ప్రపంచ జీవకోటికి సముద్రమే ఆధారం

మన నివసించే ఈ భూ గ్రహంపై భూమి కేవలం 29 శాతం మాత్రమే ఉండగా.. మిగిలినదంతా సముద్ర నీరే. ఈ గ్రహంలోని జీవులన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా సముద్రాల పైనే ఆధారపడి జీవిస్తున్నాయి. కానీ అటువంటి సముద్రాలన్నీ చెత్తాచెదారంతో నిండిపోతు న్నాయి. విచ్చలవిడిగా వ్యర్థాలను తీసుకొచ్చి కడలి నీటిలో పడేస్తున్నారు మనుషులు. దీంతో కాలుష్య కోరల్లో చిక్కుకొని సముద్రజీవులు కూడా అంతరించిపోతున్నాయి. సాగరం బాగుంటేనే సకల జీవరాశులు బాగుంటాయనే విషయాన్ని విస్మరిస్తున్నారు చాలా వరకు. సముద్రాలను కలుషితం చేస్తూ సర్వనాశనం చేస్తున్నారు. సముద్రాలకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించే ప్రతి సంవత్సరం జూన్‌ 8న ప్రపంచ సముద్ర దినోత్సవం నిర్వహిస్తున్నారు. సముద్రా న్ని చెత్తమయం చేస్తున్నారు. చాలా దేశాలు వ్యర్థాలను నౌకల్లో తరలించి సముద్రాల్లో పడేస్తున్నాయి. ఇలా రోజూ వేల టన్నుల చెత్త సముద్రాల్లో కలుస్తోంది. అందులో ఎక్కువ భాగం ప్లాస్టికే ఉంటుంది. భూమిలో కరగని ఈ కాలుష్య కారకం సముద్రాల్లోని చేపలు ఇతర జీవుల్ని చంపేస్తోంది. ఆ కాలు ష్యపు నీటిలో అరుదైన జీవజాతులు కూడా అంతరించిపోతున్నాయి. సముద్ర మొక్కలు నశించిపోతున్నాయి. సముద్రాలను కాపాడుకు నేందుకు తీసుకునే చర్యలు మాత్రం శూన్యంగా ఉంటున్నాయి. సముద్రాల ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతున్నారు మానవులు. కడలిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ ప్రేమి కులు అంటున్నారు. ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తోంది. 45 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. బ్రెజిల్‌లోని రియో డిజనీరో నగరంలో 1992లో జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సులో సముద్రాలపై అవగాహన పెంచా లని నిర్ణయించారు. చివరకు ఐక్యరాజ్యసమితి 2008లో తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది. సముద్రాలు బాగుండాలి..జీవులూ బాగుండాలి అనేది ఈ ఏడాది అంతర్జాతీయ సముద్ర దినోత్సం థీమ్‌గా ఎంపిక చేశారు.సాగరం బాగుంటేనే సకల జీవరాసులు బాగుంటాయి అనే విషయాన్ని విస్మరిస్తున్నారు చాలావరకు. సముద్రాలను కలుషితం చేస్తూ సర్వనాశనం చేస్తున్నారు అని, సముద్రానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి సంవత్సరం జూన్‌ 8 న సముద్ర దినోత్సవం నిర్వహిస్తున్నారు. సముద్రాన్ని చెత్త మయం చేసేస్తున్నారని, చాలా దేశాల్లో వ్యర్థాలను నౌకలో తరలించి సముద్రంలో పడేస్తున్నారని, ఇలా రోజూ వేల టన్నుల్లో చెత్త సముద్రంలో కలుస్తుందనీ,అందులో ఎక్కువ భాగం ప్లాస్టిక్‌ ఉంటుందని, ఈ కాలుష్య కారకం వల్ల సముద్రా ల అరుదైన జీవజాతులు అంతరించి పోతున్నాప్రజలకు సముద్రాల యొక్క ఆవశ్యకత ఉంది. సముద్రాల ద్వారా ఎన్నో రకాల ప్రయో జనాలు పొందుతున్నారు మానవులు. కడలిని కాపాడు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యా వరణ ప్రేమికులు అంటున్నారు. బీచ్‌ల వంటి నీటి వనరుల చుట్టూ.. మన అజాగ్రత్త వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. దీంతో సము ద్రంలోని అనేక వేల జీవరాశులు మరణిస్తు న్నాయి. కొన్ని కలుషితమైపోతు న్నాయి. వీట న్నింటి వల్ల ప్రకృతి విపత్తులు జరిగే అవకాశం కూడా ఉంది.అందుకే ఈ విషయాలన్నీ ప్రజల కు వివరించి..సముద్రాల సుస్థిర అభివృద్ధికి కృషి చేసేలా..వారికి అవగాహన కల్పిస్తారు.
ప్రాముఖ్యత
సముద్రం కనీసం 50% ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుందని ఐక్యరాజ్యసమితి డేటా సూచిస్తుంది. మహాసముద్రాలు 30% కంటే ఎక్కువ కార్బన్‌ డయాక్సైడ్‌ను గ్రహిస్తాయని.. ఇవి గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావాలను తగ్గిస్తాయని రుజువు చేసింది. చెత్త, మురుగు, చమురు లీకేజీల వంటి మానవ కార్యకలాపాల చర్యల వల్ల.. విధ్వంసం జరిగే అవకాశముంది. ఈ విష యాలపట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకో వాలి.
