దేశ చరిత్రలోనే తొలిసారిగా..

చరిత్రలోనే తొలిసారి పేదలకు 31.19 లక్షల ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ అందజేస్తున్నాం.58 నెలల్లో ప్రతి అడుగు పేదల అభ్యున్నతి కోసమే..ఎన్నికలకు మనం సిద్ధం అంటే..కుప్పంలో ప్రజలు బాబుకి బైబై అంటున్నారు.మన ప్రభుత్వంలో పెత్తందారు లకు కాదు పేదలకే పదవులు ఒంగోలు మున్సి పల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 20,840 ఇళ్ల స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ పంపిణీ ప్రారంభ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 20,840 మంది పేద అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్‌ చేసిన ఇంటి స్థలం భూ బదిలీ పత్రం, కట్టుకోడానికి ఇళ్లు కూడా మంజూరు చేసి, ఆ పత్రాలు కూడా పంపిణీని సీఎం జగన్‌ ప్రారంభించారు. దీంతో పాటు ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కింద రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేసిన 31.19 లక్షల ఇళ్ల స్థలాలను ఆ పేద అక్కచెల్లెమ్మల పేరు మీదుగానే సంపూర్ణ హక్కులు కల్పిస్తూ, రిజిస్ట్రేషన్‌ కూడా చేసి కన్వేయన్స్‌ డీడ్స్‌ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ఒంగోలు వేదికగా లాంఛనంగా ప్రారంభించారు. అర్హులైన 20,840 మంది పేద అక్కచెల్లె మ్మలకు ఇంటి స్థలాల కోసం ప్రభుత్వం మల్లేశ్వరపురం,అగ్రహారం,యరజర్ల, వెంగ ముక్కల పాలెం గ్రామాల్లో 536.11ఎకరా లను భూసేకరణ ద్వారా సమీకరించి రిజిస్టర్‌ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్‌ డీడ్స్‌ అందజేసి నట్లు సీఎం జగన్‌ వివరించారు. భూమి కొను గోలు,జగనన్న టౌన్‌ షిప్‌ల అభివృద్ధికి రూ.210 కోట్లు..లే అవుట్ల అభివృద్ధికి రూ. 21.33 కోట్లు కేటాయించినట్లు వివరించారు.
మన ప్రభుత్వంలో పెత్తందారులకు కాదు పేదలకే పదవులు
గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్‌ పదవులు ఉండేవని, మన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పదవులు ఇచ్చామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. పెత్తందారులతో జరిగే ఈ యద్ధంలో ప్రజలు గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించాలని విజ్ణప్తి చేశారు.పేదల ఆత్మ గౌరవం గురించి గతంలో ఏప్రభుత్వం ఆలో చన చేయలేదన్నారు. అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు తెచ్చామని, మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగిందని సీఎం జగన్‌ పేర్కొన్నారు.ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్‌.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని సీఎం జగన్‌ ప్రారంభించారు. అంతకు ముందు ఒంగోలు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ మన ప్రభుత్వంలో పేద మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఆర్థిక అంత రాలు తొలగించామన్నారు. రిజిస్ట్రేషన్‌ పట్టా లు ఇవ్వడం వల్ల అక్క చెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కులు లభించాయని, భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్‌ చేసే అవకాశం ఎవరికీ ఉండక పోవడంతో పాటు రిజిస్ట్రేషన్‌ పట్టాలు ఉండడం వల్ల కబ్జాలకు చెక్‌ పడుతుం దన్నారు. ఈ మేరకు ఇళ్ల పట్టాలకు సంబంధించి గ్రామ సచివాలయాల నుంచి సర్టిఫైడ్‌ కాపీలు అందిస్తున్నట్లు సీఎం జగన్‌ వివరించారు.పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామని, ఇంటింటికీ తలుపు వద్దే ప్రభుత్వ సేవలు అందిస్తున్నా మన్నారు.
నాడు నేడుతో విద్య, వైద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
నాడు నేడుతో విద్య,వైద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు సీఎం జగన్‌ తెలిపారు. పేదలకు కార్పొరేట్‌ వైద్యం అంది స్తుండటంతో పాటు చికిత్స కోసం వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తూ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచి నట్లు వివరించారు.ఎక్కువ వ్యాధులను ఆరోగ్య శ్రీ కింద కవర్‌ అయ్యేలా ప్రొసీజర్స్‌ను 3,300 కు పెంచామన్నారు. పేదల ఇంటి వద్దకే ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలు చేస్తూ రోగులు కోలుకునేంత వరకు ప్రభుత్వమే ఆసరా అందిస్తుందన్నారు. పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశ్యంతో ఆంగ్ల విద్యను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇంగ్లీష్‌, తెలుగు మీడియాల్లో పుస్తకాలు అందిస్తూనే ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్‌ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ బడుల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.
ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు
ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ చంద్రబాబు ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా పుట్టాలను కుంటారా అని అన్యాయమైన స్టేట్‌ మెంట్‌ ఇచ్చి, ఎస్సీలంతా గుణపాఠం చెబుతారనే భయం లేకుండా, బాబు రాజకీయంగా బరితెగించి ఉండగలుగుతున్నాడంటే ఇంతక న్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా?అని సీఎం జగన్‌ ప్రశ్నించారు.బీసీల తోకలు కత్తిరిస్తా, ఖబడ్దార్‌ అని కూడా బాబు ఈ రాష్ట్ర రాజకీయాల్లో బీసీలంతా తనకు గుణపాఠం చెబుతారన్న విషయం చంద్రబాబు అర్ధం కావడం లేదా అన్నారు. పేద వర్గాలకు ఇళ్ల నిర్మాణం చేయకపోయినా, రైతులకు బేషరతుగా పూర్తిగా రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఈ మాయలోడు ఏ జంకూ గొంకూ లేకుండా ఇప్పటికీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం కంటే దారుణం మరొకటి ఉండదన్నారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మొదటి సంతకంతోనే రుణాలుమాఫీ చేస్తానని ఒక్క రూపాయి కూడా మాఫీ చేయని చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో 650 వాగ్దానాలిచ్చి మేనిఫెస్టోగా చూపించి ప్రతి సామాజికవర్గానికి అది చేస్తా ఇది చేస్తానని 10శాతం కూడా అమలు చేయకపోయినా, ప్రజలు తనను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడం లేదని తెలిసినా, నిస్సిగ్గుగా మళ్లీ ఎన్నికలొచ్చేసరికి కొత్త మేనిఫెస్టో తెచ్చి ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు కొనిస్తానంటూ చంద్రబాబు ప్రజ లను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
మనం సిద్ధం అంటే.. కుప్పంలో ప్రజలు బాబుకి బైబై అంటున్నారు.
చంద్రబాబు తన 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామ గ్రామానికీ ఈ మంచి జరిగిందని సమాధానం చెప్పలేరని సీఎం జగన్‌ విమర్శించారు. పేదలకు జగన్‌ మాదిరిగా బటన్‌ నొక్కాను 2.55 లక్షల కోట్లు పేదల ఖాతాల్లోకి జమ చేశాను అని ఈ పెద్దమనిషి నోట్లో నుంచి మాటలు రావన్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితుల్లతో మనం సిద్ధం అంటుంటే.. మరోవంక బాబు భార్య మా అయన సిద్ధంగా లేడు అంటోందని చామత్కరించారు. ఏకంగా కుప్పంలో బైబై బాబు అంటూ ఆయన అర్ధాంగి నోటే పంచ్‌ డైలాగులు వస్తున్నా యన్నారు. ఇలాంటి బాబును ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదని కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థిం చలేదని సీఎం జగన్‌ విమర్శించారు. ఏనాడూ ఏపీలో లేని వారు, ఏపీకి రాని వారు,సొంత ఊరు ఏదంటే తెలియని వారు,వారికి మన రాష్ట్రంలో ఓటే లేని వారు,ఇక్కడ దోచుకో వడం,దోచుకున్నది పంచుకోవడానికి అల వాటైన వారే అలాంటి నాన్‌ రెసిడెంట్‌ ఆంధ్రాస్‌ మాత్రమే చంద్రబాబును సమర్థి స్తారని అన్నారు. మీ బిడ్డగా అందరితో కోరేది ఒక్కటే. మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడి స్టార్‌ క్యాంపెయినర్లుగా ఉండాలన్నారు.పేద అక్కచెల్లమ్మల సొంతింటి కలను సాకారం చేస్తూ..రికార్డు స్థాయిలో 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు అందించడమే గాక దేశంలోనే తొలిసారిగా లబ్ధిదారులకు ఆ స్థలా లపై సర్వహక్కులు కల్పిస్తూ వారి పేరు మీదనే ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి కన్వేయన్స్‌ డీడ్స్‌ అందించిన సీఎం జగన్‌ ప్రభుత్వం….
రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ ద్వారా కలిగే ప్రయోజనాలు ఇవీ.
పదేళ్ల తర్వాత ఇంటి స్థలంపై అన్ని హక్కులు ఉండేలా లబ్ధిదారుల పేరిట గ్రామ/వార్డు సచివాలయాల్లోనే, ఇప్పుడే ఉచితంగా స్థలాల రిజిస్ట్రేషన్‌ చేసి కన్వేయన్స్‌ డీడ్స్‌ కూడా అందజేత చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టారు. ఇప్పటికే దాదాపు 15 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి.. శరవేగంగా మిగిలిన రిజిస్ట్రేషన్ల కార్యక్రమం కొనసాగిస్తారు.గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉన్న జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ (జెఎస్‌ఆర్వో) డేటాబేస్లో వివరాలన్నీ పదిలం..ఎప్పుడైనా ఈ జెఎస్‌ఆర్వోలలో సర్టిఫైడ్‌ కాపీ పొందే అవకాశం..ఫోర్జరీ గానీ,ట్యాంపర్‌ చేయడానికి గానీ ఆస్కారమే ఉండదు.పదేళ్ల తర్వాత ఆటోమేటిక్‌గా క్రయ, విక్రయ,దాన,వారసత్వ హక్కులతో సహా పూర్తి హక్కులు..అత్యవసర సమయాల్లో ఇంటిని అమ్ముకునే వీలు..అమ్ము కునే సమయంలో ఎన్వోసీ కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.ఎలాంటి లింకు డాక్యుమెంట్ల అవసరం లేకుండానే నేరుగా రిజిస్ట్రేషన్‌. పేదలకు పక్కా గృహాల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది.
అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 71,811ఎకరాల్లో 31.19లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇళ్ల పట్టాల పంపిణీ.
ఒక్కోప్లాట్‌ విలువ ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా పలుకు తున్న నేపథ్యంలో ఆ కనీస విలువ రూ.2.5 లక్షల చొప్పున లెక్కించినా ఇళ్ల పట్టాల విలువ రూ.76,000 కోట్లు. దీంతోపాటు సుమారు రూ.60,000 కోట్ల వ్యయంతో 22 లక్షల ఇళ్ల నిర్మాణం. ఇందులో ఇప్పటికే 8.9లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందిం చింది. జగనన్న ప్రభుత్వం.రాష్ట్ర వ్యాప్తంగా 17,005 జగనన్న లేఅవుట్లలో రూ.32,909 కోట్ల వ్యయంతో నీటి సరఫరా,విద్యుత్‌, డ్రైనేజీ, సీవరేజ్‌, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పన. ఇంటి స్థలం ఉచితంగా ఇవ్వడమే కాకుండా యూనిట్‌ కు రూ.1.80 లక్షల చొప్పున ఇంటి నిర్మాణానికి అందిస్తూనే.. మరోవైపు పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం.. దీంతో పాటు ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్‌, స్టీల్‌, మెటల్‌ ఫ్రేమ్స్‌, ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడంతో ఇంకో రూ.40 వేల మేర లబ్ధి..మొత్తంగా ఒక్కో లబ్ధిదారునికి రూ. 2.70 లక్షల మేర లబ్ధి చేకూరుస్తున్న జగనన్న ప్రభుత్వం.. మౌలిక వసతుల కల్పనతో ప్రతి ఇంటికి సగటున మరో రూ. 1 లక్ష లబ్ధి. తద్వారా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు ప్రాంతాన్ని బట్టి ఆ ఇంటి విలువ రూపేణా కనీసం రూ. 6 లక్షల నుండి రూ.20లక్షల వరకు లబ్ధి.. రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మల చేతుల్లో కనీసం రూ.2లక్షల కోట్ల నుండి రూ.3 లక్షల కోట్ల సంపద. అడ్డంకులను అధిగమిస్తూ రాష్ట్రంలో శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్య సాధన దశగా గత ఐదేళ్ల పాలనలో ప్రజలు సుభిక్షాన్ని కోరుకుంది. -జిఎన్‌వి సతీష్‌

దివ్యాంగుల జీవితాల్లో వెలుగులే లక్ష్యం

దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవిరళ కృషి చేస్తున్నాయని కేంద్ర మత్స్య,పశుసంవర్దక,డెయిరీశాఖ మంత్రి పర్షోత్తం రూపాల పేర్కొన్నారు. ఎ.డి.ఐ.పి.(అసిస్టెన్స్‌ టు డిజెబుల్డు పర్శన్స్‌ ఫర్‌ పర్చేజ్‌ /ఫిట్టిం గ్‌ ఆఫ్‌ ఎయిడ్స్‌/ అప్లియెన్స్‌) పథకం కింద ఫిబ్రవరి 22న విశాఖపట్టణంలోని కైలాసపురం డీఎల్బీ గ్రౌండ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక అధికారిత శిబిర్‌ పేరుతో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నర్శింహారావు,విభిన్న ప్రతిభా వంతులు,హిజ్రాలు,వయోవృద్ధుల సంక్షేమశాఖ ఎండీ కుమార్‌ రాజా,జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌,ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లాలోని దివ్యాంగులకు అందజేశారు. రూ.2.25కోట్లతో2,925 పరికరాలను అలింకో సంస్థ ఆధ్వ ర్యంలో తయారు చేయగా1,589 మంది దివ్యాంగులు అధికా రుల చేతులమీదుగా జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు. 1,589దివ్యాంగులకు ఒకేచోట ఇంతమొత్తంలో ఉపకరణాలు పంపిణీ చేయటం ఒక శుభ పరిణామమని,దీనికి సహకరిం చిన కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలకు,ప్రజాప్రతినిధులకు,అధికారు లకు మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా..అని కేంద్ర మంత్రి పుర్షోత్తం రూపాల పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌, సున్నిత మనస్తత్వం కారణంగానే దివ్యాంగులకు ఇంత స్థాయిలో మంచి జరుగుతుందని అన్నారు. అడిగితేనే గానీ కొంతమంది నేతలు స్పందిం చరు..కానీ నరేంద్ర మోదీ అడగకుం డానే పేదలకు అన్నీ ఇస్తున్నా (దేశ ప్రధానిగా) ఉండటం మనందరి అదృ ష్టం అని పేర్కొన్నారు.పేదల కోసం చేసే మంచి పని ఏదైనా విస్తృత ప్రచా రం కల్పించాలని ప్రసార మాధ్యమా లనుద్దేశించి అన్నారు. దివ్యాంగులపట్ల గౌరవ మర్యాదలతో మెలగాలి ః ` జీవీఎల్‌ అంగవైకల్యం అనేది కోరు కుంటే వచ్చింది కాదని..దురదృష్టంవల్ల వచ్చిందని..దివ్యాంగుల పట్ల మన మంతా గౌరవ మర్యాదలతో నడుచు కోవాలని రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నర్శింహారావు సూచించారు.దివ్యాం గులకు సంబంధించిన కార్యక్రమం విశాఖలో నిర్వహిస్తున్నామని చెప్పగానే కేంద్ర ప్రభుత్వం,ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందిం చారని,సహకారం అందించారని గుర్తు చేశారు.వారి ఆమోదంతో రాష్ట్ర,జిల్లా యంత్రాంగం సహాయంతో దివ్యాంగుల సమస్యలు,అవసరాలు తెలుసుకు న్నామని చెప్పారు.ఆ మేరకు1,589 మందికి రూ.2.25 కోట్లతో 2,925 ఉపకరణాలను తయారు చేయించామని జీవీఎల్‌ వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో వికలాంగులు అనే పదం పూర్తిగా తొలగిపోయిందని, దాని స్థానంలో దివ్యాంగులు అనే పదం వచ్చిందని పేర్కొన్నారు. రెండు దఫాల భాజపా పాలనలో సుమారు 45లక్షల మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందించామని,వచ్చే ఐదేళ్లలో మరొక 50లక్షల మందికి పరికరాలు అంద జేస్తామని జీవీఎల్‌ నర్శింహారావు చెప్పా రు. రైల్వే స్టేషన్లు,ఎయిర్‌ పోర్టలలో చేపట్టే ప్రతి పనినీ దివ్యాంగులను దృష్టిలో ఉంచుకునే చేపడుతున్నా మన్నారు.ఉపకరణాల తయారీలో అలింకో (ఆర్టిఫిసియల్‌ లింబ్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) సహకారం మరువలేనిదని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలోరూ.25కోట్లతో 4వేలమందికి చేయూత ః ఎండీ కుమార్‌ రాజా
దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక మంచి నిర్ణయాలు తీసుకుందని దానిలో భాగంగానే రూ.25కోట్లతో నాలుగు వేల మందికి వివిధ ఉపకర ణాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని విభిన్నప్రతిభావం తులు,హిజ్రాలు,వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఎండీ కుమార్‌ రాజా వెల్లడిర చారు.దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్‌ ట్యాప్లు,మోటరైజ్డ్‌ త్రిచక్ర వాహ నాలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1,750మంది దివ్యాంగ విద్యార్థు లకు త్రిచక్ర వాహ నాలు అందించా మని గుర్తు చేశారు. గుంటూరులో ఉన్న బ్రెయిలీ ప్రింటింగ్‌ కేంద్రం సాయంతో అంధ విద్యార్థుల సహాయార్థం బ్రెయిలీ పాఠ్య పుస్తకాలు అందిస్తున్నామని వివ రించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సం యుక్త ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తూ దివ్యాంగు లకు పూర్తి స్థాయిలో తోడ్పాటు అందిస్తు న్నామని ఎండీ పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగులకు అవసరమైన2,925 పరికరాలను రూ.2.25 కోట్లు వెచ్చించి అలింకో (ఆర్టిఫిసియల్‌ లింబ్స్‌ మ్యాను ఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) సంస్థ సహకారంతో తయారు చేయిం చామని జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ పేర్కొన్నారు.ఈ సంస్థ సహకా రంతో ఇప్పటికే విశాఖపట్టణం, విజయ నగరం జిల్లాల్లో 13చోట్ల ప్రత్యేక శిబిరా లు నిర్వహించామని, వారి అవసరా లను గుర్తించి చర్యలు తీసుకు న్నామని చెప్పా రు.ఈ వేదిక ద్వారా1,589 మంది దివ్యాంగులకు ఉపకరణాలను అంద జేస్తున్నామని జేసీ తెలిపారు.2,925 పరికరా ల్లో 282 మోటరైజ్డ్‌ సైకిళ్లు,173ట్రైసైకిళ్లు, 219 ద్విచక్ర వాహనాలు ఉన్నాయని పేర్కొ న్నారు.క్రచ్చెస్‌ 657, వినికిడి పరికరాలు 868, వాకింగ్‌ స్టిక్స్‌ 146,బ్రెయిలీకిట్స్‌45, స్మార్ట్‌ ఫోన్లు 15,సాధారణ సెల్ఫోన్లు 10,సీపీ ఛైర్స్‌ 40,లింబ్స్‌ ఇతర పరికరాలు 470 వరకు ఉన్నాయని వివరించారు. కార్యక్రమం లో అలింకో సంస్థ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ సింఫ్‌ు, విభిన్న ప్రతిభావంతులశాఖ విశాఖ పట్టణం జిల్లా ఏడీ మాధవి,విజయ నగరం జిల్లా ఏడీ జగదీష్‌, ఇతర అధికా రులు, పలువురు ప్రజాప్రతినిధులు,అధిక సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు. -జి.ఎన్‌.వి.సతీష్‌

