బంజరు నేలలో మొలకెత్తిన బంగారం..

నేలను నమ్ముకొంటే రైతుకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మరోసారి రుజువు చేశారు వన్నూరమ్మ. కష్టాలెన్ని ఎదురైనా స్థైర్యం కోల్పోని ఆమె… బీడు భూమిలో బంగారు పంటలు పండిరచారు. దేశంలోని ఆదర్శ రైతుల్లో ఒకరుగా గుర్తింపు పొందారు. ప్రధాని మోదీతో ముఖా ముఖి మాట్లాడే అవకాశాన్ని పొంది,ఆయన ప్రశంసలు అందుకున్నారు. ‘ప్రకృతి వ్యవసాయమే రైతు సమస్యలకు పరిష్కారం’ అని చెబుతున్న ఆమె జీవన ప్రస్థానం ఇది…
కుటుంబాన్ని ఎలా పోషించాలనే ప్రశ్నకు నేను వెతుక్కున్న సమాధానం వ్యవ సాయం.ఉపాధి కరువైన సమయంలో వ్యవ సాయాన్నే జీవనాధారంగా ఎంచుకున్నాను. మాది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని దురదకుంట గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబం. ఆరేళ్ళ కిందట నాభర్త గోవిందప్ప అనారోగ్యంతో చనిపోవడంతో పరిస్థితులన్నీ తల్లకిందులయ్యాయి. నా నలు గురు పిల్లలకు దారి చూపించే బాధ్యత నా మీద పడిరది.
ఎగతాళి చేశారు…
మా కుటుంబానికి ముప్ఫై ఏళ్ళ కిందట ప్రభుత్వం 4.3ఎకరాల బంజరు భూమి ఇచ్చింది. ఒకప్పుడు అది పంటలు పండే భూమే. అయితే భవన నిర్మాణాల కోసం రాళ్ళ తవ్వకాల వల్ల బీడుగా మారిపోయింది. అందు లో సాగు సాధ్యం కాకపోవడంతో మా పెద్దలు దాన్ని అలాగే వదిలేశారు. భర్త పోయాక కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని గడిపేదాన్ని. మూడేళ్ళ కిందట ప్రకృతి వ్యవసాయం గురించి నాకు మొదటిసారి తెలిసింది. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ లక్ష్మీ నాయక్‌ మా గ్రామానికి వచ్చి, రైతులతో సమీక్ష జరిపారు. రైతులు, భూముల వివరాలు సేకరించారు. సరైన పద్ధతులు పాటిస్తే ఏడాదికి మూడు పంటలు పండిరచవచ్చని చెప్పారు. ఆయన చొరవతో గ్రామంలో 64రైతు సంఘాలు ఏర్పాటయ్యాయి. ఈ స్ఫూర్తితో నేను కూడా వ్యవసాయం చెయ్యా లని నిర్ణయించుకున్నాను. ఆ మాట చెప్పగానే ఎంతోమంది నన్ను చూసి ఎగతాళిగా మాట్లా డారు. కానీ నేను వెనుకంజ వేయలేదు. మా భూమిలో ఉన్న కంప చెట్లనూ, మొక్కలనూ తొలగించాను. వ్యవసాయ యోగ్యంగా మార్చాను. తొలి పంట మొలకలెత్తగానే నాలో కలిగిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. క్రమంగా పంటలను పెంచుతూ వెళ్ళాను. రెండు ఎకరాల్లో చిరు ధాన్యాలు, వేరుశెనగ, కూరగాయలు, ఆకుకూర పంటలు వేశాను. దీనికి 27వేల రూపాయల పెట్టుబడి పెట్టాను. రూ.1.4 లక్షల ఆదాయం వచ్చింది. .మూడేళ్ళలో తొమ్మిది రకాల పంటలను విజయవంతంగా సాగు చెయ్యగలిగాను.
ఒకరికి ఒకరం సాయపడతాం…
పంటల సాగులో నేను ఎలాంటి రసాయనిక ఎరువులూ, మందులూ ఉపయోగించలేదు. ఆవు పేడ, గోమూత్రం, మట్టి, బెల్లం, పప్పుల పిండితో తయారు చేసిన ఘన జీవామృతాన్నీ, ద్రవరూపంలోని జీవామృతాన్నీ మాత్రమే వాడాను. ప్రకృతి వ్యవసాయం ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ఇలా పండిన పంటల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. పౌష్టికాహార వినియోగం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే దీనికి మంచి డిమాండ్‌. పంట దిగుబడి ఎంత ఉన్నప్పటికీ కొనుగోలుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. మార్కెటింగ్‌ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ పద్ధతిలో పంటలు ఎవరు పండిస్తున్నారో తెలుసుకొని ముందుగానే అడ్వాన్సులు ఇస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూముల్లో సారాన్ని కాపాడుకోవచ్చు. మా పొలంలో పండిస్తున్న ధాన్యాలు,కూరగాయలు, ఆకుకూరల వల్ల మా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంది. ఇప్పుడు నామీద ఆర్థిక భారం తగ్గింది. అప్పులన్నీ తీర్చేశా. ప్రస్తుతం టొమాటో పంటను సాగు చెయ్యడానికి పొలాన్ని సిద్ధం చేస్తున్నాను. సరైన మార్గదర్శకత్వం రైతులకు లభిస్తే సానుకూల ఫలితాలు లభిస్తాయి. నా నేతృత్వంలో నడుస్తున్న స్వయంసహాయక బృందంలోని మహిళల నుంచి నాకు ఎంతో ప్రేరణ లభిస్తోంది. మేం ఒకరికి ఒకరం సాయం చేసుకుంటాం. పొదుపు చేసుకుంటాం. రుణాలు తీసుకుంటాం. విత్తనాలను పంచు కుంటాం. ఒకరి పొలంలో మరొకరం పని చేస్తాం. కష్టకాలంలో ఒకరిని ఒకరు ఆదుకుంటూ ఉంటాం. ప్రస్తుతం మా గ్రామాన్ని రసాయన రహిత వ్యవసాయ గ్రామంగా… అంటే బయో గ్రామంగా మార్చడానికి నేనూ, మా గ్రామస్తులూ పని చేస్తున్నాం.
రైతులకు శిక్షణ ఇస్తున్నా….
సాక్షాత్తూ దేశ ప్రధానితో మాట్లాడే అవకాశం వస్తుందనీ, ఆయన ప్రశంసలు అందుకుంటాననీ కలలోనైనా ఊహించలేదు. సుమారు అయిదు నిమిషాలు ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయంలో నా అనుభవాలను ఆయన స్వయంగా తెలుసుకున్నారు. ‘‘వన్నూరమ్మ మేడమ్‌! మీరు దేశ రైతులకు ఆదర్శం కావడం అభినందనీయం’’ అని మోదీ ప్రశంసించారు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.‘అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లాలో వ్యవసాయాన్ని సుసాధ్యం చేసిన ఆదర్శ రైతు’ అంటూ అందరూ అంటూ ఉంటే ఎంతో సంతోషంగా అనిపిస్తోంది.పట్టుదలతో పని చేస్తే ఏదైనా సాధించవచ్చు.పేద దళిత కుటుంబంలో పుట్టిన నేను ఎన్నో కష్టాలు పడ్డాను. అవేనాకు పాఠాలుగా మారాయి. ఇప్పుడు ఐసిఆర్‌పి (ఇంటర్నల్‌ కమ్యూనిటీ రిసోర్స్‌పర్సన్‌)గా పని చేస్తున్నాను. బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి వంకతండాలో దాదాపు 170 మంది మహిళా, ఆదివాసీ రైతులకు ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇస్తున్నాను.దీనికి గౌరవవేతనం కూడా లభిస్తోంది. మా అబ్బాయిల్లో ఒకడైన అనిల్‌ వ్యవసాయం చేస్తున్నాడు. ఏది ఏమైనా ప్రకృతి వ్యవసాయం ప్రయోజనాలపై అన్ని గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నదే నా ఆశయం.’’

  • శంకర్‌నాయక్‌, కళ్యాణదుర్గం
    సహజ వ్యవసాయం వల్లే సాధ్యం!
    ‘‘శీతల దేశాల్లో తప్పితే మిగిలిన ప్రాంతాలన్నింటిలోను గాలిలో తేమ ఉంటుంది. దీనిని ఆధారంగా చేసుకొని వ్యవసాయం చేయగలిగితే బంజరు భూములలో కూడా మంచి దిగుబడి తేవచ్చు. సహజ వ్యవసాయం పద్ధతిలో మేము ఈ తరహా ప్రయోగాలను 2018 నుంచి అనంతపూర్‌ ప్రాంతంలో చేస్తున్నాం. సాధారణంగా ఈ ప్రాంతంలో బంజరు భూములు ఎక్కువ. నీటి వసతి తక్కువ. అందువల్ల లభ్యమయ్యే అతి తక్కువ నీరు, గాలిలో తేమల ఆధారంగా వ్యవసాయ పద్ధతులను రూపొందించాం. వన్నూరమ్మ కూడా ఈ పద్ధతిలో సేద్యం చేశారు. ఈ పద్ధతిలో ఏడాది పొడుగునా రకరకాల కూరగాయలు పండిరచటం జరుగుతుంది. దీని వల్ల రైతులకు సంవత్సరం పొడుగునా ఆదాయం ఉంటుంది. రెండోది సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు కావటంతో పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి. పంటలు మార్చి మార్చి వేయటం వల్ల నేలకు పోషకాలు అందుతాయి. ఈ రెండిరటితో పాటుగా- ఈ పంటలు పండిరచే ప్రాంతంలో ఉష్ణోగ్ర తలు తక్కువ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించి ప్రపంచంలోని అనేక మంది శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం లక్షకు పైగా రైతులు ఈ తరహా వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తున్నారు.
  • టి. విజయ్‌ కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌, రైతు సాధికార సంస్థ
    తెలుగు రైతులు ఆదరిస్తున్నారు!
    సహజ వ్యవసాయ పద్ధతులను మిగిలిన వారితో పోలిస్తే తెలుగు రాష్ట్రాల రైతులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే దాదాపు రెండు లక్షల ఎకరాలలో ప్రకృతి కృషి పద్దతిలో సాగు జరుగుతోందంటే- దీనికి లభిస్తున్న ఆదరణను మనం గమనించవచ్చు. రైతు సాధికార సమితి కేవలం ఆంధ్రాలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా నోడల్‌ ఏజన్సీగా వ్యవహరిస్తోంది. ఇక మహిళా రైతులకు వ్యవసాయంతో పాటు కుటుంబ బాధ్యతలు కూడా తెలుసు. కనుక తమ కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని ఎలా అనుకుంటారో.. సమాజానికి కూడా అలాంటి ఆహారాన్ని అందించాలనే తపన వారిలో కనిపిస్తూ ఉంటుంది. ఎరువుల వల్ల కలిగే కష్టనష్టాలు వారికి బాగా తెలుసు కాబట్టి- సహజ వ్యవసాయ పద్ధతులను అనుసరించటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వారికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తోంది. 2015 నుంచి సహజ వ్యవసాయ పద్దతులపై కేంద్రం అమలు చేసిన పధకాలన్నీ విజయం సాధించాయి. ఈ ఏడాది సాగు పద్ధతులపైనే కాకుండా.. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌పైన దృష్టి పెడుతున్నాం. సేంద్రీయ రైతు ఉత్పత్తి సంస్థ (ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌-ఎఫ్‌సీఓ)లను ఏర్పాటు చేస్తున్నాం. వీటివల్ల రైతులు తమ ఉత్పత్తులను లాభసాటి ధరలకు విక్రయించుకోగలుగుతారు. ఎఫ్‌సీఓల వల్ల దేశంలో సేంద్రీయ వ్యవసాయానికి కొత్త ఊపు వస్తుందని ఆశిస్తున్నాం.’- అడిదం నీరజ శాస్త్రి, జాయింట్‌ సెక్రటరీ, కేంద్ర వ్యవసాయ శాఖ-(ఆర్‌.కె.రాఘవ రమణా రెడ్డి)

చిరు సేధ్యం..ఆరోగ్య భాగ్యం

మారుతున్న ఆధునిక పోకడలు.. నిత్యం పని ఒత్తిడిలో పడ ఆరోగ్యాన్ని ఆశ్రద్ద చేయడం.. తీరిక లేకుండా బిజీగా గడుపుతూ దొరికిన జంక్‌ఫుడ్‌ తినడానికి నగర ప్రజలు అలవాటు పడిపోతున్నారు.దీంతో కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలుఉన్న తిండి తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. చిరుధాన్యాల్లో మంచి పోషక విలువలు ఉంటున్నాయి. వీటిని సాగు చేస్తున్న రైతులకు సైతం సిరులు కురిపిస్తు న్నాయి. అంతేకాకుండా వీటి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మద్దతు ధరను కూడా ప్రకటించింది.రైతులు పండిరచిన దిగుబడులను పౌరసరఫరాశాఖ ద్వారా కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేసింది. దీంతో చాలా మంది రైతుల చిరుధాన్యాల సాగుకు ఆసక్తి చూపుతున్నారు.
నేటి పోటీ ప్రపంచంలో అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయనిక ఎరువులు,పురుగు మందుల వినియోగం పెరిగిపోయింది. ఫలితంగా భూమిలో రసాయన అవశేషాలు నిండి ఏటికేడాది పంట దిగుబడులు పడిపోతున్నాయి.ఇలా సాగు చేసిన ఆహారం పంటల్లో కూడా రసాయనాల అవశేషాలు ఎక్కువ ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా జనాల్లో వ్యాధుల సంఖ్య ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది.వీటికి చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.చాలా మంది ఇప్పుడు చిరుధాన్యాలను ఇష్టపడుతున్నారు. ఇప్పటికే చాలా ఏళ్ల నుంచి నగరంలోని రైతు బజార్లులో ప్రత్యేక కౌంటర్ల పెట్టి విక్రయాలు సాగిస్తున్నారు.నగర ప్రజలపై అవగాహన కల్పించేందుకు గత రెండేళ్ల నుంచి కొన్ని స్వచ్చంధ సంస్థలు కలసి చిరుదాన్యాల జాతర కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలను అవగాహన కల్పిస్తున్నారు.ఇందుకు సంబంధించి ఇటీవలే ఐక్యరాజ్యాసమితి కూడా 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్‌ సంవత్సరంగా ప్రకటించింది. దీనికి అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం సాగును ప్రొత్సహించేంఉదకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సదస్సులను నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తోంది.
మినుకు మినుకు..
వర్షాధార,సారవంతం కాని భూముల్లో ఆహార పంటలుగా చెలామణి అవుతున్న వరి,గోధుమ,మొక్కజొన్న లాంటివి పండిరచలేము. దాంతో ఆయా భూముల్లో ఇప్పటికీ మిల్లెట్స్‌ సాగు మినుకు మినుకు మంటోంది. అంటే పాక్షిక ఉష్ణమండల ప్రాంతాలలో సాగు చేస్తున్నారు. ప్రధాన ఆహార ధాన్యాలలో కంటే వీటిలో పోషకాలు, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. ఆరోగ్య భద్రతనిస్తాయి. అంతేకాక తీవ్రమైన వాతావరణ అననుకూల పరిస్థితులను తట్టుకునే శక్తి ఈ మిల్లెట్స్‌కు ఉంది. పర్యావరణ అభివృద్ధికి తోడ్పడతాయి.
2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం..
చిరుధాన్యాలు..సిరిధాన్యాలుగా పిలువబడే మిల్లెట్స్‌ పూర్వకాలం నుంచి మన దేశంలో ప్రధాన ఆహారపంటగా ఉండేది. ప్రస్తుతం వరి, గోధుమ, ఇతర ఫాస్ట్‌ఫుడ్స్‌ జనజీవన సరళితో మమేకమయ్యాయి. కంటికింపుగా పిల్లలను, పెద్దలను ఆకర్షిస్తున్న ఫాస్ట్‌ఫుడ్స్‌ లాంటి ఆహార పదార్ధాలు జిహ్వచాపల్యాన్ని తీర్చడం తప్ప ఆరోగ్యహేతువులు కావు. కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రోగ నిరోధక శక్తి అవసరం. అన్ని తరగతుల ప్రజలకు పౌష్టికాహారం అందించాల్సిన అగత్యం ఏర్పడిరది. వీటన్నింటి దృష్ట్యా మన ప్రభుత్వం 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించింది.
రిఫైన్డ్‌ డైట్‌ కల్చర్‌కు ప్రత్యామ్నాయంగా..
మారిన జీవనశైలితో ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజల్లో చైతన్యం పెరిగి,‘రిఫైన్డ్‌ డైట్‌ కల్చర్‌’కు ప్రత్యామ్నాయంగా పోషకాలు అధికంగా ఉండే మిల్లెట్స్‌ను స్వీకరించే స్థితిలో ఆలోచిస్తున్నారు. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రజలు రోగనిరోధక శక్తిని పెంపొందించు కోవడానికి మిల్లెట్స్‌ వినియోగంపై దృష్టి పెడుతున్నారు. ప్రకృతి ప్రేమికులు ప్రజల్లో మీడియా ద్వారా వీటిపై అవగాహన కల్పిస్తున్నారు.
పోషకాలు మెండు..
మిల్లెట్ల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం2018 ఏప్రిల్‌లో మినుములను న్యూట్రి-తణధాన్యాలుగా ప్రకటించింది.వాటిలోజొన్న (జోవర్‌),పెరల్‌ మిల్లెట్‌ (బజ్రా),ఫింగర్‌ మిల్లెట్‌ (రాగి/మాండువా) మైనర్‌ మిల్లెట్‌బీ ఫాక్స్‌టైల్‌ మిల్లెట్‌ (కంగని/కాకున్‌),ప్రోసో మిల్లెట్‌ (చీనా),కోడోమిల్లెట్‌ (కోడో),బార్న్యార్డ్‌ మిల్లెట్‌(సావా/సన్వా/జంగోరా),లిటిల్‌ మిల్లెట్‌ (కుట్కి)లు కూడా ఉన్నాయి.గ్రామీణస్థాయిలో వ్యవసాయం,చిన్నతరహా,కుటీర పరిశ్రమలు, హస్తకళలు,ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో జాతీయ అభివద్ధి బ్యాంకుగా బాధ్యత వహించే నాబార్డ్‌ కూడా ఈ థీమ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించింది.
చిరుసేధ్యం కేరాఫ్‌ ఏజెన్సీ ప్రాంతం..
చిరుధాన్యాలు ఒకప్పుడు పేదలు,మధ్య తరగతి ప్రజల ప్రధాన ఆహారం.మూడు,నాలుగు దశాబ్దాల క్రితం వరకూ వీటి వినియోగం అధికంగానే ఉండేది.ముఖ్యంగా ఉమ్మడి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైన 11మండలాలల్లో చిరు సేధ్యం ఉత్పత్తులు అధికంగా ఉండేవి.వీటికి రసాయనిక ఎరువులు,పురుగుమందులు వాడకుండా పశువుల ఎరువు, చెరువు మట్టి,సేంద్రియ ఎరువులతో పండిరచే వాళ్లు. పలితంగా వీటిని వాడే ప్రజల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండేది. అనంతరం వచ్చిన మార్పులతో ఏడాదికేడాది చిరుధాన్యాల సాగు తగ్గుతూ వచ్చింది.చాలా మంది రైతున్నలు అధిక ఆదాయం కోసం వరి,పత్తి,మిరప,ఉల్లి వంటి పంటల సాగుపై ఆసక్తిని కనబరచ డంవల్ల చిరుధాన్యాల సాగు కనుమరుగువుతూ వచ్చింది.వీటితోపాటు అధిక దిగుబడులను సాధించాలనే పోటీతత్వంతో రైతులు విచక్షణా రహితంగా ఎరువులు,పురుగు మందులు వాడటం మొదటు పెట్టారు. ఫలితంగా సాగు ఖర్చులు పెరిగి పంట దిగుబడులు తగ్గాయి. భూమి కూడా విషతుల్యంగా మారుతోంది. దీనిని తగ్గించేందకు రాష్ట్ర ప్రభుత్వం చిరుధాన్యాల సాగును ప్రొత్సహిస్తోంది. ఇందులో భాగంగా జొన్నలు,రాగి పంటలకు మద్దతు ధరను ప్రకటించింది.
ఈ ఏడాది 9.85 వేల హెక్టార్ల సాగు లక్ష్యంగా…
ఉమ్మడి జిల్లా అనకాపల్లి,అల్లూరి సీతారామ రాజు,విశాఖపట్నం జిల్లాలో మిల్టెట్స్‌ సాగను ప్రొత్సహించే లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 9.85 హెక్టార్లలో సాగు చేసేందుకు వ్యవసాయ అధికారులు ప్రణాళికలను సిద్దం చేశారు. అందులో 2664 హెక్టారులో జొన్న,2050 హెక్టార్లలో సజ్జలు,2010హెక్టాలో రాగి,1872 హెక్టారలలో కొర్రలు సాగు లక్ష్యంగా నిర్ధేశించారు. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) పరిధిలో మిల్లెట్స్‌,క్లస్టర్స్‌ ఏర్పాటు చేసి ప్రతి నెలా మొదటి శుక్రవారం వ్యవసాయ అధికారులతో రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ సాగను ప్రొత్సహిస్తున్నారు.
మద్దతు ధరలు ఇలా..
రాష్ట్ర ప్రభుత్వం మిల్లెట్స్‌ సాగు ప్రొత్సహించే కార్యక్రమంలో భాగంగా జొన్న,రాగులకు మద్దతు ధరలను కూడా ప్రకటించింది. హైబ్రీడ్‌ జొన్నలకు క్వింటా రూ.3,180కాగా సాధారణ జొన్నకు క్వింటా 3225,అలాగే రాగులకు క్వింటాకు రూ.3846గా ప్రకటించింది. రైతులు పండిరచిన పంటలకు మద్దతు ధరను కల్పించి పౌరసరఫరాశాఖ తరుపున కొనుగోలు చేయనుంది.చిరుధాన్యాలు.. సిరి ధాన్యాలుగా పిలువబడే మిల్లెట్స్‌ పూర్వకాలం నుంచి మన దేశంలో ప్రధాన ఆహారపంటగా ఉండేది. ప్రస్తుతం వరి, గోధుమ, ఇతర ఫాస్ట్‌ఫుడ్స్‌ జనజీవన సరళితో మమేకమయ్యాయి. కంటికింపుగా పిల్లలను, పెద్దలను ఆకర్షిస్తున్న ఫాస్ట్‌ఫుడ్స్‌ లాంటి ఆహార పదార్ధాలు జిహ్వచాపల్యాన్ని తీర్చడం తప్ప ఆరోగ్యహే తువులు కావు. కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రోగ నిరోధక శక్తి అవసరం. అన్ని తరగతుల ప్రజలకు పౌష్టికాహారం అందించాల్సిన అగత్యం ఏర్పడిరది. వీటన్నింటి దృష్ట్యా మన ప్రభుత్వం 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించింది. ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచి భారత ఉపఖండంలో చిరుధాన్యాలు పండిరచబడుతున్నాయని సూచించడానికి పాలియోం టలాజికల్‌ ఆధారాలున్నాయి. గడ్డి కుటుంబానికి చెందినవి చిరుధాన్యాలు. ఏడాదంతా ఉష్ణమండల వాతావరణంలో పెరిగే తృణధాన్యాలు. తక్కువ నీటి సౌకర్యంతో,అతి తక్కువ కాలంలోనే పంట కోతకు వచ్చి, దిగుబడిని ఇస్తాయి. సైజులో చిన్నవే కానీ పోషకాలు మెండుగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్‌, అమైనో ఆమ్లాలు,వివిధ రకాల ఖనిజాలను కలిగి ఉం టాయి. రాగులు (ఫింగర్‌ మిల్లెట్‌),జొన్నలు (జోవర్‌),బజ్రా (పెర్ల్‌ మిల్లెట్‌),ఊదలు, కొర్రలు, అండుకొర్రలు, ప్రోసో (చీనా),కోడో (కొడ్రా, అరికెలు), ఫాక్స్‌ టెయిల్‌ (కంగ్ని/కొర్ర), బార్న్యార్డ్‌ (వరై, సావా), లిటిల్‌ మిల్లెట్‌ (కుట్కి) మనదేశంలో పండిరచే మిల్లెట్లు.
ఆకుపచ్చ విప్లవం..
ఎమ్‌ఎస్‌ స్వామినాథన్‌ ఆధ్వర్యంలో (1960) వచ్చిన గ్రీన్‌ రివల్యూషన్‌ దశాబ్ద కాలం మనగ లిగింది. తద్వారా భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి లాంటి రకరకాల విత్తనాలు వ్యవసాయంలో ప్రాధాన్యతను సంతరించు కున్నాయి. గ్రీన్‌ రివల్యూషన్‌ నేపథ్యంలో యాంత్రిక వ్యవసాయ ఉపకరణాలు, నీటి సౌకర్యం, పురుగుమందులు, ఎరువులు అభివృద్ధి రూపంలో వినియోగంలోకి వచ్చాయి. వ్యవసాయం ఆధునిక పారిశ్రామిక వ్యవస్థగా మారింది. ఆహారధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగింది. వాణిజ్య, వ్యాపార ధోరణిలో క్రమంగా వరి, గోధుమ ప్రాముఖ్యత పెరిగి, మిల్లెట్స్‌ ఉనికి మరుగున పడిపోయింది.
నాబార్డ్‌ ప్రమేయం..
గ్రామీణస్థాయిలో వ్యవసాయం, చిన్న తరహా, కుటీర పరిశ్రమలు, హస్తకళలు, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో జాతీయ అభివద్ధి బ్యాంకుగా బాధ్యత వహించే నాబార్డ్‌ కూడా ఈ థీమ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించింది.-(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

