రాజ్యాంగ విలువలకు ప్రతీకలు…చట్టం…న్యాయం..ధర్మం..!
సమాజంలో ఒకకట్టుబాటు,క్రమ పద్దతి ఏర్పరచేటందుకు ఏర్పాటు చేసుకున్న నియమ నిబం ధనలే చట్టంగా చెప్పబడుతున్నాయి. చట్టం సామా జిక వాస్తవాలపై ఆధారపడివుంటుంది. న్యాయ స్థానాల ద్వారా,ప్రభుత్వ సంస్థలద్వారా అమలు చేయబడే విధి విధానాలు చట్టంగా చెప్పవచ్చును. సమాజంలో నీతి, న్యాయం ధర్మం క్రమ పద్దతితో అమలు పరచాలంటే కొన్ని నిర్దుష్ట విధానాలు అవస రము. ఏవ్యక్తికో, సమాజా నికో,కులానికో ఇష్టం ఉన్నా లేకపోయినా అమలు పరచ టానికి చట్టాలు అవసరం. వీటిని అతిక్రమించుట ఎవ్వరికీ సాధ్య ము కాదు. అతిక్రమించినవారు శిక్షార్హులౌతారు. చట్టం అనేది ప్రభుత్వాలు ప్రజలను భయపెట్టడం ద్వారా వాటికిలొంగి ఉండేలా చేసే ఆదేశాలు అన్నాడు‘ఆస్టిన్’. సామాజికంగా అంగీకరించబడిన సూత్రాలకు అను గుణంగా చట్టాలు రూపొందించ బడతాయి.
చట్టానికి ఎంత వరకు నిబద్ధత ఉం టుందనేది నైతిక అంశాల మీద ఆధారపడి వుం టుంది.‘‘హెచ్.ఎల్.హార్టు’’ప్రకారం శీలానికి సంబం ధించిన ప్రాధమిక నియమాలు మరియు ప్రాథమిక నియమాలు అమలు పరచేందుకు అధికారులకు ఇవ్వబడిన అధికారాలను సెకండరీ నియమాలుగా వర్ణించాడు. ఈ నియమాలు న్యాయబద్ధమైన నియ మాలయ్యాయి. వివాదాలను పరిష్కరించేందుకు, మార్పుకు సంబంధించిన నియమాలు, చట్టాలలో మార్పుకు అనుమతిచ్చేవి మరియు గుర్తింపుకు, చట్టాల యొక్క ప్రామాణికతను పరిరక్షించేందుకు అవకాశం ఇచ్చే నియమాలుగా వీటిని వర్గీకరించ వచ్చును.
నైతికతకు సంబంధించిన తర్కాన్ని పరి శీలించక పోయినప్పటికీ పూర్తిగా సామాజిక మూ లాల ద్వారా గుర్తించదగిన అధికారమే చట్ట మని జోస్‌ఫ్‌రాజు వివరిస్తారు. సమాజంలో వాస్తవిక స్థితి గతులపై ఆధారపడి అన్ని సామాజిక వర్గాలకు రక్షణ కల్పించే దిశగా చట్టాలను రూపొందిస్తారు. ఈ చట్టాలను మానవులు తయారు చేస్తారు కాబట్టి మానవులకుండే భయాలు,ఆందోళనలు,బలహీ నతలు మరియు లోపాలు అన్నీ ఈచట్టాలకు అతీ తం కాదని,అవన్నీ వాటిలో ప్రతిఫలిస్తాయనే వాదన కూడాబలంగా వుంది. చట్టంలో వుండే కఠిన తను బట్టి న్యాయపాలన జరుగుతుంది. అవి ఎంత కఠినంగా వుంటే ప్రజలుతప్పులు చేయటాని భయ పడతారు. అవి లొసుగుల భూయిష్టంగా వుంటే తప్పించుకునే మార్గాలు ఎక్కువగా వుంటాయి. దీనికి ప్రత్యక్ష ప్రమాణము మనదేశ న్యాయవ్యవస్థ. సంవత్సరాల తరబడి న్యాయ స్థానాలలో కేసులు సాగుతున్నాయంటే చట్టంలోని లోపాలగాను, తప్పించుకునే మార్గాలగాను పేర్కొనవచ్చును. అంతేకాకుండా న్యాయవాదులలో లోపించిన నైతికతకూడా చట్టం బారినుండి దోషులు తప్పించు కునేందుకు దోహదపడుతున్నాయి. చట్టం లోప భూయిష్టమైతే న్యాయం కుంటుబడుతుంది. అధర్మము రాజ్యమేలుతుంది. పరిపాలించే రాజులు కూడా స్వార్థ పరత్వానికిలోనైతే, చట్టం తన సమగ్ర తను కోల్పోతుంది.