అడవులు తరిగిపోతే వర్షాలుండవు

అడవులవల్ల కోట్లసంఖ్యలో వన్యప్రాణులు,వృక్షజాతులు,కీటకాలతోపాటు మానవాళికి ప్రత్యక్షంగా..పరోక్షంగా అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి.వాతావరణ మార్పులను నివారించడమే కాకుండా జీవుల మనుగడకు అవసరమైన స్వచ్ఛమైనగాలి,నీరు,ఆహారం,ఔషధాలను అందించడంలో వనాలు విశేషపాత్ర పోషిస్తున్నాయి.ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ, పర్వత ప్రాంతాలకు చెందిన కోట్లాది ప్రజలు తమ ఆహారంలో భాగమైన పండు,కాయలు,గింజలు,పుట్ట గొడుగులు,తేనెవంటి వాటిలో అధికశాతం అడవుల నుంచే సేకరిస్తున్నారు.అవిపేదలకుశక్తిని,ఆహార భద్రతను అందిస్తున్నాయి.ఆహార వైవిధ్యానికి తోడ్పడుతున్నాయి.ప్రపంచఆహార,వ్యవసాయసంస్థ ఎఫఏఓ)గణాంకాల ప్రకారం అరణ్యా లలో లభించే ఆహార,ఔషధ,కలపేతర ఉత్పత్తుల ద్వారా ఏటా రూ.5.86లక్షలకోట్ల ఆదాయం సమకూరుతోంది. అటవీ వనరుల సేకరణ ద్వారా138దేశాల్లో1.25కోట్ల మంది పూర్తిస్థాయి ఉపాధిని పొందుతున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనాల ప్రకారం విశ్వవ్యాప్తంగా ఔషధాలకోసం వినియోగించే అటవీవృక్ష జాతులసంఖ్య యాభైవేల దాకా ఉంటుంది.భూమి మానవులకే కాదు కోట్లాది జీవరాశులకు,మొక్కలకు నిలయం.నేలపై ఏజీవి అయినా ప్రాణంతో ఉండాలంటే గాలి,నీరు,ఆహారం ముఖ్యం.మరిభూమిని నాశనం చేస్తుంటే ఈవనరులన్నీ తరిగిపోతూ ఉంటాయి.ఇప్పటికే నీరు, ఆహారం కొనుక్కుంటున్నాం.భవిష్యత్తులో గాలి కూడా కొనుక్కునే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.అభివృద్ధి పేరుతో ప్రయివేటు,కార్పొరేట్శక్తులు భూమిని నాశనం చేస్తున్నాయి.దీనివల్ల వరదలు,భూకంపాలు,వాతావరణమార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.ఇప్పటికే ఓజోన్‌పొర దెబ్బతిన్నది.దీంతో తీవ్రమైనఎండలు, భారీ వర్షాలు,గడ్డకట్ట్టించేచలి.ఇవన్నీ గతదశాబ్దకాలంగా క్రమక్రమంగా వాతావరణంలో వస్తున్నమార్పులు..మనిషి జీవనంపై తీవ్రప్రభావం చూపుతున్నాయి.ఇప్పటికైనా భూమి సమస్యలు పట్టించుకోకపోతే భవిష్యత్తులో మరెన్నో ప్రమాదాలను చవిచూడాల్సి వస్తుంది.మనుషులు భూతాపాన్ని,కాలుష్యాన్నిపెంచే చర్యలను నిలువరించకపోతే భూమిని కాపాడుకోవడం కష్టం.అందుకే భూమి పరిరణక్షణకోసం ప్రజల్లో అవగాహన కలిగించాలి - పద్మావతి


మానవుల చర్యలతో భూమిని అనారోగ్యానికి గురిచేయడంతో తీవ్రంగా వేడెక్కుతుంది. వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. వీటిని నివారించే దిశగా చర్యలు చేపడుతూ,పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలి.ఆలక్ష్యంగా ప్రజల్లో అవగాహన పెంచాలి. అంతరించిపోతున్న జీవజాతులను కాపాడు కోవాలి. అప్పుడే ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవా’నికి అర్థం ఉంటుంది.
ప్రత్యేకత!..
అమెరికాలో 1969 జనవరి 28న శాంటా బార్బరా సముద్ర తీరం చమురు తెట్టలతో నిండిపో యింది. తీరమే ఆలంబనగా బతకుతున్న వందలాది జీవజాతులు మృత్యువాతపడ్డాయి. సుమారు నాలుగు వేల పక్షులు ఆతెట్టలో చిక్కుకొని, ఎగరలేక ప్రాణా లొదిలాయి. జీవ వైవిధ్యం కొడిగట్టిన ఆనాటి సంఘ టన ఎందరినో కలిచివేసింది. యుఎస్ సెనేటర్, పర్యావరణవేత్త గేలార్డ్ నెల్సన్, హార్వర్డ్ విశ్వవిద్యా లయంలో గ్రాడ్యుయేట్ విద్యార్థి అయిన డెనిస్ హేస్‌లను ఆందోళనకు గురిచేసింది. దీంతో పర్యావర ణంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి వీరిద్దరూ 1970లో, ఏప్రిల్ 22న ఎర్త్ డేను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. ప్రపంచంలో 175 దేశాల నుంచి దాదాపు 20లక్షల మంది పాల్గొ న్నారు.‘పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం!’ అంటూ నినాదాలు చేశారు.ప్రతి సంవత్సరం జరిగే ఈ సదస్సు ల్లో ప్రపంచ దేశాల్లో పర్యావరణంలో వచ్చిన మార్పు లను, భూమి పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి చర్చిస్తారు. ఐక్యరాజ్యసమితి చొరవతో 1990లోఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తమైంది. ఇప్పుడు ఏటా దాదాపు 200 దేశాలలో కోటిమందికి పైగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు నిర్వాహకులు తెలుపుతున్నారు.
ఈ ఏడాది థీమ్
‘అంతర్జాతీయ ఎర్త్ పరిరక్షణ’ సంస్థ ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఒక కొత్త లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సంవ త్సరం ‘మన శక్తి, మన గ్రహం’ అనే థీమ్‌తో 55వ సారి నిర్వహిస్తుంది. అంటే మనశక్తితో మన భూమిని కాపాడుకుందాం అని.కంపెనీలు,ప్రభుత్వాలు, పౌరు లు..అందరూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఈ దిశగా చర్యలను చేపట్టాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ప్రతి ఏడాది ఈ రోజున ర్యాలీలు, చెట్ల పెంపకానికి సంబంధించిన కార్యకలాపాలను విస్తృతంగా నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా ప్రజలు ఈరోజు జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ భూమి పరిరక్షణకు మద్దతు తెలుపుతారు. ఈ భూమిని రక్షించడంలో తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. భూమిని కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. మాటలతో, ప్రతిజ్ఞలతోనే కాకుండా కార్యచరణకు మన వంతుగా చేయాల్సిన కొన్ని పనులు మనం చేయాలి.చెట్లు నాటు దాం..భూమిని చల్లగా, సురక్షితంగా ఉంచుదాం !
