పగడ్బందీగా పీసా చట్టం

ఐదో షెడ్యూలు ప్రాంత పరిరక్షణకు ప్రాముఖ్యమైన పీసా చట్టం1996(పంచాయతీస్‌ ఎక్స్‌టెన్షన్‌ టూ షెడ్యూల్‌ ఏరియా) వచ్చి ఈ ఏడాది డిసెంబరు నాటికి 25 వసంతాలు పూర్తికానున్నాయి. చట్టం రావడానికి ఎంతో మంది మేథావులు,ప్రజల ఉద్యమం ఫలితంగా పీసా చట్టాన్ని సాధించారు. ముఖ్యంగా ఐఏఎస్‌ ఉన్నతాధికారులైన బి.డి.శర్మ,ఎస్‌.ఆర్‌.శంకరన్‌,దిలీఫ్‌ సింగ్‌ భూరియా,ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు వంటి గిరిజనతెగల స్పూర్తిదాతల సహకారం కూడా మరవలేనిది.73వ రాజ్యాంగ సవరణలో1991లో అమలులోకి వచ్చిన పంచాయితీరాజ్‌ చట్టాన్ని దేశమంతటా ఒకేరీతిన అమలు చేయడంతో గిరిజనుల్లో తీవ్ర నిరసన మొదలైంది. వారు ఉద్యమబాట పట్టారు. దీంతో కేంద్రప్రభుత్వం దిలీఫ్‌సింగ్‌ భూరియా నేతృత్వంలోని ఓకమిటీని నియమించింది. కమిటి సీపార్సులతో 1996 డిసెంబరులో పీసా చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చారు. దీన్నీ రెండు భాగాలు చేశారు.1) పంచాయతీస్‌ ఎక్స్‌టెన్షన్‌ టూ షెడ్యూల్‌ ఏరియా(పీసా)2) మున్సిపల్‌ పీసా విస్తరణ షెడ్యూల్‌ ఏరియా(మీసా) చట్టాలుగా రూపొందించారు.

