ఆదివాసీ సంస్కృతికి అద్దం

తెలుగు సాహితి చరిత్రలో కథాపక్రియ సదా వన్నె తరగని మకుటం లాంటిది,తెలుగు సమా జపు జీవిత చిత్రణ కథల్లో అగుపిస్తుంది. మానవ జీవితాల మనుగడకు అద్దంపట్టే కథా ప్రక్రియనే తన సామాజిక వర్గపు సంస్కృతి సాంప్రదాయాలను బాహ్య ప్రపంచానికి అందిం చడానికి సాధనంగా చేసుకుంది పాల్వంచకు చెందిన ‘‘పద్దం అనసూయ’’ కోయ సామాజిక వర్గానికి చెందిన సాంప్రదాయాలనే తన కథా వస్తువులుగా తీసుకుని వ్రాసిన ఆమె కథలు, రాశి కన్నా వాసిలో ముందు నిలుస్తాయి. వాస్తవంగా తనకు రచనా రంగంలో అంతగా అనుభవంగానీ, ప్రవేశం కానీ లేవు, అయినా తనలోని భావాలను పదుగురితో పంచు కోవాలనే తపన తనను రచయిత్రిగా తయారు చేసింది. దానికి తోడు తన చిన్నతనంలో అమ్మమ్మ చెప్పిన జానపద కథల ప్రభావం కూడా బాగా పనిచేసింది.తన మాతృభాష అయిన కోయ భాషతోపాటు వృత్తి భాష అయినా తెలుగులో కూడా మనసుతో చదివిన అనసూయ జీవిత లక్ష్యం లిపిలేని తన మాతృభాష కోయ భాషను, తెలుగు లిపి సాయంతో దేశవ్యాప్తం చేయడమే. !! అందులో భాగంగానే తన సామాజిక వర్గపు భాషతో పాటు సాంస్కృతి సాంప్రదాయాలను అక్షరీకరించి భద్రపరిచి భావితరాలకు అందించడమే దీక్షగా పని చేస్తున్నారు. అందులో భాగంగానే 2019లో ఆమె ‘‘చప్పుడు’’ అనే పేరుతో కోయ కథా సంపుటి వెలువరించారు. అంతేగాక తొలి గిరిజన కథారచయత్రిగా కూడా తెలుగు కథ సాహిత్యంలో స్థానం సంపాదించారు. ఈ కథ సంపుటిలో కథలు 2009-2011సంవత్సరాలు మధ్య వ్రాయబడినవి, సాధారణంగా గిరిజన కథలు అనగానే పోరాటాలు,మోసాలు,దగాలు, రాజకీ యాలు,వగైరా వగైరాలు,కథా వస్తువులుగా ఉంటాయి,కానీ ‘‘పద్దం అనసూయ’’ వ్రాసిన కథలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒక వైపు తమ గిరిజన సామాజిక వర్గ సంస్కృతి సాంప్రదాయాలు కనిపిస్తే, మరో వైపు తనదైన గిరిజన స్త్రీ మానసిక వేదన లను మిళితం చేసినట్టు కనిపిస్తుంది. అనసూయ స్వతహాగా గిరిజన సామాజిక వర్గంకు చెందినవారు. నిత్యం తన సామాజిక వర్గపు స్త్రీలతో కలిసిమెలిసి జీవించిన వ్యక్తివారి భావాలను అను భవాలను బాధలను దగ్గరగా చూసిన స్వానుభవంగల మనిషి,సాధారణ సమాజపు స్త్రీవాదులచూపుకు, గిరిజన సామాజిక వర్గపు ఈ ఆడ బిడ్డ స్త్రీవా దపు దృష్టికి పూర్తి వైవిధ్యం కనిపి స్తుంది. తెలుగు సాహిత్యపు స్త్రీవాదాన్ని అనసూ య దిగుమతి చేసుకోలేదు కానీ‘‘గిరిజన మహిళల జీవితంలోని కష్టాలు’’అందరికీ తెలియాలి అని మాత్రం పూర్తిగా నమ్మింది. ప్రామాణిక కథా సిద్ధాంతాలు, పత్రికలవారి ‘‘నిర్దేశిత వలయ సూత్రాలు’’ తనకు తెలిసి ఉం డవు దరిమిలా ఆమె కథల్లో సంబంధిత కొలతలు కనిపించక పోవచ్చు,కానీ తనలోని ఆవేదనలను వ్యక్తీకరిం చు కోవడానికి రచయిత్రి పడ్డ శ్రమకు తోడు తనదైన భాష,తనకు మాత్రమే సొంతమైన కథన శైలి, వెరసి పాఠకు లకులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఈ కథల రచన కొనసాగింది. కథలశైలి ఎంత చిత్రమో! వాటి వస్తువు కూడా అంతే విచిత్రం గా ఉంది. ఈ సంపుటిలోని ప్రతి కథకు నేపథ్యం‘‘చావు’’, మనిషికి మరణం ఒక పోరా టం ప్రతి జీవన పోరాటం ఒక విప్లవంఅనే అర్థ సూత్రానికి కట్టుబడి ఈ కథలు రాశారు. కథలోని వస్తువు కన్నా వస్తువుకు నేపథ్యాలైన సంస్కృతి, సంప్ర దాయాల వెంటే ఆమెకథా ప్రయాణం సాగింది. ఈ కథలన్నీ గిరిజనస్త్రీని ముఖ్యపాత్రగా చేశాయి చావు సందర్భంగా బ్రతకు పోరాటం వివరిం చిన కథలు. మరణించిన గిరిజన మహిళల బతు కులను అక్షరీకరించిన ‘సమయ ప్రవా హికలు’ ఈ కథలు.‘కాకమ్మ’కథ మొదలు ‘మూగబోయిన శబ్దం’ వరకు సాగిన ఈ‘‘చప్పుడు’’ కథల పయనంలో పాఠకులకు సరికొత్త అను భూతి సంతృప్తి కలుగుతాయి అనడంలో నిండు నిజం దాగి ఉంది.‘కాకమ్మ’కథలో ప్రధాన పాత్ర ‘కాకమ్మ’ రచయిత్రి జ్ఞాపకాల సాయంతో గిరిజన సమాజం,సంస్కృతి,భాష, కలగలుపుకుని చక్కగా సాగుతుంది.కాకమ్మ వయసు పైబడిన వృద్ధ గిరిజనస్త్రీ,తన చిన్నతనం నుంచి తమ కుటుంబం బాగుకోసం ఎంతోకృషి చేసింది, తనకు తనదైనసంస్కృతి సాంప్రదాయాలంటే ప్రాణం.వాటిని పరిరక్షించుకోవడమే తన ధ్యేయం, కానీ తన వారసులు ఆధునికత పేరుతో సంస్కృతి సాంప్రదాయాలు పాటించ కుండా ఎవరిస్వార్థం కోసం వారు కట్టు తప్పి ముందుకు కదిలిపోయిన ప్రతి సంఘటనలు కాకమ్మ మనసును గాయపరుస్తాయి.కూతురు వేరే కులం వ్యక్తినిపెళ్లి చేసుకోవడం,కొడుకు తన పెళ్లి గిరిజన ఆచారం ప్రకారం చేయడం అనాగరికంగా భావించడం, మొదలైన సంఘ టనలతో కలత చెందిన కాకమ్మ చివరికి తన చావునైనా తనవాళ్లు తమపద్ధతిలో చేస్తారో చేయరో అని ఆవేదనపడి తానే తన కర్మకాం డలు గిరిజన సాంప్రదాయం ప్రకారం చేయ డానికి కావలసిన సరుకులు అన్నీ ముందు గానే సమకూర్చుకొని పాత భోషణం పెట్టెలో దాచి దాని తాళం చెవి తన వారికి అందించి, తన ప్రాణం తన ఇంట్లోనే పోవాలనే చివరి కోరికతో కన్నుమూస్తుంది కాకమ్మ. సంస్కృతి సంప్రదా యాల పరిరక్షణలో గిరిజన స్త్రీ పడే ఆవేదనకు ఈ కథ అద్దం పడుతుంది, రెండవ కథ సంపుటి శీర్షికఅయిన ‘చప్పుడు’ కథలో గిరిజన గూడెంకు చెందిన ‘పోతప్ప’ బ్రతుకు తెరువు కోసం భార్య ‘సుంకులు’తోకలిసి పాల్వంచ పట్ట ణం పోయి బ్రతుకు తుంటాడు. పట్టణం పోయిన తమ గిరిజన పద్ధతులు మానుకోలేదు ఆకోయ దంపతులు. దురదృష్టవ శాత్తు పోతప్ప భార్య సుంకులు చనిపోతుంది. ఆమె కర్మకాం డలు గిరిజన ఆచారం ప్రకారం చేయడానికి సిద్ధమే తగిన ఏర్పాట్లు చేసుకుం టాడు.14వ రోజు రాత్రిడోలి వాళ్ళడోలి వాయిద్యాల సాయంతో రాత్రి అంతా శబ్దాలు చేస్తూ ‘పూర్భం’ చెప్పి యాస పోసి చనిపోయిన వ్యక్తి ఆత్మను సాగనంపినప్పుడే గిరిజనుల ఆచార ప్రకారం కర్మ జరిగినట్టు. పోతప్ప తన భార్య కర్మకాండలు చేస్తున్న తీరు ఆడోలు వాయిద్యాల హోరుకు పట్టణంలోని ఆధునిక గిరిజనేతరులు అడ్డు తగలడం వారిని ఎదిరించి సింహంలా ఎదురు తిరిగి తనభార్య కర్మకాండ తమదైన పద్ధతిలో డోలు చప్పుళ్ళతో పోతప్ప పూర్తి చేయడం ఈ కథలో ఇతివృత్తం. ఎంతఎత్తుకు ఎదిగిన మన పూర్వ ఆచారాల పునాదిని వదల కూడదని సత్యాన్ని చాటింది ఈ ‘చప్పుడు’ కథ. స్వార్థం నీడలో ఆధునిక సమాజం ఎంతగా పాడైపోయినా గిరిజన సామాజిక వర్గంలో ఎప్పటికీ ప్రేమలు, ఆత్మీయతలు, ప్రవహిస్తూనే ఉంటాయి అని చాటి చెప్పిన కథ ‘ముసిలి’. తనకోసం మాత్రమే కాదు తన జాతి కోసం, గోత్రంకోసం,ఇంటి కోసం,కాకుండా తన ఊరి బాగు కోసం ఆలోచించి కష్టపడి కన్నుమూసిన ముసిలి చావును ఆఊరి వాళ్ళంతా ఓపండ గల చేయడం ఈ కథలో విశేషం.పరుల కోసం పాటుపడ్డ వారు చనిపోయి కూడా జీవిస్తారు అనే మంచి సందేశం ఇచ్చింది ఈ కథ.గతం వర్తమానాల మధ్య రెండు తరాల,రెండు మతాల,మధ్య ప్రస్తుతం అడవి బిడ్డల ఊగిసలాటను దృశ్యమానం చేసిన చివరి కథ ‘‘మూగబోయిన శబ్దం’’ ఇద్దరు కొడుకులు గల ‘‘పెద్దయ్య’’కు పెద్ద కొడుకు చనిపోవడంతో ఆ కర్మకాండల కోసం గూడెం గూడెం తిరిగి బంధువులకు కబుర్లు చెప్పుకొని అందరినీ పిలుచుకుంటాడు, కానీ మతం మారిన చిన్నకొడుకు తన అన్నకు కర్మకాండ తను మారిన కొత్త మతం ప్రకారం జరిపించడం చూసి ‘శిలువ బరువు’ భారం భరించలేక శోకసముద్రం గుండెల్లో దాచుకున్న పెద్దయ్య మానసిక స్థితి, గిరిజన సంప్రదాయాలను కమ్మేస్తున్న అన్యమత మేఘాలవల్ల పొంచి ఉన్న ప్రమాదపు హెచ్చరికలు రచయిత్రి ఈకథ ద్వారా అందించారు. కథల్లోని వాక్య నిర్మాణం, జాతీయాలు,సామెతలు,పలుకు బళ్ళు,అలం కారాలు,అన్ని అచ్చమైన అడవి బిడ్డల సాంప్ర దాయ వాతావరణంతో చూపించడం రచయి త్రికి అడవిబిడ్డలకు గల అనుబంధాన్ని తేట తెల్లచేస్తుంది. – డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

