చింతిస్తున్న చింతపండు రైతులు

ఈ ఏడాది చింతపండు గురించి మరిచి పోవాల్సిందేనా? ఇదేపరిస్థితి కనిపిస్తే..ధరలు మరిం త ఏడిపించే అవకాశాలు కనిపిస్తు న్నాయి. చింత పండు సాగు కనుమరుగు అవు తుండడానికి కారణం ఏంటి?మద్దతుధర ఇస్తున్నా.. రైతులు ఎందుకు నో చెబుతున్నారు.
ప్రతి వంట గదిలో తప్పక ఉండా ల్సిన ఐటెమ్స్‌లో చింతపండు ఒకటి. అది లేనిదే రోజు వారీ ఏవంటా పూర్తి కాదు.. పప్పు నుంచి పులుసు వరకు.. పులిహార నుంచి కూడా వరకు అన్నింటిలోనూ చింతపండుతప్పని సరి.. దేనికైనా రుచిరావాలి అంటే చింతపండు పులుపు తగలా ల్సిందే?కానీ అలాంటి చింతపండు గురించి ఇక మరిచిపోవాల్సిందేనా?చింతపడు సాగు పూర్తిగాతగ్గిపోవడమే దానికి కారణమా..? మన్యంలో గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరు చింతపండు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో కాపు లేదు.దీంతో నిరాశతప్పడం లేదు. చింత పువ్వు దశలోనే ఈదురుగాలులు,వర్షాలు అధికం గా కురవడంతో ఆ ప్రభావం పంటపై పడిరది. చాలాచోట్ల ఇదే పరిస్థితి..దీంతో సాగుపై గిరిజన రైతుల్లో ఆశలు సన్నగిల్లాయి. ఆశించిన స్థాయిలో జీడిపంట లేకపోగా,చింతదిగుబడి కూడా అం తంతమాత్రంగానే ఉంటోంది. అందుకే దాని మీద ఆధారపడిన వారికి ఈ ఏడాది నిరాశే తప్ప లేదు. వాస్తవంగా ఏటా జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం,సాలూరు,కొమరాడ,పాచిపెంట ప్రాం తాల్లో5 వేల క్వింటాళ్లు,సీతంపేట మన్యంలో ఏటా రెండు వేల క్వింటాళ్ల వరకు చింతపండు దిగుబడి వస్తుంది. సాధారణంగా మన్యంలో చింతపండుకు మంచి డిమాండ్‌ ఉంది. మైదాన ప్రాంత వాసులు కూడా భారీగా కొనుగోలు చేస్తుంటారు. జీసీసీకి కూడా ప్రధాన ఆదాయం చింతపండు కొనుగోలు ద్వారానే వస్తుంది. అయితే గత ఏడాది జీసీసీలో చింతపండు నిల్వలు ఎక్కువగా ఉండడంతో కొను గోలుకు మొగ్గు చూపలేదు. 2022లో కిలో చింత పండు మద్దతు ధర 36గా నిర్ణయించారు. గత ఏడాది నిల్వలు ఉండడంతో మద్దతు ధరను 32. 50కు తగ్గించారు. ఆ ధరకు కూడా గిరిజనుల నుంచి చింతపండును కొనుగోలు చేయలేదు. దీంతో గిరిజనులు మైదాన ప్రాంత వ్యాపారులకు కిలో 40 నుంచి 5కు పంటను అమ్ముకున్నారు.అయితే ఈ ఏడాది చింతపండు ధర మరింత ప్రియంగా ఉండే అవకాశం ఉంటుందని ఆశపడ్డారు. కానీ ఆశించిన స్థాయిలో దిగుబడి లేకపోవడంతో ఆర్థిక కష్టాల నుంచి ఎలా గట్టెక్కగలమని గుజ్జి, పెద్దూరు, కిరప,గాడిదపాయి, తాడిపాయి, కిల్లాడ గ్రామాలకు చెందిన గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకూ జీసీసీ చింత పండుకు మద్దతు ధర నిర్ణయించలేదు. ఏటా లానే ఈసారి కూడా బయట మార్కెట్‌ కంటే తక్కువగా ధర నిర్ణయిస్తే చింతపండును విక్రయిం చేదని లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఉన్న కాస్త పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ఉన్న తాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఏడాది పెద్దఎత్తున చింతపండు కొనుగోలుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. గత ఏడాది 32.50 పైసలకు కొనుగోలు చేయగా, ఈ ఏడాది మద్దతు ధరను ఇంకా నిర్ణయించలేదంటున్నారు. గిరిజనుల నుంచి సేకరించిన చింతపండుకు గతంలో ఆన్‌లైన్‌ చెల్లింపులు జరిగేవని, ప్రస్తుతం కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని అంటున్నారు.
పూర్వ వైభవాన్ని కోల్పోతున్న గిరి బజార్లు
గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఆధ్వ ర్యంలో నెల కొల్పిన గిరిబజార్లు(సూపర్‌ మార్కెట్లు) వెలవెలబోతున్నాయి.ఏజెన్సీలోని గిరిజనులు సేక రించిన అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆ ముడి సరుకుద్వారా వినియోగ వస్తువులను తయారు చేయడం,తేనె ఇతరత్రా వాటిని విక్ర యిండంతో పాటు సాధారణ సూపర్‌ మార్కెట్లో లభ్యమయ్యే అన్ని రకాల నిత్యావసరాలను అమ్మ కాలు సాగిస్తుంటారు.కానీ ప్రస్తుతం సాధారణ నిత్యావసర సరుకులు బయటి మార్కెట్‌ కంటే తక్కువ ధరలకే లభ్యమవుతున్నప్పటికీ గిరిజన ఉత్పత్తులు మాత్రం లేకుండా పోయాయి.
ఒకప్పుడు భద్రాచలం జిసిసి పాయిం ట్లో అన్నిరకాల అటవీ అత్పత్తులు లభ్యమయ్యేవి కానీ ఇప్పుడు ఒక్కటంటే ఒక్కఉత్పత్తి కూడా లేదు.ఎక్కడైతే ఐటిడిఎలు ఉంటాయో వాటికి అను సంధానంగా జిసిసి డివిజన్‌ కార్యాలయాలు ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో భద్రా చలం,ఏటూరునాగారం,ఉట్నూరులలోని ఐటిడిఎల కేంద్రంగా జిసిసి డివిజన్‌ కార్యాలయాలు కార్య కలాపాలు సాగిస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉంది. నిర్మల్‌ జిల్లా కేంద్రంగా తేనె, భద్రాచలం డివిజన్‌ కార్యాలయం కేంద్రంగా సబ్బులు, షాంపూలు, ఏటూరు నాగారం కేంద్రంగా వాషింగ్‌ సోప్‌ యూనిట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులు ప్రస్తుతం జిసిసి సూపర్‌ మార్కెట్లలో కానరావడం లేదు. ప్రధానంగా జిసిసి అటవీ ఉత్ప త్తులను చాలా మంది వాడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సుమారు 142 జిసిసి సూపర్‌ మార్కెట్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అదే విధంగా అలోవీరా సబ్బులు,నీమూసబ్బులు,టర్మరిక్‌ సబ్బులు,తేనెతో తయారు సబ్బులు, బట్టలు ఉతికే సబ్బులు కూడా అందుబాటులో లేవు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్పుడు సూపర్‌ మార్కెట్లు కళకళాడేవి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇటీవలి కాలం వరకు పలు రకాల జిసిసి ఉత్పత్తులు నిత్యం అందుబాటులో ఉండేవి. షికాకాయి,కుంకుడుకాయిపౌడర్‌, షాంపులు,చీపర్లు,పెసర్లు,కందులు,చింతపండు, అలోవీరా సబ్బులు, మారేడు చెక్కరసం, ఉసిరికాయ పొడి, కరక్కాయలు, అరకు కాఫీ పౌడర్‌ తదితర ఉత్పత్తులు దొరికేవి. ఇప్పుడు అవి కంటికి కూడా కానరావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన చెందిన ఉత్పత్తులను ఇక్కడికి ఇవ్వడం లేదని, అందుకే షాపుల్లో పెట్టలేకపోతు న్నామని ఇక్కడి జిసిసి వర్గాలు చెబుతున్నాయి. కానీ మన దగ్గర తయారయ్యే తేనెను మాత్రం ఏపి జిసిసికి విక్రయి స్తున్నారు. అటు విక్రయించిన వారు ఇక్కడికి కొనేం దుకు ఎందుకు అశ్రద్ధ చూపుతున్నారో అర్ధం కావడం లేదని పలువురు అంటున్నారు.ఈ నేపథ్యంలో జిల్లాలో సహజ సిద్ధమైన అటవీ ఉత్పత్తులు అందుబాటులో లేక పోవడంతో పలు వురు వినియోగదారులు ఇబ్బందులు పడుతు న్నారు. ఇప్పుడు అవి కావాలంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చింతూరుకు వెళ్లాల్సి వస్తోంది. దూరా భారం కావడంతో వినియోగదారులు మనస్సు మార్చుకుని వేరే ఉత్పత్తులు వాడుతున్నారు. జిసిసి సూపర్‌ మార్కెట్లో అటవీ అత్పత్తుల నిల్వ లేకున్న ప్పటికీ సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల పలువురు వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ధరపైనే ‘చింత’
ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు గిరిజన సహకార సంస్థ (జిసిసి) రaలక్‌ ఇచ్చింది. జిల్లాలో కొనుగోలు చేసే అటవీ ఉత్పత్తుల్లో ప్రధాన మైన చింతపండుకు రివర్స్‌ గిట్టుబాటు ధర కల్పిం చింది. ఈ ఏడాది సీజన్‌లో కిలో చింతపండును 32.40రూపాయలకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.గత ఏడాదితో పోల్చుకుంటే నాలు గు రూపాయలు తగ్గించింది. ధర తగ్గింపుతో ఆగకుండా కొనుగోలుకు సంబంధించి సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తాజా నిబం ధనల ప్రకారమైతే ఏగిరిజనుడూ జిసిసికి చింత పండు విక్రయించే అవకాశం లేదు. చింతపండు పొడిగా వుండాలని,తేమ శాతం అసలు వుండ రాదని,చింత బొట్టలను చేతులతో కొట్టాలని, కర్రలు వినియోగించరాదని మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే చింతపండు విక్రయించే గిరిజన రైతులకు నగదు చెల్లింపులు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని, ప్రతి గిరిజన రైతూ బ్యాంకు ఖాతా,ఆధార్‌ కార్డు జరాక్స్‌ కాపీలు అందజేయాలని నిర్దేశించింది. ఈ నిబంధనలపై జిసిసి సిబ్బంది ఇప్పటికే ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులకు అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహిస్తున్నారు. సాలూరు మండలం లోని పట్టు చెన్నూరు, పగులచెన్నూరు, నేరళ్లవల సలో జిసిసి సిబ్బంది స్థానిక గిరిజన ప్రజాప్రతి నిధుల సమక్షంలో అవగాహన సదస్సులు నిర్వహిం చారు. జిల్లాలో జిసిసి కొనుగోలు చేసే అటవీ ఉత్పత్తుల్లో ప్రధానమైంది చింతపండే. దీన్ని జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు సేకరించి విక్రయించుకోవడం ద్వారా వచ్చిన డబ్బుతో వారి కుటుంబ అవసరా లను తీర్చుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో జిసిసి చింతపండుకు కనీస మద్దతు ధర తగ్గించడం గిరిజ నులకు ఆశనిపాతంలా పరిణమించింది. గిరిజన సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న జిసిసి వారిని దూరం చేసే నిర్ణయాలు తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
గత రెండేళ్ల ధర కన్నా తక్కువ
గడిచిన రెండేళ్లలో జిసిసి నిర్ణయించిన చింతపండు ధర కన్నా ఈ ఏడాది తక్కువగా నిర్ణ యించింది. సాధారణంగా ఏటేటా అటవీ ఉత్పత్తుల ధరలు ఎంతో కొంత పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 2021-22లో కిలో చింతపండు రూ.32గా మొదట నిర్ణయించింది. అయితే ప్రయి వేటు వ్యాపారుల కన్నా ఈధర తక్కువ కావడంతో అప్పటి జిసిసి ఎమ్డీ మరో మూడు రూపాయలు పెంచి రూ.35గా నిర్ణయిం చారు. 2020-21సం వత్సరానికి కిలో చింత పండు ధర రూ.36గా జిసిసి ప్రకటించింది. ఈ ఏడాదిలో జిల్లాలో 780మెట్రిక్‌ టన్నుల చింత పండును కొనుగోలు చేసింది. గత ఏడాది కొను గోలు చేసిన చింతపండు పూర్తిగా అమ్మకం కాకపోవడం వల్లే ఈ ఏడాది చింతపండు ధరను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలు స్తోంది. గిరిజనుల నుంచి కొనుగోలు చేసిన చింత పండు లాభదాయకమైన ధరకు అమ్ముకో వాల్సిన బాధ్యత జిసిసి సంస్థ ఉన్నతాధికారులదే. పాత చింతపండు కోల్డ్‌ స్టోరేజ్‌లో మూలుగుతున్న దనే సాకు చూపి ఈ ఏడాది ధర తగ్గించడంపై గిరిజ నులు ఆందోళన చెందుతున్నారు.అసలే కరోనా వైరస్‌ కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గిరిజన రైతులకు చింతపండు ధర పెంపు ద్వారా మేలు చేయాల్సిన ప్రభుత్వంరివర్స్‌ గేర్‌ లో వెళ్ళడం వివాదాస్పద మవుతోంది.
ప్రయివేటు వ్యాపారులదే హవా
ఈ ఏడాదిలో చింతపండు కొనుగో లుకు సంబంధించి ప్రయివేటు వ్యాపారుల హవా కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కనీస మద్దతు ధర తగ్గించడం,కొత్త మార్గదర్శకాలు విడుదల చేయడం,ఆన్‌ లైన్‌ చెల్లింపులు చేస్తా మన డం వంటి నిర్ణయాలు గిరిజనులను పూర్తిగా జిసిసికి దూరం చేసేలా ఉన్నాయనే వాదనలు వినిపిస్తు న్నాయి. చింతపండు కొనుగోలు సీజన్‌కు ముందే ప్రయివేటు వ్యాపారులు గిరిజన రైతులకు అడ్వాన్స్‌ రూపంలో డబ్బులు చెల్లిస్తారు. జిసిసి మెరుగైన ధర కల్పించినా కొంతమంది గిరిజనులు ప్రయివేటు వ్యాపారులకే చింతపండు విక్రయిస్తారు. తాజా నిబంధనల ప్రకారమైతే గిరిజనులంతా ప్రయివేటు వ్యాపారుల వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. చింతపండు కొనుగోలు బాధ్యతల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరను తగ్గించిందనే అనుమానాలు వ్యక్త మవుతు న్నాయి. దీనివల్ల జిల్లాలోని గుమ్మలక్ష్మీ పురం, కురుపాం, జియ్య మ్మవలస, పార్వతీపురం, కొమరాడ, సాలూరు, పాచిపెంట,మక్కువ, మెం టాడ,ఎస్‌.కోట మండ లాలకు చెందిన వేలాది మంది గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ ప్రాం తంలోని గిరిజనులకు చింత పండు సేకరణతో వచ్చిన ఆదాయమే ఏడాది పొడవునా వారి కుటుం బ పోషణకు వినియోగిస్తారు.
కాఫీ ధర పెంపు, చింతపండు ధర తగ్గింపు
అరకు ప్రాంతంలో పండిరచే కాఫీ, స్ట్రా బెర్రీ పండ్లుకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాఫీ,స్ట్రా బెర్రీ పండ్లుకు గిరాకీ ఉండడంతో ధరలను పెం చింది. చింతపండుకు డిమాండ్‌ ఉన్నప్పటికీ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా విక్రయిం చడంలో జిసిసి అధికారులు విఫలమయ్యారు. వారి అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి చింతపండు ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంపట్ల అసంతప్తి వ్యక్తమవుతోంది.
సోమవారం రోజంటే ఎందుకంత భయం..
గిరిజనులు ఎక్కువగా అటవీ ఉత్ప త్తులపైనే ఆధారపడి జీవిస్తుంటారు..అక్కడ పండిర చే పంటలకు ఆర్గానిక్‌ అనే పేరు ఉండటంతో మార్కెట్లో కూడా మంచి డిమాండ్‌ వస్తుంది. అయి తే చింతపండు విషయంలో విశాఖపట్నం లోని ఏజెన్సీలో ఉన్న గిరిజనులకు మరింత ఆందోళన కలిగిస్తోంది. సోమవారం రోజున చింతపండు అమ్మాలంటే వారు భయపడి పోతున్నారు. ఎందు కంటే ఆరోజు చింతపండు ధర చాలా తగ్గిపో తుంది. మిగతా రోజుల్లో మాత్రం ధర అటు ఇటుగా ఉన్నా సోమవారం రోజు వస్తే వివిధ కారణాలతో చింతపండు ధర తగ్గిపోతోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణాలు కూడా చెబుతున్నారు.. గిరిజనుల దగ్గర వార సంతలు వారంలో రెండు సార్లు జరుగు తాయి. సోమవారం మరియు గురువారం.. కానీ గిరి పుత్రులకు సోమవారం రోజున చింతపండు అమ్మకాలు అసలు కలిసి రాదట. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడిరదనీ అంటున్నారు. సాధారణంగా చింతపండు మార్కెట్‌ విలువ పిక్క తీసింది అయితే 120 రూపాయలు కిలో.. పిక్క తీయనిది అయితే 80 రూపాయలకు కిలో. కానీ గిరిజనులు మాత్రం పిక్కతో ఉన్న దాన్ని కేజీ 40 మాత్రమే అమ్ముతున్నారు. అయితే చింతపండును గిరిజనుల నుంచి దళారులు కొనేసి ట్రాన్స్పోర్ట్‌ ప్యూరిఫైయర్‌ అనే పేరుతో రకరకాల ధరలు వేసి వినియోగదారుడికి వదిలేస్తున్నారు. దీంతో ధర బయటి మార్కెట్‌కి వచ్చేసరికి డబల్‌ అయి పోతుంది. కానీ గిరిజన ప్రాంతాల్లో గిరిపుత్రులు పండిరచిన చింతపండు మాత్రం అంత ధర రాదు. ఇందులోనూ సోమవారం చాలా సెంటిమెంట్‌ గా భావిస్తారు. గురువారం రోజున అమ్ముకుంటే వచ్చే లాభం సోమవారం రాదని అనుకుంటారు గిరి పుత్రుడు.అందుకే వారికి సోమవారం అంటే అంత భయం.-(కందుకూరి సతీష్‌ కుమార్‌)

విద్య హక్కు వీడని చిక్కు

-ప్రైవేట్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్ధులకే.. ` ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్‌
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ స్కూళ్లలోని 25 శాతం సీట్లను పేద విద్యార్ధులకు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం (ఫిబ్రవరి 26) జీవో విడుదల చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి మార్చి 3 నుంచి ఏప్రిల్‌ 30 వరకూ ఒకటో తరగతిలో అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 7 వరకు విద్యార్ధులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసు కోవచ్చు. లాటరీ విధానంలో సీట్లను కేటాయి స్తారు. మొదటి రౌండ్‌లో ఎంపికై విద్యార్ధుల వివరాలు ఏప్రిల్‌ 13న వెల్లడిస్తారు. సెకండ్‌ రౌండ్‌ సెలక్షన్‌ లిస్టు ఏప్రిల్‌ 25న ప్రకటిస్తారు. మొత్తం 25 శాతం సీట్లలో అనాధలు, హెచ్‌ఐవీ బాధితు లకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ, పేద ఓసీలకు 6 శాతం సీట్లను కేటాయించున్నారు. అడ్మిషన్లకు సంబంధించి ఇతర వివరాలకు 14417 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించవచ్చు.

