పోషకాహార లోపం భావి తరాలకు శాపం

దేశంలో పోషకాహార లోపం అనేది అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా ఉంది. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, అయిదేళ్ల లోపు పిల్లలు దీనివల్ల ఎక్కువగా ప్రభావితమవు తున్నారు. ప్రస్తుతం మన దేశం ఆర్థికాభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించి,ప్రజలందరికీ ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ పోషకా హారాన్ని అందించడంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నట వివిధ అధ్యయనాలు పేర్కొంటున్నాయి.దీని కారణంగా ఎదుగుదల లోపించడం, రక్తహీనత, తక్కువ బరువు లాంటివి దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. వీటిని అధిగమించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టి వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. వీటిపై పోటీపరీక్షారికి అవగాహన ఉండాలి.

గ్రామీణ,పట్టణ అసమానతలు: గ్రామీణ ప్రాం తాలతోపోలిస్తే పట్టణ ప్రాంతాల్లో సాధార ణంగా మెరుగైన పోషకాహార ఫలితాలు ఉం టాయి.అక్కడ ఉండే మౌలికసదుపాయాలతో పాటు సరైన పారిశుద్ధ్యం,ఆహార సంరక్షణ సౌక ర్యాలు దీనికి ప్రధానకారణం.గ్రామాల్లో ఆరో గ్య సంరక్షణ సదుపాయాలు లేకపోవడం, నిరక్షరాస్యత,సంప్రదాయ పోషకాహార పద్ధతు లపై ఆధారపడటం లాంటి సవాళ్లు అధికం ఉన్నాయి.
ప్రాంతీయ వైవిధ్యాలు: కేరళ,తమిళనాడు లాంటికొన్ని రాష్ట్రాలు బలమైన ప్రజారోగ్య వ్యవస్థలు,సంక్షేమ కార్యక్రమాల అమలు ద్వారా పోషకాహార లోపాన్ని చాలావరకు తగ్గిం చాయి. ఆర్థికంగా వెనుకబడిన బిహార్, ఝార్ఖం డ్,ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోని ప్రజలు అధికపోషకాహార లోపంతో బాధపడుతున్నారు. లింగ అసమానతలు: లింగ ఆధారిత వివక్ష
కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ అసమానతలు బాలికల పోషకాహార, ఆరోగ్య సంరక్షణ అవసరాలను ప్రత్యేకంగా పరిష్క రించే కార్యక్రమాలఆవశ్యకతను తెలుపుతాయి.
ప్రభుత్వ పథకాలు/ కార్యక్రమాలు : మన దేశంలో పోషకాహార, సమతౌల్య ఆహార లోపా నికి ప్రధాన కారణం పేదరికం. తగినంత ఆదా యం లేక,ఆహార పదార్థాలు కొనలేక అనేక మంది తీవ్ర ఆకలితో బాధపడుతున్నారు.
భారతదేశంలోని గిరిజన వర్గాలలో పోషకా హార లోపం అత్యంత తీవ్రంగాఉందని ఇటీవలి గణాంకాలు వెల్లడిస్తున్నాయి.సగటు వ్యాప్తి రేట్ల ప్రకారం,దాదాపు 43.8%గిరిజన పిల్లలు తక్కువ బరువుతో,43.2% మంది ఎదుగుదల లోపంతో, మరియు 29.6% మంది క్షీణతతో బాధపడుతున్నారు.ముఖ్యంగా బలహీన గిరి జన సమూహాలు మరింత తీవ్రమైన పోషకాహార లోపాలను ఎదుర్కొంటున్నాయి; దీనికి తోడు అధిక స్థాయిలో ఉన్న రక్తహీనత మరియు తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్లు ఈ సమస్య ను మరింత తీవ్రతరం చేస్తున్నాయి
కీలక పోషకాహార లోప సూచికలుతక్కువ బరువు: ఐదేళ్లలోపు గిరిజన పిల్లలలో సుమారు 43% నుండి 45% మంది దీని బారిన పడు తున్నారు, ఇది జాతీయ సగటుల కంటే గణనీ యంగా ఎక్కువ.ఎదుగుదల లోపం (దీర్ఘకాలిక పోషకాహార లోపం43% కంటే ఎక్కువ మంది గిరిజన యువతపై దీని ప్రభావం ఉంటుంది, ఇది దీర్ఘకాలిక పోషకాహార లోపాన్ని మరియు పరిమితమైన నిలువు పెరుగుదలను సూచి స్తుంది.క్షీణత (తీవ్రమైన పోషకాహార లోపం): దాదాపు 30% చిన్నపిల్లల ఆరోగ్యంపై దీని ప్రభావం ఉంటుంది. వీరు ఆకస్మిక ఆహార కొరత లేదా కాలానుగుణ అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది.రక్తహీనత మరియు సూక్ష్మపోషకాల లోపాలు పునరుత్పత్తి వయస్సులో ఉన్న గిరిజన మహిళలలో 60% కంటే ఎక్కువ మంది మరియు అధిక శాతం పిల్లలు తీవ్రమైన రక్తహీనతతో బాధపడు తున్నారు
దేశంలోని గిరిజన పిల్లల్లో పోషకాహార లోపం: దేశంలోని గిరిజన పిల్లల్లోదాదాపుసగం మంది తక్కువ బరువు,ఎదుగుదల లోపంతో బాధ పడుతున్నట్లు అధ్యయనం వెల్లడి.భారత దేశంలోని గిరిజన సమాజాలకు చెందిన పిల్ల ల్లో పోషకాహార లోపం తీవ్ర స్థాయిలో ఉన్నట్లు తాజా సిస్టమాటిక్ రివ్యూ, మెటా-అనాలిసిస్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న పరిశోధనలను సమగ్రంగా విశ్లేషించిన ఈ అధ్యయనం,గిరిజన పిల్లల్లో లిలితక్కువ బరువు, ఎదుగుదల లోపం,ఎముకల క్షీణత/సన్నబారడం వంటి సమస్యలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ అధ్య యనం ప్రధానంగా భారతదేశంలోని గిరిజన పిల్లల్లో పోషకాహార లోపం ఎంతమేర ఉందో అంచనా వేయడం, ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆధారాలను ఒకచోట చేర్చి విశ్లేషించడం లక్ష్యంగా నిర్వహించారు.1,606 అధ్యయనా ల్లో 58మాత్రమే అర్హత సాధించాయి.గిరిజన పిల్లల్లో తక్కువ బరువు, ఎదుగుదల లోపం, వేస్టింగ్‌కు సంబంధించిన ప్రాబల్యాన్ని నివేదిం చిన అధ్యయనాలను పరిశీలించారు. మొత్తం 1,606 అధ్యయనాలు గుర్తించగా, నిర్ణయిం చిన అర్హత ప్రమాణాలను కేవలం 58అధ్య యనాలు మాత్రమే పూర్తి చేశాయి.
