వర్షం వణికించింది
“ రాష్ట్రవ్యాప్తంగా వాయుగుండం తీరం దాటింది..వర్షం తగ్గుముఖం పట్టింది...కానీ కొన్ని జిల్లాలో వరదల ప్రభావం మాత్రం కొనసాగుతూనే ఉంది.నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలకు ఉత్తరాంధ్రలో జనజీవనం అస్తవ్యస్థమైంది.ప్రస్తుతం వర్షం లేకపోయినప్పటికీ అల్లూరి సీతారామారాజు జిల్లాలో పలు గిరిజన గ్రామాలకు వర్షపు నీరు చేరింది.మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో పలు చోట్ల చెట్లు,కొండచరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఎగువ నుంచి ప్రవహిస్తున్న వర్షపు నీటితో మన్యంలో వాగులు, గెడ్డలు ఇంకా ఉద్ధృ తంగా ప్రవహిస్తున్నాయి. స్వల్పంగా ఈదురుగాలులతో చెట్లు, అక్కడక్కడ విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని గిరిజన గ్రామాలను అంధకారంలోకి నెట్టేశాయి. సకాలంలో వర్షాలు పడి అన్నదాతను ఆదుకున్నా..రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు, విద్యుత్తు స్తంభాలు భారీగా ధ్వంసమయ్యాయి. వాగులు, గెడ్డలుఉద్ధృ తంగా ప్రవహిస్తుండటంతో.. కొన్ని గ్రామా లకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు హెచ్చరిస్తున్నా నిత్యావసరాల కోసం,గ్రామాలకు వెళ్లేందుకు కొందరు గిరిజనులు సాహసాలు చేసి ప్రమాదకరంగా వాగులు దాటుతున్నారు.” - గునపర్తి సైమన్
మన్యంలో..రహదారుల కల నెరవేర తుంది..తమకు డోలి మోతలు తప్పుతా యనుకుని సంబరపడుతున్న తరుణంలో వాయుగుండం గిరిజనుల ఆశలను చిదిమేసింది.అల్లూరి సీతారామారాజు జిల్లాలో నేటికీ చాలా గ్రామాలకు సరైన రహదారులు లేవు.కూటమి ప్రభుత్వం అడవితల్లి బాట పేరుతో మారుమÖల ఆదివాసీ గ్రామాలకు రహదారులు నిర్మిస్తోంది.గూడెంకొత్త వీథి మండలం లోని చాలా ఊర్లకు ప్రస్తుతం రహదారి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో నిర్మాణాలు పూర్తవుతా యనుకుంటున్న తరుణంలో భారీ వర్షా నికి ఎక్కడికక్కడ రోడ్లు దెబ్బతిన్నాయి. గూడెం కొత్త వీథి నుంచి చెరకుంపాకలు వెళ్లే రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. సప్పర్ల నుంచి ఆకులూరు మధ్య రెండు కల్వర్టులు దెబ్బతిన్నాయి.ఎం.బూసికొండ వద్ద రోడ్డు కూడా దెబ్బతింది.
దారులు ఛిద్రం.. ప్రయాణం నరకం
మండలంపై అధిక ప్రభావం చూపింది. పెద్దసంఖ్యలో కల్వర్టులు,రహదారులు ఛిద్రమయ్యాయి.లంకపాకలు-పనసపల్లి గ్రామాల మధ్య కల్వర్టు పూర్తిగా కొట్టుకు పోయింది.ఈ మార్గంలో అనేక గ్రామా లకు రాక పోకలు నిలిచిపోయాయి. సీలేరు సమీపంలో ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది.దీంతో సీలేరు -నర్సీపట్నం మార్గంలో రాకపోకలు నిలి చిపోయాయి.లంబసింగి తాజంగి నడు మ అత్యవసర సమయాల్లో అంబులె న్సులను మాత్రమే అనుమతిస్తున్నారు.
