బ్లాక్‌ ఫంగస్‌ అంటే ఏమిటీ?

ఒకపక్క కోవిడ్‌ భయపెడుతుంట్టే… కొన్నాళ్లుగా బ్లాక్‌ ఫంగస్‌ మరీ ఆందోళన కలిగిస్తోంది. అసలు బ్లాక్‌ ఫంగస్‌ అంటే ఏమిటి? ఇది ఎందుకు సోకుతుంది? దీని పట్ల తీసు కోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇత్యాది విషయాలపై ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ రమణయ్య అందించిన సమాచారం మన పాఠకుల అవగాహన పెంచటానికి ఈ సమాచారం ఉపయోగపడు తుందని ఆశిస్తున్నాం. – ఎడిటర్

బ్లాక్‌ ఫంగస్‌ కోవిడ్‌ కంటే ప్రమాదకరమైనదని, కోవిడ్‌ వచ్చిన వారికందరికి బ్లాక్‌ ఫంగస్‌ వస్తుందని, దీనికి వైద్యం లేదని విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవం కాదు. నిజానికి ఎప్పటి నుంచో ఉన్న జబ్బు. ఎక్కువ కాలం నిల్వ ఉంచిన కూరగాయలు,బ్రెడ్‌లు చెడిపోయి బూజు పట్టినట్టుగా కనిపించడం ఈ ఫంగస్‌ వల్లనే. కోవిడ్‌ రోగులకు ఎక్కువగా వస్తుండడంతో కోవిడ్‌ వ్యాధికి వచ్చినంత ప్రచారం దీనికి కూడా వచ్చి కోవిడ్‌ కంటే ఎక్కువగా భయపెడు తుంది. ఆ పేరు ఎలా వచ్చింది?

బ్లాక్‌ ఫంగస్‌ …శాస్త్రీయ నామం మ్యూకార్‌ మైకోసిస్‌. నిజానికి ఇది నల్ల రంగులో ఉండదు. ఈ ఫంగస్‌ సోకిన కణజాలం రక్తప్రసరణ సరిగా అందక నల్లగా మారిపోతుంది. కాబట్టి దీనిని బ్లాక్‌ ఫంగస్‌ అని పిలుస్తున్నాం.

Read more

చెట్లు కూలితున్న దృశ్యం

తెలుగు కథావనంలో గిరిజన కథాసుమాలు…

అడవి బిడ్డలు అంటే అందమైన అడవుల్లో నివసిస్తూ స్వచ్ఛమైన జీవనం సాగిస్తూ శ్రమైక జీవన సౌందర్యంతో జీవిస్తూ అమూల్యమైన సంస్కృతిని అత్యంత విలువైన అటవీ సంప దను సంరక్షించు కుంటారు అని అందరం భావిస్తాం.. కానీ, ఇది నాణానికి ఒకవైపు మాత్రమే! మరోవైపు నిత్యం జీవన్మరణ సమస్య తమ ప్రాంతంలోనే తాము పరాయి తనం అను భవిస్తూ దుర్భర జీవితం గడుపు తున్న దౌర్భాగ్యం వారిది.
ఇక గిరిజన కథలు ప్రారంభంలో వారి యొక్క జీవన్మరణ పోరాటం గురించిన నేపథ్యం తో రాగా ఇటీవలవారి వికాసం సంస్కృతి సాంప్రదాయాల నేపథ్యంతో కథలు వెలువడు తున్నాయి. ఈరెండు విభాగాల కథలను గురిం చిన అభిప్రాయాలు విభేదాలు ఎలాఉన్నా వేటి అవసరం వాటికి ఉంది. అలాగే ఈరెండు రకాల కథలను గిరిజన కథ సామ్రాజ్యంలో చేర్చాల్సిన అవసరం కూడా ఉంది. అందులో భాగంగానే గిరిజనకథల ప్రారంభ దశకు చెం దిన కథ ‘‘చెట్లు కూలుతున్న దృశ్యం’’ గురించిన విశ్లేషణలోకి వెళదాం.
రచయిత డాక్టర్‌ దిలావర్‌ అవిభక్త వరంగల్‌ జిల్లా ఇల్లందు తాలూకాలోని మారు మూల గ్రామం పాత కమలాపురంలో జన్మిం చినఉద్యోగరీత్యా 25సంవత్సరాలపాటు సంపూర్ణ గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయు డుగా తెలుగు ఉపన్యాసకునిగా సేవలు అంది స్తూనే తనకుగల పర్యటన అభిరుచి మేరకు అరకులోయ నుంచి ఆదిలాబాద్‌ వరకు అనేక గిరిజన ప్రాంతాలు పర్యటించి ఆయా ప్రాంతా లలోని విభిన్న పద్ధతుల్లో జీవిస్తున్న గిరిజనుల స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించి, తెచ్చు కున్న అనుభూతితో వారి జీవన్మరణ సమస్య లను చూస్తూ రాయకుండా ఉండలేను అన్న తపనతో అచ్చంగా అడవిబిడ్డల వ్యధలతో కూడిన 12కథలు రాసి 2014సంవత్సరంలో వాటిని ‘కొండా కోనల్లో’ పేరుతో సంపు టిగా ప్రచురించార్ను ఈడజనుకథల్లో మేటిగా నలుగురితో మెచ్చ బడిన కథే ‘‘చెట్లు కూలు తున్న దృశ్యం’’ పేరులోనే రచయితలోని కవి తొంగి చూస్తాడు, ఇక కథ నిండా అవసరం మేరకు రచయిత తన అడవి అనుభూతులను అందంగా కవితాత్మకంగా చెబుతూ స్థానిక సామెతలు,జాతీయాలు,ఉపయోగిస్తూ, కథా వస్తువుకు చేటు రానీయకుండా కథను చది వింపచేసే ప్రయత్నంలో రచయిత సఫలీకృ తులయ్యారు అనవచ్చు. ఇక కథ విషయానికొస్తే ‘‘జోజి’’ అని గిరిజన యువకుడు చదువుకుని అటవీ శాఖలో బీట్‌ అధికారికి సహాయకునిగా ఉండే ప్రభుత్వ ఉద్యోగం పొందుతాడు. అది తనకు తన కుటుంబానికి భరోసా కానీ తన యావత్‌ గిరిజన జాతి అభివృద్ధి తన అభివృద్ధి గా భావించే సామాజిక స్పృహ గల యువ కుడు’’జోజి’’. అందులో భాగంగానే తన జాతి మనుగడ కోసం చేయాల్సిన పోరాటాల గురించి చైతన్యపరిచే సభ ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో జరుగుతుందన్న ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళిన ‘‘జోజి’’కి కలిగిన తన జాతి జీవన స్థితిగతులకు చెందిన ఆలోచనలు రూపమే ఈకథ. నిత్యం అడవుల్లో తిరిగే గిరిజ నులకు అక్కడ ఉండే క్రూరమృగాల బారినుంచి ఎలా తప్పించుకోవాలో బాగా తెలుసు, కానీ మానవత్వం లేని ఆధునిక మనుషులు అధి కారుల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలి యక నానా అవస్థలు పడుతున్న అడవిబిడ్డల స్థితిని రచయిత ‘‘డిలావర్‌’’ కళ్లకు కట్టినట్లు అక్షరీకరించారు. అది కూడా జోజి పనిచేసే అటవీశాఖ అధి కారులు తమ గిరిజనులను పెడుతున్న హింసకు తోటి ఉద్యోగి అయ్యికూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అతనిది, సాధా రణ అవసరాలు తీర్చుకోవ డానికి కూడా తనతల్లి లాంటి అడవి మీద ఆధా రపడ కూడదు అన్న అటవీ అధికారుల అనాలోచిత ఆంక్షలతో అడవిబిడ్డల ఆవేదన అంతా ఇంతా కాకుండా పోతుంది. ఒకరోజు తెల్లవారుజామున తన గూడెం ఆడపిల్లలు ఇప్పపువ్వు ఏరడానికి సమీపంలోని అడవికి వెళ్లగా అదును చూసి ఆ గిరిజన యువతులను అనుభవించిన అటవీ అధికారులు అకృత్యం చెవులారా విన్న జోజి హతా శుడై నివురుగప్పిన నిప్పులా మారిన సంఘటనను కూడా చాలా అందంగా ఆసక్తికరంగా కథనాత్మక గా అక్షరీకరించడంలో దిలావార్‌ సాబ్‌ మస్తు నైపుణ్యం కనబరిచాడు. అడవిలో ఉండే ప్రజలను జంతువులను రక్షించాల్సిన అటవీ అధికారులు, పోలీసు ఆఫీసర్లు, వారికి వాటికి ఎలా శత్రువులుగా తయారై హింసి స్తున్నారో ప్రత్యక్షంగా అనుభవైక్యం పొందిన రచయిత తనదైన ధర్మాగ్రహ రూపంలో పరిస్థితులను ‘‘అక్షర చిత్రీకరణ’’ చేసి భావితరాలకు అందించే ప్రయత్నం చేశారు అనిపిస్తుంది ఈ కథ చదువుతుంటే!!!
‘‘కంచే చేను మేసిన వైనంగ’’ అటవీ అధికారుల చర్యలను ఈ కథలో వివరించే ప్రయత్నాలు అనేక సంఘటనల సాయంగ జరిగింది,
ఒకరోజు తెల్లవారుజామున తన విధుల్లో భాగం గా అధికారులతో కలిసి అడవి లో తిరుగుతున్న‘‘జోజి’’కి చిత్రమైన సంఘటన అనుభవమవుతుంది, కరెంట్‌ తీగల ద్వారా అడవి జంతువులను ఎలా వేటాడుతున్నారు దానికి అటవీ అధికారుల సహకారం ఎంత చిత్రంగా అందుతుం దో తెలుసుకున్న జోజి మనసు మొద్దు బారిపోతుంది, అప్పటివరకు కేవలం అడవి బిడ్డలే వారి అమానుష త్వానికి బలవుతున్నారు అనుకున్న జోజి ఆలోచన లకు కొత్త సమస్య వచ్చి చేరింది. అభం శుభం తెలియని మూగజీవాలు సైతం ఈ మృగాళ్ల బారిన పడి ఎలా జీవితాలు జీవనాలు కోల్పోతున్నారో తెలిసింది. కానీ ఈ సమస్యకు పరిష్కారం ఎలా? అదే జోజి మనసులో చెలరేగుతున్న హిమజ్వాల!! తలవని తలంపుగా ఆ రాత్రి రేంజ్‌ ఆఫీసర్‌ ఇంట్లో జరిగే పార్టీకి రావాలని జ్యోతికి ఆహ్వానం అందిం ది. రాత్రి ఎనిమిదింటికల్లా చెప్పిన చోటికి చేరుకు న్నాడు జోజి అధికారుల మాట సమయపాలన పాటించే చిరుద్యోగిల అక్కడ ఏర్పాట్లు చూసిన జోజి మనసు ఏదో కీడు శంకించింది. మళ్లీ ఏదో చూడకూడని దృశ్యం ఏదో చూడాల్సి వస్తుందని ఆందోళనతో అటుగా వెళ్లి సిద్ధంగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అన్నట్టుగానే ఆధునిక మత్తుపానీ యాలు సిద్ధం చేయబడి ఉన్నాయి జోలికి కూడా అవకాశం కల్పించారు అధికారులు, తనకు అల వాటు లేదన్న విషయం చెప్పి వాళ్లతో హేళన చేయబడ్డాడు చివరికి దుప్పి మాంసం వేపుడన్నా మాతో కలిసి చేయమని ఆజ్ఞాపించిన తనపై అధి కారుల ఆదేశాలతో నివ్వెర పోవడమేకాదు పొద్దున అడవిలో కరెంటు తీగెల ఉచ్చులద్వారా వేటాడిన దుప్పి దృశ్యం కళ్ళముందునిలవడంతో ‘‘జోజి’’ మనసు కాకా వికలమై గుండెలు అలసిపోయి మూగ జీవాల ఆవేదన దీనంగా కళ్లముందు కదలాడిరది. అభయారణ్యాలు రక్షించేందుకు గాను ప్రభుత్వాలు వీరికి జీతభత్యాలు ఇస్తుంటే వీళ్ళు చేస్తున్న పని ఏమిటి?అంటూ అతని మనసు మూగగా రోది స్తుంది. అదే సమయంలో అక్కడ టీవీలో వస్తున్న పర్యావరణ సంబంధిత కార్యక్రమం పట్టు బట్టి మరీ చూస్తాడు జోజి. అది అక్కడ మత్తులో జోగు తున్న అటవీ అధికారులకు ససేమిరా నచ్చదు అయి నా జోజిమీద సానుభూతి చూపిస్తూ ఆ కార్య క్రమం చూసే అవకాశం కల్పిస్తారు. తన వృత్తి ధర్మంగా పర్యావరణ సంరక్షణ కార్యక్రమం అబ్బు రంగా ఆసాంతంచూస్తాడు. మర్నాడు జోజి తన పైఅధికారులతో కలిసి ఉద్యోగ ధర్మంలో భాగంగా చేస్తున్న క్షేత్ర పర్యటనలో మరో అనుభవం కలుగు తుంది. అధికారుల అండదండలతో కలప రవాణా చేస్తున్న లారీలను,ముఠా నాయకులను, ధైర్యంచేసి అడ్డగించి పట్టుకుని తనవృత్తి ధర్మంలో విజయం సాధించానని,న్యాయం చేస్తున్నానని సంబర పడ తాడు. కానీ అది క్షణకాలమేఅని అతని పై అధికా రుల ఆదేశాల ఫోన్‌ సమాచారంతో తెలుసుకుని చేసేదేమీలేక అధికారలేమి తో నిస్సహాయంగా ఉండిపోతాడు జోజి. ఈసంఘటనలు అన్నీ ఒక్కొ క్కటిగా కళ్ళముందు తిరుగుతూ జ్ఞాపకాలుగా గుర్తు చేసుకున్న జోజి అనబడే గిరిజన అటవీ ఉద్యోగి పాత్ర కేంద్రంగా ఈ కథ నడుస్తుంది.
కథ ఆసాంతం అడవులు, అడవిబిడ్డల దీనస్థితి,అడవి జంతువుల మూగ రోదన,కేంద్ర బిందువుగా అచ్చమైన స్వచ్ఛమైన అడవిఅందాల వాతావరణం,అడవిబిడ్డల వేషభాషలు, సంభాషణ ముచ్చట్లు,సాయంతో కొనసాగిన ‘‘చెట్లు కూలుతు న్నదృశ్యం’’ కథద్వారా రచయిత ఏమి చెప్పాలను కున్నాడు? ఎవరికి చెప్పాలను కున్నాడు?? చివరికి ఆయన అందించే సందేశం ఏమై ఉంటుంది?? అన్న ప్రశ్నలు అన్ని ప్రశ్నలు గానే మిగిలి పోతాయి. రచయిత భావన ప్రకారం తాను ప్రత్యక్షంగా గమ నించిన విషయాలను తన శైలిలో అక్షరీకరిం చారు ఏమిటి ?ఏమి చేయాలి?? అన్నది పాఠకుల ఇష్టానికే సొంతం చేసినట్టు అర్థమవుతుంది. రచ యిత కూడా అదే నిర్ధారణ చేశారు.
ఇక్కడ కథలోని జోజి ఒక్కడి ఆవేదనే అందరి ఆవేదనై మార్పుకోసం ఆచరణాత్మకంగా కృషి చేసిన నాడు మనం కోరుకున్న పర్యావరణ సమతుల్యత చేకూరి పుడమితల్లి పచ్చని అడవులతో అందరి పాలిట ఆరోగ్య దేవతగ నడయాడటం తథ్యం అనిపిస్తుంది.

