ఆదివాసులకు దక్కని రాజ్యాంగ ఫలాలు

రాజ్యాంగ దినోత్సవాన్ని ‘‘నేషనల్‌ లా డే’’ లేదా ‘‘సంవిధాన్‌ దివస్‌’’ అని కూడా పిలుస్తారు. ఇది భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుని ప్రతి సంవత్సరం నవంబర్‌ 26 న జరుపుకుంటారు. 26 నవంబర్‌ 1949 న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. అందువల్ల రాజ్యాంగం యొక్క సిద్ధాంతాలను, డాక్టం బి.ఆర్‌.అంబేద్కర్‌ ఆలోచనలను వ్యాప్తి చేయడానికి ఈ రోజును ఎంచుకున్నారు.– బి.రామారావు దొర

ఈ దేశ ఆదివాసులకు భారత రాజ్యాంగం షెడ్యూల్‌ 5,6 ద్వారా ప్రత్యేకమైన రక్షణ వలవలయాలు (బపర్‌ జోన్స్‌) రూపొందించింది. భూమి హక్కులు,వనరులు పరిరక్షించడంతో పాటు భాష,సాంస్కృతి, సాంప్రదాయక విలువలను కూడా ఈరక్షణ వలయంలోకి తీసుకువచ్చింది.ఈషెడ్యూల్‌ల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూ పరిరక్షణకు 1/70భూ వదలాయింపు నియంత్రణ చట్టం చేసింది.1917 ుష్ట్రవ Aస్త్రవఅషవ ుతీaష్‌ం Iఅ్‌వతీవర్‌ aఅస ూaఅస ుతీaఅంటవతీం Aష్‌, 1917 (Aష్‌ చీశీ.1శీట 1917)’’ఈ చట్టానికి మూలం కాగా,ఈ చట్టం రూపకల్పనకు కారం తమ్మన్న దొర చేసిన పోరాటం స్పూర్తిగా నిలిచింది. ఆ తరువాత 1935, 1959 సవరణల తరువాత 1970లో ఏజేన్సీ ప్రాంతంలో ఆదివాసులు-ఆదివాసేతరు లకు మద్య అన్నిరకాల భూబదలాయింపులు పూర్తిగా నిషేదించబడిరది. షెడ్యుల్డ్‌ ప్రాంతంలో స్వయం ప్రతిపత్తిని బలపరుస్తూ,స్థానిక సంస్థల పరిపాలనను చూసుకోవడానికి పెసా చట్టం, 1996 ను తీసుకు వచ్చారు. వందల ఏళ్లుగా అదారపడ్డ అటవీ భూములకు యాజమాన్యపు హక్కులు సుస్థిరం చేయడానికి 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం రూపకల్పన చేసారు.షెడ్యూల్డ్‌ కులాలు,షెడ్యూల్డ్‌ తెగల పట్ల అత్యాచారాలు,ద్వేషపూరిత నేరాలను నిరోధించడానికి భారతపార్లమెంటుఎస్సీ,ఎస్టీ అట్రాసిటి (అత్యాచారాల నిరోధక) చట్టం,1989 తీసుకు వచ్చింది. ఆదివాసులను వడ్డీ వ్యాపారుల దోపిడీ నుండి కాపాడటానికి షెడ్యూల్డ్‌ ప్రాంత ఋణ (వడ్డీ) వ్యాపార నిబంధనలు 1960,రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు మరియు వెనకబడిన తరగతుల కుల దృవీకరణ పత్రాల జారిచట్టం`1993వంటి రక్షణ వ్యవస్థలు రూపొందించబడి ఉన్నాయి. అంతేకాకుండా,జాతీయ విధానాలు (చీa్‌ఱశీఅaశ్రీ ూశీశ్రీఱంఱం), మార్గదర్శకాలు (Gబఱసశ్రీఱఅం) చాలానే ఉన్నాయి.
క్షేత్రస్థాయి ఆచరణలో ఆదివాసుల హక్కులపట్ల పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వలన వారి హక్కులకు భంగంకలుగుతూనే ఉన్నాయి.రోజురోజుకు వారిహక్కులు ఉల్లంఘించబడుతూ ఉంది. బలమైన రాజ్యాంగవ్యవస్థలు ఉన్నప్పటికీ,ప్రస్తుతం ఆదివాసుల స్థితి ఏమిటి అంటే?ఉన్న చట్టాలు అమలు కోసం లేదా పరిరక్షించుకోవడం కోసం నిరంతరం పోరాటాలు చేస్తూనే, జరుగుచున్న ఉల్లంఘనలను అడ్డుకో వడానికి కొత్త చట్టాలు రూపకల్పనకు మరో పోరాటం చేస్తు ఉండాలి.దొంగ ఎస్టి సర్టిఫికెట్లుతో ఎస్టీల లోకి చొరబడిన వారు దొంగ ఎస్టీ విద్యార్థులు,దొంగ ఎస్టీ ఉద్యోగులు,దొంగ ఎస్టీ రాజకీయ నాయకులు, దొంగ ఎస్టీ ఓటర్లు, దొంగ ఎస్టీ లబ్దిదార్లు ఆదివాసులకు న్యాయంగా దక్కవలసిన రాజ్యంగా ప్రయోజనాలు, భూములు దొంగిలిస్తున్నారు.వీరికి పాలకపక్షాలన్ని మద్దతుగా నిలుస్తున్నారు.భారతదేశం అత్యంత వైవిధ్యమైన ఆదిమా సముహాల జనాభాకు సాక్షిగా నిలుస్తుంది.ప్రతి తెగకు దాని సొంత పాత్ర,గుర్తిం పు,స్వభావం కలిగి ఉంటుంది.ఉదాహరణకు,మధ్య భారతదేశం లేదా పశ్చిమ భారతదేశంలోని ఆదివాసుల జీవితం, పరిస్థితులకు – ఈశాన్య భారతదేశం మరియు అండమాన్‌లోని తెగల స్థితులు భిన్నంగా ఉంటాయి. దేశంలోని ఆదిమ సమూహాలు 18 రాష్ట్రాలలో విస్తరించి దేశ జనాభాలో 8.6% (104.2 మిలియన్లు) ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లోని ఈ సమూహాలు మెజారిటీగా ఉండగా (ఉదా:ఈశాన్య రాష్ట్రాలు), ఇతర రాష్ట్రాలలోని షెడ్యూల్డ్‌ ప్రంతాలలో చిన్నచిన్న భూ భాగా లుగా ఉన్నాయి.వీరిచట్టాలు కేంద్ర,రాష్ట్రా ప్రభు త్వాలచే అమలు చేయబడతాయి.భారత రాజ్యాంగం ఆదివాసుల ప్రయోజనాలను,ప్రత్యేకించి వారి భూమిపై వారి స్వయం ప్రతిపత్తి హక్కులను పరిరక్షించడానికి ప్రయత్నిస్తుంది. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 5,6 ప్రత్యేక రక్షణను కల్పిస్తుంది.ఇది ఆదివాసీ సమూహాలను దోపిడీ నుండి రక్షించడానికి,వారి భూమిపై వారి హక్కులను కాపాడు కోవడానికి దోహద పడుతుంది.
ఐదో షెడ్యూల్డ్‌ నియమాల ప్రకారం సాధారణ పరిపాలనకు ఉద్దేశించిన పార్లమెంటు లేదా రాష్ట్ర శాసన సభలు చేసిన చట్టాలను షెడ్యూల్డ్‌ ప్రాంతానికి వర్తిస్తా యని జారిచేసిన నోటిఫికేషన్‌ లేదా ఆ చట్టాలను కొన్ని మినహాయింపులు, కొన్ని చేర్పుల (జుఞషవజ్‌ూఱశీఅం aఅస వీశీసఱటఱషa్‌ఱశీఅం)తో ఈ ప్రాంతానికి వర్తింపచేసేటట్లు రాష్ట్ర గవర్నర్‌,టిఎసితో కలిసి తగిన నిర్ణయం తీసుకుని వర్తింపచేయవలసి ఉంటుంది. ఇది ఐదో షెడ్యూల్డ్‌ లోని పేరా 5(1డ2) వెసులుబాటు కల్పిస్తుంది.దీనికి ఉదా హరణ:1994లో 73వరాజ్యాంగ సవరణ ద్వారా రూ పొందించిన రాష్ట్ర పంచాయతీ రాజ్‌ చట్టం నియ మాల ప్రకారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, 1996లో పంచాయతీరాజ్‌ షెడ్యూల్డ్‌ ప్రాంత విస్తరణ చట్టం (పెసా) కేంద్ర చట్టం చేసే వరకు ఇదేళ్ళపాటు (1995-99) షెడ్యూల్‌ ప్రాంతంలో హై కోర్టు తీర్పుతో రద్దుచేసారు. పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలను మినహాయింపులు లేదా చేర్పుల లేదా కొత్త చట్టాలు రూపొందించడానికి టిఎసిదే కీలకపాత్ర.కానీ, ఆంధ్ర ప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 10 నెలలు గడుస్తున్న ఇంకా కౌన్సిల్‌ ఏర్పాటు జరగలేదు. నియమా నుసారం జరజవలసి రాజ్యాంగ ప్రక్రియాను నిర్లక్ష్యం చేయడం లేదా దానిని రాజకీయ సంస్థగా చూడటం వలన ఆదివాసులకు తీవ్రనష్టం జరుగుతుంది. ఇది అణ గారిన అదివాసి ప్రజల పట్ల జరుగుతున్న వివక్షపూరిత నిర్లక్ష్యానికి నిదర్శనం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో1950 జనవరి 26 నాటికి షెడ్యూల్‌ తెగలుగా గుర్తించబడి షెడ్యూల్డ్‌ ప్రాం తంలో నివాసం ఉంటున్న స్థానిక తెగలతో టిచర్‌ పోస్టుల భర్తికి ఉద్దేశించిన జీవో నెంబర్‌ 3రద్దు తర్వాత అదివా సులలో ‘షెడ్యూల్‌ ప్రాంతాల ఉద్యోగ నియామకల చట్టం’ చేయాలని డిమాండ్‌ ముందుకు వచ్చింది.నిజానికి ఈ డిమాండ్‌ కొత్తగా లేవనెత్తిన గొంతెమ్మ కోరిక కానేకాదు. రాజ్యాంగ కర్తలు ఐదో షెడ్యూల్‌ పేరా5లో పొందు పరచిన అంశమే.ఈ ప్రక్రియా రాజ్యాంగ వ్యవస్థ అయిన టిఎసిని ఏర్పాటుచేసి, ఆదివాసీ శాసనసభ్యులంత సంత కాలుచేసి,తిర్మాణాన్ని ఆమోదించి గవర్నర్‌ గారికి పం పాలి.రాష్ట్ర గవర్నర్‌ ద్వారా రాష్ట్రపతికి ఆమోదం కొరకు పంపాలి.ఆతీర్మానం ఆమోదం పొందితే ఆదివాసుల ఉద్యోగ భద్రతకు చట్టబద్దత వస్తుంది.ఇది రాజ్యాంగ ప్రక్రి యనే అయినప్పటికీ,ఉభయ తెలుగు రాష్ట్రాలు కనీస ప్రయత్నం చేయకుండా గుమ్మనంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ లో గతప్రభుత్వం చేసిన టిఎసి తీర్మానం గవర్నర్కు ఆమోదం కోసం పంపిన సరిపోతుంది.లేదా టిఎసి ఏర్పా టు చేసి, తీర్మానాన్ని ఆమోదించి పంపాలి. లేదంటే, నాణ్యత లేని అరకొర చదువులతో ఏజేన్సీ ప్రాంత తెగలు, ఇప్పుడున్న పోటిని ఎదుర్కొని ఉద్యోగాలు పొందడం అంత సులువు కాదు. జీవో నెంబర్‌ 3రద్దు తరువాత,ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్య మంత్రి జగన్మోహన్‌ రెడకి లేఖ రాస్తూ, ‘ఆదివా సుల హక్కులపట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి, సాను భూతి లేకపోవడం వలన అణగారిన ప్రజలు వారి పురోగతికి,సాధికా రతకు ఆటంకం కలిగిస్తున్నార’ని తన లేఖలో పేర్కొ న్నారు. 2024 సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా, అరుకు సభలోను,అమరావతిలో జరిగిన ‘ప్రపంచ ఆది వాసి దినోత్సవ’ సభ లోను జివో నెం.3ని మళ్లీ తీసుకు వస్తానని బాబుప్రకటించారు.ఈప్రకటన వయసు మిరు తున్న ఆదివాసీ నిరుద్యోగులకు కొంత ఊరటనిచ్చే అంశమే.అయినా,మెగా డిఎస్సి -2024 నోటిఫికేషన్‌ జారీకి ముందు ఏజేన్సీప్రాంతానికి కేటాయించిన పోస్టు లు గురించి సరిjైున నిర్ణయం తీసుకోకుండా జెనరల్‌ రోస్టర్‌ ప్రకారం నోటిఫికేషన్‌ ఇస్తే మాత్రం షెడ్యూల్డ్‌ ఏరియా ఆదివాసులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది.ఆదివాసులకు గత పాలకులపై కలిగిన అపనమ్మకం, చంద్రబాబుపై పెట్టుకున్న ఆశ నెరవేరాలని ఆశిద్దాం…(నంబర్‌ 26 భారత రాజ్యాంగ దినోత్సవం సంద ర్బంగా… వ్యాసకర్త: ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసీ జెఎసి జిల్లా కన్వీనర్‌, అల్లూరి జిల్లా)

వణికితున్న మన్యం..విసురుతున్న చలి పంజా…!

