మన జాతి రత్నం లాల్‌ బహుదూర్‌ శాస్త్రి

భారతదేశానికి రెండో ప్రధానమంత్రి,భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్రధారి,భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడు లాల్‌బహదూర్‌ శాస్త్రిగారి జన్మదినం సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య విశేషాలను ఈకథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అక్టోబరు రెండవ తేదీ భారత ద్వితీయ ప్రధాని శ్రీలాల్‌ బహుదూర్‌ శాస్త్రిగారి జన్మదినం.1904వ సంవత్సరం అక్టోబరు2న ఉత్తరప్రదేశ్‌లోని వారణాశిలో జన్మించిన లాల్‌బహదూర్‌‘జైజవాన్‌జై కిసాన్‌’ నినాదంతో దేశాన్ని మేల్కొలిపి చ్కెతన్యం రగిలించిన ధన్యజీవి. ఆకలి తీర్చే రైతుకు, దేశాన్ని కాపాడే సైనికుడికి మనం చేసే అభినందనలే వారిలో విజయమార్గంలో నడిపిస్తాయి అని అప్పటి మూడుకోట్ల జనాభాకి పిలుపు నిచ్చారు.భారతదేశాన్ని ప్రపంచదేశాల గుర్తింపు కార్యక్రమంలో భారత భవిష్యత్తును రూపొందిం చటంలో కీలక పాత్ర పోషించిన మేధావి. కాయస్థ వంశంలో శారదాప్రసాదుకు మరియు రామ్‌దులారీ దేవి దంపతులకు జన్మించిన ఈ బాలుడు, బాల్యమునందే తండ్రిని పోగొట్టుకున్నాడు.బీద కుటుంబముభర్త మరణించటంతో రామ్‌దులారీ దేవి తన ఇద్దరు కుమార్తెలను, కుమారుడు బహదూర్‌ని తీసికొని తండ్రి వద్దకు చేరినది.బహదూర్‌ని అందరూ ‘‘నానీ’’ అని ముద్ధుగా పిలుచుకొనేవారు.అది తాతగారు పెట్టిని ముద్దు పేరు.
బాల్యంలో ఆటల మైదానంలో ఆడుకుంటూ తోటి స్నేహితులతో కలసి ఒకరి జామచెట్టును, యజమాని అనుమతి లేకుండా కాయలు కోసుకొనే సమయంలో,ఆయజమాని చూసి కోపంగా అరచిన అరుపుకి అందరూ తప్పుకున్నారు గాని,నానీ మాత్రం తప్పించుకోలేదు.పైగా ఆయజమానితో ‘తండ్రిలేని వాడిని,నన్ను ఎక్కువగా దండిరచకు’అని బ్రతిమాలితేదానికి ఆయజమాని ‘నీకు తండ్రి లేడు కనుకనే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పిన మాటను సందేశంగా భావించి,భవిష్యత్తును క్రమబద్ధంగా చక్కగా తీర్చిదిద్దుకున్నాడు.దాని ప్రభావము ఆయనకు బాగా తోడ్పడిరది.లాల్‌బహదూర్‌ ప్రాధమిక విద్య గంగానదికి ఆవలి ఒడ్డున గల మొగల్‌సరాయి, వారణాసిలలోని పాఠశాలలో జరిగింది. లాల్‌బహదూర్‌ నిత్యం పాఠశాలకు గంగానదిపై పడవలో ప్రయాణించి వెళ్ళి చదువుసాగించాడు. ఆ సమయంలో ఒకసారి పైకం చెల్లించే పరిస్థితి లేక బట్టలు,పుస్తకాలు సంచిలో చుట్టుకుని,వాటిని నడు ముకి కట్టుకుని నదిపై ఈదుకుంటూ ఆవలి ఒడ్డుకు చేరుకుని పాఠశాలకు వెళ్ళటం జరిగింది. పడవకి డబ్బులు ఇస్తామని చాలామంది చెప్పినా సున్నితంగా తిరస్కరించి,ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకున్నాడు. సమ యస్ఫూర్తితో కార్యాలను సాధించుకునేవాడేగాని, పేదరికానికి మాత్రం చింతించలేదు,వెనుకంజ వేయ లేదు.లాల్‌బహదూర్‌ 13వసంవత్సరంలోనే గాంధీ గారి ప్రసంగాలకి, సిద్ధాంతాలకి ప్రభావితుడ్కె నాడు. విధ్యార్థి దశలోనే భారతసేవా సమితి అనే సంస్థలో సభ్యునిగా ఉండేవారు.బాలగంగాధర్‌ తిలక్‌గారి ఉపన్యాసాలకు ప్రీతిపాత్రుడ్కె దేశభక్తిని అమితంగా పెంచుకున్నాడు.1921లో గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణాద్యమంలో పాల్గొని అరెస్టు చేయబడి, మైనరగుటచే వెంటనే విడుదలకాబడ్డారు. ఆకారణం చేత విధ్యాభ్యాసానికి హాని కలుగలేదు. కాని విశ్వవిధ్యాలయం నుండి‘‘శాస్త్రి’’ పట్టాను పొంది న కారణంగా లాల్‌బహదూర్‌ శాస్త్రి అయ్యారు. 192728 సం.లో లలితాదేవితో వివాహమైనది. వరకట్నంగా మామగారు కొయ్య చరఖాని బహు మతిగా ఇచ్చారు.అప్పుడప్పుడే స్వాతంత్య్ర పోరాటం ఉధృతమవుతున్న సమయంలో శాస్త్రికి,నెహ్రూగారితో సన్నిహిత సంబంధం ఏర్పడిరది.అది వారి మధ్య గొప్ప మైత్రికి దారితీసింది.1930లో లాల్‌బహదూర్‌ లొలిసారిగ జిల్లాకాంగ్రెస్‌ కార్యదర్శిగా ఎంపిక కాబ డ్డారు.పన్నుల నిరాకరణోద్యమం ప్రారంభించిన కార ణంగా 2సంవత్సరాలకాలం కారాగార శిక్ష వేసారు బ్రిటిష్‌వారు.ఆయన ఆశిక్షను అనుభవించారు.
ఒకసారి అలహాబాదు నగరమధ్యలో జాతీయ పతాకం ఎగురవేయుటకు కాంగ్రేస్‌ సభ్యులందరూ భయాందోళనలో వుండగా, శాస్త్రిగారు స్త్రీ దుస్తులలో బురఖా వేసుకుని పైకిపాకి జెండాను ఎగురవేసి నారట. అతని ధ్కెర్యసాహసాలకు భారతీయులందరూ ప్రసంసించినా, అందుకుగాను మరల జైలు శిక్ష అను భవించవలసి వచ్చింది.1936లో ఆంగ్ల ప్రభుత్వానికి పోటీగా కేంద్ర,రాష్ట్ర శాసనసభలకు జాతీయ కాం గ్రెసు పోటీ చేసింది.శాస్త్రిగారు అలహాబాదు నియో జగవర్గం నుండి ఎన్నికైనారు.వారు ఎప్పుడూ సమ యాన్ని వృధా చేయలేదు.జ్కెలులో ఉన్న సమయంలో కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుని ‘మేడం క్యూరీ’ జీవితగాధను హిందీలోనికి అనువదించారు. కాలాన్ని వ్యర్ధం చేయక పఠనానికో, గ్రంధరచనకో ఖర్చుచేసేవారు.విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో భార్యను కూడా పాల్గొనమని ప్రోత్సహించారు. శాస్త్రిగారి జీవితం మిక్కిలిఆదర్శప్రాయమైనది. భారతీ యుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిన అమర జీవి.ప్రధానిగా కొంతకాలమే వున్నప్పటికీ, ముందు వారికంటే కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నారు. పదవు లకోసం ప్రాకులాడలేదు.పదవులే వారిని వెదుక్కుంటూ వచ్చాయి.ఉక్కుమనిషి,ఆజాత శత్రువు, నిగర్వి,ధ్కెర్య శాలి, స్థిరచిత్తుడు వంటి పదాలకి సరైన నిర్వచనం శాస్త్రిగారు.భారత స్వాతంత్య్రానంతరం అలహాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలలో గెలిచి ‘అలహాబాద్‌ ఇంప్రూవ్‌ మెంటుట్రస్టుకు’ట్రస్టీగా నియమించ బడినారు. రెండు బాధ్యతలు నిర్వర్తించే సమయంలో ‘‘టాగూర్‌ నగర్‌’ అనే పేరుతో అర ఎకరం భూమిని ప్లాటుగా విభజించి శాస్త్రిగారు లేని సమయంలో మిగిలినవారు వేలానికి పెట్టారు.ట్రస్టు సభ్యులందరూ తలొక ప్లాటును స్వంతం చేసుకోవాలనుకున్నారు.
రెండు రోజులకి తిరిగి వచ్చిన శాస్త్రిగారికి ఈ విషయం తెలిసి,వారందరినీ పిలిచి,మనం ప్రజా ప్రతినిధులము,ప్రజల ముందు నిజాయితీగా నిల వాల్సిన వారం,అందరూ వాపసు ఇచ్చేయండి లేదా రాజీనామా చేద్దాం.కావలసివారు వేలం పాటలో పాల్గొని దక్కించుకోండి అని చెప్పి అందరిచేత వాపసు చేయించారు.శాస్త్రిగారు ప్రధానమంత్రిగా పనిచేసినా పదిరూపాయలు కూడా దాచుకోలేదు. స్వంత ఇల్లు కూడా లేని నిజాయితీకి మారు రూపం.రాజకీయంగా కీలక పదవులు చేపట్టిన సందర్భాలలో కూడా దేశానికి మేలు చేసే శాశ్వత కార్యక్రమాలు చేపట్టారు. రైల్వేమంత్రిగా 195156 వరకూ,హోంమంత్రిగా ఏప్రిల్‌ 61 నుండి ఆగస్టు 63వరకూ,ప్రధానమంత్రిగా జూన్‌ 64నుండి జనవరి 66వరకూ (మరణించే వరకూ) పనిచేసారు.ఈసమయలో ప్రధాన మంత్రి గాచేస్తూ అదనంగా కొంత కాలం హోం మంత్రి త్వశాఖను కూడా నిర్వహించారు. ఆ సమ యంలో ఎదురైన ఆహారధాన్యకొరత, పొరుగు దేశాల వత్తిడికి ధీట్కెన సమాధానం చెప్పి రెండు సమస్యలకు పరి ష్కారం చూపారు.శాస్త్రిగారు ప్రధానిగా ఉన్న సమ యంలో కూడా వారి సంతానం సిటీబస్సులలోనే ప్రయాణించే వారు.ప్రధానిగా కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన సౌకర్యాలు సమ కూర్చలేదు.వారిలోని జాతీయ భావానికి శాస్త్రిగారి సంస్కారానికి ఆకుటుం బ సభ్యుల సహకారానికి నమోవాకాలు అర్పించ వలసినదే.వారి పెద్దకుమారుడు హరికృష్ణకు అశోక్‌లేలాడ్‌ సంస్థలో ఉద్యోగం చేసే సమయంలో, అకస్మాత్తుగా సీనియర్‌ మేనేజర్‌గా పదోన్నతి కల్పిం చారు.శాస్త్రిగారికి ఈవిషయం తెలిసి, ఆసంస్థవారు నీకు అర్హతలు చూడ కుండా పదోన్నతి కల్పించడం లోని ఉద్ధేశ్యం వారు ప్రధానిగా నానుండి ఏదో ఆశిం చవచ్చును.కనుక నేను ప్రధానిగా ఉన్న సమయంలో ఆసంస్థలో నీవు ఉద్యోగం చేయవద్దని ఖండిరచిన మహనీయులు శాస్త్రి గారు. రైల్వేమంత్రిగా పనిచేసిన సమయంలో ప్రమాద సంఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేసారు. అనేక విశేష సలహాలు, నిర్ణయా లపై కేంద్రమంత్రి వర్గంలో విశిష్టస్థానంలో ఉన్న శాస్త్రిగారి నిర్ణయంతో జరిగేవి.ఏపదవీ లేన ప్పుడు కూడా ఇదే పంధాలో కొనసాగుతూ దేశానికి సేవ చేశారు.శాస్త్రిగారు ప్రధానిగా ఉన్న సమయంలో పాకిస్థానుతో యుద్ధం సంభవిం చింది.వారి దురాక్ర మణను గుండె నిబ్బరంతో అణచివేసిన వీరుడు. శాంతి స్థాపనకై రష్యా నాయకుల ఆహ్వానంతో తాష్కెంటుకు వెళ్ళి సంధి పత్రంపైన సంతకం చేసి, గుండె పోటుతో 1966 జనవరి 11వారు మరణిం చారు.ఆయన విశ్రాంతి స్థానం‘విజయ్‌ ఘాట్‌’గా గుర్తింపబడినది.ఆయన మరణానంతరం ‘భారతరత్న’ బిరుదును ప్రకటించారు. శాస్త్రిగారు వాయిదాల పద్దతిలో తీసుకున్న కారు వాయిదా నాలుగు వేల రూపాయలను వారి సతీమణి,శాస్త్రి గారి మరణా నంతరం చెల్లించి వారి నిబద్ధతకు, నిరా డంబర జీవితానికి భర్తకి సహకరిం చిన ఆదర్శమహిళ లలితా శాస్త్రిగారు.‘జ్కె జవాన్‌జ్కె కిసాన్‌’నినాదాలు ఎప్పటికీ మనతోనే వుంటాయి. మహనీయుల పుట్టుకకు ఒకపరమార్థం వుంటుంది. భారతదేశాన్ని ఉద్దరించ టానికి జన్మించిన నిస్వార్థ మహనీయులలో శాస్త్రిగారి కీర్తి ఆచంద్రార్కం నిలచి వుంటుంది.వారికి నమోవా కములు.జై భారత్‌.(వ్యాసకర్త : సాహితీరత్న,ప్రముఖ రచయిత్రి
విశాఖపట్టణం`9849692414
) డాక్టర్‌ దేవులపల్లి పద్మజ

ప్రాణాలు తోడేస్తున్న రక్తహీనత

మన్యంవాసులు పోషకాహారానికి దూరమవుతున్నారు.సక్రమంగా సరఫరా చేయకపోవడంతో గిరిజన తెగలకు చెందిన పిల్లలు,బాలింతలు,గర్భిణులు రక్తహీనత బారిన పడుతున్నారు.ఈపరిస్థితి వారికి ప్రాణసంకటంగా మారింది.నీరసించి నిస్పత్తువతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అయినా అధికారుల్లో చలనం లేదనే విమర్శలు వస్తున్నాయి.
పాడేరు మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో పీటీజీ గిరిజన తెగలకు చెందిన వారు తీవ్ర పోషకాహార సమస్యతో సతమవుతున్నారు.తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.గిరిజన కుటుంబాల్లోని పసిప్రాణాలు విలవిల్లాడుతున్నాయి. తల్లీబిడ్డల మరణాలు సంభవిస్తున్నాయి.ఏటా మరణాలు నమొదువుతున్నా ప్రత్యేక పోషకాహార సరఫరా,వైద్యసేవల కల్పనపై ఎటువంటి చర్యలు కానరావడం లేదు.చాలా గ్రామాలకు అంగన్‌వాడీ వ్యవస్థ కూడా విస్తరించడం లేదు.