ఆహారం దక్కక ఆకలి కేక

అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన సంపూర్ణ పోషణ పథకం నిర్విర్యమౌతోంది. రాష్ట్రంలోని 77 గిరిజన, సబ్‌ప్లాన్‌ మండ లాల పరిధిలోని 8ఐటీడీఏలు, 52 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులతో పాటు 8,320 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పథకం అమలు చేస్తున్నారు. 66 వేల మంది గర్భిణులు, బాలింతలకు నెలలో25రోజులపాటు వేడి పాలు, అన్నం, పప్పు,కూరగాయలు లేదా ఆకుకూరలు, గుడ్డు అందజేస్తారు. టేక్‌ హోమ్‌ న్యూట్రి షన్‌ కిట్‌ కింద నెలకు 2కిలోల మల్టీ గ్రెయి న్‌ ఆటా, అర కిలో వేరుశనగ చిక్కీ, అరకి లో రాగిపిండి,అరకిలో బెల్లం,అరకిలో ఎండు ఖర్జూరం పంపిణీ చేయాలి. ఒక్కో లబ్ధిదారుడిపై నెలకి రూ.1,100 చొప్పున మొత్తంరూ.87.12 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. ఈ పథకం77 గిరిజన మండలాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా 47, 287 అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేస్తు న్నారు. ప్రస్తుతం విశాఖ జిల్లా గిరిజన ప్రాంతాల్లో ఈ పథకం అరకొరగా కొనసాగుతోంది. పథకానికి సంబంధించిన పోషకాలు అర్హులైన లబ్దిదారులకు అందడం లేదు. కనీసం ఈ కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనైనా లబ్దిదారులకు సక్రమంగా అమలు చేసే నాధుడు కరవయ్యారు.

మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజనుల అభివృద్ధిని ఆనాటి ఆంధ్రపాలకుల నుంచి నేటి తెలంగాణ పాలకుల వరకు పట్టించు కునే వారు లేక వారి బతుకులు మారడం లేదు. గిరిజనుల అభివృద్ధి కోసం కోట్లు ఖర్చు పెడుతున్నామని అధికారులు ప్రగల్భాలు పలుకుతూ లెక్కల్లో చెపుతున్నా, ఆచరణలో మాత్రం శూన్యంగానే ఉన్నది. కాసిపేట మండలంలో ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో సరైన రోడ్లు , రవాణా సౌకర్యాల్లేక గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. గిరి పుత్రులకు సరైన పౌష్టికాహారం అందడం లేదు. పారిశుధ్యం అధ్వానం ఇలా చెప్పుకుంటూ పోతే ఆదివాసీ గ్రామాల్లో అనేక సమస్యలున్నాయి. గిరిజన గ్రామాలకు కనీస వసతులు కల్పించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదివాసీ గ్రామాల్లోని పిల్లలకు పోషకాహారం అందని ద్రాక్షగానే ఉంది. గిరిజనుల పిల్లల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆదివాసీల పిల్లలు పోషకాహార లోపంతో రోగాల భారిన పడుతున్నారు. మండలంలోని ఆదివాసీ గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ వాటి నిర్వహణ నామమాత్రంగానే కొనసాగుతోంది. కొలాంగూడ , లక్ష్మిపూర్‌, తిరుమలాపూర్‌ గిరిజన గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు లేకపోవడంతో పిల్లలు పోషకాహారానికి దూరమై అనారోగ్యం పాలవుతున్నారు. కొన్ని గిరిజన గ్రామాల్లో అధికారింగా అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి పనిచేసిన దాఖలాలు లేవు. దీంతో గిరిజనుల పిల్లలు గంజి, గట్కలతో కడుపు నింపుకుంటున్నారు.
మౌలిక సదుపాయలు శూన్యం
ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యంలేదు. కొన్ని గ్రామాలకు వెళ్లాలంటే వాగు లు, వంకలు దాటు కుంటూ వెళ్లాల్సిందే. సమస్యలతో సతమతమౌతున్న గిరిజన గ్రామాలకు కనీస సదుపాయాలు కల్పిం చడంలో ప్రభు త్వం ఏనాడు శ్రద్ధ వహిం చలేదని విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వర్షాకా లంలో వాగులు పొంగి పోర్లుతుంటే ప్రమాదపు టంచున వాగులో రాకపోకలు సాగిస్తూ ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. గ్రామాల్లో రోడ్డు సౌకర్యాలు లేక అనారోగ్యంతో ఉన్నవారికి సరైన సమయంలో వైద్యమందక మృతి చెందిన ఘటనలు చాలా ఉన్నాయి.
పౌష్టికాహారం అందని ద్రాక్షే..
సంపూర్ణ పౌష్ఠికాహారం అందించి మాతా, శిశు మరణాలు రేటు తగ్గించాలన్నది స్త్రీ, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్‌) లక్ష్యం. కానీ కరోనా కష్టకాలంలో లబ్ధిదారులకు నిర్దేశిత ప్రకారం సంపూర్ణ ఆహారం అంద డం లేదని క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బట్టి తెలు స్తోంది. గుడ్లు తప్ప, నూనె, పప్పు రెండు నెలలుగా అంగన్‌వాడీ కేంద్రాలకు సక్రమంగా సరఫరా కావడం లేదు. దీంతో లబ్ధిదారులకు అరకొర గుడ్లు, పాలు నేరుగా అందించి చేతులు దులుపుకొంటున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు భోజనం చేసి పెట్టాల్సి ఉండగా గత రెండు నెలలుగా కరోనా నేపథ్యంలో నేరుగా నిత్యావసరాలు అందిస్తున్నారు. కానీ నూనె, పప్పులు ఇవ్వట్లేదు. పాలు కూడా అరకొరగానే ఇస్తున్నారు. అవి కూడా ఒక రకమైన వాసన వస్తోండటంతో తాగలేకపోతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు.
గర్భిణుల్లో రక్తహీనత
జిల్లాలోని గిరిజన గ్రామాల్లోని లబ్ధిదారులు పౌష్ఠికాహారానికి నోచుకోక పచ్చళ్లు, చారుతో భోజనం చేయాల్సి వస్తోంది. ప్రధానంగా విశాఖ జిల్లా షెడ్యూల్‌ ప్రాంతానికి చెందిన 11 మండలాల్లోని గిరిజన గ్రామాల పిల్లలు బలవర్ధక ఆహారానికి నోచక, వ్యాధినిరోధక శక్తి లేక వ్యాధుల బారిన పడుతున్నారు. వారానికి ఒకసారి సమీపం సంతలకు వెళ్లి కూరగాయలు తెచ్చుకునే కుటుంబాలే అధికం. గర్భిణులు,బాలింతలు నడిచి వెళ్లలేక పచ్చడి,గంజి మెతుకులతో రోజులు గడుపుతున్నారు. ఫలితంగా నెలలు నిండుతున్న వారిలోనూ పిండం సరిగా ఎదగడం లేదు. రక్తహీనత బాధితులు ఎక్కువగా ఉన్నారు. కొందరికి హిమోగ్లోబిన్‌ శాతం 6-7 శాతం మాత్రమే ఉంటోంది. బాలింతల్లోనూ పట్టణా లబ్ధిదారుల్లో పరిస్థితి కాస్త పర్వాలేకున్నా.. గిరిజనుల్లో మాత్రం సుమారు 70 శాతం మంది సరైన తిండికి నోచక పిల్లలకూ సరిపడినన్ని పాలివ్వలేని పరిస్థితి దాపురించింది.
గర్భిణులు: 8,430
బాలింతలు: 9,259
0-6 ఏళ్ల పిల్లల సంఖ్య: 69,183
మినీ అంగన్‌వాడీలు: 636
జిల్లాలో అంగన్‌వాడీలు: 1,424
బాధితులు ఇలా..
అతి తీవ్ర పోషణ లోపం ఉన్నవారు (ఎస్‌ఏఎం) 2139,తీవ్ర పోషణ లోపం (ఎంఏఎం) 4,299,అతి తక్కువ బరువు (ఎస్‌యూడబ్ల్యూ) 1,334,పోషకాహార లోపం (ఎంయూడబ్ల్యూ) 6,376 వయసుకు తగిన ఎత్తులేని వారు 696
గిరిజనుల పిల్లల్లో వయసు పెరుగు తున్నప్పటికీ తగిన బరువు ఉండటం లేదు. జిల్లాలోని అన్నీప్రాజెక్టుల పరిధిలో తీవ్ర పౌష్ఠికాహారం లోపంతో బాధపడే వారు వేలాది మంది ఉన్నారు. వీళ్లకు సంపూర్ణ పౌష్ఠికాహారం అందితేనే శరీరం ఎదుగుదల ఉంటుంది. వ్యాధులు దరిచేరవు. ఉన్నతాధికారులు అవసరమైతే పౌష్ఠికాహార కేంద్రాలకు (ఎన్‌ఆర్‌సీ) తరలించి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేయాల్సిన బాధ్యత ఉంది.
నెలాఖరుకల్లా సమస్య పరిష్కారం

  • సీతామహాలక్ష్మీ, ఐసీడీఎస్‌ పీడీ
    గత నెలన్నర నుంచి పప్పు, నూనెలు రాష్ట్రస్థాయి నుంచే సరఫరా కాలేదు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా. మొన్న నూనె సరఫరా చేశారు. వెంటనే ప్రాజెక్టులకు అందజేశాం. వారు కేంద్రాలకు అందజేస్త్నేన్నారు. పప్పు కూడా ఈ నెల చివరి కల్లా వచ్చే అవకాశం ఉంది.
    పారిశుధ్యం అధ్వానం
    గిరిజన గ్రామాల్లో పారిశుధ్యం మరీ అధ్వానంగా ఉంది. ప్రతి వర్షకాలం పారిశుధ్యలోపంతో రోగా లు ప్రబలి ప్రజలు మృతిచెందుతున్నా, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన గ్రామాల్లో చాలా చోట్ల డ్రెయినేజీలు నిర్మించలేదు. దీంతో పాటు కాలువలో పూడికలు తీయకపోవడంతో కాలువల్లో మురికినీరు నిలిచి, దోమలు వృద్ధి చెంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఇలా అనేక సమస్యలతో గిరిజన గ్రామాలు సతమతమ వుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారి గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.
    జి.ఎన్‌.వి.సతీష్‌