Read more

ఆకలి భారతం`సత్య సూత్రాలు

ఆకలి మహమ్మారిని తరిమివేయాలి అంటే, లోపాలమీద పోరాటంలో ప్రజల భాగస్వా ములు కావడం కూడా తప్పనిసరి. భారతదేశం ‘ప్రపంచ ఆకలి లెక్కల్లో, గత సంవత్సరం కంటే 45 స్థానాలు కిందకు పడిపోయి, 100వ స్థానానికి దిగజా రింది.అని ‘అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ’ (వాషింగ్టన్‌) తాజా నివేదిక వెల్ల డిరచింది. వెంటనే, భారత్‌ ప్రజలు ఆకలిదప్పు లతో మలమల మాడిపోతున్నారని మేధావులు, మీడియాల వాళ్ళు రాసేసారు. అసలు ఈ నివేదిక లో పేర్కొన్నది నిజమేనా? భారత్‌ అంత ఘోర స్థితిలో వుందా? ఒకటి రెండు సంవత్సరాల్లో ఆన్ని స్థానాలు పడిపోయేంత ఆకలి తీవ్రత భారతలో పెచ్చుమీరిందా? నివేదికను, అందులోని అంశా లను, గత నివేదికలను సాధికారికంగా పరిశీలిస్తే వాస్తవం మరోలా వున్నది. భారత్‌లో ఆకలి వుండ డం అయితే నిజం. కానీ ఆ ఆకలి లెక్కలు మాత్రం పూర్తి వాస్తవం కాదు.
అసలు వాస్తవం ఏమిటంటే 100వ స్థానానికి పడిపోవడం కరెక్టే. కానీ నిరుడు 55వ స్థానంలో ఉన్నప్పుడు,ఈ సంవత్సరం 100వ స్థానానికి దిగజారడం ఏమిటి అని పరిశీలించి నప్పుడు ఈసారి దేశాలకు ర్యాంకులు ఇచ్చే విధానంలో మార్పు చేసారు. 2016వ సంవత్సరం దాకా ఆ వాషింగ్టన్‌ సంస్థ రెండు వేర్వేరు ర్యాంకుల లిస్టు ఇచ్చేది. ఆకలి సమస్య మరీ ఎక్కువ వున్న దేశాలకు వేరుగా, అభివ ృద్ధి చెందిన దేశాలకు వేరుగా ఇచ్చేది. ఆకలి రూపుమాపే దిశగా ఇంకా ఎంతో వృద్ధి చెందాల్సిన లిస్టులో మన భారత దేశాన్ని పెట్టేది. అప్పుడు మనకు 55ర్యాంకు వచ్చింది. ఈసారి 2016 సంవత్సరానికి గానూ ర్యాంకులను ప్రకటించే విధానంలో మార్పులు చేసి, రెండు లిస్టులు కాకుండా అన్ని దేశాలకు కలిపి ఒకే లిస్టు ఇచ్చింది. సహజంగానే భారత్‌ ర్యాంకు 55వ స్థానం నుంచి 100కు పడిపోయింది. పూర్తి వాస్తవం కాని మన ర్యాంకును చూసి సోషల్‌ మీడియా మొదలుకొని అందరమూ గుండెలు బాదుకున్నాము! సరే, 45స్థానాలు తగ్గిన మాట తప్పే అనుకొందాము. మరి ప్రపంచంలో 100వ స్థానంలో ఉండడం నిజమే కదా అనే ప్రశ్నకు , ఆర్యాంకులను విమర్శిస్తున్నప్పుడు, జవాబు చెప్పాలి. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ పేరిట వాషింగ్టన్‌ సంస్థ ఇచ్చిన లెక్కలను బాగా పరిశీలిస్తే, ఈ ర్యాం కులు స్థూలంగా పోషకాహారలోపం ఆధారంగా ఇస్తూ అయిదు సంవత్సరాల వయస్సు లోపు పిల్లలకు మూడు ఆరోగ్య సూచికలను పునాదిగా చేసుకొన్నారు. వేస్టింగ్‌ (ఎత్తుకు తగినంత బరువు లేకపోవడం), స్టంటింగ్‌ (వయసుకి తగినంత ఎత్తు లేకపోవడం), మరణాల రేటు అనే మూడు ప్రామా ణిక విలువల సగటుని తీసుకొని ర్యాంకులను ఇచ్చారు. పోషకాహారలోపం, అయిదు సంవత్సరాల వయస్సు లోపు శిశువుల మరణాలకి 1/3 వంతు సగటు ఇచ్చి, ఎత్తు, బరువులకు 1/6 వంతు వెయి టేజీ ఇచ్చారు. ఈ సగటుల ప్రామాణిక విలువలను, శాతాల్లోకి మార్చి, 1983-2012 మధ్య సంవ త్సరాల్లో వచ్చిన అత్యధిక శాతంలో నుంచి మైనస్‌ చేసారు. ఈసంవత్సరాల మధ్యకాలంలో ఈ అంశాల ఆధారంగా అత్యధిక పోషకహార లోపం విలువ 76.5%గా తేలింది. అందువలన భారత్‌లో ఆకలిని, ఆయా సంవత్సరాల్లో వచ్చిన సగటులను ‘80’లోనుంచి తీసేసి, ఫలానా శాతం గా చెప్తారు. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ విలువలను 1-100 మధ్యలో చూపిస్తారు. ఒకటి అంటే, పైన చె ప్పిన నాలుగు సూచికలు అసలు కనిపించవు. 100 అంటే ఆకలితో ప్రజలు అలమ టించడం. ఇలాంటి పద్ధతిని మొదటిసారి 2017 సంవత్సరంలోనే వాడారు. ఈ పద్ధతి ప్రకారం, ఈ సంస్థ భారత్‌కు 2016కు మాత్రమే కాకుండా, గడచిన సంవత్సరాలైన 1992, 2000, 2008 సంవత్సరాలకు కూడా విలువలను ఇచ్చింది. వాషింగ్టన్‌ సంస్థ ఇచ్చిన అంచనాల ప్రకారమే భారత్‌ గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ స్కోరును 1992లో 46.2 నుంచి 2017లో 31.4కు తగ్గించు కోగలి గింది. అంటే, కొన్ని సంవత్సరాలుగా భారత్‌లో పోషకాహార లోపం తగ్గుతూ వస్తోంది అని ఆ సంస్థే చెప్తోంది. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో మన ఆకలి సూచిక ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ సర్వే, మన దేశపు జాతీయ కుటుంభ ఆరోగ్య సర్వేలో కూడా తగ్గింది. పోషకాహార లోపం వల్లే తగ్గుతున్నట్లుగా తేలింది. సరే, వీటితో కూడా సంతృప్తి చెందమూ అంటే, జాతీయ నమూనా సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ)లో బాగంగా మీరు ఎప్పుడైనా ఏదేనీ కారణం చేత ఆహారం దొరక్కుండా వున్నారా అని తమ డేటా సేకరణలో బాగంగా అడిగితే 1983లో 16%మంది తాము ఒక్కసారైనా ఆకలి తో ఉన్నాము అని చెప్పగా, 2004-05 నమూనా సర్వేలో కేవలం1.9% మంది మాత్రం తాము ఎప్పుడో ఒకప్పుడు ఆకలితో అన్నం లేకుండా ఉన్నామని చెప్పారు. అంత తక్కువ శాతం వున్నార నేమో అని కాబోలు, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ తరువాతి సంవత్సరాల్లో అసలా ‘ఆకలి’ అనే కాలమ్‌ తీసే సింది! కొందరు విమర్శకులు, పేదలు తాము ఆకలితో ఉన్నాము అని చెప్పుకోవడానికి ఇష్టపడరు అని వాదించారు. తమ వాదనకి మద్దత్తుగా ‘ఐక్య రాజ్యసమితి అభివృద్ధి పధకం’ (యుఎన్‌ డిపి) సర్వేలో దేశంలోని అతిపేద జిల్లాల్లో ఆకలితో అల్లాడే వాళ్ళు7.5% అని, కొద్దిగా ఆహారం వుండే వాళ్ళు 29% అని వచ్చిన లెక్కలు చూపించారు. అంటే, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ లెక్కల్లో చెప్పుకోలేని వారు, యుఎన్‌డిపి సర్వేలో మాత్రం చెప్పుకోన్నారన్న మాట! సరే, యుఎన్‌డిపి లెక్కలే కరెక్టు అనుకొంటే, భారత్‌ లో జరుగుతున్న అతిపెద్ద సంక్షేమ పధకం, 2013 లో ప్రవేశ పెట్టబడిన జాతీయ ఆహార భద్రతా చట్టం సంగతేమిటి అనే ప్రశ్న వస్తుంది.
భారత్‌ లోని ప్రజలకు ఆహారం ఒక సంక్షేమపథకంగా కాకుండా ‘హక్కుగా’ అందిం చాలనే ఉద్దేశంతో పెట్టబడిన ఈ చట్టంద్వారా 75%గ్రామీణ ప్రజ లకు,50%,పట్టణ ప్రజలకు కవరేజ్‌ వచ్చే విధంగా డిజైన్‌ చెయ్యబడి, లక్ష్యిత ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దేశంలోని2/3వంతు ప్రజలకి,మనిషికి, నెలకి 5కేజీల వంతున, కేజీరూ.1/2-/1-వంతు న బియ్యం/గోధుమలు/తృణధాన్యాలు ఇవ్వబడు తోంది. అతిపేదలుగా అంచనా వేయబడినవారికి ‘అంత్యోదయ అన్న యోజన’ ద్వారా ఉచితంగా నెలకు 35కేజీల వంతున ఇవ్వబడుతోంది. ఇది కాకుండా, జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారానే గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు, పోషకాహార పధకం కింద, బాలింతలకు పూర్తి భోజనం పెట్టడమే కాకుండా, రూ. 6000 వరకూ మెటర్నటీ బెనిఫిట్‌ కింద ధనసహాయం చెయ్యబడుతోంది. 14 సంవ త్సరాల లోపు పిల్లలకు పోషకాహార విలువల ప్రకారము భోజనం ఇవ్వబడుతోంది.పలు రాష్ట్రాలు ప్రత్యేక పధకాల కింద, అన్న అమ ృతహస్తం లాంటి పధకాలు చేపడుతున్నాయి. ఇక చాలా సంవత్స రాల నుంచి నడుస్తున్న మధ్యాహ్న బోజన పథకం గురించి చెప్పక్కరలేదు. అన్నీ ఇంత బాగా వుంటే అసలు పేదరికం ఎందుకు వుంటుంది అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. ప్రతి పధకంలో ఉన్నట్టే ఈ పధకంలో కూడా లోపాలు వున్నాయి. అవినీతి, డెలివరీ వ్యవస్థ లోపాలు, అమలు యంత్రాగం నిర్లక్ష్యం, ప్రతి రాష్ట్రంలో కొన్ని వేల సంఖ్యలో వున్న ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు నియంత్రణ లోపాలు, ప్రజల ఆహార అలవాట్లు మారడం.. ఇలా పలు కారణాలుతో మనము ‘ఆకలి’ అనే భూతాన్ని ఇంకా తరిమి వేయలేకున్నాము. ప్రతి రాష్ట్రప్రభుత్వం వందల కోట్ల డబ్బు ప్రజా పంపిణీవ్యవస్థ ద్వారా ఆహార సరఫరా కొరకు ఖర్చు పెడుతోంది. ఇంతమంది ప్రజలు దీని మీద ఆధార పడేటప్పుడు, ప్రభుత్వం, దాని యంత్రాం గంతో పాటుగా తమకు దీనిద్వారా లబ్ధి జరిగే టట్లు చేసుకొనే బాధ్యత ప్రజల మీద కూడా ఉందేమో. తమకు రేషన్‌ సరుకులు దొరక్కపోతేనో, సమయానికి ఇవ్వకపోతేనో, ధర ఎక్కువ చార్జ్‌ చేస్తేనో, లేక అసలు చౌక ధరల దుకాణాలు తెరవక పోతేనో, బరువు సరిగ్గా లేకపోతేనో, అంగన్‌వాడీల్లో తమకు, పిల్లలకు సరైన సేవలు, పోషకాహార విలు వలు కలిగిన భోజనం లేదని భావిస్తేనో, ఇలా తనకు ప్రభుత్వం ఇచ్చిన ఈ సౌలభ్యం అందాల్సిన రీతిలో అందలేదు అని భావిస్తే ఏమి చెయ్యాలి? మండల అధికారులకి రిపోర్టు చెయ్యాలి. వాళ్ళు సరైన లేదా సంత ృప్తికరమైన చర్య తీసుకోలేదని భావిస్తే, జిల్లా స్థాయిలో, రేషన్‌ విషయం అయితే తెలుగు రాష్ట్రాల్లో జేసి-2కి,అంగన్‌వాడీల విష యంలో ప్రాజెక్టు డైరెక్టర్‌ (ఐసిడీఎస్‌)లకు రిపోర్ట్‌ చెయ్యాలి. వీళ్ళేవ్వరి దగ్గర కూడా న్యాయం జరుగ లేదు అని భావిస్తే, పార్లమెంటు ఆమోదించిన ఈ ఆహార భద్రతా చట్టంలో బాగంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, క్వాసీ జ్యుడిషియల్‌ అధికా రాలు కలిగిన ‘ రాష్ట్ర ఆహార కమీషన్‌’లను ప్రతి రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసారు. విస్తృత అధికా రాలు కలిగిన ఈ ‘కమీషన్‌’ కు రిపోర్ట్‌ చెయ్యడం అంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ద ృష్టికి తీసుకోచ్చినట్టే! మన రాష్ట్రంలో కూడా ఇటీవల ‘రాష్ట్ర ఆహార కమీషన్‌’ ను ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం ఒక చైర్మన్‌, అయిదుగురు సభ్యులు, ఒక ఐఏఎస్‌ అధికారి మెంబర్‌ సెక్రటరీగా ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ కమీషన్‌ తనకు వచ్చిన ఫిర్యాదులనే కాకుండా, సుమోటోగా, అంటే తనకు తానుగా కూడా చర్యలు తీసుకొని, క్రైం కాని వాటిలో జరీమానాలను శిక్షలుగా వేస్తుంది. నేర చరిత్ర వుంటే, కేసు నమోదు చేసి కోర్టుకు బదిలీ చేస్తుంది. ఆకలి వున్నది అన్నది నిజం. అది ఎంత శాతమైనా సరే. అలాంటి ఆకలిని పారద్రోలాల్సిన అవసరం బాధ్యత అందరిమీద వుంది. ఏ ప్రభుత్వ మైనా పధకాలు తెస్తుంది, నిధులు ఇస్తుంది. పధకాలు ఆశించిన విజయం సాధించి ఆకలి మహమ్మారిని తరిమివేయాలి అంటే, లోపాల మీద పోరాటంలో ప్రజల బాధ్యత కూడా తప్పనిసరి. అప్పుడే ప్రజలు ఆనందంగా వుంటారు.
ఆంధ్ర దేశంలో ఆకలి కేకలు
విద్య, భూమి కలిగి వుండటం, పారి శ్రామీకరణలో భాగం కావడం అంబేద్కర్‌ ఆలోచ నలో ప్రధాన మైనవి. సమాజంలో అణగారిన ప్రజలు ఆకలితో బాధ పడకూడదు. వారి బిడ్డలు ఆకలితో అలమటించకూడదనే సదాÄవేన ముఖ్యమంత్రికి చాలా అవసరం. సులభంగా ప్రజ లకు ఏదో ఒక పేరుతో డబ్బు ఇచ్చివేస్తే మన బాధ్యత తీరిపోతుందని అనుకోవడం సొంత ఎజెండా అవుతుందే కానీ రాజ్యాంగబద్ధ ఎజెండా కాదు. రాష్ట్రంలో ఎటుచూసినా ఆకలి కేకలు విని పి స్తున్నాయి. ప్రభుత్వం ప్రజా సమస్యల పైన ప్రజల ఆకలి తీర్చడం పైన దృష్టి సారించడం లేదు.‘అన్ని విషయాలు నాకు తెలిసాయి’ అని ముఖ్యమంత్రి అనుకోవడమే దీనికంతటికి కారణం. కానీ ఆయనకు తెలియని ఆవేదన తెలుగు నేలలో వుంది. ఈ ఆకలి కేకలకు కారణం ముఖ్యమంత్రికి అంబేద్కర్‌ రాజ్యాంగ సూార్తిే లేకపోవడం. రాజ్యాంగం ప్రధానంగా నిర్దేశిస్తున్న అంశం విద్యాభివ ృద్ధి. కానీ నేడు విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా వుంది. పాఠ్యపుస్తకాలు లేక, బోధించడానికి ఉపాధ్యాయులు లేక త్రైమాసిక పరీక్షలకు విద్యార్థులు సంసిద్ధులు కాలేక పోతున్నారు. ‘అమ్మ ఒడి’ ప్రచారం మోగిపోతోంది. మధ్యాహ్న భోజనంలో నీళ్ళ చారు, బుల్లి గుడ్డుతో అన్నం తినలేక పిల్లలు పస్తులుంటున్నారు. ఒక్కొక్క టాయిలెట్‌ దగ్గర ఇరవై మంది పిల్లలు క్యూలో నిలబడుతున్నారు. బాత్‌ రూమ్‌లు దుర్గంధం కొడుతున్నాయి. రుతుక్రమం సమయంలో ప్యాడ్స్‌ కోసం హెచ్‌.యం ఆఫీసు దగ్గర బాలికలు క్యూ కడుతున్నారు. ఈ దృశ్యాల న్నింటిని పాదయాత్రలో ముఖ్యమంత్రి వర్ణించినవే. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక అటు వంటి పరిస్థితి ఉండదని వాగ్ధానం కూడా చేశారు. కాని ఆస్థితి యథాతథంగానే గాక ఇంకా అధ్వాన్న దశకు చేరుకుంది. విద్య సామాజిక పరిణామానికి మూ లం. సమాజ భవితవ్యానికి సోపానం.
ప్రధానంగా భారత రాజ్యాంగం విద్యా వ్యాప్తినే ప్రభుత్వా లకు ఆదేశిస్తున్నది. ప్రతి విద్యార్థికి విద్యను అందించే ప్రక్రియే ముఖ్యం. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ.రెండు లక్షల 20 వేల కోట్లు కాగా మరి స్కూళ్ళు ఎందుకు ఇంత అధ్వాన్న స్థితిలో వున్నాయి? బడ్జెట్లో కొత్త ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి 16,17 పైసలే పెంచింది. మరి రూ.6,7లకు నాసిరకం భోజనమే కదా వచ్చేది. ఇటువంటి భోజనం చేయలేక ఎంతో మంది హాస్టలు విద్యార్థులు ఉదయం నుండి సాయంత్రం వరకూ ఖాళీ కడుపుతో ఉంటున్నారు. పౌష్టికాహారం అంటే ఏంటో పాలకులకు తెలి యదా? అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఎటువంటి ఆహా రం వడ్డిస్తున్నారు? ప్రభుత్వానికి మానవతా స్పూర్తే కావాలి. అది లేని ప్రభుత్వం ఎండు కట్టె వంటిం ది. ప్రభుత్వ ప్రతినిధులెందుకు మధ్యాహ్న భోజనం లో సహ పంక్తికి రావడం లేదు. ప్రజా ప్రతినిధుల్లో కోట్లకు పడగలెత్తిన వారున్నారు. ప్రతి ప్రజాప్రతి నిధికి మూడు లేక నాలుగు మండలాలే ఉంటాయి. కొందరి పరిధిలో ఒకమున్సిపాలిటీ కూడా ఉంటుంది. ప్రతి నియోజక వర్గంలో ప్రభుత్వ స్కూళ్ళు వుంటాయి. వారంలో ఏదో ఒకరోజు ఆ స్కూళ్ళ ప్రజాప్రతినిధి పిల్లలకు మంచి భోజనం పెట్టించవచ్చు. అసలు ప్రజాప్రతినిధులను సామా జిక కార్యకర్త్తలుగా ఎందుకు మార్చడం లేదు? పదో తరగతి ఉత్తీర్ణులైన వారిలో 50శాతం మంది ఇంటర్మీయట్‌లో చేరడం లేదు. ఈ విషయం మీద ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదు? ‘మీ పిల్లల భవిష్యత్తు నాచేతుల్లో పెట్టండ’ని పాద యాత్రలో భరోసా ఇచ్చారు. మరి ఇప్పటి పరిస్థితి ఏంటి? ఇంటర్మీయట్‌, బి.ఎచదువుతున్న విద్యా ర్థులకు మధ్యాహ్న భోజనం లేదు. స్కూళ్ళలో, కాలేజీల్లో మంచినీళ్ళు లేక విద్యా ర్థులు జ్వరాల బారిన పడుతున్నారు. 300నుండి వెయ్యి మంది ఉండే స్కూళ్ళల్లో ప్రాథమిక చికిత్స అందించే నర్స్‌ లేరు. ప్రభుత్వ పాఠశాలలను ఆశ్రయిస్తున్న వారంతా యస్‌.సి,యస్‌.టి, బి.సి పిల్లలే! 80 శాతం మంది యస్‌.టి, యస్‌.సి లే అని తేలింది.
‘నాకు పార్టీలతో పనిలేదు. పారదర్శకతే ముఖ్యం’ అని చెప్పిన ముఖ్యమంత్రి,మధ్యాహ్న భోజన కార్మికులను, యానిమేటర్లను, ఆశా వర్కర్ల ను, మున్సిపల్‌ అంగన్‌వాడీ వర్కర్లను రాజకీయ కారణాలతో తొలగించి, తమ పార్టీ వారిని పెట్టు కొంటున్నారు. ఇదిరాజ్యాంగ విరుద్ధం! ఇలా తొలగించడం వల్ల ఒక యానిమేటర్‌ ఆత్మహత్య చేసుకొన్నారు కూడా! ‘పార్టీ కార్యకర్తలకే పదవులు’ అనే అంశం వల్లనే కదా చంద్రబాబు ప్రభుత్వం పై అసంత ృప్తి రగిలింది. బాబు దారి లోనే ఈ ముఖ్యమంత్రి నడుస్తున్నారు. అంతేకాక, అనేకాం శాల్లో ఆయన్ని మించి పోతున్నారు.
పేదల ఆకలి తీర్చే ‘అన్న క్యాంటిన్‌’ని కూడా రద్దు చేశారు. దీని వెనుక ఆంతర్యం ఏంటి? మరోపక్క వ్యవసాయ కార్మికులకు భూమి పంచ కుండా ఉపాధి కూలీలుగా మార్చారు. గుంటూరు జిల్లా నివేదిక చూస్తే విస్తుపోక తప్పదు. జిల్లాలో సుమారు 13 లక్షల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. 7,99, 599 కుటుంబాలకు జాబ్‌ కార్టులు మంజూరు చేశారు. వీరిలో దళిత కుటుంబాలు 4,78,919 మంది, గిరిజనులు 1,12,954 మంది ఉన్నారు. మొత్తం జాబ్‌ కార్డుల్లో నమోదైన కూలీల సంఖ్య 15,53,660 మంది ఉన్నారు. దళిత, గిరిజన, బీసీ వర్గాల నుంచి మాత్రమే కాకుండా ఓసీల్లోని పేదలు సైతం కూలీలుగా నమోదైన పరిస్థితి ఉంది. అయితే జిల్లాలో ప్రతి రోజూ 1.50లక్షల మందికే పని కల్పిస్తున్నారు. వేతనాలను పరిశీలిస్తే కనీస వేతనం రూ.211 రావాల్సి వుంది కానీ రూ.80 నుంచి రూ.140మాత్రమే ఇస్తున్నారు. ఇకపోతే 100 పని దినాలు కల్పించాల్సి ఉండగా సరాసరి 40 పని దినాలు మాత్రమే కల్పిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. దీనిని బట్టి పరిశీలిస్తే ప్రతి వ్యవసాయ కార్మికుడు రోజుకు కనీస వేతనం నుంచి రూ.81కోల్పోతున్నట్లు వెల్ల డవుతోంది. ప్రతి రోజూ పని ప్రదేశాలకు ప్రతి కూలి తన మంచి నీరు తానే తెచ్చుకుంటే వేతనం కాకుండా రోజుకు రూ.5 మంచి నీటికి, పలుగు, పార తెచ్చుకుంటే రూ.5 అదనంగా అద్దె ఇవ్వాలి. ఈ వివరాలన్నీ పే స్లిప్పులో నమోదై పారదర్శకంగా కూలీలకు తెలియజేయాలి. అయితే అది అమలు జరగడం లేదు. పని ప్రదేశాల్లో మెడికల్‌ కిట్స్‌ దాదాపు లేవు. మజ్జిగ సరఫరా చేయడం లేదు. గతంలో మజ్జిగ సరఫరా చేసినా బిల్లులు రావడం లేదని మేట్స్‌ చెప్పారు. ఒకజిల్లా నివేదికే ఇలా వుంటే రాష్ట్ర మొత్తంగా ఉపాధి కూలీల సంగతి ఆలోచిస్తే దారుణంగా వుంది. ప్రజల దాహం తీర్చడానికి, ప్రజల పొట్ట నింపడానికి వెనకాడడం ఏ ధర్మ సూత్రమో ముఖ్యమంత్రే చెప్పాలి. తన చేతిలో రెండు కోట్ల 20లక్షల ఎకరాల భూమి పెట్టుకొని విదేశీ కంపెనీలను పిలిచి పందేరం చేయాలని చూస్తున్నారే గాని, ఆభూమిని భూమి లేని పేదలకు పంచి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని చూడ డం లేదు.
విద్య,భూమి కలిగి వుండటం, పారి శ్రామీకరణలో భాగం కావడం అంబేద్కర్‌ ఆలోచన లో ప్రధానమైనవి. సమాజంలో అణగారిన ప్రజలు ఆకలితో బాధ పడకూడదు. వారి బిడ్డలు ఆకలితో అలమటించకూడదనే సదాÄవేన ముఖ్యమంత్రికి చాలా అవసరం. సులభంగా ప్రజలకు ఏదో ఒక పేరుతో డబ్బు ఇచ్చివేస్తే మన బాధ్యత తీరిపో తుందని అనుకోవడం సొంత ఎజెండా అవుతుందే కానీ రాజ్యాంగబద్ధ ఎజెండాకాదు.
డా॥బి. ఆర్‌. అంబేద్కర్‌ అణగారిన వర్గాలకు న్యాయం చేయడం అంటే భూమి పంప కంలో,వారి పిల్లలకు విద్యను నేర్పించడంలో, పరిశ్రమల్లో వారిని భాగం చేయ డంలో చిత్తశుద్ధితో వుండాలని చెప్పారు. నిజానికి దళితుల నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా ముఖ్య మంత్రిని పొగిడే పనిలో వున్నారు గాని వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేట పరిస్థితి లేదు. ద్వేషంతో దేన్నీ నిర్మించలేం. ప్రేమ, కరుణ తోనే పునర్నిర్మాణం సాధ్యం అని ముఖ్య మంత్రి తెలుసు కున్న నాడు ఆంధ్ర దేశంలో ఆకలి కేకల నివారణకు పరిష్కారం రూపొందుతుంది.-నీలయపాలెం విజయ్‌ కుమార్‌

అసైన్డ్‌ చట్ట సవరణ ఎవరి కోసం?

