అక్టోబర్ 28న రాయపూర్ లో తొలిసారిగా సమావేశమైన PESA పై వర్కింగ్ గ్రూప్ చైర్ పర్సన్ రెబ్బాప్రగడ రవి షెడ్యూల్డ్ ఏరియాల అడ్మినిస్ట్రేషన్ & ఇంటర్నెట్ టెక్నాలజీ వినియోగ కమిటీ సభ్యులు - ఛత్తీస్‌గఢ్ స్టేట్ ప్లానింగ్ కమిషన్. - నయా రాయపూర్ 

వ్యవసాయ రంగాన్ని కమ్మేసిన సంక్షోభం

రైతాంగ ఉద్యమాలకు అశోక్‌ ధావలే గత ముప్పై సంవత్సరాలుగా దిశా నిర్దేశం చేస్తున్నారు. ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’ (ఎస్‌.కె.ఎం)లో ప్రధాన భాగస్వామిగా ఉన్న ‘ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ’ (ఎ.ఐ.కె.ఎస్‌) అఖిల భారత అధ్యక్షుడిగా వ్యవహరిస్తు న్నారు. వ్యవసాయ రంగంపై మూడు దశాబ్దాల నయా ఉదారవాద విధానాల ప్రభావం గురించి…బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాల రద్దుకు రైతాంగం చేపట్టిన చారిత్రాత్మక పోరాటం గురించి….ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు….
మన దేశ జనాభాలో మూడిరట రెండొంతుల మందికి వ్యవసాయమే జీవనాధారంగా ఉంది. సరళీకరణ ఆర్థిక విధానాల ప్రభావం వల్ల నేటికీ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న తీరుపై మీ అభిప్రాయం ఏమిటి ? 75 ఏళ్ళ స్వాతంత్య్రం తరువాత కూడా దేశంలో మూడిరట రెండొంతుల జనాభాకు ఆధారంగా ఉన్న వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న మాట నిజం. సరళీకరణ ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులను వేగవంతం చెయ్యడంలో విఫలం చెందాయి. వ్యవసాయంలో అతి తక్కువ వృద్ధిరేటు ఉన్న కారణంగా సగానికి పైగా వ్యవసాయ కుటుం బాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి బాగా తగ్గింది. వ్యవసాయ వృద్ధిరేటు తక్కువగా ఉన్న కారణంగా పారిశ్రామిక వృద్ధి రేటుపై కూడా ప్రతికూల ప్రభావం పడిరది. కేరళ, పశ్చిమ బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాలు మినహా, దేశంలో వ్యవసాయ సంస్కరణలు, గ్రామీణ వ్యవసాయ నిర్మాణంలో ప్రభుత్వ పెట్టుబడుల కొరత వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిరది. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ గ్రామీణ అసమానతలు ఉన్న దేశాల్లో మన దేశం ఒకటిగా ఉంది. గ్రామీణ వ్యవస్థలో అప్పటికే ఉన్న అసమానతలను..1991 తరు వాత వ్యవసాయ రంగాన్ని కమ్మేసిన సంక్షో భం..మరింత తీవ్రతరం చేసింది. వ్యవ సాయ వృద్ధి రేటు మందగించింది. ప్రభుత్వ పెట్టు బడులు పూర్తిగా తగ్గిపోయాయి. పెట్టుబడి సబ్సిడీలలో కోతల ఫలితంగా పెట్టుబడి ఖర్చు లు భారీగా పెరిగాయి.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పం దాల ఫలితంగా ఆర్థిక దోపిడికి అవకాశం ఉన్న దిగుమతుల ప్రవాహం పెరగడం వల్ల సరుకుల ధరలు కుప్పకూలాయి. దాంతో అన్ని పంటలపై లాభదాయకంగా ఉండే ధరలు తగ్గిపోయాయి. చిన్న, సన్నకారు రైతులకు అందాల్సిన ఆర్థిక వనరులను ధనిక వర్గాలకు, బడా కార్పొరేట్‌ సంస్థలకు మళ్ళించారు. ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి, గత మూడు దశాబ్దాలుగా నిరంతరాయంగా అమలవుతున్న నయా ఉదారవాద విధానాలే ప్రధాన కారణం. 1992లో హర్యానా లోని హిస్సార్‌ లో జరిగిన ఎఐకెఎస్‌ జాతీయ మహాసభ, ఈ నయా ఉదార వాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా హెచ్చరిం చింది. ఆర్థిక వృద్ధి జరిగినప్పటికీ, వ్యవసాయ రంగం గణనీయమైన వృద్ధిని పొందలేదు. చిన్న రైతులు విముక్తి కాలేదు. ఎందువల్ల ?గ్రామీణ అభివృద్ధి ఏమైనా జరిగిందా ?వారు వ్యవసాయ రంగం అవసరా లను తప్పుగా అర్ధం చేసుకోవ డంతో ఈ రంగంలో సంస్కరణలు విఫలమ య్యాయి. ఈరంగా నికి వ్యవసాయ సంస్కరణ లు, భారీ ప్రభుత్వ పెట్టుబడులు అవసరం. వ్యవసాయ రంగంలో దేశీయంగా, బయట కూడా మార్కెట్లు తెరిస్తే, వ్యవసాయ రంగం దానంతటదే పెరగడం ప్రారంభమవుతుందని మన విధాన నిర్ణేతలు ఊహించుకున్నారు. స్వేచ్ఛా వాణిజ్యం, ప్రభుత్వం చేయాల్సిన వ్యయంలో కోత విధింపు…భారతదేశ ఆహార భద్రతకు ప్రమాదమని స్థూల ఆర్థిక శాస్త్రవేత్తలు పదే పదే చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ?ఒక వ్యవస్థగా స్వేచ్ఛా వాణిజ్యం పట్ల ప్రపంచ వ్యాప్తంగా అపనమ్మకం ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ప్రపంచ వాణిజ్య సంస్థను (డబ్ల్యూటీఓ) ఒక విశ్వసనీ యమైన సంస్థగా భావించడం లేదు. అందుకే ఈ దేశాలు ప్రాంతీయ, ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నాయి. డబ్ల్యూటీఓ ప్రయోజనకరంగా ఉన్నట్లైతే, మళ్ళీ కొత్త ఒప్పందాలతో అవసరం ఏమిటి? ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, ఆసియా దేశాల్లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు వ్యవసాయ రంగానికి ప్రమాదం తెచ్చిపెట్టాయి. చౌకగా లభించే వస్తువులను దిగుమతి చేసుకోవడంతో ధరలు బాగా పడిపోయి, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం లోకి నెట్టబడిరది. ఆహారధాన్యాల ఉత్పత్తిలో బాగా వెనుకబడిన దేశాల్లోని ఆహార భద్రతపై స్వేచ్ఛా వాణిజ్యం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. వారు వాణిజ్య పంటలను ఎగుమతి చేసే ప్రయత్నం చేసి, ఆహార ధాన్యాలను కొనుగోలు చేసే విధంగా విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతారు. కానీ వాణిజ్య పంటల ధరలు బాగా పడిపోతున్నాయి కాబట్టి, ఎగుమతుల ద్వారా పొందే ఆదాయాలు కూడా పడిపోతున్నాయి. అందువలన ఈ దేశాలు ఇంతకుముందు చేసుకున్న పరిమాణంలో దిగుమతి చేసుకోడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఇది వారి ఆహార భద్రతపై ప్రభావం చూపుతుంది. మంచి లాభాలతో ధాన్యాలను ఉత్పత్తి చేసే చిన్న, సన్నకారు రైతుల సామర్థ్యంపై ప్రభుత్వ వ్యయంలో కోతలు ప్రభావం చూపుతాయి. కార్పొరేట్ల లాభాలు, సబ్సిడీలలో కోతలు విధిస్తున్న కారణంగా పెట్టుబడి ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. రైతులు బహుళజాతి కార్పొరేషన్‌లపై ఆధారపడేవారిగా మారిపోతున్నారు. ఇవన్నీ చిన్న, సన్నకారు రైతులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. 1980లో భారత వ్యవసాయ వృద్ధి రేటు, నయా ఉదారవాద విధానాలను అమలు చేసిన 30 ఏళ్ళ కాలం లోని వ్యవసాయ వృద్ధి రేటు కంటే ఎక్కువ. సంస్కరణలు వ్యవసాయ రంగంలో వృద్ధిని సాధించడంలో విఫలమ య్యాయని చెప్పడానికి ఈ ఒక్క సూచిక చాలు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2015-2022 మధ్య కాలంలో వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని వాగ్దానం చేసింది. ఇది ప్రస్తుత బిజెపి పాలకుల అతి పెద్ద వైఫల్యం. వాస్తవానికి ఈ కాలంలో రైతుల ఆదాయాలు బాగా పడిపో యాయి. పెద్దనోట్ల రద్దు, అనాలోచితమైన జీఎస్టీ పన్ను విధానం, అనాగరికంగా విధించిన లాక్‌డౌన్‌ లాంటి నిర్ణయాలు రైతాంగాన్ని దెబ్బతీశాయి. ఈ సంస్కరణలు తమ స్థితిగ తులను దుర్భరం చేశాయని వారు ఆగ్రహంగా ఉన్నారు. గత ముప్పై సంవత్సరాలుగా మీరు నాయకత్వం వహిస్తున్న రైతాంగ ఉద్యమాల అనుభవాలను వివరిస్తారా ? గత ముప్పై ఏళ్ళుగా అమలవుతున్న నయా ఉదారవాద విధానాల ఫలితంగా ఏర్పడిన తీవ్ర వ్యవసాయ సంక్షోభం,4లక్షల మంది రైతుల ఆత్మహ త్యలకు దారి తీసింది. ప్రాథమిక సమస్యగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు… పెట్టుబడికి అయిన ఖర్చుకు అదనంగా యాభై శాతం కలిపి మద్దతు ధరగా హామీ ఇవ్వాలని, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసం హరించుకోవాలని, పెట్రోల్‌-డీజిల్‌-గ్యాస్‌ ధరలను సగానికి తగ్గించాలని, రైతులు వ్యవసాయ కార్మికుల రుణాలను పూర్తిగా రద్దు చేయాలని, ఇన్సూరెన్స్‌ కంపెనీలకు కాకుండా బాధల్లో ఉన్న రైతాంగానికి పంట బీమా పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని, సన్న-చిన్నకారు రైతులకు తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం కల్పించాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద వ్యవసాయ కార్మికులకు రెట్టింపు పని దినాలు, రెట్టింపు వేతనాలను అమలు చేయాలని, గిరిజన రైతులకు అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, రైతుల నుండి బలవంతంగా భూసేకరణను నిలిపి వేయాలని, భూ సంస్కర ణలను చేపట్టాలని కోరుతూ పోరాటాలు జరిగా యి. అదే విధంగా కార్మికులకు వ్యతిరేకంగా చేసిన నాలుగు లేబర్‌ కోడ్‌ లను రద్దు చేయా లని, ప్రైవేటీకరణను నిలుపుదల చేసి, బిజెపి పాలకులు దేశాన్ని తెగనమ్మే చర్యలకు అంతం పలకాలని పోరాటాలు జరిగాయి. గడచిన ఏడు సంవత్సరాల కాలంలో కార్పొరేట్‌ కంపెనీల అనుకూల విధానాలను అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమా లను తీవ్రతరం చేస్తున్నాం. ఈ ఉద్యమాలకు పరాకాష్టగానే ఢల్లీి సరిహద్దుల్లో జరుగుతున్న చారిత్రాత్మక రైతు ఉద్యమాన్ని చూడాలి. సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకత్వంలో 2020 నవంబర్‌ 26న దేశ వ్యాప్తంగా ప్రారంభమైన రైతు ఉద్యమం పది నెలల కాలాన్ని పూర్తి చేసుకోబోతోంది. ఈ ఉద్యమం మతం, కులం, ప్రాంతం, రాష్ట్రం, భాషలను అధిగమించి కొనసాగుతోంది. అణచివేత, అపఖ్యాతిపాలు చేసే చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొం టోంది. విజయం సాధించే వరకు ఈ పోరా టాన్ని తీవ్ర తరం చేయాలని రైతులు పట్టు దలతో వున్నారు. కాంట్రాక్టు వ్యవసాయం వలన కలిగే లాభాలను, అనర్థాలను వివరిస్తారా ? కొంత కాలంగా మన దేశంలో కాంట్రాక్టు వ్యవసాయం అమలులో ఉంది. కార్పొరేట్‌ కంపెనీలు ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన ధరను చెల్లించి రైతులను మోసం చేయకుండా హామీ ఇవ్వాలి. అయితే మన చట్టాలు అందుకు భిన్నంగా వున్నాయి. కాంట్రాక్టు వ్యవసాయంలో కార్పొరేట్‌ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా వున్నాయి. రైతులు తమ భూములను ఈ కంపెనీలకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందే మోనని భయపడుతున్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎఐకెఎస్‌ అనేక నిరస నోద్యమాలను నిర్వహిస్తున్నది. ఆ చట్టాల గురించి వివరిస్తారా?వ్యవసాయ చట్టాలు దేశంలోని రైతుల బతుకు తెరువుపై తీవ్ర దాడిగా చెప్పవచ్చు. అగ్రికల్చరల్‌ ప్రొడ్యూస్‌ మార్కెట్‌ కమిటీ (ఎపిఎంసి), ఎసెన్షియల్‌ కమోడిటీస్‌ యాక్ట్‌ (ఇసిఎ)లు 1960 నుండి రైతులకు, వినియోగదారులకు రక్షణగా ఉన్నాయి. అవి రైతులు మెరుగైన ప్రయోజనాలు, స్థిరమైన ధరలు (ఎపిఎంసి నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ) పొందడానికి సహాయపడ్డాయి. ఎపిఎంసి వ్యవస్థను ఉపసం హరించి…వాటిని ఆదానీ, అంబానీ గ్రూప్‌ కంపెనీలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్కెట్‌ వ్యవస్థ పతనంతో రైతులు పూర్తిగా కార్పొరేట్‌ కంపెనీల అదుపు లోకి నెట్టివేయబడతారు. ఇది పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లో రైతుల మరణాలకు దారి తీస్తుంది. అదేవిధంగా ఎసెన్షియల్‌ కమోడిటీస్‌ యాక్ట్‌, రిటైల్‌ మరియు రవాణా రంగాలను కార్పొరేట్‌ చేతుల్లోకి చేర్చుతుంది. అంటే దీనర్థం, వినియోగదారులు ఆహార పదార్థాలను మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
కనీస మద్దతు ధరను కల్పించే వ్యవస్థను, ప్రభుత్వ ఆహార ధాన్యాల సేకరణ వ్యవస్థను ఒక క్రమపద్ధతిలో ధ్వంసం చేసే లక్ష్యంతోనే…బిజెపి ప్రభుత్వం ఈ మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. భారతదేశంలో 81 కోట్ల మంది ఉపయోగిం చుకొనే ప్రజా పంపిణీ వ్యవస్థ కూడా ధ్వంసం చేయబడుతుంది. కాబట్టి ఈ వ్యవసాయ చట్టాలు కేవలం రైతులకు మాత్రమే కాక, ప్రజలందరికీ వ్యతిరేకమైనవి. ఈ వ్యవ సాయ చట్టాలు రాజ్యాంగబద్దం కావు. ఇవి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండాల్సిన అంశాలు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకోకుండా, అగౌరవ పరస్తూ, సమాఖ్య నిబంధనలను తుంగలో తొక్కి, రాష్ట్రాల హక్కులను కాలరాసి పార్లమెంట్‌లో చట్టాలను తెచ్చింది. – భాస్కరరావు