ఈఅధ్యయనాల ఫలితాలను కలిపి విశ్లేషిం చేందుకు లిఇన్వర్స్ వేరియన్స్ పద్ధతిలిను ఉపయోగించారు. వివిధ అధ్యయనాల మధ్య కనిపించిన వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకుని లిరాండమ్ ఎఫెక్ట్స్ మోడల్‌లి ద్వారా సమగ్ర ప్రాబల్యాన్ని అంచనా వేశారు. దాదాపు సగం మంది పిల్లలు తక్కువ బరువుతో మెటా-అనాలిసిస్‌లో వెలుగులోకి వచ్చిన గణాంకాలు పరిస్థితి తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తు న్నాయి.భారతదేశంలోని గిరిజన పిల్లల్లో తక్కు వ బరువు ఉన్నవారి సమగ్ర ప్రాబల్యం 43.78 శాతంలిలిగా నమోదైంది.95శాతం విశ్వస నీయ పరిధి (్పుశీఅfఱdవఅcవ Iఅtవతీఙaశ్రీ) 38.80 నుంచి 48.83శాతం మధ్య ఉంది.అంటే, సగ టున ప్రతి100మంది గిరిజన పిల్లల్లో దాదాపు 44మంది తక్కువ బరువుతో ఉన్నట్లు అంచనా. అదే విధంగా,ఎదుగుదలలోపం43.16 శాతం గా నమోదైంది. దీని 95శాతం విశ్వసనీయ పరిధి 39.10 నుంచి 47.26శాతం మధ్య ఉంది.ఇది పిల్లల వయసుకు తగిన ఎత్తు లేక పోవడాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక పోషకాహార లోపం, పదేపదే వచ్చే అనారోగ్యా లు, పేదరికం, సరైన ఆహారం అందకపోవడం వంటి కారణాలతో పిల్లల ఎదుగుదల దెబ్బతిన వచ్చు.
ప్రతి ముగ్గురు-నలుగురిలో ఒకరికి వేస్టింగ్
గిరిజన పిల్లల్లో వేస్టింగ్ ప్రాబల్యం 29.58 శాతంగా నమోదైంది.95 శాతం విశ్వస నీయ పరిధి 25.59 నుంచి 33.73 శాతం వరకు ఉంది.అంటే సుమారు ప్రతి 100మంది గిరి జన పిల్లల్లో 30మంది వరకు వారి ఎత్తుకు తగిన బరువు లేకుండా, తీవ్రమైన లేదా ఇటీ వ పోషకాహార లోపానికి గురయ్యే ప్రమా దంలో ఉన్నారు.వేస్టింగ్ పిల్లల తక్షణ ఆరోగ్యా నికి ప్రమాదకరమైన పరిస్థితి. ఇది రోగనిరోధక శక్తిని బలహీనపరచడంతో పాటు తీవ్రమైన అనారోగ్యాలు, అభివృద్ధిలో వెనుకబాటుతనం, మరణాల ప్రమాదాన్ని పెంచుతుంది.
ప్రాంతాల మధ్య భారీ వ్యత్యాసాలు
అధ్యయనాల్లో గణనీయమైన హెటిరోజీనిటీ కనిపించింది. అంటే వివిధ పరిశోధనల్లో పోష కాహార లోపం శాతం ఒకే విధంగా లేదు.దీనికి అధ్యయనాల రూపకల్పన, పరిశోధన జరిగిన భౌగోళిక ప్రాంతం, పిల్లల ఎంపిక విధానం, పోషక స్థితిని కొలిచిన పద్ధతులు వంటి అనేక అంశాల్లో ఉన్న తేడాలు కారణమై ఉండవచ్చని పరిశోధకులు భావించారు.భారతదేశంలోని గిరిజన సమాజాలు ఒకే విధమైన సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో లేవు.కొండ ప్రాంతాలు, అడ వులు, దూరప్రాంతాల్లో నివసించే సమూహా లకు ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, మార్కె ట్లు,రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉం డటం కూడా భిన్నంగా ఉంటుంది. అందువల్ల పోషకాహార లోపానికి కారణాలు, దాని తీవ్రత కూడా ప్రాంతాన్ని బట్టి మారవచ్చు.
