ప్రపంచ భాషల్లో అందమైనది..తెలుగు భాష ఒక్కటి

  • ఆధునిక సాహిత్యంలో గురజాడ పాత్ర
    ’’అడుగుజాడ గురజాడది అది భావికిబాట’’ అన్న ఒకే వాక్యంతో శ్రీశ్రీ ఆధునిక యుగకర్తగా తెలుగు సాహిత్య చరిత్రలో గురజాడ స్థానం గూర్చి తీర్పు ఇచ్చారు. గురజాడగా ప్రసిద్ధి పొందిన వీరి పూర్తి పేరు గురజాడ వెంకట అప్పారావు. సమాజం లోని కుళ్ళును, మత మౌఢ్యాన్ని, కుల దురహం కారాన్ని, గ్రాంధిక భాషా ఛాందసత్వాన్ని, స్త్రీల పట్ల అణచివేతను తీవ్రంగా నిరసిస్తూ తన కలాన్ని కత్తిగా మలచి అభివృద్ధి నిరోధకత్వంపై పోరాడిన యుగకర్త గురజాడ. ఈయన దృష్టిలో సాహిత్యం ఒక భోగ(వినోద) వస్తువు కాక సమాజంలోని మార్పుకు ప్రజల పక్షాన కృషి చేసే ఆయుధంగా (దిక్సూచి)గా భావించారు.అందుకే గురజాడ అభ్యుదయ కవితా పితామహుడు,నవయుగ వైతాళికు డయ్యాడు
    జననం -కుటుంబ నేపథ్యం
    గురజాడగారు 1862 సెప్టెంబర్‌ 21వతేదీన విశాఖ జిల్లా, ఎలమంచిలి తాలూకా లోని రాయవరం గ్రామంలో మాతామహుల ఇంట జన్మించారు.తల్లి కౌసల్యమ్మ, తండ్రి వెంకటరామదాసు.గురజాడ పూర్వీకులు కృష్ణా జిల్లా గురజాడ గ్రామంనుండి విశాఖ మండ లానికి తరలివచ్చారు. గురజాడ తండ్రి ’’చీపురు పల్లి’’లో ఉద్యోగం చేసేవారు. అందువల్ల గుర జాడ ఆఊరులో ఉన్న గ్రాంటు స్కూలులో మొదటి మూడు తరగతులు చదివారు. వెలువలి రామ మూర్తి పంతులుగారివద్ద సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషలు నేర్చుకున్నారు. విజయనగరం మహారాజా వారి హైస్కూలులో లోయర్‌ ఫోర్త్‌, అప్పర్‌ఫోర్త్‌, ఫిప్తు,మెట్రిక్యులేషన్‌ చదివారు.1882లో మెట్రిక్యు లేషన్‌ ఉత్తీర్ణులయ్యారు.1882-1884మధ్య ’’ఎఫ్పే’’చదివారు. 1884-1886లో ఫిలాసఫీలో బి.ఎ.చదివారు.బి.ఎ.చదువుతుండగా 1885లో అప్పారావు వివాహం జరిగింది.భార్యపేరు ’’అప్పల నర్సమ్మ’’.ఈ దపంతులకు 1887లో లక్ష్మీనరసమ్మ (కుమార్తె),1890లో వెంకట రామదాసు (కుమారుడు) 1902లో కొండయమ్మ (కుమార్తె) జన్మించారు. గురజాడ బి.ఎ.ఉత్తీర్ణత పొందడంతో ప్రిన్స్‌పాల్‌ చంద్రశేఖరశాస్త్రి రాజా వారి కళాశాలలో ఎనిమిదో అసిస్టెంట్‌ లెక్చరర్‌గా ఉద్యోగం వేయించారు. నెలకు 25 రూపాయలు జీతం కావడంతో,ఆర్థిక ఇబ్బందుల వల్ల 1886 లో కళాశాల నుండి సెలవు తీసుకుని ’’డిప్యూటీ కలక్టరాఫీసులో’’ హెడ్‌ క్లర్కుగాచేరారు. కాని ఆ ఉద్యోగం సంతృప్తినివ్వలేదు.తిరిగి 1887లో ఆనందగజపతి మహారాజా వారి కళాశాలలో నాలుగవ లెక్చరర్‌గా చేరారు. దానితో పాటు మహారాజావారికి వార్తాపత్రిలు చదివి విన్పించి నందుకు మరో 50రూపాయలు అదనంగా ఇచ్చే వారు. మొత్తంగా నెలసరి జీతం 150 రూపా యలు వచ్చేవి.1889లో మహారాజావారి ఆస్థా నంలో ఏర్పాటు చేయబడిన డిబేటింగ్‌ క్లబ్‌ చర్చా వేదికకు ఉపాధ్యక్షుడైనారు.1896లో విజయ నగరం సంస్థానంలో శాసన పరిశోధకునిగా నియ మితులైనారు.1897లోఆనందగజపతి మరణా నంతరం సంస్థానం వ్యవహారాలను చక్కబెట్టే బాధ్యత నిర్వర్తించారు. 1898 నుండి 1912 వరకు రీవారాణి అంతరంగిక కార్యదర్శిగా చేసి 1913 ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ పొందారు.
    గురజాడ రచనా వ్యాసంగం
    గురజాడలో మెట్రిక్యులేషన్‌ చదువు తున్నప్పుడే కవిత్వ శక్తి వికసించింది. ఆంగ్లంలో ’’కకూ’’ (కోకిల)అనే కవితను వ్రాశారు. సంస్కృ తంలో శ్లోకాలు వ్రాస్తుండేవారు.1883లో ఇంగ్లీషులో ’’సారంగధర’’ అనే కథా కావ్యాన్ని రాశారు.అది ’’ది ఇండియన్‌ లీజ్జర్‌ అవర్‌’’ అనే ఆంధ్రాంగ్ల పత్రికలో ప్రచురించబడిరది. కలకత్తా నుండి వచ్చే ’’రీస్‌ అండ్‌ రయ్యత్‌’’ అనే పత్రికలో ’’సారంగధర’’ ను పునర్ముద్రించారు. ఈ పత్రికా సంపాదకుడైన శంభుచంద్ర ముఖర్జీతో గురజా డకు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచేవి.గురజాడ రాసిన రచనల్లో కన్యాశుల్కం ఒక గొప్ప రచన. ఇది ప్రపంచ సాహిత్యంలో గొప్ప ఆదునిక నాట కాల సరసన నిలిచిన నాటకం. దీని తొలికూర్పు 1897లో,రెండవ ముద్రణ1909లో జరి గింది. 1909లో నీలగిరి పాటలు రచించారు. 1910 లో గురజాడను తెలుగు కవిత్వ చరిత్రలో చిర స్థాయిగా నిలిపిన’’ముత్యాల సరములు’’ రచన చేశారు. ఇది కవితా సంపుటి. ఇందులో ముత్యా ల సరాలు,కాసులు,లవణరాజుకల,కన్యక, పూర్ణ మ్మ,లంగరెత్తుము,డామన్‌ పితియస్‌,దేశభక్తి గేయం మొదలైన కవితా ఖండికలున్నాయి. కొండు భట్టీయం, బిల్హణీయం అనే అనువాద నాటకాలు రచించారు. దిద్దుబాటు, దేవుళ్లారా మీ పేరేమిటి? మాటల మబ్బులు, పుష్పలావికలు, మెరుపులు, సుభద్ర, ఋతుశతకం వంటి సంస్కృత రచనలతో ఆపటు సౌదామిని వంటి నవలలను కూడా రచించారు. కథ చెప్పేటప్పుడు ఒక ఎత్తు గడా, నడిపించే తీరూ, నాటకీయత, ఒక పతాక స్థితి,ఒక ముగింపూ తప్పకుండా ఉంటాయి. వీటన్నింటి మేళవింపు గురజాడ రచనల్లో మనకు దర్శనమిస్తాయి.
    ఆధునిక సాహిత్యంలో గురజాడ పాత్ర-ఒక పరిశీలన
    ’’జీవితం స్పష్టం చేయలేని దాన్ని సాహిత్యం స్పష్టం చేస్తుంది’’ అని కొడవటిగంటి కుటుంబరావు చెప్పిన మాట గురజాడ సాహి త్యానికి పూర్తిగా వర్తిస్తుంది. గురజాడ సాహిత్య పతాక సంఘ సంస్కరణకు మించిన సాంఘిక విప్లవం.అందుకే ఆయన ఆనాటి మొత్తం భారత దేశంలోనే విశిష్టమైన సాహితీవేత్త. సమకాలీన కొత్త వస్తువుతో, కొత్త దృక్పథంతో, కొత్త రూపంతో గురజాడ తన నాటక కళను కవిత్వాన్ని, కథాని కను తీర్చిదిద్దినారు. దానికి నిదర్శనమే ఆనాటి కాలంలోని కన్యాశుల్క వివాహాలను నిరసిస్తూ, అనాదిగా కొనసాగుతున్న సంస్కృత నాటక కళను నిరాకరించి వాడుక భాషలో కన్యాశుల్కం రచిం చడం.వ్యవహారికభాషలో రచన చేయడమే కాకుం డా 1906లో సహాధ్యాయి అయిన గిడుగు రామ మూర్తి పంతులుతో కలిసి వాడుకభాష కోసం మహోద్యమాన్ని ప్రారంభించారు. ఇలా వాడుక భాషలో రచనలు చేసి ఆధునిక సాహిత్యంలో వాడుక భాషకు పునాదివేసి ’’ఆధునిక యుగకర్త’’ అయినారు. వేదాంతం పేరుతో మన దేశంలో ఎంత వంచన ఎంత మూర్ఖత్వం సాగు తుందో అని వాపోయాడు గురజాడ. మతాచారాల పేరు మీద సాగే స్వార్థపరత్వాన్ని ఎండగడుతూ రాసిన కథ -’’మీ పేరేమిటి?’’ మానవ సంబంధాల ఉద్వేగాలు మతాలకు అతీతమైనవి అని పెద్ద మసీదు కథ విశదపరు స్తుంది.మూఢ విశ్వాసా లను తృణీకరించే విధంగా ’’ముత్యాల సరములు’ రచన చేశారు.
    ’’దేశమంటే మట్టికాదోయ్‌.. దేశమం టే మనుషు లోయ్‌’’ – అంటూ దేశభక్తి గేయం ద్వారా ప్రజల్లో జాతీయ భావ స్ఫూర్తిని నింపారు. ’’ఆధునిక మహిళ భారతదేశ చరిత్రను తిరగరా స్తుందని’’ ఆశాభావం వ్యక్తం చేశారు. గురజాడ రాసిన తెలుగులో మొదటి కథానిక అయిన ’’దిద్దుబాటు’’ద్వారా’’పురుషుడి అడుగు జాడల్లో స్త్రీ నడవటం కాదు,పురుషుడికి నడక నేర్పేది, పురు షుడి జీవితాన్ని తీర్చిదిద్దేది స్త్రీ’’అని చాటి చెప్పారు. వర్ణవ్యవస్థను పూర్తిగా నిరాకరించి మంచి చెడ్డల ప్రాతిపదికగా మనుషులలో రెండే కులాలున్నాయి అని చెప్పారు.ఆధునిక సాహిత్యం లో ఎన్నో ఉద్యమాలకు ప్రేరకులైనారు. ప్రాచీన కాలం నుండి సాహిత్యాన్ని కేవలం ఒక భోగ (వినోదవస్తువు) వస్తువుగానే భావించి రచన లు చేశారు. నాటి వ్యవస్థను నిరసిస్తూ సమాజ మార్పే సాహిత్య లక్ష్యం అంటూ రచనలు చేశారు గురజాడ. ప్రజాస్వామ్య యుగపు లక్ష్యాలైన స్వేచ్ఛ, సమానత్వం,సౌభ్రాతృత్వం సాధనకు కలంబట్టి నాటకం,కవిత్వం,కథలు,సాహిత్య,విద్యా రంగంపై విమర్శనా రూపాలతో చివరిక్షణాల దాకా సమా జ ప్రగతికై రచనలు చేశారు. స్త్రీ జాతికి సమాన గౌరవం దక్కాలని పురుషాధిక్య సమాజాన్ని ధిక్కరించిన గురజాడ 1915 నవంబరు 30నాడు కన్నుమూశారు. స్త్రీలపై అణచివేత, పీడన కొనసాగినంత కాలం వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులకు స్ఫూర్తిని, చైతన్యాన్ని అందిస్తూనే వుంటాయి. కొందరు జీవిస్తూ మరణిస్తారు. మరికొందరు మరణించి జీవిస్తారు. ప్రజాకవి గురజాడ మరణించినా కూడా ప్రజల గుండెల్లో జీవిస్తూనే ఉంటారు. – (స్త్రీవాద పత్రిక భూమిక సౌజన్యంతో) – (జాలిగం స్వప్న)

