భాగస్వామిని ఎంచుకునే హక్కు లేదా?

భారత రాజ్యాంగ రచనా కమిటీలో ఇద్దరు మహిళా సభ్యులు హన్సా మెహతా, రాజ్‌ కుమారి అమృత్‌ కౌర్‌ కూడా ఉన్నారు. ప్రతి మహిళ తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కును, లేదా కనీసం వివాహ మాడే వ్యక్తిపై తన ఇష్టాయిష్టాలను తెలిపే హక్కును రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కులలో చేర్చాలని వారు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కమిటీ లోని మిగతా సభ్యులు మద్దతు ఇవ్వలేదు. అందువల్ల రాజ్యాంగ పరిషత్తు ముందుంచిన తుది రాజ్యాంగ ప్రతిలో ఈ హక్కును చేర్చలేదు.
ఏడు దశాబ్దాల తర్వాత కూడా, మహిళలు తమకు నచ్చిన ఇతర కుల, మతా లకు చెందిన వ్యక్తులను ఎంపిక చేసుకోలేని పరిస్థితులను వారి కుటుంబాలే కల్పిస్తూ సంకుచితమైన ఆజ్ఞలను జారీ చేస్తున్నాయి. వారి జీవిత భాగస్వా ములపైన కిడ్నాప్‌, అత్యాచారం,‘లవ్‌ జిహాద్‌’ కేసులు మోపి జైలుపాలు చేస్త్తున్నారు. ఒకవేళ ప్రేమ జంట ప్రతిఘటిస్తే…స్వంత కుటుంబ సభ్యుల చేతిలోనో లేక ఆగ్రహంతో ఉన్న గుంపు దాడు లలోనో హత్యకు గురవుతున్నారు. ఇటీవల కాశ్మీర్‌ కు చెందిన సిక్కు యువతులు కొందరు ముస్లిం యువకులను వివాహం చేసుకొని, ఇస్లాం మతం లోకి మారాలనుకోవడంతో కాశ్మీర్‌ లోయలో ఒక ప్రమాదం ముంచుకొచ్చింది. పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్‌ సిక్కు నాయకులు ఇవన్నీ ‘’లవ్‌ జిహాద్‌’’ నేరపూరిత చర్యలని ఆగ్రహించారు. అమాయక హిందూ, సిక్కు బాలికలను వెంబడిస్తున్నారని ముస్లింలపై ద్వేషపూరితంగా నిందించడం కొత్తేమీ కాదు. ముస్లిం యువకులు గల్ఫ్‌ లో సంపాదించిన డబ్బుతో క్రైస్తవ బాలికలను వంచించి ఇస్లాం మతం లోకి మార్చే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారని ఆరోపిస్తూ కేరళ క్యాథలిక్‌ బిషప్‌ కౌన్సిల్‌ మొదట ‘లవ్‌ జిహాద్‌’ అనే పదాన్ని ఉపయోగించింది. ఈ భావావేశ ద్వేషభావాన్ని మొత్తం హిందూత్వ సంస్థలు వెంటనే స్వీకరించాయి. పైకి నదురుగా కనిపించే ముస్లిం యువకులను ఇలాంటి లవ్‌ జిహాద్‌ కోసం ఇస్లాం మత విశ్వాసాలను బోధించే కళాశాలల్లో జాగ్రత్తగా ఎంపిక చేశారని, హిందూ యువతులను ప్రేమ సంబంధాల్లోకి లాగి, ప్రలోభపెట్టే శిక్షణను వారికిస్తారనీ, వారికి అమ్మాయిలను ఆకర్షించడానికి మోటారు వాహనాలు, స్మార్ట్‌ ఫోన్లు, తేలికగా డబ్బు సంపాదించే ఏర్పాట్లు చేస్తారని హిందూత్వ సంస్థల వాదన. హిందూ యువతులతో సంబంధాలు ఏర్పరచుకునే ముస్లిం పురుషుల హృదయాల్లో ప్రేమ లేదని, కేవలం ఇస్లాం మతంలోకి మార్చేందుకే వారిని మభ్యపెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటారని హిందూత్వ వాదులు చెబుతున్నారు.
ఇటీవల సిక్కు మహిళలను (కేరళలో వారి క్రైస్తవ సోదరీమణులు, దేశంలో అనేక ప్రాంతాల్లో హిందూ సోదరీమణుల తరువాత) లవ్‌ జిహాదీలుగా ఆరోపణలు ఉన్న వారి మత ప్రచారంలోకి లాగారు. ‘లవ్‌ జిహాదీ’ల బాధితులుగా గుర్తించిన సిక్కు మహిళలలో, పద్దెనిమిది సంవత్సరాల మన్‌మీత్‌ కౌర్‌ కూడా వుంది. ఆమె ఇస్లాం మతంలోకి మారి,29 సంవత్సరాల ముస్లిం యువకుడు షాహీద్‌కు దగ్గరైంది. వారు రహస్యంగా పెళ్లి చేసుకు న్నారని రుజువు చేసే నిఖా ధ్రువపత్రాలు ఉన్నప్పటికీ…పోలీసులు వారిని గుర్తించి, వారు చెప్పే విషయాలను నమోదు చేయడానికి శ్రీనగర్‌ జిల్లా కోర్టుకు తీసుకెళ్ళారు. పోలీసు చర్యలు మన్‌మీత్‌ కౌర్‌ కోర్టులో చెప్పిన విషయాలను నిర్థారించడం కష్టమే అయినప్పటికీ, ఆమె ఇస్లాం మతం లోకి మారడం, షాహీద్‌ ను పెళ్లి చేసుకోవడం స్వచ్ఛందంగానే జరిగాయని అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆమె సంతకాలు చేసిన అఫిడవిట్‌ లు షాహీద్‌ కుటుంబం దగ్గర వున్నాయి. చివరికి ఆమె కోర్టు నుండి బయటకు వచ్చేటప్పుడు, ఆమెను షాహీద్‌ కుటుంబంతో వెళ్ళనివ్వలేదు. ఆమెను లాక్కెళ్లి ఒక వాహనంలో పడేసి, షాహీద్‌ ను పోలీసు కస్టడీ లోకి తీసుకున్నారు. మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా స్థానికంగా చెలరేగిన దౌర్జన్యాలను పురికొల్పింది ఢల్లీి సిక్కు గురుద్వారా యాజమాన్యం పెద్ద, శిరోమణి అకాలీదళ్‌ కు చెందిన మంజీందర్‌ సింగ్‌ సిర్షా అని చాలా నివేదికలు తెలియజేస్తున్నాయి. మన్‌మీత్‌ కౌర్‌ వ్యవహారం లవ్‌ జిహాద్‌ కు ఒక ఉదాహరణ అని, ఆమెను తుపాకీతో బెదిరించి, కిడ్నాప్‌ చేసి అరవయ్యేళ్ళ ముస్లిం వృద్ధునితో పెళ్లి చేశారని గతంలో బిజెపి లో ఉన్న సిర్షా ఆరోపించాడు. మూడు రోజుల తరువాత, మన్‌మీత్‌ కౌర్‌ తన మొదటి భర్తతో విడాకులు కాకుండానే ఒక సిక్కు యువకునితో దక్షిణ కాశ్మీర్‌ లోని పుల్వామా గురుద్వారాలో పునర్వివాహం చేశారు. సిర్షా ముందుండి ఈ పెళ్ళి జరిపించినట్లు వార్తలందాయి.
ఆ ముస్లిం యువకునితో తనకున్న అనుబంధాన్ని గురించి హైకోర్టులో మన్‌మీత్‌ కౌర్‌ ఏం చెప్పిందనేది అధికారికంగా నిర్థారణ కాలేదు. అయినప్పటికీ, మరో మహిళ దన్‌మీత్‌ కౌర్‌ అలాంటి సమస్యతోనే ఒక సెల్ఫీ వీడియోను బయట పెట్టింది. 30 ఏళ్ళ తన భర్త ముజఫర్‌ తనను బెదిరించి కిడ్నాప్‌ చేశాడని ఆరోపణలు చేస్తూ ఆమె తల్లిదండ్రులు పోలీస్‌ కేసు పెట్టారు. దానిని ఖండిస్తూ, తాను అన్నీ తెలిసిన విద్యావంతురాలునని ఆమె వీడియోలో తెలిపింది. ‘నా హక్కులు నాకు తెలుసు. మంచి చెడుల మధ్య ఉన్న తేడా తెలుస’ంది. ఆమె జూన్‌ 6న ఇల్లు వదిలి, తన కోసం వెతకొద్దని తన తల్లిదండ్రులకు తెలిపింది. కానీ ఆరు గంటల వ్యవధిలోనే వారు పోలీసు ఫిర్యాదు చేయడంతో ఆమెను పెట్టుకొని వారికి అప్పగించారు. ఆమె 2012 లోనే స్వచ్ఛందంగా ఇస్లాం మతం లోకి మారి, 2014లో తన తోటి విద్యార్థి ముజఫర్‌ ను పెళ్లి చేసుకున్నానని రుజువు చేసే పత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఆమె భర్త శ్రీనగర్‌ సెంట్రల్‌ జైలులోనే ఉన్నాడు.
తన ‘’సిక్కు బిడ్డలను’’ కిడ్నాప్‌ చేసి, బలవంతంగా ఇతర మతాలకు చెందిన వారితో పెళ్ళి జరిపించడం విస్మయానికి గురిచేసిందని శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ అంటున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ లో మాదిరిగా బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా చట్టాలు చేసి, అమలు చేయాలని బిజెపి అభిప్రాయపడిరది. కానీ, సిక్కు మహిళలు తమకు నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకునే క్రమంలో… వారి కుటుంబ సభ్యులు, మత, రాజకీయ సంస్థలు, కోర్టులు, పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల…జమ్మూ, కాశ్మీర్‌ లో అనేక మంది మహిళలు బహిరంగంగా విచారాన్ని వ్యక్తం చేశారు.
మహిళ మతానికి చెందిన ఆస్తి కాదు
‘మహిళలను ఒక ‘’మతానికి చెందిన ఆస్తిగా’’ పరిగణిస్తున్నారు. 21వ శతాబ్దంలో కూడా మహిళలకు అండగా నిలిచే సంస్థలేమీ లేవు. పితృస్వామిక వ్యవస్థ చెప్పిన విధంగా మహిళలను మారకానికి ఉపయోగించే ఒక సరుకుగా చూస్తున్నారు’ అని జమ్మూ, కాశ్మీర్‌ కు చెందిన ఇఫ్రా జాన్‌ పేర్కొంది. పోలీసులు, కోర్టులు మహిళల ప్రాథమిక హక్కులను కాపాడే స్థితిలో లేవు. మగవారు కోరుకున్న విధంగానే ఆ వ్యవస్థలు పని చేస్తున్నాయి.
