వర్షం వణికించింది

“ రాష్ట్రవ్యాప్తంగా వాయుగుండం తీరం దాటింది..వర్షం తగ్గుముఖం పట్టింది...కానీ కొన్ని జిల్లాలో వరదల ప్రభావం మాత్రం కొనసాగుతూనే ఉంది.నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలకు ఉత్తరాంధ్రలో జనజీవనం అస్తవ్యస్థమైంది.ప్రస్తుతం వర్షం లేకపోయినప్పటికీ అల్లూరి సీతారామారాజు జిల్లాలో పలు గిరిజన గ్రామాలకు వర్షపు నీరు చేరింది.మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో పలు చోట్ల చెట్లు,కొండచరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఎగువ నుంచి ప్రవహిస్తున్న వర్షపు నీటితో  మన్యంలో వాగులు, గెడ్డలు ఇంకా ఉద్ధృ తంగా ప్రవహిస్తున్నాయి. స్వల్పంగా ఈదురుగాలులతో చెట్లు, అక్కడక్కడ విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని గిరిజన గ్రామాలను అంధకారంలోకి నెట్టేశాయి. సకాలంలో వర్షాలు పడి అన్నదాతను ఆదుకున్నా..రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు, విద్యుత్తు స్తంభాలు భారీగా ధ్వంసమయ్యాయి. వాగులు, గెడ్డలుఉద్ధృ తంగా ప్రవహిస్తుండటంతో.. కొన్ని గ్రామా లకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు హెచ్చరిస్తున్నా నిత్యావసరాల కోసం,గ్రామాలకు వెళ్లేందుకు కొందరు గిరిజనులు సాహసాలు చేసి ప్రమాదకరంగా వాగులు దాటుతున్నారు.” - గునపర్తి సైమన్  

మన్యంలో..రహదారుల కల నెరవేర తుంది..తమకు డోలి మోతలు తప్పుతా యనుకుని సంబరపడుతున్న తరుణంలో వాయుగుండం గిరిజనుల ఆశలను చిదిమేసింది.అల్లూరి సీతారామారాజు జిల్లాలో నేటికీ చాలా గ్రామాలకు సరైన రహదారులు లేవు.కూటమి ప్రభుత్వం అడవితల్లి బాట పేరుతో మారుమÖల ఆదివాసీ గ్రామాలకు రహదారులు నిర్మిస్తోంది.గూడెంకొత్త వీథి మండలం లోని చాలా ఊర్లకు ప్రస్తుతం రహదారి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో నిర్మాణాలు పూర్తవుతా యనుకుంటున్న తరుణంలో భారీ వర్షా నికి ఎక్కడికక్కడ రోడ్లు దెబ్బతిన్నాయి. గూడెం కొత్త వీథి నుంచి చెరకుంపాకలు వెళ్లే రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. సప్పర్ల నుంచి ఆకులూరు మధ్య రెండు కల్వర్టులు దెబ్బతిన్నాయి.ఎం.బూసికొండ వద్ద రోడ్డు కూడా దెబ్బతింది.
దారులు ఛిద్రం.. ప్రయాణం నరకం
మండలంపై అధిక ప్రభావం చూపింది. పెద్దసంఖ్యలో కల్వర్టులు,రహదారులు ఛిద్రమయ్యాయి.లంకపాకలు-పనసపల్లి గ్రామాల మధ్య కల్వర్టు పూర్తిగా కొట్టుకు పోయింది.ఈ మార్గంలో అనేక గ్రామా లకు రాక పోకలు నిలిచిపోయాయి. సీలేరు సమీపంలో ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది.దీంతో సీలేరు -నర్సీపట్నం మార్గంలో రాకపోకలు నిలి చిపోయాయి.లంబసింగి తాజంగి నడు మ అత్యవసర సమయాల్లో అంబులె న్సులను మాత్రమే అనుమతిస్తున్నారు.
