ఎన్నికల సంస్కరణలు

ప్రజాస్వామ్యంలో ప్రజలు తమను తామే పాలించుకొంటారు. జనాభా తక్కువగా ఉంటే ప్రత్యక్ష, ప్రజాస్వామ్యాన్ని అమలు చేయవచ్చు. జనాభా లక్షల్లోనూ, కోట్లలోనూ ఉంటే ప్రాతినిథ్య ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలి. ప్రపంచమంతా ప్రాతినిథ్య ప్రజాస్వామ్యమే నడుస్తున్నది. ప్రాతినిథ్య ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రధాన పాత్ర కలిగి ఉంటాయి. ప్రజలు ఎన్నికల ద్వారా తమ పాలకులను ఎన్నుకొంటారు. 1950నుంచి ఇప్పటి వరకు చాలా సార్లు చట్టసభలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల విధానంలోని లోపాలను అప్పుడప్పుడు కొద్దిగా సవరించు కుంటూ వస్తున్నారు.
ఎన్నికల వ్యయం విపరీతంగా ఉండటం, ఓటర్లకు అర్హతలు సరిగా నిర్ణయించకపోవటం, ఓటర్లు డబ్బులకు ఓట్లు అమ్ముకోవటం, ఓట్ల లెక్కింపు విధానం సరిగా లేకపోవటం, రహస్య ఓటింగుతో పాటు బహిరంగ ఓటింగు లేకపోవటం, దొంగ ఓట్లు వేయటం, పోలింగు కేంద్రాలను ఆక్రమించి రిగ్గింగు చేయటం, బలహీనవర్గాలను పోలింగు కేంద్రాలకు రానీయకుండా అడ్డుకోవ డటం, ఎన్నికల్లో మితిమీరిన హింస, తక్కువ శాతం పోలింగు కావటం, నేర చరిత్ర ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పాల్గొనటం, కుల, మత, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టటం, అధికార యంత్రాంగాన్ని ఎన్నికల్లో దుర్వినియోగం చేయటం, వ్యక్తిగత దూషణలకు పాల్పడటం, అసంబద్ధమైన వాగ్దానాలు చేయటం, సాధారణ ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు, ఉపఎన్నికలతో సంవత్సరం పొడవునా, ఐదు సంవత్సరాల పాటు ఎన్నికల వాతావరణం నెలకొనటం, రాజకీయ పార్టీల నియంత్రణ చట్టం లేకపోవటం, ఎన్నికల సంఘానికి ఎక్కువ అధికారాలు లేకపోవటం, ప్రభుత్వ, ప్రైవేటు మీడియాను దుర్వనియోగం చేయటం, పార్టీ ఫిరాయింపులు మొదలగునవి మన ఎన్నికల విధానంలోని ముఖ్యమైన లోపాలు. ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ బలంగా ఉండాలంటే రాజకీయ పార్టీల నియంత్రణ చట్టం చాలా అవసరం. రాజకీయ పార్టీల వ్యవహారాన్ని అంతరంగిక వ్యవహారంగా భావించరాదు. అవికూడా ప్రజలకు, న్యాయ స్థానాలకు, ఎన్నికల సంఘానికి జవాబుదారీగా ఉండాలి. రాజకీయ పార్టీల ఎన్నికలు ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. రాజకీయ పార్టీల ఆదాయ, వ్యయాలను ‘కాగ్‌’ పరిధిలోకి తేవాలి. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం కలిగిన రాజకీయ పార్టీలను మాత్రమే అనుమతించాలి. సాధారణ ఎన్నికల నిర్వహణ సుదీర్ఘకాలంపాటు ఉంటున్నది. దశలు ఎక్కువగా ఉండటం, ఒక్కొక్క దశకు ఎక్కువ కాలపరిమితి ఉండటం వలన సుదీర్ఘ ప్రక్రియగా మారింది. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోనే ఎన్నికలను నాలుగు దశలలోనే జరపాలన్న నిబంధన ఉండాలి. ఒక్కొక్క దశకు నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉండాలి. ఎన్నికల ప్రకటన తేదీ నుంచి లెక్కింపు తేదీ మధ్య రెండు నెలలకు మించి ఉండకూడదు. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల సంఖ్యలో నాలుగింట మూడు వంతుల స్థానాలను అభ్యర్థులను ఎన్నుకోవటం ద్వారాను, స్థానాలను పార్టీలకు వచ్చిన ఓట్ల నిష్పత్తి ప్రకారం రాజకీయ పార్టీలు సూచించిన అభ్యర్థులను ఎంపిక చేయాలి. పార్లమెంటరీ విధానం వలన మన దేశం లాభపడిరదో లేక నష్టపోయిందో అర్థం కావటం లేదు. సాధారణ ఎన్నికల్లో మెజారిటీ రాని చోట్ల సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం, కొద్ది రోజుల్లోనే పార్టీ ఫిరాయింపుల వలన అవి కూలిపోవటం, మళ్లీ ఎన్నికలు ఎదుర్కొనవలసి రావటం గత 60 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. చట్టసభల కాలపరిమితి ఐదు సంవత్సరాలని చెప్పినప్పటికీ చాలాసార్లు మధ్యలోనే రద్దవుతున్నాయి. పార్లమెంటరీ విధానంలో ఇదొక పెద్దలోపం. దేశంలోని అన్ని వ్యవస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిగే విధంగా రాజ్యాం, చట్టసవరణలు చేసుకోవాలి. కాలపరిమితి ప్రకారమే సాధారణ ఎన్నికలు జరగాలి. పార్ల మెంటు, అసెంబ్లీ ఎన్నికలు పార్టీ చిహ్నాల మీద జరిగితే, స్థానిక సంస్థలు, ఇతర సహకార సంఘాల ఎన్నికలుపార్టీ రహితంగా జరగాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం లేక లాటరీ విధానం అనుకరిస్తే ఇంకా మంచిది. ప్రభు త్వాలు, రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. పోటీ చేసే అభ్యర్థులు ఓట్లను కొనటానికి తెగబడుతున్నారు. ఓటర్లు కూడా చాలామంది ఓట్లు అమ్ముకోవటం తప్పు కాదన్నట్లుగా ప్రవర్తిస్తు న్నారు. ఓటుకు ఇంత ఇవ్వాలని పట్టుబట్టే స్థితికి ఓటర్లు వచ్చారు. దీన్ని నివారించటానికి రహస్య ఓటింగుతో పాటు బహిరంగ ఓటువిధానాన్ని ప్రవేశపెట్టాలి. బహిరంగ ఓటింగు విధానం ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరు స్తుంది. ఓటర్లకు కొన్ని అదనపు అర్హతలను నిర్ణయించాలి. ఓట్ల లెక్కింపు విధానంలో మార్పులు చేయాలి. ఓటర్లను మూడు తరగతులుగా వర్గీకరించాలి. పూర్తిఅర్హత కలిగిన ఓటర్లు, సగం అర్హత కలిగిన ఓటర్లు, పూర్తిగా అర్హతలేని ఓటర్లుగా విభజించాలి. ఎటువంటి సివిల్‌, క్రిమినల్‌ కేసులు లేని వాళ్లు, ప్రభుత్వాలకు, ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు, స్థానిక సంస్థలకు ఎటువంటి బకాయిలు లేని వాళ్ళను పూర్తి అర్హత కలిగిన ఓటర్లుగా భావించాలి. సివిల్‌, క్రిమినల్‌ కేసుల్లో ఉన్నవారు, ప్రభుత్వ సంస్థలకు, స్థానిక సంస్థలకు బకాయిలు ఉన్నవారు సగం అర్హత కలిగిన ఓటర్లుగా భావించాలి. సివిల్‌, క్రిమినల్‌ కేసుల్లో చార్జిషీట్‌ పెడితే సగం అర్హతే ఉంటుంది. సివిల్‌, క్రిమినల్‌ కేసుల్లో శిక్ష పడినవారు, మతి స్థిమితం లేనివారు, ప్రభుత్వ సంస్థలకు దీర్ఘకాలంగా బకాయిలు ఉన్నవారు, పన్నులు ఎగవేసినవారు, దివాలా తీసినవారు పూర్తిగా అర్హతలేని ఓటర్లుగా భావించాలి. మొదటి, రెండవ తరగతి ఓటర్లకు ఓటు వేసే హక్కు ఉంటుంది. మొదటి తరగతి ఓటర్లను ఒక రకం బ్యాలట్‌ బాక్స్‌, రెండవ రకం ఓటర్లకు మరొక రకం బ్యాలట్‌ బాక్సు ఉండాలి. ఓట్ల లెక్కింపులో మొదట మొదటి రకం బాక్స్‌లోని ఓట్లను లెక్కించాలి. ఓట్లు సమానంగా వచ్చినప్పుడు లేక అతి తక్కువ మెజారిటీ వచ్చినపుడు రెండవ రకం బాక్స్‌ ఓట్లను లెక్కించాలి. ఈపద్ధతి వలన ఓటర్లు బాధ్యత కలిగి ఉంటారు. ప్రభు త్వాలకు బకాయిలు పెట్టరు. బాధ్యతతో మెలిగే ఓటర్లుకు విలువ పెరుగుతుంది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశం భారత దేశమేనని అందరూ చెబుతుంటారు. మన ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ మేడిపండులాగానో, నేతి బీరకాయలాగానో మారకూడదు. ఎన్నికల సంస్కరణలను త్వరగా ప్రవేశపెట్టి భారత ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా చూపాలి. అప్పుడే మన స్వాతంత్య్రం సమరయోధుల పోరాటాలు ఫలవంతమవుఆయి. ఈదిశగా అన్ని రాజకీయ పక్షాలు నడుం బిగించి ఎన్నికల సంస్కరణల కొరకు పోరాడాలి.
రాజ్యసభ ఎన్నికల విధానం:
శాసనసభ్యులుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు మాత్రమే ఓటర్లు, ఆయా రాష్ట్రాల నుండి పార్లమెంటు ఎగువసభకు పంపవలసిన ప్రజాప్రతి నిధులను వీరే ఎన్నుకోవాలి. ఎమ్మెల్యేలు మాత్రమే అభ్యర్థు లను ప్రతిపాదించాలి కూడా! ఇటువంటి ప్రత్యేక అంశాలను ఎన్నికల కమిషన్‌ విస్మరించింది. దీనికన్నా ఎన్నికల ప్రక్రియ నేరమయం కావడంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అత్యంత కీలకమైనవి! భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుండే లోటుపాట్లపై చర్చ కూడా మొదలైంది. మేధావులు, ప్రజాస్వామ్య వాదులు ఎన్నో సూచనలు చేశారు. అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు సైతం ఎన్నికల రణరంగంలో నీరుగారుతున్న ప్రజాస్వామ్య స్ఫూర్తిపై ఆవేదన వ్యక్తం చేసింది. గడిచిన రెండేళ్లలోనే అరడజను సార్లకు పైగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎన్నికల ప్రక్రియ అపహాస్యమవుతున్న తీరుపై స్పందించిందంటే మన ప్రజాస్వామ్యం నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఎలా మారుతోందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల బరిలో నేరచరితులు దిగడంపై సుప్రీంకోర్టు తాజాగా వ్యక్తం చేసిన ధర్మాగ్రహాన్ని సైతం ఈ కోవలోనే చూడాలి. ఈఅంశంపై కూడా అత్యున్నత న్యాయస్థానం స్పందించడం ఇదే మొదటిసారి కాదు. ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులపై నేరారోపణలపై విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం నేరం రుజువైన వ్యక్తి శిక్ష అమలులోకి వచ్చిన తేదీ నుండి జైలు నుండి విడుదలైన ఆరు సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడవుతారు. అయితే, ఇదే చట్టంలోని సెక్షన్‌ 8 సబ్‌సెక్షన్‌ 4 ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కొన్ని మినహాయింపులిచ్చింది. ఈ మినహాయింపు ప్రకారం అప్పటికే ఎంపి, ఎంఎల్‌ఏగా ఉన్న వ్యక్తి చేసిన నేరం రుజువై శిక్ష పడినా మూడు నెలల వరకు అనర్హత నిబంధన అమలులోకి రాదు. ఈ లొసుగును అడ్డం పెట్టుకుని పై కోర్టులకు అప్పీలు చేస్తూ నేరస్తులు తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఈ మినహాయింపే నేరస్తులు దొడ్డ్డిదోవలో అధికారం చేజిక్కించుకునేందుకు ఊతమిస్తోంది. ఫలితంగా చట్టసభల్లో నేరస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. 15వ లోక్‌సభలో 128 మంది సభ్యులపై క్రిమినల్‌ కేసులుండగా, ప్రస్తుత లోక్‌సభలో ఆ సంఖ్య 162కు పెరిగింది. హత్యలు, కిడ్నాప్‌లు, మానభంగాల వంటి తీవ్ర స్వభావం గల నేరారోపణలు ఎదుర్కుంటున్న వారు 15వ లోక్‌సభలో 58 మంది ఉండగా, ప్రస్తుతం వీరి సంఖ్య 76కు చేరింది. అంటే 18 శాతం పెరిగింది. పార్లమెంటుతో పాటు రాష్ట్రాల శాసనసభల్లోనూ కలిపి 30శాతం మందికి పైగా సభ్యులు నేరారోప ణలు ఎదుర్కుంటున్నారని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే కొన్ని సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ సంఖ్యలు చాలు చట్టసభల్లో ఎవరు తిష్టవేస్తున్నారో, ఎవరికోసం పని చేస్తున్నారో తెలుసుకోవడానికి! నేర చరిత్ర ఉన్న వారిని చట్టసభ్యులుగా పంపడంలో బిజెపి,కాంగ్రెస్‌లు పోటీ పడుతు న్నాయి. 19 శాతం బిజెపి లోక్‌సభ సభ్యులపైనా, 13శాతం కాంగ్రెస్‌ సభ్యుల పైనా క్రిమినల్‌ కేసులున్నట్లు నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ ప్రకటించడం గమనార్హం. ఇక వివిధ ప్రజా సమస్యలపై పోరాటం చేసే వామపక్ష పార్టీల నేతలపైనా తప్పుడు కేసులు బనాయించి నేరచరితులుగా రికార్డుల కెక్కించడం, ఇతర పార్టీలకూ వాటికి తేడా లేదన్నట్లు గా చిత్రీకరించడం పాలకవర్గ పార్టీల కుతంత్రంలో భాగం! ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నేర చరిత్రను బహిరంగంగా ప్రకటించేలా నిబంధన తీసుకురావాలని, అలా ప్రకటించని పార్టీల గుర్తింపు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశిస్తామని హెచ్చరించాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఈ స్పందన ఆహ్వానించదగినదే అయినప్పటికీ దాని వల్ల ఫలితం సందేహాస్పదమే. ఇటువంటి వివరాలు ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు అభ్యర్థులు నివేదిస్తున్న విషయం తెలిసిందే! నిజానికి మెజార్టీ మార్కు మాయాజాలం తో సాగే ప్రక్రియే మన ఎన్నికల వ్యవస్థ లోని దుష్పరిణామాలకు కారణం. దీనిని సాధించడానికే పాలకవర్గ పార్టీలు రూ. వందల కోట్లు ఖర్చు పెట్టగలిగే కార్పొరేట్లను, నేరస్తులను అభ్యర్థులుగా ముందుకు తెస్తున్నాయి. కొన్ని సమయాలలో తక్కువ శాతం ఓట్లతోనూ అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాయి. వీటి నుండి భారత ప్రజాస్వామ్యం బయట పడాలంటే దామాషా ప్రాతినిధ్య ఎన్నికల విధానమే మార్గం! ఆ దిశలో విస్త ృత స్థాయిలో చర్చ జరపడానికి మేధావులు, ప్రజాస్వామ్య వాదులు ముందుకు రావాలి.- సైమన్‌ గునపర్తి

స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసంమే..

‘‘రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మాణాన్ని అడ్డగోలు సవరణలు చేసి రెండవ సారి పంపింది. తెలుగుదేశం, వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రేస్‌ పార్టీల్లో ఉన్న ఎస్టీ ఎమ్మేల్యేలు, గిరిజన సలహా మండలి (టిఎసి) సభ్యులే భాద్యత వహించాలి!. ఆదివాసీ రిజర్వేషన్లపై పాలక పక్షలు అనుసరిస్తున్న వ్యతిరేక విధనాలను నిరసిస్తూ, బోయవాల్మీకీ, మత్సకార, వడ్డేర, రజక కులాను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిద్దాం! ఆదివాసుల మనుగడను కాపాడు కొందాం!!’’ రామారావు దొర

