ఆకలి భారతం`సత్య సూత్రాలు

ఆకలి మహమ్మారిని తరిమివేయాలి అంటే, లోపాలమీద పోరాటంలో ప్రజల భాగస్వా ములు కావడం కూడా తప్పనిసరి. భారతదేశం ‘ప్రపంచ ఆకలి లెక్కల్లో, గత సంవత్సరం కంటే 45 స్థానాలు కిందకు పడిపోయి, 100వ స్థానానికి దిగజా రింది.అని ‘అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ’ (వాషింగ్టన్‌) తాజా నివేదిక వెల్ల డిరచింది. వెంటనే, భారత్‌ ప్రజలు ఆకలిదప్పు లతో మలమల మాడిపోతున్నారని మేధావులు, మీడియాల వాళ్ళు రాసేసారు. అసలు ఈ నివేదిక లో పేర్కొన్నది నిజమేనా? భారత్‌ అంత ఘోర స్థితిలో వుందా? ఒకటి రెండు సంవత్సరాల్లో ఆన్ని స్థానాలు పడిపోయేంత ఆకలి తీవ్రత భారతలో పెచ్చుమీరిందా? నివేదికను, అందులోని అంశా లను, గత నివేదికలను సాధికారికంగా పరిశీలిస్తే వాస్తవం మరోలా వున్నది. భారత్‌లో ఆకలి వుండ డం అయితే నిజం. కానీ ఆ ఆకలి లెక్కలు మాత్రం పూర్తి వాస్తవం కాదు.
అసలు వాస్తవం ఏమిటంటే 100వ స్థానానికి పడిపోవడం కరెక్టే. కానీ నిరుడు 55వ స్థానంలో ఉన్నప్పుడు,ఈ సంవత్సరం 100వ స్థానానికి దిగజారడం ఏమిటి అని పరిశీలించి నప్పుడు ఈసారి దేశాలకు ర్యాంకులు ఇచ్చే విధానంలో మార్పు చేసారు. 2016వ సంవత్సరం దాకా ఆ వాషింగ్టన్‌ సంస్థ రెండు వేర్వేరు ర్యాంకుల లిస్టు ఇచ్చేది. ఆకలి సమస్య మరీ ఎక్కువ వున్న దేశాలకు వేరుగా, అభివ ృద్ధి చెందిన దేశాలకు వేరుగా ఇచ్చేది. ఆకలి రూపుమాపే దిశగా ఇంకా ఎంతో వృద్ధి చెందాల్సిన లిస్టులో మన భారత దేశాన్ని పెట్టేది. అప్పుడు మనకు 55ర్యాంకు వచ్చింది. ఈసారి 2016 సంవత్సరానికి గానూ ర్యాంకులను ప్రకటించే విధానంలో మార్పులు చేసి, రెండు లిస్టులు కాకుండా అన్ని దేశాలకు కలిపి ఒకే లిస్టు ఇచ్చింది. సహజంగానే భారత్‌ ర్యాంకు 55వ స్థానం నుంచి 100కు పడిపోయింది. పూర్తి వాస్తవం కాని మన ర్యాంకును చూసి సోషల్‌ మీడియా మొదలుకొని అందరమూ గుండెలు బాదుకున్నాము! సరే, 45స్థానాలు తగ్గిన మాట తప్పే అనుకొందాము. మరి ప్రపంచంలో 100వ స్థానంలో ఉండడం నిజమే కదా అనే ప్రశ్నకు , ఆర్యాంకులను విమర్శిస్తున్నప్పుడు, జవాబు చెప్పాలి. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ పేరిట వాషింగ్టన్‌ సంస్థ ఇచ్చిన లెక్కలను బాగా పరిశీలిస్తే, ఈ ర్యాం కులు స్థూలంగా పోషకాహారలోపం ఆధారంగా ఇస్తూ అయిదు సంవత్సరాల వయస్సు లోపు పిల్లలకు మూడు ఆరోగ్య సూచికలను పునాదిగా చేసుకొన్నారు. వేస్టింగ్‌ (ఎత్తుకు తగినంత బరువు లేకపోవడం), స్టంటింగ్‌ (వయసుకి తగినంత ఎత్తు లేకపోవడం), మరణాల రేటు అనే మూడు ప్రామా ణిక విలువల సగటుని తీసుకొని ర్యాంకులను ఇచ్చారు. పోషకాహారలోపం, అయిదు సంవత్సరాల వయస్సు లోపు శిశువుల మరణాలకి 1/3 వంతు సగటు ఇచ్చి, ఎత్తు, బరువులకు 1/6 వంతు వెయి టేజీ ఇచ్చారు. ఈ సగటుల ప్రామాణిక విలువలను, శాతాల్లోకి మార్చి, 1983-2012 మధ్య సంవ త్సరాల్లో వచ్చిన అత్యధిక శాతంలో నుంచి మైనస్‌ చేసారు. ఈసంవత్సరాల మధ్యకాలంలో ఈ అంశాల ఆధారంగా అత్యధిక పోషకహార లోపం విలువ 76.5%గా తేలింది. అందువలన భారత్‌లో ఆకలిని, ఆయా సంవత్సరాల్లో వచ్చిన సగటులను ‘80’లోనుంచి తీసేసి, ఫలానా శాతం గా చెప్తారు. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ విలువలను 1-100 మధ్యలో చూపిస్తారు. ఒకటి అంటే, పైన చె ప్పిన నాలుగు సూచికలు అసలు కనిపించవు. 100 అంటే ఆకలితో ప్రజలు అలమ టించడం. ఇలాంటి పద్ధతిని మొదటిసారి 2017 సంవత్సరంలోనే వాడారు. ఈ పద్ధతి ప్రకారం, ఈ సంస్థ భారత్‌కు 2016కు మాత్రమే కాకుండా, గడచిన సంవత్సరాలైన 1992, 2000, 2008 సంవత్సరాలకు కూడా విలువలను ఇచ్చింది. వాషింగ్టన్‌ సంస్థ ఇచ్చిన అంచనాల ప్రకారమే భారత్‌ గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ స్కోరును 1992లో 46.2 నుంచి 2017లో 31.4కు తగ్గించు కోగలి గింది. అంటే, కొన్ని సంవత్సరాలుగా భారత్‌లో పోషకాహార లోపం తగ్గుతూ వస్తోంది అని ఆ సంస్థే చెప్తోంది. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో మన ఆకలి సూచిక ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ సర్వే, మన దేశపు జాతీయ కుటుంభ ఆరోగ్య సర్వేలో కూడా తగ్గింది. పోషకాహార లోపం వల్లే తగ్గుతున్నట్లుగా తేలింది. సరే, వీటితో కూడా సంతృప్తి చెందమూ అంటే, జాతీయ నమూనా సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ)లో బాగంగా మీరు ఎప్పుడైనా ఏదేనీ కారణం చేత ఆహారం దొరక్కుండా వున్నారా అని తమ డేటా సేకరణలో బాగంగా అడిగితే 1983లో 16%మంది తాము ఒక్కసారైనా ఆకలి తో ఉన్నాము అని చెప్పగా, 2004-05 నమూనా సర్వేలో కేవలం1.9% మంది మాత్రం తాము ఎప్పుడో ఒకప్పుడు ఆకలితో అన్నం లేకుండా ఉన్నామని చెప్పారు. అంత తక్కువ శాతం వున్నార నేమో అని కాబోలు, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ తరువాతి సంవత్సరాల్లో అసలా ‘ఆకలి’ అనే కాలమ్‌ తీసే సింది! కొందరు విమర్శకులు, పేదలు తాము ఆకలితో ఉన్నాము అని చెప్పుకోవడానికి ఇష్టపడరు అని వాదించారు. తమ వాదనకి మద్దత్తుగా ‘ఐక్య రాజ్యసమితి అభివృద్ధి పధకం’ (యుఎన్‌ డిపి) సర్వేలో దేశంలోని అతిపేద జిల్లాల్లో ఆకలితో అల్లాడే వాళ్ళు7.5% అని, కొద్దిగా ఆహారం వుండే వాళ్ళు 29% అని వచ్చిన లెక్కలు చూపించారు. అంటే, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ లెక్కల్లో చెప్పుకోలేని వారు, యుఎన్‌డిపి సర్వేలో మాత్రం చెప్పుకోన్నారన్న మాట! సరే, యుఎన్‌డిపి లెక్కలే కరెక్టు అనుకొంటే, భారత్‌ లో జరుగుతున్న అతిపెద్ద సంక్షేమ పధకం, 2013 లో ప్రవేశ పెట్టబడిన జాతీయ ఆహార భద్రతా చట్టం సంగతేమిటి అనే ప్రశ్న వస్తుంది.