ఇటీవల కాలంలో సిక్కు మత పెద్దల మార్గదర్శకత్వంలో జరిగిన చర్యలను ఖండిస్తూ రచయితలు, మేధావులు, కవులు, కళాకారులు, సాంస్కృతిక కార్యకర్తలు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఒక వ్యక్తితో స్నేహం చేసే, ప్రేమించే, పెళ్లి చేసుకునే హక్కు, ఒక మత విశ్వాసాలను ఆచరించే హక్కులు విడదీయరానివి. ఇవి మహిళలకు కూడా సమానంగా చెందుతాయి. తప్పుడు వార్తలపై ఆధారపడే, మతాల మధ్య ద్వేష భావాన్ని, అనుమానాన్ని పెంచే ‘లవ్‌ జిహాద్‌’ లాంటి కుట్రపూరిత సిద్ధాంతాలను తిరస్కరిస్తున్నాం. దేశంలో ఏ ప్రాంతంలోనైనా మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అన్నారు. ‘వాస్తవానికి మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని ఇతర మతాలకు చెందిన మహిళలను పెళ్లాడిన ముస్లిం యువకులను నేరస్తులను చేసేందుకు ఉపయోగిస్తున్నారు. కానీ అటువంటి చట్టాలకు నిజమైన బాధితులు మహిళలే. ఎందుకంటే ఆ చట్టం వారి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కును ఉల్లంఘిస్తుందని’ వారు అన్నారు. తమ జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునే వారికి తమ సంఫీుభావాన్ని ప్రకటించి, మత పెద్దల బాధితులకు, కుటుంబాలకు మద్దతుగా నిలుస్తామని ప్రతినబూనారు.-(‘ది హిందూ’ సౌజన్యంతో),హర్ష మందిర్‌

భూముల చుట్టూ సమస్యల ముళ్లు

ఏళ్లతరబడి వారే సాగు చేసుకుంటు న్నారు. వారి వద్ద పాత దస్త్రాలున్నాయి. నేటికీ కొత్త పాసుపుస్తకం అందలేదు…తాము సాగు చేసు కుంటున్న భూమికి ఆధీనధ్రువీకరణ పత్రంఉంది. అయినా ఆన్‌లైన్‌లో సర్వే నంబరు కనిపిం చడం లేదు. క్షేత్రస్థాయిలో ఇలాంటి అనేక భూ సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి.

ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం రూపొం దించి ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలను ప్రవేశ పెట్టి సులభతర భూ లావాదేవీలకు వీలు కల్పించింది. అయితే కొత్త చట్టంతో ఇన్నాళ్లూ హక్కులు, పాసుపుస్తకాలు జారీ చేసిన తహసీల్దార్లకు అధికారాలు లేకుండా పోయాయి. ఇటీవల పెం డిరగ్‌ సమస్యల పరిష్కార బాధ్యతలను ప్రభు త్వం కలెక్టర్లకు అప్పగించింది. నెలల తరబడి పరిష్కా రం కాని సమస్యలకు వారం రోజులే గడువు విధిం చింది.దీనివల్ల గందరగోళ పరిస్థి తులు ఏర్పడగా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ఐచ్ఛికాలే లేవంటూ నిట్టూరుస్తున్నారు.
కుటుంబంలోని కొందరిని తప్పించి మిగిలినవారికి గతంలో పాసుపుస్తకాలిచ్చారు. దీన్ని సరిచేసే ఐచ్ఛికాన్ని ధరణిలో ఇవ్వలేదు. ఇన్నాళ్లూ ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతూ వచ్చిన అధికారులు ఇప్పుడు రెవెన్యూ కోర్టుల్లో కేసులున్న వారివి మాత్రమే పరిష్కరిస్తా మంటు న్నారు. క్షేత్ర స్థాయి అధికారులు చేసిన పొరపాట్లు అర్హులైన వారికి శాపంగా మారాయి. భూ సేకరణ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న భూమి పోను మిగిలిన దానిని లబ్ధిదారుల ఖాతాలో కలపాల్సిఉండగా ఇంకా పరిష్కరించలేదు. ఒక సర్వే నంబరు లో సగం భూమి తీసుకుంటే ఆ నంబరు మొత్తం ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. కలెక్టర్‌ లాగిన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల ప్రభుత్వం ఐచ్ఛి కాన్ని ఇచ్చింది. అయితే, సర్వే నంబరు ఆన్‌లైన్‌లో కనిపించక పోవడంతో దరఖాస్తును ఆన్‌లైన్‌ తిరస్క రిస్తోంది. గతంలో సాదాబైనామాకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అనువుగా మలుచుకుని పక్కనే ఉన్న సర్వే నంబరులోని భూమిని కూడా కొందరు కలిపేసుకున్నారు. ఈఅంశంపై విచారించిన అనం తరమే క్రమబద్ధీ కరించాల్సి ఉండగా చాలా చోట్ల దస్త్రాల ఆధారంగా మమ అనిపించారు. ఇప్పుడు ఈతప్పును సరిచేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఏజెన్సీ ప్రాంతంలో పాసుపుస్తకాల జారీ సమస్య గిరిజనప్రాంతంలో ఏజెన్సీ చట్టానికి లోబడి అర్హులైన గిరిజనులకు హక్కుపత్రాలు జారీ చేయాల్సి ఉంది. గిరిజనుల నుంచి గిరిజనేతరులు,అర్హత లేని గిరిజనులు కొనుగోలు చేసిన భూములకు సంబంధించి 76వేల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. గిరిజనులు,గిరిజనులకు మధ్య తెల్ల కాగి తాలపై జరిగిన ఒప్పందాలు సాదాబైనామాలు క్రమబద్ధీకరించాల్సి ఉంది. కలెక్టర్‌ లాగిన్‌లో దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. కానీ, చాలా సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. దీంతో దరఖాస్తులు దాఖలు చేసేందుకు అవకాశం లేకుండా పోతోంది. కొందరు రైతుల మధ్య విస్తీర్ణం లో వివాదాలు నెలకొన్నాయి. దీనిపై గతంలోనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసుకోగా ఇరు వురికి పాసుపుస్తకాలు నిలిపివేశారు. క్షేత్రస్థాయి సర్వే చేస్తే గానీ పరిష్కారం కనిపించడం లేదు. కలెక్టర్‌ లాగిన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. పాసు పుస్తకంతో ఆధార్‌ అనుసంధానం సందర్భంగా వేలిముద్రలు నమోదుకాక ఇన్నాళ్లూ పాసుపుస్తకం రానివాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కలెక్టర్‌ లాగిన్‌లో మరోమారు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వేలిముద్రలు లేకపోతే కనుపాప ఐరిస్‌ తోనూ పాసుపుస్తకం జారీకి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి భూములు పొందిన వారికి చాలాచోట్ల పాసు పుస్త కాలు జారీ చేయడం లేదు.ఈ తరహా భూముల సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. దీంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగు తున్నారు. ఆన్‌లైన్‌లో ఖాతా నంబరు లేక పాసు పుస్తకాలు రాని రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇన్నాళ్లూ వీరికి పాసుపుస్తకం జారీ చేస్తామంటూ తహసీల్దారు కార్యాలయ అధికారులు సర్ధిచెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం కలెక్టర్లకు పెండిరగ్‌ సమస్యల పరిష్కారానికి అవకాశం ఇచ్చింది. అయితే ఖాతా నంబరు లేని రైతులు దరఖాస్తు చేసుకునేందుకు మాత్రం మీసేవ, ధరణిలో ఐచ్ఛికాలు లేవు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూముల విస్తీర్ణంలో కోత
కొందరు రైతులకు పాసుపుస్తకాల్లో సర్వే సంఖ్యలు నమోదైనప్పటికీ విస్తీర్ణాల్లో కోతలు పెట్టారు. రెవెన్యూ సెటిల్‌మెంట్‌ సర్వే (ఆర్‌ఎస్‌ఆర్‌) ప్రకారం ఒక గ్రామ సేత్వారిలోని మొత్తం విస్తీర్ణం ఆ గ్రామంలోని రైతుల ఖాతాల్లోని విస్తీర్ణానికి మించి ఉంటే ధరణిలోకి అనుమతించదు. ఈకార ణంతోనే మొద ట్లో రెవెన్యూ సిబ్బంది కొందరు రైతుల విస్తీ ర్ణాల్లో కోతపెట్టారు. ఇప్పటికీ ఈ కత్తి రించిన విస్తీర్ణాలను కలిపే ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం కలెక్టర ్లకుదర ఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
3 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌.. మ్యుటేషన్‌
ధరణి పోర్టల్‌లో నెల రోజుల వ్యవధి లో 60వేల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరి గాయి. పోర్టల్‌ గతేడాది నవంబరు రెండో తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. మూడు నెలల కాలంలో జనవరి-ఫిబ్రవరి నెలల మధ్య జరిగిన రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లే అధికం. మంగళవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.36 లక్షల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరిగాయి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనిష్ఠంగా మూడు నిమిషాలు,సగటున 36నిమిషాల సమ యం పడుతోంది. వ్యవసాయ భూములను వ్యవ సాయేతర భూములుగా మార్పిడికి రెండు నుంచి ఎనిమిది నిమిషాల వ్యవధిపడుతోంది. ఎన్ని రిజిస్ట్రే షన్లు పూర్తవుతున్నాయో అంతే సంఖ్యలో మ్యుటేషన్లు కూడా పూర్తవుతున్నాయి.
