మేడారం కీర్తిక పతాక సమ్మక్క

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పిలిచే మేడారం జాతర గురించిన విశేషాలు పూర్వాపరాలు వివరిస్తూ జాతర నేపథ్యం జరిగే తీరు గురించి రెండు దశాబ్దాల అనుభవాల సమ్మేళనంతో రూపొందించిన పుస్తకం “సమ్మక్క” ది గ్లోరీ ఆఫ్ మేడారం…
20 సంవత్సరాలపాటు పూర్వ వరంగల్ జిల్లా సహాయ పౌరసంబంధాల అధికారిగా పనిచేసిన సందర్భంలో ఉద్యోగ విధుల్లో భాగంగా మేడారం జాతర నిర్వహణ బాధ్యతలు చూసే వేళ మేడారంలో ఈ జన జాతర జరిగే విధానం ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో ఈ పుస్తక రచయిత కన్నెకంటి వెంకటరమణ గారు అందించిన వివరాలు ద్వారా పాఠకులకు జాతర దగ్గరగా చూసిన అనుభూతి కలుగుతుంది.అందుకు ప్రధాన కారణం పుస్తకంలో గల నిండుగా సజీవత్వాన్ని తలపించే రంగురంగుల ఛాయా చిత్రాలే…!!
ప్రకృతిఒడిలో జరిగే పచ్చటి ఆదివాసి జన జాతరకు సంబంధించి రచయిత వెంకటరమణ అనేక అనుభ వాలతో పాటు బోలెడు ఆశయాలు వ్యక్తం చేశారు. మొత్తం 40అంశాలుగా విభజించబడ్డాయి వ్యాస సంపుటిలో ప్రతి అంశంలో మేడారం జాతర పూర్వపరాలు లోతుగా వివరించే ప్రయత్నం జరిగింది.
మేడారం జాతర నాడు నేడు,జాతరలో అమ్మవార్లకు సమర్పించే బంగారం రహస్యం.సమ్మక్క గద్దెల చెంత గల రావిచెట్టు,సమ్మక్క ప్రతిరూపం అయిన వెదురు కంక విషయం గుడి మిలిగే రోజు నుంచి సమ్మక్క గద్దె పైకి ఆగమనుచిందే అద్వితీయ క్షణాలు వంటి విలువైన ఆకర్షణ ఏమైనా సమాచారాలు మనం ఇందులో విపులంగా చదవవచ్చు.
వీటితోపాటు సమ్మక్క సారలమ్మలను ప్రతాపరుద్రుడు చంపించాడా? వంటి ప్రశ్నలకు వివరణ ఇచ్చే ప్రయ త్నం కూడా రచయిత చేశారు.మేడారం జాతరలో గుడికాని,విగ్రహాలు కానీ,పూజలు మంత్రాలు అభి షేకాలు నైవేద్యాలు వంటి హిందూ దేవాలయపు ఆచార సంప్రదాయాలు మచ్చుకు కూడా కనిపించవు. మÖల వాసుల జీవితం సంస్కృతి ఆచారాలు లాగే వైవిధ్య మైన సంపూర్ణ గిరిజన ఆచారాలే అడగడుగునా ఆగు పిస్తాయి.వీటిల్లోని అంతరార్థాలను ఆవిష్కరించే ప్రయ త్నం జరిగింది‘మేడారంగద్దెల పరి ణామ క్రమం ఎట్టిదనిన..?’ వ్యాసంలో..
గిరిజన జాతికి చెందిన సమ్మక్క సారక్క అనే తల్లి కూతురు తమ వారి రక్షణ తమ ఆత్మాభిమాన పరి రక్షణలో భాగంగా కాకతీయ సైనికుల చేతిలో వీర మరణం చెందారు.ఆయుద్ధ భూమి ఎక్కడ? యుద్ధం జరిగింది ఎప్పుడు?అన్న తేదీలు ఆలభ్యం. ఇది కేవ లం కోయ గిరిజనుల ఆశ్రిత కులం వారు అయిన ‘డోలి’వారు చెప్పే మౌఖిక గేయ కథల ఆధారపు జాన పద వీర గాధ మాత్రమే..!
కాకతీయ చరిత్రలోగాని వారి శిలా శాసనా ల్లో గాని ఒక్క వాక్యం కూడా లేని అంశం మేడారం సమ్మక్క సారక్కల వీరమరణం సంఘటన కారణాలు కుట్రలు, కుతంత్రాలు.ఏమైనా ఉండవచ్చు. ఆనాడు భూస్థా పితమైన ఈ వీరుల త్యాగాలకు గుర్తింపు లేకుండా పోయి ఉండవచ్చు కానీ సత్యం ఎప్పటికైనా బయట పడుతుంది అన్న చందంగా సంఘటన జరిగిన వందల సంవత్సరాల పాటు ఈ అమరత్వం బాహ్య ప్రపంచానికి తెలియకపోయినా కోయ గిరిజనులలో నిండుగా ఉండే కృతజ్ఞతా గుణం సాయంగా…
ఆవంశీయుల కుటుంబ వీరులుగా ముందు తలుచు కుని పూజింపబడి కొన్నాళ్లకు ఆ గ్రామస్తుల పూజలు అందుకుని అనంతర కాలంలో చుట్టుపక్క గ్రామాలకు వ్యాపించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తమై మహా జాతరగా రూపాంతరం చెంది సత్యాన్ని ఎవరు అడ్డుకోలేరు అణచలేరు అని సమాజానికి పాలకులకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది ఈ మేడారం జాతర.
మరణించిన వారికి గుర్తుగా కరస్తంభం నేలలో పాతి దాని చుట్టూ మట్టిని గద్దెగా వృత్తాకారంలో నిర్మించి ఆకర్రస్తంభాన్ని పూజించుకుంటూ ముక్కులు సమర్పి స్తూ తమదైన భక్తి పారవశంతో వారివైన సాంప్రదాయ వాయిద్యాల మోతలతో నృత్యాలు చేయడం ఇందులో భాగంగానే చనిపోయిన వారి ఆత్మలు వారికి అత్యంత ఇష్టమైన మనుషుల మీద ఆవహించి తమ భావాలు పలుకుతారని ఈసందర్భంగానే పూనకాలతో ఊగి పోతుంటారు అనేది అడవి బిడ్డల అనంత విశ్వాసం.
మేడారం జాతర యావత్తు ఇదే తీరుగా జరుగుతుంది. ప్రధాన వీరులైన సమ్మక్క సారక్కలతో పాటు వారి ఇతర కుటుంబ సభ్యులను కూడా ఈ సందర్భంగా పూజించి గౌరవించుకోవడం ఈ జాతరలో మరో కృతజ్ఞతాఘట్టం.
1990 ముందు నుంచి నేటి వరకు మేడారం దగ్గరలో జరిగిన పరిణామక్రమం తెలుసుకోవాలి అంటే ఈ11వవ్యాసం విధిగా చదవాలి.ఏడు దశా బ్దాల క్రితమే గ్రామాలకు వ్యాపించిన ఈ మేడారం జాతర నిర్వహణకు ఆర్థిక వవెసులుబాటు లేక నిరు పేద గిరిజనులు అందుబాటులో గల వడ్డీ వ్యాపారుల నుంచి డబ్బులు అప్పులు తెచ్చి జాతర నిర్వహించు కునేవారు.
జాతరకు జనం వచ్చిన అప్పటి పేద పరిస్థి తిల దృష్ట్యా భక్తులు నగదు రూప కానుకలు చెల్లించక పోవడంతో ఆశించిన నగదు రాక, వడ్డీ వ్యాపారులకు బాకీలు చెల్లించలేని ఆర్థిక భారంతో జాతర నిర్వహణ ఖర్చులు లేక నాటి గిరిజనులు రెండు ఏడాదులకు ఒకసారి జాతర నిర్వహించే పరిస్థితికి చేరుకున్నారు. ఇప్పటికీ అదే ఆచారం గా రావడం విశేషం..!
ప్రస్తుత పాలక ప్రభుత్వాలు కారణాలు ఏమైనా పోటీలు ఏవైనా కావచ్చుగాని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎక్కడ ఆదివాసీ సంప్రదాయాలకు భంగం కలగ కుండా శాశ్వత నిర్మాణాలు చేపట్టి,తెలంగాణ రాష్ట్రా నికే తలమానికమైన గిరిజన జాతర ప్రాంతంగా మేడారం కుగ్రామాన్ని తీర్చిదిద్దటం అభినందనీయం అన్న సచిత్ర వ్యాసాలు ఇందులో మనం చదవవచ్చు.
పూర్వం మేడారం జాతరకు పోవాలంటే కాలినడక గుంపు ప్రయాణాలు, కలిగిన వారి గూడు ఎడ్లబండ్ల వరుసలు ప్రధాన ఆకర్షణలు ఈ నేపథ్యాన్ని వివరిస్తూ… “ఎడ్ల బండి నుంచి హెలికాప్టర్ వరకు” విస్తరించిన మేడారం జాతర ప్రయాణపు పరిణామ క్రమాన్ని గణాంకాలతో వివరించిన వ్యాసకర్త కృషి అభినందనీయం.
2012 నుంచి మేడారం జాతర ప్రయా ణంకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయంతో పాటు, జంపన్న వాగు పై బ్రిడ్జి నిర్మాణ విశేషాలు కూడా ఇందులో ఆసక్తిదాయకంగా చదువు కోవచ్చు.
మేడారం జాతరకు మరో ప్రత్యేక ఆకర్షణ అయిన “గుర్రం తలతో ఉండే లక్ష్మీదేవర” విశేషాలు ఆమె ఆవిర్భావ నేపథ్యంతో పాటు లక్ష్మీ దేవరకు సమ్మ క్కకు గల సంబంధం బంధుత్వం గురించి సచిత్ర వివరణ తెలుసుకోవాలి అంటే సంబంధిత వ్యాసం చదవడం అత్యవసరం.
ఇలా ఈ జాతరకు సంబంధించిన సమా చారం అంతా ఒకసమాచార పౌర సంబంధాల అధికారిగా సేకరించి ఒకచోట పేర్చి పుస్తక రూపంలో అందించిన వెంకటరమణ గారి ఈ అక్షర కృషి భావి తరం రచయితలకు, పరిశోధక విద్యార్థులకు, ఊత కర్రగా సహాయపడుతుంది అనడంలో నిండు నిజం ఉంది.
చరిత్రలో చోటు దక్కని ఈనిరుపేద గిరిజన వీరు ల త్యాగానికి ఆలస్యంగా నైనా ప్రజాధరణ అసం ఖ్యాకంగా లభించటం ఆనందదాయకమే ఇప్పటికైనా మన విశ్వవిద్యాలయాలు గిరిజన అధ్య యన సంస్థలు ముందుకు వచ్చి మరింత ప్రామా ణికమైన పరిశోధ నలు చేసి వాస్తవాలను వాస్తవంగా భావితరాలకు భద్రపరచాల్సిన తక్షణ కర్తవ్యం నేటి తరం పరిశో ధకుల అత్యవసర విధి. పరిశోధనలన్నీ ఒక క్రమంలో సాగాలి తప్ప ఎవరి మేధస్సులు వారు ప్రదర్శిస్తూ మాకు తెలిసింది చరిత్ర మేము పక్కవారి అభిప్రా యాలు స్వీకరించం అనే మొండి వాదనలు పక్కన పెట్టి, సమిష్టి పరిశోధనా కృషితో ‘వాస్తవ మేడారం చరిత్ర’ వెలుగు చూడాలి.‘వాదాల మకిలి’తో వాస్తవా లను అంతం చేసే తీరు మారి మన మేడారం జన జాతర వెలుగు చూడాలన్న రచయిత ఆశయం అతి త్వరలో కార్యరూపం కావాలని ఆశిద్దాం.
పరిశోధకులతో పాటు మేడారం పర్యాటక ప్రేమికులకు ఎంతో అవసరమైన అమÖల్య విషయాల సచిత్ర వ్యాసాల సమ్మేళమైన ఈ సమ్మక్క వ్యాసా వళి ప్రతి ఒక్కరు దాచు”కొని” చదవాల్సిన పుస్తకం ఇది.

పుస్తకం పేరు : సమ్మక్క
పేజీలు : 80
వెల : రూ.250/-
ప్రతుల కోసం : కన్నె కంటి పబ్లికేషన్స్ హైదరాబాద్ – 74
సెల్ : 98499 05900.
సమీక్షకుడు : డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు,
సెల్ : 77298 83223.

మారనున్న విశాఖ రూపురేఖలు

సాగరతీరం విశాఖపట్నం అభివృద్ధి మీద ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా ముంబై తరహాలో విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయా లని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ నుంచి అధికారుల బృందం ముంబైలో పర్యటిం చింది. సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ విధానాలను అధ్యయ నం చేసింది.ఆవిధానాలను ఇక్కడ అమలు చేసేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం రూపురేఖలు త్వరలోనే మారిపోనున్నాయి. ముంబై తరహాలో విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన నేషనల్ గ్రోత్ హబ్‌లో భాగంగా, విశాఖపట్నాన్ని గ్లోబల్ ఎకనామిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికోసం ముంబైలో విజవంతమైన సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర లిమిటెడ్,ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీఎంఆర్‌డీఏ)తరహా విధానాలను ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది.మరోవైపు విశాఖ గ్రోత్ హబ్ కార్యక్రమం కింద..కైలాసగిరి, భీమిలి మధ్య బే సిటీని అభివృద్ధి చేయాలని నీతిఆయోగ్ సూచించింది.విశాఖపట్నం 2.0ను భోగాపురం విమానాశ్రయం వరకు విస్తరించాలని,గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం చుట్టూ ఏరోసిటీ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది.ఈ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడానికి.. ఆంధ్రప్రదేశ్ అధికారుల బృందం జనవరి 12,13 తేదీలలో పట్టణ అభివృద్ధి నమÖ నాలను అధ్యయనం చేయడానికి ముంబైని సందర్శించింది. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా ల్యాండ్ మానిటైజేషన్, ప్రీమియంల ద్వారా నిధులు ఎలా సమకూర్చు కోవాలో వీరు అధ్యయనం చేశారు.ఈ సందర్శ నలో భాగంగా సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర లిమిటెడ్ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆర్థికంగా స్వయం సమృద్ధిని ఎలా సాధించాయనే దానిపై అధ్యయనం జరిపారు. అలాగే ప్రతిపాదిత భోగాపురం ఏరోసిటీ, వైజాగ్ 2.0 ప్రాజెక్టు లకు బెంచ్‌మార్క్‌లుగా ్పుIణ్పుO నవీ ముంబై,(నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ నోటిఫైడ్ ఏరియా) నమÖనాలను అధ్యయనం చేశారు. మరోవైపు ప్రస్తుతం దాదాపు రూ.14,000 కోట్ల వార్షిక బడ్జెట్‌తో పని చేస్తుంది,ఎక్కువగా భూమి, రియల్ ఎస్టేట్ ఆధారిత ఆదాయాల ద్వారా నిధులు సమకూరుస్తుంది.
మరోవైపు నీతి ఆయోగ్ ఇటీవల డెవలపింగ్ విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ యాజ్ గ్లోబల్ ఎకనమిక్ హబ్ అనే పేరుతో నివేది కను విడుదల చేసింది.ఈఎకనమిక్ రీజియన్.. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు తొమ్మిది జిల్లాలను కవర్ చేస్తుంది. నీతి ఆయోగ్ నేషనల్ గ్రోత్ హబ్ కార్యక్రమం కింద విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ ఎంపిక చేశారు. మరోవైపు ముంబై నుంచి నేర్చుకున్న వాటి ఆధారంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ వాల్యూ క్యాప్చర్, ల్యాండ్ మానిటైజేషన్ పాలసీలను అనుసరించనుంది. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ కోస్టల్ హబ్ వైజాగ్ 2.0ఆలోచన చేస్తున్నారు. దక్షిణాన విశాఖపట్నం ఓడరేవు నుంచి ఉత్తరాన భోగాపురం విమానాశ్రయం వరకు 200-250 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఇంటి గ్రేటెడ్ కోస్టల్ హబ్‌గా తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తున్నారు. అలాగే వైజాగ్ బే సిటీని 40 చదరపు కిలోమీటర్ల ఇంటిగ్రేటెడ్ కోస్టల్ హబ్‌గా ప్రతిపాదించారు.కైలాసగిరి, భీమిలి మధ్య 25 కి.మీ తీరప్రాంతాన్ని వాటర్‌ఫ్రంట్ నగరంగా మార్చాలని ఆలోచనలు చేస్తున్నారు. మరోవైపు మధురవాడ,కాపులుప్పాడ, ఆనంద పురంలోని ఐటీ,డేటా సెంటర్ హబ్‌లు, భోగాపురం ఏరోసిటీ,వైజాగ్ బే సిటీ వంటి ప్రాజెక్టుల ద్వారా విశాఖ రూపురేఖలు మారుతాయని భావిస్తున్నారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విధించుకున్న లక్ష్యం.నవ్యాంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు..తన విజన్ సాకారం దిశగా ఈ ఏడాదిలో పలు చర్యలు తీసుకున్నారు. 2047 నాటికి ఏపీ ఆర్థిక వ్యవస్థను 2.44 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.
అమరావతి
ఏపీ అంటే ఏ ఫర్ అమరావతి,పీ ఫర్ పోలవరం..ఇదీ సీఎం కాగానే చంద్రబాబు చెప్పిన నిర్వచనం.ఇందుకు అనుగుణంగానే అమరావతి నిర్మాణం,పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే 2025లోనే బలమైన అడుగులు పడ్డాయి. అమరావతిని అంతర్జా తీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావి స్తున్న ఏపీ ప్రభుత్వం..అమరావతిలో పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపడుతోంది. ఇందులో భాగంగా సెక్రటేరియట్ టవర్లు, అసెంబ్లీ,హైకోర్టు,ట్రంక్ రోడ్లు,రిజర్వాయర్లు వంటి ముఖ్య నిర్మాణాలను వేగంగా జరుపు తోంది. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచబ్యాంక్‌తో పాటుగా వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటూ పనుల్లో వేగం పెంచింది.అమరావతిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఎయిర్ పోర్టు వంటి నిర్మాణాలు తల పెట్టిన ఏపీ ప్రభుత్వం..రెండో విడత భూస మీకరణ కింద మరో16వేల ఎకరాలుసమీక రించాలని నిర్ణయించింది.
క్వాంటం వ్యాలీ..
మరోవైపు అమరావతిలో ప్రతిష్టాత్మక క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు.ఈ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.కేంద్రం కేటాయించిన నిధులతో దేశంలోనే మొట్ట మొదటి క్వాంటం కంప్యూటర్ కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు సన్నా హాలు జరుగుతున్నాయి.ఐబీఎం,టీసీఎస్ వంటి సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్
విశాఖను ఏఐ సిటీగా మార్చాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం..ఆదిశగా 2025లో బలంగా అడుగులు వేసింది.విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావటం వైజాగ్ ముఖ చిత్రాన్ని మార్చనుంది. గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. విశాఖలో 1గిగావాట్ ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారుగా లక్షన్నర కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు.ఈ ప్రాజెక్టు విశాఖను ఏఐ హబ్‌గా మారుస్తుందని ప్రభుత్వం చెప్తోంది.
ఏపీ గ్రోత్ ఇంజన్..విశాఖ భాగస్వామ్య సదస్సు
మరోవైపు విశాఖ వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు కూడా ఏపీ గ్రోత్ ఇంజన్‌గా మారనుంది.ఈ సదస్సులో సుమారుగా 13లక్షల కోట్ల రూపాయల పెట్టు బడులకు వివిధ సంస్థలతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు చేసుకుంది. 640 అవగాహన ఒప్పందాల ద్వారా రూ.13.2 లక్షలకోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇవన్నీ కార్యరూపం దాల్చితే 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని అంచనా.
రిలయన్స్ ఏఐ డేటా సెంటర్
మరోవైపు రిలయన్స్ సంస్థ కూడా విశాఖలో ఏఐ డేటా సెంటరఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.రూ.93,000కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. అలాగే 6గిగావాట్ల సోలార్ ప్రాజెక్టు,రాయలసీమలో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్‌ను రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. అలాగే అదానీ గ్రూప్,బ్రూక్ ఫీల్డ్,రీన్యూ వంటి సంస్థలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.
టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్
మరోవైపు డేటా సెంటర్లతో పాటుగా ఐటీ సంస్థలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా విశాఖ మారుతోంది. విశాఖలో కాగ్నిజెంట్ సంస్థ ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించింది. క్యాంపస్ ఏర్పాటు కోసం సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. అలాగే టీసీఎస్, యాక్సెం చర్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు కూడా విశాఖలో క్యాంపస్‌లు ఏర్పాటు చేయనున్నాయి.ఆ రకంగా సాగరతీరాన్ని ఐటీ హబ్‌గా మార్చేలా బలమైన అడుగులు ఈ ఏడాదిలో పడ్డాయి.
బీపీసీఎల్ రిఫైనరీ.. ఎన్టీపీసీ హైడ్రోజన్ ప్లాంట్
మరోవైపు నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం వద్ద రూ.96 వేలకోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు కూడా 2025లోనే అడుగులు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ బీపీసీఎల్ రామాయపట్నం పోర్టు వద్ద ఆయిల్ రిఫైనరీ తో పాటుగా పెట్రో కెమికల్ యÖనిట్ ఏర్పాటు చేయనుంది. ఇక అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్,ఎన్టీపీసీ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటు కూడా ఏపీ ఆర్థికవ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చడంలో కీలకంగా మారనున్నాయి.
ఏవియేషన్ ఎడ్యుసిటీ
విశాఖపట్నం,విజయనగరం సరిహద్దులలో 136 ఎకరాల్లో ఏవియేషన్ ఎడ్యు సిటీ నిర్మాణానికి కూడా ఈ ఏడాదిలో అడుగులు పడ్డాయి. 136 ఎకరాల్లో జీఎంఆర్ గ్రూప్- మాన్సాస్ ట్రస్టు కలిసి ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీని ఏర్పాటు చేయనున్నాయి.ఇది పూర్తి అయితే ఏవియేషన్ రంగంలో అంతర్జా తీయ స్థాయి నిపుణులను తయారు చేయటమే కాకుండా..ఏపీని విమానయాన శిక్షణలో గ్లోబల్ సెంటర్‌గా మార్చుతుందని అధికా రులు చెప్తున్నారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు
ఇక అన్నింటికంటే ప్రధానంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయి. 2026 మే నెలలో భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రానుంది. ఈ ఎయిర్ పోర్టు అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రం మారు తుందని నిపుణులు చెప్తున్నారు.మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశాల్లో 2025 ఏడాదిలో భారీ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 13 ఎసఐపీబీ సమావేశాలు జరగ్గా..మొత్తం రూ.8.29 లక్షల కోట్ల పెట్టుబడులకు ఈ సమావేశాల్లో ఆమోదం లభించింది.– జి ఏ సునీల్ కుమార్ 

