వైవిధ్య జీవన చిహ్నాలు నూకదొర గిరిజనులు

గిరిజనులు అంటేనే భిన్న జీవన సంస్కృతుల సమ్మేళనం,ఒక్కో తెగది ఒక్కో ప్రత్యేకత,కానీ నదులన్నీ సముద్రం చేరినట్టు ఈ అడవి బిడ్డల సంస్కృతి జీవనాలు అన్ని“ఐక్యత సంస్కృతి సంరక్షణ”అనే ప్రధాన సూత్రంలోకే వస్తాయి, అందులో భాగంగానే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన శ్రీకాకుళం,విజయనగరం,విశాఖ పట్నం,తో పాటు తూర్పుగోదావరి జిల్లాలో అరుదుగా నివసించే గిరిజనతెగ “నూకదొర గిరిజనులు”.
సురవర ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ‘జానపద గిరిజనవిజ్ఞాన పీఠం వరంగల్లు’ ఆచార్యుల బృందం చేస్తున్న విస్తృతకృషిలో భాగంగా చేసిన క్షేత్ర పర్యటనల్లో తెలుగు రాష్ట్రాల్లోగల వివిధ గిరిజన ఆవాసాలు సందర్శించి ఆయా గిరిజనజాతుల చరిత్ర, జీవన విధానాలు,సంస్కృతి పద్ధతులు, ప్రత్యక్షంగా తెలుసుకొని ప్రామాణిక పరిశోధనా పద్ధతిలో వాటిని పుస్తకాలుగా ప్రచురించి అమూల్యమైన గిరిజన సంస్కృతిని సచిత్రంగా భావితరాల కోసం భద్రపరుస్తున్న తీరు అభినం దనీయం ఆచరణాత్మకం.ఇందులో భాగంగా వెలువడిందే విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం లోని కొత్త వెదురుపల్లి,గ్రామానికి చెందిన “నూకదొర గిరిజనుల జీవన విధానం”Úస్తకం.
ఆచార్య బట్టు రమేష్,డాక్టర్ గడ్డం వెంకన్న, గార్ల నేతృత్వంలో వారి గిరిజన విజ్ఞాన పీఠం 2007,2008,సంవత్సరాల్లో చేసిన క్షేత్ర పర్యటనల ఫలితమే ఈపుస్తకం.దీనిని ప్రామాణికత సౌలభ్యం కోసం ఆరు విభాగా లుగా విభజించుకొని ఉపోద్ఘాతం,గ్రామీణ జీవనం,సామాజిక జీవనం,ఆర్థిక జీవనం, మత జీవనం,రాజకీయ పరిపాలన,అనే భాగాలలో ‘నూక దొరగిరిజనుల’కు సంబం ధించిన పూర్తి వివరాలు అందించారు. ఉపోద్ఘాతంలో విశాఖ చరిత్ర దాని ఆవిర్భావ నేపథ్యంతో పాటు అక్కడి గిరిజనులను పరిచయంచేసి జనాభా లెక్కల ప్రాతిపదికన జిల్లాలు,మండలాలు,గ్రామాల, వారీగా వివిధ తెగల గిరిజనుల జనాభా వివరాలు పొందుపరిచారు. 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం 42,375 మంది నూకదొర గిరిజనులు ఉన్నట్టు పేర్కొన్నారు.ఒరిస్సా ప్రాంతం నుంచి వలస వచ్చిన వీరు ద్రావిడ భాష నుండి వేరుపడి పరిణామం చెందిన‘నూక దొర భాష’ మాట్లాడతారని,ఆచార్య ప్రసన్నశ్రీ, ఈ భాషకు 20 అక్షరాలు లిపిని కూడా నిర్మించినట్టు చెప్పారు.
అడవులు,గ్రామాల,మధ్య జీవించే ఈ అల్ప జాతి గిరిజనులు నూకదొరలను ప్రారంభంలో మూక (ముఖ్యమైన)దొర అనేవారు.కారణం మిగతా గిరిజనుల కన్నా ముఖ్యమైన వారు అని, మూక దొర కాస్త కాలక్రమంలో “నూక దొర”గా మారిందని ఒక కథనం.
వీరు సాధారణ గిరిజనులవలే అటవీ ఉత్పత్తుల సేకరణ,పోడు వ్యవసాయం,వ్యవసాయ కూలీ, పనులు చేస్తూ జీవనం సాగిస్తారు.మిగతా గిరిజనుల నుంచి వీరిని వేరు చేసే ఆచారం నూకదొర గిరిజన స్త్రీ పురుషులు జంజం ధరించడం,మరే ఇతర గిరిజనతెగ వారు జంజం ధరించరు,ఇది కేవలం ఈగిరిజన తెగకు మాత్రమే సొంతం.దీనిని వారికి పెళ్లిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ధరింప చేస్తారు.
మూడు వరసల చొప్పున 9వరుసల నూలు దారాన్ని జంజంగా తయారు చేసిపెళ్లి పెద్ద అయిన ‘ముహూర్త గాడు’అబ్బాయికి, అమ్మా యికి,ఎడమ భుజం మీదుగా వేదం చదువుతూ ధరింప చేస్తాడు.ఇది చనిపోయే వరకు శరీరం మీద ఉండాలని నియమం ఉంది.ప్రతి ఏడాది ‘జంజరాల పండుగ’రోజు కొత్త జంజాలు ధరించి పాతవి తీసివేస్తారు.ఆడవారు కూడా జంజం ధరించే సంప్రదాయం వీరిలో తప్ప మరెక్కడ కనిపించదు.భర్త చనిపోయిన స్త్రీకి తాళి,మట్టెలు,గాజులు, బొట్టు,తీస్తారు.కానీ జంజం తీయరు,అలాగే భార్య చనిపోయిన పురుషునికి మొలతాడు తీస్తారు తప్ప జంజం తియ్యరు ఇటువంటి విశేషమైన వీరి ఆచారాల గురించి మనం ఇందులో చదవవచ్చు.
రెండవ అధ్యాయం గ్రామీణజీవనంలో నూక దొర గిరిజనుల యొక్క గ్రామ నిర్మాణం,పేర్లు, ఇతర తెగలతో సంబంధాలు,పర్యావరణం, ఆహారం నిల్వ చేసుకునే పద్ధతులు,వేష భూషణాలు,శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, వాద్యాల గురించిన వివరణలు,సచిత్రంగా ఉన్నాయి.మూడవ అధ్యాయం అయిన ‘సామాజిక జీవనం’లో కుటుంబం,జీవిత చక్ర సంబరాలు, వైద్యం గురించిన వివరాలు ఉం డగా,నాల్గవది అయిన ఆర్థిక జీవనంలో వృత్తి విజ్ఞానం, అటవీ ఉత్పత్తుల సేకరణ, గురించి. ఐదవ అధ్యాయం మత జీవనం,ఆరవదైన రాజకీయ పరిపాలన,విభాగాల్లో పండుగలు, దేవరలు, మరియు గ్రామ పరిపాలన, పంచాయతీ విధానాలు, వరుసగా పేర్కొన బడ్డాయి.ముందే అనుకున్న విధంగా మిగతా గిరిజన తెగల కన్నా నూకదొర గిరిజనులు విశిష్టమైన లక్షణాలు కలిగి ఉంటారు.అందుకు ప్రధాన ఉదాహరణ,వీరు శాస్త్రసాంకేతిక పరి జ్ఞానం,ఖగోళ విషయాలు,వాతావరణం గురిం చి,సాంకేతిక నైపుణ్యఅవగాహన కలిగి ఉం టారు.ఈ తెగల పూజారిగా వ్యవహరించబడే వ్యక్తికి ఆకాశంలోని నక్షత్రాల గురించి,వాటి గమనం గురించి స్పృహ ఉంటుంది.దీని ఆధా రంగా కాలం గురించి,పండుగలు గురించి,శుభముహూర్తాల గురించి,ముందుగా తమ జనజాతికి చెబుతాడు.వీచే గాలులను బట్టి, పక్షుల అరుపులను బట్టి,ఆకాశంలోని మబ్బుల రంగులను బట్టి,వర్షాల వివరాలు ముందుగా పసిగట్టే నైపుణ్యం నూకదొర గిరిజన పూజారికే ఉంటుంది.ఇలాంటి ఆసక్తిదాయకమైన అనేక విషయాలు ఈక్షేత్ర పర్యటన పుస్తకంలో మనం చదవవచ్చు.
ఇకపోతే ఈ గిరిజనులు తమ ఆహార దినుసు లను నిలవ చేసుకునే పద్ధతులు కూడా చాలా ఆసక్తిదాయకంగా ఉంటాయి. అవి తెలియాలి అంటే రెండవ అధ్యాయంలోని ‘నిల్వ చేసుకునే పద్ధతులు’ విభాగం విధిగా చదవాలి,వీరు తమ చుట్టూ గల ప్రకృతి సంపదను ఉపయోగించు కుంటూ,దానికి అనుకూలంగా జీవనం సాగిస్తుంటారు.అందులో భాగంగానే ప్రకృతిని రక్షించుకుంటూ పర్యావరణ పరిరక్షకులుగా కూడా ప్రసిద్ధి పొందారు.నూకదొర గిరిజనుల పండుగలు అన్ని ప్రకృతితో మమేకమై ఉం డటం మరో విశేషంగా చెప్పవచ్చును,సౌలభ్యం కోసం వీరి పండుగల వివరాలు తెలిపే పట్టికను కూడా ఏర్పాటు చేసి పండుగ పేరు. ఏ రోజు ఏకాలంలో చేస్తారు,పూజించే దేవుడు ప్రదేశం,మొక్కుబడి నైవేద్యం,పూజించే ప్రత్యేక వ్యక్తి, వివరాలు ఇందులో స్పష్టంగా వివరిం చారు.విత్తనాల పండుగ,ఆవటి కొత్త పండుగ, బుడమ కొత్త పండుగ,సంక్రాంతి,జంజాల పండుగ,సంకుపండుగ,నెలదోషంపండుగ, ప్రధానంగా పేర్కొన్నారు.దీనిలో ఈగిరిజన జాతికి మాత్రమే పరిమితమైన ‘జంజాల పండుగ’ వీరికి ఎంతో ప్రత్యేకం పవిత్రం. అలాగే ప్రతినెలా చేసుకునే సామూహిక పండుగ ‘నెలదోషం పండుగ’ గూడెంలోని అందరూ ఆరోగ్యంగా జీవించాలని వారి ఇలవేల్పైన సుంకుదేవుడుని పూజిస్తారు.
ఇక ఈనూకదొర గిరిజనులు సామూహికంగా అందరూ ఒకేచోట జీవనం సాగిస్తారు.ఒకే వరుసలో గదుల నిర్మాణం చేసుకున్న ‘కేటం ఇల్లు’ అందుకు ఉదాహరణగా కనిపిస్తుంది. అలాగే ఈగిరిజనుల వివాహాల్లో కనిపించే ఒడి బాలు,నేస్తంచుట్టం,అద్దె ఇల్లు,జంజం, తొగ రులు పోయడం,ఇల్లియ్యడం, వంటి తంతులు గురించి ప్రత్యేకంగా ఇందులో చెప్పబడ్డాయి.
వీరి మరణం తాలూకు అంతిమ కార్యక్రమాల్లో కూడా ప్రత్యేక పద్ధతులు కనిపిస్తాయి. సహజంగా మరణించిన వారిని గొయ్యి తవ్వి పూడ్చి పెడతారు, ప్రమాదంవల్ల కానీ వ్యాధితో కానీ మరణిస్తే కట్టెలు పేర్చి కాల్చుతారు. అంతిమ కార్యక్రమాల్లో జేజవ,పసుపు ముట్టడం,కాకులకూడు వంటి తంతులు చేసే ఆచారం వీరి తెగల్లో ఉంటుంది.
ఇలా గిరిజన సామాజిక పద్ధతుల నేపథ్యంలో జీవిస్తూ మిగతా గిరిజన తెగల కన్నా భిన్నంగా ఉండటం నూకదొర గిరిజనుల వైవిధ్య జీవన పద్ధతులకు తార్కాణంగా ఉంటుంది.అల్ప సంఖ్యతో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన అరుదైన ఈగిరిజనుల పూర్తి జీవిత విశేషాలు తెలియాలి అంటే ఈపుస్తకం ఆసాంతం చదవాలి.
నూక దొర గిరిజన జీవన విధానం (పరిశోధన వ్యాసావళి)
పేజీలు : 180
ధర : 140/`
ప్రతులకు : ప్రచురణ విభాగం,సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం,బాచుపల్లి హైదరాబాద్-500118
చరవాణ ì : 94413 05070
సమీక్షకుడు : డా: అమ్మిన శ్రీనివాసరాజు, చరవాణి : 77298 83223.

ముగిసిన స్థానిక పుర,పరిషత్ ఎన్నికలు

రాష్ట్రంలో స్థానిక సంస్ధల ఎన్నికల్లో భాగంగా మున్సిపాల్టిలు,జిల్లాపరిషత్, ఎంపీటీసీ ఎన్నికలు ముగిశాయి. నవంబరు ఒకటన తొలిదశలో 92 పట్టణ స్థానిక సంస్థలకు (13నగర పాలక సంస్థలు,87పురపాలక సంస్థలు/నగర పంచాయతీలు)ఎన్నికలు జరిగా యి.వీటిలో ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా 17మున్సిపల్ ఛైర్మన్ పదవులు ఏకగ్రీవమయ్యాయి.13మేయర్,70 మున్సిపల్ ఛైర్మన్ స్థానాలకు మేయర్లు, చైర్మన్లు ఎంపిక జరిగింది. మొత్తం3,942 వార్డు స్థానాలకు గానూ 755వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 99.36లక్షలు ఉండగా..వీరిలో మహిళా ఓటర్ల సంఖ్యే అత్యధికం (51.05 లక్షలు),పురుష ఓటర్లు 48.29లక్షలమంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుర పోర్లులో కొన్ని జిల్లాలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాంటి జిల్లాలో తిరిగి పోలింగ్ ఏర్పాటు చేశారు.
ప్రశాంతంగా ముగిసిన పరిషత్ పోరు
నవంబరు 5నజిల్లా పరిషత్,ఎంపీటీసీ ఎన్నికలు ముగిశాయి.రాష్ట్రగ్రామీణ ప్రాంతంలో2.61కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకు న్నారు.మొత్తం 31,460 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 659 జెడ్‌పిటిసి స్థానాలకుగాను 77 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 స్థానాలకు ఆయా పార్టీలకు చెందిన ప్రజాప్రతినిదులు ఎన్నికయ్యారు. 9,821ఎంపిటిసి స్థానాలకుగాను 2,051 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 7,767 స్థానాల్లో పోటీ నెలకొనగా,వారిలో ఎంపీటీసీలుగా విజయం సాధించారు. అర్నబ్,మురసు తుపాన్లను లెక్కచేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును ఉత్సహంగా వినియోగించుకున్నారు.ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి, అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో రవాణా, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించారు.రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ఓటర్ల రద్దీ నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ,పోలీసు బలగాల మోహరింపునకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ప్రశాంత ఎన్నికల వాతావరణాన్ని కల్పించారు. పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎన్నికల సంఘం కార్యదర్శి ఎ మల్లికార్జున వెల్లడించారు. వీడియో రికార్డింగ్ సమయంలో ఓటు రహస్యానికి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తుఫాన్లు కారణంగా రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పరిషత్ ఎన్నికలు 5 మండలాల్లో ఎన్నికలు 6వ తేదీకి వాయిదాపడ్డాయి.పెదవాగు ప్రాజెక్టు రింగ్బండకు గండితో ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిల్చిపోయాయి. దీంతో, బుట్టాయి గూడెం,పోలవరం, జీలుగువి Tల్లి, వేలేరుపాడు మండలాల్లో జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు 6వ తేదీకి వాయిదా వేశారు.అవి కూడా ప్రశాంతంగానే ముగిశాయి.– జి ఎస్ ఎన్ సతీష్ 

