ఉసురి తీస్తున్న ఊపిరి

పర్యావరణం పట్ల ప్రజల్లో అవగాహన అవసరం.కాలుష్య నివారణకై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణ యోగ్యంకాని విధా నాలు, ప్రయోగాలు చేస్తూ రోజురోజుకు సమస్యను జటిలం చేస్తున్నారు. ఫలితంగా పర్యావరణం విషతుల్యంగా మారుతున్నది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు అనేక వ్యాధులకు గురవ్ఞతున్నారు. మరెం దరో దీర్ఘకాలిక వ్యాధుల బారినపడి మంచానికే పరిమి తమై కృంగికృశించి అసువ్ఞలు బాస్తున్నారు. కాలుష్య మేఘాలు అంత కంతకు కమ్ముకోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రధానంగా దేశంలోని అనేక నగరాల్లో పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతున్నది. ఒక్క వాయు కాలుష్యమేకాదు నీటి కాలుష్యం కూడా పరిస్థితిని పతా నంచునకు తీసుకు పోతున్నది. రోజురోజుకు గ్రామాల నుండి నగరాలకు వలస వచ్చేవారు ఎక్కువ కావడంతో పాటు సమస్య మరింతజటిలంగా మారు తున్నది. మురికి వాడల నిర్మూలనకు దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయలు వెచ్చించి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎక్కడికక్కడ ఎప్పటి కప్పుడు కొత్తవి పుట్టుకొస్తున్నాయి.
ప్రధానంగా పీల్చేగాలిలో ప్రమాదకరమైన దుమ్ముకణాలు పెచ్చరిల్లుతుండటంతో ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారుతున్నది. భారతదేశానికి సంబంధించినంతవరకు దేశంలోని ఆరు మెట్రోనగరాలు ఢల్లీి, కోల్‌కతా, చెన్నై,ముంబాయి,బెంగళూరు, హైదరాబాద్‌ లో జరిపిన సర్వేల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా ఢల్లీి పరిస్థితి ఆందోళన కరంగా తయారైంది.ఢల్లీి పరిసరప్రాంతాల్లో ఉన్నకొందరు రైతులు తమ పంటవ్యర్థాలను దగ్ధం చేయడం పెనుశాపంగా పరిణ మిస్తున్నది. దీనిని అడ్డుకునేందుకు పాలకులు నిషేధం విధించి, భారీగా జరిమానాలతోపాటు జైలు శిక్ష కూడా విధించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏమాత్రం తగ్గకపోగా ప్రస్తుతం రైతులు చేస్తున్న ఆందోళనలో దీనిని తొలగించాలనే డిమాండ్‌ కూడా ఒకటిగా మా రింది. అనేక నగరాల్లో నీటి,గాలి నాణ్యత వాతావరణంలో మార్పులు, అటవీ విస్తీర్ణం, చెత్తనిర్వహణ తదితర అంశాలపై జరిపిన అధ్య యనంలో వాయుకాలుష్యం నగరజీవి ఊపిరితి త్తులకు తూట్లుపొడుస్తుందనే విషయం బయట పడిరది.హైదరాబాద్‌ నగరంలో నీటి,వాయు కాలుష్యంతోపాటు నిర్మాణ రంగంవల్ల పీల్చే గాలిలో ధూళికణాలు అధికంగా ఉన్నట్లు వెలుగుచూసింది.హైదరాబాద్‌నగర శివారుల్లో పరిశ్రమలు గాలిలో వదులుతున్న కాలుష్యానికి అడ్డూఅదుపులేకుండా పోతున్నది. అలాగే నీటి కాలుష్యం దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కరంగా తయారవుతున్నది. దేశంలో సగానికి పైగా చెరువ్ఞలు, జలాశయాల్లో ఉన్న నీరు తాగడానికి పనికిరాకుండాపోయాయి. ఒకనాడు తాగునీరు అందించిన కొన్ని నీటివనరులు ఇప్పుడు పూర్తిస్థాయిలో కాలుష్యకారకంగా మారి వెదజల్లుతున్న దుర్వాసనలు చుట్టుపక్కల ప్రాంతాల వారికి తీవ్రంగా ఇబ్బంది కలిగి స్తున్నాయి. నగరాల రోడ్లపై నడుస్తున్న వాహ నాలు వెదజల్లుతున్న కాలుష్యం గురించి ప్రత్యే కంగా చెప్పక్కర్లేదు. వాహన కాలుష్యాన్ని నివారించేందుకు అధికారులు చేస్తున్న ప్రయ త్నాలు అంతగా సఫలీకృతం కావడం లేదు.1989 నాటి మోటారు వాహనాల చట్టం రూల్‌నెం.5 ప్రకారంనిర్ధారిత ప్రమాణాలకు మించి పొగవదిలితే జరిమానా విధించాలి. అప్పటికీ అదుపుకాకపోతే ఏకంగా వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలి. పర్యావరణాన్ని కాలు ష్యం చేస్తూ మోతాదు కుమించి పొగలు వదులు తున్న ఏ వాహనం అయినా ఈచట్ట పరిధిలోకి వస్తుంది. ఈ చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తూ ప్రస్తుతం తెలుగురాష్ట్రాల వరకు పరిశీలించినా సగానికిపైగా వాహనాలు రోడ్లపై తిరిగే అవకాశం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 1993లో మొదటి సారిగా వాహనకాలుష్య నియంత్రణ కోసం కాలుష్య నియంత్రణ మండలిని (పిసిబి)ని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి అధికారుల మీద అధికారులను నియ మిస్తూ నిబంధనలను రూపొందిస్తూనే ఉన్నారు.మార్పులు చేర్పులు చేస్తూ నిబంధనలను అతిక్రమించిన వారిపై జరిమానాతో పాటు జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు. అయినా ఎలాంటి ఫలితాలు రాలేదు.ఎన్ని చట్టాలు తెచ్చినాఅవన్నీ దాదాపు కాగితాలకే పరిమితమవ్ఞతు న్నాయి. ప్రయోగాలు విఫలమవుతున్నాయే తప్ప ఫలితాలు రావడం లేదు.ఫలితంగా వాతా వరణం కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రిక్‌ ఆక్సైడ్‌, దుమ్ముధూళి పెరిగిపోతున్నది. వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ పర్యావరణం అంతగా కలుషితమైపోతున్నది. పెట్రోలులో జరుగుతున్న కల్తీ సమస్యను మరింతగా పెంచుతుందనే చెప్పొచ్చు.గతంలో పర్యావరణ శాస్త్రజ్ఞులు చేసిన అధ్యయనంలో భారత్‌ దాదాపు వంద దేశాల కంటే అట్టడుగున ఉన్నట్లు బయట పడిరది.అంతేకాదు భారత్‌ వాతావరణంలో ధూళికణాలు ఉండాల్సిన స్థాయి కన్నా ఐదు రెట్లు అధికంగా ఉండి శ్వాసకోశ సమస్యల నుంచి కేన్సర్‌ దాకా అనేక వ్యాధులకు కారణమవ్ఞతున్నా యనే విషయం బయట పడిరది. ప్రత్యేకించి భావితరం బాలబాలికల బతుకుదీపాలను కాలుష్యం ఛిదిమేస్తుంద నేది ఆందోళన కలిగించే అంశం.ఐదేళ్లలోపు బాలబాలికల్లో దాదాపు పదిహేను శాతం శ్వాస సంబంధిత వ్యాధులతో చికిత్సపొందుతూ ఆస్పత్రుల్లోనే కన్నుమూస్తు న్నారు. వాయు కాలుష్యం నుంచి మంచి కొలె స్ట్రాల్‌ చెడు కొల టస్ట్రాల్‌గా మారడం గుండె జబ్బులకు, పక్షవాతానికి, ఊపిరి తిత్తుల కేన్సర్‌కు మూలం అవుతుందని వైద్యనిపుణులు అభిప్రాయపడు తున్నారు.ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపు తున్న ఈ కాలుష్య తీవ్రతను పాలకులు ఇప్పటి కైనా గుర్తించి నివారణకు ఆచరణ యోగ్యమైన విధానాలను ప్రకటించి త్రికరణశుద్ధిగా అమలుకు ప్రయత్నం చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా పర్యావరణం పట్ల సాధారణ ప్రజల్లో అవగాహన పెంచేందుకు పెద్దఎత్తున కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ముంచుకొస్తున్న కాలుష్య ముప్పు!