పేదరికం నుంచి భౌగోళిక అడ్డంకుల వరకు
గిరిజన పిల్లల్లో పోషకాహార లోపాన్ని కేవలం ఆహారం అందకపోవడమనే ఒకే కారణంతో అర్థం చేసుకోవడం సరైంది కాదు. పేదరికం, ఆరోగ్య సేవలకు పరిమిత ప్రాప్యత, దూరప్రాం తాల్లో నివాసం, రవాణా సమస్యలు, స్వచ్ఛమైన నీరు-పారిశుధ్య సౌకర్యాల కొరత, ఆరోగ్యంపై అవగాహన లోపం వంటి అనేక అంశాలు కలిసి పిల్లల పోషక స్థితిని ప్రభావితం చేస్తాయి.
ముఖ్యంగా భౌగోళికంగా మారుమూల ప్రాం తాల్లో నివసించే గిరిజన కుటుంబాలకు ప్రభు త్వ ఆరోగ్య,పోషకాహార కార్యక్రమాలు అందు బాటులోకి రావడంలో అనేక అడ్డంకులు ఉంటాయి.ఆరోగ్య కేంద్రం చేరుకోవడానికి ఎక్కు వ దూరం ప్రయాణించాల్సి రావడం, రవాణా ఖర్చులు,కుటుంబ ఆర్థిక పరిస్థితి వంటి అంశా లు చికిత్సను ఆలస్యం చేయవచ్చు.
సాధారణ పరిష్కారాలు సరిపోవు
ఈ అధ్యయనం సూచించే ముఖ్యమైన అంశం ఏమిటంటే..గిరిజన పిల్లల్లో పోషకాహార లోపా న్ని తగ్గించడానికి దేశవ్యాప్తంగా ఒకే రక మైన చర్యలు చేపట్టడం కంటే స్థానిక అవస రాలకు అనుగుణమైన లక్ష్యిత కార్యక్రమాలు అవసరం. పిల్లలకు అవసరమైన పోషకాహార సప్లిమెంట్లు అందించడంతో పాటు, ఆరోగ్య సేవలు వారి నివాస ప్రాంతాలకు చేరేలా చూడాలి. మారు మూల ప్రాంతాల్లో మొబైల్ ఆరోగ్య సేవలు, గ్రామస్థాయి పోషకాహార పర్యవేక్షణ,తల్లి-శిశు ఆరోగ్య సేవలు మరింత బలోపేతం చేయా ల్సిన అవసరం ఉంది. అదే సమయంలో గిరి జన కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచే సామాజిక భద్రతా చర్యలు కూడా కీలకం. పేదరికాన్ని తగ్గించకుండా పోషకా హార లోపాన్ని శాశ్వతంగా పరిష్కరిం చడం కష్టం.
పోషకాహారం మాత్రమే కాదు సంపూర్ణ ఆరోగ్య దృక్పథం అవసరం
గిరిజన పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించా లంటే లిలిపోషకాహార సప్లిమెంటేషన్, ఆరోగ్య సేవలకు అందుబాటు, పరిశుభ్రమైన తాగు నీరు,పారిశుధ్యం,తల్లి-శిశు ఆరోగ్యం, విద్య, సామాజిక-ఆర్థిక సహాయంలిలి వంటి అంశా లను సమగ్రంగా అమలు చేయాలి.ప్రత్యేకంగా జీవితంలోని తొలి సంవత్సరాలు పిల్లల శారీ రక, మానసిక ఎదుగుదలకు అత్యంత కీలకం. ఈ దశలో తగిన పోషకాహారం అందకపోతే ఎదుగుదల లోపం వంటి సమస్యలు దీర్ఘకాలం కొనసాగవచ్చు.అందువల్ల గిరిజన ప్రాంతాల్లో పోషకాహార కార్యక్రమాల అమలును కేవలం లబ్ధిదారుల సంఖ్యతో కాకుండా లిలిపిల్లల నిజ మైన పోషక స్థితిలో వస్తున్న మార్పులతోలిలి అంచనా వేయాలి.
అత్యవసర చర్యలు అవసరం
ఈ సిస్టమాటిక్ రివ్యూ,మెటా-అనాలిసిస్ భారత దేశంలోని గిరిజన పిల్లల్లో పోషకాహార లోపం ఎంత తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది.తక్కువ బరువు 43.78 శాతం,ఎదుగుదలలోపం43.16శాతం, వేస్టిం గ్ 29.58 శాతంలిలి అనే గణాంకాలు తక్షణ చర్యల అవసరాన్ని తెలియజేస్తున్నాయి.గిరిజన సమాజాల ప్రత్యేక పరిస్థితులను అర్థం చేసు కుని,వారికి చేరువగా ఆరోగ్య-పోషకాహార సేవలను అందించడం,పేదరికాన్ని తగ్గించడం, భౌగోళిక అడ్డంకులను అధిగమించడం, పిల్ల లకు లక్ష్యిత పోషకాహార సహాయం అందిం చడం అత్యవసరం. గిరిజన పిల్లల పోషకాహా రం మెరుగుపడకుండా సమగ్ర భారత పోషకా హార లక్ష్యాన్ని సాధించడం సాధ్యం కాదు. ప్రతి గిరిజన బాలుడికి ఆరోగ్యకరమైన ఎదుగుద లకు అవసరమైన ఆహారం,ఆరోగ్య సేవలు, సురక్షితమైన జీవన పరిస్థితులు అందేలా చూడ టం ప్రజారోగ్య వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత కావాలి.– జి ఎస్ ఎన్ సతీష్ 

పోలవరం నీరు ప్రజలకా..డెటా సెంటర్లకా?

