రైతు కంట క‌న్నీరు

సంక్రాంతి వచ్చేస్తోంది. అన్నదాత చేతిలో చిల్లిగవ్వ లేదు. పంట విక్రయించి పిల్లాపాపలకు కొత్త బట్టలు కొందా మంటే పండిరచిన ధాన్యం ఇంకా కొనేవారు కనిపిం చడం లేదు. ఆర్‌బికెలకు వెళ్తే తమ శాతం పేరుతో తిప్పి పంపిస్తున్నారు. ధాన్యం ఆరబెట్టాలంటే కళ్లాలు లేవు. తక్కువకు దళారులకు అమ్మలేక సతమతమవుతున్నారు. ఈ ఏడాది వరిసాగుచేస్తే వారిలో 30 శాతం మంది రైతుల పేర్లు వెబ్‌సైట్‌లో కనిపిం చడం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసమస్య సరిదిద్దే ప్రయత్నంలో రెవెన్యూ, వ్యవ సాయశాఖలు సంయుక్తంగా పనిచేయాల్సి ఉంది. ఈ రెండు శాఖల్లో పని ఒత్తిడి కారణంగా వెబ్‌సైట్‌ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. మరోవైపు ఈ-క్రాప్‌ నమోదు జిల్లాలో శతశాతం పూర్తికాలేదు. దీంతో ధాన్యం విక్రయాలకు ఈ సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయి. మరోపక్క తేమ శాతం ఎక్కువగా ఉండటంతో సాగుదారులు పలుమార్లు రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిర గాల్సి వస్తోంది. దీంతో చేసేది లేక రైతులు దళారు లను ఆశ్రయించి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొం టోంది. జిల్లాలో గోనె సంచుల కొరత వేదిస్తోంది. పౌరసరఫరా సంస్థనుంచి సకాలంలో గోనె సంచు లు రాక పోవడంతో ఈ సమస్య తలెత్తు తోంది.

Read more

ప‌చ్చ‌ని పొలాల్లో కాల్సైట్ చిచ్చు

‘‘ గిరిజనులకు ప్రధాన జీవనాధారం భూమి.ఇప్పటికీ అత్యధిక గిరిజన కుటుంబాలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో ప్రతీ గిరిజను కుటుంబానికి సరిపోయనంత భూమి ఉండేది. అనేక కారణాలువల్ల గిరిజనులు తమ భూమిని కోల్పోతూ వస్తున్నారు. నిరక్షరాస్యత, అనారోగ్యం,అజ్ఞానం,ఆర్ధికదోపిడి,కనీస సౌకర్యాలలేమి వారు నిత్యం ఎదుర్కొనే సమస్యలు. వీటి కారణంగా గిరిజనులు తమ భూములు,వనరులను కాపాడుకోలేక పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, గిరిజనుల్లో తమ హక్కులపట్ల చైతన్యం కలిగించి ప్రభుత్వం గిరిజనేతరుల దోపిడీని ప్రతిఘటించే విధంగా వారిని సమీకరించడంపై ‘సమత’ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు పరిధిలోకి వచ్చే ఆదివాసీ ప్రజల సమస్యలు,వనరులు, పర్యావరణ పరిరక్షణ,వారి హక్కులను కాపాడుతూ పోరాటం సాగిస్తోంది. స్థానికులైన గిరిజనల భూములు, అన్యాక్రాంతం కాకుండా ఈ షెడ్యూలు రక్షణ కల్పిస్తుంది. అయినా రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ జిల్లా ఏజెన్సీలో చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గిరిజనేతరులు గిరిజన భూములను ఆక్రమించుకోవడం ఆగలేదు ’’పచ్చని పొలాలపై కాల్సైట్‌ చిచ్చు రగులు తోంది. అగ్ని ఆరదూ..పురుగు చావదు చందంగా ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ,మైనింగ్‌ కాంట్రాక్టర్ల(ఏపీఎం డీసీ)కాల్సైట్‌ మైనింగ్‌ ప్రభావిత గ్రామ రైతుల మధ్య ప్రచ్ఛన్నయుద్దం జరుగుతోంది. రాజ్యాంగానికి విరుద్దంగా,పీసా చట్టం,సమత జడ్జిమెంట్‌లను ఉల్లంఘించి మైనింగ్‌ తవ్వకాలు చేపడితే సహించమని గిరిజన రైతులు ప్రతిఘటి స్తున్నారు. మరోపక్క మైనింగ్‌ కాంట్రాక్టర్ల మైనింగ్‌ ప్రభావిత గ్రామాల్లోని గిరిజనుల మధ్య విభేదాలు సృష్టించి వారిలో వారికి వివాదాలు పెట్టి కాల్సైట్‌ తవ్వకాలు చేపట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ వివాదంపై ఇటీవల మూడు గ్రామాల ప్రజలు ఏర్పాటు చేసిన గ్రామసభ దీనికి తార్కాణం. విశాఖ జిల్లాలోని అనంతగిరి మం డలం కరకవలస,రాళ్లవలస,నిమ్మలపాడు మూడు గ్రామా ల గిరిజన ప్రజల మధ్య కాల్సైట్‌ మైనింగ్‌ తవ్వకాల కోసం ప్రభుత్వం ఇచ్చిన లీజులపై అప్రాంత గిరిజన ప్రజలు వ్యతిరేకిస్తు న్నారు. ప్రభు త్వం ఇచ్చిన లీజులు తక్షణమే రద్దుచేసి స్థానిక గిరిజన సొసైటీలకే మైనింగ్‌ లీజులు అప్పగించాలంటూ గిరిజన ప్రజలు గ్రామసభలో ప్రతిఘటించారు. తమకు రాజ్యాంగం కల్పించిన చట్టాలను బాధ్యతాయతంగా అమలు చేయాలని గ్రామసభ సాక్షిగా కోరారు. మైనింగ్‌ లీజులకు గ్రామసభ తీర్మాణం లేదు. సమతజెడ్జిమెంట్‌, పీసా చట్టం,అటవీహక్కులచట్టం, నియమగిరి జడ్జెమెంట్‌ వంటి గిరిజనులకు రక్షణగా ఉన్న రాజ్యాంగ బద్దమైన చట్టా లను వ్యతిరేకించి.. మైనింగ్‌ లీజులు ఇవ్వడంపై గిరిజన ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసుల హక్కులు, మైనింగ్‌ తవ్వకాలపై పూర్వంనుంచి సమత పలు ఉద్య మాలు చేపట్టి సుప్రీం కోర్టులో కేసు వేసి విజయం సాధించడం జరిగింది. ఫలితంగా సుప్రీం కోర్టు ఇచ్చిన సమత తీర్పును గౌరవించి అమలు చేయాల్సిన ప్రభుత్వం,అధికార యంత్రాంగాలు కంచెచేను మేసే చందంగా వ్యవహరింస్తోందని గ్రామసభ లో గిరిజనరైతులు ధ్వజమెత్తారు. ఈప్రాంతం లో నాటికి నేటికీ గిరిజన ప్రజల స్థితిగతులు ఏమాత్రం మారలేదు. నేటికీ అన్యాయాలకు, అమయక త్వానికి గురవుతునే ఉన్నారు. వారి అమాయ కత్వాన్ని ఆసరాగా తీసుకొని మళ్లీ ప్రాంతంలో మైనింగ్‌ తవ్వకాలకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Read more