పారిస్ ఒప్పందం నిర్లక్ష్యం
ఎర్త్ డే మొదలైన కొన్నేళ్ళకే పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. అనేక పర్యావరణ చట్టా లను తీసుకువచ్చారు.క్లీన్ ఎయిర్ యాక్ట్ లాంటి వాటిని ఏర్పాటుచేసి, వాటిని చెప్పుకోదగ్గ స్థాయిలో బలోపేతం చేశారు.లక్షలాది మొక్కలు నాటడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులకు మద్దతుగా నిలవడంతో పాటు,ప్రపంచమంతటా వాతావరణ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. జాతీయ, అంతర్జా తీయ ఎజెండాలో పర్యావరణ సమస్యలు చోటు దక్కించుకోవడానికి ఎర్త్ డే కీలకపాత్ర పోషిస్తోందని అందరూ అనుకున్నారు. కానీ ఆయా దేశాల్లో ప్రభు త్వాలు ప్రయివేటు వ్యక్తుల ప్రభావంతో పనిచేస్తు న్నాయి. ప్రకృతి చట్టాలు కఠినంగా నిర్వహించడం లేదు. విచ్చలవిడిగా భూమి వినాశకర చర్యలు చేపడుతున్నాయి. ఫలితంగా భూమి కాలుష్యకోరల్లో చిక్కుకుపోతోంది. భవిష్యత్తు ప్రమాదాన్ని గ్రహించిన పర్యావరణవేత్తలు2015లో పారిస్ సదస్సు నిర్వహిం చారు.పర్యావరణ పరిక్షణకోసం కొన్ని నియమ నిబంధనలను ప్రపంచదేశాల ముందు పెట్టాయి. వీటికి 196 దేశాలు కట్టుబడి ఉంటామని ఆమోదిం చాయి. ఇది వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అంతర్జాతీయంగా కట్టుబడి ఉన్న ఒక ఒప్పందం. ఇది 2016,నవంబర్ 4న అమల్లోకి వచ్చింది. భూమికి చేసిననష్టాన్ని సరిదిద్దుకునేందుకు ఇది మంచి అవకాశం. గ్లోబల్ వార్మింగ్‌ను పరిమితం చేయడానికి ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా అంగీకరించిన మొదటి సందర్భమది.దీనిలో అన్నిదేశాలూ పాటించాల్సిన ముఖ్యమైన నిబంధనలు,లక్ష్యాలు ఉన్నాయి. కానీ, దీనిని అమెరికాతో పాటు అనేక దేశాలు తుంగలో తొక్కుతున్నాయి.దీన్ని చూస్తూ ఊరుకుంటే మన భూమి మనకు మిగలదు. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉంది. భూమి అంటే మనం ఉంటున్న ఇల్లు, పనిప్రదేశం మాత్రమే అనుకుంటే పొరపాటు మరొకటి ఉండదు. మనచుట్టూ ఉన్న భూమిని, ప్రకృతిని నాశనం చేసే హక్కు ఎవ్వరికీ లేదు. ఎవరైనా సరే భూమికి హాని కలిగించకూడదు అన్న సామాజిక స్పృహ అందరిలోనూ పెరగాలి.
ఎండిపోతున్న నదులు
అడవుల నరికివేత, భూమి కాలుష్యంతో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఎండలు కాకరేపుతు న్నాయి. వేడి ధాటికి ఒకవైపు అడవులు కాలి బూడిద అవుతుంటే, మరోవైపు నదులు ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అమెరికాలోనూ నీటి కొరత ఏర్పడి, కొన్ని రాష్ట్రాలకు నీటి కేటాయింపులు భారీగా తగ్గించారు. విపరీతమైన వేసవి ఉష్ణోగ్రతల నడుమ జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్‌లో పుట్టిన డాన్యూబ్ నది 2022లో అడుగంటింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది వేసవిలో ఈనది ఎండిపోతుంది. ఈ నదిపైనే ఆధా రపడి జీవించే జిమినిసియా నౌకాశ్రయ కార్మికులు, రైతులు,నౌకా నిర్మాణ సిబ్బంది, రెస్టారెంట్ల యజమా నులు తదితర ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారిం ది. చాలా కుటుంబాలు వలస వెళ్లాయని అక్కడ అధికారులు తెలిపారు. వర్షాకాలంలో అప్పుడప్పుడు పడే వర్షం నీటిని ఒడిసిపట్టి ఇంట్లో అవసరాల కోసం ప్రజలు వాడుకుంటున్నారు. డాన్యూబ్ నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. నది ఎండిపోవడంతో కొత్తగా కనిపిస్తున్న మట్టితో నిండిన బీచ్‌లపై పిల్లలు ఆడుకుంటున్నారు. ‘ఇటు వంటి పరిస్థితే చాలా దేశాల్లో ఇప్పుడు కనిపిస్తోందని, ప్రపంచంలో ప్రతి ఏడాది నీటి ఎద్దడి తీవ్రత అసాధా రణంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులకు మనం అలవాటుపడాల్సి ఉంటుందేమో. ప్రస్తుతం జీవనదు ల్లో నీటి మట్టం పెరుగుతున్నట్లు ఎక్కడా కనిపిం# áలేదు.గత నాలుగైదు ఏళ్లుగా వేసవిలో ఇలాంటి నీటి ఎద్దడివల్ల భూగర్భ జల వనరులు పూర్తిగా అడు గంటాయి. మరోవైపు హిమనీనదాలు కూడా వేగంగా కరిగిపోతున్నాయి. ఇది భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడికి ఓ హెచ్చరిక!’ అని జర్మనీకి చెందిన హెల్మోల్ట్జ్ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ (యÖఎఫ్‌జడ్)కు చెంది న కార్స్‌టెన్ రింక్ ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలోనూ ఇటువంటి అనుభవాలు ఎదురవుతు న్నాయి. ఇకనైనా భూమిని కాలుష్య కోరల్లో నుంచి రక్షించుకుని, మంచినీటి వనరులైన నదులను కాపాడుకోవాలి.
ప్రభావాలెన్నో..