కాలుష్య నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణయోగ్యం కాని విధానాలతో ప్రయో గాలతో సమస్యను రోజురోజుకు జఠిలం చేసు ్తన్నాయి. ఫలితంగా పర్యావరణ విషతుల్యంగా మారుతున్నది. కోట్లాది మంది ప్రజలు అనేక వ్యాధులకు లోనవ్ఞతున్నారు. మరెందరో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి మంచానికి పరిమితమై అసువ్ఞలు బాస్తున్నారు. కాలుష్య మేఘాలు అంతకంతకు కమ్ముకోవడం ఆందో ళన కలిగించే అంశం. నగరాల పరిస్థితి రోజురోజుకు మరింత దారుణంగా తయాంవు తున్నది. నీటి కాలుష్యం నగర జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీనికితోడు రోజురోజు గ్రామాల నుండి నగరాలకు వసల వచ్చేవారు ఎక్కువ కావడం సమస్య మరింత ప్రమాదకరంగా మారుతున్నది మురికివాడల నిర్మూలనకు ఏటా వేలాది కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నా పాలకులు ఎంత ప్రయత్నం చేస్తున్నా మరొకపక్క కొత్తకొత్తవి పుట్టుకు వస్తున్నాయి. గ్రామాల్లో ఉన్న పరిస్థితుల వల్ల వలసలు పెరిగిపోతున్నాయి. అందుకే నగరాలు ఊహించని రీతిలో పెరుగుతుండటంతో సమస్యలు అంతకు రెట్టింపుస్థాయిలో తయాంవు తున్నాయి. భారతదేశంలో ఆరు మెట్రో నగరాల్లో ఢల్లీి, చెన్నై,ముంబాయి,కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో గతంలో జరిపిన సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగు లోకి వచ్చాయి. పర్యావరణం,నీరు,గాలి నాణ్యత,వాతావరణంలో మార్పులు, అటవీ విస్తీర్ణం, చెత్తనిర్వహణ తదితర అంశాల్లో జరిపిన సర్వేల్లో వాయుకాలుష్యం నగర జీవి ఊపిరితిత్తులకు తూట్లుపొడుస్తుందనే విషయం వెలుగు చూసింది. కొన్ని నగరాల్లో వాయు కాలుష్యం అంచనాలకు మించి పెరిగినట్లు బయటపడిరది.హైదరాబాద్‌తోపాటు మరికొన్ని నగరాల్లో పారిశ్రామిక కాలుష్యం అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్‌ నీటి,వాయుకాలుష్యంతో పాటు నిర్మాణ రంగం వల్ల వీచే గాలులు ధూళి కణాలు అధికంగా ఉన్నట్లు బయటపడిరది. నగరశివారులోని పరిశ్రమలు, గాలిలో వదులుతున్న కాలుష్యానికి అదుపులేకుండా పోతుంది. మరొకపక్క దాదాపు ఐదున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికీ ఈ పరిశ్రమలు మూసీలో వదులుతున్న వ్యర్థాలు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఒకనాడు మంచినీరు అందించిన అనేక నీటి వనరులు ఇప్పుడు పూర్తిస్థాయిలో కాలుష్యకాసారాలుగా మారి వెదజల్లుతున్న దుర్వాసనను చుట్టుపక్క ప్రాంతాల వారికి ఇప్పటికీ ఇబ్బందులు కలిగిస్తూనే ఉన్నాయి. ఇక నగర రోడ్లపై నడుస్తున్న వాహనాల కాలుష్యాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాహన కాలుష్యాన్ని నివారిం చేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదు. 1889 నాటి మోటార్‌ వాహనాల చట్టంలోని రూల్‌నెం.115 ప్రకారం నిర్ధారిత ప్రమాణాలకు మించి పొగ వదిలే వాహనాలపై జరిమానా విధించాలి. అప్పటికీ అదుపుకాకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలి. పర్యావరణాన్ని కాలుష్యం చేస్తూ మోతాదుకు మించి పొగలు వదులుతున్న ఏవాహనమైనా ఈ చట్టపరిధిలోకి వస్తుంది. ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే అటు రోడ్డు రవాణా సంస్థలోకానీ, ఇటు ప్రభుత్వ వాహనాలు రోడ్లపై తిరిగే అవకాశం లేదు. 1993లో మొదటిసారిగా వాహన కాలుష్య నియంత్రణ కోసం కాలుష్యనియంత్రణ మండలినిఏర్పాటు చేశారు. అప్పటి నుండి అధికారుల మీద అధికారులను నియమిస్తు న్నారు. నిబంధనలను రూపొందిస్తున్నారు. మార్పులు, చేర్పులు చేస్తున్నారు. అయినా ఆశించిన ఫలితాలు రావడంలేదు. ఎయిర్‌ యాక్ట్‌ 1887సెక్షన్‌ 31ఎ కింద హైదరాబాద్‌ లోని పెట్రోల్‌ పంపుల్లో దాదాపు ఇరవైకిపైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిబంధన లను అతిక్రమించిన వారికి జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధిస్తామని హెచ్చరించారు. జంటనగరా ల్లో తిరిగే ప్రతి వాహనం విధిగా పరీక్షించుకోవాలని నిబంధనలు కూడా విధించారు. నాలుగేళ్ల తర్వాత కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కొత్త ప్రతిపాదనలు ముందుకు తీసుకువచ్చారు. కాలుష్యసర్టిఫ్టికేట్‌ (పీయూసీ) ఉన్న వాహనాలకే ఇంధనం పోయాలని కొత్త నిబంధనలు విధించారు.ఇవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రయోగాలు విఫలమవ్ఞతున్నాయి తప్ప ఫలితాలు రావడం లేదు. ఫలితంగా వాతావరణంలో కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రిక్‌ ఆసిడ్‌, దుమ్ముధూళి పెరుగుతున్నది. వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ వాతావరణం అంతా కాలుష్యం అవ్ఞతున్నది. పెట్రోల్‌ జరుగుతున్న కల్తీ కూడా ఈ కాలు ష్యాన్ని పెంచుతున్నది. ఈ కల్తీని నిరోధిం చేందుకు అధికార గణం తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇవ్వడం లేదు. మొత్తం మీద తీవ్ర స్థాయిలో వెలువడతున్న విషవాయువ్ఞలవల్ల పర్యావరణం విషతుల్యమై ప్రజలు అనేక వ్యాధులకు గురవ్ఞతున్నారు. భారత్‌లో వాతావరణంలో ధూళికణాలు ఉండాల్సిన స్థాయి కన్నా ఐదురెట్లు అధికంగా ఉండి శ్వాస కోశ వ్యాధుల నుంచి క్యాన్సర్‌ దాకా అనేక రోగాలకు కారణమవ్ఞతున్నాయని పరిశోధనల్లో ఎన్నోసార్లు వెల్లడైంది. ప్రత్యేకించి భావితరం బాలబాలికల బతుకు దీపాలను కాలుష్యం చిధిమేస్తున్నట్లు అయింది. ఐదేళ్లలోపు బాలబాలికలు 14శాతం శ్వాససంబంధిత వ్యాధులతో చికిత్సపొందుతూ ఆస్పత్రుల్లోనే కన్నుమూస్తున్న విషయం ఆందోళన కలిగి స్తున్నది. వాయుకాలుష్యం మంచి కొలెస్ట్రాల్‌ను చెడు కొలెస్ట్రాల్‌గా మారుస్తూ గుండెజబ్బులకు పక్షవాతానికి, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు మూలం అవ్ఞతున్నాయని వైద్యనిపుణులే చెప్తున్నారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ కాలుష్యభూతాన్ని నియంత్రించాల్సిన అవస రం ఎంతైనా ఉంది. సమస్యతీవ్రతను అర్థం చేసుకొని నివారణకు ఆచరణయోగ్యమైన విధానాలను ప్రకటించి అమలుకు త్రికరణశుద్ధిగా కృషి చేయాలి.
ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు నిషేధం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇకపై ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు నిషేధిస్తూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తు న్నట్లు చెప్పారు. సముద్రాన్ని కాపాడుకు నేందుకు, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పార్లే ఓషన్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్ర జీవరాశులను హరించివేస్తు న్నాయి. రాష్ట్ర పౌరులుగా సముద్ర తీరాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. విశాఖ బీచ్‌ పరిశుభ్రత కార్యక్రమాన్ని జీవీఎంసీ, జిల్లా కలెక్టరేట్‌, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో తీరం వెంట ఉన్న ప్లాస్టిక్‌ను తొలగించారు. ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు సుమారు 28 కిలోమీటర్ల పొడవునా సాగరతీరంలో ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాల్ని సేకరించే కార్యక్రమంలో దాదాపు 20 వేల మంది వలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో ‘పార్లే ఫర్‌ ది ఓషన్‌’ సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌, బీచ్‌ పరి రక్షణకు నిర్వహించిన కార్యక్రమాలు, ప్లాస్టిక్‌ నియంత్రణకు సంబంధించి జీవీఎంసీ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం సందర్శించారు. అనం తరం ఏర్పాటు చేసిన మీటింగ్‌లో సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ ఏమన్నారంటే…: ఈ రోజు గుర్తుండిపోయే రోజు. నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌, లీడర్‌షిప్‌ కౌన్సిల్‌ జీఏఎస్‌పీ, రాజీవ్‌ కుమార్‌, సెక్రటరీ జనరల్‌, గ్లోబల్‌ అలయెన్స్‌ ఫర్‌ సస్టైనబుల్‌ ప్లానెట్‌ సత్య ఎస్‌ త్రిపాఠి, సీఈఓ పార్లే ఫర్‌ ది ఓషన్స్‌ సిరిల్‌ గచ్చ్‌తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ హృదయపూర్వక అభినందనలు.
ప్రపంచంలోనే అతి పెద్ద బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమం. ఈ ఉదయం పెద్ద సంఖ్యలో హాజరై భారీ ఎత్తున బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు. దాదాపు 22 వేల మంది ప్రజలు,40 ప్రాంతాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొని దాదాపు 28 కిలోమీటర్లు మేర గోకుల్‌ బీచ్‌ నుంచి భీమిలి బీచ్‌ వరకు శుద్ధి చేశారు. 76 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్ధాలను సేకరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్‌ క్లీనింగ్‌ కార్య క్రమం ఇది. ఈ సామాజిక స్ఫూర్తి చాలా అద్భుతమైనది, అదే వైజాగ్‌ను ప్రత్యేక నగరంగా నిలబెట్టింది.
పర్యావరణ పరిరక్షణ దిశగా…
పర్యావరణం, ఎకానమీ రెండూ కూడా నాణేనికి రెండు కోణాలు. పర్యావరణాన్ని పరిరక్షించక పోతే.. మనకు మనుగడ ఉండదు. సుస్ధిరత, సమగ్రత అన్నవి మన ప్రధాన లక్ష్యాలు. మనం స్వల్పకాలిక లక్ష్యాల కోసం రాజీపడితే.. దీర్ఘకా లికంగా మనుగడ సాగించలేం. అందుకే మన ప్రభుత్వం మానవ, ఆర్దిక వనరులతో ఈ దిశ లోనే సుస్ధిర ప్రగతి కోసం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో పర్యావరణాన్ని, ప్రకృతిని కూడా పరిరక్షిస్తోంది. దాన్ని రాబోయే తరాల ఉత్తమ భవిష్యత్తుకు కూడా అందించాలి.
