విప్లవ సింహం…అల్లూరి సీతారామారాజు
మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురల వాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరా టానికి సిద్ధం చేయ్యసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు.
బ్రిటిష్ వారి నిరంకుశ పాలన నుండి భారతీయులకు దాస్యవిముక్తి కలిగించటానికి జీవన బలిదానం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు. సీతారామరాజు క్రీ.శ.1897లో జూలై 4వ తేదీన విశాఖ జిల్లాలోని పాండ్రంకి గ్రామంలో నారాయణమ్మ, వెంకట్రామరాజు దంపతులకు జన్మించాడు. 1909లో భీమవరంలో 6వ తరగతిని, కాకినాడ పి.ఆర్.కళాశాలలో 8వతరగతి, ఎ.వి.యస్. కళాశాలలో 9వ తరగతి పూర్తి చేశాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన సీతారామరాజు అనేక కష్టాలను చవిచూశాడు.పేదరికం అనుభవించాడు. పినతండ్రి పెంపకంలో కొంత వరకు విధ్యాభ్యాసం చేయగలిగాడు. వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిషం, వాస్తు, హఠయోగం వంటివి నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. అపారమైన దైవభక్తి కలిగిన సీతారామరాజు కొంతకాలం రామలింగేశ్వరస్వామి ఆలయంలో తపస్సు చేశాడు. సీతారామరాజు బాల్యం నుండి దేశభక్తి ఉత్తేజ పూరితమైన వాతావరణంపెరిగాడు. బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాలో ఇచ్చిన ఉపన్యాసంతో ప్రభావితుడైన సీతారామరాజు, విధ్యార్థి దశ పూర్తికాగానే దేశమంతటా పర్యటించి దేశ స్వాతంత్త్రోధ్యమ స్థితి గతులను తెలుసుకున్నాడు. ఆపర్యటనలోనే విశాపట్టణంలోని మన్యం ప్రజలు పడుతున్న కష్టాలు, బాధలు తెలుసుకుని వారికి అండగా నిలవాలని అనుకున్నాడు.
మన్యం ప్రజలు పూర్తిగా అడువులపై ఆధారపడి, వాటినుండి లభించే తేనె, సీకాయ, కట్టెలు మొదలైనవి పట్టణ ప్రజలకు ఇచ్చి వాటి బదులుగా తమకు కావలసినవి తెచ్చుకునేవారు. బ్రిటిష్ వారి పాలనలో ప్రభుత్వం అడవుల చట్టాన్ని ప్రవేశపెట్టినది. దీని ప్రకారం కొండజాతివారు కట్టెలను కొట్టకూడదు, పోడు వ్యవసాయం చేయరాదు. అంతే కాకుండా అనేక ఆంక్షలు ప్రవేశపెట్టినది. వారి పరిపాలన కార ణంగా అనేక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారు రౌలత్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం నిందితులను ఎటువంటి విచారణ చేయకుండా నిర్భంధించవచ్చును, శిక్షింపవచ్చును. దేశ రాజకీయ నాయకులందరూ దీనిని ప్రతిఘటించారు. సహాయనిరాకరణోధ్యమాన్ని ప్రారంభించారు. విధ్యార్థులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు.