చలి తీవ్రత పెరగడంతో కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పొగమంచు కురుస్తున్నది. సాయంత్రం నుంచి మొదలుకొని మరునాడు ఉదయం 8 గంటల వరకు చలివీస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చాలామంది వాకింగ్‌, జాగింగ్‌ చేస్తున్నారు. చలికాలంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్య నియమాలు పాటించక పోవడంతో జబ్బుల బారినపడతారని నిపుణులు పేర్కొంటున్నారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారు జబ్బులు వారిని పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కాబట్టి పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. గునపర్తి సైమన్‌


ఉత్తరాంధ్రలో చలిపంజా విసురుతోంది. అర్ధ రాత్రి నుంచి తెల్లవారే వరకు కురుస్తున్న మంచుకు చలిగాలులు తోడయ్యాయి.దీంతో జనం ఉదయం7 గంటల వరకు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. రానున్న రోజుల్లో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులుచెబుతున్నారు. సాధారణంగాఉండాల్సిన ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా ఉంటున్నాయి. ఉష్ణోగ్రతలు గత వారం రోజుల నుంచి వేగంగా పడిపోతు న్నాయి.మన్యంలోపాటు మహావిశాఖలోను ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.కురి స్తున్న దట్టమైన పొగమంచుతో చలి తీవ్రత పెరగడంవల్ల మన్యం వణికిపోతుంది. ప్రధా నంగా వృద్దులు,పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవా లని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
గతంలో లేని విధంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.నగరంలో గతనాలుగైదు రోజుల నుంచి కనిష్టస్థాయిలో సుమారు14 డిగ్రీలుగా నమోదువుతు న్నాయి.చలిగాలి తీవ్రత పెరిగి వణికిస్తోంది.ప్రధానంగా రాత్రిళ్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదువుతుండడం గమనార్హం.రానున్న రెండు మూడు రోజుల్లో అల్పపీడన ప్రభావ నేపథ్యంలో మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోద య్యే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తు న్నారు.ఇక మన్యప్రాంతంలో డుంబ్రిగుడలో8.2, జీ.మాడుగులలో 8.4,అరకులోయలో 8.5,పాడేరులో 10.9,ముంచంగిపుట్టులో 10.9,గూడెం కొత్తవీధిలో 11.4,చింతపల్లిలో11.3,మినుములూరులో9, పాడేరు లో 11డిగ్రీలు నమోదైంది.
మన్యంలో దట్టమైన పొగమంచులు..
చలి పులి పంజా విసరడంతో విశాఖ ఏజెన్సీ వణికిపోతోంది.జనం ఇళ్లలో నుంచి బయటకు రావడా నికి భయపడిపోతున్నారు.చలిమంటలు వేసుకుని కాలక్షే పం చేస్తున్నారు. పొగమంచు కమ్మెయ్యడంతో రహదా రుల్లో ముందు ఏంఉందో కనిపించడం లేదు.దీంతో పగలు కూడా లైట్లు వేసుకుని వేసుకుని వెళుతున్నారు వాహనదారులు. పాడేరులో పట్టపగలే వాహనాల లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాడేరు వణికిపోతోంది.చలి పులి పంజా విసరడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడి పోతు న్నారు. చలిమంటలు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారు. పొగమంచు కమ్మెయ్యడంతో రహదారుల్లో ముందు ఏంఉందో కనిపించడం లేదు.దీంతో పగలు కూడా లైట్లు వేసుకుని వేసుకుని వెళుతున్నారు వాహనదారులు. మిచౌంగ్‌ తుఫాన్‌ తర్వాత నుంచి అల్లూరి జిల్లా పాడేరు చలితో గజగజా వణికిపోతూనే ఉంది.తాజాగా చలి తీవ్రత మరింత పెరిగింది. పాడేరు ఏజెన్సీలో చలితీవ్రత ఎక్కువవడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. పొగమంచు దట్టంగా అలుముకుంటోంది.
ఎంత పొద్దెక్కినా సూరీడు కనిపించట్లేదు..
ఎంత పొద్దెక్కినా సూర్యుడు కనిపిం చకపోగా, పాడేరు,చింతపల్లి,అరకు లోయ, డుంబ్రిగుడ, ముంచుంగిపుట్టు, హుక్కుంపేట, తదితర మన్యప్రాంతాన్ని మంచు దుప్పటి కమ్మేస్తోంది. దీంతో వాహనదారులు నానా ఇక్కట్లు పడుతు న్నారు.రోజురోజుకూ ఉష్ణోగ్ర తలు పడిపోవ డంతో పగలైనా సరే,వాహనం బయటకు తియ్యాలంటే లైట్లు ఆన్‌ చెయ్యా ల్సిందే.ఇక ముంచంగిపుట్టులో చలితీవ్రతకు జనం చలి మంటలను ఆశ్రయిస్తున్నారు. మన్యంలో చలి తీవ్రత కొనసాగుతున్నది.క్రమంగా ఉష్ణోగ్ర తలు దిగజారుతుండడంతో చలి తీవ్రత పెరుగుతున్నది.తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు చలితీ వ్రత కొనసాగుతోంది.ఇకసాయంత్రం నాలుగు గంటల నుంచే చలి మొదలవు తోంది.కొద్ది సమయం లోపలే ప్రజలు పనులు చక్కపెట్టు కోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది.ఇక ముంచంగి పుట్టు మండల పరిధిలో గత మూడు రోజులు గా చలి తీవ్రత పెరిగింది.ఉదయం పూట పది గంటల వరకు ముంచంగిపుట్టులో మం చు తెరలు వీడడం లేదు.చలికి జనం గజగజ వణికిపోతున్నారు.సాయంత్రం అయితే చాలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయ పడుతున్నారు.సాయంత్రం నాలుగు గంటల తరువాత వీధుల్లో చలి మంటలు దర్శనమి స్తున్నాయి.ఇలా ఉండగా ఈవాతావరణ పరిస్థితులు సందర్శనకు వచ్చే పర్యాటకులకు మంచి అనుభూతినిస్తోంది.చలిలో మంచు అందాలను తిలకిం చేందుకు మాత్రమే వారు సందర్శి స్తున్నారు.మంచు విపరీతంగా పడుతుండటంతో ప్రజలు అనారోగ్య సమస్య లకు గురవుతున్నారు.ఫ్రధానంగా విష(వైరల్‌) జ్వరాలు విజృంభిస్తున్నాయి.ఆస్తమా(ఉబ్బసం)బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం విశాఖ కేజీహె చ్‌కు జ్వరాలు,ఆస్తమాతో బాధప డుతున్న రోగులు తాకిడి పెరిగింది.ఎక్కువశాతం మందికి ఓపి విభాగంలో చికిత్స చేసి పంపుతున్నామని,శ్వాస తీసుకోవడంతో ఏమైనా ఇబ్బందులుంటే ఆసుప్రతిలో చేర్చి చికిత్స అందిస్తున్నా మని ఆసుపత్రి మెడిసిన్‌ విభాగా ప్రొఫెసర్‌ డాక్టర్‌ వల్లూరి సత్యప్రసాద్‌ తెలిపారు.చలి పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.
పెరుగుతున్న బాధితులు..
బాధితుల్లో ఒళ్లునొప్పులు,జ్వరం,జలుబు, గొంతు నొప్పి,నోరు రుచి లేకపోవడం వంటిలక్షణాలు కనిపిస్తు న్నాయి. జ్వరం మాత్రం48గంటలోపే నియంత్ర ణలోకి వస్తోంది.ఐదురోజుల వరకు జ్వరం తగ్గకపోయినా,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనా వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. కోవిడ్‌ టీకాలు వేయించుకోకుంటే కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.ప్రస్తుతం వస్తున్నవి విష జ్వరాలే.ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.కాస్త ఆప్రమత్తంగా ఉంటే సరిపోతుంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..` డాక్టర్‌.యశోధ

కాఫ్‌`29 భేటీ లాభమేంటీ!?

ప్రపంచ వాతావరణ సదస్సు కాఫ్‌`29 అజర్‌ బైజాన్‌లోని బాకులో ముగిసింది.నవంబర్‌ 22తో పూర్తికావాల్సిన సదస్సును అంతర్గత,వాగ్వివాదాల వల్ల రెండు రోజులపాటు పొడిగించారు. అయినా వాతావరణ మార్పులను సమష్టిఎదుర్కోవాలన్నలక్ష్యం నీరుగారిపోయిందని వర్ధమాన దేశాలు నిరసించాయి.ఐక్యరాజ్యసమితివాతావరణ మార్పుల నియంత్రణ ఒప్పందం (యూఎన్‌ఎఫ్‌సీసీ)లో భాగస్వాములైన దేశాల వార్షిక సమావేశాన్ని కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌(కాఫ్‌)గా వ్యవహరిస్తారు.శిలాజ ఇంధనాల వినియోగం వంటి మానవ కార్యకలాపాలతో భూగోళం వేడెక్కిపోతోంది.భూఉష్ణోగ్రత పెరగుదలను 1.5సెల్సియస్‌ డిగ్రీల దగ్గర నిలువరించాలని పారిస్‌ వాతావరణ సభలో ప్రపంచ దేశాలు తీర్మానించాయి.ఈలక్ష్య సాధనలో పేద దేశాలకు ఆర్ధికంగా చేయూతనివ్వాలని నిశ్చయించాయి.దీన్ని వాతావరణ ఫైనాన్స్‌ అంటున్నారు.బాకు కాఫ్‌`29 సదస్సులో పేద దేశాలకు నిధుల కేటాయింపునకు సంబంధించి కొత్తగా నిర్ణయం తీసుకోవాలని అజెండా పేర్కోంది.
భవిష్యత్తులో ఏర్పడే తీవ్ర వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు 2015లో చేసుకున్న పారిస్‌ ఒప్పందాన్ని కొన్ని ధనిక,అభివృద్ధి చెందిన దేశాలు నిర్వీర్యం చేయడం పట్ల కాప్‌29 శిఖరాగ్ర సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది.వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన వాతావరణ నిధిపై ముసాయిదా సత్వర కార్యాచరణకు ఏమాత్రమూ అనువుగా లేదని పలు దేశాలు అభిప్రాయపడ్డాయి. మరింత సమర్ధవంతమైన చర్యలు తీసుకోవడానికి వెసులుబాటు కల్పించేలా కొత్తఆర్థిక లక్ష్యాలతో ముసాయిదా వుండాలని వర్ధమాన,నిరుపేద దేశాలు భావిస్తున్నాయి.
క్లయిమేట్‌ ఫైనాన్స్‌ కింద ఏటా 100బిలియన్ల డాలర్లు (10 వేల కోట్ల డాలర్లు) ఇస్తామని 2009లో సంపన్న దేశాలు ఒప్పుకున్నాయి. కానీ, గడచిన పదమూడేళ్లలో దానిని పాటించింది ఒక్కసారే! సంపన్న దేశాలు 2020నుంచి వాతావరణ ఫైనాన్స్‌ కిద ఏటా 100బిలియన్ల డాలర్లు (10వేలకోట్లు డాలర్లు) ఇస్తామని వాగ్దానంచేశాయి.2022లో సదరులక్ష్యాన్నిఅందుకున్న ఆ దేశాలు 2025వరకు దీన్నికొనసాగిస్తామన్నాయి.ఇప్పుడు తమ సాయాన్ని 30వేల కోట్ల డాలర్లకు పెంచుతున్నామనీ,అదీ ఉదారంగా ఇస్తున్నదేనని వాదిస్తున్నాయి.వాస్తవానికి 2035కల్లా 50వేల కోట్ల డాలర్ల సాయం అందిస్తామని అవి మొదట్లో ప్రతిపాదించాయి.అది చివరికి 30వేల కోట్ల డాలర్లకు తగ్గింది.వచ్చే ఏడాది జరిగే కాఫ్‌30సభలో వార్షిక వాతావరణ ఫైనాన్స్‌ను 1.3లక్షల కోట్ల డాలర్లకు పెంచే విషయం పరిశీలిస్తామని మాటతో సరిపెట్టేశారు. ఇలాంటి మాట తప్పుడు తంతుతో పర్యావరణానికి ఏమాత్రమూ మేలు జరగదని పేద దేశాలు వాపోతున్నాయి.ప్రపంచంలో పునుత్తాదక ఇంధన వనరుల ఉత్పత్తి సామర్ధ్యాన్ని 2030కల్లా మూడు రెట్లు పెంచాలని కాఫ్‌29లక్షిస్తోంది.కానీ,శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ప్రత్యేక తీర్మాణం చేయకపోవడం గమనార్హం.దీనివల్ల సంపన్న దేశాలు బొగ్గు,చమురును యధేచ్ఛగా వినియోగిస్తాయనే ఆందోళన వ్యక్తమైంది.వాతావరణంలో మార్పుల నిరోధానికి సంపన్న,వర్ధమాన దేశాలు ఒక్కతాటిపై నడవడం తప్పనిసరి.ఈవిషయంలో ఏకాభిప్రాయం లోపించడం కాప్‌29లో స్పష్టంగా కనిపించింది.పాశ్చాత్య దేశాలు కూడా మాటలకే పరిమితమయ్యాయి.ఆఖరికి కాఫ్‌29 సదస్సును నిర్వీర్యం చేస్తూ అర్ధవంతంగా ముగించేశారు.!- రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

