కోయ సంగీతం..రేలా నృత్యం

కోయలు సామూహికంగా జరుపుకొనే భూమి పండుగ, ముత్యాలమ్మ పండుగ, కొలుపు, తాటిచెట్ల పండుగ, లేలే పండుగ, వేల్పుల పండుగతో పాటు వివాహాది కార్యక్రమాలలో సాంప్రదాయ నృత్యాలు చేస్తారు. కోయలు ఇప్ప సారాయితో పాటు తాటి, జీలుగు చెట్ల నుండి కూడా కల్లు తీసి స్త్రీ పురుషులం దరు సేవించి ఆ నిషాలో అందరూ కలిసి కేరింతల మధ్య ఆనందంగా నృత్యాలు చేస్తారు.
సంగీత వాయిద్యాలు

ఆదిమ కోయ జాతులు పూర్వం రాళ్లతో, కర్రలతో శబ్దాలు చేసేవారు. ఒక గుంపు నుండి మరో గుంపుకు సందేశాలు అందిం చడం లాంటివి, తమను రక్షించుకోనే క్రమాలలో శబ్ద తరంగిణులను చేసుకునేవారు. క్రమంగా జంతువుల చర్మాలు ఒలిచి ఎండ పెట్టి వాటిని డోలు, డప్పులుగా చేసి శబ్ద తరంగిణులు చేసుకునేవారు. వారు ఏద్కెనా విజయం సాధించినప్పుడు ఈ శబ్దాలు చేసుకుంటూ గంతులు వేసుకుంటూ వినోద కార్యక్రమాలు జరుపుకునేవారు. కాలక్రమంలో కోయజాతుల సాంప్రదాయం అభివృద్ధిలోకి వచ్చాక ఏసందర్భంలో ఏశబ్ద తరంగిణులు కావాలో,ఎలాంటి సంగీత వాయిద్యాలు వాడాలో,సహజ సిద్ధంగా వారి పరిసరాలలో లభించే వస్తువులతో సంగీత వాయిద్యాలను వారే స్వతహాగా కళాత్మకంగా తయారు చేసు కున్నారు,వీటిని పండుగలలో పెళ్ళిళ్లలో, చావు లలో,దినాలల్లో,జాతర్లలో,వేటలో,కొలు పుల్లో, విందులు-వినోదాలలో ఈ సంగీత వాయి ద్యాలు ఉపయోగిస్తున్నారు.
అందె: దీన్ని ఇనుముతో చేసి,లోపల చిన్న చిన్న గట్టివి గుండ్రనివి రాళ్ళ ముక్కలు లేదా ఇనుప ముక్కలు వేస్తారు.వీటితో అడుగు కదిలినప్పుడు శబ్దంవస్తుంది,దీన్ని మగవారు కాలికి తొడుక్కొని నృత్యాలు చేస్తారు. అడు గుకు అందె సవ్వడితోఆనృత్యం కొనసాగు తుంది.
డోలు కొయ్య: సుమారు మూడు అడుగుల పొడవు కలిగి,కుడి ప్రక్క అడుగు,ఎడమ వారం కలిగి ఉండే శబ్ద తరంగిణి.దీన్ని వేగిస చెట్టు గుల్లను చెక్కి, డోలుగా చేసి దీన్ని రెండు వైపులా మేక చర్మం కుడి వైపు,గొడ్డు చర్మం ఎడమ వైపుతో మూస్తారు.ఈ డోలును చర్మం తాడుతో బిగించి కడతారు.ఈ డోలును నృత్యం చేసేటప్పుడు మగవారు మెడలో వేసుకొని కుడివైపు చేతితో,ఎడమవైపు సిర్ల కర్రతో వాయిస్తారు. దీన్ని ఆయా సంద ర్భాలలో ఉపయోగించే ప్రధాన సాంప్రదాయ సంగీత వాయిద్యం.
తూత కొమ్ము -అక్కుం : దీన్ని అడవి దున్న కొమ్ము తో తయారు చేసుకుంటారు. అడుగు న్నర పొడవు కలిగి ఉండి అర్ధ చంద్రా కారంలో ఉంటుంది,ఊదేవైపు సన్నగాను మరోవైపు వెడల్పుగాను ఉంటుంది. దీన్ని ఊదినప్పుడు శబ్ధ సంగీతం వస్తుంది. దీన్ని సాంప్రదాయ నృత్యాలు, వేట మొదల్కెన సందర్భాలలో ఉపయోగిస్తారు. వీటిని తాటాకులతో కూడా తయారు చేసుకుంటారు. అక్కుంను ఇత్తడి లేదా ‘డాక్రామెటల్‌’తో తయారు చేస్తారు.సాధారణంగా ఇది తూత కొమ్ము ఆకారాన్ని కలిగి ఉంటుంది. దీని ఎడమవైపు సన్నగ ఉండి ఆ భాగంలో ఊదటానికి అనుకూలంగా రంధ్రం చేస్తారు. దీని క్రింది భాగం చివరి వరకు చూడటానికి కళాత్మకంగా గజ్జెలు అమర్చుతారు. దీని రంధ్రం నుండి ఊదితే అద్భుతమైన శబ్ద తరంగం వస్తుంది. కోయ జాతులు దీన్ని ప్రత్యేకంగా వేల్పులు-కొల్పులలో మాత్రమే ఉపయోగిస్తారు. కోయవారి సాంప్రదాయంలో అక్కుం ప్రత్యేక చారిత్రక సంస్కృతికి స్థానం పొందిన సంగీత వాయిద్యం.దీన్ని పూజ వస్తువుగా వినియోగిస్తారు.
కోయలు ప్రధానంగా ఐదు రకాల సాంప్రదాయ నృత్యాలు చేయడం కనిపిస్తుంది. అవి: రేలా నృత్యం,డోలి / మేళం నృత్యం, కొమ్ము నృత్యం,కురై నృత్యం,కోలాటం.
1.రేలా నృత్యం
కోయలు మూడు రకాల రేల నృత్యాలు చేస్తారు.ఈ రేల నృత్యాలలో 30నుండి 40 మంది వరకు స్త్రీ పురుషులు పాల్గొంటారు. స్త్రీ జట్టుకు ఒక నాయకురాలు, పురుషుల జట్టుకు ఒక నాయకుడు ముందు ఉండి ఈ నృత్యాలను చేస్తుంటారు. ఒక రకమైన పద్ధతిలో స్త్రీ పురుషులు పాటలు పాడుతూ ఒకరి నడుముపై ఒకరు చేతులు వేసి పాటకు అనుగుణంగా లయబద్ధంగా అడుగులు వేస్తూ వలయాకారంగా తిరుగుతూ నృత్యం చేస్తారు. ఇంకో రకమైన పద్ధతిలో స్త్రీ పురుషులు విడివిడిగా వలయాకారంగా నిలబడి, ఎవరి చేతులతో వారే చప్పట్లు కొడుతూ ముందుకు మూడు అడుగులు వేసి, వెనుకకు మూడు అడుగులు వేస్తూ పాటకు అనుగుణంగా నృత్యం చేస్తారు. మరో రకమైన పద్ధతిలో వలయాకారంగా విడివిడిగా నిలబడి అడుగులు వేస్తూ నృత్యం చేస్తూ తమ చేతులను ఇరు ప్రక్కలకు మార్చి మార్చి చప్పట్లు కొడతారు.ఈ ఆట కోలాటం మాదిరిగా ఉంటుంది. భూమి పండుగ సమయంలో గ్రామంలోని పురుషులందరు సామూహికంగా వేటకు వెళ్ళి ఏదో ఒక అడవి జంతువును వేటాడి తీసుకు వస్తారు. పురుషులు అడవి నుండి తిరిగి వచ్చేంత వరకు గ్రామంలోని స్త్రీలు రేల పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. స్త్రీలు ఒకరి భుజాలు ఒకరు పట్టుకొని వలయాకారంగా తిరుగుతూ రేల నాట్యం చేస్తారు. సాంప్ర దాయ దుస్తులు ధరిస్తారు. అడ్డ కట్టుగా మోకాళ్ళ వరకు చీర కట్టి కుడివైపు పైట వేసుకుంటారు.శిరోజాలను అందమైన కొప్పులుగా (కూపారు ముడి) ముడుస్తారు. తలపై పక్షుల ఈకలను ధరిస్తారు. పండుగ, వివాహము, జాతర్లు, వెన్నెల రోజుల్లో ఆనందంగా మైమరచి చేసే కోయ యువతుల నృత్య భంగిమలు బహు ఆకర్షణీయంగా ఉంటాయి. వారు పాడే రేల పాటలలో రేల అంటే ‘‘వెన్నెల’’అని అర్ధం.వారి జాతి కూడా రేల చెట్టు క్రిందనే జన్మించిందనే భావం కూడ ఉంది.
ఒక రేల పాట రేలా రేలయ్యో రేలా రేలా రేరేలా
సన్నబాదు చెల్లెలే లారిదాదా ఎలో చెలో బొలో చెలే లారిదాదా వీరలరాజు చెల్లెలే లారిదాదా ఎలో చెలో బొలో చెలే లారిదాదా అద్దమన్నా నత్థింకే లారిదాదా ఎలో చెలో బొలో చెలే లారీదాదా దాని లేబరేయ్యానో లారిదాదా ఎలో చెలో బొలో చెలే లారిదాదా దానితోడు చెల్లెలే లారిదాదా ఎలో చెలో బొలో చెలే లారిదాదా ముత్త లచ్చు చెల్లెలే లారిదాదా ఎలో చెలో బొలో చెలే లారిదాదా ముత్తల జానకి చెల్లెలే లారి దాదా ఎలో చెలో బొలో చెలే లారిదాదా
రేలా రేలా రేరేలా.. రేలా రేలా రేరేలా…. రేలా రేలా రేరేలా.. రేలా రేలా రేరేలా… రేలా రేలా రేరేలా… రేలా రేలా రేరేలా.. రేలా రేలా రేరేలా… లచ్చల నీరు చెల్లెలే లారీదాదా ఎలో చెలో బొలో చెలే లారీదాదా లచ్చల రాజు చెల్లెలే లారీదాబా ఎలో చెలో లొలో చెలే లారీదారా రేలా రేలా రేరేలా రేలా రేలా రేరేలా డోలి నృత్యం
కోయ సంఘ వ్యవస్థను ఐదుగురు వ్యక్తులు నడిపిస్తారు.వారు:దొర,పటేల్‌,వడ్డె,అడితి బిడ్డ, తలపతి.దొర,పటేల్‌ అనుమతి మేరకు తలపతి ఆధ్వర్యంలో వడ్డె ఇలవేలుపు (దేవత) కొలు పును నిర్వహించగా అడితి బిడ్డ డోలి అనే వాయిద్యాన్ని వాయిస్తూ, పాటలు పాడుతూ పడిగె (చిత్రపటం) ఆధారంగా కోయల చారిత్రక గాథలను వల్లిస్తాడు. ఇలవేల్పును గుట్టపై నుండి జాతర స్థలానికి ఎదుర్కోవ డానికి, మళ్ళీ తిరిగి సాగనంపడానికి డోలి కోయలే ముందుండి వాయిస్తారు. ఈ సంద ర్భంగా వీరు పాటలు పాడుతూ వాద్య శబ్దానికి అనుగుణంగా వలయాకారంలో తిరుగుతూ నృత్యం కూడా చేస్తారు. 2020 సంవత్సరపు మేడారం జాతర నుండి డోలి కోయలది ఒక ప్రత్యేక నృత్యంగా పేరు సంపాదించుకుంది. ఇలాంటి డోలి కోయ కళాకారుడు సకినె రామచంద్రయ్యకు భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి సత్కరించింది.
కొమ్ము నృత్యం
కోయలు అడవి దున్నపోతు (గొర్రపోతు) కొమ్ములతో తయారు చేసుకున్న ‘సింగ’ అను శిరస్త్రాణము (టోపి) ధరిస్తారు. తాటాకులతో తలపైన బోర్లించుకునే పరిమాణంతో సింగ తయారు చేస్తారు. దాని పై మధ్య భాగంలో జానెడు ఎత్తు ఉండేటట్లు తుంచిన నెమలి ఈకలను చెక్కుతారు. సింగకు కుడి, ఎడమ వైపుల కొమ్ములను అమర్చుతారు. తాటాకులు కనపడకుండా ముదురు రంగు (పచ్చ లేదా ఎరుపు) చీరను (పెర్మ కోక) చుట్టుతారు. నెమలి పురికట్ట, కొమ్ముల చుట్టూ చుట్టగా మిగిలిన చీరను సింగ వెనుక వైపుకు వదులుతారు. ఇలా తయారైన సింగను నర్తకుడు ధరించినప్పుడు అతని తలపై నెమలి ఈకల కట్ట, కొమ్ముల జత, నర్తకుని వెనుక తల వెనుక వీపు మీదుగా కొంకులపై వేళ్ళాడుతున్న చీర మడత మాత్రమే కనిపిస్తాయి -అందంగా. ఇలా పెద్ద కోక ధరించిన నర్తకులు చేసే నర్తనం కాబట్టి దీనిని పెర్మ కోక ఆట అని కూడా పిలుస్తారేమో. ఈ నర్తకులు పూర్వ కాలంలో కేవలం ధోతిని మాత్రమే ధరించేవారనిపిస్తుంది. కాని గత రెండు, మూడు దశాబ్దాల కాలంలో వీరు చేతులు లేని బనియన్‌ లేదా టీ-షర్ట్‌, నడుము భాగం నుంచి కిందికేమో గీతల లంగాను ధరించడం అలవాటు చేసుకున్నారు. ప్రతీ పురుష నర్తకుడు తన ఎడమ భుజం మీదుగా కుడి కాలుపై వేలాడే విధంగా నాలుగు అడుగుల పొడవైన డోలకొయ్య (గండ్జ)ను ధరిస్తాడు. గండ్జను గుమ్ముడు చెట్టు దుంగతో తయారు చేస్తారు. దుంగ మధ్యలో ఫీటు, ఫీటున్నర వ్యాసంతో బోలు చేసి,ఆ బోలును ఒక వైపు ఆవు తోలుతోన,మరో వైపు హన్మబండ (అలబండ) తోలుతో మూస్తారు. ఆవు తోలుతో మూసిన వైపు అడుగు పొడవుండే చిర్ర (కట్టె)తో వాయిస్తారు, హన్మ బండ తోలుతో మూసిన వైపు ఎడమ చేతితో వాయిస్తారు. చిర్ర మొదట్లో చిన్న రంధ్రం చేసి,దాని గుండా ఒక ఇనుప రింగును దూర్చి, దానికి మువ్వలు కూర్చుతారు – వాయిస్తు న్నప్పుడు వినసొంపైన శబ్దం రావడానికి. అందరూ కాళ్ళకు అందెలు ధరిస్తారు. నర్తకుల మధ్యలో ప్రధాన పాటగాడు (మేస్త్రీ) ఉండి రేల పాటలు పాడుతూ నృత్యానికి నాయకత్వం వహిస్తాడు. పాటగాడు చిర్రతో బీటు మారిస్తే మిగతా నర్తకులు కూడా బీటు మార్చి, నృత్యాన్ని మారుస్తూ అనుసరిస్తారు. మధ్య మధ్య ముసారి కొమ్ము (తూత కొమ్ము /అడవిదున్న కొమ్ము) ను ఊదుతూ హుషారు గొలిపే శబ్దాలు చేస్తారు. నాట్యం చేసే సమయంలో ఈ ముసారి కొమ్మును భుజానికి తగిలించుకుంటారు. వారి నాట్యంలో భాగంగా అడవి దున్నపోతుల పోరాటం (పెర్మాం) ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేక్షకులు భూమి మీద వేసిన రూపాయల నోట్లను లేదా కాగితపు ముక్కలను తాము ధరించిన అడవి దున్న కొమ్ము కొనలతో గుచ్చి పైకి తీయడం వంటి చిత్ర విచిత్రమైన కళలను ప్రదర్శిస్తారు. ఇలాంటి నృత్యాలు పూర్వ కాలంలో మనుగడ సాగించినా మధ్యలో కోయల ఆర్థిక స్థితి దిగజారిన కాలంలో కనుమరుగయ్యాయి. కాబట్టి ఇలాంటి నృత్యం తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలంలోని పండ్రపోల పంచాయితీలోని కోయదొర కులస్థులకు మాత్రమే వచ్చు అని 2016 లో మైపతి అరుణ్‌ కుమార్‌ రాశాడు. కాని ఆ తరువాత తెలంగాణలోని అశ్వాపురం మండలం కోయ రంగాపురం, ఏటూరునాగారం దగ్గరి చినబోయినపల్లి మొదల్కెన గ్రామాల కోయలు ఈ నృత్యాన్ని నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ నృత్యాన్ని మేడారం జాతరతో పాటు గంగాలమ్మ, కొండరాజులు, పసరుబోలి, పప్పుకొత్త,పలకం,బడ్డి మొదల్కెన పండుగలు, వివాహాది శుభకార్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శిస్తున్నారు.
కుర్రె నృత్యం
సందర్భాన్ని బట్టి 20నుండి 30మంది పురుషుల వరకు కుర్రె నృత్యంలో పాల్గొంటారు. రెండు సన్నాయిలు, మూడు మేళాలు ఈనృత్యంలో ప్రధాన సంగీత వాయిద్యాలుగా ఉపయోగిస్తారు. పంచ, బనీను ధరించి తలకట్టు కట్టుకొని, చేతిలో తువ్వాలు పట్టుకొని కాళ్లకు గజ్జలు ధరించి వలయాకారంగా సంగీత వాద్య శబ్దాలు అనుగుణంగా నృత్యాలు చేస్తారు. ఒకరి భుజంపై మరొకరు చేతులు వేసి బృంద నాయకుని సైగలను అనుసరించి ఈ నృత్యాలు చేస్తారు.
కోలాటం
గ్రామాలలో పురుషులు రెండు చేతుల్లో రెండు కోలలు ధరించి పరస్పరం ఒకరి కోలలను ఒకరు కొట్టుకుంటూ పాటలు పాడుతూ వలయా కారంలో నృత్యం చేసే కోలాటం ఆట కోయలలో కూడా ఉంది. అలాగే కోయ స్త్రీలు కూడా ఈ ఆటను ఆడుతుంటారు. (తెలంగాణ మాస పత్రిక సౌజన్యంతో..)- (డా. ద్యావనపల్లి సత్యనారాయణ)