సముద్రాలూ కలుషితం
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందికి అటు జీవనోపాధిని ఇటు పౌష్టికాహారాన్ని సముద్రాలు అందిస్తున్నాయి. ప్రపంచ పటంలో మూడు వంతులకు పైగా సముద్రాలు విస్తరించి ఉన్నా యి. ప్రకృతి సంపదలో సముద్ర జలాలది కీలక స్థానం అయినప్పటికీ రానురానూ అవి కాలు ష్యం బారిన పడుతున్నాయి. మనం యథేచ్ఛగా సముద్ర జలాలను కలుషితం చేస్తూ, సముద్ర జీవుల మనుగడకే ముప్పు ఏర్పడే విధంగా వ్యవహరిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్‌ వినియోగం నానాటికీ పెరిగిపోతున్నది. ప్లాస్టిక్‌ సంచులు, ఇతర వస్తువులు పర్యావరణానికి హాని చేస్తాయని అందరికీ తెలిసినా, వాటి వినియోగాన్ని నియంత్రించడానికి ఎటువంటి చర్యలు తీసుకొనకపోవడం గమనార్హం. ప్లాస్టిక్‌ వినియోగం విషయంలో యావత్‌ మానవాళి ‘తాను కూ ర్చున్న చెట్టుకొమ్మను తానే నరుక్కొన్నట్లు’గా వ్యవహరిస్తున్నది. మానవ శరీర నిర్మాణంలో ప్రొటీన్లది చాలా కీలక పాత్ర. అటువంటి ప్రొటీన్లను సమృద్ధిగా అందజేసే సత్తా ఒక్క సముద్ర జీవులకే ఉంది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం సముద్రాలలో 5 ట్రిలి యన్‌ల మైక్రోప్లాస్టిక్స్‌ ఉన్నాయి. వీటిని సముద్ర జీవులు (చేపలు వంటివి) మింగడం, వాటిని మనం ఆహారంగా తీసుకోవడంతో పలువురు కాన్సర్ల బారిన పడుతున్నారు. 2025వ సంవత్సరం నాటికి సముద్రాలలో ప్లాస్టిక్‌, చేపల నిష్పత్తి 1:3గా ఉంటుందని అంచనా. పలు దేశాలు వ్యర్థ జలాల ను సముద్రంలోకి వి చక్షణా రహితంగా వ దులుతున్నాయి. విశ్వవ్యాప్తంగా సముద్రం లో కలుస్తున్న డ్రైనేజ్‌ వాటర్‌లో 70 శాతం శుద్ధి చేయనందు న సముద్ర జలాలు కలుషితం అవుతున్నాయి. సముద్ర వాతవారణంలో పెను మార్పులు కలుగుతున్నాయి. దీనివల్ల సాలీనా 13 బిలి యన్‌ డాలర్ల నష్టం జరుగుతుందని యుఎన్‌ఇపి అంచనా వేసింది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సముద్ర జలాల్లో పారవేస్తున్న దేశాల్లో భారత్‌, చైనాలు ముందువరసలో ఉండటం గమనార్హం. మన దేశంలో సాలీనా ప్లాస్టిక్‌ వినియోగం 15 మిలియన్‌ టన్నులు. ఇది 2050 నాటికి 20 మిలియన్‌ టన్నులు అవుతుందని అంచనా. 2050 నాటికి సముద్ర జలాల్లోని ప్లాస్టిక్‌ వస్తువులను తొలగించకపోతే, సముద్రాలలో ఉండే చేపల బరుకన్నా ప్లాస్టిక్‌ వ్యర్థాల బరువే ఎక్కువగా ఉంటుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘రీ సైక్లింగ్‌’కు పనికిరాని ప్లాస్టిక్‌ బ్యాగ్‌ల తయారీని చాలా దేశాల్లో నిషేధించారు. అయితే దాని అమలు శూన్యం. ప్లాస్టిక్‌ వ్యర్థాలను కొన్ని దేశాలు రోడ్ల నిర్మాణంలోను, విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగి స్తున్నాయి. మన దేశంలో పశ్చిమ బెంగాల్‌లో రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను వినియో గిస్తున్నారు. వీటిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. మనకన్నా అభివృద్ధిలో, ఆర్థికంగా వెనుకబడిన దేశాలైన రువాండా, బంగ్లాదేశ్‌, కీన్యాలు ప్లాస్టిక్‌ బ్యాగుల తయారీ, వినియోగాన్ని పూర్తిగా నిషేధించాయి. ఇకనైనా సముద్ర జలాలలోకి ప్లాస్టిక్‌ వ్యర్థాలను వదలడం ఆపకపోతే, చేపలకన్నా ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది.- జిఎన్‌వి సతీష్‌

దళితులకు రక్షణ లేదా..ఎన్నాళ్లీ ఇలా?

దేశాన్ని కుల,మత జాఢ్యాలు ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. పెత్తందారీ కుల కాలనాగులు అవకాశమొచ్చినప్పుడల్లా అణగారిన ప్రజానీకాన్ని కాటేసి ప్రాణాలు తోడేస్తూనేవున్నాయి. కులం వద్దు..మతం వద్దు.. భారతీయులంతా స్వేచ్ఛా స్వతం త్రాలు అనుభవిద్దామంటూ చేసుకున్న ప్రతినలన్నీ వెక్కిరింతకు గురవుతూనే వున్నాయి. కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షంలో పెత్తందారీ గూండాల దాడిలో దళిత యువకుడు బలైపోవడం, మరో తొమ్మిది మంది దళితులు గాయపడటం సమాజంలో వేళ్లూనుకున్న పెత్తందారీ దురహంకారాన్ని మరోమారు బయటపెట్టింది. కొన్ని నెలల కిందటే అధికార పార్టీకి చెందిన ఒక ప్రజా ప్రతినిధి తన వద్దే డ్రైవర్‌గా పనిచేస్తున్న దళిత యువకుడిని హత్య చేసి..మృతదేహాన్ని సదరు ప్రజా ప్రతినిధే నేరుగా బాధితుడి ఇంటికి డోర్‌ డెలివరీ చేసిన దారుణ ఉదంతం నుంచి జిల్లా తేరుకోక మునుపై మరో ఘోరం చోటు చేసుకుంది. శృంగవృక్షమనేది కాకినాడ జిల్లాలో చిన్న గ్రామం. ప్రతి యేటా ఇక్కడ జరిగే నూకాలమ్మ జాతరలో అన్ని సామాజిక తరగతు లవారు పాల్గొనడం ఆనవాయితీ. అందరూ ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకో వడం..మొక్కులు తీర్చుకోవడం గత కొన్ని తరాలుగా అనుసరిస్తూ వస్తున్న ఆనవాయితీ. జనం రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు పరస్పరం కాళ్లూచేతులు రాసుకోవడం, ఒక్కో సందర్భంలో కిందామీదా పడటం సర్వసాధారణం. శృంగ వృక్షం జాతరలోనూ అదే జరి గింది. జనం రద్దీలో పెత్తందారీ కాలు..దళిత యువకుడి కాలు పరస్పరం రాసుకున్నాయి. ‘మన కులపోడి కాలు నెత్తిన తగిలినా బాధలేదయ్యా..దళితుడి కాలు సోకితే ఊరుకుంటామా?’ అంటూ కుగ్రా మమైన శృంగవృక్షంపై మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. జాతరలో కాలు రాసుకున్న నేరా నికి శృంగవృక్షం దళితపేటపై పెత్తందార్లు రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా మూకు మ్మడి దాడికి పాల్పడ్డారు. దొరికినవారిని దొరికినట్టు చితకబాదారు. ఈ దాడిలో తొం డంగి గ్రామానికి చెందిన నడిరపల్లి రాము అనే దళిత యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో తొమ్మిది మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంత దారుణంగా దాడికి పాల్పడినా.. పెత్తందార్ల జోలికి వెళ్లకుండా పోలీసులు మీనమేషాలు లెక్కిస్తూ ఉండిపో యారే తప్ప ఎలాంటి తక్షణ చర్యలకు ఉపక్ర మించకపోవడం పలు అనుమానాలకు తావి స్తోంది. తెల్లారితే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాల్సినవాళ్లం..కేసులుగీసులు ఎందుకయ్యా..సర్దుకుపోతే అందరికీ మంచి దంటూ దళితులకు మైండ్‌వాష్‌ చేసే పనిని ఖాకీలు భుజానికి ఎత్తుకోవడం దిగ్భ్రాంతి కరం.కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) వంటి ప్రజాసంఘాలు నిలదీ యకపోతే అస్సలు కేసు కూడా నమోదు చేసేవారు కాదేమో ! విజయవాడలో స్వరాజ్య మైదానంలో ఆకాశాన్నంటేలా 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని నిర్మిస్తున్నా మని, దళితులకు, అణగారిన ప్రజానీకానికి తాము పెద్ద పీట వేస్తున్నామని పాలకులు మాటలు చెబితే సరిపోదు. ‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటామా?’ అంటూ ప్రశ్నించే పెత్తందారీ ఆధిపత్య భావా జాలాన్ని పూర్తిగా విడనాడాలి. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితు లకు శిరోముండనాలు చేయించడం, అత్యా చారాలు, హత్యలు వంటివి తరచూ చోటుచేసు కోవడం దేనికి సంకేతం. దాడులు జరిగిన ప్పుడు ఒంటికాలిపై లేవడం.. అరకోపరకో పరిహారమిచ్చి చేతులు దులిపేసుకుంటే సరి పోతుందా? ఇలాంటి దాడులకు పాల్పడిన వారి పీచమణచాలి. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్దర వీడి దళితులు, ఆదివాసీలు, ఇతర అణగారిన ప్రజానీకం రక్షణకు గట్టి చర్యలు చేపట్టాలి. బాధిత దళితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
ప్రభుత్వంలో దళితులకు స్థానంలేదన్న వాస్త వం!