విశాఖ నగర భవిష్యత్తు నీటి అవసరాలకు సమగ్ర ప్రణాళిక 

విశాఖపట్టణం, ః
విశాఖపట్టణం నగరంలో పెరుగుతున్న జనాభా, పరిశ్రమల అభివృద్ధి దృష్ట్యా భవిష్యత్‌లో నీటి అవసరా లను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికలు రూపొం దించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సంబంధిత అధికారు లను ఆదేశించారు.మార్చి 5న గురువారం కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన సమావేశంలో నగరానికి సంబంధించిన నీటి డిమాండ్, సరఫరా పరిస్థితులు, భవిష్యత్ అవసరాలపై అధికా రులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, సీఈ సత్యనారా యణరాజు, ఎసఈ రవికుమార్, ఇరిగేషన్, విస్కో, ఇతర అధికారులు భాగస్వామ్యమై పలు అంశాలపై చర్చించారు.ముందుగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ప్రస్తుత తాగునీటి నిర్వహణ, భవిష్యత్తు కార్యాచరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.2024 నాటికి విశాఖ నగర జనాభా సుమారు 24లక్షలుగా ఉండగా రోజుకు సుమారు 453 ఎంఎల్డీ (వీLణ) నీటి అవసరం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం సుమారు 390 ఎంఎల్డీ నీటి సరఫరా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. 2025 నాటికి నీటి అవసరం సుమారు 476 ఎం ఎల్డీకి పెరిగే అవకాశముండగా, 2040 నాటికి ఇది 726 ఎంఎల్డీకి, 2055 నాటికి సుమారు 836 ఎంఎల్డీకి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రస్తుత సరఫరా సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే భవిష్యత్‌లో నీటి లోటు గణనీయంగా పెరిగే అవకాశముందని, దానికి తగ్గట్లుగా బృహత్ కార్యాచరణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై మేథోపరమైన చర్చ.. కలెక్టర్ దిశానిర్దేశం
సమీక్షలో భాగంగా విశాఖలో అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల అవసరాలను కూడా చర్చించారు. అర్సెల్లార్ మిత్తల్ నిప్పన్ స్టీల్,హెచ్‌పీసీఎల్,ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులు,డేటా సెంటర్లు, ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు తదితర పరిశ్రమలకు భవిష్యత్‌లో గణనీయమైన స్థాయిలో నీటి అవసరం ఉండొచ్చని అధికారులు పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచు కుని ముందస్తుగా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఈ క్రమంలో సూచించారు. 2026 నుంచి 2031 మధ్య కాలంలో పరిశ్రమల అవసరాల కోసం,వ్యవసాయ, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవా లన్నారు. భవిష్యత్‌లో నీటి అవసరాలను తీర్చేందుకు ప్రత్యామ్నాయ వనరులను గుర్తిం చడం,రీసైకిల్ నీటి వినియోగాన్ని విస్తృతంగా పెంచడం, కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. జీవీఎంసీ పరిధిలో ఉన్న నీటి నిల్వ ట్యాంకుల మరమ్మ తులు పూర్తి చేసి వాటిని పూర్తిస్థాయిలో విని యోగంలోకి తీసుకురావాలని సూచించారు. నీటి పునర్వినియోగం (రీసైక్లింగ్)పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నగరంలో నీటి నిర్వహణను మెరుగుపరచేందుకు అవసరమైన క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.మెఘాద్రి రిజర్వా యర్ గేట్ల మరమ్మతులకు అవసరమైన చర్య లు తీసుకోవాలని కూడా సూచించారు. నీటి నిర్వహణలో అంతర్జాతీయ స్థాయి అనుభ వాలను అధ్యయనం చేయడానికి సింగపూర్ నిపుణులు విశాఖపట్నం నగరాన్ని సందర్శించ నున్న క్రమంలో ప్రాథమిక సమీక్ష నిర్వహిం చిన కలెక్టర్ పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంబంధిత శాఖల అధికారులు ఫీల్డ్ స్థాయిలో పర్యటించి నీటి వనరుల పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి, నగరంలోని గృహ, పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు.ఈ నెల10వ తేదీన సింగపూర్ వాటర్ సెంటర్ బృందంతో జరిగే కాన్ఫరెన్స్‌లో ప్రస్తుత నీటి నిర్వహణ పద్ధతులు,భవిష్యత్తు కార్యాచరణ,ఆర్థిక ప్రణాళి కలు,భాగస్వామ్య సంస్థల సహకారం గురించి వివరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
జనగణన-2027పై అధికారులకు మార్చి 7 నుంచి 9 వరకు శిక్షణ
దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన-2027 కార్యక్రమం విజయవంతంగా అమలు కావడానికి జిల్లా స్థాయిలో సన్నాహాలు ప్రారం భమైనట్లు జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ గురు వారం ఓ ప్రకటనలో తెలిపారు. జన గణన-2027లో తొలి దశగా నిర్వహించనున్న హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ కార్యక్రమా నికి సంబంధించి జిల్లా, కార్పొరేషన్, ఛార్జ్ స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్య క్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం మార్చి 7నుంచి 9వ తేదీ వరకు మÖడు రోజుల పాటు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆంధ్ర విశ్వ విద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈశిక్షణలో జిల్లా, మండల స్థాయి సెన్సస్ అధికారులకు జనగణన నిర్వహణకు సంబంధించిన విది óవిధానాలు,బాధ్యతలు,హౌస్ లిస్టింగ్ ప్రక్రియ,డేటా సేకరణ విధానం తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున ్నట్లు తెలిపారు.శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి,చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, జిల్లా విద్యాశాఖాధికారి,జిల్లా పంచా యతీ అధికారి,జిల్లా అటవీ అధికారి,జడ్పీ సీఈఓ,సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగా ధికారి తదితర జిల్లా స్థాయి అధికారులు, భీమిలి,ఆనందపురం,పద్మనాభం,పెందుర్తి మండలాలకు చెందిన తహసీల్దార్లు, ఎంపీ డీఓలు, సంబంధిత సిబ్బంది శిక్షణలో పాల్గొంటారన్నారు. – జి ఏ సునీల్ కుమార్ 

జిల్లాల మధ్య ఆరోగ్యకర పోటీతోనే అభివృద్థి వేగవంతం

విశాఖపట్నం ప్రతినిథి
వెనుకబడిన జిల్లాలు,బ్లాకుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్(ఏడీపీ) ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్(ఏబీపీ) కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నీతి ఆయోగ్ అడిషనల్ సెక్రటరీ,మిషన్ డైరెక్టర్ రోహిత్ కుమార్ పేర్కొన్నారు.జిల్లాల మధ్య ఆరోగ్యకర పోటీ ఉండేలా చర్యలు తీసుకుంటే తక్కువ సమయంలోనే ఆశాజనక అభివృద్ధి ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు.– జి ఏ సునీల్ కుమార్ 

దేశ అభివృద్ధికి ఏడీపీఏబీపీ కీలకం..
నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రటరీ గౌరవ్ కటియార్ మాట్లాడుతూ ఆశాజనక జిల్లాలు, బ్లాక్స్ కార్యక్రమాలు దేశఅభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి ప్రాథమిక రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేయడం,చివరి మైలు వరకు ప్రభుత్వ సేవలను అందించడం ఈ కార్యక్రమాల ముఖ్య లక్ష్యమన్నారు.జిల్లాలు, బ్లాక్స్ స్థాయిలో అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులు పరస్పరం పంచుకోవడం ద్వారా అభివృద్ధికి కొత్త మార్గాలు సుగమం అవుతాయని ఆయన తెలిపారు.
స్వర్ణాంధ్రఏ2047” విజన్‌తో ముందుకు రాష్ట్రం..: ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీ అనంత శంకర్ మాట్లాడుతూ ఆశాజనక జిల్లాలు,బ్లాక్స్ కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధికి గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం “స్వర్ణాంధ్రఏ2047” విజన్‌తో ముందుకు సాగుతోందన్నారు.ప్రస్తుతం సుమారు 200 బిలియన్ డాలర్లుగా ఉన్న రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎస్‌డీపీ)ను 2047 నాటికి 2.4ట్రిలియన్ డాలర్లకు పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.తలసరి ఆదాయాన్ని 3,300డాలర్ల నుంచి 42,000 డాలర్లకు పెంచే దిశగా ప్రణాళికాబద్ధ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కీలక పనితీరు సూచికలు(కేపీఐఎస్) ఆధారంగా మండల,జిల్లా,రాష్ట్ర స్థాయిలో సమగ్ర పర్య వేక్షణ వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు.రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా డేటాను పర్యవేక్షిస్తూ కుటుంబ కార్డుల ద్వారా ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా అందిస్తున్నామని తెలిపారు.
జిల్లాల వారీగా వినూత్న కార్యక్రమాల ప్రదర్శన..: సెమినార్‌లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులను ప్రెజెంటేషన్ల రూపంలో వివరించారు.అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గిరిజన విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించేందుకు చేపట్టిన “నిర్మాణ” కార్యక్రమాన్ని వివరించారు.ఎన్టీఆర్ జిల్లా అధికారులు “ఒన్ ఫ్యామిలీ ఒన్ ఎంటర్‌ప్రె న్యూర” కార్యక్రమంద్వారా గ్రామీణ మహిళ లకు శిక్షణ, మార్కెటింగ్ మద్దతు అందిస్తూ జీవనోపాధి మెరుగుపరుస్తున్న విధానాన్ని వివరించారు.వైఎసఆర్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం”, “స్మార్ట్ కిచెన” కార్యక్రమాలను వివరించగా,కర్నూలు జిల్లా కలెక్టర్ ఎ.సిరి వ్యవసాయం,ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో చేపట్టిన వినూత్న చర్యలను వివరించారు.
కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలో ఆశాజనక జిల్లాలు,బ్లాకుల అభివృద్ధికి ఉత్తమ పద్ధతుల మార్పిడి,పరస్పర అనుభవాల పంచుకోవడం,జిల్లాల మధ్య ఆరోగ్యకర పోటీ వంటి అంశాలు దేశఅభివృద్ధిని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఈసెమినార్ స్పష్టంచేసింది.ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్,పార్వతీపురం మన్యం ప్రాజెక్టు అధికారి స్వప్నిల్ పవార్,వివిధ రాష్ట్రాలకు చెందిన జిల్లా కలెక్టర్లు, నీతి ఆయోగ్ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అధిగమిస్తూ..అప్రతిహాతంగా..

మహిళలు పెళ్లి కానంతవరకు తల్లిదండ్రుల మాటునే ఉండాలి, పెళ్లి చేసుకున్నాక భర్త చాటున ఇంటి పట్టునే వంట, సేవ చేస్తూ ఉండాలి.. అనే దశ నుండి వివిధ ఆధునిక రంగాలలో పురుషులకు సాటిగా, దీటుగా తమ సత్తా చూపే దశకు చేరుకున్నారు. లింగ సమానత్వం పెరుగుతున్నా, సైన్స్ రంగంలో స్త్రీల ప్రవేశం నుండి అక్కడ నిలదొక్కుకుని, విజయం సాధించడానికి ఎన్నో అవరో ధాలు ఉంటూనే ఉన్నాయి. అయినా మేరీక్యూరీ లాంటి వారు స్త్రీలు సైతం శాస్త్రీయ ఆవిష్కరణలు చేయగలరని, నడిపించగలరని నిరూపించారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగమైన సైన్స్,టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం వంటి చాలా కీలకమైన అంశాల్లో మహిళల పాత్రను మెరుగు పరుచుకుంటూ ముందుకు వెళుతున్నారు.
– డాక్టర్ కాకర్లమూడి  విజయ్


సమాజం నిర్దేశించిన ఆశలు అమ్మాయిల, అబ్బాయిల ఆకాంక్షలను వేరు వేరుగా రూపొందేలా చేస్తున్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాలలో అబ్బా యిలను ఫిజిక్స్,గణితం, ఇంజనీరింగ్ వైపు ప్రోత్స హిస్తే, అమ్మాయిలను సేవ చుట్టూ తిరిగే రంగాల వైపు పంపుతు న్నాయి. ఈతేడా వలననే సైన్సులో మహిళల ప్రాతినిధ్యం లేకుండా పోతుంది.సైన్సు చైతన్యవంతమై, అనేక మంది సహకారంతో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళను పరిష్కరించడానికి, పరిశో ధనాలయాల బయట కూడా కెరీర్‌లు కల్పించడానికి అద్భుతమైన సాధనగా ఉంటూ వచ్చింది. ఈ 21వ శతాబ్దంలో దాని ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఈ రంగంలో పురుషులే ఆధిపత్యం చెలాయిస్తున్నా, మేరీక్యూరీ వంటి మహిళలూ పరిశోధనలు చేయ గలరని నిరూపించి శతాబ్ద కాలం గడిచినా, గుర్తింపు పొందిన మహిళా శాస్త్రవేత్తలు ఇప్పటికీ బహు కొద్ది మందే కావడం లింగ అసమానత్వాన్ని ఎత్తిచూపు తోంది. ఆసమానత్వాన్ని పెంపొందించు కోవడం, మరింత వైవిధ్యమైన సహకారాన్ని పంచుకోవలసిన అవసరాన్ని వెల్లడిస్తుంది.

