మహా భూతం …ప్లాస్టిక్

“ మనిషి మనుగడపై మనిషే గొడ్డలి వేటు వేసుకుంటున్నాడు..జీవరాశి మనుగడను ప్రమాదంలో పడేస్తున్నాడు.ఇందులో ప్రధానమైనది ప్లాస్టిక్..ప్రస్తుతం ప్రళయంగా ముంచెత్తుతోంది.కంటికి కనిపించని ప్లాస్టిక్ రేణువులు క్యాన్సర్‌కి కారణమవుతుండగా..మనం వాడిపడేస్తున్న ప్లాస్టిక్ కవర్లు,ఉపకరణాలు పర్యావరణాన్ని కాటు వేస్తున్నాయి.” – గునపర్తి సైమన్ 


వాడేస్తాం..పడేస్తాం…ఇలావాడేస్తూ పడేస్తూ, సగటున ప్రతివ్యక్తి ఒక పాలిథిన్ సంచిని చెత్త బుట్ట పాలు చేసినా రోజుకి వందకోట్లపైమాటే? అవన్నీ ఎక్కడికెళ్తాయి? ఏమైపోతాయి.మట్టిలో, నీళ్ళలో,ఎడారిలో,అడవుల్లో,కొండల్లో,గుట్టల్లో, ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తున్నాయి.ఆవ్యర్థం కొండలా పేరుకుపోయి,కొండచిలువలా మానవ జాతిని మింగేస్తోంది.సౌలభ్యంగా ఉందని, చవగ్గా వస్తోందని, మహా తేలికని,మడత పెట్టుకోవచ్చని మురిసిపోతున్న మనం రాబోయే కష్టాల సంగతే పట్టించుకోకుండా మితిమీరి ప్లాస్టిక్‌ని వాడుతున్న ఫలితంగా ‘జనాభా విస్పో టనం కన్నా పెను ఉత్పాతంలా గుండెల మీద కుంపటిలా ప్లాస్టిక్ వినియోగం తయారైంది. రోజూ అన్ని అవసరాల కోసం కుగ్రామం నుండి మహానగరం వరకు ప్రతిరోజు విపరీతంగా ప్లాస్టిక్ వినియోగిస్తున్నారు. ఒక ప్లాస్టిక్ సంచి భూమిలో కలవాలంటే కొన్ని వందల ఏళ్ళు పడుతుందనేది శాస్త్రీయంగా నిరూపించబడ్డ నిజం. మార్కెట్ ఆధారిత లాభాపేక్షతో కూడిన వినిమయ సంస్కృతి వల్లే భూవాతావరణం ధ్వం సమైంది. మన అవసరాలను తీర్చుకునే క్రమం లో ప్రకృతి నియమాలకు లోబడి వ్యవహరించ డమనే ఆలోచన మనకుండాలి.పర్యావరణానికి భంగం కలుగకుండా ఈ భూగోళాన్ని తర్వాతి తరాలకు అందించే దృష్టితో,సమ కాలీన అవసరాలను తీర్చుకునే విధమైన సుస్థిర అభివృద్ధి నమÖనా రూపొందించు కోవాలి.జీవితంలో ప్లాస్టిక్ నిత్యావసర వస్తువులలో ఒకటిగా మారిపోయింది.ఉద యం నిద్రలేచింది మొదలు మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఇంటా,బయటా ఎన్నో అవస రాల కోసం ప్లాస్టిక్‌పై ఆధారపడు తున్నాం. టూత్ బ్రష్‌లు,వాటర్ బాటిల్స్,టిఫిన్ బాక్స్‌లు,ప్లేట్లు,గ్లాసులు, షాంపులు, పాలు, వంట నూనె ప్యాకెట్లు, తలనూనె,ఔషధాల డబ్బాలు, పిల్లల పాలసీసాలు..ఇలా ప్రతి వస్తువు ప్లాస్టిక్‌తో తయారైనవే.ఆశ్చర్యమే మంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే హాస్పిట ల్స్‌లో కూడా సెలైన్ బాటిల్స్, రక్తం భద్రపరచే సంచులు, ఇంజక్షన్ సీసాలు, సిరంజిలు కూడా ప్లాస్టిక్‌తో తయారైనవే. పర్యా వరణం,ప్రజా రోగ్యం ముప్పుకలిగించే వాటిల్లో ప్లాస్టిక్ ముఖ్యమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నా, ప్లాస్టిక్ వినియోగంపై అవగాహనఉన్నా కూడా నిర్లక్ష్యం,బద్దకంవల్ల విపరీతంగా అడ్డూఅదుపు లేకుండా ప్లాస్టిక్ వాడుతున్నాం.