మాతృభాషల రక్షణతోనే గిరిజన విద్యాభివృద్ధి

సంఖ్యతో సంబంధం లేకుండా పాఠశాలలను కొనసాగించటం, గిరిజన స్థానిక భాష, లిపిని రాజ్యాంగబద్ధంగా పరిరక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం, వృత్తి విద్యా కోర్సులను రూపొందించి, వాటికి అనుగుణంగా ఉపాధి కల్పించడం, మాతృభాషా వాలంటీర్లను కొనసాగించటం, ఐఏపి, సబ్‌ప్లాన్‌ నిధులను చిత్తశుద్ధితో కొనసాగించటం పట్ల పాలకులు దృష్టి పెడితే గిరిజనుల ఆలోచన విద్య వైపు మళ్లుతుంది.
గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీల జీవన విధానం ఉన్నత స్థితికి చేరాలంటే అక్షరాస్యత చాలా కీలకం. అటువంటి విద్యనందించడంలో పాలకుల వైఫల్యాలు కోకొల్లలు. గిరిజన పిల్లల చదువుల్లో ఆంధ్రప్రదేశ్‌ 48.8 శాతంతో 31వ స్థానం అంటే చివరి స్థానంలో వుంది. ఇప్పటికైనా మేలుకోకపోతే అక్షరాసత్యతా శాతం పడిపోతుంది. రాజ్యాంగంలో షెడ్యూల్‌ తెగలకు ప్రత్యేకమైన రక్షణలు, సదుపాయాలు కల్పించబడ్డాయి. ఆర్టికల్‌ 46 ప్రకారం విద్య, ఆర్థిక వృద్ధి చేపడుతూ వారిని అన్ని విధాలైన సామాజిక అన్యాయాల నుంచి, దోపిడీ నుంచి రక్షించాలి. 5వ షెడ్యూల్‌ ద్వారా గిరిజన ప్రాంతాల పరిపాలన గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యత ఇచ్చింది. 275(1) ప్రకారం షెడ్యూల్‌ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నోడల్‌ ప్యాకేజీలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని సూచించింది. రాజ్యాంగంలో పొందుపరచబడిన గిరిజన హక్కులను కాలరాసే విధానాలను పాలకులు అనుసరిస్తున్న నేపథ్యంలో భాష, తెగలు సమస్య, పేదరికం, నిరక్షరాస్యత, దోపిడీ, మౌలిక సౌకర్యాల లేమి వెంటాడుతున్నాయి. మాతృభాష (స్థానిక భాష) లోనే విద్యాబోధనకు ప్రాధాన్యతనిస్తే గిరిజన పిల్లలు విద్యకు చేరువ అవుతారని గిరిజన ప్రజానీకమే అనేక ప్రయత్నాలు చేసింది. చదువు కోసం తపన పడిన బడులు ఆ ప్రాంతాలలో అప్పటికి లేవు. కొద్దిపాటి చైతన్యంతో ‘మా బడులు’ వెలిసాయి. ‘అక్షర దేవుళ్ళు, అక్షర బ్రహ్మ’ వంటివి ఆవిష్కరించుకుని అక్షరాలకే పూజలు చేసేవారు. స్థానిక భాషల రక్షణ కోసం ఆ భాషలో బోధించేందుకు గిరిజనులు కృషి చేశారు. 1985 నుండి 1990 వరకు విద్య కోసం గిరిజనులు పడ్డ తాపత్రయం పరిశీలించ దగ్గదే. ఈ ప్రాంతాలలో గిరిజనులు విగ్రహాలను పూజించరు, లిపినే నమ్ముతారు. ఆ తెగల అవసరాలను గుర్తించి భాష, లిపి, సంస్కృతిని పరిశీలించాలి. తెలుగు రాష్ట్రాలలో 33 తెగలకు చెందిన గిరిజనులు వున్నారు. అక్షరాస్యత లో వెనుకబడి, విద్యకు దూరంగా ఉన్న ప్రాంతాలుగా గుర్తించి 2005లో స్థానిక భాషలో విద్యాబోధనకు విద్యాశాఖ ప్రయోగాలు మొదలుపెట్టింది. భాషా సమస్య ప్రధాన కారణంగా గుర్తించి లిపి గల భాషలు అన్నింటికీ పాఠ్య పుస్తకాలను ముద్రించారు. నిర్దేశించుకున్న కొన్ని లక్ష్యాల సాధన దిశగా గిరిజన విద్యార్థులలో విద్యపై ఆసక్తి పెంచి బడి మానేసే శాతాన్ని తగ్గించడం, గిరిజన భాష, సంస్కృతులను పరిరక్షించటం కోసం ఇంట్లో మాట్లాడే భాష, బడిలో బోధించే భాషతో తెగలను అనుసంధానం చేయాలి. దాంతో వారు విద్య పట్ల ఆకర్షితులౌతారని గిరిజన సాంస్కృతిక పరిశోధనా సంస్థ, ప్రాథమిక విద్యా పథకం సంయుక్తంగా 2006 నుంచి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రత్యేక మాడ్యూల్స్‌, వాచకాలతో అమలు చేయడం మొదలు పెట్టింది. మంచి ఫలితాలను సాధించింది. ప్రస్తుత పాలకుల విధానాల వలన వాలంటీర్ల వ్యవస్థ నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. మన రాష్ట్రంలో 8 జిల్లాలలో 920 పాఠశాలలలో, స్థానిక లిపి గల భాషలను 811 మంది వాలంటీర్లు బోధిస్తునారు. ఆగస్టు నెలలో పాఠశాలలు తెరిచినా ఇంతవరకూ స్థానిక భాషలకు చెందిన వాలంటీర్ల నియామకం లేదు. కరోనాకు ముందు కూడా ఇటువంటి పరిస్థితి ఉన్న కారణంగా పిల్లలు పూర్తిగా బడులకు దూరం అయ్యారు. పిల్లలు లేరని, తక్కువ సంఖ్యలో ఉన్నారని ఈ లోపల వందల సంఖ్యలో బడులను మూసేస్తున్నారు. కోయ, కొండ, కోలామి, కుయి, ఆదివాసీ ఒరియా, సవర, గోండి భాషలకు లిపి ఉంది. ఇవి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయి. పెద్ద తెగగా ఉన్న జాతాపు భాషకు లిపి లేదు. లిపి లేకపోవడం కూడా వెనుకబాటుకు ఒక కారణం. లిపి ఉన్న భాషలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. స్వాతంత్య్రం రాకమునుపు పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన గిడుగు వెంకట రామమూర్తి గిరిజన జాతుల విద్యాభివృద్ధి అభ్యుదయానికి, ఐక్యతకు సుమారు వంద సంవత్సరాల క్రితమే సవర సంస్కృతి, భాషలపై నిఘంటువును తయారు చేసి వర్ణమాల రూప కర్త అయ్యారు. అన్నిటికంటే ముఖ్యమైనది గిరిజన మాతృభాష బోధన తెలుగు లిపిలో జరుగుతున్నది. కాబట్టి తెలుగు భాష నేర్చు కోవడం సులభం అవుతుంది. విద్యార్థి ఆలోచనా సరళిని అభివృద్ధి చేస్తుంది. ఈనాటికీ 33 తెగలుగా గల ఆదివాసులు స్థానిక భాషలకు లిపిని సమకూర్చే బాధ్యత ప్రభు త్వాలదే. అంతేకాక జన గణన తెగల వారీగా చేపట్టకపోతే అంతరిస్తున్న ఆదిమ తెగలు గురించి తెలిసే అవకాశం లేదు. గిరిజనులు ఐటీడీఏ లక్ష్యాలను ఎలా నెరవే స్తారు? ఈ పరిణామాలన్నీ గిరిజనుల హక్కులు, ఉనికిని నిర్వచిస్తున్న రాజ్యాంగం లోని 5వ షెడ్యూల్‌ స్ఫూర్తిని నీరుగార్చేలా ఉన్నాయి. లిపి గల గిరిజన మాతృభాషలను బోధించే వాలంటీర్లను కొనసాగించడం లేదు. అన్ని ఐటీడీఏ లలో ఇదే పరిస్థితి ఉంది.3,4,5 తరగతుల విద్యార్థులను ఆశ్రమ పాఠశాలలకు తరలించడం వలన స్థానిక మాతృభాషతో తెలుగు నేర్చుకునే పరిస్థితులు లేవు. ఈ బోధన కేవలం ప్రాథమిక పాఠశాల లోనే జరుగుతుంది. ఆశ్రమ పాఠశాలలోనే ఈ భాషలను బోధించే వాలంటీర్లు ఉండరు. టీచర్ల నియామకాలు లేకపోవడంతో, ఆశ్రమ పాఠశాలలో వారి ఆలనా పాలనా చూసే ప్రత్యేక టీచర్లు లేరు. సమగ్ర సర్వే లేకపోవడం, ప్రత్యామ్నాయ పాఠశాలల రద్దు చేయటం, నేటికి గిరి శిఖరాలకు రవాణా,విద్యుత్తు, వైద్య, కమ్యూనికేషన్‌ సౌకర్యాలు లేకపోవడం, పాలకుల విధానాలతో మాతృభాష విద్యా బోధనపై దాడి మరింత వెనుకబాటుకు దారితీస్తున్నది. ప్రత్యామ్నాయాలు లేకపోలేదు. సంఖ్యతో సంబంధం లేకుండా పాఠశాలలను కొనసాగించటం, గిరిజన స్థానిక భాష, లిపిని రాజ్యాంగబద్ధంగా పరిరక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం, వృత్తి విద్యా కోర్సులను రూపొందించి, వాటికి అనుగుణంగా ఉపాధి కల్పించడం, మాతృభాషా వాలంటీర్లను కొనసాగించటం, ఐఏపి, సబ్‌ప్లాన్‌ నిధులను చిత్తశుద్ధితో కొనసాగించటం పట్ల పాలకులు దృష్టి పెడితే గిరిజనుల ఆలోచన విద్య వైపు మళ్లుతుంది. ఆ ప్రాంతాలకు గల ప్రత్యేక పరిస్థితులను బట్టి ఎన్ని అవకాశాలు ఉంటే అన్నింటినీ అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిది. కనుకనే భాష, సంస్కృతి, లిపి, విద్య వంటి అంశాల ప్రాధాన్యతను గుర్తించే ప్రతి ఒక్కరు రాజ్యాంగ పరమైన హక్కులకు భంగం కలగకుండా, భంగం కలిగించే విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. ఓకే భాష మాట్లాడే తెగలన్నీ తమ తమ ప్రాంతాలలో ఐక్యతను సాధించాయి. స్వాతంత్య్ర పోరాటంలో సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడాయి. అన్నింటికి మూలమైన చారిత్రక అంశం భాష. అటువంటి గిరిజన మాతృభాషల పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు అనివార్యం.
మౌళిక వసతులు కల్పించాలి
మాతృభాషతోపాటు గిరిజన విద్యాలయాల్లో మౌళిక వసతులు కల్పించాలి. నాడు నేడు కార్యక్రమంలో కొన్ని పాఠశాలలను మాత్రమే అభివృద్ధి చేశారు. మారుమూల లోతట్టు ప్రాంతాల్లో చాలా పాఠశాలలు అధ్వానంగా పడి ఉన్నాయి. వాటికి యుద్ద ప్రాతిపదన నిధులు మంజూరు చేయించి ఆధునీకరిం చాలి.ఉపాధ్యాయులు లేని పాఠశాల్లో ఉపాధ్యాయులను నియమించాలి. -కె.విజయ గౌరి

