పరిశోధన దివిటీ తెలగాణా గిరిజనుల సంస్కృతి

నేలతల్లి ముద్దుబిడ్డలు! అడవి తల్లి వరపుత్రులు!! ఈ నేలకు తొలి హక్కుదారులు!!! పంచభూతాలకు ఆది సాక్షులు!!!! అడవి బిడ్డలు అనబడే గిరిజనులు.వీరి జీవనం,సంస్కృతులు,ఎలా విలక్షణమైనవో వీరిపై వస్తున్న పరిశోధనలు అంతే ప్రత్యేకమైనవి… అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతిక శాఖ వారు వెలువరించిన “తెలంగాణ గిరిజనుల సంస్కృతి…”పుస్తకం,డా:మామిడి హరికృష్ణ సంపాదకత్వంలో పరిశోధక రచయిత్రి ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ తెలుగు శాఖ అధ్యక్షులు వాచస్పతి ఆచార్య కె.కుసుమారెడ్డి దీనిని వ్రాసారు,ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అనుసరించి తెలంగాణ రాష్ట్రంలో గుర్తించబడిన 32గిరిజన తెగల లోని ప్రసిద్ధమైన తెగలను ఎంపిక చేసుకుని సాధికారికంగా, సోదాహరణంగా,సశాస్త్రీయంగా ఈ పుస్తకంలోపొందుపరిచారు,ఎరుకలి,చెంచు, లంబాడి,కోయ,కొండరెడ్లు,నాయకపోడు,గోండు, కోలామీ,తోటి,ప్రధాన్‌ల యొక్క జీవన సంస్కృతుల గురించి ఇందులో క్షుణ్ణంగా వివరించబడింది.
ప్రాచీన చారిత్రక ప్రదేశాలలో గిరిజనుల స్థానంతో పాటు,తెలుగు సాహిత్యంలో గిరిజనుల ప్రస్తావనలు… మహాభారతం నుంచి శశాంక విజయం, వరకు గల కావ్యాలలో గిరిజనుల గురించిన వివరాలు ఆయా రచయితలు పేర్కొన్న తీరు సహేతుకంగా వివరిం చడంలో రచయిత్రి కుసుమగారి కృషి అభినంద నీయం.తెలంగాణ గిరిజనులు-భౌగోళిక, చారిత్రక,సాహిత్య పరిచయం,తెలంగాణలోని వివిధ రకాల గిరిజనులు, అని రెండు విభాగాలుగా విభజించి,తిరిగి మొదటి విభాగంలో ఐదు ఉపవిభాగాలు, రెండవ విభాగంలో 11ఉప విభాగాలుగా విభజించి విషయ వివరణ చేయడం జరిగింది.
గిరిజనుల మÖలాలను పరిశీలించినప్పుడు వీరందరూ హిందూ సాంప్రదాయానికి చెందినవారు అని| ¾స్తుంది.వారి పుట్టుకకు మÖలం లక్ష్మీదేవి,పార్వతి, ఆది శక్తి,కాళికా దేవతలని,వారివారి పురాణాల్లో చెప్పుకుం టున్నప్పటికీ అందరి మÖలం ఒకటే అని అర్థం అవుతుంది.లక్ష్మీదేవికి జన్మించిన ఐదుగురు కొడుకుల్లో ముగ్గురు శాపగ్రస్తులై, చెంచులు, కోయలు, యానాది, గిరిజన జాతులుగా మారినట్టు నాయకపోడు పురాణ గాథలో పేర్కొన్న విషయం ఇందులో చెప్పబడింది. ఇక ఎరుకలు దక్షిణ దేశము నుంచి లంబాడాలు ఉత్తర దేశం నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడినట్టు చెబుతూ..చారిత్రక పరిశీలనలో గిరిజనులు రాజ్య పాలకులుగా ఉన్న విషయం గుర్తు చేశారు.శాత వాహన రాజులు అంత గిరిజన జాతికి చెందిన వారు కాగా హనుమకొండ ప్రాంతాన్ని ఎరుకలు పాలిం చినట్లు శాసనాలవల్ల తెలుస్తున్నట్లు,గోండ్వానా ప్రాం తాన్ని గోండులు పాలించిన విషయం.నాయక పోడులు పద్మనాయకులుగా ప్రోలయ నాయకుని నాయకత్వంలో పరిపాలన చేసిన విషయం కూడా ఇందులో పేర్కొన్నారు, ఉత్తరదేశంలో రాజపుత్రులుగా పరిపాలన చేసి ముస్లింల దండయాత్రలతో పాలన కోల్పోయి వలస వచ్చి తెలంగాణ ప్రాంతంలో లంబా డాలుగా నివసిస్తున్నట్టు పేర్కొంటూ.. గిరిజన తెగల్లో భేదాలకు గల ప్రధాన కారణాలు మత విశ్వాసం, సంగీత, నృత్యాలు, సంగీత వాద్యాలు, అని ఇందులో తెలియజేయడం జరిగింది.
వివిధ గిరిజన తెగలకు చెందిన వారు అంతా కలిగి ఉండే విశిష్టతలను సైతం వివరించి అందుకు గల కారణాలను అందించారు.ప్రకృతిని ఆరాధించటం సమిష్టి కృషి ఐకమత్యం జీవితంలో ప్రతి విషయాన్ని సామÖహిక పండగలుగా నిర్వహించుకోవడం అడవి బిడ్డల విశిష్టతలలో ప్రధానంగా చెప్పడం జరిగింది. రెండవ విభాగంలో తెలంగాణలోని గిరిజనుల రకాలు జీవన విధానం మొదలు… ఆహారం, ఆభరణాలు, వస్త్రధారణ, ఆర్థిక న్యాయవ్యవస్థలు, మత విశ్వాసాలు, జాతరలు, పండుగలు, నృత్యాలు, సంగీత వాద్యాలు, వివాహం, చావు, తదితర అంశాలను సచిత్రంగా విభాగాలు వారీగా సమగ్రంగా అందించారు. సాధార ణంగా గిరిజనులు కొన్ని కొన్ని ప్రత్యేక ప్రాంతాలకే పరిమితమై విభిన్న పేర్లతో జీవనం సాగిస్తుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రం అంతటా విస్తరించి ఉన్న ఏకైక గిరిజన జాతి‘ఎరుకల’ ‘కుర్రు’ జాతికి చెందిన వీరిలో స్త్రీలు త్రికాల విషయాలు ‘సోది’ లేదా ‘ఎరుక’గా చెప్పే ప్రతిభ కలిగి ఉండటం వల్ల వారిని ఎరుక చెప్పేవారు…ఎరుకల వారు, అని పిలవడం పరిపాటయింది.
వీరి భాష ప్రత్యేక మాండలికంగా ఉంటుంది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన ఈ లిపిలేని ఎరుకల భాష తెలుగు,తమిళ,కన్నడ,భాషల మిళితంగా ఉం టుంది.కానీ తెలంగాణ ఎరుకల జాతి గిరిజనులు అందరూ అచ్చమైన తెలుగులోనే మాట్లాడుకుంటారు. వీరు వంశపారంపర్యంగా అనేక తెగలు వృత్తుల ఆధా రంగా వేరుపడ్డారు.
తట్టలు బుట్టలు తడికలు తయారు చేసేవారు ‘దబ్బ ఎరుకలు’ ముగ్గు అమ్మేవారు‘ముగ్గు ఎరుకలు’ గరిసెలు గాదెలు తయారు చేసేవారు‘కూటు ఎరుకలు’ పంట చేలు కాపలా కాసేవారు‘కావలిఎరుకలు’పాము లాడిం చేవారు‘పాములఎరుకలు’పిట్టలు కుందేళ్ళు ఉడుములు పట్టేవారు‘పిట్టల ఎరుకలు’అనే పేర్లతో పిలిచే ఎరుకల జాతి రకాలను తెలుపుతూ వారి జీవనవిధానం కట్టు బాట్లు చెప్పటం జరిగింది.
ఎరుకలి సామాజిక వర్గంలో ఎక్కువగా జరిగే మేనరి కపు వివాహాలు ‘రూకమాడ’అని ప్రత్యేకంగా పిలిచే నిశ్చితార్థం తంతులో మేనమామ తన నిరభ్యంతరం తెలపడం పెళ్లి ఖర్చులు మగ పెళ్ళి వారే భరించటం పెళ్లి సమయంలో వేసే పందిరి రాటలకు పుట్టమన్ను వేయడం వంటి ప్రత్యేక పనులు ఎరుకుల వారి పెళ్లి తంతుల్లో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఎరుకలలో విడాకుల సాంప్రదాయం ఉంది కుల పెద్దలు బంధు మిత్రులు సమక్షంలో పురుషుడు మర్రి లేదా వేప చెట్టుకు మÖడుసార్లు కసిగా గాట్లు వేయడంతో ఆభార్యాభర్తలకు ఎలాంటి సంబంధం ఉండదఅని తెలియజేయడం జరిగింది.వీరిలోని కురువంజి, కురువ,కోలాటం,నృత్యాలు ప్రధాన భూమిక వహిస్తా యి.అలాగే వీరు పాడుకునే పాటల గురించిన వివర ణలో పాటలతో పాటు వాటి అర్థ వివరణలు కూడా అందించారు.ఎరుకలవారి పాటల్లో భక్తి,మానవ సంబంధం,సామాజిక అంశాలు గల పాటలు అధికం గా ఉంటాయి. ఈపాటల్లో త్యాగయుతమైన స్త్రీ జీవి తం గమనించవచ్చు. తెలంగాణలోని నల్లమల అడవి ప్రాంతంలో జీవించే చెంచుజాతి గిరిజన జీవన తీరు గురించి చెబుతూ..వీరి సంతానంలో లింగ బేధం చూపించని వైనం, పగటిపూట మాత్రమే పెళ్లి చేసు కునే సంప్రదాయం,బహుభార్య విధానంతో పాటు అక్రమ సంబంధాలకు ఉండే కఠిన శిక్షల వివరాలు, చెంచులు మరణాన్ని సాధారణ ప్రక్రియ గా భావించే పద్ధతి, ఆ విభాగంలో సవివరంగా పొందుపరిచారు. తండాలుగా నివాసాలను ఏర్పాటు చేసుకొని జీవించే లంబాడీల గురించిన విభాగంలో సాధారణ అంశా లతో పాటు వారి నృత్యాలు,సంగీత వాద్యాల గురించి ప్రధానంగా పేర్కొన్నారు,వీటిలో నగారా,సారంగి, రబాబ్, వంటి ప్రత్యేక సంగీత పరికరాల వివరణలు అందించారు.తెలంగాణ రాష్ట్రంలోనే ప్రధానమైన “కోయ” జాతి గిరిజనుల గురించిన వివరణలో కోయ సంస్కృతి మÖలాలను తెలిపే కోయ పురాణ కథ ఇందులో ప్రత్యేకతను సంతరించుకుంది, వీరి కొమ్ముకోయ నృత్యం,రేల నృత్యంతో పాటు, పురుషులు మాత్రమే చేసే కుర్రె నృత్యం గురించి. వీరి ప్రధాన సంగీత వాద్యాలు అయిన తూతకొమ్ము, డోలీ,డోలు కొమ్ము,ల వివరణలు సచిత్రంగా అందించారు. కొండ ప్రాంతాల్లో పోడువ్యవసాయం జీవన వృత్తిగా చేసుకునే కొండ రెడ్డి గిరిజనుల గురించిన వివరణ విభాగంలో పంటల ఆధారిత పండుగలు,పండుగలు జాతర్ల సందర్భంగా చేసే మామిడికోత నృత్యం,సంగీత వాద్యాలైన గిల్ల,జౌజం,మొదలైన వాటి విశేషాలు మనం ఈవిభాగంలో చదవవచ్చు.గిరిజన సామాజిక వర్గాలకే ప్రముఖమైన ఘనమైన పాలనా చరితగల గోండులు వారి ఆశ్రిత కులం వారైనా ప్రధాన్‌లు గురించి చెబుతూ…అదే ఆదిలాబాద్ అడవుల్లో జీవిం చే కోలామీలు,ఆంధ్‌లు,తోటీలు,గురించిన జీవన చిత్రాలు సామాజిక కట్టుబాట్లు గురించిన వివరణలు మిగతా గిరిజన జాతులకు ఇచ్చినట్టే ఇచ్చారు.
పాండవులను కులదైవాలుగా భావించి పూజించే నాయకుడు గిరిజనుల సంస్కృతి వివరణలు సైతం అందించిన ఈ పరిశోధక విశ్లేషణ పుస్తకం ఆసాంతం అన్ని గిరిజన జాతులు నిక్కచ్చిగా హిందూ మతానికి లేదా హిందూ సమాజానికి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి ఆదివాసులు అక్షరాలా హిందూ బంధువులే అన్న నగ్న సత్యాలను ఆవిష్కరించింది.
తెలంగాణ గిరిజనుల సంస్కృతి (వ్యాస సంపుటి), సంపాదకులు: డా:మామిడి హరికృష్ణ, రచన: ఆచార్య కె .కుసుమారెడ్డి, పేజీలు: 178, వెల:250/-రూ, ప్రతులకు: రవీంద్ర భారతి, హైదరాబాద్ -4, ఫోను: 040- 29703142,

కొత్త విద్యుత్ విధాన కేంద్రం ఏం చేయనుంది?