భాషా పితామహుడుగా రిషి రాజ్‌పాటిల్‌

కేంబ్రిడ్జ్‌లోని భారతీయ విద్యార్థి 2,500ఏళ్ల నాటి సంస్కృత పజిల్‌ను పరిష్కరించాడు.27 ఏళ్ల రిషి అతుల్‌ రాజ్‌పోపట్‌, సుమారు రెండున్నర వేల సంవత్సరాల నాటి ప్రాచీన సంస్కృత భాషలో మాస్టర్‌ అయిన సంస్కృత భాషా మాస్టర్‌ పాణిని రాసిన వచనాన్ని డీకోడ్‌ చేసినట్లు నివేదించ బడిరది. కేంబ్రిడ్జ్‌ లోని సెయింట్‌ జాన్స్‌ కాలేజ్‌ లోని ఆసియన్‌, మిడిల్‌ ఈస్టర్న్‌ స్టడీస్‌ ఫ్యాకల్టీలో పీహెచ్‌డీ విద్యార్థి రిషి రాజ్‌పోపట్‌. 2500 ఏళ్ల నాటి సంస్కృత సమస్యకు..భారతీయ విద్యార్థి పరిష్కారించడం అందరూ సంతోషించాల్సిన విషయం.- రెబ్బాప్రగడ రవి
మలివేద కాలంలో..ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే తొలిభాషా పితామహుడిగా పేరొందిన సంస్కృత పండితుడు పాణిని రాసిన‘అష్టాధ్యాయి’ వ్యాకరణ గ్రంథంలోని ధాతు నియమాల(మెటా రూల్స్‌)ను ఇంతకాలం తప్పుగా అర్థం చేసుకు న్నారా?పాణిని వ్యాకరణంపై తొలిసారిగా భాష్యం రాసిన కాత్యాయనుడు కొన్నినిబంధనలను తప్పుగా అర్థం చేసుకోవడంవల్ల..అదే సంప్ర దాయం కొనసాగిందా?ఈప్రశ్నలకు కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో సంస్కృతంపై పీహెచ్‌డీ చేస్తున్న 27 ఏళ్ల భారత విద్యార్థి రిషిరాజ్‌ పోపట్‌ అవునని చెబుతున్నారు. క్రీ.పూ.4-5శతాబ్దాల మధ్యకాలంలో భారత వాయవ్యం(ప్రస్తుతం పాక్‌-అఫ్ఘానిస్థాన్‌ల మధ్య ప్రాంతం)లో పాణిని నివసించాడనడానికి ఆధారాలున్నాయి. సంస్కృతంపై ఆయన రాసిన ‘అష్టాధ్యాయి’ లోని వ్యాకరణ సూత్రాలు నేటికీ కొనసాగుతున్నాయి.‘‘అష్టాధ్యాయిని ఇంత కాలం మన పండితులు సరిగ్గాఅర్థం చేసుకోలేదు. ఆయన రాసిన ఎనిమిది అధ్యాయాల వ్యాకరణ పుస్తకంలో 4,000 నిబంధనలున్నాయి. పదాలను అర్థం చేసుకోవడం,కొత్తపదాల సృష్టి, విశేష ణాలు,విభక్తుల ప్రాధాన్యం.. ఇలా పలు అంశాలను ఈ నిబంధనలు స్పృశిస్తున్నాయి.గడిచిన 2,500 ఏళ్లుగా మన వాళ్లు ఈ నిబంధనలను తప్పుగా అర్థం చేసుకుని,వివరణలు ఇచ్చారు’’అని రిషి రాజ్‌పోపట్‌ వ్యాఖ్యానించారు. ‘పాణిని బోధించిన మెటారూల్‌ ప్రకారం..సమాన ప్రాముఖ్యం కలిగిన రెండు సూత్రాల మధ్య వైరుధ్యం ఏర్పడితే..వ్యాకరణ క్రమంలో వచ్చే తర్వాతి సూత్రం వర్తిస్తుందని ఇప్పటి వరకూ పండితులు భావించారు. ఈనిబంధన వ్యాకరణకోణం నుంచి తప్పుడు ఫలితాలను ఇస్తుండటంతో గందరగోళం నెలకొంది. పదానికి ఇరువైపులా వర్తించే నియమాల గురించి చెప్పడమే పాణిని ఉద్దేశం.పాఠకుడు కుడివైపు నియమాన్ని ఎంచుకోవాలన్నది ఆయన అభిప్రాయం.అష్టాధ్యాయిలోని 1.4.2 నిబం ధన(విప్రతిశేధే పరం కార్యం)ను అర్థం చేసుకుంటే ఈ విషయం తెలుస్తుంది’’ అనిరాజ్‌పోపట్‌ వాదించారు.ప్రాథమిక శబ్దాల నుంచి నూతన పదాలు, వాక్యాలను రూపొం దించడానికి అవసరమైన నిబంధనలను పాణిని తన ‘అష్టాధ్యాయి’లో చక్కగా వివరించారని పేర్కొన్నారు. పాణిని అల్గారిథమ్‌ను సరిగ్గా అర్థం చేసుకుని,కంప్యూటర్‌ప్రోగ్రామ్‌ను రూపొందిస్తే..సంస్కృతం నుంచి ఇతరభాషల తర్జుమా కూడా సులభమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు మరో రెండున్నరేళ్లు పనిచేయాల్సి ఉంటుందన్నారు. రాజ్‌పోపట్‌ పరిశోధనకు గైడ్‌(మార్గనిర్దేశకుడు)గా ఉన్న విన్సెంజో వెర్జియాని కూడా ఈకృషిపట్ల అభినందనలు తెలిపారు.శతాబ్దాలుగా ఎందరో పండితులు పరిష్కరించలేని సమస్యకు రాజ్‌పోపట్‌ మార్గ దర్శకుడయ్యారని, ఈపరిశోధనతో మరింత మంది సంస్కృత భాషపై ఆసక్తిచూపుతారని అభిప్రాయపడ్డారు.

అందరికీ న్యాయం అందేదెలా?

రాజ్యాంగం మనకు వివిధ చట్టాల ద్వారా చాలా హక్కుల్ని కల్పించింది. అయితే పొద్దున్న లేచించి మొదలు..రాత్రి పడుకునే వర కూ ఎక్కడో ఒకచోట ఏదోఒక సమస్య తలెత్తు తూనే ఉంది.మన చుట్టూ జరిగే అనేక మోసా లు,దోపిడీలు,నేరాలు-ఘోరాలు వంటివి నిత్యం మీడియాలో చూస్తూనే ఉన్నాం.. మరీ ముఖ్యం గా దళితులు,గిరిజనులు,మైనారిటీలు, మహి ళలపై అనేక రకాలుగా హింస పెరిగి పోతోంది. ఈవిషయాన్ని ఇటీవల ఎన్‌సి ఆర్‌బి విడుదల చేసిన గణాంకాలను చూస్తే అర్థమవుతుంది. అయితే వీరిలో చాలామందికి న్యాయం అంద డంలేదు.అవగాహన లేక కొందరు మిన్న కుం డిపోతే.. అక్రమార్కులు, అరాచక శక్తుల ఆగడా లకు భయపడి మరికొందరు బాధితులు గానే మిగిలిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసు స్టేషన్లు,కోర్టుల్లోనూ అన్యాయం జరు గుతున్న దుస్థితి..ఈక్రమంలో రాజ్యాంగం మనకు కల్పిస్తున్న హక్కులను ఎలా పొం దాలి..? తగిన న్యాయం..రక్షణకోసం ఎవరిని సంప్రదించాలి? ఇలాంటి పరిమితమైన అంశా లపైనే అంశాలపై ప్రత్యేక కథనం.. (సురేష్‌ కుమార్‌ పొత్తూరి)

సుప్రీం తీర్పులు….: అనితకుశవహ వర్సెస్‌ పుషవ్‌ నుండాని14-21లోపొందుపరచబడినహక్కు,చట్టం ముందు అందరూ సమానమే.పౌరులందరికీ సామాజిక,రాజకీయ,ఆర్థిక న్యాయం జరగాలి. ఈ ప్రాథమిక సూత్రాలు రాజ్యాంగం యొక్క ఆదేశాలు. అనేక చోట్ల రాజ్యాంగంలో వీటిగురించి ప్రస్తావించ బడిరది. సమాజంలోపేద,బలహీనవర్గాలకు న్యాయ సహాయం అందించబడాలి.అదిఉచితంగా జరగా లని 39ఎ అధికరణ నిర్దేశిస్తుంది.
అందే సేవలు..: న్యాయవాది సేవలు అందుతాయి. అనగా కోర్టులో కక్షిదారుని తరపున వాదనలు విని పించబడతాయి.న్యాయ సలహాలు ఇవ్వబడ తాయి. సముచిత కేసులలో కోర్టులో చెల్లించవలసిన ప్రాసెస్‌ రుసుము,సాక్షికి అయ్యే ఖర్చులు,కోర్టు వ్యవహారంలో ఆకేసుకు అయ్యే ఇతర ఖర్చులు చెల్లించబడతాయి. కేసులో వాదనలు తయారుచేయడం. అప్పీలు దాఖలు చేయడం. కేసు కాగితాలు కోర్టులో దాఖలు చేసే విధంగా ఫైలు, పుస్తకాలు తయారు చేయడం. కాగితాలను అనువాదం చేయడం. వాదనలు లిఖితపూర్వకంగా తయారు చేయడం (డ్రాఫ్టింగ్‌) ధృవపరచబడిన తప్పులు,ఉత్తర్వులు,సాక్ష్యా లు చట్టపరమైన కాగితాలు అందించడం. మహిళా బాధితులకు నష్టపరిహారం..: అత్యా చారాలు,యాసిడ్‌ దాడులువంటి విషయాలలో మహిళలపైదాడులు జరిగినప్పుడు వారికిగాని, వారివారసులకుగాని నష్టపరిహారం చెల్లిం చేందు కు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ‘మహిళా బాధి తుల నష్టపరిహార నిధి’ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. న్యాయ సేవా సంస్థల సూచన మేరకు తగిన మొత్తాన్ని ప్రభుత్వం మహిళా బాధితులకు చెల్లిస్తుంది. ఈ విధానంతో చెల్లించే నష్టపరిహారం ఇతర నష్టపరిహారాలకు సంబంధంలేదు.ఈ నష్ట పరిహారం కోసం జిల్లాలో లేదా న్యాయసేవ సంస్థ లకు దరఖాస్తు చేసుకోవాలి. ఆసంస్థలలో దరఖా స్తుల నమూనాలు లభ్యమవుతాయి. లైంగిక దాడు లు జరిగినప్పుడు కూడా ఈ నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
వివిధ సేవా పథకాలు..: ఈ న్యాయ సేవా సంస్థల ద్వారా సమాజంలో వివిధ రకాలైన నిస్సహాయ వ్యక్తులు అనగా విభిన్న ప్రతిభావంతులు, బాలలు, వృద్ధులు,గిరిజనులు,ప్రకృతి వైపరీత్యాల బాధితు లు, అసంఘటిత బాధితులు, నిరుపేదలు, మత్తు పదార్థాల బాధితులు మొదలైనవారి కోసం పథ కాలు ఏర్పాటు చేయబడ్డాయి.
న్యాయ సహాయం ఏ దశ నుండి లభిస్తుంది?..:
న్యాయ సహాయం కేసుల ప్రారంభం నుంచి అనగా సివిల్‌ కేసుల్లో దాఖలుఅయిన దగ్గర నుంచి సహా యం పొందవచ్చు.క్రిమినల్‌ కేసులలో ఎఫ్‌ఐ ఆర్‌ దాఖలు అయిన దగ్గర నుంచి అనగా అరెస్టు కు ముందు నుంచి పొందవచ్చు. అలాగే కేసు యొక్క అన్ని దశలలోను అనగా అప్పీలు, రివిజన్‌ దశ లలో కూడా పొందవచ్చు.
ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?..: సమస్య ఉన్న ప్రాంతాన్ని బట్టి, సమస్యలో ఉన్న విషయాన్ని బట్టి ఆయా (తమకు దగ్గర) తాలూకా / మండల స్థాయి న్యాయ సేవా అధికార సంస్థల వద్ద ప్రథమంగా దాఖలు చేసుకోవాలి.ఒకవేళ ఏదైనా సాంకేతిక సమస్య వలన ఆ సంస్థకు పరిధి లేకపోతే వారి సూచన మేరకు తగిన సంస్థలో దాఖలు చేయాలి. ప్రతి స్థాయిలోను అనగా తాలూకా,జిల్లా స్థాయి న్యాయ సేవా సంస్థలు తాలూకా, జిల్లా కోర్టులలోనే స్థాపించబడి ఉంటాయి. కాబట్టి తమకు దగ్గరలో ఉన్న మండలంలో ఉన్న సంస్థను సంప్రదించడం ప్రథమ కర్తవ్యం.రాష్ట్ర స్థాయి సమస్యలు రాష్ట్ర న్యాయ సేవా సంస్థల వద్ద పేర్కొనాలి. ఇవికాక రాష్ట్ర హైకోర్టులో న్యాయ సహాయం కావలసి వస్తే హైకోర్టు స్థాయిలో ప్రత్యేక సేవా సంస్థ ఉంటుంది. దానిని సంప్రదించవచ్చు. సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి సంస్థఉంటుంది. కనుక అక్కడా సంప్రదించవచ్చు.
లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌లు..: ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు గ్రామీణస్థాయిలో ఏవిధంగా వైద్య సహాయం అందిస్తాయో ఆవిధంగా గ్రామీణ ప్రజలకు, నిరక్ష రాస్య,నిరుపేద ప్రజలకు న్యాయ సహాయం అందా లనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయబడిన పథకం లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌.ఈ విధానంలో సాధారణంగా ప్రతి ఆదివారం,బుధవారాలలో గ్రామాలలోని పంచాయి తీలు లేక స్థానిక సంస్థల కార్యాలయాల్లో క్లినిక్‌లు ఏర్పాటు చేయబడతాయి. ఈక్లినిక్‌లకు పారా లీగల్‌ వాలంటీర్లు,లీగల్‌ ఎయిడ్‌న్యాయవాదులు హాజర వుతారు.ఈక్లినిక్‌లలో గ్రామీణప్రాంతాలలో ఉన్న న్యాయ సమస్యలు కాక, వీధి దీపాలు,రహదారులు, ఇళ్ళ స్థలాలు వంటి సమస్యలు..వాటినిఎలా పరి ష్కరించుకోవాలో కూడా సలహాలు ఇస్తారు. అక్కడే ఏవైనానోటీసులు,జవాబులు,పిటీషన్లతయారీ, దర ఖాస్తులు మొదలైన విషయాలలో సలహాలు, సహా యం చేస్తారు.ఎక్కువ సహాయం అవసరమైతే న్యాయసేవా అధికార సంస్థకు ఆ కేసును పంపిస్తారు. ఈ విధంగా సహాయం చేయడం ద్వారా కేసులు కోర్టుల దాకా రాకుండానే పరిష్కరించేందుకు ప్రయ త్నం చేస్తారు.
కుటుంబ హింస ఎదుర్కోవాలంటే..: ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌ల నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కుటుంబ హింస 20-50 శాతం వరకూ ఉంది.1946లో ఐరాస స్త్రీల స్థితిగ తుల అధ్యయనం కోసం ఏర్పరచిన కమిషన్‌ నివేదిక ఆధారంగా 1979 డిశంబరు 18న ఐరాస ఒక ఒప్పందాన్ని ఆమోదించింది. దీనిని ‘కన్వెన్షన్‌ ఆన్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఫామ్స్‌ ఆఫ్‌ డిస్‌ ఇంటిగ్రేషన్‌ ఎగైనెస్ట్‌ ఉమెన్‌’ అంటారు. ఈ ఒప్పందం అమలు కొరకు ఏర్పరిచిన కమిటి 1992లో కొన్ని సిఫార సులు చేస్తూ మహిళలపై హింస, వివక్ష ఉన్నాయనీ వాటిని అరికట్టాలనీ తనసిఫార్సు నెం.19లో పేర్కొంది. మహిళలకు వ్యతిరేకంగా జరిగే హింస అంతమొందించేందుకు ఐరాస ప్రకటన 1993లో మొదటిసారిగా కుటుంబ హింసను నిర్వచించింది. ఈనిర్వచనం మహిళలపై కుటుంబంలో జరిగే హింసను అన్ని కోణాల నుంచి నిషేధించింది. 1994లో మానవహక్కుల కమిషన్‌ ఏర్పాటు చేసిన కమిటి,1995బీజింగ్‌ అంతర్జాతీయ మహిళా సమా వేశం రూపొందించిన ఉద్దేశ్యాలలో కూడా కుటుం బ హింస అరికట్టడం ప్రధానమైనది. అంతర్జాతీయ కుటుంబ హింసకు వ్యతిరేకంగా వచ్చిన ప్రకట నలు,ఒప్పందాలు, ప్రచారం ఫలితంగా44 దేశా లలో కుటుంబ హింసకు వ్యతిరేకంగా చట్టాలు వచ్చాయి.మనదేశంలో కూడా మహిళా సంఘాలు, ప్రజాతంత్ర వాదుల ఒత్తిడి ఫలితంగా కుటుంబ హింస నుంచిమహిళల రక్షణచట్టం-2005 వచ్చిం ది. ఒక మహిళను ఆమె భర్తగానీ, అతని బంధువు లుగానీ హింసిస్తే అది భారత శిక్షాస్మృతి 498ఎ కింద నేరం.ఈచట్టంలో భాగ స్వామి కావటానికి స్వచ్ఛంద సంస్థలకు,రిజిస్టరు సొసైటీలకు అవకాశం ఉంది.
రక్షణ.. ఆర్థిక సహాయం..: ఈచట్టం కేవలం చట ్టబద్ధమైన వివాహితే కాక,వివాహాన్నిపోలి ఉన్న సం బంధాన్ని కలిగియున్న మహిళలకూ రక్షణ కల్పిం చింది. బాధితురాలు ఏవిధమైన సంబంధం అనగా ఉమ్మడి కుటుంబం ద్వారా ఏర్పడిన,రక్త సంబం ధం ద్వారా ఏర్పడిన సోదరి,తల్లి,ఒంటరి మహి ళలు ఎవరైనా రక్షణ పొందవచ్చు. వీరున్యాయ సేవల అథారిటీల చట్టం 1987 ప్రకారం ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చు. కుటుంబ హింస వల్ల బాధితురాలికి అయిన ఖర్చులు, నష్టపరిహా రంగా ఆమెకు లేదా ఆమె పిల్లలకు తగినంత మొత్తాన్ని చెల్లించాలని హింసకు పాల్పడిన వ్యక్తిని మెజిస్ట్రేట్‌ ఆదేశించవచ్చు.
సహాయం ఎలా?..: బాధితురాలు ఈచట్టం ద్వారా సహాయం పొందుటకు మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు పెట్టుకోవాలి.ఈదరఖాస్తును బాధితురాలు స్వయం గాగానీ,రక్షణ అధికారుల ద్వారాగానీ లేదా ఆమె తరఫున మరి ఎవరైనాగానీ దాఖలు చేయొచ్చు. ఈదరఖాస్తులో తనకు కలిగిన బాధను వివరిస్తూ తనకు కావాల్సిన సహాయాన్ని అర్థించాలి.ఈ దర ఖాస్తు ద్వారా తనపై కుటుంబ వ్యక్తి నుంచి తగిన పరిహారం ఇప్పించమనీ కోరవచ్చు.
ఎన్నిరోజుల్లో పూర్తవుతుంది..: దరఖాస్తు అయిన తేదీ నుంచి సాధారణంగా మూడు రోజుల లోపల మేజిస్ట్రేట్‌ దరఖాస్తుల విచారణ ప్రారంభిస్తారు. విచారణ ప్రారంభమైన తేదీ నుంచి60రోజుల లోపల పూర్తిచేసేందుకు మేజిస్ట్రేట్‌ ప్రయత్నిస్తారు.
ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం నేరం..: ఐపిసికి 2013లో వచ్చిన సవరణల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం సెక్షన్‌ 166 (ఎ) ప్రకా రం నేరంగా పరిగణించబడుతుంది.నిర్ధిష్టంగా 354,354ఎ,345బి,345సి(2),345డి,376 (ఎ),376బి,376సి,376డి,376ఇ సెక్షన్ల ప్రకారం నేరంగా పరిగణించబడే సమాచారం అందినప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోతే నేరంగా పరిగణిం చడుతుంది. మహిళలపై జరుగుతున్న అత్యాచా రాల విషయంలో పోలీసుల నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఉద్దేశంతో ఈ సవరణ తీసుకురావడం జరిగింది.
సంక్షేమ పథకాలు పొందడంలో..:కేవలం న్యాయ పరమైన విషయాలు మాత్రమే కాక, ఏదైనా సంక్షేమ చట్టాలు ఉంటే వాటి ప్రకారం లబ్దిదారులకు రావా ల్సిన ప్రయోజనాలను పొందే విషయంలో సలహా లు,సహాయాలు అందిస్తారు.అలాగే ప్రభుత్వ పథకాలు పొందడంలో కూడా సలహాలు, సహా యాన్ని అందజేస్తారు.ఆవిధంగా న్యాయాన్ని పొంద డంలో కావాల్సిన సహాయాన్ని అందిస్తారు.
ఫ్రంట్‌ ఆఫీస్‌ అంటే ఏంటి?..: న్యాయసేవలు అందుబాటులో ఉండేందుకు న్యాయసంస్థల్లో ఏర్పర చిన గదిని ‘ఫ్రంట్‌ ఆఫీసు’ అంటారు. అన్ని న్యాయ సేవా సంస్థలు ఈగదిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ గదిలోనే న్యాయవాదులు, పారాలీగల్‌ వాలం టీర్లు అందుబాటులో ఉంటారు.ఈగది సమర్థ వం తంగా,నాణ్యతతో కూడి ఉండాలి. (వ్యాసకర్త: సుప్రీంకోర్టు న్యాయవాది)

