చరిత్ర పుటల్లో వందేళ్ల ఆంధ్ర విశ్వవిద్యాలయం

ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్ర విశ్వకళాపరిషత్ భారత దేశంలో ఉన్న గొప్ప విశ్వవిద్యాల యాల్లో ఒకటి.ఏప్రిల్ 26తో 99ఏళ్లు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన అతి కొద్ది వర్సిటీల జాబితాలో చేరింది. పేద,మధ్య తరగతి విద్యార్థు లెందరికో మెరుగైన విద్య అందించింది. ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు సంపా దించు కుంది. దేశ, విదేశాల్లో ఎన్నో కీలక విభాగాల్లో ఏయÖ పూర్వ విద్యార్థులు విధులు నిర్వర్తిస్తు న్నారు. ఈనెల 11(శనివారం) నుంచి ఏయÖ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.- జి ఎన్ వి సతీష్ 
చరిత్ర నేపథ్యం..
జమీందార్లు,స్థానికుల సహకారంతో 1913మే 26న బాపట్ల టౌన్ హాలులో నిర్వహించిన ఆంధ్ర మహాసభకు విశాఖకు చెందిన భయ్యా నరసింహశర్మ అధ్యక్షత వహించారు. ఆ సభలోనే కొందరు తెలుగు ప్రజలకు విశ్వవిద్యాలయం ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా అప్పటి మద్రాస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న అన్నెపు పరశురాం పాత్రో వర్సిటీ ఏర్పాటుకు కృషి చేశారు. 1926 ఏప్రిల్ 26న తొలుత విజయవాడలో వర్సిటీని ఏర్పాటు చేశారు. వర్సిటీకి స్థలం, నిధులు సమకూర్చుతామని విశాఖకు చెందిన పలువురు హామీ ఇవ్వడంతో 1930 సెప్టెంబరులో ఇక్కడికి తరలించారు. అప్పటికే ఉపకులపతిగా ఉన్న సర్ సీఆర్ రెడ్డి(సర్ కట్టమంచి రామలింగారెడ్డి) ఈ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించారు. విజయనగరం, కురుపాం, జయపురం జమీందార్లతోపాటు నగరానికి చెందిన కొందరి సహకారంతో ఏయÖ ఏర్పడింది. శతాబ్ది ఆంధ్ర విశ్వవిద్యాలయం విస్తృత పరిశోధనలతో భారత చరిత్రను ఆవిష్కరిం చింది. ప్రపంచ చరిత్రకే దిశానిర్దేశం చేసింది. ఇక్కడ చరిత్ర, పురావస్తు విభాగాలు సుదీర్ఘ పరిశోధనా లక్ష్యాలతో ప్రముఖ కేంద్రాలుగా నిలిచాయి. చరిత్ర విభాగం 1931లో మొదలై స్వతంత్రంగా ఎదిగి, ఉన్నతస్థాయి బోధన, పరిశోధన, క్షేత్ర అధ్యయనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఆచార్య మామిడి పూడి వెంకటరంగయ్య (1889-1982) తెలుగు, ఆంగ్ల భాషల్లో చేసిన రచనలు భారత స్వాతంత్య్రోద్యమం, ప్రజాస్వామ్యం, పాలన, సమాజ మార్పులు వంటి అంశా లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆంధ్రా ప్రాంతంలో స్వాతంత్య్రోద్యమ చరిత్రను విశదీకరించిన ప్రామాణిక గ్రంథం ‘ఫ్రీడ మ్ స్ట్రగుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ’. తెలుగులో ‘ఆంధ్రాలో స్వాతంత్య్ర సమరము’, ‘ఆంధ్ర దేశంలో స్వాతంత్య్ర పోరాట చరిత్ర’ గ్రంథాలను రాయడమే గాక,సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశం ప్రధాన సంపాద కునిగా ఆచార్య వెంకటరంగయ్య వ్యవహరించారు. రాజకీయ,చారిత్రక అంశాలను కూడా సామాన్య పాఠకుడికి అర్థమయ్యే శైలిలో ఆయన రాశారు. ఆధు నిక తెలుగు వ్యావహారిక భాషను పరిపుష్టం చేయడంలో కీలక పాత్ర పోషించారు. నాడు ఆయన ఈ విభాగ అభివృద్ధికి పునాదిరాయి వేశారు. భారత ప్రభుత్వం ఈయన్ని పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.