క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమం…
ఆ దిశగా ఏం చర్యలు తీసుకుంటున్నాం, దీన్ని ఎలా సాధించాలన్నదే ముఖ్యమైన అంశం. మన ముందు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివి. గత కొన్ని నెలలుగా చూస్తే… ప్రభుత్వం క్లాప్‌ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. అక్టోబరు 2, 2021న క్లాప్‌ ప్రొగ్రాం ప్రారంభించింది. 4097 చెత్త సేకరణ వాహనాలను ప్రారంభిం చింది. గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా ఈకార్యక్రమాలను ప్రారంభించాం. దీనివల్ల గ్రామాల్లో చెత్త సేకరణ 22 శాతం నుంచి 62 శాతం పెరిగింది. 100 శాతం సేకరణ లక్ష్యం గా అడుగులు వేస్తున్నాం. అయితే కొన్ని వాస్తవాలను కూడా మనం తెలుసుకోవాలి. భూమి మీద మనకు లభించే ఆక్సిజన్‌లో 70 శాతం మెరైన్‌ ప్లాంట్స్‌ నుంచే వస్తోంది. అంటే మన రెయిన్‌ ఫారెస్ట్స్‌ నుంచి కేవలం 28 శాతం ఆక్సిజన్‌ మాత్రమే లభిస్తోంది. అంటే ఫైటో ప్లాంక్టన్‌, కెల్ఫ్‌, ఆల్గల్‌ ప్లాంక్టన్‌ వంటి ప్లాంట్స్‌ కిరణజన్యసంయోగక్రియలో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఫైటో ప్లాంక్టన్‌లో ముఖ్యమైనది ప్లో క్లోరో కాకస్‌. వాతావరణంలోకి అత్యధిక ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్‌ ఇది. చాలా కొద్ది మందికి మాత్రమే అవగానహన ఉన్న వాస్తవాలు ఇవి. – జిఎన్‌వి సతీష్‌

న్యాయ వ్యవస్థపై తెలుగు సంతకం

‘నాది సాధారణ వ్యవసాయ కుటుంబం. వైకుంఠపాళిలో నిచ్చెనలే కాదు,పాములూ ఉన్నట్లే నా ప్రగతి ప్రస్థానంలో కూడా పగబట్టిన పాములున్నాయి. వాటినుంచి తప్పించుకొని, లక్ష్యాన్ని అధిగమించాను. న్యాయవ్యవస్థలోని లోపాలు, వ్యవస్థలోని విషయాల గురించి మాట్లాడితే వ్యక్తిగా నా స్థాయి తగ్గడమే కాదు, న్యాయవ్యవస్థ కూడా పలచనవుతుంది. పదవిలో ఉండగా చేసే పనులు, వ్యక్తిగత నడవడికలే నిలిచి ఉండేవి. అందుకే నేనేమీ మాట్లాడను’ – సీజేఐ హోదాలో చివరిసారి హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఈ వ్యాస రచయితతో జస్టిస్‌ ఎన్వీ రమణ అన్న మాటలివి’. ధర్మం,న్యాయ మే లక్ష్యంగా ఉద్యోగ జీవితాన్ని సాగించిన తెలుగు బిడ్డ జస్టిస్‌ ఎన్వీ రమణ. మధ్య తరగతి కుటుంబం నుంచి న్యాయవాదిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నత శిఖరాన్ని అధిరోహించి చెరగని ముద్ర వేశారు. సంస్కరణలకు శ్రీకారం: సీజేఐగా పగ్గాలందుకున్న ఎన్వీ రమణ 2021 ఏప్రిల్‌ 24 నుంచి పదవీ విరమణ దాకా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సుప్రీం కోర్టుకు 11మంది,హైకోర్టులకు 250 మంది న్యాయమూర్తుల పేర్లను కేంద్రానికి సిఫార్సు చేశారు. వారిలో 224 మంది నియమితు లయ్యారు. 15 హైకోర్టులకు సీజేలను నియ మించారు. సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం మహిళా న్యాయమూర్తుల భర్తీకి పెద్దపీట వేసింది. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి 2027లో మహిళ ప్రధాన న్యాయ మూర్తిగా నియామకం అయ్యే పరిస్థితిని సృష్టించారు. ఇవన్నీ కొలీజియం లో ఒక సభ్యుడిగా చేశానని చెప్పుకోవడం ఆయన వినయానికి నిదర్శనం.
తెలంగాణకు అగ్రస్థానం
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటైనప్పుడు 24 మంది జడ్జీలుండేవారు.ఈ సంఖ్య 42కు పెరిగేందుకు కృషిచేశారు. రాష్ట్ర హైకోర్టుకు రికార్డు స్థాయిలో 24 మంది న్యాయమూర్తుల నియామకాలు జరిగేలా చేశారు. మరో జడ్జీని ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేశారు. ఇతర రాష్ట్రాల హైకోర్టుల్లో జరిగిన నియామ కాలతో పోలిస్తే తెలంగాణ హైకోర్టుకే అత్యధిక మందిని న్యాయమూర్తులుగా నియమించిన ఘన త జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియానికి దక్కుతుంది.
ఆన్‌లైన్‌ విచారణ
సీజేఐగా ఎన్వీ రమణ 16 నెలలు పనిచేస్తే అందులో సుప్రీంకోర్టు 55 రోజులే భౌతి కంగా కేసులను విచారించింది. కరోనా కారణంగా కేసుల విచారణ ఆన్‌లైన్లో చేసేందుకు సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఆన్‌లైన్‌లో కేసుల విచారణ తెలంగాణలోనే మొదలైంది. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం జరిగేలా చేసిన ఘనత జస్టిస్‌ ఎన్వీ రమణకు దక్కుతుంది.
మౌలిక వసతుల కోసం ఆరాటం కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఏపీ హైకోర్టు యాక్టింగ్‌ సీజేగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన ఆ చర్యలు సీజేఐ అయ్యాక కొనసా గించారు. దేశ వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో మౌలిక వసతులు ఉండాలన్న ఆకాంక్షను కార్యరూపంలో పెట్టారు. జాతీయస్థాయిలో ‘నేషనల్‌ లా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సిస్టం’ పేరిట ఒక కార్పొరేషన్‌ ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. సీఎంల సదస్సులో చేసిన ఆ ప్రతిపాదన అమలు జరిగి ఉంటే కోర్టులు ప్రజలకు మరింత చేరువయ్యేవన్నారు. కోర్టులు ల్యాండ్‌మార్కుగా నిలవాలని జస్టిస్‌ రమణ చెప్తారు. అనేక రాష్ట్రా ల్లో కొత్త కోర్టు భవనాలను ప్రారంభించారు. ప్రజల ముంగిట్లోకి న్యాయం తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కోర్టులను జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రారంభించారు. పది జిల్లా కోర్టుల సంఖ్యను ఏకంగా 32కు పెంచడాన్ని దేశ చరిత్రలో అరుదైన ఘట్టంగా అభివర్ణించారు. ఉద్యోగాల నియామాకాలకు సీఎం కేసీఆర్‌ సత్వరమే సంపూర్ణ సహకారం అందించారని కొనియాడారు.
హైదరాబాద్‌ సిగలో కలికితురాయి అంతర్జాతీయ స్థాయిలో మధ్యవర్తిత్వ, పరిష్కార కేంద్రం (ఐఏఎంసీ) ఏర్పాటు ప్రతిపాదనను స్వయంగా సీజేఐ హోదాలో సీఎం కేసీఆర్‌ ముందుంచారు. తక్షణమే సీఎం సాను కూలంగా స్పందించడం,ఆపై తాత్కాలిక భవ నంలో ఐఏఎంసీ ఏర్పాటు జరిగిపోయింది. గచ్చిబౌలిలోని ప్రభుత్వం స్థలంలో ఐఏఎంసీ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగేందుకు దోహదపడ్డారు.
కీలక మలుపు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు 1995లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ట్రైబ్యునల్‌ సభ్యుడి పదవికి ఎంపికయ్యారు. కానీ ఆనాడు ఆయన ఆ పద విని స్వీకరించి ఉంటే భవిష్యత్‌ మరోలా ఉండే ది. కానీ న్యాయవాదిగానే ఉంటూనే అనేక కీలక పదవులు అలంకరిస్తూ దేశ అత్యున్నత న్యాయ శిఖరంపై ఆసీనులయ్యారని జస్టిస్‌ రమణ సన్నిహితులు చెప్తారు.