న్యాయదేవతకు చెవులు మాత్రమే వున్నాయి.చట్టంలో వున్నది యథాతథంగా అమలు పరచటమే న్యాయస్థానాల కర్తవ్యం. వక్రీక రణకు అవకాశాలు లేని చట్టంవలన త్వరగా న్యాయం లభిస్తుంది. ముస్లిం దేశాలలో శిక్షలు అతి కఠినంగా వుంటాయి. అంతేకాకుండా దోష నిరూపణకు తీసు కునే సమయము కూడా అతి తక్కువ. అందువలనే అన్యాయం చేయటానికి,తప్పులు చేయటానికి ప్రజలు భయపడతారు. పూర్వకాలంలో రాజులు కూడా ఇదే విధానాలు అమలు పరచేవారు. బహిరం గంగా శిక్షలు అమలుచేసేవారు. కాని ప్రజాస్వా మ్య వ్యవస్థలో ఈ విధానాలు నిర్వీర్యమైనాయని చెప్పవచ్చును. కేసు విచారణకు కాల నిర్ణయం చేస్తే,చట్టం తనపని తాను చేసుకుని,న్యాయాన్ని ప్రజలకు ప్రసాదించగలుగుతుంది. వందమంది దోషులు తప్పించుకన్నా ఫరవాలేదుకాని ఒక్క నిర్ధోషికి మాత్రము శిక్షపడకూడదనే మూల సిద్ధాం తము మన చట్టాలు ఆచరిస్తాయి. అందువలనే న్యాయనిర్ణయంలో అసాధారణ సమయం పడు తుంది. మారుతున్న సామాజిక స్థితిగతులకు అను గుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, వాటిని చట్ట రూపంలో పొందుపరచటం జరుగుతుంది. ఈనిర్ణయాలు అన్ని వర్గాలకు ఆమోదకరంగా వుండకపోవచ్చును. ఉదాహరణకు మన దేశంలో బహ భార్యాత్వాన్ని, బాల్య వివాహాలను,సతీ సహ గమనం నిషేధించి చట్టాలు చేసారు. అప్పట్లో కొంతమంది దీనిని వ్యతిరేకించారు. కాని చట్టం రూపుదాల్చినందువలన చేసేదేమి లేకపోయింది. కాని ముస్లిం దేశాలలో బహుభార్యాత్వం అమలులో వుంది.అందువలన చట్టం ప్రాంతాలకు అనుగు ణంగా రూపుదిద్దుకుంటుంది. మనకు ఇష్టం వున్నా లేకపోయినా ట్రాఫిక్ నియమాలు పాటించాలి. లేకపోతే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. చట్టాలు, శాసనాలు వున్నప్పటికీ కొన్ని సామాజిక వర్గాలలో వారి వారి కులప్రాతిపదికన ఏర్పరచుకున్న నియ మాలు చట్టాలుగా చెలామణి అవుతున్నాయి. మాన వులు రూపొందించుకున్న చట్టాలకు వాటికున్న శక్తి ప్రకృతి న్యాయములనుండి లభిస్తుంది.శాసన కర్తలు,న్యాయమూర్తులు మరియు అమలు చేసేవారు వాటిని అనుసరిస్తే చట్టానికి బలం చేకూరుతుంది. వీటిని సహజ న్యాయసూత్రాలు అంటారు. ప్రజలం దరిదీ ఒకే ధర్మము,ఒకే న్యాయము,ఒకే కర్తవ్యము అని చట్టాలలో నిర్దేశించి, వాటిని అమలు చేస్తే లోకంలో న్యాయం,ధర్మము కలకాలం వర్థిల్లు తుంది. ఒకరు మరొకరిని వేలెత్తి చూపించే అవకా శమురాదు. ఇది చట్ట సమగ్రతపైనే ఆధారపడి వుంటుంది.