గ్రోత్‌ హాబ్‌గా మహావిశాఖనగరం

కణితి మార్కెట్‌ రోడ్లో జరిగిన దీపం -2 పథకం ప్రారంభోత్సవంలో కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌
గాజువాక ప్రాంతంలో ఇళ్ల క్రమబద్దీకరణ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ
విశాఖపట్టణం(గాజువాక) ః ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకా రంతో విశాఖ మహా నగరాన్ని గ్రోత్‌ హబ్‌ గా తీర్చిదిద్దుతామని, ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అద్దం పడుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌ పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌ సహాయంతో ఇప్పటికే సమగ్ర ప్రణాళికలు రూపొందించామని గుర్తు చేశారు.కేంద్ర, రాష్ట్ర డబుల్‌ ఇంజన్‌ సర్కారులో ప్రజలకు సత్వర సేవలను అందించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని, ప్రజా సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుం టున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దీపం-2 పథకం ఉచిత గ్యాస్‌ సిలిం డర్ల పంపణీ జిల్లాస్థాయి కార్యక్రమం గాజు వాక పరిధిలోని కణితి మార్కెట్‌ రోడ్లో అట్ట హాసంగా జరిగింది. ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివా సరావులతో కలిసి జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌,జాయింట్‌ కలెక్టర్‌ కె.మ యూర్‌ అశోక్‌ భాగస్వామ్యమయ్యారు.ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దీపం పథకం ద్వారా పేదల ఇళ్లల్లో కొత్త వెలుగులు వస్తా యని,శ్వాసకోస సంబంధిత వ్యాధులు దూరమ వుతాయని, మహిళలకు సాంత్వన చేకూరు తుందని అన్నారు.జిల్లాలో టీబీ కారణంగా ఎంతో మంది చనిపోయారని,దానికి ప్రధాన కారణం కట్టెల పొయ్యిల వినియోగమే అని గుర్తు చేశారు.డబుల్‌ ఇంజన్‌ సర్కారులో ప్రజ లకు సత్వరమే సేవలు అందుతున్నాయని, సంక్షేమం,అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నా యన్నారు.దానిలో భాగంగా టీసీఎస్‌ విశాఖ పట్టణానికి వస్తోందని,మెగా డీఎస్సీ కూడా వస్తోందని పేర్కొన్నారు.ప్రభుత్వ విధానాల ఫలి తంగా జిల్లాకు పరిశ్రమలు కూడా వస్తున్నా యని గుర్తు చేశారు.స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రస్తావించిన ఇళ్ల స్థలాల క్రమ బద్దీకరణ,స్టీల్‌ ప్లాంటు విషయంలో అనుసరిం చే విధానాలపై కలెక్టర్‌ ఈ సంద ర్భంగా స్పందించారు.జీవో నెం.301విషయంలో సానుకూల నిర్ణయం తీసు కుంటామని, దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు.అలాగే స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో సానుకూలంగా ఉన్నామని దానిలో భాగంగా నే రెండో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలి పారు.అందరి సహకా రంతో అందరికీ న్యాయం చేస్తామని, మంచి సేవలు అంది స్తామని,జిల్లా అభివృద్ధికి అవిరళ కృషి చేస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉం డగా జిల్లాలోని అన్ని నియోజక వర్గాల పరిధిలో ప్రస్తుతం 3,76,924గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయని వాటిలో అర్హులైన అందరికీ దీపం పథకంలో ఉచిత సిలిండర్ల పంపిణీ చేస్తామని జిల్లా సివిల్‌ సప్లై అధి కారి తెలిపారు.కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే, కలెక్టర్‌,జాయింట్‌ కలెక్టర్‌,డీఎస్వో తదిత రుల చేతుల మీదుగా ఉచిత సిలిండర్లను పంపిణీ చేశారు.కార్యక్రమంలో జిల్లా సివిల్‌ సప్లై అధికారి భాస్కరరావు,స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు, అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.-జి.ఎన్‌.వి.సతీష్‌

జాతీయ డ్రోన్‌ కాపిటిల్‌ అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ నిర్వహించడం సంతోషంగా ఉందని..ఇది భవిష్యత్తు నాలెడ్జ్‌ ఎకానమీలో గేమ్‌ ఛేంజర్‌ అని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అన్నారు. అక్టోబర్‌ 22న మంగళగిరిలోని సీకే కన్వెన్షన్స్‌లో కేంద్ర పౌర విమానయాన శాఖ,ఏపీ డ్రోన్స్‌ కార్పొ రేషన్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అమ రావతి డ్రోన్‌ సమ్మిట్‌ను కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మౌలిక వసతులు,పెట్టుబడుల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్ధన్‌ రెడ్డి తది తరులతో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభిం చారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… 1995లో నేను ఐటీ విధానం గురిం చి మాట్లాడితే ఆరోజు ఆమాటలు కొందరికి అర్థం కాలేదని..సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఐటీ రంగాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని పెద్దఎత్తున ప్రమోట్‌ చేసినట్లు తెలిపారు.బెంగళూరులో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఐటీ కంపెనీల ఏర్పాటుకు గతంలో పరిస్థితులు అనుకూలంగా ఉండేవని..తాను వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి హైదరా బాద్‌కు ఐటీ పరిశ్రమలు తెచ్చేందుకు కృషిచే శానన్నారు. వాటి ఫలితమే నేడు హైదరాబాద్‌ ఐటీ రంగంలో అభివృద్ధి పథంలో నడుస్తోందని తెలిపారు. పీపీపీ విధానంలో హైటెక్‌ సిటీని నిర్మించినట్లు తెలిపారు.ఆ సమయంలో అమెరికాలో 15రోజులు పాటు పర్యటించి అనేక మంది ఐటీ నిపుణులతో సంప్రదించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే.. నాడు నేను ఒకటే చెప్పా…టెక్నాలజీలో ఇండియా బలమైన దేశమని. బ్రిటిష్‌ వారు మన దేశాన్ని వదిలివెళ్లేటప్పుడు దేశ సంపదతో పాటు కోహినూర్‌ వజ్రాన్ని తీసుకెళ్లారు.అయితే ఇంగ్లీష్‌ను వదిలివెళ్లారు.నేడు ప్రపంచంలోనే ఇంగ్లీష్‌ మాట్లాడేవారు ఇండియాలోనే ఎక్కువ మంది ఉన్నారు.గణితంలోనూ ఇండియా వారు బలమైనవారు. సున్నాను కనిపెట్టింది కూడా ఇండియా వారే.బిల్‌ గేట్స్‌ను కూడా గతంలో హైదరాబాద్‌కు ఆహ్వానించి ఇక్కడి పరిస్థితులు వివరించాం.టెలీ కమ్యూనికేషన్‌లో డీ రెగ్యు లేషన్‌ గురించి నాటి ప్రధాని వాజ్‌పేయ్‌ని ఒప్పించాం.సెల్‌ ఫోన్‌ అన్నం పెడుతుందా అంటూ వెకిలిగా మాట్లాడారు.ఐటీ రంగంలో భారతీయులు బలమైనవారు.బయో టెక్నాలజీ,ఫార్మాలో భారతీయులు సమర్థవం తులు.టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తెలుగు ప్రజలు ఎప్పుడూ ముందుం టారు.అడ్వాన్స్‌డ్రోన్స్‌,సీసీటీవీ కెమెరాలు, యాప్‌లు,ఇతర టెక్నాలజీ పరికరాల విని యోగంలో ముందున్నాం.ఐటీ గురించి మాట్లాడిన సందర్భంలో ఉద్యోగాలు చేయడమే కాదు…ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్లాలని చెప్పాను.ప్రపంచంలో భారతీయులు ఎక్కువ తలసరి ఆదాయం పొందుతున్నారు. అందులో తెలుగువారు 30శాతం మంది ఉన్నారు. విమాన సదుపాయం లేని సమయంలో ఢల్లీి, ముంబైలో దిగి హైదరాబాద్‌ రావాలని చెప్పాను.వ్యాపారాలు చూసు కుని వెళ్లండని కోరాను…దానికి కారణం హైదరాబాద్‌కు నాడు సరైన విమాన సదుపాయం లేకపో వడమే.నాటి ప్రధాని వాజ్‌పేయిని ఒప్పించి ఓపెన్‌ స్కై పాలసీ తెచ్చేలా కృషి చేశాం. అప్పుడు మొదటి సారి ఎమిరేట్స్‌ నుండి హైద రాబాద్‌ విమానం నడిచింది.ఆ సమయంలోనే గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టుకు శ్రీకారం చుట్టాం. 32 సార్లు ప్రధానమంత్రి,విమానయాన శాఖ అధికారులతో చర్చించాం.
గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టు నిర్మాణం తర్వాత హైదరాబాద్‌కు ఔటర్‌ రింగ్‌రోడ్‌,బయోటెక్నాలజీ పార్క్‌,ఐటీ,ఫార్మా రంగాల్లో పెద్ద సంస్థలను తీసుకొచ్చాం. ఇప్పుడు దేశంలోనే హైదరాబాద్‌ బెస్ట్‌ నివాసయోగ్య సిటీ అని గర్వంగా చెప్తుకుం టున్నాం.మన దేశానికి ఒక డైనమిక్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. ఇండియన్‌ బ్రాండ్‌ ను ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నారు. వికసిత్‌ భారత్‌ 2047 ద్వారా ఇండియాను ప్రపంచంలో నెంబర్‌ 1లేదా నెంబర్‌ 2 స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. నేడు ప్రపంచంలోనే డిజిటల్‌ కరెన్సీని ఎక్కువగా ఉపయోగించేది ఇండియన్స్‌.జన్‌ ధన్‌,ఆధార్‌ మొబైల్‌ (జామ్‌) అనుసంధానం చేస్తున్నారు.ఆయుష్మాన్‌ భారత్‌ వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టారు.రాబోయే కాలం అంతా డేటాదే. ఎంత డేటా ఉంటే దేశానికి, పెట్టుబడిదారులకు అంత బాగుంటుంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ),మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌)ద్వారా నిర్ధిష్టమైన సమా చారాన్ని పొందవచ్చు.డ్రోన్స్‌ను మనం ఎక్కడికైనా పంపవచ్చు…సరైన సమాచారాన్ని పొందవచ్చు. ఇటీవల విజయవాడలో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి.ఆ సమయంలో బాధితులకు ఆహారం కలుషితం కాకుండా, వృధా కాకుండా అందించడానికి దేశంలోనే మొదటిసారిగా డ్రోన్లు వినియోగించి బాధితు లకు ఆహారం అందించాం.హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించిన సందర్భంలో పైనుంచి వేయడంతో ఆహార పొట్లాలు పగిలిపోయేవి. కానీ..డ్రోన్ల ద్వారా సురక్షితంగా1.50లక్షల మందికి ఆహారం అందించాం.
అంతేకాదు డ్రోన్లు సిటీలోకి పంపి ఎంత చెత్త ఎక్కడ పేరుకుపోయిందో కూడా సర్వే చేశాం. సరైన సమయంలో అన్నింటిని గుర్తించి 20 మెట్రిక్‌ టన్నుల చెత్తను నాలుగు రోజుల్లోనే తొలగించాం.రోడ్లు ఎక్కడ సరిగా లేకపోయినా డ్రోన్లు పంపి సమాచారం తెప్పించాం.ఏరోడ్డు పక్కన చెత్త ఉన్నా పరిశీలించి శుభ్రం చేయిం చాం.వరద నీరు బయటకు పోవడానికి కారణం డ్రెయిన్లు మూసుకుపోవడమని.. బ్లాక్‌లను గుర్తించి,వాటిని తొలగించి నీటిని బయటకు పంపాం.భవిష్యత్తులో డ్రోన్లు గేమ్‌ ఛేంజర్లుగా చెప్పొచ్చు.వ్యవసాయం, ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ తదితరాల్లో వాటిని వినియోగించవచ్చు. విజిబుల్‌ పోలీసింగ్‌…ఇన్‌ విజిబిల్‌ పోలీస్‌కు ప్రాధాన్యమిస్తున్నాం.టెక్నాలజీ సహాయంతో నేరగాళ్ల ఆటకట్టిస్తాం. ప్రతి అంశంలోనూ ఖచ్చితత్వాన్ని సాధించడంతో పాటు చివరి మైలు వరకు అభివృద్ధి,సంక్షేమ ఫలాలు అందించడంలో టెక్నాలజీని వినియోగించు కుంటాం.భూసార పరీక్షలు, పురుగుమందుల పిచికారీ,భూసర్వే,భూసార పరీక్షలు తదితరా లను డ్రోన్ల ద్వారా నిర్వహించవచ్చు. కనీసం100నుండి 150వరకు డ్రోన్‌ అప్లికే షన్స్‌ (డ్రోన్‌యూజ్‌ కేస్‌లు)వినియోగం లక్ష్యంగా పనిచేస్తున్నాం.అప్లికేషన్స్‌ను క్షేత్ర స్థాయిలో పరీక్షించి ఆయా కంపెనీలకు సరైన విధంగా ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చేలా పైలట్‌ ప్రాజెక్టులకు వీలుకల్పిస్తాం.నాకు కావాల్సింది డ్రోన్ల ద్వారా అభివృద్ధి. ఇండియాకు రెండంకెల వృద్ధిరేటు సాధించే సత్తా ఉంది.నాలెడ్జ్‌ ఎకానమీలో గ్లోబల్‌ సర్వీస్‌లు అందించగల సత్తా కూడా మన దేశానికి ఉంది.పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తల నుండి సల హాలు,సూచలను తీసుకుని డ్రోన్‌ పాలసీని ప్రవేశపెడతాం.15రోజుల్లోనే డ్రోన్‌ పాలసీని ఆవిష్కరిస్తాం.కనీసం 35వేలకు పైగా డ్రోన్‌ ఫైలట్లకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టు కున్నాం.డ్రోన్‌ సిటీ ఆఫ్‌ ఇండియాగా అమ రావతిని తీర్చిదిద్దుతాం.ఏఐ,ఎమ్‌ఎల్‌.. ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేస్తాయి. మీఅందరికీ ఒక సూచన ఇస్తున్నా…థింక్‌ గ్లోబల్లీ..యాక్ట్‌ గ్లోబల్లీ విధానాన్ని అనుస రించాలి.ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ పార్కులో డ్రోన్‌ హబ్‌ కోసం 300ఎకరాలు కేటా యిస్తాం.అక్కడ డ్రోన్‌ హబ్‌ ఏర్పాటు చేస్తే పెద్ద నగరాలైన హైదరబాద్‌,చెన్నై,బెంగళూరు, అమ రావతికి దగ్గరగా ఉంటుంది.అక్కడ డ్రోన్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌కు సహకారం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం.నేను డ్రోన్లు తయారీదారులకు కూడా చెప్తున్నా….మీకు నేను అంబాసిడర్‌ గా ఉంటాను….మీ మార్కెట్‌ ను ప్రమోట్‌ చేస్తా. నేను చాలా మంది ప్రధాను లను చూశాను కానీ టెక్నాలజీని ఇంతగా అర్థం చేసుకునే వ్యక్తి ప్రధాని మోదీ. స్నేహ పూర్వక వాతావరణంలో విధానాల రూపకల్ప నకు సిద్ధంగా ఉన్నాం.స్టూడెంట్స్‌,టీచర్స్‌, ప్రొఫెసర్స్‌కు కూడా చెప్తున్నా నాలెడ్జ్‌ ఎకానమీకి ఇది మంచి సమయం.ప్రతిదీ అందుబాటులో ఉంది. ప్రతి దాన్ని ఎలా వినియోగించుకోవాలో ఆలోచిస్తే ఇండియన్స్‌ను ఎవరూ ఎదుర్కోలేరు.నేడు మన దేశం యువ జనాభా తద్వారా యంగ్‌ టాలెంట్‌తో తొణికిస లాడుతోంది.కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం, రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ కూడా టెక్నాలజీ,ఇన్నోవేషన్‌లో భాగస్వాములవు తున్నారు. సమష్టి భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని డ్రోన్‌ హబ్‌గా మారుస్తాం.రాష్ట్రంలోని యూనివర్సిటీలు కూడా థియరిటికల్‌ విద్యకే కాకుండా అప్లికేషన్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. నవ టెక్‌ ఆవిష్కరణలు దిశగా యువతను ప్రోత్స హించాలి. రాష్ట్రంలో5రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం.అమరావతిలో హెడ్‌ క్వార్టర్‌ ఉంటుంది..మిగతావి విశాఖ, రాజమండ్రి, తిరుపతి, అనంతపురంలో ఏర్పాటు చేస్తున్నాం.2047 నాటికి ఒక కుటుంబం…ఒక వ్యాపారవేత్త ఉండాలన్నది నా అభిమతం.25ఏళ్ల క్రితం ప్రతి కుటుంబంలో ఒక ఐటీ వ్యక్తి ఉండాలని ఆకాంక్షించాని..అదే విధంగా ఇప్పుడు చెప్తున్నా ఒక కుటుంబంలో ఒకవ్యాపారవేత్త, ఒక స్టార్టప్‌ కంపెనీ ఉండా లని చెప్తున్నా. ఇది సక్సెస్‌ అయితే భారత్‌.. టెక్నాలజీ,గ్లోబల్‌ సర్వీసెస్‌లో ముందుంటుంది. -జిఎన్‌వి సతీష్‌

