ఏజెన్సీలో డ్రోన్ల శకం

“ ఏజెన్సీలో డ్రోన్ల శకం ప్రారంభమైంది.గిరిజన ప్రాంతాల వైద్య సేవల్లో సాంకేతిక విప్లవానికి నాంది పలకింది.ముందుగా ముంచంగిపుట్టులో సరికొత్త ప్రయోగాన్ని చేపట్టారు. కొండలు, లోయలు,దట్టమైన అడవులు…ఇవే అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల ప్రత్యేకత.కానీ ఇవే అక్కడి ప్రజలకు వైద్య సేవలను దూరం చేస్తున్న అడ్డంకులు కూడా. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి చేరుకునేలోపే గర్భిణీలు, రోగులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. సరైన రహదా రులు లేక అంబులెన్సులు చేరలేని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలను వేగంగా అందిం చేందుకు ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను ఆశ్రయించింది.ఇప్పుడు ఏజెన్సీ ఆకాశంలో డ్రోన్లు ఎగురుతున్నాయి…మందులు,రక్త నమూనాలు, పరీక్షల నివేదికలను మోసుకెళ్తూ ఆశాకిరణా లుగా మారుతున్నాయి. ”
అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.ఇటీవల అక్కడకు ఓడ్రోన్ వచ్చి వాలింది. సిబ్బంది వెంటనే తాము సేకరించిన రక్త నమూనాలను అందించగానే రివ్వున ఎగిరిపోయింది. మర్నాడు సరిగ్గా అదే సమయానికి ఆడ్రోన్ మరోసారి వచ్చింది. ఈసారి తనవెంట రక్త నమూనాల రిపోర్టులతో పాటు ఆ పీహెచ్‌సీకి అవసరమైన మందులను కూడా మోసు కొచ్చింది. ఏజెన్సీలో డ్రోన్ల శకం ప్రారం భమైంది.గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొండలు,కోనలతో విభిన్న భౌగోళిక పరిస్థి తులు కలిగిన అల్లూరిజిల్లాలో వీటిని అందు బాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. పాడేరు నుంచి వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ ద్వారా మందుల పంపిణీని 2నెలల నుంచి ప్రయోగాత్మకంగా చేపట్టారు. భవిష్యత్తులో దీన్ని కేజీహెచ్‌కు అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు.దీనివల్ల గిరిజనప్రాంతాలకుప్రయోజనంచేకూరుతుంది
ఆధునిక సాంకేతికతతో…
ఏజెన్సీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,ఆరోగ్య ఉపకేంద్రాలు జిల్లా కేంద్రానికి దూరంగా ఉం టాయి. రహదారుల సదుపాయం కూడా లేని ప్రాంతాలు అనేకం ఉన్నాయి.దీంతో మందులు అందుబాటులో లేకపోవడం, వ్యాధి నిర్ధారణ పరీక్షల ఫలితాల్లో జాప్యం వంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి.ఈక్రమంలో టెక్నాలజీ సాయంతో గిరిజనులకు వేగంగా సేవలందిం చడానికి రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగానే పాడేరులోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మందు లు పంపడంతో పాటు వ్యాధి నిర్ధారణకు సంబంధించిన నమూనాల రవాణా, ఫలితాలు అందజేత తదితరాలకు డ్రోన్‌లను వినియో గించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం 3కిలోల బరువు మోసుకుంటూ 45నిమిషాల్లో 80 కి.మీ.ప్రయాణించే సామర్థ్యమున్నఒకడ్రోన్‌ను వినియోగిస్తున్నారు.ముంచంగిపుట్టు, అరకు లోయ మండలం సుంకరమెట్ట,చింతపల్లి మండలం తాజంగి పీహెచ్‌సీలకు పాడేరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి మందులు పంపిం చారు. మన్యంలో వైద్య రంగానికి డ్రోన్ సేవలు ఎంతగానో ఉపయోగపడతా యని వైద్య నిపుణులు,స్థానికులు పేర్కొంటు న్నారు.అయితే విశాఖపట్నం పరిధిలో రక్షణ రంగ సంస్థలు ఉన్నందున,భారీ డ్రోన్ విని యోగానికి కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉంది.
డ్రోన్ ద్వారా…
† ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అత్యవసర మందుల సరఫరా,
† రక్త నమూనాలను ప్రయోగశాలకు తరలించడం,
† పరీక్షల ఫలితాలను తిరిగి సంబంధిత ఆరోగ్య కేంద్రాలకు అందించడం,
† అవసరమైన వైద్య సామగ్రిని వేగంగా చేరవేయడం జరుగుతోంది.
ప్రస్తుతం వినియోగిస్తున్న డ్రోన్ సుమారు 3 కిలోల బరువును మోసుకుంటూ,45 నిమిషా ల్లో 80కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామ ర్థ్యం కలిగి ఉంది.ప్రయోగాత్మకంగా మూడు ఆరోగ్య కేంద్రాల్లో సేవలు డ్రోన్ సేవ లను ప్రస్తుతం మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రా =ల్లో విజయవంతంగా అమలు చేస్తున్నారు. సుంకరమెట్ట (అరకు లోయ మండలం) తాజంగి(చింతపల్లి మండలం) కేంద్రాలకు పాడేరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మందులు, రక్త నమూనాల రవాణా సమర్థవంతంగా సాగుతోంది.
కేజీహెచ్‌తో అనుసంధానం… తదుపరి లక్ష్యం
డ్రోన్ సేవలు విజయవంతమైతే విశాఖ పట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్) తో కూడా అనుసంధానం చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనివల్ల క్లిష్టమైన కేసులకు సంబంధించిన రక్త నమూనాలు, ఇతర పరీక్షల నమూనాలను వేగంగా విశాఖకు పంపే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ప్రత్యేక వైద్య సేవలు గిరిజన ప్రాంతాలకు మరింత చేరువయ్యే అవకాశముంది.అయితే విశాఖ పరిసర ప్రాంతాల్లో రక్షణశాఖ సంస్థలు ఉండటంతో భారీడ్రోన్‌ల వినియోగానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమని అధికారులు పేర్కొంటున్నారు.
డ్రోన్‌లు పరిష్కారం…కానీ పూర్తిస్థాయి పరిష్కారం కావు
డ్రోన్ సేవలు గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవ లకు కొత్త ఆశను తీసుకొచ్చినా,అవి అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం కావు.
నేటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో…వైద్యుల కొరత, ఖాళీగా ఉన్న పోస్టులు,సరైన రహదారుల లేమి,అంబులెన్స్ సేవల కొరత,ఆధునిక వైద్య పరికరాల లోపం,నిపుణుల సేవలు అందు బాటులో లేకపోవడం వంటి సమస్యలు కొన సాగుతూనే ఉన్నాయి.
డ్రోన్ మందులను తీసుకురాగలదు…కానీ అత్యవసర శస్త్రచికిత్స చేయలేదు. రక్త నమూ నాను తీసుకెళ్లగలదు…కానీ ప్రసవం నిర్వ హించలేదు.అందువల్ల సాంకేతికతతో పాటు గ్రామీణ ఆరోగ్య వ్యవస్థను కూడా సమాం తరంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
డాక్టర్ హేమలతాదేవి ఏమంటున్నారు?
ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ డి. హేమలతాదేవి మాట్లాడుతూ, డ్రోన్ సేవల ద్వారా గిరిజన ప్రాంతాలకు మందులు, రక్త నమూనాల రవాణా వేగవంతమవుతోందని తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను కేజీ హెచ్‌తో అనుసంధానం చేసి మరింత విస్త రించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని పేర్కొన్నారు.
ఎంత సాంకేతికత సంతరించుకున్న సరే గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు ఇప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో డ్రోన్ ఆధారిత వైద్య సేవల ప్రారంభం ఒక వినూత్నమైన,స్వాగతించదగిన అడుగు. కొండలు దాటలేనిచోట సాంకేతికత చేరడం నిజంగా అభివృద్ధికి సంకేతం.అయితే ఆరోగ్య వ్యవస్థలో నిజమైన మార్పు రావాలంటే ప్రతి గిరిజన గ్రామానికి నాణ్యమైన రహదా రులు,పూర్తి స్థాయి వైద్య సిబ్బంది,ఆధునిక పరికరాలు,24గంటల అత్యవసర సేవలు అందుబాటులోకి రావాలి. డ్రోన్‌లు మార్గాన్ని చూపగలవు…కానీ గిరిజన ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయగలది ప్రభుత్వ సంకల్పం మాత్రమే.‘సాంకేతికతకు మానవీయ సేవలు తోడైతేనే గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య విప్లవం సాకారమవుతుంది. – జి ఎన్ వి సతీష్ 

ఎన్నెల నవ్వు..

