కలుపు మొక్కలు

బాల్యం నుండే విద్యార్థుల్లో ప్రకృతి,పర్యా వరణం, దురాచారాలు మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు, ఆచార వ్యవహా రాలు మొదలైన అనేక అంశములను తెలి యజేసి విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించే ఉద్దేశంతో విద్యార్థుల కోసం ప్రారంభిస్తున్న కొత్త శీర్షిక ‘థింసా బాల వినోదం. ప్రదర్శన యోగ్యమైన చేతి బొమ్మలాటలు, లఘునాటికలు,నాటికలు ఏక పాత్రాభి నయం మొదలగు ప్రక్రియల ద్వారా ధారా వాహికగా అందిస్తున్నాం. ఈశీర్షిక మీ అందరి మనసులు ఆనందంతోపాటు, విజ్ఞా నం, వినోదం కలిగిస్తుందని భావింస్తున్నాం. చిత్తూరు జిల్లా రిషివ్యాలి స్కూల్లో ఉపాధ్యా యులుగా పనిచేస్తున్న తెలుగు పండితులు శ్రీ గోమఠం రంగా చార్యులు అందిస్తున్నారు. ఈనెల సంచికలో ‘కలుపు మొక్కల కథ’ ప్రత్యేకమైన కొత్త శీర్షిక.

కోదండపాణి గురుకుల పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు వారం వారం కాకపోయినా నెలకొకసారైనా వాళ్ల పుస్తకాల బీరువాలు పరిశుభం చేసుకుని పుస్తకాలను ఓ క్రమపద్ధతి లో అమర్చుకుంటారు. ఓఆదివారం తెలుగు ఉపాధ్యాయుడు బుడంకాయ్‌ బీరువా పని పడదామని ఉత్సాహంగా తలుపు తెరవగానే ఉన్న ఎలుక సపరివార సంతాన సమేతంగా దూకి పారిపోయింది. అదృష్టం బాగుండి తెలుగు టీచరు బుడంకాయ్‌ మీదకు దూకలా. బుడంకాయ
అసలు పేరు సంతానం. నిక్‌ నేం బుడంకాయ్‌. బొద్దెంకను చూస్తేనే భయపడే ఆయనకి ఎలుకల సమూహాన్ని చూడగానే ఒళ్లంతా ముచ్చెమటలు పట్టాయి.నిశ్చేష్టుడైఎలుకల వైపు వాటితోకల వైపు తదేకంగా కళ్లార్పకుండా చూస్తున్న ఆయన చెవులకు ‘బుడంకాయ గారు’ అన్న కేక వినబడేసరికి ఉలిక్కిపడి గంతేసి చెయ్యెత్తి నిల్చున్న ఆ ఆకారం చూచి ఈ భంగిమలో మీరు ఉవేదాంతం సత్యనారాయణశర్మ గారి భామాకలాపంలో వున్న ‘సత్యభామలా వున్నారండి’ అన్నారు ఆ స్కూలు డాన్సు
మాస్టారు పెంచలయ్య –
పుస్తకాల బీరువా శుభ్రం చేస్తున్నారా?అన్న పెంచెలయ్య మాటలకు లేదు అభ్యంగన స్నానం చేయిద్దామని ఆలోచిస్తున్నాఅన్నాడు నిదానంగా.
ఏంటినిజంగా నీళ్లు పోసికడుగుతారా? అన్నాడు అమాయకంగా..మీరు ప్రతిసారి పిల్లలచేత చేయించే వినాయక స్తోత్రరో వున్న మూషిక వాహనానికి – దానమ్మ కడుపు మాడ నా కబ్బో ర్డులో సంతాన సమేతంగా ఉన్నదికాక మల మూత్ర విసర్జనలతో, పుణ్యాహ వాచనం చేసిందండీ! మరి నన్నేం చేయమంటారు? అని ఓ పశ్న్ర సంధించాడు బుడంకాయ గారు.
నేను మీకు చెప్పేంతటివాడినా? అడిగారు కాబట్టి – నిమ్మకాయ చెక్కతో శుభంగ్రా రుద్ది, యాంటీడాండ్ర షాంపుతో కడిగి, ఎందుకైనా మంచిది కరోనా శానటైజర్‌ కూడా స్ప్రేచేయండి అన్నారు నృత్యాచార్యుడు పెంచెలయ్య.
మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగనూనా? నా తలచుండ్రుకే మీరు చెప్పినదేదీ చెయ్యలేదు.చూస్తున్నారుగా! ఎడారిలో ఖర్జూరం మొక్కల్లా నడినెత్తిన నాలుగు వెంట్రుకలు అని దీర్ఘాలోచనలో పడ్డ ఆయనగారితో చమత్కారంగా గుండైతే ఏంటండీ? ఎంత గుండంగ్రా వుందోమీ తల అన్న పెంచెలయ్య మాటలకు యిద్దరూ హాయిగా
నవ్వుకున్నారు. ఎలుక దాని సంతానం కలసిపరీక్ష ఆన్సర్‌ పేపర్లన్నీ కొరికేశాయి పెంచెలయ్య్నా.. అని కాంభోజీ రాగం లాంటి అరుపుకు పక్కనేవున్న సంగీతం సార్‌ దేవలోకం ఉదేశభాషలందు తెలుగు తియ్యందనం ఎక్కువ అని మీరే
అంటారుగా! అందుకే తెలుగు పేపర్లన్నీ కొరికాయ్‌ అన్నాడు కాలర్‌ ఎగరేస్తూ . దేవలోకం చేసిన ఎద్దేవకు ఏం చెప్పాలో అర్థంకాని బుడంకాయ్‌ కొరికి తిన్నందుకు కాదు, అన్నిటి మీద మలమూత్రవిసర్జన చేసి కంపు చేశాయ్‌ నా అలమార అన్నాడు సావధానంగా! ఈసారివిస్తుపోయారు సంగీతం దేవలోకం, డాన్సు పెంచెలయ్య. ప్రక్కనేవున్న హిందీటీచర్‌ విద్వత్‌ ఇదంతా వింటు వుండబట్టలేక పిల్లలు వ్రాసిన స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌ పేపర్లు తిన్న తరువాత వాటికి అతి మూత్రవ్యాధి విరోచనాలు పట్టుకు నుంటాయ్‌ మిస్టర్‌ బుడంకాయ్‌ అన్నాడు నవ్వుతు. ఆయనగారి సహేతుక వివరణకు ముగ్గురూ నవ్వుకున్నారు.
ముక్కుకు గుడ్డకట్టుకొని, నోటికిప్లాస్టర్‌ వేసుకుని, చేతివేళ్లకు గ్లౌజ్‌ తొడుక్కుని తలకు కండువ చుట్టుకొని చేసేదిటీచరు ఉద్యోగం. ఎన్ని జాగ్రత్తలు? ఇవన్నీ జాగ్రత్తలు అంటేపొరపాటే. బుడంకాయ్‌ గారికిలేని జబ్బు లేదనటం
సముచితంగా వుంటుంది. ఎలర్జీ,తుమ్మలు, గజ్జి,దురదలు,బి.పి,ఎక్కువ తింటేడయాబిటిక్‌, రెండు మెట్లు ఎక్కితే ఆయాసం, ఎక్కువసేపు కూచుంటే శరీర భాగాలన్నీ తిమ్మిరెక్కుతాయ్‌! ఒకటా రెండా? అన్ని వ్యాధుల సమాహారమే బుడంకాయ్‌ ఆల్‌ డిసీజెస్‌ యిన్‌ వన్‌ బాడీ! మొత్తం మీద రాక్‌ శుభం చేసి ఎలుకలు కొరికిన పరీక్ష పేపర్లు ఆ రూములోనేడస్ట్‌ బిన్‌ లో వేశాడు. వేసివెయ్యకుండానే డస్ట్‌ బిన్‌ ఈ పేపర్లు వేసేందుకు నేను తప్పితే ఇంకేం దొరకలేదా? అని అడిగినట్లనిపించింది బుడం కాయ్‌కి. ఇక్కడ కాకపోతేఎక్కడ వేస్తాను? పైగా పరీక్ష పేపర్లు. వీటన్నిటినీ తగలబెడదామా అంటేకాగితం సాక్షాత్‌ సరస్వతీదేవికి ప్రతి రూపం. ఆం ఏం కాదులే అని అవి తగల పెడితేఅగ్నిదేవుడికిఏం కోపం వస్తుందో? బుడంకాయ గారు ప్రకృతి ప్రేమికుడు కూడాను. ఈ మధ్యనేపక్షుల వీక్షణ గ్రూపులో కూడా చేరాడు. ప్రతి ఆదివారం ఉదయం చెట్లవెంబడి, పుట్టల వెంబడిపడితిరుగుతు పక్షులను గమనిస్తున్నాడు.
ఈ ఎలుకలు కొరికిన చెత్తవదిలించుకోవటం ఎలా? తల వేడెక్కింది బుడంకాయ్‌ కి.
తలపాగా తీసిగోక్కుంటే అపురూపంగా పెంచుకున్న నాలుగు వెంట్రుకల్లో ఓ వెంట్రుక కాస్తా ఊడిపడిరది. ఆ గోకుడుకి గుండు మీద గాయం రక్తం కారటం మొదలుపెట్టింది. ఏం చెయ్యాలి? డాక్టరు దగ్గరకు వెళితే 56 రకాల పరీక్షలు చేయించమని అంటాడు. దిద్దిపారేసిన పేపర్లు 156 దాకా వున్నాయి కాని జేబులో 6 రూపాయలు కూడా లేవు. పైగా నెలాఖరు.
పోనీ అప్పు చేస్తే? అనుకోగానేశ్రీమతి ఃమంగతాయారుః జ్ఞాపకం వచ్చింది. అప్పిచ్చిన వాడితల, నా తల రోకలిబండతో ముక్కల పచ్చడిచేస్తుంది. డాక్టరూ వద్దు మందూ వద్దు. అప్పు అసలే వద్దు అనుకుంటు చిన్నపిల్లవాడిలా చేతులో వున్న చాక్పీసు అరగతీసి నెత్తురుపై నెత్తికిరాసుకున్నాడు.ఆ మంటకు ఏడుపు ఆపుకోలేకపోయాడు. కళ్ల వెంట నీరు ఏకధాటిగా కారుతోంది. అటుగా వెళుతున్న విద్యార్థిచూసి ఉఏమైందిఎవరన్నా పోయారండీ? అలా ఏడుస్తున్నా రెందుకండీ?్న అని సావ ధానంగా అడిగాడు. భరించలేని మంట, కోపం, ఏం చెప్పాలో తెలియక ముందు వెనక ఆలోచించకుండా ఠక్కున ఆ హెడ్‌మాస్టారు పోయాడు అన్నాడు బుడంకాయ. పాపం పిల్లవాడూ వెక్కి వెక్కి ఏడుపు ప్రారంభించాడు. ఒకరికియింకొకరు తోడైఅక్కడ ‘ఓఏడుపుల క్లబ్‌’ తయారైంది.
అటుగా వెళుతున్న లెక్కలసారును చూడగానే నోటికి తాళాలు పడ్డాయ్‌. పిల్లలందరూ మటుమాయమయ్యారు. కాస్త ఊపిరి పీల్చుకున్నాడు బుడంకాయ. ఇప్పుడు ఇలా యింటికి వెళితే తల గాయం గూర్చి శ్రీమతి అడుగుతుంది. విషయం చెప్పీ చెప్ప కుండానే ఏడుపులు,పెడబొబ్బలు మొదలవుతాయి అనుకొని స్టాఫ్‌ రూంలోనే కూర్చున్నాడు. వచ్చేవారు వస్తున్నారు పోయేవారు పోతున్నారు. వారడిగే ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానం చెప్పి వూరుకుంటున్నాడు బుడంకాయ. మనసు పరిపరివిధాలా వేధిస్తోంది.ఈ పేపర్లను ఏం చేయాలి? ఇంటికివెళ్లేలోపు ఏదో ఒకదారి దొరుకుతుందిలే అని చంకలో పేపర్లు పెట్టుకొని దర్జాగా బయలుదేరాడు.హఠాత్తుగా ఈదురుగాలి విజృంభించింది. దుమ్ము ధూళి పైకిలేచింది.పేపర్లగూర్చే ఆలోచించే ఆయన ఈ హఠాత్పరిణామాన్ని గమనించలేదు. కంట్లో దుమ్ము పడేసరికిచేతులెత్తి కళ్లుమూసు కున్నాడు. చంకలో కాగితాలు గాలిపటాల్లా సందు చివరిదాకా ఎగురుతు చెల్లాచెదురుగా భూమ్మీద కొన్ని, చెట్లకొమ్మల ఆకుల మధ్యలో కొన్ని, వీధిచివర్లో వున్న చెరువులోకి
కొన్ని కొట్టుకుపోయాయి.
ఐదేఐదు నిముషాల్లో వాయుదేవుడు విజృంభించటం, శాంతించటం జరిగి పోయింది.దుమ్ము పడ్డముఖాన్ని చెరువు నీళ్లతో కడుక్కుందామని చెరువు గట్టు దగ్గరకు చేరిచెరువులోకి చూసి మూర్ఛ పేషంటులా వూగిపోతూ కిందపడిగుడ్లు తేలేశాడు. వెంటనేతనను తాను తమాయించుకుంటు చేతులు చాచి ‘మరణ మృదంగం మీద నృత్యం చేస్తున్న’ మీన సుందరినోట్లో కాగితం తీసిచూస్తేతన శిష్యులు వ్రాసిన పరీక్ష పేపరు
ముక్క మీద మీనము అన్నది చూచి ఆ కాగి తాన్ని జేబులో వుంచీ వుంచకుండానేకేరింతలు వేస్తూ చేతిలో వున్న మీన సుందరిమృత్యువుని జయించి ఈదుకుంటు లాహిరిలాహిరి లాహిరిలో జగమేవూగెను అన్నంత ఆనందంలో చెరువు మధ్యకు చేరింది. బుడంకాయ వెళ్లిన దారినే ‘బర్డ్‌ వాచర్స్‌ క్లబ్‌’ సెక్రటరీ ఖగపతి కూడా యింటికి బయలుదేరాడు. ఆయన ధోరణిలో ఆయన కొత్తపిట్టేమైనా వచ్చిందేమో అనుకుంటు ‘బైనాక్యులర్‌’ తీసి ఓచెట్టు కొమ్మలో యిరుక్కుని ‘కీకీ’ అంటున్న పక్షిని గమనించాడు. అదిచావుబతుకుల మధ్య కొట్టుకుంటోందని అర్థమైంది. నిశితంగా గమనిస్తేదాన్నోట్లో కాగితం ముక్క. గొంతు కడ్డు పడిరదనుకొని అటుగా వెళుతున్న ఓచెలాకీవిద్యార్థిని పిలిచి చెట్టుపైవున్న పిట్టను చూపించి దాన్ని జాగ్రత్తగా కిందకు పట్టుకు రమ్మన్నారు. విద్యార్థీశతమర్కట ఉపాధ్యాయుడిమాట పూర్తయీ కాకుండానేవాడు చెట్టు సగం ఎక్కేసిపిట్టని పట్టుకుని కిందకిదిగి గురువుగారిచేతిలో ఆయన కోరుకున్న పక్షీశ్వరు ణ్ణివుంచాడు.పిట్టనోట్లో కాగితం తీసిపిట్టని పిల్లవాడి చేతిలో వుంచాడు. పరలోకానికి వెళ్లాల్సిన పిట్టపిల్లవాడిచేతుల్లో నుండి తుర్రున ఎగిరిపోయింది.చెరువు దగ్గర నుండి బుడంకాయ వీళ్లను వింతగా చూస్తూ ఏమైందండీఅని అడిగాడు. ఖగపతిగారు చేతిలోని కాగితం ముక్కను బుడంకాయ చేతిలో పెట్టాడు. బుడంకాయ కాలరెగరేసాడు ఈ కలుపు మొక్కలు సూర్యుడస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం వారు నేర్పిన ఇంగ్లీషులో కూడా ఉన్నాయా అని అనుకున్నాడు.పక్కనేవున్న చెట్టెక్కి దిగిన విద్యార్థిఆ పేపరు నాదేనండి అదినేనే వ్రాశాను. నా ఇంగ్లీషు దస్తూ రినేను గుర్తుపట్టగలనండీ అన్నాడు. వాడి మాటలకు బుడంకాయ మళ్లీ బుర్రగీక్కున్నాడు. మిగిలివున్న మూడు ఎడారి మొక్కల్లో ఒకటి కిందకు పడిరది. నెత్తిన మిగిలి వున్న రెండు మొక్కలు ఈరోజుకు బతిక్రిపోయాం అనుకున్నాయి. పిల్లలు నాటిన యీ కలుపు మొక్కలు ఎప్పుడు వూడిపడతాయో! అనుకుంటు దిగాలుగా యిల్లు చేరాడు. చిలికి చిలికి గాలివాన తుఫానుగా మారినట్లు పరీక్ష పేపర్లు కొరికిన ఎలుకల దగ్గర నుండి చావు బ్రతుకుల మధ్య నరకం అనుభవించి బయటపడ్డమీన సుందరి, పక్షీశ్వరుల కథలు, కథలు కథలుగా స్కూలు మొత్తానికి తెలిశాయి. ఆనోట ఆనోట హెడ్‌ మాస్టరు గజవా హనుడికీ తెలిసింది. గజవాహనుడు చండశాసనుడు. స్కూలు పిల్లల్ని గడగడ లాడిస్తాడేకాని ఆయన పిల్లల్ని చూస్తే ఆయన గడగడలాడుతాడు. స్టాఫ్‌ రూంలో సరదాగా కబుర్లు చెప్పుకుంటు నవ్వులు విరగబూస్తున్న సమయంలో గజవాహనుడు వచ్చాడు. ఆయన్ను చూడగానేవాతావరణం మారిపోయింది. వాడిపోయిన కుసుమాల్లా ముఖాల్లో మార్పు వచ్చింది. ఇదంతా గమనించ లేనంత అసమర్ధుడు కాదు గజవాహ నుడు.అందర్ని చూస్తూ ఉనా రాక మీకేమైనా ఇబ్బందిగా వుందా అన్నారు.ఉచెట్టెక్కి కిందకు దింపిన పిల్లవాడి పిట్టకథ ప్రాణాపాయం నుండి బయటపడిన ఉమీన సుందరికథఉ తెలుసా? అని గద్దించాడు గజవాహనుడు. అందర్నీ ఉతికిఆరేద్దామని వచ్చి ఏదోమొదలు పెట్టబోయేలోపేబెల్‌ మోగింది. అక్కడున్నవారు అంతా ఎవరిమానాన వారు పుస్తకాలు,డస్టరు, చాక్పీసు తీసుకుని గజవాహనానికి నమస్కరిస్తూ బయటపడ్డారు. కాంపోజిషన్‌ పుస్తకాలు దిద్దుకుంటు అక్కడేకూర్చున్న బుడంకాయను సావకాశంగా ఉఏం చేస్తున్నారండి? అని అడిగిఆయవ పక్కనేకూర్చున్నాడు గజవా హనుడు. దిద్దుతున్న పుస్తకాన్ని చూపిస్తూ తెలుగు కాంపోజిషన్‌ దిద్దుతున్నా సార్‌ అని పుస్తకం పెద్దాయనకు చూపించాడు. పుస్తకంలో ప్రతిపేజీ దిద్ది వ్రాసిన సరిjైున పదాలు, వ్యాసంపైవిద్యార్థికి చేసిన సూచనలు అన్నీ చూశాడు గజవాహనుడు సావకాశంగా. ఏంటిసార్‌ 10ష్ట్రలో యింత ఘోరమా? అన్న ఆయన ప్రశ్నకు ఇదిచూడండి అంటూ యింకో పుస్తకంలో ఓపేజీ చూపిస్తూ కురుక్షేత్ర సంగ్రామంలో కాళ్లు, చేతులు,తల కోల్పోయి మొండెం ఏనుగుల కాళ్ల కిందపడి రక్తసిక్తమైన కురుక్షేత్రసంగ్రామాన్ని తలపిస్తుందియీ ఎర్రసిరా గుర్తులు అంటు తన అశక్తను తెలియజేసాడు బుడంకాయ్‌. ఆ పుస్తకంలోని అన్ని పేజీలు తిప్పి అట్టమీద పేరు చూసిదిమ్మెర పోయారు గజవాహనుడు. అదెవరిదో కాదు అక్షరాల తన పుతర్రత్నానిదే. బుడంకాయ మీద కోపం చల్లారలేదు. ఎంత కోపం బాధగా వుంటే మాత్రం ‘హెడ్మాష్టరు చచ్చాడని’ పిల్లలకు చెపుతాడా? కోపాన్ని తమాయించుకుంటున్నాడు గజవాహనుడు. వారిద్దరిమధ్య నిశ్శబ్దం ఆవరించింది. ఇంతలో ప్యూన్‌ అప్పలస్వామి ఓ ఫైల్‌ చేతికిచ్చి నిలబడ్డాడు. ‘పద. వస్తున్నా నంటు’ లేచి రూంకి బయలు దేరాడు.ఓ వారం రోజుల తరువాత గజవాహనుడు తన పుత్ర రత్నానికితెలుగు చెప్పే బుడంకాయకి కబురు చేశారు.వీలైతేయీరోజు సాయంత్రం మాఇంటి కిటీకిరాగలరా? ఓ తప్పకుండ వస్తా అంటు తిరుగు సమాధానం కబురు తెచ్చిన వ్యక్తిచేతే కబురు పంపాడు.ఏం ఆలోచించ లేదు. సాయంత్రం గజవాహనుని ఇంటికి వెళ్లాడు బుడంకాయ్‌. సాదరంగా ఆహ్వానించి లోపలకు తీసుకుని పోయి ఏవేవో పిచ్చాపాటి మాట్లాడి అసలు విషయానికివచ్చాడు.మీ గూర్చి నాకే అనుమానమూ లేదు. మీరు శక్తివంచన లేకుండా పిల్లల అభివృద్ధికికావలసిన చర్యలన్నీ తీసుకుంటు ఆహ్లాద వాతావరణంలో పాఠం బోర్‌ కొట్టకుండా చెపుతారనీ తెలుసు. పిల్లల అశద్ధ్రను ఏమాత్రం సహించరనీ తెలుసు. కానీ యీ కురుక్షేత్రసంగ్రామంలో రక్తం మరకల్లా యీ ఎర్రసిరా గుర్తులేంటిసార్‌? అన్నాడు. తెలుగు సాహితీ నందనవనంలో మొలకెత్తాల్సిన కల్పవృక్షం విద్యార్థుల చేతుల్లో పడి కలుపు మొక్కలుగా మొలిచిందండీ! కారణం ఎవరైనా కావచ్చు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమా జం, పాఠశాల యాజమాన్యం, ప్రభుత్వం తీరుతెన్ను-ఏదైనా కావచ్చు. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిపైన ఎంతమందికి ప్రేమా భిమానాలున్నాయి మాతృమూర్తి మీదేఅభిమానం చూపించలేని వీరు మాతృభాష మీదేం అభిమానం చూపిస్తారు? అంటేమనమేం చేయలేమా అన్న గజవాహనం మాటకికాంగ్రెస్‌ మొక్కలు అంటే పార్థీనియంని ఏ ఒక్కడో అంత మొందించలేడు. ఏ ఒక్క సంవత్సరంలోనో ఆ పని కాదు. రైతులందరూ సామూహికంగా కొన్ని సంవత్సరాలు అవి మొలకెత్తిన రోజుల్లోనే పీకేస్తే వాటి ఉత్పత్తి తగ్గి చివరికి అదృశ్యం కావచ్చు.తెల్లకాగితం లాంటివిద్యార్థుల మెదడులో అమోఘమైన జ్ఞాపకశక్తిఉంటుంది. అదిఆ వయసులో ఎట్లా చెపితే అట్లా వింటుంది ఆ సమయంలో సరిjైున ఉపాధ్యాయుని చేతులో విద్యార్థి పడితే సాహితీ నందన వనంలో కల్పవృక్షమే కాదు క్రియేటివిటీ అనే కామధేనువూ ఉదయిస్తుంది. దేశం మొత్తం -అన్ని శాఖల్లో – యీ కలుపుమొక్కలు ఒక్కొక్క చోట ఒక్కో పేరుతో పెరిగాయి. కలుపు మొక్కే గదా అని నాడు వదిలేశాం. అది నేడు మహా వృక్షంగా సిగ్గుసెరం లేకుండ తలెత్తుకుని భుజాలు ఎగరవేస్తోంది-ఇంతకంటే ఏం చెప్ప లేను సార్‌ అన్నాడు బుడంకాయ. గజవాహనం గారిభార్య దేవమ్మ తెచ్చిన టీతీసుకుంటు ఏమ్మా ఎలా వున్నావు? నీ రచనా వ్యాసంగం ఎలా వుంది? అని వాత్సల్యంగా అడిగారు బుడంకా య్‌. నేను మీ శిష్యురాలిని సార్‌. మీరు నా చిన్ననాడు నామీద ఉంచిన ఆశలు నిరాశలు చేయలేదు. మీ దయవల్ల నా రచనా వ్యాసంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వుందండీ అన్నదిఎంతో వినమ్రతతో. మంచి కబురు చెప్పావు. ఇదిగో యీ చాక్లెట్‌ తీసుకో అంటు చేతిలో చాక్లెట్‌ పెట్టి నేటిపిల్లలే రేపటిపౌరులు. వాళ్లను అన్ని విధాల తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడ వున్నదన్న సంగతి గుర్తుంచుకోవాలి అంటూ దంపతులిద్దరినుండి సెలవు తీసుకున్నాడు బుడంకాయ. ఇంటి బయటకొస్తోంటేగార్డెన్‌లో తోటమాలి ఏకాం బరం కలుపుమొక్కలు పీకు తున్నాడు. వాడు జీవితాంతం ప్రయత్నించినా యీ కలుపు తగ్గదనుకుంటు యింటికిచేరాడు బుడంకాయ్‌ –గోమఠం రంగా చార్యులు