పోడు భూముల సమస్యలు తీరాలంటే.. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీర్‌ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెబుతూ వస్తు న్నారు. అయితే ప్రభుత్వం మూడు అంశాలపై దృష్టి కేంద్రీకరించడం వల్ల పోడు భూముల సమస్య లకు త్వరితగతిని పరిష్కారం చూపవచ్చంటున్నారు భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్‌ కుమార్‌. అటవీ భూములకు హక్కు పత్రాలు కావాలని గతంలో 2లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చా యి. ఇందులో 93 వేల మందికి హక్కు పత్రాలు అందాయి. మిగతా వారివి తిరస్కరించామని ప్రభు త్వం చెప్పింది. అయితే అధికారికంగా దర ఖాస్తు చేసుకున్న వారికి సమాచారం లేదు.ఈ క్రమంలో ఎవరి దరఖాస్తులు తిరస్కరించారో వారికి సమా చారం ఇవ్వడంతో పాటు అప్పీల్‌ చేసుకునే అవకా శం ఇవ్వాలని సూచిస్తున్నారు. అదే విధంగా అర్హత ఉండీ ఇంకా హక్కు పత్రాలకు కోసం దరఖాస్తు చేసుకోని వారు ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం కల్పించాలంటున్నారు. ఇక అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములను ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వారికి తాత్కాలికంగా హక్కు పత్రాలు ఇవ్వడం దీర్ఘకాలికంగా ఉమ్మడి సర్వే చేసి అది ఏభూమో తేలితే ఆచట్టాల మేరకు హక్కు పత్రాలు కొనసాగించాలని చెబుతున్నారు. ఇక హక్కు పత్రాలను అందుకున్న వారికి అనేక చిక్కుముడులు ఉన్నాయి. కొద్ది మందికి వారు వాస్తవంగా సాగు చేసుకుంటున్న మొత్తం విస్తీర్ణం కాకుండా కొద్దిపాటి భూమికే హక్కు పత్రం వచ్చింది. పూర్తి విస్తీర్ణం కాకుండా ఎవరికైతే తక్కువ విస్తీర్ణం వచ్చిందో వారికి కూడా అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పిం చాలని సునీల్‌ కుమార్‌ సూచిస్తున్నారు. 2008 అటవీ హక్కుల చట్టం అదే చెబుతోందని అంటు న్నారు. 10ఎకరాల లోపు ఎంత భూమి సాగులో ఉంటే అంత భూమికి హక్కు పత్రం ఇవ్వచ్చని అంటున్నారు. ఇక పోడు భూములు సాగు చేసుకునే వారంతా గిరిజనులు కావడం వల్ల గిరిజన సంక్షేమ శాఖ తరపున లీగల్‌ టీమ్‌ను ఏర్పాటు చేసి వారి ద్వారా అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వాలం టున్నారు. గ్రామస్థాయిలోనే స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిం చి అక్కడ నెలకొన్న సమస్యలను గుర్తించి విచారణ చేపట్టి పరిష్కారం చూపాలంటున్నారు. అటవీ హక్కు చట్టం కేవలం అటవీ భూములను దున్నుకునే హక్కుకోసం చేసిన చట్టం మాత్రమే కాదు. అడవుల సంరక్షణ కోసమూ చేసిన చట్టం. అడవుల సం రక్షణ కోసం కమ్యూనిటీ టీమ్‌లు కీలకపాత్ర పోషి స్తున్నాయి. ఈ నేపథ్యంలో సామూహిక హక్కుల కోసం ఎక్కడైతే దరఖాస్తులు వచ్చాయో వాటిని వెంటనే పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేయా లంటున్నారు.
ఆదివాసీల పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇవ్వడంతోనే నేను టీఆర్‌ఎస్‌లో చేరాను. అటవీ భూముల నుంచి గిరిజనులను ఖాళీ చేయిస్తున్నారు. వారిని బెదిరి స్తున్నారు. సాగు చేసుకోకుండా అడ్డుప డుతున్నారు. అమీ తుమీతేల్చుకోకుంటే బతుకులు రోడ్డున పడ తాయి.అటవీ అధికారులను నిర్బంధించండి. పోరాటాలు చేసేందుకు గిరిజనులు సిద్ధంగా ఉండాలి.‘‘అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూవివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కులు కల్పిస్తాం. పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరిస్తాం. ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలను వారికీ వర్తింపజేస్తాం’ – 2018 శాసన సభ ఎన్నికలకు ముందు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ‘‘గిరిజనులను రక్షించాలి. పోడు భూముల వ్యవహారాన్ని తేల్చేయాలి. అన్ని జిల్లాలు, అన్ని డివిజన్లకూ నేనే స్వయంగా పోతా. నేనొక్కణ్నే కాదు.. మొత్తం మంత్రివర్గాన్ని, అటవీశాఖ ఉన్న తాధికారులను, చీఫ్‌ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీలం దరినీ తీసుకెళ్లి… తాలూకా కేంద్రాల్లో ప్రజాదర్బా ర్లు పెట్టి.. ‘ఇదిగో ఇది పోడు భూమి.. ఇదిగో మీ పట్టా’ అని ఇచ్చేస్తాం. దానిని ఫైనల్‌ చేసేస్తాం. ఆ తర్వాత ఒకఇంచు భూమి కూడా ఆక్రమణల పాలు కానివ్వం. పొరుగు రాష్ట్రం నుంచి గుత్తి కోయలు వచ్చి తమ ఇష్టం వచ్చినట్లు చెట్లను నరికేస్తు న్నారు. దీంతో మన గిరిజనులు నష్టపోయే పరిస్థితు లుంటున్నాయి. అందుకే ఈ పోడు భూములకు ఎక్కడో ఒక దగ్గర భరత వాక్యం పలకాలి. ఆర్‌వో ఎఫఆర్‌ చట్టం ప్రకారం హక్కులు కల్పిస్తాం. ఆ పేద గిరిజనులకు కూడా రైతుబంధు, రైతుబీమా రావాలి. వాళ్లు బతకాలి. వాళ్లూ మన బిడ్డలే ’’ -2019 జూలై నెలలో పోడుభూములపై అసెం బ్లీలో సీఎం కేసీఆర్‌ గిరిజనులకు ఇచ్చిన భరోసా ‘‘రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్క రించాలని కేబినేట్‌ సమావేశంలో చర్చించాం. ఈ చట్టం కేంద్రం పరిధిలో ఉంది. 2005 సంవత్స రం కటాఫతో రాష్ట్రంలో అవకాశం ఉన్న అందరికీ పోడు భముముల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించాం’’-నల్లగొండ జిల్లా హాలియాలో (ఆగస్టు 2న) జరిగిన నాగార్జునసాగర్‌ నియోజక వర్గ ప్రగతి సమీక్షలో సీఎం.
ఇలా పోడుభూముల సమస్యపై కేసీఆర్‌,టీఆర్‌ఎస్‌ పార్టీ పదేపదే హామీలిస్తున్నా సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. దశాబ్దన్నర కాలం నుంచి రావణ కాష్టంలా రగులుతున్న పోడు భూముల వ్యవహారం ఆదివారం నాటి కేబినేట్‌ సమావేశంలో, సోమవారం నాటి హాలియా ప్రగతి సమీక్ష సమావేశంలో ప్రస్తావనకు రావడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. దీనిపై పాలకులు ప్రతిసారీ హామీలు,భరోసాలు ఇస్తున్నారే తప్ప,అవి ఆచరణ లోకి రావట్లేదని గిరిజన, ఆదివాసీ సంఘాలు, తుడుందెబ్బ భగ్గుమంటున్నాయి. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే పోడు భూములపై గిరిజనులకు సాగు హక్కులు కల్పించేలా ఆర్‌వోఎఫఆర్‌ చట్టాన్ని తెచ్చినా…తెలంగాణలో అది అమలు కావడం లేదని ఆరోపిస్తున్నాయి. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఒక్క సెంటు భూమిపై కూడా ఆదివాసీలకు హక్కులు కల్పించలేదని గుర్తుచేస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ దీనిపై పలుమార్లు భరోసా ఇస్తున్నా… ఆయన హామీలు ఆచరణలోకి రావట్లేదని గిరిజన, ఆదివాసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. తెలంగాణలో దాదాపు 13లక్షలకు పైగా ఎకరాలు పోడు వ్యవసాయం కింద ఉన్నాయని, ఇంత భారీ మొత్తంలో ఉన్న భూములపై ఆదివాసీలకు హక్కులు లేకుండా పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. పోడు భూములపై గిరిజనులకు సాగు హక్కులు కల్పిస్తామని సీఎం తాజాగా ప్రకటించి నందున ఇప్పటికైనా ఈసమస్యకు పరిష్కారం లభి స్తుందని ఆదివాసీలు ఆశిస్తున్నారు.
2005లోనే..
పోడు భూములపై ఆదివాసీ బిడ్డలకు సాగు హక్కులు కల్పించాలని దశాబ్దన్నర క్రితమే కేంద్రం నిర్ణయించి..‘రికగ్నిషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌ (ఆర్‌వోఎఫఆర్‌) యాక్ట్‌-2006’ను అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు పోడు భూములపై సర్వే చేసి, న్యాయబద్ధంగా ఉన్న కేసులను గుర్తించి, పొసెషన్‌లో ఉన్న వారికి భూసాగు హక్కులు కల్పిం చాలని ఆదేశించింది. 2005 డిసెంబర్‌ 13 వరకు సాగులో ఉన్న పోడుభూములపై హక్కులు కల్పిం చాలంటూ ప్రకటించింది. తెలంగాణలో.. ఆదిలా బాద్‌, కుమ్రం భీం-ఆసిఫాబాద్‌, భద్రాద్రి-కొత్త గూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, జయశంకర్‌-భూపాలపల్లి, నాగర్‌కర్నూల్‌ వంటి మొత్తం 24 జిల్లాల్లో పోడు భూముల సమస్య ఉంది. రాష్ట్రంలో గోండు,బంజారా,కోయ,చెంచు,తోటి,కొలాం,నాయిక పోడ్‌ వంటి గిరిజన తెగలకు చెందిన ప్రజలు, కొంత మంది గిరిజనేతరులు పోడు భూములను సాగు చేస్తున్నారు. కేంద్రం ఆదేశాల మేరకు అప్పటి వైఎస్‌ ప్రభుత్వం 2007లో పోడుభూములపై సర్వే చేయించగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 40 లక్షలకు పైగా ఎకరాలు పోడు వ్యవసాయం కింద ఉన్నట్లు తేలింది. ఒక్క తెలంగాణలోనే 13 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములున్నాయని తేల్చారు.
పరిష్కారమేదీ?
వైఎస్‌ హయాంలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ద్వారా.. పోడు భూములకు సాగు హక్కులు కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలా తెలంగాణలోనే 1,86,679 క్లెయిమ్స్‌ వచ్చాయి. ఇందులో వ్యక్తిగత ఆర్జీలు1,83,252 కాగా, సామూహిక(కమ్యూనిటీ-గూడెంలోని ఆదివాసీ లందరూ కలిసి సాగు చేసుకునే భూమి) ఆర్జీలు 3,427.2020 మార్చి వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన వివరాల ప్రకారం..మొత్తం క్లెయిమ్స్‌లో 94,360 క్లెయిమ్స్‌ను పరిష్కరించారు. దాదాపు 7.54లక్షల ఎకరాలపై గిరిజనులకు సాగు హక్కులు కల్పించామని ప్రభుత్వం అందులో పేర్కొంది. కానీ..గిరిజన సంఘాలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక సర్కారు ఒక్క ఎకరంపై కూడా హక్కులు కల్పించ లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ప్రజాదర్బార్లు అంటూ ప్రకటనలు చేస్తున్నారే తప్ప…ఎక్కడా నిర్వ హించిన దాఖలాలు లేవని విమర్శిస్తున్నారు.