తమను తాము సానబెట్టుకుంటూ..
ప్రపంచమంతా, ఆ మాటకొస్తే మొత్తం సృష్టి అంతా, పురుషాధిక్యతతో పేట్రేగుతున్న కాలంలో మహిళలు మేము సైతం అంటూ, అందుబాటులోకొచ్చిన అవకా శాలను అందిపుచ్చుకుంటూ వాటిలో తమ ప్రతిభను సానబెట్టుకుంటూ ముందుకు సాగుతు న్నారు.ఉదయాన్నే రోడ్లుఊడ్చే మహిళల నుండి రోదసీలో నడక సాగిస్తున్న మహిళామÖర్తులకు మనం దరం జేకొ ట్టాలి. ఇప్పటి అమ్మాయిలు కేవలం సున్నితమైన కళా కారులుగా,రచయిత్రులుగా,కవయిత్రులుగానే కాకుం డా డాక్టర్లుగా,ఇంజనీర్లుగా,డ్రైవర్లు,కండక్టర్లుగా, యుద్ధం చేసే సైనికులుగా,పరిశోధనాత్మక విషయా లను వెల్లడిచేసే జర్నలిస్టులుగా,పాలన చేసే ప్రజా ప్రతినిధులుగా,రాష్ట్రాల్ని, దేశాల్ని నడిపే ఆఫీసర్లుగా, నేతలుగా,ఐటీ రంగంలో నిపుణులుగా,కొన్నిచోట్ల శాస్త్రీయ సంస్థలలో పరిశోధకులుగా కనిపిస్తున్నా, ఇంకా వారి ఉనికి బలపడాల్సి ఉంది. సైన్సు రంగం లో ఎందరో అమ్మాయిలు పిహెచ్‌డి వరకూ చదువు తున్నా, చాలామంది చివరకు చదువు చెప్పే బోధనా రంగానికే పరిమితమౌతున్నారు.ప దవ తరగతి చదువు పూర్తవ్వగానే సైన్సు గ్రూపు సెలెక్ట్ చేసుకుని డాక్టరు అవ్వుదామా, ఇటు లెక్కలు తీసుకుని ఇంజనీరు అవ్వుదామా అనే వరకూ అంతా బాగానే ఉంది. అలా డాక్టర్లూ, ఇంజనీర్లూ అయిన మహిళలు ఆయా వృత్తులలో తమ శారీరక, మానసిక శక్తిని, పరిమితులను దాటి పనిచేయడం ముదావహం.
సైన్స్ అండ్ టెక్నాలజీలో..
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మాత్రం మహిళలు కాస్త వెనకబడే ఉన్నారు. సైన్స్ అభివృద్ధికి ప్రామా ణికంగా పరిగణింపబడే నోబెల్ పురస్కారాలలో మగు వలు అగుపించడం లేదు. నూతన ఆవిష్కరణలు అతివల నుండి రావడంలేదు. పిచారులూ, జూకర్బ ర్గ్‌లూ సత్యానాదెళ్ళలూ కనిపించే టెక్ రంగంలో కూడా ఆ స్థాయిలలో మగువలు లేరు. జానకీ అమ్మా ళ్,టెస్సీ థామస్, వందనా కామత్, సునీతా విలియమ్స్ వంటివారు అడపాదడపా మెరుస్తున్నా, ఇంకా బోలెడు శూన్యం ఉంది మహిళలు భర్తీ చేయడం కోసం. సైన్స్ ఎప్పటినుండో ఉత్సుకత, నవీనత, ఎడతెగని జ్ఞానతృష్ణ మీద నడుస్తుంది. చరిత్రలో నిలిచిపోయే ఆవిష్కరణలు ఆడవారి ద్వారానే పురుడుపోసుకు న్నాయి. అటువంటి మహిళల కథలు కేవలం వారు సాధించిన శాస్త్రీయ విజయాలే కాదు, అవి ధైర్యం, స్థైర్యం, ఓపిక, పట్టుదల, ప్రతికూలమైనా అననుకూల మైనా పరిస్థితులను ఎదుర్కొని ఎదిగిన కబుర్లు. మేరీ క్యూరీ నుండి ఇప్పటి మహిళల వరకూ లింగ వివక్షను అధిగమించి తమ సామర్ధ్యాన్ని నిరంతరమÖ ప్రదర్శిం చిన వాళ్ళే. అలాగే పాఠ్య పుస్తకాలలో కూడా మహిళల శాస్త్రీయ విజయాలను పురుషుల కంటే తక్కువగానే చూపించడం జరుగుతుంది.తమకు మాదిరిగా, ప్రేరణగా మహిళలు లేకపోతే అటువంటి స్థానాలలో, స్థాయిలలో తమను తాము ఊహించుకోవడం అమ్మా యిలకు కాస్త కష్టం. ఆ విధమైన ప్రోత్సాహం ప్రస్తుతం తక్కువైంది.ఒకవేళ అన్ని అవరోధాలని దాటి శాస్త్రీయ రంగంలోకి అడుగుపెట్టిన మహిళలు తరచూ తమ పరిశోధన వాతావరణంలో కూడా సవాళ్ళను ఎదు ర్కొంటున్నారు.సీVAద్యోగులు,యాజమాన్యం మహి ళల విశ్వాసాన్ని తక్కువ చేసి,అవకాశాలను, వనరు లను తగ్గించి,వారి పురోగతిని అడ్డుకుంటున్నారు.
శాస్త్రీయ రంగంలో సవాళ్లు
మంచి విద్యకు అవకాశాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అమ్మాయిలకు ముఖ్యమైన అడ్డంకి. బల మైన విద్యా పునాది లేకపోవడం శాస్త్రీయ రంగంలో ముందుకు సాగడం, నిలదొక్కుకోవడం పెను సవాలు. సమాజంలో వేళ్ళూనుకుపోయిన కొన్ని అభిప్రాయాలు -అమ్మాయిలకి ఏదో చదివి, రాసేంత స్థాయి చదువు ఉంటే చాలు-వంటివి వాళ్లను శాస్త్రీయ విద్యవైపు పోకుండా నిరుత్సాహపరుస్తున్నాయి. ఆ కారణంగా డాక్టర్ల (అదీఎక్కువగా గైనకాలజిస్టులు) వరకూ చద వడం మాత్రమే కనిపిస్తుంది. ఈఎంసెట్‌లూ, నీట్ లలో విజయం సాధించని వాళ్లలో కొంతమంది ఎమ్మె స్సీలు చేస్తే, వాళ్లలో ఇంకా కొద్దిమంది పీహెచ్‌డీలు చేస్తారు. ఇక ఆ తరువాత అత్యధిక మంది లెక్చరర్లుగా స్థిరపడిపోతారు తప్ప పరిశోధనా రంగంలో ముందుకు వెళ్లలేకపోతున్నారు.
పరిశోధనాలయాలలో..
పరిశోధనాలయాలలో పరిశోధన విషయంలో, స్త్రీ పురుష వివక్ష ఎక్కువగా కనిపిస్తుంది. సమానమైన అర్హతలు ఉన్నా,పురుషులనే అధికంగా నియ మించు కోవడం కనిపిస్తుంది. అంతేకాకుండా, వారికే అధిక జీతం,అధిక తోడ్పాటు లభిస్తుంది.ఈ వివక్ష కేవలం పురుషుల నుండే కాకుండా స్త్రీలనుండి కూడా రావ డం ఆశ్చర్యం. పని ప్రదేశంలో ఇమిడిపోవ డానికి మహిళా శాస్త్రజ్ఞులు తమ ఆత్మగౌరవంతో పాటు ఆరోగ్యంవిషయంలో కూడా సర్దుకుపోవలసి వస్తుంది. పైగా, స్త్రీల నిర్ణయాలు తీసుకునే సమర్ధతపై పురుషు లు అనుమానంగా ఉండటం, తక్కువ చేసి చూడటం, వారి అభిప్రాయాలకు ప్రాముఖ్యత ఇవ్వక పోవడం వంటి చర్యలు తెలీకుండానే మహిళలలో ఒత్తిడి పెంచి,అనేక ఇబ్బందులకు కారణమౌతుంది. పరిశో ధనకు అవసరమైన గ్రాంట్లు, ప్రాజెక్ట్‌ల ఆమో దం వంటివి కూడా మహిళల కంటే పురుషులకే ఎక్కువగా లభిస్తున్నాయి.ఈఅంటే 22శాతం మాత్రమే ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. మహిళా పరిశో ధకుల కెరీర్ తక్కువకాలం ఉండటమే కాకుండా, తక్కువ జీతాలతో ఉంటుంది.వారి పనితనం పేరెన్నిక గన్నసైన్స్ జర్నల్స్ లో అంతగా కనిపించదు. వారికి ప్రమోషన్లు, ఇతర ప్రోత్సాహకాలు కూడా తక్కువే. మహిళలకు ఉన్న మరో సమస్య ఇంటి బాధ్యతలు. ఉద్యోగంలోనే కాకుం డా ఇంటి పనులలో కూడా లభించని ‘మగ’ సహాయం కారణంగా మానసిక,శారీరక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే, ప్రభుత్వ తోడ్పాటు ఈ విషయంలో చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది.ఇప్పటికే, మన ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఖఅశీwశ్రీవdస్త్రవ Iఅఙశీశ్రీఙవఎవఅt ఱఅ =వsవaతీcష్ట్ర Adఙaఅcవఎవఅt tష్ట్రతీశీuస్త్రష్ట్ర చీuతీtuతీఱఅస్త్ర (ఖI=Aచీ) వంటి స్కీమ్‌లు ప్రవేశపెట్టి, వాటి ద్వారా మహిళా శాస్త్రజ్ఞులను వారి వృత్తిపర అభివృద్ధికి సహాయం చేస్తున్నాయి. వివిధ ఎన్జీవోలు, కొన్ని విద్యాసంస్థలు శాస్త్రీయ విద్యను అమ్మాయిలకు అందించడంలో, ముఖ్యంగా వెనుకబ డిన ప్రాంతా లలో ముందుకు వస్తున్నాయి. శాస్త్రవేత్త లుగా, ఇంజ నీర్లుగా ఎదగాలనుకునే అమ్మాయిలకు ఇటువంటి తోడ్పాటు బలాన్ని ఇస్తుంది. ఇటీవల పెరుగుతూ వ్యాపిస్తున్న స్టార్ట్-అప్ వాతావరణం టెక్నా లజీ, ఆవిష్కరణ రంగాలలో కొత్త అవకాశాలను అంది స్తుంది.వివక్షను, అవమానాలనూ, చిన్నచూ పునూ అధిగమించి తమ కలలను సాకారం చేసుకో వాలంటే..మహిళలు,ముఖ్యంగా అమ్మాయిలు, ఆత్మవిశ్వాసం,అపార పట్టుదలకు,మొండితనం, ధైర్యం అలవర్చుకోవాలి.వీటికంటే ముందు స్వతహాగా తమ కు ఆసక్తి, సృజనాత్మకతతో పాటు తాము విజయం సాధిస్తే ఎందరో అమ్మాయిలకు ప్రేరణగా ఉంటా మనే పాజిటివ్ దృక్పథం అవసరం.
మార్గదర్శకత్వం అవసరం
సైన్సు అండ్ టెక్నాలజీ రంగాల్లో ఇప్పటికే విజయం సాధించిన మహిళలు ఆసక్తిగల ఉత్సాహవంతులు ప్రేరేపించేందుకు, స్ఫూర్తి నింపేందుకు, ప్రోత్సహిం చేందుకు,సమస్యలకు పరిష్కారాలు, మెళకువలు నేర్పేందుకు తరచూ సమావేశాలు నిర్వహిస్తుండాలి. ఇది నిరంతరం జరుగుతుంటే మేలు జరిగే అవకా శాలు మెండుగా ఉంటాయి. భవిష్యత్తులో మరింత మంది మహిళలు సైన్స్ రంగంలో ప్రవేశించి, నాయ కుల స్థానాలకు ఎదిగి, వారి ఆవిష్కరణలతో, సృజనా త్మకతతో,జ్ఞానంతో,నైపుణ్యంతో ప్రపంచాన్ని మార్చ వచ్చు అని ఆశించవచ్చు.
మహిళా మార్గదర్శకులు మేరీ క్యూరీ
మేరీక్యూరీ పనిలో కనికరంలేని స్వభావం కల మహిళ.1906లో ఆమె భర్త, సహపరిశోధకుడు అయి న పియరీ అకాల మరణం తర్వాత, వ్యక్తిగత దుఃఖం, శాస్త్రీయ సమాజాన్ని పీడిస్తున్న వివక్ష ఉన్నప్పటికీ క్యూరీ తన పరిశోధనను కొనసాగించారు. మహిళ లకు చాలా అరుదుగా గుర్తింపు లభిస్తున్న కాలంలో.. ఆమె రెండు నోబెల్ బహుమతులు గెలుచుకున్న తొలి వ్యక్తిగా నిలిచారు. ఒకటి భౌతిక శాస్త్రం (1903), మరొకటి రసాయన శాస్త్రం (1911).ఆమె ఆవిష్కర ణలు రేడియేషన్ థెరపీద్వారా క్యాన్సర్ చికిత్సకు పునాది వేసింది. లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడింది.
అడా లవ్‌లేస్
యాంత్రిక కంప్యూటింగ్ పరికరం అయిన అనలిటి కల్ ఇంజన్ కొరకు చార్లెస్ బాబేజ్‌తో పాటు కలిసి పనిచేస్తున్నప్పుడు అడా లవ్‌లేస్ ఈ యంత్రాన్ని అంక గణిత గణనల కంటే ఎక్కువగా ఉపయోగించవచ్చని గ్రహించారు. ఆమె స్వయంగా బెర్నౌలీ సంఖ్యలను లెక్కించడానికి ఒక అల్గారిథమ్‌ను వివరించే ప్రోగ్రాం ను రాశారు.దీనిని మొట్టమొదటి కంప్యూటర్ ప్రోగ్రా మ్‌గా భావిస్తారు. ఆమె అంతరదృష్టి ఆ కంప్యూటింగ్ యంత్రాలు గణనకు మించి అనేక రకాల పనులను చేయగలవని నిరూపించింది. ఆ విధంగా ఆధునిక కంప్యూటింగ్‌కు పునాది వేశారు. అయితే, అప్పట్లో ఆమె ఆలోచనలు కొట్టివేశారు.కానీ నేడు, అడా లవ్ లేస్ ప్రపంచంలోని మొట్టమొదటి కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా ప్రశంసించబడుతున్నారు.
రోసలిండ్ ఫ్రాంక్లిన్
రోసలిండ్ ఫ్రాంక్లిన్ కథలో విషాదం, విజయం రెండూ ఉన్నాయి. 1950వ దశకంలో బ్రిటీష్ జీవ భౌతిక శాస్త్రవేత్త అయిన ఫ్రాంక్లిన్, ఎక్స్-రే క్రిస్ట ల్లాగ్రఫీని ఉపయోగించి డిఎనఎ నిర్మాణంపై మార్గ దర్శక పరిశోధనను నిర్వహించారు.ఆమె తీసిన ఛాయాచిత్రాలు డబుల్ హెలిక్స్ నిర్మాణంలో కీలక మైన అంతర్దృష్టులను అందించాయి. వాటికి వాట్సన్, క్రిక్,విల్కిన్స1962లో నోబెల్ బహుమతిని అందు కున్నారు.ఫ్రాంక్లిన్ జీవితకాలంలో ఆమెకు తగిన గుర్తింపు ఇవ్వబడలేదు. ముఫ్పై ఏడు సంవత్సరాల వయస్సులో ఆమె అకాల మరణం తర్వాత, డిఎనఎ ఆవిష్కరణలో ఆమె పాత్ర పూర్తిగా గుర్తించబడింది.
కేథరీన్ జాన్సన్
కేథరీన్ జాన్సన్ కథ జాత్యహంకారం, లైంగిక వివక్ష నేపథ్యంలో పట్టుదల కథ. 1960లలో ఎనఎఎసఎలో పనిచేసిన జాన్సన్ ఆఫ్రికన్ అమెరికన్ గణిత శాస్త్రజ్ఞురాలు. అమె పని 1962లో జాన్‌గ్లెన్ యొక్క ఆర్బిటల్ ఫ్లైట్ సహా ప్రారంభ అంతరిక్ష యాత్రల విజయాలలో అంతర్భాÄగం. జాతి, లైంగిక అడ్డంకులు తీవ్రంగా ఉన్నప్పటికీ ఆ ప్రాజెక్ట్ కోసం జాన్సన్ వేసిన లెక్కలు చాలా కచ్చితంగా ఉండి, ఆమె సీVAద్యోగుల గౌరవాన్ని సంపాదించాయి. ఎనఎఎసఎలో జాన్సన్ పాత్ర పురుషాధిపత్య మిషతో చాలాకాలం వెలుగు చూడలేదు. కానీ 2015లో గణితం, అంతరిక్ష పరిశోధనలలో ఆమె చేసిన మార్గదర్శక పనిని గుర్తించారు. 97 సంవత్సరాల వయస్సులో జాన్సన్‌కు ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను ప్రదానం చేశారు.
మచ్చుకి మనవాళ్ళు..
మనదేశం గొప్ప మేధో సంప్రదాయాల భూమి. సామాజిక అడ్డంకులు, విద్యాపరమైన సవాళ్లు, గుర్తింపు లేమిని ఎదుర్కొన్నప్పటికీ%…% సైన్స్‌లో భారతీయ మహిళలు పట్టుదలతో, సంచలనాత్మక ఆవిష్కరణలు చేశారు. అలాగే భవిష్యత్ తరాలను ప్రేరేపించారు. మొదటి మహిళా భౌతిక శాస్త్రవేత్త బేగం రోక్వియా సఖావత్ హుస్సేన్ నుండి, బయో ఫిజిక్స్‌లో డాక్టర్ మంజు బన్సాల్ వరకు.. విజ యమనేది స్త్రీ-పురుషులతో ముడిపడి ఉండదని, అది ఉత్సుకత, అభిరుచితో ముడిపడి ఉందని నిరూ పించారు.
ఆనందీ గోపాల్ జోషీ
తనకంటే ఇరవై ఏళ్ళు పెద్దగా ఉన్న అతన్ని పెళ్ళాడి, పద్నాలుగేళ్ల వయసులో మగబిడ్డకు జన్మనిచ్చింది ఆనందీబాయి.అయితే వైద్య సౌకర్యాలు సరిగా లేక పోవడంతో ఆబిడ్డ పదిరోజుల తరువాత చనిపో యింది. ఈ సంఘటన ఆనంది జీవితంలో విషాదం తో పాటు దేశంలో వైద్యరంగంలో ఏదైనా చేయాలన్న తలంపుకి పురుడుపోసింది.భర్త తోడ్పాటుతో 1883లో ఆనందిబారు అమెరికాలో వైద్య శిక్షణ ప్రారంభించి, 1885లో ఎండి పట్టా పుచ్చుకున్నారు. ఆ మరుసటి సంవత్సరం కొల్హాపూర్‌లో ఆల్బర్ట్ ఎడ్వర్డ్ ఆసుపత్రిలో మహిళలవార్డ్‌కి ఇన్‌ఛార్జిగా సేవలందించారు. అయితే ఆమెకు తనకి 22 ఏళ్లు రాకముందే క్షయవ్యాధి సోకి మరణించారు. ఆమె నుండి ప్రేరణ పొందిన అనేక మంది మహిళలు ఆమె సాకారం చేసుకోలేకపోయిన కలలను సాధించి చూపారు.
జానకి అమ్మాళ్
జానకి అమ్మాళ్ వృక్షశాస్త్రజ్ఞురాలు. 1897లో జన్మిం చిన అమె మిచిగాన్ విశ్వవిద్యాలయంలో వృక్ష శాస్త్రం లో డాక్టరేట్ పొందారు. దేశంలోనే ఈ రంగంలో డాక్టరేట్ పట్టా పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. చెరకు మొక్క జన్యు నిర్మాణంపై, సిట్రస్ జాతి అధ్యయనానికి ఆమె కృషి ఘనమైనది. దేశం లోనే ఆధునిక వ్యవసాయ పరిశ్రమకు పునాది వేయ డానికి సహాయపడ్డారు. ప్రతిష్టాత్మకమైన లిన్నేయన్ సొసైటీ ఆఫ్ లండన్‌లో సభ్యురాలైన మొదటి భారతీ యురాలు కూడా ఆమె. లండన్‌లో పనిచేస్తున్న ఆమె, పండిట్ నెహ్రూ ఆహ్వానం మేరకు భారతదేశానికి తిరిగి వచ్చి, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. జానకీ అమ్మాళ్ 1977 లో పద్మశ్రీ పురస్కారం పొందారు. ఒక రకం పూల మొక్కకి ఆమె పేరు పెట్టారు కూడా. ఎనభై ఏడేళ్ల వయసులో 1884లో మరణించే సమయానికి ఆమె చెన్నైలోని ఒక ల్యాబ్‌లో పనిచేస్తున్నారు.
వందనా కామత్
భారతదేశ అంతరిక్ష కార్యక్రమ పితామహుడిగా విక్ర మ్ సారాభారు పరిగణించబడుతున్నప్పటికీ, ఇస్రో విజయాన్ని రూపొందించడంలో డా.వందనా కామత్ తెరవెనుక కీలకపాత్ర పోషించారు. భారతదేశ అంతరిక్ష విజ్ఞాన రంగంలో ప్రారంభ సంవత్సరాల్లో ఉన్న కొద్దిమంది మహిళల్లో ఒకరైన డాక్టర్ కామత్, ఇస్రో యొక్క మొదటి ఉపగ్రహాలు, ప్రయోగ వాహనాల అభివృద్ధికి గణనీయంగా సహకరించారు. సమాచార సాంకేతికత, ఉపగ్రహ వ్యవస్థలలో డా. కామత్ యొక్క నైపుణ్యం టెలీకమÖ్యనికేషన్స్, వాతావరణ అంచనా వ్యవస్థలు, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను నేరుగా ప్రభావితం చేసే ఉపగ్రహ కమÖ్యనికేషన్ రూపొందించడంలో సహాయపడింది.
టెస్సీ థామస్
‘క్షిపణి మహిళ’గా పేరుగాంచిన టెస్సీ థామస్ అగ్ని, పృథ్వీ క్షిపణులతో సహా క్షిపణి వ్యవస్థల అభివృద్ధిలో మార్గదర్శక పాత్ర పోషించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ థామస్ భారతదేశంలో క్షిపణి ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన మొదటి మహిళ.గ్లోబల్ మిస్సైల్ టెక్నాలజీ, డిఫెన్స్ సిస్టమ్స్‌లో భారతదేశాన్ని కీలకంగా మార్చడం లో ఆమె కృషి కీలకమైనది.అత్యంత సాంకేతికత, సాంప్రదాయకంగా పురుషాధిపత్య రంగంలో ఉన్న మహిళగా,భారతదేశ రక్షణ సామర్థ్యాలు, సాంకేతిక ఆవిష్కరణలలో అగ్రగామిగా ఉండేలా డా||థామస్ అడ్డంకులను అధిగమించారు.
ఈ కథనాలు సైన్స్ అంటే కేవలం కొత్త వాస్తవాలను కనుగొనడం లేదా కొత్త సాంకేతికతలను సృష్టించడం మాత్రమే కాదని గుర్తుచేస్తాయి. ఇది యథాతథస్థితిని సవాలు చేయడం,ఊహించడం, ప్రశ్నించడం, ప్రపం చాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి కృషి చేయ డం.అలా చేయడం ద్వారా సైన్స్‌లోని మహిళలు మనందరికీ గొప్పగా ఆలోచించడానికి, ధైర్యంగా కలలు కనడానికీ,అసాధ్యమైన వాటిని కొనసా గించడాన్ని నిరంతరం ప్రేరేపిస్తూనే ఉన్నారు..ఉంటారు. మరి ఆప్రేరణను అందిపుచ్చుకోడానికి మన అమ్మాయిలు సంసిద్ధులు కావాలి.
ఈ దినోత్సవము ఎందుకంటే?
ఒక దేశ ఆర్థిక అభివృద్ధిలో సైన్స్, టెక్నాలజీ, ఇంజ నీరింగ్, గణితం చాలా కీలకమైన అంశాలు. అయి నా, అభివృద్ధి చెందిన దేశాలు సహా, ప్రతి దేశంలోనూ ఈ రంగంలో లింగ సమానత్వం అంతంత మాత్రం గానే ఉంది. ఈకీలకాంశాల సాయంతోనే సుస్థిర అభివృద్ధి,వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, ఆరోగ్యంలో సమగ్రాభివృద్ధి సాధించడం వీలౌతుంది. అందుకు నిపుణులు, వారి నైపుణ్యం ఎంతో అవసరం. కేవలం పురుషులపైనే ఆధారపడితే అభివృద్ధి అనుకు న్నంతగా వేగిరం కాకపోవచ్చు. అందుకు మహిళా నిపుణులు పాలుపంచుకోవడం ముఖ్యం. సైన్స్ అండ్ టెక్నాలజీ కమÖ్యనిటీలలో మహిళలు, బాలికలు కీలకపాత్ర పోషిస్తున్నారు
సైన్స్ పరిశోధనల పట్ల ఆసక్తి పెంచాలి!
దేశంలో కేరళ వంటి కొన్ని రాష్ట్రాలలో తప్ప వివిధ రంగాల్లో మహిళా అభివృద్ధి పెద్దగా జరగడం లేదు. ఇంకా దేశంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగు తూనే ఉన్నాయి. అందువల్ల బాలికలు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. బాలికలు భవిష్యత్తులో మహిళా శాస్త్రవేత్తలుగా ఎదగాలంటే,పాఠశాల స్థాయిలోనే వారికి సైన్స్ పరిశోధనలపట్ల ఆసక్తిపెంచాలి. ఉన్నత పాఠశాలల్లో సైన్స్ ప్రయోగశాలలను అన్ని వసతులతో ఏర్పాటు చేయాలి. ఇందుకు అవసరమైన నిధులు కేటాయించాలి. ఇన్స్పైర్ పథకం కింద ఎక్కువ మంది బాలికలని ఎంపిక చేయాలి. పరిశోధనా రంగం వైపు వారిని ప్రోత్సహించాలి.విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనలు పెంచడానికి తగిన కృషి చేయాలి. బాలిక లపై తరతరాలుగా వస్తున్న ఆంక్షలని తొలగించేం దుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. అప్పుడే మహిళా శాస్త్రవేత్తలుగా మరింత మంది ఎదుగుతారు.

