అర్బన్ ఛాలెంజ్ ఫండ్`పట్టణాలకు ముప్పు

“కేంద్ర బిజెపి ప్రభుత్వం పట్టణాల్లో మంచి నీరు, మురుగు నీరు, పారిశుధ్యం,ఘన వ్యర్థాల నిర్వ హణ,ఇతర మౌలిక సదుపాయాలు పెంపొందిం చేందుకు, పట్టణా లను ఆర్థికవృద్ధికి చోదక శక్తులుగా, సృజనాత్మక పునరా భివృద్ధి కేంద్రాలుగా నిర్మించడం పేర అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యు.సి.ఎఫ్) పథకాన్ని ప్రకటించింది. 2026 నుండి 2031 వరకు ఐదేళ్లపాటు ఈ పథకం అమలులో ఉం టుంది. ఈ పథకాన్ని ప్రపంచ బ్యాంకు అనుబంధ సంస్థ అయిన ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎ.డి.బి) రూపొందిం చింది. వాస్త వంగా దీనిని 2025-26 బడ్జెట్‌లోనే ప్రవేశ పెట్టారు. ఎ.డి.బి రుణాన్ని మంజూరు చేయక పోవడంతో అమల్లోకి రాలేదు.2026-27బడ్జెట్‌లో తిరిగి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకానికి దశల వారీగా రాబోయే ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేంద్ర ప్రభుత్వా నికి ఎ.డి.బిరుణం రూపంలో ఇస్తుంది. దీని అమలును కూడా ఎ.డి.బి ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తుంది.”
దేశ పట్టణ జనాభా2036 నాటికి 40 శాతా నికి చేరుతుందని,స్థూలజాతీయోత్పత్తిలో 70 శాతానికి పట్టణాలు,నగరాలు ప్రాతినిధ్యం వహిస్తాయని, రాబో యే 15 ఏళ్లలో దేశంలో పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కనీసం రూ.75లక్షలకోట్లు (840బిలియన్ డాలర్లు) పెట్టుబడులు అవసరమని ప్రపంచబ్యాంకు భారత దేశ పట్టణ మౌలిక సదుపా యాలపై 2022లో విడుదల చేసిన నివేదిక తెలి పిందని తాజాగా విడుదల చేసిన 2025-26ఆర్థిక సర్వే పేర్కొ న్నది. అంటే ఏడాదికి సుమారు రూ.4.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలని,ఇది స్థూలజాతీయ ఉత్పత్తి (జి.డి.పి)లో1.2శాతంగా ఉంటుందని, ఇంత పెట్టుబడి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెట్ట లేవని, ప్రైవేట్ మార్కెట్ ఫైనాన్స్ నుండి సమీకరించు కోవాలని మోడీ ప్రభుత్వం చెబుతున్నది.
ఇప్పుడు యు.సి.ఎఫ్‌పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పట్టణస్థానిక సంస్థలకు మౌలిక సదుపా యాల కల్పనకు ఇచ్చే గ్రాంట్ల నుండి వైదొలగి బహి రంగ మార్కెట్ నుండి రుణాలద్వారా నిధులు సేక రించుకొని మౌలిక సదుపాయాలు చేపట్టాలని ఆదేశిస్తున్నది.ఈపథకం పెద్దపెద్ద నగరాలకే పరి మితం కాదు.దేశంలో ఉన్న అన్ని నగరాలతో పాటు మొత్తం 4,223 టైర్ 1, టైర్ 2 పట్టణాలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేశారు.చిన్న చిన్న పట్టణాలకు ప్రత్యేకంగా ప్రైవేట్ మార్కెట్ నుండి రుణాలు సేకరించుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో ప్రత్యేకంగా మార్కెట్ సంస్థలకు రిస్క్ హామీగా రూ.5 వేల కోట్లరుణ హామీ నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నది.