అపరా అనుభవసారం ఆదివాసీ ఆత్మగానం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు అందించిన ఈనెల పుస్తక పరిచయం ప్రముఖ రచయత ‘‘ డాక్టర్‌ వి.ఎన్‌ .వి. కె, శాస్త్రి గారి ’’ కలం నుంచి జాలు వారిన ‘ఆదివాసి ఆత్మగానం’ – డా. అమ్మిన శ్రీనివాసరాజు
గిరిజన జన జీవితాలను అత్యంత దగ్గరగా గమనించడమే కాక సుమారు 50సంవత్స రాల పాటు వారితో సహజీవత్వం చేసిన పరిశోధకుడు, ప్రభుత్వ ఉద్యోగి, రచయిత, ముఖ్యంగా కేవలం గిరిజనుల గురించి అనేక పుస్తకాలు పరిశోధనాత్మకంగా వ్రాసిన వ్యక్తి, తెలుగు గిరిజన రచయిత లలో ప్రథమ స్థానంలో నిలిచేవారు, వారే అందరికీ డాక్టర్‌విఎన్‌.వి.కె,శాస్త్రిగా సుపరిచి తులైన ‘‘వట్టిపల్లి నరసింహ వీరభద్ర కృష్ణశాస్త్రి’’ ఆయన ఇటీవల వెలువరించిన వ్యాససంపుట్టి ‘‘ఆదివాసి ఆత్మగానం’’ ఆదివాసి జీవన సంస్కృతులకు దర్పణం పడుతున్న ఈ వ్యాసవళిలో మొత్తం 34వ్యాసాలు ఉన్నాయి. నేటి ఆధునిక కాలంలో మన గిరిజన బిడ్డలు పడుతున్న ఇక్కట్ల గురించి సహేతుకంగా వివరించే నేపథ్యంలో ఒకవైపు సంస్కృతి పరంగా, మరోపక్క పాలకులు చేస్తున్న దురాగతాలు, అలాగే వలస గిరిజనుల వల్ల కలుగుతున్న నష్టాలు అదేవిధంగా గిరిజనే తరులు, ప్రపంచీకరణ సాయంతో సాగు తున్న ఆధునిక అభివృద్ధివల్ల వాటిల్లుతున్న నష్టం గురిం చి రచయిత పారదర్శకంగా ఆలోచింప జేసే విధంగా ఈవ్యాస ప్రస్థా నం కొనసాగించారు. ఆనాటి మొగ లాల సాయంతో మన తెలుగు ప్రాంతానికి వచ్చిన బంజారాలు తమదైన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ అష్ట కష్టాలు పడి దుర్భర జీవితాలు అనుభ వించిన వారు ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతంలో సుగాలీలుగా తెలంగాణలో లంబాడాలుగా పేర్లు కలిగి గిరిజ న సామాజిక వర్గ సౌక ర్యాలు పొందుతున్న తీరును వివరిం చిన శాస్త్రిగారి వ్యాసంలో కేవలం వారి చరిత్ర జీవితం మాత్రమే ప్రస్తావించారు, వారివల్ల నిజమైన కొండల్లోని గిరిజన సామాజిక వర్గం వారికి జరుగుతున్న ఉపాధి ఉద్యోగ ఆర్థిక నష్టాల ప్రస్తావన లేదు.కానీ ఇదే వ్యాస సంపు టిలో ‘‘నకిలీ గిరిజన సర్టిఫికెట్‌ గాళ్లు’’ అనే మరో వ్యాసంలో ఆయన స్వీయ అనుభవంలోని విష యాలు ప్రస్తావించారు. సుమారు 50 సంవత్స రాల క్రితమే నకిలీ సర్టిఫికెట్లు పొంది వివిధ ఉద్యోగ హోదాల్లో ఉన్నవారు ప్రస్తుతం వారి పిల్లలకు సైతం అదే సర్టిఫికెట్లతో రిజర్వేషన్‌ సౌకర్యాలు అనుభవిస్తున్న వైనం ఇందులో పేర్కొంటూ నకిలీ గిరిజనులు ఏర్పడుతున్న తీరును, తెలిపి అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు గూర్చి మాత్రం అస్పష్టంగా ముగించారు. కోసం మెరుపుగా ఏజెన్సీ బయట నివసిస్తున్న గిరిజనులు ఏజెన్సీ గిరిజనులుగా నకిలీ సర్టిఫికెట్లు పొంది స్థానిక గిరిజన కోటాలో ఉద్యోగాలు పొందుతున్న వైనం, ప్రస్తావించిన శాస్త్రిగారు తనదైన పారదర్శకత చూపించే ప్రయత్నం చేశారు. ఆధునికత పేరుతో ఆవిర్భవించిన పర్యాటక రంగం వల్ల అడవి బిడ్డల సంస్కృతి ఎలా నాశనం అవుతుందో వివరించే వ్యాసంతో పాటు మాయమవుతున్న సాంప్రదాయ నాయకత్వం, గిరిజనేతరులైన వడ్డీ వ్యాపారులు, గిరిజనులను ఆర్థికంగా దోచుకుంటున్న వైనంతో పాటు ప్రస్తుతం ఆధునిక గిరిజన జనాభా పోడు వ్యవసాయం నుంచి కాఫీ తోటలు సాగు చేసే స్థాయి వరకు సాధించిన అభివృద్ధిని కూడా వ్యాస ర చయిత ఇందులో పేర్కొనడం అభినందనీయం.
ఇక గిరిజనులు అంటేనే సాంస్కృతి సాంప్రదాయాల వారసులుగా చెప్పుకుంటాం. అంతేకాక వారిలో అబ్బురపరిచే జీవన సంస్కృతి ఆగుపిస్తుంది ఈ వ్యాస సంపుటలో ఈ కోవకు చెందిన వ్యాసాలు కూడా మనం చదివే వీలు కల్పించారు. గోండు గిరిజనుల సలహాదారులైన ‘‘ప్రధానులు’’ అనే గిరిజన ఉపతెగ ప్రస్థానంతో పాటు,యానాదులు కొండరెడ్లు చెంచులు రాచకోయలు గుండులు తదితర గిరిజన జాతుల వారి జీవన విధానం సంస్కృతి సాంప్రదాయాలను వివరించే విశేషమైన వ్యాసాలు ఇందులో ఉన్నాయి, మనం అంతా గోండులు అని వ్యవహరిస్తున్న వారు గోండ్లు కాదు కోయత్తుర్లు అనే సహేతుక విశ్లేషణ కూడా వ్యాస రచయిత ఇందులో చేశారు.ప్రస్తుత గిరిజన సాహిత్యంలో అత్యంత ప్రధాన పాత్ర వహిస్తున్న విషయం’’ గిరిజన చట్టాలు’’ వీటికి సంబంధించిన విలువైన సమాచారయుతమైన వ్యాసాలు ఇందులో పొందుపరిచారు, ఉమ్మడి అటవీ యాజమాన్య చట్టం, అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం గురించిన ఎంతో ఉపయుక్త సమాచారం ఇందులో వివరించబడిరది. అలాగే గిరిజన యువతలో విద్యావంతులతో పాటు పెరుగుతున్న నిరుద్యోగిత గురించి కూడా వివరిస్తూనే గిరిజనులకు మాతృభాషలో విద్యాబోధన లేని తీరు, భాష అంతరిస్తే జరిగే పరిణామాలు గిరిజన పాఠశాలల సంఖ్య తో పాటు పెరగాల్సిన సౌకర్యాలు గురించిన వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. వ్యవస్థాగత లోపాల కారణంగా గిరిజన అక్షరాస్యత దేశవ్యాప్తంగా 58.96% మాత్రమే కాగ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే గణాంకాలు ఉన్నట్లు చెబుతూ.. మైదాన ప్రాంతాల్లో కూడా గిరిజన అక్షరాస్యత ఆశించినంత ఎక్కువగా లేదనే అభిప్రాయం వెల్లడి చేశారు. అంతేకాక గిరిజన స్త్రీ అక్షరాస్యత 40% మాత్రమే ఉండటం మరింత అన్యాయంగా వ్యాసకర్త అభిప్రాయం వ్యక్తం చేశారు. గిరిజన జన జాతుల్లో ఒకటైన ‘‘సవర’’ తెగ గురించిన సంపూర్ణ వివరణలో భాగంగా చిత్రకళలో వారి నైపుణ్యాన్ని వారు ఇచ్చే ప్రాధాన్యతల గురించి ఎంతో ఆసక్తిగా విశేషంగా వివరించారు ‘‘ఇడి సింగ్‌ లేని ఇల్లుండదు’’ వ్యాసంలో. ఇలా ఈ 34 వ్యాసాలు వేటికవి ప్రత్యేకతలు కలిగి ఆసక్తి విశేషాలతో కూడిన విలువైన సమాచారం నిండి ఉన్నాయి. వ్యాసాలు అనగానే పాఠకుల దృష్టి అదో గణాంకాల సమూహం, అనే సాధారణ అభిప్రాయం ఉంటుంది కానీ ఈ వ్యాసాల రచయిత ఒక పరిశోధకుడు మాత్రమే కాక అర్థశతాబ్దం పాటు అచ్చంగా గిరిజనులతోనూ వారు నివసించే ప్రాంతాల లోను అత్యంత దగ్గర సంబంధాలతో నివసించిన వ్యక్తి అలాగే 1980 దశకంలో గోండు గిరిజనులు ఆరాధ్య దైవంగా భావించే లండన్‌ విశ్వవిద్యాలయ మానవ శాస్త్ర ఆచార్యుడు, గిరిజన పరిశోధకుడు, నైజాం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, అయిన ‘‘హేమన్‌ డార్ప్‌’’ తో డాక్టర్‌ శాస్త్రి ప్రత్యక్ష పరిచయం, వారి పర్యటనల్లో భాగస్వామి కూడా అయిన అనుభవాల సారం తదితర ప్రత్యేక అర్హతలు గల ఈ వ్యాసర చయిత కలం నుంచి జాలువారిన ఈ అన్ని వ్యాసాలు అత్యంత ఉపయుక్తంగా ఉన్నాయి. వ్యాసాలు అన్నీ సాధారణ నిడివి అత్యంత సరళమైన భాష ఆసక్తిని పెంచే అనుభవ సంఘటనలు, తదితరాల మేళవింపుతో ఈ వ్యాస సంపుటి విలువ మరింతగా పెరిగింది, కేవలం గిరిజన జీవన విధానం, చరిత్ర, సంస్కృతి,తో పాటుగా పరిశోధనలకు అవసరమైన ప్రామాణిక విషయా లు గణాంకాలు దీనిలో నిక్షిప్తమై ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ప్రతి ఒక్కరితోపాటు పరిశోధకులు విధిగా చదవాల్సిన వ్యాసావళి ఇది.
ఆదివాసి ఆత్మగౌరవం… వ్యాసకర్త: డాక్టర్‌ వి ఎన్‌ వి కె శాస్త్రి, పేజీలు: 152, వెల: రూ 90/-ప్రతులకు: నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ అన్ని బ్రాంచీలు. ఫోను: 040 – 27665420. సమీక్షకుడు: డా:అమ్మిన శ్రీనివాసరాజు, సెల్‌:7729883223.

హరిత విప్లవ పితామహుడు డాక్టర్‌ సోమనాథన్‌

భారతదేశ హరితవిప్లవ పితామహు డు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్‌ స్వామినాథన్‌ కన్ను మూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన,సెప్టెంబర్‌ 27న చెన్నెలోని తననివాసంలో తుదిశ్వాస విడిచి నట్లు కుటుంబ వర్గాలు వెల్లడిరచాయి. ఆయన వయసు 99ఏళ్లు.అధిక దిగుబడినిచ్చే వరి, గోధు మ రకాలను అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రెండవ పంచవర్ష ప్రణాళిక (1956- 1961)సమయంలో హరిత విప్లవానికి నాందిపలికారు.స్వామినాధన్‌ ప్రయత్నాలు భారతదేశం తన ఆకలి సంక్షోభా పరిష్కరిం చడంలో సహాయపడిరది. ముఖ్యంగా 1943 లో బెంగాల్‌ కరవు పరిస్థితి తర్వాత స్వామినాథన్‌ ప్రయోగాలకు ప్రాధాన్యతేర్పడిరది. స్వామినాథ నకు భార్య మీనాతో పాటు ముగ్గురు కుమార్తెలు సౌమ్యా స్వామినాథన్‌, మధురా స్వామి నాథన్‌, నిత్యా స్వామినాధన్‌ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో చీఫ్‌ సైంటిస్టుగా ఉన్న సౌమ్యా స్వామి నాథన్‌ ఈయన కుమార్తె కావడం విశేషం.
వైద్యరంగం నుంచి వ్యవసాయంవైపు..
ఎంఎస్‌ స్వామినాథన్‌ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. భారతదేశ హరిత విప్లవ పితామ హుడు. ప్రపంచ ప్రఖ్యా త వ్యవసాయ శాస్త్రవేత్త కూడా.భారతదేశం ఆహార సంక్షోభా న్ని ఎదుర్కొం టున్న వేళ,అధిక న్న వేళ,అధిక దిగుబడినిచ్చే వరి,గోధుమ రకాలను అభివృద్ధిచేసి ఆహార ధాన్యాల సమృద్ధికి బీజం వేశాదు. ఆహారభద్ర తకు మార్గదర్శిగా నిలిచాడు.ఎంఎస్‌ స్వామి నాథన్‌ 1925ఆగస్టు 7న అప్పటి మద్రాసు ప్రెసి డెన్సీలోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తండ్రి ఎండే సాంబశివ న్‌ సర్జన్‌, మెట్రిక్యులేషన్‌ పూర్తయిన తర్వాత స్వామినాథన్‌ కూడా తండ్రి బాటలోనే మెడికల్‌ స్కూల్లో చేరారు. కానీ, 1943లో బెంగాల్‌ కరవును కళ్లారా చూసిన ఆయన చలించిపోయా రు. దేశాన్ని ఆకలి నుంచి కాపాడాలన్న లక్ష్యంతో వైద్య రంగం మనసు మార్చుకుని వ్యవసాయ పరిశోధనల వైపు నుంచి తన అడుగువేశారు. త్రివేండ్రంలోని మహారాజా కాలేజీలో జువాల జై నుంచి యూజీ డిగ్రీ పట్టా పొందిన ఆయన.. ఆ తర్వాత. మద్రాసు అగ్రిక ల్చరల్‌ కాలేజీ లో చేరారు. అగ్రికల్చరల్‌ సైన్స్‌ లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు.ఆ తర్వాత ఢల్లీిలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో పీజీ చదివారు. యూపీఎస్సీపరీక్ష రాసి ఐపీఎస్‌ కు అర్హత సాధించారు. కానీ,ఆ అవకాశాన్ని వదులుకుని యునెస్కో ఫెలోషిప్తో నెదర్లాండ్స్‌లోని అగ్రికల్చ రల్‌ యూనివర్సిటీలో చేరారు.
రీసెర్చి స్కాలర్‌..
1952లో ఇంగ్లండ్లోని క్యాంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ నుంచి జెనటిక్స్లో పీహెచ్‌ పూర్తి చేశారు. అమెరికా లోని విసిస్సన్‌ లో ఆయన పోస్టు డాక్టోరల్‌ రీసెర్చ్‌ చేశారు.జెనటిక్స్‌,నేచర్‌,జర్నల్‌ ఆఫ్‌ హెరిడిటీ, జెనిటీకా,యుఫిటికా,బిబిలియో గ్రాఫికా జెనటికా, అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ బాటనీ, అమెరికన్‌ పొటా టో జర్నల్‌ లాంటి పత్రికల్లో ఆయన రచనలు అయ్యాయి. రీసెర్చి స్కాలర్‌ స్వామినాథన్‌.. ప్రోస్ట్‌ రెసిస్టాంట్‌ అలుగడ్డను డెవలప్‌ చేశారు. అతి శీతల వాతావరణాన్ని తట్టుకునే ఆలు వంగడాన్ని ఆయన అభివృద్ధి చేశారు.తన రీసెర్చ్‌ కెరీర్ను క్రిప్టోజెనటిక్‌ స్టడీస్తో ప్రారంభించారు. నెదర్లాండ్స్లో ఉన్న నాగనీస్‌ఆన్‌ వ్య న వ్యవసాయ యూనివర్సిటీ లో 1949లో ఆయన ఆలుగడ్డపై తన అధ్య యనం చేపట్టారు.
పురస్కారాలు…
స్వామినాథన్‌ అనేక జాతీయ, అంతర్జాతీయ అవా ర్డుల ను గెలుచుకున్నారు. 1987లో వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ అవార్డు దక్కింది. 1971లో రామన్‌ మెగస్సే న్‌ అవార్డు వరించిం – 1986లో ఆల్బర్ట్‌ ఐన్స్టీన్‌ వరల్డ్‌ సైన్స్‌ అవార్డు పొందా రు. ఇందిరాగాంధీ శాంతి బహుమతి,1967లో పద్మశ్రీ, 1972లో పద్యభూషణ్‌,1989లో పద్మ విభూషణ్‌ పురస్కా రాలు అందుకున్నారు. 2007 నుంచి 2013 మధ్య పార్లమెంట్కు నామినేట్‌ ఎంపీగా సేవలం దించారు. 1988లో స్వామినాథన్‌ లాభాపేక్ష లేని రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ను చెన్నైలో స్థాపించారు. అలస్కా ప్రోస్టిస్‌ అన్న వెరైటీతో ఆయన ఫేమస్‌ అయ్యారు.ఆ తర్వాత ఆయన అనేక పంటలకు చెందినఎన్నోహైబ్రిడ్‌ వెరైటీలను డెవలప్‌ చేశారు.
అంతర్జాతీయ కీర్తిప్రతిష్టలు..
20వశతాబ్దంలో ఆసియాలో ప్రభావం చూపిన 20 మందివ్యక్తుల్లో ఎంఎస్‌ స్వామినాథన్‌ ఒకరని టైమ్‌ మేగజైన్‌ కీర్తించింది. మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్‌ ఠాకూర్‌ తర్వాత ప్రభావంతమైన భారతీయ వ్యక్తుల్లో ఆయన్ను ఒకడిగా పేర్కొన్నది. స్వామినాథన్‌ ను ఫాదర్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ ఎకాలజీ అని ఐక్య రాజ్యసమితి కీర్తించింది.వ్యవసాయం లో హరిత విప్లవానికి స్వామినాథన్‌ నాయ కత్వం వహించినట్లు యూఎన్‌ఓ దశలో పేర్కొన్నది. ఆ ఆహార భద్రతకోసం ఐక్యరాజ్యసమితిలో ఆయన ఎన్నోకీలప పదవుల్ని చేపట్టారు. 1980 లో ఏర్పాటు చేసిన యూఎస్‌ సైన్స్‌ అడ్వైజరీ కమిటీలో ఆయన చైర్మెన్‌గా చేశారు. వియన్నా యాక్షన్‌ ప్లాన్లో పాల్గొన్నారు.ఆ ఎఫ్‌ఎవో కౌన్సిల్‌ ఇండిపెండెంట్‌ చైర్మెన్‌గా ఉన్నారు. ప్రకృతి, ప్రకృతివనరుల సంరక్షణ అంతర్జాతీయ సంఘా నికి అధ్యక్షుడిగా చేశారు.వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచరు అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1961 నుంచి 1972 వరకు ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్స్టిట్యూట్‌ కు డైరెక్టర్‌గా ఉన్నారు. 1979 -1980లో భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. 1980 నుండి 1982 వరకు ప్రణాళికా సంఘం లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి కృషిచేశారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ డైరెక్టర్‌ జనరల్గా ఫిలిప్పీన్స్లో పనిచేశారు. అన్నదాతలకు ఆప్త మిత్రుడు.
విదేశాల నుంచి గోధుమలను దిగు మతి చేసుకునే దుస్థితి నుంచి మన దేశం వ్యవ సాయ రంగంలో స్వయం పోషకత్వం సాధించ డానికి ప్రధాన కారకుడు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.ఎస్‌. స్వామినాథన్‌. అందుకే, ఆయ నను హరిత విప్లవ పితామహుడని శ్లాఘి ఉం టారు. ఆయనకు రుణపడి ఉంటామని అన్నదా తలు అంటూంటారు.వ్యవసాయ రంగంలో సమ స్యల పరిష్కారానికి డాక్టర్‌ స్వామినాథన్‌ సిఫార్సు లను అమలు చేయాలని రాజకీయ పార్టీల నాయకులు తరచూ డిమాండ్‌ చేస్తుంటారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి,తండ్రి బాటలో డాక్టర్‌ అవుదామన్న మెట్రిక్యులేషన్‌ పూర్తి కాగానే మెడిక ల్‌ స్కూల్లో చేరారు. ఆ రోజుల్లో బెంగాల్లో కరవు విలయతాడవం యావత్‌ దేశాన్ని కుదిపేసింది. అవిభక్త బెంగాల్లో ఆకలిచావుల గురించిన వార్తలు దేశ ప్రజలను కలచివేశాయి. స్వామి నాథన్‌ డాక్టర్‌ అవ్వాలన్న తన ఆలోచన మార్చు కున్నా అధ్యయనం చేసి డాక్టరేట్‌ సంపాదించారు. ఆ రోజుల్లో మేధావులు ఏ వృత్తిలో ఉన్నా దేశం గురించే ఆలోచించేస్వామినాథన్‌. సంకరజాతి వరి, గోధుమ వంగడాలను సృష్టించడం ద్వారా అధిక దిగుబడి నిచ్చే వంగడాలను సృష్టించినం దువల్లనే ఆయనను ఈరంగానికి పితా మహుడని కీర్తిస్తున్నారు. వ్యవసాయ రంగం గ్రామాల ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది. వ్యవసాయ రంగం వృద్ధి చెందాలంటే స్వామినాథన్‌ సిఫార్సులు అమలు జరగాల్సిందేనన్నది అధికుల విశ్వాసం. ఆకలిలో మగ్గుతున్న వారు 60శాతం ఉన్నారని డాక్టర్‌ స్వామినాథన్‌,ఆయన గురువు నార్మన్‌ బోర్లోగ్‌ విశ్వసించి, ఆహార లో సాధించిన భద్రత కోసం ఏదైనా చేయాలని పట్టుబట్టి సంకరజాతి గోధుమలను కనుగొన్నారు.అదే సస్యవిప్లవానికి దారి తీసింది. స్వామినాథన్‌ కృషికిఆనాటి ప్రధాని ఇందిరా గ్రహించి గాంధీ సంపూర్ణ సహకారం అందించారు. తమ స్వార్థం కోసం కాకుండా సమాజ హితం గురించి ఆలోచించేవారు.డాక్టర్‌ స్వామినాథన్‌ రోజున తన నిర్ణయాన్ని మార్చుకో కుండా ఉండి ఉంటే దేశానికి ఒక గొప్ప వ్యవసా య శాస్త్రవేత్త లభించి ఉండే వారు కారు. ఆహార సంక్షోభంలో ఉన్న దేశాన్ని ఆహార రంగంలో స్వయం సమృద్ధిగల దేశంగా మార్చిన ఘనత ఆయనదే. అప్పట్లో అమెరికా నుంచి పిఎల్‌ 480 రకం గోధుమలను మన దేశం దిగుమతి చేసు కునేది. ఆ దశలో ఉన్న వ్యవసాయరంగం దిశ,దశ మార్చినవాడు. అందుకే మన దేశాన్ని పాడి పంటల భాగ్యభూమిఅని అభివర్ణించారు. తరత రాలుగా భారత్లో ప్రజలు ఈ రెండిరటిపై ఆధార పడి జీవనోపాధి సాగిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ 60శాతం మందిపైగా ఈ రెండు రంగాలపైనే ఆధారపడు తున్నారు.ఏదేశమైనా అభివృద్ధి సాధించేందుకు ఈ రెండు రంగాల్లో సాధించిన వృద్ధి అసలైన అభివృద్ధికి కొలమానం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం పంపిణీ కావడం వృద్ధినే అభివద్ధిగా పరిగణిస్తున్నారు. సాఫ్‌ వేర్‌ ఎగుమతులు కాదు,ఆహారధాన్యాల ఎగుమతులు పేరిగితేనే దేశం అభివృద్ధి చెందినట్టు, ఈ వాస్త వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస వ్యవస్థా పకుడు కె.చంద్రశేఖరరావు అమలులో పెడుతు న్నారు. రంగం రూపురేఖలు మారిపోయాయి. ఆహార ధాన్యాల.అదే ఆయనకు నిజమైన నివాళి.ఉత్పత్తులు 34లక్షల టన్నులకు పెరిగాయి. కేసీఆర్‌ పదేపదే ప్రకటిస్తున్నట్టు దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. స్వాతంత్య్రా నంతరం పాలకులు వ్యవసాయ, పారిశ్రామికరం గాలకు సమానంగా ప్రాధాన్యం ఇచ్చేవారు. తర్వాత వ్యవసాయ రంగంపై దృష్టి తగ్గింది. గ్రామాల్లో ఉపాధి కార్యక్రమాలు లేక అక్కడి జనం గ్రామాలు, నగరాలకు వలసలు రావడం ప్రారంభించారు.దీనిని నిరోధించేందుకు యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం ఇప్పుడు అంతంత మాత్రంగా కొనసాగుతోంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగినా అవి సక్రమంగా లేదు. అందుకే యూపీఏ హయాంలో ఆహార భద్రతా పథకాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఆపథకం నీరుగారడం వల్లనే దేశంలో పలు రాష్ట్రాల్లో ఆహార సంక్షోభం ఏర్పడుతోంది. స్వామి నాథన్‌ సిఫార్సులను అమలు చేయడం ద్వారా వ్యవసా య రంగాన్ని,ఇటు రైతులను పరిపుష్టం చేయ వచ్చు.అందుకే కేంద్రప్రభుత్వం చిత్తశుద్దితో పని చేయాలి.అదే ఆయనకు నిజమైన నివాళి.- (కె.సతీష్‌ కుమార్‌)