భారత స్వాతంత్య్ర పోరాటం అవలోకం

ఎందరో  త్యాగమూర్తుల పోరాట ఫలితంగా భారత ప్రజలు నేడు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో కొత్త తరం ముందుకు వచ్చింది. భారత ఉపఖండం లో స్వాతంత్య్రం కోసం జరిగిన అనేక ఉద్యమాలనన్నిటినీ కలిపి ‘‘భారత స్వాతంత్య్రోద్యమం’’గా చెబుతున్నారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్య్రోద్యమంలో భాగాలు. భారత ఉపఖండంలోని బ్రిటిష్‌, ఇతర వలసపాలకుల పాలనను అంతమొందంచటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించే అనేక రాజకీయపక్షాలు ఉద్యమించాయి.
16వ శతాబ్దంలో పోర్చుగీసు ఆక్రమణలకు వ్యతిరేకంగా అబ్బక్కరాణి చేసిన పోరాటాలను, 17వ శతాబ్దం మధ్యలో బెంగాల్‌ లో ఈస్ట్‌ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలను వలస పాలనపై వ్యతిరేకతకు మొదటి అడుగులుగా చెప్పవచ్చు. మొదటి సంఘటిత సాయుధ పోరాటం బెంగాల్‌ లో ప్రారంభమై తర్వాత రాజకీయ పోరాటంగా పరిణామం చెంది భారత జాతీయ కాంగ్రెస్‌ గా ఆవిర్భవించింది. కాంగ్రెసులో అతివాదులైన లాలా లజపతిరాయ్‌, బాలగంగాధర తిలక్‌, బిపిన్‌ చంద్ర పాల్‌, (లాల్‌ బాల్‌ పాల్‌) విదేశీవస్తు బహిష్కరణ, సమ్మె, స్వావలంబన మొదలైన పద్ధతులను అవలంబిస్తే, అరబిందో వంటివారు తీవ్రవాద మార్గాలను అవలంబిచారు. మెదటి దశకాలలో సాయుధ విప్లవ పోరాటాలు ముందుకు వచ్చాయి. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీ, అమెరికాల్లోని భారత స్వాతంత్రయోధులు ప్రారంభించిన గదర్‌ పార్టీ సహకారంతో జరిగిన సంఘటిత భారతసిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమంలో వచ్చిన మౌలిక మార్పుగా చెప్పవచ్చు.
జాతీయోద్యమం చివరి దశలో జాతీయ కాంగ్రెస్‌ మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాలలో ఉద్యమించింది. ప్రముఖ విద్యావేత్త రాంజీ సింగ్‌ మహాత్మాగాంధీని 20వ శతాబ్దంలో అవతరించిన బోధిసత్వునిగా కీర్తించాడు. అయితే ఇతర నాయకులు సాయుధ పోరాటాలను అవలంబించారు. సుభాష్‌ చంద్ర బోస్‌ సాయుధ సంగ్రామమే సరైనదిగా భావిస్తే, స్వామి సహజానంద సరస్వతి సన్నకారు రైతులు, శ్రామికుల సంపూర్ణ ఆర్ధిక స్వాతంత్రా నికై పిలుపునిచ్చాడు. రెండవ ప్రపంచయుద్ధ కాలానికి ఈ ఉద్యమాలు ఉధృతరూపం దాల్చాయి. నేతాజీ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పేరుతో భారత జాతీయసైన్యాన్ని స్థాపించి తూర్పు ఆసియా నుండి పోరాడగా భారత జాతీయ కాంగ్రెస్‌ క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. మహాత్మా గాంధీ నాయకత్వంలోని 1947 ఆగష్టు 15న భారత దేశం స్వతంత్ర దేశంగా ఆవిర్బవించింది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయితే అప్పటివరకూ బ్రిటీష్‌ వారి పాక్షిక పాలలోనే సాగింది. భారత రాజ్యాంగం భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్బవింపజేసింది.
సుసంపన్న భారత్‌ దిశగా సుస్థిర ప్రయాణం..!
స్వతంత్ర భారతం 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ ఏట అడుగు పెడుతోంది. ఈ సందర్భం గా పుణ్యభూమి ప్రస్థానాన్ని సింహావలోకనం చేసుకుంటే సవ్యదిశలోనే పురోగమిస్తున్నామని అంచనా వేసుకోవచ్చు.
‘‘ప్రపంచం అంతా నిద్రిస్తున్న వేళ ..అర్థరాత్రి భారత్‌ కొత్త జీవితం, స్వేచ్చల కోసం మేలు కుంది..! ‘‘ అని 75 ఏళ్ల క్రితం భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన క్షణాన జవహర్‌లాల్‌ నెహ్రూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ మాటల వెనుక ఎంతో అర్థం ఉంది. స్వాతంత్రం వస్తేనే సమస్యలు పరిష్కారం కావు. అప్పట్నుంచే అసలు సమరం ప్రారంభమవు తుంది. దేశానికి ప్రజలందరూ కలిసి ఓ దశ.. దిశ తీసుకు రావాల్సిన అవసరం అప్పుడు ఉంది. అప్పట్నుంచి ఇప్పటికి 75ఏళ్లు పూర్త య్యాయి. 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇన్నేళ్ల కాలంలో భారత్‌ ఏం సాధించింది..?ప్రపంచంతో పోటీ పడి ఎంత ముందుకెళ్లాం..?
ప్రథమ స్వతంత్ర సంగ్రామం
జ్యోతిబసు 1857లో జరిగిన మహా తిరుగుబాటు ఆధునిక భారత చరిత్రకు పరీవాహక ప్రాంతం లాంటిది.భారతదేశంలో ఆంగ్లేయులను మొట్ట మొదటి సారిగా సవాలు చేసినది…భారత జాతీయ రాజకీయాలు జీవం పోసుకోవడానికి స్ఫూర్తి రగిలించినది…దేశం లోని బ్రిటిష్‌ ప్రభుత్వం తన రాజ్యాంగంలో కీలక సవరణలు చేయాల్సి రావడానికి దోహదం చేసినది.ఈ రోజు…నూట యాభై సంవత్సరాల తర్వాత ఆమహత్తర ఘటనను మనం గుర్తు చేసుకుంటున్నాం. జాతి నిర్మాణం పూర్తి చేయడానికి ఆవిప్లవం మనకు కొత్త స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటుంది. పంతొమ్మిదవ శతాబ్దంలో అనేక సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సినవాటిలో లాటిన్‌ అమెరికాలో సైమన్‌ బోలివార్‌ స్పానిష్‌ వలసవాదానికి వ్యతిరేకంగా జరిపిన పోరాటం, విప్లవ మత గురువు హిడాలో నాయకత్వాన జరిగిన పోరాటం. అయితే, సామాజికంగానూ భౌతికంగానూ అత్యంత శక్తివంతమైనది. 1857లో భారతదేశంలో జరిగిన తిరుగు బాటు,కొవ్వు పూత పూసిన తూటాలు ఉప యోగించడానికి వ్యతిరేకంగా ఈ సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. అయితే, భారత దేశంలో ఈస్టిండియా కంపెనీ అమలు చేస్తున్న రాజకీయ వ్యవస్థ మూలంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలోని పౌర ప సమాజపు విశాల సెక్షన్లతో సిపాయిలు భాగస్వాములయ్యారు. సిపాయిల తిరుగుబాటు,జనంలో వచ్చిన తిరుగుబాటు- రెండిరటి కలయిక వల.
వెనక్కి తిరిగి చూసుకుంటే గర్వపడే విజయాలు.!
రెండు శతాబ్దాల బానిసత్వం..త్యాగధనుల పోరు ఫలితం..స్వేచ్చా గీతికతో మువ్వన్నెల స్వాతంత్య్ర భారతం. రెండు వందల సంవత్స రాలు భారత్‌ను తమ కబంధ హస్తాల్లో బిగించిన ఆంగ్ల పాలకుల్ని తరిమేయడానికి చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి పౌరుడూ ఓ యోధుడయ్యాడు. స్వాతంత్య్ర సంగ్రామంలో సామాన్యుడు సైతం దేశం కోసం సర్వం త్యాగం చేశాడు.జెండా పట్టుకుని భరతమాత దాస్య శృంఖలాలు తెంచేందుకు వజ్రాయుధమే అయ్యాడు. అలా అందరి రక్తం,కష్టం,త్యాగం సమ్మిళితంగా మన చేతికందిన స్వాతంత్య్రానికి 76వ ఏడు వచ్చింది. ఏమి సాధించామన్న విష యాన్ని ఆత్మపరిశీలన చేసుకోవడానికి.. సాధిం చాల్సిందేమిటని నిర్దేశించుకోవడానికి ఇది అరుదైన అవకాశం.75 ఏళ్ల కిందటి ప్రజల జీవన ప్రమాణాలతో పోలిస్తే ఇప్పుడు దేశం ఎంతో పురోగమించింది. మన పూర్వికుల వరకూ ఎందుకు… ఈ నాటి యువత తల్లిదండ్రుల్ని అడిగితేనే తాము ఎలాంటి మౌలిక వసతులు లేని పరిస్థితుల్లో పెరిగామో చెబుతారు. ఓ పాతికేళ్ల ఏళ్ల క్రితం వరకూ సగం జనాభాకు కరెంట్‌ అంటే తెలియదు. ఇంటర్నెట్‌ అనే పదం కూడా తెలియదు. ఇక రోడ్లు,మంచినీరు,గ్యాస్‌ వంటి సౌకర్యాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అలాంటి పరిస్థితుల్ని …ప్రస్తుత పరిస్థితుల్ని పోల్చి చూసుకుంటే దేశం ఎంతో పురోగమించిందని అర్థం చేసుకోవచ్చు. దేశంలో కరెంట్‌ అందని గ్రామం లేదని ఇటీవలే కేంద్రం ప్రకటించింది. చిట్ట చివరి గ్రామానికీ విద్యుత్‌ వెలుగులు అందించామని తెలిపింది. ఇక విద్య, వైద్య సౌకర్యాలు ఎంతో మెరుగుపడ్డాయి. అందరికీ సరిపడా అందుతున్నాయా అంటే.. సంతృప్తికరం అని చెప్పలేం కానీ.., నిన్నటి కంటే ఈ రోజు మెరుగు అని మాత్రం చెప్ప గలిగే స్థితిలో భారత్‌ ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు.
ప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశమే అయినా పురోగమనమే..!
స్వాతంత్య్రం వచ్చిన 75ఏళ్లకు కూడా భారత్‌ను అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెబుతున్నారు. దేశ జనాభాలో ఇప్పటికీ సగం మందికిపైగా పేదరికంలోనే ఉన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరొం దిన భారత్‌లో ఇంతమంది పేదలు ఉండటం ఖచ్చితంగా వైఫల్యమే. ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు. కానీ పేదలు మాత్రం పైకి రావడం లేదు. పేదరికం తగ్గిపోయిందని ప్రభుత్వం లెక్కలు చెబుతూ ఉండవచ్చు. కానీ ప్రభుత్వం నిర్దేశించుకున్న మొత్తం కన్నా ఒక్క పైసా సంపాదించుకున్నా వాళ్లు పేదలు కాదనడం…మనల్ని మనం మోసం చేసు కోవడమే. దేశంలో విద్య, వైద్యం అందని వారంతా పేదలుగానే భావించాల్సి ఉంటుంది. ఇటీవలి కరోనా మహమ్మారి సమయంలో ఆ వైరస్‌ బారిన పడి ఎంత మంది.ఎన్ని లక్షల కుటుంబాలు అప్పులపాలయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ధనిక..పేద తేడా లేదు. అందరూ ఆస్తులు కోల్పోయారు. అప్పుల పాల య్యారు. కేవలం రేషన్‌ కార్డు ఉన్న వారే పేదవాళ్లు..మిగతా వాళ్లెవరూ కాదనడం ఎంత మూర్ఖత్వమో.. ప్రభుత్వాలు కూడా అర్థం చేసు కున్న రోజునే నిజమైన పేదరిక నిర్మూలనకు బీజాలు పడతాయి.ఈ 75 ఏళ్ల భారతావనిలో ప్రభుత్వాలు అంత విశాలంగా ఆలోచించక పోవడమే ఇప్పటి వరకూ చోటు చేసుకున్న విషాదం.
ఇప్పటికీ వదలని జాడ్యాల వల్లే వెనుకబడుతున్నాం…!
శతాబ్దానికి మూడు వంతులు గడిచి పోయింది.టెక్నికల్‌గా మనం ఎక్కడకో పోయాం. చంద్రుడ్ని అదుకుంటున్నాం. ఆకాశానికి నిచ్చెనలేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు వైద్య రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నారు. టెక్నాలజీ రంగంలో భారతీయులే గ్రేట్‌ అన్న పేరు తెచ్చుకుంటున్నారు. కానీ..అదే సమయంలో కాస్త వెనక్కి తిరిగి చూస్తే ..మన నలుపు మనకే అసహ్యమేస్తూ ఉంటుంది. దేశ సమగ్రతను కాపాడుకోవాలన్నా, అభివృద్ధిలో ముందుకు సాగిపోవాలన్నా అది ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుంది. కానీ ప్రజలు వదిలించుకోలేని సమస్య కులం,మతం .దేశం తరపున ఎవరైనా ఓగొప్ప విజయం సాధిస్తే ముందుగా అతని కులం ఏమిటి అని వెదికే వారి సంఖ్య ఇండియాలో ఎక్కువ.ఓమ తం వారు విజయం సాధిస్తే ఆమతం కనుక ప్రశంసించేవారూ తగ్గిపోతారు. దీనికి సాక్ష్యం హాకీ క్రీడాకారిణి వందన కటారియా ఉదంతం. ఆమె ఒలింపిక్స్‌లో సర్వశక్తులు ఒడ్డి దేశానికిప తకం తెచ్చేందుకు ప్రయత్నిస్తూంటే… ఇండి యాలో ఆమెఇంటిపై కులపరమైన దాడి జరిగింది. దీనికి స్వతంత్ర భారతావని మొత్తం సిగ్గుపడాల్సిందే. ఇక్కడ తప్పు..వందనా కటారియా కుటుబంపై కులపరమైన దాడి చేసిన వారిది కాదు..అలాంటి మనస్థత్వాన్ని వదిలించుకోలేకపోయిన భారతీయులది. ఆ విష యంలో 75 ఏళ్లలో మనం సాధించింది చాలా స్వల్పం. ఇంకా విశాలం చేసుకోవాల్సిన అభిప్రా యాలు అనంతం ఉన్నాయి. కానీ రాను రాను దేశంలో కులాల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. సామాజికంగా,ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వర్గాలు సైతం తమకూ రిజర్వేషన్లు కావాలని డిమాండు చేస్తున్న పరిస్థితి నెలకొంది.
రాజకీయ వ్యవస్థ సంయమనం పాటిస్తే అంతా మంచే..!
భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.అయితే ఆ ప్రజాస్వామ్య పునాదులు ఈ 75ఏళ్లలో బలపడ్డాయా… బలహీనపడ్డాయా అని విశ్లేషించుకుంటే.. రెండోదే నిజం అని అంగీకరించక తప్పని పరిస్థితి. ప్రజాస్వామ్యం బలంగా ఉండా లంటే… వ్యవస్థలన్నీ సక్రమంగా పని చేయాలి. కానీ దేశంలో ప్రతి వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. న్యాయవ్యవస్థ సహా.. రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలు అన్నీ ఏదో ఓ సందర్భంలో సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. దీనికి కారణం రాజకీయ వ్యవస్థే. ప్రజలు ఇచ్చిన అధికారంతో మిగతా వ్యవస్థలను అదుపు చేయాలని రాజకీయ వ్యవస్థ అంతకంతకూ భావిస్తూ పోతూండటమే సమస్యలకు మూలం అవుతోంది. అదే ప్రజాస్వామ్యానికి పెను సవాల్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొనే అతి క్లిష్టమైనసమస్య కూడా ఇదే కావొచ్చు.
భవిష్యత్‌ అంతా భారత్‌దే..!
సమస్యలు అంటూ లేని మనిషి ఎలా ఉండడో.. అలాగే సమస్య అంటూ లేని దేశం కూడా ఉం డదు. ఆ సమస్యలను ఎంత పకడ్బందీగా అధిగమిస్తారో… ప్రజలు ఎంత వివేకంగా ఉం టారో…వాళ్లని పాలించే వాళ్లు దేశం పట్ల ఎంత నిబద్ధతగా ఉంటారో అన్నదానిపైనే దేశం పురోభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అదృష్టవ శాత్తూ ఈ విషయంలో భారత్‌కు అన్నీ మంచి సూచనలే ఉన్నాయి..ఈ 75వ స్వాతంత్య్ర వేడుకల్ని…తిరంగా రెపరెపలతో.. ఘనమైన వారసత్వ సంపదతో..మొక్కవోని భవిష్యత్‌ సంకల్పంతో భారతావని మున్ముందుకు దూసుకుపోయేలా ఉంటుందని ఆశిద్దాం.!
`హ్యాపీ ఇండిపెండెన్స్‌ డే