లేటరైట్‌ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

లేటరైట్‌ అక్రమాల నిగ్గు తేల్చేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ రంగంలోకి దిగింది. విశాఖ ఏజెన్సీలో అక్రమంగా ఖనిజాన్ని తవ్వడంతో పాటు…రవాణాకోసం వేలాది పచ్చటి చెట్లను అడ్డంగా నరికి రోడ్డు వేసిన వైనంపై ‘నిజ నిర్ధార ణ’కు ఆదేశించింది.ఈవ్యవహారంపై విశాఖ జిల్లా నాతవరం మండలం గునుపూడికి చెందిన దళిత ఐకయ ప్రగతి సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ్రు మరిడియ్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు స్వీకరిం చడమే కాకుండా..‘మా జోక్యం అవసరం అని భావిస్తున్నాం’అని కూడా ట్రైబ్యునల్‌ చెన్నై ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన తర్వాతే ధర్మాసనం ఈఅభిప్రా యానికి వచ్చినట్టు స్పష్టమవుతోంది. దీంతో మైనింగ్‌ లీజుదారు జర్తాలక్ష్మణరావుతోపాటు పంచాయ తీరాజ్‌ సహా పలు శాఖల అధికారులు దాదాపు ఇబ్బందుల్లో పడినట్టేనని ప్రభుత్వ వర్గాలే అభిప్రా యపడుతున్నాయి. అడవిలోకి చొచ్చు కురా వడమే కాకుండా వేలాదిచెట్లు కొట్టి రోడ్డువేయడంపై స్థానిక గిరిజనులు కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్నారు. న్యాయపరంగా ఉన్న మార్గా లపై జాతీయ పర్యా వరణవాదులతో కొంతకా లంగా చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే కొండ్రు మరిడియ్య జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ వేశారు.ఎన్జీటీ న్యాయ సభ్యుడు జస్టిస్‌ కే.రామకృష్ణన్‌,సభ్య నిపుణుడుకే సత్యగోపాల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం జులై 26వ తేదీన పిటిషన్‌ను విచారించి,అదేరోజు జులై 30న ఆదేశాలుఇచ్చింది.
పిటిషన్‌లో ఏముందంటే..

అటవీ సంరక్షణచట్టం-1980లోని సెక్షన్‌ 2 కింద సరైన అటవీ అనుమతులు లేకుండా, అటవీ సంరక్షణ రూల్స్‌-2003ను పాటించకుండా లేటరైట్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. సర్వే చేయని కొండ పోరంబోకు భూమి(యూఎసహెచ్‌పీ)లో 212 హెక్టార్ల భూమిలో 20ఏళ్లపాటు మైనింగ్‌ చే సేందుకు అనుమతులు ఇచ్చారు. గిరిజనుల కోసం ఉద్దేశించిన రహదారిని ఎలాంటి అటవీ శాఖ అనుమతులు లేకుండా మైనింగ్‌కోసం పెద్దది గా విస్తరించుకున్నారు. ఈరహదారి నిర్మాణం కూడా అటవీ హక్కుల చట్టం-2006లోని నిబంధ నలకు విరుద్దంగా చేశారు. మైనింగ్‌కోసం సమర్పిం చిన గ్రామసభ తీర్మానపత్రం వట్టిబోగస్‌. ఆ విష యం తెలిసినా దాని ఆధారంగానే మైనింగ్‌కు అను మతి ఇచ్చారు. దీంటోపాటు అటవీ హక్కుల చట్టం-2006తోపాటు ఇతర కీలకచట్టాలను కూడా ఉల్లంఘించారు. దీనివల్ల పర్యావరణకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈనేపధ్యంలో విశాఖ,తూర్పు గోదా వరి మన్యంలో రిజర్వ్‌ ఫారెస్ట్‌ (ఆర్‌ఎఫ)తో కలిసి ఉన్నభూమిలో అటవీ సంరక్షణ చట్టం-1980, రూల్స్‌-2003ని ఉల్లంఘించి మైనింగ్‌ చేయడానికి వీల్లేదని ఆదేశించాలి. అటవీ సంరక్షణ చట్టం ఉల్లంఘించి చేపడుతున్న మైనింగ్‌ ని నిలు వరించి ఆ ప్రాంతాన్ని తిరిగి పునరుద్ధరించాలి. ఈ విష యంలో చట్టబద్ధమైన అంశాలు, నిబంధనలను అమలు చేయడంలో విఫలమైన అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించాలి. సరుగుడు లోని రిజర్వ్‌ ఫారెస్టను కాపాడలేకపోయిన, తప్పులు చేసిన అధికారులపై అపరాధరుసుం విధించాలి’’
ట్రైబ్యునల్‌ ఆదేశాలివీ..
ఫిర్యాదులో పిటిషనర్‌ లేవనెత్తిన అంశా లపై విచారణకు ట్రైబ్యునల్‌ ఆదేశించింది. కేంద్ర-రాష్ట్ర అధికారులతో కూడిన జాయింట్‌ కమిటీ విచారణ చేయాలని దిశానిర్దేశం చేసింది. ఈ కమిటీలో కేంద్ర అటవీ,పర్యావరణ మంత్రిత్వ శాఖ లోని సీనియర్‌అధికారి లేదా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏదైనా స్వతంత్ర ఏజెన్సీబీ విశాఖ కలె క్టర్‌,విశాఖ జిల్లా అటవీఅధికారి(డీఎఫఓ),గనులశాఖ సీనియర్‌ అధికారి,రాష్ట్రకాలుష్య నియంత్రణమండలి (పీసీబీ) నుంచి సీనియర్‌ అధికారి ఉంటారని,కమిటీకి అవస రమైన లాజిస్టిక్‌ సహకారం,సమన్వయం కోసం రాష్ట్ర గనుల శాఖ నోడల్‌ ఏజెన్సీగా ఉంటుందని పేర్కొంది. ఈ కమిటీ క్షేత్రస్థాయికి వెళ్లి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, చట్టాల ఉల్లంఘనలను పరిశీ లించి,వాటిపై వాస్తవిక,కార్యాచరణ నివేదికను అందించాలని కోరింది. అంటే,మైనింగ్‌ జరుగు తున్న ప్రాంతం,రహదారులు నిర్మించిన అటవీ, డంపింగ్‌ యార్డు,పర్యావరణంపై ప్రభావం చూపే ప్రతీ పాయుంట్‌ను కమిటీ పరిశీలన చేయనుంది. అలాగే…మైనింగ్‌కోసం కేటాయించిన భూమి వాస్తవిక పరిస్థితి ఏమిటో,అక్కడ మైనింగ్‌ చేపట్ట డానికి అటవీ సంరక్షణ చట్టం-1980 ప్రకారం ఏమైనా అనుమతులు తీసుకోవాలా? ఆ ప్రాంతంలో అటవీ సంరక్షణ చట్టం, అటవీ హక్కుల చట్టంలోని నియమనిబంధనల ఉల్లంఘనలు జరిగాయా? ఒక వేళ అలాంటివేమైనా కనిపెడితే వాటిపై అటవీ శాఖ తరపున ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్వతంత్ర నివేదికను అందించాలని ఆంధ్రప్రదేశ్‌ పీసీసీఎఫ్‌, అటవీ దళాల విభాగాధితి (హెచ్‌ఓ ఎఫఈ)ని ఎన్‌జీటీ ఆదేశించింది.
ఏడు అంశాల్లో విచారణ..
లేటరైట్‌ మైనింగ్‌ జరుగుతున్న ప్రాం తాన్ని తనిఖీ చేసి..వాస్తవిక పరిస్థితులను అధ్య యనం చేయడంతోపాటు ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై నివేదిక అందించాలని కమిటీకి ట్రైబ్యునల్‌ ఆదేశించింది. మొత్త ఏడు అంశాలను పరిశీలిం చాలని నిర్దేశించింది.అవి..ౌ మైనింగ్‌ జరుగు తున్న ప్రాంతం ఒరిజినల్‌ రెవెన్యూ రికార్డుల (స్వాతంత్య్రానికి ముందున్నవి) ప్రకారం ఎక్కడుందో నిర్ధారణ చేయాలి. ౌ మైనింగ్‌దారు నిబంధనల ప్రకారం, అటవీ సంరక్షణ చట్టం-1980 మేరకు అనుమతులు తీసుకొన్నారా? ౌ అక్కడ ఏ పద్ధతిలో మైనింగ్‌ జరుగుతోంది… దాని వల్ల పర్యావరణం,జీవావరణం (జంతు జాలం)పై ఎంత మేర ప్రభావం ఉంటుంది.. ఇప్పటికే ఏ మేరకు దెబ్బతీసింది? ౌ లీజుదారు ఏమైనా పరిమితికి మించిన మైనింగ్‌ చేశారా…ఒక వేళ అదే జరిగితే ఏ స్థాయిలో అది ఉంది? ౌ ఆ ప్రాంతంలో లీజుదారు ఏమైనా చట్టప రమైన అనుమతులు తీసుకోకుండా రహదారిని విస్తరించారా? ౌ లీజుదారు మైనింగ్‌కు అనుమతులు,క్లియ రెన్స్‌లు తీసుకున్నప్పుడు జారీ చేసిన నిబం ధనలను, కాలుష్యనియంత్రణ మండలి నియమనిబంధనలు పాటించారా? ౌ ఇంకా….ఏమైనా ఉల్లంఘనలకు పాల్పడ్డారా…వాటిపై సంబంధిత విభాగాలు తీసుకున్న చర్యలేమిటి? పర్యావరణ నష్టం జరిగి ఉంటే పర్యావరణ పరిహారాన్ని అంచనావేశారా? ఈ అంశాలపై సమగ్ర పరిశీలనచేసి ఆగస్టు31లోగాపీడీఎఫ్‌ రూపం లో నివేదిక సమర్పించాలని జాయింట్‌ కమిటీకి దిశానిర్దేశం చేసింది.
ఫిర్యాదుదారుకీ భాగస్వామ్యం
ట్రైబ్యునల్‌ మరోకీలకమైన ఆదేశం ఇచ్చింది. ఫిర్యాదుదారు కొండ్రు మరిడయ్యను కూడా విచారణ పరిధిలోకి తీసుకోవాలని ఎన్‌జీటీ ఆదేశించింది. విచారణ చేపట్టే సమయంలో హాజరు కావా ల్సిందిగా ఫిర్యాదుదారునికి నోటీసులు ఇవ్వాలని, మైనింగ్‌ ప్రాంతాన్ని సందర్శించే సమయంలో ఫిర్యా దుదారు కూడా ఉంటారని నిర్దేశించింది. ఈ సమ యంలో పర్యావరణ,అటవీ చట్టాల ఉల్లంఘనలు, అక్రమాలపై కమిటీకి ఆయన తన నివేదిక అందిం చొచ్చునని పేర్కొంది. కమిటీ తన నివేదికను సమ ర్పించడానికి అది(ఫిర్యాదుదారుడు ఇచ్చిన రిపోర్టు) ఉపయోగపడుతుందని ఉత్తర్వులో పేర్కొంది. జాయింట్‌ కమిటీ విచారణ వేగంగా సాగడానికి ఫిర్యాదుదారు వారం రోజుల్లోగా తన వద్ద పత్రా లు,రిపోర్టులను కమిటీ సభ్యులకు అందించాలని కోరింది.
ఇదీ నేపథ్యం..
విశాఖజిల్లా నాతవరం మండలం భమిడికలొద్ది వద్ద 121హెక్టార్లలో లేటరైట్‌ మైనిం గ్‌కు గతంలో లీజులుపొందిన వ్యక్తిని అధికార పార్టీ ముఖ్యనేతలు తమ దారికి తెచ్చుకున్నారు. గత నెల నుంచి లీజుగనిలో లేటరైట్‌ తవ్వి, తరలిం చడం మొదలుపెట్టారు. ఈ ఖనిజాన్ని తరలించ డానికి క్వారీ నుంచి తూర్పుగోదావరి జిల్లా రౌతుల పూడి మండలం జల్దాం వరకు 12 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించారు. అప్పటికే ఉన్న కాలి బాటను 20-30 అడుగుల మేర వెడల్పు చేశారు. దీనికోసం ఐదు కిలోమీటర్ల మేరవిస్తరించిన ఫారెస్టు ను గుల్ల చేశారు.రెవెన్యూ,అటవీశాఖల అనుమతు లు లేకుండా ఆరేడు వేలవృక్షాలను నరికివేశారు.
చెట్టుకు రూ. ఐదు వేలు..
విశాఖ జిల్లా నాతవరం మండలం తొరడలో లేటరైట్‌ మైనింగ్‌ కోసం కిల్లో లోవరాజు అనే వ్యక్తి సుమారు పదేళ్ల క్రితం దరఖాస్తు చేసు కొన్నారు. అన్ని ప్రక్రియల అనంతరం అధికారులు ఆయనకు లీజు మంజూరుచేశారు. సుమారు 19 హెక్టార్లలో 2016-17లో తవ్వకాలు ప్రారంభించి తొమ్మిది నెలల్లో మూడు లక్షల టన్నుల లేటరైట్‌ను ఆ క్వారీలో వెలికితీశారు. సుందరకోటకు చెందిన ఓగిరిజనుడు మైనింగ్‌లో నిబంధనలు ఉల్లంఘిం చారంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు.ఖనిజం రవాణాకు 1.5కిలోమీటర్ల రహదారి నిర్మాణం కోసం దాదాపు మూడు వేల చెట్లు కొట్టివేశారని ఫిర్యాదు చేశారు. కొట్టేసిన చెట్ల ఫొటోలను హైకోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీ లించిన హైకోర్టు..తక్షణమే మైనింగ్‌ నిలిపివేయాలని 2018లో ఆదేశించింది. అంతేకాక క్వారీ చుట్టూ ప్రహరీగోడ నిర్మించి, వన్యప్రాణులకు ముప్పు లేకుండా పగటిపూట మాత్రమే క్వారీ తవ్వకాలు చేపట్టాలని సూచించింది. రోడ్డు నిర్మాణం కోసం నరికివేసిన చెట్లకు ఒక్కో చెట్టుకు రూ.ఐదు వేలు వంతున మొత్తం రూ.1.5కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఇంతలో కాలుష్య నియంత్రణ మండలి,గనులశాఖ,అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. క్వారీలో తనిఖీలు చేసి, నిబం ధనలు ఉల్లంఘించారంటూ మైనింగ్‌ని నిలిపి వేశారు. తాజా ట్రైబ్యునల్‌ ఆదేశాలతో స్థానిక గిరిజనులు అప్పటి ఉదంతాన్ని గుర్తు చేసుకొం టున్నారు. ఇప్పుడూ తమకు అలాంటి న్యాయం అందించాలని కోరుకుంటున్నారు.
సీనియర్‌ జర్నలిస్టు జక్కల నాగ సత్య నారాయణ(జనాస)అందించిన వివరాలు ప్రకారం
రిజర్వ్‌ ఫారెస్ట్‌ పొడవునా రహదారుల ఏర్పాటు
పేరుకే గిరిజనుల సంక్షేమం కోసం రహ దారి..కానీ, అక్కడ జరిగింది…కాకినాడ పోర్ట్‌ కు అడ్డరోడ్డులో లేటరైట్‌ను యథేచ్ఛగా తరలించుకు పోయేందుకు రోడ్డు నిర్మాణం.జాతీయ రహదారి మీదుగా తరలిస్తే ఇబ్బందులొస్తాయని తలంచి అడవి మార్గం అయితే ఖనిజరవాణాకు గోప్యంగా ఉంటుందని భావించినట్టుంది. రిజర్వ్‌ ఫారెస్టులో రోడ్లనిర్మాణానికి అటవీశాఖ చట్టాలు అంగీకరిం చవు ..అందులోనూ ప్రజలకు సంబంధం లేకుండా ఖనిజాన్ని తరలించ డానికి రోడ్ల నిర్మాణం అంటే అస్సలు పనికాదు. దీంతో క్వారీయజమానులు కొత్త ఎత్తుగడతో ఏజెన్సీ గ్రామాలను కలుపుతూ ప్రజా ప్రయోజనంపేరిట అనుమతులు పొందారు. అను కున్నదే తడవుగా ఖనిజాన్ని తరలించేందుకు కాకి నాడ పోర్టుకు దగ్గరదారైన రౌతులపూడి మం డలం రాఘవపట్నం,జల్దాం,దబ్బాది,సిరిపురం మీదుగా బమిడికలొద్దుక్వారీ వరకూ దశల వారీగా 2అడుగుల కాలిబాటను 8అడుగులరోడ్డు కోసం అనుమతులు తెచ్చుకొని ఏకంగా 32 అడు గుల వెడల్పుతో19రోజుల్లో..17కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించేశారు. ఇప్పుడా రోడ్డుపై14 టైర్ల టిప్పర్లు వేగంగా దూసుకు పోతున్నాయి.నాతవరం మండలం సరుగుడుపంచాయితీ పరిధిలోని భమిడికలొద్దు రిజర్వ్‌ఫారెస్టులోని 121హెక్టార్లలోని సుమారు 5000కోట్ల లాటరైట్‌ ఎర్ర మట్టిని తవ్వుకు నేందుకు ఆంధ్రప్రేదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులను తీసుకున్న క్వారీ నిర్వాహకులు తొలుత రోడ్డునిర్మాణంపై దృష్టి సారించారు. రిజర్వ్‌ ఫారెస్టులోరోడ్ల నిర్మాణానికి అటవీశాఖ చట్టాలు అంగీకరించవు. అందులోనూ ప్రజలకు ఏవిధం గానూ సంబంధం లేకుండా కేవలం లాటరైట్‌ ఖనిజ సంపదను తరలించడానికి రోడ్ల నిర్మాణం అంటే అస్సలుపనికాదు. అందుకు రిజర్వ్‌ ఫారెస్టు లోని వివిధగ్రామాలను కలుపుతూ ప్రజాప్రయో జనం అనే ముసుగులో అనుమతులను పొందారు. విశాఖ జిల్లాలోని సరుగుడు,తూర్పు గోదావరి జిల్లాలోని కోటనందూరు,తుని మండలాల మీదుగా లాటరైటు ఖనిజాన్ని జాతీయ రహదారికి తరలించి అక్కడ నుంచి నేరుగా వివిధ దారుల్లో కాకినాడ పోర్టుకు చేర్చాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా లోని కాకినాడ పోర్టుకు దగ్గర దారైన ప్రత్తిపాడు నియోజక వర్గం రౌతుల పూడి మండలం రాఘవ పట్నం, జల్దాం, దబ్బాది, సార్లంక, సిరిపురం మీదుగా బమిడికలొద్దు క్వారీ వరకూ దశల వారీగా సుమారు 17కిలో మీటర్ల మేరకు వివిధ భాగాలుగ పక్కాగా ఒకే మట్టిరోడ్డుగా నిర్మించాలని తలంచి రంగం సిద్దంచేసారు. దాన్ని గుట్టుగా పక్కాగా అమలు చేసారు. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం అటవీశాఖ రేంజ్‌ పరిధి లోని రౌతులపూడి మండలం సార్లంక నుంచి విశాఖ మన్యంలోని సిరిపురం వరకు రహదారి నిర్మించాలని జూన్‌10న పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీర్‌తో అటవీశాఖకు ఓదర ఖాస్తు పెట్టారు. 15న అటవీశాఖ రేంజర్‌ వెళ్లి ప్రతిపాదిత ప్రాంతా న్ని పరిశీలించి,అది 2అడు గుల కాలి బాట అని, దాన్ని 8అడుగుల రహదారిగా మార్చాల్సిన అవ సరం లేదని రిపోర్టు ఇచ్చారు. ఆ మరుసటి రోజే జిల్లా స్థాయి కమిటీ సమావేశమై సిరిపురం, సార్లంక, దబ్బాది గ్రామాల ప్రజల రాకపోకలు, వైద్య పరమైన అవసరాల కోసం ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని జిల్లాస్థాయి కమిటీ (డీఎల్‌సీ) లో జూన్‌ 16న తీర్మానించారు. ఐతేఈరోడ్డే అడిగితే లేటరైట్‌ రహదారి విషయం బయ టకు వస్తుందని తెలివిగా ఆలోచించి, ఒకేసారి 109రోడ్లను అందులో రంప చోడవరం ఐటిడిఏ మన్యం పరిధిలో 66, కాకి నాడ పంచాయితీరాజ్‌ విభాగం పరిధిలో 43కు తీర్మానించి అదేరోజు ఈ రహదార్ల నిర్మాణానికి అనుమతిస్తూ అటవీశాఖ అధికారి ఆదేశాలు ఇచ్చారు. అడవిలో రహదారులు నిర్మిం చాలంటే అటవీశాఖ,గ్రామపంచాయతీల తీర్మానం, ఐటీడీఏ అనుమతి తప్ప నిసరి.వాటికి ప్రభుత్వ నిధులూ ఉండాలి. అన్నిరకాల అనుమతులు వచ్చాక రహ దారి నిర్మాణం ప్రారంభంకావడానికి కనీసం ఐదా రు నెలల సమయం పడుతుంది. కానీ ఇక్కడ మన్యంలో మాత్రం కేవలం 19 రోజులే పట్టింది. అంటే ఇక్కడ ప్రభుత్వ నిధులతో పని లేకుండా మైనింగ్‌ సొమ్ములతో పనిపూర్తి అయ్యింది. కానీ వాస్తవానికి ఇప్పుడు ఇక్కడ 32అడుగుల మేర మట్టిరోడ్డు కనిపిస్తోంది. ఇప్పుడా రోడ్డులో14 టైర్ల టిప్పర్లు దూసుకుపోతున్నాయి.
పర్యావరణానికి భారీ నష్టం
దట్టమైనఅటవీ ప్రాంతంలో వేలాది గా ఎదిగిన పచ్చని వృక్షాలు,చెట్లు విచాక్షణ రహితంగా నరికేశారు.తమస్వార్ధం కోసం రిజర్వ్‌ ఫారెస్టును నాశనం చేసేశారు. అడవిని నరికే సమయంలో అడ్డోచ్చిన అటవీ జంతువు లను యంత్రాలతో నిర్ధాక్షణ్యంగా చంపేశారు. వేలాది చెట్లు నేలమట్టంచేసి పర్యావరణానికి తీవ్ర విఘా తం కల్పించారు. ఇంటి ముందు సొంతంగా పెంచుకున్నచెట్టు నరకాలంటేనే…రూల్స్‌ ఒప్పు కోవు! రిజర్వు ఫారెస్టలో చెట్టుపై గొడ్డలి వేటు వేస్తే…అదో పెద్ద నేరం! అక్కడ…కేంద్ర అను మతి లేకుండా ప్రభుత్వాలే చిన్నపని కూడా చేయలేవు. కానీ ప్రైవేటు వ్యక్తుల సారథ్యంలో కొండకోనల్లో వందలు,వేల సంఖ్యలో చెట్లను నరికేసి,రోడ్డు వేయడాన్ని ఏమనాలి? వాటి ఆన వాళ్లు లేకుండా చేశారు. దశాబ్దాల వయసున్న టేకు,నల్లమద్ది, తెల్లమద్ది వంటి వృక్షాలను కొట్టేసు కొంటూ పోయి..నెలన్నరలోనే రోడ్డు వేసేశారు. ఈ మార్గంలోని చెల్లూరు- భమిడికలొద్ది మధ్య నున్న అయిదు కిలోమీటర్ల పరిధి రోడ్డు పూర్తిగా రిజర్వ్‌ అడవే. రిజర్వు అడవి పరిధిలో అటవీ శాఖ అనుమతులు లేకుండా ఎలాంటి పనులు చేయకూడదు. కానీ ఇవేవీ పట్టించుకోలేదు. రహ దారికోసం అడ్డంగా ఉన్న టేకు,దండారి,నల్ల మద్ది,తెల్లమద్ది,తుమ్మిడి, తెల్లగర్ర వంటి విలువైన భారీ వృక్షాలను నేలకూల్చేశారు. చిన్నా పెద్దా కలిసి ఆరేడువేల చెట్లను నరికినట్లు స్థానికులు చెబుతున్నారు. వన్యప్రాణాలకు ముప్పు వాటిల్లు తుందనే స్పృహ కూడా లేకుండా అడ్డగోలుగా నేలకూల్చేశారు.పైగా కేవలం 425 మీటర్ల రిజర్వు ఫారెస్టు పరిధిలో 21చెట్లు మాత్రమే తొలగించామని చెప్పడం అతిపెద్ద వింత. నిజా నికి…రిజర్వు ఫారెస్టులో ఇలాంటి నిర్మాణాలు చేపట్టాలంటే సంబంధిత అధికారుల అనుమతి తప్పని సరి. కానీ ఇక్కడ ఇవేం లేకుండా టిప్పర్లు తిరిగేస్థాయిలో30 అడుగులకు మించి రహదారి నిర్మించేశారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంతో భారీ యంత్రాలు మోహరించి ఎక్కడికక్కడ చెట్లతో పాటు కొండలను కూడా గుల్లచేసేశారు.– కొండ్రు మ‌రిడియ్య‌, అధ్య‌క్షుడు ద‌ళిత ప్ర‌గ‌తి ఐక్య‌సంఘం
జిఎన్‌వి సతీష్‌