పెసా చట్టం అమలు చేయాలి

గిరిజనుల హక్కులకు రక్షణ కల్పించే పీసా చట్టాన్ని అమలు చేయాల్సిన అవశ్యకత ఉంది. షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో నివసించే గిరిజను గ్రామసభల ద్వారా స్వయంపాలన చేసుకోగలరు. గ్రామసభలు విద్య,ఆరోగ్యం,వ్యవసాయం,ప్రజా ఆస్తులు, గ్రామ రక్షణ,మౌలిక సదు పాయాలు మొదలైన వాటికోసం సొంతంగా కమిటీలు వేసుకొనే హక్కునిస్తోంది.అటవీ భూమి,చిన్న నీటి వనరులు,మైనర్‌ ఖనిజాలు,సహజ వనరుల వినియోగానికి సంబంధించిన హక్కులు కూడా పెసాచట్టం కింద నిర్వచించబడ్డాయి.దీనర్థంగ్రామసభలు నేల,వనరులు వంటి మొదలైన చిన్నఖనిజాల కోసం ప్రణాళికలు రూపొందించి,వాటిని ఉపయోగించు కోవచ్చు.ఏదైనా ఖనిజ తవ్వకాలకు గ్రామసభల అనుమతి తప్పనిసరి,అంటే మైనింగ్‌లీజు లేదా మైనర్‌ ఖనిజాలకోసం ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ అనుమతి దానితో ముందస్తు సంప్రదింపులు లేకుండాజారీ చేయబడదు.చెరువుల వంటి సహజ నీటి వనరులలో చేపలు పట్టడానికి మరియు నక్కల వంటి వనరులను సేకరించేందుకు నివాసితులందరికీ సమాన హక్కులు ఉంటాయి.
రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌లోని ప్రాంతాల సంప్రదాయ ఆచారాలు,పద్ధతులకు హానికలిగించే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను కూడా సభలు తిరస్కరించవచ్చు. ఏ గిరిజన భూమి అయినా గ్రామసభ అనుమతి ఇచ్చిన తర్వాతే సేకరించవచ్చు. పెసా చట్టం లక్ష్యాలను ప్రతి గిరిజనుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనాఉంది.గిరిజన జనాభాలో ఎక్కువ మందికి స్వయం పాలన అందించడం.భాగస్వామ్య ప్రజాస్వామ్యంతో గ్రామ పాలనను కలిగి ఉండటం మరియు గ్రామసభను అన్ని కార్యకలాపాలకు కేంద్రకం చేయడం.సాంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా తగిన పరిపాలనా ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం.గిరిజన వర్గాల సంప్రదాయాలు మరియు ఆచారా లను పరిరక్షించడం మరియు సంరక్షించడం.ఈ చట్టం కింద గ్రామసభలకు విస్తృత అధికారాలు అప్పగించబడ్డాయి.షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో భూమి అన్యాక్రాంతాన్ని నిరోధించడం,షెడ్యూల్డ్‌ తెగకు చెందిన ఏదైనా చట్టవిరుద్ధంగా అన్యాక్రాంతమైన భూమిని పునరుద్ధరిం చడానికి తగిన చర్యలు తీసుకోవడం,గ్రామ మార్కెట్‌లను ఏ పేరుతో పిలిచినా నిర్వహించండి,షెడ్యూల్డ్‌ తెగలకు రుణాలిచ్చే డబ్బుపై నియంత్రణను పాటించండి,అన్ని సామాజిక రంగాలలోని సంస్థలు,కార్యకర్తలపై నియం త్రణను అమలు చేయాలి.గిరిజన ఉపప్రణాళికలతో సహా అటువంటి ప్రణాళికల కోసం స్థానిక ప్రణాళికలు,వనరులపై నియంత్రణ ఉంటోంది.అదేవిధంగా పౌర సమాజంలో గిరిజనులు ఎదుర్కొం టున్న వాస్తవ సమస్యల పరిష్కారానికి పెసాను మరింత మెరుగ్గా అమలు చేయాలని పెసా చట్టం చెబుతోంది. గిరిజనుల ప్రాంతంలో మంచి పని చేస్తున్న,స్వచ్ఛంద సంస్థలు పాల్గొనవలసిన అవసరం ఉంది.
అయితే పెసా చట్టం అమలుపై పలువురు మేథావులు,ఐఏఎస్‌ విశ్రాంతి అధికారులు ప్రభుత్వాలకు ఎన్నొ లేఖలు రాస్తునే ఉన్నారు. ఇటీవల విశాఖకు చెందిన ఫోరం ఫర్‌ బెటర్‌ విశాఖ వ్యవస్థాపకులు కేంద్రప్రభుత్వ విశ్రాంతి ఐఏఎస్‌ అధికారి ఇ.ఎ.ఎస్‌.శర్మ రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో,పీసా చట్టం అమలు కావడం లేదు.అటవీ ప్రాం తాల్లో భూములను తరతరాలుగా సాగుచేస్తున్న ఆదివాసీలకు,అటవీహక్కుల చట్టం క్రింద వ్యక్తిగత,ఉమ్మడి పట్టాలు లభించడం లేదు. ఇందుకు కారణం,ప్రభుత్వ సంస్థలలో ఆదివాసీలపట్ల ఉన్న నిర్లక్ష్యం,ఉదాసీనత.ఈ విషయంలో పభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆలేఖలో పేర్కొన్నారు.
ఇప్పటికైనాపెసా చట్టాన్ని సమర్ధవంతంగా గిరిజనప్రాంతాల్లో అమలు పర్చాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. రాజ్యాంగంకల్పించిన వారి హక్కులు నిర్వీర్యం చేయకుండా గిరిజన చట్టాలను అమలు చేసేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.!- రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