శుభ్రత..పరిశుభ్రత`ఆరోగ్యం

అందానికి రెండు కళ్ళు. దుమ్ము, ధూళి నిండిన ప్రపంచంలో పరిశుభ్రత ఒక తాజా పరిమళం. ఇది వ్యాధుల నుంచి దూరంగా వుంచుతుంది. జీవితాలను సంతోషమయం చేస్తుంది. శుభ్రత అంటే చేతులు కడుక్కోవడమో, స్నానం చేయడమొక్కటే కాదు మన పరిసరాలను కూడా శుభ్రంగా వుంచుకోవడం. ఇది ఆరోగ్యం నిండిన ప్రపంచానికి ఒక ఆనవాలు. ‘శుభ్రత విలాసం కాదు అవసరం. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితానికి పరిశుభ్రత తొలి మెట్టు’ అంటాడో రచయిత. ఎంత మంచి ఆహారమైనా పరిశుభ్రంగా లేకపోతే అనారోగ్యానికి దారితీస్తుంది. అతిసార,శ్వాసకోస వంటి వ్యాధులతో ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది పిల్లలు చనిపోతు న్నారు. దీనికి కారణం పరిసరాలు శుభ్రంగా లేకపోవ డమేనని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెబు తోంది. ఒక్క చేతులు శుభ్రపరుచుకుంటేనే దాదాపు 50 శాతం పైగా అతిసార సంబంధిత వ్యాధులు,20నుంచి 30శాతం శ్వాస సంబంధిత వ్యాధు లను నివారించవొచ్చునని వైద్య నిపుణులు చెబు తున్నారు.‘నీశరీరం ఒక దేవాలయం. దానిని శుభ్రంగా వుంచుకో’ అంటారు బికెఎస్‌ అయ్యం గార్‌. స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ వంటి ప్రచారాలు ఎన్ని వచ్చినాపల్లెల నుంచి మహానగరాల వరకూ అపరిమితమైన చెత్త, ధూళి పేరుకుపోతోంది. ఇది పర్యావరణానికి హానికరంగా మారింది.
నేడు మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో పేరుకుపోతున్న చెత్త, వ్యర్థ పదార్థాలను ప్రధానంగా చెప్పుకోవాలి. వీధులు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం ఉండడం సర్వసాధారణం. దీనివల్ల పర్యావరణానికి, ప్రజా రోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది. వీధుల్లో చెత్త వేయడమే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం, మల మూత్ర విసర్జన చేయడం వంటివి కూడా పరిసరాల అశుభ్రతకు కారణ మౌతున్నాయి.పరిశుభ్రత కేవలం భౌతిక పరిస రాలకే పరిమితం కాదు. ఇందులో వ్యక్తిగత పరి శుభ్రత కూడా ఉంటుంది. వ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి,ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి పరిశుభ్రతను పాటించడం అవసరం. ‘పరిశుభ్రత అనేది పరిపూర్ణ ప్రమా ణాల యొక్క ముఖ్య లక్షణం. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణం’ అంటారు గాంధీజీ. అయితే, కంటికి కనిపించని రెండో కోణం కూడా వుంది. అదే, పారిశుధ్య కార్మికుల నిరంతర శ్రమ. తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా వీధులను, ఇళ్లను శుభ్రం చేసే పనిలో వారి జీవితాలను మైనంలా కరిగిస్తుంటారు. మాన్యువల్‌ స్కావెం జర్లది మరీ దయనీయమైన గాథ.గత ఐదేళ్ల కాలంలో సెప్టిక్‌ ట్యాంక్‌ల్లో పడి, మురుగు కాల్వల్లో పడి 399మంది మాన్యువల్‌ స్కావెంజర్లు చనిపోయారని ప్రభుత్వ అధికారిక సమాచారం. ఊళ్లు, నగరాల పరిశుభ్రత కోసం వీళ్ల జీవితా లను ఫణంగా పెడుతున్నారు. అయినా లభించేది అరకొర వేతనాలే. ఇటీవల పారిశుధ్య కార్మికులు వేతనాలు పెంచాలని సమ్మె చేయాల్సి వచ్చింది. చివరకు రాష్ట్రప్రభుత్వం దిగొచ్చినా ఏ మేరకు వారి అవసరాలు తీర్చుతా రనేది చూడాల్సిందే.
పరిశుభ్రత ఆవశ్యకత, ప్రయోజనాల గురించి తెలిసినప్పటికీ, మన దేశం ఈ సమస్యతో పోరాడుతూనే ఉంది.‘స్వచ్ఛభారత్‌’ పథకం ప్రక టనలకే పరిమితమైంది. వీధుల్లో చెత్తాచెదారం, పొంగిపొర్లుతున్న చెత్త కుండీలు, అపరిశుభ్రంగా ఉన్న పబ్లిక్‌ టాయిలెట్లు నిత్యం కనిపించే దృశ్యం. చిన్నపాటి వర్షం వచ్చినా%ౌౌ%రోడ్లన్నీ అశుద్ధంతో నిండుకుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి యేటా జనవరి30న ‘జాతీయ పరిశుభ్రత దినో త్సవం’ నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ పరిస రాలను పరిశుభ్రంగా, ఆరోగ్యంగా వుంచుకో వడం ప్రాథమిక కర్తవ్యంగా గుర్తు చేసేందుకు ఈ వేడుకను నిర్వహిస్తారు. ఇంటి నుంచి పని ప్రదేశం వరకు పరిసరాలను శుభ్రంగా వుంచడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తారు. ‘ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముంగిలి శుభ్రంగా వుంచుకుంటేదేశమంతా శుభ్రంగా వుంటుంది’ అంటారు మదర్‌ థెరిస్సా. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేయా ల్సిన సమయం ఇది.అందరం చేయి చేయి కలు పుదాం మన పరిసరాలను పరిశుభ్రంగా, ఆరో గ్యకరంగా మార్చుకోడానికి కృషి చేద్దాం. -డా.దేవులపల్లి పద్మజ

సుస్తిర వ్యవసాయంతోనే ఆహార భద్రత

ఆహారం లేనిదే జీవం లేదు. కానీ తగినంత ఆహారం లేకుండా ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. నాగరిక సమాజంలో మానవులు తమకు అవసరమైన ఆహారాన్ని సంపాదించుకునే వీలుకూడా లేని ప్రదేశాలు ఇంకా ఉండడం మన అభివృద్ధికి అవమానం. అసలు అభివృద్ధి అన్న విషయమే అనుమానం. ప్రకృతితో సహజీవనం చేస్తున్నప్పుడు సమస్యలు తరచూ అనూహ్యంగా వస్తుంటాయి. అటువంటి సందర్భాలలో కూడా ఆహారం లభించడం ముఖ్యం. ఆ దిశలో ‘పాలకుల’ ధ్యాస ఉండాలి. ప్రణాళికలు తయారవ్వాలి. ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. –పతకమూరు దామోదర్‌ ప్రసాద్‌
సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా రసాయన ఎరువులు వాడకం విచ్చల విడిగా పెరిగిపోయింది. అటువంటి అశాస్త్రీయ, అసహజ పద్ధతులు సహజంగానే నేలల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. భూసారం తగ్గ డంతో లక్షలాది హెక్టార్ల విస్తీర్ణంలో పంట భూ ములు బీడు బారుతున్నాయి. దీంతో రానురాను ఆహార ఉత్పత్తులు మరింత తగ్గిపోయి మనిషి మనుగడే కష్టతరమయ్యే అవకాశం ఉంది. అం దుకే భూఆరోగ్యాన్ని మన కర్తవ్యంగా స్వీకరంచా లనేది నిపుణులు మాట.అనంతమైన జీవ వైవిధ్యానికి ఆరోగ్యకరమైన నేలలే పట్టుగొమ్మలు. ఒక ప్రాంతంలో ఉండే జీవ సమూహంలోని వ్యత్యా సాలను జీవ వైవిధ్యంగా పరిగణిస్తారు. నేలలో కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు ఉంటాయి. వానపా ములు, కీటకాలు, ఎలికపాములు వంటి అనేక జీవరాశులతో ఇది నిర్ధారణ అవుతుంది. ఒక అంచనా ప్రకారం చదరపు మీటర్‌ వైశాల్యం లోని మంచి నేలలో వెయ్యి రకాల సూక్ష్మజీవుల జాతులు ఉండి జీవ వైవిధ్యానికి కారణమవు తున్నాయి.
ఆహారభద్రతకు నీటి సంరక్షణ కీలకం అనేక రాష్ట్రాలు ఇప్పటికే సూక్ష్మ సాగు పద్ధతులను అమలు చేస్తున్నాయి.భారత్‌కు సుస్థిర ఆహార భద్రత సమకూరాలంటే వివిధ స్థాయిలలో నీటిని పొదుపుగా వాడుకోవ డమేగాక, వల్లెస్థాయి నుండి నీటిసంరక్షణను పెద్ద ఎత్తున చేపట్టడం ఎంతో ముఖ్యం. మనకు లభ్యమయ్యే నీటిలో 2030నాటికి 87శాతం ఒక్క సేద్యపు రంగానికే కావలసి ఉంటుందని అంచనా, దేశానికి ఆహార భద్రత చే కూరాలంటే వ్యవసాయరంగంలో పంట అవస రాలకు అవసరమైనంత తప్ప ఎక్కువ నీటి వాడ కాన్ని నియంత్రించడానికి చర్యలు చేపట్టడం అవసరమని శాస్త్రజ్ఞుల అభిప్రా యం. వ్యవసాయ క్షేత్రాలలో నీటి వినియోగాన్ని, వృథాను నియం త్రించడానికి తాగునీటి యాజమాన్య పద్ధతులను పాటించక పోతే వచ్చే ఆరేళ్లలో భారత్కు 48 ట్రిలియన్‌ రూపాయల నష్టం వాటిల్లగలదని అంచనా. దేశంలో ఆహారం, ఇంధన అవసరాలు తీర్చడానికి నీరు ఎంతో అవసరం ఇటీవలి సంవత్సరాలలో అదనులో తగినంత వర్షం కురవకపోవడంతో రిజర్వాయర్లలో తగినంత నీరు చేరడం లేదు.గత ఏడాది కూడా వానల్లేక రిజర్వా యర్లలో అతి తక్కువ నీరు చేరడంతో జలవిద్యుత్‌ ఉత్పాదన కుంటు పడిరది. ఫలితంగా లక్షలాది ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీటి సరఫరా సాధ్యం కాలేదు.చాలా జలాశయాలు అడు గంటాయి. వివిధప్రాంతాల్లో తాగునీటికి కొరత ఏర్పడుతున్నది. దేశంలో ఆహారభద్రత, జీవనోపాధుల మెరుగుదలకు ఒక ఉద్యమంలా నీటి సంరక్షణ చర్యలను చేపట్టి వృథాను అరికట్ట వలసిన అవసరం ఎంతో ఉంది. 2020నాటికి మన దేశీయ అవసరాలకు 54వేల బిలియన్‌ లీటర్ల నీరు అవసరమైంది. కాగా వచ్చే ఆరేళ్లలో సేద్యం, దేశీయ అవసరాలకు 76వేల బిలియన్‌ లీటర్ల నీరు అవసరం కావచ్చని జాతీయ ఇంధనం,నీరు, పర్యావరణ మండలి అంచనావే సింది. ఒక్క సేద్యపు రంగానికే లభ్యమయ్యే నీటిలో 87 శాతం నీరు అవసరమవుతుంది. అందువల్ల లభ్యమయ్యే పరిమిత నీటి వనరులను వివిధ అవసరాలకు జాగ్రత్తగా,పొదుపుగా వాడితేనే కొంతవరకు సర్దుబాటు చేయవచ్చు. లేదంటే వివిధ రంగాల్లో నీటి కొరతను ఎదుర్కోక తప్పదని నిపు ణులు హెచ్చరిస్తున్నారు. దేశీయ జనాభా నీటి అవసరాలకు, పరిశ్రమలకు, సేద్యానికి ముఖ్యంగా వేసవి కాలంలో మంచి నీటి కొరత ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పటికీ ఓ శతాబ్ద కాలంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి నదీజలాల వివాదం రగులుతున్న విష యం విదితమే. కృష్ణా, గోదావరి నదీ జలాలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తెలెత్తడం తెలిసిందే. వాతావరణంలో సంభవి స్తున్న పెనుమార్పులు, ఒడిదుడుకుల వల్ల తగినంత వానలు కురవని సంవత్సరాలలో రిజర్వా యర్ల లో నీరు అడుగంటి జలవిద్యుత్‌ ఉత్పా దనకు, పారిశ్రామిక అవసరాలకు, మంచినీటికి కొరత ఏర్పడు తున్నది.భూమి, నీరు, ఇంధనం, ఆహార రంగాలు కీలకమైనవి. సహ సంబంధం కలిగి నవి.అందువల్ల ఇతర రంగాల అవసరాలు గుర్తించకుండా,సమన్వయం లేకుండా ఏ ఒక్క రంగంలో చర్యలు చేపట్టినా అవిప్రతికూల పరిణా మాలకు దారితీయవచ్చు. దేశంలో ఆహార రంగం లో స్వయం సమృద్ధి సాధనకు అమలుచేసిన హరిత విప్లవం వల్ల కూడా కొన్ని విపరీత పరిణా మాలు సంభవించాయి.ఆహారోత్పత్తి పెంచడానికి పంజా బ్‌, హర్యానా రాష్ట్రాలలో బోరుబావుల నుండి నీరు తోడే మోటార్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్‌ సరఫరావల్ల,పంటల అవసరాలకు మించి భూ గర్భ జలాలను తోడడంవల్ల ఉత్పన్నమైన దుష్ఫ లితాలు ఇప్పటికీ వెన్నాడుతూనే ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ భూగర్భ జలాలను అధికా దికంగా తోడడటంవల్ల భూగర్భ జల మట్టాలు పడిపోవడమే గాక, నీటిపొరలలోని రసాయనాల వల్ల కలుషితమై భూసారం క్షీణించి,పంట దిగు బడులు కూడా తగ్గినట్లు తేలింది. ఈ రెండు రాష్ట్రాలలో సేద్యపు రంగంలో విద్యుత్‌ సరఫరాపై రూ.91వేల కోట్ల విద్యుత్‌ సబ్సిడీలు ఇచ్చినట్లు భారత ప్రభుత్వం వెల్లడిరచింది. కనీస మద్దతుదా రులను భారత ప్రభుత్వం ఏటేటా ఎంతో కొంత పెంచుతూ ఉండటం వల్ల నీరు అధికంగా వాడే వరి,గోధుమ,చెరకు పంటలసాగు బాగా పెరి గింది. ప్రస్తుతం నీటి నియంత్రణ లేని సాగునీటి పద్ధతులు,విచక్షణా రహితంగా నీరు తోడటంవల్ల భూగర్భ జలమట్టాలు ఆందోళనకర స్థాయికి పడిపోవడంపై శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. సేద్యపు నీటి వాడకంలో ఉత్తమ యాజ మాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల, తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వాటిల్లే సష్టం వచ్చే ఆరేళ్లలో రూ.48వేల ట్రిలియన్లకు చేర గలదని,2050నాటికి ఆనష్టాలు రూ.138 ట్రిలి యన్లకు చేరుతుందని నిపుణులు అంచనా. దేశం లో ఆహార వ్యవస్థలను పటిష్టం చేయడానికి, నీటిభద్రత మెరుగుదలకు 3 చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రాలలో మెరుగైన సాగునీటి వాడకం, యాజమాన్య పద్ధతులు, నీటిని పొదుపుగా వాడుకోవడాన్ని ప్రోత్సహించాలి. ముఖ్యంగా బిందు, తుంపర్ల సేద్యం ద్వారా నీటిని పొదుపుగా అవసరమైన మేరకు వాడటాన్ని ప్రోత్స హించాలి. ఈ పద్ధతులు పాటిస్తే వచ్చేఆరేళ్లలో 47శాతం సాగునీటిని ఆదా చేయవచ్చని నిపు ణులు అంటున్నారు. ప్రతిబిందువుకూ మరింత పంట అనే జాతీయ కృషి వికాస్‌ యోజన పథకం కింద ఇందువల్ల 72లక్షల హెక్టార్ల భూమిలో సూక్ష్మ, సాగు పద్ధతులు అమలవుతున్నట్లు గణాం కాలు ఘోషిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడే ఒడిదుడుకులను తట్టుకుని నిలిచే సుస్ధిర సేద్యం, ఆహారవ్యవస్థల అభివృద్ధికి కృషి చేయాలని గత ఏడాది భారత్లో జరిగిన జి20 దేశాల అగ్రనాయక సమావేశం నిర్ణయించింది. నీటిపారుదల, వ్యవ సాయ రంగాలలో సుస్థిర పద్ధతులను అనుసరిస్తేనే అందుకు అవసరమైన పెట్టుబడులు వస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు అవసరమైన ప్రోత్సాహకాలు కల్పించి తగు సాంకేతిక ప్రక్రి యలను ప్రవేశ పెట్టడం అవసరం. ఆహారం, భూమి,నీరు,ఇంధన విధానాలను పరస్పర సమన్వ యంతో అమలు చేయాలి. విధానాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమన్వయం చేయ డానికి ఒకస్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలి. వ్యవసాయం, రైతు సంక్షేమం, జలశక్తి, సంప్రదా యేతర ఇంధన అభివృద్ధి శాఖ, విద్యుత్‌ శాఖలు సమన్వయంతోఈవిధానాల అమలును ఎప్పటిక ప్పుడు పర్యవేక్షించాలి. ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే ఇందుకోసం ప్రణాళిక,అమలు విభాగాన్ని నెల కొల్పి సత్ఫలితాలు సాధించినట్లు వెల్లడైంది. సుస్థిర సేద్యాభివృద్ధి, తద్వారా ఆహార భద్రత సాధన కోసం భూమి, నీరు, ఇంధనశాఖల మధ్య సమన్వయం సాధించి మెరుగైన యాజమాన్య పద్ధతులను అమలు చేయాలి.పల్లెలలో పంచా యతీరాజ్‌ సంస్థల ద్వారా ప్రజా భాగస్వామ్యంతో భూగర్భ జలాలను సమర్థంగా వినియోగిం చడానికి ప్రోత్సహించాలి. వాతావరణంలో తీవ్ర ఒడిదుడుకులవల్ల కరువులు, దుర్భిక్షాలు, ఆకాల, అధిక వర్షాలు, వడగండ్లవానల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నందున నీటి విని యోగంపై గాక, మెరుగైన నీటి సంరక్షణ పద్ధతులు పాటించే దృక్పథాన్ని అలవరచుకోవాలి. దేశంలో 62శాతం భూగర్భ జలాలను వాడుతున్నారు. ఇప్పటికే భూగర్భజలాల వాడకం ఎక్కువగా జరుగుతున్నట్లు గణాంకాలు ఘోషిస్తున్నాయి. నీటి వినియోగంపై స్థానిక గణాంకాలను ఎప్పటి కప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులకు అందు బాటులో ఉంచితే నీటి సంరక్షణ వద్దతులను మెరుగ్గా అమలుకు వీలవుతుంది. కేంద్ర ప్రభుత్వ ఆటల్‌ భూ యోజన పథకం అందుకు ఉపకరించ వచ్చు. గ్రామస్థాయిలో స్థానికులే నీటిభద్రతకు అవసరమైన గణాంకాలను సేకరించాలి.ఈ పథకం కింద పంచాయితీ స్థాయిలో స్థానికులకు నీటి సంరక్షణపై శిక్షణ ఇస్తారు. ఇలా ప్రజాభాగ స్వామ్యంతో భూగర్భ జలవనరుల పరిరక్షణను అమలుచేసిన చోట మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇతర పథకాలతో సమన్వయం చేస్తే మరింత మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చు. ఉత్తమ నీటి యాజమాన్య పద్ధతులు అమలు చేస్తేనే వచ్చే ఆరేళ్లలో ఆహారభద్రత సాధించాలనే లక్ష్యం నెరవేరుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నో అత్యల్ప వర్షాలు, నీటికొరత ప్రాంతాలు ఉన్నం దున,మనవాగులు,వంకలు,చెరువులు, జలాశ యాలు, పరీవాహక ప్రాంతాలు ఆక్రమణ లకు గురికాకుండా, పర్యావరణ, నీటి సంరక్షణ కోసం ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు జాగ్రత్తలు తీసు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్టు