విశాఖ కార్పొరేషన్ కూటమి కైవసం

ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద కార్పొరేషన్‌గా  |రొం దిన గ్రేటర్ విశాఖ పీఠంపై తెలుగుదేశం పార్టీ విజయబావుటా ఎగురవేసింది. తీవ్ర ఉత్కంఠ రేపిన మేయర్ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి ముక్కా శ్రావణి తన ప్రత్యర్థి, వైసీపీ తరఫున నిలిచిన వరుదు కల్యాణిపై విజయాన్ని నమోదు చేసు కున్నారు. మొత్తం120వార్డులు కలిగిన విశాఖ కార్పొ రేషన్ ఎన్నికల్లో కూటమి కూర్పు తిరుగు లేని ఫలితాన్ని ఇచ్చింది. నగర ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని పార్టీవర్గాలు హర్షంవ్యక్తంచేస్తూ విజయోత్సవాల్లో మునిగిపోయాయి. డాక్టర్ ముక్కా శ్రావణి కార్పొరేషన్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కు రాలైన మÖడో మహిళా విశాఖ మేయర్‌గా సరికొత్త రికార్డు సృష్టించారు.
విశాఖపట్నం కార్పొరేషన్ (జీవీఎం సీ) పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. కూటమి నుంచి పోటీచేసిన ముక్కా శ్రావణి మేయర్ 2.47,817 ఓట్లు భారీ మెజార్టీతో గెలిచారు. మేయర్ స్థానానికి మొత్తం15 మంది పోటీ చయగా.. కూటమి, వైఎస్సార్ సీపీ మధ్య ప్రధానపోటీ జరిగింది.జీవీఎంసీలో మొ త్తం 120డివిజన్లలో టీడీపీకి 64,జనసేన పార్టీకి 26,బీజేపీకి 8స్థానాలు వచ్చాయి.. మొ త్తం కూటమికి 98స్థానాలుదక్కాయి. వైఎస్సా ర్‌సీపీ13,స్వతంత్రులు8, సీపీఎం 1 డివిజన్లలో గెలిచారు.
ముక్కా శ్రావణి ఎవరు?
మహా విశాఖ నగరపాలక సంస్థ మేయరుగా కూటమి అభ్యర్థి డాక్టర్ ముక్కా శ్రావణి గెలు పొందారు.టీడీపీ,బీజేపీ,జనసేన కూటమి అభ్యర్థిగా పోటీచేసిన ఆమె..తన సమీప అభ్యర్థి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు వరుదు కల్యాణిపై 2.30లక్షలకు పైగాఓట్ల మెజారిటీతో గెలుపొం దారు.శ్రావణి వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్.. ఆమె వయసు 32 సంవత్సరాలు. ముక్కా శ్రావణి 2015లో టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు.ఆతర్వాత 2021విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో 26వార్డు నుంచి కార్పొరేటరుగా గెలుపొందారు.శ్రావణిది సుదీర్ఘ రాజకీయ నేపథ్యంఉన్న కుటుం బం.ఆమెతండ్రి ముక్కా ముత్యాల నాయుడు టీడీపీ సీనియర్ నాయకుడు.పార్టీ స్థాపించి నప్పటి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ లో చురుగ్గా కొనసాగుతున్నారు. గతంలో ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ కార్పొరేటర్లుగా పనిచేశారు. డాక్టర్ ముక్కా శ్రావణి 2015 లో తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు.2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో అక్కయ్యపాలెం పరిధి లోని 26వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందారు.“2021 కార్పొ రేషన్ ఎన్నికలో విశాఖ ఉత్తరనియోజక వర్గంలోని 26వవార్డు నుంచిపోటీ చేశా ను.ఆనియోజకవర్గంలో17 వార్డులుంటే… అందులో టీడీపీ గెల్చుకున్న ఏకైన వార్డు నాదే” అని ముక్కా శ్రావణి చెప్పారు.ఒక వార్డు రిజర్వేషన్ కారణంగా రాజకీయాల్లోకి వచ్చిన ముక్కా శ్రావణి…ఐదేళ్లలో నగర ప్రథమ పౌరురాలిగా ఎదిగారు.జీవీఎంసీ మేయర్ స్థానం 2026లో జనరల్ మహిళా కేటగిరీకి రిజర్వ్ కావడంతో, సుదీర్ఘ చర్చల అనంతరం టీడీపీ అధిష్టానం ఆమెను కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా ఖరారు చేసింది.‘ఆరిజర్వేషనే నన్నింత దూరం తెచ్చింది’విశాఖ మేయర్ గా ఎన్నికైన ముక్కా శ్రావణి తాను రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందోచెప్పారు.”నిజానికి 2021ఎన్నికల్లో మాఅన్నయ్య కార్పొరేటర్ గా పోటీ చేద్దామనుకున్నారు.మానాన్న 2000లో జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచారు. ఆయన రాజకీయ వారసుడిగా మా అన్నయ్య 26వవార్డునుంచిబరిలోదిగుదామనుకున్నారు. కానీ ఆవార్డు మహిళ లకు రిజర్వ్ కావడంతో నేను పోటీ చేయా ల్సి వచ్చింది.” అని శ్రావణి మాట్లా డుతూ గుర్తు చేసుకున్నారు. ఆనిర్ణయ యమే ఇప్పుడు తనను విశాఖ మేయర్ పీఠంపై నిలిపిం దన్నారు.
‘కార్పొరేటర్ అనుభవం మేయర్‌గా ఉపయోగం’
కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవం ఇప్పు డు విశాఖమేయరుగా పనిచేయడానికిఉప యోగ పడుతుందని శ్రావణిఅన్నారు. “కార్పొ రేటర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. జీవీ ఎంసీ సమా వేశాల్లోనూ అనేకసార్లు పాల్గొన్నా.అందుకే విశాఖనగర సమస్యలపై పూర్తి అవగాహన ఉంది.ప్రతివార్డులో అభివృద్ధిపనులు,ప్రజా సమస్యలపై నెలవారీ సమీక్షలు నిర్వహించడం తో పాటు సురక్షిత తాగు నీరు,పారిశుధ్యం,రహ దారుల మరమ్మతులపై దృష్టిపెడతా. సముద్రం లోకి మురుగు నీరు చేరకుండా చర్యలు తీసు కుంటా. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు ఏర్పాటుచేయడం,వీధి దీపాలు, పబ్లిక్ టాయిలెట్లు,ఆట స్థలాలను మెరుగు పరచడంద్వారా విశాఖను మరింత అభివృద్ధి చేస్తా”అని ముక్కాశ్రావణి తెలిపారు. “విశాఖ నగరాన్ని పరిశుభ్రమైన, పచ్చ దనంతో కూడిన క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చి దిద్దడమే నాలక్ష్యం. ప్రతివార్డులో ఆటస్థలాలను అభివృద్ధిచేసి, ప్రజ లకు మెరుగైన జీవనప్రమాణాలు కల్పిం చేందు కు కృషి చేస్తాను”అని శ్రావణి తెలిపారు.
ప్రశాంతంగా ముగిసిన జీవీఎంసీ రెండో సాధా రణఎన్నికలు
విశాఖపట్నం నగరంలో జీవీఎంసీ రెండో సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నవం బరు ఒకటన ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీ రింగ్ కళాశాలలోని సివిల్ ఇంజనీ రింగ్ కాంప్లెక్స్ భవనంలో పోలీస్ కమిష నర్ శంఖ బ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌లతో కలిసి నిర్వహించిన విలే కరుల సమావేశంలో ఎన్నికల వివరాలను వెల్లడించారు. జీవీఎంసీ పరిధిలోని 120 వార్డుల్లో మొత్తం18,37,901మంది ఓటర్లకుగాను 9,45,915 మంది తమ ఓటు హక్కును వినియోగిం చుకు న్నారని, మొత్తం51.47శాతం పోలింగ్ నమో దైందని స్పష్టంచేశారు.వీరిలో4,55,395 మంది పురుషులు,4,90,519మంది మహిళలు ఓటువేశారని వివరించారు.మొత్తం1,990 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛ నీయ ఘటనలు చోటుచేసుకో కుండాఎన్నికల ప్రక్రి య పూర్తయిందని,నగర వ్యాప్తంగా ఎలాంటి ఎన్నికల సంబంధిత ఫిర్యాదులు లేదా ఘటనలు నమోదు కాలే దని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో సుమారు15వేల మంది సిబ్బంది పాల్గొన్నారని, 201 రూట్ల లో పోలింగ్ సిబ్బంది,ఎన్నికల సామగ్రి తరలింపునకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. నవంబర్ 3వతేదీన ఆంధ్ర విశ్వ విద్యాల యంలో ఏర్పాటు చేసిన113 కౌం టింగ్ ప్రక్రియకూడా ప్రశాంతంగా ముగిసిందన్నారు. – జి ఏ సునీల్ కుమార్

భాషలను వదిలేస్తే నాగరికత సగం వదిలేసినట్టే

విశాఖపట్నం ప్రతినిథి : భారతీయ భాషల న్నింటిలోనూ మనదైన సంస్కృతిసాంప్ర దా యం శక్తి ఉన్నాయని భాషలను వదిలేస్తే సగం నాగరికతను వదిలేసినట్టేనని సాహితీవేత్త సినీ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు అన్నారు.ముఖ్యంగా అడవిదాటి రాని గిరిజన భాషలు అమూల్య మైనవని ప్రాచీన మైన వీటన్నింటిని నిలుపుకొని పరిశోధనలతో సుసం బంధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజన భాషలు భారతీయ భాషలే అనే అంశం పై ఆంధ్ర విశ్వవిద్యాలయం శక్తిఫౌండేషన్ సంయుక్తంగా గత నెలలో రెండు రోజులపాటు ఆంధ్ర విశ్వ విద్యాల యం అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాల యం వైస్‌ఛాన్సలర్ ఆచార్య జిపిరాజశేఖర్ ఏక లవ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు పివేణు గోపాల్‌రెడ్డి,విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎంవిఆర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.జొన్నవిత్తులప్రధానోఉపన్యాసం చేస్తూ,మహోన్నతమైన సంస్కృతికి నాగరిక తలతో కూడిన గిరిజనభాషనుంచి మనం నేర్చు కోవాల్సింది ఎంతో ఉందని,అందుకోసం గిరిజన మాండలికాలు,పదాలు,వైద్యానికి సంబం ధించిన విషయాలపై పరిశోధ నలు జరగాలని అన్నారు.వారికథలు,పాటలు సామెతలు చాలాఉన్నతమైనవని,గిడుగురామ్మూర్తి రాసిన సవర కథలు ఎంతో స్ఫూర్తిదాయకంగాఉంటాయని చెప్పారు.
తెలుగు భాషకే సరైన ప్రోత్సాహాన్ని ప్రభు త్వాలకు ఇవ్వని సందర్భంలో గిరిజన భాషలను కాపాడుకోవడం కాస్త ఇబ్బందికరమైన విషయ మని, అయినప్పటికీ ప్రజలు భాషల కోసం గట్టిగా నిలబడాలని పిలుపునిచ్చారు.పిల్లలకు తెలుగు అక్షరం నేర్పకపోతే ఎలాగని స్థానిక భాషల్లోనే ప్రాథమిక విద్య బోధించాలని అన్నారు. మన సం స్కృతి మనభాషలను మనకు కాకుండా చేసే ప్రభు త్వాలను మనం తిరస్కరించాలని పిలుపునిచ్చారు.
మరో అతిధి పి.వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం ప్రకారం గిరిజన భాషల్లోనే విద్యాబోధన జరగా లని అన్నారు.8వ తరగతివరకు విద్యాబోధన స్థానిక భాషలోనే జరగాలని కేంద్రంస్పష్టం చేసిం దని రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు జరపాలని కోరారు.గిరిజన ఉపాధ్యాయులే ప్రాథమిక విద్యను బోధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకో వాలని అన్నారు. గిరిజన భాషల్లోనే పుస్తకాల ప్రచురించాలని సూచించారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు గిరిజన ప్రాంతాల్లో వినియోగం,పిసా చట్టం అమలు ద్వారా మాత్రమే ఇది సాధ్యమ వుతుందని చెప్పారు.
ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ, గిరిజన భాషా వికాసంకోసం ఆంధ్రవిశ్వవిద్యాలయం అల్లూరు జిల్లా యంత్రాంగంతో ఒప్పందానికి కుదుర్చు కున్నదని,గిరిజన భాష,ఆరోగ్యంపై పరిశోధ నలు చేస్తామని చెప్పారు. ప్రతి గిరిజన భాషకు లిపి అవసరమా లేదా అన్నదానిపై భాషావేత్తలు పరిశోధన చేయాలని,ఏఐ యుగంలో నాలుగైదు భాషలకు కలిపి ఒక లిపి ఉంటే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. గిరిజన భాషలకు ప్రజాదా రణ కల్పించేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కట్టుబడి ఉంటుందని చెప్పారు.ఆచార్య డి. సంధ్య దీపిక స్వాగతం పలకగా ఆచార్య పివి లక్ష్మీనారాయణ అతిధులను పరిచయం చేశారు. గిరిజన విద్యార్థి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.- జి ఏ సునీల్ కుమార్ 

