పగడ్బందీగా పీసా చట్టం

ఐదో షెడ్యూలు ప్రాంత పరిరక్షణకు ప్రాముఖ్యమైన పీసా చట్టం1996(పంచాయతీస్‌ ఎక్స్‌టెన్షన్‌ టూ షెడ్యూల్‌ ఏరియా) వచ్చి ఈ ఏడాది డిసెంబరు నాటికి 25 వసంతాలు పూర్తికానున్నాయి. చట్టం రావడానికి ఎంతో మంది మేథావులు,ప్రజల ఉద్యమం ఫలితంగా పీసా చట్టాన్ని సాధించారు. ముఖ్యంగా ఐఏఎస్‌ ఉన్నతాధికారులైన బి.డి.శర్మ,ఎస్‌.ఆర్‌.శంకరన్‌,దిలీఫ్‌ సింగ్‌ భూరియా,ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు వంటి గిరిజనతెగల స్పూర్తిదాతల సహకారం కూడా మరవలేనిది.73వ రాజ్యాంగ సవరణలో1991లో అమలులోకి వచ్చిన పంచాయితీరాజ్‌ చట్టాన్ని దేశమంతటా ఒకేరీతిన అమలు చేయడంతో గిరిజనుల్లో తీవ్ర నిరసన మొదలైంది. వారు ఉద్యమబాట పట్టారు. దీంతో కేంద్రప్రభుత్వం దిలీఫ్‌సింగ్‌ భూరియా నేతృత్వంలోని ఓకమిటీని నియమించింది. కమిటి సీపార్సులతో 1996 డిసెంబరులో పీసా చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చారు. దీన్నీ రెండు భాగాలు చేశారు.1) పంచాయతీస్‌ ఎక్స్‌టెన్షన్‌ టూ షెడ్యూల్‌ ఏరియా(పీసా)2) మున్సిపల్‌ పీసా విస్తరణ షెడ్యూల్‌ ఏరియా(మీసా) చట్టాలుగా రూపొందించారు.

పంచాయితీరాజ్‌ చట్టం మాదిరే మున్సిపల్‌ చట్టాన్ని గిరిజన ప్రాంతాలకు విస్తరించాలనే ప్రతిపాదన దశాబ్దాల కాలంగా కాగితాలకే పరిమితమైంది. అందువల్ల మీసా చట్టం కాలేదు. దీంతో గిరిజన ప్రాంతాల్లో అధిక జనాభా ఉన్న పంచాయితీలను పురపాలక సంఘాలుగా మార్చడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి74ఏళ్లు పూర్తియినా గ్రామపంచాయితీ సర్పంచ్‌లకు కల్పించిన 29అధికారాలు నేటికీ అమలు కాలేదు. పీసా చట్టం దేశవ్యాప్తంగా అన్నీరాష్ట్రాల్లోను అమల్లో ఉంది. కానీ వివిధ రాష్ట్రప్రభుత్వాలు తమకు అనుగుణంగా ఎవరికి తోచిన విధంగా వారు చట్టా న్ని తయారు చేసుకున్నారు. కానీ నేటికీ ప్రజలకు సరిjైున న్యాయం జరగడం లేదు.ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామపంచాయితీని కాకుండా గ్రామ సభను కేంద్రబిందువు చేశారు. గ్రామసభకు విశేషాధికారాలను కల్పించారు. ఒక ప్రాంతంలో నివసించే ఓటు హక్కు కలిగి ఉన్న నివాసితు లంతా గ్రామసభ పరిధిలోకి వస్తారు. వీరు తాము నివసించే ప్రాంతాల చుట్టూ గల సహజ వనరులు,అటవీ సంపదపై యాజమాన్యహక్కులు కలిగి ఉంటారు.ఆ వనరులను స్వీయ అవసరాల కోసం వినియోగించు కుంటూ,గిరిజన సంప్రదాయ పరిరక్షణకు దోహదపడతారు.చట్టం సక్రమంగా అమలు జరిగితే న్యాయవ్యవస్థ,రక్షణవ్యవస్థ,వంటి వ్యవస్థలన్నీ కూడా గ్రామసభకు జవాబుదారీగా నిలవాలి. కానీ గ్రామస్థులే జవాబు దారీగా ఉంటున్నారు తప్పా,ప్రభుత్వ యంత్రాంగం మాత్రం చట్టానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా షెడ్యూలు ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ కోసం ముందు గ్రామసభలను సంప్రదించాలి. ఆ ప్రాజెక్టువల్ల నష్టం అనర్ధం వాటిల్లక ముందు నష్ట పరిహారం,పునరావాసం కల్పించాలని చట్టం చెబుతోంది. ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టుల నిర్మాణాల అనుమతుల కోసం చట్టాన్ని వాడుకుంటోందే తప్పా అధికారాలు మాత్రం గిరిజనులకు ఇవ్వట్లలేదు. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో అమలువుతున్న పీసాచట్టం ఇదే పిరిస్థితులు ఉన్నాయి. ఏ రాష్ట్ర ప్రజలు చట్టాన్ని అర్ధం చేసుకొని గ్రామసభకు ప్రాధాన్యత కల్పించారో..ఆ ప్రాంతానికి న్యాయం జరిగింది. ఉదాహరణకు మహారాష్ట్రంలోని మెంథలేక్‌ గ్రామం, అలాగే ఒరిస్సా రాష్ట్రంలోని నియామగిరి వేదాంత బాక్సైట్‌ తవ్వకాలపై సమత జడ్జిమెంటు పీసా చట్టం గ్రామసభ విశేష అధికారాలను వినియోగించి విజయం సాధించారు. గ్రామసభ,పీసా చట్టం క్రింద తీర్మాణం లేనిదే తవ్వకాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఐదో షెడ్యూలు ప్రాంత పరిధిలోకి వచ్చే పర్వత శ్రేణుల్లో బాక్సైట్‌ ఖనిజం తవ్వకాల విషయంలో అక్కడి డోంగ్రియా ఆదివాసుల ఒడిశా ప్రభుత్వంపై చేసిన న్యాయపోరాటం ఫలించడానికి పీసా గ్రామసభ దిక్సూచిగా నిలిచింది. పీసాచట్టం ప్రకారం అక్కడి గ్రామసభల అనుమతులు తీసుకున్నాకే ఖనిజ తవ్వకాలు చేపట్టాలని సర్వో న్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో గ్రామసభలు కీలకమయ్యాయి. ఆదివాసీ ప్రాంతాల్లో భూములు,గనులు,అడవులు ఇతర సహజ వనరుల ఇష్టారాజ్యదోపిడిని అడ్డుకు నేందుకు గొప్ప ఆయుధంగా పీసాచట్టం దోహదపడిరది. ఇటీవల కాలంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల పరిపాలన విధానంపీసా మరియు కమ్యూనికేషన్‌ టెక్నాలజీ ఒక వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసింది. దాంట్లో పీసా చట్టం వర్కింగ్‌ గ్రూప్‌ కమిటీకి చైర్‌పర్సన్‌గా ఆప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. స్వర్గీయ ఐఏఎస్‌ అధికారి బి.డి.శర్మ,ఎస్‌.ఆర్‌.శంకరన్‌ల స్పూర్తితో పీసా చట్టాన్ని సమర్ధవంతంగా సరిjైున రీతిలో బలోపేతం చేయడానికి కృషి చేస్తాను. ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామసభకు ఉన్న అధికారాలను గిరిజనులకు అవగాహన పరచడానికి ఇదోక మంచి అవకాశం. సమత తీర్పులో కూడా పీసా చట్టాన్ని ప్రస్తావించింది. గ్రామసభ కాంబినేట్‌ అధారిటీ అని వివరించింది.అటవీ వనరులపై హక్కులు కల్పించి,గ్రామసభల స్థాయిలో పరిపాలనపరమైన సామర్ధాన్ని పెంచినప్పుడే గిరిజనుల్లో నిజమైన సాధికారత సాధ్యమవుతోంది. విద్య, వైద్యం,రహదారులు,విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామసభలను మమేకం చేయడానికి పది రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవశ్యకత ఉంది.-రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్ థింసా