ఆగని ఆకలి కేకలు.. పేదరికానికి పడని పగ్గాలు

పేదరికం ఒక విషవలయం.కనీస అవస రాలతోపాటు స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం పొంద లేని స్థితిని‘పేదరికం’అని ఐక్యరాజ్య సమితి నిర్వ చించింది.పేదరికం బాధను అంధుడుసైతం చూడ గలడంటూ నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ వాపోయారు.ఆకలి,అనారోగ్యం ఈ రెండూ పేదరి కం కవలలు. పోషకాహార లోపం, అనారోగ్యం, నిరక్షరాస్యత,నిరుద్యోగం వంటి మౌలిక సమ స్యలతో భారత్‌ నేడు సతమతమవుతోంది. స్వాతం త్య్రానంతరం సాధించిన అభివృద్ధి ఫలాలు కొంద రికే పరిమితం కావడంతో బీద ధనిక అంతరాలు కొనసాగుతున్నాయి.పోషకాహార లోపాలను అధిగ మించడంలో కొంత ముందడుగు పడినా, చేయా ల్సింది మరెంతో ఉందని క్షేత్రస్థాయి వాస్తవాలు చాటుతున్నాయి.2005-06 నుంచి 2015-16 మధ్య పదేళ్ల వ్యవధిలో 27.1కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులైనట్లు గణాంకాలు చెబుతున్నా, 130కోట్ల దేశజనాభాలో నేటికీ 28 శాతం పేదరి కంలోనే మగ్గుతున్నారని యూఎన్‌డీపీ నివేదిక స్పష్టీకరించింది.
పథకాలు ఎంత వరకు గట్టెక్కిస్తాయి?
ప్రధానిగా ఇందిర అయిదు దశాబ్దాల క్రితం ఇచ్చిన ‘గరీబీ హటావో’ నినాదం తరవాత చేపట్టిన బ్యాంకుల జాతీయీకరణ నుంచి ఇప్పటి గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమాల వరకు పేదల సంక్షే మం కోసం ప్రభుత్వాలు అనేకానేక పథకాలు చేపడుతూ వచ్చాయి. హరిత విప్లవం పుణ్యమాని 60వ దశకం చివరలో వ్యవసాయ ఉత్పత్తుల పెరు గుదల ఆహార భద్రతకు బాటలుపరచింది. అన్నా ర్తుల ఆకలి కేకలు కొంతవరకు తగ్గుముఖం పట్టా యి. పేద రైతులకు పెట్టుబడి సాయాలు, పేదలకు పింఛను పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి. అయినా కిందకు దిగిరానం టున్న పేదరికం గణాంకాలు వెక్కిరిస్తూనే ఉన్నా యి.ఈ తరహా పథకాలద్వారా ఆకలి మంటల నుంచి తాత్కాలిక ఉపశమనం లభిస్తుందే తప్ప పేదరికాన్ని నిర్మూలించలేమని ఇన్నేళ్ల అనుభవాలు స్పష్టీకరిస్తున్నాయి. పేదలకు ఆదాయ భద్రతతో పాటు విద్య,వైద్యం,రక్షిత తాగునీరు వంటివి అం దాలి.దారిద్య్ర రేఖను స్వయంకృషితో అధిగ మించేలా వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పడాలి.దురదృష్టవశాత్తు కొన్నేళ్లుగా వీటికోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఆశించిన స్థాయి లో లేవు. సేవల నాణ్యతా పలు విమర్శలకు తావి స్తోంది.పేదరిక నిర్మూలనకు బహుముఖ వ్యూహాలు అవసరమని దీన్నిబట్టి బోధపడుతోంది.తాజా ప్రపంచ ఆకలిసూచీ-2019 నివేదిక ప్రకారం పౌష్టికాహార లోపాలతో బాధపడుతున్న చిన్నారులు 2008-12మధ్యకాలంలో 6.50 శాతం నమో దైతే, 2014-18 మధ్యకాలంలో వారి సంఖ్య 20.83 శాతానికి పెరిగింది. ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే అధికంగా ఉన్నట్లు నివేదిక వెల్లడిరచింది. వాస్త వానికి పేదరికాన్ని ఎలా గణించాలన్న దానిపై ప్రభుత్వపరంగానే స్పష్టత కొరవడుతోంది. ఈ విషయంలో కేంద్రం ప్రభుత్వం నియమించిన అలఫ్‌ు కమిటీ (1979), లకడాయీలా (1993), తెందూల్కర్‌(2009),రంగరాజన్‌కమిటీ(2014) లు పేదరికం గురించి భిన్నమైన నిర్వచనాలు ఇవ్వ డమే దీనికి దాఖలా.ఆ మేరకు తెంద్కూలర్‌ కమిటీ దేశంలో పేదలు 22శాతమని అంచనా వేయగా, రంగరాజన్‌ కమిటీ 29.5శాతమని చెప్పింది.

ఆ వర్గాల వారే ఎక్కువగా!
జీవితమంతా పేదరికంతో మగ్గినవారిని శాశ్వత పేదలంటారు. వీరు తరవాతి తరానికీ పేదరికాన్ని బదలాయించే పరిస్థితి ఉంటుంది. ఇలాంటివారు అధికంగా ఎస్సీ, ఎస్టీల్లో ఉంటున్నారు. ‘క్రానిక్‌ పావర్టీ రీసెర్చ్‌ సెంటర్‌’ పత్రాల ప్రకారం దేశం లోని పేదల్లో 50శాతం ‘శాశ్వత పేదరిక’ పరిధి లోనే ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఎస్టీల్లో పేదరికం తగ్గుదల మిగిలినవారికన్నా తక్కువ. 1993-94,2004-05 సంవత్సరాలనాటి అంచ నాల ప్రకారం దేశవ్యాప్తంగా పేదరికం 37శాతం నుంచి 27శాతానికి దిగివస్తే, ఎస్టీల్లో మాత్రం 51.9 శాతం నుంచి 47.3 శాతానికే తగ్గింది. దీన్నిబట్టి పేదరిక నిర్మూలన పథకాలు వీరికి చేర వేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అవ గతమవుతోంది.పేదల స్థితిగతులు ఇలాఉంటే, దేశంలో సంపన్నులు మరింత కుబేరులవుతు న్నారు. 2018లో కేవలం ఒక శాతం ధనవంతుల సంపద 39శాతం అధికమైతే, అట్టడుగున ఉన్న సగం జనాభా సంపద మూడు శాతమే పెరిగింది. దేశంలో సగానికిపైగా సంపద కేవలం ఒక శాతం సంపన్నుల చేతుల్లోనే ఉంది. పదేళ్లపాటు జీడీపీలో తొమ్మిది శాతం వృద్ధి సాధ్యపడితే ప్రగతిఫలాలు అట్టడుగు స్థాయికి చేరి పేదరికం నిర్మూలన సాధ్య పడుతుందన్న అంచనాలు గురితప్పాయి. గ్రామీణ పేదరికానికి పగ్గాలు వేయగల వ్యవసాయానికి సరైన గిట్టుబాటు దక్కకపోవడం శాపమవుతోంది. గ్రామాల్లో జీవన ప్రమాణాలు క్షీణిస్తుంటే, పట్టణా ల్లో అవి పెరుగుతున్నాయి.
లోపాలను అరికట్టితే చాలు
భారతీయులెవరూ ఖాళీ కడుపులతో నిద్రపోకుండా చూడటమే దేశ స్వాతంత్య్ర పరమార్థమని మహాత్మా గాంధీ చెప్పారు. గ్రామ స్వరాజ్యాన్ని ఆయన లక్షిం చారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ సైతం రాజకీ య స్వాతంత్య్రాన్ని మాత్రమే సాధించుకున్నామని అప్పట్లో అన్నారు. సాంఘిక, ఆర్థిక స్వాతంత్య్ర సాధన తదుపరి లక్ష్యాలని దిశానిర్దేశం చేశారు. సామాజిక, ఆర్థికన్యాయం ప్రాతిపదికన సామాజిక వ్యవస్థ నిర్మాణం రాజ్యాంగ నిర్మాతల ఆశయం. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో నేటికీ లక్ష్య సాధనకు దూరంగా ఉండటం మన వ్యవస్థల వైఫ ల్యాలనే చాటుతోంది. పన్నెండు పంచవర్ష ప్రణా ళికలు, మూడు వార్షిక ప్రణాళికలు కాలగర్భంలో కలిసిపోయినా,భారత్‌ ఇంకా దిగువ మధ్య ఆదాయ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనుగడ సాగి స్తోంది. దేశంలో క్రమేపి పేదరికం తగ్గు ముఖం పడుతోందని చెబుతున్నా, ప్రభుత్వ సంక్షేమ పథ కాల అర్హుల సంఖ్య ఏటాపెరుగుతుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలు పేదలను దారిద్య్ర రేఖ దిగువ నుంచి వెలు పలికి తీసుకురావాలి. పథకాల అమలులో లోపా లను అరికట్టి అర్హులకే లబ్ధి నేరుగా చేరేలా జాగ్రత్త లు తీసుకోవాలి. సంక్షేమ ఫలాలను పేదలు సద్వి నియోగం చేసుకునేలా చైతన్యపరచాలి. తద్వారా పేదరికం కోరల నుంచి వారు బయటపడేలా చేయాలి.- ప్రొఫెసర్‌ పి.వెంకటేశ్వర్లు