ప్రజా సమస్యలు వదిలి పథకాలతో కాలక్షేపం

ప్రజలు సమస్యలతో సతమతం అవుతుంటే పరిష్కారం చేయకుండా జగన్‌ ప్రభుత్వం కొన్ని పథకాలపైనే దృష్టి పెడుతూ కాలయాపన చేస్తోంది. రైతులు, కార్మికులు, చేతివృత్తి దారులు, గిరిజనులు వారు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారం అయితే, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం పాకులాడవలసిన దుస్థితి ఉత్పన్నం కాదు. కాని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమస్యలు ప్రాధాన్యతా సమస్యలుగా అనిపించకపోవడం శోచనీయం. ఈ సమస్యలు పరిష్కారం అయితే రాష్ట్రాభివృద్ధి నిలకడగా సాగుతుంది. సంక్షేమ పథకాల పంగల కర్రల మీద ఎన్నాళ్లు నడుపుతారు? రాష్ట్రంలో రైతులు, చేతివృత్తిదారులు, కార్మికులు, ప్రాజెక్టు నిర్వాసితులు, గిరిజనులు ముఖ్యమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వీటిపై తక్షణమే దృష్టి సారించి పరిష్కరిం చాల్సిన అవసరం ఉంది. కాని జగన్‌ ప్రభుత్వం ఈ సమస్యల్ని విస్మరిస్తూ రాజధాని సమస్యను ముందుకుతెచ్చింది. రాష్ట్ర పురోగమనం పట్టాలు తప్పే స్థితి తెచ్చింది. ఇంకో వైపు కేంద్రం, రాష్ట్రానికి చేసే అన్యాయం విషయంలో మెతకవైఖరి ప్రదర్శిస్తోంది.‘స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేసి రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తానని, మంచి రోజులు తెస్తానని, 2022 కి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాన’ని నరేంద్రమోడీ ఎన్నికల్లో చెప్పారు. కానీ ఆయన స్వామినాథన్‌ సిఫార్సును ఎగ్గొట్టారు. స్వామినాథన్‌ సిఫార్సు ప్రకారం క్వింటాల్‌ ధాన్యానికి రూ.2418 ధర ప్రకటించాలి. కానీ సాధారణ రకానికి రూ.1815, నాణ్యమైన రకానికి రూ.1835 కనీస మద్దతు ధరను మోడీ ప్రకటించారు. ఇలా అన్ని పంటల ధరల నిర్ణయంలోనూ రైతులకు ప్రధాని తీవ్ర అన్యాయం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. 1710 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచామని, 41లక్షల టన్నులు కొన్నామని ప్రకటిస్తున్నారు. కాని ఆచరణ తీరు వేరుగా ఉంది. ఎక్కడా ప్రభుత్వం ధాన్యం కొని రైతుకు నేరుగా డబ్బు చెల్లించడం లేదు. ప్రయివేటు వ్యాపారులే బ్రోకర్ల ద్వారా ధాన్యం కొని కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్నట్లు బినామీ పేర్లతో రికార్డు చేస్తున్నారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయిపేటలో 82 కిలోల ధాన్యం రూ.1070లకు బ్రోకర్ల ద్వారా రైస్‌ మిల్లు కొన్నది. 82 నుండి 84 కిలోల వరకు గల బస్తా ధాన్యాన్ని జిల్లాలో ఎక్కడా రూ.1350ల కంటే ఎక్కువకు కొనడం లేదు. అంటే క్వింటాల్‌ రూ.1300 నుండి రూ.1600ల మధ్యలో కొంటున్నారు. ఈ విధంగా క్వింటాల్‌కు 500 నుండి 200 వరకు రైతు నష్టపోతున్నాడు. ఇందుకు కేంద్రంతో పాటు రాష్ట్రమూ బాధ్యత వహించాలి. జిల్లాల్లో పంట దిగుబడిని బట్టి రైతుకు నష్టం వుంటుంది. జిల్లా జిల్లాకు వ్యత్యాసం వుంది. జగన్‌ మోహన్‌ రెడ్డి రైతుకు గిట్టుబాటు ధర ఇస్తానని ప్రకటించారు. ధరల స్థిరీకరణ నిధి సమకూరుస్తున్నట్లు ప్రకటించారు. కాని నిజంగా అవసరం వచ్చిన సమయానికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ రైతుకు అండగా లేరు. మరో పంట పత్తికి కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు. ఇక్కడా రైతు నష్టపోతున్నాడు. కందుల్లోనూ రైతుకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు. చెరకు రైతులకు కనీస మద్దతు ధర టన్నుకు రూ.4,000 ఇవ్వాలి. కానీ ఇస్తున్నది రూ.2,700 మాత్రమే. సంవత్సరాల తరబడి బిల్లులు చెల్లించడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సమస్యలు చర్చించిందీ లేదు. చర్యలూ లేవు. జ్యూట్‌, ఫెర్రో ఎల్లాయిస్‌, స్పిన్నింగ్‌, షుగర్‌ మిల్లులన్నీ మూతపడుతున్నాయి. వేలకు వేల కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడుతున్నారు. ఈ పరిశ్ర మలు మూత పడడానికి కారణాలను తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించడానికి బదులు ఎమ్మెల్యేలు, మంత్రులే దగ్గరుండి మరీ పరిశ్రమలను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అమ్మించేస్తున్నారు. చిట్టివలస జ్యూట్‌ మిల్లును మంత్రి అవంతి శ్రీనివాస్‌, బొబ్బిలి లక్ష్మీ శ్రీనివాసా జ్యూట్‌ మిల్లును బొబ్బిలి శాసన సభ్యులు సంబంగి చిన్నప్పల నాయుడు, లచ్చయ్యపేట ఎన్‌సిఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీ భూమిని పార్వతీపురం శాసనసభ్యులు అమ్మేసే బాధ్యత తీసుకున్నారు. ‘నన్ను గెలిపించండి, మిల్లులను తెరిపించి ఉపాధి గ్యారంటీ చేస్తాన’ని స్వయంగా జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర లోనూ, ఎన్నికల సభల్లోనూ చెప్పారు. అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా జరుగుతోంది. పోలవరం మొదలు వంశధార వరకు ప్రాజెక్టు నిర్వాసితుల భూముల ధరల్లో జరిగిన అన్యాయాన్ని సరిచేస్తానని అదనంగా రైతుకు నష్టపరిహారం ఇస్తానని జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల్లో చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలు 105 లక్షలని వారి పునరావాసానికి అయ్యే ఖర్చు రూ.33 వేల కోట్లని లెక్క వేసింది చంద్రబాబు ప్రభుత్వం. జాతీయ ప్రాజెక్టయినా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ‘పునరావాసం నా బాధ్యత కాద’ని చెప్పేసింది. ఇది అన్యాయమని నాడు చంద్రబాబు కాని, నేడు జగన్‌ కాని అనడం లేదు. నిర్వాసితులను మాత్రం ముంచేస్తున్నారు. వెలుగొండ, వంశధార, తోటపల్లి, తారక రామా నిర్వాసితులందరూ జగన్‌ ప్రభుత్వం ఏదో చేస్తుందని ఎదురు చూస్తున్నారు. నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి, భృతికి అన్నింటిలో న్యాయం చేస్తామని చెప్పారు. ఇంత వరకు చేసిందేమీ లేదు. నిర్వాసితుల ఇళ్లకు గత చంద్రబాబు ప్రభుత్వం బిల్లులు కూడా ఇవ్వలేదు. ఆ ఇళ్ళు కూడా పిట్ట గూళ్ళ వలె ఉన్నాయి. నివాస యోగ్యంగా లేవు. విజయనగరం జిల్లా పాచిపెంట మండల కేంద్రం దగ్గర పెద్ద గెడ్డపై రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రిజర్వాయర్‌ నిర్మించింది. అందులో ఆ గిరిజన గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఆ గ్రామాల్లో గిరిజనులంతా ఫారెస్టు భూముల్లో ఇళ్ళు కట్టుకుని, ఫారెస్టు భూములను సాగు చేసుకుని వందల సంవత్సరాలు బతికారు. ఫారెస్టు భూమి కనుక నష్టపరిహారం ఇవ్వలేదు. ఎర్రొడ్లు వలస పునరావాస కాలనీ కొండ పక్కనే నిర్మించారు. కొండను ఆనుకుని వున్న భూమిని సాగు చేసుకుని బతకమని ఆనాడు కలెక్టర్‌, జె.సి చెప్పి ఒప్పించారు. ఇప్పుడు ఇళ్ళ స్థలాల కోసం భూమిని తీసుకుంటామని మండల అధికారులు ఆ గ్రామం మీద దాడి చేస్తున్నారు. ఒకసారి నిర్వాసితులైన ఆ పేదలనే మళ్లీ రెండోసారి నిర్వాసితులను చేస్తున్నారు, ఇదేం న్యాయం?25 లక్షల మందికి రేపు ఉగాది నాటికి ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని ప్రకటనలు చేస్తున్నారు. అందుకు భూమి సేకరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పేదల భూమిని తీసుకుని ఇళ్ళ స్థలాల పంపిణీకి పూనుకున్నారు. డీపట్టా భూమి, పేదల సాగులో వున్న ప్రభుత్వ భూమి తీసుకుంటామని అధికారులు పేదలపై దాడి చేస్తున్నారు. ప్రభుత్వమే భూమి కొని పేదలకు పంచి ఇస్తామని ప్రకటనలు చేస్తూ పేదల స్వాధీనంలో ఉన్న భూమిని ఎలా తీసుకుంటారు? పేదలకు అన్యాయమే కదా? భూస్వాముల దగ్గర భూమి కొని ఇళ్ళ స్థలాలు ఇవ్వాలనే అభిప్రాయం ఎందుకు కలగలేదు. విశాఖ ఉడా పరిధిలో డీ-పట్టా భూమిని రాజధానిలో చంద్రబాబు ల్యాండ్‌ పూలింగ్‌ చేసిన విధంగానే భూమిని సేకరిస్తామనడం పేదలకు అన్యాయం చేయడమే కదా! రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ‘పునాదులు వేయండి, ఇళ్ళు కట్టండి బిల్లులు ఇస్తామని అధికారుల తోనూ, వారి పార్టీ నాయకులతోనూ చెప్పి పేదలతో ఇళ్ళు కట్టించింది. జనంఆ మాటలు నమ్మి పునాదులు వేశారు. ఇళ్లు కట్టేశారు. తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ ఇళ్ళకు బిల్లులు ఇవ్వలేదు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం పేదలను నిర్మించు కోమన్న ఇళ్ళకు, ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. ప్రతిపక్షం మీద కోపంతో ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌తో అనేక ప్రయివేటు కాలేజీలు నడుస్తున్నాయి. జూన్‌ నుండి నడుస్తున్న కాలేజీలకు డిసెంబర్‌ నెలలో ఫీజు రియింబర్సుమెంట్‌ ఇవ్వనని ప్రభుత్వం జి.వో జారీ చేయడంతో ఆ కాలేజీలన్నీ గందరోళంలో పడ్డాయి. ఆదివాసీలకు 2006 అటవీ చట్టం ప్రకారం పోడు పట్టాలు ఇవ్వాలి. గత ప్రభుత్వం ఇస్తామని మోసం చేసింది. జగన్‌ ఎన్నికల హామీ ఇచ్చారు. తరువాత ఆ ఊసే లేదు. భూమి సర్వేలు చేయడం లేదు. సర్వే చేసిన వారికి పట్టాలు ఇవ్వడం లేదు. 554 నాన్‌ షెడ్యూల్‌ గ్రామాలను 5వ షెడ్యూల్డు గ్రామాల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలని గిరిజన సలహా మండలి ప్రకటించింది. వాస్తవంగా 1250 గ్రామాలు షెడ్యూల్డ్‌ గ్రామాలుగా ప్రకటించాల్సి ఉండగా కేవలం 554 గ్రామాలకే పరిమితం చేయడం గిరిజనులకు అన్యాయం చేయడమేనని గిరిజన సంఘాలన్నీ ఆందోళన చేశాయి. బంద్‌ కూడా నిర్వహించాయి. రీ సర్వే చేస్తామని ఉప ముఖ్యమంత్రివర్యులు పుష్పశ్రీవాణి ప్రకటించి నెలలు గడుస్తున్నాయి. అన్ని లెక్కలూ ప్రభుత్వం వద్ద ఉన్నాయి. వారం రోజుల్లో చేయాల్సిన పనిని 4 నెలలైనా చేయలేదు. భూస్వాముల ఒత్తిడికి లొంగిపోయి వుండకపోతే ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నట్లు అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. చేనేత కార్మికులకు చేయూత పథకం ఇస్తామన్నారు. 80 శాతం చేనేత కార్మికులు మాష్టర్‌ వీవర్ల దగ్గర పని చేస్తున్నారు. ఆ కారణం చేత వారికి పథకం ఇవ్వ నిరాకరించారు. గొర్రెలు, మేకల పెంపకందార్లకు ఎన్‌.సి.డి.సి అప్పు ఇస్తామ న్నారు. ఒక్కరికీ ఇచ్చింది లేదు. హుదూద్‌ తుఫానులో నష్టపోయిన కల్లుగీత కార్మికుల నష్టపరిహారాన్ని, చంద్రబాబు ప్రభుత్వం కొంత మందికే ఇచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గీత వృత్తిదార్లకు ఇవ్వలేదు. ‘మా ప్రభుత్వం వస్తే ఇస్తామ’ని జగన్‌ మోహన్‌ రెడ్డి వాగ్దానం చేశారు. ఈ రోజు వరకు ఆ ఊసే లేదు. ఇలా ప్రజలు సమస్యలతో సతమతం అవుతుంటే పరిష్కారం చేయకుండా జగన్‌ ప్రభుత్వం కొన్ని పథకా లపైనే దృష్టి పెడుతూ కాలయాపన చేస్తోంది. రైతులు, కార్మికులు, చేతివృత్తి దారులు, గిరిజనులు వారు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారం అయితే, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం పాకులాడవలసిన దుస్థితి ఉత్పన్నం కాదు. కాని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమస్యలు ప్రాధాన్యతా సమస్యలుగా అనిపించకపోవడం శోచనీయం. ఈ సమస్యలు పరిష్కారం అయితే రాష్ట్రాభివృద్ధి నిలకడగా సాగుతుంది. సంక్షేమ పథకాల పంగల కర్రల మీద ఎన్నాళ్లు నడుపుతారు? ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు జరపకపోయినా సుతిమెత్తని అభ్యర్థనలతో, వేడికోళ్లతో సరిపెడుతున్నారు. దేశమంతా పౌరసత్వ సమస్యపై ఆందోళన జరుగుతుంటే రాష్ట్ర ప్రజలలో కలుగుతున్న ఆందోళన పట్ల ఉదాసీనంగా ఉన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజల పౌరసత్వాన్నే ప్రశ్నార్ధకం చేసినా ఆ మోడీ పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతునీయడం మరీ దారుణం. అనేక పార్టీలు, పార్లమెంటులో సిఎఎకు మద్దతునిచ్చినా ప్రజల నుండి ప్రతిఘటన రావడంతో నిర్ణయం మార్చుకున్నాయి. ఎన్‌.ఆర్‌.సి.ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాయి. చివరికి బిజెపి కర్నాటక ముఖ్యమంత్రి కూడా ప్రజా ప్రతిఘటనకు జడిసి కర్నాటకలో అమలు జరపనని ప్రకటించారు. కానీ జగన్‌ నేటి వరకు వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించలేదు. పలు ఎన్నికల వాగ్ధానాల అమలులో వెనకబడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో గాని, పాదయాత్ర సందర్భంలో గాని ప్రస్తావించని రాజధాని సమస్యను హఠాత్తుగా ముందుకు తెచ్చింది. అన్ని పక్షాలను, పార్టీలను సంప్రదించి కలుపుకుపోయే వైఖరి కాకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వం అతి కేంద్రీకరణ పేరుతో ఇబ్బంది పెడితే ఈ ప్రభుత్వం అర్థం లేని విధానాన్ని చేపట్టి, దానికి వికేంద్రీకరణ పేరుపెట్టి జనాన్ని ఇబ్బందుల పాలు చేస్తోంది. మొత్తం మీద అటు కేంద్రంలో బిజెపి ఎన్నార్సీ పేరుతోనూ, ఇటు రాష్ట్రంలో వైసిపి మూడు రాజధానుల పేరుతోనూ అప్రధాన అంశాలను ముందుకు తెచ్చి ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించకుండా జనాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయి.

