లౌకికవాద పటిష్టత – గణతంత్ర పరిరక్షణ

భారత స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించి, రాజ్యాంగాన్ని రూపొందించిన మేథావులకు భారతదేశంలోని బహుళ మతాల, బహుళ సంస్కృతుల లక్షణాలు మరియు భారతదేశం యొక్క సామాజిక నిర్మాణంలో ఉన్న సంక్లిష్టతల గురించి చాలా లోతైన అవగాహన ఉంది. దేశాన్ని ఐక్యంగా ఉంచ డానికి గాను గణతంత్రం యొక్క ప్రాథమిక సూత్రంగా లౌకికతత్వాన్ని ఎంపిక చేశారు. ఒకవేళ లౌకికతత్వాన్ని ఉనికిలో లేకుండా తిరస్కరిస్తే, కష్టపడి సాధించుకున్న దేశ ఐక్యతకు ముప్పు వాటిల్లుతుందనే వాస్తవాన్ని విజ్ఞులైన ప్రజలు తెలుసుకోవాలి. లౌకికతత్వాన్ని బలోపేతం చేసి, గణతంత్రాన్ని కాపాడాల్సిన దేశభక్తియుతమైన బాధ్యత ప్రతీ పౌరునిపై ఉంది.
కర్ణాటక హైకోర్టు హిజాబ్‌ సమస్యను పరిష్కరించలేక పోయింది. పైగా హైకోర్టు ఇచ్చిన తీర్పు హిజాబ్‌ ధరించే ఉడిపి కళాశాల విద్యార్థినులను మరింత రెచ్చగొట్టే విధంగా ఉంది. కోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు తీర్పు చాలా టెక్నికల్‌గా ఉంది. అది ఒక దరఖాస్తు మాదిరిగా, ఇతరుల వాదనను తిరస్కరించే విధంగా, మోసం చేయాలనే ఆత్రుతతో ఉన్న ట్లుంది. వాదన సరిగా లేదని పేర్కొనడం ద్వారా… ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయనే అభ్యర్థనను కొట్టివేసే స్థితికి ఈ అసాధారణ ఆత్రుత వెళ్ళింది. ఈ హిజాబ్‌ సమస్య రాజకీయపరమైనది, రాజ్యాంగ పరమైనది కూడా. దేశ సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగపరమైన కోణంలో పరిశీలించి,ఈ సమస్య పరిష్కారానికి తగిన తీర్పు ఇస్తుందని ఆశించవచ్చు. కానీ హిజాబ్‌ సమస్యకు సంబంధించిన రాజకీయ దృష్టి కోణం…చాలా కాలంగా భారతీయ సమా జాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆకస్మి కంగా బయటకు వచ్చిన ఈ సమస్య, జారిటీ మతస్థులలో అంతర్గతంగా గూడుకట్టుకున్న అసహనాన్ని ప్రతిబింబి స్తుందన్న వాస్తవాన్ని వెల్లడిరచడానికి గొప్ప పరిశోధనలు చేయాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఉత్తర భారతదేశంలో హిందూ, సిక్కు మహిళలు పెళ్ళిళ్ళు, అంత్యక్రియలు, మతపరమైన వేడుకలు వంటి ముఖ్యమైన సందర్భాలలో తల కనిపించకుండా ముసుగు ధరిస్తారు. వీధుల్లోకి వచ్చి, ఒకరినొకరు ఘర్షణ పడడానికి ఓచిన్న గుడ్డ ముక్క చాలు. అది భారతీయ సమాజంలో సంభవించిన మార్పుకు ఒక కొలమానంగా మారింది. ఇలాంటి అసహన వాతావరణంలో, సాంప్రదాయ బద్ధమైన సహనం, బహుళత్వం, ఉదారబుద్ధి లాంటి వాదనలు విడ్డూరంగా కనిపిస్తాయి.
నైతిక చట్రం
కానీ, ప్రపంచం లోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించి,ఒక స్నేహపూర్వక వాతావరణంలో,శాంతియు తంగా కొన్ని లక్షలాది సంవత్సరాలపాటు జీవించడానికి అనుమతించిన ఘన చరిత్ర భారతదేశానికి వుందన్న మాట వాస్తవం. అన్య మతస్థులను తమ మతం లోకి మార్చే చర్యలు మద్దతుదారులను పెంచింది కానీ, వారు అధిక సంఖ్యాక మతస్థులకు ఎటువంటి సవాలుగా, సమస్యగా తయారవలేదు. బుద్ధుని కారణంగానే ఇతర మతాలకు చెందిన వారి విశ్వాసాల పట్ల సహనం, తోటి మానవుల పట్ల సానుభూతి భారతీయ సాంప్రదాయాల్లో అంతర్భాగంగా మారాయి. ఆయనే భారతదేశానికి ఓ నైతిక చట్రాన్ని అందించాడు. ఆ చట్రంలోనే తోటి మానవులతో మన సంబంధాలు, భావనలు రూపుదిద్దుకుంటాయి. నేడు సంభవిస్తున్న మార్పులు ఆ నైతిక చట్రానికి అవతలనే జరుగుతున్నాయి. మనకు బుద్ధుడు వారసత్వంగా అందించిన గొప్ప జ్ఞానాన్ని అసాధారణ ప్రతీకారంతో వృధా చేస్తున్నారు. భారత రాజ్యాంగం ఆ నైతిక చట్రం యొక్క విధానాన్ని భారతదేశ పరిపాలన కోసం ఆమోదించింది. ఆధునిక యూరప్‌ పునరుజ్జీవ నానికి ఉన్న విధంగానే, సమానత్వం, సమ న్యాయం, సౌభ్రాతృత్వం అనే సూత్రాలు బౌద్ధ సాంప్రదాయాల్లో ఒక భాగంగా ఉన్నాయి. వాస్తవంగా భారతదేశ భవిష్యత్తు, చారిత్రక అనివార్యత (నెహ్రూ, అంబేద్కర్‌ లాంటి గొప్ప నాయకులు రూపొందించిన ఆధునిక దేశ భావాలు) బౌద్ధ మతం యొక్క నైతిక సాంప్రదాయాల్లో, ఆధునిక ప్రపంచ సమానత్వపు ప్రేరణల మూలాల్లో ఉన్నాయి. ఆ విధంగా భారత రాజ్యాంగం ఒకవైపు మత స్వేచ్ఛ, మనస్సాక్షి స్వేచ్ఛ కోసం…మరోవైపు దేశ పాలన కోసం లౌకికతత్వాన్ని సమకూర్చింది. భారతదేశంలో లౌకికతత్వం అంటే అన్ని మతాల పట్ల సమాన గౌరవాన్ని కలిగి ఉండడం అని అనేక మంది చాలా తీవ్రంగా వాదిస్తారు. ఈ తప్పుడు అవగాహనే పాలకులు (మతపరమైన ప్రత్యేక దుస్తులు ధరించి, బహిరంగంగా మతాచారాలను పాటిస్తూ) మతపరమైన ఉత్సవాలకు హాజరయ్యే పరిస్థితులకు దారితీసింది. ఇవి వాస్తవానికి, తమ మత విశ్వాసాలతో ఆచరించే సాంప్రదాయాల కంటే కూడా, ఆ పేరుతో ప్రజలను ఆకట్టుకొని…తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందే చర్యలని చెప్పవచ్చు.
విభజన
భారత రాజ్యాంగంలో కూడా యూరప్‌లో వలే రాజ్యం నుండి మతాన్ని వేరు చేసే ఒక విభజన రేఖ ఉన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి, యూరప్‌ పునరుజ్జీవన చరిత్రలో ఈ విభజన ఒక ప్రధానమైన పరిణామం. రాజ్యానికి మతం లేదనేది భారత లౌకికతత్వం యొక్క ముఖ్య సారం. ఇది రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 27,28లలో స్పష్టంగా ఉంది. ఏదైనా ఒక మతాన్ని ప్రోత్సహించడానికి ఎటువంటి పన్నులు విధించకూడదని ఆర్టికల్‌ 27చెపుతుంది. అంటే ఏ మతానికి అనుకూలంగా ప్రభుత్వ ఆదాయాన్ని ఖర్చు చేయడానికి అనుమతి లేదు. ప్రభుత్వ నిధులతో నిర్వహించబడుతున్న ఏ విద్యా సంస్థలలో ఎటువంటి మతపరమైన నిబంధనలు పాటించాలని ఆదేశించకూడదని ఆర్టికల్‌ 28 చెపుతుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన లేదా ప్రభుత్వ సహకారంతో నిర్వహించబడుతున్న ఏ విద్యా సంస్థ కూడా మతపరమైన తరగతులకు లేదా ఆరాధనా కార్యక్రమాలకు హాజరు కావాలని ఎవ్వరినీ ఒత్తిడి చేయకూడదని కూడా ఆర్టికల్‌ 28 చెపుతుంది. మతపరమైన ఆచారాలకు సంబంధించిన లౌకిక కార్యక్రమాలను క్రమబద్ధీకరించే అధికారాన్ని ఆర్టికల్‌ 25(2)(ఏ) ప్రభుత్వానికి ఇస్తుంది. మతం పేరుతో ఏవిధ మైన వివక్షతనైనా ఆర్టికల్‌ 15 నిషేధిస్తుంది. అన్నిటినీ మించి మత స్వేచ్ఛ ఇతర ప్రాథమిక హక్కులకు లోబడి ఉండేట్లు చేస్తారు. ఆ విధం గా మన రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ కూడా చట్టం ముందు సమానత్వం, వివక్షతకు గురికాకపోవడం, జీవించే హక్కు, స్వేచ్ఛగా ఉండే హక్కు లాంటి లౌకిక హక్కుల వలె అమలుకు నోచుకోవడం లేదు.పై అంశాలను దష్టిలో ఉంచుకొని, రాజ్యానికి మతం ఉండదనే నియమం ఆధారంగా భారత రాజ్యాంగంలో లౌకికతత్వాన్ని పొందుపరచారని స్పష్టం అవుతుంది. భారత రాజ్యం ఈ ప్రాథమిక సూత్రం ఆధారంగా నిర్వహించబడుతుంది. ఇందిర-నెహ్రూ-గాంధీ వర్సెస్‌ శ్రీరాజ్‌ నారాయణ్‌ అండ్‌ ఏఎన్నార్‌ కేసు విషయంలో ‘’రాజ్యానికి తనకంటూ స్వంతంగా ఎటువంటి మతాన్ని కలిగి ఉండదని’’ భారత సర్వోన్నత న్యాయస్థానం పునరుద్ఘాటించింది.
ప్రజా జీవితంలో మత దురహంకారం
భారతదేశంలో, ప్రజా జీవితంలో తీవ్రమైన మత దురహంకారం కనపడుతుంది. కాబట్టి, మనం చాలా సౌకర్యంగా లౌకికతత్వం యొక్క అర్థాన్ని ‘సర్వ ధర్మ సమభావం’గా మార్చు కున్నాం. ఇది కేవలం అధిక సంఖ్యాకుల ఆధిపత్యానికి దారితీసి, చివరకు మత ప్రాతి పదిక గల రాజ్యం ఏర్పడుతుంది.‘సమ భావం’ అనే భావన వాస్తవానికి నేటి భారతీయ సమా జంలో లేదు. మత ప్రాతిపదికన ఏర్పడిన రాజ్యం,దేశ పతనానికి హామీ ఇస్తుంది.సుమారు 20కోట్ల అల్ప సంఖ్యాక ప్రజలున్న భారత దేశంలో అనేక మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. భారత ప్రభుత్వం, దేశంలో ఆరు అల్ప సంఖ్యాక మతాలను గుర్తించింది. కాబట్టి మత ప్రాతిపదికన ఏర్పడిన రాజ్యంలో అధిక సంఖ్యాకుల మతమే రాజ్య మతంగా ఉండడం అనేది ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదన.భారతదేశంలో మత ప్రాతిపదికన రాజ్యం ఏర్పాటు అసాధ్యమని చెప్పే మరొక కీలకమైన అంశం ఏమంటే, అధిక సంఖ్యాకుల మతం ఒక సంక్లిష్టమైన, అసమానతలతో కూడిన శ్రేణీగత వ్యవస్థ. అంతేగాక అణచి వేతతో కూడిన సామాజిక నిర్మాణాన్ని కలిగి ఉంది. మత రాజ్యం, మత సూత్రాల ఆధారం గా పని చేస్తుంది. అంటే భారతదేశంలో అయితే ధర్మ శాస్త్రాల ప్రకారం ఒక ప్రత్యేకమైన కులం మాత్రమే పాలించే హక్కును కలిగి ఉంటుంది. అధిక సంఖ్యాక ప్రజలకు అధికారం లో పాలుపంచుకునే హక్కు ఉండదు. వారికి మానవ హక్కులు ఉండవు. అణచివేతకు, అన్యాయానికి వారు శాశ్వత బాధితులుగా ఉంటారు. మత ప్రాతిపదికన ఏర్పడే రాజ్యం మత గ్రంథాలపై ఆధారపడుతుంది. అంటే, భారతదేశంలో రాజ్యం సమానత్వాన్ని, సమాన రక్షణను నిరాకరిస్తుంది. కుల ప్రాతిపదికన వివక్షతను ప్రదర్శిస్తుంది. ఇది శాశ్వత వైరుధ్యా లకు, సమాజ పతనానికి దారితీస్తుంది. కాబట్టి, ఒక దేశంగా భారతదేశం, మతం లేని రాజ్యం గా, ఏ మతాన్ని ప్రోత్సహించని లౌకిక రాజ్యం గానే ఉనికిలో కొనసాగుతుందనే ఒక అనివా ర్యమైన నిర్ధారణకు వస్తాం. విద్యా వంతులైన భారతీయులు లౌకిక వాద్వాన్ని ఎగతాళి చేసి మాట్లాడుతూ, అధిక సంఖ్యాకుల మతం ఆధారంగా ఏర్పడే మతరాజ్య భావనను బలపర్చడమనేది అనాలోచిత చర్య తప్ప మరొకటి కాదు. వారి మానసిక స్థితి నేటి మత రాజకీయ అల్లరిమూకల ఆర్భాటపు ప్రచా రాలతో రూపొందించబడుతుంది. భారత స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించి, రాజ్యాంగాన్ని రూపొందించిన మేథావులకు భారతదేశం లోని బహుళ మతాల, బహుళ సంస్కృతుల లక్షణాలు మరియు భారతదేశం యొక్క సామాజిక నిర్మాణంలో ఉన్న సంక్లిష్టతల గురించి చాలా లోతైన అవగాహన ఉంది. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి గాను గణతంత్రం యొక్క ప్రాథమిక సూత్రంగా లౌకికతత్వాన్ని ఎంపిక చేశారు. ఒకవేళ లౌకికతత్వాన్ని ఉనికిలో లేకుండా తిరస్కరిస్తే, కష్టపడి సాధించుకున్న దేశ ఐక్యతకు ముప్పు వాటిల్లుతుందనే వాస్తవాన్ని విజ్ఞులైన ప్రజలు తెలుసుకోవాలి. లౌకికతత్వాన్ని బలోపేతం చేసి, గణతంత్రాన్ని కాపాడాల్సిన దేశభక్తియుతమైన బాధ్యత ప్రతీ పౌరునిది. భారత స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించి, రాజ్యాం గాన్ని రూపొందించిన మేథావులకు భారత దేశంలోని బహుళ మతాల, బహుళ సంస్కృ తుల లక్షణాలు మరియు భారతదేశం యొక్క సామాజిక నిర్మాణంలో ఉన్న సంక్లిష్టతల గురించి చాలా లోతైన అవగాహన ఉంది. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి గాను గణతంత్రం యొక్క ప్రాథమిక సూత్రంగా లౌకికతత్వాన్ని ఎంపిక చేశారు. ఒకవేళ లౌకికతత్వాన్ని ఉనికిలో లేకుండా తిరస్కరిస్తే, కష్టపడి సాధించుకున్న దేశ ఐక్యతకు ముప్పు వాటిల్లుతుందనే వాస్తవాన్ని విజ్ఞులైన ప్రజలు తెలుసుకోవాలి. లౌకికతత్వాన్ని బలోపేతం చేసి, గణతంత్రాన్ని కాపాడాల్సిన దేశభక్తియుతమైన బాధ్యత ప్రతీ పౌరునిపై ఉంది.- (పి.డి.టి.ఆచారి)

థింసా దారిలో……!