పర్యావరణ విధ్వంసంతోనే ప్రకృతి విఫత్తులు

‘‘ పర్యావరణ విధ్వంసం.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కీలక అంశం. మొన్నటి కరోనా.. నిన్నటి ఉత్తరాఖండ్‌ విలయం ఇవన్నీ మనుషుల ప్రాణాలను తీస్తున్నవే. అభివృద్ధి పాట పాడే ప్రభుత్వాలు, అవినీతి, అక్రమాలకు అలవాటుపడ్డ రాజకీయ నాయకులు, కార్పొరేట్లకు పర్యావరణం గురించి పట్టడం లేదు. దీంతో మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. గత అనుభవాల నుంచి మనిషి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు.!’
ప్రకృతి సహజంగా ఇచ్చిన అందా లను మనుషులు చేతులారా నాశనం చేస్తున్నా డు.పర్యావరణ పరిరక్షణ కోసం ప్రయత్నించ కుండా దాని చేదు ఫలితాలను, పర్యవసానా లను చవిచూస్తున్నాడు. ఇక అభివృద్ధి పేరు మీద చేస్తున్న విధ్వంసం గురించి చెప్పడానికే వీలు లేకుండా ఉంది. ఉత్తరాఖండ్‌లోని చమో లి జిల్లాలో జరిగిన జల విలయం ఇదే విష యాన్ని వేలెత్తి చూపుతున్నది. రిషి గంగ వద్ద నిర్మాణంపూర్తి చేసుకున్న11మెగా వాట్ల హైడల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ తనతోపాటు అందులో పని చేస్తున్న ఉద్యోగులను తీసుకుని మునిగింది. ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. దీని కింద నిర్మాణంలో ఉన్న 530 మెగావాట్ల ఎన్టీపీసీకి చెందిన పవర్‌ ప్రాజెక్ట్‌ కూడా ధ్వం సం అయింది. ఈ ప్రమాదం రిషి గంగలో మంచు శిఖరం పగలడం వల్ల జరిగింది. ఐస్‌ లాగ గడ్డకట్టిన నదిలో వాతావరణంలో వేడి పెరిగి ఈ విలయం జరిగిందని ఎన్విరాన్‌మెంట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. మొత్తం250మీటర్ల టన్నెల్‌ అంటే పొడవైన సొరంగాల్లో200మంది ఉద్యో గులు ఇరుక్కుపోయారు.16మందిని రెస్క్యూ టీంలు రక్షించాయి.16వరకు శవాలను వెలికితీశాయి. మరో 175 మంది ఆచూకీ తెలియ లేదు. ఇంకా రెస్క్యూ పనులు సాగుతున్నాయి. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు..గాయపడ్డ వారికి రూ.50వేల నష్ట పరిహారం ప్రకటించింది.
2013లోనూ ఇదే తరహాలో
2013లో ఇదే ఉత్తరాఖండ్‌లో జరిగిన కేదార్‌నాథ్‌ సంఘటన నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏమి నేర్చుకుందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అప్పుడు కూడా మెరుపు వరదలు వచ్చి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.వేలకోట్ల రూపా యల ఆస్తి నష్టం జరిగింది. ఇలాంటి ఘటనలు జరగడం, అప్పటి కప్పుడు ఏవో చర్యలను ప్రభు త్వాలు ప్రకటించడం కామన్‌గా మారింది. ఆ తర్వాత వాటి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదనేది తాజా ఘటన చెబుతున్న సత్యం. ఎప్పటి కప్పుడు ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా తీసుకునే చర్యల గురించి ప్రభుత్వాలు, అధికారులు చర్చిస్తారు. అయితే వాటిని ఆచరణలో పెట్టడం మాత్రం ఉండదు.
గుట్టలను, అడవిని నాశనం చేస్తున్నరు
ధౌలీనదిపైన నిర్మించిన హైడల్‌ ప్రాజెక్ట్‌ కింద ఎన్టీపీసీ తన ప్రాజెక్టు కడుతున్నది. దీన్ని తపోవన్‌గా పిలుస్తున్నారు. ఈడిజాస్టర్‌ వల్ల 15 గ్రామాల్లో ఆందోళన చెలరేగింది. గ్రామాలకు గ్రామాలు నదిలో మునిగిపోయా యి. ఏడు వరకు బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి. వాస్తవానికి బఫర్‌ జోన్‌లో ఈప్రాజెక్టుల నిర్మా ణం చేపట్టారు. రేణిగావ్‌ గ్రామవాసులు హైడల్‌ ప్రాజెక్ట్‌ ను వ్యతిరేకిస్తూ ఎన్నోరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అయితే వాటిని పట్టించుకోకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని కొన సాగించారు.పర్యావరణ పరిరక్షణ సంస్థలు.. పర్యా వరణ ప్రేమికులు కూడా దీనిని వ్యతిరే కించారు. అయినా ప్రాజెక్టు పని మాత్రం ఆగలేదు. 2013 లో ఈప్రాజెక్ట్‌ నిర్మాణదా రుడు సొరంగంలో ఇరు క్కుని మరణించాడు. కొద్దికాలంపాటు ఆగిన పనులు, మరో కొత్త వారికి కేటాయించడంతో తిరిగి ప్రారంభం అయ్యాయి. ఈప్రాజెక్టు కోసం వేలాదిగా చెట్లను నరికి వేశారు. పదుల సంఖ్యలో అంద మైన గుట్టలను ధ్వంసం చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే పర్యావరణాన్ని కాపాడుతున్న గుట్టలను, అడవిని నాశనం చేసి ప్రాజెక్టులు కడుతున్నారు.
గతం నుంచి ఏమీ నేర్చుకోవడం లేదు
కేదార్‌నాథ్‌ ట్రాజెడీ నుంచి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఏమీ నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో గతంలో కలపతో ఇండ్ల నిర్మాణం చేపట్టేవారు. కానీ ఇటీవల కాలంలో కలప ఇండ్ల స్థానంలో కాంక్రీట్‌ ఇండ్ల నిర్మాణం పెరిగింది. మరోవైపు స్థానిక అవసరాలకోసం గుట్టల బ్లాస్టిం గ్‌లు విపరీతంగా పెరిగాయి. పర్యావరణ మార్పుల కారణంగా స్నో ఫాల్‌ సైతం తగ్గింది. హిమాచల్‌ ప్రదేశ్‌,అరుణాచల్‌ ప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా ఇలాగే ప్రాజెక్టులు కడుతు న్నారు. 2013లో కేదార్‌నాథ్‌ సంఘటన తర్వాత ఒక కమిటీ వేయగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్‌పర్ట్స్‌ 25 అంశాలపై సిఫారసులు అందజేశారు. ఇందులో గ్రేసియర్‌ బర్న్‌కు సంబంధించి మ్యాప్‌.. ట్రాకింగ్‌.. అంశాలు తెలుసుకునేలా సూచనలు చేశారు. స్నో ఫాల్‌ ఎంత..ఎన్ని లేయర్ల గ్రేసియర్‌ ఉంది.ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి లాంటి అంశా లు ఇందులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌పర్ట్స్‌ కమిటీ చేసిన కొన్ని సూచనలను అమలు చేసినప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో మానిటరింగ్‌ చేయలేదు. అసలు వీటన్నింటినీ పక్కన పెట్టిన కారణం వల్లే కావచ్చు ప్రమాదాలు నిరంతరంగా జరగడం మాత్రం తగ్గడం లేదు.
అడవుల నరికివేత ఆపాలి
అభివృద్ధిపేరిట అడవిని నరికేసి గుట్ట లను ధ్వంసం చేసే విధానానికి ఇకనైనా స్వస్తి చెప్పాలి. అడవులను,గుట్టలను ధ్వంసం చేయడం మానేసివాటిని మరింత విస్తరించేప్రయత్నం చేయా లి. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. అయితే దీని కోసం వేర్లలోతువరకు వెళ్లాల్సిందే. ఒక ఆపద వచ్చిన తర్వాత దానిపై యాగీచేసే బదులు ప్రత్యా మ్నాయ మార్గాలను అన్వేషించి ఆపదలు రాకుండా చూసేలా నిర్ణయాలు తీసుకోవాలి.పర్యావరణ విధ్వం సంవల్ల కలిగేఆపద కూడా అంతే.. హిమా లయా ల్లోని మధ్య భూభాగంలో ఉత్తరా ఖండ్‌ ఉంది. ఇక్కడి నుంచే పర్యావరణ పరిరక్షణ మొద లు కావాలి. గుట్టలను చెట్లను కొల్లగొట్టడంపై నిషేధం ఇక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి. అప్పుడే అడవు లకే కాదు మనుషుల ప్రాణాలకూ రక్షణ దొరుకు తుంది.
బఫర్‌ జోన్లలో ప్రాజెక్టులు కడుతున్నరు
తమ రాజకీయ అస్థిత్వం కోసం.. అధి కారాన్ని నిలబెట్టుకోవడం కోసం బఫర్‌ జోన్లలో ప్రాజెక్టులు కడుతున్నారు.మానవ వినాశనం జరుగు తున్నప్పటికీ ఇవి అవసరమా? అనే విషయాన్ని ఆలోచించకపోతే.. మానవుడి మీద ప్రకృతి పగ తీర్చుకోవడానికి నిరంతరం సిద్ధంగా ఉంటుంది. మన దేశంలోని పొలిటికల్‌ సిస్టమ్‌, అభివృద్ధి విలువ మనులు ఫ్రాణాలుగా మారింది. ఉత్తరాఖండ్‌ లో తాజా డిజాస్టర్‌ ఇదే విషయాన్ని చెప్పకనే చెబు తోంది.ఈవిలయంలో ఎంత మంది చనిపోయారనే దానికి సంబంధించి పక్కా సమాచారం కూడా అధికారుల వద్ద లేదు.రికార్డులు కూడా మునిగి పోయినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఇంటికిరాని, చేరని వారు, డ్యూటీకి వెళ్లి తిరిగి రాని వారి కుటుంబాల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ విలయం వల్ల ప్రాజెక్టుల చుట్టూ నివసిస్తున్న వారి గోస వర్ణనాతీతంగా ఉంది.
పర్యావరణ విధ్వంసం ఇకనైనా ఆపాలి
పర్యావరణ కాలుష్యంతో ప్రకృతి జీవ నాడులు పట్టుదప్పుతున్నాయి. పల్లెలకు జీవకళ తప్పింది. ప్రకృతిని చూసే విధానంలో మార్పు రావొచ్చు కానీప్రకృతి మాత్రం మారదు. అభివృద్ధి పేరిట జరుగుతున్న ప్రకృతి విధ్వంసం ఆపసకపోతే పల్లెల స్వరూపమే మారుతుంది.ఈవిధ్వంసక ప్రయ త్నాలు శతాబ్దాలుగా జరుగుతూనే వున్నా ఇటీవల కాలంలో మరింత ఊపందుకున్నాయి.ఈ నేపథ్యం లోనే పర్యావరణ సమస్య తీవ్రరూపం దాల్చింది. మానవాళి ప్రశాంతంగా జీవించాలంటే ప్రకృతి, పర్యావరణం సజావుగా ఉండాలి. దీనికి విరుద్ధం గా సాగించే ప్రయాణం మనిషి మనుగడకు, అస్తి త్వానికి పెనుసవాలుగా మారనుంది. అభివృద్ధి పేరిట ప్రకృతి గుండెల్లో చిచ్చు పెట్టే ధోరణిని అడ్డుకోవాలి.అభివృద్ధిపేరుతో పచ్చని చెట్లను, అడ వులను నిర్మూలిస్తున్నారు. తద్వారా పర్యావర ణం ముప్పుకు భారీ మూల్యం చెల్లించక తప్పని పరిస్థితిని పాలకులే కల్పిస్తున్నారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌తో పాటు ఇతర నిపుణుల సూచనలను కాదని యథే చ్ఛగా కొనసాగుతోన్న పర్యావరణ విచ్ఛిత్తిని అడ్డుకో వాల్సింది ప్రజలే. ఇబ్బడిముబ్బడిగా ఎరువుల వాడకం వల్ల చినుకు రాలంగానే పరవశించాల్సిన భూమి మనిషి వినాశకర విధానాలవల్ల ఉష్ణతా పంతో వేడెక్కిపోతోంది.అందుకే భూమి వేడెక్కింది. సారాన్ని కోల్పోయింది.