మొకం మల్లచ్చింది సారు

మానవతా దృక్పథం… సామాజిక స్పృహతో తన ఉద్యోగ ధర్మం నిర్వ ర్తించి గిరిజనుల గుండెల్లోనే కాదు.. తనలోని సృజనాత్మకత ఆసరాగా తెలుగు సాహితీ క్షేత్రంలో కథారచయితగా స్థానం సంపాదించారు. గిరిజన జీవితాలపట్ల సంపూర్ణ అవగాహన కలిగిన అధికారి గుర్తింపు పొందారు. ఆనేపథ్యంలో తన అనుభవాలు ఆలోచనలకు తనదైన సృజనాత్మకత జోడిరచి శాశ్వతత్వం తెచ్చే లక్ష్యంతో రాసిన 20కథలను ఏకం చేసి ‘భద్రాచలం మన్యం కథలు’ పేరుతో ప్రచురిం చారు . అందులోని కథే ‘నామొకంమల్లోచ్చింది సార్‌’ తెలుగు కథా సాహిత్యంలో గిరిజన కథలు అనగానే గుర్తుకు వచ్చే ఒకవిశిష్టమైన రచయిత ఎ. విద్యాసాగర్‌. వృత్తిరీత్యా ఆయన ఐఏఎస్‌ అధికారి,1988 నుంచి రెండేళ్ల పాటు పూర్వక ఖమ్మం జిల్లాలోని పాల్వంచ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా పనిచేసి దాని పరిధిలో గోదావరికి ఆవల ఈవల గిరిజనగూడేలతో,గిరిజనులతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకున్నారు. పాలన అధికారిగా మొక్కుబడిగా గిరిజనుల అభివృద్ధి గురించి పనిచేయలేదు. మానవతా దృక్పథంతో సామాజికస్పృహతో తన ఉద్యోగధర్మం నిర్వ ర్తించి గిరిజనుల గుండెల్లోనే కాదు..తనలోని సృజనాత్మకత ఆసరాగా తెలుగు సాహితీ క్షేత్రం లో కథారచయితగా స్థానం సంపాదించారు. ఎ.విద్యాసాగర్‌గా సుపరిచితుడైన ‘అంగల కుర్తి విద్యాసాగర్‌’ పుట్టి పెరిగింది ప్రకాశంజిల్లా. స్వతహాగా తెలుగువాడు కావడం తెలుగు భాష మీద పట్టు ఉండటం గ్రూప్‌ వన్‌ పోటీ పరీక్ష ల్లో తెలుగు సాహిత్యం ప్రధానాంశంగా తీసు కోవడం,ఉద్యోగరీత్యా గిరిజన ప్రాంతాల్లో పని చేయడం ద్వారా గిరిజన జీవితాలపట్ల సం పూర్ణ అవగాహన కలిగింది ఆయనకు. ఆ నేపథ్యంలో తన అనుభవాలు ఆలోచనలకు తనదైన సృజనాత్మకత జోడిరచి శాశ్వతత్వం తెచ్చే లక్ష్యంతో రాసిన 20కథలను ఏకం చేసి ‘భద్రాచలం మన్యం కథలు’ పేరుతో ప్రచురిం చారు అందులోని కథే ‘నామొకంమల్లోచ్చింది సార్‌’.గిరిజనులు నిత్యం అడవుల్లో తిరగడం వల్ల అక్కడ ఉండేపెద్ద పులులు,ఎలుగు బంట్లు, బారినపడి గాయాలపాలవడం,ఒక్కోసారి ప్రాణాలు సైతం కోల్పోవడం సర్వసాధారణం. ఇక కథ విషయానికొస్తే రచయిత పాల్వంచలో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా పని చేస్తున్న కాలం, అక్కడికి సమీపంలోని ‘‘యానం బయలు’’ వద్ద గల గిరిజన గ్రామంకు చెందిన ఒక గిరిజనుడు తన అల్లుడుతో కలిసి అడవికి వెళ్లగా, అక్కడ అతని పై ఎలుగుబంటి దాడి చేయగా మొహం అంతాగాయమై, ఒకకన్ను కూడా పోగొట్టుకొని, రెండు రోజులపాటు వారికి తెలిసిన పసరు వైద్యం చేసుకుని గాయం నయం కాక ముంబై లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకోగా ప్రాథమిక చికిత్స చేసిన డాక్టరు ఖమ్మం పెద్ద ఆసుపత్రికి వెళ్ళమని సలహా ఇవ్వడంతో, దిక్కుతోచక నడిచి పాల్వంచరావడం, వీరి దీనస్థితి చూసిన కానిస్టేబుల్‌ అర్ధరాత్రి పూట దగ్గర్లోని ఐటీడిఎకి వాళ్ళని చేర్చి క్షతగాత్రుని భార్య సీతమ్మద్వారా పూర్తి వివరాలు తెలుసు కున్న కానిస్టేబుల్‌ ఆరాత్రి వేళప్రాజెక్టు అధి కారికి విషయం తెలియజేసి,అక్కడ గిరిజనుల సహాయార్థం ఏర్పాటు చేయబడిఉండే జీపు సాయం అడుగుతాడు.కార్యాలయం బయట వరండాలో జుగుత్సా కరమైన స్థితిలో పడుకొని ఉన్నా ఆముసలి గిరిజనుడి దయనీయ స్థితి చూసిన ప్రాజెక్టు అధికారి చలించిపోతాడు. దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మళ్లీ కట్టు కట్టించి తెల్లవారాక ఒకవ్యక్తిని సాయం ఇచ్చి ఖమ్మం కాకుండా సరాసరి హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రికి పంపిస్తారు. అతడితో వచ్చిన అల్లుడు పెద్దాసుపత్రిలో ఉండేందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకోవడానికి సొంత గ్రామం వెళ్లిపోతాడు. క్షతగాత్రునితో అతని భార్య ఒక్కతే వెడుతుంది.హైదరాబాద్‌ ఆసుప త్రికి పంపించిన నాలుగు రోజులు కూడా పూర్తి కాకుండానే పాల్వంచ ఐటీడీఏవరండాలో ప్రాజెక్టు అధికారి ముందు ప్రత్యక్షం అవుతారు ఆముగ్గురు.ఎలుగుబంటి దాడిలో గాయపడ్డ ముసలాడి పరిస్థితిలో ఏమార్పు లేదు.అదే జుగు త్సాకరమైన రూపం. చీము నెత్తురుతో చివికి పోయి వాసన వస్తున్న బ్యాండేజీ కట్టు. ఆదృశ్యం చూసిన ప్రాజెక్ట్‌ అధికారికి కోపం విసుగు ఒక్కసారిగా వచ్చిన,గిరిజనుల్లో ఉండే అమాయకత్వం, నిస్సహాయతలకు ఆచేతనుడవు తాడు. చివరికి అతని భార్య ద్వారా అసలు విషయం తెలుస్తుంది.‘ఆపెద్దపట్నం పెద్దాసు పత్రిలో తన ముఖంనయంఅయి మళ్ళీ వస్తదో రాదో కానీ ఒకవేళ ఇక్కడే చచ్చిపోతే..!! దేశం కాని దేశంలో అసలుచావ, నన్ను మన ఊరికి తీసుకుపోండి అనే ముసలోడు ఒకటే గోల చేసిండు.’అని చెబుతూనే ఆదావత్‌ దవాఖా నాల్లో బిట్లు లేక కిందనే పడుకోబెట్టి వైద్యం చేశారని ఒకసారి డాక్టర్‌ వచ్చి చూసి పోతే మళ్ళీ పొద్దుట ఆయన వచ్చి చూసే దాకా ఎవరూ రారని అడిగిన ఏది చెప్పరని,అక్కడి దయనీయ స్థితి సీతద్వారా తెలుసుకున్న ప్రాజెక్టు అధికారి.ఈవిషయాల గురించి తాను ముందు గా తెలుసుకోనందుకు తనలో తానే సిగ్గు పడ తారు.‘సరే అయిందేదో అయింది కానీ రేపు మీతో ఉండటానికి ఒక మనిషిని ఇచ్చి రెండు వారాలపాటు అక్కడ ఉండటానికి మీకు ఏర్పాటు చేస్తామని’ అంటారు. కానీ మళ్లీ పట్నం పోవడానికి,వాళ్ళు ససేమిరా ఒప్పుకోరు, సరే ఈరాత్రి ఇక్కడే ఉండి తెల్లవారాక చేయా ల్సిన దాని గురించి ఆలోచిద్దామని నచ్చచెప్తారు, కానీ తెల్లవారి వాళ్ళు అక్కడ కనిపించడం లేదని వాచ్‌ మెన్‌ చెప్పిన మాటలతో, కథకు డైన ప్రాజెక్టు అధికారిలో తను ఓడిపోయాననే భావం ఆవరిస్తుంది, పాపం అమాయకపు గిరిజనుడు ఏమవుతాడో!? అనే ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆరు నెలలయ్యాక ఒక రోజు పాల్వంచ మండలం లోని‘ఉలవనూరు’గిరిజన సదస్సులో పాల్గొన్న ప్రాజెక్టు అధికారి వద్దకు ముఖంపై కొంచెం మొర్రి ఉన్న ముసలాడు వచ్చి ‘‘నన్ను గుర్తుపట్టలేదా సారు నా మొకం మల్ల చ్చింది సారు’’ అంటూ తనను తాను పరిచయం చేసుకోవడమే కాదు….ఆస్పత్రిలో వైద్యం చేసిన డాక్టర్లు,తనకు సేవలు చేసిన తన భార్య సీతను, గుర్తుచేసుకుంటూ మీలాంటి గవర్నమెంట్‌ పెద్ద సార్లు మాలాంటి పేదలను ఆపదలో వున్నప్పు డు అట్ల ఆదుకుంటారని,డబ్బులు ఖర్చు పెడ తారని, నాకు అప్పుడు తెలియదు,మీ అందరి దయవల్లే బతికి మీ ముందు ఈరోజు ఇలా ఉన్నాను అంటూ అత్యున్నతమైన పశ్చాత్తాప గుణంతో ప్రాజెక్టు అధికారి ముందు కృతజ్ఞతా భావంతో నిలబడతాడు ఆగిరిజనవృద్ధుడు. ఆ గిరిజన ముసలాడి మాటలతో చలించిన ప్రాజెక్టు అధికారి ఆలోచనల సింహా వలోకనం తో ఈ కథ ప్రారంభమవుతుంది. కథ మొత్తం జ్ఞాపకాలు దారిలో నడిచిన, వాస్తవ సంఘట నల సమాహారంలా కనిపిస్తుంది. ప్రతి సంఘ టనలో సమకాలీన పరిస్థితులు, గిరిజనుల్లో ఉండే దయనీయ స్థితి, కష్టకాలంలో వారిలో ఉండే సహకారం, మానవ సంబంధాల గురించి, కథా రచయిత స్పష్టపరిచారు. ప్రస్తుత రోజు గడుపుకోవడానికే సతమతమయ్యే అరణ్య వాసులను భవిష్యత్తు గురించి ఆలోచించ మనడం,సబబు కాదనే భావన రచయిత ఇందులో వ్యక్తం చేస్తారు. తన కష్టాలకు తాను బాధపడుతున్న తన కర్తవ్యాన్ని, భార్యాభర్తల బంధాన్ని,మర్చిపోని గిరిజన స్త్రీ వ్యక్తిత్వం గురించి సీతమ్మ పాత్ర ద్వారా రచయిత చక్కగా ఆవిష్కరిస్తారు. తాను పూర్తిగా ప్రభుత్వం వారు అందించే వైద్య సాయం పొందక పోయినా, జన్మనిచ్చిన భూమి మీదే చనిపోవాలని కోరిక, పట్టణవాసపు వాసనలు,అక్కడి అసౌకర్యాలు, పడక వైద్యం చేయించుకోకుండా మధ్యలో పారిపోయి వచ్చితమదైన పసరు వైద్యంతో తన గాయం మాన్పుకున్నా…కొద్దిపాటి సాయాన్ని కూడా మరవ కుండా కృతజ్ఞతలు చెప్పిన గిరిజనవృద్దుడి లోని గొప్పదైన కృతజ్ఞతాభావం తన అనుభవసారం జోడిరచి చెప్పడంలో కథారచయిత పరిశీలనాశక్తి అర్థమవుతుంది. నిజానికి ఆగిరిజన వృద్ధుడికి చేయగలిగినంత సాయం చేయలేకపోయామని,పెద్దగా సాయం చేసింది ఏమీ లేదని,అవమానపడటంలో రచయిత పారదర్శకత స్పష్టమవుతోంది. చేసిన కొద్దిపాటి సాయాన్ని తమజీవితాంతం గుర్తు పెట్టుకునే కల్మషం ఎరుగని ఉన్నత వ్యక్తిత్వం అడవిబిడ్డల సొంతం,అనే గొప్ప విషయాన్ని రచయిత విద్యాసాగర్‌ ఇందులో అద్భుతంగా, అనుభవపూర్వకంగా,ఆవిష్కరించిన వైనం అభి నందనీయం.ఈ కథలో ఎలుగుబంటి దాడిలో గాయపడ్డ గిరిజన వృద్ధుడి స్థితి హృదయ విదారకంగా చెప్పబడి కరుణరస భరితంగా సాగిన,కష్టాల్లో సైతం ధైర్యంగా వాటిని ఎదు ర్కునే ధీరగుణం గిరిజనుల్లో ఎలా ఉంటుందో కళ్లకు కట్టింది. ప్రభుత్వాలు గిరిజనుల సమగ్రా భివృద్ధికి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ఐటీడీఏ లు ఏర్పాటు చేసిన దాని ఫలితాలు అందుకోవడంలో గిరిజనులు అందించడంలో అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారు అని దీనికి తెలియని అజ్ఞానం గిరిజనులది అయితే, వృత్తి పట్ల పూర్తి నిర్లక్ష్యం అధికారులది కావడం అని, నిర్మొహమాటంగా రచయిత చెబుతారు. తాను ఒకగిరిజన అభివృద్ధి అధికారి కూడా తమ శాఖల లోపాలను ఖచ్చితంగా తన రచన లో వెల్లడిరచడం ద్వారా ఈకథా రచయిత, ఉత్తమరచయిత గుణాలు సొంతం చేసుకుని ఆదర్శ రచయితగా నిలిచారు, ఇది రచయితలు అందరూ ఆచరించదగ్గ గొప్ప విషయం.కథ మొత్తం రచయిత తన జ్ఞాపకాల సాయంతో నడిపిన, సంబంధిత సంఘటనలు, పాత్రోచిత సంభాషణలు,రచయిత కథన శైలి, వెరచి పాఠకులకు మంచి కథ చదివామనే సంతృప్తి మిగులుతుంది. రచయిత తెలుగు భాషా నైపు ణ్యం కూడా కథమొత్తం విస్తరించింది.వాస్తవ సంఘటనలను కాకా చెబుతూనే భవిష్యత్తులో అడవిబిడ్డల మనుగడ కోసం మనం ఏంచే యాలో కూడా చెప్పిన ఈకథలో సంపూర్ణ కథా లక్షణాలు సలక్షణంగా కనిపిస్తాయి
-(వచ్చే మాసం మీకోసం స్వర్ణ ముఖి కథ ‘‘గోరపిట’’) -డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు, ఫోను: 77298 83223

కులం సంకెళ్లు.. ఇంకెన్నాళ్లు ?

తరాలు మారుతున్నా కులం పేరుతో జరుగుతున్న హత్యలు మాత్రం ఆగడం లేదు. కులం మారి పెండ్లిళ్లు చేసుకుంటే అయినోళ్లే బొందవెడు తున్నారు. నిన్నగాక ఇటీవల వరంగల్‌ లో కులాం తర పెండ్లి చేసుకుందని కన్నతల్లే కూతుర్ని కడ తేర్చింది. నిన్న మహారాష్ట్ర ఔరంగాబాద్‌ జిల్లాలో అక్క వేరే కులపుటోణ్ని పెండ్లి చేసుకుంది.. అంతే కడుపుతో ఉందని కూడా చూడకుండా నరికి చంపిండు ఓ తమ్ముడు. దాన్ని సెల్ఫీ తీసి అందరికీ చూపిండు. సాంకేతికంగా ఎంతో ఎదిగిపోయాం అంటూ జబ్బలు చరుచుకుంటున్నాం.. కానీ ఇలా పరువుప్రతిష్ట అంటూ అయినోళ్లనే నిర్థాక్షిణ్యంగా పొట్టన పెట్టుకుంటున్న వారిని మాత్రం ఏమీ చేయలేక పోతున్నాం. ఎన్ని చట్టాలు తెచ్చినా వారిలో మార్పు తేలేకపోతున్నాం. మరి ఈ కులాల కార్చిచ్చు ఆగేదెన్నడు? ప్రేమకు నీడ దొరికేదెన్నడు? పచ్చని జంటలు తమ బతుకులు పండిరచుకునేదెప్పుడు? మన సమాజాన్నిపట్టి పీడిస్తున్న భయం కరమైన జబ్బు కులవ్యవస్థే. కుల ప్రభావం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందకపోవడానికి కారణం కుల వ్యవస్థే అని మనదేశాన్ని లోతుగా పరిశీలిం చిన సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశం లోని ప్రతి మనిషికి ఏమున్నా లేకున్నా కులం మాత్రం గ్యారంటీ. వేల కులాలున్న ఈ సమాజంలో ఏ కులం కూడా ఇంకో కులంతో సమానం కాదు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఇప్పటికీ దాదాపు 30 కోట్ల మంది అంటరానితనం, కులవివక్షతో అణచివేయబడుతున్నారు. మనదేశంలో కులం కొందరికి వరమైతే.. ఎందరికో శాపంగా మారు తోంది. కులాల చిచ్చుతో రగులుతున్న మన సమా జానికి శస్త్రచికిత్స తక్షణ అవసరం. ఆరోజు రావా లంటే ప్రజల్లో సామాజిక చైతన్యం రావాలి.. కుల రహిత సమాజం ఆవిర్భవించాలి. అనునిత్యం దాడులు.. దౌర్జన్యాలు
రెండు వేల సంవత్సరాలకు పైగా మన సమాజాన్ని అంధకారం,అజ్ఞానంలో ఉంచటంలో కులవ్యవస్థ పాత్ర ఎంతో ఉంది. శ్రమచేసే వారికిచదువు లేకుం డా చేసింది కులమే. మనుషుల మధ్య ఐక్యత, సాన్నిహిత్యం లేకుండా చేస్తోంది కులమే. ప్రేమిం చడాన్ని సహించదు సరికదా ద్వేషించడాన్నే ప్రేమి స్తుంది. ఉన్నత చదువులు చదివి విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వారు సైతం.. తిరిగి మన దేశానికొచ్చి తన కులమెక్కడుందో వెతుక్కొని, సొంత కులంలోనే పెండ్లి చేసుకుంటున్నారంటే కులమెంతగా ప్రభావం చూపుతుందో అర్థమవు తోంది. కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై, చేసుకోవాలి అనుకునే వారిపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు జరగడం మన సమాజంలో మామూలై పోయింది. గత నెలలో వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఎస్సీ కులానికి చెందిన యువతి ఎస్టీ యువకుడిని ప్రేమించింది. అది నచ్చని ఆమె తల్లి,అమ్మమ్మ కలిసి దారుణంగా చంపేశారు. తమ కుల కట్టుబాట్లు దాటినందుకే హత్య చేశామని, మా కులం కాని వాడితో పెళ్లి వద్దన్నా వినలేదు అందుకే చంపాల్సి వచ్చిందని వారు సమర్థించు కున్నారు. కులాంతర వివాహాల పట్ల కర్కశత్వంగా వ్యవహరించడం ఇదేమీ మొదటిసారి కాదు, అలాగని చివరిదీ కాదు. గతంలో ఇలాంటి ఘట నలు అనేకం మన ముందున్నాయి.