2017 డిసెంబర్‌ 12 న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుమారుగా ఏబై లక్షల మంది జనాభా కలిగిన బోయవాల్మీకీ పద్దెనిమిదికి పైగా దాని ఉపకులాలను షెడ్యూల్డ్‌తెగల(ఎస్టీ) జాబితాలో చేర్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మాణం చేసింది. ఇప్పుడు మత్సకార, వడ్డేర, రజక కులాలను కూడా ఎస్టీ జాబితాలోకి చేర్చడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం సోషల్‌ వర్క్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫసర్‌ ఆర్‌.డి సంపత్‌ కుమార్‌ నేతృత్వంలో ప్రొఫెసర్‌ రంగరావు, ఆంత్రోపాలజిస్టు ప్రొఫెసర్‌ పి.డిసత్యపాల్‌ కుమార్‌ లతో కూడిన త్రి సభ్య కమిటిని నియమించింది. 2014 లో భ్రుత్వం ఏర్పడ్డ వెంటనే మరో రెండు కులాలను చేర్చింది. 1976 లో లంబడా, ఎరుకుల, యానాది కులాలను ఎస్టీ జాబితాలో చేర్చారు. పై మూడు సందర్బల్లో కూడా బిసిఎ జాబితాలో ఉన్న రిజర్వుడ్‌ కులాల్నే కలపడం జరిగింది. కాని అన్ని సందర్బల్లో పాలకుల అంతిమ లక్ష్యం మాత్రం రాజకీయంగా ప్రయోజనం పొందడం. మహారాష్ట్రలో బిసిలుగా, కర్ణా టకలో ఎస్సీలుగా,రాజస్థాన్‌లో ఒసిలుగాదేశంలో వివిద రాష్ట్రల్లో వివిధ సామాజిక హోదల్లోఉన్న లంబడాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్టీలు గా గుర్తించినందుకు ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ మెధక్‌ జిల్లా (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌) నుండి పోటి చేసి గెలుపొంది దేశప్రధాని అయ్యిం ది. నేడు కూడా నాయుడు గారు మరోసారి పొందడానికి, రెడ్డి గారు తొలి సారి అధికారంలోకి రావడానికి ఆదివాసులను బలి చేయడానికి పూనుకొన్నారు. ఆదివాసుల ఉనికిని దెబ్బతీసి, ప్రకృతి వనరులను బహుళాజాతి కంపెనీలకు దొచిపెట్టడానికి సిద్దమయ్యారు. దీనికి అన్ని రాజకీయ పక్షలు మద్దతుగా నిలుస్తున్నారు. రాజకీయలు అటుంచి భారత రాజ్యంగంలో రిజర్వేషన్లునిర్థేసించిన ఉద్దెశాలు, లక్ష్యలు ఎవరికి పట్టడంలేదు. ఈ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో బిన్నత్వంలో ఏకత్వం ఉన్నట్టే! ఏకత్వంలో అనేక భిన్నదృక్పదాలు కనిపిస్తాయి. మన రాజ్యం గం నిర్ధేశించి అమలులోఉన్న అతి ముఖ్యమైనది మూడు రకాల రిజర్వేఫన్లు. మొదటిది ఆదివాసులు (ఎస్టీ), రెండవది దళితులు (ఎస్సీలు), మూడవది వెనుకబడిన తరగతులు (బిసిలు). వెనుకబడిన తరగతులకు సామాజిక, ఆర్ధిక వెనబాటు ప్రామనికం కాగా, దళితులకు అంటరాని తనం, సామాజిక అసమానతలు ప్రమనికమైంది. అదే ఆదివాసుల విషయానికొస్తే అన్నిటికంటే భిన్నంగా సాంస్కృతిక, సాంప్ర దాయక విలువలకు ప్రాదన్యత ఇచ్చారు. ప్రపంచంలో ఏ రాజ్యంగం లోలేని విధంగా 5వ,6వషెడ్యూల్స్‌ ద్వారా భూహక్కులతో సహా రిజర్వు చేయబడిరది. దీనికి కారణం మనది సర్వశత్తక గణతంత్ర రాజ్యమైనం దుకు మామ్రే కాదు! ఈ దేశమే ఆదివాసులదైైనందుకు!. తిల్కా మంజీ, బిర్సా ముండా,కొమురంభీం, గాంగంటందొర, మర్రికామయ్య వంటి అనేక మంది ఆదివాసీ యోధుల తిరుగుబాట్లువల్ల సాధ్యమైంది. కాని నేడు ఆదిపత్య కులాల బ్లాక్‌ మెయిలింగ్‌ స్వార్థ రాజకీయలకు రిజర్వే షన్లు అంగడి సరుకుగా మారింది. ఇప్పటి వరకు అనేక కులాలను ఎస్టీ జాబితాలో కలపడానికి మాత్రమే కమిటిలు వేస్తున్నారు. షెడ్యూల్డ్‌ తెగల జాబితాలో ఇతర కులాలను చేర్చడం వల్ల రాజ్యంగం అమల్లోకి వచ్చింది మొదలు విద్య,ఉద్యోగ,సామాజిక,ఆర్ధిక,రాజకీయ దోపిడియే కాకా! ఆదిమ తెగల గుర్తింపు, ఉనికికి పునాదులైన సంస్కృతి, సాంప్రాదాయక విలువలతోపాటు, ఆదిమజాతుల నిర్ములనకు విద్వాం శకర ప్రక్రియా జరుగుతున్నది. ఆనష్టాన్ని అంచన వేయడానికి ఇప్పటి వరకు ఒక కమిటి గాని, కమీషన్‌ గానీ వేయలేదు!. ఆ…ప్రయత్నం కూడా ఏ…నాడు జరగలేదు!. ఇప్పుడు ‘‘సామాజికన్యామం’’ అనే నినాదంతో ఈదేశ సంపదనంత మేమే! తినేసినట్టు! అన్ని కులాల వారు ఎస్టీలో చేరిస్తేనే అభివృద్ధి చెందుతామని, ఎస్టీల్లో చేర్పిస్తే తప్ప! చదువు రా…దని!, అభివృద్ధి చెందలే…రని ఆదిపత్య కుల పాలకులు సైతం ప్రజలను రెచ్చగొట్టి తెగల మీదికి ఉసగొలుపతున్నారు. రాజ్యం గం నిర్ధేశించిన స్పూర్తికి విరుద్దంగా ఎటువంటి సాంకేతిక ప్రమాణాలు పాటించకుండా పాలకులు తమ స్వార్ధరాజకీయ ప్రయోజ నల కోసం అభివృద్ధి చెందిన కుల సమాజన్ని ఆదిమజాతుల్లోకి చేరుస్తు వస్తున్నారు. 39 కులాలు తెగలజాబితాలో కలపాలనీ కోరుతున్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‘ట్రైబల్‌ ఎడ్వజరీ కౌన్సిల్‌ (టిఎసి)’ గుర్తించింది. పైకు లాలను తెగల్లో చేర్చడానికి ఆయా కులాలకు తగిత అర్హాతలు లేవని‘‘గిరిజన సాంస్కృతిక పరిశోదన మరియు శిక్షణ కేంద్రం (టి.సి.ఆర్‌ అండ్‌ టి.సి) జరిపిన మానవ సామాజిక అధ్యయనం (ఎత్నోగ్రషఫిక్‌ స్టడీ) ద్వారా గుర్తించి వెల్లడిరచింది. ఆజాబితాలోనే బోయవాల్మీకీ,మత్సకార,వడ్డేర,రజక కులాలు కూడా ఉన్నాయి. తగిన అర్హాత కలిగి లేరని నిర్ధరణ అయినప్పటికి ఆయా కులాలు వారు తమని ఎస్టీ జాబితాలో కలపమని పదే పదే విన్నవిస్తున్నందున, ఇకమీదట ఏకులాలను తెగల్లోకి కలపమని సిపారసు చేయకూడద’’ని తీర్మణించింది. రాజ్యంగంనిర్ధేశించిన ప్రమాణాలకు లోబడి పని చేసే ప్రభుత్వ సంస్థ అయిన టి.సి.ఆర్‌ అండ్‌ టి.సి రిపోర్టును, టిఎసి తీర్మా ణాన్ని తుంగలోకి తొక్కిన ప్రభుత్వం ప్రొఫెసర్‌ పిడి సత్యపాల్‌ కుమార్‌ రిపోర్టునే తీసుకొని బోయవాల్మీకీ కులాలను ఎస్టీ జాబితాలో కలపడం, మళ్ళీ అదే ప్రొఫెసర్‌ను త్రి సభ్య కమిటిలో సభునిగా నియమించడం వెనుక తెలుగు రాష్ట్రల్లో నాలుగు నుండి ఐదుకోట్ల మంది కుల సమాజ జనాభాను తెగల్లోకి విలీనం చేసి ఆదిమజాతులు ఉనికిని దెబ్బతీసి ప్రకృతి వనరుల దోపిడికి పాల్పడనుంది. పాలకుల కుట్ర పన్నగానికి సహోదర దళితుడు, కుహాన మేధావిjైున ప్రొఫెసర్‌ పిడి సత్యపాల్‌ కుమార్‌ లాంటివారు సహాకరిస్తారు. ఈ మాట ఎందుకంటున్ననంటే విశాఖ ఏజేన్సికి ఆయనకున్న అనుబంధం, అవగహాన మరో ఏ ఆంత్రో పాలాజిస్టుకు కూడా ఉండవేమో! ఆదివాసులపైన అద్యాయనం పేరుతో ప్రతీ సంవత్సరం ఎంతో మంది తన విద్యార్ధులను ఏజేన్సి కొండల మీదికి తరలించేవాడు. ఇక్కడ వాల్మీకీ తెగ జీవనవిధానం, అచార సాంప్రదాయలకు, రాయలసీమ జిల్లాల్లో నేరచరితులుగా ముద్ర వేయబడి బ్రతుకు తెరువు కోసం రెడ్లు, కమ్మ పెత్తందారి కులాల వద్ద ప్యాక్షనిజంచేసి బ్రతికిన బోయ,బోయవాల్మీ కులాలకు పోలికలున్న యనీ, వీరిని ఎస్టీ జాబితాలో కలపాలనీ సిపారసు చేసారు. ఇందులో రాజకీయ ప్రయోజనమా! ఆర్ధిక ప్రయోజనమా! ఏదైనా ఉండవచ్చు! ఉంటుంది. ఈరిపోర్టు వెనక చంద్రబాబునాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం, ప్రతిపక్షనేత జగన్మోహన్‌ రెడ్డి గారు ముఖ్య మంత్రి పదవి దక్కించుకోవడంతోపాటు, ఆదివాసుల ఉనికిని సమూ లంగా నిర్మూలించాలనే కాంక్ష స్పష్టంగా కనబడుతుంది. దీనికి మిత్రుడు ఇచ్చిన రిపోర్టు సారంసం వనరుగా ఉపయోగపడుతుంది కనుక రిజర్వే న్లను ఆదిపత్య కులాలుబ్లాక్‌ మెయిలింగ్‌ రాజకీయలకు వాడు కొంటున్నారు: బోయ,బోయవాల్మీకీ కులాలను కలపడం పరికొత్త అంశంగా కనబడినా బలవంతులైన ఆదిపత్య కులాలకు విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగల్లో బలహీనులైనా తెగలపై ఆదిపత్యం కొనసాగిస్తునే ఉన్నారు. 1935 లో భారత ప్రభుత్వ చట్టం (బ్రిటీషుచట్టం) దేశంలో 212ఆదిమ తెగలను షెడ్యూల్డ్‌ తెగలుగా గుర్తించగా, రాజ్యంగంఅమల్లోకి వచ్చేనాటికి (1950) ఆజాబితా 429కి పెరిగింది. అనేక రాజకీయ ఒత్తిడ్ల కారణంగా నేడది 790కి పైగా పెరిగిపోయింది. అయినా ఇంకా చేరుస్తునే ఉన్నారు. అన్ని రంగల్లో ఆదివాసుల కంటే చైతన్యవంత కులాలను రాజకీయ అవస రాలకోసం కలుపుతున్నారు. అందరిని ఒకేవిధంగా పరిగనించడం వలన సాంకేతికంగా తరువాత చేర్చబడిన వారే మొత్తం ప్రయోజనం పొందుతుతారు. మాతెగలకు కేటాయించిన రిజర్వేషన్‌ ఫలాలైనా విద్య,ఉద్యోగ,ఉపాది,ఆర్థిక,రాజకీయ ప్రయోజనలు అందుకోలేక ఆయా రంగాల్లో నిలదొక్కుకోనే అవకాశన్ని కోల్పోతున్నాము. అంతే కాకుండా ఆదివాసులు, దళితులు, స్త్రీలు, వెనుకబడిన తరగతులు, ముస్లీం మైనార్టీప్రజలు అందరితో సమానస్థాయికి ఎదగడానికి ఉద్దేశించిన రిజర్వేషన్లు అగ్రవర్ణ పాలకుల ‘‘బ్లాక్‌ మెయిలింగ్‌’’ రాకీయా లకు (తెలుగురాష్ట్రల్లో రెడ్డి,కమ్మ,వెలమ) వనరులుగా వాడుకొంటు న్నారు. తప్పితేఅయా వర్గలకు ఒరగబెట్టిందేమిలేదంటే అతిశయోక్తి కాదు. 50శాతం కంటే మించి రిజర్వేషన్లు ఉండకూడదనే నియమం అత్యున్నత ధర్మాశనం చెప్పినప్పటికి, కాపులకు ప్రత్యేక కేటటగిరిలో 5శాతం ఇవ్వడానికి నిర్ణయించింది పాలకపక్షం. కానీ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్నప్పుడు అలాంటి నియమం ఏమి లేకుండా ఇప్పుడున్న 6శాతన్నే! వచ్చే ఏబై లక్షల మందికి పంచిపెడుతుంది. అదిక జనాభా కలిగి అభివృద్దికి చేరువైన కులాలను ఎస్టీల్లో కలిపి అంత శాతం రిజర్వేషన్‌ పెయచితే సరిపోతుందని అనవచ్చును. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, దబాయించడానికి పనికొస్తుంది. తప్పితే! పరిష్కారం ఎంత మాత్రం కానే…కాదు. లంబడా, ఎరుకుల, యానాది కులాలను కలిపినప్పుడు అప్పటి పాలకులు కూడా ఇదే నిర్లక్ష్య వైకరిని ప్రదర్శించింది. ఆదివాసీ తెగల్లో ఆవయించి ఉన్న నిరక్షరాస్యత, నిరుద్యోగం, పేదరికం రాజకీయ నిరాశక్తత వంటివి పరిగణన తీసుకోకుండా నాలుగు శాతంగాఉన్న ఎస్టీ రిజర్వేషన్‌ ఆరు శాతానికి పెంచింది. 6 శాతంలో కొద్ది మేరకైనా అందుకోలేక పోగా! 4 శాతం కూడా కోల్పోయిన స్థితిని చూస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా సాంస్కృతిక సాంప్రదాయక విలువలకు ఏసందర్బంలో కూడా ప్రామా ణికంగా తీసుకొన్న దాకలాలు లేవు. సామాజిక న్యాయమంటూ రాజకీయ పరమైన ఒత్తిడ్లే ప్రధాన అర్హాతగా తీసుకొన్నారు. బోయల విషయంలో అదే జరిగింది. కలపబోయే మత్సకారులు, వడ్డేరా, రజకుల విషయంలో ఇదే జరుగబోతుంది. మరిన్ని కులాల డిమాం డ్లన్ని రాజకీయ పార్టీల పరిశీలనలో ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, జగన్మోన్‌ రెడ్డి గార్ల పరిశీలనలో ఉంది. ఓట్ల పంపకాల లెక్కలు తెలాక ఎన్నికల వేల మన ముందుకు రానుంది. కులాలను తెగల జాబితాలో చేర్చే క్రమంలో షెడ్యూల్ద్‌ ప్రాంతల్లో విపరీతమైన వలసలు పెరిగుతుంది. ఇతర వలస జనాభా వలన ఒత్తిడికి తట్టుకోలేక, స్థానిక సమూహాలు అంతరించిపోతున్న పరిస్థితులు వివ్వవ్యప్తంగా చూస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో లంబడాలనుఎస్టీ జాబితా లో చేర్పినపుడు అదే జరిగింది. 1971 జనాభా లెక్కల ప్రకారం ఒక లక్ష 32 వేల 464 మందిగా ఉన్న లంబడా జనాభా 1981 నాటికి ఆ సంఖ్య 11 లక్షల 58వేల 342కు చేరుకొందని గణంకాలు స్పష్టం చేస్తుంది. అంటే పదేళ్ళలో దేశానలు మూలల నుండి 11లక్షలకు పైగా జనాభా వలస వచ్చి చేరిపోయారు. నేడు విశ్వవ్యప్తంగా గుర్తింపు పొందిన ‘గోండు, కోయ’ వంటి సమూహాలు తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. ఈపరిణామం గుణపాఠంగా మన ముందున్న సవాలు. షెడ్యూల్డ్‌ తెగల్లోకి ఇతరకులాలను చొప్పించే కుతంత్రలను అడ్డుకోవడం మా ఆదివాసుల మనుగడ సమస్య మాత్రమే.. కాదు. విశ్వమానవ మానవ మనుగడ సమస్య కూడా?.

రాజ్యాంగ మౌలిక విలువలకు ముప్పు

స్వాతంత్య్రానంతరం…సుమారు రెండేండ్లపాటు దేశవ్యాప్తంగా జరిగిన చర్చోపచర్చ ల పర్యవసానంగా దేశం గణతంత్రంగా అవతరించింది. ఎందరో త్యాగధనుల పోరాటాల ఫలితంగా సముపార్జించిన స్వాతంత్రాన్ని..అంతకు ముందున్న రాజులూ మహారాజుల చేతుల్లో పెట్టకుండా.. ప్రజలనే ప్రభువులుగా ప్రకటిస్తూ ప్రజాతంత్రంగా మారడం.. గణతంత్ర దినోత్సవ విశిష్టతకు నిదర్శనం. నేడు దేశంలో స్వైరవిహారం చేస్తున్న మతోన్మాద మనువాద మూకలు.. నాడు.. పంద్రాగస్టుకు, చబ్బీస్‌ జనవరికి మధ్యనున్న రెండేండ్ల సంధి కాలంలో సైతం జబర్ధస్తీ చేస్తూ.. తమతిరోగామి పంథాని దేశ ప్రజల మీదరుద్దాలని ప్రయత్నించారు. స్వతంత్ర భారతం ఏపంథాలో నడవాలి..దేశంలో ఏరాజకీయ వ్యవస్థను నిలపాలిఅనే అంశంపై ఆరెస్సెస్‌, హిందూమహాసభ,రామరాజ్య పరిషద్‌ ఇత్యాది సంస్థలు.. తమ రాచరిక అనుకూల ధోరణులకు అనుగుణమైన ప్రతిపాదనలు తీసుకొచ్చారు. పైగాతాము చెప్పినదే సనాతన భారతీయ పంథా అంటూ.. ప్రజాస్వామ్యమనే విదేశీ పోకడలు మనకొద్దు అంటూ దుష్ప్రచారం మొదలుపెట్టారు. బ్రిటిష్‌ వాడిని వెల్లగొట్టాము కాబట్టి..ఆబ్రిటీషువాడు ఎవరినైతే కూలదోసాడో..ఆదేశీయ రాజులు, మహారాజులను మళ్లీ తీసుకొచ్చి, వాళ్లకి మళ్లీ పట్టం కట్టి, అధికారం వాళ్ళ చేతుల్లో పెట్టడమే స్వాతంత్య్రానికి నిజమైనఅర్థం అంటూ విపరీత వ్యాఖ్యానాలు చేశారు. ఈకుత్సిత వాదనల న్నింటినీ గాంధీ,నెహ్రూ,పటేల్‌,అంబేద్కర్‌,మౌలానా అబ్దుల్‌ కలాం..ఇతరజాతీయ నాయకులు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఇక వెనక్కి పోయేది లేదు..దేశం చూపుముందు వైపేఉంటుందటూ స్పష్టీకరించారు. దేశాన్నిసర్వసత్తాక,ప్రజాస్వామ్య గణతంత్రంవైపు నడిపించారు.
బ్రిటిష్‌ వాడి వలసవాద సంకెళ్ళు మన దేశాన్ని చుట్టు ముట్టక ముందు.. వలస వాదంతో పోలిస్తే మరింత విషపూరితమైన మనువాద వ్యవస్థ ఈదేశంలో రాజ్యమేలింది. సుమారు మూడు వేల ఏండ్ల పాటు మనువాద వ్యవస్థ పన్నిన విషవలయంలో ఈదేశం బందీ అయింది..బానిసగా బతికింది. మనిషిని మనిషిగా చూడ నిరాకరించిన అమానుష వ్యవస్థ-మనుధర్మం. కాయకష్టం చేసి సంపదను సృష్టించే శ్రమజీవులను శూద్రులను, ఛండాలు రను చేసి..ఏపనీ చేయకుండా సోమరిపోతులుగా మెలగుతూ,పక్క వాడి కష్టార్జితాన్ని దోచుకుతినే స్వార్థపరులను ఉన్నత స్థానంలో నిలబెట్టింది ఈ మను వ్యవస్థ. 90 శాతంగా ఉన్న శ్రామిక జనాలను బానిసలుగా మార్చేసింది. రాజ్యమేదైనా, రాజులెవరైనా, వంశమేదైనా..భారతఉపఖండమంతటా మనుస్మృతియే రాజ్యాంగంగా అమలయింది. భారతీయులందరూ వేల ఏండ్లుగా పూజించిన గ్రంధాలన్నీ ఒకటే నీతిబోధించేవి. రాజులు ఎవరైనా సరే..ధర్మం తప్పక పరిపాలన కొనసాగించాలని. ధర్మమంటే.. మనుధర్మమే! శ్రీరాముడంతటివాడు సైతంశంభూకుడి తలను నిర్దాక్షి ణ్యంగా తెగనరికింది..అందుకోసమే! మన రాజ్యాంగం విశిష్టత ఏమి టంటే.. రెండువందల ఏండ్ల బ్రిటిష్‌ వాడి బానిస త్వాన్ని నిర్మూలించడం తోటే ఆగిపోలేదది. బ్రిటీషువాడు రాకముందు.. మూడు వేల ఏండ్ల పాటు ఈ దేశంలో రాజ్యమేలిన మనుస్మృతి తీసుకొచ్చిన కులవ్యవస్థ బానిసత్వాన్ని సైతం రాజ్యాంగం భూస్థాపితం చేసింది. వేలయేండ్ల మన దేశ చరిత్రలో.. రాజ్యాంగ అవతరణ తర్వాతనే.. మొట్టమొదటి సారిగా దేశ ప్రజలందరికీ కుల మత ప్రాంత లింగ విభేదాలు లేకుండా సమాన హోదా లభించింది. మనిషిని మనిషిగా చూసింది.. మనుషు లందరికీ ఈదేశంలో మొదటిసారిగా సమాన హక్కులనిచ్చిందీ… రాజ్యాంగమే. ఈ గడ్డ మీద పుట్టిన మనుషులందరూ సమానులేనన్న మానవతా సూత్రాన్ని మొట్టమొదటిసారిగా శాసన బద్ధం చేసింది మన భారత రాజ్యాంగం! సామాజిక విప్లవ మూర్తులు బుద్ధుడు పూలే అంబేద్కర్‌లు కొట్టిన సమ్మెట దెబ్బల కారణంగా తమప్రాభవాన్ని కోల్పోయిన కులదురహంకారుల ముఠా..తమ స్వార్థప్రయోజనాలకు రక్షణగా ఉన్న కుత్సిత మనుధర్మాన్ని ఎట్లాగైనా దేశం మొత్తం మీద పునస్థాపిం చాలనే కుతంత్రంలో భాగంగానే 1925లో ఆరెస్సెస్‌ను స్థాపించారు. 18వ శతాబ్దంలో…మహారాష్ట్రలో పీష్వాలు గా రాజ్యాధికారం చెలా యించిన ‘’చితపవన్‌’’ బ్రాహ్మణులు…మనువ్యవస్థను నూటికి నూరు పాళ్ళూ నిర్దాక్షిణ్యంగా అమలు పరిచారు. దళితులను పశువుల కంటే హీనంగా చూసే ‘’ముడ్డికి చీపురు…మూతికి ముంత’’ విధానం వీళ్ళ హయాంలోనే అమలయింది. దేశ ప్రజలలో స్వేచ్ఛా స్ఫూర్తిని నింపిన ఇంగ్లీష్‌ విద్యకు తోడు.. మానవతామూర్తులు తీసుకొచ్చిన సాంఘిక తిరుగుబాట్ల కారణంగా.. మరణశయ్యకు చేరువైన మనుధర్మాన్ని… జాతీయత, దేశభక్తి అనే మాయమాటలతో…ఎలాగోలా పునరుజ్జీవింప చేయాలనే తలంపే ఆరెస్సెస్‌ ఆవిర్భావానికి కారణమయింది. మహారాష్ట్ర లోని నాగపూర్‌ ఈ సంస్ధకు కేంద్ర స్ధానం కావడం.. హిందూత్వ నాయకులంతా మహారాష్ట్ర ‘చితపవన్‌’ బ్రాహ్మణులే కావడము వెనుకనున్న మతలబు అదే! మనుస్ముృతి ఆరెస్సెస్‌ దృష్టిలో అతి పవిత్రమైనది. హిందూ మతానికి మనువాదం, కులవ్యవస్థే కీలకమనీ…అవిలేకపోతే హిందూమతమే లేదని ఆరెస్సెస్‌వారు ప్రగాఢంగా విశ్వసిస్తారు… ఆచరిస్తారు. ‘’వేదాల తర్వాత.. హిందువులకు అత్యంత పవిత్రమైనది మనుస్మతి’’ అనిసావర్కార్‌ పేర్కొంటాడు. ఆరెస్సెస్‌ రెండవ సర్‌ సంఫ్‌చాలక్‌ గోల్వాల్కర్‌ తన రచన ‘బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌’లో.. ‘’అసమానతలు పకతిలో భాగం…కులాల పేరిట అసమానతల్లో తప్పేమీలేదు’’ అనిస్పష్టీకరిస్తాడు. ప్రపంచంలోనే గొప్ప స్మతికారుడైన మనువు రాసిన చట్టాలను హిందువులందరూ విధిగా పాటించాల్సిందేనని తేల్చి చెబుతాడు. దేశ ప్రజలని కులాల వారీగాచీల్చి దేశఅనైక్యతకు, వెనుకబాటు తనానికీ మూలకారణంగా నిలిచిన మనుస్మతియే అసలు రాజ్యాంగంగా భావిస్తున్న మనువాద శక్తులు.. మొదటి నుంచి భారత రాజ్యాంగాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అందులోనూ.. మనుస్మతి ప్రకారం హీనజాతి వాడైన అంబేటద్కర్‌ ఆధ్వర్యంలో రాజ్యాంగ రచన జరగడం మనువాదులకు మింగుడు పడని విషయంగా పరిణ మించింది. ‘’మనువు స్థానంలో పంచముడైన అంబేద్కర్ని ఎట్లా ఒప్పుకుంటాం..?’’అంటూ దురహం కార పూరితంగా హుంకరించారు. స్వతంత్ర భారత రాజ్యాంగం.. మనుధర్మ సూత్రాలకు అనుగుణంగా ఉండాలంటూ డిమాండ్‌ చేసారు. 26 నవంబరు 1949న దేశ రాజ్యాంగసభ రాజ్యాంగాన్ని స్వీకరించిన తరువాత..30 నవంబరు 1949 సంచికలో ఆరెస్సెస్‌ అధికార పత్రిక ‘’ఆర్గనైజర్‌’’ భారత రాజ్యాంగాన్ని తూలనాడుతూ ఇలా రాసింది: ‘’భారతదేశానికి రాజ్యాం గం ఇప్పుడు కొత్తగా రాయాల్సిన అవసరం లేదు. ప్రాచీన కాలంలో మనువు రాసిన సూత్రాలు ఉన్నప్పటికీ వాటి ప్రస్తావనే రాజ్యాంగంలో లేకపోవడం పెద్ద అపరాధం. ప్రపంచానికే ఉత్తేజంతో దారి చూపగల ఆరాధనపూరితమైన మనుధర్మ శాస్త్రం.. అంబేద్కర్‌కూ, రాజ్యాంగ పండితులకూ గుర్తు కూడా రాలేదు’’
నేటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన గురువుగా చెప్పుకునే ఎం. ఎస్‌. గోల్వాల్కర్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌ రెండవ సర్‌ సంఘచాలక్‌) అంబే ద్కర్‌ రచించిన రాజ్యాంగం అసలు విలువ లేనిదంటూ తేల్చిపారేశాడు. ‘’పాశ్చాత్య దేశాల రాజ్యాంగాల నుంచి అక్కడో ముక్క, ఇక్కడో ముక్క పేర్చి..భారత రాజ్యాంగ మంటూ వీళ్ళు మనకు చూపెడుతున్నారు. అంబేద్కర్‌ రాసిన ఈరాజ్యాంగంలో భారతీయమైనదంటూ ఏదీ లేదు.. అంతా పరాయిదే’’ నంటూ తేల్చేసాడాయన. కులం పేరుతో తన సోదరులను బానిసలుగా చూడడం గోల్వాల్కర్‌ గారి దృష్టిలో భారతీ యత. దేశ ప్రజలందరూ సమానులేనని చెబితే.. అది పరాయి భావన. ఇలా ఉన్నది ఈ దేశ భక్తుల కుతర్కం! నాడు దేశ స్వాతంత్య్ర సంగ్రా మంలో పాల్గొనకుండా విదేశీ ప్రభువులకు వత్తాసు పలికిన సంఘ పరివారం..నేడు స్వతంత్ర భారత రాజకీయ అధికారాన్ని చేజిక్కించు కుని ఢల్లీి గద్దెపై కూర్చున్నది. తన రాజకీయ అంగమైన బీజేపీ ద్వారా నేడు ఆర్‌ఎస్‌ఎస్‌ దేశ పరిపాలనను తనచేతుల్లోకి తీసుకున్నది. స్వయంగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త అయిన నరేంద్రమోడీ నేడు రాజ్యాం గం మీద ప్రమాణం చేసి దేశ ప్రధాని పదవిలో కూర్చున్నాడు. అయితే సంఘ పరివారపు భావజాలంలో భారత రాజ్యాంగం పట్ల వ్యతిరేకత ఏమాత్రమూ తగ్గలేదు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం కాదు..మనుస్మ తియే మాకు శిరోధార్యమంటూ ఎన్నోసార్లు ఆర్‌ఎ స్‌ఎస్‌ నేతలు తేల్చి చెప్పారు.1992లో డిసెంబర్‌ ఆరెస్సెస్‌ ఏర్పాటు చేసిన ధర్మ సంసద్‌లో ప్రస్తుత రాజ్యాంగం హిందూవ్యతిరేకమైనదనీ..మనుస్మ తిని రాజ్యాంగంగా స్వీకరించాలంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు. మోడీ క్యాబినెట్‌ లోని మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే 2016 డిసెంబర్‌ లో కర్ణాటకలో ఒకకుల సమావేశంలో మాట్లాడుతూ..బీజేపీ అధికారం లోకి వచ్చిందే రాజ్యాం గాన్ని మార్చడానికి..కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చి తీరుతామని తేల్చి చెప్పాడు.
నేడు కేంద్రంలో అధికారాన్ని అనుభవిస్తున్న సంఫ్‌ పరివార్‌ నేతలు భారత రాజ్యాంగంపట్ల కపట భక్తిని ప్రదర్శిస్తున్నారు. మానవతా మూర్తులైన సాంఘిక విప్లవ కారులు తీసుకొచ్చిన మార్పుల వలన నేడు మనువాదం బలహీన పడిరది కాబట్టి.. సమయంకోసం వేచి చూస్తున్నారు. దేశ ప్రజల్లో క్రమక్రమంగా మతోన్మాద,మనువాద విషబీజాలను నాటి దేశంలో మళ్లీ మనువాద రాజ్యాన్ని స్థాపించాలనేదే వారి కుట్రల సారాంశం. దేశ ప్రజలలో సమతా, మమతా వెల్లివిరిసి.. అభివద్ధి పధంలో దేశం సమున్నతంగా ముందడుగు వేయాలని ఆకాంక్షించే దేశభక్త పౌరులందరూ నేడు మతోన్మాద-మనువాద ముఠాల కుతంత్రాల పట్ల జాగ్రత్త వహించాలి. ఈ దేశంలో సామాజిక న్యాయం వెల్లివిరియడం, అసమానతల మనువ్యవస్థ అంతం కావడమనేది ఏకొందరి ప్రయోజనాల కోసమో కానే కాదు. మను వాదం అంతమయితేనే భారత జాతి ఐక్యంగా నిలబడగలదు. భారత దేశ ఐక్యత, సమగ్రత..భారతరాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సమసమాజ భావనల పైన ఆధారపడి ఉన్నది. మనువాదుల విషపు పడగల నుండి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం, నేడు దేశ భక్త పౌరులందరి ప్రథమ కర్తవ్యంగా నిలిచి ఉన్నది. – ఆర్‌.రాజేశమ్‌