పని హక్కును ప్రాధమిక హక్కుగా గుర్తించాలి

నిరుద్యోగ సైన్యం ఎంత ఎక్కువగా వుంటే పెట్టుబడిదారీ విధానంలో అంత దోపిడీ చేయవచ్చు. వంద మంది కార్మికులు జీతాలు పెం చాలని అడిగితే రెండు వందల మంది ఇంకా చౌకగా పని చేస్తామనే విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో అమలు జరుగు తుంది.దేశంలోని ప్రజలందరికీ చదువు చెప్పాలంటే కోట్లాది మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రజలం దరికీ వైద్యం సమకూర్చాలంటే అనేక కోట్ల మందికి ఉద్యోగాలొస్తాయి. కానీ పెట్టుబడిదారీ విధా నంలో ప్రజలందరికీ కనీస సౌకర్యాలు కల్పించడానికి పాలకవర్గం ప్రయత్నించదు.
ఉపాధి కల్పించడమంటే యువతీ, యువకులను దేశ సంపద సృష్టికర్తల్లో భాగస్వాములుగా చేయ డం.వారి శారీరక,మానసిక శక్తిని ఉపయోగించు కోవడం.‘నేను పని చేస్తాను. నాకు పని కల్పించండి’ అని అడిగితే పని కల్పించలేని స్థితిలో ప్రభుత్వాలు వుండడం దేశాభివృద్ధికి,సౌభాగ్యానికి హానికరం. ఒకప్పుడు అత్యంత వెనుకబడిన దేశంగా వున్న చైనా నేడు అమెరికాతో ఢ కొట్టగలుగుతుందంటే ఆదేశ మానవ శక్తిని ఉపయోగించుకోవడమే కార ణం.‘నేటి భారతదేశం’అనే పుస్తకంలో రజనీ పామే దత్‌ చెప్పినట్లుగా ఒకమనిషికి నోరు మాత్రమే వుండదు. రెండు కాళ్లు, రెండు చేతులు వుంటాయి. ఒక మనిషి సంపదను సృష్టించి పది మందికి పెట్టగలిగిన ఆధునిక పరిజ్ఞానం నేడు పెరిగింది. పెట్టుబడిదారీ వ్యవస్థలో పెరిగిన ఆధునిక పరిజ్ఞా నాన్ని తమ లాభాల పెంపుదలకు పెట్టుబడిదా రులు ఉపయోగించుకుంటున్నారు. మానవ వనరు లు పుష్కలంగా వున్న భారతదేశంలో రోబోట్‌లను ఉపయోగించడమంటే ఇదే. పెట్టుబడిదారులు తమ లాభాల కోసమే యువతీ, యువకులను నిరుద్యోగు లుగా చేసి రోబోట్‌ వంటి యంత్రాలను ప్రోత్సహి స్తున్నారు. ఇదిపెట్టుబడిదారీ విధాన సహజ లక్ష ణం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలి. ఆసౌకర్యం ప్రజలకు కల్పిం చి,పని గంటలు తగ్గించాలి. విశ్రాంతి పెంచాలి. కానీ కాలుష్య కోరల్లోని రసాయన పరిశ్రమల్లో మనుషులతో విషాన్ని మింగించే ఎరువులు, రసా యన కంపెనీల్లో కూడా రోజుకు 8నుంచి12 గంట లు పని చేయిస్తున్నారు. సోషలిస్టు దేశాల్లో ఇటు వంటి పరిశ్రమల్లో వారానికి ఐదురోజులు, రోజుకు ఆరుగంటలు మాత్రమే పని కల్పించే పద్ధతి వుంది. మనుషుల ప్రాణాలకు సోషలిస్టు దేశాల్లో విలువ వుంటుంది.
కరోనా సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రజలందరికీ టీకాలు ఇవ్వడంలో తాత్సారం చేసింది. కరోనాతో 2021జూన్‌ 26నాటికి3.94లక్షల మంది ప్రాణా లు కోల్పోయారు. కరోనా మొదటి దశలో మిలట్రీ కర్ఫ్యూలా దేశమంతా లాక్‌డౌన్‌ విధించడంతో లక్షలాది మంది వలస కార్మికులు వేల కిలోమీటర్లు మూటా ముల్లే నెత్తిన పెట్టుకొని సొంత గ్రామాలకు కాలిబాట పట్టారు. దారిలో వేలాది మంది మర ణించారు. అంతేకాకుండా ప్రభుత్వ లెక్కల ప్రకా రం కరోనా కాలంలో 7.7 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఏప్రిల్‌, మే నెలలో 2.2 కోట్లమంది ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగం 12 శాతం పెరిగింది. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రా ల్లో నిరుద్యోగ సమస్యను 20ఏళ్లలో పరిష్కరిం చాలని ఆదేశించారు. 20 ఏళ్ల తరువాత నిరుద్యోగ సమస్య రెట్టింపు అయింది. 75 ఏళ్ల స్వాతంత్య్రా నంతరం నిరుద్యోగం అనేక రెట్లు పెరిగింది తప్ప తగ్గలేదు. కారల్‌మార్క్స్‌ చెప్పినట్లు పెట్టుబడిదారీ విధానం ఉన్నంతకాలం నిరుద్యోగ సమస్య కొనసా గుతుంది. నిరుద్యోగ సైన్యం ఎంత ఎక్కువగా వుంటే పెట్టుబడిదారీ విధానంలో అంత దోపిడీ చేయ వచ్చు. వంద మంది కార్మికులు జీతాలు పెంచాలని అడిగితే రెండు వందల మంది ఇంకా చౌకగా పని చేస్తామనే విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో అమలు జరుగుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా ఉపాధి అవకాశాలు మెండుగా వుంటాయి. కానీ పాలకవర్గం ఈ అవకాశాలు కల్పించదు. దేశంలోని ప్రజలందరికీ చదువు చెప్పాలంటే కోట్లా ది మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రజలందరికీ వైద్యం సమకూర్చాలంటే అనేక కోట్ల మందికి ఉద్యోగాలొస్తాయి. కానీ పెట్టుబడిదారీ విధానంలో ప్రజలందరికీ కనీస సౌకర్యాలు కల్పించడానికి పాలకవర్గం ప్రయత్నించదు. ప్రజల సంక్షేమం కంటే తమ లాభాలకు ప్రాధాన్యత ఇస్తారు.‘లియాంటివ్‌’ అర్థశాస్త్రంలో చెప్పినట్లు దేశంలో బొగ్గు ఉత్పత్తి అధికంగా వుంటుంది. బొగ్గుల ఉత్పత్తి ఎక్కువగా జరిగింది కాబట్టి బొగ్గు గనుల కార్మికులను పనిలో నుంచి తొలగిస్తారు. దాంతో కార్మిక కుటుంబం కనీసం చలి కూడా కాచుకోలేక చనిపోతుంది. ఇది పెట్టుబడిదారీ వ్య వస్థ నిజ స్వరూపం. అందుకే ఆర్థిక సంక్షోభాలు ప్రతీ పదేళ్లకు కొనసాగుతూనే వుంటాయి. సోష లిస్టు వ్యవస్థ దీనికి పూర్తి భిన్నం. సోషలిస్టు దేశాల్లో ‘పని హక్కు’ ప్రాథమిక హక్కుగా వుంటుంది. ప్రతి ఒక్కరికీ ఉచితవిద్య ప్రభుత్వమే అందిస్తుంది. 18 ఏళ్లు నిండిన తరువాత అందరికీ ఉపాధి కల్పి స్తుంది. పని హక్కు కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. ఓటుహక్కు, భావ ప్రకటనా హక్కు వలె పని కూడా ఒకప్రాథమిక హక్కు. ప్రపంచంలో 143కోట్ల జనాభా కల్గిన చైనాలో గానీ, చిన్న దేశాలైన క్యూబా,వియత్నాం లోగానీ నిరుద్యోగ సమస్య వుండదు. అందరికీ ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పిస్తుంది. క్యూబా 95 శాతం ప్రభుత్వరంగం లోనూ,5శాతం కోఆపరేటివ్‌ రంగంలోనూ ఉపాధి కల్పించింది. ఉచిత విద్య, వైద్యం, ఇంటి సౌకర్యం నామమాత్రపు రేట్లతో ప్రభుత్వమే కల్పించడం వల్ల ప్రజలపై భారాలు ఉండవు. ఒకప్పుడు రష్యా తో సహా తూర్పు జర్మనీ వరకు యూరప్‌ ఖండంలో నిరుద్యోగ సమస్య వుండేది కాదు. 1991తరు వాత పెట్టుబడిదారీ విధానం తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత స్పెయిన్‌,గ్రీస్‌ దేశాల్లో 25 నుంచి 30 శాతం వరకు నిరుద్యోగం పెరిగింది. అమెరికా లాంటి అత్యాధునిక దేశాల్లో సైతం నిరుద్యోగం 9శాతం వరకు పెరిగింది. ఇప్పటివరకు ప్రభుత్వ రంగం బలోపేతంగా వుండడం వల్ల ఆర్థిక సంక్షోభ ప్రభావం భారతదేశంలో తగినంతగా లేదు. అయి నా నిరుద్యోగం నేడు విలయతాండవం చేస్తున్నది. డిగ్రీ, పీజీ లు చేసిన వారు బంట్రోతు ఉద్యోగాల కోసం ఎగబడుతున్నారు. అతితక్కువ వేతనం లభించే చిరు ఉద్యోగాలకు లక్షల్లో దరఖాస్తులు చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జూన్‌ 18న జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించింది. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు కల్పించిందీ,వచ్చే ఏడాదిఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పడం మంచిదే. కానీ లేని ఉద్యోగాలు ఇచ్చినట్లు కాకిలెక్కలు చెప్పడం సరైనది కాదు. దశాబ్దాల క్రితం నుంచి ఆర్‌టిసి పర్మినెంట్‌ కార్మికులకు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చి నట్లు లెక్కల్లో చూపించడం తప్పు. భర్తీ చేసినట్లు చెప్పిన6,03,756ఉద్యోగాల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యో గులు3,99,791మంది వున్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ ఉద్యోగుల భర్తీలో చూప డం అన్యాయం. మున్సిపల్‌, విద్యుత్‌ రంగాల్లోని కాంట్రాక్టు,ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను…ఎ.పి కాం ట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ 93 వేల మందికి పైగా కార్మికులను పర్మినెంట్‌ కార్మికులుగా చూపిం చడం ఆశ్చర్యకరం. రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినట్లుగా ఉద్యోగాల విప్లవం వస్తుందన్న మాటలు బూటకమని రుజువైంది. గత ప్రభుత్వం ఖాళీలు నింపని ప్రభుత్వ ఉద్యోగాలను ఈ క్యాలెండర్‌లో ప్రకటించలేదు. ఆఖాళీలు హుష్‌ కాకి అయ్యాయి. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగం, రైల్వేలోని లక్షలాది ఖాళీఉద్యోగాలను రద్దు చేస్తున్నది. ఒకవేళ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలుపై ఉద్యోగాలన్నీ పర్మినెంట్‌ ఉద్యోగాలు కల్పించినా, భారతదేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. నిరుద్యోగ సమస్యను పెట్టుబడిదారీ విధానం పరిష్క రించదు. కార్మికవర్గం నిరుద్యోగానికి వ్యతిరేకంగా పోరాడాలి. తొలగించబడిన, ఉపాధి కోల్పోయిన కార్మికుల గురించే ట్రేడ్‌ యూనియన్లు పోరాడుతు న్నాయి. ఇది సరికాదు. రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కుగా గుర్తించి నిరుద్యోగ యువతీ, యువకు లందరికీ పని హక్కు కల్పించేలా పోరాడాలి. అప్పుడే నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం. యువతీ,యువకులు నేడు జరుపుతున్న పోరాటానికి కార్మికవర్గం చేతులు కలపాలి. కార్మికవర్గం అండ వున్నప్పుడే యువతీ, యువకుల పోరాటం మరింత ముందుకు సాగుతుంది. ఇది కార్మికవర్గం బాధ్యత.
ఉపాధిపై కరోనా మహమ్మారి వేటు
కరోనాతో దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరగడమేగాక అనేకమంది జీవనోపాధి కోల్పోయి నట్లు సర్వేలు చెబుతున్నాయి. మహమ్మారి రెండో దశ విజృంభణతో ఆర్థికకార్యకలాపాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఫలితంగా ఉత్పాదకత, సేవా రంగాలు తీవ్రంగా ప్రభావితమై..ఉద్యోగార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.కరోనా సంక్షోభంలో అనేక సంస్థలు ఆర్థిక ఒడుదొడుకులను ఎదుర్కొంటూ, తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిం చడం, వేతనాల్లో కోత విధించడంవంటి చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే దేశాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు-ఈ పరిస్థితి ఆజ్యం పోస్తోంది. ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చడానికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కొన్ని నిత్యావసర సరకులను అంద జేస్తున్నప్పటికీ,అవి అందరికీ సరిపోవడంలేదు. పిల్లల చదువులు, వైద్య ఖర్చులు వంటి అవసరా లకు సరిపడా ఆర్థిక వనరులు లేక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కొన్ని నెలలుగా మెల్లగా కోలుకుం టున్న ఉపాధిరంగంపై-కొవిడ్‌ రెండో దశ వ్యాప్తి తో తీవ్ర ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న కఠినతరమైన కొవిడ్‌ నిబంధనలు, పాక్షిక లాక్‌డౌన్‌లతో నిరుద్యోగం కనీసం పదిశాతం మేర పెరిగినట్లు అనేక అధ్యయ నాలు వెల్లడిస్తున్నాయి.నైపుణ్య శిక్షణ అవసరం అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది ప్రజల ఆర్థిక పరిస్థితిలో గతఏడాది కాలంగా పురోగతి లేకపోగా, తిరోగమనం కనిపిస్తోంది. కేంద్ర కార్మిక శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది మార్చి తొమ్మిదో తేదీ వరకు ఉద్యోగ అవకాశాలను ప్రోత్సహిం చడానికి ప్రారంభించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ ద్వారా సుమారు 16.5లక్షల మంది కార్మికులు లబ్ధి పొం దారు. పీఎంజీకేవై కింద38.82లక్షల మంది ఉద్యోగుల ఈపీఎఫ్‌ ఖాతాల్లో రూ.2,567.66 కోట్లు జమ చేసినట్లు ప్రకటించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం సైతం కరోనా కష్టకాలంలో గ్రామీణ ప్రాంతప్రజలకు ఉపాధి కల్పించడంలో కీలకపాత్ర పోషించింది. ఈ పథ కం ద్వారా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పెద్ద యెత్తున చేపడితే నిరుద్యోగ సమస్యను కొంతవరకు ఎదుర్కోవచ్చు.‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండి యన్‌ ఎకానమీ’ అంచనాల ప్రకారం భారత్‌లో 4.40 కోట్లమంది నిరుద్యోగులు ఉన్నారు. వీరిలో 2.80కోట్ల మంది ఉపాధి కోసం నిత్యం ప్రయత్నా లు చేస్తున్నారు. మిగతావారు ఉపాధిని కోరుకుం టున్నా దానికోసం తీవ్రంగా ప్రయత్నించడంలేదు. ప్రస్తుతం ఉన్న నిరుద్యోగుల్లో 3.80కోట్లమంది యువకులే. పట్టణాలనుంచి గ్రామాలకు వెళ్లే శ్రామికుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటంతో నిరుద్యోగ సమస్య మరింత జటిల మయ్యే ప్రమాదమూ ఉంది.ఈ సంక్షోభ సమ యంలో నిరుద్యోగులను ఆదుకోవడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది. నిరుద్యోగ సమస్య పెరిగేకొద్దీ దేశంలో నేరాలూ పెచ్చరిల్లడం సహజం. ఉపాధి కల్పనపై దృష్టి సారించడం ద్వారా శాంతిభద్రతల సమస్య లనూ గణనీయంగా తగ్గించవచ్చు. ప్రభుత్వ శాఖల్లో అన్ని రకాల ఉద్యోగాల ఖాళీలనూ వేగంగా భర్తీ చేయా ల్సిన అవసరం ఉంది. ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు అవసరమైన ప్రోత్సాహకాలను ఇవ్వాలి. స్వయం ఉపాధి కోసం ప్రయత్నించే నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించాలి. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, శిక్షణను కల్పించాలి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించ డానికి స్వయం ఉపాధికోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై విస్తృతమైన అవగాహన కల్పించా ల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. స్థానిక సంస్థలకు కీలక బాధ్యతలు అప్పగించి, స్వయం ఉపాధిని పెంపొందించే పనులకు పెద్ద పీట వేయాలి. నూతన ఆవిష్కరణలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. పట్టణ, గ్రామీణ మానవ వనరులను పూర్తిస్థాయిలో విని యోగించుకోవాలి.ఉపాధి కల్పన పెరిగితే దేశ ఆర్థికాభివృద్ధి రేటు సైతం ఆశించినదానికన్నా మెరు గ్గా ఉంటుంది. వలస కార్మికులకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాల్ని స్థానిక ప్రభుత్వాలు విధిగా నమోదు చేసి, ప్రభుత్వ రికార్డుల్లో పొందుపరచాలి. దీనివల్ల శ్రామికులకు అవసరమైన సహాయాన్ని నేరుగా అందించడానికి అవకాశం ఉంటుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరకులు అందరికీ అందేలా చూడాలి.సరఫరా పెంచాలిగత సంవత్సరం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి- జన్‌ధన్‌ ఖాతా కలిగిన మహిళలకు ఆర్థిక సహా యాన్ని ప్రకటించినట్లుగానే.. ఇప్పుడూ ఆర్థిక సహా యాన్ని సమకూర్చాలి. ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి పెద్దయెత్తున ఆర్థిక వనరులను కూడగట్టాల్సి ఉంటుంది. కరోనా కష్టకాలంలో ప్రజాసంక్షేమం కోసం ఖర్చు చేయడమే పరమావధి కావాలి. ప్రభుత్వ ఖర్చు పెరగడంవల్ల లోటు పెరిగి పోయినప్పటికీ, నేటి పరిస్థితుల దృష్ట్యా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అందుకే ప్రభుత్వం ఉపాధి కల్పన కార్యక్రమాలకు పెద్దయెత్తున శ్రీకారం చుట్టాలి.కొవిడ్‌ వ్యాక్సిన్‌కు తీవ్రంగా కొరత ఉన్నందువల్ల- టీకాల సరఫరాను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ టీకా వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ రంగం, కొన్ని ప్రైవేటు కంపెనీలు దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు, ప్రజల్లో ధైర్యాన్ని పాదుగొల్పేందుకు పరస్పర సహకారంతో ముందుకు వెళుతున్నాయి. ప్రణాళికాబద్ధంగా ఉపాధి కల్పన, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు అమలు జరిగినప్పుడే ప్రజలు భవిష్యత్తుపై భరోసాతో ఉంటారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికీ ఆస్కారం ఉంది.
సమస్య ఎంత తీవ్రంగా ఉందో వెల్లడిరచిన (జవీIజు)
భారత్‌లో నిరుద్యోగ సమస్య ప్రస్తావన వచ్చిన ప్రతీసారి ప్రధాని మోదీ తమ ప్రభుత్వం చాలానే చేసిందని చెబుతున్నారు. ఉపాధి, ఉద్యోగ రంగాల్లో భారత్‌ పురోగమిస్తోందని..గత నాలుగేళ్ల లో 6లక్షల మంది ప్రొఫెషనల్స్‌ ఉపాధి పొందారని ఇటీవల వెల్లడిరచారు. అయితే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని సర్వేలు,పలు నివేది కలు చెబుతున్నాయి. భారత్‌లో నిరుద్యోగ సమస్య ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ప్రభుత్వ శాఖల్లో ఏచిన్న అటెండర్‌ పోస్టుకు నోటిఫి కేషన్‌ విడుదలైనా..పీజీలు,పీహెచ్‌డీలు చేసిన వారు కూడా దరఖాస్తులు చేసుకుంటున్న పరిస్థితి. దేశం లో నిరుద్యోగానికి సంబంధించి సెంటర్‌ ఫర్‌ మాని టరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(జవీIజు) సంస్థ తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడిరచింది.2016 సెప్టెం బర్‌ నుంచి ఇప్పటివరకు నమోదైన నిరుద్యోగ రేటును పరిశీలిస్తే..ఫిబ్రవరిలో అత్యధికంగా 7.2 శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. గతేడాది 2018, ఫిబ్రవరి నెలలోనిరుద్యోగ రేటు 5.9 శా తం ఉండగా ఇప్పుడది మరింత పెరిగింది. దేశ వ్యాప్తంగా కొన్నివేల ఇళ్లనుంచి సేకరించిన సమా చారం ప్రకారం.. ఈసర్వే నివేదికను తయారు చేసినట్టు (జవీIజు) తెలిపింది.ముంబైలోని థింక్‌ ట్యాంక్‌ సంస్థ ఛైర్మన్‌ మహేష్‌వ్యాస్‌ తెలిపిన వివ రాల ప్రకారం..గతేడాది ఫిబ్రవరి నాటికి ఇండి యాలో 406 మిలియన్ల ఉద్యోగస్తులు ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అది 400 మిలియన్లకే పరిమితమైంది. భారత్‌లో నిరుద్యోగ సమస్య ప్రస్తావన వచ్చిన ప్రతీసారి ప్రధాని మోదీ తమ ప్రభుత్వం చాలానే చేసిందని చెబుతున్నారు. ఉపాధి,ఉద్యోగ రంగాల్లో భారత్‌ పురోగమి స్తోం దని.. గతనాలుగేళ్లలో 6లక్షల మంది ప్రొఫెషన ల్స్‌ ఉపాధి పొందారని ఇటీవల వెల్లడిరచారు. అయితే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని సర్వేలు,పలు నివేదికలు చెబుతున్నాయి. నిరుద్యోగానికి సంబంధించి కొన్ని వారాల క్రితం ఓవార్తా పత్రిక కొన్ని లెక్కలను బయటపెట్టింది. అయితే అధికారులు మాత్రం దాన్ని కొట్టిపారేశారు. సదరు పత్రిక బయటపెట్టిన వివరాల ప్రకారం.. దేశంలో గత45ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 2017-18లో నిరుద్యోగ సమస్య తీవ్రమైంది. జవనవరిలో (జవీIజు) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం..పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తర్వాత 2018లో దాదాపు 11మిలియన్ల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు.
ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. నోట్ల రద్దు ప్రభావం ఉద్యోగా లు, చిన్న తరహా పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం చూపించిందన్న దానికి సంబంధించి తమవద్ద ఎలాంటి డేటా లేదని గతనెలలో ప్రభుత్వం ప్రక టించింది.-(సిహెచ్‌. నర్సింగరావు /డాక్టర్‌ చిట్టెడి కృష్ణారెడ్డి)