మహిళా బిల్లుకు ఆమోదం

దీంతో తమ పని సులువైపోతుందని, పితృస్వామ్యపు తుట్టెను కదపకుండానే, తమకు రావాల్సిన ఓట్లు వచ్చేస్తాయని బిజెపి, ప్రధాని గట్టి నమ్మకంతో వున్నట్లు కనిపిస్తోంది. కానీ కచ్చితంగా ఇదేదీ జరిగేది కాదు. దేశవ్యాప్తంగా మహిళలందరూ సంతోషంతో పొంగి పోయేం దుకు ఇందులో ఏమీ లేదని,నిజానికి మోస పోయామని భావిస్తున్నారు. పార్లమెంట్‌లో కానీ, రాష్ట్రాల అసెంబ్లీల్లో గానీ తమ సంఖ్య పెరగ కుండానే మరో సార్వత్రిక ఎన్నిక, అనేక రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయనే క్రూరమైన వాస్తవం వారి కళ్ళ ముందుంచబడిరది.
మహిళా రిజర్వేషన్‌ వాస్తవ రూపం దాల్చడానికి జనాభా లెక్కల నిర్వహణ లేదా పునర్విభజన ప్రక్రియ ఏదీ అవసరం లేదు. బిల్లు ను ఆమోదించిన తక్షణమే రిజర్వేషన్‌ను అమలు చేయవచ్చు,జనగణన,పునర్విభజన ప్రక్రి యలు నిర్వహించినపుడు సీట్ల సంఖ్య ఆ దామాషా ప్రకారం పెరుగుతాయి. కానీ, ప్రజాప్రతినిధు లుగా ఎన్నుకునేందుకు మహిళలకు గల హక్కును మరికొన్ని సంవత్సరాల పాటు నిరాకరించడానికి వీటిని ముందుకు తీసుకువచ్చారు.
ఇరవైఏడు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు ఎంతగానో అందరూ ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందింది. కానీ, ఇది ఆనందించే అంశంగా లేదు. ఇన్నేళ్ళూ, వరుసగా వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా ఈ బిల్లును చంపే యడానికే చూశాయి, ఉదాసీనతతో మూటగట్టి మూలన పెట్టడానికే ప్రయత్నిం చాయి. కానీ, వామపక్షాలు,ఐద్వాతో సహా కొన్ని మహిళా ఉద్యమ విభాగాలు మాత్రమే నిరంతరంగా పోరా డుతూ,ఈ బిల్లును సజీవంగా వుంచేందుకు పోరా టం, ప్రచారం చేస్తూ వచ్చాయి.
తాజా అధ్యాయంలో విషాదకరమైన అంశమేమంటే, బిల్లు ఆమోద ముద్ర పొందినా, దీని అమలు మాత్రం 2029 సార్వత్రిక ఎన్నికల వరకు, అది కూడా తీవ్రమైన స్థాయిలో ప్రశ్నించ దగ్గ కారణాలతో వాయిదా వేశారు. తదుపరి జన గణన ప్రక్రియ పూర్తయిన పిదప 2026లో సీట్ల పునర్విభజన ప్రారంభమైన తర్వాత మాత్రమే చట్టసభల్లో మహిళలకు సీట్ల రిజర్వేషన్‌ జరుగు తుందని ముసాయిదాబిల్లు పేర్కొంటోంది. మహి ళా రిజర్వేషన్‌ వాస్తవరూపం దాల్చడానికి జనాభా లెక్కల నిర్వహణ లేదా పునర్విభజన ప్రక్రియ ఏదీ అవసరం లేదు.బిల్లును ఆమోదించిన తక్షణ మే రిజర్వేషన్‌ను అమలు చేయవచ్చు, జనగణన, పునర్విభజన ప్రక్రియలు నిర్వహించి నపుడు సీట్ల సంఖ్య ఆదామాషా ప్రకారం పెరుగుతాయి. కానీ, ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకునేందుకు మహిళలకు గల హక్కును మరికొన్ని సంవత్సరాల పాటు నిరాకరించడానికి వీటిని ముందుకు తీసుకు వచ్చారు.మహిళా రిజర్వేషన్‌ బిల్లును బిజెపి క్రమం తప్పకుండా తన ఎన్నికల ప్రణాళికల్లో చేరుస్తూ వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లోగా అమలు చేస్తామంటూ 2014లోనే ఈదేశ మహి ళలకు హామీ ఇచ్చింది.ఆ రెండు ఎన్నికల తర్వాత లోక్‌సభలో బిజెపికి మెజారిటీ వచ్చింది. దాంతో ఈ బిల్లును తొక్కిపారేసింది. అధికారంలో వున్న తొమ్మిదేళ్లలో బిల్లును ఆమోదిస్తామన్న హామీని మాత్రం నెరవేర్చలేదు. ఇప్పుడు, రెండో పదవీ కాలం చివరిలో బిల్లును ప్రవేశ పెట్టింది. దీంతో తమ పని సులువైపోతుందని, పితృస్వామ్యపు తుట్టెను కదపకుండానే, తమకు రావాల్సిన ఓట్లు వచ్చేస్తాయని బిజెపి,ప్రధాని గట్టి నమ్మకంతో వున్నట్లు కనిపిస్తోంది. కానీ కచ్చితంగా ఇదేదీ జరిగేది కాదు. దేశవ్యాప్తంగా మహిళలందరూ సంతోషంతో పొంగిపోయేందుకు ఇందులో ఏమీ లేదని, నిజానికి మోసపోయామని భావిస్తున్నారు. పార్లమెంట్‌లో కానీ,రాష్ట్రాల అసెంబ్లీల్లో గానీ తమసంఖ్య పెరగకుండానే మరోసార్వత్రిక ఎన్నిక, అనేక రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయనే క్రూర మైన వాస్తవంవారి కళ్ళ ముందుంచ బడిరది.
మనకు స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ళలో, ప్రజాస్వామ్యానికి మూలాధారం అంటూ బిజెపి చెబుతున్న దానిలో లోక్‌సభలో మహిళల సీట్ల శాతం 5శాతం నుండి ఈనాటి 15 శాతా నికి మాత్రమే పెరిగింది. ఇది సిగ్గుపడాల్సిన వాస్తవంగా వుంది. ప్రపంచంలోని అనేక ఇతర దేశాలు మెరుగైన రికార్డును కలిగి వున్నాయి. పార్లమెంట్లకు ఎన్నికైన మహిళల సీట్ల సంఖ్య పరంగా చూస్తే భారత్‌ ఇరవయ్యవ స్థానంలో వుంది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇది మారవచ్చు, కానీ మారదు. మన దేశంలో మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తున్నారు, పైగా ప్రతి ఎన్నికతో ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది.
పైగా గాయాన్ని మరింత రేపేలా, ‘బిల్లు లక్ష్యాలు-కారణాలు’ను ప్రభుత్వం పేర్కొం ది. ‘’మహిళాసాధికారత, మహిళల నేతృ త్వంలో అభివృద్ధిద్వారా, మహిళల ఆర్థిక స్వాతం త్య్రం గణనీయంగా మెరుగు పరచబడిరది. విద్య, ఆరోగ్యానికి సమాన అవకాశాలు అందుబాటు లోకి వచ్చాయి. తద్వారా ‘నారీ శక్తి’కి పెద్ద పీట వేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఉజ్వల యోజన,స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద టాయి లెట్లకు అవకాశం, ముద్ర యోజన ద్వారా ఆర్థిక క్రమంలోకి తీసుకురావడం వంటి వివిధ చొరవల ద్వారా ముఖ్యంగా మహిళలకు ప్రశాంత జీవ నాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, మహిళల నిజమైన సాధికారతకు…నిర్ణయం తీసు కునే ప్రక్రియలో మహిళలు మరింత ఎక్కువగా పాల్గొనడం అవసరం. వారు విభిన్నమైన దృక్కో ణాలతో చట్టసభల్లో చర్చలు జరిపి, నిర్ణాయక క్రమాన్ని మరింత పరిపుష్టం చేసి, నాణ్యతగా మారుస్తారు.’’అని ప్రభుత్వం పేర్కొంది. ఉజ్వల యోజన అనేది లక్షలాదిమంది నిరుపేద మహి ళలపై క్రూరమైన జోక్‌గా మారిందని రుజువైంది. వివిధ సాంకేతిక అభ్యంతరాల కారణంగా వారికి ఉచితంగా సిలిండర్లు రావడం లేదు. దాంతో ఇప్పుడు అత్యంత వ్యయభరితంగా మారిన సిలిం డర్లను వారు కొనుగోలు చేయలేకపోతున్నారు. అలాగే,దేశంలో పలుప్రాంతాల్లో నిర్మించిన తర్వాత,పని చేస్తున్న టాయిలెట్ల సంఖ్యకు సంబం ధించి ప్రభుత్వం చెబుతున్న గొప్పలు కూడా కేవలం కాగితాలపైనే. కానీ, నిరుపేద మహిళల పారిశుధ్య పరిస్థితులు పెద్దగా మారలేదని, ఇంకా అలానే కొనసాగుతున్నాయనేది సిగ్గుచేటైన వాస్తవికతగా వుంది. చట్టసభల్లో మహిళల రిజర్వే షన్‌కు హామీ కల్పించే బిల్లు అమలుకు సుదీర్ఘ కాలం పట్టనుండడంతో… ఈ రాజ్యాంగ (128 వ సవరణ) బిల్లు-2023పై లోక్‌సభలో సుమారు 8గంటలపాటు చర్చ జరిగింది. ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, ఇద్దరు మాత్రం వ్యతిరేకంగా ఓటేశారు.
బిల్లుకు సంబంధించిన ముఖ్యాంశాలు
లోక్‌సభ,రాష్ట్రాల్లోని అసెంబ్లీలు,జాతీయ రాజ ధాని ప్రాంతం దిల్లీ అసెంబ్లీలో మూడో వంతు సీట్లు మహిళలకు రిజర్వ్‌ అవుతాయని ఈ బిల్లు చెబుతోంది.అంటే, 543 లోక్‌సభ స్థానాల్లో 181 సీట్లు మహిళలకు రిజర్వ్‌ చేస్తారు.పుదుచ్చేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు సీట్లు రిజర్వ్‌ చేయలేదు.
‘ఇంటి నుంచే మొదలవ్వొచ్చు..’
మూడు దశాబ్దాల నుంచీ మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతూ ఉంటే ఇప్పటికి ఆమోదించారు. దీనిపై ఇప్పుడు బాగా చర్చ జరుగుతోంది.అయితే,ఆంధ్రప్రదేశ్‌లో 2019లోనే వైసీపీ ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఆరిజర్వేషన్ల వల్లే నాకు జడ్పీటీసీ స్థానం లభించింది. కానీ, మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్‌లో మాత్రం ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వచ్చింది. ఇది పురుషాధిక్య సమాజం అనేది బహిరంగ రహస్యం. ఒక మహిళ ఎదుగుతుంది అంటే ఏ పురుషుడూ సహించడు. అది ఆమె ఇంటి నుంచే మొదలవ్వొచ్చు.సమాజంలో కావొచ్చు. వేరే ఎక్క డైనా కావొచ్చు.మేము ఇంతమంది ఉన్నప్పుడు, ఒకమహిళకు ఎందుకు ఇస్తారు? అనే దిశగా పురుషులు ప్రశ్నిస్తే మహిళలు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సవాళ్లు తట్టుకోని నిలబడగాలంటే ఈ రిజర్వేషన్లు మాకు ఒక హక్కులా, ఒక ఆయుధంలా పనిచేస్తాయి. మహిళలకు కచ్చితంగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే. ఎందుకంటే,ఒక కుటుంబం బాగుండాలంటే తన పిల్లలు, భర్త సరైన మార్గంలో వెళ్లాలంటే మహిళ పాత్ర చాలా కీలకం అనేది అందరికి తెలిసిన విషయం.కుటుంబం తరహాలోనే సామాజికంగా కూడా బ్యాలెన్స్‌ చేసి మహిళ పరిపాలన అందించ గలదని నేను గట్టిగా నమ్ముతాను. ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్‌ వల్ల 33 శాతం రిజర్వేషన్లు వస్తే, ప్రతి ముగ్గురిలో ఒక మహిళా ప్రజాప్రతి నిధి ఉంటారు. ఇది అందరికీ ఆమోదయోగ్యమైన అంశం. మహిళలందరూ గర్వించదగినది.
మహిళా రిజర్వేషన్‌తోనే ఈ స్థాయికి..
‘’మాది ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం. నా స్టడీస్‌ అంతా అక్కడే జరిగాయి. ఇంటర్మీడియెట్‌ వరకూ ధర్మవరంలో,డిగ్రీ, అనం తపూర్‌, పీజీ కర్నూల్‌లో చేశాను. మొదటి నుంచీ నాకు రాజకీయాలు అంటే ఆసక్తి. కాలేజీ రోజుల్లో కూడా ఎన్నికల్లో పోటీచేసి కాలేజీ చైర్మన్‌గా గెలి చాను’’ అని పద్మావతి తెలిపారు. మహిళా రిజర్వేషన్‌ వల్లనే ఈరోజు ఈ గౌరవప్రదమైన జెడ్పీటీసీ స్థానంలో కూర్చోగలిగానని ఆమె చెప్పారు.‘’పార్టీకి పనిచేసిన వాళ్లం మేము ఇంత మంది ఉండగా మహిళకే ఎందుకు ఇవ్వాలి అని పురుషులు పోటీ పడుతుంటారు. పురుషా ధిపత్యం ఉన్న దేశంలో ఉంటున్న మనం నిజానికి లింగ వివక్ష ఎదుర్కొంటున్నాం. ఇంతమంది పోటీ దారుల మధ్య మహిళకు రిజర్వేషన్‌ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా మహిళలకే ఇస్తారు. మహిళా రిజర్వేషన్‌ వచ్చింది కాబట్టి నేను జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. అప్పట్లో ప్రతిపక్ష పార్టీ వాళ్లు విత్‌ డ్రా చేసుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది’’ అని పద్మావతి అన్నారు.
ఎస్సీ, ఎస్టీ మహిళల సంగతి ఏంటి?
ప్రస్తుతం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ లలో షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్టీ)ల కోసం రిజర్వ్‌ చేసిన సీట్లు ఉన్నాయి. ఆ రిజర్వ్‌ చేసిన స్థానాల్లో ఇప్పుడు మూడోవంతు సీట్లను మహిళలకు కేటాయిస్తారు.ప్రస్తుతం ఎస్సీలు,ఎస్టీల కోసం 131 సీట్లను రిజర్వ్‌ చేశారు. వీటిల్లో నుంచి సుమారు 43 సీట్లు మహిళలకు కేటాయించనున్నారు.ఈ 43 సీట్లను కూడా సభలో మహిళలకు రిజర్వ్‌ చేసిన మొత్తం సీట్లలో భాగం గానే లెక్కిస్తారు.అంటే, మహిళలకు రిజర్వ్‌ అయ్యే 181స్థానాల్లో,138 సీట్లు జనరల్‌ కేటగిరీ మహిళ లకు అందుబాటులో ఉంటాయి.అయితే, ఈ లెక్కలన్నీ ప్రస్తుతం లోక్‌సభలో అందుబాటు లో ఉన్న సీట్లసంఖ్య ఆధారంగా చేసినవే. ఒక్కసారి డీలిమిటేషన్‌ కసరత్తు మొదలైతే ఈ గణాంకాలు మారొచ్చు.
ఈ చట్టం ఎప్పటినుంచి అమల్లోకి వస్తుంది?
మొదట,పార్లమెంట్‌లోని ఉభయ సభలు ఈ బిల్లును మూడిరట రెండొంతుల (2/3) మెజారిటీతో ఆమోదించాలి.జనగణన (సెన్సస్‌) తర్వాత డీలిమిటేషన్‌ జరగాల్సి ఉంటుంది. డీలిమిటేషన్‌ అంటే జనాభా ప్రకారం నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియ. దేశవ్యాప్త డీలిమిటేషన్‌ ప్రక్రియ చివరిసారిగా 2002లో జరిగింది. ఇది 2008 లో అమల్లోకి వచ్చింది. డీలిమిటేషన్‌ జరిగిన తర్వాత లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు అయ్యాక మహిళా రిజర్వేషన్‌ అమల్లోకి రావొచ్చు. ప్రాక్టికల్‌గా చూస్తే, ఈ రిజర్వేషన్ల అమలు 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందువరకు సాధ్యం కాదని అనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్లు అమ ల్లోకి వచ్చాక 15 ఏళ్ల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఎస్సీ, ఎస్టీలకు కూడా ఒక పరిమిత సమయం వరకే సీట్లను రిజర్వ్‌ చేస్తారు. తర్వాత వాటిని పదేళ్లపాటు పొడిగిస్తారు.
రిజర్వ్‌డ్‌ సీట్లను ఎలా నిర్ణయిస్తారు?
ప్రతీ డీలిమిటేషన్‌ ప్రక్రియ తర్వాత రిజర్వ్‌డ్‌ సీట్లను రొటేట్‌ చేస్తామని బిల్లులో పేర్కొ న్నారు.ఈ వివరాలను పార్లమెంట్‌ తర్వాత నిర్ణ యిస్తుంది.పార్లమెంట్‌, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్లను ఏర్పాటు చేసుకునేలా ప్రభు త్వానికి ఈరాజ్యాంగ సవరణ అధికారాన్ని కల్పిస్తుంది. అయితే సీట్ల రొటేషన్‌, డీలిమిటేషన్‌ చేపట్టడానికి ఒక ప్రత్యేక చట్టం,నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. పంచాయతీలు, మున్సిపా లిటీలు వంటి స్థానిక సంస్థల్లో కూడా మూడో వంతు సీట్లు మహిళల కోసం కేటాయించారు. ప్రతీ ఎన్నికల సందర్భంగా ఇవి కూడా మారు తుంటాయి. ఎస్సీలకు నియోజకవర్గాల్లో వారి జనాభా ఎక్కువగా ఉన్నచోట సీట్లను రిజర్వ్‌ చేశా రు.చిన్న రాష్ట్రాల్లో సీట్లను ఎలా రిజర్వ్‌ చేస్తారు? లడఖ్‌, పుదుచ్చేరి, చండీగఢ్‌ వంటి కేవలం ఒక ఎంపీ సీటు ఉన్నకేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజర్వేషన్‌ ఎలా ఉంటుందో ఇంకా నిర్ణయిం చలేదు. ఈశాన్య రాష్ట్రాలైన మణిపుర్‌, త్రిపురల్లో రెండు చొప్పున, నాగాలాండ్‌లో ఒకే ఎంపీ స్థానం ఉంటుంది.అయితే, మునుపటి మహిళా రిజర్వే షన్‌ బిల్లులో ఈఅంశానికి ఒకపరిష్కారం చూపా రు.ఒకే సీటు ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో… ఒక లోక్‌సభ ఎన్నికల్లో ఆ సీటును మహిళలకు కేటాయించి, తర్వాతి రెండు ఎన్నిక లకు దాన్ని రిజర్వ్‌ చేయకూడదని 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వే షన్‌ బిల్లులో పేర్కొన్నారు.రెండు సీట్లు ఉన్న రాష్ట్రా ల్లో ఒక సీటును రెండు లోక్‌సభ ఎన్నికల వరకు రిజర్వ్‌చేసి,మూడో ఎన్నికలో మహిళలకు ఎలాంటి రిజర్వేషన్‌ కేటాయించకూడదని నిర్ణయించారు.
మహిళల ప్రాతినిధ్యం ఎంత?
ప్రస్తుతం,లోక్‌సభలో 82మంది మహిళలు ఉన్నారు. అంటే మొత్తం సంఖ్యలో దాదాపు 15శాతం.19రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యం 10శాతం కంటే తక్కువే ఉంది. ప్రపంచవ్యాప్తంగా పార్లమెంట్‌లలో మహి ళా ప్రాతినిధ్యం సగటున 26.5శాతంగాఉందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.
మహిళలకు కలిగే ప్రయోజనం
మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లు అమలులోకి వస్తే రాష్ట్రంలోని నియోజకవర్గాల ముఖచిత్రం మార నుంది. ఇప్పుడు ఉన్న స్థానాల ప్రకారం 8 లోక్‌సభ,58శాసనసభ స్థానాలు అతివలకే చెంద నున్నాయి. మహిళా బిల్లు ఆమోదం పొందితే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి అమలవు తుంది. అప్పటికీ నియోజకవర్గాల పునర్విభజన పూర్తవనుంది. దీంతో స్థానాల సంఖ్య పెరిగితే ముఖచిత్రాలు తారుమారయ్యే అవకాశం ఉంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే మహిళా బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌ సభలో ప్రవేశపెట్టడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఇప్పటికప్పుడు కాకుండా. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అంటే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికే ఇది అమల్లోకి వస్తుందనే స్పష్టత వచ్చినప్పటికీ రాష్ట్రంలోని ఏయే నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉందనేదానిపై ప్రజా ప్రతినిధులు ఆరా తీస్తున్నారు. ఈబిల్లు వల్ల తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం మహి ళలకు కేటాయించే అవకాశం ఉందా అనే అంశం పై చర్చల్లో మునిగి తేలుతున్నారు. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నాటికే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని మొదట్లో ప్రచారం జరి గింది. దీంతో ఆ మార్పులు ప్రభావం, పర్యవ సానం తమపై ఎలా ఉంటుందోనని తొలుత కొంతమంది ఆందోళన చెందారు. అయితే లోక్‌ సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఇది అమ ల్లోకి వస్తుందనే స్పష్టత రావటంతో ఊరట పొందారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 175 శాసనసభ,25లోక్‌సభ నియోజకవర్గాలకు సంబం ధించిన ఓటర్ల జాబితాను విశ్లేషించగా ఈ ఏడాది జనవరి 5వ తేదీనాటికి ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం మహిళా ఓటర్ల సంఖ్య అత్యధి కంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించాయి. నియోజకవర్గాల సంఖ్య పెరగకుండా పరిధిల్లో పెద్దగా మార్పులు చేర్పులు లేకపోతే మహిళా ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉన్న నియోజక వర్గాల్లో పెద్దతేడా ఏమీ ఉండకపోవొచ్చు. నియో జకవర్గాల సంఖ్య పెరిగి వాటి పరిధిల్లో భారీగా మార్పులు, చేర్పులు చేసుకుంటే మాత్రం మహిళా ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల ముఖచిత్రం కూడా మారే వీలుంది.రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో శాసనసభ నియోజ కవర్గాల పెంపు అంశం ఉండటంతో పునర్వి భజన సమయంలో ఇక్కడి నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
-(జిఎన్‌వి సతీష్‌/ న్యూఢల్లీి నుంచి ప్రకాష్‌ యాదవ్‌)