త్వరలో విశాఖ నుంచి పాలన

రాష్ట్రంలో విజయదశమి కీలక మార్పులు తేనుంది. దసరా పండుగ తర్వాత పాలనా రాజధానికి సీఎంవో తరలనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుంచి అడుగు ముందుకు పడలేదు. ఎప్పటికప్పుడు తరలింపు తప్పదంటూ నాయకుల ప్రకటనలు మినహా ఆ దిశగా జరిగిందేమీ లేదు. అయితే గతంలోనే సీఎం ముఖ్య కార్యదర్శి, పలువురు అధికారులు విశాఖలో సీఎంవో,హెచ్‌వోడీల కార్యాలయాల కోసం పర్యటనలు చేశారు. నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో భవనాలనూ ఖరారు చేసుకున్నారు.
మూడు రాజధానులకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో తరలి తీరాలనే పట్టుదలతో ఉంది. అసెంబ్లీలో పాసైన చట్టంపై న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు కావడంతో తరలింపుపై వేచి చూస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని తరలింపు పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదని స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌ఆర్సీ వంటి వాటిని న్యాయ రాజధాని అయిన కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణ యించింది. హైకోర్టు తరలింపుపైనా న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తోంది.పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖ నుంచి పరిపాలనను సాగించబోతున్నట్లు ఉత్తరాంధ్ర కీలక నేతలు కూడా చెబుతున్నారు. గతంలో రెండు మూడు సార్లు ప్రయత్నాలు, ప్రచారం జరిగినా వివిధ కారణాల వల్ల అడుగు ముందుకు పడలేదు. ముఖ్య మంత్రి ఎక్కడ నుంచి పరిపాలన సాగిస్తే అదే రాజధాని అని చట్టం చెబుతోందని న్యాయస్థానంలోనూ ప్రభుతవ్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. అలాగే శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని స్పష్టం చేసింది. న్యాయపరమైన ఇబ్బందులతో బిల్లును ఉపసంహరించుకున్నా తరలింపునకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి బొత్స పలు వేదికలపై చెప్పారు. అలాగే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా విశాఖే పాలనా రాజధాని అని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే మరో బిల్లుతో వస్తామని పేర్కన్నారు. ఈ క్రమంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బిల్లు తుది దశలో ఉండటంతోనే సెప్టెంబర్‌ ఒకటిన జరగాల్సిన కేబినెట్‌ను ఏడో తేదీకి వాయిదా వేసినట్లు చర్చించుకుంటున్నారు. కేబినెట్‌ ఆమోదం తర్వాత అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదించుకోనున్నట్లు చర్చ జరుగు తోంది. సీఎం జగన్‌ ఇటీవల పర్యట నలను వేగవంతం చేశారు. రెండుమూడు సార్లు ఉత్త రాంధ్రలోనూ పర్యటించారు. ఈ క్రమంలో విశాఖతో పాటు తాడేపల్లి క్యాంపు కార్యాల యం నుంచి కూడా పరిపాలనను నిర్వహించ నున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఆవిధంగా చేస్తే న్యాయపరమైన ఆటంకాలు కూడా ఉం డవని భావిస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో పరి పాలనకు అవసరమైన అన్ని భవనాలను ఎంపిక ప్రక్రియ జోరందుకుంది. విశాఖ నుంచి ముఖ్యమంత్రి పాలన ప్రారంభిస్తే ప్రస్తుతానికి హెచ్‌వోడీలు తరలి వెళ్తే సరి పోతుందని చెబుతున్నారు.
అక్టోబర్‌ 23వ తేదీన మూహోర్తం..
విజయదశమికి ఇంకా నెలరోజులు గడవు ఉంది.ఈలోగా అమరావతి ప్రాంతంనుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకదాని తరు వాత మరొకటి విశాఖపట్నం తరలి వస్తాయని అధికార వర్గాల సమాచారం.విజయదశమి రోజు(అక్టోబర్‌ 23న) రాజధాని నిర్మాణాలకు సీఎం చేతులు మీదుగా శంకుస్థాపనకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. చట్ట బద్ధం గానే మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ సీఎం జగన్‌ గత ఏడాది సెప్టెంబరులో జీఎన్‌ రావు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అన్ని ప్రాంతాల ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి,పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలంగా డిసెంబరు నెలాఖరున నివేదిక సమర్పించింది.దీనిపై ప్రతిపక్షాలు, అమరావతికి 33వేల ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఇచ్చిన రైతుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది.ఆపై బోస్టన్‌ కన్సల్టెన్సీ నివేదిక అంటూ మరోకటి తెరపైకి తీసుకువచ్చింది.దీంతో విశాఖకు పరిపాలన రాజధానిని తరలిం చాలని ప్రభుత్వం నిర్ణయింది. విశాఖలో ఇందుకు అవసరమైన కార్యాలయాలను ఎంపిక చేసుకోవాలని అన్ని శాఖల అధిపతులకు సూచించింది. రెవెన్యూ,ఐటీ, జలవనరులు,ఆర్‌అండ్‌బీ, పురపాలన, పట్టణాభివృద్ధి,రిజిస్ట్రేషన్లు…ఇలా అన్ని శాఖల అధిపతులు ఏదో ఒక సమయంలో విశాఖ పట్నం వచ్చి, తమ శాఖకు అనుకూలమైన భవనాలను పరిశీలించుకున్నారు. కుటుం బాలతో సహావస్తే… ఉండేందుకు రుషి కొండలో ఏపీ టూరిజం నిర్మిస్తున్న ఐదు భవన నిర్మాణాల్లో రెండు భవనాలు సిద్దమవుతున్నాయి.భహుశా ఆభవనాల్లోనే ముఖ్యమంత్రి పరిపాలన కార్యనిర్వహణా కొనసాగించవచ్చని పరిశీలికలు భావిస్తున్నారు.
సీఎం కార్యాలయాలన్నీ భీమిలి నియోజకవర్గ పరిధిలోనే?
విశాఖపట్నంలో పరిపాలన రాజధాని అనగానే..భీమిలి నియోజకవర్గంలోనే రాజధాని కార్యాలయాలు రానున్నాయి.ఈ మేరకు ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కూడా ఈప్రాంతంలో పర్యటించినప్పుడల్లా ‘ఇదంతా రాజధానిప్రాంతమని అనేవారు.గత సీఎం సలహాదారు అజయ్‌ కల్లం, అప్పటి సీఎం పేషీముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌,రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి… తదితరులు విశాఖలో ప్రభుత్వ అవసరాలకు అనువైన భూములు,భవనాల కోసం అన్వేషిం చారు.మొదట రుషికొండఐటీ పార్కులోని మిలీనియం టవర్‌లో సీఎం కార్యాలయం ఏర్పాటు చేయాలని భావించారు. అప్పటికే అందులో కాండ్యుయెంట్‌ కంపెనీ ఉండడం, వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు పోతా యని ఐటీవర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో అప్పటి ఐటీ సెక్రటరీ కోనశశిధర్‌, స్వర్గీయ ఐటీ శాఖ మంత్రి గౌతంరెడ్డి విశాఖపట్నం వచ్చి…అటువంటిదేమీ లేదని, అందులో సీఎం కార్యాలయం రాదని ప్రకటించారు. అయితే ఆ పక్కనే మిలీనియం టవర్‌-2నిర్మాణాన్ని వేగవంతం చేశారు. దానిని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించు కోనున్నారు.
పరిపాలన కార్యాలయాలు గతంలో కొన్ని గుర్తింపు..
సీఎం నివాసం,కార్యాలయం,సచివాలయం ఇలా అన్నీ శాఖల కార్యాలయాలు ఏర్పాటుపై గతంలో అప్పటి సీఎంఓ కార్యాలయ ఉన్నతాధికారులు ఒక కమిటీ ఏర్పడి విశాఖలో పర్యటించి కొన్ని భవనాలను గుర్తించారు.ఎక్కడ ఏ కార్యాలయం ఏర్పాటు చేయాలి?అనే అంశాలపై క్షుణ్ణంగా పలు ప్రదేశాలను సందర్శించారు.అప్పట్లో రుషికొండ ఐటీపార్కులో స్టార్టప్‌ విలేజ్‌ భవనాన్ని సీఎం కార్యాలయం కోసం ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. అందులో స్టార్టప్‌ కంపెనీలన్నింటినీ ఏడాది క్రితమే ఖాళీ చేయించారు. ఐటీ పార్కులో ఓరాజకీయ నాయకుడికి చెందిన భవనాన్ని డీజీపీ కార్యాలయం కోసం మాట్లాడారు. మూడు ఎకరాల విస్తీర్ణంలోని ఉన్న ఆభవనంలో మరో అంతస్థు నిర్మించే అవకాశం కోసం పరిశీలిం చారు. కాపులుప్పాడలో గ్రేహౌండ్స్‌ కార్యాల యం ఉంది.అక్కడ భద్రత ఎక్కువ. అందు లోనూ కొన్ని నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు.బోయపాలెంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అల్లుడికి చెందిన పైడా విద్యా సంస్థల భవనాలను కూడా అజయ్‌ కల్లం,తదితరులు ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగపడతాయని అప్పట్లో పరిశీలిం చారు.అదే విధంగా నగరంలోని ఏలేరు గెస్ట్‌హౌస్‌ను జల వనరులశాఖ రాష్ట్ర కార్యాలయంగా,మర్రిపాలెంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ స్‌ను ఆ శాఖ ప్రధాన కార్యాలయం కోసం వినియోగించుకుంటారని కూడా అప్పట్లో సీఎంఓ ఉన్నతాధికారులు పరిశీలించడం జరిగింది.రుషికొండ ఐటీ పార్కులో పరిశ్రమలు,ఐటీ శాఖల కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.రాష్ట్ర టౌన్‌ప్లానింగ్‌ కార్యాలయం కోసం మద్దిలపాలెం ఆటోమోటివ్‌ సమీపాన వీఎంఆర్‌డీఏ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను అప్పట్లో రిజర్వ్‌ చేసి సీఎంకి నివేదించారు.
అధికారులకు అద్దె ఇల్లులు సిద్దం..
రుషికొండ కేంద్రంగా పరిపాలన సాగితే అందుకు తగ్గట్టుగా అధికారులు నివాసం ఉండటానికి ఇప్పటికే గృహలను గుర్తించారు. ఇరవై రోజులుగా బీచ్‌ రోడ్డు నుంచి రుషికొండ వరకు ఉన్న అపార్టుమెంట్లలో 128ప్లాట్లను అద్దెకు తీసుకోవడానికి ముందుగా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రవైద్యకళాశాల వైద్యుల క్వార్టర్స్‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఎనిమిది డూప్లెక్స్‌ ఇళ్లను సైతం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే కొందరు మంత్రులు విశాఖలో ఇళ్లు కొనుగోలు చేయగా,మరికొందరు అద్దెకు తీసుకోవడానికి సిద్దమయ్యారు.
మంత్రిత్వశాఖలకు అతిథి గృహాలు..ఖాళీ భవనాలు
మంత్రుల కార్యాలయాలకు ఆయా శాఖల్లోని ఖాళీ భవనాలు,అతిథగృహాలను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీ కాంప్లెక్సులో ఖాళీగా ఉన్న ప్లోరుతోపాటు,అతిథిగృహాన్ని రహణాశాక మంత్రి కార్యాలయానికి, ఆధునీకరిస్తున్నట్టు జిల్లాపరిషత్‌ అతిథిగృహాన్ని పంచాయితీశాఖ మంత్రిత్వశాఖకు,బీచ్‌ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న అతిథి గృహాన్ని పురపాలకశాఖ కార్యాలయానికి, ఈఎన్‌సీ కార్యాలయంలో జలవనరులశాఖ మంత్రికి,దేవాదాయశాఖ మంత్రికి సింహాచలంలో కార్యాలయాలు కేటాయించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
బృహత్తర ప్రణాళికతో విశాఖ అభివృద్ధి
విశాఖనగర అభివృద్ధికి భవిష్యత్తు అవసరాల దృష్టిలో ఉంచుకొని బృహత్తర ప్రణాళికతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)కే.ఎస్‌.జవహర్‌రెడ్డి జిల్లా అధికారులకు దిశనిర్ధేశం చేశారు. విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎం ఆర్‌డీఏ)పరిధిలో మూడు జిల్లాలో రూ.కోట్లతో చేపట్టే ప్రాజెక్టులు,ఇతర అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో ఆయన సమీక్షించారు. విశాకలో చేపట్టే ప్రాజెక్టులతో నగర రూపురేఖలు మారతాయని,అభివృద్ధి పనుల్లో పచ్చదనం,పారిశుద్ద్యాఆనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. బీచ్‌ కారిడార్‌లో భాగంగా కాపులుప్పాడలో సిగ్నేచర్‌ టవర్‌,ఆధునిక వసతులతో కూడిన కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించాలని జవహర్‌రెడ్డి సూచించారు. మంగమూరిపేట వద్ద జల క్రీడలు,కైలాసగిరిపైన సైన్స్‌ సిటీపాటు నగరంలోని అన్ని ఉద్యానవనాలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు.
పరిపాలన రాజధాని విశాఖ కొత్త హంగులు
ఇప్పటికే అధికారులు ఆదిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అందాల నగరంగా గుర్తింపు తెచ్చుకున్న విశాఖకు మరిన్ని కొత్త హంగులు దిద్దేందుకు జిల్లా కలెక్టర్‌,జీవీఎంసీ కమిషనర్‌,కలసి కసరత్తు చేస్తున్నారు.సీఎం నివాసముండే రుషికొండ భవనాల చుట్టూ వంద అడుగుల రహదారులు నిర్మాణమవు తున్నాయి.ఇక్కడ నుంచి నగరంలోకి సీఎం కాన్వాయ్‌ వెళ్లేందకు గీతం వర్శిటీ నుంచి జోడుగుళ్లపాలెం వరకు బీచ్‌ రోడ్డును సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు .విశాఖవ్యాలీ మలుపు నుంచి సీతకొండ వ్యూ ఫాయింట్‌ వరకు విస్తరణకు నోచుకోని బీచ్‌ రోడ్డును అటవీశాఖ అనుమతులు తీసుకొని ఐదువందల మీటర్లు పొడవును విస్తరించే పనులు శరవేగంగా కొనసాగుతు న్నాయి.రుషికొండ నుంచి ఆర్కేబీచ్‌ వరకు బీచ్‌ రోడ్డు ఇరువైపుల పుట్‌పాత్‌లు,విద్యుత్‌లైట్లతో ప్రత్యేక ఆకర్షణగా తయారు చేస్తున్నారు.నగర పరిధిలో ఉన్న ఇరుకైన రహదారులను విస్తరిస్తున్నారు. ఇప్పటికే పూర్ణామార్కెట్‌, ఓల్డ్‌టౌన్‌,కనకమహాలక్ష్మీ టెంపుల్‌,కొత్త రోడ్డు వంటి ఇరుకైన మెయిన్‌ రోడ్డులను విస్తరి స్తున్నారు. అక్కయ్యపాలెం, దొండపర్తి, రైల్వేన్యూకాలనీ తదితర ప్రాంతాల్లో కూడా మెయిన్‌రోడ్డులను విస్తరించి అకర్షణీయంగా నిర్మించేందకు జీవీఎంసీ కమిషనర్‌ దృష్టికేంద్రికరించారు.
వీఎంఆర్‌డీఏ పరిధిలో రహదారులు విస్తరణ,అభివృద్ధి..
ఇప్పుడు విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్‌డీఏ) పరిధిలో కూడా పరిపాలనా రాజధానికి కొత్త హంగులు సమకూరబోతున్నాయి.విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి భొగాపురం వరకు మెట్రో ప్రాజెక్టు ఏర్పాటుతో పాటు.భీమిలీ బీచ్‌ నుంచి భోగాపురం వరకు రోడ్డును సుందరంగా తీర్చి దిద్దాలని ప్రణాళికలు సిద్దం చేశారు. అదే రకంగా13 మండలాల వీలీనంతో ీ(వీఎం ఆర్‌డీఏ) పరిధి పెరిగింది.ఇప్పటికే అభివృద్ధిని పరుగులు పెట్టించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్ల విస్తరణ,అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధంచేస్తోంది.
అడ్డంకులు అధికమించి..
జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్నీ ఇచ్చిన నివేదికలపై హైపవర్‌ కమిటీ చర్చించి కేబి నెట్‌కు నివేదికను సమర్పించింది. చట్టసభ ఆమోదం కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా… ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్‌ చేసింది. తరువాత జనవరి 20న అసెంబ్లీ ఆమోదించింది.22న శాసన మండలి ముందుకు బిల్లును తీసుకువచ్చారు. అక్కడ కూడా ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు. మండలిలో తెలుగుదేశానికి ఎక్కువ మంది సభ్యులు ఉండడంతో శాసన మండలిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. తెలుగు సంవత్సరాది ఉగాదినాటికి విశాఖ తరలి రావాలని ప్రభుత్వం మరోయత్నం చేసింది. అది కూడా బెడిసి కొట్టింది. ఆతరు వాత స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, ఎన్నికల కమిషనర్‌ మార్పు,కరోనా వైరస్‌ వ్యాప్తి ఇలా…ఒక దాని తరువాత మరొకటి రావడంతో వేసవి సెలవుల తరువాత కార్యాలయాలు తరలించాలని యోచించారు. ఇదే సమయంలో రాజ్యాంగపరంగా అవసర మైన అనుమతుల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే వచ్చారు. రెండోసారి అసెంబ్లీలో బిల్లును ఆమోదించి, తరువాత ఆమోదం కోసం రాష్ట్ర గవర్నర్‌కు పంపిం చారు. దీంతో విశాఖపట్నం పరిపాలన రాజధానిగా మారినట్టయ్యింది.- గునపర్తి సైమన్‌