సరళీకృత ఆర్ధిక విధానాలపై ఎగిసిన కెరటం!

పద్దెనిమిదోసారి! ఇరవైకోట్లమంది! సరళీకృత ఆర్థిక విధా నాలపై ఉప్పెనలా ఎగిసిపడ్డారు. అనేక రాష్ట్రాలలో లక్షల్లో ప్రైవేటు పారిశ్రామిక వాడల కార్మికుల సమ్మెతో పారిశ్రామిక వాడలు బోసి పోయినాయి. ఇటీవలి కాలంలో పెరిగిన మిలిటెన్సీతో లాంగ్‌మార్చ్‌లు జరుపుతున్న రైతన్నలు వ్యవసాయ కార్మికుల్తో కల్సి అనేక రాష్ట్రాల్లో గ్రామసీమలు బంద్‌ పెట్టారు. గతంలో జరిగిన ఏసమ్మెలకన్నా ఈ 18వ సమ్మెలో అనేక కీలక రంగాలు మూతబడ్డాయి. అనేక రాష్ట్రాల్లో బొగ్గు ఉత్పత్తి, దాని రవాణా దెబ్బతిన్నది. 70-75 శాతం బొగ్గు పరిశ్రమలో సమ్మె జరిగింది. 30లక్షల మంది విద్యుత్‌ ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. పబ్లిక్‌, ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్టు కార్మికులు సుమారు3.5 కోట్ల మందిపాల్గొన్నారు. కేరళ,బీహార్‌, ఒడిసా, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌తో పాటు అనేక ఈశాన్య రాష్ట్రాలు ఈకార్మికుల సమ్మెతో సంపూర్ణంగా బంద్‌ కాగా బెంగాల్‌లో 80శాతం జయప్రద మైంది. కర్నాటక,పంజాబ్‌,మహారాష్ట్ర,జార్ఖాండ్‌లలో అనేక జిల్లాల్లో ట్రాన్స్‌పోర్ట్‌ సమ్మె పెద్ద ప్రభావం చూపింది. పోర్టులలో సమ్మె పాక్షికంగా జరిగింది. కానీ హమాలీల సమ్మెతో పారదీప్‌, ట్యూటికోరిన్‌, కోల్‌కతా, కొచ్చిన్‌, హాల్దియా విశాఖల్లో సరుకు రవాణా నిలిచిపోయింది. విశాఖ, సేలం, భద్రావతి ఉక్కు కర్మాగారాల్లో పూర్తిగా ఉత్పత్తి నిలిచిపోయింది. రూర్కెలాస్టీల్‌ ప్లాంట్‌ శాశ్వత కార్మికులు సమ్మె చేసి, గేట్ల వద్ద పికెటింగ్‌ చేశారు. సుమారు కోటి మంది స్కీం వర్కర్లు సమ్మెలో పాల్గొన్నారు. భారత ఆర్ధిక వ్యవస్థ నాడీ మండలం స్తంభించింది. ఇన్సూరెన్స్‌ సేవలు పూర్తిగా నిలిచిపోగా, రిజర్వుబ్యాంకుతోపాటు లక్షలాది గ్రామీణ బ్యాం కులు, సహకార బ్యాంకులు,నాబార్డ్‌,అనేక జాతీయ బ్యాంకులు సంపూర్ణంగా మూతబడ్డాయి. 13 లక్షల మంది పోస్టల్‌, ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్లు సంపూర్ణంగా నిలిచిపోగా ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌, సివిల్‌ అకౌంట్స్‌,అటామిక్‌ ఎనర్జీవంటి మరో30శాఖల్లో సమ్మె జరిగింది. అసంఘటితరంగాలైన నిర్మాణ కార్మికులు, హమాలీలు మొదలగు వారు పెద్దఎత్తున సమ్మెలో పాల్గొన్నారు.
8వతేదీ21.33 లక్షల మంది, 9వ తేది 19 లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ చుట్టూ వున్న సంగారెడ్డి, మేడ్చెల్‌, రంగారెడ్డి, భువనగిరి జిల్లాలలోని పారిశ్రామిక వాడలు పెద్దఎత్తున మూతబడ్డాయి. క్ఱెసీఆర్‌ ఎన్నిమంత్రాలు పెట్టినా ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఉమ్మడి నిజామాబాద్‌,ఉమ్మడి ఆదిలాబాద్‌, ఉమ్మడి మెదక్‌ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం (14జిల్లాల్లో) అంగన్‌వాడీ, ఆషా వర్కర్లు పెద్దఎత్తున సమ్మెలో పాల్గొన్నారు. రాష్ట్రమంతా మధ్యాహ్న భోజన మహిళలు సంపూర్ణంగా సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగం లో సమ్మె బలహీనంగా జరిగింది. ఎన్‌టీపీసీ కాంట్రాక్టు కార్మి కులు 3 వేల మంది సంపూర్ణంగా సమ్మెలో పాల్గొన్నారు. సింగరేణిలో 41శాతం మంది, బీడీఎల్‌లో 40శాతం మంది మొదటిరోజు సమ్మెలో పాల్గొన్నారు. బీడీకార్మికులు సంపూర్ణంగా రెండు రోజులూ సమ్మెలో వున్నారు. ఈరెండు రోజుల సమ్మెట్రేడ్‌ యూనియన్ల బలంతో పాటు బలహీనతలనూ, ఐక్యట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ లోపాలను బహిర్గతం చేసింది. ఆత్మవిమర్శనా పూర్వకంగా వాటిని అన్ని స్థాయిల్లో పరిశీలిం చుకోవాలి. రాష్ట్రంలో ఈసమ్మెకు ఒక పరిమితి ఉంది. ఈసారి సమ్మె ఏర్పాట్లకు సరిగ్గా నెల రోజులు మాత్రమే మిగిలింది. రెండు రాజకీయ ప్రత్యామ్నాయాల కోసం సాగిన ఎన్నికల పోరాటం మళ్ళీ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఏర్పాటుతో కొన్ని సంఘాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఏమైనా, అన్నిస్థాయిల్లోని సీఐటీయూ కార్యకర్తలు ఈఅతిపెద్ద వర్గ పోరాటంలో శక్తి వంచన లేకుండాకృషి చేశారు. తగుసమయం ఉండి ఉంటే సంస్థల్లో కృషిని మరింత సమగ్రంగా ప్లాన్‌ చేసి వుంటే ఇంకా మెరుగ్గా సమ్మె రాష్ట్రంలో జరిగి వుండేది.
ఈ సమ్మె ఒకసైద్ధాంతిక పోరాటం
ఏదో ఒక సమ్మె పిలుపు వచ్చింది, దాన్ని జయప్రదం చేయడానికి కృషి చేయాలన్న దృక్పథం మాత్రమే కలిగి ఉండటం తప్పు కొన్ని సంఘాల్లోకన్పడుతోంది. ఇది నయాఉదారవాద విధానా లపై ఎక్కుపెట్టిన ‘పాశుపతాస్త్రం’. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సరళీకరణ ఆర్థిక విధానాలపై అమీతుమీ తేల్చుకునే ప్రయత్నం. ఒకరకంగా చెప్పాలంటే ఇదిఅంబానీ, అదానీల అనుకూల విధానాలను భౌతి కంగానే కాక, సైద్ధాంతికంగా కూడా ఎదుద్కొనే ప్రయత్నం. మన ప్రభుత్వ రంగ పరిశ్రమలను అక్షరాల తినేస్తున్న బహుళజాతి కంపెనీ లపై దండెత్తిన పోరాటం. 70వ దశకంలో ఇందిరాగాంధీ బిహెచ్‌ఇ ఎల్‌ పై ఉసికొల్పిన సీమెన్స్‌ నుండి తాజాగా మోడీ ఆధ్వర్యంలో హెచ్‌ఏఎల్‌ను మింగేస్తున్న రాఫెల్‌ వరకు ఈ కోవలోవే. డీపీపీ పేర (డిఫెన్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీ) డిఫెన్స్‌ రంగంలోకి అడ్డగోలుగా ప్రైవేటు వారిని అనుమతిస్తున్నారు. ఇది బీఈఎల్‌, బీడీఎల్‌, మిధానీ వంటి పరిశ్రమలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడ్తున్నది. మోడీ ప్రభుత్వ అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి పరాకాష్ట రాఫెల్‌ ఒప్పందం. ఇది హిందూస్థాన్‌ ఎయిరో నాటిక్స్‌ను ముంచుతుందని దేశమంతా గగ్గోలు పెడ్తున్నది. ఇంతకుముందే చెప్పినట్టు డిఫెన్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీ కింద యుద్ధ పరికరాల తయారీకి 200 లైసెన్స్‌లు ప్రైవేటు వారికి కట్ట బెట్టింది మోడీ సర్కార్‌. ప్రభుత్వ ఆధ్వర్యంలోని హెచ్‌ఏఎల్‌ను, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను, బీడీఎల్‌ను ఎండబెట్టి ప్రైవేటు వారికి ఆర్డర్స్‌ ఇవ్వడమే మేక్‌ ఇన్‌ ఇండియా నేమో! ఇది బీఈఎల్‌, హెచ్‌ఏఎల్‌, బీడీఎల్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను, డీఆర్‌డీఓను ముంచుతున్నది. ఈ విషయాలు మన ట్రేడ్‌ యూనియన్‌ కార్యకర్తల రోజువారి పనిలో అంతర్భాగంగా వున్నాయా? లేదా? పరిశీలించుకోవాలి. అంటే కార్మి కుల కొచ్చే సమస్యలు-ప్రమోషన్స్‌, ఇన్‌సెంటివ్‌లు రావడం/ రాకపో వడం వంటి వాటి వెనుక ప్రభుత్వ విధానాల లోతు పాతులు కార్మికుల ముందుచగల్గుతున్నారా?లేదా?అనేది ముఖ్యమైన విషయం. దీన్లో కీలకమైనది పెరుగుతున్న కాంట్రాక్టీకరణను అడ్డుకునేందుకు లేదా ఆ కాంట్రాక్టు కార్మికుల బాగోగులపై ప్రభుత్వరంగ యూనియన్లు ఏమేరకు, ఎటువంటి కృషి చేస్తున్నాయనేది కూడా మరో కీలక విషయం. ‘ఎవడెటుపోతే నాకేం?!చిన్నినా బొజ్జకు శ్రీరామరక్ష!’ అనేది సంస్కరణ వాద సంఘాల వాదన. ఈజబ్బు వదిలించకుండా కార్మిక వర్గం విప్లవకర పాత్ర పోషించజాలదు. ప్రభుత్వ విధానాలను అర్ధం చేసుకోవడం,వాటిని రోజు వారి కార్మికుల సమస్యలతో లింక్‌ చేయడం ప్రైవేటు రంగమైనా, స్కీంవర్కర్ల ఉద్యమమైనా,ఆటో,హమాలీ,భవన నిర్మాణరంగమైనా,అన్నింటికీ వర్తించేదే!
సంస్కరణ వాదం నుంచి బయట పడాలి
అది1998 ఏప్రిల్‌లో విద్యుత్‌ రంగంలోని 1104 ఆఫీసు లో1104 కార్యకర్తలకు, యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూని యన్‌ కార్యకర్తలకు విద్యుత్‌రంగ ఆఫీసర్ల కాన్ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు శ్రీ అశోక్‌రావు ఏపీ విద్యుత్‌ సంస్కరణల చట్టాన్ని వ్యతిరేకిం చండని చేసిన ఉద్భోదలో భాగం. ‘మేంసమ్మె చేస్తే ఆగుతుందా’ అన్న చొప్పదంటు ప్రశ్నలకు ‘కనీసం స్పీడ్‌ బ్రేకర్లు పెట్టగలిగితే ప్రభు త్వాల వేగాన్ని తగ్గించగలుగుతార’ని అశోక్‌ రావు గారు వివరించారు. 2000 సంపప ఆగస్టు టారిఫ్‌ వ్యతిరేక ఉద్యమం ప్రపంచ బ్యాంకు ఎజెండానే ధ్వంసం చేసింది. డిస్కాంల ప్రైవేటీకరణకు పెట్టిన ముహూ ర్తాలు నాశనం అయ్యాయి. ఇరవయ్యేళ్ళు గడిచినా డిస్కాంల ప్రైవేటీక రణకు ఏప్రభుత్వమూ సాహసం చేయట్లేదు అటు ఆంధ్రలో,ఇటు తెలంగాణాలో. ఇదికార్మికుల,సామాన్య ప్రజలవిజయం.1978లో జనతాపార్టీ ప్రభుత్వం పారిశ్రామిక సంబంధాల బిల్లు తెచ్చినప్పుడు సమైక్య ప్రతిఘటనతో తిప్పికొట్టింది కార్మికవర్గమే. 1988లో మళ్ళీ రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఒకప్రయత్నం చేస్తే ప్రతిఘటించింది కార్మిక వర్గమే. 1991లో పీవీ – మన్మోహన్‌ల శకం ప్రారంభమైనప్పట్నించీ కార్మిక చట్టాల సవరణకు పెట్టుబడిదారుల మార్గం సుగమం చేసేం దుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నది కార్మికవర్గమే. ఈపాతికేండ్లలో ఈవిధానాలు ముదిరిపాకానపడ్డాయి. వ్యవసాయ సంక్షోభం తీవ్రమైంది. గత రెండేండ్లలో రైతాంగ ప్రతిఘటన పెరిగింది. నీటి సరఫరాకోసం,విద్యుత్‌ఛార్జీలు తగ్గించడం కోసం రాజస్థాన్‌ రైతాం గం, పంటరుణాలరద్దు, గిట్టుబాటుధర కోసం మధ్యప్రదేశ్‌ రైతాంగం, భూములను గుంజుకుని తమని నిర్వాసితులను చేయొద్దనీ, గిరిజన రైతాంగానికి పట్టాలివ్వాలనీ మహారాష్ట్ర రైతాంగం పెద్దపెద్ద ఆందోళ నలు చేసింది. ఆయా రాష్ట్రాల పాలక బీజేపీ ప్రభుత్వాల కూల్చివేతలో ముఖ్య భూమిక పోషించింది.
ఇవన్నీ సరళీకృత ఆర్థికవిధానాలకు బ్రేకు వేయడమే కదా. మనంబ్రేకులేస్తూంటే వాళ్ళు ‘వాషింగ్టన్‌ కన్సెన్సస్‌’ (వాషింగ్టన్‌ ఏకాభిప్రాయం) అంటున్నారు. అంటే పార్టీలు మారినా, నాయకులు మారినా అవే విధానాలు కొనసాగుతున్నాయి. అందుకే ‘ప్రజల జీవన విధానానికీ, జీవితాలకూ సంబంధించిన అంశాలపై వారిని సమీకరించాలి. వారికి ప్రధాన శత్రువులెవరో అర్ధం చేయిం చడమే మన ముందున్న కర్తవ్యం. అది మాత్రమే ఉదారవాద విధా నాలను వెనక్కితిప్పికొట్టగలదు. మనం మూలలపై గురి ఎక్కుపెట్టాలి. అప్రధాన విషయాలను పట్టించుకోవద్దు. అప్పుడు మాత్రమే పెట్టుబడి దార్ల, భూస్వాముల, వారి రాజకీయ ప్రతినిధుల నుండి దృష్టి మరల్చ కుండా చేయగలం. ప్రజల్ని వర్గేతర సమస్యలవైపు వెళ్ళకుండా చూడ గలం’ అని రాశారు. 18 దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మెలు ఐక్యంగా నడిపిన సీఐటీయూ అనుభవముంది. ప్రభుత్వాలు మారుతున్నా అవే సరళీక ృత ఆర్థిక విధానాలు కొనసాగుతున్నాయన్న సీఐటీయూ 14వ అఖిల భారత మహాసభ (కన్నూర్‌) విశ్లేషణ ఉంది. కార్మికవర్గానికి, సామాన్య ప్రజలకు విధ్వంసకరమైన విధానాలను మోసుకొచ్చినా ఆపలేకపోయామన్న బాధఉంది. కార్మికుల సమస్యలకు మూల కారణా లను, వాటి వెనుకున్న రాజకీయాలను అర్ధం చేయించడంలో విఫల మౌతున్నామన్న ఆత్మవిమర్శ ఉంది.
‘ ’కార్మికోద్యమంలో ఈఅనైక్యత ప్రమాదవశాత్తు వచ్చింది కాదు. సంస్కరణవాద సంఘాల విషపూరితప్రచారం, ప్రభావాల వల్లనే ఇది ప్రాప్తించింది. ఇది భారతకార్మికవర్గం యొక్క వర్గచైతన్యాన్ని తుడిచి పెట్టుకుపోయేలా చేసింది. దీనివల్ల కార్మికుల వర్గ చైతన్యం మసకబారి పోయింది. ఫలితంగా వర్గశత్రువులపై చేయాల్సిన నిర్ణయాత్మక పోరాటం పలచబడిరది. కార్మికవర్గం యొక్క ప్రజాతంత్ర బాధ్యతలను, ముఖ్యంగా రైతాంగం యెడల తన బాధ్యతలను అర్ధం చేసుకోకుండా అడ్డుకున్నది. కార్మికోద్యమం సంకుచిత, ఆర్థికవాదంతో నిండిపోయి నా ఫ్యాక్టరీ, నారంగం అన్న మనస్తత్వం పెరిగింది’’-1971 సెప్టెం బర్‌ ‘వర్కింగ్‌క్లాస్‌’ పత్రిక సంపాదకీయంలోఈ హెచ్చరిక చేశారు. సమాజమార్పు కోసం కృషి చేసే బాధ్యత కార్మికో ద్యమ కార్యకర్తలది. దానికి అడ్డుగా నిలిచిన సరళీకృత ఆర్థిక విధానా లను ఓడిరచడం ప్రతికార్మికవర్గం బాధ్యత. – ఆర్‌.సుధాభాస్కర్‌