సంకల్పంతో అడుగులేద్దాం..

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌, ఆలోచనలకు అనుగుణంగా ప్రతి పౌరుడూ, అధికారీ, ప్రజాప్రతినిధి, స్వచ్ఛంద సేవకులు వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో భాగస్వా మ్యం కావాలని అభివృద్ధి లక్ష్యాలను చేరుకు నేందుకు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్‌ దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను రూపొందించి అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్థిక ప్రయోజనాలు అందిస్తోందని పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రను విశాఖ వేదికగా గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏయూ కన్వెన్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వివిధ పథకాల ఉద్దేశాలను, లక్ష్యాలను వివరించారు. 2047 నాటికి భారత దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన తప్పక నిలుస్తుందని.. ఈ కలను నిజం చేసేందుకు అందరం కలిసికట్టుగా పని చేయాల్సి ఉందని, అన్ని వర్గాల వారు భాగస్వామ్యం కావాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా గవర్నర్‌ ఉద్ఘాటించారు. అర్హులైన ప్రతి భారతీయుడికీ ఆర్థిక ప్రయోజనాలు అందించటమే వికసిత్‌ భారత సంకల్ప యాత్ర ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగా రాబోయే 25 ఏళ్లలో(అమృత కాల) లక్ష్యాలను చేరుకునేందుకు 140 కోట్ల మంది భారతీయులు ప్రణాళికాయుతంగా అడుగులేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అర్హులెవరూ సంక్షేమ, ఆర్థిక ఫలాల కోసం ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన పని లేదని, వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో భాగంగా ఎక్కడిక్కడే సహాయక కేంద్రాలు పెడుతున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఆయు ష్మాన్‌ భారత్‌ యోజన, పీఎం ఆవాస్‌ యోజన, పీఎం పోషణ్‌ అభియాన్‌,దీనద యాల్‌ అంత్యోదయ యోజన,పీఎం ఉజ్వల్‌ యోజన, పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన, పీఎం భారతీయ జన్‌ ఔషధి పరియోజన తదితర పథకాల ద్వారా ప్రజలకు సంక్షేమ, ఆర్థిక ఫలాలు అందాయని తన ప్రసంగంలో భాగంగా రాష్ట్ర గవర్నర్‌ గుర్తు చేశారు. పేదలకు మరింత చేరువవటం,వారి అభిప్రా యాలను తెలుసుకోవటం, వారితో మమేకం కావటం, వారి నుంచి నేర్చుకోవటం తదితర ప్రయోజనాలు వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రతో ఒనగూరుతాయని పేర్కొన్నారు. అనంతరం వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రను ప్రారంభిస్తూ అందరిచేత గవర్నర్‌ ప్రతిజ్ఞ చేయించారు.
విశాఖ నగర అభివృద్ధికి అవిరళ కృషి చేశాం – జీవీఎంసీ కమిషనర్‌ ః కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ విశాఖ నగర అభివృద్ధికి అవిరళ కృషి చేశామని జీవీఎంసీ కమిషనర్‌ ప్రారంభో పాన్యం చేశారు. ఇప్పటి వరకు నగర పరిధి లో అమలు చేసిన పథకాలు, వెచ్చించిన వ్యయం,లబ్దిపొందిన వారి వివరాలను వివరించారు. పీఎం ఆవాస్‌ యోజన ద్వారా 24,192 మంది లబ్ధిపొందారని వారికి బ్యాంకు లింకేజీ ద్వారా రూ.311.46 కోట్ల ఆర్థిక ప్రయోజనాలు అందించామన్నారు. 1.18 లక్షల మందికి ఒన్‌ సెంట్‌ గృహాలు మంజూరు చేశామని తెలిపారు. అమృత్‌ మొదటి విడతలో భాగంగా రూ.124.99 కోట్లు, రెండో విడతలో రూ.70.44 కోట్లు వెచ్చించి వివిధ పనులు చేపట్టామని వివరిం చారు. 315 మంది నిరాశ్రయులు నివసించేం దుకు అనువుగా రూ.50 లక్షలతో ఎన్‌.యు. ఎల్‌.ఎం. పథకంలో భాగంగా ఎనిమిది షెల్టర్‌ హోంలు నిర్మించామని తెలిపారు. పీఎం స్వానిధిలో భాగంగా 23,675 మంది కి రూ.26.21 కోట్ల మేర లబ్దిచేకూర్చా మని పేర్కొన్నారు. 5.22 లక్షల మందికి ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు అందజేశామ న్నారు. రూ.1000 కోట్లతో స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులు చేపట్టామని వెల్లడిర చారు. పీఎం పోషణ్‌, మిషన్‌ వాత్సల్య ఇతర పథకాల ద్వారా ఎంతోమందికి అండగా నిలిచామని జీవీఎంసీ కమిషనర్‌ ప్రగతి నివేదికను వివరించారు.
పేదలందరికీ ఆర్థిక ఫలాలు అందాలి ః సాల్మన్‌ ఆరోక్య రాజ్‌
పేదలందరికీ ఆర్థిక ఫలాలు అందించటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోందని, వాటన్నింటిపై ప్రజలకు అవగాహన కల్పించటం, అవకాశాలను సృష్టించటం కోసమే కేంద్రం వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రను చేపడుతోందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ సాల్మన్‌ ఆరోక్య రాజ్‌ పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ యాత్ర ఉద్దేశాలను అర్థం చేసుకొని భాగస్వామ్యం కావాలని, అర్హతల మేరకు పథక ఫలాలు పొందాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి చిత్తశుద్ది -నగర మేయర్‌ ః కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో భాగంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ పథకాలు అమలు చేస్తున్నట్లు నగర మేయర్‌ గొలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి చిత్తశుద్దితో పని చేస్తున్నారని గుర్తు చేశారు. సదుద్దేశంతో తలపెట్టిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రంలో ప్రతి ఒక్కరూ భాగస్వా మ్యం కావాలని పిలుపునిచ్చారు.
అధికారులందరం ప్రత్యేక సంకల్పంతో పని చేస్తాం – జాయింట్‌ కలెక్టర్‌ ః భారత ప్రధాన మంత్రి,రాష్ట్ర గవర్నర్‌ పిలుపు మేరకు అధికారులందరం వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రంలో భాగస్వామ్యం అవుతామని, అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రత్యేక సంకల్పంతో పని చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ కె.ఎస్‌. విశ్వనాథన్‌ పేర్కొన్నారు. కార్యక్రమం లో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ప్రాజెక్టుల గురించి వివరిం చారు. జిల్లా ప్రజలు కూడా వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో మనస్ఫూర్తిగా భాగస్వా మ్యం కావాలని సూచించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందిన పెదజాలారి పేటకు చెందిన దొడ్డి ఆదిలక్ష్మి, మద్దిలపాలెనికి చెందిన సుచిత్ర, ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా చికిత్స చేయించుకున్న నానాజీ వారి అభిప్రాయాలను సభలో పంచుకున్నారు. ఏయూ కన్వెన్షన్‌ హాలులో నిర్వహించిన సభలో పాల్గొనడానికి ముందు రాష్ట్ర గవర్నర్‌ ప్రాంగణంలో ఏర్పటు చేసిన వివిథ పథకాలకు సంబంధించిన స్టాళ్లను సందర్శించారు. అక్కడ పథకాల వివరాలను పరిశీలించారు. నిర్వాహకుల ద్వారా పలు వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ వద్ద నెలల చిన్నారికి గవర్నర్‌ అన్నప్రాసన చేసి ఆశీర్వదించారు. రెండో విడతలో భాగంగా గాజువాక పరిధిలో 10 వేల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి ఏయూ కన్వెన్షన్‌ హాలు వద్ద మొక్క నాటి శ్రీకారం చుట్టారు. సభా వేదికపై ఉజ్వల పథకంలో లబ్దిపొందిన పలువురు మహిళలకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. క్రీడాకారులు దాసరి స్రవంతి, కుసుమంచి తేజేశ్‌, వెలగలనేటి కిరణ్‌ కుమార్లను గవర్నర్‌ చేతుల మీదుగా సత్కరిం చారు. కార్యక్రమంలో ఏయూ ఇన్ఛార్జి వీసీ ప్రొ.కె.సమత,స్థానిక కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధికారులు, అధిక సంఖ్యలో స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. –జిఎన్‌వి సతీష్‌