స్వాతంత్య్ర ఉద్యమ సమిధ`భరత్‌సింగ్‌

ఉద్యమం అతని ఊపిరి. దేశభక్తి అతని హృదయం. స్వాతంత్య్రం అతని లక్ష్యం. పట్టుదల -శ్రమ అతని నేత్రాలు. నిస్వార్థం అతని రక్తం. ఫలితం ఉరి తీత.భగత్‌ సింగ్‌ పంజాబ్‌లోని లాయల్‌ పూర్‌ జిల్లా,బంగా సమీపంలోని ఖత్కర్‌ కలాన్‌ అను గ్రామంలో విద్యావతీ, సర్దార్‌ కిషన్‌ సింగ్‌ దంపతులకు జన్మించిన సంధూరaాట్‌ కుటింబీకుడు. ‘‘భక్తుడు’’ అనే పదమునకు పంజాబీలో భగత్‌ అనే పదంతో వాడతారు. ఆతల్లిదండ్రులకు కూడా దేశభక్తి ఎక్కువగా గల సిక్కుల కుటుం బంలోనివారు. స్వాతంత్య్రోద్య మంలోను, మరికొందరు మహారాజా రంజిత్‌ సింగ్‌ సైన్యంలోను పనిచేయడం వలన దేశభక్తి వారి కుటుంబాల్లో కలసిపోయి వారి సంతానానికి ‘‘భక్తుడు’’గా చెప్పబడే భగత్‌ నామకరణం పెట్టడం జరిగింది.
భగత్‌ సింగునకు మూడేళ్ల వయస్సులో తండ్రి కిషన్‌ సింగ్‌ ఎత్తుకుని అతని స్నేహితుడు నంద కిషోర్‌ మెహతాపాటుగా కొత్తగా మొక్కలు వేస్తున్న తోటలోనికి వెళ్ళడం జరిగింది.అక్కడే ఆడుకుంటున్న భగత్‌ సింగ్‌ మట్టిలో చిన్న చిన్న గడ్డిపరకలను నాటటం మొదలుపెట్టాడు. అతనిని తండ్రి ఏమి చేస్తున్నావు భగత్‌ అని ప్రశ్నిస్తే భగత్‌ ఇచ్చిన సమాధానానికి వారు అవాక్కయినారు. అతన నోట తుపాకులు నాటుతున్నా అని పలికేడు. మొలకలు వేసే వయస్సులో తుపాకులను మొలకెత్తించాలని చూడడం అతని వ్యక్తిత్వానికి మచ్చుతునక. విధ్యార్థి దశలో భవిష్యత్తుకు బాల్యమే మొలక అని తెలియచేసాడు. విధ్యార్థి దశలో ఆట పాటలలో చుకుకుగా ఉంటూ అందరితో స్నేహంగా ఉండేవాడు. భగత్‌ బాబాయి అజిత్‌ సింగ్‌ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉంటున్న సమయంలో,కంటనీరు పెట్టుకొన్న చిన్నమ్మ హర్నామ్‌ కౌర్‌ ను చూసి నాలుగేళ్ళ భగత్‌ సింగ్‌ పిన్నీ ఏడవద్దు,నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటాను అని ప్రతిజ్ఞ చేసాడు. స్వామీ దయానంద సరస్వతి అనుచరుడైన సింగ్‌ తాత అర్జున్‌ సింగ్‌ హిందూ సంస్కరణ ఉద్య మం ఆర్యసమాడంలో భాగం కావడం కూడా ఆయనపై విపరీతమైన ప్రభావం పడిరది. అపరిష్కృత కేసుల కారణంగా బ్రిటిష్‌ వారు అజిత్‌ సింగి పెర్సియాకు పారిపోగా కరోరి రైలు దోపిడీ నేరం మోపి సింగ్‌ బాబాయిని 1927 డిశంబర్‌ 19న ఉరితీసిన వైనం భగత్‌ మనో ఫలకంపై ముద్రపడి, ఈ దాస్యశృంఖలాల నుండి భారతదేశమును విడిపించాలనే కోరిక బలంగా నాటుకొనిపోయింది.13 ఏళ్ళ వయస్సులోనే గాంధీజీ తలపెట్టిన సహాయ నిరాకరణోద్యమానికి ప్రభావితు డయ్యాడు. బ్రిటిష్‌ దిగుమతి దుస్తులను తగులబెట్టడం ద్వారా గాంధీ సిద్దాంతాలను అనుసరిం చాడు.1923లో పంజాబ్‌ హిందీ సాహిత్య సమ్మేళన్‌ నిర్వహించిన వ్యాసరచన పోటీలో భగత్‌ విజయం సాధించాడు. ఆవయస్సులో ప్రముఖ పంజాబీ సాహిత్యానిన ఉటంకించడమే కాకుండా పంజాబ్‌ సమస్యలను తన సాహి త్యంలో ప్రస్థావించాడు.భగత్‌ లాహోర్‌లోని నేషనల్‌ కళాశాలో విధ్యాభ్యాసం చేశాడు. ఇంటిలోని పెద్దలు పెళ్ళి ప్రస్థావన తేగానే ఇష్టంలేని భగత్‌ఇల్లు వదలి పారిపోయి నౌజవాన్‌ భారత్‌ సభ (దానిని భారత యువ జన సంఘము అని కూడా అంటారు)లో చేరి, సహ విప్లవకారుల సహాయంతో యువతను ఆకట్టుకున్నాడు. ఫ్రొఫెసర్‌ విధ్యాలంకౌర్‌ విజ్ఞప్తి మేరక,అప్పట్లో రామ్‌ ప్రసాద్‌ బిస్మిత్‌, అఫ్పా ఖుల్లా ఖాన్‌ నాయకత్వం వహిస్తున్న హిందూ స్తాన్‌ గణతంత్ర సంఘంలోనూ చేరి విప్లవాత్మక సాహిత్యం ఉర్థూ,పంజాబీ వార్తాపత్రికలలో వార్తలు వ్రాసేవాడు, పర్యవేక్షించేవాడు. 1928లో దేశవ్యాప్తంగా ఉన్న అనేకమంది విప్లవకారులు కీర్తి కిసాన్‌ పార్టీ పేరుతో ఢల్లీిలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. విప్లవకారు లను నాటి బ్రిటిష్‌ ప్రభుత్వ నిరంకుశ పాలనలో ఉరితీయడం, కఠిన కారాగార శిక్షలు వేయడం తెలిసిన విషయమే. కటకటాల వెనకాల భగత్‌ సింగ్‌ ఒక అధ్యయన శీలిగా కాలాన్ని గడిపాడు.రాజనీతి,అర్థ శాస్త్రం, సామాజిక శాస్త్ర విషయాలను ప్రభోధించే అనేక గ్రంథాలను ఆయన అధ్యయనం చేసాడు. పుస్తకాలు చదువుతూ,చదువుతూ సింగ్‌కు ఇష్టమైనపాట,రామ్‌ ప్రసాద్‌ భిస్మిల్లాగారు వ్రాసిన పాటను మేరా రంగ్‌ దే బసంతీ చోలా పాడుకుంటారు. సింగ్‌ మంచి సాహితీవేత్త కూడా.ఉత్తమ సాహితీ వ్యసాలు,ఉద్యమ వార్తలు వ్రాయటంలో దిట్ట. అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టి యువతను చైతన్యపరుస్తూ కర్తవ్యబోధ చేసే వాడు.30అక్టోబర్‌ 1928న బ్రిటిష్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమీషన్‌ ‘‘సర్‌ జాన్‌ సైమన్‌’’ నాయకత్వంలో ఏర్పడిరది.ఆ సమయంలో ఆ కమీషన్‌లో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడంతో భారతీయ రాజకీయ పార్టీలు దానిని బహిష్కరించాయి.ఫలితంగా, దేశ వ్యాప్తంగా పలు నిరసనలు వెల్లవెత్తా యి.30 అక్టోబర్‌ 1928న కమీషన్‌ లాహోర్‌ సందర్శించినపుడు సైమన్‌ కమీషన్‌కు వ్యతి రేకంగా లాలాలజపతిరాయ్‌ నేతృత్వంలో నిశ్శబ్ధ అహింసా పద్దతిలోఒకనిరసన కార్యక్రమం జరిగింది.అయితే అక్కడ హింసను రేకెత్తించటానికి పోలీసులే కారణమయ్యారు. ప్రశాంతంగా నిరసన చేసుకుంటున్న వారిపై లాఠీ చార్జి జరిపారు.లాలాలజపతిరాయ్‌ ఛాతీపై బలంగా కొట్టడంతో వారికి బలమైన గాయాలు తగిలాయి. తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కళ్ళార చూసిన యువకుడు భగత్‌ సింగ్‌ ప్రతీకారం తీర్చుకోవాలనే కాంక్ష బలంగా హృదయంలో స్థిరపడిరది. పోలీసు అధికారి స్కాట్‌ ను హతమార్చడానికి విప్లవ కారులు శివరామ్‌ రాజ్‌ గురు,జై గోపాల్‌, సుఖదేవ్‌ ధాపర్లలోతో చేతులు కలిపాడు. ఫలితంగా స్కాట్‌కు బదులు సాండర్స్‌ హతమయ్యాడు. పొరపాటు గుర్తింపు కారణంగా మరియు డి.ఎస్పీ జె.పి.సాండర్స్‌ కనిపించినపుడు సింగుకు జైపాల్‌ తప్పుగా సంకేతమిచ్చాడు.ఫలితంగా స్కాట్‌కు బదులు సాండర్స్‌ను హతమార్చడం జరిగింది. ఈ కారణంగా పోలీసులనుంచి దూరంగా లాహోరు పారిపోయాడు భగత్‌.విప్లవకారుల చర్యలను అణచివేసే దిశగా భారత రక్షణ చట్టమును తీసుకురావడం ద్వారా పోలీసులకు బ్రిటిషు ప్రభుత్వం మరిన్ని ప్రత్యేక అధికారాలు కల్పించింది.భగత్‌ సింగ్‌ వంటి దేశభక్తి ఉద్యమ కారులను అణచివేయడం ఈచట్టం యొక్క ముఖ్య ఉధ్దేశ్యము. ఆతరువాత ఈచట్టం ప్రజాహితం కోసమే అటూ ప్రత్యేక శాసనం క్రింద ఈచట్టాన్ని ఆమోదించారు. అయితే దానిని వ్యతిరేకిస్తూ ఆమోదం కానున్న సమయంలో కేంద్ర శాసనసభపై బాంబు పేలుడుకు హిందూస్థాన్‌ వాద గణతంత్ర సంఘం వ్యూహరచన చేసింది.దీనికి భగత్‌ సింగ్‌ ను కాకుండా మరొక విప్లవకారుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ అడ్డుపడ్డాడు.అయితే సింగు ఆశయాలను గౌరవించే మరికొందరు పార్టీ సభ్యులు ఆయనపై వత్తిడి తీసుకొచ్చారు. దాని ఫలితంగా 8ఏప్రిల్‌ 1929 భగత్‌ సింగు మరి యొక విప్లవకారుడు కలసి అసెంబ్లీ వసారాలపై బాంబు విసిరి,‘‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ రిమం బర్డు-డైలీ టైమ్స్‌ పాకిస్థానీని తరువాత వినికిడి శక్తి కోల్పోయేలా గొంతెత్తి అరుస్తామని ముద్రించబడిన పలు కలపత్రాలనువెదజల్లారు. కేంద్ర అసెంబ్లీ ఆవరణలో కరపత్రం విసిరివేత, బాంబు దాడివల్ల ఏఒక్కరు మరణించడంగాని, గాయపడడంగాని జరుగలేదు.తమ వ్యూహంలో భాగంగానే ఉద్ధేశ్యపూర్వకంగానే జాగ్రత్తలతో కూడినదాడి చేసినట్లు భగత్‌ సింగ్‌,దత్‌లు అంగీకరించారు. బాంబు గాయపరచేంత శక్తివంతమైనది కాదని, బ్రిటిష్‌ ఫోరెన్సిక్‌ విచారణాధికారులు కూడా తేల్చిచెప్పారు.12 జూన్‌1929న సింగ్‌,దత్‌లు దేశ బహిష్కరణకు గురయ్యారు.అసెంబ్లీ పేలుడుపై విచారణ నేపద్యంలో జె.పి.సాండర్స్‌ హత్య వెనుక భగత్‌ సింగ్‌,రాజ్‌ గురు,సుఖదేవ్‌లపై అభియోగాలు మోపారు.భారతదేశంలో స్వాతంత్య్ర సమర యోధుడు,విప్లవకారుడు,రచయిత, ప్రారంభ మార్సిస్టు,ఇప్పుడుపాకిస్థాన్‌ లాహోర్‌లో జన్మిం చిన ధైర్యశాలి.భారత్‌, బ్రిటిన్‌ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండు చేస్తూ జైలులో 64రోజులు నిరా హార దీక్షను చేపట్టడం ద్వార సింగ్‌ విపరీ తమైన మద్దతును కూడ గట్టుకున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు లాలాలజపతి రాయ్‌ని ఒకపోలిసు అధికారి హత్య నేరంపై ఉరితీసిన సంఘటన భగత్‌ సింగ్‌లో అగ్ని జ్వాలలు రేపాయి.ప్రతీకార వాంఛ పెరిగింది. మన మాతృదేశంపై పరాయి పెత్తనం సహించ లేకపోయేవాడు.ఆయన ఉత్తరదాయిత్వం భారత స్వాతంత్య్రసిద్ధికి పోరాడేలా యువతను ప్రేరేపించింది.అంతేకాక భారత్‌లో సామ్య వాద వ్యాప్తి మరింత పుంజుకుంది.భగత్‌ సింగ్‌ లో అరాజకవాదం (అనార్కిజం),సామ్యవాదం (కమ్యూనిజం)అనే భావనలు జీర్ణించుకున్నాడు. బకునిన్‌,మార్క్స లెనిన్‌ రచనలను ఎక్కువ చదివేవాడు.1928 మే నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో అరాజకత్వంపై పంజాబీ వార్తాపత్రిక కీర్తిలో వరుసగా అనేక కథనాలు ప్రచురిం చాడు.అరాచక తత్త్వాన్ని ప్రజలు సరిగా అర్థం చేసుకోవటం లేదని చింతిస్తూ ఉండేవాడు. ‘‘అరాజకత్వం అనే పదానికి ప్రజలు భయపడుతున్నారు’’ అని ఆయన పేర్కొన్నాడు. భారత్‌లో విశ్వజనీన సహోదరత్వం అంటే సంస్కృతంలో చెప్పినట్టుగా వసుధైక కుటుంబకం మొదలైనవి రావాలని ఆకాంక్షించేవాడు. అరాజకత్వం సిద్ధాంతం గురించి విస్తృతంగా ప్రచారం చేసిన తొలి వ్యక్తి ఫ్రౌధన్‌.అందువలనే అరాజకత్వ వ్యవస్థాపకుడని పిలుస్తారు. 1931 లో జైల్లో ఉండగా నాస్తికవాద తత్త్వాన్ని వివరి స్తూ ‘‘నేను ఎందుకు నాస్తికుడిని’’ అంటూ ఒక వ్యాసం వ్రాసాడు.జైలులోఉండగా,మతం, దేవుడిపట్ల విశ్వాసం లేనివ్యక్తిగా సహచర విప్లవకారులు తనని విమర్శించిన కారణంగా ఈ వ్యాసం వ్రాయటం జరిగింది. తనను అహంకారిగా కూడా చిత్రీకరించుకున్న అరుదైన వ్యక్తిత్వం భగత్‌ సింగ్‌ది. స్వంత విశ్వాసా లను గౌరవించే సింగ్‌ సర్వశక్తి సంపన్నుడి పట్ల ధృడ విశ్వాసినని చెప్పేవాడు. అయితే ఇతరుల హృద యాలకు దగ్గరగా ఉండే కల్పిత గాథలు,విశ్వా సాలను నమ్మే స్థాయికి తాను దిగజారబోనని స్పష్టం చేసాడు. మతం చావును సులభతరం చేస్తుందనే వాస్తవాన్ని గుర్తించాలని అనేవాడు. డైరీ వ్రాసే అలవాటు వున్న భగత్‌ సింగ్‌ 404 పుటలను నింపాడు.తాను సమర్థించే పలు ప్రముఖుల ఉల్లేఖనాలు, వారి గొప్ప వాక్యాలను వ్రాసుకున్నాడు.భగత్‌ సింగ్‌ డైరీలోని పలు వ్యాఖ్యలు ఆయన విశిష్టమైన దార్శినిక అవగాహనకు అద్ధం పడుతుంది. 23 మార్చి, 1931న భగత్‌ సింత్‌ తోపాటు ఆయన సహచరులు,రాజ్‌ గురు,సుఖ్‌ దేవ్లను లాహోరులో ఉరితీసారు. సింగు ఉరిని వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న మద్ధతు దారులు ఆయనను ఆక్షణమే ‘‘షహీద్‌’’ అంటే అమరవీరుడుగా ప్రకటించారు. అప్పటి సూపరింటెండెంటు ఆఫ్‌ పోలీసు వి.ఎన్‌.స్మిత్‌ ఆజ్ఞ ప్రకారం సింగును ముందుగానే ఉరితీ సారు.సాధారణంగా ఉదయం 8గంటలకు తీసే ఉరిని, ఏమి జరిగిందో ప్రజలు తెలుసుకునే లోగా ఉరి తీయాలని నిర్ణయించుకున్నారు. సుమారు రాత్రి 7గంటల సమయంలో జైలు లోపలనుంచి ‘‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’’ అంటూ నినాదాలు మిన్నుముట్టాయి. సింగు జీవితానికి చివరగా తెర దించబోతున్నారన్న విషయంలో అది సంకేతమైంది. సట్లెజ్‌ నది ఒడ్డున ఉన్న హుస్సేనీవాలా వద్ద ఒక వీరుని దహనం జరిగింది.భగత్‌ సింగ్‌ స్మారక చిహ్నం నేడు భారత స్వాతంత్య్ర సమర యోధులను గుర్తుకు తెస్తుంది.
ఆఖరి కోరిక
తీవ్రమైన ఒత్తిడి పరిస్థితులలోనే తలవెండ్రుకలు, గడ్డం తీసివేయటం జరిగింది.‘‘దేశసేవ కోసంమే అదంతా తన సహచరుడు సిక్కు రూపాన్ని కూర్చుకునే విధంగా ఒత్తిడి చేసారు.’’
భగత్‌ సింగ్‌ కు సంబంధించి ప్రత్యేకించి ప్రము ఖులు ఆయన మరణం చుట్టూ నెలకొన్న సంఘ టనల వెనుక పన్నాగ సిద్దాంతాలు ఉన్నాయను కుంటారు.-ఆచార్య. దేవులపల్లి పద్మజ

నాలుగున్నరేళ్లలో సంక్షేమ ఫలాలెన్నో..