సముద్రాల,నదుల, పర్వ తాల,అడవుల ఉనికికి ముప్పుగా పరిణమించే విధా నాల్ని అనుసరించడం వల్ల మనం ముప్పును ఎదు ర్కోవడమే గాకుండా భవిష్యత్‌ తరాలకు వారస త్వంగా అందిస్తున్నాం. భూతాపం పెరగడానికి కారణమైన ఈ విధానాల పర్యవసానాలు రానున్న రోజుల్లో మరింత తీవ్రరూపం దాల్చనున్నాయి. రసాయన ఎరువులు, విమానాలు విడుదల చేసే వాయువులు, అంతరిస్తున్న అడవులు- వెరసి ఓజోన్‌ పొరను బలహీనం చేస్తున్నాయి. ప్రకృతికీ, మానవాళికీ క్షేమకరంగా ఉండే ప్రత్యామ్నాయాల వైపు ప్రయాణించడం మన తక్షణావసరం. వర్త మాన తరాలకే కాదు భవిష్యత్‌ తరాలకు ఉపక రించే విధానాలు ప్రకృతి సమ్మతంగా ఉండాలి. ప్రకృతి సహజ వనరుల్ని దోచుకోడమే పురోగతి కాదు. ప్రకృతిఒడిలో మనుషులు హాయిగా ఉం డాలంటే ప్రకృతిని అర్థం చేసుకోవాలి. ప్రకృతిని పరిరక్షించడమంటే మనల్ని మనం రక్షించుకోవడమే కాదు భావితరాలకు ఆరోగ్యకరమైన, సుందర సహజ ప్రకృతి గమనాన్ని అందించడం అవసరం. అందుకు అనుగుణంగా మన విధానాలను మళ్లీ పూర్వ స్థితికి తెచ్చుకోవాలి. చెరువులను కాపాడు కోవడం,పశువుల సంతతిని పెంచడం,రసాయన ఎరువులను దూరం చేయడం అలవర్చుకోవాలి. పాతపద్దతుల్లోనే వ్యవసాయాన్ని సాధించాలి. సేంద్రియ ఎరువులను ప్రభుత్వమే పంపిణీ చేసి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. చెరువులను కాపాడుకుంటూ బలోపేతం చేయాలి. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొన్ని పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం చేయ బోతున్నాయి.గొర్లు, మేకల పెంపకం, పాడి అభి వృద్ది,చెరువులపునరుద్దరణ,చేపలపెంపకం వంటి వన్నీ పర్యా వరణ హితంతో కూడుకున్నవే. అలాగే గ్రావిరీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసేవే. దేశం లోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న చెరువు లన్నింటి లోనూ ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేసారు. ఇక గొర్రెలు, మేకల పెంపకం, హరిత హారం వంటి కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరు కారణంగా పర్యావరణం పరిఢవిల్లడంతో పాటుగ్రావిరీణ ఆర్థికరంగం పుంజుకోవడం ఖా యంగా ఉంది. ఇవి దేశానికి దిశానిర్దేశం చేసేలా లబ్దిదారులు పాటుపడాలి.రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడితే పల్లె స్వరూపం మారి పచ్చ గా స్వాగతిస్తుంది.
పర్యావరణ విధ్వంసాలపై సీఎంకి లేఖ
పర్యావరణ పరిరక్షణ,ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై మాజీ ఐఏఎస్‌ అధికారి,కేంద్ర ఇంధన వనరులశాఖ ముఖ్య కార్యదర్శి ఈ.ఎ.ఎస్‌.శర్మ నవంబరు 3న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లేఖ రాశారు.ఆలేఖ పూర్తి సారాం శం ఇదీ..
ఎన్నో విషయాలలో ప్రభుత్వాధికారులు, వారి మీద అధికారం చెలాయించే రాజకీయ నాయ కులు,చట్టాలను,నిబంధనలను ఉల్లంఘిస్తూ,కార్పొ రేటు సంస్థలతో, కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి, పర్యావ రణను ధ్వంసం చేసి,ప్రజలకు నష్టం కలిగించి, ఆవిషయాలలో ప్రజలు కోర్టులను ఆశ్రయించి నప్పుడు,చేసిన తప్పులు ఒప్పుకోకుండా కోట్ల రూపా యల ఖర్చు తో ఢల్లీి నుంచి పెద్ద న్యాయవాదులను రప్పించి,ఆ ఖర్చులను కూడా రాష్ట్ర ప్రజలమీద రుద్దుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకు అయినఖర్చులను,బాధ్యులైననాయకులు, అధికారులు ఎందుకు భరించడం లేదు?
ఉదాహరణకు, ముందున్న ప్రభుత్వాలు శ్రీకాకుళంజిల్లాలో,సోంపేట ప్రాంతంలో, పర్యావ రణ పరిరక్షణ చట్టాన్ని, రాష్ట్రం ప్రవేశపెట్టిన వాల్టా చట్టాన్ని, ఇతర నిబంధనలను ఖాతరు చేయకుండా, ఉల్లంఘించి, 2008 సెప్టెంబరులో మంచి బీల భూములు ధ్వంసం చేస్తూ, వెయ్యికి పైగా ఎకరాల భూమిని ఒకకార్పొరేట్‌ సంస్థకు,థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మించేందుకు అప్పగించడం జరిగింది. బీలభూముల మీద ఆధారపడే మత్స్యకారుల, చిన్న కారు రైతుల ఉపాధులకు నష్టం కలుగుతుందనే విషయాన్ని,బొగ్గుమీద పనిచేసే పవర్‌ ప్లాంట్‌ కార ణంగా వచ్చే కాలుష్యంవలన,ప్రజల ఆరోగ్యం క్షీణి స్తుంది అనే విషయాన్ని, ప్రజలు ప్రభుత్వం దృష్టికి పదేపదే తెచ్చినా,అప్పటి నాయకులు, అధికారులు కార్పొరేట్‌ సంస్థ మీద ఉన్న వ్యామోహంతో గుడ్డిగా నిర్ణయాలు తీసుకోవడం,ప్రజలు అడ్డుకుంటే, వారిని పోలీసు బలగాల సహాయంతో అణిచివేసి, కొంత మందికిప్రాణనష్టం కూడా కలిగించడం, దేశ వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం. ప్రభుత్వం స్పందించక పోవడంవలన, ప్రజాసంఘాలు కోర్టు లను ఆశ్రయించడం జరిగింది.పదేళ్లకి పైగా వ్యా జ్యాలు నడిచాయి. జాతీయ పర్యావరణ పరిరక్షణ ట్రిబ్యునల్‌ ప్రజల తరఫున తీర్పు ఇచ్చినా,అధికా రులు,నాయకులు, కార్పొరేట్‌ సంస్థ పక్షంలో పనిచే శారు.సలీంఅలీ సెంటర్‌ వంటి ప్రఖ్యాతమైన పర్యా వరణ పరిరక్షణ సంస్థ, కోర్టు ఆదేశాలకు అనుగు ణంగా సోంపేట బీలభూములు మీదఇచ్చిన రిపో ర్టు మీదకూడా,ప్రభుత్వంచర్యలు తీసుకోక పోవడం వలన, ప్రజాసంఘాలు చెన్నైలో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవలసి వచ్చింది. ఆ కేసులో ఇచ్చినా,ఈరోజు వరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలను తీసుకోకపోవడం, నాయకులకు,అధి కారులకు కార్పొరేటు సంస్ధమీద ఉన్న ఆప్యాయతకు నిదర్శనం.ఈ కేసులలో, గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం వ్యర్థంగా చేసిన ఖర్చులు, ముఖ్యంగా న్యాయవాదులకు ఇచ్చిన ఫీజులే, కోట్లాది రూపా యలు ఉంటాయి.సోంపేట కేసులలో చట్ట ఉల్లం ఘనలకు బాధ్యులైన నాయకులనుంచి, అధికారు లనుంచి ఆ ఖర్చులకు అయిన మొత్తాన్ని సేకరించ డమే కాకుండా,బీల భూములకు కలిగిన నష్టాలను దృష్టిలో పెట్టుకునివారి మీద పెనాల్టీలు వేసి, Iూజ క్రింద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అలాగే విశాఖపట్నంలో రుషికొండ మీద, ప్రభుత్వ పర్యా వరణాభివృద్ధి సంస్థ, మున్సిపాలిటీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా,విశాఖమాస్టర్‌ ప్లాన్‌ను ఉల్లం ఘిస్తూ,విస్తృతంగా పర్యావరణను ధ్వంసం చేసే కట్టడాలనుచేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ నేను ప్రభు త్వానికి ఎన్నోమార్లు రాయడం జరిగింది. అటు వంటి కట్టడాలు కాంట్రాక్టర్లకు లాభం కలిగించేవే కాని,ప్రజలకు కావలసింది కావు.
అయినా ఆ సంస్థ రాజకీయ నాయకుల మద్దతుతో,ప్రజాసంఘాల వ్యతిరేకతను ఖాతరు చేయకుండా,గుడ్డిగా పనులు చేపట్టింది.ఇక ఎటు వంటి పత్యామ్నాయం కనిపిం చక పోవడం వలన, కొంతమంది,ప్రజల తరఫున హైకోర్టులో వ్యాజ్యా లను వేయవలసి వచ్చింది. ప్రజల ఉద్దేశాలను గౌరవించకుండా,ప్రభుత్వం ఢల్లీి నుంచి కోట్లాది రూపాయల ఖర్చుతో పెద్ద న్యాయ వాదులను రప్పించి కేసును నడిపిస్తున్నారని వార్తలు చదివాను. అటువంటి ఖర్చులను ప్రజలు ఎందుకు భరించాలి?అందుకు ఖర్చయిన మొత్తాన్ని బాధ్యులైన రాజకీయ నాయకుల నుంచి,అధికారుల నుంచి ఎందుకు వసూలు చేయడం లేదు?విశాఖపట్నం నగరం మధ్యలో ఉన్న దసపల్లా ప్రభుత్వ భూముల విషయంలోకూడా ప్రభుత్వంవైఖరి అలాగే ఉండ టం బాధాకరం. ఈవిషయంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కోర్టులను ఆశ్రయించినప్పుడు, కంచే చేను మేసినట్లు, ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ నాయకులు, వారికి దాసోహం అయిన అధికారులు,పూర్తివివరాలనుకోర్టు ముందు పెట్ట కుండా,ప్రభుత్వం తరఫు కేసును బలహీన పరచి, ఆ కారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులు ఇచ్చిన ఆదేశాలను కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు లాభం కలిగించే విధంగాఅమలు చేస్తున్నారు. వారు ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో పనిచేసే దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేయడం దృష్టిలో పెట్టుకుని, కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల చేత దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది.
ఈ కేసులో కూడా, ప్రభుత్వం చేసిన ఖర్చుల వివరాలను, ముఖ్యంగా న్యాయస్థానాలలో వ్యాజ్యాల మీద చేసిన ఖర్చుల వివరాలను,ప్రజల ముందు పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నాను. ఆఖర్చులను ప్రజలమీద రుద్దే హక్కు ప్రభుత్వానికి లేదు. దసపల్లా కేసులో వేలాది కోట్ల విలువ ఉన్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవ్వడమే కాకుండా,ఎనిమిది దశాబ్దాల నుంచి ప్రభుత్వం ఉపయోగిస్తున్న సర్క్యూట్‌ హౌస్‌ భూమి కూడా చేయి జారే అవకాశం ఉంది. ప్రభుత్వాధి కారులు ప్రజల తరఫున పని చేయకుండా, ప్రైవేట్‌ వ్యక్తుల కోసం పని చేసి, కేసును బలహీనపరిచి, భూము లను అన్యాక్రాంతం చేసినందుకు వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?ఈ కేసు మీద ప్రభుత్వం వ్యర్ధంగా న్యాయస్థానాల ముందు చేసిన ఖర్చును ప్రజలు ఎందుకు భరించాలి? ఈ మొత్తా న్ని వారి జీతాల నుంచి ఎందుకు వసూలు చేయడం లేదు? దసపల్లా భూముల ఆక్రమణ నేపథ్యంలో, ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు,ప్రైవేటు వ్యక్తు లతో,రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులతో,కుమ్మక్క యి, రెండు మూడు ప్రైవేటు కంపెనీలను ప్రారంభించి న వార్తలు వస్తున్నాయి.ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థల చేత దర్యాప్తు చేయిస్తే కాని అసలు విషయాలు బయటకు రావు.
ఈ విషయాలను మీ ముందు పెట్టడమే కాకుండా, ప్రజల దృష్టికి కూడా తీసుకువస్తున్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని, ఈ విషయాల మీద ప్రశ్నిస్తారు అని ఆశిస్తున్నాను. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నాయకులు, అధికారులు, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరునికి ఉందని గుర్తిం చాలని లేఖ రాశారు.- (ఎండీ మునీర్‌), ` వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్ట్‌,న్యూఢలీి