ఇటువంటి ఉద్యమ పరిస్థితులలో సీతారామరాజు మన్య నాయకులైన గంటందొర, మల్లు దొరలతో సంభాషణలు జరిపాడు. సీతారామరాజు అనేక యుద్ధవిధ్యలలోను,ఆయుర్వేదంలో నైపుణ్యం కలవాడగుటచే, మన్యం ప్రజలు వీరిని అమితంగా గౌరవించేవారు. వివిధ గ్రామాల ప్రజలను సమావేశ పరచి వారికి అన్ని విద్యలు నేర్పించాడు. విలు విద్యలో నిపుణులుగా తయారుచేసి, కొండదళం తయారుచేసి, దానికి తానే స్వయంగా నాయకత్వం వహించాడు. కొండ ప్రజలకు అనేక యుద్దపద్ధతులు, గెరిల్లా విద్య మొదలైనవి నేర్పాడు. కొండజాతివారిని చైతన్య వంతులుగా చేయటం గమనించిన బ్రిటిష్ వారు రాజు కొంత కాలం దూర ప్రాంతంలో అధికారుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ ప్రవాశ శిక్ష నచ్చని సీతారామరాజు అక్కడినుండి తప్పించుకుని తిరిగి మన్యం చేరుకున్నాడు. 1922 ఆగస్టు 22వ తేదీన చింతపల్లి పోలీసు స్థేషన్ పై మెరుపుదాడి చేసి తూటాలను, కత్తులను, మందుగుండు సామాన్లను స్వాధీనం చేసుకున్నాడు. తరువాత కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి స్టేషన్లను కొల్లగొట్టి,జైల్లో మగ్గుతున్న వీరయ్యదొరను విడి పించాడు. ఈకొండదళం ఆచూకీ తెలుప వలసి నదిగా బ్రిటిష్ ప్రభుత్వం ప్రజ లను అనేక బాధలకు గురిచేసింది. చింతపల్లి, కృష్ణదేవి పేట, నర్సీపట్నం మధ్య ప్రభత్వం కల్పిం చిన టెలి ఫోన్ సౌకర్యాలను, స్తంభాలను ఈదళం ధ్వంసం చేసిం ది. పోలీసు లను ముప్పుతిప్పలు పెట్టే వారు, ఆహార ధాన్యాలను కొల్లగొట్టేవారు.విప్లవానికి వ్యతిరేకంగా పనిచేసే వారిని వీరు శిక్షించేవారు. ఈదళం వారిని పట్టి చ్చిన వారికి వెయ్యిరూ పాయల బహుమానం కూడా ప్రభుత్వం ప్రకటిం చింది. ఈ కొండదళం అనేక భీకర పోరులను సల్పింది. ఈ దళాన్ని ఏమీ చేయలేక ప్రభుత్వం సైన్యాన్ని తీసుకుని వచ్చింది. వారి సోధనలో మల్లుదొర పట్టుబడ్డాడు. సీతారామరాజు మన్యం ప్రజల గుండెలలో తిరుగులేని నాయకుడుగా నిలచిపో యాడని తెలుసుకుని బ్రిటిష్ వారు, సీతారామరాజు ఆచూకీకై మన్యం ప్రజలను అనేక చిత్రహింసలకు గురిచేసారు. వారి బాధలను చూడలేక సీతారామ రాజు, బ్రిటిష్ వారితో సంధి చేసుకునేందుకు స్వయంగా పాలకుల వద్దకు వెళ్ళాడు. తమ ఎదుట పడిన సీతారామరాజును బ్రిటిష్ వారు నిర్ధాక్ష్యింగా కాల్చిచంపారు. వారు తుపాకీ కాలుస్తున్నప్పటికీ బెదురు చెందక సీతారామరాజు, తన వంటి సీతా రామరాజులు వేలకొలది పుట్టుకొస్తారని, వారి బ్రిటిష్ వారిని భారతదేశం నుండి పారద్రోలుతారని నిర్భయంగా ప్రకటించాడు. వందేమాతరం అంటూ 1924 మే 7వ తేదీన సీతారామరాడు తుదిశ్వాస విడిచాడు. రామరాజు మరణంతో మన్యం ప్రజ లలో మరింత పట్టుదల పెరిగి, ఉద్యమాన్ని ఉధృతం చేశారు. బ్రిటిష్‌వారు నిరంకుశంగా కొండ దళం నాయకులందరినీ పట్టి చెరసాలలో వేశారు. సీతారామరాజు పూరించిన విప్లవశంఖం దేశ మంతటా సంచలనం కలిగించింది. కొండదళం నాయకుడుగా సీతారామ రాజు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయాడు.సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్య్రం సిద్దిస్తుందని నమ్మిన పోరాట యోధుడు. మహాత్మాగాంధి ఆంధ్రదేశంలో పర్య టించే సమయంలో అల్లూరిసీతారామరాజు అనేక విధాలుగా కొనియాడారు. సాయుధ పోరాటం పట్ల తనకు సదుద్ధేశ్యం లేదని, అయినప్పటికీ సీతా రామరాజు వంటి త్యాగశీలని, ధైర్యవంతుని కొని యాడకుండా ఉండలేమని చెప్పారు. తదనంతరం జరిగిన అనేక పోరాటాలకు ఆయన మార్గదర్శ కుడయ్యాడు.
