గిరిజన.. దళితుంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు..?

రాష్ట్రంలో గిరిజన,దళిత వర్గాల‌పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యవైఖరి అవంబిస్తున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో నెల‌కొన్న‌ పరిస్థితులే దీనికి తార్కాణం. వారిపై జరుగుతున్న దాడు అమానుషమని మేథావు ఆవేదను వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక యుగంలో ప్రభు త్వాలు మారుతున్నా వారి తరాతలు మారడం లేదు. కదా రోజురోజుకు ఆవర్గాల‌ ప్రజలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నారు. దీంతోవారంతా సామాజికంగా, ఆర్ధికంగా అణచి వేతకు గురవుతున్నారు.

అధికంగా పేదలు, వ్యవసాయ కార్మికులుగా, వల‌స కార్మికలుగా జీవిస్తున్నారు. రాష్ట్రంలో దళితవాడు సుమారు 20వేల‌ వరకు ఉన్నాయి. ఇవి ఊరు చివరఅభివృద్థికి ఆమడదూరంలో ఉంటాయి. ఇదినేటి దళితుస్థితి. దళితును సమా జంలో ఉన్నత స్థాయికి తేవాని రాజ్యాంగంలో కీల‌కమైన ఆర్టికల్స్‌ను రాసుకున్నాం. కానీ వాటి అమలు సక్రమంగా జరగకపోవడంవ‌ల్ల‌ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు దళితల బతుకులు సాగుతున్నాయి. ఆర్టికల్‌16(4)రిజర్వేషన్లు, ఉద్యోగ కల్ప‌న‌, ఆర్టికల్‌ 17అంటరానితనం నిర్మూన, ఆర్టికల్‌ 46 ప్రత్యేక శ్రద్ధతో విద్య, ఆర్థిక సౌకర్యా క్పల్ప‌న, సామాజిక న్యాయం దోపిడీకి గురికాకుండా రక్షణ,ఆర్టికల్‌341,342దళితల‌ అభివృద్థిని గవర్నర్ల సహాయంతో చేయడం,ఆర్టికల్‌ 335 సామర్థ్యం నిర్వహాణ, నియమకాలు, ఆర్టికల్‌ 338 దళితల‌ అభివృద్థికి ప్రత్యేక అధికారాలు, నియామకం, జాతీయ కమిషన్‌, సహాకార కార్పొరేషన్‌ ఏర్పాటు... రాజ్యాంగంలో ఇన్ని హాక్కు ఉన్నప్పటికి అమల‌లో తీవ్రమైన వైఫ్యం జరిగిందనేది స్పష్టంగా కనపడుతుంది. నేటి బీజేపీ పాల‌కల‌ రాజ్యాంగాన్ని సమీక్షించాలి,మార్చాలి,ఆర్టికల్‌16(4)నురద్దు చేయాలి,రాజ్యాంగ స్థానంలో మనువాద ఏజెండాను అమ‌లు చేయాల‌ని తీవ్రప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌, 370 ఆర్టికల్‌ రద్దు, దళితల‌,మైనార్టీలు,మహిళపై దాడు,దౌర్జన్యాల హత్యు అత్యాచారాలు జరుగుతున్నాయి. క్రైమ్‌ ఇన్‌ ఇండియా 2019 నివేదిక ప్రకారం దేశంలో దళితల‌పై నేరాల్లో మొత్తం 7.3 శాతం పెరుగుదల‌ ఉంది. 45935 నేరాలు, దారుణకేసు నమోదు చేయబడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో 11,829 కేసు. ఇది దేశమొత్తం కేసుల్లో 25.8 శాతం,రాజస్థాన్‌ 6794కేసు14.8శాతం, బీహార్‌ 14.2శాతం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితుపై లైంగిక వేదింపు అత్యాచారాలు హత్యల‌కు కిడ్నాప్ లు ఎక్కువగా నమోదయ్యాయి.. అంబేద్కర్‌పై బీజేపీ, ఆర్‌ఎస్‌ ఎస్‌కు ఎంత ప్రేమ ఉందో ఈనేరానుబట్టి అర్థమవుతుంది. రాష్ట్రంలో 2014లో 1104 సంఘటను జరిగితే 2019లో నవంబర్‌18నాటికి1904 సంఘటను జరిగాయి. కిరాతకమైన హత్యలు జరిగాయి. కుల దురంకార హత్యలు 49జరిగాయి. అత్యాచారాలు దౌర్జన్యాలు లైంగిక వేదింపుల‌కు తోడు వీడీసీ పేరుతో ఉత్తర తెంగాణ 4జిల్లా పరిధిలో 200గ్రామాల్లో దాడలు జరిగాయి. అంబేద్కర్‌ విగ్రహా ధ్వంసం, అనేక గ్రామాల్లో గ్రామ బహిష్కరణలు జరిగాయి. కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిస్లిలో దళితుల‌కు ఏమాత్రం రక్షణలేదు. రాష్ట్ర మొత్తం ఇదే పరిస్థితి ఉంది. దళితుల‌కు కల్పించబడ్డ హక్కుల‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం 1989ను ప్రభుత్వాలు అమ‌లు చేయలేదు. ప్రభుత్వాలు చట్టాన్ని నీరుగార్చడమే కాకుండా దళితల‌పై పెరుగుతున్న దాడుల‌కు దోహదం చేస్తూ నేరస్థుల‌కు అండగా నిబడుతున్నవి. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకు బహిరంగ ప్రజా వేదిక నుంచి రిజర్వేషన్‌ విధానాన్ని సమీక్షించా ని డిమాండ్‌ చేస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని పునః‌పరిశీ లించాని కోరుతున్నారు. గ్రామాల్లో హౌదా, గౌరవం భూపరిమాణాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఇందులో దళితు పరిస్థితి చూస్తే తెంగాణలో18క్ష కుటుంబాలు ఉండ గా7.12క్ష కుటుంబాకు13.12క్ష ఎకరాల‌ భూమి మాత్రమే ఉంది. రాష్ట్రంలో మొత్తం సాగు భూమి1.65కోట్లఎకరాలు ఉంది. ఇందులో దళితల‌ భూముఎన్ని? రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటిం చినట్టు 3క్ష భూమి లేని కుటుంబాకుగాను, 3ఎకరా భూమి కొనుగోలు పథకం కింద గత 7ఏండ్లలో 6,662 కుటుంబాకు 16544.13 ఎకరాను మాత్రమే కొనుగోుచేసి పంపిణీ చేసారు. ఇందులో 511మందికి 1122.02 ఎక రాకు నేటికి రిజిస్ట్రేషన్‌ చేయకుండా కాల‌యాపన చేస్తున్నారు. ప్రతి ఏటా10వే కోట్లు కేటాయించి ఐదేండ్లలో 50వే కోట్లుఖర్చుచేసి భూమిలేని ప్రతి దళిత కుటుంబానికి భూమి ఇస్తామని ప్రకటించి మాట మార్చిన కేసీఆర్‌ దళితవ్యతిరేకిగా ని బడ్డారు. పైగా గత ప్రభుత్వాు దళితుకు అసైన్డ్‌ చేసిన భూమును అభివృద్ధి పేరుతో ఎలాంటి నష్ట పరిహారం చెల్లించకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తిరిగి తీసుకుంటున్నది. ఈభూముల్లో గ్రామ పార్కుల‌ను,డంపింగ్‌ యార్డు,రైతువేదికల‌కు ,స్మశాన బిల్డిం గ్స్‌,ఇండిస్టీపార్కు నిర్మిస్తున్నారు. ఇది ధనవంతల‌కు, భూస్వాముకల‌కు రియలేస్టేట్‌, పరిశ్రమ అధిపతల‌కు భూముల‌ను ధారదత్తం చేసే భూస్వామ్య,దొర ప్రభుత్వమని తేలిపోయింది. 2014-15ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరం వరకు ఏడేండ్లలో దళితు ప్రత్యేక అభివృద్ధికి 85913 కోట్లు కేటాయించి 57100 కోట్లు మంజూరు చేసి 47685 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దళితు సంక్షేమం, అభివృద్ధి, రక్షణ నినాదాలు బాగా వినబడుతున్నప్పటికీ 50 శాతంలోపే ఖర్చుచేసి దళితు అభివృద్ధిని సాది స్తామంటే ఏలాసాధ్యం. స్వయం ఉపాధి పథకాకు గత ఐదేండ్లుగా5క్షకుపైగా ధరఖాస్తు పెట్టుకున్నారు.ల‌క్ష20వే మందికి మంజూరు చేసి ల‌క్ష మందికి సబ్సిడీ విడుద చేశారు. 13వంద కోట్లు కేటాయించి 1160కోట్లు ఖర్చు చేశారు. 2019 నుంచి 21వరకు రెంళ్ళ‌‌కు యాక్షన్‌ ఫ్లాన్‌ విడుద చేయలేదు. నిరుద్యోగు ప్రతి సంవత్సరం సుమారు 2క్ష వరకు దరఖాస్తు పెట్టు కుంటున్నారు. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఉంది. సరిపడని బడ్జెట్‌ కేటాయించారు. లోన్‌ కోసం విషమ షరతు విధిస్తున్నారు. తిరిగి తిరిగి విసిగి వేసారి లోన్స్‌కు దూరంగా ఉండే దుస్థితి వస్తున్నది. ఏలాంటి షరతు లేకుండా ప్రతి ఏడాది1500కోట్లు కేటాయించి ఖర్చు చేస్తే దళిత నిరుద్యోగుకు న్యాయం జరుగుతుంది. అక్షరాస్య తలో దళితు 50శాతం కూడా లేరు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ళను అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. వైద్యంపూర్తిగా కార్పొ రేట్‌ శక్తు చేతుల్లోకి వెళ్ళింది. ప్రజారోగ్యోం దెబ్బతినడం వ్ల ఆర్థికంగాలేని దళితుల్లో చిన్న చిన్న జబ్బుకే మరణాలు సంభవిస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయాలి. జీఓ 342 ప్రకా రంగా 101 యూనిట్ల విద్యుత్‌ను ఫ్రీగా దళితుకు ఇస్తున్నారు. ఇది200యూనిట్లకు పెంచాలి. జిఓ1235 ఆధారంగా రెండు ఎకరా భూమిని ప్రతి గ్రామంలోస్మశాన స్థలాకు ఇవ్వాలి. ప్రభుత్వ రంగం వేగంగా తగ్గిపోతున్నది. ప్రయి వేట్‌ రంగం లో రిజర్వేషన్లు లేవు. బ్యాక్‌లాక్‌ పోస్టు భర్తీ చేయడం లేదు. దళిత ప్రజు సాంఘిక సంక్షేమ పథకాపై ఆధారపడి జీవిస్తు న్నారు. ఉపాధిహామీ చట్టం, ప్రజాపంపిణీ,ఆహారభద్రత,ఆసరా ఫించన్స్‌, ఇవి కొంత మేరకు దళిత సమాజానికి ఉపయోగ పడు తున్నాయి. ఈతరుణంలో నయా ఉదారవాద ఆర్థిక విధానా అమువ్ల సాంఘిక సంక్షేమ పథకా క్ష్యం నిరంతరం తగ్గించబడుతున్నది. నిత్యవసర సరుకు ధరు నిత్యం పెరుగు తున్నాయి. అర్థాకలితో జీవి స్తున్నారు. దళితవాడల్లో రక్షిత తాగునీరు, రోడ్లు ఉండవు. గృహవసతి లేనివారు 30శాతం ఉన్నారు. గృహ నిర్మాణ పథకం, డబల్‌ బెడ్రూం పథకాు ఇండ్ల సమస్యను పరిష్కరించలేదు. కులాంతర వివాహాు, కళ్యాణక్ష్మీ పథకాకు నిధును పెంచాల్సిన అవసరం ఉంది. దళితు సమగ్రాభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాు నిర్లక్ష్యం చేస్తున్నాయి. 

దళితు, ఆదివాసీ కష్టాు` దళిత్‌ శోషన్‌ ముక్తి మంచ్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రామచంద్ర
ఈఏడాది అసెంబ్లీ ఎన్నికు జరగ బోయే పశ్చిమ బెంగాల్‌లో దళితు, ఆదివాసీ పరిస్థితి దయనీయంగా మారింది. శ్రామిక వర్గంలో భాగంగా ఉన్నవారు దశాబ్దాుగా తమ హక్కుకు నోచుకోలేకపోతున్నారు. సామాజికంగా, ఆర్థికం గానూ వారు అణచివేతకు గురవుతున్నారు. అయితే, రాష్ట్రంలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), విపక్ష బీజేపీు దళితు,ఆదివాసీను మోసగిస్తు న్నాయి. వారిని కేవం ఓటు బ్యాంకుగానే చూస్తు న్నాయి కానీ వారిహక్కు విషయంలో మౌనం వహిస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌లో ఈవర్గా హక్కు,సామాజిక,ఆర్థికన్యాయం కోసం వామపక్షం మాత్రమే దశాబ్దా పాటు పోరాడిరదని దళిత శోషన్‌ ముక్తి మంచ్‌ (డీఎస్‌ఎంఎం) ప్రధాన కార్య దర్శి, మాజీఎంపీ డాక్టర్‌ రామచంద్ర డోమ్‌ గుర్తు చేశారు.
బెంగాల్‌లో దాదాపు 30శాతం ఎస్సీ, ఎస్టీలే..!
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వర్గా మద్దతు కోసం బీజేపీ,టీఎంసీు చేస్తున్న కుటి యత్నాు అనేక సందర్భాల్లో బయటపడ్డాయని చెప్పారు. ‘విభజన’ రాజకీయాతో ఈ వర్గాను మరింతగా బహీనపరిచే కుట్రను కేంద్ర, రాష్ట్రంలోని అధికార పార్టీు చేస్తున్నాయని వివరిం చారు. పశ్చిమ బెంగాల్‌లోఎస్సీ,ఎస్టీ జనాభా గణనీ యంగా ఉన్నది.2011 జనాభా లెక్క ప్రకారం.. ఎస్సీు 1.8కోట్ల మందికి పైగా (23.5శాతం మంది),ఎస్టీు దాదాపు 53 క్ష మంది (5.8 శాతంమంది) ఉన్నారు. అంటే జనాభాలో దాదాపు 30శాతం ఈ రెండు వర్గాకు చెందినవారే.
కులాధారిత వేధింపు అధికం
అయితే, రాష్ట్రంలో కులాధారిత వేధిం పు ఎక్కువయ్యాయని డోమ్‌ వ్లెడిరచారు. ఇందుకు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో మెగులోకి వచ్చిన రెండు సందర్భాను ఆయన వివరించారు. ‘’ కోల్‌కతాలోని రవీంద్ర భారతీ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఎస్టీ వర్గానికి చెందిన సర స్వతి కెర్కెట్టా2019లోనియమితుయ్యారు. అయితే,ఆవర్గానికి చెందినవ్యక్తిగా ఇదిఆమె సాధిం చన గొప్ప ఘనత. కానీ, సాక్షాత్తూ ఆమె విద్యార్థులే ఆమెను ఒకగంటపాటు నిబెట్టారు. ఇంకో ఘట నలో.. జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ హిస్టరీ అసోసి యేట్‌ ప్రొఫెసర్‌గా ఆదివాసీ మరూనా ముర్ము నియమితుయ్యారు. అయితే,ఈమెను కూడా విద్యా ర్థు ఒక విషయంలో దూషించారు’’ అని ఆయన గుర్తు చేశారు.
అగ్రవర్ణాకే ప్రయోజనం
అధికార పార్టీ విభజన రాజకీయా కు ఆకర్షితు వుతున్న ఈ శ్రామిక వర్గా ప్రజు పోరాడటం ద్వారానే తమ హక్కును పొందు తారని డోమ్‌ చెప్పారు. తాగునీరు, భూమి హక్కు, వనయి, విద్య, సాంస్కృతిక, అభివృద్ధికి సంబం ధించిన అనేక విషయాల్లో దళితు, ఆదివాసీ హక్కుకు పోరాటాలే దారిని చూపిస్తాయని వివరించారు. రాష్ట్రంలో టీఎంసీ దాదాపు 10 ఏండ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ.. అటవీ హక్కుచట్టం ప్రకారం ఆదివాసుకు పట్టా ఇవ్వ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అగ్రవర్గా ప్రజు మాత్రమే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారనీ, ఈ అసమానత దళిత, ఆదివా సీను ఉద్యమాు చేసేలే పురిగ్పొుతుందని తెలిపారు.
‘తీవ్రస్థాయికి ఆహార సంక్షోభం’
బెంగాల్‌లో ఈ రెండు వర్గా ప్రజ పరిస్థితి ఆహార సంక్షోభంతో తీవ్ర స్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘’2018లో లోధ, షబర్‌ వర్గానికి చెందిన10మంది ఆకలి కారణంగా చని పోయారు. ఆహార సంక్షోభం శ్రామిక వర్గా ప్రజ ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ గణాం కాను ఎన్‌ఎస్‌ఎస్‌ఓ డేటా కూడా ప్రతిబిం బిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రజు మళ్లీ ఎర్ర జెండా కిందకు వస్తున్నారు’’ అని ఆయన తెలిపారు.
‘లెఫ్ట్‌ ఉద్యమానికి దళిత, ఆదివాసీ మద్దతు’
అయితే,బెంగాల్‌లో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్ని స్తున్నదనీ,ఇందుకు మత,కురాజకీయాకు తెరలేపి ప్రజల్లోవిభజను తీసుకొస్తున్నదని చెప్పారు. దీంతో,ముఖ్యంగాదళితు,ఆదివాసీు విడి పోతు న్నారని ఆవేదనవ్యక్తంచేశారు. రాజ్యాంగం కల్పిం చిన రిజర్వేషన్లను సైతం ప్రశ్నించేలా బీజేపీ చర్యు న్నాయన్నారు. గుండాయిజం, బెదిరించే ధోరణితో టీఎంసీ చర్యు రాష్ట్రంలో భయభ్రాంతు గురి చేస్తున్నాయని డోమ్‌ వివరించారు. రాష్ట్రంలో మహిళపై లైంగికదాడు, హత్యు, ఆది వాసీ, దళిత యువకును తప్పుడు సాకుతో అరెస్టు చేయడం వంటివి కొనసాగుతున్నాయని ఆయన నొక్కి చెప్పారు. రాష్ట్రంలో వామపక్ష ప్రభు త్వం దూరం అయినప్పటి నుంచి ఈసమస్యు అధికమ య్యాయని చెప్పారు. హక్కు పోరాటాల్లో భాగంగా దళితు, ఆదివాసీ నుంచి వామపక్ష ఉద్యమానికి విస్తృతమైన మద్దతు భిస్తుందని డాక్టర్‌ డోమ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.
-ఆర్‌. వెంకట రాములు