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకులు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ తెలుగు సాహితీలోకానికి సుపరిచితులైన యువ సాహితీవేత్త ‘శంభాన బాల సుధాకర మౌళి ’ కథా రచన ‘ థింసా దారిలో…’ కథా చదవండి..! – సంపాదకులు
ఉత్తరాంధ్ర ప్రాంతం విజయనగరం జిల్లా వాసి ఉపాధ్యాయ కథారచయిత, తాను నిత్యం చూస్తున్న అడవి బిడ్డల జీవనాన్ని చిత్రిక పట్టి వ్రాసిన సంపూర్ణ సంస్కృతి సంబంధ గిరిజన కథ థింసాదారిలో… ఇది ఏప్రిల్‌ 2012 సాహిత్య ప్రస్థానం మాస పత్రికలో తొలి సారిగా ప్రచురించబడిరది. ఉత్త రాంధ్ర మాండలిక భాషలో సంభాషణ యుతం గా సాగిన ఈకథద్వారా,రచయిత గిరిజన సంప్రదాయ పండుగలోని అంతరార్థం ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
అడవి బిడ్డలు జీవనంలాగే వారిసంస్కృతి, సాంప్రదాయాలు,అబ్బురపరిచే విధంగా ఉంటాయి.సూక్ష్మంగా పరిశీలిస్తే అంతర్గతంగా ఏదో ఒక జీవనసూత్రం అందులో ముడిపడి కనిపిస్తుంది.బయటకు అంత త్వరగా కనిపిం చని ఆ జీవన సూత్రాలు తెలుసుకోవాలి అంటే గిరిజన బ్రతుకు చిత్రాన్ని అంతే చేరువుగా చూసిన వారికే సాధ్యం.
ఉత్తరాంధ్ర ప్రాంతం విజయనగరం జిల్లా వాసి ఉపాధ్యాయ కథారచయిత,‘‘శంభాన బాల సుధా కర మౌళి’’ తాను నిత్యం చూస్తున్న అడవి బిడ్డల జీవనాన్ని చిత్రిక పట్టి వ్రాసిన సంపూర్ణ సంస్కృ తి సంబంధ గిరిజన కథ ‘‘థింసాదారిలో…’’ ఇది ఏప్రిల్‌ 2012 సాహిత్య ప్రస్థానం మాస పత్రికలో తొలిసారిగా ప్రచురించబడిరది. ఉత్త రాంధ్ర మాండలిక భాషలో సంభాషణ యుతం గా సాగిన ఈకథద్వారా,రచయిత గిరిజన సంప్రదాయ పండుగలోని అంతరార్థం ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇక కథ విషయానికొస్తే….అందమైన అడవి, సుందర సోయగాలను వర్ణిస్తూ మొదలైన ఈ కథలోని పాత్రల పేర్లు,ఊర్ల పేర్లు,ఉపయో గించిన భాష,జాతీయాలు,అన్ని స్థానికతకు అగ్రతాంబూలం ఇచ్చాయి.‘‘గుమిడిగూడ’’ గిరి జన గూడెంపెద్ద ‘‘ఉంబయ్య’’,అతని మొదటి భార్య ‘‘భూదేవమ్మ’’,ఆమె కొడుకు‘‘బుదరయ్య’’ రెండో భార్య కూతురు‘‘సుకిరి’’తల్లులు వేరైనా ఒకేతండ్రిబిడ్డలు కనుక అంతేగారాబంగా జీవిస్తూ ఉంటారు. గిరిజన గూడేల్లో ఏ సామూ హిక పండుగలు చేయాలన్న అందరూ ఒకచోట చేరి ముందుగా ప్రణాళిక చేసుకుంటారు.ఇది ఆ గ్రామ పెద్దల సమక్షంలో…ఇకపోతే ‘గుమిడిగూడ’గ్రామ పెద్ద‘ఈడ ఉంబయ్య’ రెండు తరాలుగా వస్తున్న ఆ గ్రామ పెద్ద మనిషి. తగువులు పంచాయతీ తీర్చడమే కాదు వైద్య సేవలు కూడా అందిస్తాడు. పాము కరిచిన, తేలు కుట్టిన,పసరు పోస్తాడు.చూడటానికి బానకడుపుతో లావుగా,నల్లగా,ఉంటాడు.
చెవికి బంగారు బావిలి, మొలతాడుకి ఒకపక్క చుట్టలు పెట్టుకోవడానికి వెదురు గొట్టం, మరో పక్క కత్తి పెట్టుకోవడానికి వరలాంటి రెండు జానల పొడవైన మరో వెదురు గొట్టం,అది అతడి అవతారం. అతను వాడే కత్తి లాగే మాట కూడా పదునే….!! ఆ గ్రామాన్ని రక్షిస్తున్న ‘కొండ భైరవుడు’ పంపిన రక్షకుడిగా ఉంబయ్యను నమ్ముతారు అక్కడి గిరిజనులు. అతని మాటే వేదం ఎవరు అతని మాట కాద నరు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎవరికి ఏకష్టం వచ్చినా ముందుండేది ఆ గ్రామ పెద్ద ఉంబయ్య. కూతురు సుకిరి‘అయ్య రమ్మంటున్నాడు’ అని చెప్పిన చిన్న మాట తోనే…గూడెం లోని ఇంటికొకరు అంత రాత్రి చీకటిలో వాన ముసురు కూడా లెక్కచేయకుండా గూడెం పెద్ద పిలుపును గౌరవిస్తూ అతని ఇంటి ముందుకు చేరుకుంటారు.దీని ద్వారా అడవి బిడ్డలు లోని క్రమశిక్షణ, నిజాయితీ తీరు తెన్నులు అర్థమవుతాయి. వచ్చిన వారిని అంద రినీ పలకరిస్తూ క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్న ఉంబయ్య ప్రవర్తన ద్వారా అతనిలోని అసలైన నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి. కొండ మీద నివసించే గిరిజనులు ప్రత్యేక అవసరం పడితే తప్ప కొండ దిగి ‘దిగువకు’రారు వారి ప్రయాణాలు కూడా సామూహికంగా,సమైక్యంగా సాగుతాయి. అలాంటి సాధారణ ప్రయాణానికి పండుగ సంప్రదాయం అన్వయించి చెప్పిందే ఈ‘థింసా దారిలో…’ కథ. ఈ కథరాయడంలో రచయిత సుధాకర్‌ మౌళి రెండు అంశాలను సూచించి నట్లు అనిపిస్తుంది, అందులో ఒకటి గిరిజనుల్లో గల భిన్నసాంప్రదాయాల్లో ఒకటైన థింసా ఆటకు,సంక్రాంతి పండుగకు గల అవినాభావ సంబంధం తెలపడం ఒకటి. పండుగ పేరుతో దిగువ ప్రాంతాలకు వెళ్లి అక్కడి మనుషుల్లోని చెడు బుద్ధులను నేర్చుకో వద్దని, సాంప్ర దాయాలను కలుషితం చేసుకోవద్దని మరోకటి. ముఖ్యమైన ఈహెచ్చ రికను నర్మగర్భంగా చెప్పే ప్రయత్నం రచయిత చేశారు అనిపిస్తుంది.ఇక ఈ థింసానృత్యం కథా శీర్షికగా,వస్తువుగా, రచ యిత ఎంచుకోవడంలో అతని రచన ప్రతిభ వెల్లడవుతుంది.చిన్న వస్తువు సాయంగా పెద్ద విషయం వెల్లడి చేయడం అనేఉత్తమ రచయిత భావాలు కూడా ఇందులో కనిపిస్తాయి.ఉత్తరాం ధ్ర ప్రాంతానికి చెందిన కొండదొర,గదబ, గిరిజనుల సాంప్రదాయాల నృత్య కేళి‘‘థింసా’’ సంక్రాంతి పండుగ రోజుల్లో ఈనృత్యాలు చేస్తూ కొండల మీద నివసించే కోయలు,దిగువ ప్రాంతాల్లోని గ్రామాల్లో తిరుగుతూ వారి థింసా ఆటపాటలతో అక్కడి వారికి ఆనందం అందిస్తారు.మైదాన ప్రాంత ప్రజలు అబ్బుర పరిచే ‘‘థింసా’’ సోయగాలు చూడటానికి ఆరు నెలల ముందు నుంచే ఎదురు చూస్తారు. ప్రకృతి సైతం అడవిబిడ్డల పాద స్పర్శ కోసం పరవశంతో ఎదురు చూస్తోందట!! అనుచరులు డప్పులు,పినలగర్రలు,కిరిడి,సన్నాయి, పిల్లన గ్రోవి,జోడుకొమ్ములు,వాయిద్యాలు వాయిస్తూ, చూపరులకు వీనులవిందు అందిస్తారు. సాధారణంగా దీపావళికి మొదలైన థింసా ఆటలు,పుష్య,పాల్గున,మాసాల్లో ముగుస్తాయి. పుష్యమాసపు సంక్రాంతి రోజుల్లో దీనికి ఉత్త రాంధ్రలో అధిక ప్రాధాన్యత ఉంటుంది. వాయిద్యాలకు అనుగుణంగా 14గతులలో గిరిజన జీవితాన్ని అభినయించేదే థింసా నృత్యం.
ఇక కథలోకి వెళితే….ఉత్తరాంధ్రకు చెందిన ‘గుమిడిదూడ’ అనే గిరిజన కొండ గ్రామంకు చెందిన గ్రామ పెద్ద కొడుకు ‘బుదరయ్య’ అతని సావాసగాడు ‘సువ్వాయి’ అడవికి కట్టెలకు వెళ్లి కట్టెలతో ఇంటి ముఖం పట్టి, దారిలో వర్షానికి తడిసి ఇల్లు చేరతాడు, తల్లి భూదేవమ్మ కొడుకును మందలిస్తుంది, ఆరోగ్యం పాడవు తుందనే భయంతో.!! కొండ దేవుడు భైరవుడు ఉండగా తన ఆరోగ్యానికి ఏమీ కాదంటూ తల్లికి భరోసా చెప్పి చెల్లెలు ‘‘సుకి రి’’ని బువ్వ పెట్ట మంటాడు.గోడకాని చెల్లి సిబ్బిలో పెట్టిన బువ్వ తింటాడు. సందకాడ వర్షం జోరు తగ్గాక సుకిరి గూడెంలోని వాళ్లకు తండ్రి చెప్ప మన్నా కబురు చెప్పి వస్తుంది.గ్రామపెద్ద‘ఉంబ య్య’ పిలుపు అందుకున్న వారంతా అక్కడికి చేరతారు, తాము ప్రతి సంక్రాంతి నెలలో చేయబోయే థింసా ప్రయాణం గురించి చెప్పగ అందరూ అందుకు సమ్మతించి,దానికి సంబం ధించిన సూచనలు, విని ఎవరి ఇళ్లకు వారు వెళతారు. తెల్లారి పొద్దుపొదుపు అయ్యాక ఉంబయ్య నాయకత్వంలో ఆగిరిజన గూడెం మగవాళ్ళంతా తమతమ వాయిద్యాలతో థింసా ఆటకు కొండదిగువ గ్రామాలకు ప్రయాణం అవుతారు.వారు ఇళ్లకు తిరిగి రావడానికి వారం పది రోజులు పట్టవచ్చని అంతవరకు ఇళ్ళల్లో ఉండే ఆడవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గ్రామ పెద్ద చెబుతాడు. ఆడ వాళ్ళంతా ఒకరి చేతులు ఒకరు జట్టుగా పట్టు కుని మీరు వచ్చేవరకు అందరం గుట్టుగా ఉంటామంటూ వాళ్ల భర్తల కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాటిస్తారు.మగాళ్లంతా తమ తమ వాయిద్యాలతో కొండ దిగువకు పయనం కట్టడం వారి నాయకుడు కొండభైరవుడికి మొక్కి ప్రయాణం ప్రారంభిస్తూ ‘కొండ దిగువకు పోయేది అక్కడి రుచులు తినడానికి,తాగ డానికి, డబ్బులు సంపాదనకు కాదు,మన థింసాఆట ఉనికి అందరికీ పంచడానికి’ అంటూ అసలు విషయం చెప్పడంతో కథ ముగుస్తుంది.‘సాంప్రదాయాన్ని కొనసాగించే దారుల్లో కొండ బిడ్డలు’అన్న రచయిత ముగింపు వాక్యం తో ముగిసిన ఈ కథ ఆద్యంతం అంద మైన అటవీ వాతావరణంతో సాగుతూ గిరి బిడ్డల జీవన చిత్రాన్ని కళ్ళకు కడుతుంది. ఏమండి క్యారేజీ ఉండదని రచయిత శైలి కూడా భిన్నంగా అనిపిస్తుంది. కథలో సందర్భోచితంగా వాడిన ‘‘చేటలో చెరిగిన మెత్తని పిండిలా వెన్నెల పల్చగా కాస్తంది’’ వంటి జాతీయాలు రచయిత నూతనత్వానికి అద్దం పడతాయి. ఇక కథద్వారా రచయిత చెప్పదలుచుకున్నది ‘థింసాఆట’ద్వారా గిరి బిడ్డ లు తమ జీవన గతిని ప్రదర్శిస్తూ తమ సాంప్ర దాయ సంస్కృతులను కాపాడుకుంటూ,అందరికీ ఆనందం అందిస్తారు తప్ప తద్వారా వచ్చే డబ్బులు,ధాన్యాల కోసం ఆశ పడి చేసే‘‘యాచక పని’’ఎంత మాత్రం కాదు,అని ఉద్ఘాటిస్తారు.అదే విధంగా వారం పది రోజుల పాటు తమకు సొంతమైన అడవులను,కొండలను, భార్యా బిడ్డలను, వదిలి ఉండలేమనే భావంతో వెళ్లే సమయంలో ‘‘ఆ మగాళ్ళు కన్నీరు పెట్టు కున్నారు’’ అన్న వాక్యం ద్వారా అడవి బిడ్డలు తమ నివాసాల మీద ఎంతటి మమకారం కలిగి ఉంటారో రచయిత చెప్పకనే చెప్పారు. ఈ మమకారం మనుషులం దరికీ ఉంటుంది, కానీ అధికారులు,పాలకులు,అభివృద్ధి,ప్రాజెక్టులు, నెపంతో అడవి బిడ్డలను వారి జన్మభూమికి శాశ్వతంగా దూరం చేసే ప్రయత్నాలు చేయడం వల్ల వారి మనసుఘోష ఎలా ఉంటుందో ఎవ రికి వారు మనుషులుగా ఆలోచించుకోవాలి. చిన్ని ఇతివృత్తానికి అందమైన సృజన శైలి జోడిరచి ఆసక్తికరమైన కథనంతో కథను ఆసాంతం ఆహ్లాదంగా నడిపించడంలో రచ యిత ‘‘బాలసుధాకర్‌ మౌళి’’ కృషి అభినం దనీయం, వర్తమాన కథా రచయితలకు ఆచర ణీయం.
(వచ్చే నెల బలివాడ కాంతారావు గారి ‘‘నైజరు తేనె’’ కథా విశ్లేషణ మీకోసం)

ఈ ఇబ్బందులతో చదువు సాగేదెలా?