ఆగని అన్నదాత పోరు

పంటలకు చట్టపరంగా కనీస మద్దతు ధరల హామీ,రైతు వ్యతిరేకకార్పోరేట్‌ అనుకూల మూడు సేధ్యపు బిల్లుల రద్దును కోరుతూ దేశ రాజధాని ఢల్లీి నగర శివార్లలో అన్నదాతలు పట్టుదలతో సాగిస్తున్న పోరాటం నానాటికీ ఉన్నతమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ రైతు వ్యతిరేక,ధనవంతులకు లక్షల కోట్లు లాభాలు కట్టబేట్టిన వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని, పంటలకు కనీస మద్దతు కల్పిస్తూ చట్టపరంగా హామీ ఇవ్వాలని రైతాంగం కోర్కెలకు మద్దతుగా యువద్భారతం సెప్టెంబరు 27న బంద్‌ పాటించి సంఫీుభావం ప్రకటిచింది. గత పదినెలలుగా అన్నదాతలు ఆందోళన సాగిస్తున్నా మోదీ ప్రభుత్వం మొక్కుసూటిగా రైతు సంఘాలతో చర్చలు జరిపినా ఎలాంటి నిర్ధిష్ట హామీ ఇవ్వకపోవడంతో పోరు ముందుకు సాగుతోంది. కాలయాపన చేస్తే పట్టించుకోకపోతే రైతాంగ ఆందోళన అదంతకదే నీరుగారిపోయిందని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. కానీ సెప్టెంబరు 5న జాట్‌ భూమిగా పిలిచే పశ్చిమ యూపీలోని ముజఫర్‌నగర్‌లో జరిగిన బ్రహ్మండమైన బహిరంగ సభలో యూపీ,ఉత్తరాఖాండ్‌, హర్యానా,మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి లక్షలాది మంది రైతులు పాల్గొని మోదీ ప్రభుత్వం మొండివైఖరిని నిరసిస్తూ వివాదస్పదమైన మూడు వ్యవసాయచట్టాలను రద్దు చేసేవరకు ఆందోళన కొనసాగించాలని ప్రతిబూనారు. సంయుక్త కొసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ కిసాన్‌ మహా పంచాయిత్‌లో మూడువందలకు పైగా రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. యూపీ,పంజాబ్‌ఉత్తరాఖండ్‌,గోవా,మణిపూర్‌ శాసనసభలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నఇకలు జరగున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వఆనికి గుణపాఠం నేర్పేందుకు ముజఫర్‌నగర్‌లో ఈభారీ కిసాన్‌ బహిరంగ సభను నిర్వహించారు. యూపీ శాసనసభ 303స్థానాలకు,గోవా కనీసం125 అసెంబ్లీ స్థానాల ఫలితాలను రైతాంగ ప్రదర్శనధర్నాల ప్రభావితం చేయగలవని అంచనా. 2013లో ముజఫర్‌ నగరం ప్రాంతంలో జరిగిన హిందూముస్లిం ఘర్షణ వలల రైతాంగ వ్యతిరేకత నెరవేర్చనుంది. అన్నదాతల కనిపిస్తుంటే జాట్‌లో ముస్లింలు ఘర్షణ పదివేరై,జాట్‌లు బీజేపీకి మద్దతులు ఇవ్వగా 2014 మే ఎన్నికల్లో గెలిచి నరేంద్రమోడీ సారధ్యంలో కమలం పార్టఈ అధికారంలోకి రాగాలిగింది. 2017 యూపీశాసనసభ 2019లోక్‌సభ ఎన్నికల్లో ఇదే తంతు కొనసాగింది. అధికారపార్టీకి రాజకీయ లబ్దిచేకూరింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో తెచ్చిన మూడు సేధ్యపు చట్టాలు కార్పొరేటు వర్గాలకు లక్షల కోట్లు కట్టబెట్టేవని రైతు నాయకులు రాకేష్‌ తికాయల్‌ విమర్శించారు. ఈ పోరాటం కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాదని జాతిని,రాజ్యాంగాన్ని రక్షించకోవడానికి జరుగుతున్న ఆందోళనలో 14కోట్ల భారత యువకలు క్రియాశీలపాత్ర వహించాలని తికాయల్‌ కోరారు. మోదీ ప్రభుత్వం భారత్‌ను అమ్ముకానికి పెట్టందని, రైళ్ళు,రేవులు, జాతీయరహదారులు, విమానాశ్రయాలు,ఎల్‌ఐసీ,ఓన్‌జీసీ,బీపీసీఎల్‌, తదితర ప్రతిష్టాత్మక సంస్థలను అదాన్న అంబానీ వంటి బడా పెట్టుబడిదార్లకు కారుచౌకగా కట్టబెట్టి దానికి చేస్తున్న ప్రయత్నాలపై దేశ ప్రజల్లో ఆగ్రహాం రగులు తోంది. ఎన్నో పోరాటాల తర్వాత సాధించు కున్న ప్రతిష్టాత్మకమ విశాఖ ఉక్కు కర్మాగారాన్నఇ ప్రైవేటీకరించేందుకు నిర్ణయిం జరిగి పోయిందని కమలానాధుల చేసిన ప్రకటనలకు వ్యతిరేకంగా తెలుగు ప్రజలు, కార్మికులు మహిళలు పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే. పశ్చిమ యూపీలో రైతాంగం పండిరచే చెరకు క్వింటాల ధరకు రూ.450కి పెంచుతామని హామీ ఇచ్చిన ప్రస్తుత ప్రభుత్వం ఒక్క రూపాయు కూడా పెంచలేదు.పైగా చెరకు రైతుకు చక్కెర ప్యాక్టరీలు రూ.12వేలకోట్ల భారీ బకాయిలివ్వాలని రైతులు ఆందోళన చేస్తే అవి రాజకీయపరమైనవని,కమలానాధులు ప్రకటించడం సిగ్గు చేటు. యూపీలో మత విభజన వాణిని కొనసాగించి, హిందువుల ఓట్లును గంపగుత్తగా పొంది మళ్ళీ అధికారంలోకి రవాలన్నదే కమలనాధుల పన్నాగం. 2013 హిందూ ముస్లిం కల్లోలంలో 42మంది ముస్లింలు,20మంది హిందువులు మరణించారు. రైతుల ఆందోళనను ఆందోళనను పోలీసు తుఫాకుల్లో భాష్ప వాయువు గోళాలతో దమనకాండతో అణిచివేయాలని నరేంద్ర మోదీ యోగి ప్రభుత్వం ఎన్నో యత్నాలను లక్షలాది మంది రైతులు కదలి వచ్చి తిత్తాయల్‌ దీక్షకు మద్దతుగా నిలబడి వమ్మఉ చేశారు. మద్దతు ధరలు మూడు వందలకేనా? ఢలీి పరిసర ప్రాంతాలలో జరుగుతున్న ఆందోళనల్లో ఇరుగు పొరుగు రాష్ట్రాల వారే అధికంగా పాల్గొంటున్నా దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘనేతలు,మహిళలు,కార్యకర్తలు వెళ్లి దీక్షల్లో పాల్గొని సంఫీుభావం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు బీమా పేరిట ప్రభుత్వానికి రూ.2500 కోట్ల బీమా కంపెనీలకు లాభాలే చేకూరుతున్నాయి. రైతుల ఆందోళన వల్ల ఏర్పడిన ప్రతిష్టంభన తొలగించేందుకు సుప్రీం కోర్టు రంగంలోకి దిగి తదుపరి ఉత్తర్వఉలు వచ్చేవరకు ఎలాంటి వివాదస్పద సేధ్యపు బిల్లులు అమలు చేయవద్దని ఆపేసింది. రైతుల సమస్యలను తెలుసుకున్న సుప్రీం కోర్టు విరమించినా కనీసం రైతులు ఎవ్వరూ పాల్గొనేదు. రైతుదినోత్సవం నాడు జనం,వ్యాపార ప్రొత్సహం,సహకార చట్టం2020,రైతుల సాధికారిత మరియు కనీస ధరల హామి ఒబ్బందం,రైతుల సేద్య చట్టం`2020,నిత్యఆవసర సరకులు(సవరణ) చట్టాలు పూర్తిగా రైతులను దోపిడికి గురిచేసి అదానీ తదితర కార్పొరేటు శక్తులకులాభాలు కట్టబెటేవని,వాటిని ఉపసంహరించుకోనేవరకు ఆందోళన వీడబోమని రైతు సంఘాల నేతలు స్పుష్ట్రం చేశారు. దీనికి తోడు గత ఏడాదిన్నరగా దేశంలో కరోనా మహమ్మారి వల్ల లాక్‌డౌన్‌లు విధించడం,రవాణా స్తంభించించడంవల్ల పండ్లు,కూరగాయలు,పూలు,పాలను ఎక్కడెక్కడ దొరక్కపోవడం వల్ల చాలా మంది రైతాంగం అప్పులు పాలైనారు. అందుకే వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దత ధరలు కల్పించే ఇచ్చే చట్టాలను కావాలని రైతులు కోరుతున్నారు.