సామాజిక వివక్షే కట్టుబాటుగా…!

ఉత్తరప్రదేశ్‌లో అత్యున్నత స్థాయిలో ఘనీభవించిన కు చట్రంలో మనుగడ సాగించడం పెద్ద సాహసమే. ఇక్కడ కు పక్షపాతం, పితృస్వామిక శక్తు ప్రాబ్యం బంగా వ్యాపించి ఉంది. కులాకు రాజకీయ ప్రతినిధు అండదండుంటాయి. ఉన్నావో మొదు కొని హత్రాస్‌ వరకు హింస పునరావృతం కావడం చూశాం. మృగప్రాయమైన అంశాకు ప్రాధాన్యత నిస్తూ, గొప్పగా చెప్పుకోవడం పరిపాటి.
నుగురు ఠాకూర్లచే హత్యాచారానికి గురైన బాధితురాలిని, ఆమె తల్లిదండ్రు అభీష్టానికి భిన్నంగా, ఆ రాత్రికి రాత్రే అంత్యక్రియు నిర్వహించారు. ఆమె కుటుంబాన్ని నిఘా నీడలో ఉంచి మరీ ఆ దుశ్చర్యకు ప్పాడ్డారు. పట్టణంలో 144వసెక్షన్‌ విధించడం, వారి కుటుంబ సభ్యును పత్రిక వారితో మాట్లాడడానికి అనుమతించకపోవడం, బాధితు రాలి సోదరుడి మొబైల్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయించడం, వారి కుటుంబాన్ని ఇంటికే పరిమి తం చేయడం వంటివన్నీ జరిగాయి. ఠాకూర్‌ కుటుంబీకు బహిరంగంగా నిరసన తెలియ చేయడానికి అనుమతించారు. బాధితురాలి కుటుంబాన్ని మాత్రం బహిరంగంగా బెదిరిం చారు. వారిని పరామర్శించడానికి వెళ్లిన చంద్రశేఖర్‌ రావణ్‌ లాంటి వారికి కూడా హెచ్చరికు చేశారు. బాధిత కుటుంబం భయంతో వణికి పోయింది. హత్రాస్‌ అనేది కులాధిక్యత గ పట్టణం. వారిలో ముఖ్యంగా బ్రాహ్మణు, వైశ్యు వున్నారు. మురికి క్వాు బహిరంగంగా పారే ప్రాంతంలో వాల్మీకు నివసిస్తారు. వారు ప్రధానంగా పారిశుధ్య కార్మికుగా వుంటూ ఠాకూర్ల పంటపొలాల్లో వ్యవసాయ పను చేస్తారు. ఠాకూర్లకు వారితో పని పడినప్పుడు ఒక మధ్యవర్తిని వారి వద్దకు పంపుతారు. దళితవాడకు వెళ్లి పనికి రమ్మని అడగడం తమ గౌరవానికి భంగకరమని భావిస్తారు. దళితు మార్కెట్‌ నుంచి కొనానుకున్నా, షాపు యజమాను దూరాన్ని పాటిస్తూనే సరుకు ఇస్తారు. కరోనా మహమ్మారి వ్ల వాడుకలోకి వచ్చిన ‘సామాజిక దూరం’ అనే పదం అంతకు ముందే ఆప్రాంతంలో పాటించబడుతున్నది.ఉత్తరప్రదేశ్‌లో కులా ఆధారంగా అసమానతనేవి స్పష్టంగా కన్పిస్తుంటాయి. హత్రాస్‌ దీనికి మినహాయింపు కాదు. దళితు అగ్రవర్ణా కానీల్లోకి వెళ్లినట్లయితే సామాజిక దూరాన్ని పాటించ వసిన ఉంటుంది. కు కట్టుబాట్లకు అనుగు ణంగా మసుకోవాల్సి వుంటుంది. కులాంతర చర్చగాని, సామాజిక ఐక్యత గాని లేదు. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ వివేక్‌ కుమార్‌ ఇలా అంటారు. ‘’కు ఆధిపత్య హిందూ సమాజంలో దళితు ఎప్పుడూ బహిష్కృ తుగానే ఉన్నారు. నేటికీ వారు అగ్ర కుస్తు పొలాల్లో పని చేస్తున్నప్పటికీ…వారి దగ్గరకు వెళ్ళడానికి కూడా అనుమతించరు. వారి పశువును కూడా అగ్ర కుస్తు పొలాల్లో మేత మేయడానికి అనుమతించరు. ఉదయం బహిర్భూమికి కూడా సుదూర ప్రాంతాకు వెళ్ళ వసి ఉంటుంది’’. ప్రముఖ సామాజిక శాస్త్ర వేత్త అవిజిత్‌ పాఠక్‌ ఇలా అంటారు. ‘’నీవు ముస్లిమైనా,దళితుడవైనా,ఆధిపత్య శక్తు పరిమితు విధిస్తారు. భారతీయ సమాజంలో ఆధునికత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, కొన్ని సంవత్సరాుగా భారతీయ సమాజం రోజు రోజుకు తిరోగమన దిశలో పయనిస్తోంది. వినిమయతత్వం పట్ల విపరీతమైన మోజుతో పాటు, తిరోగమన భావాు వ్యాపిస్తున్నాయి. మతమనేది ప్రధానమైనదిగా మారింది. ఉత్తర ప్రదేశ్‌లో అత్యున్నత స్థాయిలో ఘనీభవించిన కు చట్రంలో మనుగడ సాగించడం పెద్ద సాహసమే. ఇక్కడ కుపక్షపాతం, పితృ స్వామిక శక్తు ప్రాబ్యం బంగా వ్యాపించి ఉంది. కులాకు రాజకీయ ప్రతినిధు అండదండుంటాయి. ఉన్నావో మొదుకొని హత్రాస్‌ వరకు హింస పునరావృతం కావడం చూశాం. మృగప్రాయమైన అంశాకు ప్రాధాన్యతనిస్తూ, గొప్పగా చెప్పుకోవడం పరిపాటి’’.ఈ పరిస్థితి ఎప్పుడూ ఉన్నదే. అయినా, హత్రాస్‌ విషాదం తరువాత మీడియా దృష్టికి వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఫ్న్‌ ప్రారంభం నుంచి క్షత్రియును సమర్థిస్తూ, వారిపై నమ్మకం వుంచుతున్నాయి. దేశ విభజన తరువాత ఈనాడు భారతీయ జనతా పార్టీ అధికారంలో వున్నది కాబట్టి వారు అధికార కుంగానే భావిస్తారు. యు.పిలో కాంగ్రెస్‌ పుకుబడి ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో, మాయావతితో లేని దళిత కులాను తమ సామాజిక కూటమిగా ఎన్నుకున్నారు. వెనుకబడిన తరగతులో మౌర్యాను మొదుకొని, మల్లాు, పాసీ వరకు నూతన కూటమిని ఏర్పరుచుకున్నారు. కళ్యాణ్‌ సింగ్‌, ఉమాభారతి అధికారంలో ఉన్నంత కాం లోథాు వారితోనే వున్నారు. మల్లాు రామునితో తమకు ఉన్న అనుబంధాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. పరుశురాముని శ్వేదం నుంచి తాము ఉద్భవించినట్టు పాసీు చెప్తారు. ఒకవైపున యు.పిలో 9శాతం ఠాకూర్లు, పూర్తిగా వెనుకబడిన తరగతు నుంచి 32 శాతం ఓటర్లు బిజెపి వైపు ఉన్నారు. ప్రధాన మంత్రిని కూడా వెనుకబడిన తరగతు వాడిగా చెప్పుకోవడానికి ఇష్టపడ తారు! 2017 విధానసభ ఎన్నికల్లో 200 చిన్న సమావేశాు కు ప్రాతిపదికన జరిగాయి. ఈరోజున కు సమీకరణు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, పై స్థాయిలో ఉన్న పోలీసు అధికారుల్లో, జిల్లా మెజిస్ట్రేట్‌ కోవిడ్‌ పునరా వాస కేంద్రాలో కూడా ఈ సామాజిక గ్రూపు ప్రాబల్యాన్ని గమనిస్తాం. ఈ నభై ఒక్క శాతమే రాష్ట్రంలో ఆధిపత్య శక్తిగా కనబడుతుంది’’ అంటారు ప్రొఫెసర్‌ పాఠక్‌. ఈ కు సమీకరణు…2017 నుంచి ఎన్‌కౌంటర్‌ పేరుతో దళితును, ముస్లింను ఏరిపారేస్తు న్నారనే వాదనకు మినహాయింపు లేని సాక్ష్యంగా వున్నాయి. యు.పి లో హత్రాస్‌ ఒక చిన్ని ప్రాంతం. హత్రాస్‌ ఢల్లీికి అత్యంత సమీపంలో వున్నదనే విషయం మన దృష్టిలో వుండాలి. కాబట్టి హత్రాస్‌లో బిజెపి జరిపే ప్రతి చర్యా ఢల్లీి, రాజస్థాన్‌, బీహార్‌పై ప్రభావం చూపుతుంది. కు, వర్గ అసమానతు, ఆధిక్య తతో కూడిన చైతన్యం మధ్యతరగతిలో గమని స్తామని ప్రొఫెసర్‌ పాఠక్‌ చెప్తారు. తన మాట ల్లోనే చూద్దాం.‘’వస కార్మికు సంక్షోభ సమ యంలో, మధ్యతరగతి ఉన్నత వర్గాు ఏ విధం గా ప్రవర్తించాయో మనం గమనించాం. అప్పుడు కూడా వారు అమెజాన్‌ సరుకు, ఆహారం,చేపు,చికెన్‌ అందుతాయో లేదో అనే దానిపైనే దృష్టి పెట్టారు. అత్యంత నీచమైన అంటరానితనం పాటించారు. పనివారు లిఫ్ట్‌ ఎక్కవచ్చా,కూరగాయు అమ్మేవారు కానీ లోకి ప్రవేశించవచ్చా అనే అంశాు ముందు కొచ్చాయి. కొన్ని సందర్భాలో బిజెపి శాసన సభ్యు అమ్మకందారును అవమానిం చటం, వారి ఆధార్‌కార్డు అడగటం గమనిస్తాం’’. గత కొన్ని సంవత్సరాుగా కు విభేదాు బాగా పెరిగాయి. కేవం సాధార ణమైన కులాధి పత్యమే కాదు, దళిత సమాజంలో కూడా కరుడుగట్టిన కు విభేదాు పొడచూపాయి. ప్రతి విషయం తమ రాజకీయ అవసరా ను బట్టి అంచనా వేయబడుతుంది. అధికార యంత్రాంగం లేక రాజకీయ విభాగం చాలా చురుగ్గా కు, ఉపకు అస్తిత్వ మంటను, రాజకీయాను ఏ స్థాయికి తెచ్చిందంటే ద్విజు (బ్రాహ్మణు) కానివారు, బిఎస్‌పి తో కానీ, ఎస్‌పితో గాని కవడానికి మీలేనంతగా జాగ్రత్త పడిరది. ఈ పరిస్థితుల్లో చిన్న కులాు అవినీతిపై, ఆధిపత్య కులానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాు చేయడం చాలా కష్టం అవుతుంది. ‘’వీటి ప్రభావాను గురించి ఆలోచిం చాల్సిన సమయం ఆసన్నమైంది. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం వాడే భాషనే బిజెపి యేతర ప్రభుత్వాు కూడా అనుసరించే ప్రయత్నం చేస్తున్నాయి.’’ అంటారు ప్రొఫెసర్‌ పాఠక్‌. సామాజిక పునర్నిర్మాణం ఎజెండాగా పని చేయవసిన అవసరం ఉంది. అన్నిటికంటే అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవసి ఉంది. మనం ఇప్పుడు నేరం ఎవరు చేశారనే దాని ఆధారంగా తీర్పు ఇచ్చే కాంలో జీవిస్తున్నామంటారు బరేలికి చెందిన విశ్రాంత విద్యావేత్త, సామాజిక కార్యకర్త ఇనుమూర్‌ రెహమాన్‌. ఒకవేళ దళిత లేక ముస్లిం యువతిపై అఘాయిత్యం జరిగినట్టయితే మీడియా గాని, అధికార యంత్రాంగంలోని అన్ని విభాగాు గాని కేసు నుంచి పక్కదారి పట్టించడానికే ప్రయత్నిస్తాయి. ముంబైలో రాజ్‌పుట్‌ హీరో ఆత్మహత్య చేసుకున్నప్పుడు యు.పి లోని చానళ్లన్నీ నిరంతరాయంగా ప్రసారం చేశాయి. కానీ గోండా జిల్లాలో ముగ్గురు దళిత యువతుపై యాసిడ్‌ దాడి జరిగినప్పుడు అదే మీడియావారికి వార్తగా కనబడలేదు. హత్రాస్‌లో జరిగింది కు దురహంకార హత్యగా నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర ప్రదేశాలో వారి ఆత్మగౌరవంపై, మివపై దూషణతో దాడిచేయడం జరుగుతుంది. సెక్స్‌ వర్కర్‌పై అఘాయిత్యం జరిగినా అది అత్యాచారం కిందికే వస్తుంది కదా? కొన్ని శక్తుకు స్వేచ్ఛగా వ్యవహరించే హక్కును కల్పించినట్టుగా కనిపిస్తుంది. వారి కోసం ప్రత్యేకమైన నియమాు రూపొందించబడ్డాయి. హత్రాస్‌, ఉన్నావో ఇతర ప్రదేశాల్లో జరిగే సంఘటను కతపరిచే విధంగాఉన్నాయి. ఇది అధికారాన్ని దుర్వినియోగ పరచడమే. ఇవన్నీ అనాగరికమైన, ఆధిపత్యంతో కూడిన పురుషాధిక్య క్షణాలే. విషపూరిత భావాను, మనుషు మధ్య నిర్మితమైన అడ్డుగోడను, తొగించటానికి మనకు అనేక సంవత్సరాు పట్టవచ్చు. ఈ విధానాు భారతీయ సంస్కృతికి ఎంతో హాని చేస్తాయి. ఈగాయాన్ని మాన్పడానికి సుదీర్ఘకాం పట్టవచ్చు. ఈ సామాజిక క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడాల్సి వుంది. ఎందువ్లనంటే హిందూత్వ శక్తు దూకుడు వ్ల నిన్నటి స్నేహితులే నేటి శత్రువుగా మారిన పరిస్థితిని చూస్తున్నాం. చరిత్ర అదే మార్గం చూపుతుంది. కానీ, చరిత్రే అద్భుతాు సృష్టిస్తుందని, మనం నిస్తేజంగా నిరీక్షించలేం. మనం ఎక్కడో ఒకచోట నుంచి ప్రారంభించాలి. హత్రాస్‌ బాధితురాలికి న్యాయం జరగడమనేది మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. కు సంబంధమైన తప్పుడు మార్గాను తొగించే కార్యక్రమాకు ప్రాముఖ్యతను పెంచాలి. (‘ఫ్రంట్‌లైన్‌’ సౌజన్యంతో `వ్యాసకర్త : జియా ఉన్ స‌లామ్అసోసియేట్‌ ఎడిటర్‌)

మతాలు  కాదు…మనిషే ప్రమాదంలో..ఉన్నాడు..?