ప్రపంచ భాషల్లో అందమైనది..తెలుగు భాష ఒక్కటి

  • ఆధునిక సాహిత్యంలో గురజాడ పాత్ర
    ’’అడుగుజాడ గురజాడది అది భావికిబాట’’ అన్న ఒకే వాక్యంతో శ్రీశ్రీ ఆధునిక యుగకర్తగా తెలుగు సాహిత్య చరిత్రలో గురజాడ స్థానం గూర్చి తీర్పు ఇచ్చారు. గురజాడగా ప్రసిద్ధి పొందిన వీరి పూర్తి పేరు గురజాడ వెంకట అప్పారావు. సమాజం లోని కుళ్ళును, మత మౌఢ్యాన్ని, కుల దురహం కారాన్ని, గ్రాంధిక భాషా ఛాందసత్వాన్ని, స్త్రీల పట్ల అణచివేతను తీవ్రంగా నిరసిస్తూ తన కలాన్ని కత్తిగా మలచి అభివృద్ధి నిరోధకత్వంపై పోరాడిన యుగకర్త గురజాడ. ఈయన దృష్టిలో సాహిత్యం ఒక భోగ(వినోద) వస్తువు కాక సమాజంలోని మార్పుకు ప్రజల పక్షాన కృషి చేసే ఆయుధంగా (దిక్సూచి)గా భావించారు.అందుకే గురజాడ అభ్యుదయ కవితా పితామహుడు,నవయుగ వైతాళికు డయ్యాడు
    జననం -కుటుంబ నేపథ్యం
    గురజాడగారు 1862 సెప్టెంబర్‌ 21వతేదీన విశాఖ జిల్లా, ఎలమంచిలి తాలూకా లోని రాయవరం గ్రామంలో మాతామహుల ఇంట జన్మించారు.తల్లి కౌసల్యమ్మ, తండ్రి వెంకటరామదాసు.గురజాడ పూర్వీకులు కృష్ణా జిల్లా గురజాడ గ్రామంనుండి విశాఖ మండ లానికి తరలివచ్చారు. గురజాడ తండ్రి ’’చీపురు పల్లి’’లో ఉద్యోగం చేసేవారు. అందువల్ల గుర జాడ ఆఊరులో ఉన్న గ్రాంటు స్కూలులో మొదటి మూడు తరగతులు చదివారు. వెలువలి రామ మూర్తి పంతులుగారివద్ద సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషలు నేర్చుకున్నారు. విజయనగరం మహారాజా వారి హైస్కూలులో లోయర్‌ ఫోర్త్‌, అప్పర్‌ఫోర్త్‌, ఫిప్తు,మెట్రిక్యులేషన్‌ చదివారు.1882లో మెట్రిక్యు లేషన్‌ ఉత్తీర్ణులయ్యారు.1882-1884మధ్య ’’ఎఫ్పే’’చదివారు. 1884-1886లో ఫిలాసఫీలో బి.ఎ.చదివారు.బి.ఎ.చదువుతుండగా 1885లో అప్పారావు వివాహం జరిగింది.భార్యపేరు ’’అప్పల నర్సమ్మ’’.ఈ దపంతులకు 1887లో లక్ష్మీనరసమ్మ (కుమార్తె),1890లో వెంకట రామదాసు (కుమారుడు) 1902లో కొండయమ్మ (కుమార్తె) జన్మించారు. గురజాడ బి.ఎ.ఉత్తీర్ణత పొందడంతో ప్రిన్స్‌పాల్‌ చంద్రశేఖరశాస్త్రి రాజా వారి కళాశాలలో ఎనిమిదో అసిస్టెంట్‌ లెక్చరర్‌గా ఉద్యోగం వేయించారు. నెలకు 25 రూపాయలు జీతం కావడంతో,ఆర్థిక ఇబ్బందుల వల్ల 1886 లో కళాశాల నుండి సెలవు తీసుకుని ’’డిప్యూటీ కలక్టరాఫీసులో’’ హెడ్‌ క్లర్కుగాచేరారు. కాని ఆ ఉద్యోగం సంతృప్తినివ్వలేదు.తిరిగి 1887లో ఆనందగజపతి మహారాజా వారి కళాశాలలో నాలుగవ లెక్చరర్‌గా చేరారు. దానితో పాటు మహారాజావారికి వార్తాపత్రిలు చదివి విన్పించి నందుకు మరో 50రూపాయలు అదనంగా ఇచ్చే వారు. మొత్తంగా నెలసరి జీతం 150 రూపా యలు వచ్చేవి.1889లో మహారాజావారి ఆస్థా నంలో ఏర్పాటు చేయబడిన డిబేటింగ్‌ క్లబ్‌ చర్చా వేదికకు ఉపాధ్యక్షుడైనారు.1896లో విజయ నగరం సంస్థానంలో శాసన పరిశోధకునిగా నియ మితులైనారు.1897లోఆనందగజపతి మరణా నంతరం సంస్థానం వ్యవహారాలను చక్కబెట్టే బాధ్యత నిర్వర్తించారు. 1898 నుండి 1912 వరకు రీవారాణి అంతరంగిక కార్యదర్శిగా చేసి 1913 ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ పొందారు.
    గురజాడ రచనా వ్యాసంగం
    గురజాడలో మెట్రిక్యులేషన్‌ చదువు తున్నప్పుడే కవిత్వ శక్తి వికసించింది. ఆంగ్లంలో ’’కకూ’’ (కోకిల)అనే కవితను వ్రాశారు. సంస్కృ తంలో శ్లోకాలు వ్రాస్తుండేవారు.1883లో ఇంగ్లీషులో ’’సారంగధర’’ అనే కథా కావ్యాన్ని రాశారు.అది ’’ది ఇండియన్‌ లీజ్జర్‌ అవర్‌’’ అనే ఆంధ్రాంగ్ల పత్రికలో ప్రచురించబడిరది. కలకత్తా నుండి వచ్చే ’’రీస్‌ అండ్‌ రయ్యత్‌’’ అనే పత్రికలో ’’సారంగధర’’ ను పునర్ముద్రించారు. ఈ పత్రికా సంపాదకుడైన శంభుచంద్ర ముఖర్జీతో గురజా డకు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచేవి.గురజాడ రాసిన రచనల్లో కన్యాశుల్కం ఒక గొప్ప రచన. ఇది ప్రపంచ సాహిత్యంలో గొప్ప ఆదునిక నాట కాల సరసన నిలిచిన నాటకం. దీని తొలికూర్పు 1897లో,రెండవ ముద్రణ1909లో జరి గింది. 1909లో నీలగిరి పాటలు రచించారు. 1910 లో గురజాడను తెలుగు కవిత్వ చరిత్రలో చిర స్థాయిగా నిలిపిన’’ముత్యాల సరములు’’ రచన చేశారు. ఇది కవితా సంపుటి. ఇందులో ముత్యా ల సరాలు,కాసులు,లవణరాజుకల,కన్యక, పూర్ణ మ్మ,లంగరెత్తుము,డామన్‌ పితియస్‌,దేశభక్తి గేయం మొదలైన కవితా ఖండికలున్నాయి. కొండు భట్టీయం, బిల్హణీయం అనే అనువాద నాటకాలు రచించారు. దిద్దుబాటు, దేవుళ్లారా మీ పేరేమిటి? మాటల మబ్బులు, పుష్పలావికలు, మెరుపులు, సుభద్ర, ఋతుశతకం వంటి సంస్కృత రచనలతో ఆపటు సౌదామిని వంటి నవలలను కూడా రచించారు. కథ చెప్పేటప్పుడు ఒక ఎత్తు గడా, నడిపించే తీరూ, నాటకీయత, ఒక పతాక స్థితి,ఒక ముగింపూ తప్పకుండా ఉంటాయి. వీటన్నింటి మేళవింపు గురజాడ రచనల్లో మనకు దర్శనమిస్తాయి.
    ఆధునిక సాహిత్యంలో గురజాడ పాత్ర-ఒక పరిశీలన
    ’’జీవితం స్పష్టం చేయలేని దాన్ని సాహిత్యం స్పష్టం చేస్తుంది’’ అని కొడవటిగంటి కుటుంబరావు చెప్పిన మాట గురజాడ సాహి త్యానికి పూర్తిగా వర్తిస్తుంది. గురజాడ సాహిత్య పతాక సంఘ సంస్కరణకు మించిన సాంఘిక విప్లవం.అందుకే ఆయన ఆనాటి మొత్తం భారత దేశంలోనే విశిష్టమైన సాహితీవేత్త. సమకాలీన కొత్త వస్తువుతో, కొత్త దృక్పథంతో, కొత్త రూపంతో గురజాడ తన నాటక కళను కవిత్వాన్ని, కథాని కను తీర్చిదిద్దినారు. దానికి నిదర్శనమే ఆనాటి కాలంలోని కన్యాశుల్క వివాహాలను నిరసిస్తూ, అనాదిగా కొనసాగుతున్న సంస్కృత నాటక కళను నిరాకరించి వాడుక భాషలో కన్యాశుల్కం రచిం చడం.వ్యవహారికభాషలో రచన చేయడమే కాకుం డా 1906లో సహాధ్యాయి అయిన గిడుగు రామ మూర్తి పంతులుతో కలిసి వాడుకభాష కోసం మహోద్యమాన్ని ప్రారంభించారు. ఇలా వాడుక భాషలో రచనలు చేసి ఆధునిక సాహిత్యంలో వాడుక భాషకు పునాదివేసి ’’ఆధునిక యుగకర్త’’ అయినారు. వేదాంతం పేరుతో మన దేశంలో ఎంత వంచన ఎంత మూర్ఖత్వం సాగు తుందో అని వాపోయాడు గురజాడ. మతాచారాల పేరు మీద సాగే స్వార్థపరత్వాన్ని ఎండగడుతూ రాసిన కథ -’’మీ పేరేమిటి?’’ మానవ సంబంధాల ఉద్వేగాలు మతాలకు అతీతమైనవి అని పెద్ద మసీదు కథ విశదపరు స్తుంది.మూఢ విశ్వాసా లను తృణీకరించే విధంగా ’’ముత్యాల సరములు’ రచన చేశారు.
    ’’దేశమంటే మట్టికాదోయ్‌.. దేశమం టే మనుషు లోయ్‌’’ – అంటూ దేశభక్తి గేయం ద్వారా ప్రజల్లో జాతీయ భావ స్ఫూర్తిని నింపారు. ’’ఆధునిక మహిళ భారతదేశ చరిత్రను తిరగరా స్తుందని’’ ఆశాభావం వ్యక్తం చేశారు. గురజాడ రాసిన తెలుగులో మొదటి కథానిక అయిన ’’దిద్దుబాటు’’ద్వారా’’పురుషుడి అడుగు జాడల్లో స్త్రీ నడవటం కాదు,పురుషుడికి నడక నేర్పేది, పురు షుడి జీవితాన్ని తీర్చిదిద్దేది స్త్రీ’’అని చాటి చెప్పారు. వర్ణవ్యవస్థను పూర్తిగా నిరాకరించి మంచి చెడ్డల ప్రాతిపదికగా మనుషులలో రెండే కులాలున్నాయి అని చెప్పారు.ఆధునిక సాహిత్యం లో ఎన్నో ఉద్యమాలకు ప్రేరకులైనారు. ప్రాచీన కాలం నుండి సాహిత్యాన్ని కేవలం ఒక భోగ (వినోదవస్తువు) వస్తువుగానే భావించి రచన లు చేశారు. నాటి వ్యవస్థను నిరసిస్తూ సమాజ మార్పే సాహిత్య లక్ష్యం అంటూ రచనలు చేశారు గురజాడ. ప్రజాస్వామ్య యుగపు లక్ష్యాలైన స్వేచ్ఛ, సమానత్వం,సౌభ్రాతృత్వం సాధనకు కలంబట్టి నాటకం,కవిత్వం,కథలు,సాహిత్య,విద్యా రంగంపై విమర్శనా రూపాలతో చివరిక్షణాల దాకా సమా జ ప్రగతికై రచనలు చేశారు. స్త్రీ జాతికి సమాన గౌరవం దక్కాలని పురుషాధిక్య సమాజాన్ని ధిక్కరించిన గురజాడ 1915 నవంబరు 30నాడు కన్నుమూశారు. స్త్రీలపై అణచివేత, పీడన కొనసాగినంత కాలం వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులకు స్ఫూర్తిని, చైతన్యాన్ని అందిస్తూనే వుంటాయి. కొందరు జీవిస్తూ మరణిస్తారు. మరికొందరు మరణించి జీవిస్తారు. ప్రజాకవి గురజాడ మరణించినా కూడా ప్రజల గుండెల్లో జీవిస్తూనే ఉంటారు. – (స్త్రీవాద పత్రిక భూమిక సౌజన్యంతో) – (జాలిగం స్వప్న)