వైఎస్‌ హయాంలో మొదటి దశ కింద 3.16లక్షల ఎక రాలకు హక్కులు కల్పించారని, ఇందులో తెలంగాణ ప్రభుత్వం హరితహారం కింద 40వేల ఎక రాలను వెనక్కి తీసుకుందని ఆరోపి స్తున్నారు. ఇంకా 10లక్షలకు పైగా ఎకరా లకు హక్కులు కల్పించాల్సి ఉందని వివరిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఆర్‌వోఎఫఆర్‌ చట్టాన్ని అమలు చేయలేదని విమర్శిస్తున్నారు. పైగా… వర్ధన్నపేట వంటి ఆర్డీవో కార్యాలయాల్లో అప్పటివరకూ ముద్రించి ఉన్న ఆర్‌వోఎఫఆర్‌ బుక్స్‌ను చెత్తబుట్టలో పారేశారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన వివ రాల ప్రకారం చూసుకున్నా..ఇంకా92,319 క్లెయిమ్స్‌ పెండిరగ్‌లో ఉన్నాయి. అయితే,అది పాత లెక్క. ఇప్పటి లెక్క ప్రకారం క్లెయిమ్స్‌ లక్షకు పైగానే ఉంటాయని సంఘాలు చెబుతున్నాయి. వీటికి సంబంధించి 10లక్షల ఎకరాలకు పైగా భూమి ఉంటుందని, వీటిపై గిరిజనులకు హక్కులు కల్పించాలని డిమాం డ్‌ చేస్తున్నాయి. పోడుభూముల వ్యవ హారం బయ టకు వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్‌ స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హామీ ఇవ్వడంతో ఇక తమబతుకుల్లో వెలుగులు నిండుతాయని ఆశిం చామని.. కానీ, ఇప్పటివరకూ ఒక్క ఇంచు భూమి సమస్యను కూడా పరిష్కరించలేదని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సమ స్య తీవ్రతను గుర్తించిన సీపీఐ బుధవారం (ఆగస్టు 4) నుంచి‘పోడుయాత్ర’ను చేపడుతోంది. ఇప్పటి కైనా కేసీఆర్‌ పోడు భూముల సమస్యను పరిష్క రించాలనిగిరిజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
అస్తిత్వంలో లేని కమిటీలు..
ఆర్‌వోఎఫఆర్‌ కింద సాగు హక్కులు కల్పించడానికి పెద్ద ప్రక్రియే ఉంది. ఇందుకోసం గ్రామ,జిల్లా,రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పాటు కావాలి. అప్పట్లో ఏర్పాటు చేసిన ఈ కమిటీలు అస్తిత్వాన్ని కోల్పోయాయి. ఇవి ఉన్నాయో లేదో అధికారులకే తెలియని పరిస్థితి. కాగా..పోడు భూములకు సంబంధించి ముందుగా గ్రామ స్థాయి కమిటీకి గిరిజనులు దరఖాస్తు చేసుకోవాలి. గ్రామ సభలు నిర్వహించి, ఆదరఖాస్తులు వాస్తవమో కాదో గ్రామ కమిటీలు తేలుస్తాయి. అర్హమైన ఆర్జీలను జిల్లా కమిటీలకు పంపుతారు. జిల్లా కమిటీలు వాటిని పరిశీలించి, రాష్ట్ర స్థాయి కమిటీకి పంపు తాయి. రాష్ట్రస్థాయి కమిటీ ఆర్జీలను ఆమో దిస్తుంది. అనంతరం ఫారెస్ట్‌, రెవెన్యూ శాఖలు ఆఆర్జీల్లో పేర్కొన్న భూములపై జాయింట్‌ సర్వే చేసి, నిజమో కాదో నిర్ధారిస్తాయి. సరిహద్దులు కరెక్టే అని తేలితే…భూసాగు హక్కులు కల్పిస్తారు. కానీ. తెలంగాణ ఏర్పాటయ్యాక ఏ ఒక్క గ్రామంలోనూ గ్రామసభలు జరిగిన సంద ర్భాలు లేవని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికారులు వర్సెస్‌ గిరిజనులు
అధికారులు వర్సెస్‌ గరిజనులు
పోడు భూముల విషయంలో అటవీ అధికారులు,గిరిజనులకు మధ్య తరచూ వివా దాలు నెలకొంటున్నాయి. గిరిజనులు సాగు చేసు కుంటు న్న భూమి తమదేనంటూ అటవీ అధికారులు క్లెయి మ్‌ చేస్తున్నారు.ఎక్కడ చదును భూమి కనిపిస్తే… అక్కడ అటవీ శాఖాధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇదిపోడు వ్యసాయం చేసుకుంటున్న గిరిజనుల భూముల్లో కూడా కొన సాగుతోంది. దీంతో గిరిజనులు తిరగబడు తున్నా రు. తరతరాలుగా తాముసాగు చేస్తున్నా మని, ఆ భూమి తమదేనని చెబుతున్నారు.దీనిపై ఇరు వర్గాల మధ్య తరచూ దాడులు, ప్రతిదాడులు జరుగు తున్నాయి.
-ఆదిలాబాద్‌ నుంచి సునీల్‌ నాయక్‌

సంక్షోభంలో రాజ్యాంగ సంస్థలు

‘‘ అసమ్మతి ప్రకటించే వ్యవస్థలు బలహీనపడినప్పుడు రాజ్యం రాజ్యాంగ విధ్వంసం చేస్తుంది. ఆంబేద్కర్‌ మనుస్మృతిని బహిరంగంగా కాల్చి నిరసన తెలిపారు. సంఫ్న్‌ సర్కారుపైకి పొగుడుతూనే లోలోపల రాజ్యాంగాన్ని కాల్చేస్తోంది.’’

రాజ్యాంగం సంక్షేమ సూత్రాల సమాహారం. వీటి ప్రకారం రాజ్య నిర్మాణం,ప్రజాస్వామ్య పాలన సాగుతాయి. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అతిక్రమించరాదు. రాజ్యాంగ,రాజ్యాంగేతర,ప్రజాస్వామ్య, శాసనసంస్థలు ప్రజా సంక్షేమ సంస్థలు. వీటి విధ్వంసం వినాశకారకం. రాజ్యాంగం ఏర్పర్చినవి రాజ్యాంగ సంస్థలు. వివిధ రాజ్యాంగ అధికరణల ద్వారా 20 రాజ్యాంగ సంస్థలు ఏర్పడ్డాయి. అవి: దేశ,రాష్ట్ర ఆర్థిక సంఘాలు (ఎఫ్‌సీ),వస్తుసేవల శిస్తు సంఘం, సమాఖ్య, రాష్ట్ర పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్లు, దేశ,రాష్ట్ర ఎన్నికల సంఘాలు (ఈసీ), కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అటార్నీ జనరల్స్‌, భారత కంట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (సీఏజీ),జిల్లాల, మెట్రొపాలిటన్ల ప్రణాళిక సంఘాలు, అంతర్రాష్ట్ర మండలి,ఎస్సీ,ఎస్టీ,బీసీల జాతీయ కమిషన్లు, ఆదివాసీ ప్రాంతాల, ఎస్టీ, బీసీల అధికార భాష కమిషన్లు, పార్లమెంటు అధికారభాష కమిటి,మైనారిటి భాషల ప్రత్యేక అధికారి. సీఏజీ,ఈసీ,ఎఫ్‌సీ ప్రధాన రాజ్యాంగ సంస్థలు. ప్రభుత్వ కార్యనిర్వాహక తీర్మానాలు, చర్యల ద్వారా రాజ్యాంగేతర సంస్థలు ఏర్పాటవుతాయి. ఇవి:భారత రూపాంతర జాతీయ సంస్థ (నిటి ఆయోగ్‌), జాతీయ అభివృద్ధి మండలి,జాతీయ,రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు, కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ),కేంద్ర నిఘా సంస్థ(సివిసి),జాతీయ లోక్పాల్‌,రాష్ట్ర లోకాయత్‌లు,కేంద్ర,రాష్ట్ర సమాచార కమిషన్లు.
శాసన,కార్యనిర్వాహక,న్యాయవ్యవస్థలు ప్రజాస్వామ్య సంస్థలు. మాధ్యమాలను ప్రజాస్వామ్య నాల్గవ స్తంభంగా పరిగణిస్తారు. ఇవి రాజ్యాంగ సూత్రాల అమలులో, ప్రజాస్వామ్య నిర్మాణ, నిర్వహణల్లో కీలక పాత్ర పోషిస్తాయి. శాసనవ్యవస్థ,రాజ్యాంగ పరిధిలో చట్టాలుచేసే అతిశక్తివంతమైన ప్రజాప్రతినిధుల వేదిక. వ్యవహారాలు చట్టబద్దంగా, లావాదేవీల లాభార్జన న్యాయసమ్మతంగా ఉండాలి. పౌరప్రయోజనాలు పరిరక్షించబడాలి. వ్యాపార లాభాలను సమాజ ప్రయోజనానికి వాడాలి. కార్యనిర్వాహక సంస్థ రాజకీయ ప్రతినిధులు సమాజాన్ని శాసించరాదు. సమాజ నిర్మాణాన్ని, పనితీరును నియంత్రించరాదు. రాజ్యాంగం సమాఖ్య సూత్రాలను పొందుపరిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధులను నిర్వచించింది. కార్యనిర్వాహకులు సమాఖ్య పరిధి, పరిమితులు దాటరాదు. చట్టాలు రాజ్యాంగ పరిధిలో ఉండేలా చూడటం న్యాయవ్యవస్థ బాధ్యత. రాజ్యాంగ వ్యతిరేకత, పాలన అక్రమాలను ప్రశ్నించడం, న్యాయవిరుద్ధ చట్టాల నుండి ప్రజారక్షణ, వివాద పరిష్కారం న్యాయవ్యవస్థ రాజ్యాంగ అధికారాలు. వైద్య విజ్ఞాన శాస్త్రాల అఖిల భారత సంస్థ ఎఐఐఎంఎస్‌,భారతీయ వజ్రాల సంస్థ,భారత చలనచిత్ర,దూరదర్శన్‌ సంస్థ(ఎఫ్‌.టి.ఐ.ఐ),జాతీయ అధికార శిక్షణ, బొగ్గు నిర్వహణ భారతీయ సంస్థ, భారత రిజర్వు బ్యాంకు,రైల్వే,పెట్రోలియం సంస్థలు సమాఖ్య ప్రభుత్వ భాగస్వామ్య చట్టబద్ద సంస్థలలో కొన్ని.