తెలుగు సాహిత్యంలో గిరిజనజీవితాల నేపథ్యంలోకొన్ని నవలలు వెలువడ్డాయి.కానీ అవి అన్ని గిరిజ నేతర రచయితలు రాసినవి.ఒంగోలు గద్దర్‌గా పేరు పొందిన ప్రజావాగ్గేయకారుడు.ఇ.విగా జనం ఎరిగిన అరుణ పతాక ప్రేమికుడు ఏకుల వెంకటేశ్వర్లు తన స్వీయ జనజాతి ‘యానాది గిరిజ నులు’ అనుభవిస్తున్న స్థితిగతులకు చేసిన అక్షర రూప చిత్రమే “ఎన్నెలనవ్వు”నవల.భూస్వాములు అగ్రవర్ణాల వారి ఆధిపత్యాలకు తోడు బ్రిటిష్ కాలం నాటి“క్రిమినల్ ట్రైబల్‌యాక్టు”వంటి రాక్షస చట్టాలను పోలీసులు నేటికీ అమలు పరుస్తూ యానాదులను అక్రమ అరెస్టులు చేస్తూ,యానాదులు అంటేనే అగ్రకులాల వారికి చాకిరీ చేసే నిత్య సేవకులు,అనే భావన నేటికీ ఉండటం శోచనీయం. ఈనవల ప్రథమ ప్రచురణ కాలం 2011,అశేష పాఠ కాదరణ పొంది 2018లో ద్వితీయ ముద్రణ పొందటంలోనే ఈ నవల యొక్క ప్రత్యేకత చెప్పకనే చెబుతుంది.రచయిత ఇ.వి స్వతహాగా గాయకుడు కళాకారుడు.“సాయుధ పోరాటమే సర్వరోగ నివారిణి”అని నమ్మిన అనుభవైక్య సృజన కారుడు. చాలా సంవత్సరాలుగా తన యానాది జనజీవులు అనుభవిస్తున్న దుర్భర జీవితాల తాలూకు కన్నీళ్లను తనలో దాచుకోగా కలిగిన ఆవేదనల సముద్రం నుంచి వెల్లువెత్తిన అక్షర అల్పపీడనమే ఈ యానాది బతుకుల చారిత్రక నవల “ఎన్నెల నవ్వు”.
ఇది అక్షరాలతో పేర్చిన సాధారణ నవల కాదు..అనేక శబ్దాలు, జీవితాల, రూపాలకు చిత్రరూపం ఇచ్చిన నవల. దీనిలో ఆడంబరపు వర్ణనలు కనిపించకపోయినా సహజసిద్ధమైన నాటకీయతతో నెల్లూరు ప్రాంత మాండలికపు పాత్రోచిత సంభాషణలతో సాగిన ఈ నవలా చదువుతుంటే ప్రతి వాక్యం దృశ్య రూపమై ఆయా పాత్రలు మన కళ్ళముందే కదు లుతూ సంభాషించుకుంటున్న అనుభూతి కలుగు తుంది,పాఠకులుకాస్త ప్రేక్షకావతారాలు ఎత్తా ల్సిందే..!! యానాది గిరిజనుల బ్రతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన ఈ నవల విషయానికి వస్తే దీనిలో మొత్తం 20అధ్యాయాలు ఉన్నాయి, మంగమ్మ అలివేలు అనే యానాది గిరిజన మహిళల నేప థ్యంలో సాగిన ఈనవలలో అలివేలు కొడుకు “చెంచులు” అమ్మమ్మ ప్రోద్బలంతో పదవ తరగతి వరకు చదివిన అతడు వాళ్ళ యానాది కుటుంబా లలోనే ఏకైక చదువరిగా నిలిచిన పాత్ర.ఈ నవల యావత్తు యానాది గిరిజన ప్రజలు అనుభవిస్తున్న పేదరికం వివక్షత ఆవిష్కరిస్తుంది.భావితరాల కోసం యానాది ప్రజలబ్రతుకు చిత్రాన్ని భద్ర పరచినచారిత్రక నవలగా కూడా దీనిని చెప్ప వచ్చు. యానాదులు అంటేనే శారీరక శ్రమకు చిరునామాదారులుగా నిలిచి మగవారు తమ జాతికి గల నేరస్తులు అనే అనాది ఆచారానికి బలి అవుతుండగా కొందరు యానాది మహిళలు వయసు రీత్యా కలిగిన అందంతో గిరిజనేతర పురుషుల వలలోచిక్కి తమ మానప్రాణాలు అర్పిం చుకుంటున్న త్యాగజీవులుగా మిగిలి పోతు న్నారు.దేశానికి స్వాతంత్రం రాజ్యాంగం అమలు అవుతూ దేశ ప్రజలందరికీ సమానత్వం స్వాతం త్రం అందాయని సంబరపడుతున్న....ఇది భౌతిక మార్పు మాత్రమే కానీ ఆలోచనపరమైన మానసిక మార్పు రావాలి అనే ఆశయం ధర్మగ్రహం రచయిత దృక్పథం లో కనిపిస్తుంది.సమాజం ఎంత ఆధునీకరించబడ్డ, ఎన్ని కొత్తచట్టాలు వచ్చినా, అగ్రవర్ణ ధనవంతులలో మానవత్వపు సమ భావనఅనే ఆలోచనఆచరణా త్మకంగా రానప్పుడు,బాధితవర్గాల వారిలో విద్యాపర మైన ఎదుగుదల వ్యసన రాహిత్య సంస్కారం పెర గాలి.అప్పుడే మన దేశనాయకులు ఆశించిన సమ సమాజ భావన ఆవిష్కృతం అవుతుందనే హెచ్చరికతో కూడిన సందేశం అందించారు రచయిత ఇ.వి. ఇక ‘ఎన్నెలనవ్వు’నవల కథాంశానికి వస్తే అక్కడి యానా దులంతా తమ గుడిసెల సముదా యానికి హుందాగా పెట్టుకున్నపేరు‘సింతతోపు సంగం’,దానికి కొద్ది దూరంలోగల మరో యానాది పల్లె ‘దొరపుసంగం’కథ ఈరెండు పల్లెలకు పరిమితం కాగా..ప్రధాన పాత్ర లుగా మంగమ్మ,అలివేలు,పోలయ్య,మునెయ్య, చెంచులు,కోటిరెడ్డి,చిటికెలోడు కనిపిస్తారు.వీరికి అను బంధంగా నరసయ్య,పర్వతాలు,పెంచలమ్మ,వెంకా యమ్మ,పక్కిలోడు,బుర్రమ్మ,కన్నయ్య,నాయుడు, మొద లైన పాత్రలు నవలలో ఆయా సందర్భాలను బట్టి ఆగు పిస్తాయి.సింతతోపు సంగానికి చెందిన యానాది మహిళ మంగమ్మ యవ్వనంలో తెలియని తనంతో భావనారాయణద్వారా తల్లిఅయి‘అలివేలు’అనే అమ్మా యికి జన్మనిచ్చి తనతప్పు తెలుసుకొని భార్య చని పోయిన ఇద్దరు పిల్లల తండ్రి‘పోలయ్య’తో కలిసి జీవ నం సాగిస్తూ ఇద్దరూ పిల్లలను సొంత బిడ్డల్లా సాకు తూ తమ అన్యోన్య దాంపత్యం సాగిస్తుండగా.. అలి వేలు వయసుకు వచ్చి కూలిపనులకు వెళుతూ కోటిరెడ్డి అనే మృగాడి మాయలో పడుతుంది.విషయాన్ని పసిగట్టిన మంగమ్మ తన బతుకుల తనబిడ్డ బ్రతుకు చీకటిమయం కారాదని తమదగ్గరి బంధువుల పిల్లాడు ‘మునె య్య’తో అలివేలు పెళ్లి తనయానాది కుటుంబ సాంప్రదాయం ప్రకారం జరిపించి సంతృప్తి చెందు తుంది. అలివేలు మునెయ్యల దాంపత్య జీవితానికి ప్రతిఫలంగా ‘చెంచులు’అనే పిల్లాడు పుడతాడు. పిల్లాడు పుట్టకముందే మునెయ్య అత్తవారి ఊరిలో అగ్రవర్ణ కుటుంబంలో జరిగిన బంగారు నగ దొంగ తనం నేరంకు వారి ద్వారా దెబ్బలు తిని అవమానాలు ఎదుర్కొని,తమ జాతివారి మీదగల‘చిటాకు’ (క్రిమినల్ ట్రైబల్ యాక్ట్) వల్ల జైలుజీవితం తప్పదనే భయంతో ఇంటి నుండి పారిపోయి అదృశ్యం అవుతాడు.అలా భర్తను కోల్పోయి మగబిడ్డతో కలిసి తల్లితోనేఉంటుంది అలివేలు.అలివేలు కొడుకు చెంచులు అమ్మమ్మ మంగ మ్మ పెంపకంలో పెరుగుతో తనదైన ప్రతిభతో ఎదు గుతూ..చదువుకుంటూ తనసమాజంలో తనకు ఎదు రవుతున్న అవమానాలు,ముఖ్యంగా కులంవల్ల జరుగు తున్న అసమానతలు,సంఘటనలు ప్రత్యక్షంగా గమ నిస్తూ మార్పుకోసం తన పేదరికం సాయంగా సాహస యాత్ర సాగిస్తూ ఉన్నత పాఠశాల దశకు చేరు కుం టాడు.అక్కడ అనసూయ అనే అగ్రవర్ణపు అమ్మాయితో స్నేహించబడి చివరికికులం కారణంగా ఆమె స్నేహం కోల్పోయి ఆవేదనపడతాడు.మనుషులను దూరం చేస్తు న్న కులదుర్మార్గం మీద కోపగించుకుంటాడు. చెంచు లు తల్లి అలివేలు కొడుకు కన్నా తనసౌఖ్యం తాను చూసుకుని,ఇల్లు విడిచిపోవడంతో తను తోటి పిల్లల వద్ద అనాధగా అవమానాలు ఎదుర్కొంటూ అమ్మమ్మ అందిస్తున్న ఆదరణతో ఎదుగుతున్న క్రమంలో, కులం కుళ్ళు పోగొట్టి సమాజంలో సమత మమత ప్రేమాను రాగాలు పంచే లక్ష్యంతో సాగుతున్న కమ్యూనిస్టు సంఘంతో తనకు సాన్నిహిత్యం కలుగుతుంది. దరి మిల సంఘం కార్యాచరణలో భాగంగా దళ సభ్యులతో కలిసి గిరిజన గుడాలు తిరిగిన చెంచులకు చెంచులు కి తమజాతి వారి కన్నా దుర్భరమైన జీవితాలు అను భవిస్తున్న అడవుల్లోని గిరిజనుల జీవితాలు ప్రత్యక్షం గా చూస్తాడు, దానితో సమాజ చైతన్యం మీద మరింత బాధ్యత పెరుగుతుంది చివరికి చెంచులు బృందం పోలీసుల కంటపడటం వారు తొలి తప్పుగా భావించి కాలేజీ విద్యార్థులు అనే సానుభూతితో వదలడంతో, పోలీసుల చెరనుంచి క్షేమంగా ఇల్లు చేరతాడు చెంచులు.తను గిరిజన గుడాలకు వెళ్లే ముందు రోజు రాత్రి అతని తల్లి అలివేలు చెడు తిరుగుళ్లు తిరిగి రోగాల పాలై చావుకు చేరువై ఇల్లు చేరుతుంది.కడుపు తీపితో కన్న బిడ్డను కాపాడుకోవడానికి తపిస్తుంది మంగమ్మ,యవ్వనపు పొంగుతో చేసిన తప్పులకు శిక్షగా చావు తెచ్చుకొని కొడుకు చివరి చూపు కోసం పరితపించిన అలివేలు అతి కష్టం మీద కొడుకును చూసుకుని కన్నుమూస్తుంది.

సమాజంలోని కులం కుళ్ళు పోయే రోజుల కోసం చెంచులు ఆలోచనలతో….“ఎన్నెలనవ్వు”నవల ముగుస్తుంది. ఈనవల యానాది ప్రజల దుర్భర జీవి తాలను ఆవిష్కరించడమే కాక వారి జీవన పద్ధతు లను,సంస్కృతి సాంప్రదాయాలను కళ్ళకు కడుతూ ఆ జన జాతి చైతన్యానికి దోహదపడుతుంది.
అలివేలు మునెయ్యల పెళ్లి సందర్భంగా వారి ఆచారాలకు సంబంధించిన అనేక విషయాలు ఆవిష్క రించారు రచయిత,సీతారాముల కళ్యాణం జరిగే అభిజిత్ లగ్నాన్నే యానాదులు ‘గడ్డపారం ముహూ ర్తం’గా భావించి తమ పెళ్లిళ్లు చేసుకునే ఆచారం నేటికీ పాటిస్తారు.పేదరికంతో వారు తినే ఆహార పదార్థాలకు ఉన్నతమైన పేర్లు పెట్టుకుని పిలుచు కుంటూ తమ ఆత్మాభిమానం గౌరవాలు కాపాడు కుంటున్న వైనం కూడా ఈనవలలో మనం చదవ వచ్చు.యానాదులు పెళ్లిళ్లు వారిజాతికి చెందిన వ్యక్తు లే వారికి తోచిన మంత్రాల వంటి మాటల సాయంతో చేస్తారనే విషయం ‘పక్కెలోడు’ అలివేలు పెళ్లి తంతు చేసిన సందర్భంగా రచయిత చెబుతూ… మనుధర్మ వ్యతిరేకి అయిన రచయిత యానాదుల వంటి కడ జాతుల వారి ఇళ్లకు వచ్చి పెళ్లిళ్లు చేయడానికి బ్రాహ్మ ణులు రారు అనే భావం వ్యక్తపరుస్తారు. యానాది జాతి స్త్రీ పురుషులు తమ జీవితాలను అగ్రకులాల వారికి అర్పించుకోవడానికే పుట్టారా?అన్న భావనను రచయిత అలివేలు,మునెయ్య,పక్కెలోడు,పాత్రల ద్వారా వ్యక్తపరిచారు.
ఇలా యానాది గిరిజనజాతి నేపథ్యం చుట్టూ సాగిన ఈనవల అన్నివర్గాల పాఠకుల చేత ఆగకుండా చదివిస్తుంది, నిరాడంబర శైలితో నిజజీవితాలను ఆవిష్కరించిన ‘ఎన్నెలనవ్వు’ తెలుగు నవలా సాహి త్యంలో ఉత్తమోత్తమ సంపూర్ణ స్వానుభవ తొలి గిరిజన నవల అనడంలో సందేహం లేదు.
ఎన్నెల నవ్వు యానాది నవల
పేజీలు : 200, ధర :100/-,ప్రతులకు : పల్నాటి శ్రీరాములు, ఒంగోలు, సెల్:98499 44170,
సమీక్షకుడు :డా అమ్మిన శ్రీనివాసరాజు, సెల్:77298 83223.

