ఆమెకేది రక్షణ

దేశంలో వివిధ రకాల నేరాలకు సంబంధించి జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) తాజాగా 2019 సంవత్సరానికి సంబంధించిన నివేదికను వెలువరిం చింది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి వెల్లడైన పలు సంచలన గణాంకాలు పరిస్థితి తీవ్రతను తెలియజేసేలా ఉన్నాయి. ఓవరాల్‌గా నేరాల్లో ఏపీ దేశంలోనే ఎనిమిదో స్థానంలో నిలవగా.. కీలకమైన ఆర్థిక నేరాల్లో మాత్రం టాప్‌లో ఉండటం, మహిళల అక్రమ రవాణాలో రెండో స్థానంలో నిలవడం కలకలం రేపుతున్నది.
2019 చివరి నాటికి ఇలా..
ఎన్‌సీఆర్‌బీ తాజా రిపోర్టులో 1995 నుంచి 2019 డిసెంబర్‌ చివరి నాటికి నమోదైన నేరాలను పరిగణలోకి తీసుకున్నారు. 2019 మేలో ఏపీలో జగన్‌ అధికారంలోకి రాగా, ఆ ఏడాది మొత్తంగా రాష్ట్రం ఆర్థిక నేరాల్లో అగ్రగామిగా నిలిచింది. గతేడాది ఏపీలో రూ.50 కోట్ల నుంచి 100కోట్లు మోసానికి పాల్పడిన కేసులు ఏకంగా 30 నమోదయ్యాయి. ఇది దేశంలోనే ఇది అత్యధికమని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. నమ్మకద్రోహం, ఫోర్జరీ, చీటింగ్‌, ఫ్రాడ్‌ తదితర మోసాలకు సంబంధించి నిందితులు, బాధితుల సంఖ్య ఏటా పెరు గుతూనే ఉంది.
జనాభా తక్కువే అయినా..
ఆర్థిక, పారిశ్రామిక వృద్ధిలో అగ్రరాజ్యాలైన మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడును తోసిరాజని.. ఆంధ్రప్రదేశ్‌ లో ఆర్థిక నేరాలు విస్తృతంగా చోటుచేసుకుకోవడం గమనార్హం. మహారాష్ట్రతో పోల్చుకుంటే సగం జనాభా కూడా లేని ఏపీలో.. ప్రజలకు కుచ్చుటోపీ పెడుతోన్న నేరాలు ఎక్కువగా నమోదయ్యాయి. మధ్య తరగతి ప్రజలకు అత్యాశ చూపి మోసం చేస్తున్న వైనాలు భారీగా బయటపడ్డాయి. వాటిలో అగ్రిగోల్డ్‌ కేసు ప్రధానమైనది కాగా, డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మోసాలకు పాల్పడిన ‘వెల్‌ పే’లాంటి సంస్థల పాత్ర కూడా ఉంది. రూ.50కోట్ల నుంచి 100కోట్లు మోసం చేసిన కేసులు.. గతేడాది మహారాష్ట్రలో ఐదు మాత్రమే నమోదు కాగా,ఏపీలో వాటి సంఖ్య 30గా ఉండటం గమనార్హం. అదే సమ యంలో…పెరిగిన మహిళల అక్రమ రవాణా ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం ఏపీలో మహిళ లను అంగడి సరుకులుగా విక్రయించే ముఠాల కార్యకలాపాలు పెరిగాయి. మహిళల అక్రమ రవాణా, విక్రయాల్లో మహారాష్ట్ర టాప్‌లో ఉండగా,అక్కడి గ్యాంగుల కార్య కలాపాలు ఏపీకి సైతం విస్తరించినట్లు నివేదికలో వెల్లడైం ది. ఏపీలో మూడేళ్లుగా మానవ అక్రమరవాణా క్రమంగా పెరుగుతూ,2019లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. మహిళలు,మానవ అక్రమరవాణాలో మహా రాష్ట్ర 12.5శాతంతో అగ్రస్థానంలో ఉండగా10.8శాతంతో ఏపీ తర్వాత స్థానంలోఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 398 మంది మహిళలు, యువతులు గతేడాది అక్రమ రవాణాకు గురి కాగా వారిలో 316మంది వ్యభిచార గృహాలకు అమ్ముడు పోయారని, వీటికి సంబంధించి కేసు ల నిరూపణ శాతం తక్కువగా ఉందని, కేవలం 21.8శాతం కేసుల్లోనే శిక్షలు పడ్డాయని ఎన్‌సీ ఆర్‌బీ వెల్లడిరచింది. మహిళలపై అఘాయిత్యాల్లో ఏపీ ఎనిమిదో స్థానం..
రాష్ట్రంలో మహిళలపై, లైంగిక వేధింపులు, అత్యాచారాలు..పునరావృతం అవుతున్నాయి. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉంది. గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన ఈతర హా ఘటనల్లో 33.14% మనరాష్ట్రంలోనే నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడు తోంది.
ా రాష్ట్రంలో మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు,వారి ఆత్మ గౌరవానికి భంగం కలిగించే ఘటనలు పెరిగాయి.
ా స్త్రీలపై జరిగిన మొత్తం నేరాల్లో స్వల్ప తగ్గుదల ఉన్నా, వారిపై భౌతిక దాడుల నేరాలు అదుపులోకి రాకపోవడం కలవరపరుస్తోంది.
ా మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉండటం,గతేడాది దేశ వ్యాప్తంగా జరిగిన ఈతరహా ఘటనల్లో 33.14% మన రాష్ట్రంలోనే నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ా ఈ కేసులు 2019లో 1,892 నమోదు కాగా..2020లో ఆ సంఖ్య 2,342కు పెరిగింది.
ా ఏడాది వ్యవధిలో 23.78 శాతం మేర అధికమయ్యాయి.
ా పని ప్రదేశాల్లో మహిళలను లైంగికంగా వేధించడం, స్త్రీలను రహస్యంగా చిత్రీకరించటం (వోయిరిజం) నేరాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో రెండో స్థానంలో ఉంది. 2020 సంవత్సరానికి సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ వివరాలు వెల్లడిరచింది.
ా ఏపీలో మహిళలపై 2019లో 17,746, 2020లో 17,089 నేరాలు జరిగాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గతేడాది 3.70 శాతం మేర తగ్గాయి. ఈ తరహా నేరాలు అత్యధికంగా జరిగిన రాష్ట్రాల జాబితాలో 2019లో పదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ 2020లో ఎనిమిదో స్థానానికి వెళ్లింది.
ా పని ప్రదేశాల్లో మహిళల్ని లైంగికంగా వేధించిన ఘటనల్లో హిమాచల్‌ప్రదేశ్‌ (72 కేసులు) దేశంలో మొదటిస్థానంలో ఉండగా..70 కేసులతో ఏపీ రెండో స్థానంలో ఉంది.
ా స్త్రీలను రహస్యంగా చిత్రీకరించిన ఘటనలు అత్యధికంగా చోటుచేసుకున్న రాష్ట్రాల జాబితాలో ఏపీది రెండో స్థానం. మహారాష్ట్రలో ఈ తరహా కేసులు 201 నమోదు కాగా.. ఏపీలో 124 కేసులు పెట్టారు.
పరిచయస్తులే అత్యాచార నిందితులు
ా రాష్ట్రంలో 1,095 అత్యాచార ఘటనలు జరగ్గా.. అందులో 1,088 ఘటనల్లో ఈ నేరాలకు పాల్పడ్డది బాధితులకు పరిచ యస్తులే.
ా 91 ఘటనల్లో బాధితుల కుటుంబసభ్యులే నిందితులు.997 ఘటనల్లో స్నేహితులు, ఆన్‌లైన్‌ ఫ్రెండ్స్‌, ఇరుగుపొరుగువారి ప్రమేయం ఉంది.
ా అత్యాచారాలు 0.82% పెరిగాయి.
ా సైబర్‌, చిన్నారులపై నేరాల్లో పెరుగుదలలిబి
ా రాష్ట్రంలో 2019తో పోలిస్తే 2020లో సైబర్‌ నేరాలు, చిన్నారులపై జరిగిన నేరాలు కొంత పెరిగాయి.
ా రోడ్డుప్రమాదాలు 14,700 నుంచి 12,830కు తగ్గాయి.
ా అపహరణ కేసులు 902 నుంచి 737కు తగ్గాయి.