శిశు మరణాల్ని తగ్గిద్దాం భవిష్యత్తరాన్ని కాపాడుదాం

పోషకాహార లోపం.. మూఢ నమ్మకాలు.. సామాజిక..ఆర్థిక కారణాలరీత్యా ప్రతి ఏటా అనేక మంది శిశువులు మరణిస్తున్నారు. వైద్య రంగంలో నేడు ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. శిశువులకు సంబంధించిన వైద్య సేవలు ఎన్నో విస్తరిం చాయి.వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా నేటి కీ గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాం తాల్లోని ప్రజల్లో మూఢ నమ్మకాలు పెరిగి పోవ డం..ఆకారణంగా ప్రతి ఏటాలక్షల సంఖ్యలో శిశు మరణాలు జరగడం విచారించదగిన అంశం. శిశు మరణాల రేటు తగ్గించేందుకుగాను ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా నవంబరు 7వతేదీన ‘శిశు రక్షణ దినోత్సవం’ నిర్వహి స్తున్నారు. అయితే కేవలం ఆ ఒక్కరోజున మాత్రమే వివిధ కార్యక్రమాలను నిర్వహించడం కాదు..నిరంతరం శిశు రక్షణా కార్యక్రమాలను చేయడం వలన ప్రజల్లో అవగాహన పెరిగి,శిశు మరణాల రేటును తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనిపైనే ప్రత్యేక కథనం..
నేటికీ మూఢ నమ్మకాలతో గోల్డెన్‌ అవ ర్‌లో వైద్యం అందక, శిశువుల మరణాలు సంభవి స్తున్నాయి.అవిద్య,పేదరికం కూడా ఇందుకు ప్రధా న కారణంగా ఉంది.ఇదిసామాజికంగా రావాల్సిన చైతన్యం. ఎంతో అభివృద్ధి చెందామని చెప్పుకుం టున్న దశలో నేడు మరింతగా మూఢ నమ్మకాలు ప్రబలడం విచారకరం. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటిని రూపుమాపే విధంగా, ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు ముమ్మరంగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
శిశువు అంటే..
అప్పుడే పుట్టినప్పటి నుండి మొదటి సంవత్సరం పూర్తయ్యే వరకు శిశువుగా పరిగణిస్తారు. ఈ సంవత్సర కాలంలో శిశువులను జాగ్రత్తగా చూడ టంతో పాటు ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలనూ కల్పించా ల్సిన అవసరం ఉంది. అయితే మన దేశంలోగానీ లేదా ఇతర దేశాలలోగానీ చూస్తే ఎక్కువగా మర ణాలు ఏడాదిలోపు పిల్లల్లోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా మొదటి మూడు నెలల పిల్లల్లో మరీ ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఏడాదిలోపు పిల్లల మరణాలు ఎందుకు సంభవి స్తున్నాయనే విషయాలను తెలుసుకోవాలి. శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ము ఖ్యంగా బిడ్డ పుట్టిన తరువాత మొదటి మూడు నెలలు అభివృద్ధికి కీలక దశ.ఈ సమయంలో వినికిడి, కంటి చూపు, ఆలోచన, స్పందన తదితర విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. ఈ సమయంలో తల్లిదండ్రులతో అవినాభావ సంబంధం ఏర్పడు తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటాను కనుక పరిశీలిస్తే 2019లో పుట్టిన శిశువులు మొదటి నెలలోనే 24 లక్షలకు పైగా శిశువులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ప్రతిరోజూ ఏడు వేల కంటే ఎక్కువ మంది పిల్లలు మరణిస్తున్నారు. దీనిని నివారించేందుకు కృషి చేయాల్సిన అవసరం అందరిపైనా ఉంది.
కారణాలను పరిశీలిస్తే..
శిశు మరణాలకు ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. తల్లికి, బిడ్డకు సంబంధించినవి, సామాజిక, ఆర్థికపరమైనవి ముఖ్యంగా చెప్పవచ్చు. ఈ నాలుగు కారణాల వల్లనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు.
తల్లికి సంబంధించి..
తల్లికి సంబంధించిన కారణాలను పరిశీలిస్తే చిన్న వయస్సులోనే వివాహం చేసుకోవడం ప్రధాన కారణంగా ఉంది. వివాహ వయసు రాకుండానే వివాహాలు చేయడం వలన తల్లిలో సక్రమంగా శారీరక ఎదుగుదల ఉండకపోవడం..అలాగే పిల్లల సంరక్షణపైనా ఆమెకు సరైన అవగాహన లేకపో వడం..ప్రధాన కారణాలుగా ఉన్నాయి.అలాగే వివాహం అయిన వెంటనే గర్భం దాల్చడం వలన తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం జరుగుతుంది. శిశు మరణాలను కనుక పరిశీలిస్తే ఎక్కువ మంది బరువు తక్కువగా పుట్టడం వలన మరణిస్తున్నారు. గర్భిణీగా ఉన్న సమయంలో తల్లికి బిపి, షుగరు, గుర్రపువాతం వంటి లక్షణాలు ఉండటం కారణం గా బరువు తక్కువ పిల్లలు పుడుతున్నారు. అలాగే నెలలు నిండకుండానే ఎక్కువ మంది తల్లులు ప్రసవిస్తున్నారు. ఈ కారణాల రీత్యా పిల్లల ప్రాణా లకే ప్రమాదం పొంచి ఉంది. వీటిని నివారించా లంటే గర్భిణీగా ఉన్నప్పటి నుంచి తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబం ధించి వైద్యులు, వైద్య సిబ్బంది పర్యవేక్షణలో నిత్యం పరీక్షలు చేయించుకోవడంతో పాటు..చక్కటి పోషకాహారం తీసుకోవాల్సిన అవసరమూ ఉంది. అంతకంటే ముఖ్యంగా ఆడపిల్లలకు వివాహ వయ సు వచ్చిన తర్వాతనే పెళ్లిళ్లు చేయాలి. అలా చేయ డం వలన ఆడపిల్లలకు అన్ని రకాలుగా అవగా హన ఉంటుంది. దాని కంటే ముఖ్యంగా శిశు రక్షణ ఎలా చేయాలో తెలుసుకోగలుగుతారు.
బిడ్డకు సంబంధించి..
బిడ్డకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తే గర్భంలో ఉన్న బిడ్డ పరిస్థితి ఎలా ఉందనేది తెలుసు కోక పోవడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోక పోవడం ఒక కారణంగా చెప్పవచ్చు. చాలా మంది గర్భధారణ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకో వడం లేదు..వీటన్నింటివల్ల పిల్లలు పుట్టిన తరు వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంత కంటే ముఖ్యంగా జన్యుపరంగా ఎటువంటి సమ స్యలు వున్నాయో కూడా ముందుగానే తెలుసు కోవాలి.గర్భిణీగా ఉన్న సమయంలోనే బిడ్డ ఎదుగు దల గురించి, బరువు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బిడ్డకు పుట్టుకతో వచ్చే లోపాలు న్నాయేమో గుర్తించేందుకు మూడు సార్లు స్కాన్‌ చేయాల్సి ఉంటుంది.ఒకవేళ అవసరమైతే రక్త పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది.
సామాజిక కారణాలు..
సామాజిక కారణాలను అనేక విధాలుగా చూడ వచ్చు. నేటికీ మన సమాజంలో ఆడపిల్ల అంటే తక్కువగా చూసేదుస్థితి కనబడుతోంది. దీని నుండి ముందు మనం బయటపడాల్సిన అవసరంఉంది. శిశువు పుట్టగానే అమ్మాయిలు అయితే తక్కువగా చూడటం, అబ్బాయిలు అయితే అల్లారుముద్దుగా పెంచడం కూడా జరుగుతుంది. దీని కారణంగా తొలి రోజుల్లోనే శిశువు ఆరోగ్యం దెబ్బతినే అవకా శం ఉంది. అవిద్య,పేదరికం,సరైన సమయంలో ఇబ్బందులను గుర్తించకపోవడం,సమయానికి ఆసుపత్రికి తీసుకువెళ్లలేకపోవడం వలన కూడా శిశు మరణాలు సంభవిస్తున్నాయి.
మూఢ నమ్మకాలు..
మూఢ నమ్మకాలు శిశు మరణాలకు ప్రధాన కార ణాలుగా చెప్పవచ్చు.సాధారణంగా శిశువు జన్మిం చగానే తల్లిపాలు పట్టించాల్సి ఉంటుంది. కానీ చాలా మంది నేటికీ తేనె,పంచదార నీళ్లు పట్టిం చడం,కొన్నిచోట్ల గోమూత్రం పట్టించడం వంటివి చేస్తున్నారు.వీటి కారణంగా శిశువుల్లో అనేక రకా లైన‘ఇన్ఫెక్షన్లు’వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యం గా పిల్లల్లో విరేచనాలు అవుతుంటే అనాస పేరుతో నాటు వైద్యాలకు వెళుతున్నారు. ఇటీవలే విజయ వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఇలాగే జరిగి, చివరకు శిశువు పరిస్థితి ప్రాణాంతకం కావడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఎట్టి పరిస్థితులలోనూ శిశువులకు నాటు వైద్యం మంచిది కాదు.ఈ విధం గా అనేక మూఢ నమ్మకాల వలన ‘గోల్డెన్‌ అవర్‌’ లో శిశువులకు వైద్యం అందడం లేదు. ఫలితంగా పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఇప్పటికీ చాలా చోట్ల నాటు వైద్యం, నమ్మకాలు పెద్ద స్థాయిలో ఉంటున్నాయి. వైద్య రంగం అభివృద్ధి చెందుతున్నా మూఢ నమ్మకాలు, విశ్వాసాలు కూడా అంతకం తకు పెరగడం విచారించాల్సిన విషయం. పురోగ మించాల్సిన దశలో ఈ తిరోగమన భావాలు శిశువుల ప్రాణాలను హరిస్తున్నాయన్న వాస్తవాన్ని ప్రజ లకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతై నా ఉంది. అంతకంటే ముఖ్యంగా శిశువుకు ఎటు వంటి సమస్య వచ్చినా తక్షణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు గానీ లేదా సమీపంలోని ఆసుపత్రికి గానీ తీసుకువెళ్లాలి.కచ్చితంగా శిశువుకు వైద్య సేవలను అందించాల్సిన అవసరం ఉంది.
స్నానం జాగ్రత్తలు..
శిశువుకు స్నానం చేయించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.శిశువు టబ్‌లో ఉన్నప్పుడు మీ చేతికి అందేంత దూరంలో ఉండేలా చూసు కోవాలి.టబ్‌లో కొన్ని అంగుళాల వెచ్చగా ఉన్న నీటితో నింపాలి. నీళ్లు మరీ వేడిగా ఉండకూడదు.
వ్యాక్సినేషన్‌..
మొదటి సంవత్సరం పూర్తయ్యే వరకూ శిశువులకు తప్పనిసరిగా వ్యాక్సినేషన్స్‌ వేయించాలి.సూది ఇవ్వడం వలన జ్వరం వస్తుందని..లేదా ఇతరత్రా సమస్యలు వస్తాయనే మూఢ నమ్మకాలు ఇంకా బలంగా ఉన్నాయి.దీనివల్లే గ్రామీణ,ఏజెన్సీ ప్రాం తాలలో వ్యాక్సినేషన్‌ వేయించడానికి వెనకాడు తున్నారు. పట్టణ ప్రాంతాలలో కూడా అక్కడక్కడా కొంత మంది కుటుంబ పెద్దల అవగాహన లేని మాటల కారణంగా వ్యాక్సినేషన్‌ వేయించడం లేదు. కానీ మొదటి ఏడాదిలోపు క్యాలెండర్‌ ప్రకా రం కచ్చితమైన వ్యాక్సినేషన్‌ శిశువులకు అందిం చాల్సిన అవసరం ఉంది. ఇది బిడ్డకు రక్షణగా నిలుస్తుంది.ఆవిధంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది.
ఆర్థిక కారణాలు..
సమాజంలో నేటికీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడానికి చాలా మంది వెనకాడుతున్నారు. ప్రస్తుతం ప్రయి వేటు,కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయిం చుకునే పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితుల కారణంగా కూడా కొంతమంది వైద్యం చేయించు కునే అవకా శం కోల్పోతున్నారు.గిరిజన,మారుమూల ప్రాంతా లలో ‘రవాణా’ వ్యవస్థ అందుబాటులో లేక వైద్యం పూర్తిస్థాయిలో అందడం లేదు.వీరికి పట్టణ ప్రాం తాలకు వచ్చి వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత ఉండటం లేదు.ఈ కారణంగా గ్రామీణ ప్రాంతా లలో నాటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు.అయితే కొన్నిచోట్ల ఇంటి వద్దనే కాన్పు చేయిస్తున్నారు. అలా చేయడం వలన తల్లికి,బిడ్డకు కూడా ప్రమా దం కలిగే అవకాశం ఉంది.కాబట్టి కచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలోనే కాన్పు జరిగే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆసుప త్రులలో కూడా మెరుగైన వైద్య సేవలు,తగిన వైద్య పరికరాలు ఉండేలా చూడటం,ప్రజలకు అవగా హన కల్పింవలసిన బాధ్యత ప్రభుత్వాలదే.
తల్లిపాలే బిడ్డకు రక్ష ..
బిడ్డకు తల్లిపాలేరక్ష.అసలైన పోహాకాహారం, ఆరో గ్యాన్నిచ్చేది తల్లిపాలే.కానీ నేటి సామాజిక పరిస్థి తులు,తల్లులు ఉద్యోగరీత్యా,కొన్ని అనారోగ్య కార ణాల వలన..మరికొందరు తమ అందం పోతుం దనే భయంతో బిడ్డకు పాలివ్వని పరిస్థితు లున్నాయి. శిశువులకు తల్లిపాలు జీవితాంతం రక్షణనిస్తాయి.ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా తల్లిపాలే బిడ్డను కాపాడేది.తల్లిపాలను బిడ్డకు ఆరు నెలలు కచ్చితంగా ఇవ్వాలి. తల్లిపాలు ఇవ్వకపో వడం వలన రోగనిరోధక శక్తి లేక బిడ్డకు పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తల్లిపాలు తప్పనిసరిగా ఇచ్చేలా కుటుంబం లో అందరూ బాధ్యత తీసుకోవాలి.
అవగాహన పెరగాలి..
శిశు రక్షణపై పూర్తిస్థాయిలో పెద్దఎత్తున అవగా హన పెరగాల్సిన అవసరం ఉంది. ఇంకా పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలను నిర్వహిం డంతో పాటు ప్రజలను పిహెచ్‌సి (ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు)కు రప్పించి,వైద్య సేవలు పొందేలా చూడాలి.దీంతో పాటు వైద్య సదుపాయాలు ప్రజల వద్దకే వెళ్లాల్సిన అవసరం ఉంది.ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్‌) ప్రచురించిన‘లెవెల్స్‌ అండ్‌ ట్రెండ్స్‌ ఇన్‌ చైల్డ్‌ మోర్టా లిటీ’ రిపోర్ట్‌ 2020 ప్రకారం..భారతదేశంలో నవ జాత శిశు మరణాల రేటు 2006 నుంచి 2019కి సగటున 37నుంచి 22కు తగ్గింది.1990 నుంచి చూస్తే 2019కి 57నుంచి 22కు తగ్గింది. ఇదే పీరియడ్‌లో నవజాత శిశు మరణాల సంఖ్య 15 లక్షల నుంచి 5లక్షలకు తగ్గింది. శాతాలలో చూస్తే, నవజాత శిశుమరణాల రేటు 1990నుంచి 2005కు 39% తగ్గగా,2005 నుంచి 2019కి 41%తగ్గింది.1990 నుంచి 2019కి 60% తగ్గింది. అంటే నవజాత శిశు కేంద్రాలను ఏర్పా టు చేశాక నవజాత శిశుమరణాల రేటు ఎక్కువగా తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
ఐక్యరాజ్యసమితి ఇంటర్‌-ఏజెన్సీ గ్రూప్‌ ఫర్‌ చైల్డ్‌ మోర్టాలిటీ ఎస్టిమేషన్‌ విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం, నవజాత శిశువులు, ఐదేళ్ల లోపు పిల్లల నివారించగల మరణాలను అంతం చేయడంలో సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ఎస్‌డిజి) చేరుకోవడానికి ప్రపంచం గణనీయంగా దూరంగా ఉంది. నివేదిక ప్రకారం 2030 నాటికి 50 కంటే ఎక్కువ దేశాలు ఐదేళ్లలోపు మరణాల లక్ష్యాన్ని చేరుకోలేవు. 60 కంటే ఎక్కువ దేశాలు తక్షణ చర్య లేకుండా నియోనాటల్‌ మరణాల లక్ష్యాన్ని కోల్పోతాయి. ఎస్‌డిజిలు నవజాత శిశువులు,5సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల మరణాలను నివారించాలని పిలుపు నిచ్చాయి. అన్ని దేశాలు నవజాత శిశు మరణాల రేటు 1,000 సజీవ జననాలకు 12లేదా అంత కంటే తక్కువ మరణాలు. ఐదు సంవత్సరాల కంటే తక్కువ మరణాల రేటు 25లేదా అంతకంటే తక్కువ మరణాలను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.2030 నాటికి1,000 సజీవ జన నాలు.2020లో మాత్రమే ఐదులక్షలకు పైగా పిల్లలు వారి ఐదవ పుట్టినరోజుకు ముందే మరణిం చారు.22 లక్షల మంది పిల్లలు,5నుండి 24 సంవ త్సరాల వయస్సు గల యువకులు మరణించారని ఆ నివేదిక పేర్కొంది.
పిల్లలహక్కులు,శ్రేయస్సు అభివృద్ధి : యునిసెఫ్‌
పిల్లల శ్రేయస్సుపై ఎక్కువ ప్రభావం చూపే ప్రయ త్నాలను ఏకీకృతం చేసే కన్వర్జెంట్‌ సోషల్‌ పాలసీ విధానం,సమగ్ర వ్యవస్థలను అభివృద్ధి చేయడం ప్రధానం. దీనిద్వారా సామాజికంగా మెరుగుపర చడం,పర్యావరణాన్ని బలోపేతం చేయడంపై యునిసెఫ్‌ ఎక్కువగా దృష్టి సారిస్తోంది.పిల్లల కోసం ఫలితాలను మెరుగుపరచడంలో కేరళలో వివిధ కార్యక్రమాలతో శిశు మరణాలను తగ్గించ డంలో గత రెండు దశాబ్దాలలో గణనీయమైన పురోగతి సాధించింది. కేరళ ప్రోగ్రామ్‌ ప్రయత్నాల కోసం యునిసెఫ్‌ రాష్ట్ర కార్యాలయం సామాజి కంగా మెరుగుపరచడం, సంఘటిత సామాజిక విధానం, సమగ్ర వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా పర్యావరణాన్ని కాపాడడంపై ఎక్కువ గా దృష్టి సారిస్తోంది.పిల్లల శ్రేయస్సుకు ఉపయోగ పడేందుకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంది.
దేశంలోనే కేరళ ఆదర్శం..
సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాన్ని అమలు చేయడంలో కేరళ అగ్రగామిగా ఉంది.అత్యంత అట్టడుగువర్గాల్లోని పిల్లలు, మహిళల కోసం పేదల అనుకూల విధానాలు, సామాజిక రక్షణ కార్య క్రమాలను ప్రారంభించడంలో మనదేశంలోని అగ్రగామి రాష్ట్రాలలో కేరళ ఒకటి. రాష్ట్రం సామా జిక భద్రతా చర్యలు,ఆరోగ్యం,పోషకాహారం, వాష్‌, విద్యావ్యవస్థల విస్తరణ,ప్రజా పంపిణీ వ్యవస్థ వంటి ప్రగతిశీల చట్టాలు,పథకాలను ఆ రాష్ట్రం ప్రవేశ పట్టింది.యునిసెఫ్‌,వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యు హెచ్‌ఓ) కేరళను ప్రపంచంలోనే మొట్టమొదటి ’’బేబీ-ఫ్రెండ్లీ స్టేట్‌’’ గా గుర్తించాయి. ఎందుకంటే ఫార్ములాల కంటే తల్లి పాలివ్వడాన్ని సమర్థవం తంగా ప్రోత్సహించింది కేరళ. కేరళలో ప్రసవాలు 95 శాతానికి పైగా ఆసుపత్రిలో జరిగేలా ప్రోత్స హిస్తోంది. దేశంలోనే అతి తక్కువ శిశు మరణాల రేటు కూడా కేరళ రాష్ట్రంలోనే నమోదయింది. మూడవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వైద్య సదుపాయాలలో 100 శాతం జననాలతో ‘ఇన్‌స్టి ట్యూషనల్‌ డెలివరీ’లో కేరళ మొదటి స్థానంలో నిలిచింది.
దశాబ్దాలుగా ఈ సామాజిక విధానాలు ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి. సామాజిక రంగంలో అధిక ప్రభుత్వ పెట్టుబడితో,సమర్థవంతమైన ప్రణా ళికలు రూపొందించింది. పర్యవేక్షణను సులభత రం చేసే బలమైన పరిపాలనా నిర్మాణాలు, వ్యవ స్థలు సమర్థవంతంగా కేరళలో అమలు చేయ బడ్డాయి.ఇది ఆరోగ్యం,పోషణ, విద్యలకు సంబం ధించి పిల్లల శ్రేయస్సుపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది.శిశు,నవజాత శిశు మరణాలు, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలలో మరణాల పెరుగుదల తక్కువగా ఉంది.
-వ్యాసకర్త : ఎం.డి.(పీడియాట్రిక్స్‌), డిసిహెచ్‌.రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌, సిద్దార్థ ప్రభుత్వ వైద్యకళాశాల,విజయవాడ-( డాక్టర్‌ ,ఎన్‌.ఎస్‌.విఠల్‌రావు)