మూతపడిన జాతీయరహదారి
జి.మాడుగుల పరిధిలో జాతీయరహదారి కొట్టుకుపోయింది.దీంతోపాటు చింత పల్లి-కృష్ణదేవిపేట నడుమ రాకపోకలను మÖడు రోజుల నుంచి మూసేశారు. రంపుల ఘాట్రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున పెద వలస వద్ద బారికేడ్లు పెట్టారు. గూడెం కొత్తవీధి-సీలేరు ప్రధాన రహదారి ఛిద్రమై వాహనాలు బురదలో కూరుకు పోతున్నాయి. తాజంగి-లంబసింగి మధ్య తాత్కాలికంగా వాహనాల రాకపోకలు నిలిపివేశారు. హుకుంపేట మండలం లోని భీమవరం,సుకూరు రెండు గ్రామ పంచాయతీల పరిధిలోని తోటకూర పాడు, గంగవరం గ్రామాలకు రహదా రుల నిర్మాణం పూర్తికాకముందే ఛిద్రమైంది.ఒక వైపు నిర్మాణం చేపడు తుంటే మరోవైపు గోతులు,పెచ్చులూడి దర్శనమిస్తోంది.దీంతో మట్టిరోడ్డు ఉన్న సమయంలో కంటే ప్రస్తుతం రాకపోక లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన ఎన్నో ఏళ్లకు తోట కూరపాడుకు రోడ్డు నిర్మాణంతో కష్టాలు తీరతాయని ఈప్రాంత గిరిజనులు ఆశపడ్డారు.అయితే రోడ్డు నిర్మాణం చేపడుతున్నా నాణ్యత లేకపోవడంతో వర్షాలకు అధ్వానంగా మారి,రాకపో కలకు మరింత అవస్థలు పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.అలాగే గంగవరం గ్రామానికి తొలుత నుంచి రోడ్డు సదుపాయం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలలకే ఈ గ్రామానికి రోడ్డు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. తారు రోడ్డు నిర్మాణం పూర్తయింది. అయితే గత ఏడాది వచ్చిన భారీ తుఫాన్‌కు రోడ్డు మొత్తం గుంతలు పడి,కోతకు గురై అధ్వానంగా మారింది.దీంతో ఈపంచాయతీకి చెందిన ప్రజలు ఆటవీ ఉత్పత్తులు,పంటలను వారపు సంతకు తీసుకు వెళ్లేందుకు ఇబ్బం దులు పడుతున్నారు.అనారోగ్యం బారిన పడినా,గర్భిణులు,బాలింతలను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు వీలు కావడంలేదు. అధికారులు స్పందించి ఈ రహదారి పునఃనిర్మించాలని గిరిజనులు కోరుతు న్నారు.పెదబయలు మండలంలో జడి గుడచింతలవీథి మధ్య పెద్దగెడ్డ ఉప్పొం గడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల నిర్మించిన రాయగడ వంతెన వద్ద అప్రోచ్‌రోడ్డు పదిఅడుగుల మేర కుంగిపోయింది.అధికారులు అప్రమత్తమై మరమ్మతులు చేపట్టారు. పాడేరు వంతాడపల్లి చెక్ పోస్ట్ సమీపంలో కల్వర్టు రిటైనింగ్ వాల్ కూలిపోయింది. జీకేవీథి మండలంలో ఇటీవల నిర్మించిన జర్రెల కొత్తూరు కల్వర్టు కొట్టుకు పోయింది.సీలేరు ఏరియా దుప్పిలవాడ పంచాయితీ డి.అగ్రహారం వంతెన వరద నీటి ఉధృక్తితకు కొట్టుకుపోయింది. దీంతో సుమారు 14గ్రామాలకు రాక పోకలు నిలిచిపోయాయి. అరకులోయ మండలం గిర్లిగుడ`పరిశీల మధ్య కల్వర్టు కొట్టుకుపోయింది.వరద ఉద్ధృ తికి పలుచోట్ల వంతెనలు,కల్వర్టులు కోతకు గురై కొట్టుకుపోయాయి.దీంతో అనేక గిరిజన గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపో యాయి.ఏజెన్సీ ప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో రవాణా వ్యవస్థకు అంత రాయం ఏర్పడింది.పాడేరు, జి. మాడు గుల, చింతపల్లిని కలిపే మార్గం మూసి వేశారు. నిత్యావసర సరుకుల కోసం వారపు సంతలపై ఆధారపడే గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా పాడేరు నుంచి జి.మాడుగుల మీదుగా చింతపల్లి వెళ్లే ప్రధాన రహ దారి వరద నీటిలో పూర్తిగా కొట్టుకు పోయింది.ఈ మార్గం ఏజెన్సీ ప్రజలకు అత్యంత కీలకం.నిత్యం పదుల సంఖ్యలో గ్రామాల ప్రజలు ఇదే రోడ్డు గుండా ప్రయాణిస్తుంటారు. ఇప్పుడు ఈప్రధాన మార్గం ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోయి గిరిజనులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు.అత్యవసర పనులకు,కనీస అవసరాలకు బయటకు వెళ్లలేక స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. అరకులోయ మండలం బస్కి పంచాయితీ గిర్లిగూడ నుంచి కితలంగి పంచాయితీ మధ్య తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కల్వర్టు వర్షానికి కొట్టుకు పోయింది.పెదబయలు మండలంలోని ప్రధాన రహదారిపై కల్వర్టు మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. అధికారులు వెంటనే స్పందించి పాడైన రహదారిని బాగు చేయాలని కోరుతున్నారు.
జిల్లాలో148.31 హెక్టార్లలో వరి ముంపు
వాయుగుండం కారణంగా కురిసిన భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా 148.31 హెక్టార్లలో వరిపంట ముంపునకు గురై నట్లు వ్యవసా యశాఖ ప్రాథమికంగా నిర్ధారిం చింది.ముంపునకు గురైన పంటల వివరాలను వ్యవసాయశాఖ అధికారి కంగా ప్రకటించింది. ఈ వివరాలను చింతపల్లి వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు తిరుమలరావు వెల్లడిం చారు. జిల్లాలో లక్షకు పైగా ఎకరాల్లో వరిసాగు జరుగుతుండగా.. మూడు రోజులుగా కురిసిన భారీ వర్షా లకు కొన్నిచోట్ల వరిపంట ముంపునకు గురైంది.జి.మాడుగుల,గూడెంకొత్తవీధి, హుకుంపేట,చింత పల్లి,పెదబయలు, కొయ్యూ రు,డుంబ్రి గుడ,అరకులోయ ముంచంగి పుట్టు మండలాల్లోని 94 గ్రామాల్లోని 476 మంది రైతులకు సంబంధించి 148.31హెక్టార్లలో వరి పైరు నీట మునిగిందన్నారు.కేవలం 3.5 హెక్టార్లలో రాజ్మా,16 హెక్టార్లలో మిను ముల పంటలు నీటమునిగాయని పేర్కొ న్నారు.