మహిళలే సమాజా ప్రగతికి శక్తి..!

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పరస్కరించుకొని జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలో మహిళలకు ఆటవిడుపుగా ఆటల పోటీలు నిర్వహించారు. మహిళా సాధికారిత కోసం రూ.10113.23కోట్ల మెగా చెక్కులను మహిళలకు ఆర్ధిక రుణాలు కింద అంద జేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పలు కార్యక్రమా ýకు హజరై మాట్లాడారు.మహిళా సాధికారత మాటలకే పరిమితం కాకుండా కార్యరూపం దాల్చినప్పుడే దానికి నిజమైన సార్థకత చేకూరుతుందని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభను చాటుతూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని,ఒక వైపు కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ మరోవైపు కార్యాలయ బాధ్యతలను సమర్థ వంతంగా నిర్వర్తించడం అభినందనీ యమని అన్నారు. అలాంటి వారికి అన్ని విధాలుగా అండగా నిలవటంతో పాటు, మహిళా సాధికారత సాధనకు దోహదపడాలని పిలుపునిచ్చారు. మార్చి 08న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో మహిళా అధికా రులు, సిబ్బందికి ప్రత్యేకంగా క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను ఉదయం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి బెలూన్లను ఎగురవేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిపాలనా వ్యవహారాల్లో మహిళా అధికారులు,సిబ్బంది చురుకైన పాత్ర పోషిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కీలకంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. మహి ళలు వివిధ రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తున్నారని పేర్కొంటూ సునీతా విలియ మ్స్,కల్పనా చావ్లా,పీవీ సింధు వంటి ప్రముఖులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పారు. వారిలాగా ప్రతి మహిళ తన లక్ష్యాలను సాధించి ఉన్నత స్థానాలకు ఎదగాలని,సమా జానికి ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఆకాం క్షించారు. క్రీడలు ఆరోగ్యాన్ని కాపాడట మే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదం చేస్తాయని పేర్కొన్నారు.క్రీడల ద్వారా జట్టు భావన, క్రమశిక్షణ, పోటీ స్ఫూర్తి వంటి విలువలు పెంపొందుతాయని,ఇవి వృత్తి జీవితంలో కూడా ఎంతో ఉపయోగపడ తాయని తెలిపారు.ఈరోజు క్రీడా పోటీల్లో కనిపించిన ఉత్సాహం,క్రీడా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ దీర్ఘకాలం కొనసాగించాలని సూచిం చారు.కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన ఈక్రీడా పోటీల్లో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి,పలువురు డిప్యూటీ కలెక్టర్లు శేష శైలజ,అనిత,రామలక్ష్మి,మాధవి, ఇతర మహిళా అధికారులు,కలెక్టరేట్ ఏవో బీవీరాణి,ఇతర విభాగాల సూపరింటెండెంట్లు,సిబ్బంది ఉత్సా హంగా పాల్గొన్నారు.కార్యక్ర తమం ఆద్యంతం ఆనందోత్సవాల మధ్య కొనసాగింది.
ఏయÖ కన్వెన్షన్ సెంటర్లో ..
ఏయÖ కన్వెన్షన్ సెంటర్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అట్టహాసంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. భాగస్వామ్యమైన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు,ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు,జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్,జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జీసీసీ ఎండీ శోభిక,జూ క్యురేటర్ మంగమ్మ, ఇన్చార్జి డీఆర్వో శేషశైలజ,జీవీఎంసీ అదనపు కమిషనర్ సత్యవేణి,ఎస్సీ కార్పొరేషన్ ఈడి సత్యపద్మ, ఐసీడీఎస్ పీడీ రామలక్ష్మి, జిల్లా కో.ఆపరేటివ్ అధికారిణి ప్రవీణ,విభిన్న ప్రతి భావంతుల శాఖ ఏడీ కవిత, సచివాల యల జిల్లా కో.ఆర్డినేటర్ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు,జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్,పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి,డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ చందోలు,లతా మాధురి సంద ర్శించి వివిధ వస్తు ఉత్పత్తులను పరిశీలిం చారు.ఆస్తులకు సంబంధించిన పత్రాలను అందజేశారు.
మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా లబ్ధిదారులకు అందజేత
2025-26 ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల కింద బ్యాంకు లింకేజి కింద సమ కూర్చిన రూ.1013.23 కోట్ల విలువగల మెగా చెక్కులను సంబంధిత లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అందజేశారు.నిర్దేశించిన లక్ష్యాల మేరకు సాధించిన ప్రగతిని వివరిస్తూ డి.ఆర్.డి.ఎ., మెప్మా శాఖలు లబ్ధిదారులకు అందజేసిన రుణాలు, ఇతర ఆర్థిక సాయం తాలుక నివేది కలను ఆదివారం ఏయÖ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించాయి. దానిలో భాగంగా 2025-26ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన పధకాల కింద లబ్ధిపొందిన మహిళా సంఘాల సభ్యులకు చెక్కులు సిద్ధం చేశారు.వాటిని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్,జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి చేతుల మీదుగా అంద జేశారు.వాటిలో డి.ఆర్.డి.ఎ.ఆధ్వర్యంలో సమకూర్చిన రూ.256.14కోట్ల చెక్కు, జీవీ ఎంసీ-అర్బన్ కమÖ్యనిటీ డెవలప్మెంట్ (యు. సి.డి.)సమకూర్చిన రూ.747.69,పీఎం స్వాని ధి కింద సమకూర్చిన రూ.9.40కోట్ల విలువ గల చెక్కులు ఉన్నాయి.డి.ఆర్.డి.ఎ.పీడీ లక్ష్మీ పతి,అదనపు కమిషనర్ సత్యవేణి,ఇతర అధికారులు పాల్గొన్నారు.– జి ఏ సునీల్ కుమార్ 

