తుఫాన్లు పోయాయి నష్టం మిగిలింది  

“మొన్నటి వరకు ఎల్‌నినో ప్రభావంతో కరువు కాటకాలు..ఇప్పుడు అర్నబ్,మురసు తుపాన్ల బీభత్సంతో ప్రకృతి ప్రకోపం! వరుస విపత్తులతో ఆంధ్రప్రదేశ్రైతాంగం,సామాన్యప్రజానీకం కోలుకోలేని దెబ్బతిన్నారు.ఉత్తరాంధ్ర నుంచి బాపట్ల వరకు ఎటుచూసినా నేలకొరిగిన పంటలు..నీట మునిగిన పొలాలు,దెబ్బతిన్నఇళ్లు,ఛిన్నాభిన్నమైన రహదారులు కనిపిస్తున్నాయి.చేతికొచ్చినపంట కళ్లముందేనేలపాలవడంతో అన్నదాతల ఆశలుఆవిరయ్యాయి.పెట్టుబడులు నీటిపాలై రైతులుకన్నీటి పర్యంతమవుతుంటే,ఇళ్లు,ఆస్తులుకోల్పోయిన సామాన్యులబతుకులు బరువెక్కాయి.రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో సుమారుమూడులక్షలహెక్టార్లలో పంటలుదెబ్బతిన్నట్లు అంచనా.కోతకుసిద్ధమైన వరితోపాటు అరటి,పత్తి, జీడిమామిడితోటలు నీటమునిగాయి.కొబ్బరిచెట్లు నేలకొరిగాయి.ప్రకృతివిపత్తులువెళ్లిపోయినా..వాటి గాయాలుమాత్రం మిగిలిపోయాయి.దెబ్బతిన్న వ్యవసాయరంగాన్ని గట్టెక్కించడం,జనజీవనాన్నిసాధారణస్థితికి తీసుకురావడం,ధ్వంసమైన మౌలిక వసతులను పునరుద్ధరించడం ప్రభుత్వానికి పెనుసవాలుగా మారింది.జరిగిన నష్టమెంత?బాధితులకు అందాల్సిన పరిహారంఎంత?పునరావాసం,పునర్నిర్మాణ ప్రణాళికలు కార్యరూపం దాల్చుతున్నాయా?తుపాన్లు మిగిల్చిన కన్నీటి కథలపై ప్రత్యేక పరిశీలన.”-గునపర్తి సైమన్ 

ఆంధ్రప్రదేశకు సముద్రం ఒకవరం.అదే సముద్రం అప్పుడప్పుడు ప్రజలపాలిట శాపంగా మారుతోంది.లక్షలాది మత్స్య కార కుటుంబాలకు జీవనాధార మైన సాగరం ఉగ్రరూపం దాల్చిన ప్రతిసారీ తీరప్రాంత ప్రజల బ్రతుకులు తలకిందు లవుతున్నాయి.పచ్చని పొలాలు నీట మునుగుతున్నాయి.పండ్లతోటలు నేల కొరుగుతున్నాయి.కష్టపడి కట్టుకున్న ఇళ్లు కూలిపోతున్నాయి.ఏళ్ల తరబడి కూడ బెట్టు కున్న ఆస్తులు గంటý వ్యవధిలోనే కను మరుగవు తున్నాయి.తుపాను తీరం దాటిన తర్వాత తీవ్రత తగ్గినా బాధిత కుటుంబా లకు కష్టాలు అప్పుడే మొదలవుతున్నాయి. ఒక తుపానుమిగిల్చిన గాయాల నుంచి కోలుకోకముందే మరో విపత్తు ముందు కొస్తోంది.గత26ఏళ్లలో రాష్ట్రాన్ని ప్రత్య క్షంగా,పరోక్షంగా ప్రభావితం చేసిన తుఫాన్లు ఒక్కొక్కటి ఒక్కోగాయాన్ని మిగి ల్చాయి.ప్రకృతిప్రకోపంతో సంభవించిన నష్టాలను లెక్కించ గలుగుతున్నా, బాధి తుల కన్నీటికి మాత్రం వెలకట్టలేని పరి స్థితి నెలకొంది.
పచ్చని పంటలపై ప్రకృతి పగ.
రైతుకు పంట అంటే కేవలం పెట్టుబడి కాదు.అది కుటుంబ భవిష్యత్తు.పిల్లల చదువులు,ఆడబిడ్డ పెళ్లి,అప్పులు చెల్లింపు వంటి ఎన్నో ఆశలు పంట చుట్టూనే అల్లుకుని ఉంటాయి.తుపాను విరుచు కుపడితే ఆ ఆశలన్నీ నీటిపాలవుతు న్నాయి.కోతకు వచ్చిన వరి నేలవాలి పోతోంది.ధాన్యం వర్షపు నీటిలో నాని పోతోంది.పత్తి,మిరప,మొక్కజొన్న పంట లు దెబ్బతింటున్నాయి.అప్పుచేసి సాగు చేసిన రైతుకు చివరకు మిగిలేది రుణ భారం,భవిష్యత్తుపై భయం మాత్రమే. గోదావరి జిల్లాల్లో కొబ్బరితోటలు, కృష్ణా.గుంటూరు ప్రాంతాల్లో అరటి,ఉత్త రాంధ్రలో జీడితోటలు తుపాన్లకు బలవు తున్నాయి.ఏళ్ల తరబడి పెంచిన చెట్లు గంటల్లో నేలకొరు గుతుండటంతో రైతులు కోలుకోలేని నష్టాలను ఎదు ర్కొంటున్నారు..
26 ఏళ్లుగా తుపాన్లతో తల్లడిల్లుతున్న ఏపీ!
ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఎన్నో తుపాన్లు తాకాయి. కొన్ని నేరుగా విరుచుకుపడితే మరికొన్ని పొరుగు రాష్ట్రాల్లో తీరం దాటినా ఏపీని వణికించాయి.2001లో నెల్లూరు ప్రాంతాన్ని ప్రభావితం చేసిన తుపాను,2003లో మచిలీపట్నం సమీ పంలో సంభవించిన తుపాను కోస్తా జిల్లాల్లో నష్టం కలిగించాయి.2005లో ప్యార్ శ్రీకాకుళం తీరాన్నితాకగా, 2006 లో అగ్ని ప్రభావంతో దక్షిణ కోస్తాలో వర్షాలు కురిశాయి.2008లో ఖైముక్ నెల్లూరు సహాకోస్తా ప్రాంతాలను ప్రభా వితం చేసింది.2016లో లైలా బాపట్ల సమీపంలో తీరం దాటి గుంటూరు, ప్రకాశం,కృష్ణా జిల్లాల్లో పంటలను దెబ్బతీసింది.అదే ఏడాది జల్ దక్షిణ కోస్తాలో భారీ వర్షాలకు కారణమైంది. 2012లో నీలం ప్రభావంతో కోస్తాంధ్రలో పంటలు నీట మునిగాయి.2013లో ఫైలిన్ ఉత్తరాంధ్రను వణికించగా,హెలెన్‌కృష్ణా, గోదావరి జిల్లాలను ప్రభావితం చేసింది. అనంతరం లెహర్ తుపాను ముప్పు తీర ప్రాంత ప్రజలను ఆందోళనకు గురిచేసింది.