సంప్రదాయవాదు, దైవ విశ్వాసం గవారు అన్ని మతా బోధకు, ప్రవచనకాయి వగైరాంతా అసు నీతి నిజాయితీ అనే మాటు ఉచ్ఛరించగూడదు. ఎందుకంటే వారు నిరూపణలేని దైవం మీద విశ్వాసం ఉంచు కోవడంతో పాటు జనాన్ని కూడా కుట్ర పూరితంగా మోసం చేస్తున్నారు. వాస్తవాు, నిజాు మాట్లాడని వారు తమకు నీతి నిజాయితీ ఉందని, ఇతరుల్లో అవి ఉండాని బోధించడం హాస్యాస్పదం. అబద్ధ్దాు ప్రచారం చేసేవాడు ఇతరుకు నిజం మాట్లాడమని చెప్పినట్టుగా ఉంది. చిత్తుగా తాగిన తాగుబోతు తడబాటు లేకుండా అడుగులేయాని హితబోధ చేసినట్లు ఉంటుంది. ఆత్మ ద్రోహం చేసుకుని బతుకుతూ, ఇతరుకు ద్రోహం చేస్తూ, నైతికత గురించి నీతి నిజాయితీ గురించి ఉపన్యాసాలిస్తే వాటికి అసు మివ ఉంటుందా? ఒకసారి ఆలోచించండి!


నిజానికి ఇస్లాం మతం ప్రమాదంలో లేదు. క్రైస్తవం ప్రమాదంలో లేదు. హిందూ మతం కూడా ప్రమాదం లేదు. మత పిచ్చిలో పడ్డ మనిషే ప్రమాదంలో ఉన్నాడు. చనిపోయిన వాడికి తను చనిపోయినట్లు తెలియదు. దగ్గరి వాళ్ళంతా వివిలాడతారు. మూర్ఖత్వంలో ఉన్నవాడికి కూడా తను మూర్ఖత్వంలో ఉన్నాడని తెలియదు. ఇతయి జాలిగా బాధపడతారు. మూర్ఖత్వం మరణం కంటే తక్కువది కాదు. అందుకే విశ్వవిఖ్యాత రచయిత మార్క్‌ ట్వెయిన్‌ ఇలా అన్నారు. ‘’వాళ్ళు పిచ్చి వాళ్ళయి పోతున్నారని వాళ్ళకు తెలియకుండా, జనాన్ని పిచ్చి వాళ్ళను చెయ్యొచ్చు… ఒక వాస్తవాన్ని చెప్పి ఒప్పించడం కష్టం!’’ అని! ఉగ్రవాదుకీ వీరికీ తేడా ఏమిటంటే వారికి మతపిచ్చి మాత్రమే ఉంటుంది.మూర్ఖత్వంలో కొట్టుమిట్టాడే వీరికి కుపిచ్చి, వర్ణపిచ్చి, వర్గపిచ్చి, ప్రాంతీయ పిచ్చిలాంటివి ఎన్నో ఉంటాయి. మతపిచ్చి ఉన్న వాడు ఇతర మతస్తుల్ని ద్వేషిస్తాడు. కుపిచ్చిగాడు మాత్రం స్వంత మతంలోని మనుషుల్నే అంటరాని వాళ్ళుగా దూరం పెట్టి అవమానిస్తాడు. తన ఆధిక్యత చూపుకోవడమే వాడికి ముఖ్యం. ఇలాంటి పరిస్థితి గమనించి రాహుల్‌ సాంకృత్యయన్‌ ఏనాడో ఓమాట చెప్పారు. ‘’ప్రతి మతం ఇతర మతానికి వ్యతిరేకం. కానీ, ప్రజల్ని పీడిరచడానికి అన్నీ ఏకమౌతాయి.’’ నిజమే కదా? ఈనాటికీ పరిస్థితి మారలేదు-ఉగ్రవాది మతం పేరుతో బయటి నుండి మనపై దాడి చేస్తాడు.వీడు మన అగ్రవాది-మతం పేరుతోనే స్వదేశీయు పైనే దాడు చేస్తాడు. ఇద్దరి ఉన్మాదం ఒకటే కదా? ఇదే విషయం మీద ఒక ఇమామ్‌ ఏమన్నాడో చూడండి -‘’ ఆత్మాహుతి ద్వారా స్వర్గానికి వెళ్ళడం ఖాయం -అని విశ్వసిస్తూ ఉంటే గనక, వారు తమను మాత్రమే ప్చుేకోవాలి. అంతే గాని ఇతరును క్చాడం దేనికీ? అది న్యాయమా?’’ అని ప్రశ్నించాడు ఇమామ్‌ తవ్‌హిడి.


‘’మతం ఒక ప్రమాదకరమైన మూర?త్వాన్ని నేర్పుతూ ఉంటుంది. అది చావుతో కూడా ముగిసిపోదు’’ అని అన్నారు ప్రముఖ జీవ పరిణామ శాస్త్రవేత్త రిచర్డ్‌ డాకిన్స్‌. ఆయన హేతువాది కూడా కాబట్టి అలా అన్నాడని అనుకుందాం. మరి హేతువాదం తోనూ, విజ్ఞాన శాస్త్రంతోనూ అంతగా సంబంధం లేని ప్రఖ్యాత ప్రకృతి కవి విలియం వర్డ్స్‌ వర్త్‌ కూడా అదే అభిప్రాయం ఎందుకు వెలిబుచ్చాడు- ఆలోచించాలి కదా? పైగా ఇద్దరూ బ్రిటీష్‌ వారే. వర్డ్స్‌ వర్త్‌ చెప్పిన మాట ఏమిటంటే -‘’శాంతి సౌఖ్యం, విశ్రాంతి ఇవ్వలేని మతం కంటే, ప్రకృతి ఆరాధనే ఉత్తమం? ‘’ విశ్వవిఖ్యాత బ్రిటీష్‌ శాస్త్రవేత్త ఛార్లెస్‌ డార్విన్‌ తన మిత్రుడికి రాసిన ఒక ఉత్తరంలో మతం పట్ల తన అభిప్రాయం తెలియజేశాడు. జీసస్‌ మీద గాని, బైబిల్‌ మీద గాని, తనకు విశ్వాసం లేదని – ఆయన తన మిత్రుడు ఫ్రాన్సిస్‌ మెక్‌ డెర్మొట్‌ అనే యువ బారిస్టర్‌కు రాశాడు. ‘’న్యూ టెస్ట్‌మెంట్‌ మీద మీకు విశ్వాసం ఉందో లేదో దయచేసి తెలియజేయండి-నేను దాని బహిర్గతం చేయను’’ అని ఆ యువ బారిస్టర్‌ లేఖ రాస్తే-దానికి జవాబుగా డార్విన్‌ అలా రాశాడు. అయితే చాలా కాలానికి డార్విన్‌ చేతి రాతతో ఉన్న ఆఉత్తరం న్యూయార్క్‌లో వేం వేశారు. అప్పుడు అది క్షా తొంభయ ఏడుమే పలికింది. ఆయువ బారిస్టర్‌ లేఖ రాసింది. 23 నవంబర్‌ 1880న అయితే, ఓ యాభై సంవత్సరా తర్వాత అది వేం వేయబడిరది. డార్విన్‌ వ్యక్తిత్వానికి, చేతిరాతకు, అభిప్రాయానికి ఎంత మివ ఉంటే, ఆ రోజుల్లోనే అంత డబ్బుకు వేం వేయబడాలీ? డార్విన్‌ మతం గురించి , దేవుడి గురించి ఎక్కడా ఏమీ చెప్పలేదు. జీవ పరిణామం ఎలా జరిగిందో రుజువుతో సహా తన సిద్ధాంతం ప్రతిపాదించాడు. అంతే ప్రపంచ వైజ్ఞానిక జగత్తు జేజేు పలికింది. అదే క్రమంగా దైవ విశ్వాసకుల్ని ఆలోచనలో పడేస్తూ వస్తోంది. సహస్ర నామాు వంటి విషయాు దాటి అయ్యవార్లు రాలేక పోతున్నారు. అంతకు మించిన జ్ఞానం వారికి లేదని సామాన్య జనం గ్రహించుకోవాలి. ఎక్కువ శాతం ఉన్న చెడుని దాచేసి, కొద్దిగా ఉన్న మంచిని చూపి మత బోధకు తమ మత గ్రంథా డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. పైగా తమకు తామే, తాము అభ్యుదయ వాదుమని రొమ్ము విరుచుకుంటూ ఉంటారు. మిత్‌- నుండి పుట్టితందే మైథాజీ అయిన ప్పుడు అది చరిత్ర అని నిరూపించడానికి కొందరు విఫయత్నం చేస్తుంటారు. అందుకే డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ అన్నారు. ’హేతువాదానికి నిబడని వాదను విశ్వసించగూడదు. సమాజం చైతన్యవంతంగా పురోగమించాంటే కాలాన్ని అనుసరించి నడుచుకోవాలి’’ -అని! అంతేకాదు ఇదే విషయాన్ని బ్రిటీష్‌ అమెరికన్‌ వక్త, జర్నలిస్ట్‌, విశ్వ విఖ్యాత రచయిత క్రిస్టోఫర్‌ హిచ్చెన్స్‌ మరింత స్పష్టంగా చెప్పారు. ‘’ఆధారం లేకుండా చెప్పబడుతున్న దేనినైనా..ఆధారం లేకుండానే తోసిపుచ్చవచ్చు-‘’అని! మతాచారా మూఢ నమ్మకా ఫలితంగా సాగిన హింసను కొంతైనా తగ్గించి, శాంతిని స్థాపించింది బుద్ధుడే. హిందూ పరిపాకులెవరూ శాంతిని కోరుకోలేదు. హిందూ మతాన్ని, వేదాను నమ్మని చార్వాకుల్ని ధర్మరాజు(మహా భారతంలోని పాత్ర కాదు) అనే పరిపాకుడు నిర్దాక్షిణ్ణంగా హత్యు చేయించాడు. ఆ చార్వాకు స్ఫూర్తితోనే బుద్ధుడు నాస్తికత్వాన్ని ప్రచారం చేశాడు. బుద్ధుడు నేర్చిన నాస్తికత్వం అనే భౌతికవాదితో జరిగిన చర్చలో నేర్చు కున్నదే! అందువ్ల బుద్ధుణ్ణి ఒక సామాజిక వాదిగా చూడాలి. దేవుడే లేడన్న బుద్ధుణ్ణి సైతం ఈ దేశంలో దేవుణ్ణి చేశారు. ఆయన జీవిత కథని ఆయన బోధనల్ని మార్చి రాశారు. చివరకు ఆయననే దశావతారాల్లో చేర్చుకున్నారు. కొన్నేళ్ళ క్రితం ఈ నే మీద నడయాడిన చారిత్రక పురుషుడు. మహోన్నత వ్యక్తిత్వం గ గొప్ప సంఘ సంస్కర్త! బౌద్ధంలోని అహింసని హైజాక్‌ చేసిన మనువాదు తాము అహింసా వాదుమని ప్రకటించుకుంటూ ఉంటారు. అదే నిజమైతే మరి వారు పూజించే జంతు ఋ, నర ఋ ఎందుకున్నాయి? శతాబ్దాు గడిచినా ఇలాంటి ప్రశ్నకు సమాధానం ఎందుకు దొరకడం లేదూ? ఏ మానవత్వాన్ని నిపడానికి ఇవి సంస్కృతిలో భాగమయ్యాయి? దుష్టును శిక్షిస్తున్నాడనే నెపం మీద ఇందుకు దుష్టును సృష్టించడం దేనికీ? మానవు ందరినే సద్భుద్ధితో సృష్టిస్తే సరిపోయేది కదా? ఈ కహాు, హత్యు, దోపిళ్ళు, రేప్‌ు, యుద్ధాు ఉండేవి కావు కదా? మొదట దుష్టును సృష్టించడం, మళ్ళీ వాళ్ళను సంహరించడానికి ఆయుధాు ఉపయోగించడం, హింసను ప్రేరేపించడం.. సున్నిత మనసులైన మావు, శాంతి కాముకు భరించలేరు కదా? జనాన్ని భయపెట్టి, అందులోంచి భక్తి పుట్టిస్తారా? భయపెట్టే తండ్రిని ఏ ప్లిూ ప్రేమించరు. విశ్వ మానవ సౌభ్రాతృత్వం గురించి ఏ దేవుడైనా చెప్పాడా? లేదే! ఇవి సర్వకా సర్వావస్థకు ప్రామాణికం ఎలా అవుతాయి? ఏ మతమైనా నరకం పేరుతో భయపెట్టి, స్వర్గం పేరుతో ఆశపెట్టి భక్తును లొంగదీసుకునేదే’’-అని అన్నాడు రాబర్ట్‌ జి. ఇంగర్సాల్‌, అమెరికన్‌ రచయిత స్వేచ్ఛాలోచనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చినవాడుఋ, యజ్ఞాు, యాగాు హిందూ ధర్మంలో భాగమై ఉన్నప్పుడు, వే ఏళ్ళ క్రితమే బుద్ధుడు వాటిని ఎందుకు వ్యతిరేకించాడో ఒక సారి ఆలోచించండి. వాటివ్ల కొంతమంది అగ్రవర్గాకు ఏం మేు జరిగేదో కాని, సామాన్యు తీవ్రంగా నష్టంపోయేవారు. వాటివ్ల వ్యవసాయం బాగా దెబ్బతినేది. పశువుపై ఆధారపడ్డ ఇతర వృత్తు వారిక్కూడా తీవ్ర నష్టం కలిగేది. ఇది కేవం హిందూ మతానికే పరిమితమైలేదు. ఇతర మతాలో కూడా ఉంది.


‘’దేవుడి పట్ల సమర్పణ భావం లేకపోతే జరిగే నష్టం ఏమీ ఉండదు. కాని, నైతికత లేకపోతే.. అన్నీ కోల్పోయినట్లే. నైతికత అనేది ప్రజ ఆస్థి’’- అని అన్నారు. పెరియార్‌ ఇవి రామస్వామి తమిళనాడులోని శ్రీరంగ పట్నంలో శ్రీ రంగనాథ ఆయం ఎదురుగా ఉన్న పెరియార్‌ విగ్రహం కింద పారాయి మీద చెక్కబడి ఉన్న సందేశం ఈ విధంగా ఉంది.
దేవుణ్ణి మరిచి మనిషికి కృతజ్ఞతు చెప్పు దేవుడు లేదు. దేవుడు అసలే లేడు!! సమర్పణ భావం వ్యక్తిగత విషయం

నైతికత ప్రజ సొత్తు – ఇ.వి. రామస్వామి (17 సెప్టెంబర్‌ జయంతి) దేశం నిండా వే దేవాయాు కడితే నాస్తికు మనోభావాు దెబ్బతినలేదు. కాని ఒక దేవాయం ఎదురుగా ఉన్న పెరియార్‌ సందేశం వ్ల ఆస్థికు మనోభావాు దెబ్బతిన్నాయి. అందుకు కొందరు కొర్టుకెక్కారు. ‘’ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎవరి అభిప్రాయం వారు కలిగి ఉండొచ్చు అది నేరం కాదు.-అని కోర్టు చెప్పడంతో కోర్టు కెక్కిన వారి నోళ్ళు మూతపడ్డాయి! – వ్యాసకర్త : డాక్టర్ దేవర రాజ్ మహారాజు , సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాజీ ప్రొఫెసర్‌.