అర్బన్ ఛాలెంజ్ ఫండ్`పట్టణాలకు ముప్పు

“కేంద్ర బిజెపి ప్రభుత్వం పట్టణాల్లో మంచి నీరు, మురుగు నీరు, పారిశుధ్యం,ఘన వ్యర్థాల నిర్వ హణ,ఇతర మౌలిక సదుపాయాలు పెంపొందిం చేందుకు, పట్టణా లను ఆర్థికవృద్ధికి చోదక శక్తులుగా, సృజనాత్మక పునరా భివృద్ధి కేంద్రాలుగా నిర్మించడం పేర అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యు.సి.ఎఫ్) పథకాన్ని ప్రకటించింది. 2026 నుండి 2031 వరకు ఐదేళ్లపాటు ఈ పథకం అమలులో ఉం టుంది. ఈ పథకాన్ని ప్రపంచ బ్యాంకు అనుబంధ సంస్థ అయిన ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎ.డి.బి) రూపొందిం చింది. వాస్త వంగా దీనిని 2025-26 బడ్జెట్‌లోనే ప్రవేశ పెట్టారు. ఎ.డి.బి రుణాన్ని మంజూరు చేయక పోవడంతో అమల్లోకి రాలేదు.2026-27బడ్జెట్‌లో తిరిగి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకానికి దశల వారీగా రాబోయే ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేంద్ర ప్రభుత్వా నికి ఎ.డి.బిరుణం రూపంలో ఇస్తుంది. దీని అమలును కూడా ఎ.డి.బి ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తుంది.”
దేశ పట్టణ జనాభా2036 నాటికి 40 శాతా నికి చేరుతుందని,స్థూలజాతీయోత్పత్తిలో 70 శాతానికి పట్టణాలు,నగరాలు ప్రాతినిధ్యం వహిస్తాయని, రాబో యే 15 ఏళ్లలో దేశంలో పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కనీసం రూ.75లక్షలకోట్లు (840బిలియన్ డాలర్లు) పెట్టుబడులు అవసరమని ప్రపంచబ్యాంకు భారత దేశ పట్టణ మౌలిక సదుపా యాలపై 2022లో విడుదల చేసిన నివేదిక తెలి పిందని తాజాగా విడుదల చేసిన 2025-26ఆర్థిక సర్వే పేర్కొ న్నది. అంటే ఏడాదికి సుమారు రూ.4.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలని,ఇది స్థూలజాతీయ ఉత్పత్తి (జి.డి.పి)లో1.2శాతంగా ఉంటుందని, ఇంత పెట్టుబడి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెట్ట లేవని, ప్రైవేట్ మార్కెట్ ఫైనాన్స్ నుండి సమీకరించు కోవాలని మోడీ ప్రభుత్వం చెబుతున్నది.
ఇప్పుడు యు.సి.ఎఫ్‌పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పట్టణస్థానిక సంస్థలకు మౌలిక సదుపా యాల కల్పనకు ఇచ్చే గ్రాంట్ల నుండి వైదొలగి బహి రంగ మార్కెట్ నుండి రుణాలద్వారా నిధులు సేక రించుకొని మౌలిక సదుపాయాలు చేపట్టాలని ఆదేశిస్తున్నది.ఈపథకం పెద్దపెద్ద నగరాలకే పరి మితం కాదు.దేశంలో ఉన్న అన్ని నగరాలతో పాటు మొత్తం 4,223 టైర్ 1, టైర్ 2 పట్టణాలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేశారు.చిన్న చిన్న పట్టణాలకు ప్రత్యేకంగా ప్రైవేట్ మార్కెట్ నుండి రుణాలు సేకరించుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో ప్రత్యేకంగా మార్కెట్ సంస్థలకు రిస్క్ హామీగా రూ.5 వేల కోట్లరుణ హామీ నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నది.
పట్టణ ఛాలెంజ్ నిధి మొత్తం రూ.4లక్షల కోట్లుగా నిర్ణయించారు.రాబోయే ఐదేళ్లలో పట్ట ణాల్లో ఖర్చు పెట్టాలి.ఈమొత్తం నిధిని కేంద్ర ప్రభు త్వం ఇవ్వదు. ఇందులో కేవలం25శాతం (రూ.లక్ష కోట్లు)మాత్రమే ఇస్తుంది.మిగిలిన రూ. మÖడు లక్షల కోట్ల నిధులు సమకూర్చు కోవటా నికి కొన్నిషరతులు విధించింది.రూ.4లక్షల కోట్లలో కనీసం 50శాతం నిధులను ప్రైవేట్ రుణాల ద్వారా,మున్సిపల్ బాండ్లు, ప్రభుత్వ,ప్రైవేట్ భాగస్వామ్యం(పిపిపి) రూపంలో సమకూర్చు కోవాలి.మిగిలిన 25శాతం అనగా రూ. లక్ష కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, పట్టణ స్థానిక సంస్థలు భరించాలి లేదా వీటిని కూడా రుణాలు,బాండ్ల రూపం లో సమకూర్చుకోవాలి.ఈ పథకంలో మౌలిక సదుపా యాలను తప్పనిసరిగా ప్రభుత్వ, ప్రైవేట్, భాగస్వా మ్యంలో చేపట్టాలి.
గత రెండున్నర దశాబ్దాల నుండి ప్రపంచ బ్యాంక్ ఆదేశిత సంస్కరణలు పట్టణ రంగంలో తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పట్టణ రంగంలో అమలు చేసిన వివిధ పథకాలకు తప్పనిసరిగా ప్రైవేటు రుణం తీసుకోవాలని, కార్పొరేట్ బాండ్లు సేకరించాలని, పిపిపి కింద ప్రాజెక్టులు చేపట్టాలని షరతులు లేవు. 2005-12 మధ్య అమలు చేసిన జవహర్‌లాల్ నెహ్రూ పట్టణ ఆధునీకరణ మిషన్ (జె.ఎన్.ఎన్. యు.ఆర్.ఎం)గాని, 2015-25 మధ్య అమలు చేసిన స్మార్ట్ సిటీ పథకంలో గానీ ఈ నిబంధనలు తప్పనిసరి చేయలేదు. జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎంలో కేంద్రం 70 శాతం,రాష్ట్రాలు, పట్టణ స్థానికసంస్థలు 30శాతం గాను,స్మార్ట్ సిటీ పథకంలో కేంద్రం50శాతం, రాష్ట్రాలు 50 శాతం నిధులు భరించేలా రూపొందించి అమలు చేశాయి. అయితే ఇవి కూడా సంస్కరణతో ముడిపెట్టి అమలు చేసినవే.
దేశంలో నేటికి పెద్దపెద్ద మెట్రోపాలిటిన్ నగరాలు మాత్రమే ప్రభుత్వ బ్యాంకుల నుండి పరిమిత స్థాయిలోనే రుణాలు, మున్సిపల్ బాండ్ల రూపంలో నిధులు సేకరిస్తున్నాయి. ఇప్పటివరకు మున్సిపల్ బాండ్ల రూపంలో దేశంలో 10 నగరాలు మాత్రమే రుణాలు సేకరించాయి.2018లో రాష్ట్రంలో చంద్ర బాబు నాయుడు ప్రభుత్వం కూడా అమరావతి బాండ్స్ పేర రెండు వేలకోట్లు రుణం సమీకరిం చింది.ఈ రుణాలు మొత్తం కూడా రూ.3,783 కోట్లు మాత్రమే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పట్టణ స్థానిక సంస్థలు నిధుల కోసం ఆధారపడకుండా మార్కెట్ రుణాలు, మున్సిపల్ బాండ్ల రూపంలో సేకరించుకోవాలని షరతులు విధించింది. అలా సేకరించుకుంటేనే కేంద్ర ప్రభు త్వం ప్రాజెక్ట్ వ్యయంలో 25 శాతం గ్రాంట్ ఇస్తుంది. ఈ బాండ్లను కూడా బడా కార్పొరేట్ సంస్థల నుండి సేకరించే నగర పాలక సంస్థలకు నగదు ప్రోత్సాహ కాలు కూడా ప్రకటించింది. ఉదాహరణకు ఏదైనా నగర పాలక సంస్థ రూ.1000కోట్ల విలువగల ఒకే మున్సిపల్ బాండ్‌ను కార్పొరేట్ సంస్థల నుండి సేకరిస్తే ఆ నగర పాలక సంస్థకు రూ.100కోట్ల ప్రోత్సాహక నిధిని ఇస్తామని తెలిపింది.
దేశంలోని పట్టణాలన్నింటినీ మౌలిక సదు పాయాల నిధుల కోసం రుణాల వేటకు ప్రభుత్వం బలవంతంగా నెడుతున్నది. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థల నుండి బాండ్లరుణాలు సేకరించాలంటే నగ రాలు, పట్టణాలు అన్ని భారత స్టాక్ ఎక్చేంజ్ బోర్డు (సెబీ)లో నమోదు కావాలి. కంపెనీల వలే బాంబే స్టాక్ ఎక్చేంజ్‌లో లిస్ట్ కూడా కావాలి.అలాగే నగరా లు,పట్టణాలు ఎంతెంత రుణసామర్థ్యం కలిగి ఉన్నా యో ప్రతి ఏడాది క్రిసిల్,కౌర్,ఫిచ్,స్మేరా వంటి రేటిం గ్ సంస్థల నుండి క్రెడిట్ రేటింగ్ ర్యాంకులు పొం దాలి. క్రెడిట్ యోగ్యత కలిగిన రేటింగ్ ర్యాంకులు పొందాలంటే పట్టణ స్థానిక సంస్థలు పౌర సేవలపై యÖజర్ చార్జీలు విధింపు, స్థానిక పన్నులు పెంపు, మౌలిక సదుపాయాలు ప్రైవేటీకరణ వంటి పట్టణ సంస్కరణలు అమలు చేయాలి. ఇటువంటి పట్టణాలకు ఎక్కువ ర్యాంకులు ఇస్తాయి. అలా చేయని మున్సిపల్ సంస్థలకు క్రెడిట్‌కు అర్హతలేని దిగువ స్థాయి ర్యాంకులు ఇస్తాయి. అందువల్ల రుణాల కోసం తప్పనిసరిగా సంస్కరణలు అమలు చేయాల్సి వస్తుంది.
ఈ పథకంలో మరొకషరతు మున్సిపల్ రం గంలో స్వేచ్ఛగా ప్రైవేట్ పెట్టుబడులు పెట్టేందుకు ఆటంకంగా ఉన్న చట్టాలను మార్చేయాలి.పట్టణ ప్రణాళిక, జోనింగ్ విధానంలోనూ ప్రైవేట్ పెట్టుబడికి అనుకూలంగా మార్పులు చేయాలి. పట్టణ భూ (సర్టి| ˜¾కెట్ అఫ్ టైటిల్) చట్టాన్ని తీసుకొచ్చి భూమి వివరా లను డిజిటలైజేషన్ చేయాలి.టైటిల్ నెంబర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఇప్పటికే రాజస్థాన్‌లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.దేశంలో ఎక్కువ భాగం పట్టణ భూమి నిరర్థకంగా ఉందని,ముఖ్యంగా ప్రైవేట్ పెట్టు బడి ప్రవేశానికి మున్సిపల్ రెగ్యులేషన్స్,న్యాయ చట్టాలు తీవ్ర ఆటంకంగా ఉన్నాయని వాటిని మరిం త సరళతరం చేయాలని ప్రతిపాదించింది. భవనాల నిర్మాణ ఏరియా,ఎత్తైన భవనాల నిర్మాణానికి (ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్) ఉన్న ఆటంకాలను తొలగించాలి. అన్ని జోన్లలో ఎత్తైన భవనాల నిర్మాణాల అనుమ తులకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్‌లను అన్ని మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీలు సవరిం చాలి. పరిపాలనా పరమైన సంస్కరణలు సరళతరం చేయాలి. పాలనలో స్థానిక ప్రభుత్వాల పాత్ర, జోక్యం తగ్గించాలి.
స్థానిక సంస్థల పరిధిలో వసూలు చేసే పన్ను, పన్నేతర ఆదాయాలు బాగా పెంచుకోవాలి. ఉదాహ రణకు భారతదేశంలో అన్ని పట్టణ స్థానిక సంస్థల నుండి వసూలు అవుతున్న పన్ను, పన్నేతర ఆదాయా లు మొత్తం జిడిపిలో ఒక్కశాతం లోపే ఉంది. ఆస్తి పన్ను ద్వారా వస్తున్న ఆదాయం చూస్తే కేవలం 0.2 కన్నా తక్కువకే పరిమితమై ఉందని మోడీ ప్రభుత్వం పదే పదే వాపోతున్నది. అందువల్ల ఆస్తి పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని కనీసం జిడిపిలో ఒక్క శాతం స్థాయికి తీసుకు రావాలని నిర్ణయించింది.కోవిడ్ మహమ్మారి కాలంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు ఎరగా వేసి మున్సిపల్ సంస్థల్లో ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను మదింపు పద్ధతిని దేశ వ్యాప్తంగా అమలులోకి తెచ్చినవిషయం తెలి సిందే. ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తి పన్ను మదింపులో మార్పు తీసుకు రావడంతో పాటు ప్రతి ఏడాది 15 శాతం ఆస్తి పన్ను పెరిగేలా చట్టంలో మార్పు తీసుకొచ్చారు. చెత్త సేకరణపై కూడా యÖజర్ చార్జీల విధానం తీసుకొచ్చారు. ఇలా అన్ని రకాల పన్నులు భారీగా పెంచడం,పౌరసేవలన్నిటిపై వాటి నిర్వహణకు అయ్యే ఖర్చును యÖజర్ చార్జీల రూపంలో వసూలు చేయ డం,మౌలిక సదుపాయాల కల్పనకు అయిన వ్యయా న్ని, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఖర్చును పూర్తిగా ప్రజల నుండి వసూలు చేయాలి. పిపిపి లేదా రుణా లు, మున్సిపల్ బాండ్ల రూపంలో నిధులు తీసుకొచ్చి నెలకొల్పిన మౌలిక సదుపాయాలపై తిరిగి ఆ సొమ్మును చెల్లించడానికి ఆస్తి పన్ను,నీటి చార్జీల వంటి వాటి నుండి వచ్చే ఆదాయాన్ని ప్రత్యేక ఎస్క్రో అకౌం ట్‌లో వేసి అందులోంచి ఆటోమేటిక్‌గా చెల్లింపు జరిగే లా చర్యలు తీసుకోవాలి.
ఇపుడు ప్రధాన నగరాల చుట్టూ ఉన్న ప్రాం తాలను కలిపి ఆర్థిక రీజియన్ల నమÖనాను ముందుకు తీసుకొచ్చారు.దీనిలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చాలా వేగంగా ముందుకెళుతున్నది. ఇప్పటికే రాష్ట్రా న్ని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా మÖడు ఆర్థిక రీజియన్లను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మోడీ ప్రభుత్వం దీని అమలుకు పూను కున్నది. వీటిని దేశ ఆర్థికాభివృద్ధికి, వికసిత భారత్‌కు శోధక శక్తులుగా ఉంటాయని ప్రకటించారు. పట్టణ ఛాలెంజ్ నిధి పథకంలో ఈ నమÖనా అభివృద్ధికి కావాల్సిన నిధుల సమీకరణ గురించి ప్రస్పుటంగా పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకం కోసం అర్రులు చాస్తోంది. రాష్ట్ర బడ్జెట్‌లో అనేక పథకాలను దీంతో ముడిపెట్టింది. ఇప్పటికే విశాఖపట్నం, విజ యవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లలో రోడ్లను పిపిపి కింద ప్రైవేటీకరణ చేస్తోంది. మెడికల్ కాలేజీలను కూడా పిపిపి కిందకు తీసుకొస్తోంది.నగరాలు, పట్ట ణాలను క్లస్టర్లుగా విభజించి సంస్కరణలు అమలు చేస్తోంది.
స్థూలంగా పట్టణ ఛాలెంజ్ నిధి పథకం నగరాలు,పట్టణాలను అప్పుల ఊబిలోకి దించు తుంది. పట్టణ స్థానిక సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఇచ్చే గ్రాంట్ల నుండి పూర్తిగా వైదొలగను న్నాయి. ప్రైవేట్ పెట్టుబడుల కోసం పట్టణ మౌలిక సదుపాయాల్లో, మున్సిపల్ వ్యవస్థల్లో తీవ్ర మార్పులు, రకరకాల పన్నులు, యÖజర్ చార్జీల పెంపుతో పాటు ప్రజలపై పెను భారాలు మోపే సంస్కరణలు వేగంగా అమలుచేస్తారు. ఈ చర్యలు పట్టణ మున్సిపల్ స్వయం నిర్ణయాధికారాన్ని దెబ్బ తీయడమేగాక మొత్తం పట్టణ మున్సిపల్ వ్యవస్థలకే పెను ప్రమాదం తీసుకొస్తాయి. (ప్రజాశక్తి సౌజన్యంతో..) – డా॥ బి.గంగారావు

చెలమలో నీళ్లకోసం కిలోమీటర్ల దూరం నడక

మన్యంలో భూగర్భజలాలు అడుగంటడంతో దప్పిక తీర్చే నీటిచుక్కకోసం గిరిజన పల్లెలు అల్లాడి పోతున్నాయి. ఈ పల్లెల్లోని గిరిజన మహిళలు రెండు బిందెల మట్టి నిండిన నీళ్లకోసం అన్ని పనులూ మాను కుని కిలోమీటర్లు దూరం వెళ్తున్నారు.ఇప్పుడే కాదు, ప్రతీ వేసవిలో వీళ్లను నీటి కష్టాలు వెంటాడుతాయి.మురికి నీళ్లే తాగిరోగాల బారిన పడేలా చేస్తాయి.ఉత్తరాంధ్రలో పాడేరు,సీతంపేట,పార్వతీపురం ఐటిడి ఎలపరిధిలో మొత్తం 39మండలాలు 7వేలకు పైగా గ్రామాలు ఉన్నాయి.వీటిలో దాదాపు అన్ని గ్రామాల్లో నీటి సమస్య ఉంది.ఎక్కువ గ్రామాల్లో తాగు నీరు అందక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బిందె నీళ్లకోసం కిలోమీటర్ల దూరం నడుస్తున్నారు. బోర్లు పనిచేయకపోవడం, బావులు పాడుబడడంతో ఇక్కడి గిరిజనులు ఊట చెలమల్లో నీటిని,చివరకు పంటలకుపెట్టే నీటినే తాగిదప్పిక తీర్చుకుంటు న్నారు.- గునపర్తి సైమన్ 