భారత రాజ్యాంగం విద్యను రాష్ట్రాల హక్కుల్లో పెట్టింది. ఇందిరా గాంధీ ఉమ్మడి జాబితాకు మార్చింది. ఇపుడు మోడీ ప్రభుత్వం ఉమ్మడి జాబితాలో గల విద్యను స్వాధీనం చేసుకొని శిశు విద్యతో సహా మొత్తం సిలబస్‌ తానే నిర్ణయించి రాష్ట్రాలపై రుద్దుతున్నది. మా హక్కుపై నీ పెత్తనం ఏమిటని కేంద్రాన్ని నిలదీయడానికి బదులు జగన్‌ ప్రభుత్వం కేంద్రానికి లొంగిపోయి బిజెపి ముదనష్టపు విద్యావిధానాన్ని మన రాష్ట్రంలోనే తొలుత అమలు చేస్తున్నది. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం ప్రజలు, ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి వారి బాధ్యత. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, నాణ్యమైన విద్య కోసం పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.
విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఫిబ్రవరి18నుండిమార్చి ఐదో తేదీ వరకు శ్రీకా కుళం నుండి అనంతపురం వరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన జాతా నిర్వహించడం జరిగింది. యాత్ర ప్రారంభానికి ముందు 17వ తేదీ రాత్రి 9 గంటలకు శ్రీకాకుళం పట్టణ ఎస్‌ఎఫ్‌ఐ కార్యా లయంలో ఉన్న నాయకత్వాన్ని ఈడ్చుకుంటూ పోలీ సులు అరెస్ట్‌ చేశారు. స్టేషన్లో పిడిగుద్దులు గుద్ద డంతో జిల్లా కార్య దర్శి రాజు స్పృహ తప్పి ఆస్పత్రి పాలయ్యారు. జాతా నిర్వహించడానికి పర్మిషన్‌ లేదంటూ యాత్ర కోసం అద్దెకు తీసుకున్న మినీ బస్సును 18 ఉదయం 10 గంటలకు పోలీసులు సీజ్‌ చేశారు.వాహనంలోఉన్న పుస్తకాలు, కర పత్రాలు, పోస్టర్లు, బ్యానర్లను పోలీసులు కాల్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం విధించినా విద్యార్థులను కలిసి సమస్యలు తెలుసుకుంటామని ఆర్‌.టి.సి బస్సులో ప్రయాణం చేసి పార్వతీపురంలో సభ జరిపారు. పోలీసులు మరలా రాత్రి 9 గంటల వరకు నాయకత్వాన్ని ఆఫీసులో నిర్బంధించారు. ఆర్‌.టి.సి బస్సులో విజయనగరం చేరుకొని విద్యా ర్థులు ర్యాలీ చేస్తే అడుగడుగున నాయకత్వాన్ని అరెస్టులు చేశారు. విజయనగరంలో విద్యార్థులు యాత్రలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు ముం దస్తుగా ప్రతి కాలేజీ దగ్గరా పోలీసులను కాపలా పెట్టారు. నిర్బంధాన్ని అధిగమించి వందలాది మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొ న్నారు. విశాఖ పట్నంలో అడుగడుగునా చెకింగ్‌ చేసినా రాత్రి9 గంటలకు ఆంధ్ర యూని వర్సిటీ హాస్టల్‌ కి వెళ్లి మీటింగ్‌ పెట్టాము. రాజ మండ్రిలో ర్యాలీ మీటింగ్‌ పెట్టుకోడానికి అనుమతి లేదు. మీవాళ్లు ఏ వాహ నంలో వస్తున్నారో చెప్పండి అరెస్ట్‌ చేస్తామని స్థానిక నాయకత్వానికి పోలీసులు వార్నింగ్‌ ఇచ్చారు. భీమవరం నుండి ఏలూరు వచ్చే దారిలో మమ్మల్ని పట్టుకోవడం కోసం పోలీసులు ఎనిమిది చెక్‌పోస్టు లు పెట్టారు. ప్రతి వాహనాన్ని చెక్‌ చేశారు. పోలీ సుల నుండి తప్పించుకుని రాత్రికి ఏలూరు చేరు కున్నాం. అనేక నిర్బంధాల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర సాగింది. ప్రభుత్వం విద్యార్థుల మీద ఎందుకు ఇంత నిర్బంధం విధిస్తోంది? ప్రతిపక్ష నాయకునిగా జగన్‌ మోహన్‌ రెడ్డి ఓదార్పు యాత్ర, పాదయాత్ర చేయటానికి ప్రజాస్వామ్యం ఉంది. విద్యార్థి సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతూ యాత్ర చేస్తే అది అప్రజాస్వామ్యమా?
వసతులు లేవు.. టీచర్లు లేరు.. చదువుకునేదెలా?
అరకులో ఉమెన్స్‌ డిగ్రీ కాలేజ్‌ ఏర్పాటు చేసి నాలుగేళ్లు అవుతోంది. సొంత భవనం లేదు. ప్రిన్సిపాల్‌ ఒక్కరే ఉన్నారు. లెక్చరర్లు లేరు. పాడేరు బాలికల కళాశాల హాస్టల్లో 250 మంది విద్యా ర్థులు ఉన్నారు. ఒక్కో గదిలో 30 మంది విద్యార్థులు ఉంటున్నారు. మరుగుదొడ్లు లేవు. ఉన్న మరుగు దొడ్లకు తలుపులు లేవు. కాకినాడ ఐటిఐ కాలేజీలో వెయ్యి మంది విద్యార్థులున్నారు. 80 మంది అధ్యా పకులు కావాలి. కానీ 50 మంది ఉన్నారు. ఏలూరు జిల్లా కేంద్రం డిగ్రీ కాలేజ్‌ స్థాపించి పన్నెండేళ్లు అవుతుంది. 250 మంది చదువుతున్నారు. సొంత భవనం లేదు. చెట్ల కిందే పాఠాలు. రేపల్లె ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ సొంత భవనం లేక ఫస్టియర్‌ సెకండియర్‌ విద్యార్థులు ఒకేక్లాసురూములో చదువు కోవాల్సిన పరిస్థితి. బాపట్లలో ఇంటర్మీడియట్‌ కళాశాల నాలుగు రూముల్లో క్లాసులు జరుగు తున్నాయి. హెచ్‌ఇసి, సిఇసి గ్రూపులకు ఒకే రూము లో క్లాసులు జరుగుతున్నాయి. సివిక్స్‌, కెమిస్ట్రీ సబ్జె క్టులకు అధ్యాపకులు లేరు. ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వడిగ్రీకాలేజిస్థాపించి 31ఏళ్ళు అవుతుంది. సొంత భవనంలేదు. ఒక్క బిఏ కోర్సు మాత్రమే ఉంది. విద్యార్థులు ఇతర డిగ్రీ కోర్సులు చదవాలంటే అనంతపురం, కర్నూలు వెళ్లాలి.
సంక్షేమ హాస్టల్‌లో మెనూ అమలు చేయాలి
పేదవాళ్లు, తల్లిదండ్రులు లేని విద్యార్థులు హాస్టల్‌లో వుండి విద్యనభ్యసిస్తున్నారు. మెనూ ప్రకారం భోజనంలో వారానికి ఆరు సార్లు గుడ్లు వడ్డించాలి. కానీ మూడుసార్లు ఇస్తున్నారు. గుం టూరు బీసీ హాస్టల్‌లో ‘’మీరాకతో మంచి భోజనం అన్న’’ అన్నారు. పాడేరు గిరిజన బాలికల కళాశాల హాస్టల్‌లో ఉదయం పులిహోర పెట్టాలి. కానీ పసుపు అన్నం పెట్టారు. ప్రతిరోజు అరటి పండ్లు ఇవ్వాలి కానీ ఇవ్వటం లేదు. ప్రభుత్వం విద్యార్థికి రోజుకి 46 రూపాయలు ఖర్చు చేస్తుంది. విద్యార్థి మెస్‌చార్జి నుండి వర్కర్‌ జీతం కింద ఐదు రూపా యలు కట్‌ చేస్తారు. 41రూపాయలతో మూడు పూటలు భోజనం పెట్టాలి. ఎలా సాధ్యం? గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఎక్కడా మెనూ అమలు కావడం లేదు. మెస్‌ ఛార్జీలు పెంచి నేటికి ఐదు సంవత్సరాలవుతుంది. నిత్యావసర ధరలు 300 శాతం పెరిగాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమా ణాల ప్రకారం రోజుకి 2300కిలో క్యాలరీల శక్తి నిచ్చే ఆహారం తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్య వంతులుగా ఉంటారని ఆ సంస్థ చెబుతుంది. ఈ మధ్యకాలంలో విశాఖ ఏజెన్సీ 11మండలాల్లో హాస్టల్‌లో చదువుతున్న బాలికలకు రక్తపరీక్ష చేస్తే 8 శాతం కంటే ఎక్కువ హిమోగ్లోబిన్‌ లేదు. రక్తహీ నతతో ఉన్నారని ఐటీడీఏ అధికారులు తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఎలా ఉంటారు? ఎలా బాగా చదువుకోగలరు? అందుకనే ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచాలి. బాపట్ల బాలికల ఉన్నత పాఠశాలలో 576 మంది విద్యార్థులు ఉన్నారు. చాలీచాలని 12 రూముల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఆట స్థలం లేదు. నూతన విద్యా విధానం అమలులో భాగంగా చుట్టుపక్కల ఉన్న 8 ప్రాథమిక పాఠశా లల్లోని 3,4,5 తరగతుల 500 మంది విద్యార్థుల్ని వచ్చే విద్యా సంవత్సరం ఇక్కడికి పంపిస్తారట. ఇప్పటికే ఆ స్కూల్లో సరైన వసతులు లేక అనేక ఇబ్బందులతో చదువు తుంటే అదనంగా విద్యార్థు లను జాయిన్‌ చేసుకుంటే ఎలా చదువుకునేది? నెల్లూరు సిటీలో మున్సిపల్‌ (కెఎన్‌ఆర్‌) పాఠశాలల్లో 2 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 20 క్లాస్‌రూములు ఉన్నాయి. రూములు చాలక ఉదయం 8,9తరగతులు మధ్యాహ్నం 6,7 తరగ తులు క్లాసులు నిర్వహిస్తున్నారు. టెన్త్‌ క్లాస్‌ విద్యా ర్థులు 370మంది 7 ఏడు సెక్షన్లు ఉన్నాయి. 25 మంది టీచర్లు ఉన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం1:30 ప్రకారం 66 మంది ఉపాధ్యాయు లు కావాలి. కానీ 25 మంది ఉన్నారు. కొందరపు, వీరపడుము, కొండపాయి, కొండపాయి మెన్‌ ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 3,4,5 తరగతులకు చెందిన 500 మంది విద్యార్థులను స్కూల్‌కి తరలిస్తున్నారు. మొత్తం 2,500 మంది విద్యార్థులు అవుతారు. చాలామంది విద్యార్థులు ఇబ్బందిపడి డ్రాపౌట్లు అవుతారు. ఇలా18వేల ప్రాథమిక పాఠ శాలలు మూసివేసి అక్కడున్న విద్యార్థులను హైస్కూ ల్‌కు తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్లో చాలీచాలని రూముల్లో అరకొర టీచర్లతో నడుస్తున్న స్కూళ్లలో ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగితే నాణ్యమైన విద్యరాకపేద వాళ్లు చదువుకు దూరం అవ్వాలి. లేదా ప్రైవేట్‌ పాఠ శాలలో డబ్బు చెల్లించి చదువుకోవాలి.
రోగం వస్తే ఎవరికి చెప్పుకోవాలి?
సంక్షేమ హాస్టల్లో విద్యార్థికి అనారోగ్యం వస్తే వారి సంక్షేమం చూడటానికి ఒక ఏఎన్‌ఎం ని నియమించేవారు. ఈ ప్రభుత్వం ఆ అవకాశాన్ని తొలగించింది. గురుకులాల్లో ఏఎన్‌ఎంఉన్నా…విద్యార్థికి జ్వరం ఇతర వ్యాధులు వస్తే ఏ జ్వరం వచ్చిందో టెస్ట్‌ చేయడానికి కూడా కిట్లు లేని పరిస్థితి. గతంలో గురుకులాల్లో హెల్త్‌ కోసం ప్రభు త్వం లక్ష రూపాయలు ముందుగానే బడ్జెట్‌ కేటా యిం చింది. నేడు జీవో నెంబర్‌ 99విడుదల చేసి ఆరోగ్యం కోసం ఆ విద్యాసంస్థల యాజమాన్యం చేసుకోవాలని తెలిపింది. దీంతో ఏ ఒక్క విద్యార్థి అనారోగ్యం పాలైనా వారు తినే భోజనంలో కోత విధించి ఆ డబ్బుతో వైద్యం చేస్తున్నారు. పిఠాపురం ఎస్‌.సి గురుకులంలో పనిచేస్తున్న టీచర్‌, సిబ్బంది తమకు అందే జీతంలో రెండు వందల రూపా యలు తీసి విద్యార్థుల ఆరోగ్యం కోసం ఖర్చు పెడు తున్నారు. గతంలో విద్యార్థికి ప్రతి నెలా కాస్మొటిక్‌ ఛార్జీలు ఇచ్చేవారు. వాటితో అవసరం ఉంటే విద్యార్థి తీసుకునేవాడు. నేడు అమ్మ ఒడి పథకంతో 15 వేల రూపాయలు ఇస్తున్నాం కదా అని కాస్మొ టిక్‌ ఛార్జీలు కూడా ఇవ్వట్లేదు. దీంతోచాలా విద్యా సంస్థల్లో విద్యార్థులు జబ్బు పడిన సంద ర్భంలో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతూనే ఉంది.
తెలుగు మీడియం కావాలి
మాతృభాషలో బోధించాలని విద్యాహక్కు చట్టం చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇంగ్లీష్‌ మీడియంలోనే అంటోంది. డిగ్రీ మొదటి సంవ త్సరం ఇంగ్లీష్‌ మీడియం చేయడం వల్ల ఇప్పటి వరకు ఇంటర్మీడియట్‌ తెలుగు మీడియం చదువు తున్న వాళ్ళు డిగ్రీలో ఇంగ్లీష్‌ చదవడం కష్టంగా ఉంది.ప్రభుత్వ ఉపాద్యాయుల్లో బోధన అర్హతలున్నా ఆంగ్లంలో చెప్పేంత సామర్ధ్యం వారిలో లేకపోవడంతో ఆంగ్ల విద్య పడకేసింది. నాడు`నేడు కార్యక్రమంలో పాఠశాలల అభివృద్ధిలో అవినీతి రాజ్యమేలుతోంది. దీనిపై అధికార్లు కన్నెత్తి చూడం లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పరీక్షలు మాతృ భాషలోనే పరీక్షలు నిర్వహి స్తుంది. నీట్‌ పరీక్షలను ప్రభుత్వం12 భాషలలో నిర్వహిస్తుండగా…మనం మాతృ భాషలో తరగతులు నిర్వహిస్తే తప్పేంటి?
జీవో నెంబర్‌ 77-పేదలు ఉన్నత విద్యకు దూరం
క్రిస్మస్‌ రోజున జగన్‌ ప్రభుత్వం జీవో నెం. 77 తెచ్చి ప్రైవేట్‌, ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో పి.జి, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన నిలిపి వేసింది. యూనివర్సిటీ అనుబంధ కాలేజీ ల్లో ఎం.ఏ, ఎం.ఎస్సీ, ఎం.కామ్‌ వంటి సాధారణ పి.జి 22,830 మంది చదువుతుంటే… ప్రైవేట్‌, ఎయిడెడ్‌ కాలేజీల్లో 32,562 మంది చదువుతున్నారు. ఎం.టెక్‌, ఎం.సి.ఏ, ఎం.బి.ఏ, ఎల్‌.ఎల్‌.బి వంటి ప్రొఫెషనల్‌ కోర్సులు ప్రభుత్వ సంస్థల్లో 12,020 మంది చదువు తుంటే ప్రైవేట్‌, ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో 1,63,810 మంది చదువుతున్నారు.ఈజీవో వలన మొత్తం 1,96, 372 మందికి విద్యాదీవెన, వసతి దీవెన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు. పేదల పిల్లలు వేలు, లక్షల రూపాయల ఫీజులు కట్టి ప్రైవేటు రంగంలో ఉన్నత విద్య ఎలా చదవగలరు?
ఫీజులు భారం
ప్రభుత్వం గతంలో స్కాలర్‌షిప్‌ను కళాశాల యాజమాన్యం అకౌంట్లో కొంత వేసేది. మరికొంత ఫీజు విద్యార్థి అకౌంట్లో జమ చేసేది. నేడు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో సంవత్సరానికి 20 వేల రూపా యలు విద్యార్థి అకౌంట్లో జమ చేస్తామని తెలి పింది. కాబట్టి కళాశాల యాజమాన్యం విద్యా ర్థులపై ఫీజులు ముందుగానే చెల్లించాలని ఒత్తిడి తీసుకు వస్తున్నాయి. ప్రభుత్వం నుండి సకాలంలో విద్యా దీవెన, వసతి దీవెన పూర్తిస్థాయిలో రాక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు చెల్లి స్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ హాస్టల్లో గతంలో 2500 రూపాయలు మెస్‌ బిల్లు వచ్చేది. నేడు ఒక విద్యార్థికి 3500 రూపా యలు వస్తుంది. రాయలసీమ యూనివర్సిటీ హాస్టల్లో ఫీజులు చెల్లించలేదని150మంది విద్యార్థులను యూని వర్సిటీ రిజిస్ట్రార్‌ బయటికి పొమ్మన్నారు. భారత రాజ్యాంగం విద్యను రాష్ట్రాల హక్కు ల్లో పెట్టింది. ఇందిరా గాంధీ ఉమ్మడి జాబితాకు మార్చింది. ఇపుడు మోడీ ప్రభుత్వం ఉమ్మడి జాబితాలో గల విద్యను స్వాధీనం చేసుకొని శిశు విద్యతో సహా మొత్తం సిలబస్‌ తానే నిర్ణయించి రాష్ట్రాలపై రుద్దు తున్నది. మా హక్కుపై నీ పెత్తనం ఏమిటని కేంద్రాన్ని నిలదీయడానికి బదులు జగన్‌ ప్రభుత్వం కేంద్రానికి లొంగిపోయి బిజెపి ముదనష్టపు విద్యా విధానాన్ని మన రాష్ట్రంలోనే తొలుత అమలు చేస్తున్నది. మన హక్కును కేంద్రం స్వాధీనం చేసుకోవడాన్ని, జగన్‌ కేంద్రానికి లొంగిపోవటాన్ని టిడిపి, జనసేన ఖండిరచక మేమంతా ఒకటేని చెప్పకనే చెబుతున్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం ప్రజలు, ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి వారి బాధ్యత. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, నాణ్యమైన విద్య కోసం పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. – ( ఎ.అశోక్‌ )

నెరవేరని జాతీయ కనీస వేతన వ్యధ…!