లాక్‌డౌన్‌ రోజుల్లో…ఈ రాష్ట్రాల్లో మహిళలే ఆశ,శ్వాష

భారతదేశంలో లాక్‌ డౌన్‌ సమస్య తీవ్రతను తగ్గించడంలో, వీలైనంత తక్కువ సమయంలో ఉత్తమ పరిష్కారాలు చూపించడంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే, దక్షిణాది రాష్ట్రాల్లో మహిళల పాత్ర ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఇక్కడి ప్రభుత్వ యంత్రాంగాలకు మహిళలు అందించిన చేయూత, గొప్ప సామాజిక ప్రభావాన్ని చూపాయి.
ఈ శతాబ్దంలోనే అతి పెద్ద విపత్తును ఎదుర్కోవడం కేవలం ప్రభుత్వాలకు మాత్రమే సాధ్యం కాదు. అందరికీ అన్నీ అందించడానికి చాలా పెద్ద యంత్రాంగం కావాలి. దానికి బలమైన, వ్యవస్థీకృత పద్ధతులుండాలి.
సరిగ్గా ఆ ఖాళీనే పూరించాయి మహిళా స్వయం సహాయక బృందాలు. ఇవే కోవిడ్‌-19 కాలంలో దక్షిణ భారతంలో వెలుగు రేఖల్లా మారాయి. దాదాపు మొత్తం జనాభాకు వివిధ అవసరాలు ఒకేసారి పెద్ద ఎత్తున తీర్చాల్సి రావడం, వైద్యపరంగా దాదాపు ప్రతి కుటుంబాన్నీ సర్వే చేయాల్సిన అవసరం రావడం – ఈ రెండిటినీ సమన్వయం చేయడం సాధారణ విషయం కాదు.
కానీ, మహిళా సంఘాలు, ఆ బాధ్యతను సమర్థంగా, సత్వరంగా చేపడుతున్నాయి. భోజనం పెట్టడం దగ్గర నుంచి ఆరోగ్యం కాపాడడం వరకూ అన్ని విధాలా వారు తమ వంతు సాయం అందిస్తున్నారు.దక్షిణాదిన దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రూపంలో మహిళల పాత్ర కనిపిస్తోంది. కేరళ మహిళలు ఈ విషయంలో ముందున్నారు. అక్కడ ప్రభుత్వాలు, స్థానిక సంస్థలకు సమాంతరంగా పనిచేస్తోంది కుదుంబ శ్రీ. (మలయాళంలో కుటుంబాన్ని కుదుంబ అని అంటారు).
కేరళను కాపాడుతున్న కుదుంబశ్రీ
కుదుంబశ్రీ.. ఇది అక్కడి మహిళా స్వయం సహాయక బృందాల సంస్థ. లాక్‌ డౌన్‌ తరవాత దేశమంతా పేదలు, వలస కార్మికుల ఆకలి కేకలు వినిపించాయి. కానీ కేరళ కుదుంబశ్రీ మహిళల కమ్యూనిటీ కిచెన్‌ అందరికంటే కాస్త ముందుగా వారి ఆకలి తీర్చింది.
అక్కడి స్థానిక సంస్థలతో కలపి కుదుంబ శ్రీ సంఘాలు ఈ వంటశాలలు ఏర్పాటు చేశాయి. పేదల దగ్గర నుంచి క్వారంటైన్లో ఉన్నవారి వరకూ అందరికీ భోజనం అందజేశాయి. మొత్తం 1304 కమ్యూనిటీ కిచెన్స్‌లో 1100 వంటశాలల్ని ఈ మహిళా సంస్థలే నడుపుతున్నాయి.
ఆహారం ఉచితం
కాస్త డబ్బు పెట్టగలిగిన వారి కోసం, వీటిలో 238 కిచెన్లను హోటళ్లుగా కేటాయించారు. అక్కడ 20 రూపాయలకే భోజనం దొరుకుతుంది. ఇక సరిహద్దుల్లో, లారీ డ్రైవర్లు ఎక్కువగా ఇరుక్కుపోయిన చోట, వారి కోసం 15 టేక్‌ అవే పాయింట్లు ఉన్నాయి. సాధారణ వ్యక్తులతో పాటూ గుర్తించిన 1,57,691 అనాథ కుటుంబాలకి కూడా ఆహారం అందుతోంది.
కేరళ సివిల్‌ సప్లైస్‌ శాఖ, 87 లక్షల కుటుం బాలకు ఇవ్వాల్సిన నిత్యావసరాల కిట్లను తయారు చేయడంలో వీరి సాయం అడిగింది. దానికి అదనంగా ఆ కిట్లకు కావల్సిన సంచులు కుట్టే పని కూడా వీరే తీసుకున్నారు.
ఇక అంగన్‌వాడీల ద్వారా అందించే పౌష్టికాహారం లాక్‌ డౌన్‌లో కూడా ఆగకుండా వీరు చూస్తున్నారు.
ఇప్పటికే ఏప్రిల్‌ నెలకి సరిపడా అమృతం నూట్రిమిక్స్‌ నిల్వ పెట్టుకున్నారు. పంపిణీ కూడా జరుగుతోంది. గిరిజన ప్రాంతాలకూ ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు.
కొన్ని చోట్ల పడవల్లో సూపర్‌ మార్కెట్లు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 60ఏళ్లు పైబడిన వారు ఎక్కడా బయటకు రాకుండానే వారి అన్ని అవసరాలు తీర్చేలా చేశారు.
విస్తృత నెట్‌వర్క్‌, సమర్థులైన సభ్యులు, వారి మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్‌ ఈ లక్షణాలే ఇక్కడ స్వయం సహాయక బృందాలపై ప్రభుత్వాలే ఆధారపడేలా చేయగలిగాయి.
కౌన్సిలింగ్‌ కోసం స్నేహిత
కేవలం భోజనం పెట్టడమే కాదు, ఆప్యాయంగా పలకరించి మంచి చెడ్డలూ చూస్తున్నారీ మహిళలు. ఇందుకోసం స్నేహిత అనే కార్యక్రమం ఉంది. దిక్కులేని (డెస్టిట్యూట్‌) కుటుంబాల్లో 1,22,920 మంది వృద్ధులే ఉన్నారు. లాక్డౌన్‌ సమయంలో వారందరినీ రోజూ పలకరించడం కుదుంబశ్రీ పనుల్లో ఒకటి. క్వారైంటన్లో ఉన్నవారినీ పలకరిస్తారు. క్వారంటైన్లో ఉన్న వారందరూ మానసికంగా ధైర్యంగా ఉండేందుకు పలకరించాలనే నియమం పెట్టుకున్నారు.
ఈ పలకరింపుల పని కోసమే 2,500 మంది ఉన్నారు. ఇంతేకాదు, ఇంట్లోనే అందరూ ఉండిపోవడంతో, బయటకు వెళ్లకపోవడంతో వచ్చే మానసిక ఒత్తిడి ఎదుర్కోవడానికీ, మహిళలు గృహహింస ఎదుర్కొంటుంటే గుర్తించడానికీ కూడా స్నేహిత కౌన్సిలింగ్‌ కార్యక్రమం పనిచేస్తోంది.
1,90,000 వాట్సాప్‌ గ్రూపులు
కుదుంబ శ్రీ చేసిన ముఖ్యమైన పనుల్లో కమ్యూనికేషన్‌ ఒకటి. బ్రేక్‌ ద చైన్‌ కాంపైన్‌ ద్వారా చేతులు కడుక్కోవడం, దూరం పాటించడం, శుభ్రత గురించి అవగాహన కల్పించడంలో చురుగ్గా వ్యవహరించారు. వాట్సప్‌ ద్వారా, అది లేని చోట ప్రత్యక్షంగా ప్రచారం, అవగాహన కల్పించారు.
ఇంతకీ కుదుంబశ్రీ కింద ఎన్ని వాట్సప్‌ గ్రూపులున్నాయో తెలుసా? అక్షరాలా లక్షా 90 వేలు. అవును. వాటిలో 22 లక్షల 50 వేల మంది సభ్యులు ఉన్నారు. వీరందరికీ కోవిడ్‌ గురించి స్పష్టమైన సమాచారం ఎప్పటికప్పుడు చేరిపోతూ వచ్చింది. ఇంగ్లీషు, మలయాళ భాషలో రూపొందించిన పోస్టర్లను వ్యాప్తి చేశారు.
ఎలా సాధ్యపడిరది?
నిజానికి మహిళా స్వయం సహాయక బృందాల ఉద్యమం దేశమంతా ఉంది. కానీ కొన్ని చోట్లే బాగా విజయవంతమయ్యింది. కొన్ని చోట్లే సామాజికంగా -ఆర్థికంగా ప్రభావం చూపగలిగింది. దక్షిణ భారతంలో ఈ సంఘాల ప్రభావం గ్రామీణ పేదరికాన్ని తగ్గించడంలో స్పష్టంగా కనిపించిందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చాయి.
కేరళ వంటి చోట్ల ఈ సంఘాలు మరింత శక్తివంతంగా, సంపన్నంగా ఎదిగాయి. ఈ కుదుంబశ్రీలను తెలుగు రాష్ట్రాల్లోని డ్వాక్రాతో దీన్ని పోల్చవచ్చు.
కేరళలో 90లలో ఈ ఉద్యమం మొదలైంది. 2019 మార్చి నాటికి అక్కడ మొత్తం 2,91,507 స్వయం సహాయక బృందాలున్నాయి. వాటిపైన 19,489 ప్రాంతీయ అభివృద్ధి సంఘాలు, మరో 1064 కమ్యూనిటీ అభివృద్ధి సంఘాలు ఉన్నాయి.
వీటిలో 43 లక్షల 93 వేల 579 మంది మహిళలు సభ్యులుగా ఉన్నవారు. ఏ మహిళ అయినా ఇందులో చేరవచ్చు, కాకపోతే ఇంటికి ఒక్కరు మాత్రమే చేరాలి.
సమగ్ర ఆర్థిక,సామాజిక,మహిళా సాధికారిత ఈ సంస్థ లక్ష్యం. సూక్ష్మ రుణాలు, సూక్ష్మ వ్యాపారాలు, ఉమ్మడి సాగు, జంతువుల పెంపకం, మార్కెట్‌ అభివృద్ధి, వాల్యూ చైన్‌ ఆధారిత వ్యవహారాలు వంటివన్నీ ఆర్థిక కార్యకలాపాల కిందకు వస్తాయి.
ఆశ్రయ (దిక్కులేని వారికి సాయం చేయడం), బాలసభ (పిల్లల కోసం),బడ్స్‌ (ప్రత్యేక అవసరాలున్న పిల్లల విద్య కోసం), ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ప్రాజెక్టులు ఇవన్నీ సామాజిక కార్యక్రమాల కిందకు వస్తాయి. ఇక మహిళల కోసం కార్యక్రమాల గురించి చెప్పక్కర్లేదు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ కుటుంబశ్రీలు చేస్తున్నాయి.
వీళ్లు చేస్తున్న ప్రతీ కార్యక్రమమూ ప్రత్యేకమే. పదుల సంఖ్యలో ఇలాంటి కార్యక్రమాలు వీరు చేపడతున్నారు. వీటి వల్ల ఎందరో మహిళలు తాము ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు. వ్యాపారవేత్తలుగా కొందరు ఎదిగారు. స్వయం ఉపాధి కొందరు పొందారు.
కేరళ తరువాత స్థానంలో మిగిలన దక్షిణ రాష్ట్రాల్లో కూడా ఈ సంఘాలు బలంగానే ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుల్లో ఈ సంఘాలు ఎందరో మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశాయి. స్వయం ఉపాధి పొందడానికి సహాయపడ్డాయి. వారి ఉత్పత్తు లను అమ్ముకోవడానికి వేదిక కల్పించాయి. అలాగే కుటుంబాలకు ఆర్థికంగా మేలు చేశాయి. పరోక్షంగా పేదరిక నిర్మూలనకు సహాయ పడ్డాయి.(బీబీసీ సౌజన్యంతో…)
బళ్ల సతీశ్బీ

సుప్రీం పీఠంపై తెలుగు తేజం

‘‘ తెలుగువాంతా గర్విస్తున్న సందర్బమిది. ఐదున్నర దశాబ్దాల తర్వాత తెలుగు బిడ్డ దేశంలోనే అత్యున్నతమైన పీఠాన్ని ఆథిరోహిస్తున్నారు.జస్టీస్‌ ఎస్వీ రమణ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవడంతో సామాన్యులంతా తమ ఇంట్లోని వ్యక్తికే ఈ గౌరవం దక్కినంతగా ఆనందిస్తున్నారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి స్వయకృషితో ఎదిగిన ఆయన ప్రస్థానం అందరకీ ఆదర్శం. చిన్నతనంలో కాలినడకన బడికి వెళ్లి చదువుకున్న వ్యక్తి…ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూనే తన లక్ష్యం దిశగా సాగిపోయిన తీరు స్పూర్తిదాయకం. తెలుగు రాష్ట్రాలు పొంగిపోతున్న వేళ ఆయన సొంతూళ్ళో సంబరాలు మిన్నంటుతున్నాయి. .. కష్టాలకు ఎదురీది అత్యున్నత న్యాయస్థాన పీఠానికి జస్టిస్‌ ఎస్వీ రమణ..ఎదిగారు.’’


కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగారు! గుంటూరులో చదువుకున్నారు! న్యాయవాదిగా ఎదిగారు. న్యాయమూర్తిగా ప్రస్థానించారు. ఇప్పుడు…భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనే… జస్టిస్‌ నూతల పాటి వెంకట రమణ! అందరికీ… జస్టిస్‌ ఎన్వీ రమణగా సుపరిచితుడు! సాధారణ దిగువ మధ్య తరగతి రైతు కుటుంబానికి చెందిన రమణ… ఇప్పుడు భారత చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణగా మారారు. ఆయన 1957 ఆగస్టు 27న జన్మించారు. తల్లిదండ్రులు… గణపతిరావు, సరోజనీ దేవి. స్వగ్రామం..కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం. ఆయనకు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. వ్యవసాయం కలిసి రాకపోవడంతో గణపతిరావు కుటుంబం ఆర్థికంగా పలు ఇబ్బందులు పడిరది. స్వగ్రామంలో ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. బాల్యంలో కష్టాలు ఎదురైనప్పటికీ రమణ పట్టుదలతో కష్టపడి చదువుకున్నారు. కంచికచర్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. గుంటూరు జిల్లా ధరణికోట (అమరావతి) ఆర్‌వీవీఎన్‌ కళాశాలలో బీఎస్సీ చదివారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి 1982లో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు.
యువరానర్‌ అంటూ…
రమణ 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. కర్నూలు మాజీ ఎంపీ ఏరాసు అయ్యపురెడ్డి వద్ద తొలినాళ్లలో జూనియర్‌గా పని చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి హైకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు ‘పిల్‌’ రమణగా పేరు తెచ్చుకోవడం విశేషం. ప్రజా సమస్యలపై ప్రజాప్రయోజన వ్యాజ్యాల ద్వారా అనేక అంశాలపై న్యాయ పోరాటం చేశారు. సుప్రీంకోర్టులోనూ వాదనలు వినిపించారు. కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రైబ్యునల్స్‌లోనూ వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండిరగ్‌ కౌన్సిల్‌గా పని చేశారు. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానల్‌ అడ్వొకేట్‌గా వ్యవహరించారు. రాజ్యాంగం, క్రిమినల్‌, సర్వీస్‌, ఎన్నికలు, అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసులను వాదించారు. రమణ ఆంధ్రప్రదేశ్‌ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ హోదాలో సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు.
న్యాయమూర్తిగా…
న్యాయవాదిగా మంచి పేరు తెచ్చుకున్న జస్టిస్‌ రమణ తొలుత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2000 జూన్‌ 27న రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితు లయ్యారు. సుమారు 13 ఏళ్లపాటు హైకోర్టు జడ్జిగా జస్టిస్‌ రమణ వేల కేసుల్లో తీర్పులు ఇచ్చారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక సీజేగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ జుడీషి యల్‌ అకాడమీ చైర్మన్‌గా, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా పనిచేశారు.
ఏపీ నుంచి ఢల్లీికి…
జస్టిస్‌ రమణ 2013 సెప్టెంబరు 2న ఢల్లీి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితు లయ్యారు. ఆ తదుపరి ఏడాదే సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సుప్రీం న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు… భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సౌమ్యుడిగా పేరుపొందిన జస్టిస్‌ రమణ చీఫ్‌ జస్టిస్‌గా నియమితులయ్యే క్రమంలో అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించి అత్యున్నత స్థానాన్ని అధిష్టిస్తున్నారు.
దేశ విదేశాలకు…
జస్టిస్‌ రమణ మహిళా సాధికారత, పర్యావరణం, జుడీషియల్‌ యాక్టివిజమ్‌, జెండర్‌ జస్టిస్‌, సబ్‌-ఆర్డినేట్‌ కోర్టుల పాత్ర, మానవ హక్కులు, దివ్యాంగుల హక్కులు తదితర అంశాలపై జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించారు. బ్రిటన్‌ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఇంగ్లండ్‌ వెళ్లి, అక్కడి న్యాయవ్యవస్థ తీరును పరిశీలించారు. అమెరికాలో న్యాయపాలనపై అధ్యయనం చేశారు. పేద ప్రజలకు న్యాయం అందుబాటులోకి రావాలని, వారికి ఉచిత న్యాయసేవలు లభించాలని ఆయన కోరుకుంటారు. న్యాయసేవల అథారిటీ చైర్మన్‌గా జస్టిస్‌ రమణ వేలాది మంది పేద ప్రజల కేసులు ఉచితంగా పరిష్కారం అయ్యేలా చూశారు. దేశంలో కోర్టులను ఆధునికీక రించాలని, మౌలిక సదుపాయాలను పెంచాలని, ఇందుకోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఇద్దరూ.. ఇద్దరే..! ఒకరు న్యాయశాస్త్రాన్ని ఔపోసన పెడితే, ఇంకొకరు వైద్యశాస్త్రం లోతులను తరచిచూసినవారు. వారే జస్టిస్‌ ఎన్వీ రమణ, డాక్టర్‌ యార్లగడ్డ నాయుడమ్మ. వీరిద్దరూ వియ్యంకులు. అవిభక్త కవలల శస్త్ర చికిత్సలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డాక్టర్‌ నాయుడమ్మ పేరు ప్రఖ్యాతలు పొందారు. ఆయన కుమారుడు రితేశ్‌తో జస్టిస్‌ రమణ కుమార్తె భువనకు వివాహం జరిగింది.
లాయర్‌ కావాలనుకోలేదు…
న్యాయ వ్యవస్థలో అత్యున్నత పీఠానికి ఎదిగిన జస్టిస్‌ రమణ నిజానికి న్యాయవాది కావాలని భావించలేదు. యాదృచ్ఛికంగానే ఆయన ఈ వృత్తిని ఎంచుకున్నారు. ఆయన కుటుంబం లోనూ ఎవరూ న్యాయవాదులు లేరు. విద్యార్థి దశలో చురుకుగా వ్యవహరిస్తూ, సామాజిక అభ్యుదయం కోసం పలు పోరాటాలు చేశారు. అనేక విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో విద్యార్థులతో నిరసన ప్రదర్శనలు నిర్వ హించారు. ఒక దశలో తాను అరెస్టు నుంచి తప్పించుకున్నట్లు జస్టిస్‌ ఎన్వీ రమణ ఒక సందర్భంలో చెప్పారు.
సుప్రీంకోర్టుకు కొత్త సారథి- తీవ్ర సవాళ్లు
సీనియర్‌ పాత్రీకేయులు,సాహితీవేత్త ప్రముఖ రచయిత తెలకపల్లిరవిగారి తెలియసిన మరికొన్ని వివరాలు ఇలాఉన్నాయి. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ నూతల పాటి వెంకట రమణ ప్రమాణ స్వీకారం చేశారు. 2013లో సుప్రీం కోర్టు న్యాయ మూర్తిగా నియమితులైన జస్టిస్‌ రమణ అంతకుముందు ఉమ్మడి ఎ.పి హైకోర్టు న్యాయమూర్తిగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, ఢల్లీి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అత్యున్నత న్యాయస్థానంలో ఎనిమిదేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించిన ఆయన సి.జె గా ఏప్రిల్‌ 24 నుంచి 2022 ఆగష్టు 26 వరకూ పదహారు నెలల పాటు పదవిలో వుంటారు. ఏప్రిల్‌ 23న సిజెఐ గా పదవీ విరమణ చేసిన జస్టిస్‌ బాబ్డే సీనియారిటీ ప్రకారమే 48వ న్యాయమూర్తిగా ఆయన పేరును సిఫార్సు చేశారు. సుప్రీం న్యాయమూర్తులలో అత్యంత సీనియర్‌ను నియమించడం సంప్రదాయమైనా సరే నెల రోజుల ముందుగా తన తదుపరి సి.జె పేరు సిఫార్సు చేయడం ఆనవాయితీ. ఏ కారణం చేతనైనా సీనియార్టీ ప్రకారం వున్నవారిని నియమించలేని పరిస్థితి వస్తే ముందే చర్చ చేయవలసి వుంటుంది. జస్టిస్‌ రమణపై ఎ.పి ముఖ్యమంత్రి జగన్‌ కొన్ని ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో కొంత ఆసక్తి నెలకొన్నప్పటికీ ఆయన నియమాకం తథ్యమని ముందే స్పష్టమైంది. సుప్రీం కోర్టులో ఖాళీల భర్తీ పైన, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నాగరత్నను సుప్రీంకు తీసుకు వస్తే 2027లో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారనే అంశం పైన చర్చ జరిగింది తప్ప తదుపరి సిజెఐ గురించి కొలీజియంలో భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు కనిపించదు.
ఆరోపణల తోసివేత