భూగర్భజల శాఖ అధికారిక లెక్కలు కూడా ఈ మÖడు ఐటీడీఏల పరిదిలో భూగర్భ జలమట్టం తగ్గిపోయిందని చెబుతున్నాయి.2024మార్చిలో 5.5 మీటర్లున్న నీటిమట్టం ఈసారి 6.2మీటర్లకు పడి పోయింది.విశాఖ ఏజన్సీలోని గిరిజన గ్రామం పెదబ యలులో భూగర్భ జలాలు 8.5 మీటర్ల నుంచి 10 మీటర్ల లోతుకు చేరాయి.అరకులో కూడా ఇవి ఒక మీటరు వరకూ పడిపోయాయి. అటు విజయనగరం గిరిజన ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. కురుపాం, ఎస్ కోట మండలం బొడ్డవరల్లో దాదాపు రెండు మీటర్ల వరకూ భూగర్భ జలాలు పడిపోయాయి.ఇక వర్షపాతం కూడా అంతంతమాత్రంగానే ఉంది. శ్రీకా కుళంలో సాధారణ వర్షపాతం ఉంటే, విశాఖ, విజ యనగరం జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమో దైంది. ఇటీవల వరుసగా పెథాయ్, తిత్లి, ఫొనీ లాంటి వరుస తుపాన్లు వచ్చినా భూగర్భ జలమట్టంలో ఎలాంటి మార్పులూ రాలేదు.విశాఖపట్నం జిల్లా డుంబ్రిగూడ మండలం కొర్రాయి పంచాయితీలోని బురుడివలస, నిమ్మగడ్డ, లోగిలి గ్రామాలలో బీబీసీ పర్యటించింది. అక్కడ నీటి కోసం కిలోమీటర్లు నడిచివెళ్లే గిరిజన మహిళలను పలకరించింది.
నీటికోసం నడక
వారిలో గుడ్డి శాంతి అనే మహిళ “నీటి కోసం రెండు కిలోమీటర్లు నడవాలి.రోజులో ఎక్కువ సమయం నీటిని వెతుక్కోవడంలోనే సరిపోతుంది.ఇంక వేరే పనులు చేసుకోవడానికి ఉండడం లేదు. పిల్లలను స్కూలుకు కూడా తీసుకెళ్లలేని పరిస్థితి”ఉంది. రాణి “రోజూ నీటి కోసం మÖడు కిలోమీటర్లు నడుస్తు న్నాం.ఊర్లో బోర్లు ఉన్నా పనిచెయ్యడం లేదు. ఆఫీ సర్లకు చెప్పినా లాభం లేకుండా పోయింది” అన్నారు. 150 మంది ఉన్న బుడ్డివలసలో తాగునీటి కోసం కొట్టుకునే పరిస్థితి వస్తోందని మహిళలు చెప్పడం ఇక్కడ తాగునీటి సమస్య తీవ్రతను చెబుతోంది.” ఎండైనా,వర్షం ఉన్నా ఈబురద నీళ్లే తాగు తాం. దాంతో జ్వరాలు వస్తున్నాయి. కానీ వేరే దారిలేదు. ఆఖరికి ఈ నీళ్లు తాగి జ్వరాలు వచ్చినవాళ్లకు సాయం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాం”అని రాణి చెప్పారు.
అసలేంటి సమస్య?
ఏజన్సీ ప్రాంతాల్లో వాతావరణంభిన్నంగా ఉంటుంది. మైదానాల్లో ఉన్నట్టు కుళాయిలు, చెరువుల నుంచి పైపులైన్లు వేయడం చాలా కష్టం.కానీ ఇక్కడ తాగునీటి సౌకర్యం కల్పించడం అంతకష్టం కూడా కాదని స్థానికులు చెబుతున్నారు.”ఊటగడ్డల నీటి కోసం చెక్ డ్యాంలు నిర్మించి,బోర్లు, కుళాయిలు బాగు చేయిస్తే తక్కువ నిధులతోనే ఈసమస్య తీర్చవచ్చు”అని గిరిజన సంఘం నాయకుడు నరేంద్ర చెప్పా రు.”2014ఎన్ని కల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటింటికి 20లీటర్ల మంచినీళ్లు ఇస్తామని తెలుగుదేశంవాళ్లు హామీ కూడా ఇచ్చారు. ఇంటిం టికి కుళాయిలు వేస్తామన్నారు. కానీ అది ఎక్కడా జరగలేదు,.కనీసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసినా మా దప్పిక తీరు తుంది” అన్నారు.
ప్రభుత్వం ఏం చేస్తోంది?
ప్రస్తుతం ఏజెన్సీలో రాష్ట్ర ప్రభుత్వం క్రాష్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు గ్రామాల్లో ఉన్న హ్యాండ్ పంపులు, నీటి పథకాలను గుర్తించి మరమ్మతులు చేయిస్తు న్నారు.ఒక్క అరకు పరిధిలో ఇప్పటి వరకూ 82 పంపులను బాగుచేశామని వాటర్ వర్క్స్ ఇంజినీర్లు చెప్పారు.”వాటర్ గ్రిడ్ పధకం ఫేజ్-1 పనులు కూడా ఇప్పటికే ప్రారంభించారు. దీనికి సంబంధించి సర్వే కూడా పూర్తయింది.త్వరలో వాటర్ గ్రిడ్ ఫేజ్-2లో నీటిని అందిచే ప్రయత్నం చేస్తున్నాం. త్వరలో అన్ని గ్రామాలకు నీళ్లు అందిస్తాం” అని జూనియర్ ఇంజి నీర్ శ్రవణ్ చెప్పారు.
వ్యాపిస్తున్న రోగాలు
ప్రభుత్వం ఒకవైపు పనులు జరుగుతున్నాయని చెబుతుంటే, మరోవైపు కలుషిత నీటిని తాగడంతో మన్యంలో రోగాలు వ్యాపిస్తున్నాయి.కలుషిత నీటిని తాగడం వల్ల అమీబియాసిస్, విష జ్వరాలు, డయేరి యా వస్తున్నాయని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. ఇక నీటి కోసం ఎక్కువ సార్లు తిరగకుండా నిల్వ చేసుకుందామని అనుకుంటే మరో సమస్య ఎదురవు తోంది. నీటి నిల్వ వల్ల దోమలు చేరి మలేరియా వ్యాప్తిస్తోంది.దీంతో నీటిని కాచిచల్లార్చి తాగాలంటూ ప్రభుత్వ వైద్యులు ప్రచారం చేస్తున్నారు.”ఈనీళ్లు తాగడం వల్ల జ్వరాలు, డయేరియా కేసులు ఎక్కువ వస్తున్నాయి. అందుకే మేం అవగాహనా కార్యక్రమా లు చేపడుతున్నాం” అని అరకు ఏరియా హాస్పిటల్ డాక్టర్ బానుప్రియ చెప్పారు.
తవ్వకాలతోనే సమస్య
ఏజన్సీ ప్రాంతంలో ఎక్కువగా జరిగే తవ్వకాలు, పోడు వ్యవసాయం వల్లే మన్యంలో భూగర్భ జలాలు తగ్గుతున్నాయని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతు న్నారు.“మైనింగ్ వల్ల కొండలు మాయం అవుతున్నా యి దాంతో ఎక్కడా నీళ్లు నిలబడడం లేదు. ఇటు గిరిజనులు పోడు వ్యవసాయం కోసం చెట్లు ఎక్కువగా కొట్టేస్తున్నారు. పచ్చదనం లేకపోవడం వల్ల కూడా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. చెట్లకు నీటిని పట్టి ఉంచే గుణం ఉంటుంది. అవి లేక చెలమలు ఎండిపోతున్నాయి”అని వెత్త రత్నం చెప్పారు. “గతం లో పోడు వ్యవసాయం చేసే గిరిజనులు ఒక చెట్టు కొట్టేస్తే ఇంకో మొక్కను నాటేవారు. ఇప్పుడు అలా చేయడం లేదు.దాంతో ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి. తవ్వకాలు ఆపేయడంతోపాటు మొక్కలు ఎక్కువగా నాటడం వల్ల భూగర్భ జలాలు పెంచచ్చు” అన్నారు.‘60 శాతం గ్రామాలకు తాగు నీరుఅందించాం.ఇంకా40శాతంగ్రామాలకు అందిం చాలి’ఈ కథనంపై ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు సివేరి అబ్రహం స్పందిస్తూ.. రూ.100 కోట్లతో ఏజన్సీ ప్రాంతాల్లో తాగునీటి ప్రాజెక్టులను రూపొందించాం. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ట్యాంకులు నిర్మించాం. అయితే, భౌగోళికంగా ఏజన్సీలో భిన్నమైన వాతావరణం ఉండటంతో బోర్లు పడటం లేదు. అయినా, పడినచోట బోర్లకు సోలార్ సదుపాయం ఏర్పాటు చేశాం. 60 శాతం గ్రామాలకు తాగునీరు అందించాం. ఇంకా 40 శాతం గ్రామాలకు అందించాలి. వాటర్ గ్రిడ్ మొదటి దశ ఇప్పుడు నడుస్తోంది. మÖడో దశ నాటికల్లా అన్ని గ్రామాలకూ తాగునీరు అందిస్తాం” అని తెలిపారు.
అల్లూరి జిల్లా పాడేరు ప్రాంతాల్లో నీటికి కటకట
ఏజెన్సీ వ్యాప్తంగా 244 గ్రామ పంచాయతీల పరిధిలో 3,803 గ్రామాల్లో లక్షా 55 వేల 756 గిరిజన కుటుంబాలున్నాయి. వాటిలో 2,025 గ్రామాల్లో పూర్తిగా,1,778 గ్రామాల్లో పాక్షిక తాగునీటి సదు పాయాలున్నాయని అధికారుల రికార్డులు చెబుతు న్నాయి. అలాగే ఏజెన్సీలో ప్రస్తుతం అన్ని గ్రామాలకు ఏదో రకమైన తాగునీటి సదుపాయం ఉందనేది అధికారుల వాదన.కాగాఇప్పటికీ సగానికిపైగా పల్లెల్లో తాగునీటి కోసం గిరిజనులు ఇబ్బందులు పడుతున్నా రనేది జగమెరిగిన సత్యం. వేసవి నేపథ్యంలో తాగు నీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ వంటివి కాగితాలకే పరిమితమవ్వగా, నిధులు సక్ర మంగా విడుదల కాని పరిస్థితుల్లో జల్ జీవన్ మిషన్ వంటివి ఆచరణలోకి రాని దుస్థితి ఏర్పడింది. దీంతో అన్ని విధాలా గిరిజనానికి తాగునీటి కష్టాలు తప్పడం లేదు.
ఆశించిన ఫలితమివ్వని తాగునీటి పథకాలు
మన్యంలోని గిరిజనులకు తాగునీటి సదుపాయాలు కల్పించేందుకు 3,129 చేతి బోర్లు,2,200 సింగిల్ విలేజ్ తాగునీటి పథకాలు,10 బహుళ గ్రామ తాగు నీటి పథకాలు,750కి పైబడి సోలార్ నీటి పథకాలు న్నాయి.వాస్తవానికి ఏజెన్సీ వ్యాప్తంగా 3,803 గ్రామా లుండగా6,089 తాగునీటి(నీటి పథకాలు, బోర్లు) వనరులున్నాయి. అయినప్పటికీ సగానికిపైగా గిరిజన పల్లెల్లోని ప్రజలు గ్రామాలకు సమీపంలో ఉన్న ఊట గెడ్డలపైనే ఆధారపడుతున్నారు.గ్రామీణా నీటి సరఫరా విభాగం నిర్మిస్తున్న తాగునీటి పథకాలు నాణ్యతగా లేకపోవడంతో దీర్ఘకాలం పని చేయడం లేదనేది ప్రధాన ఆరోపణ.దీంతో నీటి పథకం నిర్మించిన ఒకటి లేదా రెండు సంవత్సరాల్లోనే మÖలకు చేరుతున్నది. ఫలితంగా గ్రామాల్లో నీటి పథకాలున్నా ప్రజలకు నీరందని దుస్థితి కొనసాగుతున్నది. అలాగే పల్లెల్లో నీటి పథకాలను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు నిర్మిస్తుం డగా, వాటి నిర్వహణ బాధ్యత పంచాయతీది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నుంచి పంచాయ తీలకు ఎటువంటి నిధులు లేకపోవడంతో తాగునీటి పథకాల వైపు పంచాయతీ యాజమాన్యం కన్నెత్తి చూసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎక్కడిక క్కడ తాగునీటి పథకాలు మరమ్మతులకు గురై మÖ లకు చేరుతున్నాయి. ఉదాహరణకు పాడేరు మండలం గబ్బంగి పంచాయతీ పసనపల్లి గ్రామంలో 2018లో రూ.18.50 లక్షల వ్యయంతో తాగునీటి పథకాన్ని నిర్మించారు.కానీ దానికి సరైన నిర్వహణ లేకపోవడం తో మÖలకు చేరింది. ఇలా ఏజెన్సీలో పదుల సంఖ్యలో నీటి పథకాలు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. ఇవే కాకుండా సోలార్ ఆధారంగా పని చేసే నీటి పథకాల పరిస్థితి మరీదా రుణం.వాటికి చిన్నపాటి మరమ్మతులు వచ్చినా పట్టించుకున్న దాఖ లాలు లేవు.దీంతో అనేక గ్రామా ల్లో తాగునీటి పథకా లున్నా వాటి నిర్వహణపై పాల కులు శ్రద్ధచూ పని కారణంగా నిరుపయోగంగా మారుతున్నాయి. ఫలి తంగా గిరిజనులు ఊటగెడ్డలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది.
మన్యం వాసులకు ఊటగెడ్డ నీరే ఆధారం
ఏజెన్సీలోని గిరిజన పల్లెలకు పక్కాగా రక్షిత నీటిని అందించని కారణంగా అధిక సంఖ్యలోని గిరిజన పల్లెల్లో ఊటగెడ్డలే ప్రధాన తాగునీటి వనరులుగా ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ఆర్‌డబ్ల్యూఎస్ అధికా రుల బాధ్యతా రాహిత్యం, పంచాయతీల్లో పాలన పడకేయడం వంటి కారణాలతో గిరిజనులకు గుక్కెడు నీరు దొరకని దుస్థితి కొనసాగుతున్నది. ముఖ్యంగా ఏజెన్సీలో మత్స్యగెడ్డను ఆనుకుని ఉన్న ముంచం గిపుట్టు, పెదబయలు, డుంబ్రిగుడ, జి.మాడుగుల మండలాల్లోని గిరిజన పల్లెల్లో స్థితి మరీ దారుణం. మత్స్యగెడ్డ తీరంలోని చెలమలు చేసుకుని నీటిని పట్టుకుంటున్నారు.ఇతర మండలాల్లో పంట పొలాలకు సమీపంలోని ఊటగెడ్డలను ఆశ్రయి స్తున్నారు.పెదబయలు మండలం బొడ్డగొంది, లింగేటి,పన్నెడ,గుల్లెలు, హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ పంతెలచింత, ముంచంగి పుట్టు మండలం చీపురుగొంది, దొరగూడ, డెంగా గుడ, కర్లాపొదర్ గ్రామాల్లోని గిరిజనులు దూర ప్రాంతంలోని ఊటగెడ్డల నుంచే నీటిని మోసుకు వస్తున్నారు. ఇలా ఏజెన్సీలో వందల సంఖ్యలో గిరి పల్లెల్లో దాహం కేకలు వేస్తున్నా పాలకులకు అవేవీ వినిపించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి గిరిజన పల్లెల్లోని తాగునీటి సమస్యలకు పరిష్కారం చూపి గిరిజనుల గొంతులు తడపాలని పలువురు కోరుతున్నారు.

గిరిజనులు భూమి హక్కుల పరిరక్షణ

భారతదేశం అత్యంత వైవిధ్యమైన గిరిజన జనాభాకు సాక్ష్యంగా ఉంది.ప్రతి తెగకు దానిస్వంత లక్షణం మరియు స్వభావం ఉంటుంది,తత్ఫలితంగా వేరేచికిత్స అవసరం.ఉదాహరణకు,మధ్య దేశం లేదా పశ్చిమ భారతదేశంలోని స్థానిక ప్రజల జీవితం మరియు పరిస్థితులు ఈశాన్య భారతదేశం మరియు అండమాన్‌లలోని తెగల స్థితికి భిన్నంగా ఉంటాయి.స్వాతంత్య్రానంతర భారత పరిపాలన దాని గిరిజన జనాభాను బాగా చూసుకున్నట్లు కనుగొనబడింది.                      - ఆర్యన్ మోహింద్రూ

1.భారతదేశంలో 18 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న 100మిలియన్లకు పైగా గిరిజనులు ఉన్నారు. కొన్ని రాష్ట్రాలలో గిరిజన సమÖహాలు మెజారిటీగా ఉన్నప్పటికీ (ఉదా. ఈశాన్య రాష్ట్రాలు), షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాలు అని పిలువబడే చిన్న మండలాల్లో ఇతర రాష్ట్రాలలో గిరిజన సమÖహాలు ఉన్నాయి. కేంద్ర మరియు రాష్ట్ర చట్టాల ద్వారా అమలు చేయబడిన గిరిజన జనాభా చికిత్సకు సంబంధించి భారతదేశం గణనీయమైన తనిఖీలు మరియు సమతుల్యతలను కలిగి ఉంది.భారతరాజ్యాంగం గిరిజనప్రయోజనాలను, ముఖ్యంగా వారి స్వయంప్రతిపత్తి,వారి భూమిపై హక్కులను కాపాడటానికి ప్రయత్నిస్తుంది.(భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 5& 6)