పార్లమెంట్‌లో పాస్‌ అయిన వేతనాల కోడ్‌ ప్రకారం కనీస వేతన నిర్ణయం కోసం కనీస వేతనాల సలహా బోర్డుల సలహాలు తీసుకోవాలి. అంతిమంగా సదరు ప్రభుత్వాలు కనీస వేతనాన్ని ఖరారు చేయడానికి… కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వేతనాల కోడ్‌ నిబంధనల ప్రకారం… 15వ భారత కార్మిక మహాసభ సిఫార్సులను, సుప్రీంకోర్టు తీర్పులను ప్రాతిపదికగా తీసుకోవాలి. కాని తాను పాస్‌ చేసిన ఈ చట్టానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
జాతీయ కనీస వేతనం తిరిగి చర్చనీయాం శమైంది. మోడీ ప్రభుత్వం 2017లో పార్లమెంట్‌ లో వేతనాల కోడ్‌ బిల్లు ప్రవేశపెట్టిన తరువాత జాతీయ కనీస వేతన సిఫార్సు కోసం ‘వి.వి.గిరి జాతీయ కార్మిక సంస్థ’కు చెందిన డాక్టర్‌ సత్పతి అధ్యక్షతన ఒక కమిటీ వేసింది. అనేక పరిమితులతో ఆ కమిటి చేసిన కొద్దిపాటి సిఫార్సులను కూడా ఆమోదించకుండా ఏకపక్షంగా జాతీయ కనీస వేత నాన్ని రోజుకు రూ.176గా నిర్ణయించింది. దేశ మంతా ఈ నిర్ణయంపై గగ్గోలు పెట్టిన తరువాత దాన్ని రూ.2 పెంచి రూ.178 చేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం వేతనాల కోడ్‌ నిబంధనలను ప్రతిపాదించిన తదుపరి ఇప్పుడు కొత్తగా జాతీయ కనీస వేతనంపైనే కాకుండా కేంద్ర మరియు రాష్ట్రాల లేబర్‌ కమిషనర్లు నిర్ణయించే కనీస వేతనంపై కూడా సిఫార్సులు చెయ్యమని గణాంక శాస్త్రజ్ఞుడు ఎస్‌.పిముఖర్జీ అధ్యక్షతన కమిటీ వేసింది.దాంతో జాతీయ కనీస వేతనం మరోసారి చర్చకు వచ్చింది.
ఈ ఏడాది మార్చి 28,29 తేదీల్లో కార్మిక సంఘాలు మరియు స్వతంత్ర ఉద్యోగ సంఘాల ఫెడరేషన్లు చేయబోయే రెండు రోజుల అఖిల భారత సమ్మె కోర్కెలలో నెలకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలనేది ప్రధానమైనది. జాతీయ కనీస వేతనం అయినా,కనీస వేతనం అయినా ఒకటిగానే ఉండాలి. వాటి నిర్ణయానికి ప్రామాణి కాలు ఒకటిగానే ఉండాలి. కాని మోడీ ప్రభుత్వం వేతనాల కోడ్‌ ప్రతిపాదిత నిబంధనలలో కనీస వేతన నిర్ణయానికి 1957లో జరిగిన 15వ భారత కార్మిక మహాసభ సిఫార్సులను, 1992 సుప్రీంకోర్టు తీర్పులను ప్రామాణికాలుగా తీసుకోవాలని చేర్చింది. జాతీయ కనీస వేతనానికి మాత్రం ఈ ప్రామాణికాలు పెట్టలేదు. వేతనాల కోడ్‌ లోనూ, దాని నిబంధనలలోనూ కొత్తగా జాతీయ కనీస వేతనాన్ని చేర్చింది. ఇంతకు ముందటి కనీస వేతన చట్టంలో ఇది భాగంగా లేదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం దానికి చట్టబద్ధత తెచ్చింది.పైగా జాతీ య కనీస వేతనానికి తక్కువగా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు మరియు ప్రైవేటు యాజమాన్యాలు కనీస వేతనాన్ని నిర్ణయించగూడదని చేర్చింది (జాతీయ కనీస వేతనం రూ.178 గానే వుంది).
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ పే కమిషన్‌ భారత కార్మిక మహాసభ సిఫార్సులు మరియు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నెలకు రూ.18 వేలను కనీస వేతనంగా సిఫార్సు చేస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. చదువులు, ఆరోగ్య అవసరాలు, వినోదం, పండగలు పబ్బాలు, భవి ష్యత్‌ అవసరాల కోసం కనీస వేతనంలో 25 శాతం ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పును 15 శాతా నికి తగ్గించింది. 15వ భారత కార్మిక మహాసభ సిఫార్సులలోని అద్దెకోసం సంబంధించిన ప్రామాణి కాన్ని కూడా తీసుకోకుండా, దాన్ని నెలకు 18 వేలుగా చేసింది. ఈ సిఫార్సును కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తిరస్కరించి తమకు 2015 ధరలలో నెలకు రూ.26 వేలు కనీస వేతనంగా ఇవ్వాలని కొంత కాలంపాటు ఆందోళన చేసినా మోడీ ప్రభు త్వం రూ.18 వేలనే ఖరారు చేసింది. ఆ ప్రకారం చూసినా ఇప్పటి ధరల్లో కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
2017లో మోడీ ప్రభుత్వం జాతీయ కనీస వేతనంపై వేసిన కమిటీ 2011-2012 జాతీయ శాంపిల్‌ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) తాలుకా వినిమయ ఖర్చులను,ప్లానింగ్‌ కమిషన్‌ పేదరిక రేఖను నిర్ణయించటానికి తీసుకున్న ఆహార కేలరీల లెక్కను పరిగణనలోకి తీసుకొని జాతీయ స్థాయిలో కనీస వేతనాన్ని రోజుకు రూ.375, నెలకు రూ.9750 గా సిఫార్సు చేసింది. భారత కార్మిక మహాసభ సిఫార్సు చేసిన 2700 కేలరీల ఆహారాన్ని 2400కు తగ్గించింది. దీనికి నేషనల్‌ శాంపిల్‌ సర్వేను ప్రాతి పదికగా తీసుకుంది. పేదరిక రేఖ మాత్రమే ఈ కమిటీకి ప్రాతిపదిక అయ్యింది. ఆర్థిక వెనుకబాటు తనం వల్ల వినిమయాన్ని తగ్గించుకుంటే దాన్ని కూడా లెక్కలోకి తీసుకుంది. అదనంగా పట్ట ణాలలో ఇంటి అద్దెకు రూ.1430 ఇవ్వాలన్నది. పల్లెటూళ్లల్లో అత్యధిక మంది సొంత ఇళ్లల్లో ఉంటారని సర్వేలో తేలినందున వారికి ఇంటి అద్దెను సిఫార్సు చెయ్యలేదు. ప్రత్యామ్నాయంగా దేశంలో ఉన్న రాష్ట్రాలను 5 జోన్లుగా విభజించి 5 రకాల వేతనాలను తక్కువ స్థాయిలో రోజుకు రూ.341, నెలకు రూ.8878 గా,అధిక స్థాయిలో రోజుకు రూ.446,నెలకు రూ.11610లను సిఫార్సు చేసిం ది. కార్మికులు, వారి కుటుంబాల కనీస అవస రాల కోసం ఈ వేతనాలు సరిపోతాయని వాటిని చట్టబద్దం చెయ్యవచ్చని చెప్పింది. మోడీ ప్రభుత్వం అతి తక్కువగా ఉన్న ఈవేతనాలను కూడా ఆమోదించకుండా జాతీయ కనీస వేతనాన్ని రోజుకి రూ.178,నెలకు రూ.4628గా నిర్ణయించి ప్రకటించింది. ఈ జాతీయ కనీస వేతనం ఎలా వచ్చింది, ఎక్కడ ప్రారంభమయ్యింది, ఇప్పటికీ రూ.178గానే ఎందుకు వుందనేది తెలుసుకుంటే దేశంలోని పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థ అసలు రూపం బయటపడుతుంది.1991లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మరియు గ్రామీణ కార్మికుల వేతనంపై వేసిన కమిటీ చేసిన సిఫార్సులు అత్యంత కార్మిక వ్యతిరేకమైనవిగా ఉన్నాయి. 1979-80 ధరల్లో నేషనల్‌ శాంపిల్‌ సర్వే నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 2400 కేలరీల ఆహారానికి (పేదరిక స్థాయి) గాను ఒక్కో వ్యక్తి వినిమయ ఖర్చు సరాసరిన నెలకు రూ.76. ఆ సమయంలో వ్యవసాయ కార్మికుల వినిమయ సూచి పాయింట్లు 360 ఉన్నాయి.దీనిని 1990 అక్టోబర్‌లో తాజా పరిచి అప్పటి వినిమయ సూచి 804 పాయింట్ల దగ్గర నెలకు రూ. 170గా కమిటీ తేల్చింది (360 నుండి 804పాయింట్లు 223.33 శాతానికి పెరిగాయి కాబట్టి రూ. 76 లను కూడా 223.33 శాతానికి పెంచి రూ.170 చేసింది.ఒక్కో పాయిం ట్‌ ప్రాతినిధ్యం వహించే రూపాయలలో ఉండే ధరల పెరుగుదలను లెక్కలోకి తీసుకోలేదు. ఇప్పటికీ ఇదే పద్ధతి కొనసాగుతోంది).కుటుంబానికి ముగ్గురు గా లెక్కించి కుటుంబం మొత్తానికి నెలకు రూ.510, సంవత్సరానికి రూ.6120గా లెక్కేసింది. సర్వే ప్రకారం కుటుంబంలో 1.89 మంది పనిలో ఉన్నారని చెప్పి రూ.6120లను1.89 మందికి పంచి రూ.3238.09గా చేసింది. కాని సంవత్స రంలో 159 రోజులే పనులు దొరుకుతున్నందున ఆ వచ్చిన మొత్తాన్ని 159తో భాగించి రోజుకు రూ.20.37 లుగా తేల్చింది. దీన్ని రౌండ్‌ ఫిగర్‌గా మార్చిన తరువాత వచ్చిన రూ.20లను, 1996లో అప్పటి వినిమయ సూచి ప్రకారం రూ.35 చేశారు. ప్రతి రెండు సంవత్సరాలకీ దీన్ని మార్చుతూ 2017లో రోజుకు రూ.176గాప్రకటించారు. 2017లో ఇదే సమయంలో వ్యవసాయ కార్మికుల (క్యాజువల్‌ లేబర్‌) కనీస వేతనం లేబర్‌ కమిషనర్‌ నిర్ణయం ప్రకారం రూ.244.25 పైసలు ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర లేబర్‌ కమిషనర్‌ జారీ చేసే జీవో లలో వ్యవసాయేతర పనులకు ఇండెక్స్‌లో ప్రతి పాయింట్‌కు ఎక్కువ ఎంప్లారుమెంట్లలో రూ.6.55 పైసలు విడిఎ వస్తోంది. కాని గ్రామీణ కార్మికుల వేతనాల కోసం నియమించిన కమిటీ పెరిగిన పాయింట్లను మాత్రమే పరిగణన లోకి తీసుకొని పాయింట్లలో పెరిగిన శాతాన్ని బట్టి మాత్రమే రోజు వేతనాన్ని పెంచటాన్ని సిఫార్సు చేసింది. దీని వలన జాతీయ కనీస వేతనంలో ఎటువంటి ఎదుగుదల లేకుండా గొర్రె తోక లాగ ఉండిపోయింది. ఈవేతనం ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి ఆచరణయోగ్యంగా కనపడిరది. 2017లో జాతీయ కనీస వేతనంపై వేసిన కమిటీ చేసిన సిఫార్సు రోజుకు రూ.375లను కూడా కాదనిరూ.176 లనే ఖరారు చేసింది. పైగా దీనికి ఇప్పుడు చట్టబద్దత తెచ్చింది.
తాజాగా కార్మిక సంఘాలు నెలకు రూ.26, 000 కనీస వేతనాన్ని డిమాండ్‌ చేస్తున్న పరిస్థి తులలో…మోడీ ప్రభుత్వం మోసపూరితంగా… జాతీయ కనీస వేతనం మరియు లేబర్‌ కమిషనర్లు నిర్ణయించే కనీస వేతనం పైన కూడా సిఫార్సు చెయ్యమని ఎస్‌.పిముఖర్జీ అధ్యక్షతన కమిటీ వేసింది. పార్లమెంట్‌లో పాస్‌ అయిన వేతనాల కోడ్‌ ప్రకారం కనీస వేతన నిర్ణయం కోసం కనీస వేతనాల సలహా బోర్డుల సలహాలు తీసుకోవాలి. అంతిమంగా సదరు ప్రభుత్వాలు కనీస వేతనాన్ని ఖరారు చేయడానికి… కేంద్ర ప్రభుత్వం ప్రతి పాదించిన వేతనాల కోడ్‌ నిబంధనల ప్రకారం… 15వ భారత కార్మిక మహాసభ సిఫార్సులను, సుప్రీంకోర్టు తీర్పులను ప్రాతిపదికగా తీసుకోవాలి. కాని తాను పాస్‌ చేసిన ఈ చట్టానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కార్మిక వ్యతిరేక మోడీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, కార్మికులు పోరాడి నెలకు రూ.26,000 కనీస వేతనంగా సాధించుకోవాలి. పేదరికంలో ఉన్న కార్మికులను పేదరికంలోనే ఉంచేలా రోజు వేతనాన్నిరూ.176గానిర్ణయించటాన్ని తిప్పికొట్టాలి.
వ్యాసకర్త : సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు- (పి.అజయ కుమార్‌)

మాతృభాషల రక్షణతోనే గిరిజన విద్యాభివృద్ధి

సంఖ్యతో సంబంధం లేకుండా పాఠశాలలను కొనసాగించటం, గిరిజన స్థానిక భాష, లిపిని రాజ్యాంగబద్ధంగా పరిరక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం, వృత్తి విద్యా కోర్సులను రూపొందించి, వాటికి అనుగుణంగా ఉపాధి కల్పించడం, మాతృభాషా వాలంటీర్లను కొనసాగించటం, ఐఏపి, సబ్‌ప్లాన్‌ నిధులను చిత్తశుద్ధితో కొనసాగించటం పట్ల పాలకులు దృష్టి పెడితే గిరిజనుల ఆలోచన విద్య వైపు మళ్లుతుంది.
గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీల జీవన విధానం ఉన్నత స్థితికి చేరాలంటే అక్షరాస్యత చాలా కీలకం. అటువంటి విద్యనందించడంలో పాలకుల వైఫల్యాలు కోకొల్లలు. గిరిజన పిల్లల చదువుల్లో ఆంధ్రప్రదేశ్‌ 48.8 శాతంతో 31వ స్థానం అంటే చివరి స్థానంలో వుంది. ఇప్పటికైనా మేలుకోకపోతే అక్షరాసత్యతా శాతం పడిపోతుంది. రాజ్యాంగంలో షెడ్యూల్‌ తెగలకు ప్రత్యేకమైన రక్షణలు, సదుపాయాలు కల్పించబడ్డాయి. ఆర్టికల్‌ 46 ప్రకారం విద్య, ఆర్థిక వృద్ధి చేపడుతూ వారిని అన్ని విధాలైన సామాజిక అన్యాయాల నుంచి, దోపిడీ నుంచి రక్షించాలి. 5వ షెడ్యూల్‌ ద్వారా గిరిజన ప్రాంతాల పరిపాలన గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యత ఇచ్చింది. 275(1) ప్రకారం షెడ్యూల్‌ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నోడల్‌ ప్యాకేజీలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని సూచించింది. రాజ్యాంగంలో పొందుపరచబడిన గిరిజన హక్కులను కాలరాసే విధానాలను పాలకులు అనుసరిస్తున్న నేపథ్యంలో భాష, తెగలు సమస్య, పేదరికం, నిరక్షరాస్యత, దోపిడీ, మౌలిక సౌకర్యాల లేమి వెంటాడుతున్నాయి. మాతృభాష (స్థానిక భాష) లోనే విద్యాబోధనకు ప్రాధాన్యతనిస్తే గిరిజన పిల్లలు విద్యకు చేరువ అవుతారని గిరిజన ప్రజానీకమే అనేక ప్రయత్నాలు చేసింది. చదువు కోసం తపన పడిన బడులు ఆ ప్రాంతాలలో అప్పటికి లేవు. కొద్దిపాటి చైతన్యంతో ‘మా బడులు’ వెలిసాయి. ‘అక్షర దేవుళ్ళు, అక్షర బ్రహ్మ’ వంటివి ఆవిష్కరించుకుని అక్షరాలకే పూజలు చేసేవారు. స్థానిక భాషల రక్షణ కోసం ఆ భాషలో బోధించేందుకు గిరిజనులు కృషి చేశారు. 1985 నుండి 1990 వరకు విద్య కోసం గిరిజనులు పడ్డ తాపత్రయం పరిశీలించ దగ్గదే. ఈ ప్రాంతాలలో గిరిజనులు విగ్రహాలను పూజించరు, లిపినే నమ్ముతారు. ఆ తెగల అవసరాలను గుర్తించి భాష, లిపి, సంస్కృతిని పరిశీలించాలి. తెలుగు రాష్ట్రాలలో 33 తెగలకు చెందిన గిరిజనులు వున్నారు. అక్షరాస్యత లో వెనుకబడి, విద్యకు దూరంగా ఉన్న ప్రాంతాలుగా గుర్తించి 2005లో స్థానిక భాషలో విద్యాబోధనకు విద్యాశాఖ ప్రయోగాలు మొదలుపెట్టింది. భాషా సమస్య ప్రధాన కారణంగా గుర్తించి లిపి గల భాషలు అన్నింటికీ పాఠ్య పుస్తకాలను ముద్రించారు. నిర్దేశించుకున్న కొన్ని లక్ష్యాల సాధన దిశగా గిరిజన విద్యార్థులలో విద్యపై ఆసక్తి పెంచి బడి మానేసే శాతాన్ని తగ్గించడం, గిరిజన భాష, సంస్కృతులను పరిరక్షించటం కోసం ఇంట్లో మాట్లాడే భాష, బడిలో బోధించే భాషతో తెగలను అనుసంధానం చేయాలి. దాంతో వారు విద్య పట్ల ఆకర్షితులౌతారని గిరిజన సాంస్కృతిక పరిశోధనా సంస్థ, ప్రాథమిక విద్యా పథకం సంయుక్తంగా 2006 నుంచి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రత్యేక మాడ్యూల్స్‌, వాచకాలతో అమలు చేయడం మొదలు పెట్టింది. మంచి ఫలితాలను సాధించింది. ప్రస్తుత పాలకుల విధానాల వలన వాలంటీర్ల వ్యవస్థ నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. మన రాష్ట్రంలో 8 జిల్లాలలో 920 పాఠశాలలలో, స్థానిక లిపి గల భాషలను 811 మంది వాలంటీర్లు బోధిస్తునారు. ఆగస్టు నెలలో పాఠశాలలు తెరిచినా ఇంతవరకూ స్థానిక భాషలకు చెందిన వాలంటీర్ల నియామకం లేదు. కరోనాకు ముందు కూడా ఇటువంటి పరిస్థితి ఉన్న కారణంగా పిల్లలు పూర్తిగా బడులకు దూరం అయ్యారు. పిల్లలు లేరని, తక్కువ సంఖ్యలో ఉన్నారని ఈ లోపల వందల సంఖ్యలో బడులను మూసేస్తున్నారు. కోయ, కొండ, కోలామి, కుయి, ఆదివాసీ ఒరియా, సవర, గోండి భాషలకు లిపి ఉంది. ఇవి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయి. పెద్ద తెగగా ఉన్న జాతాపు భాషకు లిపి లేదు. లిపి లేకపోవడం కూడా వెనుకబాటుకు ఒక కారణం. లిపి ఉన్న భాషలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. స్వాతంత్య్రం రాకమునుపు పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన గిడుగు వెంకట రామమూర్తి గిరిజన జాతుల విద్యాభివృద్ధి అభ్యుదయానికి, ఐక్యతకు సుమారు వంద సంవత్సరాల క్రితమే సవర సంస్కృతి, భాషలపై నిఘంటువును తయారు చేసి వర్ణమాల రూప కర్త అయ్యారు. అన్నిటికంటే ముఖ్యమైనది గిరిజన మాతృభాష బోధన తెలుగు లిపిలో జరుగుతున్నది. కాబట్టి తెలుగు భాష నేర్చు కోవడం సులభం అవుతుంది. విద్యార్థి ఆలోచనా సరళిని అభివృద్ధి చేస్తుంది. ఈనాటికీ 33 తెగలుగా గల ఆదివాసులు స్థానిక భాషలకు లిపిని సమకూర్చే బాధ్యత ప్రభు త్వాలదే. అంతేకాక జన గణన తెగల వారీగా చేపట్టకపోతే అంతరిస్తున్న ఆదిమ తెగలు గురించి తెలిసే అవకాశం లేదు. గిరిజనులు ఐటీడీఏ లక్ష్యాలను ఎలా నెరవే స్తారు? ఈ పరిణామాలన్నీ గిరిజనుల హక్కులు, ఉనికిని నిర్వచిస్తున్న రాజ్యాంగం లోని 5వ షెడ్యూల్‌ స్ఫూర్తిని నీరుగార్చేలా ఉన్నాయి. లిపి గల గిరిజన మాతృభాషలను బోధించే వాలంటీర్లను కొనసాగించడం లేదు. అన్ని ఐటీడీఏ లలో ఇదే పరిస్థితి ఉంది.3,4,5 తరగతుల విద్యార్థులను ఆశ్రమ పాఠశాలలకు తరలించడం వలన స్థానిక మాతృభాషతో తెలుగు నేర్చుకునే పరిస్థితులు లేవు. ఈ బోధన కేవలం ప్రాథమిక పాఠశాల లోనే జరుగుతుంది. ఆశ్రమ పాఠశాలలోనే ఈ భాషలను బోధించే వాలంటీర్లు ఉండరు. టీచర్ల నియామకాలు లేకపోవడంతో, ఆశ్రమ పాఠశాలలో వారి ఆలనా పాలనా చూసే ప్రత్యేక టీచర్లు లేరు. సమగ్ర సర్వే లేకపోవడం, ప్రత్యామ్నాయ పాఠశాలల రద్దు చేయటం, నేటికి గిరి శిఖరాలకు రవాణా,విద్యుత్తు, వైద్య, కమ్యూనికేషన్‌ సౌకర్యాలు లేకపోవడం, పాలకుల విధానాలతో మాతృభాష విద్యా బోధనపై దాడి మరింత వెనుకబాటుకు దారితీస్తున్నది. ప్రత్యామ్నాయాలు లేకపోలేదు. సంఖ్యతో సంబంధం లేకుండా పాఠశాలలను కొనసాగించటం, గిరిజన స్థానిక భాష, లిపిని రాజ్యాంగబద్ధంగా పరిరక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం, వృత్తి విద్యా కోర్సులను రూపొందించి, వాటికి అనుగుణంగా ఉపాధి కల్పించడం, మాతృభాషా వాలంటీర్లను కొనసాగించటం, ఐఏపి, సబ్‌ప్లాన్‌ నిధులను చిత్తశుద్ధితో కొనసాగించటం పట్ల పాలకులు దృష్టి పెడితే గిరిజనుల ఆలోచన విద్య వైపు మళ్లుతుంది. ఆ ప్రాంతాలకు గల ప్రత్యేక పరిస్థితులను బట్టి ఎన్ని అవకాశాలు ఉంటే అన్నింటినీ అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిది. కనుకనే భాష, సంస్కృతి, లిపి, విద్య వంటి అంశాల ప్రాధాన్యతను గుర్తించే ప్రతి ఒక్కరు రాజ్యాంగ పరమైన హక్కులకు భంగం కలగకుండా, భంగం కలిగించే విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. ఓకే భాష మాట్లాడే తెగలన్నీ తమ తమ ప్రాంతాలలో ఐక్యతను సాధించాయి. స్వాతంత్య్ర పోరాటంలో సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడాయి. అన్నింటికి మూలమైన చారిత్రక అంశం భాష. అటువంటి గిరిజన మాతృభాషల పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు అనివార్యం.
మౌళిక వసతులు కల్పించాలి
మాతృభాషతోపాటు గిరిజన విద్యాలయాల్లో మౌళిక వసతులు కల్పించాలి. నాడు నేడు కార్యక్రమంలో కొన్ని పాఠశాలలను మాత్రమే అభివృద్ధి చేశారు. మారుమూల లోతట్టు ప్రాంతాల్లో చాలా పాఠశాలలు అధ్వానంగా పడి ఉన్నాయి. వాటికి యుద్ద ప్రాతిపదన నిధులు మంజూరు చేయించి ఆధునీకరిం చాలి.ఉపాధ్యాయులు లేని పాఠశాల్లో ఉపాధ్యాయులను నియమించాలి. -కె.విజయ గౌరి

కులం సంకెళ్లు.. ఇంకెన్నాళ్లు ?