సీజేఐగా కీలక తీర్పులు బ్రిటిష్‌ కాలం నాటి రాజద్రోహ చట్టంపై సుమోటోగా స్పందించారు.124సెక్షన్‌ కింద నమోదు చేసిన పెండిరగ్‌ కేసులు,వాటిపై అప్పీళ్లు అన్నింటినీ నిలిపివేస్తూ చారిత్రక ఉత్త ర్వులు ఇచ్చారు. ఆసెక్షన్‌ను కేంద్రం తిరిగి సమీక్ష చేసేవరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంపై ఆచితూచి వ్యవహరించాలని ఆదేశించారు. పెగాసస్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆర్‌వీ రవీంద్రన్‌ సారథ్యంలో దర్యాప్తునకు ఆదేశించారు.యూపీలోని లఖింపూర్‌ ఖేరి ఘటనలో రైతులు మరణించడంపై అందిన లేఖను సుమోటోగా విచారణ చేపట్టారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా కొడుకు అశీష్‌ మిశ్రాపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించారు. కరోనా సమయంలో ఆక్సిజన్‌, వ్యాక్సినేషన్‌ ధరలు ఇష్టానుసారంగా ఉండటంపై సుమోటోగా స్పందించి ఇచ్చిన ఉత్తర్వుల ఫలితంగా కేంద్రం 18ఏండ్లు నిండినవారికి ఉచిత వ్యాక్సిన్‌ ఇస్తామని ప్రకటించింది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో అదనపు జిల్లా జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ను పట్ట పగలు నడిరోడ్డుపై వాహనంతో ఢీకొట్టి హత్యచేసిన ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు స్పందించిన తీరు కారణంగా ఏడాదిలోపే హంతకులకు శిక్ష పడిరది. నిందితులకే కాదు, ఖైదీలకు కూడా హక్కులుంటాయని ఉత్తర్వు లిచ్చిన ఘనత జస్టిస్‌ ఎన్వీ రమణది. ఇదిలా ఉండగా.. సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ.. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా విశేష సేవలు అందించారు. 13ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా రమణ పనిచేశారు. ఆ తరువాత ఢల్లీి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగారు. 2021 ఏప్రిల్‌ 24 నుంచి సీజేఐగా ఎన్వీ రమణ కొనసాగు తున్నారు. కాగా, 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ యూయూ లలిత్‌ ప్రమాణ స్వీకారంచేశారు. రాష్ట్రపతి భవన్‌లో జస్టిస్‌ యూయూ లలిత్‌ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. ఇక, యూయూ లలిత్‌ రెండు నెలల 12 రోజుల పాటు సీజేఐగా పదవిలో కొనసాగనున్నారు.- (పెమ్మరాజు శ్రీనివాస్‌)

లౌకిక సౌభ్రాతృత్వ విలువలు తిరిగి వికసించాలి

మహాత్మాగాంధీ,నెహ్రూ,భగత్‌సింగ్‌,ఆజాద్‌ వంటి ఎందరో వీరుల నాయకత్వాన సాధించిన స్వాతం త్య్ర ప్రసాదాన్ని అందుకోవడానికి 75ఏండ్ల కింద ప్రారం భమైన పండుగ 1947 ఆగస్టు 15 స్వాతం త్య్ర దినోత్స వం. ఏటా ప్రజా విజయాన్ని, ప్రజాస్వా మ్యాన్ని కీర్తించి నీరాజనాలు ఎత్తుతూ జరుపుకొనే పండుగగా వర్ధిల్లుతూ వస్తున్నది. మూడు వందల ఏండ్లు బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం, నిరంకుశత్వం కింద దారిద్య్రం, దైన్యా లతో ప్రజలు జీవిం చారు. ఆంగ్లే యులు మన దేశాన్ని జయించడానికి, సుదీర్ఘకాలం పాలించడానికి మన జాతి నైతిక పతనం ప్రధాన కారణం. నైతిక పతనం ఎంత సులువో, దాన్ని తిరిగి నెలకొల్పడం చాలా కష్టం. మన దేశంలో మహమ్మా రిలా వ్యాపించి వ్యవస్థీకృతమైన మత మౌఢ్యాలు,ప్రజలను చీలికలు పేలికలుగా చేసిన కుల,వర్ణ వ్యవస్థలు,సాంఘిక దురాచారాలు,నీచ స్వార్థాలతో సింథియా,హోల్కర్లు వంటి కొందరి రాజుల,ఆర్కాట్‌ వంటి నవాబులు అరా చక, భోగ లాలస,వ్యక్తిగత అహంకారాల వల్ల యావత్‌ ఉపఖండం దాస్యంలోకి వెళ్లిపోయింది.
దేశ దాస్యాన్ని అనివార్యం చేసిన నైతిక పతనంలో కూడా అప్పుడప్పుడు తిరుగుబాట్లు చోటు చేసుకున్నాయి.1757ప్ల్లాసీ,ఆంగ్లో-మైసూర్‌ యుద్ధా లు,1800 ఆరంభంలో హిందూ సాధువులు సంప్ర దాయ ఆయుధాలతో నిర్వహించిన సన్యాసి తిరుగు బాటు (ఈ ఉద్యమం ఇతివృత్తంగా బంకించంద్ర ఛటర్జీ‘ఆనందమఠం’అనే నవల రాశారు), 1857లో ప్రజ్వలించిన ప్రథమ స్వాతంత్య్రసంగ్రామం వీటిలో భాగమే.ఈ యుద్ధాల్లో మన ప్రజలనే సైన్యంగా మలచుకొని మన డబ్బుతొనే,మన పాలకులలో కొందరి ధనలోభం, అధికార వ్యామోహం, స్వామి ద్రోహంతో ఆంగ్లేయులు ఈ దేశభక్తియుత యుద్ధా లలో విజయం సాధించారు. ఇవి జాతిలో తీవ్ర నైరాశ్యం, నిస్పృహలను కలిగించాయి. 1900 నుం చి స్వాతంత్య్ర సమరఆకాంక్ష మళ్లీ మొగ్గ తొడి గింది. దీనికి పునాదులు వేసిన వారు సామాజిక సంస్కర్తలు,కవులు,కళాకారులు.వీరి విశేష కృషితో భారతజాతి నైతిక పునరుత్తేజం పొందింది. ఆంగ్లే యుల ఆధిపత్యంలో బానిసలుగా ఉండటం సిగ్గు చేటనే భావన ప్రబలింది. 1880 నుంచి గెలుపోట ములతో నిమిత్తం లేకుండా అలలు అలలుగా, ఉప్పెనగా కొనసాగిన1905,1917,1921,19 29,1942,1947వరకు ప్రజావెల్లువలతో స్వాతంత్య్రం సాకారమైంది.
స్వాతంత్య్ర పాలన తొలినాళ్ళలో వైజ్ఞాని కవేత్త,సోషలిస్ట్‌ నెహ్రూ,సామాజిక విప్లవ నేత అంబే ద్కర్‌ల నేతృత్వంలో ప్రజల ఆకాంక్షలకు అనువైన రాజ్యాంగాన్ని రూపొందించారు. పీడిత ప్రజాకోటి వికాసానికి అనేక రక్షణలు కల్పించారు. ప్రజల మౌలిక ప్రగతికి తోడ్పడే విద్య, వైద్యం,రవాణా, గనులు,శక్తి రంగాలను ప్రభుత్వ ఆధీనంలో ఉం చారు.చెల్లా చెదురైన దేశానికి నిర్దిష్ట రూపం తెచ్చా రు.విద్య,పాలన,ఆర్థిక విషయాల్లో వేల ఏండ్లుగా భాగస్వామ్యానికి నోచుకొనివారికి చోటుదక్కింది, వ్యవసాయ వైజ్ఞానికరంగాల్లో స్వావలంబనతో పాటు అనేక విజయాలు సొంతం చేసుకున్నాం. వేల ఏండ్లుగా భారత సమాజాన్ని అంధకారంలో ఉంచి నమత మౌఢ్యం,విశ్వాసాల ప్రాతిపదికతో ప్రజల ఐక్యతను చీల్చే రాజకీయాలు పురుడు పోసు కొని ప్రస్తుతం మహా విపత్తుగా మారాయి. జాతీయో ద్యమంలో కానీ,సాంఘిక విప్లవాలతో కానీ సంబం ధం లేని శక్తుల పాలనలో ప్రస్తుత జీవన ప్రామా ణికత సూచికల్లో అన్నీఅధమస్థానాలే. సాధించుకున్న అనేక హక్కులను, రాజ్యాంగ వ్యవస్థలను, రక్షణలను బలహీనం చేస్తున్నాయి. సమాఖ్యవ్యవస్థ స్ఫూర్తిని కాలరాస్తూ అప్రజాస్వామిక నియంత ధోరణులు చెలరేగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్వాతం త్య్ర సమరంలో అశేష త్యాగాలు చేసిన లక్షలాది ప్రజల ఆకాంక్షలను తిరిగి నెలకొల్పే బాధ్యతను విద్యా వంతులు,ప్రజాస్వామికవాదులు తీసుకోవాలి. లౌకిక,సౌభ్రాతృత్వ విలువలను తిరిగి వికసింప జేయాలి.
లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ను కాపాడుకుందాం
భయంకరమైన మత విభజనల పెరుగు దలతోపాటు గతంలో లేని విధంగా ప్రజల పౌర హక్కులు,ప్రజాస్వామిక హక్కులపై దాడులు జరుగు తున్నాయి. తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్‌ చేసి నిర్బం ధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్‌ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు…కొంతమంది జర్నలిస్టులు, ఇతరులు అనా గరిక చట్టాల కింద జైల్లో ఉన్నారు.భిన్నాభిప్రా యంతో కూడిన ప్రతీ వ్యక్తీకరణను ‘దేశద్రోహం’ గానే పరిగణిస్తున్నారు.
75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మోడీ ప్రభుత్వం ‘’ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’’గా నామకరణం చేసింది. ఈ సందర్భం, దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసే దృష్టిని సారించే పెద్ద ప్రచారంగా మారింది. దీని కోసం ఖాదీ, కాటన్‌,సిల్క్‌ కానటువంటి పాలిస్టర్‌ జెండాలను కూడా అనుమతించే విధంగా భారతదేశ జెండా కోడ్‌ను డిసెంబర్‌ 2021లో సవరించారు. దేశంలో అత్యంత పెద్ద పాలిస్టర్‌ ఉత్పత్తిదారులెవరో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎంపిక చేయబడిన సన్నిహితులు భారీ లాభాలనుపొందే అవకాశాలను ఇది సమ కూర్చుతుంది. అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రి అయ్యేంతవరకు,ఆరెస్సెస్‌,బీజేపీలు జాతీయ జెండాను ఆవిష్కరించలేదు. కాషాయ జెండాపైనే వారికి విశ్వాసం. ఆరెస్సెస్‌కు భారత స్వాతంత్య్రో ద్యమంలో ఎటువంటి భాగస్వామ్యం లేదు. ఇది చరిత్రకారులు నమోదు చేసిన, ఆనాటి బ్రిటిష్‌ ఇంటి లిజెన్స్‌ నివేదికలు ధృవీకరించిన నిజం.