పంటల వైవిధ్యమే పోషకాహారానికి మూలం

ప్రజాస్వామ్య సౌధానికి మూలం వైవిధ్యం. సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా వివిధ ప్రజా సమూహాలు ఈ వైవిధ్యానికి ప్రాణం పోస్తాయి. అందుకే పాలనలోనూ ఈ ప్రజాస్వామిక స్వభావాన్ని ప్రభుత్వాలు సంతరించుకోవాలి. సాధారణంగా లాభాల కోసం పని చేసే పెట్టుబడి వైవిధ్యానికి వ్యతిరేకం. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పని చేసే పాలకులు కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. అందుకే అన్ని ప్రజాస్వామిక, నాగరిక విలువలనూ తుంగలో తొక్కి, ఏకస్వామ్య పాలన సాగిస్తుంటారు. పాలకుల సంస్కృతి ప్రజలను కూడా ప్రభావితం చేస్తుంది కనుక ప్రజలు తమ నిత్య జీవితంలోనూ అలాగే వ్యవహరిస్తుంటారు.


తెలంగాణలో పంటల వైవిధ్యం పడిపోవడం చూస్తుంటే పాలకులలోనూ, గ్రామీణ ప్రజలలోనూ ఈ మోనో కల్చర్ ధోరణులు ఎంత బలంగా పని చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ గడ్డ మొదటి నుంచి, ప్రధానంగా వర్షాధార ప్రాంతమే. ప్రత్యేక భౌగోళిక స్వభావం కలిగి ఉన్నది. కానీ ఎప్పుడూ వైవిధ్యమైన పంటలకు ఈ నేల కేంద్రంగా ఉండేది. ఫలితంగా వైవిధ్యమైన ఆహారం ప్రజల అలవాటులో భాగంగా ఉండేది. నేల సారాన్ని బట్టి, సాగునీరు అందుబాటును బట్టి ప్రజలు పంటలు వేసేవారు.
కానీ ఇప్పుడు అదంతా గడిచిపోయిన చరిత్ర. ప్రస్తుతం తెలంగాణలో కేవలం 3 లేదా 4 పంటలే 95 శాతం భూములను ఆక్రమించాయి. కాలక్రమంలో కొన్ని పంటలు కనుమరుగవుతున్నాయి. 2020 ఖరీఫ్‌లో రైతులు వరి 53,33,477, పత్తి 60,53,890, కంది 10,84,557 సోయాబీన్ 4,00,998 ఎకరాలలో సాగు చేశారు. మొత్తం 1,35,63,492 ఎకరాలలో పంటలు సాగయితే ఈ నాలుగు పంటలే 1,28,72,922 ఎకరాలలో సాగయ్యాయి. యాసంగిలో కూడా వరిని 50,58,128 ఎకరాలలో సాగు చేశారు. ఫలితంగా రెండు సీజన్లలోనూ మిగిలిన పంటల విస్తీర్ణం బాగా పడిపోయింది.
ఈ ధోరణి వల్ల, సాగునీటిపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్నది. అన్ని పంటల సగటు దిగుబడులు పడిపోతున్నాయి. కొన్ని పంటల విస్తీర్ణం గణనీయంగా పెరగడం వల్ల, మార్కెట్ సమస్య కూడా ఎదురవుతున్నది. నిల్వ కోసం అవసరమైన గిడ్డంగుల కొరత కూడా ఏర్పడుతున్నది. ఒకేసారి వ్యవసాయ కార్యకలాపాలు జరగడం వల్ల కూలీల కొరత సైతం ఏర్పడుతున్నది. యంత్రాల కిరాయిలతో సహా అన్ని రకాల సాగుఖర్చులు పెరిగి రైతులకు నికర ఆదాయాలు పడిపోతున్నాయి. కొన్ని వాణిజ్య పంటలకే డిమాండ్ పెరిగి, భూముల కౌలు ధరలు కూడా పెరిగిపోతున్నాయి.
ఇప్పుడు మార్కెట్ మాత్రమే రాష్ట్ర పంటల ప్రణాళికను శాసిస్తున్నది. వాతావరణంలో వస్తున్న మార్పులను ఏ మాత్రం పట్టించుకోకుండా పంటలను ప్రోత్సహించే ధోరణి తెలంగాణ పాలకులలో ఎక్కువగా ఉంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా భూగర్భ జలాలను అడుగంటి పోయేటట్లు చేస్తున్నా, ఫలితంగా యాసంగి సీజన్‌లో పంటలు ఎండిపోతున్నా, ప్రభుత్వానికి పట్టడం లేదు.
వాస్తవానికి రాష్ట్ర ప్రజల ఆహార అవసరాలు, పశువుల ఆహార అవసరాలు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ముడిసరుకు అవసరాలు దృష్టిలో ఉంచుకుని ఏ ప్రభుత్వమైనా రాష్ట్రంలో ఉన్న సాగుభూములను ఉత్పత్తికి ఉపయోగించుకోవాలి. అందుకు అనుగుణంగా రైతులతో కలసి గ్రామ, మండల స్థాయిలో ప్రణాళికలు రచించుకోవాలి. బఫర్ స్టాక్, ప్రకృతి వైపరీత్యాలు దృష్టిలో ఉంచుకుని కొంత అదనంగా ఉత్పత్తి ప్రణాళిక రూపొందించుకోవచ్చు. ఈ అవసరాలు తీరాక అంతగా భూములు మిగిలితే, అప్పుడు ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ శాఖతో కేంద్రం, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, కంపెనీలు చేసుకునే ముందస్తు ఒప్పందాల ప్రాతిపదికన ఇతర రాష్ట్రాల కోసం, దేశాల కోసం కూడా పంటలు పండించవచ్చు.
ఈ మొత్తం ప్రక్రియలో రాష్ట్ర వాతావరణం, సాగు భూముల స్వభావం, సాగునీరు అందుబాటు, దానికోసం రైతులు తవ్వుకునే బావులు, బోర్లు, ప్రభుత్వాలు అప్పు తెచ్చి నిర్మించే ఎత్తిపోతల పథకాలు, వాటి నిర్మాణ, నిర్వహణ వ్యయం, వాటి విద్యుత్ అవసరాలకు చెల్లింపులు, ఫలితంగా పెరిగే పంటల ఉత్పత్తి ఖర్చు పరిగణనలోకి తీసుకోవాలి. కేంద్రం ప్రతి సంవత్సరం పంటల మద్దతుధరల విషయంలో అనుసరించే అపసవ్య ధోరణులు, ప్రభుత్వ సంస్థలకు పంటల సేకరణలో ఉన్న పరిమితులు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అమెరికా, యూరప్, చైనా దేశాలు అక్కడి రైతులకు వివిధ పేర్లతో ఇస్తున్న భారీ సబ్సిడీలు, ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులను కూడా ఇక్కడ పంటల ప్రణాళిక సమయంలో దృష్టిలో ఉంచుకోవాలి.
వీటిపై రైతులందరికీ అవగాహన ఉండకపోవచ్చు కానీ ప్రభుత్వానికి తప్పకుండా ఉండాలి. ఈ సందర్భంలో ప్రజాపక్షంగా ఆలోచించి సూచనలు చేసే వ్యవసాయ ఆర్థిక నిపుణుల అభిప్రాయాలూ, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల పొందికపై వ్యవసాయ విశ్వవిద్యాలయాలు చేసే సూచనలూ ప్రభుత్వాలు ఆలకించాలి. ప్రగతి భవన్లో తీసుకునే నిర్ణయాలన్నీ పారదర్శకమైనవి, శాస్త్రీయమైనవి కావని గత 7 సంవత్సరాల పాలన నిరూపించింది.
భారత వైద్య పరిశోధనా సంస్థ (ICMR), ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 400 గ్రాముల ఆహారధాన్యాలు, 60 గ్రాముల పప్పుధాన్యాలు, 60 గ్రాముల నూనెలు, 25 గ్రాముల సుగంధ ద్రవ్యాలు, 325 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పండ్లు ఆహారంగా తీసుకోవాలని సిఫార్సు చేసింది. అంటే ఆహార అవసరాల కోసం ఏ గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశం అయినా వీటి ఉత్పత్తికి స్థానికంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. అందుకు అనుగుణంగా భూములను కేటాయించుకోవాలి. ఇంకా సాగు భూములు మిగిలితే పశుగ్రాసం కోసం, పరిశ్రమల అవసరాల కోసం, ఇతర ఆహార అవసరాల కోసం సాగు భూముల కేటాయింపు జరగాలి. అప్పటికీ భూములు మిగిలితే అప్పుడు మార్కెట్ ఆధారిత, ముందస్తు ఒప్పంద ఆధారిత పంటల ఉత్పత్తి కోసం కేటాయించుకోవాలి. స్థానికంగానే ఉత్పత్తి, నిల్వ, ప్రాసెసింగ్, పంపిణీ, మార్కెటింగ్ జరిగితే రైతులకు ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి. వినియోగదారులకు స్థానికంగా నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకు దొరుకుతాయి. ప్రజలు ఇప్పటిలా, కేవలం తెల్ల వరి బియ్యం మాత్రమే ప్రధాన ఆహారంగా తీసుకోకుండా జొన్నలు, ఇతర చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, వివిధ రకాల నూనెలు, కూరగాయలు, పండ్లు, సుగంధద్రవ్యాలు ఆహారంలోకి తీసుకోవడం వల్ల ప్రజలకు పౌష్టికాహారం అందుతుంది. ఆరోగ్యాలు మెరుగవుతాయి. అన్నిటికీ మించి రైతులకు స్థానికంగానే అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు లాభసాటి ధరలు లభిస్తాయి. పశువులకు కూడా వైవిధ్యమైన పశుగ్రాసం దొరికి ఆరోగ్యకరమైన పాలు, మాంసం, గుడ్ల దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. ఈ మొత్తం వ్యవసాయ, పశు ఆధారిత ఉత్పత్తుల ప్రక్రియలో ఎరువుల ధరలు పెరుగుతూ, పంటల ఉత్పత్తి ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉన్నందున విష రసాయనాలను వదిలేసి సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తే ప్రజల ఆరోగ్యాలూ ,పర్యావరణమూ బాగుపడతాయి. రాష్ట్రంలో సాగునీటిపై కూడా ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఎందుకంటే వరి, పత్తి, పామాయిల్ లాంటి పంటలకు నీటి అవసరం ఎక్కువ. మిగిలిన పంటలు ప్రధానంగా మెట్ట పంటలు. ఇప్పటి వరకూ వీటిని అశ్రద్ధ చేయడం వల్ల రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది. కేంద్రం తెచ్చిన మూడు చట్టాల నేపథ్యంలో మార్కెట్ ధరలు రైతులకు అనుకూలంగా ఉండే అవకాశం లేదు. రాష్ట్రంలో రెండు మూడు పంటల విస్తీర్ణాన్నే ప్రోత్సహిస్తే వాటి మార్కెటింగ్ కష్టం అవుతుంది. ప్రభుత్వం కూడా చివరి గింజ వరకూ ఎప్పుడూ కొనే అవకాశం ఉండదు.
అందువల్ల ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట చర్యలు వెంటనే ప్రారంభించాలి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ దృష్టితో కాకుండా తెలంగాణ రాష్ట్ర అవసరాల ప్రాతిపదికన పంటల ప్రణాళిక చేపట్టాలి. రాష్ట్రస్థాయిలో చర్చించడం కాకుండా, రైతులకు అవగాహన కల్పించడం ద్వారా, గ్రామ, మండల స్థాయిలో ఈ ప్రణాళికలు రూపొందాలి. ఈ చర్చలలో స్థానికంగా ఉండే రైతు సహకార సంఘాలను, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను, గ్రామీణ మహిళా సహకార సంఘాలను, పశు పోషకులను, కోళ్ళ పెంపకందారులను భాగస్వాములను చేయాలి. ఈ సహకార సంఘాల ఆధ్వర్యంలోనే ప్రాసెసింగ్ యూనిట్లు, గిడ్డంగుల కోసం నిధులు కేటాయించవచ్చు. కస్టమ్ హైరింగ్ సెంటర్లు నిర్వహించవచ్చు.
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా పరిశ్రమలు నడుపుతున్న పారిశ్రామికవేత్తలతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమావేశాలు జరిపి వాళ్ళ అవసరాలు తెలుసుకోవాలి. ఇతర రాష్ట్రాలను, బడా వ్యాపారసంస్థలను సంప్రదించి, వాళ్ళకు రాష్ట్రం నుంచి అవసరమైన వ్యవసాయ, ఇతర గ్రామీణ ఉత్పత్తుల గురించి చర్చలు జరిపి, కనీస మద్దతుధరల చెల్లింపు ప్రాతిపదికన వారితో ముందస్తు ఒప్పందాలు చేసుకోవాలి. వాటిని కూడా గ్రామ, మండల స్థాయిలో పంటల ఉత్పత్తి ప్రణాళికలలోకి తీసుకురావాలి. పంటల ఉత్పత్తి ఖర్చులు, దిగుబడుల మధ్య వ్యత్యాసం వల్ల, రైతులకు వచ్చే ఆదాయాల మధ్య వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది కనుక, వారు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఎకరానికి కనీస ఆదాయం గ్యారంటీ ఇవ్వాలి. అప్పుడే రైతులు భరోసాతో అన్ని పంటలను సాగు చేస్తారు. అడవి జంతువులు, ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులు తట్టుకోవడానికి సమగ్ర బీమా పథకాలను అమలు చేయాలి.
రాష్ట్రప్రభుత్వం ఈ వానాకాలం సీజన్‌కు ముందే, పాత తప్పులు పునరావృతం కాకుండా చర్చలు ప్రారంభించి నిర్దిష్ట విధానాలను అమలు చేయాలి.(ఆంధ్ర‌జ్యోతి సౌజ‌న్యంతో..)
కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక

ఆస్తుల అమ్మకంలో ఆంతర్యమేమి?

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విశాఖ నగరం లోని భూములను వేలం ద్వారా అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది. దీని కనుగుణంగా ‘నేషనల్‌ బిల్డింగ్‌ కనస్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ వారు మార్చి 30వ తేదీన నగరంలోని ఐదు ప్రదేశాలలో ఉన్న 17.48 ఎకరాల భూమిని వున్నది వున్నట్లుగా అమ్మాలని ‘ఇ టెండర్ల’ను ఆహ్వానించారు. నగరం నడిబొడ్డున ఆర్కే బీచ్‌ను ఆనుకుని ఉన్న 13. 59 ఎకరాల భూమి కూడా ఇందులో ఉంది. ప్రభుత్వం భూములు ఎందుకు అమ్ముతోంది అన్నది ఒక అంశం కాగా, అలా అమ్మడం సహేతుకమేనా అన్నది మరొక అంశం. వాస్తవానికి గత సంవత్సరమే ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేసినా హైకోర్టు ఆర్డర్‌ వల్ల నిలిచిపోయింది.

అధికారంలోనికి వఛ్చిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం ‘బిల్డ్‌ ఎ.పి మిషన్‌’ అమలుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక స్టేట్‌ లెవెల్‌ మోనిటరింగ్‌ కమిటీని (ఎస్‌ఎల్‌ఎంసి) జీఓ నెం. 447 (తేదీ 5.11.02019) ద్వారా ఏర్పాటు చేసింది. అందులో మూడు అంశాలను ప్రధానంగా పేర్కొన్నారు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వ ‘నవరత్నాలు, నాడు-నేడు’ వంటి పథకాల అమలుకు నిధులు సమకూర్చుకోవడం, రెండవది రాష్టంలో నిరుపయోగంగా ఉన్న స్థలాలను అమ్మడం ద్వారా ఆ నిధులు రాబట్టడం, మూడవది ఈ పనిని సమర్ధవంతంగా చేయడానికి నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌బిసిసి) అనే కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమతో ఒప్పందం చేసుకోవడం. ఇప్పుడు ఈ సంస్థ కూడా కేంద్ర ప్రభుత్వ అమ్మకాల జాబితాలో ఉండడం గమనార్హం.

