విద్యా హక్కు చట్టానికి 16 ఏళ్లు

దేశంలో 6 నుంచి 14 ఏండ్లలోపు ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించటానికి ఉద్దేశించిన చట్టమే విద్య హక్కు చట్టం` 2009. ఈ విద్యా హక్కు చట్టం 2009 ఆగస్టు 28న రాష్ట్రపతి ఆమోదం పొందింది. కేంద్ర ప్రభుత్వం 2009 ఆగస్టు 26న ఈ బిల్లును ఆమోదించింది. జమ్ముకశ్మీర్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ చట్టం 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక అనుబంధ షెడ్యూలఉన్నాయి. అయితే ఈ చట్టం ప్రవేశ పెట్టి నేటికి 16 ఏళ్లు అవుతున్న నేటికీ సంపూర్ణంగా అమలు కాలేదనేది నిర్వాదాంశమే. – జి ఏ సునీల్ కుమార్
విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి 16 సంవ త్సరాల్లోకి అడుగుపెట్టింది.2010 ఏప్రిల్ 1నుంచి అమలులోకి వచ్చింది.6 నుంచి 14 ఏళ్ల వయస్సు బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించాలనే ఏర్పడి విద్యాహక్కు చట్టం వచ్చి ఏప్రిల్ 1కి పదహేరేళ్లు పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకూ అది నెరవేరనేలేదు. పలు పరిశ్రమల్లోను..చెత్త ఏరుకుంటు..ఇలా పలు పనులలో బాలబాలికలు మగ్గిపోతుండటమే దీనికి నిదర్శనం.ఈ చట్టాన్ని అమలు చేయ టంలో రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీ నతే దీనికి కారణంగా కనిపిస్తోంది. విద్యాహక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్న అంశంపై సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది.బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యనందించాల్సి ఉన్నా,గ్రామీణ,పేద విద్యార్థు లకు నాణ్యమైన విద్య అందడం లేదు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఆర్ధికంగా వెనకబడిన వర్గాలకు 25శాతం రిజర్వేషన్లు కల్పించాలని చట్టంలో పేర్కొన్నారు.ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వం సర్కారు స్కూళ్లును బలోపేతం చేయ డంతోపాటు,ప్రైవేటు స్కూళ్లు ఫీజుల దోపిడీని ఆరికట్టాలి. కేంద్రర ప్రభుత్వం 86వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్స్ 21ఎ, 45,51(కె)లను చేరుస్తూ దేశంలోని 6నుంచి 14సంవత్సరాల వయసు గల బాల, బాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్ధేశించింది. ఆర్టికల్ 21ఎప్రకారం దేశంలోని 6నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలి.ఆర్టికల్ 45ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బాల, బాలికలకు 6సంవత్సరాల వయస్సు వరకు ఉచిత విద్యా సదుపాయాలు కల్పించాలి.ఆర్టికల్ 51(కె)ప్రకారంబాల,బాలికల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారి సంతానానికి 6నుంచి14ఏండ్ల వరకు విద్యనందించే సదుపా యాలు ఏర్పాటు చేయాలి.
విద్యాహక్కు చట్టం రూల్స్
విద్యాహక్కు చట్టం సెక్షన్ 26ప్రకారం టీచర్స్ ఖాళీలు10శాతానికి మించకుండా ఉండాలి.(ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది) సెక్షన్ 23 ప్రకారం ఉపాధ్యాయ నియామక అర్హతలు తప్పనిసరి చేయాలి.28 ప్రకారం గవర్నమెంట్ టీచర్స్ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్ చేయ కూడదు. సెక్షన్ 12ప్రకారం బడుగు బలహీన వర్గాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాలు కల్పించి, ఉచిత నిర్బంధ విద్య అందిం చాలి. ఇలా చట్టంలో ఎన్నో అంశాలు విద్యాహక్కు చట్టంలో పొందు పరిచినా..అవి అమలుకు నోచుకోకపోవటం విచారకరం.దీనిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రత్యక్షంగా కనిపిపస్తోంది.
విద్యాహక్కు చట్టం ఉద్ధేశాలు
విద్యను బాలల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ విద్యను హక్కు పొందాలని ఈ చట్టం ముఖ్య ఉద్ధేశ్యం.6-14 ఏళ్ల మధ్య వయసు బాలబాలి కలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో చేరి చదువుకునేలా చూస్తూ, వారికి ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6-14 ఏళ్ల మధ్య వయసు బాలబాలికలు 92లక్షల మందికిపైగా పాఠశాల చదువులకు దూర మయి ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. పాఠశాలల్లో చేరని, లేదా మధ్యలోనే చదువు మానేసిన వీరందరినీ తిరిగి చదువుల బాట పట్టించటం విద్యాహక్కు చట్టం ముఖ్యోద్దేశం. స్కూలు నిర్వహణ కమిటీ లేదా స్థానిక ప్రభుత్వం పాఠశాల చదువులకు దూరంగా ఉండిపోతున్న ఆరేళ్లపైబడిన బాలిబాలిక లందరినీ గుర్తించి, వారికి తగిన శిక్షణ ఇప్పించి, పాఠశాలలో తగిన తరగతిలో చేర్పించాలి.ఏ విద్యార్థికీ పాఠశాలలు అడ్మిషన్‌ను నిరాకరించటానికి వీల్లేదు.ప్రైవేటు పాఠశాలలు సైతం 25%సీట్లను బలహీన,పేద వర్గాలకు కేటాయించాలి.దీనికి సంబంధించిన వారి ఖర్చులను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. అంటే దానికి సంబంధించిన నిధులను 55-45 శాతం కేంద్రం రాష్ట్రాలు భరించాలి.
విద్యాహక్కు చట్టంలోని ముఖ్యంశాలు
దేశం స్వాతంత్య్రం పొందిన దాదాపు అరవై ఏళ్లకు దేశ చరిత్రలో విద్యకి సంబంధించిన కీలక చట్టం అమల్లోకి వచ్చింది. అదే విద్యా హక్కు చట్టం- 2009.యÖపీఏ ప్రభుత్వ హయాంలో 2009, ఆగస్టు 26న విద్యాహక్కు బిల్లు ఆమోదం పొందింది. 2009, ఆగస్టు 27న అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ సంత కాలతో గెజిట్ రూపంలో ఆవిర్భవించింది.ఈ బిల్లు బాలల మౌలిక హక్కు (అధికరణ 21)లో సవరణ చేయడంతో రూపొందింది. దీన్నే 21అధికరణ అంటారు.రాజ్యాంగంలో ఈ సవరణను 86వ సవరణగా పిలుస్తారు. ఈ బిల్లు 2010, ఏప్రిల్ 1నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. విద్య అనేది ప్రాథమిక హక్కుగా మారడం దేశ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం.దేశంలో ప్రతీ బాలబాలికలు బడిలోనే ఉండాలి..ఇదే విద్యాహక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం.
విద్యాహక్కు చట్టం అమలు ఏది?
పాఠశాలకు వెళ్లాల్సిన బడి ఈడు పిల్లలు బడిలో చేరడం, చేరినవారు కొనసాగడం, వారందరూ ఆనందంగా అర్థవంతంగా నేర్చుకోవడానికి అనువైన, ప్రోత్సాహకరమైన, స్వేచ్ఛాపూరిత వాతావరణం పాఠశాలల్లో కల్పించడానికి 13 ఏళ్ల క్రితం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. 6 నుంచి 14 సంవత్సరాల వయస్సుగల పిల్లలందరికీ ప్రాథమిక విద్యను హక్కుగా మారుస్తూ సమున్నత ఆదర్శాలతో పట్టాలెక్కిన ఈ చట్టం ఆచరణలో చతికిల పడింది. దేశంలోని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశా లలన్నీ పాతిక శాతం సీట్లను నిరుపేద విద్యార్థు లకు కేటాయించాలనే ఈ చట్టం నిబంధనను ఖాతరు చేస్తున్న వారు కనిపించడం లేదు. అడ్డంగా చట్టం నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్పటికీ పాఠశాలలను నియంత్రించే సరైన పర్యవేక్షణ లేదు. దీంతో క్షేత్రస్థాయిలో చట్టం అమలు అభాసుపాలు అవుతున్నది. విద్యాహక్కు చట్టం సక్రమంగా అమలు కాకపోవడంవల్ల దేశంలో 6కోట్ల మంది పిల్లలు పాఠశాల మొహమే చూడడం లేదు. అన్నిటినీ మించి బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం (ఎనఇపి) విద్యాహక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేలా వుంది.
చట్టం అమలులో నిర్లక్ష్యం
సమాజంలో కొంత మంది పిల్లలు బడి బయట ఉండిపోవడం, బాల కార్మికులుగా పనుల్లో కారా?నాల్లో గనుల్లో పని చేయడం, వారి ప్రవేశానికి పాఠశాల నియమ నిబంధనలు అడ్డంకి రావడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రాథమిక హక్కుగా మారిన విద్యను పిల్లలందరూ పొందడానికిగాను ఉచిత నిర్బంధ విద్యకు ‘బాలల విద్యా హక్కు చట్టం-2009’ దేశవ్యాప్తంగా 2010 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చింది. చట్టం అమలులోకి వచ్చిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ అప్పటి ప్రధాని మాట్లాడుతూ జాతి,మత, కులాలకు అతీతంగా దేశంలోని బాలలందరిని బడిలోకి చేర్పించి నాణ్యమైన విద్యను చట్టం ద్వారా అందిస్తా మన్నారు. కానీ నేటికీ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం నెరవేరలేదు. చట్టం సక్రమంగా అమలు కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో 6 శాతం నిధులను విద్యాభివృద్ధికి కేటాయించాలి. అరకొర కేటా యింపులతో అద్భుత ఫలితాలు సాధించడం సాధ్యం కాదనే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు తేల్చి చెప్పినప్పటికీ ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు పేలవంగా ఉంటున్నాయి. నేటికీ ప్రాథమిక పాఠశాల లేని గ్రామాలు, మౌలిక సదుపాయాలు లేమి, ఉపాధ్యాయుల కొరతతో విద్యా రంగం అవస్తలు పడుతోంది. కరోనా కాలంలో దేశంలో 92 లక్షల బాలబాలికలు బడికి దూరం అయ్యారని పలు గణాంకాలు విశ్లేషణ చేస్తున్నాయి. అలాగే ఇటీవల కాలంలో మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు నాలుగు లక్షలకు పైగా తగ్గారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా బడి ముఖం చూడని పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు ఉద్దేశించిన పథకం సమగ్ర శిక్షా అభియాన్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఎందుకూ కొరగానిదిగా మారింది.
అమలుకు నోచుకోని చట్టం నిబంధనలు
విద్యా హక్కు చట్టం సెక్షన్ 12ప్రకారం దేశంలోని ప్రతి కార్పొరేట్, ప్రవేట్ పాఠశాలలు ప్రతి విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ప్రవే శాల్లో 25 శాతం సీట్లు బలహీన వర్గాలకు ఉచి తంగా కేటాయించాలి. ఇందులో భాగంగా విక లాంగులు, అనాథలు, వీధి బాలలకు 5శాతం, ఎస్‌సి బాలలకు 10శాతం, గిరిజన బాలలకు 4శాతం, వెనుకబడిన వర్గాల పిల్లలకు 6శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలి. కానీ అటు దేశంలో ఇటు రాష్ట్రంలో అధిక శాతం పాఠశా లలు ఈ చట్టం నిబంధనలను పాటించడం లేదు. అలాగే సెక్షన్ 13 ప్రకారం ప్రాథమిక స్థాయిలో వివిధ పాఠశాలల్లో పిల్లల ఎంపిక కోసం ఎలాంటి ఎంట్రన్స్‌లను నిర్వహించ కూడదు. కానీ ఈ చట్టం నిబంధనలు ఉల్లం ఘిస్తూ మన రాష్ట్రంలో గురుకుల,ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థుల ఎంపిక కోసం ఎంపిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశం కోసం ఎలాంటి క్యాపిటేషన్ రుసుములు తీసుకో కూడదు. కానీ ఈ చట్టం నిబంధనలు బేఖాతరు చేస్తూ డొనేషన్, అడ్మిషన్ ఫీజులను ఇబ్బడి ముబ్బడిగా వసూలు చేస్తున్నాయి. అలాగే సెక్షన్ 18 ప్రకారం గుర్తింపు లేకుండా ప్రైవేట్ పాఠశాలలు నడపరాదు. అలా నడిపితే ఈ చట్టం నిబంధనల ప్రకారం జరిమానాలు వసూలు చేయవచ్చు. కానీ చాలా గ్రామీణ ప్రాంతాలలో, మారుమÖల ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలలు నెలకొల్పుతూ ఎలాంటి అనుమ తులు లేకుండా పాఠశాలలను నడుపుతున్నారు. దీనిపై ప్రభుత్వాల సరైన పర్యవేక్షణ లేకపో వడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు.
చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలి
ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య హక్కు చట్టం సత్ఫలితాలను ఇవ్వాలంటే%……%విద్యా హక్కు చట్టం సెక్షన్ 25 ప్రకారం మొదట పాఠశా లల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి. ప్రస్తుతం దేశంలో 9 లక్షల ఉపాధ్యా య పోస్టులు, అలాగే రాష్ట్రంలో 30 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఉన్నాయి. విద్యా హక్కు చట్టం నిబంధనలకు అనుగు ణంగా వాటిని వెంటనే భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. బాలకార్మి కులను ‘ఆపరేషన్ స్మైల’ వంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఎప్పటికప్పుడు గుర్తిస్తూ బడి ఈడు పిల్లలందరూ బడిలో కొనసాగేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. పిల్లల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసమే లక్ష్యంగా పాఠశాల విద్య ఉండాలి. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు,పౌర సమాజం ఏకతాటిపై నిలిచి మొక్కవోని దీక్షతో కృషి చేస్తే విద్యా హక్కు చట్టం లక్ష్యాలు నెరవేరతాయి. విద్యా హక్కు చట్టానికి 15 సంవత్సరాల్లోకి అడుగు పెట్టింది. పూర్తయిన సందర్భంగానైనా చట్టం అమలుపై సమీక్ష జరిగి పూర్తి స్థాయిలో అమలుకు చర్యలు తీసుకుంటారని..ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి..భావిపౌరులకు గుణాత్మక విద్య అందాలని ఆశిద్దాం..!

ఊరి బడిని కాపాడుకుందాం..

ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యా రంగంలో సంస్కరణలు ప్రవేశ పెట్టడం సర్వసాధారణం అయింది. ముందు క్లస్టర్ పాఠశాల వ్యవస్థను తెచ్చారు. మొత్తం ప్రాథమికోన్నత పాఠశాలలను మÖసివేసేందుకు ప్రయత్నం చేశారు. 2017లో విద్యారంగంలోకి వ్యాపార రంగంలో ఉన్న ఎఫ్.ఐ.సి.సి.ఐ అనే సంస్థను ప్రవేశ పెట్టడానికి కూడా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే 2020లో కరోనా వచ్చింది. ఈ కాలంలోనే కనీసం చర్చ లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా జాతీయ విద్యావిధానం-2020 ప్రవేశపెట్టింది.
5,8తరగతిలో పరీక్షలు, వృత్తి విద్యా కోర్సు లు, ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రోత్సాహం, నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సు ఇవన్నీ ముందుకు వచ్చాయి. దీన్ని అమలు చేయడానికి చాలా రాష్ట్రాలు తటపటా యిస్తుండగా వైసిపి ప్రభుత్వం ఈ సంస్కరణ అమలు చేస్తూనే, ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.1876 కోట్లు అప్పు తెచ్చుకుని ‘సాల్ట’ పథకాన్ని ముందుకు తెచ్చింది. సర్క్యులర్ 172ని విడుదల చేసింది.దానికి కొనసాగిం పుగా జీవో 117 విడుదల చేసింది. ఇక సంస్కరణలు వేగవంతంగా ముందుకు పోయాయి. అంతర్జాతీయ విద్యార్థిగా తయారు చేయడం మా లక్ష్యమని ఒక మంచి స్లోగన్ ముందుకు తీసుకొచ్చారు. ఏఒక్క బడి మÖసేయం,ఒక్క ఉపాధ్యాయుడిని తగ్గించం అనే మరొక క్యాచీ స్లోగన్ విద్యారంగం మీదకి వదిలారు. జీవో 117వల్ల విద్యా వ్యవస్థ విచ్ఛిన్నమవు తుందని ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు, విద్యా ప్రముఖులు మొత్తుకున్నా ఇది మా పాలసీ అనే పేరుతో అత్యంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. దీన్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి.2024ఎన్నికల్లో జీవో 117ని రద్దు చేస్తా నని చెప్పిన తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది.ఇప్పటికీ జీవో నెంబర్ 117నిరద్దు చేస్తామని చెబుతూనే ఆ 117ఆధారంగా మళ్ళీ సంస్కరణలను ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నది.
ప్రభుత్వ బడుల్లో తగ్గుతున్న విద్యార్థులు
2018-19విద్యా సంవత్సరంలో 39,29,019 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువు తున్నారు.2021-22లో 44,29,569 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ్లఉన్నారు (ఇది కరోనా కాలం).2025-26లో 33,62,093 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. గత 5 సంవత్సరాలలో10,49,596 మంది విద్యా ర్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి ప్రైవేట్ పాఠశా లలకు వెళ్ళినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఈ సంవత్సరం 34,02,049 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.49శాతం మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటే,51 శాతం మంది ప్రైవేటు పాఠశాలల్లో విద్యనభ్యసిస్తు న్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణల వల్ల 3,4,5తరగతుల విద్యార్థులకు సబ్జెక్టు బోధన చేస్తామని చెప్పి హైస్కూల్‌కు తరలించారు. కొద్దిమంది ప్రభుత్వ హైస్కూల్‌కి వెళితే, కొద్ది మంది ప్రైవేట్‌కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరలా హైస్కూల్ కంటే మోడల్ ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యా యులుంటే నాణ్యమైన విద్య వస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే హైస్కూళ్ళలో ఉన్న 3,4,5 తరగతి పిల్లలను తిరిగి మోడల్ ప్రాథమిక పాఠశాలలకు తరలిస్తామని చెబుతున్నారు.హైస్కూల్‌లో ఉన్న3,4,5తరగతి పిల్లలు ఎంతమంది తిరిగి మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో చేరతారో చెప్పలేం.ఈసంస్కరణలు ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్యను పెంచలేకపోయాయి.
పాఠశాలల భవితవ్యం!
ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు సంస్కరణలు, స్కీములు, జీవోల ఫలితంగా 34 వేలకు పైగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో 12,512 ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయి.10లోపురోల్ ఉన్న పాఠశాలలు 5495.11-20లోపురోల్ ఉన్న పాఠశాలలు 14,5 70 అంటే 20లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలు 20,065. ఈ ప్రాథమిక పాఠశాలలు భవిష్యత్తులో బతుకుతాయా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. 3206 పైగా ప్రాథమికోన్నత పాఠశాలల పరిస్థితి ఏమిటో స్పష్టత లేదు.దీనిలో చదివే విద్యార్థుల భవిష్య త్ అగమ్యగోచరంగా మారబోతున్నది.502 ఉన్నత పాఠశాలల్లో ప్లస్ టూ పాఠశాలలను ప్రవేశ పెట్టారు. వీటి భవిష్యత్‌పై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు.
ఉపాధ్యాయుల పరిస్థితి
రాష్ట్రంలో 27,409ఉపాధ్యాయ ఖాళీలున్నట్లు తెలుస్తున్నది.జీవో నెం 117రద్దు వల్ల ఉపాధ్యాయ పోస్టులు చాలా మిగులుగా అవుతాయి.16 వేల పోస్టులకు డిఎస్‌సి వేస్తామని ప్రభుత్వం చెబుతున్నది. కొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయుల కొరతతీవ్రంగా ఉంది. ప్రత్యేకించి మున్సిపల్ పాఠశాలల్లో సబ్జెక్టుకు తగిన ఉపాధ్యాయులు లేరు. ఎయిడెడ్ పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి.చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.కొన్ని చోట్ల విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఎక్కడైతే ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో మమేకమై విద్య అందించడానికి కృషి చేస్తున్నారో అక్కడ రోల్ పెరుగుతుందని తెలుస్తుంది. ఇక్కడ ఉపాధ్యాయుల్లో ఉన్న లోపాలను కూడా మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు బడిలో ఉంటేనే ఉపాధ్యాయులకు జీతాలు భద్రత ఉంటుంది. సంస్కరణలు ఉపాధ్యాయులను,పాఠశాలలను రక్షించుకునే వైపు కాకుండా వ్యక్తిగత డిమాండ్ చుట్టూ ఆలోచించే వైపు పరుగులు తీయిస్తున్నాయి. ప్రభుత్వం ఉపాధ్యాయుల బోధనా శక్తి సామర్ధ్యాలను బోధనేతర కార్యక్రమాలకు వినియోగించు కుంటున్నది. రకార కాల ట్రైనింగ్‌లు, రిపోర్టులు, పర్యవేక్షణలు, ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం ముందుకు వచ్చాయి. నాలుగక్ష రాలు చెప్పారా లేదా అని పర్యవేక్షణ చేసేవాళ్ళ కంటే ఆ 42రిపోర్టులు ఎందుకు పంపలేదు. ఎప్పుడు పంపి స్తారు? అని అడగడంగా విద్య మారిపోయింది.
పెరగని సామర్థ్యాలు
ఈ సంస్కరణలు విద్యార్థుల సామర్ధ్యాన్ని పెంచాయా, తగ్గించాయా పరిశీలిస్తే అసర్ లాంటి సర్వేలు చెబు తున్న దాని ప్రకారం 3వ తరగతి విద్యార్థులు 2వ తరగతి స్థాయి పుస్తకాలు 83.3శాతం మంది చదవ లేక పోతున్నారు. ఐదవ తరగతి విద్యార్థులలో రెండో తరగతి స్థాయి పుస్తకాలు 62.5శాతం మంది చదవ లేక పోతున్నారు.ఎనిమిదవ తరగతి విద్యార్థుల్లో రెండవ తరగతి స్థాయి పుస్తకాలు 47శాతం మంది చదవలేకపోతున్నారు. 8వ తరగతి చదివే విద్యార్థుల్లో 54.8శాతం మంది భాగాహారం చేయలేక పోతు న్నారు.సంస్కరణలు విద్యార్ధుల సామర్ధ్యాలను పెంచ లేకపోయాయి.
విద్యారంగానికి బడ్జెట్
విద్యా రంగానికి కేంద్ర ప్రభుత్వం జిడిపిలో ఆరు శాతం నిధులు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం 30 శాతం నిధులు కేటాయించాలని కొఠారి కమిషన్ చెప్పింది. మనరాష్ట్ర బడ్జెట్లను గమనిస్తే విద్యా రంగానికి ఎక్కడా 15శాతానికి మించి ఏ సందర్భం లోనూ కేటాయింపులు చేయలేదు.2015-16 బడ్జెట్‌లో 16శాతం నిధులు కేటాయించారు. 2017 -18లో 13.60 శాతం కేటాయించారు. 2018-19లో 8 శాతం కేటాయించారు. ఇక్కడ అమ్మఒడి, నాడు నేడు నిధులను కూడా దీనిలో కలిపారు.23-24 బడ్జెట్‌లో 9.8శాతం, 2025-26 బడ్జెట్లో 9.8 శాతం మాత్రమే ఇచ్చారు. ఈ బడ్జెట్‌తో అంతర్జాతీయ విద్యార్థి ఎలా తయారవుతారు?అంతర్జాతీయ విద్యా ర్థిని తయారు చేయటమే లక్ష్యం అంటున్నారంటే ఈ రాష్ట్ర మానవ వనరులను విదేశీ వనరులుగా మార్చటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే!
ప్రస్తుత పరిస్థితి
రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణల ద్వారా”అంతర్జాతీయ విద్యార్థి,నాణ్యమైన విద్య, తరగతికి ఒక గది, తరగతికి ఒకఉపాధ్యాయుడు.బోధనేతర కార్యక్రమాలుఉపాధ్యా యులకు ఉండవు. ఒక యాప్ మాత్రమే ఉంటుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు బడి సమయం లో బోధన కార్యక్రమాలు మాత్రమే ఉంటాయి. శని వారం మాత్రమే బోధనేతర కార్యక్రమాలు. నో బ్యాగ్ డేలు.స్కూలు కాంప్లెక్స్‌లు,శిక్షణ తరగతులు. ఇక విద్యార్థి నుంచి అవుట్ కం తీసుకురావటమే మా లక్ష్యం. ఉపాధ్యాయులకు బదిలీల చట్టం, ప్రమోషన్లు సీనియార్టీల ప్రకారం జరుగుతాయి.60దాటిన ప్రాథ మిక పాఠశాలలను మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా మారుస్తాము.ఉన్నత పాఠశాలల్లో ఉన్న 3,4,5 తరగ తుల విద్యార్థుల్ని ఈ మోడల్ స్కూల్‌కి మ్యాప్ చేస్తాము. అవసరమైతే ఆపంచాయతీలో ఉన్న కొన్ని ఎలి మెం టరీ పాఠశాలల్లోని 3,4,5తరగతుల విద్యార్థుల్ని ఆ పంచాయతీలో మోడల్ స్కూల్‌కి మ్యాప్ చేస్తాము. 60దాటిన ప్రాథమికోన్నత పాఠశాలలను అప్‌గ్రేడ్ చేసి ఉన్నత పాఠశాలగా మారుస్తాము.30లోపుఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థులను దూరంగా ఉన్న హైస్కూల్‌కి తరలించి రవాణా భత్యం ఇస్తాము. 31నుంచి 59వరకు ఉన్న ప్రాథమికోన్నత పాఠశా లలను అక్కడున్న పరిస్థితుల్ని పరిశీలించి తగు నిర్ణ యం చేస్తాము. ఒక పంచాయతీలో ఏ పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా మార్చాలో, దేనిని మ్యాప్ చేయాలో అనే అంశాలు ఆపంచాయతీలోని స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల ఆమోదంతో మాత్రమే చేస్తాము. ఆ స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు అంగీకరించకపోతే పాఠశాలలను యథాతథంగా కొనసాగిస్తాము. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు వర్క్ లోడ్ తగ్గిస్తాము. ప్లస్ టు పాఠశాలలపై ఆలోచిస్తున్నాం” అని ప్రభుత్వం చెబుతుంది.ఇవన్నీ నిజంగా జరిగితే ప్రభుత్వ పాఠ శాల విద్యకు మంచి జరిగే అవకాశం ఉంది. ఆచరణలో దీనికి భిన్నంగా ఒకటి, రెండు తరగతులు మాత్రమే ఉన్న ఫౌండేషన్ పాఠశాలల సంఖ్య పెరిగే అవకాశం కన్పిస్తున్నది. రాష్ట్రంలో 13,325 గ్రామ పంచాయితీలు ఉంటే 7600 పంచాయతీల్లో మాత్ర మే మోడల్ స్కూళ్లు పెట్టే అవకాశం ఉంది. అదీ ఆ పంచాయతీలో ఉన్న కొన్ని ఎలిమెంటరీ పాఠశాలల్లోని 3,4,5తరగతుల విద్యార్థులను మ్యాప్ చేయడం ద్వారా కొన్ని పాఠశాలలు మోడల్ పాఠశాలల్లా మారు తున్నాయి.ప్రాథమికోన్నత పాఠశాలల భవిష్యత్ ప్రశ్నా ర్ధకంగా మారుతుంది. ఇంగ్లీష్ మీడియంను మాత్రమే కొనసాగించబోతున్నారు. ఎక్కడైనా బేసిక్ ప్రాథమిక పాఠశాల కొనసాగాలని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ తీర్మానం చేస్తే, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు ఆ మేనేజ్‌మెంట్ కమిటీలకు నచ్చజెప్పి లేదా ఏదోరకంగా కన్విన్స్ చేసి ఫౌండేషన్ స్కూళ్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ బలోపేతం కావాలంటే
విద్యా రంగ సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్ధుల సంఖ్యను, సామర్ధ్యాలను, ఉపాధ్యాయుల సంఖ్య ను తగ్గించాయి.విద్యకు కేటాయించే బడ్జెట్ సైతం తగ్గిపోయింది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం తీసుకోవలసిన సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరిచే విధంగా ఉండడం గమనించాలి.దీర్ఘ కాలంలో ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను బలోపేతం చేయడానికి కామన్ స్కూల్ సిస్టమ్‌ని అమలు చేయా లి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఒకే రకమైన సిలబ స్‌ని అనుసరించాలి. బడ్జెట్‌లో విద్యకు 30 శాతం నిధులను కేటాయించాలి.ప్రాథమిక స్థాయిలో మాతృ భాషలో బోధన,సెకండరీ స్థాయిలో తెలుగు, ఇంగ్లీషు మీడియంలో బోధన ఉండాలి. ఉపాధ్యాయులను బోధ నకు మాత్రమే పరిమితం చేయాలి.తక్షణం విద్యా వ్యవస్థను ప్రభుత్వం రంగంలో అభివృద్ధి చేయడానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఒక మోడల్ ప్రైమరీ పాఠశాల ఐదుగురు ఉపాధ్యాయులు, ఐదు తరగతి గదులు ప్రత్యేక బడ్జెట్ అన్ని హంగులతో ఏర్పాటు చేయాలి.మిగిలిన ప్రాథమిక పాఠశాలలను యథా తథంగా కొనసాగించాలి.60మంది విద్యార్థులుఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేయాలి. మిగిలిన ప్రాథమి కోన్నత పాఠశాల లను యథాతథంగా కొనసాగించాలి. ఉన్నత పాఠశా లలో సమాంతర మీడియంలను కొనసా గించాలి. ప్లస్ టు వ్యవస్థను కొనసాగించాలి. -వ్యాసకర్త : ఎన్.వెంకటేశ్వర్లు,యు.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు

ప్రకృతితో మమేకం..ఆదివీసల జీవనం

గిరిజనుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటుచేసింది. సీతంపేట ఐటీడీఏ పరిధిలో దాదాపు 28 వేల ఎకరాల విస్తీర్ణంలో 18 వేల మందిగిరిజనులకు అటవీ సాగుహక్కు పత్రాలను అందజేసింది.ఏటా గిరిజన రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అంద జేస్తోంది. గిరిజన గూడలను కలిపేలా రోడ్లు నిర్మి స్తోంది. వరదల భారి నుంచి రక్షించేలా 114 రక్షణ గోడలను నిర్మించింది. రక్తహీనతతో బాధపడే గర్భి ణులు, బాలింతలు, చిన్నారులకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, పోషణప్లస్‌ పథకాల కింద పౌష్టికాహారం అందజేస్తోంది. గిరిజనుల వైద్యంకోసం పార్వతీపురం మన్యం జిల్లాకు వైద్యకళాశాలను మంజూరు చేసింది. సీతంపేట,పార్వతీపురంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్ప త్రులు నిర్మించింది. రోగులను అత్యవసరవేళ ఆస్పత్రు లకు చేర్పించేందుకు 108వాహనాలతో పాటు బైక్‌ అంబులెన్స్లు ఏర్పాటుచేసింది.గిరిజన గ్రామాల ప్రజ లకు సెల్‌ సిగ్నల్‌ సమస్యలకు పరిష్కారం చూపు తోంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన మ్యూజియంను సీతంపేట పీఎంఆర్సీలో ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఆదివాసీ జీవన విధానం ప్రతిబింబించే చిత్రాలు, విగ్రహాలను అమర్చుతోంది. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తోంది.
జీవనం విభిన్నం.. వైవిధ్యం
లి ఆదివాసీలు అటవీ సంస్కృతికి ప్రతీకలు. ఘన చరితకు వారసులు. వారి ఆధ్యాత్మిక చింతన వినూ త్నం. వారి కట్టూ బొట్టూ చూడనలవిగా ఉంటాయి. తెల్లారితే కొండపోడు తాళాలు వంటి వస్తువులను తయారు చేసి నృత్యాలకు ఉపయోగిస్తారు.
లి ఆదివాసీలు ప్రధానంగా దంపుడు బియ్యం, గంటె, జొన్న, కొర్ర, జీలుగ పిండితో జావ చేసుకుని తాగుతారు. అడవిలో లభించే ఆకు కూరలు, దుంప కూరలను ఆహారంగా వినియోగిస్తారు. బొదండం కూర, చిట్టికూర, గురుంకూర, పుల్లేరుగుడ్లను కూరగా వండి తింటారు.

  • అక్షరాలను ఆరాధ్యదేవతలుగా పూజిస్తారు. ఏజెన్సీలో అక్షరబ్రహ్మ, మడిబ్రహ్మ వంటి ఆలయాలు వెలిశాయి. ప్రతి గురువారం ఆలయాల్లో పూజలు చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
  • ఆదివాసీ ప్రాంతాల్లో వివాహ ఆచారం వింతగా ఉంటుంది. మైదాన ప్రాంతంలో వరకట్న భూతం వెంటాడుతున్న నేటి రోజుల్లో ఇందుకు భిన్నంగా ఆదివాసీ గ్రామాల్లో వరుడు కుటుంబ సభ్యులు వధువు కుటుంబానికి ఓలి (తిరిగికట్నం) ఖర్చుల నిమిత్తం ఇచ్చే ఆచారం ఉంది.
    ఆదివాసీలు నిరంతర శ్రమ జీవులు.అయినా తీరిక వేళల్లో మాత్రం ఆటపాటలు, ఆనందాలకు ప్రాధాన్యం ఇస్తారు.పండగలన్నీ ప్రకృతి, ఫలసాయాల సేకరణ, గ్రామదేవతలకు సంబంధిం చినవే ఉంటాయి. కందికొత్తలు,ఆగం,టెంక పండగలను డప్పుల వాయి ద్యాలతో గ్రామాల్లోని గిరిజనులంతా ఏకమై నిర్వహి స్తారు.
    అడవితల్లి ఒడిలో ప్రశాంత జీవనం
    సాలూరులో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం సీతంపేట ఐటీడీఏలోనూ ఆదివాసీపండగకు ఏర్పాట్లు గిరిజనాభివృద్ధికి కృషి నాలుగేళ్లలో గిరిజనుల అభివృ ద్ధికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తోంది. గిరిజన పండగల నిర్వహణకు అధిక ప్రాధాన్య మిస్తోంది. రాష్ట్రస్థాయి ఆదివాసీ పండగను సాలూరు లో నిర్వహించడం, సీతంపేట ఐటీడీఏలోను ఆదివాసీ పండగను వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం ఆనందంగా ఉంది.
    విశ్వాసరాయి కళావతి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే
    అర్హులందరికీ సంక్షేమ పథకాలు
    ఐటీడీఏ ద్వారా గిరిజనులకు క్షేత్రస్థాయిలో పకడ్బం దీగా పథకాలు అమలు జరిగే చర్యలు తీసుకుంటు న్నాం.గిరిజనకళల అభివృద్ధిలోభాగంగా సవర పెయింటింగ్‌ కళాకారులకు సీడాప్‌ ద్వారా శిక్షణ ఇప్పించనున్నాం. గిరిజన అటవీఉత్పత్తులకు మార్కె టింగ్‌ సదుపాయం కల్పిస్తాం. గిరిజన యువతకు స్కిల్‌ కళాశాల, స్కిల్స్టాబ్‌ వంటివి ఏర్పాటు చేశాం. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం.
  • కల్పనాకుమారి, ఐటీడీఏ పీఓ
    గూడు లేకా గోసపడుతున్న గిరిజనులు
    రాష్ట్రంలోని గిరిజనులు సరైన గూడు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా గిరిజనులకు అందించ లేదు. రాష్ట్రంలో నిర్మిస్తున్న కొద్దొగొప్పో ఇళ్లు కేంద్రం మాంజూరు చేసినవే.అయితే గత ప్రభుత్వాలు గిరిజ నుల ఇళ్ల కోసం నిర్వహించిన పథకాలు, కార్య క్రమాలన్నీ ఇప్పటి అధికార ప్రభుత్వం నీరుగార్చింది.
    జగన్‌ తాను అండగా ఉంటానంటే నమ్మి గెలిపించిన గిరిజనులు ప్రస్తుతం ఆయనను నమ్మె స్థితిలో లేరు. తమ నియోజకవర్గాల్లో ఆయన పార్టీనే గెలిపించారు. అధికారంలోకి వచ్చాక అందర్నీ మోసం చేసినట్లే వారినీ ముంచేశారు జగన్‌. తాను మాత్రం ప్యాలెస్‌ల మీద ప్యాలెస్‌లు కట్టుకున్న జగన్‌, గిరిజనులకు గూడు మాత్రం కల్పించలేకపోయారు.
    లక్షల్లో స్థలాలిచ్చాం. ఇళ్లు కట్టిస్తున్నామని ప్రచారం చేసుకోవడం తప్ప అత్యంత వెనుకబడిన వర్గాలైన ఆదివాసీలు రాష్ట్రంలో ఉన్నారని, వారికి సొంతగూడు కల్పించాలని ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపిం చడం లేదు.సొంతగూడు కల్పించాలని నాలుగేళ్లుగా మొత్తుకుంటున్నా కనీస స్పందన లేదు. రాష్ట్రంలోని 11 జిల్లాల పరిధిలోని 52 వేల మంది పీవీటీజీలకు పక్కా గృహమే లేదని కేంద్రం తేల్చింది.రాష్ట్ర ప్రభు త్వం క్షుణ్నంగా సర్వే నిర్వహిస్తే ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి పీఠమెక్కిన తర్వాత జగన్‌ సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు. పైగా గిరిజనులను ఉద్ధరించేసినట్టుడాంబికాలు మాత్రం పలుకుతున్నారు. ‘‘ఆదివాసీ ప్రాంతాల్లో పక్కా ఇళ్లు లేక వారు పూరి గుడిసెల్లో,పెంకుటిళ్లలో,రేకుల షెడ్లలో జీవనం సాగిస్తున్నారు. సరైన ఇంటి వసతి లేక రాత్రి పూట నిద్రిస్తున్న సమయాల్లో పాముకాటుకు గురై మర ణించిన ఘటనలున్నాయి.’’`రాధాకృష్ణ, సీపీఎం నాయకుడు
    శంకుస్థాపన-పూర్తి చేయ కుండానే మధ్యలో నిలిపివేత
    జిల్లాల విభజన వేళ గిరిజనులకు ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కేటాయించినట్టు గొప్పలు చెప్పారు.కానీ,నాలుగున్నరేళ్లుగా అక్కడ సొంత ఇల్లు లేని అభాగ్యులకు ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు. ఈ జిల్లా పరిధిలో పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాలు ఉన్నాయి.6 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద 17వేల ఇళ్లు మంజూరు చేసేంత వరకు వారి గోడు వినేవారే లేరు. ఈ పథకం కింద మంజూరైంది కూడా కొంతమందికే. ఇంకా అక్కడ దాదాపుగా 32 వేలమంది సొంతింటి కోసం ఇప్పటికీ ఎదురు చూస్తు న్నారంటే ఆదివాసీలపై జగన్‌కు ఎంత మమకారం ఉందో అర్థమవుతోంది. ప్రతికూల పరిస్థితుల మధ్యే ఆదివాసీలు జీవనం సాగిస్తుంటారు.వాటిని గుర్తించిన గత టీడీపీ ప్రభు త్వం సొంతిల్లు కట్టుకునేందుకు వీరికి అదనపు సాయాన్ని మంజూరు చేసింది. అప్పట్లో గ్రామీణ పేదల కోసం ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకాన్ని అమలుచేసి ఇంటి నిర్మాణం కోసం ఎస్టీలకు అదనపు ఆర్థిక సాయాన్ని అందించింది. ఇందులోనూ ఆదివాసీలకు మరింత తోడ్పాటు నిచ్చింది.మైదాన ప్రాంతాల్లో నివ సించే ఎస్టీలకు 2లక్షలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వారికి 2.25లక్షలు, ఆదివాసీలకు 2.5లక్షల సాయాన్ని అందించింది. సాధారణ వర్గా లకు అందే సాయం తో పోలిస్తే లక్ష రూపాయలు అదనంగా ఇచ్చింది.కానీ వైఎస్సార్‌సీపీ హాయంలో రాష్ట్రంలో గ్రామీణుల కోసం గృహనిర్మాణ పథకాన్నే అమలు చేయలేదు. ప్రస్తుతం అమలయ్యే పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వానివే. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న పుష్ప శ్రీవాణి ఆదివాసీల ఇళ్ల నిర్మాణానికి అదనపు సాయం అందించాలని ప్రభుత్వానికి నివేదించినా జగన్‌ పట్టించుకోలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయాన్నీ కొనసాగించలేదు. ఆపథ కాలనే రద్దుచేసి గిరిజనులకు మొండిచేయి చూపిం చారు. ‘‘గత ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం చేసింది. ఈ ప్రభుత్వం పీఎంకేవీవై కింద ఇస్తున్న నిధులకు, వైఎస్సార్సీపీ కొంత మొత్తం కలిపి ఇస్తోంది. అది ఏ మూలనా సరిపోవడం లేదు.’’ -దీసారి గంగరాజు, అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గత టీడీపీ హయంలో చాలా ఇళ్లు మంజూరు చేశారు. అందులో కొన్ని ఇళ్లు నిర్మాణ దశలో మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మధ్యలో ఆగిన ఇళ్లకు బిల్లుల చెల్లించలేని స్థితిలో ఉంది.’’-దొన్నుదొర,

జీవన విధానం మారితేనే మనుగడ..!