మహోన్నతమైన పాత్ర
దీనికి భిన్నంగా, భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్క్సిస్ట్‌)కి చెందిన తొమ్మిది మంది వ్యవస్థా పక పొలిట్‌ బ్యూరో సభ్యులందరినీ బ్రిటిష్‌ ప్రభు త్వం అరెస్ట్‌ చేసింది. స్వాతంత్య్ర పోరాట కాలంలో సుదీర్ఘ కాలంపాటు వారంతా జైల్లోనే గడిపారు. అండమాన్‌లోని సెల్యులార్‌ జైల్‌ (కాలాపాని) వద్ద పాలరాతిపై చెక్కబడిన చాలాపేర్లు కమ్యూనిస్ట్‌ విప్ల వోద్యమంతో ముడిపడి ఉన్నాయి. 1947 ఆగస్ట్‌, 15 నాటికి కన్ననూర్‌ జైల్లో ఖైదీగా ఉన్న కామ్రేడ్‌ ఎ.కె.గోపాలన్‌జాతీయ జెండాను ఆవిష్క రించాడు. 1932 హోషియార్‌పూర్‌ కలెక్టరేట్‌లో యూనియన్‌ జెండాను కిందకులాగి, త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన 16 ఏళ్ల హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ను బ్రిటిష్‌ వారు అరెస్ట్‌ చేశారు. కమ్యూనిస్టులకు, సీపీఐ(ఎం)కు దేశ భక్తి, త్యాగనిరతి అనేవి భారతదేశ సోషలిస్టు పరివ ర్తన యొక్క విప్లవ దార్శనికతకు అంతర్భాగంగా ఉంటాయి.1920లో దాని పుట్టుక నుండే కమ్యూ నిస్ట్‌ పార్టీ జాతీయోద్యమ ఎజెండాను ప్రభావితం చేయడం ఆరంభించింది. 1921లో అహ్మదాబాద్‌ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమా వేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ తరపున మౌ లానా హస్రత్‌ మోహాని,స్వామీ కుమారానంద బ్రిటిష్‌ వారినుంచి సంపూర్ణ స్వాతంత్య్రాన్ని డిమాం డ్‌ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ దానిని గాంధీజీ అంగీకరించలేదు (‘సంపూర్ణ స్వరాజ్యం’ పిలుపు 1929లో మాత్రమే ఇచ్చారు). తరువాత 1922లో గయ లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో జాతీయోద్యమ లక్ష్యాలకు సంబంధించిన పత్రాలను పంచింది. ఆతర్వాత జరిగిన ఏఐసీసీ సమావేశా ల్లో కూడాఇది కొనసాగింది.జాతీయోద్యమ ఎజెం డాను ప్రభావితం చేయడంలో కమ్యూనిస్టులు చాలా పెద్ద పాత్రను పోషించారు.1940లలో దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులు వివిధ ప్రాంతాలలో చేపట్టిన భూపోరాటాలు స్వాతంత్య్ర సాధనలో కీలకమైనవి.కేరళ లోని పున్నప్ర వాయలార్‌, బెంగా ల్‌ లోని తెభాగపోరాటం, అస్సాంలో సుర్మా వ్యాలీ పోరాటం, మహారాష్ట్రలో వర్లీ ఆదివాసీ పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వీటిలో ముఖ్యమైనవి.భారతదేశంలోని భాషాపరమైన భిన్న త్వాన్ని కమ్యూనిస్టులు సమర్థించారు. దేశంలోని వివిధ భాషలు మాట్లాడే వారిని స్వాతంత్య్ర పోరా టంతో ఐక్యంచేయడంతో,స్వతంత్ర భారత దేశంలో భాషాపరమైన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు దారి తీసింది.లౌకికవాదంపట్ల కమ్యూనిస్టులకుండే అచం చలమైన నిబద్ధత, స్వాతంత్య్ర పోరాట కాలంలో చెలరేగిన మత ఘర్షణల్లో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పి,నిలబెట్టడంలో చాలా ప్రధాన పాత్రను పోషించింది. కమ్యూనిస్టులు నేటికీ లౌకికవాదానికి అత్యంత నిబద్ధత కలిగిన సమర్థకులుగా ఉన్నారు.
చరిత్ర వక్రీకరణ
కానీ,నేడు తమను తాము స్వాతంత్య్రో ద్యమ పోరాటంలో భాగస్వాములమని తప్పుడు ప్రచారం చేసుకోవడం ద్వారా ఆరెస్సెస్‌, బీజేపీలు చరిత్రను వక్రీకరించి,చరిత్రను తిరగ రాసే ప్రయ త్నం చేస్తున్నాయి. హిందూత్వ, ఆరెస్సెస్‌ నాయకులు స్వాతంత్య్ర సమర యోధులని చిత్రీకరిస్తూ ప్రభుత్వం ప్రచారాన్ని చేపట్టింది. ఈప్రచారంలో ఉదహరిం చబడిన వారిలో వీడీ సావర్కర్‌ ముందున్నాడు. హిందూ మతాచారంతో సంబంధం లేని రాజకీయ లక్ష్యాలు గల ‘హిందూత్వ’ అనే పదాన్ని 1923లో కనుగొన్నది వి.డి.సావర్కర్‌. ఒక ప్రత్యేక ముస్లిం దేశం కోసం మహ్మదాలీ జిన్నా పోరాటానికి నాయ కత్వం వహించడానికి రెండు సంవత్సరాల ముందే సావర్కర్‌ ద్విజాతి సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చా డు.దానిని బ్రిటిష్‌ వారు ప్రోత్సహించాడు.ఆ తర్వా త విషాదకరంగా దేశ విభజన జరిగింది. బ్రిటిష్‌ పాలకులతో సంధి కుదిరిన తరువాత సావర్కర్‌, తనరాజకీయ జీవితంలో ఎక్కు వ భాగం, కాంగ్రెస్‌, వామపక్షాల నేతృత్వం లోని ఉద్యమాలకు వ్యతిరేకం గానే ఉన్నాడు. హిందూ మహాసభ నాయకునిగా, 1942లో జరిగిన క్విట్‌ ఇండియా లాంటి ఉద్య మాలలో హిందూ మహా సభ, ఆరెస్సెస్‌ సభ్యుల భాగస్వామ్యం లేకుండా చూశాడు. వాస్తవాలన్నిటిని మరుగునపెట్టి వారు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. కమ్యూ నిస్టుల విషయం పక్కన పెట్టండి, ప్రభుత్వ ప్రచారా లలో జవహర్‌ లాల్‌ నెహ్రూ గురించి కూడా ఎక్కడా ప్రస్తావిం చడం లేదు.భారత రాజ్యాంగం, స్వాతంత్య్ర భారత దేశం ఒకఆధునిక లౌకిక ప్రజా స్వామిక రిపబ్లిక్‌గా రూపొందేందుకు దారి తీసిన అనేక చర్చలు, తీర్మా నాలకు దారి చూపిన వ్యక్తి నెహ్రూ. ఈ విషయాన్ని మరుగుపరిచి బీజేపీ తన ఫాసిస్ట్‌ హిందూత్వ రాజ్యం ఆలోచనను నిజం చేసే చర్యలను ముందుకు తీసు కొనిపోతోంది.
భారత రాజ్యాంగంపై దాడి
ఈఫాసిస్ట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతం కావాలంటే, మన రాజ్యాంగం కల్పించిన భారత రిపబ్లిక్‌ యొక్క లౌకిక ప్రజాస్వామిక లక్షణం పైన దాడి చేసి, బలహీనపరచి, నాశనం చేయాల్సి ఉంది. తదనుగుణంగానే 2019లో మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన నాటి నుండి…మన రాజ్యాంగానికి నాలుగు మూల స్తంభాలైన లౌకిక ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, సామాజిక న్యాయం, ఆర్థిక సార్వభౌమత్వాలు తీవ్రమైన దాడికి గురవు తున్నాయి. చర్చలులేని తీరుతో పార్లమెంట్‌ సాంప్ర దాయాలను తుంగలో తొక్కుతున్నారు. ఏ విధమైన చర్చలు లేకుండానే కేవలం మంద బలంతో చట్టా లను ఆమోదింపజేసు కుంటున్నారు. ప్రస్తుత పార్ల మెంట్‌ సమావేశాల్లో, ఆకాశాన్నంటే ధరలు, పెరిగి పోతున్న నిరుద్యోగం లాంటి ప్రజలెదుర్కొం టున్న సమస్యలపై చర్చ జరపాలని డిమాండ్‌ చేసిన నేరా నికి గతంలో ఏనాడూలేని విధంగా27మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారు. పని చేయని పార్ల మెంట్‌ చాలా ప్రమాదకరం.అంటే భారత రాజ్యాం గం యొక్క ప్రాముఖ్యత, ప్రజల సార్వభౌ మత్వం, ప్రజలకు జవాబుదారీగా ఉండే ఎంపీల అధికారం, పార్లమెంట్‌కు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం లేకుండాపోవడం.పార్లమెంట్‌ను బలహీనపర్చ డమంటే, ప్రజల సార్వభౌమత్వాన్ని రద్దు చేయడం, ప్రభుత్వం జవాబుదారీతనం నుండి తప్పించుకొని, ఫాసిస్ట్‌ విధానాలను అవలంబిస్తూ నిరంకుశత్వం వైపు వెళ్లడం.దాదాపు మూడేళ్లుగా ఆర్టికల్‌ 370,ఆర్టికల్‌ 35ఏ రద్దు సవాళ్లు, సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం),రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేసే ఎన్నికలబాండ్లు మనరాజ్యాంగాన్ని ఉల్లం ఘించే అంశాలుగా మారాయి. ఇవేవీ సుప్రీం కోర్టుకు వినిపించవు. న్యాయ వ్యవస్థ యొక్క నిష్పా క్షికత,స్వతంత్రత తీవ్రంగా రాజీ పడినప్పుడు, రాజ్యాంగ నిబంధనల అమలు,ప్రజాస్వామిక హక్కు ల హామీలు,పౌర హక్కులపై విచారణ ఉనికిలో లేకుండా నిలిచిపోతుంది.అదేవిధంగా,ఒక ఆరోగ్య కరమైన ప్రజాస్వామ్యంలో అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తూ, స్వేచ్ఛాయుత వాతావర ణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిష న్‌ స్వతంత్రత, నిష్పాక్షికత చాలా ముఖ్యమైనవి. ఇది రాజీ పడినప్పుడు కూడా ప్రభుత్వాలు ఇంకే మాత్రం ప్రజల తీర్పును, ప్రజాస్వామిక అభిప్రాయా లను ప్రతిబింబించవు. సీబీఐ,ఇ.డిమోడీ ప్రభుత్వ రాజ కీయ ఎజెండాను అమలు చేయడానికి సాధనా లుగా మారిన తీరును దేశమంతా గమనిస్తున్నది. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడం, ప్రజా స్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిర పరచడం,ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైన ప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలగడానికి గల హామీకై పార్టీ ఫిరాయింపుల కోసం ఒత్తిడి చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, దానిని నాశనం చేస్తున్నారు.