పేదలకిచ్చిన అసైన్డ్‌ భూములు, ఇళ్ళ స్థలాలు లబ్ధి పొందినవారు, వారి వారసులు తరత రాలుగా అనుభవించాలేగానీ అమ్మకూడదు. ఇతరు లు కొనకూడదు. గత తెలుగుదేశం ప్రభుత్వం 20సంవత్సరాల తరువాత అమ్ముకోవచ్చని సవరిస్తే. …ఇప్పటి వైసిపి ప్రభుత్వం పదేళ్ళకు కుదించింది. అమ్ముకోవచ్చని చట్టమే సవరిస్తే పేదల చేతుల్లో ఉన్న చారెడు భూమి కూడ మిగలదు.
‘భూమి అనేది కేవలం ఆర్థిక వనరే కాదు. ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, సమాజంలో హోదాని అందిస్తుంది. వీటితోపాటు భూమి అంటే అధికారం’ అని చెప్పేవారు ఎస్‌.ఆర్‌.శంకరన్‌. అందుకేనేమో పేదల చేతుల్లో ఉన్న అసైన్డ్‌ భూములు చేజారిపోకుండా, ఒకవేళ పోయినా తిరిగి ఆ పేదలకు చెందేలా 9/77 అసైన్డ్‌ చట్టాన్ని తెచ్చారు. నాటి పాలకవర్గం దీనిని తొలత తీవ్రం గా వ్యతిరేకించినా పట్టుబట్టి ఈ చట్టాన్ని సాధిం చారు. ఇంతటి ప్రాధాన్యత కల్గిన అసైన్డ్‌ చట్టాన్ని మరింత సమర్ధవంతంగా అమలు పరచాల్సింది పోయి నేటి పాలకులు రోజు రోజుకూ నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గం 9/77 చట్టం సెక్షన్‌ 3ను సవరించి పేదలకిచ్చిన ఇళ్ళ స్థలాలు,ఇళ్లు 10సంవత్సరాల అనుభవం తరువాత అమ్ము కోవచ్చని తీర్మానించింది. పేదలకిచ్చిన అసైన్డ్‌ భూములు, ఇళ్ళ స్థలాలు లబ్ధి పొందినవారు, వారి వారసులు తరతరాలుగా అనుభవించాలేగానీ అమ్మ కూడదు. ఇతరులు కొనకూడదు. గత తెలుగుదేశం ప్రభుత్వం 20సంవత్సరాల తరువాత అమ్ము కోవచ్చని సవరిస్తే…ఇప్పటి వైసిపి ప్రభుత్వం పదే ళ్ళకు కుదించింది. ఈ చట్టం ఇంత పగడ్బందీగా ఉన్నప్పటికీ పేదలకిచ్చిన భూములను పలుకుబడి కలిగినవారు, సంపన్నులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రులు, చివరకు ప్రభుత్వం కూడా అభివృద్ధి పేరుతో అసైన్డ్‌ భూములనే బలవంతంగా లాక్కుంటుంది. ఇక అమ్ముకోవచ్చని చట్టమే సవరిస్తే పేదల చేతుల్లో ఉన్న చారెడు భూమి కూడ మిగలదు.
స్వాతంత్య్రానికి ముందు ఆ తరువాత ‘దున్నే వానికే భూమి’ నినాదంతో దేశ వ్యాపితంగా జరిగిన భూ పోరాటాలవల్ల పాలక వర్గాలకు ఇష్టం ఉన్నా, లేకపోయినా భూసీలింగ్‌ చట్టం, రక్షిత కౌలుదారీ చట్టాలు, 1/70చట్టం,9/77 అసైన్డ్‌ చట్టాలు సాధించబడ్డాయి. ఈ చట్టాల వల్ల పేదల చేతుల్లోకి కొంతైనా భూమి వచ్చింది. ఆ భూమిని పొందిన దళితులు, బలహీన వర్గాల కుటుంబాలు తమ పిల్లలను చదివించుకుని ఇపుడిప్పుడే సమా జంలో మెల్లమెల్లగా తల ఎత్తుకుని తిరిగే స్థాయికి చేరుకుంటున్నారు. దీనిని కూడా సహించని పాలక వర్గాలు పేదలను భూమి నుండి వేరు చేసి వీరికున్న కొద్దిపాటి చట్టబద్ద హక్కులను కూడా లేకుండా చేస్తున్నాయి. ఇందులో భాగమే మన రాష్ట్ర మంత్రి వర్గం చేసిన అసైన్డ్‌ చట్ట సవరణ. స్వాతంత్య్రానికి పూర్వం నుండి కమ్యూనిస్టులు చేసిన పోరాటాల వల్లగాని లేదా ల్యాండ్‌ సీలింగ్‌ చట్టంవల్ల భూస్వా ముల చేతుల్లో ఉన్న మిగులు భూమిగాని, ప్రభుత్వ బంజర్లు, ఇనాం భూములు మొదలగు 16 రకాల భూములు ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 55 లక్షల ఎకరాలకుపైగా పేదలకు పంపిణీ చేసినట్లు ప్రభుత్వ లెక్కలు తెలియచేస్తున్నాయి. ఈ రూపంలో పేదలు పొందిన భూములను తిరిగి పెత్తందార్లు, పలుకు బడి కలిగినవారు అక్రమంగా దౌర్జన్యంగా ఆక్ర మించుకుంటుంటే….పేదలకు పావలో, పాతికో ఇచ్చి లాగేసుకుంటుంటే…పేదల చేతుల్లో ఉన్న భూములు చేజారిపోకుండా ఉండడానికే నాడు సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా ఉన్న ఎస్‌.ఆర్‌ శంకరన్‌ 9/77అసైన్డ్‌ చట్టాన్ని తీసుకు వచ్చారు. ఈచట్టం ప్రకారం ఎవరైనా పేదలు తమ అవసరాల కోసం భూమిని అమ్మినా లేదా ఇతరులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నా భూమి కోల్పోయిన పేదలు మా భూమి తిరిగి ఇప్పించమని ప్రభుత్వానికి విన్నవించుకుంటే సెక్షన్‌ 4 ప్రకారం తిరిగి కోల్పోయిన పేదలకే ఇవ్వాలి. సెక్షన్‌ 5ప్రకారం అసైన్డ్‌ భూములు రిజిష్టర్‌ చేయ కూడదు. అసైన్డ్‌ భూములు పొందేవారు ప్రభుత్వ ఉద్యోగులై ఉండకూడదు. అసైన్డ్‌ భూములు పొందాలంటే ప్రభుత్వం ఇచ్చేది, సొంత భూమి కలుపుకొని 5ఎకరాలు మెట్టగానీ లేదా రెండున్నర ఎకరాలు మాగాణి మించకుండా ఉండాలి. అనర్హులు అసైన్డ్‌ భూములు కొంటే 6 నెలలు జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధించాలని సెక్షన్‌ 6 చెబుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అసైన్డ్‌ భూములకు ఈ చట్టం కవచకుండలం లాంటిది.
ఉమ్మడి రాష్ట్రంలో వామపక్షాల ఒత్తిడితో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 2005లో కోనేరు రంగారావు నాయకత్వంలో ఏడు గురు ఐఎఎస్‌ అధికారులతో భూకమిటీని వేశారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాపితంగా పర్యటించి భూసమస్య పరిష్కారం కోసం 104సిఫారసులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 90ఆమోదించింది. 12 తిర స్కరించింది.2పెండిరగ్‌లో ఉంచింది. ఆమోదిం చిన 90 సిఫారసులను తక్షణమే అమలు చేయాలని జిల్లా కలక్టర్లకు, సంబంధిత అధికారులకు జీవో నెంబర్‌ 1049,1191 విడుదల చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూములతో పాటు భూస్వాముల దగ్గర ఉన్న మిగుల భూములు, ప్రభుత్వం దగ్గర ఉన్న పదహారు రకాల భూములు మొత్తం కలుపుకుంటే ఈ రాష్ట్రంలో భూమిలేని ప్రతికుటుంబానికి ఎకరం భూమి పంచవచ్చని భూకమిటీ చెప్పింది. ఇది అమలు కావాలంటే అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూ ములు తిరిగి పేదలకు ఇప్పించాలి. సాగు నీటి వనరులు వచ్చిన చోట భూమి పున:వర్గీకరణ చేసి భూస్వాముల చేతుల్లో ఉన్న మిగులు భూమిని స్వాధీనం చేసుకోవాలి. దేవాలయ భూములు పేదలకే లీజుకివ్వాలి. కౌలుదారీ చట్టాలను సక్రమంగా అమలు చేయాలి. 1/70 చట్టాన్ని పక డ్బందీగా అమలు చేయాలని కోనేరు రంగారావు భూ కమిటీ 104 సిఫారసులు చేసింది. వీటిని అమలు చేయవలసిన రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం… అసైన్డ్‌ చట్టం సెక్షన్‌ 4 సవరించి అసైన్డ్‌ భూములు ఆక్రమించుకున్నవారు విద్యాలయాలు, పరిశ్రమలు, ఉద్యానవనాలు నిర్మించుకుని ఉంటే వారికే రెగ్యులర్‌ చేస్తూ చట్టసవరణ చేసి భూకమిటీ సిఫారసులకు ఆదిలోనే తిలోదకాలిచ్చి పేదలకు తీరని అన్యాయం చేసింది. అయినా నేటికీ 90 సిఫారసులు అమలు లోనే ఉన్నాయి. కానీ కోనేరు రంగారావు తో పాటు ఆయన సిఫారసులను కూడా కాంగ్రెస్‌, టిడిపి, వైసిపి ప్రభుత్వాలు కోనేటి లోకి కలిపేశాయి.
స్వాతంత్య్రానంతరం పాలక వర్గాలకు ఇష్టం ఉన్నా లేకపోయినా పేదలకు అనుకూలంగా కొన్ని చట్టాలయినా చేశాయి. 1991 నూతన ఆర్థిక విధా నాలు అమలు చేసిన తరవాత పేదలకు వ్యతి రేకంగా రివర్స్‌ భూసంస్కరణలు మొదలుపెట్టారు. నాడు పేదలకు అనుకూలంగా భూ పంపిణీ కోసం చట్టాలు చేస్తే నేడు పేదల భూములు పెద్దలకు కట్టబెట్టడానికి చట్టాలను అనుకూలంగా మారుస్తు న్నారు. ఇప్పటికే అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ చట్టాన్ని రద్దు చేశారు. నేడు అసైన్డ్‌ చట్టాన్ని మారుస్తున్నారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి మాటున భూ బ్యాంక్‌ పేరుతో అసైన్‌మెంట్‌ భూములనే లక్ష్యంగా చేసుకుని 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి చట్టబద్దమైన నష్టపరిహారం పేదలకివ్వ కుండా బలవంతంగా భూసేకరణకు పూనుకు న్నారు. నాడే చంద్రబాబు ప్రభుత్వం అసైన్డ్‌ భూము లు అనర్హులకు కట్టబెట్టడానికి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళస్థలాలు, ఇళ్ళు 20సంవత్సరాలు అనుభవం ఉన్న వారు అమ్ముకోవచ్చని పేదలను నమ్మబలికించి చట్టసవరణ చేసింది. దీనివల్ల పేదలు లబ్ధి పొంద డం సంగతి పక్కనపెడితే రాష్ట్రంలో అక్రమంగా, దౌర్జన్యంగా పొందిన అనర్హులు తప్పుడు అగ్రి మెంట్‌లు సృష్టించి క్రమబద్దీకరించుకుని పేదలకు ద్రోహం చేశారు. నేడు వైసిపి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి 10 సంవత్సరాలు అనుభవం ఉంటే చాలు అమ్ముకోవచ్చని అసైన్డ్‌ చట్టం సెక్షన్‌ 3ను సవరిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. దీనివల్ల పేదలు లాభపడేదేమోగానీ దీనిమాటున అనర్హులకు మాత్రం రాజమార్గం ఏర్పడనుంది. ఏ ప్రభుత్వాలైనా పేదలకు భూములు ఇచ్చి వాటికి నీటి వనరులు, పరపతి సౌకర్యాలు కల్పించి వారిని దారిద్య్రంలో నుంచి బయటకి లాగి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి. దీనికి విరు ద్ధంగా పేదలకిచ్చిన సెంటో,కుంటో భూమిని కూడా అమ్ముకోమని ప్రభుత్వాలే పేదలను బికా రులుగా మార్చడం అత్యంత బాధాకరమైన విష యం.రాష్ట్ర వ్యాపితంగా భూముల విలువ పెరిగిన తరువాత రకరకాల అభివృద్ధి పేరుతో అసైన్డ్‌ భూ ములనే లక్ష్యంగా చేసుకొని బలవంతంగా లాక్కుంటున్నారు. ఎదిరించినవారిపై దౌర్జన్యం చేస్తూ అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వాలే భూమాఫి యాగా మారాయి. రాష్ట్రంలో నాగార్జున సాగర్‌, శ్రీశైలం, తుంగభద్ర,సోమశిల,వంశధార,తోటపల్లి,హంద్రీ నీవా,గండికోట,మొదలగు ప్రాజెక్టులు, రిజర్వాయర్ల కింద లక్షలాది ఎకరాలకు సాగునీటి సౌకర్యం వచ్చింది. 1975 భూసీలింగ్‌ చట్టం ప్రకారం ఈ భూములన్నీ పున:వర్గీకరణ చేసి భూస్వాముల చేతుల్లో ఉన్న భూములను తీసుకొని తిరిగి పేదలకు పంపిణీ చేయాలి. కానీ గడచిన నాలుగు దశాబ్దా లుగా కాంగ్రెస్‌, తెలుగుదేశం, వైసిపి ప్రభుత్వాలు ఒక్క భూస్వామి దగ్గర ఒక్క సెంటు భూమి తీసుకున్న దాఖలాలు లేవు.
దీనిని బట్టి ఈ ప్రభుత్వాలు ఏ వర్గ ప్రయోజనాలు కాపాడతాయో అర్థం అవు తుంది. దీనికి భిన్నంగా బెంగాల్‌, కేరళ రాష్ట్రాలలో భూస్వా ముల చేతుల్లో ఉన్న మిగుల భూములను తీసుకుని లక్షలాది ఎకరాలు పేదలకు పంచిన చరిత్ర వామ పక్ష ప్రభుత్వాలకు ఉంది. ప్రస్తుతం పేదలకు భూ పంపిణీ మాట ఏమో గానీ పేదల చేతుల్లో ఉన్న కొద్దిపాటి భూమిని కూడా వివిధ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వాలే లాగేసుకుం టున్నాయి. రాష్ట్ర మంత్రి వర్గం చేసిన అసైన్డ్‌ చట్ట సవరణ వల్ల పేదలకు లాభం లేదు. ఆక్రమణ దారులకు రాజమార్గం ఏర్పాటు చేయడానికి కొద్దో, గొప్పో దళితుల చేతుల్లో ఉన్న అసైన్డ్‌ భూములను లాక్కోవడానికి తప్ప మరొకటి కాదు. నాడు ‘’దున్నే వానికే భూమి’’ కావాలని పోరాడి సాధించుకున్న భూ చట్టాలను నేటి ప్రభుత్వాలు ఒక్కొక్కటి నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయి. సంక్షేమ పథకాల వల్ల దారిద్య్ర నిర్మూలన జరగదు. కేవలం ఉపశమనం మాత్ర మే. పేదలకు భూపంపిణీ చేయడం ద్వారానే దారిద్య్రాన్ని రూపుమాపడానికి దోహదపడుతుంది. కాబట్టి ఎంతోమంది త్యాగాల ఫలితంగా సాధించు కున్న భూ చట్టాలను అదే స్ఫూర్తితో పోరాడి రక్షించు కోవాలి.
వ్యాసకర్త ఎ.పి వ్యవసాయ కార్మిక సంఘం-రాష్ట్ర ప్రధాన కార్యదర్శి-వి.వెంకటేశ్వర్లు

సమత తీర్పుకు 24 ఏళ్లు

గిరిజన ప్రాంతాల్లో వారు అనుభవిస్తున్న భూములపై హక్కులను సమర్ధిస్తూ ‘సమత’ కేసులో ఒక సంచలన తీర్పు ఇచ్చి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్వర్గీయ జస్టిస్‌ కె రామ స్వామి సేవలు చిరస్మరణీయం. సమత తీర్పువెలువడి ఇప్పటికి 24 సంవత్సరాలు పూర్తి య్యాయి. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు ప్రకారం మాత్రమే కాకుండా వివిధ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలకు విరుద్ధంగా షెడ్యూల్డు ప్రాంతాల్లో గిరిజ నులకు చెందిన భూములను గిరిజనేతరులు దోచు కుంటున్నారని,చివరకు గిరిజనులు వారి హక్కు లను కోల్పోతున్నారని ‘సమత’ స్వచ్ఛంద సంస్థ ఆ హక్కుల కోసం చాలా కాలంగా పోరాడుతోంది.