సింగల్ యుజ్ ప్లాస్టిక్‌పై జీవీఎంసీ పోరాటం

రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషే ధించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా మహా విశాఖ మునిపల్ కార్పోరేషన్ సంస్థ(జీవీఎంసీ)గత రెండేళ్ల నుంచి పక డ్బందీగా కార్యాచరణ ప్రారంభించింది. ప్రాంతాలవారీగా పలు దశల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని అమల్లోకి తీసుకు వస్తోంది. ప్లాస్టిక్ కవర్లు నీటి వనరుల్లో కలిసి వాటి అవశేషాలు మానవ దేహంలోకి వెళ్తున్నాయని ఫలితంగా క్యాన్సర్ బారిన పడుతున్నారని ప్రజలకు అవగాహణ కల్పిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ పరి రక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధానికి జీవీఎంసీ పకడ్బంధీగా చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది జూన్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు చర్య లు చేపట్టాం. ప్రతి నెల ఒక థీమ్‌ని పెట్టుకొని కొన సాగిస్తున్నాం. ప్రస్తుతం ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని అధికంగా వినియోగిస్తున్నారు. ఇది ఒక్కసారిగా పూర్తి అయ్యే కార్యక్రమం కాదు. అందుకే అంచెలు అంచెలుగా ప్రణాళికలు చేస్తున్నాం.” – కేతన్ గార్గే,కమీషనర్,జీవీఎంసీ.
‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకండి.. ప్రకృతిని కాపాడండి’ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కారణంగా దరిత్రితో పాటు, ప్రకృతి పెను విపత్తును ఎదుర్కొంటున్న దని దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)పిలుపునిచ్చింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల ప్రపంచం పెను ప్రమాదంలో చిక్కు కుందని,దీనివల్ల వాతావరణ,జల,భూమి కాలుష్యాలు ఏర్పడుతున్నాయి. మానవ తప్పిదాలు,వివాదాల వల్ల మనుషులతో పాటు,జంతుజాలానికి కూడా ప్రమాదం ఏర్పడుతోంది.ప్లాస్టిక్ వినియోగం అనంతరం డీకం పోస్టు చేయకపోవడం వల్ల ఇది భూమితో పాటు, ప్రకృతిని నాశనం చేస్తుస్తోంది. దీని నుండి బయట పడేందుకు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున మొక్కలు నాటి దరిత్రిని సంరక్షించు కోవాల్సిన బాధ్యత ఉందని జీవీ ఎంసీ కమిషనర్ కేతన్ గార్గె’ పిలుపు నిచ్చారు.
మొక్కలు నాటి సంరక్షించడంతో పాటు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, ఒకవేళ వాడినట్లైతే తిరిగి దానిని వినియోగించడం, రీసైకిల్ చేయడం వంటి వాటిపై దృష్టి సారించాలని, ఈ నినాదం ప్రతి గృహానికి వెళ్లేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అప్పుడే మనం భూమిని, ప్రకృతిని కాపాడగలుగుతామన్నారు.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా ప్రతి ఒక్కరూ బయటికి,లేదా మార్కెట్‌కు వెళ్లేటప్పుడు తప్పని సరిగా కాటన్ చేతి సంచులు వాడాలని, ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌కు బదులు స్టీల్ లేదామట్టి బాటిల్స్ వాడడం,ప్లాస్టిక్ మెటీరియల్ వాడకుండా చూడా లని,ఈ విషయంపై అన్ని చోట్ల అవగాహన కల్పిం చాలని తెలిపారు .రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళి కలో భాగంగా అన్నిచోట్ల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ప్రకృతిని కాపాడే అంశంపై పెద్ద ఎత్తున నగరంలో ప్రచారం నిర్వహిస్తున్నారు..ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడుకునే ప్రయత్నం చేయా లని,అప్పుడే మనం అనుకున్న అందమైన జీవితా న్ని గడపగలుగుతారని భావిస్తున్నారు.
రైతు బజార్లో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలపై అవగా హన కార్యక్రమం.
పర్యావరణహిత వస్తువుల వినియోగంతో ప్లాస్టిక్ వ్యర్థాలకు స్వస్తి పలుకుదాం.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి తీవ్ర హానికర మని,ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీ సర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ ఈ.ఎన్.వి.నరేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన తూర్పు జోన్ పరిధిలో ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ,పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందిం చేందుకు వార్డు నెం.23 పరిధిలోని సీతమ్మధార రైతు బజార్లో “ప్లాస్టిక్ వినియోగాన్ని స్వస్తి పలు కుతూ ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగిం చాలని అవగాహన కార్యక్రమం” నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ వ్యాపారులు, దుకాణ దారులు, స్థానిక ప్రజలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే హానికర ప్రభావాలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకు బదులుగా వస్త్ర సంచులు, నార సంచులు, పేపర్ బ్యాగులు, స్టీల్ కంటైనర్లు, బయోడిగ్రేడబుల్ ప్లేట్లు మరియు కప్పులను వినియోగించాలని సూచించారు. మార్కెట్ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించి, సుస్థిరమైన పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నగర నిర్మాణానికి పర్యావరణ హిత అలవాట్లు ప్రతి ఒక్కరూ అలవరుచు కోవాలని తెలిపారు.స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26లో విశాఖ నగరం పరిశుభ్ర నగరంగా,ప్లాస్టిక్ రహిత నగరంగా, పర్యావరణహిత నగరంగా దేశంలోనే ప్రథమ స్థానం పొందేందుకు వ్యాపారులు, కొనుగోలు దారులు ,ప్రజలు సహకరించాలని సీఎంహెచ్ కోరారు.- జి.ఆనంద్ సునీల్ కుమార్ 

కార్మికుల కనీస వేతనాలు పంపు

ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలలో కార్మికుల కనీస వేతనాలు వారు పనిచేసే రంగం (నైపుణ్యంలేని,సెమీ-స్కిల్డ్,నైపుణ్యం కలిగిన, అత్యంత నైపుణ్యం కలిగిన) మరియుప్రాంతాల (జోన్-1,జోన్-2 మొదలైనవి)ఆధారంగా నిర్ణయించబడతాయి.
కనీస వేతనాల వివరాలు ఇలా.. :
ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ 2026 నుండి అమల్లోకి వచ్చిన సవరణల ప్రకారం,షాపులు మరియు వాణిజ్య సంస్థలలో (ఉదాహరణకు జోన్-II పరిధిలో) కనీస వేతనాలు నెలకు 12,317 (హెల్పర్) నుండి 14,504 (మేనేజర్,జోన్-I) వరకు ఉన్నాయి. తాజా సవరణల పూర్తి పట్టికను Ascవఅt H= AP వీఱఅఱఎuఎ ఔaస్త్రవs ద్వారా పరిశీలించ వచ్చు.రాష్ట్రంలో మార్పులు: ఆంధ్రప్రదేశ్ కనీస వేతనాల చట్టం ప్రకారం ఏడాదికి రెండుసార్లు వేతనాలు (VణA)సవరించబడ తాయి.తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం జూన్ 1,2026 నుండి అమల్లోకి వచ్చేలా కోటి 11లక్షల మంది కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ కొత్త విధానాన్ని ప్రకటించింది.
కార్మికులకు కనీస వేతనాలు పెంచుతూ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడం హర్హణీయం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రకటించిన పధ్నాలుగు సంవత్సరాల తరువాత ఆరాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడీ ప్రకటన వెలువరించింది. తెలంగాణలోని ఒక కోటి పదకొండు లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది కనుక ఈ నిర్ణయం విస్తృత ప్రభావం వేస్తుంది. కనీస వేతనం పెంచుతూ ప్రకటించడం బాగానేవుంది కానీ ఆపెంపుదల శాస్త్రీయంగా లేదన్నది వాస్తవం.ఈ పధ్నాలుగేళ్లలో పెరిగిన ధరలతో పోల్చితే ఈపెంపుదల స్వల్పమే! కనీస వేతనాలను తెలంగాణ రాష్ట్రంలో 3జోన్లుగా, వేతనాలను 4క్యాటగిరీలుగా విభజించి ప్రకటించారు. అందులోనూ శాస్త్రీయత కొరవడింది. ఆయా జోన్లలో అన్ని రంగాల్లో ఒకే రీతిలో పెంచడంవల్ల గతంలో ఎంప్లాయ్ మెంట్‌లో వివిధ రకాల పనులకు ఆయా రకాలుగా ఉన్న పద్ధతి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. కనీస వేతనాల పెంపుదల సందర్భంగా కరువుభత్యం గురించి ప్రస్తావించకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన వేతనాలు కూడా 4 క్యాటగిరీల్లో ఒక్క అన్‌స్కిల్డ్ వర్కర్లకు తప్ప మిగతా వారికి బేసిక్ కరువుభత్యం కలుపుకుని ఇప్పటికే వస్తున్న జీతానికి,పెరిగిన దానికి పెద్ద తేడా ఏమీ లేకపోవడం గమనార్హం.తెలంగాణ కాంట్రాక్టు లేబర్ జీవో నెం 11ప్రకారం ఇప్ప టికే కార్మికులు రూ.13,098 నుంచి రూ. 23,683 వరకు వేతనాలు పొందుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం పెంచింది పెద్దగా ఏమీ లేదు కదా! తెలంగాణ జీవో 4లో స్కిల్డ్ కార్మికుడికి వేతనం రూ.19,572 ఉండగా సీఎం ప్రకటించిన వేతనం రూ.18,500 మాత్రమే! గతంతో పోలిస్తే రూ.1072 తగ్గింది.ఇప్పటి వరకు అనుసరించాల్సిన ఏ ప్రామాణికాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదని కార్మిక సంఘాలు చేస్తున్న విమర్శ సత్య దూరం కాదు.పెరిగిన ధరలు, 1948 కనీస వేతనాల చట్టం,డాక్టర్ ఆక్ట్రాయ్ ఫార్ములా,సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా వేతనాలు లెక్కిస్తే రూ.32 వేలు వస్తుంది. అయినప్పటికీ కార్మిక సంఘాలు కనీస వేతనం రూ.26 వేలు ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. కార్మిక సంఘాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలను సవరించాలి. పొరుగు రాష్ట్రం చేసింది చూసి అయినా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాలు వెంటనే ప్రకటించడం కనీస ధర్మం. ఇక్కడ 72షెడ్యూల్డ్ పరిశ్రమల్లో 50లక్షల మందికి పైగా కార్మికులకు ఈకనీస వేతనాలు వర్తిస్తాయి.ఉమ్మడి రాష్ట్రంలో ప్రకటించినదే తప్ప ఇక్కడ టిడిపి లేదా వైసిపి పాలకులు ఏనాడూ వాటిని పట్టించుకోలేదు.టిడిపి కూటమి సర్కారు ఇప్పుడైనా మేలుకోవడం అవసరం. ఇప్పటికే అన్ని నిత్యావసర సరుకు లతో పాటు ధరలన్నీ పెరిగి కార్మికుల బతు కులు దుర్భరంగా మారాయి. వాస్తవ పరిస్థితి గుర్తించి వెంటనే కనీస వేతనాలు పెంచాలి. దేశ రాజధాని ప్రాంతంలోని నోయిడా పారిశ్రా మిక కార్మికుల ఆందోళన గురించి ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే కనీస వేతన పెంపు ప్రకటన ఆవశ్యకత ఏమిటో పాలకులకు బోధపడుతుంది.అంతేగాక పొరుగున వున్న హర్యానా సర్కారు వేతన పెంపు ప్రకటన వెల్లడించాక ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభు త్వం బండ రాయిలా మిన్నకుండడం కడుపు మండి వున్న కార్మికుల ఆగ్రహానికి ఆజ్యం పోసింది. కార్మికుల ఆగ్రహం కట్టలు తెంచు కున్న తీరు జ్ఞప్తికి తెచ్చుకుంటే సర్కారు పెద్దల్లో కదలిక వస్తుంది.ఈ రెండు నెలల్లో యుద్ధం పేరిట భారాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యాన్ని పరిగణన లోకి తీసుకోవడంతో పాటు పొరుగు రాష్ట్రం ప్రకటించిన దాంట్లోని లోపాలను సవరించి తాజాగా కనీస వేతనా లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ప్రకటిం చాలి.ఆలస్యం అనర్ధదాయకం అని గుర్తెర గాలి. లేనిపక్షంలో కార్మికుల ఆందోళనలకు లేదా వ్యక్తమయ్యే ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నిరం తరం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేదా పెట్టుబడుల ఆకర్షణ జపం చేస్తూ కార్పొరేట్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పాలకులు శ్రమ జీవుల గురించి కొద్దిగానైనా పట్టించుకోరా? వెంటనే కనీస వేతన పెంపు ప్రకటన చేసి విజ్ఞత ప్రదర్శించండి.
పేరు వేతనాల పెంపు.. జరిగింది తగ్గింపు
రాష్ట్రంలో కాంట్రాక్ట్,ఔట్‌సోర్సింగ్ కార్మికుల కనీస వేతనాలను భారీస్థాయిలో పెంచుతు న్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 21న ప్రకటించారు. పెరిగిన కనీస వేతనాలను జూన్ 1నుంచి అన్ని సంస్థలకు అమలు చేస్తామని,ఇది అమలు జరిగేలా కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చామని సీఎం పేర్కొన్నారు.రాష్ట్రంలో ఉన్న 73షెడ్యూల్ ఎంప్లాయిమెంటులోగల కోటి11 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మి కులు,వారి కుటుంబాలకు మేలు జరుగను న్నది.అయితే,ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల పెంపు అసంబద్ధంగా,అన్యాయంగా ఉందనేది అర్థమవుతున్నది.1948 నాటి కనీస వేతనాల చట్టం,కార్మిక సంఘాల డిమాండ్లు, 1991నాటి సుప్రీంకోర్టు ఆదేశాలు,డాక్టర్ ఆండ్రాయిడ్ ఫార్ములా,రోజురోజుకూ పెరుగు తున్న నిత్యావసర సరుకుల ధరలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు.సర్కార్ నిర్ణయంతో కనీస వేతనాల పెంపువల్ల రాష్ట్రం లోని అన్నిరంగాల్లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు లాభం చేకూరక పోగా తీరం నష్టం చేస్తుందనేది వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటింది.ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి తమ ఎన్నికల ప్రణాళికలో కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకు ఎంతమాత్రం సిద్ధం కాలేదని విశదమవుతున్నది.కార్మికుల కరువు భత్యం కనీస వేతనాల్లో కలిపే ఆలోచన సైతం చేయలేదు.బీఆరఎస్ హయాంలో అన్‌స్కిల్డ్ కార్మికులకు కనీస వేతనం రూ.1,809గా నిర్ణయించి కరువుభత్యం (డీఏ)పాయింట్ ఒక్కింటికి రూ.12గా నిర్ణయించింది. కనీస వేతన సలహా బోర్డు సిఫార్సులను పరిగణన లోకి తీసుకున్నది. దీని ప్రకారం 2021 జూన్ 25న కేసీఆర్ సర్కార్ ఐదు జీవోలను జారీ చేసింది. కానీ ప్రస్తుత పాలకులు రెండున్న రేండ్ల కాలంలో గెజిట్ కూడా విడుదల చేయకుండా వదిలివేశారు.కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు కనీస వేతనాన్ని రూ.14వేలకు కుదించటమే కాకుండా, డీఏ పాయింట్లను పరిగణనలోకి తీసుకోలేదు.ఈనిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటి పది లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు అన్యాయం చేయటమే అవుతుంది. ప్రభుత్వ వైఖరి పెట్టుబడిదారులు,యాజమాన్యాలకు మేలు చేసేదిగా ఉన్నదని స్పష్టమవుతున్నది. పెంచిన వేతనాల్లో పెరుగుదల లేకుండా ఉండటమే కాకుండా ప్రస్తుతం పొందుతున్న కనీస వేతనాలపై రూ.8,444 వరకు కార్మికుడు నష్టపోతున్న పరిస్థితి నెలకొన నున్నది.కార్మికులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ పూనుకుంటున్నది.నిజంగా కార్మికుల వేతనాల పెంపునకు చిత్తశుద్ధితో కృషిచేయాలని భావిస్తే కార్మిక సంఘాలు, సంబంధిత అధికారులతో చర్చించాలి. ప్రస్తుతం అమలు జరుగుతున్న వేతనాలు, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, కార్మికుల జీవన ప్రమాణాలను గుర్తించటం ద్వారా సరైన నిర్ణయం తీసుకొని ఉండాల్సి ఉన్నది. కానీ ఈ దిశగా ప్రభుత్వం ప్రయత్నా లు చేయకపోవటంతో కనీస వేతనాలను పెంచాలనే నిజాయితీతో కూడిన ఆలోచన ఎంతమాత్రం లేదని స్పష్టమవు తున్నది. వాస్తవానికి నిత్యావసర సరుకుల ధరల పెరు గుదల,కార్మికుల జీవన ప్రమాణాలు, సుప్రీం కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న ప్పుడు కార్మికుల కనీస వేతనం రూ.32 వేలుగా నిర్ణయించాల్సి ఉంటుంది.కార్మిక సంఘాలన్నీ కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలనే డిమాండ్‌ను న్యాయబద్ధ మైనదిగా తీసుకొని ప్రభుత్వం అంగీకరించాల్సి ఉంటుం ది.కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఇప్పటికే అమలు జరుగుతున్న వేతనాల్లో కనీస వేతనంగా రూ.28,444 చెల్లిస్తున్నారు.- గునపర్తి సైమన్ 