పట్టణ ఛాలెంజ్ నిధి మొత్తం రూ.4లక్షల కోట్లుగా నిర్ణయించారు.రాబోయే ఐదేళ్లలో పట్ట ణాల్లో ఖర్చు పెట్టాలి.ఈమొత్తం నిధిని కేంద్ర ప్రభు త్వం ఇవ్వదు. ఇందులో కేవలం25శాతం (రూ.లక్ష కోట్లు)మాత్రమే ఇస్తుంది.మిగిలిన రూ. మÖడు లక్షల కోట్ల నిధులు సమకూర్చు కోవటా నికి కొన్నిషరతులు విధించింది.రూ.4లక్షల కోట్లలో కనీసం 50శాతం నిధులను ప్రైవేట్ రుణాల ద్వారా,మున్సిపల్ బాండ్లు, ప్రభుత్వ,ప్రైవేట్ భాగస్వామ్యం(పిపిపి) రూపంలో సమకూర్చు కోవాలి.మిగిలిన 25శాతం అనగా రూ. లక్ష కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, పట్టణ స్థానిక సంస్థలు భరించాలి లేదా వీటిని కూడా రుణాలు,బాండ్ల రూపం లో సమకూర్చుకోవాలి.ఈ పథకంలో మౌలిక సదుపా యాలను తప్పనిసరిగా ప్రభుత్వ, ప్రైవేట్, భాగస్వా మ్యంలో చేపట్టాలి.
గత రెండున్నర దశాబ్దాల నుండి ప్రపంచ బ్యాంక్ ఆదేశిత సంస్కరణలు పట్టణ రంగంలో తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పట్టణ రంగంలో అమలు చేసిన వివిధ పథకాలకు తప్పనిసరిగా ప్రైవేటు రుణం తీసుకోవాలని, కార్పొరేట్ బాండ్లు సేకరించాలని, పిపిపి కింద ప్రాజెక్టులు చేపట్టాలని షరతులు లేవు. 2005-12 మధ్య అమలు చేసిన జవహర్‌లాల్ నెహ్రూ పట్టణ ఆధునీకరణ మిషన్ (జె.ఎన్.ఎన్. యు.ఆర్.ఎం)గాని, 2015-25 మధ్య అమలు చేసిన స్మార్ట్ సిటీ పథకంలో గానీ ఈ నిబంధనలు తప్పనిసరి చేయలేదు. జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎంలో కేంద్రం 70 శాతం,రాష్ట్రాలు, పట్టణ స్థానికసంస్థలు 30శాతం గాను,స్మార్ట్ సిటీ పథకంలో కేంద్రం50శాతం, రాష్ట్రాలు 50 శాతం నిధులు భరించేలా రూపొందించి అమలు చేశాయి. అయితే ఇవి కూడా సంస్కరణతో ముడిపెట్టి అమలు చేసినవే.
దేశంలో నేటికి పెద్దపెద్ద మెట్రోపాలిటిన్ నగరాలు మాత్రమే ప్రభుత్వ బ్యాంకుల నుండి పరిమిత స్థాయిలోనే రుణాలు, మున్సిపల్ బాండ్ల రూపంలో నిధులు సేకరిస్తున్నాయి. ఇప్పటివరకు మున్సిపల్ బాండ్ల రూపంలో దేశంలో 10 నగరాలు మాత్రమే రుణాలు సేకరించాయి.2018లో రాష్ట్రంలో చంద్ర బాబు నాయుడు ప్రభుత్వం కూడా అమరావతి బాండ్స్ పేర రెండు వేలకోట్లు రుణం సమీకరిం చింది.ఈ రుణాలు మొత్తం కూడా రూ.3,783 కోట్లు మాత్రమే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పట్టణ స్థానిక సంస్థలు నిధుల కోసం ఆధారపడకుండా మార్కెట్ రుణాలు, మున్సిపల్ బాండ్ల రూపంలో సేకరించుకోవాలని షరతులు విధించింది. అలా సేకరించుకుంటేనే కేంద్ర ప్రభు త్వం ప్రాజెక్ట్ వ్యయంలో 25 శాతం గ్రాంట్ ఇస్తుంది. ఈ బాండ్లను కూడా బడా కార్పొరేట్ సంస్థల నుండి సేకరించే నగర పాలక సంస్థలకు నగదు ప్రోత్సాహ కాలు కూడా ప్రకటించింది. ఉదాహరణకు ఏదైనా నగర పాలక సంస్థ రూ.1000కోట్ల విలువగల ఒకే మున్సిపల్ బాండ్‌ను కార్పొరేట్ సంస్థల నుండి సేకరిస్తే ఆ నగర పాలక సంస్థకు రూ.100కోట్ల ప్రోత్సాహక నిధిని ఇస్తామని తెలిపింది.