భారత్‌ లోని ప్రజలకు ఆహారం ఒక సంక్షేమపథకంగా కాకుండా ‘హక్కుగా’ అందిం చాలనే ఉద్దేశంతో పెట్టబడిన ఈ చట్టంద్వారా 75%గ్రామీణ ప్రజ లకు,50%,పట్టణ ప్రజలకు కవరేజ్‌ వచ్చే విధంగా డిజైన్‌ చెయ్యబడి, లక్ష్యిత ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దేశంలోని2/3వంతు ప్రజలకి,మనిషికి, నెలకి 5కేజీల వంతున, కేజీరూ.1/2-/1-వంతు న బియ్యం/గోధుమలు/తృణధాన్యాలు ఇవ్వబడు తోంది. అతిపేదలుగా అంచనా వేయబడినవారికి ‘అంత్యోదయ అన్న యోజన’ ద్వారా ఉచితంగా నెలకు 35కేజీల వంతున ఇవ్వబడుతోంది. ఇది కాకుండా, జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారానే గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు, పోషకాహార పధకం కింద, బాలింతలకు పూర్తి భోజనం పెట్టడమే కాకుండా, రూ. 6000 వరకూ మెటర్నటీ బెనిఫిట్‌ కింద ధనసహాయం చెయ్యబడుతోంది. 14 సంవ త్సరాల లోపు పిల్లలకు పోషకాహార విలువల ప్రకారము భోజనం ఇవ్వబడుతోంది.పలు రాష్ట్రాలు ప్రత్యేక పధకాల కింద, అన్న అమ ృతహస్తం లాంటి పధకాలు చేపడుతున్నాయి. ఇక చాలా సంవత్స రాల నుంచి నడుస్తున్న మధ్యాహ్న బోజన పథకం గురించి చెప్పక్కరలేదు. అన్నీ ఇంత బాగా వుంటే అసలు పేదరికం ఎందుకు వుంటుంది అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. ప్రతి పధకంలో ఉన్నట్టే ఈ పధకంలో కూడా లోపాలు వున్నాయి. అవినీతి, డెలివరీ వ్యవస్థ లోపాలు, అమలు యంత్రాగం నిర్లక్ష్యం, ప్రతి రాష్ట్రంలో కొన్ని వేల సంఖ్యలో వున్న ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు నియంత్రణ లోపాలు, ప్రజల ఆహార అలవాట్లు మారడం.. ఇలా పలు కారణాలుతో మనము ‘ఆకలి’ అనే భూతాన్ని ఇంకా తరిమి వేయలేకున్నాము. ప్రతి రాష్ట్రప్రభుత్వం వందల కోట్ల డబ్బు ప్రజా పంపిణీవ్యవస్థ ద్వారా ఆహార సరఫరా కొరకు ఖర్చు పెడుతోంది. ఇంతమంది ప్రజలు దీని మీద ఆధార పడేటప్పుడు, ప్రభుత్వం, దాని యంత్రాం గంతో పాటుగా తమకు దీనిద్వారా లబ్ధి జరిగే టట్లు చేసుకొనే బాధ్యత ప్రజల మీద కూడా ఉందేమో. తమకు రేషన్‌ సరుకులు దొరక్కపోతేనో, సమయానికి