విశాఖ ప్రాంతంలో స్థానిక ప్రజలను సంప్రదించకుండా ప్రభుత్వం అనుమతిస్తున్న భారీ డేటా సెంటర్లకు అవసరమైన నీటిని పోలవరం ప్రాజెక్టు నుంచి కేటాయించడం వల్ల భవిష్యత్తులో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడే ప్రమా దం ఉందని మాజీ కేంద్ర ఇంధనశాఖ కార్య దర్శిఈ.ఏ.ఎస్.శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖప్రజలనీటి అవసరాలను దృష్టిలో పెట్టు కుని డేటా సెంటర్లకు ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం పునఃపరిశీలించాలని కోరారు.డేటా సెంటర్ల నీటి వినియోగంపై తాను ఆగష్టు12, 15తేదీల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రెండు లేఖలు రాసి నట్లు శర్మ తెలిపారు.డేటా సెంటర్లకు ఏటా 3.5టీఎంసీల నీరు మాత్రమే అవసరమని,ఈఅంశంపై కొం దరు అనవసర విమర్శలు చేస్తున్నారని ముఖ్య మంత్రి పేర్కొన్న నేపథ్యంలో,విశాఖ ప్రజల తరఫున తన అభ్యంతరాలను ఆలేఖల్లో వివ రించినట్లు చెప్పారు.

6,500 మెగావాట్ల డేటా సెంటర్లకు ఎంత నీరు?
రాష్ట్ర శాసనసభలో ఇటీవల డేటా సెంటర్లపై జరిగిన చర్చలో ఉత్తరాంధ్రలో 6,500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, వాటికి అవసరమైన సుమారు 3టీఎంసీల నీటిని పోల వరం నుంచి ఉత్తరాంధ్ర పరిశ్రమలకు కేటా యించిన వాటా నుంచి అందించవచ్చని ప్రభు త్వం పేర్కొన్న విషయాన్ని శర్మ ప్రస్తావించారు. అయితే అమెరికాలో గూగుల్ నిర్మించిన డేటా సెంటర్ల నీటి వినియోగాన్ని పరిశీలిస్తే, శీతలీ కరణ కోసం ఒక యూనిట్ విద్యుత్ వినియోగా నికి కనీసం 1.8లీటర్ల నీరు అవసరమవు తుందని తెలిపారు.ఈ లెక్కన 6,500 మెగా వాట్ల డేటా సెంటర్లకు కనీసం 3.74 టీఎంసీల నీరు అవసరమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇప్పుడే 74 ఎంఎల్‌డీ నీటి లోటు
ప్రస్తుతం విశాఖ నగర ప్రజల రోజువారీ నీటి అవసరం సుమారు 400ఎంఎల్‌డీ,అంటే 5.16 టీఎంసీలుగా ఉందని శర్మ తెలిపారు. స్థానిక రిజర్వాయర్లలో సిల్ట్ పేరుకుపోవడం, ముడసర్లోవ,మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ల సామర్థ్యం తగ్గడం, ఏలేరు కాలువ సామర్థ్యం తగ్గిపోవడం వంటి కారణాలతో ప్రస్తుతం ప్రజ లకు సుమారు 326ఎంఎల్‌డీ(4.2 టీఎంసీ లు) నీరు మాత్రమే అందుతోందన్నారు. అంటే ఇప్పటికే రోజుకు సుమారు74ఎంఎల్‌డీ (0. 95టీఎంసీ) నీటి కొరత ఉందని పేర్కొన్నారు. 2040 నాటికి విశాఖ ప్రజల నీటి అవసరం లిలి726 ఎంఎల్‌డీ (9.37 టీఎంసీలు)లిలికు చేరుకునే అవకాశం ఉందని, పోలవరం నీటిని లెక్కలోకి తీసుకోకపోతే అప్పటికి సుమారు 400 ఎంఎల్‌డీ (5.16టీఎంసీలు) నీటి లోటు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
పరిశ్రమలకు ఇప్పటికే దాదాపు మొత్తం నీటి వాటా
విశాఖ ప్రాంతంలో నీటి సమస్య, పారిశ్రామిక కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకున్నప్పటికీ, పారిశ్రామిక వర్గాల ఒత్తిడితో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని శర్మ విమర్శించారు.2019 జనవరిలో అప్పటి ప్రభుత్వం పోలవరం ఎడమ కాలువ, పురుషో త్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలకు నీటిని అందించేందుకు బాబూ జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి (దీజీ=USS) ప్రాజెక్టును మంజూరు చేసిందని తెలిపారు.ఈపథకంద్వారా సుమారు 30 లక్షల మంది ఉత్తరాంధ్ర ప్రజల తాగునీటి అవస రాలకు,అలాగే 8లక్షల ఎకరాల వ్యవసా య భూములకు సాగునీటికి నీటిని కేటాయించిన ట్లు పేర్కొన్నారు.పరిశ్రమలకు మిగిలిన వాటా లో 5.34 టీఎంసీలు కేటాయించినట్లు తెలి పారు.అయితే దీజీ=USS మంజూరు తర్వాత HP్పుL విస్తరణ,బల్క్ డ్రగ్, ఇతర రసాయన పరిశ్రమలు,ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంటు తదితర పరిశ్రమలకు నీటి లభ్యతను తగినంత గా పరిగణనలోకి తీసుకోకుండా అనుమతులు ఇచ్చారని శర్మ అన్నారు.ఈపరిశ్రమలకు అవస రమయ్యే నీరు సుమారు 5టీఎంసీలు కాగా, పరిశ్రమల కోసం కేటాయించిన5.34 టీఎం సీలలో కేవలం 0.34టీఎంసీలు మాత్రమే మిగులుతాయని వివరించారు.