అన్నీ కుల దురహంకార హత్యలే..
మిర్యాలగూడలో వైశ్య కులానికి చెందిన అమృత భర్త ప్రణయ్‌ను ఆమె తండ్రి, బాబాయిలే కిరాయి గూండాలతో హత్య చేయించారు. ప్రణయ్‌ దళిత మధ్యతరగతి కుటుంబంలో పుట్టడమే దానికి కారణం. ఇదే విధంగా కర్నూల్‌లో కులాంతర వివాహం చేసుకున్నందుకు ఆదాం స్మిత్‌ను గొడ్డళ్లతో నరికి చంపారు. హైదరాబాద్‌లో అవంతిరెడ్డి కులాం తర వివాహం చేసుకున్నందుకు వైశ్య కులానికి చెందిన హేమంత్‌ కుమార్‌ను అవంతి తండ్రి, మామ కిరాయి గూండాల సహకారంతో చంపించారు. భువనగిరిలో స్వాతిరెడ్డి భర్త నరేశ్‌ రజకుడని ఆమె తండ్రి,బంధువులు కలిసి నిర్ధాక్షి ణ్యంగా హత్య చేశారు. పొరుగు రాష్ట్రమైన తమిళ నాడులో సంచలనం సృష్టించిన కౌసల్య భర్త శంకర్‌ హత్య ఈకోవకు చెందిందే. శంకర్‌ దళి తుడైన కారణంగా అతణ్ని కౌసల్య తండ్రి, బంధు వులు కలిసిహత్య చేశారు. పంజాబ్‌కు చెందిన కావ్య భర్త అభిషేక్‌ను కూడా కులాంతర వివాహం చేసుకున్నందుకు చంపేశారు. అక్కడా ఇక్కడా అని లేదు దేశం నలుమూలలా తమ కులం కాని వారిని పెండ్లి చేసుకున్నందుకు అమానుషంగా హత్యలు చేస్తున్నారు. ఇవన్నీ నూటికి నూరుపాళ్లు కుల దురహంకార హత్యలే. ఈ హత్యలన్నీ సమీప రక్త సంబంధీకులు చేస్తున్నవే. కానీ, ఇవి అరుదుగా, అప్పుడప్పుడు జరుగుతున్న ఘటనలుగా, ప్రాధాన్యతలేని వార్తలుగా చూస్తున్నారు. తరతరాల చరిత్రలో ఇలాంటివి ఎన్నెన్నో. ఈ రోజు సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, సామాజిక మాధ్యమాలు విస్తృతం కావడం వల్ల ఇవి వెలుగులోకి వస్తున్నాయంతే.

వేరే కులం వారిని పెండ్లి చేసుకుంటే..
పిల్లలు కులాంతర వివాహాలు చేసుకుని తమ కుటుంబం పరువు తీశారని తల్లితండ్రులు, తోబు ట్టువులు, బంధువులు వాదిస్తున్నారు. ఆధిపత్య కులాల వారు తమకులం పరువుపోతోందని ఇలాం టి ఘోరాలకు పాల్పడుతున్నారు. రెండు వేర్వేరు కులాల వాళ్లు పెండ్లి చేసుకుంటే ఒకరు పైకులం గా,ఇంకొకరు కింది కులంగా భావిం చడమే ఇందు కు కారణం. తమకులం కంటే తక్కువ కులమని భావించిన ప్రతి ఒక్కరూ దాడులకు, దౌర్జన్యాలకు, హత్యలకు తెగబడు తున్నారు. కులాంతర వివాహాన్ని వ్యతిరేకించని తల్లిదండ్రు లను కూడా మిగతా బంధువులు వెలి వేస్తున్నారు. వారి పిల్లల్ని ఆదరించకుండా వాళ్లను శిక్షించాలని కులమంతా వేధిస్తోంది. ఎవరైనా కులాంతర వివాహాలు చేస్తు న్నా, ప్రోత్సహిస్తున్నా వారిని ధర్మం తప్పినట్లు కుల సమాజం చూస్తోంది.హంతకులుగా మారుతున్న రక్తసంబంధికులెవరూ తాము చేసింది తప్పని అను కోవడం లేదు. కులధర్మాన్ని కాపాడ టానికే ఈ పని చేశామని ఫీల్‌ అవుతున్నారు.

కుల రహిత సమాజం రావాలంటే..
కులం మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న భయం కరమైన వ్యాధిగా మారింది.21వ శతాబ్దంలో కూడా అంటరానితనం, వివక్షలు కుల సంస్కృతిలో భాగమైపోయాయి. ఈ అమానుష కులవ్యవస్థను అంతం చేయడానికి ఎన్ని పథకాలు పెట్టినా కొత్త కొత్త రూపాల్లో అదిప్రత్యక్షమవుతునే ఉంది. ప్రస్తుతం సమాజానికి ఇదో సవాల్‌గా మారింది. ఈ సంస్కృతి సమాజ పురోగమనానికి ఆటంకంగా మారుతోంది. కుల వ్యవస్థ ఇంతకాలం సజీవంగా మిగలడానికి, భవిష్యత్తులో కూడా కొనసాగేది స్వకుల వివాహల ద్వారానే. కులాంతర వివాహాలు ఎంత ఎక్కువగా, ఎంత వేగంగా జరిగితే అంత త్వరగా కులరహిత సమాజం ఏర్పడుతుంది. బాహ్య వివాహాలు(తమ కులాలు కాకుండా బయటి కులాల నుంచి) ఒక నియమమైతే కుల వ్యవస్థే మిగలదన్నారు భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెచ్‌? అంబేద్కర్‌. ఈ దిశలో కుల వ్యవస్థను నిర్మూలించడానికి మహోద్యమం చేయాల్సిన అవసరం ఉంది.

సాంస్కృతిక విప్లవం రావాలె..
సొంత కులం వారినే వివాహాలు చేసుకోవాలని, అదే ధర్మమని, ఆ ధర్మాన్ని ఉల్లంఘించి కులాంతర వివాహాలు చేసుకుంటే మరణ శిక్ష విధించాలని మన ధర్మ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఇవి ఆనాటి సమకాలీన పరిస్థితులను అనుసరించి రాసినవి. కానీ ‘సంఘం శరణం గచ్చామి.. ధర్మం శరణం గచ్చామి’ అన్న బుద్ధుని ప్రబోధనలను అనుసరిస్తే.. మారుతున్న పరిస్థితులతోపాటు జనమూ మారక తప్పదు. కుల వ్యవస్థను సమూలంగా నిర్మూలిం చడం మనందరి బాధ్యత. వందలాది కులాలున్న సమాజంలో ఒక్క మన కులం కాక మరే కులంలో వివాహం చేసుకున్నా అది కుల రహిత సమాజానికై జరుగుతున్న పోరాటంలో ఒక భాగమే. పెండ్లిలకు ‘ఒక్క నీకులంతప్ప, ఏ కుల మైనా ఫర్వాలేదు’ అన్న నినాదం కావాలి. అందు కోసం దేశంలో అతిపెద్ద సాంస్కృతిక విప్లవం రావాలి. -కందుకూరి సతీష్‌ కుమార్‌

అమ్మాయి వివాహం వ‌య‌స్సు 21కి పెంపు

అమ్మాయిల కనీస వివాహ వయసును 21 సంవత్సరాలకు పెంచేందుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. హిందూ వివాహ చట్టం (1955)ను అనుసరించి అమ్మాయిల కనీస వివాహ వయసు 18 సంవత్సరాలు ఉండేది. దీనిని పురుషులతో సమానంగా 21 సంవత్సరాలు చేసేందుకు క్యాబినెట్‌ అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయా నికి అనుగుణంగా ప్రత్యేక వివాహ చట్టం (1954), బాల్య వివాహాల నిరోధక చట్టం (2006), హిందూ వివాహ చట్టం(1955)లో కూడా తగిన సవరణలు చేయాల్సి ఉంటుంది. అమ్మాయిల వివాహ వయసును 18 సంవత్సరాలుగా 1978లో నిర్ణయించారు. అమ్మాయిల పెళ్లి వయసు పెంపుపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ నేతృత్వంలో టాస్క్‌ ఫోర్స్‌ కమి టీని నియమించింది.21 సంవత్సరాలకు పెంచా లని ఈ కమిటీ ప్రతిపాదించింది. ఇందు కోసం దేశవ్యాప్తంగా 16 యూనివర్సిటీలు,15 స్వచ్చంద సేవాసంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ కమిటీకి సమతా పార్టీమాజీఛైర్మన్‌ జయ జైట్లీ నేతృత్వం వహించారు. ఈమెతో పాటు, ఈ కమిటీ లో నీతిఆయోగ్‌సభ్యులు డాక్టర్‌ వి.కె.పాల్‌, న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్‌ అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు.స్కూళ్లలో లైంగిక విద్యను తప్పని సరి చేయాలని కూడా ఈ కమిటీ సూచించింది.ఈ నిర్ణయం లింగ సమానత్వాన్ని సాధించేందుకు సహకరిస్తుందని ప్రభుత్వం చెబు తోంది. అమ్మాయిలు,అబ్బాయిల వివాహ వయసు లోని అంతరాన్ని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నిర్ణయం లింగ సమానత్వాన్ని సాధిస్తుందా?
సమాజంలో పితృస్వామ్య భావజాలాన్ని పెంచి పోషించినంత వరకూ బాలికల హోదాలో, పరిస్థి తుల్లో ఎటువంటి మార్పులు రావని స్త్రీవాద పత్రిక ‘భూమిక’సంపాదకురాలు కొండవీటి సత్యవతి అంటారు. బాలికల కనీస వివాహ వయసును ప్రభుత్వం 21సంవత్సరాలకు పెంచడంపై ఆమె ఒక వ్యాసం రాశారు. సామాజిక వాతావరణాన్ని ప్రక్షాళన చేయకుండా వివాహ వయో పరిమితిని పెంచడంలో అర్ధం లేదు. బాలికలపై చూపించే వివక్షకు మూలకారణాలను తెలుసుకోకుండా సమా నత్వాన్ని సాధించడం కష్టమని ఆమె అంటారు. ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతి స్తున్నానని అంటూ లింగ సమానత్వం సాధించ డానికి ఇదొక మెట్టు లాంటిదని ఆంధ్రయూని వర్సిటీ లా కాలేజీ విభాగాధిపతి డాక్టర్‌ సుమిత్ర అన్నారు.

ఈ నిర్ణయం బాల్య వివాహాలను ఆపుతుందా?
భారతదేశంలో 2019-20నాటికి బాల్య వివా హాలు 23% ఉన్నట్లు ఇటీవల విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలిపింది. ఇది 2015-16లో 27% ఉండేది.బాల్య వివాహాలు శిశు మరణాలకు, ప్రసూతి మరణాలకు కూడా కారణం అవుతున్నాయి.చిన్న పిల్లల పెళ్లిళ్ల గురించి చర్చ మొదలై 150 సంవత్సరాలు గడిచిపోయినా, నేటికీ ఇదొక సమస్యగానే ఉండిపోవడం విచారకరమని సత్యవతి అంటారు. ‘‘చిన్న వయసులోనే రజస్వల అవ్వడంవల్ల చురుకుగా మారే హార్మోన్ల ఒత్తిడిని అమ్మాయిలు ఎలా అధిగమిస్తారు? గ్రామాల్లో హై స్కూల్‌ అయిపోయిన తర్వాత ఎక్కడ చదివించాలనే సందేహం,ఆడపిల్లలను దూరంగా పంపించి చది వించేందుకు ఇష్టం చూపకపోవడం, అమ్మాయిలకు సురక్షిత వాతావరణం లేకపోవడం, లైంగిక వేధింపులు కూడా బాల్య వివాహాలకు దారి తీస్తున్నాయి’’ అని ఆమె అన్నారు. యుక్తవయసులో ఉన్న 51% చదువు లేని అమ్మాయిలు, ప్రాధమిక విద్యను మాత్రమే అభ్యసించిన 47%మంది అమ్మా యిలు 18సంవత్సరాలులోపే వివాహం చేసు కున్నట్లు యూఎన్‌ఎఫ్‌పీఏ ఇండియా-2020 నివేదిక చెబుతోంది. భారత్‌లో 1.5కోట్ల మంది అమ్మాయిలకు 18ఏళ్లలోపే వివాహమైందని నివేది కలో జయ చెప్పారు. అయితే ఇదివరకు 46శాతం (మొత్తం బాలికల్లో 46శాతం మంది)గా ఉండే ఈ వివాహాలు ప్రస్తుతం 27శాతానికి తగ్గాయని జయా జైట్లీ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గిరిజన తెగల్లో మార్పు తెస్తుందో లేదో సందేహమేనని అంటున్నారు నిర్ణయ్‌ స్వచ్చంద సంస్థకు చెందిన నిఖిని వర్మ. ఆమె తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజన మహిళలు, బాలికల విద్య కోసం పని చేస్తున్నారు.‘‘గిరిజన ప్రాంతాల్లో పాటించే ఆచారాలు వారి సంస్కృతి పై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా,ఈప్రాంతాల్లో ప్రతి నిర్ణ యానికి గ్రామపెద్దపై ఆధారపడతారు. ఈ ప్రాంతా ల్లో 18 ఏళ్లురాక ముందేపెళ్లి చేసేస్తారు. ఆ విష యం గురించి ఫిర్యాదు కూడా ఎవరూ చేయరు. పెళ్లి వయసు 21లేదా25కు పెరిగినా 18 సంవత్స రాలే ఉన్నా అది గిరిజనసమాజాల్లో పెద్దగా ప్రభావం చూపించదు’’అనిఅన్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్పెషల్‌ మ్యారేజ్‌ చట్టం (1954) హిందూ వివాహచట్టం(1955)ప్రకారం వివాహం చేసుకునేవారికి ఈనిర్ణయం వర్తిస్తుంది.