మూతపడిన జాతీయరహదారి
జి.మాడుగుల పరిధిలో జాతీయరహదారి కొట్టుకుపోయింది.దీంతోపాటు చింత పల్లి-కృష్ణదేవిపేట నడుమ రాకపోకలను మÖడు రోజుల నుంచి మూసేశారు. రంపుల ఘాట్రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున పెద వలస వద్ద బారికేడ్లు పెట్టారు. గూడెం కొత్తవీధి-సీలేరు ప్రధాన రహదారి ఛిద్రమై వాహనాలు బురదలో కూరుకు పోతున్నాయి. తాజంగి-లంబసింగి మధ్య తాత్కాలికంగా వాహనాల రాకపోకలు నిలిపివేశారు. హుకుంపేట మండలం లోని భీమవరం,సుకూరు రెండు గ్రామ పంచాయతీల పరిధిలోని తోటకూర పాడు, గంగవరం గ్రామాలకు రహదా రుల నిర్మాణం పూర్తికాకముందే ఛిద్రమైంది.ఒక వైపు నిర్మాణం చేపడు తుంటే మరోవైపు గోతులు,పెచ్చులూడి దర్శనమిస్తోంది.దీంతో మట్టిరోడ్డు ఉన్న సమయంలో కంటే ప్రస్తుతం రాకపోక లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన ఎన్నో ఏళ్లకు తోట కూరపాడుకు రోడ్డు నిర్మాణంతో కష్టాలు తీరతాయని ఈప్రాంత గిరిజనులు ఆశపడ్డారు.అయితే రోడ్డు నిర్మాణం చేపడుతున్నా నాణ్యత లేకపోవడంతో వర్షాలకు అధ్వానంగా మారి,రాకపో కలకు మరింత అవస్థలు పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.అలాగే గంగవరం గ్రామానికి తొలుత నుంచి రోడ్డు సదుపాయం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలలకే ఈ గ్రామానికి రోడ్డు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. తారు రోడ్డు నిర్మాణం పూర్తయింది. అయితే గత ఏడాది వచ్చిన భారీ తుఫాన్‌కు రోడ్డు మొత్తం గుంతలు పడి,కోతకు గురై అధ్వానంగా మారింది.దీంతో ఈపంచాయతీకి చెందిన ప్రజలు ఆటవీ ఉత్పత్తులు,పంటలను వారపు సంతకు తీసుకు వెళ్లేందుకు ఇబ్బం దులు పడుతున్నారు.అనారోగ్యం బారిన పడినా,గర్భిణులు,బాలింతలను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు వీలు కావడంలేదు. అధికారులు స్పందించి ఈ రహదారి పునఃనిర్మించాలని గిరిజనులు కోరుతు న్నారు.పెదబయలు మండలంలో జడి గుడచింతలవీథి మధ్య పెద్దగెడ్డ ఉప్పొం గడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల నిర్మించిన రాయగడ వంతెన వద్ద అప్రోచ్‌రోడ్డు పదిఅడుగుల మేర కుంగిపోయింది.అధికారులు అప్రమత్తమై మరమ్మతులు చేపట్టారు. పాడేరు వంతాడపల్లి చెక్ పోస్ట్ సమీపంలో కల్వర్టు రిటైనింగ్ వాల్ కూలిపోయింది. జీకేవీథి మండలంలో ఇటీవల నిర్మించిన జర్రెల కొత్తూరు కల్వర్టు కొట్టుకు పోయింది.సీలేరు ఏరియా దుప్పిలవాడ పంచాయితీ డి.అగ్రహారం వంతెన వరద నీటి ఉధృక్తితకు కొట్టుకుపోయింది. దీంతో సుమారు 14గ్రామాలకు రాక పోకలు నిలిచిపోయాయి. అరకులోయ మండలం గిర్లిగుడ`పరిశీల మధ్య కల్వర్టు కొట్టుకుపోయింది.వరద ఉద్ధృ తికి పలుచోట్ల వంతెనలు,కల్వర్టులు కోతకు గురై కొట్టుకుపోయాయి.దీంతో అనేక గిరిజన గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపో యాయి.ఏజెన్సీ ప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో రవాణా వ్యవస్థకు అంత రాయం ఏర్పడింది.పాడేరు, జి. మాడు గుల, చింతపల్లిని కలిపే మార్గం మూసి వేశారు. నిత్యావసర సరుకుల కోసం వారపు సంతలపై ఆధారపడే గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా పాడేరు నుంచి జి.మాడుగుల మీదుగా చింతపల్లి వెళ్లే ప్రధాన రహ దారి వరద నీటిలో పూర్తిగా కొట్టుకు పోయింది.ఈ మార్గం ఏజెన్సీ ప్రజలకు అత్యంత కీలకం.నిత్యం పదుల సంఖ్యలో గ్రామాల ప్రజలు ఇదే రోడ్డు గుండా ప్రయాణిస్తుంటారు. ఇప్పుడు ఈప్రధాన మార్గం ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోయి గిరిజనులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు.అత్యవసర పనులకు,కనీస అవసరాలకు బయటకు వెళ్లలేక స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. అరకులోయ మండలం బస్కి పంచాయితీ గిర్లిగూడ నుంచి కితలంగి పంచాయితీ మధ్య తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కల్వర్టు వర్షానికి కొట్టుకు పోయింది.పెదబయలు మండలంలోని ప్రధాన రహదారిపై కల్వర్టు మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. అధికారులు వెంటనే స్పందించి పాడైన రహదారిని బాగు చేయాలని కోరుతున్నారు.
