బ్లాక్‌ ఫంగస్‌ అంటే ఏమిటీ?

ఒకపక్క కోవిడ్‌ భయపెడుతుంట్టే… కొన్నాళ్లుగా బ్లాక్‌ ఫంగస్‌ మరీ ఆందోళన కలిగిస్తోంది. అసలు బ్లాక్‌ ఫంగస్‌ అంటే ఏమిటి? ఇది ఎందుకు సోకుతుంది? దీని పట్ల తీసు కోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇత్యాది విషయాలపై ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ రమణయ్య అందించిన సమాచారం మన పాఠకుల అవగాహన పెంచటానికి ఈ సమాచారం ఉపయోగపడు తుందని ఆశిస్తున్నాం. – ఎడిటర్

బ్లాక్‌ ఫంగస్‌ కోవిడ్‌ కంటే ప్రమాదకరమైనదని, కోవిడ్‌ వచ్చిన వారికందరికి బ్లాక్‌ ఫంగస్‌ వస్తుందని, దీనికి వైద్యం లేదని విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవం కాదు. నిజానికి ఎప్పటి నుంచో ఉన్న జబ్బు. ఎక్కువ కాలం నిల్వ ఉంచిన కూరగాయలు,బ్రెడ్‌లు చెడిపోయి బూజు పట్టినట్టుగా కనిపించడం ఈ ఫంగస్‌ వల్లనే. కోవిడ్‌ రోగులకు ఎక్కువగా వస్తుండడంతో కోవిడ్‌ వ్యాధికి వచ్చినంత ప్రచారం దీనికి కూడా వచ్చి కోవిడ్‌ కంటే ఎక్కువగా భయపెడు తుంది. ఆ పేరు ఎలా వచ్చింది?

బ్లాక్‌ ఫంగస్‌ …శాస్త్రీయ నామం మ్యూకార్‌ మైకోసిస్‌. నిజానికి ఇది నల్ల రంగులో ఉండదు. ఈ ఫంగస్‌ సోకిన కణజాలం రక్తప్రసరణ సరిగా అందక నల్లగా మారిపోతుంది. కాబట్టి దీనిని బ్లాక్‌ ఫంగస్‌ అని పిలుస్తున్నాం.

అంత భయపడాల్సిన అవసరం ఉదా?
మధుమేహ వ్యాధి అదుపులో లేకుండా ఉండి కరోనా పీడితులైన వారికి బ్లాక్‌ ఫంగస్‌ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ స్టిరాయిడ్స్‌ వాడేవారికి ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. కరోనా బాధితుల్లో 10 నుంచి 15 శాతానికి మించి మధుమేహ వ్యాధిగ్రస్తుల ఉండరు. వీరందరికీ బ్లాక్‌ ఫంగస్‌ రావాలని లేదు. వెయ్యి మందిలో ఒక్కరికి బ్లాక్‌ ఫంగస్‌ రావొచ్చు. బ్లాక్‌ ఫంగస్‌ గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. షుగర్‌ని అదుపులో ఉంచుకుంటే గురించి భయపడాల్సిన పనిలేదు. అయితే బ్లాక్‌ ఫంగస్‌ కేసుల్లో 50 శాతం మరణాల రేటు ఉంది. అంటే ఈ వ్యాధి సోకిన వారిలో దాదాపు సగం మంది మరణిస్తున్నారు. మూడోవంతు మంది కంటిచూపు కోల్పోతున్నారు. ముందుగానే గుర్తించి యాంటీఫంగల్‌ వైద్యం అందిస్తే బాధితుల ప్రాణాలను కాపాడవచ్చు.