విప్లవం రెండవదశ
డిసెంబర్ 6 న విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. జాన్ ఛార్సీ, మరికొందరు అధికారుల నాయకత్వంలో ప్రభుత్వ సైన్యానికి, రాజు సైన్యానికి పెదగడ్డపాలెం వరిచేలలో పోరా టం జరిగింది. ప్రభుత్వసేనలు శక్తివంతమైన శతఘ్నులను (ఫిరంగులను) ప్రయోగించాయి. ఆరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో 4మంది రాజు అనుచరులు చనిపోయారు. కొన్ని ఆయుధాలు పోలీ సుల వశమయ్యాయి. తప్పించుకొన్న విప్లవ వీరుల స్థావరంపై ప్రభుత్వదళాలు ఆరాత్రి మళ్ళీ దాడి చేశాయి. ఒకగంట పైగా సాగిన భీకరమైన పోరు లో మరొక 8మంది విప్లవకారులు మరణిం చారు.
ఆ తరువాత దాదాపు 4 నెలలపాటు దళం స్తబ్దుగా ఉండిపోయింది. రామరాజు చనిపో యాడనీ విప్లవం ఆగిపోయిందనీ పుకార్లు రేగాయి. అయినా అనుమానం తీరని ప్రభుత్వం రామ రాజును, ఇతర నాయకులను పట్టి ఇచ్చిన వారికి బహుమతులు ప్రకటించింది. స్పిన్, హ్యూమ్ వంటి అధికారులు జాగ్రత్తగా వ్యూహాలు పన్నసాగారు.
1923 ఏప్రిల్ 17నరాజు కొద్దిమంది అనుచరు లతో అన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. పోలీసు స్టేషనుకు వెళ్ళారు. పోలీసులు లొంగిపోయారు గానీ స్టేషనులో ఆయుధాలు మాత్రం లేవు. తరు వాత రాజు అనుచరులతో పాటు కొండపైకి వెళ్ళి సత్యనారాయణస్వామిని దర్శించుకున్నాడు. పత్రికా విలేఖరులతో కూడా మాట్లాడాడు. చెరుకూరి నరసింహమూర్తి అనే అతనికి, రాజుకు జరిగిన సంభాషణ 21-4-1923ఆంధ్ర పత్రికలో ప్రచు రింపబడిరది. 10గంటలకు బయలుదేరి శంఖ వరం వెళ్ళాడు. అక్కడి ప్రజలంతా రాజును భక్తిగా ఆదరించారు. రాజు వచ్చిన విషయం తెలిసిన కలెక్టరు అన్నవరం వచ్చి, రాజును ఆదరించి నందుకు ప్రజలపై (4,000 రూపాయలు జరి మానా) అదనపు పన్నును విధించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈవిషయం తెలిసి ‘‘నేను సాయం కాలం 6గంటలకు శంఖవరంలో ఉంటాను. నన్ను కలవవలసినది’’ అని కలెక్టరుకు రాజు ‘‘మిరప కాయ టపా’’ పంపాడు. కాని కలెక్టరు రాజును కలవడానికి సాహసించలేదు. (ఈ విశేషాలు 19-4-1923 హిందూ పత్రికలో ప్రచురింపబడ్డాయి.) క్రమంగా రాజు దళానికి, ప్రభుత్వ దళాలకు వైరం తీవ్రరూపం దాల్చింది. ఎలాగైనా రాజును పట్టు కోవాలని ప్రభుత్వం అనేక గూఢచారుల ద్వారా ప్రయత్నిస్తోంది. తమను అనుసరిస్తున్న గూఢచారు లను రాజు దళాలు హెచ్చరించడం లేదా శిక్షిం చడం జరుగసాగింది. ప్రజలలో ఇరువర్గాల మను షులూ ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్నారు. సి.యు.