దీర్ఘకాల పోరాటం తర్వాత ఆ సంస్థ కోర్టుల్ని ఆశ్రయించిది. 1993లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే దాన్ని కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలుచేసింది. నాలుగేళ్ళ పోరాటం తర్వాత సమత ఆ కేసులో విజయం సాధించింది.1980 నాటి అటవీ పరిరక్షణ చట్టం ప్రకారం షెడ్యూలు ప్రాంతాల్లో, రిజర్వు అటవీ ప్రాంతాల్లో భూములను ప్రైవేటు మైనింగ్‌ అవసరాల కోసం లీజుకు ఇవ్వడం నిషేధమంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గిరిజన ప్రాంతాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక వ్యక్తి (పర్సన్‌) తరహాలోనే చట్టాలకు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు ఆ తీర్పులో స్పష్టం చేసింది. ‘‘గవర్నర్‌ తన వ్యక్తిగత బాధ్యత ప్రకారం షెడ్యూల్డు ప్రాంతాల్లో శాంతి స్థాపనకు కృషి చేయాలి. సుపరిపాలన అందేందుకు చొరవ తీసుకోవాలి. గిరిజనులు, గిరిజనేతరులు, స్థానిక వ్యక్తుల మధ్య భూముల కేటాయింపు క్రమ బద్ధీకరణకు సంబంధించి రాజ్యాంగంలోని ఐదవ అధికరణంలో కొన్ని అధికారాలను కల్పించింది. షెడ్యూల్డు ప్రాంతాల్లోని భూములను బదలాయించడంపై నిషేధాజ్ఞలు విధించింది. ‘క్రమబద్ధీకరణ’ అంటే ‘నిషేధం’ కూడా అనే అంశాన్ని అన్వయించడానికి సంబంధించి స్పష్టమైన వివరణ ఇచ్చింది. ‘వ్యక్తుల’ అంటే సహజ వ్యక్తులతో పాటు న్యాయ వ్యవహారాలతో సంబంధం కలిగిన వ్యక్తులు, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాలు కూడా’’ అని జస్టిస్‌ కె.రామస్వామి, జస్టిస్‌ సాగిర్‌ అహ్మద్‌లు వారి తీర్పులో పేర్కొన్నారు. పైవేటు వ్యక్తులు, సంస్థలు, పారిశ్రామికవేత్తలకు అటవీ భూములను కేటాయించడం చెల్లదని సుప్రీంకోర్టు ఆ తీర్పులో స్పష్టం చేసింది. అయితే ఖనిజాభివృద్ధి సంస్థ, గిరిజన సహకార సంస్థ లాంటి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రం అటవీ భూములను బదలాయించడాన్ని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం అనుమతించింది. కానీ కొన్ని షరతులు విధించింది. ఆ సంస్థలు ఆర్జిస్తున్న నికర ఆదాయంలో కనీసంగా ఇరవై శాతం మొత్తాన్ని ఒక శాశ్వత నిధిగా నిర్వహించాలని, ఆ నిధిని గిరిజనులకు ఉపయోగపడేలా పాఠశాలలు, ఆసుపత్రులు, రవాణా సౌకర్యాలు, పారిశుద్య అవసరాలు తదితరాల కోసం ఖర్చు చేయాలని ఆ షరతులో పేర్కొనింది.
గిరిజనుల ఆర్థిక వనరుల్లో ఒకటి వారి ప్రాంతాల్లో లభిస్తున్న విలువైన ఖనిజాలు. గిరిజనులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో భారీ స్థాయిలోనే ఖనిజ (సహజ) వనరులు నిరుపయోగంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆశించిన స్థాయిలో, పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేక వృథాగా వదిలేసిన పరిస్థితుల్లో ఉన్నాయి. నిజంగా వాటిని సమర్ధవంతంగా వినియోగించుకున్నట్లయితే మైనింగ్‌ పరిశ్రమ లేదా ఖనిజ ఆధార పరిశ్రమలు గణనీయంగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా గిరిజనులకే ఆ పరిశ్రమల్లో ఉపాధి కల్పన లభించే అవకాశం ఉంటుంది. మొత్తం గిరిజన ఆవాసాల్లోనే నాణ్యమైన లోహ సంబంధమైన ఖనిజాలే కాకుండా ఇతర రకాల ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వీటిని వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవచ్చు. గిరిజనులను భాగస్వాములను చేసి అనేక రకాలుగా విలువను జోడిరచే ఖనిజ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలను నెలకొల్పి అభివృద్ధి చేయవచ్చు. ఇదే చేసినట్లయితే గిరిజనుల అభివృద్ధి కోసం శాశ్వతంగానే ఒక ‘రాయల్టీ అభివృద్ధి డివిడెండ్‌ ఫండ్‌’ను నెలకొల్పడానికి పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. మైనింగ్‌ వ్యాపారంలో గిరిజనులకు కూడా నిర్దిష్ట వాటాను కేటాయించడం ద్వారా వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయవచ్చు. విలువైన ఖనిజాల ప్రాధాన్యత గురించి గిరిజనులు తెలుసుకునేందుకు, అవగాహన చేసుకోడానికి దోహదపడుతుంది. ఖనిజ ఆధార వ్యాపార, వాణిజ్య రంగాల్లో మాత్రమే కాక వ్యాపార నిర్వహణలో సైతం వారు రాణించేలా చైతన్యం కలిగించవచ్చు. అంతిమంగా ఇది వారి జీవన ప్రమాణాలు పెరగడానికి ఉపయోగపడుతుంది. గిరిజనుల చేతి బ్రహ్మాస్త్రం 1/70 చట్టం: షెడ్యూల్డు ప్రాంతాల్లో గిరిజనేతరుల స్వాధీనంలో ఉన్న భూములు గిరిజనులకే చెందేలా 1970లో ‘భూ బదలాయింపు క్రమబద్ధీకరణ చట్టం’ (వన్‌ ఆఫ్‌ సెవెంటీ) ఉనికిలోకి వచ్చింది. షెడ్యూల్డు ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూమి ఉన్నట్లయితే, ఏదేని నిర్దిష్టమైన ఉత్తర్వులు లేదా అనుమతి ఉంటే తప్ప, అది గిరిజనుల నుంచి స్వాధీనం చేసుకున్నదేననే ఒక స్పష్టమైన (ముందస్తు అంచనాతో కూడిన) సెక్షన్‌ ఈ చట్టంలో ఉంది. గిరిజనేతరులు ఈ ప్రాంతాల్లో ఏ స్వల్ప స్థాయిలో భూమిని కలిగి ఉన్నా దాన్ని మరో గిరిజనేతరుల పేరు మీద బదలాయించడానికి కూడా వారికి అధికారం లేదు. షెడ్యూల్డు ప్రాంతాల్లోని భూమి (స్థిరాస్తి) బదలాయింపుకు ఈ చట్టంలో చాలా స్పష్టత ఉంది. 1964 నాటి సహకార సొసైటీల చట్టం కింద రిజిస్టర్‌ అయిన సొసైటీలోని సభ్యులు లేదా గిరిజనులకు తప్ప మరెవ్వరికి ఈ ప్రాంతంలోని భూమిని బదలాయించడం వీలు పడదు. బదలాయించాలనుకుంటున్నవారు గిరిజనులైనా, సొసైటీలో సభ్యులైనా తీసుకుంటున్నవారు గిరిజనులు కానప్పుడు, సొసైటీలో సభ్యులు కానప్పుడు ఆ బదలాయింపు చెల్లుబాటు కాదు.
ఈ చట్టం షెడ్యూల్డు ప్రాంతాల్లోని భూమిపై గిరిజనులకు హక్కు కల్పించింది. తొలుత ఈ చట్టాన్ని రూపొందించినప్పుడు సంబంధిత అధికారుల నుంచి ముందస్తు లిఖితపూర్వక అనుమతి ఉంటే తప్ప గిరిజనులకు చెందిన భూమిని గిరిజనేతరులకు బదలాయించడం సాధ్యంకాదు. ప్రారంభంలో ఈ చట్టం పరిధి ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైనప్పటికీ ఆ తర్వాత తెలంగాణ ప్రాంతానికి కూడా అన్వయించేలా సవరణ జరిగింది. గిరిజనుల నుంచి గిరిజనేతరులకు భూమి బదలాయింపు జరుగుతున్నట్లయితే ఈ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు అప్పగించబడిరది. అలాంటి సందర్భాల్లో ఆ భూమి గిరిజనులకు లేదా వారి వారసులకు మాత్రమే చెందుతుంది తప్ప గిరిజనేతరులకు చెల్లదు. ఈ చట్టం అమలులోకి వచ్చిన తొమ్మిదేళ్ళ కాలంలో (1979 వరకు) షెడ్యూల్డు ప్రాంతంలో గిరిజనేతరుల ఆధీనంలో ఉన్న విస్తారమైన భూములు పరిరక్షించబడినాయి. 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరుల ఆధీనం లో ఉన్న లక్షలాది ఎకరాల భూములు రక్షించ బడినట్లు ట్రైబల్‌ కల్చరల్‌ రీసెర్చి అండ్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొనింది. అయితే ఇలా పరిరక్షణకు గురైన భూములు మళ్ళీ గిరిజనుల చేతికి వెళ్ళింది కేవలం నాల్గవ వంతు మాత్రమేనని, వివిధ రకాల ఉత్తర్వులతో ఇంకా లక్షలాది ఎకరాలు గిరిజనేతరులే అనుభవిస్తున్నారని కూడా పేర్కొనింది. ఇలాంటి పరిస్థితుల్లో 1197 జూలై 11న (దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం) దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో జస్టిస్‌ కె రామస్వామి, జస్టిస్‌ సాగిర్‌ అహ్మద్‌, జస్టిస్‌ జిబి పట్నాయక్‌ల నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన తీర్పులోని అంశాలను పరిశీలించడం అవసరం.
‘వ్యక్తి’ అంటే కేవలం వ్యక్తులు మాత్రమే కాదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అని ఆ తీర్పు నొక్కి చెప్పింది. షెడ్యూల్డు ప్రాంతంలోని భూమిని బదలాయించేటప్పుడు ‘వ్యక్తి’ అని పేర్కొన్నప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం కూడా అవుతుందని, మైనింగ్‌ అవసరాల కోసం భూమిని గిరిజనేతరులకు లీజుకు ఇస్తున్నప్పుడు లేదా బదలాయిస్తున్నప్పుడు ఇది వర్తిస్తుందని, అలాంటి బదలాయింపు / లీజు నిషిద్ధమని ఆ తీర్పు స్పష్టం చేసింది. ఒకవేళ ప్రభుత్వమే ఆ భూమిని మైనింగ్‌ అవసరాల కోసం ఒక సంస్థకు బదలాయిస్తుంటే అది కూడా నిషేధిత చర్యే అవుతుందని స్పష్టం చేసింది. ఆ తర్వాతి పరిస్థితుల్లో రాష్ట్రపతి ఒక ప్రకటనలో ‘గవర్నర్లతో ఏర్పాటైన కమిటీ’ ఏర్పాటవు తుందని, చట్టం అమలులో జరుగుతున్న పొరపాట్లను, లోపాలను,ఉల్లంఘనలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు సంబంధించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సైతం పలు సిఫారసులతో కూడిన తీర్పు ఇచ్చినా ఆ తదనంతర పరిస్థితుల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నా యో స్పష్టం కావడంలేదు. -వనం జ్వాలా నరసింహారావు

వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాళ్లు

భారత వ్యవసాయ రంగం ఇప్పటికే తీవ్ర సంక్షో భాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా, రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, ఫెడరల్‌ స్ఫూర్తికి భంగం కలిగిస్తూ అప్రజాస్వామికంగా రాజ్యసభ బిజినెస్‌ రూల్స్‌ను తుంగలో తొక్కి మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చిన పరిస్థితి గతంలో ఏనాడూ లేదు.
ప్రస్తుత మార్కెటింగ్‌ యార్డులు రైతుల చేతులకు సంకెళ్ళు వేస్తున్నాయని,ఈనూతన వ్యవ సాయ చట్టాల వలన రైతులు ఎక్కడికైనా తమ ఉత్పత్తులను పంపి, తనకు నచ్చిన ధరకు అమ్ముకొనే వెసులుబాటు లభిస్తుందని,కమీషన్‌ ఏజెంట్లు వుండ రని, రైతులకు చాలా మేలు చేకూరుతుందని ప్రధాని మోడీ, వ్యవసాయ మంత్రి తోమర్‌ తదితరులు పదేపదే చెటబుతున్నారు. వాస్తవానికి ఈ మూడు నల్ల చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్ళుగా మారతా యి. ఇప్పటి వరకు దేశం మొత్తం మీద వున్న 2384 రెగ్యులేటెడ్‌ మార్కెట్‌ యార్డులు, 4887 సబ్‌ యార్డులు,ఎ.పి.ఎం.సి.లు నోటిఫై చేసిన వేలా ది ప్రైవేట్‌ మార్కెట్‌ యార్డులు,గోడౌన్లు ఈ-నామ్‌తో అనుసంధానం చేయబడిన వందల మార్కెట్‌ యార్డులు,గ్రామీణ ప్రాంతాలలో వున్న దాదాపు 20,000 చిన్న చిన్న మార్కెట్‌ యార్డులు, మోడీ తెచ్చిన చట్టంలో ‘’ట్రేడ్‌ ఏరియా’’ నిర్వచనం లోకి రావు.దాంతో మార్కెటింగ్‌ వ్యవస్థ క్రమేపీ నిర్వీర్య మై, గత్యంతరం లేక రైతులు ఎమ్‌.ఎస్‌.పిలతో నిమిత్తం లేకుండా కార్పొరేట్‌ సంస్థలకు తక్కువ ధరలకు అమ్ముకోవలసిన దుర్గతి పడుతుంది.
మోడల్‌ ఎ.పి.యం.సి.యాక్ట్‌-2017, మోడల్‌ కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ యాక్ట్‌-2018లను అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం నుండి అదనపు ఆర్థిక మద్దతు ఇవ్వబడుతుందని, దాంతో వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వీలు కలుగుతుందని ఆర్థిక మంత్రి లోక్‌సభలో నమ్మబలికారు. రైతుల ఆదాయం రెట్టింపు అవ్వాలంటే ఈ రెండు మోడల్‌ చట్టాలను అమలు చేయటం అవసరమని నీతి అయోగ్‌ సంస్థ కేంద్రానికి సిఫార్సు చేసి వుంది. కమీషన్‌ ఏజెంట్లు ఉండరని ప్రధానమంత్రి పెద్ద అబద్ధం చెబుతున్నారు. రైతుల ఉత్పత్తుల మార్కె టింగ్‌లో ‘’ఎగ్రిగేటర్లు’’ ఉంటారని చట్టంలో స్పష్టంగా పేర్కొ నబడిరది. కమీషన్‌ ఏజెంట్లు చేసే పనినే ‘ఎగ్రిగేటర్లు’చేస్తారు. ‘మోడల్‌ ఎ.పి.ఎం.సి.యాక్ట్‌-2017’లో రెగ్యు లేటెడ్‌, ప్రైవేట్‌ మార్కెట్‌ యార్డు లనుఈ-నామ్‌తో అనుసంధానం చేయడం, ధాన్యం, గోధుమలు మున్నగు ఉత్పత్తులపైన 2శాతం మించ కుండా, కూరగాయలు, పండ్లు మొదలగు పచ్చి సరుకుపై 1శాతం మించకుండా మార్కెట్‌ సెస్సు వసూలు చేయవచ్చు. కమీషన్‌ ఏజెంట్లకు ధాన్యం మున్నగు వాటిపైన 2శాతం మించకుండా, కూర గాయలు మున్నగు వాటిపైన 4శాతం మించ కుండా కమీషన్‌ వసూలు చేసుకోవచ్చు. ఇందుకు పూర్తి భిన్నంగా మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకు రావలసిన అగత్యంపై కేంద్రం నుండి ఇంతవరకు సమాధానం లేదు.
మోడీ ప్రభుత్వం తెచ్చిన కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ చట్టం-2020 రైతులకు నష్టం కలిగిం చేలా వుంది. రైతులకు సరైన రక్షణ కలిగించే అంశాలు ఇందులో లేవు. స్పాన్సర్‌తో విభేదాలు వచ్చినపుడు రైతు (ఆర్‌.డి.ఒ/జిల్లా కలెక్టర్‌ స్థాయిలో నడిచే వివాద పరిష్కార ప్రక్రియ సందర్భంగా) న్యాయవాది సహాయం తీసుకోడానికి వీల్లేదని ఆంక్షలు విధించడం అత్యంత దుర్మార్గం. సాధార ణంగా రైతాంగంలో ఎక్కువ శాతం మంది నిరక్షరా శ్యులు. స్పాన్సర్‌ తరపున హాజరయ్యే వారికి ఉన్నత విద్య, చట్టాలపట్ల అవగాహన,ప్రభుత్వ అధి కారులతో సత్‌సంబంధాలు వుంటాయి. కావున వారు చెప్పినట్లుగానే జరుగుతుంది. అంతే తప్ప రైతుల మాటలకు విలువ వుండదు. ’నిత్యావసర వస్తువుల సవరణ చట్టం’’లో నిల్వ పరిమితులను ఎత్తివేయడంవల్ల బడారిటైల్‌ సంస్థలు చాలా హెచ్చు పరిమాణంలో సరకులను నిల్వ చేసుకోగల అవ కాశం కల్గుతుంది. ఫలితంగా కృత్రిమ కొరతలు సృష్టించబడేందుకు ఆస్కారం వుంది. అంతేకాక గత 12మాసాలలో వస్తువు సగటు ధరపైన మరు సటి సంవత్సరం 50శాతానికి మిగలని ధరలకు అమ్ముకోవచ్చుననే అంశం ప్రైవేట్‌ రిటైల్‌ మాల్స్‌కు అత్యధిక అదనపు లాభాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరలకు, రిలయన్స్‌ రిటైల్‌ మార్టులలో వినియోగ దారులకు అమ్మే ధరలకు పొంతన లేదు. రైతులకు ఎంతమాత్రం ఉపయోగం లేకపోగా వినియోగ దారులపైన పెనుభారం మోపబడుతుంది.
ఈ నేపథ్యంలో కౌలు రైతుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలోపడ్డ చందంగా తయారయ్యే అవకాశం వుంది. సన్నకారు, చిన్న రైతులలో నూటికి 40మంది ప్రైవేట్‌ వడ్డీ వ్యాపా రుల దయాదాక్షిణ్యాల పైనే ఆధారపడాల్సిన పరిస్థితి వుందని నాబార్డుసర్వే చెబుతోంది. రూ.1.5లక్షల లోపు పంట రుణాలను హామీతో నిమిత్తం లేకుండా రైతులకు, కౌలు రైతులకు ఇవ్వా లని రిజర్వుబ్యాంకు మార్గదర్శకాలు వున్నా సరిగ్గా అమలు కావడం లేదు. దేశవ్యాప్తంగా సాగుభూమి లో 10శాతం భూమిని కౌలు రైతులు సాగు చేస్తు న్నారని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆచరణలో ఇంకా అధిక శాతం భూమిని కౌలు రైతులు సాగు చేస్తున్నారు. పంట రుణాలే కాక ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు అందవలసిన ఇన్‌పుట్‌ సబ్సిడీ గానీ, ప్రభుత్వం నేరుగా అందించే నగదు బదిలీ సహాయం (పి.ఎం.కిసాన్‌ సమ్మాన్‌ యోజన) కానీ, పంటల బీమా పథకం వలన అందాల్సిన సహా యం గానీ కౌలు రైతులకు ఇప్పటికీ అందడం లేదు. చాలామంది రైతులలో కౌలుకిచ్చినట్లు కాగి తంపైన అంగీకరిస్తే, తమ భూయాజమాన్య హక్కుకు భంగం వాటిల్లుతుందనే భయాందోళనలు వుండ టం వలన కౌలు పత్రం పైన సంతకాలు చేయడం లేదు. అంతేకాక బ్యాంకు కౌలు రైతుకిచ్చే పంట రుణం అతను కట్టకపోతే తాను కట్టవలసి వస్తుం దనే భయం కూడా వుంది. వాస్తవంగా తాము కౌలు చేస్తున్న భూమి తమకు చెందాలని, కౌలు రైతులు కోరుకోవడం లేదు. కౌలు చేసుకోడానికి భూమి దొరికితే చాలనుకుంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు నీతి ఆయోగ్‌ సంస్థ ‘’మోడల్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ లీజింగ్‌ యాక్ట్‌-2016’’ను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదానికి పంపించింది. ఉత్తరప్రదేశ్‌,మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలు ఈచట్టం అమలు చేసేందుకు కృషి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ చట్టా న్ని ఆమోదించాలని,రైతుకు తనభూమి పైన యాజ మాన్య హక్కుకు ఎట్టి పరిస్థితిలోనూ భంగం వాటి ల్లదని హామీ ఇస్తూ, అదే సమయంలో కౌలు రైతుకు గుర్తింపు ఇచ్చి,బ్యాంకు రుణం, ఇన్సూరెన్స్‌ సదు పాయం, ఇన్‌-పుట్‌ సబ్సిడి, నగదు బదిలీ మున్నగు ప్రయోజనాలు అందేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయవలసి వుంటుంది. రైతు సంఘాలు,కౌలు రైతు సంఘాలు, మోడల్‌ యాక్టు లోని అంశాలను రైతు లకు అవగాహన కల్పించి కౌలుపత్రాలపైన సంత కాలు చేయడంద్వారా కౌలు రైతులకు మేలు కలిగేం దుకు కృషి సల్పాలి.కేంద్ర ప్రభుత్వ నగదు బదిలీ (పి.యం.కిసాన్‌ సమ్మాన్‌) పథకంలో 5ఎకరాల లోపు భూయజమానులైన సన్నకారు, చిన్న రైతులకు మాత్రమే వార్షికంగా మూడు వాయిదాలలో రూ. 2,000 చొప్పున మొత్తంగా రూ.6,000నగదు బదిలీ జరుగుతుంది. వాస్తవానికి సాగు చేస్తున్న భూమిగల రైతుగాని లేక అనేక కష్టనష్టాలకోర్చి సాగు చేస్తూ వున్న కౌలురైతుకు ఈసహాయం అంద వలసిన అవసరం ఎంతైనావుంది. కాలియా పథ కం కింద ఒరిస్సా ప్రభుత్వం వార్షికంగా వ్యవసా య కూలీ కుటుంబాలకు రూ.12,500 చొప్పున, సన్నకారు,చిన్నరైతులు,కౌలు రైతులకు రూ.10,000 చొప్పున అందచేస్తున్నది. అదేపద్ధతిని ఇతర రాష్ట్రా లలో కూడా అమలు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది. ఈ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే భూమి రికార్డులు సక్రమంగా వుండా లి. దేశంలో సుమారు 2 కోట్ల గిరిజన కుటుంబాలు వుండగా 20లక్షల మందికి మాత్రమే ఫారెస్ట్‌ అటవీ హక్కు పత్రాలు ఇవ్వబడ్డాయి. తగు సంఖ్యలో సిబ్బందిని నియమించి మహిళారైతుల పేర్లతో సహా భూ యజమానులపేర్లు, కౌలు రైతుల పేర్లతో సహా భూ రికార్డులను ఆధునీకరించవలసిన అవసరం ఎంతైనా వుంది.
వ్యవసాయ చట్టాలు -నిజా నిజాలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసా య సంస్కరణల చట్టాలు రద్దు చేసేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని రైతులు చెబుతు న్నారు. సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన వ్యవసా య చట్టాలను వెనక్కు తీసుకోవాలని ఢల్లీి సరిహ ద్దుల్లో కొన్ని వారాలుగా వివిధ రాష్ట్రాల రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రైతుల ప్రయోజనాల కోసమే మూడు కొత్త చట్టాలు చేశామని కేంద్రం చెబుతోంది. అవసరమైతే చట్టాల్లో సవరణలు చేస్తాం కానీ, వాటిని రద్దు చేసే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రులు చెప్పారు. ఈ నేపథ్యంలో మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాల వల్ల రైతులకు లాభం ఎంత? కార్పొరేట్లకు వ్యవసాయాన్ని దారాదత్తం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత? తదితర వివరాలను పరిశీలిద్దాం.
ప్రభుత్వం ఇటీవల మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాలకు ఆమోదం తెలిపి, వాటిని అమల్లోకి తీసుకొచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునేందుకు తీసుకువచ్చిన ుష్ట్రవ ఖీaతీఎవతీం ూతీశీసబషవ ుతీaసవ aఅస జశీఎఎవతీషవ (ూతీశీఎశ్‌ీఱశీఅ aఅస ఖీaషఱశ్రీఱ్‌a్‌ఱశీఅ) Aష్‌-2020బీ ఒప్పంద వ్యవసాయం చేసుకునేందుకు రూపొం దించిన, నిత్యావసర వస్తువుల పరిమితిపై చేసిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకు వచ్చింది. దళారులకు అవకాశం కల్పించకుండా రైతుల ఆదాయాన్ని వృద్ది చేయాలనే లక్ష్యంతోనే ఈ చట్టాలు చేశామని కేంద్రం ప్రకటించింది.
రైతులకు ఎలా ఉపయోగం?
ఇంతకు ముందు వివిధ రాష్ట్రాలు ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీల (Aూవీజ) నియమాల ప్రకారం రైతులు పంటలు అమ్ముకు నేవారు. వీటిని కొత్త చట్టాలు సడలించాయి. ఇప్పటి నుంచి ప్రభుత్వ మార్కెట్లలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తు లను అమ్ముకునేందుకు చట్టం వీలు కల్పిస్తోంది. దీంతోపాటు ఒప్పంద వ్యవసాయానికి సంబంధిం చిన నియమ,నిబంధనల ద్వారా చట్టబద్దత కల్పిం చారు. వ్యవసాయ ఉత్పత్తులపై స్టాక్‌ పరిమి తులను తొలగించేందుకు విధానాన్ని రూపొందించారు. పంటలు ఎక్కువగా పండినప్పుడు వ్యాపారులు రైతుల నుంచి పెద్ద మొత్తంలో ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. పెద్దపెద్ద కార్పొరేట్‌ కంపెనీలు వ్యవసాయ ఉత్ప త్తుల మార్కెట్లలోకి వచ్చేందుకు కొత్త చట్టాలు వీలు కల్పిస్తున్నాయని రైతులు భయపడుతున్నారు. ఇది గుత్తాధిపత్యాన్ని సృష్టించగలదని,ఫలితంగా పంట ల ధరలను ఆయాకంపెనీలు తగ్గించడానికి అవకాశం కలుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Aూవీజ మార్కెట్లను 1960లలో దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. రైతులకు మెరుగైన మద్దతు ధరలు కల్పించాలనేది వీటిలక్ష్యం. దీని ప్రకారం రైతులు స్థానిక మార్కెట్‌ యార్డులలోని లైసెన్స్‌ పొందిన మధ్యవర్తులకు మాత్రమే పంట ఉత్పత్తులను అమ్మాల్సి ఉంటుంది. అంటే.. బహి రంగ మార్కెట్లో కాకుండా,తమకు దగ్గర్లో ఉన్న మార్కెట్‌ యార్డుల్లోనే రైతులు పంటలు అమ్ము కోవాలి. ఈ పరిమితుల వల్ల రైతులు తమ పంటను బహిరంగ మార్కెట్లలో అమ్ముకునేందుకు అడ్డంకు లు ఏర్పడ్డాయి. దీంతోపాటు కొన్ని దశాబ్దాలుగా ఈ కమిటీల ద్వారానే పంట ఉత్పత్తులు అమ్మాల్సి వచ్చింది. ఫలితంగా ప్రభుత్వ మార్కెట్లే రైతులు తమ ఉత్పత్తులకు సరిపోయే ధరను పొందడానికి అవరోధాలుగా మారాయి. ఏయే సీజన్లో, ఏయే పంటలకు ఎంత ధర పలుకుతుందనేది ప్రభుత్వం చేతుల నుంచి మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లింది. దీంతో దళారులు చెప్పిన ధరకే పంటలను అమ్ము కునే గతి రైతులకు పట్టింది. Aూవీజలు ప్రధానంగా కమిషన్‌ ఆధారిత వ్యవస్థ పై ఆధారపడి ఉంటాయి. లైసెన్స్‌ పొందిన మధ్యవర్తులు మాత్రమే ఈ మార్కెట్లలో రైతుల పంటలను కొనాలి. ఈ మధ్య వర్తుల్లో కమీషన్‌ ఏజెంట్లు,హోల్‌సేలర్స్‌, ట్రాన్స్‌ పోర్టర్స్‌, రైల్వే ఏజెంట్లు,స్టోరేజ్‌ ఏజెంట్లు ఉన్నారు. కానీ కొన్ని సంవత్సరాలు తరువాత ఇవి ఱఅ్‌వతీషశీఅఅవష్‌వస శీశ్రీఱస్త్రశీజూశీశ్రీఱవంలకు దారితీశాయి. కొన్ని వ్యాపార వర్గాలే మార్కెట్‌ యార్డులపై ఆధిపత్యం చూపడం మొదలైంది. స్థానిక మార్కెట్లలో వారు చెప్పిందే వేదం అనేంతగా పరిస్థితులు దిగజా రాయి. ఇందుకు ఒక ఉదాహరణ సైతం ఉంది. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్‌ ఉంది.2010 డిసెంబరులో…ఈ మార్కెట్‌ నుంచి జరిగిన వ్యాపారంలో దాదాపు 20శాతం ఒకే ఒక్క దళారీ సంస్థ ద్వారా జరిగిం దని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా తేల్చింది. ఇలాంటి సంస్థలన్నీ కలిసి మార్కెట్‌ యార్డులకు వచ్చే రైతులకు మద్దతు ధర రాకుండా ముందుగానే ప్రణాళిక వేసుకొని వ్యాపారాన్ని పంచుకుం టున్నాయని తేలింది. ఇలాంటి దళారుల వల్ల రైతు అందుకున్న ధరకు, వినియోగదారులు కొనే ధరకు మధ్య తేడా పెరిగిపోతుంది.లాభం మాత్రం ఎప్పుడైనా మధ్యవర్తుల జేబుల్లోకే వెళ్తుంది. ప్రభుత్వ మార్కెట్‌ యార్డులు కొంతమంది వ్యాపారుల గుత్తాధిపత్యంలోకి వెళ్లాయని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (చీa్‌ఱశీఅaశ్రీ జశీబఅషఱశ్రీ శీట Aజూజూశ్రీఱవస జుషశీఅశీఎఱష Rవంవaతీషష్ట్ర)2012లో వెల్లడిరచిన నివేదికలో తెలిపింది. రైతులు ప్రభుత్వ మార్కెట్‌ యార్డుల్లోనే కాకుండా బహిరంగ మార్కె ట్లలో,ఇతర రాష్ట్రాల్లో కూడా పంటలు అమ్ముకు నేందుకు కొత్తచట్టం అవకాశం కల్పించింది.దీనివల్ల రైతులు తమ ఉత్పత్తులకు ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే అక్కడే అమ్ముకునే అవకాశం కలుగుతుంది. చట్టాలపై రైతులకు ఎందుకు నమ్మకం కలగడం లేదు? క్రమబద్ధీకరించని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లలోకి పెద్ద సంస్థలు, ప్రైవేటు వ్యాపారులు ప్రవేశిస్తే..వారితో బేరమాడే శక్తిని కోల్పోతామని రైతులు భయపడుతున్నారు.దీంతోపాటు కొత్త చట్టం ప్రకారం వ్యాపారులు ఎలాంటి ఫీజులూ చెల్లించా ల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ లేకుండా ఇలాంటి ప్రైవేట్‌ వ్యాపారులు లావాదేవీ లు చేయడం వల్ల సాంప్రదాయ మార్కెట్‌ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుందేమోనని రైతులు భయపడుతు న్నారు. గత కొన్ని సంవత్సరాలలో చాలా రాజకీయ పార్టీలు ఇలాంటి సంస్కరణలు చేసేందుకు ముం దుకు వచ్చాయి. కానీ అందులో రాజకీయ కోణమే ఉందని స్పష్టంగా అర్థమైంది. సాంప్రదాయ Aూవీజమార్కెట్లు కొన్ని రాష్ట్రాలకు ఆదాయ వనరు లుగా ఉన్నాయి. ఉదాహరణకు పంజాబ్‌లో Aూవీజల్లో గోధుమల కొనుగోలుపై ఆరు శాతం ఫీజు(మార్కెట్‌ఫీజు,గ్రామీణాభివృద్ధి ఫీజు-మూడు శాతం చొప్పున)ను ప్రభుత్వం వసూలు చేస్తుంది. ధాన్యంపై ఆరు శాతం, బాస్మతి బియ్యంపై 4.25 శాతం ఫీజుఉంటుంది. పంజాబ్‌లో సుమారు 90 శాతం గోధుమలు, వరి పంటలను ఈ మార్కెట్ల లోనే కనీస మద్దతు ధరల (%వీూూం%)కు కొను గోలు చేస్తారు. అందువల్ల కొత్తచట్టాలతో ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో ప్రభుత్వంతో పాటు మార్కె ట్‌ కమిటీలపై ఆధారపడి వ్యాపారాలు చేసే మధ్య వర్తులు,రైతులపై కూడా దీని ప్రభావం ఉంటుంది. కొత్త చట్టాల వల్ల ప్రభుత్వం చివరికి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం ఆపేస్తుందేమోనని, ప్రైవేటు వ్యాపారులకే పంటలు అమ్ముకునే రోజులు వస్తాయేమోనని రైతులు భయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం 23 ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర ను ప్రతి సంవత్సరం ప్రకటిస్తోంది.
కనీస మద్దతు ధరపై రైతుల డిమాండ్లు ఏంటి?
అన్ని ప్రధాన పంటల ఉత్పత్తులను ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేస్తామని చట్టప్రకారం హామీ ఉండాలని, అలాంటి హామీ ఇచ్చే చట్టాన్ని కేంద్రం తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. దీని ప్రకారం ప్రైవేటు వ్యాపారులు రైతుల పంటలను కనీస మద్దతు ధరకు, లేదా అంతకంటే ఎక్కువకు కొనాలనే నియమం ఉంటుంది.వీూూకి తక్కువగా ఉండే ఏదైనా వ్యవ సాయ ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించేలా చట్టం ఉండాలని రైతులు కోరుతున్నారు.
ఎవరికి ఉపయోగం?
వ్యవసాయ ఉత్పత్తులను ఫుడ్‌ కార్పొ రేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఖీజI)ద్వారా ప్రభుత్వం కొను గోలు చేస్తోంది.దేశ అవసరాలకు సరిపోయే ఉత్పత్తులను ఎఫ్‌సీఐ సేకరించి,నిల్వ చేస్తోంది. దేశవ్యాప్తంగా అతి తక్కువమంది రైతులు మాత్రమే కనీస మద్దతు ధరను పొందుతున్నారని ప్రభుత్వ గణాంకాలు నిరూపిస్తున్నాయి. వరిసాగు చేసే రైతుల్లో 13.5శాతం,గోధుమలు పండిరచే రైతుల్లో 16.2శాతం మంది రైతులు మాత్రమే కనీస మద్దతు ధరను పొందుతున్నారని నేషనల్‌ శాంపిల్‌ సర్వే చెబుతోంది.
కనీస మద్దతు ధరపై చట్టాలు చేయలేమా?
కనీస మద్దతు ధరకోసం చేసే చట్టం వల్ల ద్రవ్యోల్బణం ప్రభావితమవుతుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు…రైతుల వద్ద మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేసే ప్రైవేట్‌ వ్యాపారి,తన లాభాన్ని చూసుకొని వాటిని వినియోగ దారులకు అందించేందుకు ఎక్కువ ధరలను నిర్దేశిం చాల్సి వస్తుంది. దీంతోపాటు మద్దతు ధరల విధా నాన్ని చట్టబద్దం చేస్తే.. బహిరంగ మార్కెట్లో కొను గోళ్లు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇదిపంట ఉత్పత్తుల ఎగుమ తులపై కూడా ప్రభావం చూపు తుంది. కొన్నిసార్లు బహిరంగ మార్కెట్లో, విదేశాల్లో పంట ఉత్పత్తులధరలు మద్దతు ధరలకంటే తక్కువ గా ఉండే అవ కాశంఉంది. ఇలాంటప్పుడు వ్యాపా రులు పంటలను ఎక్కువ ధరలు పెట్టి కొని, తక్కువ లాభాలకు ఎగుమతి చేయలేరు. ఇదే సందర్భంలో దేశీయ మార్కెట్‌లో కూడా ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధరలకు పంటలను కొనడానికి ముందుకు రారు. దీనివల్ల ప్రభుత్వం లేదా ఎఫ్‌సిఐ మాత్రమే మార్కెట్లో పంటలను కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీంతో పాటు ఎక్కువ మద్దతు ధర వచ్చే పంటలనే రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతారు. దీనివల్ల ప్రజలకు అవసరమయ్యే వివిధ రకాల పంటల సాగు తగ్గిపోతుంది. ఫలితంగా నూనె గింజలు వంటి అనేక ఆహార ఉత్పత్తులను భారత దేశం దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడు తుంది. సంస్కరణల వల్ల రైతులకు మంచి ధరలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. రైతుల అభ్యం తరాలను పరిగణనలోకి తీసుకొని, చట్టాలకు కొన్ని సవరణలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. కనీస మద్దతు ధరకు లిఖిత పూర్వక హామీ ఇస్తామని కేంద్ర మంత్రులు సైతం చెప్పారు. రైతులకు మెరుగైన ధర లభిస్తుందని భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం ధర-లోటు (జూతీఱషవ-సవటఱషఱవఅషవ) విధా నాన్ని అమలు చేస్తే మంచిదని కొంతమంది నిపు ణులు అభిప్రాయపడ్డారు.
ఈ వ్యవస్థను మధ్య ప్రదేశ్‌లో ప్రయ త్నించారు. దీని ప్రకారం..మార్కె ట్‌ ధరకు, కనీస మద్దతుధరకు మధ్య ఉండే లోటును ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుంది. కాంట్రాక్ట్‌ వ్యవసా యంలో రైతుల హక్కులను కాపాడేందుకు చట్టపరంగా అద నపు రక్షణ కల్పించేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. రిజిస్ట్రేషన్‌ విధానం ద్వారా ప్రైవేటు మార్కెట్లు, రాష్ట్రప్రభుత్వాల ఆధ్వ ర్యంలో పనిచేసే నోటిఫైడ్‌ మార్కెట్ల మధ్య సమానత్వం తీసు కొస్తామని తెలిపింది.నోటిఫైడ్‌ మార్కె ట్లలో వర్తించే సెస్‌, సర్వీస్‌ ఛార్జీలను రాష్ట్ర ప్రభు త్వాలు వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తా మని ప్రకటిం చింది. కాంట్రాక్ట్‌-ఫార్మింగ్‌ చట్టం ప్రకారం అగ్రి బిజినెస్‌ స్పాన్సర్లు రైతుల భూమిని ఇతరుల పేరుకు ట్రాన్స్‌ఫర్‌ చేయడం,అమ్మడం,లీజుకు ఇవ్వడం, తనఖా పెట్టడం వంటివి నిషేధించారు. కాంట్రా క్టు వ్యవసాయంలో రైతులు, స్పాన్సర్ల మధ్య ఏర్పడే భేదాభిప్రాయాల కారణంగా రైతుల భూమిని జప్తు చేయలేరని ప్రభుత్వం పేర్కొంది. పంటల వ్యర్థా లను కాల్చడంవల్ల ఢల్లీి,చీజR పరి సర ప్రాంతాల్లో కాలుష్యం పెరిగిపోతోందని, అందువల్ల వ్యర్థాలను దహనంచేసే రైతులకు ఒక సంవత్సరం జైలుశిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ అక్టోబర్లో దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. వ్యర్థా లను దహనం చేయకుండా ఇతర అవసరాలకు కొనుగోలు చేసేలా చొరవ చూపాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఒకక్వింటాల్‌ వ్యర్థాలకు రూ. 200 చొప్పున చెల్లించి, వాటిని తరలించాలని రైతులు కోరుతున్నారు. క్వింటాల్‌కు రూ.100 చొప్పున చెల్లించేందుకు ముందుకు రావాలని కేంద్రా నికి సుప్రీంకోర్టు సూచిం చింది. ఈసమస్యకు కూడా పరిష్కార మార్గాన్ని తీసుకువస్తామని ప్రభుత్వం తెలిపింది.– జిఎన్‌వి సతీష్‌