జిల్లాలో148.31 హెక్టార్లలో వరి ముంపు
వాయుగుండం కారణంగా కురిసిన భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా 148.31 హెక్టార్లలో వరిపంట ముంపునకు గురై నట్లు వ్యవసా యశాఖ ప్రాథమికంగా నిర్ధారిం చింది.ముంపునకు గురైన పంటల వివరాలను వ్యవసాయశాఖ అధికారి కంగా ప్రకటించింది. ఈ వివరాలను చింతపల్లి వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు తిరుమలరావు వెల్లడిం చారు. జిల్లాలో లక్షకు పైగా ఎకరాల్లో వరిసాగు జరుగుతుండగా.. మూడు రోజులుగా కురిసిన భారీ వర్షా లకు కొన్నిచోట్ల వరిపంట ముంపునకు గురైంది.జి.మాడుగుల,గూడెంకొత్తవీధి, హుకుంపేట,చింత పల్లి,పెదబయలు, కొయ్యూ రు,డుంబ్రి గుడ,అరకులోయ ముంచంగి పుట్టు మండలాల్లోని 94 గ్రామాల్లోని 476 మంది రైతులకు సంబంధించి 148.31హెక్టార్లలో వరి పైరు నీట మునిగిందన్నారు.కేవలం 3.5 హెక్టార్లలో రాజ్మా,16 హెక్టార్లలో మిను ముల పంటలు నీటమునిగాయని పేర్కొ న్నారు.

యూపీఐ.. ఛార్జీలపై భారీ గందరగోళం

ప్రస్తుత డిజిటల్ యుగంలో నగదు రహిత లావాదేవీలువేగంగా పెరిగిపోయాయి.షాపింగ్ మాల్స్,కిరాణా షాపులు,ఆన్‌లైన్ కొనుగోళ్ల నుంచి చివరికి టీషాపుల వరకు అందరూ యూపీఐ,క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు లేదా స్వైపింగ్ మెషీన్ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు.ఈడిజిటల్ చెల్లింపుల ప్రక్రియ వెనుక మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎం డీఆర్) అనే కీలకమైన రుసుము ముడిపడి ఉంది.వ్యాపారులు,బ్యాంకులు,పేమెంట్ గేట్వేల మధ్య జరిగే ఆర్థికచక్రంలో మర్చంట్ డిస్కౌంట్ రేట్కీ లక పాత్ర పోషిస్తుంది.యూపీఐ లావాదేవీలపైఛార్జీలు లేదా మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలు విధించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నతరుణంలో వినియోగదారుల్లోఆందోళన నెలకొంది.రూ.2000దాటి పేమెం ట్లు చేస్తే ఛార్జీలు పడతాయనే భయాందోళన వినియోగదారుల్లో నెలకొంది.రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై అక్టోబర్ 15 నుంచి 0.4శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ వసూలు చేయనున్న నేపథ్యంలోఈఎండీఆర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..-(ప్రదీప్ కుమార్)

ఎండీఆర్ ఎలా పనిచేస్తుంది? ఓ విని యోగదారుడు దుకాణంలో వస్తువును కొను గోలు చేసికార్డు లేదా డిజిటల్ విధానంలో డబ్బులు చెల్లించినప్పుడు ఆపేమెంట్ సురక్షి తంగా జరిగేందుకు బ్యాంకులు, నెట్వర్క్ ప్రొవై డర్లు, పేమెంట్ గేట్‌వేలు కలిసి పనిచేస్తాయి. ఆ సేవలను అందించినందుకుగాను ఆయా సంస్థలు వ్యాపారి నుంచి కొంత శాతాన్ని రుసు ముగా వసూలు చేస్తాయి. ఆమొత్తాన్నే మర్చం ట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) అంటారు. ఉదా హరణకు ఒక్కశాతం ఎండీఆర్ అంటే.. కస్ట మర్ చెల్లించినరూ.1000లో రూ.10బ్యాంకు లకు రుసుముగా వెళ్లి..వ్యాపారి ఖాతాలో రూ.990మాత్రమే జమ అవుతాయి. ఆ 10 రూపాయలు వ్యాపారి మాత్రమే భరించాల్సి ఉంటుంది. దాంతో వినియోగదారుడికి ఎలాం టి నష్టం జరగదు.