మాయమవుతున్న రాజ్యాంగ మౌలిక స్వభావం

డెబ్బై రెండవ గణతంత్ర దినోత్సవాు ఘనంగా జరుపుకున్నాం. రాజ్యాంగాన్ని ఆమోదిం చుకున్న రోజు కనుక ఈ రోజు గణతంత్ర దినోత్స వం జరుపుకన్నాం. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభు త్వం రెండోసారి అధికారానికి వచ్చినతర్వాత రాజ్యాంగ పునాదును కూదోయటం మరింత వేగవంతమైంది. జమ్ముకాశ్మీర్‌నిఓరాష్ట్రంగా భారత రాజకీయ చిత్రపటం నుంచి తొగించటం, పౌర సత్వ సవరణ చట్టం మొదు రైతు వ్యతిరేక చట్టా వరకూ ఈధోరణి అడుగడునా కొట్టొచ్చి నట్లు కనిపి స్తోంది. ప్రత్యేకించి ఈ గత నెరోజుల్లో కేంద్రం చేసిన రెండు ప్రకటననేపథ్యంలో భారత రాజ్యాం గపు మౌలిక క్షణా గురించిన చర్చను మరోసారి మననం చేసుకోవాల్సి ఉంది. డిశంబరులో జరగా ల్సిన శీతాకా పార్లమెంట్‌ సమావే శాను రద్దు చేయటం, రైతుచట్టాను ఏడాదిన్నర పాటు వాయి దా వేయటానికి తాము సిద్ధమని కేంద్రం ప్రకటిం చటం ఈ రెండు ఘటను. ఈ రెండు ప్రకటనూ ప్రజ చేత ప్రజ కొరకు రూపొందించామని చెప్పుకుంటున్న రాజ్యాంగం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న గౌరవం ఏపాటితో తెలియచెప్పే సంఘ టను.రాజ్యాంగం రూపొందించే క్రమంలో పరి పానా స్వరూప స్వభావాు ఎలా ఉండాన్న విషయంపై రాజ్యంగ పరిషత్‌లోనూ వివిధ ఉపసంఘాల్లోనూ విస్తృతమైన చర్చ జరిగింది. అనం తరం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం స్వా తంత్య్రోద్యమ మివకు ప్రాతినిధ్యం వహిస్తున్నా నంటూ ముందుకొచ్చింది. చట్టసభు, కార్యనిర్వా హక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల్లో ఏ ఒక్క వ్యవస్థకూ సంపూర్ణ అధికారాు కట్టబెట్టని అధికార విభజన మన భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రం. అంతిమంగా న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ ప్రజా సార్వభౌమత్వానికి ప్రతినిధిగా ఉన్న చట్టస భకు లోబడి ఉండాన్నది ఈసూత్రం వెనక దాగి ఉన్న మౌలిక సిద్ధాంతం. కానీ ఈ మౌలిక సిద్ధాంతానికి చ్లిుు పెడుతూ నేనంటే నేను రాజ్యాంగ పరిషత్‌ వారసత్వానికి నిజమైన ప్రతినిధి నంటూ మూడు వ్యవస్థూ రాజ్యాంగం ఆమోదిం చిన తొలిఏడాదిలోనే సమస్యను తెర మీదకు తెచ్చాయి. 1951 నుంచి 1975 వరకూ సుప్రీం కోర్టు పు దఫాుగా భారత రాజ్యాంగపు మౌలిక క్షణాు, స్వభావం ఏమిటో నిర్వచించే ప్రయత్నం చేసింది. చివరకు కేశవానంద భారతి కేసు ఈ వివాదాన్ని ఓ కొలిక్కి తేవటంతో భారత రాజ్యాంగ వ్యాఖ్యాన చరిత్రలో ఈ కేసుపై జరిగిన విచారణ, తీర్పు ఓ మైు రాయిగా నిలిచిపోయింది. ఇక్కడ అధికారా విభజన అంటే రాజ్యానికి మతానికి మధ్య స్పష్టమైన విభజనను పాటించటం, రాజ్యం మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు, మతం, మత విశ్వాసా ఆధారంగా పని చేసే సంస్థు రాజకీయాల్లో ప్రభుత్వ వ్యవహారాల్లో మే పెట్టకూడదు అన్న విభజనే. దీంతో పాటు రాజ్యాం గ యంత్రంలోని వివిధ వ్యవస్థు, విభాగా (పార్ల మెంట్‌, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థు) మధ్య రాజ్య భారాన్ని నిర్వహించటంలో పని విభజన కూడా. కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు…వ్యక్తిగత స్వేఛ్చా స్వాతం త్య్రాు, సమాఖ్య స్వభావం, ప్రజాస్వామిక గణ తంత్ర ప్రభుత్వం,లౌకికతత్వం,అధికారా వికేంద్రీ కరణను రాజ్యాంగపు మౌలిక స్వభావంగా, క్షణంగా నిర్ధారించింది.‘’రాజ్యాంగ సవరణ ద్వారా కూడా ప్రభుత్వం రాజ్యాంగపు మౌలిక స్వభావానికి భిన్నంగా వ్యవహరించరాద’’న్నది ఈ తీర్పు సారాంశం. గత ఏడేండ్లల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ నిర్ణయాు,చేసిన చట్టా నేపథ్యం లో పైన ప్రస్తావించుకున్న క్షణాు ఎలా ఎంత వేగంగా కనుమరుగవుతూ వస్తున్నాయో అర్థం చేసు కోవటం గణతంత్ర దినోత్సవ స్పూర్తిని సజీవంగా నిలిపి ఉంచానకుంటున్న ప్రతి ఒక్కరి బాధ్యత. భీమా కోరెగాం మొదు పౌరసత్వ వ్యతిరేక ఉద్య మాు, జమ్ము కాశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దు చట్టం వరకూ కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత స్వేఛ్చా స్వాతంత్య్రాను తిరస్కరిస్తూ చట్టాు చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్య్రాల్లో భాగంగానే నచ్చిన మత విశ్వాసాు పాటించటం, విచారణ లేకుండా నిరవధిక ఖైదీగా ఉండకుండా స్వేచ్ఛాగా సంచరిం చే హక్కు వంటివి కూడా కలిసి ఉన్నాయి. కానీ కేంద్రంలో బీజేపీ అధికారానికి వచ్చిన గత ఏడేం డ్లల్లో ఈ వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్య్రాు ఏలా హననమవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇక నచ్చిన మతవిశ్వాసాన్ని పాటించే హక్కు గురించి ఎంత తక్కువగా చర్చించుకుంటే అంత మంచిది. పు బీజేపీ పాలిత రాష్ట్రాు మతాంతర వివాహాపై ఆంక్షు విధిస్తూ చేస్తున్న చట్టాు.. రాజ్యాంగ స్ఫూర్తితో పాటు సుప్రీం కోర్టు నిర్వచించిన రాజ్యాంగపు మౌలిక స్వభావ సిద్ధాంతానికే పూర్తి భిన్నమైనవి. అయినా ఈచట్టాు చలామణీ అవుతూనే ఉన్నాయి. సుప్రీం కోర్టు సైతం జోక్యం చేసుకునేందుకు సాహసించటంలేదు. రాజకీయాు, మతం మధ్య చెరగని గీతుండాన్న మౌలిక క్షణం బీటు వారటం ఏనాడో ప్రారంభమైంది. చివరకు రామమందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో ఓట్రస్టు ఏర్పాటు చేయటంతో ఈ సూత్రం అధఃపాతాళానికి చేరింది. ఓవైపున నిరసన తెపటం పౌరు ప్రాధమిక హక్కు అంటూనే మరో వైపున రిపబ్లిక్‌ డేసందర్భంగా ట్రాక్టర్స్‌ పేరేడ్‌ను అడ్డుకోవటానికి, అదుపు చేయటానికి మీకున్న అధికారాు, అవకాశాు నేను గుర్తు చేయాలా అని ఢల్లీి పోలీసును ప్రశ్నించిన సుప్రీం కోర్టును గమనిస్తే ఏకంగా న్యాయ వ్యవస్థే పంజ రంలో చికగా మారిపోయిన వైనం తేటత్లెమ వుతున్నది. ఇక రాజ్యాంగ యంత్రంపై ప్రజ సార్వభౌమాధికారం, ప్రజలెన్నుకున్న చట్టసభ అధి కారం స్థానంలో కార్యనిర్వాహకవర్గం సంపూర్ణ సార్వభౌమాధికారం చెలాయించటం ఈ కాంలో ముందుకొచ్చిన మరో ప్రమాదకరమైన ధోరణి. ఉదాహరణగాపైన ప్రస్తావించుకున్న రెండు ఘటను ఈ ధోరణి తీవ్రతను తెలియచేస్తున్నాయి. చట్టసభు ఆమోదించిన చట్టా అము తాత్కాలి కంగా వాయిదా వేయాని సుప్రీం కోర్టు తీర్పుని చ్చింది. గత కొంతకాంగా జరుగుతున్న పరిణా మాు, వాటికి సుప్రీం కోర్టు స్పందన గమనిస్తే కనీసం చట్టసభ అభిప్రాయాన్ని తీసుకోమనని సహా ఇవ్వాన్న ఆలోచన అత్యున్నత న్యాయ వ్యవస్థకు రాకపోవటంలో పెద్దగా ఆశ్చర్యమేమీ కగదు. రైతుతో పదోదఫా జరిగిన చర్చల్లో ఈ చట్టా అమును ఏడాదిన్నర పాటు వాయిదా వేయటానికి సిద్ధమనీ, దానికిగాను రైతు తమ ఆందోళనను విరమించాని కేంద్రం షరతు విధించింది. ఈ వ్యవహారం రైతు ఆందోళనను నీరుగార్చే ప్రయత్నం తప్ప వాళ్లు లేవనెత్తిన అం శాను ప్రభుత్వం అంగీకరించి చట్టాు అము నిలిపి వేయటం లేదన్న వాస్తవాన్ని అటుం చితే పార్లమెంట్‌ పట్ల వీసమెత్తు గౌరవం కూడా బీజేపీ ప్రభుత్వానికి లేదన్న వాస్తవాన్నిమాత్రం ఈ ప్రకట ను బట్ట బయు చేస్తున్నాయి. చివరిగా రాజ్యాంగ మౌలిక స్వభావంలో కీకమైన సమాఖ్య స్వభావం గురించి క్లుప్తంగా ప్రస్తావించుకుందాం. మన రాజ్యాంగంలోనే బహీనమైన రాష్ట్రాు, బమైన కేంద్రంఅన్న భావనకు బమైన పునాదు ున్నాయి. ఈపునాదు ఆధారంగానే నాటి ఇందిరా ప్రభుత్వం అన్ని వ్యవస్థను చాపచుట్టి చంకన బెట్టి అత్యవసర పరిస్థితి విధించింది. ఈ అత్యవసర పరిస్థితి నేప థ్యంలో దాఖలైన కేసు విచారిస్తున్న సమయంలోనే సుప్రీం కోర్టు రాజ్యాంగపు మౌలిక స్వభావం అన్న సిద్ధాంతాన్ని తెర మీదకు తెచ్చింది. నేటి బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్వభావాన్ని ఏస్థాయిలో పాతరే స్తుందో రుజువు చేయటానికి వ్యవసాయక చట్టాను మించిన ఉదాహరణ అక్కర్లేదు. వ్యవసాయం ఉమ్మడి జాబితాలోని అంశమే. వ్యవసాయం విద్య, ఆరోగ్యం వంటి కీక విషయాపై నిర్ణయాు తీసుకునేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాను సంప్ర దించటం, వారి ఆమోదాన్ని పొందటం సమాఖ్య స్వభావంలో కీకమైన ఆచరణాత్మక రూపం. బీజేపీ రెండో దఫా అధికారానికి వచ్చిన తర్వాత ఈసమాఖ్యకు దారుణంగా తూట్లుపడ్డాయి. ఇందిరా హయాంలో ఈప్రయత్నం జరిగినా అప్పుడప్పుడే తెరమీదకు వస్తున్న ప్రాంతీయ పార్టీు, వాటి వెనక నిలిచిన శక్తు ఏదో ఓమోతాదులో ప్రతిఘ టించాయి. సర్కారియా కమిషన్‌ నియమించేలా కేంద్రాన్ని ఒత్తిడి చేయగలిగాయి. కానీ నేటి ప్రాంతీ య ప్రభుత్వాు తమ కాళ్ల కింది నుంచి భూమి కదిలిపోతున్నా స్పందించలేని దుస్సహాయ స్థితికి చేరాయి.రాజ్యాంగ మౌలిక స్వభావం అన్న చర్చ తెరమీదకు వచ్చిన నేపథ్యాన్ని క్లుప్తంగా ప్రస్తావించు కుందాం. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మన్‌ పాకుడిగా పగ్గాు స్వీకరించిన హిట్లర్‌ నాటి జర్మనీ రాజ్యాంగాన్ని సమూంగా మార్చే శాడు. అలా మార్చటానికి రాజ్యాంగంలో ఉన్న అవకాశానే వినియోగించు కున్నాడు. దాని పర్యవ సానాు, యూదు ఊచకోత, ప్రపంచం చవి చూసిన విపత్తు చరిత్ర పుటనిండా రక్తాక్ష రాతో విస్తరించివుంది. ఈ నేపథ్యంలో రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక నూతన రాజ్యాంగాన్ని రూపొం దించుకుంటున్న జర్మన్‌ పాకవర్గం రాజ్యాంగంలో కొన్ని అంశాు తిరుగులేనివని, ఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినా ఈ మౌలిక స్వభావానికి లోబడే వ్యవహరించాని తీర్పునిచ్చింది. నాటి నుంచీ ప్రతి ప్రజాస్వామిక ప్రభుత్వం తమతమ రాజ్యాంగాల్లో కొన్ని క్షణాను మౌలిక క్షణా ుగా గుర్తిస్తూ వస్తున్నాయి. మరినేటి బీజేపీ ప్రభు త్వం భారత రాజ్యాంగపు మౌలిక క్షణాను, స్వభావాన్ని పునాదుతో సహా పెకలించి వేయ బూనుకోవటంఏఉత్పాతానికి హెచ్చరిక కాబో తోంది?