పోలీసులపై కేసుల్లో మూడోస్థానం
ా పోలీసులే పలు కేసుల్లో నింది తులవుతున్నారు.
ా దేశవ్యాప్తంగా వారిపై అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ది మూడో స్థానం.
ా అస్సాం (2,179),మహారాష్ట్ర (407) తర్వాత 261 కేసులతో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది.
ా ఆయా ఘటనలపై అభియోగపత్రాల దాఖలులో దర్యాప్తు అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.
ా ఏపీలో 70 (26.81%) కేసుల్లోనే అభియోగపత్రాలు దాఖలుచేశారు. మరో 10 కేసుల్ని ప్రాథమిక దశలోనే న్యాయస్థానాలు కొట్టేశాయి.
ా 17 కేసుల్లో తుది నివేదికలు దాఖలు చేశారు.
దేశద్రోహం కేసులు 2019లో 93 నమోదు కాగా గతేడాదితగ్గి 73కి చేరాయి. మణి పూర్‌లో15,అస్సాంలో 12,కర్నాటకలో 8, ఉత్తరప్రదేశ్‌లో 7,హర్యానాలో 6,ఢల్లీిలో 5, కాశ్మీర్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. 2019లో మొత్తంగా 51,56,158 కేసులు నమోదు కాగా గతేడాది 28.8శాతం అంటే 14,45,127 కేసులు పెరిగాయి. అంటే లక్ష మంది జనాభాకు నమోదైన నేరాల రేటు 2019లో 385.5 వుండగా, 2020లో 487.8కి పెరిగిందని ఆనివేదిక పేర్కొంది. 2020లో భారతీయ శిక్షాస్మృతి కింద నమోదైన కేసులు 31.9శాతంగా వున్నాయి. మొత్తంగా 66,01,285 నేరాలు నమోదు కాగా, వీటిల్లో 42.54లక్షలు కేసులు ఐపిసి కింద దాఖల య్యాయి. 23.46లక్షలకు పైగా కేసులు ప్రత్యేక, స్థానిక చట్టాల (ఎస్‌ఐఎల్‌) కింద నమోద య్యాయని నివేదిక పేర్కొంది. సాంప్రదాయ రీతిలో సాగే నేరాలు రెండు లక్షల వరకు తగ్గా యని తెలిపింది. 2020లో 55.84లక్షల కేసులు దర్యాప్తు దశలో వున్నాయి. వాటిల్లో 34.47లక్షల కేసులను పరిష్కరించారు. దాదాపు 26.12లక్షల కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే చార్జిషీట్లు దాఖలు చేసిన రేటు కూడా 12.5శాతం పెరిగింది.
లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ !
గతేడాది మార్చి 25 నుండి మే 31వరకు కోవిడ్‌ లాక్‌డౌన్‌ వుండడంతో మహిళలు, పిల్లలు, వృద్ధులపై జరిగే నేరాలు, దొంగ తనాలు, దోపిడీలు తగ్గాయని నివేదిక పేర్కొంది. హత్య కేసులు మాత్రం ఒక శాతం పెరిగాయి. ఈ హత్యలకు ప్రేరేపించిన కారణాల్లో వ్యక్తిగత కక్షలు లేదా శతృత్వం, లాభాల కోసం జరిగినవి ఇలా పలు రీతుల్లో వున్నాయి. కిడ్నాప్‌ లేదా అపహరణ కేసులు 19.3శాతం మేర తగ్గాయి. వీరిలో 73,721మంది మహిళలు కిడ్నాప్‌ కాగా, పురుషులు 14,869గా వున్నారు. ఎస్‌సిఆర్‌బి డేటా ప్రకారం వీరిలో మైనర్లు 56,591మంది (8,175మంది బాలురు, 47,876మంది బాలికలు)గా వున్నారు. పెద్దవారు 31,999మందిగా వున్నారు. మొత్తంగా 91,458మంది కిడ్నాప్‌ అవగా,281మంది చనిపోయి శవంగా తేలారు. ప్రజల శాంతి భద్రతలకు సంబంధించి 71,107 కేసులు నమోదయ్యాయి. అంటే 2019తో పోలిస్తే ఈ నేరాలు 12.40శాతం ఎక్కువ. వీటిల్లో 51,606 కేసులు ఘర్షణలకు సంబంధించినవే. మహిళలపై నమోదైన నేరాలు 8.30శాతం తగ్గాయి. నమోదైన కేసుల్లో భర్త లేదా బంధు వుల దాష్టీకానికి సంబంధించిన కేసులే మెజారి టీగా వున్నాయి. ఆతర్వాత అత్యాచార ఉద్దేశ్యం తో దాడి జరిపిన కేసులు 23శాతంగావుండగా, కిడ్నాప్‌ (16.8శాతం), అత్యాచారం (7.5 శాతం) కేసులు నమోదయ్యాయి. 2020లో బాలలపై మొత్తంగా 29,768 కేసులు నమోద య్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 7.8శాతం కేసులు తగ్గాయి.1,45,754 ఆర్థిక నేరాలు నమోదయ్యాయి.
మహిళలపై అఘాయిత్యాలు ఆగాలంటే..
దేశ రాజధాని ఢల్లీిలో మహిళలపై అకృత్యాలు గతంలోనూ జరిగాయి.. ఇప్పుడూ జరుగు తున్నాయి.. భవిష్యత్తలోనూ జరుగుతాయి. పాలకులు మారినా, మహిళలపై అకృత్యాలు తగ్గడంలేదు. బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోనో, ఆన్‌లైన్‌ క్యాబ్‌లను బ్యాన్‌ చేస్తేనో మహిళలపై అఘాయిత్యాల అగిపోతాయను కోవడం హాస్యాస్పదం. మొత్తంగా సమాజంలోనే మార్పు రావాల్సి వుంది. ఆమార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి. దానికి తగ్గ చర్యలు అధికారంలో వున్నవారు తమ స్థాయిలో చేపడితే, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ, విచిత్రంగా అలాంటి చర్యల్ని తీసుకోవడంలో పాలకులు చిత్తశుద్ధి ప్రదర్శించడంలేదు.
చట్టాలు.. నిఘా టీమ్‌లు.. విచిత్రాలు.!
ఢల్లీి నుంచి హైద్రాబాద్‌ దాకా.. ఆమాటకొస్తే ఆర్థిక రాజధాని ముంబై నుంచి గల్లీ దాకా.. నిత్యం ఎక్కడో ఓచోట మహిళలపై అఘాయి త్యాలు జరుగుతూనే వున్నాయి. చట్టాలు లేకనేం, నిందితుల్ని శిక్షించడానికి చాలానే వున్నాయి. కానీ, ఆ చట్టాలే బూజుపట్టిపోయాయి. అనేకా నేక కారణాలతో దోషులు తప్పించు కుంటు న్నారు. దాంతో చట్టాలంటే భయపడే పరిస్థితి లేదు తప్పు చేసేవారికి. అందుకే తప్పు మీద తప్పు.. తప్పు మీద తప్పు జరిగిపోతూనే వుంది. కొన్ని చట్టాలు విచిత్రంగా తెరపె ౖకొస్తుంటాయి. వరకట్న వేధింపుల వ్యవహారమే వుంది.. ఓమహిళ కేసు పెడితే చాలు, అత్తిం టోవారి పనైపోయినట్టే.
దేశానికి దిశా నిర్దేశనం చేయాల్సినవాళ్ళే…
చట్ట సభలు వ్యవస్థల్ని దిశా నిర్దేశనం చేస్తాయి. అందులోని ప్రజా ప్రతినిథులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కానీ, అందరూ అలా వుంటున్నారా.? కొందరు చట్టసభల్లోనే అసాంఫీుక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఆమధ్య ఓరాష్ట్ర అసెంబ్లీలో అధికార పార్టీ నేతలే (ఇందులో అమాత్యులూ వున్నారు) మొబైల్‌ ఫోన్లలో నీలి చిత్రాలు తిల కించారు. అలాంటి ఘటనే మరోటి ఇటీవలే వెలుగు చూసింది. ఇవన్నీ రాజకీయ వివాదా లుగా మారుతున్నాయి తప్ప, ఇంకోసారి ఇలాం టి ఘటనలు వెలుగు చూడకుండా,దోషులకు చట్ట సభలనుంచి సాగనంపడం లాంటి చర్య లేమీ తీసుకుంటున్న దాఖలాలు కన్పించడం లేదు. చట్ట సభల్లో ప్రజా ప్రతినిథులే ఇలా వ్యవహరిస్తోంటే, వారిని రోల్‌ మోడల్స్‌గా తీసు కునే వారి అనుచరులు ఎలా వ్యవహరిస్తారో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు– సింధు