సరికొత్త చరిత్రను సృష్టించిన భారత్‌ బంద్‌
ప్రభుత్వం రైతులపై రుద్దిన వ్యవసాయ చట్టాల రద్దు కోసం సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కె ఎం) పిలుపు మేరకు సెప్టెంబరు 27న నిర్వహించిన భారత్‌ బంద్‌ జయప్రదమైంది. రైతు,కౌల రైతు,వ్యవసాయకార్మిక,కార్మిక,ఉద్యోగ, మహిళా,విద్యార్థి,యువజన,ప్రజా సంఘాల భాగస్వామ్యాలతో బంద్‌ సరికొత్త చరిత్రను లిఖించింది. ప్రజల నుండి ఎన్నడూ లేని విధంగా అపూర్వ స్పందన,మద్దతు, సంఫీు భావం బంద్‌కు లభించాయి. మోడీ ప్రభుత్వ విధానాలు,పెట్రోల్‌,డీజిల్‌,గ్యాస్‌,నిత్యావసరాల ధరలకు తాళలేకున్న ప్రజ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని తమ నిరసనాగ్రహాన్ని తెలియజెప్పారు. బంద్‌కు కాంగ్రెస్‌,లెఫ్ట్‌ సహా 19బిజెపి యేతర రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. మావోయిస్టు పార్టీ సైతం బంద్‌కు మద్దతుగా ప్రకటన చేసింది. కేరళ,పంజాబ్‌,రాజస్థాన్‌,తమిళనాడు, మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని అధికార ప్రభుత్వాలు మద్దతు తెలపడం బంద్‌ ఘనంగా విజయవంతం కావడానికి దోహదపడిరది. రాష్ట్రాల అధికారాలను,ఫెడరల్‌ స్ఫూర్తిని కాలరాసే విధంగా ఉన్న మోడీ ప్రభుత్వ వైఖరి వలన ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సైతం బంద్‌ అనుకూల వైఖరి తీసుకున్నాయి. బిజెపి పాలిత గుజరాత్‌,ఉత్తరప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌,కర్నాటక,ఉత్తరాఖండ్‌లలో బంద్‌ను నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. పెద్ద ఎత్తున రైతులు, కార్మికులు, ప్రజలు బారికేడ్లను చేధించుకొని మరీ వీధుల్లో కదం తొక్కడం విశేషం.ఈపరిణామం బిజెపి పట్ల ప్రజల్లో గూడు కట్టుకుంటున్న ఆక్రోశానికి అద్దం పడుతుంది. నిరుడు కరోనా విజృంభిస్తున్న వేళ ఇదే అదనుగా వ్యవసాయ పంటల మార్కెట్‌ కమిటీలు ఎత్తివేసే,కాంట్రాక్టు సేద్యం మరింత పాదుకొనే, నిత్యావసరాల నిల్వలపై పరిమితులు ఎత్తేసే మూడు చట్టాలను మోడీ సర్కారు ఏకపక్షంగా చేసింది. తమ ఉనికికే ముప్పు కలిగించే వినాశకర నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గతేడాది నవంబర్‌ 26న రైతులు ఢల్లీి పీఠాన్ని కదిలించేందుకు పయనమయ్యారు. శివార్లలో నిలువరించగా అక్కడే బైఠాయింపు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. దాంతో తమ ఆందోళన మొదలై పది మాసాలు పూర్తి చేసుకున్న సందర్భాన, తామెందుకు ఎండ, వాన,చలి,కరోనాలను లెక్క చేయకుండా పోరాటం చేయాల్సి వచ్చిందో దేశానికి తెలియజెప్పేందుకు 27న భారత్‌ బంద్‌కు నడుం కట్టారు రైతులు. ఈ నెల5న బిజెపి పాలిత యు.పిలోగల ముజఫర్‌నగర్‌లో లక్ష లాది రైతులతో ‘మహా పంచాయతీ’ నిర్వహించి బంద్‌ బావుటా చేతబూనారు. బంద్‌ ఆవశ్యకత ను వివరిస్తూ ఊరూ వాడా సదస్సులు, సమా వేశాలు,ర్యాలీలు,కరపత్రాలు,పోస్టర్లతో విస్తృత ప్రచారం చేసి మోడీ పాలనలో కడగండ్ల పాలైన వారిని సమీకరించి సన్నద్ధం చేశారు. ఇంతటి అకుంఠిత దీక్ష,కఠోర కృషి ఉన్నందునే బంద్‌ ఘన విజయం సార్ధకమైంది. ఈభారత్‌ బంద్‌ది ప్రత్యేక నేపథ్యం, చరిత్రాత్మకం. బిజెపి విధానాలకు వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఐక్య పోరాటాలు మరింత బలపడటానికి బంద్‌ దిశా నిర్దేశం చేసింది. కార్మిక, కర్షక ఐక్యతను పటిష్టమొనర్చింది. కార్పొరేట్ల దోపిడీని ఐక్యంగా ప్రతిఘటించాలని మార్గ దర్శనం కావించింది. కార్పొరేట్లకు అనుకూలంగా పని చేస్తున్న పార్టీలు, ప్రభు త్వాలకు గట్టి హెచ్చరిక అయింది. హిందూత్వ, కార్పొరేట్‌ దోపిడీకి ఊతం ఇచ్చే నయా-ఉదార వాద విధానాలను కలగలిపి మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న కుటిల పన్నాగాలను రైతు ఉద్య మం పటాపంచలు చేయనా రంభించింది. రైతు ల ఆందోళనలు కొన్ని రాష్ట్రాలకే, కొన్ని ప్రాంతా లలోనేనని తక్కువ చేసి చూస్తున్న బిజెపికి ఒకటి కాదు రెండు కాదు 540 సంఘాల మద్దతుతో ఆసేతు హిమాచలం జనాన్ని కదిలించిన భారత్‌ బంద్‌తోనైనా కనువిప్పు కలిగి ఉండాలి. ‘కార్పొ రేట్ల కబంధ హస్తాల నుండి వ్యవసాయ పరి రక్షణ, మోడీ గద్దె దిగాలి’ అనే నినాదం బంద్‌ లో దేశ వ్యాప్తంగా పెక్కటిల్లింది.జాతి వ్యతిరేక, రైతు వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక సాగు చట్టా లను రద్దు చేయకపోతే ప్రజలు ఆ కార్యాచరణ ను నిజం చేసే రోజు ఎంతో దూరం లేదు.

పతకమూరు దామోదర్‌ ప్రసాద్‌,సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు

మద్దతు ధర ఎలా?