ధర్మం
ప్రకృతి నియమాలు,మార్గదర్శకాలను ప్రధానంగా ధర్మము అని చెప్పుకో వచ్చును. దీనిలో మనిషి యెక్క సత్ప్రవర్తన,సామాజిక న్యాయ పాలన, లోకకళ్యాణ ప్రవర్తన వంటివి ఈకోవలోనికి వసా ్తయి. మన ప్రవర్తనతో సాటి మనుషులకుగాని, జంతువులకుగాని, ప్రకృతికి గాని ఎటువంటి హాని కలుగకుండా చూసుకోవాలి.ఎందుకంటే ఈ సృష్టిలో మనతోపాటు మిగిలిన అన్ని జీవరాసులకు బ్రతికే హక్కు సమానంగాఉంటుంది. మనకు హాని కలిగినా పరవాలేదు గాని ఇతరులకు మనవలన మాత్రము హాని కలుగకూడదు అనేది ధర్మం సూచిస్తుంది. శాంతి,అహింస, సత్యము, ఉపకారము, సానుభూతి వంటివి ప్రధాన ధర్మ కారకాలు. మనిషి మాత్రమే తన బుద్ధిని ఉపయోగించి ప్రవర్తించగలుగుతాడు. మిగిలిన ఏ జీవరాశికి ఇటువంటి అవకాశం లేదు. కాని ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశం ఏమంటే ప్రకృతిలో మనిషి తప్ప మిగిలిన అన్ని జీవరాశులు ప్రకృతి నియమిత ధర్మంలో జీవనం సాగిస్తూవుంటాయి.చెట్లు,మొక్కలుకాలాను గుణంగా తమ తమ ధర్మమైన పువ్వులు పూయటం,కాయలు కాయటం,పండ్లు కాయటం వంటివి చేస్తాయి. ఋతువులు తమ తమ ధర్మాలను పాటించి వివిధ కాలాలలో చేయవలసిన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వుంటాయి. జంతువులు కూడా ఎవ్వరి ప్రమేయం లేకుండా తమ కర్తవ్యపాలన చేస్తాయి. కాని మనిషి మాత్రమే ధర్మాన్ని అతిక్రమించి చరిస్తూవుంటాడు. అందువలనే పురాణాలు,శాస్త్రాలు,వేదాలు వంటివి వెలువడి మనషికి మార్గదర్శనం చేస్తూ వుంటాయి. మనిషికి బాల్య,యౌవన,కౌమార,వార్దక్య దశలుం టాయి. ఆయా దశలలో ఆచరించవలసిన వివిధ ధర్మాలు ఆచరించాలి. తల్లిదండ్రులను,గురువు లను,సోదర,సోదరీలను,సహచరులను,ధర్మ పత్నిని, సంతానాన్ని ఎలా గౌరవించాలో,వారిపట్ల తన విధ్యుక్త ధర్మమేమిటో తెలుసుకోవాలి. ధర్మపాలన చేయకపోవటం వలన అనేక అనర్థాలు కలుగు తాయి.వీటిని మనవేదాలలో,పురాణాలలో వివ రంగా విపులీకరించారు. రామాయణంలో పుత్రుని ధర్మము, సోదర ధర్మము,తండ్రిధర్మము,పత్నీ ధర్మ ము,స్నేహ ధర్మము,గురు ధర్మము,శత్రు ధర్మము, సేవక ధర్మము,రాజధర్మము, ప్రజల ధర్మము వంటి చక్కగా వివరించారు. మహాభారతంలో భీష్ముడు, ధృతరాష్ట్రుడు,ధుర్యోధనుడు,శకుని,ధర్మరాజు, విదు రుడు ఇలాఎవరికివారు తాము ఆచరించేదే ధర్మ మని భావించటం వలన అనేక సమస్యలు తలెత్తా యి.