ప్రపంచవ్యాప్తంగా 90శాతం అడవుల నష్టానికి వ్యవసాయ విస్తరణే కారణమవుతోంది.అటవీయేతర కార్యకలాపాలు కోసం ఆమెజాన్ అడవులు నిర్మూల నకు గురవుతున్నాయి.పశువుల పెంపకం 70శాతం నష్టానికి కారణమవుతోంది.అటవీ నష్టం వల్ల ఆమో జాన్ అడవుల్లో జీవైవిధ్యం దెబ్బతింటోంది.స్థానిక వాతావరణ మార్పులతోపాటు ప్రపంచ శీతోష్టస్థితిలో మార్పులకూ దారితీస్తోంది.ఒక ప్రాంతంలో అడవు లకు నష్టం వాటిల్లితే స్థానికంగా తీవ్ర దుష్ప్రభావం పడటమే కాకుండా,ఇతర ప్రాంతాల్లో సైతం దుష్ఫ రిణామాలు చోటుచేసుకుంటాయని పరిశోధ కులు చెబుతున్నారు.దక్షిణ అమెరికాలోని వర్షార ణ్యాలు అమెరికా వర్షపాతం ప్రభావం చూపుతాయని ఆగ్నేయాసియా అడవులు ఆగ్నేయ ఐరోపా,చైనాల వర్షపాత సరళిని ప్రభావితం చేస్తాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.అడవులకు నష్టం వాటిల్లడం వల్ల స్థాణికంగా,ప్రాంతీయంగా ఉష్ణోగ్రత,వర్షపాతాల మీద గణనీయమైన ప్రభావం చూపుతుంది.
భూమి పరిరక్షణ
ఇప్పటికే భూమికి చాలా నష్టం జరిగింది. దాని ఫలితం ప్రత్యేక్షంగా చూస్తున్నాం. ఇకనైనా ప్రజలు ఏకతాటిపైకి వచ్చి జీవవైవిధ్యం, భూగ్రహాన్ని రక్షించే చర్యలను ప్రారంభించాల్సిన అవసరాన్ని ఈ సంవ త్సరం థీమ్ నొక్కి చెబుతుంది. శీతోష్ణస్థితి మార్పులు ఇకపై సుదూర విషయం కాదు.. వరదలు, అగ్నిప్ర మాదాలు పెరుగుతున్నందున పరిస్థితిని సమీక్షించడం,తదనుగుణంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. పారిస్ ఒప్పందం ప్రకారం ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పారిశ్రామిక పూర్వస్థాయిల కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గించాలన్న లక్ష్యం పెట్టుకున్నా.. ఇప్పుడు 3డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వేడెక్కు తుంది. ఇది పారిస్ ఒప్పందం లక్ష్యం కంటే రెండు రెట్లు అధికమని ఇటీవల ఐపీసీసీ నివేదిక అప్రమత్తం చేసింది.ఈ మార్పులు భూమిపై ఉన్న మానవుల, జీవరాశుల ఉనికిని దుర్భరంగా మారుస్తాయని ఆందో ళన వ్యక్తం చేసింది. కాబట్టి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూమిని నాశనం చేసే పర్యావరణ పరిరక్షణ వ్యతిరేక విధానాలను పాలకులు విడనాడాలి.భూమి పరిరక్షణ అంటే భూమిని, దాని సహజ వనరులను సంరక్షించడం, దెబ్బతినకుండా కాపాడడం. భూమిని పరిరక్షించడం ద్వారా భూమిని, జీవరాశులను కాపాడగలం. భవిష్యత్ తరాలకు సురక్షితమైన భూమిని అందించగలం. సమస్త జీవకోటి భారాన్ని మోసే భూమి పరిరక్షణ అందరి బాధ్యతగా గుర్తించాలి. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యక రమైన భూమిని అందించాలంటే.. భూమిని కాపాడు కునే బాధ్యత మనందరి చేతుల్లోనే ఉంది.
క్లీన్ కేరళ
పర్యావరణ పరిరక్షణలో భాగంగా భూమిని నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలపై కేరళ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇళ్లు, పరిశ్రమల నుంచి చెత్తచెదా రంతో పాటు ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ చేపట్టారు. ఇందు కోసం స్థానిక అధికారుల చేత ప్రజలకు అవగాహన కల్పించారు. చాలా తక్కువ సమయంలో సమిష్టికృషితో క్లీన్ కేరళ ద్వారా 61,664 టన్నులకు పైగా ప్లాస్టిక్ తోళ్లు, బ్యాగులు, చెప్పులు వ్యర్థాలను సేకరించి,ప్రాసెస్ చేశారు. అంతే కాదు 89లక్షలకు పైగా ఇళ్ల నుంచి పనికిరాని బట్ట లను, చెత్తను సేకరించి, రీసైక్లింగ్ పద్ధతిలో తిరిగి ఉపయోగించేలా మారుస్తున్నారు.. ఇది దేశానికే మార్గదర్శకం.
ప్లాస్టిక్ భూతం
భూమిని కలుషితం చేసే వాటిలో ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరమైనది. ప్లాస్టిక్‌లో బిస్‌ఫినాల్-ఏ, థాలేట్స్, డయాక్సిన్స్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ (పీఏహెచ్), పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్ (పీసీబీస్), స్టైరిన్ మోనోమర్, నానిల్ఫెనాల్ వంటి విష పదార్థాలు ఉంటాయి. ఇవి భూమిని,నీటిని, గాలిని కలుషితం చేస్తూ అత్యంత ప్రమాదకరంగా మారుస్తాయి. భూసారం పెరగకుండా ప్లాస్టిక్ అడ్డుపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్లోరినేటెడ్ ప్లాస్టిక్‌తో మట్టిలో విషరసాయనాలు చేరుతున్నాయి. అవి భూగర్భ జలాల్లో కలిసి మానవాళికి, ప్రాణకోటికి హాని చేస్తున్నాయి. ఏటా పెద్దసంఖ్యలో పక్షులు, చేపలు, జంతువులు ప్లాస్టిక్ వల్ల చనిపోతున్నాయని నిపుణుల నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతరించి పోతున్న ప్రాణుల్లో దాదాపు 700 జాతులు ప్లాస్టిక్ వల్ల ప్రభావితమైనట్లు గుర్తించారు. అంతేకాదు.. మనం తినే జలచరాల్లో మైక్రో ప్లాస్టిక్, నానో ఫైబర్ వ్యర్థాలనూ కనుగొన్నారు. ఇంత ప్రమాదమని తెలిసినా ప్రభుత్వాలు కొన్ని ప్రయివేటు కంపెనీలకు ప్లాస్టిక్ తయారీకి అనుమతులు ఇస్తున్నాయి. బహి రంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను మండించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా రెండువేల లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉత్పత్తవుతోంది. ఇది 60 లక్షల మంది మరణాలకు కారణమవుతున్నట్టు అంచనా. బహిరంగ ప్రదేశాల్లో కాల్చడం వల్ల శ్వాసకోశ రుగ్మతలు వస్తున్నాయి. ప్లాస్టిక్ పాలిమర్ అవశేషాలతో క్యాన్సర్, ఎండోక్రైన్ గ్రంథిó దెబ్బతినడం, చర్మవ్యాధులు సోకుతున్నాయి. ప్లాస్టిక్ వల్ల భూమికి ఎంత నష్టం ఉందో, మానవాళికీ అంతే ప్రమాదం.