మహావిశాఖనగర పాలక ప్రస్థానం

“ వాలంటరీ అసోసియేషన్ నుంచి జీవీఎంసీ దాకా విశాఖ నగర పాలన ప్రస్థానం..”
ఒకప్పుడు వ్యాపారులు, జమీందారుల స్వచ్ఛంద సంస్థ చేతుల్లో నగర పాలన.. నేడు ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో విస్తృత పరిపాలన.1858లో వాలంటరీ మున్సిపల్ అసోసియేషన్‌తో ప్రారంభమైన మహా విశాఖ నగర పాలన ప్రస్థానం ఎన్నో మలుపులు తిరిగింది. ఐదు వార్డులతో మొదలైన వ్యవస్థ నేడు 120 వార్డులకు విస్తరించింది. మున్సిపల్ కమిషన్, కౌన్సిల్, కార్పొరేషన్, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)గా ఎదిగిన ఈ ప్రయాణం నగర చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. -గునపర్తి సైమన్
ఇప్పుడు విశాఖపట్నం అంటే బీచ్‌లు,పోర్టు, పరిశ్రమలు,వేగంగా విస్తరిస్తున్న నగరం. కానీ ఈ నగరం తొలిరోజులలో ఇలా లేదు.కొంతమంది వ్యాపారులు,జమీం దార్లు కలిసి ఏర్పాటు చేసిన ఓవలంటరీ అసోసియేషన్ నుంచి మొదలైన వ్యవస్థ… మున్సిపల్ కమిషన్‌గా,కౌన్సిల్‌గా,కార్పొ రేషన్‌గా మారింది.ఆతర్వాత నగరం విస్తరిం చడంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొ రేషన్ (జీవీఎంసీ)గా ఎదిగింది.ఈ క్రమం లో నగరపాలనలో వచ్చిన మార్పు లేంటి? ప్రజాప్రతినిధుల పాత్ర ఎలా మారింది? వంటి అంశాలు తెలుసు కుందాం.
సహజ నౌకాశ్రయం..అభివృద్ధికి పునాది
తూర్పు కనుమలు,బంగాళాఖాతం మధ్య విస్తరించిన విశాఖపట్నానికి సహజసిద్ధ మైన నౌకాశ్రయం ప్రత్యేకగుర్తింపును తీసు కొచ్చింది.సముద్ర వాణిజ్యం,విదేశీ వ్యాపారుల రాకపోకలు,బ్రిటిష్ పాలనతో ఈప్రాంత ప్రాధాన్యం పెరిగింది. అనంత రం రైల్వే,పోర్టు,పరిశ్రమలు,నౌకాదళ స్థావరం ఏర్పాటుతో నగరం వేగంగా విస్తరించింది.విశాఖభౌగోళిక స్వరూపమే నగర అభివృద్ధికి పునాదిగా నిలిచిందని ఆంధ్ర విశ్వ విద్యాలయం చరిత్ర,పురా వస్తుశాస్త్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ వివరించారు. ఒకవైపు తూర్పుకను మలు,మరో వైపు సముద్రతీరం,తీరప్రాంతంసహజంగా ఒంపుతిరిగి ఉండటం విశాఖప్రత్యే కతలని ఆయన పేర్కొన్నారు.
1858లో వాలంటరీ అసోసియేషన్ ఏర్పాటు
విశాఖ నగర పాలనకు పునాది పడింది 1858లో ఏర్పాటైన వాలంటరీ మున్సి పల్ అసోసియేషన్‌తో.1850నాటి చట్టం ప్రకారం ఏర్పాటైన ఈ సంస్థ ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్న పాలక వ్యవస్థ కాదు.అప్పటి కలెక్టర్,సివిల్ జడ్జి,జమీం దారీ కుటుంబాలకుచెందిన ప్రము ఖులు,వ్యాపారవర్గాల ప్రతినిధులు ఇందు లో భాగస్వాములుగా ఉండేవారు.ఈ వ్య వస్థను పెద్దమనుషుల కూటమిగా అభి వర్ణించిన ప్రొఫెసర్ కొల్లూరు సూర్య నారాయణ,అప్పటినగరపాలనలో అధి కారులతో పాటు స్థానిక ప్రముఖులు కీలక పాత్ర పోషించేవారని వివరిం చారు.స్థానికంగా పన్నులు,లైసెన్సుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుని నగర అవసరాలకు వినియోగించేవారు.
ఐదు వార్డులతో మున్సిపల్ పాలన
1865లో టౌన్ ఇంప్రూవ్‌మెంట్ చట్టం అనంతరం విశాఖలో మున్సిపల్ పాల నకు మరింత అధికారిక రూపం వచ్చిం ది.మున్సిపల్ కమిషన్,కౌన్సిల్ వ్యవస్థల ద్వారా నగరఅభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాయి.అప్పట్లో పాలన ప్రధానం గా అధికారుల ఆధ్వర్యంలోనే సాగేది. విశాఖ చరిత్రపై అధ్యయనం చేసిన బి.మహదేవశాస్త్రి వివరాలప్రకారం, 1888 నాటికి నగరంలో కేవలం ఐదు వార్డులు మాత్రమే ఉండేవి.వీధుల అభి వృద్ధి,మార్కెట్లనిర్వహణ,పారిశుధ్యం, టౌన్ హాల్ వంటి నిర్మాణాలు అప్పటి నగర పాలనలో ముఖ్యమైన అంశాలుగా నిలిచాయి.
1979లో మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్పు
జనాభా పెరుగుదల, నగర విస్తరణతో మున్సిపల్ వ్యవస్థను మరింత బలో పేతం చేయాల్సిన అవసరం ఏర్పడింది.ఈ నేప థ్యంలో 1979లో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయింది.1981లో కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగాయి.ఎం. ఎస్.ఎన్.రెడ్డి మేయర్‌గా ఎన్నికయ్యారు. 1987లో డి.వి.సుబ్బారావు మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు.అనంతర కాలంలో సబ్బం హరి,రాజాన రమణి తదితరులు కూడా మేయర్ పదవిలో కొనసాగారు. ఈ దశలో నగర పాలనలో ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పాత్ర మరింత ప్రాధాన్యం సంత రించుకుంది. అయితే పాలకవర్గాల పదవీ కాలం ముగిసిన సందర్భాల్లో ప్రత్యేక అధికారుల పాలన కూడా కొనసాగింది.
2005లో గ్రేటర్ విశాఖ ఆవిర్భావం
విశాఖ నగరం పాత మున్సిపల్ కార్పొ రేషన్ పరిధిని దాటి విస్తరించడంతో పరిసర ప్రాంతాలను కూడా నగరపాలనపరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది.ఈ క్రమంలో 2005 నవంబర్ 1న గ్రేటర్ విశాఖమున్సిపల్‌కార్పొరేషన్ (జీవీఎంసీ) ఏర్పాటైంది.గాజువాక,గోపాలపట్నం, బుచ్చి రాజుపాలెం వంటిప్రాంతాల విలీనంతో నగరపాలనా పరిధి విస్తరించింది.
ఆ తర్వాత అనకాపల్లి,భీమునిపట్నం పురపాలక సంఘాలు,మరికొన్ని గ్రామీణ ప్రాంతాలు కూడా జీవీఎంసీ పరిధిలోకి వచ్చాయి.దీంతో విశాఖ నగర పాలన మరింత విస్తృత భౌగోళిక పరిధిలో సేవలు అందించే వ్యవస్థగా మారింది.
ప్రత్యేక అధికారుల పాలనఎన్నికైన పాలక వర్గాలు
విశాఖ నగర పాలన చరిత్రలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పాలనతో పాటు ప్రత్యేక అధికారుల పాలన కూడా పలుదశల్లో కొనసాగింది.1992నుంచి1995 వరకు ప్రత్యేక అధికారిపాలన ఉండగా, 1995 లో ఎన్నికల అనంతరం సబ్బంహరి మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2000 లో రాజాన రమణి మేయర్‌గా ఎన్నిక య్యారు.జీవీఎంసీ ఏర్పాటైన తర్వాత 2005నుంచి2007వరకు ప్రత్యేక అధికారిపాలన కొనసాగింది.2007లో మళ్లీ ఎన్నికలుజరిగాయి.2012లోపాల కవర్గ పదవీకాలం ముగిసిన తర్వాత 2021వరకు ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది.
పెరిగిన నగరం.. విస్తరించిన బాధ్యతలు
నగరపాలనాపరిధి పెరిగేకొద్దీ ప్రజలకు అందించాల్సినసేవల బాధ్యత కూడా విస్త రించింది.తాగునీరు,పారిశుధ్యం,రహదా రులు,డ్రైనేజీ,వీధిదీపాలు,పట్టణ ప్రణాళిక వంటి మౌలిక సదుపాయాలను విస్తృత ప్రాంతాలకు అందించాల్సిన అవసరం ఏర్పడింది.వార్డుల స్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించడం,వాటిని కార్పొ రేషన్ దృష్టికి తీసుకెళ్లడం,అభివృద్ధి పనుల అమలును పర్యవేక్షించడం, నిధుల వినియోగంపై ప్రశ్నించడం వంటి బాధ్యతలు ఎన్నికైన కార్పొరేటర్లపై ఉన్నా యి.నగర విస్తరణకు అనుగుణంగా పాలనా వికేంద్రీకరణ,ప్రజల భాగస్వా మ్యం కూడా అంతే ముఖ్యమైనవి.
అభివృద్ధితో పాటు జవాబుదారీతనం అవసరం
ఐదు వార్డులతో ప్రారంభమైన విశాఖ నగర పాలన నేడు 120వార్డులకు విస్తరించింది.1858లో వాలంటరీ అసోసియేషన్‌గా మొదలైన వ్యవస్థ మున్సిపల్ కౌన్సిల్,కార్పొరేషన్, గ్రేటర్ కార్పొరేషన్ దశలను దాటి ప్రస్తుత జీవీ ఎంసీగా రూపాంతరం చెందింది. 2026-27ఆర్థిక సంవత్సరానికి రూ.4,047కోట్ల వ్యయ బడ్జెట్‌ను ఆమో దించి, రూ.4,180కోట్ల ఆదాయాన్ని అంచనా వేసినట్లు పేర్కొనడం నగర పాలన విస్తృతిని తెలియజేస్తోంది.అయితే నగరం విస్తరించడం,బడ్జెట్ పెరగడం మాత్రమే అభివృద్ధికి కొలమానం కాదు. నగరంలోని పేదలు,మురికివాడల ప్రజలు,అట్టడుగు వర్గాలు,కొత్తగా విలీన మైన ప్రాంతాల ప్రజలకు సమానంగా మౌలిక సదుపాయాలు అందుతు న్నాయా?తాగునీరు,పారిశుధ్యం,ఆరో గ్యం,రహదారులు,పర్యావరణ పరిరక్ష ణకు తగిన ప్రాధాన్యం లభిస్తోందా? ప్రజాధనం వినియోగంలో పారదర్శకత, ప్రజాప్రతినిధుల జవాబుదారీతనం ఎంతవరకు ఉంది? అనే ప్రశ్నలు కీలకంగా మారుతున్నాయి. విశాఖ నగర పాలన చరిత్ర కేవలం సంస్థాగత మార్పుల ప్రయాణం మాత్రమే కాదు. ప్రజల అవసరాలకు అనుగు ణంగా మారాల్సిన స్థానిక ప్రజాస్వామ్య వ్యవస్థ పరిణామ క్రమంకూడా.నగరం ఎంత విస్తరించినా,అభివృద్ధి ఫలాలు చివరి వరుస లో ఉన్నపేద ప్రజలకు చేరినప్పుడే విశాఖ ప్రగతికి నిజమైన అర్థం చేకూరుతుంది.
విస్తరించిన నగరం..మారిన గ్రామాలముఖచిత్రం
విశాఖ నగర విస్తరణ అంటే కేవలం భౌగో ళిక సరిహద్దులు పెరగడం మాత్రమే కాదు.నగరంలో విలీనమైన గ్రామాల జీవన విధానాలు,భూముల వినియోగం,ఉపాధి అవకాశాలు,సామాజిక సంబంధాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి.ఒకప్పుడు వ్యవసాయం,పశుపోషణ,చేపలవేటపై ఆధారపడిన గ్రామాలు క్రమంగా నివాస, వాణిజ్య,పారిశ్రామిక ప్రాంతాలుగా మారా యి.రహదారులు,తాగునీరు,పారిశుధ్యం వంటి సౌకర్యాలు విస్తరించినప్పటికీ, భూములధరలు పెరగడం,వ్యవసాయ భూములు తగ్గిపోవడం,సంప్రదాయ వృత్తు లకు విఘాతం కలగడం వంటి సమస్యలు కూడా ముందుకొచ్చాయి.2005లో జీవీ ఎంసీ ఏర్పాటుతో పాత విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు గాజువాక మున్సిపాలిటీ,32 గ్రామాలు,పంచాయతీ ప్రాంతాలు కొత్తపాలనా పరిధిలోకి వచ్చా యి. అనంతరం భీమిలి,అనకాపల్లి మున్సి పాలిటీల విలీనంతో పరిధి మరింత విస్తరించింది.అయితే విలీనమైన ప్రాంతాల్లో నగరానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏకకాలంలో అభివృద్ధి చెందాయా? గ్రామీణ ప్రాం తాల అవసరాలకు అనుగుణంగా ప్రణా ళికలు రూపొందించారా? అనే ప్రశ్న లు పరిశీలించాల్సి ఉంది.
మత్స్యకారుల జీవనోపాధిపై పట్టణీకరణ ప్రభావం
విశాఖతీరప్రాంత అభివృద్ధి,పర్యాటక ప్రాజె క్టులు,పోర్టువిస్తరణ,పారిశ్రామిక కార్యకలా పాలు మత్స్యకారగ్రామాలపై ప్రభావం చూపిన అంశాలు.రుషికొండ, కాప్పలుప్పాడ,తిమ్మాపురం వంటి తీర ప్రాంతాల్లో సంప్రదాయ చేపల వేటకు ఎదురవుతున్న సవాళ్లను ఒకఅధ్యయనం ప్రస్తావించింది.కార్పొరేట్ ట్రాలర్లపోటీ, సముద్రకాలుష్యం,పర్యాటక అభివృద్ధి కారణంగా సంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధి ఒత్తిడికి గురవుతోందని ఆఅధ్యయనం పేర్కొంది.ఆర్‌కే బీచ్‌పరి సరాల సుందరీ కరణతో మత్స్యకార కుటుంబాల నివాస,వృత్తిసంబంధిత సమ స్యలుకూడా ప్రస్తావనకు వచ్చాయి. గంగవరం పోర్టునిర్మాణం,దిబ్బపాలెం మత్స్య కారులవేట కార్యకలాపాల మార్పు,యారాడలో చేపలల్యాండింగ్ సదుపాయాల ఏర్పాటు వంటి పరిణా మాలను ప్రపంచ బ్యాంకు విశాఖపట్ట ణాభివృద్ధి పత్రం ప్రస్తావించింది. ఇవి అభివృద్ధి ప్రాజెక్టులు స్థానిక జీవనోపాధి పై ఎలాంటి ప్రభావం చూపుతాయో అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని తెలియ జేస్తాయి.
పేదలు,మురికివాడలు..అభివృద్ధి ఫలాలు ఎవరికి?:
నగర విస్తరణతో భూముల విలువ పెరి గినా,అదే స్థాయిలో పేదలకు గృహ వసతి, మౌలిక సదుపాయాలు అందు తున్నాయా అన్నది కీలక ప్రశ్న.మురికి వాడల్లో నివసిం చే కుటుంబాలకు తాగు నీరు,డ్రైనేజీ,పారిశుధ్యం,రహదారులు, ఆరోగ్యసేవలు అందు బాటులో ఉండటం అత్యవసరం.పునరాభివృద్ధి పేరుతో నివాసితులను తరలించే సందర్భాల్లో వారి ఉపాధి ప్రదేశాలు, పాఠశాలలు,సామా జిక సంబంధాలు దెబ్బతినకుండా చూడాలి. విశాఖలో మురికివాడల పునరా భివృద్ధి, నివాసితుల పునరావాసంపై ఇటీవల వెలువడిన నివేదికలు ఈఅంశం ప్రాధా న్యాన్ని తెలియజేస్తున్నాయి.వెలంపేటలో 177కుటుంబాలను అదే ప్రాంతంలో పునరావాసం కల్పించే ప్రాజెక్టు ఇందుకు ఒకఉదాహరణ.
చారిత్రక వివరాలు: నిర్ధారణలు,సవరణలు
-1858 అసోసియేషనఆల్ ఇండియా యాక్ట్ XXVI ఆఫ్ 1850 కింద ఏర్పాటైనట్లు జీవీ ఎంసీ అధికారిక వెబ్‌సైట్ పేర్కొంటోంది.
-1865 చట్టంటౌన్ ఇంప్రూవ్ మెంట్ యాక్ట్ ఆఫ్ మద్రాస్,యాక్ట్ X ఆఫ్ 1865.
-మున్సిపల్ కమిషన్ అధికారులు, వ్యాపార వర్గాల నుంచి నామినేట్ చేసిన సభ్యులతో ఏర్పడింది. కలెక్టర్ ఎక్సఅఫీషియో అధ్యక్షుడు.
-1884 చట్టంమద్రాస్ డిస్ట్రిక్ట్ మున్సిపాలిటీస్ యాక్ట్‌ద్వారా కమిషన్ స్థానంలో కౌన్సిల్ ఏర్పడినట్లు జీవీఎంసీ చరిత్ర వివరిస్తోంది.
-1888లో ఐదు వార్డులుఈ సంఖ్యను నిర్ధారించే ప్రాథమిక అధికారిక రికార్డు లభించలేదు. మరో చారిత్రక కథనం 1884లో ఆరు వార్డులుగా విభజించినట్లు పేర్కొంటోంది.
-1987 మేయర్ ఎన్నిక డి.వి.సుబ్బారావు నేరుగా ప్రజల ఓట్లతో మేయర్‌గా ఎన్నికై నట్లు వార్తా చరిత్రలో పేర్కొంటున్నారు.దీనికి ఎన్నికల సంఘం లేదా అప్పటి గెజిట్ ఆధారం జతచేయడం మంచిది.
-120 వార్డులు2026 సెప్టెంబర్ 14న వెలువడిన వార్డుల పునర్విభజన గెజిట్‌లో 98 నుంచి 120 వార్డులకు పెంపు ప్రక్రియ నమోదైంది.
-2026-27బడ్జెట్‌రూ.4,047కోట్ల వ్యయం,రూ.4,180కోట్ల ఆదాయం అనే గణాంకాలను నిర్ధారించే అధికారిక బడ్జెట్ పత్రంలేదా కౌన్సిల్ తీర్మానం ఇంకా లభించలేదు.