గత సంవత్సరం మార్చి 2వ తేదీన జరిగిన ఎస్‌ఎల్‌ఎంసి సమావేశంలో సుమారు పది వేల కోట్ల రూపాయల విలువచేసే 1400 ఎకరాల భూమి 250 ప్రాంతాలలో ఉందని గుర్తించారు. ఈ భూమిని వివిధ దశలలో అమ్మాలని ప్రతిపాదించారు. మొదటి దశలో విశాఖపట్నం జిల్లాలో 28, కృష్ణా జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 7 మొత్తం 40 స్థలాలను అమ్మవచ్చని ఎన్‌బిసిసి ఎంపిక చేసింది. ఈ స్థలాల నుండి అత్యధిక రాబడి సాధించేందుకు అవసరమైన సహకారానికి కెనడా రాజధాని టోరొంటో ప్రధాన కేంద్రంగా ఉన్న ‘కొలియర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రవేట్‌ లిమిటెడ్‌’, అమెరికా లోని చికాగో ప్రధాన కేంద్రంగా ఉన్న ‘జెఎల్‌ఎల్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌’ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ఈ రెండూ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రపంచం లోనే అతి పెద్ద కంపెనీలు.

ఇలా అమ్మకానికి పెడుతున్న స్థలాలు ఎపిఐఐసి, ఇరిగేషన్‌, మునిసిపల్‌, రెవిన్యూ, ఆరోగ్య, జైళ్ల శాఖలకు చెందినవి ఉండడంతో, ఎలాంటి వివాదాలకు తావులేకుండా అమ్మకానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడానికి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షులుగా, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కన్వీనరుగా డిస్ట్రిక్ట్‌ ప్లానింగ్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ కమిటీని అన్ని జిల్లాలలో ఏర్పాటు చేశారు.

అసలు ఇలా భూములు అమ్మడం వివేకమేనా అనే ప్రశ్న అలా ఉండగా ఇంకా విచిత్రమైన రెండు విశేషాలు ఇందులో ఉన్నాయి. ఒకటి స్థలాల విలువ కట్టడమైతే, రెండోది ఈ స్థలాలలో ప్రస్తుతం ఏమున్నాయనేది. మార్కెట్‌ విలువ కంటే అన్ని స్థలాలలోనూ తక్కువే వస్తుందని వారు పేర్కొన్నారు. అదే సందర్భంలో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ రేట్ల కంటే కూడా వీరు తక్కువ మార్కెట్‌ రేటును పొందుపరిచారు. దీనర్ధమేమిటంటే భూములను చవకగా అమ్మడం. వీరు అమ్మాలనుకున్న కొన్ని స్థలాలలో ప్రధానమైన ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లు పని చేస్తున్నాయి. ఉదాహరణకు గుంటూరు నగరంలోని అరండల్‌ పేటలో వున్న తహసీల్దార్‌ ఆఫీసు, జైలును ఖాళీ చేయించి ఆ స్థలాన్ని అమ్మేయాలని నిర్ణయించారు. అలాగే విశాఖ నగరం లోని సీతమ్మధారలో ఉన్న తహసీల్దార్‌ ఆఫీసు, రెవిన్యూ ఉద్యోగుల క్వార్టర్లను ఖాళీ చేయించి అమ్మకానికి పెడుతున్నారు. ఇంకా విచిత్రంగా, అక్కడే ఉన్న ప్రభుత్వ కంటి ఆసుపత్రిని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ కార్యాలయాన్ని కూడా తరలించి, ఆ పదకొండు ఎకరాల స్థలాన్ని కూడా వేలానికి పెట్టాలని నిర్ణయించారు.

ఇంకో విశేషమేమిటంటే గత ప్రభుత్వం విశాఖ నగరంలోని 13.59 ఎకరాల భూమిని ‘లులు మాల్‌’ కు కేటాయించింది. ఈ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే ఆ కేటాయింపును రద్దు చేసింది. ప్రభుత్వం దీనిని ప్రజావసరాలకు వినియోగిస్తుందని భావించి ప్రజలు ఈ రద్దును హర్షించారు. కానీ వారికి దిమ్మదిరిగేలా ప్రభుత్వం నేడు ఆ భూమిని కూడా అమ్మకానికి పెట్టింది. ఆ కాడికి పాత కేటాయింపును రద్దు చేయడమెందుకు? ‘లులు మాల్‌’ కే వదిలేస్తే పోయేది కదా అనే భావనతో ఇప్పుడు ఆ ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ‘బిల్డ్‌ ఎ.పి” అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడం కాకుండా అమ్మకానికి పెట్టడంలా ఉంది. ఒక పక్క అమ్మేస్తూ, ఇదెలా నిర్మించడం అవుతుందో ఆ పేరు పెట్టిన వారికే తెలియాలి.

ఈ మొత్తం వ్యవహారం అనేక సందేహాలకు తావిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ వివేచనను ప్రశ్నించేలా చేస్తోంది. ఇలా అమ్ముకుంటూ పోతే ఆస్తులు తరుగుతాయే కానీ పెరగడానికి ఇదేమీ ఊరే జల కాదు కదా! ఈ అమ్మకాలలో విదేశీ బడా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలను భాగస్వామ్యం చేయడం వెనుక ఏమైనా మతలబుందా అనే సందేహం కూడా సామాన్యులకు కలగడం సహజం. ప్రభుత్వ ఆఫీసులను కూడా ఖాళీ చేయించి మరీ అమ్మకానికి పెట్టడంలో ఆంతర్యమేంటనే సందేహం కూడా కలుగుతుంది. ఇటువంటి సందేహాలను కొట్టిపారేయకుండా నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇంటి రోజువారీ ఖర్చులకు ఆదాయ మార్గాలను వెతుక్కోకుండా ఇంట్లో సామాన్లన్నీ అమ్ముకుంటూ పోతే, ఆ ఇల్లు ఎలా దివాళా తీస్తుందో మన రాష్ట్ర పరిస్థితి కూడా అక్కడికే చేరుకుంటుందనడం అతిశయోక్తి కాదు.

సంక్షేమ పథకాలు అమలు చేయడం మంచిదే కానీ, ఆ పేరుతో ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం వివేకవంతమైన ఆలోచనేనా? అలా అమ్ముకుంటూ పోతే కొన్నాళ్ళకు ప్రభుత్వ ఆస్తులన్నీ అయిపోతే అప్పుడు ఏం చేస్తారనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేయడమే తమ విధానమని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ బాట లోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పయనిస్తోందా అనే భావం కూడా ప్రజలకు కలుగుతుంది. ఇప్పుడు విశాఖ భూములతో ప్రారంభించి అనేక ప్రాంతాలలో భూములను అమ్మడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా అవగతమవుతోంది.

ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞతతో పునరాలోచించి స్థిరంగా వచ్చే ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి సారించాలి. కేంద్రం నుండి రావలసిన మన వాటా నిధులకై అవసరమైతే అందరినీ కలుపుకుని ఒత్తిడి తేవాలి. అంతేకాని ఇలా ఆస్తులను అమ్ముకోవడం రాష్ట్రానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. విజ్ఞత అంతకంటే అనిపించుకోదు.
ఎ. అజ శర్మ /వ్యాసకర్త ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి

లాక్‌డౌన్‌ వేల శ్రామిక జీవులపై కరోనా పంజా

లాక్‌డౌన్‌ కారణంగా గ్రామీణ ప్రాంతాలలో కన్నా పట్టణ ప్రాంతాలలోనే అర్ధాకలి పస్తులు పెరిగాయన్న సంగతి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో రేషన్‌ కార్డులు లేనివారి సంఖ్య ఎక్కువగా ఉండడం మొదటి కారణం. అందువలన వారికి ప్రజా పంపిణీ ద్వారా ఆహార దినుసులు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ కరోనా కష్టకాలంలో ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీకాన్ని కొంతవరకూ ఆదుకుంది. అటువంటి పథకం ఏదీ పట్టణ ప్రాంతా లకు లేదు. పట్టణ పేదలను ఈ కష్టకాలంలో ఆదుకునే ప్రత్యామ్నాయం ఏదీ లేకుండా పోయింది. ఇది రెండవ కారణం.

దేశంలో వేలాది మంది ప్రాణాలు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన కరోనావైరస్‌ మహమ్మారి ఇంకా తన విజృంభణ ఆపలేదు. భారత్‌ కరోనావైరస్‌తో జీవనం కొనసాగిస్తుంది. ఇప్పుడు దాని తో పాటు ఆకలి ఒకపెద్ద సమస్యగా మిగిలిపోయింది. కరోనావ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్‌ డౌన్‌ సమయంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆకలితో ఉన్నారు. రోజువారి అవస రాలను తీర్చడానికి కష్టపడుతున్నారు.అంగన్‌వాడీ కేంద్రాలు,పాఠశాలలు మూసివేయడం వల్ల హైద రాబాద్‌లో వేలాదిమంది పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు.మార్చిలో లాక్‌ డౌన్‌ విధించినప్పటి నుంచి తెలంగాణలో అన్నిప్రభుత్వ పాఠశాలలు మూసివేయబడ్డాయి. దీనివల్ల నిరుపేద పిల్లలకు మధ్యాహ్నం భోజనం లేకపోవడం. మధ్యాహ్నం భోజనం లేకపోవడంతో,పిల్లలు పోషకాహార లోపానికి గురయ్యారు. ఈ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి లాక్‌ డౌన్‌ను అస్త్రంగా వాడితే ఆకలి అనేమరో పెద్ద విపత్తు ప్రజల నడ్డి విరిచింది. కరోనాచావులుతోపాటు ఆకలి మరణాలు కూడా సంభవిస్తాయని ప్రభుత్వాలు మారాయి.
2020 మార్చి 24న మరో నాలుగు గంటల్లో దేశంమంతటా లాక్‌డౌన్‌ అమలు జరగనున్నట్టు నరేంద్రమోడీ ప్రకటించారు. ఆలాక్‌డౌన్‌ మే నెలాఖరు వరకూ కొనసాగింది. ఆతర్వాత కూడా స్థానికంగా అక్కడక్కడా లాక్‌డౌన్‌లు కొనసాగినా, దేశం మొత్తంమీద లాక్‌డౌన్‌ మళ్ళీ విధించలేదు. ఆలాక్‌డౌన్‌ పేద శ్రామికులకు ఎక్కడా లేని కష్టాలను తెచ్చిపెట్టింది. వారిలో ముఖ్యంగా వలస కార్మికులు పడిన పాట్లు మొత్తం ప్రపంచం దృష్టిలో సైతం పడ్డాయి. తక్కిన దేశాలలో లాక్‌డౌన్‌కి, మన భారతదేశంలో లాక్‌డౌన్‌కి ఒకతేడా ఉంది. ట్రంప్‌ హయాంలోని అమెరికాతో సహా తక్కిన దేశాల్లో లాక్‌డౌన్‌ కార ణంగా ఆదాయాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇచ్చారు. మనదేశంలో మాత్రం అటువంటిదేమీ లేదు (ఎక్కడో కొద్ది మంది ఎంపిక చేసుకున్నవారికి చాలా స్వల్ప మొత్తాలు ఇచ్చారు. అంతే). లాక్‌డౌన్‌ కారణంగా ఏంతోమంది పేద శ్రామికులు ఆదాయాలు కోల్పోయి నిరాధారంగా,ఆకలి బాధతో బతకవలసిన స్థితికి నెట్టబడ్డారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసి కొన్ని నెలలు గడిచినా, వారాస్థితి నుండి ఇంకా కోలుకోనేలేదు. కొన్ని పౌరసంస్థలుకలిసి ‘హంగర్‌వాచ్‌’ అనేపేర ఒకసర్వే నిర్వహించారు. గత అక్టోబర్‌ నెలలో ఈ సర్వే జరిగింది. ఈసర్వేలో కలిసిన వారినుండి ఆదాయాల,వ్యయాల లెక్కలు,గణాంకాలు సేకరించడం కాకుండా వారికి కలిగిన అభిప్రాయాలను యథాతథంగా సేకరించారు. సర్వేలో వెల్లడైన విషయాలు చేదు వాస్తవాలను బైటపెట్టాయి. సర్వే చేసినవారు దాదాపు 4000మందిని కలిశారు. వారిలో 53.5 శాతం-అంటే సగం కన్నా ఎక్కువమంది-కుటుం బాలు మార్చి 2020లో వాడిన గోధుమ లేదా బియ్యం కన్నా అక్టోబర్‌లో వాడినది తగ్గింది. ఇక పప్పుధాన్యాలు,ఆకుకూరలు,గుడ్లు,మాంసం వంటి దినుసుల వినియోగం తగ్గిపోయిన కుటుంబాల శాతం అంతకన్నా ఎక్కువగానే ఉంది. 62శాతం కుటుంబాల ఆదాయం లాక్‌డౌన్‌ కన్నా ముందు ఉన్నస్థాయితో పోల్చితే అక్టోబర్‌ నాటికి తగ్గి పోయింది. లాక్‌డౌన్‌కు పూర్వం పనులకు పోయిన వారికన్నా ఆ తర్వాత కాలంలో పనులకు పోతున్న వారి సంఖ్య పెరిగింది. కుటుంబ ఆదాయాలు తగ్గిపోతున్నందున,ఎక్కువమంది పనులకు పోవ లసిన అగత్యం ఏర్పడిరది.సర్వే పరిమితంగానే జరిగి వుండొచ్చు. కాని జరిగిన మేరకైనా చూసి నప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా కొంతమందికైనా కడుపులు నిండనిస్థితి ఏర్పడిరదని స్పష్టం అవు తోంది. హంగర్‌ వాచ్‌ సర్వే ప్రత్యేకించి బలహీన వర్గాలపైన,తరగతుల పైన కేంద్రీకరించిందిన్నది ఇక్కడ గమనంలో ఉండాలి.
గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాం తాలలో ఆహార దినుసుల వినియోగం తగ్గిపోయిన కుటుంబాలు (కరోనా పూర్వపు కాలంతో పోల్చి నప్పుడు) ఎక్కువశాతం ఉన్నాయని హంగర్‌ వాచ్‌ అధ్యయనంలో తేలిన అంశం మరింత ఆశ్చర్యాన్ని గొలుపుతోంది. ఇది ముందు ఊహించినదానికి భిన్నంగా ఉంది. సాధారణంగా అర్ధాకలి పస్తులు, పోషకాహారలేమి వంటివి పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణప్రాంతాల్లోనే ఎక్కువ.పోషకాహారం పొంద గలుగుతున్న వారెందరన్న కొలబద్దతో పేదరి కాన్ని అంచనా వేసినప్పుడు గ్రామీణ ప్రాంతాలలోనే పేద రికం ఎక్కువగా ఉందని ప్రతిసారీ మన అధ్య యనాలు వెల్లడి చేస్తున్నాయి. అందుచేత లాక్‌డౌన్‌ కారణంగా గ్రామీణ ప్రాంతాలలో కన్నా పట్టణ ప్రాంతాలలోనే అర్ధాకలి పస్తులు పెరిగాయన్న సంగతి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇలా పెరగడానికి రెండు కారణాలు ఉన్నా యని చెప్పవచ్చు. పట్టణ ప్రాంతాల్లో రేషన్‌ కార్డులు లేనివారి సంఖ్య ఎక్కువగా ఉండడం మొదటి కారణం. అందువలన వారికిప్రజా పంపిణీ ద్వారా ఆహార దినుసులు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ కరోనా కష్టకాలంలో ఉపాధిహామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీకాన్ని కొంత వరకూ ఆదుకుంది. అటువంటి పథకం ఏదీ పట్టణ ప్రాంతాలకు లేదు. పట్టణ పేదలను ఈ కష్టకాలంలో ఆదుకునే ప్రత్యామ్నాయం ఏదీ లేకుం డా పోయింది. ఇది రెండవ కారణం. హంగర్‌ వాచ్‌ నివేదిక నుండి కొన్ని ముఖ్యమైన నిర్ధారణలకు రావచ్చు. లాక్‌డౌన్‌ కాలంలో ఎటువంటి తోడ్పా టూ అందకపోవడం కారణంగా పేదరికం, అర్ధాకలి పెరగడం, నిరాధారంగా మిగిలిపోయిన వారు పెరగడం సంభవించింది. ఇది అనివార్యం. ఐతే,ఈ పరిస్థితి అంతే తీవ్రంగా లాక్‌డౌన్‌ అనం తర కాలంలో కూడా కొనసాగడం కొట్టవచ్చినట్టు కనపడే విషయం. సాధారణంగా లాక్‌డౌన్‌ కాలం లో ఉత్పత్తి నిలిచిపోతుందని, ఒకసారి లాక్‌డౌన్‌ ఎత్తివేశాక ఉత్పత్తి యథాతథంగా తిరిగి ప్రారంభ మౌతుందని అందరమూ భావిస్తాం. కాని లాక్‌డౌన్‌ కాలంలో శ్రామిక ప్రజలకు ఇతరత్రా ఆర్థిక తోడ్పా టు అందినట్టైతే ఈ విధంగా జరిగే వీలుంటుంది. అదే, మన దేశంలో మాదిరిగా ఎటువంటి ఆర్థిక తోడ్పాటూ అందకుండా ఉన్నట్టైతే యథాతథ స్థితి మొదలుకాదు.
లాక్‌డౌన్‌ కాలంలో శ్రామిక ప్రజల ఆదా యాలు పడిపోకుండా నిలబెట్టగలిగితే ఆహార దినుసులను, ఇతర వినిమయ వస్తువులను వారు అదే స్థాయిలో కొనుగోలు చేయగలుగుతారు. అదే విధంగావారి ఋణభారం అదనంగా పెరిగి పోదు. ఉత్పత్తి లాక్‌డౌన్‌ కాలంలో నిలిచిపోతుంది గనుక, శ్రామిక ప్రజల అవసరాలను తీర్చడానికి వ్యాపా రులు వారివద్దనుండే సరుకుల నిలవలను కరిగి స్తారు. ఒకసారి లాక్‌డౌన్‌ ఎత్తివేశాక ఉత్పత్తి తిరిగి ప్రారంభం అవుతుంది. కార్మికులకు ఆదాయాలు రావడం తిరిగి మొదలౌతుంది. వారి వినిమయం మాత్రం యథాతథంగా కొనసాగుతుంది. వ్యాపా రులు తమ వద్ద నిల్వలను తిరిగి పెంచుకోవలసి వుంది గనుక మామూలు స్థాయికన్నా ఎక్కువగా ఉత్పత్తి ని చేయవలసిన స్థితి వస్తుంది.
అదే లాక్‌డౌన్‌ కాలంలో శ్రామికులకు ఎటు వంటి ఆర్థిక తోడ్పాటూ అందకపోతే వారి ఆదా యం ఏమీ ఉండదు గనుక వారి వినిమయం బాగా తగ్గుతుంది. అలా తగ్గించుకున్నా, అందు కోసం వారు అప్పులు చేయవలసి వస్తుంది. లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ఉత్పత్తి యథాతథంగా పూర్వపు స్థాయిని చేరుకుందనుకున్నా శ్రామిక ప్రజల వినిమయం మాత్రం యథాతథ స్దితికి రాదు. ఎందుకంటే వారు లాక్‌డౌన్‌ కాలంలో చేసిన అప్పులు తీర్చడానికి తమకు వచ్చిన ఆదా యాల్లో నుండి కొంతభాగం కేటాయించవలసి వుంటుంది. ఆఅప్పులు పూర్తిగా తీరిపోయే వరకూ వారి వినిమయం పూర్వపు స్థాయికి చేరుకోదు. వినిమయం బట్టి ఉత్పత్తి ఉంటుంది. వినిమయం తగ్గింది గనుక ఉత్పత్తి కూడా పూర్వపు స్థాయికి చేరుకోదు. అంటే ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, విని మయం-రెండూ కరోనా పూర్వపు స్థితికి చేరుకోవు. అందుచేత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కూడా అరకొరగానే జరుగుతుంది. అందుచేత ఆర్థిక వ్యవస్థ మామూలు స్థాయికి తిరిగి కోలుకోవాలన్నా, శ్రామిక ప్రజలు దుర్భర దారిద్య్ర పరిస్థితి నుండి బైట పడాలన్నా వారి ఆదాయాల స్థాయి లాక్‌డౌన్‌ కాలంలో పడిపోకుండా ఆర్థిక తోడ్పాటు అందిం చడం అవసరం. తెలివిమాలిన మోడీ ప్రభుత్వం ఈ పని చేయలేదు. శ్రామిక ప్రజలలో చాలా మంది ఆదాయాలను దాదాపు సున్నా కి తీసుకొ చ్చింది. దీని పర్యవసానాలు ఏవిధంగా ఉంటాయో హంగర్‌ వాచ్‌ వెలుగులోకి తెచ్చింది.
మధ్యంతరంగా సగంలో నిలిచిపోయిన మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేంద్రం ఖర్చు చేయనున్నదని, దానితో ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి కావలసిన ప్రేరణ లభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అందు కోసం ఎంత మోతాదులో ఖర్చు చేయనున్నారన్నది అసలు ప్రశ్న. లాక్‌డౌన్‌ కు మునుపు ఏ స్థాయిలో ఖర్చు చేశారో,అదే స్థాయిలో ఇప్పుడూ చేస్తే, శ్రామిక ప్రజల కొనుగోలు శక్తి ఏమీ అదనంగా పెరగదు. లాక్‌డౌన్‌ కాలంలో చేసిన అప్పులకు వాయిదాలు కట్టడానికి కొంత భాగం పోతే తక్కిన భాగంతోటే వారు ఏ కొనుగోలు అయినా చేయగలు గుతారు. అందువల్ల మొత్తం డిమాండ్‌ లాక్‌డౌన్‌ అనంతర కాలంలో కూడా పూర్వపు స్థాయికి తిరిగి చేరుకోదు. అంటే ఆర్థిక వ్యవస్థ మామూలు స్థాయికి తిరిగి కోలుకోవడం జరగదు. అలా కోలుకో వాలం టే మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం పెట్టే ఖర్చు లాక్‌డౌన్‌ పూర్వపు కాలంలో చేసిన ఖర్చు కన్నా చాలాఎక్కువ మోతాదులో పెంచాలి. పడిపోయిన శ్రామిక ప్రజల కొనుగోలు శక్తి వలన డిమాండ్‌లో ఏర్పడే తరుగుదలను అదిభర్తీ చేయ గలిగేంతగా ఉండాలి.
ఇలా పరోక్షంగా మౌలిక వసతుల కల్పనపై ఎక్కువ ఖర్చు చేయడం కన్నా నేరుగా ఆ శ్రామిక ప్రజలకు నగదు చెల్లించడం ద్వారా వారి కొను గోలు శక్తిని నిలబెట్టడమే మెరుగు. లాక్‌డౌన్‌ అనం తరం కూడా ఆవిధంగా నగదు చెల్లింపులను కొనసాగించవచ్చు. లాక్‌డౌన్‌ అనంతరం కొంత తగ్గిన ఉత్పత్తి స్థాయి,తగ్గిన ఆదాయాల వలన ఏర్పడిక కొరతను భర్తీచేయగలిగే మేరకు ఈ నగదు చెల్లింపులు జరగాలి. అప్పుడు మాత్రమే పూర్వపు స్థాయికి వినిమయం పెరుగుతుంది. లాక్‌డౌన్‌ కాలంలో ఇటువంటి చెల్లింపులేవీ చేయనందున దాని ప్రభావం లాక్‌డౌన్‌ అనంతర కాలంలో కూడా పడుతోంది. దానివలన ఆర్థిక వ్యవస్థ కోలు కోవడం కూడా సాధ్యం కావడంలేదు.
నేరుగా శ్రామిక ప్రజలకు నగదు చెల్లింపులు చేస్తే వారి దారిద్య్రం ఉపశమించడమే గాక, వారు ఆసొమ్ముతో కొనుగోలుచేసే సరుకులన్నీ దేశీయంగా ఉత్పత్తి చేసినవే ఎక్కువగా ఉంటాయి. దిగుమతి చేసుకోవలసినవి పెద్దగా ఉండవు. అందువలన ప్రభుత్వం చేసే ఖర్చు దేశీయ డిమాండ్‌ ఎక్కువగా పెరగడానికి తోడ్పడుతుంది. అందువలన దేశంలో ఉపాధి అవకాశాలు మరింత పెరగడానికి దోహ దం చేస్తుంది. శ్రామిక ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసే ఆహార ధాన్యాలను ఇక్కడ ప్రభుత్వం చేసే నగదు చెల్లింపులలో భాగంగా పరిగణించకూడదు. ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వడం మంచిది. అవసరం కూడా. కాని దానివలన ఆర్థిక వ్యవస్థ పెరగడానికి ఎటువంటి ప్రేరణా కలగదు. అది కేవలం భారతీయ ఆహారసంస్థ వద్ద పేరుకు పోయిన నిల్వలను కొంత తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. దానితోబాటు నేరుగా నగదు చెల్లింపులు చేసినప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి తగిన ఊపు లభిస్తుంది. ఇప్పుడు ఉపాధి లేని ప్రతీ కుటుంబానికీ నెలకు రు.6000 కనీసం చెల్లిం చాలని ప్రధానికి ప్రతిపక్ష నాయకులు లేఖ రాశారు. ఆవిధంగా ప్రతీఇంటికీ మూడు నెలల పాటు నగదు చెల్లించినా,అందుకయ్యే ఖర్చు మన జిడిపిలో కేవలం 2 శాతమే. ఆమాత్రం లోటును తేలికగా సర్దుకో వచ్చు.కాని మోడీ ప్రభుత్వానికి తెలివి తక్కువ తనంతోబాటు పిరికితనం కూడా ఉంది. అందుకే ప్రజలు ఇంత దుర్భర పేదరికంతో నలిగిపో తున్నా, ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నా ధైర్యం చేయలేకపోతోంది. అంత ర్జాతీయ ద్రవ్య పెట్టుబడి నిర్దేశించిన పరిమితులను దాటుకుని వ్యవహరించ లేకపోతోంది.