తరాలు మారుతున్నా కులం పేరుతో జరుగుతున్న హత్యలు మాత్రం ఆగడం లేదు. కులం మారి పెండ్లిళ్లు చేసుకుంటే అయినోళ్లే బొందవెడు తున్నారు. నిన్నగాక ఇటీవల వరంగల్‌ లో కులాం తర పెండ్లి చేసుకుందని కన్నతల్లే కూతుర్ని కడ తేర్చింది. నిన్న మహారాష్ట్ర ఔరంగాబాద్‌ జిల్లాలో అక్క వేరే కులపుటోణ్ని పెండ్లి చేసుకుంది.. అంతే కడుపుతో ఉందని కూడా చూడకుండా నరికి చంపిండు ఓ తమ్ముడు. దాన్ని సెల్ఫీ తీసి అందరికీ చూపిండు. సాంకేతికంగా ఎంతో ఎదిగిపోయాం అంటూ జబ్బలు చరుచుకుంటున్నాం.. కానీ ఇలా పరువుప్రతిష్ట అంటూ అయినోళ్లనే నిర్థాక్షిణ్యంగా పొట్టన పెట్టుకుంటున్న వారిని మాత్రం ఏమీ చేయలేక పోతున్నాం. ఎన్ని చట్టాలు తెచ్చినా వారిలో మార్పు తేలేకపోతున్నాం. మరి ఈ కులాల కార్చిచ్చు ఆగేదెన్నడు? ప్రేమకు నీడ దొరికేదెన్నడు? పచ్చని జంటలు తమ బతుకులు పండిరచుకునేదెప్పుడు? మన సమాజాన్నిపట్టి పీడిస్తున్న భయం కరమైన జబ్బు కులవ్యవస్థే. కుల ప్రభావం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందకపోవడానికి కారణం కుల వ్యవస్థే అని మనదేశాన్ని లోతుగా పరిశీలిం చిన సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశం లోని ప్రతి మనిషికి ఏమున్నా లేకున్నా కులం మాత్రం గ్యారంటీ. వేల కులాలున్న ఈ సమాజంలో ఏ కులం కూడా ఇంకో కులంతో సమానం కాదు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఇప్పటికీ దాదాపు 30 కోట్ల మంది అంటరానితనం, కులవివక్షతో అణచివేయబడుతున్నారు. మనదేశంలో కులం కొందరికి వరమైతే.. ఎందరికో శాపంగా మారు తోంది. కులాల చిచ్చుతో రగులుతున్న మన సమా జానికి శస్త్రచికిత్స తక్షణ అవసరం. ఆరోజు రావా లంటే ప్రజల్లో సామాజిక చైతన్యం రావాలి.. కుల రహిత సమాజం ఆవిర్భవించాలి. అనునిత్యం దాడులు.. దౌర్జన్యాలు
రెండు వేల సంవత్సరాలకు పైగా మన సమాజాన్ని అంధకారం,అజ్ఞానంలో ఉంచటంలో కులవ్యవస్థ పాత్ర ఎంతో ఉంది. శ్రమచేసే వారికిచదువు లేకుం డా చేసింది కులమే. మనుషుల మధ్య ఐక్యత, సాన్నిహిత్యం లేకుండా చేస్తోంది కులమే. ప్రేమిం చడాన్ని సహించదు సరికదా ద్వేషించడాన్నే ప్రేమి స్తుంది. ఉన్నత చదువులు చదివి విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వారు సైతం.. తిరిగి మన దేశానికొచ్చి తన కులమెక్కడుందో వెతుక్కొని, సొంత కులంలోనే పెండ్లి చేసుకుంటున్నారంటే కులమెంతగా ప్రభావం చూపుతుందో అర్థమవు తోంది. కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై, చేసుకోవాలి అనుకునే వారిపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు జరగడం మన సమాజంలో మామూలై పోయింది. గత నెలలో వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఎస్సీ కులానికి చెందిన యువతి ఎస్టీ యువకుడిని ప్రేమించింది. అది నచ్చని ఆమె తల్లి,అమ్మమ్మ కలిసి దారుణంగా చంపేశారు. తమ కుల కట్టుబాట్లు దాటినందుకే హత్య చేశామని, మా కులం కాని వాడితో పెళ్లి వద్దన్నా వినలేదు అందుకే చంపాల్సి వచ్చిందని వారు సమర్థించు కున్నారు. కులాంతర వివాహాల పట్ల కర్కశత్వంగా వ్యవహరించడం ఇదేమీ మొదటిసారి కాదు, అలాగని చివరిదీ కాదు. గతంలో ఇలాంటి ఘట నలు అనేకం మన ముందున్నాయి.

అన్నీ కుల దురహంకార హత్యలే..
మిర్యాలగూడలో వైశ్య కులానికి చెందిన అమృత భర్త ప్రణయ్‌ను ఆమె తండ్రి, బాబాయిలే కిరాయి గూండాలతో హత్య చేయించారు. ప్రణయ్‌ దళిత మధ్యతరగతి కుటుంబంలో పుట్టడమే దానికి కారణం. ఇదే విధంగా కర్నూల్‌లో కులాంతర వివాహం చేసుకున్నందుకు ఆదాం స్మిత్‌ను గొడ్డళ్లతో నరికి చంపారు. హైదరాబాద్‌లో అవంతిరెడ్డి కులాం తర వివాహం చేసుకున్నందుకు వైశ్య కులానికి చెందిన హేమంత్‌ కుమార్‌ను అవంతి తండ్రి, మామ కిరాయి గూండాల సహకారంతో చంపించారు. భువనగిరిలో స్వాతిరెడ్డి భర్త నరేశ్‌ రజకుడని ఆమె తండ్రి,బంధువులు కలిసి నిర్ధాక్షి ణ్యంగా హత్య చేశారు. పొరుగు రాష్ట్రమైన తమిళ నాడులో సంచలనం సృష్టించిన కౌసల్య భర్త శంకర్‌ హత్య ఈకోవకు చెందిందే. శంకర్‌ దళి తుడైన కారణంగా అతణ్ని కౌసల్య తండ్రి, బంధు వులు కలిసిహత్య చేశారు. పంజాబ్‌కు చెందిన కావ్య భర్త అభిషేక్‌ను కూడా కులాంతర వివాహం చేసుకున్నందుకు చంపేశారు. అక్కడా ఇక్కడా అని లేదు దేశం నలుమూలలా తమ కులం కాని వారిని పెండ్లి చేసుకున్నందుకు అమానుషంగా హత్యలు చేస్తున్నారు. ఇవన్నీ నూటికి నూరుపాళ్లు కుల దురహంకార హత్యలే. ఈ హత్యలన్నీ సమీప రక్త సంబంధీకులు చేస్తున్నవే. కానీ, ఇవి అరుదుగా, అప్పుడప్పుడు జరుగుతున్న ఘటనలుగా, ప్రాధాన్యతలేని వార్తలుగా చూస్తున్నారు. తరతరాల చరిత్రలో ఇలాంటివి ఎన్నెన్నో. ఈ రోజు సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, సామాజిక మాధ్యమాలు విస్తృతం కావడం వల్ల ఇవి వెలుగులోకి వస్తున్నాయంతే.

వేరే కులం వారిని పెండ్లి చేసుకుంటే..
పిల్లలు కులాంతర వివాహాలు చేసుకుని తమ కుటుంబం పరువు తీశారని తల్లితండ్రులు, తోబు ట్టువులు, బంధువులు వాదిస్తున్నారు. ఆధిపత్య కులాల వారు తమకులం పరువుపోతోందని ఇలాం టి ఘోరాలకు పాల్పడుతున్నారు. రెండు వేర్వేరు కులాల వాళ్లు పెండ్లి చేసుకుంటే ఒకరు పైకులం గా,ఇంకొకరు కింది కులంగా భావిం చడమే ఇందు కు కారణం. తమకులం కంటే తక్కువ కులమని భావించిన ప్రతి ఒక్కరూ దాడులకు, దౌర్జన్యాలకు, హత్యలకు తెగబడు తున్నారు. కులాంతర వివాహాన్ని వ్యతిరేకించని తల్లిదండ్రు లను కూడా మిగతా బంధువులు వెలి వేస్తున్నారు. వారి పిల్లల్ని ఆదరించకుండా వాళ్లను శిక్షించాలని కులమంతా వేధిస్తోంది. ఎవరైనా కులాంతర వివాహాలు చేస్తు న్నా, ప్రోత్సహిస్తున్నా వారిని ధర్మం తప్పినట్లు కుల సమాజం చూస్తోంది.హంతకులుగా మారుతున్న రక్తసంబంధికులెవరూ తాము చేసింది తప్పని అను కోవడం లేదు. కులధర్మాన్ని కాపాడ టానికే ఈ పని చేశామని ఫీల్‌ అవుతున్నారు.

కుల రహిత సమాజం రావాలంటే..
కులం మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న భయం కరమైన వ్యాధిగా మారింది.21వ శతాబ్దంలో కూడా అంటరానితనం, వివక్షలు కుల సంస్కృతిలో భాగమైపోయాయి. ఈ అమానుష కులవ్యవస్థను అంతం చేయడానికి ఎన్ని పథకాలు పెట్టినా కొత్త కొత్త రూపాల్లో అదిప్రత్యక్షమవుతునే ఉంది. ప్రస్తుతం సమాజానికి ఇదో సవాల్‌గా మారింది. ఈ సంస్కృతి సమాజ పురోగమనానికి ఆటంకంగా మారుతోంది. కుల వ్యవస్థ ఇంతకాలం సజీవంగా మిగలడానికి, భవిష్యత్తులో కూడా కొనసాగేది స్వకుల వివాహల ద్వారానే. కులాంతర వివాహాలు ఎంత ఎక్కువగా, ఎంత వేగంగా జరిగితే అంత త్వరగా కులరహిత సమాజం ఏర్పడుతుంది. బాహ్య వివాహాలు(తమ కులాలు కాకుండా బయటి కులాల నుంచి) ఒక నియమమైతే కుల వ్యవస్థే మిగలదన్నారు భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెచ్‌? అంబేద్కర్‌. ఈ దిశలో కుల వ్యవస్థను నిర్మూలించడానికి మహోద్యమం చేయాల్సిన అవసరం ఉంది.

సాంస్కృతిక విప్లవం రావాలె..
సొంత కులం వారినే వివాహాలు చేసుకోవాలని, అదే ధర్మమని, ఆ ధర్మాన్ని ఉల్లంఘించి కులాంతర వివాహాలు చేసుకుంటే మరణ శిక్ష విధించాలని మన ధర్మ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఇవి ఆనాటి సమకాలీన పరిస్థితులను అనుసరించి రాసినవి. కానీ ‘సంఘం శరణం గచ్చామి.. ధర్మం శరణం గచ్చామి’ అన్న బుద్ధుని ప్రబోధనలను అనుసరిస్తే.. మారుతున్న పరిస్థితులతోపాటు జనమూ మారక తప్పదు. కుల వ్యవస్థను సమూలంగా నిర్మూలిం చడం మనందరి బాధ్యత. వందలాది కులాలున్న సమాజంలో ఒక్క మన కులం కాక మరే కులంలో వివాహం చేసుకున్నా అది కుల రహిత సమాజానికై జరుగుతున్న పోరాటంలో ఒక భాగమే. పెండ్లిలకు ‘ఒక్క నీకులంతప్ప, ఏ కుల మైనా ఫర్వాలేదు’ అన్న నినాదం కావాలి. అందు కోసం దేశంలో అతిపెద్ద సాంస్కృతిక విప్లవం రావాలి. -కందుకూరి సతీష్‌ కుమార్‌