మహిళా సాధికారత సాధించేందుకు తోడ్పడు తుందా?
చట్టంలో మార్పులు చేసినంత మాత్రాన మహిళా సాధికారత వస్తుందని చెప్పలేం,కానీ,ఇదొక మార్పు కు నాంది పలుకుతుందని డాక్టర్‌ సుమిత్ర అంటారు.‘‘సాధికారతకు సమానత్వం తొలి మెట్టు’’. సమానత్వ భావన అనేది సామాజికంగా వచ్చే వరకూ సాధికారత సాధ్యం కాదని ఆమె అంటారు. ఆర్ధిక,రాజకీయ సమానత్వం కొంత వరకు సాధిం చాం కానీ, సామాజిక సమానత్వం ఇంకా పూర్తిగా రాలేదంటారు డాక్టర్‌ సుమిత్ర.
‘‘మహిళలు కూడా జెండర్‌ స్టీరియోటైప్స్‌ ను దాటి ఆలోచించగలగాలని అన్నారు. సమాజం ఒక పరి ణామం చెందుతున్న దశలో ఉంది.చట్టంతో పాటు సామాజిక దృక్పధం కూడా మారాలి. కానీ, మార్పు సాకారమయ్యేందుకు చాలా సమయం పడుతుంది’’ అని అన్నారు.అమ్మాయిల వివాహ వయసును పెంచ డం ద్వారా వారి విద్య ఉద్యోగావకాశాలు పెరిగితే, ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం చేస్తుందని సుమిత్ర అన్నారు.

అమలు చేయడంలో ఉన్న సవాళ్లేంటి?
అమ్మాయిల వివాహ వయసును పెంచడం ద్వారా పిల్లలు,మహిళలపై మాత్రమే కాకుండా కుటుం బం,ఆర్ధిక,సామాజిక పరిస్థితులపై ప్రభావం చూపి ిస్తుందని టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ అభిప్రాయపడిరది. కొన్ని వెనుకబడిన వర్గాల్లో 70% బాల్య వివాహాలు చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. చదువును ఆపేసిన పిల్లల్లో 3నుంచి4రెట్లు మందికి పెళ్లిళ్లు చేసే అవకాశముందని లేదా వారి వివా హం నిశ్చయం అయిపోయి ఉంటుందని ఇంట ర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ విమెన్‌ నిర్వహిం చిన అధ్యయనం పేర్కొంది. గ్రామీణ,గిరిజన ప్రాం తాల్లో నాటుకుపోయిన నమ్మకాలు, ఆచారాలను ఆపమని చెప్పడం చాలా కష్టమని అంటారు నిఖిని వర్మ.‘‘అదిలాబాద్‌ జిల్లాలోజరిగే నాగోబా జాతర లో వధూవరులను ఎంపిక చేసుకుంటారు. మాకు దేముడు చూపించిన మనువు అని అంటూ ఉంటారు. అటువంటి వారిని18లేదా21 సంవత్స రాల వరకూ పెళ్లి చేయకుండా ఆపమని ఒప్పించ డం చాలా కష్టమైన పని’’అని అంటారు నిఖిని. లోహారా గ్రామంలో బాల్య వివాహాలను ఆపేం దుకు పిల్లల తల్లితండ్రులను ఒప్పించడం చాలా కష్టంగా మారినట్లు వివరించారు.
పెంపు ద్వారా లింగ సమానత్వం సాధ్యమా…? ప్రపంచంలో జరిగే బాల్యవివాహాల్లో మూడవ వంతు మనదేశంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఆడపిల్లలు అంటే ‘’ఆళ్ళ’’ పిల్లలే అని దురభిప్రాయం మన కుటుంబాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నది. అందు చేతనే పదవ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఆడ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేందుకు సన్నాహాలు చేస్తు న్నారు. రాజస్థాన్‌ ఈవిషయంలో దేశంలోనే మొద టి స్థానంలో ఉంది. దేశ వ్యాప్తంగా నేటికీ 47 శాతం బాల్యవివాహాలు జరుగుతున్నాయి అని ఐక్య రాజ్యసమితి బాలలనిధి తెలియజేస్తున్నది. చదువు కున్న వారు కూడా బాల్యవివాహాలు జరిపించడం బాధాకరమైన విషయం. మగ పిల్లలు ఎక్కువ, ఆడపిల్లలు తక్కువఅనే భావం నేటికీ అనేక కుటుం బాల్లో కనపడుతోంది. ఈరకమైన ఆలోచనలు మార్చుకోవాలి.‘’లింగ సమానత్వం’’ దిశగా ప్రయా ణం చేయాలి. మత విశ్వాసాలను, మూఢ విశ్వా సాలను, ఆచారాలను పక్కన పెట్టాలి. అందరూ సమానమే అనే భావన రావాలి. స్త్రీని దైవంగా కొలిచే ఈ దేశం నిరంతరం మహిళల వేదింపు లకు నిలయంగా ఎందుకు ఉంటుందో ఆలోచన చేయాలి. మన సంస్కృతి సాంప్రదాయాలను పాశ్చా త్య దేశాల్లో గొప్పలుగా చెప్పుకొంటున్న మనం, ఈరోజున మన దేశంలో ఉన్న వాస్తవ పరిస్థితులకు ఏమి సంజాయిషీ ఇస్తాం…?ఆకలి బాధలు, ఆక్రందనలు, వివక్షత, పేదరికం, అవిద్య, అక్రమ రవాణా,అఘాయిత్యాలు,ఆత్మహత్యలు,యాసిడ్‌ దాడులు,పరువు హత్యలు,వరకట్న వేదింపులు, వ్యభిచారకూపాలు, అవహేళనలు, గృహహింసలు, లైంగిక దోపిడీ,ర్యాగింగ్‌,రేప్‌లకు నిలయంగా ఉన్న ఈదేశంలో సగౌరవంగా స్త్రీబతికేది ఎప్పు డు…? ఆలోచన చేయాలి.అందుకే ‘’ఒకదేశ అభి వృద్ధి,ఆ దేశ మహిళా అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది’’ అంటారు అంబేద్కర్‌. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చిత్తశుద్ధితో అమలు చేయాలి. కానీ అంతమాత్రానికే దేశంలో మహి ళలకు రక్షణ, భధ్రత, సమానత్వం కలుగుతుందా?. పురుషులుతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తారా?. దేశాభివృద్ధికి తిరుగులేని శక్తిగా నిలబడుతారా? దిశయాప్‌,షీ టీం,మహిళా పోలీస్‌ స్టేషన్లు, నిర్భయ చట్టం ఉన్నా, అనునిత్యం దేశంలో ఏదో ఒకచోట మహిళల ఆక్రందనలు ఎందుకు వినిపిస్తున్నాయో గుర్తెరగాలి.
ఇటీవలి కాలంలో దేశంలో లింగ నిష్పత్తిలో 1000 మంది పురుషులకు, మహిళలు 1020 పైబడి నమోదు కావడం శుభ పరిణామంగా భావించాలి. భ్రూణ హత్యలు తగ్గాయి.అయితే అదే సమయంలో అఘాయిత్యాలు, గృహహింస రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ కరోనా కాలంలో మరింత ఎక్కువయినాయి. చట్టాలు ఎన్నిఉన్నా సమాజంలో మహిళలపై చిన్న చూపు,వివక్షత కొనసాగుతూనే ఉంది. ఈ విషయా లపై ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. -జి.ఎన్‌.వి.సతీష్‌