హుద్ హుద్.. విశాఖ గుండెల్లో చెరగని గాయం!
2014అక్టోబరులో విశాఖపట్నంపై విరుచు కుపడిన హుడ్ హుద్ తుపాను ఉత్తరాంధ్ర లో భారీవిధ్వంసం సృష్టించింది.పెనుగాలు లకు వృక్షాలు,విద్యుత్ స్తంభాలు నేలకొరి గాయి.ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. పరిశ్ర మలు,వ్యాపార సంస్థలు,పర్యాటక రంగం దెబ్బతిన్నాయి.విశాఖతోపాటు విజయ నగరం,శ్రీకాకుళంజిల్లాల్లోపంటలు,ఉద్యాన తోటలకు నష్టం వాటిల్లింది.నగరాన్ని సాధా రణ స్థితికి తీసుకురావడానికి రోజుల తర బడిక్రమించాల్సి వచ్చింది.హుద్‌హుద్ ఎన్నో కుటుంబాల ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసింది.
తిల్లీ..ఉత్తరాంధ్ర రైతు వెన్ను విరిచిన విలయం!
2016లో వర్షా తుపాను చెన్నై సమీపంలో తీరం దాటినా నెల్లూరు,చిత్తూరు ప్రాంతా లపై ప్రభావం చూపింది.2018అక్టోబరు లో శ్రీకాకుళం జిల్లాపై విరుచుకుపడిన తిల్లీ రైతుల జీవితాలను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి, జీడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.వరి పంటలు,ఇళ్లు,విద్యుత్ వ్యవస్మ రహదా రులకు నష్టం వాటిల్లింది.ఏళ్ల తరబడి పెంచిన చెట్లు నేలకొరగడంతో రైతులు జీవనోపాధిని కోల్పోయారు.అదే ఏడాది పెథాయ్ గోదావరి జిల్లాల్లో పంటలకు నష్టం కలిగించింది.2019లో ఒడిశాలో తీరం దాటిన ఫణి ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై పడింది.
మిచౌంగ్.. చేతికొచ్చిన పంటకు కన్నీటి వీడ్కోలు!
2020లో నివార్ కారణంగా నెల్లూరు, చిత్తూరు,కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయి. 2021 లో గులాబ్ శ్రీకాకుళం జిల్లా కళింగ పట్నం సమీపంలో తీరందాటి ఉత్తరాం ధ్రలో నష్టం కలిగించింది.2022లో ఆసని కోస్తాంధ్ర తీరానికి సమీపంగా వచ్చి బలహీనపడగా,మాండస్ దక్షిణ కోస్తా.రాయలసీమను ప్రభావితం చేసింది.2023 డిసెంబరులో బాపట్ల సమీపంలో తీరం దాటిన మిదౌంగ్ కోస్తాంధ్ర రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీ సింది.కోతల సమయంలో కురిసిన భారీ వర్షాలకుసముద్రం ఇచ్చిన బతుకును.. సముద్రమే తీసుకుంటే!తుపాను ముగి సిన తర్వాత విద్యుత్ సరఫరా పునరు ద్దరిస్తారు.రహదారులు తెరుచుకుం టాయి..సాధారణ పరిస్థితులు నెలకొం టాయి.కానీ పంట కోల్పోయిన రైతు, పడవ కోల్పోయిన మత్స్యకారుడు,ఇల్లు కోల్పోయిన నిరుపేద కుటుంబం జీవి తంలో పరిస్థితులు అంతత్వరగా చక్క బడవు.మరో తుపాను హెచ్చరిక వినిపిస్తే గుండెల్లో అదే భయం మొదలవుతోంది. ఆస్తి నష్టాన్ని లెక్కించవచ్చు. కూలిపోయిన ఇళ్లను తిరిగికట్టుకోవచ్చు. కానీ ఏళ్ల తరబడి పెంచిన తోటలను కోల్పోయిన రైతు ఆవేదనను,జీవిత కాలం కూడబెట్టుకున్న ఆస్తులను కోల్పోయిన కుటుంబాల కన్నీటిని ఏ లెక్కలూ ప్రతిబింబిందలేవు.ప్రకృతి ప్రకో పానికి ఎదురొడ్డి పోరాడుతున్న తీర ప్రాంత ప్రజలకు తాత్కాలిక ఓదార్పుతో పాటు భవిష్యత్తుపైశాశ్వత భరోసా కల్పిం చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ధాన్యంతడిసిపోయింది.కృష్ణా, గుంటూ రు,బాపట్ల,ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో వ్యవసాయ కార్యకలాపాలు దెబ్బతిన్నా యి.2024లో ఫెంగల్ ప్రభావంతో దక్షిణ కోస్తాలో వర్షాలు కురిశాయి.
మొంథా,అర్థబ్..మళ్లీ అదే భయం!
2025అక్టోబరులో మొండా తుపాను ఆంధ్రప్రదేశ్ తీరాన్నితాకింది.గోదావరి ప్రాంతాలతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు,గాలులు వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేశాయి.ఆవిపత్తు నుంచి కోలుకోకముందే 2026అక్టోబరులో అర్థబ్ రాష్ట్రాన్ని వణికించింది. అక్టోబరు 28న నరసాపురం సమీపంలో తీరం దాటిన ఈ తుపాను ప్రభావంతో కోన సీమ,పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి.ఉద్యాన తోట లు,ఇళ్లు, గుడిసెలు దెబ్బతిన్నాయి. విద్యు త్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నవంబరు 1నాటి ప్రాథమిక వివరాల ప్రకారం3.52లక్షల హెక్టార్ల వ్యవసాయ పంట విస్తీర్ణం నీటమునిగినట్లు,23 వేల హెక్టార్లకు పైగా ఉద్యాన పంటలు ప్రభా వితమైనట్లు నివేదికలు అందాయి. దాదాపు 4,891ఇళ్లు,3,046 గుడిసెలు దెబ్బతిన్నట్లు అంచనా.అర్ధబ్ నుంచి కోలుకోకముందే మురస్ రూపంలో మరో తుపాను ముప్పు ప్రజలను ఆందో ళనకు గురిచేస్తోంది.
తీరం పొడవునా.. బతుకుల భయం!
వెయ్యి కిలోమీటర్లకు పైగా సముద్రతీరం ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి అనుకూల మైనప్పటికీ తుపాన్ల సమయంలో పెద్ద సవాలుగా మారుతోంది.శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు తీరప్రాంత ప్రజలు ఏటా తుపాన్ల హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు.సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందన్న వార్త వినిపిం చగానే మత్స్యకారుల గుండెల్లో గుబులు మొదలవు తోంది.వేటకు వెళ్లలేని రోజు ల్లో ఆదాయం నిలిచిపోతోంది.పడవలు, వలలు దెబ్బతింటే వాటిని తిరిగి సమ కూర్చుకోవడం భారంగా మారుతోంది కుటుంబాలను పోషించే సాగరమే ఉగ్రరూ పం దాల్చినప్పుడు వారి భవిష్యత్తు ప్రశ్నార్ధక మవుతోంది.