జస్టిస్‌ రమణ పేరును సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు అదే సమయంలో ఆయనపై ముఖ్యమంత్రి జగన్‌ ఆరోపణలను తోసిపుచ్చినట్టు ప్రకటించింది. ఈ విషయంలో అనుకూలంగా వ్యతిరేకంగా రకరకాల వాదోపవాదాలు న్యాయవర్గాల నుంచి వినిపించాయి. ఈ ఆరోపణల విచారణకు సంబంధించి కొన్ని కథనాలు రాగా అంతర్గత విచారణ విషయాలు ఎప్పుడూ బహిరంగ పర్చబోమని వాటిని తోసిపుచ్చింది. అంతిమంగా ఆ ఆరోపణలలో పసలేదని తోసిపుచ్చినట్టు ప్రకటించింది. విచారణ ప్రక్రియ జరిపి తిరస్కరించడం పారదర్శకత లేదనే విమర్శకు సమాధానంగా భావించాల్సి వుంటుంది. అయితే ఆ ఆరోపణలను విచారించింది ఎవరు, ఏం తేల్చారనేది బయిటపెట్టి వుండాల్సిందని సీనియర్‌ న్యాయవాదులు కొందరు రాశారు. ఏమైనా అది ముగిసిన అధ్యాయం.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి నియమితులవటం ఇది రెండవ సారి. గతంలో ఎ.పి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ పని చేసిన జస్టిస్‌ కోకా సుబ్బారావు 1966-67 మధ్య సి.జె గా పనిచేశారు. 1993-94లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ వెంకటాచలయ్య కూడా ఇప్పటి ఎ.పి లోని లేపాక్షిలో జన్మించిన వ్యక్తి అయినప్పటికీ అది అప్పుడు ఉమ్మడి కర్ణాటక రాష్ట్రంలో భాగంగా వుండేది. మానేపల్లి నారాయణరావు వెంకటాచలయ్య అన్న ఆయన పేరు కూడా అచ్చం తెలుగు వారి పేరే అయినా చదువు కర్ణాటకలో సాగింది. ఈ మధ్య కాలంలో తెలుగువారు అనేకులు సుప్రీం కోర్టులో న్యాయమూర్తులుగా పని చేసినప్పటికీ ప్రధాన న్యాయమూర్తి స్థానం దాకా పయనించే అవకాశం జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణకే దక్కింది. ఆయన పదవీ కాలం కూడా సాపేక్షంగా చాలా మంది సి.జె ల కన్నా అధికంగా వుంటుంది.
సుప్రీం ప్రతిష్టపై నీలినీడలు
చాలా దశాబ్దాల తర్వాత తెలుగు వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి కావడం పట్ల సంతోషం వ్యక్తమైనా సుప్రీం కోర్టు ప్రతిష్ట అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన బాధ్యతలు తీసుకుంటున్నారు. ప్రధాన న్యాయమూర్తులుగా ఎస్‌.ఎ.బాబ్డే, అంతకు ముందు రంజన్‌ గొగోరుల హయాంలో అత్యున్నత న్యాయస్థానం కేంద్రం ఒత్తిళ్లకు లోబడిపోయిందనే ఆరోపణ బలపడిరది. వరుసగా ఇచ్చిన తీర్పులు మోడీ సర్కారుకు సంతోషం కలిగించాయి. సిజెఐ గా రంజన్‌ గొగోరు అయోధ్య, రాఫెల్‌ తీర్పులు ఇచ్చారు. పదవీ విరమణ తర్వాత కొద్ది కాలానికే రాజ్యసభ సభ్యత్వం పొంది విమర్శలు మూట కట్టుకున్నారు. ఇక 2019 నవంబరులో ఎస్‌.ఎ బాబ్డే ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టినప్పుడు కీలకమైన ఎన్నో కేసులు న్యాయస్థానం ముందు అపరిష్కృతంగా వుండిపోయాయి. జమ్మూ కాశ్మీర్‌కు రాజ్యాంగం ఇచ్చిన ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి మూడు ముక్కలు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన కేంద్రం నిరంకుశ చర్యను సవాలు చేస్తూ వంద పిటిషన్లు దాఖలయ్యాయి. కాని వాటిపై పూర్తి విచారణ జరగనేలేదు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పైనా పిటిషన్లు వచ్చాయి. ఢల్లీితో సహా దేశవ్యాపితంగా నిరననలు సాగాయి. ముఖ్యంగా ఢల్లీిలో కుట్రపూరితంగా మత కలహాలు రగిలించి యువతను విద్యార్థులను అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టారు. జామియా మిలియా విశ్వవిద్యాలయం లోనూ దాడులు జరిగాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ లోకి గ్యాంగులు చొరబడి దౌర్జన్యం చేశారు. ఇవన్నీ కళ్ల ఎదురుగా జరుగుతున్నా పలుసార్లు కేసులు వస్తున్నా సుప్రీంకోర్టు న్యాయం చేసేందుకు చొరవ తీసుకోలేదు. హత్రాస్‌ అత్యాచారం ఘటనలో అన్యాయంగా అరెస్టు చేయబడిన కేరళ జర్నలిస్టు సిద్దిక్‌ కప్పన్‌ కేసు వస్తే విచారించి మీడియా స్వేచ్ఛను కాపాడకపోగా ఇలాంటి కేసులు హైకోర్టుకే వెళ్లేలా తాను చర్యలు తీసుకుంటానని ప్రకటించింది. రోహింగ్యా శరణార్థులను ఆదుకునే విషయంలోనూ భారత దేశ సంప్రదాయం, రాజ్యాంగ విలువలు, అంతర్జాతీయ సూత్రాలను బేఖాతరు చేస్తూ జోక్యానికి నిరాకరించింది.
వివాదగ్రస్తమైన తీరు
ఇంతకంటే తీవ్రమైన విషయం ఎన్నికల బాండ్లకు సంబంధించిన కేసును పూర్తిగా పక్కన పెట్టేయడం. ప్రతి ఎన్నికల సమయంలోనూ ఆ బాండ్లపై స్టే విధించాలంటూ పిటిషన్లు వస్తూనే వున్నాయి. ఇవి ఎప్పటినుంచో వున్నాయనీ, ఈ విధమైన అభ్యర్థనలను ఇదివరకటి నుంచి వస్తున్నాయంటూ ప్రతిసారి సుప్రీంకోర్టు ధర్మాసనం వాటిని పక్కన పెడుతూ వచ్చింది. వలస కార్మికుల దుస్థితిపై దాఖలైన వ్యాజ్యాల విషయంలోనూ ఇదే విధమైన స్పందనా రాహిత్యం తాండవించింది. వారికోసం ఏం చేయాలనేది ప్రభుత్వానికే బాగా తెలుసంటూ కేసును చాలా కాలం సాగదీశారు. వలస కార్మికులకు తిండి పెడుతున్నప్పుడు మళ్లీ ఆర్థిక సహాయం దేనికని ఆఖరుకు సి.జె బాబ్డే స్వయంగా ప్రశ్నించారు. ఇదే కాలంలో కార్పొరేట్లకు సంబంధించిన పలు కేసుల్లో సుప్రీం కోర్టు అమితాసక్తి ప్రదర్శించింది. ఢల్లీిలో రైతుల ఆందోళనను పరిష్కరించాలనే కేసు లోనూ ఒక కంటితుడుపు కమిటీని వేసి కాలయాపన చేసింది. ఆ కమిటీ కూడా ప్రభుత్వ అనుకూల వ్యక్తులతో నిండి వుండటం, ఒకరు ముందే నిరాకరించడం దాన్ని మరింత పలచన చేసింది. తీరా ఆ కమిటీ సిఫార్సులు వచ్చి చాలా కాలం గడిచినా ఎలాంటి సానుకూల చర్యలు ఆదేశించింది మాత్రం లేదు. ప్రజల పేదల హక్కులను కాపాడ్డంలో ఈ విధంగా వ్యవహరించిన న్యాయస్థానం కోర్టు ధిక్కార కేసుల పేరిట మాత్రం ఎంతో సమయం వెచ్చించింది. అయోధ్య కేసులో 1991 ప్రార్థనా స్థలాల చట్టం ప్రాతిపదికగా చెప్పిన న్యాయస్థానం ఆ చట్టాన్నే సవాలు చేసే పిటిషన్‌ను అనుమతించడం మరో వైపరీత్యం. ఆ వెంటనే కాశీ, మధుర క్షేత్రాలలో వివాదాలను స్థానిక న్యాయస్థానాలు చేపట్టాయి.
న్యాయమూర్తుల నియామకం స్తంభన
కరోనా కారణంగా ఈ కాలంలో వర్చువల్‌ విచారణ పద్ధతి గొప్ప మార్పుగా చెబుతున్నా వాస్తవంలో అనేక కేసులు విచారణకు నోచుకోకుండానే పోయాయి. కేవలం 25 శాతం మాత్రమే విచారణ జరిగాయి. ఈ పరిస్థితి అనివార్యమైందనుకుంటే ఒక తీరు గాని ఇందుకు సి.జె బాబ్డేను పొగడ్తల్లో ముంచెత్తడం విచిత్రం. ఇప్పటికి వచ్చిన తీర్పులపైనే ఇంత అసంతృప్తి వుండగా కొత్తగా ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ను కూడా ప్రవేశపెట్టేందుకు కోర్టు చర్చలు సాగిస్తున్నది. వాటి పాత్రపై న్యాయమూర్తులకే స్పష్టత వున్నట్టు లేదు. ఈ మొత్తం కాలంలో సుప్రీం కోర్టుకు ఒక్క న్యాయమూర్తిని కూడా అదనంగా నియమించలేకపోవడం పెద్ద లోపం. హైకోర్టుల్లోనూ 400 పైనే ఖాళీలున్నా కొలీజియం, కేంద్రం పరస్పరం బాధ్యతను నెట్టివేసుకుంటూ కాలం గడిపాయి. పదవీ విరమణకు ముందు రోజు సి.జె బాబ్డేతో కూడిన ధర్మాసనం రాజ్యాంగంలోని 224(ఎ) అధికరణాన్ని దాదాపు 60 ఏళ్ల తర్వాత పునరుద్ధరించి, రిటైర్డు జడ్జిలను హైకోర్టులకు నియమించవచ్చునని ఆనుమతినిచ్చింది. క్రమబద్దమైన నియామకాలు పూర్తిచేయకపోగా ఈ విధంగా విచక్షణతో కూడిన నియామకాలు చేస్తే మళ్లీ అదెక్కడికి దారి తీస్తుందోననే సందేహాలు వున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను తొక్కిపడుతూ ఒత్తిడికి గురి చేస్తున్నదనే అభిప్రాయం అందరిలో నెలకొంది. మాజీ సీనియర్‌ న్యాయమూర్తులు అరుణ్‌ మిశ్రా వంటి వారు ప్రధాని మోడీని అదేపనిగా పొగిడి తరించడం, రంజన్‌ గొగోరు రాజ్యసభకు వెళ్లడం ఆ సందేహాలను పెంచింది. తాజా మాజీ సి.జె బాబ్డే కూడా బహురంగాలలో ఆసక్తి వున్నవారు గనక పదవీ విరమణ తర్వాత ఏదైనా చేయవచ్చునని ప్రస్తుత సిజెఐ ఎన్‌.వి.రమణ వీడ్కోలు ప్రసంగంలో చెప్పడంలోనూ సంకేతాలున్నాయి.
భవిష్యత్‌ గమనం?
సిజెఐ గా ఎన్‌.వి రమణ పదవీ కాలం సాపేక్షంగా చాలా మంది కన్నా కొంచెం ఎక్కువగానే వుంటుంది. రాజకీయ నాయకులపై, ప్రజా ప్రతినిధులపై కేసులసు వేగంగా పరిష్కరించాలన్నది గతంలో జస్టిస్‌ రమణ తీసుకున్న కీలక నిర్ణయం. పేదలకు కూడా న్యాయ సహాయం సమానంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నది ఈ సిఫార్సుకు ముందు రోజు ఆయన చేసిన ప్రసంగం. నదీ జలాల వివాదాలు రాష్ట్రాల హక్కులకు సంబంధించి కూడా ఆయన తీర్పులను ప్రస్తావిస్తుంటారు. తెలుగు రాష్ట్రాలకే నదీ జల వివాదాలు ఒకవైపు రాష్ట్రాల హక్కులపై కేంద్రం తీవ్ర దాడి మరోవైపు సాగుతున్న ఈ కాలంలో మరి ఆయన తీర్పుల పరంగానూ న్యాయ వ్యవస్థ నిర్వహణ పరంగానూ ఎలాంటి అడుగులు పడేది చూడవలసిందే. చట్టం వ్యవస్థపై ఆధారపడిరదే గాని వ్యవస్థ చట్టంపై ఆధారపడి వుండదన్న కారల్‌మార్క్స్‌ మాట ప్రకారం వ్యక్తులను బట్టి మౌలిక మార్పులకు పెద్ద అవకాశం వుండకపోయినా న్యాయమూర్తులు చేయగలిగింది చాలానే వుంటుంది. మసకబారిన సుప్రీం ప్రతిష్ట రీత్యా కొత్త సిజెఐ జస్టిస్‌ ఎన్‌.వి రమణ ఏం చేస్తారనేది రేపటి నుంచే చూడొచ్చు.
-సైమన్‌ గునపర్తి