ఇప్పుడు ఈ సంస్థలన్నీ సంఫ్న్‌ భావజాల వ్యక్తుల చేతుల్లో బందీలు.గతంలో ప్రగతిశీల కాంగ్రెసీయులు, గాంధీయన్లు, సోషలిస్టులు, వామపక్షవాదుల ఆధ్వర్యంలో నడిచేవి. వారు ప్రజానుకూల నిర్ణయాలు తీసుకునేవారు. తెరవెనుక ఏంచేసినా వేదికలపై నీతి, ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడేవారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు జంకేవారు. నేటి సంఫీుయ అధికారులకు సిగ్గు ఎగ్గు లేవు. వైదిక హైందవ ఆర్య బ్రాహ్మణత్వ ఆధిపత్య రూపాలలో సంస్థలను నడుపుతున్నారు. ఆర్థిక సంఘాలు పాలక అనుకూల ప్రతిపాదనలు చేస్తున్నాయి. వస్తుసేవా శిస్తు వ్యవస్థ కరోనా కాలంలోనూ, టీకాలకు కూడా పన్నులు తగ్గించలేదు. రాష్ట్రాల వాటాలను ఇవ్వలేదు. ఎన్నికల కమిషన్లు పాలక పక్షపాతంగా పనిచేస్తున్నాయి. అటార్నీ జనరల్స్‌ ప్రజా వ్యతిరేకంగా వాదిస్తున్నారు. వలసకార్మికులకు, కోవిడ్‌ చావుల అనాథలకు ఆర్థిక సాయంలో మానవత్వరహిత వాదనలు చేశారు. సీఏజీ ముందస్తు స్పందన, ప్రతిస్పందనల బాధ్యతలను మరిచింది. ప్రభుత్వ న్యాయవాదులు ప్రజాపక్షం కాక ప్రభుపక్షం వహించారు. ప్రణాళిక మండళ్లకు పాలకుల మాటే ప్రణాళిక. అంతర్రాష్ట్ర మండలి సంఫ్న్‌ పాలిత రాష్ట్రాల పక్షపాతిగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంఘాలను ప్రభుత్వం పట్టించుకోదు. లక్షద్వీప్‌ పాలనాధికారి చట్టాలు ఉల్లంఘనలకు ఉదాహరణలు. అధికార భాషాసంఘం, మైనారిటి భాషల అధికారి ఉనికి కోల్పోయారు. ప్రతిచోటా సంస్కృతాన్ని రుద్దుతున్నారు. ప్రజల మాతృభాషలను మాతృభాషలు చేస్తున్నారు. నిటి ఆయోగ్‌, అభివృద్ధి మండలి ప్రయివేటీకరణకు మద్దతు ఇస్తున్నాయి. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టోరెట్‌, మానవ హక్కుల కమిషన్లు, నిఘా, సమాచార సంఘాలు పాలకుల జేబు సంస్థలుగా మారాయి. న్యాయస్థానాల పోరుపడలేక, అధికారం చేపట్టిన ఆరేండ్లకు, కోరలులేని పాములాంటి లోక్పాల్‌ను నియమించారు. సుప్రీంకోర్టు ఆదేశించినా మోడీ గుజరాత్‌ లోకాయత్‌ను నియమించ లేదు. ఆ పనిచేసిన మహిళా గవర్నర్‌ను ముప్పుతిప్పలుపెట్టి ఇంటికి పంపేదాకా నిద్రపోలేదు. పదుల కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టి ఆ నియామక రద్దుకు కోర్టుల్లో దావాలు నడిపారు. ఇక ప్రజా సమస్యల పరిష్కారానికి రక్షకులెవరు? ప్రజాస్వామ్య చట్టబద్ద సంస్థలు కూడా పాలక పక్షానికి వంతలుగా మారాయి. రాజ్యాంగ సంస్థల విచ్ఛిత్తితో ప్రజలకు రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామ్య మానవత్వ హక్కులు నిరాకరించబడుతున్నాయి.
పార్లమెంటు కమిటీలను నియమించ కుండా ప్రతిపక్షాలను బెదిరించి, భ్రమపెట్టి, ఆశపెట్టి, బయటకునెట్టి ఏకపక్షంగా చట్టాలు చేశారు. రాష్ట్రాల జాబితాల్లో చొరబడ్డారు. కరోనా కాలంలో ప్రత్యామ్నాయ పక్షాలు, ప్రజా సంఘాలు నిరసన తెలుపలేని స్థితిలో, అవకాశ వాదంతో రాజ్యాంగ, ప్రజా వ్యతిరేక చట్టాలు చేశారు. పౌరసత్వ సవరణ, కొత్త విద్య, కార్మిక, వ్యవసాయ, విద్యుత్‌ చట్టాలు వీటిలో కొన్ని. 40మంది సంఫ్న్‌ గూండాలు 11.8.21న రాజ్యసభలో ప్రవేసించి మహిళా ఎంపీలపై దౌర్జన్యంచేసి బీమా చట్టం ఆమోదించుకున్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ ముందెన్నడూలేనంత పక్షపాతంగా వ్యవహరిస్తోంది. కోర్టు తీర్పులూ సంఫ్న్‌ పాలకులకు అనుకూలంగా ఉన్నాయి. 5, 7 మంది న్యాయమూర్తుల ధర్మపీఠాల్లో కూడా అసమ్మతి నమోదుకాదు. న్యాయం ఏకపక్షంగా మారింది. అయోధ్య, రాఫెల్‌, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల తీర్పులు వాటిలో కొన్ని. ‘’కోర్టుల్లో మా అనుకూల తీర్పులు యాధృచ్ఛికంకాదని’’ బీజేపీ ప్రముఖ నాయకుడే అన్నారు. అనుమాన న్యాయమూర్తులను హత్యచేసే రాజకీయ స్థితి దాపురించింది. పూర్వ ప్రధాన న్యాయమూర్తి బాబ్డే రెండు రోజుల్లో రిటైర్‌ అవుతారనగా న్యాయమూర్తుల తీరు మారింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రమణ వ్యాఖ్యానాలు ఆశావహంగా కనిపిస్తున్నాయి. కాని కొట్టినవారిని శిక్షించకుండా కొట్టిన విధానం మంచిదికాదు, వాడిన ఆయుధం సరైంది కాదన్నట్లు ఉంది. చట్టాల రద్దు ప్రతిపాదించకుండా వాటి దురుపయోగాన్ని ఎత్తిచూపి లాభం లేదు. 70శాతం మీడియా ప్రభుత్వ రాజకీయ-వాణిజ్య భాగస్వామి ముకేశ్‌ అంబానీ సొంతం. మిగిలిన మీడియా సంఫ్న్‌ సంస్థల యాజమాన్యంలో, ప్రభుత్వ మీడియాగా పనిచేస్తోంది. స్వేచ్ఛా స్వాతంత్రాలు, సమానత్వం, ప్రజాభిప్రాయం, సంక్షేమం, పౌర, మానవ హక్కుల పట్ల ప్రభుత్వ ఉల్లంఘనలను ఈ మీడియా ఎత్తిచూపదు. సమర్థిస్తుంది.
అసమ్మతి ప్రకటించే వ్యవస్థలు బలహీనపడినప్పుడు రాజ్యం రాజ్యాంగ విధ్వంసం చేస్తుంది. ఆంబేద్కర్‌ మనుస్మృతిని బహిరంగంగా కాల్చి నిరసన తెలిపారు. సంఫ్న్‌ సర్కారుపైకి పొగుడుతూనే లోలోపల రాజ్యాంగాన్ని కాల్చేస్తోంది.
-ఎస్‌.హనుమంతరెడ్డి

దిశ చట్టం ఉన్నా..ఆగని అఘాయిత్యాలు

‘‘ దిశ యాప్‌ ద్వారా వచ్చిన కేసుల్లో 390 కేసులకు 7రోజుల్లోపే చార్జిషీట్‌ దాఖలు చేశారు. దిశ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం ముగ్గురు దోషులకు ఉరి శిక్ష, 25 మందికి జీవిత ఖైదు పడిరది. దిశ కేసుల దర్యా ప్తునకు అవసరమైన సాంకేతిక ఆధారాల కోసం తిరుపతి,విశాఖపట్నం,మంగళగిరి లో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు.’’

రెండు సంవత్సరాలుగా ప్రేమించి అక్టో బర్‌ నెలలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని అను మానంతో విజయనగరం జిల్లాలో తగలబెట్టా డొకడు. అభం శుభం తెలియని దళిత చిన్నారిపై గుంటూరులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు వరుసకు మామ అయిన ప్రబుద్ధుడు. దిశ చట్టం అమలు గురించి ఎంతో ఆర్భాటంగా చెప్పుకునే రాష్ట్రంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున పట్టపగలు అంద రూ చూస్తుండగా ఇంజినీరింగ్‌ చదువుతున్న రమ్య అతిదారుణంగా హత్యకు గురికావడం అందరిని కలచివేసింది. నిర్భయ, దిశ,అశ్లీలతవ్యతిరేక చట్టాలు ఎన్ని వచ్చినా అమ్మాయిలపై అఘాయి త్యాలను, ప్రేమోన్మాదుల దాడులను,యాసిడ్‌,లైంగిక దాడు లను నివారించ లేక పోతున్నాయి. ఇప్పటికైనా లోపం ఎక్కడుందో గ్రహిస్తే మంచిది. రోజు రోజుకు పేట్రేగిపోతున్న అశ్లీల సినిమాలు,సాహిత్యం, ప్రకటనలను ప్రభు త్వాలు కట్టడి చేయలేక పోతు న్నాయి. కేవలం ప్రచార ఆర్భాటాలతో కాలం వెళ్లబుచ్చుతున్నాయి తప్ప చేసిందేమీ లేదు. దిశచట్టం అమలులోకి వచ్చిన సంవత్సరంలోనే దాదాపు ఆరుగురు ఇంజి నీరింగ్‌ చదివే అమ్మా యిలు హత్యకు గురయ్యా రంటే…వార్తల కందని, నిరక్ష రాస్యులైన మహిళలు ఎందరో ?