భారీ వ‌ర్షాల‌కు జ‌న‌జీవ‌నం అత‌లాకుత‌లం

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో వరద తీవ్ర నష్టం కలిగించింది.బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కురిసిన కుండ పోతకు వాగులు, నదులు పోటెత్తి ఊళ్లు, పట్టణాలను ముంచేశాయి. జలాశయాలు, చెరువుల కట్టలు తెగాయి. రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. వేలాది ఎకరాలలో పంట నీట మునిగింది. బస్సులు నీటిలో కొట్టుకుపో యాయి. స్వర్ణముఖి ఒడ్డున ఓ ఇల్లు నిలువునా కుంగి నదిలో కలిసిపోయింది. తిరుమల కొండలలో కుంభవృష్టి కురవడంతో ఘాట్‌ రోడ్డులో రాకపోకలకు ఆటంకమేర్ప డిరది. వర్షాలు వరదలకు రైళ్లు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. మొత్తం18 మంది మరణించినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికా రులు తెలిపారు. 50 మందికి పైగా ప్రజలు గల్లంతయ్యారు. రేణిగుంట-గుంతకల్‌ రైలు మార్గంలో కిలోమీటరు మేర రెండు ట్రాక్‌లు కొట్టుకు పోయాయి. అనంతపురం జిల్లా కదిరిలో మూడంతుస్తుల భవనం వర్షాలకు నాని కూలిపోవడంతో ముగ్గురు చిన్నారులు, ఒక వృద్ధురాలు మరణించారు.
ఈశాన్య రుతుపవనాలకు తోడు బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షాలతో రాయలసీమలోని కడప,చిత్తూరు, అనంతపురం జిల్లాలతో పాటుగా నెల్లూరు జిల్లాలోనూ విలయం సృష్టించింది. భారీ వర్షాలకు పెన్నా, దాని ఉపనదులన్నీ పొంగిపొర్లాయి. ఆనకట్టలు తెగిపోయాయి. గ్రామాల మీదకు ఒక్కసారిగా జలప్రళయం మాదిరి ఎగిసిపడడంతో నేటికీ పలు గ్రామాలు కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. 18వ తేదీ సాయంత్రం నుంచే..ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌ 16.2021,22వ తేదీవరకు వర్షాలు కురుశాయి. వర్షాన్ని వాతావరణ శాఖ ముందుగానే అంచనా వేసింది. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయు గుండంగా మారి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్‌ సరిహద్దుల్లో వాయుగుండం తీరం దాటు తుందని హెచ్చరించింది. ఆ క్రమంలోనే 17వ తేదీ నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. తిరుమలలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఏకంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని టీటీడీ అధికారికంగా వెల్లడిరచింది.వర్షాల ప్రభావంతో 18వ తేదీకి తిరుమల అల్లకల్లోలంగా మారింది. తిరుపతి వరద నీటిలో చిక్కుకుంది. చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో కూడా వర్ష తాకిడి తీవ్రంగా కనిపించింది. చెరువులన్నీ నిండుకుండలయ్యాయి. వాగులు పొంగిపొర్లాయి. నదులు ఉద్ధృతంగా ప్రవహించాయి. తిరుమల ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా దిగువన పింఛా నదీకి వరదనీరు భారీ స్థాయిలో చేరింది. 40 వేల క్యూసెక్కుల నీరు వచ్చే పింఛాడ్యామ్‌కి ఒక్కసారిగా 4లక్షల క్యూసెక్కుల వరకూ వరద జలాలు రావడంతో కట్ట తెగిపోయింది.18వ తేదీ చీకటి పడిన తర్వాత పింఛా డ్యామ్‌ కట్ట కొట్టుకుపోయింది. ఈ నీరు, బాహుదా నుంచి వచ్చిన నీటితో కలిసి చెయ్యేరు నది ఒక్కసారిగా ఉప్పొంగింది. ఫలితంగా అన్నమయ్య డ్యామ్‌ ప్రమాదంలో చిక్కుకుంది.
అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకు పోయింది..
1976లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా శంకుస్థాపన చేసి..ఎన్టీఆర్‌ హయంలో పూర్తిచేసిన అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా 10వేల ఎకరాలకు సాగునీరు, రాజంపేట పట్టణం సహా సమీప గ్రామాలకు తాగునీరు అందు తోంది. ఈడ్యామ్‌ నిర్వహణ లోపాలపై పలు ఫిర్యాదులున్నాయి. ఇప్పుడు పింఛా డ్యామ్‌ నుంచి వచ్చిపడిన వరద ప్రవాహంతో ఒక్క సారిగా 3.5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లోని అన్నమయ్య ప్రాజెక్ట్‌ తట్టుకునే స్థితిలో లేదని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి,కడప జిల్లా ప్రత్యేక అధికారిగా వరద సహాయక చర్యల కోసం వెళ్లిన శశి భూషణ్‌ కుమార్‌ తెలిపారు. ‘‘సహజంగా 2లక్షల క్యూసెక్కుల ప్రవాహానికి అనుగుణంగా ప్రాజెక్టు డిజైన్‌ చేశారు. కానీ దానికి దాదాపు రెట్టింపు స్థాయిలో వరద వచ్చింది. అప్పటికే గేట్లు ఎత్తి నీటిని తరలించే ప్రయత్నం చేశాం. కానీ కట్ట పై నుంచి ప్రవాహం సాగింది. చివరకు 19వ తేదీ ఉదయం 5.30 గంటలు దాటిన తర్వాత కట్ట తెగిపోయింది. దిగువన గ్రామాల్లోకి వరద ప్రవాహం ఒక్కసారిగా వెళ్లింది. ముందుగానే హెచ్చరికలు చేయడం వల్ల ప్రాణనష్టం తగ్గింది. కానీ నందలూరు, రాజంపేట మండ లాల్లో 9 గ్రామాలు జలమయమయ్యాయి’’ అని ఆయన వివరించారు.చాలా మంది ప్రాణ భయంతో పరుగులు తీశారు. కొండలపైకి ఎక్కి తలదాచుకున్నారు. అందులో కొందరు వరద ప్రవా హంలో కొట్టుకుపోగా, మిగిలిన వారు ఇప్పటికీ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
కళ్లెదురుగానే కొట్టుకుపోయారు
‘మా ఆయనకు చెవుడు. ఎంత చెప్పినా వినబడలేదు. వరద వచ్చేస్తుందని మాకు ఎవరో ఫోన్‌ చేశారు. ఆలోగానే నీరు వాకిట్లోకి వచ్చేసింది. కొండపైకి వెళ్లాలంటే మాకు ఓపిక లేదు. అరవై ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా గానీ ఇలాంటి భయంకర దృశ్యాలు చూడలేదు. మిద్దె పైకి ఎక్కి తలదాచుకున్నాం. చుట్టూ వరద నీరు. అలలు అలలుగా ఎగిసిపడేది. ఏం జరుగుతుందో తెలియదు.ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాం. మూడు,నాలుగు గంటల తర్వాత శాంతించింది. మా కళ్లెదురుగానే కొందరు నీటిలో కొట్టుకుపోయారు. మా బంధువులిద్దరి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు’’ అంటూ పులపుత్తూరు గ్రామానికి చెందిన ఎం నాగమణి బీబీసీకి తెలిపారు.సమీపంలోని గుం డ్లూరు శివాలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ శివాలయ పుజారి కుటుంబం ఆచూకీ కూడా ఇప్పటి వరకూ దొరకలేదు. ఇంకా అనేక మంది గల్లంతయినట్టు చెబుతున్నారు. చెయ్యేరు వరదల మూలంగా మరణించిన వారిలో 12 మంది మృతదేహాలు లభ్యమయినట్టు అధికా రులు ప్రకటించారు. మరో 15 మంది వరకూ ఆచూకీ దొరకాలని చెబుతున్నారు.
గల్లంతయిన వారి సంఖ్య ఎక్కువే
అన్నమయ్య ప్రాజెక్టు దిగువన వరదల్లో గల్లంతయిన వారి సంఖ్యపై అనేక రకాల ప్రచారాలు సోషల్‌ మీడియాలో సాగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం వారి సంఖ్య 15గా నిర్ధరిం చింది. తమ వాళ్లు కనిపించడం లేదంటూ ఎక్కడికక్కడ స్థానికులు చెబుతున్న సంఖ్యతో పోల్చితే ఇది సగం కంటే తక్కువే.‘‘ప్రభుత్వం చెప్పిన సంఖ్యకు, మా ఊరిలో కనిపించకుండా పోయిన వారి సంఖ్యకు సంబంధం లేదు. మా సొంత మేనత్త, ఆమె భర్త కనిపించడం లేదు. ఇంట్లో సామాను కోసం అని కొంత ఆలస్యం చేశారు. మేం కేకలు వేస్తున్నా వారు తొందరగా బయటపడలేదు. దాంతో ఇప్పుడు వారి ఆచూకీ లేదు. మా గ్రామంలోనే ఎస్సీ కాలనీలో ముగ్గురు కనిపించడం లేదు. రాజుల పేటకు చెందిన నలుగురు కనిపించడం లేదు. ఒక్క మా ఊరిలోనే 10 మంది. మందపల్లిలో ఆరు, గుండ్లూరులో 10 ఇలా ఇప్పటికే మా ప్రాం తంలో 26 మంది గల్లంతయ్యారు. ప్రభుత్వం మాత్రం తక్కువగా చెబుతోంది’’ అని పులపు త్తూరుకి చెందిన ఎం.నాగిరెడ్డి తెలిపారు.
నెల్లూరులో కకావికలం
ఎగువన కురిసన వర్షాలతో పెన్నా నది పోటెత్తింది. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహించింది. నెల్లూరు నగరం, కోవూరు నియోజకవర్గం సహా పలు ప్రాంతాలను జలదిగ్బంధంలో చిక్కుకోవడానికి కారణమైంది. 20వ తేదీ తెల్లవారుజాము నుంచి నెల్లూరులో వరద తాకిడి తీవ్రంగా కనిపించింది. అంతకు ముందే గూడురు వద్ద జాతీయ రహ దారిపై నీరు చేరింది. కావలి, సూళ్లూరుపేట పరిసరా ల్లో లక్షల ఎకరాల పంట నీటమునిగింది. పొలాలు చెరువులను తలపించాయి.చివరకు 20వ తేదీ రాత్రి నెల్లూరు వద్ద ఎన్‌హెచ్‌-16కి కూడా గండిపడిరది. కోవూరు సమీపంలో కూడా కృష్ణపట్నం,బళ్లారిరోడ్డు పైకి వరద ప్రవాహం చేరడం, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకపోవడంతో తీవ్రంగా వరద తాకిడి కొనసాగుతోంది.ఎగువన సోమశిల శాంతించి నప్పటికీ మైలవరం డ్యామ్‌తో పాటుగా, పెన్నార్‌ నుంచి ప్రవాహం కొనసాగుతోంది. దాని కారణంగా పెన్నా నదికి వరద 21 వ తేదీ రాత్రి వరకూ కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు భావిస్తున్నారు.18 మంది మృతి, 3,500 పశువులు మృతిభారీ వర్షాలు, వరదల మూలంగా ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రమాదాల్లో 18 మంది మరణించినట్టు అధికారికంగా ధ్రువీకరించారు. గల్లంతయిన వారి కోసం గాలిస్తున్నట్టు ప్రకటించారు. వేల పశువులు వరదల్లో కొట్టుకుపోయాయి. సుమారు 3,500 పశువులు మృతి చెందినట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 28 కుంటలు, చెరువులు, కాలువలు తెగిపోయాయని విపత్తుల నిర్వహణశాఖ వెల్లడిరచింది.
తిరుపతిపై జలఖడ్గం..
తిరుమల తిరుపతిని భారీ వర్షాలు ముంచెత్తాయి. అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో తిరుమల గిరులన్నీ జలపాతాల్లా మారాయి. రోడ్లన్నీ నదులను తలపించాయి. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా వరద నీరే. వరద వెళ్లే కాలువలు చిన్నగా ఉండడం.. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో.. కాలనీలన్నీ నదుల్లా మారిపోయాయి. వాహనాలు, జంతువులు కళ్ల ముందే కొట్టుకుపోయాయి. ఇళ్లలోని సామానులు కాగితపు పడవల్లా నీటితో తేలియాడుతూ వెళ్లిపోయాయి. తిరుమల, తిరుపతిలో ఎప్పుడూ ఇలాంటి దృశ్యాలను చూడలేదని స్థానికులు తెలిపారు. కనివినీ ఎరుగని రీతితో వరద ముంచెత్తిందని వాపోతున్నారు. ఇంతటి ప్రకృతి విపత్తును ఊహించలేదని చెబుతున్నారు.టీటీడీకి 4కోట్లకు పైగా నష్టం..30 ఏళ్లలో ఎప్పుడూ ఇంత భారీ వర్షం కురవలేదు’ నవంబరు 17 నుంచి 19వ తేదీ వరకు తిరుమల, తిరుపతిలో కురిసిన వర్షాలు గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేదని టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్‌ డ్యామ్‌లు పొంగి పొర్లి..కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంచేశాయని ఆయన తెలిపారు.

ఆమెకేది రక్షణ

దేశంలో వివిధ రకాల నేరాలకు సంబంధించి జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) తాజాగా 2019 సంవత్సరానికి సంబంధించిన నివేదికను వెలువరిం చింది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి వెల్లడైన పలు సంచలన గణాంకాలు పరిస్థితి తీవ్రతను తెలియజేసేలా ఉన్నాయి. ఓవరాల్‌గా నేరాల్లో ఏపీ దేశంలోనే ఎనిమిదో స్థానంలో నిలవగా.. కీలకమైన ఆర్థిక నేరాల్లో మాత్రం టాప్‌లో ఉండటం, మహిళల అక్రమ రవాణాలో రెండో స్థానంలో నిలవడం కలకలం రేపుతున్నది.
2019 చివరి నాటికి ఇలా..
ఎన్‌సీఆర్‌బీ తాజా రిపోర్టులో 1995 నుంచి 2019 డిసెంబర్‌ చివరి నాటికి నమోదైన నేరాలను పరిగణలోకి తీసుకున్నారు. 2019 మేలో ఏపీలో జగన్‌ అధికారంలోకి రాగా, ఆ ఏడాది మొత్తంగా రాష్ట్రం ఆర్థిక నేరాల్లో అగ్రగామిగా నిలిచింది. గతేడాది ఏపీలో రూ.50 కోట్ల నుంచి 100కోట్లు మోసానికి పాల్పడిన కేసులు ఏకంగా 30 నమోదయ్యాయి. ఇది దేశంలోనే ఇది అత్యధికమని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. నమ్మకద్రోహం, ఫోర్జరీ, చీటింగ్‌, ఫ్రాడ్‌ తదితర మోసాలకు సంబంధించి నిందితులు, బాధితుల సంఖ్య ఏటా పెరు గుతూనే ఉంది.
జనాభా తక్కువే అయినా..
ఆర్థిక, పారిశ్రామిక వృద్ధిలో అగ్రరాజ్యాలైన మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడును తోసిరాజని.. ఆంధ్రప్రదేశ్‌ లో ఆర్థిక నేరాలు విస్తృతంగా చోటుచేసుకుకోవడం గమనార్హం. మహారాష్ట్రతో పోల్చుకుంటే సగం జనాభా కూడా లేని ఏపీలో.. ప్రజలకు కుచ్చుటోపీ పెడుతోన్న నేరాలు ఎక్కువగా నమోదయ్యాయి. మధ్య తరగతి ప్రజలకు అత్యాశ చూపి మోసం చేస్తున్న వైనాలు భారీగా బయటపడ్డాయి. వాటిలో అగ్రిగోల్డ్‌ కేసు ప్రధానమైనది కాగా, డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మోసాలకు పాల్పడిన ‘వెల్‌ పే’లాంటి సంస్థల పాత్ర కూడా ఉంది. రూ.50కోట్ల నుంచి 100కోట్లు మోసం చేసిన కేసులు.. గతేడాది మహారాష్ట్రలో ఐదు మాత్రమే నమోదు కాగా,ఏపీలో వాటి సంఖ్య 30గా ఉండటం గమనార్హం. అదే సమ యంలో…పెరిగిన మహిళల అక్రమ రవాణా ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం ఏపీలో మహిళ లను అంగడి సరుకులుగా విక్రయించే ముఠాల కార్యకలాపాలు పెరిగాయి. మహిళల అక్రమ రవాణా, విక్రయాల్లో మహారాష్ట్ర టాప్‌లో ఉండగా,అక్కడి గ్యాంగుల కార్య కలాపాలు ఏపీకి సైతం విస్తరించినట్లు నివేదికలో వెల్లడైం ది. ఏపీలో మూడేళ్లుగా మానవ అక్రమరవాణా క్రమంగా పెరుగుతూ,2019లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. మహిళలు,మానవ అక్రమరవాణాలో మహా రాష్ట్ర 12.5శాతంతో అగ్రస్థానంలో ఉండగా10.8శాతంతో ఏపీ తర్వాత స్థానంలోఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 398 మంది మహిళలు, యువతులు గతేడాది అక్రమ రవాణాకు గురి కాగా వారిలో 316మంది వ్యభిచార గృహాలకు అమ్ముడు పోయారని, వీటికి సంబంధించి కేసు ల నిరూపణ శాతం తక్కువగా ఉందని, కేవలం 21.8శాతం కేసుల్లోనే శిక్షలు పడ్డాయని ఎన్‌సీ ఆర్‌బీ వెల్లడిరచింది. మహిళలపై అఘాయిత్యాల్లో ఏపీ ఎనిమిదో స్థానం..
రాష్ట్రంలో మహిళలపై, లైంగిక వేధింపులు, అత్యాచారాలు..పునరావృతం అవుతున్నాయి. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉంది. గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన ఈతర హా ఘటనల్లో 33.14% మనరాష్ట్రంలోనే నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడు తోంది.
ా రాష్ట్రంలో మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు,వారి ఆత్మ గౌరవానికి భంగం కలిగించే ఘటనలు పెరిగాయి.
ా స్త్రీలపై జరిగిన మొత్తం నేరాల్లో స్వల్ప తగ్గుదల ఉన్నా, వారిపై భౌతిక దాడుల నేరాలు అదుపులోకి రాకపోవడం కలవరపరుస్తోంది.
ా మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉండటం,గతేడాది దేశ వ్యాప్తంగా జరిగిన ఈతరహా ఘటనల్లో 33.14% మన రాష్ట్రంలోనే నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ా ఈ కేసులు 2019లో 1,892 నమోదు కాగా..2020లో ఆ సంఖ్య 2,342కు పెరిగింది.
ా ఏడాది వ్యవధిలో 23.78 శాతం మేర అధికమయ్యాయి.
ా పని ప్రదేశాల్లో మహిళలను లైంగికంగా వేధించడం, స్త్రీలను రహస్యంగా చిత్రీకరించటం (వోయిరిజం) నేరాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో రెండో స్థానంలో ఉంది. 2020 సంవత్సరానికి సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ వివరాలు వెల్లడిరచింది.
ా ఏపీలో మహిళలపై 2019లో 17,746, 2020లో 17,089 నేరాలు జరిగాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గతేడాది 3.70 శాతం మేర తగ్గాయి. ఈ తరహా నేరాలు అత్యధికంగా జరిగిన రాష్ట్రాల జాబితాలో 2019లో పదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ 2020లో ఎనిమిదో స్థానానికి వెళ్లింది.
ా పని ప్రదేశాల్లో మహిళల్ని లైంగికంగా వేధించిన ఘటనల్లో హిమాచల్‌ప్రదేశ్‌ (72 కేసులు) దేశంలో మొదటిస్థానంలో ఉండగా..70 కేసులతో ఏపీ రెండో స్థానంలో ఉంది.
ా స్త్రీలను రహస్యంగా చిత్రీకరించిన ఘటనలు అత్యధికంగా చోటుచేసుకున్న రాష్ట్రాల జాబితాలో ఏపీది రెండో స్థానం. మహారాష్ట్రలో ఈ తరహా కేసులు 201 నమోదు కాగా.. ఏపీలో 124 కేసులు పెట్టారు.
పరిచయస్తులే అత్యాచార నిందితులు
ా రాష్ట్రంలో 1,095 అత్యాచార ఘటనలు జరగ్గా.. అందులో 1,088 ఘటనల్లో ఈ నేరాలకు పాల్పడ్డది బాధితులకు పరిచ యస్తులే.
ా 91 ఘటనల్లో బాధితుల కుటుంబసభ్యులే నిందితులు.997 ఘటనల్లో స్నేహితులు, ఆన్‌లైన్‌ ఫ్రెండ్స్‌, ఇరుగుపొరుగువారి ప్రమేయం ఉంది.
ా అత్యాచారాలు 0.82% పెరిగాయి.
ా సైబర్‌, చిన్నారులపై నేరాల్లో పెరుగుదలలిబి
ా రాష్ట్రంలో 2019తో పోలిస్తే 2020లో సైబర్‌ నేరాలు, చిన్నారులపై జరిగిన నేరాలు కొంత పెరిగాయి.
ా రోడ్డుప్రమాదాలు 14,700 నుంచి 12,830కు తగ్గాయి.
ా అపహరణ కేసులు 902 నుంచి 737కు తగ్గాయి.
పోలీసులపై కేసుల్లో మూడోస్థానం
ా పోలీసులే పలు కేసుల్లో నింది తులవుతున్నారు.
ా దేశవ్యాప్తంగా వారిపై అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ది మూడో స్థానం.
ా అస్సాం (2,179),మహారాష్ట్ర (407) తర్వాత 261 కేసులతో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది.
ా ఆయా ఘటనలపై అభియోగపత్రాల దాఖలులో దర్యాప్తు అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.
ా ఏపీలో 70 (26.81%) కేసుల్లోనే అభియోగపత్రాలు దాఖలుచేశారు. మరో 10 కేసుల్ని ప్రాథమిక దశలోనే న్యాయస్థానాలు కొట్టేశాయి.
ా 17 కేసుల్లో తుది నివేదికలు దాఖలు చేశారు.
దేశద్రోహం కేసులు 2019లో 93 నమోదు కాగా గతేడాదితగ్గి 73కి చేరాయి. మణి పూర్‌లో15,అస్సాంలో 12,కర్నాటకలో 8, ఉత్తరప్రదేశ్‌లో 7,హర్యానాలో 6,ఢల్లీిలో 5, కాశ్మీర్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. 2019లో మొత్తంగా 51,56,158 కేసులు నమోదు కాగా గతేడాది 28.8శాతం అంటే 14,45,127 కేసులు పెరిగాయి. అంటే లక్ష మంది జనాభాకు నమోదైన నేరాల రేటు 2019లో 385.5 వుండగా, 2020లో 487.8కి పెరిగిందని ఆనివేదిక పేర్కొంది. 2020లో భారతీయ శిక్షాస్మృతి కింద నమోదైన కేసులు 31.9శాతంగా వున్నాయి. మొత్తంగా 66,01,285 నేరాలు నమోదు కాగా, వీటిల్లో 42.54లక్షలు కేసులు ఐపిసి కింద దాఖల య్యాయి. 23.46లక్షలకు పైగా కేసులు ప్రత్యేక, స్థానిక చట్టాల (ఎస్‌ఐఎల్‌) కింద నమోద య్యాయని నివేదిక పేర్కొంది. సాంప్రదాయ రీతిలో సాగే నేరాలు రెండు లక్షల వరకు తగ్గా యని తెలిపింది. 2020లో 55.84లక్షల కేసులు దర్యాప్తు దశలో వున్నాయి. వాటిల్లో 34.47లక్షల కేసులను పరిష్కరించారు. దాదాపు 26.12లక్షల కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే చార్జిషీట్లు దాఖలు చేసిన రేటు కూడా 12.5శాతం పెరిగింది.
లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ !
గతేడాది మార్చి 25 నుండి మే 31వరకు కోవిడ్‌ లాక్‌డౌన్‌ వుండడంతో మహిళలు, పిల్లలు, వృద్ధులపై జరిగే నేరాలు, దొంగ తనాలు, దోపిడీలు తగ్గాయని నివేదిక పేర్కొంది. హత్య కేసులు మాత్రం ఒక శాతం పెరిగాయి. ఈ హత్యలకు ప్రేరేపించిన కారణాల్లో వ్యక్తిగత కక్షలు లేదా శతృత్వం, లాభాల కోసం జరిగినవి ఇలా పలు రీతుల్లో వున్నాయి. కిడ్నాప్‌ లేదా అపహరణ కేసులు 19.3శాతం మేర తగ్గాయి. వీరిలో 73,721మంది మహిళలు కిడ్నాప్‌ కాగా, పురుషులు 14,869గా వున్నారు. ఎస్‌సిఆర్‌బి డేటా ప్రకారం వీరిలో మైనర్లు 56,591మంది (8,175మంది బాలురు, 47,876మంది బాలికలు)గా వున్నారు. పెద్దవారు 31,999మందిగా వున్నారు. మొత్తంగా 91,458మంది కిడ్నాప్‌ అవగా,281మంది చనిపోయి శవంగా తేలారు. ప్రజల శాంతి భద్రతలకు సంబంధించి 71,107 కేసులు నమోదయ్యాయి. అంటే 2019తో పోలిస్తే ఈ నేరాలు 12.40శాతం ఎక్కువ. వీటిల్లో 51,606 కేసులు ఘర్షణలకు సంబంధించినవే. మహిళలపై నమోదైన నేరాలు 8.30శాతం తగ్గాయి. నమోదైన కేసుల్లో భర్త లేదా బంధు వుల దాష్టీకానికి సంబంధించిన కేసులే మెజారి టీగా వున్నాయి. ఆతర్వాత అత్యాచార ఉద్దేశ్యం తో దాడి జరిపిన కేసులు 23శాతంగావుండగా, కిడ్నాప్‌ (16.8శాతం), అత్యాచారం (7.5 శాతం) కేసులు నమోదయ్యాయి. 2020లో బాలలపై మొత్తంగా 29,768 కేసులు నమోద య్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 7.8శాతం కేసులు తగ్గాయి.1,45,754 ఆర్థిక నేరాలు నమోదయ్యాయి.
మహిళలపై అఘాయిత్యాలు ఆగాలంటే..
దేశ రాజధాని ఢల్లీిలో మహిళలపై అకృత్యాలు గతంలోనూ జరిగాయి.. ఇప్పుడూ జరుగు తున్నాయి.. భవిష్యత్తలోనూ జరుగుతాయి. పాలకులు మారినా, మహిళలపై అకృత్యాలు తగ్గడంలేదు. బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోనో, ఆన్‌లైన్‌ క్యాబ్‌లను బ్యాన్‌ చేస్తేనో మహిళలపై అఘాయిత్యాల అగిపోతాయను కోవడం హాస్యాస్పదం. మొత్తంగా సమాజంలోనే మార్పు రావాల్సి వుంది. ఆమార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి. దానికి తగ్గ చర్యలు అధికారంలో వున్నవారు తమ స్థాయిలో చేపడితే, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ, విచిత్రంగా అలాంటి చర్యల్ని తీసుకోవడంలో పాలకులు చిత్తశుద్ధి ప్రదర్శించడంలేదు.
చట్టాలు.. నిఘా టీమ్‌లు.. విచిత్రాలు.!
ఢల్లీి నుంచి హైద్రాబాద్‌ దాకా.. ఆమాటకొస్తే ఆర్థిక రాజధాని ముంబై నుంచి గల్లీ దాకా.. నిత్యం ఎక్కడో ఓచోట మహిళలపై అఘాయి త్యాలు జరుగుతూనే వున్నాయి. చట్టాలు లేకనేం, నిందితుల్ని శిక్షించడానికి చాలానే వున్నాయి. కానీ, ఆ చట్టాలే బూజుపట్టిపోయాయి. అనేకా నేక కారణాలతో దోషులు తప్పించు కుంటు న్నారు. దాంతో చట్టాలంటే భయపడే పరిస్థితి లేదు తప్పు చేసేవారికి. అందుకే తప్పు మీద తప్పు.. తప్పు మీద తప్పు జరిగిపోతూనే వుంది. కొన్ని చట్టాలు విచిత్రంగా తెరపె ౖకొస్తుంటాయి. వరకట్న వేధింపుల వ్యవహారమే వుంది.. ఓమహిళ కేసు పెడితే చాలు, అత్తిం టోవారి పనైపోయినట్టే.
దేశానికి దిశా నిర్దేశనం చేయాల్సినవాళ్ళే…
చట్ట సభలు వ్యవస్థల్ని దిశా నిర్దేశనం చేస్తాయి. అందులోని ప్రజా ప్రతినిథులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కానీ, అందరూ అలా వుంటున్నారా.? కొందరు చట్టసభల్లోనే అసాంఫీుక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఆమధ్య ఓరాష్ట్ర అసెంబ్లీలో అధికార పార్టీ నేతలే (ఇందులో అమాత్యులూ వున్నారు) మొబైల్‌ ఫోన్లలో నీలి చిత్రాలు తిల కించారు. అలాంటి ఘటనే మరోటి ఇటీవలే వెలుగు చూసింది. ఇవన్నీ రాజకీయ వివాదా లుగా మారుతున్నాయి తప్ప, ఇంకోసారి ఇలాం టి ఘటనలు వెలుగు చూడకుండా,దోషులకు చట్ట సభలనుంచి సాగనంపడం లాంటి చర్య లేమీ తీసుకుంటున్న దాఖలాలు కన్పించడం లేదు. చట్ట సభల్లో ప్రజా ప్రతినిథులే ఇలా వ్యవహరిస్తోంటే, వారిని రోల్‌ మోడల్స్‌గా తీసు కునే వారి అనుచరులు ఎలా వ్యవహరిస్తారో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు– సింధు