క్షీణిస్తున్న ఉద్యోగులు..తగ్గుతున్న వేతనాలు

ప్రపంచంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం కూడా ఉందని ఇప్పుడు చాలామంది నమ్ముతు న్నారు. అయితే అభివృద్ధి అంటే జీడీపీ వృద్ధి అని మాత్రమే కాదు. జీడీపీ వృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం, ఉపాధీ ఉద్యోగ అవకాశాలూ పెరగాలి 2014 ఎన్నికలప్పుడు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని ఎన్‌డీఏ హామీ ఇచ్చింది. జనవరి 2018లో ఒక టెలివిజన్‌ ఇంటర్వ్యూలో 70లక్షల మంది కొత్తగా పీఎఫ్‌ అకౌంట్లను తెరిచారని ఇది కొత్త ఉద్యోగాల సృష్టి గురించి చాలా స్పష్టంగా తెలియజేస్తోందని అని ప్రధాని మోడీ చెప్పారు. అయితే ప్రధానమంత్రి రోజ్‌గార్‌ ప్రోత్సహన్‌ యోజన కింద కేంద్ర ప్రభుత్వం యజమానులు చట్టబద్ధంగా చెల్లించాల్సిన పీఎఫ్‌ మొత్తాన్ని మూడేండ్లవరకూ చెల్లిస్తున్నది. ఈ పథకాన్ని ఉపయోగించుకొని ఇదివరకే తమ వద్ద పీఎఫ్‌ చెల్లించకుండా పనిచేస్తున్న కార్మికులను కొత్తగా చేర్చుకున్నట్టు చూపి వారికి ప్రభుత్వపథకం ద్వారా పీఎఫ్‌ చెల్లిస్తున్నారు. ఇదివరకు ఉన్న ఉద్యోగాలని కొత్త ఉద్యోగాలుగా చూపిస్తూ కొత్త ఉద్యోగాల సృష్టి జరిగిందని ప్రభుత్వం చెప్పడంలో అర్థం లేదు. అంతర్జాతీయ కార్మిక సంస్థ 2018, 2019 లో నిరుద్యోగపు రేటు భారతదేశంలో 3.5 శాతంగా ఉండవచ్చని అంచనా వేయగా సీఎంఐఈ ఇది ఇంతకన్నా చాలా ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది. ఆర్థిక అభివ ృద్ధి గురించి కాంగ్రెస్‌, బీజేపీలు నిరంతరం వాదులాడుకుంటూ ఉంటాయి. ఈ వాదనలలో మానవాభి వృద్ధి రేటు గురించి ఎవరూ ఎక్కువగా మాట్లాడరు. మోడీ ప్రభుత్వం ఈమధ్య జీడీపీని లెక్కించే పద్ధతి మార్చి వేసింది. తమ హయాంలో యూపీఏ కన్నా ఎక్కువ వ ృద్ధి జరిగిందని చెప్పుకోడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అయితే ఈ కొత్త పద్ధతి ప్రకారం వేసిన అంచనాలు వివాదాస్పదమయ్యాయి. నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌ అనధికారికంగా చేసిన అంచనాల ప్రకారం ఎన్‌డీఏ కన్నా యూపీఏ హయాంలో వృద్ధిరేటు ఎక్కువగా ఉండగా సెంట్రల్‌ స్టాటిస్టికల్‌ ఆర్గనైజేషన్‌ అధికారికంగా విడుదల చేసిన అంచనాలలో ఎన్‌డీఏ హయాంలో వృద్ధిరేటు ఎక్కువగా ఉన్నది. ఈ విరుద్ధమైన అంచనాలు రెండు సంస్థలు చేసిన అంచనాల విశ్వసనీయతను ప్రశ్నించేట్టుగా ఉన్నాయి. జీడీపీలో వృద్ధి జరిగినా అది ప్రజల జీవితాలలో గుణాత్మ కమైన మార్పు తీసుకురానప్పుడు ఆ వృద్ధివల్ల ప్రయోజనం ఏమిటి. జీడీపీలో వృద్ధి జరిగినా సమాజంలోని ఒక పెద్ద సమూహానికి దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు లేవు. భారతదేశంలో వృద్ధిరేటు వేగంగా పెరుగుతున్నప్పటికీ అదే స్థాయిలో అసమానతలు కూడా పెరుగుతున్నాయి. జతీవసఱ్‌ ూబఱంంవ రిపోర్ట్‌ ప్రకారం ఒక శాతంగా ఉన్న సంపన్నుల సంపద 2010లో మొత్తం సంపదలో 40శాతంగా ఉండగా 2016లో అది 50 శాతానికి పెరిగింది.10శాతంగా ఉన్న సంపన్నులు మిగతా 90శాతం ప్రజల కన్న నాలుగు రెట్లు ఎక్కువ సంపద కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన సెంటర్‌ ఫర్‌ సస్టయినబుల్‌ డెవలప్‌మెంట్‌ భారతదేశంలో ఉపాధి అవకాశాలపై ఒక నివేదిక విడుదల చేసింది. ‘స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇన్‌ ఇండియా’ అన్న పేరు మీద ఈ నివేదిక విడుదల చేశారు. భారతదేశ లేబర్‌ మార్కెట్‌ను విశ్లేషిస్తూ వ్యవసాయరంగం నుంచి వ్యవసాయేతర రంగాలకు కార్మికుల వలసపోతున్నారని నివేదిక తెలియజేసింది. ఉపాధి రహిత అభివృద్ధీ, వేతనాలు పెరగని అభివృద్ధీ సహజంగానే సమ్మిళితమైన అభివృద్ధికి దారితీయదని అది అసమానతలూ అంతరాలూ పెంచుతుందని నివేదిక స్పష్టంగా తెలియజేసింది.నూతన ఆర్థిక విధానాలు అమలైన గత 25 ఏండ్లలో జీడీపీకి,ఉపాధి కల్పనకూ ఉన్న సంబంధం రోజు రోజుకి బలహీనపడిపోతున్నది. 1970, 1980లలో జీడీపీ వృద్ధి 3 నుంచి 4శాతం ఉంటే ఉపాధిలో వృద్ధి సుమారు 2శాతంగా ఉండేది.1990 తర్వాత మరీ ముఖ్యంగా2000ల తర్వాత జీడీపీలో 7శాతం వృద్ధి ఉన్నా ఉపాధిలో వృద్ధి మాత్రం ఒకశాతం కన్నా తక్కువ ఉన్నది. జీడీపీలో వృద్ధీ, ఉపాదివృద్ధికీ మధ్య నున్న నిష్పత్తి 0.1 శాతం కన్నా తక్కువగా ఉన్నది. అంటే జీడీపీలో 10శాతం వృద్ధి ఉంటే ఉపాధిలో ఒక శాతం పెరుగుదల మాత్రమే ఉంటుందన్నమాట. 2013-15 మధ్య దాదాపుగా 70లక్షల ఉద్యోగాలు మాయమైపోయాయని నివేదిక తెలియజేస్తున్నది. నిరుద్యోగం 5శాతం కన్నా ఎక్కువైందని ఉత్తరాది రాష్ట్రాలలో ఇది మరింత ఎక్కువగా ఉన్నదని నివేదిక వెల్లడిరచింది. ఉన్నత విద్యావంతులైన యువతీ యువకులలో నిరుద్యోగం 16శాతంగా ఉందని నివేదిక తెలపడం చాలా ఆందోళన కలిగించేదిగా ఉంది. అండర్‌ ఎంప్లాయిమెంట్‌, తక్కువ వేతనాలు మాత్రమే సమస్యలుగా ఉన్నాయని అనుకుంటే ఇప్పుడు ఈ నివేదిక పెరుగుతున్న నిరుద్యోగం మరి ఉపాధి కల్పన భారత దేశానికి పెద్ద సవాళ్లని తెలియజేస్తున్నది. దాదాపు అన్ని రంగాలలో వేతనాలు పెరుగుతున్నాయని చెప్తున్నా ఇది జీడీపీ వృద్ధితో పోలిస్తే చాలా తక్కువ. గ్రామీణ వేతనాలలో ఎలాంటి పెరుగుదల లేదు. సగటున వేతనాలలో వృద్ధి 3శాతంగా ఉన్నది. అయితే కార్మికుల ఉత్పాదకత 30ఏండ్ల కింది నాటికన్నా ఆరు రెట్లు పెరిగింది. సూపర్వైజరీ, మేనేజరియల్‌ ఉద్యోగాల్లో వేతనాలు మూడు రెట్లు పెరగగా కార్మికుల వేతనాలలో వృద్ధి మాత్రం ఒకటిన్నర రెట్లుగా ఉన్నది. ఇప్పటికీ మగవారిలో 82శాతం, స్త్రీలలో 92శాతం నెలకు 10 వేల రూపాయలు కన్నా తక్కువగా సంపాదిస్తున్నారు. సెవెంత్‌ సెంట్రల్‌ పే కమిషన్‌ నెలకు 18వేల రూపాయలు కనీస వేతనంగా ఇవ్వాలని సిఫారసు చేసింది. దీన్నిబట్టి చాలా పెద్ద సంఖ్యలోనే భారతీయులు జీవించడానికి కావలసిన వేతనాలకు (లివింగ్‌ వేజ్‌) చాలా దూరంలో ఉన్నారని అర్థమైపోతుంది. ప్రయివేట్‌ రంగంలో చాలా పరిశ్రమలు సెంట్రల్‌ పే కమిషన్‌ సిఫారసు చేసిన కనీస వేతనం కన్నా చాలా తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. అందుకనే ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలకు పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉంటున్నది. అట్లాగే కార్మిక, పెట్టుబడి (లేబర్‌-క్యాపిటల్‌) నిష్పత్తి కూడా దారుణంగా పడిపోతున్నది. 1980లో కోటి రూపాయలు (2015 ధరలలో) పెట్టుబడి పెడితే 90ఉద్యోగాలు వచ్చేవి. ఇప్పుడు 90బదులు 10 ఉద్యోగాలు మాత్రమే వస్తున్నాయి. అట్లాగే ఉన్న ఉద్యోగాలలో కూడా కాంట్రాక్టు ఉద్యోగాలు పెరుగుతున్నాయి. మొత్తం ఉద్యోగాలలో 60శాతానికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటున్నారు. శాశ్వత ఉద్యోగుల పనులను ఇప్పుడు రకరకాల పేర్లు గల తాత్కాలిక ఉద్యోగులు చేస్తున్నారు. పర్మనెంట్‌ ఉద్యోగులకు ఇచ్చే వేతనాల కన్నా చాలా తక్కువ వేతనాలను వీరికి ఇస్తూ కార్మిక చట్టాలను నిర్వీర్యపరుస్తు ప్రయివేట్‌ యాజమాన్యాలు శ్రమదోపిడీ చేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన లింగ వివక్ష నెలకొని ఉన్నదని నివేదిక తెలిపింది. మేనేజర్లు, సీనియర్‌ అధికారులు, శాసనసభ్యులలో 2011లో 13శాతంగా ఉన్న మహిళల వాటా 2015 కల్లా 7శాతానికి తగ్గిపోయిందని నివేదిక వెల్లడిరచింది. తయారీ రంగంలోని కార్మికులలో 22శాతం మహిళలు ఉండగా సర్వీస్‌ రంగంలో మహిళలు 16శాతంగా ఉన్నారు. టెక్స్టైల్‌ గార్మెంట్‌, టుబాకో, విద్య. వైద్య రంగాలలో మహిళా కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ఉద్యోగాల సంఖ్యలోనే కాక వేతనాలలో కూడా మహిళలు వివక్షకూ లోనవుతున్నారు. తాము చేస్తున్న పని, తమ విద్యార్హతలను బట్టి మహిళలు పురుషుల వేతనాలలో 35 నుంచి 85 శాతం వరకు పొందుతు న్నారు. అయితే ఈఅసమానతలు కొంత తగ్గుతున్న సూచనలు కూడా కనిపిస్తు న్నాయి. తయారీరంగంలో మహిళల వేతనాలు పురుషుల వేతనాలలో 35 నుంచి 45శాతానికి పెరిగింది. రెగ్యులర్‌ వర్కర్స్‌, ఉన్నత విద్యావంతులైన మహిళలలో ఈ వ్యత్యాసం తక్కువగా ఉన్నది. శ్రామిక మహిళలు, ఉద్యోగాల కోసం చూస్తున్న మహిళల శాతం ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే మనదేశంలో చాలా తక్కువగా ఉన్నది. ఇది ఇంకా తగ్గుతూ వస్తున్నది. ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాల కన్నా దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉన్నది. సాంఘిక పరమైన కట్టుబాట్ల కన్నాఅవకాశాలు లేకనే మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉన్నది. గ్రామీణ ఉపాధి పథకం, ఆషా, అంగన్‌ వాడీ వంటి స్కీముల వల్ల మహిళల వాటా ఉద్యోగాల్లో కొంతమేరకు పెరిగింది.
ఉపాధిలో కులపరమైన వివక్ష, అసమాన తలు కొనసాగుతున్నాయి. తక్కువ వేతనాలు ఉన్న వృత్తులలో ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారు చాలా ఎక్కువగా ఉండగా అధిక వేతనాలు కల ఉద్యోగాలు/ వృత్తులలో వారి సంఖ్య నామమాత్రంగా ఉన్నది. కుల వివక్షతను అలాగే నిమ్న కులాలకు గౌరవప్రదమై ఉద్యోగాలలో అవకాశాలు లేకపోవడాన్ని ఇది స్పష్టంగా చూపిస్తున్నది. రిజర్వేషన్లు సరిగా అమలైన చోట ప్రభుత్వ పాలనా వ్యవస్థలో కొంత మెరుగైన ప్రాతినిధ్యం ఈవర్గాలకు లభ్యమయిందని నివేదిక తెలియజేస్తున్నది. గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే సంపాదనలో/ వేత నాలలో మహిళల పట్ల ఉన్న తేడాల కన్నా కులపరమైన వివక్ష తేడాలే ఎక్కువ. ఉన్నత కులాలకు చెందిన వారి సంపాదనలో ఎస్సీ కులాల వారు 56 శాతం సంపాదిస్తూ ఉండగా, ఎస్టీ కులాలవారు 55శాతం అలాగే ఓబీసీకి చెందినవారు 72శాతం సంపాదిస్తున్నారని నివేదిక అంచనా.
వ్యవస్థాగతమైన మార్పులు చాలా మెల్లగా జరుగుతున్నాయని ఇవి వేగవంతం కావాల్సిన అవసరం ఉన్నదని నివేదిక అభిప్రాయపడిరది. అలాగే ఉపాధి కల్పనకు ఒక సమగ్ర విధానం రూపొందించాల్సిన అవసరం ఉన్నదని నివేదిక భావించింది. అధిక వృద్ధిరేటు ఉద్యోగాల కల్పనను పెంచలేక పోయినందున అలాగే కార్మికుల పెరిగిన ఉత్పాదకత వారి వేతనాలను పెంచలేక పోయినందున ప్రభుత్వం ఒక జాతీయ ఉపాధి విధానాన్ని రూపొందించాలని నివేదిక సిఫారసు చేసింది. దీనికిగాను గ్రామీణ ఉపాధి హామీ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని నివేదిక సూచించింది. కొన్ని రాష్ట్రాలలో విజయవంతంగా అమలు చేస్తున్న ఉపాధి పథకాలను దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాలను పరిశీలించాలని అట్లాగే పారిశ్రామిక విధానాలను ఉపాధి అవకాశాలను కల్పించేటట్టుగా, కార్మికులకు వేతన ప్రోత్సాహకాలను అందించేట్లుగా రూపొందించాలని నివేదిక ప్రభుత్వాలకు సూచించింది. గ్రామీణ ఆదాయాలను పెంచడానికి వ్యవసాయ రంగంలో పబ్లిక్‌ పెట్టుబడులను పెంచాలని, విద్య, వైద్యం, హౌసింగ్‌ పబ్లిక్‌ రవాణాలో ప్రభుత్వ పెట్టుబడులను పెంచాలని, పర్యావరణ రక్షణ, కాలుష్య రహిత ఇంధనం ఉత్పత్తి కోసం పెట్టుబడులు పెట్టడం వల్ల ఉద్యోగాలు సృష్టించాలని నివేదిక సిఫారసు చేసింది. సాంఘిక అసమానతలు తగ్గించడానికి ప్రభుత్వ పథకాలు కీలకమని నివేదిక అభిప్రాయపడిరది. త్వరలోనే పార్లమెంట్‌ ఎన్నికలు రానున్నాయి. కార్మిక సంఘాలు, అసమానతలను అంతరాలను తొలగించడానికి కృషి చేస్తున్న సంస్థలు, పర్యావరణ పరిరక్షణకు పని చేస్తున్న సంస్థలు నివేదిక తెలియజేసిన అంశాలపై ప్రజాభిప్రాయం కూడగట్టి ఉపాధి అవకాశాలు పెంచే అభివృద్ధిని, అంతరాలను తగ్గించే సమ్మిళిత అభివృద్ధికి తోడ్పడే ఆర్థిక సాంఘిక విధానాలను అవలంబించేట్టుగా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నది -వేణుగోపాల్‌