ధర్మము, న్యాయము అనేవి ఒకదానితో మరొకటి కలసి మమేకమై సాగేవి.ధర్మనిర్ణయము అతి సున్నిత మైనది.ధర్మము కాలానుగుణంగా మారుతూవుం టుంది. పూర్వకాలంలో రాచరికాలు వుండేవి. రాజు తనతరువాత ఎవరిని నిర్ణయిస్తే వారే తరు వాతి రాజుగా వ్యవహరించబడుతూవుంటారు. కాని నేడు ఆసిద్ధాంతము అమలులో లేదు. ప్రజలు నిర్ణేతలు. వారు ఎవరిని నిర్ణయిస్తే వారే పాలకులు. ఇది నేటిధర్మం. పూర్వం బహభార్యాత్వం వుండేది. కాని నేడు అది లేదు. ధర్మం ప్రకారం మనిషి ప్రకృతిని,తోటి జీవజాలాన్ని రక్షించాలి. కాని నేటి మానవుడు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. అందువలనే ప్రకృతిలో సమతుల్యత లోపించి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. నీటి వనరులు నశి స్తున్నాయి. జీవజాలాలు నశిస్తున్నాయి. సరైన ఆహారం దొరకటం లేదు.వీటన్నిటికి కారణం ధర్మ ప్రవర్తన లేకపోవటమే. నాటినుంచి నేటి వరకు చరిత్రను పరిశీలిస్తే అధర్మపరులు విజయం సాధిం చినదీ, ధర్మపరులు నష్టపోయినది కనిపించదు. తాత్కాలికంగా ధర్మపరులకు కొంత ఇబ్బందులు కలుగవచ్చును. కాని అంతిమ విజయం మాత్రము ధర్మానిదే. ‘‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాంధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’’ అని శ్రీకృష్ణపరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. పరమాత్ముడు తన నిజరూపంలోనో, లేక ఇతర రూపాలలోనో తనను తాన సృజించుకుని ధర్మాన్ని కాపాడుతుంటాడు. మన వేదాల ప్రకారం ధర్మం నాలుగు పాదాలు కలిగివుంటుంది. అది నాలుగు యుగాలలో తన ప్రభావాన్ని కోల్పోతుంది అని తెలియచేసారు.కృతయుగంలో నాలుగు పాదా ల సంచరించే ధర్మము, నేటి కలియుగంలో ఒక్క పాదంలోనే సంచరిస్తుందని చెప్పారు.అంటే నాలి గింట మూడు వంతులు అధర్మము చరిస్తుందని అర్థము. ఇది మనకు ప్రత్యక్ష అనుభవము. ధర్మ ప్రబోధం విషయంలో ఏ మతమైనా ఒక్కటే వివరి స్తుంది. గురువులను అనుసరించమని, వారి బోధ నలు పాటించమని చెబుతారు. కాని వివరించే విధానంలో, ఆచరించే క్రమంలో తేడా గోచరించ వచ్చును. అంతిమ సూత్రం మాత్రం ఒక్కటే. నిస్వా ర్దం,పరోపకారము వున్న మనిషి ధర్మనిరతుడై జీవించి, తనతోటివారికి కూడా జీవించే అవకాశం కల్పిస్తాడు. ధర్మోరక్షతి రక్షితః అన్నారు. అంటే ధర్మాన్ని మనంకాపాడితే అది మనలకు కాపాడు తుంది.