స్వర్ణయుగ చక్రవర్తి

‘‘స్వర్ణయుగ చక్రవర్తి (ఏకపాత్రాభినయం) ఆంధ్ర ` తెలంగాణ రాష్ట్రాలలో ప్రప్రధమంగా ఏకపాత్రకు విద్యార్థుల విభాగంలో 14 నవంబరు 2018లో 30మంది విద్యార్ధు లచే ప్రదర్శించినందుకు గాను తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కింది.’’

నరసనాయకునికి,నాగాంబకు జన్మించిన వారి ఆలనా పాలనములు అంతంతమాత్రమే. నేను విద్యాప్రియుడిని, వీరుడను, లలితకళాభిమానిని, విజయనగర సామ్రాజ్య స్వర్ణయుగ కర్తను చక్రవర్తిని ఔతానని ఏనాడూ వూహించలేదు. ఊహించని ఊహకందని ఎన్నో మలుపులు నా జీవితంలో కలిగాయంటే అవి విధివిలాసమే. తిమ్మరుసు మహామంత్రి నా యందు కనబరచిన వాత్సల్యము ఇంత అని చెప్పలేని, మాటలకు అందని అనిర్వచనీయమైన బంధము. రాజన్న కృష్ణదేవరాయలు, మంత్రి అన్నచో తిమ్మరుసు అన్నంతగా పెనవైచుకున్నది మా బంధము. తండ్రి దగ్గరలేని చనువు అప్పాజీవద్ద పొందిన ధన్యజీవి నేనే.
అప్పాజీ పర్యవేక్షణలో పదునారేండ్ల వయస్సు నిండుసరికే సమస్తాయుధ యుద్ధ విద్యాకౌ శలము, వ్యూహ నిర్మాణము,ప్రత్యర్థి వ్యూహచ్చేదనము,దుర్గరక్షణ,తదాక్రమణ మొదలగు సకల యుధ్ధ విద్యలయందు ఆరితేరాను. గుర్రపు స్వారి,కత్తిసాములో మల్ల యుద్ధములో ప్రత్యేక మెళకువలు నేర్పించాడు అప్పాజీ! సద్గుణ సంపన్నునిగా అప్పాజీ నన్ను తీర్చిదిద్దాడు. ప్రజలకందరికీ ప్రీతిపాత్రుడన య్యేలా చేశాడు. నా పినతల్లి తిప్పాంబికకు మాత్రము నా ఈ ఎదుగుదల మాత్సర్య మనస్కురాల్ని చేసింది. నాపై అసూయ ద్వేషములు పెరిగాయి. తన కుమారుని పై ఆతని పట్టాభిషేకముపై వాత్సల్యము దినదిన ప్రవర్థమానమయ్యెను. తిప్పాంబ కుటిల ప్రవర్తన ఎరిగి యున్న అప్పాజీ నన్ను కంటికి రెప్పలా వెన్నంటి యుండి కాపాడారు. లేకున్నచో పినతల్లి యిచ్చిన విషప్రసాదము తిని ఏనాడో ఈ దేహమును చాలించి యుండెడివాడను. విరూపాక్షస్వామి ఆశీస్సులతో అప్పాజీ రాజనీత్నిత,అండదండలతో బతికి బట్టకట్ట గలిగాను. నాఅన్నగారు వీరనరసింహరాయల వారి ఆగ్రహమునకు నా నేత్రములు రెండు ఏనాడో కోల్పోవలసినవాడిని. అప్పాజీ తన్నననేత్రముతో నా నేత్రములు పోకుండ కాపాడగలిగాడు. అప్పాజీయే లేకున్న అష్టదిగ్గజకవులెక్కడ? ఈ సాహితీసమరాంగణ బిరుదాంకితుడెక్కడ?
అవును. అపాజీ సాక్షాత్తు దైవస్వరూపుడు. లేకున్న భూత భవిష్యత్‌ వర్తమానములు ఆతని మస్థిష్కములో గురితప్పక ఏలగోచరించును? చిన్ననాట అన్నపానాదులకు అల్లలాడిన ఆ కర్మయోగి అలసిసొలసి సొమ్మసిల్లి పడిపోగా ఆ అరణ్యములో ఆతనికి నీరెండపడకుండ నాగుపాము పడగవిప్పి ఆమహనీయుని శిరస్సున ఛత్రమువలే నిలచునా? దైవస్వరూపుడో దైవానుగ్రహస్వరూపుడో ఐన అప్పాజీ అడుగుజాడలో నడచినందుననే నేను తెలుగు సామ్రాజ్యమును అందునా హిందూ సామ్రాజ్యమును ఏకఛత్రాధిపత్యముగా ఏలగల్గి యుండెడివాడనా?
కుమార వీరశ్యామల రాయుడు,ఆర్వీటిశ్రీ రంగ రాజు,ఆకువీటి యిమ్మరాజు,పిమ్మసాని రామలింగ భూపతి,నంద్యాల నాపరాజుల ముందు సలకము తిమ్మయ గారు ఆరోపించిన ఆరోపణలు కారుకూతలను అప్పాజీ సభా ప్రాంగణములో నోరు మెదపక ఎదుటివారి నోరెట్లు నొక్కెచో ….ఆ….అదికదా ప్రతివారు నేర్వదగిన రాజనీత్నిత, నిష్కళంక దేశభక్తి. రామలింగ భూపతి శ్రీ రంగరాయార్యన్య సామంతుల ఎదుట నన్ను నిలిపి…..
వీరులు,శూరులు,చతురంగబల ససైన్యా ధిపతులు, రాజులు, అందరూ కొలువుదీరి యున్నపుడు ఈ రత్నసింహాసనమును అధిష్టించు అధికారము ఈ యువకిశోరం రాయలుకు గాక మరెవ్వరికి కలదు? అని ప్రశ్నించుట ఎవరికి సాధ్యము? పట్టాభిషేక మునకు ముందు సభాభవన అంతర్గృ హములోనికి నన్ను పిలువుకొని వెళ్ళి ఏకాన్తముగ రా నాయనా! అని చేరబిలిచి చెంపపై పెట్టుపెట్టిన ఆ చెంపదెబ్బ ఎట్లు మరతును? ‘‘వత్సా! ఈ క్షణముతో నీపై నాయధికారము ముగియుచున్నది. ఇక నీవు రాజువు. నేను నీ కింకరుడను. అధికారము మహామోహస్థానము. నీ తీర్పునకు తిరుగుండదు. నాఈ చెంపదెబ్బ నీకెంతటి వేదన కల్గించినదో ్నప్తియందుంచుకొని అపరాధులను శిక్షించుయెడ మనస్సెట్లుం డవలెనో నీ మనస్సున నాటుకొనుటకే నిరపరాధివగు నిన్నిట్లు బాధించితిని’’ అని పలికిన అమృతపుపలుకుల మర్మము రాజనీతి ఎట్లుమరతును? నూటయేబది సంవత్సరములకు ముందే స్థాపింపబడిన విజయనగర సామ్రాజ్య మును హిందూ సామ్రాజ్యముగా తీర్చిదిద్దాను. తూర్పున కటకము వరకు తెలుగువారి యధికా రము విస్తరింపజేశాను. దక్షిణమున సేతువు వరకు నాయ్నాకు తిరుగులేదు. పశ్చిమమున బీజాపురమే నా రాజ్యసరిహద్దు. తురుష్కులకు మనమన్న సింహస్వప్నము.ఉత్కళులు విధేయు లుగా నిలిచిరి. చోళులు,పాండ్యులు నామ మాత్రావశిష్ఠులు. పొట్నూరు,సింహాచల మందలి దిగ్విజయస్తంభములు చారిత్రక సత్యములకు తార్కాణములు. నాయేలుబడిలో రక్షణలో ప్రజలకు యుద్ధభయము గాని,చోరభయము గానీ లేకుండా నిశ్చింతగా జీవించునట్లు చేయ గల్గితిని. పాడిపంటలు ద్విగుణములు, త్రిగుణములుగా వృద్ధి చెందినవి. అందుకే విజయనగర వీధులలో వాణిజ్యము మూడు పువ్వులు ఆరుకాలుగా వర్ధిల్లుచున్నది. లేకున్న రత్నములు,మణులు,మాణిక్యములు, వజ్రవైఢూర్యములు పురవీధులలో ఆరుబయట రాసులుపోసి అమ్మగలరా? కత్తికేకాక ఘంటమునకూ పదునుపెట్టి భువన విజయసాహితీ సభయందు ఎన్నెన్నో సాహిత్య కుసుమాలు విరగబూయునట్లు చేయగల్గితిని. ఆ కావ్యసంపద, కవులు నభూతో నభవిష్యత్తి అన్నట్లు వేయిసంవత్సరములైననూ తరగని సాహిత్యసంపద ఉద్భవించినది కదా! ఒకపక్క సాహిత్యము, మరొకపక్క సంగీతము, ఇంకొకపక్క రాజకీయముల….అష్టావధానము చేయుచునే ఆముక్తమాల్యద గ్రంథము పూర్తి చేయగల్గితిని. దేశభాషలందు తెలుగులెస్స కాకున్న నా ఈ బృహద్గ్రంధము రచియింపబడియుండెడిదా? విజయపరంపరలతో నేను కట్టించిన దేవాలయప్రాంగణములు, ఆకాశహర్మ్యములైన గాలిగోపురములు కూలిన కూలుగాక నా విజయపరంపరలతో నెలకొల్పిన విజయస్తంభాలు పవిత్రతుంగభద్రమ్మ తరంగాలలో తళతళలాడుచున్న విఠలాలయ గోపురకాంతి దీప్తులు, గగనమును తాకునట్లు మెరుపుతీగల మాపుచేసిన ఆంధ్రవీరుల ఖడ్గకాంతులు,సహృదయలోకమునకు సుధాధారవలె,పానీయములుగా పెదవికం దించిన భువనవిజయ కవితా గోష్టులు తలచితలచి తెలుగువాడు తన్మయుడు కాకుండునా?పెద్దనగారి మనుచరిత్ర, తిమ్మనగారి పారిజాతాపహరణము, తెనాలి రామలింగని పాండురంగ మహత్మ్యము….. ఒకటేమిటి…..
మున్ముందు నా ఈ సామ్రాజ్యమేమగునో? మరల శత్రురాజులు పుంజుకొనిన- రాజుల మధ్య ఐక్యత లోపించిన -ఆంధ్ర సామ్రాజ్య మందలి విజయస్తంభములను వారు విరుగగొట్టిన గొట్టునేమో! విఠలాలయ, దేవాలయ ప్రాంగణములు చెల్లాచెదురు చేసిన చేయునేమో! ఆకాశహర్మ్యములుగా నే నిర్మించిన గాలిగోపురములు కూలిన కూలుగాక. ఆంధ్రవీరుల ఖడ్గకాంతులు అంతమొనర్చిన ఒనర్చునేమో! కానీ నా భువనవిజయ ప్రాభవమును యిసుమంతయు కదల్చలేరు. భువనవిజయమనగానే అపజయమెట్టిదో ఎరుగని ఆంధ్రజాతి పౌరుషప్రతాపములు ్నప్తికి రాగలవు. సాహితీ సదస్సుచే సాధించిన విజయములు ఆంధ్రజాతి మరువదు. సంస్కృతభాష నుండి సాగిన అనువాద ప్రక్రియకు అడ్డుకట్టవైచి ప్రబంధ ప్రక్రియకు నాందీ పలికి పరిపుష్టి గూర్చి వయసుతోపాటు పొంగివచ్చు అవయవ సౌష్టవముల దర్పముతో మంత్రముగ్ధులను చేయు ప్రబంధసుందరి అష్టాదశ వర్ణనాలంకృత కాంతులతో సాహిత్యమున్నంత కాలము నిలిచియుండును కదా!
తెలుగదేలయన్న దేశంబు తెలుగు
దేశభాశలందు తెలుగులెస్స
శ్రీ గోమఠం రంగా చార్యులు

విప్లవ సింహం…అల్లూరి సీతారామారాజు

మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురల వాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరా టానికి సిద్ధం చేయ్యసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు.