జిల్లాలో ఎంఎసఎంఈ పార్కుల అభివృద్ధికి కృషి

విశాఖపట్నం ప్రతినిధి :
జిల్లాలో ఎం.ఎస్.ఎం.ఈ.పార్కులను అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అభిషిక్త్‌కిషోర్ అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నుండి 38 ఇండస్ట్రియల్ పార్కు లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయగా విశాఖపట్నం ఉత్తర నియో జకవర్గం కంచరపాలెంలో రూ.14.50కోట్ల వ్యయంతో నిర్మించే ఫ్లోటేడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్(ఎఫఎఫ్‌సీ) కు జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్,ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి మే 25న శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెసఎంఈ ల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని,సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ పెన్యూర్ నినాదంతో యువతను పారిశ్రామిక రంగంలోకి తీసుకు రావడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో 138 ఎంఎసఎంఈ పార్కులను ఏర్పాటు చేసిందన్నారు.జిల్లాలో ఏడు ఎంఎసఎంఈ పార్కులకుగాను ఆరు పార్కులకు శంఖు స్థాపన చేయడం జరిగిందని,పెదగంట్యాల్లో పార్కు ఇప్పటికే ప్రారంభమైందని,మిగిలిన పురోగతిలో ఉన్నాయని తెలిపారు.విశాఖపట్నం సౌత్‌లో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయవలసి ఉందని,సౌత్ నియోజక వర్గంలో ఒకఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయవలసి ఉందని,సౌత్ నియోజకవర్గం పోర్టు ప్రాంతంలో ఉంది కాబట్టి విశాఖ పట్నంపోర్టు అధికారులతో మాట్లాడి ఒక లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ఎంఎసఎంఈ పాలసీతో రూ.10కోట్లతో ఇండస్ట్రీ పెడితే 75శాతం వరకు ఇన్సెంటివ్స్,రాయితీ రూపంలో వెనక్కు తెచ్చుకోగలిగే అవకాశం ఉందన్నారు. ఎంఎసఎంఈలు పెడుతున్న ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకోవాలని,ఐటిఐ చదువు తున్న యంగ్ స్టూడెంట్స్‌లో అవగాహన తీసుకు రావాలన్నారు.అప్పుడే మనం పెట్టుకున్న వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ప్రైన్యూర్ నినాదం సాధ్యమవుతుందన్నారు.యువ పారిశ్రామికవేత్తలను సహకారం అందించడానికి రతన్ టాటా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.గత రెండు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం 28 ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకువచ్చిందని,. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో దేశానికి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ లో 16శాతం మన రాష్ట్రానికి వచ్చాయని,రెండో సంవత్సరంలో వచ్చే వచ్చిన ఇన్వెస్ట్మెంట్లలో 25శాతం మన రాష్ట్రానికి వచ్చాయని అన్నారు.రాష్ట్రానికి వచ్చిన రూ.10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లలో సుమారు 60 శాతం పైగా విశాఖ ఎకనామిక్ రీజియన్(9జిల్లాలకు) కే రావడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇది మన ప్రాంతానికి సువర్ణ అవకాశం అని,దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
యువత ను పారిశ్రామిక విధాలుగా చేయడమే లక్ష్యం.
శాసనసభ్యులు విష్ణు కుమార్ రాజు మాట్లా డుతూ నార్త్ నియోజకవర్గ పరిధిలో ఫ్లోటేడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ 83సెంట్లు విస్తీర్ణంలో 36మంది నూతన పారిశ్రామిక వేత్తలకు 725 చదరపు అడుగుల స్థలాలను,భవనాలను కేటాయిస్తామన్నారు. పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారానికి విశాఖలో మైక్రోస్మాల్ ఫెసిలిటేషన్ సెంటర్ చేసినట్లు ఆయన తెలిపారు.చిన్న పరిశ్రమల వివాదాల వేగవంత పరిష్కారం కోసం డిస్ప్యూట్ రిజల్యూషన్ పోర్టల్ ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది అన్నారు.ఎంఎసఎంఈ చట్టప్రకారం సరుకు సరఫరా చేసిన 45రోజులలో చెల్లిం పులు జరగాల్సి ఉంటుందని ఆలస్యమైతే వడ్డీతో చెల్లింపు జరిగేలా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. యువత ను పారి శ్రామిక రంగంలో తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని,ఐటిఐ,పాలిటెక్ని విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ద్వారా కల్పిస్తామని పేర్కొన్నారు. కొత్త పరిశ్రమలు స్థాపించే వారికి రాయితీలు ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందిస్తుందని ఆయన అన్నారు. పరిశ్రమ నిర్వాహకులకు ఎదురైన టెండర్‌ల సమస్యను పరిష్కరించి వారికోసం ప్రత్యేక కోటా తీసుకువచ్చా మన్నారు. పారిశ్రామిక ప్రాంతాలలో తక్కువ ధరలకు స్థలాలు పొంది వాటిని సొంతంగా నిర్వహించకుండా ఇతరులకు అద్దెకు ఇచ్చే విధానాన్ని అరికట్టాలని, పరిశ్రమలు పెట్టినవారు ఉత్ప త్తిని సాధించలేకపోతే ఆ స్థలాలను డిఐసికి తిరిగి స్వాధీనం చేసి నూతన పారిశ్రామిక వేత్తలకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో ఐలా చైర్మన్ జగపతి రాజు, ఏపీఐఐసీ అధికారులు, జోనల్ మేనేజర్ సింహాచలం జిఎం ఇండస్ట్రీస్, వి.ఆదిశేషు, పారిశ్రామికవేత్తలు,స్థానిక నాయ కులు లొడగల కృష్ణ,ఉషా,కిరణ్,నజీర్, తదిత రులు పాల్గొన్నారు.-జి.ఆనంద్ సునీల్ కుమార్

విశాఖలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు…

సీఎం చంద్రబాబు అత్యంత ఉత్సాహంగా విశాఖలో ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవోటెల్ వరకు 5.5 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 21 నిమిషాల 18 సెకండ్లలో చేరుకుని యువతను సైతం ఆశ్చర్యపరిచారు. 76 ఏళ్ల వయస్సులో ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేరు, బీచ్ రోడ్ మీదుగా దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన సైకిల్ తొక్కారు. ఈ సైకిల్ ర్యాలీలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రకృతి పచ్చగా ఉంటేనే మనుషుల మనుగడ సాఫీగా సాగుతుంది. పెరుగు తున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులతో పొంచి ఉన్న ముప్పును పారద్రోలేందుకు విస్తృతంగా మొక్కలు నాటడం ఒక్కటే మన ముందున్న ప్రధాన మార్గం.ఇదే స్ఫూర్తిని రగులుస్తూ విశాఖ పట్నం వేదికగా జూన్ 5న జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ఉత్సా హంగా పాల్గొన్నారు.పర్యావరణ పరిరక్షణ ఆవశ్యక తను వివరిస్తూ స్వయంగా మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ప్రాంగ ణంలో పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడ కేవలం 25శాతం మాత్రమే పచ్చదనం ఉండటంపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.తక్షణమే క్యాంపస్ అంతటా భారీగా మొక్కలు పెంచేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఏయూ వీసీని ఆయన ఆదేశించారు. ఇదే సమ యంలో పార్టీ నాయకులను ఉద్దేశించి సీఎం ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఎవరైతే ఎక్కువ మొక్కలు పెంచి పచ్చ దనాన్ని పెంపొందిస్తారో,రాబోయే ఎన్నికల్లో వారికే టిక్కెట్లు ఇస్తామంటూ సరదాగా నవ్వులు పూయించారు.ఆంధ్ర విశ్వ విద్యాలయం ఎంతో మంది గొప్ప నాయ కులను దేశానికి అందించిన ఒక ప్రతిష్టాత్మక విద్యాసంస్థ. అలాంటి ప్రాంగణం పర్యా వరణానికి ఆదర్శంగా,ఒక బయోడైవర్శిటీ పార్కులా రూపాంతరం చెందాలని చంద్రబాబు ఆకాం క్షించారు.తిరుమల కొండల మీద 89.5శాతం పచ్చదనం ఉందన్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఏయూ క్యాంపస్ కూడా పూర్తిగా పచ్చదనంతో నిండిపోయి ‘నెట్‌జీరో’ క్యాంపస్‌గా మారాలని పిలుపునిచ్చారు. విపరీతంగా పెరుగుతున్న ఎండలు,అకాల తుఫానులు వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందనడానికి సంకే తాలని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.దీన్ని అరికట్టే క్రమంలో ఏయూకు ఉన్న 450ఎకరాల సువిశాల స్థలంలో ఖాళీ ప్రదేశాల న్నింటిలో చెట్లు నాటాలని సూచించారు.భవనాలపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి,క్యాంపస్‌కు అవసరమైన విద్యుత్‌ను పూర్తి స్థాయిలో సౌరశక్తి ద్వారానే ఉత్పత్తి చేసుకునే దిశగా అడుగులు వేయాలని స్పష్టం చేశారు.
చెత్త నిర్వహణ విషయంలో ఏయూ యాజమాన్యం అత్యాధునిక విధానాలు అవలంబించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేయాల న్నారు.స్వచ్ఛ పథం కింద రీ-సైక్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ చేపట్టాలని సూచించారు. పీఎన్జీ, ఎలక్ట్రికల్ స్టవ్స్ వినియోగాన్ని పెంచాలని, నెట్ జీరో విధానాన్ని పర్యవేక్షిం చేందుకు ప్రత్యేకంగా ప్రొఫెసర్లతో ఒక బృం దాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఏయూ క్యాంపస్ కేవలం చదువులకే పరిమితం కాకుండా విద్యార్థులకు ఒక నాలెడ్జ్ హబ్‌గా తయారు కావాలని సీఎం ఆకాంక్షిం చారు. ఈ నెట్ జీరో విధానంలో ఇతర విద్యా సంస్థలకు సైతం మార్గదర్శకంగా నిలిచేలా ఏయూను తీర్చిదిద్దాలని అధికారులకు సూచిం చారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఒక బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నామని, ఇందులో విద్యా ర్థులను కూడా భాగస్వాములను చేస్తామని ప్రకటించారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5కోట్ల సీడ్ బాల్స్ చల్లేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
విశాఖపట్నం నగరంలో ప్రస్తుతం ఉన్న పచ్చదనాన్ని ఏకంగా 50 శాతానికి పెంచేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. పర్యావరణాన్ని పరిరక్షించే మహాయజ్ఞంలో విశాఖ పోర్టుతో సహా నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వ్యవస్థలను భాగస్వాములను చేస్తామన్నారు. పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచడానికే తాను సైకిల్ మీద ప్రయాణి స్తున్నానని, సైకిలింగ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దినచర్యగా మారాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకోసం నగరంలో ప్రత్యేకంగా సైకిలింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. –జి.ఆనంద్ సునీల్ కుమార్ 