75వ గణతంత్ర దినోత్సవ వేడుక

ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తమై భారతదేశం స్వతంత్ర దేశమైంది. బ్రిటిష్‌ పార్లమెంట్‌ ఆమోదించిన 1947 భారత స్వాతంత్రం చట్టం కింద రాజ్యాంగ అధినేత గా 6వ జార్జి ప్రభువు, ఎర్ల్‌ మౌంట్‌ బాటన్‌ గవర్నర్‌ జనరల్‌ గాను మనకు స్వాతంత్య్రం సిద్దించింది. మన దేశానికి స్వతంత్ర రాజ్యాంగం ఆనాటికి లేనందున 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన కొనసాగింది. దేశ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947 ఆగస్టు 28న రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ అధ్యక్షునిగా బాబా సాహెబ్‌, అంబేద్కర్‌ బాధ్యతలు చేపట్టారు. రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభ (తాత్కాలిక పార్లమెంట్‌)కు సమర్పించగా, దాదాపు రెండేళ్ల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి, సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. దానిని ఇంగ్లీష్‌, హిందీ భాషలలో చేతిరాతతో తయారు చేసి 1950 జనవరి 24న సంతకాలు చేసి ఖరారు చేశారు.
అలా తయారైన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే ‘’భారత గణతంత్ర’’ దినం 1950 జనవరి 26. చారిత్రాత్మకంగా ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యం దష్ట్యా జనవరి 26వ తేది గణతంత్ర దినంగా ఎంపిక చేశారు. భారత స్వాతంత్య్రం పోరాటానికి నాయకత్వం వహించిన ‘భారత జాతీయ కాంగ్రెస్‌’ 1930లో ‘పూర్ణ రాజ్య’ కోసం ప్రకటన చేసి ప్రతి సంవత్సరం జనవరి 26ను పూర్ణ స్వరాజ్య జయంతి దినోత్సవం జరపాలని జాతికి పిలుపునిచ్చింది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశమంతటా వాడవాడలా ప్రజలు జాతీయ పతకాన్ని ఎగురవేసి సంబరాలు జరుపుకొంటారు.
రాజ్యాంగ సభ 11సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాయటానికే పట్టింది. రాజ్యాంగ రాతప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్‌ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేసారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి, భారత్‌ తాత్కాలిక పార్లమెంటు గా మారింది.1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తరువాత కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటు ఉనికిలో ఉంది. మన రాజ్యాంగం యొక్క అసలు ప్రతులు రెండు మాత్రమే ఉన్నా యి, హిందీలో ఒక ప్రతి, ఇంగ్లీష్‌లో ఒక ప్రతి ఉన్నాయి, ఆ ప్రతులు పాడవకుండా ఉండేం దుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్‌కేసు లలో పార్లమెంట్‌ భవనంలో భద్రపరిచారు, వాటి నకలును ఫోటో కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి. మన రాజ్యాంగం జనవరి 26వ తేది ఉదయం 10:18 నిమిషాలకు అమలులోకి వచ్చింది. 1930వ సంవత్సరంలో జనవరి 26వ తేదిని స్వాతంత్య్ర దినోత్సవం లేదా పూర్ణ స్వరాజ్‌ దినోత్సవంగా జరుపుకొనేవారు, అంటే ఆరోజున భారతదేశం పూర్తి స్వేచ్చ కోసం పోరాడడానికి నిర్ణయించుకున్న రోజు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించబడడం ప్రోటోకాల్‌ పరంగా దేశం అందించే అత్యున్నత గౌరవం. కాలక్రమేణా ఈవెంట్‌ యొక్క ఫాబ్రిక్‌ మరియు దాని రన్‌-అప్‌లో భాగంగా మారిన అనేక ఉత్సవ కార్యక్రమాలలో ముఖ్య అతిథి ముందు మరియు కేంద్రంగా ఉంటారు. వారికి రాష్ట్రపతి భవన్‌లో సెరిమోనియల్‌ గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ ఇవ్వబడుతుంది, ఆ తర్వాత సాయం త్రం భారత రాష్ట్రపతిచే రిసెప్షన్‌ ఇవ్వబడుతుంది. వారు రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ గౌరవార్థం పుష్పగుచ్ఛం కూడా ఉంచారు. వారి గౌరవార్థం ఒక విందు ఉంది, ప్రధానమంత్రి ఆతిథ్యం ఇచ్చే లంచ్‌ మరియు ఉపరాష్ట్రపతి విదేశాంగ మంత్రి కాల్స్‌. 1999 మరియు 2002 మధ్య ప్రోటోకాల్‌ చీఫ్‌గా పనిచేసిన మాజీ ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ అధికారి అంబా సిడర్‌ మన్బీర్‌ సింగ్‌, ముఖ్య అతిథి సందర్శన ప్రతీకాత్మకతతో నిండి ఉందని ఇంతకు ముందు ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు ‘‘ఇది ముఖ్య అతిథి భారతదేశ గర్వంలో పాల్గొంటున్నట్లు చిత్రీకరిస్తుంది. ఆనందం, మరియు భారత రాష్ట్రపతి మరియు ముఖ్య అతిథి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇరువురి ప్రజల మధ్య స్నేహాన్ని ప్రతిబింబిస్తుంది’’.ఈ ప్రతీ కవాదం భారతదేశం మరియు దాని ఆహ్వానిత దేశం మధ్య సంబంధాలను ఏర్పరచడానికి మరియు పునరుద్ధరించడానికి ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుంది, ఎక్కువ రాజకీయ మరియు దౌత్యపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది.
అయితే రిపబ్లిక్‌ డే ముఖ్య అతిథిని ఎలా ఎంపిక చేస్తారు?
ఈవెంట్‌కు దాదాపు ఆరు నెలల ముందుగానే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆహ్వానాన్ని పొడిగించే ముందు అన్ని రకాల పరిగణన లను పరిగణనలోకి తీసుకుంటుందని రాయ బారి మన్బీర్‌ సింగ్‌ చెప్పారు.భారతదేశం మరియు సంబంధిత దేశానికి మధ్య ఉన్న సంబంధాల స్వభావం అత్యంత కేంద్ర పరిశీలన. రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించడం భారత దేశం మరియు ఆహ్వానించబడిన దేశం మధ్య స్నేహానికి అంతిమ సంకేతం. భారతదేశం యొక్క రాజకీయ, వాణిజ్య, సైనిక మరియు ఆర్థిక ప్రయోజనాలు ఈ నిర్ణయానికి కీలకమైన చోదకాలు, ఈ అన్ని అంశాలలో ఆహ్వానించ బడిన దేశంతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించు కోవాలని కోరుతోంది.ముఖ్య అతిథి ఎంపికలో చారిత్రాత్మకంగా పాత్ర పోషించిన మరో అంశం 1950ల చివరలో మరియు 1960ల ప్రారంభంలో ప్రారంభమైన నాన్‌-అలైన్డ్‌ మూవ్‌మెంట్‌ తో అనుబంధం.అనేది ప్రచ్ఛన్న యుద్ధం యొక్క గొడవల నుండి దూరంగా ఉండటానికి మరియు వారి దేశ నిర్మాణ ప్రయాణాలలో ఒకరికొకరు మద్దతు ఇవ్వడానికి కొత్తగా వలసరాజ్యం చేయబడిన దేశాల అంతర్జాతీయ రాజకీయ ఉద్యమం. 1950లో జరిగిన కవాతుకు మొదటి ముఖ్య అతిథి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో, %చీAవీ% యొక్క ఐదుగురు వ్యవస్థాపక సభ్యులలో ఒకరు.
1950లో మొదటి గణతంత్ర వేడుకలు ఎలా జరిగాయో తెలుసా?
జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం. రిపబ్లిక్‌ డే రోజున దిల్లీలో ఎలాంటి సందడి ఉంటుందో టీవీల్లో చూస్తున్నారు. పేపర్లలో చదువుతున్నారు. కానీ 68 సంవత్సరాల క్రితం, మొదటి ‘రిపబ్లిక్‌ డే’ ఎలా జరిగిందో మీకు తెలుసా?ఆనాటి వేడుకలను కళ్లారా చూసిన వారు ఆరోజును ఎలా మరువగలరు? ఆనాటి జ్ఞాపకాలను సీనియర్‌ వ్యాసకర్త ఆర్‌.వి.స్మిత్‌ బీబీసీతో పంచుకున్నారు. 1950 జనవరి 26న పురానా ఖిలా ఎదుట ఉన్న బ్రిటిష్‌ స్టేడియంలో రిపబ్లిక్‌ డే పెరేడ్‌ జరిగింది. డా.రాజేంద్ర ప్రసాద్‌ మొదటి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, సి.రాజగోపాలాచారి అక్కడే ఉన్నారు.ఆ ఉదయం..ఆ స్టేడియంలో మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత పెరేడ్‌ ప్రారంభమయ్యింది. గాల్లోకి పేల్చిన తుపాకీ చప్పుళ్లు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించాయి.చివరి బ్రిటిష్‌ వైస్రాయ్‌ లార్డ్‌ లూయీస్‌ మౌంట్‌బాటన్‌ నుంచి గవర్నర్‌ జనరల్‌ బాధ్యతలను సి.రాజగోపాలాచారి అప్పటికే స్వీకరించి ఉన్నారు. వీదేశీ పాలన పూర్తిగా అంతరిం చిపోయి, అధికారాన్ని అప్పగించిన గురుతులే రిపబ్లిక్‌ డే! స్వతంత్ర దేశంగా పురుడుపోసు కుని ప్రపంచ దేశాల కూటమిలో సంపూర్ణ స్వతంత్ర దేశంగా భారత్‌ చేరింది.అప్పటి బ్రిటన్‌ రాజు కింగ్‌ జార్జ్‌-భారత్‌కు శుభా కాంక్షలు తెలుపుతూ, ఇండియాకు కామన్‌వెల్త్‌ దేశాల సభ్యత్వం కొనసాగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.అప్పటికే అంతర్థానమైన నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ ‘దిల్లీ చలో’ పిలుపునిస్తూ రిపబ్లిక్‌ డే వేడుకల్లో తిరిగి ప్రత్యక్షమవుతా రన్న వార్తలు దావానంలా వ్యాపించాయి. అప్పటికి రెండేళ్ల ముందే మహాత్మ గాంధీ మరణించారు. రిపబ్లిక్‌ వేడుకల్లో ఆయన లేకపోవడం లోటుగా కనిపించింది. ఇప్పుడు జరుపుతున్నంత ఆర్భాటంగా ఆనాటి రిపబ్లిక్‌ డే వేడుకలు జరగలేదు. కానీ అప్పటికి ఆ వేడుకలు కూడా బ్రహ్మాండంగానే జరిగాయని చెప్పుకోవాలి. రిపబ్లిక్‌ వేడుకల్లో నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌, సైనిక దళాలు పాల్గొన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వాల శకటాలు ఆనాడు లేవు.
ఇప్పటిలా న్యూ దిల్లీ, ఎర్రకోటల మీదుగా పెరేడ్‌ సాగలేదు. ఆనాటి పెరేడ్‌ మొత్తం ఆ స్టేడియానికే పరిమితమైంది. కానీ 1951 నుంచి పెరేడ్‌ ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. వేడుకల్లో భాగంగా యుద్ధ విమా నాల విన్యాసాలు జరిగాయి. కానీ ఆ విన్యా సాల్లో జెట్‌ విమానాలు, థండర్‌బోల్ట్‌ విమానాలు లేవు. అప్పటికి వినియోగంలో ఉన్న డకోటా, స్పిట్‌ ఫైర్స్‌ మాత్రమే విన్యాసాల్లో పాల్గొన్నాయి.
మొట్ట మొదటి భారత సైన్యాధిపతి కరియప్ప. ఈయన బ్రిటిష్‌ ప్రభుత్వంలో కూడా ఎంతో గౌరవం, కీర్తి సంపాదించిన వ్యక్తి.
‘’ఈరోజు నాకు, మీకు, మనతో పాటు మన కుక్కలకు కూడా స్వాతంత్య్రం వచ్చింది’’ అంటూ సైనికాధిపతి కరియప్ప బారత సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కరియప్ప ప్రసంగం. అక్కడివారిలో ఆనందం, ఉత్సా హాన్ని నింపాయి. ఇప్పటికీ నాకు గుర్తే. రిపబ్లిక్‌ డే సందర్భంగా జామా మసీద్‌ సమీపంలోని ఓ హోటల్‌ యజమాని అందరికీ స్వీట్లు పంచాడు. ఆ స్వీట్ల రుచి నాకింకా గుర్తుంది. అవి మహాద్భుతంగా ఉన్నాయి.చాందినీ చౌక్‌ను అందంగా ముస్తాబు చేశారు. వీధుల నిండా ప్రజలు. వారి చేతుల్లో చిన్నచిన్న జాతీయ జెండాలు. వారంతా చాలా ఉత్సా హంగా కనిపించారు. ఎక్కడచూసినా బంతిపూల హారాలు. పూల వ్యాపారులు ఆ ప్రాంతమంతా రోజా పూలను చల్లారు. ఒకరికొకరు పువ్వులు ఇచ్చిపుచ్చుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
ఆగస్ట్‌ 15న పురుడుపోసుకున్న స్వతంత్ర భారతం.. 1950, జనవరి 26కు ఓ రూపం తీసుకుందన్న భావన వారిలో స్పష్టంగా కనిపించింది. దిల్లీలో ప్రధాన కూడలి ‘కన్నాట్‌ ప్లేస్‌’ను చాలా అందంగా ముస్తాబు చేశారు. నగరంలోని కొన్ని హోటళ్లు, ప్రధాన దుకాణాలు తమ అమ్మకాలపై డిస్కౌంట్లు కూడా ప్రకటించాయి.ఇక ఆ రాత్రి చూడాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ భవనాలన్నీ దీప కాంతులతో వెలిగిపోయాయి. రాష్ట్రపతి భవన్‌ను కొత్త పెళ్లికూతురిలా ముస్తాబు చేశారు.ఎర్రకోట, పార్లమెంట్‌ భవనం, ఆల్‌ ఇండియా రేడియో కార్యాలయం, ఇండియా గేట్‌, అన్నిటి వైభ వాన్ని ఆరోజు చూడాలి. ఆ అందమే వేరు! మరోవైపు, క్లబ్బులు, రెస్టారెంట్లలో పాటలు పాడుతూ..నృత్యాలు చేస్తూ.. ఒకటే కోలాహలం, సంబరం.. ఎక్కడ చూసినా పండగ వాతావరణమే!
ఆ కాలంలో జీన్స్‌ ప్యాంట్లు లేవు. కానీ, పాశ్చాత్య దుస్తుల్లో కనిపించే అందమైన యువతులు క్లబ్బులు, రెస్టారెంట్లలో తళుక్కుమన్నారు. అమ్మాయిల విషయంలో యువకుల మధ్య ఒకట్రెండు చిన్నచిన్న గొడవలూ జరిగాయి. ఎక్కడచూసినా రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన విందు గురించే చర్చలు నడిచాయి.జవహర్‌లాల్‌ నెహ్రూ, ఆయన కూతురు ఇందిరాగాంధీ, రాజేంద్ర ప్రసాద్‌, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, మౌలానా ఆజాద్‌ మరెందరో ఆ విందులో పాల్గొన్నారు.చివరగా ఆ రాత్రి జరిగిన ముషాయిరాలు, కవిసమ్మేళనాలతో తొలి రిపబ్లిక్‌ డే వేడుకలు అలా ముగిశాయి..
(బీబీసీ సౌజన్యంతో..)-జి.ఎన్‌.వి.సతీష్‌