ఉపాధి హక్కుల లక్ష్యంగా మహిళా ఉద్యమం

పనితో బతకాలన్నది యువత ఆకాంక్ష. పంతులమ్మలు కూరగాయలు, పల్లీలు అమ్ముకుని బతికే దుస్థితి. వ్యవసాయ భూములు లాక్కుంటూ, పరిశ్రమలను ప్రైవేటు వాళ్ళకు అమ్ముతూ ఉపాధి, ఉద్యోగాలను హరిస్తున్న ప్రభుత్వాలు మన నెత్తినెక్కాయి. పనులు, ఉద్యోగాలు కాపాడబడాలంటే విద్య, వైద్యం, పరిశ్రమలు, రైల్వేలు వీటన్నింటిని ప్రైవేటు వారికి అమ్మడాన్ని ప్రతిఘటించాలి. ఉద్యోగం, ఉపాధి ప్రాథమిక హక్కుగా మారాలి. ఇప్పటికే ఉన్న గ్రామీణ ఉపాధి పథకానికి నిధులు పెంచాలి. వారికి వేతనాలు పెంచడమే కాదు, 100 రోజులు పని ఇచ్చే వరకు పోరాడాలి. పట్టణ ప్రాంతాలలో కూడా ఉపాధి చట్టం రావాలి.
ధరల మోతతో,ఇంటా బయటా సాగు తున్న హింసతో బతకడమే సవాలుగామారిన నేప థ్యంలో రాష్ట్ర మహిళల వేదనకు ప్రతిబింబంగా నెల్లూరులో రాష్ట్ర మహిళా వజ్రోత్సవ మహాసభలు జరిగాయి.ఐద్వా15వ రాష్ట్ర మహాసభలు జయ ప్రదంగా జరిగాయి. హింస నుండి,దోపిడి నుండి, భద్రతతో,గౌరవంగాజీవించే హక్కు అమలు,ఉపాధి లక్ష్యాలుగా మహాసభ పిలుపునిచ్చింది.ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు ప్రజలను,కష్టజీవులను అందులోనూ మహి ళలను నిలువు దోపిడీ చేస్తున్నాయి. మద్యం మహ మ్మారి మను షులను రాక్షసులను చేస్తుంది. బిడ్డలు మృగాలుగా మారి తల్లిదండ్రులను చంపుతున్న ఘోరా లను చూస్తున్నాము. మహిళల నిస్సహాయ తను ఆసరా చేసుకుని అత్యాచారాలు పెరుగుతు న్నాయి.వ్యాపార లాభాపేక్షతో విశ్రాంతి లేని జీవితా లు.రిక్రియేషన్‌ పేరిట బూతు.పనిచేసేచోట ఉద్యో గినులపై,పాఠశాలల్లో విద్యార్థినులపై ఎందెందు వెదికినా వేధిం పులే! మరి మార్గం ఏమిటి? ఈ దుస్థితికి కారణం ప్రభుత్వవిధానాలే! వీటిని ప్రశ్నిం చాలి! ప్రతిపక్ష పాలక పార్టీలుకూడా మహిళలపై హింసను నివా రించటానికి, అరికట్టడానికి ఏం చేస్తాయో నిలదీ యాల్సిందే! ఇందుకోసం నవం బరు 25నుండి డిసెంబరు 10వరకు సాగే హింసా వ్యతిరేక పక్షోత్సవం ప్రచారంగా మాత్రమేగాక కర్ర సాము,కరాటేలాంటి ఆత్మరక్షణ శిబిరాల నిర్వ హణకు పూనుకోవాలి.ఉన్నఉద్యోగాలు పోవడం,పని దొరకక పోవడం, అన్ని ఖర్చులు పెరగడం…ఇంటి పనికి పరిమితమైన మహిళలనుకూడా వీధుల్లోకి తెచ్చిం ది.పనులు దొరక్క గంటల కూలీకి పచారీ షాపుల్లోనో మరోచోటో వెతుక్కుంటున్నారు. సుదూర ప్రాంతాలకు మాత్రమే కాదు,దేశ దేశాలకు ప్రయాణి స్తున్నారు. ఒళ్ళమ్ముకుని బతకాల్సిన స్థితిలో కూడా నెట్టుకొస్తున్నారు.పని దొరికితే బతకొచ్చు. పథకా లతో కాదు. పనితో బతకాలన్నది యువత ఆకాంక్ష. పంతులమ్మలు కూరగాయలు, పల్లీలు అమ్ముకుని బతికే దుస్థితి. వ్యవసాయ భూములు లాక్కుంటూ, పరిశ్రమలను ప్రైవేటు వాళ్ళకు అమ్ముతూ ఉపాధి, ఉద్యోగాలను హరిస్తున్న ప్రభుత్వాలు మన నెత్తినె క్కాయి. పనులు,ఉద్యోగాలుకాపాడబడాలంటే విద్య, వైద్యం,పరిశ్రమలు,రైల్వేలు వీటన్నింటిని ప్రైవేటు వారికి అమ్మడాన్ని ప్రతిఘటించాలి.
ఉద్యోగం,ఉపాధి ప్రాథమిక హక్కుగా మారాలి.ఇప్పటికే ఉన్న గ్రామీణ ఉపాధి పథకానికి నిధులుపెంచాలి.వారికి వేతనాలు పెంచడమే కాదు,100రోజులు పని ఇచ్చే వరకు పోరాడాలి. పట్టణప్రాంతాలలోకూడా ఉపాధి చట్టంరావాలి. సాంప్రదాయాల పేర సంకెళ్ళు! వర కట్నం, బాల్య వివాహాలు, ఆడపిల్లను గర్భంలోనే చిదిమి వేసే వారసత్వపు వాసనలు. ఋతుస్రావాన్ని అంటరా నిదిగాముట్టరానిదన్న ఆచారాలు, వితంతు దురా చారం లాంటి దుస్సాంప్రదాయాలను అంత మొం దించాలన్న స్ఫూర్తిని ప్రజలకు,యువతకు అందిం చేందుకు పూనుకోవాలి.నేడు యువత, మహి ళలు విద్య,వైద్యం,మత్తుమందులు,మౌలిక సదు పాయాలు లాంటి అనేక సమస్యలను ఎదుర్కొం టున్నారు. చదువులలో,ఆటపాటలలో సమస్త రంగాలలో పట్టుదలతో సమర్ధవంతంగా పని చేస్తున్న యువ తుల సంఖ్య బాగా పెరుగుతున్నది.కానీ అదే సమ యంలో పెట్టుబడిదారీ క్షీణ విలువల ప్రభా వంలో యువత శలభాల్లా మాడిపోతున్నది. వీటి నుండి రక్షించుకోవాలి. యువత శక్తి సామర్ధ్యాలను ఉపయోగించుకోవాలి.వారిని సామాజిక,రాజకీయ ఉద్యమాలలో సమీకరిం చాలి. అందుకు సాంస్కృతిక కార్యక్రమాలను విస్తృతపరచాలి.సమానతకు ఆటం కంగా ఉన్న మనువాద భావజాలాన్ని అడుగడు గునా ఎదిరిం చాలి. స్వాతంత్య్రోద్యమ చరిత్రను, సమానత్వం కోసం సాగిన త్యాగాలను రంగరించి శిక్షణా తరగ తులను ముమ్మరంగా నిర్వహించాలి.
ఇవన్నీ తీర్మానాలతో, సంకల్పాలతో మాత్రమే అమలు జరుగవు.ఈరోజు కనీసం మనిషి మాదిరి బతకాలంటే ఉపాధి ఉండాలి.ఇంటా బయ టా రక్షణ, భద్రతఉండాలి. ఇది మహిళా సంఘం లో ఉన్నవారు మాత్రమే సాధించ గలిగేది కాదు. అన్ని రంగాలలో పని చేస్తున్న మహిళ లందరూ ఏకం కావాలి. మనతోపాటు కష్టంలో ఉన్న రైతు కూలీలు, కార్మికులు, ఉద్యోగులు భుజం కలపాలి. యువత ముందు పీఠిన నిలవాలి.సంస్థలతో, వ్యక్తులతో ఐక్య వేదికలను ఏర్పాటు చేసు కోవాలి. వర్తమాన కాలంలో మహిళలు అన్ని రకాల పోరా టాలలో వేలసంఖ్యలో పాల్గొంటున్నారు. తక్షణ వేతనాలు, భద్రత కోసమేగాక ప్రభుత్వ విధానాల మార్పు కోసం ఉద్యమించాలి.అందుకు అందరం కలవాలి,కలుపుకోవాలి.అందుకు మహిళా సంఘం ఉత్ప్రేరకంగా మారాలి. వేలాది మంది పాల్గొనడ మేకాదు, అనుసరించే అనుయాయులుగా మాత్రమే కాదు,ఊయలలూపే చేతులు,ఇంటిని నిర్వహణ చేసే సమర్థత ఉన్నమహిళలు ఉద్యమా లలో ముం దుడి దానికి నాయకత్వంవహించే నైపు ణ్యాన్ని సముపార్జించుకోవాలి.అందుకోసం అధ్య యనం-ఆచరణను మహాసభలక్ష్యాలుగానిర్ణ యించుకున్నది.
పైలక్ష్యాల సాధనకు ప్రతి సందర్భాన్ని సాధనంగా మలచాలి. స్త్రీలశక్తి సామర్ధ్యాలకు చిహ్నంగా ప్రజలు జరుపుకునే దసరా సంబరాలు సంబరాలుగా మాత్రమే కాదు, సంకల్ప వేదికలుగా మారాలి.మార్చుకోవాలి. నవంబరు 14 బాలల పండుగ.బాలలకు బంగారు ప్రపంచాన్ని ఉత్సా హంగా,ఆనందంగా జీవించగలిగే సమాజాన్ని అందించేందుకు కార్యాచరణకు అడుగు వెయ్యాలి. ఇవి తక్షణ కర్తవ్యాలుగా అమలుకు పూనుకోవాలి. దిగ్విజయంగా, ఫలప్రదంగా జరిగిన ఈ మహా సభలు75సంవత్సరాల వజ్రోత్సవాల సభగా జరగ డం మరో ప్రత్యేకత. అన్ని జిల్లాల నుండి ప్రాతి నిధ్యంతో 55 మందితో రాష్ట్ర కమిటీని మహాసభలు ఎన్నుకున్నాయి. ఎన్నికైన రాష్ట్ర మహిళా సంఘం నూతన కమిటీ పైలక్ష్యాల సాధనలో నాయకత్వం వహించనున్నదివ్యాసకర్త : ఐద్వా రాష్ట్ర కార్యదర్శి – (డి.రమాదేవి)

