జమిలి ఎన్నికలు

కేంద్ర,రాష్ట్రచట్టసభలకు,ఇంకా అవస రమైతే స్థానిక సంస్థలకు జమిలి ఎన్నికలు నిర్వహిం చాలన్న ఆలోచన పైకి మంచిగానే కనబడుతున్న ప్పటికీ, లోతుగా విశ్లేషిస్తే, ప్రజాస్వామ్య విలువలు, సమాఖ్యస్ఫూర్తికి పమాదం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘ఐదేండ్ల కాలానికి ఎన్నికైన ఏదైనా ప్రభుత్వం మధ్యలో కూలిపోతే ఏమిటి చేయడం? అక్కడ మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే కొత్త ప్రభుత్వం ఐదేండ్ల కాలానికి అధికారం చేపడుతుంది. అప్పుడు ఉమ్మడి ఎన్నికల వ్యవస్థ (జమిలి) లక్ష్యం దెబ్బతిం టుంది.ఇలా జరుగకుండా ఉండాలంటే, కొత్త ప్రభుత్వం కాల పరిమితిని కుదించాల్సి ఉంటుంది. ఇది పజాతీర్పుకు, సమాఖ్యస్ఫూర్తికి, ప్రజా స్వామ్య విలువలకు గొడ్డలి పెట్టులాంటిదే’ అని వాళ్లు వాదిస్తున్నారు.
లా కమిషన్‌ సిఫారసు అలా..
రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం ప్రస్తావన కచ్చితత్వంతో లేదు. లోక్‌సభ విధివిధా నాల్లోని198వ నిబంధనలో మాత్రమే దాన్ని ప్రస్తావించారు. 50 లేదా అంతకంటే ఎక్కువమంది చట్టసభ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్ట వచ్చని నిబంధనలు చెబుతున్నాయి.అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం గద్దె దిగాల్సిఉంటుంది. ఏ వర్గమూ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితిలో లేన ప్పుడు సభను రద్దుచేసి మధ్యంతర ఎన్నికలు జరు పడమే మార్గం. మరి అలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏంచేయాలి? దీనిపై 1999లో లా కమిషన్‌ ఓ సిఫారసు చేసింది. ఈ మేరకు జర్మనీ రాజ్యాంగాన్ని ఉదహరించింది. దాని ప్రకారం.. జర్మనీలో అవిశ్వాస తీర్మానంతో పాటు విశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడతారు. అంటే, ప్రభుత్వం పై అవిశ్వాసం ప్రకటించేవారు ఎవరు నెగ్గుతారో కూడా చెప్పాలి.ఈరెండు తీర్మానాలను సభ ఆమో దించిన తర్వాత అధ్యక్షుడు కొత్త చాన్సలర్‌ను నియ మిస్తారు. ప్రభుత్వాలు మారినా ఐదేండ్లపాటు సభ కొనసాగుతుంది. అయితే, జర్మనీలో అధ్యక్ష పాలన అమల్లో ఉన్నది.మనది ప్రజాస్వామ్య దేశం. దీంతో ఈ సిఫారసును పక్కనబెట్టారు. అవిశ్వాస తీర్మానం తో రాష్ట్రప్రభుత్వాలు కూలిపోతే, జమిలి ఎన్నికల నెపంతో రాష్ట్రపతి పాలన విధించే అవకాశమూలేక పోలేదని..పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఏకకాలంలో ఎలక్షన్స్‌ నిర్వహించాలంటే ఏయే ప్రొసీడిరగ్స్‌ అనుసరించాలి..?
జమిలి ఎన్నికల అంశాన్ని మోదీ సర్కారు విడిచిపెట్టడం లేదు. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిం చాలని బీజేపీ ఏండ్లుగా ప్రతిపాదిస్తూనే ఉన్నది. అయితే, ఇప్పటికే రెండు మూడుసార్లు దీనికి సంబం ధించి ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, కార్య రూపం మాత్రం దాల్చలేదు. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ (జమిలి ఎన్నికలు)సాధ్యాసాధ్యాల పరిశీలన నిమిత్తం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఓకమిటీని ఏర్పాటు చేయడం గమనా ర్హం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు సాధ్యమా? ఒకవేళ ఈ ఎన్నికలు నిర్వహించాలంటే ఏయే ప్రొసీడిరగ్స్‌ను అనుసరించాల్సి ఉంటుందన్న దానిపై పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది.
ఏమిటీ జమిలి ఎన్నికలు?
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ లకు, లోక్‌ సభకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించ డమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం.
గతంలో జరిగినా.. ఆ తర్వాత వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్ని కల నిర్వహణ కొత్తదేమీ కాదు.1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని,1967 వరకు లోక్‌సభకు,రాష్ట్రాల అసెంబ్లీలకు చాలావరకు ఒకే సారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలం లో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్‌ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరుపడం మొదలైంది.
ప్రక్రియ చాలా పెద్దదే
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా రాష్ట్రాల చట్టసభలను గడువు కంటే ముందే రద్దుచేయాల్సి ఉంటుంది. మరికొన్నింటి కాలవ్యవధిని పొడగిం చాల్సిన అవసరమూ ఉండొచ్చు. కాబట్టి, జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే దానికి సంబంధిం చిన బిల్లు తొలుత పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలు జరుగాలంటే దాదా పు ఐదు రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని 2018లో లా కమిషన్‌ అభిప్రాయపడిరది. ఆర్టికల్‌ 356,ఆర్టికల్‌324,ఆర్టికల్‌ 83(2),ఆర్టికల్‌ 172 (1),ఆర్టికల్‌ 83కు సంబంధించి పలు సవరణలకు సూచించింది.
ఆమోదం లభించడం సులభమేమీ కాదు
జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంట్‌ ఉభయ సభలు కనీసం 67శాతం సానుకూల ఓట్ల తో ఆమోదించాల్సి ఉంటుంది. అంతే కాకుండా.. ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యం లో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోద ముద్రవేయాలి. అంటే 543 స్థానాలున్న లోక్‌సభలో కనీసం 67శాతం (362 ఎంపీలు) మంది ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. దీంతోపాటు రాజ్యసభలో 245 సీట్లలో 67శాతం (164 ఎంపీలు) ఈ బిల్లును సమర్థిం చాలి. దీనికి తోడు కనీసం 14రాష్ట్ర అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉన్నది.
ఏ ఆర్టికల్‌/నిబంధన ఏం చెబుతున్నది?
ఆర్టికల్‌ 356: రాష్ట్రాల అసెంబ్లీలను రద్దుచేసే అధికారం కేంద్రానికి ఉన్నది. రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధ యంత్రాంగం విఫలమైనప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్‌ను ఉపయోగించి కేంద్రం ఈ చర్యకు దిగాల్సి ఉంటుంది.ఒకవేళ, వేరే సందర్భంలో చట్ట సభ రద్దుకు నిర్ణయిస్తే,అది రాజ్యాంగ విరుద్ధమే అనిపించుకొంటుంది.
ఆర్టికల్‌ 172 (1): అసెంబ్లీ కాలవ్యవధి ఐదేండ్లుగా కొనసాగుతుంది. అత్యయిక స్థితిలో తప్పించి అసెంబ్లీ కాలవ్యవధిని మరే ఇతర సందర్భాల్లో పొడిగించకూడదు. సభ తొలిసారిగా సమావేశమైన నాటినుంచి కాలపరిమితి మొదలౌతుంది.
ఆర్టికల్‌ 324: రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి,లోక్‌సభ, రాజ్యసభ,శాసనసభ,శాసనమండలి ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయి. సమ యానుసారం,రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఈ ఎన్నికలు జరుగుతాయి.పార్లమెంట్‌,శాసనసభ ఎన్ని కలు ఒకేసారి నిర్వహించాలంటే చట్టసభ కాల వ్యవధిని సహేతుక కారణాలతో సవరించాల్సి ఉంటుంది.
ఆర్టికల్‌ 83(2): ప్రజాతీర్పుతో కొలువుదీరిన లోక్‌ సభ కాలవ్యవధి ఐదేండ్లు. ప్రత్యేక సందర్భాల్లో మినహాయించి దిగువ సభను రద్దు చేయడానికి వీలులేదు.
ఆర్టికల్‌ 83: పెద్దల సభ కాలపరిమితికి సంబం ధించి ఆర్టికల్‌ 83 సూచిస్తుంది. దీంతో పాటు రాజ్యాంగంలోని 2,3చాప్టర్స్‌, పార్ట్‌-15లోని పలు అంశాలను, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలను జమిలి బిల్లు కోసం సవరించాల్సి ఉంటుంది.
దేశంలో జమిలి ఎన్నికలు సాగాయిలా..
2019 15 శాతం
1967 67 శాతం
1951-52 90 శాతం
1957 76 శాతం
ఉభయ సభల్లో ఎన్డీయే బలాబలాలు
ó లోక్‌సభలో ఎన్డీయే బలం 61శాతం
ó జమిలి బిల్లు ఆమోదానికి కావాల్సిన బలం 67 శాతం
ó రాజ్యసభలో ఎన్డీయే బలం 38శాతం
ó జమిలి బిల్లు ఆమోదానికి కావాల్సిన బలం 67 శాతం
ó ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాలు 16శాతం
ó బిల్లు ఆమోదానికి ఎన్ని రాష్ట్రాల ఆమోదం అవసరం 14శాతం
సమైక్య వ్యూహంతో ‘ఇండియా’- జమిలి ఆత్రంలో మోడీ
బిజెపి మత రాజకీయాలనూ కేంద్రం నిరంకుశత్వాన్ని ఓడిరచడానికి మరింత సమిష్టి గానూ సమర్థంగానూ సత్వర వ్యూహాలు రూపొం దించుకోవాలని ప్రతిపక్షాల నాయకులు గుర్తిం చారు. కీలక నేతలందరూ హాజరైనారు కూడా. దేశంలోని 450నియోజక వర్గాలలో బిజెపికి వ్యతి రేకంగా ఒకేఅభ్యర్థిని నిలబెట్టి ఓడిరచాలని అందుకే తొలి అంశంగా నిర్ణయించుకున్నారు. అయితే ఇది విశాల ప్రతిపక్ష వేదిక మాత్రమే గనక వీలైనంత వరకూ కలసి పోటీ చేస్తామని ప్రకటించాయి. అందుకే జాతీయస్థాయి సమావేశంలో గాక రాష్ట్రా ల స్థాయిలోనే సమన్వయ కమిటీల ద్వారా ఎవరు ఎలా పోటీ చేయాలన్నది ఖరారు చేయాలని నిర్ణయించారు.ఆనిర్ణయం వాస్తవికతను ప్రతిబింబి స్తుంది.