విద్యాహక్కు చట్టం ప్రైవేటు పాఠశాలల యాజ మాన్యాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నది, విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుండి ప్రైవేట్‌ పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయలేక పోతున్నాయి, దీనికి ప్రధాన కారణం అధికారుల లోపం? లేకపోతే ప్రైవేటు పాఠశాల లోపమా?విద్యా హక్కు చట్టం ప్రకారం6నుండి14సంవత్సరాల లోపు గల బాల బాలికలందరికీ విద్య ప్రాథమిక హక్కు, ప్రాథమిక పాఠశాలలు కనీస ప్రమాణాలు పాటించవలసి ఉంటుంది, కానీ ఎక్కడా ఇవి అమలు కావడం లేదు, అన్ని ప్రభుత్వ పాఠశా లలు మరియు ప్రైవేటు పాఠశాలలో పేద కుటుంబాల పిల్లలకు 25 శాతం సీట్లు కేటా యించాల్సి ఉంటుంది కానీ ఇది ఎక్కడ ఏ ప్రైవేట్‌ పాఠశాలలో కనిపించడం లేదు. పాఠశాలలో అడ్మిషన్ల కోసం డొనేషన్ల క్యాపి టేషన్‌ ఫీజులు ఫీజులు వసూలు చేయడంపిల్లలు తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయడం విద్యా హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధం అవు తుంది. డ్రాపౌట్‌ స్టూడెంట్‌లను వారి సమాన తరగతి విద్యార్థుల స్థాయికి తెచ్చేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. బడి వయసు పిల్లలందరినీ బడిలో తమ వయసుకు తగిన తరగతుల్లో చూడాలి. ఆవాస ప్రాంతానికి 1కిలోమీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల ఉండాలి,3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమి కోన్నత పాఠశాల ఉండాలి.ఈ విద్యకు అయ్యే ఖర్చు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి,ఏ విద్యార్థిని కూడా ఒక విద్యా సంవత్సరంలో ఏ తరగతిలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ నిలిపి ఉంచకూడదు..ఇది విద్యా హక్కు చట్టానికి విరుద్ధం, ప్రభుత్వ గుర్తింపు లేకుండా బడులు నిర్వహించే కూడదు, ప్రతి పాఠశాలలో యాజమాన్య కమిటీలు లను ఏర్పాటు చేయాలి , అదే విధంగా పాఠశాలలు అభివృద్ధి ప్రణాళి కను తయారు చేయాలి,ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యే వరకు ఎలాంటి బోర్డు పరీక్షలు నిర్వ హించ కూడదు,విద్యావిధానం ఆధునిక ధోర ణులులో మార్పులు సలహాలకు జాతీయ స్థాయిలో జాతీయ సలహా సంఘం,రాష్ట్రంలో రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు చేయాలి. పిల్లలను శారీరకంగా మానసికంగా శిక్షించడం వంటివి చేయరాదు, నాణ్యమైన విద్యకు సంబంధించిన విద్యా ప్రణాళికలు తయారు చేయాలి, మూల్యాంకన విధానాలు రూపొందిం చేటప్పుడు పిల్లల సమగ్ర అభివృద్ధిని రాజ్యాంగ విలువలను తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవా లని ఈ చట్టం పేర్కొంటోంది. ప్రభుత్వ టీచర్‌ ప్రైవేట్‌ ట్యూషన్లు ప్రైవేట్‌ బోధనా పనులు చేపట్టకూడదు. టీచర్‌ నిష్పత్తి ప్రతి బడుల్లో ఉండేలా సంబంధిత ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం చూడాలి. కానీ నేటి వరకు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిం చాల్సిన అటువంటి పాఠ్య పుస్తకాలు డ్రెస్సులు ఇప్పటికీ అందలేదు, ప్రతి పాఠశాలలో 2009 ప్రకారం తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు తరగతి గదులు, వసతి సౌకర్యాలు మొద లైనవి ఉండాలి, విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు వారానికి కనీసం 45 గంటలు పని చేయాలి. ఉపాధ్యాయులు తమకున్న అపోహలు తొలగించుకొని బాలల హక్కుల దృక్పథంతో పనిచేస్తున్నారు, జ్ఞానం అంటే సమాచారం కాదని అది గత అనుభవాలు ఆలోచన ద్వారా ఉత్పన్నమవు తుందని ఉపాధ్యాయుడు భావి స్తాడు, పిల్లలను ఆలూరు ఆలోచింపజే సలా ప్రతి చర్యలో భాగస్వామ్యం చేసేలా బోధనా భ్యసన ప్రక్రియ ఉపాధ్యాయుడు నిర్వహించాలి.విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో ప్రణాళిక (కరికులం) ఉంటుంది. దీని ప్రకారం కార్యక్రమాలు అమలు చేయాలి. అన్ని సహాపాఠ్య విషయాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి.బడి ఈడు పిల్లలు అందరు పాఠశాలలో చేరి విద్యను అభ్యసిం చాలి,విద్యా హక్కు చట్టం ప్రకారం చదువులో వెనుకబడిన పిల్లలకు అదనపు సమయంలో ఉపాధ్యాయులు తరగతులు నిర్వహించాలి. భయారహిత దండ న లేని పాఠశాల వాతా వరణం ఉండాలి. పిల్లలు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్త పరిచే విధంగా తరగతిగది ఉండాలి.పిల్లల యొక్క జ్ఞానాన్ని ఉపాధ్యా యుడు నిరంతరం మూల్యాం కన ద్వారా అంచ నా వేస్తాడు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో పిల్లలకు అవసరమైన తరగతి గదులు తాగునీరు మరుగుదొడ్లు కనీససౌకర్యాలు కల్పించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ప్రత్యేక స్కూలు నెలకొల్పాలి. విద్యాహక్కు చట్టం సరిగా అమలు కాకపోవడం వల్ల ప్రైవేటు పాఠశాలలు విద్యను వ్యాపారం చేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం సరిగా అమలు చేయకపోవడంవల్ల వందలు స్కూలు మూతబడి పోతున్నాయి తద్వారా పిల్లలకు అందాల్సినటువంటి ఉచిత నిర్బంధ విద్య అందకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలావరకూ విద్యా వ్యవస్థకు బడ్జెట్‌ ను తగ్గిం చాయి. దీని ద్వారా అన్ని పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కొరతగా ఏర్పడుతున్నాయి. విద్యా వ్యవస్థకు బడ్జెట్‌ తగ్గించడంతో పాఠశా లల్లో సమస్యలు నాటికీ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు దివాళా తీస్తున్నాయి. ప్రైవేట్‌ స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. దీని ద్వారా ఉచితం గా అందాల్సినటువంటి విద్య కాస్త ఖరీదైన సరుకుగా మారిపోతుంది.విద్యా హక్కు చట్టం అమలు చేయక లేకపోవడం వల్ల దేశ ప్రగతికి పట్టుకొమ్మలు గా ఉండాల్సిన అటువంటి ప్రాథ మిక విద్య పతనం అయిపోతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు లేకపోతే విద్య అనేది పేదవారికి అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. విద్యా హక్కు చట్టం సార్వత్రిక ప్రాథమిక విద్యను అందిస్తుంది కానీ వ్యంగ్యంగా దీన్ని సాధ్యం చేయగల ప్రైవేట్‌ విద్యా ప్రదాతలను పరిమితం చేస్తుంది. చట్టం ప్రారంభానికి ముందు స్థాపించబడిన పాఠశాలలు మూడు సంవత్సరాలలోపు ఆర్‌టీఐ షెడ్యూల్‌లో పేర్కొ న్న నిబంధనలు మరియు ప్రమాణాలకు అనుగు ణంగా ఉండాలని లేదా లేకుంటే మూసి వేయ బడతాయని సెక్షన్‌ 19 పేర్కొంది. చట్టం ప్రకారం ఇప్పటికే గుర్తింపు పొందిన పాఠశా లలు ఆర్టీఈ షెడ్యూల్‌లోని నిబంధనలను మాత్రమే పాటించాల్సి ఉండగా,గుర్తింపు లేని పాఠశాలలు అదనంగా రాష్ట్ర నిబంధనలను కూడా పాటించాలి.చాలా వరకు గుర్తింపు లేని పాఠశాలలు ప్రణాళిక లేని కాలనీల్లోనే ఉండి ప్రాథమిక స్థాయి వరకు బోధిస్తున్నారు. గుర్తిం పు పొందిన పాఠశాలలను కొనుగోలు చేయలేని మరియు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపడానికి ఇష్టపడని తల్లిదండ్రులకు ఈ పాఠశాలలు చౌకైన ప్రత్యామ్నాయం. ఢల్లీిలో గుర్తింపు పొందని పాఠశాలల సాంప్రదాయిక అంచనా ప్రకారం ఒక్కొక్కటి 200 మంది పిల్లలతో దాదాపు 2000 మంది ఉన్నారు. ప్రస్తుత ఢల్లీి రాష్ట్ర నిబంధనల ప్రకారం, పాఠశాలలకు 800 చదరపు గజాల స్థలం ఉం డాలి మరియు ఆరవ వేతన సంఘం తర్వాత ప్రవేశ స్థాయిలో రూ.23,000 ప్రభుత్వ జీతంతో సమానంగా ఉపాధ్యాయుల జీతం చెల్లించాలి.అదనంగా,విద్యా హక్కు చట్టం ప్రతి పాఠశాలకు ఆట స్థలం ఉండాలని నిర్దేశి స్తుంది. ఈ స్థలం మరియు ఉపాధ్యాయుల జీతం అవసరాలు గుర్తించబడని పాఠశాలలకు చేరుకోవడం కష్టం.ఈ ప్రమాణాలను తనిఖీ చేయడానికి ఐదు గుర్తింపు పొందిన పాఠశా లలు,తొమ్మిది గుర్తింపు లేని పాఠశా లలను షహదారాలో సందర్శించారు. గుర్తింపు పొందిన ఐదు పాఠశాలల్లో ఏదీ ప్రస్తుత భూమి ప్రమాణాలకు అనుగుణంగా లేదు మరియు నిర్ణీత ఉపాధ్యాయుల వేతనాన్ని చెల్లించలేక పోయింది. ఒక గుర్తింపు పొందిన పాఠశాల నిర్వాహకుడు తన పాఠశాల 200 చదరపు గజాల స్థల ప్రమాణానికి అనుగుణంగా ఉన్నం దున గుర్తింపు పొందాడు, అయితే ఆ సమయం లో రూ.80,000లంచం చెల్లించాల్సి వచ్చిం ది. అతను ఒక పిల్లవాడికి నెలకు రూ. 