ఆదవాసీ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక బిర్సాముండా

  • భూమి,అడవి,అస్తిత్వంకోసం ఉల్గులన్..
  • తరతరాలకు స్ఫూర్తినిచ్చే విప్లవపోరాటం
    నవంబర్ 15, 2026-జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా ప్రత్యేక కథనం
    1875నవంబర15నజన్మించిన బిర్సా ముండా 2026 నవంబర్ 15నాటికి 151వ జయంతిని జరుపుకుంటున్నారు. ఆయన జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా జనజాతీయ గౌరవ్‌దివస్‌ను నిర్వహిస్తున్నారు.ఈరోజు ఒకమహానాయ కుడి జన్మదిన వేడుక.ఆదివాసీ సమా జాల చరిత్ర,సంస్కృతి,స్వాభిమానం, హక్కులు,దేశ నిర్మాణంలో వారి పాత్రను గుర్తుచేసుకునే ప్రత్యేక సందర్భం.ఉలి హటు నుంచి విప్లవ నాయకుడిగా..బిర్సా ముండా ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్రంలోని ఖుంటి జిల్లాకు చెందిన ఉలిహటు గ్రామంలో 1875నవంబర్ 15న ముండా ఆదివాసీ కుటుంబంలో జన్మిం చారు.చిన్ననాటి నుంచే పేదరికం, సామాజిక వివక్ష,గిరిజన కుటుంబాలు ఎదుర్కొంటున్న భూమి సమస్యలను ఆయన దగ్గరగాచూశారు. బ్రిటిష్‌పాలన విస్తరించడంతోపాటు సంప్రదాయ ఆదివాసీభూములపై బయటివ్యక్తుల ఆధిపత్యంపెరిగింది.భూస్వాములు,వడ్డీ వ్యాపారులు, కాంట్రా క్టర్లు,అధికారుల దోపిడీతో గిరిజనరైతుల జీవనవిధానం సంక్షోభంలోపడింది.ముండా సమా జంలో భూమి పూర్వీకుల వారసత్వం, సామాజిక అస్తిత్వం,సంస్కృతి,జీవనో పాధికి ఆధారం.తరతరాలుగా సాగు చేసుకుంటూ వచ్చిన భూములపై హక్కులు కోల్పోవడం,అధిక పన్నులు, అప్పుల ఊబి,వెట్టిచాకిరీ వంటి సమస్యలు ఆదివాసీలను తీవ్రంగా వేధించాయి. ఈ పరిస్థితులను గమనించిన బిర్సా ముండా ప్రజల్లో చైతన్యం కల్పించారు. తమ భూమి,సంస్కృతి,సంప్రదా యాలు, స్వయంపాలనను కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.ఆయన నాయకత్వం కేవలం రాజకీయ నిరస నకు పరిమితం కాలేదు.సామాజిక, మతపరమైన సంస్కరణలద్వారా ప్రజల్లో ఐక్యత,ఆత్మగౌరవం,స్వీయ గుర్తింపును పెంపొందించారు.
    ఉల్గులన్.. బ్రిటిష్‌పాలనకు సింహస్వప్నం
    బిర్సా ముండా పేరు వినగానే గుర్తు కొచ్చేది‘ఉల్గులన’.ముండారీ భాషలో ఈపదానికి మహాకల్లోలం లేదా మహా తిరుగుబాటు అనే అర్థం ఉంది.1899-900మధ్య చోటానాగ్‌పూర్ ప్రాంతంలో ఉవ్వెత్తున సాగిన ఈఉద్యమం బ్రిటిష్ వలస పాలనతో పాటు ఆదివాసీలను దోపిడీ చేస్తున్న భూస్వాములు,వడ్డీ వ్యాపారులు,బయటి ఆధిపత్య శక్తులను సవాలు చేసింది.ఉల్గులన్ ఉద్యమం ఒక వ్యక్తికి లేదా ఒక అధికారికి వ్యతిరేకంగా సాగిన సాధారణ నిరసన కాదు.అది ఆదివాసీల భూమి హక్కులు,సంప్రదాయ పాలనా వ్యవస్థ,సామాజిక గౌరవం,ఆర్థిక స్వాతంత్య్రం కోసం సాగిన సమగ్ర పోరా టం.తమ పూర్వీకుల భూములపై తిరిగి హక్కులు సాధించుకోవాలని,దోపిడీవ్యవస్థకు ముగింపు పలకాలని బిర్సా పిలుపునిచ్చారు ‘అబువా రాజ’ అంటే మనరాజ్యం,మన పాలన అనే భావనను ప్రజల్లో బలంగా నాటారు.బ్రిటిష్ పాలనకు బదులుగా ఆదివాసీల స్వయంపాలన స్థాపించాలనే ఆకాంక్షను ఉద్యమంలో భాగంచేశారు. ముండా ప్రజలతోపాటు ఇతర ఆదివాసీ వర్గాలు కూడా ఈఉద్యమానికి మద్దతుగా నిలిచాయి.బ్రిటిష్ ప్రభుత్వం ఈతిరుగు బాటును అణచివేయడానికి తీవ్రచర్యలు చేపట్టింది.అనేక మంది ఉద్యమకారులు అరెస్టయ్యారు.బిర్సా ముండా కూడా బ్రిటిష్ అధికారుల చేతికి చిక్కి జైలుపాలయ్యారు.
    24ఏళ్ల వయసులోనే అమరత్వం
    బిర్సా ముండా 1900 ఫిబ్రవరిలో అరెస్ట య్యారు.రాంచీ జైలులో నిర్బంధంలో ఉం డగా1900జూన్ 9న కేవలం 24ఏళ్ల వయసులో మరణించారు.ఆయన మర ణానికి సంబంధించిన పరిస్థితులపై చారిత్రక చర్చలు ఉన్నప్పటికీ,ఆదివాసీ హక్కులకోసం సాగిన ఆయన పోరాటం మాత్రం చరిత్రలో చెరగని ముద్ర వేసింది. ఆయన జీవితం స్వల్పకాలమే అయినా, ఆలోచనలు, పోరాట పటిమ, ప్రజలను సంఘటితం చేసిన నాయకత్వం తరత రాలకు స్ఫూర్తిగా నిలిచాయి.ఆయన మరణంతో ఉద్యమం ముగిసిపోలేదు. ఆదివాసీ భూముల రక్షణ,సంప్రదాయ హక్కుల గుర్తింపు,వలస పాలనలోని దోపిడీ వ్యవస్థలపై చర్చలకు ఈ పోరాటం బలమైన పునాది వేసింది.1908లోఅమల్లోకి వచ్చిన చోటానాగ్‌పూర్ కౌలు చట్టం (్పుష్ట్రశీta చీaస్త్రజూuతీ Tవఅaఅcy Act) ఆదివాసీ భూముల బదిలీపై పరిమితులు విధించి భూమి రక్షణకు కీలకమైన చట్టంగా నిలిచింది.బిర్సా ముండా పోరాటం ఈచట్టానికి ఏకైక కారణమని చెప్పలేకపోయినా,ఆయన ఉద్యమం వెలుగులోకి తెచ్చిన భూమిసమస్యలు, ఆదివాసీల హక్కుల ప్రశ్నలు తదుపరి చట్టపరమైన చర్యలకు చారిత్రక నేప థ్యంగా నిలిచాయి.
    ‘ధర్తీ అబా’..భూమికి తండ్రి
    బిర్సాముండాను ఆయన అనుచరులు ‘భగవాన్ బిర్సాముండా’,‘ధర్తీఅబా’అని గౌరవంగా పిలుస్తారు.ధర్తీ అబా అంటే భూమికి తండ్రి అని అర్థం.ఆయనను కేవలం రాజకీయ నాయకుడిగా కాకుండా ఆధ్యాత్మిక మార్గదర్శిగా, సామాజిక సంస్కర్తగా,ఆదివాసీ సమా జానికి రక్షకుడిగా భావిస్తారు.ఆయన బోధనలు ప్రజల్లో నైతిక విలువలు, ఐక్యత,క్రమశిక్షణ,సామాజిక సంస్కర ణలకు ప్రాధాన్యమిచ్చాయి.మూఢ నమ్మకాలు,సామాజిక దురాచారాలను విడనాడాలని,సమాజాన్ని ఐక్యంగా ఉంచాలని బోధించారు.ఆదివాసీ సంప్రదాయాలు,సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.బిర్సా ముండా అనుచరులలో ఏర్పడిన మతపరమైన సంప్రదాయాన్ని ‘బిర్సా యిట’ సంప్రదాయంగా పేర్కొంటారు. ఆయనను దైవ స్వరూపంగా ఆరాధిం చడం అనుచరుల విశ్వాసానికి సంబం ధించిన అంశం.అదే సమయంలో చరిత్ర లో ఆయనఒకవాస్తవికనాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు,సామాజిక సంస్కర్తగా గుర్తింపు పొందారు.
    జార్ఖండ్ ఆవిర్భావ దినోత్సవంతో మరో అనుబంధం
    నవంబర్ 15తేదీకి జార్ఖండ్ రాష్ట్రప్రజల జీవితాల్లో మరో ప్రత్యేకత ఉంది.2000 నవంబర్ 15న బిహార్ నుంచివిడిపోయి జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఆదివాసీ జనాభా అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర ఉంది.భాష,సంస్కృతి, భూమి,వనరులు, స్వయం పాలన వంటి అంశాలు ఈఉద్యమంలో కీలక పాత్ర పోషించాయి.అందువల్ల నవంబర్ 15 ఒకవైపు బిర్సా ముండా జయంతి, మరో వైపు జనజాతీయ గౌరవ్ దివస్, ఇంకో వైపు జార్ఖండ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స వంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మూడు సందర్భాలు చారిత్రకంగా పరస్పరం అనుసంధానమైనప్పటికీ,వాటి ప్రత్యేకతలను వేర్వేరుగా గుర్తించడం అవసరం.
    నేటి ఆదివాసీ సమాజానికి బిర్సా పోరాటం ఇచ్చే సందేశం
    బిర్సా ముండా పోరాడిన కాలం ముగిసినా,ఆయన లేవనెత్తిన ప్రశ్నలు నేటికీ పూర్తిగా పరిష్కారం కాలేదు. దేశంలోని అనేక ఆదివాసీ ప్రాంతాల్లో భూమి హక్కులు,అటవీహక్కులు,నిర్వా సితత్వం,మైనింగ్‌ప్రాజెక్టులు,సహజ వనరులపై నియంత్రణ,విద్య,వైద్యం, ఉపాధి వంటి సమస్యలు కొనసాగు తున్నాయి.అభివృద్ధి పేరుతో చేపడుతున్న భారీ ప్రాజెక్టులవల్ల ఆదివాసీ గ్రామాలు, అడవులు,జీవనాధారాలు ప్రభావితమవు తున్న సందర్భాలు ఉన్నాయి.ఒకవైపు సహజవనరుల నుంచి భారీఆర్థిక ప్రయోజనాలు సమకూరుతుండగా, మరో వైపు ఆ వనరులపై ఆధారపడి జీవించే స్థానిక ప్రజలు తమ భూములు,జీవనో పాధిని కోల్పోయే పరిస్థితులు ఎదుర్కొంటు న్నారు.ఇలాంటి సందర్భాల్లో బిర్సాముండా పోరాటస్ఫూర్తి మరింత ప్రాసంగికమవు తుంది. ఆదివాసీ అభివృద్ధి అంటే కేవలం రహదారులు,భవనాలు,పరిశ్రమలు నిర్మిం చడం మాత్రమే కాదు.వారి భూమి,అడవి, నీరు,సంస్కృతి,భాష,సంప్రదా యాలు, స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ అభివృద్ధి ఫలాలను వారికి అందించడం నిజమైన అభివృద్ధి.రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్,పంచాయతీల(షెడ్యూల్డ్ ప్రాంతా లకు విస్తరణ) చట్టం-పెసా (PజుSA), అటవీహక్కులచట్టం (ఖీ=A)వంటి చట్టాలు ఆదివాసీహక్కుల పరిరక్షణకు కీలకమైన సాధనాలు. గ్రామసభల అధికారాలు, సంప్రదాయ హక్కులు,అటవీ వనరులపై సమాజాల హక్కులు ఆచరణలో బలపడి నప్పుడే బిర్సాముండా ఆశయాలకు నిజమైన గౌరవం లభిస్తుంది.
    యువతకు బిర్సా జీవితం ఒక పాఠం
    బిర్సా ముండా చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ఒక చిన్న పాఠంగా మాత్రమే పరిమితం చేయకూడదు. ఆయన పోరాటం వెనుక ఉన్న సామాజిక,ఆర్థిక, రాజకీయ పరిస్థి తులను యువత అధ్యయనం చేయాలి. ఆదివాసీ సమాజాల చరిత్ర,భాషలు, సాహిత్యం,కళలు,సంప్రదాయాలు,స్వాతంత్య్ర పోరాటాల్లో వారి పాత్రకు విద్యా వ్యవస్థలో తగిన స్థానం కల్పించాలి.పాఠ శాలలు,కళాశాలల్లో బిర్సా ముండా జయంతి సందర్భంగా చరిత్రచర్చలు, వ్యాసరచన,చిత్రలేఖనం,పోస్టర్ ప్రదర్శ నలు,నాటకాలు,గిరిజన సాహిత్య పరిచ య కార్యక్రమాలు నిర్వహించవచ్చు.ఉలి హటు, రాంచీ వంటి ఆయన జీవితంతో ముడిపడిన ప్రాంతాల గురించి విద్యార్థు లకు వివరించాలి.సిద్ధూ కన్హు,రాణి గైడిన్లియు వంటి ఇతర గిరిజన పోరాట యోధుల చరిత్రను కూడా పరిచయం చేయాలి.అయితే గిరిజన సంస్కృతిని ఒకే రకమైన దుస్తులు,నృత్యాలు,ఆచారాలుగా చూపకుండా, ప్రతి తెగకు,ప్రాంతానికి ప్రత్యేకమైన భాష, సంస్కృతి,చరిత్ర ఉన్నా యని గుర్తించాలి.ఆదివాసీ సమాజాల గొంతుకకు ప్రాధాన్యం ఇచ్చేలా కార్యక్ర మాలు నిర్వహించాలి.
    బిర్సా ముండా స్ఫూర్తి..హక్కుల సాధనలో ముందడుగు
    బిర్సా ముండా జీవితం మనకు ఒకగొప్ప సందేశాన్ని ఇస్తుంది. భూమిని కాపాడు కోవడం అంటే కేవలం ఆస్తిని కాపాడు కోవడం కాదు..అది ఒక సమాజపు అస్తిత్వాన్ని, సంస్కృతిని, భవిష్యత్తును కాపాడుకోవడం. అడవిని పరిరక్షించడం అంటే ప్రకృతిని మాత్రమే కాదు,దానిపై ఆధారపడి జీవించే ప్రజల హక్కులను కూడా పరిరక్షించడం.151సంవత్సరాల క్రితం జన్మించిన ఆమహా నాయకుడి స్ఫూర్తి నేటికీ ఆదివాసీ యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది.ఆయన సాగించిన ఉల్గులన్ పోరాటం మనకు హక్కులకోసం ఐక్యంగా నిలబడాలని,అన్యాయాన్ని ప్రశ్నించాలని, మన సంస్కృతి,భూమి,ప్రకృతిని కాపాడు కోవాలని గుర్తుచేస్తోంది.జనజాతీయ గౌరవ్ దివస్‌ను కేవలం జయంతి వేడుకగా కాకుండా,ఆదివాసీ సమాజాల చరిత్రను గౌరవించే,వారి హక్కులను పరిరక్షించే, వారి అభివృద్ధికి కట్టుబడే సంకల్ప దినంగా నిర్వహించాలి.బిర్సా ముండాకు నిజమైన నివాళి ఆయన చిత్రపటానికి పూలమాల వేయడంలో మాత్రమే లేదు.ఆయన కలలుగన్న భూమి హక్కులు,సామాజిక గౌరవం,స్వయంపాలన,ఆదివాసీ అస్తిత్వ పరిరక్షణను ఆచరణలోకి తీసుకురావడం లోనే ఉంది.జోహార్ బిర్సా ముండా! జోహార్ ఆదివాసీ పోరాట స్ఫూర్తి! – గునపర్తి సైమన్ 

చట్టాలున్నాయి..అమలేదీ..?

. హక్కులకు రాజ్యాంగ భరోసా
. ఆచరణలోకి రావాలి రాజ్యాంగం
. ఆదివాసీ హక్కులే రాజ్యాంగ స్ఫూర్తి
. బలహీనుల పక్షాన రాజ్యాంగం
. గ్రామసభకు అధికారం.. ప్రజలకు హక్కు

ఆదివాసీ హక్కుల నుంచి ప్రజాస్వామ్య విలువల వరకు..చట్టాలు ఉన్నా అమలులో ఎందుకీ నిర్లక్ష్యం?
అధికారంలో ఉన్నవారికి అసౌకర్యం కలిగిం చినా రాజ్యాంగాన్ని గౌరవించి, బలహీనుల హక్కులను కాపాడినప్పుడే సమాజం ఆరో గ్యంగా ఉంటుంది.