తత్వవేత్త సర్వోన్నతులు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌

‘‘ ఎవని లీలవలన రాతినుండి కూడా అమృతం లభిస్తుందో అట్టి లక్ష్మీకాంతుడైన మహాగురువునకు నమస్కరిస్తున్నాను. అల్పబుద్దుల్కెన శిష్యులను సైతం మహా ప్రజ్ఞావంతులుగా మలచగల శక్తియుక్తులు గల గురువులకు నమస్కారము.’’

ా విద్యార్థుల కోసం గవర్నర్‌నే ఎదిరించారు
ా అరిటాకు లేక నేల మీదే అన్నం తిన్నారు
ా పూజారి కాబోయి రాష్ట్రపతి అయ్యారు

ఆయనో ఆసాధారణ ప్రజ్ఞాశాలి,రాజ నీతి కోవి దుడు, విద్యావేత్త. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్ర ప తిగా (1962 నుంచి67) పదవులకే వన్నెతెచ్చిన ‘భారత రత్నం’. ఆయనే డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ప్రజాస్వామ్య విలువలను నెలకొల్ప డంలో, విద్యకు సమున్నత స్థానాన్ని కల్పించడంలో ఆయన చూపిన బహుముఖ ప్రజ్ఞ ఆయనకు చరిత్ర లో శాశ్వత స్థానం కల్పించింది.‘తత్వవేత్తలు రాజ్యాధి పతులైనప్పుడు ఆదర్శ రాజ్యం ఏర్పడి దేశంలో సుఖశాం తులు విలసిల్లుతాయి’ అన్న గ్రీక్‌ తత్వవేత్త ప్లేటో వ్యాఖ్యలకు రాధాకృష్ణనే నిలువెత్తు నిదర్శనం. ముందుగా ఆయన జీవితంలోని మధుర ఘట్టాలను ఒకసారి స్పృశిద్దాం…

Read more

కథ చెబుతాను ఊకొడుతావా

వినదగు నెవ్వరు చెప్పిన ..వినినంతనె వేగపడక వివరింపదగున్‌.. గని కల్ల నిజము దెలిసిన.. మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ…!

