ఓట్ల దొంగతనం ఆరోపణలు.. ప్రజాస్వామ్యానికి పరీక్ష

భారత ప్రజాస్వామ్యానికి పునాది ఓటు.ఆఓటు స్వేచ్ఛగా,నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వినియోగించుకునే హక్కు ప్రతి పౌరుడికీ రాజ్యాంగం కల్పించింది.అలాంటి ఓటుహక్కుపై సందేహాలు తలెత్తినప్పుడు అదికేవలం రాజకీయవివాదంగా చూడలేం.అదిప్రజాస్వామ్య వ్యవస్థకే ఎదురైన సవాలుగా భావించాలి.ఇటీవలి పరిణామాలు ఎన్నికల సంఘం పనితీరు,ఓటర్లజాబితాలసవరణ,పారదర్శకత, అంతర్గత భిన్నాభిప్రాయాలువంటి అంశాలపై దేశవ్యాప్తంగాచర్చకు దారితీశాయి. ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలోపేర్లు తొలగించారనే ఆరోపణలు,ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్)పై వ్యక్తమవుతున్న అభ్యంతరాలు,వాటిపై రాజకీయపార్టీలు,పౌరసంఘాలు వేస్తున్నప్రశ్నలు సాధార ణంగా కొట్టిపారేయాల్సినవి కావు.ఎన్నికలసంఘం భారతరాజ్యాంగవ్యవస్థలో అత్యంత కీలకమైన స్వతంత్ర సంస్థ.దేశప్రజల తీర్పును ఎన్నికల రూపంలో ప్రతిబింబించే బాధ్యత దానిదే. అందుకే ఎన్నికల ప్రక్రియపై చిన్నఅనుమానం కూడా పెద్దచర్చకు దారితీస్తుంది.
ఓటర్ల జాబితాల సవరణలో పారదర్శకత ఉందా?తొలగించిన పేర్లకుసరైన సమాచారం అందిం చారా? అభ్యంతరాలు,అప్పీళ్లకు తగినఅవకాశం కల్పించారా?డిజిటల్ విధానాలను ఉపయో గించినప్పుడు వాటివివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారా?వంటి ప్రశ్నలకు ఎన్ని కల సంఘమే స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలి.ప్రజాస్వామ్యంలో విశ్వాసం కోరుకోవడం కంటే,విశ్వాసానికి కారణాలు చూపించడం ముఖ్యం.ఓటర్ల జాబితా నుంచి ఒకపేరు తొలగిం చడం కేవలం ఒకగణాంకాన్ని మార్చడంకాదు. అదిఒక పౌరుడి ప్రజాస్వామ్యహక్కును ప్రభా వితం చేసే అంశం.పేదలు,వలస కార్మికులు,ఆదివాసీలు,అట్టడుగువర్గాలు,నిరక్షరాస్యులు, చిరునామాలు తరచుగా మారే కుటుంబాలు..ఇలాంటివర్గాలు ఓటర్లజాబితా సవరణలో ఎక్కు వగా నష్టపోయే ప్రమాదంఉంది.అందుకే ఏదైనా భారీస్థాయి సవరణ చేపట్టినప్పుడు,ఎవరూ ఓటుహక్కు కోల్పోకుండా చూడటం ఎన్నికల వ్యవస్థకు అత్యంత ముఖ్యమైన బాధ్యత.
ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలు అడగడం దేశద్రోహం కాదు.ప్రభుత్వాన్ని,ఎన్నికలసంస్థలను ప్రశ్నించడం ప్రజాస్వామ్యహక్కు.శాంతియుతంగా నిరసనవ్యక్తం చేయడం రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలో భాగం.మహాత్మాగాందీచూపిన సత్యాగ్రహమార్గం కూడా ఇదేవిషయాన్ని గుర్తు చేస్తుంది. అన్యాయాన్ని ప్రశ్నించడం,సత్యంకోసం నిలబడటం,అహింసాయుతంగా నిరసనవ్యక్తం చేయడం ప్రజాస్వామ్యానికి బలం.
సుప్రీంకోర్టు సహా న్యాయవ్యవస్థ పాత్ర కూడా కీలకమే.ఓటుహక్కు,ఎన్నికల పారదర్శకత, ఓటర్లజాబితాలసవరణ వంటి అంశాల్లో స్పష్టమైన న్యాయపరమైన ప్రమాణాలు ప్రజాస్వామ్యానికి బలమైన రక్షణగా నిలుస్తాయి.గాంధీ జయంతి రోజున సత్యాగ్రహాన్ని గుర్తుచేసుకోవడం కేవలం ఒక చారిత్రక స్మరణకాదు.ప్రజాస్వామ్యంలో సత్యం,అహింస,ప్రశ్నించే హక్కు,ప్రజల భాగస్వా మ్యం ఎంతముఖ్యమో గుర్తుచేసుకోవడం.స్వాతంత్య్ర పోరాటంలో భారతీయులు “మాకు స్వేచ్ఛ కావాలి”అని ప్రశ్నించారు.నేడు అదే ప్రజాస్వామ్యవారసత్వం మనల్ని మరోప్రశ్న అడగమం టోంది.ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా చేయాలి.తొలగించిన ప్రతి ఓటరుకు కారణం తెలియజేసి,అప్పీల్‌కు అవకాశం కల్పించాలి.సర్‌పై ఉన్న అనుమానాలకు ఎన్నికల సంఘం స్పష్టమైన వివరణ ఇవ్వాలి.ఆ ఓటుపై సందేహం వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం సమాధానం చెప్పాలి.ఆప్రశ్నను అడిగినప్పుడు ప్రజలను శత్రువులుగా చూడ కూడదు.ఎందుకంటే ఓటు పోతే..ప్రజల గొంతు పోతుంది.ప్రజల గొంతు పోతే..ప్రజాస్వామ్యమే బలహీనపడుతుంది.ఎన్నికల సంఘం ప్రజల విశ్వాసాన్ని కాపాడాలి.రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.ప్రజలు తమ ఓటు హక్కును కాపాడుకోవాలి.!– రెబ్బాప్రగడ రవి,ఎడిటర్,

1 2