కోవింద్‌ కమిటీ గురించి ప్రహ్లాద్‌ చెప్ప డమే గాని ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువ రించలేదు. పైగా రాజ్యాంగం గురించిన చర్చను అనధికార కమిటీ ఎలా చేస్తుంది? ఆ అధికారం పార్లమెంటుకు మాత్రమే వుంది.గతంలో వాజ్‌పేయి హయాంలోనూ రాజ్యాంగ సంస్కర ణలకై జస్టిస్‌ వెంకటాచలయ్య కమిటీని ఇలాగే ఏర్పాటు చేసి తర్వాత… సూచనల కోసం అని వెనక్కు తగ్గారు. ఇప్పుడైనా ఏకపక్షంగా రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయడం చెల్లదు.
2023 జులైలో బెంగళూరులో ప్రతి పక్షాల కూటమి సమావేశమై ‘ఇండియా’గా ముందు కు వస్తున్న తరుణంలోనే కేంద్ర పాలక పక్షమైన బిజెపి హడావుడిగా ఎన్‌డిఎను పునరుద్ధరించి విస్తరించి ఢల్లీిలో సమావేశపర్చింది.26 పార్టీలు ఇక్కడ కలుస్తుంటే అక్కడ ఏకంగా 38పార్టీలు హాజ రైనాయి గాని వాటి సీట్లబలం నామకార్థమని మీడి యా విశ్లేషించింది. తాజాగా ముంబయిలో ఇండి యా సమావేశమవుతుందంటే ఎన్‌డిఎ సమావేశం కాకుండా ఏకంగా పార్లమెంటు ప్రత్యేక సమావే శాలనే పిలవాలని మోడీ ప్రభుత్వం నిర్ణయిం చింది.లౌకిక ప్రతిపక్షాల ఐక్యవేదిక ఏర్పాటు పట్ల ప్రధాని మోడీ ఎంతగా ఉలిక్కిపడుతున్నారో దీన్ని బట్టే చెప్పొచ్చు. నవంబరు, డిసెంబరులో అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలలో తన పరిస్థితి ప్రతికూలంగా వుంటుందని భయపడుతున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం ముందస్తు ఎన్నికలకు వెళ్ల వచ్చుననే సంకేతాలు గతం నుంచి వున్నాయి. కానీ ముంబయి సమావేశ సన్నాహాలు, ప్రతిపక్షాల వ్యూ హాల ఉధృతి చూసిన తర్వాత కేంద్రం దాదాపు ముందస్తును మరింత ముందుకు జరపాలని నిర్ణయించుకోవలసి వచ్చిందని ఇప్పుడు అందరూ భావిస్తున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకూ లోక్‌సభ అమృతోత్సవ్‌ ప్రత్యేక సమావేశాలు జరిపి కీలకమైన బిల్లులు, సవరణలు ఆమోదింప చేసు కోవాలని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు జాతీయ మీడియా ఏకకంఠంతో చెబుతున్నది. ఇందుకు తగినట్టే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నాయకత్వంలో జమిలి ఎన్నికల గురించి అధ్యయ నం చేసేందుకు ఒక కమిటీనే నియమించారు. 2018లో కోవింద్‌ ఆపదవిలో వున్నప్పుడు ఉభ య సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో లోక్‌ సభకూ శాసనసభలకూ ఒకేసారి ఎన్నికలు జరిగితే మంచిదన్న సూచన చేశారు. అంటే కేంద్రం ఆలోచ నను వినిపించారు. ఆయన నాయకత్వంలో కమిటీ ఇక ఏమి చెబుతుందో ఊహించడం కష్టమేమీ కాదు. అసలు రాజ్యాంగ అధినేతగా పనిచేసిన ఒక మాజీ రాష్ట్రపతికి ఈ విధంగా రాజకీయ బాధ్యత అప్పగించడం దేశ రాజకీయాలలో ఇదే తొలిసారి కావచ్చు.
కోవింద్‌ కమిటీ, కోటి కౌటిల్యాలు
ఏమైనా ఈ సమావేశ ప్రభావం అప్పుడే బిజెపిపై పడిరదని సీతారాం ఏచూరి చేసిన వ్యాఖ్య అర్థవంతమైంది. ముంబయి సమావేశం ఒకవైపున ఇంకా జరుగుతుండగానే ఏకకాల ఎన్నికల ముచ్చట ఊపందుకోవడంలో అది కనిపిస్తుంది. పార్లమెం టరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ను కలిశారు. ‘ఇండియా’ అనే పేరు మార్చి భారత్‌నే వాడాలని భగవత్‌ రెండు చోట్ల వేర్వేరు సమావేశాల్లో ప్రవచించారు. ఈ దేశం హిందూ రాష్ట్రమేనని, భారతీయు లందరూ హిందువులేనని మత భాష్యాన్ని మరింత తీవ్రంగా వినిపించారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా కొంత కాలం కిందట భగవత్‌తో సమావేశమైనారని ఇక్కడ గుర్తు చేయాలి. అంటే మోడీ అమిత్‌ షా ఒకవైపు ఎన్‌డిఎ విస్తరణ కోసం తంటాలు పడు తుంటే మరోవైపు మోహన్‌ భగవత్‌ హిందూత్వ మతతత్వ సిద్ధాంతం వ్యాప్తి బీజాలు వేస్తున్నారన్న మాట. కోవింద్‌ కమిటీ గురించి ప్రహ్లాద్‌ చెప్పడమే గాని ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువరించ లేదు. పైగా రాజ్యాంగం గురించిన చర్చను అనధి కార కమిటీ ఎలా చేస్తుంది? ఆ అధికారం పార్ల మెంటుకు మాత్రమే వుంది. గతంలో వాజ్‌పేయి హయాంలోనూ రాజ్యాంగ సంస్కరణలకై జస్టిస్‌ వెంకటాచలయ్య కమిటీని ఇలాగే ఏర్పాటు చేసి తర్వాత…సూచనల కోసం అని వెనక్కు తగ్గారు. ఇప్పుడైనా ఏకపక్షంగా రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయడం చెల్లదు. ఆ అంశాన్ని తెరపైకి తేవడం, ప్రజల్లో అనుకూలత పెంచడం లక్ష్యంగా పెట్టుకు న్నట్టు కనిపిస్తుంది. పార్టీలు, వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలతో ఈ కమిటీ సంప్రదిస్తుందంటున్నారు. కానీ ఇతర పార్టీలు, ప్రభుత్వాలు ఒక అనధికార కమిటీకి సహకరిస్తాయని చెప్పడం కష్టం. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా పదవీ విరమణ తర్వాత మామూలు పౌరుడేనని ఇటీవల జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ స్పష్టంగా చెప్పారు. అధికార లాంఛనాలు కొన్ని వుండవచ్చు గాని మాజీ రాష్ట్రపతి అయినా ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తి ఏమీ వుండదు. ఈ కమిటీ సిఫార్సులు చేసినా వాటిని కేంద్ర క్యాబినెట్‌ తీర్మానం ముందుకు తెస్తారన్న మాట. ఎన్నికల సంఘం కూడా కేంద్రం ఒత్తిడితో గతంలోనే దీనిపై స్పందించింది. ఒకేసారి ఎన్నిక లు జరపగల సత్తావుందని, కాకపోతే అదనంగా సహాయం అవసరమని వెల్లడిరచింది.తన వంతుగా అయిదు సూచనలు చేసింది.1.కొత్త లోక్‌సభ ప్రారంభానికి తేదీ నిర్ణయించాలి.2.అవిశ్వాస తీర్మానం తెచ్చేవారు ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి నాయకత్వం వహించే వ్యక్తి పేరు అందులో సూచించాలి. 3.పదవీ కాలం కొద్దిగానే మిగిలి వుండగా ప్రభుత్వం పడిపోతే రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఎక్కువ వుంటేనే ఎన్నికలు. 4.శాసనసభల విషయంలోనూ ఇదే జరగాలి.5.లేదంటే అన్ని ఎన్నికలకూ నిర్ణీత తేదీలలో జరిగేలా నిర్ణయిం చాలి.