ఆచార్య హిరేన్ ముఖర్జీ, మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటి ప్రఖ్యాత చరిత్రకారులు తమ బోధన,పరిశోధనలతో విభాగంలో విమర్శనాత్మక చారిత్రక ఆలోచనలను ప్రోత్సహించారు. స్వాతం త్య్రానికి పూర్వం నుంచి గణతంత్ర భారత తొలి దశాబ్ది వరకు విభాగాధిపతిగా పనిచేసిన ప్రొఫెసర్ గొర్తి వెంకటరావు, మధ్యయుగ భారత చరిత్రలో తన ప్రావీ ణ్యంతో విభాగాన్ని ఉన్నతస్థితికి తీసు కొచ్చారు. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన వెంకటరావు బోధనతో పాటు పరిశోధనలో నాణ్యతను పెంపొం దించారు. పి.టి.శ్రీనివాస అయ్యంగార్ చేసిన ఆంగ్ల మÖల రచనకు గొర్తి వెంక టరావు సంపాదకత్వం వహించారు. మల్లంపల్లి సోమశేఖరశర్మ ఆంధ్ర విశ్వ విద్యాలయంతో అనుబంధం కలిగిన గొప్ప చరిత్రకారుడు. ఆంధ్ర చరిత్ర పరిశోధనకు పునాది వేసిన శాసన విజ్ఞాని. ముసునూరి నాయకులు, రెడ్డి రాజ్యాల చరిత్రపై ఆధార భూతమైన, ప్రామాణిక గ్రంథాలను రచిం చిన మహావిద్వాంసుడు. 1970లో ఈయన ‘విజయనగర ఎంపైర’ గ్రంథాన్ని రాశారు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ సర్వేపల్లి గోపాల్ అధ్యాపకునిగా ఇక్కడ సేవలందించారు. చిన్నప్పటి నుంచి స్వాతంత్రోద్యమకారులు, జాతీయ నాయ కుల మధ్య పెరిగిన వ్యక్తి.1975-1984 మధ్య కాలంలో జవహర్‌లాల్ నెహ్రూ జీవిత చరిత్ర (మÖడు సంపుటాలు) ప్రచురించారు. 1992 లో తనతండ్రి రాధా కృష్ణన్ జీవిత చరిత్రను స్వాతంత్య్రోద్య మంతో అనుసంధానం చేస్తూ ప్రచురించారు. 1965లో ‘భారతదేశంలో బ్రిటిష్ విధానం 1858-1905’ సామ్రాజ్య వాద పాలనపై విశ్లేషణ చేశారు. 1953లో లార్డ్ రిప్పన్ వైస్రాయ్ పాలన 1880-84 మధ్య¿ ±లంలో వలస పాలనా విధానాలపై పరిశో ధనా గ్రంథాన్ని ప్రచురించారు. 1957 లో ‘లార్డ్ ఇర్విన్ (1926-31) వైస్రాయ్ పాలన’,బాబ్రీ మసీదు-రామజన్మభూమి సమస్య (1991-92) ఘటనల మీద ప్రచురించిన సంకలనాలకు సంపాదకత్వం వహించారు. ‘బెంగాల్‌లో శాశ్వత భూస్థిరీకరణ విధానం-దాని ఫలితాలు (1949)’ అనే గ్రంథంలో భూ విధానంపై ప్రాథమిక పరిశో ధనాత్మక సంకలనాన్ని ప్రచురించారు. ‘ఆధునిక భారతదేశం (1967)’,‘భారత చరిత్రపై సంక్షిప్త అవలోకనం’ వంటి గ్రంథా లను రచించారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర విభాగంలో మరో ముఖ్యమైన మలుపు ప్రొఫెసర్ ఓరుగంటి రామచంద్రయ్య పాత్ర. ఈయనే మొదటిగా ఆంధ్రవిశ్వవిద్యాలయం చరిత్ర విభాగం నుంచి పీహెచ్‌డీ పొం దారు. అంతేగాక, కామన్‌వెల్త్ మాడిఫైడ్ ఓవర్సీస్ స్కాలర్‌షిష్ పొందిన వ్యక్తి. దీంతో ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఆర్కియాలజీ లో రెండేళ్ళు పురావస్తుశాస్త్రంలో ఉన్నత శిక్షణ పొందారు. ఆయన తిరిగి ఇక్కడకు వచ్చిన తరువాత విభాగంలో పురావస్తుశాస్త్ర బోధన మొదలయింది. ఈయన మార్గదర్శ కత్వంలో డాక్టర్ ఎ.