అంగన్‌వాడీలే ఆధారం..
ఏజెన్సీలో అంగన్‌వాడీల ద్వారా అందిస్తున్న పోషకాహారమే చిన్నారులకు,బాలింతలకు ఆధారం.అయితే వీటిద్వారా అరకొరగానే పోషకాహారం సరఫరా జరుగుతోంది.పర్యవేక్షణ లేకపోవడంతో పంపిణీ అస్తవ్యస్థంగా ఉంటోంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పాలు,గుడ్లు,పంపిణీ సవ్యంగా జరగడం లేదు.నెలరోజులుగా పూర్తిగా పోషకాహారం అందడం లేదు.దీంతో పిల్లలు రక్తహీనతకు గురవుతున్నారు.పిల్లలకు పాలు ఇచ్చేం దుకు కూడా గిరిజనులకు పాడి పశువులు లేకుండా పోయాయి.మన్యంలో ఆహార పంటలు బాగా తగ్గిపో యాయి.దీంతో ప్రస్తుతం గిరిజనులకు రాగి అంబలి, కోటా బియ్యమే ప్రధాన ఆహారంగా ఉన్నాయి. పప్పు దినుసులు,ఇతర పోషకాహారం అందుబాటులో లేని కారణంగా వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి గిరిజ నుల ప్రాణాలకు ముప్పు కలుగు తోంది.ఏటా ఏజెన్సీ లో సంభవిస్తున్న మరణాలకు కారణం పోషకాహార లోపమేనని వైద్యులు చెబుతు న్నారు.రేషన్‌ దుకాణా ల్లో నాణ్యమైన సరుకులు అందని పరిస్థితి.అంగన్‌ వాడీలు, పాఠశాలలో మధ్యాహ్నా భోజనం,ఆశ్రమ పాఠశాలల్ల్లో విద్యార్థులకు మెనూలో కూడా సరైన పోషకాహారాన్ని అందించ లేకపోతున్నారు. ఏజెన్సీ లోని కొన్ని మండలాల్లో గతంలో ఐటీడీఏ పోషకా హార కేంద్రాలను నిర్వహించినప్పటికీ కొన్నాళ్లకే పరిమితమైంది.గిరిజనుల ఆహార భద్రతపై నిర్ధష్టిమైన కార్యాచరణ ఐటీడీఏ చేపట్ట లేదు.
దిగజారిన జీవన ప్రమాణాలు..
మన్యంలో సుమారు 1.80లక్షలగిరిజన కుటుం బాలు ఉన్నాయి.3,574 గిరిజన గ్రామాల్లో ఉన్న గిరిజన జనాభా ప్రస్తుతం6లక్షలు దాటి ఉంది.సగానికి పైగా గ్రామాల్లో గిరిజన కుటుంబాలు ఆర్ధిక సమస్యలతో ఇబ్బందు లకు గురవుతు న్నారు.ఫలితంగా పోష కాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు. రోజుకు ఒకపూట అంబలి,ఒకపూట గంజి అన్నం తిని జీవనం సాగిస్తున్న గిరి జన కుటుంబాలు చాలా ఉన్నాయి. నిత్య వసర ధరలు అధికం కావడంతో పేద గిరిజన వర్గాల జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయి.
గుడ్లు,పాలు సరఫరా లేదు..
సంపంగి గరువు గ్రామంలో మినీ అంగన్‌వాడీ కేంద్రంఉంది.ఇక్కడకు ప్రతి నెల సరుకులు రావడంల లేదు.ముఖ్యం గా గుడ్లు,పాలు సరఫరా సరిగ్గా లేదు. జనవరి నెలలో 8రోజులే గుడ్లు ఇచ్చారు. ఈనెలలో ఒక్కరోజు కూడా గుడ్లు అంది వ్వలేదు.బాలింతలకు ఏడు నెలల వరకు పోషకాహారం ఇస్తున్నారు.కూరగాయలు, పాలు,గుడ్లు,పప్పు దినుసులకు కొరతగా ఉంది.ఎప్పుడైనా సంతకు వెళ్లినప్పుడే తెచ్చుకుంటాం.` మజ్జిప్రమీల,సంపంగి గరువు గ్రామం.
గిరిజన ప్రాంతాలకు 125బహుళ ప్రయోజన కేంద్రాలు..
గిరిజన ప్రాంతాల్లో కనీస సౌకర్యాలకు నోచుకోని ప్రాంతాలకు ఆదివాసీ తెగలు(పీటీజీ) గిరిజన పిల్ల లకు పాఠశాల భవనాలు,అంగన్‌వాడీ కేంద్రాలు, వైద్య సేవల నిమిత్తం వారు నివసించే గూడేల్లో ప్రత్యేక భవనాలు నిర్మించేందుకు కేంద్ర,రాష్ట్రప్రభు త్వాలు నిర్ణయించింది.ప్రాథమిక పాఠశాల,అంగన్‌ వాడీ కేంద్రం,వైద్య ఉపకేంద్రం ఒకేచోట నిర్వహిం చేలా మల్టీపర్పస్‌ సెంటర్ల(బహుళ ప్రయోజన కేంద్రా లు)నిర్మాణానికి చర్యలు చేపట్టింది.పీఎం జన్‌మన్‌ పథకం కింద ఆదివాసీ గిరిజనులు నివసించే ప్రాంతాలకు 125 కేంద్రాలనుమంజూరు చేసింది. దీని కోసం ఇప్పటికే రాష్ట్రానికి రూ.75కోట్లు విడు దల చేసింది.వచ్చే ఏడాది మార్చినాటికి పనులు పూర్తి చేయాలని నిర్ధేశించింది.వీటిలో రెండు నెలల క్రీతం 72 కేంద్రాల నిర్మాణానికి రూ.43.20కోట్లు విడుద ల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన సంక్షేమశాఖ అధికారులు ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తి చేశారు.త్వరలో పనులు మొదలు పెట్టనున్నారు.తాజాగా మిగతా 53కేంద్రాల నిర్మాణా నికిరూ.31.80కోట్లు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతిలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అల్లూరి సీతారామారాజు,ఏలూరు,పార్వతీపురం మన్యం,శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఈకేంద్రాలు మంజూరయ్యాయి.
గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రం ఫోకస్‌
రాష్ట్రంలో 924గిరిజన ఆవాసాల్లో అభివృద్ధి కార్యక్ర మాల అమలుకు ప్రభుత్వాలు ప్రతిపాదనలు తయారు చేశారు.దేశంలో గిరిజనుల సామాజిక, ఆర్థికాభివృ ద్ధిపై దృష్టిసారించిన కేంద్రం-రాష్ట్రంలో 500 జనాభా దాటిన దాదాపు 924గిరిజన ఆవాసాలు, గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాద నలు గిరిజనుల సామాజిక,ఆర్థికాభివృద్ధిపై కేంద్రం దృష్టిసారించింది.ఏజెన్సీలు,మైదాన ప్రాంతా ల్లోని గిరిజన ఆవాసాల పరిధిలో4జీ సర్వీసులు,అన్ని గ్రామాలకు వందశాతం విద్యు దీకరణ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 500 జనాభా దాటిన దాదాపు 924గిరిజన ఆవాసాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు,విద్య,ఆరోగ్యం, జీవనోపాధి,నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను చేపట్ట నుంది.దీనికి రాష్ట్ర నిధులు లేకుండా కేంద్రమే మొత్తం నిధులు కేటాయి స్తుంది.ఇప్పటి వరకు అమల్లో ఉన్న పీఎం జనజాతి ఆదివాసీ న్యాయమహా అభియాన్‌ను ఉన్నతీకరించి ప్రధానమంత్రి జన్‌ జాతీ య ఉన్నత్‌ గ్రామ అభియాన్‌గా మార్చింది.రానున్న ఐదేళ్ల కాలంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లోని గిరిజనుల సామాజిక,ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది.ఈ పథకం కింద ఐదేళ్లలో దేశవ్యాప్తం గా రూ.79,156కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలి పింది.పథకం వివరాలను ముసాయిదా రూపంలో ప్రకటించింది. ఇందులో భాగంగా 17మంత్రిత్వశాఖ లు ఆయా ప్రాజెక్టులు చేపట్టనున్నాయి.రాష్ట్రంలో ఈ పథకం అమలు కోసం నాలుగు కమిటీలు వేయాలని కేంద్రం తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అపెక్స్‌ కమిటీపథకం అమలును పర్య వేక్షిస్తుంది.దీంతో పాటు రాష్ట్ర, జిల్లా,మండల స్థాయి ల్లో కమిటీలు మౌలిక సదుపాయాలు,ఇతర పనుల ప్రతిపాదనల్ని నోడల్‌ విభాగమైన గిరిజన సంక్షేమ శాఖ ద్వారా పంపించనున్నాయి.పీఎంజుగా కార్యక్ర మాలకు ప్రత్యేక విధివిధానాలు త్వరలో జారీ చేస్తా మని వెల్లడిరచింది.గిరిజన జీవన పర్యాటకం కోసం స్వదేశీదర్శన్‌ పేరిట నూరుశాతం నిధులతో హోం స్టే గృహాలు నిర్మించనున్నట్లు పేర్కొంది.
కేంద్రం చేపట్టే పనులు : కరెంటు లేని గిరిజన ఆవాసాల్లో కుటుంబాలు, ప్రభు త్వ విభాగాలకు విద్యుత్తు సౌకర్యం, రహ దారుల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. ఏజెన్సీ ప్రాంతా ల్లో 5కి.మీ.మైదాన ప్రాంతాల్లో 10కి.మీ.దూరంలో హెల్త్‌సెంటర్‌ లేకుంటే సంచార మెడికల్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తుంది. గిరిజన కుటుంబాలకు ఆయు ష్మాన్‌ భారత్‌ వైద్య బీమా కార్డుల పంపిణీ చేస్తుంది. గిరిజన రైతుల సుస్థిర వ్యవసాయ కార్యక్రమాల కోసం నిధుల కేటాయింపు.పశుపోషణ కార్యక్రమాలు చేపడతారు.
కొత్త అంగన్‌వాడీలకు రూ.12 లక్షలు : రాష్ట్రంలో ఇప్పటివరకు అమలైన పీఎం జనజాతి ఆదివాసీ న్యాయమహా అభియా న్‌ కింద81గిరిజన ప్రాంతాల్లో అంగన్‌ వాడీ కేంద్రాల నిర్మాణానికి మహిళాశిశు సంక్షేమశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసిం ది.పాత నిబంధనల ప్రకారం కేంద్రం 60,రాష్ట్రం40శాతం నిధులు భరించాలి. కానీ కొత్త నిబంధనల ప్రకారం పూర్తి నిధులు కేంద్రమే భరిస్తుంది.గిరిజన ప్రాంతాల్లో కొత్త అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.12లక్షల చొప్పున నిధులివ్వనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న కేంద్రాల ఉన్నతీకరణకు రూ.లక్ష చొప్పున అందిం చనుంది.ఇందులో గిరిజన ప్రాంతాల్లో 8,311అంగన్వాడీ కేంద్రాలు ఉన్నా యని వివరించారు.గర్భిణులు, బాలింత లకు అమలవుతున్న పథకాలు,పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై చంద్ర బాబు సమీక్ష చేశారు.2014లో ప్రవేశ పెట్టిన బాలామృతం,అమృతహస్తం, గోరు ముద్ద,గిరిగోరుముద్ద,బాల సంజీవని వంటి పథకాల స్థితిగతులను అధికారు లను అడిగి తెలుసుకున్నారు.రాష్ట్రంలో మొత్తం 55,607అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని అందులో ప్రధాన అంగ న్వాడీ కేంద్రాలు48,770ఉండగా, మినీ అంగన్వాడీలు 6,837ఉన్నాయని అధికా రులు తెలిపారు.ఇందులో గిరిజన ప్రాం తాల్లో 8,311అంగన్వాడీ కేంద్రాలుఉన్నా యని వివరించారు. – గునపర్తి సైమన్‌