ప్రజల నీటిని డేటా సెంటర్లకు మళ్లించడం సబబేనా?
ప్రభుత్వం పేర్కొంటున్న లెక్కల ప్రకారం 6, 500 మెగావాట్ల డేటా సెంటర్లకు అవసర మయ్యేనీరు సుమారు3.74టీఎంసీలు అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న 0.34 టీఎం సీలతో ఆ అవసరాన్ని తీర్చడం సాధ్యం కాదని శర్మ అన్నారు.మిగిలిన సుమారు 3.4టీఎం సీల నీటిని డేటా సెంటర్లకు మళ్లిస్తే,ఉత్తరాం ధ్రలోని సుమారు 12లక్షల మంది ప్రజల నీటి అవసరాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రజల తాగునీటి అవసరాలకు కేటాయించిన వనరులను భారీ డేటా సెంట ర్లకు మళ్లించడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించాలని కోరారు.రూ.7.61 లక్షల కోట్ల రాయితీలు..ఉద్యోగాలు మాత్రం పరిమితమే.6,500 మెగావాట్ల డేటా సెంట ర్లకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.1.43 లక్షల కోట్ల విలువైన రాయితీలు ఇస్తుండగా, కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.6.18లక్షల కోట్ల మేర రాయితీలు ఇస్తున్నట్లు శర్మ పేర్కొన్నారు.ఇంత భారీ స్థాయిలో ప్రజా వనరు లను రాయితీల రూపంలో వినియోగిస్తున్న ప్పటికీ,స్థానిక ప్రజలకు లభించే ఉద్యోగ అవకా శాలు పరిమితంగానే ఉండే అవకాశం ఉం దన్నారు.ఈ మొత్తం వ్యయంలో కనీసం ఒక శాతం నిధులను ఉత్తరాంధ్రలో విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టులు,ఇతర సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తే,ఈప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగు పరచవచ్చని సూచించారు.
పోలవరి నీటి వెనుక నిర్వాసిత ఆదివాసీల త్యాగం ఉంది
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుపై సుమారు రూ.30,437కోట్లు ఖర్చు చేస్తున్నా యని శర్మ గుర్తుచేశారు. ఈప్రాజెక్టు కారణంగా లక్షకు పైగా ఆదివాసీలు నిర్వాసితులవుతున్నా రని, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో వారికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కులు కూడా ప్రభావిత మవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.తగిన నష్టపరిహారం అందకుండానే అనేక సందర్బా Ûల్లో భూములు కోల్పోవాల్సి వస్తున్న ఆదివాసీల త్యాగాలతో పోలవరం నిర్మితమవుతోందని పేర్కొన్నారు.“పోలవరం నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టులో నిర్వాసితులైన ఆదివాసీ కుటుంబాల బాధ,త్యాగం ఉంది. అలాంటి నీటిని లక్షల కోట్ల డాలర్ల లాభాలు ఆర్జించే బహుళజాతి సంస్థల డేటా సెంటర్లకు అత్యంత చౌకగా కేటా యించడం ఎంతవరకు సమంజసం?” అని శర్మ ప్రశ్నించారు.
డేటా సెంటర్లపై పునఃపరిశీలన అవసరం
విశాఖ ఇప్పటికే నీటి సమస్యను ఎదుర్కొం టున్న నేపథ్యంలో డేటాసెంటర్లకు భారీగా నీటి ని కేటాయించే నిర్ణయాలపై ప్రభుత్వం సమ గ్రంగా పునఃపరిశీలన చేయాలని శర్మ కోరారు. ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు, అధికా రులు తాను ప్రస్తావించిన అంశాలను, ముఖ్యం గా భవిష్యత్తులో విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజలపై పడే నీటి ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలిం చినట్లు కనిపించడం లేదని అన్నారు. “పోలవ రం ప్రాజె క్టును అమెరికా డేటా సెంటర్లకోసం నిర్మిం చలేదు.ఉత్తరాంధ్ర ప్రజల తాగునీరు, సాగునీటి అవసరాలను విస్మరించి ఆనీటిని డేటా సెంటర్లకు మళ్లించడం సమర్థనీ యం కాదు. ప్రజల ప్రయోజనాలను ముందుగా ఉంచి ప్రభుత్వం తన నిర్ణయాలను పునః పరిశీలించాలి” అని ఈ.ఏ.ఎస్.శర్మ కోరారు
ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి
డేటా సెంటర్లకు నీరుఎలా కేటాయించ బోతు న్నారు?రోజువారీ,వార్షిక నీటిఅవసరం ఎంత? ఆనీరు ఏ ప్రాజెక్టు నుంచి వస్తుంది? ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు కేటాయింపులు ఎంత?2040నాటికి ప్రజల అవసరాలకు ఎంత నీరు మిగులుతుంది?ఈ ప్రశ్నలకు ప్రభు త్వం బహిరంగంగా సమాధానం ఇవ్వాలి.డేటా సెంటర్లకు నీటి కేటాయింపుపై పూర్తి వివరా లతో శ్వేతపత్రం విడుదల చేయడం అవస రం.అలాగే స్థానిక ప్రజలతో, నిపుణులతో, నీటి రంగ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి.
