డోలీ మొత తీరని వ్యధ
ఎన్ని ప్రభుత్వాలు మారినా మారని గిరిజనుల తలరాత.. మహిళకు పురిటి నొప్పులు.. డోలీలో తీసుకెళ్తుండగా మధ్యలోనే ప్రసవం స్వాతంత్య్రం వచ్చిన ఎన్ని ఏళ్ళు అయినా.. ఎన్ని ప్రభుత్వాలు మారినా కష్టాలు మాత్రం తీరడం లేదు.. అంబరాన్ని తాకినా అనేక గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక అవస్థలు తప్పడం లేదు. కనీస అవసరాలైన విద్య, వైద్య సదుపాయాలు ఇప్పటికీ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. మారు మూల పల్లెల్లోని ప్రజలు.. ముఖ్యంగా అడవుల్లోని నివసించే గిరిజనలకు రవాణా సదుపాయాలు కూడా కరవు. ఎప్పుడైనా ఆరోగ్యం బాగోలేకపోతే డోలీ మోతలే శరణ్యం అంటున్నారు అడవి బిడ్డలు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మం డలం గిరిశిఖర గ్రామస్థులకు డోలీ మోతలు తప్పలేదు. గ్రామానికి చెందిన వంతల కుషా యికి పురిటి నొప్పులు రావ డంతో 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి డోలీపై మోసుకుంటూ వెళ్తుం డగా మార్గ మధ్యలోనే గర్భిణి మగ బిడ్డకు జన్మనిచ్చింది.అక్కడి నుంచి తల్లిబిడ్డలను మోసుకుంటూ పుణ్యగిరి కొండ దిగువకు తీసుకొచ్చారు. అక్కడ ఉన్న ఆటోలో ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా ప్రజాప్రతి నిధుల్లో స్పందన కరవైందని గిరిపుత్రులు వాపోయారు. గిరిశిఖర గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించ డంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని గిరిజన సంఘాలు మండి పడుతు న్నాయి.గిరిజన గ్రామాలను 5వషెడ్యూల్లో చేర్చి ఉంటే ఈడోలి దుస్థితి ఉండేది కాదని పేర్కొన్నారు.ఇప్పటికైన నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను ఐటీడీ పరిధిలో చేర్చాలని గిరిజనసంఘాల ప్రతిని ధులు డిమాండ్ చేస్తు న్నారు.దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించింది.గిరిజన మహిళ పురిటి కష్టాలు,మారుమూల వైద్య సేవలు అందక మృత్యువాతపడుతున్న గిరి బిడ్డలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి,ఇతర సంబం ధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదు`ఏపీ సీఎం
గిరిజన మహిళల సౌకర్యంకోసం మళ్లీ గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేస్తామని ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ట్రైకార్,జిసిసి,ఐటిడిఎలను యాక్టివేట్ చేస్తా మన్నారు. ఏపీలో కూతమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు మరింత చేరువ పోతున్నారు. తాజాగా గిరిజన ప్రాంతాల సమస్యలపై దృష్టి పెట్టి ఆ ప్రాంతా ల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికా రులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించ కూడకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమశాఖపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు..అధికా రులకు పలు ఆదేశాలు జారీ చేశారు.గిరిజన ప్రాంతాల్లోని మహిళల సౌకర్యం కోసం గర్భిణీ వసతి గృహాలు,ట్రైకార్, జీసీసీ,ఐటీడీఏలను యాక్టివేట్ చేయాలన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వ విధానాలతో గిరిజన ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పూర్తిగా దిగ జారి పోయాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన..గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసేలా ప్రణా ళికలు సిద్దం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా వర్షాకాలంలో గిరిజన ప్రాంతాల్లోని గర్భి ణీలు ఆసుపత్రులకు వెళ్లేందుకు నానా ఇబ్బం దులు ఎదుర్కొంటుండంతో ఇకపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాల న్నారు.ఫీడర్ అంబులెన్స్ లను తిరిగి ప్రవేశ పెట్టాలన్నారు.గిరిజన విద్యార్థుల కోసం టీడీపీ సర్కార్ తీసుకొచ్చినఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేడ్కర్ ఓవర్ సీస్ విద్యానిధి పథకాలను వైసీపీ పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండి పడ్డారు. గిరిజన గూడెంలను సైతం అభివృ ద్ధిలోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం పాటుపడు తుందని..ఇందుకోసం అధికారులు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసంతో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని ముఖ్యమంత్రి అన్నారు. అవసరమైన మౌళిక వసతులు కల్పించడం ద్వారా,ఫీడర్ అంబులెన్స్ లను తిరిగి ప్రవేశ పెట్టడం ద్వారా రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా చూడాలని అన్నారు. అలాగే నెలలు నిండిన గర్భిణీల కోసం గతంలో తెలుగు దేశం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలన్నారు. తద్వారా గిరిజన మహిళలకు మేలు జరుగు తుందని చంద్రబాబు చెప్పారు.గిరిజన సంక్షేమ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఈమేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.