వైసీపీ ప్రభుత్వంలో దళితలకు స్థానం లేదు అన్నది అక్షర సత్యం. ఆ సత్యాన్ని బహు జనులు, దళిత సంఘాలు ఎప్పుడో గుర్తిం చాయి. ఉత్తరాంధ్రాను మొదలుకొని రాయలసీమ వరకు నిత్యం దళితలపై జరుగుతున్న దాడులు, బెదిరింపుల అనేవి లెక్కకుమించినవి. ఇంత వివక్ష ఎందుకో అర్థకాదుకానీ ..స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటివరకు కూడా ఇంతలా దేశ వ్యాప్తంగా ఇటువంటి దాడులు ఏపీలో తప్ప ఎక్కడ చోటు చేసుకోకపోవడం గమనార్హం. దళిత ఓటు బ్యాంకుతో గద్దెనెక్కిన జగన్‌ కు ఈ దాడుల లెక్క పట్టదా అని దళిత మేథావులు ప్రశ్నిస్తున్నా .. దున్నపోతుమీద వాన చందమే. ప్రశ్నించిన తెలుగుదేశం నేతలపై అధికార పార్టీకి చెందిన దళిత నాయకులతో అసభ్య పదజాలంతో విరుకుపడేలా పురికొల్పు తున్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటే చాలు వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుపడటం, ఒప్పుకొకుంటే దాడులు చేయడం జగన్‌ రెడ్డి ప్రభుత్వంలో పరిపాటిగా మారింది. ఇందుకు ఉదాహరణే ఏపిలో మిగిలి ఉన్న స్థానిక సంస్థలకు జరగుతున్న ఎన్నికలే. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో నామినేషన్‌ వేసేందుకు వచ్చిన వెంకటేశ్‌ అనే దళితుడిపై 30 వైసీపీ కార్యకర్తలు ముకుంబడి చేసిన దాడి, గుంటూరు జిల్లా గురజాల మున్సిపల్‌ ఎన్నికలలో మైనారిటీ మహిళా సుందగిరి నజీమూన్‌ నామినేషన్‌ చింపి, ఆమెపై దాడి, తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం కాచవరం పంచాయితీ ఒకటో వార్డుకు నామినేషన్‌ వేసిన గిరిజన మహిళ శిరీష కు బెదింపులు వంటివి వైసీపీ ప్రభుత్వం పాల్పడు తున్న దమనకాండకు నిర్శనాలు కావా అని విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంతిమంగా ప్రజాస్వామ్య పద్దతిలో పదవులకు పోటీ చేసే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు దళితులకు లేదు అన్నది జరుగుతున్న ఘనటలకు సజీవ సాక్ష్యాలు.దళితుల సంక్షేమం మరిచారు .. దాడులే లక్ష్యంగా పెట్టుకున్నారు! ఉత్తరాం ధ్రాల్లో దళితులు ..బెదిరింపులు,దాడులు, శిరోముండనాలను చూస్తే ..రాయలసీమలో రక్తాలు కారేలా హింసిస్తున్నారు. వివక్షలు, చిన్నచూపు వంటివి పరిస్థితులను తరుచూ అక్కడ దళితులు ఎదుర్కొంటున్నారు. దాడులు, శిరోముండనాలు, ఎన్నికల్లో పోటీచేస్తే చంపే స్తాం అన్న అనాగరిక చర్యలు గతంలో ఎన్నడూ చూడలేదు. వైఎస్సార్సీపీ అధికారం లోకి వచ్చిన నాటినుంచి దళితలపై సాగిస్తున్న నరమేథం, ఊచకోతలు అన్నీఇన్నీకావు. చంద్ర బాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో అధికారంలో వైకాపా చేస్తున్న పాపాలు అన్నీఇన్నీకావు.14వ వార్డు టీడీపీ ఎస్సీ అభ్యర్థి వెంకటేష్‌ పై దాడి, నామి నేషన్‌ పత్రాలు చించివేయడం వంటివి చూస్తే అక్కడి మున్సిపల్‌ ఎన్నికలు సాధరణ ఎన్నికలు తలపించేంతగా అధికార పార్టీ సృష్టించే సీన్‌ సర్వత్ర విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికే కుప్పంలో అధికారపార్టీ చేస్తున్న అకృత్యాలపై మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కు లేఖ రాశారు. వెంకటేశ్‌ ను 30 మందికి దాడికి దిగారని, ఆ దాడికి సంబం ధించి ఫోటోలను కూడా లేఖకు జతచేశారు. గడిచిన 30 నెలలో వైసీపీ ప్రభుత్వం చేతిలో చితికిన దళితుల గురించి వివరించాలంటే ఒక గ్రంథం రాయాలి. రెండు శిరోముండనాలతో దళితులపై దాడులు సెంచరీ దాటాయి. ఇదిలా ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు కిందా టీడీపీ హయంలో 2018 నుంచి 2020 వరకు రూ.24 వేల కోట్లును ఖర్చు చేస్తే ..వైఎస్సార్సీపీ ప్రభుత్వం 30 నెలల్లో కేవలం రూ.5వేల కోట్లు కూడా ఖర్చు చేయకా..ఆ నిధులను ఫిచన్లు, అమ్మఒడి, రైతు భరోసా పథకాలకు మరలించడం కడు విచారం. ఇదేక్కడి దౌర్భగ్యమోకానీ..టీడీపీ హయంలో దళితలకు భూమి కొనుగోలు పథకం కింద 5 వేల ఎకరాలు పంపిణీ చేస్తేఏపి ప్రభుత్వం జగనన్న ఇళ్ల పేరుతో 4 వేల ఎకరాల అసైన్ట్‌ భూములను లాక్కొంది.
స్వాతంత్య్రం వచ్చి 76 ఏండ్లు గడిచినా దళితులపై ఆగని దాష్టీకాలు.
దేశంలో దళితులకు వేధింపులు, ఛీత్కారాలు, వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. మధ్య ప్రదేశ్‌లో గ్రామపంచాయతీలో ఓదళి తుడు కుర్చీలో కూర్చున్నందుకు అగ్రకులస్థుడు అతడి తల పగలగొట్టడం.. ఉత్తరప్రదేశ్‌లోని ఔరియా జిల్లాలో తరగతి నోట్స్‌లో తప్పులు రాశాడని టీచర్‌ ఓ దళిత విద్యార్థిని చితకబాదడంతో మరణించడం.. ఇదే యూపీలోని లఖింపూర్‌ లో ఇద్దరు దళిత అక్కాచెలెళ్లను రేప్‌ చేసి హత్య చేయడం..రాజస్థాన్‌లో నీటి కుండను తాకాడని ఓదళిత విద్యార్థిని తీవ్రంగా కొట్టిన ఘటన.. ఇలా దళితులపై వివక్ష చూపేలా..వారిని వేధించేలా జరుగుతున్న ఘటనలు దేశంలో కొకొల్లలు. కేంద్రంలో, రాష్ట్రాల్లో బీజేపీ గద్దెనెక్కిన తర్వాత ఈ విష ధోరణి మరింత పెచ్చరిల్లుతున్నది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితుల పరిస్థితి దయనీయంగా మారింది.