1/70 చట్టం పట్టని అధికారులు

గిరిజనులకు ఆవాసం,జీవనోపాధి,సామాజిక,ఆర్థిక,రాజకీయ ప్రగతితో పాటు సమా నత్వాలకు అత్యంత ప్రధానమైన, విలువైన ప్రకృతి సంపద భూమి. దాంతోనే గిరిజనుల భూములను అన్యాక్రాంతం కాకుండా రక్షించడానికి స్వాతంత్య్రం రాకముందు నుంచి చట్టాలు చేయబడ్డాయి. స్వాతంత్య్రానంతరం కూడా వీటికి కొనసాగింపుగా షెడ్యూలు ప్రాంత భూ బదలాయింపు నిషేధ చట్టం`1959 ఎల్‌.టి.ఆర్‌.1/59చట్టం,1/70చట్టం ఆతర్వాత ఈ చట్టాలకు సవరణ కూడా తీసుకొచ్చారు.ఈ చట్టం ప్రకారం షెడ్యూలు ప్రాంతాలోని భూమితో సహా ఇతర స్థిర ఆస్తులను గిరిజనులు మాత్రమే పొందటానికి అర్హులు. గిరిజనేతరులు ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్డ్‌ ప్రాంతాలో భూమిని కాని,ఏ స్థిరాస్తిని కొనుగోలు లేదా మరి ఏ ఇతర మార్గాల ద్వారా పొందటానికి వీలులేదు. కాని దానికి భిన్నంగా షెడ్యూల్డ్‌ ప్రాంతాలలోని గిరిజనుల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. బ్రిటిష్‌ పాలనలో…గిరిజన తెగలు నివసించే అటవీ ప్రాంతాల్లో పరిస్థితులు, ఆచారాలు భిన్నంగా ఉన్నందున..కొండల్లో ఉండే గ్రామాలను షెడ్యూల్డ్‌ (నిర్దేశిత, ప్రత్యేక) ఏరియాలుగా పేర్కొన్నారు.అందుకోసం ూషష్ట్రవసబశ్రీవస ణఱర్‌తీఱష్‌ం Aష్‌-1874అమల్లోకి తెచ్చారు.మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి నియమితులైన ప్రభుత్వ ఏజెంట్‌ పర్యవేక్షణలో ఈ ప్రాంతాల్లో పరిపాలన జరిగేది.ఏజెంట్‌ పరిపాలనలో ఉన్న ప్రాంతాలు కావడంతో ఏజెన్సీగా పిలవడం మొదలైంది.ఇప్పటికీ అదే పేరు కొనసాగుతోంది.భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గిరిజన గ్రామాలను అయిదో షెడ్యూల్‌లో చేర్చారు.అదే సమయంలో కొన్ని గిరిజన గ్రామాలను వదిలేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత,13జిల్లాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆతర్వాత 2022లో ఈజిల్లాలను 26జిల్లాలుగా పునర్వీభన చేశారు.దీంట్లో కొత్తగా రెండు ఆదివాసీ జిల్లాలు-పార్వతీపురం మన్యం,అల్లూరి సీతారామ రాజులు ఏర్పడ్డాయి.ఇవిప్రధానంగా ఆదివాసీ ప్రజలతో కూడిన ప్రాం తాలు.అదనంగా,ఏలూరుజిల్లా(పోలవరం,బుట్టయ్యగూడెం,జీలుగుమిల్లి,వెలూరుపాడు, కుకునూరు వంటి మాండల్లు) మరియు అనకాపల్లి జిల్లాలో (జి.మడుగుల,దేవరపల్లి, నాతవరం మండలాల్లోని కొన్ని ఆదివాసీ గ్రామాలు)కొన్ని గిరిజన గ్రామాలు కలిపి 5వషెడ్యూల్‌ కింద వస్తాయి. ఈనేపథ్యంలో రాజ్యాంగబద్దంగా ఐదో షెడ్యూల్‌ ఏరియాలోకి వచ్చే ఈప్రాంతాల్లో 1/70 భూ బదలాయింపు చట్టాన్ని బాధ్యతగా అమలు పరిచే ప్రభుత్వ ఏజెంట్‌ ఎవరనేది గిరిజన ప్రజల్లో తెలియని పరిస్థితులు దాపురించాయి.ఈచట్టం ప్రకారం,ఐదో షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఉన్న భూములు ఆదివాసీ ప్రజలవి.ఈభూములను ఆదివాసీ సమాజాల ప్రయోజనాలకు తప్ప మరే ఇతర ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఉపయోగించకుండా ఉండాలి. అంతేకాకుండా, ప్రభుత్వానికి ఈ భూములను ప్రభుత్వ సంస్థలకు కేటాయించే అధికారమూ లేదు.ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని,ప్రభుత్వానికి 5వ షెడ్యూల్‌ కింద ఆదివాసీ భూములను రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరం.ముఖ్యంగా ఆదివాసీలు జీవించే జిల్లాలో ‘‘ఏపీ భూబదాలయింపు` 1/70చట్టం’’ను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వ ఏజెంట్లును నియమించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.దీనిపై గిరిజన సంఘా నాయకులు, ఆదివాసీ ప్రజలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవశ్యకత ఉంది.గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన ఈచట్టాన్ని విస్మరించినట్లుయితే మనలను చరిత్ర క్షమించదు.!

రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

మన్యంలో సికిల్‌సెల్‌ మహామ్మారి

సికిల్‌ సెల్‌ అనీమియా జనాన్ని మింగేస్తోంది .పచ్చటి మన్యాన్ని ఓ మహామ్మారి మింగే స్తోంది. గిరిజనుల మనుగడనే ప్రశ్నార్ధకం చేస్తోంది. ఏజెన్సీలో మృత్యుఘటికలు మోగి స్తోంది. చిన్నారులే లక్ష్యంగా ప్రాణాలనే హరిస్తోంది.ప్రతి గూడెంలో చిన్న పిల్లలు ఈవ్యాధి బారినపడి చనిపోతున్నారు. మన్యా న్ని వణికిస్తున్న ఆజబ్బు పేరు సికిల్‌ సెల్‌ అనీమియా.జన్యుపరమైన మార్పుల వల్ల వచ్చే ఈరక్తహీనత జబ్బు చాపకింద నీరులా ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాలను వణికిస్తుంది. ముఖ్యంగా అల్లూరి సీతారా మారాజు జిల్లా ఏజెన్సీప్రాంతాన్ని చుట్టు ముట్టుతోంది. భయంకరమైన ఈ వ్యాధి జన్యుపరమైన మార్పులవల్ల వచ్చే జబ్బుని వైద్యులు గుర్తిస్తున్నారు. ఈవ్యాధి నివారణకు ఇంతవరకు మందులు లేవు.ప్రతి గూడెంలో చిన్న పిల్లలు ఈరోగం బారినపడి చనిపోతున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలో దాదాపు 10లక్షల గిరిజన జనాభా ఉంది.ఇందులో కనీసం పదిశాతం మందికి ఈ జబ్బు లక్షణాలు ఉన్నాయి.ఈ వ్యా ధికి గురై మరణించవారి సంఖ్య ఏటా పెరుగు తూ పోతుంది.యూనివర్శిటీ స్థాయిలో హ్యూ మన్‌ జెనెటిక్స్‌ విభాగం వారు జరిపిన పలు శాంపిల్‌ సర్వేల లెక్కల ప్రకారం ఉత్తరాంధ్ర ఏజెన్సీ పరిసర గ్రామాల్లో నివశిస్తున్న గిరినేతర కులాల్లో కూడా ఈవ్యాధి లక్షణాలు కనిపిస్తుం డటం మరింత ఆందోళన కలిగించే విషయం. అల్లూరిసీతారామారాజు,పార్వతిపురం మన్యం, అనకాపల్లి,ఏలూరు,శ్రీకాకుళం జిల్లాల్లో ఈవ్యా ధి లక్షణాలు కలిగిన రోగులు అనేక మంది బాధపడుతున్నారు.
నిర్లక్ష్యానికి పరాకష్ట..
పాడేరు పరిసర ప్రాంతాల్లో సికిల్‌ సెల్‌ అనీమి యా రోగుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. ఎత్తయిన ప్రాంతం(3,600అడుగులు)కావడం వల్ల ఈ ప్రాంతంలో ఆక్సిజన్‌ లభ్యతలో తేడా లుంటాయి.రోగులకు తరచూ రక్తం ఎక్కించా ల్సిన అవసరం ఉంటుంది.ఈరోగానికి మందు లు లేవు.సికిల్‌ సెల్‌ క్యారియర్లను గుర్తించి వారి మధ్య వివాహాలను నిరోధించడమే మార్గం.
సికిల్‌ సెల్‌ అనీమియా వ్యాధి లక్షణాలు ఇలా..
సికిల్‌ సెల్‌ ఎనీమియా అనే వ్యాధి వారస త్వంగా వచ్చిన ఎర్ర రక్త కణాల రుగ్మతల సమూహం.రక్తములో హిమోగ్లోబిన్‌ ఉత్పత్తికి కారణమయ్యే జన్యువులు లోపబూయిష్టంగా మారతాయి.ఆక్సిజన్‌ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలలో హిమోగ్లోవిన్‌ కొడవలి కణా లుగా మారి తద్వారా ఏభాగంలోనైనా కణజాలం,అవయవ వైకల్యానికి దారితీ స్తుంది.కొడవలి ఆకారంలో కణాలు మార డం వలన రక్తహీనత పరిస్థితులకు దారి తీస్తుంది.శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారంగా ఉండడం,అవయవ వైఫల్యం కలుగుతోంది.రక్త కణాలు సంఖ్య తగ్గడం (రక్తహీనత) కళ్ళు పసుపు రంగులో మార డం,తీవ్రమైన కీళ్ల నొప్పులు,ఒళ్ళు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,అలసట, తరచూ వచ్చే అంటువ్యాధులు,గర్భాధారణ సమయంలో ఎదురయ్యే సమస్యలు,అవయవ వైకల్యం,పెరుగుదల వంటి సమస్యలు ఈవ్యాధి లక్షణాలు.ప్రతి ప్రాథమిక వైద్య శాలలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు 40ఏళ్లు ఉన్న వారందరూ చేయించు కోవాలి. జన్యుపరంగా తల్లిదండ్రుల నుండి చిన్నపిల్లలకు ఈవ్యాధి సోకే ప్రమాదం ఉంది.ఈ వ్యాధి అంటువ్యాధి కాదు.ఒక వ్యక్తి నుండి ఒకవ్యక్తికి గాలి,నీరు,చర్మములైన వాటిద్వారా రాదు.ఆహార అలవాట్లువల్ల కూడా సంభవించదు.కేవలం జన్యుపరంగా తల్లిదండ్రుల నుండి మాత్రమే సంక్ర మిస్తుంది. ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో జీరో నుండి 45ఏళ్ల మధ్య వయస్సున్న జనాభాకు అవగాహన కల్పించడం,సార్వ త్రిక నిర్ధారణ పరీక్షలు కౌన్సిలింగ్‌ ద్వారా ఈ వ్యాధిని అరికట్టడానికి దోహదపడు తుందని పాడేరు సర్వజన ఆసుపత్రి సికిల్‌ అనీమియా వైద్యనిపుణ రాలు డాక్టర్‌ ఆశాలత తెలిపారు.
సికిల్‌ సెల్‌ ఎనీమియా వ్యాధి నిర్మూలనే లక్ష్యం
సికిల్‌ సెల్‌ అనీమియా వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర,కేంద్రప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.వ్యాధి గ్రస్తులకు నెలకు రూ.10వేలు చొప్పున ప్రొత్సహాకలు అంది స్తోంది.సికిల్‌ సెల్‌ అనీమియా లక్షణాలు కలిగిన రోగులకు నిరంతరం రోగనిరోధక పరీక్షలు చేస్తోంది.రోగం ఉందని నిర్ధారణ అయితే వారికి ప్రభుత్వం సర్టిఫికేట్లు అందజేస్తోంది.తద్వారా ప్రభుత్వం కల్పించే రాయితీ మంజూరు చేస్తున్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సికిల్‌ సెల్‌ ప్రభా విత గిరిజన ప్రాంతాల్లో అవగాహన చాలా అవసరం.40ఏళ్ల మధ్య గిరిజనుల్లో నిర్ధా రణ పరీక్షలు నిర్వహించి కౌన్సిలింగ్‌ ఇవ్వాలి.హిమోగ్లోబిన్‌ తక్కువ ఉన్న వాళ్లకి ఈవ్యాధి వ్యాపిస్తోంది.దీనిని నిరోధించేం దుకు గిరిజనులకు స్కానింగ్‌ పరీక్షలు పాడేరు ఆసుపత్రిలో అందుబాటులోఉన్నాయి. సకాలంలో ఈవ్యాధి నిర్ధారిం చడంవల్ల చికిత్స ను వెంటనే ప్రారంభిం చడానికి అవకాశం ఉంది.ఈ వ్యాధి తీవ్రంగా మారకుండా నిరోధించడమే ఉత్తమ మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. మెరుగైన జీవనశైలి అలవర్చు కోవాలి.ఈ వ్యాధి లక్షణాలు వచ్చినప్పుడు క్రమం తప్పకుండా వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని తరచూ నీళ్లు తాగుతూ ఉండాలని,సమతుల ఆహారం,పౌష్టికా హారం తీసుకోవాలని విపరీతమైన వాతా వరణ పరిస్థితిలకు ఎదురు కాకుండా జాగ్రత్త తీసుకోవాలని,ఆరోగ్యకరమైన జీవనశైలి ఏర్పాటు చేసుకోవాలని ఎత్తైన ప్రదేశాలకు వెళ్లకూడదని తెలియజేశారు.ఈ వ్యాధిని నిర్ధా రించడానికి ఎలక్ట్రోఫోరోసిస్‌ అనే రక్తపరీక్ష ద్వారా మాత్రమే నిర్ధారించవచ్చని ఎవరైనా అనుమానితులు ఉన్నట్లయితే ఈ పరీక్ష చేయిం చుకుని చికిత్స పొందినట్లయితే ఈ వ్యాధిని నివారించడం ద్వారా వారి జీవనశైలి మెరుగు పడుతుందని వైద్యులు పేర్కొన్నారు.
సికిల్‌ సెల్‌ రోగుల లక్షణాలు…
సికిల్‌ సెల్‌ వ్యాధిని నివారించడానికి,దాని కారణాలను మొదట అర్ధం చేసుకోవడం చాలా అవసరం.ఒక్కోసారి ఈవ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల కూడా సంభిస్తుంది.అంటే తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరూ దీని బారిన పడినట్లుయితే,అది పిల్లలకీ కూడా వచ్చే ప్రమా దం ఎక్కువగా ఉంటుంది.ఈ వ్యాధి జన్యుపు ఒకతరం నుంచి మరోక తరానికి వచ్చే అవకా శం ఉంది.అందువల్ల ముందు జాగ్రత్త కోసం వివాహానికి ముందు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.అంతేకాకుండా ఈవ్యాధి లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఈ వ్యాధి నుంచి ఎలా బయ పడొచ్చు..
ఎర్ర రక్తకణాలను ప్రభావితం చేసే ఈవ్యాధి జన్యుపరమైన కారణాలవల్ల మాత్రమే వస్తుంది. ఎర్రకర్తకణాల ఆకారం మారిపోతుంది.దీనివ్ల శరీరానికి తగినంత ఆక్సిజన్‌ లభించదు. ఎందుకంటే హిమోగ్లోబిన్‌లో అసాధారణైన గొలుసులు ఏర్పడటంతో సికిల్‌ సెల్‌ అనీమి యా,సికిల్‌ సెల్‌ తలసీమియా వంటి వ్ధాఉలు వస్తాయి.అందువల్ల సకాలంలో సకాలంలో చికిత్స పొందడం చాలా ముఖ్యమని వైద్యు నిపుణులు చెబుతున్నారు.
ఈవ్యాధిని నయం చేయడం సాధ్యమేనా ?..
వైద్యులు సాధారణంగా సికిల్‌ సెల్‌ అనీమి యాతో బాధపడుతున్న వ్యక్తులకు రక్తమార్పిడి అవసరమని సిఫార్సు చేస్తారు.శరీరంలోని ప్రతి భాగానికి తగినంత ఆక్సిజన్‌ అందనప్పుడు, దానివల్ల కలిగే తీవ్రమైన నొప్పి నుంచి ఉపశ మనం పొందేందుకు హైడ్రాక్సీ యూరియాని ఉపయోగిస్తారు.రానున్న కాలంలో ఈ వ్యాధి చికిత్సలో జన్యు చికిత్స ఎంతగానో ఉపకరి స్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.దీనివ్ల తీవ్ర లక్షణాలున్న రోగులకు ఎంతో మేలు చేకూరనుంది.
పరీక్ష ఖరీదు పది రూపాయలే..
జబ్బు నిర్దారణకు జరిపే ప్రాధమిక రక్త పరీక్ష ఖరీదు రూ.10లోపే ఉంటుంది. రక్తనమూనాను సోడియం మెటాట్రై సల్ఫేట్‌లో కలిపి మైక్రోస్పోప్‌ కింద చూస్తే రక్తకణాలు మామూలుగా ఉన్నాయా?వంపు తిరిగి ఉన్నాయా?అని తెలుస్తుంది.ఈ ప్రాధ మిక పరీక్షను ప్రైమరీ హెల్త్‌ సెంటర్ల (పీహెచ్‌సీ)స్థాయిలోనే జరప వచ్చు.జిల్లాలో సికిల్‌ సెల్‌ అనీమియా ఎక్కువగా ఉన్న పాడేరు,అరకు పరిధిలో 22 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి.అయితే ఎక్కడా సికిల్‌ సెల్‌ పరీక్షలు జరపడం లేదు.రోగులు మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీ హెచ్‌ ఆస్పత్రిక వచ్చినప్పుడు అక్కడ పరీక్షల్లో మాత్రమే వీరికి సికిల్‌ సెల్‌ అనీమి యా ఉన్నట్లుగా నిర్ధారణ అవుతోంది. ప్రస్తుతం పాడేరు సర్వజన ఆసుపత్రిలో కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కొడుకు చనిపోయాడు..కుమార్తెకూ వ్యాధి…
రaూన్సీరాణి,క్రాంతిరాజు దంపతులకు ఒక కుమారుడు.ఒక కుమార్తె ఉన్నారు. రaూన్సీ రాణి పాడేరు సమీపంలోని కిండంగిలో ఎన్‌ఎన్‌ఎంగా పనిచేస్తోంది.క్రాంతారాజు గిరిజన కార్పొరేషన్‌లో సేల్స్‌మేన్‌,తొమ్మిదేళ్ల క్రితం 9వ తరగతి చదువుతున్న కొడుకు సురేష్‌కు విపరీతైన జ్వరం వచ్చింది.డాక్టర్లు సికిల్‌ సెల్‌ అనీమియా అన్నారు.అన్నీ రకాల వైద్యం చేయిస్తూ వచ్చినా 2013 సెప్టెంబర్‌లో చనిపోయాడు.ఆ దు:ఖం నుంచి కోలుకోక ముందే కుమార్తె శ్రీలతకూ అదే విధమైన జబ్బు వచ్చింది.కూతుర్ని దక్కించుకోవడమెలాగో తెలియక ఆ దంప తులు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం.ఇది వీరి ఒక్కరి సమస్య కాదు.. ఉత్తరంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో గల పలు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి గుడెం లోను వందలాది కుటుంబాలు ఇలాంటి వ్యధ ను అనుభవిస్తున్నాయి.ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు. వీటిన్నింటిపై ప్రజ లకు అవగాహన కల్పిం చాలనే లక్ష్యం.
సికిల్‌సెల్‌ ఎనీమియా రహిత సమాజమే లక్ష్యం
సికిల్‌సెల్‌ ఎనీమియా రహిత గిరిజన సమాజ మే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని అల్లూరి జిల్లా పాడేరు ఐటీడీఏ పీవో వి.అబి óషేక్‌ తెలిపారు.ఏజెన్సీలో గిరిజనులను దీనిపై చైతన్య పరచాలన్నారు. ప్రధాన మంత్రి జన జాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ (జన్‌మన్‌)లో భాగంగా ఏర్పాటు చేసిన సికిల్‌ సెల్‌ ఎనీమియా ప్రచార రథాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి సికిల్‌సెల్‌ ఎనీమియాను నిర్మూలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా నిర్దేశించాయన్నారు. తొలి విడతగా స్థానిక ఐటీడీఏకు రెండు ప్రచార వాహనాలు పాడేరు చేరుకున్నాయని, మరో నాలుగు వాహనాలు త్వరలో వస్తాయ న్నారు. పాడేరు డివిజన్‌ పరిధిలో 35 ప్రాథ మిక ఆరోగ్యకేంద్రాల పరిధిలోని గిరిజన గ్రామాల్లో సికిల్‌ సెల్‌ ఎనీమియాపై ప్రచారం చేసి గిరిజనులకు అవగాహన కల్పించా లన్నారు. డివిజన్‌ పరిధిలో 1,550 గ్రామాల్లో ప్రచారం చేయాలనేది లక్ష్యంగా నిర్దేశించామని, ప్రతి రోజు మూడు నుంచి ఐదు గ్రామాల్లో ప్రచార రథం పర్యటించాలన్నారు. ఎంపిక చేసిన గ్రామాలకు ప్రచార రథం వచ్చిన సమయంలో సంబంధిత వైద్యాధికారి, వైద్య సిబ్బంది, గ్రామ సర్పంచులు విధిగా భాగ స్వామ్యం కావాలన్నారు. సికిల్‌ సెల్‌ ఎనీమి యా లక్షణాలను, నివారణ చర్యలను ప్రజలకు వివరించాలని ఐటీడీఏ పీవో సూచించారు. ఐటీడీఏ పరిధిలో లక్షా పది వేల మందికి సికిల్‌ సెల్‌ ఎనీమియా నిర్ధారణ పరీక్షలు నిర్వహిం చగా వారిలో 1,050 మందికి సికిల్‌సెల్‌ ఎనీమియా పాజిటివ్‌ వచ్చిందని, వారికి మరో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 650 మందికి సికిల్‌ సెల్‌ ఎనీమియా ఉందని తేలిందన్నారు. దీంతో వారికి అవసరమైన మందులు, సికిల్‌ సెల్‌ ఎనీమియా పింఛన్‌ మంజూరుకు సిఫా రసు చేశామన్నారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వీఎస్‌.ప్రభాకరరావు, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ సి.జమాల్‌ బాషా, స్థానిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విశ్వమిత్ర, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. భారత దేశంలో ఈవ్యాధి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, చత్తీష్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌, తూర్పు గుజరాత్‌, మహారాష్ట్ర, పశ్చిమ ఒడిశా,ఉత్తర తమిళినాడ్‌లలో ప్రబ లంగా ఉంది.
తెలంగాణలో వరంగల్‌,ఆదిలాబాద్‌,ఆసిఫాబాద్‌,జయశంకర్‌ భూపాలపల్లి,ఖమ్మం,భద్రాద్రి కొత్త గూడెం, నల్లకొండ,మహాబూబ్‌నగర్‌ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల వారు,ఆదివాసులు అత్యధిక సంఖ్య లో ఈ వ్యాధికి గురవుతున్నారు.దీనికి సంబం ధించి వైద్య చికిత్సల కోసం నగరానికి రాకపోకు సాగిస్తున్నారు.
మేనరికపు వివాహాలు కూడా కారణమే…
తండాలలో ఈవ్యాధి ఎక్కువగా కనిపించడానికి మేనరిక వివాహాలు,దగ్గర బంధువుల్లో వివా హాలు కూడా కారణమే.ప్రణాళికబద్దంగా పరీ క్షల నిర్వహణ,అవగాహన పెంచడం,ముం దుస్తుగా వ్యాధిని గుర్తించడం,ఆయా ప్రాంతాల్లో వ్యాధి నిర్మూలనకు దోహద పడతాయి.జాతీ య ఆరోగ్య సర్వే ప్రకటించిన వివరాలను బట్టి చూస్తే రాష్ట్రంలోని చిన్నారులు పెద్ద సంఖ్యలో సికిల్‌ సెల్‌ అనీమియా బారిన పడుతున్నారు. సరైన అవగహణ లేక,గుర్తిం చడంలో ఆలస్యం వల్ల,అనేక ంది బాధితులుగా మారుతున్నారు. వచ్చే 2047కల్లా సికిల్‌ సెల్‌ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 0`40ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న 7కోట్ల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించ డంవ్యాధి నిర్మూ లనకు దోహదపడుతుంది. గత కొన్నేళ్లుగా బాధితులకు స్వచ్చంధ సేవలు తలసీమియా, సికిల్‌సెల్‌ సొసైటీ అధ్యక్షుడు చంద్రకాంత్‌ అగర్వాల్‌ అందిస్తున్నారు.
– గునపర్తి సైమన్‌