ఆదివాసీ భాషల పరిరక్షణే కర్తవ్యం

శాంతిదూత అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం కలిగిన ప్రజాస్వామిక దేశంలోనే ఆదిమజాతుల పరిస్థితి ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఈదీనావస్తలను ఎలా వర్ణించాలి. మనుషులుగా మా ఆదిమజాతులకు లేని భద్రత మా భాషలకు, సంస్కృతులకు ఎలా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద వలస పాలన ఆక్రమణల కారణంగా స్థానిక ఆదిమజాతులు రాజ్యాధికారానికి దూరం కావడం, తద్వారా సంస్కృతిలు, భాషలు అణిచివేతకు గురికావడం నిరంతరం జరుగుతూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 90దేశాలలో సుమారు ఐదువేల తెగలు, సంస్కృతులు కలిగి 370మిలియన్ల జనాభా, ఏడు వేలరకాలకు పైగా భాషలు ఉన్నట్టు యునెస్కో (ఖఅఱ్‌వస చీa్‌ఱశీఅం జుసబషa్‌ఱశీఅaశ్రీ ూషఱవఅ్‌ఱటఱష aఅస జబశ్ర్‌ీబతీaశ్రీ ూతీస్త్రaఅఱస్త్రa్‌ఱశీఅ) గుర్తించగా, 2680 లకుపైగా ఆదిమ జాతులు మాట్లడే భాషాలు అంతరించి పోతున్న భాషాల జాభిలో ఉండడం ఆందోళన కలిగించే అంశం. మన దేశంలో 104 మిలియన్ల జనాభా కలిగి 700 తెగలు (యునెస్కో గుర్తింపు పొందిన) ఆదివాసులుండగా, 500 తెగలు మాత్రమే ఉనికిలో ఉన్నాయి. 1635భాషలు స్థానిక జాతుల వాడుకలో ఉంటే 197 భాషలు, 75 తెగలు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదావస్తలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో తోటి, చెంచు, కొండ రెడ్డి, కులియా, దులియా మొదలైన తెగలు, కొలాం, సవర, కొండ భాషా వంటి భాషాలు ఇతర భాషాల ఆదిపత్యానికి లోనై కనుమరుగు కానున్నాయి. ఈ పరిణామాలు ఆదిమజాతుల మనుగడకు, విశ్వ మానవాళి వినాశానికి హెచ్చరికలుగా పరిణామీస్తున్న వేళ యునెస్కో 2019 సంవత్సరాన్ని ‘‘ప్రపంచ ఆదివాసీ భాషా సంవత్సరోత్సవం’’గా ప్రకటించడం ఆదిమజాతుల భాషా జ్ఞానాన్ని పరిరక్షించుకోవడం ప్రపంచ సమాజం భాద్యత అని గుర్తు చేయడం శుభపరిణామం.
ఆదిమజాతుల భాషా పరిరక్షణ అంటే మన సాంస్కృతిక వారసత్వం జ్ఞానమూలాల పరిరక్షణేనని సమాజం గుర్తించాలి. ఆదిమజాతుల నాగరికత సంస్కృతులతో పాటు భాషలు మన సమాజానికి ఎంతో అవసరమని గ్రహించి గౌరవించి కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ఆదిమజాతులది మాత్రమే కాదని, మన అందర బాధ్యత అని యునెస్కో గుర్తుచేసింది. ఆదిమ జాతుల సంస్కృతి వర్ధిల్లితేనే మానవ మనుగడ వైవిధ్యత వర్ధిల్లుతుంది. ఆదిమజాతుల, భాషా సంస్కృతుల పరిరక్షణ అంటే పురాతన సమాధుల త్రవ్వకాలు, సామాగ్రిని మ్యూజియంలలో భద్రపరచడం మాత్రమే కాదు. మా భాషా సంస్కృతిని, జీవన విధానాన్ని, సజీవంగా కొనసాగే అవకాశాలు కల్పించడమని వీలైనంత తొందరగా గుర్తించాలి. విశ్వవిద్యాలయాలు సైతం భాషా అధ్యయనాల పేరిట పురాణ ఇతిహాసాలు, రాతప్రతులు, భాషా, అలంకారాలు, రంధ్రాన్వేషణలు మాని నిజాయితీగా వాస్తవ మూల భాషాజ్ఞాన అన్వేషణ ఇకనైనా మొదలు పెట్టాల్సి ఉంది. అధ్యయ నాలు అలంకారప్రాయాలుగా అనుకరణలుగా కాక, చారిత్రక వాస్తవ నిర్ధారణలు కావాలి. ఆదివాసి భాషాసంవత్సరం భాషల జనని సంవత్స రోత్సవంగా యూరివర్శిటీలు, భాషాపండితులు, అధ్యయనాలు, మేధో మధనాలు జరగాలి.
నిజానికి యునెస్కో ప్రయత్నం మొదటిదేమి కాదు. ముందడుగు అంతకన్నా కాదు. 2005లోనే నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌Êట్రైనింగ్‌ (ఎన్సీఆర్టీ) సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజేస్‌ (సి.ఐ.ఐ.ఎల్‌) సంస్థలు మైసూర్‌లో సెమినార్‌ నిర్వహించి ‘‘ఆదివాసీ సమాజంలో భాషా పరిరక్షణ-విద్యావకాశాలు మరియు విద్య వెనుకబాటుతనానికి కారణాలు’’ అనేఅంశంపై సమీ క్షించి భాషఅవరోధం ఒకపెద్ద సమస్య అనిగ్రహించింది. ఆ అవరో ధాన్ని అధిగమించడానికి మల్టీ లింగ్వల్‌ ఎడ్యుకేషన్‌ (వీూజు) ప్రోగ్రాం ద్వారా మాతృభాషలో ప్రాధమిక విద్యాబోధన అందించే విధంగా కార్యక్రమాలను రూపొందించింది. ఆదివాసీ విద్యార్ధిని, విద్యార్థులకు వారి మాతృభాషలోనే విద్యాబోధన అందించడం ద్వారా ఆదివాసీ సమాజంలో విద్యాభివృద్ధికి భాషా అవరోధంతో పాటు డ్రాపౌట్స్‌ శాతం తగ్గించడం ధ్యేయంగా పెట్టుకొంది. 2006 లో దేశవ్యాప్తంగా ప్రత్యేక మాతృభాషలు కలిగిన ఆదివాసీ సమూహాలు కలిగి ఉన్న రాష్ట్రాలను ఎన్నుకుని ప్రారంభించారు. అందులో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుండి గోండి (గోండిభారతి), కోయ (కోయ భారతి), కొలాం (కొలాం భారతి), సవర (సవర భారతి), కొండ దొర (కొండ భారతి), కోందు (కుంవి భారతి) వారి వారి మాతృభాషాల ద్వారా విద్యబోధన మొదలైయ్యింది. వాస్తవంగా సాధారణ విద్యార్ధికి మాతృభాషే విద్యాభాష, కాని ప్రత్యేక మాతృభాష కలిగిన ఆదిమజాతుల విద్యార్ధులకు మాత్రం స్థానిక విద్యా బోధన భాష పూర్తిగా తెలియని భూతమై కూర్చుంది. ఆభాష ఏంటో ఆ అక్షరాలేంటో అర్థమవ్వక బడికి రాకుండా పారిపోయే వారే ఎక్కువ. మిగిలిన కొద్ది మందికి మాతృభాషా పమస్య (మనకు తెలుగు)ఉంటుండగానే సెంకండ్‌ లాంగ్వేజ్‌ (హింది), థర్డ్‌ లాంగ్వేజ్‌ (ఇంగ్లీషు) అంటూ తెలియని భాషలు బలవంతంగా చొప్పించే ప్రయత్నం కారణం గానే అజ్ఞానులుగా, అనాగరికులుగా ముద్రపడే దౌర్భాగ్యం దాపురిం చింది. ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్యం వల్లే మల్టీలింగ్వల్‌ ఎడ్యుకేషన్‌ (ఎం.ఎల్‌.ఇ), ఆదిమజాతుల విద్యార్ధుల మాతృభాష వికాస కార్యక్రమ మైన ‘‘ఆనందలహరి’’ వంటి పథకాలు దీర్గకాలంగా కొనసాగించ కుండా మూడునాళ్ళ ముచ్చటగా మిగిలాయి. అదే కొనసాగి ఉంటే కొంతమేరకు భాషా పరిరక్షణకు దోహదపడి ఉండేది.
అభివృద్ధి ముసుగులో ఆదిమజాతుల మనుగడ ప్రమాదక రంగా మారిందన్నది. ఎంతవాస్తవమో విద్యా విధానాలవల్ల వారి భాషలు సంస్కృతులు అంతరించి పోవడానికి దారి తీసిందన్నది అంతే వాస్తవం. ఆదిమజాతుల సంస్కృతులు పాఠ్యాంశాలు కాకపోవడం, కనీసం వారి సమీప ఆవాస ప్రాంతాల్లో జరిగే సాంప్రదాయ పండగా లకైనా సెలవులు ప్రకటించి విద్యార్థిని విద్యార్థులకు సంస్కృతిలో భాగస్వా మం కల్పించక పోవడం కారణంగా తరువాతి తరాలు సంస్కృతికి దూరమైన కారణంగానే సాంస్కృతిక వారసత్వం పూర్తిగా అంతరించి పోవడానికి కారణమౌతుంది. మాఆదిమజాతుల విద్యార్ధులు మాది కాని భాషలో విద్యాబోధన కారణంగా,ే మాభాషలకు ప్రాధాన్యత గౌరవం సమాజంలో కానీ పాలన అవసరాలు కానీ, లేనందున విద్యా వంతులైన ఆదివాసీ కుటుంబాలు తరువాతి తరాలకు భాషను నేర్పించకపోవడం, వారి లాగే ఇతర కుటుంబాలు భాషకు దూరం కావటం జరుగుతుంది. ఇది ఏస్థితికి చేరుకుందంటే భృాణ హత్యాపాత కంలా తల్లి గర్భంలోనే మాతృభాషకు సమాధి కట్టే దౌర్భాగ్య పరిస్థితులు ఆదిమజాతుల భాషలకు దాపురించింది. నిజానికి భాష బ్రతకడానికి, కొనసాగడానికి కావలసింది సామాజిక ఆదరణ, ఆచరణ, అవసరం. ‘‘సంస్కృతిభాష ఆధరంగా విస్తృతం అవుతుంది. భాషసంస్కృతి ఆధారంగా సంపూరణమ వుతుం ది’’. ఆచరణ సంస్కృతినిస్తుంది. సాంస్కృతిక పరిరక్షణే భాషను పరిరక్షి స్తుంది. సంస్కృతి భాష ఒకదానికొకటి పెనవేసుకుని సాంస్కృతిక కొనసా గింపు భాషతో, భాషా కొనసాగింపు సంస్కృతితో వారసత్వంగా అందు తుంది. దానికి ప్రభుత్వ తోడ్పాటు అవసరం. కొన్ని వేల సంవత్సరాలు గా ఇప్పటికీ కొన్ని ఆదిమ జాతులు, భాషలు, మనుగడలో ఉన్నాయంటే సామాజిక, సాంస్కృతిక ఆమోదమే కారణం. కానీ పాలకుల తోడ్పాటు ఏ మాత్రం కాదు. ఆదివాసీ భాషలు అంతరించి పోవడానికి లిపి లేకపోవడమే! అనే పరిపక్వత లేని వాదన తెరమీదికి తెస్తున్నారు. అదే వాస్తవమైతే లిపి ఉన్న హరప్ప నాగరిక భాషేది? లిపి ఉండి దేవనాగరిక భాషేది? లిపి లేకుండా దేవనాగరి లిపితో మనుగడ సాగిస్తున్న సంస్కృతం, హింది,బోజ్‌పురి,మరాఠిభాషల పరిస్థితిఏమిటి? ఇంగ్లీష్‌ కే లిపి లేక పరాయి లిపితో వెలిగిపోతుంది. నిన్నటి వరకు అధికారిక భాషగా గౌరవం పొంది లిపి ఉండి అధికారిక ఆమోదం కోల్పోయాక మనుగడే ప్రశ్నార్థకమైన మహారాష్ట్ర ప్రాంత ‘‘మోది’’ భాష పరిస్థితి ఏమిటి ? లిపి ఉండి భావన(భాష) తెలియక అడివి కాచిన వెన్నెలైన హరప్పా జ్ఞానం అంతర్ధానం మరువరాదు. అందుకే ఆదిమ జాతుల భాషలకు లిపి అందించాలనే వృదా ప్రయత్నాల కన్నా ముందుగా ఆ భాషలను ఎక్కువ సమాజం చదవగలిగిన, వ్రాయ గలిగిన లిపిలో భవిష్యత్‌ తరాలకు, సమాజానికి అందే విధంగా గ్రంథస్థం చేసుకోవటం ఉత్తమం. అలాంటి అద్భుత ప్రయత్నమే మల్టి లింగ్విల్‌ ఎడ్యుకేషన్‌. ఎవరికీ తెలియని కొత్త లిపిలో మనకు మాత్రమే తెలిసిన భాషను లిఖించుకోవటం, గ్రంథస్థం చేయటం అంటే తుఫాను సమయంలో నడి సముద్రానికి చుక్కాని లేని పడవ ప్రయాణం లాంటిది. విశ్వ జ్ఞానమూలాల ఆధారాలను అన్వేషించడం అధ్యయనం చేయటం మాని అక్షరాల్ని వెతకడం ఆదిమ జాతుల భాషా పరిరక్షణకు ఇప్పుడంత అవసరం కాదు. పైగా ఇది ఆదిమ సమాజాన్ని మరింత అయోమయంలోకి నెట్టే కుట్రలో భాగమే. ఆదిమ జాతుల భాషా వారసులు విద్యావంతులు, పెద్దలు, ఆయా భాషల్లో సాహిత్యాన్ని, రచనలను విరివిగా విస్తరింప చేయటం తక్షణ అవసరం.
పాలకులు, మేధావులు, సమాజం, ఆదిమ జాతుల భాషా పరిరక్షణని ఆదివాసుల కోసమే అనే చిన్నచూపుతో లేదా సానుభూతితో కాక సామాజికభాద్యతతో పాటు జ్ఞాన దృష్టితో చూడకపోవడం పెద్ద అవరోదం. ఎందుకంటే భాష ఒక సామాజిక సమాచార మాధ్యమమో, సాంస్కృతిక జీవాధారమో, గుర్తింపో మాత్రమే కాదు. అంతకుమించి భాష అంటే జ్ఞానం. ఆది భాషాలంటే జ్ఞానభాండాగారాలు. ఎందుకంటే ఎంత గొప్ప నాగరికత అయినా మూలం మూలవాసీలతోనే మొదలవ్వాలి. ఈనాటి విజ్ఞానానికి నాంది మా ఆదిమజాతుల భారaా జ్ఞానబీజాలే. నేటి భాషలన్నిటికీ మాతృ భాష మా తొలి పలుకులే. ఎంతటి జ్ఞానం అయినా, ఆవిష్కరణ అయినా భాషలోనే నిక్షిప్తమై ఉంటుంది. భాషలోనే వ్యక్తమవు తుంది. భాషలోనే ప్రసారమవుతుంది. ఆ భాషా జ్ఞానం లేకనే ఈజిప్టు, హరప్పా నాగరికత జ్ఞాన వైభవం తెలియక శతాభ్దాలపాటు విశ్వ విద్యాల యాలతో పాటు జుట్లు పీక్కుంటున్నాం. అయినా ఈ పాలక మేథావులకు, యూనివర్సిటీలకు నిన్న మొన్నటి భాషలకు వ్రాత ప్రతులంటూ ప్రాచీన హోదాలు కవి సమ్మేళనాలు వంటి ఇగోలు, కాలక్షేపం తప్ప మూల జ్ఞానం, మూల వాసీల వద్ద మూల వాసీల భాషా రూపంలో నిక్షిప్తమై ఉందని ఆభాండాగారాన్ని మధించి శోధించి అభివృద్ది చేద్దాం. సమాజానికి మరింత వైజ్ఞానిక మూల జ్ఞానాలు పంచుదామనే ధ్యాస, దృష్టి, దృక్పథం ఏ కోశానా లేదు. భాష ముందా, అక్షరం ముందా అనే ప్రశ్న! చెట్టు ముందా, విత్తు ముందా అన్నంత సంక్లిష్టమేమీ కాదు. అక్షరాల కంటే ముందే అద్భుత విజ్ఞానాన్ని తమలో నిక్షిప్తం చేసుకున్నాయి మా ఆదివాసి భాషాసాగరాలు. అందుకు హరప్పా నాగరికతే సాక్ష్యం. హరప్పా ముద్రికల్లో భావాన్ని అర్ధంచేసుకోవటానికి వలసవిదేశీ భాషల్లో డీకోడిరగ్‌ ప్రయత్నాలు దశాబ్దాలుగా విశ్వవిద్యాలయాలు సైతం సాగిస్తున్నాయి. ఈ హాస్యాస్పద తంతు మన ఇంటి బిడ్డ డి.యన్‌.ఎ మ్యాచింగ్‌ కోసం పక్కింట్లో వెతుకు లాడినట్లు సాగుతూనే ఉంది. పైగా పశుపతి ముద్రికల్లోని కొమ్ముల కిరీటం ధరించే ఆదివాసి సమాజం సజీవంగా ఉన్నా, ఆ భాషలు సమృద్దిగ ఉన్నా కాదని ఆ నాగరికతవారసత్వం అంతరించింది అని నిర్దారించటం అంటే బ్రతికుండగానే డెత్‌ సర్టిఫికేట్స్‌ ఇచ్చేంత గుడ్డితనమా? లేక ఆ వారస త్వాన్ని అంతం చేసే కుట్రలో భాగమా అనేది అర్ధం అవుతూనే ఉంది. జాతులనే కాక సంస్కృతుల్ని భాషల్ని కూడా అంతం చేసి, హైజాక్‌ చేసే కుట్రలు వలస వాద పాలనలో సర్వ సాధారణం, చారిత్రక విదితం. కానీ అంతం అయ్యేది మా ఆదిమ జాతులు భాషా సంస్కృలు మాత్రమే కాదు. విశ్వమానవాళి జ్ఞానం. ఎప్పటికీ అందక అంతుచిక్కని రహస్యాలుగా మిగిలి పోవటం ఏ సమాజానికి శ్రేయస్కరం?. పొరుగు భాష అయిన ఉర్దు, చాయ్‌, తహశీల్‌ వంటి పదాలతో హిందీ భాషకు తద్వారా ఈ దేశానికి ఎంతో మేలు చేసిందని కొనియాడే మేధావులు భాషా పండితులు ఈ దేశం మూల భాషల సమృద్ధతను, గొప్పతనాన్ని కొనియాడడం అటుంచి నేటివరకు గుర్తించనే లేదు. గంగ : అంటే నది పేరు మాత్రమే కాదని నీటి ప్రవాహం అనే అర్ధం ఉందని ఎంతమందికి తెలుసు. చేపల్ని మీన్‌ లేదా మీనా, నాగుపాముని నాగ్‌ లేదా నాగిని అని అనేక భాషల్లో వ్యవహరిస్తున్నారు. నిజానికిది ఈదేశ మూలవాసీలైన కోయభాషా పదాలు. అలానే తెలుగులో పొట్ట, పటేల్‌, పట్వారీ, పొద్దు, నెల, వెన్నెల, తళారీ, ఏరువాకలో ఏరు అనే పదాలు తమిళంలో కై, కాల్‌, కండ్‌, కుడిచే, వర, నల్ల వంటి పదాలు కోయభాష లోనివే. తెలుగులో 20 శాతం, తమిళంలో 30 శాతం, కన్నడంలో 80 శాతం కోయభాషా పదాలతోను సంమృద్ధతను పొందాయి. సింప్‌ాసింహం, ఇంద్‌సముద్రం (హిందూమహా సముద్రము), ఇమ్‌మంచు (హిమాలయపర్వతాలు), ఒడిస్సేల్‌, ఒడిస్సి చెట్టు పదాల నుండి ఒడిస్సా అనే పదము ఉత్పత్తి అలానే చెన్నయ్‌ చెట్టు పదం నుండి చెన్నె (మద్రాసు) పట్టణం పేరు, శివంపూనకం (దేవర) నుండి శివుడు, శివతాండవం వంటి పదాలు ఉద్భవించాయి. తెలియదు అనే పదమే ‘కంగారు’ జంతువు పేరుగా స్ధిరపడిరదనేది విదితం. అలానే మడ, మర్ర, మార ` చెట్టు అనే పదం నుండి మడ అడవులు వంటి పదాల ఉత్పత్తులు ఆదిమభాషల నుండే ఉద్భవించాయి.
ఆదిమజాతుల భాషలన్ని చిన్నచూపు చూడడం సమాజపు తెలియనితనం. చిన్నతనమే కాని ఆ భాషల చిన్నతనం కాదు. ఉదాహరణకు ప్రపంచంలో గుర్తింపు పొందిన దాదాపు అన్ని భాషల్లో భర్త చనిపోయిన భార్యను వితంతువు అనే పదం మాత్రమే ఉంది. కానీ అండమాన్‌ దీవుల్లో ఒక ఆదిమతెగ భాషలో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన రక్తసంబంధీకు లందరిని ప్రత్యేకంగా సంబోధించే పదజాలం సమృద్ధిగా ఉంది. అంటే సాంకేతిక పదజాలంలో ఆదిమజాతుల భాషలు వెనుకబడి ఉండొచ్చు కాని సామాజిక పదజాలంలో మాత్రం భాషలన్నింటికి ఆదిమజాతుల భాషలు జన్మ నిచ్చాయని స్పష్టమవుతుంది. సంస్కృతి లాగే భాషలు కూడా ఇచ్చి పుచ్చుకుంటూ సంమృద్ధతను, సమగ్రతను సాధించుకుంటాయి. అది నాగరికతా వికాసానికి వారధి. నిజానికి సాంకేతిక పదాలు కూడా ఇతర దేశాల మూల భాషాపదాలే. తెలియని ప్రాంతాలకు మాత్రమే అవి కొత్త పదాలు. అందుకే మాఆదిమ జాతుల నాగరికత సంస్కృతితో పాటు భాషలు మన సమాజానికి ఎంతో అవసరమని గ్రహించి గౌరవించి కాపాడుకోవాల్సిన భాధ్యత కేవలం మా జాతులది మాత్రమే కాదు. విశ్వ మానవాళి భాధ్యతకూడా అని ‘‘ఆదివాసి భాషా సంవత్సరం’’గా యునెస్కో చాటి చెప్పింది. 2019 సంవత్సరంలో విశ్వవిధ్యాలయాలు ప్రత్యేక శ్రద్దతో మరింత నిశితమైన అధ్యాయనాలు సాగించాల్సి ఉంది. ప్రభుత్వాలు కూడా ఆనంద లహరి, మల్టి లింగ్విల్‌ ఎడ్యుకేషన్‌ వంటి పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ ఆదివాసి భాషా సాహిత్యం అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తూ తోడ్పాటు అందించాల్సిందిగా మా ఆదివాసీల ఆకాంక్ష. – మడివి నెహ్రు

కొండరెడ్లకు కొండంత కష్టాలు

కొండరెడ్లు గోదావరికి ఇరువైపుల ఉన్న పాపికొండల ప్రాంతంలో నివసిస్తారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలోఈ ప్రాంతం విస్తరించిఉంది. సాంకేతికంగా ఇంకా వ్యవసాయ పూర్వపు విధానాలు ఈమధ్యవరకు అవలం భించడంవల్ల ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం వీరిని చాలా వెనుకబడిన గిరిజన తెగలు (పివిటిజి) జాబితాలో చేర్చింది. అయితే సాంస్కృతికంగా ఎంతో ఉన్నత స్థాయిని అందుకున్నారు కొండరెడ్లు. – గునపర్తి సైమన్