మూలవాసులం..మేము ఆదివాసులం

దేశంలో తమ హక్కుల సాధన కోసం ఆదిఆసీ సమాజాలు ఉద్యమించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బ్రిటీష్‌ చట్టాలకు వ్యతిరేకంగా బిర్జాముండా,సంతాల్‌లు,తిరుగుబాటు చేశారు.జిల్‌,జంగల్‌,జమీన్‌ కోసం సాయుధ పోరాటాలు సాగాయి. తమపై సాగుతున్న అన్ని రకాల దోపిడీ,పీడనలను ఎదరించారు. అనేకసార్లు ఓటమి చెందినా తమ ఉనికే ప్రశ్నార్ధకంగా మారుతున్న పరిస్థితుల్లో,తమ అస్తిత్వం కోసం అలుపెరుగని పోరాటాలు నేటికీ కొనసాగి స్తూనే ఉన్నారు. జీవన పోరాటంలో ఆరితేని వారు ఆదివాసీలు. వారు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజ వనరులతో కళకళలాడుతుండేవి. సాటి మానవులుగా అనేక దేశాలలో వారికి తగిన గుర్తింపు,రక్షణ నేటీకీ లేదు.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నివాసముండే గిరిజనులు అనేక సమస్య లతో కొట్టిమిట్టులాడుతునే ఉన్నారు. గునపర్తి సైమన్‌
ఆదివాసీలు తమ అస్తిత్వం కోసం ఎన్నో అలుపెరుగని పోరాటాలు చేస్తున్నా..అభివృద్ధికి మాత్రం నోచుకోవడమే లేదు. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఆదివాసీల తలరాతలు మారినట్లు కనిపించడం లేదు. తమ హక్కుల కోసం నిరంతరంగా గళం విప్పుతూనే ఉన్నారు. ప్రధానంగా ఆదివాసీలను నిరక్షరాస్యత, ఆరోగ్య సమస్యలు,పేదరికం వెంటాడుతునే ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ జిల్లాలో రవాణా సౌకర్యం, విద్యుత్‌ లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలోనే జిల్లాలో ఆదివాసీలు అధికంగా నివసిస్తున్నారు. విద్య, వైద్యం అందని ద్రాక్షగానే మారడంతో ఆదివాసీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. తమ వెనుకబాటుతనానికి మరో గిరిజన తెగనే కారణ మంటూ గత కొంత కాలంగా ఆందోళ న బాట పట్టిన ఆదివాసీలు, ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నారు. ఆదివాసీలకు రక్షణగా ప్రత్యేక చట్టాలు ఉన్నా.. వాటి అమలుల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపడం లేదంటూ,హక్కుల కోసం నిరంతర పోరాటాలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీల ఉద్యమాన్ని రగిలించిన ఎంపీ సోయం బాపురావు గత పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపొందడంతో ఆదివాసీలు ఎంతో సంబరపడ్డారు.కాని మూడేళ్లు గడిచిపోతున్నా.. తమ కల సాకారానికి అడుగు ముందుకు పడకపోవడంతో మెజార్టీ ఆదివాసీల్లో నిరాశానే కనిపిస్తోంది. అడవుల్లో విసిరిపారేసినట్లు కనిపించే ఆదివాసీల జీవనాన్ని మరింత మెరుగుపరిచేందుకు 1982 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆదివాసీల దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ.
పోడు భూములకు పరిష్కారం ఏదీ?!
ఎన్నో ఏళ్లుగా పోడు భూముల సమస్యను పరిష్కరించాలంటూ పోరాటాలు చేస్తున్నా.. ప్రభుత్వం, పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత యేడాది క్రితం స్వయాన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆరే అర్హులైన గిరిజ రైతులందరికీ హక్కు పత్రాలు ఇస్తామని ప్రకటించి రైతుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించారు. అయినా ఇప్పటి వరకు హక్కుపత్రాలు ఇవ్వకపోగా..పరిష్కారమే చూపడం లేదు. దీంతో వానాకాల సీజన్‌ మొదలైందంటే చాలు ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. అటవీ శాఖ అధికారులతో ఆదివాసీలు చిన్నపాటి యుద్ధాన్నే చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతు న్నాయి. పోడు భూములను సాగు చేసుకుంటున్న క్రమంలో హద్దులు దాటారంటూ అటవీ శాఖాధికారులు ఆదివాసీ మహిళలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయం భయంగా పోడు సాగు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోందని వారు ఆవేదనకు గురవు తున్నారు. ప్రభుత్వ ప్రకటనతో వేల మంది గిరిజన రైతులు హక్కుపత్రాల కోసం దరఖా స్తులు చేసుకున్నా.. అమలుకు నోచుకోక పోవడంతో ఎదురుచూపులు తప్పడం లేదు.
వణుకు పుట్టిస్తున్న వానాకాలం
రెండు తెలుగు రాష్ట్రాల్లో నివాసముంటున్న గిరిజనుల సమస్య ఏదైనా అమాయక ఆది వాసీల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. వానాకాలం వచ్చిం దంటే చాలు ఆదివాసీ గ్రామాలకు వణుకు పుట్టిస్తోంది. చిన్నపాటి వర్షాలకే వాగులు, వంకలు పొంగి ప్రవహిం చడంతో ఊరుదాటే పరిస్థితు లు కనిపించడం లేదు. దీంతో అత్య వసర సమయంలో వైద్యం అందక, వరద నీటి ఉధృతిని దాటేక్రమంలో ప్రమాదాల భారీన పడి ప్రాణాలు కోల్పో తున్నారు. ముఖ్యంగా ఆదివాసీ మహిళలకు ప్రసవమంటే పునర్‌ జన్మగా మారింది. సకాలంలో వైద్యం అందక మాతాశిశు మరణా లు ఏటా జరుగుతూనే ఉన్నాయి. ఆదివాసీలు ఆచార సంప్రదాయాలకు కట్టుబడి మూడ విశ్వాసాలతో జీవనం గడుపుతున్నారు. అలాగే తరతరాలుగా వెంటాడుతున్న రక్తహీనత, పౌష్టికాహార లోపంతో ఆదివాసీలు బక్కచిక్కిపోయి బలహీన పడుతూ..మరీ దయనీ యంగా కనిపిస్తున్నారు. దీని కారణంగా ఆదివా సీలను భయంకర వ్యాధులు చుట్టుముట్టి ఏటా ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. అంతే కాకుండా వెంటాడుతున్న పేదరికం,అనా రోగ్య సమస్యలతో ఆర్థికంగా,సామాజికంగా వెనుకబడి పోతున్నారు. మెరుగైన వైద్య సౌకర్యాలు అందు బాటులోఉన్నా..సకాలంలో వైద్యం అందకపో వడంతో ప్రాణనష్టం జరుగుతూనే ఉంది.
ఉద్యోగం, ఉపాధికి దూరమే..
ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీలకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు దూరమవుతునే ఉన్నాయి. ఆదివాసీలకు ఉద్యోగ భద్రత కల్పిం చేందుకు గత ప్రభుత్వం జీవో నెం.3 తీసు కొచ్చింది. కానీ గత రెండేళ్ల క్రితమే సుప్రీంకోర్టు ఈ జీవోను రద్దు చేయడంతో ఉద్యోగ అవకాశ ాలు కరువవుతున్నాయి.ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యా య పోస్టుల్లో గిరిజనేతరులకు కూడా అవకా శాలు కల్పించాలంటూ దేశ అత్యున్నత న్యాయ స్థానం తీర్పును ఇవ్వడంతో ఆదివాసీల ఆశలు ఆవి రయ్యాయి. దీంతో ఏజెన్సీలో స్పెషల్‌ డీఎస్సీకి అవకాశమే లేకుండా పోయింది. అసలే అంతంత మాత్రంగా చదువుకుంటున్న ఆదివాసీలకు ప్రభుత్వ ఉద్యోగం గగనంగా మారింది. ప్రభుత్వం జీవో నెం.3మళ్లీ పునరు ద్ధరించక పోవడంతో ఎంతో మంది నిరుద్యో గులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూ డాల్సి వస్తోంది. ఇకనైనా ప్రభుత్వం జీవో నెం.3 తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంత ఉద్యోగా లను స్థానికులకే కేటాయించాలంటూ డిమాండ్‌ చేస్తున్నా.. ప్రభుత్వాలు పట్టించుకున్నట్లే కనిపిం చడం లేదు. నిరంతరంగా ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నా..పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారు.
ఉద్యమాలతోనే హక్కులు సాధించుకుంటాం
ఆదివాసీలకు ఉద్యమాలు చేయడం కొత్తేమీ కాదు. నిరంతర పోరాటాలతోనే హక్కులు సాధించుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం కల్పిం చుకుని జీవో నెం.3 పునరుద్ధరించాలి. అలాగే ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన రైతులందరికీ పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనుల పట్ల చిన్నచూపు చూస్తోంది. ఆదివాసీల సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలకు ఇచ్చిన హామీలన్నీ మరిచి పోయింది. ఎన్నికల సమయంలోనే ఆదివాసీలు గుర్తుకొస్తున్నారు. ఏదిఏమైనా ఆదివాసీలకు అధికారం వస్తేనే హక్కుల సాధనకు అవకాశం ఉంటుంది.
ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసీ ప్రజలు
సమిష్టి జీవన పద్ధతులు,సహజీవనం,పారదర్శ కతకు నిలువెత్తు సాక్షులు వారు.వ్యష్టి జీవన పద్ధతులు,పరస్పర అసహనం,కనిపించని కుట్ర లు నేటి పారి శ్రామిక సమాజలక్షణాలు. బ్రెజిల్‌,పెరూ దేశాలలో వంద కుపైగా ఆదివాసి తెగలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నారు. పెరూ లోని‘ముచి-పిచి’పర్యావరణ పార్కుకు కేవలం100కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఈ తెగలు ఇప్పటికీ జంతు ప్రాయమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు.50-60 వేల సంవత్స రాల నుంచి అటవీ దుంపలు ప్రధానఆహార వన రుగా జీవిస్తూ మొక్క జొన్న,బంగాళాదుంప సాగుకు ఈ తెగలు ఎంతో తోడ్పడ్డాయి.తాము వేటాడే జంతువులకు ఎరగావేసే క్యురారే మొక్క నేడు ఓపెన్‌ హార్ట్‌ శస్త్రచికిత్సకు ఔషధంగా మారింది. గత సునా మీలో అండమాన్‌ తెగలలో ఆదివాసి తెగలు ఎవ రూ చనిపోలేదు. కారణం సముద్రం వెనక్కి వెళ్లగానే వారు ఎత్తైన కొండలపైకి వేగంగా కదిలి వెళ్లారు. జారవా, సెంటినిల్‌ తెగల ఆదివాసీల్లో కళ్లుతెరచి సముద్రపు నీటిలో చేపలవేటకు అనువుగా 50 శాతం మంది కళ్లు రూపాంతరం చెందాయి.ప్రపంచంలో సుమారు ఏడు వేల భాషలు ఉంటే అందులో ఆదివాసీ తెగలు మాట్లాడే బాషలే నాలు గువేలు ఉన్నా యి. నేడు అత్యధికులు మాట్లాడే, వాడే ఆరు భాషలు (ఇంగ్లీషుతో సహా) గతంలో అంత రించిపోయిన ఆదివాసీ తెగలు వాడినవే. బ్రతుకు పోరాటంలో ఆరితేరిన వారు ఆదివాసీలే. వారు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజ వనరులతో కళకళలా డుతుండేవి. ఈ పదేళ్లపాటు ఆదివాసీ తెగలను మానవులుగా గుర్తించడం, వారి జీవన పరిస్థితు లను మెరుగు పర్చడం, వారి నివాస ప్రాంతా లలోని సహజవన రులన్నింటినీ వారే సమిష్టిగా వినియోగించుకునే చట్టాలు చేయవలసి ఉన్నది. ప్రపంచవ్యాప్తం గానే తొలుత ఈతీర్మానాన్ని అమలు చేయాలని ప్రయత్నించిన వారు ప్రపంచ స్థాయి ఎన్‌జిఒలు మాత్రమే. మన దేశంలో ఇప్పటికీ అంత ర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వాలు జరప డం లేదు. ఎన్‌జిఒలు చేసే కార్యకలాపాలకు కొన్ని రాష్ట్రాలలో కేవలం ఆర్థిక తోడ్పాటును మాత్రమే ప్రభుత్వాలు అందిస్తున్నాయి. మన దేశంలో సుమా రు 600 ఆదివాసీ తెగలు గుర్తించ బడ్డాయి. భారత రాజ్యాంగం వీరికి చట్టపర మైన రక్షణలు కల్పిం చింది. అవే 5వ,6వ షెడ్యూల్‌గా ప్రాంతీయ, పరిమిత స్వయం పాలనా హక్కు ఇవ్వబడిరది.ఆచరణకు వీలుగా పీసాచట్టం (పి.ఇ.ఎస్‌.ఎ-1996) చేయ బడిరది. అయినా బూర్జువా పాలక వర్గాలు మనదేశంలో గిరిజన తెగలకు స్వయం పాలనా హక్కులు ఇవ్వలేదు.
ఆదివాసీలు-హక్కులు
వలస కాలం నుంచి మనదేశంలో ఆదివాసీ తెగలు బూర్జువా,భూస్వామ్యవర్గాలకు వ్యతి రేకంగా పోరా టాలు చేస్తున్నాయి.ఒక రాజీగా అనేక రక్షణ చట్టాలు వచ్చాయి. ముఖ్యం గా1874లోనే ప్రత్యేక షెడ్యూల్డ్‌ జిల్లాల చట్టం చేయబడిరది.1917లో ఆదివాసీ తెగల నివాస ప్రాంతాలలో ఉమ్మడి భూమి హక్కులు ఇవ్వ బడ్డాయి.అవేభారత రాజ్యాంగంలో పొందు పరిచారు. అనేక పోరాటాల అనంతరం ఆది వాసీ తెగలకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ 2006లోచట్టం చేయబడిరది. చట్టం ప్రకా రం అటవీ భూమిపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి గిరిజన కుటుంబానికీ 10ఎకరాల వరకూ పట్టా ఇవ్వవచ్చు. వారిపై గల కేసులను ఎత్తివే యాల్సి ఉంది. మన రాష్ట్రంలో దీని అమలు అరకొరగా జరిగింది. సుమారు 25లక్షల ఎకరాలకు పట్టాలి వ్వవలసిన భూమిని గుర్తించినప్పటికీ కేవలం 9 లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలిచ్చారు. దీనిలో లక్షా యాబై ఆరు వేల మందికి 3లక్షల ఎకరాలు మాత్రమే దక్కింది.మిగతా 6లక్షల ఎకరాలు 2 వేల విఎస్‌ఎస్‌ల పేర (వన సంరక్షణ సమితులు) పట్టా లిచ్చి అటవీశాఖ ఆధీనంలోనే ఉంచుకు న్నారు. ఇన్ని చట్టాలు ఉన్నా, స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు అయి నా ఆదివాసీ తెగలు తమ సంప్రదాయపు భూముల నుంచి,అటవీ ప్రాంతంనుంచి నెట్టివేయబడు తున్నా రు.మనరాష్ట్రంలో 1/70చట్టం అమలులో ఉన్నది. గిరిజనుల సాంప్రదాయక భూములు గిరిజన తెగ లకే దక్కాలి. గిరిజనేతరులకు షెడ్యూల్డ్‌ భూమిపై ఎట్టి హక్కూ లేదు. కానీ మన రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ ప్రాంతంలో 48శాతం సంప్రదాయక గిరిజన భూములను గిరిజనేతరులు ఆక్రమించు కున్నారు. గిరిజన విద్యపేరుతో ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలకు ఐటిడిఎలు దోచిపెడుతున్నాయి.ఈసొమ్ముతో ఐటిడిఎనే జూనియర్‌ కాలేజీలను పెట్టవచ్చు లేదా తాము నడుపుతున్న రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీ ల్లో చేర్పించవచ్చు.
ఆదివాసీ చట్టాలు-అక్కరకురాని చుట్టాలు
ఆదివాసీ చట్టాలు అక్కరకురాని చుట్టా లుగా మారాయి. పోలవరం ప్రాజెక్టు వద్దని గ్రామ సభలు, పంచాయతీలు,మండల పరిషత్తులు (ఇవన్నీ షెడ్యూల్డ్‌ ఏరియాలో, పీసా చట్టం పరిధి లో ఉన్నవి) చేసిన తీర్మానాలకు రాష్ట్ర ప్రభుత్వం విలువే ఇవ్వలేదు.బాక్సైట్‌ త్రవ్వకాలు వద్దని విశాఖ జిల్లాలోని గ్రామసభలు, పంచాయతీలు, మండల పరిషత్తులు చేసిన తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రక్కనపెట్టి ఐటిడిఎల ద్వారా బాక్సైట్‌ త్రవ్వకాలు జరుపుతామని చెబుతున్న మా టలు సుప్రీంకోర్టు ‘సమతా తీర్పును’ వెక్కిరించడం కాదా? ఆదివాసీ హక్కులను కాలరాయడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడడం లేదు.షెడ్యూల్డ్‌ ప్రాంతంలో జీవో 3ప్రకా రం అన్ని ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగాలన్నింటినీ స్థానిక గిరిజన అభ్యర్థులతో నింపవలసి ఉన్నది. ప్రతి కార్యాలయంలో గుమస్తా నుంచి అధికారి వరకు ప్రతి స్కూలు, ఆసుపత్రి, వివిధ కార్యాలయా లలో నేడుస్థానిక అభ్యర్థులు10శాతం కూడా లేరు. స్థానికేతరులు, గిరిజనేతరులు, తాత్కాలిక ప్రాతిపది కపై గతంలో నియామకాలు జరిగాయి. ఈ జీవో ప్రకారం వారిని తొలగించి స్థానిక గిరిజన అభ్యర్థు లతో నింపవలసి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం స్కీం వర్కర్లలో ఎక్కువమంది గిరిజనేతరులనే నియమి స్తున్నది. అర్హులైన గిరిజన అభ్యర్థులు నిరుద్యోగులుగా ఉన్నారు. ప్రభుత్వం జీవో 3ను పటిష్టంగా అమ లుచేసి స్థానిక గిరిజన అభ్యర్థులకే ఉద్యోగ అవకాశం కల్పించాలనే డిమాండ్‌ ముందుకు వస్తున్నది. ఆదివాసీ తెగలు ప్రత్యేక భాషలు, విశిష్టమైన సంస్క ృతిని కలిగి ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనేతర భాషలను వారిపై బలవంతంగా రుద్దు తున్నాయి. మన రాష్ట్రంలో ప్రతి గిరిజన కుటుంబం ఇంట్లో తమ తెగ భాష మాట్లాడుతున్నారు.స్కూలుకు వెళ్తే తెలుగు,ఇంగ్లీషులో బోధన జరుగుతున్నది. భాషా పరిజ్ఞానమేకాక సాధారణ విషయాలను కూడా అవగాహన చేసు కోవడం గిరిజన విద్యా ర్థులకు కష్టంగా ఉన్నది. ఫలితంగా స్కూల్‌ డ్రాపవుట్స్‌ ఎక్కువ అవుతు న్నాయి. యునెస్కో సూచన మేరకు 10వేల మంది మాట్లాడే ప్రతి భాషకూ లిపి కనిపెట్టాలని, వాడుక లో దానికి రక్షణనివ్వాలని ఉన్నది. అయినా లక్షల మంది మాట్లాడుతున్న ఆదివాసీ భాషలకు లిపి కని పెట్టకపోవడం దారుణం.భాషా పరిశోధన సంస్కృతి రక్షణలోభాగం. ఆదివాసీ తెగల వాయిద్య పరికరాలు, వారి నృత్యాలు ప్రభుత్వం ప్రోత్సాహం లేక అంతరించిపోతున్నాయి. ఆదివాసీ ప్రాంతాలలోకి టూరిజం ప్రవేశించాక ఆదివాసీ కళలు వ్యాపార సరుకులుగా మారి పోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికా రికంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పాటించాలి. నేడు జరుగు తున్న ఉత్సవాలు పాలకవర్గాల అవసరాల కోసమే తప్ప ఆదివాసీలను కాపాడడానికి కాదు. నిజమైన ఆదివాసీ దినోత్సవం, ఆదివాసుల ‘అవసరాలు- ఆకాంక్షలు’ నెరవేర్చేదిగా ఉండాలి.