ప్రకృతి మనిషికి ఇచ్చిన వరాలు పర్వాతాలు

ప్రకృతి మనిషికి అందించిన వనరులు ఎన్నో..ఎన్నెన్నో. గాలి, నీరు,నిప్పు,అడవులు,బొగ్గు, పెట్రోలియం, బంగా రం, వజ్రాలు, ఖనిజాలు, వాతావరణం, వర్షపాతం, కొండలు, గుట్టలు,పర్వతాలు ఇలా ప్రకృతి మనిషికి ఎన్నో ఇచ్చింది. ప్రకృతి మనకు అందించిన ఈ సహజ వనరుల్ని వాడుకోవాలి. వాటిని సంరక్షించు కోవాలి. ఆ బాద్యత ప్రతీ మనిషికి ఉంది. కానీ మనిషి మాత్రం అన్నింటిని కలుషితం చేస్తున్నాడు.రాబోయే తరాలకు అందకుండా చేస్తున్నాడు.
ప్రకృతి మనకు ఇచ్చిన సహజవనరు ల్లో పర్వతాలు కూడా ఉన్నాయి. మొదటి తరం మానవుల నాగరికత ఆనవాళ్లు నదులు, పర్వతాల్లోనే బైటపడ్డాయి.నీరు ఉన్నచోటే ప్రాణి మనుగడ సాగిస్తుంది. అలాగే పర్వతాలు భద్రతనిస్తాయి. అందుకే నదులు, పర్వతాల వద్దనే మొదటితరం మనిసి నాగరికత ఆనవాళ్లు బైటపడ్డాయి. నదులు, పర్వతాలు అనేక జీవజాతులకు నిలయంగా ఉంటాయి. వాటి పరిరక్షణ కోసం డిసెంబర్‌ 11న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్‌ మౌంటెన్‌ డే ను నిర్వహిస్తారు. అన్ని దేశాల్లోనూ వేడుకలు జరుపుతారు.పర్వతాలు వివిధ జంతువులు,మొక్కలకు నిలయంగా విలసిల్లుతున్నాయి.
ప్రపంచ జనాభాలో 15శాతం మందికి పర్వతాలపైనే నివాసం
భూమిపైన జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. ప్రపంచ జనాభాలో 15శాతం మంది ప్రజలు పర్వత ప్రాంతాల్లోనే నివసిస్తున్నారంటే పర్వతాల ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీన్ని గుర్తుచేసు కుంటూ డిసెంబర్‌ 11న పర్వతాల పరిరక్షణ, అక్కడి జీవవైవిధ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. పర్వతాలను పరిరక్షించుకోవాలనే ఉద్ధేశ్యంతోనే ఇంటర్నేషనల్‌ మౌంటెన్‌ డే ఏర్పడిరది.
ఇంటర్నేషనల్‌ మౌంటెన్‌ డే..ఈ సంవత్సరం థీమ్‌ ఏంటంటే..
2020 ఇంటర్నేషనల్‌ మౌంటెన్‌ డే ని ఒక థీమ్‌గా ఖఅఱ్‌వస చీa్‌ఱశీఅం ఎంచుకుంది. పర్వతాలపై కనిపించే జీవవైవిధ్యాన్ని కాపాడుతూ, అక్కడ నివసించే ప్రజలకు ఎదురవుతున్న బెదిరింపులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఖఅఱ్‌వస చీa్‌ఱశీఅం ఈ థీమ్‌ను తీసుకుంది. జీవవైవిధ్యానికి సవాళ్లుగా.. మైనింగ్‌ పేరిట జరిగే విధ్వంసాలు, జంతువుల అక్రమ రవాణాకొన్ని వందల ఏళ్లుగా పర్వతాలు అనేక జీవజాతులకు నిలయంగా వెల్లివిరుస్తున్నాయి. పర్వతాలపై వాతావరణ పరిస్థితులు వ్యవసాయానికి, ఉద్యానవన పంటలకు, పశువుల పెంపకానికి అవకాశాలను సృష్టించాయి. కానీ వాతావరణ మార్పులు, మారుతున్న వ్యవసాయ పద్ధతులు, మైనింగ్‌ పేరిట జరిగే విధ్వంసాలు, జంతువుల అక్రమ రవాణా కోసం సాగించే వేట, అక్కడ నివసించే పక్షులు, వన్యప్రాణుల అక్రమ రవాణా వంటివి జీవవైవిధ్యానికి సవాళ్లు విసురు తున్నాయి. వన్యప్రాణుల మనుగడను ప్రశ్నిస్తున్నాయి. ఇటువంటి అంశాలపై ప్రజలకు అవగాహనతో పాటు ప్రభుత్వాల బాధ్యతను ఈ రోజు గుర్తుచేస్తుంది. దీనిపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మౌంటెన్‌ బయోడైవర్సిటీ అనే థీమ్‌ను ఖచీఎంచుకుంది.
అవసరాలను బట్టి ప్రత్యేక రోజులు మొదలవు తాయనే విషయం తెలిసిందే. అలాగే టర్నేష నల్‌ మౌంటెన్‌ డే చరిత్ర 1992 నుంచే మొద లైంది. 1992లోయుఎన్‌ ఆధ్వర్యంలో జరిగిన జశీఅటవతీవఅషవ శీఅ జుఅఙఱతీశీఅఎవఅ్‌ aఅస ణవఙవశ్రీశీజూఎవఅ్‌ సదస్సులో పర్వతాల పరిరక్షణ అంశం చర్చకు వచ్చింది. అప్పటినుంచి పర్వతాల ప్రాముఖ్యతపై పర్యావరణవేత్తలు సదస్సులు నిర్వహించటం ప్రారంభించారు. ఆ తరువాత 2002 సంవత్సరాన్ని ఖచీ Iఅ్‌వతీఅa్‌ఱశీఅaశ్రీ ్‌వaతీ శీట వీశీబఅ్‌aఱఅం గా ఐక్యరాజ్యసమితి గుర్తిం చింది. 2003 నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 11న Iఅ్‌వతీఅa్‌ఱశీఅaశ్రీ వీశీబఅ్‌aఱఅ ణaవని నిర్వహించటం కొనసాగు తోంది.
ప్రాముఖ్యత ఏంటి? తెలుసుకోవాల్సిన అవసరమేంటీ?
ప్రపంచ జనాభాలో సగంమందికి పర్వతాలు మంచినీటిని అందిస్తున్నాయి. పర్వతాలు అందించే నీటితోనే అంత స్థాయి జనాభా మనుగడ సాగిస్తోంది.కానీ అక్కడి వాతావరణ మార్పుల వల్ల పర్వతాలపై నివసించే ప్రజల మనుగడ కష్టమవుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరిగిపోతున్న మంచుపర్వతాలు.. మనకు తెలియకుండానే మనిషిని ప్రమాదం లోకి నెట్టేస్తున్నాయి. ఇది మనిషి గుర్తిం చటంలేదు. మంచు పర్వతాలు కరిగిపోతుం డటంతో కోట్లామంది ప్రజల మంచినీటి సరఫరాపై ప్రభావం పడుతోంది. ఇది ఏ ఒక్క దేశానికో కాదు. ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశంపై ఏదో ఒక విధంగా ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇది ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా గుర్తించాలి. వాతావరణ కాలుష్యానికి కారణమయ్యే చర్యల్ని అడ్డుకోవాలి. సహజవనరులను పరిరక్షించుకోవాలి. ఇది ప్రతీ ఒక్కరి బాధ్యతగా ఉండాలి. దీంతో పాటు పర్వతాల పరిధిలో ఉండే జీవవైవిధ్యాన్ని, అందమైన ప్రకృతిని కాపాడటానికి ప్రజలకు ఈIఅ్‌వతీఅa్‌ఱశీఅaశ్రీ వీశీబఅ్‌aఱఅ ణaవ అవగాహన కల్పించటానికి ఏర్పడిరది. పర్వతాలలో స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ రోజు లక్ష్యం. పర్వతాల ప్రాముఖ్యతపై పెరుగుతున్న శ్రద్ధతో 2002లో అంతర్జాతీయ పర్వతాల సంవత్సరంగా ప్రకటించేలా చేసింది. మొదటి అంతర్జాతీయ దినోత్సవాన్ని మరుసటి సంవత్సరం, 2003లో మొదటి సారిగా జరుపుకున్నారు. ఈ సున్నితమైన పర్యావరణ వ్యవస్థలు వాతావరణ మార్పు, అతిగా దోపిడీ మరియు కాలుష్యం నుండి విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నందున పర్వత జీవవైవిధ్యాన్ని రక్షించడం గురించి అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ పర్వత దినోత్సవం మనకు అవకాశం ఇస్తుంది.
అంతర్జాతీయ పర్వత దినోత్సవం 2023: థీమ్‌
సస్టైనబుల్‌ మౌంటెన్‌ టూరిజం అనేది ఈ సంవత్సరం అంతర్జాతీయ పర్వత దినోత్సవం యొక్క థీమ్‌. పర్వతాలలో స్థిరమైన పర్యాట కం అదనపు మరియు ప్రత్యామ్నాయ జీవనో పాధి ఎంపికలను సృష్టించేందుకు మరియు పేదరిక నిర్మూలన, సామాజిక చేరిక, అలాగే ప్రకృతి దృశ్యం మరియు జీవవైవిధ్య పరిరక్షణను ప్రోత్సహించడంలో దోహద పడుతుంది. పర్వతాలు ప్రపంచ జనాభాలో 15% మందికి నివాసంగా ఉన్నాయి మరియు ప్రపంచంలోని జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లలో సగం వరకు ఉన్నాయి. వారు మానవాళిలో సగం మందికి రోజువారీ జీవితానికి మంచి నీటిని అందిస్తారు. స్థిరమైన అభివృద్ధికి వాటి పరిరక్షణ కీలకమైన అంశం.
ఈ సంవత్సరం డిసెంబర్‌ 11న అంతర్జాతీయ పర్వత దినోత్సవం యొక్క థీమ్‌ స్థిరమైన పర్వత పర్యాటకం. పర్వతాలలో స్థిరమైన పర్యాటకం అదనపు మరియు ప్రత్యా మ్నాయ జీవనోపాధి ఎంపికలను సృష్టించ డానికి మరియు పేదరిక నిర్మూలనను ప్రోత్స హించడానికి దోహదపడుతుంది పర్వతాలు భూమి యొక్క భూ ఉపరితలంలో 25% కంటే ఎక్కువ ఆక్రమించాయి మరియు 1 బిలియన్‌ మందికి పైగా ప్రజలు నివసిస్తు న్నారు.అయినప్పటికీ, వాతావరణ సంక్షోభం కారణంగా వారు ఎక్కువగా ముప్పును ఎదుర్కొంటున్నారు.
ప్రపంచంలోని 7ఎత్తైన పర్వతాలు
భారతదేశం ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శ్రేణులు మరియు పర్వత రహదారులను కలిగి ఉంది. భారతదేశం1000 మీటర్ల కంటే ఎక్కువ శిఖరాలను కలిగి ఉన్న ఏడు ప్రధాన పర్వత శ్రేణులకు నిలయం. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ మరియు ఎత్తైన పర్వత శ్రేణి హిమాలయ శ్రేణి. ఇది భారతదేశంలోని అతి చిన్న మరియు పొడవైన పర్వత శ్రేణి మరియు ప్రపంచంలోని దాదాపు ప్రతి అతిపెద్ద శిఖరాన్ని కలిగి ఉంది. హిమాలయ పర్వత శ్రేణి భారతదేశాన్ని ఆసియాలోని మిగిలిన ప్రాంతాల నుండి విభజిస్తుంది మరియు భారతదేశంలోని శక్తివంతమైన నదులకు ప్రధాన మూలం. భారతదేశంలోని ఎత్తైన పర్వత శ్రేణి, హిమా లయ సంస్కృతం నుండి ‘‘మంచు నివాసం’’ అని అనువదిస్తుంది. హిమాలయ పర్వతం భారతదేశంలోని అతి చిన్న శ్రేణి మరియు ఇది రెండు టెక్టోనిక్‌ ప్లేట్ల ఢీకొనడం వల్ల ఏర్పడిన కొత్త మడత పర్వతం. హిమాలయ పర్వత శ్రేణి ప్రపంచంలోని దాదాపు ప్రతి ఎత్తైన శిఖరాన్ని కలిగి ఉంది మరియు సగటున 7200 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుతో 100 కంటే ఎక్కువ శిఖరాలను కలిగి ఉంది. నంగా పర్బత్‌ మరియు నమ్చా బార్వా హిమాలయాల పశ్చిమ మరియు తూర్పు బిందువుగా పరిగణించబడుతుంది.మౌంట్‌ ఎవరెస్ట్‌ 8848 మీటర్ల ఎత్తుతో ప్రపంచం లోనే ఎత్తైన శిఖరం. ఇది నేపాల్‌ లోని హిమాలయ శ్రేణిలో ఉంది. హిమాలయాలు గంగా, బ్రహ్మపుత్ర మరియు సింధుతో సహా అనేక గొప్ప నదీ శ్రేణులకు కూడా మూలం. శీతాకాలంలో భారత ప్రధాన భూభాగంలోకి ప్రవేశించకుండా చల్లని గాలిని నిరోధించడం ద్వారా ఉత్తర భారతదేశంలోని వాతావ రణాన్ని నియంత్రించడంలో హిమాలయాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
కారాకోరం మరియు పిర్‌ పంజాల్‌ శ్రేణి
కారాకోరం శ్రేణి మరియు పీర్‌ పంజాల్‌ పర్వత శ్రేణులు హిమాలయ శ్రేణికి వాయువ్య మరియు దక్షిణంగా ఉన్నాయి.కారకోరం శ్రేణిలో ఎక్కువ భాగం భారతదేశం మరియు పాకిస్తాన్‌ల వివాదాస్పద వర్గం క్రింద ఉంది మరియు రెండు దేశాలు దానిపై దావా వేసాయి. కారకోరం శ్రేణి, 500 కిమీ పొడవుతో భూమి యొక్క అనేక అతిపెద్ద శిఖరాలను కలిగి ఉంది. ప్రపంచంలోని రెండవ ఎత్తైన శిఖరం,8,611 మీటర్ల ఎత్తులో కారకోరం శ్రేణిలో ఉంది.హిందూ-కుష్‌, కారాకోరం శ్రేణి యొక్క పొడిగింపు ఆఫ్ఘనిస్తాన్‌లో నడుస్తుంది. కారకోరం ధ్రువ ప్రాంతాలను మినహాయించి అత్యధిక హిమానీనదాలను కలిగి ఉంది.ప్రపంచంలోని 2వ మరియు 3వ అతిపెద్ద హిమానీనదాలు అయిన సియాచిన్‌ గ్లేసియర్‌,ది బియాఫో గ్లేసియర్‌ ఈ శ్రేణిలో ఉన్నాయి.పిర్‌ పంజాల్‌ శ్రేణి భారతదేశంలోని హిమాచల్‌ ప్రదేశ్‌ నుండి మొదలై వాయువ్యంగా జమ్మూ కాశ్మీర్‌ మరియు జమ్మూ ` కాశ్మీర్‌ వివాదాస్పద ప్రాంతం వైపు హిమాలయాల దక్షిణ దిశలో ఉంది.