స్వినీ అనే అధికారి ఏజన్సీ భద్రతలకు బాధ్యుడైన అధికారిగా జూన్‌లో నియమితుడయ్యాడు. గాలింపు తీవ్రం చేశాడు. విప్లవకారులు 1923 జూన్ 10న ధారకొండ, కొండకంబేరు మీదుగా మల్కనగిరి వెళ్ళి పోలీసు స్టేషను, ట్రెజరీపై దాడి చేసారు కాని అక్కడ మందుగుండు సామగ్రి లేదు. ముహూ ర్తం పెట్టి జూన్ 13న ప్రభుత్వ సైన్యంతో తాను పోరాడగలనని, ప్రభుత్వాన్ని దించేవరకు పోరాటం సాగిస్తానని రాజు అక్కడి డిప్యూటీ తాసిల్దారు, పోలీసు ఇనస్పెక్టరులకు చెప్పాడు. ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసికొని ధారకొండ వెళ్ళాడు. జూన్ 17నరాజు ఒకచోట బస చేసినట్లు ఒక ఉపాధ్యా యడు స్వినీకి వార్త పంపాడు. సైనికులు రాలేదు గాని ఈ విషయం తెలిసిన మల్లుదొర, గంటందొర నాయకత్వంలో విప్లవవీరులు ఈతదుబ్బులు గ్రామానికి వెళ్ళి, తమ ఆచూకీ తెలిపినందుకు అక్కడివారిని బెదరించి నానాబీభత్సం చేశారు. జూలై 29న ప్రభుత్వ సైన్యాలకు ఆహారపదార్ధాలు తీసుకెళ్ళే బండ్లను విప్లవవీరులు కొల్లగొట్టారు. ఆగష్టు 4న పెదవలస పోలీసు శిబిరానికి వెళ్ళే పోలీసులను పట్టుకొన్నారు. ఆగష్టు 11న కొమ్మిక గ్రామంలోను, ఆగష్టు 20న దామనూరు గ్రామం లోను ఆహార పదార్ధాలు సేకరించారు. 2-9-1923న రామవరం ప్రాంతానికి కమాండర్‌గా ఉన్న అండర్వుడ్ సైనికులకు, మన్యం వీరులకు భీకరమైన పోరాటం జరిగింది. సెప్టెంబర్ లో రాజు ముఖ్య అనుచ రుడైన గాము మల్లుదొర పోలీసులకు దొరికి పోయాడు. ఇతను మహా సాహసి. కాని త్రాగుడు, వ్యభిచారం వ్యసనాలకు బానిస. ఒకమారు త్రాగి పోలీసులకు దొరికిపోగా రాజు దళం విడిపిం చింది. అతనిని దళం విడచి పొమ్మని రాజు ఆనతి చ్చాడు. అలా దళానికి దూరమైన మల్లుదొర తన ఉంపుడుగత్తె ఇంటిలో ఉండగా 17-9-1923న అర్ధరాత్రి దాడిచేసి అతనిని సైనికులు నిర్బంధిం చారు. తరువాత శిక్షించి అండమాన్ జైలుకు పంపారు(1952లో మల్లుదొర పార్లమెంటు సభ్యు నిగా విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎన్నిక య్యాడు.1969లో మరణించాడు). విప్లవాన్ని అణచివేసే క్రమంలో పోలీసులు ప్రజలను భయభ్రాంతులను చేసారు. గ్రామాలోకి ప్రవేశించి, చిత్రహింసలకు గురి చేసారు. మన్యాన్ని దిగ్బంధనం చేసారు. ప్రజలకు ఆహారపదార్థాలు అందకుండా చేసారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా చంపారు. సెప్టెంబరు 22న విప్లవకా రులు పాడేరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. 