ఎంత దౌర్భాగ్యం

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ ఔషధం అంటూ ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్నాడు. దీనిపై సీఎం జగన్‌ కూడా దృష్టి సారించి, శాస్త్రీయ అధ్యయనం అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. నెల్లూరు జిల్లా యం త్రాంగం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని నిలిపివేసింది. దీనిపై నెల్లూరు జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌ బాబు వివరణ ఇచ్చారు. మూలికా ఔషధం పంపిణీ ఆపివేశామని.. ఈ ఔషధంకు సంబం ధించి శాంపిళ్లను డీఎం హచ్‌ఓ, ఆయుష్‌ అధికా రులు హైదరా బాదు లోని ఓ ప్రయోగశాలకు పంపారని కలెక్టర్‌. తెలిపారు . దీనిపై శాస్త్రీయ పరిశోధన చేయాల్సి ఉందని, ఆ పరిశోధనలో తెలిసే అంశాల ఆధారం గానే..ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి లభించింది.

ప్రభుత్వ వైద్యం ఏ మూలకూ చాలదు. కార్పొరేట్‌ వైద్యం అందనంత ఖరీదు. అటువంటి దయనీయ స్థితిలో నేడు అసంఖ్యాకంగా పేదలు ఉన్నారు. ఏచిన్న ఆశ కనిపించినా, ఏ చిన్న ఆధా రం దొరికినట్టు అనిపించినా, ఆశగా దానికోసం వారు ఎగబడతారు. ఇది వారి నిస్సహాయ స్థితికి ప్రతిబింబమే కాని చైతన్యపూరితంగా ఆ ప్రజలు కోరుకునేది కాదు. కాబట్టి తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకుని ప్రజల మీదకు ‘వారు కోరుకుం టున్నారు’ అనే పేరుతో నెపాన్ని నెట్టేసి నాటు వైద్యాన్ని సమర్ధిం చడం తప్పు.తప్పే కాదు, నేరం కూడా.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం దగ్గర ఆనందయ్య అనే నాటు వైద్యుడు ఇచ్చే మందు కరోనాను నయం చేస్తుందన్న ప్రచారం దుమారంలా వ్యాపించింది. రెండురోజుల క్రితం అక్కడ వేలాదిగా గుమి గూడిన జనాలను చెదరగొట్టడానికి లాఠీచార్జి కూడా చేయవలసి వచ్చింది. ఆమందును, ప్రజలపై దానిని ప్రయోగిస్తున్న విధానాన్ని పరిశీలించిన ఆయుష్‌ వైద్యుడు అదిఆమోదం పొందిన ఆయుర్వేద ఔషధం కాదని, ఆనందయ్య అర్హతలున్న ఆయుర్వేద వైద్యుడు కాడని, ఆమందు పని చేస్తుందో లేదో నిర్ధారించాల్సి వుందని స్పష్టంగా నివేదిక ఇచ్చారు. దాంతో తాత్కాలికంగా ఆ కార్యక్రమం ఆగింది. ఆనందయ్య వాడిన మందు పని చేస్తుందో లేదో తేల్చడానికి అవసరమైన పరీక్షలను జరిపి నిగ్గు తేల్చాల్సినది ఐసిఎంఆర్‌ అని, ఆనందయ్య తయారు చేసిన మందును నాటుమందుగానే పరిగణిస్తు న్నామని ఆయుష్‌ కమిషనర్‌ రాములు స్పష్టంగా ప్రకటించారు. ఈలోపు ఆనందయ్య ఇచ్చిన మందు వికటించి రోగులలో కొందరి పరిస్థితి విషమంగా తయారైనట్టు వార్తలు కూడా వచ్చాయి. కాని ఒక్కరోజు లోనే మొత్తం సీన్‌ మారిపోయింది !
తిరుపతి ఆయుర్వేద కళాశాల విశ్రాంత అధ్యాపకుడు ఒకాయన అధికార పార్టీ ఎమ్మెల్యే నిర్వహించిన పత్రికాగోష్టిలో ‘’నాటి మందు’’నే ఇప్పుడు ‘’నాటు మందు’’ అంటున్నారని తెలుగు భాషకు కొత్త భాష్యం చెప్పారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఆనందయ్య మందు హాని చేస్తు న్నట్టు ఎటువంటి దాఖలాలూ లేవని, ఆయుర్వేదం మందు అయితే నిబంధనలు వర్తిస్తాయి గాని, అది ఆయుర్వేదం మందు కానట్టయితే ఏ నిబంధనలూ వర్తించవని అత్యంత హాస్యాస్పదమైన, బాధ్యతా రహితమైన ప్రకటన చేశారు! ముఖ్యమంత్రి అండ తనకు ఉన్నదంటూ ఆనందయ్య మీడియా ముందు ప్రకటించాడు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆనందయ్య వైద్యానికి మద్దతు తెలిపారు. స్వయానా ఉపరాష్ట్రపతి అసాధారణ రీతిలో ఒక కేంద్ర బృం దాన్ని పంపి ఆనందయ్య మందుకు ఇమేజ్‌ పెం చారు. ఇంతమంది రంగంలో ఉంటే మనం ఎక్కడ వెనకబడిపోతామనో ఏమో గాని సిపిఐ నాయకులు నారాయణ కూడా దీనిని సమర్ధిస్తూ మాట్లాడారు.
ఆయుర్వేదం, యునానీ, హోమియో, ఆక్యు పంక్చర్‌, యోగా తదితర సాంప్రదాయ వైద్య విధా నాలు చాలానే ఉన్నాయి. వాటికి నాటు వైద్యానికి నక్కకు, నాక లోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈ సాంప్రదాయ వైద్యాలను ఆధునిక శాస్త్త్ర విజ్ఞానం సహకారంతో అధ్యయనం చేసి శాస్త్రబద్ధం చేయా ల్సిన అవసరాన్ని ప్రపంచం గుర్తించి అనేక సంవత్స రాలుగా పరిశోధనలు జరుపుతోంది. ఆ క్రమం లోనే కొన్ని రకాల వైద్యాలను గుర్తించి అనుమతి చ్చింది. ఆయుర్వేదం, యునానీ, హోమియో వైద్య విద్యలకు సిలబస్‌లను రూపొందించి కళాశాలలు ఏర్పాటు చేశారు. డిగ్రీలు ప్రదానం చేసి ప్రాక్టీస్‌ కు అనుమతులిచ్చారు. కాని ఇప్పటికీ గ్రామాల్లో, పట్టణాల్లో సైతం నాటువైద్యం కొనసాగుతోంది. దానికి ఎటువంటి నియంత్రణా లేదు. కాని దానిని ప్రభుత్వం ఎక్కడా ఆమోదించి అనుమతించనూ లేదు. గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన కార్యక్ర మాలలో భాగంగా నాటువైద్యం జోలికి పోవద్దన్న ప్రచారం జరుగుతూనే వుంది. ఆశా,అంగన్‌వాడీ వర్కర్ల ద్వారా కూడా ఇటువంటి ప్రచారాలు జరి గాయి. నాటువైద్యం వికటించి ప్రాణాలు పోగొట్టు కునేవారి గాధలు నిరంతరం వినవస్తూనే వుం టాయి. ఇక తాయెత్తులు,పోగులుకట్టడం, రాగిరే కులు మంత్రించి ఇవ్వడం, భూత వైద్యం, చేతబడి, ఎరుకలసాని మందులు, పుత్తూరు వైద్యం వంటివి నాటువైద్యం రూపాలు, ప్రజల్లో పాతుకుపోయిన మూఢ విశ్వాసాలకు ప్రతీకలు. ప్రజలు వీటిని అధిగమించి ఆధునిక, శాస్త్రీయ వైద్య పద్ధతులను అనుసరించి ఆరోగ్యాలను కాపాడుకోవాలన్న లక్ష్యం తో ప్రభుత్వాలు, బాధ్యతగల అధికారులు, రాజకీయ నాయకులు వ్యవహరించాలి. అందుకు తగిన ఆధు నిక వైద్య వసతుల కల్పనకు కృషి చేయాలి. ఆరో గ్యం ప్రజల ప్రాథమిక హక్కు. అది జీవించే హక్కు లో భాగమే. దానిని కాపాడాల్సిన బాధ్యత ప్రభు త్వాలది. ప్రజల ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టే నాటు వైద్యాలను నియంత్రించే బాధ్యత కూడా ప్రభు త్వాలదే. మరి ఆ బాధ్యతను విస్మరించి,అందునా, ఆరోగ్యపరంగా ఒక అత్యవసర పరిస్థితి ఏర్పడిన ప్రస్తుత తరుణంలో ప్రభుత్వాలు,కొన్ని రాజకీయ పార్టీలు,అధికారులు ఎందుకు ప్రత్యక్షంగాను,పరో క్షంగాను ఆనందయ్య మందును సమర్ధిస్తున్నారు ?ప్రజలు వేలాదిగా ఆమందుకోసం వస్తున్నారు కాబట్టి సమర్ధిస్తున్నాం అని చెప్పడంలో అర్ధం లేదు. ఎక్కడికక్కడ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, జనరల్‌ హాస్పిటళ్లు, ఈ కరోనా కాలంలో ప్రజల ఆరోగ్యాన్ని సరైన విధంగా, సకాలంలో సంరక్షించే సామర్ధ్యంతో నడిస్తే ప్రజలు నాటువైద్యానికి ఎందుకు వస్తారు? కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ ఆరోగ్యవ్యవస్థను పూర్తి గా నిర్లక్ష్యం చేసిన పాపం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వా లదే. అదీ చాలదన్నట్టు, ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రు లను విపరీతంగా పెంచి పోషించినదీ ఈ ప్రభు త్వాలే.మెడికల్‌ రీఇంబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ వంటివి ప్రజాధనాన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల పాలు చేయ డానికి తోడ్పడిన, తోడ్పడుతున్న మార్గాలు. పైగా కార్పొరేట్‌ ఆస్పత్రులను నియంత్రణ చేసే చర్యలేవీ లేవు. లాభార్జనే కాని ప్రజారోగ్యం పట్టని కార్పొరేట్‌ ఆస్పత్రులు ఈ కరోనా కష్టకాలంలో చేతులెత్తేసి తమ చేతకానితనాన్ని బైటపెట్టుకున్నాయి. ఈ సమ యంలో కూడా లక్షలు ప్రతీ కరోనా రోగి నుండీ పిండుకుంటున్నాయి. ఈపరిస్థితి పూర్తిగా ప్రభు త్వాలు (కేంద్రం,రాష్ట్రం) కల్పించినదే.
ప్రభుత్వ వైద్యం ఏమూలకూ చాలదు, కార్పొ ంట్‌ వైద్యం అందనంత ఖరీదు. అటువంటి దయ నీయ స్థితిలో నేడు అసంఖ్యాకంగా పేదలు ఉన్నారు. ఏచిన్న ఆశ కనిపించినా, ఏ చిన్న ఆధారం దొరికినట్టు అనిపించినా, ఆశగా దానికోసం వారు ఎగబడతారు. ఇదివారి నిస్సహాయ స్థితికి ప్రతి బింబమే కాని చైతన్యపూరితంగా ఆ ప్రజలు కోరు కునేది కాదు.
కాబట్టి తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుని ప్రజలమీదకు ‘వారు కోరుకుంటున్నారు’ అనే పేరుతో నెపాన్ని నెట్టేసి నాటువైద్యాన్ని సమర్ధించడం తప్పు. తప్పే కాదు, నేరం కూడా. ఇక ‘’అన్నీ వేదాల్లోనే ఉన్నాయా’అన్న అగ్నిహోత్రావధానుల మూర్ఖత్వాన్ని ఒక సిద్ధాంతంగా మార్చి దానిని ‘ప్రాచీన వైశిష్ట్యం’ గా చిత్రీకరించి ఆపేర రాజకీయం నడుపుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌,సంఘపరివారానికి ఈకృష్టపట్నం మందు ఒకఅవకాశంగా దొరికింది. అందుకే అసా ధారణ రీతిలో నేరుగా వెంకయ్య నాయుడి గారి జోక్యం. ఆనందయ్య మందు పని చేస్తుందో లేదో తెలియదు కాని దానిపై ఏనియంత్రణా లేదు అని అన్నాక ఇక ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వనక్కరలేదు, ఆస్పత్రులలో పడకలు అవసరం లేదు. ఆక్సిజన్‌ అక్కరలేదు. బడ్జెట్‌ కేటాయింపులూ అక్కరలేదు. యథావిధిగా సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టు కోవచ్చు,సెంట్రల్‌ విస్తా వంటి డాబు,దర్పం ప్రద ర్శించే కార్యక్రమాలకు విచ్చలవిడిగా ఖర్చు పెట్టు కోవచ్చు. నెలకో కుంభమేళా జరుపుకోవచ్చు. ప్రజలు ఇక కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల గురించి నోరెత్తరు.పైగా కృష్ణపట్నం ఒక టూరిస్టు సెంటర్‌గా మార్చుకోవచ్చు. అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగించవచ్చు. దానికి హెల్త్‌ సిటీ లాంటి పేర్లు పెట్టవచ్చు.సెమినార్లు, సంబరాలు ఎన్నైనా జరుపు కోవచ్చు. ఇంగిత జ్ఞానం విడిచిపెట్టేశాక ఇక హద్దేముంటుంది? ఎవరైనా ఇదేం అన్యాయం అని అడిగితే, ప్రజలు కోరుకుంటున్నారని నెపాన్ని ప్రజల మీదకు తోసెయ్యవచ్చు. కరోనా ప్రమాదం ఏడాది కో,రెండేళ్ళకో పోతుంది. దానికి కూడా ఓపరిమితి ఉంటుంది కాబట్టి. కాని పాలకుల,అధికారుల బాధ్య తారాహిత్యానికి, అవకాశవాదానికి పరిమితి లేదు. అదే మనకు దాపురించిన దౌర్భాగ్యం !
(కొన్నేళ్ళ క్రితం ఒకరిక్షావాలా కాలికి కట్టుకున్న పోగుతో కనపడ్డాడు. ఎందుకు కట్టుకున్నావని అడిగాను. ‘జొరం కాస్తంది బాబూ, తగ్గడం లేదు. అందుకే సాయిబు దగ్గరికెల్తే పోగు కట్టాడు.’ అన్నాడు.‘మరి జ్వరం తగ్గిందా?’ అనడిగితే, ‘సూడాల బాబూ,నిన్ననే కద,కట్టింది’అన్నాడు. ‘తగ్గుతుందనుకుంటున్నావా?’ అన్నాను. ఏవో బాబూ, నాకాడ వొయిద్దానికి రెండ్రూపాయలే ఉన్నాయి. మరిదాంతో ఏడాట్రు వొయిద్దెం సేత్తాడు ? గవుర్మెంటు ఆస్పత్రికెల్తే సీటీ మాత్రం రాస్తారు. మందులు కొనుక్కోవాల.దానికి డబ్బు లెక్కడి నుండొస్తాయి?ఈడు రెండ్రూపాయలుచ్చుకుని పోగు కట్టాడు. నాకుసేతనైన వొయిద్దెం ఇదే. మరి ఎలా గోలా బతకాల కదా బాబూ’’ అన్నాడు. కృష్ణ పట్నంలో మనం చూడాల్సింది పోటెత్తుతున్న జనా లని కాదు,మూర్తీభవించిన ప్రజల నిస్సహా యతను, కొట్టొచ్చినట్టు కనిపించే పాలకుల వైఫల్యాన్ని .
-ఎం.వి.ఎస్‌. శర్మ

పునరపి జననం

నాలుగు జీతం రాళ్లు సంపాదిస్తున్న ఈ రోజుల్లో సంసారం గడవటం అంత తేలిక కాదు. కరోనా లాక్డౌన్‌ లతో పెరిగిపోయిన ధరలను తట్టుకోవడం సామాన్యుని శక్తికి మించిన పని. ఇక ప్రైవేటు పాఠశా లల్లో పనిచేసే ఉపాధ్యాయుల సంగతి దీనికి భిన్నం కాదు. కరోనా లో లాక్‌ డౌన్‌ లో పాఠశాలలు నెలలతరబడి మూసేస్తే? గోరుచుట్టుపై రోకటి పోటే. ఉపాధ్యాయులకు యాజమాన్యం అంతంత మాత్రంగానే జీతాలు ఇస్తారు. కరోనా లో అది మానేసారు. ఆవు ఉపాధ్యాయుల బ్రతుకు కుడితిలో పడ్డ బల్లి చందమే. ఉపాధ్యాయుడు కరోనాతో తండ్రిని పోగొట్టుకుని చేతిలో చిల్లిగవ్వ లేని అతడు ఏం చేయాలో తెలియక మరణమే శరణ్యం అనుకున్నాడు. ఆ ఇంటి యజమాని ఈ ఉపాధ్యాయుడికి ఎలా జీవితంపై ఆశ కల్పించాడోచెప్పేదే ఈ కథ.