ప్లాస్టిక్ ఎలా హానికరం?
ప్లాస్టిక్‌లో కృత్రిమ రంగులు,రసాయనాలు, పిడ్‌మెంట్లు, ప్లాస్టిసైజర్లు, ఇతర మÖలకాలు వినియోగిస్తారు. ఇవి రకరకాల క్యాన్సర్ కారకాలు. ఈ ప్లాస్టిక్ సంచుల్లో ఆహార పదార్థాలు ప్యాకింగ్ చేసినపుడు ఇందులోఉండే కాల్షియం, సీసం వంటి ధాతువులు ఆహారంలో చేరి ప్రజల ఆనారోగ్యానికి కారణమవుతాయి. ఈ ప్లాస్టిక్‌తో తయారైన ఉత్పత్తులను బయట పారేయడంవల్ల చాలా పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి.ఈ ప్లాస్టిక్ వస్తువులను పశువులు తింటే వాటికి ప్రాణహాని కలుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు పశువుల జీర్ణాశయాల్లోకి చేరి వాటికి తీవ్ర ఆరోగ్య సమస్యలొస్తాయి. భారత్‌లో ఏడాదికి 65లక్షల టన్నుల ప్లాస్టిక్ వినియోగం జరుగుతున్నది. గత 50 ఏళ్ళలో 20రెట్లు ప్లాస్టిక్ వినియోగం పెరిగింది.కాని ఇందులో 5శాతం మాత్రమే రీసైకిల్ జరుగుతున్నది.ప్యాకింగ్ రంగంలో మొత్తం ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌లో 40శాతం వాడుతున్నారు. ఒక కవరు రీసైక్లింగ్ అయ్యే ఖర్చులో 50కొత్త కవర్లు తయారుచేసుకోవచ్చు. ప్యాకింగ్ రంగంలో వాడే ప్లాస్టిక్‌లో 90శాతం వ్యర్థాలుగా మారుతున్నాయి. ఏటా 80లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరుతు న్నాయి.2030నాటికి సముద్రాలలో ప్లాస్టిక్ వ్యర్థాలు రెట్టింపు అయి 2050నాటికి నాలుగిం తలు అవుతుందని ‘వరల్డఎకనామిక్‌ఫోరం’ సర్వే నివేదికలు చెబుతున్నాయి.2029నాటికి 1టన్ను సముద్ర చేపలకు 3టన్నుల ప్లాస్టిక్ పేరుకు పోతుందని ఈ సర్వే చెబుతున్నది.
ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంపరంగా..
అధిక ప్లాస్టిక్ వినియోగం వల్ల మగవారిలో బిపి,షుగర్,శ్వాస,గుండెపోటు వ్యాధులు పెరుగు తున్నాయని, ఆడవారిలో మెనోపాజ్, థైరాయిడ్, షుగర్, గర్భకోశవ్యాధులు పెరుగు తున్నాయని వైద్యులంటున్నారు. జీవక్రియల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే హార్మోన్ల పనితీరుపై ప్లాస్టిక్‌లో ఉండే ‘ధాలైడఈస్టర’ అనే రసాయనం తీవ్రప్ర భావం చూపుతుంది.ప్లాస్టిక్ అనేది‘’కాక్ టెయిల్ ఆఫ్ కెమికల్స’అంటారు. ఎందుకంటే ప్లాస్టిక్‌లో భారలోహాలు, క్రిమిసంహారిణిలు, పెస్టిసైడ్స్, పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లు (పిఎహెచ్‌లు) పాలీక్లోరినేటెడ్ బైఫినాల్స్ (పిహెచ్ బిలు) మిధనల్, సైక్లోహెక్సేన్,హెప్టేన్‌ల లాంటి సాల్వెంట్‌లుబీ పోటాషియం పర్‌సల్ఫేట్, బెంజా యిల్ పెరాక్సైడ్ లతో పాటు ట్రైబ్యూటాల్టిన్, జింకాక్సైడ్,కాపర్‌క్లోరైడ్ లాంటి ఉత్ప్రేర కాలుబీ బ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డంట్స్ (పియండిఇ) పాలేట్స్,సీసం సంయోగాలు, పాలిక్లోరి నేటెడ్ బిస్పినాల్స్(పిసిబిలు),బిస్పినాల్ లాంటి రసాయనా లు ప్లాస్టిక్‌లో ఉంటాయి. ఇవి అంత స్రావీ వ్యవస్థపై వినాళగ్రంథుల స్రవనాలపై దుష్పలితాలు చూపుతాయి.