సమస్యల కొలిమిలో గిరిజన,సాంఘీక హాస్టళ్లు

“ఉత్తరాంధ్ర జిల్లాలోగల ప్రభుత్వసాంఘీక,గిరిజనసంక్షేమ వసతిగృహాలు సమస్యల కొలిమిలో కొట్టుమిట్టులాడు తున్నాయి.పేద విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైఉన్నా ఆదిశగా వసతిగృహాల్లో కనిపించడం లేదు.వేసవి సెలవులు ముగిస్తున్న శిధిలావస్థుల్లో ఉన్నవసతి గృహ భవనాలు మరమత్తులకు నోచుకోక పోవడం వసతిగృహాల్లోకి చేరే విద్యార్ధులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.”               - జి ఎన్ వి సతీష్ 

అధికారుల మాటల్లో వినిపించే సౌకర్యాలు.. బూతద్దం పెట్టి వెతికినా దొరకటం లేదు.కాలకృత్యాల నుంచి నిద్రపోయే వరకూ పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చే వరకు నిత్యం సమస్యలతో విద్యార్థులు ఓసాహ సమే చేస్తున్నారని చెప్పాలి.వసతి గృహాల్లోనే కాదు.. భవనాల చుట్టూ వాతా వరణం పరిస్థతులు అద్వా నంగా కన్పిస్తున్నాయి.
పేరుకే వసతి గృహం..
అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలోని పాడేరు గిరిజన సంక్షేమ పాఠశాలలో నెలకొన్న సమస్యల తాండవం ఇది..ఏజెన్సీవ్యాప్తంగా 115 ఆశ్రమ పాఠ శాలలో ఉంటే అందులో 15వరకు గిరిజన గురుకుల పాఠశాలున్నాయి. విద్యార్థులకు సరైన మరుగుదొడ్లు, కిటికీలు లేని వసతి గృహాలు బీటలు వారిన గోడలు, అపరిశుభ్రమైన పరిసరాలు దర్శనమిస్తాయి.నీటి సదుపాయం కూడా అంతంత మాత్రమే అయినా నీటి నిల్వచేసే ట్యాంకు నాచు పట్టి పురుగులు తాండ విస్తున్నాయి.ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల వసతి గృహాలు అంటేనే సమస్యలు ఉంటాయనే విధంగా అధికారుల తీరు కనిపిస్తోంది.గత ఏడాదిలో పాడేరు లో తలార్ సింగి బాలురు పాఠశాలలో 500 మందికు పైగాఉన్న విద్యార్థులు ఈసమస్యలు ఎదుర్కొం టున్నా..అధికారులకు మాత్రం ఇవేవి కనిపించక పోవడం దురదృష్టకరం..పిల్లలు ఉండటానికి గదుల్లో సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నా.. ప్రభుత్వం ఇటీవల నిర్మించిన కొత్త వసతి గృహాన్ని కళాశాల విద్యార్థులకు ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది.అక్కడ వసతిగృహాలకు మైయిన్ గేటు లేకపోవటంతో పశువులు,పందులు లోపల సేదతీరుతున్నాయి.ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు అయినా అధికార పాలక వర్గాలు కల్పించాలని పూర్వ విద్యార్థులు కోరుతున్నారు.
డార్మెటరీ గదుల్లో ఇక్కట్లు..
గిరిజన సంక్షేమ ఇంగ్లిష్ మీడియం పాడేరు పాఠ శాలలో విద్యార్థినిలు తరగతి గదిలోనే డార్మెటరీ ఉండడంతో ఇక్కట్లు పడుతున్నారు.చలి మంటలు వేసు కోలేక, సరిపడా దుప్పట్లు లేక, గుంపులు గుంపులుగా కూర్చుని చలికి ఉపశమనం పొందుతున్నారు. మెనూ పరిశీలించగా శుక్రవారం పొంగలి శెనగ చెట్నీ గుడ్డు ఇవ్వవలసి ఉంది..అయితే పొంగలి మాత్రమే సిద్ధం చేశారు.. వర్కర్‌ను ప్రశ్నించగా తమకు గుడ్లు ఇవ్వ లేదని చెప్పారు. పిల్లల్ని ప్రశ్నించగా గుడ్లు ఎప్పుడు పెట్టారో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. పాడేరు ఏపీఆర్‌లో నిర్వహిస్తున్న ఏకలవ్య పాఠశాలలో మూడు మండలాలకు చెందిన విద్యార్థులు ఒకే చోట ఉన్నారు. అదే డార్మెటరీ.. అదే తరగతి గది..అక్కడే పుస్తకాలు,అక్కడే బకెట్లుతో నిండిపోయింది.నీళ్లు లేక తెల్లవారుజాము మూడు గంటల నుంచి మెస్ నుంచి మోసుకొస్తూ 300 మంది పైబడి విద్యార్థినులు.. ఇక్కట్లు గురవుతున్నారు.సరైన సెక్యూరిటీ లేక భయభ్రాంతులకు గురవుతున్నామని.. నీటి సదుపా యం,బాత్రూం సదుపాయం సరిగా లేదని ఆవేదన చెందారు. పశువుల సైతం లోనికి వచ్చి ఆరబెట్టిన బట్టలు పాడు చేస్తున్నాయన్నారు. అధికారులు తమకు త్వరితగతిన ఏకలవ్య పాఠశాల నిర్మించి వసతి కల్పిం చాలని విద్యార్థినిలు కోరుతున్నారు.
ప్రభుత్వంపై హాకోర్టు ఘాటు వ్యాఖ్యలు
సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో పరిస్థితు లపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు నేలపైనే పడుకోవడాన్ని నిరసిస్తూ.. ఇలాంటి పరిస్థితులు ఉంటే మన పిల్లల్ని అక్కడ చేరు స్తామా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. విద్యార్థులు పడుకోవడానికి మంచం,పరువు అందించడం ప్రభు త్వ బాధ్యత కాదా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. వసతి గృహాల్లో సౌకర్యాల లేమిపై రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. విద్యార్థులు పడుకోవడానికి కనీసం మంచం,పరువు సౌకర్యం కల్పించకపోవడంపై విచారం వ్యక్తం చేసింది. విద్యా ర్థులకు కనీస వసతులు కల్పించడం ప్రభుత్వం బాధ్యత కాదా అంటూ..ఇలాంటి పరిస్థితులు ఉండే మన పిల్లల్ని అక్కడ చేరుస్తామా అంటూ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించింది.ఎటువంటి సమాజంలో మనం బతుకు తున్నాం. ఇలాంటి పరిస్థితులు చాలా దురదృష్టకరం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.సాంఘింక సంక్షేమ గురుకుల పాఠశాలలు,వసతి గృహాల్లో పేద విద్యార్థులే చదువుతుంటారని,ఇతరులతో సమానంగా వారికి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 190 గురుకుల పాఠశాలల్లో లక్షా 70వేల మంది విద్యార్థు లకు మంచాలు, నాణ్యమైన పరుపులు ఇచ్చే వ్యవహా రంపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది.400 వందలమంది విద్యార్థులకు రెం డు టాయిలెట్లు ఉండటంపై ఆశ్ఛర్యం వ్యక్తం చేసింది.
నీళ్ల పప్పు..పురుగుల అన్నం..
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని గోడి గ్రామంలో సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాల, వసతి గృహంలో అసౌకర్యాలపై సామాజిక కార్యకర్త బాజ్జీ దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది.విద్యార్థులకు మంచాలు, పరుపులు లేక కిందే పడుకుంటున్నారని..కనీసం దుప్పట్లు అందించడం లేదని పిటిషనర్ తరపు న్యాయ వాదులు వాదనలు వినిపించారు. ప్రభుత్వ న్యాయ వాది వాదనలు వినిపిస్తూ..వసతుల మెరుగు పరిచేం దుకు నిధులు విడుదల చేస్తూ జీవో ఇచ్చినట్లు తెలిపారు.వసతి గృహంలో సౌకర్యాల కల్పనకు ఏమి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.వసతి గృహానికి కేటాయించిన 84లక్షల నిధులను సరైన మార్గంలో వినియోగించాలని ఇంజ నీర్లను హైకోర్టు ఆదేశించింది.
పనులన్ని పూర్తయ్యాక హైకోర్టు సీనియర్ అధికారి పనులను పరిశీలిస్తారని,లోపాలేమైనా ఉంటే ఆ ఇద్దరు ఇంజనీర్లు వ్యక్తిగతంగా బాధ్యులవుతారని హెచ్చ రిం చింది.నాణ్యతవిషయంలో రాజీపడొద్దని పేర్కొంది. ప్రతి పైసాకు జవాబుదారీతనంగా ఉండాలంది. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలిం చేందు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి అకస్మిక తనిఖీలు చేయాలని పేర్కొంది. ఇదే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు మంచాలు, పరుపులు ఇచ్చే విషయంపై తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్‌ఠాకుర్,జస్టిస్ ఆర్. రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఆదేశిం చింది.విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిం ది. గోడి వసతి గృహంలో దయనీయ పరిస్థితులను న్యాయస్థానం దృష్టికి తెచ్చినందుకు పిటిషనర్ బాబ్జీని అభినందిస్తున్నట్లు హైరోర్టు ధర్మాసనం పేర్కొంది.
అరకొర సౌకర్యాలతో విద్యార్థుల అవస్థలు
శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేటలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహం శిథిలావస్థకు చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు వసతి భవనంలో మౌలిక వస తుల కొరతతో తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.పాలకులు,అధికారుల నిర్లక్ష్యం ఆ విద్యా ర్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలం లక్ష్మీనర్సుపేట గ్రామం లో ఎస్సీసాంఘిక సంక్షేమ బాలురు వసతి గృహం శిథిలావస్థకు చేరి కూలిపోయేస్థితిలో ఉన్నా పట్టించు కునే నాధుడే లేడంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వసతిగృహం స్లాబ్ నుంచి పెచ్చులు ఊడి ఊచలు వేలాడుతుండడంతో భవనం ఎప్పుడు కూలి పోతుందో అని విద్యార్థులు భయాందోళనకు గురవు తున్నారు.శిథిలావస్థకు చేరిన వసతి గృహంతో ఇబ్బం దులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 70మంది విద్యార్థు లున్న వసతి భవనంలో మౌలిక వసతుల కొరతతో తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నామని వాపోతు న్నారు. శిథిలా వస్థకు చేరిన భవనంపై పెచ్చులూడి తమపై పడతున్నా యని,నిద్రించే సమయంలో చాలాసార్లు తమపై పెచ్చులూడి పడిపోయాయి అంటూ విద్యా ర్థులు ఆందోళన వ్యక్తం చేశారు.వసతి గృహ పరిస్థితిపై స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టలేదని హాస్టల్ వార్డెన్ తెలిపారు.ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన వసతి గృహం నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు.వసతి గృహం శిథిలావస్థకుచేరి మూడేళ్లు గడుస్తున్నా అధి కార యంత్రాంగం కనీసం స్పందించిన దాఖలు లేవంటూ విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 70మంది విద్యార్థులున్న ఈ వసతి గృహంలో తాగు నీటి సరఫరా,మరుగుదొడ్లు నిర్వహణ సక్రమంగా లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని తెలిపారు. వర్షం వస్తే గదిలో నీరు కారడంతో పాటు భోజనం చేసేట ప్పుడు పైకప్పు నుంచి పెచ్చులూడి పడుతున్నాయంటూ వాపోయారు. వంటగది,భోజనశాల పూర్తిగా ధ్వంసమై శిథిలవస్థకు చేరడంతో పైకప్పు పడిపోకుండా కర్రలను దన్నుగా పెట్టి అధికారులు కాలం వెల్లదీస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వసతి గృహం పరిస్థితిపై స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం అంటున్నారు. ఈచుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ వసతిగృహం ఒకటే ఉండడంతో చేసేదేంలేక పేద విద్యార్థులందరూ ఇక్కడే చేరాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు దీనిపై స్పందించి వెంటనే నూతన వసతిగృహాన్ని నిర్మించి..విద్యార్థులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తు న్నారు.