అయితే పెద్ద వ్యాపార సంస్థలు ఎండీఆర్ ఛార్జీ లను సులువుగా భరించగలిగే అవకాశం ఉన్నప్పటికీ..తక్కువ లాభం మార్జిన్లతో పనిచేసే చిరువ్యాపారులకు ఈరుసుములు కాస్త భారం గా మారే అవకాశం ఉంది.అయితే సురక్షిత మైన పేమెంట్ల నిర్వహణ,సైబర్ భద్రత పెంచడం,డిజిటల్ నెట్‌వర్క్‌ను నిర్వహిం చేందుకు బ్యాంకులకు ఈఎండీఆర్ ఆదా యం అత్యవసరమని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. సమర్థవంతమైన ఎండీఆర్ విధానం ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలో పేతం కావడమే కాకుండా నగదు రహిత సమాజం దిశగా అడుగులు పడతాయని అభిప్రాయపడుతున్నారు.
ఎంత ఛార్జీలు?..
ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పర్సన్ టు పర్సన్ నగదు బదిలీలకు ఎలాంటి ఎండీఆర్ ఉండదు.కొత్త ఎండీఆర్ విధానం ప్రకారం రూ.2,000కు మించిన పర్సన్-టు-మర్చం ట్ లావాదేవీలపై 0.4శాతం ఎండీఆర్ విధి స్తారు.రూ.2 వేలలోపు జరిగే యూపీఐ లావా దేవీలపై ఎలాంటి ఎండీఆర్ ఛార్జీలు వర్తిం చవు. ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.300 మాత్రమే ఎండీఆర్ వర్తిస్తుంది.అంటే రూ. 75వేలు పైబడిన లావాదేవీలన్నింటికీ రూ.300మాత్రమే కట్ అవుతుంది.ఈ ఎండీఆర్ ఛార్జీలను వ్యాపారులే భరించాలి. నెలకూ రూ.లక్షవరకు యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా ఆదాయం పొందే చిన్న వ్యాపారులకు ఎండీఆర్ నుంచి మినహాయింపు ఉంది. టెలి కాం,రైల్వేలు,పెట్రోల్,ఇన్సూరెన్స్,పబ్లిక్ యుటి లిటీ బిల్లులకు శాతంతో సంబంధం లేకుండా కేవలం రూ.5ఫ్లాట్ ఛార్జ్ మాత్రమే ఉంటుంది.
కస్టమర్ల నెత్తిన పెడతారు..
ఈఎండీఆర్ వినియోగదారుల నెత్తిన పడే ప్రమాదంపై తీవ్రఆందోళన నెలకొంది. విని యోగదారులతో పాటు వ్యాపార వర్గాల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది.అదనపు ఖర్చును కస్టమర్ల నుంచే వసూలు చేస్తామని కొందరు వ్యాపారు చెబుతుండగా..మరికొందరు యూపీఐ పేమెంట్లకు బదులుగా మళ్లీ నగదు చెల్లింపులను ప్రోత్సహించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.ఈక్రమంలో వస్తువులు, సేవ ల ధరలుకూడా పెరిగే అవకాశముందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు యూపీఐ చెల్పింపుల వ్యవస్థపై కూడా భారీ దెబ్బ పడే అవకాశం ఉందని ఆందోళ నలు వ్యక్తమవుతున్నాయి.అయితే చాలా మంది చిన్న వ్యాపారులకు, యూపీఐ వినియోగ దారులకు అసలు ఎండీఆర్(మర్చంట్ డిస్కౌం ట్ రేట్) అంటే అసలు అవగాహనే లేదు. ఈ తరుణంలో వారికి దీనిపై అవగాహన కల్పిం చాల్సి ఉంది.
అవగాహన కల్పిస్తారా?
ఈకొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధానం గురించి చాలామంది వ్యాపారులకు కనీసం అవగాహన లేదు. ఏ లావాదేవీలకు వర్తిస్తుంది, వేటికి వర్తించదు అనేఅంశాలపై వ్యాపారు లతోపాటు వినియోగదారులకు కేంద్ర ప్రభు త్వం పేమెంట్ అగ్రిగేటర్లతో కలిసి అవగా హన కార్యక్రమాలు నిర్వహించాలి.వ్యాపారులకు కొత్త ఛార్జీల విధానాన్ని క్షుణ్ణంగా వివరించి అనవసర గందరగోళం లేకుండా చూడాలి. అవగాహన కార్యక్రమాల గురించి ఇదివరకే కేంద్రప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
7 ఉచిత లావాదేవీలకు ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు..