సంక్షేమం పథకాలు అందరికీ అందాలి..కులం, మతం, ప్రాంతం, పార్టీలు,రాజకీయాలకుతీతంగా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు చేరాలి..పార్టీలకతీతంగా ప్రతి పేద వాడూ ధైర్యంగా బతికే అవినీతి రహిత,స్వచ్ఛమైన పరిపాలన తీసుకు వస్తాం..` సీఎం.జగన్‌
అభివృద్ధి,సంక్షేమం ఈ రెండిరటి ఫార్ములానే ప్రామాణికంగా తీసు కుని జగన్‌ పాలన కొనసాగుతోంది. తండ్రి నుంచి రాజకీయ వార సత్వాన్ని అందిపుచ్చుకున్న జగన్‌..వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బాటలోనే అడుగులు వేస్తున్నారు.ఎన్నికల ముందు ఆచరణ సాధ్యమయ్యే హామీలనే జగన్‌ ఇచ్చారు. ఇప్పుడు వాటిలో చాలా వరకు అమలు చేయడం సులు వైందని అంటున్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి కేబినెట్లోనే 14 మంది బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అంటే 56శాతం వారికే అవకాశమిచ్చారు.2022 ఏప్రిల్‌ 11న మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో ఈశాతాన్ని ఏకంగా 70కిపెంచారు. కేబినెట్‌ నుంచే సామాజిక న్యాయాన్ని మొదలు పెట్టారు.అటు రాజ్యసభకు 8సీట్లలో నాలుగింటిని బీసీలకే ఇచ్చారు. నాలుగేళ్లన్నర పాలనలో సీఎంజగన్‌ ఏపీలో చాలా సమస్యలకు పరిష్కారం చూపారం టున్నారు. నిషేధిత జాబితా భూముల సమస్యను సులువుగా పరిష్కరించారు.3లక్షల ఎకరాలను ఆజాబితాను తొలగించారు.చుక్కల భూములు,షరతులుగల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారుజగన్‌. పారిశ్రామికంగానూ ముందడుగు వేశామని వైసీపీ నేతలు అంటు న్నారు.ఇందుకు నిదర్శనం కొత్తగా 4పోర్టులు, 10ఫిషింగ్‌హార్బర్లు,6 ఫిషింగ్‌ ల్యాండ్‌లు, 3ఎయిర్‌పోర్టుల నిర్మాణం చేపట్టామని గుర్తు చేస్తున్నారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌తో పెట్టుబడులను ఆకర్షించగలిగారు. పౌర సేవల్ని ఏఊరికి ఆ ఊళ్లోనే అందించడానికి 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి.వీటిలో 1.34లక్షల మంది యువత ప్రభుత్వోద్యోగులుగా చేరారు. ప్రభుత్వ సేవల్ని ఇంటింటికీ నేరుగా అందించడానికి 2.65లక్షల మందితో వాలంటీర్లను ఏర్పాటు చేశారు.10,592 గ్రామ,పట్టణ హెల్త్‌ క్లినిక్‌లు పెట్టించారు. పేదలకు రేషన్‌ సరుకులు ఇంటి ముందుకే వస్తున్నాయి.దీనికోసం 9,260 డెలివరీ వ్యాన్‌లు పనిచేస్తున్నాయి.ఏపీ మోడల్‌ అన్న చర్చ తీసుకురావడానికి కారణం పాలనలో సీఎం తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలే. సచివాలయ వ్యవస్థ నుంచి ఆర్‌బీకే,రేషన్‌ డోర్‌డెలివరీ,వాలంటీర్‌ వ్యవస్థ..ఇలా అన్నిటినీ కొన్ని రాష్ట్రాలు స్టడీ చేశాయి. 2014ఎన్నికల్లో అధికారంలోకి వస్తారని ఆశించినా..అప్పుడు అపోజిషన్‌ కే పరిమితం అయ్యారు జగన్‌. ఓ వైపు కోర్టు కేసులు, మరోవైపు సుదీర్ఘ పాదయాత్ర ఇలా చాలా ఆటుపోట్ల తర్వాత 2019లో ప్రజావిశ్వాసం పొందారు. ప్రజల నమ్మకం పొందడమే రాజకీయ నాయకులకు ముఖ్యం. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారికి అదో జడ్జిమెంట్‌గా మారుతుంది. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు జగన్‌. పేదలందరికి ఇళ్లు,అమ్మఒడి,పెన్షన్లపెంపు,ఫీజురీఇంబర్స్‌ మెంట్స్‌, వైఎస్‌ఆర్‌ చేయూత,వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, వైఎస్‌ఆర్‌ ఆసరా వంటి పలు హామీలను ఎన్నికల సమయంలో ఇచ్చిన జగన్‌..అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని అమలు చేసే ప్రయ త్నం చేశారు. ఇప్పటి వరకు సంక్షేమ పథకాలద్వారా దాదాపు రెండులక్షల పదివేలకోట్ల రూపాయలను డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ ఫర్‌ విధానం ద్వారా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే సర్కార్‌ జమచేసింది. ఇదే అంశాన్ని వచ్చే ఎన్నికల్లో వైసీపీ తమ అస్త్రంగా వినియోగించుకోనుంది.
2019 మేలో జగన్‌ అధికారం చేపట్టగా.. ఏడాదిలోపే 2020 మార్చ్‌ నుంచి కరోనా ప్రపంచంపై తీవ్రమైన ఎఫెక్ట్‌ చూపించింది. అది ఏపీ ఆర్థిక, ఆరోగ్య రంగాలపై ప్రభావం చూపింది. ఒకదశలో ఏపీనుంచి హైదరా బాద్‌కు రోగులు క్యూ కట్టారు.అప్పుడు రాక పోకలు నిలిచిపోవడంతో చాలాఇబ్బందులు ఎదురయ్యాయి.అలాంటి పరిస్థితులనుంచి ఏపీని ఆరోగ్యరంగంలో ముందుకెళ్లే దిశగా సీఎం చర్యలు చేపట్టారు. ఒకదశలో దేశంలోనే ఎక్కువ కరోనా టెస్టులు చేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతి కల్పించారు. జిల్లాకు ఒకమె డికల్‌ కాలేజీ నిర్మించాలని నిర్ణయిం చారు.ఇప్పుడు ఉన్న మెడికల్‌ కాలేజీలకు అదనంగా 17మెడికల్‌ కాలేజీల ఏర్పాటు చేయలని జగన్‌ డిసైడ్‌ అయ్యారు. వీటిలో కొన్నింటికి కేంద్రం నుంచి అనుమతులు రాగా కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ను సైతం తీసుకొచ్చారు జగన్‌. ఫ్యామిలీ ఫిజీషియన్‌ డాక్టర్‌ విధానంలో డయాబెటిక్‌, హైపర్‌ టెన్షన్‌తో పాటు పలు అసాంక్రమిక వ్యాధులను గుర్తించి వైద్యం చేస్తున్నారు. ప్రతి పీహెచ్సీకి ఇద్దరు డాక్టర్లను నియమించారు. మండలానికో 104,108 వాహనాలను పెట్టిం చారు. దేశంలోనే ఏరాష్ట్రంలోనూ అమలుచేయని విధంగా గ్రామ/వార్డు సచివాలయవ్యవస్థ ద్వారా సేవల్లో కొత్తపంథా తెరపైకి వచ్చింది. సామాన్య జనానికి సులువుగా సేవలు అందే పరిస్థితి వచ్చింది. సంక్షేమం,అభివృద్ధి రెండు కళ్ల మాదిరిగా పాలన సాగుతోంది. ప్రతి తల్లీ తన బిడ్డను బడికి పంపితే అమ్మఒడి కింద 15వేల రూపాయలు అందిస్తున్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌,వసతి దీవెనకు నేరుగా సొమ్ములిస్తున్నారు. విదేశీ విద్యాదీవెన ద్వారా విద్యార్థులకు చేయూత అందిస్తున్నారు. అటు రైతులకూ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం,వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాలు,ఇన్‌ పుట్‌ సబ్సిడీ, డ్రిప్‌,స్ప్రింక్లర్ల అందజేత,విత్తన సబ్సిడీ ఇవన్నీ అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలను నగదు బదిలీ ప్రక్రియ ద్వారా అమలు చేయడంవల్ల అవినీతికి,అక్రమాలకు తావు లేకుండా పోయిందని,రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే సహాయం ప్రజానీకానికి ఇంత సాఫీగా అందడం ఇదే సర్కార్‌ హయాంలో తొలిసారి అని అంటున్నారు.
వైద్యవిద్యలో నవశకం..
రాష్ట్ర చరిత్రలోతొలిసారిగా 5 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను సీఎం జగన్‌ ప్రారం భించారు. విజయనగరంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని తన చేతుల మీదుగా ప్రారంభించిన సీఎం..అనంతరం వర్చువల్‌ విధానంలో రాజమహేంద్రవరం,ఏలూరు,మచిలీ­పట్నం, నంద్యాలలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రారంభించారు. అంతేకాకుండా విజయనగరం మెడికల్‌ కాలేజీలో ఫొటో ఎగ్జిబిషన్‌నుతిలకించారు. కాలేజీ భవనంలోని వివిధ విభాగాలకు సంబంధించిన గదులను పరిశీలించి ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో సీఎం జగన్‌ ముఖాముఖి నిర్వహించారు.
17మెడికల్‌ కాలేజీల కోసం రూ.8,480కోట్లు
స్వాతంత్య్రం వచ్చాక మన ఏపీలో కేవలం 11మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, ఈ నాలుగున్నరేళ్లలో మన ప్రభుత్వం 17మెడకల్‌ కాలేజీలు ప్రారంభించేందుకు ప్రణాళిక చేశామని,అందుకోసం రూ.8,480 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.అందులో భాగంగా ఐదు కాలేజీలు ప్రారంభించటం సంతోషంగా ఉందని, వచ్చే ఏడాది మరో 5కాలేజీలను ప్రారంభిస్తామని,ఆమరుసటి ఏడాది మరో 7కాలేజీలు ప్రారంభించడానికి సీఎం ప్రతిసాదించారు. ఇప్పటి వరకు ఉన్న మెడికల్‌ కాలేజీలలో 2,185 సిట్లు కేటాయించగా, కొత్త కాలేజీల రాకతో 4,735కి సీట్ల సంఖ్య చేరింది. అంతేకా కుండా మలో18 నర్సింగ్‌ కాలేజీలను కూడా అందుబాటుకి తీసుకువస్తున్నట్లు సీఎం వెల్లడిరచారు. అంతేకాకుండా ఈకాలేజీల ద్వారా పీజీ మెడికల్‌ సీట్ల సంఖ్యను నాలుగేళ్లలో 966 నుంచి 1,767కి పెంచను న్నారు. మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను మెరుగుపరిచేందుకే పని చేస్తున్నామని ప్రతి విద్యార్ధి ఈ ఆవకాశాన్ని ఉపయోగించుకుని ఈ సమాజంలో ఒక మంచి డాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకుని సేవ చేయా లనదే సీఎం జగన్‌ ఆకాంక్ష!
వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు
నాలుగేళ్లలో ఏకంగా దాదాపు 53వేలకు పైగా వైద్య పోస్టుల భర్తీ చేశారు.ఎప్పటి ఖాళీలు అప్పుడే యుద్ధప్రాతిపదికన నియామకాలు కోసం ప్రత్యేకంగా రిక్రూట్‌ మెంట్‌ బోర్డ్‌ కూడా ఏర్పాటు చేశారు. రూ.16,852 కోట్లతో 17కొత్త వైద్య కళాశా లలు,వివిధ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు నాడు-నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రులకు జవసత్వా­లు చేశారు. గ్రామాల్లో 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటు చేశామని, 12రకాల వైద్య సేవలు,14రకాలపరీక్షలు,105రకాల మందు లతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్‌కాన్సెప్ట్‌ అమలు చేస్తున్న ప్రభుత్వం మనదే!. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్‌సీ వైద్యులు వెళ్తారని దీని ద్వారా రానున్న 6నెలల్లో పేదలకు మంచి వైద్యం అందించి ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మారనునా గ్రామస్థాయిలో ఆశా వర్కర్ల ద్వారా సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా సరఫరా చేస్తున్నారు.వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి ఏకంగా3,257కి పెంచారు.40లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కోసం రూ.8వేలకోట్ల వెచ్చించామని చెప్పారు.తాజాగాఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి పేద వాడికి రూ.1ఖర్చు లేకుండా పరీక్షలు చేసి చికిత్స అందిస్తుండటం విశేషం. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లిస్తున్నారు. ఇప్పటివరకూ 17.25లక్షల మందికి రూ.1,074.69 కోట్లు ప్రభుత్వం అందించింది.108,104 వాహనాలు సంఖ్యను కూడా పెంచారు.
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
నాలున్నర ఏళ్లలో విద్యారంగంలో అనేక రకాల విప్లవాత్మకమైన మార్పులు తీసుకొ చ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గ్లోబల్‌ సిటిజన్స్‌గా తీర్చిది ద్దేందుకు సీఎం వైయస్‌ జగన్‌ మరిన్ని చర్యలు ప్రారంభించారు. ప్రపంచస్థాయిలో పోటీని తట్టుకునేలా,మారు తున్న టెక్నాలజీరంగంలో విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్దేలా మరో అడుగు ముందుకేశారు. భవిష్యత్తు టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నైపుణ్యాలతో ప్రభుత్వవిద్యార్థులను తీర్చిదిద్ది వారికి హైఎండ్‌ టెక్నాలజీ రంగంలో ఉన్నత ఉద్యో గాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ఈతరం పిల్లలకు గ్లోబల్‌ చదువులు
దీనికోసం ప్రభుత్వంలోని ఉన్నతాధికారు లు,గ్లోబల్‌టెక్‌ కంపెనీల ప్రతినిధులతో ఉన్నత స్థాయి వర్కింగ్‌ గ్రూపును ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులను తీసుకు వచ్చారు. అమ్మఒడి,విద్యాకానుక, వసతిదీవెన, విద్యా దీవెన లాంటి పథకాలను అమలు చేయడమే కాకుండా పాఠ్యప్రణాళిక పరంగా,మౌలిక సదుపాయాల పరంగా ఎన్నెన్నో మార్పులు తీసుకువస్తున్నారు.
నవశకంలో తెచ్చిన మార్పులివే..
దీంట్లో భాగంగా 2019-20 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోని 41 లక్షలమంది విద్యార్థులకు ఇంగ్లిషు మీడియం చదువులు అందుతు న్నాయి. జాతీయస్థాయి, ప్రపంచస్థాయి విద్యా ర్థులతో పోటీపడేలా అన్ని ప్రభుత్వ పాఠశా లలకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ వచ్చేలా 2022-23లో ప్రభుత్వం చర్యలు ప్రారం భించింది. ప్రపంచస్థాయిలో ప్రభుత్వ పాఠశా లల విద్యార్థులు పోటీపడాలంటే ఇంగ్లిషులో ప్రావీణ్యం చాలా కీలకం.పాఠ్య ప్రణాళిక, మౌలిక సదుపాయాలు,మాన వవన రులు, లెర్నింగ్‌ కంటెంట్‌,ల్యాబులు తదితర అంశాలు పాఠశాలల్లో ఎలా ఉండా లన్న దానిపై ఈ వర్కింగ్‌ గ్రూపు ఖరారు చేయనుంది.
‘అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే ధ్యేయంగా..ఖాతాల్లోకి రూ.1,353.76 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్‌ అందజేసింది.నిజమైన వ్యాపార వేత్తలుగా మార్చాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం అమలు విజయవంతంగా సాగుతోంది. మన ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలు వారి కాళ్ళ మీద వారు నిలబడేలా,వారి జీవనోపాధి మెరుగుపరుస్తూ..బహుళ జాతి,దిగ్గజ కంపెనీలు,బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ వంటి పథకాలతో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి సీఎం జగన్‌ బాటలు వేశారు.ఈప్రభుత్వం చొరవతో బ్యాంకుల లోవడ్డీ రేట్లు తగ్గింపజేయడంతో అక్కచెల్లె మ్మలపై ఏకంగా రూ.1,224కోట్ల మేర వడ్డీ భారం తగ్గింది. ప్రభుత్వ సహకారంతో పశువుల కొనుగోలు,కిరాణా దుకాణాలు,వస్త్ర వ్యాపారాల వంటి వివిధ వ్యాపారాలు చేసుకుంటున్న 16,44,029 మంది అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.7వేల నుంచి 10వేల వరకు అదనపు ఆదాయం పెరిగింది. అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి లీటర్‌ పాలపై రూ.20వరకు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. – గునపర్తి సైమన్‌