250 రుసుము వసూలు చేస్తున్నప్పుడు, అది రూ. 500గా లెక్కించబడుతుంది, తద్వారా అతను ఉపాధ్యాయుని జీతం వాస్తవానికి చెల్లించే దాని కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.గుర్తింపు లేని పాఠశాలలు ఏవీ భూ ప్రమాణాలకు అను గుణంగా లేవు. కనీసం ప్రణాళిక లేని కాలనీల్లోనైనా భూ నిబంధనలను సడలించా ల్సిన అవసరం ఉంది. పాఠశాలలో తగినంత సంఖ్యలో వెంటిలేషన్‌ మరియు కొంత ఖాళీ స్థలం ఉన్నట్లయితే గుర్తింపు ఇవ్వడం ఒక ఎంపిక. అనేక గుర్తింపు లేని పాఠశాలల్లో తరగతికి 15-20 మంది విద్యార్థులు ఉన్నారు మరియు పిల్లలకి అవసరమైన స్థలం ప్రకారం గది పరిమాణాన్ని లెక్కించడం మరింత సమంజసంగా ఉంటుంది. అలాగే, ఉపాధ్యా యుల జీతాలు పూర్తిగా మార్కెట్‌పై ఆధారపడి ఉండాలని ప్రభుత్వం కోరుకోనప్పటికీ, అవాస్తవ ప్రభుత్వ జీతాల కంటే పాఠశాలల ఫీజు ఆధారంగా నిర్ణయించాలి. మూడవది పాఠ శాలలకు ఆటస్థలం కావాలని అడగడం కంటే ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో పార్కు ఉండేలా చూసుకోవాలి మరియు పాఠశాలలు తమ విద్యార్థులకు వ్యాయామ విద్యను అందిం చడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించకుండా పొందగలిగేలా కొంత పర్యవేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయితీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠశాలలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు. అవాస్తవ ప్రభుత్వ జీతాల కంటే పాఠశాలల ఫీజు ఆధారంగా నిర్ణయించాలి. మూడవది పాఠశాలలకు ఆటస్థలం కావాలని అడగడం కంటే ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో పార్కు ఉండేలా చూసుకోవాలి మరియు పాఠశాలలు తమ విద్యార్థులకు వ్యాయామ విద్యను అందించడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించకుండా పొందగలిగేలా కొంత పర్యవేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయి తీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠ శాలలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించ డంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు. అవాస్తవ ప్రభుత్వ జీతాల కంటే పాఠశాలల ఫీజు ఆధారంగా నిర్ణయించాలి. మూడవది పాఠశాలలకు ఆటస్థలం కావాలని అడగడం కంటే ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో పార్కు ఉండేలా చూసుకోవాలి పాఠశాలలు తమ విద్యార్థులకు వ్యాయామ విద్యను అందిం చడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించకుండా పొందగలిగేలా కొంత పర్యవేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయి తీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠశాలలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు. ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో ఒక పార్కు ఉండేలా చూసుకోవాలి మరియు పాఠశాలలు తమ విద్యార్థులకు శారీరక విద్యను అందించడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించకుండా పొందగలిగేలా కొంత పర్య వేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయి తీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠశాలలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు. ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో ఒక పార్కు ఉండేలా చూసుకోవాలి పాఠశాలలు తమ విద్యార్థులకు శారీరక విద్యను అందించడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించ కుండా పొందగలిగేలా కొంత పర్యవేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయి తీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠశా లలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించ డంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు.
వ్యర్థమవుతున్న విద్యాహక్కు చట్టం
ఆర్టికల్‌ 51(కె) ప్రకారం బాల బాలికల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారి సంతానానికి 6 నుండి 14 సంవత్సరాల వరకు విద్యను అందించే సదుపాయాలను ఏర్పాటు చేయాలి. తదనంతరం కేంద్ర ప్రభుత్వం 2009లో బాలలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఏర్పాటు చేసింది, అదేవిధంగా ప్రైవేటు విద్యాసంస్థలలో ఆర్థికం గా వెనుకబడిన బలహీన వర్గాలకు 25% రిజర్వేషన్లు కల్పించాలని నిర్దేశించింది, ఈ చట్టాన్ని సుప్రీం కోర్టులో ప్రైవేటు విద్యా సంస్థలు సవాలు చేశాయి. సొసైటీ ఫర్‌ అన్‌ ఎయిడెడ్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ రాజస్థాన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా తీర్పులో సుప్రీం కోర్టు ధర్మాసనం బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఆమోదిస్తూ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి కల్పించిన 25% రిజర్వేషన్లకు ఆమోదం తెలుపుతూ, ఇందులో ఆర్టికల్‌ 30(1) ప్రకారం ఏర్పడిన మైనారిటీ విద్యాసంస్థలకు మినహాయింపు ఇచ్చింది. ఆర్టికల్‌ 21ఎ చెల్లుబాటును రాజ్యాంగ ధర్మాసనానికి పంపించింది. అదేవిధంగా 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌ 15(5)ను చేరుస్తూ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల (ఓబిసి) వారికి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ల కల్పనకు కేంద్రం వెసలుబాటును కల్పించింది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం 2008లో అశోక్‌ కుమార్‌ ఠాకూర్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా తీర్పులో కేంద్రీయ విద్యా సంస్థలలో ఓబిసి లకు 25% రిజర్వే షన్లకు ఆమోదం తెలుపుతూ ప్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్లపై తేల్చలేదు. సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం 2012 లో ప్రతిమా ఎడ్యుకేషనల్‌ కల్చరల్‌ ట్రస్ట్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండి యా మధ్య జరిగిన కేసును విచారించి 2014లో తుది తీర్పు వెలు వరిస్తూ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన ఆర్టికల్‌ 21ఎ మరియు 93వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన ఆర్టికల్‌ 15(5) లను ఆమోది స్తూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థ లలో కూడా ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ వారికి రిజర్వే షన్ల కల్పనకు ఆమోదించి అదే తీర్పులో ఆర్టికల్‌ 13(1) ప్రకారం ఏర్ప డిన మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఇటీవల జాతీయ నూతన విద్యా విధానం 2019ని అమలులోకి తేవాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీనిపై పార్ల మెంటు ఆమోదంతో చట్టం చేయవలసి ఉంది. సదరు నూతన విద్యా విధానం 2030 నాటికి100% అక్షరా స్యతను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాజ్యాం గం నిర్దేశించి నట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్య నుండి సెకండరీ విద్య వరకు నిరుపేదలకు 25% రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేసి పేద బాల బాలికల కు నాణ్యమైన విద్యను అందించవలసిన అవ సరం ఉంది.-జిఎన్‌వి సతీష్‌

అవంతరాల వలయంలో..విశాఖ స్మార్ట్‌సిటీ

భారతదేశం 2015లో స్మార్ట్‌ సిటీ మిషన్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలోని 100 నగరాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం,ఆర్థికవృద్ధిని పెంచడం దీని లక్ష్యం.నగర/పట్టణ ప్రాంతాల్లోని సామాజిక-ఆర్థిక,పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో స్మార్ట్‌ సిటీ మిషన్‌ సొసైటీలకు సహాయపడుతుంది.2016లో,20 నగరాల మొదటి జాబితాను ప్రకటించారు దేశ్యాప్తంగా అహ్మదాబాద్‌, భువనేశ్వర్‌,పూణే,కోయంబత్తూర్‌,జబల్‌పూర్‌, జైపూర్‌, సూరత్‌, గౌహతి,చెన్నై, కొచ్చి, విశాఖపట్నం, ఇండోర్‌,భోపాల్‌,ఉదయపూర్‌,లూథియానా,కాకినాడ,బెల్గాం,షోలాపూం,భువనగిరి మొత్తం20 నగరాలున్నాయి.