పాలకులకు పట్టని ప్రాధామిక విధులు

రాజకీయ నాయకులు, ప్రజా ప్రతి నిధులు, రాజకీయ అధికారాలున్న ప్రధాన మంత్రి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదలైన వారు మత, భాష, ప్రాంత మొదలైన విభజనలకు అతీతంగా సామరస్యాన్ని ఉమ్మడి సోదర భావాన్ని పెంచాలి. దీనిని నిజాయితీగా చేయాలి. సంకుచితంగా ఆలోచిస్తూ ఎన్నికల ప్రయోజనాల కోసం సమాజంలో ఏదో ఒక తరగతికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇతర మతాల పట్ల సమాన భావాన్ని కనబరచని వారు ప్రజలకు స్ఫూర్తినివ్వరు. పంచాయితీ నుండి పార్లమెంటు వరుకు ఉన్న ప్రజా ప్రతినిధులు ఈ ప్రాథమిక విధులను ఒక బాధ్యతగా ప్రచారం చేయాలి, పాటించాలి.
ద్వేష భావజాలం భారత దేశాన్ని మింగేస్తుంది’.మహాత్మాగాంధీ 75వవర్థంతి సంద ర్భంగా ఆయన ముని మనవడు తుషార్‌ గాంధీ చేసిన వ్యాఖ్య ఇది.ద్వేష భావజాలం భారతదేశం లో ఎందుకు పెరుగుతున్నదో దేశ రాజకీ యాలను చూచాయగా పరిశీలించే వారికి సైతం తెలుస్తుంది. ద్వేష భావజాలాన్ని పెంచటంలో, వ్యాప్తి చేయటం లో రాజకీయ నాయకులు, పాలకుల పాత్ర ఎంత వున్నది? రాజ్యాంగం వారికి చెప్పిందేమిటి? వారు చేస్తున్నదేమిటో చర్చించటమే ఈ వ్యాసం ఉద్దేశ్యం. ఈ క్రమంలో ప్రాథమిక విధుల గురించి తెలుసు కోవటం అవసరం.
ప్రాథమిక విధులు – చరిత్ర
రాజ్యాంగం ఆమోదించినపుడు ప్రాథ మిక విధులు అందులో భాగం కాదు. నాటి రాజ్యాం గ నిర్మాతలు అప్పుడున్న సామాజిక, నైతిక పరిస్థి తులను దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక విధులు అవసరం లేదని భావించి ఉండవచ్చు.కాని 1976 లో స్వరణ్‌ సింగ్‌ కమిటీ సిఫార్సుల మేరకు 42వ సవరణ ద్వారా వాటిని రాజ్యాంగంలో పొందు పరిచారు.
ప్రాథమిక విధులను ఎందుకు చేర్చారు ?
‘కాలం గడిచే కొలది నైతిక విలువలు … ముఖ్యంగా ప్రజా జీవితంలో విలువల పతనం స్పష్టమైన కారణంగా ప్రాథమిక విధులను ప్రత్యేకం గా రూపొందించటం అవసరమని దేశం భావిం చింది.’’ అని జస్టిస్‌ జె.ఎస్‌. వర్మ కమిటీ పేర్కొంది.
ప్రాథమిక విధులు – స్వభావం
51ఏ అధికరణంలో మొత్తం 11 ప్రాథ మిక విధులుంటాయి. వాటిలో 51(ఎ)(ఇ)లో ఉన్న ప్రాథమిక విధిని మాత్రమే ఈవ్యాసంలో చర్చిం చాం. కొన్ని విధులు నైతిక నియమావళిలాగా, మరికొన్ని పౌర నియమావళిలాగా ఉంటాయి.
అధికరణం 51(ఎ)ఇలో ఏముంది ?
ఈ అధికరణంలో రెండు భాగాలున్నా యి. మొదటి భాగం భారత ప్రజలందరి మధ్య కుల,మత,భాషా,ప్రాంతలేదా ఏ ఇతర విభజనలతో వైవిధ్యాలతో వైవిధ్యాలతో సంబంధం లేకుండా ప్రజలందరి మధ్య సామరస్యం,సోదరభావాన్ని పెంపొందించాలని ఆదేశిస్తుంది. రెండవ భాగం స్త్రీలను అగౌరవ పరిచే అన్ని అంశాలను, విధానా లను విడనాడాలని ఆదేశిస్తుంది.
ఎవరు పాటించాలి ?
51వ అధికరణం ప్రారంభంలో ఇది ప్రతి పౌరుని యొక్క విధి అనే వాక్యం ఉన్నది.దీని అర్థం.. ప్రభు త్వానికి, పాలకులకు, అధికార గణానికి, రాజకీయ నాయకులకు వర్తించదా అనేది ప్రశ్న? ఈ ప్రశ్నకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వర్మ సమాధానం చెప్పారు. ప్రాథమిక విధులపై 1999లో ఆయన నేతృత్వంలో వేసిన కమిటి అనేక సిఫార్సులు చేసింది.
జస్టిస్‌ జె.యస్‌.వర్మ సిఫార్సులు
రాజకీయ నాయకులు ఈ విధుల గురించి మాట్లాడేటప్పుడు ఇవి ప్రజలు పాటించ వలసినవిగా తమకేమీ సంబంధం లేదు అన్నట్లుగా చెబుతారు. కాని వాస్తవంలో వారే ఈ విధులను పాటించవలసిన బాధ్యత ఉంది. నైతిక విలువల వ్యాప్తిలో ఆదర్శనీయులుగా ఉండే వ్యక్తుల పాత్ర చాలా ప్రముఖమైనది.కేవలం చట్టపరమైన నిబం ధనల ద్వారా ఈ విలువల వ్యాప్తి జరగదు. విలువ లు పాటించటం ద్వారా ఆదర్శప్రాయులుగా మార టం ద్వారా,సామాజిక ఆంక్షలద్వారా ఈ విలువలు వ్యాప్తి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజకీయ నాయకులు,ప్రజా ప్రతి నిధు లు,రాజకీయ అధికారాలున్న ప్రధానమంత్రి, రాష్ట్రా ల ముఖ్యమంత్రులు, మంత్రులు,ఎంపీలు,ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు మొదలైన వారు మత,భాష, ప్రాంత మొదలైన విభజనలకు అతీతంగా సామర స్యాన్ని ఉమ్మడి సోదర భావాన్ని పెంచాలి. దీనిని నిజాయితీగా చేయాలి. సంకుచితంగా ఆలోచిస్తూ ఎన్నికల ప్రయోజనాల కోసం సమాజంలో ఏదో ఒక తరగతికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇతర మతాల పట్ల సమాన భావాన్ని కనబరచని వారు ప్రజలకు స్ఫూర్తినివ్వరు.పంచాయితీ నుండి పార్లమెంటు వరు కు ఉన్న ప్రజా ప్రతినిధులు ఈ ప్రాథమిక విధులను ఒక బాధ్యతగా ప్రచారం చేయాలి,పాటించాలి.
ప్రభుత్వ ఉద్యోగులు, కార్యాలయాలు
ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉండే అధిపతులు ప్రాథమిక విధులు ఆచరించి, వ్యాప్తి చేయాలనే బాధ్యతకల్గి ఉన్నారు.వారికి ఇది అదనపు విధి.సిబ్బంది అందరి ముందు ప్రతి సంవత్సరం ప్రాథమిక విధులను ఆచరిస్తానని ప్రతిజ్ఞ చేయాలని జస్టిస్‌జె.యస్‌.వర్మ సూచించారు.అవినీతి లేకుండా, ప్రజలకు సన్నిహితంగా ఉంటూ స్నేహపూర్వకమైన విధానంతో విధులు నిర్వర్తించాలని పారదర్శకత చూపాలని సిపార్సు చేశారు. ప్రతి అధికారికి రెండు రకాలైన బాధ్యతలు (వ్యక్తిగతంగా,అధికారయుతం గానూ) ఉంటాయని ఆరెండిరటి సందర్భంగా కూడా విధులు పాటించాలని ఆయన సూచిం చారు. ప్రభుత్వ అధికారులు లేదా ప్రభుత్వ కార్యాల యాల మీద ఆధిపత్యం ఉన్న వారు ఎవరైనా… రాజకీయ,పరిపాలనా,విద్య,ఇతర ఏ ప్రజా సేవలకు సంబంధించినదయినా…వారు తమ అధికార పరిధి ఉన్నంతవరకు పౌరులను ప్రాథమిక విధుల విషయంలో మార్గదర్శకంగా నిలుస్తూ ప్రచారం చేయాలి. ప్రతి సంవత్సరం జనవరి మూడవ తేదీని ప్రాథమిక విధుల దినోత్సవంగా పాటించాలి.పై సిఫార్సులను పరిశీలించినప్పుడు ప్రధానంగా రాజకీ య నాయకులు, ఎన్నికలలో పాల్గొనేవారు, ప్రభుత్వ అధికారులు అత్యంత నిజాయితీగా ఉండాలి. ముఖ్యంగా సోదరభావాన్ని పెంపొందించటంలో ప్రముఖ పాత్ర పోషించాలని అర్థమవుతుంది.
ఆచరణ ఎలా ఉంది ?
2014 నుంచి 2018 మధ్య 4సంవ త్సరాల కాలంలో ప్రముఖ రాజకీయ నాయకుల విద్వేష ప్రసంగాలు 5 వందల శాతం పెరిగాయని ఎన్‌డిటివి పరిశోధనలో తేలింది. అలాగే కర్ణాటక లో బిజెపి ప్రభుత్వం 2019 నుండి 2023 ప్రాం తం మధ్యలో 7ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా 182 మత హింస, విద్వేష ప్రసంగాలు, గోరక్షణ నేరాలకు సంబంధించిన కేసులను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ఫలితంగా ఈ నేరాలలోనిందితులుగా ఉన్న వందలాది మంది శిక్షల నుంచి బయటపడ్డారు. వీరిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు. అంటే వందల మంది రాజకీయ నాయకులు ప్రాథమిక విధులకు విరు ద్ధంగా విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని అర్థమవు తుంది.అలాగే 2017లో హిందూస్థాన్‌ టైమ్స్‌ చేసిన సర్వే ప్రకారం ఎన్నిక కాబడిన, అధికారాలు పొం దిన వారిలో 50మందిపై మత హింస, ద్వేష ప్రసంగాలకు సంబంధించిన నేరాలు నమోదయ్యా యి.2018-2019మధ్య కాలంలో అసత్యపు వార్తలను,వాట్సాప్‌ వార్తలు నిజమని నమ్మి 31 మంది చనిపోయారని బిబిసి పరిశోధనలో తెలి పింది. ఇతర మతాలపై ద్వేషపూరిత, అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా గల్ఫ్‌ దేశాలు, ముస్లిం దేశాలు తమ అసమ్మతిని తెలియజేయటం మనం గమనించాం. మణిపూర్‌, హర్యానా, ఇతర ప్రాంతాలలో జరుగుతున్న హింసాత్మక ఘర్షణలు …ఇటీవలి కాలంలో పెరుగుతున్న విద్వేష ప్రచార ఫలితాలే.
సుప్రీంకోర్టు తీర్పులు
ప్రాథమిక విధులను క్షేత్ర స్థాయి నుంచి ప్రచారం చేయాలన్న జస్టిస్‌ వర్మ కమిటి సిఫార్సుల ను వెంటనే అమలు చేయాలని 2003లో జస్టిస్‌ రంగనాథ్‌మిశ్రా పిటిషనర్‌గా భావించబడిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. స్కూలు స్థాయి నుంచి అన్ని విద్యా స్థాయిల వరకు సమాజంలోని అన్ని విభాగాలలోను ఈ విధులను ప్రచారం చేయాలని, సోదరభావం,మతాలపట్ల సమభావం పెరిగేం దుకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.20 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ద్వేషభావాన్ని తీవ్రస్థాయికి చేర్చిన రాజకీయ నాయ కులు, పాలకులు సమాధానం చెప్పుకోవాలి. ద్వేష ప్రసంగాల విషయంలో వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి తక్షణం చర్యలు తీసుకోవాలని జస్టిస్‌ కె.ఎం. జోసెఫ్‌ బెంచ్‌ ఇటీవల తీర్పునిచ్చింది. ఈ నేపథ్యం లో ప్రచారం చేయవలసిన, పాటించ వలసిన ప్రాథమిక విధులు,నైతిక విలువ లను పక్కనబెట్టి మతపరమైన విషయాలను ప్రచా రంచేస్తామని, అవగాహన కల్పిస్తామనిఎ.పి మంత్రి వర్యులొకరు ప్రకటించటం విపరీతం. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లుతెరిచి భారతదేశ సంస్కృతి సాంప్ర దాయ మైన…పరమత సహనం,సహోదర భావంతో పాటు ఇతర అన్ని ప్రాథమిక విధులను పాటించి ప్రచారం చేయాలని ఆశిద్దాం. (వ్యాసకర్త :ఎ.పి.సి. ఎల్‌.ఎ ప్రధాన కార్యదర్శి,సుప్రీంకోర్టు న్యాయవాది) – (పొత్తూరి సురేష్‌ కుమార్‌)