పరిహారం వస్తుంది…పోయిన కాలంతిరి గొస్తుందా!
తుపాను వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వాలు సహా యక,పునరావాస చర్యలు చేపడుతున్నా బాధిత కుటుంబాల సమస్యలు అక్కడితో ముగియడం లేదు.అప్పుచేసి వేసిన పంట నష్టపోతే తిరిగి సాగుకు పెట్టుబడి కావాలి.కూలిపోయిన ఇంటిని నిర్మిం చుకోవాలంటే అదనపు భారం భరిం చాలి.నేలకొరిగిన పండ్ల తోటలను పునరుద్ధరించాలంటే ఏళ్ల తరబడి ఎదురుచూడాలి.ముఖ్యంగా ఉద్యాన రైతులు తిరిగి ఆదాయం వచ్చేవరకు ప్రత్యామ్నాయ జీవనోపాధిని వెతుక్కో వాల్సి వస్తోంది.పరిహారం తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించినా కోల్పోయిన కాలాన్ని,ఆదాయాన్ని తిరిగి తీసుకురా లేదన్న ఆవేదన బాధితుల్లో వ్యక్తమవు తోంది.
పునరావాసమే పెద్ద సవాలు!
తుపాన్లను అడ్డుకోలేకపోయినా వాటివల్ల జరిగే నష్టాన్ని తగ్గించడం సాధ్యమే. ముందస్తు హెచ్చరికలు,సురక్షిత ప్రాం తాలకు తర లింపు,పటిష్టమైన తుపాను ఆశ్రయ కేంద్రాలు,తీరప్రాంత రక్షణ చర్యలు,ముంపు నీటిపారుదల వ్యవస్థల అభివృద్ధి,పంటల బీమా,సకాలంలో పరిహారం వంటిచర్యలు అవసరం.తర చూ తుపాన్ల బారినపడే మండలాలను గుర్తించి శాశ్వతరక్షణ ప్రణాళికలు అమలు చేయాలి.ఉద్యాన రైతులకు తోటలు తిరిగి ఆదాయం ఇచ్చేవరకు ఆర్థిక సహకారం అందించడంతోపాటు మత్స్య కారుల పడవలు,వలలకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని బాధితులు కోరు తున్నారు.విపత్తులను తట్టు కునేలా తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
‘మురసు’తో అస్తవ్యస్తం
ప్రస్తుతం మురసు తుపాను పలు జిల్లా లను అస్తవ్యస్తం చేసింది.భారీ నుంచి అతి భారీవర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించింది.ప్రకాశం,బాపట్లజిల్లాల్లో విద్యుత్తు,కమ్యూనికేషన్‌వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయి.తుపాను ముఖ్యంగా ఒంగోలుపై తీవ్ర ప్రభావం చూపింది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెం దారు.బలమైన ఈదురుగాలులకు చిన్నగంజాం టోల్ ప్లాజా వద్ద ఐరన్ కంటైనర్ కూలిపడింది.ఈఘటనలో టోల్ ప్లాజా వద్ద వాహనాల రాకపోక లను పర్యవేక్షించే విధుల్లో ఉన్న పెదగం జాం గ్రామానికి చెందిన చొప్పరపు జాన్ అగస్టిన్ (25)మృతి చెందారు. బాపట్ల జిల్లా కారంచేడు మండలం దగ్గుబాడు గ్రామంలో పక్క ఇంటిపై వాటర్ ట్యాంకు
చీమకుర్తిలో రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్టు
రేకుల ఇంటిపై పడటంతో ఆఇంట్లో నిద్రిస్తున్న మాటలపూడి తిరుపతమ్మ (66) అక్కడికక్కడే మరణించారు.పలు చోట్ల విద్యుత్తు స్తంభాలు చెట్లు,కొమ్మలు విరిగిపడ్డాయి.విద్యుత్తు సరఫరా,ఇంటర్ నెట్ సేవలు నిల్చిపోయాయి.సెల్ ఫోన్లు మూగబోవడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.వర్షం,భీకర గాలులతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు.నవంబరు 3న అర్ధరాత్రి నుంచి 4వతేది ఉదయం 10 గంటల వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. తు పాను తీరందాటే సమయంలో 120 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచాయి.తెల్లారుజామున ఒంగోలు – చినగంజాం మధ్య తీరందాటింది.తీర ప్రాంత మండలాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి.ఒంగోలు పట్టణంలో పరిస్థితి భయానకంగా మారింది. ఒక్కరోజులోనే 174.7మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కలెక్టరేట్లోని ఏళ్ల నాటి పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి. ఒంగోలు పట్టణంలో రాత్రి వరకు చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిల్చిపోయింది. రైల్వే ట్రాకులపై అక్కడక్కడా నీరు చేరడంతో ఒంగోలు స్టేషన్లో పలురైళ్లను కాసేపు ఆపేశారు. తీరం దాటిన చినగంజాం ప్రాంతంలోనూ, కొత్తపట్నం,సంతనూతలపాడు,మద్దిపాడు, శింగరాయకొండ, నాగులుప్పలపాడు మండ ల్లాల్లోనూ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది.గుంటూరు,పల్నాడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి.పలుప్రాంతాల్లో అత్యధికంగా 200 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది.విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.పలు ప్రాంతాల్లో రహదారులు జలదిగ్బంధనలో చిక్కుకు న్నాయి.గుంటూరు-చిలకలూరిపేట జాతీయ రహదారిపై రెండు అడుగుల ఎత్తున వర్షం నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.రాజధాని అమరావతి ప్రాంతాన్ని వర్షపు నీరు ముంచె త్తడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. పల్నాడు జిల్లాలో వందలాది గ్రామాల్లో అంధకారం అలుముకుంది.
ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద ప్రవాహం
ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరి గింది.ఎగువ నుంచి పది వేల క్యూసెక్కుల వరకు నీరు వస్తుందన్న అంచనా నేపథ్యం లో కృష్ణా నది దిగువకు సుమారు 5,000 నుండి 10,000 క్యూసెక్కుల అదనపు నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసు కుంటున్నట్టు జలవనరులశాఖ అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పలుప్రాం తాల్లో రాత్రి నుండి వర్షం ఏకధాటిగా కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.విజయ వాడ నగరంలో గరిష్టంగా 48.5మిల్లీమీ టర్ల వర్షపాతంనమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.విశాఖ నగరంలో 3వతేదీ రాత్రి భారీవర్షం కురి సింది.
అర్నబ్ తుపాను నుంచి కోలుకోకముందే..