తీవ్రమైన మత విభజనలు
ఇలా భారీగా రాజ్యాంగ క్రమాన్ని నాశ నం చేయడంతో పాటు భారతరిపబ్లిక్‌ లౌకిక ప్రజా స్వామిక లక్షణాన్ని నాశనం చేయడానికి విషపూరిత మైనద్వేషం,భయాల వ్యాప్తిపై ఆధారపడి క్రూరమైన రీతిలో మత విభజనల ప్రచారం జరుగుతున్నది. పెద్ద ఎత్తున ‘బుల్డోజర్‌ రాజకీయాల’ వ్యూహ రచన, కొన్ని రాష్ట్రాల్లో హింసకు దారితీసే రీతిలో మైనా రిటీలను లక్ష్యంగా చేసుకోవడం, పార్లమెంట్‌ నూతన భవనంపైన జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించే సంద ర్భంలో హిందూ మతాచారాలను ఆచరించడం లాంటి చర్యలు భారతరాజ్యాన్ని,ప్రభుత్వాన్ని హిం దూత్వతో గుర్తిస్తున్నారు కానీ భారత రాజ్యాంగంతో కాదని స్పష్టం చేస్తున్నాయి.ఇలాంటి భయంకరమైన మత విభ జనల పెరుగుదలతో పాటు గతంలోలేని విధంగా ప్రజల పౌరహక్కులు,ప్రజాస్వామిక హక్కు లపై దాడులు జరుగుతున్నాయి.తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్‌ చేసి నిర్బంధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్‌ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు…కొంతమంది జర్నలిస్టులు, ఇత రులు అనాగరిక చట్టాల కింద జైల్లో ఉన్నారు. భిన్నాభి ప్రాయంతో కూడిన ప్రతీ వ్యక్తీకరణను ‘దేశద్రోహం’ గానే పరిగణిస్తున్నారు.ఈ హిందూత్వ కథనం విజయవంతం కావాలంటే,ఈ ఫాసిస్ట్‌ ప్రాజెక్ట్‌ లోని సిద్ధాంతం కొనసాగడానికి భారతదేశ చరిత్రను తిరగ రాయా ల్సిన అవసరం ఉంటుంది. అందుకే విద్యా విధానంలో మార్పులు చేస్తున్నారు. వివేచనా రహిత ఆలోచనలను ప్రచారంచేస్తు న్నా రు.హేతుబద్ధత స్థానాన్ని మార్చేప్రయత్నం చేస్తు న్నారు.గుడ్డివిశ్వాసాలను ప్రచారం చేస్తూ, శాస్త్రీయ తను కాదని పురాణాలను ప్రచారం చేస్తు న్నారు. చరిత్రస్థానంలో హిందూ పురాణాలను, తత్వ శాస్త్రం స్థానంలో హిందూ ధర్మశాస్త్రాన్ని తీసు కొని రావడంద్వారా భారతదేశం యొక్క గొప్ప వైవిధ్యాన్ని, బహుళత్వాన్ని నాశనం చేస్తున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆకలి, పౌష్టికాహార లోపం లాంటి రోజువారీ సమస్యలపై ప్రజా పోరా టాలను, ప్రతిఘటనలను పెంచడం ద్వారా భారత దేశం లౌకిక ప్రజాస్వామిక రాజ్యాం గాన్ని రక్షించి, బలోపేతం చేసే బాధ్యతను తీసు కోవాలి. ప్రజా స్వామ్యం,ప్రజాస్వామిక హక్కులు,పౌర హక్కులు, లౌకికవాదాల రక్షణకై పోరాటా లను ఉధృతం చేయాలి. బలమైన ప్రజా పోరాటా లను ఉధృతం చేయడం ద్వారా సీపీఐ(ఎం) స్వతంత్ర బలాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం. వామపక్ష శక్తుల ఐక్యతను సంఘటిత పరచడం, వామపక్ష ప్రజా తంత్ర శక్తుల్ని ఏకం చేయడం, హిందూత్వ మతో న్మాదానికి వ్యతిరేకంగా విశాల ప్రాతిపదికన లౌకిక శక్తులను సిద్ధం చేయడం ద్వారానే 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మన లౌకిక ప్రజాస్వామిక రిపబ్లిక్‌ రాజ్యాంగాన్ని రక్షించు కోగలం.ఈలక్ష్యాన్ని నిజం చేసే మన దేశభక్తి తోనే ఆగస్ట్‌ 15న అన్ని పార్టీ కార్యాలయాల్లో జాతీ య జెండాను ఆవిష్కరించి, మనరాజ్యాంగంలోని పీఠిక పై ప్రతిజ్ఞ చేశామని గుర్తుంచుకోవాలి.ఈఉన్మాద పూరిత,ఫాసిస్టు ప్రయ త్నాల నుండి స్వేచ్ఛకోసం, మనలౌకిక ప్రజాస్వామికరిపబ్లిక్‌నుకాపాడు కోవడం కోసం జరిగే పోరాటాన్ని బలపరుచు కుందాం!
భయంకరమైన మత విభజనల పెరుగు దలతో పాటు గతంలో లేనివిధంగా ప్రజల పౌర హక్కులు,ప్రజాస్వామిక హక్కులపై దాడులు జరుగు తున్నాయి. తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్‌ చేసి నిర్బం ధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్‌ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు..కొంతమంది జర్నలిస్టులు,ఇతరులు అనా గరిక చట్టాలకింద జైల్లోఉన్నారు. భిన్నాబి óప్రాయం తో కూడిన ప్రతీవ్యక్తీకరణను ‘దేశద్రోహం’గానే పరిగణిస్తున్నారు.
వ్యాసకర్త : సిపిఎం ప్రధాన కార్యదర్శి (ప్రజాశక్తి సౌజన్యంతో)- (అస్నాల శ్రీనివాస్‌ / సీతారాం ఏచూరి)

మ‌న్యం వీరుడు…స్వ‌రాజ్య భానుడు-అల్లూరి తొలి దాడుకు వందేళ్లు! 1922-2022

‘ ఉద్యమానికి అతివాద, మితవాద, విప్లవ వాద మార్గాలను ఎన్నుకున్న అనేకమంది దేశ భక్తులు తమ జీవితాలను అంకితం చేశారు. ఈ ఉద్యమ స్రవంతుల్లో ఆయుధం పట్టి బ్రిటిష్‌వాళ్ల భరతం పట్టాలన్న వర్గానికి చెందినవారు అల్లూరి సీతారామరాజు. అమాయక గిరిజనుల బాధలను దగ్గర నుంచి గమనించి, విజ్ఞాప నల ద్వారా వారి సమస్యలు పరిష్కారం కావని గ్రహిం చారు. అందుకే మన్యం ప్రాంతంలో అద్భుతమైన గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. అల్లూరి సీతారా మరాజు చేసిన ఈ సంచలన యుద్ధానికి 1922`2022 ఆగష్టు 22తో నూరు వసంతాలు పూర్తియ్యింది ’’ -గునపర్తి సైమన్‌
సీతారామరాజు విప్లవం విజయవంతం కాక పోయినా.. ఆయన ధైర్యసాహసాలు, ప్రాణ త్యాగం ఎందరో భారతీయులను ఉత్తేజపరచి, వారిలో జాతీయతా భావాన్నీ,దేశభక్తినీ పురి గొల్పాయి.సన్యాసి జీవితం గడిపిన రాజు,తన స్వీయ ముక్తి కంటే,అణగారిన ప్రజలసాంఘిక, ఆర్థిక విముక్తికి కృషి చేయడమే తన విద్యుక్త ధర్మమని భావించాడు.భారతదేశ చరిత్రలో సన్యసించి,విప్లవకారునిగా మారిన వారు అరుదు. అరవింద్‌ఘోష్‌,అల్లూరి సీతారామ రాజు మాత్రమే మనకు కనిపిస్తారు…27ఏళ్ళ వయసులో విప్లవజ్వాలలు,అల్లూరి సీతారామ రాజు జీవితం ఎం దరికో ఆదర్శనీయం,మన్యం వీరుడి పోరాటానికి వందేళ్లు పూర్తియిన సందర్భంగా ఓసారి గుర్తు చేసుకుందాం! భారత స్వాతంత్య్ర చరిత్రలో(1897జూలై 4-1924 మే7) ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. ఈ విప్లవ యోధుడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యా యం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాల ర్పించిన యోధుడు. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలా డిరచిన అల్లూరి సీతారామరాజు అమాయకులు, విద్యా విహీనులైన గిరిజన జాతి ప్రజలను ఒక్క తాటిపై నిలిపి,వారిని విప్లవ వీరులుగా తీర్చిదిద్ది, బ్రిటిష్‌ ప్రభుత్వంపై యుద్ధం చేసిన అల్లూరి వంటివారు భారత విప్లవ చరిత్రలో మరొకరు కానరారు. అడవి నుంచీ, పూర్వీకుల నుంచీ వచ్చిన స్వేచ్ఛా జీవనానికి సంకెళ్లు వేయాలని చూసిన చట్టాలకు ప్రతిఘటనలే గిరిజనోద్యమాలు. దేశం నలుమూలలా జరిగిన అలాంటి ఉద్యమాలలో 1922-24 నడుమ విశాఖ మన్యంలో అల్లూరి సీతారామరాజు (శ్రీరామరాజు) నిర్వహించిన పోరాటం ప్రత్యేకమైనది. అవన్నీ కొండా కోనా మీద హక్కు కోసం కొన్ని తరాల ఆదివాసీలు పడిన తపన,వేదనలే.