న్యాయం
న్యాయం అంటే న్యాయశాస్త్రమును అను సరించి నిర్ణయాలు తీసుకోవటం.ఏదైనా ఒక సమస్యవస్తే దానిని ఎలాపరిష్కరించాలి అనే విష యం న్యాయ శాస్త్రములో వివరిస్తారు. పక్షపాత రహితంగా,రాగద్వేష రహితంగా నిర్ణయం తీసు కోవాలని న్యాయ శాస్త్రము తెలియచేస్తుంది. అందుకే న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి వుం టాయి. న్యాయనిర్ణయానికి తనదగ్గరకు వచ్చే వారె వరైనా కావచ్చును, న్యాయశాస్త్రము ప్రకారము తీర్పు చెప్పటమే తనకర్తవ్యమని తెలియచేస్తుంది. న్యాయం అనేది నీతి శాస్త్రానుగుణంగా వుంటుంది. నీతి, సత్యం, సమానత్వం, ధర్మము మొదలైన అంశాల ప్రాతిపదికను న్యాయము నిర్ణయించబడుతుంది. సంఘలో ప్రతీ వ్యక్తికి సమానముగా జీవించే హక్కు కలిగివుంటింది. వాటికి విఘాతము కలిగినప్పుడు, తన హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయము కలుగచేసుకుని బాధితునికి న్యాయము చేస్తుంది. నిరుపేదలకు, నిస్సహాయులకు న్యాయం చేయ టంలో ప్రాధాన్యక ఇవ్వాలని క్రైస్తవ సిద్ధాతం చెబు తోంది. ప్రభుత్వాలు న్యాయ సూత్రాలకు అనుగు ణంగా ప్రజాపాలన చేయవలసి వుంటుంది. సరైన కారణం లేకుండా ఏఒక్క వ్యక్తికి అన్యాయం చేయ రాదు అని చట్టాలు చెబుతాయి.వాక్‌స్వా తంత్య్రము, మత స్వాతంత్య్రము,భావనాస్వాతంత్య్రము వంటివి నీతి, న్యాయ అంశాలలోకి వస్తాయి. మహాభారతం లో పాండవులను యక్షుడు బంధించి, ధర్మరాజును ధర్మానికి,నీతికి సంబంధించిన అనేక ప్రశ్నలు వేస్తా డు. సముచింతంగా సమాధానాలు విన్న తరువాత బంధింపబడిన నలుగురు సోదరులనుండి ఒకరిని విడిపించుకోమని చెప్పినపుడు, సహదేవుని విడుదల చేయమని చెబుతాడు. బలవంతులైన తమ్ములను వదలి చిన్నవాడైన సహదేవుని కోరటంలోని ఆంత ర్యము తెలుసుకోదలచిన యక్షునికి ధర్మరాజు తన నిర్ణయానికి కారణం వివరిస్తాడు. తనతండ్రికి గల ఇద్దరు భార్యలలో తాను కుంతి కుమారుడునని, రెండవ భారైన మాద్రి కుమారుడు కూడ వున్నట్ల యితే ఇద్దరు తల్లులకు న్యాయం చేసినట్లవుతుందని, అందువలన సహదేవుని కోరానని చెబుతాడు. ఈ న్యాయ నిర్ణయానికి ముగ్దుడైన యక్షుడు మిగిలిన తమ్ములకు కూడా విడిచిపెడతాడు. ఇది సామాజిక న్యాయం. తాను మాత్రమే జీవిస్తే సరిపోదు, తనతోపాటు మిగిలిన వారికికూడా జీవించే సమాన హక్కు వుంటుంది.