భూ కబ్జా నిరోధిక చట్టం`2024

‘‘ ప్రస్తుతమున్న భూ ఆక్రమణల నిరోధక చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ఇకపై భూ ఆక్రమణలకు పాల్పడేవారికి గరిష్ఠంగా 14 ఏళ్ల వరకు శిక్ష విధించవచ్చు. అలాగే ఏపీ డ్రోన్‌ పాలసీ, డేటా సెంటర్ల పాలసీ, సెమీ కండక్టర్ల పాలసీల అమలుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.రాష్ట్రంలో ఇష్టానుసారం ప్రభుత్వ, పట్టా భూముల ఆక్రమణలకు పాల్పడినవారికి తగిన గుణపాఠం చెప్పేలా, అలాంటి కఠిన శిక్షలు విధించి, భారీ జరిమానాలతో చెక్‌ పెట్టేలా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న భూ ఆక్రమణల నిరోధక చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ఇకపై భూ ఆక్రమణలకు పాల్పడేవారికి గరిష్ఠంగా 14 ఏళ్ల వరకు శిక్ష విధించవచ్చు. అలాగే ఏపీ డ్రోన్‌ పాలసీ, డేటా సెంటర్ల పాలసీ, సెమీ కండక్టర్ల పాలసీల అమలుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలోని అన్ని భూములకు రక్షణ : ప్రభుత్వ, ప్రైవేటు భూములు అక్రమించుకోవడం, ఎక్కడో దూరంగా ఉంటున్నవారి భూములను కబ్జా చేయడం, పేదల భూములు లాక్కోవడం, నకిలీపత్రాలతో రిజిస్ట్రేషన్లు వంటివి నియంత్రించేందుకు ఏపీ భూఆక్రమణల నిరోధక చట్టం-1982ను రద్దు చేసి, దాని స్థానంలో ఏపీ భూ ఆక్రమణల నిరోధక చట్టం-2024 అమలుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పాత చట్టం పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులకే పరిమితమైంది. దాని ద్వారా రూ.5 వేల వరకు జరిమానా, ఆర్నెల్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకే అవకాశం ఉంది. కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని భూముల రక్షణకు వీలుంటుంది. ఆక్రమణదారులకు 10 నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష, భూమి విలువతోపాటు, నష్టపరిహారం కలిపి జరిమానా విధిస్తారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి, నిర్ణీత కాలంలో కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు.’’
ఏపీలో ప్రభుత్వ, పట్టా భూముల ఆక్రమణలకు పాల్పడిన వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూకబ్జాదారులకు భారీ జరిమానా,14ఏళ్లు జైలుశిక్ష వేయనుంది.ఈ మేరకు ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న భూ ఆక్రమణల నిరోధక చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఇష్టానుసారం భూకబ్జాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు, భారీ జరిమానాలు ఉండనున్నాయి.
పాత చట్టం కన్నా కొత్త చట్టం భేష్‌ : ఏపీ భూఆక్రమణల నిరోధక చట్టం -1982ను రద్దు చేసి, దాని స్థానంలో ఏపీ భూ ఆక్రమణల నిరోధక చట్టం -2024 అమలుకు బిల్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనకు ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.దీని ప్రకారం పాత చట్టంలోని ప్రభు త్వ,ప్రైవేటు భూములు ఆక్రమించుకోవడం,ఎక్కడో దూరంగా ఉంటున్న వారి భూములను కబ్జా చేయడం, పేదల భూములు లాక్కోవడం,నకిలీ పత్రాలతో రిజిస్ట్రే షన్లు చేయడం వంటి వాటిని నిరోధించేది.ఇప్పుడు ఈ చట్టానికి కొన్ని మార్పులు తీసుకొచ్చింది.పాతచట్టం పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులకే పరిమితం అవ్వగా, దాని ద్వారా రూ.5వేల వరకుజరిమానా, ఆర్నెల్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష మాత్రమే విధించేవారు.కానీ కొత్త చట్టం రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లోని భూములు రక్షణకు వీలుం టుంది. ఆక్రమణదారులకు 10 నుంచి 14ఏళ్ల వరకు జైలు శిక్ష, పరిహారం,భూమి విలువతో పాటు జరిమానా విధించనున్నారు.దీనికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయ నున్నారు.నిర్ణీత కాలంలో కేసులు పరి ష్కరించేలా చర్యలు తీసుకోనున్నారు.ఎ.పి.భూ దురా క్రమణ(నిషేధం)చట్టం-1982కంటే గట్టిచట్టం తెస్తు న్నందున,ఇప్పటి వరకు ఉనికిలో ఉన్న ఆచట్టాన్ని రద్దు చేస్తున్నామ న్నారు. పాత చట్టానికి,కొత్త చట్టానికి మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు. ‘1982’యాక్ట్‌ అప్పటి ఉమ్మడి ఎ.పి.లోని అర్బన్‌ ప్రాంతా లకు పరిమితంకాగా,‘2024’బిల్లులో రూర ల్‌,అర్బన్‌ సహారాష్ట్రంమొత్తానికీ వర్తి స్తుం ది.అప్పుడూ ఇప్పుడూ ల్యాండ్‌ గ్రాబర్‌ అనే దానికి నిర్వచనం మక్కికి మక్కికి దించారు. ప్రభుత్వ, ఎండోమెంట్‌, వక్ఫ్‌,చారిటబుల్‌, ప్రైవేటు భూముల ఆక్రమణలను నేరా లుగా పరిగణించి శిక్షిస్తామన్నారు.పాత చట్టంలో భూముల కబ్జాకు పాల్పడిన వారిపై అభి యోగం రుజువైతే ఆరు నెలలకు తక్కువ కాకుండా జైలు శిక్షఅన్నారు.జైలు శిక్షను ఐదేళ్ల వరకు వేయొచ్చు.ఐదు వేలరూపా యల జరిమానా కూడా అన్నారు.కొత్తగా తీసుకొచ్చిన బిల్లులో పదేళ్లకు తక్కువ కాకుం డా జైలు శిక్ష అన్నారు.పధ్నాలుగేళ్ల వరకు జైలు శిక్ష విస్తరించవచ్చు అన్నారు. కబ్జాకు గురైన ఆస్తి మార్కెట్‌ విలువను జరిమానాగా వేస్తారు. ప్రత్యేక కోర్టులు అప్పుడూ ఇప్పుడూ ఉన్నాయి. ఆ కోర్టులను ఏర్పాటు చేసే, జడ్జిలను నియమించే అధికారం, రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి దఖలు పర్చారు. సర్కారు ఎప్పుడైనా ఆ పని చేయొచ్చు.1982 జూన్‌లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. తదుపరి ఆగస్టులో అసెంబ్లీలో బిల్లు పెట్టింది. 1982 ఆగస్టు 10న ఆ బిల్లుపై శాసనసభలో చర్చ సందర్భంగా సిపిఎం అగ్ర నేత కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య మాట్లాడుతూ ఎప్పుడు పడితే అప్పుడు కోర్టులను, జడ్జిలను ఏర్పాటు చేసే, రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి దఖలు పరిస్తే,ఒక వేళ ప్రభుత్వంలో ఉన్న వారిపైనే భూకబ్జా అభియోగాలువస్తే, శిక్షల దాకా వెళితే సదరు కోర్టులను,జడ్జిల నియామకాలను బతకనిస్తారా, ఆగ్యారంటీ బిల్లులో లేదని నిలదీశారు.రద్దు చేసిన చట్టంలో ఏముందో, కొత్తగా తెచ్చిన చట్టంలోనూ అదే ఉంది.ఇక్కడే ప్రభుత్వ నైజం అర్థమవుతుంది.నాలుగు న్నర దశాబ్దాలలో పరిస్థితుల్లో మార్పొచ్చింది. అదానీ వంటి వారు భూకబ్జాలకు పాల్పడి శిక్షలు పడే దాకా వస్తే, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి స్పెషల్‌ కోర్టులను, జడ్జిలను రద్దు చేయిస్తారు.చట్టంలో పొందుపర్చిన ఈ లొసుగు ముందు ల్యాండ్‌ గ్రాబ్‌ ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి,డిఎస్‌పి స్థాయి కి తక్కువ కాకుండా అధికారితో దర్యాప్తు చేయించాలి, ఆర్నెల్లలో విచారణ పూర్తి కావాలి అనేవి చాలా చాలా చిన్నవి.
మతలబు ఇదే : బిల్లులో పేర్కొన్న శిక్షల విషయానికొస్తే జైలు శిక్ష, జరి మానా అన్నారు.కబ్జాకు పాల్పడిన ఆస్తి మార్కెట్‌ విలు వను గ్రాబర్‌ నుంచి వసూలు చేస్తామంటు న్నారు. ఇక్కడ మార్కెట్‌ విలువంటే రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో ఉండే బుక్‌ వాల్యూనా లేదంటే బహిరంగ మార్కెట్‌లో క్రయవిక్రయాల రేటా అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ బుక్‌వాల్యూనే అయితే గ్రాబర్‌కే లాభం. గ్రాబింగ్‌ చట్టబద్ధమై పోతుంది.అందుకే కబ్జా చేసిన ఆస్తిని ప్రభుత్వం జప్తు చేస్తే కబ్జాదారులకు సరైన శిక్ష అవు తుంది. జైలు శిక్ష, జరిమానాతో పాటు ఆస్తి జప్తు కూడా చట్టంలో ఉండాలి.బిల్లులో ఆ అంశం లేదు. అందువల్లనే కొత్త చట్టం ఆర్థికంగా,రాజకీయంగా బలవంతులైన పెద్ద వాళ్లకు,కార్పొరేట్లకు చుట్టం అవుతుందని సందేహిం చాల్సి వస్తుంది. ప్రభుత్వ,ప్రైవేటు వ్యక్తుల భూములను ఆక్రమించుకున్నవారు ల్యాండ్‌ గ్రాబర్ల కిందకు వస్తారని బిల్లు చెబుతోంది. ఇళ్లు లేని పేదలు ప్రభుత్వ భూముల్లో వంద యాభై గజాల్లో నివాసాలు ఏర్పరుచుకుంటే చట్ట ప్రకారం ల్యాండ్‌ గ్రాబర్‌ అయిపోతారు. ఇళ్లు వేసుకోమని పేదలను ప్రోత్సహించిన వారు కూడా నేరస్తులవుతారు. ప్రభుత్వ,ఎండోమెంట్‌,వక్ఫ్‌ భూములను ఎకరమో, రెండె కరాలో సాగు చేసుకుంటున్న పేదలు భూ దురాక్రమణ దారులై శిక్షలకు గురవుతారు.కొంతమంది పెద్దలు ప్రభు త్వ భూములను ఆక్రమించి ప్లాట్లువేసి దర్జాగా అమ్ముకుం టున్నారు.చౌకగా వస్తుందన్న ఆశతో సామాన్యులు కొంటున్నారు.ఎవరు ప్రస్తుతం పొజిషన్‌లో ఉన్నారో వారు గ్రాబర్‌ అయిపోతారు తప్ప అక్రమంగా భూము లను ఆక్రమించి అమ్మిన అసలు వ్యక్తి తప్పించుకుం టారు. ఒక వేళ భూ దురాక్రమణ ఆరోపణలొచ్చినా వ్యవస్థలను మేనేజ్‌ చేసే పలుకుబడి అటువంటి పెద్దలకు ఎలాగూ ఉంటుంది. అపరాధులయ్యేది పేదలు, చిన్న వాళ్లే.అందుకే పేదలకు,చిన్న చిన్న వారికి కొంత వరకు మినహాయింపులుండాలి.ప్రభుత్వ అభ్యంతరాల్లేని నివాసా లకు ప్రభుత్వం కొంత విస్తీర్ణ పరిమితి పెట్టి పట్టాలిస్తోంది. అనధికారిక బిల్డింగ్‌లను రెగ్యులరైజ్‌ చేస్తోంది. అలాగే చట్టంలో పొందుపర్చాలి.పెద్దలను పట్టుకొని కఠినంగా శిక్షించాలి.అటువంటి సదుద్దేశం బిల్లులో కనిపించదు. పాత చట్టం ఉన్నా ఆచరణలో పేదలకు,సామాన్యులకు నష్టం జరిగింది. అర్బన్‌ ప్రాంతాల్లో యథేచ్ఛగా పెద్దల ఆక్రమ ణలు సాగిపోయిన అనుభవం ఉండనే ఉంది. రియల్‌ ఎస్టేట్‌ మాఫియా కబ్జాలు, వీరంగాలు రోజూ చూస్తున్నవే. ఆ కారణం గానే 2024-ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టంపై పేదల్లో, ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవు తున్నాయి.
అసైన్డ్‌లో జరుగుతున్నదేంటి? :1977-అసైన్డ్‌ ల్యాండ్‌ చట్ట సవరణల సమయం లోనూ ఎస్‌సి,ఎస్‌టి,పేదలు నష్టపోతారన్న భయాలు వ్యక్తమయ్యాయి. ఆచరణలో నిజం అయ్యాయి కూడా.1977-చట్ట ప్రకారం అసైన్డ్‌ భూములు అమ్మడం,కొనడం నిషి ద్ధం.2019లో టిడిపి ప్రభుత్వం దిగిపోయే ముం దు అసైన్డ్‌ ఇళ్ల స్థలాలు పొంది 20 సంవ త్సరాలు దాటితే ఒరిజనల్‌ ఎస్సయి నీలకు సర్వ హక్కులూ కల్పిస్తూ చట్టం తెచ్చింది. అమరావతి ప్రాంతంలో ఐదేళ్ల గడువుపై చట్టానికి ప్రయత్నించగా నాటి గవర్నర్‌ అంగీకరించలేదు. అదే దారిలో ఐదేళ్ల కాల పరిమితి పెట్టి సర్వ హక్కులూ అంది వైసిపి సర్కారు.కోర్టులు అంగీక రించకపోయే సరికి అసైన్డ్‌ వ్యవసాయ భూములకు 20ఏళ్లు, ఇళ్ల స్థలాలకు పదేళ్ల కాలపరిమితి పెట్టి జగన్‌ సర్కారు సవరణ చట్టం తెచ్చింది.ఈచట్టం పైకి బాగానే ఉన్నట్లు కనిపించినా కార్యక్షేత్రంలో చూస్తే అసైన్‌ భూములను అక్రమంగా కొనుగోలు చేసిన,ఆక్రమించిన,బెదిరించి లాక్కున్న పెద్ద లకే ఎక్కువగా ఉపయోగ పడుతోంది. ఈ పూర్వరంగంలో ప్రస్తుత ల్యాండ్‌ గ్రాబింగ్‌ (నిషేధం)చట్టంకూడా అంతే.ల్యాండ్‌ గ్రాబింగ్‌ (నిషేధం) చట్టంపై ప్రజల్లో సందే హాలు,భయాందోళ నలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఏపక్షంగాచట్టం చేయబూను కోవడం ప్రజా ప్రభుత్వం అనిపించుకోదు. రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రజాసంఘాలు, మేధావులతో విస్తృతంగా చర్చించి వారి నుంచి అభిప్రాయ సేకరణ చేస్తే ప్రభుత్వా నిది సదుద్దేశం అనిపించు కుంటుంది. చట్టాన్ని అమలు చేసే ముందైనా అన్ని పక్షాలతో చర్చలు జరపాలన్న డిమాండ్‌ సహేతుక మైనది.ఎలాంటి చర్చలు,సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా చేసే చట్టం ఆచరణలో నిలబడదు. అప్పటికి తాత్కాలిక రాజకీయ కక్షలకు ఉపయోగపడితే పడ వచ్చు.ప్రధానంగా పేదప్రజలకు నష్టం జరగకూడదు. పేదల పక్షాన,వారి హక్కులకోసం పోరాటాలు, ఉద్యమా లు నిర్వహించే సంస్థలపై,వ్యక్తులపై అణచివేత, నిర్బంధా లకు ప్రభుత్వానికిచట్టం ఆయుధం కాకూ డదు.అప్పుడే ‘మంచి ప్రభుత్వం’ అవుతుంది.
ఎవరి కోసం భూ ఆక్రమణల (నిషేధ) చట్టం?
భూకబ్జాలను అరికట్టడానికి,కబ్జాదారులకు కఠిన దండన విధించడానికి ఆంధ్రప్రదేశ్‌ భూ ఆక్రమణల (నిషేధం) చట్టం 2024 తీసుకు వస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చింది.జులై 15న జరిగిన క్యాబినేట్‌ సమావేశం అనం తరం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ మీడియాకు తెలియజేశారు. గుజరాత్‌ భూ ఆక్రమణల (నిషేధం) చట్టం 2020 ఆధారంగా త్వరలోనే కొత్త చట్టం తెస్తా మని ప్రకటించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ,దేవదాయ, వక్ఫ్‌ భూములను ఆ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు కబ్జా చేశారు. వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని, ఆక్రమణకు గురైన భూములను వెనక్కి తీసుకుంటామని చెప్పారు.భూ కబ్జాదారులను శిక్షిస్తే ప్రజాతంత్ర వాదులందరూ హర్షిస్తారు. కాని ఈ చట్టం మాటున పేదల పోరాటాలను అణచివేయడానికి ప్రయత్నిస్తే ప్రజలు హర్షించరు.
మనరాష్ట్రంలో స్వాతంత్య్రానంతరం వామ పక్షాలు,ప్రజాసంఘాల పోరాటాల ఫలితంగా భూ సీలింగ్‌ చట్టం,కౌలుదారీ హక్కుల చట్టం,1/70చట్టం,9/77 అసైన్డ్‌ చట్టాలు వచ్చాయి. పాలకవర్గాలకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఉద్యమాలకు తలొగ్గి దళిత,గిరిజన, బలహీ న వర్గాలకు చెందిన సుమారు 25లక్షల పేద కుటుం బాలకు 33లక్షల ఎకరాల భూమి ప్రభుత్వాలు పంపిణీ చేసినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. వీటిలో సుమారు 15లక్షలఎకరాల భూమిని పిఓటి 9/77చట్టాన్ని ఉల్లం ఘించి ప్రజా ప్రతినిధులు,రాజకీయంగాను,ధనబలం, కండ బలం కల్గిన నాయకులు అక్రమంగా,దౌర్జన్యంగా ఆక్రమించుకున్నట్లు2006 నుండి ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి.కాని రాష్ట్రంలో పిఓటియాక్ట్‌ (భూనిషేధ చట్టం) ప్రకారం ఆక్రమించుకున్న వారిపై 6 నెలలు జైలు శిక్ష, జరిమానా విధించాలి,ఆక్రమించుకున్న భూములను తిరిగి పేదలకు ఇవ్వాలి. ఈ చట్టం చేసిన నాటి నుండి (1977) నేటి వరకు కాంగ్రెస్‌, తెలుగుదేశం, వైసిపి ప్రభుత్వాలే రాష్ట్రాన్ని పాలించాయి. కాని ఇప్పటి వరకు ఒక్క భూకబ్జాదారుని మీద కూడా కేసు పెట్టి జైలుకు పంపలేదు.జరిమానా విధించి వసూలు చేయలేదు. కనీ సం ఒక్క పేదవానికైనా తిరిగి భూమిని ఇప్పించారా? అంటే ఎక్కడా అమలు జరిగిన దాఖలాలే లేవు. అసైన్డ్‌ చట్టం ప్రకారం పేదల భూమి పేదలకివ్వాలని ఆందోళన చేసిన ప్రజా సంఘాలు, సామాజిక సంస్ధలు, వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, పేదలపై క్రిమినల్‌ కేసులు,రౌడీషీటర్‌ కేసులు పెట్టి జైళ్ళకు పం పారు. వారు నేటికీ కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. ఒక్క భూ కబ్జాదారుడు కూడా జైలుకు వెళ్ళలేదు. వేలాది ఎకరాలను పెద్దలు, ఉన్నతాధికారులు ఆక్రమించుకున్నా రని,వీటిని తిరిగి తీసుకోవాలని కోనేరు రంగారావు భూ కమిటి, ప్రజాసంఘాలు చెప్పినా ఏఒక్కరి నుండి ఒక్క ఎకరం భూమికూడా స్వాధీనం చేసుకొని పేదలకు ఇవ్వ లేదు. ఏ కోర్టూ శిక్షించలేదు. నేడు తెలుగుదేశం ప్రభుత్వం తెస్తామని చెబుతున్న భూ ఆక్రమణల (నిషేధం) చట్టం 2024 కూడా అలాగే మిగులుతుందా! ఉన్న చట్టాలనే అమలు చేయకపోగా కొత్తచట్టాలను తెచ్చి అమలు చేస్తా రంటే ఎలా నమ్మగలం? గుజరాత్‌ తరహాలో చట్టం తెస్తామని చెప్పారు. గుజరాత్‌ భూ ఆక్రమణల (నిషేధం) చట్టం 2020లో ఏముందో ఒకసారి పరిశీలిద్దాం. ఈ చట్టం 2020 అక్టోబర్‌ 9 నుండి అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్‌ 2(4) ప్రకారం ఎవరైనా భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నా లేదా డబ్బు ఆశ చూపి వేరే వారి నుండి ఆక్రమించుకున్నా,చట్ట విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా,భూమిపై అనధికారికంగా,అక్ర మంగా అద్దె (డబ్బు)వసూలు చేసినా లేదా భూఆక్ర మణ లకు సహాయం చేసినా,ప్రోత్సహించినా,వారి పక్షాన నిలబడినా భూఆక్రమణదారుల కిందకి వస్తారు. అటు వంటి భూములను కౌలుకి తీసుకున్నా, ఆ భూములలో పేదలు పని చేసినా నేరస్తులుగా పరిగణించబడతారు. నేరం రుజువైతే 10నుండి 14ఏళ్ళ జైలు శిక్ష, ఆ భూమి విలువను బట్టి జరిమానా విధించబడుతుంది.సెక్షన్‌ 6 (1) ప్రకారం ఈ చట్టాన్ని ఉల్లంఘించి పరిశ్రమ లేదా ఏదైనా కంపెనీ నిర్మించి ఉంటే కూడా శిక్షార్హులు.ఈ ఆక్రమణ తమకు తెలియకుండా జరిగిందని లేదా ఆక్రమణ జరగకుండా ఆపామని పరిశ్రమాధి పతులు రుజువు చేసుకుంటే శిక్ష నుండి మినహాయింపు ఇస్తారు.పైసెక్షన్లను బట్టి ఈ చట్టం ప్రకారం పెట్టుబడిదారులు, పారిశ్రా మికవేత్తలకు,పెద్దలకు శిక్ష విధించే కంటే కూడా చారెడు భూమి కోసం పోరాడే ప్రజా ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపడానికే గుజరాత్‌ ప్రభుత్వం ఈచట్టం తెచ్చినట్లు కన్పిస్తుంది.
సెక్షన్‌ 7-న్యాయస్థానాల పాత్ర : రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి సమ్మతితో ఒకటి లేదా ఎక్కువ ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తుంది. ఈ కోర్టులకు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తిని నియ మిస్తారు. దీనికి ప్రభుత్వం తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు ఉంటారు.ఈకోర్టులు భూ కబ్జాలను అరికట్టడానికి కలెక్టర్‌ నాయ కత్వంలో నియమించిన కమిటీ సభ్యులు ఫిర్యాదు చేసినా లేదా కోర్టే సుమో టాగా చేపట్టినా లేదాఎవరైనా ఫిర్యాదుచేసినా చర్య లు తీసుకుంటారు.కేసు బనాయించబడ్డ వ్యక్తి పూర్తి ఆధారాలతో,రాత పూర్వకంగా తనే స్వయంగాకోర్టు ముందు ఆధారాలు సమర్పిం చుకోవచ్చు.నేరం రుజు వైతే జైలు శిక్షతో పాటు అతను లేదా వారు ఆక్రమిం చుకున్న భూమి ఆరోజు మార్కెట్టు విలువ ఎంతఉంటే అంత మొత్తం నష్ట పరిహారం చెల్లిం చాలి.అదే ప్రభుత్వ భూములైతే ఆక్ర మించు కున్ననాటి నుండి ఆక్రమణ దారులు ఎంత చెల్లించాలో కోర్టు నిర్ణయిస్తుంది.ఈ కేసుల న్నిటినీ 6నెలలలోపు పరిష్కారం చేయాలి. ఒక వేళకోర్టు పరిష్కరిం చకపోతే రాష్ట్ర ప్రభు త్వానికి నివేదిస్తుంది. –(కె.ఎస్‌.వి.ప్రసాద్‌,/వి.వెంకటేశ్వర్లు)

విఫత్తుల నాశనం..జయించే శక్తిలేకున్నా..