బ్రిటిష్‌ వారి నిరంకుశ పాలన నుండి భారతీయులకు దాస్యవిముక్తి కలిగించటానికి జీవన బలిదానం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు. సీతారామరాజు క్రీ.శ.1897లో జూలై 4వ తేదీన విశాఖ జిల్లాలోని పాండ్రంకి గ్రామంలో నారాయణమ్మ, వెంకట్రామరాజు దంపతులకు జన్మించాడు. 1909లో భీమవరంలో 6వ తరగతిని, కాకినాడ పి.ఆర్‌.కళాశాలలో 8వతరగతి, ఎ.వి.యస్‌. కళాశాలలో 9వ తరగతి పూర్తి చేశాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన సీతారామరాజు అనేక కష్టాలను చవిచూశాడు.పేదరికం అనుభవించాడు. పినతండ్రి పెంపకంలో కొంత వరకు విధ్యాభ్యాసం చేయగలిగాడు. వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిషం, వాస్తు, హఠయోగం వంటివి నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. అపారమైన దైవభక్తి కలిగిన సీతారామరాజు కొంతకాలం రామలింగేశ్వరస్వామి ఆలయంలో తపస్సు చేశాడు. సీతారామరాజు బాల్యం నుండి దేశభక్తి ఉత్తేజ పూరితమైన వాతావరణంపెరిగాడు. బిపిన్‌ చంద్రపాల్‌ ఆంధ్రాలో ఇచ్చిన ఉపన్యాసంతో ప్రభావితుడైన సీతారామరాజు, విధ్యార్థి దశ పూర్తికాగానే దేశమంతటా పర్యటించి దేశ స్వాతంత్త్రోధ్యమ స్థితి గతులను తెలుసుకున్నాడు. ఆపర్యటనలోనే విశాపట్టణంలోని మన్యం ప్రజలు పడుతున్న కష్టాలు, బాధలు తెలుసుకుని వారికి అండగా నిలవాలని అనుకున్నాడు.
మన్యం ప్రజలు పూర్తిగా అడువులపై ఆధారపడి, వాటినుండి లభించే తేనె, సీకాయ, కట్టెలు మొదలైనవి పట్టణ ప్రజలకు ఇచ్చి వాటి బదులుగా తమకు కావలసినవి తెచ్చుకునేవారు. బ్రిటిష్‌ వారి పాలనలో ప్రభుత్వం అడవుల చట్టాన్ని ప్రవేశపెట్టినది. దీని ప్రకారం కొండజాతివారు కట్టెలను కొట్టకూడదు, పోడు వ్యవసాయం చేయరాదు. అంతే కాకుండా అనేక ఆంక్షలు ప్రవేశపెట్టినది. వారి పరిపాలన కార ణంగా అనేక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారు రౌలత్‌ చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం నిందితులను ఎటువంటి విచారణ చేయకుండా నిర్భంధించవచ్చును, శిక్షింపవచ్చును. దేశ రాజకీయ నాయకులందరూ దీనిని ప్రతిఘటించారు. సహాయనిరాకరణోధ్యమాన్ని ప్రారంభించారు. విధ్యార్థులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు.
ఇటువంటి ఉద్యమ పరిస్థితులలో సీతారామరాజు మన్య నాయకులైన గంటందొర, మల్లు దొరలతో సంభాషణలు జరిపాడు. సీతారామరాజు అనేక యుద్ధవిధ్యలలోను,ఆయుర్వేదంలో నైపుణ్యం కలవాడగుటచే, మన్యం ప్రజలు వీరిని అమితంగా గౌరవించేవారు. వివిధ గ్రామాల ప్రజలను సమావేశ పరచి వారికి అన్ని విద్యలు నేర్పించాడు. విలు విద్యలో నిపుణులుగా తయారుచేసి, కొండదళం తయారుచేసి, దానికి తానే స్వయంగా నాయకత్వం వహించాడు. కొండ ప్రజలకు అనేక యుద్దపద్ధతులు, గెరిల్లా విద్య మొదలైనవి నేర్పాడు. కొండజాతివారిని చైతన్య వంతులుగా చేయటం గమనించిన బ్రిటిష్‌ వారు రాజు కొంత కాలం దూర ప్రాంతంలో అధికారుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ ప్రవాశ శిక్ష నచ్చని సీతారామరాజు అక్కడినుండి తప్పించుకుని తిరిగి మన్యం చేరుకున్నాడు. 1922 ఆగస్టు 22వ తేదీన చింతపల్లి పోలీసు స్థేషన్‌ పై మెరుపుదాడి చేసి తూటాలను, కత్తులను, మందుగుండు సామాన్లను స్వాధీనం చేసుకున్నాడు. తరువాత కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి స్టేషన్లను కొల్లగొట్టి,జైల్లో మగ్గుతున్న వీరయ్యదొరను విడి పించాడు. ఈకొండదళం ఆచూకీ తెలుప వలసి నదిగా బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రజ లను అనేక బాధలకు గురిచేసింది. చింతపల్లి, కృష్ణదేవి పేట, నర్సీపట్నం మధ్య ప్రభత్వం కల్పిం చిన టెలి ఫోన్‌ సౌకర్యాలను, స్తంభాలను ఈదళం ధ్వంసం చేసిం ది. పోలీసు లను ముప్పుతిప్పలు పెట్టే వారు, ఆహార ధాన్యాలను కొల్లగొట్టేవారు.విప్లవానికి వ్యతిరేకంగా పనిచేసే వారిని వీరు శిక్షించేవారు. ఈదళం వారిని పట్టి చ్చిన వారికి వెయ్యిరూ పాయల బహుమానం కూడా ప్రభుత్వం ప్రకటిం చింది. ఈ కొండదళం అనేక భీకర పోరులను సల్పింది. ఈ దళాన్ని ఏమీ చేయలేక ప్రభుత్వం సైన్యాన్ని తీసుకుని వచ్చింది. వారి సోధనలో మల్లుదొర పట్టుబడ్డాడు. సీతారామరాజు మన్యం ప్రజల గుండెలలో తిరుగులేని నాయకుడుగా నిలచిపో యాడని తెలుసుకుని బ్రిటిష్‌ వారు, సీతారామరాజు ఆచూకీకై మన్యం ప్రజలను అనేక చిత్రహింసలకు గురిచేసారు. వారి బాధలను చూడలేక సీతారామ రాజు, బ్రిటిష్‌ వారితో సంధి చేసుకునేందుకు స్వయంగా పాలకుల వద్దకు వెళ్ళాడు. తమ ఎదుట పడిన సీతారామరాజును బ్రిటిష్‌ వారు నిర్ధాక్ష్యింగా కాల్చిచంపారు. వారు తుపాకీ కాలుస్తున్నప్పటికీ బెదురు చెందక సీతారామరాజు, తన వంటి సీతా రామరాజులు వేలకొలది పుట్టుకొస్తారని, వారి బ్రిటిష్‌ వారిని భారతదేశం నుండి పారద్రోలుతారని నిర్భయంగా ప్రకటించాడు. వందేమాతరం అంటూ 1924 మే 7వ తేదీన సీతారామరాడు తుదిశ్వాస విడిచాడు. రామరాజు మరణంతో మన్యం ప్రజ లలో మరింత పట్టుదల పెరిగి, ఉద్యమాన్ని ఉధృతం చేశారు. బ్రిటిష్‌వారు నిరంకుశంగా కొండ దళం నాయకులందరినీ పట్టి చెరసాలలో వేశారు. సీతారామరాజు పూరించిన విప్లవశంఖం దేశ మంతటా సంచలనం కలిగించింది. కొండదళం నాయకుడుగా సీతారామ రాజు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయాడు.సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్య్రం సిద్దిస్తుందని నమ్మిన పోరాట యోధుడు. మహాత్మాగాంధి ఆంధ్రదేశంలో పర్య టించే సమయంలో అల్లూరిసీతారామరాజు అనేక విధాలుగా కొనియాడారు. సాయుధ పోరాటం పట్ల తనకు సదుద్ధేశ్యం లేదని, అయినప్పటికీ సీతా రామరాజు వంటి త్యాగశీలని, ధైర్యవంతుని కొని యాడకుండా ఉండలేమని చెప్పారు. తదనంతరం జరిగిన అనేక పోరాటాలకు ఆయన మార్గదర్శ కుడయ్యాడు.
విప్లవం రెండవదశ
డిసెంబర్‌ 6 న విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. జాన్‌ ఛార్సీ, మరికొందరు అధికారుల నాయకత్వంలో ప్రభుత్వ సైన్యానికి, రాజు సైన్యానికి పెదగడ్డపాలెం వరిచేలలో పోరా టం జరిగింది. ప్రభుత్వసేనలు శక్తివంతమైన శతఘ్నులను (ఫిరంగులను) ప్రయోగించాయి. ఆరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో 4మంది రాజు అనుచరులు చనిపోయారు. కొన్ని ఆయుధాలు పోలీ సుల వశమయ్యాయి. తప్పించుకొన్న విప్లవ వీరుల స్థావరంపై ప్రభుత్వదళాలు ఆరాత్రి మళ్ళీ దాడి చేశాయి. ఒకగంట పైగా సాగిన భీకరమైన పోరు లో మరొక 8మంది విప్లవకారులు మరణిం చారు.
ఆ తరువాత దాదాపు 4 నెలలపాటు దళం స్తబ్దుగా ఉండిపోయింది. రామరాజు చనిపో యాడనీ విప్లవం ఆగిపోయిందనీ పుకార్లు రేగాయి. అయినా అనుమానం తీరని ప్రభుత్వం రామ రాజును, ఇతర నాయకులను పట్టి ఇచ్చిన వారికి బహుమతులు ప్రకటించింది. స్పిన్‌, హ్యూమ్‌ వంటి అధికారులు జాగ్రత్తగా వ్యూహాలు పన్నసాగారు.
1923 ఏప్రిల్‌ 17నరాజు కొద్దిమంది అనుచరు లతో అన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. పోలీసు స్టేషనుకు వెళ్ళారు. పోలీసులు లొంగిపోయారు గానీ స్టేషనులో ఆయుధాలు మాత్రం లేవు. తరు వాత రాజు అనుచరులతో పాటు కొండపైకి వెళ్ళి సత్యనారాయణస్వామిని దర్శించుకున్నాడు. పత్రికా విలేఖరులతో కూడా మాట్లాడాడు. చెరుకూరి నరసింహమూర్తి అనే అతనికి, రాజుకు జరిగిన సంభాషణ 21-4-1923ఆంధ్ర పత్రికలో ప్రచు రింపబడిరది. 10గంటలకు బయలుదేరి శంఖ వరం వెళ్ళాడు. అక్కడి ప్రజలంతా రాజును భక్తిగా ఆదరించారు. రాజు వచ్చిన విషయం తెలిసిన కలెక్టరు అన్నవరం వచ్చి, రాజును ఆదరించి నందుకు ప్రజలపై (4,000 రూపాయలు జరి మానా) అదనపు పన్నును విధించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈవిషయం తెలిసి ‘‘నేను సాయం కాలం 6గంటలకు శంఖవరంలో ఉంటాను. నన్ను కలవవలసినది’’ అని కలెక్టరుకు రాజు ‘‘మిరప కాయ టపా’’ పంపాడు. కాని కలెక్టరు రాజును కలవడానికి సాహసించలేదు. (ఈ విశేషాలు 19-4-1923 హిందూ పత్రికలో ప్రచురింపబడ్డాయి.) క్రమంగా రాజు దళానికి, ప్రభుత్వ దళాలకు వైరం తీవ్రరూపం దాల్చింది. ఎలాగైనా రాజును పట్టు కోవాలని ప్రభుత్వం అనేక గూఢచారుల ద్వారా ప్రయత్నిస్తోంది. తమను అనుసరిస్తున్న గూఢచారు లను రాజు దళాలు హెచ్చరించడం లేదా శిక్షిం చడం జరుగసాగింది. ప్రజలలో ఇరువర్గాల మను షులూ ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్నారు. సి.యు.స్వినీ అనే అధికారి ఏజన్సీ భద్రతలకు బాధ్యుడైన అధికారిగా జూన్‌లో నియమితుడయ్యాడు. గాలింపు తీవ్రం చేశాడు. విప్లవకారులు 1923 జూన్‌ 10న ధారకొండ, కొండకంబేరు మీదుగా మల్కనగిరి వెళ్ళి పోలీసు స్టేషను, ట్రెజరీపై దాడి చేసారు కాని అక్కడ మందుగుండు సామగ్రి లేదు. ముహూ ర్తం పెట్టి జూన్‌ 13న ప్రభుత్వ సైన్యంతో తాను పోరాడగలనని, ప్రభుత్వాన్ని దించేవరకు పోరాటం సాగిస్తానని రాజు అక్కడి డిప్యూటీ తాసిల్దారు, పోలీసు ఇనస్పెక్టరులకు చెప్పాడు. ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసికొని ధారకొండ వెళ్ళాడు. జూన్‌ 17నరాజు ఒకచోట బస చేసినట్లు ఒక ఉపాధ్యా యడు స్వినీకి వార్త పంపాడు. సైనికులు రాలేదు గాని ఈ విషయం తెలిసిన మల్లుదొర, గంటందొర నాయకత్వంలో విప్లవవీరులు ఈతదుబ్బులు గ్రామానికి వెళ్ళి, తమ ఆచూకీ తెలిపినందుకు అక్కడివారిని బెదరించి నానాబీభత్సం చేశారు. జూలై 29న ప్రభుత్వ సైన్యాలకు ఆహారపదార్ధాలు తీసుకెళ్ళే బండ్లను విప్లవవీరులు కొల్లగొట్టారు. ఆగష్టు 4న పెదవలస పోలీసు శిబిరానికి వెళ్ళే పోలీసులను పట్టుకొన్నారు. ఆగష్టు 11న కొమ్మిక గ్రామంలోను, ఆగష్టు 20న దామనూరు గ్రామం లోను ఆహార పదార్ధాలు సేకరించారు. 2-9-1923న రామవరం ప్రాంతానికి కమాండర్‌గా ఉన్న అండర్‌వుడ్‌ సైనికులకు, మన్యం వీరులకు భీకరమైన పోరాటం జరిగింది. సెప్టెంబర్‌ లో రాజు ముఖ్య అనుచ రుడైన గాము మల్లుదొర పోలీసులకు దొరికి పోయాడు. ఇతను మహా సాహసి. కాని త్రాగుడు, వ్యభిచారం వ్యసనాలకు బానిస. ఒకమారు త్రాగి పోలీసులకు దొరికిపోగా రాజు దళం విడిపిం చింది. అతనిని దళం విడచి పొమ్మని రాజు ఆనతి చ్చాడు. అలా దళానికి దూరమైన మల్లుదొర తన ఉంపుడుగత్తె ఇంటిలో ఉండగా 17-9-1923న అర్ధరాత్రి దాడిచేసి అతనిని సైనికులు నిర్బంధిం చారు. తరువాత శిక్షించి అండమాన్‌ జైలుకు పంపారు(1952లో మల్లుదొర పార్లమెంటు సభ్యు నిగా విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎన్నిక య్యాడు.1969లో మరణించాడు). విప్లవాన్ని అణచివేసే క్రమంలో పోలీసులు ప్రజలను భయభ్రాంతులను చేసారు. గ్రామాలోకి ప్రవేశించి, చిత్రహింసలకు గురి చేసారు. మన్యాన్ని దిగ్బంధనం చేసారు. ప్రజలకు ఆహారపదార్థాలు అందకుండా చేసారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా చంపారు. సెప్టెంబరు 22న విప్లవకా రులు పాడేరు పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. 20వ తేదీన రాజు నాయ కత్వంలో ఎర్రజెర్లలో ఉన్నపుడు పోలీసులు అటకా యించి కాల్పులు జరిపారు. ఒకగ్రామ మునసబు ఆపోలీసు దళాలను తప్పుదారి పట్టించడంవల్ల వారు తప్పించుకోగ లిగారు. అక్టోబరు 26న గూడెం సైనిక స్థావరంపై దాడి చేశారు కాని స్టాండునుండి తుపాకులు తీసే విధానం తెలియక ఒక్క తుపాకీని కూడా చేజిక్కించు కోలేక పోయారు.17-4-1924న మన్యానికి కలెక్టరు (స్పెషల్‌కమిషనర్‌)గా రూథర్‌ఫర్డ్‌ నియ మితు డయ్యాడు. ఇతడు విప్లవాలను అణచడంలో నిపు ణుడని పేరుగలిగిన వాడు. విప్లవకారులలో అగ్గిరాజు (అసలు పేరు వేగిరాజు సత్యనారాయణ రాజు. అయితే శత్రువుల గుడారాలకు నిప్పుపెట్టి హడలుకొట్టే సాహసిగనుక ‘‘అగ్గిరాజు’’ అనే పేరు వచ్చింది.) అతిసాహసిగా పేరుపొందాడు. ప్రభు త్వాధికారులను, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టే వాడు. ఆహారధాన్యాలు కొల్ల గొట్టేవాడు. విప్లవ ద్రోహులను దారుణంగా శిక్షించేవాడు. అతనికి ప్రాణభయం లేదు.1924 మే 6వతారీఖున జరిగిన కాల్పులలో అగ్గిరాజుకాలికి గాయమైంది. శత్రు వులకు చిక్కకుండా ఒక బావిలో దూకి మరణిం చాలని ప్రాకుతూ వెళుతుండగా సైనికులు వచ్చి పట్టుకొన్నారు. అతనిని శిక్షించి అండమానుకు పం పారు. అక్కడే మరణించాడు. ఆరాత్రి రాజు మంపగ్రామానికి వచ్చాడు. అంతకుముందు రూథర్‌ ఫర్డ్‌ నిర్వహించిన కృష్ణదేవు పేట సభకు మంప మునసబు కూడా హాజర య్యాడు. వారం రోజు లలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని కృష్ణదేవు పేట సభలో రూథర్‌ ఫర్డ్‌ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. అతడేమి చెప్పాడో తెలుసుకుందామని రాజు ఆ మునసబు ఇంటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివ రించి, వారికి ఈ బాధలనుండి విముక్తి ప్రసాదించ డానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. తనను ప్రభుత్వానికి పట్టిఇచ్చినవారికి పదివేల రూపాయల బహుమతి లభిస్తుందని, కనుక తనను ప్రభుత్వానికి పట్టిఇమ్మని కోరాడు. కాని తాను అటువంటి నీచమైన పని చేయజాలనని మునసబు తిరస్కరించాడు.తరువాత,1924 మే 7న కొయ్యూ రు గ్రామ సమీపంలో ఒకఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసు లకు కబురు పంపాడట.ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధిం చారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్‌ గుడాల్‌ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజు ను (ఒక చెట్టుకు కట్టివేసి) ఏవిచారణ లేకుండా గుడాల్‌ కాల్చి చంపాడు.27ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారా మరాజు అమరవీరుడయ్యాడు.- డా,దేవులపల్లి పద్మజ

1 2 3 4 5 6