గిరిజన అభ్యున్నతిలో సమస్యలెన్నో..

దేశవ్యాప్తంగా గిరిజన జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ పదకొండో స్థానంలోఉంది. రాష్ట్రంలోని గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వాల పరంగా ఎన్ని చర్యలు చేపడుతున్నా,అన్ని తెగలూ సమానంగా అభివృద్ధి చెందడం లేదు. దీంతో అంతర్గత అసమానతలు,అభివృద్ధి లో తారతమ్యాలు నెలకొంటున్నాయి.కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత ప్రమాణాల మేరకు అత్యంత వెనుకబడిన,ప్రత్యేక రక్షణ అవ సరం ఉన్న చెంచులు కోలాం,కొండరెడ్డి, తోటి వంటి నాలుగు తెగలను తెలంగాణలో ఆదిమ గిరిజన తెగలు (పి.వి.టి.జి)గా గుర్తించారు.ఇందులో చెంచులు నాగర్క ర్నూల్,మహబూబ్నగర్,నల్గొండ, వికారా బాద్,రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించిన అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.వీరి సంప్రదాయ వృత్తి వేట. అటవీ ఆధారిత జీవన విధానం నుంచి స్థిర వ్యవసాయానికి మార్పు చెందు తున్నారు. కలపయేతర అటవీ ఉత్పత్తులైన జిగురు,తేనె,కొండ చీపుర్ల సేకరణ వీరికి ప్రధాన ఆదాయ వనరులు.కొండరెడ్డి గిరిజ నులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి తీర అటవీ ప్రాంతాల్లో సాంప్రదాయకంగా పోడు వ్యవసాయం చేస్తున్నారు.వెదురు బుట్టలు,అలంకరణ వస్తువుల తయారీతో పాటు అటవీ కూలీ పని,మొక్కల పెంపకం వంటివి చేస్తారు.చింతపండు,తేనె,ఉసిరి వంటి ఉత్పత్తుల సేకరణ వీరి ప్రధాన జీవనోపాధి. తోటి తెగవారు ప్రధానంగా ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తు న్నారు. గోండులతో సంబంధాలున్న సాంస్కృ తిక వాహకులుగా ప్రసిద్ధి.వంశపారంపర్యంలో భాగంగా పాటలు పాడతారు, సంప్రదాయ పచ్చబొట్టు వేస్తారు. వ్యవసాయంతోపాటు దినసరి కూలీ పనులు చేస్తారు. కొలాములు అనేవారు తోటీలుగోండులతో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.పోడు వ్యవసాయం చేస్తూ, కొండచరియలపై చిరుధాన్యాలు,పప్పుదిను సులు మొదలైన పంటలను సాగుచేసేవారు. ఇప్పటికీ కొంతమంది పోడుసాగు చేస్తున్నా ఎక్కువగా స్థిర వ్యవసాయమే చేస్తున్నా వెదు రు కళాకృతులు,బుట్టలు,చేపలవలలు, వ్యవ సాయ సాధనాలు,నిల్వ పాత్రల తయారీ వీరి ముఖ్య ఉపాధి.
క్షీణిస్తున్న జీవనోపాధులు
పీవీటీజీ తెగల వారు ఎక్కువగా వర్షాధారిత వ్యవసాయం,పోడు సాగు వంటి సంప్రదా య పద్ధతులనే అనుసరిస్తున్నారు.నీటిపారు దల సదుపాయాల కొరత,భూ యాజమా న్యం పరిమితంగా ఉండటం వంటి సమ స్యలు వారికి ప్రతికూలంగా నిలుస్తున్నాయి. అటవీ సంరక్షణ చర్యలవల్ల వేట,సేకరణ వంటి సంప్రదాయ జీవనోపాధులు క్షీణిస్తు న్నాయి.భూ హక్కుల లోపంతో వ్యవసాయ అవకాశాలు దెబ్బతింటున్నాయి.ఆధునిక ఉపాధి అవకాశాలకు కావాల్సిన నైపుణ్యాలు, అనుభవం లేకపోవడం,వాతావరణ మార్పుల ప్రభావం వల్ల సంప్రదాయ జీవనోపాధుల్లో అస్థిరత నెలకొంటోంది.ఆరోగ్య సదుపాయాలు లేకపోవడం, పోషకాహార లోపం,పేదరికం వేధిస్తున్నాయి. మిగిలిన వారితో పోలిస్తే ఆదిమ జాతి గిరిజన తెగల సగటు ఆయు ర్దాయ తగ్గడంతో వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.ఈ నేపథ్యంలో ఆతెగల అభివృ ద్ధికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నాయి. సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థద్వారా నివాసాలు, రోడ్లు,తాగునీరు,విద్యుత్,ఆరోగ్య శిబిరాల ఏర్పాటు,స్థిర వ్యవసాయం,ఉద్యానవనాల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తున్నారు. తెలంగాణ షెడ్యూల్డ్ తెగల ఆర్థిక సహకార సంస్థ ద్వారా పశుపోషణ,వ్యవసాయం ఇతర చిన్న వ్యాపారాల కోసం ఆర్థికసహకారం అందుతోంది.ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, గురుకుల నివాస విద్యాసంస్థల ద్వారా బాల బాలికలకు విద్య అందిస్తున్నారు.కేంద్ర ప్రభు త్వ పరంగా ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాఅభియాన్ పథకంద్వారా సురక్షిత గృహాలు, శుద్ధమైన తాగునీరు,విద్య,ఆరోగ్యం, పోషకాహారం వంటి మౌలిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.రోడ్లు, టెలి ఫోన్,విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు.స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించడం ఈ పథ కం ప్రధాన లక్ష్యాలు.వన ధన్ వికాస కేంద్రాల పథక ద్వారా అటవీ ఉత్పత్తుల విలువ వృద్ధి, శిక్షణ, మార్కెటింగ్ మద్దతు దక్కుతుంది. జాతీ య ఆరోగ్య మిషన్లో భాగంగా పోషకఆహార లోపం తగ్గింపు,సీజనల్ ఆరోగ్య శిబిరాల ఏర్పాటు,సంచార వైద్య ఆరోగ్య కేంద్రాల సేవలు అందిస్తున్నారు.ఏకలవ్య మోడల్ నివాస విద్యాసంస్థల ద్వారా గిరిజన బాలబాలి కలకు చదువు చెబుతున్నారు.ఇంత చేస్తున్నా- తెలంగాణలోని ఇతర గిరిజన జనాభాతో పోల్చితే ఆదిమ గిరిజన తెగల్లో మానవ అభి వృద్ధి సూచీల్లో గణనీయమైన వెనుకబాటుతనం కనిపిస్తోంది.వీరి సామాజిక,ఆర్థిక స్థితిని మెరుగుపరచడం,పేదరికాన్ని తగ్గించడం, సుస్థిర అభివృద్ధిని సాధించడం సమ్మిళిత ప్రగతికి తప్పనిసరి అవసరం.
నైపుణ్య శిక్షణ అవసరం : ఆదిమ గిరిజన తెగల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక కేంద్రీ కృత,కమ్యూనిటీ ఆధారిత జీవనోపాధి కార్యక్రమాలను బహుముఖ వ్యూహంతో అమలు చేయాలి.ఆర్థిక స్వావలంబన కల్పించాలి. ఇందుకోసం ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు,సాగునీటి వసతులు కల్పించాలి.నేల ఆరోగ్య పరిరక్షణ పద్ధతులకు సహకారం అందిస్తూ వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన సాగును ప్రోత్సహించాలి. నైపుణ్యాధారిత సూక్ష్మ సంస్థలు, వ్యవసాయేతర ఉపాధులు, హస్తకళలు, ఆహార ప్రాసెసింగ్, గ్రామీణ సేవా రంగాల్లో జీవనోపాధికి వీలు కల్పించాలి. శాస్త్రీయ పద్ధతిలో అటవీ ఉత్పత్తు ల సేకరణ, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, నిల్వ సదుపా యాలు సమకూర్చాలి. మార్కెటింగ్ సహకారం అందించాలి.ఆదిమ గిరిజన తెగల్లోని యువత,మహిళలకు నైపుణ్యాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి శిక్షణ కల్పించాలి. తద్వారా సంప్రదాయ వృత్తులకు అతీతంగా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపించాలి. స్వయం సహాయ సంఘాలు, సహకార సంఘాలు, ఉత్పత్తిదారుల సమూహాలు వంటి కమ్యూనిటీ సంస్థలను బలోపేతం చేసి, సమష్టి కొనుగోలు, విక్రయశక్తిని పెంచాలి. ఆర్థిక సేవలు, ప్రాథమిక వసతులు, సాంకేతికతలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి. ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, రాష్ట్రంలో అత్యంత వెనుకంజలో ఉన్న 16,688 ఆదిమ గిరిజన తెగల కుటుంబాల సమగ్ర అభ్యున్నతి బాధ్యతను ప్రభుత్వం, సంబంధిత సంస్థలు స్వీకరించాలి. అప్పుడే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడి ఇతర గిరిజన తెగలతో సమానంగా అభివృద్ధి సాధించగలుగుతారు.ఏజెన్సీలో ఉన్న ఆదిమ జాతి గిరిజనుల వ్యక్తిగత,సామాజిక అభివృ ద్ధికి ప్రణాళికలు రూపొందించి సమగ్ర అభి వృద్ధివైపు పయనించేలా ప్రభుత్వాలు కృషిచే యాల్సి ఉంది.వారి తాజా స్థితిగతులు,జీవన విధానం,వారి సమస్యలు,అవసరాలు,వారి భవిష్యత్తును మరింతగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలి. (మామిడాల లక్ష్మీప్రసాద్) – వ్యాసకర్త :స్టేట్ మిషన్ మేనేజర్,తెలంగాణ షెడ్యూల్డ్ తెగల ఆర్థిక సహకార సంస్థ(ట్రైకార్)

‘ఎవరో వచ్చి ఏదో చేస్తారన్న ఆశ పోయింది..’