పరుగుతున్న జనాభా..అందుకు తగ్గట్టుగా రెట్టింపవుతున్న అవసరాలకు మొదట ప్రభావితమవుతున్నవి అడవులే. చెట్లను నరికి వ్యవసాయ భూములు,నివాస స్థలాలుగా మారుస్తున్నారు.ఫలితంగా అటవీ విస్తీర్ణం తగ్గి జీవవైవిధ్యం దెబ్బతింటోంది. అది పర్యావరణంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తోంది.చివరకు వర్షాభావ పరిస్థితులు,అధిక ఉష్ణోగ్రతలు,అతివృష్టి వంటి వైపరీత్యాలు ఎదురవుతున్నాయి. భూభాగంలో 33శాతం అటవీ విస్తీర్ణం ఉం డాల్సి ఉండగా..ఉభయ జిల్లాల్లో 22శాతం నమోదు కావడం ఆందోళనకడు ప్రభుత్వం తీసుకున్న హరితహారంతో కాస్త పచ్చదనం పెరిగింది.ప్రాణాధారమైన జలాన్ని సమర్థంగా వినియోగించు కోవడంలో మనిషి విఫలమవుతున్నాడు. ప్రధానంగా జలవనరుల ఆక్రమణతో నిల్వ సామర్థ్యాన్ని తగ్గించేయడం,నీటి ప్రవాహ మార్గాలైన కాలువలను మూసి వేయడం వంటి చర్యలతో వాటి ఉనికిని ప్రమాదంలోకి నెడుతున్నాడు. దీనికితోడు కలుషితం చేస్తున్నాడు. విష రసాయనాలు మిళితమైన పారిశ్రామిక, నివాసాల మురుగును కాలువల్లోకి వదులుతున్నారు.అవి నదులద్వారా సముద్రంలోకి చేరు తున్నాయి వ్యర్థ జలాలను శాస్త్రీయ పద్ధతిలో పునశుద్ధి చేసి జలవనరుల్లోకి వదిలితే మేలు.చర్యలతో పీల్చేగాలి నాణ్యత దెబ్బతింది.వాహనాలు,విద్యుత్తు అతి వినియోగం వల్ల వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయి.వ్యవసాయంలో ఉప యోగించే రసాయనిక ఎరువులు ప్రమాదకరంగా మారాయి. సాధ్యమైనంత వరకు తగ్గించడమే మనం ప్రకృతికి మేలు చేసే చర్యలు. ఎన్ని చట్టాలు రూపాంతరం చెందినా నిషేధిత ప్లాస్టిక్‌ ఉత్పత్తుల వినియోగం తగ్గడం లేదు.వాటిని శాస్త్రీయ పద్ధతిలో నిర్వీర్యం చేయకుండా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు.ఈవ్యర్థాలను కాల్చడం వాతావరణ కాలుష్యానికి కారణమవుతోంది.భూమి పొరల్లోకి ప్లాస్టిక్‌ చేరి వాన నీరు ఇంకకుండా నిలువరిస్తోంది.జల వనరుల్లోకి చేరి జలచరాల హననానికి కారణమవుతోంది. నదులు, కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డుగా మారుతోంది. ప్లాస్టిక్ను సాధ్యమైనంత వరకు దైనందిన జీవితం నుంచి నిషేధించాలి.
జీవ వైవిధ్యం..జాతుల కవచం
మనిషి విచక్షణారాహిత్యానికి అంతరించిపోతున్న జీవజాలం భూమి మీద 14మిలియన్ల జీవజాతులు పరిరక్షించుకోక పోతే ముప్పు తప్పదు.ప్రకృతిని కాపాడ డంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి.మనిషి విచక్షణారాహిత్యం వల్ల రోజురోజుకూ జీవవైవిధ్యం దెబ్బ తింటోంది.ప్రకృతి విధ్వంసకర పనులవల్ల జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది.నానాటికి కాలుష్యం పెరిగిపోవడం,విస్తరించాల్సిన జీవజా తుల శాతం తగ్గిపోవడం జీవ వైవిధ్యాన్ని ప్రమాదం లోకి నెట్టేస్తున్నాయి.ఈపరిస్థితి ఇలాగే కొనసాగితే మాన వాళికి భారీమూల్యం తప్పదని హెచ్చరిస్తు న్నాయి ప్రపంచ పర్యావరణ,జీవవైవిధ్య సదస్సుల నివేదికలు.
జీవవైవిధ్యం.. ఆవశ్యకత
అవనిపై జీవించే సకల జీవరాశిని కలిపి జీవవైవిధ్యం అంటున్నారు. సరళంగా చెప్పాలంటే వివిధ రకాల జీవజాతుల సముదాయాన్నే జీవ వైవిధ్యం అంటాం. సూక్ష్మరూపంలోని తొలిజీవి ప్లాజిల్ల్లెటా అనే ఏక కణజీవి ప్రీ బయాటిక్‌ సూప్‌ అనే సముద్ర అడుగు నీటిలో పుట్టిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. తొలుత వృక్షాలు,జంతుజాలం అవతరించాయి.క్రమక్ర మంగా ఉభయ చరాలు,పక్షులు పుట్టుకొచ్చాయి. ప్రస్తు తం నేలమీద ఎన్నో రకాల వృక్షాలు, పండ్లు, జంతు జాతులు మనుగడ సాగిస్తున్నాయి. సృష్టిలోని ఏజాతి ఉనికైనా జీవ వైవిధ్యం ఎంతో అవసరం. కుందేళ్లు, గేదేలు,జీబ్రాలు వంటివి పచ్చని గడ్డి తింటాయి. ఈ జంతువులను మాంసాహారులైన సింహం, పులి, చిరుతపులులు ఆరగిస్తాయి.గొల్లభామలు గడ్డిని తింటే వాటిని కప్పలు భక్షిస్తాయి. ఈ చక్రంలో ఒక బంధం తెగితే దాని ప్రభావం అనేక రూపాల్లో కనిపిస్తాయి. పాములు నాశనమైతే ఎలుకల సంతతి అనుహ్యంగా పెరిగిపోతుంది. దానితో ఎలుకలు పంటలపై పడి తిండి గింజలను తినేస్తాయి. మానవుడు తన మనుగడ కోసంచుట్టూ ఉన్న పరిసరాలపై ఆధారపడి జీవిస్తాడు. ఆహారం,గాలి,నీరురక్షణ,ఆశ్రయం నిత్యావసర వస్తువు లు అన్నీ ప్రకృతి ఉత్పత్తులే. కంటికి కనబడని ఎన్నో జీవులు సైతం పరోక్షంగా ఎంతో మేలు చేస్తాయి. ఇలా ఒకజీవి మనుగడ మరో జీవి మనుగడకు ప్రత్య క్షంగా లేదా పరోక్షంగా ఉపయోగ పడటం వల్లనే సకల జీవులు మానవాళిలో మనుగడ సాగిస్తున్నాయి.
జీవవైవిధ్యానికి ఏం చేయాలంటే ..
అడవులను రక్షించుకోవడం అందరి బాధ్యత కావాలి. ఇంటి వద్ద ముగ్గులు పిండితో వేయాలి. అప్పుడే పక్షు లు కీటకాలకు ఆహారంగా లభిస్తుంది.భవిష్యత్‌ తరాల కోసం చెట్లు, జలవనరులను పెంపొందించుకోవాలి. రసాయనాలకు బదులు సహజ ఎరువులు వాడాలి. ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించి భూగర్భ జలాల పెంపు నకు కృషి చేయాలి.ప్రతి ఒక్కరూ జీవవైవిధ్యం పెంపు నకు కృషి చేయాలి.పర్యావరణానికి మొక్కలు పెంచాలి2050 సంవత్సరం వరకు దేశ జనాభా 200కోట్లకు పెరిగే అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణకు,జనాభా హితంకోసం మొక్కలను విరివిరి గా పెంచాలి. లేకుంటే మనిషి సృష్టిస్తున్న విపత్తు వల్ల జీవవైవిధ్యం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉంది. 1972 నుంచి ఇప్పటివరకు 61 శాతం వన్యప్రాణులు అంతరించినట్లు వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఆఫ్‌ నేచర్‌ రిపోర్టు చెబుతుంది. దీంతో మనుగడ సాగించాల్సిన జీవజా తులు అంతరిస్తున్నాయి. ఇలా ఒక రకమైన జీవులు అంతరిస్తే వాటిమీద ఆధారపడే జీవులూ నశిస్తు న్నాయి.రాష్ట్రంలో జీవ వైవిధ్యానికి కేంద్రం లాంటిది. అనేక రకాల జంతు,పక్షి జాతులకు నెలవు.తెలం గాణ వ్యాప్తంగా 280రకాల మొక్కలజాతులు ఉన్నా యి. అందులో 1800రకాల జాతుల మొక్కలు ఔషద మొక్కలే. 900రకాల ఔషధ మొక్కలు హైదరాబాద్‌ కేంద్రంగా అందుబాటులో ఉన్నాయి. 108 జాతుల క్షీరదాలు,486 పక్షిజాతులు తెలంగాణలో మనుగడలో ఉన్నాయి. తెలంగాణ బయోడైవర్సిటీ రిపోర్టు ప్రకారం మన రాష్ట్రంలో అంతరించిపోయే దశలో ఉన్న వాటిలో అడవి కుక్క,ఉడుత,చిరుతపులి,హైనా, మౌస్‌డీర్‌, రాబందు,బాతు,హంస,మొసలి, మరిన్ని చేపజాతులు ఉన్నాయి. జీవవైవిధ్యాన్ని పరిరక్షించడా నికి తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు ఆధ్వర్యంలో జిల్లా,మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ఆయా పరిధిలోనే జీవవైవిధ్యాన్ని రక్షించడానికి ఈ బోర్డు కృషి చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా హెరిటేజ్‌ సైట్లను ఏర్పాటు చేయ డానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. అందులో భాగం గానే కూకట్‌పల్లి శివారులోని అమీన్‌పూర్‌ లేక్‌ను అభివృద్ధి చేసింది. 2016 నుంచి ఈ చెరువును వలస పక్షుల కోసం చుట్టు పక్కల జీవ వైవిధ్యాన్ని సంరక్షిం చడం కోసం ఉపయోగించుకుంటుంది. 93 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువు పరిధిలో కొన్ని వందల స్థానిక పక్షులతోపాటు వలస పక్షులు ఆశ్రయం పొందుతు న్నాయి.ఇక ప్రభుత్వం మనుగడలో ఉన్న జీవులు, చెట్లను గుర్తించి రాష్ట్ర ఐకాన్‌లుగా ప్రకటించింది. అందులో రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, జంతువుగా జింక, రాష్ట్ర చెట్టుగా జమ్మిచెట్టు,రాష్ట్ర పువ్వుగా తంగేడు ఉన్నాయి.-(గునపర్తి సైమన్‌)

నో స్మోకింగ్‌ ప్లీజ్‌..

వృత్తిలోనే ప్రవృత్తిని వెతుక్కున్నారు ఆ అధికారి. సగటు మనిషిపై వ్యసన పరుడిగా ముద్ర వేస్తున్న పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా పోరాటం సలుపుతున్నారు. పొగాకు ఉత్పత్తుల బారిన పడుతూ ప్రాణాంతకమైన వ్యాధులను కొనితెచ్చుకో వద్దని చెప్తూ సమాజ శ్రేయస్సుకు పాటుపడు తున్నారు.పొగాకు ఉత్పత్తులకు వ్యతి రేకంగా తనదైన రీతిలో పోరాటం చేస్తున్నారు. పొగాకువల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ అందరిలో అవగా హన కల్పిస్తున్నారు. పొగాకు..వ్యసనపరుల బతుకుల్లో పొగ బెడుతున్న తీరును సామాజిక మాధ్యమాల్లో వివరించడంద్వారా పొగాకు ఉత్ప త్తులపై రగల్‌ జెండా ఎగురవేసిన రఘునందన్‌ సేవలు అభినందనీయం.
అవకాశం దొరికినప్పుడల్లా..
ఎక్స్‌ ఖాతా ద్వారా నిత్యం పొగాకు,సిగార్‌ గురిం చిన పోస్టులు పెడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న రఘునం దన్‌ ప్రచార సరళిని దేశవిదేశాల్లోని స్వచ్చంధ సంస్థలూ గుర్తించాయి.పొగాకు నియంత్రణలో భాగంగా ఏర్పాటుచేసే సభలు, సమావేశాల్లో పాల్గొనేందుకు రావాలని ఆయనకు అంతర్జాతీ యంగా ఆహ్వానాలు వచ్చినప్పటికీ అనివార్య కారణాల వల్ల ప్రత్యక్షంగా పాల్గొన లేకపోయారు. అయితే,అవకాశం కుదిరినప్పుడల్లా ఆన్‌లైన్‌ కాన్పరెన్సుల్లో పొగాకు వ్యతిరేకంగా గళమెత్తు తున్నారు.ఛడీఘర్‌లో జరిగిన పొగాకు నియంత్రణ అంతర్జాతీయ సదస్సులో గౌరవ ప్రతినిధిగా పాల్గొని తన లక్ష్యాన్ని వివరించారు. జాతీయ స్థాయిలో పొగాకు నియంత్రణకు కృషి చేస్తున్న ‘రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ టొబాకో’‘కంట్రోల్‌ టోబాకో కంట్రోల్‌ స్టాల్‌వర్ట్‌’గా రఘునందన్‌ గుర్తింంచడం విశేషం.
సోషల్‌ మీడియాలో..
విధి నిర్వహనలో భాగంగా రఘునందన్‌ పల్లెల్లో తిరుగుతూ ఉంటారు. స్వామి కార్యంలో సమాజ కార్యంగా గ్రామాల్లో పొగాకు వల్ల కలిగే అనర్ధాల పై అవగాహన కల్పిస్తుంటారు.ముఖ్యంగా రైతులు, కార్మికులు ధూమపానం చేస్తూ కంటబడితే ముక్కు మూసుకొని పక్కకు తప్పుకోరు.వారి చేత ఆక్షణమే సిగరెట్‌ మాన్పించేలా హితబోధ చేస్తారు.ఇలా ఒకట్రెండేండ్లు కాదు..రెండు దశాబ్దాలుగా కృషిచేస్తున్నారు.వివిధ గ్రామాల్లో సభలు, అవగా హన సదస్సుల్లో పాల్గొని ధూమపానం వదల గొట్టేందుకు ప్రయత్ని స్తున్నారు. పొగాకు వ్యతి రేకంగా తమ చేస్తున్న పోరాటానికి మంచి స్పందన వస్తుందని చెబుతారు రఘునందన్‌. ఎవరైనా మీ మాటలు విన్నాక నేను సిగరెట్‌ మానేశానని చెప్పినప్పుడు ఎంతో ఉత్సాహం కలుగుతుంటుందని…ఆ కిక్‌తో మరింత కష్టపడే ప్రయత్నం చేస్తున్నాను అంటున్నారాయన.
రఘునందన్‌ నేపథ్యం..
రఘునందన్‌ మాచన..మేడ్చల్‌ జిల్లా కేశవరం వాస్తవ్యుడు. ఆయన తండ్రి అభిమన్యు ఆంగ్లభాషా పండితుడు. తండ్రి రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి పురస్కారా న్నందుకున్నారు.అలా భావి పౌరులను తీర్చిదిద్దే క్రమంలో తనదైన సేవలు అందిస్తూ ఉత్తమ ఉపా ధ్యాయుడిగా పేరు గడిరచారు అభిమన్యు. తండ్రి కి తగ్గ కొడుకు అనిపించు కునేలా రఘునం దన్‌ సమాజ శ్రేయస్సుకోసం తనవంతు కృషి చేస్తు న్నారు. యువత పెడదోవ పట్టకుండా తనదైన రీతిలో స్పందిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారాయన. పౌర సరఫరాల శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్‌గా నిత్యం దాడులు,తనిఖీలు నిర్వ హించే అధికారులు ఎందరో ఉన్నారు.కానీ రఘు నందన్‌ మాచన అలా కాదు.ఉద్యోగాన్ని తన విధి గానో,ఓఅధికారిగా తాను నిర్వర్తించాల్సిన బాధ్యత గానో మాత్రమే భావించలేదాయన. అందులో మానవత దృక్పథాన్ని వెతుక్కున్నారు. సమాజాన్ని మా ర్చాలన్న తపన ఆయనలో కనిపిస్తుంది. అలా కమిట్‌మెంట్‌తో సామాజిక స్పృహతో పనిచేస్తుం టారు రఘునందన్‌.
సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తూ..
పొగాకు నియంత్రణపై రఘునందన్‌ సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోస్టులు అంతర్జాతీయంగా అన్ని సమాజాలను చేరుతూ ఆలోచింప జేస్తున్నాయి.ఎక్స్‌ ద్వారా ఆయన పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం, జర్మనీ దేశస్తులను ఆకట్టుకోగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా రఘునందన్‌ను ఆహ్వానిం చింది.దేశం తరఫున పాల్గొనడం ఆనందాన్ని చ్చింది..పంజాబ్‌ ఛండీగడ్‌లో జరిగిన పొగాకు నియంత్రణ అంత ర్జాతీయ సదస్సులో భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ గౌరవ ప్రతినిధిగా నేను పా ల్గొనడం ఆనందా న్నిచ్చింది. పొగాకు ఉత్పత్తులవల్ల ఆరోగ్యానికీ, ఐశ్వ ర్యానికీ ముప్పు వాటిల్లక ముందే..టుబా కోకు గుడ్‌ బై చెప్పాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలని ఆశిస్తున్న వారిలో నేనొకణ్ని. నేను సుమారుగా రెండు దశా బ్దాలుగా పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా పని చేస్తున్నా. ఆఫలాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ టుబాకో కంట్రోల్‌ సంస్థ ‘టుబాకో కంట్రోల్‌ స్టాల్‌ వర్ట్‌’గా నాసేవలను గుర్తించింది.అమెరికాకు చెందిన హెల్త్‌ మ్యాగజీన్‌ పల్మనరీ మెడిసిన్‌ కూడా నాసక్సెస్‌ను గుర్తిస్తూ వావ్‌..వెల్డన్‌ అని కొనియాడిరది.ఇటీవల పలువురు నన్ను అభినందించడం ఆనందాన్ని చ్చింది.పొగాకు ఉత్పత్తుల వాడకం సమసిపోయేలా చేయటం అంత సులభమైన పనికాదు.ఆలోచన ఆత్మ నుంచే రావాలి.స్వీయ చైతన్యంతోనే మార్పు సాధ్యం.బీడీ,సిగార్‌,పొగాకు ఉత్పత్తుల మత్తులో పడినవాళ్లు ఎవరికివారు ప్రశ్నించుకోవాలి.తన ఆరోగ్యంపై శ్రద్ద పెరిగినప్పుడే పొగాకు వినియో గం ఆగిపోతుంది.నా పెండ్లికివచ్చి స్మోకింగ్‌ చేయొద్దు అని నేను నావెడ్డింగ్‌ కార్డులో ఓనిబం ధన రాయించాను.ఇలా చేయడంద్వారా రాకుండా ఉంటారని కాదు!ఒక ఆలోచన,చర్చ మొదలవు తుంది.మార్పు ఆలోచనతోనే ఆరంభ వంవుతుంది కదా.నేను కోరుకునేది అంతే!నా మాటలు విని పొగతాగడం మానేసిన వాళ్లుచాలా తక్కువే కానీ..ప్రత్యక్షంగా మాట్లాడి ఆకొద్దిమంది ఆరో గ్యాన్ని కాపాడగలిగానన్న సంతృప్తి మిగిలుతోం దని,ఈఅభినందనలన్నీ నాబాధ్యతను మరింత పెంచాయని రఘునందన్‌ మాచన ఆకాంక్షిం చారు.-` గునపర్తి సైమన్‌