పర్సన్ టు పర్సన్: ఒకరి బ్యాంకు ఖాతా నుంచి మరొకరి బ్యాంక్ ఖాతాకు నేరుగా డబ్బులు పంపే పర్సన్ టు పర్సన్ లావాదేవీలకు జీరో ఎండీఆర్ వర్తిస్తుంది. ఎలాంటి లిమిట్ లేదు. ఇతరుల నుంచి మీ బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేసిన ఎలాంటి ఛార్జీలు వర్తించవు. చిరు వ్యాపారులకు చేసే పేమెంట్స్: క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన కిరాణా దుకాణం,స్థానిక వ్యాపారులకు చేసే పేమెంట్లపై నెలకు రూ.లక్ష వరకు ఎలాంటి ఛార్జీలు పడవు.ఎండీఆర్ కేవ లం వ్యాపారులే చెల్లిస్తారని గుర్తుంచు కోవాలి. రూ.2000వేలలోపు వాలెట్ చెల్లింపు: పేటీఎం, ఫోన్ పే లేదా ఇతర ప్రీపెయిడ్ వాలెట్ల నుంచి రూ.2 వేల లోపు జరిపే వాలెట్ చెల్లింపులపై ఎండీఆర్ ఛార్జీలు వర్తించవు. ప్రభుత్వ సేవలకు లావాదేవీలు:ప్రభుత్వ ట్యాక్సులు,చలానాలు, సేవలకు యూపీఐద్వారా చేసే చెల్లింపులు ఆన్ లైన్ ఈ-కామర్స్ ఆర్డర్లు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సైట్లలో చేసే యూపీఐ లావా దేవీలకు ఎలాంటి ఎండీఆర్ ఛార్జీలు పడవు. యూపీఐ ఆటోపే: బిజినెస్ బిల్లులు,ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు,సిప్‌ల కోసం షెడ్యూల్ చేసుకునే ఆటో పేలపై ఎలాంటి ఛార్జీలు పడవు.
రూ.2 వేల లోపు పర్సన్ టూ మర్చంట్: బడా వ్యాపారులకు చేసే పర్సన్ టూ మర్చంట్ యూపీఐ లావాదేవీలు రూ.2వేలలోపు ఉచి తం.ఆపైన చేసే లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలను వ్యాపారులే చెల్లిం చాల్సి ఉంటుంది.
కేంద్రం నిఘా
కేంద్రం త్వరలో వసూలు చేసే ఎండీఆర్ విని యోగదారుల నెత్తిన పడే ప్రమాదం ఉందనే ఆందోళన నెలకొన్న తరుణంలో..వ్యాపారి లావాదేవీలను నిత్యం పర్యవేక్షించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.వ్యాపారులు మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలను వినియో గదారుల ఖాతానుంచి వ్యాపారి వసూలు చేయ కుండా కేంద్రం భారీ చర్యలను చేపడుతోంది. అక్టోబర్ 15నుంచి అమలు కానున్న విధా నంపై కేంద్ర ప్రభుత్వం నిఘాను ఏ మేరకు పెట్టనుందో వేచి చూడాల్సిందే.
యూపీఐ ఉచితంగా ఉండాలి.. ఛార్జీలు విధిస్తే డిజిటల్ ఇండియాకి అర్థం లేదు..
దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ద్వారా జరిగే లావాదేవీలపై ఎలాంటి రుసుములు విధించకూడదని..మరికొన్నేళ్ల పాటు సున్నా ఫీజు విధానాన్ని కొనసాగిం చాలని నీతి ఆయోగ్ మాజీ వైస్-ఛైర్మన్ రాజీవ్ కుమార్ ప్రభుత్వానికి సూచించారు.దేశంలో కరెన్సీ-జీడీపీ నిష్పత్తి స్పష్టంగా తగ్గుముఖం పట్టే ధోరణి కనిపిచే వరకు యథాతథ స్థితిని కొనసాగించి..ఆతర్వాతే ఫీజుల అంశంపై సమీక్ష జరపాలని ఆయన అభిప్రాయపడ్డారు. పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన.. ఏ రకమైన లావాదేవీల విలువ పైనైనా వ్యాపారుల నుండి రుసుము వసూలు చేయడాన్ని తాను సమర్థించడం లేదని..యూపీఐని విస్తృత సాను కూల ప్రయోజనాలు కలిగించే ఒక ‘ప్రజా ప్రయోజన’ (Pubశ్రీఱc Gశీశీd) సేవగా ప్రభుత్వం పరిగణించాలని స్పష్టం చేశారు.