నాడే చెప్పిన బాబా సాహేబ్‌

మణిపూర్‌లో జరుగుతున్న అత్యాచారాలు,మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘట్టాల మీద ప్రధాని మోదీ 80 రోజులు నోరు విప్పకపోవడానికి కారణమేమిటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.ఈ అఘాయిత్యాలు జూలై 19న బయటకు వచ్చిన వీడియో ద్వారా ప్రపంచమంతా వీక్షించింది.ఈ ఘటనలో ముఖ్యపాత్ర వహించిన మణిపూర్‌ పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని,మణిపూర్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ను ఆగస్టు 7న స్వయంగా హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మార్గంలోనే దళితుల, ఆదివాసీల,స్త్రీల రక్షణ కోసం ప్రజాస్వామ్య లౌకికవాద సోషలిస్టు భావజాలంతో ఉన్నవారందరం కలసి ఏక కంఠంతో పోరాటం చేయాలి.
మణిపూర్‌లోజరుగుతున్న అత్యాచా రాలు, మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘట్టాల మీద ప్రధాని మోదీ 80 రోజులు నోరు విప్పక పోవడానికి కారణమేమిటని ప్రతిపక్షాలు నిలదీస్తు న్నాయి. ఈ అఘాయిత్యాలు జూలై 19న బయటకు వచ్చిన వీడియోద్వారా ప్రపంచమంతా వీక్షించింది. ఈ ఘటనలో ముఖ్యపాత్ర వహించిన మణిపూర్‌ పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని, మణిపూర్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ను ఆగస్టు 7న స్వయంగా హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగి న తర్వాత కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమో దు చేయడంలో ఎందుకు జాప్యం చేశారని సుప్రీం కోర్టు అడిగింది. సుప్రీంకోర్టు ఇటీవల అనేక విష యాల్లో రాజ్యాంగేతరశక్తిగా ప్రభుత్వం నడుస్తు న్నదని హెచ్చరిస్తూ వస్తున్నది. ఈ ఘటన మీద హోంమంత్రి అమిత్‌ షా చేసిన ప్రకటన అనేక అనుమానాలకు దారి తీస్తుంది. గుజరాత్‌లో ఒక వర్గానికి 2022లో బుద్ధి చెప్పిన తర్వాత అక్కడ మతఘర్షణలు ఆగిపోయాయని హోంమంత్రి అంటున్నారు.2022 నుంచి హిందువులకు భయ పడి ముస్లింలు అక్కడ జీవిస్తున్నారని అర్థం. కుకీల అటవీ భూములను మొయితీలకు కట్టబెట్టి అడవిపై ఆధిపత్యం వహించాలనేది మణిపూర్‌లో పన్నిన వ్యూహం. ముఖ్యంగా కుకీలు అడవి సంపదనంతా రక్షిస్తూ వచ్చారు. అడవి సంపదలో ప్రధానంగా గ్రానైట్‌, ప్లాటినం మెటల్స్‌,ఎలిమెంట్స్‌,నికిల్‌, కాపర్‌, బొగ్గు, పెట్రోలియం ఇంకా ఎంతో విలువైన ఖనిజ సంపదను వారు భారతదేశానికి ఒక ఘన నిక్షేపంగా కాపాడుతూ వచ్చారు.దానికి కారణం డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు చట్టపరమైన, రాజ్యాంగపర మైన హక్కులున్నాయి. ఈ హక్కుల ప్రకారం అక్కడ మైనింగ్‌ను దోపిడీ చేయడానికి కార్పొరేట్లకు అవ కాశం లేదు.అందుకే వాళ్లు విధ్వంసానికి పూను కున్నారు. ఈరోజున ఈశాన్య రాష్ట్రాలు భారత దేశానికి ఆయువులు. ఈశాన్య రాష్ట్రాల్లో భారత ఉపఖండం మూలాలున్నాయి. ఈ భారతదేశాన్ని జయించిన ఆర్యులు, కుషానులు, అరబ్బులు, తురు ష్కులు ఎవరూ కూడా ఈశాన్యాన్ని ముట్టుకోలేక పోయారు. తాకట్టులోకి భారతదేశం వెళ్తున్నప్పుడు కూడా ఈశాన్యం తనను తాను కాపాడుకుంది. గిరిజనుల పోరాటాల వల్ల సంపదను కాపాడు తుంది.మణిపూర్‌లో భారత రాజ్యాంగాన్ని ఉల్లం ఘించడానికి, క్రైస్తవులపైదాడి చేయడానికి వెనకా డటం లేదు. అది ప్రపంచమంతా అర్థం చేసు కుంది. ముస్లింల మీద, క్రైస్తవుల మీద, బౌద్ధుల మీద, జైనుల మీద చేస్తున్న దాడులు వెనక మొత్తం భారతదేశాన్ని గుప్పెట్లో తీసుకోవాలని, భారతదేశ వనరులన్నీ కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేసి తద్వారా మిగిలిన జాతులన్నింటిని ధ్వంసం చేయాలనే భావన మనకు కనిపిస్తుంది. నిజానికి గిరిజనులు అక్కడ ఎందుకు క్రైస్తవులైనారు. వారు క్రైస్తవులు అవ్వడం వల్ల వారికి కలిగిన లాభమే మిటి? అక్కడ గిరిజన పిల్లలు ఎక్కువ మంది ఈ రోజు అన్ని సెంట్రల్‌ యూనివర్సిటీల్లో చదవగలుగు తున్నారంటే ఇంగ్లీషు విద్యను చదవడానికి క్రైస్తవ మతాన్ని వారు ఆశ్రయించారు.
మణిపూర్‌ హింస గురించి బీజేపీలోనే వ్యతిరేకత పెల్లుబుకింది. బీజేపీ ఎమ్మెల్యే పోలిన్‌ లాల్‌ హోకిప్‌ మహిళలను నగ్నంగా ఊరేగించడం మీద తీవ్రఆక్షేపణ తెలిపారు. మణిపూర్‌లో చెలరే గుతున్న హింస కేవలం శాంతిభద్రతల సమస్య కాదని, దీనివెనుక భారీ కుట్ర ఉన్నదని ఆ రాష్ట్ర అధికార బీజేపీ ఎమ్మెల్యే పోలిన్‌లాల్‌ హోకిప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల నగ్న వీడియో బయటకు రాకుంటే ప్రధానమంత్రి మోదీ అసలు మాట్లాడేవారే కాదన్నారు. హింస మొదలైన ప్పుడే సమస్యను చెప్పుకొనేందుకు ప్రధాని అపా యింట్‌మెంట్‌ అడిగామని, ఇప్పటికీ కలిసేం దుకు ఆయన అంగీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హింసకు మైతే మిలిషియాతో పాటు పోలీసులూ కారణమని విమర్శించారు.
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ గిరిజన రచయితలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాశారు.26 రాష్ట్రా లు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 86 మంది గిరిజన రచయితలు ఈలేఖపై సంతకాలు చేశారు. ‘సువిశాల మైన, సాంస్కృతిక వైవిధ్యం కలిగిన దేశా నికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రాష్ట్రం లో శాంతిని నెలకొల్పేం దుకు సహాయం చేయాలి’ అని దేశంలోని కోట్లాది మంది గిరిజనుల తరపున ‘ఆల్‌ ఇండియా ఫస్ట్‌ నేషన్స్‌’ (స్వదేశీ,ఆదివాసీ) రచయితల సదస్సు సభ్యులు లేఖలో విజ్ఞప్తి చేశారు.
గత రెండు నెలలుగా మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు, తాము దిగ్భ్రాంతి చెందామనీ, విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఇద్దరు కుకీ, గిరిజన మహిళలను బందీలుగా చేసి, క్రూరంగా హింసిం చడం ఇది భారతదేశంలోని 700కు పైగా గిరిజన సంఘాలను మాత్రమే కాకుండా మొత్తం పౌర సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. దేశంలోని ఆదివాసీ సాహితీవేత్తలమైన తాము ఈ హీనమైన,అమానుష చర్యను తీవ్రంగా ఖండిస్తు న్నామని పేర్కొన్నారు. గిరిజన మహిళలపై క్రూర మైన దాడికి పాల్పడిన ప్రత్యక్ష, పరోక్ష నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
మణిపూర్‌ విషయాన్ని కొందరు లౌకికవాదులు ఇలా విశ్లేషిస్తున్నారు. మణిపూర్‌ విషాదం జాతి సంహారం లేదా జాతి ప్రక్షాళనకు ఆరంభమే. అవును, సందేహం లేదు జాతి ప్రక్షాళన (ఎథ్నిక్‌ క్లీన్సింగ్‌) ఒక భయానక పదబంధం ఇప్పు డది భారత్‌ను వెన్నాడుతోంది, పీడిస్తున్నది. జాతిప రంగా ఒకసజాతీయ భౌగోళిక ప్రాంతాన్ని నెల కొల్పేందుకు అవాంఛిత ఉపజాతి సభ్యులను (దేశ బహిష్కృతులను చేయడం, స్థాన చలనం కలిగించ డం లేదా మూకుమ్మడిగా హతమార్చడం ద్వారా) సంపూర్ణంగా వదిలించుకోవడమే జాతి ప్రక్షాళన అని హిస్టరీ.కామ్‌ వెబ్‌సైట్‌ ఎడిటర్స్‌ నిర్వచిం చారు. ఎథ్నిక్‌ క్లీన్సింగ్‌కు ఉదాహరణలుగా మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఆర్మేనియన్ల ఊచకోత, రెండవ ప్రపంచ యుద్ధకాలంలో 60లక్షల మంది యూరోపి యన్‌ యూదుల మారణహోమాన్ని చరిత్రకారులు పేర్కొంటారు. ఐరోపాలో సెర్బియా, కొన్ని ఆఫ్రికన్‌ దేశాలు కూడా జాతి ప్రక్షాళనను చవిచూశాయి. స్వాతంత్య్రానికి పూర్వం భారత రాజ్యాంగం గుర్తిం చింది. మూడు ప్రధాన జాతుల వారికి మణిపూర్‌ నెలవు. తమ నాగరికత కొన్ని వేల ఏండ్ల నాటిదని గొప్పలు చెప్పుకొనే ఈ దేశంలో ఈ ఆదిమవాసులు నేటికీ ప్రాచీన కాలంనాటి దుర్భర అనాగరిక పరిస్థితి లోనే నివసిస్తున్నారంటే ఏమనాలి?కానీ,ఇది మాత్రం నగ్నసత్యం. ఇన్ని వేల ఏండ్లుగా ఈ దుర దృష్టవంతులు నాగరికులు కాలేకపోవడం ఒక్కటే కాక ఇందులో కొందరు దుష్టవృత్తులను అవలం బించే దుస్థితికి దిగజారి నేరస్త జాతులు (క్రిమి నల్స్‌)గా పరిగణించబడుతున్నారు. కోటి ముప్పై లక్షల మంది, నాగరికత మధ్య బతుకుతూ అనాగ రిక ఘోర దుస్థితిలో ఉండిపోవడం! పైగా వంశ పరంపరగా నేరస్థులుగా బతుకడం! దీనికి పాలకు లు సిగ్గయినా పడకపోవడం! ప్రపంచంలో ఎక్కడా లేని విచిత్ర పరిస్థితి ఇది.ఈ లజ్జాకరమైన పరిస్థితికి ఏమిటి కారణం?ఈ ఆదిమవాసులను నాగరికు లుగా మార్చడానికి,గౌరవప్రదమైన వృత్తులు చేపట్టేలాగ చేయడానికి అసలు ప్రయత్నమే జరగ లేదు.ఎందువల్ల?
బహుశా,వాళ్ల అనాగరికస్థితికి జన్మ సిద్ధమైన బుద్ధిమాంద్యమే కారణమని చెప్పడానికి ప్రయత్నించవచ్చు. ఆదిమవాసులు తరతరాలుగా అనాగరికులుగానే ఉండిపోవడానికి కారణం తామేననీ ఒప్పుకోకపోవచ్చు. వాళ్లకు నాగరికత నేర్పడానికిగాని,వైద్య సహాయం మొదలైన వాటి ద్వారా వాళ్లను సరిదిద్దడానికిగాని,వాళ్లను సంస్క రించి మంచి పౌరులుగా తయారుచేయడానికి గాని తాము ఏమాత్రమూ ప్రయత్నించకపోవడమే ఆదిమవాసుల అనాగరిక స్థితికి కారణమని పాల కులు అంగీకరించకపోవచ్చు.ఆదిమవాసులను నాగరికులను చేయడమంటే వాళ్లను నీవాళ్లుగా భావించడం. వాళ్ల మధ్య నివసించడం, వాళ్లలో ఒక సహానుభూతిని పెంపొందించడం, క్లుప్తంగా చెప్పాలంటే,వాళ్లను ప్రేమించడం.
(వ్యాసకర్త: మహాకవి, దళిత ఉద్యమనేత), – (డాక్టర్‌ కత్తి పద్మారావు)

సంక్షేమంతో..సుపరిపాలన

‘తమకు అందుతున్న నిరంతర సేవలను దృష్టిలో వుంచుకుని రాష్ట్రంలో సుపరిపాలన అమలవు తుందా లేదా అని ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ సీ.ఆర్‌.మీడియా అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. సుపరి పాలన దిశగా ఆంధ్రప్రదేశ్‌ రూపాంతరం అనే అంశంపై స్టేట్‌ అవర్‌ లీడర్‌ వైఎస్సార్‌ ఇంటెక్ట్యువల్‌ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఆయన పర్యటించారు. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం,శ్రీకాకుళం ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించి మేథావులు,విద్యావేత్తలతో ఈ అంశంపై సమాలోచనలు చేసి సీఎం జగన్‌ అమలపరుస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలకు సుపరిపాలన అందుతుందా లేదా అనేదానిపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు..’
ఇందులో భాగంగా విశాఖలో జరిగిన సభలో కొమ్మినేని శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగిం చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అమలుచేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటు న్నాయని కొనియాడారు. ఆగష్టు 21న అవర్‌ స్టేట్‌ అవర్‌ లీడర్‌లో భాగంగా ‘‘సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్‌ రూపాంతరం’’ అనే అంశంపై జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో వైఎస్సార్‌ ఇంటలెక్చువల్‌ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల వద్దకు సంక్షేమ ఫలాలను తీసుకెళ్లే లక్ష్యంతో ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను తమిళనాడు ప్రభుత్వం కూడా అమలు చేసేందుకు సిద్దమైందన్నారు. వలంటీర్ల వ్యవస్థను మెచ్చుకున్న కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఇలాంటి వ్యవస్థనే తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోం దన్నారు. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నారనడానికి ఇవి ఉదాహరణ లన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాద్యమం ఏర్పాటు చేయడం హర్షణీయమని ఆయన తెలిపారు. పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టగా తీవ్రంగా వ్యతిరేకించిన వారే తమపిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చదివిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా హామీలను నెరవేర్చిం దన్నారు. గ్రామసచివాలయ వ్యవస్థలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 50వేల కార్యాలయాలను ఏర్పాటుచేసి అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. గతంలో ఏముఖ్యమంత్రీ చేపట్టని సంస్కరణలు, సంక్షేమానికి జగన్‌ శ్రీకారం చుట్టారని కొనియాడారు. విద్యకు వృత్తిపరమైన నైపుణ్యాన్ని జోడిరచడం ద్వారా ఉన్నత విద్య అనంతరం యువతకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు మెరుగు పరచిందన్నారు. ఆర్ధికపరమైన అన్ని అంశాలను మహిళలకు కేటాయించడం ద్వారా వారి సాధికారితకు నిజమైన నిర్వచనాన్ని ఇచ్చారన్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా విద్యా సంస్థలపై తల్లులకు ప్రశ్నించే అధికారాన్ని కల్పించారని ఆయన పేర్కొన్నారు. ఇదంతా సుపరిపాలనలో భాగమని ఆయన తెలిపారు. పరిపాలన అందరికీ ఉపయోకరంగా,ఉపయుక్తంగా ఉండాలని అందుకు నిదర్శనంగా ఈ ప్రభుత్వం నిలుస్తుందన్నారు.సభకు అధ్యక్షత వహించిన నాగార్జున యూనివర్శిటీ రిటైర్డ్‌ వీసీ వి.బాలమోహన్‌దాస్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ,ప్రజలకు పథకాలు అందజేయడంలో తండ్రీకి మించిన తనయుడు సీఎం జగన్‌ అని కొనియాడారు. విద్యకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రవేశపెట్టిన విద్యాకానుక, విద్యాదీవెన,విదేశీయ విద్యాదీవెనలకు సంబంధించి కొనియాడారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఇంటలెక్చువల్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శాంత మూర్తి మాట్లాడుతూ తమ సంస్థలో 700మంది సభ్యులు ఉన్నారని ,వీరిలో డాక్టర్లు,లాయర్లు, ఇంజనీర్లు, ఇంటలిజెన్స్‌ అధికారులు,వైస్‌ ఛాన్సలర్లు,ఐఎఎస్‌ అధికారులు ఉన్నారని తెలిపారు. ప్రజా సంకల్పయాత్రలో ప్రజల సమస్యలను గుర్తించిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సుపరిపాలన సాగిస్తున్నార న్నారు.ప్రజల వద్దకు సంక్షేమ ఫలాలను తీసుకెళ్లే లక్ష్యంతో ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను తమిళనాడు ప్రభుత్వం అనులు చేసేందుకు సిద్ధమైందని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను మెచ్చుకున్న కేరళ ప్రభుత్వం,ఆ రాష్ట్రంలో ఇలాంటి వ్యవస్థనే తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు.పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారే తమ పిల్లలను అంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారని చెప్పారు.విద్య, వైద్యానికి కీ.శే రాజశేఖర్‌ రెడ్డి ప్రాధాన్యత కల్పించారని, నేడు జగన్మోహన్‌ రెడ్డి మరింత బలోపేతం చేసి అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అని కొనియాడారు. తీరప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పలువురు అడిగిన ప్రశ్నలకు వక్తలు సమాధానమిచ్చారు.
కిడ్నీ వ్యాధి మూలాలు కనుగొనడమే ప్రభుత్వ లక్ష్యం
ఉద్దానంలో మహమ్మరిలా వ్యాపిస్తున్న కిడ్నీ వ్యాధి మూలాలు కనుగొనడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. కాశీబుగ్గలో కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల ఆసుపత్రిని మంగళవారం సందర్శించారు.కిడ్నీ రోగులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. అంతకుముందు పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ డైరెక్టర్‌ ఎ.పి ఇన్నోవేషన్‌ సొసైటీ లావణ్య, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్‌ వెంకటరావు, 28వార్డు కార్పొరేటర్‌ పల్లా దుర్గారావు,యాక్సిస్‌ సెవెన్‌ ఇకోస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పాల్‌ బాస్కర్‌,ఆంధ్రా యానివర్సిటీ ప్రొఫెసర్‌ తిమ్మారెడ్డి, పాతపట్నం,టెక్కలి,రాజాం ప్రభుత్వ డిగ్రీకళాశాలల ప్రిన్సిపాళ్లు కె.శ్రీరాములు,గోవిందమ్మ, స్వప్న హైందవి, గాయత్రి విద్యాసంస్థల ప్రిన్సిపాల్‌ పులఖండం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.– జి ఎన్ వి సతీష్ 

బంజరు నేలలో మొలకెత్తిన బంగారం..