ఎంత మందికి సోకింది?
కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం… దేశంలో మే 22 నాటికి 9000 మందికి సోకింది. 212 మంది ప్రాణాలను హరించింది. ఈ కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రం గుజరాత్‌. గుజరాత్‌లో 2281 మందికి, మహారాష్ట్రలో 2000 మందికి, ఆంధ్రప్రదేశ్‌లో 910 మందికి ఇది సోకింది. దేశంలో నమోదైన కేసుల్లో 58 శాతం కేసులు ఈ మూడు రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

ఎలా ప్రవేశిస్తుంది?
ఈ ఫంగస్‌ స్పోరులు గాలిలో ఉంటాయి. మన శరీరంలోకి ఏ మార్గం ద్వారా అయినా ప్రవే శించవచ్చు. చర్మం మీద కూడా వాలచ్చు. ఈ స్పోరులు గాలిలో ఉంటాయి కాబట్టి మనం గాలి పీల్చుకున్నప్పుడు ఆగాలి ద్వారా ముక్కు లోకి ప్రవేశించి, ముక్కు దగ్గరలో ఉన్న సైనస్‌ల లోనికి, కళ్ళకి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. కొన్ని సందర్భాల్లో జీర్ణవ్యవస్థలోకి, ఊపిరి తిత్తుల్లోకి,మెదడుకు కూడా పాకవచ్చు.

ఎవరికి ఎక్కువగా సోకుతుంది?
ఎక్కువ కాలం మధుమేహ వ్యాధి ఉండి ఈ వ్యాధి అదుపులో లేకుండా ఉన్నటువంటి వారికి,కీళ్ల నొప్పులు,ఆస్తమా లాంటి మొండి దీర్ఘకాలిక జబ్బులకు ఎక్కువ కాలం పాటు స్టిరాయిడ్స్‌ వాడుతున్నటువంటి వారికి, ఊపిరి ఆడక దీర్ఘకాలం వెంటిలేటర్‌ సహాయంతో వైద్యం చేస్తున్న వారికి, అవయవ మార్పిడి చేయించుకున్న వారికి, క్యాన్సర్‌ రోగులకు, ఎయి డ్స్‌ రోగులకు ఎక్కువగా సోకే అవకాశం ఉంది.

వ్యాధి లక్షణాలు ఏమిటి?
విపరీతమైన తలనొప్పి,దవడ నొప్పి,కళ్ళు ఎర్రబారడం,కళ్ళు,ముక్కు దగ్గర చర్మం వాచి ఎర్రబడడం,చూపు మందగించడం,రెండు ప్రతిబింబాలు కనిపించడం,ముఖం నొప్పిగా ఉండడం,ఎక్కువ సందర్భాల్లో ఒక వైపు తల నొప్పి ఉండటం.. దగ్గినప్పుడు,తుమ్మినప్పుడు ముదురు రంగు ద్రవం పడడం,శ్వాస పీల్చు కోవడంలో ఇబ్బందిగా ఉండడం,పళ్ళు వదులు కావడం …ఇలా అనేక లక్షణాలు ఉండవచ్చు. అందరికీ అన్ని లక్షణాలూ ఉండనవసరం లేదు. కొద్ది మందికి కొన్ని ఉంటాయి. మరి కొద్ది మందికి కొన్ని ఉండవు. కోవిడ్‌ వ్యాధి నుంచి కోలుకుంటున్న దశలో ఈ లక్షణాల్లో కొన్ని ఉన్నా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