భారతదేశంలో చట్టాలకు కొరత లేదు. రాజ్యాంగం ప్రతిపౌరుడికి హక్కులు కల్పిం చింది.బలహీనవర్గాలకు ప్రత్యేక రక్షణలు అందించింది.ఆదివాసీలభూమి,అటవీ వనరు లు,సంప్రదాయాలు,సంస్కృతిని కాపాడేం దుకు ప్రత్యేకచట్టాలు,పాలనా వ్యవస్థలను ఏర్పాటు చేసింది.అయినప్పటికీ,ఈచట్టాలు అత్యంత అవసరమైనచోటఅడవులు,కొండలు,మారు మూల గ్రామాల్లోవాటి అమలు ప్రశ్నార్థకంగా మారుతోంది.రాజ్యాంగం ఇచ్చినహామీలు అక్క డి ప్రజలకు అందుతున్నాయా? లేక అధికార, ఆర్థిక ప్రయోజనాల ముందు వారి హక్కులు బలవుతున్నాయా?అన్నది నేడు మనం వేసు కోవాల్సిన ప్రశ్న.ఆరోగ్యకరమైన సమాజం అంటే సంఘర్షణలు లేని సమాజం కాదు. అధికారంలో ఉన్నవారికి అసౌకర్యం కలిగించినప్పటికీ రాజ్యాంగ విలు వలను గౌరవించే సమాజం.బలహీనుల హక్కు లను కాపాడే వ్యవస్థ. ప్రజల అభిప్రాయాలను వినే పాలన. తప్పులను అంగీకరించి సరిదిద్దు కునే ప్రజాస్వామ్యం. – రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 


రాజ్యాంగం ఇచ్చిన హామీ..భిన్నత్వానికి భరోసా
భారత రాజ్యాంగ నిర్మాతలు దేశాన్ని ఒకే మతం,ఒకే భాష,ఒకే సంస్కృతికి పరిమితం చేయలేదు.అనేకమతాలు,భాషలు,కులాలు, తెగలు,ఆచారాలు,జీవన విధానాలతో కూడి న బహుళత్వ భారతదేశాన్ని ఊహించారు. ఆ వైవిధ్యాన్ని కేవలం సామాజిక వాస్తవంగా కాకుండా,రాజ్యాంగబద్ధమైన విలువగా గుర్తించారు.రాజ్యాంగంలోని పలు అధికర ణలుఈబహుళత్వానికిరక్షణ కల్పిస్తున్నాయి.
1.రాజ్యాంగ ప్రవేశిక: న్యాయం,స్వేచ్ఛ, సమానత్వం,సౌభ్రాతృత్వంద్వారా ప్రతి వ్యక్తి గౌరవాన్ని,దేశ ఐక్యతను,సమగ్రతను కాపా డాలని స్పష్టం చేస్తుంది.
2.అధికరణలు 14-16: చట్టం ముందు అందరూ సమానులని,మతం,జాతి, కులం, లింగం,జన్మస్థలం ఆధారంగా వివక్ష చూప రాదని నిర్దేశిస్తాయి.
3.అధికరణలు 25-30: మనస్సాక్షి,మత స్వేచ్ఛతోపాటు భాష,లిపి,సంస్కృతిని పరి రక్షించుకునే హక్కులను కల్పిస్తాయి. మైనా రిటీ వర్గాలకు విద్యాసంస్థలను స్థాపించి నిర్వహించుకునే హక్కును కల్పిస్తాయి.
4.అధికరణ 51A(వ): మత,భాషా, ప్రాం తీయ విభేదాలకు అతీతంగా సామరస్యాన్ని పెంపొందించడం,మహిళల గౌరవానికి భంగం కలిగించే ఆచారాలను విడనాడడం ప్రతి పౌరుడిప్రాథమిక కర్తవ్యంగా పేర్కొంటుంది.
5.అధికరణ 244,ఐదో,ఆరో షెడ్యూళ్లు : గిరిజనప్రాంతాల ప్రత్యేకసామాజిక, సాంస్కృ తిక, భౌగోళిక పరిస్థితులను గుర్తించి ప్రత్యేక పాలనా,రక్షణవ్యవస్థలను ఏర్పాటు చేశాయి. ఇవన్నీ కలిపిచూస్తే భారతరాజ్యాంగం బహు ళత్వాన్ని కేవలం అంగీకరించలేదు.దానిని కాపాడాల్సిన బాధ్యతను కూడా ప్రభుత్వా లకు, పౌరులకు అప్పగించింది.
మెజారిటీ అధికారం కంటే రాజ్యాంగమే గొప్పది
ప్రజాస్వామ్యంలో ఎన్నికలద్వారా ప్రభుత్వా లు ఏర్పడతాయి. మెజారిటీతో పాలన సాగు తుంది. అయితే ఎన్నికల్లో వచ్చిన మెజారి టీకి రాజ్యాంగంలోని ప్రాథమిక విలువలను ధ్వంసం చేసే అధికారం లేదు. ఈ విషయా న్ని సుప్రీంకోర్టు పలు చారిత్రాత్మక తీర్పుల్లో స్పష్టం చేసింది.కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం (1973):ఈ చారిత్రాత్మక కేసులో 13 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మా సనం,పార్లమెంటుకు రాజ్యాం గాన్ని సవరించే అధికారం ఉన్నప్పటికీ,దాని మౌలిక స్వరూ పాన్ని ధ్వంసం చేసే అధికారం లేదని తీర్పుని చ్చింది.దీనినే ‘మూల నిర్మాణ సిద్ధాంతం’గా పిలుస్తారు.ప్రజాస్వామ్యం,లౌకికవాదం, న్యాయ పాలన వంటి రాజ్యాంగ మౌలిక విలువలకు ఈ సిద్ధాంతం రక్షణగా నిలిచింది.
ఎస్.ఆర్.బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1994): ఈకేసులో సుప్రీం కోర్టు లౌకికవాదం రాజ్యాంగమూల నిర్మా ణంలో భాగమని స్పష్టం చేసింది.అలాగే అధికరణ 356కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే కేంద్ర ప్రభుత్వ అధికారానికి న్యాయ సమీక్ష ఉంటుందని పేర్కొంది.రాజకీయ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వాలను ఇష్టాను సారం రద్దు చేయలేమని తేల్చిచెప్పింది. ఈరెండు తీర్పులు ఒకముఖ్యమైన విష యాన్ని గుర్తుచేస్తు న్నాయి.ఎన్నికల మెజారిటీ తాత్కాలికం కావ చ్చు.ప్రభుత్వాలు మార వచ్చు.కానీ రాజ్యాంగ మౌలిక విలువలు శాశ్వతమైనవి.వాటిని కాపాడటం ప్రతి ప్రభుత్వ బాధ్యత.
నియమగిరి తీర్పు..గ్రామసభే ఆదివాసీ అస్తి త్వానికి రక్షణ
ఆదివాసీ హక్కుల పరిరక్షణలో మరో చారి త్రాత్మక ఘట్టం ఒడిశాలోని నియమగిరి కొం డల పోరాటం.ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ వర్సెస్ పర్యావరణ,అటవీమంత్రిత్వశాఖ (2013) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గ్రామసభల ప్రాధాన్యతనుదేశానికిచాటి చెప్పింది.నియమగిరికొండలతోడోంగ్రియా కొంధ్ ఆదివాసీ తెగకు ఉన్న మత,సాంస్కృ తిక,సంప్రదాయ సంబంధాలను న్యాయ స్థానం గుర్తించింది. అటవీ హక్కుల చట్టం–2006 కిందవారికి ఉన్నహక్కులను పరిశీ లించి, మైనింగ్ ప్రాజెక్టు వల్ల ప్రభావితమ య్యే గ్రామాల గ్రామసభలు వారి మత, సాంస్కృతిక హక్కులపై నిర్ణయం తీసుకోవా లని ఆదేశించింది.తదనంతరం సంబంధిత గ్రామసభలు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరే కంగా నిర్ణయించాయి. ఈ పరిణామం ఆది వాసీ హక్కుల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.గ్రామసభ అనేది కేవలం సమా వేశం నిర్వహించి తీర్మానం నమోదు చేసే సంస్థ కాదు.ఆదివాసీ సమాజం తన భూమి, అటవీ వనరులు,సంప్రదాయాలు, భవిష్యత్తు పై అభిప్రాయం వ్యక్తం చేసే రాజ్యాంగబద్ధ వేదిక. గ్రామసభ నిర్ణయాలను నిర్లక్ష్యం చేయడం అంటే ప్రజాస్వామ్యపు పునాదు లనే బలహీనపరచడం.
చట్టాలు మరిన్ని వచ్చాయి..అమలు ఎక్కడ?
సమత,నియమగిరి వంటి తీర్పుల తరు వాత కూడా ఆదివాసీ హక్కుల పరిరక్షణకు పార్లమెంటు మరిన్ని చట్టాలను రూపొందిం చింది.
వాటిలో ముఖ్యమైనవి:
1.పంచాయతీ (షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరణ)చట్టం-1996 ( పెసా ) : షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గ్రామసభలకు ప్రత్యేక అధికా రాలు,బాధ్యతలు కల్పించింది.సంప్రదాయ ఆచారాలు,సంస్కృతి,సామూహిక వనరు లను కాపాడటం,స్థానిక అభివృద్ధి నిర్ణయా ల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించ డం దీని ప్రధాన లక్ష్యం. అటవీ హక్కుల చట్టం-2006 : అటవీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తున్న షెడ్యూల్డ్ తెగలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసులవ్యక్తిగత,సామూహికఅటవీ హక్కు లను గుర్తించేందుకు ఈచట్టం రూపొం దించబడింది.అటవీవనరులపై వారి హక్కు లను చట్టబద్ధం చేయడమే దీని ఉద్దేశం.ఈ చట్టాలు ఆదివాసీలకుభూమి,అటవీ వనరు లపై హక్కులు కల్పించడంతో పాటు గ్రామ సభల పాత్రను బలోపేతం చేశాయి. అయి తే చట్టంలోని ప్రతినిబంధనను,సంబంధిత నిబంధనల ప్రకారం అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. భూసేక రణ, అటవీ భూముల మళ్లింపు, మైనింగ్ వంటి అంశాల్లో గ్రామసభల సంప్రదింపులు, సమ్మతి అవసరమయ్యే సందర్భాలను చట్టం నిర్దేశించింది. వాటిని యథాతథంగా పాటించాలి.చట్టాలు కాగితాలపై ఉండటం కాదు, క్షేత్రస్థాయిలో అమలైనప్పుడే వాటి ప్రయోజనం ప్రజలకు అందుతుంది.
వైఫల్యం చట్టానిదా? అమలు వ్యవస్థదా?
చట్టాలకు,ఆచరణకు మధ్య ఉన్న అంతరా న్ని దేశవ్యాప్తంగా అనేక సంఘటనలు వెల్లడిస్తు న్నాయి. అటవీ హక్కుల గుర్తింపులో జాప్యం, సామూహిక అటవీహక్కుల దరఖాస్తుల తిరస్క రణ,గ్రామసభల అధికారాలను పరిమి తం చేయడం వంటి సమస్యలు తరచూ వెలుగు లోకి వస్తున్నాయి.కొన్ని ప్రాంతాల్లో గ్రామసభ తీర్మానాలను పట్టించుకోకపోవడం, ముందుగా నిర్ణయించిన ప్రాజెక్టులకు అనుకూలంగా తీర్మానాలురూపొందించేందుకు ప్రయత్నిం చడం, అటవీ హక్కుల దరఖాస్తులను సాంకేతిక కారణాలతో తిరస్కరించడం వంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి.మధ్యప్రదేశ్‌లో అటవీ హక్కుల చట్టంఅమలు,గ్రామసభలఅధికారాలపై కూడా వివాదాలు నివేదించబడ్డాయి.
దేశవ్యాప్తంగా కనిపిస్తున్న కొన్ని సమస్యలు ఇవి :
– గ్రామసభల అభిప్రాయాలను సరైన రీతిలో నమోదు చేయకపోవడం లేదా నిర్లక్ష్యం చేయడం.
– సామూహిక అటవీ హక్కులదరఖాస్తులను సంవత్సరాల తరబడిపెండింగ్‌లో ఉంచడం.
– గిరిజనుల సామూహిక భూములను పెట్టుబడులు,పారిశ్రామిక ప్రాజెక్టులకోణంలో మాత్రమే చూడడం – అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రశ్నించే ప్రజలను అభివృద్ధి వ్యతిరేకులుగా ముద్రవేయడం.
– చట్టపరమైన రక్షణలు ఉన్నప్పటికీ ఆదివాసీలకు న్యాయం అందడంలో జాప్యం జరగడం.
పేదలపై చట్టాలను కఠినంగా అమలు చేస్తూ,శక్తివంతుల విషయంలో మాత్రం మినహా యింపులుచూపే వ్యవస్థ ఆరోగ్యకరమైన ప్రజా స్వామ్యానికి సంకేతం కాదు.చట్టం ముందు అందరూ సమానులనే రాజ్యాంగ సూత్రం ఆచరణలోనూ కనిపించాలి.
రాజ్యాంగాన్ని కాపాడటం దయ కాదు.. బాధ్యత
ప్రజాస్వామ్యం తనను తాను సరిదిద్దుకునే శక్తిని కలిగి ఉండాలి.అందుకు రాజ్యాంగం అనేక వ్యవస్థలను,సాధనాలను కల్పించింది. న్యాయవ్యవస్థ : పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయస్థానాలను ఆశ్ర యించే అవకాశం ఉంది. సమత, నియమ గిరి తీర్పులు న్యాయవ్యవస్థ ప్రజల హక్కు లకు ఎలా రక్షణ కల్పించగలదో నిరూపిం చాయి. గ్రామసభలు :ముఖ్యంగా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రజల భాగస్వామ్య పాలనకు గ్రామసభలు కీలకమైన వేదికలు.వాటి అధికారాలను, నిర్ణ యాధికారాన్ని గౌరవించాలి. స్వేచ్ఛా యుత పత్రికారంగం
పౌర సమాజం: మారుమూల ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకు రావడం,ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా న్యాయం కోసం పోరాడడం ప్రజాస్వామ్యాన్ని బలో పేతం చేస్తాయి.
బాధ్యతాయుత అధికారులు : కలెక్టర్లు,అటవీ శాఖ,గనులశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు రాజ్యాంగానికి విధేయులుగా పనిచేయాలి. చట్టాన్ని అమలు చేయడంలో మౌనం వహిం చడం తటస్థత కాదు..అది బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుంది.
బహుళత్వ భారతదేశం కోసం తక్షణం చేప ట్టాల్సిన చర్యలు
రాజ్యాంగం కల్పించిన హక్కులు క్షేత్రస్థా యిలో అమలవ్వాలంటే ప్రభుత్వాలు,అది óకార యంత్రాంగం,పౌర సమాజం సమన్వ యంతో పనిచేయాలి. ఇందుకు కొన్ని కీలక చర్యలు అవసరం.
1. పెసా ,ఐదో షెడ్యూల్ అమలు : సంబంధిత చట్టాలు,నిబంధనల ప్రకారం గ్రామసభల సంప్రదింపులు, అవసరమైన సమ్మతి ప్రక్రియలను పారదర్శకంగా నిర్వ హించాలి.తీర్మానాలను సక్రమంగా నమో దు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలి.పెండింగ్ అటవీ హక్కుల దరఖాస్తుల పరిష్కారం : ప్రతి దరఖాస్తును చట్టబద్ధంగా పరిశీలించి, తిరస్కరణకు స్పష్టమైన కారణా లు తెలియజేయాలి. వ్యక్తిగత, సామూహిక అటవీ హక్కుల వివరాలను బహిరంగంగా ప్రచురించాలి.
3.అసమ్మతికి గౌరవం : మైనింగ్,భూసేకరణ, పరిశ్రమలు,ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రజలు ప్రశ్నించినంత మాత్రానవారిని అభివృద్ధి వ్యతిరేకులుగా చిత్రీకరించరాదు. వారి అభిప్రాయాలను చట్టబద్ధ ప్రక్రియలో భాగంగా పరిగణించాలి. సాంస్కృతిక హక్కుల పరిరక్షణ: ప్రతి సమా జానికి తన మతం,భాష,సంస్కృతి,జీవన విధానాన్ని కాపాడుకునే హక్కు ఉంది. మెజా రిటీ,మైనారిటీ అనే తేడా లేకుండా ఈ హక్కు లను గౌరవించాలి.సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం: కుల, మత,భాష,ప్రాంతీయ విభేదాలకు అతీతం గా పరస్పర గౌరవం,సమానత్వం,సామా జిక న్యాయాన్ని ఆచరణలో చూపాలి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ హెచ్చరించినట్లుగా,సామాజిక ప్రజాస్వా మ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం ఎక్కువకాలం నిలవలేదు. స్వేచ్ఛ, సమాన త్వం,సౌభ్రాతృత్వం ఒకదానితో మరొకటి ముడిపడిఉన్న విలువలు. వీటిలో ఏ ఒక్కటి బలహీనపడినా ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు ఏర్పడుతుంది.
తీర్పు చెప్పాల్సింది మనమే!
రాజ్యాంగం విచారణలో లేదు.దాని సూత్రా లు స్పష్టంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు తన తీర్పులద్వారా అనేకహక్కులకు రక్షణ కల్పిం చింది.పార్లమెంటు చట్టాలను రూపొందిం చింది.గ్రామసభలకు అధికారాలు కల్పిం చింది. అయినప్పటికీ, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఈహక్కులను అమలు చేయ డంలో ఇంకా అనేక సవాళ్లు ఎదురవుతు న్నాయి. అసలువిచారణ జరగాల్సింది రాజ్యాం గంపై కాదు..దానిని అమలు చేయాల్సిన మన వ్యవ స్థపై. రాజ్యాంగం ఇచ్చిన హామీలను ప్రభు త్వాలు ఎంతవరకు గౌరవిస్తున్నాయి? అధికార యంత్రాంగం చట్టాలను ఎంతవరకు అమలు చేస్తోంది?బలహీన వర్గాలకు న్యాయం అందు తోందా? ప్రజలగొంతుకలకు పాలన లో స్థానం లభిస్తోందా?అన్న ప్రశ్నలకు సమా ధానం చెప్పా ల్సిన సమయం ఆసన్నమైంది.ఆరోగ్యకరమైన సమాజం అంటే సంఘర్షణలు లేని సమాజం కాదు. శక్తివంతుల కంటే చట్టం బలంగా ఉండే సమాజం. బలహీనులు కూడా న్యాయస్థానాల తలుపులు తట్టగలిగే సమాజం. గ్రామసభల నిర్ణయాలకు విలువ ఉండే సమా జం.తప్పులు జరిగినప్పుడు వాటిని బహిరం గంగా అంగీకరించి సరిదిద్దుకునే సమాజం. 1997లో సమతతీర్పు,2013లో నియ మగిరి తీర్పు రాజ్యాంగం ప్రజలహక్కులకు ఎలా అండగా నిలవగలదో చూపించాయి. ఇప్పుడు ఆ తీర్పుల స్ఫూర్తిని ప్రతిగ్రామానికి,ప్రతి గిరిజ న ప్రాంతానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనం దరిపై ఉంది.రాజ్యాంగాన్ని కాపాడటం అంటే కేవలం పుస్తకాన్ని గౌరవించడం కాదు.దాని రక్షణలో ఉన్న చివరివ్యక్తి హక్కును కాపాడటం. ఆదివాసీ భూమిని,వారి సంస్కృతిని,గ్రామసభ అధికారాన్ని,బలహీనుల గౌరవాన్ని నిలబెట్ట డం.అదే నిజమైన ప్రజాస్వామ్యం..అదే రాజ్యాంగానికి మనం చెల్లించే గౌరవం.