ఇవి సిటీ పౌరులకు సేవలను అందించడానికి సాంకేతికతను ఉపయోగించుకుంటాయి. డేటాను సేకరించేందుకు వివిధ ఎలక్ట్రానిక్‌ పద్ధతులు,సెన్సార్లు ఉపయోగించబడతాయి. అందుకున్న డేటా అంతర్భాగం చెత్త సేకరణ,వినియోగ సరఫరా,ట్రాఫిక్‌ కదలిక,పర్యావరణ నిర్వహణ,సామాజిక సేవల నిర్వహణలో కార్యాచరణ మెరుగుదలకు సహాయపడతాయి. అలాగే కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. స్మార్ట్‌ హెల్త్‌కేర్‌ సిస్టమ్‌,గవర్నెన్స్‌,రవాణావ్యవస్థ,భద్రత కోసం మెరుగైన నిఘా,స్మార్ట్‌ మౌలిక సదుపాయాలు,మెరుగైన ఉద్యోగావకాశాలు,సౌకర్యవంతంగా జీవించే ప్రతి ఇతర సౌకర్యాలు కల్పిస్తాయి.
వాస్తవానికి స్మార్ట్‌ సిటీ అంటే ప్లానింగ్‌ పక్కాగా ఉండాలి.కానీ ఎక్కడ ఏం జరుగుతుందో..ఏ పని ఎటు వెళ్తుందో తెలియక తికమకపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మరెక్కడో కాదు ఏపీలో కీలక నగరమైన విశాఖపట్నంలోనే.స్మార్ట్‌సిటీలో నిరుపేదలు జీవించే పరిస్థితులు లేకుండా పోతుంది. నగరానికి జీవనోపాధి పొట్టకూటి కోసం వచ్చే వలసవాదులు,బీక్షాటన చేసే బిక్షగాళ్లకు సరిjైున సదుపాయాలు లేక రోడ్డుజంక్షన్లవద్దనే భిక్షాటన చేయడం శోచనీయం.వీటికి చట్టాలున్నా శూన్యంగానే ఉంది. మరోపక్క చెత్త,చెదారం,ఆహార వ్యర్ధాలు విచ్చలవిడిగా పడేయడంవల్ల నగరమంతా అస్తవ్యస్థంగా మారుతోంది. స్మార్ట్‌సిటీ అంటే చెత్తరీసైక్లింగ్‌కు అధిక ప్రాధాన్యత కల్పించాలి.కానీ ఆపరిస్థితి విశాఖలో కన్పించడం లేదు.స్మార్ట్‌సిటీ అంటే కేవలం మెయిన్‌ రోడ్లుకు మరమ్మతులు,డివైడర్ల మధ్య పూల మొక్కలు,ప్రగహారీగోడలకు రంగులు వేయడమేనా?నగరాన్ని ఆనుకొని ఉన్న మురికివాడలు,గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానం చేస్తూ లింక్‌ రోడ్డు నిర్మిణాలు ఎక్కడ జరుగుతున్నాయి? పచ్చని చెట్లు నరికేసి మొదళ్లు,మోడులకు రంగులు వేయడం అవసరమా?.అలాగే ప్లాస్టిక్‌ నియంత్రణ ప్రకటనలకే పరిమితమైయ్యింది.నగర నడిబొడ్డునఉన్న ఎన్నో షాపింగ్‌ మాల్స్‌,దుకాణాల్లోను ప్లాస్టిక్‌ తాండవి స్తోంది.దీంతో నగరపరిసరాలన్నీ ప్లాస్టిక్‌మయంగా మారింది.పరిశ్రమల నుంచి వెలువడే కాలు ష్యకారకాలు,వాహన శబ్దకాలుష్యాలు నగరాన్ని రాజ్యమేలు తున్నాయి.

జగనన్న ఇళ్లు స్థలం పేరుతో నగరంలో జీవిస్ను నిరుపేదలను3040కిలోమీటర్ల దూరంలో అభయారణ్యాల మధ్య నగరం నుంచి గెంటేశారు. వీరంతా నగరంలో చిన్నచితక పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న నిరుపేదలే.ఇప్పుడంతా వారు నిర్వాసితులయ్యారు. ఉన్నచోటనే నిరుపేదలకు ఉపాధి,ఇతర మౌళిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వాలు స్మార్ట్‌సిటీ పేరుతో పేదలను నగరం నుంచి గెంటేయడం ఎంతవరకు సమాంజసం. ఇక ఇంటర్నెట్‌ ఆఫ్‌థింగ్స్‌,పబ్లిక్‌ సేఫ్టీ,స్మార్ట్‌ మొబిలిటీ,పెరిగిన టూరిజం,సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌,ఫిజికల్‌ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నగరాన్ని స్మార్ట్‌ సిటీలుగా మార్చడాన్ని సులభతరం చేస్తాయి.కానీ నగరాన్ని ఆనుకొని స్మార్ట్‌సిటీలో విలీనమైన దబ్బంద గ్రామంలో ఇప్పటికీ సెల్‌ఫోన్‌ సిగ్నిల్‌ రావడం లేదు.దీనివల్ల అనేక మంది నిరుపేద ప్రజలు ప్రభుత్వం కల్పించే సంక్షేమ ఫలాలు సక్రమంగా పొందలేకపోతున్నారు.

ఈనెల 28,29,30తేదీల్లో జరిగే జీ20సదస్సుకు కోసం జీవీఎంసీ రూ.150కోట్లతో నగరాన్ని సుందరీకరణ చేస్తుంది కానీ అస్తవ్యస్థంగా పడి ఉన్న చెత్త,ప్లాస్టిక్‌ సేకరణలో మాత్రం చూసిచూడనట్టు వ్యవహరిస్తోంది.సేకరించిన చెత్త,ప్లాస్టిక్‌ నియంత్రణ కోసం శాస్త్రీయమైన రీసైక్లింగ్‌ పద్దతులను పాటించి పర్యావరణ పరిరక్షణకు బాధ్యత వహించాల్సిన అవశ్యకత ఎంతైనాఉంది.అప్పుడే స్మార్ట్‌సిటీ ప్రయోజనాలు ప్రజలకు సమకూరుతాయి. – రెబ్బాప్రగడ రవి,ఎడిటర్

చూసి కూడా చదవలేకపోతున్న పిల్లలు

పిల్లలకు చదవడం రావట్లేదు, చిన్న పాటి లెక్కలూ చేయట్లేదు. చివరికి మాతృ భాష లోని అక్షరాలనూ గుర్తించటం లేదు. ఇక.. తీసి వేతలు, భాగాహారాల గురించి.. ఎంత తక్కువ మాట్లాడుకుంటే..అంత మంచిది. అంకెలు తెలి యని వాళ్లు కూడా తక్కువేమీ లేరు. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి దాకా..ప్రతి క్లాస్‌లో ఇలాంటి పిల్లలు ఉన్నారని.. అసర్‌ రిపోర్ట్‌ తేల్చింది. దీంతో.. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అంటూ ప్రభు త్వాలు చేస్తున్న ప్రచారమంతా ఉత్తిదేనని తేలి పోయింది. ప్రాథమిక విద్యా ప్రమాణాలు ఇంత దారుణంగా పడిపోవటానికి కారణమేంటి?