ఎకో టూరిజంపై సమత శిక్షణ తరగతులు

స్థానిక వనరులపై స్థానికులకే హక్కు కలిగి ఉండాలనే లక్ష్యంతో సమత గిరిజన యువతకు ఏకోటూరిజంపై జూన్‌ 19నుంచి 26వ తేదీ వరకు ఆరురోజుల పాటు గిరిజన యువతకు శిక్షణ తరగతులు నిర్వహించారు.‘‘స్థానిక వనరులపై స్థానిక ఆదివాసులకే హక్కు ఉంది’’అనే అంశంపై శిక్షణ కార్యక్రమం జరిగింది.విశాఖ ఉమ్మడి జిల్లా ఐదువ షెడ్యూల్‌ ప్రాంతానికి చెందిన కటికి, కొల్లా పుట్‌,సరియా,సరుగుడు ఆదివాసీ ప్రాంత జలపా తాల వద్ద జరిగిన శిక్షణకార్యక్రమంలో సుమారు 30మంది యువతీ,యువకులు పాల్గొన్నారు. ఈ యువకులంతా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న స్థానికంగాఉన్న వనరుల సద్విని యోగంపై అడిగి తెలుసుకున్నారు. అనంతిగిరి మండలం బొర్రా పంచా యితీ కటిక జలపాతం వద్ద నుంచి శిక్షణ కార్యక్ర మం ప్రారంభమైంది. కార్యక్రమాన్ని బొర్రాపంచా యితీ సర్పంచ్‌ జన్నిఅప్పారావు ప్రారంభించారు. సర్పంచ్‌ మాట్లాడుతూ కటికి వాటర్‌ ఫాల్స్‌ చరిత్ర ను వివరించారు.తర్వాత గ్రామపెద్ద గెమ్మెల దేవ కుమార్‌ మాట్లాడుతూ ఈ జలపాతాలు ద్వారా స్థానిక యువ కులు పొందుతున్న స్వయం ఉపాధి గురించి వివరించారు.వాటర్‌ ఫాల్స్‌ నిర్వహణ కమిటీ తరుపున గెమ్మెల రమేష్‌ మాట్లాడుతూ దీనివల్ల సుమారు 30మంది ఆదివాసీ కుటుంబాలు స్వయం ఉపాధిని పొందుతున్నట్టు చెప్పారు.ఆనాడు సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవిరెబ్బాప్రగడ ఆద్వ ర్యంలో ఆనాటి ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌ శివశంకర్‌ ఏర్పాటు చేసిన కటికి వాటర్‌ ఫాల్స్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ నేడు మా ఆకలి తీర్చుతోందని వివరించారు. రెండోవరోజు కటికి,సరియా,సరుగుడు వాటర్‌ పల్స్‌ టీంలు కాటికి వాటర్‌పల్స్‌ పరిసర ప్రాంతాల్లో స్వచ్‌ భారత్‌ నిర్వహించారు.అక్కడ నుంచి మూడవ రోజు కొల్లాపుట్‌ ఎకో రిసార్టుస్‌కు చేరుకున్నారు. ఇక్కడ జరిగిన శిక్షణలోఐ.టి.డి.ఏ.నుంచి ఎకో టూరిజం కో-ఆర్డినేటర్‌ గణపతి నాయుడు రిసోర్స్‌ పెర్సన్‌గా హజరయ్యారు. ఆయన ఎకో టూరిజం ప్రాముఖ్య తను వివరించారు.ఎకో టూరిజం అంటే ప్రకృతిని పాడు చేయకుండా చేసే కార్యక్రమని అన్నారు. దీనిద్వారా స్థానిక యువకులకు స్వయం ఉపాధి లభిస్తోందని,నీరు కలుషితం కాకుండా చెత్త చెదరాలను లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే దీని లక్ష్యమన్నారు. పర్యా వరణాన్ని పరిరక్షించుకోవడానికి స్థానికులను చైతన్య వంతులను చేయాలని కోరారు.చెట్లను నరక కుండా అందంగా తీర్చిదిద్దాలి.ఎకోటూరిజంద్వారా ప్రకృతి సహసిద్దమైన కూరగాయలు,అటవీ ఉత్పు త్తులు లభిస్తాయని వాటి ద్వారా కూడా జీవనో పాధిని పెంపొదించుకోవచ్చని పేర్కొన్నారు. గ్రీనరీ ని పెంచడం ద్వారా టూరిస్టులు ఆకర్షితులు అవు తారని, వాటర్‌ పల్స్‌ దగ్గర ప్లాస్టిక్‌ కనిపించే కుండా టీం వర్కు చేయాలని పిలపు నిచ్చారు. అలాగే ఎత్తు పల్లాలుగా ఉన్న భూమిని అలాగే ఉంచి మనం క్రియేటివిటీగా ఆలోచించి అందంగా తీర్చి దిద్దినట్లుయితే అప్పుడు పర్యాటకులు ఇష్టపడ తారని సూచించారు.మొదట స్థానికంగా మనం ప్లాస్టిక్‌ని వాడకం తగ్గించాలని,తరువాత టూరిస్టు లకు చెప్పాలని సూచించారు. స్థానికంగా అటవీ ప్రాంతాల్లో లభించే ఆకులు,వెదురును వస్తువులుగా తయారు చేసి వినియోగించుకొని స్వయం ఉపాధి పొందవచ్చన్నారు.మట్టి కుండల్లో మంచినీటిని నింపి డోకులతో పర్యాటకులకు ఇవ్వడం అలవాటు చేయాలి.ఆదివాసీ సాంప్రదాయాలను,ఆచారా లను,మనం టూరిస్టులకు చూపించాలి.ఈ విధంగా ఉంటే మన ఆదాయం పెరుగుతుంది అని వివరిం చారు.చాపరాయి వాటర్ఫాల్స్‌ టూరిజం మేనేజర్‌ అప్పారావు కూడా పలు సూచనలు చేశారు.ఎకో టూరిజం-ఎకోఫ్రెండ్లీగా ఉండాలి. ఎకో టూరిజం మన ఆదివాసీప్రాంతాల్లో చాలాచక్కగా చేయవచ్చు న్నారు.నేచర్‌ ఎస్‌ టీచర్‌ ట్రైబ్‌ ఎస్‌ గైడ్‌ టీం వర్క్‌కి సొసైటీ కీ చాలా సంబంధం ఉంటుంది, మొదట టీం వర్క్‌ బలపడితే,దాని సొసైటీగా రిజిస్టర్‌ చేయ వచ్చు,ఈ సొసైటీలో ప్రెసిడెంటు, వైస్‌ ప్రెసిడెంట్‌, సెక్రటరీ,జాయింట్‌ సెక్రెటరీ, కోశాధికారి మరియు మెంబెర్స్‌ ఉంటారు. దీనికి ఒక బై లా ఉంటుంది. దాని ప్రకారం సొసైటీ ని నడపాలని సూచించారు. ముఖ్యంగా రికార్డ్స్‌ రాయాలి,ప్రతి సంవత్సరం అడిట్‌ చేయించాలి, టూరిజంలో ఎకోటూరిజం, అగ్రికల్చరల్‌ టూరిజం,హోమ్‌ స్టే టూరిజం ఇలా 75 రకాలు ఉన్నాయి. ఆతర్వాత 2016లో కొల్లా పుట్‌ రిసార్ట్‌ పేరుతో నిర్మించిన 8కాటేజీలద్వారా స్థానిక యువతీ, యువ కులు పొందుతున్న స్వయం ఉపాధిపై వివరిం చారు.అక్కడ నుంచి కొత్తపల్లి జలపాతంను సందర్శించారు.ఇక్కడ నవీన్‌ మేనేజర్‌ మాట్లాడుతూ ఇక్కడ 12మంది యువకులు పని చేస్తున్నారు వీరు అంతా ఆదివాసీ తెగ(పీటీజీ) గ్రూప్‌కు చెందిన గిరిజనులని వారు ఇక్కడ స్వయం ఉపాది పొందు తున్నట్టు తెలిపారు.అక్కడ నుంచి చింతపల్లి మండలం,పెదబారడా పంచాయతీ కృష్ణాపురం గ్రామానికి చేరుకున్నారు.ఇక్కడ చింతపల్లి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు చిట్టిబాబు ఆధ్వర్యంలో చింతపల్లి అటవీశాఖ సబ్‌ డివిజినల్‌ అధికారి బెర్లాండ్‌రాజు,రేంజ్‌ అధికారిణి చిట్టితల్లి,సెక్షన్‌ ఆఫీసర్‌అప్పారావు బీట్‌ఆఫీసర్‌ వెంకటరావు గార్డులతో కలసి అవగాహన సదస్సు నిర్వహిం చారు.అటవీశాఖ అధికారులకు సమత కోఆర్డినేటర్‌ సతీష్‌ కుమార్‌ సమత నిర్వహిస్తున్న ఏకో టూరిజం శిక్షణపై వారికి వివరించారు. గత మూడు రోజుల నుండి కాటికి జలపాతం, కొల్లాపుట్‌ ఎకో టూరి జం,లంబసింగి టీం అందరు సందర్శించడం, అక్కడ వారు చేస్తున్న పని, ఎకో టూరిజం ద్వారా ఎలా జీవనోపాధి పొందుతు న్నారు, వంటి అంశాలు శిక్షణలో నేర్చుకోవడం జరిగిందన్నారు.షబ్‌ డివిజినల్‌ అధికారి మాట్లా డుతూ కృష్ణాపురం గ్రామం దగ్గరలో ఎకో టూరి జం,మీఅందరి సహకారంతో మొదలు పెడతాం. ఈటూరిజంలో మీ గ్రామస్తులు పని చేసుకొని ఉపాధి పొందడం మన ముఖ్య ఉద్దేశ్యమని వివరిం చారు. దీనికి అందరు సహకరించాలని ఆదివాసీల సహకారం లేకపోతేె ఈ ప్రాజెక్టుని తాము ముందుకు తీసుకెళ్లలేమని సూచించారు.అక్కడ నుంచి నాత వరం మండలం సరుగుడు పంచాయితీ సుందర కోటవాటర్‌ ఫాల్స్‌ సందర్శించారు. ఇక్కడకు కూడా చాలా మంది టూరిస్టులు రావడం జరుగుతుంది. ఇక్కడ గవర్న మెంటు కొంత సుందరంగా తయారు చేశారు ఫారెస్టు డిపార్టుమెంట్‌ కొంత పెన్సింగ్‌ కట్టడం సరుగుడు వాటర్‌ పల్స్‌ అనిబోర్డు పెట్టడం జరిగింది. ఇక్కడ టికెట్‌ కలెక్షన్‌ లాంటివి చేయడం లేదని స్థానికులు తెలియజేశారు.
ఈ శిక్షణ నాకు ఎంతో ఆలోచన ఇచ్చింది..!
మాది సరుగుడు గ్రామం నేను బి.టెక్‌ చదివాను. ఈఐదురోజులు చాలా ప్రాంతాలు సందర్శించడం వల్ల నాకు ఎంతో ఆలోచన వచ్చింది.సరుగుడు వాటర్‌ ఫాల్స్‌వద్ద టోల్‌గేట్‌ ఏర్పా టుచేసి ఇక్కడ నిరుద్యోగ గిరిజన యువకులం స్వ యం ఉపాధి పొందుతాం.అందుకు సమత సహకా రం అవసరం.
చిన్నా.సరుగుడు ఎకో టూరిజం పెట్టవచ్చు అనేది ఆలోచన మాది కాటికి గ్రామం. మేము దాదాపు 15 సంవ త్సరంల నుండి కాటికి వాటర్‌ఫాల్స్‌ని నిర్వహి స్తున్నాము. ఇందులో దాదాపు 20మందికి ఉపాధి దొరుకుతుంది. కొల్లాపుట్‌ రిసార్ట్‌ ద్వారావారు ఉపాధి ఎలాదొరుకుకుతుంది నేర్చు కున్నాము.అలానే ఫారెస్టు డిపార్టుమెంటు ద్వారా కూడా ఎకో టూరిజం పెట్టవచ్చు అనేది ఆలోచన వచ్చింది. తమాల మోహన్‌,కటిక గ్రామం.
ఎక్సపోసర్‌ విజిట్‌లో చాలా నేర్చుకున్నా..
మాది బొర్రా గ్రామం. ఈఎక్సపోసర్‌ విజిట్‌లో చాలా అవసమైన విషయాలు నేర్చుకున్నాము. ఒక ప్రొడక్టుని వేల్యూ ఎడిషన్‌ చేస్తేదాని డిమేండ్‌ ఎలా ఉంటాది అనేది అర్ధమైంది. అలానే ఏదైనా ఒక ప్రాజెక్టు లో టీంవర్క్‌పాత్ర దాని ప్రాముఖ్యత ఎలా ఉంటాది తెలు సుకున్నాం.మనకు ఉన్న వనరులపై హక్కు మనకే ఉంది అనేది అర్ధం అయ్యింది. అలానే స్థానికంగా దొరికే వెదురుతో తయారు చేసిన వస్తువులకు రంగులు పూసి వాల్యూ ఎడిషన్‌ చేస్తే ఆదివాసీ వ్యాపారులకు ఇంకా మెరు గ్గా డబ్బులు వస్తాయి. ముఖ్యంగా మనం టూరిస్టు లకు ఏదీ ఫ్రీగా ఇవ్వ కూడదు అనేది ఈ విజిట్‌ ద్వారా అర్ధం అయ్యింది.
`వంతుల మేరీ,బొర్రా
మహేష్‌ జర్ర: మాది సిరియా వాటర్‌ పల్స్‌, మేము ఒక్క టిక్కెటు కలెక్షన్‌ చేస్తూ 10 మంది ఉపాధి పొందుతున్నాము . మొదటిలో స్థానిక పంచాయతీ నుండి చాలా వత్తిడి వచ్చింది. వాటర్‌ పల్స్‌ పంచాయితీది అని చాలా ఇబ్బంది పెట్టారు. మేము అన్ని తట్టుకొని చేస్తున్నాము సమతా సతీష్‌ గారి ద్వారా కటికి వారు నిర్వహిస్తున్న వాటర్‌ పల్స్‌ ని సందర్శించడం జరిగింది, అలా నే వారిని చూసి మాకు కూడా కొంత దైర్యం వచ్చింది. సర్యా వాటర్‌ పల్స్‌ అనేదిచాలా ప్రమాద కరమైన ప్రదే శం,కాబట్టి మేము చాలా జాగ్రత్త పని చేయా లి, ముఖ్యంగా టూరిస్టులు విశాఖపట్నం నుండి వస్తారు.ఈ విసిట్‌ వలన మాకు కొత్త ఆలోచనలు వచ్చాయి,ఆదివాసీ సాంప్రదాయ పద్ధతులు టూరి స్టులకు చూపిస్తే వారు ఆకర్షితులు అవుతారు. మేము కూడా ఎకోటూరిజం ప్రాజెక్టు నాకు ఆలో చన చేస్తాము.-(కె.సతీష్‌ కుమార్‌)