    ఎల్‌నినో పంజా ముంచుకొస్తున్న ముప్పు

    “ ఎల్‌నినో ఎఫెక్ట్ రబీపంటల సాగుపైనా పడింది.దేశంలో ఈరబీ పంటల సాగు విస్తీర్ణం 28.26లక్షల హెక్టార్ల నుంచి 18.02లక్షలహెక్టార్లకు తగ్గింది.వాతావరణమార్పులు,ఎల్‌నినో ప్రభావం దేశంలో వ్యవసాయరంగంపై ఆందోళనపెంచు తున్నాయి.ఇప్పటికే ఖరీఫ్(వర్షాకాలం)పంటలసీజన్‌ను అతలాకుతలంచేసిన ఎల్‌నినో ప్రభావం ఇప్పుడు రబీ(శీతాకాలం) పంటలపైనా తీవ్రంగాపడుతోంది.ఈఏడాది రుతుపవనాల సీజన్‌లో సాధారణంకంటే 13శాతం తక్కువ వర్షపాతం నమోదు కావడంతో వాతావరణ సమతుల్యతపూర్తిగా దెబ్బతింది.దీనివల్లపొలాల్లో తగినంత తేమలేకరైతులు సాగుపనుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నేలలో తేమతగ్గడంసహా సాగునీటిలభ్యతపై ఆందోళనల కారణంగా గోధుమలు,శనగలు సహా పలు పంటలసాగు నెమ్మదించింది.ఈఎల్‌నినో-రబీపంటలవిత్తనాలువేసే ప్రక్రియను తీవ్రంగాప్రభావితం చేసింది. కేంద్ర వ్యవసాయ రైతుసంక్షేమశాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈఆందోళనకరమైన పరిస్థితుల్ని కళ్లకుకట్టింది.”

    సగానికిపైగా పడిపోయిన గోధుమల సాగు సాధారణంగా గోధుమల సాగు కాలం దేశంలో అక్టోబర్ నుంచి నవం బర్ వరకు ఉంటుంది.మార్చి- ఏప్రిల్ నాటికి కోతకు వస్తుంది.అయితే కేంద్ర వ్యవసాయశాఖ రిపోర్ట్‌ప్రకారం గత పం టల కాలం (2025-26)అక్టోబర్ 23వ తేదీ గణాంకాలతో పోలిస్తే, ప్రస్తుత పం టల సంవత్సరంలో (2026-27) గోధు మల సాగు విస్తీర్ణం ఏకంగా 59శాతం క్షీణించింది. గతేడాది ఇదే సమయానికి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 27వేల (0.27లక్షలు) హెక్టార్లలో గోధుమ విత్త నాలు వేయగా,ఈసారి చూస్తే అది కేవలం 11వేల (0.11లక్షలు)హెక్టార్లకే పరిమితమైంది. గోధుమలతో పాటు శనగలు,అన్ని రకాల పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం కూడా భారీగా పడి పోయింది. గతేడాది అక్టోబర్ 23 నాటికి 3.77 లక్షల హెక్టార్లలో శనగలు సాగు చేయగా, ఈసారి 2.21 లక్షల హెక్టార్లకే పరిమితమైంది. పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు తగ్గడం కూడా ఆహార సరఫరాపై ప్రభావం చూపొచ్చనే ఆందోళన వ్యక్తమవు తోంది.రాజస్థాన్‌లోనే 58 శాతం తగ్గిన రబీ సాగు రాజస్థాన్ రాష్ట్రంలో రబీ పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.గోధుమలు,ఆవాలు,బార్లీ, శనగలు, కందులు,బఠానీలు వంటి పంటలు కలిగి గతేడాది ఇక్కడ అక్టోబర్ 23 నాటికి 14.13లక్షల హెక్టార్లలో సాగు చేశారు. ఈ ఏడాది అదే తేదీ నాటికి చూస్తే 5.93 లక్షల హెక్టార్లలోనే సాగు జరిగింది. ఇక్కడ రికార్డు స్థాయిలో 8.21లక్షల హెక్టార్ల మేర తగ్గుదల నమోదైంది.ఇది దాదాపు 58శాతానికి సమానం.తమిళనాడులో కూడా రబీసాగు విస్తీర్ణం సగానికి సగం తగ్గింది.యూపీలో స్వల్పంగా ప్రభావం కనిపిస్తోంది.మధ్య ప్రదేశ్‌లో గతేడాది 0.20లక్షల హెక్టార్లలో రబీ సాగు కాగా,ఈసారి అసలు నమోదు కాలేదు. ఉత్తరాఖండ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కేరళంలో గతేడాది 0.14లక్షల హెక్టార్లతో పోలిస్తే ఈసారి 0.11లక్షల హెక్టార్లలో సాగు నమోదైంది.కొద్దిరోజుల క్రితమే, భూమిపై అత్యంత శక్తిమంతమైన ఎల్‌నినో ఈ ఏడాదిలో ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇది జూన్ నుంచి ప్రారంభం కావొచ్చని అంచనా వేశారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోతాయని, ఉష్ణోగ్రతలు భారీగా పెరగొచ్చని, రుతుపవనాలు అసాధారణంగా ఉండొచ్చని భావించారు. మరోవైపు, మే నెలలో ఎల్‌నినో ఏర్పడుతుందని, ఆగస్టు నాటికి బలపడుతుందని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ (ఈసీఎండబ్ల్యూఎఫ్) అంచనా వేసింది. ఆగస్టులో సూపర్ ఎల్‌నినో ఏర్పడే అవకాశం 22 శాతం ఉందని, స్ట్రాంగ్ ఎల్‌నినో ఏర్పడటానికి 80శాతం, ఒక మోస్తరు ఎల్‌నినో ఏర్పడేందుకు 98శాతం అవకాశాలున్నాయని అభిప్రాయపడింది.
    ఇలా దేశవ్యాప్తంగా 2026,అక్టోబర్ 23 వ తేదీ నాటికి చూస్తే రబీ పంటల మొత్తం సాగు విస్తీర్ణం 18.02లక్షల హెక్టార్లుగా ఉంది. గతేడాది ఇదే తేదీ నాటికి ఇది ఏకంగా 28.26లక్షల హెక్టార్లుగా ఉం డటం గమనార్హం.ఎల్‌నినో కారణాలతో ఈసారి 10.24 లక్షల హెక్టార్ల వరకు తగ్గుదల నమోదైంది.ఈసారి శీతాకాలంలో వరి సాగు విస్తీర్ణం కూడా సగానికి సగం తగ్గింది.ఇదిలా ఉండగా,జొన్న,సజ్జ,రాగులు, ఇతర చిరుధాన్యాలు వంటి వాటి సాగు విస్తీర్ణం మాత్రం 13 వేలహెక్టార్ల నుంచి ఈసారి 23వేలహెక్టార్లకు పెరగడం విశేషం.అయితే అన్ని రాష్ట్రాల్లో సాగు తగ్గలేదు.కర్ణాటకలో రబీపంటల సాగు విస్తీర్ణం 1.80లక్షల హెక్టార్ల నుంచి1.91 లక్షల హెక్టార్లకు పెరిగింది.ఆంధ్రప్రదేశ్‌లో కూడా 0.23లక్షల హెక్టార్లతో పోలిస్తే ఈసారి 0.37లక్షల హెక్టార్లలో సాగు నమోదైంది.భారత వాతావరణశాఖ గణాం కాల ప్రకారం దేశంలో రుతుపవనాల సీజన్‌లో జూన్-సెప్టెంబర్ మధ్య దేశంలో సాధారణం కంటే 13శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.పంజాబ్‌లో సాధారణం కంటే 38 శాతం,రాజస్థాన్‌లో 22 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ చివరినాటికి ఈ రాష్ట్రాల్లోని జలాశయాల్లో నీటి నిల్వలు కూడా తక్కువగా ఉన్నాయి.దేశంలోని మొత్తం గోధుమసాగు విస్తీర్ణంలో పంజాబ్,రాజస్థాన్ రాష్ట్రాల వాటానే 31శాతంగా ఉండగా,ఈ రాష్ట్రాల్లోనే ఇప్పుడు ఎక్కువగా సాగు విస్తీర్ణం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఎల్ నినో ప్రభావం మరింత తీవ్రరూపం దాల్చనుండటంతో దేశ ఆహార భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే బలహీనమైన నైరుతి రుతుపవనాలు ఖరీఫ్ పంటల సాగు, దిగుబడులపై ప్రభావం చూపుతుండగా..తగ్గిన జలాశయాల నిల్వలు రబీ పంటలకు నీటి లభ్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.మరోవైపు కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ అండ్ సొసైటీ అంచనాలు రాబోయే శీతాకాలంలో ఎల్ నినో మరింత బలపడే అవకాశం ఉం దని హెచ్చరిస్తున్నాయి.దీంతో ఈ ఏడాది ఖరీఫ్ దిగుబడులతోపాటు రబీ ఉత్పత్తుల పైనా తీవ్ర ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారధాన్యాల ఉత్పత్తిలో కీలకమైన రాష్ట్రాలు దెబ్బతింటే దాని ప్రభావం మొత్తం దేశ ఆహార సరఫరా వ్యవస్థపై పడుతుంది.
    తెలంగాణలో ఖరీఫ్, రబీ పంటలకు దెబ్బ
    నైరుతి రుతుపవనాలు ఈసారి దేశాన్ని తీవ్రంగా నిరాశపరిచాయి.దేశవ్యాప్తంగా 759.4మి.మీ.వర్షపాతం మాత్రమే నమోదైంది.దీర్ఘకాలిక సగటు 868.6 మి.మీ.తో పోలిస్తే ఇది 87.4శాతం మాత్రమే. 1901 తర్వాత నమోదైన అత్యల్ప రుతుపవనాల్లో ఇది13వ స్థానం కాగా..2001 తర్వాత నాలుగో అత్యల్ప వర్షపాతంగా నమోదైంది.దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు విస్తీర్ణం కూడా గత ఏడాదితో పోలిస్తే తగ్గింది.ముఖ్యంగా వరి సాగు విస్తీర్ణం 16.32లక్షల హెక్టార్లు తగ్గడం ఆహార భద్రత కోణంలో కీలక పరిణా మంగా మారింది.రాష్ట్రంలో నైరుతి సీజన్లో 17శాతం లోటు ఏర్పడింది.రాష్ట్ర సగటు ఐఎండీ ప్రమా ణాల ప్రకారం సాధారణ కేటగిరీలోనే ఉన్న ప్పటికీ..33 జిల్లాల్లో 18జిల్లాలు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొ న్నాయి.దీంతో ఈ సీజన్లో వరిసాగు 54.26లక్షల ఎకరాలకే పరిమితమైంది. సాధారణ సాగు 65.96 లక్షల ఎకరాలు ఉండగా..12లక్షల ఎకరాల మేర తక్కువగా ఉంది.రబీలో 50.20లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. రబీలో తెలంగాణలో దొడ్డు వడ్లనే సాగు చేస్తారు. దీంతో డిమాండ్ ఎక్కువగా ఉన్న సన్న బియ్యం లోటు మరింత పెరుగుతుంది. రాష్ట్ర అవసరాలకు కూడా సరిపోని పరిస్థితి ఏర్పడుతుంది.సెంట్రల్ పూల్కు వెళ్లే బియ్యం తగ్గనుండటంతో ఈ ప్రభావం దేశవ్యాప్తంగా ఉండనుంది.
    పప్పులు, నూనెలపైనా ప్రభావం
    ఆహార భద్రత అంటే పప్పుధాన్యాలు, నూనె గింజలు,చక్కెర,కూరగాయల ఉత్పత్తి కూడా కీలకమే. దేశవ్యాప్తంగా పంటల దిగుబడు లపై వర్షాభావం ప్రభావం చూపితే..పంట ఉత్పత్తి దుగుబడి తగ్గుతుంది.సరఫరా తగ్గితే బియ్యం,పప్పులు,నూనెలు,కూరగాయల ధరలపై ఒత్తిడి పెరుగుతుంది.ఇప్పటికే ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేప థ్యంలో..పంటల దిగుబడి మరింత తగ్గితే పరిస్థితి కఠినంగా మారే అవకాశం ఉంది.
    దేశ ఆహార నిల్వలపై ప్రభావం
    వరి సాగు తగ్గితే ఆహార భద్రతలో కీలక మైన ఉచిత బియ్యం పంపిణీలో లోటు ఏర్పడనుంది. ఇప్పటికే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్ పంట కోతలు ప్రారంభం కాగా, ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు రైతుల వద్దకు వచ్చి పచ్చి ధాన్యాన్నే కొనుగోలు చేస్తున్నారు.ఎంఎస్పీరూ.2, 461 ఉండగా, అంత కన్నా ఎక్కువగా సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.3,200 వరకు చెల్లిస్తున్నారు.దేశంలోని పేదలకు రేషన్ బియ్యం, సంక్షేమ పథకాలకు అవసరమైన ధాన్యం,మార్కెట్లో ధరలను నియంత్రిం చేందుకు అవసరమైన బఫర్ నిల్వలు.. అన్నింటికీ ప్రభుత్వానికి తగినంత ధాన్యం అవసరం. అందువల్ల ఒకటి రెండు ప్రధాన వరి ఉత్పత్తి రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గినా.. ప్రభావం కేంద్ర నిల్వలపై పడుతుంది. ఖరీఫ్,రబీ రెండు సీజన్లలో వరిసాగు తగ్గితే, రెండు సీజన్ల ఉత్పత్తిపై ఒకేసారి సీజన్లలో వరి సాగు తగ్గితే, రెండు సీజన్ల ఉత్పత్తిపై ఒకేసారి ప్రభావం పడుతుంది.ఇది దేశ ధాన్యం సేకరణ వ్యవస్థకూ సమస్యగా మారుతుంది.
    ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు కసరత్తు ముమ్మరం
    రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సర్కారు కసరత్తు ముమ్మ రం చేసింది.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు దిశినిర్దేశం చేశారు. ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై ఇటీవల పలు కీలక సూచనలు చేశారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కూడా అధికారులకు ఇటీవల కీలక సూచనలు చేశారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరి వేస్తే నష్టాలు వస్తాయని, డిమాండ్ ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేవిధంగా రైతులను చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు.
    ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలి వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ ప్రణాళికను విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్లతో ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ సూచించారు. ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేవిధంగా విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు సమర్థవంతంగా అమలు చేయాలని సీఎస్ సంజయ్ జాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైనందు వల్ల ప్రత్యామ్నాయ పంటలను వేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. – ప్రదీప్ కుమార్

    పేదల జేబులకు పన్ను కుబేరుల సంపదకు..