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు అల్లాడి పోయాయి.డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోన సీమ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వరి పంట దాదాపు తుడిచిపెట్టుకు పెట్టుకు పోయింది.ఈ జిల్లాలో 1.23లక్షల ఎకరాల్లోఒంగోలులో తుపానుధాటికి ధ్వంసమైన అవతార్ ఎగ్జిబిషన్‌ఖరీఫ్ సాగు చేశారు.అర్నబ్ తుపాను ప్రభావా నికి దాదాపు 80వేలఎకరాలకు నష్టం వాటిల్లింది.కాస్తోకూస్తో పంట చేతికి వస్తుందనుకుంటున్న సమయంలో మురసు తుపాను పంటను పూర్తిగా తుడిచిపెట్టేసింది. కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.ఉమ్మడి జిల్లాలో రెండు లక్షల ఎకరాలకుపైగా వరి పంట,50వేల ఎకరాలకుపైగా ఉద్యాన పంటలు,20 వేల ఎకరాల్లో కూరగాయల పంటలు పూర్తిగా పాడయ్యాయి. ఏలూరు జిల్లాలో 62.4మిల్లీమీటర్ల సగటు వర్షంపాతం నమోదైంది.13,754ఎకరాల్లో పంట నష్టం జరిగింది.వరిపంట13,272 ఎకరాల్లో నష్టపోగా,ఉద్యాన పంటలు 482ఎకరాల్లో ఉన్నాయి.గతంలో వచ్చిన అర్నబ్ తుపానుకు 42వేలఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది.పశ్చిమగోదావరి జిల్లాలో 69.9మిల్లీమీటర్ల వర్షం నమో దైంది.మురసు తుపానుకు మరో50 వేల ఎకరాల్లో పంట నష్టం ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.
వేటపాలెంలో కూలిన విద్యుత్ స్తంభం
డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇంకా అంధకారంలోనే ఉంది.అర్నబ్ తుపాను అనంతరం అమలాపురం, ముమ్మిడివరం,రామచంద్రపురం,కొత్త పేట వంటి మండలాల్లో మండల కేంద్రా లు,కొన్ని గ్రామాలకు మాత్రమే విద్యుత్ పునరుద్ధరణ జరిగింది.

తుఫాన్లు వాటి ప్రభావాలు 

తుఫాన్..ఈ పేరు వింటేచాలుతీరప్రాంత ప్రజలు వణికిపోతారు.అయితే,ఈ తుఫాన్లు ఎలా ఏర్పడతాయి? అవి తీరాన్ని తాకడం వల్ల కలిగే నష్టం ఏమిటనే సందేహం చాలామందిలో ఉంటుంది.‘తుఫాన’ గురించి తెలుసుకునే ముందు..అల్పపీడనం, వాయుగుండాల గురిం చి తెలుసుకోవలసిన అవసరం ఉంది.ఎక్కడైతే ఎక్కువగా గాలులు ఉంటాయో ఆ ప్రాంతాన్ని అధిక పీడనం అంటారు. అతి తక్కువ గాలులు ఉంటే దాన్ని అల్పపీడనం అంటారు. ఈ రెండు పీడనాలు గాలుల కదలిక వల్లే ఏర్పడతాయి. గాలుల్లో రెండు రకాల గాలులు ఉంటాయి. అవి వేడి గాలి, చల్లగాలి. వేడిగాలి తేలికగా ఉండి పైకి చేరుతుంది. చల్లగాలి నెమ్మదిగా కిందికి దిగుతుంది.- గునపర్తి సైమన్

భూ వాతావరణాన్ని సమీపించే కొలది ఈ గాలి చల్లబడుతుంది.గాల్లో ఉంటే ఆవిరి ఘనీభవించి మంచు స్పటికాలుగా ఏర్పడ తాయి.దట్టమైన మేఘాలు ఏర్పడతాయి. కొన్నిచోట్ల సుడులు తిరుగుతూ మరింత గాలిని గ్రహిస్తాయి.ఈ అల్పపీడనం మరిం త తీవ్రమైతే వాయుగుండంగా మారు తుంది. అది మరింత బలపడితే తుఫాన్‌గా ఏర్పాడు తుంది.సముద్రంలో వేడెక్కిన నీటి ఆవిరిని తుఫాన్లు గ్రహిస్తాయి.సముద్రంలో ఏర్పడే సుడుల వల్ల చల్లబడి దట్టమైన మేఘా లుగా ఏర్పడి తుఫాన్‌తో కలిసి ప్రయాణిస్తాయి.
సముద్రంలో సుడులు రూపంలో ఉండే తుఫాన్ : భూ వాతావరణంలోకి ప్రవేశించడాన్నే తీరాన్ని తాకడం అంటారు.తుఫాన్ తీరాన్ని తాకగానే సుడులు రూపంలో ఉన్న మేఘాలు చెల్లాచెదురై భారీ వర్షాలు కురుస్తాయి.సుడులకు కారణ మైన గాలులు తీరం పైకి గంటకు 61 నుంచి 250 కిమీ కంటే వేగంగా ప్రయాణించగలవు. ‘కన్ను’ అంటే ఏమిటీ: తుఫాన్‌లో ఏర్పడే ‘కన్ను’ కూడా ప్రమాదకరమే. తుఫాన్ సుడిలో ఉండే అతిపెద్ద సూన్యప్రదేశమే కన్ను.ఇందులో మేఘాలు ఉండవు,గాలి ఉండదు.ఈకన్ను భూమిపైకి రాగానే తుఫాన్ ఆగిపోయిందనే భ్రమ కలుగుతుంది.అయితే,అదితీరాన్ని దా టిన తర్వాత తుఫాన్ ప్రభావం మళ్లీ కొనసాగు తుంది.తుఫాన్ ప్రభావాన్ని బట్టిఈ కన్ను విస్తీ ర్ణం ఒక కిలోమీటరు పైనే ఉంటుంది.
తుఫాన్, హరీకేన్లకు తేడా ఏమిటీ?: తుఫాన్ల ను ప్రాంతాలు, వాటి ప్రభావం ఆధారంగా వివిధ రకాలుగా పిలుస్తారు. ఆగ్నేయాసి యా ప్రాంతాల్లో సైక్లోన్ అని,ఈశాన్య పసి ఫిక్,అట్లాంటిక్ ప్రాంతాల్లో హరికేన్లు అని అంటారు.హరికేన్‌లు,టైపూన్‌ల మధ్య తేడా ని గాలి వేగాన్నిబట్టి అంచనా వేస్తారు. గాలి వేగం గంటకు 100కిమీలు మించితే అది హరికేన్.గాలి వేగం అంతకన్నా తక్కువగా ఉంటే టైపూన్ అంటారు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాల్లో ఇలాంటివి ఎక్కు వగా ఏర్పడుతాయి.
ఉప్పెనలు ఎలా ఏర్పడతాయి : తుఫాన్ అంటే బలమైన గాలులు, మేఘాలతో కూడి భారీ వలయం.ఇదితీరాన్ని సమీపించే కొల ది సముద్రంలో అలజడి పెరుగుతుంది. తుఫాన్ వేగానికి సముద్రంలో నీరు భారీ అలల రూపంలో భూమి పైకి చేరుతుంది. దీన్నే ఉప్పెనా అంటారు. అందుకే, అధికా రులు తీర ప్రాంతాలను ఖాళీ చేయిస్తారు.తుపాన్లు తరచూ విరుచుకుపడడానికి కార ణాలేంటి? : ఎక్కడో సముద్రంలో ఏర్ప డుతుంది.మెల్లిగా కదులుతుంది.తానుఉన్న చోటును ప్రశాంతంగానేఉంచుతుంది.కానీ చుట్టూ ఉన్నప్రాంతాలను అల్లకల్లోలం చేస్తుంది.