రాజ్యాంగానికే ఎసరు, దేశానికే ప్రమాదం
భారత రాజ్యాంగం ఏకకాల ఎన్నికలు జరగాలని చెప్పడం లేదు. లోక్‌సభ, శాసనసభల నియమ నిబంధనలు కాలపరిమితి అన్నీ వేర్వేరుగా వున్నాయి. మొదటి మూడు ఎన్నికలు కలిసే జరిగా యంటే కాంగ్రెస్‌ గుత్తాధిపత్యమే కారణం, 1967 నుంచి క్రమంగా ఈ పరిస్థితి మారుతూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడం, రద్దు చేయడం, పడిపోవడం చాలా చూశాం. కేంద్రంలోనూ కనీసం మూడు సార్లు ప్రభుత్వాలు ముందే పడిపోయాయి. వాటిపై ఏవో కొత్త షరతులు రుద్దాలనేది ఇక్కడ ఆంతర్యం. అంటే పదవీ కాలం ముగిసినా కొనసా గించడం లేక ఇంకా వున్నా ఎన్నికలకు వెళ్లకుండా పరోక్ష పాలన సాగించడం వంటివి రాజ్యాంగ నిర్దేశానికి విరుద్ధం. అప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అనే మౌలిక సూత్రమే మంటగలిసి పోతుంది. ఎమర్జన్సీలో రాష్ట్రాల శాసనసభల కాల పరిమితిని ఆరేళ్లకు పెంచితే తర్వాత కత్తిరించాల్సి వచ్చింది. వాస్తవానికి శ్రీలంక, బంగ్లాదేశ్‌ వంటి చోట్ల కూడా గతంలో నిరంకుశ ప్రభుత్వాలు పాలనా వ్యవస్థను ఇష్టానుసారం మార్చినా తర్వాత అవి నిలబడలేదు. వి.పి.సింగ్‌ ప్రభుత్వ కూల్చివేత తర్వాత అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్‌ జాతీయ ప్రభుత్వం అంటూ ఒక ప్రహసనం నడిపించి వెనక్కు తగ్గాల్సి వచ్చింది. బిజెపి ఎప్పుడూ అధ్యక్ష తరహా పాలన కోరుకుంటుంది. దేశంలో రాజకీయ సామాజిక బహుళత్వం కారణంగా అది చేయలేక పోయింది. మోడీ హయాంలో దాదాపు ప్రధాని కేంద్రంగా చేయడం అధ్యక్ష తరహా ప్రతిబింబమే. నోట్ల రద్దుతో సహా కీలక నిర్ణయాలు మోడీ ఒక్కరే తీసుకున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి వాటిని కూడా ఎవరితో చర్చించలేదు. ఈ నిర్ణయాలు సుప్రీం కోర్టు సమీక్షలో వుండటమే గాక తీవ్ర ప్రశ్నలకు కారణమవుతున్నాయి. లోక్‌సభ పదవీ కాలానికి సంబంధించిన 83వ అధికరణం రద్దుకు సంబంధించిన 85 అధికరణం, అసెంబ్లీల పదవీ కాలానికి సంబంధించిన 172 రద్దు పైన 174,రాష్ట్రపతి పాలనపై 356 అయిదు రాజ్యాం గ సవరణలు చేయవలసి వుంటుంది. శాశ్వత మార్పులైతే సగం శాసనసభల ఆమోదం కూడా అవసరమవుతుంది.లక్షల కోట్లు బడాబాబుల పరం చేయడమే గాక రాయితీల రూపంలో మరిన్ని లక్షల కోట్లు కట్టబెడుతున్న ఈసర్కారు ఎన్నికల ఖర్చు తగ్గించాలని పొదుపు కబుర్లు చెప్పడం హాస్యా స్పదం. ఇది వాస్తవానికి అధికార దాహం, అప్రజా స్వామిక రాజ్యాంగ కుట్ర. మోహన్‌ భగవత్‌, మోడీల మాటల వెనక వున్న రాజకీయ దురుద్దే శాలు, మతతత్వ వ్యూహాల పట్ల ప్రజల అప్రమత్తత చాలా అవసరం. దురదృష్టమేమంటే తెలుగు రాష్ట్రాలలో రెండు పాలక పార్టీలైన వైసిపి, బిఆర్‌ ఎస్‌, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఏవీ ఈ పోరాటం లో పాలుపంచుకోవడం లేదు, బిజెపికి వత్తాసుగా నిలవడానికే పోటీ పడుతున్నాయి. ‘ఇండియా’ ఈ నిరంకుశత్వాన్ని నిలవరించేందుకు పోరాడటమే గాక ఎన్నికలలోనూ బిజెపి కూటమిని ఓడిరచడం ద్వారా ఆకుటిల ప్రయత్నాలు శాశ్వతంగా అడ్డు కోవడం మరింత ముఖ్యం.
(వ్యాసకర్త : సీనియర్‌ పాత్రికేయులు,న్యూఢల్లీి)-(ఢల్లీి నుంచి ప్రకాశ్‌ యాదవ్‌)

ఐక్యరాజ్యసమితి పేదరికపు అంచనాలు

మనం ఇంతవరకూ గ్రామీణ పేదరికం గురించి చర్చించాం. కరోనా మహమ్మారి విరుచుకు పడకముందు 2019-20లో మన దేశంలో నిరుద్యోగం అప్పటికి 45 ఏళ్ళకు పూర్వం ఏనాడూ లేనంత ఎక్కువ స్థాయికిచేరు కుంది. దీనిని బట్టి మన దేశంలో పేదరికం తగ్గలే దని స్పష్టంగా చెప్పవచ్చు. వాస్తవానికి అది మరింత పెరిగింది.కాని యుఎన్‌డిపి లెక్కలు దాని కి భిన్నంగా చెప్తున్నాయి.కేంద్ర ప్లానింగ్‌ మంత్రి రావుఇంద్రజిత్‌ సింగ్‌రాజ్యసభలో మాట్లాడుతూ ‘మన దేశంలోపేదరికాన్ని అంచనా వేయడానికి 2011-12తర్వాత ఏవిధమైన గణాంకాలూ అందు బాటులో లేవు’అని ప్రకటించారు. అందుచేత ఆ ఏడాది తర్వాత ఎంతమంది పేదరికస్థాయి నుండి బైట పడ్డారో చెప్పలేమని అన్నారు. అయితే ఐక్యరాజ్య సమితికి (ఐరాస) చెందిన యుఎన్‌డిపి (యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం) జులై 18న ఒక ప్రకటన చేసింది. దాని ప్రకారం 2005 నుండి 2019 మధ్య కాలంలో భారతదేశంలో 41 కోట్ల 50లక్షల మంది పేదరికపు స్థాయిని అధిగమిం చారు. కరోనా అనంతర కాలపు పరిస్థితి గురించిన అంచనాలను యుఎన్‌డిపి చెప్పలేదు. కాని అంతకు ముందరి కాలానికి సంబంధించి యుఎన్‌డిపి చెప్పినది విపరీతంగా ప్రచారం అయ్యింది. గొప్పలు చెప్పుకోడానికి అదిదారి తీసింది.కాని, ఇక్కడ గమనించని వాస్తవం ఏమంటే యుఎన్‌డిపి పేదరి కానికి సంబంధించి అంచనాలు వేసే పద్ధతి, అది తీసుకున్న కొలబద్దలు వేరు, మన దేశంలో పేదరి కాన్ని అధ్యయనం చేయడానికి తీసుకునే కొలబద్దలు వేరు. యుఎన్‌డిపి అంచనాలు సైద్ధాం తికంగా సమర్ధించుకోగలిగినవి కావు.ఆ అంచనా లకు రావ డానికి అది ఉపయోగించిన గణాంకాలు కూడా సరైనవి కావు.
మన దేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి ఒక ప్రధానమైన కొలబద్ద పౌష్టికా హారం.అది అందనివారు పేదలుగా పరిగణింప బడతారు.అంతే కాదు. మన జాతీయ శాంపిల్‌ సర్వే చాలా పెద్దది. ఆ సర్వే చాలా పెద్ద సంఖ్యలో ప్రజలను కలిసి వివరాలు సేకరిస్తుంది. ఐతే 2011-12 తర్వాత మన ప్రభుత్వం దగ్గర ఏ గణాంక వివరాలూ లేవని ఎందుకు ప్రకటించారు? ఆ తర్వాత 2017-18 సంవత్సరంలో చేసిన సర్వేలో బైటపడ్డ చేదు వాస్తవాలను వెల్లడిరచే సాహసం కేంద్ర ప్రభుత్వానికి లేకుండాపోయింది. ఆ తర్వాత మోడీ ప్రభుత్వం ఎటువంటి సర్వేనూ చేపట్టనే లేదు.అందుచేత తమ వద్ద 2011-12 తర్వాత వివరాలు లేవంటూ బుకాయిస్తున్నారు.
ఇక యుఎన్‌డిపి సర్వే విధానం చూస్తే అది పూర్తిగా భిన్నమైనది. పేదరికపు అంచనాల కోసం అది తీసుకునే సూచికలు కొన్ని ఉన్నాయి. వాటన్నింటినీ బట్టి ఒకఅంచనాకి వస్తారు. ఉదాహ రణకి: ఒక వ్యక్తి ఎంత ఎత్తు ఉన్నాడు అన్నది కొలిచి దానివర్గాన్ని లెక్కిస్తారు.అలా వచ్చిన అంకెను 18.5తో గుణిస్తారు. అప్పుడు వచ్చిన అంకె కన్నా ఆ వ్యక్తి తక్కువ కిలోల బరువు ఉంటే అతడు పేదవాడిగాలెక్క (ఉదా: ఎత్తు 1.5 మీటర్లు అయితే దాని వర్గం 2.25.దానిని 18.5తో గుణిస్తే 41. 625 కిలోలు వస్తుంది. ఆ వ్యక్తి బరువు అంతకన్నా తక్కువ ఉంటేనే అతడిని పేదవాడుగా గుర్తిస్తారు). ఇంకొక కొలబద్ద: ఆ ఇంట్లో గత ఐదేళ్ళలో 18 సంవత్సరాల వయస్సు లోపు ఉన్నవారు ఎవరైనా మరణించారా? అన్నది. ఇంకొకటి: ఆఇంట్లో 12 ఏళ్ళ వయస్సుకు పైబడిన పిల్లలు ఉంటే వారు కనీసం 6సంవత్సరాల స్కూలు చదువు పూర్తి చేశా రా? లేదా? అన్నది. స్కూలుకు పోయే వయస్సు ఉన్న పిల్లల్లో 8వ తరగతి వరకూ చదవకుండా మధ్యలోనే ఆపివేశారా? అన్నది ఇంకొకటి.