విఫత్తులకు పరిమితి అంటూ ఉండదు. ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరూ చెప్పలేరు. ప్రపంచం మొత్తం విఫత్తులు ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్‌ కూడా ఉంది.ఇవి వాటిల్లి నప్పుడు అన్ని వ్యవస్థల మీద, అన్నీ వర్గాల మీద ప్రభావం చూపిస్తాయి.ఈ భూమ్మీద ఇప్పటిదాకా ప్రకృతి విఫత్తుల కోట్లమంది చని పోయారు. ఒక్కోసారి ఇవి కలగజేసే నష్టం తీరనిదిగా..కోలుకోవడా నికి కొన్నేళ్లు పట్టేదిగా ఉం టుంద కూడా. సాధారణంగా విఫత్తులు రెండు రకాలు.ఒకటి మానవ తప్పిదం. రెండోది ప్రకృతి వల్ల జరిగేవి. కరువు,భారీ వర్షాలు,వరదలు,తుఫాన్‌, సునామీ,భూకంపాలు ప్రకృతి విఫత్తులు. ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల ఇవి వస్తాయి. భూమి వేడెక్కటం(గ్రీన్‌హౌజ్‌ ఎఫెక్ట్‌) కాలుష్యం, అడవుల నరికివేత్త తదితర కారణాలు మానవ తప్పిదాలు. ఈరెండు విఫత్తులు ప్రాణ,ఆస్తి,పర్యావరణ నష్టాలకు కారణం అవుతుంటాయి.కరోనా లాంటి మహామ్మారు లను సైతం విఫత్తులుగా ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పుడు.
ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 2009,డిసెంబర్‌ 21న ఒక ప్రతిపాదన చేసింది.ప్రతియేటా అక్టోబర్‌ 13ను అంతర్జాతీయ విఫత్తు కుదింపు(తగ్గింపు) దినోత్సవాన్ని అధికారికంగా పాటించాలని నిర్ణయించింది.కానీ,1989లోనే మొదటి దినోత్సవాన్ని పాటించారు.విఫత్తులను తగ్గించుకునేంఉదకు చేసే ప్రయత్నాలు,రిస్క్‌ ఆవేరీనెస్‌ గురించి ప్రమోట్‌ చేస్తుంది.మొదట్లో నేచురల్‌ డిజాస్టర్‌ రెడక్షన్‌ డేగా ఉండేది. 2002లో ఐరాస ఓ రెజుల్యూషన్‌ పాస్‌ చేసింది.ఆపై 2009లో అధికారికంగా ప్రకటించడంతోపాటు ఈ దినోత్సవం పేరును మార్చేసింది.
విఫత్తుల నిర్వహణ
విఫత్తుల సంబంధించాకే సహాయక చర్యలు మొదలు పెట్టాలి.విఫత్తు నిర్వహణ అంటే ఇంతే..అని ఒకప్పుడు అనుకునేవాళ్లు.గతంలో మనదేశంలో విఫత్తులు ఆలా సంభవించాయి. ఆయా సందర్భాల్లో కీలక పాత్ర పోషించింది పునరావాస విభాగాలే.అయితే విఫత్తును ముందే అంచనా వేసే జాగ్రత్తలు తీసుకోలేమా?ఈ దిశగా ఐక్యరాజ్య సమితి(ఐరాస)1990లో ఒక తీర్మాణం చేసింది.ఆ దశాబ్దం మొత్తాన్ని ‘అంతర్జాతీయ విఫత్తుల తగ్గింపు’ దశాబ్దంగా ప్రకటిం చింది.విఫత్తుల నిర్వహణ అంటే..ఆపదలు వచ్చాక సాయం చేయటం మాత్రమే కాదు.రాకముందే పరిస్థితిని అంచనా వేయాలి.ముందుస్తు చర్యలు చేపట్టాలి. లోపాలను అధిగమించాలి.ఒకవేళ విఫత్తులు వస్తే త్వరగతిని సాయం అందించాలి. ఇందుకోసం టెక్నాలజీ సాయం తీసుకోవ డంతోపాటు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకోవాలి.తద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ప్రపంచ దేశాలకు ఐరాస సూచించింది ఇదే.

జాతీయ విఫత్తు..
విఫత్తు నిర్వహణ చట్టంలో లొసుగులూ ఉన్నాయి. ఇవి చూపిస్తూ కేంద్ర ప్రభుత్వాలు.. రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపిస్తున్నాయి. ఉదాహరణకు..కేరళ వరదలను జాతీయ విఫత్తుగా కేంద్ర ప్రకటించడానికి కారణం కూడా ఇదే.విఫత్తు నిర్వహణ చట్టం ప్రకారం మహా విఫత్తు,మానవ తప్పిదాల వల్ల భారీ తప్పిదాలు జరిగాలి.ఆ పరిస్థితిని అంచనా వేసి కేంద్రం జాతీయ విఫత్తుగా ప్రకటిస్తుంది. కానీ, సహజ విఫత్తులను ఖచ్చితంగా జాతీయ విఫ త్తుగా ప్రకటించాలన్న రూలేం చట్టంలో లేదు. అసలు సహాజ విఫత్తుల అంటే ఏంటీ సూచన లు చేయకుండానే డిజాల్వ్‌ అయ్యింది. రాష్ట్రా లకు ఇదే మైనస్‌గా మారింది.అయితే విమర్శ లు వచ్చినప్పుడుల్లా నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ రంగంలోకి దింపి,ఏదో మొక్కబడి ఆర్ధిక సాయం ఇచ్చి చేతులుదులుపుకుంటోంది కేంద్రం. విఫత్తులు/ఆపదలు చేప్పిరావు.. ఆకస్మాత్తుగా వస్తాయి.మానవ తిప్పదాలతో జరిగే విఫత్తులను ఆరికట్టొచ్చు.కానీ,ప్రకృతి విఫత్తులను పూర్తిగా జయించే శక్తి మనకు లేదు.ఎదుర్కొం డటానికి..తీవ్రతను తగ్గించడా నికి మాత్రమే సిద్దంగా ఉండాలి!కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫత్తు నిర్వహణను ఉమ్మడి బాధ్యతగా స్వీకరించాలి.అత్యున్నత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.లేకపోతే మున్ముందు కూడా అంతులేని నష్టం జరుగుతుందని మేథావులు అభిప్రాయపడుతున్నారు.
వైపరీత్యాలను
1. సహజ వైపరీత్యాలు
2. సామాజిక-సహజ వైపరీత్యాలు
3. మానవ ప్రేరేపిత వైపరీత్యాలు
4. పర్యావరణ వైపరీత్యాలుగా విభజించవచ్చు. భూకంపం,సునామీ,అగ్నిపర్వత విస్ఫో టనం, భూతాపం,ఆనకట్టలు తెగిపోవడం, గనుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించడం మొదలైనవాటిని ప్రకృతిసిద్ధ లేదా సహజ వైపరీత్యాలు అంటారు.
వరదలు, భూకంపాలు,కరువులు,ఆనకట్టలు కూలిపోవడం వంటి వాటికి మానవ ప్రేరేపిత, ప్రకృతి కారణాలు రెండూ ఉన్నాయి. అందువల్ల సామాజిక-సహజ వైపరీత్యాలు అంటారు.ఉదాహరణ: వరదలు అనేవి సహజసిద్ధంగా కురిసే అధిక వర్షాల వల్ల రావచ్చు లేదా మావన నిర్లక్ష్యం కారణంగా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటంవల్ల కూడా రావచ్చు. పారిశ్రామిక ప్రమాదాలు, రైలు, రోడ్డు, విమాన ప్రమాదాలు,ఉగ్రవాద దాడులు, ఆనకట్టలు కూలిపోవడం,విషపూరిత వ్యర్థాల లీకేజీ,యుద్ధం,అంతర్గత తిరుగుబాట్లు మొదలైనవి మానవ ప్రేరేపిత వైపరీత్యాలకు ఉదాహరణలు.కాలుష్యం,అడవుల నరికివేత, ఎడారీకరణ, తెగుళ్లదాడులు మొదలైనవి పర్యావరణ వైపరీత్యాలు. ఉదా: మానవజాతి నివసించని ఎడారిలో భూకంపం సంభవిస్తే అది సమాజానికి ఎలాంటి ప్రత్యక్ష, తక్షణ నష్టం కలిగించదు.అందువల్ల దాన్ని విపత్తుగా పేర్కొనలేం.ఉదా:2001లో గుజరాత్‌లోని భుజ్‌లో సంభవించిన భూకంపం 10వేల మందికిపైగా ప్రాణాలను హరించింది.-(కందుకూరి సతీష్‌ కుమార్‌)