స్థానిక సమస్యల మీద తలెత్తి నట్టు కనిపించినా నిజానికి అవి ప్రభుత్వాల మీద యుద్ధాలే. విశాఖ మన్య పోరాటంలో మైదాన ప్రాంత రాజకీయ స్పృహ,సైద్ధాంతిక ఛాయ ఉన్నాయి. శ్రీరామరాజు ఉద్యమకారు నిగా అవతరించడం ఒక చారిత్రక నేపథ్యంలో జరిగింది. మొదటి ప్రపంచయుద్ధం,గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం పిలుపు,ఉపసం హరణ ఉత్తర భారత యాత్ర ఆ నేపథ్యాన్ని ఇచ్చాయి. తన కుటుంబం తునిలో ఉన్నప్పుడే 1915లో ఉద్యోగాణ్వేషణ పేరుతో రామ రాజు ఉత్తర భారతదేశం వెళ్లారు. ఆ యాత్ర లోనే రామరాజు కలకత్తా వెళ్లి ప్రముఖ జాతీయ ఉద్యమ నేత సురేంద్రనాథ్‌ బెనర్జీని కలుసు కున్నారు. ఆ తరువాత అల్లూరి తూర్పు కనుమ లలోని కృష్ణ్ణదేవిపేటకు 1917జూలై 24న ఒక ఆధ్యాత్మికవేత్తగా చేరుకున్నారు. ఈ ఊరే ఆయన కార్యక్షేత్రమయింది. ఇక ఆయన ఆయుధం పట్టి, ఉద్యమం ప్రారంభించడానికి చాలా కారణాలు ఉన్నాయి. 1920లో గాంధీజీ సహాయ నిరాకర ణోద్యమానికి పిలుపూ,‘ఒక్క ఏడాదిలోనే స్వాతం త్య్రం’ అన్న నినాదమూ ఇచ్చారు. రాళ్ల పల్లి కాశన్న, నర్సీపట్నం ప్రాంత కాంగ్రెస్‌ కార్య కర్తలు కృష్ణదేవిపేటలోనూ సహాయ నిరాకరణో ద్యమ ప్రచారం చేశారు.1921లో రామరాజు కాలినడకన నాసికాత్రయంబకం వెళ్లారు. అక్కడ ‘అభినవ్‌ భారత్‌’ విప్లవ సంస్థ ప్రభావం ఆయనపై గాఢంగా పడిరది. అప్పటికే రామ రాజు మన్యవాసులలో కొన్ని సంస్కరణలు తెచ్చారు. గాంధీజీ కార్య క్రమమంతటిలోను మద్యపాన నిషేధం,కోర్టుల బహిష్కారం…ఈ రెండూ ఆయనకు నచ్చాయి. ఇవే రామరాజు ‘సహాయ నిరాకరణ వాది’ అన్న అనుమానం కలిగిం చాయి. మొదటి ప్రపంచ యుద్ధం ఆగిన తర్వాత కరవు విజృంభించ డంతో మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ఆకలి దాడులు జరిగాయి. ప్రభుత్వం ఉపాధి కల్పన ఆరంభించింది. మన్యంలో రోడ్ల నిర్మాణం అందులో ఒకటి. ఆసియా చరిత్రలోనే ఈరోడ్ల నిర్మాణం ఓ అమా నుష ఘట్టం. ఇందుకు బాధ్యుడు గూడెం డిప్యూటీ తహసీల్దార్‌ అల్ఫ్‌ బాస్టియన్‌. నిజానికి 1882 చట్టంతో అడవిలో ప్రవేశం కోల్పోయిన ఆదివాసీలు కూలీలుగా మారిపోయారు. పెద్దవలస మాజీ ముఠాదారు కంకిపాటి బాలయ్యపడాలు (ఎండు పడాలు),బట్టి పనుకుల మునసబు గాము గంతన్నదొర,అతని తమ్ముడు గాంము మల్లుదొర,గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు వంటివారు 1922 జనవ రిలో రాజు దగ్గరికి వచ్చి గోడు వినిపించు కున్నారు. బాస్టియన్‌ మీదపై అధికారులకు శ్రీరామరాజు ఫిర్యాదు రాశారు. రామరాజు మన్యంలో సహాయ నిరాకరణ ఆరంభించాడన్న ఆరోపణకు ఈ ఫిర్యాదు దోహదం చేసింది. రామరాజును ఆ ఫిబ్రవరి 3న నిర్బంధంలోకి తీసుకున్నది కూడా సహాయ నిరాకరణవాది అన్న ఆరోపణతోనే! ఆ ఒకటో తేదీనే సహాయ నిరాకరణను తీవ్రం చేస్తున్నట్టు గాంధీజీ ప్రక టించారు. 5వ తేదీన జరిగిన ‘చౌరీచౌరా’ ఉదంతంతో గాంధీ ఆ పిలుపును ఉపసం హరించుకున్నారు. అహింసాయుతంగా పోరాడే సంస్కారం భారతీయులకు లేదని నింద మో పారు. ఇదే యువతను ఇతర పంథాల వైపు నడిపించింది. అలాంటి వారిలో రామరాజు ఒకరు. సంప్రదాయ, ఆధునిక ఆయుధాలతో గెరిల్లా పోరు జరపాలని అనుకున్న రాజు… ఆయుధాల కోసం మన్యంలోని పోలీస్‌ స్టేషన్లను దోచు కోవాలని నిర్ణయించారు. అనుచరులను మూడు దళాలుగా విభజించారు. 1922 ఆగస్ట్‌ 22న పట్టపగలు చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌ మీద 300 మందితో దాడి చేశారు. ఆయుధాలు తీసుకు వెళుతున్నానని ఒక లేఖ రాసి వచ్చారు రాజు. తొలి దాడితోనే మన్య ఉద్యమ తత్త్వం తెలుస్తుంది. కొండదళం ‘వందేమాతరం… మనదే రాజ్యం’, ‘గాంధీజీకి జై’ అంటూ నిన దించింది. ఆగస్టు 23న కృష్ణదేవిపేట పోలీస్‌ స్టేషన్‌ మీద దాడి జరిగింది. ఆగస్ట్‌ 24న రాజ వొమ్మంగి స్టేషన్‌ (తూర్పు గోదావరి)ను ఎంచు కున్నారు. లాగరాయి పితూరీని సమర్థించిన నేరానికి అరెస్టయిన మొట్టడం వీరయ్యదొర అప్పుడు ఆ స్టేషన్‌లోనే ఉన్నారు. ఆయనను విడిపించడం కూడా ఈదాడి ఆశయాలలో ఒకటి. తొలి రెండు దాడులతోనే మద్రాస్‌ ప్రెసిడెన్సీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఏ గ్రాహవ్న్‌కు టెలిగ్రావ్న్‌లు వెళ్లాయి. 26 తుపాకులు, వేలాది తూటాలు కొండదళం చేతికి చిక్కాయి. ఎంత ప్రమాదం! ఏజెన్సీ జిల్లా పోలీసు సూపరిం టెండెంట్‌ సాండర్స్‌, కలెక్టర్‌ వాయువేగంతో నర్సీపట్నం చేరు కున్నారు. నర్సీపట్నం కేంద్రం గా మన్యం ఖాకీవనమైంది.అలాంటి వాతా వరణంలోనే జైపూర్‌ మహారాజు ఐదు ఏనుగుల మీద పోలీసుల కోసం పంపిన సామగ్రిని సెప్టెంబర్‌ 3న ఒంజేరి ఘాట్‌లో రాజుదళం వశం చేసుకుంది. తరువాత జరిగిన ఘటన మద్రాస్‌ ప్రెసిడెన్సీని మరీ కలవరపెట్టింది. రామరాజు పేరు మొదటిసారి తెలుగునేలంతా వినిపించింది. దామనపల్లి అనే కొండమార్గంలో 1924 సెప్టెంబర్‌ 24న గాలింపు జరుపుతున్న స్కాట్‌ కవర్ట్‌, నెవెల్లి హైటర్‌ అనే ఒరిస్సా పోలీ సు ఉన్నతాధికారులను రాజు దళం చంపింది. వీరిలో హైటర్‌ మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్నాడు. తరువాత అడ్డతీగల,చోడవరం, మల్కనగిరి, పాడేరు స్టేషన్‌ల మీద చేసిన దాడులు విఫల మయ్యాయి. బ్రిటిష్‌వాళ్లు ఆయుధాలను ట్రెజరీలకు పంపి జాగ్రత్త పడ్డారు. మన్యం మీద పట్టు బిగించడానికి మద్రాస్‌ ప్రెసిడెన్సీ మరొక అడుగు ముందుకు వేసి, 1922 సెప్టెంబర్‌ 23న మలబార్‌ పోలీసు దళాలను దించింది. కానీ రామవరం అనే చోట ఆ దళమూ వీగిపోయింది. 1922 డిసెంబర్‌ 6న పెద్దగడ్డపాలెం, లింగాపురం అనేచోట్ల రాజుదళం మీద లూయీ ఫిరం గులతో మలబార్‌ దళం యుద్ధానికి దిగింది. ఎనిమిది మంది రాజు అనుచరులు వీరమరణం చెందారు. ఆ డిసెంబర్‌ 23న ఉద్యమకారుల తలలకు ప్రభుత్వం వెలలు ప్రకటించింది. నాలుగు మాసాల అనంతరం 1923 ఏప్రిల్‌ 17న రామరాజు దళం ఆకస్మాత్తుగా అన్నవరం పోలీస్‌ స్టేషన్‌లో ప్రత్యక్షమై మొత్తం యంత్రాం గాన్ని కలవరపరిచింది. ఆ సంవత్సరం డిసెం బర్‌లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు రామరాజు మారు వేషంలో హాజరయ్యారు. నడిపేది గిరిజనోద్య మమే అయినా, ఆయన మైదాన ప్రాంత ఉద్య మాన్ని గమనిస్తూనే ఉన్నారు. 