‘ఆధునిక’ సమాజాలుగా పరివర్తన జరు గుతున్న ఏసమాజంలోనైనా పైన తెలిపిన కొల బద్దల ప్రాతిపదికన చూస్తే అభివృద్ధి తప్పనిసరిగా జరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఉదాహరణకి: 18ఏళ్ళ లోపు వయస్సు ఉండే పిల్లల్లో మరణాల రేటు ఆ సమాజాల్లో తగ్గుతూనే వుంటుంది. అదేమాదిరిగా స్కూలుకి పోయే పిల్లల సంఖ్య పెరుగుతూనే వుం టుంది. ముఖ్యంగా మంచి చదువు ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నభావన అప్పో,సప్పో చేసై నా పిల్లల్ని చదివించాలనే తాపత్రయం ఉండే తల్లిదండ్రులు పెరుగుతున్నకొద్దీ స్కూళ్ళకి పోయే పిల్లల సంఖ్య పెరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకం వంటివి కూడా స్కూలు హాజరు రేటును మెరుగుపరుస్తాయి. ఐతే, ఆకుటుంబపు ఆదాయం తగ్గిపోతున్నా,ఈ కొలబద్దలన్నీ అందుకోవచ్చు. ఆకు టుంబం ఇతరత్రా వినియోగించే సరుకుల మొత్తం అంతకంతకూ తగ్గించుకుంటూ బిడ్డల్ని చదివించు కోవడం జరుగుతుంది.అంటే ఆకుటుంబంలో ఒకవైపు పేదరికం పెరుగుతున్నా, యుఎన్‌డిపి కొల బద్దలను బట్టి చూస్తే, ఆ కుటుంబం పేదరికంలో లేనట్టే లెక్క.యుఎన్‌డిపి తన కొలబద్దలు పేదరి కాన్ని బహుముఖంగా పరిశీలించడానికి తోడ్పడతా యని చెప్తుంది. ఈ బహుముఖపు పేదరికం అంటే ఏమిటి?ఈపెట్టుబడిదారీ వ్యవస్థ సమాజపు ఆధునీకరణ ఏవిధంగా జరగాలని కోరుకుం టుం దో ఆదిశకు అనుగుణంగా ఇది ఉంటుంది. మరి ఈ ఆధునీకరణ జరగడానికి మూల్యం ఎవరు చెల్లిస్తున్నారు? శ్రామిక ప్రజలా? లేక సంపన్నులా? యుఎన్‌డిపికి ఈప్రశ్న అసలు ఉదయించదు. ఆధు నీకరణ జరిగిందా లేదా అన్నదే దానికి ముఖ్యం (వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెరిగి కూలీలకు పనులు దక్కకుండా పోయినా అది అభివృద్ధికిందే లెక్క. రెగ్యులర్‌ కార్మికుల స్థానంలో కాంట్రాక్టు కార్మికులను పెట్టుకుని నడిపే పరిశ్ర మలు పెరిగితే అదీ అభివృద్ధి కిందే లెక్క). ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో మన దేశంలో ఈ తరహా ఆధునీకరణ వేగంగా జరుగుతోంది. అందుకే యుఎన్‌డిపి లెక్కల్లో మనదేశంలో పేదరికం తగ్గి నట్టు కనిపిస్తోంది.కాని ఈ ఆధునీకరణకు మూల్యం చెల్లిస్తున్నది శ్రామిక ప్రజలే. వారి వినిమయ శక్తి (లేదా కొనుగోలు శక్తి) పడిపోతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కుటుంబం చేసే ఖర్చులలో ప్రాధాన్యతలు కూడా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఆహారం కోసం చేసే ఖర్చు తగ్గుతోంది. అందువల్ల పేదరికాన్ని అంచనా వేయడానికి ఆ యా కుటుం బాల ఆహారపు పౌష్టిక విలువలను (ఎన్ని క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకుంటున్నారు అన్నది) ప్రాతిపదికగా తీసుకోవడం అవసరం. పేదరికపు తీరు తెన్నులకు అద్దం పట్టే ప్రమాణం ఇదే. అంతే కాదు, కుటుంబపు వాస్తవ ఆదాయం పెరుగుతోం దా లేక తగ్గుతోందా అన్నది కూడా ఈ ప్రమాణాన్ని బట్టి నిర్ధారించగలుగుతాం.రూపాయి లెక్కల్లో ఆదాయం పెరిగినట్టు కనిపించినా, ఆ రూపాయి విలువ నిగ్గు తేల్చేది ఒకానొక కుటుంబం పౌష్టికా హారాన్ని పొందగలుగుతోందా లేదా అన్న పరి శీలనే.ఇటువంటి ముఖ్యమైన కొలబద్ద-పౌష్టికా హారం పొందగలగడం-యుఎన్‌డిపి పెట్టుకున్న ప్రమాణాలలో ఆరో వంతు ప్రాధాన్యత మాత్రమే కలిగివుంది. పైగా పౌష్టికాహార లభ్యతకు వాళ్ళు ఇచ్చే నిర్వచనమే వేరుగా ఉంది. శరీరానికి తగ్గట్టు బరువు ఉందా లేదా అన్నది (బాడీ-మాస్‌ ఇం డెక్స్‌),వారి ప్రమాణం. పౌష్టికాహారం పొందలే నప్పుడే బరువు తగ్గుతుంది. ఒక్కోసారి బరువులో తేడా కనిపించకపోవచ్చు కాని రోగాలబారిన పడే అవకాశాలు పెరుగుతాయి.అంటే శరీరపు బరువును బట్టి పేదరికాన్ని లెక్క వేయడం శాస్త్రీ యం కాదు. నిజానికి పౌష్టికాహారం తీసుకోలేకపోతే ఆ వెంటనే శరీరపు బరువు తగ్గిపోదు. దానికి కొంత కాలం పడుతుంది. అందుచేత యుఎన్‌డిపి పెట్టుకున్న కొలబద్దలకు వాస్తవ పౌష్టికాహార సమస్య దొరకదు. పైగా దీనికి ఆరో వంతు ప్రాధాన్యత మాత్రమే ఇవ్వడంబట్టి యుఎన్‌డిపి దృక్కోణం ఏమిటో తెలుస్తూనే వుంది.యుఎన్‌డిపి ప్రమాణా లకు, మన జాతీయ శాంపిల్‌ సర్వే ప్రమాణాలకు ఎంత తేడా ఉందో తెలియాలంటే ఈ ఉదాహరణ చూడాలి: 2005-2006 నాటికి భారతదేశంలో 64 కోట్ల 50లక్షల మంది పేదలు ఉన్నారని, 2015-16నాటికి ఈ సంఖ్య 37 కోట్లకు పడిపో యిందని యుఎన్‌డిపి లెక్కలు తెలుపుతున్నాయి. అంటే అప్పటికి 27కోట్ల 50లక్షల మంది పేదరికం నుండి బైటపడినట్లు ఔతుంది. అదే జాతీయ శాంపిల్‌ సర్వే 75వ రౌండ్‌ సర్వేలో (2017-18)గ్రామీణ ప్రాంతంలో ప్రజల వినియోగం (అన్ని సరుకుల, సేవలనూ కలుపుకుని) 9శాతం పడిపోయిందని తేల్చింది.(ఈ నిర్ధారణ మోడీ ప్రభుత్వాన్ని ఎంత వణికించిందంటే ఆ గణాంకా లను విడుదల చేసిన కొద్ది గంటలలోపే వాటిని తొలగించివేసి,ప్రజానీకానికి దొరక్కుండా దాచి పెట్టింది. ఆకొద్ది గంటల వ్యవధి లోపలనే కొందరు వ్యక్తుల ఆ గణాంకాలను వీలైన మేరకు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.అప్పటి మీడియాలో కూడా ఆ గణాం కాల ఆధారంగా కొంత చర్చ జరిగింది.) భారత ప్రణాళికా సంఘం మొదట్లో గ్రామీణ ప్రజలకు కనీసం 2200 క్యాలరీల శక్తి రోజుకు ఒక్కొక్కరికి అందాలన్నది ప్రమాణంగా నిర్ణయించింది. ఆ లెక్క చూస్తే 1993-94లో కనీస పౌష్టికాహారం పొంద లేని గ్రామీణులు 58శాతం ఉన్నారు. 2011-12నాటికి వాళ్ళు 68 శాతానికి పెరిగారు. 2017-18 నాటికి వాళ్ళు అమాంతం 77శాతానికి పెరి గారు! కాని యుఎన్‌డిపి లెక్కల్లో మన దేశంలో కోట్లాది మంది పేదరికం లోంచి బైటపడ్డారు!
మనం ఇంతవరకూ గ్రామీణ పేదరికం గురించి చర్చించాం. కరోనా మహమ్మారి విరుచుకు పడకముందు 2019-20లో మన దేశంలో నిరుద్యోగం అప్పటికి 45 ఏళ్ళకు పూర్వం ఏనాడూ లేనంత ఎక్కువ స్థాయికి చేరుకుంది. దీనిని బట్టి మన దేశంలో పేదరికం తగ్గలేదని స్పష్టంగా చెప్ప వచ్చు. వాస్తవానికి అది మరింత పెరిగింది. కాని యుఎన్‌డిపి లెక్కలు దానికి భిన్నంగా చెప్తున్నాయి. యుఎన్‌డిపి పెట్టుకున్న కొలబద్దలను ఇక్కడ మనం విమర్శించడం ప్రధానాంశం కాదు. ఆ కొలబద్దల ఆధారంగా పేదరికం పెరిగిందా లేక తగ్గిందా అన్న నిర్ధారణకు రావడాన్ని మనం విమర్శిస్తున్నాం. దేశంలో పేదరికంపై జరుగుతున్న చర్చ కాస్తా యుఎన్‌డిపి గణాంకాలతో పూర్తిగా దారి తప్పింది. మన దేశం పెట్టుకున్న కొలబద్దలకు, యుఎన్‌డిపి కొలబద్దలకు మధ్య తేడాను గమనించకపోతే చర్చను మళ్ళీ గాడిలో పెట్టడం సాధ్యం కాదు. మొత్తం 121దేశాలకుగాను ప్రపంచ ఆకలి సూచి కలో 107 వస్థానానికి దిగజారిన మన దేశంలో మరోవైపు కోట్లాదిమంది ప్రజలు పేదరిక స్థాయి నుండి బైట పడ్డారని చెప్పుకుంటే దానిని ఏ విధం గా ప్రజలు విశ్వసిస్తారు?.