కొండరెడ్ల ఉనికి ప్రశ్నార్థకమే…!
పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లో నివసిస్తున్న గిరిజనుల్లో కొండరెడ్లు ప్రధానమైనవారు. శతాబ్దాలుగా సజీవంగా ఉన్న గిరిజన తెగ ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థమైంది. విలక్షణమైన వీరి జీవనవిధానం, సంస్కృతి, సంప్రదాయాలు ఇక కాలగర్భంలో కలిసిపో తాయని చరిత్రకారులు, ఆంత్రోపాలజిస్టులు ఆందోళన చెందుతు న్నారు. ఇంతకాలం పచ్చటి అడవుల్లో, కొండల్లో ప్రశాంతంగా జీవించిన కొండరెడ్లు పోలవరం ప్రాజెక్టు కారణంగా చెల్లాచెదురై పోతారని, వారి బతుకులు అధ్వానమైపోతాయని అంటున్నారు. పోలవరం కారణంగా కూనవరం మండలంలోని ఏరువాడ గట్టుపై ఉన్న మూడు కొండరెడ్ల గ్రామాలు, కూనవరం నుంచి చింతూరు వరకూ ఉన్న కూనూరుగడ్డ గుట్టలపై ఉన్న 12 గ్రామాలు, రేఖపల్లి నుంచి తుమ్మలేరు వరకు ఉన్న కొండరెడ్ల గ్రామాలు కనుమరుగ వుతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉన్న 33 ఆదివాసీ తెగల్లో కొండరెడ్ల తెగ ఒకటి. ఈ తెగ రాతియుగానికి చెందిందని పరిశోధకులు చెబుతున్నారు. తూర్పుకనుమల్లో ముఖ్యంగా గోదావరికి ఇరు పక్కలా గుట్టలపై దట్టమైన అరణ్యాల్లో నివసించే అరుద్కెన గిరిజనులు కొండరెడ్లు. కొండరెడ్డి అంటే కొండలపై నివసించే మనిషి అని అర్థమట…! తాము సూర్యవంశానికి చెందినవారమని చెప్పుకునే కొండరెడ్లు స్వాభావికంగా అమాయకులు. నిగర్వంగా,నిరాడం బరంగా, ఆధునిక సమాజానికి దూరంగా గుట్టలపై జీవిస్తుం టారు. వీరి గ్రామాల్లో ఈనాటికీ మౌలిక సౌకర్యాలు లేవు. రహదా రులు, విద్యుత్తు, విద్య, వైద్య మొదల్కెనవి కరువే. మూఢ నమ్మకాలు, బహు భార్యత్వం, బాల్య వివాహాలు, మంత్రతంత్రాలు ఇలాంటివెన్నో వీరి జాతిలో ఈనాటికీ ఉన్నాయి. విచిత్రమేమిటంటే ఆధునికులుగా, నాగరికులుగా చెప్పుకునే గిరిజనేతరులు వీరి నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి. కొండరెడ్లను ప్రధాన జన జీవన స్రవంతిలో కలపాలని ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేస్తున్నా ఈనాటికీ అది పూర్తి ఫలితాలు ఇవ్వలేదు.
పోడు వ్యవసాయమే జీవనాధారం
గుట్టలపై నివసిస్తున్న కొండరెడ్లకు పోడువ్యవసాయమే ప్రధాన జీవనాధారం. కొండలపైవాగులకు దగ్గరగా ఉన్న భూము లను చదును చేసుకొని పోడు వ్యవసాయం చేస్తుంటారు. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు మొదల్కెన వర్షాధార పంటలు పండిస్తారు. వీరు నిరక్షరాస్యులు కావడం, నాగరిక సమాజానికి దూరంగా ఉండటంతో ఆధునిక వ్యవసాయ విధానాలు తెలియవు కాబట్టి ప్రకృతి కరుణిస్తేనే పంట చేతికొస్తుంది. అయితే ఆధునిక పోకడలు సంతరించుకున్న కొందరు కొండరెడ్లు సాధారణ రైతులతో పోటీ పడి పంటలు పండిస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఇలాంటివారు తమ పిల్లల్ని పాఠశాలలకు పంపి పట్టుదలగా చదవిస్తున్నారు కూడా. అయితే మొత్తం మీద చూస్తే ఇలాంటివారి శాతం చాలా తక్కువ. పోడు వ్యవసాయంతో పాటు వెదురుతో తట్టలు, బుట్టలు, చాపలు, తడికెలు మొదల్కెనవి తయారుచేసి వారపు సంతల్లో అమ్ముతారు. అడవుల్లో లభ్యమయ్యే తేనె, జిగురు, చింతపండు తదితరాలూ విక్రయిస్తారు. వర్షాకాలంలో పనులు దొరక్క ఆకలితో అల్లాడు తుంటారు. శనగగడ్డలు, జీలుగుచెక్క, మామిడి టెంకలు వీరికి ఆహారం. కొండరెడ్లలో 30శాతం మంది అడవుల్లో లేదా వాటికి దగ్గరగా నివసిస్తుంటారు. వీరు ఇళ్లలోనే అనేక పండ్లచెట్లు పెంచు తుంటారు. చింతచెట్లను ఉమ్మడి ఆస్తిగా పరిగణిస్తారు. అనేక గిరిజన జాతుల్లో మాదిరగానే కొండరెడ్లకు కూడా వేట ప్రధాన వ్యాపకం. మగవారు ఎప్పుడూ విల్లంబులతో తిరుగుతూ జంతువులను వేటాడుతుంటారు. వేటాడిన జంతువుల మాంసాన్ని సమష్టిగా పంచు కుంటారు. చేపల వేట కూడా ఉమ్మడిగానే సాగిస్తారు.
సంప్రదాయాలు…వేషధారణ
కొండరెడ్ల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు చిత్రంగా ఉంటాయి. వారు వీటిని కట్టుబాట్లు అంటే, ఆధునికులు మూఢ నమ్మకాలు అంటారు. ప్రధానంగా చెప్పుకోవల్సినవి బాలికలు రజస్వల లేదా పుష్పవతి (మెచ్యూర్‌) కాగానే ఇళ్లకు దూరంగా ‘కీడుపాక’ పేరుతో ఓ చిన్నఇల్లు తయారుచేసి వారంరోజులు అక్కడే ఉంచుతారు. గర్భవతులను కూడా ప్రసవ సమయంలో అక్కడే ఉంచి ప్రసవమ య్యాక వారం రోజుల తరువాత ఇంటికి తీసుకొస్తారు. ముత్యాలమ్మ, గంగానమ్మ, భూదేవి, గండమ్మ మొదల్కెన దేవతలను కొలుస్తారు. వీరిని కొండ దేవతలంటారు. భూత వైద్యాన్ని ఎక్కువగా నమ్ముతారు. అనారోగ్యం కలగ్గానే భూతవైద్యుడిని తీసుకొచ్చి వైద్యం చేయిస్తారు. అంటురోగాలొస్తే రకరకాల పూజలు చేస్తుంటారు. వీరిలో ఎక్కవ మంది కొండలు దిగి ఆస్పత్రులకు వెళ్లేందుకు ఇష్టపడరు. దానికితోడు డబ్బు లేకపోవడం, రహదారులు, బస్సులు కరువువడంతో స్థానకం గానే నాటు వైద్యం చేయిస్తుంటారు. ఇళ్ల దగ్గర ఉన్నప్పుడు పురుషులు ఎక్కువమంది చొక్కా లేకుండా గోచీలతో కనబడతారు. ఆడవారు చినిగిన, మాసిన బట్టలతో ఉంటారు. శుభకార్యాలకు వెళ్లేటప్పుడు మగవారు నిక్కర్లు, చొక్కాలు వేసుకుంటారు. ఆడవారు చీరలు కట్టుకుంటారు. మహిళలు చెవులకు వెండి దిద్దులు, ముక్కుపుడకలు పెడతారు. మెడలో రకరకాల కడియాలు వేసుకుంటారు. కాళ్లకూ కడియాలు, పట్టలు ధరిస్తారు. సంతల్లో దొరికే గిల్టు నగలు ఎక్కువగా కొంటారు. కొండరెడ్ల యువతులు, యువకులు ఫ్యాషన్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
వివాహాలు
కొండరెడ్లలో వివాహాలు మూడు రకాలుగా జరుగుతాయి. వీటిల్లో బలవంతంగా పెళ్లి చేసుకోవడం ఒక రకం. దీన్ని ‘మొగనాలు’ అంటారు. పురాణాల్లో కనిపించే రాక్షస వివాహం వంటిదే ఇది. అమ్మాయి, అబ్బాయి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయి పెళ్లి చేసుకో వడం మరోటి. పెద్దలు కుదిర్చినపెళ్లి ఇంకోటి. వీరి వివాహాల్లో కట్నం ప్రసక్తి ఉండదు. బహుభార్యత్వం, పునర్వివాహాలు వీరిలో సాధారణం. ముఖ్యంగా తమ్ముడు చనిపోతే అతని భార్యను అన్న వివాహం చేసుకునే ఆచారం ఉంది.
పండుగలు
కొండరెడ్లు మూడు రకాల పండుగలు జరుపుకుంటారు. వానలు కురవగానే జరుపుకునే పండుగను భూదేవి పండుగ అంటారు. వ్యవసాయ పనులు ప్రారంభించేముందు పందిని బలి ఇచ్చి పనులు ప్రారంభిస్తారు. పంటలు చేతికొచ్చే సమయంలో కోతల పండుగ చేస్తారు. మరొకటి మామిడికాయల పండుగ. కొండరెడ్లు నివసించే ప్రాంతాల్లో మామిడికాయలు ఎక్కువగా కాస్తాయి. అవి పక్వానికి వచ్చేవరకూ ఎవ్వరూ ముట్టుకోరు. పక్వానికి వచ్చాక గ్రామ పెద్ద అయిదారు కాయలు కోసి పూజ చేసి (దీన్ని గొందికి పెద్దడం అంటారు) పెద్దలకు పంచుతాడు. అప్పటి నుంచి మామిడి పండ్లు తినడం ప్రారంభిస్తారు. పండుగులు, జాతర్లు సమయంలో ఆట పాటలతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆసమయంలో ప్రత్యే కంగా వస్త్రధారణ చేస్తారు. జంతువుల కొమ్ములతో, నెమలి ఈకలతో అలంకరించుకుంటారు. పురుషులు కోయడోళ్లు వాయిస్తారు. ఆడవారు గిల్లలు మోగిస్తారు. వీరి గిరిజన నృత్యాలు చూడముచ్చటగా ఉంటా యి. వీరి డప్పు నృత్యం, కొమ్ము డ్యాన్స్‌ పాపులర్‌. పండుగల సమయాల్లో తెల్లవారేవరకూ ఆడ,మగ కలిసి కల్లు సేవిస్తారు. జీలుగు కల్లు వీరి ప్రత్యేకత.
అంతరిస్తున్న గిరిజన జాతుల్లో ఇదొకటా?
ప్రపంచంలో ఇప్పటికే అనేక ప్రాచీన గిరిజన జాతులు అంతరించిపోయాయి. ఇప్పడు పోలవరం ప్రాజెక్టు ముంపు కారణంగా కొండరెడ్ల జాతి కూడా అంతరించే అవకాశముందని సామాజిక శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. వారుకొన్ని శతాబ్దాలుగా జీవించిన ప్రాంతం మునిగిపోయిన తరువాత కొత్త ప్రాంతంలో కృత్రిమంగా జీవితం సాగించాల్సిందే తప్ప ఆసహజత్వం ఉండదు. ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలు ఎంత చక్కగా అమలు జరుగుతాయో అందరికీ తెలిసిన విషయమే. ఏదిఏమైనా కొండరెడ్ల ఉనికిని కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మీద ఉంది.
మర్యాదస్తులు కొండరెడ్లు
కొండరెడ్లు గోదావరికి ఇరువైపుల ఉన్న పాపికొండల ప్రాంతంలో నివసిస్తారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలోఈ ప్రాంతం విస్తరించిఉంది. సాంకేతికంగా ఇంకా వ్యవసాయ పూర్వపు విధానాలు ఈమధ్యవరకు అవలం భించడంవల్ల ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం వీరిని చాలా వెనుకబడిన గిరిజన తెగలు (పివిటిజి) జాబితాలో చేర్చింది. అయితే సాంస్కృతికంగా ఎంతో ఉన్నత స్థాయిని అందుకున్నారు కొండరెడ్లు. ఆవిశేషాల సమాహారమేనని ప్రముఖ గిరిజన ప్రరిశోధ కులు డా॥విఎన్‌వికె శాస్త్రి అభిప్రాయపడ్డారు. కొండరెడ్లపై ఆయన చేసిన పరిశోధన..జీవన శైలి విశేషాలు..!
కొండరెడ్ల జీవన విధానాలపై1945లో హేమండార్ఫ్‌ రాసిన ‘రెడ్డీస్‌ ఆఫ్‌ బైసన్‌ హిల్స్‌’ పుస్తకం ఇప్పటికీ ప్రామాణికమే. నేను 1968-72 ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని తూటిగుంట, గెడ్లపల్లి, ప్రాంతంలోని కొండరెడ్డి గ్రామాలలో నెలలతరబడి నివసించాను. ఇంకా చాలామంది కొండరెడ్ల మీద పరిశోధనా పత్రాలు, వ్యాసాలు రాశారు. వీటి సారాంశమే ఈ వ్యాసానికి ఆధారం. కొండరెడ్ల ప్రాంతం సందర్శించి వచ్చిన వారి మొట్టమొదటి అవగాహన వారి భాషమీద ఉంటుంది. వారి మాతృభాష తెలుగే అయినా ఆ స్వచ్ఛత నేను మైదాన ప్రాంతంలో కూడా ఎక్కడా చూడలేదు. 1972 ప్రాం తంలో నేను అక్కడ ఒకపరిశోధన నిమిత్తం వెళ్లాను. వారిఆర్థిక జీవనంపై పరిశోధన జరపాలి. పశ్చిమగోదావరి జిల్లా గెడ్డపల్లి గ్రామంలో మకాం పెట్టి ఆచుట్టుపక్కల గ్రామాలు తిరగాలి. అసలు గెడ్డపల్లి గ్రామంలో నలభై ఏండ్ల క్రితం నివాసం అంటే ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు అధికారులు. పోలవరం నుంచి తూటిగుంట వరకు లాంచిలో ప్రయాణం చేసి ఆరాత్రికి అక్కడే బస చేశాను. అప్పటికే గెడ్డపల్లి పాఠశాలలో పనిచేసే కొండరెడ్డి తెగకు చెందిన సహాయకుడు తూటిగుంటకు వేరే పనిమీద వచ్చి ఉన్నాడు. అతడి సాయంతో గెడ్డపల్లికి వెళ్లాలి. నా బెడ్డింగు, వంట సామాగ్రి, కిరోసిన్‌ స్టౌ అతడు తన కావిడిలో సర్ది ఉంచాడు. ఉదయం 9గంటల ప్రాంతంలో ఫల హారం ముగించి అడవిలో,కొండల్లో నడక ప్రారంభిస్తే సాయంత్రానికి గెడ్డపల్లి చేరు కున్నాం. అసలే చలిరోజులు. పాఠశాల ఉపాధ్యాయునికి కేటాయించిన ఒక చిన్న గుడిసెలో నా మకాం. పేరుకు గుడిసే కాని అది విశాలంగా, వెచ్చగా ఉంది. గ్రామస్తుల పరిచయం ఆరాత్రే జరిగింది. నేను నా పరిశోధన గురించి వివరించా. ఒక్కొక్క కుటుం బంతో వివరంగా మాట్లాడటానికి, రాసుకోవటానికి గంటకు పైగా సమయం పడు తుందని, అట్లాగే గ్రామంలో అన్నికుటుంబాల సర్వే చేయాలని చెప్పా. కొండరెడ్ల సామాజిక, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని వారి అభి వృద్ధికి ప్రణాళిక రచించడం నా వృత్తిలో భాగం అని కూడా వివరించా. దీంతో వారిలో వారికి చర్చ ప్రారంభమ యింది. ఉదయంపూట కొందరు, సాయంత్రం పూట కొందరు నాకుఅందుబాటులోఉండాలనే నిర్ణయానికి వచ్చారు. వారిలోని ప్రజాస్వామ్యం, సమిష్టి నిర్ణయ తత్వం నాకు ఎంతగానో నచ్చింది. వారిలో వారు చర్చించుకునేటప్పుడు ‘’రెడ్డిగారు మీరు ఉండువారా వెళ్లువారా?’’ అని అడగటం చూశాను. ఎంతటి మర్యాదయిన భాష. చర్చ అంగీకారం తెలుసుకోవటం ప్రజా స్వామ్యానికి పరాకాష్ట. అయితే ఇవే గ్రామాలు ఇప్పుడు వారి అంగీ కారం లేకుండానే, పోలవరం ప్రాజెక్టు కింద మునిగిపోతు న్నాయని తెలిసిన తరువాత ఎంతో క్షోభ అనుభవించాను. ఎంతటి ఉన్నతమైన సంస్కృతి మునిగి పోతుంది! వారితో చర్చించవలసిన అవసరమే లేదనే భావన పాలకుల్లో ఉందంటే ఏమనాలి? మాటల్లో నేను పోడుపొలాలను కూడా చూస్తానని ఓరెడ్డిగారికి చెప్పాను. ఆయన ‘’అయ్యా నేను ఓపలేను’’ (నాకు ఓపిక లేదు), రామిరెడ్డిగారి పోడుకు వెళ్లండి. మాఅందరిదీ ఒకేపద్ధతి అని వివరించారు. వారి భాషపై అభిమానం వారి మర్యాద పూర్వక సమాధా నాలు అబ్బురమ నిపించాయి. కొండరెడ్లు భాషలోనే కాదు రూపంలో కూడా ఆకట్టుకుం టారు. మరీఎత్తు, పొట్టి కాని ఎత్తుతో, బలమైన శరీరంతో విశాలమైన ముఖంతో, పసుపురంగుచర్మంతో, మిగిలిన ప్రజలకంటే వేరుగా ఉంటారు. వారంవారం జరిగే సంతల్లో వారిని వెంటనే గుర్తుపట్టవచ్చు. కొండరెడ్ల సమాజంలో చాలా ఇంటిపేర్లు ఉంటాయి. వల్లాలు,పోటేరు, కడపల, సాయంత, కత్తులలాంటి వాటిని పరిశోధకులు పేర్కొన్నారు. వీరిది పితృస్వామ్య సమాజం. అందువల్ల ఆస్తి తండ్రి నుండి కుమారునకు బదిలీ అవుతుంది. అట్లాగే అధికారం కూడా. పెండ్లి తరువాత భర్త ఇంటికే స్త్రీవెళుతుంది. పురుషుడు ఓలి కట్టడం సర్వ సామాన్యం. పోడు వ్యవసాయం, వేట, అటవీ సంపద సేకరణ లాంటి ఆర్థిక కార్యకలాపాల స్థాయిలో ఆర్థిక వ్యవస్థ ఉండటంవల్ల చిన్న కుటుంబాలే ఎక్కువగా ఉంటాయి. గ్రామాలు కూడా చిన్నవే. పని ముట్లు కూడా చాలా తక్కువ. పెద్దకత్తి, చిన్న కత్తి, విల్లంబులు అందరి దగ్గర ఎప్పుడూ ఉంటాయి. పోడువ్యవసా యంలో జొన్నలు పండిస్తారు. అయితే గోదారిఒడ్డున గ్రామాల్లో స్థిర వ్యవ సాయం, పొగాకు వంటి వాణిజ్యపంటలను పండిరచడం 1970 వ దశకంలోనే చూశాను. తూర్పుగోదావరిజిల్లాలో పండ్ల తోటల పెంప కం కూడా చేపట్టారు.
ఒకరికొకరుగా..
కొండరెడ్ల పంచాయితీవ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది.గ్రామ సరిహద్దు లోపలి వనరులు అందరికీ అందుబాటులో ఉంచడం వారి కర్తవ్యం. ‘’ఒక్కరి కోసం అందరు, అందరికోసం ఒక్కడు’’ అనే భావం ప్రతి పనిలోను కనిపిస్తుంది. ఇండ్లు కట్టుకునే సమయంలో బంధువు లందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అట్లాగే పెండ్లిళ్లు, చావు లాంటి సందర్భాల్లోనూ సమిష్టి తత్వం కనిపిస్తుంది. వేటాడి జంతు మాంసం అందరూ పంచుకుంటారు. పెద్దమనిషి, పిన్న పెద్ద మనిషి, పెద్దకాపు లాంటి పేర్లు వారి సామాజిక స్థాయిని చూపిస్తాయి. వీరందరూ కలిసి పంచాయితీ నిర్వహిస్తారు. పంచాయితీలో ప్రజా స్వామ్యం స్పష్టంగా కనిపిస్తుంది. పంచాయితీ నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యం. కొండరెడ్లు పోడు వ్యవసాయమే కాకుండా అటవీ శాఖ నిర్వహించే పనుల్లో కూలీలుగానూ పనిచేస్తున్నారు. ముఖ్యంగా వెదురు కూపుల్లో వారు చూపే నైపుణ్యంవల్ల వీరినే కూలీలుగా ఎంచుకుం టారు. వారి దేవతలందరూ చుట్టుపక్కల అడవిలోనే ఉండి కాపా డుతారని వారి నమ్మకం. అయితే అతి సున్నితమైన జీవన విధానం కలిగిన వీరి నివాస ప్రాంతం ముంపుకి గురైతే వీరు వేరే చోట ఎట్లా జీవించగలరనేది నాభయం. సామాజిక ప్రభావం అంచనా కట్టవలసిన అవసరమే లేదు అనేది పాలకుల అభిప్రాయం. కేంద్రప్రభుత్వం రెండు సార్లు ఆర్డినెన్సులు కూడా ఇచ్చింది. అయినా అది చట్టం కాలేదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ పాలకుల్లో వచ్చిన ఈభావన మరో రూపంలో ప్రత్యక్షమవుతుంటే ఇటువంటి అతి సున్నిత నాగరి కత కలిగిన తెగలు ఏమైపోతాయనేది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. వారి సాంస్కృతిక వైభవం ఎట్లా కాపా డాలనేది ముఖ్యమైన అనుబంధ ప్రశ్న.

ప్రభుత్వ మోసాలకు పరాకష్ట 2019 తాత్కలిక బడ్జెట్‌

‘‘ ఇది ఎన్నికల బడ్జెట్‌ అన్నది అందరికీ తెలిసిందే. ఏకంగా రైతాంగానికి 60వేల కోట్ల రూపాయల రొక్కం అక్కౌంట్లలోకి జమ చేయబోతున్నట్టు ప్రకటించారు ఆర్థిక మంత్రి. 2008లో పంట రుణాల మాఫీ పథకం అమలుకు ఖర్చు చేసిన మొత్తం సుమారు 80 వేల కోట్లు. ఫలితంగా తర్వాతి మూడు నాలుగేండ్లు వ్యవసాయ రంగంలో ఎంతో కొంత కదలిక రావటానికి నాటి యూపీఏ అమలు చేసిన రుణమాఫీ పథకం పని చేసింది. కానీ ఇప్పుడు మోడీ ప్రతిపాదిస్తున్న తెలంగాణ మోడల్‌ రైతు సహాయ పథకం వ్యవసాయ రంగానికి ఎంత మేలు చేస్తుంది అన్నది ప్రశ్నార్థకమే ’’ – ధీర