న్యాయ దేవత కళ్లు తెరిసింది

దేశ అత్యున్నత న్యాయస్థానం న్యాయదేవతకు కళ్లు ఉండాలని నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ఆదేశాలతో సుప్రీంకోర్టులో కొత్తగా న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.గతంలో న్యాయ దేవత కుడి చేతిలో న్యాయానికి ప్రతి బింబంగా నిలిచే త్రాసు, ఎడమ చేతిలో ఖడ్గం ఉండేవి. కొత్తగా ఏర్పాటుచేసిన న్యాయ దేవత విగ్రహం కుడి చేతిలో త్రాసు అలాగే ఉంచి ఎడమ చేతిలో ఖడ్గానికి బదులుగా రాజ్యాంగం ఉంచారు . ప్రస్తుతానికి సుప్రీంకోర్టులోని జడ్జీల లైబ్రరీలో ఈ విగ్రహాన్ని ఉంచారు. న్యాయం గుడ్డిది కాదని.. చట్టానికి కళ్లున్నాయని బలమైన సంకేతమిచ్చే ఉద్దేశంతో న్యాయదేవత విగ్రహంలో సుప్రీంకోర్టు మార్పులు చేసింది.న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు కట్టడం వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. చట్టం ముందు అందరూ సమానమే.. న్యాయస్థానం డబ్బు, అధికారం.. ఇతర హోదాను చూడదు అనే సందేశంతో విగ్రహానికి గంతలు కట్టి ఉండేవి.ఇక ఖడ్గం విషయానికి వస్తే అన్యాయాన్ని న్యాయదేవత చీల్చిచెండాడుతుందని సంకేతం ఇచ్చేందుకు చేతిలో ఖడ్గం ఉండేది.కాగా కొత్త న్యాయ దేవత విగ్రహం కిరీటం, ఆభరణాలతో భారతమాత రూపంలో ఉండ డం విశేషం. ఈ విగ్రహానికి ఆమోదం లభిస్తే దేశ వ్యాప్తంగా ఇదే విగ్రహాన్ని అన్ని న్యాయస్థానాల్లో ఏర్పాటుచేసే అవకాశం ఉంది.
అయితే ఇప్పటివరకు ఉన్న న్యాయ దేవతల విగ్రహాలకు..ఈ విగ్రహానికి చాలా తేడాలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన న్యాయ దేవత విగ్రహానికి కళ్లకు గంతలు తీసేశారు. అంతేకాకుండా న్యాయ దేవత కుడి చేతిలో ఉండే త్రాసును అలాగే ఉంచగా..ఎడమ చేతిలో ఉండే పొడవైన కత్తిని తీసేసి ఆ స్థానంలో రాజ్యాంగాన్ని పెట్టారు. అంటే రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానంగా న్యాయం జరుగుతుందని తెలియ జేయడానికి దాన్ని అలా ఉంచారు.సుప్రీంకోర్టు జడ్జిల లైబ్రరీలో ఏర్పాటైన ఈకొత్త న్యాయ దేవత విగ్రహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.చట్టానికి కళ్లు ఉండవని.. దానికి గుర్తుగానే కోర్టుల్లో ఉండే న్యాయ దేవత విగ్రహానికి ఉండే కళ్లను గంతలతో కడతారని మనం ఇప్పటివరకు విన్నాం.అంతేకాకుండా ఎన్నో సినిమాల్లో చూశాం.న్యాయ దేవతకు కళ్లు ఉండవని,చెవులు కూడా వినిపించవని పేర్కొంటారు.ఎందుకంటే డబ్బు, అధికారాన్ని బట్టి..నిందితులకు చట్టాలు, తీర్పులు ఉండ వని..న్యాయ దేవత ముందు అందరూ సమాన మేనని చెప్పేందుకే అలా ఉంచారు. అయితే ఈ న్యాయ దేవత విగ్రహాన్ని బ్రిటీష్‌ కాలంలో ప్రవేశపెట్టగా.. ప్రస్తుత పరిస్థితులకు అనుగు ణంగా మార్పులు అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మనం కోర్టుల్లో చూసే న్యాయ దేవత జస్టియా అనే గ్రీకు దేవత. జస్టిస్‌ అనే పదం నుంచి జస్టియా అనే పేరు వచ్చింది.17వ శతాబ్దంలో ఒక బ్రిటిష్‌ కోర్టు అధికారి ఈ జస్టియా విగ్రహాన్ని మొట్ట మొదటి సారిగా మన దేశానికి తీసుకువచ్చారు.ఆ తర్వా త 18వ శతాబ్దంలో బ్రిటిష్‌ కాలంలో న్యాయ దేవత విగ్రహాన్ని కోర్టుల్లో ఉంచగా..స్వాతం త్య్రం వచ్చిన తర్వాత అదే విగ్రహం కొనసా గుతూ వచ్చింది.
ఇటీవల సుప్రీంకోర్టు ఆవరణలోని న్యాయ మూర్తుల గ్రంథాలయంలో కొత్త న్యాయదేవతా విగ్రహం ఏర్పాటు చేయటంతో దేశంలో ఈ మార్పు వెనకాలవున్న ఉద్దేశాలపైన పెద్ద చర్చ మొదలయింది.సాధారణంగా న్యాయదేవత ఒక గౌను వేసుకొని, తల విరబోసుకుని, కళ్లకు గంతలతో,ఒక చేతిలో త్రాసు,మరో చేతిలో ఖడ్గంతో ఉంటుంది.న్యాయదేవతగా ప్రపంచ దేశాలలో సైతం ఈ విగ్రహం ప్రసిద్ధి.గ్రీకు పురాణాల ప్రకారం థెమిస్‌ అనేది న్యాయ దేవతగా చెప్పుకుంటారు. ఆమె న్యాయానికి, చట్టానికి అధికారానికీ ప్రతీక.థెమిస్‌ను గ్రీకు ప్రజలు బాగా గౌరవిస్తారు. థెమిస్‌ అంటే గ్రీకు భాషలో సంప్రదాయం,చట్టం అని అర్థం. ఈజిప్టులోనూ ‘మాట్‌’ దేవతను సత్యదేవతగా పూజిస్తారు. రోమ్‌లో జెస్టిసియా దేవత న్యాయానికి గుర్తుగా ఉంది. ప్రపంచ దేశాలలో ఈ విగ్రహాన్ని న్యాయ స్థానాలలో వాడు తున్నారు. బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మొదలైన దేశాలలో కూడా ఈ ప్రతిమనే న్యాయానికి ప్రతీకగా పెడతారు. బ్రిటీషర్స్‌ నుండి మనమూ కొనసాగిస్తున్నాము. చట్టానికి అందరూ సమా నమని,వారి వారి రంగు, మతము, పేద, ధనిక, ప్రాంత భేదాలు లేకుండా తప్పొప్పుల ఆధారంగానే న్యాయం జరుగుతుందని, శిక్షలు విధించడం చేస్తామని చేప్పే ప్రకటనకు, కళ్లకు గంతలు ఉంటాయని వివరిస్తారు.అలాగే ఖడ్గం ధరించడం అనేది శిక్ష విధింపునకు ఉండే అధికారాన్ని సూచిస్తుంది. ఇంకా వివరణలేవో చెపుతుంటారు.
స్వతంత్రం వచ్చినా బ్రిటీష్‌ పాలకులు బిగించిన చట్రంలోనే భారత దేశం పరిపాలన సాగు తోందన్నది అందరికీ తెలిసిన నిజం.అయితే ఎవరూ ఆ సంకెళ్ల ఆనవాళ్లను వదలించడానికి ప్రయత్నించలేని పరిస్థితి. అయితే అప్పటి బ్రిటీష్‌ పాలకులు ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా న్యాయదేవత విగ్రహాన్ని ఇలా కళ్లకు గంతలు కట్టి ఏర్పాటు చేశారు. ఇంత కాలం న్యాయదేవత కళ్లకు గంతలతో పాటు ఒక చేతిలో త్రాసు,మరో చేతిలో కత్తి ఉండేవి. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పేందుకే న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు కట్టేవారు.కుడి చేతిలో ఉండే త్రాసు న్యాయానికి సూచికగా ఉం డేది.ఎడమ చేతిలో ఖడ్గం అన్యాయాన్ని న్యాయ దేవత సహిం చదని,అంతం చేస్తుందని తెలిపేందుకు ఏర్పాటు చేశారు.
ఇంతకాలం కోర్టుల్లోనూ న్యాయం జరగనపుడు న్యాయదేవత కళ్లు తెరచి చూడదని,అందుకనీ నిజాలు తెలువవనీ విమర్శ వచ్చేది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆదేశాల మేరకు న్యాయ దేవత రూపురేఖలను మార్చి తయారు చేశారు.ఆవిగ్రహం కళ్లకు గంతలు తీసివేశారు. చేతిలో కత్తి బదులు రాజ్యాంగాన్ని పెట్టారు. త్రాసు అలాగే ఉంది. కానీ మొత్తం దేవతా రూపం భారతీకరించారు. ’’న్యాయదేవత కళ్లకు గంతలు అవసరం లేదు. చట్టం ఎప్పుడూ గుడ్డిది కాదు.అదిఅందరినీ సమంగా చూస్తుంది.కత్తి హింసకు ప్రతీకగా కనిపిస్తుంది.కానీ న్యాయస్థానాలు రాజ్యాంగ చట్టాల మేరకు న్యాయాన్ని అందజేస్తాయి’’అని జస్టిస్‌ చంద్రచూడ్‌ ఈసందర్భంగా వ్యాఖ్యానిం చారు. వాస్తవికతలో అలా జరిగితే సంతోషమే. ఈ న్యాయ వ్యవస్థలోనే మొన్న మరణించిన ప్రొఫెసర్‌ సాయిబాబా తొమ్మిదేళ్లు విచారణ పేరుతో ఏనేరంరుజువు కాకుండానే జైల్లో మగ్గారు.హక్కుల కార్యకర్త స్టాన్‌స్వామి జైల్లోనే ప్రాణాలు విడిచారు.సాయిబాబాకు తన తల్లి మరణిస్తే,చూసేందుకు కూడా అనుమతి దొరక లేదు.కానీ అనేక దుర్మార్గాలు, హత్యలు, లైంగిక దాడుల ఆరోపణలతో జైలుకెళ్లిన డేరా బాబాకు పదులసార్లు పెరోల్‌ దొరికిన సంద ర్భంలో, న్యాయదేవత విగ్రహం మారగానే న్యాయం జరుగుతుందని నమ్మటానికి అవకాశముందా? అంబేద్కర్‌ ఆధ్వర్యంలో నిర్మితమైన రాజ్యాంగం పైన ఏమాత్రమూ గౌరవం,విశ్వాసం లేని పాల కులు,అనేక రాజ్యాంగ సవరణలకు పూనుకుని, రాజ్యాంగ మౌలిక స్వభావాన్నే మార్చివేస్తున్న వేళ,న్యాయదేవత చేతిలో రాజ్యాంగాన్ని పెట్ట గానే భ్రమకు గురవుతామా!కళ్లకు గంతలు తీసిన దేవతకు నిజాల్ని చూసి తీర్పులిచ్చే ధైర్యం వస్తుందా!ఈఅసమ సమాజంలో న్యాయం ఎవరి పక్షం వహించాలో న్యాయ వ్యవస్థకు ముందుగానే తెలుసు.న్యాయ చట్టా లను మార్చి,సంస్కృత పేర్లతో వాటిని పిలిచిన పుడే ఏదో మార్పుకు మార్గం వేస్తున్నారని సంకేతించారు.ఇప్పుడు భారతీకరించిన మను ధర్మాన్నే న్యాయంగా తెచ్చేందుకు పూనుకునే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా వేచిచూడాలి!
ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహం కళ్లకు గంతలు తీసేశారు. దీని అర్థం ఏమిటంటే చట్టం కళ్లున్నా చూడలేని గుడ్డిది కాదు. రెండు కళ్లు తెరిచి అందరినీ సమానంగా చూడగలదని చెప్పడానికే న్యాయదేవత కళ్లకు గంతలు తీసేశారు. అదేవిధంగా ఎడమ చేతిలో ఉన్న కత్తి బదులు రాజ్యాంగం ఉంచారు. దీని అర్థం ఏమిటంటే రాజ్యాంగాన్ని అనుసరించి న్యాయదేవత జరిగిన అన్యాయాన్ని గుర్తించి శిక్ష విధిస్తుంది. ఈ విషయాలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ వెల్లడిరచారు. ఆయన ఆదేశాల మేరకే న్యాయదేవత విగ్రహంలో ఈ మార్పులు చేశారు.
న్యాయ దేవత కొత్త విగ్రహాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల లైబ్రరీలో ఏర్పాటు చేశారు. చట్టం గుడ్డిది కాదన్న సందేశం బలంగా వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఇలా న్యాయదేవత విగ్రహంలో మార్పులు చేసినట్లు సమాచారం. – గునపర్తి సైమన్‌

1 4 5 6 7 8 75