దేశంలోని పట్టణాలన్నింటినీ మౌలిక సదు పాయాల నిధుల కోసం రుణాల వేటకు ప్రభుత్వం బలవంతంగా నెడుతున్నది. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థల నుండి బాండ్లరుణాలు సేకరించాలంటే నగ రాలు, పట్టణాలు అన్ని భారత స్టాక్ ఎక్చేంజ్ బోర్డు (సెబీ)లో నమోదు కావాలి. కంపెనీల వలే బాంబే స్టాక్ ఎక్చేంజ్‌లో లిస్ట్ కూడా కావాలి.అలాగే నగరా లు,పట్టణాలు ఎంతెంత రుణసామర్థ్యం కలిగి ఉన్నా యో ప్రతి ఏడాది క్రిసిల్,కౌర్,ఫిచ్,స్మేరా వంటి రేటిం గ్ సంస్థల నుండి క్రెడిట్ రేటింగ్ ర్యాంకులు పొం దాలి. క్రెడిట్ యోగ్యత కలిగిన రేటింగ్ ర్యాంకులు పొందాలంటే పట్టణ స్థానిక సంస్థలు పౌర సేవలపై యÖజర్ చార్జీలు విధింపు, స్థానిక పన్నులు పెంపు, మౌలిక సదుపాయాలు ప్రైవేటీకరణ వంటి పట్టణ సంస్కరణలు అమలు చేయాలి. ఇటువంటి పట్టణాలకు ఎక్కువ ర్యాంకులు ఇస్తాయి. అలా చేయని మున్సిపల్ సంస్థలకు క్రెడిట్‌కు అర్హతలేని దిగువ స్థాయి ర్యాంకులు ఇస్తాయి. అందువల్ల రుణాల కోసం తప్పనిసరిగా సంస్కరణలు అమలు చేయాల్సి వస్తుంది.
ఈ పథకంలో మరొకషరతు మున్సిపల్ రం గంలో స్వేచ్ఛగా ప్రైవేట్ పెట్టుబడులు పెట్టేందుకు ఆటంకంగా ఉన్న చట్టాలను మార్చేయాలి.పట్టణ ప్రణాళిక, జోనింగ్ విధానంలోనూ ప్రైవేట్ పెట్టుబడికి అనుకూలంగా మార్పులు చేయాలి. పట్టణ భూ (సర్టి| ˜¾కెట్ అఫ్ టైటిల్) చట్టాన్ని తీసుకొచ్చి భూమి వివరా లను డిజిటలైజేషన్ చేయాలి.టైటిల్ నెంబర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఇప్పటికే రాజస్థాన్‌లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.దేశంలో ఎక్కువ భాగం పట్టణ భూమి నిరర్థకంగా ఉందని,ముఖ్యంగా ప్రైవేట్ పెట్టు బడి ప్రవేశానికి మున్సిపల్ రెగ్యులేషన్స్,న్యాయ చట్టాలు తీవ్ర ఆటంకంగా ఉన్నాయని వాటిని మరిం త సరళతరం చేయాలని ప్రతిపాదించింది. భవనాల నిర్మాణ ఏరియా,ఎత్తైన భవనాల నిర్మాణానికి (ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్) ఉన్న ఆటంకాలను తొలగించాలి. అన్ని జోన్లలో ఎత్తైన భవనాల నిర్మాణాల అనుమ తులకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్‌లను అన్ని మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీలు సవరిం చాలి. పరిపాలనా పరమైన సంస్కరణలు సరళతరం చేయాలి. పాలనలో స్థానిక ప్రభుత్వాల పాత్ర, జోక్యం తగ్గించాలి.