మహిళలపై హింస అనేది సామాజిక, ఆర్థిక, అభివృద్ధి…విద్య,మానవ హక్కులు,చట్టాలు, ఆరో గ్యానికి సంబంధించిన సమస్య. మహిళలపై హిం సకు మానసిక అనారోగ్యానికి మధ్య గల సంబం ధాన్ని తగినంతగా పరిశోధించలేదు. ఇంట ర్నెట్‌ పుణ్యమా అని పోర్నోగ్రఫీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంది. కరోనా పుణ్యమా అని అన్ని ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్న ఈ తరుణంలో సమస్య విపరీతంగా పెరిగిపోయింది.భారతదేశంలో ప్రత్యే కంగా ఏచట్టంలోనూ అసభ్యత, అశ్లీలత నిర్వ చించ బడలేదు. కానీ భారతీయ శిక్షాస్మృతి-1860, సమాచార సాంకేతిక చట్టం-2000 ప్రకారం… అశ్లీలత,అశ్లీలతతో కూడిన వాటిని ప్రచురించడం, ప్రసారం చేయడం…అసభ్యకర, అశ్లీల వస్తువులను విక్రయించడం వంటివి శిక్షార్హమైన నేరాలు. మహి ళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారా లను, లైంగిక దాడులను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం దిశ చట్టాన్ని రూపొందించింది. అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో14రోజుల్లోనే విచా రణ పూర్తి చేసే విధంగా ఈచట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం 21రోజుల్లో రేప్‌ కేసుపై జడ్జిమెంట్‌ ఇవ్వాలి. ప్రభుత్వం ఎన్ని కఠినమైన చట్టాలు చేసినా, చుట్టూ ఉన్న సమాజం, మనుషులలో మార్పు రానిది ప్రయోజనం లేదు. ఈ రోజు సామజిక మాధ్యమాల ద్వారా మంచి కంటే చెడును ఎక్కువ ఆకళింపు చేసుకొని ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఉపాధి లేకుండా యువతను నిర్వీర్యం చేసిన ఘనత మన పాలకులది. ఇంజినీరింగ్‌ చదివిన వారిలో తొంభై ఐదుశాతం మందికి ఉద్యోగాలు లేవు. ప్రయివేటు రంగంలో పనిచేసే వారికి అరవై శాతం మందికి జీతాలులేవు. తొంభైశాతం ప్రజలు అభ ద్రతా భావంతో జీవితాన్ని నెట్టుకొస్తున్న సమయం లో ఇలాంటి దారుణాలకు కొదవ లేకుండా పో యింది. ప్రజలకు నాణ్యమైన విద్య,సంస్కృతి,మాన వ విలువలు,పర్యావరణం,మంచి ఆరోగ్య ఆహార పు అలవాట్ల గురించి చెప్పే విద్యాసంస్థలు కరువ య్యాయి. కేవలం డబ్బే పరమావధిగా కార్పొ రేట్‌ కళాశాలలు, విద్యా సంస్థలు ఏర్పడి నడుస్తు న్నాయి. వీటి మాయాజాలంలో పడిన తల్లిదండ్రులకు సమాజం గురించి పట్టడం లేదు. తమ పిల్లలకు మంచి ప్లేస్‌మెంట్‌ వచ్చి ఎక్కువ డబ్బు సంపాదిస్తే చాలు అనుకునేలా తయారవుతున్నారు. పరిస్థితులు ఈ విధంగా ఉన్నంతవరకు మహిళలపై దాడులను అరికట్టడం అంత సులభం కాదు.
మహిళల రక్షణలో ‘దిశ’ మారదు
మహిళలు, బాలికలకు రక్షణ కవచం లా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ‘దిశ’ నిర్దేశంలో మార్పులేదని మరోసారి రుజువైంది. హైదరాబాద్‌ లో దిశ ఘటన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో అటు వంటి ఘోరాలకు అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం2019 డిసెంబర్‌ 13న అసెంబ్లీలో, డిసెంబర్‌ 16నమండలిలో దిశ బిల్లును ఆమో దించి 2020 జనవరి 2నచట్ట రూపం కోసం రాష్ట్రపతికి పంపిన సంగతి తెలిసిందే. అయితే ఆబిల్లుపై కేంద్రం చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఇప్పటికే దిశ చట్టాన్ని తెచ్చేందుకు రాజీలేని వైఖరితో ప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దిశ చట్టం` 2019 (పాతబిల్లు)ని రద్దు చేసి ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం-2020 (కొత్తబిల్లు)ని శాసనసభ, శాసన మండలిలో ప్రవేశపెట్టి ఆమోదించింది.ఈ నేప థ్యంలో ఆంధ్రప్రదేశ్‌ దిశ (మహిళలు, బాలలపై జరిగే నేరాలపై విచారణకు ప్రత్యేక న్యాయ స్థానాలు)చట్టం-2020కి ప్రభుత్వం మరింత పదును పెట్టింది. అసెంబ్లీ,మండలి ఆమోద ప్రక్రి య పూర్తి కావడంతో ఈ బిల్లును రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 254(2)ప్రకారం గవర్నర్‌ పరిశీలన అనం తరం వీలైనంత త్వరగా రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్నారు.
ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు
ా దాదాపు ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళలు, చిన్నారుల రక్షణ కోసం అనేక కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జీరో ఎఫ్‌ఐఆర్‌ కచ్చితంగా అమలు చేయాలంటూ ఇటీవల కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేయడానికి ముందు నుంచే ఏపీలో ఈ విధానం అమల్లో ఉండటం విశేషం. చట్టం ప్రకారం బాధితులు తమ సమీపంలోని ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది.
ా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 దిశ పోలీస్‌ స్టేషన్లలో 18 కస్టమైజ్డ్‌ బస్సులు ఏర్పాటు చేశారు. ఈ బస్సుల్లోని ప్రత్యేక పరికరాలతో సాంకేతిక సిబ్బంది నేర స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తున్నారు.
ా ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారులకు సత్వర సహాయం అందించేలా ఆవిష్కరించిన దిశ యాప్‌ను ఇప్పటి వరకు దాదాపు 12 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. గత 8 నెలల్లో 98,380 మంది ఎస్‌ఓఎస్‌ ద్వారా పోలీసుల సహాయం కోరారు.
ా దిశ యాప్‌ ద్వారా వచ్చిన కేసుల్లో 390 కేసులకు 7 రోజుల్లోపే చార్జిషీట్‌ దాఖలు చేశారు. దిశ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం ముగ్గురు దోషులకు ఉరి శిక్ష, 25 మందికి జీవిత ఖైదు పడిరది.
ా దిశ కేసుల దర్యాప్తునకు అవసరమైన సాంకేతిక ఆధారాల కోసం తిరుపతి, విశాఖపట్నం, మంగళగిరిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు.
ా రాష్ట్రంలో11 ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే 700 పోలీస్‌స్టేషన్లలో ఉమెన్‌ స్పెషల్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. దిశ బిల్లులో ప్రస్తావించిన అనేక విషయాలను సమర్థవంతంగా అమలు చేయడంతో ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 4 అవార్డులు వచ్చాయి.
దిశ బిల్లులో ప్రధానాంశాలు..
్చ మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడితే ప్రత్యేక నేరాలుగా పరిగణించి నిర్భయ చట్టం-2012, పోక్సో చట్టం ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ)- 1860,క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌(సీపీసీ)- 1973లను ఉపయోగిస్తారు.
్చ ఐపీసీ సెక్షన్‌ 326ఎ,326బి,354,354ఎ, 354బి,354సి,354డి,376,376ఎ, 376బి,376ఎబి,376సి,376డి, 376డిఎ,376డిబి,376ఈ,509లతో పాటు పోక్సో యాక్ట్‌, కేంద్ర చట్టాల్లోని పలు సెక్షన్లపై కేసు నమోదు చేస్తారు.
్చ 18ఏళ్లలోపు బాలబాలికలపై లైంగిక దాడులు,అత్యాచారాలు నిరోధించేందుకు 2012 నవంబర్‌ 14న కేంద్రం పోక్సో యాక్ట్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫ్‌న్సెస్‌ యాక్ట్‌ -పీఓసీఎస్‌ఓ)ను ప్రయోగించడం వల్ల తీవ్రమైన శిక్షలు తప్పవు. పోక్సో చట్టం అమలులోకి వచ్చిన ఏడేళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం గతేడాది ఆ చట్టానికి సవరణలు చేసింది. చట్టంపరిధిలో ఉన్న శిక్షలను కొనసాగిస్తూనే చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు జీవిత ఖైదుకు బదులు మరణ శిక్షను విధించాలని సవరణ చేసింది.
్చ జీవిత ఖైదును 20 ఏళ్లుగాని, మరణించే వరకు గానీ జైలులోనే ఉండాలనే మరో సవరణ చేసింది. మహిళలపై తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి కూడా ఐపీసీ సెక్షన్ల ప్రకారం తీవ్రమైన శిక్షలు విధించే అవకాశం ఉంది.
్చ కేసుల నమోదుకు ఆన్‌లైన్‌ విధానం అమలు చేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. మహిళలు, బాలలపై నేరాలకు పాల్పడే వారి వివరాలు అపరాధుల రిజిష్టర్‌ (ఆన్‌లైన్‌ విధానం)లో నమోదు చేస్తారు.
్చ వేగంగా దర్యాప్తు పూర్తి చేసేలా ప్రతి జిల్లా స్థాయిలో ఒక డీఎస్పీ నేతృత్వంలో పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తారు.
్చ బాధిత మహిళకు సత్వర న్యాయం జరిగేలా, దోషులకు వేగంగా శిక్షలు అమలు చేసేలా ఈ కేసుల కోసం ప్రతి జిల్లాలో ఒకటి, అంతకంటే ఎక్కువగా ప్రత్యేక కోర్టులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వీటిలో ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ)ను కూడా నియమించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం- 2019
నిర్భయ (2012), ఉన్నావ్‌ (2017), దిశ (2019)..నేరాలతో దేశం ఉలిక్కిపడిరది. భవిష్యత్తులో ఇటువంటి నేరాలు పునరావృతం కాకుండా ఉండాలంటే శిక్షలను పకడ్బంధీగా అమ లుచేసే చట్టాలు ఉండాలి. ఆలస్యంగా దొరికిన న్యాయం అన్యాయంతో సమానం అంటారు. ఎందరో నేరస్తులు భారతీయ శిక్షాస్మృతిలోని లొసు గులను అవకాశాలుగా తీసుకుని దర్జాగా తప్పించు కుంటున్నారు. బాధితులు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగినా న్యాయం దొరకని సంద ర్భాలు కోకొల్లలు. వీటన్నింటి దృష్ట్యా న్యాయ విచా రణ ప్రక్రియ వేగవంతం చేయాలని, నేరానికి పాల్ప డ్డ వ్యక్తులకు సత్వర శిక్షను అమలు చేసే ఉద్ధేశ్యంతో రూపొందించిందే దిశ యాక్ట్‌-2019 .
ఈ చట్టం ఎప్పుడు వచ్చిందంటే…?