నీళ్లకోసం..నేలకోసం..మత్స్యకారుల దైన్యం

మూడొంతుల నీళ్లే ఉన్న భూగోళంపై.. ఆ నీళ్లలోనే బతికే చేపల ఉనికికి ఏర్పడుతున్న ప్రమాదం గురించి గుర్తుచేసే రోజు. చేపలనే కాదు.. సమస్త జలచరాలను వెంటాడుతున్న మనుగడ ప్రమాదం గురించి మానవాళిని హెచ్చరించే రోజు.. కొన్ని సంవత్సరాల క్రితం వరకు సంద్రం నిండా కదలాడిన అనేక రకాల చేపలతో పాటు జలచరాలు క్రమేణా మాయమైపోతుంటే.. ఏం చేయాలో, ఎవరికి చెప్పాలో దిక్కు తెలియక ప్రపంచవ్యాప్తంగా సతమతమవుతున్న మత్స్యకారులకు గళమిచ్చిన రోజు! కడలి అలలపైన.. వలల మాటున పొట్టకూటి కోసం నిత్యం తిప్పలు తప్పని జీవితాలు.. బతుకు తీరం దాటేందుకు తీరం నుంచి సుదూరం వెళ్లాల్సిందే. ఇంత చేసినా బతుకు ఒడ్డున పడుతుందన్న నమ్మకం,బతికి ఒడ్డున పడతాం అన్న నమ్మకం లేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఒక పట్టాన అంతుపట్టని రోజుల తరబడి ప్రయాణం..అయినా సంద్రంపై నమ్మకంతో బతుకుపోరు సాగిస్తూనే ఉంటారు మత్స్యకారులు.. సముద్రం ఉట్టి చేతులతో పంపదు..అన్న నానుడిని మననం చేసుకుంటూ,వలలు భుజాన వేసుకుని, తిరిగి వస్తామో రామోనన్న నమ్మకం లేని పయనం చేస్తారు మత్స్యకారులు.. సంద్రంలో ఇప్పుడు కార్పొరేట్‌, కాలుష్య తిమింగలాలు సంద్రాన్ని..తీరాన్ని.. వీరిని, వీరి బతుకుల్ని కబళించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ నెల 21 ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..-`గునపర్తి సైమన్‌
వివిధ దేశాలకు చెందిన మత్స్యకారుల ప్రతినిధులతో1997లో తొలిసారిగా వరల్డ్‌ ఫిషరీస్‌ కన్సార్టియమ్‌ ఫోరమ్‌ పేరిట న్యూఢల్లీిలో ఒక సమా వేశం జరిగింది. దాదాపు 18 దేశాల నుండి ప్రతి నిధులు హాజరైన ఈసమావేశంలో వరల్డ్‌ ఫిషరీస్‌ ఫోరమ్‌ (డబ్ల్యుఎఫ్‌ఎఫ్‌) ఆవిర్భవించింది. మత్స్య కారుల సంక్షేమమే లక్ష్యంగా సముద్ర పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా,కార్పొరేట్‌ లాభాపేక్షతో అంతరించిపోతున్న మత్స్స సంపదను కాపాడటమే ధ్యేయంగా నవంబర్‌ 21ని మత్స్య దినోత్సవంగా జరపాలని ఆసమావేశం పిలుపునిచ్చింది.తొలి సమావేశం జరిగి 26 సంవత్సరాలు గడిచిపోయా యి.అప్పటి సమావేశంలో భాగస్వాములైన మత్స్య కారుల తరం దాదాపుగా దాటిపోయింది. కానీ పరిస్థితుల్లో మార్పు మాత్రం రాలేదు.
ఉనికికే ప్రమాదం..
ఇప్పుడు జలచరాలకే కాదు..మత్య్పకారుల ఉనికికి కూడా ప్రమాదం ముంచుకొచ్చింది. కాలు ష్యం కారణంగా చోటుచేనుకుంటున్న వాతావరణ మార్పులతో సముద్రాలు ఉప్పొంగి, మత్స్యకారుల ఆవాసాలను ముంచెత్తుతున్నాయి. ఈదుష్పరిణా మానికి కారణమైన కార్పొరేట్లు తీరప్రాంత భూము లపై కన్నేశారు. మత్స్యకారుల నివాస ప్రాంతాలను ప్రభుత్వాల సహకారంతో కబ్జా చేస్తున్నారు. ఆప్రాం తంలోని అన్నిజలవనరులను విషతుల్యంగా మారు స్తున్నారు. సముద్ర సంపదను నిలువునా దోచేస్తు న్నారు.జలచరాల గుడ్లను కూడా మిగల్చ కుండా ఊడ్చేస్తున్నారు. అందుకే..మత్స్యకారులు ఇప్పుడు తరతరాలుగా తమకింత నీడనిచ్చిన నేల కోసం, కడుపు నింపే నీళ్ల కోసం పోరాడాల్సి వస్తోంది. ఈ పరిణామాలు మన రాష్ట్రంలోనూ శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి.ఫలితంగా తూర్పు తీరం లోని లక్షలాది మంది మత్స్యకారుల బతుకులు తీవ్రంగా ప్రభావితమౌతున్నాయి.తీరంతో పాటు సముద్రాన్ని కూడా కార్పొరేట్లకు ప్రభుత్వాలు అప్ప చెబుతున్నాయి.సముద్ర జలాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుండటంతో కేంద్రం అనుసరిస్తున్న విధానాలే మత్స్యకారులను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి.
రాష్ట్రంలో ఇలా..
రాష్ట్రానికి సుదీర్ఘమైన 974కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది.సముద్రం మీద ఆధా రపడి జీవనం సాగించే మత్స్యకారుల జనాభా (2011లెక్కల ప్రకారం)సుమారుగా 6.05 లక్షలు. వీరిలో ప్రత్యక్షంగా సముద్రం మీదకు వేటకు వెళ్లే మత్స్యకారుల సంఖ్య 1.50 లక్షలు. అప్పటి లెక్కల ప్రకారం12,747మోటారైజ్డ్‌,1771మెకనైజ్డ్‌, 14, 677సాంప్రదాయ బోట్లు రాష్ట్రంలో ఉండేవి. గడి చిన పన్నెండేళ్ల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అనుసరించిన విధానాల కారణంగా మత్స్యకా రుల జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయి.సాంప్రదాయ,మోటరైజ్డ్‌బోట్లసంఖ్య భారీ గా తగ్గింది.వాటిస్థానంలో మెకనైజ్డ్‌ బోట్లు పెరిగా యి.వెజెల్స్‌ అత్యంత ఆధునిక నౌకలు చేపల వేటకు అందుబాటులోకి వచ్చాయి.పెద్ద వ్యాపారవేత్తల నుండి వందలకోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టగల కార్పొరేట్లు రంగ ప్రవేశం చేస్తున్నారు. తరతరాలుగా జీవనోపాధిగా ఉన్న చేపల వేట మత్స్య పరిశ్రమగా మారింది. పెరిగిన పోటీ కార ణంగా సాంప్రదాయ బోట్లతో వేట అసాధ్యం గా మారింది.ఎక్కడైతే స్వేచ్ఛగా ఆడుతూ, పాడుతూ జీవనం సాగించారో అక్కడే కూలీలుగా బతుకులీ డ్చాల్సిన దుస్థితి మత్స్యకారులకు ఏర్పడుతోంది. గుడ్లను,చేప పిల్లలను వదిలి వేస్తూ సాగే ‘బతుకు.. బతికించు’ జీవన విధానం నుండి ‘సర్వస్వాన్ని దోచేసే’ కొత్త సముద్రపు నీతి పుట్టుకొచ్చింది. ‘కాళ్ళ కింద నేలను..బోటుకింద నీళ్లను..’లాగేసే ప్రభుత్వ విధానాలు..తీర ప్రాంతంలో తిష్టవేసి,మత్స్యకా రుల బతుకుల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. దీంతో మత్స్యకారులు దయనీయస్థితిలోకి నెట్టబడ్డారు.
ఏం జరుగుతోంది?
నదులలో ఏటికేడాది కాలుష్యం పెరుగు తోంది.సముద్రపు ఒడ్డున కూడా విచ్చలవిడిగా పరిశ్రమలకు అనుమతిస్తుండటంతో సముద్రమూ కాలుష్య సాగరంగా మారుతోంది.నదుల్లో చేరుతు న్న కాలుష్యానికైతే లెక్కలున్నాయిగానీ, సముద్రం లో కలుస్తున్న విషపదార్థాలపై పూర్తిస్థాయి సమాచా రం లేదు.రిలయన్స్‌ వంటి సంస్థలు కోస్టల్‌ రెగ్యు లేటరీ జోన్‌ నిబంధనలను కాదని, బేఖాతరు చేస్తూ తిష్ట వేసిన తరువాత వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి? మిగిలిన ప్రపంచానికేమోగానీ స్థానిక మత్స్యకారులకు మాత్రం ఈవాస్తవం పూర్తిగా అర్థ మైంది.‘ఎవరైనా వస్తున్నారంటే కంపెనీల వాళ్లకి సమాచారం ముందుగానే తెలిసిపోతుంది. జాగ్ర త్తలు అన్నీ తీసుకున్నట్లు చెప్పడమే కాదు.తీసుకెళ్లి చూపించేస్తారు కూడా..కానీ సముద్రంలోకి, మా బతుకుల్లోకి విషం మాత్రం చిమ్ముతూనే ఉంటారు. అది తగ్గదు..పైగా రోజురోజుకీ పెరుగుతూ ఉం టోంది’అని కాకినాడ డీప్‌ వాటర్‌పోర్టులో జెట్టి ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఒకమత్స్య కార్మికుడు చెప్పాడు. కాలుష్యం పెరుగు తూనే ఉండటంతో సముద్రంలో మాములుగా దొరికే చేప జాతులు ప్రస్తుతం దొరకడం లేదన్నది ఆయన ఆవేదన. సొంత మెకనైజ్డ్‌ బోటులో మరో ముగ్గురు, నలు గురితో కలిసి వేటకు వెళ్ళే ఆయన‘కొన్ని సంవత్స రాల క్రితం ఒడ్డునేచేపలు దొరికేవి. ఇప్పుడు చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. రోజుల తరబడి సము ద్రం మీదనే ఉండాల్సి వస్తోంది.ఇంత చేసినా వేట బాగా జరుగుతుందన్న నమ్మకం లేదు.ఒక్కోసారి బోటు మీద తీసుకెళ్ళేవారికి రోజుకూలీ కూడా ఇవ్వలేని స్థితి ఉంటుంది’ అని చెప్పారు.ఆయనతో పాటు మరికొందరు చెప్పిన సమాచారం ప్రకారం వందల రకాల సముద్ర జీవజాలం ఉనికి ఇప్పుడు కాకినాడ తీరప్రాంతంలో కనిపించడం లేదు. వీటి లో ఎక్కువ భాగం చేప జాతులే! వాటి పేర్లు చెప్ప మని అడిగితే వారు తడబడకుండా చెబుతున్నారు. కాకినాడలోనే కాదు. బంగాళాఖాతం పొడవునా ఇదే స్థితి!
కలవరపెడుతున్న కోత!
కాలుష్యం కారణంగా చోటుచేసుకుం టున్న పరిణామాలు తీరప్రాంతంలో కొత్త జీవన దృశ్యాలను ఆవిష్కరిస్తున్నాయి.పిల్లి పిల్లలను మార్చి నట్టు సంవత్సరాల కాలంలో తమ నివాస ప్రాం తాలను ఒకచోట నుండి మరోచోటుకు మార్చాల్సి వస్తోంది.అయినా,తరతరాలుగా అలవాటైన సము ద్రతీరంలోనే ఎప్పటికప్పుడు మత్స్యకారులు కొత్త నివాసాలను వెతుక్కుంటున్నారు. రాష్ట్రంలోని ఉప్పాడ ప్రాంతం దీనికి పెద్ద ఉదాహరణ. అందు బాటులో ఉన్నలెక్కల ప్రకారం గడచిన 80 సంవ త్సరాల కాలంలో ఇక్కడ రెండు కిలోమీటర్ల భూమి కోతకు గురైంది.ఈప్రభావం 1989నుండి మరిం త స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న సంవత్సరాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంటుందని ఒక అంచనా! ‘ఒకే దగ్గర నివాసంఉండటమన్నది మరచి పోయాం. మూడు తరాలుగా స్థలాలు మారుస్తూనే ఉన్నాం.మా ముందు తరం వాళ్లున్న ప్రాంతం అదిగో అక్కడ సముద్రంలో ఉంది. గంగను వదిలి ఉండలేంగా..ఇక్కడే ఉంటున్నాం’అని ఇక్కడి మత్స్యకారులు అంటున్నారు. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో ఇళ్లనుకోల్పోయిన వారే అంద రూ.కోల్పోకుండా ఉన్నవారు ఒక్కరంటే ఒక్కరూ లేరంటే అతిశయోక్తి కాదు.ఇలానష్ట పోయిన ప్రతి సందర్భంలోనూ ఉన్నదంతా కోల్పోవడం, కట్టుబట్ట లతో మిగలడం వారికి మామూలే. ఉప్పాడలోనే కాదు..రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. కేంద్రమంత్రి డాక్టర్‌ జితేంద్రనాథ్‌ ఇటీవల పార్లమెంటులో చేసిన ప్రకటన ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికే 294.89కిలోమీటర్ల భూమి కోతకు గురైంది. ఇది మొత్తం తీర ప్రాంతంలో 28.7 శాతం.దీనిని బట్టే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది.
ఏ జిల్లాలో ఎంత కోత?
జిల్లా కోత (కి.మీ.లలో)
శ్రీకాకుళం 25.12
విశాఖపట్నం 25.81
తూర్పుగోదావరి’ 89.25
కృష్ణా 57.55
నెల్లూరు 53.52
తీరం కార్పొరేట్ల పరం..
కాలుష్యం కారణంగా ఇప్పటికే సముద్ర పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. అయినా ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోవడం లేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పరిణామం మరింత వేగవంతమైంది.అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ తీర ప్రాంత అప్పగింత మత్య్స సంపదతో పాటు,మత్స్యకారులకు కూడా శాపంగా మారుతోంది. మన రాష్ట్రంలో అదాని గ్రూపు సంస్థలకు పోర్టుల అప్పగింత కార్యక్రమం పెద్దఎత్తున కొనసాగుతోంది.ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్‌ కాస్తా అదానిప్రదేశ్‌గా మారుతోంది. పోరు ్టలను స్వాధీనం చేసుకున్న అదాని సంస్థ సము ద్రంలోకి నౌకలకు ఆటంకం కలుగుతోందంటూ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడంపై ఆంక్షలు విధిస్తోంది. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టును స్వాధీనం చేసుకోవడంతో దాదాపు 37కిలోమీ టర్లకు పైగా తీరప్రాంతం అదాని పోర్ట్స్‌ పరిధిలోకి వెళ్లింది. దీనిలో ఇప్పటికే దాదాపు 16కిలోమీటర్ల మేర కాంపౌండ్‌వాల్‌ను కట్టారు. మిగిలిన గోడ కట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సముద్రంలోకి రాకపోకలకు ఆటంకం కలిగేలా జరుగుతున్న ఈ గోడ నిర్మాణం పట్ల మత్స్య కార్మి కులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..ఆందోళనలు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వ యంత్రాంగమంతా అదానికే మద్దతుగా నిలిచింది. ఆ సంస్థ చేతుల్లోకే వెళ్లిన గంగవరం పోర్టు వద్ద కూడా ఇదే స్థితి.గోడ నిర్మాణంతో కిలోమీటరు దూరం వెళ్లి, వేటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని మిగిలిన పోర్టులను కూడా స్వాధీనం చేసుకోవడానికి అదాని గ్రూపు ప్రయతిస్తోంది. పోర్టులే కాకుండా‘కోస్టల్‌ ఎకనామిక్‌ జోన్లు, సెజ్‌లు,సాగరమాల’ ప్రాజెక్టుల పేరుతో తీరప్రాంత భూమిని కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు. ఫుడ్‌ ప్రాసె సింగ్‌, టెక్స్‌టైల్స్‌, పెట్రో కెమికల్స్‌ ఫార్మా పరిశ్ర మలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. దివీస్‌ లాబరేటరీస్‌ లిమిటెడ్‌,రాంకీ ఫార్మ సిటి, హెటిరో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌,బ్రాండిక్స్‌ ఇండియా అపె రల్‌ సిటీ,డాక్టర్‌ రెడ్డీస్‌ లాబరేటరీస్‌ లిమిటెడ్‌లు వీటిలో కొన్ని.వీటి నుండి విడుదలయ్యే కాలు ష్యాలు పెద్ద ఎత్తున బంగాళాఖాతంలో కలుస్తు న్నాయి.దీనిని నియంత్రిస్తున్నట్లు,కాలుష్య నివార ణకు చట్టాలను కఠినంగా వినియోగిస్తున్నట్లు.. ప్రభుత్వం చెబుతున్న విషయాలు మాటలకే పరి మితం.దీని ప్రభావం మత్య్స సంపదపై పెద్ద ఎత్తున పడుతోంది.
సమస్యలు పరిష్కరిస్తేనే బతుకు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులకు నష్టదాయకమైన జీవోలను విడుదల చేస్తున్నాయని ఎపి మత్స్యకారులు,మత్స్యకార్మిక సంఘం పేర్కొం ది.దీంతో మత్స్యకార వృత్తికి తీరని అన్యాయం జరుగుతోంది.చేపలకు గిట్టుబాటు ధర కల్పించాలి. గంపల మహిళలకు మార్కెట్‌ సౌకర్యం ఏర్పాటు చేయాలి.సబ్సిడీ డీజిల్‌,ఐస్‌ ప్లాంట్‌ వంటి సదుపా యాలు కల్పిస్తామని,జెట్టీలు నిర్మిస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.తుపాను సమయాల్లో మత్స్య కారులకు నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలి. వేట నిషేధ కాలంలో సమస్యలను పరిష్కరించాలి. యాభై సంవత్సరాలు నిండిన మత్స్యకారులకు పిం ఛన్‌ సౌకర్యం కల్పించాలి.స్థానిక పరిశ్రమల్లో మత్స్యకార కుటుంబాల యువతకు ఉపాధి కల్పించాలి.
ఆక్వా రైతుల్ని ఆదుకోవాలి..
ఆక్వా (రొయ్యలు, చేపలు,పీతలు) రైతులు ఇటీవల కాలంలో పీకల లోతు కష్టాల్లో కూరుకు పోతున్నారు. సన్న, చిన్నకారు రైతులు కోలుకోలేని దెబ్బ తింటున్నారు. ఫీడ్‌ ధరలు విపరీతంగా పెరి గాయి.ఫీడ్‌, సీడ్‌ (విత్తనం) నాణ్యతా ప్రమాణాల్లో లోపాలుంటున్నాయి.వైరస్‌లు, వాతావరణ మార్పు లు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దిగుబడులు తగిన విధంగా లేవు.ధర రాక ఆక్వా రైతులు కుదేలౌతు న్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల పన్ను లు,విదేశీ మారకద్రవ్యం రూపంలో ఆదాయం పొందుతున్నాయి.కానీ ఆక్వారైతుల్ని మాత్రం గాలి కి వదిలేసి,నట్టేట ముంచుతున్నాయి. ఆక్వా రైతుల చేపలు,రొయ్యలకు ధర కల్పించి..ఆదుకోవాలి. నాణ్యమైన సీడ్‌,ఫీడ్‌ సరఫరా చేయాలి.విద్యుత్‌ రాయితీ పునరుద్ధ్దరించాలి.
సముద్రమూ వారికే..
మత్స్యకారుల నివాస ప్రాంతమైన తీరమే కాదు,వారికి జీవనాధారమైన సముద్రం కూడా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అథారిటీ-సిఎఎ(అమెండ్‌ మెంట్‌)బిల్లు -2023..సాధారణ మత్స్యకారు లకు ప్రాణాంతకంగా మారనుంది.ఈ పరిణామం ఎలా జరిగిందో చూద్దాం.గత ఏడా దికి మరో పదివేల బోట్లు తగ్గి ఉంటాయని అంచ నా.వీటి స్థానంలో తొలుత మోటరైజ్డ్‌,మెకనైజ్డ్‌ బోట్లు పెరిగాయి. మెకనైజ్డ్‌ బోట్లకు లక్షల రూపా యల్లో పెట్టుబడులు అవసరమైంది. బ్లూ ఎకానమి,సముద్ర ఆధారిత టూరిజం,డీప్‌ సీ మైనింగ్‌ ఇలా రకరకాల పేర్లతో నూరుశాతం విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమ తించింది.దీంతో కొన్ని సంవత్సరాల వరకు మత్స్య కారులకు కన్నతల్లిలా కడుపునింపిన గంగమ్మ ఇప్పుడు కార్పొరేట్ల ఖజానా నింపే వనరుగా మారింది. ఇది ఇలాగే కొనసాగితే సముద్రంలోంచి చేపలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అందుకే సముద్రాన్ని,సముద్రతీరాన్ని, మత్య్సకారులను కాపా డుకునే బాధ్యత ఇప్పుడు ప్రతి ఒక్కరిది! 2004 భారత మహాసాగరమైన సునామీ నుండి వచ్చే పాఠాలు తదుపరి తరంకోసం మహా సముద్రం వంటి అధికమొత్తంలో నీరు శీఘ్ర స్థాన భ్రంశం జరగడంవల్ల ఒక సునామి సముద్రపు కెరటం (అలలు) పరంపర ఆరంభమవుతుంది నీటి పై గాని క్రిందగాని భూకంపాలు, సమూహపు కద లిక,కొన్ని అగ్నిపర్వత విస్ఫోటనములు,కొన్ని జలాంతర్భాగ విస్ఫోటనం.

కోయ భాష అస్తిత్వాన్ని బతికిద్దాం

పిల్లలే కవులుగానూ,కథకులు గానూ రచయితలుగామారి తమకోసం తాము కవి తలు,కథలు,పాటలు రాసుకునే అరుదైన సంఘటనతో మొదటి రోజు బాల సాహిత్య కార్యక్రమం అల్లూరి సీతారామారాజు జిల్లా చింతూరు మండలం రామన్నపాలెంలో అక్టోబర్‌ 5న కార్యశాల ప్రారంభమైంది. కోయత్తోర్‌ బాట మరియు సమత సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐదురోజుల కోయబాష బాల సాహిత్య కార్యశాలఅక్టోబర్‌ 5నుంచి 9వ తేదీవరకు కొనసాగింది.6 నుండి 14 సంవ త్సరాల వయస్సు గల చిన్న పిల్లలు తాము రాసిన కవితలు, పాటలు, కథలు రాసి వినిపించిన తీరు అందరిని ఆకట్టు కుంది.’’ పిల్లల కు సరిjైున అవకాశం, ప్రోత్సాహం ఇస్తే పెద్దల తో సమానం గల కవితలు, కథలు ఎన్నెన్నో రాస్తారని‘‘కార్యశాల సమన్వయకర్తలు జీ.యాదయ్య,కె.పాండు, డి.భీమమ్మ,జె.మల్లయ్య అన్నారు.పిల్లలను ఐదుగురు గ్రూప్‌లుగా విభజించి వాటికి బంతి, మల్‌ పిట్ట,ఎడజు డువ్వు,గులాబీ అని పేర్లు పెట్టి,అందరికీ చిన్న చిన్న కథల,పాటల పుస్తకాలు ఇచ్చి,వీటి మాదిరి మీరు కూడా కవితలు,కథలురాసి,చదివి వినిపించాలని చెప్పి రాయించి‘‘కార్యశాల నిర్వహించిన తీరు వివరించారు.ఇందులో తొలి కోయ బాల సాహిత్య రచయిత్రి భీమమ్మ తాను రాసిన కొన్ని పిల్లల పాటలు చదివి వినిపించి,పిల్లల లను ప్రోత్సాహం నింపింది.కోయ బాష కార్య కార్యకర్తలు తెల్లంకృష్ణ,మోసం సత్యనారా యణలు తమ నాట్య గీతాలలో పిల్లలను పాల్గొనేలా చేసిన తీరు పిల్లలలో కొత్త ఉత్సా హం నింపింది.ఎంతో దూరం నుండి కొయ తురు బాట పూర్వ విద్యార్థులు విచ్చేసి ఈ కార్యశాలలో పాల్గొనడం ప్రశంస నీయమని కార్యశాల నిర్వాహాకులు తెలియ జేశారు.ఈ కార్యశాలలో రామన్నపాలెం పిల్లలూ,కుంజ వారి గూడెం పిల్లలూ ఉత్సాహంగా పాల్గొ న్నారు.కోయత్తోర్‌ బాట పూర్వ ఉపాధ్యా యులూ,బాల సాహిత్య అభిమానులూ, మొదటితరం రచయిత శ్రీపూనెం బాబూరావు ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ప్రసంగం చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషలు కనుమరుగవుతూ వస్తున్నాయన్నారు.ఆదివాసీ భాషలు అంతరించే దశకు చేసుకుంటున్నాయి. గత ఇరవైఏళ్లుగా కోయ భాషలో బాల సాహిత్యం అభివృద్ధికి కోయత్తర్‌ బాట విశేష కృషి చేస్తుందన్నారు.ఇందులో భాగంగానే పూర్వ ప్రాధమిక సాహిత్య సృజనపై ఐదురోజుల కార్యక్రమం గిరిజనబిడ్డలకు ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయ పడ్డారు.భాష మనుగడను పరిరక్షించడానికి స్వచ్ఛంధ సంస్ధలు చేస్తున్న కృషిని పలువురు అభినందించారు. – (జీ.యాదయ్య)