  1. ఇది దేశీయ సమÖహాలను దోపిడీ నుండి రక్షిం చడానికి మరియు వారి భూమిపై వారి హక్కులను పొందటానికి ఆదేశాలతో కూడిన సమగ్ర పథకాన్ని అందిస్తుంది. భారతదేశంలోని చాలా స్థానిక సమÖ హాలను సమిష్టిగా షెడ్యూల్డ్ తెగలు (ఆర్టికల్ 342 (1అండ2), భారత రాజ్యాంగం)
  2. 3.భారత రాజ్యాంగం ప్రకారం స్వయం నిర్ణయా ధికార హక్కుకు హామీ ఇవ్వబడింది. (పార్ట్X, భారత రాజ్యాంగం)
  3. 4.2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలోని షెడ్యూల్డ్ తెగలు భారతదేశ జనాభాలో దాదాపు 8.6శాతంఉన్నారు.
  4. 5.భారతదేశంలోని షెడ్యూల్డ్ తెగలకు చెందిన చాలా మంది సభ్యులు తమ జీవనోపాధి కోసం అడవులపై నేరుగా ఆధారపడి ఉన్నారు. సంవత్సరాల పోరాటం, వివక్ష,హింస తర్వాత,భారత ప్రభుత్వం 2006లో షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం ద్వారా అటవీ నివాస తెగల ప్రాథమిక హక్కులను క్రోడీకరిం చింది (అటవీ హక్కుల చట్టం`2006) భారతదేశంలోని షెడ్యూల్డ్ తెగలు అత్యంత అణగారిన జనాభాలో ఉన్నాయి. భారతదేశంలోని షెడ్యూల్డ్‌తెగల భూమిహక్కులను రక్షించడానికి పరిరక్షించడానికి,ఈకొత్త చట్టం ద్వారా వారికి అనేక హక్కులు కల్పించబడ్డాయి.
    భారతదేశంలోని స్వదేశీ ప్రజల భూమి హక్కులు
    అటవీ హక్కులచట్టం కింద గిరిజనులకు అందించబడిన హక్కులు భారతదేశంలోని స్థానిక ప్రజలచే అడవులలో భూమిని కలిగి ఉండటం, దోపిడీ చేయడం మరియు నివాసంపై వ్యక్తిగత మరియు సమాజ యాజమాన్యాన్ని పొందేందుకు ప్రయత్ని స్తాయి. ఈ హక్కులు తరతరాలుగా ఈ భూములలో నివసిస్తున్న మరియు గతంలో అలాంటి హక్కులు లేని అటవీ నివాసితుల షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసులకు ఉంటాయి. షెడ్యూల్డ్ తెగ,ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు అనే అటవీ నివాసం అంటే ఏమిటి? భారత చట్టం ప్రకారం,అటవీ నివాసి షెడ్యూల్డ్ తెగ అంటే భారత చట్టం ప్రకారం ఒక ప్రాంతంలో షెడ్యూల్డ్ తెగలుగా జాబితా చేయబడిన తెగల సమాజ సభ్యులు. ఇంకా, ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు కూడా అటవీ హక్కుల చట్టం కింద హక్కులను పొందేందుకు అర్హులు. ఇతర సాంప్రదాయ అటవీ నివాసులలో 13-12-2005 కి ముందు మÖడు తరాలు (75 సంవత్సరాలు) అటవీ భూమిలో నివసించిన మరియు వారి జీవనోపాధి అవసరాల కోసం అటవీ భూమిపై ఆధారపడిన సభ్యులు లేదా సంఘాలు ఉన్నాయి.
  5. ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు అటువంటి దావాను స్థాపించడానికి ఆధారాలు జనాభా గణన, సర్వేలు,మ్యాప్‌లు, నిర్వహణ ప్రణాళికలు మొదలైన ప్రజా పత్రాలు, ప్రభుత్వం అధికారం ఇచ్చిన గుర్తింపు పత్రాలు, న్యాయపరమైన మరియు పాక్షిక-న్యాయ రికార్డులు,ఇల్లు,గుడిసెలు వంటి భౌతిక లక్షణాలు, పెద్దల ప్రకటన మొదలైనవి.(నియమం13,ఖీ=A నియమాలు)
  6. ఈ ఆధారాలలో ఏవైనా రెండింటిని దావాను స్థాపించడానికి సమర్పించవచ్చు.అటవీ నివాస షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల హక్కులు
  7. 8 (సెక్షన్ 3,అటవీ హక్కుల చట్టంభూమి వినియోగం స్థానిక ప్రజలకు అనేక హక్కులు ఉన్నాయి, ముఖ్యంగా వారి భూమిని ఆక్రమించడం,ఉపయో గించడం గురించి. షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదా య నివాసితులు అటవీ భూమిని దాని వ్యక్తిగత లేదా సాధారణ స్వాధీనంలో నివాసం కోసం కలిగి ఉండ టానికి మరియు నివసించడానికి అర్హులు. షెడ్యూల్డ్ తెగ లేదా ఇతర సాంప్రదాయ అటవీ నివాసితులలోని ఏ సభ్యుడైనా తమ జీవనోపాధి కోసం భూమిని స్వయం సాగుకోసం ఉపయోగించుకునే హక్కు కూడా ఉంది.సాంప్రదాయ అటవీ నివాసులునిస్తార్ లేదా ఏ పేరుతో నైనా వారి సమాజ హక్కులను అమలు చేసు కునే హక్కునుకలిగి ఉంటారు,అలాంటి సమాజ హక్కు లను ప్రకటించవచ్చు,రాచరిక రాష్ట్రాలు,జమీం దారీ, ఇలాంటి పాలనలలో ఉపయోగించే వాటితో సహా.కొన్ని అటవీ ఉత్పత్తులపై యాజమాన్యం గిరిజన గ్రామంలో,వెలుపల సాంప్రదాయ కంగా సేకరించే చిన్న అటవీ ఉత్పత్తులపై కూడా అటవీ నివాసులకు యాజమాన్య హక్కు ఉంది.ఈ హక్కు అటువంటి ఉత్పత్తులను సేకరించడం,ఉప యోగించడం పారవేయడం వరకు విస్తరించింది. అటువంటి సందర్భాలలో చిన్న అటవీ ఉత్పత్తులలో వెదురు,బ్రష్‌వుడ్,తేనె,మైనం, ఆకులు, ఔషధ మొక్కలు మÖలికలు,వేర్లు వంటి మొక్కల నుండి ఉద్భవించే కలప కాని అటవీ ఉత్పత్తులు కూడా ఉంటాయి.
    సమాజ హక్కులు
    నివాసితులు చేపలు,నీటి వనరుల ఇతర ఉత్పత్తులను ఉపయోగించడంతో పాటు పాస్టోరల్ కమÖ్యనిటీల సాంప్రదాయ కాలానుగుణ వనరులను పొందడం వంటి ఇతర సమాజ హక్కులకు కూడా అర్హులు. స్థానిక ప్రజల హక్కులు వారి ఆవాసాల కమÖ్యనిటీ పదవీకాలానికి అలాగే స్థానిక అధికారం లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పట్టాలు లేదా లీజులు లేదా గ్రాంట్ల ను మార్చడానికి కూడా విస్తరిస్తాయి. ఇంకా,ఒక భూమి లేదాగ్రామం ఒకభాగం అటవీ హక్కుల చట్టం కింద చేర్చబ డనిచోట,షెడ్యూల్డ్ తెగలు ఇతర సాంప్ర దాయ అటవీ నివాసులు పరిపాలనా రికార్డుల ప్రయో జనంకోసం అన్ని అటవీ గ్రామా లను రెవెన్యూ గ్రామా లుగా స్థిరపడటానికి మరియు మార్చడానికి హక్కును కల్పిస్తుంది.ఏకారణం చేతనైనా ఏదైనా కమÖ్యనిటీ అటవీ వనరులను రక్షించి, పరిరక్షిస్తున్న తెగలు అటవీ నివాసుల విషయంలో, అటువంటి అటవీ వనరులను రక్షించడానికి, పునరుత్పత్తి చేయడానికి లేదా సంరక్షిం చడానికి స్థానిక సమÖహాలకు హక్కు ఉంది.
    జీవవైవిధ్యంపై హక్కులు
    జీవవైవిధ్యం లేదా సాంస్కృతిక వైవిధ్యానికి సంబంధిం చిన సాంప్రదాయ జ్ఞాన హక్కులను లేదా సమాజంగా జీవవైవిధ్యం లేదా మేధో సంపత్తిని పొందే హక్కును కూడా తెగలు కలిగి ఉన్నారు.చట్టంలో ప్రత్యే కంగా జాబితా చేయని ఇతర హక్కులుచట్టంలో జాబి తా చేయబడిన ఏవైనా హక్కులు గిరిజన సమÖ హాల విభిన్న అవసరాలను తీర్చనప్పుడు, వారు ఆచారంగా అనుభవిస్తున్న ఏదైనా సాంప్రదాయ హక్కును అనుభ వించవచ్చు, అడవి జంతువును వేటాడటం లేదా బంధించడం లేదా వాటి శరీరంలోని కొంత భాగాన్ని తీయడం వంటి సాంప్రదాయ హక్కు తప్ప.
    స్థానభ్రంశం విషయంలో పునరావాసం
    అంతేకాకుండా,13-12-2005 కి ముందు ఎటువంటి చట్టపరమైన ఉపశమనం పొందకుండా షెడ్యూల్డ్ తెగలు లేదా ఇతర సాంప్రదాయ అటవీ నివాసులను వారి అటవీ భూమి నుండి చట్టవిరు ద్ధంగా తరలించినట్లయితే, అటువంటి గిరిజనులకు ప్రత్యామ్నాయ భూముల ఏర్పాటుతో సహా పునరా వాసం పొందే హక్కు ఉంటుంది.చట్టం ప్రకారం, జాబితా చేయబడిన అన్ని హక్కులు వ్యక్తి మరియు సమాజం రెండింటికీ ఉద్దేశించబడ్డాయి. తత్ఫలితం గా, అటువంటి హక్కులను ప్రభుత్వం ఒక వ్యక్తి, సమÖహం లేదా గ్రామసభకు ఇవ్వవచ్చు. అదనంగా, కేంద్ర ప్రభుత్వం పాఠశాలలు, డిస్పెన్సరీలు, ఆసు| Ÿత్రులు, అంగన్‌వాడీలు, సరసమైన ధరల దుకాణాలు, టెలికమÖ్యనికేషన్ లైన్లు, నీటి వనరులు, కాలువలు, రోడ్లు,వృత్తి శిక్షణా కేంద్రాలు మొదలైన వాటి నిర్మాణం కోసం కొన్ని అటవీ భూమిని ఆక్రమించుకోవడానికి అవకాశం కల్పించవచ్చు.చట్టం ప్రకారం అందించబ డిన హక్కులు కొన్ని షరతులకు లోబడి ఉంటాయి. చట్టంలో అందించబడిన ఏవైనా హక్కులు 13-12-2005కి ముందు ఒక నిర్దిష్ట అటవీ భూమిని ఆక్ర మించిన నివాసితులకు మాత్రమే సంబంధించినవి. ఈ హక్కు, గిరిజన సమాజాల తరతరాలుగా వార సత్వంగా పొందుతుంది,
    అయితే, అటువంటి హక్కులు మీతోనే ఉంటాయి వేరొకరి ప్రయోజనం కోసం అమ లు చేయ బడవు. మీహక్కు గుర్తింపు కోసం మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే, గుర్తింపు లేదా ధృవీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు మిమ్మల్ని బలవంతంగా మీ భూమి నుండి తొలగించలేరు లేదా తొలగించ లేరు. అటు వంటి హక్కులను కలిగిఉన్న స్వదేశీ ప్రజలు అటు వంటి ప్రాంతాల వన్యప్రాణులు,అడవులు జీవ వైవి ధ్యాన్ని రక్షించాల్సిన బాధ్యతను కలిగి ఉంటారు. సమీప ప్రాంతాలు మరియు నీటి వనరులు తగినం తగా రక్షించబడుతున్నాయని నిర్ధారించు కోవాలి.వారి సాంస్కృతిక మరియు సహజ వారసత్వం పై ప్రభావం చూపే ఏవైనా విధ్వంసక పద్ధతుల నుండి వారు తమ నివాసాలను కూడా రక్షించుకోవాలి.(సెక్షన్ 21,అటవీ హక్కుల చట్టం).
    గ్రామ సభ బాధ్యతలు
    గ్రామసభ తన అధికార పరిధిలోని స్థానిక పరిమితుల్లో వ్యక్తి లేదా కమÖ్యనిటీ అటవీ హక్కుల పరిధిని నిర్ణయించే ప్రక్రియను అమలు చేసే బాధ్య తను కలిగి ఉంది. అటవీ హక్కుల క్లెయిమ్‌ను దాఖలు చేయడానికి, క్లెయిమ్‌లను గ్రామసభ పిలిచి అటవీ హక్కుల కమిటీ ఆమోదించవచ్చు, ఇక్కడ అందించిన ఫారమ్‌లో సరిగ్గా నింపాలి (అనుబంధంI చూడండి). ఈ ప్రక్రియలో గ్రామసభ క్లెయిమ్‌లను స్వీకరించడం, వాటిని ఏకీకృతం చేయడం మరియు క్లెయిమ్‌లను ధృవీకరించడం,వారి అధికార పరిధి యొక్క భౌగోళిక సరిహద్దులపై వాటిని మ్యాప్ చేయడం జరుగుతుంది.
    అటువంటి ధృవీకరణ తర్వాత, గ్రామ సభ అటువంటి క్లెయిమ్‌ల ప్రభావం గురించి ఒక తీర్మా నాన్ని ఆమోదించవచ్చు మరియు దాని కాపీని అటవీ హక్కుల చట్టం అమలును పర్యవేక్షించడానికి ఏర్పాటు చేయబడిన సబ్-డివిజనల్ స్థాయి కమిటీకి పంప వచ్చు.ఈ ప్రక్రియను మÖడు నెలల్లోపు నిర్వహిం చాలి,అలా చేయడంలో విఫలమైతే, గ్రామసభ లిఖితపూర్వకంగా కారణాలను అందించాలి. (నియ మం 11(1)(ఎ) ఖీ=Aనియమాలు)) 10 గ్రామ సభ నిర్ణయంతో బాధపడే ఏ వ్యక్తి అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్-డివిజనల్ స్థాయి కమిటీ ముందు పిటిషన్ దాఖలు చేయవచ్చు. కమిటీ నుండి అప్పీళ్లను జిల్లా స్థాయి కమిటీ ముందు దాఖలు చేయవచ్చు మరియు అక్కడినుండి రాష్ట్రస్థాయి కమిటీకి పంపవచ్చు. (సెక్షన6,అటవీ హక్కుల చట్టం)
    ముగింపు
    షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర స్వదేశీ సమÖహాల హక్కులు వారి భూహక్కులకే పరిమితం కాదు మరియు రిజర్వేషన్లు, వివక్ష,దురాగతాల నివారణ వంటి ఇతర రాజ్యాంగ హామీలకు కూడా వర్తిస్తాయి.
    అయితే, స్వాతంత్య్రానంతర భారత దేశంలో అటవీ నివాసి గిరిజనులు గణనీయంగా దోపిడీకి గురయ్యారు మరియు ఆధునిక సమాజంతో వారికి సంబంధం లేకపోవడం వల్ల వారి లక్ష్యం తరచుగా విస్మరించబడింది. తత్ఫలితంగా, అటువంటి తెగలు తమ నివాస స్థలంలోవారి జీవితాలను నిలబెట్టు కోవ డానికి పరిపాలన లేదా ప్రైవేట్ వ్యక్తుల దోపిడీని ఎదుర్కొనే ప్రమాదం లేకుండా అదనపు రక్షణను అందించడం చాలా కీలకం. అటువంటి సమÖహాల చికిత్సపై తనిఖీలు మరియు సమతుల్యతలను ఉంచ డాని¿,వారి భూమి,దానిలోని వనరులపై వారి హక్కు ను భద్రపరచడానికి అటవీ హక్కుల చట్టం కీలకమైన చర్యగా పనిచేస్తుంది.ఈచట్టం గ్రామస్థాయిలో గ్రామ సభ ద్వారా నిర్వహించబడుతుంది, తద్వారా వారి రోజువారీ జీవనోపాధి మరియు జీవనోపాధి కోసం సజావుగా అందుబాటులో ఉండే రక్షణ పాలనను నిర్ధారిస్తుంది.
    సోర్సున్యాయ బ్లాగ్ : ఆర్యన్ మోహింద్రూ కోల్‌కతాలోని చీUజీSలో విద్యార్థి మరియు విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ చొరవ అయిన కౌటిల్య సొసైటీ సభ్యుడు. అభిప్రాయాలు వ్యక్తిగతం.

జనావాసాల్లో జంతువులు

అడవుల్లో ఉండాల్సిన వన్య మృగాలు కొంత కాలంగా జనావాసాల బాట పడుతున్నాయి. దీంతో జనపథాలుగొల్లుమంటున్నాయి.తెగించి ఎదురునిలిచినా, తెలియక ఎదురుపడినా బతుకుపై భరోసా లేనట్టే. దీంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీయాల్సిన స్థితి. చిత్తూరు జిల్లాల్లో ఏనుగు దాడిలో ముగ్గురు మరణిం చినా,తిరుమల కొండల్లో అభం శుభం తెలియని పసిపాప చిరుతకు బలైనా, వందలాది ఎకరాల్లో పంటపొలాలు ధ్వంసమైనా.. ఆ మÖల నుండి ఈ మÖల వరకు ప్రతిరోజూ రాష్ట్రంలో ఏదో ఒకప్రాంతంలో వన్యమృగాలు సంచరిస్తు న్నట్లు వార్తలు వస్తున్నా కారణం ఒక్కటే.. అది మృగాలకి, మనుషులకి మధ్య పెరుగుతున్న ఘర్షణ. అనివార్యంగా మారుతున్న మనుగడ పోరాటం. ఎక్కడో కాకులు దూరని కారడవుల్లో ప్రశాంతంగా తమ మానాన తాము బతికే పులులు, చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్లు నుండి వివిధ రకాల వన్యమృగాలు జనారణ్యంలోకి ఎందుకు వస్తున్నాయి? మనకు సమస్యగా ఎందుకు మారుతు న్నాయి? ఈ సంఘర్షణకు పరిష్కారం లేదా? అసలీ దుస్థితికి కారణం ఏమిటి? దీనిపై ఈ వారం ప్రత్యేక కథనం.. .-తిరుపతి రెడ్డి మద్దిగెడ్డ


వన్య మృగాలు జనావాసాల్లోకి రావడమనేది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన సమస్యేమీకాదు. అటవీ ప్రాంతాలకి సమీపంలో ఉండే గ్రామాల ప్రజలకు వన్యమృగాలు తారసపడటం అనేది సహజమే. అయి తే, అది మృగాలకు మనుషులకు మధ్య ఘర్షణగా మారే సందర్భాలు మాత్రం అరుదు. పొరపాటున గ్రామాల్లోకి వన్యమృగాలు వచ్చినా, మనిషి తారస పడగానే అవి వెనక్కి తగ్గేవి. అనివార్యంగా జనావా సాలను దాటాల్సి వచ్చినా.. సాధ్యమైనంత మేరకు మనిషి కంటపడకుండా వెళ్లిపోతాయి. అడవులకు సమీపంలో నివసించే చెంచులను, గిరిజనులను అడిగితే ఇటువంటి సంఘటనలను కోకొల్లలు చెబుతారు. కొన్ని సంవత్సరాలుగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. కిలోమీటర్ల దూరం జనావాసాల్లోకి వన్యమృగాలు వచ్చేస్తున్నాయి. ఆ మేరకు మనుషులకు మృగాలకు మధ్య జరుగుతున్న ఘర్షణలూ పెరుగు తున్నాయి. జంతువుల దాడుల్లో మనుషులు, మను షుల దాడుల్లో జంతువులు మరణిస్తున్న సంఘటనలూ పెరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2021 నుండి 2025 సంవత్సరాల మధ్య కాలంలో వన్యమృగాల బారిన పడి రాష్ట్రంలో 139మంది మరణించారు. మృతులలో పురుషులే ఎక్కువ. ఏ జంతువుల బారిన పడి ఈ మరణాలు చోటుచేసు కున్నాయి అన్నది ఎన్‌సిఆర్‌బి అధికారికంగా ప్రకటిం చలేదు. అయితే, అటవీ, పోలీస్ అధికారులు చెబు తున్న సమాచారం ప్రకారం ఏనుగులు, ఎలుగుబంట్ల దాడుల కారణంగానే ఈమరణాలు చోటుచేసు కున్నాయి. ఇటీవల కాలంలో చర్చనీయాంశమైన చిరు తలు,పులుల దాడుల్లో మనుషులు మృతి చెందిన సంఘటనలు దాదాపుగా లేవనే చెప్పవచ్చు. ఇటీవల తిరుమలలో జరిగిన దురదృష్టకర సంఘటన దీనికి మినహాయింపు. రాష్ట్రంలో రెండు మÖడు జిల్లాలు ఏనుగుల గుంపుల బారిన తరచూ పడుతున్నట్లు ఎన్‌సిఆర్‌బి నివేదికలను పరిశీలిస్తే అర్థమవుతోంది. సంవత్సరానికి సుమారుగా 30 మంది వన్యమృగాల బారిన పడి, ప్రాణాలు కోల్పోతున్నారు. 2018 సంవత్సరంలో 31 మంది, 2019లో 25 మంది, 2020లో 32మంది మరణించారు. అనధికారికం గా మరికొన్ని సంఘటనలూ చోటుచేసుకుని ఉండ వచ్చు. శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు, ఎలుగుబంట్ల దాడులు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. నాలుగు ఏనుగుల మంద ఈప్రాంతంలో తిరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. మన్యం పార్వతీపురం జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఆరు ఏనుగులు కనిపించాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో గడిచిన ఐదు సంవ త్సరాల కాలంలో ఏనుగుల దాడిలో ఆరుగురు రైతులు మరణించారు.వీటిని బంధించడానికి వచ్చిన ఒక ట్రాకర్ కూడా మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం జిల్లా లో ఐదు సంవత్సరాల కాలంలో పదిమంది రైతులు మరణించినట్లు సమాచారం. విజయనగరం జిల్లాలో గత ఏడాది పెద్ద పులుల సంచారం కలకలం రేపగా, ఈఏడాది శ్రీకాకుళం జిల్లాలో కూడా పెద్దపులి కనిపించినట్లు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారాయి.కౌండిన్య వైల్డ్‌లైఫ్ శాంచురీ నుండి చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లోకి ఏనుగుల రాకపోకలు కొనసాగుతున్నాయి. తమిళనాడు, కర్నాటక నుండి కూడా ఈ ప్రాంతంలోకి ఏనుగులు వస్తున్నాయి. ఇలా వచ్చిన ఓఒంటరి ఏనుగు బారిన పడి,చిత్తూరు జిల్లా లో కొద్దిరోజుల క్రితం ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే.