ఇవ్వకపోతేనో, ధర ఎక్కువ చార్జ్‌ చేస్తేనో, లేక అసలు చౌక ధరల దుకాణాలు తెరవక పోతేనో, బరువు సరిగ్గా లేకపోతేనో, అంగన్‌వాడీల్లో తమకు, పిల్లలకు సరైన సేవలు, పోషకాహార విలు వలు కలిగిన భోజనం లేదని భావిస్తేనో, ఇలా తనకు ప్రభుత్వం ఇచ్చిన ఈ సౌలభ్యం అందాల్సిన రీతిలో అందలేదు అని భావిస్తే ఏమి చెయ్యాలి? మండల అధికారులకి రిపోర్టు చెయ్యాలి. వాళ్ళు సరైన లేదా సంత ృప్తికరమైన చర్య తీసుకోలేదని భావిస్తే, జిల్లా స్థాయిలో, రేషన్‌ విషయం అయితే తెలుగు రాష్ట్రాల్లో జేసి-2కి,అంగన్‌వాడీల విష యంలో ప్రాజెక్టు డైరెక్టర్‌ (ఐసిడీఎస్‌)లకు రిపోర్ట్‌ చెయ్యాలి. వీళ్ళేవ్వరి దగ్గర కూడా న్యాయం జరుగ లేదు అని భావిస్తే, పార్లమెంటు ఆమోదించిన ఈ ఆహార భద్రతా చట్టంలో బాగంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, క్వాసీ జ్యుడిషియల్‌ అధికా రాలు కలిగిన ‘ రాష్ట్ర ఆహార కమీషన్‌’లను ప్రతి రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసారు. విస్తృత అధికా రాలు కలిగిన ఈ ‘కమీషన్‌’ కు రిపోర్ట్‌ చెయ్యడం అంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ద ృష్టికి తీసుకోచ్చినట్టే! మన రాష్ట్రంలో కూడా ఇటీవల ‘రాష్ట్ర ఆహార కమీషన్‌’ ను ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం ఒక చైర్మన్‌, అయిదుగురు సభ్యులు, ఒక ఐఏఎస్‌ అధికారి మెంబర్‌ సెక్రటరీగా ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ కమీషన్‌ తనకు వచ్చిన ఫిర్యాదులనే కాకుండా, సుమోటోగా, అంటే తనకు తానుగా కూడా చర్యలు తీసుకొని, క్రైం కాని వాటిలో జరీమానాలను శిక్షలుగా వేస్తుంది. నేర చరిత్ర వుంటే, కేసు నమోదు చేసి కోర్టుకు బదిలీ చేస్తుంది. ఆకలి వున్నది అన్నది నిజం. అది ఎంత శాతమైనా సరే. అలాంటి ఆకలిని పారద్రోలాల్సిన అవసరం బాధ్యత అందరిమీద వుంది. ఏ ప్రభుత్వ మైనా పధకాలు తెస్తుంది, నిధులు ఇస్తుంది. పధకాలు ఆశించిన విజయం సాధించి ఆకలి మహమ్మారిని తరిమివేయాలి అంటే, లోపాల మీద పోరాటంలో ప్రజల బాధ్యత కూడా తప్పనిసరి. అప్పుడే ప్రజలు ఆనందంగా వుంటారు.