ఆధునిక యుగంలో ప్రపంచ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల పరిస్థితి మాత్రం ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొన్ని గిరిజన మారు మూల ప్రాంతాల పరిస్థితులు కూడా మారకుండా అలాగే ఉండిపోయాయి. అనేక గిరిజన గ్రామాలకు, సరైన రహదారులు నేటికీ అందని కలగానే మిగిలి పోయాయి. స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం అంటే ఏమి టో తెలియని గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయి.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివాసీల గ్రామాల పరిస్థితులు మారాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు.తమ దుస్థితిని మార్చుకు నేందుకు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు ఎన్నోసార్లు విన్నవించు కున్నారు. కానీ ఎలాంటి పరిష్కారాలు లభించ లేదు. వారి ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరు లాగా అయింది.నేడో, రేపో ఎవరో వచ్చి ఏదో చేస్తారన్న ఆశ వాళ్లకు పోయింది. ప్రకృతి ఒడిలో ‘పోడు’ వ్యవసాయం ద్వారా జీవనం సాగించే గిరిజన సముదాయాలు, కొండల పైనుంచి కిందికి దిగాల్సి వచ్చిన ప్రతిసారీ తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటారు. గుమ్మలక్ష్మీపురం,పార్వతీపురం,సీతంపేట, కురుపాం గ్రామీణం,సాలూరు గ్రామాలకు చెందిన గిరిజనులు ఎవరైనా అనారోగ్యం పాలైనా,నిత్యావసరాలు సేకరించాల్సి వచ్చినా లేదా అటవీ ఉత్పత్తులను విక్రయించాలను కున్నా ఆ ప్రమాదకరమైన రాళ్లతో నిండిన దారుల గుండా ప్రయాణించడం వారికి నరకయాతనగా మారుతుంది.ఈ గ్రామాలకు రహదారుల నిర్మాణం కోసం కోట్లాది రూపా యలు మంజూరైనప్పటికీ బిల్లుల చెల్లింపులు, అటవీ శాఖ అనుమతులు, ఇతర ప్రభుత్వపర మైన అడ్డంకుల కారణంగా అసలు పనులు మాత్రం నిలిచిపోయాయి.ఫలితంగా గ్రామ స్థులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ బాధ్య తలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. వాళ్లు, వీళ్లు మారుస్తారు అనే ఆలోచనలను వీడి,తమ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు నడుం బిగించారు.తమ ప్రాంత అభివృద్ధి వైపు అడుగులు వేశారు అడవి బిడ్డలు. వీరు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
కొండను తొలచి రహదారికి మరమ్మతులు కురుపాం మండలంలోని ఆగంగూడ గ్రామానికి సరైన రాకపోకల రహదారి లేదు. చినుకు పడితే చాలు ఆ దారి బురదమయమై, నడవడానికి కూడా వీలులేని చిత్తడిగా మారి పోతుంది. పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకున్న గ్రామస్థులు ‘శ్రమదానం’ద్వారా ఒక కొండను తొలచి రహదారిని స్వయంగా నిర్మించుకుని మరమ్మతులు చేసుకున్నారు.
స్వచ్ఛందంగా కదిలి తొలగించిన బండరాళ్లు
సీతంపేట మండలంలోని పాకలగూడ,గజిలి, కడగండి గ్రామాలకు వెళ్లే రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది.గ్రామస్థులు స్వచ్ఛంద శ్రమతో ఆ రహదారిలోని వివిధ భాగాల్లో రాళ్లు,కంకరను పరచి,గుంతలను పూడ్చి, వాహనాలు వెళ్లడానికి వీలుగా ఆ దారిని పున రుద్ధరించారు. అదేవిధంగా పెద్దగూడ నుంచి రంగంవలసను కలిపే రహదారి కూడా అత్యంత దయనీయ స్థితిలో ఉంది. గిరిజన నివాసులు మరోసారి స్వచ్ఛంద శ్రమతో ముందుకు వచ్చి,దారిలో అడ్డంగా ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లను తొలగించి ఆ మార్గాన్ని బాగు చేశారు. రూ.70వేలు పోగుచేసి రహదారి నిర్మాణం కురుపాం మండలంలోని మారిపల్లి పంచా యతీ పరిధిలో ఉన్న చీడిమానుగూడ గ్రామా నికి రహదారి నిర్మించాలని పదే పదే చేసిన విన్నపాలు నిష్ప్రయోజనం కావడంతో గ్రామస్థులు స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. వారు సుమారు రూ.70 వేల నిధులను సమకూర్చుకుని ఈనెల 4వ తేదీన రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు.
20 రోజుల పాటు శ్రమించి
కొమరాడ మండలంలోని కుంతేసు పంచా యతీ పరిధిలో గిరిశిఖరపై వెలసిన బద్దిడి గ్రామానికి తాగునీటి సరఫరా పథకాన్ని ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్థులు ఏళ్ల తరబడి అధికారులకు విన్నవిస్తూనే ఉన్నారు. గ్రామానికి వెళ్లడానికి సరైన రహదారి లేకపో వడంతో ఆ పథకాన్ని అమలు చేయడం అసాధ్యంగా మారింది.చివరకు గ్రామస్థులే స్వయంగా ఒకరికొకరు చేతులు కలిపారు. వారు తమ గ్రామం చుట్టుపక్కల లభించిన రాళ్లు, కంకరను సేకరించి కొంత సిమెంటును కొనుగోలు చేశారు.20రోజుల పాటు అవిశ్రాం తంగా శ్రమించి వారు 38 అడుగుల లోతు గుంత తవ్వి తమ కోసం ఒక బావిని నిర్మించుకున్నారు.
కుటుంబానికి రూ.15,000 చొప్పున విరాళం
గుమ్మలక్ష్మీపురం మండలంలో రేగిడిని కొండపై ఉన్న బయ్యాడతో కలిపే రహదారి ఎంత అధ్వాన స్థితిలో ఉందంటే కనీసం కాలినడకన వెళ్లడం కూడా కష్టంగా మారింది. ఈ ప్రాజెక్టు కోసం 2021లోనే రూ.3.35 కోట్లు మంజూరైనప్పటికీ నిర్మాణ పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. వేరే మార్గం లేక ఆ గ్రామంలో నివసించే 75 కుటుంబాలు తమ వనరులను సమకూర్చు కుని కుటుంబానికి రూ.15,000 చొప్పున విరాళంగా ఇచ్చాయి. మొత్తం రూ.11.25 లక్షల నిధులను వినియోగించి ఆ రహదారిని రాకపోకలకు అనుకూలంగా మార్చేందుకు వారు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.
రూ.2.50 లక్షల సొంత నిధులతో
అదే విధంగా గుమ్మలక్ష్మీపురం మండలంలోనే లప్పటి నుంచి వాడబాయితో కలిపే రహదారి నిర్మాణం కోసం రూ.2.80కోట్లు మంజూర య్యాయి. అయితే పనులు ప్రారంభం కాకపో వడంతో ఆ రహదారిపై ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది.దీనికి స్పందిస్తూ ఆ గ్రామానికి చెందిన కామేశ్వర రావు అనే వ్యక్తి తన సొంత నిధుల నుంచి రూ.50,000ఖర్చు చేసి ఒకజేసీబీని అద్దెకు తీసుకుని రహదారిపై మరమ్మతులు చేయిం చారు.సాలూరు మండలంలోని దిగువ కాశాయివలసదీలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.అక్కడి స్థానికులందరూ కలిసి సుమారు రూ.2.50లక్షలు సమ కూర్చుకుని ఆ రహదారి నిర్మాణ బాధ్యతలను స్వయంగా చేపట్టారు.ప్రభుత్వాలు మారుతున్నా నేటికీ గిరిజన గూడేల్లో తాగునీటి కష్టాలు తీరడం లేదు.అల్లూరి జిల్లా అనంతగిరి మండలం రొంపిలి పంచాయతీ మొరలోవలో గిరిజనులు గుక్కెడు నీటికోసం అష్టకష్టాలు పడుతున్నారు.“మా గ్రామానికి నీళ్లు ఇవ్వండి” అంటూ ఆ గిరిజనులు వినూత్నంగా చేతులు జోడించి మొర పెట్టుకుంటున్నారు.కొండ ప్రాంతాల్లో నివసించే తమ గోడు వినేవారు లేరా అంటూ ఆవేదన చెందుతున్నారు. నీరు ఇవ్వాలని మొక్కుకుంటూ అనంతగిరి మండ లం రొంపిలి పంచాయతీ మొరలోవ గిరిజ నులు మొర పెట్టుకుంటున్నారు.ఈక్రమంలో 12 కుటుంబాల్లో సుమారు 60మంది నివసి స్తున్నారు.జల్ మిషన్ పథకం తమకు అందు బాటులో లేదని చెప్పారు.వేసవి వచ్చిందంటే కొండ దిగువన ఉన్న రెండు కిలోమీటర్ల దూరంలో నీటి ఊటలను పట్టుకుంటూ పిల్లాపాపలతో కష్టాల పడవలసి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. పలుమార్లు బిందె లతో రాళ్లు తన్నుకుని పోయి గాయాలు పాలవుతున్నామన్నారు. పశువులు కూడా ఇదే నీటిని తాగుతున్నట్లు మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. వర్షాల కోసం ఎదురుచూస్తున్నామని గుక్కెడు నీటి ఊటల కోసం వెతుకుతున్నామని ఆవేదన చెందారు. వెంటనే కలెక్టర్ తమకు మంచినీటి సౌకర్యం కల్పించాలని చేతులు ఎత్తి జోడిస్తున్నారు.
మా సొంత భూమిలో పని కల్పించాలి రావికమతమండలం చీమలపాడు పంచాయతీ 16గిరిజన గ్రామాలు.570 జాబ్ కార్డు కలిగి ఉన్నారు. వేసవికాలంలో.ఎండ తీవ్రత ఎక్కువ గా ఉంది.రెండు పుట్ల పేస్ యాప్‌వల్ల. సమ యం ఎక్కువగా పడుతుంది. ఎండలో విపరీ తంగా కాస్తున్నాయి.ఫేస్ యాప్.ఒంటి పూట చేయాలి.మజ్జిగను ప్రభుత్వం సఫరా చేయాలి. మా సొంత భూమిలో ఉపాధి పనులు పెట్టాలి. గిరిజన ప్రాంతాల్లో సిగ్నల్ వ్యవస్థ సక్రమంగా లేక. రోజుకి5 గంటలో పనిచేస్తే 2 రెండు గంటలు ఫేస్ యాప్‌కి టైం సరిపోతుంది. దీనివల్ల వేసవికాలంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాము.తక్షణమే ప్రభుత్వం ఫేస్ యాప్ రద్దు చేయాలి లేదా ఒంటిపోటే ఫేస్ ఆఫ్ అని పెట్టాలి.మాకు జీడి మామిడి తోటలుఉన్నాయి. మా గ్రామంలో చెరువులు ఉన్నాయి.వాటిలోనే పనులు పెట్టాలి.. గతంలో ఇద్దరు విఆర్పిలు ఉండారు. నేడు ఒక విఆర్పివల్ల పని ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో.అనేక ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది.తక్షణమే రెండో విఆర్పిని పోస్ట్ భర్తీ చేయాలి.ఫేస్ ఆఫ్ వంటి పూట ఏర్పాటు చేయాలి. – జి.ఆనంద్ సునీల్ కుమార్ 

గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలల గోడు వినరే..