స్వర్ణయుగ చక్రవర్తి

‘‘స్వర్ణయుగ చక్రవర్తి (ఏకపాత్రాభినయం) ఆంధ్ర ` తెలంగాణ రాష్ట్రాలలో ప్రప్రధమంగా ఏకపాత్రకు విద్యార్థుల విభాగంలో 14 నవంబరు 2018లో 30మంది విద్యార్ధు లచే ప్రదర్శించినందుకు గాను తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కింది.’’

నరసనాయకునికి,నాగాంబకు జన్మించిన వారి ఆలనా పాలనములు అంతంతమాత్రమే. నేను విద్యాప్రియుడిని, వీరుడను, లలితకళాభిమానిని, విజయనగర సామ్రాజ్య స్వర్ణయుగ కర్తను చక్రవర్తిని ఔతానని ఏనాడూ వూహించలేదు. ఊహించని ఊహకందని ఎన్నో మలుపులు నా జీవితంలో కలిగాయంటే అవి విధివిలాసమే. తిమ్మరుసు మహామంత్రి నా యందు కనబరచిన వాత్సల్యము ఇంత అని చెప్పలేని, మాటలకు అందని అనిర్వచనీయమైన బంధము. రాజన్న కృష్ణదేవరాయలు, మంత్రి అన్నచో తిమ్మరుసు అన్నంతగా పెనవైచుకున్నది మా బంధము. తండ్రి దగ్గరలేని చనువు అప్పాజీవద్ద పొందిన ధన్యజీవి నేనే.
అప్పాజీ పర్యవేక్షణలో పదునారేండ్ల వయస్సు నిండుసరికే సమస్తాయుధ యుద్ధ విద్యాకౌ శలము, వ్యూహ నిర్మాణము,ప్రత్యర్థి వ్యూహచ్చేదనము,దుర్గరక్షణ,తదాక్రమణ మొదలగు సకల యుధ్ధ విద్యలయందు ఆరితేరాను. గుర్రపు స్వారి,కత్తిసాములో మల్ల యుద్ధములో ప్రత్యేక మెళకువలు నేర్పించాడు అప్పాజీ! సద్గుణ సంపన్నునిగా అప్పాజీ నన్ను తీర్చిదిద్దాడు. ప్రజలకందరికీ ప్రీతిపాత్రుడన య్యేలా చేశాడు. నా పినతల్లి తిప్పాంబికకు మాత్రము నా ఈ ఎదుగుదల మాత్సర్య మనస్కురాల్ని చేసింది. నాపై అసూయ ద్వేషములు పెరిగాయి. తన కుమారుని పై ఆతని పట్టాభిషేకముపై వాత్సల్యము దినదిన ప్రవర్థమానమయ్యెను. తిప్పాంబ కుటిల ప్రవర్తన ఎరిగి యున్న అప్పాజీ నన్ను కంటికి రెప్పలా వెన్నంటి యుండి కాపాడారు. లేకున్నచో పినతల్లి యిచ్చిన విషప్రసాదము తిని ఏనాడో ఈ దేహమును చాలించి యుండెడివాడను. విరూపాక్షస్వామి ఆశీస్సులతో అప్పాజీ రాజనీత్నిత,అండదండలతో బతికి బట్టకట్ట గలిగాను. నాఅన్నగారు వీరనరసింహరాయల వారి ఆగ్రహమునకు నా నేత్రములు రెండు ఏనాడో కోల్పోవలసినవాడిని. అప్పాజీ తన్నననేత్రముతో నా నేత్రములు పోకుండ కాపాడగలిగాడు. అప్పాజీయే లేకున్న అష్టదిగ్గజకవులెక్కడ? ఈ సాహితీసమరాంగణ బిరుదాంకితుడెక్కడ?
అవును. అపాజీ సాక్షాత్తు దైవస్వరూపుడు. లేకున్న భూత భవిష్యత్‌ వర్తమానములు ఆతని మస్థిష్కములో గురితప్పక ఏలగోచరించును? చిన్ననాట అన్నపానాదులకు అల్లలాడిన ఆ కర్మయోగి అలసిసొలసి సొమ్మసిల్లి పడిపోగా ఆ అరణ్యములో ఆతనికి నీరెండపడకుండ నాగుపాము పడగవిప్పి ఆమహనీయుని శిరస్సున ఛత్రమువలే నిలచునా? దైవస్వరూపుడో దైవానుగ్రహస్వరూపుడో ఐన అప్పాజీ అడుగుజాడలో నడచినందుననే నేను తెలుగు సామ్రాజ్యమును అందునా హిందూ సామ్రాజ్యమును ఏకఛత్రాధిపత్యముగా ఏలగల్గి యుండెడివాడనా?
కుమార వీరశ్యామల రాయుడు,ఆర్వీటిశ్రీ రంగ రాజు,ఆకువీటి యిమ్మరాజు,పిమ్మసాని రామలింగ భూపతి,నంద్యాల నాపరాజుల ముందు సలకము తిమ్మయ గారు ఆరోపించిన ఆరోపణలు కారుకూతలను అప్పాజీ సభా ప్రాంగణములో నోరు మెదపక ఎదుటివారి నోరెట్లు నొక్కెచో ….ఆ….అదికదా ప్రతివారు నేర్వదగిన రాజనీత్నిత, నిష్కళంక దేశభక్తి. రామలింగ భూపతి శ్రీ రంగరాయార్యన్య సామంతుల ఎదుట నన్ను నిలిపి…..
వీరులు,శూరులు,చతురంగబల ససైన్యా ధిపతులు, రాజులు, అందరూ కొలువుదీరి యున్నపుడు ఈ రత్నసింహాసనమును అధిష్టించు అధికారము ఈ యువకిశోరం రాయలుకు గాక మరెవ్వరికి కలదు? అని ప్రశ్నించుట ఎవరికి సాధ్యము? పట్టాభిషేక మునకు ముందు సభాభవన అంతర్గృ హములోనికి నన్ను పిలువుకొని వెళ్ళి ఏకాన్తముగ రా నాయనా! అని చేరబిలిచి చెంపపై పెట్టుపెట్టిన ఆ చెంపదెబ్బ ఎట్లు మరతును? ‘‘వత్సా! ఈ క్షణముతో నీపై నాయధికారము ముగియుచున్నది. ఇక నీవు రాజువు. నేను నీ కింకరుడను. అధికారము మహామోహస్థానము. నీ తీర్పునకు తిరుగుండదు. నాఈ చెంపదెబ్బ నీకెంతటి వేదన కల్గించినదో ్నప్తియందుంచుకొని అపరాధులను శిక్షించుయెడ మనస్సెట్లుం డవలెనో నీ మనస్సున నాటుకొనుటకే నిరపరాధివగు నిన్నిట్లు బాధించితిని’’ అని పలికిన అమృతపుపలుకుల మర్మము రాజనీతి ఎట్లుమరతును? నూటయేబది సంవత్సరములకు ముందే స్థాపింపబడిన విజయనగర సామ్రాజ్య మును హిందూ సామ్రాజ్యముగా తీర్చిదిద్దాను. తూర్పున కటకము వరకు తెలుగువారి యధికా రము విస్తరింపజేశాను. దక్షిణమున సేతువు వరకు నాయ్నాకు తిరుగులేదు. పశ్చిమమున బీజాపురమే నా రాజ్యసరిహద్దు. తురుష్కులకు మనమన్న సింహస్వప్నము.ఉత్కళులు విధేయు లుగా నిలిచిరి. చోళులు,పాండ్యులు నామ మాత్రావశిష్ఠులు. పొట్నూరు,సింహాచల మందలి దిగ్విజయస్తంభములు చారిత్రక సత్యములకు తార్కాణములు. నాయేలుబడిలో రక్షణలో ప్రజలకు యుద్ధభయము గాని,చోరభయము గానీ లేకుండా నిశ్చింతగా జీవించునట్లు చేయ గల్గితిని. పాడిపంటలు ద్విగుణములు, త్రిగుణములుగా వృద్ధి చెందినవి. అందుకే విజయనగర వీధులలో వాణిజ్యము మూడు పువ్వులు ఆరుకాలుగా వర్ధిల్లుచున్నది. లేకున్న రత్నములు,మణులు,మాణిక్యములు, వజ్రవైఢూర్యములు పురవీధులలో ఆరుబయట రాసులుపోసి అమ్మగలరా? కత్తికేకాక ఘంటమునకూ పదునుపెట్టి భువన విజయసాహితీ సభయందు ఎన్నెన్నో సాహిత్య కుసుమాలు విరగబూయునట్లు చేయగల్గితిని. ఆ కావ్యసంపద, కవులు నభూతో నభవిష్యత్తి అన్నట్లు వేయిసంవత్సరములైననూ తరగని సాహిత్యసంపద ఉద్భవించినది కదా! ఒకపక్క సాహిత్యము, మరొకపక్క సంగీతము, ఇంకొకపక్క రాజకీయముల….అష్టావధానము చేయుచునే ఆముక్తమాల్యద గ్రంథము పూర్తి చేయగల్గితిని. దేశభాషలందు తెలుగులెస్స కాకున్న నా ఈ బృహద్గ్రంధము రచియింపబడియుండెడిదా? విజయపరంపరలతో నేను కట్టించిన దేవాలయప్రాంగణములు, ఆకాశహర్మ్యములైన గాలిగోపురములు కూలిన కూలుగాక నా విజయపరంపరలతో నెలకొల్పిన విజయస్తంభాలు పవిత్రతుంగభద్రమ్మ తరంగాలలో తళతళలాడుచున్న విఠలాలయ గోపురకాంతి దీప్తులు, గగనమును తాకునట్లు మెరుపుతీగల మాపుచేసిన ఆంధ్రవీరుల ఖడ్గకాంతులు,సహృదయలోకమునకు సుధాధారవలె,పానీయములుగా పెదవికం దించిన భువనవిజయ కవితా గోష్టులు తలచితలచి తెలుగువాడు తన్మయుడు కాకుండునా?పెద్దనగారి మనుచరిత్ర, తిమ్మనగారి పారిజాతాపహరణము, తెనాలి రామలింగని పాండురంగ మహత్మ్యము….. ఒకటేమిటి…..
మున్ముందు నా ఈ సామ్రాజ్యమేమగునో? మరల శత్రురాజులు పుంజుకొనిన- రాజుల మధ్య ఐక్యత లోపించిన -ఆంధ్ర సామ్రాజ్య మందలి విజయస్తంభములను వారు విరుగగొట్టిన గొట్టునేమో! విఠలాలయ, దేవాలయ ప్రాంగణములు చెల్లాచెదురు చేసిన చేయునేమో! ఆకాశహర్మ్యములుగా నే నిర్మించిన గాలిగోపురములు కూలిన కూలుగాక. ఆంధ్రవీరుల ఖడ్గకాంతులు అంతమొనర్చిన ఒనర్చునేమో! కానీ నా భువనవిజయ ప్రాభవమును యిసుమంతయు కదల్చలేరు. భువనవిజయమనగానే అపజయమెట్టిదో ఎరుగని ఆంధ్రజాతి పౌరుషప్రతాపములు ్నప్తికి రాగలవు. సాహితీ సదస్సుచే సాధించిన విజయములు ఆంధ్రజాతి మరువదు. సంస్కృతభాష నుండి సాగిన అనువాద ప్రక్రియకు అడ్డుకట్టవైచి ప్రబంధ ప్రక్రియకు నాందీ పలికి పరిపుష్టి గూర్చి వయసుతోపాటు పొంగివచ్చు అవయవ సౌష్టవముల దర్పముతో మంత్రముగ్ధులను చేయు ప్రబంధసుందరి అష్టాదశ వర్ణనాలంకృత కాంతులతో సాహిత్యమున్నంత కాలము నిలిచియుండును కదా!
తెలుగదేలయన్న దేశంబు తెలుగు
దేశభాశలందు తెలుగులెస్స
శ్రీ గోమఠం రంగా చార్యులు