చంద గహ్రణం (కథ)
మేడమీద మంచంలో లక్ష్మయ్యతాత చందమామను చూస్తూ పండుకున్నాడు. మనవడు సుధీర్‌, మనవరాలు ప్రతిమ తాత పక్కన చేరి చందమామను గూర్చి అనేక ప్రశ్నలు అమాయకంగా అడిగారు.
‘‘మేం చిన్నప్పుడు విన్న చంద్రుడికి, పుస్తకాల్లో చదువుకున్న చంద్రుడికి చాలా తేడ వుందిరా. రాహువు కేతువు అనే గ్రహాలు చంద్రుడిని, సూర్యుడిని మింగుతాయట. అలా మింగినపుడు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడతాయని మా తాతముత్తాతలు చెప్పారు. చంద్రుడు చాలా అందంగా వుంటాడని, చంద్రు నిపై చెట్టు, చెట్టుకింద అవ్వ, ఆమె పక్కన కుందేలు వుంటుందని చాలా కథలు చెప్పేవారు. నేను బడిలో చేరి పుస్తకాలు చదివినప్పుడు అసలు చంద్రుడు నేను విన్నట్లు అందంగా వుండడని,చంద్రునిపై చెట్టు,అవ్వ, కుందేలు లేవని చదివాను.చంద్రుని మీద దుమ్ము,ధూళి,రాళ్ళగుట్టలు వుంటాయని చదివా. సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో భూమి వస్తే చంద్రగ్రహణం వస్తుంది. ఎక్కువగా పున్నమి రోజు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది’’- అన్నాడు తాత లక్ష్మయ్య.

Read more

పీసా చట్టం గ్రూపు చైర్‌పర్సన్‌గా రెబ్బాప్రగడ రవి

‘ ఆదివాసీలు భిన్నజాతుల సమాహారమైన భారత ఉపఖండంలో అనేక గిరిజన సముదాయాలు నివసిస్తున్నాయి. ఆదివాసీలు తమదైన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, సామాజిక విలువలను కలిగి ఉంటారు. దేశంలో ఆదివాసీలు నివసించే 9 రాష్ట్రాల్లో గిరిజనులకు కల్పించ బడిన రాజ్యాంగ హక్కులను అమలు పరచడానికి కృషి చేయడం తోపాటు, షడ్యూల్‌ తెగల సామాజిక సాధి కారత. సమా నత్వం, సంక్షేమం సాధిం చడమే సామాజిక బాధ్యత. ప్రజల జీవన ప్రమా ణాలు పెంచడంలోనూ, స్వయం సంవృద్ది సాధించడం లోనూ పీసా చట్టంలోని మరికొన్ని విశేష అధికారాలు ఉన్నాయి ’’ ` రెబ్బాప్రగడ రవి, సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మరియు పీసా వర్కింగ్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌, చత్తీస్‌ఘర్‌,

అడవి బిడ్డలకు స్వయం పాలన మరింత సులువు కానుంది. ఇన్నాళ్లు షెడ్యూల్డ్‌ ఏరియాలో గిరిజనుల హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగింది. పెసా (పంచాయతీస్‌ ఎక్స్‌టెన్షన్‌ టూ షెడ్యూల్‌ ఏరియా)1996 చట్టం వచ్చి 25ఏళ్లు పూర్తియిన సమత ఎగ్జిక్యూ టివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవి చత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర ప్రభుత్వం పీసా చట్టం వర్కింగ్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్‌ బాగెల్‌ సలహాదారు శ్రీరాజేష్‌తివారీ అధ్యక్షతన‘‘గిరిజన అభివృద్ధి,అటవీ మరియు వన్యప్రాణి నిర్వహణ, మైనర్‌ ఫారెస్ట్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఏరియాస్‌ డెవలప్‌మెంట్‌’’పై టాస్క్ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. దానికి అను బంధంగా టాస్క్ఫోర్స్‌ కింద వివిధ సబ్‌-వర్కింగ్‌ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఇందులో సబ్‌-వర్కింగ్‌ గ్రూప్‌ ‘‘ట్రైబల్‌ ఏరియా గవర్నెన్స్‌-పెసా మరియు గవర్నెన్స్‌లో టెక్నాలజీ వాడకం’’ ఛైర్మన్‌గా సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవిని ఆరాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక సంఘం ప్రకటించింది.వర్కింగ్‌ గ్రూప్‌ కమిటీ పీసా చట్టంపై ప్రభుత్వానికి తగు సూచనలు సలహాలు ఇస్తోంది.

Read more

నిజం

నేటి ఆధునిక సమాజపు ఆలోచన, కానీ అందుకు భిన్నమైన దృక్పథంతో కొత్తకోణంలో రాసిన గిరిజన కథ ‘‘నిజం’’. మనుషులు, సమాజం, దేశం,తరతమ భేదం లేకుండా ఏనాటికైనా మార్పు చెంది తీరా ల్సిందే.అనే ఆశాభావంతో.. ఆలోచించే రచయిత్రి కథలన్నీ అలాంటి నిర్మాణాత్మక దృక్పథంతో ప్రయో జనాత్మకంగా తీర్చిదిద్ద బడ్డాయి. తన క్షేత్ర పర్యటనల్లో భాగంగా సందర్శించే గిరిజన గ్రామాల్లోని వాస్తవ సంఘటనలు, ప్రత్యక్షంగా గమ నించిన పరిజ్ఞానంతో ‘‘నిజం’’ కథ రాశారు. రచనా కాలం మార్చి 20,2006 జాగృతి వార పత్రికలో మొదట ప్రచురించబడిరది. అడవిబిడ్డలకు ప్రత్యేకంగా మతం,దైవాలు, ఉండవు వారు వేటి ద్వారా జీవనం సాగిస్తారో అవే వారి పాలిట దైవాలు..అవి వారి మతం… అభిమతం. అడవి బిడ్డలు విశ్వసించినట్టు దేని ద్వారా తమ జీవనం గడుస్తుందో దానినే దైవంగా ఆరాధించే లక్షణం ఆధునిక మానవులు అలవర్చుకుంటే ఇప్పుడున్న ఇన్ని మతాలు..నాగరికత ముసుగులో మనిషి సృష్టించుకున్న ఇన్ని రకాల దైవాల అవసరమే ఉండదు. ` శివల పద్మ , రచయితి.

సాధారణంగా గిరిజనులుఅంటే, కొండ కోనల్లో కాపురముంటూ, నాగరిక ప్రపంచం, లోకం పోకడ తెలియక, మూఢనమ్మకాలతో మూర్ఖ త్వం నిండిన, విచిత్ర వేషధారణలతో చిత్రంగా ఉం టారు. అనేది నేటి ఆధునిక సమాజపు ఆలోచన, కానీ అందుకు భిన్నమైన దృక్పథంతో కొత్తకోణంలో శివల పద్మ రాసిన గిరిజన కథ ‘‘నిజం’’. విద్యార్హ తల రీత్యా తెలుగు, ఫిలాసఫీ,ల్లో మాస్టర్‌ డిగ్రీలు పొందిన వీరు. కథా రచయిత్రిగా ‘‘ఎన్నాళ్లీ మౌ నం?’’ ‘‘ఫలించిన స్వప్నం’’ లాంటి కథా సంపు టాలు ప్రచురించిన ఈమె ఆలోచనా ధోరణిలాగే, కథా శిల్పం కూడా అద్భుతంగా ఉంటుంది. ‘‘సాధనమున పనులు సమకూరు ధరలోన’’ అన్న నానుడిని నిండుగా నమ్మిన ఆమె తాను నిత్యం చూస్తున్న సంఘటనలు,సమస్యలను,అనుభవాలను, వస్తువులుగా ఎంచుకుని ఎం చక్కని శిల్పసౌందర్యం అద్ది, అందమైన ఆలోచించదగ్గ కథలు రాయడంలో తను అందెవేసిన చేయి.
మనుషులు,సమాజం,దేశం,తరతమ భేదం లేకుండా ఏనాటికైనా మార్పు చెంది తీరా ల్సిందే.అనే ఆశాభావంతో.. ఆలోచించే రచయిత్రి కథలన్నీ అలాంటి నిర్మాణాత్మక దృక్పథంతో ప్రయో జనాత్మకంగా తీర్చిదిద్దబడ్డాయి. కథా రచయిత్రి తన క్షేత్ర పర్యటనల్లో భాగంగా సందర్శించే గిరిజన గ్రామాల్లోని వాస్తవ సంఘటనలు, ప్రత్యక్షంగా గమ నించిన పరిజ్ఞానంతో ‘‘నిజం’’ కథ రాశారు. దీని రచనా కాలం మార్చి 20,2006 జాగృతి వార పత్రికలో మొదట ప్రచురించబడిన గిరిజన కథ లోని కథనం, పరిశీలిస్తే…..
‘‘వారిజ’’ అనే పత్రిక రచయిత్రి తన స్నేహితురాళ్ళు సుధ,సునీతలతో కలిసి గిరిజన ప్రాం తాలతో పరిచయంగల‘మూర్తి’అనే సోదరుని సాయంతో ఒకచిన్నగిరిజన గ్రామం వెళ్లడంతో ప్రారంభమయ్యే కథ,ఆద్యంతం అడవుల్లోని వన వాసుల సుందర జీవన చిత్రాన్ని పాఠకుల కళ్ళకు కడుతూ,అందమైన అనుభవం అనుభూతిని,ఇచ్చి ఒకకొత్త ఆలోచన కలిగిస్తూ ముగుస్తుంది.తనదైన ‘‘కవితాత్మక ఉత్తమ వాక్య నిర్మాణ శైలి’’ సొంతం చేసుకున్న శివలపద్మకథా పయనం మరింత ఉత్తమోత్తమంగా సాగుతుంది. నగర జీవితంలో ఎంత వెతికినా దొరకని అనుభూతి సోయగం ‘వారిజ’ స్నేహితురాళ్ళ త్రయానికి అక్కడ లభ్య మౌతుంది. కానీ..బాహ్యప్రపంచంతో సంబం ధాలు లేకుండా,పూర్వకాలపు అనాగరిక పద్ధతు ల్లో, కూనరిల్లిపోతున్న అక్కడి గిరిజనుల పట్ల తక్కు వ భావం కలిగిన సుధ,సునీతలకు తన పరిశోధన ద్వారా వారి పూర్వాపరాలు తెలుసుకుని వారికి నాగరికత నేర్పడమే తన లక్ష్యం అని తన స్నేహితు రాళ్లకు సగర్వంగా చెబుతుంది. కానీ అక్కడ తాను ప్రత్యక్షంగా చూసిన పరిస్థితితో ఆశ్చర్యపోతుంది వారిజ.గిరిజన గ్రామంలో మూర్తి సేవా కార్యక్ర మాలు నిర్వహిస్తూ అక్కడి గిరిజనులతో సహృదయ సంబంధాలు కలిగి ఉంటాడు. అక్కడి వారంతా తనని తమ బంధువుగా భావించి ఆదరిస్తారు, ఆ చదువుతోనే స్నేహితురాళ్ళ బృందాన్ని అక్కడికి తీసుకువెళతాడు.
ముందస్తు సమాచారంతో అక్కడకు వెళ్లిన వీరిని ఆగూడెం ప్రజలంతా ఎంతో ఆత్మీ యంగా పలకరించడం,ఆహ్వానించడం,ఆధునిక అమ్మాయిలకు ఆశ్చర్యంగా అనిపించినా అది అడవి బిడ్డల సహజగుణం. మూర్తి అక్కడ తులసి అనే ఒక గిరిజన యువతిని ‘వారిజ’కు పరిచయం చేస్తాడు. ఆమె కట్టు బొట్టు రూపం చూసి తనకు మొదట చులకన భావం కలుగుతుంది.కానీ ‘తులసి’ లోని ఆప్యాయత పలకరింపులేకాదు.తను విశ్వ విద్యాలయ విద్యపూర్తి చేసి ఆగ్రామంలో ఒకబడి కూడా నడుపుతూ..జర్నలిజం కూడా చదువు తుం దని,చక్కని నాయకత్వ లక్షణాలు కలిగి,మంచి చైత న్యం నిండిన యువతి అని మూర్తి మాటల ద్వారా తెలుసుకున్న వారిజకి ఆశ్చర్యం కలుగుతుంది. చివరకు గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకునే పనిలో భాగంగా తులసి ఆధ్వ ర్యంలో అక్కడి గిరిజన మహిళలతో సమావేశం అయిన వారిజ స్నేహితురాళ్లకు చెంపలు చెళ్లు మనిపించేట్టు సమాధానాలు వస్తాయి.ప్రకృతితో ముడిపడి ఉండే వారి పండుగల గురించి, కట్న కానుకలు కనిపించని వారి పెళ్లిళ్లు, డబ్బు ప్రసక్తే లేకుండా సాగిపోయే వారి జీవనం గురించి, వృద్ధు లైన తల్లిదండ్రులను వారికొడుకులు కోడళ్ళు కాపా డే తీరు,ముసలి వారినినిర్లక్ష్యం చేస్తే గిరిజన కుటుం బాల్లో పాటించే,ఎలివేత,తదితర కట్టుబాట్లు, ఆచా రాల గురించి…ఆగిరిజన స్త్రీలు చెబుతూ ఉంటే ఈపట్టణ యువతులకు కళ్ళు బైర్లు కమ్ముతాయి, పేరుకు ఆధునిక ప్రాంతంలో నాగరికతతో జీవిస్తు న్నాము అని అనుకుంటున్నా,..అడవిబిడ్డల ఆత్మీయ సంస్కృతులతో పోల్చుకుంటే, మనం ఎంత అనాగరి కంగా జీవిస్తున్నామో నర్మగర్భంగా చెబుతూ రచ యిత్రి తనకు గల ‘మూలవాసి ప్రేమ’ను చెప్పకనే చెబుతారు.ఎంతో పటిష్టమైన కుటుంబ, సంఘ వ్యవస్థలకు, కట్టుబాట్లకు బద్ధులై జీవిస్తున్న ఈ వనవాసులు బాహ్యంగా అనాగరిక అవతారాల్లో అగుపించిన అంతర్గతంగా,మానసికంగా, నిజమైన మానవత్వం కలిగి జీవిస్తున్నారు అనే సందేశం ఈకథ ద్వారా అందించే ప్రయత్నం జరిగింది.
అడవిబిడ్డలకు ప్రత్యేకంగా మతం,దైవాలు, ఉండవు వారు వేటి ద్వారా జీవనం సాగిస్తారో అవే వారి పాలిట దైవాలు,అవి వారి మతం,అభిమతం. అడవి బిడ్డలు విశ్వసించినట్టు దేని ద్వారా తమ జీవనం గడుస్తుందో దానినే దైవంగా ఆరాధించే లక్షణం ఆధునిక మానవులు అలవర్చుకుంటే ఇప్పుడున్న ఇన్ని మతాలు,నాగరికత ముసుగులో మనిషి సృష్టించుకున్న ఇన్ని రకాల దైవాల అవ సరమే ఉండదు,అన్న భావన వ్యక్తం చేస్తుంది రచ యిత్రి. ‘‘వారిజ’’ తన గిరిజన ప్రాంత పర్యటనలో మనిషిని మనిషిగా గౌరవించే గొప్ప సుగుణాల సంపదలుగల అడవి బిడ్డలను…. వారిలో అడుగ డుగున అగుపించే అతిధి మర్యాదలు, నిష్కల్మష మైన, కాలుష్యరహిత జీవితాలు, చూసి మొదట తాము అనుకున్నట్టు వారికి ఏదో నాగరికత సంస్కా రాన్ని నేర్పి చైతన్యవంతుల్ని చేయాలి, అన్న ఆలోచ న మానుకుని వారినుంచే ఎంతో విలువైన సంస్కృతి సంప్రదాయాలు, తెలుసుకుని కొత్త ఆలోచనలతో తానేచైతన్యం చెందుతుంది.
గిరిజన సంస్కృతిని సంరక్షించడం అంటే వారికి ‘‘ఆధునిక మురికి సంస్కృతి’’ అంట కుండా చూడటంతోపాటు….వారిని వారిలాగే జీవింప జేసేస్తూ….మనమంతా వారికి అండగా తోడు ఉండటమే, నిజమైన గిరిజన సంస్కృతి సం రక్షణ, గిరిజన జాతి చైతన్య పతాక, అవుతుంది, అన్న వినూత్న అనుభవం ఐక్యసందేశం అంది స్తారు రచయిత్రి. దీనిలో గల క్లుప్తత,ఏకకాల, ఏకాంశ, లక్షణాల దృష్ట్యా ఇది అచ్చమైన ‘‘కథానిక’’ అనడంలో నిండు నిజం ఉంది. అలా..సార్థక నామధేయి అయింది కూడా.. కథానిక ప్రారంభం లో కనిపించే ఆసక్తి కథ నడపడం లో ఉండే సంబంధాలు చివరికి పాఠకులు ఊహించని ముగిం పు ఇలా ప్రతి విషయంలో రచయిత తీసుకున్న శ్రద్ధ కథకు మరింత వన్నె లద్దింది,నిజంగా ఈ ‘‘నిజం’’ కథ రచయిత్రి సంపూర్ణ రచనాపరిణితికి ఓమచ్చుతునక అనవచ్చు. (వచ్చే నెల సంచికలో మీ కోసం అట్టాడ అప్పలనాయుడు కథ అరణ్యపర్వం)
-డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు,ఫోను: 77298 83223