త్వరలోనే దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో సమÖల మార్పులు చూడబోతు న్నా మా?నెలనెలా టారిఫ్‌లు మారతాయా? డిస్క మ్‌లపై ఒత్తిడి తగ్గనుందా?ఇప్పుడు ఈ చర్చ రావ డానికి ఓకారణం ఉంది.కేంద్ర విద్యుత్‌శాఖ జాతీయ విద్యుత్ నూతన విధాన ముసాయిదా లోని అంశాలే ఇవన్నీ. ఎప్పటి నుంచో విద్యుత్ రంగంలో ఉన్న సమస్యలను పరిష్క రించే దిశగా ఈ కొత్తడ్రాఫ్ట్‌ను సిద్ధం చేసింది కేంద్రం.విని యో గదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు నిర్దిష్టమైన లక్ష్యాలు సాధించేం దుకు ఇది ఎంతో ఉపకరిస్తుందని భావిస్తోంది. మరి ఈకొత్త ముసాయిదాలో ఏముంది?ఈమార్పులు చేయాల్సిన అవసరం ఏం వచ్చింది?
వికసిత్ భారత్‌లో భాగంగా
విద్యుత్ రంగంలోసంస్కరణలు తీసు కు రావాలి.పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉండాలి.నాణ్యమైన విద్యుత్ అంది స్తూ సుస్థిరాభివృద్ధి సాధించాలి.ఈ లక్ష్యాలను 2047 నాటికి చేరుకోవాలి. వికసిత్ భారత్‌లో భాగంగా వీటిని సాధించేందుకు సిద్ధమవుతోంది కేంద్ర విద్యుత్ శాఖ.విద్యుత్ రంగంలో ప్రస్తుతం ఉన్న కొన్ని సమస్యలు తీర్చడంతో పాటు పూర్తి స్థాయి లో మార్పులు తీసుకురావాలని చూస్తోంది. అందుకే ఇటీవల జాతీయ విద్యుత్ నూతన విధాన ముసాయిదా రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఈడ్రాఫ్ట్‌ను అన్ని రాష్ట్రాలకూ పంపిం చింది.అంతేకాదు వచ్చే నెల అంటే ఫిబ్రవరి 20వ తేదీలోగా తమ తమ అభిప్రాయాలు చెప్పాలని సూచించింది. ఆతరవాత దీనికి ఓతుదిరూపు తీసుకు రానుంది. ఈలోగానే ఈ ముసాయిదాపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
బడ్జెట్ ముందు ముసాయిదా
ఏటా ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.అయితే ఈ బడ్జెట్ సమావేశాలకు ముందు ఈ ముసాయిదా రూపొందించడం కీలకమైన విషయం. విద్యుత్ సవరణ బిల్లు ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా డిస్కమ్స్ ఆర్థిక పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను తగ్గిం చడంతో పాటు విద్యుత్ రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం పెంచాలన్నది డ్రాఫ్ట్ బిల్లు ప్రాథమిక లక్ష్యాలు. 20ఏళ్లకు సరిపడా ప్లానింగ్ సిద్ధంగా ఉండాలన్నదీ మరో ముఖ్యమైన అంశం. నిజానికి 2005లోనే ఈ విధానాన్ని నోటిఫై చేశారు. కానీ అప్పటి నుంచి పెద్దగా అమలు చేయలేదు. ఇప్పుడు ఆపాత విధానం స్థానంలో కొత్త ముసా యిదా తయారైంది. ఇదివిద్యుత్ రంగానికి దిశా నిర్దేశం చేసే అత్యంత కీలకమైన విధానంగా భావి స్తోంది కేంద్రం.2003నాటికి విద్యుత్ చట్టం ఆధారంగా ఇది అమలు కానుంది.
కీలక అంశాలెన్నో
ఈ జాతీయ విద్యుత్ నూతన ముసా యిదాలో ఎన్నో కీలక అంశాలున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే విద్యుత్ సరఫరాలో పోటీ పెంచడం.అంటే ఎక్కువగా ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించడం. అంతే కాదు. జాతీయ తలసరి వార్షిక వినియోగం ప్రస్తుతం 1300యÖనిట్ల వరకూ ఉంది.2030నాటికి దీన్ని 2వేల యÖనిట్లకు, 2047నాటికి 4వేల యÖనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర విద్యుత్ శాఖ. అయితే నాణ్యత విషయంలో మాత్రం రాజీ పడకుండా ఈలక్ష్యాన్ని సాధిం చాలని భావిస్తోంది. అదే సమయంలో బాధ్యతా యుతంగా విద్యుత్‌ను వాడే విధంగా చర్యలు చేపట్ట నుంది.వినియోగదారుల కేంద్రంగానే సేవలు అందించాలన్నది మరో ముఖ్యమైన అం శం. అదే విధంగా డిమాండ్‌కు సంబం ధించిన అంశాలనూ పరిశీలించాల్సి ఉంటుంది. అన్నింటి కన్నా కీలకంగా విద్యుత్ రంగంలో ఏదైనా ఇబ్బం దులు, వివాదాలు తలెత్తినప్పుడు వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించి వినియోగదారులపై భారం పడకుండా చూడాలన్నది ఈ బిల్లులో ఉన్న మరో అంశం. అంతే కాదు.డిస్కమ్‌లపై ఒత్తిడి తగ్గించ డంతోపాటు విద్యుత్‌రంగంలో పోటీపెంచే విధం గా మరి కొన్ని అంశాలనూ ఇందులో చేర్చారు.
డిస్కమ్‌లకు ఆర్థిక భరోసా
విద్యుత్ టారిఫ్‌లకుసంబంధించి కఠిన తరమైన నిబంధనలు పెట్టడం, డిస్కమ్‌లకు ఆర్థిక భరోసా అందించడం, విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయడం లాంటివి ఇందులో కీలకంగా ఉన్నాయి.ముందుగా టారి ఫ్‌ల గురించి చెప్పుకోవాలి. సాధారణంగా టారిఫ్ లలో మార్పులు పూర్తిగా స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యు లేటరీ కమిషన్స్ చేతుల్లో ఉంటుంది. కాకపోతే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొన్ని సార్లు విద్యుత్ టారిఫ్‌లు పెంచకుండా వదిలే స్తుంటాయి. ఈ కారణంగానే విద్యుత్ సంస్థలు నష్టాలు చవి చూడాల్సి వస్తోంది. ఈ సమస్య పరిష్కరించేందుకే కొత్త ముసాయిదాలో ఓ కీలక నిబంధన చేర్చింది విద్యుత్ శాఖ. విద్యుత్ ఛార్జీల సవరణలకు సం బంధించిన ఉత్తర్వులను ఆర్థిక సంవత్సరం మొద లు కాకముందే రెగ్యులేటరీ కమిషన్స్ తప్పని సరిగా జారీ చేయాల్సి ఉంటుంది. ఇక అంతకు ముందు ఏడాది సరఫరా వ్యయం ఎక్కువ అయ్యుంటే ఆ లోటును ప్రస్తుత ఆర్థిక సంవ త్సరంలో ట్రూఅప్ సర్‌ఛార్జీలతో పేరుతో వసూలు చేసి భర్తీ చేసుకోవాలి.ఈఆర్థిక సంవత్సరం నుంచే ఇదంతా అమల్లోకి రావాలి.
క్రాస్ సబ్సిడైజేషన్
ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే డిస్కమ్‌లను నష్టాల ఊబిలో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు చీజుP 2026లో కొన్ని ముఖ్య మైన అంశాలు చేర్చింది విద్యుత్ శాఖ. ఇది కూడా టారిఫ్‌లతో ముడిపడి ఉన్న విషయమే. చాలా సందర్భాల్లో విద్యుత్ సరఫరా వ్యయం కన్నా టారిఫ్‌లు చాలా తక్కువగా ఉంటున్నాయి.ఈ కారణంగానే డిస్కమ్‌లకు నష్టాలు తప్పడం లేదు. లోటు భర్తీ చేసుకునేందుకు పరిశ్రమలు, వాణిజ్య పరమైన వినియోగదారులకు ఉత్పత్తి వ్యయం కన్నా ఎక్కువ మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తారు. ఇక వ్యవసాయం సహా గృహావసరాలకు సబ్సిడీ విద్యుత్ అందిస్తారు. దీన్నే క్రాస్ సబ్సిడైజేషన్ అంటారు.కానీ ఇలా చేయడంవల్ల విద్యుత్ ఉత్ప త్తి సంస్థలు నష్టాలు మÖటగట్టుకుంటున్నాయి. అందుకే ఇకపై క్రాస్ సబ్సిడైజేషన్ పూర్తిగా తొల గించాలని ఈముసాయిదా ప్రతిపాదిస్తోంది. 50% కన్నా టారిఫ్‌లు తక్కువ ఉండకూడదని తేల్చి చెప్పింది. అంతే కాదు.టారిఫ్‌లు ఏటా ఆటో మెటిక్‌గా రెన్యువల్ అయ్యే విధంగా చర్యలు తీసు కోవాలనీ స్పష్టం చేసింది కేంద్ర విద్యుత్ శాఖ.
యÖనివర్స్ సర్వీస్ ఆబ్లిగేషన్
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 1 మెగావాట్ కన్నా ఎక్కువ విద్యుత్ అవసరం ఉన్న విద్యుత్ వినియోగదారులకు సంబంధించి కీలక మార్పులు జరగనున్నాయి. వీరు యÖని వర్స్ సర్వీస్ ఆబ్లిగేషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ లను ఉపసంహరించుకోవచ్చు. అంటే 1 మెగా వాట్,అంతకన్నా ఎక్కువ వినియోగానికి కాంట్రాక్ట్ తీసుకున్న వారు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి డిస్కమ్ పరిధి నుంచి బయటకు రావచ్చు. సొంత గా పవర్ ఎక్స్‌ఛేంజ్‌లు, కాంట్రాక్ట్‌ల ద్వారా విద్యు త్ పొందవచ్చు. ఇలా చేయడం వల్ల డిస్కమ్‌లపై ఒత్తిడి చాలా వరకూ తగ్గుతుందని భావిస్తోంది కేంద్ర విద్యుత్ శాఖ.అంటే భారీ డిమాండ్‌ను తీర్చాల్సిన అవసరం డిస్కమ్‌కు ఉండదు.ఇక 2030 నాటికి ప్రతి వ్యవసాయ బోర్‌కు సోలార్ విద్యుత్ తప్పనిసరిగా అనుసంధానం కావాలని చెబుతోంది ఈకొత్త ముసాయిదా. వ్యవసాయానికి ఇస్తున్న విద్యుత్ రాయితీల భారాన్ని ఈ మేరకు తగ్గించుకోవచ్చని విద్యుత్‌శాఖ భావిస్తోంది. ప్రస్తు తం డీజిల్‌తో నడుస్తున్న వ్యవసాయ పంపుల స్థానంలో సౌర విద్యుత్ వాడడం వల్ల ఉద్గారాలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.
నూతన ముసాయిదాలో ప్రతిపాదనలు
ఇక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెంచేందుకు వీలుగా నూతన ముసాయిదాలో కొన్ని ప్రతిపాదనలు చేర్చింది కేంద్ర విద్యుత్ శాఖ. ముఖ్యంగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్‌పై ఎక్కువగా దృష్టి సారించనుంది. అంతే కాదు.డిమాండ్ అధికంగా ఉన్న సమయంలో విద్యుత్ వినియో గించిన వారికి అధిక ఛార్జీలు వసూలు చేయా లన్నదీ కీలకమైన ప్రతిపాదన.ఇలా కూడా సరఫ రా వ్యయాన్ని, వస్తున్న ఆదాయాన్ని కొంత వరకూ సమం చేసుకోవచ్చని భావిస్తోంది కేంద్రం. అంతే కాదు.రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెద్ద ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిం చాలన్నది మరో ప్రతిపాదన. ఎంత పెట్టుబడులు పెడుతున్నాం,ఎంత ఆదాయం వస్తుంది అనేది ప్రతి రంగంలోనూ ఓలెక్క ఉంటుంది.దీన్నే రిటర్న్ ఆఫ్ ఇన్‌వెస్ట్‌మెంట్ అంటారు. మిగతా రంగాలతో దీటుగా విద్యుత్ రంగంలోనూ ఈ =OI పెర గాలన్నది కేంద్రం ఆకాంక్ష. ఏయే సంస్థలైతే ఈ విషయంలో ముందంజలో ఉంటాయో వాటికి రాష్ట్ర కమిషన్‌లు ప్రోత్సాహకాలు అందించాలన్నదీ కేంద్రం చెబుతున్న మరో విషయం.
డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్
విద్యుత్ రంగంలోనూ పోటీతత్వం పెంచాలని భావిస్తోంది కేంద్రం. అయితే ఈ పోటీ వినియోగదారులపై ప్రభావం చూపించే విధంగా మాత్రం ఉండకూడదన్నది కీలక నిబంధన. స్వతంత్రంగా విద్యుత్‌ను పొందగలిగే భారీ సంస్థ లకు కూడా డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్‌లు ఇస్తు న్నారు. రైల్వేస్, తయారీ పరిశ్రమలు ఈ కోవకు వస్తాయి. అలా కాకుండా ఈ లైసెన్స్ పరిధిలో నుంచి వీటిని తొలగిస్తే చాలా వరకూ ఒత్తిడి తగ్గుతుందన్న ఓ అభిప్రాయం.రెగ్యులేటరీ కమిషన్స్ మార్కెట్ లిక్వి డిటీ పెరిగే విధంగా సరైన వ్యవస్థను తయారు చేయాలన్నది మరో ప్రతిపాదన. ఇప్పుడు చెప్పిన మార్పులన్నీ అమల్లోకి రావడంవల్ల సగటు విని యోగదారుడిపై ఎలాంటి ప్రభావం పడుతుం దన్నది తప్పకుండా చర్చించాల్సిన విషయం. ఇది అమల్లోకి వస్తే తరచూ కరెంట్ బిల్స్‌లో మార్పులు వస్తాయి. టారిఫ్‌లో మార్పులు చేయకుండా వది లేసినా ఆటోమెటిక్‌గా ఏటా ధరలు మారతాయి. ఇక బొగ్గు ధరల్లో మార్పుల ప్రకారం కూడా ప్రతి నెలా బిల్లులో ఆ ప్రభావం కనిపిస్తుంది. 2032 నాటికి పది లక్షలకు మించి జనాభా ఉన్న నగ రాల్లో విద్యుత్ కోతలు తగ్గుతాయి.ఓట్రాన్స్ ఫార్మర్ లో సమస్య తలెత్తితే వెంటనే మరోటి అందు బాటులోకి వచ్చే విధంగామార్పులు జరుగుతాయి. ఈ ప్రతిపాదనలన్నీ అమల్లోకి వస్తే డిస్కమ్‌లు ఆర్థికంగా బలపడతాయి.ఫలితంగా మౌలిక వసతులు మెరుగపడతాయి.అంటే పాత వైర్లు తొలగించడం, స్మార్ట్ మీటర్స్ ఇన్‌స్టాల్ చేయడం, కేబుల్స్‌ను అండర్‌గ్రౌండ్ నుంచి వేయడం లాం టివి సాధ్యమవుతాయి. ఏదైనా సమస్యలు వచ్చిన ప్పుడు త్వరగా పరిష్కరించేందుకూ వీలవుతుంది. కనెక్షన్ ఇబ్బందులు కూడా త్వరగా పరిష్కారం అవుతాయి. మొత్తంగా విద్యుత్ రంగంలో భారీ మార్పులనే చూస్తామని చెబుతున్నారు విశ్లేషకులు.
కార్పొరేట్ సేవలో విద్యుత్ రంగం
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఎ.పి.ఇ.ఆర్.సి) నిర్వహించిన ప్రజాభి ప్రాయ సేకరణ జనవరి 27న కర్నూలులో ముగి సింది.2026-27 ప్రతిపాదిత టారిఫ్‌పై 71 మంది అభ్యంతరాలు తెలిపారు. భూ కేటాయిం పులే ప్రధాన ఎజెండాగా జనవరి 28వ తేదీన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో 32 అంశాలలో 24 అంశాలు భూ కేటాయింపులకు సంబంధించినవే. ఇందులో విద్యుత్ ప్రాజెక్టులకు 5975.64 ఎకరాలను 33 ఏళ్ల లీజుతో ప్రభుత్వ, ప్రైవేటు భూములను రిలయన్స్ కంపెనీకి, ఎ.పి సోలార్ పవర్ కార్పొరేషన్‌కు అప్పగించేందుకు ఆమోదం తెలిపింది.
వాస్తవంగా నియంత్రణ మండలి సమక్షంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన వాటిలో ప్రస్తుతవిద్యుతఉత్పత్తి ఒప్పందాలుకూడాఉన్నా యి. 23వేల మెగావాట్లకు డిస్కంలు ఒప్పం దాలు చేసుకున్నాయని, గత ఏడాది వేసవిలో 13 వేల మెగావాట్లకు గ్రిడ్ డిమాండ్ చేరిందని ఇదే ఇప్పటి వరకూ అధికమైందని మిగులు విద్యుత్ ఉండగా అవసరం లేకపోయినా చేసుకున్న అడ్డగోలు ఒప్పందాలతో డిస్కంలు ఆర్థిక భారంతో కుదేలు అవుతున్నాయన్న విమర్శ వచ్చింది. వీటి నుంచి పాఠాలు నేర్చుకోకపోగా కూటమి ప్రభుత్వం ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టటానికి తహతహలాడుతుందనటానికి మంత్రివర్గ నిర్ణయం ఓసూచిక. మిగులు విద్యుత్ ఉందంటూ ప్రభుత్వ రంగ జెన్‌కో థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెకీ ఒప్పందం ద్వారా 7వేల మెగావాట్లు, యాక్సిస్ కంపెనీ 600 మెగావాట్లు, పి.ఎం కుసుమ్ కింద 3725 మెగావాట్లకు డిస్కంలు ఒప్పందాలు చేసు కున్నాయి.ఈ ఒప్పందాలన్నీ అమలులోకి రాను న్నాయి.దీంతో భారీగా మిగులు విద్యుత్ ఉం టుంది.9వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఒప్పం దాలు కాగా మిగిలిన 13వేల మెగావాట్లు సోలార్, విండ్ ఒప్పందాలు పీక్ సమయాలలో సోలార్ విద్యుత్ అందుబాటులో లేకపోవడం వల్ల బహి రంగ మార్కెట్ నుంచి యÖనిట్‌కు కనీసం రూ. 10పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తున్నదని డిస్కం లు తమ నివేదికలలో ప్రస్తావించాయి. ఒక్క 2024-25లోనే5,282 మిలియన్ యÖనిట్ల విద్యుత్‌ను మార్కెట్ నుంచి కొనుగోలు చేసి ఆ భారాన్ని వినియోగదారులపై నెట్టివేశారు. కార్పొరేట్ శక్తులకు మేలు చేయాలని, వాటి నుంచి తాము లాభపడాలన్న ఆత్రుత పాలక వర్గాలలో కనిపిస్తుంది.
తారాస్థాయికి చేరిన అవినీతి
నియంత్రణ మండలి ఎదుట అభ్యంత రాలు వ్యక్తం చేసిన వారిలో అవినీతిని ప్రధాన సమస్యగా చర్చ చేయడం విశేషం. అదానీ సౌర విద్యుత్ ఒప్పందం (సెకీ ఒప్పందం) ఏడాదికి 7 వేల మెగావాట్లు (17వేల మిలియన్ యÖనిట్లు) ఆద్యంతం వివాదాస్పదమే. క్రోనీ క్యాపిటలిజంకు ఇది పరాకాష్ట (ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం). స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అసెంబ్లీలో ఈఒప్పందం గురించి మాట్లా డుతూ రాష్ట్ర ప్రజలకు లక్షాయాభై వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని అన్నారు. రూ. 1750కోట్ల లంచం తీసుకున్నారని,జగన్ మో హన్ రెడ్డి లడ్డూలా దొరికాడని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. లడ్డూలా దొరికితే మాజీ ముఖ్యమంత్రిని జైలుకు పంపకుండా, ఆ ఒప్పందాన్ని రద్దు చేయకుండా ఎందుకు కొన సాగిస్తు న్నారన్న ప్రశ్నకు ఒప్పందం రద్దు చేసు కున్నా, ఒక్క యÖనిట్ విద్యుత్‌ను కొనుగోలు చేయకపోయినా రూ.3వేలకోట్ల రూపాయల జరి మానా విధిస్తారన్న నిబంధన కారణంగా ఒప్పం దం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెబుతు న్నారు. ఇలాంటి నిబంధన ఎక్కడ ఉందో మాత్రం స్పష్టం చేయరు.అసలు కథ ఏమిటంటే ఈ ఒప్పం దం వెనుక ఉన్నది ‘అదానీ’.గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నా ప్రశ్నించకపోవటానికి ప్రధాన కారణం అదానీనే. ప్రధాన ప్రతిపక్షానికి, కూటమిలోని పార్టీలకు సెకీ ఒప్పందం గురించి మాట్లాడాలంటే ‘వణుకు’ పుడుతున్నది.
రూ.2.49పై యÖనిట్ విద్యుత్ కొను గోలు చేస్తే లక్షన్నరకోట్ల రూపాయలు నష్టం సంభ విస్తుందని ఆరోపించిన ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండి యా ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీతో 25ఏళ్ల కాల పరిమితితో 400మెగావాట్ల విండ్-సోలార్ హైబ్రి డ్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి యÖనిట్ ధర రూ. 5.50 పైసల నుంచి ప్రారంభించి రూ.4.60 పైసలకు ఒప్పందం చేసుకున్నారు. రూ.2.49కు కొనడంవల్ల జరిగే నష్టం గురించి గుండెలు బాదు కున్న చంద్రబాబుగారు రూ.4.60కు ఎలా ఒప్పం దం చేసుకుంటారు.విద్యుత్ కొనుగోలు ఒప్పం దాలతో తమకు నచ్చిన వారికి ప్రజల సంపదను కట్టబెట్టడంలో కూటమి పార్టీలకు, ప్రధాన ప్రతిపక్షానికి పెద్ద తేడాలు లేవు. ఒక్క యÖనిట్ విద్యుత్ కొనకుండారూ.1200 కోట్లు హిందూజా కంపెనీకి డబ్బులు చెల్లించిన ఘనమైన చరిత్ర మన రాష్ట్రానికే దక్కింది. – కందారపు మురళి, వ్యాసకర్త : ఎస్.పి.డి.సి.ఎల్, ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు

బడి మారుతోంది

కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఇటీవలనే జిల్లాల వారీగా విద్యా సంబంధమైన సమాచారాన్ని విడుదల చేసింది.దాంతోపాటే2023లో-24లో మొత్తం విద్యార్థు ల నమోదు డేటా కూడా వుంది.విద్యా రంగంలో ఏదో గొప్ప అభివృద్ధి వచ్చేసినట్టుగా ప్రభుత్వం చెప్పుకుంటున్న గొప్పల పసఏమిటో ఈసమాచారం తేల్చివేసింది. అంతకు ముందుతో పోలిస్తే 2023-24లో మొత్తం విద్యార్థుల నమోదు కోటికిపైగా తగ్గిపోయినట్టు చెబుతున్నది. 20 23-24లో మొత్తం విద్యార్థుల నమోదు 24.8 కోట్లు గా వుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 37లక్షల మందివిద్యార్థులు తక్కువగా నమోదయ్యారు. అయితే 2018-19లోసూళ్లలోనమోదు26.02కోట్లుగా వుంది. తర్వాతి ఏడాది అంటే 2019-20లో ఇది 1.6శాతం పెరిగి,26.45 కోట్లకు చేరుకుంది. అంటే 42లక్షల కంటే ఎక్కువ మంది అదనంగా చేరారన్నమాట. వెనక్కుపోతే 2012-13లో కూడా 26.3కోట్ల నమోదు వుంది. 2012-24 మధ్య దేశ జనాభా పెరుగుదలను కూడా లెక్కలోకి తీసుకుంటే ఈతగ్గుదల మరింత కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంది.
2023-24లోమొత్తం విద్యార్థుల నమోదు 24.8 కోట్లుగా వుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 37 లక్షల మంది విద్యార్థులు తక్కువగా నమోదు కావడాన్ని ఈ నివేదిక విశ్లేషించింది. 21 లక్షల మంది పురుష విద్యార్థులు తక్కువగా నమోదు కాగా సంఖ్య 16లక్షల మంది విద్యార్థినులు విద్యా రంగాన్ని వదలివెళ్లిపోయినట్టు చెబుతున్నది. నమోదు సంఖ్యను లెక్కగట్టడంలో గతంకన్నా మెరుగైన పద్ధ తులు తీసుకువచ్చినట్టు మంత్రిత్వశాఖ చెబుతున్నది. బహుశా అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే సంఖ్యలు తగ్గిపోవడానికి ఇది కారణమై వుండొచ్చు నంటున్నది. అయితే ఈతగ్గుదల ఆందోళనకర మైం దనీ ఈసమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించే చర్యలు తీసుకోవాలని ఆ శాఖే చెబుతున్నది.