చికిత్స ఎలా?
కోవిడ్‌ వైద్యం లాగానే బ్లాక్‌ ఫంగస్‌ వైద్యం కూడా చాలా ప్రియం అయిపోయింది. దీని కోసం వాడే ఆంపోటెరిసిన్‌ సూది మందు అంత సులభంగా దొరకడం లేదు. దరిదాపుగా 20 సూదులు వేయాలి. ఒక్క సూది ఖరీదు సుమారుగా ఐదు వేల రూపాయలు. నల్ల బజారులో దీని విలువ చెప్పనక్కర్లేదు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఈ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చింది కాబట్టి పేదవారికి కొంత ఊరట కలిగింది.
ఈ ఫంగస్‌ సోకకుండా ఏం చేయాలి?
ా కొవిడ్‌ సోకినప్పుడు స్టిరాయిడ్లు వాడవలసిన అవసరం వస్తే వైద్యుని సలహా ప్రకారం సరైన మోతాదులో, పరిమిత కాలం పాటు వాడాలి.
ా కోవిడ్‌ వైద్యం కోసం స్టిరాయిడ్స్‌ వాడినా, వాడకపోయినా చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవాలి.
ా బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిపై అవగాహన పెంచుకుని ఆ లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచి బ్లాక్‌ ఫంగస్‌ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించుకోవాలి.
ా సరైన సమయంలో, యాంటీ ఫంగల్స్‌, యాంటీ బయాటిక్స్‌ని విచక్షణతో వాడుకోవాలి.
ా ఆక్సిజన్‌ థెరపీలో ఉపయోగించే హ్యుమిడిఫయర్లలో శుభ్రమైన స్టెరైల్‌ నీటిని వాడుకోవాలి. ఇంటి దగ్గరే ఆక్సిజన్‌ కాన్సెంట్రేటరని ఉపయోగిస్తున్నప్పుడు, స్టెరైల్‌ నీరు దొరకనప్పుడు కనీసం కాచి చల్లార్చిన నీరు వాడాలి.
ా కొవిడ్‌ వ్యాధి ఉన్నప్పుడు, కోవిడ్‌ నుంచి కోలుకున్న తరువాత కనీసం ఒక నెల వరకు మరీ ముఖ్యంగా మధుమేహులు, క్రమం తప్పకుండా, తరచుగా చక్కెర స్థాయిని పరీక్షించుకుంటూ మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి.
ా మధుమేహ వ్యాధిగ్రస్తులు అందరూ మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి.
ా కోవిడ్‌ వ్యాధిగ్రస్తులకు గతంలో మధుమేహం లేకపోయినా కోవిడ్‌ నుంచి కోలుకున్న తరువాత రక్తపరీక్ష చేయించుకొని కొత్తగా మధుమేహ వ్యాధి వచ్చిందేమో చూసుకోవాలి. కోవిడ్‌ అనంతరం ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
ా మధుమేహం ఉండి,కోవిడ్‌ వ్యాధి సోకి హౌమ్‌ ఐసోలేషన్లో ఉండేవారు పల్స్‌ ఆక్సీ మీటర్‌తో పాటు రక్తంలోని చక్కెర శాతాన్ని పరీక్షించుకోవడానికి గ్లూకోమీటర్‌ని కూడా దగ్గర ఉంచుకోవాలి. చక్కెర మోతాదును బట్టి వైద్యుని సలహాలతో మందుల మోతాదును సరి చూసుకుంటూ ఉండాలి.
ా కోవిడ్‌ వ్యాధిగ్రస్తులు రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవాలి. వారి టూత్‌ బ్రష్‌ను వేరెవరి బ్రష్‌తో కలవకుండా ప్రత్యేకంగా ఉంచుకోవాలి.