వివాహ బంధం పటిష్ట పరచాలి

శక్తివంతమైన వేదమంత్రాలతో ఏర్పడిన వివాహబంధం తో ఒకటైన దంపత్యబంధం శాత్వతం, పవిత్రం. ..జీవితంలో ఎదురయ్యే ఆటుపోటులకు సమన్వయం తో ఒకరికొకరు తోడుగా ఉంటూ పరిష్కారించుకుంటూ ముందు కు సాగాలి. సంసారనౌక సజావుగా ప్రయాణించాలంటే ఓర్పు,నేర్పు, సమయస్ఫూర్తి ఉండాలి…నిర్వచనానికి అందని ఎత్తైన భావన దాంతప్యబంధం…సంతోషంలో భాగస్వామ్యం పంచుకుంటూ ఒకరి దుఃఖం లో మరొకరి ఓదార్పు పంచుతూ సంతానం యొక్క ఆలనా పాలనా చూసుకుని సంతోషపడతారు.. పరస్పర అనుకురాగం, అవగాహన కలిగి కలిసి నూరేళ్ళ జీవిత ప్రయాణమే వివాహబంధం యొక్క లక్ష్యం..అరమరికలు లేని ఆనందం పంచుకోవడం లోనే అంతర్లీనంగా ఒకరిపై మరొకరికి ఉన్న బాధ్యత, బంధం కలిసి ఉంటాయి.కేవలం ఆర్ధిక సంబంధ విషయాల వల్ల ఈ మధ్య వివాహ బంధాన్ని అతి సులువుగా రద్దు చేసేసుకుంటున్నారు…సంస్కృతి సంప్రదాయాలు గౌరవించడం నేటి తరానికి గిట్టనిమాటలు…విచ్చలవిడితనం కూడా పెరిగిపోయి వివాహబంధాన్ని తృణప్రాయంగా తీసిపారేస్తున్నారు… గత శతాబ్దంలో ఈ దుస్థితి లేదు..ఆదర్మవంతమైన జంట సీతారాములు…అరణ్య వాసంలో భర్తతో కలిసి కష్టపడడానికైనా సిద్ధపడినట్లు మనకి తెలుసు… సమస్యలు వచ్చాయని బయటపడకుండా భర్తకి, భార్య..భార్యకి భర్త ధైర్యం చెప్తూ కష్టం లోనూ సుఖంలోనూ తోడుగా నిలిచి ముందుకు సాగడమే దాంపత్య బంధం..
మానవ జీవితంలో ముడిపడిన అన్యోన్య బంధం వివాహం. పెళ్లిళ్లు భారతీయ సంస్కృతికి, సహజీవనానికి ఆనవాళ్ళు. పెళ్లిళ్లకు ప్రత్యేకించినది మాఘమాసం. పురోహితులు సూచించే శుభ ముహుర్తాలను బట్టి పెళ్లిళ్లు జరుగుతుంటాయి. హిందూ సమాజంలో దాగివున్న పవిత్రమైన వేద మంత్రాల సాక్షిగా సాగే వివాహ మహోత్సవానికి మన దేశంలో సముచిత ప్రాధాన్యత,విలువ,గౌరవం ఉంటుంది. ఇప్పటికీ భారతీయులు వైవాహిక జీవిత విలువలను దైవ స్వరూపంగా పాటిస్తారు. ఇలాంటి వివాహ బంధాలు కొన్ని ఈ మధ్య కాలంలో విడిపోతున్న సందర్భాలు కుటుంబ పెద్దలను కలవరపెడుతున్నాయి. లక్షల కట్నాలతో లక్షణమైన సంబంధాలు వెతికి పెళ్లి చేసిన తల్లిదండ్రులకు ఇలాంటి సంక్షోభం మనోవేదనను కల్గిస్తున్నది. ఆలుమగల మధ్య అవగాహన లోపిస్తే, సంయమనం లేకపోతే సంసారం నిస్సారమవుతుంది. భార్యాభర్తల విభేదాలు వివాహబంధాన్ని విడదీస్తాయి. చివరికి విడాకులకు దారి తీస్తుంది. ప్రపంచ దేశాలతో పొల్చితే కేవలం ఒక శాతం విడాకులతో అత్యల్పంగా నమోదైన దేశంగా ఇండియాకు పేరుంది. గరిష్టంగా విడాకులు బెలారస్‌ దేశంలో 68శాతం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా విడాకుల రేటులో చైనా 2.2 శాతం, ఇటలీ 2.7శాతం,కెన్యా 15 శాతం ,బ్రెజిల్‌ 21శాతం,అస్ట్రేలియా 38 శాతం,స్విస్‌ 40శాతం, జర్మనీ 41శాతం , కెనడా45శాతం,అమెరికా 49శాతం, ఉత్తర కొరియా మరియు నూజిలాండ్‌ 53శాతం, బెల్జియం 56శాతం,స్వీడన్‌ 64శాతం,రష్యాలో 65శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా విడాకుల పెరుగుదల రేటు 1960లో12 శాతం,1980లో 26శాతం,2000లో 25 శాతం,2010లో41శాతం,2017లో 44 శాతం,2020 నాటికి 51.8 శాతంగా నమోదు కాబడిరది. గత మూడేళ్ళలో వివాకుల రేటు 7.8 శాతం పెరుగుదల గమనార్హం. ఇండియాలో విడాకుల రేటు పూర్వంతో పోల్చితే క్రమంగా పెరుగుతోందని సంబంధించిన నిపుణులు వెల్లడిస్తున్నారు. మనదేశంలో విడాకులకు ముఖ్య కారణాలు- వివాహేతర సంబంధాలు, ఇరువురి మధ్య విశ్వాసం సన్నగిల్లడం, సంక్షోభాలు, బాల్యవివాహాలు, వితండ వాదనలు, ఆర్థిక సమస్యలు, చిర కాలంగా దంపతుల ఎడబాటు , గృహహింస, వరకట్న వేధింపులు, లైంగిక సమస్యలు, అహంభావ దోరణి, మానసిక వైకల్యం, సర్దుకునే దోరణి లేకపోవడం వంటివి ప్రముఖమైనవి. దేశ జనాభాలో 0.11శాతం అనగా1.36 మిలియన్ల మంది వివాహితులు విడాకులు తీసుకున్నారు. వారిలో పురుషుల కన్నా స్త్రీలు అధికం. దేశంలో విడాకుల సంఖ్య రాష్ట్రాల వారీగా మిజోరాం (6.34శాతం), మేఘాలయా (4.11శాతం ),సిక్కిం (2.16శాతం), కేరళ (1.59శాతం), మణిపూర్‌ (1.32శాతం), తమిళనాడు (1.22శాతం), మహారాష్ట్ర (1.08శాతం),వెస్ట్‌ బెంగాల్‌ (1.02శాతం ), ఆంధ్ర ప్రదేశ్‌ (1.12శాతం), గుజరాత్‌లో 1.08శాతంగా ఉంది. ఈ విడాకుల సంఖ్య గ్రామీణుల కంటే పట్టణవాసుల్లో , మద్యతరగతి కుటుంబాలలో, అందులోనూ విద్యాధికుల్లోనే నమోదు అధికం. విదేశీయుల్లో కంటే భారతీయుల్లో విడాకుల సంఖ్య తక్కువ ఉండటానికి ప్రదాన కారణం పూర్వం నుండే విడాకులనేది ఓ సామాజిక దురాచారంగా గుర్తించబడిరది. విడిపోయి జీవించటం అనేది ఒక అసామాజికమైనదిగా, దుస్సంస్కృతిగా భావించబడుతున్నది. వివాహేతర సంబంధాల్లో పురుషులు 75 శాతం,స్త్రీలు 25శాతం విడాకులు తీసుకుంటున్నారు. అందులోనూ 10 నుంచి 15 సంవత్సరాల వైవాహిక జీవితం గడిచిన తర్వాత 53శాతం మంది విడాకులు తీసుకుంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. 20ఏళ్ళకు పైగా వైవాహిక జీవితం గడిపిన వారిలో విడాకులు చాలా అరుదుగా కన్పిస్తు న్నాయి. భారత్‌ లో వివిధ మతాల వారు హిందూ వివాహ చట్టం-1955 ను అనుసరిస్తున్నారు. ముస్లిమ్‌ విడాకులు ముస్లిం వివాహ చట్టం -1939, క్రిస్టియన్లకు భారతీయ విడాకుల చట్టం-1963, కుల మతాంతర వివాహాలకు ప్రత్యేక వివాహ చట్టం-1954 చేయబడ్డాయి. ఇతర కారణాలతో పోల్చితే ఉభయుల అంగీకారంతో విడాకులు తీసుకోవడం సులభంగా జరుగుతోంది.
పెళ్ళంటే నూరేళ్ళ మంట కాకూడదు
పెళ్ళంటే రెండువంశాలు కలిసే వేడుక. వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్న ఇరువురిని ఒక బాటపై కలిసి నడవమని పెద్దలు ఏర్పాటు చేసే మొదటి మెట్టులాంటిది. అలాంటి సోఫానం శుభ్రంగా ఉండాలి కాని కలతలు, తగాదాలతో మొక్కుబడిగా చేసేవి, పాచి పట్టిన మెట్టులా తయారు చేయకూడదు. పెళ్ళంటే ఎవరికైనా కంగారు, హడావుడి సహజం. బాగా ధనవంతులైతే ఏమో చెప్పలేం గాని, మధ్య తరగతి, మరికొంచెం స్థితిమంతులైనా ఈ రోజుల్లో పెళ్ళంటే మాటలు కాదు. పెళ్ళి సంబంధాలు వెతకటం ఒక యజ్ఞం. అయితే, పెళ్ళి చేసి పిల్లని అత్తవారింటికి పంపేసరికి పిల్ల తల్లిదండ్రులకి కాస్తోకూస్తో అప్పులు ఆపైన నిందలు. లక్షల్లో చేరిపోయింది. కట్నాల రేంజ్‌. చదువులు ఎంత పెరిగాయో, దానికి సమా నంగా కట్నాలు లాగుతున్నారు అబ్బాయి తల్లిదండ్రులు. పెద్ద చదువులు, సంస్కారం నేర్పడానికి బదులు ఆశలు, దురాశలు నేర్పుతున్నాయి. కట్నాలు వద్దని గొప్పలకు పోయి, దానికి బదులుగా కానుకలంటూ, పదిరెట్లు ఆడపిల్లల తండ్రులు దగ్గరలాగు తున్నారు. పెళ్ళికూతురు మాత్రం పెద్ద చదువు చదవాలి, ఉద్యోగం చేసి రెండు చేతులా సంపాదించి భర్త చేతిలో పోయాలి. పనిపాటలు రావాలి. అత్తగారు ఎలా చెబితే అలా తల ఊపాలి. అంత చదువు చదివిన పిల్ల వ్యక్తిత్వం చంపుకుని ఎవరేం చెబితే అలా తలాడిరచేలా అణగిమణిగి ఉండాలి. కొడుకు ఎక్కడ కోడలి మాట వినేస్తాడోనని అత్తా మామలు కంగారుపడుతుంటారు.కొంతమంది అబ్బాయిల తరఫువారు అనేక రకాలుగా చికాకులు కలిగిస్తుం టారు. అందరికీ కూర్చోవడానికి వేసిన కుర్చీలు బాగోలేవని, భోజనాల్లో ఎక్కువ వెరైటీలు చేయించినా ఇంకా ఏవో తక్కువ అయ్యాయని, పెళ్ళికొడుకు స్నేహితులకి హోటళ్ళలో ఎ.సి. రూములు తీసుకోలేదని, పొద్దున్నే టిఫిన్లు తిరిగి రెండోసారి అడగలేదని వియ్యపురాలికి మాటమాటికి ఏం కావాలి? అని అడగలేదని సతాయిస్తుంటారు. కట్నాలు వద్దు, కానుకలు ఇవ్వండి అనే వారు కొందరు. పెళ్ళి బాగా చేయండి అంటూ పిల్ల తల్లిదండ్రి నుంచి ఎన్ని విధాలుగా రాబట్టాలో అన్ని విధాలా గుంజుకునేవారు కొందరు. మళ్ళీ పిల్లని కన్నతల్లిదండ్రులని గౌరవించరు. ఎంత పెద్ద చదువులు చదివినా సంస్కారం లేదని, ఇలాంటి పెళ్ళిళ్ళు రుజువు చేస్తున్నాయి. మర్యాద ఇచ్చుపుచ్చుకోమన్నారు. ఆడపిల్ల కన్నవాళ్ళని తేలిగ్గా చూసే తీరు మార్చుకోవాలి ఈనాటి వరుడి తల్లిదండ్రులు. ఒకసారి మనసులు బాధపడితే తర్వాత ఎంత మంచిగా మాట్లాడినా, అది నటనగానే ఉంటుంది అవతలి వారికి పెళ్ళిబాగా చేశారు అనే ఒక్కమాట కన్యాదాతకి ఎంత బలమిస్తుందో అబ్బాయి తల్లిదండ్రులు ఆలోచించాలి. గతంలో అయితే పెళ్ళిళ్ళు ఇంటి ముందే పెద్ద, పెద్ద పందిళ్ళు వేసి అందులోనే జరిపేవారు. ప్రస్తుత కాలంలో చిన్నచిన్న ఇళ్ళు, ఇరుకు గదుల్లో ఉండే సందర్భంలో అలాంటి అవకాశా ల్లేవు. కాబట్టి ప్రతిఒక్కరూ కళ్యాణ మండ పాలనే ఆశ్రయిస్తున్నారు. వీటిని కూడా ఆర్థిక తాహతుకు మించి బుక్‌చేస్తున్నారు. పెద్ద పెద్ద మండపాల్లో చేసుకునేబదులు, తక్కువ ఖర్చుతో చిన్నమండపాల్లో చేసుకుంటే కొంత ఖర్చు కలిసివస్తుంది. ఇంకా ఇలాంటి అనవ సరపు వాటికి, ఆడంబరాలకు అదనంగా ఖర్చు చేస్తుంటారు. ఒక విధంగా ఆలోచిస్తే ఇవన్నీ వృధాయే. పెళ్ళిపేరజరిగే కొన్ని ఖర్చులు తగ్గించుకుని, వధూవరులకు అందిస్తే వారు జీవితంలో కొంత ఒడిదుడుకులు లేకుండా, ఆర్థిక అవసరాలకు పనికివస్తాయి. ఒక రోజు జరిగే తంతుకి ఎక్కువ ఖర్చుల జోలికిపోకుండా పొదుపు చేస్తే, తర్వాత ఏఇబ్బంది లేకుండా కొత్తగా పెళ్ళిచేసుకున్న వారి జీవితం హాయిగా సాగిపోతుంది. ఈ విషయాన్ని వధూ వరుల ఇరువైపులవారు ఆలోచించి జాగ్రత్తలు పాటిస్తే పెళ్ళంటే నూరేళ్ళపంట అవుతుంది, లేకుంటే నూరేళ్ళ మంట అవుతుంది
గిరిజన తెగలలో వారి సంస్కృతి, ఆచారాలలో జరిగే వివాహ వ్యవస్థ ఆదర్శవంతమైనవి. భిల్లు, గొత్తికోయ వంటి గిరిజనులు ఆర్థిక వెసులుబాటు లేక సహజీవనంతో సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిని అధ్యయనం చేసిన రaార్ఖండ్‌ లోని ‘నిమిట్టా’ అనే స్వచ్చంద సంస్థ 2016లో 200 జంట లను చేరదీసి పెళ్ళి చేసింది. వెంటనే మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ చేపించడంతోఆ మహిళలకు చట్టబద్దమైన హక్కులు లభించాయి. ఉత్తరాది రాష్ట్రాలలో వివాహ సంప్రదాయాలను పాటించాలని, ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని, పర్యావరణ హితమైన పెళ్ళిగా ‘ రాధాసోమి ‘ అనుసరిస్తున్నారు. ఈ వివాహ సంప్రదాయంలో శుభలేఖ ఖర్చు రూ.5,భోజనాలు ప్లేటుకు రూ. 13కు మించడానికి వీల్లేదు. అమ్మాయి తరపు అతిధితులు 65మంది, అబ్బాయి తరపు బంధువులు 85 దాకా హాజరు కావాలి. ఈ రాథాసోమి అనేది ఉత్తరాధిన బహుళ ప్రాచుర్యం పొందిన అనేక ఆధ్యాత్మిక తెగల్లో ఇదొకటి. ప్రేమ పెళ్లిళ్ల కంటే పెద్దలు కుదిర్చిన వివాహాలు సమాజ ఆమోదయోగ్యంగా ఉంటాయి. భారతీయ సంప్రదాయంలో మూడుముళ్ల వివాహ బంధం పట్ల పవిత్రత, పితృసామ్య వ్యవస్థ, వివాహిత ఇంటికి పరిమితం కావడం, సామాజిక విలువలు, గ్రామపంచాయతీ తీర్పులు, లింగ సమానతలు, పెద్దల మాటలు పాటించటం వంటివి మనదేశంలో విడాకుల రేటు తక్కువ నమోదుకు తోడ్పడుతున్నాయి. భారత హిందూ పవిత్ర వివాహబంధం మూడు పువ్వులు ఆరు కాయటంగా వర్ధిల్లుతూ, కుటుంబంలో నవ్వుల పువ్వులు పూయాలి. ప్రపంచ దేశాలకు బారతీయ వివాహవ్యవస్థ దీప స్తంభం కావాలి. ప్రస్తుత వివాహ వ్యవస్థలో ఆశించిన మార్పులు రావాలంటే సాంస్కృతికంగా సంప్రదాయంగా పెళ్లిల్లు రూపుదిద్దుకోవాలి. బాల్య వివాహాలను నిరోధించడానికి పేద, కార్మిక కుటుంబాలలో వ్యసనాలను తగ్గించడానికి ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. వివాహబంధం పటిష్ఠతకు అవసరమైన కౌన్సిలింగ్‌ కేంద్రాలను గ్రామ స్థాయి వరకు విస్తరించాలి. నవ దంపతులకు ఆర్ధిక, సామాజిక భద్రత కల్పించాలి. అన్ని వర్గాల ప్రజల ఆర్థిక వెసులుబాటును బట్టి మదుపుతో, కాలుష్యానికి తావులేకుండా పర్యావరణ హితంగా,ఆరోగ్యకర వాతావరణంలో పెళ్లిల్లు జరిగితే శుభకరం !
వ్యాసకర్త : –గుమ్మడి లక్ష్మీ నారాయణ, ప్రముఖ సాహితీవేతత 9491318409