మతోన్మాదుల విష కౌగిలిలో రాజ్యాంగం

ఆర్టికల్‌ 29 ప్రకారం మైనారిటీ మతానికి చెందిన పౌరులు తమ మతానికి చెందిన ఆరాధన పద్ధతులు, సంస్కృతులు, సాంప్రదాయాలు స్వేచ్ఛగా ఆచరించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఈ హక్కు అమలు అనేది నేడు పెద్ద సవాలుగా మారింది. మన రాజ్యాంగంలో పౌరులకు మత స్వేచ్ఛ ఉంది. కానీ రాజ్యానికి (ప్రభుత్వానికి) మతం లేదు. ఉండదు కూడా. ఎందుకంటే అది లౌకిక రాజ్యం. మతం పేరుతో రాజకీయాలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. అయితే ప్రస్తుతం మతమే రాజకీయం అయింది. ప్రతి విషయాన్ని మత కోణంలో చూడడం పెరిగిపోయింది.` మహమ్మద్‌ అబ్బాస్‌ దేశంలో లౌకిక,ప్రజాస్వామిక విలువలకు మతో న్మాద ప్రమాదం తీవ్రంగా పరిణ మించింది. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులపై దాడి తీవ్రమైంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14దేశ పౌరులం దరు సమానులే అని ఉద్ఘాటిస్తుంటే, ఆర్టికల్‌ 15 మతం,కులం, జాతి,లింగం,పుట్టిన ప్రాంతం ఆధారంగా ఏ పౌరుని పట్ల వివక్ష చూప రాదని,అలా ఎవరైనా ప్రవర్తిస్తే చట్టరీత్యా నేరం అని స్పష్టం చేసింది. కానీ బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్‌లో రిక్షా తొక్కి కుటుంబాన్ని పోషించు కుంటున్న తస్లీమ్‌ బేగ్‌ను బజరంగ్‌ దళ్‌ మూక లు చుట్టు ముట్టి ‘జై శ్రీరామ్‌’ అనాలని, తన మైనర్‌ కూతురు సమక్షంలోనే తీవ్రంగా కొట్టారు. పోలీసు స్టేషన్‌లో కేసు పెడితే నిందితులను మూడు రోజులలో వదిలేశారు. వారు బయటికి వచ్చి హిందూ ఏరియాలోకి వస్తే చంపేస్తామని బహిరంగంగా హెచ్చరిం చారు. మధ్యప్రదేశ్‌ దివాస్‌ జిల్లాలో సైకిల్‌పై తిరిగి బిస్కెట్లు అమ్ముకునే జాయెద్‌ ఖాన్‌ అనే వ్యక్తిని ఆధార్‌ కార్డు చూపించమని కొట్టారు. గ్రామాలలో తిరిగి బిస్కెట్లు అమ్మితే చంపే స్తామని బెదిరించారు. అలాగే చిత్తు కాగితాలు, పాత ఇనుప సామానులను కొనుగోలు చేసే మరో వీధి వ్యాపారిని ఇదే రకంగా కట్టేసి కొట్టారు. ఇప్పు డు వీరు బయటికి రావాలంటే భయంతో వణికి పోతున్నారు. దాడి చేసినవారి పై పోలీస్‌ కేసులు లేవు, కేవలం మందలించి వదిలేస్తున్నారు. మధ్యప్రదేశ్‌ బోర్లి ప్రాంతంలో గర్బాహ అనే గ్రామంలోకి హిందూయేతరులు రావడాన్ని నిషేధిస్తూ వి.హెచ్‌.పిబోర్డులు ఏర్పాటు చేసింది. ద్వారకా ప్రాంతంలో హజ్‌ భవన్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ విశ్వ హిందూ పరిషత్‌ ధర్నా నిర్వహించి నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనలన్ని స్పష్టం చేస్తున్నదేమిటంటే చట్టం అందరికీ సమానం కాదని,మతం పేరుతో విచక్షణ చూపించినా, దాడులు చేసినా చట్టం ఏమీ అనదు అనే సందేశాన్ని ఇస్తున్నాయి.ఆర్టికల్‌ 21 ప్రతి మనిషికి స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పిం చింది. హర్యానా నోజిల్లా కేర్‌ ఖలీల్‌ గ్రామంలో ఆసిఫ్‌ ఖాన్‌ అనే 27సంవత్సరాల యువకుడిని అకారణంగా మతోన్మాదుల గుంపు దారుణంగా హత్య చేయడంతోపాటు, గ్రామంలో ముల్లాల నందరిని వదిలిపెట్టం అని హెచ్చరించింది. గతంలో కూడా గో రక్షణ దళాల పేరుతో పెహ్లూ ఖాన్‌,అఖ్లాక్‌ లాంటి అనేక మందిని అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేసారు. ఉపాధి అవకాశాలను కూడా దెబ్బ తీశారు. ఇవన్నీ రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును హరించేవే. ఆర్టికల్‌ 23 సెక్షన్‌ (2)ప్రకారం రాజ్యం (ప్రభుత్వం) మతం,కులం,జాతి,లింగం,పుట్టిన ప్రాంతం ఆధారంగా ఏమనిషి పట్ల వివక్ష చూపరాదు. కానీ అఖ్లాక్‌ హత్య కేసులో నిందితులకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. విద్వేష ప్రకటనలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్‌,బిజెపి,ఆర్‌ఎస్‌ఎస్‌ కు చెందిన నాయకులపై ఎలాంటి కేసులు పెట్టడం లేదు. త్రిపురలో మైనారిటీలపై వి.హెచ్‌.పి దాడులకు పాల్పడి ఆస్తులను,ఇళ్ళను,ప్రార్థనాస్థలాలను ధ్వంసం చేసి నిప్పంటించినా వారిపై కేసులు పెట్టలేదు. కానీ మైనారిటీలపై జరిగిన మత హింసను విచారించడానికి వెళ్లిన నిజనిర్థారణ బృందంపై దేశ ద్రోహం కింద కేసులు పెట్టారు. హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిని వది లేసి,బాధితులను పరామర్శించిన వారిపై కేసులు పెట్టడం అంటే మతోన్మాద దాడులను ప్రోత్సహించడమే కదా ! ఆర్టికల్‌ 25 సెక్షన్‌ (1) ప్రకారం దేశ పౌరులందరికీ మత స్వేచ్ఛ ఇవ్వబడిరది. పౌరులు తమకు నచ్చిన మతాన్ని, ఆరాధన పద్ధతులను స్వేచ్ఛగా ఆచరించవచ్చు. ప్రచారం చేసుకోవచ్చు. ఏమతంపై విశ్వాసం ప్రకటించకుండా స్వతంత్రంగా ఉండే హక్కు కూడా పౌరులకు ఇవ్వబడిరది. ఎవరిపైనా బలవంతంగా విశ్వాసాలను,నమ్మకాలను రుద్దరాదని రాసుకున్నాం. అయితే మానవ హక్కుల సంఘాల నివేదిక ప్రకారం 2021లో సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి అంటే 9 నెలల కాలంలోనే క్రైస్తవ ప్రార్థనా సమావేశాలపై 300 దాడులు జరిగాయి. ప్రార్థనల్లో పాల్గొన్న వారిని తీవ్రంగా కొట్టారు. దాడులకు గురైన వారంతా దళితులు, గిరిజనులు. బలవంతపు మత మార్పిడులు అనే పేరుతో దళితులకు,గిరిజను లకు రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛ హక్కును హరిస్తున్నారు. కులం పేరుతో, అంటరానితనం పేరుతో అణిచివేసినప్పటికీ వాళ్ళ కాళ్ళ కింద పడి ఉండాలనేది వారి ఉద్దేశ్యం. అందుకే దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. శుక్రవారం రోజున ముస్లింలు ప్రార్థనలు చేయకుండా రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ పేరుతో…హర్యానా రాష్ట్రం గుర్గావ్‌ లోని ఎనిమిది ప్రాంతాలలో అడ్డుకు న్నారు. ఈ రకంగా దేశంలో మైనార్టీలకు ఉన్న మత స్వేచ్ఛను, ఆరాధన స్వేచ్ఛను కాలరాశారు. చట్టాలను ఉల్లంఘిస్తూ, అధికారాన్ని దుర్విని యోగం చేస్తూ, దాడులకు దిగుతున్నారు. ఈ దాడులపై ప్రభుత్వ యంత్రాంగం కఠినంగా వ్యవహరించిన పరిస్థితి లేదు. ఆర్టికల్‌ 29 ప్రకారం మైనారిటీ మతానికి చెందిన పౌరులు తమ మతానికి చెందిన ఆరాధన పద్ధతులు, సంస్కృతులు, సాంప్రదాయాలు స్వేచ్ఛగా ఆచరించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఈ హక్కు అమలు అనేది నేడు పెద్ద సవాలుగా మారింది. మన రాజ్యాంగంలో పౌరులకు మత స్వేచ్ఛ ఉంది. కానీ రాజ్యానికి (ప్రభుత్వానికి) మతం లేదు ఉండదు కూడా. ఎందుకంటే అది లౌకిక రాజ్యం. మతం పేరుతో రాజకీయాలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. అయితే ప్రస్తుతం మతమే రాజకీయం అయింది. ప్రతి విషయాన్ని మత కోణంలో చూడడం పెరిగిపోయింది. టి 20వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఓడితే దానికి ముస్లిం కాబట్టి బౌలర్‌ షమీని బాధ్యుడిని చేసి మతం పేరుతో దుర్మార్గంగా ట్రోల్‌ చేశారు. బౌలర్‌ షమీపై మతం పేరుతో దాడి చేయడాన్ని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వ్యతిరేకించినందుకు ఆయన ఏడాది వయసున్న కూతురిపై అత్యాచారం చేస్తామని బెదిరింపులకు దిగారు. అలా బెదిరింపులకు దిగింది తెలంగాణకు చెందిన ఉన్నత విద్యావం తుడు కావడం మనం రాష్ట్రానికే అవమానం. అంతేకాదు. తెలంగాణలో విస్తరిస్తున్న మతో న్మాద విష సంస్కృతికి ఇది నిదర్శనం. అసోం రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుని జీవిస్తున్న రెండు గ్రామాల ప్రజలు కేవలం ముస్లింలు అయినందువలన వారిపైన పారామిలటరీ దళాలను ప్రయోగించి, కాల్పులు జరిపి భూముల నుండి బలవంతంగా తొలగిం చారు. ఆ కాల్పుల్లో ఇద్దరు పౌరులు చనిపో యారు. చనిపోయిన వ్యక్తి శవంపై మీడియా ఫొటోగ్రాఫర్‌ ఎగిరి గంతులు వేయడం కొంత మందిలో పెరుగుతున్న విద్వేష మానసిక స్థాయికి పరాకాష్ట. ఈ దారుణాన్ని చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. అంతర్జాతీయ మీడియా ‘డాన్సింగ్‌ ఆన్‌ డెడ్‌ బాడీ’ పేరుతో సంపాదకీయం రాసి దేశంలో పెరుగుతున్న మత ఉన్మాదపు సంస్కృతిని నిరసించింది. గుజరాత్‌లో రోడ్డు పక్కన మాంసాహార పదా ర్థాల అమ్మకాలను నిషేధించారు. వీధి వ్యాపా రం చేస్తూ జీవించేవారిలో మైనారిటీలు, దళితు లు ఎక్కువ మంది ఉన్నారు. ఈ నిషేధం మతోన్మాద కుట్ర తప్ప మరొకటి కాదు. కేరళలో హలాల్‌ పేరుతో రెస్టారెంట్లో వ్యాపారాన్ని దెబ్బతీయడం కోసం బిజెపి పెద్ద ఎత్తున కుట్రకు తెరలేపింది. చివరికి అయ్యప్ప స్వామి ప్రసాదం తయారు చేయడానికి వాడే బెల్లంపై కూడా హలాల్‌ పేరుతో వివాదం సృష్టించి అభాసుపాలైంది.ఇలా రోజూ ఏదో పేరుతో మత విద్వేషాలు, వివాదాలు సృష్టిం చడం, ప్రచారం చేయడం తప్ప మనుషుల గురించి,వారి విద్య, ఉద్యోగా లు,ఆరోగ్యం, వైద్యం,ఉపాధి, జీవన సౌకర్యాల మెరుగుదల గురించి ఏరోజు కూడా పట్టించు కునే పరిస్థితి లేదు. ఒకవైపు అంబానీ,అదానీ లాంటి కార్పొరేట్‌ శక్తులు పాలకుల అండతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టి ప్రపంచ కుబేరుల జాబితాలో చేరిపోతుంటే, మరోవైపు దేశంలో నిష్ట దరిద్రుల సంఖ్య 6 కోట్ల నుండి 13.5 కోట్లకు పెరిగింది.ప్రజా సమస్యలు చర్చ లోకి రాకుండా పక్కా ప్రణాళిక ప్రకారం విద్వేష రాజకీయాలు, విద్వేష ప్రకటనలు చేస్తూ సంఘ పరివార్‌ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రజల వాస్తవ సమస్యలు చర్చ లోకి రావాలి. అలా జరగాలంటే దేశంలో శాంతియుత, సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడాలి. లౌకిక, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ జరగాలి. రాజకీయాల నుండి మతాన్ని విడదీయాలి. బెంగాల్‌,త్రిపుర రాష్ట్రా లలో అధికారంలో ఉన్నప్పుడు మార్క్సిస్టు పార్టీ ఆ పనిని విజయవంతంగా చేసింది. అందుకే బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్న 35 సంవత్సరాల కాలంలో మత కలహా లు జరగలేదు. బాబ్రీ విధ్వంసం తర్వాత దేశమంతా మత కలహాలతో అట్టుడికి పోయిన ప్పటికీ బెంగాల్‌లో ఆనాటి లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వం ఎలాంటి మత కలహాలు జరగకుండా సమర్థ వంతంగా కట్టడి చేయగలిగింది. దేశంలోనే అత్యధిక మంది స్వయం సేవకులు ఉన్న కేరళలో సైతం సిపిఐ(ఎం) నేతృత్వం లోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం మతోన్మాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నది. త్రిపురలో కూడా సిపిఐ(ఎం) అధికారంలో ఉన్నంత కాలం ఏ ఒక్క మత ఘర్షణ గాని, మత విద్వేష దాడులు గాని జరిగిన దాఖలాలు లేవు. మార్క్సిస్టులు బలహీనపడిన తరువాతే బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాలలో మతోన్మాదం బుసలు కొడుతోంది. ఇది వర్తమాన చరిత్ర మనకు నేర్పిన గుణపాఠం. దేశంలో మతోన్మాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే లౌకిక, ప్రజాస్వామిక విలువలను నిక్కచ్చిగా అమలు చేయగలిగే సైద్ధాంతిక పునాది కలిగిన వామపక్ష శక్తులు బలపడాల్సిన అవసరం ఉంది.
వ్యాసకర్త : సీపీఐఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు (నవతెలంగాణ సౌజన్యంతో)

ఆకలి కేకలు తప్పడం లేదా..!!