ఆంధ్ర దేశంలో ఆకలి కేకలు
విద్య, భూమి కలిగి వుండటం, పారి శ్రామీకరణలో భాగం కావడం అంబేద్కర్‌ ఆలోచ నలో ప్రధాన మైనవి. సమాజంలో అణగారిన ప్రజలు ఆకలితో బాధ పడకూడదు. వారి బిడ్డలు ఆకలితో అలమటించకూడదనే సదాÄవేన ముఖ్యమంత్రికి చాలా అవసరం. సులభంగా ప్రజ లకు ఏదో ఒక పేరుతో డబ్బు ఇచ్చివేస్తే మన బాధ్యత తీరిపోతుందని అనుకోవడం సొంత ఎజెండా అవుతుందే కానీ రాజ్యాంగబద్ధ ఎజెండా కాదు. రాష్ట్రంలో ఎటుచూసినా ఆకలి కేకలు విని పి స్తున్నాయి. ప్రభుత్వం ప్రజా సమస్యల పైన ప్రజల ఆకలి తీర్చడం పైన దృష్టి సారించడం లేదు.‘అన్ని విషయాలు నాకు తెలిసాయి’ అని ముఖ్యమంత్రి అనుకోవడమే దీనికంతటికి కారణం. కానీ ఆయనకు తెలియని ఆవేదన తెలుగు నేలలో వుంది. ఈ ఆకలి కేకలకు కారణం ముఖ్యమంత్రికి అంబేద్కర్‌ రాజ్యాంగ సూార్తిే లేకపోవడం. రాజ్యాంగం ప్రధానంగా నిర్దేశిస్తున్న అంశం విద్యాభివ ృద్ధి. కానీ నేడు విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా వుంది. పాఠ్యపుస్తకాలు లేక, బోధించడానికి ఉపాధ్యాయులు లేక త్రైమాసిక పరీక్షలకు విద్యార్థులు సంసిద్ధులు కాలేక పోతున్నారు. ‘అమ్మ ఒడి’ ప్రచారం మోగిపోతోంది. మధ్యాహ్న భోజనంలో నీళ్ళ చారు, బుల్లి గుడ్డుతో అన్నం తినలేక పిల్లలు పస్తులుంటున్నారు. ఒక్కొక్క టాయిలెట్‌ దగ్గర ఇరవై మంది పిల్లలు క్యూలో నిలబడుతున్నారు. బాత్‌ రూమ్‌లు దుర్గంధం కొడుతున్నాయి. రుతుక్రమం సమయంలో ప్యాడ్స్‌ కోసం హెచ్‌.యం ఆఫీసు దగ్గర బాలికలు క్యూ కడుతున్నారు. ఈ దృశ్యాల న్నింటిని పాదయాత్రలో ముఖ్యమంత్రి వర్ణించినవే. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక అటు వంటి పరిస్థితి ఉండదని వాగ్ధానం కూడా చేశారు. కాని ఆస్థితి యథాతథంగానే గాక ఇంకా అధ్వాన్న దశకు చేరుకుంది. విద్య సామాజిక పరిణామానికి మూ లం. సమాజ భవితవ్యానికి సోపానం.
ప్రధానంగా భారత రాజ్యాంగం విద్యా వ్యాప్తినే ప్రభుత్వా లకు ఆదేశిస్తున్నది. ప్రతి విద్యార్థికి విద్యను అందించే ప్రక్రియే ముఖ్యం. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ.రెండు లక్షల 20 వేల కోట్లు కాగా మరి స్కూళ్ళు ఎందుకు ఇంత అధ్వాన్న స్థితిలో వున్నాయి? బడ్జెట్లో కొత్త ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి 16,17 పైసలే పెంచింది. మరి రూ.6,7లకు నాసిరకం భోజనమే కదా వచ్చేది. ఇటువంటి భోజనం చేయలేక ఎంతో మంది హాస్టలు విద్యార్థులు ఉదయం నుండి సాయంత్రం వరకూ ఖాళీ కడుపుతో ఉంటున్నారు. పౌష్టికాహారం అంటే ఏంటో పాలకులకు తెలి యదా? అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఎటువంటి ఆహా రం వడ్డిస్తున్నారు? ప్రభుత్వానికి మానవతా స్పూర్తే కావాలి. అది లేని ప్రభుత్వం ఎండు కట్టె వంటిం ది. ప్రభుత్వ ప్రతినిధులెందుకు మధ్యాహ్న భోజనం లో సహ పంక్తికి రావడం లేదు. ప్రజా ప్రతినిధుల్లో కోట్లకు పడగలెత్తిన వారున్నారు. ప్రతి ప్రజాప్రతి నిధికి మూడు లేక నాలుగు మండలాలే ఉంటాయి. కొందరి పరిధిలో ఒకమున్సిపాలిటీ కూడా ఉంటుంది. ప్రతి నియోజక వర్గంలో ప్రభుత్వ స్కూళ్ళు వుంటాయి. వారంలో ఏదో ఒకరోజు ఆ స్కూళ్ళ ప్రజాప్రతినిధి పిల్లలకు మంచి భోజనం పెట్టించవచ్చు. అసలు ప్రజాప్రతినిధులను సామా జిక కార్యకర్త్తలుగా ఎందుకు మార్చడం లేదు? పదో తరగతి ఉత్తీర్ణులైన వారిలో 50శాతం మంది ఇంటర్మీయట్‌లో చేరడం లేదు. ఈ విషయం మీద ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదు? ‘మీ పిల్లల భవిష్యత్తు నాచేతుల్లో పెట్టండ’ని పాద యాత్రలో భరోసా ఇచ్చారు. మరి ఇప్పటి పరిస్థితి ఏంటి? ఇంటర్మీయట్‌, బి.ఎచదువుతున్న విద్యా ర్థులకు మధ్యాహ్న భోజనం లేదు. స్కూళ్ళలో, కాలేజీల్లో మంచినీళ్ళు లేక విద్యా ర్థులు జ్వరాల బారిన పడుతున్నారు. 300నుండి వెయ్యి మంది ఉండే స్కూళ్ళల్లో ప్రాథమిక చికిత్స అందించే నర్స్‌ లేరు. ప్రభుత్వ పాఠశాలలను ఆశ్రయిస్తున్న వారంతా యస్‌.సి,యస్‌.టి, బి.సి పిల్లలే! 80 శాతం మంది యస్‌.టి, యస్‌.సి లే అని తేలింది.
‘నాకు పార్టీలతో పనిలేదు. పారదర్శకతే ముఖ్యం’ అని చెప్పిన ముఖ్యమంత్రి,మధ్యాహ్న భోజన కార్మికులను, యానిమేటర్లను, ఆశా వర్కర్ల ను, మున్సిపల్‌ అంగన్‌వాడీ వర్కర్లను రాజకీయ కారణాలతో తొలగించి, తమ పార్టీ వారిని పెట్టు కొంటున్నారు. ఇదిరాజ్యాంగ విరుద్ధం! ఇలా తొలగించడం వల్ల ఒక యానిమేటర్‌ ఆత్మహత్య చేసుకొన్నారు కూడా! ‘పార్టీ కార్యకర్తలకే పదవులు’ అనే అంశం వల్లనే కదా చంద్రబాబు ప్రభుత్వం పై అసంత ృప్తి రగిలింది. బాబు దారి లోనే ఈ ముఖ్యమంత్రి నడుస్తున్నారు. అంతేకాక, అనేకాం శాల్లో ఆయన్ని మించి పోతున్నారు.