దేశభక్తి, మతం, ఆరెస్సెస్‌ భావజాం
కొన్ని సంవత్సరాుగా ‘జాతి- వ్యతిరేకి’ అనే పదం వ్యవహారిక పదంగా ఉంటుంది. నేడు ఆరెస్సెస్‌ను, దాని సంతానాన్ని విమర్శించే వారిని జాతి వ్యతిరేకుగా ముద్ర వేస్తున్నారు. హిందూ జాతీయవాదానికి నెవుగా ఉన్న ఈదేశభక్తిని మతంతో ముడి పెట్టడంలో ఆరెస్సెస్‌ మరింత శక్తివంతంగా తయారవుతుంది. ఈ జాతికి విధే యుగా ఉన్న హిందువును అభినందించే క్రమంలో, ముస్లిం గురించి ముఖ్యంగా ‘వారు పాకిస్థాన్‌కు విధేయుగా ఉంటారు’ లాంటి సున్నిత మైన, నేర్పైన మాటను ప్రచారంలో పెడుతున్నారు. ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌,తన తెలివైన పదా వ్యక్తీకరణతో మతం కారణంగా, హిందు వు స్వభావ రీత్యానే దేశభక్తి యుతంగా ఉంటా రని పేర్కొన్నాడు. అదేవిధంగా గాంధీ జీ దేశభక్తి మూం హిందూ మతంలోనే ఉందని చెప్పేం దుకు, ఆయన గాంధీజీ మాట్లాడిన వాక్యం యొక్క అర్థాన్నేమార్చాడు. ‘’భారతీయుందరూ మాత భూమిని ఆరాధిస్తారు. కానీ, నా దేశభక్తి నా మతం నుండే వచ్చిందని, గాంధీజీ అన్నాడు. కాబట్టి, నీవు హిందువు అయితే నీవు స్వయం చాలిత (ఆటోమేటిక్‌) దేశభక్తునివి అవుతావు. నీవు చైతన్య రాహిత్యం ఉన్న హిందువు కావచ్చు,నీకు ఒక మేల్కొుపు అవసరం ఉండొచ్చు, కానీ హిందువు ఎప్పటికీ భారతదేశానికి వ్యతిరేకిగా ఉండడు.’’ ఈ సమాచారంలో దాగి ఉన్న నేర్పైన మాటను విశ్లేషించే ముందు మనం, ఆరెస్సెస్‌ ప్రారంభ దశలో దాని సిద్ధాంతకర్త, యంఎస్‌ గోల్వ్కార్‌ బాగా ఆలోచించి నాజీను పొగు డుతూ, యూ దు పట్ల నాజీు వ్యవహరించిన విధంగానే, మనం ఈదేశంలోని ముస్లిరు, క్రైస్తవు పట్ల (ఆరెస్సెస్‌ ప్రకారం వారు విదేశీ మతస్థు) వ్యవహరించాని సిఫార్సు చేశాడన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. బీజేపీ, వీహెచ్‌పీ, ఏబీవీపీ, వన్వాసిస్‌ కళ్యాణ్‌ ఆశ్రమ్‌ లాంటి తన అనుబంధ సంస్థ ద్వారా, వివిధ ప్రభుత్వ సంస్థు, మీడియా, విద్యా వ్యవస్థలో చొరబాటు ద్వారా ఇప్పుడు ఆరెస్సెస్‌ బలోపేతం అవుతున్నది. హిందూ జాతీ య వాద భావజాలాన్ని అందించే క్రమంలో అది ఉపయో గించే భాష చాలా నేర్పుగా ఉంటుంది. గాంధీజీకి సంబంధించినంతవరకు మతం అనేది వ్యక్తిగతమైన విషయంగా భావించి, తనను తాను సనాతన హిందువుగా చెప్పుకున్నాడు. కానీ తన హిందూ మతం ఉదారంగానూ, అందరినీ కుపు కొని పోయేదిగా ఉంటుంది. ఆయన మతం అనేక నైతిక మివతో కూడి ఉంటుంది. ఆయన తన ఆధ్యాత్మిక శక్తిని అన్ని మతా నుండి సాధించాడు. ‘’నన్ను నేను మంచి వానిగా పరిగణిస్తాను, ఒక ముస్లింను నాలాంటి ఒక హిందువుగా పరిగణి స్తాను. ఆ మాటకొస్తే నన్ను నేను ఒక క్రైస్తవుడు, ఒకఫార్శీతో సమానమైన మంచి మనిషిగా పరిగ ణిస్తాను’’ అంటాడు ఆయన. హిందూ మతా చారా లో ఇతర మతాకు చెందిన ప్రజను గౌరవిం చడం,వారిని కుపుకొనిపోయే విధానంఉంటాయి. ఇది ఆరెస్సెస్‌ ఆచరించే (మిగిలిన మతా ప్రజను మినహాయించే, సంకుచితమైన అవగాహనకు) హిందూ మతాచారాకు పూర్తి భిన్నంగా ఉం టుంది. వారి ఆచరణ నిరంతరం, ప్రజు మర్చి పోయిన సమస్యను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి, ఇతర మతాకు చెందిన వారిని భయభ్రాంతుకు గురి చేస్తుంది. గాంధీజీ మతాచార, సాంప్రదా యాు ఉదారంగా, అందరినీ కుపుకొని పోయే విధంగా ఉంటాయి. కాబట్టే, బ్రిటిష్‌ పానకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భిన్న మతాకు చెందిన ప్రజకు నాయకత్వం వహించగలిగాడు. ఆయన ఎప్పుడూ మతాన్ని, జాతీయతతో, దేశభక్తితో కలిపి చూడలేదు. అంటే దానర్థం దేశం పట్ల, దేశ ప్రజ పట్ల ఉండే ప్రేమ, ‘దేశభక్తి’ మూలాు మతంలో లేవు. కానీ మతం మూం లేని ‘జాతీ యత’లో ఉంది. ఆయన ఉపయోగించిన పదం ‘మతం’ రెండు స్థాయిను కలిగి ఉంటుంది. మొద టిది, ప్రముఖ ఆచారాు,గుర్తింపు,విశ్వాసం మొదలైన వాటి భావన, రెండవది, మత బోధన లోని స్వాభావిక నైతికత. మతాకు నైతికతే ప్రధానమైనది అనే విషయంపై ఆయనకు స్పష్టత ఉన్నప్పటికీ,బీజేపీ,ముస్లిం (ముస్లిం లీగ్‌ మొదలైన) మతతత్వ వాదు ఇష్టాు ఆయన ఉపయోగించిన పదాన్ని కేవం ఆచారాు,పవిత్ర స్థలా స్థాయి లోనే తీసుకున్నాయి. హిందూ జాతీయవాద భావ జాంలో భాగంగా ఉంటూ, ఆరెస్సెస్‌కు దగ్గరగా ఉండే సిద్ధాంతకర్తు, ‘భారత దేశాన్ని ఒక జాతిగా నిర్మించిన’ గాంధీజీతో పాటు ఇతర జాతీయ నాయ కు మాటు కూడా ఆరెస్సెస్‌ భావజాలానికి దగ్గరగా,వాటినే పోలి ఉంటాయని చెప్పేందుకు చాలా కష్టపడుతున్నారు. స్వాతంత్య్రపోరాట ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖుకు, ‘భారతదేశం ఒక జాతిగా ఏర్పడిన విధానాకు’, వారి భావ జాలానికి పోలిక ఉందని చూపించడం ద్వారా వారి సిద్ధాంతానికి చట్టబద్దతను పొందే ప్రయత్నం లో వారు ఆరెస్సెస్‌ సిద్ధాంతాన్ని నిుపుకుంటున్నా రు. కాబట్టి, హిందువు సహజంగానే దేశభక్తి కలిగి ఉంటారు, వారు జాతి వ్యతిరేకుగా ఉండరనేది ఇప్పుడు సూత్రీకరణ చేస్తుంటే, మరోవైపు ఇతర మతాకు చెందిన వారి జాతీయత, దేశభక్తి ఇప్పుడు అనుమానాస్పద మైంది. ఇది ఆధునిక భారతదేశ నిర్మాణంలో ముస్లిరు, క్రైస్తవు అందించిన గొప్ప సేవను నిర్లక్ష్యం చేస్తుంది. బ్రిటిష్‌ పానకు వ్యతిరేకంగా నివడమే కాకుండా భారతదేశ విభజనను వ్యతిరేకించిన ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ను అనుసరించిన మిలియన్‌ సంఖ్యలో ఉన్న ముస్లిం ను ఎక్కడ పెడతారు? షిబ్లీ నొమాని, హస్రత్‌ మొహని, అశ్ఫఖుల్లాఖాన్‌ను ఎక్కడ ఎలా చూ డాలి? మహ్మదలీ జిన్నా పాకిస్థాన్‌ను విభజిం చాని చేసిన తీర్మానాన్ని వ్యతిరేకించేందుకు ముస్లిం మహాసభను నిర్వహించేందుకు సాధనం గా ఉపయోగించిన అల్లాబక్ష్‌ సేవకు ఏం మివ కట్టాలి? స్వాతంత్య్రోద్యమ పోరాటంలో పాల్గొనేం దుకు ముస్లిరు అసంఖ్యాకమైన సంస్థను ఏర్పాటు చేశారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో, పారిశ్రా మిక, విద్యా, క్రీడా, సాంస్కృతిక రంగాలో దేశాన్ని ముందుంచేందుకు స్వాతంత్య్ర భారతదేశంలో అన్ని ప్రాంతాకు చెందిన ప్రజు సమానమైన ఉత్సా హంతో సేమ అందించారు. వారంతా దేశభక్తి కలిగిన పౌయి, జాతీయ భావాు కలిగిన వారు కాదా? మరోవైపు, మోహన్‌ భగవత్‌ సూత్రీకరణ, జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన, తమ శాఖలో శిక్షణ పొందిన నాథూరాం గాడ్సేను సమర్థిస్తుంది. సుప్రీంకోర్టు బాబ్రీ మసీదు కూల్చి వేతను నేరంగా పరిగణించింది. అప్పుడు ఈ కూల్చివేతకు నాయకత్వం వహించిన వారిని, దానిలో భాగస్వాములైన వారిని ఏమనాలి? భగవత్‌ చెప్పిన ప్రకారం,గాంధీజీ, క్బుర్గీ, నరేంద్ర దబ్కోర్‌, గౌరీంకేశ్‌, గోవింద పన్సారే లాంటి వారిని హత్య గావించిన చర్యను, దేశభక్తి యుత మైన చర్య జాబితాలో చేర్చాలా? రహస్య సమా చారాన్ని చేరవేసే వారు, స్మగ్లింగ్‌, బ్లాక్‌ మార్కెటింగ్‌ చేసే అనేక మంది హిందువును ఏ స్థానంలో ఉంచాలి? ఆసక్తికరంగా, ఆరెస్సెస్‌ గాంధీని గౌర విస్తుంది, దాని శిక్షణ పొందిన ప్రచారక్‌ు, సిద్ధాం తకర్తు, ఇతర అనుబంధ సంస్థు మాత్రం బహిరంగంగా నాథూరాం గాడ్సేను గౌరవిస్తారు. గాడ్సేను కీర్తిస్తూ పెద్ద సంఖ్యలో ట్వీట్లు మనం చూస్తున్నాం, అదికూడా హిందువు నుండే ఎక్కువ. ఇది ఆరెస్సెస్‌ యొక్క భావ జాలాన్ని వ్యాప్తి చేసే సామర్థ్యాన్ని తొపుతుంది. అటువంటి సంస్థ మాత్రమే ఏకకాంలో గాంధీజీ పట్ల విధే యతను ప్రదర్శిస్తూ, గుట్టుచప్పుడు కాకుండా ఆయన హత్యకు దారి తీసిన భావజాలాన్ని వ్యాప్తి చేసుకోగుగుతుంది.-కె వీరయ్య

వ్యాక్సిన్‌ లాభా కోసమా?..ప్రజ కోసమా…?

‘ ఎటు పోతున్నావ్‌ కరోనా?’’ అంటూ మసూచి సమాధిపై కూచున్న టి.బి, ఫ్లూ, జికా, సార్స్‌, ఎయిడ్స్‌,ఆంథ్రాక్స్‌, కరా, పోలియో, ఇంకొన్ని వైరసు ప్రశ్నించాయి. సమాధానంలేదు. కారెగరేసుకొని పోతున్నావు, కొత్త బట్టు కుట్టించుకున్నావు ఎక్కడికి?’’ మళ్ళీ అదే ప్రశ్న. ఇక తప్పింది కాదు కరోనాకి. నోరు విప్పాల్సి వచ్చింది.’’