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ బిల్లును ఏపీ శాసనసభ డిసెంబర్‌ 13,2019 ఆమోదించింది.డిసెంబర్‌ 16న శాసన మండలిలో దిశ బిల్లును ఆమోదించి.2020 జనవరి2న చట్ట రూపం కోసం రాష్ట్రపతికి పంప డం జరిగింది.రాష్ట్రపతి ఆమోదముద్రవేస్తే ఆంధ్ర ప్రదేశ్‌ క్రిమినల్‌ లా (సవరణ)చట్టం-2019 (ఆంధ్రప్రదేశ్‌ దిశ యాక్ట్‌), ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగెనెస్ట్‌ వుమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019 అమలుకు మార్గం సుగమం అవుతుంది. ఈచట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువైతే దోషికి మరణశిక్ష ఖాయం.
ఈ చట్టం ఎలా వచ్చిందంటే…?
తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్‌ శివార్లలో 2019,నవంబరు 27నజరిగిన వెటర్నరీ డాక్టర్‌ దిశ గ్యాంగ్‌ రేప్‌,హత్య ఘటనతో దేశం షాక్‌కి గురైంది. మహిళల భద్రత మీద మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే ఆందోళన దేశమంతా మొదలైంది. దేశంలో మిగతా రాష్ట్రాలు స్పందించక పోయినా..ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెంటనే ‘దిశ’ పేరుతో ఓ చట్టాన్ని ప్రవేశ పెట్టింది. దిశ దుర్ఘటన వంటి నేరాలు మునుముందు జరగకూడదని, నేరం చేస్తే కఠిన శిక్ష పడుతుందనే భయం ఉన్నప్పుడే నేరాలు తగ్గుతాయని, మహిళలపై, పిల్లలపై అఘా యిత్యాలకు పాల్పడితే మరణ శిక్ష పడుతుందనే భయం రావాలని, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుం దని,బాధితులకు సత్వరన్యాయం చేయాలనే ఉద్ధే శ్యంతో వచ్చిందీ చట్టం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంగా దేశమంతా ప్రశసంలు పొందిందీ చట్టం.
ఏపీ దిశచట్టం, ప్రత్యే క కోర్టుల ఏర్పాటు చట్టాల్లోని ముఖ్యాంశాలు:
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిర్భయ చట్టం ప్రకారం నిర్భయ కేసులో దోషికి జైలు,మరణ దండ న శిక్షగా విధిస్తుండగా ఆంధ్రప్రదేశ్‌ ‘దిశ’ చట్టం దోషికి కచ్చితంగా మరణదండన విధిస్తోంది. నిర్భయ చట్టం ప్రకారం రెండు నెలల్లో దర్యాప్తు పూర్తయితే మరో రెండునెలల్లో శిక్ష పడాలి. అంటే మొత్తం4నెలల్లో దర్యాప్తు, న్యాయ ప్రక్రియ పూర్తి కావాలి. కాని ఏపీ దిశ చట్టంలో దానిని 4 నెలల నుంచి 21రోజులకు కుదించారు. లైంగికదాడి నేరాల్లో స్పష్టమైన, తిరుగులేని ఆధారాలు లభించి నట్టయితే.. వారం రోజుల్లో పోలీసు దర్యాప్తు, 14 రోజుల్లోపే న్యాయ ప్రక్రియ పూర్తయి 21 రోజుల్లోపే దోషికి శిక్ష పడుతుంది. ఈచట్టం ప్రకారం బాధితులు తమ సమీపంలోని ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా జీరో ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. 18 ఏళ్లలోపు బాల బాలికలపై లైంగిక దాడులు, అత్యాచారాలు నిరోధించేందుకు 2012 నవంబర్‌ 14న కేంద్రం పోక్సో యాక్ట్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫ్‌న్సెస్‌ యాక్ట్‌ -పీఓసీఎస్‌ఓ)ను ప్రయోగించడం వల్ల తీవ్రమైన శిక్షలు తప్పవు. పోక్సో చట్టం అమలులోకి వచ్చిన ఏడేళ్ల తర్వాత బీజేపీ ప్రభు త్వం గతేడాది ఆ చట్టానికి సవరణలు చేసింది. చట్టం పరిధిలో ఉన్న శిక్షలను కొనసాగిస్తూనే చిన్నా రులపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు జీవిత ఖైదుకు బదులు మరణ శిక్షను విధించాలని సవరణ చేసింది. జీవిత ఖైదును 20 ఏళ్లుగాని, మరణించే వరకు గానీ జైలులోనే ఉండాలనే మరో సవరణ చేసింది. అంటే పిల్లలపై ఇక ఎలాంటి లైంగిక నేరాలకు పాల్పడినా జీవితాంతం జైల్లో ఉండటమో, లేక ఉరికంబం ఎక్కడమో శిక్ష అవు తుంది. మహిళలపై తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి కూడా ఐపీసీ సెక్షన్ల ప్రకారం తీవ్రమైన శిక్షలు విధించే అవకాశం ఉంది. లైంగిక దాడి సంఘటనల్లో మాత్రమే కాకుండా పిల్లలపై జరిగే లైంగిక నేరాలన్నింటికీ కూడా శిక్షల్ని పెంచారు. కేంద్రం చేసిన ‘పోక్సో’చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలు, లైంగిక వేధింపులకు పాల్పడిన దోషులకు కనీసం మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధించవచ్చు. ఏపీలో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు. మహిళలు,చిన్నారులపై లైంగిక దాడు లు, వేధింపులకు పాల్పడితే ప్రత్యేక నేరాలుగా పరిగణించి నిర్భయ చట్టం-2012, పోక్సో చట్టం ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ)-1860, క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌(సీపీసీ)-1973లను ఉపయోగి స్తారు.సోషల్‌మీడియా ద్వారా మహిళలను వేధిం చడం,వారిపై అసభ్య పోస్టింగులు పెట్టడం లాం టివి చేస్తే ఐపీసీ ప్రకారం ఇప్పటివరకూ శిక్షలు నిర్దిష్టంగా లేవు. అందుకు ప్రత్యేకంగా ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లో అదనంగా 354(ఇ),354 (ఎఫ్‌) అనే కొత్త సెక్షన్లను చేర్చారు.

  1. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 354(ఇ)
    మెయిల్స్‌, సోషల్‌మీడియా, డిజిటల్‌ మీడియాల్లో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఈ సెక్షన్‌ కింద చర్యలు తీసుకుంటారు. మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్ల జైలు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్ల జైలుశిక్ష
  2. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 354 (ఎఫ్‌)
    పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే పదేళ్ల నుంచి నుంచి 14ఏళ్ల వరకూ శిక్ష. నేరం తీవ్రతను బట్టి 14ఏళ్ల నుంచి జీవిత ఖైదువిధిస్తారు. పోస్కో చట్టం కింద ఇంతవరకూ 3 నుంచి 5ఏళ్ల వరకు జైలుశిక్ష అమలౌతుంది.ఇంతవరకూ దేశంలోని ఏ రాష్ట్రం లోనూ మహిళలు,పిల్లలపై నేరాల సత్వర విచార ణకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టు లేవు. కొద్ది రాష్ట్రాల్లో మాత్రం ఈ నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు ఉన్నాయి. కాని, దేశ చరిత్రలోనే తొలి సారిగా మహిళలు, పిల్లలపై నేరాల విచారణకు అదికూడా వేగంగా విచారణ ముగించడానికి వీలుగా 13జిల్లాల్లో ప్రతిజిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కోర్టుకూ ప్రత్యేకంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ని నియమించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. జిల్లా స్థాయిల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్‌ స్పెషల్‌ పోలీస్‌ టీమ్స్‌ను ఇందుకోసం ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించారు. అత్యాచారం, సామూ హిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, సోషల్‌ మీడియా ద్వారా అసభ్యంగా చూపించడం, వేధిం చడం వంటి నేరాలు,పోక్సో పరిధిలోకి వచ్చే అన్ని నేరాలు ఈ కోర్టు పరిధిలోకి వస్తాయి. నింది తులు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికినా లేదా స్పష్టమైన ఆధారా లున్నా తక్షణమే మరణశిక్ష విధించేలా చట్టం చేశారు. అందుకనుగుణంగా సెక్షన్‌ 376 (రేప్‌)కి సవరణ చేశారు. జడ్జిమెంట్‌ పీరియడ్‌ను కూడా 4 నెలల నుంచి 21 రోజులకు కుదించి, విచారణ 7 రోజుల్లో,ట్రయల్‌ 14రోజుల్లో పూర్తి చేసి 21 రోజుల్లో నిందితులకు శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటారు. క్రిమినల్‌ ప్రొసీజరల్‌ యాక్ట్‌ 173, 309కి మార్పులు చేశారు. చిన్నారుల మీద దాడులు,లైంగిక వేధింపుల విషయంలోనూ కేంద్రం విధించిన ఒక ఏడాది గడువుకు బదులు… దర్యాప్తును ఏడు రోజుల్లో పూర్తి చేసి, న్యాయ ప్రక్రియ 14పనిదినాల్లో పూర్తిచేసేలా చట్టానికి సవ రణ చేశారు. పోస్కో యాక్టు ప్రకారం మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. దానిని కూడా మార్చి జీవితఖైదు విధించేలా చట్టం చేయడం జరిగింది. ఇక ఈ నేరాలపై దోషులు పైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకునే గడువును కూడా కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్న ఆరునెలల కాలాన్ని, ఏపీ పరిధిలో 3 నెలలకు తగ్గించారు. మహిళలు, పిల్లలపై నేరాలను నమోదుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్‌ రిజిస్ట్రీని పెట్టింది. అయితే, ఆ రిజిస్ట్రీ ద్వారా డిజిటల్‌ పద్దతిలో డేటా బేస్‌ ఉన్నప్పటికీ జరిగిన నేరాలు, దాంతో సంబంధం ఉన్న వ్యక్తులపేర్లు వంటి వివరాలను బహిర్గతం చేసే అవకాశం లేదు. అంటే,ఏనేరగాడు,ఏ నేరం చేశాడన్న వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం లేదు. కాని, అటువంటి డిజిటిల్‌ రిజిస్ట్రీని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా ఈ నేరా లకు సంబంధించిన వివరాలు అన్నింటినీ ప్రజలం దరికీ అందుబాటులోకి ఉంచడంద్వారా అఫెండర్ల వివరాలు బహిర్గతం చేయబోతున్నారు.చట్టం ముందే కాకుండా సమాజం ముందు వారిని నిలబెడతారు.