నూతన విధానంతో పెద్ద ఎత్తున స్కూళ్ల
బీహార్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్ వంటి బిజెపి పాలిత రాష్ట్రాలలో ఈతగ్గుదల అత్యధి కంగా వుందని గమనించడం చాలా ముఖ్యం. 20 18-19లో బీహార్‌లో 2.49కోట్లమంది విద్యార్థులు నమోదుకాగా ఇప్పుడు2.13కోట్లకు తగ్గిపోయారు (అంటే35.65లక్షల కంటే ఎక్కువగాతగ్గారు).ఉత్తర ప్రదేశ్‌లో2018-19లో నమోదు 4.44కోట్లు కాగా తాజా నివేదికలో ఈసారి 28.26 లక్షల మంది తగ్గి ఇప్పుడు 4.16 కోట్లకు చేరుకున్నారు. మహారాష్ట్రలో గతంలో2.32కోట్ల మంది నమోదైతే తాజా నివేదిక లో ఆసంఖ్య 2.13కోట్లకు పడిపోయింది. ఈనివేదిక విడుదల తర్వాత ఈ తగ్గుదలకు కారణాలేమిటనే దానిపై వేర్వేరు నిపుణులు వేర్వేరు కారణాలు ముం దుకు తెస్తున్నారు.విద్యా విధానంలో మార్పులు, ఆర్థిక కడగండ్ల పెరుగుదల, స్కాలర్‌షిప్ మొత్తాలు సకాలంలో విడుదల చేయకపోవడమో ఎగవేయ డమో ముఖ్య కారణాలుగా వస్తున్నాయి. బిజెపి ప్రభు త్వం మÖడేళ్ల కిందట ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ప్రైవేటు విద్యకే పెద్ద పీట వేసింది. హర్యా నా వంటి బిజెపి పాలిత రాష్ట్రాలు ప్రైవేటు స్కూళ్లలో చేరిన విద్యార్థులకు సబ్సిడీలిచ్చి ప్రభుత్వ స్కూళ్లలో ఫీజులు పెంచాయి. బిజెపి పాలిత రాష్ట్రాలలో అత్య ధిక భాగం (కాంగ్రెస్,బిజెపి రెండింటి సర్కార్లు నడి చిన రాజస్థాన్ వంటి రాష్ట్రాలతో సహా) ప్రభుత్వ స్కూళ్లను భారీ ఎత్తున మÖసివేయడం లేదా కలిపే యడం జరిగింది.అంటే పిల్లలు మరీ ముఖ్యంగా పేదకుటుంబాలకూ దళితులకూ సంబంధించిన పిల్ల లు వెళ్లవలసిన స్కూళ్లు దూరమై పోయాయి. ఎంత దూరమంటే వారు వెళ్లడమే మానుకునేంత. ఇక బాలికల విషయంలో అంత దూరం ప్రయాణిం చడంలో భద్రతా సమస్యలు మరింత నిరుత్సాహ పరుస్తున్నాయి. 2018-19 మధ్య 50 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మÖత పడ్డాయని యు.డి.ఐ. ఎస్.సి (యుడైస్) 2022 నివేదిక పేర్కొం టున్నది. 2024లో యు.పి ప్రభుత్వం 27వేలపాఠశాలలు మÖసివేసింది.ప్రత్యేకించి బీహార్,మహారాష్ట్రలో ప్రైవే టు స్కూళ్లు ఉధృతంగా ప్రారంభమవుతున్నాయి.ఈ రెండు రాష్ట్రాల్లో విద్యార్థుల నమోదు తగ్గడం, ఉత్తర ప్రదేశ్‌లో స్కూళ్ల మÖతలు చూస్తుంటే కేవలం ప్రైవే టు స్కూళ్లలో నమోదు పెరగడం ఒక్కటే సమ స్యను పరిష్కరించలేదని అర్థమవుతుంది.
కేరళలో మెరుగైన ఫలితాలు
విద్యార్థుల నమోదు పెంచడానికే గాక వారు కొనసా గేలా చూడాలన్నా ఉచిత ప్రభుత్వ విద్య అందించడం ఏకైక మార్గమని కేరళ అనుభవం మనకు నొక్కి చెబు తుంది.విద్య నాణ్యత పెంచేందుకూ అదే మార్గం. 2021-22లో కేరళలోస్థూలనమోదు నిష్పత్తి (జి.ఇ. ఆర్) 41.3శాతంగా వుంది. జాతీయ సగటు 28.4 శాతం కన్నా ఇది చాలా ఎక్కువ. ఒక నిర్దిష్ట వయో బృందంలో ఉన్నత విద్యా భాగస్వామ్యం ఏ స్థాయిలో వుందో తెలుసుకోవడానికి జి.ఇ.ఆర్ కీలక సూచిక. తాజాగా2023-24 నివేదికలోకూడాకేరళ నమోదు సంఖ్యలు ఎంతో ప్రోత్సాహకరంగా వున్నాయి. ఈ రాష్ట్రంలో బాలికల చేరిక అబ్బాయిలను మించి వుం డటం నిజంగా ప్రశంసనీయమైన విషయం. విద్యా రంగంపై ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగుదల కోసం ప్రభుత్వం పెట్టే ఖర్చు, ఉపకార వేతనాలు సకాలంలో చెల్లించడం, స్కూళ్లలో ఆరోగ్యవంతమైన సుహ్రృద్భావ పూర్వకమైన వాతావ రణంకోసం కేటాయింపు ఇవన్నీ విద్యార్థుల నమోదు పెరగడానికి, నిలబడటానికి దోహదం చేస్తున్నాయి.
కనీస సదుపాయాల లేమి
యుడైస్ తాజా నివేదిక వెల్లడించే అంశాలు విద్యా ర్థుల సమస్యలకోణం నుంచి కూడా చూడాలి. ప్రత్యే కించి పేదలు సామాజికంగా అణగారిన వర్గాల పిల్లలు అనేక రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న పరిస్థితిని పరిశీలించాలి.చాలా స్కూళ్లలో అమ్మాయిలకు ప్రత్యే కంగా మరుగుదొడ్లు కూడా లేవని ఈ నివేదిక చెబు తున్నది. ఉన్నవాటిలో చాలా చోట్ల తలుపులు లేవు. చాలా బళ్లలో మంచినీటి సదుపాయం లేదు. అనేక స్కూళ్ల భవనాలు శిథిలావస్థలో వున్నాయి.తరగతి గదుల్లోకి వేటలుతురే రాదు. కుర్చీలు,టేబుళ్లు కూడా వుండవు. అనేక రాష్ట్రాల్లో ఉపాధ్యాయులు, ప్రిన్సి పాళ్లు, ఉద్యోగులు పిల్లలపై అత్యాచారాలకు, లైంగిక హింసకు పాల్పడిన ఘటనలు జరిగాయి. దేశంలో అత్యధిక చోట్ల స్కూళ్లలో కుల వివక్ష సంఘటనలు లెక్కలేనన్ని జరిగాయి.విద్యారంగంలో విచారకర మైన ఈ పరిస్థితికి ఇవన్నీ కారణాలే.
ఏకోపాధ్యాయులు, పారా టీచర్లు
చాలా రాష్ట్రాల్లో ప్రస్పుటంగా కనిపించే పెద్ద లోపం ఏకోపాధ్యాయపాఠశాలలు పెద్ద సంఖ్యలో వుండటం. ఉదాహరణకు ఒకేటీచరు నాలుగు నుంచి ఆరు క్లాసులు ఇంకా ఎనిమిది క్లాసులు కూడా చూసుకునే పరిస్థితి వుంది.ప్రభుత్వ నివేదికల ప్రకారం 2023-24లో భారత దేశంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 1,10,971వున్నాయి.ఇలాంటి పాఠశాలల్లో 89 శా తం గ్రామీణ ప్రాంతాల్లోనే వున్నాయి. అరుణాచల్ ప్రదేశ్,గోవా,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,జార్ఖండ్,ఉత్త రాఖండ్,మధ్యప్రదేశ్,రాజస్థాన్‌లలో ఏకోపాధ్యా య పాఠశాలలు ఎక్కువగా వున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో ఏకోపాధ్యాయ పాఠశాలలు అధికంగా వుండగా కేరళలో కూడా కొన్నివున్నాయి.కానివాటిలో విద్యా ర్థుల సంఖ్య చాలా తక్కువ. హిమాచల్ ప్రదేశ్‌లో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో 20 మంది కన్నా తక్కువ గా పిల్లలున్నారు. కేరళలోనైతే వాటిలో సగటున పది మంది పిల్లలున్నారు. నిజానికి కేరళలో ఏకోపాధ్యా య పాఠశాలలు అతి తక్కువగా వుండగా వాటిలో పిల్లల సంఖ్య కూడా దేశంలోకెల్లా తక్కువగా వుంది. సగటున ఒకఏకోపాధ్యాయ పాఠశాలలో 70, బీహార్ లో నైతే 96 మంది పిల్లలు వున్న పరిస్థితితో పోలిస్తే ఇది చాలా మెరుగ్గా వుంటుంది.
అందువల్ల ఇక్కడ ప్రభుత్వ తాజా నివేదికలో ఆందోళన కలిగించేది పిల్లల నమోదు తగ్గిపోవడం ఒక్కటే కాదు. పాఠశాలల్లో వసతులు అధ్వాన్నంగా వుండటం,చాలా స్కూళ్లలో బోధనా ప్రమాణాలు కూడా దారుణంగా వుండటం. ఈ విషయంలోనూ కేరళ పరిస్థితి చాలా మెరుగ్గా వుంది. ఇక్కడ ముఖ్యం గా గమనించాల్సింది ఏమంటే కేరళలో ప్రభుత్వ పాఠశాలల్లో పారాటీచర్లు, కాంట్రాక్టు టీచర్ల నియా మకమే లేదు.అక్కడ టీచర్ల ఉద్యోగాలు పర్మనెంటు పోస్టులు. వారు తమ బోధనా నైపుణ్యాన్ని బోధనా పద్ధతులను నిత్యం మెరుగు పర్చుకుంటుంటారు. ఆ ప్రక్రియపై పర్యవేక్షణా నిరంతరంగా సాగుతుంటుం ది.దీంతో పోలిస్తే యు.పిలో24వేల మంది కాంట్రా క్టు పద్ధతిలో ఆదేశాల ఉపాధ్యాయులు వున్నారు. ఎనిమిదో తరగతి వరకూ బోధించేందుకుగాను వీరికి రూ.7000 ఇస్తారు. వారిలో చాలా మంది అవసరమైన అదనపు ఆదాయంకోసం టైలర్లు, ఆటో డ్రైవర్లు, దుకాణాలలో సహాయకులుగా పని చేస్తుం టారు. అంతేగాక 1,42,000 విద్యా మిత్రలను కూడా వార్షిక కాంట్రాక్టు పద్ధతిలో నియమించు కున్నారు.ఏ క్షణంలోనైనా ఉద్యోగం ఊడిపోవచ్చు ననే భయంలో కొట్టుమిట్టాడే వారు బోధనపై శ్రద్ధ పెట్టడం ఊహకందని విషయం. ఇంతేగాక ప్రభుత్వ పాఠశాలల్లో లక్షమంది ప్రిన్సిపాళ్లు, టీచర్ల పోస్టులు ఖాళీ పడి వున్నాయి. చాలా రాష్ట్రాల పాఠశాలల్లో నమోదు తగ్గిపోవడం, విద్యా ప్రమాణాలు నాసిగా వుండటం భవిష్యత్తుపై చాలా హానికర ప్రభావం చూపిస్తాయి.నమోదులోనూ పిల్లలను నిలబెట్టు కోవ డంలోనూ కేరళ విజయం ఉత్సాహకరంగా వుంది. దాంతోపాటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నిరంతరం మెరుగుదల తీసుకురావడం, కూడా విస్తృతంగా ప్రచారం చేయవలసి వుంది. అత్యవసరమైన ఈ మార్పులు సాధించాలంటే ఆ విజయాలకు కారణ మైన అక్కడి పద్ధతులను అనుసరించడం కూడా కీలకమవుతుంది.
ఏపీలో పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణకు
పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణకు ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు రకాల బడులు ఉండగా వాటి స్థానంలో ఐదు రకాలు తీసుకొచ్చేలా పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.దీనిలో భాగం గా ప్రాథమికోన్నత పాఠశాలల విధానాన్ని తొలగిం చింది.అలాగే ఫలితాలు దారుణంగా ఉంటున్న హైస్కూల్ ప్లస్‌ల స్థానంలో ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది.కొత్తగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ప్రవేశపెట్టింది.అంగన్‌వాడీలను ప్రాథమిక పాఠశా లలకు అనుసంధానం చేసి ప్రీప్రైమరీ తరగతులు నిర్వహిస్తారు.బేసిక్ ప్రైమరీ స్కూళ్లలో ప్రీప్రైమరీ-1,2తో పాటు 1నుంచి 5తరగతులు ఉంటాయి. వీటిలో విద్యార్థుల సంఖ్యఆధారంగా టీచర్లను కేటా యిస్తారు.మోడల్ ప్రైమరీ స్కూళ్లలోనూ ఇవే తరగ తులు ఉంటాయి. వీటిని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రారంభించి, ప్రతి తరగతికి ఒకటీచర్ ఉండేలా చర్యలు తీసుకుంటారు.హైస్కూల్ ప్లస్‌లకు ప్రత్యామ్నా యంగా బాలికలకు ఇంటర్ విద్య అందించే ఉద్దే శంతో ఉన్నత పాఠశాలల్లో జూనియర్ కాలేజీల విధా నం తేవాలని భావిస్తున్నారు.దీంట్లో భాగంగా జిల్లాలో ప్రక్రియకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.
హైస్కూల్ ప్లస్ వ్యవస్థ రద్దు..
విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ బడులను ఉన్నతీకరించడం,లేదంటే ప్రాథమిక బడులుగా మార్చడం చేస్తుంది.ఇంటర్మీడియట్‌తో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్ వ్యవస్థను తీసేయనుంది.వీటిల్లోని ఇంటర్‌ను ఇంటర్మీడియట్ విద్యాశాఖఖు అప్పగించ నుంది.గతేడాది డిసెంబర్ 31వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది.జాతీయ రహదారులు,రైల్వే లైన్లు,వంతెనలు,పాఠశాల దూరాన్ని ప్రామాణికంగా తీసుకుని ఐదు రకాల విధానాన్ని అమలు చేయనుంది.ఈవిధానాలపై అవగాహన కల్పించేందుకు,ఇప్పటికే జిల్లా,క్లస్టర్, మండలస్థాయిలో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసింది.
ఉపాథ్యాయుల కేటాయింపు ఇలా..
Ê ఫౌండేషన్ పాఠశాలలో 30మందిలోపు పిల్లలు ఉంటే ఒక్క టీచర్‌ను నియిమిస్తోంది. 3160ఉంటే ఇద్దరు టీచర్లను కేటాయిస్తుంది. Ê బేసిక్ ప్రాథమిక పాఠశాలలో 20మంది వరకు ఒకరు,2160వరకు ఇద్దరు టీచర్లను ఇస్తుంది.
Ê ఉన్నత పాఠశాలలో 76మంది కంటే ఎక్కువ ఉంటే ప్రధానోపాధ్యాయ,పీఈటీపోస్టు ఉం టుంది. తక్కువగా ఉంటే సీనియర్ స్కూల్ అసిస్టెంట్ ప్రథానోపాధ్యాయుడిగా కొనసాగు తారు. మిగులు పీఈటీలు ఉంటేనే ప్రభుత్వం కేటాయిస్తుంది.
Ê విద్యార్థుల సంఖ్య ఆధారంగా మÖ్యజిక్, ఆర్ట్స్,డ్రాయింగ్,క్రాప్ట్ టీచర్లను కేటాయి స్తుంది.ప్రతి ప్యానల్ గ్రేడ్ ప్రధానోపాధ్యాయులు వారానికి 8 తరగతులు తక్కువ కాకుండా బోధన చేయాల్సి ఉంటుంది.

అవగాహనతో క్యాన్సర్‌ను అధిగమిద్దాం

క్యాన్సర్ ఒకప్పుడు మహమ్మారి. అదేంటో కూడా తెలియని స్థితి.నేడు క్యాన్సర్ జయించే స్థితిలోకి వచ్చాం.ఇది ఒకరకంగా వైద్యరంగంలో పెద్ద విజయంగా పేర్కొన వచ్చు.అయితే ఈవ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రమాదక రంగా ఉన్నదనేది అంతే వాస్తవం. అదే సందర్భంలో నేడు ఎక్కువమందిలో కనిపిస్తుండటం ఆందోళనకరం.మనదేశంలో క్యాన్సర్ ప్రమాదకరస్థాయిలో ఉందనేది గణాం కాలు చెప్తున్నాయి.ఇప్పుడు క్యాన్సర్ నియంత్రణలో అధు నాతన పద్ధతులు ఎన్నో వచ్చాయి.ఇంకా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి.రోబోటిక్స్ వంటి టెక్నాలజీతో కూడా నివారించే పద్ధతుల్లో అందుబాటులోకి రావడం ఆశాజనకం.ఇంకా వైద్యరంగంలో మరింత పురోగతి సాధించటానికి కృషి కొనసాగుతూనే ఉంది.క్యాన్సర్ నానాటికీ వృద్ధి చెందుతుండటంతో మరణ మృదంగంలా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే గడిచిన రెండు దశాబ్ధాలలో క్యాన్సర్ మరణాలు పెరుగుతున్నాయి.2026నాటికి మనదేశంలో ఏటా 20లక్షలమంది క్యాన్సర్‌తో మర ణిస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.2015లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90.5మిలియన్ల మంది కి క్యాన్సర్ వచ్చింది.2019లో 23.6మిలియన్లకు ఆసంఖ్య మరింత పెరిగింది.ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే10మిలియన్ల మరణాలు సంభవించాయి.ఇది గతదశాబ్ధంలో వరుసగా 26శాతం పెరుగుదలను సూచిస్తోంది. మొత్తంమీద చాపకింద నీరులా యావత్ ప్రపంచాన్నే చుట్టేస్తున్న క్యాన్సర్‌పై మాన వుడు నిత్యం పోరాడుతూనే ఉన్నాడు.మరో ఆందోళ నాకరమైన విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు సైతం లక్షల్లో క్యాన్సర్ భారినపడటం.ప్రపంచవ్యాప్తంగా 2023లో సుమారుకోటి మంది వరకు క్యాన్సర్ బారిన పడి మరణించారు.2024లో ఆసంఖ్య ఇంకా పెరిగింది.అంటే ప్రతిరోజూ సుమారు26వేల మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారనేది ఒక అంచనా.మనదేశంలో తాజాగా కొత్తగా 20లక్షల క్యాన్సర్ కేసులునమోదువుతు న్నాయని అంచనా.నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రేషన్ ప్రకారం 2022లో 14లక్షలమంది బారినపడ్డారు.అంటే సరాసరిన ప్రతి తొమ్మిది మందిలో ఒక్కరు ఈ వ్యాధి బారినపడుతున్నారు.2025 కల్లా మనకి ఈ క్యాన్సర్ అనేది సగటున 12శాతం పెరిగే అవకా శంకనబడుతోందని గణాంకాలను బట్టి తెలుస్తోంది.

ఎందుకొస్తుందంటే..
మనిషి శరీరం మొత్తం కణజాణంతో నిండి వుంటుంది. అయితే శరీరంలో ఎక్కడైనా కణజాలం అవసరం లేకుండా విపరీతంగా పెరిగిపోవటమే క్యాన్సర్. మామÖలుగా శరీరంలో కణాల విభజన జరుగుతుంది. ఇలా ప్రతి కణం విభజనకు గురై పుడుతూ,చనిపోతూ ఉంటాయి. శరీరంలో ఇలాంటి ప్రక్రియకు విఘాతం ఏర్పడితే కొన్ని కణాలు చని పోకుండా అలాగే ఉండిపోతాయి.కణాల్లో ఉండే డీఎనఏలో మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. డీఎనఎలవల్ల తల్లిదండ్రుల్లో ఉండే లక్షణాలే పిల్లలకు కూడా వస్తాయనే విషయం తెలిసిందే.అలాగే క్యాన్స ర్ కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. ఆహా రపు అలవాట్లు, రేడియేషన్,పొగతాగటం,ఊబ కాయం తదితర కారణాలతో కూడా డీఎనఏలో మార్పులు వస్తాయి. దీనివల్ల కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి.ఫలితంగా శరీరానికి అవసర మైన కణాలు కంటే ఎక్కువవృద్ధి చెందుతాయి. అవన్నీ ట్యూమర్ (కణితి)గా ఏర్పడతాయి.దాన్నే క్యాన్సర్ అంటారు. పురుషుల్లో ముఖ్యంగా ఊపిరి తిత్తుల క్యాన్సరు, స్త్రీలలో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సరు, చిన్న పిల్లల్లో బ్లడ్‌క్యాన్సర్ (లుకేమియా)అనే కారకాల వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. క్యాన్సర్ అనేది ఇటీవల చాలా ఎక్కువగా కనిపిస్తుం ది. పదేళ్ల కిందటి వరకు గుండె సంబంధిత మరణా లు ఎక్కువగా సంభవించేవి. కానీ ప్రస్తుతం క్యాన్సర్ వల్ల ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి.
క్యాన్సర్ రహిత కణితితో ప్రమాదం లేదు..
కణితులు రెండు రకాలుగా ఏర్పడతాయి.క్యాన్సర్ రహిత కణితి వల్ల ప్రమాదం ఉండదు. ఇది శరీరం ఒక చోట మాత్రమే పెరుగుతుంది.తొలగించిన తర్వాత మళ్లీ రాదు. అయితే క్యాన్సర్ కణితి మాత్రం రక్తం ద్వారా ఇతర కణాలకు సైతం వ్యాప్తి చెందు తుంది. దీంతో శరీరంలోని ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ కణితులు ఏర్పడతాయి.అలసట,శ్వాస తీసు కోవటంలో సమస్యలు,చర్మంలోగడ్డలు ఏర్పడటం, శరీరంబరువులోమార్పులు,చర్మంరంగు మారడం, దీర్ఘకాలికంగా దగ్గు వేధించటం వంటి సమస్య లను క్యాన్సర్ లక్షణాలుగా గుర్తించొచ్చు. అయితే శరీరం లో ఏర్పడే వివిధ రకాల క్యాన్సర్లకు వివిధ లక్షణాలు కన్పిస్తుంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్,లంగ్ క్యాన్సర్,ప్రొస్టేట్‌క్యాన్సర్,కొలోన్ లేదా రెక్టం క్యాన్స ర్,బ్లడ్‌క్యాన్సర్,కిడ్నీ క్యాన్సర్ వంటి క్యాన్సర్లు వస్తుం టాయి. నిపుణులైన డాక్టర్లను సంప్రదించటం ద్వారా వారిచ్చే వైద్యసేవలతో క్యాన్సర్లను నియంత్రించొచ్చు.
అధునాతన వైద్యంతో నియంత్రణ
ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే క్యాన్సర్ నియంత్రణ పద్ధతుల్లో అధునాతనమైనవి అందుబాటులో ఉన్నా యి. ప్రస్తుతం రోబోటిక్ పద్ధతిలో కూడా క్యాన్సర్ కారకాలను గుర్తించి,నియంత్రణ చేస్తున్నారు. ప్రపం చ ఆరోగ్యసంస్థ(డబ్ల్యుహెచఒ)పిలుపునిచ్చిన విధంగా 2024లో‘క్యాన్సర్‌నియంత్రణలోఆటంకాలను అధిగ మిద్దాం’(క్లోజ్ ది కేర్ గ్యాప్) థీమ్ మేరకు ప్రపంచ వ్యాప్తంగా కృషి జరుగుతోంది. మనదేశంలో క్యాన్స ర్ రోగుల సంఖ్య పెరుగుతుండటం ఒక ఎత్తయితే వీటిలో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్,తల,మెడక్యాన్సర్,గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, అండాశయ క్యాన్సర్లు ఉన్నాయి. పొగాకు ఉత్పత్తుల వాడకం, ఒబేసిటీ (స్థూలకాయం),కుటుంబ చరిత్ర, క్రమం తప్పిన జీవనశైలి అనేవి చాలా రకాల క్యాన్సర్లకు సాధారణ కారణాలుగా పరిగణించబడుతున్నాయి. రసాయన చికిత్స (కీమోథెరపీ) క్యాన్సర్ చికిత్సలో కీలక భాగంగా ఉన్నప్పటికీ, లక్ష్యిత చికిత్స, ఇమÖ్య నోథెరపీ వంటి ఆధునిక చికిత్సా విధానాలు, క్యాన్సర్ సంరక్షణలో సర్వైవల్ రేటును మెరుగుపరచడం ద్వారా అత్యంత ప్రభావవంతమయ్యాయి.
మెరుగైన జీవనశైలితో మార్పులు
ఎంత ఉరుకులు, పరుగుల జీవితాన్ని గడుపుతున్నా ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్ర త్తలు తీసుకోవాల్సిందే.అనారోగ్యంభారినపడ కుండా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. శరీరానికి తగినంత విశ్రాంతి ఉండాలి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలి. ఏదీ అతిగా చేయకూడదు.. తినకూడదు.. తాగకూడదు.మనలో చాలామంది ఆకలి వేసినప్పుడు కడుపు నింపుకోవటానికి ఏది అందుబాటులో ఉంటే అది తినేస్తుంటారు.అందులోనూ కనబడిన స్నాక్స్‌ను లాగించేస్తుంటాం.మరీ ముఖ్యంగా ప్రాసెసింగ్ చేసి న ఆహారాన్ని, వేపుళ్లను (ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్) లాంటివి తినేస్తుంటాం.బయట దొరికే ఇలాంటి ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉప్పు, చక్కెర వాడుతుం టారు.అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటే ఇబ్బం దులు ఏర్పడతాయి. వీటికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలు వంటివి ప్రత్యామ్నాయంగా తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. పొగాకు ఉత్పత్తులను వాడకూడదు. ప్రతిరోజూ క్రమపద్ధతిలో వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి.
గుర్తించేందుకు పరీక్షలు..
స్క్రీనింగ్ ద్వారా లక్షణాలు లేకపోయినా క్యాన్సర్‌ను గుర్తించొచ్చు.ఉదా:రొమ్ము క్యాన్సర40 ఏళ్లు పైబడిన మహిళల్లో మ్యామోగ్రామ్ ద్వారా గుర్తించొచ్చు. గర్భాశయ ముఖద్వార కాన్సర్‌ను పాప్స్మియర్ అనే పరీక్ష ద్వారా గుర్తించొచ్చు. చాలా క్యాన్సర్లు ప్రారంభ దశలో గుర్తిస్తేనయం చేయగలిగేవి మాత్రమే ఉం టాయి.వ్యాక్సిన్‌ద్వారా కొన్ని క్యాన్సర్లను నియంత్రిం చొచ్చు.ఉదాహరణకుగర్భాశయముఖద్వారా క్యాన్సర్ 9-26 సంవత్సరాల వయస్సులో ఉన్న మహిళలకు హెచ్‌పివి వ్యాక్సిన్ ద్వారా నివారిం చొచ్చు.
ఇమ్యునోథెరపీ మేలు
నిర్దేశిత చికిత్స,ఇమÖ్యనోథెరపీ వంటి ఆధునిక చికిత్సా పద్ధతులు, కీమోథెరపీ కన్నా తక్కువ దుష్ప్ర భావాలు కలిగిఉంటాయి. మరింత మెరుగైన సర్వై వల్ రేటు అందిస్తాయి.టార్గెటెడ్‌థెరపీ ద్వారా కూడా చికిత్సలు చేయొచ్చు.ఇదిక్యాన్సర్ కణాల పెరుగుదల, వ్యాప్తిని నిరోధించడానికి ప్రత్యేకప్రోటీన్లను లక్ష్యం గా చేసుకునిచేసే చికిత్స.టార్గెటెడ్‌చికిత్సద్వారా ఊ| ¾రితిత్తులు,రొమ్ము,అండాశయ,జీర్ణ కోశ,ప్రేగు,ఇతర అనేక క్యాన్సర్లకు ముఖ్యంగా ప్రాథమిక,ఆతర్వాత దశల్లో చికిత్స చేయొచ్చు.ఇమ్యునో థెరపీ ద్వారా శరీరంలోరోగనిరోధక శక్తినిపెంచి,క్యాన్సర్‌తో పోరా డే చికిత్స.ఇదిశస్త్రచికిత్సకు ముందు,తరువాత కూడా ఉపయోగించొచ్చు.ముదిరిన దశలోఉన్న ఘన కణ జాల క్యాన్సర్లకు కూడా ప్రభావవంతంగా ఉం టుంది.తరచుగా స్క్రీనింగ్,ముందుజాగ్రత్తలు, సమర్థ వంతమైన చికిత్స క్యాన్సర్ బాధితుల జీవన ప్రమాణా లను మెరుగుపరచడానికి కీలకంగా ఉంటాయి.
నివారణ వైద్యం కన్నా మేలైంది..
రక్త క్యాన్సర్ : తెల్ల రక్తకణాలు,రక్త ఫలకాలు, ఎర్ర రక్త కణాలను ప్రభావితం చేసే క్యాన్సర్లు.
రక్త క్యాన్సర్ రకాలు :మొత్తం మÖడు రకాల రక్త క్యాన్సర్లు ఉంటాయి:

  1. లుకేమియా (తెల్ల రక్త కణాలు)
  2. లింఫోమా (లింఫ్ నోడ్లు)
  3. మల్టిపుల్ మైలోమా (ప్లాస్మా కణాలు)
    లుకేమియా నిర్ధారణ
    – లుకేమియాను ఎముక మజ్జ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు.
    – లింఫోమాలను లింఫ్ నోడ్ బయోప్సీ, పెట్ సిటి ద్వారా నిర్ధారిస్తారు.
    – మల్టిపుల్ మైలోమాను రక్తపరీక్షలు, ఎముక మజ్జ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు.
    లక్షణాలు
    తరచుగాజ్వరాలు, చిగుర్ల నుండి రక్తస్రావం, తరచు గా రక్తస్రావం,బరువు తగ్గడం,లింఫ్ నోడ్లు వాపు.
    చికిత్సా విధానాలు : కీమోథెరపీ,ఎముక మజ్జ మార్పిడి (బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్).
    ఎముక మజ్జ మార్పిడి రకాలు
    ఆటోలోగస్ మార్పిడి-రోగి స్వంత స్టెమ్ కణాలను ఉపయోగించడం.అలోజెనిక్ మార్పిడి-కుటుంబ సభ్యులు లేదా ఇతర దాతల నుండి స్టెమ్ కణాలను రోగి శరీరంలో ప్రవేశపెట్టి చేయడం.
    స్టెమ్ సెల్ థెరపీ ప్రయోజనాలు ఏమిటంటే
    ఇది మల్టిపుల్ మైలోమా,పునరావృత లుకేమియా, లింఫోమాలకు పూర్తి ఆరోగ్యవంతమైన చికిత్సను అందిస్తుంది.
    రోబోటిక్స్ పద్ధతిలో చికిత్సలు..
    క్యాన్సర్‌ను జయించగలమనే నిజమైన ఆశను కల్గి స్తూ రోగుల్లో మనుగడ,జీవనాణ్యతను మెరుగు పడు తున్నాయి. ఇందుకోసం రోబోటిక్ సర్జికల్ టెక్ని కల్ క్యాన్సర్ చికిత్సలు ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి.
    –సేకరణ : యడవల్లి శ్రీనివాసరావు

యువశక్తి ఆధారిత బడ్జెట్`2026

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో 2026`27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.సుస్థిరాభివృద్ధిని కొనసాగిస్తూ.. అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకునే లక్ష్యంతో 2026-27సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న లోక్సభలో ప్రవేశపెట్టింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1న వార్షికపద్దును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.
ముందుగా తన బృందంతో కలిసి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్మును కలిశారు.రాష్ట్రపతికి బడ్జెట్ పత్రాలు అంద జేశారు. సంప్రదాయాన్ని అనుసరిస్తూ మంత్రికి రాష్ట్రపతి మిఠాయి తినిపించారు. అనంతరం బడ్జెట్కు క్యాబినెట్ ఆమోదం
తెలపడంతో.. ఉదయం 11 గంటలకు మంత్రి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “పవిత్ర మాఘపౌర్ణిమ రోజున బడ్జెట్ తీసుకువస్తున్నాం. కర్తవ్య భవన్‌లో రూపొం దించిన మÖడో బడ్జెట్ ఇది. యువశక్తి కేంద్రంగా దీనిని ప్రవేశపెడుతున్నాం. భారత దేశ ఆర్థిక ప్రయాణం స్థిరంగా సాగుతోంది. ప్రపంచ మార్కెట్లతో భారతన్ అనుసం ధానిస్తున్నాం. ప్రజల ఆకాంక్షలను ఆచరణలో తీసుకొస్తున్నాం. నైపుణ్యం,పోటీతత్వం,ఉత్పాద కతతో భారత్ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తాం. రైతులు,దళిత,గిరిజన సమÖహాలకు అభివృద్ధి ఫలాలు చేరాలి” అని ఆమె పేర్కొన్నారు.
వరుసగా రికార్డు
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది తొమ్మిదోసారి.ఇప్పటివరకూ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఆయన వరుసగా ప్రవేశపెట్టలేదు.వేర్వేరు సమయాల్లో అందించారు. మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం మొత్తం 9సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. కానీ ఆయన వరుసగా చేయలేదు. అలాగే నిర్మలా సీతారామన్ మరోఅరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆమె 2019 మే 31న ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరిం చారు. 2026 జనవరి 31నాటికి ఆమె ఈ పదవిలో 6ఏళ్ల 8 నెలలు పూర్తి చేసుకున్నారు. గతంలో సి.డి.దేశ్ ముఖ్ ఆరేళ్ల రెండు నెలల పాటు నిరంతరాయంగా ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
కేంద్ర బడ్జెట్ ముఖ్య విశేషాలు
– ఆదాయపు పన్ను రేట్లు యథాతథం.
– ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమలు.
– ఫ్యూచర్స్‌పై సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను(ఎన్టీటీ)0.02శాతం నుంచి 0.05 శాతానికి;ఆప్షన్స్ ప్రీమియం, ఆప్షన్స్ ఎన్టీటీ 0.01శాతం నుంచి వరుసగా0.15శాతం,0.125శాతానికి పెంపు.
– విదేశీ టూర్ ప్యాకేజీలపై మÖలం వద్ద పన్ను వసూలు(టీసీఎస్) 2శాతానికి తగ్గింపు.
– విదేశీ విద్యపై విధించే టీసీఎస్,
– బరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద వైద్య చికిత్సల వ్యయాలపై విధించే పన్నులు 2శాతానికి కుదింపు.
– వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి
– చేసుకునే పన్ను పరిధిలోని వస్తువులపై సుంకం 20శాతం నుంచి 10శాతానికి తగ్గింపు.
– క్యాన్సర్ రోగుల చికిత్సకు వినియోగిం చే 17రకాల ఔషధాలపై కస్టమ్స్ సుం కం మినహాయింపు.ఏడురకాల అరు దైన వ్యాధుల చికిత్సకు వినియోగించే ఔషధాలు,ఆహారాలపై దిగుమతి సుం కాల తొలగింపు.
– అరుదైన ఖనిజాల శుద్ధికి వినియో గించే వస్తువుల దిగుమతిపై సుంకాల తగ్గింపు.
– పౌర,శిక్షణ,ఇతర విమానాల తయా రీకి వినియోగించే పరికరాలు,భాగాల దిగుమతులపై మౌలిక సుంకం మినహాయింపు.
– మైక్రోవేవ్ అవెన్స్ తయారీలో ఉపయో గించే కొన్ని రకాల విడి భాగాలకు మౌలిక సుంకాల నుంచి మినహా యింపు.
– ఆడిట్ చేయని వ్యాపారాలకు సంబం ధించిన ఐటీఆర్ దాఖలు గడువు ఒక నెల పొడిగింపు. ఆగస్టు 31వరకు ఐటీఆర్ దాఖలుకు అవకాశం.
– భారత్లో నెలకొల్పిన డేటా సెంటర్ల నుంచి అంతర్జాతీయంగా సేవలు అందించే విదేశీ కంపెనీలకు 2047 సంవత్సరం వరకు పన్ను మినహా యింపు.
– కంపెనీలలో మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం… బైబ్యాక్ షేర్లపై క్యాపిటల్ గెయిన్స్ కింద కార్పొరేట్ ప్రొమోటర్స్పై 22శాతం,నాన్కార్పొరేట్ ప్రమోటర్స్ 30శాతం పన్ను విధింపు.
– 2027 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో ద్రవ్యలోటు 4.3శాతానికి కట్టడి. గత ఏడాది ద్రవ్యలోటు 4.4శాతం.
– మొత్తం బడ్జెట్ పరిమాణం రూ.53.5కోట్లు
– పన్ను రాబడుల అంచనా రూ.28.7 లక్షల కోట్లు
– మార్కెట్ల నుంచి తీసుకునే రుణాల అంచనా రూ.17.2లక్షల కోట్లు. సెక్యూరిటీస్ రుణాల అంచనా రూ.11.7లక్షల కోట్లు
– పట్టాలపైకి సంస్కరణల ఎక్స్ప్రెస్. 350కిపైగా సంస్కరణలు.
– పన్నుల్లో రాష్ట్రాల వాటా కింద పంపిణీ చేయనున్న మొత్తం రూ.1.4లక్షల కోట్లు
– 2026-27లో …జీడీపీలో మొత్తం రుణాల 56.1 55.6.2025-265.
– మÖడు కర్తవ్యాలపై బడ్జెట్ ప్రధాన దృష్టి. అవి..అభివృద్ధిని వేగిరపరిచి సుస్థిరం చేయడం.
సామర్థ్యాల పెంపు. అందరితో కలిసి-అందరి వికాసం.
2047నాటికి జీడీపీలో 10శాతం వాటా కలిగి ఉండేలా సేవల రంగాన్ని వృద్ధి చేయడానికి ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ.
. సరకు రవాణా కోసం తూర్పున డాంకునీ నుంచి పడమర సూరత్ వరకు ప్రత్యేక రైల్వే మార్గం.
. వచ్చే ఐదేళ్లలో కొత్తగా 20జాతీయ జల మార్గాల నిర్మాణం.
. ముంబయి-పుణె, పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు,హైదరాబాద్- చెన్నై, చెన్నై-బెంగళూరు,దిల్లీ-వారణాశి, వారణాసి-సిలిగుడి మధ్య మొత్తం 7 హైస్పీడ్ రైల్ కారిడర్ల అభివృద్ధి.
. మన దేశాన్ని వైద్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ఐదు ప్రాంతీయ వైద్య కేంద్రాల ఏర్పాటు
. మÖడు అఖిల భారత ఆయుర్వేద సంస్థల ఏర్పాటుకు ప్రతిపాదన.
. ప్రధాన పారిశ్రామిక, లాజిస్టిక్ కారిడర్ల సమీపంలో ఐదు విశ్వవిద్యాలయాల టౌన్ షిప్పులు నెలకొల్పాలని నిర్ణయం
. వ్యవసాయదారుల ఆదాయాన్ని పెంచే కార్యక్రమాల్లో భాగంగా 500 రిజర్వా యర్లు,అమృత్ సరోవర్ల అభివృద్ధి
. దివ్యాంగజనుల కోసం దివ్యాంగజన్ కౌశల్ యోజన.ఐటీ, హాస్పిటాలిటీ, ఆహారపానియాల రంగాలలో ఉపాధి కల్పన.
. సమీకృత ఈస్ట్కెస్ట్ పారిశ్రామిక నడవా అభివృద్ధిలో భాగంగా ఐదు పూర్వోదయ రాష్ట్రాల్లో ఐదు పర్యాటక కేంద్రాల అభివృద్ధి
. 4వేల ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు.
. బుద్దిస్ట్ సర్క్యూట్స్ అభివృద్ధిలో భాగంగా అరుణాచలప్రదేశ్,సిక్కిం,అస్సాం, మణి పుర్,మిజోరం,త్రిపుర రాష్ట్రాల కోసం ప్రత్యేక పథకం.
చరిత్ర సృష్టించిన నిర్మలమ్మ
వరసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్టును ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న రికార్డు సృష్టించారు. వేర్వేరు పదవీకాలాల్లో పదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డుకు ఆమె చేరువవుతున్నారు. 1959-64 మధ్య ఆరుసార్లు, 1967-69 మధ్య నాలుగుసార్లు మొరార్జీకి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించింది.కేంద్ర మాజీ మంత్రు ల్లో పి.చిదంబరం 9సార్లు,ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు వేర్వేరు ప్రభుత్వాల్లో బడ్జెట్లు సమర్పిం చారు. అందువల్ల వరసగా తొమ్మిదేళ్లు, అదీ ఒకే ప్రధాని (నరేంద్రమోదీ) హయాంలో కేంద్ర పద్దు సమర్పించిన ఘనత మాత్రం నిర్మ లదే అవుతుంది.
బడ్జెట్ ఎఫెక్ట్: పెరిగేవి..తగ్గేవి ఇవే..!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తీసుకొన్న నిర్ణయాలతో కొన్ని రకాల పరికరాలు, ఔషధాల ధరలు తగ్గి అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ ఎఫెక్ట్ ధరలు పెరిగేవి.. తగ్గేవి ఏమిటో చూద్దాం.
ధరలు తగ్గేవి ఇవే..
విదేశీ పర్యాటక ప్యాకేజీలు : వీటిపై ట్యాక్స్ కలెక్టెడ్,ఎట్ సోర్స్ (టీసీఎస్) 2శాతానికి తగ్గింపు
విదేశీ విద్య : దీనిపై టీడీఎస్ లిబరలైడ్జ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎసఆరఎస్) కింద విద్యా ఖర్చులు కోసం తగ్గించారు.
ఆల్కహాలిక్ లిక్కర్ తుక్కు, కొన్ని రకాల ఖనిజాలు : వీటిపై కస్టమ్స్ డ్యూటీని 5శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు.
సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు
కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026 దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరత్వం నుంచి వేగవంతమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నంగా కనిపిస్తోంది.మౌలిక వసతులు, గ్రామీణాభివృద్ధి,పర్యాటకం,సంస్కృతి, యువత ఉపాధి, డిజిటలీకరణ వంటి కీలక రంగాలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించారు.
సాంస్కృతిక పర్యాటకానికి ఊతం
బడ్జెట్‌లో ముఖ్యంగా 15పురావస్తు ప్రదేశాలను “అనుభూతి ఆధారిత సాంస్కృతిక గమ్యస్థా నాలుగా” అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన విశేష ఆకర్షణగా నిలిచింది. దీని ద్వారా దేశ వారసత్వ సంపదను కాపాడడమే కాకుండా పర్యాటక రంగానికి కొత్త ఊపిరి పోసే అవకాశం ఉంది.స్థానిక ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక చలనం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
మౌలిక వసతులు -వృద్ధికి బలమైన పునాది
రహదారులు రైల్వేలు,పోర్టులు, విమానా శ్రయాల అభివృద్ధికి గణనీయమైన నిధులు కేటాయించడం ద్వారా పెట్టుబడులకు అను కూల వాతావరణం సృష్టించాలన్న లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి బలమైన పునాదిగా మారనుంది.
రైతులు,గ్రామీణాభివృద్ధి,వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంపు, నీటి వనరుల సమర్థ వినియోగం,రైతులకు రుణసౌలభ్యం వంటి అంశాలపై బడ్జెట్ దృష్టి సారించింది. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధితో గ్రామాల నుంచి నగరాలకు వలసలు తగ్గించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.
యువత,ఉపాధి,నైపుణ్యాభివృద్ధి
యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చారు.స్టార్టప్‌లు,ఎంఎసఎంఈ రంగాలకు ప్రోత్సాహం కల్పించడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించాలన్న ఉద్దేశం ఈ బడ్జెట్‌లో ప్రతిబింబిస్తోంది.
డిజిటల్, గ్రీన్ ఎకానమీపై దృష్టి
డిజిటల్ సేవల విస్తరణ,ఈ-గవర్నెన్స్, గ్రీన్ ఎనర్జీ,పర్యావరణహిత అభివృద్ధికి బడ్జెట్‌లో చోటు కల్పించారు. ఇది భవిష్యత్ తరాలకు స్థిరమైన అభివృద్ధిని అందించాలన్న ప్రభుత్వ దృక్పథాన్ని తెలియజేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి కొత్త అవకాశాలు
కేంద్ర బడ్జెట్ 2026లో పర్యాటక రంగానికి ఇచ్చిన ప్రాధాన్యం ఆంధ్రప్రదేశ్‌కు విశేష అవకాశాలను తీసుకువచ్చేలా ఉంది. ముఖ్యం గా 15పురావస్తు ప్రదేశాలను అనుభూతి ఆధారిత సాంస్కృతిక గమ్యస్థా నాలుగా అభివృద్ధి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతి పాదన, చారిత్రక సంపద కలిగిన రాష్ట్రా లకు ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బౌద్ధ వారసత్వం,ఆలయ పర్యాటకం,తీర ప్రాంత సౌందర్యం, ప్రకృతి వనరులతో సమృద్ధిగా ఉంది. అమరావతి, లేపాక్షి, శ్రీకాళహస్తి, సింహాచలం, మంగళగిరి, ఘంటశాల, సాలిహుండం,తోట్లకొండ వంటి పురావస్తు, చారిత్రక ప్రదేశాలు రాష్ట్ర పర్యాట కానికి బలమైన ఆధారాలుగా ఉన్నాయి. ఈ ప్రదేశాలు కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో చోటు దక్కితే అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.- (న్యూ ఢిల్లీ నుంచి సూర్య ప్రకాశ్ యాదవ్)