దేశంలో..ఈమూల నుంచి ఆ మూలదాకా..ఏప్రభుత్వ పాఠశాలను తీసు కున్నా..ఇదే పరిస్థితులుఉన్నట్లు తేల్చింది అసర్‌ రిపోర్ట్‌. అక్కడో..ఇక్కడో ఎందుకు..మన తెలు గు విద్యార్థుల గురించే తెలుసు కుందాం. అందరి మాతృభాష తెలుగే అయినా.. కొంద రికి తెలుగు చదవడమే రావట్లేదు. ఇంకొం దరు..తెలుగు అక్షరాలను కూడా గుర్తు పట్టడం లేదు. పోనీ.. ఇంగ్లీషే మైనా ఇరగదీస్తున్నారా? అంటే..అదీ లేదు. తెలుగు చదవడంలో.. రెండురాష్ట్రాల విద్యా ర్థులు కొంత వెనుకబడి నట్లు తెలుస్తోంది. ప్రముఖ రీసెర్చ్‌ ఆర్గనై జేషన్‌..యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌..అసర్‌ రిలీజ్‌ చేసిన రిపోర్టులో..ఈ విష యాలు బయటపడ్డాయి. ఆ సర్వే ప్రకారం.. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి దాకా చాలా మంది పిల్లలు..చదువులో బాగా వెనుకబడి పోయినట్లు తేలింది. దాదాపు ప్రతి తరగతిలోనూ తెలుగు కంటే ఇంగ్లీషులో విద్యార్థులు కొంత మెరుగ్గా ఉన్నారు.మూడో తరగతి స్టూడెంట్స్‌ విషయానికొస్తే..అక్షరాలు చదవగలుగుతున్నా.. పదాలు చదవలేకపోతున్నారు. పదాలు చదివే వాళ్లు..ఒక మోస్తరు వాక్యాలను, పేరాలను చద వలేని స్థితిలో ఉన్నారు. ఇక.. గణితం విషయాని కొస్తే.. మూడో తరగతి విద్యార్థు ల్లో చాలా మందికి అంకెలు కూడా గుర్తించలేక పోతున్నారు.99 దాకా అంకెలే తెలియడం లేదు. సగానికి సగం పిల్లలు.. తీసివేతలు చేయలేకపోతున్నారు.మెజారిటీ విద్యా ర్థులకు భాగాహారాలు ఎలా చేయాలో కూడా తెలి యడం లేదని.. అసర్‌ రిపోర్ట్‌ తేల్చింది. చివరికి.. ఎనిమిదో తరగతిలోనూ..అంకెలు గుర్తించలేని విద్యార్థులున్నారు.ఇంగ్లీషుపదాలుచదవలేక పోతున్న విద్యార్థులశాతం కూడా భారీగానే ఉంది. సులభ మైన పదాలు గుర్తించడంలోనూ పిల్లలు బాగా వెనుకబడిపోయారు.ఈజీ వర్డ్స్‌తెలిసినా.. సులభ మైన వాక్యాలు తెలియని పిల్లలు కూడా ఎంతో మంది ఉన్నారు. దీంతో.. ప్రభుత్వ పాఠశా లల్లో విద్యా ప్రమాణాలపై ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారం..కొన్ని పాఠశాలలకే పరిమి తమైందని అర్థమవుతోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని.. ప్రభు త్వాలు చెబుతున్నా.. చాలా మంది ప్రైవేటుగా ట్యూషన్లకు వెళ్తున్నారని తేల్చింది అసర్‌ రిపోర్ట్‌. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి దాకా..కనీసం 15 శాతం మంది విద్యార్థులు డబ్బులు చెల్లించి ట్యూషన్లలో పాఠాలు చెప్పించుకుంటున్నారు. ఓవరాల్‌గా.. దేశం లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో..30శాతానికి పైగా ప్రైవేట్‌ ట్యూష న్లు చెప్పించుకుంటున్నారని తేల్చారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం.. 2018తో పోల్చుకుంటే 2022లో దారుణంగా పడిపోయింది. దేశవ్యాప్తంగా.. అన్ని రాష్ట్రాల్లో 7లక్షల మంది విద్యార్థులతో సర్వే నిర్వహిం చారు.దాని ప్రకారం.. మూడో తరగతి విద్యా ర్థులు..రెండో తరగతి పాఠాలను తప్పుల్లే కుండా చదవగలిగే వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నట్లు తేల్చారు.5,8వ తరగతి విద్యార్థులు కూడా తప్పులు లేకుండా చదవలేకపోతున్నారు. మ్యాథ్స్‌ లోనూ చాలా మంది విద్యార్థులు వెనుకబడిపోయా రని తేలింది. సక్రమంగా లెక్కలు చేసే స్టూడెంట్స్‌.. ప్రతి క్లాసులో చాలా తక్కువగా ఉన్నారు. 2012, 2014,2016లో నిర్వహించిన సర్వేలతో పోలిస్తే.. గతేడాది చేసిన సర్వేలో..విద్యార్థులఅభ్యసన ప్రమా ణాలు బాగా పడిపోయాయ్‌. ప్రతిరోజూ పాఠ శాలలకు హాజరైన వారి సంఖ్య కూడా 72 శాతమే. నాలుగో వంతు మంది విద్యార్థులు.. ఏదో ఒక కారణంతో..స్కూళ్లకు వెళ్లడం లేదు. అయితే.. హాజరుశాతం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇక..అతిచిన్న ఇంగ్లీష్‌ వాక్యాలను కూడా విద్యా ర్థులు చదవలేకపోతున్నట్లు సర్వేలో తేలిం ది.ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో..వేర్‌ ఈజ్‌ యువర్‌ హౌజ్‌,ఐ లైక్‌ టు ప్లే లాంటి వాక్యాలను చదివి.. అర్థం చెప్పలేని వారు 37శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక 14శాతం బడుల్లో తాగునీటి సౌకర్యం లేదని, 20 శాతం పాఠశాలల్లో సదుపాయం ఉన్నా తాగునీరు లేదని అసర్‌ నివేదిక తెలిపింది. పద్నాలుగున్నరశాతం పాఠశాల్లో మరుగుదొడ్లు ఉన్నా..అవి నిరుపయోగంగా ఉన్నా యని తెలిపింది.20శాతం పాఠశాలల్లో లైబ్రరీ లు లేవని, 76శాతం స్కూళ్లలో కంప్యూటర్లు లేవని.. 19 శాతం బడుల్లో పీఈటీలు లేరని అసర్‌ నివేదిక వివరించింది.
ఉపాధ్యాయులు లేకుండా నాణ్యమైన విద్య ఎలా ?
విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌ జాతీయ స్ధాయి కంటే మెరుగ్గా ఉన్నట్లు ఇటీవల విడుదలైన ‘అసర్‌ నివేదిక-2022’ తెలియజేసింది. పూర్వ ప్రాథమిక స్కూళ్లలో జాతీయ సగటుకు మించి ఎ.పిలో చిన్నారుల చేరిక వుండటం,బాలికల డ్రాపౌట్లు అతి తక్కువగా ఉండటం,ఆంగ్లం సామర్థ్యంలో జాతీయ సగటుకు మించి ఫలితాలుండడం మనం గమనించవచ్చు. జాతీయ సగటును మించి వున్నాం కదా అని సంతోషించేలోగా…ప్రైవేటు ట్యూషన్లకు డిమాండ్‌ పెరగడం కూడా నివేదికలో కన్పిస్తుంది. పైగా అభ్యసనా సామర్ధ్యం తీవ్రంగా ప్రభావిత మైందని ఈ నివేదిక తెలియజేసింది.కరోనా కార ణంగా దాదాపు రెండేళ్లపాటు పాఠశాలలు మూత పడడంతో అభ్యసనంలో గతంలో సాధించిన మెరుగుదల కూడా దెబ్బతిన్నట్టు నివేదిక పేర్కొంది. బాల బాలికల అభ్యసనా సామర్ధ్యం చదవడం లోనూ,గణితం(కూడిక, తీసివేత, గుణించడం, భాగించడం)లోనూ 2012 స్థాయికి దిగజారింది. కచ్చితంగా ఒకదశాబ్ద కాలంపాటు వెనక్కు పోయా మంటే కరోనా మహమ్మారి దెబ్బ తీవ్రత ఎంతలా వుందో విశదమవుతోంది. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ఎన్ని అతిశయోక్తులు చెప్పినా, ఈ ప్రమా ణాలు,ప్రాతిపదికలు, గణాంకాలు శాస్త్రీయంగా, హేతుబద్దంగా ఆసమాజ స్థితిని నిర్ధారిస్తాయి. సమాజంలో విద్యారంగం ఎలా ఉందనేది అటు వంటి ప్రమాణాలలో ఒకటి. ఆంధ్రప్రదేశ్‌ లోనూ అభ్యసన సామర్ధ్యాలు 2012 సంవత్సరం స్ధాయికి పడిపోవడాన్ని నివేదిక స్పష్టం చేసింది.
ప్రభుత్వం మాత్రం వినూత్న పథకాలతో విద్యావిప్లవం వచ్చిందని గొప్పగా ప్రకటించడం మనం చూస్తున్నాం. విద్యా కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం ఖర్చు చేసిన బడ్జెట్‌ వివరాలను,విద్యా ర్థులకు అందజేసిన సంక్షేమ పథకాలను,వాటి వల్ల బడిలో చేరినపిల్లల గూర్చి,మన బడి,నాడు-నేడు పథకంతో పాఠశాలల కార్పొరేట్‌ రూపాన్ని… గణాంకాలతో సహా ఆర్భాటంగా చెప్తారు. కానీ ఉపాధ్యాయుల నియామకాల గురించి మాత్రం స్పందించరు. ప్రతి సంవత్సరం డియస్సీ నిర్వహిస్తా మన్న ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయరు. ఈ ప్రభుత్వం ఏర్పడి మూడున్నర సంవత్సరాలు గడిచి పోయినా, ఇప్పటికీ మెగా డియస్సీ నోటిఫికేషన్‌ ఇస్తారని ఎదురుచూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయుల భవిష్యత్తు గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. భారత పార్లమెంట్‌లో ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 50,277 టీచర్‌ పోస్టులు ఖాళీగా వున్నాయి. పాఠశాలల్లో ఉపాధ్యా యుల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ కొత్తగా ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. పైగా ఉన్న ఉపాధ్యాయులనే సర్దుబాటుచేసి, జీవో 117,124 లను అనుసరించి పాఠశాలలను విలీనం చేసి పాఠశాలల సంఖ్యను కుదించడం వేగంగా జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌ లో డియస్సీ నియామకాలు జరిగి సుమారు 5 సంవత్సరాలు అయ్యింది. 2018లో అప్పటి ప్రభు త్వం 7000 పోస్టులతో నిర్వహించింది. ఈ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత విలీనం పేరుతో పాఠశా లల కుదింపు,ఉపాధ్యాయ విద్యార్ధి నిష్పత్తిని పెంచడం ద్వారా ఉపాధ్యాయ పోస్టులను తగ్గిం చింది. గత ప్రభుత్వాల కాలంలో 1996,1998, 1999,2000,2001,2002,2003,2018 సంవత్సరాలలో వరుసగా డియస్సీలు నిర్వహించి లక్షా నలభై అయిదు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. అంటే ఇప్పుడు సర్వీసులో ఉన్న 70శాతం మంది ఉపాధ్యాయులు గత ప్రభుత్వ హయాంలో నియమింపబడినవారే. ఈ ప్రభుత్వ హయాంలో ఈ నాటికీ ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ కాలేదంటే వీరి చిత్తశుద్ధిని శంకించాల్సిందే. విద్యార్థులకు గత మూడు సంవత్సరాలుగా అమ్మ ఒడి పథకం అమలు చేయడం, జగనన్న విద్యా కానుక పేరుతో ప్రతి విద్యార్ధికి మూడు జతల యూనిఫాం, స్కూలు బ్యాగ్‌,పాఠ్యపుస్తకాలతో పాటునోట్‌ పుస్తకాలు, బూట్లు,సాక్సులు,బెల్టు,ఇంగ్లీషుడిక్షనరీ,ఈ సంవత్స రం ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇవ్వడం, జగనన్న గోరుముద్ద నిజంగా విద్యార్థుల పాలిట వరం లాంటివే. పాఠశాల రూపురేఖల్ని మార్చడం, అవసరమైన అన్ని మౌలిక వసతుల కల్పన నిజంగా మెచ్చుకోదగినవే. కానీ విద్య కోసం బడ్జెట్‌ కేటాయిం పులు చూస్తే మాత్రం ఎక్కడో వుంటాం.ఢల్లీి ప్రభు త్వం 2022-23 సంత్సరానికి తమబడ్జెట్‌లో 23. 50శాతం కేటాయించి ప్రథమస్థానంలో ఉంటే, ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో 12.70శాతం కేటా యించి 21వస్థానంలోఉంది.