ప్రకృతి వైఫరిత్యాలు`పెరుగుతున్న మార్పులు

భూకంపం,తుఫాను,వరదలు,సునామీ మొదలైన ప్రకృతి వైపరీత్యాలు మానవ నియంత్రణా పరిధికి ఆవల ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు,అనేక ప్రకృతి వైపరీత్యాలతో విధ్వంసానికి గురౌతున్నాయి. తీవ్రమైణ ఆస్తి,ప్రాణనష్టాలు జరు గుతున్నాయి. కొన్ని రకాల వైపరీత్యాలను ఎదుర్కొన డానికి,ముందుగా సిద్ధం కావటానికి మానవ చైత న్యం అవసరం.పునరావాస పనులు,ప్రథమ చికిత్స, ఆహారం,బట్ట్‌లు,మందులు,రక్షణ చర్యలు, ఆశ్రయం, మొదలైన అంశాల గురించి ప్రజలు తగినంత అవగాహన కలిగివుండాలి.

ప్రకృతి వైపరిత్యాలను మనం ఆపలేం. అయితే వరదలు, తుఫానులు, అగ్నిప్రమాదాలు, భూకంపాలవంటి ప్రకృతివైపరీత్యాలు సంభ వించ డంవల్ల పర్యావరణం కలుషితమవుతుంది. అనేక రకాల రోగాలు ప్రబలుతాయి. మనుషులతో సహా జంతువులన్నీ కూడా రోగాలబారిన పడ తాయి. కాబట్టి ఇలాంటి సందర్భాలలో మనం అప్ర మత్తంగా ఉండడంతోపాటు ఇతరులకు సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉండాలి. బట్టలు,ఆహారపదార్థాలు సేకరించి పంపడం, సేవాక్యాంపులలో పాల్గొనడం చేయాలి. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు తీసుకో వలసిన జాగ్రత్తలపట్ల అవగాహన కలిగించడానికి ప్రయ త్నం చేయాలి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నప్పుడు 12 నుండి 15 సంవత్సరాల వయస్సుగల పిల్లలు చేపట్టగల సహాయ కార్యక్రమాలకు ప్రాధా న్యత ఇవ్వాలి. ఓవైపు కరోనా వైరస్‌ కల్లోలం..
మరోవైపు భారీగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొం టున్నారు. ఇక వర్షాలు, వరదలతో సీజనల్‌ వ్యాధు లు కూడా విరజంభించే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో ఏపీప్రభుతం చర్యలు చేపట్టింది. తాజాగా ఏపీరాష్ట్రవిపత్తుల నిర్వహణశాఖ ప్రభుత్వ కోవిడ్‌-19 నియమాలు పాటిస్తూ సహాయక చర్యల్లోని అధికారులకు సహకరించండని సూచిస్తూ ప్రజలకు ఓ లేఖను రిలీజ్‌ చేసింది. అంతేకాదు.. ప్రజలు వరదల సమయంలో ఏమి చేయాలి.. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఏ విధమైన చర్యలు తీసుకోవాలి..ఒకవేళ వరదలు లోతట్టు ప్రాంతాలకు వస్తే.. అక్కడ ప్రజలు ఏ విధమైన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి అనే అంశాలను వివరిస్తూ రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్‌ కె. కన్న బాబు ఓలేఖను రిలీజ్‌ చేశారు
వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ా వరదనీటిలోకి ప్రవేశించవద్దు.
ా మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండండి.
ా విద్యుదాఘాతానికి గురికాకుండా విద్యుత్‌ స్తంభాలతో పాటు, పడిపోయిన విద్యుత్‌ లైన్ల కు దూరంగా ఉండండి.
ా ఓపెన్‌ డ్రెయిన్స్‌ లేదా మ్యాన్‌హూల్స్‌ను గుర్తించి ఆప్రదేశంలో కనిపించే విదంగా చిహ్నాలు,ఎర్ర జెండాలు లేదా బారికేడ్లు ఉంచండి.
ా వరదనీటిలో నడవకండి లేదా డ్రైవ్‌ చేయవద్దు
ా రెండు అడుగుల మేర ప్రవహించే వరద నీరు పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు
ా తాజాగా వండిన లేదా పొడి ఆహారాన్ని తినండి.
ా తినే ఆహార పదార్ధాలపై ఎల్లపుడూ మూతలు వేసి ఉంచండి
ా వేడిచేసిన లేదా క్లోరినేటెడ్‌ నీరు త్రాగాలి.
ా మీ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు
వరదల వచ్చిన తర్వాత చేయాల్సిన / చేయకూడని పనులు
్చ మీ పిల్లలను వరద నీటిలో ఆడనివ్వకండి
్చ రిపేర్‌కు వచ్చిన విద్యుత్‌ వస్తువులను ఉపయోగించవద్దు
్చ అధికారులు సూచించిన వెంటనే కరెంట్‌కు సంబందించిన ప్రధాన స్విచ్లులను,ఎలక్ట్రిక్‌ ఉపకరణాలను వాడడం మానెయ్యాలి
్చ తడిగా ఉంటే విద్యుత్‌ పరికరాలను తాకవద్దు.
్చ విరిగిన విద్యుత్‌ స్తంభాలు,తీగలు,పదునైన వస్తువులను పరిశీలించండి
్చ వరద నీటిలో కలిసిన ఆహారం తినవద్దు.
్చ మలేరియావంటి వ్యాధులను నివారించడానికి దోమతెరలను వాడండి.
్చ వరద సమయంలో పాము కాటు సాధారణం కాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
్చ నీటి మార్గాలు/మురుగునీటిపైపులు దెబ్బతి న్నట్లయితే టాయిలెట్‌ లేదా కుళాయి నీటిని వాడకండి.
్చ నీరు త్రాగడానికి సురక్షితమని ఆరోగ్య శాఖ సలహా ఇచ్చే వరకు పంపు నీరు తాగవద్దు.
్చ మీ ప్రాంతంలో వరదలు సంభవించి ఖాళీ చేయవలసివస్తే మంచం,టేబుళ్లపై మీ ఫర్నిచర్‌ ఇతర ఉపకరణాలను పెట్టండి.
్చ టాయిలెట్‌ గిన్నెపై ఇసుక సంచులను ఉంచండి మరియు మురుగునీటి తిరిగిరాకుండా నివారించడానికి అన్ని కాలువ రంధ్రాలను మూసివేయండి
్చ మీ కరెంట్‌,గ్యాస్‌ కనెక్షన్‌ ను ఆపివేయండి
్చ ఎత్తైన భూ ప్రదేశం లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి.
్చ మీ వద్ద ఉన్నఅత్యవసర వస్తు సామగ్రి, ప్రథమ చికిత్స పెట్టె,విలువైన వస్తువులు,ముఖ్యమైన పత్రాలను తీసుకొని వెళ్ళండి.
్చ నీటి లోతును తెలుసుకొనుటకు కర్రను ఉపయోగించండి.
్చ తడిసిన ప్రతిదాన్ని శుభ్రపరచండి మరియు క్రిమిసంహారకం చేయండి.
భూమి వేడెక్కితే ఏం జరుగుతుంది?
గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రపంచానికి పెను విపత్తుగా మారబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరి స్తున్నారు. మనుషుల చర్యల వల్ల వాతవరణంలోకి కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలు భారీగా పెరిగాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు కూడా మండుతున్నాయి. ధ్రువాల్లో మంచు కరుగుతోంది.ప్రతికూల వాతా వరణ పరిస్థితులు పెరుగుతున్నాయి. భూమి సగటు ఉష్ణోగ్రత15డిగ్రీసెంటీగ్రేడ్లు.గతంలో ఇది ఇంత కన్నా ఎక్కువగా,తక్కువగా కూడా ఉంది.ఈ ఉష్ణోగ్రతలో మార్పులు సహజమే. అయితే, మునుపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ దీనికి కారణమని వారు చెబుతున్నారు.
గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ అంటే సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవడం. భూమిపై నుంచి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్‌హౌజ్‌వాయువులు గ్రహిం చుకుని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి. ఫలి తంగా వాతావరణం,భూ ఉపరితంల వేడెక్కు తున్నాయి. ఈఎఫెక్ట్‌ లేకపోతే భూమి ఇంకో 30డిగ్రీ సెంటీగ్రేడ్స్‌ చల్లగా ఉండేది. జీవం మనుగడ కష్టమ య్యేది.అయితే ఈ గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌కు పరిశ్రమలు, వ్యవసాయంవల్ల వెలువడే వాయువులుతోడై మరిం త శక్తిని గ్రహించి, ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్నే గ్లోబల్‌ వార్మింగ్‌ (భూమి వేడెక్కడం),వాతావరణ మార్పులు అంటారు.
గ్రీన్‌ హౌజ్‌ వాయువులు ఇవే…
గ్రీన్‌హౌజ్‌ వాయువుల్లో అత్యంత ప్రభా వవంతమైంది నీటిఆవిరి.కానీ,అది వాతా వర ణంలో కొన్ని రోజులపాటే ఉంటుంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ చాలా కాలం ఉంటుంది. అది పారిశ్రా మికీకరణ కన్నా ముందుఉన్న స్థాయిలకు వెళ్లాలంటే కొన్ని వందల ఏళ్లు పడుతుంది. సముద్రాల్లాంటి సహజ జలవనరులు దాన్ని పీల్చుకోగలవు. శిలాజ ఇంధనాలను మండిరచడంవల్లే అత్యధికంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలవుతోంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకునే అడవులను నరికి,కాల్చేయడంవల్ల కూడా కార్బన్‌ వెలువడుతోంది.గ్లోబల్‌వార్మింగ్‌ ఎక్కువవు తోంది.1750లో పారిశ్రామిక విప్లవం మొదలై నప్పటితో పోలిస్తే కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయిలు 30శాతం పెరిగాయి.అయితే,కార్బన్‌డైఆక్సైడ్‌ అం తటి స్థాయిలో అవి లేవు.
గ్లోబల్‌ వార్మింగ్‌కు ఆధారాలు ఉన్నాయా?
పారిశ్రామిక విప్లవం కన్నా ముందు నాళ్లతో పోల్చితే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు ఒక సెంటీగ్రేడ్‌ పెరిగినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) చెబుతోంది.అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదైన 20ఏళ్లు.. గత 22 ఏళ్లలోనే ఉన్నాయి. 2005-2015 మధ్య సగటు సముద్ర మట్టం 3.6 మిల్లీమీటర్లు పెరిగింది. ఉష్ణోగ్రత పెరగడం వల్ల నీరు వ్యాకోచించి ఇది ఎక్కువగా జరిగింది. కరుగుతున్న మంచు కూడా సముద్ర మట్టాలు పెరగడానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉష్ణోగ్రత పెరుగుతున్న ప్రాంతాల్లో హిమనీనదాలు కరుగుతున్నాయి. ఆర్కిటిక్‌ సముద్ర మంచు 1979కి ఇప్పటికీ చాలా తగ్గిపోయిందని ఉపగ్రహాలు తీసిన ఫొటోలు సూచిస్తున్నాయి. మొక్కల్లో పూలుపూసే, పండ్లు కాసే సమయాలు ముందుకు జరుగుతున్నాయి. ఉష్ణోగ్రత పెరుగుదలను1.5డిగ్రీ సెంటీగ్రేడ్‌లకు కట్టడి చేసు కోగలిగితే క్షేమంగానే ఉండొచ్చని ఇటీవలికాలంలో శాస్త్రవేత్తలు,నాయకులు అంటున్నారు. గ్రీన్‌ హౌజ్‌ ఉద్గారాల కట్టడి విషయంలో రాజకీయంగా జరుగు తున్న కృషికి ఐరాసనేతృత్వం వహిస్తోంది. ఇప్పటి కిప్పుడు గ్రీన్‌ హౌజ్‌ వాయువుల ఉద్గారాలు గణనీ యంగా తగ్గించుకున్నా, వాతావరణంపై ప్రభావం తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రభావం ఎలా ఉంటుంది?
వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుదన్నదానిపై స్పష్టత లేదు.ప్రతికూల వాతా వరణ పరిస్థితులు పెరుగతాయి. దీంతో మంచినీటి కొరత ఏర్పడొచ్చు. ఆహారఉత్పత్తిపైనా తీవ్ర ప్రభా వం పడొచ్చు. వరదలు, తుఫానులు, వడగాలుల వల్ల మరణాల సంఖ్య పెరగొచ్చు. భూతాపం పెరగడంవల్ల ఎక్కువ నీరు ఆవిరవుతుంది. సముద్ర మట్టాలు పెరుగు తాయి కాబట్టి వరదలు కూడా పెరగొచ్చు. ఈ మార్పులను తట్టుకునే సామ ర్థ్యం లేని పేద దేశాలపై ప్రభావం విపరీతంగా ఉండొచ్చు. పరిస్థితులకు అంత త్వరగా అలవాటు పడలేవు కాబట్టి కొన్ని రకాల మొక్కలు, జంతువులు అంతరించిపోవచ్చు. మలేరియా లాంటి వ్యాధులు, పోషకాహార లోపాల బారిన కోట్ల మంది పడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)అంచనా వేసింది. వాతావరణంలో పెరిగిన కార్బన్‌ డై ఆక్సైడ్‌ను సముద్రాలు ఎక్కువగా పీల్చుకోవడంవల్ల వాటి ఆమ్లత్వం ఇంకా పెరగొచ్చు. కోరల్‌ రీవ్స్‌కు ముప్పు ఏర్పడొచ్చు. వాతావరణ మార్పులపై స్పందించడమే ఈశతాబ్దంలో మానవాళికి అతి పెద్ద సవాలు కాబోతోంది.
`వ్యాసకర్త : వాతావరణ మార్పుల పరిశోధకుడు,సెంట్రల్‌ యూనివర్శిటీ,హైదరాబాద్‌
మల్లేష్‌ నాయక్‌


కుదుపేసిన గులాబ్‌ తుఫాన్‌

గులాబ్‌ తుఫాను గజగజా వణికిచింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ లోను ఆరు జిల్లాలను అతలాకుతలం చేసింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు భయపడేలా చేసింది. లోతట్టు కాలనీలను ముంచేసింది. అక్కడి ప్రజలకు నిలువ నీడ లేకుండా చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. చాలాచోట్ల గల్లంతైన వారి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఏపీ వ్యాప్తంగా 1.64 లక్షల ఎకరాల్లో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది.