    దిశ మొబైల్‌ యాప్‌
    మహిళా భద్రత కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం తేవడంతోపాటు దాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్టమైన వ్యవస్థను రూపొందించింది. మహిళలపై వేధింపులకు పాల్పడితే దోషులను సత్వరం శిక్షించేందుకు క్రిమినల్‌ జస్టిస్‌ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చింది. దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసింది.విశాఖపట్నం,విజయవాడ, తిరు పతిల్లో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా విపత్కర పరిస్థితులు ఎదురైతే తక్షణ పోలీసు సహాయం పొందేందుకు‘దిశ మొబైల్‌ అప్లికేషన్‌’ను ప్లే స్టోర్‌లో అందుబాటలోకి తెచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశ యాప్‌ను ఫిబ్రవరి8,2021న అధికారికంగా ప్రారంభించించారు.
    ఎందుకు?
    విద్యార్థినులు, యువతులు, మహిళలు ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే.. ఎలా బయట పడాలి? ఎవరికి ఫోన్‌ చేయాలి? ఫోన్‌ చేసినప్పుడు అవతలి వారు లిఫ్ట్‌ చేయకపోతే పరిస్థితి ఏమిటి? ఆపదలో ఉన్న మహిళ కేకలు వేసినా వినిపించని నిర్జన ప్రదేశమైతే ఏం చేయాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా ఏపీ ప్రభుత్వం‘దిశ’యాప్‌ను ప్రారంభించింది
    డౌన్‌ లోడ్‌.. ఉపయోగించడం ఇలా..
    ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ మొబైల్‌ ఫోన్లలో గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌లో మొబైల్‌ నంబర్‌తో రిజిస్ట్రే షన్‌ చేసుకోవాలి.యాప్‌లోఎస్‌వోఎస్‌ బటన్‌ ఉం టుంది. ఆపదలో ఉన్నప్పుడు యాప్‌ను ఓపెన్‌ చేసి,అందులో ఉన్న ఎస్‌వోఎస్‌ (పుష్‌ బటన్‌ మెస్సే జ్‌ ఆప్షన్‌) బటన్‌ నొక్కాలి. ఆవెంటనే వారి ఫోన్‌ నంబర్‌,చిరునామా,వారు ఆ సమయంలో ఉన్న ప్రదేశం (లొకేషన్‌)తో సహా మొత్తం సమాచారం దిశ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు చేరుతుంది. ఆ వెంటనే కంట్రోల్‌ రూమ్‌లోని సిబ్బంది అప్రమత్తమ వుతారు. తమకు సందేశం పంపిన వారు ఉన్న ప్రదేశానికి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు క్షణాల్లోనే సమాచారం పంపిస్తారు. ఈఆప్షన్‌ ద్వార పోలీసు లు యాప్‌ వినియోగదారులకు ఏకకాలంలో సూచనలు,సలహాలుఅందించి, వారిని జరగ బోయే ప్రమాదాల గురించి అప్రమత్తం చేస్తారు. పోలీసు లతో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులు,స్నేహితు లకు కూడా సమాచారం ఇచ్చే వెసులుబాటు ఉం టుంది.విపత్కర పరిస్థితుల్లో యాప్‌ను ఓపెన్‌ చేసేందుకు తగిన సమయం లేకపోతే, ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపితే చాలు. ఆ యాప్‌ వెంటనే దిశకమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు సందేశాన్ని పంపుతుంది. ప్రయాణ సమయాల్లో రక్షణ, మార్గ నిర్దేశం కోసం ట్రాక్‌ మై ట్రావెల్‌ ఆప్షన్‌ ఏర్పటు
    తాము చేరాల్సిన గమ్యస్థానాన్ని అందులో నమోదు చేస్తే అనుక్షణం ట్రాకింగ్‌ ప్రయాణిస్తున్న వాహనం దారి తప్పితే వెంటనే ఆ సమాచారాన్ని దిశ కమాం డ్‌ కంట్రోల్‌ రూమ్‌కు, వారి బంధువులకు చేరవేసే రక్షణ కల్పించే వెసులుబాటు
    దిశ యాప్‌లో డయల్‌ 100. 112 నంబర్లతో పాటు పోలీసు అధికారుల నంబర్లు, సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లు, ఆసుపత్రులు, మెటర్నిటీ సెంటర్లు, ట్రామా కేర్‌ సెంటర్లు, బ్లడ్‌ బ్యాంకులు, మందుల దుకాణాల వివరాలు కూడా తెలుసుకునేందుకు ప్రత్యేక ఆప్షన్లు ఈయాప్‌లో ఉంటాయి. ఏపీ ప్రభుత్వం దిశ మొబైల్‌ యాప్‌ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు,ఎక్కువ మం దికి ఈయాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించిన వారికి రూ.10,116 ప్రోత్సాహకం కూడా అందిస్తోంది.
    ఇతర దేశాల్లో శిక్షలు ఇలా..
    అత్యాచార నిందితుల్ని నేరుగా ఉరికం బం ఎక్కిస్తారు. కొన్ని కేసుల్లో దోషుల పురు షాంగాన్ని తొలగించి నపుంసకులుగా కూడా మారు స్తారు. ఇదంతా నేరం జరిగిన రోజుల వ్యవధిలో జరిగిపోతుంది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేక పోయినా ఉరిశిక్ష విధించడం విమర్శలకు దారి తీసిన సందర్భాలూ ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఉరి తీశాక వారు నిర్ధోషులని తేలడం గమనార్హం.
    ఇరాన్‌: అత్యాచార దోషుల్ని కాల్చి చంపుతారు. లేదంటే ఉరితీస్తారు. కొన్ని సందర్భాల్లో బాధితు రాలు క్షమించడానికి అంగీకరిస్తే, ఉరి శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.
    ఆష్గానిస్తాన్‌: రేపిస్టులకు శిక్ష పడిన నాలుగు రోజుల్లోనే ఉరి తియ్యడమో, లేదంటే కాల్చి చంపడమో చేస్తారు.
    యూఏఈ: రేప్‌ చేసిన ఏడు రోజుల్లో ఉరికంబం ఎక్కిస్తారు.
    సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో అత్యాచార నేరం రుజువైతే బహిరంగంగా తలనరికి చంపు తారు.
    నెదర్లాండ్స్‌: మహిళలపై జరిగే లైంగిక వేధింపు లన్నింటినీ అత్యాచారం కిందే పరిగణిస్తారు. అమ్మా యి అనుమతి లేకుండా ముద్దు పెట్టుకున్నా అక్కడ నేరుగా జైలుకి పంపిస్తారు. నేర తీవ్రత ఆధారంగా 4 నుంచి 5 సంవత్సరాలు శిక్ష ఉంటుంది.
    ఫ్రాన్స్‌: అత్యాచార చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. అత్యాచార కేసుల్లో 15ఏళ్లు కారాగార శిక్ష విధిస్తారు. జైల్లో ఉన్నన్ని రోజులు వారిని చిత్రహింసలకు గురి చేస్తారు. నేర తీవ్రతని బట్టి దానిని 30 ఏళ్లకు పెంచుతారు.
    గణాంకాల ప్రకారం..
    దేశం దశ దిశలా.. నలుమూలలా.. ప్రతిరోజూ మహిళల అక్రందనలు వినిపిస్తునే ఉన్నాయి. జాతీయ నేర గణాంక నమోదు సంస్థ తాజాగా విడుదల చేసిన (2020,సెప్టెంబర్‌ 29) గణాం కాల ప్రకారం సగటున దేశవ్యాప్తంగా రోజుకు 87 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. 2012 నిర్భయ ఘటనకు ముందు 25 వేల కంటే తక్కువ, 2013లో 33,707,2016లో 38,947 కేసులు నమోదు కాగా 6,289 కేసుల్లో శిక్షలు పడ్డాయి. 2017లో32,559,2018లో33,356, 2019లో 32,033 నమోదయ్యాయి. కానీ శిక్షలుపడ్డ దాఖ లాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. ఈ కేసుల్ని విచారించడానికి కోర్టుల్లో తగిన సిబ్బంది లేక పోవడంతో పెండిరగ్‌ కేసుల సంఖ్య తడిసి మోపె డవుతోంది. ఇకఅత్యాచార కేసుల్లో దోషులుగా తేలేవారి సంఖ్య కూడా అత్యంతస్వల్పంగా ఉంది. చాలా ఏళ్లపాటు 25నుంచి 30శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. కానీ 2014లో మాత్రం శిక్షల రేటు 27 నుంచి 38 శాతానికి పెరిగింది. మహిళలపై అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో సత్వర న్యాయానికి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల్ని 2019నాటికి దేశంలో 664 ఉంటే, అవి కూడా సరిగా పనిచేస్తున్న దాఖలాలు లేవు. మన దేశంలో ఉరి శిక్ష పడాలంటే కనీసం5ఏళ్లు పడు తుంది. ఎందుకంటే ప్రత్యేక కోర్టుల్లో శిక్ష పడితే పై కోర్టుకి వెళ్లే అవకాశం ఉంది. అక్కడి నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టు.. అక్కడ శిక్ష ఖరారు చేసినీ అమలౌతుందన్న గ్యారెంటీ లేదు. మరణ శిక్ష పడిన దోషులకు రాష్ట్రపతిని క్షమాభిక్ష అడిగే హక్కు కూడా ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యే సరికి కొన్ని కేసుల్లో ఉరిశిక్ష అమలుకే 20 ఏళ్లు దోషులు జైల్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. అందుకే సత్వర న్యాయం మన దేశంలో సాధ్య పడటం లేదు. 1991 నుంచి 2017 డిసెంబర్‌ చివరి నాటికి 371మందికి ఉరిశిక్ష పడిరది. కానీ గత 15 ఏళ్లలో ఎనిమిది మందికి (నిర్భయ దోషులతో సహా) మాత్రమే ఉరిశిక్ష అమలు జరిగిందంటే న్యాయం జరగడంలో ఎంత అన్యాయం జరుగు తుందో అర్థమవుతోంది.
    ఈ పరిస్థితి మరాలంటే..
    గర్భస్థ పిండాలుగా ఉన్నప్పటి నుంచి కడ శ్వాస వరకు మహిళలపై గౌరవ భావం కలిగేలా మన సమాజానికి అవగాహన పెంచాలి. కటుంబం, బడి,పనిప్రదేశం, బహిరంగ స్థలం.. ఇలా అన్ని చోట్ల, ప్రతిస్థాయిలో వివక్ష పోవాలి. మనిషి తప్ప సృష్టిలోమరే జీవి పాల్పడని అతి హీనమైన నేరం అత్యాచారం. అది సామూహికంగా జరిగి, ఘాతు కమైన హత్యతో ముడిపడటం భూమ్మీద అతిపెద్ద నేరం. దీనికి సమాజం నుంచే పరిష్కారం లభిం చాలి. దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి అన్ని విధా లుగా,అన్ని స్థాయిల్లో సమాజం సమాయత్తం కావాలి. ఇది సమష్టి బాధ్యత.
    -డా.యం.సురేష్‌ బాబు
1 2