రెండువేల పందొమ్మిది వోట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ వివరాలు పరిశీలిస్తే 2014లో మొదలైన మోడీ ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలు పరాకాష్టకు చేరాయని స్పష్టమవుతోంది. బడ్జెట్‌ ప్రవేశపెట్టినంతసేపూ జాతీయ టెలివిజన్‌ ఛానెళ్లు అన్నీ ఆదాయ పన్ను రాయితీ, రైతు సహాయ పథకం, పెన్షన్‌ పథకం సరళీకర వంటి ఆకర్షణీయమైన హామీలను పదే పదే ప్రసారం చేశాయి. సమీప భవిష్యత్తులో మోడీ ప్రభుత్వం అందించినంత సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదని గొప్పలు చెప్పుకోవటం అప్పుడే మొదలైంది. తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్‌ గోయెల్‌ తన ఉపన్యాసంలో బీజేపీ ప్రభుత్వం పన్నుల విధానంలో అమలు చేసిన సంస్కరణల ఫలితంగా పన్ను చెల్లింపుదార్ల సంఖ్య విపరీతంగా పెరిగిందనీ, లక్షల కోట్ల ఆదాయం వచ్చిందనీ చెప్పుకొంది. కానీ వాస్తవాలు ఏమిటి? నిజంగా ప్రభుత్వం అంత గొప్ప సంక్షేమ బడ్జెట్‌ను ప్రతిపాదించిందా? వివిధ పథకాలకు కేటాయించిన నిధులు పెంచిందా? ప్రభుత్వ ఆదాయం పెరిగిందా అన్న మూడు ప్రశ్నలు వేసుకుంటే ఈ బడ్జెట్‌ ఉత్తిత్తిదే… అని ఘంటా పథంగా చెప్పవచ్చు.
ముందుగా రాబడి గురించి చూద్దాం. ప్రభుత్వం చెప్తున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుదల వల్ల దేశానికి ఒనగూడిరది ఏమీ లేదని రాబడి లెక్కలు పరిశీలిస్తే తేలుతుంది. జీఎస్టీ వల్ల పన్నుల ఆదాయం గొప్పగా పెరుగుతుందనీ ఆ విధంగా వచ్చిన ఆదాయంతో సంక్షేమ పథకాలకు ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టవచ్చన్నది బీజేపీ వాదన. కానీ పార్లమెంట్‌కు సమర్పించిన రాబడి లెక్కలు గమనిస్తే జీఎస్టీ వల్ల అదనంగా వచ్చిన ఆదాయం ఏమీ లేదని స్పష్టమవుతున్నది. జాతీయ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని చెప్పటానికి ఓ ప్రమాణం దిగుమతి సుంకాలు. ఆర్థిక వ్యవస్థ ఘనంగా ఉంటే ఆర్థిక వ్యవస్థ అవసరాలు తీర్చుకోవటానికి, వినిమయ అవసరాలు తీర్చుకోవటానికి దిగుమతులు పెరుగుతాయి. దిగుమతులు పెరగటం అంటే దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం పెరగాలి. కానీ దిగుమతి సుంకాల ద్వారా వచ్చిన ఆదాయం 201-18ఆర్థిక సంవత్సరంలో లక్ష 28వేల కోట్లు అయితే 2018-19ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం లక్షా 26వేల కోట్లు. మరో సూచన కేంద్ర ఎక్సైజు సుంకాలు. 2017-18లో ఈ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం రెండు లక్షల 58 వేల కోట్లు కాగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం రెండు లక్షల 59వేల కోట్లు మాత్రమే. వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా ఈ పద్దు కింద వచ్చే ఆదాయం పెరగదు అని అంచనా వేశారు. ఈ రెండు పద్దులు గమనిస్తే ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ గొప్పతనం గురించి చెప్తున్న విషయాలు అన్నీ కాకమ్మ కబుర్లే అని తేటతెల్లమవు తుంది. కేంద్ర ప్రభుత్వ ఆదాయం పెరగటానికి మరో మార్గం ప్రత్యక్ష పన్నులు. అంటే వేతన జీవుల మీద విధించే ఆదాయపు పన్ను. కంపెనీల మీద విధించే కార్పొరేట్‌ పన్ను. సంపన్నుల మీద విధించే సంపద పన్ను. ప్రభుత్వం వాగ్దానం ప్రకారమే ఇప్పటిరకు 2.5లక్షలుగా ఉన్న ఆదాయపన్ను పరిమితిని ఐదు లక్షలకు పెంచారు. అంటే ఇప్పటి వరకు ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తున్న వారిలో సగం మంది ఇక మీదట పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అయినా ఆదాయపు పన్ను పద్దు కింద కేంద్రానికి జమయ్యే ఆదాయంలో ఎటువంటి మార్పు లేదు…
ఆదాయపు పన్ను పరిధి పెంచిన తర్వాత ఆదాయపు పన్ను చెల్లింపుదార్ల సంఖ్య తగ్గిన తర్వాత కూడా అంతే మొత్తంలో ఆదాయపు పన్ను ఎలా వసూలు చేయాలో చార్టెడ్‌ అక్కౌంటెంట్‌, బీజేపీ రాజకీయ విరాళాలు వసూలుచేయటంలో దిట్ట అయిన పియూష్‌ గోయెల్‌కు మాత్రమే తెలిసిన విద్య. ఆర్థిక వ్యవస్థ ఆగమేఘాల మీద పురోగమిస్తున్నప్పుడు కార్పొరేట్‌ పన్ను పద్దు కింద వచ్చే ఆదాయం పెరగాలి. గత మూడేండ్లల్లో ఈ పద్దు కింద కేంద్రానికి వచ్చే ఆదాయంలో చెప్పుకోదగ్గ మార్పులు లేకపోవటాన్ని గమనిస్తే కార్పొరేట్‌ కంపెనీల మన్ననలు పొందేందుకు బీజేపీ ప్రభుత్వం ఎంతగా ఆరాట పడుతుందో అర్థమవుతుంది. ఏటాప్రపంచ కుబేరుల జాబితాలో పెరుగుతున్న భారతీయుల సంఖ్యచూసి సంస్కరణల గొప్పదనం గురించి జబ్బలు చరిచే ప్రభుత్వాలు సంపదపన్ను ద్వారా సేకరించే ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేయకపోవటం ప్రభుత్వం యొక్క పక్షపాత వైఖరిని తెలియచేస్తోంది. ప్రధాన ఆదాయ వనరుల నుండి వచ్చే ఆదాయంలో పెద్దగా మార్పు లేకపోయినా బడ్జెట్‌ మోతాదును మాత్రం పెంచేసింది బీజేపీ ప్రభుత్వం. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 21,41,975 కోట్లు. 2018-9సంవత్సరానికి ఆశిస్తున్న ఆదాయం 24, 57,235 కోట్లు. కానీ2019-0 సంవత్సరంలో 27,84,200 కోట్లు సంపాదిం చాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత రెండేండ్లల్లో కేంద్రానికి వచ్చే స్థూల రాబడిలో ఎటువంటి మార్పు లేదు అంటేనే ఆర్థికాభివ ృద్ధి గురించి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాటలకు దేశం ముందుంచుతున్న బడ్జెట్‌ గణాంకాలకు మధ్య పొంతన లేదని స్పష్టమవుతున్నది. అయినా ఈ సంవత్సరానికి అంటే 2019-20ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ రాబడి గతేడాది కంటే దాదాపు రెండున్నర లక్షల కోట్లు ఎక్కువ ఉంటుందని అంచనా వేసింది. అయితే ఈ మొత్తాన్ని అప్పుల రూపంలో సేకరిం చాలని ప్రతిపాదించింది. అప్పు చేయటం కూడామోడీ ప్రభుత్వం సాధించిన ఘనతగా చెప్పుకుని దేశాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచె త్తాలని ప్రయత్నం చేయటం ఆర్థిక వ్యవస్థ గురించిన వాస్తవాలను మరుగున పెట్టే ప్రయత్నం తప్ప మరోటి కాదు. ఇది ఎన్నికల బడ్జెట్‌ అన్నది అందరికీ తెలిసిందే. ఏకంగా రైతాంగానికి 60వేల కోట్ల రూపాయల రొక్కం అక్కౌంట్ల లోకి జమ చేయ బోతున్నట్టు ప్రకటించారు ఆర్థిక మంత్రి. 2008లో పంట రుణాల మాఫీ పథకం అమలుకు ఖర్చు చేసిన మొత్తం సుమారు 80 వేల కోట్లు. ఫలితంగా తర్వాతి మూడు నాలుగేండ్లు వ్యవసాయ రంగంలో ఎంతో కొంత కదలిక రావటానికి నాటి యూపీఏ అమలు చేసిన రుణమాఫీ పథకం పని చేసింది. కానీ ఇప్పుడు మోడీ ప్రతిపా దిస్తున్న తెలంగాణ మోడల్‌ రైతు సహాయ పథకం వ్యవసాయ రంగానికి ఎంత మేలు చేస్తుంది అన్నది ప్రశ్నార్థకమే. రక్షణ రంగానికి కేవలం 15వేల కోట్లు మాత్రమే (2.85 లక్షల కోట్లు నుంచి 3.05 లక్షల కోట్లు) పెంచి దేశ రక్షణకు ఎంతో సేవ చేస్తున్నట్టు చెప్పుకోవటం బీజేపీకి మాత్రమే చెల్లింది. ఈసంవత్సరం రక్షణ రంగానికి పెంచిన ప్రతిపాదిత కేటాయింపులు రాఫెల్‌ ఒప్పందంలో అనిల్‌ అంబానికి ఇచ్చే సబ్‌ కాంట్రాక్టు విలువ కంటే తక్కువ అన్న విషయాన్ని గమనించాలి. ఈ పేరు మీద జాతీయ భావాలు రెచ్చగొట్టే ప్రయత్నమే కనపడుతున్నది. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవటంలో ప్రధాన పాత్ర ఎరువుల సబ్సిడీది. కానీ ఈపద్దు కింద తాత్కాలిక బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీ కోసం అదనంగా కేటాయించినది కేవలం ఐదువేల కోట్లు మాత్రమే. గతసంవత్సరం 70వేల కోట్లు ఖర్చు పెడితే ఈ సంవత్సరం 74,986కోట్లు ఖర్చు పెట్టాలని ప్రతిపాదించింది. ప్రభుత్వమే వాగ్దానం చేస్తున్నట్టు రైతుకి సహాయం పథకం ద్వారా వ్యవసా యరంగంలో భారీ కదలిక వచ్చి పెద్దఎత్తున సాగుభూమి విస్తరించే మాట నిజమే అయితే తదనుగుణంగా ఎరువుల సబ్సిడీ ఉండాలి. కానీ అత్తెసరు సబ్సిడీ పెరుగుదల గమనిస్తే ప్రభుత్వ వాగ్దానం మీద ప్రభుత్వానికే నమ్మకం లేదన్న విషయం స్పష్టమవుతోంది. ఆహారసబ్సిడీ కోసం అదనంగా కేటాయించింది 13వేల కోట్లు. మొత్తం ఆహారపు సబ్సిడీ కింద గత సంవత్సరం లక్షా 71 వేల కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం లక్షా 84 కోట్లు కేటాయించింది.
పేద ప్రజల ప్రయోజనాలకు పెద్ద పీట వేశామని చెప్పు కుంటున్నా విశ్లేషణల్లో వాస్తవం ఏమీ లేదని గణాంకాలు వెల్లడిస్తు న్నాయి. గ్రామీణాబి óవృద్ధి, విద్య, వైద్య శాఖల పద్దుల్లో గుర్తించదగిన పెరుగుదల ఏమీ లేదు. ఉపాధిహమీ పథకానికి కేటాయింపులు గతమూడేండ్లల్లో ఎటువంటి పెరుగుదలకు నోచుకోలేదు. ప్రపంచ వ్యాప్తంగా గొప్పదని చెప్పుకున్న ఆయుష్మాన్‌ భవ పథకానికి (ఆరోగ్య సేవలు) కేటాయింపులు పెంచకపోవటాన్ని గమనిస్తే ఈ పథకం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదన్న సందేహం తలెత్తుతు న్నది. పేద మహిళల కన్నీళ్లు చూడలేక దీపం పథకం దేశవ్యాప్తం చేశామని చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చే గ్యాస్‌ సబ్సిడీ కేటాయింపులు గత సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం మరింత తక్కువగా కేటాయించటం గమనార్హం. మొత్తంమీద గమనిస్తే ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో మెరుగుదల సాధించటానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని గాలికొదిలి కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం అప్పులు చేసి మరీఖర్చు పెట్టడానికి సిద్ధమైందని స్పష్టమవుతూనే ఉంది. యూపీఏ 1 హయాంలో ఉపాధి హామీ చట్టం, రైతు రుణ మాఫీవాగ్దానాలు చేస్తే దిగాలుపడిన స్టాక్‌ మార్కెట్‌ అదే తరహా పథకాన్ని బీజేపీ ప్రకటిస్తే ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సంబరాలు చేసుకోవటం వ్యాపార వర్గానికీ బీజేపీకీ ఉన్న అనుబంధాన్ని నిర్ధారించే సందర్భంగా నిలిచిపోతుంది.

అంతా ఆదివాసీలదే

అక్కడ ఆదివాసీలే ప్రభువులు. ప్రభుత్వ నిర్ణయాల్ని బేఖాతర్‌ చేసే అధికారం కూడా వారికి ఉన్నది. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌ని, వార్డు సభ్యులను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కూడా వారికి సంక్రమించింది. షెడ్యూలు ప్రాంతాలకు పంచాయతీ రాజ్‌ విస్తరణ (పీసా) చట్టం ప్రకారం స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం వారికి ఉన్నా ఏజెన్సీ గ్రామాలు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా 500 జనాభా కలిగిన ఆదివాసీ గూడేలను గ్రామపంచాయతీలుగా ప్రకటించిన తర్వాత మొదటి సారి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో గ్రామ సభల అధికారాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.
రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌లో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో పీసా చట్టం అమల్లో ఉన్నది. రాష్ట్రంలోని పూర్వపు ఆదిలాబాద్‌, ఖమ్మం,వరంగల్‌,మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో గతంలో ఉన్న631 గ్రామ పంచాయితీలతో పాటూ ఇటీవల ఏర్పాటు చేసిన మరో 400 గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదివాసీ తెగల ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాల్లో భాగంగా ఉన్న స్వయం నిర్ణయాధి కారం, సమస్యలను తగవులను పరిష్కరించుకునే ఆచారాన్ని ద ృష్టిలో పెట్టుకుని 1996లో కేంద్ర ప్రభుత్వం ‘పీసా’చట్టం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం కీలక నిర్ణయాలన్నీ గ్రామసభల్లోనే జరగాలి. గ్రామ పెద్దల సమక్షంలో జరిగే గ్రామసభల నిర్వహణకు సంబం ధించిన మార్గదర్శక సూత్రాలను ఉమ్మడి రాష్ట్రంలో 2011లో జీఓ నంబర్‌ 66 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవే నిబంధనలు కొనసాగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలను ఆమోదించటం లేదా తిరస్కరిం చే అధికారం ఏజెన్సీ గ్రామ సభలకు ఉన్నది.
గ్రామసభల అధికారాలు…
ప్రజావసరాల కోసం కానీ ప్రయివేటు సంస్థల కోసం కానీ భూసేకరణ జరపాలంటే ఏజెన్సీ ప్రాంతంలో గ్రామసభల అనుమతి తీసుకోవాల్సి ఉన్నది. ‘పీసా’ చట్టం ప్రకారం ఇసుక, గ్రావెల్‌ తదితర చిన్న తరహా ఖనిజ సంసదకు ఆదివాసీలే యజమానులు. ఖనిజ సంపదను ప్రభుత్వ రంగ సంస్థలకి కానీ ప్రయివేటు వ్యక్తులకు కానీ అప్పగించాలంటే గ్రామసభల ఆమోదం అవసరం. ఏజెన్సీ ప్రాంతంలో గ్రామసభలు ఆమోదిస్తేనే మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇవ్వాల్సి ఉన్నది. ఈ లైసెన్సులు కూడా ఆదివాసీల పేరుతోనే జారీ చేయాల్సి ఉన్నది. చిన్న తరహా అటవీ ఉత్పత్తుల సేకరణ, సంతల నిర్వహణ, చిన్న తరహా నీటి వనరుల నిర్వహణ గ్రామసభల ఆమోదంతోనే జరగాలి. వ్యవసాయ ప్రణాళికలు కూడా గ్రామసభ ఆమోదం తర్వాతే అమలు చేయాలి. పంచాయితీ పరిధిలో ఉండే పాఠశాలలు, వైద్య శాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించే బాధ్యత కూడా గ్రామ సభలకే కట్టబెట్టారు. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో పీసా చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే నీరు కార్చాయనే విమర్శలు పెల్లుబుకుతున్నాయి. ఇసుక తవ్వకాలు గ్రామపంచాయితీలకే అప్పగించాల్సి ఉండగా చట్టవిర్ధుంగా రాష్ట్ర ఖనిజా భివృద్ధి సంస్థ దక్కించుకుని ప్రయివేటు కాంట్రా క్టర్లకు అప్పగించటంతో గ్రామసంచాయితీలకు ఆదాయం రాకుండా పోయింది. పర్యావరణ విధ్వంసం జరుగుతున్నా నష్ట నివారణ చర్యల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయటం లేదు. ప్రస్తుతం జరుగు తున్న గ్రామసంచాయితీ ఎన్నికల తర్వాత పంచాయితీరాజ్‌ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకు వస్తామని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఆదివాసీల స్వయం పాలన కోసం జరిగే గ్రామసభల విషయంలో కూడా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని ఆదివాసీలు కోరుతున్నారు.
సర్పంచ్‌ లేక పోయినా గ్రామసభ…
చట్ట ప్రకారం గ్రామసభను సమావేశపరచిన తర్వాత దీనికి అధ్యక్షత వహించే అధికారం సర్పంచ్‌కి ఉన్నప్పటికీ సర్పంచ్‌ రాక పోయినా గ్రామసభకు అధ్యక్షత వహించటానికి సర్పంచ్‌ అంగీకరించక పోయినా అదివాసీ తెగకు చెందిన పెద్దను గ్రామసభ అధ్యక్షుడిగా ఎన్నుకునే అధికారం ఆదివాసీలకు ఉన్నది. ఒకగ్రామపంచాయితీ పరిధిలో ఒకటి కన్నా ఎక్కువ ఆవాసాలు ఉంటే ప్రతి ఆవాసంలో ఒక గ్రామసభ నిర్వహించుకునే అధికారం ఉన్నది. అక్కడి నివసించే ఆదివాసీ తెగ లేదా గుంపు గ్రామసభ ద్వారా నిర్ణయాలను ప్రకటించే అధికారం సంక్రమించింది. గ్రామసభ తీర్మానాలకు పూర్తి స్థాయి చట్టబద్ధత ఉన్నది. గ్రామసభ వ్యవహారాల్లో తాము కూడా జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు కూడా పలుమార్లు స్పష్టం చేసింది.
వేదాంతను తిప్పికొట్టిన గ్రామసభలు : ఒడిషాలోని బాక్సైట్‌ గనులను వేదాంతకు అప్పగించటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలను గ్రామసభల తీర్మానాల ద్వారా అక్కడి ఆదివాసీలు తిప్పికొట్టారు. గ్రామసభల నిర్వహణలో అధికార యంత్రాంగం మితిమీరిన జోక్యాన్ని కూడా ఈ సందర్భంగా సుప్రీం కోర్టు తప్పుపట్టింది. అధికారులకు సంబంధం లేకుండా జిల్లా న్యాయమూర్తి పర్యవేక్షణలో నిర్వహించిన 13 గ్రామపంచాయితీలకు సంబంధించిన గ్రామసభలు బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి.
నూతన పంచాయతీలకు గ్రామాభివృద్ధే ధ్యేయం కావాలి : పదవి చిన్నదే కావచ్చు, ఐనా తను తలుచుకుంటే గ్రామాన్ని అన్ని విషయాల్లో అగ్రగామిగా ఉంచగలడు. ఆమేరకు ఆత్మవిశ్వాసం,దీక్ష, పట్టుదల పుష్కలంగా సర్పంచ్‌గా ఎన్నుకోబడే వ్యక్తికి ఉండాలి. కేవలం తమ ప్రాబల్యం చాటుకోవాలనే దుగ్ధ కాకుండా ఊరి బాగోగు లపై శ్రద్ధ కనబరచే దిశగా ఆలోచించి ఉన్నంతలో రిజర్వు స్థానా ల్లో సైతం విద్యావంతులు, ప్రగతి కాముకులు ఎన్ని కవడానికి రాజకీ య పార్టీలు చొరవచూపాలి. గ్రామానికి ఆగ్రామం సొంతంగా అభివృద్ధి చెందడానికి కావలసిన ప్రణాళికా రచన జరగాలి. గ్రామాబి óవృద్ధి ప్రణాళిక రూపొందించడంలో ‘గ్రామసభ’దే కీలకపాత్ర. గ్రామసభ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం తోపాటు వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌, సర్పంచ్‌లు అతి ముఖ్యమైన వాళ్లు. సాధారణంగా ఏ గ్రామానికైనా దాని సుస్థిరత కారకాల్లో మూడు అంగాలు ప్రధాన మైనవి. అవి1.విద్య 2.ఆరోగ్యం 3.మౌలిక సదుపాయాలు. అక్కడి ప్రభుత్వ పాఠశాలను పకడ్బందీగా నడుపుకోవడం ద్వారా బాలబాలిక లకు గుణాత్మక విద్య అందించాల్సిన బాధ్యత పంచాయతీలదే. ప్రజారోగ్యం పారిశుధ్యం పైనేఅధారపడి ఉంది. పారిశుధ్య వ్యవస్థను పటిష్టంగా అమలు పరచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లేదా ఆరోగ్య సిబ్బందిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కూడా పంచాయతీదే. మురుగుకాల్వల నిర్వహణ, సామాజిక మరుగు దొడ్ల నిర్మాణం, ఇంటింటి మరుగు దొడ్ల నిర్మాణం, దోభీ ఘాట్ల నిర్మాణం, గృహవ్యర్థాల సేకరణ వంటి చర్యల ద్వారా జాతీయ స్థాయిలో నిర్మల్‌, స్వచ్ఛ భారత్‌ పురస్కారాలను అందుకోవాలి. వీధి దీపాల ఏర్పాటు, గ్రంథాలయం నిర్వహణ, తాగు నీటి సరఫరా, రోడ్ల మరమ్మతు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం-నిర్వహణ, మెరుగైన సమాచార వ్యవస్థ, తపాలా కార్యాలయం, క్రీడా సాంసృతిక శాలలు, బ్యాంకు, మార్కెట్‌ తదితర ప్రజావసరాల్లో మండలం, జిల్లా, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని సమన్వయాన్ని ఎప్పటికిప్పుడు వేగిరపరచుకొని అభివృద్ధిలో నమూనాగా గ్రామాన్ని తీర్చిదిద్దాలి ఇందుకు సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లకు రాజకీయ అక్షరాస్యత కంటే అధికంగా స్థానిక సంస్థల విధులు-నిధులు, నిర్వహణ పట్ల అవగాహన సమగ్రంగా ఉండాలి. కొంతకాలంగా గ్రామాలు రాజకీయ కక్షలు కార్పణ్యాలకు నిలయా లుగా మారిపోయాయి. ఊళ్లు ప్రాత:కాలం నుంచే మద్యంమత్తుతో తూలుతున్నాయి. మద్యం దుకాణాల కారణంగా ప్రజా రోగ్యం పూర్తిగా క్షీణించింది. భర్తల అకాల మర ణంతో వితంతువుల సంఖ్య పెరిగి ఇళ్లలో విషాదం అలుముకుంటున్నది. మద్య రహిత గ్రామంగా తమ గ్రామాన్ని నడుపుకోవడంలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా పంచా యతీ పనితీరు, నిర్ణయాలు ఉండాలి. వలసలకు నిలయాలుగా కాకుం డా ఉత్పత్తి క్షేత్రాలుగా ఊర్లు విలసిల్లాలంటే స్థానికంగా కుటీర పరిశ్ర మలు, ఉపాధి పనులు, వృత్తి నైపుణ్యాల శిక్షణా సంస్థలు నెలకొనేటట్టు గ్రామపంచాయతీ ఒక మిషన్‌గా పనిచేయాలి. యువజన సంఘాలు, మహిళా పొదుపు గ్రూపులు, ఉద్యోగుల సేవాకేంద్రం, హితైషుల వితరణ కార్యక్రమాలను ప్రోత్సాహిస్తూ కలుపుకొని వెళ్తేనే సర్పంచ్‌ రాణిస్తారు. అధికారం చెలాయించడానికో దర్ప ప్రదర్శన కోసమో పదవి కాదని సర్పంచ్‌ గమనించాలి. గ్రామంలో కుల వ్యవస్థ పునా దులు బలిష్టంగా ఉంటాయి. శాంతి సామరస్య వైఖరులను అవలభిస్తూ సమైక్యతను మరింత అభివృద్ధి పరచాలి. పండుగలు తదితర సంద ర్భాల నిర్వహణలో గ్రామంలోని పెద్దల సలహాలు సూచనలు పాటిస్తూ ఈవెంట్‌ మేనేజ్మెంట్‌ స్ట్రాటజీతో ముందుకెళ్లాలి. నిధులు కేంద్రం నేరుగా ఇచ్చినా, రాష్ట్రం ఇచ్చినా, స్థానిక వనరుల ఆధారంగా సమ కూరినా వాటి ఖర్చు, వినియోగంలో పారదర్శకత నిజాయితీ అడుగడు గునా పాటించాలి. ఎంహెచ్‌ఆర్‌డీ వంటి సంస్థలు నిర్వహించే శిక్షణా కార్యక్రమాలకు ఉత్సాహంతో హాజరవ్వాలి. స్ఫూర్తి వంతంగా సర్పంచ్‌ పదవీ నిర్వహణకు అవసరమైన సజనాత్మకతను విభిన్న పద్ధతుల్లో అందిపుచ్చు కోవాలి. పంచాయతీరాజ్‌ చట్టానికి లోబడి సంవత్స రానికి మొక్కుబడిగా కాకుండా, విధిగా విశాల దక్పథంతో ప్రజలందరి సమక్షంలో గ్రామసభ జరిపి తీర్మానాలను తీసుకోవాలి. అంతే గుణవం తంగా తీర్మానాలను అమలు జరపాలి కూడా. అభివృద్ధితో పాటు, ప్రజలకు ప్రశ్నించే శక్తినిచ్చే పంచాయతీయే ఉన్నతమైంది. – కొండూరి రమేశ్‌బాబు

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలు సాధ్యమేనా..!