తీరం తాకడం అంటే : కొన్నిచోట్ల సుడులు తిరుగుతూ మరింత గాలిని గ్రహిస్తాయి. అల్పపీడనం తీవ్రంగా మారితే వాయు గుండంగా మారుతుంది. అది మరింత బలపడితే తుపానుగా మారుతుంది. సముద్రంలో వేడెక్కిన నీటి ఆవిరిని తుపాన్లు గ్రహిస్తాయి. సముద్రంలో ఏర్పడే సుడులు చల్లబడి దట్టమైన మేఘాలుగా ఏర్పడిన తర్వాత తుపానుతో కలిసి ప్రయాణిస్తాయి. సముద్రంలో సుడుల రూపంలో ఉండే తుపాను భూ వాతావరణంలోకి రావడాన్నే తీరం తాకడం అంటారు. తుపాను తీరం తాకగానే సుడుల రూపంలో ఉన్న మేఘాలు చెల్లాచెదురై, అది ఉన్న ప్రాంతం నుంచి కొన్ని వందల కిలోమీటర్ల మేర భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. సుడులకు కారణమైన గాలులు గంటకు 60 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో ప్రయా ణించ గలవు.
అతి పెద్ద శూన్య ప్రదేశమే కన్ను : తుపాను గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ‘కన్ను’ అనే మాట గురించి కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది.తుపాను సుడిలోఉండే అతి పెద్దశూన్య ప్రదేశమే కన్ను.తుపాను ప్రయా ణంలో ఇది కేంద్ర స్థానంగా ఉంటుంది. ఇందులో మేఘాలు, గాలి, వర్షం ఉండవు. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తుపాను ప్రభావంబట్టి దీనివిస్తీర్ణం10 నుం చి 20కిలోమీటర్లదూరం వరకు ఉం టుంది.కన్నుచుట్టూ ఉండే వలయా కారా న్ని కంటి గోడలుగా పేర్కొంటారు.కంటి గోడల విస్తృతి కేంద్ర స్థానం నుంచి 225 కిలోమీటర్ల వరకు ఉంటుంది.1979 మేలో ఆంధ్రప్రదేశ్‌లో తీరం తాకిన తుపా ను కంటి విస్తృతి 425 కిలోమీటర్లు. అంటే కేంద్ర స్థానం నుంచి అంత దూరంలో ప్రభావం చూపించింది. ఇది ఒక రికార్డుగా చెబుతారు.
తుపానుగా బలపడిన తర్వాత :హుద్ హుద్ విస్తృతి 44 నుంచి 66 కిలోమీటర్లు సాధార ణంగా తుపాను కన్ను విస్తృతి ప్రాంతంలో అధిక వేగంతో గాలులు వీస్తాయి.భారీ నుం చి అతిభారీ,అంతకు మించిన తీవ్రతతో వర్షాలు కురుస్తాయి.వీటితోపాటు ఉరు ము లు,మెరుపులు,మేఘాలు కలిసి చుట్టూ ప్రభా వం చూపిస్తాయి.తుపానుగా బలపడిన తర్వాత దాని కేంద్ర స్థానంగా పిలుచుకునే ఈకన్నుస్పష్టంగా కనిపిస్తుంది.తీవ్ర తుపాను అయితే మరింత పెద్దగా కనిపిస్తుంది.
వందల కిలోమీటర్ల దూరంలో అలజడి : తుపాను సమయంలో అదితీరంతాకిన కొన్ని వందల కిలోమీటర్ల చోట విపత్తులు సంభ విస్తే అది ఉన్న చోట మాత్రం వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.ఎలాంటిగాలి, వాన ఉండదు.సముద్రం ప్రశాతంగా ఉం టుంది. తుపాను తీరం దాటిందా అని అక్క డున్న వారే ఆశ్చర్యపోయే విధంగా వాతావర ణం ఉంటుంది. ఎందుకంటే అది తుపాను కేంద్ర స్థానంకావడంతో దానికి కొన్ని వం దల కిలోమీటర్ల దూరంలోనే అలజడి అధి కంగా ఉంటుంది.అందుకే తుపాను తీరా నికి చేరువయ్యే కొద్దీభారీ వర్షాలు,గాలులు వీస్తాయి.తీరం తాకినపుడు ప్రభావం ఉండదు. తర్వాతే విలయం ఆరంభం అవుతుంది. తీరం దాటినప్పుడు అలసత్వం వహిస్తే,ఆతర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
తుపానుకు ప్రత్యేక పేరు? : తుపాన్లు వచ్చిన ప్రతిసారి దానికి ఓ ప్రత్యేకమైన పేరు నిర్ణయి స్తారు. అయితే ఆ పేర్లు నిర్ణయించడం ఆసక్తిక రంగా ఉంటుంది. ప్రపంచ వాతావరణ సంస్థ పర్యవేక్షణలోని వ్యవస్థద్వారా పేర్లను నిర్ణయి స్తారు. ఈ పేర్లు పెట్టే సంప్రదాయాన్ని 2000 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్, ప్రపంచ వాతావరణ సంస్థలు సంయు క్తంగా ప్రతిపాదించాయి.సుదీర్ఘ చర్చల తర్వాత 2004లో ఆమోదముద్ర వేశారు.
‘మొంథా’ అంటే అర్థం : ఆసియాలో ఏర్పడే తుపాన్లకు హిందూ మహాసముద్రం తీర ప్రాం తం కల్గిన 13 దేశాలు పేర్లను నిర్ణయిస్తాయి. 2018లో ఖతార్,ఒమన్,ఇరాన్,సౌదీ అరేబి యా,యూఏఈ దేశాలు ఈ గ్రూపులో చేరాయి. అక్షర క్రమంలో ఆయాదేశాలు పేర్లను నిర్ణయి స్తాయి.జాబితాలో మొదటి పేరు బంగ్లాదేశ్ కాగా,రెండో పేరు భారత్.ఉత్తర హిందూ మహా సముద్రం,అరేబియా సముద్రంలో పుట్టే తుపాన్లకు భారత వాతావరణ కేంద్రం పేర్లను ప్రకటిస్తుంది.తుపాన్లు, వాటి తీవ్రత గురించి భవిష్యత్తులో మాట్లాడుకోవడానికి, అది వస్తున్నపుడు ప్రజలకు సమాచారం త్వరగా చేరి అప్రమత్తం చేయడానికి, శాస్త్రవే త్తలు సమాచార మార్పిడి చేసుకోవడానికి పేర్లను నిర్ణయిస్తారు.ఈపేర్లు ఎవరి మనో భావాలు దెబ్బ తినకుండా నిర్ణయించాలి. బంగాళాఖాతంలో ఇప్పుడు ఏర్పడిన ‘మొం థా’కు పేరును థాయ్‌లాండ్ సూచించింది. థాయ్ భాషలో మొంథాస్ అంటే సువాసన గల లేదా అందమైన పువ్వు అని అర్థం.