పాలకులకు పట్టని ప్రాధామిక విధులు

రాజకీయ నాయకులు, ప్రజా ప్రతి నిధులు, రాజకీయ అధికారాలున్న ప్రధాన మంత్రి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదలైన వారు మత, భాష, ప్రాంత మొదలైన విభజనలకు అతీతంగా సామరస్యాన్ని ఉమ్మడి సోదర భావాన్ని పెంచాలి. దీనిని నిజాయితీగా చేయాలి. సంకుచితంగా ఆలోచిస్తూ ఎన్నికల ప్రయోజనాల కోసం సమాజంలో ఏదో ఒక తరగతికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇతర మతాల పట్ల సమాన భావాన్ని కనబరచని వారు ప్రజలకు స్ఫూర్తినివ్వరు. పంచాయితీ నుండి పార్లమెంటు వరుకు ఉన్న ప్రజా ప్రతినిధులు ఈ ప్రాథమిక విధులను ఒక బాధ్యతగా ప్రచారం చేయాలి, పాటించాలి.
ద్వేష భావజాలం భారత దేశాన్ని మింగేస్తుంది’.మహాత్మాగాంధీ 75వవర్థంతి సంద ర్భంగా ఆయన ముని మనవడు తుషార్‌ గాంధీ చేసిన వ్యాఖ్య ఇది.ద్వేష భావజాలం భారతదేశం లో ఎందుకు పెరుగుతున్నదో దేశ రాజకీ యాలను చూచాయగా పరిశీలించే వారికి సైతం తెలుస్తుంది. ద్వేష భావజాలాన్ని పెంచటంలో, వ్యాప్తి చేయటం లో రాజకీయ నాయకులు, పాలకుల పాత్ర ఎంత వున్నది? రాజ్యాంగం వారికి చెప్పిందేమిటి? వారు చేస్తున్నదేమిటో చర్చించటమే ఈ వ్యాసం ఉద్దేశ్యం. ఈ క్రమంలో ప్రాథమిక విధుల గురించి తెలుసు కోవటం అవసరం.
ప్రాథమిక విధులు – చరిత్ర
రాజ్యాంగం ఆమోదించినపుడు ప్రాథ మిక విధులు అందులో భాగం కాదు. నాటి రాజ్యాం గ నిర్మాతలు అప్పుడున్న సామాజిక, నైతిక పరిస్థి తులను దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక విధులు అవసరం లేదని భావించి ఉండవచ్చు.కాని 1976 లో స్వరణ్‌ సింగ్‌ కమిటీ సిఫార్సుల మేరకు 42వ సవరణ ద్వారా వాటిని రాజ్యాంగంలో పొందు పరిచారు.
ప్రాథమిక విధులను ఎందుకు చేర్చారు ?
‘కాలం గడిచే కొలది నైతిక విలువలు … ముఖ్యంగా ప్రజా జీవితంలో విలువల పతనం స్పష్టమైన కారణంగా ప్రాథమిక విధులను ప్రత్యేకం గా రూపొందించటం అవసరమని దేశం భావిం చింది.’’ అని జస్టిస్‌ జె.ఎస్‌. వర్మ కమిటీ పేర్కొంది.
ప్రాథమిక విధులు – స్వభావం
51ఏ అధికరణంలో మొత్తం 11 ప్రాథ మిక విధులుంటాయి. వాటిలో 51(ఎ)(ఇ)లో ఉన్న ప్రాథమిక విధిని మాత్రమే ఈవ్యాసంలో చర్చిం చాం. కొన్ని విధులు నైతిక నియమావళిలాగా, మరికొన్ని పౌర నియమావళిలాగా ఉంటాయి.
అధికరణం 51(ఎ)ఇలో ఏముంది ?
ఈ అధికరణంలో రెండు భాగాలున్నా యి. మొదటి భాగం భారత ప్రజలందరి మధ్య కుల,మత,భాషా,ప్రాంతలేదా ఏ ఇతర విభజనలతో వైవిధ్యాలతో వైవిధ్యాలతో సంబంధం లేకుండా ప్రజలందరి మధ్య సామరస్యం,సోదరభావాన్ని పెంపొందించాలని ఆదేశిస్తుంది. రెండవ భాగం స్త్రీలను అగౌరవ పరిచే అన్ని అంశాలను, విధానా లను విడనాడాలని ఆదేశిస్తుంది.
ఎవరు పాటించాలి ?
51వ అధికరణం ప్రారంభంలో ఇది ప్రతి పౌరుని యొక్క విధి అనే వాక్యం ఉన్నది.దీని అర్థం.. ప్రభు త్వానికి, పాలకులకు, అధికార గణానికి, రాజకీయ నాయకులకు వర్తించదా అనేది ప్రశ్న? ఈ ప్రశ్నకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వర్మ సమాధానం చెప్పారు. ప్రాథమిక విధులపై 1999లో ఆయన నేతృత్వంలో వేసిన కమిటి అనేక సిఫార్సులు చేసింది.
జస్టిస్‌ జె.యస్‌.వర్మ సిఫార్సులు
రాజకీయ నాయకులు ఈ విధుల గురించి మాట్లాడేటప్పుడు ఇవి ప్రజలు పాటించ వలసినవిగా తమకేమీ సంబంధం లేదు అన్నట్లుగా చెబుతారు. కాని వాస్తవంలో వారే ఈ విధులను పాటించవలసిన బాధ్యత ఉంది. నైతిక విలువల వ్యాప్తిలో ఆదర్శనీయులుగా ఉండే వ్యక్తుల పాత్ర చాలా ప్రముఖమైనది.కేవలం చట్టపరమైన నిబం ధనల ద్వారా ఈ విలువల వ్యాప్తి జరగదు. విలువ లు పాటించటం ద్వారా ఆదర్శప్రాయులుగా మార టం ద్వారా,సామాజిక ఆంక్షలద్వారా ఈ విలువలు వ్యాప్తి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజకీయ నాయకులు,ప్రజా ప్రతి నిధు లు,రాజకీయ అధికారాలున్న ప్రధానమంత్రి, రాష్ట్రా ల ముఖ్యమంత్రులు, మంత్రులు,ఎంపీలు,ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు మొదలైన వారు మత,భాష, ప్రాంత మొదలైన విభజనలకు అతీతంగా సామర స్యాన్ని ఉమ్మడి సోదర భావాన్ని పెంచాలి. దీనిని నిజాయితీగా చేయాలి. సంకుచితంగా ఆలోచిస్తూ ఎన్నికల ప్రయోజనాల కోసం సమాజంలో ఏదో ఒక తరగతికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇతర మతాల పట్ల సమాన భావాన్ని కనబరచని వారు ప్రజలకు స్ఫూర్తినివ్వరు.పంచాయితీ నుండి పార్లమెంటు వరు కు ఉన్న ప్రజా ప్రతినిధులు ఈ ప్రాథమిక విధులను ఒక బాధ్యతగా ప్రచారం చేయాలి,పాటించాలి.
ప్రభుత్వ ఉద్యోగులు, కార్యాలయాలు
ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉండే అధిపతులు ప్రాథమిక విధులు ఆచరించి, వ్యాప్తి చేయాలనే బాధ్యతకల్గి ఉన్నారు.వారికి ఇది అదనపు విధి.సిబ్బంది అందరి ముందు ప్రతి సంవత్సరం ప్రాథమిక విధులను ఆచరిస్తానని ప్రతిజ్ఞ చేయాలని జస్టిస్‌జె.యస్‌.వర్మ సూచించారు.అవినీతి లేకుండా, ప్రజలకు సన్నిహితంగా ఉంటూ స్నేహపూర్వకమైన విధానంతో విధులు నిర్వర్తించాలని పారదర్శకత చూపాలని సిపార్సు చేశారు. ప్రతి అధికారికి రెండు రకాలైన బాధ్యతలు (వ్యక్తిగతంగా,అధికారయుతం గానూ) ఉంటాయని ఆరెండిరటి సందర్భంగా కూడా విధులు పాటించాలని ఆయన సూచిం చారు. ప్రభుత్వ అధికారులు లేదా ప్రభుత్వ కార్యాల యాల మీద ఆధిపత్యం ఉన్న వారు ఎవరైనా… రాజకీయ,పరిపాలనా,విద్య,ఇతర ఏ ప్రజా సేవలకు సంబంధించినదయినా…వారు తమ అధికార పరిధి ఉన్నంతవరకు పౌరులను ప్రాథమిక విధుల విషయంలో మార్గదర్శకంగా నిలుస్తూ ప్రచారం చేయాలి. ప్రతి సంవత్సరం జనవరి మూడవ తేదీని ప్రాథమిక విధుల దినోత్సవంగా పాటించాలి.పై సిఫార్సులను పరిశీలించినప్పుడు ప్రధానంగా రాజకీ య నాయకులు, ఎన్నికలలో పాల్గొనేవారు, ప్రభుత్వ అధికారులు అత్యంత నిజాయితీగా ఉండాలి. ముఖ్యంగా సోదరభావాన్ని పెంపొందించటంలో ప్రముఖ పాత్ర పోషించాలని అర్థమవుతుంది.
ఆచరణ ఎలా ఉంది ?
2014 నుంచి 2018 మధ్య 4సంవ త్సరాల కాలంలో ప్రముఖ రాజకీయ నాయకుల విద్వేష ప్రసంగాలు 5 వందల శాతం పెరిగాయని ఎన్‌డిటివి పరిశోధనలో తేలింది. అలాగే కర్ణాటక లో బిజెపి ప్రభుత్వం 2019 నుండి 2023 ప్రాం తం మధ్యలో 7ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా 182 మత హింస, విద్వేష ప్రసంగాలు, గోరక్షణ నేరాలకు సంబంధించిన కేసులను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ఫలితంగా ఈ నేరాలలోనిందితులుగా ఉన్న వందలాది మంది శిక్షల నుంచి బయటపడ్డారు. వీరిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు. అంటే వందల మంది రాజకీయ నాయకులు ప్రాథమిక విధులకు విరు ద్ధంగా విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని అర్థమవు తుంది.అలాగే 2017లో హిందూస్థాన్‌ టైమ్స్‌ చేసిన సర్వే ప్రకారం ఎన్నిక కాబడిన, అధికారాలు పొం దిన వారిలో 50మందిపై మత హింస, ద్వేష ప్రసంగాలకు సంబంధించిన నేరాలు నమోదయ్యా యి.2018-2019మధ్య కాలంలో అసత్యపు వార్తలను,వాట్సాప్‌ వార్తలు నిజమని నమ్మి 31 మంది చనిపోయారని బిబిసి పరిశోధనలో తెలి పింది. ఇతర మతాలపై ద్వేషపూరిత, అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా గల్ఫ్‌ దేశాలు, ముస్లిం దేశాలు తమ అసమ్మతిని తెలియజేయటం మనం గమనించాం. మణిపూర్‌, హర్యానా, ఇతర ప్రాంతాలలో జరుగుతున్న హింసాత్మక ఘర్షణలు …ఇటీవలి కాలంలో పెరుగుతున్న విద్వేష ప్రచార ఫలితాలే.
సుప్రీంకోర్టు తీర్పులు
ప్రాథమిక విధులను క్షేత్ర స్థాయి నుంచి ప్రచారం చేయాలన్న జస్టిస్‌ వర్మ కమిటి సిఫార్సుల ను వెంటనే అమలు చేయాలని 2003లో జస్టిస్‌ రంగనాథ్‌మిశ్రా పిటిషనర్‌గా భావించబడిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. స్కూలు స్థాయి నుంచి అన్ని విద్యా స్థాయిల వరకు సమాజంలోని అన్ని విభాగాలలోను ఈ విధులను ప్రచారం చేయాలని, సోదరభావం,మతాలపట్ల సమభావం పెరిగేం దుకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.20 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ద్వేషభావాన్ని తీవ్రస్థాయికి చేర్చిన రాజకీయ నాయ కులు, పాలకులు సమాధానం చెప్పుకోవాలి. ద్వేష ప్రసంగాల విషయంలో వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి తక్షణం చర్యలు తీసుకోవాలని జస్టిస్‌ కె.ఎం. జోసెఫ్‌ బెంచ్‌ ఇటీవల తీర్పునిచ్చింది. ఈ నేపథ్యం లో ప్రచారం చేయవలసిన, పాటించ వలసిన ప్రాథమిక విధులు,నైతిక విలువ లను పక్కనబెట్టి మతపరమైన విషయాలను ప్రచా రంచేస్తామని, అవగాహన కల్పిస్తామనిఎ.పి మంత్రి వర్యులొకరు ప్రకటించటం విపరీతం. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లుతెరిచి భారతదేశ సంస్కృతి సాంప్ర దాయ మైన…పరమత సహనం,సహోదర భావంతో పాటు ఇతర అన్ని ప్రాథమిక విధులను పాటించి ప్రచారం చేయాలని ఆశిద్దాం. (వ్యాసకర్త :ఎ.పి.సి. ఎల్‌.ఎ ప్రధాన కార్యదర్శి,సుప్రీంకోర్టు న్యాయవాది) – (పొత్తూరి సురేష్‌ కుమార్‌)