మృగాల సంగతేంటి …
మనిషికి మృగాలకు మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలో నష్టపోతున్నది మనిషేనా..? ‘కాదు..మృగాలు కూడా’ అన్నది ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటికే కొన్ని జంతువుల ఊసు కూడా లేకుండా నిర్మూలన జరి గింది. ఇది మనం చేసిన పనే. చీతా దీనికి ఉదాహ రణ.మన దేశంలో చీతాల జాతి పూర్తిగా అంతరిం చిపోవడంతో విదేశాల నుండి దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే.అధికారిక లెక్కలప్రకారం 2018 -19 నుండి 2020-21వరకు దేశవ్యాప్తంగా 222 ఏనుగులు విద్యుద్ఘాతంతో చనిపోయాయి.రైళ్లు ఢీ కొన డం వల్ల 45,వేటగాళ్ల కారణంగా 29, విషాహారం తినడంవల్ల 11ఏనుగులు మరణించాయి.విద్యు ద్ఘాతం వల్ల చోటుచేసుకున్న ఏనుగుల మరణాల్లో ఒడిశా మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 41 ఏనుగులు కరెంటు షాక్ కారణంగా మరణించాయి. ఆ తరువాత స్థానాల్లో తమిళనాడు (34)అస్సోం (33) ఉన్నాయి.ఈకాలంలోనే ఏనుగుల దాడుల వల్ల దేశవ్యాప్తంగా1579 మంది మరణించారు.ఈ తరహా మరణాల్లో ఒడిశా మొదటిస్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో ఏనుగుల దాడి కారణంగా మÖడు సం వత్సరాల్లో 322మంది చనిపోయారు.291 మర ణాలతో జార్ఖండ్, 240మరణాలతో పశ్చిమ బెంగాల్, 229 మరణాలలో అస్సోం ఆతరువాత స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో పాత అనంతపురం జిల్లాలోని మడకశిర సమీపంలోవిషాహారం తిని,మృతి చెందిన రెండు చిరుతల మృతదేహాలు దొరికాయి. చిత్తూరు జిల్లాలోని రామకుప్పం సమీపంలో ఒక చిరుత అస్తి పంజరం లభించింది.
ఏనుగు.. మనిషి..
ఏనుగుల దాడిలో మరణించిన మనుషులు 2019-2020లో 585 అయితే, 2020-2021లో 461, 2021-22లో 533మంది.రైలు ప్రమాదాల్లో ఏను గులు 2019-2020లో19,అయితే,2020-2021లో 14, 2021-22లో 12 మరణించాయి. విద్యాద్ఘాతం వల్ల ఏనుగులు 2019-2020లో 81 అయితే, 2020-2021లో 76, 2021-22లో 65 మృతి చెందాయి. వేటగాళ్ల వల్ల ఏనుగులు 2019-2020లో6, అయితే, 2020-2021లో 9, 2021-22లో 14మరణించాయి. విషాహారం వల్ల ఏనుగులు 2019-2020లో 6,అయితే, 2020-2021లో 9, 2021-22లో 14 మృత్యువాత పడ్డాయి.
పెద్ద పులుల సంగతి కూడా ఇంతే.2019-21 మధ్య 29 పులులు వేటగాళ్ల బారిన పడి మృతి చెందాయి. మరో 197 మరణాలకు కారణాలు నిర్ధారణ కావాల్సి ఉంది. అదే సమయంలో 125 మంది దేశ వ్యాప్తంగా పులుల బారిన పడి మరణించారు. వీటిలో సగానికి పైగా మహారాష్ట్రలో చోటుచేసుకున్న సంఘటనలే. ఆ మÖడేళ్ల కాలంలో మనరాష్ట్రంలో పులులు, చిరు తల కారణంగా ఒక్క మరణం కూడా రికార్డు కాలేదు. పులుల కారణంగా 2019-20లో50మంది చనిపోతే,2020-21లో 44మంది మృత్యువాత పడ్డారు.2021-22లో31మంది చనిపోవడం జరిగింది. సహజంగా మరణించిన పులులు 19-20లో 44అయితే, 20-21లో 20,21-22లో కేవలం నాలుగు మాత్రమే. వల వేయడం వల్ల, బోన్లు పెట్టిన కారణంగా19-20లో 6, 20-21లో 9 అయితే, 21-22లో 14పులులు మరణించాయి. అసహజంగా చూసినప్పుడు ఈ క్రమంలో 3,0,2 చనిపోయాయి. పరిశీలనలో ఉన్న పులల మరణాల సంఖ్యను పరిశీలిస్తే 19-20లో 22, 20-21లో 71, 21-22లో 104 నమోదయ్యాయి. వేటగాళ్లకు చిక్కి మరణించిన పులుల సంఖ్య ఈ వరుసలోనే 10,7,13గా ఉంది.
ఎందుకీ స్థితి..
ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంట్ పోగ్రాం (యు ఎనఇపి), వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యుడబ్య్లుఎఫ్) సంయుక్తంగా 2021జులైలో విడుదల చేసిన ‘ఏ ఫ్యూచర్ ఫర్ ఆల’ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తం గా ఉన్న పులుల జాతుల్లో 75 శాతానికి ప్రమాదకర పరిస్థితుల్లో మనుగడ సాగిస్తున్నాయి. అలాగే ధృవపు ఎలుగుబంట్లు, ఏనుగులు, సీల్స్ వంటి ఉభయచరాలు, పెద్ద సంఖ్యలో సరీసృపాలు మనుగడ సమస్యను ఎదు ర్కొంటున్నాయి. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, వన్యమృగాల వ్యాపారం, మౌలిక వసతుల పేరిట అడవుల విధ్వంసాన్ని ఈ పరిస్థితికి కారణంగా ఆ నివేదికలో పేర్కొన్నారు.వాతావరణ మార్పుల సంగతి అలా ఉంచితే,మన రాష్ట్రంలోనూ, దేశం లోనూ ఇతర అంశాల ప్రభావం ఎక్కువగా కనిపి స్తోంది. దేశంలో పెద్ద ఎత్తున అడవుల నిర్మూలన జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం గతంలో అధికారి కంగా ప్రకటించిన గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తం గా నమోదైన అడవులు (రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా) 77.53 మిలియన్ హెక్టార్లలో వ్యాపించి ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు (ఐఎసఎఫఆర్) -2021 ప్రకారం మొత్తం నమోదైన అటవీభూమిలో ప్రస్తుతం 51.66 మిలియన్ హెక్టార్లలో మాత్రమే అడవులు ఉన్నాయి. మరి మిగిలిన 25.87 మిలియన్ హెక్టార్ల (ఆరు కోట్ల 39లక్షల ఎకరాలు) అటవీ భూమి ఏమైనట్టు తగ్గినట్టే కదా..!ఈ భూమి ఏమైంది? ఎవరైనా ఆక్రమించారా?అభివృద్ధి పేరుతో కంపెనీలకు కేటాయించారా?అన్న ప్రశ్నలకు ఆ నివేదిక జవాబు ఇవ్వలేదు.ఈ పరిణామం మన రాష్ట్రంతో పాటు, పొరుగు రాష్ట్రాల్లోనూ కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌లో 13,01,900 హెక్టార్ల (సుమారుగా 31 లక్షల ఎకరాలు) లోని అడవులు మాయమ య్యాయి. ఇది మొత్తం రికార్డెడ్ అటవీభూమిలో సుమారుగా 35 శాతం. తెలంగాణలో 8,99,200 హెక్టార్లు (33 శాతం) రికార్డెడ్ భూమిలోని అడవులు తగ్గాయి. తమిళనాడులో 5,65,7000 హెక్టార్లు (25 శాతం) కర్నాటకలో 15,73,600 హెక్టార్లు (41 శాతం), ఒడిశాలో 28,51,000 హెక్టార్లు (46.59 శాతం) రికార్డైన అటవీభూమిలో ప్రస్తుతం అడవులు కనిపించడం లేదు. ఇంత పెద్ద మొత్తంలో అడవులు మాయమవుతున్నాయి కాబట్టే వన్య మృగాలకు జనావాసాల్లోకి రాక తప్పని స్థితి ఏర్పడుతోంది. మన పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, కర్ణాటకలో 40 శాతానికి పైగా రికార్డెడ్ ఫారెస్ట్ భూమి తగ్గడం ఈ సందర్భంగా గమనార్హం. కరోనా సమయంలో అనేక ప్రాంతాల్లో వన్యమృగాల సంచారం పెరిగిందని, తరువాత కాలం లో దానినే అలవాటుగా చేసుకున్నాయన్న వాదన కూడా ఉంది. అప్పట్లో లాక్‌డౌన్ కారణంగా వాహ నాలతో పాటు మనుషుల రాకపోకలను నియంత్రిం చిన సంగతి తెలిసిందే. దీంతో వన్యమృగాలు స్వేచ్ఛగా తిరిగాయి. వివిధ దేశాల్లో ఉన్న నిపుణులు కలిసి సంయుక్తంగా అకడమిక్ జర్నల్ ‘సైన్స’లో ఇటీవల ప్రచురించిన అధ్యయనం ప్రకారం సాధారణంగా తిరిగే దానికన్నా రెట్టింపు విస్తీర్ణంలో కరోనా సమ యంలో వన్యమృగాల కదలికలు నమోదయ్యాయి. ఏనుగులు, ఒంటెలు, ఎలుగుబంట్లు, జింకలు వంటి 43 విభిన్న జాతులకు చెందిన 2,300 జంతువులును ట్రాక్ చేసి, ఈ నిర్ధారణకు వచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు.ఆసమయంలోనే మానవ నివాస ప్రాంతాల్లో సులభంగా ఆహారం దొరకడాన్ని గమనించిన వన్యమృగాలు ఆ తరువాత కూడా దానికే ప్రయత్నిస్తున్నాయని, అందువల్లే జనావాసాలకు సమీపంగా వస్తున్నాయని అంటున్నారు.
తిరుమలలో పరిష్కారం ఏమిటి?
శేషాచల అడవుల్లో ఎర్రచందనం చెట్ల నరికివేత పెద్ద ఎత్తున కొనసాగుతోంది. నరికివేత సమయంలో స్మగ్ల ర్లు చేస్తున్న వివిధ కార్యక్రమాలతో వన్యమృగాలు చెల్లాచెదురవుతన్నాయని, వీటిలో కొన్ని తిరుమల మెట్ల మార్గంవైపు వస్తున్నాయని కొందరు చెబుతున్నారు. కరోనా సమయంలో అలవాటు కావడం ఒక కారణం గా చెప్తున్నారు. దానితో పాటు ఆ తరువాత యాత్రి కుల నుండి సులభంగా ఆహారం అందుతుండటంతో కొన్ని రకాల వన్యమృగాలు మెట్ల మార్గం వైపు వస్తున్నా యనేది మరొక కారణం. వాటిని వెంబడించి చిరుతల వంటి జంతువులు కూడా వస్తున్నాయని మరికొందరు చెబుతున్నారు.టిటిడి అధికారిక లెక్కల ప్రకారం రోజుకు 2 నుండి 3 టన్నుల వృథా అయిన ఆహారప దార్థాలను మెట్లదారి మీద వదిలివేస్తున్నారు. దీనిలో అధికభాగాన్ని సేకరిస్తున్నా, ఇంకా పెద్దఎత్తున మిగిలి పోతోంది. వీటికోసం జింకలు, అడవికుక్కలు వస్తు న్నాయి. యాత్రికులు పారేసే పండ్లు, వాటి తొక్కల కోసం ఎలుగుబంట్లు కూడా మెట్ల దారి వద్దకు వస్తు న్నాయి. ఈ ప్రాంతంలోనే ఉన్న జింకల పార్కును టిటిడి ఇటీవలే మÖసివేసింది. అయినప్పటికీ యాత్రి కుల నుండి సులభంగా లభించే ఆహారానికి అలవాటు పడ్డ జింకలు ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాయి. వీటికోసం వస్తున్న చిరుతలు యాత్రికులకు ప్రమాదక రంగా మారుతున్నాయి. దీనిని అధిగమించడానికి ఫెన్సింగ్ వేయాలన్న డిమాండ్ భక్తుల నుండి పెద్ద ఎత్తున వస్తోంది.ఈప్రతిపాదనను అటవీశాఖతో పాటు పర్యావరణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. ఫెన్సింగ్ వన్య మృగాలు స్వేచ్ఛగా తిరగడానికి ఆటంకంగా మార నుండటమే దీనికి కారణం. అదే జరిగితే భవిష్యత్‌లో మరింత తీవ్ర పరిణామాల చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా వన్యమృగాల స్వేచ్ఛకు ఆటంకం కలిగించకుండా ఉండే అండర్ పాస్,ఓవర్‌పాస్ నిర్మాణాలు ఉన్నాయి. ఇప్పటికే వివిధ దేశాల్లో ఈతరహా నిర్మాణాలు ఉన్నాయి. మన దేశం లోనూ ముంబయి-నాగపూర్ ఎక్స్‌ప్రెస్‌వే (బాలసా హెబ్ థాక్రే సమృద్ధి మహామార్గ్) లో వన్యమృగాల కోసం ప్రత్యేకంగా ఫ్లైఓవర్‌లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో తొమ్మిది గ్రీన్‌బ్రిడ్జిలు (ఓవర్‌పాస్),17అండర్‌పాస్‌లు ఉండనున్నాయి. మన దేశంలో ఈ తరహా నిర్మాణం ఇదే మొదటిది. దీనికి కొంత ఖర్చు ఎక్కువ అయినప్పటికీ, టిటిడికి నిధుల కొరత లేని విషయం తెలిసిందే. తిరుమలలోనే కాదు. నల్లమలతో పాటు రాష్ట్రంలో అటవీ ప్రాంతాల మీదు గా రహదారులు వేయాల్సిన ప్రతిచోటా ఈ విధానాన్ని అమలు చేయవచ్చు.
పరిష్కారం ఏమిటి..
మనుషులకు, వన్యప్రాణులకు మధ్య తలెత్తుతున్న ఈ ఘర్షణను సాధ్యమైనంత మేరకు తగ్గించవచ్చు. అయితే, ఈ దిశలో చొరవ చేయాల్సింది మనుషులే. స్థానిక ప్రజలను ఈ కృషిలో భాగస్వాముల్ని చేయడం ద్వారా అనేక దేశాలు ఈ సమస్యను సాధ్యమైనంత మేర తగ్గించాయి. స్థానిక ప్రజలకు వన్యమృగాలు, వాటి కదలికలు, ఆహారపు అలవాట్ల మీద అవగాహన కల్పించడం ద్వారా భయాన్ని పొగొట్టి, అవసరమైన జాగ్రత్తలు నేర్పడమన్నది దీనిలో మొదటిదశ. ఆ తరువాత పరిరక్షణకు సంబంధించిన పనుల్లో వారిని భాగస్వాముల్ని చేయాలి. ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రాం (యుఎనఇపి) కూడా దీనినే ధృవీకరించింది. స్థానిక సమాజాలను ఈ కృషిలో భాగస్వాముల్ని చేయడం ద్వారా పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం సాధ్యమవుతుందని, సుస్థిరాభివృద్ధికి బాటలు వేస్తుందని పేర్కొంది. రాష్ట్ర అటవీశాఖ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శాంతిప్రియ పాండే కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఈ దిశలో రాష్ట్రంలో అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. అదే సమయంలో గ్రామస్తులు తమ నివాస ప్రాంతాల పరిసరాల్లో వన్యమృగాల కదలికలను దాచిపెట్టే పొదలు లేకుండా చూసుకోవాలని, పెంపుడు జంతువులను నివాసాలకు దగ్గరగా ఉంచుకోవాలని చెప్పారు. ఆహారవ్యర్థాలను ఎక్కడబడితే అక్కడ పారవేయడం కూడా వన్యమృగాలను ఆకర్షిస్తోందని, ఈ పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. మన రాష్ట్రంలో 73 పెద్దపులులు ఉన్నాయని ఒక అంచనా. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి, పోయే వాటిని మినహాయిస్తే 50-53 మధ్యే వీటి సంఖ్య ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. 2018 గణాంకాల ప్రకారం మన రాష్ట్రంలో 1492 చిరుతలు ఉన్నాయి. ఇటీవల కాలంలో చర్చనీ యాంశంగా మారిన శేషాచలం అడవుల్లో 40 నుండి 50 చిరుతలు మాత్రమే తిరుగుతున్నాయని అంచనా. కేంద్ర ప్రభుత్వం తాజాగా (2023) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏనుగుల సంఖ్య రాష్ట్రంలో 70నుండి 80లోపే. ఇంత తక్కువ సంఖ్యలో ఉన్నా యి కాబట్టే..వీటి పరిరక్షణ కీలకంగా మారింది. ప్రకృతిలో సమతుల్యాన్ని కాపాడాలంటే జీవవైవి ధ్యాన్ని,పర్యావరణాన్ని రక్షించడం తప్ప నిసరి.

1 2