పంటలకు ధరలు నిర్ణయించిన విధానం రైతాంగాన్ని ఆహారపంటల నుండి ఇతర పంటల వైపు మళ్ళించటం లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. వాణిజ్యపంటలు, పండ్లు, కూర గాయలు తదితరాలను ఎక్కువగా పండిర చాలని, ఆ పంటలకు అధికధరలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. భారత్‌ లోని రైతు లను ఆహారపంటలు పండిరచటం నుండి దూరం చేసి, వాణిజ్యపంటలు పండిరచేలా చేసి, వారిని అంతర్జాతీయ మార్కెట్‌ ఒడిదుడుకుల లోకి లాగి దివాళా తీయించటం, దేశంలో ఆహారకొరత ఏర్పడేలాచేసి, ఆహార సరఫరాదారులుగా దేశ ఆర్థిక, రాజకీయ రంగాలపై తమ పెత్తనాన్ని పెంచు కోవచ్చు ననేది సామ్రాజ్యవాద దేశాలు, బహుళజాతి కంపెనీల వ్యూహం.
ప్రధాని మోడీ అధ్యక్షతన సెప్టెంబరు8వ తేదీన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ ఆర్థిక వ్యవ హారాల కమిటి 2021-22 ఖరీఫ్‌ సీజన్‌లో 23 వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించింది. కమిటీ ప్రకటించిన ధరలతో వ్యవసా య ఖర్చులు పోనూ రైతుల కనీస ఆదాయం 50 శాతం అదనంగా పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందని ప్రకటనలో పేర్కొన్నారు.కనీస మద్దతు ధరలను గురించి ఎవరూ ఏవిధమైన పొరపాటు అభిప్రాయాలతో ఉండవద్దని, కనీస మద్దతు ధరలు, వాటి పెంపుదల ఎప్పటికీ ఉంటాయని వ్యవ సాయశాఖ మంత్రి పత్రికా విలేకరుల సమా వేశంలో పేర్కొన్నాడు. ప్రభుత్వం వివిధ పంటలకు ప్రకటించిన ధరలు అత్యంత తక్కువగా ఉన్నాయి. మద్దతు ధరలు, వ్యవసాయోత్పత్తుల సేకరణపై రైతాంగం చేస్తున్న డిమాండ్లను, మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం పది మాసాల నుండి దేశవ్యా పితంగా రైతాంగం చేస్తున్న పోరాటాలను పరిగణన లోకి తీసుకోకుండా ప్రభుత్వం పూర్తి ఏకపక్షంగా నిర్ణయించిన ధరలు రైతాంగానికి ఏ మాత్రం మేలు చేయవు.వరిధాన్యానికి 2020-21లో కనీస మద్ద తు ధర గ్రేడ్‌ ‘ఎ’కు క్వింటాలుకు 1,888 రూపా యలుగా నిర్ణయించగా,2021-22లో1960 రూపాయలకు-72రూపాయలుపెంచారు. సాధా రణ రకానికి క్వింటాలుకు 1,868 రూపా యల నుండి 1940 రూపాయలకు-72 రూపాయలు-పెంచారు. గత సంవత్సరం కన్నా గ్రేడ్‌ ‘ఎ’ రకానికి 3.8శాతం,సాధారణ రకానికి3.9 శాతం పెంచా రు. గోధుమలకు పెంపుదల మరింత తక్కువగా ఉంది.2020-21లో గోధుమ క్వింటాలుకు 1925 రూపాయలు కనీస మద్దతు ధరగా నిర్ణయించగా, 2021-22లో 1975రూపాయలుగా నిర్ణయించారు. పెంపుదల 2.5శాతం మాత్రమే. గత సంవ త్సరం కన్నా అత్యధికంగా నువ్వులకు క్వింటా లుకు 452 రూపాయలు(6.6శాతం) పెంచారు. తర్వాత కందులు, మినుములకు 300 రూపాయల చొప్పున (5శాతం) పెంచారు. వేరుశనగ, పొద్దు తిరుగుడు గింజలకు 275,235 రూపాయల చొప్పున 5.2,2.2శాతం చొప్పున పెంచారు. ఈవిధం గా కొన్ని పంటలకు ఎక్కువగా ధరలు పెంచ టం రైతాంగాన్ని ఆ పంటలను పండిరచే విధంగా ప్రోత్సహించటం కోసమేనని అధికా రికంగా విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. దేశంలో పండిరచే పంటలలో వరి, గోధుమ ప్రధానమైనవి. ప్రభుత్వం ఈ పంట లనే అధికంగా సేకరిస్తుంది. ప్రభుత్వం సేకరించని పంటలకు మద్దతు ధరలను ప్రకటించినా వాటిలో ఎక్కువ భాగం కాగితాలపై ఉండటం మినహా రైతాంగానికి ఉపయోగపడవు. ప్రభుత్వం గోధుమలకు క్వింటాలుకు 2.5 శాతం, వరి ధాన్యానికి 3.8 శాతం చొప్పున పెంచగా,ద్రవ్యోల్బణం 5 శాతం వరకు ఉంటుందని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంచనా వేసింది. ద్రవ్యోల్బ ణంతో పోల్చుకున్నపుడు గోధుమలకు 2.5 శాతం, వరి ధాన్యానికి 1.1 శాతం తక్కువగా ధరలు నిర్ణయించినట్లు స్పష్టమౌతున్నది. వాస్తవవంగా ద్రవ్యోల్బణాన్ని పరిగణన లోకి తీసుకొని, అంతకన్నా అధికంగా మద్దతు ధరలు పెంచితే అదనంగా పెంచానని చెప్పుకోవటానికి అవకాశం ఉండేది. కాని కనీసం పెంచాల్సిన ధరల కన్నా తక్కువ నిర్ణయించి ఖర్చులకు అదనంగా 50 శాతం వచ్చేలా తాము రైతుల ఆదాయాన్ని పెంచామని చెప్పుకోవటం ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాన్ని వెల్లడి స్తున్నది. రైతులకు తాము పండిరచిన పంటలకు అయిన ఖర్చులన్నీ పోనూ 50శాతం అదనపు ఆదాయం వచ్చేలా ధరలు నిర్ణయించామని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నది. కాని వాస్తవంగా ప్రభుత్వం ఎ2ంఎఫ్‌.ఎల్‌కు అదనంగా 50 శాతాన్ని ప్రాతిపదికగా తీసుకొంటున్నామని చెబుతున్నది. రైతాంగం సి2ం50 శాతం విధానం ప్రాతిపదికగా వ్యవసాయోత్పత్తుల ధరలు నిర్ణయించాలని డిమాండ్‌ చేస్తున్నది. సి2ం50 విధానంలో మొత్తం వ్యవసాయ ఖర్చులతో పాటు వడ్డీలు, కౌలు, కుటుంబ శ్రమను కూడా పరిగణన లోకి తీసుకొని పంటలకు అయిన వ్యయాన్ని నిర్ణయి స్తారు. ఎ2ంఎఫ్‌.ఎల్‌ లో పెట్టుబడులు, కుటుంబ శ్రమను మాత్రమే పరిగణన లోకి తీసుకొని వ్యయాన్ని లెక్కిస్తారు. కాని వాస్తవంగా ప్రభుత్వం ఎ2ంఎఫ్‌.ఎల్‌ ను ప్రాతిపదికగా తీసుకోవటంలో కూడా మోసపూరితంగా వ్యవహరిస్తున్నది. వాస్తవంగా అయిన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మద్దతు ధరలను కొద్దిమేరకు పెంచి,50శాతం అదనంగా నిర్ణయించామని చెబుతున్నది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను పరిశీలించినట్లైతే నువ్వులు, మినుములు, కందులు, వేరుశనగకు మాత్రమే 5 శాతం, అంతకన్నా ఎక్కువగా పెరచారు. ద్రవ్యోల్బణం 5శాతం ఉన్నపుడు ఇది నామకార్ధపు పెరుగుదల మాత్రమే. మిగతా పంటలకు వాస్తవంగా గత సంవత్సరం కన్నా తక్కువ ధరలు నిర్ణయించినట్లుగా స్పష్ట మౌతున్నది. అసలుకే తక్కువ ధరలు నిర్ణయించి నపుడు ఇక 50శాతం అదనంగా ఇవ్వటం ఎక్కడీ ప్రభుత్వం తానుగా ప్రజలపై వేస్తున్న భారాలు రైతులు,వ్యవసాయ రంగం పైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వం పెట్రోలు, డీజిలు ధరలనను మూడోవంతుకు పైగా పెంచింది. సాధారణ రైతులు కూడా వ్యవ సాయంలో వచ్చిన మార్పుల దృష్టా మోటారు సైకిల్‌ వాడకం తప్పనిసరైంది. చాలా ప్రాంతా లలో వ్యవసాయ మోటార్లకు డీజిలు వినియో గిస్తున్నారు. వారు ఈ భారాన్నంతా భరించాల్సి వస్తున్నది. విద్యుత్‌ ఛార్జీల పెంపుతో పాటు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించమని కేంద్రం ఒత్తిడి చేయటంతో కొన్ని రాష్ట్ర ప్రభు త్వాలు మోటార్లకు మీటర్లు బిగిస్తున్నాయి. దానిలో ఆంధ్రప్రదేశ్‌ లోని వైసిపి ప్రభుత్వం ముందెత్తున వున్నది. మీటర్లెందుకు బిగిస్తున్నా రంటే రైతులపై ఏ మాత్రం భారం ఉండదు. విద్యుత్‌ వ్యయాన్నంతా ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుంది. రైతులు విద్యుత్‌ బిల్లులు చెల్లించవచ్చునని, వారిపై ఒక్క రూపాయి కూడా భారం ఉండదని చెబుతున్నారు. రైతులపై నిజంగా భారం వేసే ఉద్దేశ్యమే లేకపోతే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి, మీటర్లు బిగించటం ఎందుకు? ఇదే విధంగా గతంలో ప్రభుత్వం వంటగ్యాస్‌ సరఫరా చేసే కంపెనీలకు చెల్లిస్తున్న సబ్సిడీని వినియోగ దారుల ఎకౌంట్లలో జమ చేస్తానని,ముందు వినియోగదారులు మొత్తం ఖరీదు చెల్లించి వంటగ్యాస్‌ను కొనుగోలు చేయాలని చెప్పింది. ఆ విధంగా మార్చిన తర్వాత అనేకమంది ఎకౌంట్లలో సబ్సిడీ జమ కాలేదు.2020 నుండి మొత్తం సబ్సిడీని రద్దు చేశారు. వ్యవసాయ విద్యుత్‌కు కూడా ఆ విధంగా ప్రభుత్వం చెల్లిం చటం మానేస్తే బిల్లుల చెల్లింపు భారాన్ని రైతు లు భరించలేరు. కేంద్రం పంటల ధరలను నిర్ణయిస్తున్నపుడు ఈ విధంగా పెరుగుతున్న భారాలను పరిగణనలోకి తీసుకోవటం లేదు.
వాణిజ్య పంటల వైపుకు మళ్ళించే యత్నం
పంటలకు ధరలు నిర్ణయించిన విధానం రైతాంగాన్ని ఆహారపంటల నుండి ఇతర పంటల వైపు మళ్ళించటం లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. వాణిజ్య పంటలు,పండ్లు, కూర గాయలు తదితరాలను ఎక్కువగా పండిర చాలని, ఆ పంటలకు అధిక ధరలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. భారత్‌ లోని రైతులను ఆహారపంటలు పండిరచటం నుండి దూరం చేసి,వాణిజ్య పంటలు పండిర చేలా చేసి,వారిని అంతర్జాతీయ మార్కెట్‌ ఒడిదు డుకుల లోకి లాగి దివాళా తీయించటం,దేశం లో ఆహారకొరత ఏర్పడేలా చేసి,ఆహార సరఫరా దారులుగా దేశ ఆర్థిక, రాజకీయ రంగాలపై తమ పెత్తనాన్ని పెంచుకోవచ్చుననేది సామ్రాజ్యవాద దేశాలు, బహుళజాతి కంపెనీల వ్యూహం. దీనిలో దేశంలోని కార్పొరేట్‌ కంపెనీలకు కూడా ప్రయోజనం ఉన్నది. అందువలన బహుళజాతి సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలు కలిసి దీనిని ముందుకు తీసుకు పోవటానికి ఒత్తిడి చేస్తున్నాయి. నయా ఉదార వాద విధానాలలో భాగమైన ఈ వ్యవసాయ విధానాన్ని అమలు చేయమని రైతులపై మోడీ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒత్తిడి చేస్తున్నాయి.వాణిజ్య పంటలు పండిర చమని రైతాంగాన్ని ఒత్తిడి చేస్తున్న ప్రభుత్వాలు పంటలు మార్కెట్లోకి వచ్చి ధరలు పడిపోయి నపుడు రైతాంగాన్ని ఆదుకోవటానికి, వారికి కనీస మద్దతు ధరలు ఇప్పించటానికి ఎటువంటి ప్రయత్నం చేయటం లేదు. గతసంవత్సరం ఉభ య తెలుగు రాష్ట్రాలలో ధాన్యం,పత్తి,ఇతర వాణిజ్య పంటలు మార్కెట్‌ లోకి వచ్చినపుడు వ్యాపారులు ధరలు దిగ్గోసి కోనుగోలు చేశారు. ఆ సందర్భంలో ప్రభు త్వాలు మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వాలు నామమాత్రపు కొను గోళ్ళతో కంటి తుడుపు చర్యలు తీసుకున్నాయి మినహా మార్కెట్లోకి వచ్చిన ధాన్యం, వాణిజ్య పంటలను కొనుగోలు చేసి, రైతాంగానికి మద్దతు ధరలు అందించ టానికి ప్రయత్నం చేయలేదు. ఇటువంటి పరిస్థి తులలో రైతాం గాన్ని మరింతగా వాణిజ్య పంటల వైపు మళ్ళించటమంటే వారిని మరిం తగా మార్కెట్‌ దయాదాక్షిణ్యాలకు వదిలివేయ టమే అవు తుంది. అటువంటి స్థితిలో రైతాంగం మరిం తగా మార్కెట్‌ ఒడిదుడుకులకు గురై కనీస మద్దతు ధరలు పొందలేకపోవటం, అప్పుల పాలు కావటం,ఆత్మహత్యలు పెరగటానికి దారితీస్తుంది. అందువలన ప్రభుత్వం మద్దతు ధరలపై అసత్య ప్రచారాన్ని కట్టిపెట్టి, రైతాంగం డిమాండ్‌ చేస్తున్న విధంగా సి2ం50 శాతం ప్రాతిపదికగా అన్ని పంటలకు మద్దతు ధరలను నిర్ణయించి,సీజన్‌ ప్రారంభం కాగానే రైతాంగం నుండి మద్దతు ధరలకు పంటలను కొనుగోలు చేయటానికి పూనుకోవాలి. ఆహార ధాన్యాలు పండిరచే భూమి, ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గ కుండా,మన దేశ ఆహార భద్రత దెబ్బతినని విధంగా వ్యవసాయ విధానాలు రూపొందిం చాలి.- ఎ.కోటిరెడ్డి

బొక్కోసిన నిధులకు పక్కాగా లెక్కలు..?

వివిధ జిల్లాల పరిధిలో సుమారు 60 వేల పనులను పరిశీలించి 1000 కోట్ల రూపాయలకు పైగా ఉపాధి నిధులు దారిమళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఆ దిశగానే నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. కేవలం 60 వేల పనుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో దొపిడీ బయట పడిరదంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సుమారు 16 లక్షల పనులను పరిశీలిస్తే ఇంకెన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయో అన్న సందేహాలు అధికారుల్లో సైతం వ్యక్తమవుతున్నాయి. ఏడు రకాల రికార్డుల్లో: అనుకూలంగా పద్దులు 13 జిల్లాల పరిధిలోని 12,944 గ్రామ పంచా యతీల పరిధిలో 20 లక్షల రూపాయలకు పైబడిన పనులు ఇప్పటి వరకు 8, 517 జరిగాయి. అలాగే 10 లక్షల పైన 20 లక్షలలోపు 2, 548 పనులు చేపట్టారు.5 నుంచి 10 లక్షల లోపు సుమారు 1000 పనులు మంజూరు చేశారు. 2 లక్షల నుంచి 5లక్షల లోపు 426 పనులు, లక్ష నుంచి 2లక్షల లోపు 126 పనులు మంజూరు చేశారు. గడిచిన రెండు మూడు నెలల్లో చేపట్టారు. గత ఏడాది నుంచి ప్రస్తుత ఏడాది వరకు అన్ని రకాల పనులు సుమారు 16 లక్షలకు పైగా మంజూరు చేశారు. అందుకు సంబంధించి వేలకోట్ల రూపాయలను కేటా యించారు. రాష్ట్రాన్ని లోటు బడ్జెట్‌ వెంటాడుతున్నా అభివృద్ధి పనుల విషయంలో వెనుకడుగుకు ఆస్కారం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా వీలైనంత వరకు ఎక్కువ పనులను మంజూరు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగు పెట్టిస్తున్నారు.

Read more

పోలవరం నిర్వాసితులకు అండగా జాతీయ కమిషన్‌

రాజ్యంగంలో 338ఎఆర్టికల్‌ పక్రారంగా ఏర్పడిన గిరిజన తెగల జాతీయ కమిషన్‌, గిరిజనుల రక్షణ సామాజిక ఆర్థిక శ్రేయస్సు ఇంకా పరిరక్షణకు సంబంధించిన అన్ని అంశాలను పర్యవేక్షిస్తుంది. ఇందులో భాగంగా ఈజాతీయ కమిషన్‌ పోలవరాన్ని సందర్శించు కుని తమ అభిప్రాయాన్ని ఒక రిపోర్ట్‌ రూపంలో వ్యక్తపరిచింది. జాతీయ కమిషణ్‌ చైర్మన్‌ అనంతనాయక్‌ నాయకత్వంలో కమిషన్‌ బృందం సభ్యులతో,అలాగే భుబనేశ్వర్‌ నుంచి అశోక్‌ వర్ధన్‌ గారు మరియు న్యాయ సలహా దారులు రాధకాంత త్రిపాటితో ఆంధ్రపద్రేశ్లో ముంపునకు లోనవుతున్న కూనవరం, విఆర్‌పురం మండ లాలతో పాటుగా ఒడిస్సలోని మల్కనగిరిలను సందర్శించారు. బాధితగిరిజనుల భూ వాస్త వాలను నిర్ధారించడానికి,ముఖ్యంగా గిరిజన ప్రజలతో సంభాషించడానికి క్షేత్ర సందర్శనలు జరిగాయి. ఆగస్టు 24 నుంచి 28వరకు వివిధ గ్రామాలకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం సమన్వ యంతో నిర్మాణంలో ఉన్న బహుళ ప్రయోజన పోలవరం ప్రాజెక్ట్‌ ప్రభావిత ప్రాంతాలైన పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని ప్రదేశాలు సందర్శించారు. ` జి.నివృతి, పోలవరం నిర్వాసితుల పరిశోధకరాలు

Read more

వైవిధ్యం వారి జీవనం

‘‘ స్వచ్ఛమైన సెలయేళ్లు. దట్టమైన అడవులు. గంభీరమైన కొండలు. పక్షుల కిలకిలారావాలు. పచ్చని ప్రకృతి అందాలు. వీటి మధ్య శతాబ్దాల సంస్కృతులకు గుర్తుగా, వెనకబాటుతనానికి సజీవ సాక్ష్యంగా.. పాలకుల ఆలనకోసం ఎదురు చూస్తూ అమాయక ఆదివాసీ జనం నివసిస్తోంది. అడవితల్లి బిడ్డలుగా.. ప్రకృతి ఒడే ఆవాసంగా.. దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుని.. ప్రకృతి ప్రసాదిత ఫలాలతో సహవాసం చేస్తోంది. విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలకు నోచుకోని గూడేలెన్నో కనిపిస్తాయి. దశాబ్దాలుగా గిరిజనులు సమస్యలతోనే సహవాసం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యానికి బలైపోయారు. కానీ ఇప్పుడిప్పుడే వారి సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. వారి జీవితాల్లో మార్పు కోసం తాజా సర్కారు నడుం బిగించింది. గిరిజనులకు పాలనలో పెద్దపీట వేసింది. ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి సముచిత గౌరవం కల్పించింది. కట్టు, బొట్టు, ఆచార వ్యవహారాలు, తినే ఆహారం ఇలా.. ఆదివాసీలవన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి. ఏళ్ల తరబడి అడవిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. రాజ్యాంగంలో నిర్దేశించిన నిబంధనల ప్రకారం అటవీప్రాంతంలో స్థిర నివాసం కలిగిన 33 తెగల సమూహాలను ఆదివాసీలుగా గుర్తించారు. ఎక్కువమంది అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గిరిజన జీవనం విభిన్నంగా ఉంటుంది. సంబరాలు, వివాహ వేడుకలు, ఆరాధనల ఆచారాలు, మనిషి మూలాలను తేటతెల్లం చేస్తుంటాయి. తరాలు మారినా వారి అలవాట్లు, కట్టుబాట్లు ఇప్పటికీ మారలేదు. ఇక్కడ జరిగే వివాహ వేడుకల్లోని సంప్రదాయాల్లో భాగంగా చెట్టును ఆరాధిం చే విధానాలు ప్రపంచ శాంతి సౌభాగ్యానికి సందేశాన్ని పంపుతుం టాయి. ఏ పల్లెకు వెళ్లినా గిరిజనుల సంబరాలు, పండుగ సందడులన్నీ ఒకే రకంగా కొనసాగితే పెళ్లిళ్లు మాత్రం ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉంటాయి. ప్రాణాధారమైన నీరు, అది లభించడానికి అవసరమైన చెట్టు చుట్టూనే వారి తంతు తిరుగుతుంది. పాటలు, థింసా నృత్యాలు ఇక్కడి గిరిజనుల పండుగలు, శుభకార్యాల్లో భాగం.’’