యూపీఐ డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్వ హణకు ప్రభుత్వ ఖజానాపై దాదాపు రూ. 20, 000 కోట్ల భారం పడుతున్నప్పటికీ, డిజిటల్ లావాదేవీల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు చేకూరే మొత్తం ప్రయోజనాలు ఆ ఖర్చు కంటే చాలా ఎక్కువ అని రాజీవ్ కుమార్ వివరించారు. ప్రస్తుతం యూపీఐలో 96 శాతం లావాదేవీలు రూ.2,000 కంటే తక్కువ విలువ కలిగినవే అయినప్పటికీ,మొత్తం లావాదేవీల విలువ పరంగా చూస్తే 66శాతం లావాదేవీలు 2,000 కంటే ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. ఇలాంటి తరుణంలో వ్యాపారులపై స్వల్ప రుసుము విధించినా, వ్యాపారులు తిరిగి నగదు లావాదేవీల (్పుasష్ట్ర Tతీaఅsactఱశీఅs) వైపు మళ్లే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మరింత పటిష్టం కావడానికి ఉచిత సేవలను కొనసాగించడమే శ్రేయస్కరమని పేర్కొన్నారు.
మరోవైపు ఆరేళ్ల పాటు ఉచిత సేవలు అందిం చిన తర్వాత..అక్టోబర్ 15 నుండి రూ. 2,000 పైబడిన వ్యక్తి-నుండి-వ్యాపారి (P2వీ) లావా దేవీలపై 0.4శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటు (వీణ=) వసూలు చేయనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది.అయితే రోజువారీ వ్యక్తి గత చెల్లింపులు, చిన్న లావాదేవీలకు ఈ రుసు ముల నుండి మినహాయింపు ఉంటుంది. అలాగే,రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన చెల్లింపులకు గరిష్ట వీణ= పరిమితిని రూ.300గా నిర్ణయించారు. రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్,ఇంధనం మరియు వ్యవసాయ రంగాల వంటి తక్కువ లాభదాయక రంగా లలో రూ.2,000 పైబడిన ప్రతి లావాదేవీకి రూ.5 స్థిరమైన వీణ= మాత్రమే వర్తిస్తుంది. ఇవి మొత్తం P2వీ లావాదేవీల విలువలో 17 శాతం,పరిమాణంలో 46శాతం వాటాను కలిగి ఉన్నాయి.ఈ రుసుముల విధింపుపై రాజకీ యంగా తీవ్ర దుమారం రేగగా.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది.మర్చంట్ డిస్కౌంట్ రేటు (వీణ=) అనేది కేవలం వ్యాపా రుల చెల్లింపుల వ్యవస్థకు సంబంధించి విధిం చే రుసుము మాత్రమేనని, సాధారణ వినియో గదారుల (Usవతీs)పై ఎలాంటి రకమైన భారం పడదని తేల్చి చెప్పింది.ప్రజలు ఎటువంటి నెలవారీ పరిమితులు లేదా టైర్ ఆధారిత పరి మితులు లేకుండా అపరిమిత ఉచిత యూపీఐ సేవలను ఎప్పటిలాగే పొందుతారని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వివరించింది.
యూపీఐ ఎంత పెద్ద వ్యవస్థగా మారింది?
యూపీఐ విస్తృతి ఇప్పుడు భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన స్థాయికి చేరింది. చీP్పుI గణాంకాల ప్రకారం 2026 ఆగస్టులో యూపీఐద్వారా 24,508.96 మిలియన్ అంటే సుమారు 24.51బిలియన్ లావాదే వీలు జరిగాయి.వాటి మొత్తం విలువ రూ.29, 82,355.95కోట్లు. అదే నెలలో యూపీఐతో అనుసంధానమైన బ్యాంకుల సంఖ్య 752గా ఉంది.అంటే రోజువారీ జీవితంలో యూపీఐ ఎంతగా కలిసిపోయిందో ఈగణాంకాలే చెబు తున్నాయి.ఇలాంటి విస్తృతవ్యవస్థలో ధర విధా నంలో చిన్న మార్పు కూడా వ్యాపారులు, బ్యాం కులు,పేమెంట్ యాప్‌లు,చివరికి వినియో గదారులపై ప్రభావంచూపే అవకాశం ఉంది.