బడ్జెట్‌ కేటాయింపుల పరంగా చూస్తే మన ప్రభుత్వం విద్యారంగానికి ఎంత తక్కువ కేటాయించిందో మనం గమనించవచ్చు. రూ. వేల కోట్లు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలకు తగిన సౌకర్యాలు కల్పించి నూతన హంగులు సమకూర్చి నప్పటికీ విద్యార్థులకు పాఠాలు బోధించడానికి ఉపాధ్యాయులను నియమించకపోతే విద్యా నాణ్యత పెరిగేనా?విద్యా విప్లవం వచ్చేనా? కేంద్రం తీసు కొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం-2022ను దేశంలోనే అత్యుత్సాహంతో మొట్టమొదట అమలు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.తరగతుల విలీ నంతో గ్రామగ్రామాన ప్రాథమిక పాఠశాలలు అల్లకల్లోలమయ్యాయి. ఒక కిలోమీటర్‌ పరిధిలో ఉన్న పాఠశాలలను విలీనం చేసిన ప్రభుత్వం, మళ్ళీ పది మందికన్నా తక్కువ విద్యార్థులున్న పాఠ శాలల విలీనానికి పూనుకున్నది.
వ్యాసకర్త : ఎ.పి యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి-(జిఎన్‌వి సతీష్‌/ఎస్‌.పి.మనోహర్‌ కుమార్‌)

అందరికీ అందాలి ఆహారం

మానవుని జీవితంలో ఆహారం ప్రాముఖ్యర గురించి అందరికీ తెలిసిందే. ఈ భూమిపై జీవి మనుగడ కొనసాగడానికి ఆహారం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. అలాగే ఆహారం లేకుండా ఎక్కువ కాలం జీవించడం సాధ్యం కాదు.. జీవితంలో ఆహారం ప్రాముఖ్యతను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అయితే ఉత్పత్తి తగ్గుదల, ప్రభుత్వ విధానాలు, కోవిడ్‌-19 మహమ్మారి, పరిణామాలు, వాతావరణ మార్పులు, అసమానతలు, పెరుగుతున్న ధరలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలతో సహా అనేక సవాళ్లు ప్రజలకు పౌష్టికాహారాన్ని దూరం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ప్రభుత్వాలు ఈ ప్రతి సవాళ్లను ఎదుర్కొనే దిశగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. – ఉదయ్‌ శంకర్‌ ఆకుల
ఆహారం ప్రాథమిక మానవహక్కుగా పరిగణించబడుతుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ తొమ్మిది మందిలో ఒకరు దీర్ఘకాలిక ఆకలిని అనుభవిస్తున్నారు. ఇదే ప్రస్తుతం అందరికీ ఆందోళన కలిగిస్తున్న అంశం. ఎందుకంటే ఇది భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని అంచనా. సంపన్నులు మరింత సంపన్నులుగా..పేదలు మరింత పేదలుగా మారుతున్న ఆర్థిక విధా నాలు అమలు జరుగుతున్న నేపథ్యం ఒక ముఖ్య కారణం.ఓ వైపు కోవిడ్‌-19 మహమ్మారి ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థి తులను తీవ్రంగా దెబ్బతీసింది. అనేక మంది ఉపాధి కోల్పోయి సరైన పోషకాహారం అందని పరిస్థితి. ఇదిలా ఉంటే ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గుదల, పోషకాహారం లోపం నానాటికీ పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఆహారాన్ని ఆదా చేయడం, ఆహార వ్యర్థాలను తగ్గించడం, వ్యవ సాయం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల అభివృద్ధిని పెంచడం మనముందున్న తక్షణ కర్తవ్యం. అయితే ఆహారం విలువ తెలియ జెప్పడంతో పాటు ప్రతి ఒక్కరికీ సరైన పోషకాహారం అందించాలన్న లక్ష్యంతో, భవిష్యత్తు తరాల కోసం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న పోషకాహారలోపం సమస్యలను నిర్మూలిం చాలనేది కూడా ఈ వరల్డ్‌ ఫుడ్‌ డే ప్రధాన ఉద్దేశం. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) 1945లో ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రపంచ దేశాలన్నీ పాటిస్తున్నాయి. 1979 నుండి ఏటా అక్టోబర్‌ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఆహారం విలువ ఏంటో చాటి చెప్పటానికే. హంగేరియాకు చెందిన మాజీ వ్యవసాయ, ఆహార మంత్రి డాక్టర్‌ పాల్‌ రోమానీ సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఈ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.
గ్లోబల్‌ సమస్యగా..
గత మూడేళ్లుగా..‘సార్స్‌’..‘కరోనా’..‘మంకీ పాక్స్‌’..వంటి మహమ్మారులను ఎదుర్కొం టున్నాం..కానీ వీటన్నింటికన్నా ‘ఆకలి’ పెద్ద మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా ఉండే అత్యంత పెద్ద మహమ్మారి ఇదే. మనిషి ఏం చేసినా ఈ ఆకలి తీర్చుకోటానికే. జానెడు పొట్ట నింపుకోవటానికి కాయకష్టం చేసే కూలీల నుంచి కోట్లకు పడగలెత్తినవారు కూడా ఆకలి తీరందే ఏ పనీ చేయలేరు.ఆ కడుపు నింపు కోవటానికే ఇన్ని పాట్లు. ఈ ఆకలి అనేక పేద దేశాల్లోనే కాదు.. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలను సైతం వెంటాడుతోంది.. అయితే అన్నిరకాల ఆహారం, ఇంకా చెప్పాలంటే మితిమీరి తినగలిగే వారు కొందరుంటే.. పట్టెడన్నం లేక ఆకలితో చనిపోయే దారుణ స్థితిలో అత్యధిక పేదలున్నారు. ఈ అసమానత సరికావాల్సి ఉంది. ఎయిడ్స్‌,మలేరియా,క్షయ వ్యాధుల వల్ల జరిగే మరణాల కంటే..ఆకలి వల్ల జరిగే మరణాల రేటే ఎక్కువగా ఉందనే విషయం అత్యంత ఆందోళన కలిగించే విషయం. ఈ మరణాల స్థాయి ఎంతగా ఉందంటే..ప్రతిరోజూ 10,000 మందికి పైగా పిల్లలతో సహా 25,000 మంది ఆకలి, సంబంధిత కారణాలతో మరణిస్తున్నారు. అయితే ఓ పక్క పెరుగుతున్న జనాభా. మరోపక్క తగ్గుతున్న వ్యవసాయం. అసమా నతను పెంచే పాలకుల విధానాలు.. దీంతోనే అధికమవుతున్న ఆకలి చావులు. ఈ క్రమంలో 2050 నాటికి ప్రపంచ జనాభా 9.6 బిలి యన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ పరిస్థి తుల్లో ఆహార ఉత్పత్తిని పెంచడం అంటే తక్కువ స్థలంలోనే ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తే కొంతలో కొంత ఆహార సంక్షోభాన్ని నివారించవచ్చు. కానీ వ్యవసాయం చేసే పద్ధతులు ముఖ్యంగా సేంద్రీయ పద్ధతులనే అనుసరించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నా అది ఆచరణలో ఫలితాలు ఇవ్వవనేది.. తక్షణ సమస్యను పరిష్కరించలేవనేది శ్రీలంక పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. మెరుగైన పంట,నిల్వ,ప్యాకింగ్‌,రవాణా,మౌలిక సదు పాయాలు, మార్కెట్‌ యంత్రాంగాలతో పాటు, సంస్థాగత చట్టపరమైన చర్యలు అవసరం. వీటితో పాటు అనేక కార్యక్రమాల ద్వారా ఆహార నష్టాలను తగ్గించే ప్రయత్నాలు చేయాలి.
జిహెచ్‌ఐలో దిగజారిన భారత్‌..