తూర్పు పర్వత శ్రేణి లేదా పూర్వాంచల్‌ శ్రేణి
పూర్వాంచల్‌ శ్రేణిని భారతదేశం యొక్క తూర్పు భాగంలో హిమాలయాల విస్తరణగా పరిగణించవచ్చు, ఎందుకంటే ఈ శ్రేణి ఏర్పడే ప్రక్రియ హిమాలయాల మాదిరిగానే ఉంటుంది, అయినప్పటికీ ఈ శ్రేణి హిమాల యాలంత ఎత్తులో లేదు.పూర్వాంచల్‌ శ్రేణి లేదా తూర్పు పర్వత శ్రేణి మూడు భాగాలను కలిగి ఉంటుంది: పట్కై-బం హిల్‌, గారో-ఖాసీ-జైంతియా హిల్స్‌ మరియు లుషాయ్‌ హిల్‌ (మిజో హిల్‌). ఈ కొండల కారణంగా మేఘాలయలోని మవ్సిన్రామ్‌ భూమిపై అత్యంత తేమతో కూడిన ప్రదేశం మరియు ఇది ఖాసీ కొండలో ఉంది. ఈ శ్రేణి భారతదేశంలోని అన్ని తూర్పు రాష్ట్రాలను కవర్‌ చేస్తుంది, వీటిని సాధారణంగా సెవెన్‌ సిస్టర్స్‌ అని పిలుస్తారు.
సత్పురా మరియు వింధాయ శ్రేణి
సత్పురా,వింధాయ శ్రేణులు మధ్య భారత దేశంలో ఉన్నాయి మరియు ఈ రెండు శ్రేణులు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి.ఈ రెండిరటిలో, సాత్పురా శ్రేణి పొడవు ఎక్కువగా ఉంది మరియు నర్మదా మరియు తపతి వంటి నదులకు మూలం. సత్పురా మరియు వింధయ రెండూ ప్రధానం గా మధ్యప్రదేశ్‌ మరియు మహారాష్ట్రలో ఉన్నా యి, కొంతవరకు గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌,ఉత్తర ప్రదేశ్‌లకు విస్తరించబడ్డాయి.
ఆరావళి శ్రేణి
భారతదేశంలోని పురాతన పర్వత శ్రేణి, ఆరా వళి శ్రేణి ప్రపంచంలోని పురాతన పర్వత శ్రేణి. పరిధి వెడల్పు 10సఎ నుండి 100 సఎ వరకు ఉంటుంది. స్థానిక భాషలో, ఆరా వళిని ‘శిఖరాల రేఖ’ అని అనువదిస్తుంది,ఢల్లీి, హర్యానా,రాజస్థాన్‌ మరియు గుజరాత్‌ రాష్ట్రా లను కవర్‌ చేస్తూ మొత్తం 800 కి.మీ.ఆరా వళి శ్రేణి భారతీయ వాతా వరణంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషి స్తుంది,ఎందుకంటే ఇది థార్‌ ఎడారిని చేరు కోవడానికి వర్షం మోసే గాలిని అడ్డుకుంటుంది.ఞవెనిస్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ అని కూడా పిలువబడే ఉదయపూర్‌ నగరం, ఆరావళి పర్వతాల దక్షిణ వాలులో ఉంది. బనాస్‌, లుని మరియు సబర్మతిఈ శ్రేణి గుండా ప్రవహించే నదులు.
పశ్చిమ కనుమలు
పశ్చిమ కనుమలు 1600 మీటర్ల పొడవైన పర్వత శ్రేణి, ఇది దక్షిణ భారతదేశంలోని గుజరాత్‌ నుండి కన్యాకుమారి వరకు ఉంది. ఈ పర్వత శ్రేణిని ‘‘సహ్యాద్రి పర్వతాలు’’ అని కూడా అంటారు. ఇది నీలగిరి, అనైమలై మరియు కార్డమోమ్‌ పర్వత శ్రేణులను కలిగి ఉంది. తపతి నది గుజరాత్‌లో ప్రారంభమై, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలకు సమాంతరంగా అరేబియా సముద్రాన్ని దాటుతుంది.కేరళలోని 2695 మీటర్ల ఎత్తులో ఉన్న అనైమలై కొండలు ఈ శ్రేణిలో ఎత్తైన శిఖరం. పశ్చిమ కనుమలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటి మరియు గొప్ప జీవ వైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇది కొన్ని 139 క్షీరద జాతులు,508 పక్షి జాతులు, 179 ఉభ యచర జాతులు మరియు 250 సరీసృపాల జాతులకు నిలయం.జోగ్‌ ఫాల్స్‌, ఊటీ, బందీపూర్‌ నేషనల్‌ పార్క్‌ వంటి ప్రసిద్ధ పర్యా టక ఆకర్షణలు ఉన్నాయి.ఈ శ్రేణిలో గోదావరి,కృష్ణ మరియు కావేరి ముఖ్యమైన నదులు.
తూర్పు కనుమలు
తూర్పు కనుమలు బంగాళాఖాతానికి సమాం తరంగా భారత ద్వీపకల్పంలోని తూర్పు భాగంలో నడుస్తున్న పర్వత శ్రేణి.ఈ శ్రేణి నిరంతరంగా ఉండదు మరియు పశ్చిమ కనుమలతో పోల్చినప్పుడు ఎత్తులో తక్కువగా ఉంటుంది.ఈ పరిధి పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సా,ఆంధ్రప్రదేశ్‌,తమిళనాడు రాష్ట్రాల గుండా వెళుతుంది.1680 మీటర్ల ఎత్తులో ఉన్న అర్మ కొండ ఈ ప్రాంతంలో ఎత్తైన శిఖరం.భారతదేశంలోని నాలుగు ప్రధాన నదులు గోదావరి, మహానది, కృష్ణా మరియు కావేరి తూర్పు కనుమల ద్వారా బంగాళా ఖాతంలోకి వస్తాయి కాబట్టి తూర్పు కనుమలు భారతీయ వ్యవసాయంలో ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నాయి. వారు వరి వంటి పంటలకు అనువైన పెద్ద సారవంతమైన ప్రాంతాన్ని సృష్టిస్తారు.
ఈ కనుమలు పశ్చిమ కనుమల కంటే పురాతనమైనవి మరియు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల వెంకటేశ్వర దేవాలయం వంటి కొన్ని ముఖ్యమైన యాత్రా స్థలాలను కలిగి ఉన్నాయి.విశాఖపట్నం,భువనేశ్వర్‌ తూర్పు కనుమలలో ఉన్న ముఖ్యమైన నగరాలు.
-(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

గిరిజన యువతకు సమత కెరీర్‌ గైడెన్స్‌

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆపై చదువులకు ఏ కోర్సును ఎంపిక చేసు కోవాలన్న అంశంపై తర్జనభర్జన పడుతుంటారు. పదో తరగతి తర్వాత ఎంపిక చేసుకునే కోర్సులపైనే విద్యార్థుల కెరీర్‌ ఆధారపడి ఉంటుంది. గిరిజన గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థు లకు కోర్సుల ఎంపికపై గైడెన్స్‌ ఇచ్చేవారు ఉండరు.ఈనేపథ్యంలో వారి ఉజ్వల భవిష్యత్తు మెరుగు పరిచేందుకు కెరీర్‌పై గైడెన్స్‌ ఇచ్చే బాధ్యతలను సమత తీసుకుంది.విద్యార్థుల మేథస్సు, ఆసక్తి, అభిరుచిల ఆధారంగా పైచదువులకు సంబంధించిన కోర్సుల ఎంపికలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రభుత్వం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యా యులు సహకరించనున్నారు. అల్లూరి సీతారామారాజు జిల్లాలో ఐదు కాలేజీలు,ఐదు జిల్లా పరిషత్‌ హైస్కూల్లో కెరీర్‌ గైడెన్స్‌పై విద్యార్ధినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు.పాడేరులో ఏపీ ట్రైబల్‌ వెల్ఫేర జూనియర్‌ కాలేజీ,రెసిడెన్సీయల్‌ బాలికల పాఠశాల,ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ,బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాల, అరకువ్యాలీలో ఏపీ గిరిజన రెసిడెన్సీ యల్‌ జూనియర్‌ కాలేజీ,ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ,ఏపీ రెసిడెన్సీయల్‌ బాలుర హైస్కూల్‌(రవ్వలగుడ), ఏపీ రెసిడెన్సియల్‌ బాలికల వసతి గృహం(కొత్త భల్లుగుడ), అనంతరగిరి మండలంలో బొర్రా గిరిజన ఆశ్రమ పాఠశాల,అనంతగిరి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ,టోకూరు ఏపీ ట్రైబల్‌ బాలికల వెల్ఫేర్‌ రెసిడెన్సీయల్‌ స్కూల్‌ మొత్తం ఐదు జూనియర్‌ కాలేజీలు,ఐదు జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో కెరీర్‌ గైడెన్స్‌పై రిసోర్సు పర్సన్లు నరేష్‌, హరివెంకట రమణ,సమత డెరైక్టెర్‌ సుశాంత్‌ ప్రాణిగ్రహి, కె.సతీస్‌కుమార్‌లు కలసి విద్యార్ధినీ విద్యార్థులకు తగు సూచనలిచ్చారు. టెన్త్‌,ఇంటర్‌ తర్వాత విద్యార్థులకు ఆర్ధిక, మానసిక,విద్యాపరమైన ప్రోత్సాహం చాలా అవసరం.కానీ గిరిజన గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఈ రకమైన ప్రోత్సహం సరిగ్గా అందడం లేదు.ఈ కారణంగా ప్రతభి ఉన్నా సరే అనుకున్న లక్ష్యాల్ని ఉన్నతమైన స్థానాన్ని విద్యార్థులు చేరుకోలేకపోతున్నారు.విద్యార్థులు వెనకబడిపోకుండా ఉండేందుకు మేమున్నాం.. అంటూ చేయందించి భరోసా కల్పించే ప్రయత్నం సమత చేస్తోంది.ఇది విద్యార్థులు, యువతను ఉన్నత చదువులు చదివించటంతో పాటు కెరీర్‌ గైడెన్స్‌ కల్పించి ప్రయోజకుల్ని చేస్తోంది.నైపుణ్యం పెంచుకోవడం,మంచి కళాశాలలు,విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకునే విధానాలు,ప్రాంగణ నియామకాలపై వక్తలు అవగాహన కల్పిస్తున్నారు. మరి,ఈ సంస్థ అందించిన ప్రొత్సాహాన్ని..ప్రతిభ గల నిరుపేద గిరిజన విద్యార్థులు ఎలా సద్విని యోగం చేసుకుంటున్నారో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..!గిరిజన విద్యార్థుల్లో ప్రతిభ ఉన్నా కానీ,పేదరికంవల్ల పదో తరగతితోనో,ఇంటర్‌తోనో చాలా మంది విద్యార్థులు చదువును ఆపేస్తున్నారు. అలా ఆగిపోకూడదనే లక్ష్యంగా సమత మోటివేషన్‌ ప్రోగ్రామ్‌(కెరీర్‌పై అవగాహన)కార్యక్రమాన్ని వినూత్నమైన రీతిలో చేపడుతుంది. పాడెరు, అరకు,అనంతరగిరి మండలాల్లోని ఎంపిక చేసిన గిరిజన ఆశ్రమ పాఠశాలలు,గిరిజన సంక్షేమ ఇంటర్మీడియట్‌ జూనియర్‌ కాలేజీలు, వసతి గృహాల్లోను మోటివేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తోంది.ఇప్పటి వరకు అనేక మంది యువతను తీర్చిదిద్ది స్వంత కాళ్లపై నిలబడేలా చేయూతనిస్తోంది. మారుమూల గ్రామాల్లో చదువుకోవాలనే కోరిక ఉండి కూడా ఆర్ధిక స్థోమత లేక చాలా మంది ఇబ్బందులు పడు తుంటారు. ముఖ్యంగా పదోతరగతి విద్యార్థు లు,వారంతా చదువుల్లో ప్రతిభ చూపిన ఆర్ధిక పరిస్థితుల కారణంగా పై చదువులను అభ్య సించలేక పోతున్నారు.ఈనేపథ్యంలో టెన్త్‌, ఇంటర్‌ పూర్తియిన తర్వాత వీటి అర్హతను బట్టీ ఏవిధమైన ఉద్యోగాలు పొందవచ్చు? పై చదువులకు వెళ్లాంటే ఏమి చేయాలి?అనే వ్యక్తిత్వ వికాసవంతమైన సలహాలు,సూచనలు ఇస్తూ ప్రొత్సహిస్తోంది. బాగా చదవగల సామార్ధ్యం ఉండి వారికి ఎవైనా సమస్యలు ఉన్నాయని తెలిస్తే వారికి మానసికంగా సహాయం చేస్తున్నారు.ఉన్నత చదువుల్లో ఏ కోర్సులు చదవాలి,ఏ కోర్సులు చదివితే బాగుంటుంది అనే అంశాలను వివరిస్తున్నారు. ముఖ్యంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌,కెరియర్‌ గైడెన్స్‌ లాంటి అంశాల్లో సహాయం చేస్తున్నారు.
సాంకేతికతతో ఉజ్వల భవిష్యత్తు
విద్యార్థులు విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ..అవసరాలకు అనుగు ణంగా నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఉజ్వల భవితను సొంతం చేసుకోవచ్చు.
తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలి
తల్లిదండ్రులు గర్వపడేలా విద్యార్థులు ఎదగాలి.జీవితంలో గొప్ప వ్యక్తులు సైతం మొదట్లో ఓటములు,ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నవారే.భయాలు,అపోహాలు వీడి ఆత్మవిశ్వాసం,ఏకాగ్రతతో మంచి ర్యాంకులు సాధించాఇ. సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి.- సైమన్ 