11 శాతం పెరిగిన దాడులు
2019 నుంచి 2021 వరకు దేశంలో దళితులపై దాడులు 11శాతం పెరిగాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) ప్రకారం..2019లో 45,961,2021లో 50,900 కేసులు నమోదయ్యాయి. దళితులపై జరుగుతున్న దాడుల్లో జాతీయ సగటు కంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధికంగా ఉన్నది. మధ్యప్రదేశ్‌, హర్యానా, ఉత్తరాఖండ్‌, గోవా, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లో దళితులపై విచ్చలవిడిగా దాడులు జరుగు తున్నాయి. రాజస్థాన్‌, తమిళనాడు వంటి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో కూడా ఇది కని పిస్తున్నది. దళితులపై దాడుల ఘటనలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నా.. వాటిపై ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం తగిన విధంగా స్పందించి, చర్యలు తీసుకుంటున్న సందర్భాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
లోపం చట్టాలదా? వ్యక్తులదా?
ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్‌రస్‌లో 19ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం, హత్య ఆరోపణల వ్యవహారం మీడియాలో ప్రధానంగా కనిపించింది. ఈ ఘటన తర్వాత దళితులపై దాడులు, అణచివేతలపై మరోసారి ప్రశ్నలు మొదలయ్యాయి. స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలైన తరువాత కూడా దళితులు ఇంకా సమానత్వం కోసం పోరాడుతూనే ఉ న్నారు.దళితులపై హింసకు సంబంధించి అనేక సంఘటనలు ప్రతియేటా వినిపిస్తూనే ఉన్నాయి. 2015లో రాజస్థాన్‌ దంగవాస్‌ ఘటన, 2016లో రోహిత్‌ వేముల మరణం, తమిళనాడులో 17ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం, హత్య, 2017లో సహారాన్‌పూర్‌ హింస, 2018లో భీమా కోరేగావ్‌ ఘటన ఇలా ప్రతి సంవత్సరం సంచలనాత్మక కేసులు వస్తూనే ఉన్నాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, దళితులపై దాడులు,అత్యాచారాలు తగ్గక పోగా ఇంకా పెరిగాయి.2019 సంవత్సరం లో దళితులపై అత్యాచారాలు గతంకన్నా 7.3% ఎక్కువ కేసులు నమోదైనట్లు ఎన్సీఆర్‌బీ తెలిపింది. దళితులపై అఘాయిత్యాలకు సంబంధించి 2018లో 42,793 కేసులు నమోదు కాగా, 2019 సంవత్సరంలో 45, 935 కేసులు రికార్డయ్యాయి. ఇందులో సాధా రణ దాడుల కేసులు 13,273 కాగా, ఎస్సీ,ఎస్టీ (అత్యాచార నియంత్రణ) చట్టం కింద 4,129 కేసులు 3,486 అత్యాచారం కేసులు నమోద య్యాయి. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 2378 కేసులు నమోదు కాగా, మధ్యప్రదేశ్‌లో అత్య ల్పంగా రికార్డయ్యాయి. జమ్మూ-కశ్మీర్‌, మణి పూర్‌, మేఘాలయ,మిజోరం,నాగాలాండ్‌, త్రిపు రలలో ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఒక్క కేసు నమో దు కాలేదు. 2019 సంవత్సరంలో షెడ్యూల్డ్‌ తెగలవారిపై నేరాలు 26.5శాతం పెరిగాయి. 2018లో ఎస్టీలలపై దాడులకు సంబంధించిన 6,528 కేసులు, 2019లో 8,257 కేసులు నమో దయ్యాయి. భారతదేశంలోనే కాదు విదే శాలలో కూడా దళితులపట్ల వివక్ష, దాడులకు సంబం ధించిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూన్‌ 30న కాలిఫోర్నియాలోని సిస్కో సంస్థలో ఒక దళిత ఉద్యోగి కుల వివక్షను ఎదుర్కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీని తర్వాత అమెరికా కేంద్రంగా పని చేస్తున్న అంబేద్కర్‌-కింగ్‌ స్టడీ సర్కిల్‌(ఏకేఎస్‌సీ) కులవివక్షను ఎదుర్కొన్న 60మంది భారతీయులకు సంబంధించిన ఘటనలను ప్రచురించింది.
అండగా చట్టాలు
భారతదేశంలో దళితుల రక్షణ కోసం షెడ్యూల్డ్‌ కులాలు/తెగల (అత్యాచారాల నివారణ)చట్టం-1989 అమలులో ఉంది. షెడ్యూల్డ్‌ కులాలు, తెగలపై జరిగే దాడులను ఈ చట్టం కింద విచారిస్తారు.ఈ చట్టం ప్రకారం నేరం తీవ్రతను బట్టి బాధితులకు సహాయం, పునరా వాసం, నిందితులకు శిక్షలు నిర్ణయిస్తారు. ఇలాంటి కేసులను త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేస్తారు. ఇది కాకుండా అంటరానితనాన్ని అరికట్టడానికి అస్పృశ్యత నివారణ చట్టం-1955 కూడా ఉంది. దీనిని తర్వాత పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా మార్చారు. ఈ చట్టం ప్రకారం అంటరానితనాన్ని పాటించడం, ప్రోత్సహిం చడం నేరం. అయితే చాలా కేసులు మీడి యాకు, రాజకీయ నాయకులకు కనిపించ కుండానే పోతాయని, ఫిర్యాదు దాకా కూడా రాని కేసులు చాలా ఉంటాయని నిపుణులు అంటున్నారు. మరి సమస్య ఎక్కడ ఉంది ? చట్టం బలహీనంగా ఉందా లేక దానిని అమలు చేసేవారికి సంకల్పం లేదా?