1924 జనవరికి అస్సాం రైఫిల్స్‌ను దించారు. వీరికి మొదటి ప్రపంచయుద్ధంలో అనుభవం ఉంది.అస్సాం రైఫిల్స్‌ అధిపతే మేజర్‌ గుడాల్‌. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న థామస్‌ జార్జ్‌ రూథర్‌ ఫర్డ్‌ను ఆ ఏప్రిల్‌లో మన్యం స్పెషల్‌ కమిష నర్‌గా నియమించారు. మే ఐదు లేదా ఆరున ‘రేవుల కంతారం’ దగ్గర పోలీసుల దాడి నుంచి తప్పించుకున్న రాజు ఒక్కడే రాత్రివేళ ‘మంప’ అనే గ్రామం వచ్చి, ఒక చేనులోని మంచె మీద గడిపారు. మే 7వ తేదీ వేకువనే ఓకుంటలో స్నానం చేస్తుండగా రాజును ఈస్ట్‌కోస్ట్‌ దళానికి చెందిన కంచుమేనన్‌, ఇంటెలిజెన్స్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ ఆళ్వార్‌నాయుడు అరెస్టు చేశారు. రాజు ను ఒక నులక మంచానికి కట్టి, కృష్ణదేవిపేటకు పయనమయ్యారు. దారిలోనే ఉంది కొయ్యూరు. అక్కడే మేజర్‌గుడాల్‌… రాజుతో మాట్లాడా లని గుడారంలోకి తీసుకువెళ్లాడు. ఒక చెట్టుకు కట్టి కాల్చి చంపాడు. జూన్‌ 7న గాము గంతన్నను కాల్చి చంపారు. దాదాపు రెండేళ్ల ఉద్యమం,పోలీస్‌ వేధింపులతో మన్యవాసులు భీతిల్లి పోయారు. కొందరు ఉద్యమకారులను స్థానికులే చంపారు. పోలీసులకు పట్టించారు. సరైన విచారణ లేకుండానే 270 మంది వరకు ఉద్యమకారులకు శిక్షలు విధించింది మిలిటరీ ట్రిబ్యునల్‌.12 మందిని అండమాన్‌ పంపారు. చివరిగా…దేశం కోసం పోరాడిన ఏ వర్గం త్యాగమైనా విలువైనదే. అవన్నీ నమోదైతేనే స్వరాజ్య సమర చరిత్రకు పరిపూర్ణత. ఉద్యమ నూరేళ్ల సందర్భం ఇచ్చే సందేశం అదే! ఆయన ఆత్మత్యాగం చేసిన 28 ఏళ్లకు.. భారత ప్రజ లకు లభించింది. స్వంతంత్ర భారతావని జయ కతనంగా అల్లూరి సీతారామరాజు చరిత్రలో నిలిచిపోయారు.

జీవనదులు..విలవిల!

భూమి వేడేక్కుతోంది.పర్యావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి.ప్రకృతి విఫత్తులు పేట్రేగి పోతున్నాయి.హిమాలయాల్లో మంచు శరవేగంగా కరిగిపోతుంది. కర్ణాటక,పాకిస్తాన్‌లో వరద భీభత్సం, అడుగుంటితున్నజీవనదులు,చైనాలో కరువకాటకాలు. దీనికి కారణం వాతావరణంలో కనీవినీ ఎరుగని మార్పులు.ఇదికేవలం ఒక్క దేశానికే పరిమితం అయన అంశం కాదు.విశ్వవ్యాప్తంగా ప్రళయాన్ని సృష్టించగల సమతుల్యత లేని పర్యావరణమే ఇందుకు ప్రధమ కారణం.ఈపెనుమార్పులుపై ఐక్య రాజ్యసమితి హెచ్చరిస్తున్నా..దేశంలో అనేకప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుమతులు యధేచ్ఛగా మంజూరు చేసేస్తోంది.
మరోపక్క హిమాలయాల్లో మంచుపర్వాతాలు కరిగిపోయి సముద్రమట్టం పెరిగిపోతుంది.ఆల్ఫ్స్‌ పర్వతాల్లో కరిగే మంచుతో నిత్యం నీటితో కళకళలాడే పోనది కూడా ఎండల దెబ్బకు జీవచ్ఛవంగా మారిపోయింది.యూరఫ్‌ పరిధి పది దేశాల గుండాపారే అతిపొడవైన నది డాన్యూబ్‌ కూడా చిక్కిపోతుంది. జర్మనీ,నెదర్లాండ్‌,స్విట్జర్లాండ్‌ దేశాలకు ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా చెప్పే రెయిన్‌నది పరిస్థితి ఎంతో ధైన్యంగా ఉంది. అమెరికాలో డెన్వర్‌ నుంచి లాస్‌ఏంజెలెస్‌ దాకా కోట్లాది మందినీటి అవసరాలు తీర్చే కొలరాడో నదిదీ ఇదే దుస్థితి. ఇక ప్రపంచ ప్రసిద్ద ఫ్రెంచ్‌ వైన్‌ తయారీకి ఆధారమైన లోయోర్‌ నదిలో కూడా నీరు అతివేగంగా అడుగంటుతోంది.చైనా,అమెరికా,ఇరాక్‌ వంటి దేశాల్లో నిత్యంనిండుగా ప్రవహించే జీవనదులన్నీ నిలువునా ఎండిపోతున్నాయి. దాంతోవాటికి అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు కూడాగుడ్లు తేలేస్తున్నాయి.ఫలితంగాకోట్లాది మంది తాగు,సాగునీటికి అల్లాడుతున్నారు.నిత్యంఉధృతంగా ప్రవహించే చైనాలోనియాంగ్జీనది మరింత దుస్థితిలో ఉంది. ఇదిప్రపంచంలోనే అతిపెద్దనదిగా గుర్తింపు ఉంది. ఇదిలాంటే..స్పెయిన్‌,పోర్చుగల్‌ దేశాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలవల్ల అక్కడ దట్టమైన అడవులు కాలిపోతున్నాయి.అడవులు నశించి పచ్చదనం పరిఢవిల్లక పోవడంవల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతిని కర్భన్‌ఉద్గారాలు పేరుకు పోంతోంది. ఫలితంగా ప్రకృతి సహజసిద్దమైనగుణాన్నికోల్పోయి భూతాపం విపరీతంగా పెరిగిపోతుంది.ఇదింతా పర్యా వరణంలో సంభవిస్తున్న పెనుమార్పులని తెలుస్తోంది.
అలాగే ఆంధ్రప్రదేశ్‌ ఉత్తరాంధ్రాజిల్లాల్లో నిక్షేపమైన నదీజలాలు ఇదేపరిస్థితి దాపురిం చనున్నట్లు సాంకేతాలుచవిచూస్తున్నాయి. దీనికికారణం ఇబ్బుడిముబ్బుడిగా ఇక్క పరిశ్రమలకు అను మతులు ఇచ్చేస్తున్నారు. అల్లూరి సీతారామారాజు జిల్లా చింతపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో నిత్యం ప్రవహించే జీవనదులపై హైడ్రల్‌ ప్రాజెక్టులనిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది.దీని నిర్మాణమంటూ జరిగితే భవిష్యుత్తులో ఇటు గిరిజనలు,అటు మైదాన ప్రాంతానికి తాగు,సాగునీటికి తీవ్రమైన విఘాతం ఏర్పడనుంది. పర్యావరణ పరిరక్షణ..నీటివనరుల సంరక్షణఅనే అంశంపై2005లో సమత ఉత్త రాంధ్రజిల్లాలో(శ్రీకాకుళం, విశాఖ పట్నం,విజయనగరం,తూర్పుగోదావరి)ల్లో ‘కొండల ఆరోగ్యమే.. పల్లపుప్రాంతాల సౌభాగ్యం’’అనే నినాదంతో చైతన్యయాత్ర చేపట్టాం.చెట్లు నరికేయడం,వెసులబాటు లేకుండాఖనిజాలు వెలికితీ స్తూపోతుంటే, భవిష్యత్‌ తరాలకు మన సంపదలు మిగలవని,పచ్చదనంతో పరిఢవిల్లే అటవీ సంపదనుకోల్పోతే,వాటిని తిరిగి రాబట్టేందుకు కొన్ని సంవత్సరాలుతరబడి ఎదురుచూడాల్సి ఉంటుందనిఅనే ఈ యాత్ర ద్వారా ఆనాడే అవగాహన కల్పించాం. ఇది తెలిసినా స్వార్ధచింతనతో అటవీవృక్షాలను తెగనరికి ధ్వంసం రచనకు పూనుకుంటున్నారు.
ఇప్పటికైనా అడవులుఆరోగ్యంగా ఉంటేనేగిరిజన,మైదానప్రాంత రైతాంగానికి,ప్రజలకి సంపూర్ణ మైన ఆరోగ్యం లభిస్తోంది. ఈవాస్తవాలు గ్రహించి సహజవనరుల పరిరక్షణ,పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.! రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్‌-

1 2