నేలను నమ్ముకొంటే రైతుకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మరోసారి రుజువు చేశారు వన్నూరమ్మ. కష్టాలెన్ని ఎదురైనా స్థైర్యం కోల్పోని ఆమె… బీడు భూమిలో బంగారు పంటలు పండిరచారు. దేశంలోని ఆదర్శ రైతుల్లో ఒకరుగా గుర్తింపు పొందారు. ప్రధాని మోదీతో ముఖా ముఖి మాట్లాడే అవకాశాన్ని పొంది,ఆయన ప్రశంసలు అందుకున్నారు. ‘ప్రకృతి వ్యవసాయమే రైతు సమస్యలకు పరిష్కారం’ అని చెబుతున్న ఆమె జీవన ప్రస్థానం ఇది…
కుటుంబాన్ని ఎలా పోషించాలనే ప్రశ్నకు నేను వెతుక్కున్న సమాధానం వ్యవ సాయం.ఉపాధి కరువైన సమయంలో వ్యవ సాయాన్నే జీవనాధారంగా ఎంచుకున్నాను. మాది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని దురదకుంట గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబం. ఆరేళ్ళ కిందట నాభర్త గోవిందప్ప అనారోగ్యంతో చనిపోవడంతో పరిస్థితులన్నీ తల్లకిందులయ్యాయి. నా నలు గురు పిల్లలకు దారి చూపించే బాధ్యత నా మీద పడిరది.
ఎగతాళి చేశారు…
మా కుటుంబానికి ముప్ఫై ఏళ్ళ కిందట ప్రభుత్వం 4.3ఎకరాల బంజరు భూమి ఇచ్చింది. ఒకప్పుడు అది పంటలు పండే భూమే. అయితే భవన నిర్మాణాల కోసం రాళ్ళ తవ్వకాల వల్ల బీడుగా మారిపోయింది. అందు లో సాగు సాధ్యం కాకపోవడంతో మా పెద్దలు దాన్ని అలాగే వదిలేశారు. భర్త పోయాక కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని గడిపేదాన్ని. మూడేళ్ళ కిందట ప్రకృతి వ్యవసాయం గురించి నాకు మొదటిసారి తెలిసింది. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ లక్ష్మీ నాయక్‌ మా గ్రామానికి వచ్చి, రైతులతో సమీక్ష జరిపారు. రైతులు, భూముల వివరాలు సేకరించారు. సరైన పద్ధతులు పాటిస్తే ఏడాదికి మూడు పంటలు పండిరచవచ్చని చెప్పారు. ఆయన చొరవతో గ్రామంలో 64రైతు సంఘాలు ఏర్పాటయ్యాయి. ఈ స్ఫూర్తితో నేను కూడా వ్యవసాయం చెయ్యా లని నిర్ణయించుకున్నాను. ఆ మాట చెప్పగానే ఎంతోమంది నన్ను చూసి ఎగతాళిగా మాట్లా డారు. కానీ నేను వెనుకంజ వేయలేదు. మా భూమిలో ఉన్న కంప చెట్లనూ, మొక్కలనూ తొలగించాను. వ్యవసాయ యోగ్యంగా మార్చాను. తొలి పంట మొలకలెత్తగానే నాలో కలిగిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. క్రమంగా పంటలను పెంచుతూ వెళ్ళాను. రెండు ఎకరాల్లో చిరు ధాన్యాలు, వేరుశెనగ, కూరగాయలు, ఆకుకూర పంటలు వేశాను. దీనికి 27వేల రూపాయల పెట్టుబడి పెట్టాను. రూ.1.4 లక్షల ఆదాయం వచ్చింది. .మూడేళ్ళలో తొమ్మిది రకాల పంటలను విజయవంతంగా సాగు చెయ్యగలిగాను.
ఒకరికి ఒకరం సాయపడతాం…
పంటల సాగులో నేను ఎలాంటి రసాయనిక ఎరువులూ, మందులూ ఉపయోగించలేదు. ఆవు పేడ, గోమూత్రం, మట్టి, బెల్లం, పప్పుల పిండితో తయారు చేసిన ఘన జీవామృతాన్నీ, ద్రవరూపంలోని జీవామృతాన్నీ మాత్రమే వాడాను. ప్రకృతి వ్యవసాయం ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ఇలా పండిన పంటల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. పౌష్టికాహార వినియోగం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే దీనికి మంచి డిమాండ్‌. పంట దిగుబడి ఎంత ఉన్నప్పటికీ కొనుగోలుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. మార్కెటింగ్‌ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ పద్ధతిలో పంటలు ఎవరు పండిస్తున్నారో తెలుసుకొని ముందుగానే అడ్వాన్సులు ఇస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూముల్లో సారాన్ని కాపాడుకోవచ్చు. మా పొలంలో పండిస్తున్న ధాన్యాలు,కూరగాయలు, ఆకుకూరల వల్ల మా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంది. ఇప్పుడు నామీద ఆర్థిక భారం తగ్గింది. అప్పులన్నీ తీర్చేశా. ప్రస్తుతం టొమాటో పంటను సాగు చెయ్యడానికి పొలాన్ని సిద్ధం చేస్తున్నాను. సరైన మార్గదర్శకత్వం రైతులకు లభిస్తే సానుకూల ఫలితాలు లభిస్తాయి. నా నేతృత్వంలో నడుస్తున్న స్వయంసహాయక బృందంలోని మహిళల నుంచి నాకు ఎంతో ప్రేరణ లభిస్తోంది. మేం ఒకరికి ఒకరం సాయం చేసుకుంటాం. పొదుపు చేసుకుంటాం. రుణాలు తీసుకుంటాం. విత్తనాలను పంచు కుంటాం. ఒకరి పొలంలో మరొకరం పని చేస్తాం. కష్టకాలంలో ఒకరిని ఒకరు ఆదుకుంటూ ఉంటాం. ప్రస్తుతం మా గ్రామాన్ని రసాయన రహిత వ్యవసాయ గ్రామంగా… అంటే బయో గ్రామంగా మార్చడానికి నేనూ, మా గ్రామస్తులూ పని చేస్తున్నాం.
రైతులకు శిక్షణ ఇస్తున్నా….
సాక్షాత్తూ దేశ ప్రధానితో మాట్లాడే అవకాశం వస్తుందనీ, ఆయన ప్రశంసలు అందుకుంటాననీ కలలోనైనా ఊహించలేదు. సుమారు అయిదు నిమిషాలు ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయంలో నా అనుభవాలను ఆయన స్వయంగా తెలుసుకున్నారు. ‘‘వన్నూరమ్మ మేడమ్‌! మీరు దేశ రైతులకు ఆదర్శం కావడం అభినందనీయం’’ అని మోదీ ప్రశంసించారు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.‘అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లాలో వ్యవసాయాన్ని సుసాధ్యం చేసిన ఆదర్శ రైతు’ అంటూ అందరూ అంటూ ఉంటే ఎంతో సంతోషంగా అనిపిస్తోంది.పట్టుదలతో పని చేస్తే ఏదైనా సాధించవచ్చు.పేద దళిత కుటుంబంలో పుట్టిన నేను ఎన్నో కష్టాలు పడ్డాను. అవేనాకు పాఠాలుగా మారాయి. ఇప్పుడు ఐసిఆర్‌పి (ఇంటర్నల్‌ కమ్యూనిటీ రిసోర్స్‌పర్సన్‌)గా పని చేస్తున్నాను. బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి వంకతండాలో దాదాపు 170 మంది మహిళా, ఆదివాసీ రైతులకు ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇస్తున్నాను.దీనికి గౌరవవేతనం కూడా లభిస్తోంది. మా అబ్బాయిల్లో ఒకడైన అనిల్‌ వ్యవసాయం చేస్తున్నాడు. ఏది ఏమైనా ప్రకృతి వ్యవసాయం ప్రయోజనాలపై అన్ని గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నదే నా ఆశయం.’’

  • శంకర్‌నాయక్‌, కళ్యాణదుర్గం
    సహజ వ్యవసాయం వల్లే సాధ్యం!
    ‘‘శీతల దేశాల్లో తప్పితే మిగిలిన ప్రాంతాలన్నింటిలోను గాలిలో తేమ ఉంటుంది. దీనిని ఆధారంగా చేసుకొని వ్యవసాయం చేయగలిగితే బంజరు భూములలో కూడా మంచి దిగుబడి తేవచ్చు. సహజ వ్యవసాయం పద్ధతిలో మేము ఈ తరహా ప్రయోగాలను 2018 నుంచి అనంతపూర్‌ ప్రాంతంలో చేస్తున్నాం. సాధారణంగా ఈ ప్రాంతంలో బంజరు భూములు ఎక్కువ. నీటి వసతి తక్కువ. అందువల్ల లభ్యమయ్యే అతి తక్కువ నీరు, గాలిలో తేమల ఆధారంగా వ్యవసాయ పద్ధతులను రూపొందించాం. వన్నూరమ్మ కూడా ఈ పద్ధతిలో సేద్యం చేశారు. ఈ పద్ధతిలో ఏడాది పొడుగునా రకరకాల కూరగాయలు పండిరచటం జరుగుతుంది. దీని వల్ల రైతులకు సంవత్సరం పొడుగునా ఆదాయం ఉంటుంది. రెండోది సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు కావటంతో పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి. పంటలు మార్చి మార్చి వేయటం వల్ల నేలకు పోషకాలు అందుతాయి. ఈ రెండిరటితో పాటుగా- ఈ పంటలు పండిరచే ప్రాంతంలో ఉష్ణోగ్ర తలు తక్కువ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించి ప్రపంచంలోని అనేక మంది శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం లక్షకు పైగా రైతులు ఈ తరహా వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తున్నారు.
  • టి. విజయ్‌ కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌, రైతు సాధికార సంస్థ
    తెలుగు రైతులు ఆదరిస్తున్నారు!
    సహజ వ్యవసాయ పద్ధతులను మిగిలిన వారితో పోలిస్తే తెలుగు రాష్ట్రాల రైతులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే దాదాపు రెండు లక్షల ఎకరాలలో ప్రకృతి కృషి పద్దతిలో సాగు జరుగుతోందంటే- దీనికి లభిస్తున్న ఆదరణను మనం గమనించవచ్చు. రైతు సాధికార సమితి కేవలం ఆంధ్రాలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా నోడల్‌ ఏజన్సీగా వ్యవహరిస్తోంది. ఇక మహిళా రైతులకు వ్యవసాయంతో పాటు కుటుంబ బాధ్యతలు కూడా తెలుసు. కనుక తమ కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని ఎలా అనుకుంటారో.. సమాజానికి కూడా అలాంటి ఆహారాన్ని అందించాలనే తపన వారిలో కనిపిస్తూ ఉంటుంది. ఎరువుల వల్ల కలిగే కష్టనష్టాలు వారికి బాగా తెలుసు కాబట్టి- సహజ వ్యవసాయ పద్ధతులను అనుసరించటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వారికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తోంది. 2015 నుంచి సహజ వ్యవసాయ పద్దతులపై కేంద్రం అమలు చేసిన పధకాలన్నీ విజయం సాధించాయి. ఈ ఏడాది సాగు పద్ధతులపైనే కాకుండా.. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌పైన దృష్టి పెడుతున్నాం. సేంద్రీయ రైతు ఉత్పత్తి సంస్థ (ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌-ఎఫ్‌సీఓ)లను ఏర్పాటు చేస్తున్నాం. వీటివల్ల రైతులు తమ ఉత్పత్తులను లాభసాటి ధరలకు విక్రయించుకోగలుగుతారు. ఎఫ్‌సీఓల వల్ల దేశంలో సేంద్రీయ వ్యవసాయానికి కొత్త ఊపు వస్తుందని ఆశిస్తున్నాం.’- అడిదం నీరజ శాస్త్రి, జాయింట్‌ సెక్రటరీ, కేంద్ర వ్యవసాయ శాఖ-(ఆర్‌.కె.రాఘవ రమణా రెడ్డి)

చిరు సేధ్యం..ఆరోగ్య భాగ్యం

మారుతున్న ఆధునిక పోకడలు.. నిత్యం పని ఒత్తిడిలో పడ ఆరోగ్యాన్ని ఆశ్రద్ద చేయడం.. తీరిక లేకుండా బిజీగా గడుపుతూ దొరికిన జంక్‌ఫుడ్‌ తినడానికి నగర ప్రజలు అలవాటు పడిపోతున్నారు.దీంతో కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలుఉన్న తిండి తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. చిరుధాన్యాల్లో మంచి పోషక విలువలు ఉంటున్నాయి. వీటిని సాగు చేస్తున్న రైతులకు సైతం సిరులు కురిపిస్తు న్నాయి. అంతేకాకుండా వీటి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మద్దతు ధరను కూడా ప్రకటించింది.రైతులు పండిరచిన దిగుబడులను పౌరసరఫరాశాఖ ద్వారా కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేసింది. దీంతో చాలా మంది రైతుల చిరుధాన్యాల సాగుకు ఆసక్తి చూపుతున్నారు.
నేటి పోటీ ప్రపంచంలో అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయనిక ఎరువులు,పురుగు మందుల వినియోగం పెరిగిపోయింది. ఫలితంగా భూమిలో రసాయన అవశేషాలు నిండి ఏటికేడాది పంట దిగుబడులు పడిపోతున్నాయి.ఇలా సాగు చేసిన ఆహారం పంటల్లో కూడా రసాయనాల అవశేషాలు ఎక్కువ ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా జనాల్లో వ్యాధుల సంఖ్య ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది.వీటికి చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.చాలా మంది ఇప్పుడు చిరుధాన్యాలను ఇష్టపడుతున్నారు. ఇప్పటికే చాలా ఏళ్ల నుంచి నగరంలోని రైతు బజార్లులో ప్రత్యేక కౌంటర్ల పెట్టి విక్రయాలు సాగిస్తున్నారు.నగర ప్రజలపై అవగాహన కల్పించేందుకు గత రెండేళ్ల నుంచి కొన్ని స్వచ్చంధ సంస్థలు కలసి చిరుదాన్యాల జాతర కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలను అవగాహన కల్పిస్తున్నారు.ఇందుకు సంబంధించి ఇటీవలే ఐక్యరాజ్యాసమితి కూడా 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్‌ సంవత్సరంగా ప్రకటించింది. దీనికి అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం సాగును ప్రొత్సహించేంఉదకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సదస్సులను నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తోంది.
మినుకు మినుకు..
వర్షాధార,సారవంతం కాని భూముల్లో ఆహార పంటలుగా చెలామణి అవుతున్న వరి,గోధుమ,మొక్కజొన్న లాంటివి పండిరచలేము. దాంతో ఆయా భూముల్లో ఇప్పటికీ మిల్లెట్స్‌ సాగు మినుకు మినుకు మంటోంది. అంటే పాక్షిక ఉష్ణమండల ప్రాంతాలలో సాగు చేస్తున్నారు. ప్రధాన ఆహార ధాన్యాలలో కంటే వీటిలో పోషకాలు, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. ఆరోగ్య భద్రతనిస్తాయి. అంతేకాక తీవ్రమైన వాతావరణ అననుకూల పరిస్థితులను తట్టుకునే శక్తి ఈ మిల్లెట్స్‌కు ఉంది. పర్యావరణ అభివృద్ధికి తోడ్పడతాయి.
2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం..
చిరుధాన్యాలు..సిరిధాన్యాలుగా పిలువబడే మిల్లెట్స్‌ పూర్వకాలం నుంచి మన దేశంలో ప్రధాన ఆహారపంటగా ఉండేది. ప్రస్తుతం వరి, గోధుమ, ఇతర ఫాస్ట్‌ఫుడ్స్‌ జనజీవన సరళితో మమేకమయ్యాయి. కంటికింపుగా పిల్లలను, పెద్దలను ఆకర్షిస్తున్న ఫాస్ట్‌ఫుడ్స్‌ లాంటి ఆహార పదార్ధాలు జిహ్వచాపల్యాన్ని తీర్చడం తప్ప ఆరోగ్యహేతువులు కావు. కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రోగ నిరోధక శక్తి అవసరం. అన్ని తరగతుల ప్రజలకు పౌష్టికాహారం అందించాల్సిన అగత్యం ఏర్పడిరది. వీటన్నింటి దృష్ట్యా మన ప్రభుత్వం 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించింది.
రిఫైన్డ్‌ డైట్‌ కల్చర్‌కు ప్రత్యామ్నాయంగా..
మారిన జీవనశైలితో ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజల్లో చైతన్యం పెరిగి,‘రిఫైన్డ్‌ డైట్‌ కల్చర్‌’కు ప్రత్యామ్నాయంగా పోషకాలు అధికంగా ఉండే మిల్లెట్స్‌ను స్వీకరించే స్థితిలో ఆలోచిస్తున్నారు. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రజలు రోగనిరోధక శక్తిని పెంపొందించు కోవడానికి మిల్లెట్స్‌ వినియోగంపై దృష్టి పెడుతున్నారు. ప్రకృతి ప్రేమికులు ప్రజల్లో మీడియా ద్వారా వీటిపై అవగాహన కల్పిస్తున్నారు.
పోషకాలు మెండు..
మిల్లెట్ల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం2018 ఏప్రిల్‌లో మినుములను న్యూట్రి-తణధాన్యాలుగా ప్రకటించింది.వాటిలోజొన్న (జోవర్‌),పెరల్‌ మిల్లెట్‌ (బజ్రా),ఫింగర్‌ మిల్లెట్‌ (రాగి/మాండువా) మైనర్‌ మిల్లెట్‌బీ ఫాక్స్‌టైల్‌ మిల్లెట్‌ (కంగని/కాకున్‌),ప్రోసో మిల్లెట్‌ (చీనా),కోడోమిల్లెట్‌ (కోడో),బార్న్యార్డ్‌ మిల్లెట్‌(సావా/సన్వా/జంగోరా),లిటిల్‌ మిల్లెట్‌ (కుట్కి)లు కూడా ఉన్నాయి.గ్రామీణస్థాయిలో వ్యవసాయం,చిన్నతరహా,కుటీర పరిశ్రమలు, హస్తకళలు,ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో జాతీయ అభివద్ధి బ్యాంకుగా బాధ్యత వహించే నాబార్డ్‌ కూడా ఈ థీమ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించింది.
చిరుసేధ్యం కేరాఫ్‌ ఏజెన్సీ ప్రాంతం..
చిరుధాన్యాలు ఒకప్పుడు పేదలు,మధ్య తరగతి ప్రజల ప్రధాన ఆహారం.మూడు,నాలుగు దశాబ్దాల క్రితం వరకూ వీటి వినియోగం అధికంగానే ఉండేది.ముఖ్యంగా ఉమ్మడి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైన 11మండలాలల్లో చిరు సేధ్యం ఉత్పత్తులు అధికంగా ఉండేవి.వీటికి రసాయనిక ఎరువులు,పురుగుమందులు వాడకుండా పశువుల ఎరువు, చెరువు మట్టి,సేంద్రియ ఎరువులతో పండిరచే వాళ్లు. పలితంగా వీటిని వాడే ప్రజల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండేది. అనంతరం వచ్చిన మార్పులతో ఏడాదికేడాది చిరుధాన్యాల సాగు తగ్గుతూ వచ్చింది.చాలా మంది రైతున్నలు అధిక ఆదాయం కోసం వరి,పత్తి,మిరప,ఉల్లి వంటి పంటల సాగుపై ఆసక్తిని కనబరచ డంవల్ల చిరుధాన్యాల సాగు కనుమరుగువుతూ వచ్చింది.వీటితోపాటు అధిక దిగుబడులను సాధించాలనే పోటీతత్వంతో రైతులు విచక్షణా రహితంగా ఎరువులు,పురుగు మందులు వాడటం మొదటు పెట్టారు. ఫలితంగా సాగు ఖర్చులు పెరిగి పంట దిగుబడులు తగ్గాయి. భూమి కూడా విషతుల్యంగా మారుతోంది. దీనిని తగ్గించేందకు రాష్ట్ర ప్రభుత్వం చిరుధాన్యాల సాగును ప్రొత్సహిస్తోంది. ఇందులో భాగంగా జొన్నలు,రాగి పంటలకు మద్దతు ధరను ప్రకటించింది.
ఈ ఏడాది 9.85 వేల హెక్టార్ల సాగు లక్ష్యంగా…
ఉమ్మడి జిల్లా అనకాపల్లి,అల్లూరి సీతారామ రాజు,విశాఖపట్నం జిల్లాలో మిల్టెట్స్‌ సాగను ప్రొత్సహించే లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 9.85 హెక్టార్లలో సాగు చేసేందుకు వ్యవసాయ అధికారులు ప్రణాళికలను సిద్దం చేశారు. అందులో 2664 హెక్టారులో జొన్న,2050 హెక్టార్లలో సజ్జలు,2010హెక్టాలో రాగి,1872 హెక్టారలలో కొర్రలు సాగు లక్ష్యంగా నిర్ధేశించారు. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) పరిధిలో మిల్లెట్స్‌,క్లస్టర్స్‌ ఏర్పాటు చేసి ప్రతి నెలా మొదటి శుక్రవారం వ్యవసాయ అధికారులతో రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ సాగను ప్రొత్సహిస్తున్నారు.
మద్దతు ధరలు ఇలా..
రాష్ట్ర ప్రభుత్వం మిల్లెట్స్‌ సాగు ప్రొత్సహించే కార్యక్రమంలో భాగంగా జొన్న,రాగులకు మద్దతు ధరలను కూడా ప్రకటించింది. హైబ్రీడ్‌ జొన్నలకు క్వింటా రూ.3,180కాగా సాధారణ జొన్నకు క్వింటా 3225,అలాగే రాగులకు క్వింటాకు రూ.3846గా ప్రకటించింది. రైతులు పండిరచిన పంటలకు మద్దతు ధరను కల్పించి పౌరసరఫరాశాఖ తరుపున కొనుగోలు చేయనుంది.చిరుధాన్యాలు.. సిరి ధాన్యాలుగా పిలువబడే మిల్లెట్స్‌ పూర్వకాలం నుంచి మన దేశంలో ప్రధాన ఆహారపంటగా ఉండేది. ప్రస్తుతం వరి, గోధుమ, ఇతర ఫాస్ట్‌ఫుడ్స్‌ జనజీవన సరళితో మమేకమయ్యాయి. కంటికింపుగా పిల్లలను, పెద్దలను ఆకర్షిస్తున్న ఫాస్ట్‌ఫుడ్స్‌ లాంటి ఆహార పదార్ధాలు జిహ్వచాపల్యాన్ని తీర్చడం తప్ప ఆరోగ్యహే తువులు కావు. కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రోగ నిరోధక శక్తి అవసరం. అన్ని తరగతుల ప్రజలకు పౌష్టికాహారం అందించాల్సిన అగత్యం ఏర్పడిరది. వీటన్నింటి దృష్ట్యా మన ప్రభుత్వం 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించింది. ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచి భారత ఉపఖండంలో చిరుధాన్యాలు పండిరచబడుతున్నాయని సూచించడానికి పాలియోం టలాజికల్‌ ఆధారాలున్నాయి. గడ్డి కుటుంబానికి చెందినవి చిరుధాన్యాలు. ఏడాదంతా ఉష్ణమండల వాతావరణంలో పెరిగే తృణధాన్యాలు. తక్కువ నీటి సౌకర్యంతో,అతి తక్కువ కాలంలోనే పంట కోతకు వచ్చి, దిగుబడిని ఇస్తాయి. సైజులో చిన్నవే కానీ పోషకాలు మెండుగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్‌, అమైనో ఆమ్లాలు,వివిధ రకాల ఖనిజాలను కలిగి ఉం టాయి. రాగులు (ఫింగర్‌ మిల్లెట్‌),జొన్నలు (జోవర్‌),బజ్రా (పెర్ల్‌ మిల్లెట్‌),ఊదలు, కొర్రలు, అండుకొర్రలు, ప్రోసో (చీనా),కోడో (కొడ్రా, అరికెలు), ఫాక్స్‌ టెయిల్‌ (కంగ్ని/కొర్ర), బార్న్యార్డ్‌ (వరై, సావా), లిటిల్‌ మిల్లెట్‌ (కుట్కి) మనదేశంలో పండిరచే మిల్లెట్లు.
ఆకుపచ్చ విప్లవం..
ఎమ్‌ఎస్‌ స్వామినాథన్‌ ఆధ్వర్యంలో (1960) వచ్చిన గ్రీన్‌ రివల్యూషన్‌ దశాబ్ద కాలం మనగ లిగింది. తద్వారా భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి లాంటి రకరకాల విత్తనాలు వ్యవసాయంలో ప్రాధాన్యతను సంతరించు కున్నాయి. గ్రీన్‌ రివల్యూషన్‌ నేపథ్యంలో యాంత్రిక వ్యవసాయ ఉపకరణాలు, నీటి సౌకర్యం, పురుగుమందులు, ఎరువులు అభివృద్ధి రూపంలో వినియోగంలోకి వచ్చాయి. వ్యవసాయం ఆధునిక పారిశ్రామిక వ్యవస్థగా మారింది. ఆహారధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగింది. వాణిజ్య, వ్యాపార ధోరణిలో క్రమంగా వరి, గోధుమ ప్రాముఖ్యత పెరిగి, మిల్లెట్స్‌ ఉనికి మరుగున పడిపోయింది.
నాబార్డ్‌ ప్రమేయం..
గ్రామీణస్థాయిలో వ్యవసాయం, చిన్న తరహా, కుటీర పరిశ్రమలు, హస్తకళలు, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో జాతీయ అభివద్ధి బ్యాంకుగా బాధ్యత వహించే నాబార్డ్‌ కూడా ఈ థీమ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించింది.-(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