దేశంలో కరోనావ్యాధి తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నా...ఈవ్యాధి ప్రమా దం సమీప భవిష్యత్తులోనే పొంచి వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కరోనా దరిదాపుగా ప్రపంచ దేశాన్నింటికీ సోకింది. మనదేశంలో కరోనావ్యాధి మార్చి 30వ తేదీన తన ప్రయాణాన్ని ప్రారంభించి, డిసెంబర్‌ 19వ తేదీ నాటికి కోటి మందికి సోకింది. క్షా 45 వే మందిని తన పొట్టనబెట్టుకున్నది. కరోనా వ్యాధి వస్తే నయం చేసుకోవడానికి స్పష్టమైన మందు లేకపోవడంతో నివారణే ఏకైక మార్గమని, అందులో వ్యాక్సినేషనే అత్యుత్తమ నివారణ మార్గమని ప్రపంచ ప్రజందరూ వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్‌ ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ఈవ్యాధి నుండి బయటపడవచ్చుననే ఆశతో వున్నారు. రష్యా‘స్పుత్నిక్‌’పేరుతో ఆదేశ ప్రజకు కరోనావ్యాక్సిన్‌ను అందుబాటులో వుంచ డంతోపాటు వివిధ దేశాలో ఈ వ్యాక్సిన్‌ అమ్మకానికి సంబంధించిన ఒప్పందాు కూడా చేసుకుంది. అదేవిధంగా అమెరికాలోని ‘ఫైజర్‌’ కంపెనీ ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను ప్రపంచం లోనే మొదటిసారిగా అందుబాటులోకి తెచ్చి ప్రపంచ దేశాతోవ్యాక్సిన్‌ అమ్మక ఒప్పం దాను చేసుకుంటూ పోతోంది.మనదేశంలోసిఎంఆర్‌,సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, జైడస్‌, డా.రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ లాంటి కంపెనీతో పాటు మరికొన్ని కంపెనీు కూడా వ్యాక్సిన్‌ అందుబాటు లోకి తేవడానికి తీవ్రమైన కృషి చేస్తున్నాయి. ఇలా ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్‌ ను అందుబాటు లోకి తేవడానికి ఇప్పటికి దరిదాపుగా 200 కంపెనీు తీవ్రమైన ప్రయత్నాు చేస్తున్నాయి. ఇందులో ఏకంపెనీ కూడా కరోనా వ్యాక్సిన్‌ తయారీలో వున్నటువంటి ప్రయోగ దశలో ముఖ్యమైన మూడో దశ ప్రయోగాను పూర్తి చేయలేదు. పైగా,తమ వ్యాక్సిన్‌ బాగా పని చేస్తుందని విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నాయి. కొన్ని ప్రభుత్వాు ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతు కూడా మంజూరు చేశాయి. బ్రిటన్‌, అమెరికా, రష్యా లాంటి దేశాలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మొదలైంది. ఇటీవ కరోనా వ్యాక్సిన్‌పై విపరీతమైన ప్రచారాు ఊపం దుకుంటున్నాయి. అవేమిటంటే అమెరికాకు చెందిన ‘ఫైజర్‌’ అనే బహుళజాతి కంపెనీ తను తయారు చేసిన వ్యాక్సిన్‌ కరోనాను 95 శాతం నియంత్రించగదని ప్రకటించు కుంది. ‘ఫైజర్‌’ కంపెనీ ప్రకటించిన రెండో రోజే 92శాతం కరోనాను నియంత్రించ గలిగిన వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు రష్యా మీడి యాకు సమాచారాన్ని విడుద చేసింది. అయితే ఈవ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ సమా చారం హేతుబద్ధంగా లేదని, నియంత్రించే శక్తిని విశదీకరించే విషయా వివరణు పొందుపరచలేదనే విమర్శు వస్తున్నాయి. ఇప్పుడు‘ఫైజర్‌’కంపెనీ వ్యాక్సిన్‌పై స్పందిం చిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టి ట్యూట్‌ ఆఫ్‌ మెడి కల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌ ఈ వ్యాక్సిన్‌ ను-70డిగ్రీ సెల్సియస్‌ దగ్గర భద్ర పరచ వసిన అవసరం వుందని చెప్పారు. దీని నిర్వహణ మన దేశంలో కష్టసాధ్యంగాఉంటుందని, ఆర్‌యన్‌ఎ ఆధారిత వ్యాక్సిన్ల న్నీ చాలా ఖరీదుతో కూడుకున్నవని స్పందిం చారు. ప్రపంచ జనాభా 780కోట్లు ఉంటే వ్యాక్సిన్‌ శీతలీకరణ సామర్థ్యం 300కోట్ల జనాభాకు మించి లేదు. దీనివ్ల ఈ వ్యాక్సి న్‌ వచ్చినా అందరికీ అందుబాటు లోకి రావడానికి చాలా సమయం పడుతుంది. ‘ఫైజర్‌’ కంపెనీ మన దేశంలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించ కుండానే వ్యాక్సిన్‌ అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వా ని భారత ఔషధ నియంత్రణ అధికారుకు దరఖాస్తు చేసుకుంది. ఇటీవ అపోలో హాస్పిటల్‌ కార్పొరేట్‌ యజమాన్యం10క్ష వ్యాక్సిన్లు ఇచ్చేం దుకు మీగా తమ మౌలిక వసతు సమకూర్చు కుంటున్నా మని ప్రకటించింది. ఈవిధంగా వ్యాక్సి న్‌ తయారీ దశలోనే ఒకవ్యాపార దృక్పథం బట్ట బయు అవుతున్నది. ఇదంతా అము కావడానికి రెండు లేదా మూడు సంవత్స రాు పట్టవచ్చని పువురు వైద్య నిపుణు అంచనా వేస్తున్నారు. రేపు వ్యాక్సిన్‌ బయట కు వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా వుంటుందనేది ఈ పరిణా మాు తెలియజేస్తున్నాయి. వ్యాక్సిన్‌ తయారీ ఒక భాగమైతే ఈవ్యాక్సిన్‌ ప్రజందరికీ అందు బాటు లోకి తీసుకురావడం మరో ముఖ్యమైన అంశం. ప్రపంచ దేశాల్లో కానీ భారత్‌లో గాని కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ప్రధానం గా నిమగమైనవన్నీ బహుళజాతి కంపెనీలే. రాబోయే కాం కరోనా వ్యాధిదేనని గుర్తిం చినఈకంపెనీన్నీ గత ఆరు మాసా నుండి భవిష్యత్తు లాభా కోసం అయ్రి చాస్తు న్నాయి. లాభాలే పరమావధిగా భావించే బహుళజాతి కంపెనీు ఈవ్యాక్సిన్‌ పేరుతో చేసే వ్యాపారం ప్రజకుశాపంగా మార నున్నదా అన్న అనుమానాు కూడా వస్తు న్నాయి.
ఎందుకో తెలియాంటే…
కరోనా విజృంభణ జరిగిన మే తరు వాత చోటు చేసుకున్న ఓఅంశాన్ని ప్రస్తావించు కుందాం. ఎబోలావ్యాధి నివారణకు వాడిన ‘’గిల్లెడ్‌’’కంపెనీ ‘’రెమిడెసి విర్‌’’ఇంజక్షన్‌ కరోనా నివారణకు మందుగా అమెరికాకు చెందిన బహు జాతి కంపెనీ మార్కెట్‌లోకి విడుద చేస్తూ విపరీ తమైన ప్రకటను గుప్పించింది. తద్వారా ఈ మం దుకు కృత్రిమకొరతను సృష్టించి బ్లాక్‌ మార్కె ట్‌లో అమ్మింది. ఈమందు కోర్సు వాస్తవ ఖరీదు రూ.36మే. కానిబ్లాకులో రూ.క్ష వరకు అమ్మ కం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ‘’సాలిడారిటీ ట్రయల్‌’’లో ప్రకటించినంత నియం త్రణ ఈమందుకులేదని,కేవంతాత్కాలిక ఉపశ మనమే ఇచ్చేలా వుందని, దీన్నిమందు ప్రోటో కాల్‌ జాబితా నుంచి తొగించారు. కానీ బహుళ జాతి కంపెనీకు కొమ్ము కాసే అమెరికన్‌ ఫుడ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డి ఏ)ఈ మందును కరోనా నివారణా మందుగా అనుమతిస్తూ ప్రకటిం చింది.ఈ మందును మన దేశంలో విచ్చవిడిగా చాక్లెట్లు, బిస్కెట్లు మాదిరిగా కార్పొరేట్‌ ఆసుపత్రు ఉపయోగించాయి.
భారతదేశంలో కరోనా విజృంభణ జరు గుతున్న తరుణంలో దీని నివారణ బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకుని రాష్ట్ర ప్రభు త్వాపై వదిలేసింది. రాష్ట్ర ప్రభుత్వాు లాక్‌డౌన్‌ సడలిం పును అదునుగా తీసుకుని పూర్తిగా చేతు ఎత్తేశాయి. ఒక వైపు కేసు పెరిగి వ్యాధి సామా జిక వ్యాప్తి చెందిందని, రెండవ విడత కరోనా వచ్చే అవకాశం లేకపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికను సైతం లెక్క చేయ కుండా పూర్తిగా ప్రజ స్వీయ నియంత్రణకే వదిలేశారు. కరోనా పరీక్షు విస్తృతపరిచే కొదీ కేసు తీవ్రత పెరుగుతున్నట్లు గుర్తిం చినా అందరికీ పరీక్షు చేయానే సూచన ను కూడా పక్కకు పెట్టారు. వ్యాక్సిన్‌ రావడంఆస్యం అవుతుందని తెలిసినా… ప్రభుత్వపరంగా ప్రజకు…మాస్కు ధారణ, చేతు శుభ్రత,భౌతిక దూరం వంటి జాగ్రత్త ు కూడా చెప్పడంలేదు. వాటిని ప్రజ విజ్ఞతకే వదిలేశారు. మరోవైపు విద్యార్థుకు వార్షిక పరీక్ష నిర్వహణ, స్కూళ్లు,కాలేజీు తెరవడంతో వచ్చే పరిణామా కు తగ్గట్లు యంత్రాంగాన్ని వినియోగించడం లోనూ అనేక లోపాు మెగు చూశాయి.
ఇటీవబీహార్‌ ఎన్నికల్లో ఆరాష్ట్ర ప్రజ కు కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తామని బిజెపి ఎన్నిక మ్యాని ఫెస్టోలో ప్రకటించడంతో దేశవ్యా ప్తంగా ప్రతిపక్షాు, ప్రజ నుంచి తీవ్రవ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రజందరికీ వ్యాక్సిన్‌ అందిస్తా మని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. అయితే దీని ధర రూ.750 వుంటుందని ప్రధాని మోడీ ప్రకటించారు. కోవిడ్‌ వ్యాక్సి న్‌ తయారీ, తదుపరి పూర్తిస్థాయి క్లినికల్‌ ట్రయల్స్‌ను విజయ వంతంగా ముగించుకుని వచ్చిన వ్యాక్సిన్‌ను ప్రభు త్వమే తమ అజమాయిషీలో అందరికీ ఉచితంగా పంపిణీ చేసే బాధ్యతను చేపట్టాలి. దీనికి అనుగు ణంగా ముఖ్యంగా ప్రభుత్వ రంగ వ్యాక్సిన్‌ కంపె నీను,ప్రభుత్వ రంగమందు కంపెనీను అవసర మైతే ప్రైవేటు కంపె నీను కూడా తమ ఆధీనం లోకి తీసు కుని…అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాకు పంపిణీ అయ్యే విధంగా కోల్డ్‌ చైన్‌ను, రవాణా ఏర్పాట్లను చేయాలి. అప్పుడే వ్యాక్సిన్‌ అందరికీ వీలై నంత తొందరగా అందుబాటు లోకి వస్తుం ది.కానీ ప్రభుత్వ చర్యు ఈవిధంగా లేవు. ‘అంద రికీ వ్యాక్సిన్‌’ ప్రకటనకే పరిమిత మయ్యే విధంగా వున్నది. కరోనా వ్యాక్సిన్‌ ప్రజందరికీ ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తిం చాలి. ఈవ్యాక్సిన్‌ తయారీ, పంపిణీ, నియంత్రణ, అజ మాయిషీ అంతా ప్రస్తుతం కార్పొరేట్‌ కంపెనీ చెప్పుచేతల్లోనే వున్నది. ఈవ్యాక్సి న్‌ రావడంతో కరోనా కట్టడికి ఎంతమేర ఉపయోగపడుతుందో తెలియదుగానీ,వ్యాక్సిన్‌ కార్పొరేట్ల కోసమని స్పష్ట మవుతున్నది.
ఎటు పోతున్నావ్‌ కరోనా…?
‘’ఎటు పోతున్నావ్‌ కరోనా?’’ అంటూ మసూచి సమాధిపై కూచున్న టి.బి,ఫ్లూ,జికా, సార్స్‌,ఎయిడ్స్‌,ఆంథ్రాక్స్‌,కరా, పోలియో, ఇంకొన్ని వైరసు ప్రశ్నించాయి. సమాధానం రాలేదు. ‘’కారెగరేసుకొని పోతున్నావు,కొత్త బట్టు కుట్టించుకున్నావు ఎక్కడికి?’’ మళ్ళీ అదే ప్రశ్న. ఇక తప్పింది కాదు కరోనాకి. నోరు విప్పాల్సి వచ్చింది.
‘’రెండో దశకు’’ ధీమాగా చెప్పింది.
‘’మానవుడి గురించి నీకు పూర్తిగా తెలీదు. మేమి ప్పుడు ఊరికే బతికున్నామనే కాని… కూచుంది ఎక్కడో చూశావా?’’. ‘’చూశాను, మసూచి సమా ధిపై!!’’‘’ఇంకొన్ని చిన్న చిన్న సమాధు కనిపిస్తు న్నాయా’’ ‘’అవీ చనిపోయిన వైరసులే’’ ‘’నీక్కూడా సమాధి కడతాడు మానవుడు. అది ఎంతో పెద్దగా ఉంటుంది.అప్పుడు నీసమాధిపైకూచొని మాట్లాడు కుంటాం’’మీరు భయప డుతుంది మానవుడి గురించే, కానీ నా ధైర్య మూ మానవుడే’’ గర్వంగా చెప్పింది కరోనా.
‘’ఎలా?’’ ఒక వైరసు ప్రశ్న.
‘’ఎలాఏముంది,మీకాంలో మనిషికి తెలి సిన సైన్సుతక్కువే, కాబట్టి ఎలాగో బతికి బట్ట కట్టారు. కానిఇప్పుడు ఎంతసైన్సు తెలి సినా కామన్‌సెన్సు పూర్తిగా కోల్పోయాడు మానవుడు’’ కోవిడ్‌ సమా ధానం విని వైరసు న్నీ వెలిగిపోతున్న మొహాతో చూడసాగాయి. ‘’ఓసగటు మానవుడి మాటు వినండి మీకే తొస్తుంది. జనాను కూచోబెట్టి కొన్ని విషయాు చెబుతున్నాడు. అతని మాట నుండి ఇతరులేమి నేర్చుకుంటారో తెలీదు కాని, నాకుకొండంత ధైర్యాన్ని స్తున్నా డు. వినండి’’ ఇది ఎవరినీ భయపెట్టడానికి చెప్పడం లేదు. ఉన్నది వున్నట్టు,నిజాన్ని తొసు కొన్ని జాగ్రత్తగా నడచు కొమ్మని, మసుకొమ్మని సందేశం, సమాచార మివ్వ డానికే చెప్పేది. ఈపాటికే అర్ధమై పోయి ఉంటుంది నేను కరోనా గురించి చెబుతు న్నానని. నిజం. ఆమహమ్మారి మ్లెమ్లెగా ప్రపంచమంతా పాక డం, ప్రభు త్వాను పడగొట్టడం, చావుతప్పి కొంద రికి కన్ను లొట్టపోవడం ఈపాటికే చేసింది. దాని పని అది చేసుకుపోతోంది. మనమే మనం చేయ వసినది చేస్తున్నామా లేదా అని, చేస్తుంటే ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో, చేయక పోతే ఇప్పటి నుండైనా మొదు పెట్టాలి. ఇప్పుడు మనం క్రాస్‌ రోడ్డులో వున్నాం, రహదారి కూడలిలో వున్నాం. ఎటు పోవా లో నిర్ణయించుకోవసింది మనమే. మన తరం కోసం, రానున్న తరా కోసం. ఈ మధ్య ఒకరోజు ఉదయాన్నే కూరగాయు ఇంకొన్ని రేషన్‌ సరుకు తెద్దామని మెయిన్‌ రోడ్డెక్కాను. మూతికి మాస్కు లేకుండా ఆటో నిండా జనం పోవడం కంట పడిరది. ఇక అందరినీ గమనిం చడం మొదు పెట్టాను. నేను మాస్కు పెట్టుకొనే పోయా నన్న విషయం మీకు అర్థమై పోయిం టుంది. కూరగాయ దగ్గర నన్ను రాసు కుంటూ నిబడ్డాడో అసామి. భౌతిక దూరం ఊసే లేదు. మూతికి మాస్కు లేదు. కూరగాయు తీసుకు పోవడానికి చేతిలో సంచిలేదు. ప్లాస్టిక్‌ కవర్లు రెండిరటిలో తీసుకు పోయాడు. పోతూ పోతూ ఒక షాపు దగ్గర ఆగి జనా మీదికి పొగ వచ్చే లాగ మరీ సిగరెట్‌ ఊదేసి మరీ పోయాడు. ప్రతి ఐదు గురిలో ముగ్గురికి మాస్కు లేదు. ఇంతకు ముందు ఎరుపు జోన్‌లో ఉన్న మాప్రాంతం తరు వాత ఆకుపచ్చ జోనుగా మారింది. అప్పుడు అందరూ జాగ్రత్తగానే వున్నారు. మరి ఈ మార్పుకు కారణమేమి? కరోనా భయానికి అవాటు పడ్డారా, కరోనా ఇక రాదనే నిర్ణయానికి వచ్చారా, ఎదో ఒకరోజు ధైర్యంగా చచ్చేదానికి బదు భయ పడు తూ రోజూ చస్తూ బతకాలా అన్న నిర్ణయాని కొచ్చా రా ఇలాఆలోచిస్తూ వస్తున్నాను. అఖి భారత వైద్య సంస్థ, ఎయి మ్స్‌ డ్క్కెరెక్టరు కరోనాకు వ్యాక్సిను 2022లో మాత్రమే రాగద న్నారు. ఈలోగా రష్యా నుండి రెడ్డిల్యాబ్స్‌ వారికి వ్యాక్సిన్‌ వచ్చి నట్టు వీడియో కనిపిం చింది. అదిమూడు దశ వరకే పని చేస్తుందని ఒకఫార్మా మిత్రుడు చెప్పాడు. ఫైజర్‌ కంపెనీది కూడా త్వరలో వస్తుందం టున్నా రు. ఇంకొన్ని ప్రయోగ దశలోవున్నా యని సమా చారం.
ఈలోగా బడు తెరిచారు. కొందరు విద్యార్థుకు, ఇంకొంత మంది ఉపాధ్యాయుకు ఒకరి నుండి ఒకరికి వైరసు సోకిందని సమాచారం. దాదాపు వేయి మందికి వచ్చినట్టు వార్తు. ప్రాణం కంటే విద్యా సంవత్సరం ఎక్కువేమీ కాదని అందరూ చెబుతున్నారు. కొందరు టీచర్లు కరోనాతో మరణించారు కూడా. ఇప్పుడే ప్రభుత్వం, ప్రజు, సామాజిక సేవా సంఘాు, సైన్సు సంస్థు, ఇంకా ప్రజకు మేు చేయాన్న ప్రతి ఒక్కరూ కూచొని అసలైన పరిస్థితిని అంచనా వేయాలి. మహ మ్మారిని దీటుగా ఎదుర్కోవడానికి ఏమేం చేయాలో అవి చేయాలి. శానిటైజర్లు, హ్యాండ్‌ వాషు, హైపోు, మాస్కు, సబ్బు వ్యాపారాు బాగా పెరిగాయి. వైద్యం కూడా చిన్న వ్యాపారం కానట్లు కోట్లు రాబడు తోంది. ఉచితంగా సమాజ సేవ చేసే వారున్నారు కాని మిగతా వారంతా అలా వుండరుకదా. మందు షాపు వద్దన్నా తెరిచారు. పేకాట రాయుళ్ళు తమ వంతు బాధ్యతగా ఈ కరోనాని సమాజం పైకి వెదజ్లు తున్నారు. ఇక బాధ్యతాయుతంగావున్న యువత ఒకలాగ, ఏదీ పట్టని యువత మాస్కు కూడా లేకుండా తిరగడం చూస్తూనే వున్నాం. పెళ్ళిళ్ళు, పుట్టిన రోజు, ఇతర సంబరాుపెరిగి పోతున్నాయి. నగపై, ఖరీదైన వస్త్రాపైఉన్న ధ్యాస మాస్కు వాడడం,శానిటైజర్లు పెట్టడం లాంటి కనీస జాగ్రత్త ు పాటించడంపై లేదు. ఇంకో వైపు మాల్స్‌ తెరిచారు. సినిమా షూటింగు కూడా మొదు పెడుతున్నారు. రాజకీయ వైరసు పూర్తిగా పట్టిన వాళ్ళు ఎన్నికకై ఆరాటపడుతున్నారు. కొన్ని చోట్ల నిర్వహిం చేశారు కూడా. ఎన్నికల్లో గొపు ఓటము పై వున్న ధ్యాస వాళ్ళకి కరోనా కట్టడిపై లేదు. ఆఎన్నికవ్ల పెరిగిన కరోనా గురించి ఒక్క మాటా చెప్పరు. ఇక ఆర్‌.టి.సి బస్సుల్లో,ఆటోలో పరిస్థితి చూస్తే కరోనాను ప్రపంచంలో లేకుండా చేశామ న్నట్లు కనీస భయం కూడా లేకుండా తిరుగుతు న్నారు జనాు. ఇప్పటిదాకా ఒకఎత్తు. ఇకపై రాను న్న రెండవ దశఒక ఎత్తు. అందుకే మనం జాగ్రత్త గా ఉండాలి. అధికాయి, ప్రభు త్వాు, మునిసి పాలిటీు, పోలీసు చేయ వసిన పని మనం చేయాలి.
-టి.కామేశ్వరరావు/జంధ్యా రఘుబాబు
 

We break indigenous societies and yet are scared of ‘them’

The Hans India | Oct 31, 2020

We (you, I and them) are all tribals by origin. Over the years, we have lied to ourselves and conveniently believed that we are not tribals and that we were never tribals. A lie repeated constantly becomes the truth.