అభివృద్ధింటే అద్దంలా మెరిసే రోడ్డు..ఆకాశాన్నంటే బహుళ అంతస్తుల భవనాలుకాదు. ఆకలి ఎరుగని సమాజం. పస్తులుండని ప్రజలు. కానీ ఈభూమ్మీద ప్రతీ ఏడుగురిలో ఒకరు నిత్యం ఖాళీ కడుపుతోనే నిద్రపోతుండటం కలవరపెట్టే అంశం. కోవిడ్‌ మహమ్మారి ఈ పరిస్థితులను మరింత జఠిలం చేయగా..పేదరికం,ఆకలి విషయాల్లో భారత్‌ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. పోషకాహార లోపం..చిక్కిపోయిన పిల్లలు(ఎత్తుకు తగ్గ బరువులేని ఐదేళ్లలోపు పిల్లలు),ఎదుగుదలలేని పిల్లలు(వయస్సుకు తగ్గ ఎత్తులేని ఐదేళ్లలోపు పిల్లలు),పిల్లల మరణాలు(ఐదేళ్లలోపు పిల్ల మర ణాల రేటు)వంటి నాలుగు పారామీటర్స్‌ను ఉప యోగించి గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ అనే సంస్థ చేపట్టిన సర్వేలో తేలింది. దీని ప్రకారం భారత్‌లో ఎలాంటి పరిస్థితులున్నాయో అర్ధం చేసుకో వచ్చు.తీవ్ర పోషకాహార లోపాన్ని ఎదుర్కొం టున్న ఐదేళ్లలోపు పిల్లలసంఖ్యలో మొత్తం 116దేశాల్లో భారత దేశం టాప్‌ ర్యాంక్‌లో ఉంది’’

పెరిగిన ఆదాయాన్ని,సంపదను నేరుగా ప్రజలకు మళ్ళించడం ద్వారా వారి జీవన ప్రమా ణాల్ని పెంచేందుకు ప్రభుత్వాలు తాపత్రయ పడు తున్నాయి. తద్వారా భారత్‌లో తీవ్ర ఆర్థిక వ్యత్యా సాలపై ఉన్న అపప్రదను పోగొట్టేందుకు ప్రయత్ని స్తున్నాయి. బ్రిటీష్‌ పాలనా కాలం నుంచి భారత్‌కు పేద దేశమన్న పేరు అంతర్జాతీయంగా నెలకొంది. సొంత పాలన ఏర్పడ్డాక దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక నీలి విప్లవాలొచ్చాయి. అనూహ్యంగా సంపద పెరిగింది. ఐటీ రంగం అందుబాటులో కొచ్చాక భారత్‌ దానిపై ఆధిపత్యం సాధించింది. ప్రపంచానికే భారత్‌ ఐటీ కేంద్రంగా రూపుదిద్దు కుంది. మౌలిక సదుపాయాల కల్పనా రంగం లోనూ భారతీయ నిపుణులు ప్రపంచ స్థాయి ప్రమా ణాల్ని సాధించారు. వీరంతా దేశ సంపద పెరిగేం దుకు తోడ్పడ్డారు. అయినప్పటికీ ప్రపంచంలో భారత్‌కున్న పేద దేశమన్న పేరు పోవడంలేదు. సంపద పెరగడమే కాదు..దాన్ని సక్రమంగా పంపి ణీ చేయగలిగినప్పుడే ఈ దేశం పేదరికం నుంచి బయటపడుతుంది. అభివృద్ధి చెందిన దేశాలతో సమాన గౌరవం పొందగలుగుతుంది. అందు కోసమే ఇప్పుడు ప్రభుత్వాలు తాపత్రయ పడుతు న్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.. Read more

పీసా చట్టం`గిరిజనులకు వరం

రెండున్నర దశాబ్దాల క్రితం పీసా చట్టం కోసం దేశవ్యాప్తంగా గిరిజనులు పోరాడారు. ముఖ్యంగా ప్రముఖ విశ్రాంతి ఐఏఎస్‌ అధికారులు స్వర్గీయ బీడీ శర్మ,ఎస్‌ఆర్‌ శంకరన్‌,దిలీప్‌ సింగ్‌ భూరియా వంటి గిరిజనతెగల స్పూర్తిదాతల సహకారం కూడా మరవలేనిది.73వ రాజ్యాంగ సవరణలో 1991లో అమలులోకి వచ్చిన పంచాయితీరాజ్‌ చట్టాన్ని దేశమంతటా ఒకేరీతిన అమలు చేయడంతో గిరిజనుల్లో తీవ్ర నిరసన మొదలైంది. వారు ఉద్యమబాట పట్టారు. దీంతో కేంద్రప్రభుత్వం దిలీఫ్‌సింగ్‌ భూరియా నేతృత్వంలోని ఓకమిటీని నియమించింది. కమిటి సీపార్సులతో 1996 డిసెంబరులో పీసా చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చారు. ఈచట్టం ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామపంచాయితీని కాకుండా గ్రామసభను కేంద్రబిందువు చేశారు. గ్రామసభకు విశేషాధి కారాలను కల్పించారు. ఒక ప్రాంతంలో నివసించే ఓటు హక్కు కలిగి ఉన్న నివాసితు లంతా గ్రామసభ పరిధిలోకి వస్తారు. వీరు తాము నివసించే ప్రాంతాల చుట్టూ గల సహజ వనరులు,అటవీ సంపదపై యాజ మాన్యహక్కులు కలిగి ఉంటారు.ఆ వనరులను స్వీయ అవసరాల కోసం వినియోగించు కుంటూ,గిరిజన సంప్రదాయ పరిరక్షణకు దోహదపడతారు. ఆయా గ్రామాల్లో ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పాఠశాలలు,వైద్య కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను గ్రామసభలకు అప్పగించారు. అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ, నష్టపరిహారం పంపిణీ,గనుల తవ్వకాలకు సంబంధించిన లీజులు, సామాజిక,ఆర్ధిక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పన,ఉప ప్రణాళిక నిధుల ఖర్చుకు సైతం గ్రామసభల అనుమతి తీసుకోవాలి. అంతేకాదు ప్రభుత్వం సంక్షేమపథకాల్లో లబ్దిదారుల గుర్తింపు,చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు,మద్యం అమ్మకాలు,వడ్డీ వ్యాపారాలపై నియంత్రణ,నీటివనరుల నిర్వహణ తదితర విషయాల్లోనూ గ్రామసభలకే సర్వాధికారాలు కల్పించబడ్డాయి.

ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామపంచాయితీని కాకుండా గ్రామసభను కేంద్రబిందువు చేశారు. గ్రామసభకు విశేషాధి కారాలను కల్పించారు. ఒక ప్రాంతంలో నివసించే ఓటు హక్కు కలిగి ఉన్న నివాసితు లంతా గ్రామసభ పరిధిలోకి తీసుకొచ్చిన పీసా చట్టం వచ్చి 25 ఏళ్లు పూర్తియింది. అయినా సరే నేటికీ చట్టం లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో అమలు పర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి.

తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోను గ్రామాల సమగ్ర అభివృద్ధి, గ్రామీణుల సాధికారత కోసం గ్రామ పంచాయతీలకు మార్గనిర్దేశం చేయ డంలో ప్రభుత్వ వ్యవస్థలు దీర్ఘకాలంగా విఫలమవుతూనే ఉన్నాయి. కొండ, కోనల్లోని ఆదివాసుల సంప్రదాయ గ్రామసభలకు సముచిత గౌరవం ఇవ్వడానికి ఉద్దేశించిన పంచాయతీరాజ్‌- షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం (పీసా చట్టం-1996) అమలులోకి వచ్చి పాతికేళ్లయింది. ఆదివాసుల జీవనోపాధుల మెరుగుదల, అటవీ హక్కుల కల్పన, మౌలిక వసతుల అభివృద్ధి తదితర కీలక అంశాల్లో వారికి స్వయంపాలన హక్కులు కల్పించే పీసా చట్టం స్ఫూర్తిని ఇన్నేళ్లలో ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయనే చెప్పాలి. గ్రామసభల స్ఫూర్తికి తూట్లుపంచాయతీ రాజ్‌ చట్టాన్ని దేశమంతటా ఒకే రీతిన అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసులతో పాటు, వారి మద్దతు సంఘాలు పెద్దయెత్తున ఉద్యమించాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం దిలీప్‌సింగ్‌ భూరియా ఆధ్వర్యంలో 73వ రాజ్యాంగ సవరణతో 1992లో అమలులోకి వచ్చిన పంచాయతీ రాజ్‌ చట్టంపై ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సులతో పార్లమెంటు 1996లో పీసా చట్టాన్ని (పంచాయతీ రాజ్‌ షెడ్యూల్డ్‌ ప్రాంతాల విస్తరణ చట్టం) ఆమోదించింది. దాంతో ఆదివాసీ ప్రాంతాల్లో పరిపాలన, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు గ్రామసభలను కేంద్ర బిందువుగా మార్చారు. రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలు జాబితాలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ,ఒడిశా,ఛత్తీస్‌గఢ్‌,రaార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌,మహారాష్ట్ర,కర్ణాటక, కేరళ, బిహార్‌లలోని షెడ్యూలు ప్రాంతాల్లోని ఆదివాసీ ప్రాంతాలన్నింటికీ ఈ చట్టం వర్తిస్తుంది. దాని ప్రకారం నోటిఫై చేసిన గ్రామసభలకు ఆ ప్రాంతంలోని సహజ వనరులపై పూర్తి యాజమాన్య హక్కులు ఉంటాయి.జల, అటవీ వనరులను తమ అవసరాలకు వాడుకుని సంరక్షించుకునే విధంగా గ్రామసభలను సుశిక్షితం చేయాలి. విద్యా, వైద్య కేంద్రాలను పర్యవేక్షించే బాధ్యత ఉంటుంది. అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, నష్ట పరిహార పంపిణీ, గనుల తవ్వకాలకు అవసరమైన లీజుల మంజూరుకు గ్రామసభల అనుమతి తప్పనిసరి. ఆవాసాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పనబీ గిరిజనాభివృద్ధి ఉప ప్రణాళిక నిధులను ఖర్చు చేసేందుకు తప్పనిసరిగా గ్రామసభల పాత్ర ఉండాలి. సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల గుర్తింపు, చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు,మద్యం అమ్మకాలు,వడ్డీ వ్యాపారాలపై నియంత్రణ తదితర విషయాల్లో గ్రామసభలకు పూర్తి అధికారాలు ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనుల కోసం విడుదలయ్యే జమా ఖర్చుల ధ్రువపత్రాలను అధికారులు గ్రామసభల నుంచి తీసు కోవాలి.అమలులో అశ్రద్ధమహోన్నత లక్ష్యాలతో అమలులోకి తెచ్చిన పీసా చట్టం అమలులో రాష్ట్ర ప్రభుత్వాలు అంతులేని అశ్రద్ధ కనబరుస్తున్నాయి. చట్ట నియమాల రూప కల్పనలో ఏళ్ల తరబడి కాలయాపనవల్ల అసలు లక్ష్యం పూర్తిగా నీరుగారింది. తెలుగు రాష్ట్రా లకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1996లో చట్టం అమలులోకి వచ్చిన 15ఏళ్ల అనంతరం అంటే 2011లో సంబంధిత నియమ నిబంధనలు రూపొం దించింది. ఆ నియమాలు వచ్చిన రెండేళ్ల తరవాత 2013లో గిరిజన సంక్షేమ శాఖ- జిల్లా, మండల, పంచాయతీల వారీగా గ్రామసభలను గుర్తించి, జాబితాను ‘నోటిఫై’ చేసింది. రాష్ట్ర విభజన జరిగాక ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ‘పీసా’ అమలు ద్వారా గిరిజన ప్రాంతాల్లో గ్రామసభలకు హక్కులు వర్తింపజేసే ప్రయత్నమే జరగలేదు.పాతికేళ్లయినా..చట్టం అమలులోకి వచ్చి పాతికేళ్లు అవుతున్నా ఛత్తీస్‌గఢ్‌, రaార?ండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటివరకు చట్ట నిబంధనలను రూపొందించుకోలేదు. గుజరాత్‌లో అక్కడి అయిదో షెడ్యూలు ప్రాంతాల్లోనూ పంచాయతీ రాజ్‌ చట్టాన్ని అమలుచేస్తున్నారు. ‘పీసా’ స్ఫూర్తికి విరుద్ధంగా కొన్ని రాష్ట్రాలు చట్టాన్ని అన్వయించుకోవడంతో దాని అమలు తీరే మారిపోయే దుస్థితి దాపురించింది. షెడ్యూలు ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టుకోసం భూసేకరణకు ముందు గ్రామసభలను సంప్రదించాలి. ఆ ప్రాజెక్టువల్ల ప్రభావితమయ్యేవారికి నష్ట పరిహారం, పునరావాసం కల్పించాలని కేంద్ర చట్టం చెబుతోంది. ఆ నిబంధనను అనేక రాష్ట్రాలు తమ ఇష్టానుసారం అన్వయించుకుని గ్రామ సభల హక్కులను నిర్వీర్యం చేశాయి. గనుల లీజులు, నీటిపారుదల నిర్వహణ,అటవీ ఉత్పత్తుల యాజమాన్యం… ఇలా అనేక అంశాల్లో కేంద్ర చట్ట స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలు శాసనాల్లో మార్పులు తీసుకువచ్చి గ్రామసభల ఉనికినే అపహాస్యం చేస్తున్నాయి.హక్కులతోనే వికాసందేశంలో అత్యంత వెనకబడిన జిల్లాలన్నీ దాదాపుగా ఆదివాసీ ప్రాంతాలే. ఈ ప్రాంతాల్లోనే వామపక్ష తీవ్రవాదం అధికంగా ఉంది. అందుబాటులోని వనరులపై హక్కులు కల్పించి, వారికి గ్రామసభల స్థాయిలో పరిపాలన సామర్థ్యం పెంచి, పారదర్శకంగా నిధుల వ్యయం, సంక్షేమ ఫలాల పంపిణీ జరిగినప్పుడు గిరిజన ప్రాంతాల్లో వెలుగు రేఖలు విచ్చుకుంటాయి. ఆదివాసీ ప్రాంతాల్లో సంప్రదాయ పరిపాలన, కట్టుబాట్లు, భౌగోళిక, సామాజిక పరిస్థితులు క్లిష్టంగాను, భిన్నంగాను ఉంటాయి. ప్రధాన స్రవంతి చట్టాలను యథావిధిగా అమలు చేయడంతో ఆదివాసీ ప్రాంతాల పరిస్థితి దశాబ్దాలుగా గందరగోళంగా తయారైంది. గ్రామసభలను విస్మరించడం ఆదివాసుల్లో అసంతృప్తికి, అశాంతికి దారితీస్తుందని ఇప్పటికే అనేక ఉన్నతస్థాయి కమిటీలు కేంద్రానికి నివేదించాయి. గిరిజన ప్రాంతాల పాలనలో ఎదురయ్యే సవాళ్లపై కేంద్ర పంచాయతీ రాజ్‌ మంత్రిత్వ శాఖ సాయంతో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌’ అధ్యయనంబీ రెండో పాలన సంస్కరణల కమిషన్‌, ప్రణాళికా సంఘ నిపుణుల కమిటీ, చిన్నతరహా అటవీ ఉత్పత్తుల యాజమాన్య అంశంపై ఏర్పాటైన ఎ.కె.శర్మ కమిటీబీ భూ పరాయీకరణ, నిర్వాసితుల సమస్య, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసిన రాఘవ చంద్ర కమిటీలు- ‘పీసా’ను పటిష్ఠంగా అమలు చేస్తేనే, ఆదివాసుల స్వయంపాలన సాధ్యమని తేల్చిచెప్పాయి.నిర్వీర్యమవుతున్న రాజ్యాంగ రక్షణ కవచాలుపీసా, అటవీ హక్కుల గుర్తింపు చట్టంతోపాటు రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలులో పేర్కొన్న నిబంధనల అమలుకు రాష్ట్రాల్లో ఇప్పటికీ వ్యవస్థాగత యంత్రాంగమే సిద్ధం కాలేదు. దీంతో రాజ్యాంగ రక్షణ కవచాలు కాస్తా చేవ తగ్గి నిర్వీర్యం అవుతున్నాయి. పీసాతో సహా ఇతర గిరిజన రక్షణ చట్టాలు, సంబంధిత నిబంధనలపై శిక్షణ, అవగాహన పెంచే బాధ్యత, అమలు తీరును పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించిన రాష్ట్రాల్లోని గిరిజన సంస్కృతి, పరిశోధన, శిక్షణ సంస్థలు సరిపడా సిబ్బంది, తగిన నిధులు లేక సతమతమవుతున్నాయి. పీసా చట్టం అమలులోకి వచ్చి పాతికేళ్లయిన సందర్భంలోనైనా గిరిజనుల అభిమతాన్ని గౌరవించాలి. కొత్తగా కొలువుతీరిన తెలుగు రాష్ట్రాల పంచాయతీ పాలకవర్గాలతో గిరిజన ఆవాసాల్లో గ్రామీణ సభల కమిటీలను కొత్తగా ఏర్పాటు చేయాలి. మరోవంక రాష్ట్రాలకు తగినన్ని వనరులను సమకూర్చి పీసా అమలుకు వాటిని సిద్ధం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది!