ఆదివాసులకు తీరని ద్రోహం

టూరిజం అభివృద్ధి పేరుతో‘విజన్ 2047’లో భాగంగా 1/70 చట్ట సవరణకు రాష్ట్ర కుటమి ప్రభు త్వం రంగం సిద్ధం చేస్తున్నది.ఇటీవల జరిగిన టూరిజం ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సులో సభాపతి అయ్యన్న పాత్రుడు మాట్లా డుతూ ఆదివాసీ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి కోసం ీVAటళ్లు,రెస్టారెంట్లు, పార్కులకు పెట్టు బడులు పెట్టాలంటే 1/70 చట్ట సవరణకు రాష్ట్ర ప్రభుత్వం,అధికార యంత్రాంగం లోతైన అధ్య యనం చేయాలని ప్రకటించడం ఆదివాసీలకు తీవ్ర ద్రోహం చేయడమే. పైగా షెడ్యూల్ ఏరియా లో టూరిజం అభివృద్ధికి 1/70చట్టం అడ్డంగా ఉందని,చట్టం సవరించాలని కూడా అయ్యన్న పాత్రుడు పేర్కొనడం వ్యక్తిగత అభిప్రాయమో లేక కూటమి ప్రభుత్వ విధానమో స్పష్టం చేయడం అవసరం. 2000 సంవత్సరంలో నాటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పాడేరు ఏజెన్సీలోని చింతపల్లి జర్రేలలో ఉన్న 515 మిలియన్ టన్నుల బాక్సైట్ నిక్షేపాల తవ్వకాలకు దుబారు కంపెనీతో ఒప్పందం చేసుకుని గిరిజన సలహా మండలిలో 1/70 చట్టం సవరించడానికి పూనుకున్నారు. అప్పటి సిపిఎం భద్రాచలం ఎంఎలఎ సున్నం రాజయ్య మాత్రమే 1/70 చట్టం రక్షణకు నికరంగా నిలబడ్డారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా నిలబడి అధికారం వచ్చిన వెంటనే 2006లో ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర రెడ్డి రూ.8000 కోట్లతో రాస్ ఆల్ ఖైమ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆదివాసి గిరిజన సంఘం, వివిధ ఆదివాసీ సంఘాలు,సిపిఎం,వామపక్ష పార్టీల అండతో చేసిన సుమారు 20ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో బాక్సైట్ తవ్వకాల ఒప్పందాలు రద్దు చేయడమైనది.1/70 చట్టం అమలులో ఉండగానే అరకు,పాడేరు,చింతపల్లి,రంపచోడవరం, జీలుగు మిల్లి,పార్వతీపురం,మన్యం జిల్లాలో,ఇతర ప్రాంతా లలో బినామీ పేర్లతో లాడ్జీలు,షాపింగ్ కాంప్లెక్సు లు,రిసార్టుల నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతు న్నాయి. అల్లూరి జిల్లా చింతపల్లి,ఎర్రవరం, పెదకోట,మన్యం జిల్లా సాలూరు,అనకాపల్లి జిల్లా చింతలపూడి దగ్గర హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్ట్,ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకాయవారిపాలెం దగ్గర ఆయుధ కర్మాగారం నిర్మాణానికి 1/70చట్టం ఉల్లంఘించి ఒప్పందం చేసుకుని వేల ఎకరాల భూములు,అడవులు ధారాదత్తం చేస్తున్నది.ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో 3000ఎకరాల పరిధిలోని అదాని ఆయుధ కర్మాగారం నిర్మాణానికి ఆదివాసీల హక్కులను ఉల్లంఘించి నిర్మాణం ముమ్మరం చేసింది.గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఆదివాసీల హక్కులను ధ్వంసం చేస్తున్నది. 1970లో ఆదివాసీల పోరాట ఫలితంగా ఆదివాసీ అభివృద్ధి కోసం 1/70చట్టాన్ని సాధించాం.నేడు పెట్టుబడిదారుల అభివృద్ధి కోసం ఆ చట్టాన్ని సవరించేందుకు కుట్ర చేస్తున్నారు. షెడ్యూల్ ప్రాంత చట్టమైన 1/70లో కలుగచేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.షెడ్యూల్ ప్రాంతంలో చట్టాలు చెయ్యాలన్నా తొలగించా లన్నా రాష్ట్రపతికే అధికారం ఉన్నది.షెడ్యూల్ ప్రాంతంలో గ్రామసభ అధికారాలు,కేంద్ర అటవీ పర్యావరణ చట్టాన్ని సవరించి షెడ్యూల్ ప్రాంతంలో విస్తృతమైన అధికారాలు ఉన్న పీసా చట్టం అధికారాలు, 2006 వామపక్షాలు ఒత్తిడితో తెచ్చిన ఆటవీ హక్కుల చట్ట అధికారాలు ఇటీవలి కేంద్ర బిజెపి ప్రభుత్వం తొలగించింది.ఆ అంశా లనే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. కేంద్ర బిజెపి, రాష్ట్ర తెలుగుదేశం కూటమి ప్రభుత్వం షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీలకు రక్షణగా ఉన్న చట్టాలను తొలగించేందుకు చేస్తున్న కుట్రలను ఆదివాసీలు తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది.
అరకు ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు జీవో నంబర్ 3చట్టబద్ధతకు హామీనిచ్చి ఏడు నెలలు గడిచినా అతీగతీ లేదు.ఎన్నికల హామీ ప్రకారం ఏజెన్సీ షెడ్యూల్ ఏరియాలో100శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ నియామక సాధనకు,ఏజెన్సీ స్పెషల్ డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదలకు పోరాటం చేస్తున్న ఆదివాసీల సమస్యలను పరిష్కరించనే లేదు.పైగా ఆదివాసీ భూములకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టాన్ని సవరించేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రయత్నిస్తోంది. ఆదివాసీ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదివాసీలతో పాటు అందరం ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాల్సి వుంది.
స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యాలపై నిరసన గళం..
ఏజెన్సీలో అభివృద్ధి జరగాలంటే 1/70 చట్టాన్ని సవరించాలని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించడాన్ని రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో నిరసన సెగలు రేకెత్తించాయి.ఒక రాజ్యాంగ బద్దమైన పదవులో ఉండి గిరిజనులకు రాజ్యాం గం కల్పించిన రక్షణ చట్టాలను సవరించడం అనడంపై గిరిజనవర్గాలు భగ్గుమంటున్నాయి. అల్లూరి,పార్వతీపురం మన్యం జిల్లా ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తున్నాయి.
పార్వతీపురం: బెలగం కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు.ఈ కార్యక్రమా నికి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణ మÖర్తి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భం గా ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు పాలమిట్ట రాము మాట్లాడుతూ ఆదివాసీ భూము లకు రక్షణ కల్పించే ఈ చట్టాన్ని పకడ్బం దీగా అమలు చేయాలని కోరారు. జనవరి 27వ తేదీన విశాఖ పట్నంలో జాతీయ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ఆదివాసీల్లో తీవ్ర ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం ఎం.కృష్ణమÖర్తి మాట్లాడుతూ అల్లూరి సీతారామ రాజు,ఏలూరు,పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ రాజ్యాంగంలో 5వ షెడ్యూలు కిందకు వస్తుందని తెలిపారు.దీన్ని ధిక్కరించే అధికారం ప్రభుత్వానికి కూడా లేదని పేర్కొన్నారు. ఇప్పటికే టూరిజం అభివృద్ధి పేరుతో పలు ఉల్లంఘనలు జరుగుతున్నాయని,వీటిని వెంటనే అరికట్టాలని కోరారు. బినామీల పేరుతో గిరిజన భూముల్లో లాడ్జీలు పెట్టి గిరిజనులకు అన్యాయం చేస్తున్నా రని విమర్శించారు.ఇప్పుడు 1/70ని సవరిస్తే గిరిజనులకు భూమి దక్కకుండా పోతుందని, ఏజెన్సీలో లభించే సహజ వనరులను బడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎప్పటి నుండో పలు పథకాలు వేస్తోందని వివరించారు. అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు దీన్ని మరింత బలపరుస్తున్నాయని, 1/70 చట్టం 1970లో పెద్దఎత్తున జరిగిన ఆదివాసీ పోరాటాల ద్వారా సంపాదించుకున్నారని తెలిపారు. ఈ చట్టం మÖలంగానే గిరిజనులకు ఎంతోకొంత భూమిపై అధికారం వచ్చిందని, 2006-07లో కేంద్రంలో ఉన్న యుపిఏ ప్రభు త్వంపై వామపక్ష పార్టీలు ఒత్తిడి తెచ్చి అటవీ సంరక్షణ చట్టాన్ని తీసుకువచ్చాయని వివరిం చారు. భూమిపై గిరిజనులకు హక్కులను ఈ చట్టం మరింత బలోపేతం చేసిందని, మోడీ ప్రభుత్వం ఈ నిబంధనలను సడలించి గిరిజనుల నుండి భూములను బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. పంప్డ్ స్టోరేజీ హైడల్ ప్రాజెక్టుల పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలను ఈ ప్రాంతంలో ఆదానీ పరం చేస్తున్నారు.
1/70 చట్టం జోలికొస్తే ఖబడ్దార్!
పాడేరు: ఏజెన్సీలో గిరిజన చట్టాల జోలికొస్తే తీవ్ర పరిణామాలు తప్పదని సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స మండిపడ్డారు.1/ 70 చట్టం అమలులో సడలింపులు ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ పట్నంలో నిర్వహించిన ప్రాంతీయ పెట్టుబడి దారుల సదస్సులో అసెంబ్లీ స్పీకరఅయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను సిపిఎం అల్లూరి జిల్లా కమిటీ తరపున తీవ్రంగా ఖండించించారు.రిజన ప్రాంతంలో 1/70చట్టం సవరణ ద్వారానే ఏజెన్సీ ప్రాంతాల్లో పెట్టుబడులు వస్తాయని స్పీకర్ వ్యాఖ్యలు చేయడం సరికాద న్నారు. రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో ఉండి, గిరిజనులకు హానికలింగేలా స్పీకర్ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. స్పీకర్ వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరిగానే ఆదివాసీ సమాజం భావిస్తున్న నేపథ్యంలో దీనిపై తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఏజెన్సీ అభివృద్ధికి పర్యాటక రంగం ద్వారానే ాధ్యమనే తప్పుడు అభిప్రాయంలో కూటమి పాలకులు ఉన్నారని మండిపడ్డారు. ఏజెన్సీలోని సహజ వనరులు, సంపదను కార్పొరేట్ కంపెనీలో అప్పగించే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని, దీన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. 1/ 70 అమలులో నిర్లక్ష్యం వల్లే ఇప్పటికే వందలాది ఎకరాలను టూరిజం పేరిట ఆక్రమించారని, ఇపుడు చట్టాన్ని సడలిస్తే మన్యం మొత్తంగా ఆదివాసీలకు దూరమై కార్పొరేట్ల పరమౌతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ హక్కులను, ఆదివాసీచట్టాలను ధిక్కరించడమే అవుతుందన్నారు.ఏజెన్సీలో యువతకు ఉపాధి అవకాశాలు, చిన్నతరహా పరిశ్రమలను ఐటిడిఎ ద్వారా ఏర్పాటు చేయాలని కోరారు.మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అడ్డుగా ఉందని 1/70చట్టానికి సవరణలు చేయాలని నాటి టిడిపి ప్రభుత్వం గిరిజన సలహా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అప్పట్లో ఉన్న ఒకేఒక సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తీవ్రంగా వ్యతిరేకించడంతో అడ్డుకట్ట పడిందని గుర్తు చేశారు. మన్యవాసుల మనుగడకు నష్టం కలిగించే ఇటువంటి కుట్ర పూరిత విధానాలకు ప్రభుత్వాలు స్వసి చెప్పాలని హితవు పలికారు.పర్యాటకాభివృద్ధి ముసుగులో 1/70 చట్టం సవరణ తగదు.
అరకులోయ: ఆదివాసి ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చెందాలంటే ీVAటళ్ళు,రెస్టారెంట్లు, పార్కులు నిర్మాణం కోసం 1/70 చట్టానికి సడలింపులపై రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ ధర్మన్న పడాల్ పొద్దు బాలదేవ్ తీవ్రంగా ఖండిం చారు. అయ్యన్న ప్రకటన ఆదివాసి హక్కులు, చట్టాలకు తీవ్రమైన విఘాతం కలిగిం చేలా ఉం దని, ఆదివాసులకు ద్రోహం చేసే ఇటు వంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయ్యన్న వ్యాఖ్యలపె ్కఆదివాసీల ఆందోళన
హక్కుంపేట :టూరిజం అభివృద్ధి పేరుతో 1/70 చట్టం సవరణ చేయాలని సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించడం ఆదివా సుల హక్కులు చట్టాలకు తీవ్ర విఘాతం కలిగిం చడమే కాకుండా మన్యవాసులకు ద్రోహం చేయడమేనని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మండిపడ్డారు.. ఆదివాసీ అభివృద్ధి అంటే ీVAటళ్లు,రిసార్ట్స్ నిర్మాణం కాదని, కాపీ, చింతపండు, అడ్డాకులు వంటి గిరిజన అటవీ వాణిజ్య ఉత్పత్తులకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, జిఒ3 ప్రయోజ నాలను పునరుద్ధరించి, శతశాతం గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో హక్కుంపేట,అరకులలోని శరభగుడలో నిరసన చేపట్టారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మండల నాయకులు కిల్లో జగన్నాధం మాట్లాడుతూ, ఆదివాసులకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టం సవరణ చేస్తే షెడ్యూల్ ప్రాంతంలోని అడవీసంపద, గనులు, ఖనిజాలు, ప్రకృతి అందాలన్నీ బడా పెట్టుబడి దారులు కార్పొరేట్ కంపెనీల పరమౌతాయని, ఆదివాసుల జీవన విధానం, మనుగడ ప్రశ్నార్థర మౌతుందని ఆవేదన వెలిబుచ్చారు ఆదివాసీల హక్కుల పరిరక్షణలో గుండెకాయలాంటి 1/70 చట్టంపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆదివాసీలకు ఉపాధి కల్పించే టూరిజం కావాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 వరకు టూరిజం ప్రమోట్ చేసే భాగంగా దేశ, విదేశీ యాత్రికులను ఆకట్టు కునేందుకు టూరిజంశాఖ ఆధ్వర్యంలో చలి ఉత్సా వాలు నిర్వహిస్తున్నది. ఇందుకోసం కోట్ల రూపా యల ఖర్చుకు సిద్ధం అవుతున్నది.ఆదివా సులకు కావాల్సింది చలి ఉత్సవాలు కాదు.జీవో నెం.3కు చట్టబద్ధత కల్పిస్తూ ఏజెన్సీ స్పెషల్ డిఎస్‌సి నోటి|˜ ¾కేషన్ విడుదల చేసి అరకు చలి ఉత్సవాలు నిర్వహించాలి. చలి ఉత్సవాల పేరుతో టూరిస్టు లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కన్నా చలి కాలంలో పాడేరు ఏజెన్సీలో సున్నా డిగ్రీల చలికి వణుకుతున్న 50 వేల మంది ఆదివాసీ హాస్టల్ విద్యార్థినీ విద్యార్థులకు చలి దుప్పట్లు పంపిణీ చేయాలి. ఆదివాసీలకు ఉపాధి కల్పించేలా టూరిజాన్ని అభివృద్ధి చెయ్యాల్సింది పోయి వారి సంస్కృతిని నాశనం చేసే విధంగా టూరిజాన్ని వృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. బినామీ పేర్లతో పెద్దపెద్ద లాడ్జీలు, రిసార్ట్స్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసి వందలాది ఎకరాల ఆదివాసీల భూములను ధారాదత్తం చేస్తూ 1/70చట్టానికి తూట్లు పొడుస్తున్నది. చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా రోజురోజుకు అక్రమ కట్టడాలు పెరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడంలేదు. సోమవారం నాడు విశాఖలో జరిగిన టూరిజం ఇన్వెస్టర్స్ సదస్సులో పెట్టుబడు లను ఆకర్షించేందుకు 1/70 చట్టాన్ని సవరించా లని సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రతిపాదించడం దారుణం.ఈ విషయ మై అధికారులు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని కూడా చెప్పారు. అంటే 1/70ని మార్చి వేయాలన్నదే వారి నిశ్చితాభిప్రాయంలా వుంది. గిరిజనుల మనుగడకు ప్రమాదకరమైన ఈ ప్రయ త్నాలను గట్టిగా వ్యతిరేకించాలి.టూరిజంలో వచ్చే ఆదాయంలో 25 శాతం నిధులను స్థానిక ఆది వాసీ అభివృద్ధికి ఖర్చు పెట్టాలనే నిబంధన ఉంది. అయినప్పటికీ బేఖాతరు చేస్తూ చలి ఉత్సవాల కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టడంపై ఆదివాసీ సమాజం తీవ్ర ఆందోళ చెందుతున్నది. ఏజన్సీ ప్రాంతంలో రోడ్లు, వంతెనలు లేనందున గర్భిణీలు,రోగులను హాస్పిటల్‌కు తరలించేందుకు అంబులెన్సులు రావడంలేదు.డోలీ మోతలతో మార్గ మధ్యలోనే మరణిస్తున్నారు. మరోవైపు సరైన పౌష్టికాహారం లేక రక్తహీనత, సికిల్ సెల్ ఎనీమియా,టైఫాయిడ్,మలేరియా తదితర వ్యాధు లతో పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. వారి కోసం సరైన సదుపాయాలు కల్పించకపోగా ఆదివాసుల ప్రకృతి అందాలు చూపించి కోట్ల రూపాయల ఆదాయాలు పోగేసుకుంటూ దేశ, విదేశీ టూరిస్టులకు కోట్లు ఖర్చు పెట్టాలన్న ప్రభుత్వ ఆలోచనతో ఆదివాసీ సమాజం తీవ్ర ఆందోళ చెందుతున్నది. ఆదివాసీ యువతకు వంద శాతం ఉద్యోగావకాశాలు కల్పించే జీవో నెం 3 రద్దవడంతో గంజాయి సాగు మాయలో పడి జైలు పాలౌతున్నారు. ఏజన్సీలో ఉపాధి అవకాశాలు లేక మైదాన ప్రాంతాలైన విశాఖ, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్లి ఇటుక బట్టీల్లో, చేపలు, రొయ్యల చెరువుల్లో పనికి కుదిరి వంద లాది మంది మోసపోతున్నారు.ఆదివాసీల కళలు, సంస్కృతి రక్షణకు ఉత్సవాల నిర్వహణ పట్ల ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించడంలేదు.పైగా వారి సంస్కృతి నాశనమయ్యే విష సంస్కృతిని ప్రమోట్ చెయ్యడంతో భవిష్యత్‌లో ఆదివాసీల హక్కులకు, వారి అస్తిత్వానికి తీవ్ర ప్రమాదం ఏర్పడుతుంది. ఆదివాసీ సమాజం, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు కాపాడ్డానికి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది.పాడేరు ఏజెన్సీలో ప్రముఖ పర్యాటక కేంద్రాలైన బొర్రా, ట్రైబల్ మÖ్యజియం, పద్మపురం గార్డెన్, చాపరా యి, కొత్తపల్లి జలపాతం నుండి ఏడాదికి సుమారుగా రూ.20కోట్ల వరకు ఆదాయం వస్తున్నది. టూరిజంలో వస్తున్న ఆదాయంలో 25 శాతం నిధులు స్థానిక ఆదివాసుల అభివృద్ధికి, విద్యా వైద్యం మౌలిక వసతులపై ఖర్చు పెట్టడం లేదు. మరోవైపు టూరిస్టులకు కోట్లు ఖర్చు చెయ్యడం ఆదివాసులకు తీవ్ర అన్యాయం చెయ్యడమే అవుతుంది. ఆదివాసీల సంస్కృతి, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, చట్టాల పరిరక్ష ణకు,టూరిజంలో వస్తున్న ఆదాయంలో 25 శాతం స్థానిక ఆదివాసీల అభివృద్ధికి నిధులు కేటాయించడం కోసం,జీవో నెం.3చట్టబద్ధత కోసం,ఏజెన్సీ స్పెషల్ డిఎస్‌సి నోటిఫికేషన్ సాధించుకునేందుకోసం ఆదివాసీలు ముందుకు రావాలి.– కిలో సురేంద్ర

మహా భూతం …ప్లాస్టిక్

“ మనిషి మనుగడపై మనిషే గొడ్డలి వేటు వేసుకుంటున్నాడు..జీవరాశి మనుగడను ప్రమాదంలో పడేస్తున్నాడు.ఇందులో ప్రధానమైనది ప్లాస్టిక్..ప్రస్తుతం ప్రళయంగా ముంచెత్తుతోంది.కంటికి కనిపించని ప్లాస్టిక్ రేణువులు క్యాన్సర్‌కి కారణమవుతుండగా..మనం వాడిపడేస్తున్న ప్లాస్టిక్ కవర్లు,ఉపకరణాలు పర్యావరణాన్ని కాటు వేస్తున్నాయి.” – గునపర్తి సైమన్ 