ఆంధ్రప్రదేశ్‌ను గులాబ్‌ తుఫాను వణి కించింది. ఆనాటి1990తుఫాన్‌ను తలపిం చింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు ఆరు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. జోరుమని వీచే గాలులు.. హోరుమని జోరు వాన..ఇళ్ల నుంచి జనంబయకు రావాలంటనే భయపెట్టింది. కళింగపట్నానికి సమీపంలో తీరం దాటిన ‘గులాబ్‌’ తుపాను రెండు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఒడిశాతో పోల్చితే ఆంధ్ర ప్రదేశ్‌కు ఎక్కువ నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా దాకా కుండపోతగా కురిసిన వర్షాలకు ఆర్గురు బలయ్యారు. అపార ఆస్తినష్టం సంభవించింది. 1.6 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు ప్రాథమిక అంచనా. తుపానుధాటికి ఉత్తరాంధ్రలో విద్యుత్‌, కమ్యూ నికేషన్‌ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70-85 కి.మీ వేగం తో వీచిన ఈదురుగాలులకు విద్యుత్‌ స్తంభాలు, మొబైల్‌ సిగల్‌ టవర్లు పడిపోయాయి. చెట్లు కూలి పోయాయి. జలమయమైన పలుగ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కరెంటు లేక, ఫోన్లు పనిచేయక, సురక్షితమైన మంచినీరు దొరక్క ప్రజలు పడిన అవస్థలు వర్ణనా తీతం. నాగావళి,వంశధార,వేదావతి నదులు పొంగుతుండడంతో వరదలు పొటెత్తే ప్రమాద ముంది.గులాబ్‌ ధాటికి ఒడిశాను అనుకుని ఉన్న ప్రాంతాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. శ్రీకాకుళంలో వజ్రపు కొత్తూరు, సంత బొమ్మాళి బాగా దెబ్బతి న్నాయి. కోవిడ్‌-19మహమ్మారి నుంచి ఇప్పు డిప్పుడే తేరుకుంటున్న ప్రజలను ఇది కోలుకోలేని దెబ్బతీసింది. లక్షకు పైగా ఎకరాల్లో వరి, వేల ఎకరాల్లో మొక్కజొన్న నీట మునిగింది. వేరు శనగ, మిరప, ఉద్యాన పంటలకు కూడా నష్టం వాటి ల్లింది. విద్యుత్‌ వ్యవస్థకు భారీగా నష్టం వాటిల్లింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న రోడ్లు ఈ తుపాను దెబ్బకు మరింత అధ్వానంగా తయారయ్యాయి. పారిశుధ్యం,నీటి సరఫరా వ్యవస్థస్తంభించి పోయిం ది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదముంది. గులాబ్‌ విపత్తు సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోనే లేదు, మరో తుపాను పొంచి ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. అత్యధిక జనాభా, అంతంతమాత్రమే మౌలిక సదుపాయాలు కలిగిన మన దేశంలో చిన్న విపత్తు కూడా పెద్ద నష్టం కలిగించే అవకాశముంది. దీనికి తోడు తుపానుల స్వభావంలోనూ పెనుమార్పులు చోటుచేసుకుం టున్నాయి.
భూగోళం వేడెక్కడం వల్ల వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల ప్రభావం భయంకర తుపా నుల రూపంలో వ్యక్తమవుతుందని వాతావరణ మార్పుల సదస్సు (ఐపిసిసి) చేసిన హెచ్చరిక సరైన దేనని తాజా తుపాను నిరూపించింది. 2020లో బెంగాల్‌ను కుదిపేసిన ‘అంఫని’, అంతకుముందు గుజరాత్‌ను కకావికలం చేసిన ‘తౌకే’్టలతో పోల్చితే గులాబ్‌ తీవ్రత తక్కువే కావచ్చు. కానీ,ఈ ఉష్ణ మండల తుపాను లక్షణాలు చాలా ప్రమాదక రమైనవి. తేమ, అధిక పీడనాశక్తి కలిగి వుండడం వల్ల ఇవి ఒక్కసారిగా కుంభవృష్టిని కురిపిస్తాయి. గత 30ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విశాఖలో కురిసిన కుంభవృష్టి ఇందుకొక ఉదాహరణ. 2019లో ఎనిమిది ప్రమాదకర తుపానులు సంభవిస్తే 2020లో అయిదు ప్రమాదకర తుపానులు చోటుచేసుకున్నాయి. వీటి నుంచి పాఠాలు తీసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ పెట్టడం లేదు. విపత్తు సంభవించిన తరువాత అరకొర పరిహారం ప్రకటించి చేతులు దులిపేసుకుంటున్నాయి. ఇటువంటి విపత్తుల సమయంలో ఉదారంగా సాయం అందించాల్సిన కేంద్రం ఇది తన బాధ్యత కాదన్నట్టుగా వ్యవహరి స్తోంది. గతంలో హుదూద్‌ తుపాను సందర్భంగా వెయ్యి కోట్ల సాయం ప్రకటించిన మోడీ ప్రభుత్వం ఆచరణలో రాష్ట్రానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు గులాబ్‌ తుపాను గురించి ప్రధాని ఆరా తీశారే తప్ప బాధితులను ఆదుకునేందుకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. కార్పొరేట్లకు లక్షల కోట్ల రుణా లను మాఫీ చేయడానికి వెంటనే సిద్ధపడే మోడీ ప్రభుత్వం ప్రజలను ఆదుకునే విషయంలో కనీస మానవత్వ స్పందననైనా కనపరచకపోవడం దుర్మార్గం. తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, శిబిరాల నుంచి ఇళ్లకువచ్చినవారికి వెయ్యి రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం ఏమూలకూ చాలదు. తుపా నులు వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి ఆర్థికంగా, సంస్థాగతంగా గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. అలాగే బీమా వ్యవస్థను పటిష్ట పరచడం,పాలనాపరమైన సన్న ద్ధత పెంచుకో వడం,ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం గావించ డం వంటివి చేపట్టాలి. తక్షణం గులాబ్‌ నష్టాలను సమగ్రంగా అంచనా వేసి బాధితులకు ప్రభుత్వం తగు పరిహారం చెల్లించాలి.
కుదిపేసిన గులాబ్‌ :తుపాను ముప్పు తప్పిందని ఊపిరి పీల్చుకుంటుండగా ఆ తర్వాత అర్ధరాత్రి నుంచే విశాఖ,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. మరుచటి రోజు తెల్లవారుజాము నుంచి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,కృష్ణాజిల్లాల్లోనూ పలుచోట్ల కుంభ వృష్టి కురిసింది. ఈతుఫాను కారణంగా 277 మండ లాల్లోనూ వానలు పడ్డాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 98మండలాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వానలు పడ్డాయి.
ముఖ్యంగా ఉత్తరాంధ్రలో గంటకు 79 కిలోమీటర్ల నుంచి100కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో ఉత్తరాంధ్రలో వేల సంఖ్యలో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపో కలకు,విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. విజయనగరం,విశాఖపట్నం జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. నదుల్లో ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. రోడ్లు, వంతె నల మీదుగా నీరు పారడంతో వందలాది గ్రామా లకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లతోపాటు విద్యుత్తు సబ్‌స్టేషన్లు, పోలీస్‌స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వా సుపత్రుల్లోకి వరద నీరుచేరింది. తుపాను నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. వరద ముంచెత్తడంతో విశాఖపట్నంలో వాహనాలు నీట మునిగాయి. భారీవర్షాలకు విశాఖ పట్నంలో వేల ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. రహదారులపై నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. సుమారు 10వేల మంది ని పునరావాస కేంద్రాలకు తరలించారు. మన్యంలో గెడ్డలు పొంగిపొర్లాయి. జిల్లాలో147విద్యుత్తు సబ్‌స్టేషన్లపై తుపాను ప్రభావం చూపడంతో వందల గ్రామాలు అంధ కారంలో చిక్కుకున్నాయి. రైవాడ, కోనాం మినహా మిగతా అన్ని డ్యామ్‌ల గేట్లు ఎత్తి నీరు కిందకు విడుదల చేస్తున్నారు. ఈదురుగాలులకు గార, శ్రీకా కుళం సహా తీర ప్రాంత మండలాల్లో భారీ సంఖ్య లో వృక్షాలు నేలకొరిగాయి. చాలాచెట్లు విద్యుత్తు తీగల పై పడడంతో విద్యుత్తు స్తంభాలు నేలకూ లాయి. గిరిజనగ్రామాలు జలది గ్బంధంలో ఉన్నాయి. సాలూరు మండలం మామి డిపల్లి ప్రాథ మిక ఆరోగ్య కేంద్రం పూర్తిగా నీట మునిగి మం దులు,పరికరాలుఅన్నీ తడిచి పోయాయి. ఈదురు గాలులకు గార, శ్రీకాకుళం సహా తీర ప్రాంత మండలాల్లో భారీ సంఖ్యలోవృక్షాలు నేలకొరిగాయి. చాలా చెట్లు విద్యుత్తు తీగలపై పడడంతో విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. విజయనగరం జిల్లా నెల్లి మర్ల,గజపతినగరం,పూసపాటిరేగ ప్రాంతాల్లో గరిష్ఠంగా 23.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. వందలాది వృక్షాలు నేలకూలాయి.