మంగళవారం రాష్ట్ర సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై జరిపిన సమీక్షలో గిరిజనులకు విద్యా, వైద్యం, సంక్షేమ పథకాలు అందించడంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సియం సమీక్షించారు.2014 నుంచి 2019 మధ్య అమల్లో ఉన్న పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సియం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.గిరిజన విద్యా ర్థుల కోసం తెచ్చిన ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబే ద్కర్ ఓవర్ సీస్ విద్యానిధి,బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్ పథకాలను నిర్వీర్యం చేశారని అన్నారు. అలాగే గిరిజనులకు వైద్యం కోసం తెచ్చిన ఫీడర్ అంబులెన్స్ లను కూడా లేకుండా చేశారని పేర్కొన్నారు. అరకు కాఫీ అమ్మకాలు, మార్కెటింగ్ పై సిఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాడు అరకు కాఫీని ప్రమోట్ చేసేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని, కానీ తరువాత వచ్చిన ప్రభుత్వం అరకు కాఫీతో పాటు, గిరిజన ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి పెట్టలేదని అన్నారు. ఈవిష యంలో సమగ్రమైన మార్పులు రావాలని గిరిజన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందని దాన్ని ఉపయో గించుకుంటే గిరిజనుల జీవితాల్లో మార్పులు తేవచ్చు అని సిఎం అన్నారు. గిరిజన ప్రాంతా ల్లో ఎంతో సారవంతమైన భూములు ఉన్నా యని ఆ ప్రాంతాల్లో పకృతి సేద్యాన్ని ప్రోత్స హించాలని అధికారులకు సూచించారు. తేనె, హార్టికల్చర్, కాఫీని ప్రొత్సహిస్తే మంచి ఫలి తాలు వస్తాయి అని అన్నారు. గంజాయి అనేది గిరిజన ప్రాంతాల్లో ఎక్కడా కనిపించ కుండా చూడాలని సిఎం అధికారులను ఆదేశించారు. ట్రైకార్, జిసిసి, ఐటిడిఎలు పూర్తిగా యాక్టివేట్ కావాలని సిఎం అన్నారు. ఈ సంస్థల కార్యకలాపాల వేగం పెంచాలని సూచించారు. వచ్చే నెలలో జరిగే అంతర్జాతీ య గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహిం చాని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశిం చారు. కేంద్రం గిరిజనుల కోసం అమలు చేసే పథకాల పై కసరత్తు చేసి….రాష్ట్రానికి నిధులు సాధించే ప్రణాళికలతో రావాలని అధికారులను సిఎం ఆదేశించారు. గిరిజనులు సాగుచేస్తున్న భూములు, ఆయా పంటలకు వస్తున్న ఆదా యం,అలాగే గిరిజన ఉత్పత్తుల, ఇతర పనుల ద్వారా తలసరి ఆదాయంపై సమగ్ర వివరా లతో రావాలని ముఖ్యమంత్రి సూచించారు.
గిరిజన గ్రామ పంచాయతీల సమావేశాల్లో సికిల్ సెల్ ఎనీమియాపై చర్చించాలి
గిరిజన ప్రాంతాల్లో సికిల్‌సెల్ ఎనీమియా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవా లని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ మరియు ఎండీ నేషనల్ హెల్త్ మిషన్ సి.హరి కిరణ్ ఆదేశించారు. గిరిజన గ్రామ పంచాయ తీల సమావేశం అజెండాలో సికిల్ సెల్ ఎనీమియా అంశం కూడా చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన గ్రామ పంచాయ తీల్లో దీనిపై చర్చిస్తే ఈ కార్యక్రమం మరింత వేగవంతమవుతుందన్నారు. ఇందు కోసం గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల్ని సంప్రదించాలన్నారు.జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్‌పై మంగళగిరి ఎపిఐఐసి టవర్స్‌లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన సమీక్షించారు.ఈ సందర్భంగా కమీషనర్ హరికిరణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గ దర్శకాలనుగుణంగా సికిల్ సెల్ ఎనీమి యా బాధితుల్ని స్క్రీనింగ్ చేయాలని,ఈ ప్రక్రి యను నిరంతరం కొనసాగేలే చర్యలు తీసుకో వాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. సంబంధిత ఐటిడిఎ పీవోలతో దీనిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు.సికిల్ సెల్ ఎనీ మియా నిర్మూలన కార్యక్రమాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని సంతృప్త స్థాయికి తీసుకెళ్లాలని, ఇందుకోసం వినూత్న విధా నాల్ని అవలింబిం చాలని సూచించారు. ఈమేరకు జరిగే రాష్ట్ర స్థాయి జిల్లా కలెక్టర్ల సమావేశంలో సికిల్ సెల్ ఎనీమియా అంశంపై మాట్లాడతానన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా దీనిపై మరింత దృష్టిని సారిం చాలన్నారు.2023 జులైలో సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిష న్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిం చారని, 2047నాటికి దేశంలో సికిల్ సెల్ ఎనీమియా ను నిర్మూలించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నా రని తెలిపారు.గిరిజన ప్రాంతాల్లో జీరో నుండి 40ఏళ్ల మధ్య వయసు గల 19,90,277 బాధితుల్ని మూడేళ్లలో ఏపీలో స్క్రీనింగ్ చేయా లని కేంద్రం లక్ష్యాన్ని నిర్ణయిం చిందని ఆయన తెలిపారు.ఇప్పటి వరకు 8,80,560 మందికి స్క్రీనింగ్ చేశారని,ఇందు లో19,046మంది సికిల్ సెల్ ఎనీమియా క్యారియర్లు కాగా, 1684 మందికి సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి ఉన్నట్లు తేలిందన్నారు.కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకా రం స్క్రీనింగ్ చేసిన ప్రతివ్యక్తికీ సికిల్ సెల్ స్టేటస్ ఐడి కార్డును జారీ చేస్తారని,ఇప్పటి వరకు 2,85,397 మందికి ఈకార్డుల్ని జారీ చేశారన్నారు.మరో 1,39,888 కార్డుల్ని త్వరలో జారీచేస్తారన్నారు. – జిఎన్‌వి సతీష్