‘‘ఎంతో మందిని పొట్టనబెట్టుకున్న ఈ మహమ్మారి కోవిడ్‌ నన్ను ఎందుకు వదిలి పెట్టిందో నాకు అర్థం కావటం లేదు. నా చావు నా చేతిలోనే ఉందేమో’’ అనుకుంటూ సీసా మూత తీసి నోట్లో పోసు కుందాం అనుకుంటూ ఉండగా మధు మధు అంటూ ఎవరో తలుపు శబ్దం చేసేటప్పటికి ఉన్నపళంగా వచ్చి తలుపు తీసి చూసేసరికి హుందా గా ఉన్న ఓ అపరిచితుడు
‘‘లోపలికి రావచ్చా’’ అంటూనే లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుని’ ఇదిగోండి తిరుమల
ప్రసాదం’ అని మధు చేతిలో పెట్టాడు.
అన్నం తిని ఎన్ని రోజులు అయ్యిందేమో కానీ ఆవురావురంటూ కొండ లడ్డు తిని తృప్తిగా గ్లాసుడు నీళ్లు తాగాడు మధు. అపరిచితుడు‘‘ నాపేరు శివ శంకర్‌. నేను స్వర్గీయులు అయిన మీ నాన్న గారి శిష్యుడిని.
నీవు ఉంటున్న ఇల్లు నాది. కోవిడ్‌ మూలంగా ప్రైవేట్‌ పాఠశాలలు కళాశాలల్లో పనిచేసే
ఉపాధ్యాయులకు జీతాలు లేవని, వారి బ్రతుకులు రోడ్డున పడ్డాయి అనే వార్త చదివి
ఇలా వచ్చా. నాకు కొంచెం మంచినీళ్లు ఇస్తారా’’? అని అడిగాడు శివ శంకర్‌.
మధు లోపలికి నీళ్లు తేవటానికి వెళ్లగానే టేబుల్‌ మీద మూత తీసి ఉన్న సీసాను చూచి
ఆశ్చర్య పోయాడు శివ శంకర్‌.
‘‘ ఇదిగోండి నీళ్లు.’’ అంటూ మధు నీళ్ల గ్లాసు శివశంకర్‌ కు అందించాడు. ‘‘ మీరు లోపలికి
వెళ్లగానే నా దాహం తీరింది. ఇక మీకు ఈ సీసాతో పనిలేదు, మీరు నాతో బయలుదేరండి.
ఇది మీ సోదర తుల్యుని ఆజ్ఞ అనుకోండి’’ అంటూ మధు సూట్‌ కేసు లో బట్టలు సర్ది,
చేయి పట్టుకొని బయటకు తెచ్చి, తలుపుకు తాళం వేసి, ‘‘ఎక్కండి కారు’’. అని ఇద్దరూ
కారులో కూర్చోగానే డ్రైవర్‌ కార్‌ స్టార్ట్‌ చేసి ముందుకు దూసుకుపోయాడు.
రెండు నెలలు తరువాత మధు, శివశంకర్‌ తిరిగి శంకరాపురం చేరుకున్నారు. తలుపు తాళం తీసి
‘‘ఇదిగో లక్ష రూపాయలు చెక్‌. రెండు నెలలు ముందు నీకు ఇద్దామని తెచ్చా. నీవు నా
ఇంట్లో ఉన్న రెండు నెలల్లో నా గురించి నీకు, నీ గురించి నాకు పూర్తిగా
తెలిసిపోయింది కదా ధైర్యంగా ఉండు. నీవు ఇప్పుడు ఒంటరి వాడివి కావు. కోవిడ్‌ వల్ల
తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఐదుగురు అనాధలకు తల్లి, తండ్రి, దైవం, గురువువి.’’
అంటుండగానే ఐదుగురు పిల్లల్నితీసుకొని డ్రైవర్‌ తులసిరామ్‌ వచ్చాడు.
‘ నమస్కారమండీ’ అని ఐదుగురు పిల్లలు ఒకేసారి చెప్పి ఇద్దరి కాళ్లకు దండం
పెట్టారు.
‘‘ ఈ బ్రీఫ్‌ కేస్‌ లో అనాధల పోషణకు కావాల్సిన ప్రభుత్వ అనుమతి పత్రాలు ఉన్నాయి.
ఈరోజు అందరం హోటలులో భోజనం చేద్దాం, రేపటి నుండి వంటమనిషి వస్తుంది’’ అంటూ
బ్రీఫ్కేస్‌ మధుకి ఇచ్చాడు శివశంకర్‌.
మధు బ్రీఫ్‌ కేస్‌ తెరిచి చూడగానే తన తండ్రి పేరున ‘‘గోస్వామి ఆనందరావు అనాధ
శరణాలయం’’ అని రిజిస్ట్రేషన్‌ చేయించిన పత్రాలు చూడగానే కళ్ళ వెంట ఆనంద
భాష్పాల రాలాయి.
శివశంకర్‌ ను హత్తుకున్నాడు మధు. ‘‘ నా విషయంలో ఇదేనేమో పునరపి జననం అంటే’’అంటూ ‘‘
మీరు నా మీద పెట్టుకున్న ఆశలు తప్పక నెరవేరుస్తాను. ఈ పిల్లలను అభివృద్ధిలోకి
తెచ్చే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి’’ అంటూ నమస్కరించాడు మధు.

పోవరం ఎవరికి వరం.. ఎవరికి శాపం…!

ముంపు ప్రాంతానికి చెందిన రాము గిరిజనుడు ఈవిషయం గురించి మాట్లాడుతూ ‘‘నాపక్క పొం లోకి నీళ్లువచ్చినప్పుడు నేను ఆనీళ్లలో నాపొం లోకి రాకుండా ఎలాఆపగను? ఇదే ప్రశ్న అధికా రుని అడిగితే తర్వాత చూద్దాం అంటున్నారు. తర్వాత చూడడానికి ఏముంటుంది? మా పక్కనే ఉన్న గ్రామాు అన్ని మునుగుతాయి అంటున్నారు. కానీ మా గ్రామాల్లో మాత్రం పొలాు మాత్రమే మునుగుతాయి అని అధికాయి చెబుతున్నారు. పొలాు మునిగితే మేము ఏమి చేసుకుని బతకాలి? మా పక్క గ్రామాన్నీ మునిగినప్పుడు మా గ్రామం ఒకటే మిగిలితే కూడా ఒక్కరమే కూడా ఎలా ఉండగము? ఒకవేళ ఉంటే , మేము వేరే ఊళ్ళకి ఎలా వెళ్లాలి? రాకపోకు ఎలా జరుగుతాయి? మా ప్లిు స్కూల్కి ఎలావెళ్తారు? అందుకని ఇప్పటి ప్రాజెక్టు నీటిమట్టం, ఎత్తు ప్రకారంత్వరగా సర్వే చేసి, మాకు అతిత్వరలో స్పష్టత ఇవ్వాని కోరుకుంటున్నాను.’’


పోవరం కొన్ని దశాబ్దాుగా కొనసాగు తున్న సుదీర్ఘ గాథ! గోదావరి మాదిరిగానే దీని ప్రయాణం లోనూ ఎన్నో ముపు. ఎన్నో అభ్యంతరాను, అవరోధాను అధిగమిస్తూ చివరకు జాతీయ హోదాను పొందింది. అయినా కథ సాఫీగా నడవ డం లేదు. అనేక ఒడుదొడుకు మధ్య పయని స్తోంది. సకాంలో నిధు ఇవ్వడం లేదం టోంది రాష్ట్రం.ఇచ్చినవాటికి లెక్కు అడుగుతోంది కేంద్రం. తాను కోరుకున్న పద్ధతిలో పను సాగాం టోంది. ఇంతకు పోవరం ఆవశ్యకత ఏమిటి? ఆంధ్ర ప్రదేశ్‌ జీవనాడిగా అభివర్ణిస్తున్న పోవరం స్వరూ పం ఏమిటి?దీనిద్వారా ఎటువంటిప్రయోజ నాు కగను న్నాయి. నిర్వాసితుకు అందించే నష్టపరి హారం, పునర వాసం ఎంతవరకు జరుగుతుంది వంటి ప్రశ్నకు సమాధా నాు పరిశీలిద్దాం!
పోవరం ఓ సుదీర్ఘ ప్రయాణం…. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో1941లో తొలి సారిగా పోవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబం ధించిన ఆలోచనకు బీజంపడిరది. మద్రాసు ప్రెనిడెన్సీ చీఫ్‌ ఇంజనీర్‌ దివాన్‌బహదూర్‌ ఎల్‌.వెంకటకృష్ణ అయ్యర్‌ ఈప్రాజెక్టుపై తొలిసర్వే నిర్వహించి నిర్మా ణానికి సంబంధించిన అంచనాను సిద్ధం చేశారు. ఆనాటి నుంచి పోవరం ప్రాజెక్టు నిర్మాణం వివా దా మధ్యే నలిగిపో తున్నది. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చొరవతో 1980లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్య మంత్రి టి.అంజయ్య పోవరం ప్రాజెక్టు పనుకు శంకు స్థాపన చేశారు. ఆయన తెంగాణకు చెందిన నాయకుడు. అప్పుడే పోవరం ప్రాజెక్టుకు ఇందిరా సాగర్‌ అని నామకరణం చేసింది కూడా అంజయ్యే. తరువాత 1983లోస్వర్గీయ నందమూరి తారకరామారావూ పోవరం ప్రాజె క్టుకు శిలాఫకం వేశారు. నాటి నుంచి నేటి వరకూ అధికారంలోకి వచ్చిన ముఖ్య మంత్రు తమ పానలో ప్రతి ఏటా బడ్జెట్‌లో నామమాత్రం గా నిధు కేటాయించి ఈప్రాజెక్టు ప్రతిపాదను పెంచుతూ పోయారేతప్ప ప్రాజెక్టునిర్మాణాన్ని మాత్రం చేపట్టలేక పోయారు. వైఎఎస్‌ఆర్‌ ముఖ్య మంత్రిగా పదవీబాధ్యతు నిర్వహించిన సమయం లో చేపట్టిన జయజ్ఞం పనుల్లో భాగంగా పో వరం ప్రాజెక్టునిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసు కెళ్లారు. దశాబ్దా జాప్యం తర్వాత 2004 నుంచి ఈప్రాజెక్టు నిర్మాణం వేగం పుంజుకుంది. ఇప్పటికే 5000 కోట్ల వ్యయంతో కాువ నిర్మాణం కూడా పూర్తయింది
పోవరం వివాదంగా ఎందుకు మారింది..?
రాష్ట్రాభివృద్ధిలో భాగంగా భారీ వ్యయంతో నిర్మించ తపెట్టిన పోవరం ప్రాజెక్టు ప్రారంభం నుండీ చర్చనియాంశంగా తయారై వివాదాకు కేంద్రంగా మారింది. ఈప్రాజెక్టుసాగు ప్రయోజనాు, విద్యుత్‌ ఉత్పత్తి, ముంపు సమస్యు, ఇరుగుపొరుగు రాష్ట్రా అభ్యంతరాు ఈప్రాజెక్టును చుట్టు ముట్టాయి. గోదావరి నదిపై పోవరం ప్రాజెక్టు నిర్మాణంవ్ల వ్యవసాయం, విద్యుదుత్పత్తి,త్రాగునీరు, పారిశ్రామి కాభివృద్ధే పోవరం ప్రాజెక్టు ముఖ్యోద్దేశ్యం. కానీ ఈభారీ ప్రాజెక్టుకు నిపుణు సిఫారసును పెడ చెవినపెట్టిన అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పో వరం ప్రాజెక్టు నివేదికను 1970లో తయారుచేసి, మళ్ళీ దాని స్వరూపాన్ని 1978లో మార్చింది. ఈనేపథ్యంలో ఒరిస్సాలోని మోటు, ఛత్తీస్‌గఢ్‌ లోని కొంటా తాూకాలోని గిరిజన గ్రామాు విపరీత మైన ముంపుకు గురయ్యే ప్రమాదమున్నందున బచావత్‌ ట్రిబ్యునల్‌ ఎదుట ఆరాష్ట్రాు షరతు పెట్టాయి. పోవరం ప్రాజెక్టువద్ద 36క్ష క్యూ సెక్కు వరదప్రవాహం వుంటుందని మొదటి అంచనా వేయగా,తర్వాత వెయ్యేళ్ళకు ఒకసారి వచ్చే గరిష్ట వరదప్రవాహం యాభైక్ష క్యూసెక్కు ుగా లెక్కకట్టారు. ఈ యాభై క్ష క్యూసెక్కును పరిగణలోకి తీసుకొనిముంపును అంచనా వెయ్యా ని ఒడిస్సా అంటోంది.ఈ ప్రాజెక్టువ్ల ఒరిస్సా, చత్తీస్‌ఘఢ్‌లోని ముంపు సమస్య ఏర్పడడంతో కరక ట్ట నిర్మాణం చేపడతామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. 2005లో ఈ అంచనాను అనుసరించి ముంపునకు గురయ్యే స్థలాను,గ్రామాను,అడవును గుర్తించడమే కాకుండా దానికి తగ్గట్టు నిర్వాసితు పునరావాస పథకాను రూపొందించి కేంద్రప్రభుత్వ అను మతిని,కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అను మతిని పొందింది. అయితే పొరుగురాష్ట్రాల్లో ముం పునకు గురవుతున్న ప్రాంతా విషయమై ఆయా రాష్ట్రాతో సంప్రదించి, అనుమతు పొంద కుండానే ప్రాజెక్టు కాువ నిర్మాణ పను చేపట్ట డం,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రపునర్‌ విభజనతో ఈ వివా దం మరోసారి రాజుకుని జాతీయ ప్రాజెక్టు హోదా దక్కించుకుంది పోవరం.
పోవరం ఓ వరం ..
గోదావరినదిపై పోవరం ప్రాజెక్టు నిర్మాణం వ్ల ఉభయగోదావరి జిల్లాు,విశాఖ,కృష్ణా జిల్లాల్లో మొత్తం 7క్ష 20వే ఎకరాకు సాగునీరు అందనుంది. వీటితోపాటు విశాఖజిల్లాలో తాగు నీరు,పారిశ్రామిక అవసరాకు మరో23.44 టీఎమ్‌సి నీటిని తరలించనున్నారు. అంతేకాదు, పోవరం ప్రాజెక్టు నిర్మాణంవ్ల 960మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పతి అవుతుంది. పోవరం నిర్మాణం పూర్తయితే మొత్తం 273.04టీఎంసీ నీటిని విని యోగించుకునే మీంది. ఈప్రాజెక్టు నిర్మాణం ద్వారా80టీఎంసీ నీటిని కృష్ణానదికి మళ్ళించ వచ్చు. కుడికాువద్వారా ప్రకాశం బ్యారెజీ ఎగువ భాగంలో పోవరం నీరు కుస్తుంది. అంతేకాదు బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం ఇలా మళ్ళేంచే 80 టీఎంసీలో 21టీఎంసీు కర్నాటకకూ, 14 టీఎంసీు మహారాష్ట్రకు వెళతాయి.
పోవరం ఇక జాతీయ ప్రాజెక్టు
2010-11 ధర ప్రకారం పోవరం నిర్మాణం కోసం 10 వే కోట్ల రూపాయ వ్యయం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటివరకూ సుమారు 5 వే కోట్ల రూపాయు ఖర్చు చేసింది. జాతీయ హోదా ఇచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణానికయ్యే వ్యయంలో తొంభై శాతం కేంద్రం భరిస్తుంది. తాజా ధర ప్రకారం మరో ఇరవైశాతం నిర్మాణ వ్యయం పెరుగుతుందని అంచనా వేసుకుంటే 10 వే కోట్లకు పైగా కేంద్రం ఖర్చు చేయాల్సి వుంటుంది.
పాపం పోవరం వారికి శాపం
ఖమ్మం జిల్లా ప్రజు పూర్తిగా పోవరం ప్రాజెక్టు ను వ్యతిరేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో తమ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని గిరిజను తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. పోవరం ప్రాజెక్టు నిర్మిస్తే తెంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో 278 నుంచి370 గ్రామా వరకు మాయ మవుతాయి. దాదాపుక్ష ఎకరాల్లో పంట పొలాు జ సమాధి అవుతాయి. భారీస్థాయిలో అటవీ ప్రాంతం కనుమరుగవుతుంది. ప్రకృతి ఒడిలో జీవించే గిరిజనుకు మరో జీవన విధానం తెలి యదు. అలాంటి అడవి బిడ్డకు జీవన్మరణ సమస్య సృష్టించడం అమానవీయమంటూ ప్రజాసంఘాు గత పది సంవత్సరాుగా పోరాడుతూనే ఉన్నాయి. ఇక మా రాష్ట్ర ప్రజను.. ప్రాంతాన్ని ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎలా విలీనం చేస్తారంటూ తెంగాణా వాదు గగ్గోు పెడుతున్నారు.
మొత్తానికి పోవరం ప్రాజెక్టును ఆంధ్ర ప్రాంత ప్రజానీకం ఆధునిక దేవాయంగా అభివర్ణిస్తుంటే తెంగాణా ప్రాంతానికి ముఖ్యంగా ఖమ్మం జిల్లా గిరిజను పాలిటశాపంగానే తయారైంది. అయితే ఇటువంటి భారీ ప్రాజెక్టుకు రూపక్పన జరిగి నప్పడు ఇటువంటి ఇబ్బందు ఎదురవడం అతి సహజం. అయితే ప్రభుత్వాు నిర్వాసితుకు తగు న్యాయం చేసే విధంగా.. వారి బతుకుకు భరోసా ఇచ్చేదిగా ఉండాలి.
ముంపు గ్రామాలే అసు సమస్య
పోవరం నిర్మాణంవ్ల చాలా గ్రామాు ముంపు నకు గురవుతాయి. నిర్వాసితు సంఖ్య కూడా భారీగానే వుంటుంది. రాష్ట్రంలోని 274 గ్రామా ల్లోని 44,574 కుటుంబాకు చెందిన 1,77,275 మంది నిర్వాసితువుతారు. ఇందులో ఖమ్మం జిల్లాలో 205 గ్రామాు,తూర్పుగోదావరి జిల్లాలో 32గ్రామాు,పశ్చిమగోదావరి జిల్లాలో 29 గ్రామాు ప్రాజెక్టులో కలిసిపోతాయి. ఖమ్మం జిల్లాలో నిర్వాసితు సంఖ్యలో సగానికి పైగా గిరిజనులే. అలాగే ఒడిశాలో8 గ్రామాకు చెందిన 6,316 మంది,చత్తీస్‌ఘడ్‌లో4 గ్రామాకు చెందిన 11,766మంది నిర్వాసితువుతారు. ఇంత భారీ సంఖ్యలో గ్రామాతరలింపు, నిర్వాసితుకు పునరావాసం,ప్రాజెక్టు మొత్తంవ్యవహారంలో ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు.
నిర్వాసితు గోడు పట్టించుకొనేదేవరు?
ఈప్రాజెక్టు నిర్మాణంవ్ల 376 గ్రామాు ముంపు నకు గురవుతున్నాయి. ముంపుకు గురవుతున్న మండలాలో పశ్చిమగోదావరిజిల్లా పరిధిలోకి పో వరం,కుక్కునూరు, వేలేరుపాడు వస్తున్నాయి. తూర్పు గోదావరిజిల్లాపరిధిలోకిఎటపాక,చింతూరు, వి. ఆర్‌.పురం,కూనవరం,దేవీపట్నం. ప్రస్తు తం ఇవి అన్ని రంపచోడవరం ఐటీడిఏ పరిధిలో ఉన్నాయి. పాన ఐటీడిఏ ద్వారా జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈఆరు మండలాు (ఎటపాక, చిం తూరు,వి.ఆర్‌.పురం,కూనవరం, కుక్కునూరు, వేలేరుపాడు) నాటి ఖమ్మంజిల్లా పరిధిలోకి వచ్చేవి. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈమండ లాన్నీ ఆంధ్రప్రదేశ్‌లో విలీనంచేశారు. ఈ మం డలాల్లో 90%పైగా గిరిజనులే ఉండటం విశేషం. ప్రస్తుత రికార్డు ప్రకారం 601చదరపు కిలోమీటర్లు భూమి ముంపులో ఉంది.గత రెండు నెలుగా తూర్పుగోదావరి జిల్లాలోని పు మండలాల్లో ఉన్న గ్రామాల్లో గ్రామసభు అధికా యి నిర్వహి స్తున్నారు. ఈగ్రామసభు, పోవరం ప్రాజెక్టు నిర్వా సితు భూసేకరణకి మరియు ఆర్‌ఆర్‌ ప్యాకేజీకి సంబంధించినవి. ఈగ్రామసభు జరుగు తున్నతీరుపై ప్రజు తీవ్రఆందోళనకు గురవుతు న్నారు. చింతూరు మండంలోని రామన్న పాలెం అనే ఊరిలో జరిగిన భూసేకరణ మీటింగ్లో అధికాయి ఊరిలోఉన్న 698ఎకరా భూమిలో కేవం 114 ఎకరాు మాత్రమే మంపు లో ఉందని వివరిం చారు. ఆ 114ఎకరాల్లో ఉన్న వారి పేర్లను, సర్వే నెంబర్లను చదివి వినిపించారు. ఆపొలాకి ఆను కొని ఉన్న పొలాుగ రైతు,తమ పొలాు వాటితో ఆనుకుని ఉన్నాయని వాటిలోకి నీళ్ళు వస్తే తమ పొలాల్లోకి కూడా వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి అధికాయి ఇది 1986లో వచ్చిన గోదావరి వరద ముంపు ఆధారంగా వేసిన ఒక అంచనా అని చెప్పారు. పోవరం ప్రాజెక్ట్‌ అథారిటీ వాళ్ళు మళ్ళీ కొత్త జాబితా పంపి నప్పుడు మీకు తెలియ చేస్తామని అన్నారు . ఇది సైంటిఫిక్‌ ప్రక్రియ ప్రకారం వేసిన అంచనా ఎంతమాత్రం కాదని స్పష్టమవుతోంది. అధికాయి ఇలా తమ భూము, ఇళ్ళపట్ల నిర్లక్ష్యం వహించి, ముంపునకు సంబంధించిన స్పష్టత ఇవ్వకపోతే, రేప్పొద్దున వరదు వచ్చినప్పుడు తమ పరిస్థితి ఏమిటని గ్రామస్తు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు ప్రాంతానికి చెందిన రాము గిరిజనుడు ఈవిషయం గురించి మాట్లాడుతూ ‘‘నాపక్క పొం లోకి నీళ్లువచ్చినప్పుడు నేను ఆనీళ్లలో నాపొం లోకి రాకుండా ఎలాఆపగను? ఇదే ప్రశ్న అధికా రుని అడిగితే తర్వాత చూద్దాం అంటున్నారు. తర్వాత చూడడానికి ఏముంటుంది? మా పక్కనే ఉన్న గ్రామాు అన్ని మునుగుతాయి అంటున్నారు. కానీ మా గ్రామాల్లో మాత్రం పొలాు మాత్రమే మునుగుతాయి అని అధికాయి చెబుతున్నారు. పొలాు మునిగితే మేము ఏమి చేసుకుని బతకాలి? మా పక్క గ్రామాన్నీ మునిగినప్పుడు మా గ్రామం ఒకటే మిగిలితే కూడా ఒక్కరమే కూడా ఎలా ఉండగము? ఒకవేళ ఉంటే , మేము వేరే ఊళ్ళకి ఎలా వెళ్లాలి? రాకపోకు ఎలా జరుగుతాయి? మాప్లిు స్కూల్కి ఎలావెళ్తారు? అందుకని ఇప్ప టి ప్రాజెక్టు నీటిమట్టం,ఎత్తు ప్రకారంత్వరగా సర్వే చేసి,మాకు అతిత్వరలో స్పష్టత ఇవ్వాని కోరుకుం టున్నాను.’’అంటూ తనఅభిప్రాయం వ్యక్తం చేసాడు చింతూరు మండం పరిధిలో,తిమ్మిరిగూడెం ఊళ్ళోకూడా అధికాయి పొలాు మాత్రమే మునుగుతాయని చెబుతున్నారు. ఈపరిసర గ్రామా ల్లో ప్రజు కూడా ఇలాంటి ప్రశ్నతోనే సతమత మవుతున్నారు. ఇలాంటి పల్లొ ఇంకెన్నో. కొటారు గొమ్ము అనే కొండరెడ్డి గ్రామంలో ఆర్‌ఆర్‌ ప్యాకేజీకి సంబంధించిన గ్రామసభ జరిగింది. ఈ గ్రామంలో భూసేకరణ ఎప్పుడో 10సంవత్సరా మునుపు చేశారు. నష్టపరిహారం అన్ని భూముకు ఇవ్వలేదు. కారణం ఇక్కడి గిరిజను కొండపోడు అధికంగా చేస్తారు. ప్రస్తుత ఆర్‌ ఆర్‌ పాసీలో కొండ పోడు భూముకు పరిహారం ఇచ్చేసౌకర్యం లేదు. కొటారు గొమ్ములో 70శాతం మందికి కొండపోడు భూము పట్టాలే ఉన్నాయి. కావున వీళ్ళకి ప్యాకేజీ ఇవ్వక పోతే వీళ్లంతా భూమిలేని నిర్వాసితు అవు తారు. దీనితో పాటు వ్యక్తిగత ప్యాకేజీ విషయంలో కూడా చాలా సమస్యు ఎదురవుతున్నాయి.ప్రస్తుత పాసీ ప్రకారం18సంవత్సరాు నిండిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వంరూ.686,000ఇస్తుంది. దానితో పాటు వాళ్ళకి కానీలో వేరే ఇు్ల కూడా కట్టి ఇస్తారు. దీనికి ప్రతిదికగా నోటిఫికేషన్‌ ఆధారంగా అధికా యి 2017మార్చి నె కట్టాఫ్‌ డేటు గా ప్రకటిం చారు. మార్చి2017 నాటికి 18ఏళ్ళు నిండినవాళ్ళే దీనికి అర్హుగా ప్రకటించారు. కానీ నేటికీ కూడా ఆఊరిని,కానీకి తరలించలేదు. వారికి వ్యక్తిగత ప్యాకేజీ డబ్బు కూడా చెల్లించలేదు. కావున గ్రామస్తుంతా కటాఫ్‌డేటుని ఈసంవత్సరం వరకు పొడిగించాని కోరుతున్నారు. ఇలా గడువు పొడి గించడంవ్ల దాదాపు30నుంచి40మంది ఈలిస్టు లోఅర్హులై ఈపాసీతో బ్దిపొందుతారని చెప్తు న్నారు. గ్రామసభకు వచ్చినఅధికాయి ఈ విషయా న్ని పైఅధికారు నోటిస్‌కి తీసుకెళ్తామని సమా ధానం ఇచ్చి తప్పించు కుంటున్నారు. పోవరం కోసం తమ సర్వస్వాన్ని కోల్పోతున్న నిర్వాసితుకు కటాఫ్‌డేట్‌ కూడా సరిచేసి ఇవ్వలేని ప్రభుత్వం తమకు ఎటువంటి న్యాయం చేయగదంటు ఇక్కడి ప్రజు ప్రశ్నిస్తున్నారు. కొటారుగొమ్ము గ్రామస్తు రాు క్ష్మి తన మాటల్లో ‘‘భూమిలేని ఆదివాసి రోజుకూలీగా మారడం ఖాయం. ఎందుకంటే అక్కడ మేము ప్రతిఒక్కటి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మేము ఉండే అడవిలో మాకు ఎన్నో దొరుకుతాయి.వంటకికట్టొ, కాయు, పండ్లు,దుంపు, వనమూలికు ఇలా కాలాను గుణంగా అడవి ఉత్ప త్తు భిస్తూనే ఉంటాయి. ప్రతి ఒకటి ఎంతోప్రయోజకరం. మా ఊరు గోదా వరి ఒడ్డుకి ఆను కునే ఉంటుంది. మేము రోజు గోదారి చెలిమె నించి తాగునీరు తెచ్చుకుంటాం. గోదావరిలో చేపు పట్టుకుంటాము. రోజు మా గొడ్లు వెళ్లి గోదారిలో సేదతీరి వస్తాయి వాటిని ఎవరూ మేపాల్సిన పనేలేదు. ఇంతస్వేచ్ఛగా బ్రతికే మమ్మల్ని తీసుకెళ్ళి ఆకానీలో పడేస్తే మేము ఎలా బతకాలి. ఆకానీలో ఇు్లచాలా ఇరుకుగా ఉన్నాయి. అక్కడగొడ్లను కట్టేసు కోవడానికి సరిపడా చోట కూడా లేదు.కనీసం మాకు వంట చేసుకోవ డానికి అక్కడ ప్లు కూడా దొరకవు. ప్రతి నెవంట గ్యాసు కొనాంటే మాకుచాలా ఖర్చు అవుతుంది. పైగాఅక్కడ కూలీ దొరుకు తుందో లేదో! ‘‘ అంటూ తమకు రాబోయే దుస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు అన్ని కొండారెడ్డి పల్లెల్లో ఇది పరిస్తితి. వచ్చే రెండునెలో 8పల్లెను కానీల్లోకి తరలించనున్నారు.
ఇు్ల వదిలి కానీకు చేరిన తర్వాత
ఇటీవలే దేవీపట్నం మండంలోని కొన్ని గ్రామా ను అధికాయి ఖాళీ చేయించి వారిని కానీ లోకి తరలించారు. ఇందులో కచ్చుూరు,సుద్ధ గొమ్ము,అగ్రహారం,ఏనుగుగూడెం,సీతారం ఊళ్ళు ఉన్నాయి. అందరికీ ఆర్‌ఆర్‌ ప్యాకేజీ, ఇంటి ప్యాకేజీ ఇవ్వడం జరగలేదు. అగ్రహారం ఊరిలో 72 కుటుంబాు ఉంటే, దాదాపు 20పెండిరగ్‌ కేసు ఉన్నాయి. 18మందికి ఏకంగా ప్యాకేజీ రిజెక్ట్‌ అయింది. అయినప్పటికీ వీరిని కొత్త కానీలో నివాసం తరలించారు. కొత్త కానీలో సీసీ రోడ్డు, డ్రైనేజ్‌ వసతి,తాగునీటి వసతిలేదు. ఉన్న ఒకే ఒక్క వాటర్‌ ట్యాంకునుండి కానీకి వాడుకునే నీటిని సరఫరా చేస్తున్నారు. చాలాసార్లు సాయంత్రం అయే సరికి వాటర్‌ ట్యాంక్లో నీళ్ళు ఉండటం లేదు. ప్రజు ఈసమస్యని అధికారు సమక్షంలో లేవ లెత్తగా ఇంకొక వాటర్‌ట్యాంక్‌ కట్టిస్తాం అని అధికా యి మాట ఇచ్చి దాటవేశారు. వారి సమ స్య గురించి ప్రశ్నించినప్పుడు వాళ్ళకి ఉపాధి భించే అవకాశాు కూడా ఏవీ లేవని అగ్రహారం గ్రామ స్తు తెలియజేసారు. భూవివాదంతో చాలా మం దికి భూమికి తగ్గసాగు భూమి భించక అంతా అయోమయంలో ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పోవరం వీరికి శాపమే అని ఇక్కడి ప్రజు అభిప్రాయపడుతున్నరు. పాసీ పరంగా ఎటువంటి చర్యు తీసుకుంటే వీరికి కనీస న్యాయం చెయ్యొచ్చు. చరిత్రనిండా ఏంటో నష్టపోయి అడవుల్లో శరణు పొందిన ఆదివాసుల్ని, బవంతంగా కానీకు తరలించి వాళ్ళ జీవావ రణానికి ముప్పు తెచ్చినట్లు ఉంది ప్రస్తుత పరిస్తితి. ప్రాజెక్టు లాభాల్లో వాటాదాయిగా వీళ్ళని పరిగ ణించి,ఉన్నతమైన జీవనాన్ని అందించే వెసు బాటు లేనప్పుడు ప్రాజెక్ట్‌ కోసం వీళ్ల భూముల్ని, ఇళ్ళన్ని లాక్కోవడం సమంజసమేనా? ఈ కోణంలో ఆలోచించి, వీరి హక్కుని కాపాడుతూ నిర్వాసి తుకు తగ్గిన న్యాయాన్ని ఇవ్వాని డిమాండ్‌ చేస్తున్నారు ఆదివాసు. పోవరం ప్రాజెక్ట్‌ నిర్మా ణానికి పేసా (గ్రామ పంచాయతీ తీర్మాన చట్టం), ఎఫ్‌ఆర్‌ఏ(అటవిహక్కుచట్టం) చట్టాను పూర్తిగా ఉ్లంఘించిన ప్రభుత్వం, నిర్వాసితుకు కనీసం ఆర్‌ ఆర్‌ ప్యాకేజీలోని లోపాని సరిచేసి కొద్దో గొప్పో ఊరటనివ్వాని ఇక్కడి ప్రజు, హక్కు సంఘానేతు,పర్యావరణ కార్యకర్తు అభిప్రాయ పడుతున్నారు.