ఆ చట్టాలతో ఆదివాసులకు అన్యాయం

వ్యవసాయం నేడు ఆదివాసి జీవనా ధారాలలో అతి ముఖ్యమైన భాగమైంది. ప్రకృతి తో సహజీవనం చేస్తూ, సామూహిక జీవన విధా నాలపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసులు మార్కె ట్‌ ప్రేరేపిత పంటల వైపు ఆకర్షితుల వుతున్నారు. నూతన వ్యవసాయ చట్టాల ప్రభావం గురించి చర్చించుకునే ముందు ఆదివాసీల రక్షణ కోసం తెచ్చిన చట్టాలకు సంబంధించి జరిగిన ఉల్లం ఘనలను పరిశీలించటం అవసరం. భారత రాజ్యాంగంలోని 244వ అధికరణంలోని ఐదవ షెడ్యూల్‌ను‘రాజ్యాంగంలోరాజ్యాంగం’గా వర్ణిస్తుం టారు. షెడ్యూల్డ్‌ ఏరియాగా గుర్తించిన ప్రాంతం లో ఆదివాసులు గిరిజనేతరుల నుంచి,వడ్డీ వ్యా పారం నుంచి దోపిడీకి గురి కాకూడదని, ఆదివా సి జ్ఞానం,సంస్కృతి,పాలనావ్యవస్థలపై ఆధార పడి అభివృద్ధి పథకాలు ఉండాలని,షెడ్యూల్‌ ప్రాంత సంరక్షకులుగా రాష్ట్ర గవర్నర్‌ వ్యవహరి స్తారని,రాష్ట్ర, కేంద్రప్రభుత్వ చట్టాలు ఐదో షెడ్యూ ల్‌ స్ఫూర్తికి అనుగుణంగా ఉంటేనే అమలు జరపా లని భారత రాజ్యాంగం నిర్దేశించింది.చట్టాల రూపకల్పనలో రాజ్యాంగంలోని సమానత్వపు హ క్కు ఆర్టికల్‌ 14,ఎలాంటి వివక్షకు గురికా కుండా కాపాడే ఆర్టికల్‌ 15(4), ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధిని ఆకాంక్షించే ఆర్టికల్‌19(1)(జి), గౌర వంతో జీవించే హక్కు ఆర్టికల్‌ 21లను పరిగ ణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వీటితోపాటు గిరిజనేతరులకు షెడ్యూల్డ్‌ ప్రాంతంలో భూములు లీజుకు తీసుకోవడానికి కాని, కొనడానికి కాని, అమ్మే హక్కు కాని లేవని భూపరాయీకరణ నిరోధక చట్టం 1/70స్పష్టం చేస్తోంది.ప్రతి ఆది వాసి సమూహానికి తమగ్రామ పరిధిలోని సహజ వనరులను పాలించే శక్తి గ్రామసభలకు ఉందని స్పష్టం చేసిన పీసాచట్టం 1996లో వచ్చింది. గ్రామంలో జరిగే ఎలాంటి అభివృద్ధి పథకానికైనా గ్రామసభల అనుమతి కావాలి. వడ్డీ వ్యాపారాన్ని కట్టడి చేయటంలో గ్రామసభలకు అధికారం ఉంది. అలాగే తమ గ్రామ సంప్రదాయ సరిహ ద్దులలోని సహజ వనరుల (లఘు ఖనిజాలు, చిన్న నీటి వనరులతో సహా) నిర్వహణ, రక్షణ, యాజమాన్యం,వినియోగంలో గ్రామసభలకే అధి కారం ఉందని ఈ చట్టం చెబుతున్నది. గుర్తించిన అటవీ భూములలో డిసెంబర్‌ 2005కన్నా ముందునుంచి నివసిస్తున్న,సాగుచేస్తున్న ఆదివా సులకు,అడవిపై ఆధారపడి జీవిస్తున్న వారికి, ఆవాసాలు ఏర్పరచుకున్న పివిటిజిలకు ఉన్న హక్కులు గుర్తించి, దఖలు చేయాలని పేర్కొం టున్న అటవీహక్కుల గుర్తింపు చట్టం 2006లో అమలులోకి వచ్చింది. వ్యక్తిగత హక్కులు, అటవీ వనరులపై సామూహిక హక్కులు, ఆవాసాలపై పివిటిజిలకు హక్కులు, వాటి నిర్వహణ, యాజ మాన్యం, వినియోగం గ్రామసభ అధీనంలో ఉంటాయని ఈ చట్టం చెబుతున్నది. భూములు, అటవీ భూములను ఇతర ప్రాజెక్టులకు మరలించా లన్నా గ్రామసభల అనుమతి తప్పనిసరి అని ఈ చట్టాలు చెబుతున్నాయి. ఇంత పకడ్బందీగా రాజ్యాంగ రక్షణలతో ఉన్నా షెడ్యూల్‌ ప్రాంతం లోని ఈ అంశాలను కొత్త వ్యవసాయ చట్టాలు పట్టించుకున్నాయా? ఈ కొత్త చట్టాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు సంబంధించినవి కాబట్టి వీటి ప్రభావం షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఎలా ఉంటుందో పరిశీలించటం అవసరం.గత 30 సంవత్సరా లుగా ఆదివాసులు తిండి కొరకు ఎంతో కొంత పంటలు పండిరచుకుంటున్నారు.మార్కెట్‌ డిమాం డ్లకు అనుగుణంగా వాణిజ్య పంటలను పండిరచే రైతులుగా వాళ్లు మార్కెట్‌ చట్రంలో ఇరుక్కు న్నారు. అడవుల పెంపకం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేది లేదా వాతావరణ మార్పు లకు పరిష్కారం అనే కర్బన ఉద్గారాల అమ్మకాల మార్కెట్‌ కూడా అంతర్జాతీయంగా 2000 సంవ త్సరం నుంచి మొదలైంది. ఉదాహరణకు బయో డీజిల్‌ తోటల పెంపకం చేపట్టిన ఆదిలాబాద్‌ జిల్లా పవర్‌గూడా సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుతో ప్రపంచ బ్యాంకు కర్బన వ్యాపార ఒప్పందాలను 2003లో చేసుకోవటం గమనార్హం. భూమినీరు,అడవి, గాలి వ్యాపారానికి సరుకులుగా మారుతున్న క్రమం మనం గమనిస్తున్నాం.ఈ మధ్య రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పడి పంటలు,ఫలసాయాల సేకర ణ,శుద్ధి,ప్యాకింగ్‌,అమ్మకాలు జరుగుతు న్నాయి. ఆదివాసి ప్రాంతాలలో ప్రభుత్వం ఇటీవల సేంద్రి య పద్ధతిలో ఆహారపంటల ఉత్పత్తిని జీరో బడ్జెట్‌ ప్రకృతి వ్యవసాయం పేరుతో ప్రారంభిం చింది. మార్కెట్ల డిమాండ్‌కు అనుగుణంగా వాణి జ్య పంటలైనా,సేంద్రియ పంటలైనా పండిరచే రైతులుగా ఆదివాసీలు మారుతున్న పరిణామం ఇది. పెట్టుబడిదారీ విధానాలు ఆదివాసి జీవితా లను సంక్షోభాలకు గురిచేస్తుంటే మరో పక్కన ప్రాజెక్టులు,గనులు,పరిశ్రమలు,అభయార ణ్యాలు, జాతీయ పార్కులు,హైవేలతో ఆదివాసులు నిరం తరం నిర్వాసితులు అవుతున్నారు. అంతర్జాతీయ వ్యాపార ఒప్పందాల వల్ల ఎగుమతుల మార్కెట్‌పై దృష్టి ఉంది కనుక ఎగుమతుల పంటల ఉత్పత్తి కోసం ఆదివాసీ ప్రాంతాల్లో ఒత్తిడి పెరిగింది. ఆయిల్‌పామ్‌ చెట్లను ఉద్యానవనాల నుంచి తోటల పెంపకం కేటగిరికి మార్చి పెద్ద ఎత్తున ప్రైవేట్‌ పెట్టుబడులు వచ్చేలా చేయడానికి ప్రయ త్నాలు ప్రారంభమయ్యాయి. భూములను లీజుకు తీసుకునే చట్టాలు తెమ్మని కంపెనీలు ప్రతిపాదిస్తు న్నాయి. అటవీ వనరుల నిర్వహణలో కూడా కర్బన, కలప వ్యాపారం,టూరిజంల కోసం ప్రైవే ట్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టే ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాయి. ప్రైవేట్‌ పెట్టుబడులకు భూమి, సహజ వనరులు,కూలీలు కావాలి, రైతులు హక్కు దారులుగా ఉంటారేమో కానీ భూమిపై పంటల నిర్ణయం మాత్రం వ్యాపారులు లేదా కంపెనీల చేతిలో ఉంటుంది. ఆదివాసులకు రక్షణగా ఉన్న చట్టాల సవరణ కోసం గత పదేళ్లుగా షెడ్యూ ల్‌ ప్రాంతాల్లో ఎన్నో ప్రయత్నాలు జరుగుతు న్నాయి. ఇప్పుడు నూతన వ్యవసాయ చట్టాలు భూములు, అటవీ వనరులు, సహజవనరులకు సంబంధించి పెట్టుబడుల ప్రవేశాన్ని మరింత సుగమం చేస్తాయి. గతమూడు దశాబ్దాలలో వ్యవస్థీకృతం చేసిన పథకాలు, విధానాలు వీటికి అండగా ఉంటాయి.
కొత్తగా వచ్చిన వ్యవసాయ చట్టాలు, ప్రధానంగా కాంట్రాక్ట్‌ వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీల ఆధ్వర్యంలో నడిచే మార్కెట్‌ యార్డులలో లేదా వాటి బయట నియంత్రణ లేని మార్కెట్లను అమలుచేస్తాయి. 5 ఎకరాల లోపు ఉన్న ఆదివాసులు ఒక్కొక్కరుగా వ్యవసాయం చేయటం వృథా అని గ్రూపులుగా చేసే విధంగా ఒప్పందాలు జరుగుతాయి. ఈ పంటలకు కావాల్సిన పెట్టుబడులు కూడా ముందే కుదుర్చుకున్న ధరల ఒప్పందాల రూపంలో అందిస్తూ ఆదివాసి రైతులను కాంట్రాక్ట్‌ వ్యవ సాయంలోకి దించుతారు.కాంట్రాక్ట్‌ వ్యవసా యంలో ఒప్పందం కుదుర్చుకున్న పంటల సాగుకు చిన్న నీటివనరులపై ఒత్తిడి పెరుగుతుంది. కంపె నీలు,అగ్రిబిజినెస్‌ కార్పొరేషన్లు గ్రామంలో ఉన్న గ్రూపులు లేదా రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో ఈ ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలపై నియంత్రణలు లేవు కనుక పాన్‌కార్డు ఉన్న వ్యక్తి, సంఘం,కంపెనీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఏర్పడ్డ గ్రూపులు డైరెక్టుగా కొనుగోలు చేసి ఎలక్ట్రానిక్‌ వ్యాపారం చేసుకోవచ్చు.ఆహార పదార్థాలు అనగా వరి, గోధుమ,జొన్న,చిరుధాన్యాలు, పప్పులు, నూనెగిం జలు, కూరగాయలు, పళ్ళు, మసాలా దినుసులు, కోళ్ళు,గొర్రెలు,మేకలు,పాలఉత్పత్తులు సహజ రూపంలో లేదా శుద్ధి చేసిన రూపంలో సేకరించి పాన్‌కార్డు కలిగిన వారు ఎలక్ట్రానిక్‌ వ్యాపారం చేసుకోవచ్చు. వాళ్లు చెప్పిన ధరకు ఆదివాసులు అమ్ముకోవాలి.నియంత్రణ లేని వ్యాపార లావా దేవీల వేదికలు షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గ్రూపుల ద్వారా,సంఘాల ద్వారా జరిగే ప్రమాదంఉన్నది. ప్రజల ఆకలిని తీర్చే, పోషకాహారాన్నిచ్చే సహజ వనరులు,వాటి ఉత్పత్తులు పోటీ మార్కెట్లో వ్యా పార వాణిజ్య సరుకులుగా మారతాయి. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో భూముల విషయంలో చట్టాలు ఇంకా పకడ్బందీగా ఉన్నాయి కనుక భూములు లీజుకు తీసుకోవడం లేదా కొనడానికి బదులు కాంట్రాక్ట్‌ వ్యవసాయాన్ని తేలికగా చేసుకునే అవకాశా లున్నాయి. స్థానిక సంతల నిర్వహణ, వాటిపై యాజమాన్యం పీసా చట్టం ప్రకారం గ్రామసభ లదే. ఉత్పత్తుల కోసం పెట్టుబడులు, సేకరణ, కొనుగోలు, ఎలక్ట్రానిక్‌ వ్యాపారమైనా, గ్రూపుల ద్వారా జరిగినా గ్రామసభ అనుమతి కావాలి. ఈకొత్త చట్టాలలో గ్రామసభల అంశ మే లేదు కనుక అవి నిర్వీర్యం అవుతాయి. జిసిసి లాంటి సంస్థలు కార్పొరేట్‌ ఆధిపత్యం క్రిందికి వస్తాయి. కాంట్రాక్ట్‌ వ్యవసాయపు ఒప్పందాలు చేసుకున్న వారితో లేదా ఉత్పత్తుల అమ్మకం విషయంలో ఆదివాసులకు,ఇతర వ్యక్తులకు, గ్రూపులకు, కంపెనీలకు మధ్య వివాదాలు తలెత్తితే గ్రామ సభలో తీర్మానం చేసుకునే అధికారం పీసా చట్టం ద్వారా ఇప్పటివరకు ఉండేది. లేదా వివాదాలతో ఆదివాసుల ఆత్మగౌరవం దెబ్బతి న్నా, వారు మానసిక,భౌతిక హింసకు గురై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంకింద క్రిమినల్‌ కోర్టుకు వెళ్ళి న్యాయం అడగొచ్చు.కాని ఈ కొత్త వ్యవసాయ చట్టాలలో ఆర్డీవో స్థాయిలో సంప్ర దింపుల కమిటీకి వెళ్ళి వివాదాలు విన్నవించు కోవాలి. బలమైన మార్కెట్‌ శక్తుల ముందు నిలబడి ఆదివా సులు తమ వివాదాలను ఆర్డీవో స్థాయి అధికారితో పరిష్కరించుకుంటారని ఊహించటం అర్థం లేనిది. గ్రామసభల శక్తిసా మర్థ్యాలను, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పూర్తిగా ఈకొత్త చట్టాలు పక్కదోవ పట్టిస్తున్నాయి. ప్రజల అవసరా లకు కావలసిన ఆహార పదార్థాలు, నిల్వలు అందు బాటులో ఉండాలని,ధరల నియంత్రణ ఉం డాలని 1955లో తెచ్చిన నిత్యావసర సరుకుల చట్టం పేర్కొంటోంది. దీనిద్వారానే ప్రజా పంపి ణీ వ్యవస్థ నడుస్తోంది.ఇప్పుడు ఆ చట్టానికి చేసిన సవరణతో ధాన్యాలు,పప్పులు,నూనె,నూనె గింజ లు,బంగాళాదుంపలు,ఉల్లిపాయలను నిత్యావసర సరుకుల జాబితా నుంచి తొలగించారు. ప్రభుత్వ రేటు ప్రకారం సంతలలో లేదా ప్రజాపంపిణీ వ్యవస్థలలో కొనుక్కునే ఆదివాసులు ఇక పూర్తిగా మార్కెట్‌పై ఆధారపడి వాటిని కొనుక్కుని విని యోగించే పరిస్థితి ఏర్పడుతుంది. నియంత్రణ లేదు కాబట్టి ఈఆహార పదార్థాలను ప్రైవేట్‌ మార్కెట్‌ చెప్పే రేటుకే కొనాల్సి ఉంటుంది. ఆహార భద్రత చేకూర్చే ప్రజాపంపిణీ వ్యవస్థలు నాశనమవుతాయి. రేషన్‌ షాపులపై ఆదివాసీల రోజువారి జీవితం ఆధారపడేలా ఈ 30 సంవ త్సరాలలో జరిగిన తంతు మనం ఇంతకు ముం దే తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సవరణ చట్టంతో ఆహారభద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముంది. ఇప్పటికే ప్రభుత్వ లెక్కల ప్రకారం 42శాతం మంది ఆదివాసీ పిల్లలుబరువు తక్కువగా పెరుగు తున్నారు. 15 నుంచి 49 సంవత్సరాల వయ సున్న ఆదివాసీ మహిళలు రక్తహీనతతో జీవిస్తు న్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థనే వీరికి ఇప్పటివరకు ఎంతో కొంత అండగా ఉంది.ఈ సవరణ చట్టం తో మార్కెట్‌ చెప్పే రేటుకు కొనలేక ఆదివాసీలు అత్యంత పేదరికంలోకి కూరుకుపోతారు. ఆది వాసీల స్వయంసమృద్ధి జీవన విధానం, రాజ్యాం గ రక్షణలు,స్వయంపాలనా చట్టాలు బలహీనమవు తాయి. కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా షెడ్యూల్డ్‌ ప్రాంతం విచ్ఛిన్నమై, పరాధీనమైపోతుంది.
సీసాలో ‘పీసా’ పాతర
పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా స్థానిక సంస్థలకు అధికారాలను కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం 73,74రాజ్యాంగ సవరణలను చేసింది.వీటిలో భాగంగా భూరియా కమిటీ సిఫా రసుల మేరకు 1996 లో పార్లమెంట్లో 40 వ చట్టం ద్వారా ‘పీసా’ అమల్లోకి తెచ్చింది. ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి 1994 పంచాయితీరాజ్‌ చట్టంలో మార్పులు చేశారు. 1998లోచట్టం 7ద్వారా రాష్ట్ర చట్టంలో కేంద్ర చట్టాన్ని పొందు పరచారు. చట్టం అమలు చేయ డానికి విధివిధానాలను 2011మార్చి 24న జీవో నంబర్‌ 66ను రాష్ట్ర పంచాయితీరాజ్‌ శాఖ జారీ చేసింది.ఏజెన్సీ ప్రాంతంలో మద్యం దుకాణాలు ప్రారంభించడానికి ‘పీసా’ చట్టం ప్రకారం గ్రామ సభల అనుమతి అవసరం. గతంలో విడుదల చేసిన జీవో నంబర్‌ 66 ప్రకారం ఏజెన్సీ గ్రామా ల్లో గ్రామసభలు నిర్వహించడానికి మొత్తం ఓటర్లలో మూడవ వంతు మంది హాజరైతేనే కోరం పూర్తయినట్టు. ఏ4మద్యం దుకాణాల కోసం నిర్వహిస్తున్న గ్రామసభలకు ఆదివాసీలు తక్కువ సంఖ్యలో హాజరు కావడంతో అవి తరచుగా వాయిదా పడతున్నాయి. ప్రభుత్వ ఆదా యానికి ఇది గండి కొడుతోంది. దీనితో ఆదివా సీల విస్తృతాభిప్రాయానికి గండి కొడుతూ కేవలం కొద్ది మందితో గ్రామసభ ఆమోదం పొందేలా కోరం నిబంధనలను మార్చి వేశారు. ఈ మేరకు 2019 అక్టోబర్‌ 10న పంచాయతీరాజ్‌ శాఖ జీవో 54జారీ చేసింది.దీనిప్రకారం 500 మంది ఆదివాసీ ఓటర్లుండే గ్రామంలో కేవలం 50 మంది (10 శాతం) గ్రామసభకు హాజరైతే కోరం సరిపోతుంది.501 నుంచి1,000 మంది ఉంటే 75 మంది,1,001నుంచి3,000 మంది ఉంటే 150 మంది,3,001నుంచి5,000మందికి 200,5,001 నుంచి10,000వరకూ 300 మంది,10 వేలకు పైగా ఓటర్లు ఉంటే 400 మంది హాజరైతే కోరం పూర్తయినట్టే.
పీసా చట్టం స్ఫూర్తిని దెబ్బతీసే మరో అంశం కూడా ఈ జీవోలో పొందు పరచారు. కోరం లేక గ్రామసభ వాయిదా పడితే వాయిదా పడిన రెండు గంటల వ్యవధి లోనే మళ్ళీ గ్రామ సభ నిర్వహిస్తారు. రెండవసారి కోరం లేకున్నా, ఎవరూ హాజరు కాకున్నా తీర్మా నం ఆమోదం పొందినట్టు థృవీకరిస్తారు. ఈ రెండు నిబంధన లతో ఏజెన్సీగ్రామసభలు పూర్తిగా అస్థిత్వం కోల్పో యినట్టే.54జీవోను కనీసం ప్రభుత్వ జీవోల వెబ్‌ సైట్లో కూడా పెట్టకపోగా వివిధ శాఖలకు, ఐటీడీ ఏలకు,పంచాయితీరాజ్‌ సంస్థలకు పంప లేదు.
జీవో చట్టబద్దతపై చర్చ
అదివాసీల అభిప్రాయాలు తెలుసుకోకుండా పీసా చట్టం స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా జారీ చేసిన 54జీవో చట్టబద్దతపై సర్వత్రా చర్చ జరుగు తోంది. 2018లోచట్టం5ద్వారా అమల్లోకి వచ్చి న కొత్త పంచాయితీరాజ్‌ చట్టంలో పీసా నిబం ధనలను చేర్చినప్పటికీ ఈచట్టం అమలు చేయ డానికి పూర్తి స్థాయిలో విధివిధానాలను (గైడ్‌ లైన్స్‌) ఇప్పటి వరకూ రూపొందించలేదు. 1998 లో సవరించిన పంచాయితీరాజ్‌ చట్టం ప్రకారం పీసా నిబంధనలను జీవో 66ద్వారా అమల్లోకి తెచ్చారు. కొత్తచట్టం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇదే జీవోను అమలు చేస్తున్నారు. కొత్త చట్టం అమల్లోకి రావడంతో పాత జీవో చెల్లదని వారంటున్నారు. ఇది చెల్లక పోతే ఈ జీవోలో కోరం కోసం సవరణలు చేస్తూ జారీ చేసిన కొత్త జీవో 54 మనుగడ కూడా ప్రశ్నార్థకం కానుంది. ఈ జీవోకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తామని ఆదివాసీ సంఘాలు హెచ్చరస్తున్నాయి.
నిబంధనలకు పాతర
గోదావరి చెంతనే గ్రామాలున్నా ట్రక్కు ఇసుక కావాలంటే ఒక యజ్ఞం చేయాల్సిందే. గిరిజనులు ఇల్లు కట్టుకోడానికి,మిర్చి కల్లాల్లోకి ఇసుక కావా లంటే సవాలక్ష నిబంధనలు పాటించాలి. స్థానిక అధికారుల నుండి ఐటిడిఎ అధికారుల వరకు అనేక ఆంక్షలు పెడుతున్నారు. ఎవరైనా ధైర్యం చేసి ఇసుక తోలుతే కేసుల వరకు వెళ్ళాల్సిందే. అలాంటిది మండలంలోని గుండాల ఇసుక రాంపులో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేస్తూ పక్క రాష్ట్రాలకు లారీల్లో తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.ఈ ఇసుక ర్యాంపు పెద్దలకు కాసుల పంటగా మారింది. లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను పక్క రాష్రాలకు తరలిస్తూ ప్రజా సంపదను దోచుకుంటున్నారు.దీనిపై ప్రశ్ని స్తే అనుమతులున్నాయని నిర్వాహకులు చెబుతు న్నారు. అనుమ తుల విషయం పక్కనపెడితే, ఇక్కడ ఇసుక అమ్మ కం కూడా ప్రభుత్వ నిబంధ నలకు విరుద్ధంగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్క రాష్ట్రం చత్తీస్‌ఘడ్‌ వేబిల్‌తో ఇతర రాష్ట్రాలకు ఇసుకను అక్రమ రవాణా చేస్తు న్నారని పలువురు విమర్శిస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా రోజుకు 20నుంచి 30వరకు లారీలు, ట్రాక్టర్లతో ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
గిరిజన చట్టాలు బేఖాతరు…
ఏజెన్సీలో ఎటువంటి ఖనిజ సంపద తవ్వకాలు చేయాలన్నా 1/70,పీసా చట్టాల ప్రకారం గ్రామ సభ నిర్వహించి స్థానిక పంచాయతీ అను మతి పొందాల్సి ఉంది. గ్రామసభ ఆమోదం లేకుండా ఏ అధికారికీ ఖనిజ సంపద తవ్వకాలకు అనుమ తులు ఇచ్చే అధికారం లేదు. అసలు గ్రామసభే నిర్వహించలేదని, ఇక్కడ ఇసుక తవ్వకాలకు తమ పంచాయతీ నుంచి ఎటువంటి ఆమోదం తెలియ జేయలేదని స్థానిక పంచాయతీ నాయకులు చెబు తున్నారు.
ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఏజెన్సీ లో స్థానిక గిరిజన సొసైటీలకు మాత్రమే క్వారీ నిర్వహించే అధికారం ఉంది. అది కూడా మను షులతో మాత్రమే తవ్వకాలు చేయాలి. నిబం ధనలు ప్రకారం ఏజెన్సీలో ప్రైవేటు వ్యక్తుల ఆధ్వ ర్యంలో ఇసుక ర్యాంపు నిర్వహణ చేయడానికి వీల్లేకపోగా, ఇక్కడ గిరిజనేతరులు, అందులోనూ స్థానికేతరులు జెసిబిలతో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను, గిరిజన చట్టాలనుతుంగలో తొక్కి గుండాల ఇసుక ర్యాంపుకు అనుమతులు ఎలా ఇచ్చారని ఆదివాసీ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. అందువల్ల చట్టాలకు, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న గుండాల ఇసుక ర్యాంప్‌ను మూసివేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని గిరిజన సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. నిర్వాహ కులు,అధికారులపై చట్టపరమైన చర్యలు తీసు కోవాలి. (రచయిత : సామాజిక కార్యకర్త)