వాడేస్తాం..పడేస్తాం…ఇలావాడేస్తూ పడేస్తూ, సగటున ప్రతివ్యక్తి ఒక పాలిథిన్ సంచిని చెత్త బుట్ట పాలు చేసినా రోజుకి వందకోట్లపైమాటే? అవన్నీ ఎక్కడికెళ్తాయి? ఏమైపోతాయి.మట్టిలో, నీళ్ళలో,ఎడారిలో,అడవుల్లో,కొండల్లో,గుట్టల్లో, ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తున్నాయి.ఆవ్యర్థం కొండలా పేరుకుపోయి,కొండచిలువలా మానవ జాతిని మింగేస్తోంది.సౌలభ్యంగా ఉందని, చవగ్గా వస్తోందని, మహా తేలికని,మడత పెట్టుకోవచ్చని మురిసిపోతున్న మనం రాబోయే కష్టాల సంగతే పట్టించుకోకుండా మితిమీరి ప్లాస్టిక్‌ని వాడుతున్న ఫలితంగా ‘జనాభా విస్పో టనం కన్నా పెను ఉత్పాతంలా గుండెల మీద కుంపటిలా ప్లాస్టిక్ వినియోగం తయారైంది. రోజూ అన్ని అవసరాల కోసం కుగ్రామం నుండి మహానగరం వరకు ప్రతిరోజు విపరీతంగా ప్లాస్టిక్ వినియోగిస్తున్నారు. ఒక ప్లాస్టిక్ సంచి భూమిలో కలవాలంటే కొన్ని వందల ఏళ్ళు పడుతుందనేది శాస్త్రీయంగా నిరూపించబడ్డ నిజం. మార్కెట్ ఆధారిత లాభాపేక్షతో కూడిన వినిమయ సంస్కృతి వల్లే భూవాతావరణం ధ్వం సమైంది. మన అవసరాలను తీర్చుకునే క్రమం లో ప్రకృతి నియమాలకు లోబడి వ్యవహరించ డమనే ఆలోచన మనకుండాలి.పర్యావరణానికి భంగం కలుగకుండా ఈ భూగోళాన్ని తర్వాతి తరాలకు అందించే దృష్టితో,సమ కాలీన అవసరాలను తీర్చుకునే విధమైన సుస్థిర అభివృద్ధి నమÖనా రూపొందించు కోవాలి.జీవితంలో ప్లాస్టిక్ నిత్యావసర వస్తువులలో ఒకటిగా మారిపోయింది.ఉద యం నిద్రలేచింది మొదలు మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఇంటా,బయటా ఎన్నో అవస రాల కోసం ప్లాస్టిక్‌పై ఆధారపడు తున్నాం. టూత్ బ్రష్‌లు,వాటర్ బాటిల్స్,టిఫిన్ బాక్స్‌లు,ప్లేట్లు,గ్లాసులు, షాంపులు, పాలు, వంట నూనె ప్యాకెట్లు, తలనూనె,ఔషధాల డబ్బాలు, పిల్లల పాలసీసాలు..ఇలా ప్రతి వస్తువు ప్లాస్టిక్‌తో తయారైనవే.ఆశ్చర్యమే మంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే హాస్పిట ల్స్‌లో కూడా సెలైన్ బాటిల్స్, రక్తం భద్రపరచే సంచులు, ఇంజక్షన్ సీసాలు, సిరంజిలు కూడా ప్లాస్టిక్‌తో తయారైనవే. పర్యా వరణం,ప్రజా రోగ్యం ముప్పుకలిగించే వాటిల్లో ప్లాస్టిక్ ముఖ్యమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నా, ప్లాస్టిక్ వినియోగంపై అవగాహనఉన్నా కూడా నిర్లక్ష్యం,బద్దకంవల్ల విపరీతంగా అడ్డూఅదుపు లేకుండా ప్లాస్టిక్ వాడుతున్నాం.
ప్లాస్టిక్ ఎలా హానికరం?
ప్లాస్టిక్‌లో కృత్రిమ రంగులు,రసాయనాలు, పిడ్‌మెంట్లు, ప్లాస్టిసైజర్లు, ఇతర మÖలకాలు వినియోగిస్తారు. ఇవి రకరకాల క్యాన్సర్ కారకాలు. ఈ ప్లాస్టిక్ సంచుల్లో ఆహార పదార్థాలు ప్యాకింగ్ చేసినపుడు ఇందులోఉండే కాల్షియం, సీసం వంటి ధాతువులు ఆహారంలో చేరి ప్రజల ఆనారోగ్యానికి కారణమవుతాయి. ఈ ప్లాస్టిక్‌తో తయారైన ఉత్పత్తులను బయట పారేయడంవల్ల చాలా పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి.ఈ ప్లాస్టిక్ వస్తువులను పశువులు తింటే వాటికి ప్రాణహాని కలుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు పశువుల జీర్ణాశయాల్లోకి చేరి వాటికి తీవ్ర ఆరోగ్య సమస్యలొస్తాయి. భారత్‌లో ఏడాదికి 65లక్షల టన్నుల ప్లాస్టిక్ వినియోగం జరుగుతున్నది. గత 50 ఏళ్ళలో 20రెట్లు ప్లాస్టిక్ వినియోగం పెరిగింది.కాని ఇందులో 5శాతం మాత్రమే రీసైకిల్ జరుగుతున్నది.ప్యాకింగ్ రంగంలో మొత్తం ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌లో 40శాతం వాడుతున్నారు. ఒక కవరు రీసైక్లింగ్ అయ్యే ఖర్చులో 50కొత్త కవర్లు తయారుచేసుకోవచ్చు. ప్యాకింగ్ రంగంలో వాడే ప్లాస్టిక్‌లో 90శాతం వ్యర్థాలుగా మారుతున్నాయి. ఏటా 80లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరుతు న్నాయి.2030నాటికి సముద్రాలలో ప్లాస్టిక్ వ్యర్థాలు రెట్టింపు అయి 2050నాటికి నాలుగిం తలు అవుతుందని ‘వరల్డఎకనామిక్‌ఫోరం’ సర్వే నివేదికలు చెబుతున్నాయి.2029నాటికి 1టన్ను సముద్ర చేపలకు 3టన్నుల ప్లాస్టిక్ పేరుకు పోతుందని ఈ సర్వే చెబుతున్నది.
ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంపరంగా..
అధిక ప్లాస్టిక్ వినియోగం వల్ల మగవారిలో బిపి,షుగర్,శ్వాస,గుండెపోటు వ్యాధులు పెరుగు తున్నాయని, ఆడవారిలో మెనోపాజ్, థైరాయిడ్, షుగర్, గర్భకోశవ్యాధులు పెరుగు తున్నాయని వైద్యులంటున్నారు. జీవక్రియల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే హార్మోన్ల పనితీరుపై ప్లాస్టిక్‌లో ఉండే ‘ధాలైడఈస్టర’ అనే రసాయనం తీవ్రప్ర భావం చూపుతుంది.ప్లాస్టిక్ అనేది‘’కాక్ టెయిల్ ఆఫ్ కెమికల్స’అంటారు. ఎందుకంటే ప్లాస్టిక్‌లో భారలోహాలు, క్రిమిసంహారిణిలు, పెస్టిసైడ్స్, పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లు (పిఎహెచ్‌లు) పాలీక్లోరినేటెడ్ బైఫినాల్స్ (పిహెచ్ బిలు) మిధనల్, సైక్లోహెక్సేన్,హెప్టేన్‌ల లాంటి సాల్వెంట్‌లుబీ పోటాషియం పర్‌సల్ఫేట్, బెంజా యిల్ పెరాక్సైడ్ లతో పాటు ట్రైబ్యూటాల్టిన్, జింకాక్సైడ్,కాపర్‌క్లోరైడ్ లాంటి ఉత్ప్రేర కాలుబీ బ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డంట్స్ (పియండిఇ) పాలేట్స్,సీసం సంయోగాలు, పాలిక్లోరి నేటెడ్ బిస్పినాల్స్(పిసిబిలు),బిస్పినాల్ లాంటి రసాయనా లు ప్లాస్టిక్‌లో ఉంటాయి. ఇవి అంత స్రావీ వ్యవస్థపై వినాళగ్రంథుల స్రవనాలపై దుష్పలితాలు చూపుతాయి.ఈ రసాయనాలన్నీ సముద్ర జీవ రాశులపై, మానవుల శ్వాస కోశంపై, చర్మంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. ఒకటన్ను పాలథిన్ సంచులు తయారు చేయాలంటే 11బ్యారెళ్ళ చమురు అవసరం అవు తుంది. ఆ లెక్కన ప్రపంచ చమురు సంక్షోభానికి పాలథిన్ కూడా ఓకారణమే.పాలథిన్ సంచి సగటు జీవిత కాలం 5నిమిషాలకంటే తక్కువ. ఒకసారి వాడి పడేసే వారే అధికం.గ్రామాలలోని వీధులనుండి మొదలు మహానగరాల వరకు ఇపుడు సిమెంట్ రోడ్లేస్తున్నారు.కాంక్రిట్ జంగిల్స్‌ను తలపించే నగరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు భూసారాల్లో చేరి నీటిని భూమిలోకి ఇంకనీయ కుండా అడ్డుకుం టాయి. నగరాలలో 2సెం. మీవర్షం పడితే చాలు అక్కడ నీళ్ళు నిల్వ ఉంటు న్నాయి. మురుగు నీటి వ్యవస్థలు స్థంబించిపోతు న్నాయి.వీటికి ముఖ్య కారణం ప్లాస్టిక్ వ్యర్థాలే. పైపుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఇతర చెత్త పేరుకుపోయి అవి మÖసుకుపోతున్నాయి.దీంతో రోడ్లు జలమ య మవుతున్నాయి.ట్రాఫిక్ సమస్యలేర్పడుతు న్నాయి.ఓమోస్తరు నగరాలలో కిలోమీటర్ల కొద్దీ, మహా నగరాలలో వందల కిలోమీటర్ల మేర నాలా లుంటాయి.ఈనాలాల చుట్టు పక్కల నివాసంఉండే ప్రజలంతా,ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను ఈ నాలాల్లో పారపోస్తుంటారు. ప్లాస్టిక్ సంచులు భారీ స్థాయిలో పేరుకుపోయి నాలాలు మÖసుకుపోతు న్నాయి.ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీసే యం త్రాంగం సరిపోను లేకపోవడంవల్ల కుంటలు, చెరువుల ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నాయి.ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ ఉంచి వాడే ఆహారంవల్ల వ్యాధులు వస్తున్నాయి. ఇండ్లల్లో, కార్యాలయాల్లో, బేకరీ లలో,ీVAటళ్ళలో ఆహారాన్ని వేడి చేయ డానికి మైక్రోవేవ్ ఓవెన్లు వాడు తుంటారు. ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారంపెట్టి ఈ ఓవెన్లలో పెడతారు. ఇలా చేయడంవల్ల పదార్థాలు వేడవడంతో పాటు ప్లాస్టిక్‌పాత్ర లోని ‘’బిస్‌పినాల’ పదార్థంకరిగి ఆహారంతో కలసిపోతుంది.ఇలా క్యాన్సర్,ఉదర కోశ వ్యాధు లకు అంకురార్పణ జరుగుతుంది. అందుకే ఓవెన్‌లలో ప్లాస్టిక్ పాత్రల బదులు బోరోసి లికేట్,గ్లాస్,సిలికోవ్‌తో తయారై అధిక ఉష్ణో గ్రతను తట్టుకోగల పాత్రలు వాడడం మంచిది.
ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించొచ్చు
పెండ్లి,ఇతర విందుల్లో ప్లాస్టిక్ పళ్ళాలు,గ్లాసులు నీటి ప్యాకెట్లను వినియోగించే బదులు విస్తరా కులు,అరటిఆకులు,కాగితంతో చేసిన గ్లాసులు వాడటం మంచిది. ప్లాస్టిక్ సంచులు వాడని ీVAటళ్ళను,కర్రీ సెంటర్లను ప్రస్తుతం మనం ఎక్కడా చూడలేము.టిఫిన్ నుంచి పచ్చడి, సాంబారు,కర్రీ అన్నీటిని ప్లాస్టిక్ సంచుల్లో కట్టి అందిస్తారు. ఇది మానుకోవాలి. సాంబారు రసం,కూరల కోసం ఇంటి నుంచి లోహపు డబ్బాలు తీసుకెళ్ళడం మంచిది లేకుంటే లోహపు డబ్బాల ధరను డిపాజిట్‌గా పెట్టుకొని ీVAటల్ యాజమానులు తినుబండారాలను స్టీలు డబ్బా లలో సరఫరా చేయాలి. వాటిల్లో తీసుకెళ్ళి వినియోగదారుడు డబ్బా తిరిగి ఇచ్చిన వెంటనే డిపాజిట్ వెనక్కి ఇచ్చేయొచ్చు.వాడి పడేసే ప్లాస్టిక్ పెన్నుల వల్ల కూడా పర్యావర ణానికి ముప్పు పొంచిఉంది.ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో ఇలాంటి పెన్నుల వినియోగం భారీ స్థాయిలో ఉంది. ఇందుకు విరుగుడుగా ఇపుడు మార్కెట్లో పర్యా వరణ హితమైన పెన్నులు అమ్ముతున్నారు. ఈపెన్నులు వినియోగించిన తర్వాత భూమిలో నాటితే మొక్క వచ్చే వీలుగా వీటిని తయారుచేశారు. ఇందుకు పెన్ను చివరన ఒక విత్తనం పెడుతున్నారు. ఇంకు అయి పోయాక దీనిని తిప్పి భూమిలో నాటితే కొన్ని రోజులకు మొక్కలు వస్తాయి.ఇది స్పూర్తివంతమైన, పెద్దలకు, పిల్లలకు ఆసక్తికరమైన పని.
ప్రత్యామ్నాయాలు ఆచరించాలి
ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురుచూడ కుండా ప్లాస్టిక్ వినియోగంపై ఎవరికి వారుగా ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టాలి. పండ్లు, కూరగాయలు,కిరాణ షాపులో సామాన్లు కొనేపుడు ప్లాస్టిక్ సంచీలు అడుగ కుండా ఇంటి నుంచి బట్ట,జ్యూట్ సంచులు తీసుకెల్లడం ఉత్తమం. చికెన్,మటన్ అమ్మే వ్యాపారస్తులు చాలా మంది 40మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న సంచులు వాడుతున్నారు. వాటిల్లో తెచ్చుకునేకంటే ఇంటి నుండి ఒక స్టీలు డబ్బా తీసుకెళ్ళడం మంచిది. మంచినీటి కోసం కార్యాలయాల్లో ఒకపుడు గాజు,స్టీలు,గ్లాసులు వాడేవారు.ఇపుడు ప్లాస్టిక్ సీసాల్లో తెచ్చిపెడు తున్నారు.ఈ పద్ధతి సరికాదు.టీలు,కాఫీలు గాజు,స్టీలు,పింగాణీ పాత్రల్లో మాత్రమే తాగాలి. పండ్లరసాలు తాగడానికి కాగితం గ్లాసులే వాడాలి. ఇండ్లల్లో ఆకు కూరగాయాలను ఫ్రిజ్‌లో ఉంచేందుకు కంటైనర్లు వాడాలి. పాలు,పెరుగులను ప్లాస్టిక్ కవర్లలో విక్రయి స్తుంటారు.ఏరోజుపాలు ఆ రోజు తెచ్చుకుని పాల ప్యాకెట్లను ఫ్రిజ్‌లో పెట్టకుండా, పాత్రలో వేడిచేసి చల్లారిన తర్వాత నిల్వచేసు కోవాలి. వ్యాపారస్తులు 40 మైక్రాన్ల కన్నా తక్కువగాఉన్న ప్లాస్టిక్ సంచులు వాడకుండా అధికారులు మొక్కుబడి తనిఖీలు కాకుండా కఠినంగా వ్యవహరించాలి.ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలు ఆరోగ్యసమస్యలు,పర్యావరణ హాని తదితర అంశాలపై గ్రామాలు,పట్టణాలు, నగరాల్లో, కాలనీల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు యÖత్‌క్లబ్‌ల సభ్యులను,కాలనీ కమిటీలను ప్రోత్సహించాలి.అధికారులు ప్రజల మధ్య సమన్వయం, సహకారం ఉంటేనే ప్లాస్టిక్ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకో గలం.పాలకులు, ప్రభుత్వాలు ప్లాస్టిక్ సంచుల స్థానంలో ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులు జౌళి సంచులు తయారీ పరిశ్రమలపై దృష్టి సారించాలి. ఇందుకోసం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలివ్వాలి. సబ్సిడీలిచ్చి ఆకర్షించాలి. చెత్తకుండి ఉన్నదే చెత్తవేయడానికి మళ్ళీ అందులో పాలిథిన్ కవరు ఎందుకు?డబ్బాఖాళీ చేసాక ఓసారి నీళ్ళతో శుభ్రంగా కడిగేస్తే సరిపోతుంది. గుడ్డసంచి వాడితే,వారానికి ఆరు,నెలకు 24, సంవత్సరానికి 280 ఓజీవితకాలంలో కనీసం 22వేల పాలిథిన్ కవర్ల వల్ల కలిగే నష్టాన్ని నివారించిన వాళ్ళం అవుతాం.‘నోపాలిథిన్ హేజ’ అని మనింటికి మనమే ధృవపత్రం ఇచ్చుకోవాలి. నిజానికి పాలిథిన్ దుష్ప్రవాల నుంచి తప్పించు కోవడానికి నిషేధాలు సరిపోవు. నిజాయితీ కావాలి.జనభాగస్వామ్యం అవసరం.
మహా విశాఖనగరంలో సింగిల్ యÖజ్‌ప్లాస్టిక్
మహావిశాఖనగర మున్సిపాల్ కార్పొరేషన్ సంస్థ(జీవీఎంసీ) పరిధిలో జనవరి 1 నుంచి సింగిల్ యÖజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధం అమల్లోకి వచ్చింది.ఈ మేరకు నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, కమిషనర్‌తో కలసి సింగిల్ యÖజ్ ప్లాస్టిక్ వస్తువులపై ప్రత్యామ్నాయాలు,తనిఖీలపై స్కిల్ అప్ గ్రేడేషన్‌పై సమీక్ష నిర్వహించారు.వీధివ్యాపారులు,వర్తక, వ్యాపారస్తులు అలాగే అన్ని జోన్ల కార్యదర్శులతో జూమ్ యాప్ ద్వారా ప్లాస్టిక్ నిషేధంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన, శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.సింగిల్ యÖజ్ ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా అనేక వస్తువు లు అందుబాటులో ఉన్నాయని వాటిని ప్రతి ఒక్కరూ వినియోగించాలని మేయర్ గొలగాని హరి వెంకటకుమారి సూచించారు. మార్కెట్లు, రైతు బజార్లు, పండ్ల దుకాణాల వద్ద అవగాహన కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ వస్తువుల స్టాల్స్?ను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు మేయర్?కి వివరించారు. జనవరి 1 నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 120 మైక్రాన్లలోపు ఉన్న సింగిల్ యÖజ్ ప్లాస్టిక్? నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని ఇన్‌చార్జీ కమిషనర్ ,జిల్లా కలెక్టర్ హరేంద్రే ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
నిషేధిత జాబితాలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులివే
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐస్‌క్రీమ్ పుల్లలు, అలంకరణ కోసం వాడే థర్మాకోల్, ప్లేట్లు, పుల్లలతో కూడిన ఇయర్ బడ్స్, బెలూన్లకు వాడే పుల్లలు, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్‌లు, పిప్పర్‌మెంట్లకు వాడే పుల్లలు, కప్పులు, గ్లాసులు, ఫోర్క్‌లు ఉన్నాయి. అదేవిధంగా కత్తులు, స్పూన్లు, స్ట్రాలు, స్వీట్ బాక్స్‌ల ప్యాకింగ్‌కు వాడే పల్చటి ఆహ్వాన పత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, 120 మైక్రాన్లలోపు ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు, ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు మొదలైనవి.

జీవుల మనుగడ జీవ వైవిధ్యం

ఈ సృష్టిలో మనుషులకు,తోటి జీవులకు ఒకటే గ్రహం,ఒకటే గృహం.మనుషులంతా ఒకటే అనేది ఉట్టిమాట. పొడుగు,పొట్టి,లావు,సన్నం,నలుపు,తెలుపు,ఇంకా వీటిమధ్యస్థ రకాలు,భేదాలు.ఇంకా మనుషు లంతా ఒకటే అని అనుకోవడం ఏమిటి?ఒక్క మనుష్య జాతిలోనే ఇన్ని భేదాలుంటే,మనిషికి తెలిసిన మిగతా జంతు, వృక్ష జాతులలో మరిన్ని వైవిధ్యాలు ఉన్నాయి.ఈభూమ్మీద ఉండేజీవులలో ఉండే ఈతరహా భేదాల న్నిటినీ కలిపి జీవవైవిధ్యం అంటున్నాం.జీవవైవిధ్యం భూమిపైజీవుల ఆరోగ్యాన్నికొలిచే థర్మామీటర్ వంటిది.ప్రకృతిలో ప్రతి జీవి ఒకప్రత్యేక పాత్రనుపోషిస్తూ పర్యావరణవ్యవస్థల స్థిరత్వం,స్థితిస్థాపకతకు దోహదంచేస్తుంది.ఒకపురుగో,అసలిప్పటివరకు సామాన్య మానవులకు కనిపించని ఒక మొక్కోలేదా ఏదో విషపు పాముల వంటి జంతువో అంతమైపోతే మనకు ఏ విధంగా నష్టం జరుగుతుంది? అదిమన దైనందిన జీవితాలపై నిజంగా ప్రభావం చూపుతుందా?పర్యావరణ వ్యవస్థలోని ప్రతిజాతి ఇతర జీవ రూపాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంకర్షణ చెందుతుంది.పర్యావరణ వ్యవస్థను ఒకభారీనెట్‌వర్క్‌గా భావించవచ్చు,ఇక్కడ ప్రతి జీవిఒకదారంద్వారా ఇతరులతో అనుసంధానించబడి ఉంటుంది.ఒకదారం తెగి పోయినప్పుడు,దానితో నేరుగా అనుసంధానించబడిన జాతులు ప్రభావితమౌతాయి.అయితే అవి పరోక్షంగా దానితో సంకర్షణ చెందే వాటిపై ఎక్కువ లేదా తక్కువ ప్రభావాన్ని చూపుతాయి.పర్యావరణ వ్యవస్థ ఎంత వైవిధ్యంగా ఉంటుందో,అది అంతబాగా అంతరాయాలను తట్టుకునే శక్తికలిగి ఉంటుంది.జీవుల సహజ ఆవాసాల నాశనం,కాలుష్యం లేదా వాతావరణ మార్పులద్వారా కలిగే అంతరాయాలతో పర్యావరణం నిలకడగా ఉండదు.అందుకు కారణం జీవవైద్య నాశనమే.కొన్ని జాతుల నష్టం కూడా మానవ జనాభాకు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది,మనజీవితాలను ప్రభావితం చేస్తుంది.      -డా.కాకర్లమÖడి విజయ్