పోలవరం పోరు కేక

పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే ఆంధ్ర ప్రదేశ్‌ సస్యశ్యామలంగా ఉంటూ పంటలు సుభిక్షంగా పండు తాయని ఉద్దేశంతో వేల ఎకరాల భూ ములు గ్రామాలు ఖాళీ చేసి కట్టుబట్టలతో బయటికి వెళ్లిన అభాగ్యులు కన్నెర చేశారు.పోలవరం నిర్వాసితుల సమస్యలను గాలికి వదిలేసి ఇచ్చిన హామీలను నెరవేర్చ కుండా,సరైన పునరావాసం కల్పించకుండా కాలం గుడపుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పే విధంగా పోరు కేకతో నిర్వాసితులు మమా పాద యాత్రకు కదం తొక్కారు. జూన్‌ 20 అల్లూరి జిల్లా నెల్లిపాక నుంచి ప్రారంభమైన మహా పాదయాత్ర జూలై 4న విజయ వాడలో ముగిసింది.
జాతీయ ప్రాజెక్టును పూర్తి చేసిన బాధ్యత మొదట తమదేనన్న కేంద్రప్రభ/త్వం నిర్వాసితులకు ఇచ్చే ప్యాకేజీ విషయంలో ఎందుకు నిర్వక్ష్యం వహి స్తుందని నిలదీశారు. ప్రాజెక్టు నిర్మాణాలను అంగ రంగ వైభంగా చూపిస్తున్న ప్రభుత్వం.. నిర్వాసితుల వేదనలను ఎందుకు ప్రజలకు వివరించడం లేదని ప్రశ్నించారు. పునరావాసం పూర్తయ్యాకే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ మూరు మూరులో పాదయాత్ర కొనసాగుతుంది. కళ్లుండి చూడ లేని,చెవులుండీ వినలేని గుడ్డి,చెవిటి ప్రభు త్వాల్ని మనం ఎన్నుకున్నామని నిర్వాసితులు విమర్శి స్తున్నారు. వరదలోస్తే మురమూరు గ్రామాలు నీటి మునిగే ప్రమాదముందని,41కాంటూరులో కలపా లని కోరుతూ అధికారిక మెమోరాండం సమర్పిం చినట్లు నిర్వాసితుల తరుపున సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ.శ్రీనివాసరావు ప్రకటించారు. మురు మూరులో మొత్తం 356 కుటుంబాలు ఉన్నాయని తెలిపారు.పాదయాత్రకు వైసీపీ కాచవరం నాయ కులు సంఫీు భావం పలికారు.అనంతరం పల్లూరు గ్రామంలో బహిరంగ సభ నిర్వహించారు.
నిర్వాసితుల డిమాండ్లు ఇవే
పోలవరం నిర్వాసితులకు పునరావాసంతోపాటు పూర్తి పరిహారం చెల్లించాకే గ్రామాలను ఖాళీ చేయించాలని మహా పాదయాత్ర డిమాండ్‌ చేస్తోంది. పునరావాసం పూర్తయ్యే వరకు ముంపు గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించాలని,1986,2022నాటి వరద ముంపు ఆధారంగా ముంపు గ్రామాలు రీ సర్వే చేయాలని,మండలాన్ని యూనిట్‌గా తీసుకొని పునరవాసం పరిహారం అర్హులందరికీ ఇవ్వాలని కోరింది.పునరావాసం ఏకకాలంలో అన్ని గ్రామా ల్లో పూర్తి చేయాలని,ప్రతి ఎకరానికి రూ.20లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేసింది. గ్రామాలు ఖాళీ చేయించే నాటికి18ఏళ్లు నిండిన వారికి ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం ఇవ్వాలని,నిర్వాసిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని కోరింది.
ఇలా సాగిన పాదయాత్ర
అల్లూరి సీతారామారాజు జిల్లా నెల్లిపాక నుంచి నిర్వాసితుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. పోలవరం నిర్వాసిత గ్రామాల్లో 400కిలోమీటర్ల మేర 15రోజుల పాటు యాత్ర కొనసాగుతోంది. జూలై నాలుగో తేదీన విజయవాడలో మహా ధర్నాతో పాదయాత్ర ముగిసింది. పాదయాత్రలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు,కార్యవర్గ సభ్యులు మంతెన సీతారాం,వీ.వెంకటేశ్వర్లు పాల్గొ న్నారు.
పోలవరం పునరావాసం కోసం…
పోలవరం ప్రాజెక్టు చాలా సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రధాన ఎజెండాగా వుంది. ఇదిబహుళార్థక సాధక ప్రాజెక్టు అని సాగు నీరు,తాగునీరు,విద్యుత్‌ ఉత్పత్తికి తద్వారా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని ప్రచారం చేశారు. ప్రాజెక్టుని మాహయాంలో పూర్తిచేస్తా మంటే మాహ యాంలో ప్రారంభిస్తామని గొప్పలకు పోయి మరీ మాట్లాడడం మనంచూస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాలు,ప్రధాన ప్రతిపక్షాలు చెప్పింది చెబు తున్నది….ప్రాజెక్టు ఎత్తు, పొడవు,వాలు,డ్యామ్‌ నిధులు…వీటి గురించే. కానీ నేడు చర్చించాల్సింది సర్వం త్యాగంచేసిన నిర్వాసితుల గురించి. పోల వరం నిర్వాసితులకు న్యాయం చేయా లని సి.పి.యం ఆధ్వర్యంలో జూన్‌ 20వ తేదీ నుండి జులై 4వరకు చేపట్టిన‘మహా పాద యాత్ర’ గ్రామాల సరిహద్దులు దాటుకుంటూ చైతన్య పరుస్తూ జూలై 4న విజయవాడకు చేరికొని మహా సభతో ముగి సింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 8 మండలాలు, 222 పంచాయతీలు, 373గ్రామాలు,1,06, 000 కుటుంబాలు నీట మునుగుతాయి. లక్షల జనాభా నీట మునిగి ఆస్తులు,సంపద పోగొట్టుకుంటున్నా వీరి సంక్షేమాన్ని, పునరావాసాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అత్యంత విషాదం.2018 డి.పి.ఆర్‌. ప్రకారం ప్రాజెక్టుఖర్చు రూ.55.656 కోట్లు. ఇందులో పునరావాసం కోసం ఖర్చు చేయాల్సింది రూ.33,000కోట్లు కానీ ఖర్చుచేసింది రూ. 7000 కోట్లు మాత్రమే. ఎక్కువ శాతం నిర్మాణానికే ఖర్చు చేస్తున్నారు.మరి నిర్వాసితుల సంగతేంటి? సర్వస్వం త్యాగం చేసిన గిరిజనులు,అడవి బిడ్డల పరిస్థితి ఏంటి?అందుకే పునరావాసం పూర్తయిన తరువాతే ప్రాజెక్టు కట్టాలి.పోలవరం ప్రాజెక్టు ద్వారా చాలా ప్రయోజనాలు చేకూరతాయనేది ఎంత వాస్తవమో నిర్వాసితులు నష్టపోతారన్నది అంతే నిజం. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 25 రకాల మౌలిక వసతులు కల్పించాలి. కానీ అవెక్కడా నిర్వాసితుల కాలనీల్లో కనిపించవు.ఏనిర్వాసిత కాలనీలో కూడా శ్మశానవాటికలు కనిపించవు.బుట్టాయిగూడెం, జీలు గుమిల్లి,జంగారెడ్డిగూడెంనిర్వాసిత కాలనీల్లో అధ్వా న పరిస్థితులున్నాయి.ఇళ్ళ శ్లాబులు వర్షం వస్తే కారిపోతున్నాయి.నిర్మాణ సంస్థలు కాసుల కక్కుర్తితో నాణ్యత లేకుండా నిర్మించాయి. విద్య, వైద్యం సదుపాయాలు లేవు. గడప గడపకు వైసిపి పేరుతో గత కొంత కాలంగా హడావుడి చేస్తున్నారు. కానీ రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు నిర్వాసిత కాలనీల్లో అడుగు పెట్టడం లేదు. ఈ గడపలకు ఎందుకు రావడం లేదు. నిర్వాసితులు నిలదీస్తారని భయమా ?
ప్రతి సంవత్సరం వరద వస్తుంది. 2022 జులైనెలలో వచ్చిన వరద వేరు. ఇది పాలకుల నిర్లక్ష్యం కారణంగా వచ్చిన వరద. కాం టూరు లెక్కలన్నీ తప్పని ఈ వరదలతో తేలిపో యింది. కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా వరద ప్రాంతాలను ముంపు ప్రాంతాల జాబితా లోకి చేర్చాలని ప్రజలు కోరుతున్నారు. వరదలో పశువులు కొట్టుకుపోయాయి.పంటపొలాలు మునిగిపోయాయి.33రోజులు ఎందరో ఇళ్ళు నానిపోయి పడిపోయాయి. విలువైన వస్తువులు పాడైపోయాయి. ఇంత నష్టం జరిగితే ప్రభుత్వం నుండి అందిన సహాయం రూ.2 వేలు మాత్రమే. ఇళ్ళు కూలిపోయినవారికి రూ.10వేలు అందిం చారు. అదికూడా అరకొరగానే అందించారు. అందులోను రేకులషెడ్డుకి ఇవ్వలేదు.ముంపు గ్రా మాల ప్రజలకష్టాలు ఇలాఉంటే ఊళ్లు ఖాళీ చేసి వచ్చిన నిర్వాసితకాలనీలో బతుకుతున్న గిరిజనుల పరిస్థితి ఘోరంగా తయా రైంది.వారు నిర్వాసిత కాలనీలకు వచ్చి2సంవత్సరాలైంది.రావాల్సిన ప్యాకే జీ డబ్బులు ఇంకారాలేదు.కనీస సౌకర్యాలు కల్పిం చడం లేదు.‘చూస్తాం ప్రభుత్వం ప్యాకేజీ డబ్బులు ఇవ్వకుంటే మరలా తిరిగి మా గ్రామాలకు వెళ్ళి పోతాం.పరిహారం ఇస్తుందో,మమ్మల్ని గోదారిలో ముంచేస్తుందో ప్రభుత్వమే తేల్చుకుంటుంద’ని ఆవేదన చెందుతున్నారు.సాధారణంగా తుఫాన్లు సముద్రాల్లో పుడతాయి.కానీ ప్రభుత్వం నిర్వాసితుల పట్ల ఇదే వైఖరి కొనసాగిస్తే, వదిలేస్తే, ఉదాసీనత ఇలాగే కొనసాగితే తుఫాన్‌ పుట్టేది సముద్రంలో కాదు. గోదారినదిలో.ఆ తుఫాన్‌పేరు నిర్వాసితుల ఉద్య మం.ఈ తుఫాన్‌ ప్రజల్ని ఐక్యం చేసి పాలకులను వణికించి అమరావతి దగ్గర తీరం దాటుతుంది జాగ్రత్త. ఇది హెచ్చరిక కాదు. వాస్తవం. గిరిజనులే కదా అణచివేద్దాం, తొక్కేద్దాం అంటే కుదరదు. ఎందుకంటే ఇది చరిత్ర. ఇదే గిరిజనులకు ప్రభుత్వ పెత్తందారులకి జరుగుతున్న అసలైన వర్గపోరాటం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసి తులకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వరద సమస్య లపై ఒక్కొక్కరిది ఒక్కో వాదన.
1,నిర్వాసితు లేమో ప్రభుత్వం మా పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడు తుందని, మేము మాకు పూర్తిగా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని,పునరావాస కాలనీల లో అన్ని పూర్తి చేయాలని అడుగుతున్నాం అందుకే ఇలా చేస్తే మేమే వెళ్ళిపోతాం అని అధి కార్లు ఇలా చేస్తున్నారని అన్నారు. 2,ప్రభుత్వం నిర్వాసితులనుగాలికి వదిలేసింది అని, వారికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ 10లక్షలు, ప్రతీకుటుం బానికి రూ10వేలు,దోమతెరలు మూ డు,నెలలపాటు ఉచితంగా రేషన్‌ సరుకులు పంపిణీ చేయాలని, ప్రతిపక్షరాజకీయ నాయకులు కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు.3,కొన్ని సంస్థలు,సంఘాలు ప్రజల కోసం భోజనాలు ఏర్పాటు చేశారు.4,ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి25 కేజీల బియ్యం,కేజీ కంది పప్పు, కేజీ నూనె,కూరగాయలు ఇస్తున్నారు.అయితే ఇవి అందరికీ అందటం లేదని ప్రజలు కొట్టు కున్నారు. దీనిపై ఏలూరుజిల్లా కలెక్టరు,మండల అధికారులను ప్రజల ముందే హెచ్చరించారు.వెలేరు పాడు ముంపు గ్రామాలను పరిశీలించి వస్తున్న జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, ఎస్పీ లను ఎర్ర బోరు గ్రామం వద్ద నిర్వాసితులు అడ్డుకొని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అసలు ఈ భారీ వర్షాల గురించి ప్రభుత్వా నికి తెలియదా? సవంవత్సరం ముందుగానే అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇండియా మెటియో రాలాజికల్‌ డిపార్ట్‌ మెంట్‌ మే నెలలో నే చెప్పింది.ఈ శాఖ అధికారులు దేశవ్యాప్తంగా పడే వర్షాల గురించి, రుతు పవనాలు గురించి మే నెలలో నివేదిక విడుదల చేస్తుంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తెలియకుండా పోతుం దా? ఇవన్నీ తెలిసి కూడా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదు.అంటే ఇది పూర్తిగా నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యధోరణి ప్రభుత్వం కనపరిచినట్లు అర్థమ వుతుంది.ముంపు ప్రాంతాలను అధికారులు ముం దస్తుగా సందర్శించి రాబోయే వరదల గురించి ప్రజలకు చెప్పి వారి వారి సామాన్లను,తరలించు కోవడానికి రవాణా ఏర్పాట్లు చేయ వచ్చు కానీ అలా జరగలేదు.ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి. కుకునూరు మండల కేంద్రం ఎత్తు లో వుంటుంది కదా అని ఆ గ్రామ ప్రజలు మన ఊరు మునగదని ధీమాతో ఉన్నారు. రాత్రిపూట చడీ చప్పుడూ లేకుం డా గ్రామం అంతా తెల్ల వారే సరికి నీటి మయ మైంది. అప్పుడు ఆరాత్రిలో గ్రామప్రజలు సొం తంగా ప్రక్క గ్రామాల నుంచి ట్రాక్టర్‌లు 36 (తెలంగాణా గ్రామాలు సరిహద్దులో ఉన్నాయి). తెప్పించి కొంత మందిని సురక్షిత ప్రాంతాల కు తరలించారు. రెవెన్యూ అధికారులు కేవలం 7, ట్రాక్టర్‌లు ఏర్పాటు చేశారు. లేదంటే చాలా ప్రాణ నష్టం జరిగేది. ఇలా చేయడంవల్ల పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు అనేక కష్టాలు పడితేనే రేపు వారికై వారే పునరావాస కాలనీల కు గత్యంతరం లేక వెళతారు.అంటే దానర్ధం పొ మ్మన కుండా పొగ పెట్టడం.ఇంకా ఇక్కడ ఉం డలేము అని విసుగు చెంది వెళ్ళిపోతారు. ప్రభుత్వం వైపున తప్పు లేదని ఇది ప్రకృతి వైపరీత్యం అనీ, ఎవరూ ఏమీ చేయలేరు అని సమర్ధించు కుంటుం ది.కానీ ఇది పూర్తిగా మానవతప్పిదంగానే భావిం చాలి.ఎందుకంటే ప్రతీ ఏడాది జూలై నెలలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసి కూడా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదు.
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వాటర్‌ రిసోర్స్‌ డిపార్ట్‌ మెంట్‌ వెబ్‌ సైట్‌ ఓపెన్‌ చేస్తే ఇలా ఉంటుంది.
ముంపు, నిర్వాసిత సమస్యను,తగ్గించటానికి ప్రత్యాయ మ్నాలను గుర్తించాలని,ప్రాజెక్ట్‌ భాధిత కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిం చాలని ఉంటుంది.కానీ వాస్తవానికి కనిపించేది వేరు. పై మాటలు ఆచరణకు నోచుకోవటం లేదు.
1986గోదావరి వరదలకు దీనికి పొంతన లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కు ముందు ఎప్పుడు వరదలు వచ్చినా అవి కొన్నిరోజులుపాటు ఉండి తర్వాత దిగువకునీరు వెళ్ళేది. ఇప్పుడు అలా జరగ లేదు,కాఫ ర్‌ డామ్‌ నిర్మాణం వలన బ్యాక్‌ వాటర్‌ వచ్చి గ్రామాల్లో నిలిచి పోయింది. అందుకే భద్రా చలం కూడా వరద తాకిడికి గురైంది. దీని కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ 100 గ్రామాలు మునిగిపోతాయని సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.ఓ.ఎస్‌.నెంబర్‌బీ1ఆఫ్‌2019.అదే ఇప్పుడు పువ్వాడ అజయ్‌ కుమార్‌ మాట్లాడుతున్నది. మరల ఎటపాక గ్రామాలను తిరిగి తెలంగాణాకు ఇచ్చి వేయాలని వాదిస్తున్నారు.
ఆస్తి నష్టం అంచనా వేయరు!
సాధారణ పరిస్థితుల్లో అయితే ఇటువంటి వరదలు వచ్చినప్పుడు,అధికారులు పంటనష్టం, ప్రాణనష్టం, ఆస్తినష్టం అంచనావేసి,పరిహారం ఇస్తారు. కానీ, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుముంపు గ్రామాలలో అది సాధ్యంకాదు.ఎందుకంటే ఏదో ఒకరోజు ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేయాలంటున్నారు. అప్పుడు మునిగిపోయినా,రోడ్లు తిరిగి వేయరు, కూలిపోయిన స్కూలు బిల్డింగ్స్‌ కట్టరు,ఇండ్లు కూలిపోతే తిరిగి ఐ.ఏ.వై.స్కీమ్‌లో కట్టరు.పంట దెబ్బతిందని వ్యవసాయశాఖఅధికారులు వచ్చిచెక్కులు ఇవ్వరు. (భూములు తీసుకున్నారు) కాబట్టి గత ముంపుకు ఇప్పటి ముంపుకు తేడాను ప్రజలు గ్రహించాలి. 1986 వరద నీరు వస్తుందని అనుకోలేదు. కానీ ఇప్పుడు రాలేదా? ఈ రోజు వచ్చింది రేపు రాదు అని గ్యారంటీ లేదు. ఇంత కంటే ఎక్కువ కూడా రావచ్చు. ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తి అయితే, నీరు నిలిచి బ్యాక్‌ వాటర్‌ వస్తుంది.అటువంటప్పుడు మరలా కొన్ని పునరావాస కాలనీల ను అక్కడే కడుతున్నారు. అవి ఇప్పుడు వచ్చిన వరదల కు నీట మునిగిపోయాయి.రేపు ఆ గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ ఉండదు. ఆవిషయం అధికారులు కళ్ళారా చూస్తూనే ఉన్నారు.కాబట్టి దీనిపై ప్రజలూ ఆలోసిం చాలి, సమస్య ను ముందుగానే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలి. ప్రజల మధ్యన పని చేసే అను భవంఉన్న మేధావులు కూడా నిర్వాసితులు ఎదు ర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలి. ఇది ఏఒక్కరి సమస్యకాదు,మానవ సమా జంలోఉన్నఅన్ని వర్గాల ప్రజలదని నమ్ముతు న్నాను.-(వై.రాము/బాబ్జీ)

ప్రభం జనం ఆపుదాం..!

దేశమంటే మట్టి కాదోయ్‌…దేశమంటే మనుషులోయ్‌…! మహాకవి గేయానికి ఆధునిక కాలంలో మరో మాట కలుపవచ్చు. మనుషులంటే వనరులోయ్‌…!! అని. అధిక జనాభా ఆర్థిక వృద్ధికి అవరోధం అనేది ఒకప్పటి మాట. ఇపుడు మానవ వనరులే చోదకశక్తిగా ప్రగతిశీలత కనబరు స్తున్న దేశం మనది. ప్రగతిఎక్కడుంటే మానవ వనరులు అక్కడికి పరుగులు తీస్తాయి. అక్షరాస్యత, వృత్తి నైపు ణ్యం, గతిశీలత ఉన్న జనాభా విశాఖ అభివృద్ధికి ఆయువుపట్టు. అయితే పెరిగిన జనాభాకు తగిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడం అవసరం. జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ కథనం… ప్రపంచ జనాభాదినోత్సవం (జూలై11)సంద ర్భం గా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ప్రకా రం భారత్‌వచ్చే ఏడాది1.4బిలియన్ల (140 కోట్లు) జనాభాతో చైనాను వెనక్కినెట్టి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినదేశంగా అవతరించ నుం ది.ఈనివేదిక ప్రకారం ప్రపంచ జనాభా ఈ ఏడాది నవంబర్‌ నాటికి 800 కోట్లకు చేరనుంది. కానీ, ప్రస్తుతం జనాభా పెరుగుదల, గతంలో ఉన్నంత వేగంగా లేదు.1950తర్వాత జనాభా వృద్ధి రేటు ఇప్పుడు అత్యంత తక్కువగాఉన్నప్పటికీ, 2080ల నాటికి 10.4బిలియన్ల(1040కోట్లు)కు చేరుకుం టుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అయితే, కొందరు జనాభాశాస్త్రం నిపుణులు మాత్రం ఇది మరింత తొందరగా జరుగవచ్చని నమ్ముతు న్నారు. కానీ, ప్రపంచ జనాభా పెరుగుదల అసమా నంగా జరుగుతోంది.వచ్చే 30ఏళ్లలో ప్రపంచ జనాభా వృద్ధి రేటులో 50శాతానికి పైగా కేవలం 8దేశాల్లోనే సంభవిస్తుందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడిరచింది. కాంగో,ఈజిప్ట్‌, ఇథియోపి యా,భారత్‌,నైజీరియా,పాకిస్తాన్‌,ఫిలిప్పీన్స్‌, టాంజా నియా దేశాల్లోనే ఈఅధిక జనాభా రేటు నమోదవు తుందని చెప్పింది. అదే సమయంలో, ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలున్న దేశా లు ఇప్పటికే జనాభా క్షీణతను చూస్తున్నాయి. ఆయా దేశాల్లో సంతానోత్పత్తిరేటు ప్రతీ మహిళకు సగటు న 2.1 కంటే తగ్గిపోయింది.61 దేశాల్లో 2050 నాటికి జనాభా కనీసం1శాతం తగ్గుతుందని నివేదిక చెబుతోంది.
ప్రపంచంలోనే అతి తక్కువ సంతానో త్పత్తి రేటు ఉన్న దేశాల్లోచైనా కూడా ఒకటి. చైనా లో ప్రతీ మహిళ సగటున 1.15 మంది పిల్లలకు జన్మనిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి తమ జనాభా లో క్షీణత ప్రారంభమవుతుందని చైనా ప్రకటిం చింది.దేశంలో ‘ఒకేబిడ్డ’అనే విధానాన్ని విడిచి పెట్టి,ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే జంటలకు ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టినప్పటికీ చైనా జనాభా అనుకున్నదానికంటే వేగంగా తగ్గు తోంది.భారత్‌లో జనాభా పెరుగుతూనే ఉన్నందున, కచ్చితంగా చైనాను వెనక్కినెట్టి ప్రపంచంలోనే అత్య ధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించ నుంది.జనాభా పెరుగుతోన్న చాలా దేశాల్లోనూ సంతానోత్పత్తి రేట్లు పడిపోతున్నాయి.సైన్స్‌,మెడిసిన్‌ రంగాల్లో వచ్చిన అభివృద్ధి కూడా జనాభా పెరుగు దలకు ఒక కారణం. వీటి కారణంగానే శిశు మరణాలరేటు తగ్గిపోవడంతోపాటు,ఎక్కువ మంది పిల్లలు యుక్త వయస్సు వరకు, చాలా మంది వృద్ధాప్యంలో కూడా మనుగడ కొనసాగిస్తున్నారు. ఇకముందు కూడా ఇదే కొనసాగనున్న నేపథ్యంలో 2050నాటికి ప్రపంచ సగటు ఆయుర్ధాయం 77.2 సంవత్సరాలుగా ఉండనుంది.కానీ, దీని ప్రకారం జనాభాలో 65ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య 2022లో 10శాతంగా ఉండగా,2050 నాటికి16శాతానికి పెరుగు తుంది.ఈ పెరుగుదల కూడా అన్ని దేశాల్లో ఒకేలా ఉండదు.
జనాభా దినోత్సవం నేపపథ్యం ఇదీ..
ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుతారు. కుటుంబ నియంత్రణ, బాల్య వివాహాలు, స్త్రీ, పురుష సమానత్వం, మానవ హక్కులు వంటివాటిపై ప్రజలకు అవగాహన కల్పిం చేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రపంచ జనాభా దినోత్సవం,2023 ఇతివృత్తం ఏమిటంటే,‘‘హక్కులు,ఎంపిక చేసుకునే అవకాశాలే సమాధానం.జననాలరేటు పెరగడం లేదా తగ్గడం, ప్రజలందరి సంతానోత్పత్తి ఆరోగ్యానికి, హక్కులకు ప్రాధాన్యమివ్వడంలోనే మారుతున్న సంతానోత్పత్తి సామర్థ్య రేట్లకు పరిష్కారం ఉంది.’’యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌గవర్నింగ్‌ కౌన్సిల్‌ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రకటించింది. ఏ రోజున ప్రపంచ జనాభా 500కోట్లకు చేరుతుందని అంచ నా వేస్తారో,ఆరోజున (1987 జూలై 11న) దీనిని జరపాలని నిర్ణయించింది. దీనిని కొనసాగించాలని 1990లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మా నం చేసింది. అధిక జనాభా ప్రభావాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపింది. కుటుంబ నియంత్రణ, పౌర హక్కులు, పేదరికం, మానవాళిపై అధిక జనాభా చూపే ప్రభావం గురించి ప్రజలకు వివరించడానికి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమాలు ఉప యోగపడతాయి. ప్రపంచంలో అధిక జనాభా గల దేశాల్లో చైనా తర్వాత భారతదేశం నిలి చింది.అధిక జనాభా కారణంగా కోవిడ్‌-19 మహమ్మారిని నియంత్రించడం పెద్ద సవాలుగా మారింది.సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, 2030 ఎజెం డా అనేది ఆరోగ్యవంతమైన భూమండలంపై ప్రజ లందరికీ మెరుగైన భవిష్యత్తుకు ప్రపంచ బ్లూప్రింట్‌ అని ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటో నియో గుటెరస్‌ అన్నారు. జనాభా వృద్ధి, వృద్ధాప్యం, వలసలు,పట్టణీకరణ సహా జనాభా ధోరణులతో ఈమిషన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా గుర్తిస్తు న్నట్లు తెలిపారు.
జనభాతో పాటు సమస్యలు ఎక్కువే..!
ఇక ప్రపంచ జనాభా దినోత్సవంలో భాగంగా పెరుగుతున్న జనాభాతో ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది గత 32 ఏళ్లుగా జరుగుతున్నదే. అయినప్పటికీ ప్రతి ఏటా జనాభా పెరుగుతోందే తప్ప ఎక్కడా తగ్గిన దాఖలాలు లేవు. జనాభాతో పాటే తద్వారా వచ్చే సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. భారత్‌నే తీసుకుంటే ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం 2100నాటికి మనదేశంలో జనాభా 1450 మిలియన్‌ తాకుతుందని అంచనా వే సింది.1950లో ఉన్న జనాభా 2100 నాటికి చైనా జనాభాను కూడా భారత్‌ దాటుతుందని ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ తన నివేదికలో వెల్లడిరచింది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత జనాభా ఉన్న 10దేశాల్లో ఒక్క ఆఫ్రికా దేశాలే ఐదుగా ఉన్నట్లు రిపోర్టు పేర్కొంది. ప్రపంచ జనాభాలో 16శాతం భారత్‌లోనే ఇక ప్రపంచ జనాభాపై ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రతి ఏటా దాదాపు 83 మిలియన్‌ పెరుగుతోంది. ఇక 2030 నాటికి ప్రపంచ జనాభా 8.6బిలియన్‌ మార్కును తాకుతుందని చెప్పడంలో ఎలాంటి సం దేహం లేదని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. అయితే ప్రపంచ భూభాగంలో కేవలం 2శాతం భూమిని మాత్రమే కలిగి ఉండే భారత దేశం… ప్రపంచ జనాభా విషయానికొచ్చేసరికి దాదాపు 16 శాతం జనాభా మనదేశమే అకామొడేట్‌ చేయడం విశేషం. ఇక భారత్‌లో 35శాతం జనాభాబీహార్‌,ఉత్తర్‌ ప్రదేశ్‌,మహారాష్ట్ర రాష్ట్రాల్లోనే ఉన్నట్లు సమాచారం. అత్యధిక జనాభా ఉండటం వల్ల సమస్యలు కూడా అధికంగానే ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. అందులో ప్రధానమైన సమస్య పేదరికం అని వెల్లడిస్తున్నారు.
2050 నాటికి స్త్రీ, పురుషుల జనాభా సమానం
2050 నాటికి స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్యకు సమానంగా ఉంటుందని అంచనా.2020లో, 1950 తర్వాత మొదటిసారిగా,జనాభా పెరుగు దల రేటు సంవత్సరానికి 1శాతం కంటే తక్కువగా పడిపోయింది. ఇది రాబోయే కొన్ని దశాబ్దాల్లో, ఈ శతాబ్దం చివరి వరకు మందగించడం కొనసా గుతుందని అంచనా వేసింది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో,అంతర్జాతీయ వలసలు జనాభా మార్పులో ప్రధాన అంశంగా మారాయి. 2010, 2021మధ్య పది దేశాలు1మిలియన్‌ కంటే ఎక్కువ వలసదారుల నికర ప్రవాహాన్ని అనుభవించాయని అంచనా వేయబడిరది.ఈదేశాలలోచాలా వరకు,ఈ ప్రవాహాలు తాత్కాలిక శ్రామిక కదలికల కారణం గా ఉన్నాయి, అవి పాకిస్థాన్‌ (2010-2021లో -16.5 మిలియన్ల నికర ప్రవాహం), భారతదేశం (-3.5 మిలియన్లు),బంగ్లాదేశ్‌(-2.9 మిలియన్లు), నేపాల్‌ (-1.6మిలియన్లు),శ్రీలంక(-1 మిలియన్‌). జనాభా రెట్టింపుతో వనరులపై తీవ్ర ప్రభావం46 అతితక్కువ అభివృద్ధి చెందిన దేశాలు (ూణజు) ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందు తున్న దేశాలలో ఉండనున్నాయి.అనేక మంది 2023,2050 మధ్య జనాభాలో రెట్టింపు అవు తుందని అంచనా వేయబడిరది, వనరులపై ఇది అదనపు ఒత్తిడిని, సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ూణGం) సాధనకు సవాళ్లను విసిరింది.జనాభా, స్థిరమైన అభివృద్ధి మధ్య సంబంధాన్ని వాతావరణ మార్పు, స్థిరమైన అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపే ఇతర ప్రపంచ పర్యావరణ సవాళ్ల నేపథ్యం లో పరిగణించాలని యూఎన్‌ నివేదిక పేర్కొంది. జనాభా పెరుగుదల పర్యావరణ నష్టానికి ప్రత్యక్ష కారణం కాకపోవచ్చుబీ అయితే ఇది సమస్యను మరింత తీవ్రతరం చేయవచ్చు లేదా పరిగణించ బడిన కాలపరిమితి, అందుబాటులో ఉన్న సాంకేతి కత,జనాభా,సామాజిక,ఆర్థిక సందర్భాలపై ఆధార పడిదాని ఆవిర్భావ సమయాన్ని వేగవంతం చేయ వచ్చు.-జిఎన్‌వి సతీష్‌