నాడే చెప్పిన బాబా సాహేబ్‌

మణిపూర్‌లో జరుగుతున్న అత్యాచారాలు,మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘట్టాల మీద ప్రధాని మోదీ 80 రోజులు నోరు విప్పకపోవడానికి కారణమేమిటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.ఈ అఘాయిత్యాలు జూలై 19న బయటకు వచ్చిన వీడియో ద్వారా ప్రపంచమంతా వీక్షించింది.ఈ ఘటనలో ముఖ్యపాత్ర వహించిన మణిపూర్‌ పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని,మణిపూర్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ను ఆగస్టు 7న స్వయంగా హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మార్గంలోనే దళితుల, ఆదివాసీల,స్త్రీల రక్షణ కోసం ప్రజాస్వామ్య లౌకికవాద సోషలిస్టు భావజాలంతో ఉన్నవారందరం కలసి ఏక కంఠంతో పోరాటం చేయాలి.
మణిపూర్‌లోజరుగుతున్న అత్యాచా రాలు, మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘట్టాల మీద ప్రధాని మోదీ 80 రోజులు నోరు విప్పక పోవడానికి కారణమేమిటని ప్రతిపక్షాలు నిలదీస్తు న్నాయి. ఈ అఘాయిత్యాలు జూలై 19న బయటకు వచ్చిన వీడియోద్వారా ప్రపంచమంతా వీక్షించింది. ఈ ఘటనలో ముఖ్యపాత్ర వహించిన మణిపూర్‌ పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని, మణిపూర్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ను ఆగస్టు 7న స్వయంగా హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగి న తర్వాత కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమో దు చేయడంలో ఎందుకు జాప్యం చేశారని సుప్రీం కోర్టు అడిగింది. సుప్రీంకోర్టు ఇటీవల అనేక విష యాల్లో రాజ్యాంగేతరశక్తిగా ప్రభుత్వం నడుస్తు న్నదని హెచ్చరిస్తూ వస్తున్నది. ఈ ఘటన మీద హోంమంత్రి అమిత్‌ షా చేసిన ప్రకటన అనేక అనుమానాలకు దారి తీస్తుంది. గుజరాత్‌లో ఒక వర్గానికి 2022లో బుద్ధి చెప్పిన తర్వాత అక్కడ మతఘర్షణలు ఆగిపోయాయని హోంమంత్రి అంటున్నారు.2022 నుంచి హిందువులకు భయ పడి ముస్లింలు అక్కడ జీవిస్తున్నారని అర్థం. కుకీల అటవీ భూములను మొయితీలకు కట్టబెట్టి అడవిపై ఆధిపత్యం వహించాలనేది మణిపూర్‌లో పన్నిన వ్యూహం. ముఖ్యంగా కుకీలు అడవి సంపదనంతా రక్షిస్తూ వచ్చారు. అడవి సంపదలో ప్రధానంగా గ్రానైట్‌, ప్లాటినం మెటల్స్‌,ఎలిమెంట్స్‌,నికిల్‌, కాపర్‌, బొగ్గు, పెట్రోలియం ఇంకా ఎంతో విలువైన ఖనిజ సంపదను వారు భారతదేశానికి ఒక ఘన నిక్షేపంగా కాపాడుతూ వచ్చారు.దానికి కారణం డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు చట్టపరమైన, రాజ్యాంగపర మైన హక్కులున్నాయి. ఈ హక్కుల ప్రకారం అక్కడ మైనింగ్‌ను దోపిడీ చేయడానికి కార్పొరేట్లకు అవ కాశం లేదు.అందుకే వాళ్లు విధ్వంసానికి పూను కున్నారు. ఈరోజున ఈశాన్య రాష్ట్రాలు భారత దేశానికి ఆయువులు. ఈశాన్య రాష్ట్రాల్లో భారత ఉపఖండం మూలాలున్నాయి. ఈ భారతదేశాన్ని జయించిన ఆర్యులు, కుషానులు, అరబ్బులు, తురు ష్కులు ఎవరూ కూడా ఈశాన్యాన్ని ముట్టుకోలేక పోయారు. తాకట్టులోకి భారతదేశం వెళ్తున్నప్పుడు కూడా ఈశాన్యం తనను తాను కాపాడుకుంది. గిరిజనుల పోరాటాల వల్ల సంపదను కాపాడు తుంది.మణిపూర్‌లో భారత రాజ్యాంగాన్ని ఉల్లం ఘించడానికి, క్రైస్తవులపైదాడి చేయడానికి వెనకా డటం లేదు. అది ప్రపంచమంతా అర్థం చేసు కుంది. ముస్లింల మీద, క్రైస్తవుల మీద, బౌద్ధుల మీద, జైనుల మీద చేస్తున్న దాడులు వెనక మొత్తం భారతదేశాన్ని గుప్పెట్లో తీసుకోవాలని, భారతదేశ వనరులన్నీ కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేసి తద్వారా మిగిలిన జాతులన్నింటిని ధ్వంసం చేయాలనే భావన మనకు కనిపిస్తుంది. నిజానికి గిరిజనులు అక్కడ ఎందుకు క్రైస్తవులైనారు. వారు క్రైస్తవులు అవ్వడం వల్ల వారికి కలిగిన లాభమే మిటి? అక్కడ గిరిజన పిల్లలు ఎక్కువ మంది ఈ రోజు అన్ని సెంట్రల్‌ యూనివర్సిటీల్లో చదవగలుగు తున్నారంటే ఇంగ్లీషు విద్యను చదవడానికి క్రైస్తవ మతాన్ని వారు ఆశ్రయించారు.
మణిపూర్‌ హింస గురించి బీజేపీలోనే వ్యతిరేకత పెల్లుబుకింది. బీజేపీ ఎమ్మెల్యే పోలిన్‌ లాల్‌ హోకిప్‌ మహిళలను నగ్నంగా ఊరేగించడం మీద తీవ్రఆక్షేపణ తెలిపారు. మణిపూర్‌లో చెలరే గుతున్న హింస కేవలం శాంతిభద్రతల సమస్య కాదని, దీనివెనుక భారీ కుట్ర ఉన్నదని ఆ రాష్ట్ర అధికార బీజేపీ ఎమ్మెల్యే పోలిన్‌లాల్‌ హోకిప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల నగ్న వీడియో బయటకు రాకుంటే ప్రధానమంత్రి మోదీ అసలు మాట్లాడేవారే కాదన్నారు. హింస మొదలైన ప్పుడే సమస్యను చెప్పుకొనేందుకు ప్రధాని అపా యింట్‌మెంట్‌ అడిగామని, ఇప్పటికీ కలిసేం దుకు ఆయన అంగీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హింసకు మైతే మిలిషియాతో పాటు పోలీసులూ కారణమని విమర్శించారు.
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ గిరిజన రచయితలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాశారు.26 రాష్ట్రా లు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 86 మంది గిరిజన రచయితలు ఈలేఖపై సంతకాలు చేశారు. ‘సువిశాల మైన, సాంస్కృతిక వైవిధ్యం కలిగిన దేశా నికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రాష్ట్రం లో శాంతిని నెలకొల్పేం దుకు సహాయం చేయాలి’ అని దేశంలోని కోట్లాది మంది గిరిజనుల తరపున ‘ఆల్‌ ఇండియా ఫస్ట్‌ నేషన్స్‌’ (స్వదేశీ,ఆదివాసీ) రచయితల సదస్సు సభ్యులు లేఖలో విజ్ఞప్తి చేశారు.
గత రెండు నెలలుగా మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు, తాము దిగ్భ్రాంతి చెందామనీ, విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఇద్దరు కుకీ, గిరిజన మహిళలను బందీలుగా చేసి, క్రూరంగా హింసిం చడం ఇది భారతదేశంలోని 700కు పైగా గిరిజన సంఘాలను మాత్రమే కాకుండా మొత్తం పౌర సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. దేశంలోని ఆదివాసీ సాహితీవేత్తలమైన తాము ఈ హీనమైన,అమానుష చర్యను తీవ్రంగా ఖండిస్తు న్నామని పేర్కొన్నారు. గిరిజన మహిళలపై క్రూర మైన దాడికి పాల్పడిన ప్రత్యక్ష, పరోక్ష నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
మణిపూర్‌ విషయాన్ని కొందరు లౌకికవాదులు ఇలా విశ్లేషిస్తున్నారు. మణిపూర్‌ విషాదం జాతి సంహారం లేదా జాతి ప్రక్షాళనకు ఆరంభమే. అవును, సందేహం లేదు జాతి ప్రక్షాళన (ఎథ్నిక్‌ క్లీన్సింగ్‌) ఒక భయానక పదబంధం ఇప్పు డది భారత్‌ను వెన్నాడుతోంది, పీడిస్తున్నది. జాతిప రంగా ఒకసజాతీయ భౌగోళిక ప్రాంతాన్ని నెల కొల్పేందుకు అవాంఛిత ఉపజాతి సభ్యులను (దేశ బహిష్కృతులను చేయడం, స్థాన చలనం కలిగించ డం లేదా మూకుమ్మడిగా హతమార్చడం ద్వారా) సంపూర్ణంగా వదిలించుకోవడమే జాతి ప్రక్షాళన అని హిస్టరీ.కామ్‌ వెబ్‌సైట్‌ ఎడిటర్స్‌ నిర్వచిం చారు. ఎథ్నిక్‌ క్లీన్సింగ్‌కు ఉదాహరణలుగా మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఆర్మేనియన్ల ఊచకోత, రెండవ ప్రపంచ యుద్ధకాలంలో 60లక్షల మంది యూరోపి యన్‌ యూదుల మారణహోమాన్ని చరిత్రకారులు పేర్కొంటారు. ఐరోపాలో సెర్బియా, కొన్ని ఆఫ్రికన్‌ దేశాలు కూడా జాతి ప్రక్షాళనను చవిచూశాయి. స్వాతంత్య్రానికి పూర్వం భారత రాజ్యాంగం గుర్తిం చింది. మూడు ప్రధాన జాతుల వారికి మణిపూర్‌ నెలవు. తమ నాగరికత కొన్ని వేల ఏండ్ల నాటిదని గొప్పలు చెప్పుకొనే ఈ దేశంలో ఈ ఆదిమవాసులు నేటికీ ప్రాచీన కాలంనాటి దుర్భర అనాగరిక పరిస్థితి లోనే నివసిస్తున్నారంటే ఏమనాలి?కానీ,ఇది మాత్రం నగ్నసత్యం. ఇన్ని వేల ఏండ్లుగా ఈ దుర దృష్టవంతులు నాగరికులు కాలేకపోవడం ఒక్కటే కాక ఇందులో కొందరు దుష్టవృత్తులను అవలం బించే దుస్థితికి దిగజారి నేరస్త జాతులు (క్రిమి నల్స్‌)గా పరిగణించబడుతున్నారు. కోటి ముప్పై లక్షల మంది, నాగరికత మధ్య బతుకుతూ అనాగ రిక ఘోర దుస్థితిలో ఉండిపోవడం! పైగా వంశ పరంపరగా నేరస్థులుగా బతుకడం! దీనికి పాలకు లు సిగ్గయినా పడకపోవడం! ప్రపంచంలో ఎక్కడా లేని విచిత్ర పరిస్థితి ఇది.ఈ లజ్జాకరమైన పరిస్థితికి ఏమిటి కారణం?ఈ ఆదిమవాసులను నాగరికు లుగా మార్చడానికి,గౌరవప్రదమైన వృత్తులు చేపట్టేలాగ చేయడానికి అసలు ప్రయత్నమే జరగ లేదు.ఎందువల్ల?
బహుశా,వాళ్ల అనాగరికస్థితికి జన్మ సిద్ధమైన బుద్ధిమాంద్యమే కారణమని చెప్పడానికి ప్రయత్నించవచ్చు. ఆదిమవాసులు తరతరాలుగా అనాగరికులుగానే ఉండిపోవడానికి కారణం తామేననీ ఒప్పుకోకపోవచ్చు. వాళ్లకు నాగరికత నేర్పడానికిగాని,వైద్య సహాయం మొదలైన వాటి ద్వారా వాళ్లను సరిదిద్దడానికిగాని,వాళ్లను సంస్క రించి మంచి పౌరులుగా తయారుచేయడానికి గాని తాము ఏమాత్రమూ ప్రయత్నించకపోవడమే ఆదిమవాసుల అనాగరిక స్థితికి కారణమని పాల కులు అంగీకరించకపోవచ్చు.ఆదిమవాసులను నాగరికులను చేయడమంటే వాళ్లను నీవాళ్లుగా భావించడం. వాళ్ల మధ్య నివసించడం, వాళ్లలో ఒక సహానుభూతిని పెంపొందించడం, క్లుప్తంగా చెప్పాలంటే,వాళ్లను ప్రేమించడం.
(వ్యాసకర్త: మహాకవి, దళిత ఉద్యమనేత), – (డాక్టర్‌ కత్తి పద్మారావు)

సంక్షేమంతో..సుపరిపాలన

తమకు అందుతున్న నిరంతర సేవలను దృష్టిలో వుంచుకుని రాష్ట్రంలో సుపరిపాలన అమలవు తుందా లేదా అని ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ సీ.ఆర్‌.మీడియా అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. సుపరి పాలన దిశగా ఆంధ్రప్రదేశ్‌ రూపాంతరం అనే అంశంపై స్టేట్‌ అవర్‌ లీడర్‌ వైఎస్సార్‌ ఇంటెక్ట్యువల్‌ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఆయన పర్యటించారు. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం,శ్రీకాకుళం ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించి మేథావులు,విద్యావేత్తలతో ఈ అంశంపై సమాలోచనలు చేసి సీఎం జగన్‌ అమలపరుస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలకు సుపరిపాలన అందుతుందా లేదా అనేదానిపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు..’
ఇందులో భాగంగా విశాఖలో జరిగిన సభలో కొమ్మినేని శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగిం చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అమలుచేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటు న్నాయని కొనియాడారు. ఆగష్టు 21న అవర్‌ స్టేట్‌ అవర్‌ లీడర్‌లో భాగంగా ‘‘సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్‌ రూపాంతరం’’ అనే అంశంపై జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో వైఎస్సార్‌ ఇంటలెక్చువల్‌ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల వద్దకు సంక్షేమ ఫలాలను తీసుకెళ్లే లక్ష్యంతో ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను తమిళనాడు ప్రభుత్వం కూడా అమలు చేసేందుకు సిద్దమైందన్నారు. వలంటీర్ల వ్యవస్థను మెచ్చుకున్న కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఇలాంటి వ్యవస్థనే తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోం దన్నారు. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నారనడానికి ఇవి ఉదాహరణ లన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాద్యమం ఏర్పాటు చేయడం హర్షణీయమని ఆయన తెలిపారు. పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టగా తీవ్రంగా వ్యతిరేకించిన వారే తమపిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చదివిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా హామీలను నెరవేర్చిం దన్నారు. గ్రామసచివాలయ వ్యవస్థలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 50వేల కార్యాలయాలను ఏర్పాటుచేసి అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. గతంలో ఏముఖ్యమంత్రీ చేపట్టని సంస్కరణలు, సంక్షేమానికి జగన్‌ శ్రీకారం చుట్టారని కొనియాడారు. విద్యకు వృత్తిపరమైన నైపుణ్యాన్ని జోడిరచడం ద్వారా ఉన్నత విద్య అనంతరం యువతకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు మెరుగు పరచిందన్నారు. ఆర్ధికపరమైన అన్ని అంశాలను మహిళలకు కేటాయించడం ద్వారా వారి సాధికారితకు నిజమైన నిర్వచనాన్ని ఇచ్చారన్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా విద్యా సంస్థలపై తల్లులకు ప్రశ్నించే అధికారాన్ని కల్పించారని ఆయన పేర్కొన్నారు. ఇదంతా సుపరిపాలనలో భాగమని ఆయన తెలిపారు. పరిపాలన అందరికీ ఉపయోకరంగా,ఉపయుక్తంగా ఉండాలని అందుకు నిదర్శనంగా ఈ ప్రభుత్వం నిలుస్తుందన్నారు.సభకు అధ్యక్షత వహించిన నాగార్జున యూనివర్శిటీ రిటైర్డ్‌ వీసీ వి.బాలమోహన్‌దాస్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ,ప్రజలకు పథకాలు అందజేయడంలో తండ్రీకి మించిన తనయుడు సీఎం జగన్‌ అని కొనియాడారు. విద్యకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రవేశపెట్టిన విద్యాకానుక, విద్యాదీవెన,విదేశీయ విద్యాదీవెనలకు సంబంధించి కొనియాడారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఇంటలెక్చువల్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శాంత మూర్తి మాట్లాడుతూ తమ సంస్థలో 700మంది సభ్యులు ఉన్నారని ,వీరిలో డాక్టర్లు,లాయర్లు, ఇంజనీర్లు, ఇంటలిజెన్స్‌ అధికారులు,వైస్‌ ఛాన్సలర్లు,ఐఎఎస్‌ అధికారులు ఉన్నారని తెలిపారు. ప్రజా సంకల్పయాత్రలో ప్రజల సమస్యలను గుర్తించిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సుపరిపాలన సాగిస్తున్నార న్నారు.ప్రజల వద్దకు సంక్షేమ ఫలాలను తీసుకెళ్లే లక్ష్యంతో ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను తమిళనాడు ప్రభుత్వం అనులు చేసేందుకు సిద్ధమైందని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను మెచ్చుకున్న కేరళ ప్రభుత్వం,ఆ రాష్ట్రంలో ఇలాంటి వ్యవస్థనే తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు.పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారే తమ పిల్లలను అంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారని చెప్పారు.విద్య, వైద్యానికి కీ.శే రాజశేఖర్‌ రెడ్డి ప్రాధాన్యత కల్పించారని, నేడు జగన్మోహన్‌ రెడ్డి మరింత బలోపేతం చేసి అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అని కొనియాడారు. తీరప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పలువురు అడిగిన ప్రశ్నలకు వక్తలు సమాధానమిచ్చారు.
కిడ్నీ వ్యాధి మూలాలు కనుగొనడమే ప్రభుత్వ లక్ష్యం
ఉద్దానంలో మహమ్మరిలా వ్యాపిస్తున్న కిడ్నీ వ్యాధి మూలాలు కనుగొనడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. కాశీబుగ్గలో కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల ఆసుపత్రిని మంగళవారం సందర్శించారు.కిడ్నీ రోగులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. అంతకుముందు పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ డైరెక్టర్‌ ఎ.పి ఇన్నోవేషన్‌ సొసైటీ లావణ్య, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్‌ వెంకటరావు, 28వార్డు కార్పొరేటర్‌ పల్లా దుర్గారావు,యాక్సిస్‌ సెవెన్‌ ఇకోస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పాల్‌ బాస్కర్‌,ఆంధ్రా యానివర్సిటీ ప్రొఫెసర్‌ తిమ్మారెడ్డి, పాతపట్నం,టెక్కలి,రాజాం ప్రభుత్వ డిగ్రీకళాశాలల ప్రిన్సిపాళ్లు కె.శ్రీరాములు,గోవిందమ్మ, స్వప్న హైందవి, గాయత్రి విద్యాసంస్థల ప్రిన్సిపాల్‌ పులఖండం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.– జి ఎన్ వి సతీష్ 

1 23 24 25 26 27 75