పాఠశాలల్లో సంస్కరణలు నష్టదాయకం

పాఠశాలల విలీనం, ఇంగ్లీష్‌ మీడియం, సి.బి.ఎస్‌.ఇ, బైజూస్‌, సాల్ట్‌…పేరు ఏదైనా ప్రభుత్వ విద్యా రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ విద్యార్థుల నమోదు పెంచేదానికి, వారిని ప్రభుత్వ పాఠశాలల్లో నిలిపి ఉంచేందుకు, వారికి నాణ్యమైన విద్య అందించేదానికి ఉపయోగపడలేదనేది అనుభవంలో అర్థమవుతున్నది. ఈ సంస్కరణలన్నీ ఉపాధ్యాయుల కుదింపు, ప్రైవేటీకరణను ప్రోత్సహించే విధంగానే ఉన్నాయనేది స్పష్టం అవుతున్నది. దీనితో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బడుగు, బలహీన వర్గాల పిల్లలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
సమాజ పరివర్తనకు, దారిద్య్ర నిర్మూలనకు, ఆకలిని అంతం చేయడానికి ఒక విప్లవాత్మక సాధనం విద్య. పాలో ఫ్రీర్‌ అనే విద్యావేత్త విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ…మనిషి వ్యక్తిత్వ వికాసం, వ్యక్తి సామర్ధ్యాలను పెంచే సాధనం విద్య అన్నారు. అయితే విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రవేశపెడుతూ…ఈ సంస్కరణలన్నీ మన పిల్లలను ప్రపంచ స్థాయి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికని నమ్మబలు కుతున్నది. కానీ ఇవి మన చిన్నారులను ప్రపంచ స్థాయి విద్యార్థులుగా తయారు చేయడం సంగతి అటుంచి వారిని విద్యకే దూరం చేసేలా వుండడం విచారకరం. ఎన్‌.ఇ.పి-2020 అమలు పేరుతో మూడు కిలోమీటర్లలోపు వున్న పాఠశాలలను విలీనం చేయడానికి సిద్ధమైన ప్రభుత్వం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆందోళనలతో దానిని ఒక కిలోమీటర్‌కు కుదించి అమలు చేశారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు ‘మా ఊరు బడి మా ఊరిలోనే ఉండాలి’ అని చేసిన తీవ్రమైన ఆందోళనలు, ఎమ్మెల్సీల బస్సు యాత్రలు, ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలతో ప్రభుత్వం మొదట ప్రకటించిన అన్ని స్కూళ్లను విలీనం చేయలేకపోయింది. 5,400 ప్రాథమిక పాఠశాలలు, 600 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. దీంతో ఇప్పటికే ఏకోపాధ్యాయ పాఠశాలలుగా ఉన్న 8000 పాఠశాలలతో పాటు మరో 4000 పాఠశాలలు ఏకో పాధ్యాయ పాఠశాలలుగా మారాయి. విభజించిన తర్వాత ఒకటి రెండు తరగతులు మిగిలి ఉన్న ప్రాథమిక పాఠశాలల పరిస్థితి దయనీయంగా వుంది. ఇక్కడ 10 లేదా అంతకన్నా తక్కువ విద్యార్థులు, ఒకే ఒక్క ఉపాధ్యాయుడితో…పాఠశాలకు ఉండవలసిన హంగు, ఆర్భాటాలను కోల్పోయి…సహజ మరణం పొందే బడులుగా మారాయి. దీనితో ఆ పాఠశాలలో మిగిలిన విద్యార్థులు చదువు మానేయడం లేదా ప్రైవేటు పాఠశాలలకు తరలిపోవడం తప్ప మరో దిక్కు లేని వారిగా మిగిలిపోయారు. తీరా ఇప్పుడు విలీనం తర్వాత మిగిలిన ఒకటి రెండు తరగతులలో పది లేదా అంతకన్నా తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియ మించడానికి రూపొందించిన జీవో-117 నిబంధనలు ఉపాధ్యాయుల కుదింపే లక్ష్యంగా ఉన్నాయి. దీనితో 37 వేల యస్‌.జి.టి పోస్టులు, 18 వేల స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు కనుమరుగు అయ్యాయి. ఉపాధ్యాయులను కుదించి ప్రపంచ స్థాయి విద్యార్థులను తయారు చేయడం ఎలా సాధ్యమో పాలకులే చెప్పాలి. ఈ విలీన ప్రక్రియ వలన అందుబాటులో ఉన్న స్కూలు నుండి దూరంగా ఉన్న స్కూలుకు విద్యార్థులను బలవంతంగా తరలించడం వలన విద్యార్థులు చదువు మధ్యలోనే బడి మానేస్తారనే ఆందోళన వ్యక్తం అవుతున్నది. దీనితో అందరికీ విద్య అందించాలనే రాజ్యాంగ లక్ష్యం నెరవేరదు. ఇది 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టిన ఆర్టికల్‌ 21-ఏ ని ఉల్లంఘించడమే అవుతుంది. విలీనం అనంతరం రేషనలైజేషన్‌ కోసం జీవో-117 ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తిని ప్రాథమిక పాఠశాలలో 1:30, ప్రాథమికోన్నత పాఠశాలలో 1:45, ఉన్నత పాఠశాలలో 1:53గా నిర్ణయించారు. ఇది విద్యా హక్కు చట్టం-2009 నిబంధన లకు విరుద్ధంగా ఉంది. విద్యాహక్కు చట్టం-2009లో ప్రాథమికోన్నత పాఠశాలలో 1:35, ఉన్నత పాఠశాలలో 1:45 ఉండాలని సూచించారు. కానీ దీనికి భిన్నంగా ఉపాధ్యా యుల కుదింపే లక్ష్యంగా జరిగింది. ఇది విద్యార్థుల అభ్యసనా ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఉపాధ్యాయులకు అదనపు భారం మోపడంతో ఆనందకరమైన బోధనా అభ్యసన భారంగా మారే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఈ సంస్కరణలు ప్రవేశపెట్టడానికి సాకుగా చూపుతున్న ఎన్‌.ఇ.పి-2020లో కూడా 5ం3ం3ం4 అనేది అభ్యసనా దశలుగానే ప్రకటించింది తప్ప దీనికోసం భౌతికపరమైన విభజన అవసరం లేదని స్పష్టంగా ప్రకటించారు. అందువలన ఈ విలీన ప్రక్రియ రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 21-ఎ, విద్యాహక్కు చట్టం-2009, ఎన్‌.ఇ.పి-2020 లను పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుంది. అభివృద్ధి చెందిన అన్ని దేశాల విద్యా వ్యవస్థలు, చివరికి ఎన్‌.ఇ.పి-2020 కూడా బోధనా భాషగా మాతభాషను ఒకటి నుండి ఐదు తరగతుల వరకు, అవసరమైతే ఎనిమిదో తరగతి వరకు కొనసాగించడం ద్వారానే పిల్లలలో భావనలు, అభివృద్ధి అర్థవంతంగా ఉంటుందని తెలియజేస్తున్నాయి. ఇంగ్లీష్‌ భాష నేర్చుకోవడానికి బోధనా భాష ఆటంకం కాదని విద్యావేత్తలు చెప్తున్నారు. కానీ అశాస్త్రీయ పద్ధతిలో బోధనా భాషగా ఇంగ్లీషును ప్రవేశపెట్టి పిల్లలను బలవంతంగా ఇంగ్లీష్‌ మీడియంలోకి నెట్టడం పిల్లల హక్కులను కాలరాయడమే. కనీసం ఏ భాషలో చదువుకోవాలో నిర్ణయించుకునే అవకాశం కూడా వారికి ఇవ్వకపోవడం పిల్లలపై ప్రభుత్వం చేస్తున్న దాడిగానే పరిగణించాలి. దీనితో పిల్లలు ఇంటి భాషకు, బోధనా భాషకు మధ్య సమన్వయం చేసుకోలేక భావనలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులకు గురవుతుంటే భవిష్యత్తులో ఏ విధంగా విజయవంతం అవుతారో ఏలిన వారికే తెలియాలి. దీనికి భిన్నంగా ప్రైవేటు వ్యవస్థలో కూడా మాతృభాషలో బోధనను తప్పనిసరి చేయడం ద్వారానే పిల్లల జ్ఞానాభివృద్ధి, జ్ఞానతష్ణను తీర్చగలం. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను కేంద్ర జాబితా నుండి ఉమ్మడి జాబితా లోకి మార్చడం జరిగింది. ఆ యా రాష్ట్రాలలో ఉన్న భౌతిక పరిస్థితులు భౌతిక వనరుల ఆధారంగా విద్యలో కావలసిన మార్పులు, చేర్పులు చేసుకునే అధికారం రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించింది. 2019లో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను నిరాకరిస్తూ అన్ని వ్యవస్థలను కేంద్రీకృతం చేస్తుంది. దానిలో భాగంగానే విద్యా రంగంలో కూడా నీట్‌-2020, ఎన్‌.ఇ.పి-2020, సిలబస్‌లో చరిత్రను మార్చడం వంటివి చేస్తున్నది. అన్ని రాష్ట్రాలు సిబిఎస్‌ఇ ప్రవేశపెట్టాలని ఒత్తిడి తెస్తున్నది. రాష్ట్రాలలో ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి కరికులం, బోధనా పద్ధతులను తయారు చేస్తుంది. సి.బి.ఎస్‌.ఇ ప్రవేశపెట్టడం ద్వారా కరికులం, బోధనా పద్ధతుల్ని ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి నిర్ణ యిస్తుంది. సి.బి.ఎస్‌.ఇ ప్రవేశపెట్టడం ద్వారా చరిత్రలో మన రాష్ట్ర సంబంధిత అంశాలు ఉండే అవకాశం ఉండదు. అందువలన దీనిని ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి పరిధిలోనే ఉంచి సి.బి.ఎస్‌.ఇ లోని మంచి అంశాలను స్వీకరించవచ్చు. విద్యా వ్యవస్థలో అద్భుత ఫలితాలు సాధించిన ఢల్లీి ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్న సి.బి.ఎస్‌.ఇ, ఐ.సి.ఎస్‌.ఇ బోర్డులతో పాటు డి.బి.ఎస్‌.ఇ ని ప్రారంభించి దాని అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నది. దీనికి భిన్నంగా సిబిఎస్‌ఇని ప్రవేశపెట్టి ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి ని నిర్వీర్యం చేయడమనేది రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం. విద్యాబోధనలో టెక్నాలజీని మిళితం చేయడాన్ని ఆహ్వానించాల్సిందే. అయితే ఉపాధ్యాయుల బోధనకు బైజూస్‌ ప్రత్యామ్నాయం కాదు. కరోనా కాలంలో ఉపాధ్యాయుని ప్రత్యక్ష బోధనకు డిజిటల్‌ లెర్నింగ్‌ ప్రత్యామ్నాయం కాదని అందరికీ అనుభవం అయింది. దీనికి భిన్నంగా మంచి ఉపాధ్యాయులను గుర్తించి వారితో డిజిటల్‌ కంటెంట్‌ రూపొందించుకుంటే అది ఎక్కువ ఫలితాన్ని ఇచ్చి ఉండేది.
పాఠశాలల విలీనం, ఇంగ్లీష్‌ మీడియం, సి.బి.ఎస్‌.ఇ, బైజూస్‌, సాల్ట్‌…పేరు ఏదైనా ప్రభుత్వ విద్యా రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ విద్యార్థుల నమోదు పెంచే దానికి, వారిని ప్రభుత్వ పాఠశాలల్లో నిలిపి ఉంచేందుకు, వారికి నాణ్యమైన విద్య అందించేదానికి ఉపయోగపడలేదనేది అనుభవంలో అర్థమవుతున్నది. ఈ సంస్క రణలన్నీ ఉపాధ్యాయుల కుదింపు, ప్రైవేటీకరణను ప్రోత్సహించే విధంగానే ఉన్నాయనేది స్పష్టం అవుతోంది. దీనితో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బడుగు బలహీన వర్గాల పిల్లలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. స్కూళ్ల విలీనం పేరుతో గందరగోళం సృష్టించడంతో, ప్రభుత్వ పాఠశాలల నుండి ప్రైవేటు స్కూళ్లకు ఈ సంవత్సరం లక్షల్లో పిల్లలు తరలి వెళ్లారు. విద్యార్థులలో పఠన సామర్థ్యాలు, గణిత సామర్థ్యాలు 2012 ముందు నాటి స్థితికి పడిపోయాయని ‘అసర్‌ రిపోర్టు-2022’ తెలియజేస్తున్నది. ఏకపక్షంగా అమలు చేసిన సంస్కరణలతో విద్యార్థుల చదువు గందం గోళంలో పడిరది. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం…ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా ఆలోచించాలి. లేని పక్షంలో విద్యా రంగంలో సానుకూల ఫలితాల కోసం ప్రజలే పోరు బాట పడతారు.
సమైక్యతా సాధనంగా విద్య..
స్వతంత్ర భారత దేశ తొలి విద్యాశాఖా మంత్రి మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ పుట్టిన రోజు నవంబర్‌ 11న జాతీయ విద్యా దినోత్సవంగా పాటించబడుతోంది.1947 ఆగస్టు 15 నుంచి తాను మరణించిన 1958 ఫిబ్రవరి 22 వరకు పదిన్నర సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన మౌలానా ఆజాద్‌ దేశ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు పునాదులు వేశారు. రాజ్యాంగ విలువలతో కూడిన లౌకిక విద్యను అన్ని స్థాయిల్లోనూ అందరికీ సమా నంగా అందించేందుకు బహుముఖ పథకాలు, ప్రణాళికలు రచించారు. కామన్‌ స్కూల్‌ సిస్టం, 10ం2ం3గా విద్యా విధాన చట్రాన్ని నిర్ధారించారు. బ్రిటీష్‌ పాలనలోని పరిమి తులను అధిగమించి శాస్త్ర సాంకేతిక రంగాల్లో సత్వర ప్రగతిని సాధించేందుకు వివిధ స్థాయిల్లో విద్యారంగం పరిస్థితిని పరిశీలించి సరైన దిశా నిర్దేశాలు చేయటానికి విశేష కృషి చేశారు. 1948లో ప్రాథమిక, ఉన్నత విద్యకు, 1952లో సెకండరీ విద్యకు ప్రత్యేక కమిషన్‌లు నియమించారు. తొలి ఐదేళ్ళ కాలంలోనే యుజిసి, ఐసిసిఆర్‌, ఎఐసిటియు, సిఐఎన్‌ఆర్‌, తదితర అత్యున్నత సంస్థలతోపాటు ఖరగ్‌పూర్‌లో ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యాసంస్థను, సంగీత, సాహిత్య, లలితకళా అకాడమీలను ఏర్పాటు చేశారు. దేశం గర్వించే విద్యాశాఖామాత్యులుగానే కాక బహుముఖ ప్రజ్ఞానా శాలిగా, సుప్రసిద్ధ రాజనీతిజ్ఞుడిగా, హిందూ, ముస్లిం సమైక్యతా సారథిగా మౌలానా ఆజాద్‌ స్వతంత్ర భారత నిర్మాతల్లో ప్రము ఖులుగా చరిత్రలో నిలిచిపోయారు. ఆయనకు మరణానం తరం 1992లో ‘’భారతరత్న’’ బిరుదునిచ్చి గౌరవించారు.
ఆయన చనిపోయి 57 సంవత్సరాలు గడిరచింది. కానీ ఆయన తలపెట్టిన విద్యావిధానం ఇంకా అసమగ్రంగా, అనేక మందికి అందకుండా నిరాశా నిస్పృహలతో నిట్టూరుస్తోంది. జాతీయ సగటు అక్షరాస్యత 73.9 శాతంగానే ఉండిపోవటంతో ఏడు సంవత్సరాలు పైబడిన జనాభాలో 28.7 కోట్ల మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. ప్రపంచంలోని మొత్తం నిరక్షరా స్యుల్లో 37 శాతం మంది మన దేశంలోనే ఉండడం పాలకుల అసమర్థ పాలనకు నిలువెత్తు నిదర్శనం. కనీసం 14 ఏళ్ళ ప్రా యం వరకైనా బాలబాలికలకు ఉచితంగా, నిర్బంధంగా విద్యను అందించాలనే మౌలానా ఆకాంక్షకు అనుగుణంగా ఎట్టకేలకు విద్యా హక్కు చట్టం వచ్చినా కేంద్రంలోని కాంగ్రెస్‌, బిజెపి పార్టీల పాలనా వైఫల్యాలతో అది కాగితాలకే పరిమితమయింది. పాఠ శాలల్లో చేరిన విద్యార్థులలో సగం మంది 8వ తరగతి కూడా చ దవకుండా మధ్యలోనే మానేస్తుండడంతో పాఠశాల విద్యా సా ్థయికి చేరుకోలేక పోతున్నారు. నిరక్షరాస్యుల్లో, మధ్యలోనే బడి మానేస్తున్న వారిలో అధికులు దళితులు, గిరిజనులు, మైనార్టీలే.
పాఠశాల విద్యను గట్టెక్కిన వారిలో కూడా అందరూ పై చదువులకు పోవటం లేదు. 15-18 సంవత్సరాల వయస్కుల్లో 22 శాతం మంది మాత్రమే కాలేజీల్లో చేరుతు న్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశ జనాభాల్లో గ్రాడ్యుయేట్లు 4.5శాతం మందే ఉన్నట్లు 2011 జనాభా లెక్కలు వెక్కిరిస్తు న్నాయి. ఇక నాణ్యత విషయంలోనూ నాసికరమే. ప్రథమ్‌ సంస్థ ప్రకటిం చిన వార్షిక విద్యాస్థాయి-2014 నివేదిక ప్రకారం 5వ తరగతి విద్యార్థుల్లో సగం మంది, 8వ తరగతి విద్యార్థుల్లో నాల్గవ వం తు మంది రెండవ తరగతి తెలుగు వాచకాన్ని కూడా తప్పులు లేకుండా చదవలేకపోతున్నారు. అంతేకాదు 3వ తరగతి గణి తంలోని కూడిక లు, తీసివేతలు, భాగహారాలు కూడా చేయలేక పోతున్నారని తేల్చింది. నిర్ణీత విద్యా ప్రమాణా లు లేకపోవడం అనేది పాఠశాలల స్థాయికే పరిమితంకాక అన్ని స్థాయిల్లోనూ అదే పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇంజనీరింగ్‌ అర్హత కలిగిన వారిలో 15 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలకు సరి పడిన సామర్థ్యం ఉంటు న్నట్లు పారిశ్రామిక సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచంలోని అత్యున్నత ప్రమా ణాలు గల 200 విశ్వ విద్యాలయాల్లో భారతదేశానికి చెందినవి ఒక్కటి కూడా లేదు.వివిధ దేశాల్లోని విద్యార్థుల స్థాయినీ బేరీజువేసే అంతర్జాతీయ సంస్థ (పిఐఎస్‌ఐ) జాబితా నుంచి భారతదేశం ఆరేళ్ల క్రితమే తప్పుకున్నది. ప్రపంచ దేశాలతో పోటీ పడలేకపో తున్నందున మన దేశంలో విద్యా సంస్థల ప్రమాణాలను కొలిచే వ్యవస్థను మనమే ఏర్పాటు చేసుకోవాలని ఇటీవల కేంద్ర ప్రభు త్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించుకున్నది. అమెరి కాలోని సిలికాన్‌ వ్యాలీలోని సాఫ్ట్‌వేర్‌ నిపుణుల్లో అత్యధికులు భారతీయులేనని, దేశ దేశాల్లో మన డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉన్నారని గొప్పలు చెప్పుకోవడం వల్ల ఒరిగేదే ముంది. ‘’ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత’’ అన్నట్లుగా ఉంది.కేంద్రంలో, చాలా రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా రంగంలో ప్రతికూల పరిణామాలు పెరిగి పోతున్నాయి. సమాజాభివృద్ధికి తోడ్పడే శాస్త్ర సాంకేతిక రంగాలను విస్మరిస్తూ మూఢ విశ్వా సాలను ప్రచారంలోకి తెస్తున్నారు. పదమూ డేళ్ళ బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోప ణలతో మూ డేళ్ళ నుంచి జైలులో ఉంటున్న ఆశారాం బాపు జీవిత కథను ఆదర్శ పురుషుల జాబితాలో భాగంగా రాజస్థాన్‌లో ఉపవాచ కంగా ఉపయోగిస్తున్నారు. అదే పుస్తకాన్ని ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని 10వ తగరతి విద్యార్థులకూ పంచిపెట్టారు. కొన్ని రాష్ట్రాల్లోని పాఠశాలల ప్రార్థనా సమయంలో సూర్యనమస్కా రాలు చేయిస్తు న్నారు. ఆ విధంగా చేయని మహా రాష్ట్రలోని ఒక టీచర్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లి రక్షణ పొందాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం బడిపిల్లల మధ్యా హ్న భోజన పథకంలో కోడిగుడ్డును నిషేధించింది. చీర, జాకెట్‌ మాత్రమే ధరించాలని గుజరాత్‌ ప్రభుత్వం మహిళా టీచర్ల వస్త్రధారణపై ఆంక్షలు విధించింది. ఈ విధంగా విద్యా రంగంలో హిందూత్వ ఎజెండాను జొప్పిస్తూ దళితులూ, క్రిష్టియన్‌లు, ముస్లిం విద్యార్థులు, టీచర్లను లొంగదీసుకొనేందుకు హిందూ త్వ చర్యలు చాపకింద నీరులా అల్లుకుంటున్నాయి.
నూతన విద్యావిధానం-2015 పేరుతో కేంద్ర విద్యాశాఖ చేస్తున్న బూటకపు సంప్రదింపుల తతంగం మరింత ఆందోళన కరంగా ఉంది. ఉన్నత, సాంకేతిక విద్యలతోపాటు పాఠశాల విద్యను కూడా పబ్లిక్‌-ప్రయివేట్‌ పార్టనర్‌షిప్‌కు ఎగదోస్తు న్నది. విదేశీ విద్యా సంస్థలకు, స్వచ్ఛంద సంస్థలకూ భారతీయ విద్యార్థులను బలిచేసే వినాశకర బిల్లులతో ఎదురుచూస్తోంది. విద్యారంగం నుంచి ప్రభుత్వాలను తప్పించేందుకు ఎన్నికల కమిషన్‌ లాంటి స్వయం ప్రతిపత్తిగల సంస్థను ఏర్పాటు చేయా లనే ప్రతిపాదనను ‘’శిక్షా సంస్కృతి ఉత్థాన్‌ న్యాస్‌’’ (ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ) అనే సంస్థతో ముందుకు తెస్తోంది. మరోవైపు కేంద్ర బడ్జెట్‌లో విద్యకు నిధులను భారీగా కోతకోయటం వల్ల ప్రభుత్వ విద్యా సంస్థలు మరింత దివాళా తీసే పరిస్థితి తయారైంది. ప్రయివేట్‌ విద్యావ్యాపారం విచ్చలవిడిగా విస్తరిస్తోంది. విద్యారంగంలో ప్రబలిపోతున్న మతోన్మాద ఎజెండాతో, ప్రయివేట్‌రంగంలోని విద్యావకాశాలతో అనైక్యతా పరిణా మాలు ప్రబలే అవకాశం ఉంది. హిందూత్వ పాఠాలతో మతాల మధ్య విభజనకు దారితీస్తుంది. ప్రయివేట్‌ కార్పొరేట్‌ కాలేజీల్లో సంపన్నులు, పై కులాల పిల్లలు చేరటం, ప్రభుత్వ పాఠశాలల్లో దళితులు, గిరిజనులు, బిసిల పిల్లలే మిగిలిపోవటం విద్యారంగంలో ఆధునిక అంటరానితనంగా తేలిపోతోంది. ఈ రెండు పరిణామాలతో భావిభారత పౌరుల్లో సమైక్యతా భావజాలాన్ని ప్రోది చేయాల్సిన విద్యా విధానమే విచ్ఛిన్నకర శక్తిగా మారే ప్రమాదం పొంచివున్నది. అది మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఆకాంక్షలకు అపచారం చేసినట్లు కాగలదు. కనుక భారతీయుల సమైక్యతా సాధనంగా విద్యను వికసింపజేస్తేనే తొలి విద్యామంత్రికి నిండు నివాళి అర్పించినట్లు అవుతుంది. అందుకు అనువైన విద్యావిధానం కోసం ప్రత్యేక కృషి జరగాల్సిన అవసరం ఉన్నది. -(వ్యాసకర్త ఎస్‌టిఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షులు)/ వ్యాసకర్త యుటిఎఫ్‌ గుంటూరు జిల్లా కార్యదర్శి,
-(జి.వెంకటేశ్వరరావు)

1 2 3 4 5 6 … 10