గ్రామీణ పేదరికం తగ్గుతుంది, కానీ జీవనశైలి సమస్యలు తలెత్తుతున్నాయి
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పైకి చూస్తోంది, అయితే మాదకద్రవ్యాల దుర్వినియోగం, సోషల్‌ మీడియాకు వ్యసనం మరియు వ్యర్థాల తొలగింపు ఆందోళన కలిగించే అంశాలు ఆయోగ్‌ భారతదేశం కోసం నవీకరించబడిన మల్టీడైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌ ని విడుదల చేసింది. ఇది దేశం యొక్క పురోగతిని మూడు సమానమైన పరిమాణాలలో సంగ్రహి స్తుంది-ఆరోగ్యం, విద్య మరియు జీవన ప్రమాణం.పబ్లిక్‌ పాలసీ థింక్‌ ట్యాంక్‌ యొక్క ప్రోగ్రెస్‌ రివ్యూ2023 2015-16 మరియు 2019-21 మధ్య బహుమితీయ పేదరికంలో జనాభా నిష్పత్తిలో 24.85శాతం నుండి 14.96 శాతానికి బాగా తగ్గుముఖం పట్టింది. అంటే 2015-16 మరియు 2019-21 మధ్య దాదాపు 135.5 మిలియన్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు.అదే సమ యంలో పేదరికం తీవ్రత (సాధారణ పరిభాషలో విపరీతమైన పేదరికం) కూడా47.14 శాతం నుంచి 44.39 శాతానికి తగ్గింది. ఇది స్వాగతించే వార్త. ఇతర వాటాదా రులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న వివిధ లక్ష్య అభివృద్ధి కార్యక్ర మాలకు ఆపాదించ బడవచ్చు.
గ్రామీణ ప్రాంతాల్లో ‘పక్కా’ లేదా సెమీ పక్కా ఇళ్ల సంఖ్య అనేక రెట్లు పెరిగింది.
దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర సెల్‌ఫోన్‌ ఉంటుంది, ఎక్కువగా స్మార్ట్‌ ఫోన్లు ఉంటాయి. మోటారుబైక్‌, మరియు సైకిల్‌ కాదు, అత్యంత సాధారణ రవాణా సాధనం.విలేజ్‌ షాపులు వివిధ బ్రాండ్ల వినియోగ వస్తువులతో బాగా నిల్వ చేయ బడతాయి.బాలికలు పాఠశాలలకు వెళుతున్నారు .వ్యవస్థలు మరియు వీడియోగ్రఫీ లేకుండా వివా హాలు జరగవు.ఈ దృశ్యాలు ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ ఖండ్‌ ప్రాం తంలోని ఆకాంక్ష గ్రామాల నుండి వచ్చాయి. నిస్సం దేహంగా,గ్రామీణ ఆర్థిక వ్యవస్థ క్రమంగా మెరుగు పడటం వల్ల ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది.ఈ మార్పులు స్వాగతించదగినవి మరియు 2015-16 మరియు 2019-21 మధ్య గ్రామీణ ప్రాం తాల్లో పేదరికం సంభవం 32.59 శాతం నుండి 19.28 శాతానికి తగ్గిందని సమీక్షలో ఎత్తిచూపిన వాస్తవాలను ధృవీ కరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, వృద్ధి కథనానికి సంబంధించిన ఈ టెల్‌-టేల్‌ సంకే తాలతోపాటు, చర్చలు అవసరమయ్యే కొన్ని ఆందోళ నలు కూడా ఉన్నాయి.
తాళం వేసిన ఇళ్లు
మొదటిది,గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ/అర్బన్‌ ప్రాంతాలకు వలసలు.గ్రామాల చుట్టూ తిరిగితే ఎక్కువ సంఖ్యలో ఇళ్లకు తాళాలు వేసి ఉన్నట్లు తెలుస్తుంది.కార్మికుల కొరత తీవ్రంగా ఉంది కొన్నిసార్లు వ్యవసాయం, ముఖ్యంగా కూరగాయల సాగు దెబ్బతింటుంది.రైతులు వ్యవ సాయంపై ఆసక్తిని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది మరియు ఎక్కువ భూమి ‘లీజు’ అమరిక క్రిందకు వస్తోంది,ఇది తరచుగా తక్కువ పెట్టుబడిని మరియు తక్కువ ఉత్పాదకతను కలిగిస్తుంది. రెండవది, పొగాకు/గుట్కా/మద్యానికి వ్యసనం పెరుగుతోంది.దురదృష్టవశాత్తు, చట్ట బద్ధంగా లేదా చట్టవిరుద్ధంగా మద్యం అందు బాటులో లేని గ్రామాలు ఏవీ లేవు.ఇది ప్రజల పని సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపు తోంది.
మూడవది, ‘ఫోన్‌’కి వ్యసనం.
అన్ని వయసుల వారు తమ రోజులో ఎక్కువ భాగాన్ని వివిధ సోషల్‌ మీడియా యాప్‌ లలో గడుపుతున్నారు. ఇది గ్రామీణ ప్రజల శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీ స్తోంది, గ్రామాల్లో సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీ స్తుంది మరియు మహిళలు మరియు షెడ్యూల్డ్‌ కులాలపై నేరాలకు దారి తీస్తోంది.ఇది వివిధ తప్పుడు ప్రచారాలకు మరియు కొన్ని సమయాల్లో ‘అఫ్వా’ వ్యాప్తికి దారి తీస్తోంది.
మరొక ప్రధాన సమస్య పరిశుభ్రత మరియు పరిశుభ్రత.స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఫలితం గా ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి, అయితే గ్రామాల్లోని సాధారణ ప్రాంతాలలో అపరిశుభ్రత మరియు అపరిశుభ్రత సమస్యగా కొనసాగుతోంది. గ్రామాల్లో చెత్తాచెదారం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.గ్రామాలకు సమీపంలో ఎక్కువ ఉపాధి అవకాశాలు, పొగాకు ఉత్పత్తులు మరియు మద్యం లభ్యతను అరికట్టడం, ఇంటర్నెట్‌లో ఎక్కువ సమ యం గడపడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగా హన ప్రచారాలు మరియు గ్రామ స్థాయిలో వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించి స్వచ్ఛ అభియాన్‌ 2.0 ప్రారంభించడం మార్గం. ముందుకు.
ఆయోగ్‌ అనేది ఈ సమస్యలను పరిష్క రించడానికి క్రియాశీల వాటాదారుల సంప్రదింపు లతో బ్లూప్రింట్‌ను రూపొందించడానికి అవసరమైన ‘ఏజెన్సీ’. సామాజికంగా కూడా ముం దుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది మరియు ఆర్థిక పురోభివృద్ధిని మరింత ఆరోగ్యవంతంగా మరియు అర్థవంతంగా చేయడానికి ప్రజల వ్యక్తిగత జీవనశైలి అంశాలపై పని చేయాలి. (స్వేచ్చా Ûనుసరణ).

రాజకీయాలు`దళితుల దుస్థితి

స్వయం సేవకుల (కార్యకర్తలు) విస్తారమైన నెట్‌వర్క్‌తో ఆర్‌ఎస్‌ఎస్‌, దళిత సమాజంలో ఎన్నికల పునాదిని ఏర్పరుచుకున్నది.దళితుల్ని హిందువులుగాను,ఇతర పార్టీలు ముస్లింలను బుజ్జగించేవిగాను ఎన్నికలకు ముందు ‘ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం’ ప్రచారం చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇదే జరిగింది. ఎన్నికల ఇంటింటి ప్రచారంలో,హిందువుల ప్రయోజనాలు కాపాడే పార్టీ, ముస్లింలను సంతృప్తిపరచని పార్టీ బిజెపి మాత్రమేనని దళితుల్లో ప్రచారం సాగింది.ఈ వ్యూహం ద్వారా ఎస్సీలకు రిజర్వ్‌ అయిన స్థానాల్లో విజయం సాధించింది.