ఈ రసాయనాలన్నీ సముద్ర జీవ రాశులపై, మానవుల శ్వాస కోశంపై, చర్మంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. ఒకటన్ను పాలథిన్ సంచులు తయారు చేయాలంటే 11బ్యారెళ్ళ చమురు అవసరం అవు తుంది. ఆ లెక్కన ప్రపంచ చమురు సంక్షోభానికి పాలథిన్ కూడా ఓకారణమే.పాలథిన్ సంచి సగటు జీవిత కాలం 5నిమిషాలకంటే తక్కువ. ఒకసారి వాడి పడేసే వారే అధికం.గ్రామాలలోని వీధులనుండి మొదలు మహానగరాల వరకు ఇపుడు సిమెంట్ రోడ్లేస్తున్నారు.కాంక్రిట్ జంగిల్స్‌ను తలపించే నగరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు భూసారాల్లో చేరి నీటిని భూమిలోకి ఇంకనీయ కుండా అడ్డుకుం టాయి. నగరాలలో 2సెం. మీవర్షం పడితే చాలు అక్కడ నీళ్ళు నిల్వ ఉంటు న్నాయి. మురుగు నీటి వ్యవస్థలు స్థంబించిపోతు న్నాయి.వీటికి ముఖ్య కారణం ప్లాస్టిక్ వ్యర్థాలే. పైపుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఇతర చెత్త పేరుకుపోయి అవి మÖసుకుపోతున్నాయి.దీంతో రోడ్లు జలమ య మవుతున్నాయి.ట్రాఫిక్ సమస్యలేర్పడుతు న్నాయి.ఓమోస్తరు నగరాలలో కిలోమీటర్ల కొద్దీ, మహా నగరాలలో వందల కిలోమీటర్ల మేర నాలా లుంటాయి.ఈనాలాల చుట్టు పక్కల నివాసంఉండే ప్రజలంతా,ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను ఈ నాలాల్లో పారపోస్తుంటారు. ప్లాస్టిక్ సంచులు భారీ స్థాయిలో పేరుకుపోయి నాలాలు మÖసుకుపోతు న్నాయి.ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీసే యం త్రాంగం సరిపోను లేకపోవడంవల్ల కుంటలు, చెరువుల ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నాయి.ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ ఉంచి వాడే ఆహారంవల్ల వ్యాధులు వస్తున్నాయి. ఇండ్లల్లో, కార్యాలయాల్లో, బేకరీ లలో,ీVAటళ్ళలో ఆహారాన్ని వేడి చేయ డానికి మైక్రోవేవ్ ఓవెన్లు వాడు తుంటారు. ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారంపెట్టి ఈ ఓవెన్లలో పెడతారు. ఇలా చేయడంవల్ల పదార్థాలు వేడవడంతో పాటు ప్లాస్టిక్‌పాత్ర లోని ‘’బిస్‌పినాల’ పదార్థంకరిగి ఆహారంతో కలసిపోతుంది.ఇలా క్యాన్సర్,ఉదర కోశ వ్యాధు లకు అంకురార్పణ జరుగుతుంది. అందుకే ఓవెన్‌లలో ప్లాస్టిక్ పాత్రల బదులు బోరోసి లికేట్,గ్లాస్,సిలికోవ్‌తో తయారై అధిక ఉష్ణో గ్రతను తట్టుకోగల పాత్రలు వాడడం మంచిది.
ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించొచ్చు
పెండ్లి,ఇతర విందుల్లో ప్లాస్టిక్ పళ్ళాలు,గ్లాసులు నీటి ప్యాకెట్లను వినియోగించే బదులు విస్తరా కులు,అరటిఆకులు,కాగితంతో చేసిన గ్లాసులు వాడటం మంచిది. ప్లాస్టిక్ సంచులు వాడని ీVAటళ్ళను,కర్రీ సెంటర్లను ప్రస్తుతం మనం ఎక్కడా చూడలేము.టిఫిన్ నుంచి పచ్చడి, సాంబారు,కర్రీ అన్నీటిని ప్లాస్టిక్ సంచుల్లో కట్టి అందిస్తారు. ఇది మానుకోవాలి. సాంబారు రసం,కూరల కోసం ఇంటి నుంచి లోహపు డబ్బాలు తీసుకెళ్ళడం మంచిది లేకుంటే లోహపు డబ్బాల ధరను డిపాజిట్‌గా పెట్టుకొని ీVAటల్ యాజమానులు తినుబండారాలను స్టీలు డబ్బా లలో సరఫరా చేయాలి. వాటిల్లో తీసుకెళ్ళి వినియోగదారుడు డబ్బా తిరిగి ఇచ్చిన వెంటనే డిపాజిట్ వెనక్కి ఇచ్చేయొచ్చు.వాడి పడేసే ప్లాస్టిక్ పెన్నుల వల్ల కూడా పర్యావర ణానికి ముప్పు పొంచిఉంది.ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో ఇలాంటి పెన్నుల వినియోగం భారీ స్థాయిలో ఉంది. ఇందుకు విరుగుడుగా ఇపుడు మార్కెట్లో పర్యా వరణ హితమైన పెన్నులు అమ్ముతున్నారు. ఈపెన్నులు వినియోగించిన తర్వాత భూమిలో నాటితే మొక్క వచ్చే వీలుగా వీటిని తయారుచేశారు. ఇందుకు పెన్ను చివరన ఒక విత్తనం పెడుతున్నారు. ఇంకు అయి పోయాక దీనిని తిప్పి భూమిలో నాటితే కొన్ని రోజులకు మొక్కలు వస్తాయి.ఇది స్పూర్తివంతమైన, పెద్దలకు, పిల్లలకు ఆసక్తికరమైన పని.
ప్రత్యామ్నాయాలు ఆచరించాలి
ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురుచూడ కుండా ప్లాస్టిక్ వినియోగంపై ఎవరికి వారుగా ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టాలి. పండ్లు, కూరగాయలు,కిరాణ షాపులో సామాన్లు కొనేపుడు ప్లాస్టిక్ సంచీలు అడుగ కుండా ఇంటి నుంచి బట్ట,జ్యూట్ సంచులు తీసుకెల్లడం ఉత్తమం. చికెన్,మటన్ అమ్మే వ్యాపారస్తులు చాలా మంది 40మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న సంచులు వాడుతున్నారు. వాటిల్లో తెచ్చుకునేకంటే ఇంటి నుండి ఒక స్టీలు డబ్బా తీసుకెళ్ళడం మంచిది. మంచినీటి కోసం కార్యాలయాల్లో ఒకపుడు గాజు,స్టీలు,గ్లాసులు వాడేవారు.ఇపుడు ప్లాస్టిక్ సీసాల్లో తెచ్చిపెడు తున్నారు.ఈ పద్ధతి సరికాదు.టీలు,కాఫీలు గాజు,స్టీలు,పింగాణీ పాత్రల్లో మాత్రమే తాగాలి. పండ్లరసాలు తాగడానికి కాగితం గ్లాసులే వాడాలి. ఇండ్లల్లో ఆకు కూరగాయాలను ఫ్రిజ్‌లో ఉంచేందుకు కంటైనర్లు వాడాలి. పాలు,పెరుగులను ప్లాస్టిక్ కవర్లలో విక్రయి స్తుంటారు.ఏరోజుపాలు ఆ రోజు తెచ్చుకుని పాల ప్యాకెట్లను ఫ్రిజ్‌లో పెట్టకుండా, పాత్రలో వేడిచేసి చల్లారిన తర్వాత నిల్వచేసు కోవాలి. వ్యాపారస్తులు 40 మైక్రాన్ల కన్నా తక్కువగాఉన్న ప్లాస్టిక్ సంచులు వాడకుండా అధికారులు మొక్కుబడి తనిఖీలు కాకుండా కఠినంగా వ్యవహరించాలి.ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలు ఆరోగ్యసమస్యలు,పర్యావరణ హాని తదితర అంశాలపై గ్రామాలు,పట్టణాలు, నగరాల్లో, కాలనీల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు యÖత్‌క్లబ్‌ల సభ్యులను,కాలనీ కమిటీలను ప్రోత్సహించాలి.అధికారులు ప్రజల మధ్య సమన్వయం, సహకారం ఉంటేనే ప్లాస్టిక్ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకో గలం.