సెకండ్‌ వేవ్‌..కరోనా చెబుతున్న నిజం

కరోనా సృష్టిస్తున్న విలయానికి నేడు పేదోడికి అరవై గజాల ఇంటి స్థలం కాదు, స్మశానంలో ఆరడుగుల నేల ఓకలగా మారింది. దేశంలో రెండోదశ కరోనా వ్యాప్తి ప్రకంపనలు సృష్టిస్తున్నది….. ప్రమాదఘంటికలు మోగిస్తున్నది. అదే సందర్భంలో మన ప్రభుత్వ పెద్దల పగటి వేషాలనూ,ప్రచార వ్యామోహా లనూ,ఉత్తరకుమార ప్రగల్భాలనూ పట్టి చూపిస్తున్నది.‘వట్టి మాటలు కట్టిపెట్టోరు గట్టిమేల్‌ తలపెట్టవోరు’ అన్నాడు మహాకవి గురజాడ. కానీ ఇప్పుడు గట్టిమేలును కట్టిపెట్టి వట్టిమాటలు పలుకుతున్న పాలక నేతల బండారాన్ని నిట్ట నిలువునా బట్టబయలు చేస్తున్నది కరోనా.

దేశవ్యాప్తంగా కరోనావైరస్‌ సెకండ్‌ వేవ్‌ విలయతాండవం చేస్తోంది. నిత్యం మూడు లక్షలకు పైగా కొత్త కేసులు,వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కరోనాపై పోరు సాగిస్తున్న వైద్యులు ఈ మహమ్మారి కాటుకు బలవుతున్నారు. కోవిడ్‌పై పోరు సాగిస్తూ నిరంతరం శ్రమిస్తూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యులు ముందుండి సేవలందిస్తున్నారు. అయితే.. కరోనా బారిన పడిన రోగుల ప్రాణాలను కాపాడుతున్న క్రమంలో వైద్యు లు కూడా ఈమహమ్మారి కాటుకు బలవు తున్నారు. కరోనా కారణంగా గతేడాది దేశ వ్యాప్తంగా 730 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పో యారని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వెల్లడిర చింది. సెకండ్‌ వేవ్‌లోనూ ఈమహమ్మారి వైద్యులపై పంజా విసురుతోందని పేర్కొంది.అయితే.. కరోనా సెకండ్‌ వేవ్‌లో ఈ సంఖ్య భారీగా పెరుగుతుందని ఐఎంఏ ఆందోళన వ్యక్తంచేసింది. ఒక్క రోజులో 50 మంది వైద్యులు మరణించారని మెడికల్‌ అసోసియేషన్‌ ఆవేదన వ్యక్తంచేసింది. సెకండ్‌ వేవ్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు 244 మంది వైద్యులు కరోనా కారణంగా మరణించినట్లు భారత వైద్య సంఘం వెల్లడిరచింది.
కరోనా సెకండ్‌ వేవ్‌ లక్షణాలేంటో తెలుసా?
భారతదేశంలో కోవిడ్‌-19తీవ్రంగా చాలా మం దిని ప్రభావితం చేస్తోంది. మొదటి వచ్చిన వైరస్‌తో పోల్చుకుంటే ఈవైరస్‌ చాలా ప్రమాదమని నిపు ణులు కూడా చెబుతున్నారు. వైరస్‌లో కొత్త వేరియంట్స్‌ కూడా మనం చూస్తు న్నాం. అనుకోని లక్షణాలు కూడా చాలా మందిలో వేధిస్తున్నాయి. సాధారణంగా శ్వాస ఆడకపోవడం,కొద్దిగా జ్వరం ఉండడం,దగ్గు,తలనొప్పి,ఒళ్లునొప్పులు,గొంతు బాగా లేకపోవడం,రుచి తెలియక పోవడం,వాసన తెలియకపోవడం,నాసల్‌ కాంజిషన్‌,నీరసం, అల సట వంటి లక్షణాలు కన బడుతున్నాయి.
శ్వాస ఆడకపోవడం
శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం చాలా మందిలో కనుగొనడం జరిగింది. చాలా మంది కరోనా బారిన పడిన వాళ్ళు శ్వాస సంబం ధిత సమస్యలకు గురవుతున్నారు. నిజంగా దీని వల్ల చాలా మంది మరణిస్తున్నారు కూడా. ఒక పక్క చూస్తే అక్సిజన్‌ కొరత కూడా ఉన్నట్లు మనకి తెలుస్తుంది. దీంతో నిజంగా ఈ సమస్య నుండి బయట పడటం కష్టమని అనిపిస్తోంది. అలాగే శ్వాస అందకపోవడంతో పాటు గుండెల్లో గట్టిగా పట్టేసినట్టు వంటివి కూడా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు.దీనితో ఊపిరితిత్తుల సమస్యలు కూడా అధికమవుతున్నాయని రోగులు అంటు న్నారు.
గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌
కరోనా వైరస్‌ బారిన పడిన వాళ్ళలో గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ కూడా వస్తున్నాయి ముఖ్యంగా అరుగుదల,నోరు,ఫుడ్‌ పైప్‌, కడుపు నొప్పి, పెద్ద పేగులో ఇబ్బందులు రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం మరియు పూర్తి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడడం లాంటివి వస్తున్నాయి. గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ కారణంగా వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలకు కూడా దారి తీస్తుంది.
వినబడక పోవడం
కొంతమందిలో వినబడడం లేదట. కొంత మందికి అసలు వినబడకపోవడం మరికొందరిలో కొద్దిగా మాత్రమే వినపడడం లాంటి సమస్యలు వస్తున్నాయి. కరోనా వైరస్‌ సోకిన మొదటి వారంలో ఈలక్ష ణాలు చూడొచ్చు. ఆతర్వాత ఇన్ఫెక్షన్ని బట్టి ఈ సమస్య ఎదురవుతోంది. ఇలా ఈ లక్షణాలు కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
చాలా నీరసంగా ఉండడం
కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో నీరసం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. అదే విధంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, అలసటగా అనిపించడం, నీరసంగా అనిపించడం లాంటివి కనబడుతున్నాయి. ఇవి కూడా కరోనా వైరస్‌ సోకినట్లు లక్షణాలు అని గుర్తించాలి.
కళ్లు ఎర్రబడటం
కరోనా వైరస్‌ సోకిన వాళ్లలో కళ్లు ఎర్రబడటం, వాపు ఉండడం లాంటి లక్షణాలు కూడా కనబడు తున్నాయి. కళ్ళు దురద పెట్టడం, ఎర్రగా అయి పోవడం, కళ్ళల్లో నుండి నీరు కారడం లాంటివి కూడా కరోనా లక్షణాలు అంటున్నారు. అయితే ఈ రెండిటికీ మధ్య కనెక్షన్‌ ఏమిటి అనేది చూస్తే… మామూలుగా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి గాలి ద్వారాకానీ డ్రాప్లెట్స్‌ద్వారాకానీ ఎవరైనా మాట్లా డినా,తుమ్మినా,దగ్గినావ్యాపిస్తుంది అని తెలుసు. అయితే ఇన్ఫెక్షన్‌ ఎవరికైనా సోకితే వాళ్ళు చేతులు కళ్ల మీద పెట్టుకోవడం వల్ల కంటి ఇన్ఫెక్షన్స్‌ కూడా వస్తాయని అదే విధంగా ముక్కు నోరు కూడా ఇన్ఫెక్ట్‌ అవుతాయని అంటున్నారు. కాబట్టి కళ్ళల్లో ఇరిటేషన్‌, ఐసెన్సిటివిటీ లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
నోరు ఆరిపోవడం
నోరు ఎక్కువగా ఆరి పోవడం లాంటివి కూడా కరోనా కి కొత్త లక్షణాలు అని చెప్తున్నారు. జీర్ణానికి నోరు సహాయ పడుతుంది అదే విధంగా పళ్ళు కూడా జీర్ణానికి అవసరం. అయితే ఒక వేళ కనుక సరైన సలైవా ప్రొడ్యూస్‌ అవ్వక పోతే అప్పుడు నోరు ఆరి పోతుంది దీని కారణంగా పంటి సమస్యలు మరియు దంతాల సమస్యలు వస్తాయి.
కరోనా వైరస్‌ సోకిన వాళ్ళకి నోరు ఆరి పోవడం కూడా కొత్త లక్షణంగా గుర్తించారు. అది మ్యూకస్‌ లైనింగ్‌ ఏర్పాటు చేస్తుంది దీని కారణంగా ఇది ప్రొడ్యూస్‌ అవ్వదు దీంతో నోరు ఆరిపోతు ఉం టుంది. గొంతు కూడా ఆరిపోయినట్లు ఉంటుంది కాబట్టి కరోనాకి ఇవి కూడా కొత్త లక్షణాలను గుర్తించాలి.కరోనా వైరస్‌ సోకిన వాళ్ళల్లో డయేరియా సమస్య కూడా వేధిస్తోంది. ఇది ఒకటి నుంచి 14రోజుల వరకు ఉంటుంది. అజీర్తి సమ స్యల కారణంగా డయేరియా సమస్య కూడా రావచ్చు. కాబట్టి కరోనా పాజిటివ్‌ వచ్చిన వాళ్ళల్లో డయేరియా వస్తుంది గుర్తించండి.
తల నొప్పి
తలనొప్పి కూడా కరోనా వైరస్‌ వచ్చినట్టు లక్షణం. మామూలుగా వచ్చే తల నొప్పి కంటే ఇది ఎక్కువ సేపు ఉంటుంది. కరోనా వైరస్‌ వచ్చిన వాళ్లకి తల నొప్పి కూడా తీవ్రంగా వేధిస్తున్నట్లు గుర్తిం చారు. కరోనా వైరస్‌ వచ్చిన వాళ్లకి చర్మ సమస్యలు కూడా ఉంటున్నట్లు గుర్తించారు.
యువతనూ వదలట్లే
మంచి ఆరోగ్యంతో ఉన్నవారు,యువకులకూ కరోనా సోకడం సెకండ్‌ వేవ్‌ లో ఎక్కువగా జరుగుతోంది. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారినీ కరోనా వదలట్లేదని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి అందరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. కొత్త మ్యూటెంట్ల మీద వ్యాక్సిన్‌లు అంతగా పని చేయక పోవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయినా సరే టీకా వేయించుకోవాలని డాక్టర్లు సూచి స్తున్నారు. దీని వల్ల వైరల్‌ లోడ్‌ తగ్గడంతో పాటు ఇన్ఫెక్షన్‌ బారిన పడకుండా ఉండొచ్చని చెబుతు న్నారు. దీంతోపాటు మాస్కులను కట్టుకుంటూ.. చేతులను, ముట్టుకున్న వస్తువులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకుంటూ ఉండాలని సలహాలు ఇస్తున్నారు.
పాలకుల అస్త్రసన్యాసం – ప్రజలకు ప్రాణసంకటం