‘సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌’ (అంద రినీ కలుపుకొని అందరి అభివృద్ధి) అని భారతీయ జనతా పార్టీ నినాదమిస్తుంది కానీ సమాజంలో బడుగు బలహీన వర్గాల పరిస్థితి రోజురోజుకూ మరింతగా దిగజారుతున్నది. మెజార్టీ మతవాద రాజకీయాలకు ముస్లింలు ప్రధాన లక్ష్యంగా ఉం డగా,దళితులను అణచివేయడం కూడా అంతే సమానమైన ప్రధాన అంశం.ఓవైపు దళితుల సామా జిక,ఆర్థికపరిస్థితులు దిగజారుతుండడం, మరోవైపు దళితులకు బిజెపి,ఎన్నికలపరంగా దగ్గరవుతున్న విడ్డూర పరిస్థితులు పెరుగుతుండడం చూస్తున్నాం. ఈ ఆధిపత్య రాజకీయాలకు మూల విరాట్టుగా దళితుల్ని హిందూ జాతీయవాద స్రవంతిలోకి చేర్చుకోవాలనిచెప్పే రాష్ట్రీయస్వయం సేవక్‌ సంఫ్న్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)ప్రభావం కూడా పెరుగుతున్నది. పందొమ్మిదవ శతాబ్దం మధ్యకాలంలో హిందూ మతంలో అణచివేతకు గురైన ప్రజల విద్య, ఇతర హక్కుల కోసం పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే ‘దళితుడు’ అనే పదాన్ని రూపొందించాడు. స్వామి వివేకానంద ‘’భారతదేశ భవిష్యత్తు’పై చేసిన ప్రసంగంలో ఆసక్తికరమైన విషయాన్ని పేర్కొన్నారు. ఇంతకు ముందు ఈ వర్గాల ప్రజలు చాలామంది కులవ్యవస్థ అణచి వేత కారణంగా ఇస్లాం మతాన్ని స్వీకరించారని ఆయనన్నారు.సామాజిక సమానత్వం,ఆర్థిక న్యా యం, అందరికీ తాగునీటి బావుల అనుమతి, దేవాలయాల్లోకి ప్రవేశించే హక్కు కోసం బి.ఆర్‌. అంబేద్కర్‌ చేపట్టిన అనేక అవిశ్రాంత పోరాటాల ద్వారా,ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ(1935) స్థాపన ద్వారా కొద్దిగా సానుకూల ఫలితాలు లభిం చాయి. విద్య, ఉద్యోగాలు, ఎన్నిక ల రంగంలో దళితులకు రిజర్వేషన్ల ద్వారా అవకాశాలు కల్పించే నిర్ణయా త్మక చర్యల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దళితుల జీవితాల్లో దీనివల్ల కలిగిన ప్రభావం, కొద్ది మేరకు సంభవించిన మార్పులు నత్తనడకన సాగాయి. గడిచిన కొన్ని దశాబ్దాలలో దళితుల పరిస్థితులు మరీ అధ్వాన్నంగా మారాయి. వివిధ ఆర్థిక, సామాజిక, రాజకీయ సూచికలు ఈ క్షీణిం చిన పరిస్థితుల్ని తెలియజేస్తున్నాయి.‘నేషనల్‌ కొయలేషన్‌ ఆఫ్‌ స్ట్రెందెనింగ్‌ ఎస్సీస్‌ అండ్‌ ఎస్టీస్‌’ నివేదిక ప్రకారం షెడ్యూల్డ్‌ కులాల వారిపై నేరాలు 2021లో1.2 శాతం పెరిగాయి. అదే సంవత్స రంలో ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీలపై అత్యాచారాలు అత్యధికంగా 25.8శాతం నమోదుకాగా,రాజ స్థాన్‌ 14.7శాతం, మధ్యప్రదేశ్‌ 14.1శాతంతో ఆ తరువాతి స్థానాల్ని ఆక్రమించాయి. బిజెపి హిం దూత్వ ఎజెండాతో సమాజాన్ని రెండుగా విభజించ డానికి, అట్టడుగు వర్గాలు ఎదుర్కొంటున్న ప్రధాన మైన సమస్యల్ని పక్క దోవపట్టించేందుకు అస్థిత్వ సమస్యల్ని లేవనెత్తుతున్నది. గోరక్షక దళాలు ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని, మూకదాడులతో మనుషుల ప్రాణాలు తీయడం నిత్యకృత్యమై పోయింది. ఈ ప్రచారాలతో రెచ్చిపోయిన మూకల ఆగ్రహానికి ప్రధానంగా బలవుతున్నది ముస్లిములై నప్పటికీ దళితులు సైతం పెద్ద సంఖ్యలో హత్యగా వించ బడుతున్నారు. ఉనా లో జరిగిన భయానక ఘటన వాస్తవంగా ఏం జరుగుతున్నదో మనకు తెలియచేస్తున్నది. చారిత్రక తప్పిదాలను సరిదిద్ద డానికి దళితులకు రిజర్వేషన్ల కల్పన ఒక సాధ నంగా వున్నమాట నిజమే కానీ, బిజెపి అధికారం చేపట్టిన నాటి నుండి ఇది కూడా దెబ్బతింటున్నది. ఆర్థిక ప్రాతిపదికపై రిజర్వేషన్లను ప్రవేశపెట్టడం ద్వారా వాటి లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగు తున్నది. కేవలం 5 శాతం శ్రామిక దళిత జనాభా మాత్రమే రిజర్వేషన్ల నుండి ప్రయోజనం పొందు తున్నారని సామాజిక శాస్త్రవేత్త, సుఖ్‌దేవ్‌ థోరట్‌ అభిప్రాయపడ్డాడు. అస్పష్టమైన ఆర్థిక ప్రాతిపదికతో దళితేతరులకు రిజర్వేషన్ల కల్పించడంకూడా వారి అవకాశాల అందుబాటును కుదించేస్తుంది. ‘క్రీమీ లేయర్‌’ (మెరుగైన దొంతర)ను ప్రవేశపెట్టడం, కుటుంబాలలో వ్యక్తుల ఆదాయాల్ని కలగాలపు లగం చేయడం రిజర్వేషన్లకు ఒక వర్గాన్ని దూరం చేయడానికి దారి తీస్తుంది. 2018లో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి),అన్ని కళాశాలల్లో 700 ఖాళీలు ఉన్నాయని ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. ఆ సర్క్యులర్‌లో దళిత అభ్యర్థులకు కేవలం 2.5 శాతం పోస్టులు కేటాయించగా, ఎస్టీ అభ్యర్థులకు అసలు ఎలాంటి పోస్ట్‌లు రిజర్వ్‌ కాలేదు. ఇలాంటి చర్యలే ఈవర్గాలను మరింత దుస్థితిలోకి నెడు తున్నాయి.
ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రణాళిక
భారతీయ జనతా పార్టీ ప్రతీ సందర్భం లోను దళితుల హక్కులు, నిబంధనలను నిర్వీర్యం చేసేందకు ప్రయత్నిస్తున్నదని స్పష్టంగా తెలుస్తోంది. ఇది అర్థం కావాలంటే బిజెపి మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్రను,అది ఏ పరిస్థితుల్లో స్థాపించ బడిరదో క్లుప్తంగా తెలుసుకోవాలి. వలస పాలనా కాలంలో భారతదేశంలో సామాజిక సంస్కరణల ప్రక్రియ పుంజుకోవడం, దళితుల్లో విద్యను ప్రోత్స హించడానికి జ్యోతిరావు ఫూలే చేసిన ప్రయత్నాలు, ఆ తరువాత సామాజిక సమానత్వం కోసం అంబే ద్కర్‌ చూపిన చొరవ దళితుల్లో మరింత సామాజిక అవగాహనకు, స్పృహకు దారితీసింది. ఈ అవగా హనే 1920లలో మహారాష్ట్రలోని విదర్భలో’ బ్రాహ్మణేతర ఉద్యమానికి’’బాట వేసింది, ఈ విధమైన మార్పులను అగ్రకులాలకు చెందిన వారికి మింగుడుపడలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపనకు దారితీ సిన కారణాలలో అదీ ఒకటి. హిందూ రాష్ట్ర ఎజెండా ఓవైపు ముస్లింలను, క్రైస్తవులను ‘విదేశీ యులుగా’ పేర్కొంటూనే, మరోవైపున దళితులను బానిసలుగా పరిగణించిన మనుస్మృతి చట్టాల గురించి అదే పనిగా మాట్లాడ్డం మొదలుపెట్టింది. సమాజంలో సమానత్వం కోసం జరిగిన ప్రతి ఉద్యమాన్నీ అగ్రకులాలకు చెందిన వారు వ్యతి రేకించారు.భారత రాజ్యాంగం ఏర్పడినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌,దాని మద్దతుదార్లు రిజర్వేషన్ల నిబంధ నలను తీవ్రంగా వ్యతిరేకించారు.రిజర్వేషన్ల అమలు చేయడం, ప్రభుత్వ రంగంలో విస్త్రతంగా ఉద్యో గాలు కల్పించడంవల్ల దళితులు సామాజిక రంగం లోకి రావడం మొదలైంది.1980లో దళిత సమా జం, సమానత్వం వైపు సాగించిన యాత్రను వ్యతి రేకించడంతోపాటు అహ్మదాబాద్‌లోదళిత వ్యతిరేక హింస కూడా చోటుచేసుకుంది. 1990లో మండల్‌ కమిషన్‌ నివేదికను అమలు చేయడంతో రథ యాత్రకు భారీ ఊపు లభించి,1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసింది. వీటన్నిటి ద్వారా బిజెపికి పెద్దఎత్తున ఎన్నికల్లో పైచేయి సాధించ డానికి మార్గం తెరుచుకుంది. అదే సమయంలో బిజెపి ఆధిపత్య రాజకీయాలు,ఓవైపు దళిత సమా జాన్ని తొక్కిపడుతూనే వారిని సామాజిక, రాజకీయ, ఆర్ధిక స్థాయిలో ఆకర్షించేందుకు పనిచేశాయి. దళితులలో పని చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ‘సామా జిక సామరస్య వేదిక’ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ కుల వ్యవస్థను దెబ్బ తినకుండా ఆ పరిధిలోనే ‘’హిందూ ఐక్యత’’ కాపాడుకోవాలనే సందేశాన్ని చ్చింది. అంబేద్కర్‌ ‘’కుల నిర్మూలనకు’’ విరుద్ధంగా ఈ సంస్థ భిన్న కులాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి దళితుల్లో పని చేసింది. సోషల్‌ ఇంజనీరింగ్‌ ద్వారా దళిత సమాజంలో కొంత భాగాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ తిప్పుకోగలిగింది. దళితుల్ని మంచి చేసుకోవడానికి యు.పిలో సుహే ల్‌దేవ్‌ లాంటి ముఖ్యమైన దళిత వ్యక్తులను తీసుకొచ్చి, ముస్లిం వ్యతిరేకతను కూడా ఎక్కించడం మొదలు పెట్టింది. ఇది ఒక దెబ్బకు రెండు పిట్టలు వ్యవహారమే. దళితులను ప్రసన్నం చేసుకునేందుకు వారి ఇళ్ళలో బిజెపి భోజనాల తంతుతో,వారిలో ఒక వర్గాన్ని ఆకట్టుకుంది. ‘’సంస్కృతీకరణ’’ అనబడే ఈ తతంగం బాగా ప్రచారమైంది. స్వయం సేవ కుల (కార్యకర్తలు) విస్తారమైన నెట్‌వర్క్‌తో ఆర్‌ఎస్‌ ఎస్‌,దళిత సమాజంలో ఎన్నికల పునాదిని ఏర్పరు చుకున్నది. దళితుల్ని హిందువులుగాను, ఇతర పార్టీలు ముస్లింలను బుజ్జగించేవిగాను ఎన్నికలకు ముందు ‘ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం’ ప్రచారం చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇదే జరిగింది. ఎన్నికల ఇంటింటి ప్రచారంలో, హిందువుల ప్రయోజనాలు కాపాడే పార్టీ, ముస్లింలను సంతృప్తిపరచని పార్టీ బిజెపి మాత్రమేనని దళితుల్లో ప్రచారం సాగింది. ఈ వ్యూహం ద్వారా ఎస్సీలకు రిజర్వ్‌ అయిన స్థానాల్లో విజయం సాధించింది. ఇలాంటి వ్యూహాలతో బిజెపి 2014 సాధారణ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ లోని మొత్తం84 సీట్లకు గాను 44 సీట్లను గెలుచు కుంది.