విశాఖకు నీరు సరిపోకపోతే డేటా సెంటర్లకు నీరు ఎందుకు?ఉత్తరాంధ్ర ప్రజల భవిష్యత్తు నీటి భద్రతకు హామీ లేకపోతే భారీ నీటి వినియోగ పరిశ్రమలకు అనుమతులు ఎందుకు? పజల వనరులను రాయితీల రూపంలో ఇస్తున్నప్పుడు ప్రజలకు దక్కేది ఏమిటి?అభివృద్ధి కావాలి.పెట్టుబడులు రా వాలి.పరిశ్రమలు రావాలి. కానీ ప్రజల దాహం తీర్చలేని అభివృద్ధి నమూనా మాత్రం ప్రశ్నిం చబడాల్సిందే.విశాఖ భవిష్యత్తు కేవలం డేటా సెంటర్ల భవిష్యత్తు కాదు. అది లక్షలాది ప్రజల జీవన భద్రతకు సంబంధించిన విషయం. పోలవరి నీటిలో ప్రతి బొట్టుకూ ఒక ప్రజా ప్రయోజనం ఉంది.ఆబొట్టును ఎవరికి వ్వా లన్న నిర్ణయంలో ప్రజల హక్కే మొదటి ప్రమా ణం కావాలని ఈ.ఏ.ఎస్.శర్మ సీఎంకు రాసీన రెండు లేఖల్లో పేర్కోన్నారు.
(విశ్రాంతి ఐఏఎస్ అధికారి ఈఎఎస్‌శర్మ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు రాసీన లేఖలు ఆధారంగా..)

కష్టం కన్పించింది..కలెక్టర్ మనసు కదిలింది

పిలవలేదు.. అయినా పలకరించారు.గోడు చెప్పకముందే గమ నించి… బాధను అర్థం చేసుకున్నారు.అధికారి కాదు.. ఆపన్న హస్తమయ్యారు!..విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ కంటపడిన కష్టం..క్షణాల్లో కదిలిన మానవత్వం చాటుకున్నారు. దిక్కుతోచని తల్లిదండ్రులకు..కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ భరోసాగా నిలిచారు. ఆ ఉన్నతాధికారి కరుణా కటాక్షంతో..ఆ కుటుంబానికి ఆశ చిగురించింది!. అధికారం అంటే ఆదేశాలు ఇవ్వడం మాత్రమే కాదు..ఆపదలో ఉన్నవారి వద్దకు వెళ్లి వారి గోడు వినడమూ మానవత్వమేనని కలెక్టర్ చూపిన ఈ స్పందన పలువురి ప్రశంసలు అందుకుంది.
విశాఖ జిల్లా కలెక్టర్ మెట్లు ఎక్కేందుకు వెళ్తున్న సమయంలో కనిపించిన ఆదివ్యాంగుడిని చూసి ఆగిన కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్..ఆప్యాయంగా పలకరించివారి సమస్యను ఆసక్తిగా విన్నారు. వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి భరోసా ఇచ్చారు. ఆగష్టు 24న ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే పీజీఆరఎస్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన కలెక్టర్..తన వాహనం దిగి కార్యాల యానికి వెళ్తున్నారు. అదే సమయంలో రెడ్‌క్రాస్ వాలంటీర్ సహాయంతో లిఫ్ట్ వైపు వెళ్తున్న ఓదివ్యాంగుడు ఆయన కంట పడ్డాడు. వెంటనే అక్కడే ఆగి అతడి వద్దకు వెళ్లిన కలెక్టర్..ఏమైంది..మీ సమస్య ఏమి టి?”.. అంటూ ఆప్యాయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రూ.6 వేల పింఛన్‌తో ఇబ్బందులు..
భీమిలి మండలం చిప్పాడ గ్రామానికి చెందిన జి.రాంబాబు మానసిక దివ్యాం గుడు. ప్రస్తుతం వికలాంగుల కోటాలో నెలకు రూ.6 వేల పింఛన్ అందుతోంది. రాంబాబు తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమా రుడి పోషణకు ప్రస్తుత ఆర్థిక సాయం సరిపోవడం లేదని, బెడ్‌రిడెన్ కేటగిరీలో రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని వారు కలెక్టర్‌ను కోరారు. వారి సమస్యను సానుకూలంగా విన్న కలెక్టర్..సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా “ఇకపై రాంబాబును ఇక్కడికి తీసుకురావద్దు..కష్ట పెట్టొద్దు. మీ ఇంటికే అధికారులు వస్తారు” అని తల్లిదం డ్రులకు భరోసా కల్పించారు.మా దగ్గరకే వచ్చి గోడు విన్నారు’ సమస్యను చెప్పేందుకు కలెక్టర్‌ను ప్రత్యేకంగా కలవాల్సిన అవసరం లేకుండానే..ఆయనే తమ వద్దకు వచ్చి ఆప్యాయంగా పలకరించి గోడు విన్నా రని రాంబాబు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే స్పందించిన కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.- జి ఎస్ సునీల్ కుమార్ 

చిన్న ప్రశ్న.. పెద్ద సామాజిక మార్పుకు నాంది!

