చిన్న ప్రశ్న.. పెద్ద సామాజిక మార్పుకు నాంది!
విశాఖ ఉమ్మడి జిల్లా అనంతగిరి మండలంలోని బొర్రాగుహల భద్రతపై మొదలైన చిన్న సందేహం..క్రమంగా గిరిజనుల భూమి హక్కులు,మైనింగ్ లీజులు,రాజ్యాంగ రక్షణలు, పర్యావరణన్యాయం,అభివృద్ధిలో ప్రజలభాగస్వామ్యంవంటి విస్తృతమైన ప్రశ్నలుగా మారింది. చివరకు అది ఒక సుదీర్ఘ న్యాయపోరాటానికి నాంది పలిక1989లో బొర్రా ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలు,పేలుళ్లు జరుగుతున్నట్లు గమనించిన నేను అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు.‘ప్రభుత్వమే లీజులు ఇచ్చింది’అన్న సమాధానం ఆయనకు ఎదురైంది.అక్కడితో ఆప్రశ్న ముగిసినా..సమస్య మాత్రం సమిసిపోలేదు.1992లో గిరిజన యువతకోసం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో గమ్మెల దేవకుమార్ వేసిన ప్రశ్న ఈసమస్యకు అసలు రూపాన్ని చూపించింది. తరతరాలుగా భూమినిసాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కుపత్రాలు లేవు.అదే భూమిపై మైనింగ్ కంపెనీలకు మాత్రం ప్రభుత్వ లీజులు ఉన్నాయి. తమ భూమిపై తమకే హక్కులు లేకపోతే..ఆభూమిపై మైనింగ్ హక్కులు ఇతరులకు ఎలా వచ్చాయి?అన్న ప్రశ్న న్యాయపోరాటానికి దారితీసింది.
ఈ నేపథ్యంలో సమత న్యాయపోరాటాన్ని ప్రారంభించింది.1997లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక సమత తీర్పు షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజన భూములు,సహజ వనరులు,మైనింగ్ హక్కులపై కీలకమైన రాజ్యాంగసూత్రాలను బలపరిచింది.షెడ్యూల్డ్ ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో ప్రజల హక్కులను పక్కనపెట్టి సహజవనరులను వినియోగించడం సమర్థనీయం కాదనే భావ నకు ఈతీర్పు బలమైన పునాది వేసింది.
అయితే కోర్టు తీర్పుతోనే బొర్రా ప్రజల భూమి సమస్యకు వెంటనే పరిష్కారం లభించలేదు.పాత భూవివాదాల కారణంగా పదిగ్రామాల భూమిసెటిల్మెంట్ ప్రక్రియ సంవత్సరాల పాటు నిలిచి పోయింది.చివరకు భూమి హక్కుల సమస్య పరిష్కారమై ప్రజలకు పట్టాలు అందడం..దశాబ్దాల పోరాటంలో ఒకముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
నేడు మైనింగ్‌తో పాటు రహదారులు,విద్యుత్ ప్రాజెక్టులు,పరిశ్రమలు,పర్యాటకం,భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు గిరిజనప్రాంతాలపై ప్రభావం చూపుతున్నాయి.అభివృద్ధి స్థానికులకు ఉపాధి ఆదాయం కల్పించాలి.కానీ అదే సమయంలో భూమి, అడవి, నీరు, సంస్కృతి, గ్రామసభ నిర్ణయాధికారం బలహీనపడితే..ఆఅభివృద్ధి ఎవరి కోసం?అనే ప్రశ్న తప్పదు.మైనింగ్ లేదా ఇతర అభివృద్ధి ప్రాజెక్టులవల్ల ప్రభావితమయ్యే ప్రజలను కేవలం ‘బాధితులు’గా చూడకూడదు. వారు హక్కుదారులు.వారు నిర్ణయ భాగస్వాములు.వారు ప్రయోజన భాగస్వాములు.
భూమి,అడవి,నీరు,ఖనిజాలు కేవలం ఆర్థిక వనరులు కావు.అవే గిరిజన సమాజాల జీవ నాధారం,సంస్కృతి,ఆర్థిక భద్రతకుపునాది.అందుకే అభివృద్ధిప్రణాళికల్లో స్థానికప్రజల హక్కులు, వారి అనుమతి,వారి భాగస్వామ్యం,భవిష్యత్ తరాల ప్రయోజనాలు కేంద్రంగా ఉండాలి.బొర్రా కథ మనకు నేర్పేగొప్ప పాఠం ఇదే.ఒకనిజమైన ప్రశ్నను అడగడానికి ధైర్యం ఉంటే..అది ఒక సుదీర్ఘ పోరాటానికి నాందికావచ్చు.ఆపోరాటం పెద్ద సామాజిక మార్పుకు దారితీయ వచ్చు. అందుకే ప్రతిఅభివృద్ధి ప్రతిపాదనముందు..ప్రజల గొంతువినాలి.వారిహక్కులను గౌర వించాలి. వారి భాగస్వామ్యాన్ని నిర్ధారించాలి.ఎందుకంటే ఒకచిన్న ప్రశ్న కూడా..పెద్ద సామాజిక మార్పుకు నాంది కావచ్చు! – రెబ్బాప్రగడ రవి,ఎడిటర్