ా కోవిడ్‌ వ్యాధిగ్రస్తులు వ్యాధి లక్షణాలు తగ్గిన 14 రోజుల తర్వాత గాని కోవిడ్‌ టెస్ట్‌ నెగెటివ్‌ వచ్చిన తర్వాత గాని అప్పటివరకు వాడుతున్న బ్రష్‌ను మార్చుకోవాలి.
ా ఒకే మాస్కుని ఉతకకుండా రోజుల తరబడి ధరిస్తే బ్లాక్‌ఫంగస్‌ వచ్చే అవకాశముంది. మాస్కును శుభ్రంగా ఉతికిన తర్వాతే ధరించాలి. అటు వెంటిలేషన్‌ సరిగ్గా లేని ఇళ్లలో ఉండే వారికీ ఈ వ్యాధి సోకే ప్రమాదముంది
ా కరోనా లాగా ఇది అంటుకునే వ్యాధి కాదు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి వచ్చే సాధారణమైన జబ్బు. కాకపోతే మనదేశంలో షుగరు వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉండటం, కోవిడ్‌ కేసులు ఎక్కువగా ఉండడం కారణంగా దీని గురించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు.
అరుదుగా వచ్చే ఈ మ్యూకోర్‌మైకోసిస్‌ ఇన్ఫెక్షన్‌ సోకిన వారిలో 50శాతం మంది మరణి స్తున్నారు. ఇన్పెక్షన్‌ సోకిన కంటిని తొలగించడం ద్వారా కొంత మంది మాత్రం ప్రాణాలతో బయటపడుతున్నారు.కానీ, ఇటీవల కాలంలో కోవిడ్‌ బారిన పడినవారు, కోవిడ్‌ బారిన పడి కోలుకుంటున్న కొన్ని వేల మందిలో ఈ ఇన్ఫెక్షన్‌ కనిపిస్తోంది. తీవ్ర లక్షణాలతో కోవిడ్‌ బారిన పడినవారికి చికిత్సలో భాగంగా ఇచ్చిన స్టెరాయిడ్ల కారణంగా ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకుతోందని డాక్టర్లు అంటున్నారు.. కోవిడ్‌ నుంచి కోలుకున్న 12-18 రోజుల్లో ఈ ఇన్ఫెక్షన్‌ సోకుతోందని డాక్టర్లు చెప్పారు. నమోదయిన కేసుల్లో సగం మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల నుంచే ఉన్నాయి. కనీసం 15రాష్ట్రాల్లో 800 నుంచి 900 మధ్య కేసులు నమోదయ్యాయి.ఈ కేసులు పెరుగుతుండటంతో ఈ ఇన్ఫెక్షన్‌ ను మహమ్మారిగా ప్రకటించమని కేంద్ర ఆరోగ్య శాఖ 29 రాష్ట్రాలను కోరింది. ఈ ఇన్ఫెక్షన్‌ బారిన పడే వారికి చికిత్స చేసేందుకు కొత్తగా తెరిచిన ఆసుపత్రుల్లో వార్డులు కూడా వేగంగా నిండిపోతున్నాయని వైద్యులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో ‘‘బ్లాక్‌ ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌, కోవిడ్‌ 19 కంటే కూడా పెద్ద సవాలుగా మారింది. ఈ ఇన్ఫెక్షన్‌ సోకిన రోగులకు సమయానికి చికిత్స చేయకపోతే, మరణాల రేటు 94 శాతానికి పెరిగే ప్రమాదం ఉంది. మ్యూకోర్‌మైకోసిస్‌ సోకిన రోగులకు ప్రతి రోజూ 8 వారాల వరకు ‘యాంఫోటెరిసిన్‌-బీ’ యాంటీ ఫంగల్‌ ఇంజక్షన్‌ ఇవ్వాలని డాక్టర్లు చెబుతున్నారు. ఈ మందులు సాధారణ యాంఫోటెరిసిన్‌-బీ డీఆక్సీకోలేట్‌, లైపోసోమల్‌ ఆంఫోటెరిసిన్‌ అనే రెండు రూపాల్లో లభిస్తున్నాయి.