దీన్ని ఎర్త్ డే నిర్వాహకులు సీరియస్‌గా తీసుకున్నారు. 2040 నాటికల్లా అన్నిరకాల ప్లాస్టిక్ ఉత్పత్తులను 60 శాతం తగ్గించాలని కోరారు. దీనికి యÖకె సహ 50కు పైగా దేశాలు మద్దతునిచ్చాయి. సాధ్యమైనంత మేరకు అందరూ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా వాడుకునేందుకు ప్రభుత్వాలు కాటన్, నారా సంచులను, వస్తువులను ఉత్పత్తి చేయాలి.. అందుబాటులో ఉంచాలి. అప్పుడే భూమిని ప్లాస్టిక్ భూతం నుంచి కాపాడుకోగలం. ప్రమాదంలో అడవులు భూమిలో అధికవేడి తీవ్రతరం కాకుండా ఉండాలంటే అడవులు, మొక్కల పెంపకం, వాటి సంరక్షణ చేపట్టాలి. కానీ ప్రభుత్వాల అంతులేని నిర్లక్ష్యంతో అటవీ వనరులు, జీవవైవిధ్యం విధ్వం సానికి గురవుతున్నాయి. పరిశ్రమలు, గనుల తవ్వ కాలు, అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో సాగుతున్న అడవు ల కోతను నియంత్రించాలనే లక్ష్యంతో ‘అటవీ సంరక్షణ చట్టం-1980’ ని అమలులోకి తీసుకొచ్చా రు. ఈ చట్టానికి తూట్లు పొడుస్తూ, కొత్తగా అటవీ సంరక్షణ చట్టానికి సవరణ చేపట్టడం ఆందోళన కలిగిస్తోంది. గిరిజనులకు ఉపాధి అయిన అడవులను ఆక్రమించడంతో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టు లకు అటవీ భూములను కేటాయిస్తున్నారు.
‘అటవీ పరిరక్షణ చట్టం సవరణ బిల్లు-2023’ ద్వారా అటవీ భూములను అనేక అటవీయేతర ప్రయోజనాల కోసం స్వేచ్ఛగా బదలాయించేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇది గిరిజనులకే కాదు.. దేశప్రజలకే ప్రమాదకరం. జాతీయ భద్రత, ఇతర వ్యూహాత్మక అవసరాల కోసం దేశ సరిహద్దుల్లో వంద కిలోమీటర్ల లోపు అటవీ భూముల బదలాయింపునకు స్వేచ్ఛ కల్పించారు. దీంతో కార్పొరేట్ వ్యక్తులు పెద్ద పెద్ద వృక్షాలను, అడవులను విచక్షణారహితంగా కూల్చి వేస్తున్నారు. పచ్చని అడవులు అంతరించిపో తున్నాయి. ఫలితంగా వర్షాలు లేక కరువుకాటకాలు సంభవిస్తాయి. సవరణలు చేసిన కొత్త చట్టంలో ఈశాన్యంతో పాటు ఉత్తరాఖండ్, ఇతర రాష్ట్రాల్లో విలువైన జీవవైవిధ్య సంపద ఉన్న అడవులపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో పశ్చిమ, తూర్పుకనుమల్లో అత్యంత దట్టమైన అటవీ ప్రదేశా లకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
అడవులు తరిగిపోతే వర్షాలు ఉండవు. గిరిజనులకు ఉపాధి ఉండదు. జీవకోటికి కావాల్సిన ఆహారం, గాలి, నీరు దొరకవు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కొత్తగా ప్రవేశపెట్టిన సవరణ చట్టాలను రద్దు చేయాలి. మన అడవులను మనమే కాపాడు కోవాలి. అడవులను పరిరక్షించుకుంటే భూమిని కొంతమేరకు కాపాడుకోగలం.భూమి పరిరక్షణ ద్వారా సహజవనరుల లభ్యతా పెరుగుతుంది. అడవుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రపంచ బ్యాంక్ సాయంతో రెండు దశాబ్దాల క్రితం పలు కార్యక్రమాలు చేపట్టారు.వాటిలో ఉమ్మడి అటవీ యాజమాన్యం,సామాజిక అటవీ యాజమాన్యం వంటి పథకాలు మంచి ఫలితాలను ఇచ్చాయి.వాటి కింద పెంచిన అడవుల నుంచి వచ్చే ఉత్పత్తులు,కలప దిగుబడిపై ఆదాయాన్ని స్థానిక ప్రజలకే కేటాయిస్తా మన్న హామీ మాత్రం అనేక రాష్ట్రాల్లో అమలుకు నోచుకోలేదు.

కార్పొరేట్ విధానాలపై పెరుగుతున్న ప్రతిఘటన

ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన కార్మిక పోరాటాలు, ఆందోళనలు, నిరసనలు ఇవన్నీ సామాన్యుల సంక్షేమం కన్నా కార్పొరేట్ ప్రయోజనాలే మిన్నగా భావించే బిజెపి ప్రభుత్వం అనుసరించే విధానాలకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని పంపించాయి. కార్మిక వర్గంలో ముఖ్యంగా జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్.సి.ఆర్) వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో పెరుగుతున్న తీవ్రమైన అసంతృప్తిని ఈ నిరసనలు ప్రముఖంగా చాటి చెప్పాయి.
ఎన్.సి.ఆర్ లోని అనేక ఫ్యాక్టరీల్లో చాలా మంది కార్మికులు ఆర్థికంగా వెనుకబడిన గ్రామాలకు చెందిన వలస కార్మికులే.తమ జీవనోపాధులను వెతుక్కుంటూ వచ్చినవారే. అయితే వారు ఇక్కడకు వచ్చిన తర్వాత బానిస తరహా పని పరిస్థితుల్లో చిక్కుకు పోతున్నారు.బహుళ జాతి కంపెనీలు, ప్రధానమైన భారతీయ సంస్థలకు చెందిన ఫ్యాక్టరీల్లో ఎక్కువమంది కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తుంటారు. వీరికి మౌలికమైన కార్మిక హక్కులేవీ వర్తించవు.
కార్మిక చట్టాలు విస్తారంగా ఉల్లంఘించబడతాయి. నెలవారీ వేతనాలు రూ.10వేలు నుండి రూ.12వేలు మధ్యలో వుంటాయి. తరచుగా నిర్దేశిత కనీస వేతనాల కంటే ఇవి తక్కువగానే వుంటాయి. అనేక ఫ్యాక్టరీల్లో కార్మికులకు కార్మిక సంఘాల్లో చేరే లేదా సంప్రదించే వెసులుబాటు వుండదు, దీంతో వారికి సమిష్టి బేరసారాల శక్తి లేకుండా పోతోంది. చాలా తరచుగా వారు రోజుకు 13గంటలు పనిచేయాల్సిన పరిస్థితులు వుంటాయి. దీనికి తోడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం వారి పరిస్థితిని మరింత అధ్వాన్నం చేస్తుంది. ఇక దాదాపు రెండు దశాబ్దాల క్రితం చివరిసారిగా సవరించిన కనీస వేతనాలు ఇప్పటికీ కాలం చెల్లినవిగానే మిగిలిపోయాయి. ఇఎసఐ, ప్రావిడెంట్ ఫండ్ లేదా గ్రాట్యుటీ వంటి చట్టబద్ధమైన ప్రయోజనాల గురించి చాలామంది కార్మికులు కనీసం వినను కూడా వినలేదు !