సంయమనం అవశ్యం

తిరుపతి లడ్డు కల్తీ విషయం చినికి చినికి గాలివానగా మారింది. ఈ కల్తీపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘సిట్‌’ వేసింది. విచారణ జరిపించాలని దేశ ప్రధానికి జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తరం రాశారు. ముఖ్యమంత్రి ఆరోపణలపై బిజెపి మాజీ ఎంపీ సుబ్రమ ణ్యస్వామి, టిటిడి మాజీ ఛైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డి లతో సహా అనేకమంది విడివిడిగా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఈలోపు పాలక, ప్రతిపక్ష పార్టీల పరస్పర విమర్శలు, ప్రమాణాల సవాళ్ళు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష, వైసిపి కేంద్ర కార్యాల యంపై బిజెపి అనుబంధ యువజన సంఘం కార్యకర్తల దాడి ఒకదాని తర్వాత ఒకటి శరవేగంగా జరిగిపోతు న్నాయి. తాము ఎంతో పవిత్రంగా భావించి, పూజించి, భుజించిన స్వామి వారి లడ్డు అపవిత్రమైనదా! జంతు వుల కొవ్వు కలిపిన లడ్డు తిన్నామా! అంటూ దేశవ్యాపి తంగా వున్న కోట్లాది తిరుమల భక్తులు తీవ్ర ఆందో ళనకు, ఆవేదనకు గురవుతున్నారు. లడ్డులో కల్తీ జరిగి వుంటే కచ్చితంగా చర్యలు తీసుకోవాలి, దోషులపై కేసు లు పెట్టాలి, కఠిన శిక్షలు విధించాలి. అందుకు చట్టం తన పని తాను చేయాలి.ఈ పని సక్రమంగా చేయాల్సి న పాలకులు ఇతర మతాలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ మత సామరస్యతను దెబ్బ తీస్తున్నారు.
తిరుపతి లడ్డూ-కల్తీ నెయ్యి అంశంపై వారం రోజులుగాచర్చసాగుతోంది.నిజానిజాలను నిర్ధారించి,కారకులపై చర్యలు తీసుకోవడంపై చూ పాల్సిన శ్రద్ధను-అధికార,ప్రతిపక్ష పార్టీలు ఒక దానిపై ఒకటితీవ్రమైన నిందారోపణలు చేసుకో వటంపైనే ఎక్కువగా వెచ్చిస్తున్నాయి. భక్తుల మనో భావాలు, క్షేత్ర పవిత్రత అంటూ పైకి చెబుతూనే మత వైషమ్యాలను రెచ్చగొట్టే సంఫ్‌ు పరివార్‌ శక్తు లకు ఊతమిస్తున్నాయి. దేశంలోనే అత్యధిక మంది సందర్శించే తిరుపతి-తిరుమల క్షేత్రంలో ఇచ్చే లడ్డూ ప్రసాదం అనేకమంది భక్తుల మనోభావాలు, నమ్మకాలతో ముడిపడినది. అందులో వాడాల్సిన అన్ని రకాల దినుసులూ నాణ్యంగా ఉండాలి. తిరు మల క్షేత్రంలోనే కాదుబీ ఎక్కడైనా సరే ప్రసాదంగా నో,ఆహారంగానో ఇచ్చే ఏ పదార్థమైనా కల్తీ కాకుం డా ఉండాలి. నాణ్యతను ఎప్పటికప్పుడు నిర్ధారిం చాల్సిన యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలి. ఏ దినుసులో నాణ్యత లోపించినా, కల్తీ కనిపిం చినా నిబంధనలప్రకారం వ్యవహరించాలి. ఆయా దినుసులను వాడకంలోకి వెళ్లకుండా నిలిపి వేసి, సరఫరా సంస్థలపైనా, నిర్లక్ష్యం వహించిన వ్యక్తుల పైనా తగు చర్యలు తీసుకోవాలి. భక్తుల మనోభావా లను గౌరవించాలన్నాబీ పౌరుల ఆహార నాణ్యత కు,ఆరోగ్య భద్రతకు రక్షణ కల్పించాలన్నా-ఇదీ, పాటించాల్సిన పద్ధతి!
అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం తిరుమల క్షేత్రంలో ఇలాంటి తనిఖీ, నియంత్రణ వ్యవస్థలు చాలా ఏళ్లుగా అమలులో ఉన్నాయి.సరఫరా సంస్థలు పంపే దినుసులు నిర్దే శిత ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్నాయా? లేదా? అనితనిఖీ చేసి, సరిగ్గా ఉన్నవాటిని స్వీకరించటం, లేనివాటిని వెనక్కు పంపటం చేస్తున్నాయి. గతంలో టిడిపి,వైసిపిప్రభుత్వాలు,అవి నియమించిన పాలక వర్గాలూ అధికారంలో ఉన్నప్పుడు ఇలా నాణ్యత లేని నెయ్యిని తిప్పి పంపిన ఉదంతాలు ఉన్నాయని చెబుతున్నారు. తనిఖీ వ్యవస్థ ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు నిర్లక్ష్యమూ లేదా ఉద్దేశపూర్వక విస్మరణ ఎక్కడ,ఏ దశలో జరిగినా గుర్తించటం చాలా సుల భం.కారకులను గుర్తించి చర్యలు తీసుకోవడం కూడా సులభం. ఈ పనులన్నీ చేయటానికి అధికా రిక వ్యవస్థలూ,దొంతరలూ తిరుమలలో నడుస్తూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటి ఆధ్వర్యాన సమ స్యను సరిచేయాలి తప్ప వివాదాస్పదం చేయడం తగదు. మనోభావాలను గాయపరిచే, మత వైష మ్యాలను రెచ్చగొట్టే పరిభాషను ఎంచుకోవటం మరీ ప్రమాదకరం. కల్తీని కనుక్కోవటానికి, కార కులను శిక్షించటానికి రాజ్యాంగబద్ధమైన పద్ధతు లను అవలంబించాల్సిన ఉప ముఖ్యమంత్రి ఏకం గా మత వైషమ్యాలను రెచ్చగొట్టే మాటలతో లడ్డూ అంశాన్ని మరింత వివాదాస్పదం చేశారు. కొన్ని మతాలను,ఆ మతస్తుల ప్రార్థనా స్థలాలను ప్రస్తా వించారు. ఇలా వైషమ్యాలను సృష్టించటం అభ్యం తరకరం. చాలా సాధారణంగా, సరళంగా పరిష్క రించాల్సిన అంశానికి మతపరమైన ఉద్రేకాలను, ఉద్రిక్తలను అంటుగట్టి,రాష్ట్రంలో మతోన్మాద శక్తుల వీరంగానికి అవకాశం ఇవ్వడం చాలా పెద్ద పొర పాటు. అధికార టిడిపి-జనసేన, ప్రతిపక్ష వైసిపి ఈ విధమైన పొరపాట్లతో సామరస్యానికి చేటు తెస్తున్నాయి. ఒక పార్టీ ప్రాయశ్చిత్తమంటే- మరొక పార్టీ దేవాలయాల్లో పూజలు చేస్తామంటూ ప్రక టించింది.రాజకీయపార్టీలు రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్న జీవనోపాధికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలితప్ప వ్యక్తిగత మతవిశ్వాసాలపై కాదు. మతాన్ని స్వార్థరాజకీయ ప్రయోజనాలకు వాడుకో వటంపై అసలే కాదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, వరద బాధితులకు కేంద్ర సహాయంలో నిర్లక్ష్యం తదితరఅనేక ప్రజాసమస్యలు పక్కకుపోతు న్నాయి. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో మతోన్మాదాన్ని ఎగదోసి, రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి-ఆర్‌ఎస్‌ ఎస్‌ పొంచి చూస్తున్నాయి.అంతర్వేది,రామతీర్థం తది తర అంశాలను ఎంచుకొని ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి.ఇలాంటి కుయుక్తులపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన తరుణంలో తిరుపతి లడ్డూ అంశాన్ని రాజకీయం చేయడం రాష్ట్ర ప్రయోజనాలకు, సామరస్యానికీ ప్రమాద కరం.సిట్‌ నివేదిక వచ్చేవరకూ రాజకీయ పార్టీలు లడ్డూ అంశంపై ఎలాంటి ఉద్రేక ప్రకటనలూ చేయకుండా సంయమనం వహించాలి.
(`వ్యాసకర్త : సీనియర్‌ పాత్రికేయులు) – (ఆర్‌.వెంకట సుందరరావు)

కూటమి వంద రోజుల పాలన

ఏపీకి భరోసా లేకుండా లేని నాడు,ఏపీ అన్ని విధాలుగా నష్టపోతున్న నేపథ్యంలో అసలు ఆశలు అన్నవి ఆవిరి అయిన వేళ ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టింది.మూడు పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఏపీలో ఇదే తొలిసారి.ఎంతో అనుభవం కలిగిన చంద్ర బాబు అలాగే ప్రజల కోసం తపన పడే పవన్‌ కళ్యాణ్‌,కేంద్రంలో రెండు టెర్ములు సక్సెస్‌ ఫుల్‌ గా అధికారాన్ని అందుకుని ప్రజలకు మేలైన పాలన సాగించిన బీజేపీ కలసి ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపించాయి.జూన్‌ 12న ముఖ్య మంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ బాధ్యతలు స్వీకరించారు.అలా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి సరిగ్గా సెప్టెంబర్‌ 20తో వంద రోజులను పూర్తి చేసుకుంది. ఈ వంద రోజులలో ప్రభుత్వం ఏమిచేసింది అన్నది అంతటా చర్చించాల్సిన విషయమే. నిజానికి ఒకప్రభుత్వానికి వంద రోజులు అన్నది చాలా చిన్నది.అయినా సరే ఈ వంద రోజులలో చంద్ర బాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజ లలో కొత్త భరోసా కల్పించింది.ఏపీని గాడిన పెట్టేందుకు అన్ని రకాలైన చర్యలు తీసుకుంది. మొదటి రోజు నుంచే ఏపీకి రాజధాని ఆవశ్యకతను గుర్తించి అమరావతిని మళ్లీ పూర్వపు దారిలో నడి చేలా చర్యలకు ఉపక్రమించింది. అమరావతిలో ఎన్నో నిర్మాణాలు మొదలెట్టిన గత ప్రభుత్వం దిగి పోగానే వైసీపీ వచ్చి వాటిని అలా వదిలేసింది. అయితే తిరిగి టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే పాత నిర్మాణాలను పరిశీలించి వాటిని ఎక్కడ నుంచి నిర్మాణం పనులు ప్రారంభించవచ్చు అన్నది నిపుణులతో చర్చించి ఒక గాడిన పెట్టే కార్యక్రమం ఆరంభించింది. అంతే కాదు అమరావతి రాజధాని అంటే దాని చుట్టూ తుప్పలతో అడవిని తలపించే లా ఉన్న వాటిని అన్నీ తొలగించేలా పెద్ద ఎత్తున జంగిల్‌ క్లియరెన్స్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిం ది. దాని కోసం 37 కోట్ల రూపాయలను ఖర్చు చేయడంద్వారా అమరావతికి కొత్త రూపు ఇవ్వ డానికి ప్రయత్నాలు స్టార్ట్‌ చేసింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంవద్ద ఉన్న పలుకుబడితో అమ రావతి రాజధానినిర్మాణానికి అవసరం అయిన నిధులను పోగుచేసే పనిలో కూడా కూటమి ప్రభుత్వం విజయవంతం అయింది. కేంద్రం పూచీకత్తు మీద ప్రపంచ బ్యాంక్‌ ఏకంగా పది హేను వేలకోట్ల రూపాయలు తీసుకుని రావడం అంటే అది గ్రేట్‌ అనే చెప్పాలి. దాంతో పాటు అమరావతిలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తన పలుకుబడిని ఉపయోగిస్తు న్నారు. గతంలో అమరావతిలో భూములు కేటా యించిన వారిని పిలిచి వారితో సంప్రదింపులు చేయడం ద్వారా వారి పనులు ప్రారంభించ డానికి కూడా ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తున్నారు.అలాగేఎన్నారైలను కూడా పిలిచి మరీ వారిద్వారా కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టించాలని మాస్టర్‌ ప్లాన్‌ వేస్తు న్నారు. అమరావతిలో విద్యా సంస్థలు ఇతర కార్య కలాపాలు మొదలైతే కచ్చితంగా అక్కడా యాక్టివిటీ స్టార్ట్‌ అవుతుందని దాని ఫలితంగా అమరావతి రూపూ షేపూ మారిపోతాయని బాబు భావిస్తు న్నారు. మరో వైపు అమరావతి రాజధాని విషయం లో ప్రభుత్వం సరికొత్త ఆలోచనలు కూడా చేస్తోం ది.గతంలోలా కాకుండా గుంటూరు, విజయ వాడలను కలుపుకుని జంట నగరాల మాదిరిగా తీర్చిదిద్దేందుకు కూడా ప్రణాళికలు రూపొంది స్తోంది. ఇక అమరావతి నుంచి భారీ రైల్వే లైన్లు వేసేలా కేంద్రం నుంచి సహకరం కూడా అందు కుంది.అదే విధంగా ఆరులైన్ల రోడ్లను కూడా నిర్మించడం ద్వారా అమరావతిని ఏపీలోని అన్ని ప్రాంతాలకు దగ్గరచేసేలా కనెక్టివిటీ ఉండేలా కూడా ప్రయత్నం చేస్తోంది.దీంతో గతపదేళ్ళుగా రాజధాని లేదు అని మానసికంగా ఎంతో అవేదన చెందుతూ ఇతర రాష్ట్రాల వారితో ర్యాగింగ్‌కి గురి అయిన ఏపీ ప్రజానీకానికి కేవలం వంద రోజుల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వం రాజధాని పేరిట ఒక రాజసం కల్పించింది అని చెప్పాలి. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌. ఇది ఎనిమిది దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రాజెక్ట్‌. దీని విషయంలో 2014 నుంచి 2019దాకా టీడీపీ ప్రభుత్వం చాలానే వర్క్‌ చేసి పెట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం బాగా స్లో డౌన్‌ అయింది. దాంతో ఎపుడో పూర్తికావాల్సిన పోలవరం కూడా పడకే సింది.టీడీపీ కూటమి ప్రభుత్వం తన ప్రాధాన్య తలుగా పోలవరంని కూడా పెట్టుకుంది. అందుకే ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే కేంద్రం వద్దకు వెళ్ళి పెండిరగులో ఉన్న 12 వేల కోట్ల రూపాయ లను విడుదల చేయించుకుంది.దాంతో పోలవరం పనులకు ఇపుడు ఆటంకాలు లేకుండా పోయాయి. నవంబర్‌ నుంచి పోలవరం పనులు శరవేగంగా ప్రారంభించేందుకు అన్ని రకాలైన ప్రయత్నాలను కేవలం వందరోజుల వ్యవధిలోనే కూటమి ప్రభు త్వం చేయడం మరో ప్లస్‌పాయింట్‌. ఇక నిరు ద్యోగా యువత కోసం మెగా డీఎస్సీని 16 వేలకు పైగా టీచర్‌ పోస్టులతో భర్తీ చేయడానికి చంద్ర బాబు సీఎంగా చేసిన మొదటి అయిదు సంతకా లలో ఒకటిగా పెట్టడం నిజంగా మరో విజయం గా చూస్తున్నారు.అంతేకాదు చంద్రబాబు సామా జిక పెన్షన్లు కూడా భారీగా పెంచారు. మూడు వేల రూపాయలను ఒక్క సారిగా నాలుగు వేలకు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దివ్యాంగుల పెన్షన్‌ కూడా రెట్టింపుచేసారు. ఈ విధంగా అరవై ఆరు లక్షలకుపైగా పెన్షన్‌ లబ్దిదారుల కళ్ళలో వెలుగు నింపారు.మరోవైపు చూస్తే ల్యాండ్‌ టైటిలిం గ్‌ యాక్ట్‌ ద్వారా రైతులు తమ భూములు ఎక్కడ పోతాయో అని నానా బాధలు పడుతూ అవేదన చెందారు.కూటమి ప్రభుత్వం అధికారంలోని వస్తూనే ఆయాక్ట్‌ని తొలగించింది. దాంతో రైతులు అంతా పూర్తి భరోసాను పొందారు. అదే విధంగా అన్నా క్యాంటీన్లను టీడీపీకూటమి ప్రారంభిం చడం మరో శుభ పరిణామం.దీనివల్ల పేదల ఆకలి పూర్తిగా తీరుతోంది.ఇది దేశంలోనే అద్భుత పథకంగా మారింది. ఒక వైపు కేంద్ర ప్రభుత్వంతో సామరస్యంగా ఉంటూ ఏపీకి తేవాల్సిన నిధులను తెచ్చుకుంటూ మరో వైపు ఏపీని అభివృద్ధి చేసే విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తూ తొలి అడుగులే బలంగావేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.ముఖ్యంగా గతంలో ప్రజలలో ఉన్న అభద్రతా భావం ఇపుడు లేదు.అంతే కాదు భవిష్యత్తు మీద ఒకగట్టి నమ్మకం ఏర్పడిరది. ఏపీ సేఫ్‌ హ్యాండ్స్‌లో ఉంది అని ప్రతీ ఒక్కరూ భావిస్తు న్నారు. ఏపీ సమీప భవిష్యత్తులో బాగా పుంజుకుని అభివృద్ధిలో దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతుంది అన్న నమ్మకాన్ని చంద్రబాబు ఇవ్వగలి గారు. మొత్తానికి వంద రోజుల పాలనలో ఎన్నో సవాళ్ళు ఎదురైనా కూడా చంద్రబాబు ఆత్మ విశ్వా సంతో ముందుకు సాగారు.దానికితాజా ఉదా హరణ బెజవాడను ముంచెత్తిన భారీ వరదలు. అటువంటి సమయంలో కూడా మొక్కవోని ధైర్యంతో ముఖ్యమంత్రి పదిరోజుల పాటు శ్రమించి ప్రజలకు తగిన సహాయం అందించగలిగారు. దాంతో వందరోజుల పాలన ఏపీకి మేలు మలు పుగా ఉందని అంతా భావిస్తుననారు.
వంద రోజుల అసహనం, అపనమ్మకం
నరేంద్ర మోడీ సర్కారు మూడో దఫా పాలనకు వంద రోజులు నిండిన పేరుతో హడా వుడి చేయా లని బిజెపి, సంఘపరివార్‌లు ఎంత హంగామా చేసినా వాస్తవాలు మాత్రం వెక్కిరిం చేలా గోచరిస్తున్నాయి.నిజానికి మూడోసారి వచ్చిన ప్రభుత్వానికి ఇవేవీ పెద్ద సందర్భాలు అవసరం లేదు. అయితే ఈసారి కేంద్రంలో ఎన్‌డిఎ సర్కారు ఏర్పడిన తీరులోనే ఆబండారం దాగుంది. నాలుగు వందల జపంతో మొదలై చివరకు అందులో సగం దగ్గర ఆగి అన్య పక్షాల మద్దతుపై ఆధారపడి రాజ్యం చేయవలసిన రాజకీయ దురవస్థ అడుగ డుగునా అడ్డుచక్రం వేస్తున్నది.లాంఛనంగా జర పాల్సిన ఈవంద రోజుల వేడుకను పెద్దఉత్స వంలా ప్రచారం చేసుకోవడంలోనే బలహీనత స్పష్టమవుతుంది.ఒకసారి నెట్‌ పరికిస్తే అన్ని ఇంగ్లీ షు పత్రికలలోనూ చాలా జరిగిపోయిందని రైట ప్పులు రాయించుకోవడం, అందరూ అచ్చు గుద్ది నట్టు ఒకే జాబితా రాయడం బట్టి వాటికి ఎలాంటి ఆదేశాలు వచ్చిందీ తెలిసిపోతుంది. మంగళవారం నాడు మోడీ ‘సుభద్ర’పేరుతో ఒకపథకం ప్రారం భిస్తూ తాము ఎన్ని చేశామో ఏకరువు పెట్టారు. నిజానికి ఈఅపనమ్మకం ఎన్నికల ఫలితాలు రాక ముందే మొదలైంది.రాబోయే వంద రోజులలో ఏం చేయాలనేది ముందే గతప్రభుత్వమే చర్చకు పెట్టడం వంటి ప్రహసనం గతంలో ఎన్నడూ జరిగి వుండదేమో!కానీ మోడీమోతకు అవన్నీ అవసరమై నాయి.ముందే నిర్ణయించాము గనక ఆవంద రోజుల పనులు చేశామని ఆయన ఇప్పుడు చెప్పు కుంటున్నారు.మరోవైపున హోంమంత్రి అమిత్‌షా కూడా అదే పనిలో వున్నారు. మూడుకోట్ల కొత్త ఇళ్లనిర్మాణం,యువతకు సహాయ పడేందుకు రెండు లక్షల కోట్ల సహాయం, గ్రామాలకు రోడ్లు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి,కొత్త పెన్షన్‌ పథకం,11లక్షల మంది మహిళలను లక్షాధికారి దీదీలను చేయడం, రైతులకు సహాయంఇలా చాలా జాబితా చదివారు. నిజానికి ఇందులో చాలా భాగం గతంలో అమలు కానివీ,ఇప్పుడు కూడా స్పష్టత లేనివే. వచ్చిన మేరకు కూడా ఉద్యమాల ఒత్తిడికి జంకి మొక్కు బడిగా ప్రకటించినవి వున్నాయి. పదేళ్ల తర్వాత కూడా గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయలేక పోయామని ప్రధాని పరోక్షంగా ఒప్పుకుంటు న్నారన్నమాట.ఇక నిరుద్యోగం ప్రపంచంలో ఎక్కడా లేనంత రికార్డుస్థాయిలో వుంటే వారి పేరి ట కార్పొరేట్లకు నెలజీతం జమ చేయడం ఓ విపరీ త విధానం. వీటినే మహత్తర విజయాలుగా మోడీ సర్కారు గానీ ఆయన పార్టీగానీ ప్రచారం చేసుకో వడం,ఎన్‌డిఎ భాగస్వాములుగా వున్న పార్టీలు వంత పాడటం హాస్యాస్పదం. ఇదేగాక విదేశాంగ విధానంలోనూ గొప్పఫలితాలు సాధించినట్టు మరో ప్రచారం. – జి.ఎన్‌.వి.సతీష్‌