అవగాహన కల్పించకపోవడమే సమస్య
తమపై జరిగే హింసలో సామాజిక, రాజకీయ కారణాలే పెద్ద పాత్ర పోషిస్తున్నాయని దళితులు భావిస్తున్నారు. బాధిత వర్గంలో అవగాహన పెరగాలని దళిత మేధావి చంద్రభాన్‌ ప్రసాద్‌ అన్నారు. ‘‘అంతకు ముందు దళితులపై ఈ స్థాయిలో హింసాత్మక ఘటనలు జరగలేదు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని మూక దాడులు చేయడం, చంపడం వంటివి ఉండేవి కాదు. గత 10-15 సంవత్సరాలలో ఇవి బాగా పెరిగాయి. దళితులు అభివృద్ధి చెందుతున్న కొద్దీ వారిపై దాడులు పెరుగుతున్నాయి. ఇది చట్ట సమస్య కాదు, సామాజిక సమస్య’’ అన్నారు చంద్రభాన్‌ ప్రసాద్‌. ఒక దశలో అమెరికాలో నల్లజాతీయులపై రోడ్ల మీదనే దాడులు జరిగే వని చంద్రభాన్‌ ప్రసాద్‌ చెప్పారు.‘‘ జన వరి 1,1863న అబ్రహంలింకన్‌ బానిసత్వాన్ని రద్దు చేసినప్పటి నుంచి నల్లజాతీయులపై మూక హింసాత్మక దాడులు మొదలయ్యాయి. అంటే, నల్లజాతీయులు బానిసలుగా ఉన్నంత కాలం వారిని చంపాల్సిన అవసరం యజమానులకు రాలేదు. భారతదేశంలో గత76ఏళ్లుగా దళి తులు కూడా అందుకు మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు’’ అని చంద్రభాన్‌ ప్రసాద్‌ వ్యాఖ్యా నించారు.‘‘కుల వివక్ష ఇంకా కొనసాగుతుందన్న విష యాన్ని అందరూ ఒప్పుకోవాలి. విద్యావం తులు కూడా దీనిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు’’ దళిత నేత ఉదిత్‌రాజ్‌. ఆవేదన వ్యక్తం చేశారు.- (వి.నానిబాబు )

ఎస్టీ జాబితాలో బోయ,వాల్మీకులు

దళితులు క్త్రెస్తవ మతంలోకి మారినా వారికి ఎస్‌సి హోదా ఉండే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలని,బోయ/వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చాలని ప్రవేశపెట్టిన తీర్మానా లను శాసనసభ మార్చి 25న శుక్రవారం సభఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తీర్మానా లను ఆమోదించాలని కోరుతూ కేంద్ర ప్రభు త్వానికి పంపిస్తున్నట్లు సిఎం వైఎస్‌ జగన్‌మో హన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. దళితులు క్రైస్తవ మతంలోకి మారినా ఎస్‌సి హోదా ఇవ్వాలను బిల్లును మంత్రి మేరుగ నాగార్జున ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్డు కులాల వ్యక్తులు సామాజిక, ఆర్థిక, రాజకీయ వివక్షను ఎదుర్కొంటున్నారని తెలి పారు. సిక్కు, భౌద్ద మతంలోకి మారిన వారితో సమానంగా పరిగణించేందుకు వారు అర్హులని చెప్పారు. హిందూ మతానికి చెందిన షెడ్యూ ల్డు కులాల వారు, క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్డు కులాల వారి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఒకేలా ఉన్నాయని తెలిపారు. సమా జంలో అవమానాలు, వివక్షకు గురవుతున్నారని, ఒక వ్యక్తి మరొక మతంలోకి మారడం ద్వారా వీటిలో ఏదీ మారదని,ఒక వ్యక్తి ఏమతాన్ని ఆచరిం చాలనేది ఆ వ్యక్తి ఎంపిక అని,కుల నిర్ధారణపై ఎటువంటి ప్రభావం చూపకూడదని సిఎం పేర్కొన్నారు.
ఎస్‌టిల జాబితాలో బోయ,వాల్మీకులు
బోయ,వాల్మీకులను షెడ్యూల్‌ తెగల జాబితాలో చేర్చేందుకు తాము వేసిన వన్‌ మ్యాన్‌ కమిషన్‌ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిందన్నారు. అనం తపురం,కర్నూలు,వైఎస్‌ఆర్‌ కడప,చిత్తూరు జిల్లాల్లో నివసిస్తున్న బోయ,వాల్మీకి వర్గాలను దాని అన్ని పర్యాయపదాలతోపాటు (వాల్మీకి, చుండినవాకులు, దొంగబోయ,దొరలు,గెంటు,గురికార,కళావతి బో యలను షెడ్యూల్డ్‌తెగల జాబితాలోచేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని సభ తీర్మానిం చింది. ఈ బిల్లును బిసి సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రవేశపెట్టారు. విజయవాడలో రూ.268 కోట్ల వ్యయంతో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 125అడుగుల విగ్ర హాన్ని, ఉద్యానవనాన్ని అభివృద్ధి చేస్తు నుందుకు సిఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి మేరుగ నాగార్జున ప్రతిపాదించిన తీర్మా నాన్ని శాస నసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనిపై రాష్ట్రంలోని గిరిజన సంఘాలు వ్యతి రేకిస్తూ నిరసనలు,ఆందోళనలు చేపట్టాయి.
బోయ,వాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్టీల్లో చేర్చవద్దు : గిరిజన సంఘం
(ఎన్‌టిఆర్‌జిల్లా) :బోయ,వాల్మీకి, బెంతు, ఒరి యాలను ఎస్టీలలో చేర్చకూడదని రెడ్డిగూడెం తహశీల్దార్‌ కార్యాలయంలో గిరిజన సంఘం నాయకులు నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.గోపిరాజు మాట్లాడుతూ..బోయ, వాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్టీలలో చేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఈ కులాలను ఎస్టీలలో చేర్చెందుగాను రాష్ట్ర ప్రభుత్వం శ్యాముల్‌ ఏక సభ్య కమిషన్‌ని యమించిందని జీవో నెంబర్‌ 52ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 32లక్షల గిరిజ నులు నేటికీ నిరక్షరాస్యత, వెనుక బాటు తనం, నిరుద్యోగ సమస్య, అనారోగ్య సమస్యలతో ప్రతి నిత్యం సతమత అవుతుంటే ఓట్ల రాజకీయం కోసం గిరిజనులను మోసం చేయడం సరి కాదని కేంద్ర ప్రభుత్వం1965లో బిఎన్‌ లో కూర్‌ కమిటీ పేర్కొన్న ఏ5 ప్రమాణాలు వీరికి లేవని ఎస్టీ జాబితాలో చేర్చవద్దని డిమాండ్‌ చేశారు.రాష్ట్ర గిరిజన నాయకుడు బి రమేష్‌ మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన శ్యాముల్‌ ఆనంద్‌ కుమార్‌ ఏకసభ్య కమిషనర్ని రద్దు చేయా లని లేని పక్షంలో రాష్ట్రంలోని గిరిజన సంఘాల విద్యార్థి సంఘాలు, గిరిజన ఉద్యోగుల సంఘాలు అన్నిటిని ఏకతాటిపై తెచ్చి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డి.రవి, అజ్మీర రాజు,బి.రాజా,బి.తావూరియా,బి.చిన్నబాల, బి. రంగా తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నంలో..
బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్‌టి జాబి తాలో చేర్చొద్దని విశాఖలో జరిగిన గిరిజన సదస్సు డిమాండ్‌ చేసింది. బోయ వాల్మీకి సహ పలు సామాజిక తరగతులను ఎస్‌టి జాబితాలో చేర్చేం దుకు జరుగుతున్న ప్రయత్నాలను నిరసిస్తూ విశాఖ లోని ఎంవిపి కాలనీలోగల గిరిజనభవన్‌లో అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వ ర్యాన గిరిజన సదస్సు జరిగింది.దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపి మిడియం బాబూ రావు మాట్లాడుతూ గిరిజనుల చట్టాలు, హక్కులు పటిష్టంగా అమలు కాకపోవడంతో ఇప్పటికీ ఆదివా సీలు కష్టాలు అనుభవిస్తున్నారని తెలిపారు. వారి సంక్షేమంలోప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. తాజాగా ఎస్‌టి జాబితాలో ఇతర సామా జిక తరగతులను చేర్చేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఏసామాజిక తరగ తినైనా ఎస్‌టి జాబితాలో చేర్చాలంటే బిఎన్‌. లోకూర్‌ కమిటీ నిబంధనల ప్రకారమే జరగాలని తెలిపారు. ఆ తెగ జీవితం, ప్రత్యేక భాష, ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాల పాటింపు, ఆర్థిక పరిస్థితి, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అప్పుడు మాత్రమే ఎస్‌టిగుర్తింపు ఇవ్వాల్సి ఉంటుం దన్నారు.కానీ, నేటి ప్రభుత్వం ఎస్‌టి జాబితా లో చేర్చాలనుకుంటున్న బోయ వాల్మీకులు అభివృద్ధి చెంది ఉన్నారని తెలిపారు. ఆదివాసీ తెగలతో వారికి ఎటువంటి సంబంధమూ, పోలికలూ లేవ న్నారు. వచ్చేఎన్నికల్లో లబ్ధిపొందేందుకే ఈ విధం గా చేస్తోందని విమర్శించారు. రాజకీయంగా, సామాజికంగా,ఆర్థికంగా అభివృద్ధి చెందిన సామా జిక తరగతులను ఎస్‌టి జాబితాలో చేర్చితే ఆది వాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. గిరిజనుల భూములు అన్యాక్రాంతమవుతాయని తెలిపారు. విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల్లో ఘర్షణపూరిత వాతావరణం నెలకొంటుందన్నారు. గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ ఇతర సామాజిక తరగతు లను ఎస్‌టి జాబితాలో చేర్చడానికి గతంలో ప్రయ త్నించిన సందర్భంలో దీనిని వ్యతిరేకిస్తూ అప్పటి రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌కు తమ సంఘం వినతిపత్రం ఇచ్చిందని గుర్తు చేశారు. నేడు ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆదివాసీలకు ద్రోహం చేస్తూ బోయ వాల్మీకిలను, బెంతు ఒరియా లను ఎస్‌టి జాబితాలో చేర్చడానికి ఏకసభ్య కమిషన్‌ను నియమిస్తూ జిఒ52ని జారీ చేసింద న్నారు. తక్షణమే ఆజిఒను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజన వ్యతిరేక విధానాలను విడనాడాల న్నారు. నాన్‌ షెడ్యూల్‌ గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్చాలని, జిఒ నెంబర్‌ 3 రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయా లని డిమాండ్‌ చేశారు.- జిఎన్‌వి సతీష్‌

అమరశిల్పి..అంబేద్కర్‌

కుల,మత రహిత ఆధునిక భారత దేశం కోసం అంబేద్కర్‌ తన జీవిత కాలం పోరాటం చేశారు. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమా పేందుకు అంబేద్కర్‌ చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయింది. చిన్ననాటి నుంచే తాను ఎదుర్కొన్న అంటరానితనాన్ని ఎవరూ ఎదుర్కో కూడదని అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డారు. ఆయన చేపట్టిన కార్యక్ర మాలు ఇప్పటికీ చారిత్రా త్మకమైనవి. (ఏప్రిల్‌ 14) ఆ మహానుభావుడి జయంతి. ఈ సందర్భంగా ఆయనకు యావత్‌ భారతావని నివాళులు అర్పిస్తోంది. – (కత్తి పద్మారావు)

అంటరానితనంపై అలుపెరుగని సమరం ‘అంబేద్కర్‌’ దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ తన జీవిత కాలం చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈనెల ఏఫ్రిల్‌ 14న డాక్టర్‌.బి.ఆర్‌.అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆయనకు యావత్‌ భారతావని నివాళులు అర్పిస్తోంది.డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌..న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా,రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా భారతీయులకు పరిచయం చేయక్కర్లేని పేరు. అంతకంటే మిన్నగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం పదిలంగా ఉంటుంది. అంటరానితనంపై ఆయన పూరించిన సమరశంఖం నేటికీ ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతూనే ఉంది. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరా టం చేసిన యోధుడాయన. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 1891లో ఏప్రిల్‌ 14న మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని అంబవాడేలో రామ్‌జీ,భీమా బాయి దంపతులకు జన్మించారు.తండ్రి రామ్‌ జీ బ్రిటీష్‌ భారతీయ సైన్యంలో సుబేదార్‌గా పని చేసేవారు. అంబేద్కర్‌ చిన్ననాటి నుంచి అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. మెహర్‌ కులానికి చెందిన ఆయణ్ని అప్పట్లో పాఠశాల గది బయట కూర్చోపెట్టేవారు. ఇలా అగ్రకులాల వారి ఆధిపత్యపోరుని తట్టుకుని 1900లో ప్రభుత్వ పాఠశాలలో చేరారు.అక్కడ హేళనలు, అవమానాలపై తిరగబడ్డారు.. ఈ వివక్షలన్నిం టినీ ఎదుర్కొంటూ మెట్రిక్యులేషన్‌ అత్యధిక మార్కులతో పాసయ్యారు. బీఏ ఉత్తీర్ణులైన అంబేద్కర్‌..ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. కొలంబియా యూనివర్సిటీ,లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌తో పాటు ఎన్నో ప్రఖ్యాతి గాంచిన విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించారు. ఎంఏ,పీహెచ్‌డీ,న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తిచేశారు.విదేశాలలో ఎకనామిక్స్‌లోడాక్టరేట్‌ పొందిన మొట్టమొదటి భారతీయుడిగా గుర్తింపు పొందారు. ఇండియాకు తిరిగొచ్చి దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిపెట్టారు. ఇలాంటి సమస్యలను ఎదిరించాలంటే చదువొ క్కటే మార్గమని భావించారు. తనలా అంటరాని తనాన్ని ఎవరూ ఎదుర్కోకూడదని, చిన్నప్పటి నుంచే తనను తాను రక్షించుకోవడమే కాకుండా, అంటరానితనాన్ని నిర్మూలనకు సమరశంఖం మ్రోగించారు. అణగారిని వర్గంలోని ప్రజలకు అంబేద్కర్‌ చదువు చెప్పించి ప్రోత్సహించారు. ‘బహిష్కృత హితకారిణి’ అనే సంస్థను స్థాపిం చారు. అంటరానితనంపై పోరాటం చేశారు.. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని,మనుధర్మాన్ని వ్యతిరేకించారు.1927లో దళిత జాతుల మహా సభ జరిగింది..మహారాష్ట్ర,గుజరాత్‌ నుంచి కొన్ని వేలమంది వచ్చారు. మహత్‌ చెరువులోని నీటిని తాగడానికి వారికి అనుమతి లేకపోగా.. అంబేద్కర్‌ ఆచెరువులోని నీటిని తాగారు. చరిత్రలో అదో సంచలనం.