    సంపదపై పన్ను, జీఎస్టీ భారం..సామాజిక న్యాయానికి కొత్త ఆర్థిక విధానం అవసరం
    ఆర్థిక అసమానత పన్నుల విధానం ఆదివాసీ హక్కులపై ప్రత్యేక విశ్లేషణ

    ఒక ఆదివాసీ ప్రాంతంలో నివసించే పేద మహిళ స్థానికదుకాణంలో ఉప్పు,సబ్బు,వంటనూనె,పిల్లల పుస్తకాలు కొనుగోలు చేస్తుంది.ఆమె కొనుగోలు చేసే వస్తువుల్లో పన్ను వర్తించే ప్రతి వస్తువుపై జీఎస్టీ చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు,కోట్లాది రూపాయల విలువైనఆస్తులు,భూములు,షేర్లు,పెట్టుబడులు కలిగిన సంపన్నుల నికర సంపదపై ప్రత్యేకంగా విధించే సంపద పన్ను మాత్రం ప్రస్తుతం దేశంలో అమల్లో లేదు.ఈరెండు పరిస్థి తుల మధ్య ఉన్న వ్యత్యాసం మన పన్నుల విధానంలో సామాజికన్యాయం ఎంత వరకు ప్రతిబింబిస్తోందనే ప్రశ్నను లేవనెత్తుతోంది.- రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 
    భారతదేశంలో ఒకప్పుడుఅమల్లో ఉన్న సంపద పన్నును 2015 ఆర్థిక చట్టం ద్వారా రద్దు చేశారు.2016-17 అసెస్ మెంట్ సంవత్సరం నుంచి ఇదిఅమల్లోకి వచ్చింది. పన్ను వసూళ్లతో పోలిస్తే నిర్వహణ, అమలు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.అధిక ఆదాయం కలిగినవారిపై సర్‌చార్జి విధించడంద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చని అప్పట్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే సంపద అసమానతలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సంపదపై పన్ను విధానాన్ని మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉందనే వాదన బలపడుతోంది.ప్రపంచ అసమానత నివేదిక-2026 ప్రకారం, భారతదేశంలోని అత్యంత సంపన్నులైన 10శాతం మంది దేశ మొత్తం సంపద లో సుమారు 65శాతం కలిగి ఉండగా, అగ్రశ్రేణిలోని ఒకశాతం మంది వద్దనే 40.1శాతం సంపద కేంద్రీకృతమై ఉం ది.మరోవైపు, దిగువన ఉన్న50శాతం ప్రజల వాటా మొత్తం సంపదలో కేవలం 6.4శాతమే.ఈగణాంకాలు దేశంలో సంపద పంపిణీలోఉన్న తీవ్ర అంతరాన్ని స్పష్టం చేస్తున్నాయి.సంపన్నుల సంపద పెరుగుదల ఒకవైపు..పేదల జీవన వ్యయం మరోవైపు!.ఇది కేవలం ఆర్థిక అసమానతకు సంబంధించిన అంశం మాత్రమే కాదు.సామాజికన్యాయం, పర్యావరణ పరిరక్షణ,వనరుల సమాన పంపిణీతో ముడిపడి ఉన్న కీలక ప్రశ్న.
    పన్ను భారం ఎవరి మీద పడుతోంది?
    పేదలు : పేద,మధ్యతరగతి కుటుంబాలు తమ ఆదాయంలో అధికభాగాన్ని ఆహారం, దుస్తులు,విద్య,వైద్యం,నిత్యావసరాలకోసం ఖర్చు చేస్తాయి.ఈ కొనుగోళ్లలో పన్ను వర్తించే వస్తువులపై జీఎస్టీ చెల్లించాల్సి ఉం టుంది.పన్ను రేటుఒకేలా ఉన్నప్పటికీ, తక్కు వ ఆదాయం కలిగిన కుటుంబాలపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందు కంటే వారి ఆదాయంలో వినియో గానికి వెచ్చించే వాటా అధికం.అందుకే పరోక్ష పన్నులను చాలామంది ఆర్థిక నిపుణులు ప్రతికూల ప్రభావం చూపే పన్నులుగా (=వస్త్రతీవssఱఙవ Taఞవs) విశ్లేషి స్తారు.
    మధ్యతరగతి : ఉద్యోగులు తమ వేతనాలపై ఆదాయపు పన్ను నిబంధనలకులోబడి ఉం టారు.జీతం,పెట్టుబడులు,ఆస్తుల వివరాలు పన్ను వ్యవస్థ పరిధిలోకి వస్తాయి.ధరల పెరుగుదల,గృహరుణాలు,విద్య,వైద్య ఖర్చు లు వంటిభారాలతో మధ్యతరగతి కుటుం బాలుకూడాఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటు న్నాయి. కుబేరులు : సంపన్నుల ఆదాయం కేవలం జీతాల రూపంలోనే ఉండదు.భూములు, భవనాలు,షేర్లు,వ్యాపార సంస్థలు, పెట్టు బడులు, మూలధన లాభాలు వంటి అనేక రూపాల్లో సంపద పెరుగుతుంది.వీటిపై ప్రస్తుత చట్టాల ప్రకారం వివిధరకాల పన్నులు వర్తిస్తాయి.అయితే మొత్తం నికర సంపదపై ప్రత్యేకంగా విధించే సంపద పన్ను ప్రస్తుతం అమల్లో లేదు.అందువల్ల అత్యంత సంపన్నులపై సంపద ఆధారిత పన్ను విధానం అవసరమా?అనే చర్చకు ప్రాధాన్యం పెరుగుతోంది.
    సంపద అసమానత-పర్యావరణ అన్యాయం
    సంపద కేంద్రీకరణ ప్రభావం ఆర్థిక రంగా నికే పరిమితం కాదు.అధిక వినియోగం, విలాసవంతమైన జీవనశైలి, భారీ పరిశ్ర మలు,మైనింగ్ ప్రాజెక్టులు పర్యావరణంపై ఒత్తిడిని పెంచుతున్నాయి.ఈ ప్రభావాల వల్ల అడవులు,నీటి వనరులు,భూమి,జీవ వైవిధ్యం దెబ్బతింటున్నాయి.కానీ ఈ పర్యా వరణ విధ్వంసంవల్ల ఎక్కువగా నష్టపోయేది ఆదివాసీ,గ్రామీణ సమాజాలే.అడవుల నరికి వేత,నీటి కాలుష్యం,భూగర్భ జలాల క్షీణత, వరదలు,కరువులు,జీవనోపాధికోల్పోవడం వంటి సమస్యలను వారు ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నారు.పర్యావరణ మార్పులకు అనుగుణంగా జీవన విధానాలను మార్చు కోవడానికి అయ్యే అదనపు ఖర్చు కూడా వారిపైనే పడుతోంది.అందువల్ల పర్యావరణ పరిరక్షణకు,ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వాలకు తగిన ఆర్థిక వనరులు అవసరం. ఆభారాన్ని పేదలపై మరింత మోపడం కాకుండా,అధిక సంపద కలిగిన వర్గాల నుంచి న్యాయమైన వాటాను సమ కూర్చుకోవడం గురించి చర్చించాలి.
    ఆదివాసీ ప్రాంతాలు-సమత తీర్పు ప్రాధాన్యం
    1997లో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక సామత తీర్పు షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆదివాసీ భూములు,సహజ వనరుల పరిరక్షణకు కీలకమైన రాజ్యాంగ భరోసాను కల్పించింది. షెడ్యూల్డ్ ప్రాంతా ల్లో గిరిజన భూములను గిరిజనేతరులకు బదిలీ చేయడంపై ఉన్న చట్టపరమైన పరిమితులను స్పష్టం చేస్తూ, ప్రైవేటు సంస్థలకు మైనింగ్ లీజుల కేటాయింపుపై కీలక మార్గదర్శకాలు ఇచ్చింది.ఈ తీర్పు సారాంశం కేవలం భూముల పరిరక్షణకే పరిమితం కాదు.ఆదివాసీ ప్రాంతాల్లోని ఖనిజాలు, అడవులు,నీరు,భూమి వంటి సహజ వనరులపై స్థానిక ప్రజలహక్కులు, వారి జీవనాధారాలు, రాజ్యాంగ పరిరక్షణకు కూడా ఇది సంబంధించినది.గనుల తవ్వకాల ద్వారా లాభాలు పొందే సంస్థల కార్యకలాపాల వల్ల స్థానిక ప్రజలకు కలిగే నష్టాలను గుర్తించి,ఆప్రాంతాల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలి. జిల్లా ఖనిజ ఫౌండేషన్ (ణవీఖీ) నిధులు,రాయల్టీలు, పర్యావరణ పరిరక్షణచర్యలు ప్రజల ప్రయో జనాలకు ఉపయోగపడాలి. ఐదవ షెడ్యూల్,పెసా చట్టం (PజుSA), అటవీ హక్కుల చట్టం (ఖీ=A) స్ఫూర్తికి అనుగు ణంగా గ్రామసభల భాగస్వామ్యం, స్థానిక ప్రజల హక్కులకు ప్రాధాన్యం కల్పించాలి. సహజ వనరుల నుంచి వచ్చే సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా,ఆ వనరులపై ఆధారపడి జీవించే ప్రజల అభివృద్ధికి కూడా దోహదపడాలి. ఇదే సామాజిక న్యాయానికి అసలైన అర్థం.
    పరిష్కార మార్గాలు-ఏం చేయాలి

    1. సంపద పన్నుపై పునరాలోచన : అత్యధిక నికర సంపద కలిగిన వర్గాలపై సంపద పన్ను లేదా ప్రత్యేక లెవీ విధించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాలి.ఆస్తుల విలువను పారదర్శకంగా అంచనా వేసే విధానం, పన్ను ఎగవేతను అరికట్టే నిబంధనలు రూపొందించాలి.
    2. వారసత్వ సంపదపై చర్చ : భారీ స్థాయిలో తరతరాలకు బదిలీ అయ్యే ఆస్తులు,సంపదపై పన్ను విధించే అవకాశాలను సామాజిక, ఆర్థిక ప్రభావాల ఆధారంగా చర్చించాలి.దీనివల్ల సమాజానికి న్యాయమైన వాటా లభించేలా విధానాలను రూపొందించాలి.
    3. నిత్యావసరాలపై పన్ను భారం తగ్గించాలి : పేద,మధ్యతరగతి కుటుంబాలకు అవసరమైన ఆహార పదార్థాలు,విద్యా సామగ్రి,ఆరోగ్యసేవలపై పన్ను భారాన్ని తగ్గించే విధానాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
    4. పన్నుల ఆదాయం ప్రజలకే ఉపయోగపడాలి : సంపద పన్ను లేదా ఇతర ప్రగతిశీల పన్నులద్వారా సమకూరే ఆదాయాన్ని విద్య,వైద్యం,తాగునీరు,పర్యావరణ పరిరక్షణ,ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి వంటి రంగాలకు వినియోగించాలి.
    5. పారదర్శకత, జవాబుదారీతనం : పన్నుల విధానం,పన్నువసూళ్లు,ప్రభుత్వ వ్యయం,సహజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం వినియోగంపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉండాలి.స్థానిక సంస్థలు,గ్రామసభలకు పర్యవేక్షణలో తగిన పాత్ర కల్పించాలి.
      ముగింపు : సంపదకు సామాజిక బాధ్యత ఉండాలి ఒకదేశం తన పేదప్రజలరోజు వారీ కొనుగోళ్లపై పన్నులు వసూలు చేస్తూ, మరోవైపు అత్యధిక సంపద కేంద్రీకరణను నియంత్రించే విధానాలపై తగినంత దృష్టి పెట్టకపోతే సామాజిక న్యాయం ఎలా సాధ్య మవుతుంది? రైతుకు సాగునీరు, ఆదివాసీకి తాగునీరు,పేదవిద్యార్థికి నాణ్యమైన విద్య అందించలేని వ్యవస్థలో సంపద పంపిణీపై సమీక్ష జరగాల్సిన అవసరం లేదా? దేశ అభివృద్ధి అంటే కేవలం జీడీపీ పెరుగుదల, భారీ పెట్టుబడులు,కార్పొరేట్ లాభాలు మాత్రమే కాదు.ప్రతి పౌరుడికిఆహారం, నీరు, విద్య, వైద్యం, గౌరవప్రదమైన జీవితం అందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.సామత తీర్పు మనకు గుర్తుచేసే ప్రధాన సూత్రం ఏమిటంటే.. ఆదివాసీ భూములు,సహజ వనరుల పరిరక్షణ రాజ్యాంగ బాధ్యత.ఆవనరుల ద్వారా లభించే ప్రయోజనాలు స్థానిక ప్రజలకు కూడా అందాలి. సంపద సృష్టించే హక్కుతో పాటు సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాలి.పేదలు మాత్రమే పన్నుల భారాన్ని మోయాలా? సంపద కలిగినవారు కూడా తమ న్యాయమైన వాటాను సమాజా నికి చెల్లించాలా?ఆఆదాయాన్ని విద్య, వైద్యం,పర్యావరణం,ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి వినియోగించాలా?ఇవి కేవలం ఆర్థిక ప్రశ్నలు కావు.భారతదేశం ఎలాంటి సమాజంగా ఎదగాలనే దిశను నిర్దేశించే సామాజిక న్యాయ ప్రశ్నలు.