ఎకో టూరిజం తగ్గేదెలా 

నగరవాసుల మధ్య (స్వచ్ఛసర్వేక్షణ్‌2023) పరిశుభ్రతను పెంపొందించడానికి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోంది.స్వచ్ఛ సర్వేక్షణ్‌2023 లో టాప్‌ ర్యాంక్‌ సాధించడమే లక్ష్యంగా జీవీఎంసీ దృష్టి కేంద్రీకరించింది. దీని కోసం నగర ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏకో వైజాగ్‌ పేరుతో ప్రపంచ పర్యావరణ దినోత్స వం సందర్భంగా గతనెల 5న ప్రచారాన్ని ప్రారంభించింది.గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జివిఎంసి) పౌరులలో పరిశుభ్రతను పెంపొందించడానికి,నగరంలో కాలు ష్యంతో పాటు ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా పోరా టాన్ని కొనసాగించడానికి ‘ఈ ఎకో-వైజాగ్‌’అనే కొత్త ప్రచారాన్ని ఆర్‌కే బీచ్‌లో మున్సిపల్‌ అడ్మిని స్ట్రేషన్‌శాఖ మంత్రిఎ.సురేష్‌, జిల్లాఇన్‌ ఛార్జి మంత్రి వి.రజినితోపాటు మేయర్‌ జి.హరివెంకట కుమారి, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు లాంఛనంగా ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా పర్యావరణ పరిశుభ్రత,పచ్చదనం,నీటి సంరక్షణ,ప్లాస్టిక్‌ నిషేధం, కాలుష్యాన్ని తగ్గించ డం వంటి ఐదు అంశాలపై జీవీఎంసీ కమిష నర్‌ సాయి కాంత్‌ వర్మ దృష్టి సారించారు.ఎకో క్లీనింగ్‌లో భాగంగా వ్యర్థ పదార్థాల నిర్వహణ, వేరు చేయడాన్ని ప్రోత్సహిం చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జివిఎంసి బహిరంగ డంపింగ్‌,పరిశుభ్రతను నిర్వహించ డంవల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగా హన కల్పిస్తుంది. డ్రైవ్‌లో భాగంగా కార్పొరేషన్‌ పరిధిలో పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టనున్నారు.నీటి సంరక్షణలో భాగంగా బీచ్‌ క్లీనింగ్‌ కార్యకలాపాలు,రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ మెళుకువలు భారీస్థాయిలో కొనసాగుతాయి. దీంతోపాటు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఉత్పత్తులను తీసుకు రావడానికి కార్పొరేషన్‌ కృషి చేస్తుంది.దీనికి సంబంధించి ఎకోమేళా కూడా నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికీ జీవీఎంసీ 10ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ బృందాలను సిద్ధం చేసి ఆ బృందాలకు ప్రత్యేక వాహనాలు కొనుగోలు చేసి అందజేశారు. ప్రతి బృందంలో ఇద్దరు అధికారులు నియమించారు.వారు తనిఖీలు, ఆలోచనలు,ఫిర్యాదుల పరిష్కారం, కార్యక్రమా లను నిర్వహిస్తున్నారు. నగర ప్రజల అలవాట్లను మార్చడం,పచ్చదనాన్ని పెంపొందించడం,నీటి సంరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలు,సింగిల్‌ యూ జ్‌ ప్లాస్టిక్‌పై కఠినమైన నిషేధం వంటి అంశాలపై ఈ టాస్క్‌ స్క్వాడ్‌లు చర్యలు తీసుకుంటారు.అవసరమైతే ఈఎన్‌ఫో ర్స్‌మెంట్‌ బృందాలు జరిమానాలు కూడా విధిస్తాయి. 56 కిలోమీటర్ల బీచ్‌ తీరప్రాంతంలోని నగర పరిమితుల్లో కాలు ష్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకు నగర ప్రజలు మద్దతు ప్రకటిస్తూ ఉత్సహంగా భాగస్వామ్యం అవుతున్నారు.బీట్‌ ప్లాస్టిక్‌ పొల్యూషన్‌ అనే నినాదంతో ప్లాస్టిక్‌ కాలుష్యానికి పరిష్కారాలపై దృష్టి పెడుతూ విస్త్రత ప్రచారం చేస్తోంది.
స్వచ్ఛ సర్వేక్షణ్‌2023లో టాప్‌ ర్యాంకే లక్ష్యం గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2023-మేరా షెహర్‌,మేరీ పెహచాన్‌ (ఎస్‌ఎస్‌-2023) ఎనిమిది ఎడిషన్‌ కోసం సిద్ధమవుతోంది.దీని కోసం దేశవ్యాప్తంగా 3,000మంది మదింపు దారులతో జూలై ఒకటి నుండి ఫీల్డ్‌ అసెస్‌ మెంట్‌ ప్రారంభించారు.ఈనెల రెండోవారంలో వైజాగ్‌కు అసెస్సర్‌లు రానున్నారు. విశాఖ పట్నంతో సహా4,500ప్లస్‌ నగరాల పనితీరును 46సూచికలపై ఒక నెలలోపు మదింపుదారులు అధ్యయనం చేస్తారు. అంచనా నివేదిక ప్రతి పారామీటర్‌లో స్కోర్‌ల రూపంలో విడుదల చేయబడుతుంది.మొత్తం మార్కులు9,500. ఇందులో పౌర సేవలకు 4,525మార్కులు, సర్టిఫికెట్లు,అవార్డులకు 2,500,ప్రజల అభిప్రాయానికి 2,475మార్కులు ఉన్నాయి. ఎస్‌ఎస్‌2023 పౌరుల నుండి టెలిఫోనిక్‌ ఫీడ్‌బ్యాక్‌తో 2022లో మే 24న ప్రారంభి చింది. మూల్యాంకనం నాలుగు త్రైమాసికాల్లో నిర్వహించబడుతుంది. మొదటి మూడు త్రై మాసికాలు పూర్తయ్యాయి. బృందాలు సాక్ష్యం కోసం రెండు స్థాయిల నాణ్యత తనిఖీలు, ప్రత్యేక క్షేత్ర సందర్శనలను ఉంటాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022 సర్వేలో విశాఖపట్నం నాలుగో స్థానంలో నిలిచింది.2021లో నగరం తొమ్మిదో స్థానం నుండి పైకి ఎగబాకింది. ఇది2017లో మూడవ పరిశుభ్రమైన నగరంగా ప్రకటించ బడిరది.ఇది ఇప్పటివరకు అత్యుత్తమ ర్యాంకింగ్‌ స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022 ర్యాంకింగ్స్‌ ప్రకారం విశాఖపట్నం దేశంలో నాల్గవ పరిశుభ్రమైన నగరంగా (10లక్షలకు పైగా జనాభా విభాగం లో) ఎంపికైంది. నగరం 2021సంవత్సరంలో తొమ్మిదవ స్థానం నుండి 2022లో నాల్గవ స్థానానికి తన ర్యాంకింగ్‌లను మెరుగుపరిచింది. మొదటి నాలుగు స్థానాల్లో నగరానికి స్థానం దక్కడం ఇదిరెండోసారి.స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2017లో,నగరం మూడవ పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందింది. ఇది ఇప్పటి వరకు అత్యుత్తమ ర్యాంకింగ్‌గా ఉంది. ఇదికాకుండా,జీవీఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022లో మరో రెండు అవార్డులను కైవసం చేసుకుంది. ఒక అవార్డు చెత్త రహితనగరాల్లో (జిఎఫ్‌సి)ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ను పొందినందు కుగాను, మరోకటి 10నుండి 40 కేటగిరీలో ‘క్లీన్‌ బిగ్‌ సిటీ’ అవార్డును పొందడం విశేషం.
స్వచ్ఛ సర్వేక్షణ్‌ ఫలితాల్లో విశాఖ టాప్‌
దేశ వ్యాప్తం గా 73లక్షల 95 వేల 680 మంది ఆన్‌లైన్‌లో ఫీడ్‌ బ్యాక్‌ సేకరించారు. 2701 మంది క్షేత్ర స్థాయిలో పర్యటించి 17,030 వాణిజ్య ప్రాం తాలు,24,744 నివాస ప్రాంతాలు, 16,501 చెత్త శుద్ధి కేంద్రాలు, 1496 రెమిడియేషన్‌ సైట్లను సందర్శించి క్షేత్ర స్థాయిలో తీసిన 22.26లక్షల ఫోటోలను విశ్లేషించి ర్యాంకుల్ని ఖరారు చేశారు.లక్షకు పైబడిన నగరాల్లో విశాఖ పట్నం7500మార్కులకు 6701మార్కు లతో నాలుగో స్థానంలో,6699 మార్కులతో విజయవాడ 5స్థానంలో,6584 మార్కులతో తిరుపతి ఏడో స్థానంలో,4810మార్కులతో 75వ ర్యాంకుతో కర్నూలు,4688 మార్కులతో 81వ స్థానంలో నెల్లూరు పట్టణాలు స్వచ్ఛ భారత్‌ ర్యాంకుల్ని దక్కించుకున్నాయి.జాతీయ స్థాయిలో స్థానిక సంస్థల విభాగంలో పెద్దనగ రాల జాబితాలో 10నుంచి 40లక్షల జనాభా కింద ఈసారి పలు నగరాలను అవార్డు కోసం ఎంపిక చేయగా,మధ్యస్థాయి నగరాల జాబితా లో,3 నుంచి 10లక్షల జనాభా విభాగంలో మరికొన్ని నగరాలు, పట్టణాలను చేర్చారు.స్టేట్‌ క్యాపిటల్‌ జాబితాలో మరికొన్ని నగరాలకు అవార్డులు ప్రకటించగా,విజయవాడ మొదటి స్థానంలో నిలిచింది.అంశాలవారీ స్కోరింగ్‌.. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుకు సంబంధించి మొత్తం వివిధ విభాగాల కింద 7,500 మార్కులు కేటా యించారు. అందులో విజయవాడ 6,699 మార్కులు మాత్రమే సాధించింది.
వాలంటీర్లకు టార్గెట్లు
గత ఏడాది చెత్త రహిత శుభ్రమైన నగరంగా మూడో స్థానాన్ని దక్కించుకున్న విజయవాడకు వాటర్‌ ప్లస్‌ సిటీస్‌ క్యాటగిరీలో కూడాఅవార్డులు దక్కాయి. చెత్తసేకరణ, నిర్వహణ, రిసైక్లింగ్‌, తడిపొడిచెత్తల వేర్వేరు సేకరణ,నిర్మాణ వ్యర్థాల వినియోగంలలో నగరానికి మంచి ఫీడ్‌ బ్యాక్‌ లభించింది. కొన్నేళ్లుగా నంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు విజయవాడ తీవ్రంగా శ్రమిస్తోంది.అందుకే ఈసారి స్వచ్ఛ్‌ భారత్‌ అవార్డుల్లో నంబర్‌ వన్‌ స్థానం పొందడానికి ఓ ప్లాన్‌ వేశారు. ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు అదనంగా పాయింట్లు పొందేందుకు ఉద్యోగులు, ాలంటీర్లకు టార్గెట్లు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి గ్రామంలో, పట్టణాల్లో ప్రతి వార్డులో క్లస్టర్ల వారీగా వాలంటీర్ల ద్వారా పౌరసేవలు అందిస్తున్నారు. ఇప్పుడు స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ బాధ్యతల్ని కూడా విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికా రులు వాలంటీర్లకు అప్పగించారు. ప్రతి వాలంటీర్‌ తన పరిధిలో ఉన్న కుటుంబాల తరపున సర్వే పూర్తి చేసేస్తున్నారు. వాలంటీర్ల వద్ద తన పరిధిలో ఉండే కుటుంబాల మొబైల్‌ ఫోన్‌ నంబర్లు ఉండటంతో వాటి ద్వారా సర్వే పూర్తి చేస్తున్నారు. మొబైల్‌ రిజిస్టర్‌ చేసి ఆ ˜ోన్లకు వచ్చే టీపీలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇలా కనీసం 100మంది తరపున సర్వే పూర్తి చేయాలని ఒక్కోక్కరికి టార్గెట్‌ పెట్టారు.
ప్రచారం ఎక్కువ ఫలితం తక్కువ…
స్వచ్ఛ్‌ భారత్‌ ద్వారా ప్రజోపయోగ కార్యక్ర మాలు విస్తృతంగా చేపడుతున్నా వాటి ఫలి తాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. విజయవాడ వంటి నగరాల్లో పబ్లిక్‌ టాయిలెట్లు పేరుకే ఉంటున్నాయి. నిర్వహణాలోపాలు ఎక్కువగా ఉంటున్నాయి. అయినా సర్వేలలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం విజయవాడ మునిసిపల్‌ కమిషనర్‌గా నివాస్‌ ఉన్న సమయంలో సర్వేలో పాల్గొనేం దుకు కన్సల్టెంట్లకు బాధ్యతలు అప్పగించారని వార్తలు రావడంతో విజయవాడ నగరాన్ని ర్యాంకుల నుంచి మినహాయించారు. ఆ తర్వాత మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు వాలం టీర్లే ప్రజల తరపున సర్వేలు పూర్తి చేసే బాధ్యత అప్పగించారు. స్వచ్ఛ్‌ భారత్‌ కార్యక్ర మాల కోసం కేంద్రం భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. కేంద్ర బృందాలు పర్యటించే సమయంలో ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పెద్ద ఎత్తున హోర్డింగులు, ప్రచార కార్యక్రమాలు కనిపించేలా ఏర్పాట్లు చేస్తారు. ఆ బృందాలు నగరాల్లో పర్యటించకుండానే ఈ హంగామా చూసి బాగా పనిచేస్తున్నాయనుకుని వెనుదిరిగిపోతాయి. మొత్తంమ్మీద ఏపీలో స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ అవార్డుల కోసం నగరపాలక సంస్థలు పడుతున్న పాట్లు ప్రచారాలకు పనికొస్తున్నాయి. ఈ ఏడాది విశాఖకు ర్యాంకు రావడానికి రాజకీ య కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
టాప్‌ వన్‌ ర్యాంక్‌ సాధనే లక్ష్యం..
ఈ సంవత్సరం ప్రారంభంలో నగరంలో జరిగిన జీ-20సమ్మిట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ కమిటీ సమావేశానికి, జీవీఎంసీ మౌలిక సదు పాయాల అభివృద్ధి పనుల కోసం సుమారు 110కోట్లు ఖర్చు చేసింది మరియు సుమారు 1.5లక్షల మెట్రిక్‌ టన్నుల లెగసీ వేస్ట్‌ల బయో మైనింగ్‌ను కూడా పూర్తిచేసింది.మూల్యాంకనంలో మంచి స్కోర్‌ కోసం అవసరమైన అన్ని రంగాలను మేము కవర్‌ చేసాం.ఈ సంవత్సరం టాప్‌ 1ర్యాంక్‌ సాధిస్తామనేది మా ఆకాంక్ష.
` సాయి క్రాంత్‌ వర్మ,కమిషనర్‌,జీవీఎంసీ-గునపర్తి సైమన్‌