అంతర్ధానమవుతున్న మాతృభాషలు

మనిషి తన తల్లికి ఎంత దగ్గరగా ఉంటాడో మాతృ భాషకు కూడా అంత దగ్గరగా ఉంటాడు. పిల్ల వాడు, తన భాషా సామర్ధ్యాన్ని తల్లి నుండి నేర్చుకుం టాడు. ఏతల్లీ కూడా అప్పుడే పుట్టిన పిల్లాడికి ఎలాంటి వ్యాకరణ నిబంధనల్ని బోధించదు. అయినా,తన తల్లి పెదాల కదలికలు, ఆమె అభినయా లను గమనించడం ద్వారా,ఆమె మాటల ధ్వని, ఆమాటల కూర్పును గ్రహిం చడం ద్వారా ఆపిల్లాడు అంత సంక్లిష్టమైన నిబంధనల్ని వంట బట్టించుకుంటాడు.పిల్లలు భాషలను పాఠశాలలో నేర్చుకుంటారనే ఒక విస్తృతమైన తప్పుడు అభిప్రా యం ఉంది.అది మాతృభాషేతర భాషల విషయం లో వాస్తవం కావచ్చు.ద్వితీయ, తృతీయ లేక ఇతర భాషల్ని వ్యాకర ణం,అనువాదంద్వారా నేర్చు కోవా ల్సి ఉంటుంది. కానీ పిల్లవాడు మూడు సంవత్స రాల వయసొచ్చే సమయా నికి మాతృభాష లోని దాదాపు అన్ని సంక్లిష్టతలను నేర్చుకోవడానికి అను గుణంగా మెదడు నిర్మితమై ఉంటుంది. లేఖనం (రాత) అనేది వేరే అంశం. కొన్ని లక్షల సంవత్స రాల మానవ జాతి చరిత్రలో, లేఖనం అనేది ఏడు వేల సంవత్సరాల క్రితమే వ్యక్తీకరణకు, సమా చారాన్ని అందించే,జ్ఞాపకాలను నిల్వ చేసే సాధనం గా మారింది. భాష అంటే ప్రాథమికంగా మాట్లాడ టం.లేఖనం ద్వారా తరాల మధ్య సుదీర్ఘ కాలం పాటు భాషాపరమైన సంబంధ బాంధ వ్యాలకు అవకాశం ఇవ్వడం భాషకుండే అదనపు లక్షణం.
నాబాల్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మాతృభాష కాని ఇతర అనేక భాషలను వారాంతపు సంతల్లో జనసమూహాలు మాట్లాడడం స్వయంగా విన్నాను. అప్పట్లో రేడియో అనేది మా గ్రామంలో ఓకొత్త యంత్ర పరికరం. ఇంట్లోకి కొత్త రేడియో సెట్‌ రావడంతో నేను ఎంతో ఆసక్తిగా స్టేషన్లను కదిలిస్తుండేవాడ్ని.వారాంతపు సంతల్లో వినని అనేక భాషల్ని రేడియోలో విన్నాను. దీంతో అసలు ఈ ప్రపంచంలో ఇంకా ఎన్ని భాషలు ఉన్నాయో తెలు సుకోవాలనే ఆసక్తి నాలో పెరిగింది.1970లో ఒక విశ్వవిద్యాలయం విద్యార్థిగా భారతీయ భాషలపై జనగణనకు సంబంధించిన చిన్న పుస్తకాన్ని చూశా ను.దానిలో 109భాషల జాబితా ఉంది. ఆ జాబి తాలో చివరన ఃఃఅన్ని ఇతర భాషలు అని ఉంది. అంటే 108భాషల కన్నా ఎక్కువ భాషలు ఉన్నా యనే దానికి ఇదొక సూచిక. ఇంతకన్నా ముందుగా జనాభా లెక్కల్లో మరికొన్ని వివరాలు తెలుసు కోవాలనే ఉద్దేశంతోయూనివర్సిటీ లైబ్రరీలో 1961 జనాభా గణాంకాల కోసం వెతికాను. ఆ గణాం కాలలో నేను దిమ్మతిరిగే విషయాలను గమనిం చాను.ఆజాబితాలో 1652 భాషల్ని తమ మాతృ భాషగా భారతీయులు పేర్కొన్నారు. పైన ఉదాహ రించిన భాషల గణాంకాలకు సంబంధించి రెండు రకాల సంఖ్యల్ని పోల్చితే 10 సంవత్సరాల కాలం లో (అంటే 1961-1971మధ్య కాలంలో) భారత దేశం మొత్తం 1544 భాషల్ని కోల్పోయింది. భాషా గణనను మామూలు అంక గణితం ద్వారా విభజిం చలేం.దానికి శిక్షణ పొందిన భాషా పండితుల పరిశీలన అవసరం ఉంటుంది. అందువలన భారతీ య జనగణన రిజిస్ట్రార్‌ దగ్గర పని చేస్తున్న భాషా పండితులు, విద్యావిషయక నిష్ణాతుల సాహిత్యం లో నమోదుచేయబడిన మాతృభాషల పేర్లు (జనా భా లెక్కల సమయంలో ప్రజలు చెప్పినవి) ఏమైనా ఉన్నాయేమోనని అందుబాటులో ఉన్న గ్రంథాల యాలలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీనికి ఖచ్చితంగా సమయం తీసుకుంటుంది. అందువల్ల సాధారణంగా భాషకు సంబంధించిన గణాంకా లను చివరగా ప్రకటిస్తారు.
1971 భాషా గణనకు, భాషా గణాం కాల ప్రకటన మధ్య కాలంలో బంగ్లాదేశ్‌ యుద్ధం జరిగింది.తరువాత కాలంలో బంగ్లాదేశ్‌గా మారి న తూర్పు పాకిస్తాన్‌, పశ్చిమ పాకిస్తాన్‌ నుండి భాషా సమస్య పైనే విభజనను కోరింది. భారత ప్రభుత్వం భాషా వైవిధ్యం గురించి ఆందోళన చెంది,భాషల సంఖ్యను తగ్గించే మార్గాలను వెతికే నిర్ణయం చేసి వున్నట్లైతే, అది సహజమేనని భావిం చాలి.అందుకుగాను ప్రభుత్వం ఃఃపది వేల (భాషను మాట్లాడే వారి సంఖ్య) సంఖ్యఃః పరిమితిని విధిం చింది.ఈసంఖ్యా పరిమితికి ఎలాంటి శాస్త్రీయమైన పునాది లేదు. ఒక భాషను భాషగా పరిగణించా లంటే ఆ భాషను మాట్లాడేవారు కేవలం ఇద్దరుంటే చాలు.1970 ప్రాంతంలో 1544మాతృ భాషలు ఆకస్మికంగా మౌనం వహించాయా? కచ్చితంగా కాదు.అవికొద్ది జనాభా ఉన్న భౌగోళిక ప్రాంతాల్లో కొనసాగాయి.
ప్రభుత్వం కృత్రిమంగా విధించిన సీలింగ్‌ కారణంగా వాస్తవానికి ఎన్నిభాషలు అంత ర్ధానయ్యాయో తెలుసుకోవాలంటే1971 జనగణ నను 2011జనగణనతో పోల్చి చూడాలి. ప్రజలు తమ మాతృభాషగా పేర్కొన్న భాషల్ని లెక్కించ డానికి అదే జనగణన పద్ధతిని అనుసరించగా భారతదేశంలో ప్రజలు 1369 భాషలను మాట్లా డుతున్నట్లు 2011జనగణన నిర్ధారించింది. రెండు సంఖ్యలను పోల్చి చూడడం ద్వారా 1961 నుండి 2011వరకు…అంటే50 సంవత్సరాల్లో (1,652 -1,369¸283)283 భాషలు అంతరించి పొయ్యా యనే నిర్ధారణకు ఎవరైనా రావచ్చు. అంటే సంవ త్సరానికి సగటున నాలుగు లేక ఐదు భాషలు లేదా ప్రతీ రెండు లేక మూడు నెలలకొక భాష అంతరించినట్టు అర్థం చేసుకోవాలి. గతంలో ఓ వెయ్యి సంవత్సరాల పాటు అంతర్ధానమైనఃః భాషలు ఉనికిలో ఉన్నాయనే విషయాన్ని పరిగణన లోకి తీసుకుంటే, భారత దేశంలో భాషల అంత ర్ధానరేటు గుండెలు అదిరిపోయే విధంగా ఉంది. జనగణనమాతృభాషలనే మాటను ఉపయోగించి నప్పుడు,వాటిలో చిన్న లేదా అల్ప సంఖ్యాక భాష లు మాత్రమే కాక అధిక సంఖ్యాక భాషలు కూడా ఉన్నాయనే విషయం ఎవరికైనా అంత తేలిగ్గా స్ఫురణకు వస్తుందనుకోలేం.
భారతదేశ ప్రజలు మాట్లాడిన వివిధ భాషల వివరాలు దశాబ్దాలవారీగా చూస్తే, 1961 లో బంగ్లా మాట్లాడేవారు మొత్తంజనాభాలో 8.17 శాతం ఉండగా అర్ధశతాబ్దం తరువాత వారి సంఖ్య8.03శాతానికి తగ్గింది. మొత్తం జనాభాలో మరాఠీ భాష మాట్లాడేవారి సంఖ్య 7.62 శాతం నుండి 6.86శాతానికి, తెలుగు మాట్లాడేవారు 8.16 శాతం నుండి 6.70 కి, తమిళం మాట్లాడే వారి సంఖ్య మరీ దారుణంగా6.88శాతం నుండి 5.70శాతానికి దిగజారింది. వాస్తవానికి హిందీ భాష తరువాత ఎక్కువగా మాట్లాడే మొదటి ఎని మిది భాషలు-బంగ్లా,మరాఠీ, తెలుగు,తమిళం, గుజరాతీ,ఉర్దూ,కన్నడం,ఒడియా మొత్తం జనాభా లో 2011జనగణన ప్రకారం 42.37శాతం కాగా హిందీ ఒక్కటే 43.63శాతంగా నమోదైంది. హిందీ మాట్లాడేవారి సంఖ్య ఎప్పుడూ పెరుగు తూనే ఉంది.1961లో36.99శాతంగా నమోదైన హిందీ మాట్లాడే వారిసంఖ్య 2011నాటికి మొత్తం జనాభాలో 43.63శాతానికి పెరిగింది. హిందీ, సంస్కృతం,గుజరాతీ భాషలను మినహాయిస్తే మిగి లిన గుర్తించబడిన అన్ని భాషల అంతర్ధానం కొన సాగుతూనే ఉందని 2011జనగణన తెలియ జేస్తుంది.196లో సంస్కృత భాషను మాతృభాషగా పేర్కొన్న వారిసంఖ్య 2,212 మంది కాగా 2011 లెక్కల్లో ఆ సంఖ్య 11రెట్లు పెరిగింది. అంటే ఆ సంఖ్య 24,821కి పెరిగింది. 2011లో జరిగిన భాషా గణన వివరాలను 2018లో ప్రకటించారు. తమిళ భాష ప్రపంచంలోనే అత్యంత పురాతన జీవభాషగా ఉంది.కన్నడం,మరాఠీ భాషలు సుమా రు రెండు వేల సంవత్సరాలుగా,మలయాళం, బంగ్లా, ఒడియా భాషలు కూడా దాదాపు 1000 సంవత్సరాలుగా జీవభాషలుగా ఉంటున్నాయి. సంస్కృతం దాదాపు వెయ్యి సంవత్సరాలకు పైగా జీవభాషగా లేకుండా నిలిచిపోయింది.దీనికి భిన్నంగా 17వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన ఇంగ్లీష్‌ భాష అందరి అంగీకారం పొందింది. దీనిని మాట్లాడే వారిసంఖ్య జనగణనలో 2,59, 878గా చూపబడిరది.ఇంగ్లీష్‌ దినపత్రికల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. భారతదేశంలో ఏడులక్షల గ్రామాల్లో, రెండు వేలనగరాలు, పట్ట ణాల్లో ఇంగ్లీష్‌ మాధ్యమ పాఠశాలలు నిర్వహించ బడుతున్నాయి.ఇంగ్లీష్‌ టీవీఛానళ్ల రేటింగ్‌ పాయిం ట్లు కూడా పెరిగిపోతున్నాయి. అసలు ఇంగ్లీష్‌ మాట్లాడే వారి సంఖ్య (సంస్కృతం మాట్లాడే వారి సంఖ్యకు భిన్నంగా) పెరుగుతుండడం నిజమే అని తెలుస్తుంది.
విచారకరమైన నిర్ధారణ ఏమంటే భారతీయులు మాట్లాడే అల్పసంఖ్యాక, అధిక సంఖ్యాక భాషలన్నీ (హిందూత్వ భావజాలాన్ని అనుసరించేవారు ఇష్టపడే భాషలను మినహాయిస్తే) నేడు వాటి ఉనికికి సంబంధించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.మన రాజ్యాంగంలో పేర్కొన్న ట్లుగా బహు భాషలు మాట్లాడే వివిధ రాష్ట్రాల సమాఖ్యగా ఉన్న భారత దేశానికి ఇది మంచిది కాదు.(ఫ్రంట్‌లైన్‌ సౌజన్యంతో).
` వ్యాసకర్త:ఒబైడ్‌ సిద్ధిఖీ చైర్‌ ప్రొఫెసర్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌,బయోలాజికల్‌ సైన్సెస్‌, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌, బెంగళూరు
-గణేష్‌ దేవీ