దేశవ్యాప్తంగా కోవిడ్‌ రెండో దశ వ్యాప్తి గురించి ఆందోళనకరమైన వార్తలు వినపడుతున్నాయి. ఆదివారం ప్రధాన పత్రికలన్నీ కనీసం నాలుగు పేజీలకు తక్కువగాకుండా కోవిడ్‌ వ్యాప్తి గురించిన వార్తలు ప్రచురించాయి. శనివారం సాయంత్రం ప్రధాని జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య అవసరాలకు వినియోగించే ఆక్సిజన్‌ ఉత్పత్తి, సరఫరా గురించి సమీక్షించినట్టు టీవీలు వార్త ప్రసారం చేశాయి. గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లో ప్రధాన కార్పొరేట్‌ ఆస్పత్రులు తమవద్ద ఉన్న ఆక్సిజన్‌ నిల్వలు కరిగిపోయాయనీ, రోగులు వేరే ఆస్పత్రుల్లో భర్తీ కావాలని హెచ్చరిస్తున్నాయి. తాజాగా ఢల్లీి రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రుల్లో తగినంత ఆక్సిజన్‌ లేనందున అత్యవసర లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు రాజస్థాన్‌ ప్రభుత్వంకూడా 15రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌లలో రాష్ట్ర ప్రభుత్వాలు కోవిద్‌ నియంత్రణ విషయంలో ఘోరంగా విఫలమయ్యాయని ఆయా రాష్ట్ర హైకోర్టులు చివాట్లుపెట్టాయి. కోవిడ్‌ కారణంగా ఎంతమంది చనిపోతున్నారో వివరాలు కూడా ఇవ్వకుండా మూకుమ్మడి దహన సంస్కారాలు స్వయంగా ప్రధాని ప్రాతినిధ్యం వహించే వారణాసితో సహా ఉత్తరప్రదేశ్‌ అంతటా నిత్యకృత్యంగా మారాయి. స్మశానాల్లో శవాలు కాల్చే స్థలం లేక వచ్చిన శవాలను కుప్పలు పోసి కాలుస్తున్న వీడియోలు వాట్సాప్‌లో వైరల్‌ అవుతున్నాయి. అయినా గత ఏడాది ఇదే సమయంలో రోజువారీ విలేకరుల సమావేశాలు నిర్వహించిన కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇప్పుడేమి చేస్తుందో ఎవ్వరికీ అంతుచిక్కటం లేదు. పోయిన ఏడాది కనీసం వందకుపైగా జీఓలు, సర్కులర్‌లు జారీ చేసిన కేంద్ర హౌంశాఖ చేష్టలుడిగి చూస్తోంది. ప్రధానంగా దేశంలో వాక్సిన్‌ కొరతకు మూడు కారణాలున్నాయి. గతంలోనే ఫైజర్‌, స్పుత్నిక్‌లు తమ వాక్సిన్‌ భారతదేశంలో సరఫరా చేయటానికి వీలుగా అత్యవసర అనుమతులు కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాయి. కానీ అప్పటికే భారత్‌ బయోటెక్‌తో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్న కేంద్రం దేశంలోకి మరే ఇతర వాక్సిన్‌ దిగుమతి కానీయకుండా అడ్డుకుంది. ఇది మొదటి కారణం. కేంద్రం రూపొందించిన వ్యాక్సిన్‌ పంపిణీ ప్రణాళిక రెండో కారణం. ఈ ప్రణాళికకు మూడు లక్ష్యాలున్నాయి. మొదటిది దేశంలో కోవిడ్‌ నియంత్రణ, రెండోది విదేశాలకు ఎగుమతి. ఈ రెండూ మౌలిక లక్ష్యాలు. ఈ రెండిరటి పర్యవసానంగా విదేశాలకు వ్యాక్సిన్‌ అవసరాలు తీర్చటం ద్వారా దౌత్య సంబంధాల్లో పై చేయి సాధించాలన్నది మూడో లక్ష్యంగా ఉంది. సోకాల్డ్‌ సంపన్న దేశాలు దీనికి భిన్నంగా ఏకైక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. అమెరికా, రష్యాలు ముందుగా తమ దేశంలోని పౌరులందరికీ కావల్సినంత వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో వ్యవహరించాయి. మచ్చుకు ఓ ఉదాహరణ. దేశంలో జరుగుతున్న రైతు ఉద్యమానికి కెనడా ప్రధాని, పార్లమెంట్‌ మద్దతు ప్రకటించాయి. నాలుగు నెల్ల తర్వాత భారతదేశం నుంచి కోవ్యాక్సిన్‌ దిగుమతి చేసుకున్న కెనడా ప్రభుత్వం రైతు ఉద్యమం పట్ల తన వైఖరిని మార్చుకుంది. దీన్నే దౌత్య విజయంగా బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తూ సంబరం చేసుకున్నాయి. విదేశాల్లో అమ్ముకోవటానికి భారత్‌ బయోటెక్‌కు అనుమతించేందుకు వీలుగా దేశంలో వ్యాక్సిన్‌ వితరణ కార్యక్రమాన్ని దశలవారీ కార్యక్రమంగా మార్చారు. తొలుత మొదటి డోసుకు, రెండో డోసుకు మధ్య మూడు వారాల వ్యవధి అని నిర్ణయించారు. కానీ కావల్సినంత వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోవటంతో ఈ వ్యవధికి పెంచారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత యువశక్తి కలలిగిన దేశమని గొప్పలు చెప్పుకుంటూనే దేశంలో యువతకు వ్యాక్సిన్‌ అందించే విషయంలో ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. వ్యాక్సిన్‌ కొరత ఏ స్థాయిలో ఉందంటే ఒక్క శనివారం నాడు తెలంగాణలో లక్షన్నర డోసుల అవసరం ఉంటే కేవలం ఐదువేల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, అందువలన వ్యాక్సిన్‌ వితరణ కార్యక్రమాన్ని నిలిపి వేస్తున్నట్లు తెలంగాణ వైద్యశాఖాధికారులు ప్రకటించారు. మార్చి 24 నాటికి భారతదేశం విదేశాలకు ఆరు కోట్ల డోసులు ఎగుమతి చేస్తే స్వదేశంలో ప్రజలకు ఇచ్చింది మాత్రం ఐదు కోట్ల డోసులే. అంటే దేశంలో ప్రజల ప్రాణరక్షణ కంటటే విదేశీ వ్యాపారమే ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత కలిగిన పనైంది. కూతవేటు దూరంలో వ్యాక్సిన్‌ తయారవుతున్న తెలంగాణ పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన రాష్ట్రాల దుస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దేశ ప్రజల ప్రాణ రక్షణ కంటే విదేశాల్లో మోడీ ఫ్లెక్సీలు కట్టించుకోవటానికి వ్యాక్సిన్‌ ఎగుమతి చేసిన ఫలితమే నేడు దేశంలో వ్యాక్సిన్‌ కొరత ప్రదాదకర స్థాయికి చేరింది. చివరి కారణం వ్యాక్సిన్‌ తయారీ పూర్తిగా ప్రైయివేటు రంగానికి వదిలేయటం. దేశంలో వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాలు నాలుగు. చెన్నైలోని కింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చ్‌, బీసీజీ వ్యాక్సిన్‌ లాబ్‌లు, కసౌలిలోని సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, కూనూర్‌లోని పాశ్చర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా. కేంద్రం అనుసరిస్తూ వచ్చిన ప్రయివేటీకరణ విధానాలతో ఈ సంస్థలు మూతపడ్డాయి. 2012లో ప్రజా ప్రయోజన వాజ్యం ద్వారా మూడు సంస్థలు పున్ణప్రా రంభించినా వాటిని పని చేయించటానికి కావల్సినన్ని నిధులు కేంద్రం సమకూర్చక పోవటంతో కుదేలయ్యాయి. కానీ కోవాక్సిన్‌ తయారు చేయటానికి ప్రయివేటు సంస్థలకు వేల కోట్ల రూపాయలు వివిధ మార్గాల్లో సమకూర్చిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వ్యాక్సిన్‌ తయారీ వంటి ప్రాణరక్షణ సేవలను సైతం ప్రయివేటీకరించటం నేటి వ్యాక్సిన్‌ కొరతకు మూడో కారణం. ఇక ఆక్సిజన్‌ కొరత గురించి. కేంద్రం శాసనసభ ఎన్నికల పర్వంలోనో పాండిచ్చేరి ప్రభుత్వాన్ని కూల్చే పనిలోనో లేక గత పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు తనవంతు సహకారాన్ని అందించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్‌ అరోరాను గోవా గవర్నర్‌గా నియించే పనిలోనో తీరుబడిలేనంతగా తలమునకలై ఉంది. దాంతో దేశాన్ని చట్టుముడుతున్న కోవిడ్‌ రెండో ఉప్పెన ప్రభుత్వం కంటికి కనిపించలేదు. కేవలం 150కోట్ల రూపాయల ఖర్చయ్యే ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌ నిర్మాణానికి కావల్సిన టెండర్లు పిలవటానికి అమాత్యులు ఆర్నెల్ల పాటు ఫైలు నడిపారంటే ఇక్కడ ప్లాంట్‌ నిర్మాణం లక్ష్యం ఏమిటో అర్థమవుతుంది. మార్చి 24, 2020న ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటిస్తూ దేశాన్ని లాక్డౌన్‌లోకి నెట్టిన కేంద్రం గత సంవత్సరం అక్టోబరు 21వరకూ కోవిడ్‌ చికిత్సకు కీలకమైన ఆక్సిజన్‌ సరఫరా మీద దృష్టి పెట్టలేదు. టెండర్లు ప్రకటించిన తర్వాత కూడా కాంట్రాక్టు ఖరారు చేసి ప్లాంట్‌ నిర్మాణం మొదలు పెట్టలేదు. ఈ వైఫల్యాలన్నీ కప్పిపెట్టుకోవటానికి ఓ వంద ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లకు అనుమతిస్తున్నట్టు ప్రధాని గత వారం ప్రకటించారు. గత ఏడాదే దేశంలో వైద్య సేవలకుపయోగించే ఆక్సిజన్‌ తయారీ కొరతను గమనించిన ప్రభుత్వం రెండో ఉప్పెన సమయానికి కూడా తగినంత ఆక్సిజన్‌ నిల్వలు సిద్ధం చేసుకనేందుకు ప్రయత్నం చేయకపోవటం క్షమించరాని నిర్లక్ష్యం. కోవిడ్‌ నియంత్రణలో పాలకుల అస్త్ర సన్యాసం కారణంగా భారతదేశం కోవిడ్‌ నియంత్రణలో ఘోరంగా విఫలం కావటం ఓవైపు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తుంటే మరోవైపున ప్రజలకు ప్రాణగండంగా మారింది.- సైమన్‌ గునపర్తి

1 2