Read more

అరణ్యపర్వం

‘బూర్జగూడా’’ అనే సవరగిరిజన గూడెంలోని,ఇస్రు,బొంతు, కొయ్యం,అనే ముగ్గురు అడవి బిడ్డలు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, చెప్పిన ‘‘కామ దేను పాడి పథకం’’మాయలో పడి ఎలా మోస పోయి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది..అక్కడ మెజిస్ట్రేట్‌ ముందు’’కొయ్యం’’ తమ తప్పిదానికి గల నేపథ్యం చెప్పి వేడుకోవడంతో ఈ ‘‘అరణ్య పర్వం’’ కథ ముగుస్తుంది. ఈకథ జరిగిన కాలం 1976 సంవత్సరం కాగా,రచనాకాలం1987 వ సంవత్సరం, అరుణ తార త్రై మాస పత్రిక (ఆగస్టు-అక్టో బరు 1987 సంచిక)లో తొలిసారి ప్రచురించ బడిరది.
తొలి తెలుగు కథానిక జన్మభూమి ఉత్తరాంధ్రకు చెందిన ఉత్తమ కథా రచయితల్లో ఒకరు ‘‘అట్టాడ అప్పలనాయుడు.’’ అనేక జీవన పోరాటాలను అరణ్యజీవుల సాక్షిగా అనుభవించి అంచెలంచెలుగా ఎదిగిన అక్షర శిఖరం ఆయన. అనేక చిరు ఉద్యోగాల పిదప చేతికందిన బ్యాంకు ఉద్యోగి గిరి చేస్తూనే తన అనుభవాలతో మదిలో మెదిలిన ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చి అనేక కధలు నవలలు రచించిన సాహితీ నాయకుడు తను. జీవనం రీత్యా, ఉద్యోగరీత్యా, తన ప్రాంతంలో నిత్యం చూసే సవర జాతి గిరిజనుల జీవిత గాధలే అప్పలనాయుడు రాసిన కథలు. అరణ్య వాసుల అభివృద్ధి మీద,వారి ఎదుగుదల గురించి,ప్రభుత్వాలు అధికారులు చేస్తున్న స్వార్ధపు ఆలోచనవల్ల వారి ఎదుగుదల కన్నా నష్టాలతో కూడిన నష్టాలే అధికం అనే కొత్త ఆలోచనను,ఉదాహరణ పూర్వకంగా వివరిం చారు రచయిత తన ‘‘అరణ్యపర్వం’’ ద్వారా. ఈకథ జరిగిన కాలం 1976 సంవత్సరం కాగా,రచనాకాలం1987వ సంవత్సరం, అరుణ తారత్రై మాస పత్రిక (ఆగస్టు-అక్టో బరు 1987 సంచిక)లో తొలిసారి ప్రచురించ బడిరది. ఇక కథ విషయానికొస్తే ‘‘బూర్జగూడా’’ అనే సవరగిరిజన గూడెంలోని,ఇస్రు,బొంతు, కొయ్యం,అనే ముగ్గురు అడవి బిడ్డలు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, చెప్పిన ‘‘కామ దేను పాడి పథకం’’మాయలో పడి ఎలా మోస పోయి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.అక్కడ మెజిస్ట్రేట్‌ ముందు’’కొయ్యం’’ తమ తప్పిదానికి గల నేపథ్యం చెప్పి వేడుకోవడంతో ఈ ‘‘అరణ్య పర్వం’’కథ ముగుస్తుంది. వాస్తవంగా కథలోని ఈ కొందరు గిరిజనులే కాదు..ఈదేశంలోని సమస్త అడవిబిడ్డల గోస,గోడుకు,ఈకథ అద్దం పడుతుంది.‘‘నమ్మకానికి ప్రతిరూపాలైన అడవి బిడ్డలు,తేడా వస్తే తిరుగుబాటుకు చిరునామాలుగా మారి పోతారు’’ అనే నిండు నిజం రచయిత ఈకథ ద్వారా చక్కగా చెప్పారు. కథలోని ప్రతి సంఘటననూ పలుకుబడులను గిరిజన సామాజిక చిత్రణ చేయడంలో నాయుడు శత శాతం విజయం సాధించారు.
సాధారణంగా అడవిలోని గిరిజనులు ఎవరిని నమ్మరు.నమ్మితే సర్వస్వం అర్పిస్తారు. ఆడిన మాట అస్సలు తప్పరు. తమ గూడెంలోకి కాకిబట్టల వారు వచ్చిన.. తెల్లబట్టల వారువచ్చిన… వారిని గూడెంలోకి రానివ్వరు. సరికదా వారు అడిగిన సమాచారం కూడా చెప్పారు. దానికి నిరూపణ కథ ప్రారంభంలో పోస్ట్‌ మేన్‌ కథకు కారకులైన ఇస్రూ,బొంతు, కొయ్యం,ల చిరునామాలు దొరికించు కోవడంలో పడ్డ ఇబ్బంది. చివరకు ఆగిరిజనులు తమకు వచ్చిన బ్యాంకు బాకీల బాపతు కోర్టు నోటీసులు చదువుకునే శక్తిలేక పోస్ట్‌ మేన్‌ను, బ్రటిమిలాడుకోవడం, నోటీసులు చదివి పెట్టినందుకు అతనికి ఇస్తామన్నా జీలుగకల్లు, కందులు,చిన్నకోడి,మాట తప్పకుండా అతనికి ఇవ్వడంలో అడవి బిడ్డల నీతి నిజాయితీ కళ్లకు కట్టారు రచయిత. కోర్టు నోటీసులు సారాంశం తెలుసుకున్న ఆఅడవి బిడ్డలు, రాబోయే ప్రమాదం తలుచుకుని దానికి గల కారణాలను,గతంలోకెళ్లి ఆలోచనలగుండా వెతుకులాట ద్వారా విషయాన్ని పాఠకులకు పరిచయం చేస్తారు రచయిత. గిరిజనులు ఆరుగాలం పడ్డ కష్టాన్ని బాకీలు,వడ్డీలు,రూపంలో దోచుకునే ‘‘వడ్డీ వ్యాపారులు’’ తక్కువ తూకాలు,నాసిరకం వస్తువులతో మోసం చేసే చిల్లర వ్యాపారులతో ఒకపక్క, నానా యాతనలు పడి అనేక విధాల నష్టం పోతుంటే అదిచాలదు అన్నట్లు.. మరోపక్క ప్రభుత్వ పథకాలు, ఉచితాలు,సబ్సిడీలపేరుతో బ్యాంకులు,గిరిజన అభివృద్ధిశాఖ వారు, గిరిజనుల అభివృద్ధి పేరుతో చేస్తున్న కార్యకలాపాల ద్వారా, ‘‘వారి వికాసం కన్నా వినాశనమే అధికంగా ఎలా జరుగుతుందో’’ రచయిత చెప్పే ప్రయత్నంలో ఈ కథ నడుస్తుంది. గిరిజనులకు జరుగుతున్న అన్యాయాల నుంచి వారిని రక్షించే నెపంతో వారిని సంఘ విద్రోహ శక్తులైన నక్సలైట్లు ఎలా ఆకర్షిస్తారు. వారిద్వారా గిరిజనులు పొందిన ఊరట తాలూకు విషయాలు కూడా ఇందులో ప్రస్తావించబడతాయి. ఒకరోజు బూర్జగూడెంకు అడవిదారి గుండా అష్టకష్టాలుపడి ప్రజా ప్రతి నిధి ఆప్రాంత రిజర్వుడు ఎమ్మెల్యే, సీతంపేట బ్యాంక్‌ అధికారులు,వచ్చి అక్కడి గిరిజనుల అందరినీ సమావేశపరిచి,వారు అనవసరంగా పని పాట లేక నక్సలైట్లు, అభ్యుదయ సంఘాల చెంతచేరి విలువైన సంసా రాలు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం గిరిజనుల మేలు కోరి వారి ఆర్థికఅభివృద్ధి ఆశించి పెట్టిన’’కామధేనుపథకం’’ గురించి వారికి నమ్మకం కుదిరేట్టు,ఒక్కొక్కరు వివరిస్తారు. తమ జాతి వాడే అయిన ఎమ్మెల్యే కూడా ప్రభుత్వం వారి ‘‘కామదేను పథకం’’కు అను కూలం అంటే ఇక ఆఅడవి బిడ్డలు మారు ఆలోచన చేయరు, గూడెం మొత్తం వారి అనుమానాలు పక్కనపెట్టి ఆ పధకంలో చేరిపోతారు. అధికంగా పాలు ఇచ్చే మేలు జాతి గేదెలు కొనుగోలు మొదలు ఆఖరికి ఆ పాలను కొనే పాలకేంద్రం వరకు, అందరి చేతుల్లో ఘోరంగా మోసపోయిన ఆడబిడ్డలు,చివరికి తమ ప్రాంతపు ఆహారం వాతావరణం పడక మేలుజాతి అనుకున్న గేదలు కూడా చనిపోవడంతో వారికి ఆదాయం బదులు అప్పులు మిగిలాయి,సరికదా అన్నకాలానికి అప్పు కట్టనినేరానికి కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. పోస్ట్‌ మేన్‌అందించిన బ్యాంకు నోటీసు వల్ల వాళ్ళల్లో కలిగిన అలజడి ఆలోచనల ద్వారా గత నేపథ్యం తెలుసుకున్న పాఠకులు,వర్ధమానం లోకి వచ్చాక చివరి ఘట్టం కోర్టు భవంతిలోకి ప్రవేశిస్తారు. రుణ గ్రస్తులైన గిరిజనులను‘‘బ్యాంకు బాకీ ఎందుకు తీర్చలేదు? పథకంలో వచ్చిన గేదెలు ఏమయ్యాయి?’’ అని ప్రశ్నించిన న్యాయమూర్తి ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి ధైర్యం కూడా తీసుకుని తనదైన బాణిలో భాషలో ‘‘కుయ్యం’’ చెప్పుకు పోతాడు. గత నలభై ఏళ్ల నుంచి తాము మోసపోతున్న తీరు ఎవరు ఎలా మోసం చేసి తమ శరీర కష్టాలను దోచుకుంటున్నారు కొయ్య న్యాయమూర్తి కళ్లకు కట్టినట్టు ఒక్కొక్కటి చెప్పుకు పోతాడు. ఇలాంటి కష్టకాలంలో తమ కుల దేవత కనికరించి తమ గుండెలకు సంగాన్ని పంపిందని,దేవతల జెండాలు పక్కన సంగపు జెండాలు ఎగరే సామని, చెబుతూ షావుకార్లునుంచి అక్రమ బాకీల కోసం గుంజుకున్న భూములు విడిపించుకోవడం, వ్యాపారులు చేసే మోసాలను, ఎదుర్కొన్న తీరు. మొదలైనవి చెబుతూ సంగం వాళ్లబతుకుల్లో చీకటినితుడిచి వెలుతురు నింపిన తీరును అంత భయం లోనూ అంతమంది లోనూ ధైర్యంగా చెప్పుకు పోతాడు కొయ్యం.
‘‘ఇంత చేసినా లాభం ఏముంది? పాలకులు కన్నెర్ర చేసి సంఘ వ్యతిరేకులుగా ముద్ర వేసి గుడిసెలుతగలబెట్టి, మా గూడేల మీద తుపాకి గురి పెట్టారు, ఎందరినో నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపి నక్సలైట్ల ఖాతాలో జమ చేశారు, ఏసం ఘాల ఆదరువులేక దిక్కులేని పక్షులుగ మిగిలి పోయివలసలు పోయినం,ఆఖరికి ఏదో చేస్తామని ఆశ చూపి పథకాలని,సబ్సిడీలని, మాయమాటలు చెప్పి చివరికి మమ్ములను నేరగాళ్లను చేసి ఇక్కడకు రప్పించారు ‘‘…. అంటూ గుండెల్లో పొంగిపొర్లుతున్న బాధనంతా న్యాయమూర్తి ముందు చెప్పు పోయినాడు తను. తమకు పాలకేంద్రం వాళ్లు పాలు పోసినందుకు ఇచ్చిన రశీదు ముక్కలు తప్ప తమ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, ప్రతినెల బ్యాంకు బాకీ పాలకేంద్రంవారే చెల్లిస్తామని చెప్పిన మాటలు నమ్ముకొని చివరికి అన్నీ కోల్పోయి తమ బతుకులు కోర్టుపాలయ్యాయి అని ఆవేదనతో చెపుతాడు. చివరికి ఈ ఆధునిక సమాజం తమకు వద్దని, తమదైన అడవి సమాజమే చాలని, ఈ కుట్రలు మోసాలను, పడలేమని ఇది తమ జాతి అందరి గోస అని గోడు పెట్టుకోవడంతో…… న్యాయమూర్తి ఆలోచనలో పడి, న్యాయశాస్త్రానికి చిక్కని జన జీవితం గురించి చెప్పిన గిరిజనుడి బాధ అర్థం చేసుకున్న న్యాయమూర్తి చలించినా….. కేసు వాయిదా వేయడంతప్ప, ప్రస్తుతానికి ఏమీ చేయలేని ఆయన అక్కడనుండి నిష్క్రమించడంతో…కధ ముగుస్తుంది .గిరిజనుల అభివృద్ధి లక్ష్యంతో ప్రభుత్వ పెద్దలు, అధికారులు, ప్రవేశపెడుతున్న పథకాలు ప్రయోజనకరమైనవి అయినా, స్వార్థపు బుద్ధిగల మధ్యవర్తుల ఆచరణ లోపాల కారణంగా, అభివృద్ధి పథకాలు నిర్వీర్యంఅయ్యి తద్వారా అడవి బిడ్డలు అనేక కష్టాలపాలై ఆర్థికంగా నష్టాల పాలవుతున్నారు, అనే ఇతివృత్తంతో చెప్పబడ్డ ఈ‘‘అరణ్యపర్వం’’ కథకు,.పేరు పెట్టడం మొదలు ముగింపు వరకు రచయిత ‘అట్టాడ అప్పలనాయుడు’ గారు తీసుకున్న శ్రద్ధ ఆచరణీయంగా సముచితంగాఉంది. ప్రతి సందర్భం విషయం కూడా కథకు అన్వయించడం, సందర్భోచితమైన నానుడులు ఉపయోగించడం… రచయితలోని పరిణితి, ప్రతిభకు, నిదర్శనాలుగా నిలిచాయి. మహాభారత కథ లోని పాండవులు అన్యాయంగా శిక్షించ బడి అరణ్యవాసం చేసిన సంఘటన మాదిరి అడవి బిడ్డలు కూడా అన్యాయాలకు గురైన అనవసరపు శిక్షలు అనుభవిస్తున్నారనే భావనతోనే రచయిత ఈ కథకు ‘‘అరణ్యపర్వం’’ అని పేరు పెట్టారు అనిపిస్తుంది. కథా లక్ష్యంలో …విషయాన్ని వివరించడమే తప్ప పరిష్కార మార్గం కానీ, చైతన్యం ఇవ్వడం కానీ కనిపించవు. కథ ముగింపు పాఠకుల ఆలోచనకే వదిలి వేయబడిరది. ఇది ఒక రకంగా ‘‘ఆరణ్య వాసుల జీవన చిత్రణ’’ను నూతనకోణంలో నమోదు చేయడం కోసమే వ్రాయబడిరది అనిపిస్తుంది. ఒక ప్రత్యేక జీవనంతో జీవించే అడవిబిడ్డల జీవనశైలిలోని భాగాలను ఇలా కథల రూపంలో నమోదు చేయడంవల్ల భావి కథ చరిత్ర పరిపుష్ఠం చెందడానికి ఎంతో దోహదం అవుతుంది.
(వచ్చే మాసం మీ కోసం జీవన్‌ కథ ‘‘పోటెత్తిన జన సంద్రం’’ విశ్లేషణ- డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు, ఫోను: 77298 83223