దళిత ముస్లిం సమస్య
ఇస్లాం మతాన్ని స్వీకరించిన దళితు లకు, రిజర్వేషన్లు కల్పించాలా,వద్దా అన్న మరో చర్చ ప్రాధాన్యతను సంతరించుకున్నది. ‘’దళిత ముస్లింలు’’ రెండు రకాల ఆగ్రహాన్ని ఎదుర్కొనాల్సి వస్తుంది.ముస్లింలుగా వారు మతపరమైన హింసను ఎదుర్కొంటున్నారు.దళితులుగా రిజర్వేషన్ల ప్రయో జనాలు పొందలేకపోతున్నారు. ‘ఇస్లాంలో కుల వ్యవస్థ ఉండదు, అందరూ సమానమే అని విశ్వసి స్తారు కాబట్టి వారికి రిజర్వేషన్లను ఎందుకు కల్పిం చాల’ని అనేకమంది దళిత రచయితలు, మేథావులు వాదిస్తున్నారు. ఖురాన్‌లో కుల వ్యవస్థను అనుమ తించలేదని కూడా వారు అంటున్నారు. ప్రముఖ దళిత మేథావులైన దిలీప్‌ మండల్‌, సూరజ్‌ యెంగ్డేలు ముస్లిం దళితులకు రిజర్వేషన్లను వ్యతిరేకి స్తున్నారు. ఇస్లాం పవిత్ర గ్రంథాల ప్రకారం, ఇస్లాం లో కుల వ్యవస్థ లేదు కాబట్టి రిజర్వేషన్ల వర్తింపులో దళిత ముస్లింలను పరిగణలోకి తీసుకోకూడదని వారు వాదిస్తున్నారు. మత గ్రంథాలు చదవడం ద్వారా సమాజాలు నడవవు. సమాజంలోని ఉన్న త వర్గాలు అనేక కారణాలతో అణగారిన వర్గాల స్థితిని నిర్ధారిస్తాయి.ఆవాస్తవం గుర్తించలేక పోవడ మే వారి వాదనలో ఉన్న లోపం. దక్షిణాసియా సమాజాలలో కులం అనేది అన్నిటినీ మించిన వాస్తవం. దీనికి ముస్లింలు కూడా మినహాయింపు కాదు.ముస్లింలకు ఆధునిక విద్యనందించే ఉద్దే శ్యంతో ప్రయత్నాలు ప్రారంభిం చినపుడు కూడా, అందులోని నిమ్న కులాల వృత్తికి ఎలాంటి ఆధునిక విద్య అవసరం లేదనే వాదన వచ్చింది. ఆవాదన తోనే ఆధునిక విద్యను అందిం చడంలో వారిని పరిగణలోకి తీసుకోలేదు.
కనుక మిగిలిన దళితులెంత దళితులో ముస్లిం దళితులు కూడా అంతే. నిర్ణయాత్మకమైన కనీస సానుకూల చర్యల నుండి దళిత ముస్లింలను దూరం చేయడమంటే జనాభాలో ఒక పెద్ద వర్గానికి అన్యాయం చేసినట్టే. అసలు సమస్య ఏమంటే, కేకును ఎక్కువ మంది అడిగినప్పుడు, దాన్ని మరింత పెద్దదిగా చేయాల్సి ఉంటుంది. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ, ఎస్సీ రిజర్వేషన్లను గణనీయంగా తగ్గిస్తున్నది, కాబట్టి సమస్య ఇక్కడే ఉంది. ముస్లింల ఎన్నికల రిజర్వేషన్లు సంబంధించినంతవరకు, ఎన్నికల రంగంలో ముస్లింల ప్రాతినిధ్యం ఇప్పటికే చాలా తక్కువ స్థాయికి, అంటే జనాభాలో వారి ప్రాతినిధ్యం కంటే చాలా తక్కువ స్థాయికి పడిపోయింది. దళిత ముస్లింలకు రిజర్వేషన్లు, ఎన్నికల్లో ముస్లిం రిజర్వేషన్లపై ప్రభావం చూపుతాయని, వారి ఎన్నికల నిబంధనల అవసరాల్ని కూడా పెంచుతాయని కొందరు మేథావులు వాదిస్తున్నారు. దళిత ముస్లింలకు రిజర్వేషన్లు విస్తరించే సందర్భంలో ఎన్నికలకు సంబంధించిన ఈ వాదనను పరిగణలోకి తీసుకోకూడదు.
(వ్యాసకర్త ఐఐటి మాజీ ప్రొఫెసర్‌, సామాజిక కార్యకర్త)(‘ద వైర్‌’ సౌజన్యంతో),- (రామ్‌ పునియానీ)

నిగ్గు తేలని..లేట్‌రైట్‌ క్వారీ అక్రమాలు

అనకాపల్లి,కాకినాడ జిల్లాల సరిహద్దు లను ఆనుకుని నాతవరం మండలం భమిడికలోద్దు లో121హెక్టార్ల విస్తీర్ణంలో లేట్‌రైట్‌ క్వారీ ఉంది. ఈక్వారీ అనుమతుల నుంచి నిర్వహణ వరకు అన్నీ ఉల్లంగనలు చోటు చేసుకున్నట్లు జాతీయ హరిత ట్రైబ్యూనల్‌(ఎన్‌జీటీ)కు ఉమ్మడి విశాఖ జిల్లా దళిత ప్రగతి సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కొండ్రు మరిడియ్య ఏడాదిన్నర క్రితమే ఫిర్యాదు చేశారు.
ఒక ప్రభుత్వం పోయి మరో ప్రభుత్వం వచ్చినా వారి తలరాత మాత్రం మారడం లేదు. పచ్చని అడవులను నాశనం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా అడవుల్లో ఉన్న అపారమైన లేట్‌రైట్‌ మైనిం గ్‌పైన మాఫియా కన్ను పడిరది.ఈ విలువైన ఖని జాన్ని తవ్వేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతు న్నాయి. గిరిజనుల పేరు మీదుగా అనుమతులు పొంది లబ్ధి పొందాలని చూస్తున్నారు. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం సరుగుడు పంచాయితీ పరిధిలో లేట్‌ రైట్‌ ఖనిజం అపారం గా ఉంది. ఈ భూములపై చట్ట పరమైనహక్కులు, రాజ్యాగ పరమైన రక్షణలు ఈపంచాయితీలో నివసించే గిరిజనులకే ఉన్నాయి.ఇక్కడవున్న లేట్‌రైట్‌ తవ్వేందుకే తప్పా గిరిజన చట్టాలఅమలు,వారి సంక్షేమం ఏప్రభుత్వనికి పట్టడం లేదు.అసలు ఈతవ్వకపు అనుమతులు పొందాలంటే పిసా చట్టం ప్రకారం గ్రామసభ అనుమతి,అటవి హక్కుల చట్టం గ్రామ కమిటి అమోదం తప్పని సరిగా ఉండాలి.కానీ, కాంట్రాక్టర్లు అవేమీ పట్టించు కోకుండా బినామీల పేరు మీదుగా ఈ మైనింగ్‌ను తవ్వి ఖజనా నింపుకోవాలని చూస్తున్నారు. అభి వృద్ధి మాటే ఎరుగని గిరిజనులకు మైనింగ్‌ మాఫి యా చుక్కలు చూపిస్తున్నారు. ఎలాంటి అనుమతు లు లేకుండా అడవిని నాశనం చేసే మైనింగ్‌ తవ్వ కాలు జరిపితే తాము ఊరుకోమని ఆదివాసులు తెగేసి చెప్తున్నారు.
నాతవరం మండలం సుందరకోట పంచాయతీ పరిధి భమిడికలొద్దిలో121హెక్టార్ల విస్తీర్ణంలోఏటా10లక్షల క్యూబిక్‌ మీటర్ల లేటరైట్‌ను 15 ఏళ్లపాటు తవ్వుకునేందుకు జర్తా లక్ష్మణరావు అనే గిరిజనుడికి రెండు నెలల క్రితం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాలుష్య నియంత్రణ మండలి అంతకు ముందే ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. తరువాత కేంద్ర అటవీ,పర్యావరణ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేయగా అక్కడ నుంచి అనుమ తులు వచ్చాయి.ఈ మేరకు ఆఘమేఘాలపై లేట రైట్‌ తవ్వకాలు ప్రారంభించారు. అధికారుల లెక్కల మేరకు ఇప్పటివరకు 8,500క్యూబిక్‌ మీటర్ల మేర ఖనిజాన్ని తవ్వి తరలించారు. మైనింగ్‌లో అను భవం వున్న ఒకనిపుణుడిని స్వయంగా లీజుదారుడే నియమించుకున్నారు.అతని పర్యవేక్షణలో లేటరైట్‌ తవ్వకాలు చేస్తున్నారు.ఖనిజాన్ని పక్కనే వున్న కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో జల్దాం వద్ద డంపింగ్‌ యార్డుకు ఏర్పాటు చేశారు.అక్కడ నుంచి ఇతర వాహనాల్లోకి లోడిరగ్‌ చేసి,తూకం వేసిన అనంతరం గమ్యస్థానాలకు రవాణా చేసే వారు.