In the last seven decades and more, after many ‘convenient’ map makings, we have been trying our best to destroy tribals and their lives. Still, they hold the keys to our rental economy, specifically for Odisha, Jharkhand, Chhattisgarh, parts of Andhra Pradesh, Maharashtra and the North East. The platitudes related to a trillion-dollar economy are majorly based on the mines and minerals in custody of our indigenous peoples. The tribals, whom we left behind and set out in pursuit of creature comforts, remain the guardians of flora and fauna, below which lie the sparkle of billions of dollars.

Read more

Why India Needs Scheduled Tribes to Educate its Future Judges

The recent five-judge bench Supreme Court judgment in Chebrolu Leela Prasad Rao and Ors v State of AP and Ors, shows us once again how little the 5th Schedule of the Indian constitution which is meant to protect adivasi rights is understood.

The reasoning in the judgment – which struck down an Andhra Pradesh government order from 2000 providing 100% reservation for Scheduled Tribe teachers in Scheduled Areas of the state – moves perilously close to dismantling the entire edifice of the 5th Schedule.

If 100% reservation for teaching jobs is not permissible, the next step will be for someone to argue against the ban on alienation of tribal land, or overturn the Samata judgment prohibiting mining leases being given to non-tribals in 5th Schedule Areas in undivided Andhra Pradesh. After all, both these ‘discriminate’ against non-tribals. As non-adivasis from other districts flood scheduled areas leading to clear demographic change, the clamour to do away with the protective provisions of the 5th Schedule is only getting louder.

Read more

Coal blocks for tycoons: Rinchi village tribals may be declared forest land encroachers

Sunday, June 28, 2020

By Gladson Dungdung*
On June 18, 2020, the Government of India initiated the process for auctioning 41 coal blocks for commercialisation. These coal blocks are located in different states within India and most of them fall under Fifth Schedule areas. The Indian government claims that their decision to auction these coal areas is a big step towards making the country Atmanirbhar Bharat (self-reliant) in the energy sector.

The government envisages an investment of 33,000 crore, which would create 2.8 lakh jobs including 70,000 direct and 2,10,000 indirect jobs. Presently, India produces 60.40 million tons of coal per annum (2018-19), and the new initiates would be adding 15 percent to it.

Read more

గిరిజన నేస్తం

తూర్పు అడవుల్లో ఇప్పపువ్వు సీజన్‌ నడుస్తున్నది. ఏటా మార్చి నుంచి మే చివరి దాకా సేకరణలో గిరిజనం నిమగ్నమవుతుంది. ఈ సారి గతానికి మించి సందడి నెలకొన్నది. తునికాకుతో పాటు ఉపాధినిచ్చే ఇప్పపూల కోసం మంటుటెండను సైతం లెక్కచేయ కుండా చిన్నాపెద్దా తరలుతు న్నారు. తెల్లవారుజామునే తట్టా బుట్టా, అంబలి బుర్రతో బయలుదేరి, సాయంత్రం కల్లా ఊళ్లకు చేరుతున్నారు.-జి.ఎన్‌.వి.సతీష్‌
గిరిజనులకు ఇప్పపూల సేకరణే ప్రధాన ఆదాయవనరు. దీనిని గిరిజనులు పవిత్రం గా భావిస్తారు. గిరిజనులు జరుపుకునే సాంప్ర దాయ, వేడుకలు, సంబరాలు, పెళ్లి సమయాల్లో ఇప్పపూల నుండి తయారుచేసిన సారాయి తాగడం ఆచారంగా పాటిస్తారు. సారాయి కాచడమే కాకుండా ఇప్పపూలతో ఇప్పజామ్‌, కేక్‌, లడ్డు, హల్వా, నూనె తదితర ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ఎండాకాలం ముందు ఫిబ్రవరి, ఏప్రిల్‌ నెలల విప్ప చెట్లు ఆకురాలుస్తాయి. ఆ సమయం లోనే కస్తూరి వాసన కలిగిన పూలు పుష్పించడం మొదలవుతుంది. పూలు సాధారణగా ఉదయం సమయంలోరాలుతాయి. 30 సంవత్సరాల వయస్సు గల ఒక చెట్టు నుండి సుమారు 100 నుండి 150 కిలోల ఇప్ప పూలు లభిస్తాయి. ఇలా రాలిపడిన పూలను సేకరించి నీడలో ఆరబెడుతారు. బాగా ఎండిన తరువాత లావుపాటి కర్రతో పూలలోని పొట్టు పోయేంత వరకు కొట్టి, గాలి దూరని విధంగా వెదురు బుట్టలలో నింపి నిల్వచేస్తారు. వీటిని తమ అవస రాలకు అనుగుణంగా కావాల్సినప్పుడు వాడుతుంటారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్ప పువ్వు అంటే కేవలం సారాయి తయారు చేయడానికే వాడుతారు అనే భావన ఉంది. ఢల్లీికి చెందిన డాక్టర్‌ ఎస్‌ఎన్‌.నాయక్‌ భారత శాస్త్రీయ, సాంతికేక మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన పరిశోధనలో ఇప్ప పూల నుండి పంచదార పాకం తయారు చేసి దీంతో బిస్కెట్‌, చాక్లెట్‌, జామ్‌, కేక్‌లు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు. 1999లో పేటెంటు కొరకు దరఖాస్తు చేశారు. ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం ఇప్ప పూలు బాలింతలకు చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి. సాధారణ శారీరక బలహీనత నుండి రక్షిస్తుంది. వీటిని నేరుగా తినడం వల్ల పిల్లలు పోషకహార లోపం నుండి బయట పడవచ్చు. గతంలో గిరిజనులందరూ ఇప్ప పూలను మంగళంలో పొడిగా చేసి వేపి, వేపిన గోంగూర గింజల పొడిని కలుపుతూ ఇప్ప నూనె కొంచెం చేర్చి ఉండలుగా చేసుకొని తినేవారు. రెండు లడ్లు తింటే ఒక రోజుకు సరిపడా శక్తి శరీరానికి లభించేది. కొన్ని రాష్ట్రాల్లో గిరిజనులు ఈ పూలను రొట్టెల పిండిలో కలిపి తింటారు.
ఇప్పపూలతో ఇప్పజామ్‌గిరిజనులకు ఇప్పపూల సేకరణే ఆధారం
నవతెలంగాణ-ములుగు
గిరిజనులకు ఇప్పపూల సేకరణే ప్రధాన ఆదాయ వనరు. దీనిని గిరిజనులు పవిత్రంగా భావిస్తారు. గిరిజనులు జరుపుకునే సాంప్రదాయ, వేడుకలు, సంబరాలు, పెళ్లి సమయాల్లో ఇప్పపూల నుండి తయారుచేసిన సారాయి తాగడం ఆచారంగా పాటిస్తారు. సారాయి కాచడమే కాకుండా ఇప్పపూలతో ఇప్పజామ్‌, కేక్‌, లడ్డు, హల్వా, నూనె తదితర ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ఎండాకాలం ముందు ఫిబ్రవరి, ఏప్రిల్‌ నెలల విప్ప చెట్లు ఆకురాలుస్తాయి. ఆ సమయంలోనే కస్తూరి వాసన కలిగిన పూలు పుష్పించడం మొదలవుతుంది. పూలు సాధారణగా ఉదయం సమయంలో రాలుతాయి. 30 సంవత్సరాల వయస్సు గల ఒక చెట్టు నుండి సుమారు 100 నుండి 150 కిలోల ఇప్ప పూలు లభిస్తాయి. ఇలా రాలిపడిన పూలను సేకరించి నీడలో ఆరబెడుతారు. బాగా ఎండిన తరువాత లావుపాటి కర్రతో పూలలోని పొట్టు పోయేంత వరకు కొట్టి, గాలి దూరని విధంగా వెదురు బుట్టలలో నింపి నిల్వ చేస్తారు. వీటిని తమ అవసరాలకు అనుగుణంగా కావాల్సినప్పుడు వాడుతుంటారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్ప పువ్వు అంటే కేవలం సారాయి తయారు చేయడానికే వాడుతారు అనే భావన ఉంది. ఢల్లీికి చెందిన డాక్టర్‌ ఎస్‌ఎన్‌.నాయక్‌ భారత శాస్త్రీయ, సాంతికేక మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన పరిశోధనలో ఇప్ప పూల నుండి పంచదార పాకం తయారు చేసి దీంతో బిస్కెట్‌, చాక్లెట్‌, జామ్‌, కేక్‌లు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు. 1999లో పేటెంటు కొరకు దరఖాస్తు చేశారు. ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం ఇప్ప పూలు బాలింతలకు చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి. సాధారణ శారీరక బలహీనత నుండి రక్షిస్తుంది. వీటిని నేరుగా తినడం వల్ల పిల్లలు పోషకహార లోపం నుండి బయట పడవచ్చు. గతంలో గిరిజనులందరూ ఇప్ప పూలను మంగళంలో పొడిగా చేసి వేపి, వేపిన గోంగూర గింజల పొడిని కలుపుతూ ఇప్ప నూనె కొంచెం చేర్చి ఉండలుగా చేసుకొని తినేవారు. రెండు లడ్లు తింటే ఒక రోజుకు సరిపడా శక్తి శరీరానికి లభించేది. కొన్ని రాష్ట్రాల్లో గిరిజనులు ఈ పూలను రొట్టెల పిండిలో కలిపి తింటారు.
ఇప్పపూలతో ఇప్పజామ్‌
గిరిజనులు చెట్ల కింద పడిన పూలను ఏరి ఆరుబయట నేలపై ఆరబెడుతారు. భద్రాచలం పుణ్య కేత్రాన్ని సందర్శించిన భక్తులకు ఇప్పపూలను సీతమ్మ ప్రసాదంగా స్వీకరించడం ఆనవాయితీ. ఇప్ప పూల పొట్టు తొలగించి శుభ్రమైన నీటితో మూడు సార్లు కడికి కుక్కర్లో వేసి ఉడక బెట్టాలి. ఉడక బెట్టిన పూలను కొద్దిసేపు చల్లబడే వరకు ఉంచి మిక్సీలో వేసి ఫేస్ట్‌లా రుబ్బాలి. అదేవిధంగా బొప్పాయి. జామ, అరటి, యాపిల్‌ పండ్ల గుజ్జును కూడా తయారు చేసుకోవాలి. మొత్తం అన్నీ రకాల పండ్లు, ఇప్ప పూల గుజ్జును తూకం వేసి తూనికానికి సగం పంచదార కలిపి సన్నని సెగపై కింద అడుగు అంటకుండా మెదుపుతూ సుమారు 2 గంటల పాటు కాయాలి. కొంచెం తీసి నీళ్లలో వేసినప్పుడు ఆ కొంచెం నీళ్లలో కలవకుండా నేరుగా కిందికి దిగిపపోయినప్పుడు జామ్‌ తయారు అయినట్లుగా గుర్తించాలి.
విరిసిన ఇప్పపువ్వే బతుకుదెరువు
ఏటా వేసవిలో ఇప్పచెట్లు పూత, కాతలతో కళకళలాడుతుంటాయి. ఈ కాలన్నే గిరిజనులు ఇప్పసీజన్‌గా చెప్పుకుంటారు. ఈసారి ఇప్పపువ్వు సీజన్‌ ఆలస్యంగా ప్రారంభం కాగా, తూరుపు ప్రాంతంలో అడవిబిడ్డలు సేకరణలో తలమునకల య్యారు. వేకువజామునే బయలుదేరి, ఉదయం పదిగంటల్లోగా సేకరించి, ఇళ్లకు చేరుకుంటున్నారు. పలువురు తమ సొంత భూముల్లో ఉన్న చెట్లనుంచి సేకరించుకుంటుండగా, భూములు లేని గిరిజనులు అటవీప్రాంతంలో చెట్ల నుంచి ఏరుకుంటున్నారు.
వరా ్షకాలంలో అంబలి, ఇప్పపువ్వు అన్నం
గిరిజనులు సేకరించిన ఇప్పపూలను ఎండబెట్టి దానిలో పుప్పొడి రేణువులు పొయ్యేదాకా కర్రమొద్దులతో బాదుతారు. అనంతరం చెరిగి గుమ్ముల్లో దాచుకుంటారు. మొదట దాని అడుగున ఆకులు వేసి తొక్కుతారు. మధ్యమధ్య ఎండబెట్టిన వేపాకులు చల్లుతారు. దీంతో ఇప్పపువ్వు ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే చిక్కుడు గింజలు, అల్చందలు కలిపి ఉడికించి అంబలి కాస్తారు. ఇప్పపువ్వు కలిపి అన్నం వండుతారు. మరికొందరు గిరిజనులు ఇప్ప ఉండలను ఆల్పాహారంగా తీసుకుంటారు. ఇప్పపూలను పెంకుల్లో వేయించే సమయాన దంచిన వెల్లుల్లి, మిర్చి, అల్లం కలుపుతారు. అన్నీ కలిపి మోదుగాకుల్లో ఉండలుగా చు డుతారు. వాటిని నేతితో, ఇప్పనూనెతో కలిపి తింటారు. పలువురు ఇప్పపువ్వుతో సారా తయారు చేసి సేవిస్తారు. ఇప్పబద్దల నుంచి నూనె తీసి పంటలకు, దీపం చమురుగా వాడుతారు. అటవీ ప్రాంతానికి మేతకు వెళ్లే మేకలు, గొర్రెలు, పశువులు సైతం ఇప్పపువ్వు తింటాయి.
మందుల తయారీలో..
ఇప్పపూలను మందుల తయారీలోనూ ఉపయోగిస్తారు. పూల నుంచి తీసిన తైలాన్ని పక్షవాతం తదితర వ్యాధుల నివారణకు వాడుతారు. మాలిష్‌కు కూడా వినియోగిస్తారు. ఇప్పబద్దలను సబ్బులు, ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు. ఇప్పపూలతో పళ్లు తోముకుంటే దంతవ్యాధులు, దగ్గు దరిచేరవని గిరిజనులు చెబుతున్నారు. ఇప్పపువ్వుతో తయారైన సారా తాగితే వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయని విశ్వసిస్తారు. పలు ఆయుర్వేద మందుల తయారీలోనూ వాడతారు.
వైద్యశాస్త్రంలో ప్రాధాన్యం
వైద్యశాస్త్రంలోనూ ఇప్పచెట్టుకు ఎంతో ప్రాధాన్యముంది. ఆయుర్వేదంలో ఇప్పచెట్టును మధూక వ ృక్షమని వ్యవహరిస్తారు. దీ న్ని శాస్త్రీయ నామం గ్లీజేరియా గ్లాబ్రా కాగా, మేడికేటెడ్‌ ఆయుర్వేదిక్‌లో దీన్ని వాడుతారు. అటవీ ప్రాంతంలోని గిరిజనులు టేకు చెట్లను సైతం నరికి వంట చెరుకుగా, కట్టెలుగా, దుంగలుగా, నాగళ్లుగా వాడుతారు కానీ, ఇప్పచెట్టును నరికే ప్రసక్తే ఉండదు. ఓఅంచనా ప్రకారం ప్రతి గిరిజనుడి భూమిలో పది నుంచి పదిహేను అంతకుమించిన సంఖ్యలో కూడా ఇప్పచెట్లుంటాయి.
కొనుగోలుకు ముఖం చాటేస్తున్న జీసీసీ
గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు గ్రామాల్లో ఏర్పాటు చేసిన గిరిజన సహకార సంస్థ(జీసీసీ) కేంద్రాలు నామమాత్రంగానే మిగిలాయి. గిరిజనులు సేకరించిన ఇప్పపువ్వును ప్రభుత్వ మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉండగా ఎక్కడా కనిపించడం లేదు. కిలో ఇప్పుపువ్వుకు రూ.15 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించగా తూర్పున జీసీసీ కొనుగోలు చేయక పోవడంతో గిరిజనులు దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు నిర్ణయించిన ధరలకే అమ్మి నష్టపోతున్నారు.
ఇప్పపువ్వు..గ్రామీణులకు కల్పతరువు
గిరిజనులు అడవులను నమ్ముకుని జీవించడానికి ప్రధాన కారణం అడవిలో లభించే ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్మడం ద్వారా ఉపాధి పొందు తున్నారు. కొందరు తడకలు అల్లితే మరికొందరు పండ్లు సేకరిస్తున్నారు. మరికొందరు తునికాకు,వంటి వాటిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో ఇప్పపువ్వు సేకరణ కూడా వారికి అధిక ఉపాధి కల్పిస్తోంది. గిరిజనులకు కాలానికనుగుణంగా ఉపాధినిచ్చే వృక్షాల్లో ఇప్పచెట్లు ప్రధానమైనవి. వేసవిలో వీటి ద్వారా గిరిజనులు ఉపాధి పొందడానికి అనేక అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఇప్పపువ్వు లభిస్తుండడంతో గిరిజనులు అడవుల్లోకి వెళ్లి తెల్లవారు జామునే ఇప్పపువ్వు సేకరించే పనిలో పడ్డారు. గిరిజనులు సూర్యోదయానికి ముందే అడవికి చేరుకుని ఇప్పపువ్వును సేకరిస్తున్నారు. తెల్లవారుజామున కిందపడిన ఇప్పపువ్వును మధ్యాహ్నంలోగా సేకరించి ఇంటికి తెచ్చి ఎండబెడుతున్నారు.
మూడు మాసాలు ఉపాధికి ఊతం..
ఖరీఫ్‌, రబీ పనులు ముగిసే సమయానికి ఇప్పచెట్లు విరగపూస్తాయి. వీటి పూత గాలికి నేలరాలుతుంటుంది. ఈ పువ్వులను గిరిజనులు సేకరిస్తారు. వీటితోపాటు మొర్రిపండ్లు సేకరించి తీసుకొస్తుంటారు. వీటిని విక్రయించి మూడు మాసాలపాటు అంటే మార్చి, ఏప్రిల్‌, మేనెలల్లో వీరు ఉపాధి పొందుతారు. ఇప్పపువ్వుల నుంచి తీసిన తైలాన్ని పక్షవాతం వంటి వ్యాధులకు ఉపయోగిస్తారు. అలాగే ఇప్పపువ్వుతో దంతాలను శుభ్రం చేసుకోవడంతో దగ్గుకు, దంతాలకు సంబంధించిన వ్యాధుల నివారణకు ఔషధంగా పనిచే స్తోంది. ప్రధానంగా స్వచ్ఛమైన ఇప్పపువ్వుతో తయారుచేసిన సారాయి సేవిస్తే వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయని పల్లె ప్రజలు విశ్వసిస్తారు. ఇన్నిరకాల ప్రయోజనాలున్న ఇప్పచెట్లు రోజురోజుకు స్మగర్ల చేతుల్లో నేలరాలుతున్న టేకు చెట్లతో పాటు ఇప్పచెట్లు నరికేస్తున్నారు. దీంతో క్రమంగా ఉపాధికి దూరమవుతున్నారు.
ఇప్పపువ్వులో ఎన్నెన్నో పోషకాలు..
అడవిలో లభించే ఇప్పపువ్వుల గింజల నుంచి తీసిన నూనెలో ఎన్నెన్నో పోషక విలువలు ఉన్నట్లు శాస్త్రీయంగా రూడీ అయింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కొమురంభీం జిల్లాల్లోని ఆయా మండలాల్లోని అడవుల్లో లభించే ఇప్పపువ్వుల పండ్లలో పోషక విలువల నివధికల ఆధారంగా భారతశాస్త్రీయ సాంకేతిక మంత్రిత్వశాఖ సహయంతో 1999లో నిర్వహించిన పరిశోధనల్లో ఎండిన ఇప్పపువ్వుల నుంచి పంచదార తయారుచేసి దీంతో జాము, కేకులు, చాక్లెట్లు తయారుచేసే విధానాన్ని కనిపెట్టారు. ఇప్పపువ్వు ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి మద్యమధ్యలో ఎండినవేప ఆకు పిచికారి చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని తెలుసుకున్నారు. చిక్కుడు గింజలు, అలిచందలు కలిపి ఉడికించి అంబలి చేస్తారు. ఇప్పగింజల నుంచి తీసిన నూనెను దీపంగా వాడుతారు. గిరిజనులు కొంత మంది ఇప్పపువ్వును ఆహారంగానూ తీసు కుంటారు. ఇప్పపువ్వులో లభించే పోషకాలు పరిశీలిస్తే క్యాల్షియం 139.00, పాస్పర్‌ 137.00, ఫైబర్‌ 109.00, కార్బోహైడ్రేడ్స్‌ 68.00 మాయిశ్చర్‌ 11.66, ప్రోటీన్‌లు 6.67 శాతం ఉంటాయి.