విశాఖ ఉమ్మడి జిల్లా అనంతగిరి మండలంలోని బొర్రాగుహల భద్రతపై మొదలైన చిన్న సందేహం..క్రమంగా గిరిజనుల భూమి హక్కులు,మైనింగ్ లీజులు,రాజ్యాంగ రక్షణలు, పర్యావరణన్యాయం,అభివృద్ధిలో ప్రజలభాగస్వామ్యంవంటి విస్తృతమైన ప్రశ్నలుగా మారింది. చివరకు అది ఒక సుదీర్ఘ న్యాయపోరాటానికి నాంది పలిక1989లో బొర్రా ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలు,పేలుళ్లు జరుగుతున్నట్లు గమనించిన నేను అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు.‘ప్రభుత్వమే లీజులు ఇచ్చింది’అన్న సమాధానం ఆయనకు ఎదురైంది.అక్కడితో ఆప్రశ్న ముగిసినా..సమస్య మాత్రం సమిసిపోలేదు.1992లో గిరిజన యువతకోసం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో గమ్మెల దేవకుమార్ వేసిన ప్రశ్న ఈసమస్యకు అసలు రూపాన్ని చూపించింది. తరతరాలుగా భూమినిసాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కుపత్రాలు లేవు.అదే భూమిపై మైనింగ్ కంపెనీలకు మాత్రం ప్రభుత్వ లీజులు ఉన్నాయి. తమ భూమిపై తమకే హక్కులు లేకపోతే..ఆభూమిపై మైనింగ్ హక్కులు ఇతరులకు ఎలా వచ్చాయి?అన్న ప్రశ్న న్యాయపోరాటానికి దారితీసింది.
ఈ నేపథ్యంలో సమత న్యాయపోరాటాన్ని ప్రారంభించింది.1997లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక సమత తీర్పు షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజన భూములు,సహజ వనరులు,మైనింగ్ హక్కులపై కీలకమైన రాజ్యాంగసూత్రాలను బలపరిచింది.షెడ్యూల్డ్ ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో ప్రజల హక్కులను పక్కనపెట్టి సహజవనరులను వినియోగించడం సమర్థనీయం కాదనే భావ నకు ఈతీర్పు బలమైన పునాది వేసింది.
అయితే కోర్టు తీర్పుతోనే బొర్రా ప్రజల భూమి సమస్యకు వెంటనే పరిష్కారం లభించలేదు.పాత భూవివాదాల కారణంగా పదిగ్రామాల భూమిసెటిల్మెంట్ ప్రక్రియ సంవత్సరాల పాటు నిలిచి పోయింది.చివరకు భూమి హక్కుల సమస్య పరిష్కారమై ప్రజలకు పట్టాలు అందడం..దశాబ్దాల పోరాటంలో ఒకముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
నేడు మైనింగ్‌తో పాటు రహదారులు,విద్యుత్ ప్రాజెక్టులు,పరిశ్రమలు,పర్యాటకం,భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు గిరిజనప్రాంతాలపై ప్రభావం చూపుతున్నాయి.అభివృద్ధి స్థానికులకు ఉపాధి ఆదాయం కల్పించాలి.కానీ అదే సమయంలో భూమి, అడవి, నీరు, సంస్కృతి, గ్రామసభ నిర్ణయాధికారం బలహీనపడితే..ఆఅభివృద్ధి ఎవరి కోసం?అనే ప్రశ్న తప్పదు.మైనింగ్ లేదా ఇతర అభివృద్ధి ప్రాజెక్టులవల్ల ప్రభావితమయ్యే ప్రజలను కేవలం ‘బాధితులు’గా చూడకూడదు. వారు హక్కుదారులు.వారు నిర్ణయ భాగస్వాములు.వారు ప్రయోజన భాగస్వాములు.