ప్రజల సిరులు ప్రైవేటు పాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన దరిమిలా లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం లేక అమ్మివేసే (దీనినే -వ్యూహా త్మక పెట్టుబడుల ఉపసంహరణ అంటారు) ప్రక్రి యను ప్రత్యేక శ్రద్ధాసక్తులతో అమలు చేసేందుకు కృషి చేస్తూ ఉంది. దేశ ప్రజానీకానికి పలు విధాలుగా సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలు భార తీయ రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, సీపోర్టులు, పవర్‌గ్రిడ్‌, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు, జాతీయ రహదార్లు మున్నగువాటిని దేశీయ, విదేశీ బడా కార్పోరేట్‌ కంపెనీలకు అప్పగిం చడం కోసం ‘మానిటైజేషన్‌ పైప్‌ లైన్‌’ విధానాన్ని శరవేగంగా అమలుచేసేందుకు పూనుకున్నది. గతంలో నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలలో కొంత వాటాను కానీ, సంస్థను పూర్తిగా కానీ అమ్మివేసే ప్రక్రియ ఆర్థిక సంస్కరణలలో భాగంగా కొనసాగుతూ వస్తోంది. 2014కి పూర్వం పదేండ్లు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వాల హయాంలో ఆ ప్రైవేటైజేషన్‌ ప్రక్రియ నిదానంగా కొనసాగుతూ వచ్చింది. కొన్ని సంస్థలలో 25శాతం లోపు పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కొంతమేరకు ప్రైవేటీకరణ జరిగింది.
2019 సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభ లో తిరుగులేని మెజారిటీ సాధించిన బిజెపి ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ ఆస్తుల (ప్రజా ఆస్తులు)ను కారుచౌకగా బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పేం దుకు దృఢనిశ్చయంతో ముందుకు సాగుతోంది. ఈ అమ్మకాలను సదరు ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులు,ఉద్యోగులకు మాత్రమే సంబంధించిన వ్యవహారంగా ప్రజలు భావించ కూడదు. స్వాతంత్య్రం పొందిన తొలినాళ్ళలో టాటా,బిర్లా లాంటి కొద్దిమంది బడా పారిశ్రామిక వేత్తలు తప్ప, దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టగల స్థోమత ప్రైవేట్‌రంగానికి లేకపోయింది. తత్కార ణంగా విద్యుదుత్పత్తి,ట్రాన్స్‌మిషన్‌,రైల్వేలు, జాతీయ రహదారులు,పెట్రోలియం,ఫార్మాస్యూటికల్‌, నౌకా శ్రయాలు,ఎయిర్‌పోర్టులు,వంటి వాటిలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయి. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ధనం,బ్యాంకుల నుంచి రుణా లు,కార్మికులు,ఉద్యోగుల శ్రమవగైరాలతో ఈ సంస్థ లు అభివృద్ధి చెందాయి. వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు వల్ల కొంతమేరకు అభివృద్ధి వికేంద్రీకరణ జరగడంతోపాటు, వాటికి అనుబం ధంగా ప్రైవేట్‌ రంగంలో కొన్ని పరిశ్రమలు ఏర్పాట య్యాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఐడిపి ఎల్‌ ఏర్పాటు కావడంతో అనంతరకాలంలో పలు ఫార్మాస్యూటికల్‌ సంస్థలు ఏర్పాటయ్యాయి. దీనితో హైదరాబాదుకు విశిష్టస్థానం లభించింది. ప్రభుత్వ రంగ సంస్థలయినందున రిజర్వేషన్‌ సూత్రాన్నను సరించి ఎస్‌సి,ఎస్‌టి వర్గాలకు చెందిన వారికి ఉపాధి లభించి, కొంతమేరకు సామాజిక న్యాయం జరిగింది. మోదీ సర్కార్‌ కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వరంగ సంస్థలకు ఉన్న రిజర్వ్‌ను, మిగులు మొత్తాలను వ్యూహాత్మకంగా ఉపసంహరిస్తూ వాటి విలువ తగ్గేందుకు పావులు కదిపింది. ప్లానింగ్‌ కమిషన్‌ స్థానంలో ఏర్పాటైన ‘నీతి ఆయోగ్‌’కు ఏఏ సంస్థలను ప్రైవేటీకరించాలో సూచించాల్సిన బాధ్య తను అప్పగించింది. 38సంస్థలను ప్రైవేటీకరిం చాలని,26సంస్థలను మూసివేయాలని,10 సంస్థ లను అమ్మివేయాలని నీతి ఆయోగ్‌ సూచించింది. 50శాతం షేర్‌ హోల్డింగ్‌ కన్నా తక్కువ శాతాన్ని ప్రైవేటీకరించినప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సంస్థ కొనసాగుతుంది. సదరు సంస్థకు మార్కెట్‌లో షేర్‌ వాల్యూ ప్రకారం కొంత ధనం చేకూరుతుంది. ప్రభుత్వరంగ సంస్థను అమ్మినపుడు, మేనేజ్‌మెంట్‌ మార్పిడి జరిగినపుడు సదరు సంస్థ రిజర్వ్‌ ప్రైస్‌ లెక్కించేటప్పుడు,ఆసంస్థకు ఉన్నభూమి, ఇతర భౌతిక ఆస్తుల మార్కెట్‌ విలువను కూడా జోడిరచాలని డిజిన్వెస్ట్‌మెంట్‌ కమిషన్‌ సూచించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తి కాంత దాస్‌ 2016 మార్చి4నచేసిన ఒక ప్రకటనలో పిఎస్‌యుని అమ్మేస్తున్నప్పుడు సందర్భంలో, యాజ మాన్యం ప్రభుత్వం నుంచి కొనుగోలుదారునికి మారిన సందర్భంలో భూమి విలువను కూడా రిజర్వ్‌ప్రైస్‌లో చేర్చుతామని స్పష్టంగా చెప్పారు. అయితే మోదీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌, బిపిసిఎల్‌ వంటి పలు సంస్థల స్ట్రాటజిక్‌ అమ్మకాల విషయంలో ఈసూత్రాన్ని విస్మరించడం పలు అను మానాలకు తావిస్తోంది. విమానాశ్రయాల ప్రైవేటీకరణ సందర్భంగా ఒకే సంస్థకు రెండిరటిని మించి ఇవ్వరాదని ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫారసును ప్రక్కనపెట్టి గౌతమ్‌ అదానీకి 6 ఎయిర్‌ పోర్టులను కట్టబెట్టడం, సిబిఐతో దాడులు నిర్వ హించి ప్రైవేట్‌ సంస్థ యాజమాన్యాలను భయపెట్టి సదరు సంస్థలను అదానీ ఖాతాలోకి వెళ్ళేట్లు కృషిచేయడం వంటి కారణాలవల్ల ఆ రెండు సంస్థ లను గౌతమ్‌అదానీ,ముఖేష్‌అంబానీ,అనిల్‌ అంబా నీలకు కట్టబెట్టేందుకే మోదీ ప్రభుత్వం కృతనిశ్చ యంతో ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు.
ప్రజల సుదీర్ఘ పోరాటం, ఎంపీలు, ఎంఎల్‌ఎల రాజీనామాలు,32మంది ఆంధ్రుల ప్రాణత్యాగం ఫలితంగా ఏర్పాటైన ఉక్కు ఫ్యాక్టరీని ఈనాడు నూటికి నూరుశాతం అమ్మివేయడం గానీ, మూసివేయడం గానీ జరుగుతుందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ పదేపదే ప్రకటిస్తున్నారు. దాదాపు 30వేలఎకరాలు స్టీల్‌ప్లాంట్‌ కిందఉంది. ఆభూమి బుక్‌వాల్యూను రూ.56 కోట్లుగా ప్రభుత్వం లెక్కవేస్తోంది.మార్కెట్‌ విలువ కనీసం రూ.60 వేల కోట్లు ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ రిజర్వ్‌ప్రైస్‌ గురించి సమా చారాన్ని కేంద్రం ప్రకటించకపోవటం దుర్మార్గం. అలాగే లక్షలకోట్లు రూపాయల ఆస్తులతో వేలకోట్లు లాభాలను ఆర్జిస్తున్న 2వ అతి పెద్ద చమురు సంస్థ బిపిసిఎల్‌ను కొద్ది వేలకోట్ల రూపాయలకే అమ్మి వేయాలనుకోవడం అత్యంత దురదృష్టకరం. ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ద్వారా లభించే ధనాన్ని తిరిగి నూతనంగా మౌలిక వసతులు కల్పించేందు కు, విద్యా,వైద్యరంగాలలో ఖర్చుచేయడానికి విని యోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీర్ఘకాలం కిందట అత్యంత తక్కువ ధరలలో భూములను, పరిశ్రమలను,మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుని, అభివృద్ధి చేసినవాటిని 25 నుంచి 50 సంవత్సరాల కాలవ్యవధితో కారుచౌకగా బదలాయిస్తూ, ఇప్పుడు కొత్తగా మౌలిక వసతులను పెంపొందిస్తామని చెప్పడం కంటే నయవంచన మరొకటి ఉండదు. మోదీ ప్రభుత్వం ఇంతవేగంగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్మాలనుకోవడం,‘మానిటైజేషన్‌ పై ప్‌లైన్‌’ అమలుచేయాలనుకోవడానికి బలమైన కారణం ఉంది. యుపిఎ ప్రభుత్వంలో కంటే మోదీ ప్రభుత్వంలో బడా కార్పొరేట్‌ సంస్థలకు చాలా హెచ్చుస్థాయిలో రుణాల మంజూరు ప్రక్రియ కొనసాగడమే కాక మొండిబాకీల పరిమాణం చాలా అధిక స్థాయికి చేరింది. 2013-14నాటికి బ్యాం కులకు తిరిగి రాకపోవచ్చని భావించిన రుణాల మొత్తంరూ.2.05 లక్షల కోట్లు ఉండగా 2018–19 నాటికి ఆ మొత్తం 11.73లక్షల కోట్లకు పెరిగింది. మనదేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా బట్వాడా అవుతున్న రూ.100రుణంలో రూ.16లు కేవలం 20 అధిక స్థాయి రుణగ్రహీతల ఖాతాలకు వెళ్తోంది. 2018-19లో కూడా ఈ 20 ఖాతాల మొత్తం రుణాల పరిమాణం రూ10.94 లక్షల కోట్ల నుంచి రూ.13.55 లక్షల కోట్లకు పెరిగింది. మొత్తం పారిశ్రామిక రంగంలో ఉన్న10కోట్ల చిన్న, సూక్ష్మ,మధ్య తరహా పరిశ్రమలలో 30 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. భారీపరిశ్రమల రంగం లో కేవలం 1 కోటి మందికి ఉపాధి లభిస్తోంది. భారీ పారిశ్రామికరంగానికి రూ.24 లక్షల కోట్లు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు 3.75 లక్షల కోట్లు, మధ్యతరహా పరిశ్రమలకు రూ 1.06 లక్షల కోట్లు రుణం లభించింది. మొత్తం పారిశ్రామికరంగానికి అందిన రుణ సదుపాయంలో 50శాతం పైన ఈ 20అధికస్థాయి రుణగ్రహీతలకు లభించడం ఆశ్చర్యకరం. కార్పొరేట్లు లక్షల కోట్ల రూపాయలు తిరిగి చెల్లించనందున కేంద్రప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంకు ద్వారా బ్యాంకులకు ‘క్యాపిటల్‌ ఇన్‌ఫ్యూ జన్‌’ చేస్తూ ఉంటుంది. యుపిఎ ప్రభుత్వం ఏడేళ్ల లో రూ.68,000 కోట్లు బ్యాంకులకు అందచేయగా మోదీ సర్కార్‌ కేవలం ఐదేళ్లలో రూ 3,20,000 కోట్లు ‘క్యాపిటల్‌ ఇన్‌ఫ్యూజన్‌’ కింద అందజేసింది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వ రుణభారం జూన్‌ 2019లో రూ 88లక్షల కోట్లు ఉండగా, జూన్‌ 2020 నాటికి రూ.101లక్షల కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం అడ్డగోలుగా లక్షలాది కోట్ల రూపాయల ప్రభుత్వరంగ ఆస్తులను, రిటైల్‌ ఫుడ్‌ రంగాన్ని బడా కార్పోరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోంది.బ్రిటీష్‌ హయాంలో పలు రూపా లలో భారతీయ సంపదను తరలించుకు పోయిన కారణంగానే, కొద్దిశతాబ్దాల క్రితం ప్రపం చంలోనే అత్యధిక జిడిపిగల భారత్‌, స్వాతంత్య్రం పొందే నాటికి ఆర్థికంగా క్షీణదశకు చేరుకుంది. ఒకవైపు రైతులకు, మరొక వైపున సంఘటితశక్తి ద్వారా దీర్ఘకాల పోరాటాల ద్వారా శ్రామికవర్గం సాధించు కున్న ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ నాలుగు లేబర్‌కోడ్‌లను తీసుకురావడం, మరొకవంక అత్యధికస్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొ రేట్లకు కట్టబెట్టడం వంటి దుర్విధానాల వల్ల కోట్లాది ప్రజానీకం ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఎంతైనా ఉంది. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుని, ఇప్పుడు రైతులు, పారిశ్రామిక కార్మికులు, ప్రజాసంఘాలు యావన్మంది ఏకమై, మానిటైజేషన్‌ ప్రక్రియకు అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. (వ్యాసకర్త:మాజీ వ్యవ సాయశాఖ మంత్రి, మాజీ లోక్‌ సభ సభ్యులు)
‘సామాన్యులపై ప్రభావం ఏమిటో చెప్పడం లేదు’
` ప్రొ.బిశ్వజిత్‌ ధర్‌
విలువైన ఆస్తులను మానిటైజ్‌ చేస్తే దాని పర్యవసానాలు ఏవిధంగా వుండబోతు న్నాయో సామాన్య ప్రజానీకానికి తెలియజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. వీటిని ప్రైవేటు రంగానికి అప్పజెప్తే వాళ్ళు వీటినితమ లాభాల కోసం నడుపు తారే తప్ప ప్రజల ప్రయోజనాల కోసంకాదు. అంటే వీటి చార్జీలు గణనీయంగా పెరుగుతాయి. ఈ ఆస్తులను నిర్మించడం కోసం గతంలో ప్రజలు పన్నుల రూపంలో అదనపు భారం మో శారు. ఇకముందు ప్రైవేటు వ్యక్తుల లాభాల కోసం మరోసారి అదనపు భారాన్ని మోయవలసి వస్తుంది.
మానిటైజేషన్‌ అనే పదాన్ని వాడడం ప్రభు త్వానికి ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో ఎయిర్‌ ఇండియా, తదితర ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులను ఉపసంహరించే ప్రతిపాదనలను చేసినప్పుడు కూడా ఈ పదాన్ని ఉపయోగించారు. అందుచేత ఆస్తుల మానిటైజేషన్‌ అంటే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించడానికి పెట్టిన మరో పేరు మాత్రమే.
‘’పని చేస్తున్న’’ (పెర్‌ఫార్మింగ్‌) ఆస్తులను బద లాయించడం ద్వారా ‘’నిరర్ధకంగా’’ (ఐడిల్‌) వున్న పెట్టుబడిని విడుదల చేసి ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించి ‘’అదనపు ప్రయోజనా లను పొందుతాం’’- ఇది నీతి ఆయోగ్‌ నివేదిక మానిటైజేషన్‌ గురించి ఇచ్చిన వివరణ. ఇక్కడ మొదటి సందేహం : పని చేస్తున్న ఆస్తులైతే నిరర్ధకం గా ఎలా ఉంటాయి? ఒకవేళ నిరర్ధకంగా ఉంటే పని చేస్తున్నట్టు ఎలా ఔతుంది? ఈ రెండిరట్లో ఏదో ఒకటే సాధ్యం. రెండు పరస్పర విరుద్ధమైన పదాలను- ‘’పని చేస్తున్న’’, ‘’నిరర్ధక’’ ఒకే వాక్యంలో కలిపి చెప్పడం తప్పుదోవ పట్టించడం కాదా?
రెండో సందేహం : ఈ ‘’అదనపు ప్రయోజనాలు’’ సామాన్య ప్రజలకు అందుతాయని ఆశించగలమా? మూడవది : ఇలా టాక్స్‌ పేయర్ల సొమ్ముతో సమ కూరిన ఆస్తులను ప్రైవేటువారికి అప్పజెప్పే బదులు ఇతర మార్గాల ద్వారా వనరులను సమీకరించడం సాధ్యం కాదా ? మానిటైజేషన్‌ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ‘’పని చేస్తున్న’’ ఆస్తులలో 26,700 కి.మీ. జాతీయ రహదారులు,400 రైల్వే స్టేషన్లు, 90పాసింజర్‌ రైళ్ళు, డార్జిలింగ్‌ హిమా లయన్‌ రైల్వే తో సహా నాలుగు పర్వత ప్రాంత రైల్వేలు ఉన్నాయి. ఇవిగాక ప్రభుత్వ రంగంలోని టెలికాం, విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌, పెట్రోలియం, పెట్రో ఉత్పత్తులు, సహజవాయువు పైప్‌ లైన్లు ఉన్నాయి. ఇటువంటి అత్యంత విలువైన జాతి సంపదను ఆ జాబితాలో చేర్చకుంటే ప్రైవేటు కార్పొరేట్లు మానిటైజేషన్‌ వైపు కన్నెత్తి కూడా చూడరు.
ఇవన్నీ ‘’నిరర్ధక ఆస్తులు’’ కానే కావు.
ఇటువంటి విలువైన ఆస్తులను మానిటై జ్‌ చేస్తే దాని పర్యవసానాలు ఏవిధంగా వుండ బోతు న్నాయో సామాన్య ప్రజానీకానికి తెలియ జేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా చెల్లిస్తున్న పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఈ ఆస్తులను ప్రభుత్వం సమకూర్చింది. వీటి నిర్వహణలో ప్రజల ప్రయోజ నాలు చాలా ఉన్నాయి. ఇక ఇంతవరకూ వీటిని ప్రభుత్వం నిర్వహించింది గనుక ప్రజల ప్రయోజ నాలను దృష్టిలో వుంచుకుని వీటిని నిర్వహించింది. అందుకే వీటి ద్వారా వసూలు చేసే చార్జీలు ప్రజ లకు అందుబాటులో వుండేటట్లున్నాయి. ఇక ముం దు వీటిని ప్రైవేటు రంగానికి అప్పజెప్తే వాళ్ళు వీటిని తమ లాభాలకోసం నడుపుతారే తప్ప ప్రజల ప్రయోజనాల కోసంకాదు. అంటే వీటి చార్జీలు గణనీయంగా పెరుగుతాయి. ఈ ఆస్తులను నిర్మించడం కోసం గతంలో ప్రజలు పన్నుల రూపంలో అదనపు భారం మోశారు. ఇకముందు ప్రైవేటు వ్యక్తుల లాభాల కోసం మరోసారి అదనపు భారాన్ని మోయవలసి వస్తుంది. ఒకసారి ప్రైవేటు పరం అయ్యాక వీటిధరలను నియంత్రించే అధి కారాన్ని ప్రభుత్వం కోల్పోతుంది. అలా కాకుండా వీటి ధరలను ప్రభుత్వం అప్పుడు కూడా నియంత్రిం చాలనుకుంటే ఆ మేరకు ప్రభుత్వమే ఆ కంపెనీలకు సబ్సిడీ రూపంలో ముట్టజెప్పవలసి వుంటుంది.
ఢల్లీి అనుభవం ఏమిటి ?
దేశ రాజధాని ఢల్లీి లో విద్యుత్‌ పంపి ణీని గతంలో కాంగ్రెస్‌ హయాంలో ప్రైవేటీకరిం చారు. ఆ తర్వాత పెరిగిన విద్యుత్‌ చార్జీలు పేదలే కాకుండా మధ్య తరగతి సైతం మోయలేనంతగా గుదిబండగా మారాయి. అప్పుడు ప్రజలకు చౌకగా విద్యుత్‌ అందిస్తామని హామీ ఇచ్చి ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారం లోకి వచ్చింది. విద్యుత్‌ చార్జీలను తగ్గించింది. ఆ తగ్గించిన మేరకు ప్రైవేటు విద్యుత పంపిణీ సంస్థలకు సబ్సిడీ ఇస్తోంది. ఆ సబ్సిడీని ప్రజల నుండివసూలు చేసిన పన్నుల ద్వారా చెల్లిస్తోంది. ఢల్లీి ప్రజలు పెరిగిన విద్యుత్‌ చార్జీల రూపంలోనో,కాకుంటే అదనపు పన్నుల రూపం లోనో భారాం అదనంగా మోయక తప్పడం లేదు. ప్రైవేటు కంపెనీలు మాత్రం దర్జాగా లాభాలు పోగేసుకుంటున్నాయి.
ఆదాయం సమకూర్చుకునే మార్గాలు వేరే లేవా ?
మన దేశ జిడిపికి,వసూలు చేసే పన్నులకు మధ్య నిష్పత్తి 2019-20లో17.4 శాతంగా ఉంది. ఇది ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే చాలా తక్కువ. అందుచేత అదనంగా సంపన్నుల మీద పన్ను పెంచవచ్చు. అంతే కాదు, ఈ ప్రైవేటు కంపెనీలు ఎగవేస్తున్న పన్నుల మాటేమిటి?కంపెనీలకు వస్తున్న లాభాలను, అవి చెల్లిస్తున్న పన్నులను ప్రభుత్వం ప్రచురిస్తున్న గణాంకాల ద్వారా తెలుసుకోవచ్చు. 2005-2006 లో40శాతం ప్రైవేటు కంపెనీలు తమకు ఎటు వంటి లాభాలూ రాలేదని ప్రకటించాయి. అదే 2018-19 నాటికి ఏకంగా 51 శాతం కంపెనీలు తమకు ఏలాభాలూ రావడం లేదని ప్రకటించాయి. ఒక కోటి రూ., లేదా అంతకన్నా తక్కువ లాభాలు వచ్చే కంపెనీల శాతం 2005-2006లో 55గా ఉంది. అదికాస్తా 2018-19 నాటికి 43 శాతానికి పడిపోయింది. అంటే దేశంలోని బడా ప్రైవేటు కంపెనీలు చట్టాలలోని లొసుగులను ఉపయోగించు కుని తక్కువ లాభాలను చూపిస్తూ పన్నులు చెల్లించ కుండా తప్పించుకుంటున్నాయి. ప్రభుత్వం పక్కాగా చట్టాలను రూపొందించి పన్నులను వసూలు చేస్తే అదనపు ఆదాయం సమకూరుతుంది.ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు ? అంతే కాదు, ప్రభుత్వ రంగ సంస్థల అసమర్ధత గురించి నీతిఆయోగ్‌ పదే పదే మాట్లాడుతూ వుంటుంది. కాని వాస్తవం వేరు.బడా ప్రైవేటు కంపెనీల్లో నష్టాల్లో నడుస్తున్నవి 51 శాతం. అదే ప్రభుత్వ రంగ సంస్థల్లో నష్టాల్లో నడుస్తున్నవి 28 శాతం. ఎవరి సామర్ధ్యం ఎక్కువ? ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తే పెరిగేవి లాభాలా?లేకనష్టాలా?ఈమాత్రం ఆలోచించ లేకపోతోందా ఈ ప్రభుత్వం?
( వ్యాసకర్త – జెఎన్‌ యు ‘సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ స్టడీస్‌’ లో ప్రొఫెసర్‌)/ ‘ది హిందూ’ సౌజన్యంతో
వడ్డే శోభనాద్రీశ్వరరావు

1 2