మ్యూకోర్‌మైకోసిస్‌ అంటే ఏంటి?
మ్యూకోర్‌మైకోసిస్‌ అరుదుగా వచ్చే ఇన్ఫెక్షన్‌. ఇది సాధారణంగా మట్టిలో,మొక్కల్లో,ఎరువులో, కుళ్లి పోయిన పళ్ళు,కాయగూరల్లో ఉండే మ్యూకర్‌ అనే ఫంగస్‌వల్ల వ్యాపిస్తుంది.‘‘ఇది అన్ని చోట్లా ఉంటుంది. గాలిలో,మట్టిలో మాత్రమే కాకుండా ఆరోగ్యకరంగా ఉండే వారి ముక్కులో కూడా ఉంటుంది’’ అని డాక్టర్‌ అక్షయ్‌ నాయర్‌ చెప్పారు. ఇది సైనస్‌,మెదడు,ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్‌ ఉన్నవారికి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి, ముఖ్యంగా కేన్సర్‌,హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌లాంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి.

లక్షణాలివే..వీరికి పొంచి ఉన్న అధిక ముప్పు
దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతితో అల్లాడు తుండగానే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల ముప్పు భయ పెడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, మరణాలు చోటుచేసు కుంటుండగా కొత్తగా వైట్‌ ఫంగస్‌ వెలుగులోకి రావడం కలవరానికి గురిచేస్తోంది. బిహార్‌లో నాలుగు వైట్‌ ఫంగస్‌ కేసులు బయటపడ్డాయి. పట్నా మెడికల్‌ కాలేజీలో నలుగురిలో వైట్‌ ఫంగస్‌ గుర్తించారు. బ్లాక్‌ ఫంగస్‌ కంటే ఇది మరింత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరి స్తున్నారు. వైట్‌ ఫంగస్‌ ఉన్న నలుగురికీ కరోనా నిర్దారణ కాకపోయినా.. కోవిడ్‌ లక్షణాలు మాత్రం గుర్తించారు. పట్నా మెడికల్‌ కాలేజీ మైక్రోబయాలజీ విభాగం చీఫ్‌ డాక్టర్‌ ఎస్‌ఎన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. నాలుగు వైట్‌ ఫంగస్‌ కేసులు గుర్తించినట్టు తెలిపారు. ఈ నలుగురు రోగుల్లో కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించి నప్పటికీ పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చిందన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని ఆయన వెల్లడిరచారు. నలుగురు రోగుల పరిస్థితి నిలకడగా ఉందని, యాంటీ ఫంగల్‌ ఔషధాలను వినియోగిస్తున్నామని తెలిపారు. ఆక్సిజన్‌ పరికరాలు, వెంటిలేటర్లను తరుచూ శుభ్రం చేయాలని సూచించారు. బ్లాక్‌ ఫంగస్‌ కంటే వైట్‌ ఫంగస్‌ చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఊపిరితిత్తులపైనే కాకుండా గోళ్లు,చర్మం, పొట్ట,కిడ్నీలు,మెదడు,మర్మాంగాలు,నోరు భాగా లపై కూడా ప్రభావం చూపుతుందని చెబు తున్నారు. కరోనా వైరస్‌ బారినపడిప్పుడు కన బడుతున్న లక్షణాలే ఈఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకి నప్పడు కూడా కనబడుతున్నట్టు వైద్యులు తెలిపారు. ఇదిఊపిరితిత్తులపై దాడి చేస్తుందని, నRజు (హెచ్‌ఆర్‌సీటీ) టెస్ట్‌ చేయడం ద్వారా దీన్ని గుర్తించవచ్చని చెబుతున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన మాదిరిగానే రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారికి ఎక్కువగా సోకే అవకాశం ఉందని, డయాబెటిస్‌, స్టెరాయిడ్స్‌ ఎక్కువగా వాడటంవల్ల వైట్‌ ఫంగస్‌ సోకే అవకాశం ఉందని చెబుతున్నారు. వైట్‌ ఫంగస్‌ రోగుల ఊపిరితిత్తులను నేరుగా ప్రభావితం చేస్తుంది. వైద్యులు ప్రకారం.. క్యాన్సర్‌ రోగులు వైట్‌ ఫంగస్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వైట్‌ ఫంగస్‌ పిల్లలు,మహిళలకు కూడా సోకుతుంది. ఇది ల్యూకోరోయాకు ప్రధాన కారణం.