పిల్లలదే ఈ ప్రపంచం..

ఈ ప్రపంచం పిల్లలకు సరిపడా ఉండాలా? ప్రపంచానికి వీలుగా పిల్లలుండాలా?అని అడుగుతారు రవీంద్రనాధ్‌ ఠాగూర్‌.‘సమా జంలో అత్యంత హానికి గురికాగల వాళ్ళు ‘పిల్లలు’.వారికి హింస,భయం లేని జీవి తాలను అందిద్దాం’అన్నారు నెల్సన్‌ మండేలా. బాల్యాన్ని కోల్పోయి బానిసలుగా దుర్భరమైన బతుకులీడుస్తున్న పిల్లలు మన చుట్టూ ఇంకా ఎందరో ఉన్నారు.‘మూడు మూరల కర్రతో ముప్పై ఎడ్లతో సోపతి నాదయ్యో దిక్కు దిక్కున ఉరకంగా లేలేత కాళ్ళకు గుచ్చెను ముళ్ళయ్యో’ అనే పాల బుగ్గల జీతగాళ్ళు ఇంకా గ్రామాల్లో కన్పిస్తూనే ఉన్నారు.‘బంగ్లాలూడ్చీ, బాసన్లు తోమీ, కలిగినోల్ల కాల్లే పడితే తినబోతే ఎంగిలి కూడూ..నీ ఈపునిండా ఎర్రని వాతలే’ ఇలా పట్నం వచ్చి పనుల్లో ఉండి హింసను అనుభవిస్తూ బెదురు చూపులతో గడుపుతున్న చిన్ని ప్రాణాలు ఇంకా ఉన్నాయి.‘కన్నోరి నెరగవు ఉన్నోరినెరగవు ఆదరించే వారినె రగవూ..చెత్త కుండే తండ్రై సాకేనా నీళ్లపంపు తల్లైసాకెనా’అంటూ తప్పిపోయి వచ్చినా, పారిపోయి వచ్చినా,తప్పించుకొని వచ్చినా.. అనాధలై వీధిలోనే బతికే బాల్యం,ఛిద్రమైన వీధి బాలలూ పెరుగుతున్నారే కానీ తరగడం లేదు. బాలల హక్కులను కాపాడేందుకు, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రజల్లో అవగా హన కల్పించేందుకు 2002 నుండి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం బాల కార్మిక వ్యతిరేక దినంగా ప్రకటించి ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చి ఇటుక బట్టీలలో మట్టి కొట్టుకున్న చిన్నారులు,చిన్నారి వేళ్ళతో రాళ్ళను గాజుల్లో పొదిగి వంటి నిండా అంటుకున్న మెరుపులుతో,అమాయకంగా చూస్తున్న గిడసబారిన పిల్లలూ ఇలా ఎన్నో సీన్స్‌ కళ్ళ ముందు కన్పిస్తూ..35ఏండ్లు గడిచి పోయా యి.వీళ్ళ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. బాల కార్మిక వ్యవస్థ మూడు పువ్వులు ఆరుకా యలుగా వర్థిల్లుతూనే ఉంది. ఇంకా ఎన్నేళ్ళు? పిల్లలంతా హాయిగా ఆనందంగా ఉండే రోజు రాదా? ఇవన్నీ జవాబులేని ప్రశ్నలుగా మిగిలి పోతూనే ఉన్నాయి. కుటుంబ కలహాలు, గృహహింస ప్రకృతి విపత్తులు,కుల,మత సంఘర్షణలు,నిర్లక్ష్యానికి గురైనవారు, తప్పి పోయిన పిల్లలు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారు, ఆకలి, పేదరికం వల్ల పనిదొ రకని కుటుంబాలతో వలస వచ్చిన పిల్లల జీవితమంతా ఓ గమ్యం తెలియని ప్రయా ణం.ఈ ప్రయాణంలో సుమారు 214 మిలి యన్ల మంది పిల్లలున్నారు.
బాధ్యత ప్రభుత్వాలదే
వలస వెళ్ళిన చోట హింస,దోపిడీ,సౌకర్యాలు లేకపోవడం,అనారోగ్యాలు,పిల్లలకు చదువు లేకపోవడం..అన్నిటినీ మించి కొత్త చోటులో నిర్భంధిస్తారా? వెనక్కి పంపుతారా? ఆపుతా రా? ఉండనిస్తారా?తెలియదు. వాళ్ళు ఉండా లనుకుంటున్నారా? తిరిగి వెళ్ళాలను కుంటు న్నారా?అని పిల్లల్ని అసలు అడగరు. వలస కార్మికుల రక్షణ కోసం కార్మికశాఖ అనేక విధానాలను రూపొందించింది.వీటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఆయా ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలతో కూడా సంప్రదింపులు జరపవలసి ఉంటుంది. ఆ క్రమంలో పిల్లలు దోపిడీకి గురి కాకుండా చదువుకి ఏర్పాట్లు చేయడం,మరీ ముఖ్యంగా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం అవస రం.వాళ్ళ భవిష్యత్‌ నిర్మాణంలో వాళ్ళే భాగస్వా మ్యం వహించాలి కదా!
యావత్‌ సమాజ బాధ్యత
1973లో అంతర్జాతీయ కార్మిక సంస్థ హక్కుల ప్రకటన 138వ ఒడంబడిక,1999లో182 ఒడంబడిక బాలకార్మికతను ఈ విధంగా నిర్వచించింది.12,14 ఏండ్ల లోపు పిల్లలు ఆర్థిక కార్యకలాపాలతో ముడిపడి పనిచేయడం, ప్రమాదకర, హానికర పనుల్లో బలవంతంగా నియమించబడటం, వ్యభిచారానికి ఉపయో గించటం, అక్రమ రవాణా చేయబడటం, అసాంఘిక కార్యకలాపాల్లోకి, ప్రమాదాల్లోకి నెట్టివేయబడటం’ అత్యంత దారుణం. అలాగే 1989లో విశ్వ బాలల హక్కుల ప్రకటన ఏం చెపుతుందంటే ‘ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేసి,చదువుకు,ఆరోగ్యానికి హాని కలిగిం చేలా వారి శారీరక, మానసిక, సామాజిక, నైతిక ఎదుగుదలకు ఆటంకం కలిగించే పనుల నుండి పిల్లల్ని రక్షించాలి’ అని. పిల్లల సంక్షేమం యావత్‌ సమాజ బాధ్యత అని ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్నీ అంగీకరించి హామీనిచ్చాయి. అయితే హైదరాబాద్‌లో జరిపిన ఓచిన్న సర్వే ప్రకారం28,560మంది వీధుల్లోకి వచ్చేస్తే వాళ్ళల్లో 18,670మంది బాలకార్మికులుగా మారారు. 18,827 మంది చదువుకోగా, అసలు చదువుకోని వాళ్ళు 17,056. వీధుల్లోనే నివసిస్తూ పని చేసేవాళ్ళు 20,056 మంది ఉన్నారు. భారతదేశంలో శతాబ్దాల తరబడి బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతున్న బాలల ముఖ చిత్రాన్ని ప్రతిబింబిస్తుంది. బడిలో ఉండాల్సిన పిల్లలను, ఆట పాటలతో గడపాల్సిన బాల్యాన్ని బందీ చేయడం ఒక అనాగరిక చర్య.ఇది మన భారతదేశ సమస్య మాత్రమే కాదు. ప్రపం చంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబం ధించింది కూడా.బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి స్థిరమైన,దీర్ఘకాలిక కృషి ఎంతో అవసరం. బాలకార్మికుడు అనే పదానికి సార్వత్రికంగా ఆమోదించిన నిర్వచనమే మిటంటే ‘బాల్యాన్ని నాశనం చేసే రీతిలో పిల్లలతో పని చేయించడం’.పిల్లల శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి అవరోధమై, వారికి అక్షరాస్యత,వినోదాన్ని పొందే అవకాశం ఇవ్వని పనిని,ఆస్థితిని బాలకార్మిక వ్యవస్థగా పేర్కొంటారు.బాలలంటే 5నుంచి14 సంవత్స రాల వయసు గలవారు. అయితే, తల్లిదండ్రుల పేదరికం, నిరక్షరాస్యత కారణంగా ఎందరో బాలలు బాలకార్మికులుగా జీవిస్తున్నారు. అవసరాల కోసమో, అదనపు ఆదాయం కోసమో పేద కుటుంబాలు తమ పిల్లలను పనుల్లోకి పంపిస్తున్నారు. ఎంతో మంది బాల లు వ్యవసాయ పనుల్లో, నిర్మాణ రంగాల్లోనే కాకుండా ప్రమాదకర వృత్తులైన ఇసుకబట్టీలు, పలకల తయారీల్లో, క్వారీల్లో, గాజు పరిశ్రమ, మైనింగ్‌ రంగాల్లో బ్రతుకీడుస్తున్నారు. దీనివల్ల పిల్లలు శారీరక, మానసిక పెరుగుదల లేకుండా దీర్ఘకాల దుష్పరిణామాలకు గురవుతున్నారు. పిల్లల్లో సహజంగా ఉండే నైపుణ్యాలు, సామర్ధ్యాలు నశించిపోవడం, భావి భారత మానవ వనరులు దుర్వినియోగమవడమే.
ఎప్పుడు ప్రారంభమయింది..?
పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన మొదటి రోజుల్లో ఈ బాలకార్మిక వ్యవస్థ కూడా ప్రారంభమైంది. మొదటిసారి 1803లో బ్రిటన్‌ బాలకార్మిక నియంత్రణ కోసం చట్టం తెచ్చింది.1819లో ఫ్యాక్టరీ చట్టాలు వచ్చాయి. పనిగంటల నియంత్రణ ఫ్యాక్టరీల్లో, కాటన్‌ మిల్లుల్లో జరిగింది.ఆతర్వాత 1948లో కర్మాగారాల చట్టం వచ్చింది.1966లో బీడీ, చుట్ట కార్మికుల పని పరిస్థితులు ఉద్యోగ నిబం ధనలు వచ్చాయి.1970లో కాంట్రాక్ట్‌ కూలీల నియంత్రణా,నిషేధ చట్టం.ఆ తర్వాత అంత: రాష్ట్ర వలస కార్మికులచట్టం 1979 వచ్చింది. 1988లో దుకాణాలు, సంస్థల చట్టం. 1958 లో వాణిజ్యనౌకల చట్టం.1952లో గనుల చట్టం పై అన్ని చటాలు 14ఏండ్లలోపు పిల్లలు పనిచేయటాన్ని నిషేధిస్తున్నాయి.
మానవహక్కుల ఉల్లంఘనే
బాలకార్మికత కూడా మానవహక్కుల ఉల్లంఘనే అనిచెప్పవచ్చు.రాజ్యాంగం ప్రకారం కూడా స్వేచ్చా,సమానత్వం,గౌరవం,వివక్షత, హింస లేని జీవితాలు పిల్లల హక్కు.రాజ్యాంగంలోని ఆర్టికిల్‌ 24 ప్రకారం14ఏండ్ల లోపు పిల్లలు ఫ్యాక్టరీలలో లేక ఇతర అపాయకరమైన పరిస్థి తులతో పనిచేయడం నిషేధించబడిరది. ఆర్టికి ల్‌ 39 (ఇ)(ఎఫ్‌) ప్రకారం లేతవయసులో ఉన్న పిల్లల ఆరోగ్యం,శరీరసత్తువ దుర్వి నియోగం కాకూడదు.వయసుకి తగని వ్యాపకాల్లో బలవం తంగా నెట్టే పరిస్థితులు లేకుండా చర్యలు తీసుకోవాలి.పిల్లలను, యువతను దోపిడీకి గురికాకండా చూడాలి.‘పిల్లల అభివృద్ధి కోసం జాతీయ ప్రణాళికల్లో మానవ వనరుల అభివృద్ధి ముఖ్యమైన ప్రాధాన్యత కలిగి ఉండాలి. అసమా నతలను పోగొట్టి సామాజిక న్యాయాన్ని అందించడం మన అందరి ముఖ్య ఉద్దేశ్యం కావాలి. మన జాతీయ విధానం ప్రకారం సంపూర్ణమైన బాలల అభివృద్ధికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అన్నారు జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌.ఒక న్యాయమూర్తిగా ఉంటూ పిల్లల హక్కుల చట్టాలలో సవరణల కోసం విశేష కృషి చేసిన గొప్ప వ్యక్తి ఈయన.
తీవ్రమైన దోపిడీ
120అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకారం.. భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్య లో బాలకార్మికులున్నారు.14ఏండ్ల లోపు బాల లు 250మిలియన్ల (ఇప్పుడిరకా పెరిగిఉండ వచ్చు) మంది బాలకార్మికులు ఉంటే,వారిలో 50 మిలియన్ల మంది ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు.20మిలియన్లు వెట్టి చాకిరీలో, 20లక్షల మంది ముఖ్యంగా బాలికలు అక్రమ రవాణాకు గురౌతున్నారు. మరికొంత మంది కుటుంబాల్లో ఇంటి పనుల్లో ఉండి పోతు న్నారు.అలాగే వ్యవసాయ పనులు,చేతి వృత్తులు,కుటీర పరిశ్రమల్లో ఎలాంటి జీతం లేకుండా పనిచేస్తున్నారు. ఇంకానిర్మాణ పనులు,చెత్తతో ఉత్పత్తులు,ఇతరుల వద్ద పని చేయడంతో పాటు స్వయం ఉపాధి పనులు చేస్తున్నారు.వెట్టి చాకిరీలో భాగంగా కార్పెం టర్‌,ఎంబ్రాయిడరీ పనులు,గనులు,షాపులు, రెస్టారెంట్స్‌లో పసులు,వ్యభిచారం,అశ్లీలంతో కూడిన పనులు చేయించబడుతున్నారు. 2000లో ప్రపంచ వ్యాప్తంగా Gశ్రీశీపaశ్రీ వీaతీషష్ట్ర aస్త్రaఱఅర్‌ జష్ట్రఱశ్రీస ూaపశీబతీ జరిగింది.ఈ సందర్భంగా నేను 24గ్రామాలు కాలినడకన తిరిగి ప్రచారం చేశాను.పాటలు, నాటికల ద్వారా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పని చేశాను.ఆక్రమంలో 12ఏండ్ల బాలకార్మికుని కొట్టి చంపిన సంఘటన దానిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ఆ యజమాని (హంతకుడు)కి శిక్ష పడేలా చేయగలిగాం.
కారణాలు ఇవే
బాలకార్మిక వ్యవస్థకు మూలకారణాలైన పేదరికం,నిరుద్యోగం,నిరక్షరాస్యత, వేధింపు లుతో పాటు మంచి పాఠశాలలు,నాణ్యమైన విద్య అందివ్వలేకపోవడం.లాగే మహిళలకు పరిమిత అవకాశాలు,మరీ ముఖ్యంగా పిల్లలు పనిచేస్తే వచ్చే ప్రమాదాలు,నష్టాలను తేలిగ్గా చూసే విధానం,యజమానుల లెక్కలేని వైఖరులు వీటన్నింటిపై అందరికీ అవగాహన కల్గించాలి. ప్రయారిటీలో పిల్లలుండాలి. ఈసమస్యలను ఇప్పుడు మనం తేలిగ్గా తీసు కుంటే రేపటి సమాజం ఆటవిక సమాజం కాగలదు.పిల్లలు భావి సంపద అని చెప్తుంటారు.కానీ మెటీరియల్‌గా,ఆస్తిగా చూడ టం సరికాదు.ప్రాణం ఉన్న ఆలోచన ఉన్న వ్యక్తులుగా వారిని చూడాలి.అంటే సుస్థిర అభి వృద్ధి లక్ష్యాలను సాధించుకునే దిశగా ప్రభు త్వాలు,పౌర సమాజం స్వచ్ఛంద సంస్థలు కలసి ప్రయత్నం చేయాలి.
బాలల హక్కుల చట్టం ప్రకారం
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం చేసిన చట్టాలు అమలు చేసేందుకు రూపొందించిన యంత్రాంగాన్ని సమర్థవంతంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత అందరిది.బాలకార్మిక చట్టం 1986 సవరణ చేస్తూ బాలలు,యువ కార్మిక (నిషేద నియంత్రణ)చట్టం2016గా రూపొందించడం జరిగింది.దీని ప్రకారం14 ఏండ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరం.14నుండి18ఏండ్ల యుక్తవయసు పిల్లల్ని ప్రమాదకరమైన పనుల్లో పెట్టుకోవడం నేరం. దీనికి 6నెలల నుండి 2ఏండ్ల వరకూ జైలు శిక్షతో పాటు 50వేల వరకు జారిమానా ఉం టుంది.పై నేరాలు తల్లిదండ్రులు, సంరక్షకుల ద్వారా చేయబడితే 10వేల జరిమానా. అలాగే ముందుగా డబ్బు అప్పు ఇచ్చి పిల్లల్ని పనిలో పెట్టుకోవడం కూడా నేరంగా పరిగణించ బడుతుంది.దీనికి 1976ప్రకారం 3ఏండ్ల జైలు శిక్షతో పాటు జరిమానా ఉంటుంది.
బాలల సంక్షేమ సమితి
బాలల సంక్షేమ సమితి అనే సంస్థ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడిరది. పిల్లలు పనిలో ఉన్న సమాచారం అందగానే చైల్డ్‌ లైన్‌ లేదా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ సిబ్బంది,పోలీసులు,లేబర్‌ డిపార్ట్‌మెంట్‌,లేబర్‌ ఆఫీసర్‌ లేదా స్వచ్చంద సంస్థలుగాని రిస్క్యూ చేసి ఎప్‌ఐఆర్‌ నమోదు చేసి 24 గంటలలోముందు హజరుపరచాలి. పనిలో పెట్టుకొన్న యజమానికి లేబర్‌ కోర్ట్‌ ద్వారా శిక్షలు,జరిమానాలు ఉంటాయి.బాలల న్యాయ చట్టం ప్రకారం బాలలను ఎవరైనా పనిలో పెట్టుకొన్నా, వెట్టిచాకిరీ కోసం వినియో గించినా,పని కోసం అమ్మినా,కొన్నా,జీతం ఇవ్వకుండా యజమాని వాడుకున్నా 5ఏండ్ల జైలు,జరిమానా విధిస్తారు.పై నేరాల్లో పిల్లలు వికలాంగులైతే నేరస్తులకు రెట్టింపు శిక్ష ఉం టుంది.
ఎవరికి ఫిర్యాదు చేయవచ్చు – (ఐక్యరాజ్యసమితి విశ్వ బాలల హక్కుల తీర్మానంలో పొందుపరిచిన హక్కులే పైన తెలియజేసిన 12 అంశాలు), వ్యాసకర్త : ఎక్స్‌ చైర్మన్‌,ఛైల్డ్‌వెల్‌ఫేర్‌ కమిటీ- (పి.శ్యామలాదేవ