కార్పొరేట్ ఆధిపత్యంపై చర్చ
యూపీఐ మార్కెట్‌లో పెద్ద పేమెంట్ యాప్ లకు గణనీయమైన వాటా ఉంది.అధిక విలు వైన లావాదేవీలపై వీణ=ద్వారా ఆదాయం ఏర్పడటం వల్ల పెద్ద పేమెంట్ ప్లాట్ ఫారమ్ లకు కూడా కొత్త ఆదాయ ప్రవాహం ఏర్పడే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషణలు సూచి స్తున్నాయి. అదే సమయంలో చిన్న పేమెంట్ సంస్థలు,బ్యాంకులు,వ్యాపారులకు దీని ప్రభా వం ఎలా ఉంటుందన్నది అమలు తర్వాతే స్పష్టమవుతుంది.ఇది కేవలం “చార్జీ వస్తుందా లేదా?”అనే ప్రశ్న కాదు.లిలియూపీఐ అభివృద్ధి ఖర్చును ఎవరు భరించాలి? ఆదాయం ఎవరికి వెళ్లాలి? చిన్న వ్యాపారులు, వినియోగదారుల ప్రయోజనాలు ఎలా రక్షించాలి? అన్నది అస లు చర్చ.
ముందున్న అసలు ప్రశ్న
అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వచ్చే వీణ=తో యూపీఐ పూర్తిగా“పెయిడ్ సిస్టమ”గా మారడం లేదు. P2P చెల్లింపులు,రూ.2,000వరకు అర్హతగల మర్చంట్ చెల్లింపులు,అర్హతగల చిన్న వ్యాపారులకు మినహాయింపులు కొనసా గుతు న్నాయి.అయినప్పటికీ ఇప్పటివరకు ఉచితంగా ఉన్న అధిక విలువైన మర్చంట్ చెల్లింపులకు ధర నిర్ణయించడం ఒక కొత్త దశకు నాంది.ఈ మార్పు వల్ల వ్యవస్థకు అవసరమైన నిర్వహణ ఆదాయం లభిస్తుందా?చిన్నవ్యాపారులపై భా రం ఎంతవరకు ఉంటుంది?వినియోగదారు లకు పరోక్షంగా ఖర్చు బదిలీ అవుతుందా? డిజిటల్ చెల్లింపుల వినియోగంపై ప్రభావం ఎంత?పెద్ద పేమెంట్ సంస్థల మార్కెట్ వాటా లు మరింత పెరుగుతాయా?ఈ ప్రశ్నలకు సమాధానాలు కాలమే చెప్పాలి.యూపీఐని ప్రజల సౌకర్యంగా,సమగ్ర డిజిటల్ మౌలిక వేదికగాకొనసాగించాలంటే ఆదాయం,నిర్వ హణవ్యయం,చిన్నsవ్యాపారాల రక్షణ,విని యోగదారుల ప్రయోజనం,పోటీ ఈఐదు అం శాల మధ్య సమతుల్యతే కీలకం.

ఓట్ల దొంగతనం ఆరోపణలు.. ప్రజాస్వామ్యానికి పరీక్ష

భారత ప్రజాస్వామ్యానికి పునాది ఓటు.ఆఓటు స్వేచ్ఛగా,నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వినియోగించుకునే హక్కు ప్రతి పౌరుడికీ రాజ్యాంగం కల్పించింది.అలాంటి ఓటుహక్కుపై సందేహాలు తలెత్తినప్పుడు అదికేవలం రాజకీయవివాదంగా చూడలేం.అదిప్రజాస్వామ్య వ్యవస్థకే ఎదురైన సవాలుగా భావించాలి.ఇటీవలి పరిణామాలు ఎన్నికల సంఘం పనితీరు,ఓటర్లజాబితాలసవరణ,పారదర్శకత, అంతర్గత భిన్నాభిప్రాయాలువంటి అంశాలపై దేశవ్యాప్తంగాచర్చకు దారితీశాయి. ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలోపేర్లు తొలగించారనే ఆరోపణలు,ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్)పై వ్యక్తమవుతున్న అభ్యంతరాలు,వాటిపై రాజకీయపార్టీలు,పౌరసంఘాలు వేస్తున్నప్రశ్నలు సాధార ణంగా కొట్టిపారేయాల్సినవి కావు.ఎన్నికలసంఘం భారతరాజ్యాంగవ్యవస్థలో అత్యంత కీలకమైన స్వతంత్ర సంస్థ.దేశప్రజల తీర్పును ఎన్నికల రూపంలో ప్రతిబింబించే బాధ్యత దానిదే. అందుకే ఎన్నికల ప్రక్రియపై చిన్నఅనుమానం కూడా పెద్దచర్చకు దారితీస్తుంది.