    నివాస హక్కు..నగరంపై హక్కు

    నగరంలో పని ఉంది,కానీ నివసించడానికి చోటు లేదు.ఇల్లు ఉంది, కానీ అద్దె , కానీ అద్దె చెల్లించడం కష్టం. అంతేకాదు, చాలా మంది ఏ క్షణంలోనైనా ప్రాణాలు కోల్పోయేంత అభద్రతా భావంతో కూడిన ఆశ్రయంలో రోజులు గడుపుతున్నారు. ఈ వైరు ధ్యం నేటి పట్టణ జీవితంలోని ఒక తీవ్రమైన సంక్షో భం. భూమి, ఇల్లు అనేవి ప్రాథమిక మానవ అవస రాలు. కానీ అదే సమయంలో అవి పెట్టుబడి, లాభాల రంగాలు కూడా. దాంతో, గృహ వసతి సమస్య కేవలం పేదలకు మాత్రమే కాదు. ఇది శ్రామిక ప్రజల జీవితాలు, మధ్యతరగతి వారి ఆర్ధిక భద్రత,నగర భవిష్యత్తుకు సంబంధించిన ఒక రాజకీయ ప్రశ్న.
    బెంగళూరు,ముంబై,ఢిల్లీవంటి సగరా ల్లో ఉపాధి పెరిగినప్పటికీ, సరసమైన అద్దెకు లభించే ఇళ్లకొరతస్పష్టంగా కనిపిస్తోంది. కాయ కష్టం మీదఆధారపడిన అనేక వర్గాలు నగరం లో నివసించే అవకాశాన్ని కోల్పోతున్నాయి. అందువల్ల గృహవసతిని కేవలంనిర్మాణ పరిశ్ర మకు,ప్రైవేట్ ఆస్తికి సంబంధించిన విషయం గా మాత్రమే చూడకూడదు.అసలు ప్రశ్న ఏమి టంటే,నగరంలోని భూమి,వనరులను ఎవరి అవసరాలకోసం ఉపయోగిస్తారు?అభివృద్ధి వల్ల ఎవరు ప్రయోజనం పొందుతారు? పుర పాలక సంఘం కేవలంరోడ్లు,విద్యుత్ దీపాలు, మురుగునీటి పారుదల,వ్యర్థాల నిర్వహణకు మాత్రమే బాధ్యత వహిస్తుందా? లేక సురక్షిత మైన,సరసమైన గృహ వసతిఅవకాశాలను కల్పించడంలో కూడా పాత్రపోషిస్తుందా? ప్రపంచ రాజకీయాలలో గృహవసతి గృహ సంక్షోభం అంతర్జాతీయరాజకీయాలలో కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది.2025 న్యూ యార్క్ మేయర్ ఎన్నికలలో, అద్దెలను నియం త్రించడం,సరసమైన గృహాలను నిర్మించడం, జీవన వ్యయాన్ని తగ్గించడం వంటి జోహ్రాన్ మన్దనీ ప్రచారవాగ్దానాలు ప్రత్యేకంగా ప్రాము ఖ్యతను సంతరించుకున్నాయి.ఆయన ప్రచారం ఒక ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తింది-నగరం లోని శ్రామికప్రజలు ఇకపై నగరంలో నివసిం చలేని స్థితిలో ఉంటే, మరి ఆనగర అభివృద్ధి ఎవరి కోసం? అభివృద్ధికి ప్రధానలక్ష్యం ఆస్తి మార్కెట్లో పెట్టుబడి,లాభాలను పెంచుకో వడ మా?లేకసామాన్య ప్రజల నివాస భద్రత కూడా అంతే ముఖ్యమైనదా?లండన్,బెర్లిన్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాననగరాల్లో, పెరు గుతున్న అద్దెలు, భూమి ధరలు తక్కువ-మధ్య ఆదాయవర్గాల ప్రజలను నగర కేంద్రం నుండి దూరం చేస్తున్నాయి.సాపేక్షంగా చవకైన నివాస ప్రాంతాలలో కొత్తపెట్టుబడులతో వాణిజ్య కేం ద్రాలు,విలాసవంతమైన గృహాలు నిర్మించిన ప్పుడు,భూమి-ఇళ్ల ధరలు పెరుగుతాయి. అయితే పాతనివాసితులు అక్కడ ఉండటం కష్ట మవుతుంది.ఈప్రక్రియ ఎప్పుడూ ఖాళీ చేయ మనే నోటీసులతో ప్రారంభంకాదు.అద్దెల పెంపు,ఒప్పందాలను పునరుద్ధరించక పోవ డం, చిన్న దుకాణాలఅద్దెల పెరుగుదల కూడా ప్రజలను స్థానభ్రంశం చేస్తాయి.ఫలితంగా, కష్టజీవులు తమపని ప్రాంతాలు,కార్యాలయా ల నుండి దూరంగా వెళ్లవలసి వస్తుంది. దీని వల్ల ప్రయాణ ఖర్చులు,రవాణా సమయం పెరుగుతాయి.
    బెంగళూరు,ముంబై,ఢిల్లీ వంటినగరాల్లో ఉపా ధి పెరిగినప్పటికీ,సరసమైన అద్దెకు లభించే ఇళ్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది.కాయకష్టం మీద ఆధారపడిన అనేక వర్గాలు నగరంలో నివసించే అవకాశాన్ని కోల్పోతున్నాయి. అందువల్ల గృహ వసతిని కేవలం నిర్మాణ పరిశ్రమకు, ప్రైవేట్ ఆస్తికి సంబంధించిన విషయంగా మాత్రమే చూడకూడదు. అసలు ప్రశ్న ఏమిటంటే, నగరంలోని భూమి, వనరు లను ఎవరి అవసరాల కోసం ఉపయోగి స్తారు?అభివృద్ధి వల్ల ఎవరు ప్రయోజనం పొం దుతారు? పురపాలక సంఘం కేవలం రోడ్లు, విద్యుత్‌దీపాలు,మురుగునీటిపారుదల, వ్యర్థాల నిర్వహణకు మాత్రమే బాధ్యత వహిస్తుందా? లేక సురక్షితమైన,సరసమైన గృహవసతి అవకా శాలను కల్పించడంలో కూడా పాత్ర పోషి స్తుందా?కొత్త నిర్మాణాలు ఖచ్చితంగా అవస రం.కానీ ఆ నిర్మాణం అందుబాటు ధరల్లో లభించే గృహాలను తగ్గిస్తే, అభివృద్ధి ప్రయోజ నాలు ప్రధానంగా భూస్వాములు,పెట్టుబడి దారుల చేతుల్లోనే కేంద్రీకృతమైతే, అది సామా జిక అసమానతను పెంచుతుంది. అందువల్ల, చాలా కాలంగా అక్కడ నివసిస్తున్న వారి హక్కు లను పరిరక్షించే అంశాన్ని కూడా పట్టణాభి వృద్ధిలో చేర్చాలి.
    భారతీయ నగరాలు: అభివృద్ధి ఎవరి కోసం? బెంగళూరులో సమాచార సాంకేతికత, సేవా పరిశ్రమలవిస్తరణ ఉపాధిని పెంచింది. కానీ నిర్మాణ కార్మికులు,గృహకార్మికులు, సెక్యూరిటీ గార్డులు, తక్కువ వేతన కార్మికులకు అందు బాటుధరల్లో ఇళ్లుదొరకడం సమస్యగా ఉంది. ముంబైలో మురికివాడల పునరావాస ప్రాజెక్టు లలో ప్రైవేట్ నిర్మాణ సంస్థలు పాలుపంచు కున్నప్పటికీ,ప్రాజెక్టు విజయాన్ని కేవలం నిర్మిం చిన ఇళ్లసంఖ్యతో మాత్రమే అంచనా వేయలేం. కొత్త ఇళ్లనాణ్యత,పని ప్రదేశానికి వాటి దూరం, జీవనోపాధిపై వాటి ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.నగరశివార్లలో పునరావాసం కల్పించడం వల్ల ప్రయాణ ఖర్చులు, సమయం పెరుగుతాయని ఢిల్లీఅనుభవం కూడా చెప్తుంది. అందువల్ల,సాధ్యమైనచోట,పాత నివాస ప్రాం తాలలో నీరు, మురుగునీటి పారుదల, మరు గుదొడ్లు,ఇతర సేవలను మెరుగుపరచడం అవ సరం.
    భారతదేశంలో,జాతీయ మురికివాడల అభి వృద్ధి కార్యక్రమం, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన,జెఎనఎన్ యుఆరఎం వంటివి ప్రభు త్వ విధానాలలో పట్టణ పేదల గృహ వసతి, ప్రాథమిక సేవల సమస్యకు ప్రాధాన్యత నిచ్చా యి.ఆ తర్వాత,పట్టణ ప్రాంతాలలో రాజీవ్ ఆవాస్ యోజన, ప్రధాన్ మంత్రి ఆవాస్ యో జన కూడాగృహ వసతి అవకాశాలను పెంచ డానికి చొరవతీసుకున్నాయి.కానీ చాలా సంద ర్భాలలో, ఇళ్లనిర్మాణమే ప్రధాన లక్ష్యంగా మారింది. సేవల కొరత, ప్రాజెక్టులలో జాప్యం, పని ప్రదేశానికి దూరంగా పునరావాసం కల్పిం చడం వంటివి వాస్తవ ప్రయోజనాలను పరిమి తం చేశాయి,అందువల్ల గృహనిర్మాణ ప్రాజెక్టు ల విజయాన్ని ఇళ్లసంఖ్య ఆధారంగా కాకుం డా…ఇళ్లు కట్టిన ప్రదేశం,సేవల నాణ్యత,రుణ భారం,జీవనోపాధులతో అనుసంధానం ఆధా రంగా అంచనా వేయాలనిఈఅనుభవం రుజు వు చేస్తుంది.కేరళ ‘లైఫ్ మిషన’ నుండి కూడా పాఠాలు నేర్చుకోవచ్చు. నిరాశ్రయులైన, భూమి లేని కుటుంబాలకు గృహ వసతి కల్పించడం, ఇళ్ల నిర్మాణం,వివిధ ప్రాజెక్టుల సమన్వయం కోసం ప్రభుత్వసహాయం ఈ కార్యక్రమం ము ఖ్యమైన అంశాలు,ప్రభుత్వభూమి,ఉప యోగిం చని భవనాలు,అనువైన పాడుబడిన పారిశ్రా మిక ప్రాంతాలను సర్వే చేసి, సరసమైన అద్దె ఇళ్లు,సహకార గృహాల కోసం భూమిని గుర్తించ వచ్చు.అయితే,పర్యావరణం,మురుగునీటి పారుదల,కమ్యూనికేషన్ల అనుకూలతను తనిఖీ చేయడం ముఖ్యం.
    ప్రత్యామ్నాయ గృహ నిర్మాణం
    గృహ నిర్మాణ ప్రణాళికలో నివాసితులను నేరు గా భాగస్వాములను చేయడం సాధ్యమేనని థాయిలాండ్ బాన్‌మాంకాంగ్ కార్యక్రమం నిరూపించింది.కొన్నిసందర్భాల్లో,సహకార సంఘాలు, సామూహిక పొదుపు, ప్రభుత్వ సహాయం ద్వారా పాత నివాస ప్రాంతాలలో సేవలు.మెరుగుపరుస్తుండగా, మరికొన్నింటిలో కొత్త గృహాలు నిర్మించబడుతున్నాయి. సహకార సంఘాలను ఏర్పాటు చేయడంద్వారా, తక్కువ ఆదాయం గల నివాస ప్రాంతాలనివాసితులకు ఇళ్ల మరమ్మతులు,సేవల మెరుగుదల, కొత్త ఇళ్ల నిర్మాణం కోసం తక్కువవడ్డీకి రుణాలు ఏర్పాటు చేయవచ్చు. కుటుంబ ఆదాయానికి అనుగుణంగా రుణవాయిదాలనుదశలవారీగా పెంచే విధానాన్నికూడా ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టవచ్చు. అయితే,వడ్డీరేటు,రుణ మొ త్తం ఖర్చు,ఆదాయం పెరగనప్పుడు వాయి దాలను పునఃప్రణాళిక చేయడానికి సంబంధిం చిన నియమాలు స్పష్టంగా ఉండాలి.అదే సమ యంలో, ఇంటి కొనుగోలు రుణం కాకుండా, సరసమైన అద్దె గృహాల కోసం ప్రత్యేక నిధులు అవసరం.చాలా మందివలస కార్మికులు, గృహ కార్మికులు,తాత్కాలిక కార్మికులు ఇల్లు కొను గోలు చేయలేరు. వారికి పారదర్శకమైన అద్దె ఒప్పందాలు ఉండటం,అన్యాయమైన తొల గింపులను నివారించడం, సురక్షితమైన అద్దె గృహాలను నిర్ధారించడం చాలా ముఖ్యం.గిగ్ వర్కర్లు,యాప్ ఆధారితఆహార విక్రేతలు,కారు, బైక్ డ్రైవర్లు,ఇతర గిగ్ వర్కర్ల సంఖ్య పెరుగు తోంది.వారికి స్థిరమైన పని ప్రదేశం, క్రమమైన ఆదాయం ఉండదు. ఫలితంగా, పని ప్రదేశా నికి దగ్గరగా అద్దె చెల్లించడం కష్టమవుతుంది. కానీ అదిదూరంగా ఉంటే రాకపోకలకు సమ యం,డబ్బు ఖర్చవుతుంది.వారి కోసం, ఉపాధి కేంద్రాలు, మార్కెట్లు, ఆసుపత్రులు, రవాణా కేంద్రాలకు సమీపంలో అందుబాటు ధరలలో చిన్న ఇళ్లు, భాగస్వామ్య గృహాలను నిర్మించ వచ్చు. నెలవారీ అద్దెతో పాటు,వారపు లేదా స్వల్పకాలిక గృహవసతి ఏర్పాట్లు కూడా ఉండాలి.
    గృహాలలో మరుగుదొడ్లు,సురక్షితమైన తాగు నీరు,వంట సౌకర్యాలు,తగినంత గాలి వెలు తురు,అగ్నిమాపక భద్రతతప్పనిసరిగా ఉండేలా చూడాలి.బైక్ పార్కింగ్,ఎలక్ట్రిక్వాహన చార్జింగ్, మొబైల్ చార్జింగ్,విశ్రాంతి ప్రదేశాలు కూడా అవసరం.మహిళా గిగ్ వర్కర్ల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు అవసరం. ప్రభుత్వ సబ్సిడీలు, మున్సిపల్ భూమి,కార్మికుల సంక్షేమ నిధులు, సహకార సంఘాల పొదుపులను కలిపి పైలట్ ప్రాజెక్టులను నిర్వహించవచ్చు.ఇంటి హక్కు: మున్సిపల్ రాజకీయ కార్యక్రమం ప్రతి మున్సి పల్ ప్రాంతంలో గృహసర్వేతో ఒక సమర్థవం తమైనకార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఎన్ని కుటుంబాలు సురక్షితం కాని ఇళ్లలో నివసి స్తున్నాయి, ఎన్ని కుటుంబాలు తమ ఆదాయా నికి మించిఅద్దె చెల్లిస్తున్నాయి,ఎక్కడ తొల గింపు ప్రమాదం ఉంది అని సమాచారాన్ని ప్రచురించాలి.ప్రభుత్వభూములు,ఉపయో గించని భవనాల జాబితాను తయారు చేసి, సరసమైన గృహాలు,సహకార గృహాలు, పునరా వాసం కోసం ప్రణాళికలు రూపొందించాలి. సాధ్యమైనచోట, ఇప్పటికే ఉన్న నివాస ప్రాంతా లలో సేవలను మెరుగుపరచాలి.
    పురపాలక ఎన్నికలలో,రాజకీయ పార్టీలను కొన్ని స్పష్టమైన ప్రశ్నలు అడగాలి-ప్రభుత్వ భూముల జాబితాను ప్రచురిస్తారా? సరసమైన గృహాల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తారా? గృహ నివాస సమస్యలను ఎదుర్కొంటున్న కుటుంబాలకు న్యాయ సహాయం,పునరావా సం అందుతాయా? గిగ్ వర్కర్ల కోసం పని ప్రదేశానికి సమీపంలో గృహాలు, విశ్రాంతి కేంద్రాలు నిర్మిస్తారా?గృహ నిర్మాణ ప్రాజె క్టులకు నిధులు,వాటి అమలు వివరాలను క్రమం తప్పకుండా ప్రచురిస్తారా? కార్మిక సంఘాలు,మహిళా సంఘాలు,గిగ్ వర్కర్ల సంఘాలు,పౌర సమూహాలతో కలిసి ఇంటి డిమాండ్ లేఖను తయారు చేయవచ్చు.ఇంటి హక్కు అనేది కేవలం ఇల్లు కట్టుకోవడానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. భూ వినియోగం, అందుబాటు ధరలో అద్దె, దీర్ఘకా లిక రుణాలు, ప్రభుత్వ సహాయం, సహకార సంఘాలు,నివాసప్రాంతం నుండే సేవల అభివృద్ధి,తొలగింపు నుండి చట్టపరమైన రక్షణా-వీటన్నింటినీ కలిపి పరిగణించాలి. రాష్ట్రాలు సొంత గృహనిర్మాణ విధానాన్ని రూపొందించుకోవాలి. పని చేసుకునే హక్కు ఉన్న నగరంలో, సురక్షితంగా జీవించే అవకా శం కూడా ఉండాలి. అందువల్ల, గృహ నిర్మా ణం అనేది కేవలం ఒక ఇంటికి సంబంధిం చిన ప్రశ్న కాదు; అదిఒక న్యాయమైన, ప్రజా స్వామ్యయుతమైన, నివాసయోగ్యమైన నగరాన్ని నిర్మించే ప్రశ్న.చివరిగా, ఒక ప్రశ్న- ఈ నగరం ఎవరిది? నగరంలోని భూమి, ఇళ్లు, వనరులు ఉపయోగించబడుతున్నాయి?దీన్నిబట్టే ఆ ప్రశ్న కు సమాధానం నిర్ణయించబడుతుంది. ఎవరి ప్రయోజనాల కోసం. – శంతను ఝా,(వ్యాసకర్త : ‘బిధాన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయం’లో సీనియర్ ప్రొఫెసర్, విద్యావేత్త)

    1 2