తూర్పుగోదావరి జిల్లా రాయవరం, తాళ్లరేవు,కాజులూరు,కడియం,రామచంద్రా పురం, అమలాపురం,పి.గన్నవరం,కాకినాడ, రాజమహేం ద్రవరం,మండపేట, అంబాజీపేట ప్రాంతాల్లో 10 సెం.మీ నుంచి 16 సెం.మీ వానలు పడ్డాయి. రంపచోడవరం- గోకవరం ప్రధాన రహదారిలో జాగరంవల్లి వద్ద భారీవృక్షం నేలకూలడంతో రాక పోకలు స్తంభించాయి. మారేడుమిల్లి మండలంలో పెళ్లిరేవు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో గర్భిణిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌ నీటిలో నిలిచి పోయింది. స్థానికులు వాగు దాటించారు. తూర్పు గోదావరి జిల్లా రాయవరం, తాళ్లరేవు, కాజులూరు, కడియం,రామచంద్రాపురం,అమలాపురం, పి.గన్న వరం,కాకినాడ,రాజమహేంద్రవరం,మండపేట, అంబాజీపేట ప్రాంతాల్లో 10సెం.మీ నుంచి 16 సెం.మీవానలుపడ్డాయి. రంపచోడవరం- గోకవ రం ప్రధాన రహదారిలో జాగరంవల్లి వద్ద భారీ వృక్షం నేలకూలడంతో రాకపోకలు స్తంభిం చాయి. మారేడుమిల్లి మండలంలో పెళ్లిరేవు వాగు ఉద్ధృ తంగా ప్రవహించడంతో గర్భిణిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌ నీటిలో నిలిచిపోయింది. స్థానికులు వాగు దాటించారు. భారీ వర్షాల ధాటికి విజయ నగరం జిల్లా బొండపల్లి మండలం గదబపేటలో చెట్టుకూలి ఒకరు,తమటాడలో గోడ కూలి మరొ కరు చనిపోయారు. గుర్ల మండలం కోట గండ్రేడు లో ప్రమాదవశాత్తు చెరువులోపడి ఒకరు మృత్యు వాతపడ్డారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి అప్పల నరసయ్య కాలనీలో ఏళ్ల భావన అనే మహిళ మరుగుదొడ్డిలో ఉండగా మరో ఇంటి గోడ కూలి మరుగుదొడ్డిపై పడటంతో ఆమె అక్కడికక్కడే మర ణించింది. సుజాతనగర్‌లో వర్షంతో విద్యుదాఘా తానికి గురై నక్కా కుశ్వంత్‌ కుమార్‌ అనే ఏడేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. తుఫాను కారణంగా విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. భారీ వర్షాలతో చెరువులను తలపిస్తోంది. మోకాళ్ల లోతు నీరులోనే ప్రయాణి కులు ఇబ్బంది పడుతూ ఎయిర్‌ పోర్టులోకి చేరుకోవాల్సి వచ్చింది. విశాఖ పట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 750 కి.మీ. మేర ఆర్‌అండ్‌బీ రహదారులు, 50 కల్వర్టు లు దెబ్బతిన్నాయి. బొర్రా- చిమిడిపల్లి మార్గంలోని కేకేలైన్‌లో రైలు పట్టాలపైకి బురద కొట్టుకొచ్చింది. కొత్తవలసలో రైలు పట్టాలపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. ఎల్‌కోట సమీపంలో కొత్తవలస-కిరండోల్‌ మార్గంలో ఒక లైన్‌ దెబ్బతింది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 1.64 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 1.57 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 6,465 ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉన్నాయి. చాలా మండలల్లో పైర్లు బాగా పండాయి..
ఈ ఏడాది మంచి పంట వస్తుందని ఆశించిన సమయంలో గులాబ్‌ కన్నీరే మిగి ల్చింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజ లకు ఆపన్న హస్తం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుం టామని రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరోసారి నిరూపించింది. ఉత్తరాంధ్ర,ఉభయగో దావరి జిల్లాల్లో సహాయ,పునరావాస కార్యక్రమాల్లో పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేలకొరి గిన వృక్షాలు తొలగించడం, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు చేర్చడంలో శక్తివంచన లేకుండా పనిచేశారు. ఉత్తరాంధ్రలో గులాబ్‌ తుపాన్‌ బీభత్సం, ఐదుగురు మృతి,ఇద్దరు గల్లంతు
మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు
గులాబ్‌ తుపాను వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల రూపాయల పరిహా రాన్ని తక్షణం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, ఇతర అధికారులతో ఆయన అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధితులను ఆదుకు నేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడ్డ బాధితులకు రూ. 1000, సహాయ శిబిరాల నుంచి ఇంటికి తిరిగి వెళ్లే బాధితులకూ రూ.1000 తక్షణమే ఇవ్వాలని చెప్పారు. బాధితుల పట్ల మాన వతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఎన్యుమరేషన్‌ చేయాలని నష్టం అంచనాలు వేసి రైతులను ఆదుకో వాలని ఆదేశించారు.
పంట నష్ట పరిహారాన్ని కూడా సాధ్య మైనంత త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవా లన్నారు. శ్రీకాకుళం నుంచి సిఎస్‌ ఆదిత్య నాధ్‌ దాస్‌ తుపాను అనంతర పరిస్థితులను సిఎంకు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని మిగిలిన చోట్ల అంత తీవ్రత లేదని చెప్పారు. అక్కడక్కడా చెట్లు విరిగిపడ్డాయని వాటిని తొలగిం చామని అన్నారు. విశాఖ నగరంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రాంతంలో సహయ కార్యక్రమాలు ముమ్మరం చేశామని లోతట్టు ప్రాంతాల్లోని వారిని శిబిరాలకు తరలించామని చెప్పారు. ఈ సమీక్షలో విజయనగరం నుంచి మంత్రి బొత్స,శ్రీకాకుళం నుంచి ధర్మాన కృష్ణదాస్‌, విశాఖ నుంచి అవంతి శ్రీనివాస్‌ పాల్గొని తుపాను పరిస్థితులను సిఎంకు వివరించారు.
ధూళి తుఫాన్‌ :
వాతావరణ మార్పుల నేపథ్యంలో కొత్తగా రూపొందించుకుంటున్నారు. ప్రకృతి బీభత్సాలకు తట్టుకుని నిలిచే రీతిలో సదుపాయాల కల్పన ఉండాలనే స్పృహ పెరిగింది. కానీ మన దేశంలోని నగరాలు మాత్రం వాతావరణ మార్పు వల్ల కలిగే బీభత్సాలకు తట్టుకుని నిలిచే విధంగా లేవు. ఇటీవల ఉత్తరాదిని తుఫాను అల్లల్లాడిరచిన సందర్భంగా ఈ విషయం మరింత స్పష్టమైంది. మన విధాన కర్తలు దృష్టి సారించవలసిన మరో ముఖ్యమైన అంశం వ్యవసాయ రంగం. ప్రకృతి బీభత్సం వల్ల పంట చేను దెబ్బ తినడాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోకూడదు. వాతావరణ మార్పు వల్ల రుతువులు గతి తప్పుతున్నాయి. మన దేశాన్ని వాతావరణ మార్పు వల్ల కలిగే ప్రకృతి బీభత్సాలు వెంటాడుతున్నాయనేది తాజా వైపరీత్యాలను బట్టి వీటిని తట్టుకొనే విధంగా మనం సిద్ధపడి లేమని కూడా స్పష్టమైంది. ఈ నెల మొదటి వారంలోనే ధూళి తుఫాను ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాలలో బీభత్సాన్ని సృష్టించింది. దీని నుంచి దేశం తేరు కోక ముందే మళ్ళా గులాబ్‌ తుఫాన్‌ అకాల వర్షం కకావికలు చేసింది. పిడుగులతో కూడిన రాళ్ళ వాన, పెనుగాలలు కలిసి అనేకమంది ప్రాణాలు బలిగొన్నాయి. ఇటీవల చోటుచేసుకున్న ప్రకృతి వైపరీత్యం మూలంగా వివిధ రాష్ట్రాలలో భారీగా ప్రాణనష్టం జరిగింది.
ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే రాళ్ళవాన, పిడు గులు పడి 50మందికి పైగా మరణించారు. ఎనభై మందికిపైగా గాయపడ్డారు. చెట్లు విరిగిపడ్డాయి, ఇండ్లు కూలిపోయాయి. ఢల్లీిలోనైతే ధూళి తుఫా నుకు,భారీవర్షం తోడైంది. రాకపోకలు నిలిచి పోయాయి. ఇద్దరు మరణించారు. డ్బ్భై విమానా లను దారి మళ్ళించవలసివచ్చింది. పశ్చిమ బెంగా ల్‌లో పన్నెండు మంది మరణించారు. ధూళి తుఫాను మూలంగా ఉత్తర, పశ్చిమ భారతమంతా ఉక్కిరిబిక్కిరయింది.ఉత్తరప్రదేశ్‌,రాజస్థాన్‌,ఉత్త రాఖండ్‌,మధ్యప్రదేశ్‌,పంజాబ్‌,హర్యానా రాష్ట్రా లలో వంద మందికిపైగా మరణించారు. వంద లాది మంది గాయపడ్డారు. పెనుగాలులు సృష్టిం చిన విలయానికి ఇళ్లు కూలిపోయాయి, చెట్లు పెకిలించుకుపోయాయి, పంటలు దెబ్బతిన్నాయి. రవాణా, విద్యుత్‌ వ్యవస్థలు ఛిన్నాభిన్నమైనయి.
-జిఎన్‌వి సతీష్‌