1931లో రౌండ్‌టేబుల్‌ సన్నాహాలు సంద ర్భంగా అంబేద్కర్‌ గాంధీజీని కలిశారు. తర్వా త స్వాతంత్ర భారతావనికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు..దేశానికి రాజ్యాంగ రచన బాధ్యతలను అప్పటి ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. భారత రాజ్యాంగ పరిషత్‌ నియ మించిన రాజ్యాంగ సంఘానికి ఆయణ్ని అధ్యక్షు నిగా ఎన్నుకున్నారు. అనేక దేశాల రాజ్యాంగాన్ని ఆధ్వయనం చేసిన అంబేద్కర్‌ దృఢమైన రాజ్యాంగాన్ని అందించారు. తరతరాలుగా బడుగు,బలహీనవర్గాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా అంబేద్కర్‌.. వారి అభ్యున్నతకి రిజర్వే షన్లు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. అలాగే అంటరానితనం, అస్పృశ్యతను శిక్షార్హమైన నేరంగా చేశారు. అంతేకాదు ఆర్థికవేత్తగా కూడా ఎంతో గొప్పగా పేరు సంపాదించారు. పారిశ్రామికీకారణ, వ్యవసా యాభివృద్ధి దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మారు.అంబేద్కర్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా ఎంపికైన తర్వాత వారసత్వ,వివాహ చట్టాలలో లింగ సమానత్వాన్ని వివరించడానికి ప్రయ త్నించిన హిందూ కోడ్‌ బిల్లు ముసాయిదాను పార్లమెం టులో నిలిపివేయడంతో..1951లో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత అంబేద్కర్‌ తన జీవితంలోని ముఖ్యాం శాలను తన ఆత్మకథ ‘వెయిటింగ్‌ ఫర్‌ ఏ వీసా’లో రాసుకున్నారు. హిందూ సమాజం పట్ల ఆగ్రహించారు. హిందూసమాజ వినా శనాన్ని కోరుకోలేదు: భీమ్‌రావు తన జీవితంలో అస్పృశ్యత కారణంగా అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. పత్రికలద్వారా హిందువుల ఆలోచనా ధోరణిని మార్చటానికి ప్రయత్నిం చారు. నాసిక్‌ కాలారాం మందిర ప్రవేశంకోసం 18నెలలు శాంతియుతంగా సత్యాగ్రహం చేశారు. అంబేడ్కర్‌ వ్యక్తిత్వ ముద్ర భారత రాజ్యాంగంపై బలంగా వుంది. ఆయన విదేశీ రాజ్యాంగాలనే గాక భారతదేశానికి పనికి వచ్చే ప్రజాస్వామ్య లౌకిక అంశాలతోపాటు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను,రాజ్యాంగంలో పొందు పరిచారు.
అంబేడ్కర్‌ జీవితంలోని లోతు తాత్త్వికమైంది భారతదేశాన్ని మనం పునర్నిర్మించాలను కున్నప్పుడు తప్పకుండా ఆయన రచనలను భారతీయ పునరుజ్జీవనానికి సమన్వయం చేసుకోక తప్పదు. భారత రాజ్యాంగంలో పొందుపర్చబడిన ఆర్థిక, సామాజిక సమత అట్టడుగు ప్రజలకు ప్రవహించాలంటే ఆయన అందించిన సిద్ధాంతాల ప్రమాణాలలోని తత్త్వాన్ని అందుకోవలసిన అవసరం ఉంది. భారత రాజ్యాంగ శిల్పంలో ఆయన అద్వితీయ పాత్రను వహించాడు. భారత రాజ్యాంగం ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలోకి పెద్దది. చాలామంది భారత రాజ్యాంగాన్ని ఉపరితలం నుంచే చూసి ఇది విస్తృతమైనదనే అనుకుంటారు కాని, నిజానికి ఇది లోతైనది. ఈ లోతు అంబేడ్కర్‌ అధ్యయనం నుండే వచ్చింది. అంబేడ్కర్‌ ఆర్థిక,తాత్త్విక అధ్యయనం భారత రాజ్యాంగాన్ని తీర్చిదిద్దింది.
అస్పృశ్యత మూలాల నిర్మూలన
మనుస్మృతిలో కొన్ని వర్ణాలవారిని చూడటమే నిషేధించబడిరది! మనిషిని మనిషిగా చూడ టమే నేరమనే ఈ అమానవ నిషేధాలను అంబేడ్కర్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 17తో తిప్పికొట్టారు. ఆయనలోని మహోన్నత సామాజిక,విప్లవ శక్తంతా ఆ ఆర్టికల్‌ నిర్మాణంలోనే వుంది. దీనికి బౌద్ధ సాహిత్య అధ్యయనం ఆయనకు ఎంతగానో తోడ్పడిరది. బౌద్ధాన్ని ఆయన వ్మాయంగానే కాక, తత్త్వ శాస్త్రంగా, సామాజిక జ్ఞానశాస్త్రంగా అధ్య యనం చేశారు. మనిషికి మనిషికి అడ్డువస్తున్న అన్ని సామాజిక అంతరాలను బౌద్ధం కూల్చి వేసింది. ఆ క్రమాన్ని ఆయన అధ్యయనం చేశారు. ఒక మనిషి మరొక మనిషిని చూస్తే నేరం, తాకితే నేరం అనే దశ నుంచి ఒక మనిషిని మరొక మనిషి ప్రేమించే సూత్రాలను ఆయన అవగాహన చేసుకున్నారు. అస్పృశ్యతను నివారించడం నుంచి మానవ సమాజాన్ని సమైక్యం చేశారు. విధానాలను రూపొం దించారు. మనిషి పుట్టుకతోనే ఇతరులను అవమానించడమనే నేరస్థుడుగా జీవిస్తున్నాడని గుర్తుచేశారు. మనిషి అగ్రవర్ణుడుగా తన చుట్టూ అల్లుకుని ఉన్న ఆచార సూత్రాలన్నీ రాజ్యాంగం ప్రకారం నేరానికి దారితీస్తాయి. నేరమంటే ఏమిటి? ఇతరులను నిందించటం,అవమా నించటం,అపహాస్యం చేయటం,అణచివే యటం.మరి ఈ నేరాలు ఎవరు చేస్తున్నారు? రాజ్యం చేస్తుంది. వ్యక్తులు చేస్తున్నారు. సమాజ మూ చేస్తుంది. ఈ మూడిరటిని ఈ ఆర్టికల్‌ నిరోధిస్తుంది.