పెరుగుతున్న ప్రమాదాలు..: మనం పాల ప్యాకెట్లు,సరకులు తీసుకురావ డానికి వాడే ప్లాస్టిక్ సంచులు మొదలు ఫ్రిజ్లూ ఏసీలూ… బైకులూ కార్లూ…గనులూ ఫ్యాక్టరీలు వంటి వన్నీ కాలుష్యాన్ని వెదజల్లేవే.మనిషి మనుగడకు ఇలాంటి వస్తువులు అవసరమే. కానీ,పెచ్చు మీరిన మానవ చర్యలవల్ల ఒక్క 2023వ సంవత్సరంలోనే5,40కోట్ల ట న్నుల విషవాయువులు గాలిలో కలిసి పోయాయంటే నమ్మగలమా? ఇలా ప్రపం చవ్యాప్తంగా వాతావరణంలోకి చేరే కాలు ష్యాన్నీ అదనపు వేడిమినీ ఎక్కువ శాతం సముద్రాలే గ్రహిస్తాయి.అసా ధారణంగా వేడెక్కిపోతున్నాయి.గిన్నెలో నీళ్లు వేడెక్కిన ప్పుడు ఆవిరి వస్తుంది కదా!అలాగే సము ద్రంలోని నీరు దాదాపు 27డిగ్రీల సెంటీ గ్రేడు ఉష్ణోగ్రత దాటినప్పుడు వేడి గాలులు విడుదల అవుతాయి.దానివల్ల ఓవైపు మేఘా లు,మరోవైపు తుపానులకు దారితీసే అల్పపీడనం వంటి పరిస్థితులు ఏర్పడతా యి. ఇది ప్రకృతిలో అత్యంత సహజంగా జరిగే ప్రక్రియే.కానీ,1955 తరవాత ఈ ప్రక్రియలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ప్రపంచవ్యాప్తంగా పారి శ్రామిక కార్యకలాపాలు,శిలాజ ఇంధ నాల వినియోగంజోరందుకోవడంతో వాతావర ణంలోకి పెద్దయెత్తున కర్బనఉద్గారాలు విడుదలవుతున్నాయి. వాటిని గ్రహించడం వల్ల ఉపరితల సముద్ర జలాలు వేగంగా వేడెక్కిపోతున్నాయి.1955తో పోలిస్తే ఇప్పు డు4.5రెట్లు వేగంగా సాగరాలు వేడెక్కుతు న్నాయనీ,అందువల్లే తరచూ మేఘాలు ఏర్ప డి అకాల వర్షాలు కురవడం,తుపానులు ఏర్పడటం చూస్తున్నామనీశాస్త్రవేత్తలు విశ్లేషి స్తున్నారు.
భవిష్యత్తులో మరింత భీకరంగా…: ప్రపం చంలోని చాలా దేశాలు ప్రకృతి అనుకూల విధానాలను కాదని, ఇబ్బడిముబ్బడిగా కర్బన ఉద్గారాలను వెదజల్లే శిలాజ ఇంధన ఆధారిత అభివృద్ధి నమూనాలనే అనుసరిస్తు న్నాయి.ఫలితంగా 1750-2024మధ్య కార్బన్ డయాక్సైడ్ 53శాతం,మీథేన్ 166 శాతం, నైట్రస్ ఆక్సైడ్ 25 శాతం అధికంగా విడుదలయ్యాయి.2075 నాటికి ఈ విష వాయువులు మరింత ఎక్కువగా వాతావర ణంలో చేరే ప్రమాదముందని స్విట్జర్లాం డ్లోని జ్యూరిచ్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరిం చారు. దానివల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు 2040-2100 సంవత్సరాల మధ్య 2.5డిగ్రీల నుంచి 4.4డిగ్రీల సెంటీగ్రేడు వరకు పెరిగిపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.అలా పరిస్థితుల్లో తుపానులు ఇప్పటికన్నా ఎంతోభీకరంగాఉం టాయి.సముద్ర జలాలు వేడెక్కడం వల్ల తరచూ అకాల వర్షాలు సంభవించడమే కాకుండా, తక్కువ వ్యవధిలోనే తుపానులు ఏర్పడతాయి. వీటిలో గంటకు 220కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైనగాలులు వీచే‘సూపర్ సైక్లోన్లు’ కూడా ఉండవచ్చు. చాలా దేశాల్లో వాతావరణ వ్యవస్థలు పసిగట్టి, ప్రజలను హెచ్చరించేలోపే అల్పపీడనం తుపానుగా బలపడే పరిస్థితి వస్తుంది. దాంతో మత్స్యకారుల తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడం కష్టమవు తుంది.సకాలంలో సహాయక చర్యలు చేపట్టేంత సమయం కూడా ఉండదు. 2016-25 మధ్య సముద్ర మట్టాలు ఏటా సగటున 4.1మిల్లీ మీటర్ల చొప్పున పెరుగుతూ వచ్చాయి.
భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి కొనసాగితే, తీరప్రాంతాల్లో తుపానులు సృష్టించే విధ్వం సం అనూహ్య స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా చిన్నచిన్న దీవులకు భారీ నష్టం తప్పకపోవచ్చు. భవిష్యత్తులో ఉష్ణమండల ప్రాంతం కంటే ఉత్తర,దక్షిణ ధ్రువాల దగ్గరే తుపానులు ఎక్కువగా సంభవిస్తాయని అధ్య యనాలు చెబుతున్నాయి.
ఉద్గారాల మూలంగా మానవాళికి పెను ముప్పు : పొంచి ఉందని తెలిసినా ప్రపంచ దేశాలుతమకు పట్టనట్టే వ్యవహరిస్తున్నాయి. వాతావరణ మార్పుల నిరోధానికి గట్టి చర్యలు తీసుకుంటామని పారిస్ సదస్సులో అవి ప్రతిజ్ఞ చేశాయే తప్ప, సరైన కార్యాచర ణకు పూనుకోలేదు. తుర్కియేలోని అంతా ల్యలో ఈఏడాది నవంబరులో జరిగే ‘కాప్-31’శిఖరాగ్ర సదస్సు అయినా అందుకు నడుంకట్టాలి.