పౌర సేవల్లో వాట్సాప్‌ విప్లవం

దేశంలో తొలిసారిగా..ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు , పజల నుంచి వినతల స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సప్‌ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టింది.అందులో భాగంగా ప్రభుత్వం అధికారిక వాట్సప్‌ నంబర్‌ను 9552300009 ప్రకటించింది. ఆ ఎకైంట్‌కు వెరిఫైడ్‌ ట్యాగ్‌(టిక్‌ మార్క్‌) ఉంటుంది. ఈనంబర్‌ వన్‌స్టాప్‌ సెంటర్‌లా పనిచేస్తుంది. తొలిదశలో ఇందులో 153 రకాల సేవలు అందించనున్నారు. భవిష్యత్తులో వీటిని మరింత విస్త్రతం చేయనున్నారు.ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో భాగంగా ఆర్‌టీజీఎస్‌ సీఈఓ దినేష్‌ కుమార్‌ ఈ సేవలపై ప్రజంటేషన్‌ సమర్పించారు.ప్రస్తుతం అమల్లోకి వచ్చాయి.
ఏపీ ప్రజలకు కూటమి సర్కార్‌ మరో గుడ్‌ న్యూస్‌చెప్పింది.9552300009వాట్సాప్‌తో జనన, మరణ ధృవీక రణ పత్రాలు అందించేందుకు సన్నా హాలు చేస్తోంది.‘మనమిత్ర’ ప్రజల చేతిలోనే ప్రభు త్వం,ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం అని విద్య,ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌ పేర్కొ న్నారు. ప్రజలు ధృవపత్రాలు, ఇతర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా పౌర సేవ లను వేగవంతంగా అందజేసేందుకు వాట్సాప్‌ గవర్నెన్స్‌ కు కూటమి ప్రభుత్వం నాంది పలికింది.దేశంలో తొలిసారిగా ‘మన మిత్ర’ పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్‌ లాంఛనంగా జనవిర 30న ప్రారం భించారు.దీనికోసం అధికారిక వాట్సప్‌ నెంబర్‌ 9552300009ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిం చింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ మాట్లా డుతూ..యువగళం పేరుతో 3,132 కి.మీల పాదయాత్ర చేశాను.ఈఆలోచన యువగళం పాద యాత్ర నుంచి మొదలైంది. నాప్రసంగాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక బటన్‌ నొక్కితే సినిమాచూస్తున్నాం,భోజనంవస్తోంది,క్యాబ్‌ వస్తుం ది.ఒక బటన్‌ నొక్కితే ప్రభుత్వం ఎందుకు ప్రజల వద్దకు రాదనే ప్రశ్న ఉత్పన్నమైంది.ఆఛాలెంజ్‌ను నేను స్వీకరిస్తున్నాని ఆనాడు చెప్పా.అందుకే ‘మన మిత్ర’ ప్రజల చేతిలోని ప్రభుత్వం,ప్రజల చేతిలో పాలన,మాది ప్రజాప్రభుత్వం నినాదంతో వాట్సాప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించడం జరుగుతోంది.
మొదటి విడతలో అందుబాటులోకి 161 రకాల పౌర సేవలు : వాట్సప్‌ గవర్నెన్స్‌కు 36శాఖలను అను సంధానించాల్సి ఉంటుంది. ఇది చాలా క్లిష్టతరమైన పని. మొదటి విడతలో161పౌర సేవలు అందు బాటులోకి తీసుకువస్తున్నాం. రెండో విడతలో 360 పౌర సేవలు ప్రారంభిస్తాం. ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌ గవర్నెన్స్‌. రియల్‌టైంలో ధృవపత్రా లు అందించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసు కుం టుంది. సర్టిఫికెట్లు అందజేసినప్పుడు వాటిపై ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. ఆక్యూర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే ఏపీ గవర్నమెంట్‌ వెబ్‌ సైట్‌ కు ఆలింక్‌ వెళ్తుంది. దీంతో నకిలీ సర్టిఫికెట్లకు ఆస్కారం ఉండదు. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ కూడా త్వరలోనే తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నెంబర్‌ సెలెక్షన్‌ద్వారా రెవెన్యూ, మున్సిపల్‌, ఎండో మెంట్‌ సర్వీసులతోపాటు అనేక సర్వీసులు తీసుకు వచ్చాం. రెండో దశలో ఏఐ బాట్‌, వాయిస్‌ ద్వారా కూడా అమలుచేస్తాం.ప్రపంచంలోనే వాట్సప్‌ గవర్నె న్స్‌ అమలు చేస్తున్న తొలిరాష్ట్రం మనది.దీనికి మరింత మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది. ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి.లోటు పాట్లు సరిచేసుకునిమరింత మెరుగ్గా దీనిని తీర్చిది ద్దుతాం.రియల్‌ టైంగవర్నెన్స్‌లో కూడా అన్ని శాఖల నుంచి సమాచారాన్ని తీసుకుని క్రోడీకరిస్తు న్నాం. డేటా లేక్‌ క్రియేట్‌ చేసి సీమ్‌ లెస్‌ సర్వీసెస్‌ అంది స్తాం.గత మూడు నెలలుగా మా టీం అహర్ని శలు కష్టపడ్డారు. గత15రోజులుగా టెస్టింగ్‌ చేస్తు న్నాం. ఇంకా మెరుగులు దిద్దాలని నాకు అర్థమైంది. ఇదొక ప్రయాణం.ఆరు నెలల్లో ఐడియల్‌ ప్రొడక్ట్‌ గా తీర్చిది ద్దుతాం.అన్నిసేవలుఅందుబాటులోకితీసుకు వస్తాం. పాదయాత్ర హామీని నిలబెట్టుకున్నా.ఆరు నెలల్లో ఎంతమార్పు వస్తుందో ప్రజలే చూస్తారు. మెటా ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌, హెడ్‌ సంధ్య దేవనాథన్‌ మాట్లాడుతూ..ఈ రోజు మీ మధ్య ఉండటం చాలా ఆనందంగా ఉంది.మనమిత్ర వాట్సప్‌ సేవలు ప్రారంభించడం జరుగుతోంది. ప్రతి ఒక్కరి జీవితం లో వాట్సప్‌ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. మన మిత్ర ద్వారా 161పౌర సేవలను ప్రతి ఒక్కరికి అంది స్తాం. ప్రజలు సులభంగా విని యోగించేలావాట్సప్‌ గవర్నెన్స్‌నురూపొందించాం.వాట్సప్‌గవర్నెన్స్‌ సేవ లకోసం చాలా కృషిచేశామ న్నారు.ఏపీ ప్రభుత్వం తో కలిసి మన మిత్రను మరింత మెరుగ్గా తీర్చి దిద్దుతామని చెప్పారు.వాట్సప్‌ డైరెక్టర్‌,ఇండియా హెడ్‌ రవిగార్గ్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాం. అయితే సింగిల్‌ ప్లాట్‌ ఫామ్‌పై అన్ని రకాల సేవలు అందిం చడం ఎక్కడా లేదు. మన మిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ ను మరింత అభివృద్ధి చేసి మరిన్ని సేవలు అందు బాటులోకి తీసుకువస్తాం. హాయ్‌ అని టైప్‌ చేయడం ద్వారా ప్రజలు సుల భంగా పౌరసేవలను పొంద వచ్చని అన్నారు. మొద టి దశలో వాణిజ్యరంగంలో సమర్థ వంతమైన ప్రభు త్వ సర్వీస్‌ డెలివరీ కోసం రీ ఇంజ నీరింగ్‌ విధా నాలను అమలుచేస్తారు. రెండోదశలో ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా సులభతరంగా పౌరసేవలు అందిస్తారు. ఈప్రక్రియ లో,ఈక్రింది విధంగా వివిధరకాల సేవలను అందిం చడానికి ప్రాథమికంగా నిర్ణయించారు.-(కందారపు మురళి)

విశాఖ తీరంలో నేవీ డే విన్యాసాలు

విశాఖలో నేవీ విన్యాసాలతో,సాగ తీరం అంతా యుద్ధ వాతావరణం నెలకొంది. నేవీ విన్యాసాలు చూసేందుకు వచ్చిన పర్యాటకులు, నగరవాసులు ఆశ్చర్యానికి గురయ్యారు. నేవీ చేస్తున్నటువంటివి అన్నీ కళ్లకు కట్టినట్లు చూపించారు. విశాఖ సాగర్‌ తీరంలో నేవీ విన్యాసాలు చూడటం ఎంతో బాగుందని పర్యాటకులు అంటున్నారు.నేవీ యుద్ధ విమానాలు దగ్గర నుండి చూడటం ఇదే మొదటిసారి అంటూ చెబుతున్నారు.
ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా లేజర్‌ షో చాలా బాగుందని అంటున్నారు. నేవీ దేశం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ నేవీ విన్యాసాలు చూడటం ద్వారా తెలిసిందని మరికొందరు అంటున్నారు. మన దేశం కోసం ఎంతో కష్టపడి నేవీ పని చేస్తుందని అంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హాజరయ్యారు. దేశానికి రక్షణతో పాటు విపత్తు సమయంలో కూడా నావికాదళం అద్భుతంగా పని చేసి ప్రజల ప్రాణాలు కాపాడుతోందని, తుఫాన్లు, వరదలు, ఆపద సమయంలో అందరికంటే ముందుండేది నావికా దళమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశానికి అతి ముఖ్యమైన నావల్‌ హెడ్‌ క్వార్టర్స్‌గా విశాఖపట్నం తయారవ్వడం సంతోషంగా ఉందన్నారు.భారతదేశ సముద్ర సరిహద్దును రక్షించడం కోసం 1947 విశాఖలో నేవల్‌ స్థావరానికి పునాది పడిరదని,అధికారికంగా తూర్పునౌకాదళం 1983లో ఏర్పాటైంద న్నారు.చిన్న నేవల్‌ బేస్‌గా ఉన్న తూర్పు నౌకాదళం కమాండ్‌ నేడు మహోన్నతంగా ఎదిగిందన్నారు. శనివారం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో జరిగిన నేవీ ఆపరేషనల్‌ డెమోకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి,మనవడు దేవాన్ష్‌ బాబుతో కలిసి తిలకించారు.అనంతరం సీఎం ప్రసంగించారు.మదిని మైమరపించేలా నేవీ బృందం అద్భుత విన్యాసాలను చేసి చూపించింది. వారి ధైర్యానికి, సామర్థ్యానికి, కఠోర దీక్షకు సెల్యూట్‌ చేస్తున్నా. నేవీ డే ఒడిశాలో జరిగినా విశాఖలో మళ్లీ డెమో నిర్వహించాలని వైస్‌ అడ్మిరల్‌ నిర్ణయించడం చాలా సంతోషకరం. ఎంత క్రమశిక్షణ,కఠోర శ్రమ ఉంటేనే ఈ డెమో నిర్వహించడంసాధ్యం అవుతుంది.1971లో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య జరిగిన యుద్ధంలో విశాఖపట్నం నేవల్‌ కమాండ్‌ చాలా కీలకంగా పని చేసింది. పాకిస్తాన్‌ సబ్‌ మెరైన్‌ ఘాజీని ధ్వంసం చేసింది మనవిశాఖ తూర్పు నౌకాదళమే.ఆ యుద్ధంలో ఇండియా గెలిచి చరిత్రలో నిలిచింది. కలకత్తా నుంచి చెన్నైవరకు కోస్టల్‌ ప్రాంతం ఉన్నా విశాఖ నావికా దళానికి ప్రత్యేకత ఉంది అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘‘దేశం ఆర్థికంగానే కాకుండా రక్షణ రంగంలోనూ బలంగా ఉండాలి.అందుకే ప్రధాని మోదీ వికసిత్‌ భారత్‌లో భాగంగా రక్షణ రంగానికి పెద్దపీట వేశారు. అలాంటి రక్షణరంగంలో నౌకాళంచేస్తున్న కృషి అసామాన్యం. నేవీని చూసి వేరే దేశాలు భయపడేలా పనిచేస్తున్నారు. సముద్ర రవాణాకు తూర్పునౌకాదళం రక్షణగా నిలిచి ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తోంది.దేశ రక్షణకే కాదు ఏదైనా విపత్తు వచ్చినా నౌకాదళం వేగంగా స్పందిస్తోంది.హుద్‌హుద్‌ తుపాను సమయంలో పది రోజులపాటు నేవీ చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను. తుపాన్ల సమయంలో మత్స్యకారుల ప్రాణాలు కాపాడు తున్నారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
‘‘సుదీర్ఘ తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతులు కల్పించుకుంటే ఆర్థికంగా ఎదగొచ్చు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి తరహాలో విశాఖను రాష్ట్రఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాం. ప్రస్తుతం ఉన్న పోర్టులు, భోగా పురం ఎయిర్‌పోర్టు, మెట్రోరైలు ప్రాజెక్టు పూర్తయితే మారిటైం గేట్‌వేగా విశాఖ నిలుస్తుంది’’ అనిముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.తూర్పు నౌకాదళం విశాఖ తీరంలో జనవరి 4ననిర్వహించిన విన్యాసాల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య మంత్రి చంద్రబాబుతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకుర్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.తూర్పునౌకాదళాధిపతి రాజేష్‌ పెంథార్కర్‌ ముఖ్యమంత్రిని సభావేదిక పైకి తోడ్కొని వెళ్లారు.
టెక్నాలజీలో ఏపీ ముందంజ :దేశ భవిష్యత్తు, రక్షణకు నౌకాదళం ఎంత క్రియాశీలక పాత్ర పోషిస్తుందో,రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా అదే తరహాలో సహకరించాలని తూర్పు నౌకాదళాన్ని సీఎం కోరారు. – గునపర్తి సైమన్‌