ప్రకృతి అందించే అపరిమిత సేవలు :ప్రతిరోజూ,జీవవైవిధ్యం మనకు అనేక రకాలుగా సేవలను అందిస్తుంది. ఉదాహరణకు,మొక్కలు కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తూ ఆక్సిజన్‌ను అందిస్తాయి. తేనెటీగలు మరి యు ఇతర కీటకాలు మొక్కల ఫలదీకరణానికి దోహదపడతాయి, మాంసాహారులు శాకాహారి జనాభాను నియంత్రణలో ఉంచుతాయి.ఆక్సిజన్ ఉత్పత్తి, నేల నిర్మాణం, నీటి చక్రం వంటి క్రియలు పర్యావరణ వ్యవస్థలు సాఫీగా నడవడానికి తోడ్పడే ప్రాథమిక అంశాలు.నిజానికి జీవవైవిధ్యమే వాతావరణ మార్పులను తగ్గించ డానికిఉపయోగపడుతుంది.ఉదాహరణకు, మానవు లు ఉత్పత్తిచేసే కార్బన్ డయాక్సైడ్‌లో దాదాపు సగ భాగాన్ని పీల్చుకోవడంద్వారా వాతావరణాన్ని నియం త్రించడంలో సముద్రాలు,అడవులు కీలక పాత్ర పోషి స్తాయి.చిత్తడి నేలలు,మడ అడవులు,పగడపు దిబ్బల వంటి తీరపర్యావరణ వ్యవస్థలు తుఫానులు, వరదల నుండి సహజ రక్షణను అందిస్తాయి.వృక్షాలు గాలి నీటిశుద్దీకరణతోపాటు,ఉష్ణోగ్రతలను తగ్గించడానికి, మట్టిని స్థిరీకరించడానికి,తద్వారా వరదల ప్రమా దాన్ని తగ్గిస్తాయి. కానీ దురదృష్టవ శాత్తూ, ప్రస్తుతం వాతావరణ మార్పులే జీవవైవిధ్యాన్ని కుప్పకూలుస్తు న్నాయి.పర్యావరణం స్థిరంగా ఉండాలంటే,జీవ వైవి ధ్యం అధికంగా ఉండటం ముఖ్యం. వైవిధ్య భరి తమైన పర్యావరణం మరింత స్థిరంగా ఉంటుంది. వాతావరణ మార్పుల వల్ల జీవవైవిధ్యంపై అనేక దుష్పరిణామాలు కలుగుతాయి.ఎన్నో శాస్త్రీయ నివేది కలు ఈవిషయాన్ని నివేదించాయి. ఉష్ణోగ్రతలు 1.5 పెరిగితే, దాదాపు 6% కీటకాలు,8% మొక్కలు 4% సకశేరుకాలు వాటి భౌగోళిక పంపిణీలో (ఆవాసాల మార్పు)మార్పులకులోనవుతాయి.ఉష్ణోగ్రతల పెరుగు దల 2%మేర అయితే,ఈ శాతాలు రెట్టింపు అవుతా యి.ఈకారణంగా,ఆక్రమణ జాతులు కూడా అనూ హ్యంగా విస్తరించే ప్రమాదముంది. ప్రపంచ భూభా గంలో దాదాపు 7%పర్యావరణ వ్యవస్థలు మారే ప్రమాదం ఉంది, అందువల్ల సహజ ఆవాసాల క్షీణత రాబోయే సంవత్సరాల్లో వేగవంతం అవుతుంది. ఫినోలాజికల్ మార్పులు (కొన్ని జాతుల పుష్పించే లేదా పునరుత్పత్తి వంటి ఆవర్తన సంఘటనలు) ఎక్కు వగా నమోదు చేయబడుతున్నాయి, ఫలితంగా జాతు ల మధ్య పరస్పర సంబంధాలపై ప్రభావం చూపు తుంది.ఉష్ణోగ్రత1.5్పులేదా2%్పుపెరిగితే, దాదాపు 70-99% పగడపు దిబ్బలు నాశనమవుతాయి. ఈ సృష్టిలో మనుషులకు,తోటి జీవులకు ఒకటే గ్రహం, ఒకటే గృహం.కంటికి సరిగ్గా కనిపించని బ్యాక్టీరి యా నుండి ఆకాశాన్ని అందుకునే ఎత్తైన చెట్ల వరకు అగాధాలలో అనాయాసంగా నివసించే సముద్ర జీవుల నుండి అలవోకగా ఆకాశంలోఎగిరే పక్షుల వరకు భూమికోట్ల కొద్దీ జీవజాతులకు నిలయం. నిత్యం కనుగొనబడే జీవజాతులు, వాటి శాస్త్రీయ వర్గీకరణ కారణంగా ఖచ్చితమైన సంఖ్య ఇప్పటికీ అనిశ్చితంగా ఉన్నప్పటికీ, ఇప్పటివరకు అధికారి కంగా 17కోట్ల జాతులను మాత్రమే గుర్తించాము. యాభై నుండి మÖడువందల కోట్ల జీవజాతులు ఉండవచ్చు అనేది ఒక అంచనా. ఇంతటి విస్తృతమైన వైవిధ్యం రాత్రికి రాత్రే పుట్టుకు రాలేదు. ఇది ఇప్పటి స్థితికి రావడానికి దాదాపు నాలుగు వందల కోట్ల సంవత్సరాల పాటు జీవపరిణామక్రమ ప్రక్రియ జరగవలసి వచ్చింది. కానీ ఆకోట్లాది జాతులలో కొన్ని జాతులు సమÖలంగా అంతరించడం జరిగిం ది మాత్రం మానవుడు ఆవిర్భవించిన ఇటీవలి కాలంలోనే!భూమిచరిత్రలో జీవవైవిధ్యం అంతరించి పోవడం,పునరుద్ధరణ జరగడం సహజ ప్రకృతి చర్యనే.గతంలో కనీసం అయిదు సార్లు సహజ కార ణాలవల్ల సామÖహికంగా జీవుల విలుప్తాలు (జుఞtఱఅctఱశీఅs)జరిగాయి.వీటిలో చివరిది 65 మిలి యన్ సంవత్సరాల క్రితం జరిగిన డైనోసార్ల విలు ప్తం.కానీ ఆందోళన కలిగించే విషయం ఏమి టంటే,ప్రపంచీకరణనుండి,జీవవైవిధ్య నష్టం ప్రమా దకర స్థాయిలో వేగవంతమైంది. ఇప్పుడో ఆరవ సామÖహిక విలుప్తత జరిగే ప్రమాదం ఉందంటు న్నారు శాస్త్రవేత్తలు. చిక్కగా నేసిన వస్త్రంలో నుండి ఒక్కో దారం లాగేస్తుంటే, పల్చనైపోయి, వదులుగా మారి, క్రమేపీ కనుమరుగయ్యే వస్త్రం చందాన మన గ్రహం పైనున్న జీవవైవిధ్య పరిస్థితి ఉంది.అతి సూక్ష్మజీవుల నుండి భారీ నీలి తిమింగలాల వరకు, ప్రతిజాతి మన పర్యావరణవ్యవస్థ అనే వస్త్రపు సమ తుల్యతను కలిపి ఉంచే కీలకమైన దారాలు. ఇప్పుడు ఆ వస్త్రం నుండి దారపు పోగులు ఒక్కొక్కటిగా జారి పోతున్నాయి.మన కళ్లముందే ప్రకృతికను మరుగవు తోంది.భూగ్రహంపై జీవవైవిధ్యం ముప్పులో ఉండ టానికి ప్రధాన కారణం, దానిపైనే అధికంగా ఆధార పడే జీవి-మనిషి కావడం విశేషం.జీవవైవిధ్యం మానవ శ్రేయస్సు జీవనోపాధికి చాలా అవసరం. ఎందుకంటే ఇది అసలు జీవపు ఉనికికే ఆలంబన. కానీ,జీవుల సహజ నివాస స్థలాల నష్టం, కాలుష్యం, వ్యవసాయం,వేటాడటం,ఆక్రమణ జాతులు మరియు పెరుగుతున్న గ్లోబల్‌వార్మింగ్ కారణంగావక్ష, జంతు జాతులు అంతరించిపోయే ప్రమాదం పెరుగు తూనే ఉంది.గత కొన్నిసంవత్సరాలలో,జనాభా పెరుగు దల,దాంతోబాటే విపరీతంగా,అనిశ్చితంగా పెరిగి న,ఉత్పత్తి, వినియోగ విధానాలు జీవవనరు లకు వినియోగాన్ని పెంచాయి. దీని వలన జీవవైవిధ్యం నాటకీయంగా నష్టపోయింది. జీవవైవిధ్య నష్టాన్ని అరికట్టడం అనేది మానవజాతి ముందున్న గొప్ప సవాళ్లలో ఒకటి.జీవవైవిధ్యం అనే పదాన్ని 1988లో అమెరికన్ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఓ.విల్సన్ మొదటిసారి ప్రయోగించాడు. ఈ పదం, మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు మరియు సూక్ష్మజీవులు,అలాగే పర్యావర ణ పరస్పర చర్యలతో సహా గ్రహం మీద ఉన్న వివిధ రకాల జీవ రూపాలను సూచిస్తుంది. జీవవైవిధ్యాన్ని భూమిపై ఉన్న జీవసంపదగా నిర్వచించవచ్చు. జీవ వైవిధ్యాన్ని పర్యావరణ వ్యవస్థలోని జాతుల సంఖ్య ద్వారా కొలుస్తారు, ప్రతిజాతి జనాభాలో జన్యు వైవి ధ్యాన్ని అంచనా వేయడం ద్వారా మరియు వివిధ వాతావరణాలలో జాతుల పంపిణీ అంచనా ద్వారా కూడా కొలుస్తారు. మానవ కార్యకలాపాల కారణం గా జీవ వైవిధ్యంలో గణనీయమైన తగ్గుదల సమస్య పై అవగా హన పెంచడానికి ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్స రం అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని జరుపు తుంది.
మనదేశంలో జీవవైవిధ్యం
భారతదేశం,32,87,263చదరపు కిలోమీటర్ల వైశా ల్యంతో ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం. భారత áదేశంలో89,451జంతుజాతులున్నాయి.ఇది ప్రపంచజంతుజాలంలో7.31%. అలాగే 49,219 వృక్ష జాతులున్నాయి.ఇది ప్రపంచమొత్తంలో 10. 78% వాటాను కలిగి ఉంది. ప్రపంచంలో ఉన్న పదిహేడు అతి పెద్ద జీవవైవిధ్య దేశాలలో భారత దేశం ఒకటి. భూవిస్తీర్ణంలో 2.4 శాతమే ఉన్నప్ప టికీ, ప్రపంచవ్యాప్త జీవజాతులలో 7.8 శాతం మన దేశంలో ఉన్నాయి. మన ప్రభుత్వం 2002లో జీవవైవిధ్య చట్టాన్ని తీసుకువచ్చింది.
అందులో ముఖ్యాంశాలు: జీవవైవిద్య సంరక్షణ, సుస్థిర వినియోగం,అంతరించిపోతున్న జీవజాతు లను కాపాడటం,వాటికి పునరావాసం కల్పించడం. జీవవనరుల వినియోగాన్ని క్రమబద్దీకరించడం, జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేయడం, స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి.
ఇంటర్నేషనల్ యÖనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IU్పుచీ),భారతదేశంలో1,212 జంతు జాతు లను తన రెడ్ లిస్ట్‌లో పర్యవేక్షిస్తుంది.వీటిలో 12% పైగాజాతులు-148-అంతరించిపోతున్నాయి. అం తరించిపోతున్న జాతులలో 69 క్షీరదాలు,23 సరీసృ పాలు,56ఉభయచరాలు ఉన్నాయి. కానీ మనుషులు మాత్రం (ప్రస్తుతం మన దేశ జనాభా దాదాపు నూట నలభై నాలుగు కోట్లు. ప్రపంచ జనాభా దాదాపు ఎనిమిది వందల కోట్లు) పెరిగిపోతున్నారు.మొత్తం అటవీ ప్రదేశంలో కేవలం 15శాతం అడవులు మాత్రమే ఇప్పుడు భూమ్మీద ఉన్నాయి. మిగతావన్నీ ఏనాడో మనిషి మింగేశాడు. దాదాపు పాతిక శాతం వృక్ష జాతులు ప్రమాదపుటంచులలో ఉన్నాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ దాదాపు నలభై శాతం ప్రత్య క్షంగా లేదా పరోక్షంగా జీవవైవిధ్యంపై ఆధారపడి ఉంది. భూమ్మీద అందుబాటులో ఉన్న మÖడుశాతం మంచినీటిలో దాదాపు ఆరుశాతం జాతులు ఉన్నాయి. ఉష్ణమండల వర్షారణ్యాలు ఒకప్పుడు భూమి పై 14శాతం వుంటే, ఇప్పుడు ఆరుశాతానికి పడిపో యాయి.
వినాశనానికి ముఖ్య కారణాలు
సహజ పర్యావరణాల విధ్వంసం, విచ్ఛిన్నం జీవవై విధ్యానికి అతిపెద్ద ముప్పు. ఆవాసాలలో మార్పులు వ్యవసాయం,పట్టణీకరణ, అటవీ మరియు భూవిని యోగంలో మార్పుల ఫలితం. ఇన్వేసివ్ జాతుల (ఆక్రమణ జాతులు)వ్యాప్తి కూడా జీవవైవిధ్య వినాశ నానికి అతిపెద్ద ముప్పు. మానవులు ఉద్దేశపూర్వ కంగా లేదా ప్రమాదవశాత్తు ప్రవేశపెట్టిన కొన్ని జాతులు ఆయా ఆవాసాలలో ఉండే సహజ జాతు లపై దాడి చేసి వాటిని అంతంచేసే ప్రమాదముంది. వనరులను అతిగా దోచుకోవడం, అంటే, అధికంగా చేపలు పట్టడం, వేటాడటం లేదా అతిగా మేపడం వంటి చర్యలు అనేక జాతులకు ముప్పు కలిగిస్తుంది. మన వాతావరణం,పర్యావరణ వ్యవస్థలలో మార్పు లు జీవవైవిధ్యానికి ముప్పు. అన్ని రకాల కాలుష్యం: నీరు, నేల మరియు వాయు కాలుష్యం, కానీ కాంతి లేదా ధ్వని కాలుష్యం, ఇది అనేక రకాల జీవులను ప్రభావితం చేస్తుంది. అభివృద్ధి పేరుతో ఎకరాలకొద్దీ సహజ వనరులపై జరిగే దాడి, విధ్వంసం తెలియ నిది కాదు. ఇటీవల జరిగిన నికోబార్, లక్షద్వీ పాలలో వేలకొద్దీ ఎకరాల భూమిలో అడవులు నాశ నం కావడం, ఆ కారణంగా ఆదివాసీ తెగల జీవన, ఆవాసాలు దెబ్బతినడం తెలిసిందే. తెగలతో బాటు చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువుల జాతులు కూడా దెబ్బతిని, ఒకప్పటి ఘనమైన వైవిధ్యం ఇక ఎప్పటికీ కనిపించదు.అడవులు,జీవ, జలరాశులను ఇప్పటికై నా పరిరక్షించుకోనట్లయితే రాబోయే రోజుల్లో మాన వ జాతి మనగడకే ముప్పు వాటిల్లుతుందని అందరికీ తెలిసిన విషయమే.అభివృద్ధి పేరుతో మనం ఇప్పటికే ఎంతో విలువైన ప్రకృతి సంపదను కోల్పోయాము, అయినా మిగిలివున్న వన సంపందను కాపాడుకో వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పర్యావరణ పరిరక్షణకు ప్రతిపౌరుడు కట్టుబడి ఉండాలి. ప్రభుత్వంగానీ,పౌరులుగానీ అభివృద్ధి పేరుతో చెట్ల ను నరకాల్సి వచ్చినప్పుడు ఒక్క చెట్టు స్థానంలో పది చెట్లు నాటాలి. జీవవైవిధ్యాన్ని మనం కాపాడుకో లేకపోతే చివరకు మనిషి మనుగడే లేకుండా పోతుం దన్న అవగాహన ఉండాలి. భవిష్యత్తు కోసం జాగ్రత్త పడాలి.