అడవిపై హక్కు`ఆదివాసులదే’

రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చిన ఈశాన్య రాష్ట్రాలయిన అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరామ్‌లాంటి రాష్ట్రాలలోని అడవిని నమ్ముకొని ఉన్న గిరిజన తెగలకు, దేశంలోని 6వ షెడ్యూల్‌లో లేని మిగతా దేశం మొత్తం మీద ఇతర రాష్ట్రాలలోని అడవిని నమ్ముకొని బతుకుతున్న అయిదవ షెడ్యూల్‌లోని ప్రజలందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టంలోని కొన్ని సెక్షన్స్‌ ఆక్రమణదారులను తొలగించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయగా, వాటిని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వాధికారులు అడవి నుండి ప్రజలను తరిమివేసేందుకు పెద్ద కుట్రచేస్తూ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, వాటి వెలుగులో వచ్చిన దేశ సర్వోన్నత న్యాయస్థానం(సుప్రీంకోర్టు), వివిధ రాష్ట్రాల హైకోర్టుల తీర్పులు, ఐదు, ఆరవ షెడ్యూల్ల స్ఫూర్తికి తిలోదకాలిచ్చి, బహుళజాతి సంస్థలకు, బడా పెట్టుబడిదారులకు అడవిని అప్పజెప్పేందుకు బృహత్‌ పథకాన్నే రచించాయి. -చిక్కుడు ప్రభాకర్‌
ఈదేశ మూలవాసులు ఆదివాసీలు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలలో తరతరాలుగా అడవిలోనే జీవిస్తున్న 12 లక్షల ఆదివాసీలను, అడవి నుంచి ఖాళీ చేయించాలని ఫిబ్రవరి 13వ తేదీన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. 2006 సంవత్సరంలో దేశ పార్లమెంటు ద్వారా చేసిన ఆదివాసీ అటవీ హక్కుల చట్టం-2006ను రద్దు చేయాలని, ఈ చట్టం ఆదివాసీలు అడవిలో నివసించేందుకు, వ్యవసాయం చేసుకునేందుకు, అలాగే వారితోపాటు జీవించే ఇతర నిరుపేద తెగలకు కూడా అడవి మీద హక్కు కల్పిస్తుందని, ఈ హక్కులు వన్యమృగాల రక్షణ చట్టం, 1972నిబంధనలకు, అభయారణ్యంలోని పులుల రక్షణ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని, ఈ చట్టాన్ని కొట్టివేయాలని ‘వైల్డ్‌ లైఫ్‌ ఫస్ట్‌’ అనే స్వచ్ఛందసంస్థతో పాటు ఇతర సంస్థలు 2009 సంవత్స రంలో సుప్రీంకోర్టులో ఒక పిటిషెన్‌ వేసాయి. ఈ రిట్‌ పిటీషన్‌ తరపున గత కొద్ది సంవత్సరాలుగా వాదనలు కొనసాగుతున్నాయి. అటవీ హక్కుల చట్టం-2006లోని సెక్షన్‌2(0) చాలా స్పష్టంగా, గత మూడు దశాబ్దాలుగా, 2005 సంవత్సరం డిసెంబర్‌ కంటే ముందుగా ఎవరైనా అడవిలో బతుకు తున్నట్లయితే, వారికి అడవిలో నివసించే హక్కు, అలాగే వారు సేద్యం చేసుకుంటున్న భూమి మీద సర్వహక్కులు కల్పించాలని చెబుతున్నది. అలాగే సెక్షన్‌ 3(1)(ఎ) చాలా స్పష్టంగా ఈ విధంగా చెబుతున్నది. అడవిలో భూమి, ఇల్లు కలిగి ఉండి అక్కడే జీవిస్తున్న ఆదివాసులకు అడవిపై హక్కు ఉన్నది. ఈ హక్కులు కూడా తరతరాలుగా వారు జీవిస్తున్న సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ స్థోమతలకు ఎటువంటి భంగం కలిగించకుండా హక్కులను గుర్తించాల్సిందిగా చెబుతున్నది. అలా కాకుండా అడవిలోకి ఆక్రమణదారులుగా వస్తున్నవారికి ఎటువంటి హక్కులు కల్పించరాదని కూడా చెబుతున్నది. అయితే తరత రాలుగా అడవిని నమ్ముకొని, అడవిలోనే జీవిస్తున్న వేలాది తెగల జీవితాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చిన ఈశాన్య రాష్ట్రాలయిన అస్సాం, మేఘాలయ,త్రిపుర,మిజోరామ్‌లాంటి రాష్ట్రాలలోని అడవిని నమ్ముకొని ఉన్న గిరిజన తెగలకు, దేశంలోని 6వ షెడ్యూల్‌లో లేని మిగతా దేశం మొత్తం మీద ఇతర రాష్ట్రాలలోని అడవిని నమ్ముకొని బతుకుతున్న అయిదవ షెడ్యూల్‌లోని ప్రజలందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టంలోని కొన్ని సెక్షన్స్‌ ఆక్రమణ దారులను తొలగించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయగా, వాటిని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వాధికారులు అడవి నుండి ప్రజలను తరిమివేసేందుకు పెద్ద కుట్రచేస్తూ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, వాటి వెలుగులో వచ్చిన దేశ సర్వోన్నత న్యాయస్థానం(సుప్రీంకోర్టు), వివిధ రాష్ట్రాల హైకోర్టుల తీర్పులు, ఐదు, ఆరవ షెడ్యూల్ల స్ఫూర్తికి తిలోదకాలిచ్చి, బహుళజాతి సంస్థలకు, బడా పెట్టుబడిదారులకు అడవిని అప్పజెప్పేందుకు బృహత్‌ పథకాన్నే రచించాయి. ఇందులో భాగంగానే రాజ్యాంగాన్ని, దానికి అనుగుణంగా వచ్చిన భూమి మీద అటవీ ప్రజలకు కలిగిన హక్కులను, ఆయా చట్టాల్లోని సారాన్ని సంపూర్ణంగా హరించివేస్తూ అడవిలో బతికే ఈ దేశమూలవాసులకు తీరని అన్యాయం చేస్తున్నారు. నలభై లక్షల ధరఖాస్తులలో 12 లక్షల ధరఖాస్తులు ఎందుకు ఆమోదించలేదు? దానికి గల కారణాలు ఏమిటి? ఒకసారి అవి ఆమోదించి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వారికి దక్కాల్సిన హక్కులు ఎందుకు కల్పించలేదు? ఒకవేళ అవి తిరస్కరణకు గురైతే అవి చట్టబద్దంగానే తిరస్కరణకు గురైనాయా? అలా చట్టబద్దంగా తిరస్కరణకు గురికాగానే వారికి చట్టబద్దంగా పై ఫోరాలలో అప్పీల్‌ చేసుకునే అవకాశం ఇచ్చారా? 1996 సంవత్సరంలో దేశ పార్లమెంటు చేసిన పంచాయత్‌ ఎక్స్‌టెన్షన్‌ షెడ్యూల్‌ ఏరియా చట్టం(పెసా)లోని నిబంధనలను వీరి ధరఖాస్తు తిరస్కరణలకు వర్తింపచేశారా? ఆదివాసీలకు, అడవిలో జీవించే ప్రజలందరికి రాజ్యాంగం కల్పించిన రక్షణలు, వాటి వెలుగులో వచ్చిన దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పులతో పాటు, రాజ్యాంగ మౌలిక స్వరూపమైన, ఏ వ్యక్తికైనా సగర్వంగా సంపూర్ణ ఆరోగ్య జీవితం కల్పించాలని ఇచ్చిన తీర్పులన్ని ఆదివాసీ, అడవిలో బతికే వారందరికి వర్తిస్తాయి. కాని, ఇవేమీ పట్టించుకోకుండా దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ముగ్గురు జడ్జీలు కలిగిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు, 13 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు కేశవానంద భారతి వర్సెస్‌ కేరళ నుంచి మొదలుకొని ఐదుగురు జడ్జీలు కలిగిన రాజ్యాంగ ధర్మాసనాలు వివిధ సందర్భాలలో ఇచ్చిన తీర్పులయిన, డి.టి.సి వర్సెస్‌ మజ్దూర్‌ కాంగ్రెస్‌, బంధుముక్తి మోర్చా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(1984), ఓల్గా తెల్లీస్‌ వర్సెస్‌ ముంబాయి మున్సిపల్‌ కార్పోరేషన్‌, సుభాష్‌కుమార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బీహార్‌, సి.ఇ.ఎస్‌.సి వర్సెస్‌ యన్‌.సి.బోస్‌ లాంటి ఎన్నో తీర్పులను ఆధారం చేసుకొని 1997 సంవత్సరంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సమతరవి కేసులో విస్తృత ధర్మాసనం అడవిపై ఆదివాసుల సర్వ హక్కులను గుర్తించింది. ఈ తీర్పులన్నింటితోపాటు సమతరవి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ తీర్పును కూడా విస్త ృత దర్మాసనం నియమగిరి పర్వతాలలోని మైనింగ్‌ విషయంలో ఒరిస్సా మైనింగ్‌ కార్పోరేషన్‌ వేసిన కేసులో 2013 సంవత్సరంలో సమతరవి తీర్పును ఎత్తిపడుతూ, ఇదే విస్త ృత ధర్మాసనం అడవిలోని ఆదివాసుల, ఇతర గిరిజన, గిరిజనేతర ప్రజల సర్వహక్కులను ముఖ్యంగా జల్‌, జంగల్‌, జమీన్‌లను ధృవపరిచింది. అయితే విస్తృత ధర్మాసనం పై తీర్పులన్నింటిని పరిగణలోకి తీసుకోకుండా కనీసం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ తమ ప్రమాణపత్రాలు దాఖలు చేయకుండానే, కేవలం అటవీ మంత్రిత్వశాఖ, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ఉన్నత, ముఖ్య కార్యదర్శులు సమర్పించిన తప్పుడు ప్రమాణ పత్రాల ఆధారంగా రాజ్యాంగంలోని మౌలిక స్వరూపమైన జీవించే హక్కు, ఐదవ, ఆరవ షెడ్యూల్లు వాటి ఆధారంగా వచ్చిన వివిధ చట్టాలు, తమ సొంత తీర్పులకు భిన్నంగా రాసిన సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించాల్సిన విశాల సమాజం, ఆదివాసీ, గిరిజన, హరిజన, బడుగు, బలహీనవర్గాల సామాజిక శక్తులవారు కూడా నోరు మెదపకపోవడం అత్యంత విషాదం. ఇటువంటి నిశ్శబ్ద పరిస్థితిని నా నాలుగు దశాబ్దాల ప్రజాజీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఈ రోజు కేవలం 12 లక్షల ఆదివాసులను అడవి నుంచి పంపే తీర్పుతో మొదలయ్యే ఈ దుర్మార్గ ప్రక్రియ రేపు మొత్తం దేశంలోని 10 నుంచి 12కోట్ల వరకున్న ప్రజానీకాన్ని తరిమివేసి, బహుళజాతి సంస్థలకు, దేశీయ బడా పెట్టుబడిదారులకు, వారి దళారులకు అడవిని అప్ప జెప్పేందుకు జరుగుతున్న బృహత్‌ పథ కంగా, సమాజంలోని ప్రగతిశీలశక్తులన్నీ గుర్తించాలి.

1 7 8 9 10