పేదల ఆకలి తీర్చే ‘అన్న క్యాంటిన్‌’ని కూడా రద్దు చేశారు. దీని వెనుక ఆంతర్యం ఏంటి? మరోపక్క వ్యవసాయ కార్మికులకు భూమి పంచ కుండా ఉపాధి కూలీలుగా మార్చారు. గుంటూరు జిల్లా నివేదిక చూస్తే విస్తుపోక తప్పదు. జిల్లాలో సుమారు 13 లక్షల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. 7,99, 599 కుటుంబాలకు జాబ్‌ కార్టులు మంజూరు చేశారు. వీరిలో దళిత కుటుంబాలు 4,78,919 మంది, గిరిజనులు 1,12,954 మంది ఉన్నారు. మొత్తం జాబ్‌ కార్డుల్లో నమోదైన కూలీల సంఖ్య 15,53,660 మంది ఉన్నారు. దళిత, గిరిజన, బీసీ వర్గాల నుంచి మాత్రమే కాకుండా ఓసీల్లోని పేదలు సైతం కూలీలుగా నమోదైన పరిస్థితి ఉంది. అయితే జిల్లాలో ప్రతి రోజూ 1.50లక్షల మందికే పని కల్పిస్తున్నారు. వేతనాలను పరిశీలిస్తే కనీస వేతనం రూ.211 రావాల్సి వుంది కానీ రూ.80 నుంచి రూ.140మాత్రమే ఇస్తున్నారు. ఇకపోతే 100 పని దినాలు కల్పించాల్సి ఉండగా సరాసరి 40 పని దినాలు మాత్రమే కల్పిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. దీనిని బట్టి పరిశీలిస్తే ప్రతి వ్యవసాయ కార్మికుడు రోజుకు కనీస వేతనం నుంచి రూ.81కోల్పోతున్నట్లు వెల్ల డవుతోంది. ప్రతి రోజూ పని ప్రదేశాలకు ప్రతి కూలి తన మంచి నీరు తానే తెచ్చుకుంటే వేతనం కాకుండా రోజుకు రూ.5 మంచి నీటికి, పలుగు, పార తెచ్చుకుంటే రూ.5 అదనంగా అద్దె ఇవ్వాలి. ఈ వివరాలన్నీ పే స్లిప్పులో నమోదై పారదర్శకంగా కూలీలకు తెలియజేయాలి. అయితే అది అమలు జరగడం లేదు. పని ప్రదేశాల్లో మెడికల్‌ కిట్స్‌ దాదాపు లేవు. మజ్జిగ సరఫరా చేయడం లేదు. గతంలో మజ్జిగ సరఫరా చేసినా బిల్లులు రావడం లేదని మేట్స్‌ చెప్పారు. ఒకజిల్లా నివేదికే ఇలా వుంటే రాష్ట్ర మొత్తంగా ఉపాధి కూలీల సంగతి ఆలోచిస్తే దారుణంగా వుంది. ప్రజల దాహం తీర్చడానికి, ప్రజల పొట్ట నింపడానికి వెనకాడడం ఏ ధర్మ సూత్రమో ముఖ్యమంత్రే చెప్పాలి. తన చేతిలో రెండు కోట్ల 20లక్షల ఎకరాల భూమి పెట్టుకొని విదేశీ కంపెనీలను పిలిచి పందేరం చేయాలని చూస్తున్నారే గాని, ఆభూమిని భూమి లేని పేదలకు పంచి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని చూడ డం లేదు.
విద్య,భూమి కలిగి వుండటం, పారి శ్రామీకరణలో భాగం కావడం అంబేద్కర్‌ ఆలోచన లో ప్రధానమైనవి. సమాజంలో అణగారిన ప్రజలు ఆకలితో బాధ పడకూడదు. వారి బిడ్డలు ఆకలితో అలమటించకూడదనే సదాÄవేన ముఖ్యమంత్రికి చాలా అవసరం. సులభంగా ప్రజలకు ఏదో ఒక పేరుతో డబ్బు ఇచ్చివేస్తే మన బాధ్యత తీరిపో తుందని అనుకోవడం సొంత ఎజెండా అవుతుందే కానీ రాజ్యాంగబద్ధ ఎజెండాకాదు.
డా॥బి. ఆర్‌. అంబేద్కర్‌ అణగారిన వర్గాలకు న్యాయం చేయడం అంటే భూమి పంప కంలో,వారి పిల్లలకు విద్యను నేర్పించడంలో, పరిశ్రమల్లో వారిని భాగం చేయ డంలో చిత్తశుద్ధితో వుండాలని చెప్పారు. నిజానికి దళితుల నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా ముఖ్య మంత్రిని పొగిడే పనిలో వున్నారు గాని వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేట పరిస్థితి లేదు. ద్వేషంతో దేన్నీ నిర్మించలేం. ప్రేమ, కరుణ తోనే పునర్నిర్మాణం సాధ్యం అని ముఖ్య మంత్రి తెలుసు కున్న నాడు ఆంధ్ర దేశంలో ఆకలి కేకల నివారణకు పరిష్కారం రూపొందుతుంది.-నీలయపాలెం విజయ్‌ కుమార్‌