అనుకున్నంతగా..వానల్లేవు

వేసవిలో పంట చేతికొచ్చే సమయానికి వద్దన్నా రెండు దఫాలుగా రోజులతరబడి కురిసిన భారీ వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి. చేతికొచ్చిన వరి, మామిడి, మిరప, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. అయితే వానాకాలం సీజన్‌ నెలన్నర గడుస్తున్నా ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవకపోవడం గమనార్హం. ఎండాకాలం యాసంగిలో వద్దన్నా కురిసిన బారీ వర్షాలు అదే వానాకాలం వచ్చే ముఖం చాటేయడంతో ఆరుతడి పంటల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల రాక కోసం తెలుగు రాష్ట్రాల రైతాంగం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.
స్తారు నుంచి భారీవర్షాలు లేక కంది,సోయా, మిర్చి,వేరుశనగ మొక్కజొన్న తదితర ఆరుతడి పంటలు రెండాకుల దశలోనే ఉన్నాయి. ఆశిం చిన స్థాయిలో వర్షాలు లేక మొలకదశలోనే పత్తి ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈఏడాది రాష్ట్రంలోదాదాపు50లక్షలకు పైగా ఎకరాల్లో పత్తిసాగవుతుందని వ్యవసా యశాఖ అంచనా వేసింది.కాని వర్షాలు ముఖం చాయే టడంతో అడపదడపావాన లకు కొన్ని జిల్లాల్లో రైతులు విత్తనాలు వేశారు. ఇప్పటికీ దాదాపు 20లక్షల ఎకరాల్లో వర్షాలు పడితే పత్తినాటేం దుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.సాధారణం గా ఏటావర్షాకాలం ఆరంభంలో కురిసే వర్షా లతోనే రైతులు ఆతరుడి పంట విత్తనాలు వేస్తారు.వర్షాలు కురుస్తాయోమోనన్న ఆశతో ఈసారి కూడా రోహిణిలోనే పత్తివిత్తనాలు నాటారు. అయితే జూన్‌ నెలలో ఆరుతడి పంటలకు కావాల్సి నంతగా వర్షాలు కురవాల్సి ఉండగా రాష్ట్ర వ్యాప్తం గా చెప్పుకోదగిన వర్షాలు కురవలేదు. చెదురు ముదురు చినుకులకే విత్తనాలు విత్తినా అవి మొలకె త్తేందుకు, మొలకెత్తినా ప్రాణం పోసుకుని ఎ దిగేందుకు సరిపడా వర్షాలు లేక రైతులు తీవ్ర అవస్థులు ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం జులై మొదటి వారం గడిచిపోయినా కూడా వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో వానాకాలం పంట లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. గతే డాది ఇదే సమయానికి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం రాష్ట్రవ్యాప్తంగా నమోదైంది. కాని ఈ ఏడాది జులై రెండో వారంవచ్చినా వరుణుడు కరుణించడం లేదు. సాధారణంగా జూన్‌ నెలతలో 144.1మీమీ. వర్షపాతం కురవాల్సి ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌లో కేవలం 66.9 మి.మీ. వర్ష పాతం అది కూడా మూడు, నాలుగు జిల్లాల్లోనే కురిసింది.దాదాపు 77.2మి.మీ లోటు వర్షపాతం జులైలో నమోదయింది. వర్షాలు పడక పత్తి మొక్క లు ఎండిపోతుండడంతో రైతులు కూలీలను పెట్టి మరి బిందెలు, ట్యాంకర్లతో మొక్కమొక్కకూ నీటిని పోస్తున్నారు.సరైన వర్షాలు లేకపోవడంతో మొక్కలు వాడిపోతున్నాయని ఆవదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ముఖం చాటేయడంతో భూగర్భ జలాలు కూడా వృద్ధి చెందడం లేదు. దీంతో కనీసం బోరు, బావినీటితోనైనా ఆరుతడి పంటలను కాపాడుకు నేందుకు రైతులకు అవకాశం లేకుండా పోయింది. వాస్తవానికి ఏటా మాదిరిగా జూన్‌ నెలలో వర్షాలు కురిస్తే పత్తి మొక్కలు జులై రెండో వారంకల్లా మొక్క ఎదగడంతోపాటు కొమ్మలు పెట్టే దశలో ఒక అడుగు కంటే ఎక్కువ ఎత్తు పెరగాల్సి ఉంది.కాని ఈ సారి నెలన్నర వానాకాలం సీజన్‌ గడుస్తున్నా పత్తి మొక్కలు ఇంకా రెండాకుల దశ లోనే ఉన్నాయి. మొక్క ఎదుగుదల ఆశించిన స్థాయి లో లేకపోతే కొమ్మలు రాకపోతే కాత తగ్గి దిగుబడి తగ్గుతుందని రైతులు వాపోతున్నారు. మరో రెండు వారాలు వర్షాలు కురవకపోతే ఆత ర్వాత కురిసినా పత్తి పంటపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతు లు చెబుతున్నారు.
ఏ పంట..ఎప్పుడు వేసుకోవాలంటే!
వ్యవసాయ సీజన్‌ ప్రారంభమవు తున్నది. వానకాలం సాగుకు రైతులు సన్నద్ధ మవు తున్నారు. ఏ పంట ఎప్పుడు వేసుకోవా లో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఏదో ఒకరకమే సాగు చేస్తూ అన్న దాతలు నష్టపోతు న్నారు. అయితే అదును చూసి సాగు చేయడం వల్ల తెగుళ్లు, చీడపీడల ఉధృతి నుంచి పంటను కాపాడుకోవ డంతో పాటు పంట నాణ్యత పెరిగి అధిక దిగుబడి వస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితి నుంచి పంట బతుకుతుంది. ఈ నేపథ్యంలో ఏ పంటలను ఎప్పుడుసాగు చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసు కోవాలి? అనే అంశాలపై నిపుణుల
సూచనలు, సలహాలు.
మొక్కజొన్న : మొక్కజొన్న పంటకాలం 110 నుంచి 120 రోజులు ఉంటుంది.జూన్‌ 15 నుంచి జూలై 15లోపు విత్తనాలు విత్తుకోవాలి.మొక్కజొన్న సున్నితమైన పంట. నీరు ఎక్కువ ఉన్నా, తక్కువున్నా తట్టుకోదు.కాండం తొలుచు పురుగుతో తీవ్ర నష్టం జరుగుతుంది. పంటసాగు చేసిన 30రోజుల లోపు కాండం తొలుచు పురుగు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.30రోజులు గడిచిన తర్వాత దాని ప్రభా వం పంటపై అంతగా ఉండదు. కాండం తొలుచు పురుగు ఉధృతికి జూలై చివరివారం నుంచి ఆగస్ట్‌ లో వాతావరణ అనుకూలంగా ఉంటుంది.జూన్‌ లో మొక్కజొన్న సాగు చేయడంవల్ల పంటకాలం 30రోజులుదాటి పురుగు ప్రభావం అంతగా ఉండదు.ఆలస్యంగా సాగు చేస్తే కాండం తొలుచు పురుగుతో నష్టపోవాల్సి వస్తుంది.రబీలో మొక్కజొన్న సాగు చేసే రైతులు అక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 15 లోపు విత్తనాలు వేయాలి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 లోపు పంట చేతికొస్తుంది.
పెసర :పెసర పంట కాలం 60నుంచి 75 రోజులు ఉంటుంది.జూన్‌ 15నుంచి జూలై 15లోపు సాగు చేయాలి. ఆగస్టు 25 వరకు పంట చేతికొస్తుంది. ఆగస్టులో వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉండ డంతో పెసర పంట నష్టపోయే ప్రమాదం ఉం టుంది.జూన్‌ 20లోపు సాగు చేస్తే ఆగస్టు 10లోపు పంట చేతికి వస్తుంది.రబీలో సెప్టెంబర్‌ 15 నుంచి అక్టోబర్‌ 30లోపు సాగు చేయాలి నవంబర్‌ 20 నుంచి జనవరి 15వరకు పంట చేతికొస్తుంది. పత్తి : పత్తి సాగును వీలైనంత వరకు తగ్గించాలి. పత్తి సాగుకు పెట్టుబడి ఎక్కువగా ఉండడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ధర లేకపోవ డంతో పత్తి సాగు రైతులకు నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నల్ల రేగడి భూమిలో పత్తి సాగు చేసే రైతులు 60 నుంచి 70మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైన తర్వా త పత్తి గింజలు విత్తుకోవాలి. జూన్‌ 20 నుంచి జూలై 20వరకు పత్తి విత్తనాలు విత్తుకోవడం వల్ల రసం పీల్చుపురుగులు ఉధృతితక్కువగా ఉంటుంది.
కంది : కంది పంట కాలం 6 నెలలు. జూన్‌ 20 నుంచి జూలై చివరి వారం వరకు సాగు చేసు కోవాలి. డిసెంబర్‌ 31 నుంచి జనవరి 15 వరకు పంట చేతికొస్తుంది. సకాలంలో కంది సాగు చేయ డం వల్ల జనవరిలో రెండో పంటగా పెసర సాగు చేసుకొవచ్చు.నీటి వసతి ఉన్న రైతులు కందిలో అంతర పంటగా సోయాబీన్‌, మొక్కజొన్న సాగు చేయడంవల్ల అధికలాభాలు సాధించవచ్చు. సోయాచిక్కుడు : సోయా చిక్కుడు పంట కాలం నాలుగు నెలలు ఉంటుంది. పెసరతో పోలిస్తే సోయా చిక్కుడు వర్షాలను తట్టుకునే అవకాశం ఉంటుంది. నీటి వనరు ఉన్న రైతులు జూన్‌ 20 నుంచి జూలై 10వరకు సాగు చేయాలి. సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 20 వరకు పంట చేతికొస్తుంది. సోయాచిక్కుడు సకాలంలో సాగు చేయడం వల్ల రెండో పంటగా వేరుశెనగ,మూడో పంటగా వేసవి లో పెసరను సాగు చేసుకోవచ్చు.
మిరప : మిరప పంట కాలం ఏడు నెలలు ఆగస్టు మొదటి వారంలో నారు పోసుకుని సెప్టెంబర్‌లో నాటు వేసుకోవాలి. నకిలీ విత్తనాలు ఖరీదు చేసి మోసపోవద్దని అధికారులు చెబుతున్నారు. గుర్తింపు పొందిన డీలరు వద్ద విత్తనాలతో పాటు తప్పనిసరి గా రశీదు తీసుకోవాలి. మిరప సాగుచేసే రైతులు తొలకరి వర్షాలు కురియగానే తక్కువ కాలంలో చేతికొచ్చే పెసర రకాలను సాగు చేసి దాని తర్వాత మిరప సాగు చేసుకొవచ్చు.
వరి : దీర్ఘకాలిక వరి రకాలకు సంబంధించి జూన్‌ మొదటి వారం నుంచి చివరి లోపు నారు పోసు కోవాలి. పంటకాలం 135 నుంచి 150 రోజులు ఉంటుంది.అక్టోబర్‌ 31నుంచి నవంబర్‌ 20 లోపు పంట చేతికొస్తుంది. మధ్యకాలిక రకాల నారును జూన్‌ 20 నుంచి జులై 10లోపు పోసుకోవాలి. పంటకాలం125 నుంచి 135 రోజులు. నవంబర్‌ 5నుంచి 25లోపు పంట చేతికొస్తుంది. వానకా లంలో సాగుచేసిన పంటసకాలంలో చేతికి రావ డంతో నవంబర్‌లో వేసవి వరి సాగు చేయడానికి వీలుంటుంది. వానకాలం ఆలస్యం చేయడం వల్ల యాసంగి కూడా ఆలస్యమౌతున్నది.ఏప్రిల్‌లో వడ గండ్ల వర్షాలకు వేసవిలో సాగుచేసిన వరి నష్టపో వాల్సి వస్తున్నది. మార్చి చివరి వరకు యాసంగి పంట చేతికొస్తే వడగండ్ల వానతో వచ్చే నష్టాలను అధిగమించొచ్చు. నేరుగా పొడి దుక్కిలో వరి సాగు చేసే రైతులు స్వల్పకాలిక రకాలను జూన్‌ 20 నుంచి అక్టోబర్‌15లోపు సాగుచేయాలి.మధ్య కాలిక రకాలను జూన్‌ 20నుంచి జూలై 10లోపు సాగు చేయాలి. అక్టోబర్‌ చివరి వారం నుంచి నవంబర్‌ మొదటి వారంలో పంట చేతికొస్తుంది.
కాలానుగుణంగా పంటలు సాగు చేసుకోవాలి
రైతులు పంటలను కాలానుగుణంగా ఎంపిక చేసుకోవాలి.ఏపంటలను ఎప్పుడు సాగు చేయాల నేది పూర్తి అవగాహన చేసుకున్న తర్వాతే వేసుకో వాలి.కాలానుగుణంగా సాగుచేయడం వల్ల మంచి దిగుబడులు పొందడమే కాకుండా రోగాల ప్రభావం తగ్గుతుంది.ఏ పంటలను సాగు చేయా లన్న విత్తనాలను ఎక్కడ పడితే అక్కడ కొనకుండా గుర్తిం పు పొందిన డీలర్‌ వద్దే కొనుగోలు చేసి రశీదును తప్పక తీసుకోవాలి.
ఖరీఫ్‌ సన్నద్ధత ఏదీ?
ఈమారు తొలకరి పలకరింపు ఆలస్య మైంది. జూన్‌ మూడవవారానికీ వర్షాల్లేక ఏరు వాక కదల్లేదు. ఖరీఫ్‌ సేద్యానికి అదను పదును తప్పేలా ఉంది.తుపాన్లు,వరదలు,అకాల వానలు, వర్షాభావం నిరుడు ఖరీఫ్‌ రైతుల ఉసురు తీశా యి. పంటలకు ధర సమస్య తిష్ట వేసింది. ప్రభుత్వ నిర్లిప్తత, నిర్లక్ష్యం ఉండనే ఉన్నాయి. ఈ తడవైనా ఖరీఫ్‌ పంటలు వేయబోతే ఆదిలో హంసపాదులా నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. సీజన్‌లో 21 రోజులు గడిచినా మబ్బు జాడలేదు. ఆ ప్రాం తం ఈ ప్రాంతం అని లేకుండా అధిక ఉష్ణోగ్రత లు, వడగాలులు, ఉక్కపోతలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికి పడాల్సిన సాధారణ వర్షంలో 61శాతానికిపైన తక్కువ పడిరది. చిత్తూరు మినహా అన్ని జిల్లాలూ 50-80 శాతం వర్షపు లోటు ఎదుర్కొంటున్నాయి.ఎ.పి.లో 679 మండ లాలుండగా 527 చోట్ల తక్కువ వర్షం పడిరది. 11 మండలాల్లో చినుకు లేదు.
మో91మండలాల్లో మాత్రమే నార్మల్‌, అంతకంటే కొంచెం వర్షం కురిసింది.ఈగణాం కాలు ప్రభుత్వానివి.క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. వ్యవసాయ రాష్ట్రం ఎ.పి.కి ఖరీఫ్‌ కీలకమైనది కాగా రానురా ను రైతులకు సీజన్‌ భారంగా కష్టం గా తయారైం దని సాగు లెక్కలు తెలుపుతున్నాయి. గతేడాది నిర్ణయించుకున్న సాధారణ సాగు విస్తీర్ణంలో ఐదు న్నర లక్షలఎకరాల్లో విత్తనం పడక బీడు పడ్డాయి. రబీలోనూ పది లక్షల -ఎకరాల్లో పంట ల్లేక ఖాళీ పడ్డాయి. క్రమేపి సాగు తగ్గుతుండ టంతో నిర్ణయించుకునే నార్మల్‌ సాగు అంచనాలూ తగ్గిపోతున్నాయి.ఉదాహరణకు నిరుడు ఖరీఫ్‌ కంటే ఈ సారి ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం ఆరు లక్షల ఎకరాలు పడిపోయింది. ఒక్క సంవత్స రంలో అన్నేసి లక్షల ఎకరాల తగ్గుదల ఆందోళన కలిగిస్తుంది. రాయలసీమలో వేరుశనగ విస్తీర్ణం తగ్గి పత్తి, ఇతర వాణిజ్య పంటలు పెరుగుతున్నా యి. ధాన్యాగారాలైన గోదావరి,కృష్ణా,పెన్నా డెల్టా లలో వరి కుదించుకుపోయి ఆక్వా, ఇతర కమర్షి యల్‌ క్రాప్స్‌ వేస్తున్నారు. ఈ ధోరణులు ప్రభుత్వాల విధానాల పర్యవసానాలు. ఏపంట వేసినా పెట్టు బడులకు కనీస గ్యారంటీ లేనందున సేద్యం రైతు లకు జూదాన్ని తలపిస్తోంది. అందుకే తలో దిక్కు పోయి చేతులు కాల్చుకొని నష్టపోతున్నారు. చివరికి చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులతో స్వంత వ్యవసాయం మాన్పించి కార్పొరేట్ల చెప్పుచేతల్లోకి చేర్చే కుట్ర జరుగుతోంది. ఇది రైతాంగానికి ప్రజల ఆహార భద్రతకు ప్రమాదం.
ఖరీఫ్‌ సన్నద్ధతకు రాష్ట్ర ప్రభుత్వం అంతగా ప్రాధాన్యత ఇవ్వనట్లే కనిపిస్తోంది. పంటలేయా లంటే రైతులకు కావాల్సినవి అదనకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పరపతి, సాగు నీరు. వర్షాలు పడలేదు కాబట్టికానీ, లేకపోతే విత్తనాల కోసం వెదుకులాటే. రాయితీ వేరుశనగ విత్తన పంపిణీని మమ అనిపించారు. ఇండెంట్‌ బాగా తగ్గించారు. వరి, ఇతర పంటలదీ అదే తీరు.నిరుడు నకిలీ, కల్తీ మిర్చి విత్తనాలు, నారుతో రైతులు భారీగా నష్టపోయారు. పత్తి విత్తనాలూ అంతే. ఇప్పటి వరకు రైతులకు నష్ట పరిహారం అందలేదు. కాగా ఈ ఏడాది ఖరీఫ్‌ మొదలుకాక ముందే చాలాచోట్ల నకిలీ విత్తనాలను సీజ్‌ చేశారు. పట్టుకున్నది గోరంత, పట్టుకోకుండా చెలామణి అవుతున్నది కొండంత.పురుగు మందుల అక్ర మాలు చెప్పనలవికావు. నాణ్యత విషయంలో రాజీ లేదని ప్రభుత్వం హూంకరిస్తుండగా జరిగేది జరిగి పోతోంది. నిరుడు ఎరువుల సరఫ రాలో అస్తవ్య స్తత వలన అదనుకు ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులు పడ్డారు. బ్యాంక్‌ రుణాల లక్ష్యాలు వందకు వంద శాతం చేరాయంటున్నా కౌలు రైతుల పరపతి అధమస్తంగా ఉంది. కేంద్ర బీమా పథకంలో చేరడంతో ఖరీఫ్‌ బీమా ఇంకా అంద లేదు. అకాలవర్షాల బారిన పడ్డ రైతుల్లో చాలా మందికి పరిహారం దక్కలేదు. రైతు భరోసా చాలా మందికి పడలేదు.పి.ఎంకిసాన్‌ జాడ లేదు. కేలం డర్‌ ప్రకారం కాల్వలకు నీళ్లొదులుతు న్నామం టున్నా చివరి భూములకు అందట్లేదు. మరమ్మ తుల్లేక కాల్వల్లో తగినంత నీరు పారట్లేదు. రిపేర్లు లేక చిన్న వానలకే డ్రైన్లు పొంగి పొలాలపై పడుతు న్నాయి. శ్రీశైలం దగ్గరే రిపేర్లు లేవు. ప్రభుత్వం మాత్రం ఆర్‌బికెల జపం చేస్తోంది.ఏర్పాట్లు లేకుం డా ఖరీఫ్‌ సజావుగా సాగదు. ప్రభుత్వం ఖరీఫ్‌ సన్నద్ధతపై దృష్టి నిలపాలి.
వ్యాసకర్త : కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి-(దొంగరి నరేశ్‌)