వి.నరసింహ మÖర్తి పీహెచ్‌డీ పొందారు. ప్రముఖ భారతీయ పురావస్తు శాస్త్రవేత్త,శాసన విజ్ఞాన నిపుణు డు,నాణేల శాస్త్రవేత్తగా ఆయన ఎదిగారు. ప్రొఫెసర్ కె.ఎ.నీలకంఠశాస్త్రి శిష్యుడైన ఈయన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండి యాలో విశేష సేవలందించి ఆంధ్ర విశ్వ విద్యాలయ ఘనచరిత్ర చాటారు.ప్రొఫెసర్ రాయప్రోలు సుబ్రహ్మణ్యం ఈచరిత్ర విభా గంలో అకడమిక్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లారు. 1953లో భారత చరిత్ర కాంగ్రెస్ 16వ వార్షిక సమావేశాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం నిర్వహిం చింది. దీనికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షత వహించారు. తర్వాత తరంలో ఆచార్యసి.సోమసుందరం, ఆచార్య కె.కమ లవాసిని, ఆచార్య వై.శ్రీరామమÖర్తి వంటి పరిశోధకులు ఈ విభాగాన్ని మరింత సమర్థ వంతంగా తీర్చిదిద్దారు. సి.సోమసుం దరం ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, ఆంధ్ర ప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్,సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌ల విభాగాల అధ్యక్షుడిగా వ్యవహరిం చారు. కె.కమలవాసిని ఆంధ్రప్రదేశ్ ప్రాంతం లోని కళ, ఐకనోగ్రఫీ, దేవాలయ చరిత్రపై పరిశోధనలు చేసిన ప్రముఖ పండితురాలు. వై.శ్రీరామమÖర్తి 18వ శతాబ్దం మచిలీ పట్నం చరిత్ర (2000),తెన్నేటి విశ్వ నాథం-ఒక చారిత్రక అధ్యయనం (2003) గ్రంథాలు రాశారు. ఆచార్య మైనేని కృష్ణకుమారి మంచి పరిశోధన రచనలు చేశారు.మధ్యయుగ ఆంధ్రంలో అరుదైన కారైక్కాల్ అమ్మయ్యార్ శిల్పం,అలాగే ఎనిమిది సంఖ్యకు ఉన్న సామాజిక,మత ప్రాముఖ్యం వంటి కొత్త అంశాలను ఆమె వెల్లడించారు.ఒక చిత్రం వెయ్యి మాటలకు సమానం అనే భావనతో ప్రతిపాదించిన సిద్ధాంతాలు, వాదనల ఆధా రంగా అనేక రేఖాచిత్రాల్ని ఆమె విశ్లేషించారు. “సెర్మన్ ఫ్రమ్ స్టోన్స్-కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆంధ్ర-ఆర్ట్,కల్చర్ అండ్ థాట”,‘మృణాల్ పెయింటింగ్స్ ఆఫ్ ఆంధ్ర’,‘ఐకనోగ్రఫీ అండ్ ఆర్ట్ ఆఫ్ ఆంధ్ర-లెసర్ నోన్ ఫ్యాక్ట్స’, ‘మల్టి ఫుల్ హెడెడ్ అండ్ హైబ్రీడ్ గాడ్స్-ఇన్ ది టెంపుల్స్ ఆఫ్ సౌత్ ఇండియా’ పరిశోధన వ్యాస సంకలనాలను ఆచార్య కృష్ణ కుమారి ప్రచురించారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం ప్రాంతీయ చరిత్రను దేశచరిత్రలో శాస్త్రీయంగా పదిలపరిచింది. చరిత్ర, పురా వస్తు విభాగం భారతీయ విశ్వ విద్యాలయాల చరిత్రలో నిరంతర పరిశోధ నలను కొన సాగిస్తూ భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలిచింది.శాతవాహనులు, ఇక్ష్వాకులు, చాళుక్యుల అధ్యయనాలతో పాటు, ఆధునిక రాజకీ య,సామాజిక ఉద్యమాల మీద విశేష పరిశో ధనల్ని అందిం చింది. ఈ విభాగం నుంచి ఎంతో మంది విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదిగి ప్రపంచ విద్యారంగంలో తమదైన ముద్రవేశారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర, పురావస్తు శాఖలు సాధించిన పరిశోధన ప్రగతిని శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గుర్తు చేసు కోవడం ఎంతైనా అవసరం.డాక్టర్ సిహెచ్.మధుసూదనరావు,ప్రిన్సిపాల్,ప్రభుత్వ డిగ్రీ కళాశాల,పొందూరు పూర్వ విద్యార్థులే సర్ కట్టమంచి రామలింగారెడ్డి,సర్వేపల్లి రాధా కృష్ణన్, డాక్టర్ వీఎస్ కృష్ణ తదితరులు వర్సి టీకి ఉపకులపతులుగా పని చేశారు.సర్ సీవీ రామన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇక్కడ పాఠాలు బోధించారు.సర్ సీవీ రామన్, మోక్ష గుండం విశ్వేశ్వరయ్య పని చేస్తున్న కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఏయÖను సందర్శిం చారు.పూర్వ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు,లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాల యోగి,కేంద్ర మాజీ మంత్రి కింజరాపు యర్ర న్నాయుడు,సుప్రీంకోర్టు మాజీ న్యాయమÖర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్,జస్టిస్ రామస్వామి తదితరులు ఏయÖ పూర్వ విద్యార్థులే.పూర్వ విద్యార్థుల్లో ఐదుగురు శాంతి స్వరూప్ భట్నా గర్ అవార్డులు,ఇద్దరు పద్మ విభూషణ్, ఒకరు పద్మభూషణ్, ఐదుగురు పద్మశ్రీ అవార్డులు కైవసం చేసుకున్నారు. దేశంలోనే తొలిసారిగా ఏయÖలో మెరైన్ ఇంజినీరింగ్,వాతావరణ, సముద్ర అధ్యయన శాస్త్రం,న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగాలు ప్రారంభించారు. వివిధ విభాగాల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన ప్రయోగ శాలలు అందుబాటులో ఉన్నాయి.ఏటా వర్సిటీ లో చేరడానికి లక్షల మంది విద్యార్థులు దర ఖాస్తు చేసుకుంటారు. అయితే వర్సిటీలోని వివిధ కళాశాలల్లో దాదాపు 10000 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు.
శతాబ్ది ఉత్సవాల విశేషాలు..
ఆంధ్ర విశ్వవిద్యాలయం‘శతాబ్ది మహోత్సవం’ లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఈనెల 20 నుంచి ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. ఏయÖ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో జరిగిన ఈ వేడుకల్లో విశ్వ విద్యాలయం మరియు అనుబంధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. వైస్-చాన్సలర్ జి.పి.రాజశేఖర్ ఈ సందర్భాన్ని గర్వకారణంగా అభివర్ణిస్తూ, శతాబ్దపు మైలురా యిని చేరుకున్న ఈ విశ్వవిద్యాలయం సమా జానికి సేవ చేయాలనే కొత్త నిబద్ధతతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.