ఈ జాగ్రత్తలు తీసుకోండి
మన చుట్టూ ఉన్న గాలిలో… లెక్కలేనన్ని వైరస్‌లు,బ్యాక్టీరియాలు,ఫంగస్‌లు ఉంటున్నాయి. మనలో ఇమ్యూనిటీ వాటిని అడ్డుకుంటోంది. ఒక్కసారి ఆఇమ్యూనిటీ పోతే…ఇక వైరస్‌లు, ఫంగస్‌లకు గేట్లు తెరిచినట్లే. సో…మన ఫస్ట్‌ ఫోకస్‌…ఇమ్యూనిటీపై ఉండాలి. ప్రతి రోజూ ఇమ్యూనిటీ పెంచుకోవాలనే ఆలోచనతోనే అన్నీ తినాలి. ఈరోజుల్లో కరోనా నుంచి తప్పించు కున్న చాలా మందికి బ్లాక్‌ ఫంగస్‌ (వీబషశీతీఎవషశీంఱం) పట్టుకుంటోంది. ముఖ్యంగా స్టెరాయిడ్లు వాడిన వారికి ఇది సోకుతోంది. డయాబెటిక్‌ పేషెంట్లలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి… వారికి ఇది ఎక్కువగా సోకుతోంది.పేరుకి తగినట్లుగానే ఈ బ్లాక్‌ ఫంగస్‌ అనేది… ఓరకమైన ఫంగస్‌ వల్ల వ్యాపిస్తుంది. దీన్నే సింపుల్‌ భాషలో బూజు అంటారు. ఇది గాలిలో ఎగిరేబూజు. ఇళ్లలో పరిశుభ్రంగా లేనిచోట… ఈ బూజు తిష్ట వేస్తుంది. ఎప్పుడు మనిషిని తినేద్దామా అని చూస్తుంది. ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయి నప్పుడు…సోకుతుంది. ఇది నోటి ద్వారా రాకుండా ఉండేందుకు… నోటి లోపల కూడా మనం క్లీన్‌ చేసుకోవాలి. టంగ్‌ క్లీనర్‌ వాడి.. నాలికపై ఉండే పాచిని పరిశుభ్రంగా క్లీన్‌ చేసుకోవాలి. ఇలా రోజుకురెండు సార్లైనా చేసుకుంటే…నోటి ద్వారా ఈ ఫంగస్‌ రాకుండా చాలా వరకూ అడ్డుకోవచ్చని డాక్టర్లు చెప్పారు. నోటి లోపల నల్లగా కనిపిస్తే… అది బ్లాక్‌ ఫంగస్‌ అని గుర్తించాలి. అలాగే… కళ్ల చుట్టూ నొప్పి వస్తూ ఉంటే… అది కూడా అదే అని గమనించాలి. అలాగే…ముక్కులోపల గాలి ఆడకుండా ఏదో అడ్డుకుంటున్నట్లు అనిపిస్తే… అది కూడా బ్లాక్‌ ఫంగస్‌ కావచ్చు. ముక్కు లోంచీ నల్లటి పదార్థం వస్తూ ఉంటే… జాగ్రత్త పడాలి. తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా నోటి ద్వారా ఈ ఫంగస్‌ లోపలికి వచ్చే అవకాశాలు ఎక్కువ. గుండె జబ్బు వచ్చిన వారు, డయాబెటిక్‌ పేషెంట్లు… కరోనా సోకినప్పుడు…వాడే స్టెరాయిట్లు, మందుల వల్ల నోటి లోపల రకరకాల బ్యాక్టీరియా పెరుగు తుంది. అలాంటి వారు రోజుకు 2 లేదా 3 సార్లు బ్రష్‌ చేసుకోవాలని డెంటిస్టులు చెబు తున్నారు. ఇలాంటి సమయంలో ఎక్కువ సార్లు దంతాలు శుభ్రం చేసుకుంటే…నోరంతా క్లీన్‌ అవుతూ…ఆ దరిద్రగొట్టు ఫంగస్‌ రాకుండా ఉంటుందని చెబుతున్నారు.డాక్టర్లు మరో సూచన కూడా చేశారు. కరోనా నెగెటివ్‌ వచ్చాక… పాత టూత్‌ బ్రష్‌ పారేసి…కొత్త టూత్‌ బ్రష్‌ కొనుక్కోమని చెబుతున్నారు. అలాగే…రోజులో వీలైనన్ని ఎక్కువ సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోమని సూచిస్తున్నారు. తద్వారా ఫంగస్‌ సోకేందుకు రెడీ అయితే… సబ్బుతో క్లీన్‌ చేసుకోవడం ద్వారా అది పోతుందన్నమాట.కరోనా నుంచి రికవరీ అయిన వారు… తమ టూత్‌ బ్రష్‌,టూత్‌ పేస్టులను కొన్నాళ్లపాటూ…మిగతా కుటుంబ సభ్యుల బ్రష్‌లు,పేస్టులతో కలిపి ఉంచకూడదు. తద్వారా వారికి కుటుంబ సభ్యులకు ఎలాంటి హానీ జరగకుండా ఉంటుందని చెబుతున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా నోటిని మాత్రం వీలైనంతగా శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు.