మరోవైపు గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో భారత్‌ మరింత దిగజారింది. పోషకాహార లోపం, చిన్నారుల్లో వయసుకు తగిన బరువు, ఎత్తు లేకపోవడం, మరణాలు.. అనే నాలుగు సూచికల ఆధారంగా ఈ జాబితా రూపొం దిస్తారు. ప్రపంచ ఆకలి సూచిక (జీహెచ్‌ఐ) 2022లో 121 దేశాల్లో భారత్‌ 107వ స్థానా నికి పడిపోయింది. అంతకు ముందు నివేదిక ప్రకారం 101వ స్థానంలో ఉండగా..ప్రస్తుతం 107కి దిగజారడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మన సరిహద్దు దేశాలైన పాకి స్తాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ కంటే కూడా భారత్‌ వెనుకబడి ఉందని తెలుస్తోంది. బ్రెజిల్‌, చిలీ, చైనా,క్యూబా,కువైట్‌ సహా 18 దేశాలు జీహెచ్‌ఐ స్కోరు తొలి అయిదు స్థానాల్లో నిలిచాయి. ఈ వివరాలు ఆకలి, పోషకాహార లోపాలను లెక్కించే జిహెచ్‌ఐ వెబ్‌సైట్‌ గతేడాది వెల్లడిరచింది.
ఆహార ధాన్యాల సంక్షోభం..
ప్రపంచవ్యాప్తంగా 852 మిలియన్ల మంది దీర్ఘకాలంగా అతి పేదరికం కారణంగా ఆకలితో అలమటిస్తున్నారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇందుకు కారణాలు అనేకం. ముఖ్యంగా ప్రభుత్వాలు అనుసరించే విధానాలు అసమానతలను పెంచేలా ఉండటం. విపరీతమైన జనాభా పెరుగుదల,వాతావరణ మార్పు, ఆహార ధాన్యాలను జీవ ఇంధనాల కోసం ఉపయోగిం చడం,మౌలిక ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గించి లాభదాయకమైన వాణిజ్య పంటలవైపు మొగ్గుచూపడం…ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, చట్టాలు చేయడం..సరైన ప్రోత్సా హకాలు లేకపోవడం..గిట్టుబాటు ధర లేకపోగా..కనీస మద్దతు ధర లేకపోవడంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నారు.దీంతో నష్టాలతో కూడిన వ్యవసాయం చేయలేక ప్రతీ ఏటా రైతులు తగ్గిపోతున్నారు.చదువుకున్నవారు వ్యవసాయం చేయడానికి ఇష్టపడట్లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే మరికొద్ది రోజుల్లో ప్రపంచం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి తీవ్రం కావొచ్చు. వీటన్నింటి పర్యవసానంగా ఆహారధా న్యాల ధరలు ఆకాశాన్నంటటం మరో సమస్య.
మహిళలపై ఎక్కువ ప్రభావం..
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 821 మిలియన్ల ప్రజలు పోషకాహార లోపంతో బాధపడు తున్నారు. తద్వార వీరు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో దాదాపు 99 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన ప్రజలే కావటం గమనించాల్సిన విషయం. ఆకలి అంటే అమ్మే గుర్తుకొస్తుంది. అటువంటి అమ్మ తాను ఆకలితో అలమటిస్తున్నా బిడ్డల కడుపు నింపాలనే చూస్తుంది. అటువంటి మహిళలే ఇప్పుడు ఎక్కువగా ఆకలితో బాధపడుతున్నారు. ఏ ఒక్క సమస్య వచ్చినా అది ముందు మహిళలపైనా, వారి ఆరోగ్యాలపైనా ప్రభావం చూపుతున్నాయి. అలాగే ఆకలి, పోషకాహార సమస్య కూడా మహిళలనే ఎక్కువగా వెంటాడుతోంది. ప్రపంచంలో ఆకలితో ఉన్నవారిలో 60 శాతం మంది మహిళలే ఉండటం గమనించాల్సిన విషయం. మహిళలు ఆకలితో ఉంటే ముఖ్యంగా గర్భిణులకు ఇలాంటి సమస్య ఉంటే పుట్టే పిల్లల మీదా ఆ ప్రభావం పడుతుంది. దీంతో అనారోగ్యకరమైన పిల్లలు జన్మిస్తారు. ప్రస్తుతం జరిగేదీ అదే.. ఏటా దాదాపు 20 మిలియన్ల మంది పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారనే గణాంకాలే దీనికి నిదర్శనం. ఇందులో కూడా 96.5 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉండటం గమనార్హం. వీరిలో ప్రతి ఐదు జననాలలో ఒక బిడ్డ సరైన వైద్య సదుపాయం లేకపోవటం వల్లే ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి. దీంతో పిల్లల మరణాలలో 50 శాతం మంది ఐదు సంవత్సరాల లోపు వారే ఉండటం గమనించాల్సిన విషయం.
కారకులు ఎవరు..?
ప్రకృతితో సహజీవనం చేస్తున్నప్పుడు అనూహ్యంగా సమస్యలు వస్తుంటాయి. అటువంటి సందర్భాల్లోనూ ఆహారం అత్యవసరం. ఆ దిశలో పాలకుల ధ్యాస ఉండాలి. అందుకు తగ్గ ప్రణాళికలు చేయాలి. ఇలాంటి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నట్లనిపిస్తున్నా ఎక్కడో ఏదో లోపం ఉందనిపిస్తుంది. అందుకు నిదర్శనమే ఈ నాటికీ అన్నం లేక విలవిల్లాడు తున్న దేశాలు. కారణం కరువు కావచ్చు. వరదలు కావచ్చు. ఆర్థిక వెనుకబాటుతనమూ కావచ్చు. వీటన్నింటికీ మూలం ప్రభుత్వ విధానాలేనన్న విషయం మరిచిపోకూడదు. ఏదేమైనా ఇది మానవాళి ఎదుర్కొనే తీవ్రమైన బాధ. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య భారత్‌లోనే ఎక్కువగా ఉందని ఓ నివేదిక పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 47 ప్రకారం దేశంలో పోషకాహార ప్రమాణాలను కాపాడటం ప్రభుత్వాల విధి. మరి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు సూచిస్తు న్నారు. అయితే దేశంలో పౌరులందరికీ ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వటంలేదనేదీ మరో వాదన.
కలుషిత ఆహార బాధితులు..
తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఏది దొరికితే అది తిని,ఆకలి తీర్చుకోవాల్సిన దుస్థితి ఓ పక్క అయితే.. ధనార్జనే ధ్యేయంగా కొందరు అక్రమా ర్కులు ఆహారాన్ని కల్తీ చేయడం వల్ల, అక్రమ నిల్వలు చేసేందుకు క్రిమిసంహారకాలు కల పడం,నిల్వ ఆహారం తినడం వల్ల కూడా ఆహారం కలుషితం అవుతోంది. దీనికితోడు అపరిశుభ్రమైన వాతావరణం, కలుషిత నీరు, మురికి కూపాలుగా మారుతున్న మురికి వాడలు.. వెరసి.. ప్రపంచంలో ప్రతి10 మందిలో ఒకరు కలుషిత ఆహార బాధితులుగా మారుతున్నారు. పిల్లల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది. ఏటా ఐదేళ్ల లోపు పిల్లలైన 1,25,000 మంది కలుషిత ఆహారం కారణంగా మరణి స్తున్నారు. సురక్షిత, శుభ్రమైన ఆహారాన్ని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, కలుషిత ఆహారం ద్వారా కలిగే అనారోగ్యం తదితర అంశాలపై అవగాహన పెరగాలి.
అడుగంటుతున్న నిల్వలు..
ఆహారకొరత దేశాన్ని కూడా చుట్టుముడు తోంది..తాజా పరిణామాలు ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశంలో బియ్యం నిల్వలు గణనీయంగా తగ్గుతున్నాయి. గత ఏడా ది ఇదే సమయానికి దేశంలో 78.6 మిలి యన్‌ టన్నుల బియ్యం నిల్వలు ఉండగా, ఈ ఏడాది నిల్వలు 44 మిలియన్‌ టన్నులకు పడిపోయా యి. రానున్న రోజుల్లో ఈ అనను కూల వాతా వరణ పరిస్థితుల్లో ఆహార కొరత ఏస్థాయిలో విరుచుకుపడనుందో ఈ సంఖ్యలే తేటతెల్లం చేస్తున్నాయి. దీనికి తోడు ఈ ఏడాది ధాన్యం సేకరణ కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని, నిర్ధేశించిన లక్ష్యాలు అందు కోవడం దాదాపు అసాధ్యమనే అంచనాలు వెలువడుతున్నాయి. వీటిని కూడా పరిగణలోకి తీసుకుంటే దేశంలో తిండి గింజలకు సంబం ధించి ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టే! అదే జరిగితే సామాన్యుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టే! ఈ ఏడాది ప్రారంభం లో గోధుమలకు తీవ్ర కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. అంతకన్నా తీవ్రగానే బియ్యం కొరత రానుందని ‘డౌన్‌ టు ఎర్త్‌’ తాజాగా ఒక కథ నాన్ని ప్రచురించింది.
వృథా అరికట్టడం అవసరం..
ఈ రోజుల్లో అన్నం విలువ కొంతమందికే తెలుస్తుంది. ఎందుకంటే అన్నం తినేవాడికన్నా దానిని పండిరచేవారికే దాని యొక్క విలువ తెలుస్తుంది. ఆహారం పారేయడానికి ఒక్క నిమిషం చాలు. కానీ ఆ ఆహారాన్ని పండిరచ డానికి కనీసం మూడు నెలలు పడు తుంది. ఆ విషయం తెలియక చాలా మంది దానిని వృథా చేస్తారు.అయితే ఏటా సుమారు 900 మిలియన్‌ టన్నుల (90 కోట్ల టన్నులు) ఆహారం వృథా అవుతోందని ఓగ్లోబల్‌ రిపోర్ట్‌ వెల్లడిరచింది.

1 2