ఓటర్ల జాబితాల సవరణలో పారదర్శకత ఉందా?తొలగించిన పేర్లకుసరైన సమాచారం అందిం చారా? అభ్యంతరాలు,అప్పీళ్లకు తగినఅవకాశం కల్పించారా?డిజిటల్ విధానాలను ఉపయో గించినప్పుడు వాటివివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారా?వంటి ప్రశ్నలకు ఎన్ని కల సంఘమే స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలి.ప్రజాస్వామ్యంలో విశ్వాసం కోరుకోవడం కంటే,విశ్వాసానికి కారణాలు చూపించడం ముఖ్యం.ఓటర్ల జాబితా నుంచి ఒకపేరు తొలగిం చడం కేవలం ఒకగణాంకాన్ని మార్చడంకాదు. అదిఒక పౌరుడి ప్రజాస్వామ్యహక్కును ప్రభా వితం చేసే అంశం.పేదలు,వలస కార్మికులు,ఆదివాసీలు,అట్టడుగువర్గాలు,నిరక్షరాస్యులు, చిరునామాలు తరచుగా మారే కుటుంబాలు..ఇలాంటివర్గాలు ఓటర్లజాబితా సవరణలో ఎక్కు వగా నష్టపోయే ప్రమాదంఉంది.అందుకే ఏదైనా భారీస్థాయి సవరణ చేపట్టినప్పుడు,ఎవరూ ఓటుహక్కు కోల్పోకుండా చూడటం ఎన్నికల వ్యవస్థకు అత్యంత ముఖ్యమైన బాధ్యత.
ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలు అడగడం దేశద్రోహం కాదు.ప్రభుత్వాన్ని,ఎన్నికలసంస్థలను ప్రశ్నించడం ప్రజాస్వామ్యహక్కు.శాంతియుతంగా నిరసనవ్యక్తం చేయడం రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలో భాగం.మహాత్మాగాందీచూపిన సత్యాగ్రహమార్గం కూడా ఇదేవిషయాన్ని గుర్తు చేస్తుంది. అన్యాయాన్ని ప్రశ్నించడం,సత్యంకోసం నిలబడటం,అహింసాయుతంగా నిరసనవ్యక్తం చేయడం ప్రజాస్వామ్యానికి బలం.
సుప్రీంకోర్టు సహా న్యాయవ్యవస్థ పాత్ర కూడా కీలకమే.ఓటుహక్కు,ఎన్నికల పారదర్శకత, ఓటర్లజాబితాలసవరణ వంటి అంశాల్లో స్పష్టమైన న్యాయపరమైన ప్రమాణాలు ప్రజాస్వామ్యానికి బలమైన రక్షణగా నిలుస్తాయి.గాంధీ జయంతి రోజున సత్యాగ్రహాన్ని గుర్తుచేసుకోవడం కేవలం ఒక చారిత్రక స్మరణకాదు.ప్రజాస్వామ్యంలో సత్యం,అహింస,ప్రశ్నించే హక్కు,ప్రజల భాగస్వా మ్యం ఎంతముఖ్యమో గుర్తుచేసుకోవడం.స్వాతంత్య్ర పోరాటంలో భారతీయులు “మాకు స్వేచ్ఛ కావాలి”అని ప్రశ్నించారు.నేడు అదే ప్రజాస్వామ్యవారసత్వం మనల్ని మరోప్రశ్న అడగమం టోంది.ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా చేయాలి.తొలగించిన ప్రతి ఓటరుకు కారణం తెలియజేసి,అప్పీల్‌కు అవకాశం కల్పించాలి.సర్‌పై ఉన్న అనుమానాలకు ఎన్నికల సంఘం స్పష్టమైన వివరణ ఇవ్వాలి.ఆ ఓటుపై సందేహం వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం సమాధానం చెప్పాలి.ఆప్రశ్నను అడిగినప్పుడు ప్రజలను శత్రువులుగా చూడ కూడదు.ఎందుకంటే ఓటు పోతే..ప్రజల గొంతు పోతుంది.ప్రజల గొంతు పోతే..ప్రజాస్వామ్యమే బలహీనపడుతుంది.ఎన్నికల సంఘం ప్రజల విశ్వాసాన్ని కాపాడాలి.రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.ప్రజలు తమ ఓటు హక్కును కాపాడుకోవాలి.!– రెబ్బాప్రగడ రవి,ఎడిటర్,

1 2