ఇలాంటి అమానవీయ పని పరిస్థితులన్నీ కలిసి ఒక్కసారిగా విస్తృతమైన నిరసనలు, ఆందోళనలకు దారి తీశాయి. కార్మికులు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించడానికి బదులుగా ప్రభుత్వ కార్మిక శాఖ నిష్క్రియాపరంగా వుండిపోయింది. కార్మికులు సాగించే పోరాటాలను, నిరసనలను అణచివేయడానికి బిజెపి ప్రభుత్వం పోలీసు బలగాలను ప్రయోగించింది.
కార్పొరేట్ ప్రయోజనాలు, కార్మికుల మధ్య జరుగు తున్న ఈఘర్షణలో సిఐటియు (దిసెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్) కీలకమైన మద్దతును అందించింది. కార్మికుల కాంట్రాక్టీకరణను సిఐటియు ఎల్లప్పుడూ తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వచ్చింది. కానీ, యజమానులకు మాత్రం ఉపాధి భద్రతను, కార్మికుల ప్రయోజనాలను నిరాకరిం చడానికి ఇదొక సాధ నంగా మారింది. కాంట్రాక్ట్ కార్మికులపై ఆధార పడడం ఎక్కువైన కొద్దీ యావత్ కార్మిక లోకం హక్కులకు ఎదురుదెబ్బ తగులుతుందని, కార్మికులు విభజనకు గురవుతారని ఏళ్ళ తరబడి సిఐటియు హెచ్చరిస్తూనే వచ్చింది.కాంట్రాక్ట్ కార్మికు లతో పోలిస్తే పర్మినెంట్ ఉద్యోగులు కొంత మెరుగైన పరిస్థి తులతో లబ్ది పొందుతారు.అదే సమయంలో కాంట్రాక్ట్ కార్మికులు మాత్రం దాడులను ఎదుర్కొం టూనే వుంటారు.
బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్‌లను సిఐటియు తీవ్రంగా వ్యతిరేకి స్తోంది. చాలా చట్టాలు అమల్లో వున్నప్పటికీ పాలక వర్గాల మద్దతు కలిగిన బహుళజాతి కంపెనీలు, భారత కార్పొరేట్ సంస్థలు కార్మికులను దోపిడీ చేస్తూనే వున్నాయి. లేబర్ కోడ్‌లను తీసుకురావడంతో, ఇక కార్పొరేట్ సంస్థలు కార్మికులను ఉక్కిరిబిక్కిరి చేయడం మరింత ఉధృతమైంది. తద్వారా కార్మికులు మరింత దోపిడీకి గురవుతున్నారు.కార్మికుల భద్రతను, బేరాసారాల శక్తిని పణంగా పెట్టి యజమానులకు వెసులుబాటును పెంపొందిం చడం ద్వారా లేబర్ కోడ్‌లు ప్రధానంగా కార్పొ రేట్ ప్రయోజనాలనే నెరవేరుస్తున్నాయని సిఐటియు భావిస్తోంది.ఈ లేబర్ కోడ్‌లను పూర్తిగా రద్దు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తోంది.ఆస్థానంలో పటిష్టమైన రక్షణాత్మక చట్టాన్ని పునరుద్ధరించాలని కోరింది.కాంట్రాక్టు కార్మికులు,స్కీమ్ వర్కర్లతో సహా మొత్తంగా కార్మికులందరికీ కనీస వేతనాలకు హామీ కల్పించా లన్నది ప్రస్తుతం సాగుతున్న కార్మిక పోరాటాల్లో సిఐటియు కీలక డిమాండ్‌గా వుంది. ప్రతి ఒక్క కార్మికుడు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు,ఆహారం,నివాసం,విద్య,ఆరోగ్య సంరక్షణ వంటి మౌలిక అవసరాలు తీరేందుకు సరిపడా వేతనాన్ని అందుకోవాలని సిఐటియు కోరుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం,ఖర్చులకు అనుగుణంగా కనీస వేతనాలను క్రమం తప్ప కుండా సవరించాలని,ఈ రక్షణను అన్ని కేటగిరీల కార్మికులకు ఎలాంటి మినహాయింపు లేకుండా వర్తింపు చేయాలని సిఐటియు పదే పదే పిలుపిస్తోంది.ఎక్కడ నిరసనలు జరిగినా సిఐటి యు అనుబంధ సంఘాలు, కిసాన్ సభ, డివై ఎఫఐ, ఎసఎఫఐ కార్యకర్తలు, సభ్యులందరూ నిరసనలకు దిగిన కార్మికులకు తోడ్పాటునంది స్తుంటారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి, ఇతర నేతల జోక్యం కార్మిక శక్తి మనోధైర్యాన్ని పెంపొందించింది.ఫిబ్రవరి 12న పిలుపు ఇచ్చిన జాతీయ సమ్మె ప్రాంతాల వారీగా కార్మికులందరినీ సమీకరించి, సమాయత్తపరిచింది. సమ్మె సందర్భంగా ఇచ్చిన నినాదాలు అనేకమందికి స్ఫూర్తినిచ్చాయి. మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలను అలాగే మతోన్మాద ధోరణులతో కార్మిక వర్గం ఐక్యతను బలహీనపరిచే ప్రయత్నాలను బట్టబయలు చేయడానికి దోహదపడ్డాయి.సంఘీభావాన్ని ప్రదర్శించాలంటూ సిఐటియు ఇచ్చిన పిలుపునకు అత్యధికంగా స్పందన లభించింది. అనేక రాష్ట్రాల్లో కార్మికులు మద్దతుగా వీధుల్లోకి వచ్చారు. ఈ ఉద్యమం కార్మిక వర్గం ఐక్యతను ప్రదర్శించింది. కొత్త రకమైన దిశా నిర్దేశాన్ని అందించింది. ఉత్తర భారతంలో కార్మికులు సాగిస్తున్న పోరాటాలు ఒక ప్రాథమిక వాస్తవాన్ని నొక్కి చెప్పాయి. సమైక్యతే కార్మిక శక్తి యొక్క అత్యంత గొప్ప బలం. సంఘటితం అయినపుడు,ఏ శక్తి కూడా వారి గళాన్ని నిలువరించలేదు. ఈ నిరసనలు, కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా నిరంతరంగా సాగుతున్న ప్రతిఘటనను చూపించాయి. దీనితో పాటుగా కార్మిక వ్యతిరేక చట్టాల పట్ల గల దృఢమైన వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. ఇది ప్రభుత్వాలపై, యజమానులపై వాస్తవ ఒత్తిడిని తీసుకురాగలుగుతుంది.