ఆదివాసుల ఆపన్న హస్తం సమత సంస్థ
విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వ యంత్రాంగంతో పోటీపడి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించే శక్తి ఎన్జీఓ లకు ఉందని సమత నిరూపిస్తోంది. విశాల మైన సామాజిక దృక్పథంతో కరోనావ్యాప్తి లాక్‌డైన్ సమయంలో అన్నార్తులకు అండగా నిలిచింది. నిబద్ధతతో సంక్షేమ కోణంలో సేవ లందిస్తున్న సమత సేవలను అటు విశాఖ స్మార్ట్ సిటీ మురికివాడ ప్రజలు ఇటు గిరిజ నులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బొర్రా గ్రామ పంచాయతీ సర్పంచ్ జన్నిఅప్పారావు అధ్యక్ష తన, జరిగిన పంపిణీ బహిరంగసభకు సమత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రెబ్బప్రగాడ రవి ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. ప్రజలు మహ మ్మారి కరోనావల్ల టూరిజం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి కుటుం బాలు దయ నందన పరిస్థితులను ఎదుర్కొంటు న్నారన్నారు. ఈరకంగా నేను ఈసేవ చేయడం సంతోషంగా ఉందన్నారు. సర్పంచ్ జన్ని అప్పారావు మాట్లా డుతూ ఈకరోనా సమయంలో సమత సేవలు మరువలేనిది అంటూ అభినందన తెలిపారు. కరోనా మహమ్మారి పుణ్యమా అని ఎంతో మంది ప్రజలు ఉపాధి లేక ఆకలితో ఇబ్బంది పడుతున్న సమయంలో సమత ముందుకు వచ్చి పేద ప్రజల ఆకలి తీర్చిడం వారికి రుణపడి ఉంటామన్నారు. ఈ పంచాయితీలో సుమారుగా 500 మంది పేద తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబాల వారికి సుమా రుగా 1800 వందల రూపా యలు విలువ చేసే నిత్యావసర వస్తువులు ఒక్కొకరికి పంపిణీ చేయడం జరిగింది. ఈసందర్భంగాబొర్రా పంచాయితీ సర్పంచ్ జన్నిఅప్పారావు 14 గిరిజనగ్రామాల తరు పున సమత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెబ్బా ప్రగడ రవికి పుష్పగుచ్ఛాలిచ్చి ఘనంగా సత్క రించారు. తర్వాత మైనింగ్ పోరాట యోధులుగెమ్మెల దేవకుమర్, స్వర్గీయ దోనేరు రాము సతీమణి దొనేరు పోల్లు గార్లను రవిగారి చేతుల మీదగా ఘనంగా సత్కరిం చారు. కార్యక్రమంలో గ్రామప్రజలు, వార్డ్ నెంబర్స్ గైడ్ యూనియన్ సభ్యులు పాల్గొ న్నారు. విశాఖనగంర మురికివాడ ప్రాంతాలు, జిల్లా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో సుమారు రూ.50లక్షలతో సుమారు మూడు వేల మంది కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసింది.
సమతకు కృతజ్ఞతలు -జన్ని అప్పారావు, సర్పంచ్,బొర్రా పంచాయితీ
గిరిజన పేదప్రజల ఆకలి తీర్చే నిత్యావసర సరకులు ఐదువందల కుటుంబాలకు పంపిణీ చేసిన సమత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెబ్బాప్రగడ రవికి కృతజ్ఞతలు.యావత్ భారతదేశ ఆదివాసీ తెగలన్నీ సమతకు రుణపడి ఉన్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా తమ ప్రాంతాల్లో ఉన్న వనరులు పరిరక్షణకు సమత తీర్పు మాకు వజ్రాయుధం లాంటి తీర్పుకు రవి చేసిన పోరాటం గిరిజన భావితరాలకు స్పూర్తిదాయకం.
కందుకూరి సతీష్ కుమార్