కవి కోకిల గుర్రం జాషువా సాహిత్య విశ్లేషణ

‘‘వినుకొండన్‌ జనియించితిన్‌ సుకవితావేశంబు చిన్నప్పుడే నను పెండ్లాడె, మదీయ కావ్యములు నానారాష్ట్ర సత్కారముల్‌ గొని కూర్చెన్‌, సుయశస్సు, కల్గుదురు నాకున్‌ భక్తులై నేనెఱుంగనివా రాంధ్రధ రాతలాన బహు సంఖ్యల్‌, సాహితీ బాంధవుల్‌ ! ’’
‘నేను’ అనే కవితాఖండికలో జాషువాగారి జీవి తాంశాలు మొత్తం వారు ఒకే పద్యంలో ఎంతో అద్భుతంగా వివరించారు. కవితా విశారద, కవి కోకిల,కవిదిగ్గజ,నవయుగకవి చక్రవర్తి మధుర శ్రీనాథ,విశ్వకవి సామ్రాట్‌,కళాప్రపూర్ణ, పద్మ భూషణ్‌ కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత గుర్రం జాషువా 1895 సెప్టెంబరు`28 సంవత్సరం గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. 1971జులై 24పరమ పదించిన జాషువా…. అణు వణువున మన కణనిర్మితమైన చాతుర్వర్ణ వ్యవస్థలో పశువు కన్నాహీనంగా, ఘోరాతిఘోరంగా, అడుగ డుగునా అవమానాలతో అవహేళనలతో, తినడానికి తిండిలేక,ఉండటానికి కొంప లేక ఊరికి దూరంగా, బ్రతుకు భారంగా దిష్టితీసి పారేసిన వస్తువుల్లా, అస్తవ్యస్త జీవుల్లా,చెల్లా చెదు రుగా, చిల్లర పైసల్లాపడి సనానతన సవర్ణ హిందూ సంప్రదాయ నిరంకుశ కర్కష రక్కసి విషపు కోరల నుండి తప్పించు కోలేక బిక్కు బిక్కు మంటూదిక్కులు చూస్తున్న అస్ప ృశ్య దళిత జాతి నుండి అశాజ్యోతిలా అరుదెంచిన సంస్కరణ యశోర వికిరణం గుర్రం జాషువా ఆయన సాహిత్యాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం…. – (డా॥ఆర్‌.కుసుమ కుమారి)
‘‘ కవిని గన్నతల్లి గర్భంబు ధన్యంబు కృతిని జెందునాడు మృత్యుడు గాడు పెరుగు దొటకూర విఖ్యాత పురుషులు కవిని వ్యర్థజీవిగా దలంత్రు.’’
పిరదౌసితోపాటు,షానామా కావ్యా న్ని అందుకున్న సుల్తాను కూడా నేటికి జీవిస్తూనే ఉన్నాడు.సమాజమే పాఠశాలగా,వివక్షతే ఉగ్గు పాలుగా ఆరగించి అంటరానితనం వెంటాడి నాఒంటరిగానే పోరాటంచేసి,అవమానాలుగా భావించి,ఛీత్కారాలనుశిరోభూషణాలుగా స్వీక రించి దళిత జాతికి ప్రతినిధిగా నిలిచి పూ జారి లేని వేళ తన సందేశాన్ని వినిపించ మని గబ్బి లాన్ని పంపిన ఆధునిక దళిత కవితా, వైతాళి కుడు,పంచమస్వరంలో గానమాలపించిన కవి కోకిల,ఖండకావ్య ప్రక్రియలో అగ్రగణ్యుడు,సీనపద్యరచనలు, మధు ర శ్రీనాథుడు,విమల మనస్కుడు వినుకొండ, మగధీరుడు గుర్రం జాషువా. వీరి రచనల్లో ఎన్నో సామాజికాంశాలు, మహిళా భ్యుదయ ధోరణులు, ప్రజాసమస్యలు,రుగ్మతలు, మూఢ నమ్మకాలు ఇలా ఎన్నో విషయాలు నిక్షిప్తమై ఉంటాయి.
‘ఫిరదౌసి’ కావ్యంలో ‘‘రాజు మరణించె నొక తార రాలిపోయే కవియు మరణించె నొక తార గగనమెక్కెరాజు జీవించె రాతి విగ్రహములందు సుకవి జీవించె ప్రజల నాల్కలయందు’’ రాజాధిరాజుల కన్నా కవి గొప్పవాడని, శాస్వితుడని చెప్పడం కవికుల పక్షం వహిం చడమే జాషువా కవిత్వంలో ఇలాంటి విలక్షణాంశాలు కోకొల్లలు. తన పూర్వ కవులతో పోల్చినా సమకాలీన కవిత్వంతో తులనాత్మీకరించినా జాషువా కవిత్వానికి ప్రత్యేకస్థానం ఉంది.
‘‘ బంగారు నాణెముల్‌ బస్తాల కెత్తించి మదపుట్టెన్గుల మీద పదిల పఱిచి లేత పచ్చలు నేఱి గోతాలతో కుట్టించి లోట్టి పిట్టల మీద దిట్టపరచి…’’
గజనిమహ్మద్‌ మనదేశం మీద దండెత్తి వచ్చి ఏ విధంగా సంపదను దోచుకున్నాడో ఈ కవి త్వం తెలియజేస్తుంది, ఇంకోక చోట మత తత్వం గురించి ‘‘ పామునకు పాలు, చీమకు పంచదార మేపు కొనుచున్న కర్మభూమి జనించు ప్రాక్తంబైన ధర్మదేవతకు గూడి నులికిపడు జబ్బుగలదు వీడున్నచోట!’’ అంటాడు. జాషువా ఈపద్యంలో మూఢభక్తికి నిశితంగా విమర్శిస్తారు. విష సర్పాన్ని కండ చీమను దైవంగా భావించి కొలిచే వాళ్ళు ఎంత విచిత్రమైన వాళ్లు కదా అంటాడు. మనిషి స్వభావాన్ని గురించి చెప్తూ ‘ముసాఫిర్‌ కథ’లో ….. ‘‘మంచి వాడొక్క తెగకు దుర్మార్గుడగును దుష్టుడొక వర్గమున మహాశిష్టుడగును ఒక్కడౌనన్న కాదను నొక్కరుండు బుఱ్ఱ లన్నియు నొకమారు వెఱివగును’’! అంటే ఒక వర్గానికి మంచి వాడైనవాడు వేరొక వర్గానికి దుర్మార్గుడవుతాడు. ఒక వర్గంలోని దుష్టుడు మరొక వర్గానికి మిక్కిలి మంచి వాడవుతాడు.ఒకడు ఔనంటే మరొకడు కాదంటాడు. బుద్ధులన్నీ ఒక్కసారిగా పిచ్చివైపోతాయి. ‘‘హృదయములేని లోకము సుమీయిది మాపుల ( బశ్చిమంబుగా నుదయము తూర్పుగా నడుచుచుండు సనాతన దర్మధేవుల్‌ పిదికిన పాలు పేదకు లభింపవు శ్రీగలవాని యాజ్ఞలా )( బెదవి గదల్ప ) జారలర రవింద భవ ప్రముఖమృతాంథసుల్‌ ’’
ధర్మానికి కీడు కల్గినపుడు బ్రహ్మాది దేవతలు వచ్చి ధర్మసంస్థాపన చేస్తారని మన పురణాలు పలుకుతుంటే దళితులపట్ల జరిగే అధర్మానికి, అన్యాయానికి దేవతలెవరూ పెదవి విప్పలేదని మన పురణాలని ప్రశ్నిస్తున్నాడు కవి.
‘‘ స్త్రీ కంటెంబురుషుండు శ్రేష్ఠుడనుచున్‌ సిద్ధాంతముల్‌ చేసి తాకుల్‌ కంఠములెత్తి స్త్రీ జగతి కన్యాయంబు గావించెనో యేకాలంబున పుట్టినింటయిన లేవ నాటి స్వతంత్య్రముల్‌ వే స్త్రీకిన్‌ మారు సమాన గౌరవ విబూతిన్‌ గాంతకుం గూర్చుమా’’ ఈ పద్యంలో జాషువా మహిళాభ్యుదయాన్ని కాంక్షిస్తూ సమాన స్వేచ్ఛ కావలంటారు. యుగ యుగాలుగా అణచివేతకు గురౌతున్న స్త్రీ పై పురుష అహంకారం తగదని అటువంటి సిద్ధాం తాలు మంటగలిసిపోతాయని చెప్పారు.జాషువా గారి కవిత్వంలో వాస్తవికాంశాలను సరళమైన శైలిలో సుభోధకంగా సందేశాన్ని అందించడమే కాకుండా వాస్తవానికి దగ్గరగాను ఆలోచించే విధంగాను కనిపిస్తాయి.‘గబ్బిలం’లో….. ‘‘వాని రెక్కల కష్టంబులేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టువానికి భుక్తి లేదు’’ అంటూ అస్పృశ్యతను సమాజానికి బహిర్గతం చేస్తారు జాషువా. అస్పృశ్యుడై పేదరికాన్ని అనుభవించిన జాషువా ఆకలి మంటలతో అల్లాడిపోతూ, బుక్కెడు బువ్వకోసం తాను అనుభవిస్తున్న సమస్త కష్టాలు మరిచిపోయే అల్పసంతోషి అంటాడు. మరోచోట ‘‘ధర్మమునకు బిరికితనం మెన్నడును లేదు సత్యవాక్యమునకు చావులేదు వెరపనేల నీకు విశ్వనాథుని మ్రోల సృష్టికర్త తాను సృష్టినీవు ’’ జాషువా నిరసనలు తెలుసుకోవాలంటే ఒక ‘గబ్బిలం’ కావ్యంచాలు.ఈ కావ్యం ఎంతో హేతువాద ధోరణితో రాయబడిరది. అంటరాని తనాన్ని, సమాజంలో మొత్తం కుళ్ళుని ఎండ గట్టాడు,కర్మ సిద్ధాంతం పేరుతో పేదల నోరు కట్టేసి వారు అనుభవిస్తున్న స్వార్ధపరుల గురించి పరమేశ్వరుని దగ్గర నిరసన వ్యక్తం చేసే విధం గా గబ్బిలాన్ని ప్రోత్సహించాడు. ‘పశ్చాత్తాపము’ అనే ఖండ కావ్యంలో…. ‘‘ పడుచు బిల్లల ముసలికి ముడి బెట్టితి, పసుపు కుంకుములకు నెవ్వలిjైు గడియించిన నా పాపము వడుపున నిపుడా యనాథ పుత్యక్షమగున్‌’’ చిన్న పిల్లలను ముసలి వారికి ఇచ్చి పెళ్ళి చేస్తూ, భర్త చనిపోగానే ఆమె విధవరాలని దూషిస్తారు. ఆమె పసుపు కుంకుములకు దూరంగా వెలి వేయబడుతుంది. ఆమె అనాథగా మారుతుంది. ఈ మూఢత్వం నుండి సమాజం బయటకు రావాలని జాషువా కోరారు.‘ సూర్యోదయం’ అనే ఖండికలో…. ‘‘కాకి పిల్పుల గీతి కారవ మాలించి సమయంపు నిదుర మంచంబు డిగ్గి మల యాచలము మీది యలతి వాయువులచే నిఖిలి లోకంబును నిద్రలేపి’’ ఈ పద్యంలో కాకుల పాటలతో సమయం నిదుర మంచం నుండి దిగిందనీ,కొండలు మీద నుండి వచ్చే పిల్లగాలులు సమస్త లోకాన్ని నిద్ర లేపాయనీ నెలరాజు పడమటి కొండలపైకి నెట్ట బడ్డాడని ప్రకృతి సౌందర్యాన్ని గురించి వర్ణించాడు. జాషువా‘ లేఖిని’లో … ‘‘ సకల దేశ మహిత సౌభాగ్య సంపత్తి మనకు గిట్ట దనుచు మధ్య పరచి కులమతాలు దొడ్డ గుండాలు ద్రవ్వించు స్వార్ధ పరులు దాడి నరిగట్టి దేశంబు పరువు నిలుపు కొమ్ముబీ భరతపుత్ర! ’’
జాషువా కోరిన జాతి సమైక్యతలో జీవనరాగం కనిపిస్తుంది. ప్రపంచం సర్వ సుభిక్షం కావా లన్నది ఆయనమతం ఎల్లసోదరులు ఏకోదరులై నిరంతర ఆనంద జీవనం గడపాలన్నది ఆయన కోరిక. ‘చదువు’ ఖండికలో.. ‘‘గుళ్ళు గోపురాలు కోసరంబై నీవు ధారవో యుచున్న ధనము జూచి కటికి పేదవాని కడుపులో నర్తించు కత్తులెన్నో లెక్క గట్టగలవె!’’
డబ్బున్నవారు గుడికి,గోపురాలకు పెట్టే ఖర్చులో కొంతైనా కడుపులో ఆకలితో బాధపడుతున్న వారిని గూర్చి ఆలోచన చేయవలసిందిగా సూచిస్తున్న ఈ పద్యం చిరస్మరణీయం. ఈవిధం గా జాషువాగారి కవిత్వంలోవాస్తవికాంశాలను సరళమైన శైలిలో సుబోధకంగా సందేశా న్ని అందించడమే కాకుండా వాస్తవానికి దగ్గర గాను, ఆలోచించే విధంగాను కనిపిస్తాయి. జాషువా కొన్ని సందర్భాల్లో నాస్తికుడుగా కొన్ని సందర్భాల్లో ఆస్తికుడుగా కనిపిస్తాడు. అన్నింటికీ మించి జాషువా మానవ తావాదిగా కన్పిస్తాడు. ఆయన రచనల్లో ఎక్కువగా సమాజంలోని అసమానతలు, రుగ్మతలు, నిరసన,ఆవేదన కనిపి స్తాయి. తెలుగు సాహిత్య లోకంలో జాషువా వంటి కవి మరొ కరు లేరు.దీనికి కారణం ఆయన హేతువాద రచనలే నిదర్శనం,కాబట్టే ప్రస్తుత సమాజంలో ఇటువంటి ఎందరో కవులకు జాషువా ఆదర్శమయ్యాడు.-వ్యాసకర్త : తెలుగు విభాగాధిపతి,
డా॥వి.యస్‌.కృష్ణా ప్రభుత్వ డిగ్రీÊ పి.జి.
కళాశాల(ఎ),విశాఖపట్నం.
సెల్‌ : 9963625639.

దళిత,ఆదివాసీలకు ప్రత్యేక మహిళా కమిషన్‌

జెండర్‌ సమానత్వ ప్రపంచాన్ని ఊహిద్దాం, కలగందాం, దానికై పనిచేద్దాం. వివక్ష లేని సమాజం, మూస లేని వైవిధ్యాన్ని ఆహ్వానిద్దాం. ఇదీ, 2022 సంవత్సర అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఇతివృత్తం. పురుష పక్షపాతం ఉన్నంత కాలం మహిళలు అన్ని రంగాలలో వెనుకబడే ఉంటారు. అందుకే ‘బ్రేక్‌ ది బయాస్‌’ అని పిలుపునిచ్చారు. ‘మేము స్వేచ్ఛగా విహరించాలని అనుకుంటున్నాం కానీ రక్షణ పేరుతో మమ్ముల్ని కట్టి పడేస్తారు. మీతో పాటు సమానంగా బ్రతకాలని ఆశిస్తున్నాం కానీ సంస్కృతి, మతం, ఆచారాల పేరుతో అణగద్రొక్కుతారు. మరి సగం సమాజం, మానవత స్వేచ్ఛగా లేక పోతే మీకు మాత్రం స్వేచ్ఛ ఎక్కడిది ? స్వేచ్ఛగా ఉన్నామన్న భ్రమ తప్ప’. మహిళా లోకం ఆత్మ ఘోషను ఇప్పటికైనా అర్థం చేసుకుంటారా?
మనం ఒకఉదాత్త సమాజంలో ఉండే వాళ్ళం. ప్రపంచంలో మతఘర్షణలు, యుద్ధా లు, ఉద్యమాలు ఎక్కడ జరిగినా అంతిమంగా వాటి ప్రభావం మహిళలు,పిల్లలపైనే ఎక్కువగా ఉం టుంది. ఇది మనందరికీ నిత్యం అనుభవంలోకి వస్తున్న సత్యమే. సామాజిక,ఆర్థిక,రాజకీయ రం గాలలో మహిళల పరిస్థితి సింహావలోకనం చేసు కుని,ఇక ముందుఎట్లా అడుగువేయాలి అనే విష యమై అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంద ర్భంగా నిర్ణయాలు తీసుకోవడం,కార్యాచరణకు పూనుకోవడం పరిపాటి.మరి,మన దేశంలో మహి ళలకి సంబంధించిన గణాంకాలు చూస్తే చాలా దిగులు కలుగుతోంది. నిరుత్సాహం ఆవహిస్తోంది. ఒక్కోసారి ఈలెక్కలు తప్పేమో అనిపిస్తుంది. ప్రభు త్వాలు చాటుకునే గొప్పలు, ఇచ్చే నినాదాలు అన్ని కూడా అబద్ధం అని అనిపిస్తాయి. ఎంత నిరుత్సా హపరిచినా,ఎంత అణచివేతకు గురి అయినా, ఫీనిక్స్‌ పక్షి లాగా మళ్ళీ రెక్కలు విరుచుకుని లేవడ మే మహిళలు చేసే పని. అదే ఉత్సాహంతో మహి ళలు,మహిళా స్వేచ్ఛ కాంక్షించే వాళ్ళు ఈ అంతర్జా తీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మొక్కుబడో,శాలువాలో,పురస్కారాల కోసమో,ఎదో ఒకటి జరుపుకోవడం కూడా అవసరమే. ఆ అవస రం కూడా మహిళలలో పెరుగుతున్న చైతన్యం, అన్యాయాన్ని ఎదిరిస్తున్న సందర్భం, ప్రశ్నించే సమూహాల నుంచి వచ్చిందే అని మరవద్దు. అంత ర్జాతీయ మహిళా దినోత్సవం,భారత స్వాతం త్య్ర అమృతోత్సవాల సందర్భంగా మహిళా శిశు సంక్షే మ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సామాజిక మాధ్య మాల ద్వారా మహిళల రక్షణ, సాధికారతకు సంబంధించి అనేక అంశాలపై వివిధ కార్యక్ర మాలను నిర్వహిస్తున్నారు.ఈవారోత్సవాలకు ముగిం పుగా మార్చి8న ‘నారీశక్తి పురస్కార్‌’ పేరుతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మహిళా పోలీసులని సత్కరించనున్నారు.
సరే,మన దేశంలో మహిళలజీవన స్థితి గతుల్లో ఏమైనా మెరుగుదల ఉందా? వాస్తవాలు సంతోషించదగినవిగా లేవు.ఇదొక కఠోర వాస్తవం. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో గణాంకాలే ఇందుకు నిదర్శనం. 2019లో4,05,861మహిళలపై నేరాలు జరిగినట్టు ఆసంస్థ నివేదిక ఒకటి వెల్లడిర చింది. 2018లో కంటే 2019లో ఆనేరాలు 7.3 శాతం పెరిగినట్టు ఆనివేదిక వెల్లడిరచింది.ఆ తరు వాత కొవిడ్‌ కాలంలో ఈనేరాలు మరింత ఎక్కువ గా నమోదయ్యాయన్నది విస్మరించలేని వాస్తవం. ఇప్పటికీ 38శాతం స్త్రీలు పని చేసే స్థలాల్లో వేధిం పులకు గురవుతున్నారు. ప్రతిప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలో లైంగిక హింస వ్యతిరేక కమిటీలు, సాధికా రత కమిటీలు ఉండాలన్న విషయం ఇంకా పటిష్ఠం గా అమలులోకి రాలేదు, పెద్ద పెద్ద విద్యా సంస్థల లో ఈకమిటీల ఊసేలేదు! ఉన్న చోట్ల ఒక పాలసీ గా కాకుండా, మొక్కుబడిగా మాత్రమే ఉన్నాయి. సైబర్‌ కేసుల విషయం చూసినా అవి కూడా స్త్రీలకు వ్యతిరేకంగా జరిగినవే అధికం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో స్త్రీల పరిస్థితి ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణ గడ్డ మీద, తెలం గాణ ఉద్యమాలలో స్త్రీల పాత్ర తక్కువేమీ కాదు కదా.నేడు విద్యా,వ్యాపార,కళల రంగాలలో ఉన్న మహిళలు ఎక్కువే అయినా స్త్రీలపైన నేరాలు అత్య ధికంగా నమోదు అవుతున్నాయి. జాతీయ లెక్కల కంటే మనమే ముందున్నాము.2019 లెక్కల ప్రకా రం దేశంలో 7శాతం నమోదు అయితే తెలంగాణ లో 14.8శాతం నేరాలు పెరిగినాయి, ప్రతిరోజూ కనీసం ముగ్గురు మహిళలు అత్యాచారానికి గురవు తున్నారు. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే 18శాతం నేరాలు అత్యధికంగా నమోదయినాయి. అస్సాం తరువాత సైబర్‌నేరాలు తెలంగాణలోనే ఎక్కువ.ఇక 2022 లెక్కలు తీస్తే ఈనేరాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని అధిగమిం చేందు కు ఏంచేయాలి?మహిళలను మొక్కుబడిగా, పావ లావడ్డీ పథకాలకు,ఆసరా పింఛన్‌లకి కుదించ కుండా అన్ని అభివృద్ధి పథకాల్లో, ప్లానింగ్‌లో వారిని సంపూర్ణ భాగస్వాముల్ని చేయాలి. జెండర్‌ సమా నత్వ అవగాహన పెంచటంచిన్నప్పటి నుంచే కుటుంబం,పాఠశాలలోనే మొదలు కావాలి. భేటీ పడావో,భేటీ బచావో నినాదాలకు మాత్రమే కాకుం డా ఒకఉద్యమంలాగా ఆచరణలోకి రావాలి. ఆడ పిల్లలకి,అన్నివర్గాలలోఉన్న పేదఆడపిల్లలకి చదువు కున్నంత మేరకు ఉచిత విద్య ఇవ్వాలి. కళ్యాణలక్ష్మి పథకాలకంటే విద్యకి పెద్ద పీట వేయాలి, ఒకసారి ఆడపిల్ల తనకాళ్ళ మీదతాను నిలబడితే ఈ వరక ట్నాల బెడద తగ్గుతుంది.వరకట్న,బాల్య వివాహాల నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలయేట్టు చూ డాలి. గ్రామస్థాయి నుంచి పట్టణం వరకు అన్ని ప్రదేశా లలోను ఒంటరిస్త్రీలకు రక్షణ,పిల్లలకి విద్య, పెద్ద వాళ్లకి ఉపాధికల్పించాలి. స్త్రీలకి కేటాయిం చిన నిధులు పూర్తిగాస్త్రీల మీద మాత్రమే ఖర్చు చేయాలి. వన్‌స్టాప్‌ సెంటర్ల మీద రాజకీయ,స్థాని కుల జోక్యా లని తగ్గించాలి. అవి స్వతంత్రంగా పని చేసేటట్టు చూడాలి.మహిళా కమిషన్‌తో పాటు,దళిత ఆది వాసీ మహిళలకి ప్రత్యేకమైన కమిషన్‌ ఏర్పాటు చేయాలి.దేశంలో,రాష్ట్రంలో నమోదైన నేరాలలో వీళ్ళ మీదే అత్యధిక శాతం జరిగాయి. కనీసం అవిపోలీస్‌ స్టేషన్ల దగ్గరదాకా కూడా వెళ్లవు. ఒక వేళ వెళ్లినా వివిధ ఒత్తిడుల మూలంగా శిక్ష దాకా పోకుండానే ముగుస్తున్నాయి.వీళ్ళకి ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వరమేన్యాయం జరిగేటట్టు చూడాలి. చివరగా ఈ దేశానికి సావిత్రిబాయి,ఫాతిమా టీచర్ల ని ఆదర్శ మహిళలుగా గుర్తించి,డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ చెప్పిన కులనిర్మూలనకి స్త్రీల స్వేచ్ఛకి ఉన్న సంబంధాన్ని తెలుసుకొని ముం దుకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే జెండర్‌ సమా నత్వం సుసాధ్యమవుతుంది.– (సుజాత సూరేపల్లి)