విఫత్తుల సమయం అప్ర‌మ‌త్తం అవశ్యం


ఈనేపథ్యంలో ఇటీవల సంభవించిన గులాబ్‌ తుఫాన్‌ రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ,ఉత్తర ఒడిశా,ఛత్తీస్‌గఢ్‌లలో భారీ నష్టానికి గురిచేసింది.నాటి1990తుఫాన్లు మాదిరిగా తీవ్రమైన నష్టాన్ని చూపించింది. తెలుగు రాష్ట్రాలకు ఎప్పఉడు తుఫాన్లు వచ్చినా కేంద్రప్రభుత్వం సకాలంలో ఆదుకోవడం ప్రశంసనీయం. దేశంలో అధిక విపత్తుకు గుర య్యే ప్రాంతలు హిమాలయ ప్రాంతాలు,ఒండ్రుమైదానాలు,తీరప్రాంతాలు,ఎడారి ప్రాంతం.ప్రస్తుతం తీరప్రాంతాల్లో సంభవించే తుఫాన్లు,గాలివానలు ఎక్కవగా ఉన్నాయి. దక్షిణ ఒడిశా,ఉత్తర ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణ,ఉత్తర ఒడిశా,ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో తుఫాన్లు పరిస్థితులు పరిశీలిస్తే 19902021వరకు ప్రమాదకరమైన14తుఫాన్లు సంభవించాయి.20112021 మధ్యలో మూడు భయం కరమైన తుఫాన్లు ప్రజలు ఎదుర్కొన్నారు. ఇవీ పర్యావరణం,సమాజం,సామాన్యప్రజలకు ఆర్ధికంగా అధిక నష్టం కలిగించాయి.సాధారణ కార్యకలాపాలను కూడా అడ్డుకునే తీవ్రమైన పరిస్థితి ఏర్పడిరది. ఈప్రకృతి వైపరీత్యాలవల్ల అధిక మొత్తంలో ఆస్తి,ప్రాణ నష్టాలు జరిగాయి. గతనెలాఖరున సంభవించిన గులాబ్‌ తుఫాను బీభత్సం తెలిసిందే. ప్రజలకు హానికలిగే పరిస్థితి ఉన్నప్పుడు,వైపరీత్యాలను ఎదుర్కొనే ముందుస్తు సమర్ధచర్యలు లేనప్పుడు విఫత్తు తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ గులాబ్‌ తుఫాన్‌ ప్రభుత్వం,ప్రభుత్వ అధికార యంత్రాంగం సకాలంలో ఆదుకోని సహాయక చర్యలు చేపట్టడం అభినందనీయం.


ప్రపంచవ్యాప్తంగా వరదలకారణంగా మరణిస్తున్నవారిలో 20శాతం భారతదేశంలోనే ఉన్నారు. ఇక్కడ వరద ముంపునకు గురయ్యే ప్రదేశాలు కూడా ఎక్కువే.ఇక్కడ దాదాపు అన్ని నదీ పరీవాహక ప్రదేశాల్లోనూ వరదులు సంభవిస్తున్నాయి.తెలుగు రాష్ట్రా ల్లో గోదావరి,కృష్ణా నదులు ప్రధానంగా వరదలకు కారణమవుతున్నాయి. ఉత్తరాంధ్రలో నాగావళి,వంశధార నదులు,దక్షిణాంధ్రలో పెన్నా నదీ ప్రాంతం వరదలకు కారణమవుతున్నాయి.2009లో కృష్ణానది వచ్చిన వరదలవల్ల మహాబూబ్‌నగర్‌,కర్నూలు,నల్గోండ, కృష్ణా,గుంటూరుజిల్లాలకు అపారనష్టం వాటిల్లింది. 2005లో ముంబాయిలో ఒకేరోజు10సెంటీమీర్ల వర్షం కారణంగా ఆ మహానగరాన్ని వరదులు ముంచెత్తాయి. అలాగే2014లో సంభవించిన హూదూద్‌ తుఫాన్‌ కారణంగా విశాఖనగరం అతలాకుతలమైంది. ఆస్తి నష్టం,ప్రాణనష్టం సంభవించింది. దేశంలో వరద ఉధృక్తిని తెలుసుకోవడానికి శాటిలైట్‌,రిమోట్‌ సెన్సఇంగ్‌ పరికరాలు లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. వరదల హెచ్చరికలను కేంద్ర జలసంఘం లేదా సాగునీరు,వరద నియంత్రణశాఖ లేదా జలవనరులశాఖ జారీచేస్తాయి. సహజ వైపరీత్యమైన వరదలను ఎదుర్కొనేందుకు సన్నద్దంగాఉండాలి. అప్పుడే అవి విఫత్తులుగా మారకుండా ఉంటాయి. తద్వారా విలువైన సంపదను కాపాడుకోవచ్చు.


తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటానవంబరు,డిశంబరు నెలల్లో తుఫాన్లు,భారీవర్షాలు సంభవిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ప్రభుత్వాలు కూడా అప్రమత్తమై ముందుస్తు జాగ్రత్త చర్యలతో ప్రజలకు ప్రాణ,ఆస్తినష్టం కలుగకుండా నియంత్రిస్తోంది. వాతావరణశాఖ సూచన జారీచేసిన నేపథ్యంలో విపత్తుల నియంత్రణ అధికారులు,రక్షణశాఖ,రెవెన్యూ అధికారయంత్రాంగం అప్రమత్తంగానే వ్యవహరిస్తోంది. ముంపునకు గురయ్యే ప్రాంతవాలసులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం,తుఫాన్లు షెల్టర్లు ఏర్పాటు,పునరావాస కేంద్రాలకుతరలించి వారికి నిత్యావసర వస్తువులు,ఆహారం,వైద్య సదుపాయాలు కల్పించే సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు ముందుడటం విశేషం.అయితే ఇలాంటి విఫత్తులు సంభవించినప్పుడు సకాలంలో ఆదుకోవడానికి యువతకు శిక్షణలు ఇవ్వాలి.స్వచ్చంధ సంస్థల సేవలను ప్రభుత్వాలు వినియోగించుకోవడానికి తోడ్పడాలి. లోతట్టు ప్రాంతవాసులకు కూడా అవగాహన కల్పించి అక్కడ యువతకు శిక్షణ ఇవ్వాలి. పర్యావరణం కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలి.- ర‌వి రెబ్బా ప్ర‌గ‌డ‌,ఎడిట‌ర్‌- థింసా

1 2