రాజ్యాంగంపై అంబేడ్కర్‌ జీవిత ప్రభావం
బాబాసాహెబ్‌ అంతిమ కోరిక ఏమంటే అడవిలో లేక ప్రశాంతవనంలో ఏర్పాటు చేయబడిన ఒక గ్రంథాలయంలో కూర్చొని యుగాల మహాసిద్ధాంత కారులతో, మహోపాధ్యాయులతో సంభాషించాలని. జ్ఞానజ్యోతిని కనుగొనే క్రమంలో అనంత రహస్యాలని వెతుక్కుంటూ సాగుతున్న ఆయన ఆలోచనల్ని ఎవరు ఊహించగలరు? ఆయన విద్యాదాహం అంతులేనిది. చదువుతోపాటు ఆయన కూడా పెరిగాడు. ఆయన జ్ఞానం ఆ నింగి సాక్షిగా దిగంతాలకు పాకింది.’’ అంబే డ్కర్‌ జీవితాంతం అవిశ్రాంతంగా అధ్యయనం చేశాడు. ఆయన చదువును గురించి ధనుంజయ్‌ కీర్‌ ఇలా రాశారు. ‘‘అంబేడ్కర్‌ ఉదయం చదువుతుండేవాడు. మధ్యాహ్నం, రాత్రి చదువుతుండేవాడు. రాత్రి గడిచి ఉదయమైనా చదువుతుండేవాడు. ప్రక్కనున్న ఇళ్లల్లో ఉదయాన్నే శబ్దాలు మొదలయ్యేవి. అప్పటికి కూడా ఆయన పుస్తకం చదువుతూ ఉండేవాడు. బాబా సాహెబ్‌ గంటల గణగణల మధ్య, బండ్ల గడగడ శబ్దాల మధ్య, పనిముట్ల దబదబ శబ్దాలమధ్య, మోటార్ల బరబర శబ్దాల మధ్య కూడా తనపనిలో తాను నిమగ్నమై ఉండేవాడు.అంబేడ్కర్‌ వ్యక్తిత్వ ముద్ర భారత రాజ్యాంగంపై బలంగా వుంది. ఆయన విదేశీ రాజ్యాంగాలనే గాక భారతదేశానికి పనికివచ్చే ప్రజాస్వామ్య లౌకిక అంశాలతోపాటు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, రాజ్యాంగంలో పొందు పరిచారు. ఆయనలోని గొప్పతనం ఆయన గొప్ప దేశభక్తుడు కావటమే. సాత్వికునిగా, సామరస్యునిగా ఆయన జీవించాడు. ప్రజలు అలా జీవించాలని కోరుకున్నాడు. భారతీయు లందరూ జ్ఞానులుగా రూపొందాలనేది ఆయన ఆకాంక్ష. అందుకు కావలసిన పునాదుల్ని భారత రాజ్యాంగంలో రూపొందించాడు. శిల్పిని వేరుచేసి శిల్పాన్ని చూడలేము. కవిని వేరు చేసి కవిత్వాన్ని పఠించలేము. భారత రాజ్యాంగం అర్థం కావాలంటే అంబేడ్కర్‌ని, అంబేడ్కర్‌ రచనల్ని ప్రతి భారతీయుడు చదవాలి.

ఎస్టీల గుర్తింపులో తొందరపాటు సరికాదు !

బోయ,వాల్మీకి,బెంతు ఒరియాలను షెడ్యూల్‌ తెగలు(ఎస్టీలు)గా గుర్తించాలని తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి.బోయలు, వాల్మీకులు మరియు బెంథో ఒరియాల నుండి వచ్చిన ప్రాతినిధ్యాలపై, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దీనిని పరిశీలించడానికి ఒక వ్యక్తి కమిషన్‌ను ఏర్పాటు చేసింది మరియు ఆ కమిషన్‌ నివేదిక ఆధారంగా,వారిని ఏపీ ఎస్టీల జాబితాలో చేర్చినట్లు ప్రకటించింది.రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలని కోరుతూ రాష్ట్రంలోని పలు గిరిజన సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.సాధారణ కోర్సులో, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 338ఏ(9) ప్రకారం అవసరమైన షెడ్యూల్డ్‌ తెగల జాతీయ కమిషన్‌తో ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం ముందుగా సంప్రదింపులు జరిపి ఉండాలి. ఇప్పటి వరకు అలాంటి సంప్రదింపులు జరగిన దాఖలాలు కన్పించలేదు.రాష్ట్రం నియమించిన కమిషన్‌ ఈఅంశంపై తమ అభిప్రాయాలను కోరలేదని,రాష్ట్ర ప్రభుత్వం తమను ఎప్పుడూ విశ్వాసంలోకి తీసుకోలేదని గిరిజన సంఘాల ప్రతినిధులు వాదిస్తున్నారు.
ఐదవ షెడ్యూల్‌లోని పారా4కింద ఏర్పాటైన గిరిజన సలహా మండలి పరిగణలోకి తీసు కున్న అభిప్రాయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరలేదని తెలుస్తోంది.ఎస్సీ,ఎస్టీలజాబితాల సవరణపై జస్టిస్‌ లోకూర్‌ నేతృత్వంలోని కేంద్ర సామాజిక భద్రత విభాగం 1965లో నియమించిన అడ్వైజరీ కమిటీ,ఆదివాసీల సమూహాన్ని వర్గంగాగుర్తించాలా? వద్దా? అనే విషయాన్ని గుర్తించేందుకు అవసరమైన కొన్ని లక్షణాలను సూచించింది.కొత్త సమూహాలను షెడ్యూల్డ్‌ తెగలలో సభ్యులుగా చేర్చాలని స్థానిక రాజకీయ పార్టీల నాయకుల ఒత్తిడిని పరిగ ణనలోకి తీసుకున్నారు. అయితే దీనిని పరిశీలించడానికి రాష్ట్రం ఆదివాసీల సంస్కృతి గురించి తెలిసిన బయటి నిపుణులతో ఒకకమిటీని ఏర్పాటు చేయడం సముచితంగా ఉండేది.ఈ నేపథ్యంలో,షెడ్యూల్డ్‌ తెగల జాతీయ కమిషన్‌(ఎన్‌సీఎస్‌టీ)ఈ విషయంలో జోక్యాన్ని కోరే స్వేచ్ఛ గిరిజన తెగలకు ఉంది.ఎన్‌సీఎస్‌టీ వన్‌ మ్యాన్‌ కమీషన్‌ నివేదికను వృత్తిపరంగా ఆదివాసీల సంస్కృతి,జీవితాల గురించి తెలిసిన బయటి ప్రముఖ నిపుణుల బృందానికి సూచించమని గిరిజనతెగలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోతున్నాయి.ఈ విషయంలో కనీసం గిరిజన సలహా మండలి(టీఏసీ) అభిప్రాయాలు తీసుకున్న దాఖలులేవు.
ఏదైనా తుదినిర్ణయం తీసుకునే ముందు ఏస్టీ జాబితాలో కొత్త సమూహాలను చేర్చడం వలన వారి అవకాశాలపై నిస్సందేహంగా ప్రభావం చూపుతుంది కాబట్టి, రాష్ట్రం స్థానిక ఆదివాసీ సంఘాల ప్రతినిధులను విశ్వాసంలోకి తీసుకోవడం కూడా అంతే అవసరం. 1965లో లోకూర్‌ కమిటీ సంప్రదించిన రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ సెన్సస్‌ ఆపరేషన్స్‌ ప్రస్తుత ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆదివాసీ తెగలంతా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.ఏస్టీల జాబితాలో ఏదైనా సమూహాన్ని చేర్చాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 342(1) (రాజ్యాంగం (మొదటి సవరణ) చట్టం,1951 ద్వారా సవరించబడిన ప్రకారం)రాష్ట్రపతి ఉత్తర్వులు పొందడంచాలా అవసరం.దీనిపై ఎన్‌సిఎస్‌టి పరిశీలించిన అభిప్రా యాలను కోరాలని కేంధ్ర ఇంధన వనరులశాఖ విశ్రాంతి ముఖ్యకార్యదర్శి ఇ.ఎ.ఎస్‌.శర్మ ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను విడిగా అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 338ఏలో 9వ అంశం ప్రకారం జాతీయ షెడ్యూల్‌ తెగల కమిషన్‌ను సంప్రదించకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల విషయంలో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోరాదు. ఆదివాసీలుకాని వారిని ఎస్టీలుగా గుర్తించడంవల్ల తమ హక్కులకు హాని కలిగే అవకాశముందని గిరిజనులు పెద్దఎత్తున ఆందోళనలు చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే వారి ప్రతినిధులతో సంప్రదింపలు జరిపాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.- రెబ్బాప్రగడ రవి,ఎడిటర్

1 2