ఇవి ఎక్కువగా తినండి
చేపలు కంటికి మేలు చేస్తాయి. ముఖ్యంగా సముద్ర చేపలైతే ఇంకా మంచిది. మరి మనకు సముద్ర చేపలు దొరకకపోతే… కొవ్వు పట్టి బాగా లావుగా ఉన్న చేపలు కొని వండుకొని తింటే మంచిది. గుడ్లు రోజూ 3గుడ్ల దాకా తినవచ్చు. ఆకుకూరలు, పుల్లటి పండ్లు… కంటిని కాపాడుతాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్‌ ఎక్కువగా ఉంటాయి. పప్పులు, బద్దలు గింజలు వంటివి కంటికి మేలు చేస్తాయి. వీటిని ఎక్కువగా తినాలి. క్యారెట్లు వీటిని డైరెక్టుగా కొరికి తినవచ్చు లేదా జ్యూస్‌ చేసుకొని… పంచదార కలపకుండా తాగడం మేలు. కూర వండుకొని కూడా తినవచ్చు. డైరెక్టుగా తింటే… ఎక్కువ పోషకాలు కంటికి అందుతాయి.నారింజ, బత్తాయి, కమలా, పప్పర పనస వంటి పండ్లలో సి విటమిన్‌ ఫుల్లుగా ఉంటుంది. ఇది వ్యాధులు రానివ్వదు. ఫంగస్‌లు, బ్యాక్టీరియాలు దరిచేరకుండా ఆపేస్తుంది. బాదంపప్పులు, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్‌ వీటిలో… ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి కంటిని రక్షిస్తాయి.
సబ్జా గింజలను సూపర్‌ ఫుడ్‌ అంటారు. వీటిలో కూడా ఒమేగా 3 ఉంటుంది. కాబట్టి… ఓరూ.10 సబ్జా గింజలు కొని… రోజూ కొద్దిగా నానబెట్టి… ఓవారం పాటూ తాగితే మంచిదే. పొద్దు తిరుగుడు పువ్వు గింజలు సూపర్‌ మార్కెట్లలో లభిస్తాయి. వీటిలో విటమిన్‌ జు ఉంటుంది. ఇది కంటి చుట్టూ ఉండే చర్మాన్ని కాపాడుతుంది. రోజూ 15 మిల్లీ గ్రాములు వాడినా చాలు…కంటికి ఎంతో మేలు. ఇవి వాడటం వల్ల బ్లాక్‌ ఫంగస్‌ సోకే అవకాశాలు చాలా వరకూ తగ్గిపోతాయి. ఒకవేళ సోకినా… అది వెంటనే ముదిరి పోకుండా ఇవి బలంగా ఆపుతాయి. ఈలోగా డాక్టర్‌ని కలిసి…తగిన ట్రీట్‌మెంట్‌ తీసుకొని… ప్రాణాలను కాపాడుకోవచ్చు.
-డాక్టర్‌ రమణయ్య