దేశ రక్షణ పోరాటంలో ఆదివాసీలు భాగం కావాలి

స్వాతంత్య్రానంతరం భారతదేశం నిర్మించుకున్న పరిశ్రమలు,ఆర్థిక సంస్థలైన ఇన్సూ రెన్స్‌, బ్యాంకులు, కోట్ల మంది ప్రయాణ సాధనమైన భారతీయ రైల్వేలు,పెట్రోలియం,గ్యాస్‌,విద్యుత్‌ ఇంధన సంస్థలు,విద్య,వైద్యంతో సహా సర్వమూ మోడీ ప్రభుత్వం దేశ,విదేశీ కార్పొరేట్లపరం చేస్తు న్నది. విదేశీ కార్పొరేట్‌ కంపెనీలతో కుమ్మక్కైన స్వదేశీ రిలయన్స్‌ వంటి కార్పొరేట్‌ కంపెనీలకు ప్రభుత్వరంగాల్ని అప్పగిస్తున్నది.వ్యవసాయ రంగా న్ని దేశ, విదేశీ కార్పొరేట్‌ కంపెనీల చేతుల్లో పెట్టేం దుకు మూడు వ్యవసాయచట్టాలు చేసింది. కార్మి కులు, రైతులను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టు బానిసలుగా మార్చే చట్టాలు చేసింది. నిరసన తెలియజేసే హక్కు లేకుండా బ్రిటిష్‌ ప్రభుత్వం కంటే ప్రమాదకర‘ఉపా’ చట్టాలు చేసింది. ప్రజాస్వా మిక పునాదులపై దాడికి దిగింది. అమా యకులైన ఆదివాసీల పక్షాన నిస్వార్ధంగా నిలుస్తున్న హక్కుల కార్యకర్తలను జైళ్ల పాల్జేస్తోంది. జీవిత మంతా గిరిజన హక్కుల కోసం పోరాడిన 80 ఏళ్ల ఫాదర్‌ స్టాన్‌స్వామిని జైల్లో పెట్టి చంపేసింది. రాజ్యాంగ హక్కులను ధ్వంసం చేస్తున్నది. పౌరుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలగడంతో ‘భారత దేశాన్ని రక్షించండి’ అంటూ కార్మికులు, రైతులు ఆగస్టు 9న ప్రభుత్వ ఆఫీసుల దిగ్భ్రందించారు. ఏజెన్సీ లోని విలువైన గనులు, ఖనిజ సంపదను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం చేయని కుట్రల్లేవు. ఆ కుట్రలకు కళ్లెం వేసేందుకు, కార్పొరేట్‌ శక్తులు అడవిలో అడుగు మోపకుండా అడ్డుకొనేందుకు ఆదివాసీలూ దేశ రక్షణ పోరాటంలో భాగస్వాములు కావాలి.
అటవీ సంపద కార్పొరేట్‌ పరం
ఆదివాసీలు బతుకుతున్న అడవులను మైనింగ్‌ పేరుతో కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. అడవిపైవున్న హక్కును నిలబెట్టుకొనేందుకు పోరాడుతున్న గిరిజనులు, హక్కుల కార్యకర్తలపై బెయిల్‌ రాని భయంకరమైన ‘ఉపా’ చట్టం కింద కేసులు పెడుతోంది. బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్‌, అస్సాం,హర్యానా ప్రభుత్వాలు వేల మంది గిరిజను లను జైల్లో నిర్బంధించాయి. జార్ఖండ్‌లో 10 వేల మంది గిరిజనులపై గతంలో రాజద్రోహం నేరం కింద కేసు నమోదు చేసింది. ఆదివాసీలను ఉద్దరిస్తామని గద్దెనెక్కి ద్రోహానికి పాల్పడుతున్న పాలకవర్గ విధానాలను ప్రతిఘటించాలి. ఆది వాసీల హక్కులు దెబ్బ తీయబోమని, అటవీ సంప దను కార్పొరేట్లకు కట్టబెట్టబోమని, పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటామని ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాలు ప్రకటించేలా ఆదివాసీలు గొంతు విన్పించాలి.
రిజర్వేషన్లు గల్లంతు
ఆదివాసీలకు, దళితులకు ఉద్యోగ భర్తీలో రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించింది. మోడీ ప్రభు త్వం వారికిప్పుడు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నది. జింక్‌, బాల్కో పరిశ్రమలను వాజ్‌పేయి ప్రభుత్వం దెబ్బ తీసింది. విశాఖ స్టీలుప్లాంట్‌ సహా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ అమ్మి తీరుతా మని మోడీ శపథం చేస్తున్నారు. 42 రక్షణ పరిశ్ర మలు అమ్మకానికి పెట్టారు. జీవిత బీమా(ఎల్‌ఐసి), జనరల్‌ ఇన్సూరెన్స్‌ రెండిరటినీ అంతం చేయ డానికి లోక్‌సభలో బిల్లుపెట్టారు. బ్యాంకులు కూడా ప్రైవేటుకు ఇచ్చేస్తామని నిర్ణయం చేశారు. విద్యుత్‌ పంపిణీ కూడా ప్రైవేటు వాళ్లకు ఇచ్చే చట్టం చేసింది. రైల్వేలో కొన్నిరూట్లు, కొన్ని స్టేషన్లు, రైల్‌ ఇంజన్లు, బోగీల నిర్మాణం ప్రైవేటుకు ఇచ్చే సింది. రైల్వేలో 3లక్షల ఉద్యోగులను తీసివేస్తామని ప్రకటిం చింది. రిజర్వేషన్లు అమలు చేయాల్సిన ప్రభుత్వ రంగం, ప్రభుత్వ సర్వీసులన్నింటినీ ప్రైవేటు పరం చేస్తే రిజర్వేషన్లు అమలు చేసేది ఎక్కడీ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు కానప్పుడు రిజర్వే షన్లకు విలువేం వుంటుంది? రిజర్వేషన్లు రాజ్యాం గంలో చెప్పుకోవడానికి ఉంటాయి తప్ప ఆచరణలో ఉండవు.
ప్రపంచబ్యాంకు బాటలో జగన్‌ ప్రభుత్వం
పాదయాత్ర, ఎన్నికల సందర్భంలో అధి కారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో 1.80లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు న్యా యం చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మాట తప్పరు, మడమ తిప్పరని యువత నమ్మా రు. జాబ్‌ కేలండర్‌ విడుదలతో జగన్‌ ప్రభుత్వం అసలు నైజం బయటపడిరది. యువతలో ఆగ్రహం కల్గించింది. రాష్ట్రంలో 2.35లక్షలు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలున్నాయని ఆర్థికశాఖ నివేదిక ఇస్తే జగన్‌ 10వేలు ప్రకటించి యువత విశ్వాసంపై నీళ్లుజల్లారు. గ్రామ సచివాలయాల పోలీసు కానిస్టే బుళ్లతో లెక్క సరిపెట్టేశారు. టీచర్‌ పోస్టుల భర్తీకి డిఎస్సీ ఊసెత్తలేదు. టీచర్లు లేక జివికే స్కూళ్లు మూతపడ్డాయి.స్పెషల్‌ డిఎస్సీ వేయాలని డిమాండ్‌ చేస్తుంటే డిఎస్సీనే జగన్‌ లేపేశారు. మోడీ వలె ఉద్యోగులను తగ్గించే పనిలో జగన్‌ ఉన్నారు. ప్రపం చ బ్యాంకు చెప్పినట్లు రెగ్యులర్‌ ఉద్యోగులను తగ్గించి తక్కువ వేతనాలు, హక్కుల్లేని వారితో పనిచేయించు కోవాలని జగన్‌ ప్రభుత్వం చూస్తున్నది.
జీవో3రద్దు ఆదివాసీ రాజ్యాంగ హక్కును కాల రాయడమే
జీవో3 సుప్రీంకోర్టు రద్దు చేయడంతో 5వ షెడ్యూల్డ్‌ ఏరియాలో ఆదివాసీల రాజ్యాంగ హక్కు దెబ్బతిన్నది. ఏజన్సీలో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్‌ హక్కు పోయింది. కేంద్రంపై ఒత్తిడితెచ్చి రాష్ట్రపతి ఆర్డినెన్సు కోసం రాష్ట్ర ప్రభు త్వం ప్రయత్నించాలి. కానీ స్పందించలేదు. ఆ ప్రయత్నం చేయకపోగా ఒక పైపు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు అమలుకు ఆదేశాలు ఇవ్వడం గిరిజనులను మోసం చేయడమే. సుప్రీం కోర్టు తీర్పునకు ముందు డిఎస్సీలో సెలెక్ట్‌ అయిన వారికి టీచర్‌ ఉద్యోగాలు ఇవ్వకపోవడం మరీ అన్యాయం. రిజర్వేషన్లు లేకుండా చేయాలనే బిజెపి వైఖరికి జగన్‌ ప్రభుత్వం బాసటగా నిలబడిరది.
షెడ్యూల్‌ ఏరియాలో అర్హత గల గ్రామాలను కలపాలి
యాభై శాతం పైన గిరిజనులు వుండి, 5వషెడ్యూల్డ్‌ ఏరియాకు ఆనుకొని వున్న గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలిపే ప్రయత్నం జగన్‌ ప్రభు త్వం చేయడంలేదు. రెండేళ్ల క్రితం గిరిజన సలహా మండలిలో కొన్ని గ్రామాలు షెడ్యూల్డ్‌ ఏరియాలో కలుపుతామని తీర్మానం చేసినట్లు ప్రకటించారు. అర్హత వున్న గ్రామాలన్నీ షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలని డిమాండ్‌ చేయడంతో,సమగ్ర సర్వే జరిపి చేస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి పష్ప శ్రీవాణి ప్రకటించారు. నిజంగానే చేస్తారని గిరిజనులు ఎదురు చూస్తున్నారు. భూమి, జనాభా రికార్డులన్నీ ప్రభుత్వం వద్దే ఉన్నాయి. వారం పది రోజుల్లో పూర్తి చేయాల్సిన సర్వేను ఏళ్లు గడుస్తున్నా చేయడంలేదంటే వైసిపి ప్రభుత్వంపై భూస్వాములు, గిరిజనేతర పెత్తందార్ల ఒత్తిడి వుందని అర్ధమ వుతుంది.
పోలవరం నిర్వాసితులనునిలువునా ముంచేశారు
గనులు తవ్వినా, ప్రాజెక్టులు కట్టినా, పరిశ్రమలు నిర్మించినా నిర్వాసితులు నిలువ నీడ లేకుండా పోతున్నారు. పోలవరంలో ముంచే యడం ఖాయమని తెలిసి, గ్రామ సభల్లో ప్రాజెక్టు వద్దని గిరిజనులు తీర్మానాలు చేశారు. గిరిజన గ్రామ సభలు ప్రాజెక్టు అంగీకరించినట్లు తీర్మానా లు తారుమారు చేసి రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. రోజూ పోలవరంపై సమీక్ష చేసిన చంద్రబాబు లక్ష గిరిజన కుటుంబాల పునరావాసం గురించి 5ఏళ్లలో ఒక్క రోజూ సమీ క్షించలేదు. మొత్తం పునరావాసానికి అయ్యే ఖర్చు రూ. 33 వేల కోట్లు ఇచ్చేది లేదని మోడీ ప్రభుత్వం తెగేసి చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. పునరావాసం పూర్తి చేయకుండా ప్రాజెక్టు నిర్మాణం చేయం అని వాగ్దానం చేసిన జగన్‌ గిరిజనులను ప్రాజెక్టులో నిలువునా ముంచేశారు. పోలవరం నిర్వాసితులను బిజెపి, టిడిపి, వైసిపి దారుణంగా మోసం చేశాయి. గిరిజనుల బతుకులు, వారి ప్రాణాలకు విలువ ఇవ్వడంలేదు.
కార్మిక, కర్షక ఉద్యమంలో భాగం కావాలి
మోసపు మాటలతో గిరిజనులకు నష్టం,కష్టం కలిగించడమే గాక దేశ, విదేశీ కార్పొ రేట్లకు ఆదివాసీలను బలిచ్చే చర్యలు మానుకోవాలి. ఆదివాసీల భూమిని కార్పొరేట్లుకు ఇవ్వరాదు. విద్య,వైద్యం,పరిశ్రమలు,రైలు,బ్యాంకులు,ఇన్సూరెన్స్‌, విద్యుత్‌,వ్యవసాయం కార్పొరేట్లకు ఇవ్వొద్దు … అని ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నినదిం చాలి. పోలవరం నిర్వాసితులకు పునరావాసం యుద్ధప్రాతిపదికన కల్పించాలి. జీవో 3పై రాష్ట్ర పతి ఆర్డినెన్సు తీసుకువచ్చి గిరిజ నుల రాజ్యాంగ హక్కును కాపాడాలి. 50 శాతానికి పైగా జనాభా వున్న గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చాలి.స్పెషల్‌ డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయా లి …అని దేశ రక్షణ కోసం ఆగస్టు 9న మండ లాఫీసు వద్ద జరిగే ధర్నాలో గిరిజనులంతా భాగస్వాములు కావాలి.
-ఎం.కృష్ణ మూర్తి

1 2