55 సంవత్సరాల్లో 61 సార్లు – రాష్ట్రంపై ‘బంగాళాఖాతం తుపాన్ల’ ప్రభావం : బంగా ళాఖాతంలో ఏర్పడే తుపాన్లు ఆంధ్రప్రదే శ్‌లో అలజడి రేపుతున్నాయి.1970 నుంచి ఇప్పటి వరకు60తుపాన్లు రాష్ట్రంపై ప్రభా వం చూపాయి. ఇవి పొరుగున ఉన్న తమిళ నాడు,ఒడిశా,పుదుచ్చేరిలలో తీరం దాటినా రాష్ట్రానికి మాత్రం తీవ్రనష్టమే మిగిల్చా యి.తాజాగా ‘మొంథా’తో కలిపి వాటి సం ఖ్య 61కి చేరింది. ఇందులో 16 తుపాన్లు అక్టోబరు నెలలోనే ఆంధ్రప్రదేశ్, తమిళ నాడు పరిధిలో తీరం దాటినట్లు గణాంకా లు చెబుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళా ఖాతం (చెన్నై నుంచి కళింగపట్నం వరకు) ఎక్కువ తుపాన్లు తీరందాటాయి. ఆ తర్వాత వాయవ్య బంగాళాఖాతం (కళింగపట్నం నుంచి కోల్‌కతావరకు) తీరందాటిన తుపా న్లున్నాయి. అతి పెద్ద తుపాన్ల జాబితాలో దివిసీమ (గాలివేగం230 కి.మీ.),కోనసీ మ (270కి.మీ.),హుద్‌హుద్ (220కి.మీ) నిలిచాయి.ప్రచండగాలులు పూడ్చలేని నష్టా న్ని మిగిల్చాయి. ఇదే స్థాయిలో కొన్ని తీవ్ర తుపాన్లు (సూపర్ సైక్లోన్లు) ఏర్పడ్డాయి.అవి ఎక్కువగా ఒడిశావద్దతీరం దాటాయి. నీలం తుపాను 2010అక్టోబరు 28న తీరం దా టింది.భూమిని తాకి బలహీనపడిన తర్వాత భారీ వర్షాలు కురిశాయి.2013లో ఏకంగా ఐదు తుపాన్లు ఏర్పడగా,1987, 1996, 2016,2018ల్లో ఒకేఏడాదిలో మూడు తుపాన్లు ఏర్పడ్డాయి.అక్టోబర్‌లో సగటున 112.2మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2001 తర్వాత ఈస్థాయిలో వర్షపాతం నమో దవ్వడం ఇదే తొలిసారని భారత వాతావరణ విభాగం పేర్కొంది.అదే విధం గా 1901తర్వాత ఇది 16వసారి.ఇక ఈశా న్యరుతుపవన ప్రాంతం(కోస్తాంధ్ర, రాయల సీమ,కేరళ,కర్ణాటక,దక్షిణ అంతర్గత మాహె,తమిళనాడు,పుదుచ్చేరి,కరైకల్ సబ్ డివిజన్లు)లో అయితే అక్టో బర్‌లో సగటున 245.7మిల్లిమీటర్ల వర్షపాతం నమో దైంది.2019లో అత్యధికంగా 250.9 మిల్లి మీటర్ల నమోదు కాగా,తర్వాత ఈసారే అత్యధికం.2001 తర్వాత ఇదిమూడో గరిష్ఠం. దేశ వ్యాప్తంగా గత 5ఏళ్లలో ఎప్పుడూ లేనం తగా ఈసారి అక్టోబర్‌లో 236ప్రాంతాల్లో అతి భారీ (115.6 మి.మీ-204.5 మి.మీ.),45 చోట్ల అత్యంత భారీ(204.5మి.మీ.కు మించి) వర్షాలు కురిశాయి.
రాష్ట్రంలో సాధారణం కంటే 79% ఎక్కువ : రాష్ట్రంలో అక్టోబరులో సాధారణ సగటు వర్షపాతం 161.5 మిల్లిమీటర్ల కాగా, మొంథా తుపాను, వాయుగుండం ప్రభావంతో 288.3 మిల్లిమీటర్లగా నమోదైంది.ఇది సాధారణం కంటే 79%ఎక్కువ అని ఐఎండీ వెబ్‌సైట్‌లో పేర్కొంది.అలాగే 19జిల్లాల్లో సాధారణం కంటే 40%ఎక్కువ వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా లో 140%,శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు-131%,విజయనగరం-124%,పల్నాడు-119%,గుంటూరు జిల్లాలో109%అధి కంగా నమోదైంది.కర్నూలు,అనంతపురం, శ్రీసత్యసా యి జిల్లాల్లో సాధారణ వర్షాలు కురవగా, తూర్పుగోదావరి జిల్లాలో లోటు కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటస్టిక్స్ వెబ్‌సైట్ ప్రకారం, అక్టోబరులో రాష్ట్రంలోని 12జిల్లాల్లో సాధా రణానికి మించి వానలు కురిశాయి. ఏ జిల్లా లోనూలోటు వర్షపాతం నమోదు కాలేదు.
వాతావరణ శాఖ అలర్ట్‌ల గురించి తెలుసా?
గ్రీన్ అలర్ట్ :ఏదైనా ప్రాంతంలో 24గంటల వ్యవధిలో 6.4సెంటీ మీటర్ల కంటే తక్కువ వర్షం కురిసే అవకాశం ఉంటే వాతావరణ శాఖ అధికారులు ఈ అలర్ట్ జారీ చేస్తారు. వాతావరణంలో రాబోయే మార్పుల గురించి ఈఅలర్ట్‌తెలియజేస్తుంది. అయితే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకా శాలున్నందున ఈఅలర్ట్‌ద్వారా ప్రత్యే కంగా హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఉండదు.
ఎల్లో అలర్ట్ : ఒక ప్రదేశంలో 6.45 సెంటీ మీటర్ల నుంచి 11.55సెంటీ మీటర్ల మధ్య వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయనే సమాచారం,అంచనాల మేరకు వాతా వరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఈ అలర్ట్ జారీ చేశారంటే ప్రస్తుత వాతావర ణం ప్రతికూలంగా మారుతుందని అర్థం.
ఆరెంజ్ అలర్ట్ : 24గంటల వ్యవధిలో 11.56 సెంటీమీటర్ల నుంచి 20.44 సెం టీ మీటర్ల మధ్య వర్షం కురవొచ్చన్న అంచ నాతో ఐఎండీఈ అలర్ట్ ను జారీ చేస్తుంది. ఈ సమయంలో గాలుల తీవ్రత40 నుంచి 60 కిలోమీటర్ల వేగం ఉంటుంది. పరిస్థి తులు అల్లకల్లోలంగా ఉండే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అధికార యం త్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల ప్రజ లను సురక్షితంగా తరలిస్తారు.
రెడ్ అలర్ట్ : వాతావరణం,వర్షపాతానికి సంబంధించి ఇదిచివరి హెచ్చరికగా చెప్పు కోవచ్చు.24గంటల వ్యవధిలో ఒక ప్రాం తలో20.45సెంటీమీటర్లకుపైగా వర్ష పా తం నమోదయ్యే వీలుంటే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసి ప్రభుత్వాలను హెచ్చ రిస్తుంది.ఈప్రమాద హెచ్చరిక అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులకు సం బంధించిందని అర్థం.ఈసమయంలో విద్యుత్ స్తంభాలు కూలి పోవడం తోపాటు రోడ్లపైకి వరద పోటెత్తడం,రవాణా, వాహ నాల రాకపోకలకు అంతరాయం ఉం టుంది. పౌరులప్రాణాలకు ప్రమాదం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఐఎండీ ఈ తరహా హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో విపత్తు నిర్వహణా దళాలు,ఐఎండీ బృందాలు, రెస్క్యూ సహా యక సిబ్బందితో పాటు స్థానిక రెవెన్యూ, మున్సిపల్, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉంటాయి.రెడ్ అలర్ట్ దాదాపు ఐదురోజుల పాటు అమల్లో ఉంటాయి.