పొగ మహామ్మారిని తరిమెద్దాం..!

సిగరెట్‌ తాగడం వల్ల 12 రకాల క్యాన్సర్‌లు వస్తాయని తేలింది. సరదాగానో, మిగిలిన వారిని చూసిన ఉత్సా హంలోనో పొగతాగడాన్ని అలవాటు చేసుకున్న వారు ఆ మత్తు నుండి బయటపడలేకపోతున్నారు. ఏం చేయాలన్నా ‘ఒకసారి పొగతాగాల్సిందే’ అన్నట్టు వారి వ్యవహార శైలి మారిపోతుంది. చాలామంది వైద్యులు పొగతాగేవారిని ప్రశ్నిస్తే- తాము చిన్నతనంలో పదేళ్ల ప్రాయంలోనే సరాదాగా స్నేహితులతో పందెం కాసి పొగతాగడం మొదలుపెట్టానని చెబుతుంటారు. కాని పొగతాగేవారి వల్ల వారికే కాదు, వారి చుట్టూ ఉన్న వారు కూడా ప్రమాదంలో పడుతున్నారు. వ్యక్తులకు, ఆరోగ్యానికి, సమాజానికి కూడా నష్టాన్ని కలిగిస్తున్నారు. ‘ పొగతా గడం మానేయండి, పొగాకు వదిలి వేయండి’ అనే నినాదం అంతా పాటిస్తే అంతా సుఖమయంగా జీవిస్తారు. పొగతాగడం ద్వారా ఎన్నో హాని కరమైన, విషతుల్యమైన వాయువుతో ఊపిరితిత్తులను ఉదయం నుండి రాత్రి దాకా నిర్వి రామంగా కాలు స్తూనే ఉంటే మన జీవితం వెలుగు తున్న కొవ్వొత్తి మారిది కరిగి వెలుగులేకుండా ఆరిపో వడం ఖాయం. పొగతాగడం మానాలి అంటే మీ నేర్పు, మీ మనో ధైర్యం, పోరాట శక్తి, పొగమానాలనే బలమైన కోరిక తో దానిని జయించాలి. హానికరమైన వ్యస నాన్ని కలిగించే పదార్థాలే క్యాన్సర్‌ కరకాలు అని గుర్తించాలని… గత 20 ఏళ్లగా పొగాకు నియంత్రణపై ప్రచార ఉద్యమం చేపడుతున్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఓ డిప్యూటీ తాహశీల్దార్‌ ‘‘ మాచన రఘునందన్‌’’ మే 31న పోగాకు నియంత్రణ దినోత్సవం సందర్భంగా ‘థింసా’కి ఇచ్చిన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇదీ!
మేడ్చల్‌ జిల్లా కేశవరంకు చెందిన ‘‘మాచన’’.. రంగారెడ్డి జిల్లాలో ఆంగ్లభాషా పండితుడిగా పనిచేసి ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి పురస్కారాన్నందుకున్న అభిమన్యు కుమారుడు. సాధారణంగా పండిత పుత్ర పరమశుంఠ అని నానుడి. కానీ..మాచన అందుకు భిన్నం. ఇప్పుడు తన కుటుంబం మొత్తం గర్వించదగ్గ రీతిలో తన ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూనే…పొగాకుపై ఉద్యమం చేస్తున్న పోరాటశీలి. అందుకే జాతీయస్థాయిలో పొగాకు నియంత్రణకు కృషి చేస్తున్న రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ టుబాకో కంట్రోల్‌ రఘునందన్‌ని ‘‘టుబాకో కంట్రోల్‌ స్టాల్‌ వర్ట్‌’’గా గుర్తించింది. అమెరికాకు చెందిన హెల్త్‌ మ్యాగజీన్‌ పల్మనరీ మెడిసిన్‌ కూడా రఘునందన్‌ విజయగాధను వావ్‌..వెల్డన్‌. అని కొనియాడిరది. ఈమధ్యే రఘునందన్‌ విధి నిర్వహణలో కనబరుస్తున్న చొరవతో పాటే…ఆయన ఆశయాలు..వాటికై ‘‘మాచన’’ పోరాటం గురించి తెలుసుకున్న పలు వురు రఘునందన్‌ను అభినందించడంతో తన బాధ్యత మరింత పెరిగిందంటారు ‘‘మాచన’’. రఘునందనంటే ఓనిబద్ధత గల ఉద్యోగి…తన విధులను బాధ్యతగా నిర్వహిస్తూనే…తమ హక్కులకై పాత పింఛన్‌ విధానంపై పోరాడే ప్రచార కార్యదర్శి…పొగాకును కూకటివేళ్లతో పెకిలించే చైతన్యం సమాజం నుంచే రావాలని పోరాడుతున్న ఉద్యమశీలి.. వీటన్నింటినీ మించి సామాన్యుల పాలిట సాటి మనిషిగా స్పందించే మానవీయకోణం..మొత్తంగా మన రాష్ట్రం వాడు..మనవాడు…నిత్యం అందరిలో ఒకడు.
పొగాకు పై ఇరవయ్యేళ్ల పోరాటం
సిగరెట్‌ తాగకు..పొగాకు మంచిది కాదు అని వైద్యులు చెప్పడం సాధారణం. అదే ఓ వైద్యే తర రంగానికి చెందిన వ్యక్తికి మాత్రం జీవితమే పొగాకు పై రణం. ఇది ఓనమ్మ లేనినిజం. మాచన రఘునందన్‌ది పౌర సరఫరాలశాఖలో ఎన్ఫోర్స్‌ మెంట్‌ డిప్యూటీ తాసిల్దార్‌ ఉద్యోగం. అందరు ఉద్యోగుల్లా డ్యూటీ అయిపోగానే ఇంటికి, లేదా కాలక్షేపం కోసం క్లబ్బుకు చేరే రకం కాదు మనం చెప్పుకుంటున్న మాచన రఘునందన్‌.తన జీవితంతో మారాలి ఎన్నో జీవితాలు అని పొగాకు నియంత్రణ పథంలో ప్రయాణిస్తూ..మేం సిగరెట్‌,బీడీ,తంబాకు మానేస్తాం అని ప్రమాణం చేయిస్తున్నారు. సమాజ సేవ ఎలా చేయాలో స్ఫూర్తినిస్తున్నారు. ఎందరి జీవితాలనొ పొగాకు నుంచి విముక్తి చేస్తున్న ఓ అసాధారణ ఉద్యమం తన జీవితం అని చెప్పకనే చెబుతున్నారు. రఘునందన్‌ నగరంలో నివసించే తన ద్విచక్ర వాహనంపై పర్యటిస్తారు. ఎక్కడ ఎవరు దమ్ము కొట్టినా.. ఒక్క క్షణం ఆగి కంఠంలో ప్రాణాన్ని పొగాకు కు బలి చేయొద్దు అని తన కంఠ శోషగా హితవు చెబుతున్నారు. ప్రజారోగ్యం కాంక్షించే వైద్యులకు, ఆసుపత్రులకు వరల్డ్‌ క్యాన్సర్‌ డే, నో స్మోకింగ్‌ డే, వరల్డ్‌ నో టబాకో డేలు ఓ అవగా హన కలిగించే సందర్భాలు మాత్రమే. నగరం లో నివసించే, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్‌ మెంట్‌ డిప్యూటీ తాసిల్దార్‌ మాచన రఘునందన్‌ గత ఇరవై ఏళ్ల నుంచి పొగాకు నియంత్రణ కోసం కృషి చేస్తున్నారు. ఆయన ఇలా తన వాహనం పై స్మోకింగ్‌ కిల్స్‌,క్విట్‌ టుబాకో ఆన్న సందేశం తో రాష్ట్ర వ్యాప్తంగా 5000 కిలో మీటర్లు ప్రయాణించి,500 గ్రామాల్లో వేలాది మంది ని పొగాకు, ధూమపానం మానేస్తాం అని ప్రతీణ చేయించారు. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. శుక్రవారం నాడు ఆయన నగరంలో పలు ప్రాంతాలలో ఇలా బైక్‌పై తిరుగుతూ పొగాకు కాన్సర్‌ కారకం అని అవగాహన కలిగించారు. ఎంతో నిస్వార్థ సేవ చేస్తున్నా..ఎటువంటి అవా ర్డులు ఆశించరు. పరిమాణం ముఖ్యం కాదు పరిణామం ప్రధానం అంటారు మాచన రఘునందన్‌.
సామాజిక ఉద్యమశీలి
వాస్తవానికి నా వృత్తి డిప్యూటీ తహశీల్దార్‌ హోదా ఉన్న వ్యక్తికి…ప్రవృత్తిగా సమాజం కోసం ఏదో సాధించాలన్న తపన..ఆ తపనకు తగ్గ కమిట్మెంట్‌ ఉండట మంటే కాస్తా అరుదే. అలా ..అని ఎవరూ ఉండరని కారు. అలాంటి వారిలో ఒకరే మనమిప్పుడు చెప్పుకునే రఘు నందన్‌ మాచన. పౌరసరఫరాలశాఖలో ఓ విజిలెన్స్‌ ఆఫీసర్‌గా ఎక్కడో ఓచోట నిత్యం దాడులు,తనిఖీలు నిర్వహించే క్రమంలో… ఎందరో అధికారుల్లాగే లంచాలకు మరిగి తానూ ఆర్థికంగా అందలమెక్కొచ్చు. కానీ అలా అయితే రఘునందన్‌ గురించి చెప్పుకోవడ మెందుకు..? తన సర్వీస్‌లో మాచన రఘు నందన్‌కు ఉద్యోగ బాధ్యతే కావచ్చు..కానీ అందులో మానవత్వం ఉంది. సమాజాన్ని మార్చాలన్న తపన కనిపిస్తుంది. అందుకే ఈ అరుదైన అధికారికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. పొగాకు నియంత్రణలో రఘు నందన్‌ డెడికేషన్‌ జర్మనీ దేశాన్నీ టచ్‌ చేసింది. ఇప్పుడు రఘునందన్‌ ను ఆ దేశ ప్రతినిధులు తమ వద్దకు రావాలని ఆహ్వానిస్తున్నారు. సామా జిక మాధ్యమాల ద్వారా పుకార్లు, ఫార్వర్డ్లు, తమకు గిట్టనివారిని ఉతికారేసే ఇష్టారీతి ద్వేషపు రాతలురాసే వాళ్లేకనిపించే రోజుల్లో… పొగాకు నియంత్రణపై రఘునందన్‌ అదే సామాజిక మధ్యమాలనుపయోగించుకుని కల్పిస్తున్న అవగాహన అంతర్జాతీయ సమాజాన్నీ చేరుతోంది. వైద్యుడు కానప్పటికీ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌..తన కార్యక్రమా లకు రఘునందన్‌ ను ఆహ్వానిస్తోంది. అయితే ఇంతేనా.. మాచన అంటే…? పంజాబ్‌ ఛండీ గడ్‌లో జరిగిన పొగాకు నియంత్రణ అంతర్జా తీయ సదస్సులోనూ ‘‘మాచన’’నే భారత్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ గౌరవ ప్రతినిధిగా పాల్గొనడమంటే దానివెనుక ఆయన అవిరళ కృషే కారణం. పొగాకు ఉత్పత్తుల వల్ల ఆరోగ్యానికీ, ఐశ్వర్యానికీ ముప్పు కలగక ముందే.. టుబాకో కు గుడ్‌ బై చెప్పే అవగా హన ప్రతి ఒక్కరిలో కల్గాలని ఆశిస్తున్న వ్యక్తి మాచన. మాచన రఘునందన్‌ సుమారుగా రెండు దశాబ్దాల కృషి. అయితే ఆఫలాలు ఇప్పుడు అందుతున్నాయి. ఆయన ఆశించిన మార్పు ఆయనెంచుకున్న లక్ష్యాల్లో కనిపిస్తోంది. ఆయన పేరూ హైదరాబాద్‌ జిల్లా దాటి..రాష్ట్ర వ్యాప్తమై.. దేశం గుర్తించి…అంతర్జాతీయ సమాజానికీ వినిపిస్తోంది. ఇలా రఘునందన్‌ అటు వృత్తిలోను ఇటూ ప్రవృత్తిలోనూ తనకంటూ ఓ ప్రత్యే’కథను’ సంతరించు కుంటున్నవారు.
ప్రతిభకు పట్టాభిషేకం
రఘునందన్‌ విద్యదశలో ఉన్న సమయంలో కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలపై తనదైన ప్రతిభను చాటుకున్నారు. ఉత్తమ జర్నిలిస్టుగా,సామాజిక కార్యకర్తగా తెలంగాణా రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందారు. ఈనేపధ్యంలోనే ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ (2009)లో కేంద్ర ప్రజా సంబంధాల సమాచార బోర్డు కాష్టింగ్‌,మంత్రిత్వశాఖ ఏపీ తరుపున ఉత్తమ సామాజిక/పాత్రికేయడుగా ఎంపిక చేసింది. దాంట్లో భాగంగా రాష్ట్రంలో మొత్తం 15మంది టీమ్‌ను దేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన అరుణచల్‌ ప్రదేశ్‌, అస్సాం, మేఘా లయ,త్రిపుర,మిజోరాం,వంటి రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ ఆదివాసీ గిరిజన ఆచార వ్యవహారాలపై పరిశోధన చేశారు.ఆ బృం దంలో రఘునందన్‌ ప్రత్యేక గుర్తింపు పొం దాడం విశేషం. స్థానికంగా రఘునందన్‌ చేస్తున్న సామాజిక కృషిని రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా ఉన్నతాధికారులు సైతం తన ప్రతిభకు పట్టాభిషేకం కడుతూ ప్రశంసలు కురిపిస్తూన్నారు. రఘునందన్‌ చేస్తున్న ఈ జర్నీ మరింత ముందు కెళ్లాలని…మరెందరో అధికారులకు,సామాన్యులకు ఈయన స్ఫూర్తి ఓప్రేరణ కావాలనీ ఆశిద్దాం.! – గునపర్తి సైమన్‌

1 … 3 4 5 6 7 … 10