పాలకులు, ప్రభుత్వాలు ప్లాస్టిక్ సంచుల స్థానంలో ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులు జౌళి సంచులు తయారీ పరిశ్రమలపై దృష్టి సారించాలి. ఇందుకోసం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలివ్వాలి. సబ్సిడీలిచ్చి ఆకర్షించాలి. చెత్తకుండి ఉన్నదే చెత్తవేయడానికి మళ్ళీ అందులో పాలిథిన్ కవరు ఎందుకు?డబ్బాఖాళీ చేసాక ఓసారి నీళ్ళతో శుభ్రంగా కడిగేస్తే సరిపోతుంది. గుడ్డసంచి వాడితే,వారానికి ఆరు,నెలకు 24, సంవత్సరానికి 280 ఓజీవితకాలంలో కనీసం 22వేల పాలిథిన్ కవర్ల వల్ల కలిగే నష్టాన్ని నివారించిన వాళ్ళం అవుతాం.‘నోపాలిథిన్ హేజ’ అని మనింటికి మనమే ధృవపత్రం ఇచ్చుకోవాలి. నిజానికి పాలిథిన్ దుష్ప్రవాల నుంచి తప్పించు కోవడానికి నిషేధాలు సరిపోవు. నిజాయితీ కావాలి.జనభాగస్వామ్యం అవసరం.
మహా విశాఖనగరంలో సింగిల్ యÖజ్‌ప్లాస్టిక్
మహావిశాఖనగర మున్సిపాల్ కార్పొరేషన్ సంస్థ(జీవీఎంసీ) పరిధిలో జనవరి 1 నుంచి సింగిల్ యÖజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధం అమల్లోకి వచ్చింది.ఈ మేరకు నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, కమిషనర్‌తో కలసి సింగిల్ యÖజ్ ప్లాస్టిక్ వస్తువులపై ప్రత్యామ్నాయాలు,తనిఖీలపై స్కిల్ అప్ గ్రేడేషన్‌పై సమీక్ష నిర్వహించారు.వీధివ్యాపారులు,వర్తక, వ్యాపారస్తులు అలాగే అన్ని జోన్ల కార్యదర్శులతో జూమ్ యాప్ ద్వారా ప్లాస్టిక్ నిషేధంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన, శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.సింగిల్ యÖజ్ ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా అనేక వస్తువు లు అందుబాటులో ఉన్నాయని వాటిని ప్రతి ఒక్కరూ వినియోగించాలని మేయర్ గొలగాని హరి వెంకటకుమారి సూచించారు. మార్కెట్లు, రైతు బజార్లు, పండ్ల దుకాణాల వద్ద అవగాహన కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ వస్తువుల స్టాల్స్?ను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు మేయర్?కి వివరించారు. జనవరి 1 నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 120 మైక్రాన్లలోపు ఉన్న సింగిల్ యÖజ్ ప్లాస్టిక్? నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని ఇన్‌చార్జీ కమిషనర్ ,జిల్లా కలెక్టర్ హరేంద్రే ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
నిషేధిత జాబితాలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులివే
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐస్‌క్రీమ్ పుల్లలు, అలంకరణ కోసం వాడే థర్మాకోల్, ప్లేట్లు, పుల్లలతో కూడిన ఇయర్ బడ్స్, బెలూన్లకు వాడే పుల్లలు, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్‌లు, పిప్పర్‌మెంట్లకు వాడే పుల్లలు, కప్పులు, గ్లాసులు, ఫోర్క్‌లు ఉన్నాయి. అదేవిధంగా కత్తులు, స్పూన్లు, స్ట్రాలు, స్వీట్ బాక్స్‌ల ప్యాకింగ్‌కు వాడే పల్చటి ఆహ్వాన పత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, 120 మైక్రాన్లలోపు ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు, ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు మొదలైనవి.