అసమానతలను ప్రశ్నిస్తున్న పన్నుల విధానం

ఒకఆదివాసీ ప్రాంతంలో నివసించే పేదమహిళ స్థానికదుకాణానికివెళ్లిఉప్పు,సబ్బు, వంట నూనె,పిల్లల పుస్తకాలు కొనుగోలు చేస్తుంది.ఆమె కొనుగోలుచేసే ప్రతివస్తువుపై జీఎస్టీ ఉం డదు.కొన్ని నిత్యావసరవస్తువులు మినహాయింపులు ఉన్నప్పటికీ, పన్ను వర్తించే వస్తువులపై మాత్రం ఆమెకూడా జీఎస్టీ చెల్లించాల్సిందే.మరోవైపు కోట్లాది రూపాయల విలువైన భూములు,భవనాలు, షేర్లు,పెట్టుబడులు కలిగిన అత్యంత సంపన్నుల మొత్తం నికరసంపదపై ప్రత్యేకంగా విధించే సంపదపన్ను ప్రస్తుతం దేశంలో అమల్లో లేదు.ఈ రెండు పరిస్థితుల మధ్య ఉన్నవ్యత్యాసం మన పన్నుల విధానంలో సామాజిక న్యాయం ఎంతవరకు ప్రతిబింబిస్తోందనే ప్రశ్నను లేవనెత్తుతోంది.
పేద కుటుంబాలు తమ ఆదాయంలో అధికభాగాన్ని ఆహారం,దుస్తులు,విద్య,వైద్యం,నిత్యా వసరాలకోసం ఖర్చుచేస్తాయి.పన్ను వర్తించే వస్తువుల కొనుగోళ్లపై జీఎస్టీ చెల్లించాల్సి వస్తుంది.పన్ను రేటు అందరికీ ఒకేలా ఉన్నప్పటికీ,తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.ఎందుకంటే వారి సంపాదనలో ఎక్కువ భాగం వినియోగానికే ఖర్చవుతుంది.సంపన్నుల ఆదాయం కేవలం జీతాల రూపంలోనే ఉండదు.భూములు,భవనాలు,షేర్లు,వ్యాపార సంస్థలు, పెట్టు బడులు,మూలధన లాభాలు వంటి అనేక రూపాల్లో వారిసంపద పెరుగుతుంది.వీటిపై ప్రస్తుత చట్టాల ప్రకారం వివిధ రకాల పన్నులు వర్తిస్తాయి.అయితే మొత్తం నికర సంపదపై ప్రత్యేకంగా విధించే సంపద పన్ను మాత్రం అమల్లో లేదు.అందువల్ల అత్యంత సంపన్నులపై సంపద ఆధారిత పన్ను విధానం అవసరమా? దానిని ఎలా అమలు చేయాలి? అనే చర్చకు ప్రాధాన్యం పెరుగుతోంది.సంపద కేంద్రీకరణ ప్రభావం ఆర్థికరంగానికే పరిమితం కాదు.అధిక వినియోగం, విలాసవంతమైన జీవనశైలి, భారీ పరిశ్రమలు,మైనింగ్ ప్రాజెక్టులు పర్యావరణంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి.అడవుల నరికివేత, నీటి కాలుష్యం, భూగర్భ జలాల క్షీణత, భూముల విధ్వంసం,జీవవైవిధ్యానికి ముప్పు వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఈ పర్యావరణ విధ్వంసం వల్ల ఎక్కువగా నష్టపోయేది ఆదివాసీ, గ్రామీణ సమాజాలే. అడవులపై ఆధారపడి జీవించే గిరిజనులు తమ సంప్రదాయ జీవనాధారాలను కోల్పో తున్నారు. నీటి వనరులు కలుషితమవుతున్నాయి.సాగు భూములు,అటవీ ఉత్పత్తులు,పశువుల మేతకు అవసరమైన ప్రాంతాలు దెబ్బతింటున్నాయి.వరదలు,కరువులు,వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యం కూడా వారికి పరిమితంగానే ఉంటుంది.ప్రకృతి వనరుల వినియోగం ద్వారా లాభాలు పొందే సంస్థలు ఒకవైపు ఆర్థికంగా బలపడుతుంటే,వాటి కార్యకలాపాలవల్ల కలిగే పర్యావరణ, సామాజిక నష్టాలను స్థానిక ప్రజలు భరిస్తున్నారు.

1997లో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక సమత తీర్పులిలి షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆదివాసీ భూములు,సహజవనరుల పరిరక్షణకు కీలకమైన రాజ్యాంగ,చట్టపరమైన భరోసాను కల్పించింది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనభూములను గిరిజనేతరులకు బదిలీ చేయడంపై ఉన్న చట్టపరమైన పరిమితులను స్పష్టం చేస్తూ,ప్రైవేటు సంస్థలకు మైనింగ్ లీజుల కేటాయింపుపై కీలక మార్గదర్శకాలను నిర్దేశించింది.ఈ తీర్పు సారాంశం కేవలం భూముల పరిరక్షణకే పరిమితం కాదు.ఆదివాసీ ప్రాంతాల్లోని ఖనిజాలు,అడవులు,నీరు,భూమి వంటి సహజ వనరులపై స్థానిక ప్రజల హక్కులు, వారి జీవనాధా రాలు,రాజ్యాంగ పరిరక్షణకు కూడా ఇది సంబంధించినది.ప్రకృతి వనరులపై స్థానిక సమాజాలకు ఉన్నహక్కులను విస్మరించి అభివృద్ధి పేరుతో చేపట్టే ప్రాజెక్టులు నిజమైన అభివృద్ధిగా పరిగణించలేం. సహజ వనరుల నుంచి వచ్చే సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా,ఆవనరులపై ఆధారపడి జీవించే ఆదివాసీసమాజాల విద్య,వైద్యం,తాగునీరు, ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా దోహదపడాలి.ఇదే సమతతీర్పు స్ఫూర్తికి,సామాజిక న్యాయానికి అసలైన అర్థం.సమత తీర్పు మనకు గుర్తుచేసే ప్రధానసూత్రం ఏమిటంటే..ఆదివాసీ భూములు,సహజ వనరుల పరిరక్షణ రాజ్యాంగ, చట్టపరమైన బాధ్యత. సంపద సృష్టించే హక్కుతో పాటు సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాలి.సంపద కొద్దిమందికి కేంద్రీకృతంకావడం అభివృద్ధి కాకుండా ఆసంపదతో సమాజంలోని చివరి వ్యక్తి జీవితం మెరుగుపడినప్పుడే నిజమైన అభివృద్ధి!– రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

1 2