20వ తేదీన రాజు నాయ కత్వంలో ఎర్రజెర్లలో ఉన్నపుడు పోలీసులు అటకా యించి కాల్పులు జరిపారు. ఒకగ్రామ మునసబు ఆపోలీసు దళాలను తప్పుదారి పట్టించడంవల్ల వారు తప్పించుకోగ లిగారు. అక్టోబరు 26న గూడెం సైనిక స్థావరంపై దాడి చేశారు కాని స్టాండునుండి తుపాకులు తీసే విధానం తెలియక ఒక్క తుపాకీని కూడా చేజిక్కించు కోలేక పోయారు.17-4-1924న మన్యానికి కలెక్టరు (స్పెషల్‌కమిషనర్)గా రూథర్‌ఫర్డ్ నియ మితు డయ్యాడు. ఇతడు విప్లవాలను అణచడంలో నిపు ణుడని పేరుగలిగిన వాడు. విప్లవకారులలో అగ్గిరాజు (అసలు పేరు వేగిరాజు సత్యనారాయణ రాజు. అయితే శత్రువుల గుడారాలకు నిప్పుపెట్టి హడలుకొట్టే సాహసిగనుక ‘‘అగ్గిరాజు’’ అనే పేరు వచ్చింది.) అతిసాహసిగా పేరుపొందాడు. ప్రభు త్వాధికారులను, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టే వాడు. ఆహారధాన్యాలు కొల్ల గొట్టేవాడు. విప్లవ ద్రోహులను దారుణంగా శిక్షించేవాడు. అతనికి ప్రాణభయం లేదు.1924 మే 6వతారీఖున జరిగిన కాల్పులలో అగ్గిరాజుకాలికి గాయమైంది. శత్రు వులకు చిక్కకుండా ఒక బావిలో దూకి మరణిం చాలని ప్రాకుతూ వెళుతుండగా సైనికులు వచ్చి పట్టుకొన్నారు. అతనిని శిక్షించి అండమానుకు పం పారు. అక్కడే మరణించాడు. ఆరాత్రి రాజు మంపగ్రామానికి వచ్చాడు. అంతకుముందు రూథర్ ఫర్డ్ నిర్వహించిన కృష్ణదేవు పేట సభకు మంప మునసబు కూడా హాజర య్యాడు. వారం రోజు లలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని కృష్ణదేవు పేట సభలో రూథర్ ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. అతడేమి చెప్పాడో తెలుసుకుందామని రాజు ఆ మునసబు ఇంటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివ రించి, వారికి ఈ బాధలనుండి విముక్తి ప్రసాదించ డానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. తనను ప్రభుత్వానికి పట్టిఇచ్చినవారికి పదివేల రూపాయల బహుమతి లభిస్తుందని, కనుక తనను ప్రభుత్వానికి పట్టిఇమ్మని కోరాడు. కాని తాను అటువంటి నీచమైన పని చేయజాలనని మునసబు తిరస్కరించాడు.తరువాత,1924 మే 7న కొయ్యూ రు గ్రామ సమీపంలో ఒకఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసు లకు కబురు పంపాడట.ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధిం చారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజు ను (ఒక చెట్టుకు కట్టివేసి) ఏవిచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు.27ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారా మరాజు అమరవీరుడయ్యాడు.- డా,దేవులపల్లి పద్మజ