రామాయణంలో వాలిని చెట్టు చాటునుండి కొట్టి సుగ్రీవునికి రాజ్యాన్ని ప్రసాదిం చిన రాముడు అందులకు గల కారణాలు వాలికి వివరిస్తాడు. అధర్మంగా సుగ్రీవుని రాజ్యాన్ని అపహ రించినందుకు,వాలికిగల అపారమైన వరప్ర భావాల వలన,చాటునుండి యుద్ధం చేయటం అధర్మమైనా,సుగ్రీవునికి న్యాయం చేయవలసి వచ్చిం దని వివరిస్తాడు. అందువలన కొన్ని ప్రత్యేక సమ యాలలో ప్రకృతి సహజ ధర్మాన్ని కూడా ప్రక్కన పెట్టి న్యాయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసి వస్తుంది. తెలిసిగాని, తెలియక గాని తన కర్తవ్యాన్ని విస్మరించటం అన్యాయమౌతుంది. న్యాయపాలన చేయనందులకు కౌరవులు నశించారు. రావణుడు హతమైనాడు. పురాణాలలోనే కాకుండా మనం గమనిస్తున్న వాస్తవిక పరిస్థితులలో కూడా గమనిస్తున్నాం. మన దేశంలో పటిష్ట న్యాయవ్యవస్థ వుంది. మనం ఎన్నో తీర్పులు గమనించాము. ఎంతోవున్నత స్థానాలు అలంకరించినవారు. సమాజంలో వున్నతంగా చలామణి అవుతున్నవారు కూడా శిక్షలు అనుభవించారు. నిరుపేదలు కూడా న్యాయాన్ని పొందారు. మనదేశంలో భారతీయ శిక్షాస్మృతి అమలులోవుంది. లార్డ్‌మెకాలే మనదేశ శిక్షాస్మృతిని తయారు చేసాడు.ఇందులో భార తీయ న్యాయ ప్రామాణిక గ్రంథాలైన మనుస్మృతి, యాఙ్డా వల్క్య స్మృతిల నుంచి అనేక అంశాలను ఇందులో పొందుపరచటం జరిగింది.1860వ సంవత్స రంలో రూపొందించిన భారతీయ శిక్షాస్మృతి నాటి నుంటి అనేక మార్పులు చేర్పులు పొందినప్పటికి, మూలము మాత్రము యధాతధంగా వుంది. ఇవి సమత,సమానత్వము,అవసరముఅనే మూల సిద్ధాం తములపై ఆధారపడి నిర్మించబడినది.భౌతిక వస్తు వులకన్నా మనిషి జీవితానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడినది. బంధాలకు,అనుబంధాలకు అతీ తంగా న్యాయం కోరే హక్కు అందరికీ ఉంటుంది. సమాజం నుండి మరియు పర్యావరణం ద్వారా లభించే అన్ని వనరులను సమానంగా అనుభవించే హక్కే న్యాయము. ఇందులో పేద, ధనిక తేడా వుండదు.అందరికి మంచినీరు లభించటం, మంచి గాలి లభించటం,మంచి ఆహారం లభించటం, మంచి గృహవసతి కలగటం, తన కుటుంబంతో తాను సహజీవనం చేయటం వంటివి సామాజిక న్యాయాలు. చెడు అలవాట్లకు వ్యతిరేకంగా నైతిక విలువలుపాటిస్తూ న్యాయసూత్రాలు రూపొం దిస్తారు. కొన్ని సందర్భాలలో చట్టంలో ఏవిషయం పొందుపరచకపోవచ్చును. అప్పుడు సహజ న్యాయ సూత్రాలను అనుసరిస్తారు. మంచి చేయటం, చెడుకు దూరంగా వుండటం, మంచిని ప్రోత్సహిం చటం అనేజి సహజ న్యాయం. న్యాయ మీమాంస అనేది 18వశతాబ్దములో ప్రారంభమై సహజ న్యాయం, పౌర న్యాయం, మరియు జాతీయ న్యాయంపై దృష్టి కేంద్రీకరించింది. శాసన పరిపాల కుల యొక్క అధికారాలకు హేతుబద్దమైన భౌతిక పరిమితులుంటాయని సహజ న్యాయము చెబు తుంది.న్యాయం,ధర్మం సమపాళ్ళలలో సంచరిస్తే, దేశం,ప్రజలు,ప్రాంతాలు సుభిక్షంగా వుంటాయి.-డా,దేవులపల్లి పద్మజ,9849692414