కులగణ నేటి సామాజిక అవసరం

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కులగణాంకాలపై ఎన్నడూ లేనంతగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. మన సమాజంలో కులం అన్న దాన్ని పైకి ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అది ఒక అతి కీలకమైన, విస్మరించలేని వాస్తవం.సామాజికంగా,ఆర్థికంగా,రాజకీయంగా మనకు సంబంధించిన అన్ని విషయాల్లో అసమాన వ్యవస్థలను, అహేతుకమైన హెచ్చుతగ్గులను, నిర్హేతుకమైన ఆధిపత్య-ఆధారిత భావజాలాలను కులం పెంచి పోషించింది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కులాల హోదా, స్థానం, స్థితిగతులు, గౌరవ ప్రతిపత్తులలో పెద్ద మార్పు రాకపోగా, వ్యవస్థల భాగస్వామ్యంలో వారి యథాతథ స్థితి కొనసాగింది. ఉద్యోగిత, ఆదాయం, ఇంకా అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలలో రాజ్యాంగంలో ఉద్దేశించిన విధంగా ఎలాంటి మార్పులు రాలేదు. గత అనుభవాలను పరిశీలిస్తే దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని నిష్పక్షపాతంగా అర్థం చేసుకుని అవసరమైన మార్పును, అభివృద్ధిని సాధించే విధానాల రూపకల్పన, వాటి అమలులో మౌలికంగానే ఎక్కడో లోపమున్నట్లు వెల్లడవుతోంది. అనేక ప్రణాళికలు, లక్షల కోట్ల బడ్జెట్లతో కూడిన లెక్కలేనన్ని పథకాలు, కార్యక్రమాల అమలు కూడా ఆశించిన ఫలితాలనివ్వలేదు. పంపిణీలో సమన్యాయం పాటించడం అనేదే జరగలేదు.వారసత్వ రాజకీయాలు, కుటుంబపాలన, అవినీతి, నయా భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థల పునఃప్రతిష్ఠ కొనసాగి, అన్ని రంగాల్లో అసమానతలు, పెచ్చు పెరిగాయి. కులవ్యవస్థ ప్రభావం నిరంతరంగా కొనసాగడం వల్లనే పై స్థితి స్థిరీకరించబడిరది. దీనికి అనేక కారణాలున్నప్పటికీ అయితే దేశ ప్రజలకు సంబంధించిన శాస్త్రీయమైన గణాంకాలు అందుబాటులో లేకపోవడమే ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిపే జనాభా గణాంకాల ఆధారంగా ప్రాధాన్యతలను బట్టి, అవసరాలను బట్టి ప్రభుత్వాలు అభివృద్ధి విధానాన్ని రూపొందిస్తాయి. స్వాతంత్య్రానికి ముందు 1871 నుంచి 1931వరకు 16సార్లు జరిగిన జనాభా లెక్కల్లో కుల ప్రస్తావన ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం వల్ల 1941 సెన్సెస్‌ ప్రక్రియలో అంతరాయం కల్గింది.వివరాలు సేకరించినా నివేదికలు రూపొందించలేదు. కానీ స్వాతం త్య్రానంతరం జనాభావివరాలు సేకరణలో కుల అంశాన్ని పక్కకు పెట్టారు.దేశ ప్రజల కుల సంబంధిత సమాచారం లేకపోవడంతో సామాజిక వివక్ష,అసమానతలు,ఆర్థిక అంతరాలను తగ్గించటానికి తోడ్పడే విధానాల రూపకల్పన శాస్త్రీయంగా జరుగలేదు.ప్రభుత్వ సంక్షేమ విధానాలు,సామాజిక న్యాయం,ప్రధానంగా విద్య, ఉద్యోగాలు,అభివృద్ధిలో సమాన అవకాశాలు కల్పించడం వంటి అన్ని అంశాలలో అప్పటివరకు అందుబాటులో ఉన్న అరకొర గణాంకాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది.1931 సెన్సెస్‌ తర్వాత గడ చిన 90సంవత్సరాల కాలంలో సమాజంలో వచ్చిన అనేక మార్పులను శాస్త్రీయంగా అధ్యయనం చేసి తదను గుణంగా విధానాలు రూపొందించే క్రమాన్నే ప్రతిపాదించలేదు.ఫలితంగా నిర్ణయాలు తీసుకోవడం వాటిని అమలు చేయడం అర్థవంతంగా జరుగలేదు.ఈ నేపథ్యంలో మౌలికమైన కులగణాంకాల సమాచారం లేకుండా వివిధ తరగతులకు చెందిన సామాజిక, ఆర్థిక,అంశాలకు సంబంధించిన సమస్యలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలవల్ల సాధించిన పురోగతి, తద నుగుణంగా జరిగిన మార్పులు తెలుసుకోవడం ఎలా సాధ్యమన్న ప్రశ్న ఉద్భవిస్తుంది. అసలు విధాన నిర్ణయ మే ఎలా సాధ్యమన్న మౌలిక ప్రశ్న కూడా ఉంది. అదే క్రమంలో ఓబీసీ,బీసీ కమిషన్లు వివిధ కులాల స్థితిగతులను తులనాత్మకంగా ఎలా అర్థం చేసుకోగలు గుతాయి.వెనుకబడ్డ కులాలను గుర్తించి వారి జాబితా లను ఎలా రూపొందిస్తారు. కులాల చేర్పులు మార్పు లు ఎలా సాధ్యం. క్రీమీలేయర్‌ విషయంలో ప్రతిపాద నలు ఎలా రూపొందిస్తారు.రిజర్వేషన్‌ కోటాలను ఎలా నిర్థారిస్తారు.కులం వివక్షకు,అసమానతలకు మూల కారణమైన విద్య,ఆరోగ్యం,ఉద్యోగం మొదలైనవి అందుబాటులో లేకపోవడంవల్ల ఉత్పన్నమవుతున్న అడ్డంకులను తొలగించడం ఎలా వీలవుతుంది? ఇందుకు సంబంధించిన సామాజిక మార్పుల విష యంలో విధానరూపకల్పన ఎలాసాధ్యం? అదే విధం గా గణాంకాలు, సమాచారం లేకుండానే పది శాతం ఈడబ్ల్యుయస్‌ రిజర్వేషన్లను ఎలా నిర్ధారించగలిగారు? పక్షపాత రహితమైన,నాణ్యమైన గణాంకాలు సెన్సెస్‌ ద్వారానే సాధ్యమని,ఆ సమాచారమే చట్టబద్ధమని కోర్టులు భావిస్తున్న తరుణంలో కులగణాంకాలు నిర్వ హించకపోవడం ఎంతవరకు సహేతుకం.అది తర్కా నికి ఎలా నిలుస్తుంది అన్న అనేక ప్రశ్నలు ఉత్పన్న మవుతాయి. వాస్తవానికి సమాజానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించడం కోసం 2011 జనా భా లెక్కల్లో కులగణాంకాలను సేకరిస్తామని, అనేక చర్చల తర్వాత అప్పటి ప్రధాని మన్‌మోహన్‌ సింగ్‌ 2010లోనే పార్లమెంట్‌లో ప్రకటించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నుంచి దానికి సంబం ధించిన ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే సెన్సెస్‌ సంస్థ ద్వారా కాకుండా 2011లో సామాజిక, ఆర్థిక కుల గణాంకాలపేరుతో ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా గణాంకాలు సేకరించినా,అందులో అనేక తప్పులు దొర్లాయని నాటి పాలకులు చెప్పారు.2014లో నరేం ద్రమోదీ అధికారంలోకి వచ్చాక గణాంకాల సేకర ణలో జరిగిన తప్పులు సవరిస్తామని మాట ఇచ్చి కూడా నిలబెట్టుకోలేక పోయారు. ఓబీసీ సమాచార అవసరాన్ని యూపీఏ, అదేవిధంగా ఎన్‌డిఏ అధికారి కంగా గుర్తించినప్పటికీ,గణాంకాలను వాస్తవంలోకి తీసుకురావడానికి తగినచర్యలు చేపట్ట లేకపోయా యి. గత జూలైలో ప్రస్తుత హోం సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ 2021సెన్సెస్‌లో కులాధార గణాం కాల సేకరణ ఉండదని పార్లమెంట్‌లో ప్రకటించారు. ఆతర్వాత మోదీ సర్కారు సుప్రీంకోర్టుకు కూడ, ఇది సాధ్యంకాదని చెప్పింది.ఇలా కుల గణాంకాల సేకరణ విషయంలో యూపీఏ, ఎన్‌డీఏ ప్రభుత్వాలు రెండూ మాట మార్చాయి. ద్వంద్వ ప్రమాణాలు పాటించాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే కుల గణాంకాల విష యంలో ఒక అనిశ్చిత స్థితి నెలకొల్పాయి. ప్రజలకు సంబంధించిన పూర్తి సమాచారం వారికి అందజే యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ప్రధానమంత్రి గుర్త్తించకపోవడం ఎంతవరకు సమంజసం? దేశంలో 50 శాతం పైగా ఉన్న ఓబీసీల అభివృద్ధి కాంక్షిస్తున్నా మని చెప్పే ప్రభుత్వాలు కుల గణాంకాలు చేపట్టడానికి అనుకూలంగా ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు, ఎన్‌.డి.ఎ లోని కొన్ని పార్టీలు, అదే విధంగా ఎన్‌డిఎను బయట నుండి సమర్థించే మరికొన్ని పార్టీలు,మహారాష్ట్ర, బీహార్‌,ఒడిషా,మధ్య ప్రదేశ్‌,చత్తీస్‌ఘడ్‌ ముఖ్యమం త్రులు,అదే విధంగా సి.పి.ఐ,సిపియం,ఎన్‌సిపి, ఎస్‌పి, బహుజనసమాజ్‌పార్టీ,డియంకె,తెలుగుదేశంతో సహా అనేక జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలు, కుల గణాంకాలు కోరుకుంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో అనుకూలంగా నిర్ణయం తీసుకునే ధోరణి లో ఒక కమిటీ వేసి పరిశీలిస్తుంది.అనేక మంది బిజెపి ఎంపీలు కులగణాంకాలు జరపాల్సిందేనని పట్టుబడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఈవిషయంలో అందరి అంగీకారం కూడగట్టి నిర్ణయం తీసుకోవాలని కోరారు. స్వాతం త్య్రం వచ్చిన దగ్గరనుండి కేంద్రంలో, వివిధ రాష్ట్రాల్లో వేసిన అన్నిఓబిసి /బిసి కమీషన్లు, ప్రణాళికా సంఘం, పార్లమెంటరీ కమిటీలు కుల గణాంకాలు చేపట్టాలని సూచించాయి. దేశవాప్తంగా ఉన్న బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ సంఘాలు,కులసంఘాలు పెద్ద ఎత్తున ఈ 2021సెన్సెస్‌లో కులగణాంకాలు చేర్చాలని చెప్తున్నా యి. మరో ప్రధానమైన అంశం, సుప్రీంకోర్టు, అనేక హైకోర్టులు కూడా వివిధ కేసుల్లో తీర్పులనిస్తూ రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో, కొత్త కులాలను గుర్తించబడిన జాబితాలో చేర్చే విషయంలో, నియామ కాల్లో, ప్రమోషన్లలో ఇంకా అనేక సందర్భాలలో కుల గణాంకాల ఆవశ్యకతను చెబుతూనే ఉన్నాయి. ఈ గణాంకాలను ఎవరు వ్యతిరేకిస్తున్నారో పరిశీలిస్తే అసలు విషయం గ్రహించవచ్చు.1990లలో ఓబీసీ లకు రిజర్వేషన్లు నిర్దేశిస్తూ ప్రకటన చేసినపుడు ఎవరు వ్యతిరేకించారో వారే మళ్ళీ ఇప్పుడు కూడా వాటిని వ్యతిరేకిస్తున్నారు.అయితే దీనిని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వ్యతిరేకిస్తున్నారు.ఈ నేపథ్యంలో అందరి అనుమానాలను నివృత్తిచేస్తూ నిర్ణయం తీసుకునే బాధ్యత ఇప్పుడు ప్రధామంత్రి నరేంద్రమోదీపైఉంది. ఓబీసీల జీవన ప్రమాణాలను,సామాజిక హోదాను పెంపొందించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం నెలకొల్పాలి. ఇందుకు ఆ సామాజిక వర్గాల అభివృద్ధికి దోహదపడే సమాచారాన్ని సేకరిం చాలి. ఏఏ సామాజికవర్గాలు ఏ స్థాయిలో ఉన్నాయో, వారికి ఏవిషయంలో సహాయం అవసరమో గుర్తించి, ప్రస్తుతం ఉన్న స్థితిని మార్చాలి. ఇది తమ విధ్యుక్తధర్మ మని ఇప్పటికైనా పాలకులు గుర్తించాలి. కులగణాం కాల సేకరణను కేవలం రాజకీయ దృష్టితో కాకుండా సామాజిక కోణంలో పరిశీలిస్తే వాటి అవసరం గురించి అందరికీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
సమగ్ర కుటుంబ సర్వే : తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది.75ప్రశ్నలతో కూడిన వివరాలు సేకరి స్తున్నారు.ఈసర్వే డేటాఆధారంగానే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు కాను న్నాయి. గుర్తించిన కుటుంబాల నుంచి ఎన్యుమరేటర్లు పూర్తి వివరాలు సేకరిస్తారు.ప్రధాన ప్రశ్నలు 56,ఉపప్రశ్నలు 19కలిపి మొత్తం 75ప్రశ్నలతో కుటుం బానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తారు.కుటుంబసభ్యుల పేర్లతోపాటు అందరి మొబైల్‌ నంబరు సేకరిస్తారు.కులంతో పాటు ఆకులాన్ని ఇతర పేర్లతో పిలిస్తే వాటిని కూడా రాసుకుంటారు. కుటుంబ సభ్యులవారీగా విద్య,చదివిన మాధ్యమం,ఉద్యోగం,ఉపాధి,వ్యాపారం, వార్షికా దాయం తెలుసు కుంటున్నారు.కుటుంబానికి ఉన్న భూములు,ఇళ్లు, ఇతర స్థిర,చరాస్తుల వివరాలు సేకరిస్తారు. ఇప్పటి వరకు విద్య,ఉద్యోగాల్లో పొందిన రిజర్వేషన్‌ ప్రయో జనాలు.
గత ఐదేళ్లుగా పొందిన ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది, తీసుకున్న రుణాలు, వాటిని దేని కోసం ఉపయోగించారన్న అంశాలు సైతం అడుగుతారు. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజాప్రతిని ధులుగా,లేదా నామినేటెట్‌ పదవులు,ఎన్జీవోల్లో సభ్యత్వం వంటి అంశాలు నమోదు చేయనున్నారు. విదేశాలు లేదా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారా అనే అంశాలపై కూడా అధ్యయనం జరగనుంది. సొంత ఇళ్లా అద్దెకు ఉంటున్నారా ఇంట్లోఫ్రిజ్‌,కారు, ద్విచ క్రవాహనం,కంప్యూటర్‌,స్మార్ట్‌ ఫోన్‌ వంటివి ఉన్నాయా అనే వివరాలు అడిగి ఫారంలో నింపుతారు.
ఈ సమాచారాన్ని ఏవిధంగా ఉపయోగిస్తారంటే? : ప్రజల నుంచి సేకరించిన వివరాలను గో ప్యంగా ఉంచాలని ఎన్యుమరేటర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది.భవిష్యత్తులో బీసీ,ఎస్సీ,ఎస్టీ,ఇతర వెనక బడిన వర్గాలకు సంక్షేమపథకాలు,రాజకీయ,విద్య, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అవసరమైన ప్రణాళి కలను తయారు చేసేలా ఈ డేటాను వినియోగించు కోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీరిజర్వేషన్లు ఎంతఉండాలోఈడేటా ఆధారంగానే ఖరారు చేయనున్నారు.ఈసర్వేలో సామాజిక,ఆర్థిక,విద్య,ఉపాధి,కుల,రాజకీయ సమా చారం సేకరించనున్నారు. ఈ క్రమంలో సర్వే చేసే ఎన్యుమరేటర్‌ ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఏ పత్రాలు దగ్గర పెట్టుకోవాలి? ఏం సమాధానం చెప్పాలి అనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి.
సర్వే నిర్వహణ ఇలా : సర్వేలో మొత్తం 75ప్రశ్నలు ఉంటాయి.వీటి నుంచి సమాచారంసేకరిస్తారు. ఇందులో 56ప్రధాన ప్రశ్నలు ఉండగా,మరో 19అను బంధ ప్రశ్నలు ఉంటాయి.మొత్తం రెండు పార్టులు అంటేపార్టు-1,పార్టు-2గాఉండి ఎనిమిదిపేజీల్లో సమాచారం పూరించనున్నారు. పార్టు-1లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉండాయి. అంటే సాధా రణ,విద్య,ఉద్యోగ,ఉపాధి, భూములు, రిజర్వేషన్‌ ప్రయో జనాలు, వలసలు, రాజకీయ సమా చారం అడగను న్నారు.అలాగే పార్టు-2లో కుటుంబ వివరాలను సేకరిస్తారు.ఇందులో మొత్తం17ప్రశ్నల్లో ఏడు ప్రధాన ప్రశ్నలు ఉండగా,మిగిలినవి అనుబంధ ప్రశ్నలు.
ధరణి ఖాతా, ఎకరాల వివరాలు చెప్పాల్సిందే : భూమి వివరాలు సేకరించే క్రమంలో ధరణి పట్టా నెంబరు, భూముల వివరాలు మెట్ట, తరి, పడావు వంటి భూమి రకం, ఎకరాలు గుంటల రూపంలో ఎన్యుమరేటర్‌? కు చెప్పాల్సి ఉంటుంది.సాగు విస్తీర్ణం వివరాలు అన గా నీటి పారుదల వనరు, కౌలు భూమి సాగు వివరాలు చెప్పాలి.
రిజర్వేషన్‌ ఫలాలు పొందేవారు : విద్యా,ఉద్యోగ పరంగా రిజర్వేషన్‌ విధానంతో ప్రయోజనం పొంది నా,గడిచిన ఐదేళ్లలో ప్రభు త్వం నుంచి లబ్ధిపొందిన పథకాలు,ఆ వివరాలు నమోదు చేసుకోవాలి.ఎస్సీ, ఎస్టీ,బీసీ,ఈడబ్ల్ల్యూఎస్‌ ధ్రువపత్రాలు పొందారా? అనేవి పొందుపర్చుతారు.
రాజకీయ నేపథ్యం : ప్రజాప్రతినిధిగా సభ్యత్వం కింద ప్రస్తుతం,పూర్వం ఏపదవిలో ఉన్నారనేది తెలుసుకుం టారు. పదవీ కాలం,నామినేటెడ్‌ వివరాలు నమోదు చేస్తారు. ఈ ప్రశ్నావళి ప్రజాప్రతినిధులుగా పని చేసిన వారికి వర్తిస్తుంది.
ఈ పత్రాలు దగ్గర ఉంచుకొండి : ఆధార్‌ కార్డులు, రైతులైతే అదనంగా ధరణి పాస్‌ పుస్తకాలు దగ్గర ఉంచుకోవాలి. సర్వే చేసినప్పు డు సులువుగా వివరాలు అందించవచ్చు. ఒక కుటుం బంలో ఎవరైనా ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళితే వారి వివరాలు చెప్పాలి. వలసలు వెళ్లడానికి కారణం కూడా ఆరా తీస్తారు. సర్వే సంద ర్భంగా ప్రతి కుటుం బం ఈ విషయాలను గుర్తుంచు కోవాలి. ఎందుకంటే సర్వే సందర్భంలో ఫొటోలు,పత్రాలు వంటివి తీసు కోరు.అలాగే కుటుం బీకులు అందరూ ఉండాల్సిన పని లేదు. కుటుంబ యజమాని ఉండి ఆయా వివరాలను నమోదు చేయి స్తే సరిపోతుంది.వారు ఇచ్చిన సమాచారాన్ని గోప్యం గా ఉంచుతారు.
విద్యా వివరాల నమోదులో : పాఠశాలలో చేరిన నాటికి వయసు ఎంతో చెప్పాలి. విద్యార్హతను చెప్పాలి. ఏమాధ్యమంలో చది వారని తెలియజేయాలి.ఒకవేళ బడి మానేస్తే ఆ వివరాలు కూడా నమోదు చేయాలి.
ఉద్యోగ, ఉపాధి వివరాలు : ఈ విషయానికి వచ్చిన ప్పుడు ప్రస్తుతం చేసే పని,ఉద్యోగం,వృత్తి,ఉపాధి సమాచారం ఇవ్వాలి.వార్షికాదాయం,ఒకవేళ వ్యాపా రులైతే వార్షిక టర్నోవర్‌ తెలియజేయాలి. సాంప్రదా య కులవృత్తులయితే ఆ వృత్తి కొనసాగిస్తున్నారా? లేదా? అని రాయాలి. కుల వృత్తితో కలిగిన వ్యాధి (ఉంటేనే) చెప్పాలి. ఆదాయ పన్ను చెల్లింపుదారులా? అవునా,కాదా చెప్పాలి. బ్యాంకు ఖాతా ఉందా,లేదా తెలియజేయాలి.సర్వే వివరాల ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయనుందని కలెక్టర్‌ రాజర్షిషా వెల్లడిరచారు. ప్రణాళికబద్ధంగా ఇంటింటి సర్వేను నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతిఅధికారులను ఆదేశించారు. ఇంటిం టి సర్వే కోసం చేస్తున్న ముందస్తు సన్నాహా లను అధికారులతో కలిసి పరిశీలించారు. – (ప్రొ.కె.మురళి మనోహర్‌)