మరింత మెరుగైన వేతనాలు, మౌలిక హక్కుల సాధన కోసం జరుపుతున్న పోరు క్రమంగా గౌరవం, న్యాయం, మరింత మెరుగైన భవితవ్యం కోసం సాగించే విస్తృత పోరాటంగా రూపుదాల్చింది. ఈ పోరాటంలో సిఐటియు దృఢమైన స్తంభంగా నిలిచింది. కార్మికులందరినీ సమీకరిస్తోంది. కార్మిక విధానాలను అస్థిరపరిచే, కార్మిక సంఘాల కార్యకలాపాలను అణచివేసే లక్ష్యం కలిగిన విధానాలకు వ్యతిరేకంగా స్పష్టమైన దిశా నిర్దేశాన్ని అందిస్తోంది.ముందున్న మార్గం అనేక సవాళ్ళతో కూడుకున్నదే, అయితే, స్థిరమైన, సమైక్య కార్యాచరణతో పాతుకుపోయిన అన్యాయాన్ని సవాలు చేయవచ్చని ఉత్తర భారతంలో కార్మికులు ప్రదర్శించిన కృత నిశ్చయం రుజువు చేసింది. దోపిడీతో కూడిన కాంట్రాక్టీకరణకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేయడం, కొత్త లేబర్ కోడ్‌లను తిరస్కరించడం, సార్వత్రిక కనీస వేతనాల కోసం పట్టుబట్టడం ద్వారా కార్మిక వర్గం తక్షణ ఉపశమనం కావాలని కోరడమే కాదు, మొత్తంగా దేశంలోని కార్మిక సంబంధాల భవిష్యత్‌ను కూడా పునర్నిర్మిస్తోంది. ఈ పరిణామాలన్నీ కార్మిక హక్కుల పునరుద్ఘాట నకు సంకేతం. ఇటువంటి ఉద్యమాలు విజయ వంతం కావడమనేది ప్రాంతాలవారీగా,రంగాల వారీగా కార్మికులు కొనసాగించే ఐక్యత, సంఘటితమవడంపై ఆధారపడి వుంటుంది.ఈ పోరాటం ఉధృత రూపాన్ని సంతరించుకుం టున్నందున సమిష్టి కార్యాచరణతో అర్ధవంతమైన మార్పును తీసుకురావచ్చన్న ఆశను కలిగిస్తోంది. అలాగే కొద్దిమంది కార్పొరేట్ల కన్నా పెద్ద సంఖ్యలోని కార్మిక లోకానికి ఆర్థిక పురోభివృద్ధి ప్రయోజనాలు అందేలా చూడాలని హామీ కల్పిస్తోంది.సంక్షోభ కాలంలో ప్రజల మీద ఫాసిస్టు పాలకుల నిర్బంధం పెరగడమే కాదు, ప్రజలు ఉవ్వెత్తున తిరగబడి చరిత్ర తిరగరాసే అవకాశం కూడ పెరుగుతుంది. ఆకలి నుంచి ఉక్రోశం, అణచివేత నుంచి ప్రతిఘటన పెరుగుతుంది. మార్పులు తీవ్రమైన వేగంతో సంభవిస్తాయి. అభ్యుదయ శక్తులు సంక్షోభ కారణాలను, స్వరూపాన్ని సక్రమంగా అవగతం చేసుకుని స్ఫూర్తితో జోక్యం చేసుకోవల్సిన సమయం ఇది. అన్ని విధాలుగా విఫలమైన పెట్టుబడిదారీ వ్యవస్థ స్థానంలో మెరుగైన ప్రత్యామ్నాయ వ్యవస్థను, దోపిడీ లేని సమసమాజాన్ని నిర్మించుకునే దిశగా ప్రజాతంత్ర ఉద్యమం ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. దుష్ట మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్లు ఈ ‘హిందూత్వ’ అంతం ప్రజా ప్రతిఘటనలో ఉంది. అంతిమంగా పై చేయి సాధించేది అదే. 2022 నాటికి దేశ జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి రంగం వాటాను 25 శాతానికి పెంచే విధంగా మేక్ ఇన్ ఇండియా పథకాన్ని 2014లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి వాటా 25 శాతానికి చేరే సంగతి అటుంచి మోడీ ఏలుబడిలోకి వచ్చేనాటికి ఉన్న 16.3 శాతం కాస్తా 2020-21 నాటికి 14.3 శాతానికి దిగజారింది. మేకిన్ ఇండియా పథకాన్ని ఉపాధి పెంపుదల, విదేశాలకు వస్తు ఎగుమతులు, మన దిగుమతులు తగ్గించే లక్ష్యంతో ప్రకటించారు. మన దిగుమతుల బిల్లు తగ్గిన దాఖలాలుగానీ, ఎగుమతులు పెరిగిన అనవాలు గానీ కనిపించటం లేదు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న వాగ్దానం నెరవేర్చకపోగా రైతాంగానికి ఎసరు పెట్టి వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు దుర్మార్గమైన మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి అబాసుపాలైన విషయం తెలిసిందే. మద్దతు ధరకు చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చిన మోడీ కాలయాపన చేస్తూ మీన మేషాలు లెక్కిస్తున్నాడు.- జి ఎన్ వి సతీష్ 

పది తర్వాత ఏమి చేయాలని ఆలోచిస్తున్నారా..?

విద్యార్థి దశలో పదోతరగతి అత్యంత కీలక మైంది.ఇటీవలే పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి.తదనంతరం ఏకోర్సు చదవాలనే ఆలోచ నలు అనేక మందిలో మొదలయ్యాయి.చక్కగా ఆలోచించి సరైననిర్ణయం తీసుకుంటే భవిష్యత్తు బంగారుమయం అవుతుంది.విద్యార్థులు తమశక్తి సామర్థ్యాలు,అభిరుచులకు అనుగుణంగా కోర్సులను ఎంచుకోవాలని విద్యానిపుణులు సూచిస్తున్నారు.ఇంటర్మీడియట్ విద్యలో చేరేందుకు ప్రభుత్వ పరంగా ఏఏ కళాశాలలు,కోర్సులు అందుబాటులో ఉన్నాయనే వివరాలు మీకోసం.- జి.ఆనంద్ సునీల్ కుమార్ 

గురుకులాలు ఆహ్వానిస్తున్నాయ్ గురుకుల(రెసిడెన్షియల్) విద్యను ప్రభుత్వం ప్రతి ష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ప్రవేశ పరీక్షల్లో (ఎంట్రన్స్ టెస్ట్) ఉత్తమ ఫలితాలను సాధించిన వారు వీటిలో చేరవచ్చు.ఆంగ్ల విద్యతో పాటు వసతి సౌకర్యం కూడా ఉంటుంది. ఈ గురు కులాల్లో రుచికరమైన భోజనాన్ని అందిస్తారు. కార్పొరేట్ కళాశాల తరహాలో ఎప్‌సెట్,నీట్ తదితర వాటి కోసం విద్యార్థులను సన్నద్ధం చేస్తారు.
వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి
తక్కువ సమయంలో ఉపాధి అవకాశాల కోసం వృత్తివిద్యా(వొకేషనల్) కోర్సులను ఎంచుకోవటం ఉత్తమం. పదోతరగతి పాసైనవారు ఐటీఐ కాలేజీల్లో చేరవచ్చు. తమ ఆసక్తికి అనుగుణంగా కోర్సులను ఎంచుకోవచ్చు. ఐటీఐ చేసిన వారికి పరిశ్రమల్లో మంచి డిమాండ్ ఉంది. నైపుణ్యాలు ఉంటే కొలువు సంపాదించడం సులువే.
పాలిటెక్నిక్‌తో బీటెక్‌కు దగ్గరి దారి!
పాలిసెట్ ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకులు సాధించినవారు పాలిటెక్నిక్ కోర్సులో చేరాలి.3 ఏళ్ల పాటు శిక్షణ తీసుకోవాలి. పూర్తిచేసిన వారు నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్‌లో చేరవచ్చు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగావకాశాలు పుష్కలంగా లభించే అవకాశం ఉంది. మరోవైపు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు కూడా ఉన్నాయి. వ్యవసాయ రంగంపై ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరవచ్చు. ఇది ఇంటర్మీడియట్ విద్యతో సమానం. వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సు వ్యవధి రెండేళ్లు ఉంటుంది. కోర్సు పూర్తయి నట్లయితే వ్యవసాయ విస్తరణ అధికారుల కొలువులు సాధించవచ్చు.
ఆర్జీయూకేటీ పిలుస్తోంది
పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించే గ్రామీణ విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ విద్య ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో 6ఏళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సు ఉంటుంది.పదోతరగతి మార్కుల ఆధారంగా ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశం పొందవచ్చు. విద్యార్థులు తమ అభిరుచులకు అనుగుణమైన కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. అన్ని సామాజికవర్గాల వారికీ వీటిలో అవకాశం ఉంటుంది.
ఏకలవ్య, ఆదర్శ స్కూల్స్
ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ విద్యనభ్యసించా లనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఏకలవ్య, ఆదర్శ విద్యాలయాలు(మోడల్ స్కూల్‌లు) అందుబాటులో ఉన్నాయి. ఎంట్రన్స్ టెస్ట్‌లో మంచి ర్యాంకులు వస్తే వీటిలో చేరవచ్చు. సాధారణ ఇంటర్ చదువులతో పాటు వృత్తివిద్యా కోర్సులను కూడా ఇక్కడ బోధిస్తారు.
కేజీబీవీలు బాలికలకు వరం
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు విద్యార్థినులకు వరం లాంటివి అని చెప్పవచ్చు. ఈ కేజీబీవీల్లో ఇంటర్ విద్య కొనసాగుతోంది. ప్రవేశ పరీక్షలు లేకుండా పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులు వీటిలో చేరవచ్చు. ఎంపీసీ, బైపీసీ,సీఈసీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ) వంటి కోర్సులు ఈ కేజీబీవీల్లో అందుబాటులో ఉంటాయి.
పదో తరగతి తర్వాత ఎన్నో కోర్సులు!
వీటితో వేల సంఖ్యలో కెరియర్లకు మార్గం సుగమం చేసుకోవచ్చు. ఎంపికలో మాత్రం గుంపులో గోవింద అని, అందరు అందులో చేరుతున్నారని, స్నేహితులు చెప్పారని, అమ్మానాన్నల ఆశయమని, అవకాశాలు మెండుగా ఉన్నాయని నిర్ణయానికి రాకూడదు. ఇవేవి మీకు సరైనవి కాకపోవచ్చు. వీటి ఎంపికలో మీ ముద్ర లేకోపోవడమే ఇందుకు కారణం. మీ దారి మహోన్నతం కావాలంటే నిర్ణయం తీసుకోవాల్సింది మీరే!.ఎవరి మార్గాన్ని వారు నిర్ణయించుకునే అవకాశం పదో తరగతి తర్వాత వస్తుంది. ఉన్న వాటిలో గమ్యాన్ని చేర్చేదాన్ని ఎంచుకోవడమే ప్రధానం. ఇందుకు స్వీయ సామర్థ్యాలే కొలమానం. ప్రతి విద్యార్థీ ఎవరికి వారే ప్రత్యేకం. అందువల్ల నైపుణ్యాలు, ఆసక్తులు గుర్తించి, సరైన కోర్సు ఎంచుకుంటే మేటి భవిష్యత్తు దిశగా మొదటి అడుగు పడినట్లే!
నిర్ణయం మీదే
మీ గురించి మీకంటే ఎక్కువగా మరెవరికీ తెలీదు. స్వీయ సమీక్షే కీలకం. ఇందుకోసం మీ సామర్థ్యం, ఆసక్తులను పరిగణనలోకి తీసుకోండి. మీ బలహీనతలేమిటో గుర్తించి, వాటి ప్రకారం పది తర్వాత ఉన్న కోర్సుల జాబితాలో కొన్నింటిని వదిలేయండి. మిగిలినవాటిలో మీకు సరిపోయేది ఏదో ఎంచుకోవాలి. ఈ క్రమంలో సమగ్రత కొరవడకుండా చూసుకోండి. పది తర్వాత ఉన్న అన్ని కోర్సులు, మార్గాలపైనా అవగాహన పెంచుకోవాలి.
సరిపోయేవి ఎంచుకోవాలి
పది తరగతి పూర్తిచేసుకున్న వారికోసం ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిప్లొమాలు,ఐటీఐ, వొకేషనల్ కోర్సులు,ఉద్యోగాలు, ప్రత్యేక డిప్లొమాలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ప్రాధాన్యం ఉన్నవే. అయితే మీకు సరిపోయేవి ఏవో మీరే గుర్తించాలి. ఉన్న వాటిలో ఏదో ఒక్కటి మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల బాగా ఆలోచించి,విశ్లేషించుకుని నిర్ణయం తీసుకోవాలి.