    జీవజాలానికి రక్షాకవచం.. ఓజోన్‌!

    సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల బారిన పడకుండా భూమ్మీది సకల జీవరాశిని ఓజోన్‌ పొర సంరక్షిస్తుంది. ఇది భూతలం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండే స్ట్రాటో ఆవరణంలో భాగంగా ఉంటుంది. మానవ చర్యల మూలంగా ఓజోన్‌ పొర ప్రభావితమవుతోందన్న విషయంపై 1970ల నుంచి అధ్యయనాలు సాగుతున్నాయి. ఓజోన్‌ పొర సన్నగిల్లినట్లు (ఇదే ‘రంధ్రం’గా వ్యాప్తిలోకి వచ్చింది) ఆ తరవాతి కాలంలో కనుగొన్నారు. వృక్ష, జీవజాతుల మనుగడకు అత్యంత ముఖ్యమైన ఓజోన్‌ పొర దెబ్బతి నడానికి ప్రధాన కారణం క్లోరోఫ్లూరో కార్బన్లు (సీఎఫ్‌సీ),బ్రోమోప్లూరో కార్బన్లు (బీఎఫ్‌సీ). వీటిని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు 1987సెప్టెంబరు 15న మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ను ఆమోదించాయి.సెప్టెంబరు 16ను అంతర్జాతీయ ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవంగా ఐరాస సర్వసభ్య సమావేశం 1994లో ప్రకటించింది.దీన్నే ప్రపంచ ఓజోన్‌ దినోత్సవంగానూ పేర్కొంటారు.
    ప్రమాదకర కిరణాలు..

    జీవజాలంతో పాటు మొక్కలకూ అతినీల లోహిత కిరణాలు తీవ్ర హాని కలిగిస్తాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న పర్యావరణ పరిరక్షణ సంస్థ(ఈపీఏ) సంస్థ మూడున్నర దశాబ్దాల క్రితమే దీనిపై ఓనివేదిక ప్రచురించింది.ఓజోన్‌ పొర బాగా దెబ్బతింటే రాబోయే 88 సంవత్సరాల్లో ఒక్క అమెరికా లోనే నాలుగు కోట్ల క్యాన్సర్‌ కేసులు అధికంగా నమోదై, ఎనిమిది లక్షల మరణాలు సంభవిస్తా యని హెచ్చరించింది. అతినీలలోహిత కిరణా లు నేరుగా భూమి మీదకు ప్రసరిస్తే మనుషులు పలు రకాల క్యాన్సర్ల బారిన పడతారు. వృద్ధా ప్యం,కంటి సమస్యలు పెరుగుతాయి. రోగ నిరోధకశక్తి తగ్గిపోతుంది.మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ దెబ్బతింటుంది.పలు పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. ధ్రువప్రాంతా ల్లో ఓజోన్‌ పొర పలుచబడినట్లు వివిధ నివే దికలు వెల్లడిరచాయి.దీనివల్ల మంచు కరిగి సముద్రాల్లో నీటి మట్టం పెరుగుతుంది.ఫలి తంగా తీర ప్రాంతాలకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుంది.విపరీతమైన ఇంధన వినియో గం,ఏసీలు,ఫ్రిజ్‌లలో వాడే ప్రమాదకర రసా యనాలు ఓజోన్‌ పొరకు నష్టంచేస్తాయి. సీఎఫ్‌ సీలకు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్న హైడ్రోఫ్లూరో కార్బన్ల(హెచ్‌ఎఫ్‌సీ)తోనూ ఆపొరకు ప్రమాదమేనని శాస్త్రవేత్తలు చెబుతు న్నారు. వీటన్నింటికీ తోడు కార్చిచ్చులు సైతం ఓజోన్‌ పొరను దెబ్బతీస్తున్నాయి.అమెజాన్‌ అడవుల కార్చిచ్చు,ఈమేరకు ఆపొరపై ప్రభా వం చూపినట్లు పర్యావరణ సంస్థలు గతంలోనే ఆందోళన వ్యక్తంచేశాయి.ఆస్ట్రేలియాలో అడవుల దహనమూ ఓజోన్‌ పొరకు నష్టం కలిగించినట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఓజోన్‌ పొర స్థితిగతులపై ఐక్యరాజ్యసమితి ఓనివేదికను విడుదల చేస్తుంది.గతంతో పోలిస్తే ఓజోన్‌ పొర క్రమేణా కోలుకుంటున్నట్లు 2018లో విడుదలైన నివేదిక వెల్లడిరచింది. ఓజోన్‌ పొర క్షీణతకు దారితీసే పదార్థాల సాంద్రత వాతా వరణంలో తగ్గుతున్నట్లు తేలింది.కెనడా, స్వీడ న్‌,డెన్మార్క్‌,నార్వే వంటి వాటితో పాటు మరికొన్ని దేశాలు క్లోరోఫ్లూరో కార్బన్ల(సీఎఫ్‌సీ) ను కట్టడి చేసేందుకు మొదటి నుంచీ ప్రయత్ని స్తున్నాయి. అమెరికాలో ఈపీఏ ఆధ్వర్యంలో సీఎఫ్‌సీ ఉత్పత్తిదారులతో అంతర్జాతీయ వేదికను ఏర్పాటు చేశారు.ఓజోన్‌ పొర రక్షణ కోసం 1985లో28దేశాలు వియన్నా కన్వెన్ష న్‌లో సంతకం చేశాయి.ఓజోన్‌ పొరకు హానికా రకమవుతున్న రసాయనాలపై చర్చించేందుకు సంసిద్ధమయ్యాయి. అదే ఆతరవాత మాంట్రి యల్‌ ప్రొటోకాల్‌కు దారిదీపమైంది. అత్యంత విజయవంతమైన అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందంగా ఈ ప్రొటోకాల్‌ను అభివర్ణిస్తారు.
    భూమిపై జీవరాశులను రక్షించే కవచం..
    సూర్యుడి నుంచి వచ్చే కాంతి భూమిపై జీవుల మనుగడకు కారణమవుతుంది. అయితే ఈ కాంతిలో ఉండే అతినీలలోహిత కిరణాలు ప్రమాదకరమైనవి.ఇవి భూమిని చేరకుండా ఓజోన్‌ పొర అడ్డుకుంటుంది.ఇది లేకపోతే జీవుల మనుగడ సాధ్యం కాదు.1970వ దశకం చివర్లో ఓజోన్‌ పొరలో రంధ్రాలు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పొరను దెబ్బతీసే వాయువుల వల్ల దీనికి రంధ్రాలు ఏర్పడుతున్నాయి.రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషనింగ్‌తో పాటు ఇతర కూలింగ్‌ టెక్నాలజీ డివైజ్‌ల నుంచి ఈ వాయువులు విడుదలవుతున్నాయి. ఓజోన్‌ పొరను కాపాడ టానికి 1985లో వియన్నా ఒప్పందంపై ప్రపంచ దేశాలు సంతకం చేశాయి.ఓజోన్‌ ప్రాముఖ్యత గురించి దశాబ్దాలుగా అవగాహన ఉన్నప్పటికీ దాన్ని కాపాడాల్సిన అవసరం గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది.ఎందుకంటే భూమిపై జీవుల మనుగడకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. దుర దృష్టవశాత్తు క్రితం శతాబ్దంలో మానవులు చేపట్టిన వేగవంతమైన పారిశ్రామికీకరణ.. అస్తవ్యస్త వాతావరణ పరిస్థితులకు కారణ మైంది. అడవుల్లో కార్చిచ్చు,అకాల వరదలు ప్రపంచాన్ని మునుపెన్నడూ చూడని విధంగా ఇబ్బందులకు గురిచేశాయి.అయితే వియన్నా ఒప్పందంలోని మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ వల్ల అనుకూల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ శతాబ్దం మధ్య నాటికి ఓజోన్‌ పొర పూర్వ వైభవానికి(1980కి ముందు) చేరుతుందని నిపుణులు అంచనావేస్తున్నారు.గ్రీన్‌ హౌస్‌ వాయువులు,మిథైల్‌ బ్రోమైడ్‌,మిథైల్‌ క్లోరో ఫామ్‌,కార్బన్‌ టెట్రా క్లోరైడ్‌,క్లోరోఫ్లోరో కార్బన్స్‌, హైడ్రో ఫ్లోరో కార్బన్స్‌లాంటి రసాయన వాయు వులు ఓజోన్‌ పొర క్షీణతకు కారణమవుతు న్నాయి.
    ప్రస్తుతం ఓజోన్‌ పొర సురక్షితంగా ఉందా?
    మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ పూర్తి స్థాయి సంక్షో భాన్ని నివారించినప్పటికీ అడవుల ప్రమాదం నుంచి మనం ఇంకా బయటపడలేదు.ఈ ఏడా ది లాంకాస్టర్‌ వర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనం నేచర్‌ అనే జర్నల్లో ప్రచురిత మైంది.ఓజోన్‌ పొరను రక్షించనట్లయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో వివరించారు. ఈ శతాబ్దం చివరినాటికి 0.5 డిగ్రీల నుంచి 1 డిగ్రీల సెంటిగ్రేడ్‌ కు ఉష్ణోగ్రత పెరిగితే ఓజోన్‌ పొరను రక్షించలేమని,ఫలితంగా వాతావరణ మార్పులతో భూమిపై జీవనం తుడిచిపెట్టడానికి కారణమవుతుందని పేర్కొన్నారు.
    ఓజోన్‌ పొరను ఎలా రక్షించాలి?
    క్షీణతకు కారణమయ్యే క్లోరోఫ్లోరో కార్బన్స్‌ లాంటి వాయువులను ఉత్పత్తి చేసే ప్రొడక్టులను వినియోగించకూడదు.ఎయిర్‌ కండిషనర్లు లాంటి ఉపకరణాలను జాగ్రత్తగా చూసు కోవడంవల్ల వాతావరణంలోకి క్లోరోఫ్లోరో కార్బన్స్‌ లీకేజీని నివారించవచ్చు.వ్యక్తిగత వాహన వినియోగాన్ని తగ్గించి ప్రజారవాణాపై ఆధారపడితే కొంతమేరకు పరిస్థితిని అదుపు చేయవచ్చు.వాతావరణ మార్పును మానవాళి నిలువరించాలంటే ఓజోన్‌ పొరను రక్షించడం ఎంతో ముఖ్యం.
    చైనా మొండితనం..
    మాంట్రియల్‌ ప్రొటోకాల్‌పై సంతకాలు చేసిన ప్పటికీ ఫ్రాన్స్‌, యూకే ప్రభుత్వాలు మాత్రం తమ సీఎఫ్‌సీ పరిశ్రమలను కాపాడుకోవడానికి మొదట్లో ప్రయత్నించాయి.దానిపై పలు విమర్శ లూ వ్యక్తమయ్యాయి.ఓజోన్‌ పొర దెబ్బతినడా నికి మానవ తప్పిదాలే కారణమని బలమైన ఆధారాలు వెలుగు చూడటంతో 1990లో లండన్‌లో జరిగిన సమావేశంలో మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ను బలోపేతం చేశారు. దేశాల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా సీఎఫ్‌సీల ఉత్ప త్తిని నిరోధించడానికి లక్ష్యాలను నిర్దేశించారు. చైనా మాత్రం వాటికి తలొగ్గకుండా ప్రమా దకర విధానాలను అనుసరిస్తూనే ఉంది. ప్రపంచ సీఎఫ్‌సీ-11ఉద్గారాల్లో 40-60శాతం చైనా నుంచే వెలువడుతున్నాయని రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చింది. దీనిపై అంతర్జా తీయ సమాజం ఆందోళన వ్యక్తంచేసినా చైనా తన విధానాలను అలాగే కొనసాగిస్తోంది. మరోవైపు మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ను బలో పేతం చేశాక సీఎఫ్‌సీ ఉద్గారాలు చాలా మేరకు తగ్గుముఖం పట్టాయి.బ్రోమిన్‌ కలిగిన రసా యనాల వినియోగం క్షీణించడంతో ఓజోన్‌ పొరపై దుష్ప్రభావం చూపే హానికారక పదార్థాల తీవ్రత తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. అయితే ఇటీవలి కాలంలో నైట్రస్‌ ఆక్సైడ్‌ ఓజోన్‌ పొరను ఎక్కువగా దెబ్బతీస్తు న్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది మాంట్రి యల్‌ ప్రొటోకాల్‌ పరిధిలోకి రాకపోవడం వల్లే ఈపరిస్థితి నెలకొంది.పుడమి చుట్టూ ఆవరించి ఉన్న సహజ రక్షాకవచాన్ని సంరక్షించుకోవ డానికి ప్రపంచ దేశాల సమష్టి కృషి కొన సాగాలి. ఓజోన్‌ పొరపై దుష్ప్రభావం చూపే రసాయన సమ్మేళనాలన్నింటినీ కచ్చితంగా నియంత్రించాలి.ఓజోన్‌ క్షీణత పదార్ధాల నియంత్రిత ఉపయోగాల దశలవారీ,సంబంధిత తగ్గింపులు ఓజోన్‌ పొరను దీని కోసం భవిష్య త్తు తరాలకు రక్షించడంలో సహాయపడటమే కాకుండా,వాతావరణ మార్పులను పరిష్కరిం చడానికి ప్రపంచ ప్రయత్నాలకు గణనీయంగా దోహదపడ్డాయి.అంతేకాకుండా,ఇది హానికర మైన అతినీల లోహిత వికిరణాన్ని భూమికి చేరకుండా పరిమితం చేయడం ద్వారా మానవ ఆరోగ్యం మరియు పర్యావరణ వ్యవస్థలను రక్షించింది. – (నాదెళ్ల తిరుపతయ్య)

    1 2 3 4 … 13