హక్కుల ప్రాధాన్యత ప్రంచానికి చాటుదాం

‘‘ మానవ ప్రగతికి దోహదం చేసే పరిస్థితులే హక్కులు. సమాజ ఆమోదం పొంది, చట్టబద్ధమై నప్పుడే అవి అర్థవంతమవుతాయి.జాతి,మత,కుల,లింగ, ప్రాంతీ య తేడాలతో సంబంధం లేకుండా మానవులందరికీ హక్కులు వర్తిస్తాయి.వ్యక్తి గౌరవాన్ని (ఔన్నత్యాన్ని) పెంపొందించడానికి హక్కులు అవసరం. ఇవి మానవ నాగరికతకు నూతన ప్రమాణాలు.హక్కులు లేని మనిషి బానిసతో సమానం. ఎందుకంటే మనిషి స్వతంత్రంగా జీవించి, తన మనుగడ కాపాడుకోవడానికి హక్కులు సహకరిస్తాయి. ఎన్నో పోరాటాల ద్వారా, మరెన్నో త్యాగాల ద్వారా సాధించుకున్న మానవ హక్కులకు నేడు రక్షణ లేకుండా పోయింది. మానవ హక్కులకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలే వాటిని హననం చేస్తు న్నాయి. మానవుల మాన, ప్రాణాలకు భరోసా కల్పించేవే మానవహక్కులు. పుట్టుకతో ప్రతివ్యక్తికి లభించే ఈ హక్కులు జాతి,మత మౌఢ్యంవల్ల,రాజకీయాలవల్ల, వ్యక్తిగత ద్వేషం,కక్ష, కార్పణ్యాల వల్ల మనుషుల జీవితా లకు భరోసా లేకుండా పోతోంది. ’’
ప్రపంచంలో మానవులందరూ ఒక్కటే అని మనం గొప్పగా చెప్పుకున్నా,నవ నాగరిక సమాజంలో మన ప్రయాణం సాగుతూ ఉన్నా అనేక సందర్భాలలో స్వార్థం,కుటిలత్వం,అమానుషత్వం వంటి అనేక కారణా ల వల్ల మనిషి ప్రాణాలకు సాటి మనుషుల నుండే ముప్పు వాటిల్లుతోంది. అటువంటి పరిస్థితులలో మనిషి ప్రాణా లకు భద్రత కావాలంటే మానవ హక్కులు అవసరం. ఆహక్కుల ద్వారానే మనిషి తనకు తాను రక్షణ కల్పించు కోవచ్చు.ఈ మానవ హక్కుల గురించి ఈనాడు చర్చ చేయడం,పోరాటాలు చేయడం అనేది గొప్ప విషయం కాదు.క్రీ.శ.1215లోనే ఈమానవ హక్కుల సాధన విష యమై ఒకప్రకటన జరిగింది అంటే ఆశ్చర్యకరమే. అప్ప టి ఇంగ్లాండ్‌ రాజు జాన్‌ విడుదల చేసిన ‘మాగ్నా కార్టా’ మొట్టమొదటి మానవ హక్కుల ప్రకటనగా భావించవచ్చు. న్యాయబద్ధమైన తీర్పుద్వారా తప్ప,మరేవిధమైన పద్ధతు ల్లోనూ పౌరుల స్వేచ్ఛను హరించడం నిషేధం’ అని హక్కులకు సంబంధించిన చారిత్రక శాసనం ‘మాగ్నా కార్టా’ స్పష్టం చేసింది.
ఈ భూమ్మీద ఒకానొకప్పుడు పాలన సాగించిన నియంతలు,చక్రవర్తులు,రాజులు మా మాటే వేదం, మేం దైవాంశ సంభూతులం,తిరుగులేని అధికారం మాకే స్వం తం,చట్టానికి మేం అతీతులం అంటూ పాలన సాగించిన పాలకుల అధికారానికి మొట్ట మొదటిసారిగా అడ్డుకట్ట వేసిన ఘటనకు మరో పేరే మాగ్నాకార్టా.ఎవరైతే ప్రజల హక్కులను అణచివేసి,అతనే తప్పనిసరి పరిస్ధితులలో హక్కుల పత్రంపై సంతకం చేసిన క్షణాలు ఈ ప్రపం చంలో ప్రజాస్వామ్యానికి పునాది పడిన ఆ ఘడియల నుండే న్యాయం,స్వేచ్ఛ అనే మహత్తర భావాలకు పునాదు లు పడ్డాయి. రాజే సర్వాధికారి అని ప్రబలంగా నాటుకు పోయిన అభిప్రాయం ఆ రాజు సంతకంతోనే కొట్టుకు పోయింది. నియంతలపై ప్రజా సంక్షేమం పట్టని వారిపై ఈ రోజున ఉద్యమాలు చేయడం గొప్ప విషయం కాదు. ఏనాడో 800సంవత్సరాల క్రితమే సర్వాధి కారాలు చెలాయిస్తున్న అప్పటి ఇంగ్లాండ్‌ రాజు జాన్‌ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు ఫలితమే మాగకార్టా. నియంతరాజు మెడలువంచి స్వేచ్ఛ, సమా నత్వం అనే భావాలు మానవుల హక్కు అని నిరూపించి ప్రపంచానికి అందించిన వ్యక్తి స్వేచ్ఛల హక్కుల పత్రం.. ఇది చరిత్ర లో ఓకీలక ఘట్టం.చట్టానికి ఎవరూ అతీ తులు కాదు రాజైనా పేదైనా చట్టం ముం దు అందరూ సమానులే అంటూ ఇంగ్లాం డ్‌ ప్రజానీకం పోరు బాట పట్టింది.రాజే సర్వాధికారి అనే వేలసంవత్సరాల అభిప్రా యాన్ని కేవలం ఆఒక్క సంతకంతో తల్ల కిందులు చేసింది. తిరుగులేని ఇంగ్లాండ్‌ రాజే చట్టానికి లోబడి వ్యవహరించే అని వార్య పరిస్థితిని ఈ చారిత్రక ఒప్పందం కల్పించింది.ఆపరిణామంతో నియం తత్వ, తిరుగులేని అధికారాలు క్రమంగా పలుచబడుతూ, ప్రస్తుతం ప్రజలే ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఆవిర్భావానికి దారితీసింది. ప్రపంచ మానవాళికే గొప్ప బహుమతిని అందించింది.మానవ హక్కు లకు పట్టం కట్టింది. భావితరాల వారికి ఈవ్యక్తి స్వేచ్ఛహక్కులపత్రం నాందీ ప్రస్తా వనగా నిలిచింది అని చెప్పడంలో ఎటు వంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ పత్రం స్వేచ్ఛా హక్కుల పరిరక్షణోద్యమాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆ తదుపరి 1789వసం.లోఫ్రెంచ్‌ డిక్లరేషన్‌ పేరిట మానవ హక్కుల గురించి పేర్కొన్నారు. కాలక్రమేణా అనేక మంది మేధావులు ఈభూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతం త్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుండాలని, సాటి మనిషిని మనిషిగా కూడా చూడాలని అది హక్కుల కల్పన ద్వారానే సాధ్యపడుతుందని అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది. మనుషుల్లో జాతి,భాష,కులమతాల జాఢ్యం వీడని కారణంగానే మానవ విలువలు అడుగంటిపో తున్నాయి. మానవ హక్కులు లేని నాడు, మానవ జీవనం మరింతహీనంగా పరిణమిస్తుందని అనేక మంది సాంఘి క సంస్కర్తలు తమభావాలను వ్యక్త పరుస్తూ అనేక గ్రంధాలు, ప్రసంగాలు చేపట్టి ఈ హక్కుల ప్రాధాన్యత ప్రపంచానికి చాటి చెప్పారు.వీటిని పురస్కరించుకునే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల రూపకల్పనకై ముం దడుగు వేసింది. – (రుద్రరాజు శ్రీనివాసరాజు)