మనిషిని..మనిషే కాపాడుకోవాలి..!

‘‘ దేవుడి ఉనికే శూన్యమైనప్పుడు దాన్ని ఎన్ని ఆర్భాటాలతో హెచ్చవేస్తే మాత్రం ఏంలాభం? సున్నా సున్నాయే కదా? దైవ భావన చుట్టూ ఎన్ని శాస్త్రాలు రాసుకున్నా.. ఎన్ని కీర్తనలు పాడుకున్నా, …ఎన్ని సంప్ర దాయ నత్యాలు చేసినా, …. ఎన్ని ఆచార వ్యవహారాలకు రూపకల్పన చేసినా ఏం లాభం? పునాదిలేని భవనం కూలిపోవాల్సిందే! పుచ్చిన కర్ర విరిగి పోవాల్సిందే!! మనిషే, మనిషిని కాపాడుకోవాల్సి ఉంది.’’-(డా.దేవరాజు మహారాజు)
ఎలక్ట్రిక్‌ బల్బు ఎంతఅందంగా ఉన్నా, లోన ఫిలమెంట్‌ పోతే బల్బు పనికిరాదు. ఫిలమెంట్‌ సైన్స్‌ ప్రిన్సిపల్‌ మీద తయారయ్యింది. గాజు బల్బూ సైన్సువల్ల వచ్చిందే.మనవాళ్ళు గుళ్ళూ,గోపురాలు చూసి ఆనాటి ఇంజనీరింగ్‌ ప్రతిభ గుర్తించరు. అందులో కల్పించుకున్న ఒక దేవుణ్ణి, శక్తిని…వారి మహత్యాల్ని ప్రవచిస్తుంటారు.వారికి వారే పరవ శించిపోతుంటారు. రామాయణ,భారత,భాగవ తాలు,పురాణాలు ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా అవే పాత కథలు.మనిషి ఔన్నత్యం ఎక్కడైనా కనిపి స్తుందా? మనిషి, దైవత్వానికి దాసోహం అయిన గాథలు మహోన్నతంగా చెప్పడమే గానీ మరొక టుందా?దైనందిన జీవితంలో దేవుడి ప్రసక్తి, సంభాషణల్లో దైవం,హితబోధలో దైవం,సంగీ తం లో దైవం,సాహిత్యంలో దైవం, నాట్యంలో దైవం… మనిషి ఆత్మవిశ్వాసందెబ్బతీసే కళారూపాలు శతా బ్దాలుగా కొనసాగుతున్నప్పుడు,తరతరాలకు ఆ జా ఢ్యం వ్యాపించక ఏమవుతుందీ? ఇవన్నీ చాలవన్న ట్టు ప్రవచనాల పేరుతో కొందరు తమ తుప్పుపట్టిన భావజాలం ప్రచారంచేస్తుంటారు. మనుస్మృతి లోని విషయాలే గొప్పగా చేసి వర్ణిస్తూ ఉంటారు. ఇవన్నీ ఆధునిక ఆలోచనా ధోరణికి ఏమాత్రం సరిపడని విషయాలు కదా? మన రోజువారీ సంభాషణల్లో ‘అంతా దేవుడి దయ’-‘అంతా పైవాడు చూసు కుంటాడు’-‘ఈశ్వరాజ్ఞ లేనిది చీమైనా కదలదు’ -లాంటి మాటలు వింటూ ఉంటాం. ఏమీ తెలి యని పసిపాపలకు ‘జేజకొడతాడు దండం పెట్టు’ -‘జేజ తీసుకు పోయాడు’-‘దేవుడి దగ్గరికి వెళ్ళి పోయింది’ లాంటి మాటలు ఆ పసితనంలోనే నూరిపోస్తుంటారు. సామాన్యుడు చస్తాడు / కన్ను మూస్తాడు/మరణిస్తాడు.కానీ ఆధ్యాత్మిక గురు వులు ఈశ్వరుడిలో ఐక్యమైపోతారు.చచ్చాడని గౌరవంగా చెప్పడం..అంతే- జీవశాస్త్ర పరంగా ఏచావైనాఒకటే! ఇంతెందుకూ నాస్తిక,హేతువాద సంఘాల్లో పనిచేస్తున్న వారందరివీ దేవుడి పేర్లే. అవన్నీ వాళ్ళు పెట్టుకున్నవి కావు. ఆనవాయితీ ప్రకారం పెద్దలుపెడుతూ,పెడుతూఉండగా వచ్చి నవి.నా ఇంటిపేరులో కూడా దేవశబ్దం ఉంది. అది నేను పెట్టుకున్నది కాదు. అంటే నిస్సహా యంగా మనం మనువాదుల కుట్రలో కూరుకు పోయాం.బయటపడే మార్గాలు వెతకాలి! ఇవన్నీ మన చుట్టూ ఉన్న సమాజంలో మనం చూస్తున్న విషయాలు.మనకు అనుభవంలోకి వస్తున్న విషయాలు.మరి ప్రపంచమంతా ఇలాగే ఉందా-అంటే లేదు. కొంచెం స్థాయి పెంచుకుని, విశాల హృదయంతో ప్రపంచదేశాల్లోని పరిస్థితిని గమ నిస్తే మనం ఎక్కడ ఉన్నామన్నది అర్థం చేసుకో వచ్చు.ఉదాహరణకు ఒక విషయం చూద్దాం. ఒకఊళ్ళో ఒక చిన్న బళ్ళో ఒకటో తరగతిలో ఇరవై మంది పిల్లలున్నారనుకుందాం. అందులో కొందరు పదో తరగతి వరకైనా రాకుం డానే మానేస్తారు. మరికొందరు పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష పాస్‌ కాకుండా ఆగిపోతారు. ఇంకొం దరు జూనియర్‌ కాలేజిలో,కొందరు డిగ్రీలో ఆగి పోతారు.అవన్నీదాటి శాస్త్రవేత్తో,ఇంజనీరో, కంప్యూ టర్‌ నిపుణుడో,డాక్టరో,ప్రొఫెసరోఅయ్యేది అందులో ఏఇద్దరు ముగ్గురో ఉంటారు. ఇందులో పదో తర గతిలో కూడా ఉత్తీర్ణులు కానివారు ఆచారాల చాటున,పంచాంగాలచాటున,గుళ్ళచాటున,దేవుళ్ళ చాటున దాక్కుని పొట్టపోసుకుంటున్నారనుకుం దాం.వీళ్ళు సంప్రదాయంపేరుతో,విద్యావం తుల్ని, జ్ఞానవంతుల్ని,సంస్కారుల్ని అందరినీ తమ ఆధీ నంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆత్మ, పరమాత్మ,పునర్జన్మలాంటి మాటలు చెప్పి భయ పెడుతుంటారు.నిరూపణ లేని అనుభవాలు, అను భూతులు,సెంటిమెంట్లు,దేవుడితో సెటిల్‌మెంట్లు చెపుతూ,పిట్టకథలతోజనాన్ని రంజింపజేస్తుంటారు. ఇవాళ కాకపోయినా రేపు..జనం నిజం గ్రహి స్తారు. కారణాన్ని అన్వేషిస్తారు. తప్పదు-కొందరు తమ ఇంగిత జ్ఞానాన్ని వదిలేసి అజ్ఞానుల మాటల కు విలువనిస్తుంటారు. తమ కన్నా ఆ పంతుళ్ళకు, ముల్లాలకు,పోప్‌లకు,మతాధిపతులకు ఏదో ఎక్కువ తెలుసుననుకుని వారిని అనుసరిస్తుంటారు. వారు చెప్పేవన్నీ మనిషి ఎప్పుడో ప్రాథమిక దశలో ఏర్పరుచుకున్న ఆచారాలు! మరి ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో అవి ఎంత వరకు అనుసరణీయం? అన్న ప్రశ్న వేసుకోరు. ఏదోగుడ్డిగా, తాతలు చేశారు, తండ్రుల చేశారు, మనమూ చేసేస్తే పోదా?అని అనుకుంటూ ఉంటారు. భయస్తులు, పిరికివాళ్ళు, తమ శక్తిని తాము తెలుసుకోలేని వాళ్ళు-తమ మెదడును తాము ఉపయోగించని వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది.
మనిషికి రాయిని కూడా దేవుణ్ణి చేసే శక్తి ఉంది. మరి ఆ దేవుడు గనక ఉంటే, మనిషినైనా మనిషిగా చేస్తాడా? చేయలేడు. ఎందుకు చేయ లేడూ అంటే…అలాంటి వాడు ఎవడూ లేడు గనక చేయలేడు. మనిషి, మనిషిగా కావాలంటే మనిషి మాత్రమే ప్రయత్నించాలి. దైవ విశ్వాసంతో సమా జంలో రోజూ ఎన్ని ఘోరాలు జరుగు తున్నాయో తెలుసుకోవాలి. విశ్లేషించుకోవాలి. దైవ విశ్వాస రహిత, మానవ నైతిక సమాజానికి రూపకల్పన చేసుకోవాలి. పునర్జన్మ ఉంటుందన్న విశ్వాసంలో జనం ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. తమిళనాడు తిరుచ్చి జిల్లా చొక్కంపట్టికి చెందిన రిటైర్డ్‌ టీచర్‌ మేరి (75) 2021 అక్టోబర్‌ మొదటి వారంలో మరణించారు. కూతుళ్ళు జెసితా(43), జయంతి(40)ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి ఏడు రోజులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అప్పుడే అనుకోకుండావాళ్ళింటికి బంధువులు వచ్చా రు. వారికి రిటైర్డ్‌ టీచర్‌ మరణించిన సమా చారం లేదు. తమ తల్లి పునర్జన్మకోసం బైబిల్‌తో తాము ప్రార్థనలు చేసుకుంటూ ఉంటే,బంధువులు వచ్చి అంతరాయం కలిగించారంటూ ఆకూతుళ్ళు బం ధువుల్ని తరిమికొట్టారు.మృతదేహం పక్కన ప్రార్థ నలు చేస్తున్నారని వాళ్ళు ఊళ్ళో వాళ్ళకు, పోలీసు లకు తెలిపారు.పోలీసులు రంగప్రవేశం చేసి, మృత దేహం స్వాధీనపరుచుకుని,కూతుళ్ళను వైద్య పరీ క్షలకు పంపించారు. ఇలాంటి సంచలన సంఘట నలు మనం తరచూ టెలివిజన్‌ తెర మీద చూస్తూనే ఉన్నాం.
ఉత్తరాఖండ్‌ బాగేశ్వర్‌ జిల్లా కదిరియా గ్రామంలో2021అక్టోబర్‌ మొదటి వారంలో జరి గిన సంఘటన! కుల వివక్షతో ప్రాణాలు తీయడం ఈరోజుల్లో ఎంతో సులభమైపోయింది. సోహాన్‌ రామ్‌(31)పిండిమరలో గోధుమలు ఆడిరచి పిండి తీసుకుపోతుండగా లలిత్‌ కర్నాటక్‌ అనే అగ్రకుల స్థుడు చూసిఅడ్డగించాడు. అతనువృత్తిరీత్యా ఉపా ధ్యాయుడు.పిండిమర మలినమైందని ఆక్రోశిస్తూ, దళితుడైన సోహాన్‌ని అతనికులాన్ని తీవ్రంగా దూషించాడు. అనవసరంగా ఎందుకు దూషిస్తు న్నారని సోహాన్‌ అడిగినందుకు-పిండిమర అంద రూ ఉపయోగించేదేనని గుర్తుచేసినందుకు ఉక్రోషం పట్టలేని అగ్రకులఉపాధ్యాయుడు, కొడవలితో నరికి సోహాన్‌ను హత్య చేశాడు. హంతకుణ్ణి పోలీసులు జైలుకు పంపించారు. పిండిమర మలినం కావడం ఏమిటో? వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన వాడికే సరైన ఆలోచన లేకపోవడంఏమిటో? మన పవిత్ర భార తావనిలో ఏదైనా సాధ్యమే! దేవుడనేవాడు ఉంటే ఇలాంటివి ఎందుకుఎలా జరిపిస్తున్నాడూ? ప్రపం చానికి ఆధ్యాత్మిక వెలుగులు పంచిన మన భారత దేశంలో అదేమిటో ఇలాంటి సంఘటనలు ఎక్కువ గా జరుగుతున్నాయి. అయితే ఇతర సమాజాలు ఇలాంటివి లేకుండా ఏమీ లేవు. ప్రఖ్యాత రచయిత్రి తస్లీమా నస్రీన్‌ ఏమన్నారో చూడండి…! ‘’మసీదులో ప్రార్థన చేస్తుండగా ఆఫ్ఘనిస్తాన్‌లో షియాలను సున్నీ లు చంపుతారు.హజారా సమాజాన్నితాలిబన్‌ చంపుతుంది.పాకిస్తాన్‌లో షియాల్ని,అహ్మదీ యుల్ని, క్రైస్తవుల్ని సున్నీలు చంపుతారు.ఏదేశంలో మైనార్టీ లకు రక్షణ లేదో..ఆసమాజాలు కచ్చితంగా నాగరి కం కాదు’’ అని!
‘’నాకు ఈరోజు అల్లాఉద్దీన్‌ అద్భుత దీపం దొరికింది’’ అన్నాడు భర్త భార్యను ఉడికిస్తూ… ‘’ఓడియర్‌ ఎంత మంచి మాట? మరి ఏమడ గాివ్‌?’’ అంది భార్య. ‘’ఏముందీ? నీ తెలివితేటలు పదింతలు పెంచుమని అడిగా!’’అన్నాడు భర్త. ‘’ఓ ధ్యాంక్యూ! డాళ్లింగ్‌!! నా గురించి నీకెంత శ్రద్ధా?’’ అంది భార్య.‘’కాని యేం లాభం సున్నాను ఎన్నిం తలు చేస్తే మాత్రం ఏం ఫలితం సున్నా-సున్నాయే కదా?’’ అని చల్లాగా చెప్పాడు భర్త లోలోన తన తెలివికి తానే మురుస్తూ! ఇది జోకేఅయినా, ఇందు లో ఒక విషయం ఉంది. భార్యా భార్తల మధ్య సరదా మాటలు పక్కనపెట్టి, మనం మతాలు-దేవుడు విషయం ఆలోచిస్తే..అదీ దాదాపు ఇలాగే ఉంటుంది. దేవుడి ఉనికే శూన్యమైనప్పుడు దాన్ని ఎన్ని ఆర్భాటాలతో హెచ్చవేస్తే మాత్రం ఏం లా భం? సున్నా సున్నాయే కదా? దైవ భావన చుట్టూ ఎన్ని శాస్త్రాలు రాసుకున్నా, ఎన్ని కీర్తనలు పాడు కున్నా, ఎన్ని సంప్రదాయ నృత్యాలు చేసినా, ఎన్ని ఆచార వ్యవహారాలకు రూపకల్పన చేసినా ఏం లాభం? పునాదిలేని భవనం కూలిపోవాల్సిందే! పుచ్చిన కర్ర విరిగిపోవాల్సిందే!! మనిషే, మనిషిని కాపాడుకోవాల్సి ఉంది- వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత,జీవశాస్త్రవేత్త