అక్షరాస్యతలో బాగా వెనుకబడిన ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు.అటువంటి గిరిజన ప్రాంతాలలో అక్షరాస్యత పెంచాలనే లక్ష్యంతో రాజ్యాంగంలోని ఆర్టికల్46గిరిజనులకు విద్య,రక్షణ,సదుపాయాలు కల్పించాలని పేర్కొంది.1985 నుండి 1990 వరకు గిరిజనుల విద్యకోసం చేసినకృషి ప్రశంసించదగ్గది.క్రమేణా ఆశ్రమ,గురుకులపాఠశాలలు,గిరిజనప్రాథమిక పాఠ శాలలను నెలకొల్పి అక్షరాస్యత కోసం,విద్య కోసం సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేయడం జరిగింది.రాజ్యాంగంలో షెడ్యూల్ తెగలకు ప్రత్యేకమైన రక్షణలు,సదుపాయాలు కల్పించబడ్డాయి. గిరిజనులకు విద్యను అందిస్తూ వారిని అన్ని విధాలా సామాజిక వివక్షతల నుంచి,దోపిడీ నుంచి రక్షించాలని ఆర్టికల్46సూచించింది.5వషెడ్యూల్ద్వారా గిరిజన ప్రాంతాల పరిపాలన గవర్నరుకు ప్రత్యేక బాధ్యతను ఇచ్చింది.275(1)ప్రకారంషెడ్యూలు ప్రాంతాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ప్రత్యేక నోడల్ ప్యాకేజీలను ఇవ్వాలని సూచిం చింది.రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు నేటికీ అమలుకు నోచుకోలేదని,బాలారిష్టాలతోనే కొనసాగుతున్నాయని గిరిజన ప్రాంతాలలో జరిగే సంఘటనలే నిరూపిస్తున్నాయి.                  - కె.విజయగౌరి

మౌలిక వసతులు కీలకం
ఈనాటికీ గిరిజన ప్రాంతాల నుండి ఆసుపత్రికి రావాలంటే డోలీ మోతలు ప్రత్యేక కథనాలుగా చూస్తున్నాము. ఆ ప్రాంత ప్రజలపై గల బాధ్యతా రాహిత్యం విద్యార్థులు చదువుకునే సంక్షేమ గృహాలపై కూడా కొనసాగుతున్నది. పదేళ్ల క్రితం కురుపాం మండలం తుమ్మిక మాను గూడకు చెందిన ముగ్గురు విద్యార్థులు టంపల పాడు ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటు న్నపుడు తాగునీరు లేక,మరుగుదొడ్లు లేక రోగాల బారిన పడి చనిపోయిన ఘటన నుండి తాజాగా కురు పాం మండల కేంద్రంలోగల గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన ఘటన వరకు రాష్ట్రాన్ని కుది పివేశాయి. ఇద్దరు బాలికలు చని పోవడం, 138మంది పచ్చకామెర్లతో ఆసుప Ÿత్రిపాలు కావ డం సంక్షేమ హాస్టళ్ల పట్ల ప్రభుత్వ బాధ్యత ఏపాటి దో రుజువు అవుతున్నది.
ఈ ఘటనే కాదు. గిరిజన సంక్షేమ హాస్టళ్లు ఎక్కువ శాతం సౌకర్యాల లేమితో కునారిల్లుతున్నాయి. బాలికల వసతి గృహాలు సరిపడినన్ని లేక కురు పాం గురుకుల పాఠశాలల పరిస్థితి అత్యంత దయనీయంగా వుంది. పాఠాలు బోధించడానికి, బాలికలు నిద్రించడానికి, సామానులు భద్రపర చడానికి, భోజనాలు చేయడానికి అన్నింటికీ ఒకటే గదులు. 600 పైచిలుకు గల బాలికలకు కేవలం 18 మాత్రమే మరుగుదొడ్లున్నాయి. ఆరవ తరగతి నుండి ఇంటర్ వరకు క్లాసులున్న గురుకులాలు సమస్యల నిలయాలుగా ఉన్నాయి. బాలికల ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిం చేం దుకు ఒక్క ఆశ్రమ పాఠశాలలో కూడా ఎ.ఎన్. ఎం లు లేరు. గురుకులాలలో ఉన్నప్పటికీ తగిన మందులు, సౌకర్యాలు కల్పించడంలేదు. ఆశ్రమ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు భయపడి ఆందోళనతో స్వంత డబ్బులతో ఆరోగ్య కార్యకర్త లను నియమించుకుంటున్నారు. రెండు దశాబ్దా లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది.
ప్రభుత్వ వైద్య కళాశాల వసతి గృహాల్లో నీటి కష్టాలు
పాఠశాలలో మొత్తం 320 మంది విద్యార్థులు ఉన్నారు.వీరికి అక్కడ వసతి చాలడం లేదు ఇరు కు గదుల్లో కిక్కిరిసి ఉంటున్నారు. తగిన సిబ్బంది లేక గదులు శుభ్రం చేయడం లేదు.దోమలు బెడద ఎక్కువగా ఉంది.మరుగుదొడ్లు సరిపడా లేవు ఉన్నవి దారుణంగా ఉన్నాయి. పాఠశాలలలో రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ వార్డెన్?గా నవీన్ బాబు రెండేళ్లుగా కొనసాగుతున్నారు. రొటేషన్ పద్దతి అమలు కావడం లేదు. ఇందుకు అధికార పార్టీ నాయకుల మద్దతేనని ఆరోపణలు ఉన్నాయి. నవీన్ బాబు భార్య జీలుగుమిల్లి ఎంపీపీగా ఉన్నారు. ఇదిలా ఉండగా వసతి గృహంలో పాడైన కూరగాయలు వండి విద్యార్థులకు పెడుతున్నా రని, కనీస శుభ్రత పాటించడం లేదని మరుగు దొడ్ల పరిస్థితి మరి అధ్వానంగా ఉందని విద్యార్థు లు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాలకులు మారుతున్నా పరిస్థితులు మారడం లేదు. వార్డెన్ పోస్టులు శాశ్వత ప్రాతిపదికన లేనం దున ఉపాధ్యా యులే డిప్యూటీ వార్డెన్ బాధ్యతలు చేపడుతున్నారు. బోధన ఒకవైపు, పిల్లల బాధ్యత మరొకవైపు చూడటం నష్టదాయకంగా ఉంది. వైద్యపరమైన సేవలు అందించడానికి ప్రత్యేకంగా శాశ్వత సిబ్బంది లోపం కూడా విద్యార్థులకు శాపంగా మారుతున్నది.విద్యార్థుల అనారోగ్య పరిస్థితులలో మెడికల్ ఖర్చు ముందస్తుగా ప్రధా నోపాధ్యాయులు,వార్డెన్లపై పడుతున్నది. ఆశ్రమ పాఠశాలలలో ఆయాలు లేరు. గిరిజన ప్రాథమిక పాఠశాలల నుండి3,4,5తరగతుల పిల్లలను ఆశ్రమ పాఠశాలలకు విలీనం చేసిన తరువాత అంత చిన్నపిల్లల ఆలనా పాలన చూసే ఆయాలు గాని,టీచర్లు గాని ప్రత్యేకంగా లేకపో వడం వలన పిల్లల మానసిక,శారీరక, విద్యాపర మైన అంశా లపై తీవ్ర ప్రభావం చూపి డ్రాపవు ట్లుగా మారు తున్నారు.అప్పటివరకు కొన్ని ఘటనల్లో వీరికి తీవ్రవ్యాధుల లక్షణాలేమీ కని పించవు.ఉన్నట్లుండి బయటపడి, అంతలోనే చని పోతున్నారు. గడిచిన 25 రోజుల్లో సెలవులకు ఇంటికి వెళ్లిన నలుగురు విద్యార్థులు ఇలానే మృతి చెందారు. ఒ అమ్మాయికి ఆయాసం,మరో అబ్బా యికి వాంతులు, ఇంకో పిల్లాడికి కడుపు నొప్పి, మరో చిన్నారికి తలనొప్పి ఇవి వారిలో కనిపించిన లక్షణాలు.గిరిజన విద్యార్థుల్లో కడుపునొప్పి,తల నొప్పి, గొంతునొప్పి,ఆయాసం,శరీరం ఉబ్బడం తదితర చిన్న చిన్న అనారోగ్య సమస్యలు బయట పడి అవిమరణాలవరకు వెళ్తున్నాయి.కొన్నేళ్లుగా గిరిజన పాఠశాలల్లో ఇలాంటిఘటనలు తరచూ జరుగుతున్నాయి. వారికి సరైన వైద్యం అందు బాటులో లేకపోవడమే ప్రధాన కారణం. గతంలో ఇలాంటి మరణాల్ని గుర్తించే వ్యవస్థ సరిగా ఉండేది కాదు.ఇటీవల దీనిని పక్కాగా నమోదు చేస్తున్నారు. చాలా ఘటనల్లో వారి మృతికి కారణాలు విశ్లేషిస్తే గుండె,కిడ్నీ వ్యాధులు, కాలేయం, ఊపిరితిత్తుల సమస్య లతో మృతి చెందినట్లు తెలుస్తుంది.ఇంకా జన్యుపర మైన సమస్యలూ ఉన్నాయి.గిరిజన విద్యార్థుల అకాల మరణాలకు కారణాలు తెలుసుకునేందుకు గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక అధ్యయనం చేయిం చడానికిమంగళగిరి ఎయిమ్స్‌ను సంప్రదించిం ది.జన్యుపరమైన సమస్యలతోనే వారు ఇలా మృతి చెందుతున్నారని వైద్యులు ప్రాథమికంగా తెలి పారు.దీనికి సమగ్ర పరీక్షలు అవసరమని చెప్తు న్నారు.ఇందుకు నలుగురు వైద్యులను కేటాయిం చారు.పైలట్ ప్రాజెక్టు అధ్యయనానికి రూ.2 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. కానీ ఈమొత్తాన్ని వెచ్చించేందుకు గిరిజన సంక్షేమశాఖ, వైద్యారోగ్య శాఖ ముందుకు రాకుండా నిధుల కోసం కేంద్రా నికి నివేదించాయి. దీంతో జాప్యం జరుగుతోంది.
దీర్ఘకాలిక వ్యాధులకు స్క్రీనింగ్ లోపం
ఈ గిరిజన బిడ్డలను పోషకాహారలోపం, రక్తహీ నత, అంటువ్యాధులు వేధిస్తున్నాయి. వారికి సోకే జన్యువ్యాధులపై సరైన వివరాలు లేవు. దీర్ఘకాలిక వ్యాధులకు స్క్రీనింగ్ లోపముంది. సికిల్‌సెల్ ఎనీమియాను గుర్తించేందుకు చేస్తున్న పరీక్షల్లో నూ ఒక వేరియంట్‌నే గుర్తిస్తున్నారు. ఇంకో ప్రమాదకర వేరియంట్ పరీక్షల్లో బయటపడట్లేదు. అలానే వీరికి జన్యు,రక్తసంబంధిత,గుండె, మెట బాలిక్ వ్యాధులను గుర్తించేందుకు అన్నిరకాల పరీక్షలు పక్కాగా చేయాలి.
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి విద్య దోహద పడాలి
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఆశ్రమ పాఠశా లలు,గురుకులాలను ఏర్పాటుచేసి గుణాత్మక విద్య ను అందివ్వాలి.తద్వారా సామాజికంగా,ఆర్థి కంగా మెరుగైన జీవన పరిస్థితులు కల్పించాలనేది ఆచరణలో జరుగుతున్నదా అనేది పరిశీలిస్తే ఆటంకాలు అనేకం. బడులు లేక, ఉన్నా బడుల్లో టీచర్లు లేక, అసంపూర్ణ భవనాలు, చాలీచాలని వసతులు కనిపిస్తున్నాయి.తాగునీటిది పెద్ద సమ స్య. ఎప్పటికప్పుడు ఆర్.ఓప్లాంట్లు మరమ్మ తులకు గురికావడం,వాటి కోసం నిధులు కేటా యించక పోవడం.ఇవన్నీ పరిశీలిస్తే గిరిజన విద్య కోసం బడ్జెట్ కేటాయింపులు తగ్గిపోవడం. దాం తో గిరిజన సంక్షేమ హాస్టళ్లలో పిల్లలు రోగాల బారినపడి పిట్టల్లా రాలిపోవడం చూస్తున్నాం. విషజ్వరాలు, పచ్చకామెర్లు, మలేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఈ రం గంపై నిర్లక్ష్యం తగదు.
గిరిజన బాలబాలికలకు చదువు, వసతి సౌక ర్యాలు కల్పించాలనే లక్ష్యంతో మూడవ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వ బాలుర-బాలికల వసతి గృహాలు ప్రారంభించారు. ఎప్పుటికప్పుడు మౌలిక వసతులు కల్పించే విషయంలో బడ్జెట్ కేటాయిం పులు పెంచాలి.పెరుగుతున్న ధరలకు అనుగు ణంగా, మరమ్మతులు, వైద్య అవసరాలు, పోషక విలువలతో కూడిన మెనూచార్జీల పెంపునకు నిధులు వుండాలి. ఈ ఏడాది షెడ్యూ ల్ తెగల సంక్షేమానికి కేవలం రూ.8,159 కోట్లు మాత్రమే కేటాయించారు.పాఠశాల విద్యకు రూ.31,806కోట్లు కేటాయించారు.గిరిజన విద్యారంగానికి కేటాయింపులు తక్కువ. ఇటు వంటి పరిస్థితులలో గిరిజన సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న బాలబాలికలకు ఆరోగ్యం బాలేక పోతే బాధ్యత ఎవరిది? ఇటువంటి పరిస్థి తులను ఎవరు చక్కది ద్దుతారో పాలకులే చెప్పాలి.రాజ్యాంగ పరమైన హక్కులను అమలు చేయక పోవడంతో గిరిజన ప్రాంతాలు వెనుకబడ్డాయి. పేదరికం, దోపిడీ, వెనుకబాటుతనం నుండి విముక్తి జరగాలంటే నేటితరం గిరిజన విద్యార్థు లంతా చదువుకోవాలి. సంక్షేమ హాస్టళ్లను ఆశ్ర యించే విద్యార్థులకోసం మౌలిక సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. వ్యాసకర్త : యు.టి. ఎఫ్ సీనియర్ నాయకులు

1 2