గ్రామసభ, విధులు…

ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి మొదటి గ్రామసభ నిర్వహించడానికి డిప్యూటీ తహశీల్దార్‌ హోదాగల అధికారిని నియమించాలి. గ్రామసభ సమావేశానికి సర్పంచ్‌ అధ్యక్షత వహిస్తాడు. సర్పంచ్‌ లేనప్పుడు గ్రామపెద్ద అధ్యక్షత వహించవచ్చు. మెజార్టీ గ్రామసభ్యుల్లో 1/3వంతు తక్కువ కాకుండా కనీసం 50శాతం మంది ఎస్టీ సభ్యులు హాజరైతేనే కోరంగా పరిగణిస్తారు. మెజార్టీ గ్రామసభ్యులు చేతులెత్తి ఉపాధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకుంటారు. వీరికి ఐదేళ్ల పదవీకాలం ఉంటుంది. ఏడాదికి రెండు సార్లు గ్రామసభ నిర్వహించాలి.గ్రామసభ అనంతరం నిర్ణయాలను నిర్వహణాధికారి చదివి, వినిపించి సభ్యుల ఆమోదం పొందాలి. సభ్యుల సంతకాలు విధిగా తీసుకోవాలి. ఈ తీర్మాణాలను నాలుగు వారాల్లోపు గ్రామసభ కార్యదర్శి సంబంధిత ప్రభుత్వ శాఖలకు, సంస్థలకు పంపాల్సి ఉంటుంది. వ్యవసాయ ఉత్పాధక ప్రణాళికలు, ఉమ్మడి భూముల జాబితా, ఇంటి స్థిరాస్తుల యాజమా న్యాల బదలాయింపులు, పంచాయతీ లెక్కల ఆడిట్‌ నివేధికలు, చౌకధర దుకాణం, అంగన వాడీ, సబ్‌సెంటర్‌, పాఠశాలల పనితీరు, సంక్షేమ హాస్టళ్ళ పనితీరు, త్రాగునీటి సౌకర్యం, విద్యుత్‌ సౌకర్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామసభ జోక్యం చేసుకోవచ్చు.

భూసేకరణ, గిరిజన భూమి అన్యాక్రాంతం

ఏదైనా చట్టం కింద ప్రభుత్వం,సంబంధిత అధికారి భూసేకరణ ప్రతిపా దించినట్లైతే గ్రామసభ ద్వారానే జరగాలి. ప్రతిపాదిత భూసేకరణ, కొత్తగా స్థిరపడిన ప్రజలు, సమాజంపై చూపే ప్రభావం, ఉద్యోగవకా శాల పై గ్రామసభ పరిశీలన చేసి వాస్తవాలను పరిశీలించి భూసేకరణకు సిఫారసు చేయాలి. దీని ద్వారా నిర్వాసిత వ్యక్తుల పునరావాస ప్రణాళిక విషయంలో మండల ప్రజాపరిషత్‌ సిఫారసు చేయాలి. అట్టి మండల పరిషత్‌ సిఫారసులను భూసేకరణ అధికారి పరిగణలోకి తీసుకోవాలి. అంగీకరించని పక్షంలో మరోసారి పరిశీలన కోసం భూసేకరణ అధికారికి పంపాలి. రెండో సారి సంప్రదింపుల అనం తరం మండల ప్రజాపరిషత్‌ సిఫారసులకు వ్యతిరేకంగా ఉత్తర్వులను భూసేకరణ అధికారి జారీ చేసినట్లైతే అందుకు గల కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాలి.

ఖనిజాల వెలికితీత అనుమతులు, మద్యపాన నిషేద అమలు, క్రమబద్దీకరణ, అమ్మకాలపై ఆంక్షలు విధించ డం, మండల పరిషత్‌ అధికారాలు, నిధులు, ఎక్సైజ్‌శాఖ కింద మద్యం దుకాణాలు తెరవడానికి లైసెన్స్‌ పొందడం వంటి వాటన్నింటికీ ఈ పీసా చట్టం వర్తిస్తుంది. షెడ్యూల్డ్‌ ప్రాంతంలో గిరిజన భూమి అన్యాక్రాంతం కాబడితే చట్టబ ద్దంగా తిరిగి స్వాదీనం చేసుకోవడం, గిరిజనులతో చేసే వడ్డీ వ్యాపారంపై నియంత్రణ అధికారం పూర్తిగా ఈ పీసా చట్టం పరిధిలోకే వస్తాయి. చిన్న తరహా అటవీ ఉత్పత్తుల యాజమాన్యం, విక్రయాలు ఉదా:- వెదురు, బీడీ ఆకుల మినహా చిన్న తరహా అటవీ ఉత్పత్తుల సేకరణ, జిసిసికి ఉన్న హక్కులు గ్రామసభకు లోబడే ఉంటాయి.

వారపు సంతల నిర్వహణ..

షెడ్యూల్‌ ప్రాంతంలో గ్రామసంత లు నిర్వహించడానికి గ్రామ పంచాయతీ యే మార్కెట్‌ కమిటీగా ఉంటుంది. వారం వారం జరిగే సంతల్లో ఆ మార్కెట్‌ కమిటీ గా ఆయా గ్రామపంచాయతీలు విధులు నిర్వహిస్తాయి. స్థానిక గిరిజనులకే లైసెన్సు లు మంజూరు చేయాలి. మార్కెడ్‌యార్డుల నిర్వహణ, పోషణ, లావాదేవీలు, తాత్కాలి క నిలుపుదల, మూసివే యడం, ప్రారంభిం చడం, క్రమబద్దీకరించడం కమిటీలకు అధికారం ఉంటుంది. గ్రామపంచా యతీల ద్వారా అన్ని విద్యా సంస్థల పరిపాలన నివేధికలను కోరే అధికారం మండల పరిషత్‌కు ఉంటుంది. మండల పరిషత్‌ పరిధిలోగల అన్ని విద్యా సంస్థల బడ్జెట్‌ను మే 31 నాటికే ఆమోదించాలి. సంక్షేమ వసతి గృహాల నిర్వహణలో విద్యార్థు లకు ఆహార సరఫరా, ఇతరత్రా కార్యక్రమాల నిర్వహణ ను చట్టం కింద పర్యవేక్షించాలి. పంచాయ తీరాజ్‌ సంస్థలు తమ పరిధిలోని ఆరోగ్య కేంద్రాలు, సంస్థలకు మద్ధతును, అంగన్‌వాడీ బడ్జెట్‌ను, జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్‌ పథకం అమలు, పరిరక్షణ బాధ్యత చట్టం పరిధిలోనే ఉంటాయి..

పీసా పరిధిలోకి వచ్చే చట్టాలివే…

పీసా చట్టం పరిధిలోకి ఈ క్రింది చట్టాలు వస్తాయి. గనులు, ఖనిజాల (క్రమబద్దీకరణ, అభివృద్ధి) చట్టం 1957. ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ ప్రాంత భూబదలాయింపు క్రమబద్దీకరణ నిబంధనలు 1959, షెడ్యూల్డ్‌ ప్రాంత వడ్డీవ్యాపార నిబంధనలు 1960, వ్యవసాయ ఉత్పత్తుల పశుగణన చట్టం 1966, అటవీచట్టం 1967, ఎక్సైజ్‌ చట్టం 1968, గిరిజన రుణవిమోచన రెగ్యులేషన్‌ చట్టం 1970, వాణిజ్య క్రమబద్దీకరణ నిబంధనలు 1979, అటవీ సంరక్షణ చట్టం 1980, విద్యాచట్టం 1982, సాగునీటి వ్యవస్థల నిర్వహణ చట్టం 1997, పంచాయతీరాజ్‌ సవరణ చట్టం 1998, అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 చట్టాలు అమల్లో పీసా చట్టం ద్వారా గ్రామసభలు నిర్వహించి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది.- గునపర్తి సైమన్‌

పీసా చట్టానికి 25 ఏళ్లు

మహోన్నత లక్ష్యఆలతో అమలులోకి తెచ్చిన పీసా చట్టం (పంచాయితీరాజ్‌షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం1996) అమలులోకి వచ్చి పాతికేళ్లయింది. ఆదివాసుల జీవనోపాధుల మెరుగుదల,అటవీ హక్కుల కల్పన,మౌళిక వసతుల అభివృద్ధి తద తర కీలక అంశాల్లో వారికి స్వయంపాలన హక్కులు కల్పించే పీసా చట్టంస్పూర్తిని ఇన్నేళ్లలో ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా అర్ధం చేసు కోలేకపాయాయనే చెప్పాలి.పంచాయితీరాజ్‌ చట్టాన్ని దేశమంతటా ఒకే రీతిన అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసులతోపాటు,వారి మద్దతు సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. దాంతో కేంద్రప్రభుత్వం దిలీఫ్‌సింగ్‌ భూరియా ఆధ్వర్యంలో 73వ రాజ్యాంగ సవ రణతో 1992లో అమలులోకి వచ్చిన పంచాయితీరాజ్‌ చట్టంపై ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సులతో పార్లమెంటు 1996లో పీసా చట్టాన్ని(పంచాయితీరాజ్‌ షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం)ఆమోదించింది. దాంతో ఆదివాసీ ప్రాంతాల్లో పరిపాలన,సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల అమలుకు గ్రామసభలను కేంద్రబిదువుగా మార్చారు.

Read more

1 28 29 30 31 32 54