కార్పోరేట్ల కోసమే..బ్లూ ఎకానమీ పాలసీ

సముద్ర తీర ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన మౌలిక సదుపాయాలు లేవు.అనేక పోర్టులు, విమా నాశ్రయాల్లో మౌలిక సదుపాయాల కొరత ఉందనే సత్యాన్ని దాచి ‘బ్లూఎకానమీ’ ద్వారా ఆర్థిక కార్యక లాపాలను అభివృద్ధి చేస్తామనడం అతిశయోక్తి అవుతుంది. లాభాల కోసం పని చేసే సంస్థలకు సముద్ర ప్రాంతాల్ని అప్పగించడం ద్వారా మత్స్య కారులు జీవనోపాధిని కోల్పోతారు. విపరీతమైన పర్యావరణ నష్టం వాటిల్లుతుంది.అభివృద్ధి ప్రధానాశయంగా పేర్కొంటున్న ‘బ్లూ ఎకానమీ పాలసీ’ అందమైన అబద్ధం. అత్యంత పేదవర్గాలైన మత్స్యకారుల జీవనోపాధి దెబ్బ తీయడంతో పాటు వారిని వారి నివాసాలకు దూరం చేసే కుట్ర. ఇప్పటికే ‘సాగరమాల’ పేరుతో చేపట్టిన ప్రాజెక్టుకు సంబంధించిన కార్యకలాపా లతో మత్య్సకారుల జీవన విధానంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సముద్రాన్నే నమ్ముకుని జీవిస్తున్న లక్షలాదిమంది మత్య్సకార కుటుంబాలను వారి జీవనోపాధికి దూరం చేసి,వారి ఆవాసాలను బడా కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘బ్లూ ఎకానమీ పాలసీ’ని ముందుకు తెచ్చింది. సముద్ర జలాల పరిరక్షణ,పర్యావరణం, సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న ప్రజల రక్షణకు సంబంధించిన అంశాలేవీ లేకుండానే దేశంలోని సముద్ర తీరాన్ని, సముద్ర సంపదల్ని స్వదేశీ,విదేశీ కార్పొరేట్‌లకు అప్పగించేందుకు కేంద్రం పావులు కదుపు తోంది.కార్పొరేట్ల సేవే లక్ష్యంగా పని చేస్తోంది.
ప్రపంచ వాణిజ్యంలో 80శాతం సముద్రాల నుంచే జరుగుతుంది. ప్రపంచ జనాభాలో 40శాతం మంది ప్రజలు తీర ప్రాంతాలకు సమీపంలోనే నివసిస్తున్నారు. భారతదేశం విస్తారమైన,వైవిధ్యమైన సముద్ర భూభాగాన్ని కలిగి ఉంది.అరేబియా సముద్రం,బంగాళాఖాతం వెంబడి కీలకమైన వివిధ ఓడరేవు నగరాలున్నాయి.మొత్తం 8,118కి.మీ పొడవైన తీరప్రాంతం ఉంది. ప్రతి ఏటా దాదాపు4.412మెట్రిక్‌టన్నుల చేపలు సముద్రం నుంచి ఉత్పత్తి అవుతున్నా యనే అంచనాలున్నాయి.దాదాపు4కోట్ల మంది ప్రజలు సముద్ర చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు.ప్రతిఏటారూ.65వేలకోట్ల మేర వ్యాపారం జరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. దేశంలోని ఎగుమతుల విషయానికి వస్తే మత్య్స సంపద వాటా గణనీయమైనది.
వీటన్నిటిని గమనంలోకి తీసుకున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇంతటి ఆర్థిక పరిపుష్టి కలిగిన సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్ర సంపదల్ని తన అనుంగు కార్పోరేట్లకు కట్టబెట్టడానికి కావలసిన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఇందులో భాగంగానే ‘సాగరమాల’ప్రాజెక్ట్‌ రూపకల్పన జరిగింది. ఇది చాలదన్నట్టు తాజాగా‘బ్లూఎకానమీ పాలసీ’ని ముందుకు తెచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద తీరప్రాంత దేశమైన భారత్‌లో అందమైన బీచ్‌లు,తీర ప్రాంతాలకు రవాణా సౌకర్యాల మెరుగు, ఓడరేవుల ఆధునీ కరణ, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, సముద్ర కాలుష్య నివారణ, సముద్ర వనరుల సక్రమ వినియోగం వంటి అందమైన, మోసపూరితమైన అంశాలను ముందు పెట్టి ‘బ్లూ ఎకానమీ పాలసీ’ దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందని పేర్కొంటోంది.దేశంలోని తొమ్మిది తీర ప్రాంత రాష్ట్రాల్లోని12మేజర్‌ పోర్టులు,200 చిన్న పోర్టులకు రవాణా సౌకర్యాల కల్పనద్వారా వ్యాపారాన్ని పెంచాలనేది ఇందులో ప్రధానాంశం. షిప్పింగ్‌ పరిశ్రమ విస్తరణద్వారా కార్పోరేట్‌ శక్తులకు మరిం త లాభం చేకూర్చాలని చూస్తోంది.ఆఫ్‌ షోర్‌ ఎనర్జీ ప్రొడక్షన్‌ను ప్రోత్సహించడం, ఇంధన అవసరాలను తీర్చడం అనే పేరుతో ఆయా విభాగాల్ని పూర్తిగా ప్రైవేటు శక్తులకు కట్టబెట్టాలని చూడడం మరో అంశంగా కనిపిస్తోంది. మెరైన్‌ బయో టెక్నాలజీ, మైనింగ్‌ల పేరుతో సముద్రం లోని ఇసుక, ఇతర ఖనిజ సంపదలపై కార్పొరేట్‌ శక్తులకు గుత్తాధి పత్యం కట్టబెట్టడం ఇంకో అంశం.
అయితే ప్రభుత్వం మాత్రం ఈ పాలసీ మొత్తం అభివృద్ధి కోసమే అంటోంది. ఇందుకోసం ఆ పాలసీ ముసాయిదాలో చెబుతున్న అంశాలేవీ ఆచరణకు నిలుస్తాయనడానికి తగిన చర్యలు ఉండడం లేదు. సముద్ర తీర ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన మౌలిక సదుపాయాలు లేవు. అనేక పోర్టులు, విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల కొరత ఉందనే సత్యాన్ని దాచి‘బ్లూ ఎకానమీ’ ద్వారా ఆర్థిక కార్యకలాపాలను అభివృద్ధి చేస్తామనడం అతిశ యోక్తి అవుతుంది. లాభాల కోసం పని చేసే సంస్థ లకు సముద్ర ప్రాంతాల్ని అప్పగించడం ద్వారా మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోతారు. విపరీత మైన పర్యావరణ నష్టం వాటిల్లుతుంది. సముద్రం తో ఇప్పటికే ఓవర్‌ ఫిషింగ్‌ అనేది ఒక పెద్ద సవాలు గా ఉంది. సాంప్రదాయ మత్య్సకారుల పాలిట ఇది శాపంగా మారుతోంది. హై సీస్‌ లో అంతర్జాతీ య సంస్థలకు చేపలు పట్టుకునేందుకు అవకాశం కల్పించడంతోక్రమంగా ప్రపంచానికి ఫుడ్‌ బాస్కెట్‌ గా పిలువబడే సముద్ర జలాల్లో చేపల నిల్వలు క్షీణించి సముద్ర పర్యావరణ వ్యవస్థకే పెనుముప్పు గా పరిణమిస్తున్నాయి. ఇది తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. సముద్రాలు వ్యాపార కేంద్రాలుగా మారడంతో విపరీతమైన ఎగుమతు లు, దిగుమతుల కారణంగా,సముద్రంపై ఇంధన రవాణా మూలంగా చమురు చిందటం,ప్లాస్టిక్‌ వ్యర్థాలు,పారిశ్రామిక వ్యర్థాలతో కాలుష్యం పెరుగు తుంది.ఇక డీప్‌శాండ్‌ మైనింగ్‌ కారణంగా సముద్ర పర్యావరణ వ్యవస్థలకు హాని కలిగిస్తుంది. వాతావ రణంలో విపరీతమైన మార్పులు పెరిగి తీరప్రాం తాల్లో తీవ్ర నష్టం జరుగుతుంది.
మరో కీలకమైన అంశం విషయానికి వస్తే ఎంతో కాలంగా భారతదేశం,శ్రీలంకల మధ్య ఫిషింగ్‌ వివాదం నడుస్తూనే ఉంది. ఇరు దేశాల సముద్ర జలాల మధ్య సరిహద్దు స్పష్టంగా విభ జించబడలేదు. ఇది రెండు దేశాల మత్స్యకారుల మధ్య గందరగోళానికి, సంఘర్షణకు దారితీస్తూనే ఉంది. దీనికి ‘బ్లూఎకానమీ పాలసీ’పరిష్కారం చూపించలేదు. సస్టైనబిలిటీ సైన్స్‌ జర్నల్‌ తన సంపాదకీయంలో బ్లూఎకానమీపై కీలకమైన వ్యాఖ్య చేసింది. బ్లూ ఎకానమీకి సరైన నిర్వచనం లేదని పేర్కొంది. ఈ అసంబద్ధత కారణంగా ఈ పాలసీని రూపొందించి అమలు చేసే వారి అభిరుచులను బట్టి ఎంపిక చేసుకున్న లక్ష్యాలు తారుమారవుతా యని హెచ్చరించింది. మరో అంతర్జాతీయ పరిశో ధన సంస్థ దీన్ని మత్య్సకారుల పాలిట విషాదకర మైన పాలసీగా పేర్కొంది. మత్స్యకారులు సముద్రా న్ని చాలా స్థిరమైన పద్ధతుల్లో ఉపయోగిస్తారని, అయితే బ్లూఎకానమీ పాలసీ ఇందుకు విరుద్ధమైన దని తెలిపింది.ఈ పాలసీ సముద్రాన్ని లాభదాయక మైన వనరుగానే పరిగణిస్తుందని పేర్కొంది. తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలు విధ్వంసం అవుతా యని వెల్లడిరచింది.
ఈ నేపథ్యంలో ఏ దేశమైనా తన సముద్ర సంపదను కేవలం ఆర్థిక వనరుగానే చూడకూడదని గ్రహించాలి. సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ కోణంలోనూ చూడాల్సి ఉంటుంది. కేవలం కార్పొ రేట్ల కోసం వ్యాపార కాంక్షతో…లక్షలాది మంది మత్య్సకారుల కడుపు కొట్టేలా రూపొందించిన బ్లూ ఎకానమీ పాలసీనిరద్దు చేయాలి. సముద్ర తీరప్రాం తాల్లో పర్యావరణానికి హాని కలుగకుండా స్థిరమైన అభివృద్ధి కోసం అన్నిరంగాల నిపుణులతో సంప్ర దింపులు జరిపి సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి.
‘బ్లూ ఎకానమీ’ అంటే ఏమిటి
బ్లూ ఎకానమీ అనేది తప్పనిసరిగా దేశంలో అందుబాటులో ఉన్న అనేక సముద్ర వన రులను సూచిస్తుంది,ఇది ఆర్థిక వృద్ధి, పర్యావరణ స్థిరత్వం మరియు జాతీయభద్రతతో అనుసం ధానం కారణంగా వస్తువులు,సేవల ఉత్పత్తికి సహా యం చేయడానికి ఉపయోగపడు తుంది. భారత దేశం వంటి తీరప్రాంత దేశాలకు సముద్ర వనరు లను సామాజిక ప్రయోజనం కోసం బాధ్యతాయు తంగా వినియోగించుకోవడానికి నీలి ఆర్థిక వ్యవస్థ ఒక విస్తారమైన సామాజిక-ఆర్థిక అవకాశం. భారతదేశంబ్లూ ఎకానమీ ఎంత ముఖ్యమైనది?
భారతదేశం నీలి ఆర్థిక వ్యవస్థ మొత్తం సముద్ర వనరుల వ్యవస్థ, దేశం యొక్క చట్టపరమైన అధికార పరిధిలోని సముద్ర,సముద్ర మరియు సముద్ర తీరప్రాంతాలలో మానవ నిర్మిత ఆర్థిక మౌలిక సదుపాయాలతో కూడిన జాతీయ ఆర్థిక వ్యవస్థ ఉపసమితి. దాదాపు 7,500 కిలోమీటర్లతో, భారతదేశం ఒక ప్రత్యేకమైన సముద్ర స్థానాన్ని కలిగి ఉంది.దాని 29రాష్ట్రాలలోతొమ్మిది తీర ప్రాం తం దాని భౌగోళికంలో1,382 ద్వీపాలు ఉన్నా యి. దాదాపు199 ఓడరేవులుఉన్నాయి. వీటిలో 12 ప్రధాన ఓడరేవులు ప్రతి సంవత్సరం సుమారు 1,400 మిలియన్‌ టన్నుల సరుకును నిర్వహిస్తాయి. అంతేకాకుండా, 2 మిలియన్‌ చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలం ముడి చమురు, సహజ వాయువు వంటి ముఖ్యమైన పునరుద్ధరణ వనరులతో జీవన మరియు నిర్జీవ వనరులను కలిగి ఉంది. అలాగే, తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థ 4మిలియన్లకు పైగా మత్స్యకారులు మరియు తీర ప్రాంత వర్గాలను కలిగి ఉంది.
ప్రభుత్వం ముసాయిదా బ్లూ ఎకానమీ పాలసీని ఎందుకు రూపొందించింది?
భారతదేశం విస్తారమైన సముద్ర ప్రయోజనాల దృష్ట్యా, భారతదేశ ఆర్థిక వృద్ధిలో నీలి ఆర్థిక వ్యవస్థ కీలకమైన సంభావ్య స్థానాన్ని ఆక్రమించింది.స్థిరత్వం మరియు సామాజిక-ఆర్థిక సంక్షేమం కేంద్రీకృతమై ఉంటే, ఇదిGణూ మరియు శ్రేయస్సు యొక్క తదుపరి శక్తి గుణకం కావచ్చు. అందువల్ల, భారతదేశం యొక్క డ్రాఫ్ట్‌ బ్లూ ఎకానమీ పాలసీ ఆర్థికవృద్ధి,సంక్షేమం కోసం దేశం సామ ర్థ్యాన్ని అన్‌లాక్‌ చేయడానికి కీలకమైన ఫ్రేమ్‌వర్క్‌గా పరిగణించబడుతుంది.
ఈ విధానంలోని ముఖ్య మైన అంశాలు ఏమిటి?
ముసాయిదా విధానం ప్రకారం,జాతీ య వృద్ధికి పదిప్రధాన కోణాలలో నీలిఆర్థిక వ్యవస్థ ఒకటి. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్ర అభివృద్ధిని సాధించడానికి అనేక కీలక రంగాల లోని విధానాలపై ఆధారపడి ఉంటుంది. డ్రాఫ్ట్‌ డాక్యుమెంట్‌ బ్లూ ఎకానమీ మరియు ఓషన్‌ గవర్నె న్స్‌ కోసం నేషనల్‌ అకౌంటింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ వంటి ఏడు నేపథ్య రంగాలపై దృష్టి పెడుతుందిబీ తీర సముద్ర ప్రాదేశిక ప్రణాళిక మరియు పర్యాటకంబీ సముద్ర చేపల పెంపకం,ఆక్వాకల్చర్‌ మరియు చేపల ప్రాసెసింగ్‌ తయారీ, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు,వాణిజ్యం,సాంకేతికత,సేవలు మరియు నైపుణ్యాభివృద్ధి ట్రాన్స్‌షిప్‌మెంట్‌తో సహా లాజిస్టిక్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మరియు షిప్పింగ్‌బీ తీర మరియు లోతైన సముద్ర మైనింగ్‌ మరియు ఆఫ్‌షోర్‌ శక్తిబీ భద్రత,వ్యూహాత్మక కొలతలు.
దేశం ఆర్థిక వ్యవస్థలో ఈభాగాన్ని పూర్తిగా ప్రభా వితం చేసిందా?
వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి నౌకాశ్రయాలు మరియు ఇతర షిప్పింగ్‌ ఆస్తులను నిర్మించడానికి భారతదేశం తన విస్తారమైన తీర ప్రాంతాన్ని నొక్కింది.అయితే దాని సముద్ర వనరుల మొత్తంస్పెక్ట్రమ్‌ ఇంకాపూర్తిగా ఉపయోగించ బడ లేదు. అనేక దేశాలు తమ బ్లూ ఎకానమీని ఉప యోగించుకోవడానికి కార్యక్రమాలు చేపట్టాయి. ఉదాహరణకు,ఆస్ట్రేలియా,బ్రెజిల్‌,యునైటెడ్‌ కింగ్‌ డమ్‌,యునైటెడ్‌ స్టేట్స్‌, రష్యా మరియు నార్వేలు కొలవగల ఫలితాలు మరియు బడ్జెట్‌ కేటాయింపు లతో అంకితమైన జాతీయ సముద్ర విధానాలను అభివృద్ధి చేశాయి.కెనడా,ఆస్ట్రేలియా తమ బ్లూ ఎకానమీ లక్ష్యాల పురోగతి మరియు పర్యవేక్షణను నిర్ధారించడానికి ఫెడరల్‌ మరియు రాష్ట్ర స్థాయి లలో చట్టాన్ని రూపొందించాయి సంస్థ లను స్థాపిం చాయి. డ్రాఫ్ట్‌ బ్లూ ఎకానమీ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌తో, భారతదేశం ఇప్పుడు తన సముద్ర వనరుల యొక్క విస్తారమైన సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉంది.
నీలి ఆర్థిక వ్యవస్థ
నీలి ఆర్థికవ్యవస్థ అనేది మహా సముద్రా లలో వనరులు,ఆస్తుల స్థిరమైన అభివృద్ధి,నదులు, నీటి వనరులు,తీర ప్రాంతాలను అను సంధానం చేయడం,ఈక్విటీ,చేరిక,ఆవిష్కరణ,ఆధునిక సాంకేతి కతపై దృష్టి సారించే విస్తృత శ్రేణి ఆర్థిక కార్యక లాపాలను సూచిస్తుంది. భారతదేశం నీలి ఆర్థిక వ్యవస్థ ఆహార భద్రత,పేదరిక నిర్మూలన,వాతా వరణ మార్పుల ప్రభావాలను తగ్గించడం మరియు స్థితిస్థాపకత, వాణిజ్యం మరియు పెట్టుబడులను పెంపొందించడం, సముద్ర కనెక్టివిటీని మెరుగుపర చడం, వైవిధ్యతను పెంచడం, ఉద్యోగ కల్పన మరియు సామాజిక-ఆర్థికవృద్ధికి దోహదం చేస్తుం ది.కోవిడ్‌-19 మహమ్మారి సవాళ్లను ఎదుర్కొన్న ప్పటికీ ఈ రంగం వృద్ధి చెందింది మరియు ఏప్రిల్‌ 2021-ఫిబ్రవరి2022 నుండి వి7.2బిలియన్ల విలు వైన ఎగుమతులను నమోదు చేసింది. భారత తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థ నాలుగు మిలియన్లకు పైగా మత్స్యకారులను,తీరప్రాంత పట్టణాలను ఆదుకుంటుంది.250,000ఫిషింగ్‌ బోట్‌ల సముదా యంతో భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద చేపలను ఉత్పత్తి చేసే దేశం.భారతదేశంలో, నౌకా నిర్మాణం,షిప్పింగ్‌ కూడా నీలిఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన అంశాలు.కోస్టల్‌ షిప్పింగ్‌ యొక్క ఆర్కిటి పాల్‌ ప్రస్తుతం 6శాతం నుండి 2035 నాటికి 33శాతానికి పెరిగే అవకాశం ఉంది.
నీలి విప్లవం
హిందూ మహాసముద్రం నీలి ఆర్థిక వ్యవస్థ గ్లోబల్‌ఎకానమీ కారిడార్‌గా మారింది. ఎందుకంటే భారతదేశం వ్యూహాత్మ కంగా హార్ముజ్‌ జలసంధి మరియు మలక్కా జలసంధి అని పిలువ బడే రెండు ముఖ్యమైన ప్లగ్‌ పాయింట్ల మధ్య ఉంది.దీని ద్వారావాణిజ్య షిప్పింగ్‌లో ఎక్కువ వాణి జ్యం హిందూ మహాసముద్రంలో కదులుతుంది. నీలి ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం, ఓడరేవు ఆధారిత అభివృద్ధి ప్రణాళికలు, తీరప్రాంత షిప్పింగ్‌లోవృద్ధి,ట్రేడ్‌ ప్రోటోకాల్‌ మార్గాలు, క్రూయిజ్‌ టూరిజం, ఓడరేవు-నేతృత్వంలోని అభి వృద్ధి కోసం ‘సాగర్‌మాల ప్రాజెక్ట్‌’ వంటి వాటిపై దృష్టి సారించడంతో,సముద్ర ట్రాఫిక్‌ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. దేశంలోని మత్స్య రంగం స్థిరమైన,బాధ్యతాయుతమైనఅభివృద్ధి ద్వారా ‘నీలి విప్లవం’ తీసుకురావడానికి భారత ప్రభుత్వం మే 2020లో ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన (ూవీవ్‌ీూ)నిరూ.20,050 కోట్ల బడ్జెట్‌తో ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకారం,2023-24 కేంద్ర బడ్జెట్‌లో, మత్స్యకారుల కార్యకలాపాలను మరింత ప్రారం భించడానికి ూవీవ్‌ీూ కింద ఉప-పథకాన్ని ప్రారంభించడానికి 6,000 కోట్లు కేటాయించారు.
సముద్ర శిధిలాల ముప్పు
అబాండన్డ్‌, లాస్ట్‌ లేదా డిస్కార్డ్‌ ఫిషింగ్‌ గేర్‌ (AూణఖీG) అనేది ప్రపంచవ్యాప్తంగా తగి నంత డేటా లభ్యత కారణంగా తీవ్రమైన ముప్పు. చేపలుపట్టడం లేదాచేపలు పట్టే ప్రమాదాలు చెడు వాతావరణం కారణంగా, భారీ మొత్తంలో ఫిషింగ్‌ నెట్‌ మరియు గేర్లు కోల్పోయి వ్యర్థాలు (ఘోస్ట్‌ నెట్‌) సముద్రంలో ఉంటాయి. వారి జీవితకాల మంతా, వారు సముద్ర జాతులను చంపుతూనే ఉంటారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ప్రకారం మహాసముద్రాలలో20శాతం ప్లాస్టిక్‌ వ్యర్థాలు AూణఖీG రూపంలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా,ఏటా 640,000 టన్నుల ఘోస్ట్‌ గేర్లు మహాసముద్రాలలో పారవేయబడతాయి. భారత దేశంలో174,000 యూనిట్లు ఫిషింగ్‌ గేర్‌లు పని చేస్తున్నాయి. వీటిలో154,008యూనిట్లు గిల్‌నెట్‌లు / డ్రిఫ్ట్‌నెట్‌లు,7,285 యూనిట్లు ట్రాప్‌లు మరియు మిగిలినవి ఫిషింగ్‌ లైన్‌లు.వీటిలో,భారతదేశం ఏటా 15,276 టన్నుల గిల్‌నెట్‌లను కోల్పోతుందని ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ తెలిపింది.
సముద్రపు చెత్తాచెదారం యొక్క ప్రతి కూల ప్రభావం నుండి నీటి దిగువన మరియు సముద్రం పైన ఉన్న జీవితాన్ని రక్షించడానికి, కేంద్ర భూమి మరియు సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ 2022లో ‘‘స్వచ్ఛ్‌ సాగర్‌ సురక్షిత్‌ సాగర్‌’’ ప్రచారం క్రింద తీరప్రాంతక్లీన్‌-అప్‌ డ్రైవ్‌ను ప్రారంభించింది. భారతదేశం ఏటా అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవంలో చురుకుగా పాల్గొంటుంది మరియు తీరప్రాంతాలకు సమీపంలో ఉన్న స్థానిక సంస్థల సహాయంతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది.ఇంకా,భారతదేశం ఇప్పటికే ‘‘నేషనల్‌ మెరైన్‌ లిట్టర్‌ పాలసీ’’ని రూపొందించే మార్గంలో ఉంది.ఇది ‘జీరో వేస్ట్‌’ విధానాలతో స్వచ్ఛమైన నీలిరంగు బీచ్‌లను ఇష్టపడే పర్యాటకం కోసం బ్లూ బీచ్‌ అభివృద్ధిలో నిమగ్నమై ఉంది.-(డా.సి.ఎన్‌.క్షేత్రపాల్‌ రెడ్డి)

1 2 3 4 48