స్థానిక సంస్థల పరిధిలో వసూలు చేసే పన్ను, పన్నేతర ఆదాయాలు బాగా పెంచుకోవాలి. ఉదాహ రణకు భారతదేశంలో అన్ని పట్టణ స్థానిక సంస్థల నుండి వసూలు అవుతున్న పన్ను, పన్నేతర ఆదాయా లు మొత్తం జిడిపిలో ఒక్కశాతం లోపే ఉంది. ఆస్తి పన్ను ద్వారా వస్తున్న ఆదాయం చూస్తే కేవలం 0.2 కన్నా తక్కువకే పరిమితమై ఉందని మోడీ ప్రభుత్వం పదే పదే వాపోతున్నది. అందువల్ల ఆస్తి పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని కనీసం జిడిపిలో ఒక్క శాతం స్థాయికి తీసుకు రావాలని నిర్ణయించింది.కోవిడ్ మహమ్మారి కాలంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు ఎరగా వేసి మున్సిపల్ సంస్థల్లో ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను మదింపు పద్ధతిని దేశ వ్యాప్తంగా అమలులోకి తెచ్చినవిషయం తెలి సిందే. ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తి పన్ను మదింపులో మార్పు తీసుకు రావడంతో పాటు ప్రతి ఏడాది 15 శాతం ఆస్తి పన్ను పెరిగేలా చట్టంలో మార్పు తీసుకొచ్చారు. చెత్త సేకరణపై కూడా యÖజర్ చార్జీల విధానం తీసుకొచ్చారు. ఇలా అన్ని రకాల పన్నులు భారీగా పెంచడం,పౌరసేవలన్నిటిపై వాటి నిర్వహణకు అయ్యే ఖర్చును యÖజర్ చార్జీల రూపంలో వసూలు చేయ డం,మౌలిక సదుపాయాల కల్పనకు అయిన వ్యయా న్ని, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఖర్చును పూర్తిగా ప్రజల నుండి వసూలు చేయాలి. పిపిపి లేదా రుణా లు, మున్సిపల్ బాండ్ల రూపంలో నిధులు తీసుకొచ్చి నెలకొల్పిన మౌలిక సదుపాయాలపై తిరిగి ఆ సొమ్మును చెల్లించడానికి ఆస్తి పన్ను,నీటి చార్జీల వంటి వాటి నుండి వచ్చే ఆదాయాన్ని ప్రత్యేక ఎస్క్రో అకౌం ట్‌లో వేసి అందులోంచి ఆటోమేటిక్‌గా చెల్లింపు జరిగే లా చర్యలు తీసుకోవాలి.
ఇపుడు ప్రధాన నగరాల చుట్టూ ఉన్న ప్రాం తాలను కలిపి ఆర్థిక రీజియన్ల నమÖనాను ముందుకు తీసుకొచ్చారు.దీనిలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చాలా వేగంగా ముందుకెళుతున్నది. ఇప్పటికే రాష్ట్రా న్ని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా మÖడు ఆర్థిక రీజియన్లను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మోడీ ప్రభుత్వం దీని అమలుకు పూను కున్నది. వీటిని దేశ ఆర్థికాభివృద్ధికి, వికసిత భారత్‌కు శోధక శక్తులుగా ఉంటాయని ప్రకటించారు. పట్టణ ఛాలెంజ్ నిధి పథకంలో ఈ నమÖనా అభివృద్ధికి కావాల్సిన నిధుల సమీకరణ గురించి ప్రస్పుటంగా పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకం కోసం అర్రులు చాస్తోంది. రాష్ట్ర బడ్జెట్‌లో అనేక పథకాలను దీంతో ముడిపెట్టింది. ఇప్పటికే విశాఖపట్నం, విజ యవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లలో రోడ్లను పిపిపి కింద ప్రైవేటీకరణ చేస్తోంది. మెడికల్ కాలేజీలను కూడా పిపిపి కిందకు తీసుకొస్తోంది.నగరాలు, పట్ట ణాలను క్లస్టర్లుగా విభజించి సంస్కరణలు అమలు చేస్తోంది.
స్థూలంగా పట్టణ ఛాలెంజ్ నిధి పథకం నగరాలు,పట్టణాలను అప్పుల ఊబిలోకి దించు తుంది. పట్టణ స్థానిక సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఇచ్చే గ్రాంట్ల నుండి పూర్తిగా వైదొలగను న్నాయి. ప్రైవేట్ పెట్టుబడుల కోసం పట్టణ మౌలిక సదుపాయాల్లో, మున్సిపల్ వ్యవస్థల్లో తీవ్ర మార్పులు, రకరకాల పన్నులు, యÖజర్ చార్జీల పెంపుతో పాటు ప్రజలపై పెను భారాలు మోపే సంస్కరణలు వేగంగా అమలుచేస్తారు. ఈ చర్యలు పట్టణ మున్సిపల్ స్వయం నిర్ణయాధికారాన్ని దెబ్బ తీయడమేగాక మొత్తం పట్టణ మున్సిపల్ వ్యవస్థలకే పెను ప్రమాదం తీసుకొస్తాయి. (ప్రజాశక్తి సౌజన్యంతో..) – డా॥ బి.గంగారావు