‘‘ రిజర్వేషన్లు అనేవి ప్రజలలో కొన్ని వర్గాల అభివృద్ధికి పభుత్వం వారు ఇచ్చే మినహాయింపులు, కేటాయింపులు. ఎన్నికలు, విద్య, ఉపాధికి గల అవకాశాలలో కుల,మత,ప్రాంతము,లింగం,శారీరక మానసిక బలహీనత, సైన్యవర్గానికి చెందిన అనే రకరకాల ప్రాతిపదికలపై రిజర్వేషన్లకి సంబంధించి, రాజ్యాంగంలో, చట్టసభలు చేసిన చట్టాలున్నాయి’’ – జి.ఎన్‌.వి.సతీష్‌

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు వర్తింప చేయా లని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వార్షికఆదాయం రూ.8 లక్షలలోపు ఉన్న అగ్ర వర్ణాలకు విద్య, ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్లను అమలు చేసే ప్రతి పాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15,16లను అనుసరించి సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అయితే, గత కొన్నేళ్లుగా అనేక కులాలు తమకూ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ, మరికొన్ని కులాలు తమ రిజర్వేషన్ల కోటా పెంచాలంటూ ఉద్యమాలు చేస్తున్నాయి. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌ చాలా ఏళ్లుగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాపు, గుజరాత్‌లో పటేళ్లు, మహారాష్ట్రలో మరాఠాలు, రాజస్థాన్‌లో జాట్‌లు ఇలా చాలా రాష్ట్రాల్లోని అగ్రవర్ణాలు రిజర్వేషన్ల కోసం డిమాండ్‌ చేస్తున్నాయి.
అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు: కేంద్ర కేబినెట్‌ ఆమోదం రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే ఉండాలని అంబేడ్కర్‌ నిజంగానే అన్నారా? రిజర్వేషన్లు 50 శాతం మించొద్దు. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు దేశంలో రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు.
ప్రస్తుతం షెడ్యూల్డ్‌ కులాలకు 15 శాతం, షెడ్యూల్డ్‌ తెగలకు 7.5శాతం, ఇతర వెనకబడిన వర్గాలకు 27శాతం మొత్తంగా 49.5శాతం రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగాలలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 1991లో పీవీ నర్సింహారావు ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని గతంలో సుప్రీంకోర్ట్‌ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పును అధిగమించి కేంద్రం ఏ విధంగా రిజర్వేషన్లను అమలు చేస్తుందనేది కీలకంగా మారింది.
అమలు ఎలా :
ఇప్పటికే వివిధ వర్గాలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లలలో కోత విధించి 50 శాతం మించకుండా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారా? లేక సుప్రీం తీర్పును అధిగమించి రిజర్వేషన్లను 60 శాతానికి తీసుకెళ్తారా? అనేది ఇంకా స్పష్టం కాలేదు. అయితే, అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే మొదట ఆర్టికల్‌ 15, 16లను సవరించాల్సి ఉంటుందని పొలిటికల్‌ సైన్స్‌ నిపుణులు ప్రొఫెసర్‌ ప్రభాకర్‌ రెడ్డి భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ చేసి ఆ చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో పెట్టాలని తెలిపారు. ‘’ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం 50 శాతానికి మించి రిజర్వేషన్లను అమలు చేస్తోంది. అక్కడ 69 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచరాదని ఇచ్చిన సుప్రీం తీర్పును అధిగమించేందుకు తమిళనాడు రిజర్వేషన్ల చట్టాన్ని 76వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్డ్‌లో చేర్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే మార్గాన్ని అనుసరించాలి’’ అని ఆయన వివరించారు.
రాజ్యాంగ సరవణ ఎలా ?
రిజర్వేషన్ల అమలు కోసం పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో హాజరై ఓటు వేసిన వారిలో 2/3వ వంతు సభ్యులు ఆమోదిస్తేనే కేంద్రం తీసుకొచ్చే బిల్లు చట్టంగా మారుతుంది. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వానికి లోక్‌సభలో సంఖ్యాబలం ఉండటంతో రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందింది.
9వ షెడ్యూల్‌ ఏమిటి?
1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్‌ తీసుకొచ్చారు. కోర్టుల పరిధిలోకి రాని కేంద్ర, రాష్ట్రాలు జారీ చేసే చట్టాలను ఈ షెడ్యూల్‌లో చేర్చడానికి అవకాశం కల్పించారు. అంటే ఏదైనా అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా దానిని న్యాయ సమీక్ష నుంచి మినహాయించే అవకాశం కల్పించారు. అందుకే తమిళనాడు రిజర్వేషన్ల చట్టాన్ని ఈ షెడ్యూల్‌ కిందకు తీసుకొచ్చి రక్షణ కల్పించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే తరహాలో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉంది. అయితే, సుప్రీం కోర్టు గతంలో అనేక సార్లు 9వ షెడ్యూల్‌ను కూడా న్యాయసమీక్ష పరిధిలోకి తేవాలని పేర్కొంది. మౌలిక సూత్రాలకు భంగకరమని భావిస్తే 9వ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలనూ సమీక్షిస్తామని పలు కేసుల విచారణంలో సుప్రీం పేర్కొంది. ఐఆర్‌ కోయెల్‌హో వర్సెస్‌ తమిళనాడు కేసులో 2007లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వైకే సభర్వాల్‌ నేత ృత్వంలోని ధర్మాసనం 9వ షెడ్యూలులో చేర్చిన చట్టాలు న్యాయసమీక్షకతీతం కాదని స్పష్టం చేసింది. ఆ చట్టాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగకరంగా ఉంటే సమీక్షించవచ్చని పేర్కొంది. కేశవానంద భారతి వెర్సెస్‌ స్టేట్‌ అఫ్‌ కేరళ కేసులో ‘’ 1950 నుంచి 1973 వరకు 9 వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలకు మాత్రమే న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు ఉందని, దీని తర్వాత చేర్చినా ఏ చట్టమైన న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది’’ అని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలపై …. ఎవరేమంటున్నారు?
‘సమానత్వ భావన సాకారం అవుతుంది’
రాజ్యాంగం పేర్కొన్న సమానత్వ భావన సాకారం కావాలంటే కాలానుగుణంగా రిజర్వేషన్లను మార్చాలని ఉస్మానియా యూనివర్సిటీ న్యాయవిభాగం అధిపతి వేంకటేశ్వర్లు చెప్పారు. ‘కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మంచి పరిణామంగానే చెప్పుకోవాలి. మొదట ఎస్సీ,ఎస్టీలకే రిజర్వేషన్లు అమలు చేశారు. ఆ తర్వాత 1990లలో బీసీలకు రిజర్వేష్లను వర్తింప చేశారు. కాలానుగుణంగా రిజర్వేష్లను కూడా మారాలి. అప్పుడే రాజ్యాంగం చెప్పిన సమానత్వం అనే భావన నిజం అవుతుంది’ అని ఆయన అన్నారు.
మాకు దక్కేదేమీ లేదు’
అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల కాపులకు దక్కేదేమీ లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆయన విలేకర్లతో మాట్లాడూతూ, ‘కాపులను బీసీల జాబితాలో చేర్చి 5శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మేం పోరాటం చేస్తున్నాం. కేంద్ర నిర్ణయం వల్ల మాకు ఏ ప్రయోజనం లేదు. అగ్రకుల రిజర్వేషన్ల జాబితాలో కాపులను చేర్చితే వచ్చే ఉపయోగమూ లేదు ‘ అని పేర్కొన్నారు. అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు.
‘’సామాజికంగా, ఆర్థికంగా అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని రాజ్యాంగం చెబుతుంటే కేంద్రం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలని చూడటం సరికాదు. సుప్రీం కోర్ట్‌ కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయొద్దని తీర్పునిచ్చింది. ఈ తీర్పును ఉల్లఘించి కేంద్రం రాజ్యాంగ సవరణ చేస్తే అది రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధం అవుతుంది. అణగారిన వర్గాల రిజర్వేషన్లను సవరించడం ద్వారా రిజర్వేషన్లను బలహీనం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.
ఇది చరిత్రాత్మక నిర్ణయం
అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం అని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్‌ రెడ్డి తెలిపారు.‘ఈ నిర్ణయం వంద శాతం అమలవుతుందని ఆశిస్తున్నాం. దీని వల్ల దేశంలో ఉన్న కోట్లాది మంది అగ్రవర్ణ పేదలకు లబ్ధి చేకూరుతుంది. సామాజిక వివక్షే కాదు, ఆర్థిక వెనకబాటును ప్రాతిపాదికను తీసుకొని రిజర్వేషన్లు ఇవ్వాలని మేం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లతో పాటతు జాతీయ కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేయాలి. అప్పుడే రిజర్వేషన్ల ఉద్యమాలు బలహీన పడతాయి’ అని ఆయన పేర్కొన్నారు.
రిజర్వేషన్లు ఎందుకు.. ఎలా?
దేశంలో రిజర్వేషన్లపై పెద్ద చర్చే జరుగుతోంది. తాజాగా కేంద్రం అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్‌) 10% రిజర్వేషన్‌ కల్పించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతశాతం రిజర్వేషన్లను అమలుచేస్తున్నాయి? అనేవి ఆసక్తికర పరిణామాలు.
రాజ్యాంగం ఏం చెప్పింది?
అంటరానితనం కారణంగా అనాదిగా నిరాదరణకు, వివక్షకు గురవుతున్న ఎస్సీ,ఎస్టీ, వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని భారత రాజ్యాంగం నిర్దేశించింది.
ఎవరికి రిజర్వేషన్లు ఇచ్చారు?
అణగారిన వర్గాలుగా భారత ప్రభుత్వం గుర్తించి, నిర్దేశించిన షెడ్యూల్డు కులాలు(ఎస్సీ), షెడ్యూల్డు తెగలు(ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ)ల వారికి రిజర్వేషన్లు కల్పించారు. కొన్ని రాష్ట్రాల్లో ముస్లింలకూ బీసీ(ఎం/ఈ) కింద రిజర్వేషన్లు ఇచ్చారు. భారత రాజ్యాంగం, చట్టాలు, స్థానిక నియమ నిబంధనలు ప్రాతిపదికగా ఇవి అమల్లోకి వచ్చాయి.
స్వాతంత్య్రానికి పూర్వం ఎలా ఉండేది?
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్‌ ఇండియాలో కూడా కొన్ని కులాలు, వర్గాలకు కోటా విధానం ఉండేది. కొల్హాపూర్‌ సంస్థానాధీశుడు సాహూ బ్రాహ్మణేతరులు, వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. 1902లో ఇది అమల్లోకి వచ్చింది. 1932లో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో రిజర్వేషన్లకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిటీష్‌ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్‌ ‘కమ్యూనల్‌ అవార్డ్‌’ను ప్రతిపాదించారు. దీని ప్రకారం ముస్లింలు, సిక్కులు, భారత క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, యురోపియన్లు, అణగారిన వర్గాల వారికి ప్రత్యేక కోటా ప్రాతినిధ్యం కల్పించారు. దీన్ని గాంధీజీ వ్యతిరేకించగా.. అంబేడ్కర్‌ సమర్థించారు.
స్వాతంత్య్రానంతరం ఏం జరిగింది?
ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లకు సంబంధించి దేశ స్వాతంత్య్రానంతరం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అణగారిన వర్గాల అభ్యున్నతికి భారత ప్రభుత్వం 1950లోనే కార్యాచరణ ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన.. విద్యాసంస్థల్లో 20 శాతం సీట్లను ప్రత్యేకించాలని విద్యా మంత్రిత్వశాఖ అప్పట్లోనే ప్రతిపాదించింది. ఆ తర్వాత ప్రభుత్వ రంగం, ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థలతో పాటు, ఉద్యోగాల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం ఖాళీలను జనాభా ప్రాతిపదికన రిజర్వ్‌చేశారు.
మండల్‌ కమిషన్‌ ఎందుకొచ్చింది?
దేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల స్థితిగతుల్ని అధ్యయనం చేసి, సిఫార్సులు చేయడం కోసం 1979 జనవరి 1వ తేదీన అప్పటి మొరార్జీ దేశాయ్‌ నాయకత్వంలోని జనతాపార్టీ ప్రభుత్వం బి.పి.మండల్‌ నేత ృత్వంలో కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఓబీసీల జన సంఖ్య ఎంత అన్న గణాంకాలు అప్పటికి కమిషన్‌ వద్ద లేవు. దాంతో అది 1931 నాటి జనాభా లెక్కల్ని వినియోగించుకుని వారి జనాభా 52 శాతంగా నిర్ధారణకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలోని సేవలు, సంస్థల ఉద్యోగాల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని కమిషన్‌ సిఫార్సుచేసింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఇదే రిజర్వేషన్ల అమలుకూ మార్పులు చేయాలని సూచించింది. దీనివల్ల కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్లు 49.5%కి చేరుకున్నాయి. మండల్‌ సిఫార్సుల్ని అమలుచేస్తామని 1990లో వి.పి.సింగ్‌ ప్రభుత్వం ప్రకటించడంతో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున విద్యార్థి ఉద్యమాలు చెలరేగాయి. అప్పటికి సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చినా.. ఆ తర్వాత రిజర్వేషన్ల అమలు మొదలైంది.
రిజర్వేషన్ల ఉద్దేశం?
అనాదిగా కుల వివక్ష, అసమానతలు, అవమానాల్ని ఎదుర్కొంటున్న వర్గాల వారికి తగిన న్యాయం చేయడం కోసం, సమానత్వ సాధన కోసం రిజర్వేషన్ల వ్యవస్థ మొగ్గతొడిగింది. అణగారిన వర్గాల విద్య, సామాజిక స్థితిగతుల్ని పెంపొందించి.. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ చర్య చేపట్టారు.
ఎక్కడెక్కడ?
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలకు, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు, వివిధ చట్టసభల్లో సీట్లకు రిజర్వేషన్లు కల్పించారు.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు 1992లో తేల్చిచెప్పింది. అలా దాటితే.. రాజ్యాంగం ప్రస్తావించిన సమానత్వ హక్కు ఉల్లంఘన జరిగినట్లేనని వ్యాఖ్యానించింది.
మారుతున్న ఆలోచనలు
ా వివక్ష నుంచి ఆర్థికానికి: రిజర్వేషన్లను రాజ్యాంగ నిర్మాతలు దేశంలో కొన్ని సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక ‘వివక్ష’, ‘నిరాదరణ’లకు విరుగుడుగా ముందుకు తెచ్చారనీ, కానీ కొంతకాలంగా ఈ రిజర్వేషన్లకు వివక్షను (డిస్క్రిమినేషన్‌) ప్రాతిపదికగా కాకుండా వెనకబాటుతనానికి (డిప్రైవేషన్‌) విరుగుడుగా చూడటం ఆరంభమవుతోందన్న వాదన వినపడుతోంది. పేదరికమన్నది రకరకాల వివక్షలకు దారితీసే మాట వాస్తవమే అయినా.. ఆ పేదరిక నిర్మూలనకు కేవలం వ్యవస్థాత్మకమైన రిజర్వేషన్లనే పరిష్కారంగా చూడలేమనీ, లేదా ఇప్పటికే ఉన్న పేదరిక నిర్మూలన విధానాలకూ ఇది ప్రత్యామ్నాయం కాదని పలువురు వాదిస్తున్నారు. వివక్షనూ, ఆర్థిక వెనకబాటునూ ఒక గాటన కట్టకూడదన్నది వీరి సిఫార్సు.
ా మినహాయింపు నుంచి విస్తరణకు: రిజర్వేషన్లన్నవి వాస్తవానికి ప్రాథమిక హక్కు అయిన ‘సమానత్వ హక్కు’కు ఒక ప్రత్యేకమైన మినహాయింపుగా ఆరంభమయ్యాయి. ఎస్సీ, ఎస్టీలు చిరకాలంగా ఎదుర్కొంటున్న సామాజిక వివక్షలను సరిదిద్దేందుకు, సమానత్వ సాధన కోసం రిజర్వేషన్ల విధానాన్ని ‘సమానత్వ హక్కు’కు ఒక మినహాయింపుగా ప్రతిపాదించారనీ, కానీ క్రమేపీ ఇది విస్తరణకు దారితీస్తోందని అంటున్నారు. దీన్ని ప్రత్యేక మినహాయింపుగా కాకుండా వెనకబాటుతనానికి విరుగుడుగా చూడటం వల్లే వివిధ సామాజిక వర్గాలు రిజర్వేషన్ల కోసం ఆరాటపడుతున్నాయి.
ఏ రాష్ట్రంలో ఎంత శాతం?
రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పినటికీ..కొన్ని రాష్ట్రాలు స్థానిక జనాభాను దృష్టిలో ఉంచుకుని అంతకుమించి రిజర్వేషన్లు ఇస్తున్నాయి. కొన్నింటిపై కోర్టులు స్టే ఇచ్చాయి.్చ హరియాణా70శాతం : ఎస్సీ20శాతం, బీసీ ఏ16శాతం,బీసీ బీ11శాతం,ప్రత్యేక వెనుకబడిన తరగతులు 10శాతం, ఆర్ధికంగా వెనుకబడిన తరగతులు 10శాతం, వికలాంగులు3శాతం ్చ తమిళనాడు69శాతం : ఎస్సీ18శాతం, ఎస్టీలు27శాతం, ఏబీసీలు22శాతం ్చ రాజస్థాన్‌54శాతం : ఎస్సీలు16శాతం, ఎస్టీలు12శాతం, ఏబీసీలు26శాతం
్చ ఆంధ్రప్రదేశ్‌50శాతం :బీసీలు 29శాతం, ఎస్సీలుI15శాతం, ఎస్టీలు 6శాతం, (బీసీల కోటాలోనే ముస్లిం రిజర్వేషన్లు అమలు) ్చ తెలంగాణ50శాతం : బీసీలు 28శాతం, ఎస్సీలు15శాతం, ఎస్టీలు 6శాతం, (బీసీల కోటాలోనే ముస్లిం రిజర్వేషన్ల అమలు)
్చ ఈశాన్య రాష్ట్రాలు(అరుణచల్‌ ప్రదేశ్‌,మేఘాలయ, నాగాలాండ్‌,మిజోరం)(ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్టీ రిజర్వేషన్లు`80శాతం, ఇతరులకు 20శాతం
రిజర్వేషన్లు కల్పించవచ్చు :
ప్రజాభ్యున్నతి దృష్ట్యా కోటా ఇవ్వొచ్చు.. సమానత్వం ప్రాతిపదిక కావాలి.. విస్పష్టంగా చెప్పిన రాజ్యాంగం. రాజ్యాంగ స్ఫూర్తి సమానత్వమేనని, ఏ వర్గానికైనా అవకాశాల్లో ప్రాతినిధ్యం తగ్గిందని పార్లమెంటు నిరభ్యంతరంగా రిజర్వేషన్లు కల్పించవచ్చని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. అధికరణాలు 15, 16 ఈ విషయాన్ని విపులీకరించాయి.
ఆర్టికల్‌ 15 : (1) మతం, జాతి, కులం, ప్రాంతం, స్త్రీ-పురుష ప్రాతిపదికన ప్రజలపై వివక్ష చూపరాదు (2) మతం, జాతి, కులం, లింగ, ప్రాంత ప్రాతిపదికన ప్రజలను హోటళ్లు, సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌లోకి ప్రవేశాన్ని అడ్డుకోరాదు. వారిని భారంగా చూడరాదు. ఆంక్షలు పెట్టరాదు. ఊరిలో అందరూ ఉపయోగించే బావులు, చెరువులు, స్నాన ఘట్టాలు, ప్రజా వినోద, విలాస ప్రాంతాల్లోకి అనుమతిని నిషేధించరాదు. (3)ఈ ఆర్డికల్‌లోని అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ప్రభుత్వం మహిళలు, పిల్లలకు పత్య్రేక సదుపాయాలు కల్పించవచ్చు. (4) సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల లేదా ఎస్సీలు, ఎస్టీల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకొనే ఏ చర్యనైనా ఈ అధికరణ అడ్డుకోరాదు. అంటే ఆయా వర్గాల అభివ ృద్ధి నిమిత్తం ఏచర్యనైనా ప్రభుత్వం చేపట్టవచ్చు. ఆర్టికల్‌ 29 (2)కు కూడా ఇదే వర్తిస్తుంది.
ఆర్టికల్‌ 16 : దీని ప్రకారం ఉద్యోగావకాశాల్లో సమానత్వం పాటించాలి. (1) ప్రభుత్వం చేసే ఏ నియామకంలోనైనా లేక ఉపాధి కల్పనలోనైనా సమాన అవకా శాలు కల్పించాలి.(2) మతం, జాతి, కులం, వర్గం, లైంగిక, ప్రాంతీయ, నివాస ప్రాతిపదికన ఏ వ్యక్తికీ ఉపాధి కల్పనలో వివక్ష చూపరాదు.(3) ఏవర్గానికైనా ఉద్యోగావకాశాల కల్పించాలని పార్లమెంటు భావిస్తే ఈ అధికరణ అడ్డుకాబోదు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు లేక స్థానిక సంస్థలు…ఎక్కడైనా ఏ వర్గానికైనా ఉపాధి కల్పనకు ఇది అడ్డంకి కాదు. (4) ప్రభుత్వ విభాగాల్లో వెనుకబడ్డ వర్గాలకు నియామకాల్లో సరైన ప్రాతినిథ్యం లేదని ప్రభుత్వం భావించినపుడు నియామకాల్లో వారికి రిజర్వేషన్లు కల్పించవచ్చు. దానికి ఈ అధికరణ అడ్డుకాదు.
వెనుకబాటుతనం సామాజికమా? ఆర్థికమా? :
రిజర్వేషన్లు సామాజికంగా వెనకబడ్డ వర్గాలకు కల్పించాలా లేక ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకా? అన్న చర్చ దాదాపు 70 ఏళ్లుగా సాగుతూనే ఉంది. 1948లో రాజ్యాంగసభలో దీనిపై ఆసక్తికర చర్చే జరిగింది. అసలు వెనకబడ్డ (బ్యాక్‌వర్డ్‌) అనే పదాన్ని ఎలా నిర్వచించాలి? అన్న అంశంపైనే గంటన్నరకు పైగా చర్చ జరిగింది. రాజ్యాంగంలో ఎక్కడా వెనకబడ్డ అన్న పదాన్నే నిర్వచించలేదని హెచ్‌.ఎన్‌.కుంజ్రూ అసంత ృప్తి వ్యక్తం చేశారు. దీనిపై టీటీ కృష్ణమాచారి లేచి ‘ఈ పదం అస్పష్టం, సందిగ్ధం. దీనికి రక రకాల వ్యాఖ్యానాలు చెప్పుకోవచ్చు. పుట్టుకతో వెనకబాటుతనమా, సామాజికంగానా, ఆర్థికంగానా, నిరక్షరాస్యత వల్లా… ఇలా దేనికని వెనకబాటుతనం?’’ అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ రచనలో పాలుపంచుకొన్న కేఎం మున్షీ స్పందిస్తూ ‘‘ఇది అసలు కులానికి చెందినది కాదు.. వర్గానికి చెందినది. కాబట్టి షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు అనకుండా వెనకబడ్డ వర్గాలు అని సంబోధించాలి. అప్పుడు అధికరణం 16(4)లో పేర్కొన్న దానికి సరైన అర్థం, సార్థకత వస్తాయి’’ అన్నారు. దీనికి అంబేడ్కర్‌ సమాధానమిస్తూ ‘ఉదాహరణకు నిర్దిష్ట పోస్టుల్లో ఓ వర్గానికి లేదా అన్ని వెనకబడ్డ వర్గాలకీ కలుపుకొని 70 శాతం రిజర్వేషన్లు ఇస్తే..జనరల్‌ కేటగిరీలో మిగిలేది 30 శాతమే. ఇది సమానత్వం కిందకు వస్తుందా? అందువల్ల మనం సమానత్వపు హక్కు కల్పించాలి. ఇన్నాళ్లూ ప్రాతినిధ్యం దొరకని కొన్ని కులాలకు అవకాశాలూ కల్పించాలి. ఏప్రాతిపదికన..? అవి సామాజికంగా, సాంస్క ృతికంగా వెనుకబడి ఉన్నవి. బ్యాక్‌వర్డ్‌ పదాన్ని వాడితే అది అధికరణం మొత్తాన్ని తినేస్తుంది. రిజర్వేషన్లు పరిమితిని మించి ఇస్తే అది మంచిదా కాదా.. అన్నది న్యాయవ్యవస్థే తీర్పిస్తుంది’’ అన్నారు.

1 2