బీటలు వారుతున్న రాజ్యాంగ సౌధం

ఈ ఎనిమిదేళ్ల పాలనలో దళితులకు భూములు పంచలేదు. దళితులపై జరిగే అత్యాచారాల విషయంలో ఎటువంటి విచారణ లేదు. అస్పృశ్యతా నివారణ చట్టాన్నే కాక,1989 ఎస్సీ,ఎస్టీ అత్యా చారాల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే సకల ప్రయత్నాలు చేస్తున్నారు. భారతదేశం ఈనాడు రాజ్యాంగ సంక్షోభంలో ఉంది. దేశంలోని ప్రధాన పాలక వర్గాలు నిరంతరం రాజ్యాంగ ఉల్లంఘనకై ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రాజ్యాంగం ఒక సామాజిక సాంస్కృతిక విప్లవ మార్గం. రాజ్యాంగం భారతదేశ నిర్మాణ సౌధం. భారతదేశానికి ఒక నిర్మాణాత్మక పరిపాలనా క్రమాన్ని ఇవ్వడానికి అంబేద్కర్‌ 1949 నవంబర్‌ 20వ తేదీన దేశాన్ని సర్వ సత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్‌గా ప్రకటించారు. రాజ్యాంగంలో ప్రధాన సూత్రం ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం.

Read more

అటవీ సంరక్షణే పర్యావరణ పరిష్కారం!

పర్యావరణ పరిరక్షణలో అడవులది కీలకపాత్ర అనేది కాదనలేని వాస్తవం.పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా దేశవ్యాప్తంగాకోట్లాది రూపా యలు వెచ్చించి మొక్కలు నాటుతున్నారు. మరొక పక్క విచక్షణారహితంగాఅడవులను ధ్వంసం చేస్తు న్నారు.నాటుతున్న మొక్కల్లో ఎంత శాతంపెరిగి పెద్దవవుతున్నాయో చెప్పలేం కాని ఊహించని రీతి లో అడవుల్లోని భారీ వృక్షాలనుసైతం కూల్చివేసి తరలిస్తున్నారు. అటవీసంపద హరించుకుపోతున్న తీరుపట్ల ఆందోళన వ్యక్తమవ్ఞతున్నది.దేశంలో సగ టున రోజుకుదాదాపు 300ఎకరాలకు పైగా అటవీ భూమి అదృశ్యమైపోతున్నదని గతంలో అటవీ మంత్రిత్వశాఖ వెల్లండిరచిన నివేదికల్లో స్పష్ట మైంది. బొగ్గుగనులు, ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, పరిశ్రమలు, నదిలోయ ప్రాజెక్టులకోసం అడవులను నరికివేస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌, జార?ండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర తదితరరాష్ట్రాల్లో ఇతర ప్రయోజనాలకు కూడా భూములను ఉపయోగించు కుంటున్నారు.తెలుగురాష్ట్రాలకు సంబంధించి ఖమ్మం,వరంగల్‌,అదిలాబాద్‌,కరీంనగర్‌ తది తర జిల్లాల్లో వేలాదిఎకరాలు అటవీభూమి అన్యాక్రాంత మైనట్లు అటవీశాఖ అధికారుల రికార్డులు వెల్లడిస్తు న్నాయి.భారత అటవీ సర్వే(ఎఫ్‌ఎస్‌ఐ)సంస్థ గతంలో విడుదల చేసిన ద్వైవార్షిక నివేదిక ప్రకా రం దేశంలో దాదాపు ఏడు లక్షల చదరపు కిలోమీ టర్ల విస్తీర్ణంలో అడువులు ఉన్నాయి.పర్యావరణ జీవావరణ పరిరక్షణతోపాటు ఆర్థిక, సామాజిక జీవన వ్యవస్థలకు అడవులు ఆలంబనగా నిలుస్తు న్నాయి. భూసారాన్ని కాపాడడమేకాకుండా తుపా నులు,వరదలులాంటి దుష్ఫ్రభావాలను అడ్డుకో వడంలో వాటిపాత్ర విస్మరించలేనిది. కోస్తాప్రాం తాల్లో భూమి కోసుకపోకుండా కూడా అడవులు కాపాడుతున్నాయి. భూతాపానికి కారణమయ్యే గ్రీన్‌హౌస్‌వాయువులువాతా వరణంలోకి పెద్ద ఎత్తున విడుదల కాకుండా నిరోధించే శక్తి అడవు లకు ఉంది. బొగ్గుపులుసువాయువు పీల్చుకొని స్వచ్ఛమైన ప్రాణవాయువు అందించడం ద్వారా ఎప్పటి కప్పుడు కొత్తఊపిరులు పోస్తున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా160కోట్ల మందికిపైగా ఆవాసం, రక్షణ, జీవనోపాధి కోసం అడవుల మీదనే ఆధారపడు తున్నారు. అభివృద్ధిచెందు తున్నదేశాల్లో ఇంధన వనరులు, పారిశ్రామిక అవసరాల కోసం అటవీ ఉత్పత్తులను వినియోగించుకుంటున్నారు.కొన్ని లక్షలకోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నది. అటవీఉత్పత్తుల ఔషధ ఆరోగ్యపరమైన ప్రయోజ నాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు వాటి విలువ అంచనాలకు అందదు. అందుకే మానవ నాగరికత వికాసంలో అడవుల పాత్ర అత్యంత కీలకమైందని ఏనాటి నుంచో పెద్దలు చెప్తున్నారు. సింధునాగరికత అంతరించి పోవడా నికి ప్రధానకారణాల్లో అటవీ ప్రాధాన్యతను గుర్తించకపో వడమేనని చరిత్రకా రులు స్పష్టం చేస్తున్నారు. అడవులు రానురాను అదృశ్యమైపోతుండడం వల్లనే ప్రకృతి బీభత్సవాలు పెరిగిపోతున్నాయనేది వాతావరణ శాస్త్రజ్ఞుల అభిప్రాయం. తరుచగా వస్తున్న వరదలు, అందు వల్ల జరుగుతున్న బీభత్సం, మరొకపక్క కరువుకాట కాలు కూడా ఈ అడవుల విధ్వంసం వల్లనే జరుగు తున్నదనేది కాదనలేని వాస్తవం. ఇంత జరుగు తున్నా పాలకులు ప్రకటనలతో సరిపెడుతున్నారు తప్ప నిర్దిష్టమైనచర్యలు తీసుకొనలేకపోతున్నారు. అంతెందుకు ప్రపంచంలోనే అత్యంత అరుదైన, విలువైన ఎర్రచందం చెట్లను నరికి విదే శాలకు స్మగ్లింగ్‌ చేయకుండా నిరోధించలేకపోతున్నారు. వందలాది మంది పోలీసులను పెట్టినా చివరకు కాల్పులు జరిపినా ఈస్మగ్లింగ్‌ ఆగడం లేదు. ఇక చెట్లను పెంచే కార్యక్రమం అంతంత మాత్రం గానే ఉన్నది. కాగి తాలపై ఉన్న చెట్లెన్ని క్షేత్రస్థాయి లో అందులో ఎన్ని ఉన్నాయో పరిశీలిస్తే ఆశ్చర్యకర మైన దృశ్యాలు వెలుగులోకి వస్తాయి. ప్రభుత్వం కూడా చెట్ల పెంపకంలో ఒకనిర్దిష్ట విధానాన్ని ఎంపిక చేసుకోవాలి. స్విట్జర్లాండ్‌ లాంటిదేశాల్లో ఇంట్లో పెరటి మొక్కలు పెంచుకునేందుకు ముందుకొస్తేతప్ప ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వ డంలేదు.భూటాన్‌,నేపాల్‌,గాంభియా,తదితర దేశా ల్లో అటవీరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఆదర్శంగానిలుస్తున్నాయి. బిడ్డ పుట్టినప్పుడల్లా ఒక మొక్క నాట డాన్ని ఫ్రాన్స్‌ ప్రోత్సహిస్తున్నది. భారత రాజ్యాంగంలోని 51ఎ(జి) అధికరణ ప్రకారం అడవ్ఞలు,వన్యప్రాణులు సహా ప్రకృతి సంపదను పరిర క్షించడం,అభివృద్ధిపరచడం ప్రతిపౌరుడి కర్తవ్యం. అడవులు అంతరిస్తున్నబట్టే వన్యప్రాణులు అరణ్యాలు వదిలి జనారణ్యంలోకి ప్రవేశించడం ఆందోళన కలిగించేఅంశం. అడవులు వన్యప్రా ణాన్ని కాపాడటానికి భారత ప్రభుత్వం కృషి చేయా లని 48(ఎ)అధికరణ స్పష్టం చేస్తున్నది. న్యాయ స్థానాలు కూడా అటవీభూమి సంపద విషయాల్లో ఎన్నోసార్లు ఆదేశాలుజారీచేశాయి. భారత ప్రభు త్వం కూడా అడవుల అభివృద్ధికి వేలాదికోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. కానీ ఆచరణకు వచ్చేసరికి అది అంతంత మాత్రంగానే ఉన్నది. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి. అడవుల పెంపకం, పరిరక్షణ, ప్రోత్సాహంతో పాటు హరిత, ఆర్థిక వ్యవస్థను పెంపొందించేలా పరి శ్రమలకు గట్టి నిబంధనలను విధించాలి. అటవీ విధ్వం సానికి దారితీస్తూ వన్యప్రాణుల మనుగడను ప్రశ్నార్థకంగా చేస్తున్న స్మగ్లర్ల విషయంలో ఉక్కు పాదం మోపాలి. అటవీ సంరక్షణలో రాజకీయా లకు అతీతంగా అన్ని పార్టీల నేతలు ఆలోచిం చాలి. స్వచ్ఛంద సంస్థలను ఇందులో భాగస్వాము లను చేయాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.– జి.ఎన్‌.వి.సతీష్‌

1 2 3 4 6