చిత్తడి నేలలు ప్రకృతి పరిరక్షణకు నెలవులు

భూగోళంపై జీవరాశి మనుగడకు చిత్తడి నేలలు అత్యంత కీలకం. భూమికి ఊపిరితిత్తులుగా పని చేస్తూ ప్రకృతి సమతుల్యతకు ఇవి ఎంతగానో దోహదపడతాయి.దురదృష్టవశాత్తు చిత్తడి నేలల ప్రాధాన్యాన్ని శతాబ్దాలుగా గుర్తించకపోవడం వల్ల, అవి శరవేగంగా అంతరించి పోతున్నాయి. జీవుల మనుగడకు, పర్యావరణ సమతుల్యతకు చిత్తడి నేలలు ఎంతో అవసరం. ప్రపంచవ్యాప్తంగా గడచిన వందేళ్లలో ఇవి64శాతంమేర అంత రించి పోయాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.చిత్తడి నేలల ప్రాధాన్యాన్ని గుర్తించడంతో పాటు వాటి పరిరక్షణ,అభివృద్ధి కోసం కృషి చేయాలని ఇరా న్లోని రామ్సార్లో 1971లో ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం కుదిరి ఆతరవాత నుంచి ఏటా ఫిబ్రవరి రెండో తేదీన చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. మానవాళికి చిత్తడి నేలల వల్ల కలిగే ప్రయోజనాల పట్ల అవగాహన కల్పించడం ఈఏడాది లక్ష్యం. – గునపర్తి సైమన్ 
ఎన్నో ప్రయోజనాలు..
సముద్ర,నదీతీర ప్రాంతాల్లో ఏడాది పొడవునా నీటి వనరులతో నిండి ఉండే ప్రదేశాలను చిత్తడి నేలలుగా పరిగణిస్తారు. మంచినీటితో పాటు ఉప్పు నీటి సరస్సులు,తంపర,బీల భూములు,పగడపు దిబ్బలు, మడ అడవులు తదితర 19రకాల ప్రాంతాలు చిత్తడి నేలల కిందకు వస్తాయి. నదీ తీరాల్లోని చిత్తడి నేలలు ప్రవాహ ఉద్ధృతిని,అలల తాకిడిని అడ్డుకుని తుపానులు, వరదల ప్రభావాని తగ్గిస్తాయి. పర్యావరణ మార్పుల కారణంగా వాయు దుష్ప్రభావాలను గణనీయంగా నియం త్రిస్తాయి.అరుదైన మత్స్య,వృక్షజాతుల జీవనానికి దోహదపడటంతోపాటు దేశ,విదేశీ వలస పక్షులకు ఆశ్రయమిస్తాయి.ఈ నేలలు పరిసర ప్రాంతాల్లోని నీటి నాణ్యతను పెంచడమే కాదు,కాలుష్య తీవ్రత ను తగ్గించడంలోనూ కీలకమవుతున్నాయి.చిత్తడి నేలలు సాగు,తాగునీరు అందిస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది ఆహార భద్రతకు భరోసా కల్పిస్తున్నాయి.ఈ నేలల్లో లభించే చేపల్లో పోష కాలు అధికంగా ఉంటున్నాయని పలు పరిశోధ నలు తేల్చాయి.చూపరులను విశేషంగా ఆకట్టు కుంటున్న చిత్తడి నేలలు-పర్యటక ఆదా యాన్ని గణనీయంగా పెంచుతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,400 ప్రదేశాలను రామ్సార్ ప్రమాణాల ప్రకారం చిత్తడి నేలలుగా గుర్తించారు.వీటిలో అత్యధికంగా 175 వరకు యÖకేలోనే ఉన్నాయి.142 ప్రదేశాలతో మెక్సికో రెండో స్థానాన్ని ఆక్రమించింది.భారత్ 1982లో రామ్సార్ ఒప్పందంలో చేరి చిత్తడి నేల గుర్తింపును మొదలుపెట్టింది.1982-2013 మధ్య కాలంలో 26ప్రదేశాలను,2014-23 మధ్య మరో 49 క్షేత్రాలను చిత్తడి నేలలుగా గుర్తించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 75 చోట్ల13.30లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రామ్సార్ గుర్తింపు పొందిన చిత్తడి నేలలు విస్తరించి ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు,పులికాట్ సరస్సులు ఇలా గుర్తింపు పొంది నవే.రామ్సార్ ఒప్పంద ప్రమాణాలకు అను గుణంగా ఉన్నప్పటికీ,దేశంలోని అనేక చిత్తడి నేలలను గుర్తించడంలో తీవ్రతాత్సారం జరుగు తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోయంబత్తూరుకు చెందిన సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ, నేచురల్ హిస్టరీ (సాకాన్) సంస్థ రెండు దశాబ్దాల క్రితమే దేశంలోని 700 ప్రదేశా లకు చిత్తడి నేలలుగా గుర్తింపునిచ్చి పరిరక్షించా లని సూచించింది.వాటిలో 200 ప్రాంతాలను రామ్సార్ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ జాబితాలో చేర్చాలని సిఫార్సు చేసింది. కోరింగ అభయారణ్యం, పాకాల చెరువు, కృష్ణా నదీ పరీ వాహక ప్రాంతాలను ఆ జాబితాలో చేర్చాల్సినవి గా సాకాన్ పేర్కొంది.సోంపేట,నౌపడ, వాకల పూడి బద్వేలు,కంభం,విశాఖపట్నం జిల్లాలోని కొండక్లర్ల్ ఆవ,తిమ్మరాజు చెరువు ప్రాంతాలు చిత్తడి నేలలేనని,వాటి పరిరక్షణకు చర్యలు అత్యవసరమని సూచించింది.కొల్లేరు,కొండకర్ల ఆవతో పాటు మరికొన్ని ప్రదేశాలను అటవీశాఖ చిత్తడి నేలలుగా గుర్తించినప్పటికీ,వాటి సంరక్ష ణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడంలేదు. ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సుగా గుర్తిం పు పొందిన కొల్లేరు పరిధిలో వేల ఎకరాల చిత్తడి నేలలు ఆక్రమణలకు,విధ్వంసానికి గురయ్యాయి. దాన్ని అడ్డుకుని,అక్కడి నేలలను పునరు ద్ధరించ డంలో ప్రభుత్వ వ్యవస్థలు ఘోరంగా విఫలమవుతు న్నాయి.సుప్రీంకోర్టు ఇటీవలే నాగ్పుర్లోని ఫుటాలా సరస్సు చుట్టూ కార్యకలాపాలను నిలిపివేసింది. చిత్తడి నేలగా గుర్తించిన ఈ ప్రదేశాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం మానవ నిర్మితంగా పేర్కొన్నప్పటికీ, ప్రకృతి వ్యవస్థల వాస్తవరూపాన్ని మార్చవద్దంటూ సర్వోన్నత న్యాయస్థానం వారించింది.జాతీయ హరిత ట్రైబ్యునల్,కాగ్ వంటివి సైతం చిత్తడి నేలల విధ్వంసాన్ని నిలువరించాలని గతంలో సూచించాయి.జాతీయ అటవీ కమిషన్ 2006 లోనే చిత్తడి నేలల పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని కేంద్రానికి నివేదించింది. సుమారు దశాబ్ద కాలం తరవాత కేంద్రం 2017 లో చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణకు మార్గదర్శ కాలను తీసుకువచ్చినప్పటికీ, అవేమీ క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కావడంలేదన్న విమర్శలు న్నాయి.
బహుముఖ చర్యలు కీలకం…
కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్రప్రభు త్వాలు గుర్తింపు పొందిన చిత్తడి నేలల సమాచా రాన్ని పౌరులకు అందుబాటులో ఉంచాలి. పర్యా వరణ,అటవీ, వన్యప్రాణి, కోస్తా నియంత్రణ చట్టాలను వర్తింపజేయడంతో పాటు వ్యర్థ రసాయనాలు, విషపూరిత జలాలను చిత్తడి నేలల్లో పారబోయకుండా నిఘాను తీవ్రతరం చేయాలి. కఠిన శిక్షలు,భారీ జరిమానాలు విధించడం ద్వారా ఈ నేలల ఆక్రమణలను, విధ్వంసాన్ని అడ్డుకోవాలి.చిత్తడి నేలల పరిరక్షణ కోసం నిరుడు కేంద్రం ప్రకటించిన ‘అమృత్ ధరోహర’ పథకాన్ని రామ్సార్ గుర్తింపు ఉన్న ప్రదేశాలకే పరిమితం చేశారు.మిగతా చిత్తడి నేలలకూ వర్తింపజేయాలి. పర్యాటక, అటవీ, పర్యావరణ శాఖలు సంయు క్తంగా చిత్తడి నేలల పరిరక్షణకు జిల్లాస్థాయి ప్రణాళికలను రూపొందించి స్థానిక సమÖహాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సమర్థంగా అమలుపరచాలి. ఇటువంటి చర్యలు కొరవడితే-చిత్తడి నేలల విధ్వంసం నిరాటం కంగా సాగు తూనే ఉంటుంది!
కొరవడిన సంకల్పం
చిత్తడి నేలల విధ్వంసం మÖలంగా పర్యావరణ మార్పుల దుష్పరిణామాలు అధికమవుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వీటి పరి రక్షణకు పటిష్ఠ కార్యాచరణను రూపొందించి అమలుపరచాలని కోపెన్హాగెన్ వంటి ప్రపంచ స్థాయి సమావేశాలెన్నో తీర్మానాలు చేశాయి. అందుకు గట్టి సంకల్పం కొరవడటం దుర దృష్టకరం.జనాభా పెరుగుదలకు తోడు పారిశ్రా మిక అవసరాల కోసం చిత్తడి నేలలను మట్టితో కప్పి ఆక్రమించేస్తున్నారు పంటల సాగు కోసం రసాయన ఎరువులు,పురుగు మందులను విచ్చల విడిగా వినియోగిస్తున్నారు.ఆ ప్రభావంవల్ల చిత్తడి నేలలు సహజ స్వభావాన్ని కోల్పోతున్నాయి.
జల,వృక్ష సంపదకు కొల్లేరు ఆలవాలం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేరు సరస్సు చిత్తడి నేలలకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇటువంటి నేలను, ప్రకృతిని కాపాడితే అది భవి ష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తుందని కొంతమంది గుర్తించలేకపోతున్నారు.సృష్టిలో సహజసిద్ధంగా మానవాళి మనుగడ కోసం ఏర్పడిన సంపదను విస్మరిస్తున్నారు.ప్రపంచ దేశాలుసైతం పర్యావరణాన్ని పరిరక్షించండి, ప్రకృతిని కాపాడడండి అంటూ పదేపదే హెచ్చరి స్తున్నా వాటి వినాశనానికి చేసే వికృతి చేష్టలు తగ్గలేదు.సహజసిద్ధంగా ఏర్పడిన సంపదను రక్షించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రతి ఏడాది ఫిబ్రవరి రెండో తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని (వరల్డ్ వెట్‌ల్యాండ్స్‌డే) జరుపుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందిన ఏకైక చిత్తడి నేలలు ఏలూరు జిల్లాలో విస్తరించిన 77,136 ఎకరాలు కొల్లేరు సరస్సు మాత్రమే. ఈచిత్తడి నేలలు అనేక జీవరాశులకు, పక్షులకు ఎంతో మేలు చేస్తుంటాయి. అందువల్లే ప్రపం చంలోని అనేక దేశాలకు చెందిన పక్షులు వలస వస్తున్నాయి. చిత్తడినేలలపై 1971సంవత్సరంలో ఫిబ్రవరి 2న ఇరాన్ దేశంలో రామ్‌సర్ నగరంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు.అప్పుడు సదస్సులో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రపం చంలోని 164దేశాలు చిత్తడినేలల పరిరక్షణకు ఒప్పంద సంతకాలు చేశాయి.వీటిలో భారతదేశం కూడా ఒకటిగా ఉంది.2002 సంవత్సరంలో కొల్లేరును రామ్‌సర్ సైట్‌లోనికి తీసుకున్నారు. భారతదేశంలో 21రాష్ట్రాల్లో 46 ప్రాంతాలను చిత్తడినేలలుగా గుర్తించారు.
చిత్తడి నేలల ప్రాధాన్యం
అరుదైన మొక్కలు,పక్షులు,జంతువులు,చేపలు గుడ్లు పెట్టడానికి ఈ నేలలు చాలా అనుకూలం. నీటి నాణ్యతను పెంచడంలో,కాలుష్య కారకా లను గ్రహించడంలో ఈ చిత్తడినేలలు ప్రాధాన్యత పోషిస్తాయి. మానవ తప్పిదాలతో పర్యావరణానికి చాలాహాని జరుగుతుంది. ప్రజలు వ్యవసాయ, ఆక్వా అవసరాలకు ఈ భూములను ఆక్రమిం చుకుని రసాయన ఎరువులు వాడడంవల్ల నివాస యోగ్యానికి ఈ నేలలను పూడ్చడంతో చిత్తడి నేలలు విధ్వంసానికి గురవుతున్నాయి. ప్రపంచం పరిశ్రమల కోసం ఈచిత్తడి నేలలు కేటాయించ డంతో మరింత వినాశనానికి దారితీస్తున్నాయి.
భూమికి ఊపిరితిత్తులు!
నేడు మహా నగరాలుగా వృద్ధి చెంది ముంబయి, కోల్కతా,చెన్నై,టోక్యో,న్యూయార్క్ వంటివన్నీ జలవనరుల చుట్టూ చిత్తడి నేలల ఆధారంగా వృద్ధి చెందినవే. ప్రపంచవ్యాప్తంగా 127.5కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించిన ఈచిత్తడి నేలలు 15లక్షల కోట్ల డాలర్ల వార్షిక ఆదాయం సమ కూరుస్తున్నాయని అంచనా. ఇవి దాదాపు 18 శాతం జనాభాకు ప్రత్యక్షంగానో,పరోక్షంగానో జీవనోపాధి కల్పిస్తున్నాయి.భారత్‌లో18.4శాతం మేర భూభాగంలో ఆరు కోట్ల హెక్టార్ల పరిధిలో 19 రకాల చిత్తడి నేలలనుగుర్తించారు.ఇవి సాగు,తాగునీరు అందిస్తూ ప్రత్యక్షంగా,పరోక్షంగా ఎంతోమందికి ఉపకరిస్తున్నాయి.దాదాపు 80 శాతం మేర వరిసాగు చిత్తడి నేలల పరిధిలోనే సాగుతోంది.పర్యావరణానికి,ఆహార భద్రతకు అపారంగా అక్కరకొచ్చే ఈ నేలలు ప్రపంచ వ్యాప్తంగా క్రమంగా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.ఆహార ఉత్పత్తికి, అపార మత్స్య సంపదకు ఊతమిస్తూ ఈ నేలలు కోట్లమందికి ఆహార భద్రత కల్పిస్తున్నాయి.భూమికి ఊపిరితి త్తులుగా పనిచేసే చిత్తడి నేలలు వరదలు,కరవు కాటకాల వంటి ప్రకృతి విపత్తుల ను ప్రజలను కాపాడుతున్నాయి.ఈనేలలు నీటిని వడబోసి, అందులోని విష కాలుష్యాలను వేరుచేసి,ఆ నీటిని తాగడానికి ఉపయుక్తంగా మారుస్తాయి. చిత్తడి నేలల్లో పెరిగే మడ అడవులు- తీవ్ర సముద్ర ఉప్పెనలు, వాయుగుండాల నుంచి తీరప్రాంత ప్రజలను కాపాడుతున్నాయి. ఈ నేలల్లోని వృక్ష సంపద- వాతావరణంలోని బొగ్గుపులుసు వాయువును శోషించి,శాశ్వతంగా స్థిరీకరించి, కాలుష్యాన్ని అడ్డుకుంటోంది. జీవ వైవిధ్యానికి పేరెన్నికగన్న ఈ నేలల్లో భూమ్మీద ఉండే వృక్ష, జంతు రాశుల్లో దాదాపు 40శాతం మేర మను గడ సాగిస్తున్నాయి.మానవాళికి మీVAపకారమై నిలుస్తున్న ఈ చిత్తడి నేలలు ముప్పు అంచున కొట్టుమిట్టాడుతున్నాయి.1900-2000 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా 60శాతం చిత్తడి నేలలు కనుమరుగయ్యాయని నివేదికలు వెల్లడిస్తు న్నాయి.భారత్‌లో1970 నుంచి 2015 వరకు 35శాతం చిత్తడి నేలలు అదృశ్యమైనట్లు పరిశో ధనలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయ అవసరాల కోసం,పట్టణాల విస్తరణకు ఈనేలలకు కృత్రి మంగా ‘మురుగు’ కల్పించి వీటిని వాణిజ్య భూములుగా మార్చేస్తుండటం ఇవి కనుమరుగు కావడానికి ముఖ్య కారణం. పరిశ్రమలనుంచి వెలువడే రసాయన కాలుష్యాలను, ఇతర వ్యర్థా లను ఈనేలల్లోకి విడుదల చేస్తుండటంతో వీటి నాణ్యత,సామర్థ్యం బాగా తగ్గింది.వాతావరణ మార్పులు సైతం చిత్తడి నేలల జీవావరణాన్ని ఛిద్రం చేసి,ఆయా జీవుల మనుగడను దెబ్బ తీస్తున్నాయి.వ్యవసాయ రంగంలో ఉపయోగించే రసాయన కాలుష్యాలు కూడా ఈనేలల సామర్థ్యం తగ్గడానికి కారణమవుతున్నాయి.పట్టణాలు, నగరా ల్లోని వ్యర్థాలను ఈ నేలల్లో పారవేస్తుండటంవల్ల ఇవి అంతరిస్తున్నాయి.గడచిన యాభయ్యేళ్ల కాలంలో చిత్తడి నేలల్లో సుమారు 60శాతం మత్స్య సంపద,పక్షులు,క్షీరద సంతతి,సరీసృ పాలు,ఉభయచరాలు ఇప్పటికే అంతరించినట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి.మరో 35 శాతం మేర చిత్తడి నేలల్లో జీవరాశులు అంతరించే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు బలంగా వినిపి స్తున్నాయి. భారత్తోపాటు అంతర్జాతీయంగానూ ఇదే పరిస్థితి నెలకొంది. తీరప్రాంతాలలోని బీల, తంపర,మడ అడవులను ఈ రెండో విభాగంలో చేర్చారు.
సమాజంలో అవగాహన అవశ్యం..
చిత్తడి నేలల అవసరాన్ని తెలియజెప్పి,సమాజాన్ని చైతన్యపరచడం ద్వారానే వాటిని పరిరక్షించు కోవడం సాధ్యమవుతుంది. అందుకోసం వివిధ స్థాయుల్లోని విద్యాలయాల్లో అవగాహన తరగ తులు నిర్వహించాలి. సాగునీరు, వ్యవసాయ, మత్స్య,అటవీ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ఈ నేలల పరిరక్షణకు కృషి చేయాలి. దీంతోపాటు ప్రజలు తమ ప్రాంతాలకు సమీపంలోని చిత్తడి నేలలను గుర్తించి వాటిని రాష్ట్ర, జిల్లా జాబితా లలో ‘నోటిఫై’ చేయించాలి. తద్వారా మ పరిరక్షణకు భరోసా దొరుకుతుంది.ఈ నేలలను కాపాడుకునేందుకు కట్టుదిట్టమైన చట్టాలు చేయాలి. దానితోపాటు ఆక్రమణదారుల నుంచి వాటికి రక్షణ కల్పిస్తేనే ఈఅమÖల్యమైన వనరులు మనగలుగుతాయి.
6 వేలకు పైగా చిత్తడి నేలలు నమోదయ్యాయి
చిత్తడి నేలల సంరక్షణ కోసం వ్యవసాయం మరియు అటవీ మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నేచర్ కన్జర్వేషన్ అండ్ నేషనల్ పార్క్స్‌చే నిర్వహించబడుతున్న కార్యకలాపాల గురించి సమాచారాన్ని అందజేస్తూ, మంత్రి యు మాక్లీ చిత్తడి నేలల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు, ఇవి జీవశాస్త్రపరంగా అత్యంత ఉత్పాదక పర్యా వరణ వ్యవస్థలు. రెయిన్‌ఫారెస్ట్, పర్యావరణ సమతుల్యతను నిర్ధారించడం మరియు జీవ వైవి ధ్యాన్ని సంరక్షించడం రెండింటిలోనూ దృష్టిని ఆకర్షిస్తూ,ఈ ప్రాంతాలు అనేక విధులను కలిగి ఉన్నాయని యుమాక్లే పేర్కొన్నారు.ఈ ప్రాంతాలు భూగర్భ జలాలను పోషించడం,భూగర్భ జలాలను సమతుల్యం చేయడం, వరద నీటిని నిల్వ చేయ డం, వరదలను నియంత్రించడం,తీర ప్రాంతాల్లో సముద్రపు నీరు ప్రవేశించకుండా నిరోధించడం ద్వారా ఈప్రాంతం నీటి పాలనను క్రమబద్ధీకరి స్తుంది.2002లో చేసిన శాసన పునర్విమర్శతో చిత్తడి నేలలను నింపడం మరియు ఎండబెట్టడం నిషేధించబడిందని మంత్రి యుమాక్లే గుర్తు చేస్తూ, “అదే సంవత్సరంలో చిత్తడి నేలల రక్షణపై నియంత్రణ అమలులోకి వచ్చింది. చిత్తడి నేలల రక్షణపై నియంత్రణ,చిత్తడి నేలల రక్షణ,ఉపయో గం,సూత్రాలు,రక్షణ మండలాల నిర్ధారణ,అమలు సూత్రాలు,రామ్‌సార్ సైట్‌ల ప్రకటన ప్రక్రియ, జాతీయ చిత్తడి నేల కమిషన్ విధులు,పని విధానా లతో ఒక ముఖ్యమైన అడుగు తీసుకోబడింది. నిర్ణయించబడ్డాయి.“నియంత్రణ ద్వారా స్థాపించ బడిన నేషనల్ వెట్‌ల్యాండ్ కమిషన్,చిత్తడి నేలలపై మరియు ప్రకృతి పరిరక్షణ పేరుతో సంబంధిత సంస్థలను కలిగి ఉన్న మన దేశంలో మొదటి కమిషన”సమాచారం ఇచ్చాడు. టర్కీ లోని రామ్‌సర్ కన్వెన్షన్ ద్వారా రక్షించబడిన 14 ప్రాంతాలు కాకుండా,మొత్తం 59మిలియన్ 47 వేల1హెక్టార్ల విస్తీర్ణంలో161చిత్తడి నేలలు ఉన్నా యని, వీటిలో 205 జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలు మరియు వాటిలో 120 స్థానిక ప్రాముఖ్యత కలిగినవి అని యుమాక్లే పేర్కొంది. గత 5 సంవత్సరాలలో,జనరల్ డైరెక్ట రేట్ నిర్వ హించిన అధ్యయనాలతో జాతీయ చిత్తడి నేలల జాబితా పూర్తి దశకు చేరుకుందని నేషనల్ వెట్‌ల్యాండ్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పేర్కోంది.ఈ వ్యవస్థలో జాబితా మాత్రమే కాకుండా,చిత్తడి నేలల ీVAదాలో ఇవ్వబడిన చిత్తడి నేల కార్యకలాపాలకు అనుమతులు కూడా ఇక్కడ నిర్వహించబడతాయి.అదనంగా, మన ప్రజలు ఇ-గవర్నమెంట్ ద్వారా చిత్తడి నేలల కోసం సులభంగా దరఖాస్తులు చేసుకోవచ్చు. 1999 నుండి రామ్‌సర్ కన్వెన్షన‘తడి నేలల హేతుబద్ధ వినియోగం’ సూత్రం పరిధిలో మా మంత్రిత్వ శాఖ చిత్తడి నేల నిర్వహణ ప్రణాళి కలను సిద్ధం చేసింది.చిత్తడి నేల నిర్వహణ ప్రణా ళిక ఆప్రాంతం సాధారణ రక్షణ వినియోగ సూత్రాలను నిర్ణయిస్తుంది. అదనంగా, ప్రణాళి కలు చిత్తడి నేలల సమస్యలను పరిష్కరించడానికి భాగస్వామ్య విధానం మరియు అన్ని ఆసక్తి సమÖ హాలకు వివిధ బాధ్యతలను అందించే కార్యకలా పాలను కలిగి ఉంటాయి.1999 నుండి జనరల్ డైరెక్టరేట్ చే వెట్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌లు తయారు చేయబడ్డాయి.

విశాఖ వేదికగా ప్రపంచ యుద్ద నౌకల పండగ

ఐఎసఆర్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హజరుకానున్నారు.అలాగే ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రక్షణ శాఖ మంత్రి, రాష్ట్రగవర్నర్,ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులను ఇప్పటికే ఆహ్వానించారు. ఈ ఫ్లీట్ రివ్యూలో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ విక్రాంత్,దిల్లీ,రాజ్పుత్,విశాఖ, ఐఎనఎస్ నీలగిరి,ఆర్నాలా, శివాలిక్, బ్రహ్మపుత్ర, తల్వార్ తరగతికి చెందిన స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన యుద్ధ నౌకలు, అణు జలాంతర్గాములతో పాటు వివిధ దేశాలకు చెందిన 23 యుద్ధనౌకలు పాల్గొననున్నాయి. అందుకు తగ్గట్లు సన్నద్ధత ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.- జి ఏ సునీల్ కుమార్ 
విశాఖపట్నం ప్రతినిధి
యుద్ధనౌకల పండగకు విశాఖసాగరతీరం మరోసారి వేదికవుతోంది.దేశ చరిత్రలో మొదటి సారిగా ప్రపంచ దేశాలతో అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష (ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-ఐఎస్ ఆర్)ను 2016లో ఇక్కడే నిర్వహించారు.దాదాపు పదేళ్లతర్వాత ప్రతిష్ఠాత్మకమైన ఐఎసఆర్-2026కు సాగరతీరం రెండోసారి ఆతిథ్యమిస్తోంది. ఫిబ్రవరి 15-20 తేదీల మధ్య దీన్ని నిర్వహించ నున్నారు. ఇదే సమయంలో మిలాన్ విన్యాసాలూ జరగనున్నాయి.గతంలో ఐఎసఆర్లో 51దేశాలు పాల్గొన్నాయి. ఈసారి 100కు పైగా దేశాలకు (చైనా, పాకిస్థాన్లకు ఆహ్వానాలు పంపలేదు) ఆహ్వానాలు పంపించగా.. 61 దేశాలు వచ్చేందుకు అంగీకరించినట్లు గతేడాది నేవీ డే రోజు తూర్పు నౌకాదళ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా వెల్లడించారు.
ఐఎసఆర్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఈఎన్సీ చీఫ్‌వైస్ అడ్మిరల్ ఇప్పటికే ఆహ్వానిం చారు.ఈ ఫ్లీట్‌రివ్యూలో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ విక్రాంత్,దిల్లీ,రాజ్పుత్,విశాఖ,ఐఎనఎస్ నీలగిరి, ఆర్నాలా,శివాలిక్,బ్రహ్మపుత్ర,తల్వార్ తరగతికి చెందిన స్వదేశీ పరిజ్ఞానంతో చేసినయుద్ధ నౌకలు,అణు జలాంతర్గాములతో పాటు వివిధదేశాలకు చెందిన 23యుద్ధనౌకలు పాల్గొననున్నాయి. అందుకు తగ్గట్లు సన్నద్ధత ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
ఏమిటీ ఫ్లీట్ రివ్యూ
మన దేశంలోని యుద్ధనౌకల శక్తి సామర్థ్యాలను ఒకచోట సమీక్షించడాన్నే ఫ్లీట్ రివ్యూ అంటారు. ఏటా రాష్ట్రపతి ఆధ్వర్యంలో త్రివిధ దళాలకు ఈ సమీక్ష నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.అనంతర కాలంలో ఇతర దేశాల నౌకాదళాలతోనూ సంబంధాలు బలపర్చ డానికి,సముద్ర రక్షణ రంగ సామర్థ్యాలు ప్రద ర్శించడానికి అంతర్జాతీయ ప్లీట్ రివ్యూకు ఇది ఎదిగింది. విశాఖ వద్ద సాగరంలో ఇతర దేశ నౌకలపై ఆయా రక్షణ దళాలునిల్చుని…వారి ముందుగా వెళుతున్న రాష్ట్రపతి నౌకకు సెల్యూ ట్ చేస్తూ గౌరవ వందనం చేస్తారు. ఆ తర్వాత వివిధ నౌకాదళాల శక్తి సామర్థ్యాలు,తాజా సాంకేతికతలపై ప్రదర్శన నిర్వహిస్తారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన నావికా సిబ్బం దితో బీచ్ రోడ్డులో ప్రత్యేక పరేడ్ నిర్వహిస్తారు. భాగస్వామ్య దేశాల సంస్కృతి,సంప్రదాయాల ను ప్రతిబింబించేలా కార్యక్రమాలుఉంటాయి.
సముద్రాల ద్వారా ఏకమవుదామంటూ
ప్రపంచంలోని పలు దేశాల నౌకా దళాలను ఒకచోట చేర్చి సముద్ర భద్రత, స్థిరత్వం,సహకారం,సమన్వయాన్ని పెంపొం దించడం ముఖ్య లక్ష్యంగా ఈఫ్లీట్ రివ్యూ ఉంటుంది.రెండోసారి విశాఖలో నిర్వహిస్తున్న ఫ్లీట్ రివ్యూకు‘యునైటెడ్ త్రూ ఓషన్స’ (సము ద్రాలద్వారా ఏకమవుదాం)అనే థీమ్‌ను ఎంచుకున్నారు.తీరప్రాంత భద్రత,కొత్త సాంకే తికత,బ్లూ ఎకానమీ అంశాలపై ఫ్లీట్ రివ్యూలో చర్చించనున్నారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కోస నేవీ వర్గాలు ఇటీవల ఓ ప్రచార వీడియో ను విడుదల చేశాయి.ఫ్లీట్ రివ్యూ తర్వాత మిలాన్(బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు) కూడా ఉంటుంది.ఈ వేడుకలను సైతం ఫిబ్రవరి 19న ఆర్కే బీచ్ వేదికగా నిర్వహిం చనున్నారు.
కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిం చిన కలెక్టర్ హరేంధిర ప్రసాద్
అంతర్జాతీయ నౌకాదళసమీక్ష (ఐఎఫ్ ఆర్`2026 మిలాన్,అంతర్జాతీయ సిటీ పరేడ్ కార్యక్రమాల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయా లని,సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పేర్కొ న్నారు.ఈ మేరకు ఇండియన్ నేవీ, పోలీసు, ఇతర విభాగాల అధికారులతో కలెక్టరేట్ మీటింగు హాలులో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోస్ట్‌గార్డు డీఐజీ రాజేష్ మిత్తల్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ,వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్,జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీలు, ఆర్డీవోలు, ఇతర అధికారులు భాగస్వా మ్యమై వివిధఅంశాలపై చర్చించారు. ఈసంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాష్ట్రపతి, రక్షణ శాఖ మంత్రి,రాష్ట్రగవర్నర్,ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు,రెండు నుంచి మÖడు లక్షల వరకు ప్రజలు కూడా రానున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ,మౌలిక వస తుల కల్పన, వైద్యసేవలు అత్యంత సమర్థవంతంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఫిబ్రవరి 17నరాష్ట్రపతి రాకతో కార్య క్రమాలు మొదలవుతాయని,18న నౌకాదళ ఫ్లీట్ రివ్యూ,19నఉదయం మిలాన్ ప్రారంభోత్స వం,సాయంత్రం ఆర్కే బీచ్‌రోడ్డులో అంతర్జాతీయ సిటీ పరేడ్ ఉంటుందని, కార్యక్రమాలను వీక్షిం చేందుకు రెండు నుంచి మÖడులక్షల మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున సమన్వయంతో పని చేయాలని సూచించారు. సిటీ పరేడ్ మార్గం లో ఎలఈడి స్క్రీన్లు, పీఏ సిస్టమ్,గ్యాలరీలు, బారి¹ ¿డింగ్,పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.అదనంగా వీఎంఆర్డీఏ పార్క్, వైఎం సీఏ,ఏయÖఫుట్‌బాల్ గ్రౌండ్‌లను హోల్డింగ్ ఏరి యాలుగా వినియోగించకోవాలని సూచించారు. వైద్య,అగ్నిమాపక,తాగునీరు,మొబైల్ టాయిలెట్లు, పరిశుభ్రత చర్యలపై ప్రత్యేకదృష్టి పెట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశిం చారు.బీచ్‌రోడ్ సుందరీక రణ, డెకరేటివ్ లైటింగ్,పరిశుభ్రత పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఫిబ్రవరి 17 నుంచి కంట్రోల్ రూమ్ పూర్తిస్థాయిలో పని చేస్తుం దని, అవసరమైతే వేదికల వద్ద ప్రత్యేక కంట్రో ల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ పేర్కొ న్నారు. సిటీ పరేడ్ సమయంలో ఎక్కడికక్కడ తాగునీటి వసతితో పాటు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. బస్సులను ఇటు జగదాంబ, అటు పార్క్ హోట ల్ జంక్షన్ వరకు నడపాలని,ప్రజలకు ఇబ్బం దులు లేకుండా చర్యలు తీసుకోవాల న్నారు. మిలాన్ విలేజ్ వద్ద,క్రూయిజ్ వద్దస్టాళ్లు ఏర్పా టు చేయాలన్నారు. అధికారులంతా సంయుక్త క్షేత్రస్థాయి పర్యటన చేసి ఏర్పాట్లను పర్య వేక్షించుకోవాలని చెప్పారు.
సీసీటీవీ కెమెరాలు,లైటింగ్ సదుపాయం కల్పిం చాలి సీపీ
ప్రజా భద్రత దృష్ట్యా సీసీటీవీ కెమెరా లు, నైట్ విజన్ పరికరాలు, కంట్రోల్ రూమ్ ద్వారా లైవ్ మానిటరింగ్‌కు చర్యలు తీసు కోవాల్సి ఉందని,దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ సూచించారు.నో-డ్రోన్,నో కైట్ జోన్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. పార్కింగు ప్రాంతాల్లో, ప్రముఖులు రాకపోకలు సాగించే ప్రధాన రహదారుల్లో లైటింగ్ సదుపాయం కల్పించాలన్నారు. సమావేశంలో ఇండియన్ నేవీ, వివిధ విభాగాల జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

1 2