ప్రజలకు జవాబుదారిగా ఉండేలా పాలన చేద్దాం

ప్రజలకు జవాబుదారీగా ఉండేలా పాలన అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాలని సీఎంగా తాను కూడా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తానని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వ 150 రోజుల పాలన గురించి ఎమ్మెల్యేంతా నియోజకవర్గాల్లో తిరిగి ప్రజలకు వివరిం చాలని ముఖ్యమంత్రి సూచించారు. పీ4 ద్వారా పబ్లిక్‌ ప్రైవేటు పీపుల్స్‌ పార్టనర్షిప్‌ ద్వారా పేదల జీవన ప్రమాణాల్ని మార్చే కార్యక్రమం చేపడుతున్నామన్నారు.ఏపీ దేశంలో నెంబర్‌ 1గా ఉండాలన్నది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ చేయలేక పోవటం వల్ల 4 లక్షల ఎకరాలకు నీరివ్వలేని పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. అందుకే వాటి నిర్వహణను కూడా సక్రమంగా చేపట్టాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని గుంతలు పడిన రహదారులకు మరమ్మత్తులు నిర్వహణ చేయాల్సి ఉందన్న సీఎం ఆ సమస్యను ఏవిధంగా పరిష్కరించాలన్నది ప్రభుత్వం ఆలోచన చేస్తుందని వెల్లడిరచారు. -జిఎన్‌వి సతీష్‌
సంక్షేమం,అభివృద్ధి,సుపరిపాలన ఎన్డీయే విధానం.పేదల ఆదాయం పెరగాలి..ఖర్చులు తగ్గాలి. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలే ధ్యేయంగా పని చేస్తాం.సూపర్‌-6,మేనిఫెస్టో హామీలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం.సంక్షేమం ప్రారంభమైంది టీడీపీ ఆవిర్భావంతోనే. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ ఉండాలనేది ఎన్టీఆర్‌ ఇచ్చిన నినాదం. ఎన్టీఆర్‌ రూ.2 లకే కిలో బియ్యం ప్రవేశపెట్టారు…అది ఇప్పుడు దేశం మొత్తం అమలైంది.పేదలకు పింఛనురూ.30లతో ప్రారంభించారు.రైతులను ఆదుకు నేందుకు రూ.50లకే హార్స్‌ పవర్‌ విద్యుత్‌ అందించాం. పేదలు ఉండాల్సింది గుడిసెల్లో కాదు…పక్కా ఇళ్లని ఆలోచించి ఇళ్లు కట్టించారు.సగం ధరకే జనతా వస్త్రాల పంపిణీ చేశారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.162రోజుల కూటమి పాలనపై సీఎం చంద్రబాబు శాసనసభలో ప్రసంగించారు.
భవిష్యత్‌లో 3.7లక్షల కోట్ల మేర పెట్టుబడులు: ప్రస్తుతం ఏపీలో 1.2 లక్షల కోట్ల రూపాయల జాతీయ రహదారుల ప్రాజెక్టులు జరగాల్సి ఉందని, అలాగే 70 వేల కోట్ల రైల్వే లైన్‌ ప్రాజెక్టులు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఎన్డీఏ కూటమి ప్రథమ ప్రాధాన్యత జాబ్‌ ఫస్ట్‌ అన్న సీఎం అందుకే మొదటి సంతకం16 వేల 300ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై చేశానని స్పష్టంచేశారు. మెగా డీఎస్సీద్వారా ఈఉద్యోగాల భర్తీ చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వీటితో పాటు పారిశ్రామికంగా,పర్యాటకంగా,చిన్నతరహా పరిశ్రమలు,ఫుడ్‌ ప్రాసెసింగ్‌ద్వారా పెట్టుబడులు, ఉపాధి సాధించాలని అందుకే వీటిపై కొత్తవిధానాలను తీసుకువచ్చామని అన్నారు. రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సా హక బోర్డులోనూ 85వేలకోట్ల పెట్టుబడులకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు.34 వేల ఉద్యోగాలు వీటి ద్వారా వస్తాయని భావిస్తున్నామన్నారు.అలాగే 1లక్షకోట్ల పెట్టుబడులు ఎన్టీపీసీ,ఏపీ జెన్కో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌?ను ప్రధాని ప్రారంభిస్తారని తెలిపారు.రిలయన్స్‌ బయో సంస్థ కూడా కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతోందని, వీటి ద్వారా 2.5లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. సమీప భవిష్యత్‌లో 3.7లక్షల కోట్ల మేర పెట్టుబడులు,అదేస్థాయిలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఉద్యోగాల ఆధారంగా ప్రోత్సాహకాలను ఇచ్చే పాలసీని కూడా ఏపీలో అమలు చేస్తున్నామ న్నారు.గత ప్రభుత్వం శాంతిభద్రతల్ని నిర్లక్ష్యం చేసిందని, రాజకీయ ప్రాధాన్యతతో అణగదొక్కే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గంజాయి,డ్రగ్స్‌తో రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చిందని మండిపడ్డారు. మహిళలపై అత్యాచారాలు పెరిగాయన్నా సీఎం,మహిళల జోలికి వస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గంజాయి నివారణకు డ్రోన్స్‌ద్వారా నిఘా పెట్టినట్లు వెల్లడిరచారు.
కరడు గట్టిన నేరస్తులకు ఏపీ కేంద్రం కాదు
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా డిసెంబరు మొదటి వారం లో రాష్ట్రవ్యా ప్తంగా ర్యాలీ చేస్తామని, ఆర్యాలీలో తాను కూడా పాల్గొంటానన్నారు.తెలుగువారు ప్రపంచ వ్యాప్తం గా నాలెడ్జ్‌ ఎకానమీలో రాణిస్తున్నారన్నారు. కరడు గట్టిన నేరస్తులకు ఏపీ కేంద్రం కాదని,వారికి గట్టిగా హెచ్చరి కలు జారీచేశారు.గతంలో ఫింగర్‌ ప్రింట్‌ అనాలసిస్‌ కూడా నిధులు ఇవ్వలేదని విమర్శించారు.కూటమి ప్రభు త్వం శాంతి భద్రతలకు అగ్రపాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.అభివృద్ధి,సంక్షేమంసజావుగా సాగాలంటే సుపరి పాలన ఉండాలన్నారు.ల్యాండ్‌ గ్రాబింగ్‌ ప్రొహిబిషన్‌ యాక్టు`2024కు తీసుకువస్తున్నామన్న సీఎం,ఇందులో భూఆక్రమణ దారే తనకు హక్కులు ఉన్నాయని నిరూపిం చుకోవాల్సి ఉంటుందని తెలిపారు.తప్పని తేలితే14ఏళ్ల జైలు శిక్ష భారీజరిమానా ఉంటుందన్నారు. మద్యందు కాణాల విషయంలో ప్రభుత్వం కఠి నంగా ఉంటుందని, బెల్టు దుకాణాలు వస్తే బెల్టు తీస్తామని హెచ్చరించారు. మద్యం అక్రమాల విషయంలో మన, తన అనే బేధాలు ఏవీ ఉండవని తెలిపారు.ఉచిత ఇసుక సరఫరా విషయంలోనూ ఎలాంటి రాజీ ఉండబోదని తేల్చి చెప్పా రు.ఐదేళ్లపాటు చీకటిజీవోల ద్వారా పాలన సాగించారని, వాటన్నింటినీ ఆన్‌లైన్‌లో పెడుతూ నిర్ణయం తీసుకున్నా మన్నారు.పౌరసేవలన్నీ ఇకపై వాట్సప్‌లో ఇచ్చేలా నిర్ణ యం తీసుకుంటున్నామని వెల్లడిరచారు.రెవెన్యూ, దేవా దాయ,రవాణా,ఆర్టీసీ,గ్రీవెన్సు ఇలా వివిధ శాఖల సేవలు ఇక వాట్సప్‌ ద్వారా ఇస్తామన్నారు.150 ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌,వాట్సప్‌ద్వారా పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
శాసనసభ వేదికగా 2047 విజన్‌ డాక్యుమెంట్‌
నదుల అనుసంధానం కూటమి ప్రభుత్వ విధాన మని స్పష్టం చేశారు.సంక్షేమం,అభివృద్ధి,ఆదాయం, సాంకేతికతతో కూడిన సుపరిపాలన తమ ప్రభుత్వ లక్ష్యాలని వెల్లడిరచారు. ఓర్వకల్లులో డ్రోన్స్‌ సిటీ ఏర్పాటు చేసి నైపుణ్యశిక్షణ,పైలట్‌ ట్రైనింగ్‌,ఉత్పత్తి చేస్తామని అన్నా రు. రాష్ట్రంలో సవాళ్లు,సమస్యలు చాలా ఉన్నాయన్న సీఎం,రాత్రికి రాత్రి మారిపోతుందని చెప్పటం లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగకుండా మంత్రుల కమిటీ నియమించా మన్నారు.శాసనసభ వేదికగా 2047విజన్‌ డాక్యు మెంట్‌ ను ప్రజల ముందు ఉంచుతామని వెల్లడిరచారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు చాలా నష్టాలు వారసత్వంగానే వచ్చా యని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్లలో ఏపీ బ్రాండ్‌ పోయిందని, సమస్యలు కూడా వచ్చాయ న్నారు. వ్యవస్థలు కూడా ఛిన్నాభిన్నం అయ్యాయన్నారు. రాష్ట్రానికి దశ దిశ చూపించటంలో కూటమి ప్రభుత్వం ఎక్కడా రాజీపడదని స్పష్టం చేశారు. పొట్టిశ్రీరాముల బలిదానం వృథాగా పోదని,ఆస్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే లా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. స్వాతంత్య్రం రాక ముందు తూర్పుగోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ ఎంత మంది వచ్చినా అన్నం పెట్టారన్న సీఎం,అందుకే మధ్యా హ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టామన్నారు.
సామాజిక మాధ్యమాల్లో అరాచకాలు, గంజా యిపై డిప్యూటీ సీఎం చాలా గట్టిగా ఉన్నారని, తాము ఇద్దరం కలిసి ప్రజలకు హామీ ఇస్తున్నామన్నారు. మహిళ లకు అవమానం కలిగేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టు లు పెడితే అదే వారికి చివరి రోజు అవుతుందని ముఖ్య మంత్రి హెచ్చరించారు. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని సూచించారు. ప్రాణాలకు ముప్పు ఉన్నా లెక్క చేయకుండా ముఠా నాయకులు, మత విద్వేషాలు, నక్సల్స్‌ను నియంత్రించానని తెలిపారు.
కొందరు రౌడీలు,బ్లేడ్‌ బ్యాచ్‌లు ఉన్నాయి. వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టంచేశారు. పోలీసు వ్యవస్థను కూడా సంస్కరిస్తున్నామన్నారు. ప్రజా ప్రతినిధులు ఎవరూ శాంతిభద్రతల్ని చేతుల్లోకి తీసుకో వద్దని చెబుతున్నామని అన్నారు. ఎవరైనా దీనికి భిన్నంగా వ్యవహరిస్తే ఉక్కుపాదంతోనే అణచివేస్తామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి డెడ్లీ కాంబినేషన్‌ కావాలని అన్నారు.ప్రజలు కూడా ప్రభుత్వానికి సహక రించి వారి కుటుంబాలను వృద్ధిలోకి తీసుకెళ్లాలని చంద్ర బాబు ఆకాంక్షించారు.రైతులు పంపుసెట్ల వద్ద సౌర విద్యుత్‌ ప్యానళ్లుపెట్టుకుంటే మిగిలిన విద్యుత్‌ విక్రయిం చుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గ్రిడ్‌కు అనుసంధానించడంద్వారా తిరిగి సొమ్ము పొందే అవకా శం రైతులకు ఉంటుందని వెల్లడిరచారు.దీనిపై శాసన సభ్యులు తమ నియోజకవర్గాల్లో రైతులను ప్రోత్సహిం చాలని సూచించారు.
ఏపీలో 85 వేల కోట్ల పెట్టుబడులు – 10 భారీ పరిశ్రమలకు లైన్‌ క్లియర్‌
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 85 వేల కోట్ల పెట్టుబడు లకు ప్రభుత్వ ఆమోదం లభించింది. 34వేల ఉద్యోగాలు కల్పించే 10భారీ పరిశ్రమలకు సీఎం చంద్రబాబు అధ్య క్షతన జరిగిన ఎస్‌ఐపీబీ (ూ్‌a్‌వ Iఅఙవర్‌ఎవఅ్‌ ూతీశీఎశ్‌ీఱశీఅ దీశీaతీస) తొలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రు లు నారాలోకేశ్‌,పయ్యావుల కేశవ్‌,గొట్టిపాటి రవి, అన గాని సత్యప్రసాద్‌,అచ్చెన్నాయుడు,టీజీ భరత్‌, నారా యణ,వాసంశెట్టి సుభాష్‌, బీసీ జనార్దన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ భేటిలో ఈ అను మతులు, భూములు ఇచ్చేందుకు నిర్ణయిం చారు.

1 2 3 10