నివృతి.జి

మాఊరి పండుగలు.. స్థానిక ఆచారాలు…!

జనవరి 25 శనివారం సాయంత్రం రిషీవ్యాలి పాఠశాలో సంక్రాంతి సంబరం. మధ్యాహ్నం పాఠశాల‌లో పనిచేసే పనివారికి వ్యవసాయశాఖ (ఎస్టేటులో) భోజనాలు పెట్టారు. 3.30 నిము షాల‌కు ఆవును, ఎద్దును అంకరించి డప్పులు మేళాల‌ సందడితో పిల్ల‌న గ్రోవిల‌ పాటతో, స్త్రీ, పురుషు ఆడే జానపద నృత్యాతో సందడిగా వుంది పాఠశా. విద్యార్థు వసతి గృహా ముందు చక్కగా అలికి ముగ్గువేసి గొబ్బెమ్మతో అంకరించారు. ప్రధాన మార్గం గుండా ఆటస్థంలోకి ఆటపాటతో అందరూ చేరుకున్నారు. అక్కడ ఓ అరగంటసేపు విద్యార్థు కూడ గ్రామీణుతో కలిసి వారు చేసే నృత్యానికి అనుగుణంగా కాళ్లు చేతు కదుపుతు వృత్తాకారంలో చేయి చేయి పట్టుకొని తిరుగుతు, ఎగురుతు ఆనందిస్తున్నారు.సెల్‌ ఫోన్లలో ఆ దృశ్యాు బంధింపబడు తున్నాయి. నెమ్మదిగా భోజనశా మీదుగ నిర్జన మైదాన ప్రదేశానికి చేరుకున్నారు అందరు. ‘‘చిట్లాకుప్ప’’కు మంట వెలిగించి పశువును మూడుసార్లు ప్రదక్షిణం చేయించి గోశాకు తీసుకువెళ్లారు. నేను పాఠశాలో చేరిన కొత్తలో ఇదంతా ఓవింతగా అనిపించింది. పండుగ ఐపోయి పదిరోజు తరువాత ఈ సంక్రాంతే మిటని అనుకున్నా! ఆ విషయం అప్పుడు అక్కడితో మర్చిపోయా! జనవరి 14,15 తేదీలో సంక్రాంతి పండుగ పూర్తయితే మా ఊరిలో 25న సంక్రాంతేంటనే అనుమానం నాలాగ అందరికీ కుగుతుంది. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధమైన పాఠశా రిషీవ్యాలి స్కూు అదే మాఊరు. దానిని జిడ్డు కృష్ణమూర్తిగారు స్థాపించారు. ప్రకృతికి, పక్షు, పశువు, కొండు, గుట్టకు సమీపంగా ప్రశాంతంగా వుండే 350 ఎకరా పాఠశాకు 3కిలో మీటర్ల దూరంలో ‘తెట్టు’అనే గ్రామం ఉంది. తెట్టు గ్రామం అసు పేరు ‘‘శేషనగరము’’. ఈ గ్రామంలో అతి ప్రాచీనమైన ‘‘సంతాన వేణుగోపాస్వామి’’ దేవాయమునకు అటు తమిళనాడు, ఇటు కర్ణాటక నుండి కూడ భక్తు వచ్చి తమతమ కోరికు నెరవేరినందున మొక్కు తీర్చుకుంటు వుంటారు. అశ్వనీ నక్షత్రముతో కూడుకున్న అమావాస్యనాడు శ్రీవారి కళ్యాణోత్సవము జరుగును. స్వామివారి విగ్రహము కోనేరులో అమావాస్యనాడు భించుటతో ఆనాటి నుండి అమావాస్యనాడే కళ్యాణోత్సవం నిర్వహించటం ఆనవాయితీ అయింది.కాక్రమేణ శేషనగరము ‘తెట్టు’ గా మారింది. సుమారు 20 కుటుంబా వారు గతంలో అక్కడ ఒక కోట నిర్మించుకొని ఏనుగు బారిన పడకుండుటకై చుట్టు ముళ్లకంపతో ఎత్తైన తెట్టు వేసుకున్నందున ఆ గ్రామానికి తెట్టు అను పేరు వచ్చింది. విశిష్టాద్వైత దర్శన ప్రవర్తకుడగు శ్రీమద్రామానుజాచార్యు వారి విగ్రహం ఆ దేవాయంలో వున్నందున రామాను జాచార్యు వారు ఆదిశేషుని అవతారం కావున ఆ ఊరికి నాడు ‘శేషనగరం’ అని పేరు వచ్చింది.ప్రస్తుతం ఈ తెట్టు చుట్టు ప్రక్క గ్రామా కంటే పెద్దది కావున ‘‘కస్ఫా’’ గ్రామం అంటారు. చుట్టుప్రక్క గ్రామీణుకు స్వామి వారిపై అమిత భక్తి కావున సంక్రాంతి, దసరా మొదగు పండుగు తెట్టు దేవా యంలో ఐన తరువాతే మిగిలిన గ్రామాల్లో చేస్తారు. ఆవిధి విధానాన నుసరించి మాపాఠశా ప్రతి సంవత్సరం శనివారం ఈ సంక్రాంతి పశువు పండుగ చేస్తాం. శనివారం మధ్యాహ్నం నుండి తరగతు వుండవు కావున విద్యార్థు చదువుకు ఏవిధమైన ఆటంకం ఉండదు. తెట్టులో సంక్రాంతి కాగానే మిగిలిన గ్రామా వారు వారివారి అనుకూతను పెద్దతో చర్చించి నిర్ణయించి జరుపుకుంటారు. గ్రామం మొత్తం ఒకేరోజు ఈ సంక్రాంతి పండుగ చేస్తారు. ఆదివారాలో చేయరు. ఆరోజు మాంసాహార భోజనం కావున. సంక్రాంతికి కొత్త అు్లళ్లను పివటం, నూతన వస్త్రాు యివ్వటం వంటి ఆచారం మా ప్రాంతంలో లేదు. ఉభయ గోదావరి జిల్లా వారు ఈ సంక్రాంతిని ‘‘పెద్దపండుగ’’ అని ఘనంగా చేస్తారు. అు్లళ్లతో, కూతుళ్లతో, మనుమడు, మనుమరాళ్లతో, హరిదాసు కీర్తనతో, గంగిరెద్దువారి విన్యాసం వంటి వినోదాతో, కోడిపందాుతో ఆనందంగా గడుపుతారు. ఈ రకమైన ఆచార వ్యవహారాు యిక్కడ వీరికి తెలియవు. మదనపల్లి దగ్గర ‘పెంచుపాడు’, పుంగనూరు తాూకా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంక్రాంతి, సంక్రాంతి రోజు కాకుండ తరువాత వచ్చే ‘మంగళవారం’ చేస్తారు. ఈరోజు అనపకాయ పితికిపప్పు, దోశొ, వడు తప్పనిసరిగా ప్రతి యింటిలో చేస్తారు. పశువు అంకరణ, ‘‘చిట్లాకుప్ప’’ ప్రదక్షిణ మామూు. బుధవారం ఊరంతా కలిసి పొట్టేును కోసి దాని రక్తం ఊరి పొలిమేరల్లో చల్లి ఆ మాంసం గ్రామస్తుంతా ప్రసాదంగా పంచుకొని వండుకుంటారు. కురబకోటలో సంక్రాంతి తరువాత కనుమ పండుగ సోమ వారం, శనివారం వస్తే చేయరు. కారణం కనుమరోజు మాంసాహారం సేవిస్తారు కాబట్టి. ఒక్కో పండక్కు ఒక్కో గ్రామంలో ఒక్కో ఆచారం పాటిస్తారు యిక్కడి ప్రజు. తమిళనాడు సరి హద్దు గ్రామాల్లోని ‘‘పానటూరు’’ గ్రామం గుడి పా మండం లోనిది. సంక్రాంతికి ఎద్దు పందా పోటీు నిర్వహిస్తారు.పోటీలో గెలిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ ఎద్దుకు వస్తు రూపేణ (బంగారం, వెండి) బహుమ తు యిస్తారు. పోటీు కాగానే గ్రామదేవతకు దివ్వెను మోసి పూజించిన తరువాత, ఊరేగించి రాత్రికి పౌరాణిక నాటకం వేయిస్తారు.కర్ణాటక రాష్ట్రానికి చెందిన చింతామణి, రాయల్‌ పాడు, శ్రీనివాసపురాు మా సమీప ప్రాంతాు. ఇంచుమించుగా మదనపల్లె పరిసరా వాళ్లు చేసే విధంగానే తేదీు నిర్ణయించుకొని సంక్రాంతి పండుగ చేస్తారు. కురబకోటలో ఉగాది కొంత ప్రత్యేకతను సంతరించుకుంది. ముస్లిము కొందరు హిందూ పూజారు ఇండ్లకు ఓరోజు ముందు వచ్చి బియ్యం,పప్పు,ఉప్పు,నెయ్యి మొదగు సంభారాు యిచ్చి ఉగాది ప్రసాదం పెట్టమంటారు. ఉగాదిరోజు ఉదయం ఉపవాసముండి మధ్యాహ్నం పూజాయి యిచ్చిన అన్నప్రసాదాన్ని తీసుకుని భక్తితో ఆరగిస్తారు. హిందూ ముస్లిము ఐక్యతకు చక్కని ఉదాహరణ ఈ ఉగాది. ఇలా ఎందుకు చేస్తారని ముస్లిమును అడిగితే మాపెద్దు చెప్పారు మేం చేస్తున్న ఆచారం అంటారు. పండుగు ఆచారాలో చెప్పుకోతగినది ఏమంటే వినాయకచవితి. ఇది ఇక్కడ తొలి పండుగగా భావింపబడుతుంది.దీన్ని ‘‘టెంకాయ పండుగ’’ అంటారు. ఉదయం ఊరుచివర వున్న ‘‘నాగ ప్రతిమను’’ కడిగి పసుపు రాసి పూతో అంకరించి దారా పోగు చుట్టు చుడతారు. పాతో అభిషేకాు చేస్తారు పుట్టలో పాు పోస్తారు. తరువాత ఇంట్లో ‘పేడ’, మట్టి వినాయకుకు పూజ చేసి ఆహార పదార్థాు ఆరగింపు చేస్తారు. పొలాకు వెళ్లి వారి తాతముత్తాత సమా ధును శుభ్రం చేసి టెంకాయు కొట్టి ఆరగింపు చేసి బట్టు పెడతారు. కొందరు దీన్ని ఉగాదిరోజు చేస్తారు.ఈ ప్రాంతంలో అన్నీ ఆవులే కావున ఆవుపేడతో వినాయకుడిని చేస్తారు. వ్యవసాయదారు వ్యవసాయపు ఎరువు ఈ పేడే. అందునా ఆవు పేడ. చనిపోయిన తల్లిదండ్రుకు పూజ వారి పొలాల్లోనే వారి సమాధుకే! మట్టితో విడవలేని మమకారానికి భక్తికి యింతకంటే ప్రత్యేకమైన ఉదాహరణ ఏమన్నా కావాలా? జిడ్డు కృష్ణమూర్తి గారు పుట్టిన మదనపల్లిలో యీ టెంకాయు కొట్టడం శ్రీరామనవమి పండుగరోజు కూడ చేస్తారు. వారివారి మీ చూచుకొని ఉగాదికి కాని, వినాయకచవితికి కాని కుదరకపోతే శ్రీరామ నవమికి చేస్తార నిజానికి ఇది వ్యవసాయదారు పండుగ. తమ పంటను విపరీతంగా పాడుచేసే ఎుకకు -ఏనుగుకు చేసే ప్రార్థన. పంట నాశనం చేయవద్దని ప్రార్థన.
ఇలా ప్రతి పండుగ సాంప్రదాయంలో ఓ చక్కని నిక్షిప్తమైన సందేశం వుంది. నేడు యీ దేశానికి కావసినది ఇదే! మట్టిలో కలిసిపోయే మనం ఆమట్టిని పూజిద్దాం! ఆ ధరిత్రి తల్లి యిచ్చే పంటని కడుపార ఆరగిద్దాం. చివరిగా ‘‘తింటే గారొ తినాలి. వింటే భారతం వినాలి’’ సామెతలో ‘భారతగాధు’ ఈ జిల్లా ప్రత్యేకత.‘‘భారతం మిట్ట’’అనే పేరుతో ఓ ఊరే వుందంటే దాని ప్రాధాన్యత ఎంతో చెప్పాలా? కుప్పం,మదనపల్లి, రామసముద్రం, కాళహస్తి, చెంబుకూరు మొదగు అనేక ప్రాంత గ్రామాల్లో యీ భారతాకు పెట్టింది పేరు. ఎండా కాంలో 18పగళ్లు,14రాత్రులో ఈ కార్యక్రమాు జరుగుతాయి. రోజుకో పర్వం, మధ్యాహ్నం హరికథా రూపంలో భాగవ తాయి చెపుతారు. రాత్రికి ఆకథనే పౌరాణిక నాటకంగా వేస్తారు. ఇందులో ‘బలిబండి’ ‘అర్జునుని తపస్సు’బీ దుర్యోధన వధ ముఖ్యమైన ఘట్టాు. పగటిపూట యివి ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు. మరో చెప్పుకోదగిన విషయం ‘ఉత్తరగోగ్రహణం’ గ్రామీణు తమ గోసంపదను ఓ చోటికి చేర్చి అర్జునుడు, ఉత్తరకుమార పాత్రతో రసవత్తరంగా కథ సాగిస్తారు. కుప్పం దగ్గర ‘‘పెద్ద బంగారు నత్తం’’ గ్రామంలో ఏకంగా ‘‘పాండవుకు దేవాయాలే వున్నాయి’’.ఈ గ్రామంలో 18 రోజు కార్యక్రమా చివరిరోజు ద్రౌపదీ కళ్యాణోత్సవం చేస్తారు. చిత్తూరు జిల్లా పండుగలో స్థానిక ఆచారాు ‘ఎంత మధురం ఎంత మనోహరం’,ఎంత సుందరం? అందరం ఆఆచార సాంప్రదాయాల్ని పండుగల్ని విశ్వాసాల్ని, నమ్మకాల్ని ముందు తరా వారికి ఆదర్శంగా కొనసాగిద్దాం!
-శ్రీ గోమఠం రంగా చార్యులు

1 9 10 11 12 13