సబ్జెక్టు రాదని మరో కోర్సు వద్దు
మ్యాథ్స్ అంటే భయం కాబట్టి బైపీసీ,సైన్స్‌పై ఆసక్తి లేక సీఈసీ ఇలా వేరే కోర్సులు తీసుకుంటే రాణించలేరు.ఎందుకంటే బైపీసీ తీసుకోవడానికి మ్యాథ్స్ రాకపోవడం కారణం కాకూడదు. సైన్స్ అంశాల్లో పట్టు లేదు, అందుకే ఆర్ట్స్ కోర్సుల్లో చేరాలని నిర్ణయించుకోవద్దు. ఏఅంశాల్లో ప్రావీణ్యం ఉందో గుర్తించి,సంబంధిత కోర్సులు ఎంచుకోవాలి. ఒక సబ్జెక్టులో ఆసక్తి, ప్రావీణ్యం లేదనే కారణంతో ఇంకో కోర్సు ఎంచుకోవద్దు. అన్ని కోణాల్లోనూ ఆలోచించి నిర్ణయానికి రావాలి.
ఎవరికోసం కోర్సులు వద్దు
చదువులో రాణించలేని ఎక్కువమంది విద్యార్థులు చెప్పే ప్రధాన కారణం ఫలానా వాళ్ల ఒత్తిడితో ఇష్టం లేకుండా ఈకోర్సులో చేరి నష్టపోయానని అంటారు. అందువల్ల తెలిసినవాళ్లు, బంధువులు సూచించారనో,స్నేహితులతో కలిసి ఉండొచ్చనో, ఎక్కవ డబ్బులు సంపాదించవచ్చనో, సులువుగా ఉత్తీర్ణత సాధించవచ్చనో, ఎక్కువ మంది చేరుతు న్నారనో ఇలాంటి కారణాలతో కోర్సు, గ్రూపులను ఎంచుకోవద్దు. చేరిన కోర్సులో రాణించాల్సిన బాధ్యత మీదేనని మర్చిపోవద్దు. అందుకే ఎవరి భవిష్యత్తుని వాళ్లే నిర్ణయించుకుని కెరియర్ సౌధాన్ని నిర్మించుకోవాలి. పిల్లల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని తల్లిదండ్రులు వారికి సరిపోయే కోర్సులను ఎంపిక చేయాలి. వ్యక్తిగత ఆశయాలను రుద్దితే భవిష్యత్తులో ఇద్దరికీ సమస్యే. కొన్నిసార్లు తీవ్ర ఒత్తిడితో అనుకోని పరిణామాలూ ఎదుర్కోవాల్సి రావచ్చు. పిల్లలపై వ్యక్తిగత ఆశయా లను రుద్దకూడదు. ఆసక్తి లేకుండా, తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే చదవాల్సి వస్తే వాళ్లు ఒత్తడికి గురవుతారు.
ఈ షార్ట్ టర్మ్‌కోర్సులు నేర్చుకుంటే సూపర్ బెనిఫిట్స్! :
సాంకేతిక నైపుణ్యాలు, ఆరోగ్య సంరక్షణ సేవలు కలయికగా రూపొం దించిన కోర్సు ఇది. హైదరా బాద్, విజయవాడ ల్లోని గవర్నమెంట్ డెంటల్ మెడికల్ ఎడ్యు¹ ¿షన్‌తో పాటు పలు ప్రైవేటు దంత వైద్య కాలేజీలు రెండేళ్ల కోర్సును అంది స్తున్నాయి. డెంటల్ ప్రోథెస్టిక్స్,అసిస్ట్ డెంటిస్ట్, ల్యాబ్ పరికరాల నిర్వహణ లాంటి నైపుణ్యాలను శిక్షణలో భాగంగా నేర్పుతారు. కోర్సు పూర్తి చేసిన వారికి డెంటల్ ల్యాబ్‌లు, క్లినిక్‌ల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇందులో అనుభవం గడించి, విద్యార్హత పెంచుకుంటే సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించవచ్చనని విద్యవేత్తలు సూచిస్తున్నారు.
ఆకర్షించే స్టాక్ ట్రేడింగ్
ప్రస్తుతం అనూహ్యంగా పెరుగుతూ, అందరినీ ఆకర్షిస్తున్న రంగం స్టాక్ మార్కెట్ అప్‌స్టాక్, జెరోదా,ఫైనాన్షియల్ ట్రేడింగ్ లాంటి కొత్తతరం ట్రేడింగ్ కంపెనీల రాకతో ఆన్‌లైన్‌లో స్టాక్స్ కొనడం,అమ్మడం, పెట్టుబడి పెట్టడం ఈజీ అయిపోయింది. నేటి ట్రెండ్‌కు తగినట్లుగా యువతరానికి ట్రేడింగ్ ప్రాథమిక అంశాలు, ఫైనాన్షియల్ ప్లానింగ్, పెట్టుబడుల విశ్లేషణ నేర్పే కోర్సులు అందుబాటులో వచ్చాయి. (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్సియల్ మార్కెట్ (ఎనఐఎఫఎం) సంస్థతో పాటు యుడెమీ, జెరోదా వర్సిటీ లాంటి ఆన్‌లైన్ వేదికల్లోనూ స్వల్పకాల సర్టిఫికేట్ కోర్సులున్నాయి.స్టాక్ ట్రేడింగ్‌లో ప్రాథమిక అంశాల నుంచి నష్టభయం నియం త్రణ, పోర్ట్‌ఫోలియో నిర్మాణం వరకు అన్ని అంశాలు నేర్పుతారు. ఈ నైపుణ్యాలతో ఫైనాన్స్ సంస్థల్లో ఎంట్రీలెవల్ ఉద్యోగాలను అందుకోవచ్చు లేదా సొంత అవకాశాలను సృష్టించుకోవచ్చనని కెరియర్ కౌన్సెలర్లు చెబుతున్నారు.
దూసుకొస్తున్న గిగ్ ఉద్యోగాలు
నేటి యువతరాన్ని గిగ్ రంగం అమితంగా ఆకట్టుకుంటూ మంచి అవకాశాలు చూపుతోందని విద్యా నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి టాస్క్ బేస్డ్? ఉద్యోగాలు (నిర్ణీత పని ఆధారితం). అమెజాన్ ప్లెక్స్, స్విగ్గీ, అర్బన్ కంపెనీ లాంటివన్నీ గృహోపకరణాలు, అలంకరణ సేవలు, డ్రైవింగ్, సరకు డెలివరీ, ఎలక్ట్రానిక్ పరికరాల మరమ్మత్తులో నైపుణ్యం ఉన్నవారిపైనే ఆధారపడతాయి. ఈ రంగాన్ని ప్రభుత్వాలు కూడా గుర్తించి ప్రోత్సహిస్తున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASఖ) ఉచితంగా స్వల్పకాల శిక్షణ ఇస్తున్నాయి. ప్రాథమిక ఐటీ సేవలు, మొబైల్ ఫోన్ రీపేర్, డిజిటల్ మార్కెటింగ్ లాంటి కోర్సులు నేర్పిస్తూ గిగ్ రంగానికి పనికొచ్చేలా మారుస్తున్నాయి.

1 2