భూమి,అడవి,నీరు,ఖనిజాలు కేవలం ఆర్థిక వనరులు కావు.అవే గిరిజన సమాజాల జీవ నాధారం,సంస్కృతి,ఆర్థిక భద్రతకుపునాది.అందుకే అభివృద్ధిప్రణాళికల్లో స్థానికప్రజల హక్కులు, వారి అనుమతి,వారి భాగస్వామ్యం,భవిష్యత్ తరాల ప్రయోజనాలు కేంద్రంగా ఉండాలి.బొర్రా కథ మనకు నేర్పేగొప్ప పాఠం ఇదే.ఒకనిజమైన ప్రశ్నను అడగడానికి ధైర్యం ఉంటే..అది ఒక సుదీర్ఘ పోరాటానికి నాందికావచ్చు.ఆపోరాటం పెద్ద సామాజిక మార్పుకు దారితీయ వచ్చు. అందుకే ప్రతిఅభివృద్ధి ప్రతిపాదనముందు..ప్రజల గొంతువినాలి.వారిహక్కులను గౌర వించాలి. వారి భాగస్వామ్యాన్ని నిర్ధారించాలి.ఎందుకంటే ఒకచిన్న ప్రశ్న కూడా..పెద్ద సామాజిక మార్పుకు నాంది కావచ్చు! – రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

అరకులోయలో సంజీవని ప్రాజెక్టు ప్రారంభం

“ గిరిజనుల ఆరోగ్యం కాపాడుటంతోపాటు వారిని అన్ని విధాల అభివృద్ధిలోకి తీసుకురావడం ప్రభుత్వ బాద్యత. ఆరోగ్యపరంగా,ఆర్దికంగా వారి ఉన్నతికి ప్రాధాన్యమిస్తాం.ఏజెన్సీ ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలకు సంజీవని కార్యక్రమం ద్వారా చెక్ పెడతామన్న నమ్మకం గిరిజన తెగల్లో వచ్చింది.సంజీవని రాష్ట్రానికి,దేశానికి ఒక గేమ్ ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అల్లూరి జిల్లా అరకులోయ నియోజకవర్గం గన్నెలలో సంజీవని నిర్వహించడంతోపాటు ఆరోగ్య రథాలను జెండాడ ఊపీ ప్రారంభించారు. డ్రోన్‌ల ద్వారా రక్త నమÖనాల రవాణా విధానాన్ని పరిశీలించారు. పథకం అమలులో భాగంగా ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం సంజీవని లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించారు.” మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వైద్యం కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా వైద్యం వారి దగ్గరకు రావాలన్న దే ప్రజా ప్రభుత్వం సంకల్పం అని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికీ నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని వ్యక్తిగత డిజిటల్ హెల్త్ రికార్డులను రూపోందించేలా చేపట్టిన సంజీవనితో ప్రతీ ఒక్కరి ఆరోగ్యాన్ని సంరక్షిస్తామని సీఎం వివరించారు.ఈప్రాజెక్టును త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణ యించినట్లు తెలిపారు. అరకు లోయ నియోజకవర్గం గన్నెలిలో సంజీవని ప్రాజెక్టు అమలు తీరును ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వద్ద ముఖ్యమంత్రి ప్రసంగించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి కుటుంబ జీవన ప్రమా ణాలు మెరుగుపడాలని, అదే నిజమైన అభివృద్ధి అని చంద్రబాబు అన్నారు. గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్య సదుపాయాల కోసం రూ.250 కోట్లతో ట్రైబల్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంప్లీషన్ మిషన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. సికిల్‌సెల్, తలసేమియా బాధితులకు నెలకు రూ.10వేల పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని మండలాల్లో తక్కువ ధరకే మందులు అందించే జన ఔషధి కేంద్రాలు ప్రారంభి స్తామని చెప్పారు. అల్లూరి జిల్లాలో సంజీ వని కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు.గతంలోనే అల్లూరి సీతారామరాజు గిరిజనులకు ఆయుర్వేద వైద్యాన్ని అందించారని గుర్తుచేశారు. అలాంటి మహనీయుడిని నిత్యం స్మరిం చుకునేందుకు కొత్తగా నిర్మించిన ఎయిర్ పోర్టుకు ఆయన పేరు పెట్టామని చెప్పారు. థింసా నృత్యంతో గిరిజన బిడ్డలు గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించడం అభినందనీయ మన్నారు.యోగా,ధ్యానం వంటి కార్యక్ర మాలను ప్రోత్సహిస్తూ ప్రజారోగ్యానికి ప్రాధా న్యత ఇస్తున్నామని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంచేందుకు సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
డ్రోన్లతో అత్యవసర ఔషధాలు,వ్యాక్సీన్లు తరలింపు
ఏజెన్సీ ప్రాంతాల నుంచి రోగుల రక్త నమూనాలను డ్రోన్ల ద్వారా పెద్ద ఆసుప త్రులకు తరలించి పరీక్షలు నిర్వహించి చికిత్స అందించేలా చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా గర్భిణులకు సేవలందిస్తున్నామని, 104 వాహనాల ద్వారా సంచార వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఇంటి వద్దే 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసర మైన మందులు అందించేలా చర్యలు తీసు కుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గం,చిత్తూరు జిల్లాలో సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తున్నామని, ఇది రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ గేమ్ చేంజర్‌గా మారుతుందని అన్నారు. అత్యవసర వైద్య సేవల కోసం అల్లూరి జిల్లాలో 150వాహనాలతో ఎమర్జెన్సీ లైఫ్‌లైన్ నెట్‌వర్క్ ఉందని చెప్పారు.గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఐదు సూత్రాలతో ప్రణాళికలు రూపొందించామని చంద్రబాబు తెలిపారు.‘అడవి తల్లి బాట’ పేరుతో రూ.1,000కోట్లతో 905 కిలోమీటర్ల రహదారులు నిర్మించామని చెప్పారు. 1.60 లక్షల ఇళ్లకు కుళాయి ద్వారా నీరు అందించడంతో పాటు సోలార్ రూఫ్‌టాప్ లను ఏర్పాటు చేస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి పెంచేందుకు అరకు కాఫీని మరో లక్ష ఎకరాల్లో సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అరకు ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య పెరిగిందని, హోమ్‌స్టేల ద్వారా ఆతిథ్యం అందిస్తే గిరిజన కుటుంబాలకు ఆదాయం వస్తుందని చెప్పారు. పరిశ్రమల్లో గిరిజన యువతకు ఉద్యోగాలు దక్కేలా నైపుణ్యాభివృద్ధి కల్పిస్తామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో లక్ష మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు.- (జి.ఎ.సునీల్ కుమార్)

1 2