అత్యాశే కొంప ముంచిందా..!
భమిడికలొద్దిలో జరుగుతున్న లైట్‌రైట్‌ తవ్వాకలను తరలించడానికి మాఫియా మరింత వేగాన్ని పెంచాలని ఆలోచించింది.దీనికి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు,సంబంధిత ఉన్నతాధికారు లను సంప్రదించి వారి కోరికున్నంత ముడిపులు చెల్లించేసింది.భమిడికలొద్దిలో జరుగుతున్న లేటరైట్‌ తవ్వకాలను గనులశాఖ అధికారులుగానీ, ఫారెస్టు, రెవెన్యూశాఖల అధికారులు గానీ ఇక్కడ తవ్వే లైట్‌రైట్‌ ఖనిజాలు ఏశాఖ పరిధిలోకి వస్తాయి.. ఏజిల్లా పరిధిలో ఉంది అనే అంశాలను పరిగణన లోకి తీసుకోలేదు సరికదా మచ్చు కైనా పర్యవేక్షించ లేదు. దీంతో మైనింగ్‌ మాఫియా రెచ్చిపోయి అత్యా శకు పోయింది.అడిగే నాధుడు,ప్రశ్నించే మేథావులు లేక అటూ కాకినాడ జిల్లా,ఇటు అనకాపల్లి జిల్లా సరిహద్దుల్లో ఉన్న దట్టమైన అటవీప్రాంతం మద్య లో నుంచి మైనింగ్‌ మాఫియా విశాలమైన రహ దారి నిర్మాణానికి ఉపక్రమించింది. లైట్‌రైట్‌ తరలింపునకు భమిడికలొద్దు నుంచి కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంక వరకు 28 కిలో మీటర్ల రోడ్డు 30అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మా ణానికి పూనుకున్నారు.రోడ్డు నిర్మాణంలో వేలాది వందేళ్లు వయస్సుగల పచ్చని వృక్షాలు నరికేశారు. అనే పచ్చనిచెట్లు,వనకుమూలకులు నేలమట్టం చేశారు.ఫలితంగా పర్యావరణానికి తీవ్రమైన విఘాతంకలిగించారు.అడ్డొచ్చుని జంతవులు, జీవ రాశులను హతమార్చారు.అంతే కాకుండా రోడ్డు నిర్మాణానికి కాకినాడ జిల్లా ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.60లక్షలు ఖర్చు చేశారు. పైగా గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయం కల్పిస్తు న్నామని,సాగునీటి వనరులను కప్పేశారు. భారీ వాహనాల రాకపోకలతో జీవజాతులు ప్రాణాలకు ముప్పుతెచ్చారు.తాగునీటికి ఆధారమైన ఊటగెడ్డ లను కలుషితం చేశారు. స్థానికులకు అధికార పార్టీనేతల ద్వారా తాయిలాలు ఆశ చూపించి క్వారీ నిర్వహణకు ఆటంకం లేకుండా చేసుకు న్నారు. ఈ లేట్‌రైట్‌ తవ్వకాలపై అప్పట్లోనే కొందరు స్థానికులు అధికారులకు ఫిరార్యదు చేసినా పట్టించు కోలేదు.దీంతో జాతీయ హరిత ట్రైబ్యూనల్‌ను ఆశ్ర యించాల్సి వచ్చింది. గతేడాది కాలంగా విచరణ కొనసాగుతుంది.సంయుక్త కమిటీ నివేదిక ఆధా రంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈనెల 24న ఎన్జీటీలో ఈ కేసు మరలా విచారణకు రానుంది. అప్పటిలోగా కమిటీ నివేదిక అందజేయ డానికి అధికారులు సన్నద్దమవుతున్నారు.
– గునపర్తి సైమన్‌

సమత..గిరిజనులకు చేయూత

ఎకో టూరిజంపై గిరిజన యువతకు శిక్షణ
స్వయం ఉపాధి సాధన దశగా సమత కృషి
సత్‌ ఫలితలిస్తున్న సమత శిక్షణ తరగతులు

గిరిజన ప్రాంతాల్లో పర్యాటక రంగం గణనీయంగా పెరుగు తుంది.గిరిజన ప్రజల్లో కూడా వారి జీవనశైలి,జీనోపాధిలోను మార్పులు సంభ విస్తున్నాయి.ఈనేపథ్యంలో సమత మరో ముందుడు వేసింది.పర్యాటక ప్రదేశాల్లో నివసిస్తూ నిరుద్యోగులుగా ఉంటున్న యువతీ, యవకులకు స్వయం ఉపాధి సాధన దశగా గిరిజన యువతను తీర్చిదిద్దాలని సంకల్పంచింది.అటవీ ప్రాంతాల్లో స్థాని కంగా లభించే వనరులు,అటవీ ఉత్పత్తులను సద్వినియోగం చేసుకుని ఆర్ధికాభివృద్ధి సాధించేందుకు అవసరమైన శిక్షణలు,నైపుణ్యాభివృద్ధికి దోహదపడుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి,అరకు,చింతపల్లి,పాడేరు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా బుర్రాగుహలు, కటికి,సిరియా వంటి జలపాతాలున్న ప్రదేశాలవద్ద గిరిజన ఉత్పత్తులు,వారు తయారు చేసే వస్తువులు,రుచికరమైన వంటకాలను పర్యాటకులకు విక్రయిస్తూ మెరుగైన జీవనోపాధిని పొందడానికి వివిధ రంగాల్లో నిపుణులతో గిరిజన యువతకు శిక్షణ ఇస్తూన్నారు. దీనిపై నైపుణ్యాభివృద్ధి సాధనకు మెరుగైన శిక్షణలు ఇవ్వడానికి సమత కృతనిశ్చయంతో ముందుకు సాగుతుంది. గిరిజన యువత ఆర్థికాభివృద్ధి సాధించాలి ` సమత రవి
గిరిజన యువతలో మార్పు రావాలి.అర్హతలకు తగ్గా ఉద్యోగాలు లభించకపోయినా,అటవీప్రాంతాల్లో లభించే అటవీ ఉత్పత్తులు,పంటలను సద్వినియోగం చేసుకుంటూ స్వయం ఉపాధి సాధించేలా వివిధ రంగాల్లో నిష్టాతులైన నిపుణులతో శిక్షణలు ఇప్పిస్తూగిరిజన యువతకు వివిధ రంగాల్లో శిక్షణనిచ్చి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చర్యలు చేపడుతున్నట్లు సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవి తెలిపారు. ఇప్పటికే కటికి పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇక్కడ యువతకి డ్రైవింగ్‌ స్కూల్లో చేర్పించి నెలరోజులపాటు శిక్షణ ఇప్పించాం.వారికి అవసరమైన డ్రైవింగ్‌ లైస్సెన్సులు సైతం ఇప్పించడం జరిగింది.గిరిజన యువతకు సమత అందిస్తున్న నైపుణ్యాభివృద్ధిశిక్షణలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధిని సాధించా లన్నారు.అంతేకాకుండాపర్యాటక ప్రదేశాల్లో ఎకోటూరిజం అభివృద్ధి,పర్యా వరణ పరిరక్షణ,యువత స్వయం అభివృద్ధిపట్ల ఆదివాసీ యువతకి సమత ఇచ్చిన శిక్షణ తరగతులు సద్వినియోగపర్చుకోవాలన్నారు.యువత వివిధ రంగాల్లో నేర్చుకున్న నైపుణ్యాలను మరింత మెరుగు పర్చుకుని పర్యాటక ప్రాంతాల్లో మార్కెటింగ్‌ చేయాలన్నారు. అలాగే పెరుగుతున్న సోషల్‌ మీడియా రంగం ద్వారా ఇక్కడ ప్రదేశాలు,మీరు తయారు చేసిన అటవీ ఉత్పత్తులు, రుచికరమైన వంటకాలను యూట్యూబ్‌ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలని సూచించారు.
సత్ఫ్‌లితాలిచ్చిన సమత శిక్షణలు
ఆదివాసీ పర్యాటక ప్రాంతమైన బుర్రాగుహలు, కటికి జల పాతం ప్రాంతాల గిరిజన యువతకి కటికి గ్రామంలో సమత వారం రోజుల పాటు యువత స్వయంఉపాధి ఏర్పాటు చేసుకొని,వారి కుటుంబాలు ఆర్ధికంగా అభివృద్ధి చెండడానికి ఉపయోగపడే వివిధ రకాల అంశాలుపై ఈశిక్షణలు పొందారు.సమత కో-ఆర్డినేటర్లు కే.సతీష్‌ కుమార్‌ సమన్వయ కర్తగా వ్యవ హరించారు. హాస్పటాలిటీ మేనేజమెంట్‌ పేరుతో పర్యాటకులకు రుచి కరమైన పౌష్టికాహరాలు తయారీ,(వెదురుబొంగు,నాన్‌ వెజ్‌,వెజ్‌ బిరి యాని,బొంగు చికెన్‌,స్థానికంగా లభించే రాగి,జొన్న,కొర్రలు,సోమలు మొక్కజొన్నలతో రుచి కరమైన స్నేక్స్‌ తయారు చేయడం నేర్పించారు.అలాగే అడవిలో సేకరించే అటవీ ఉత్పత్తులతో (వెదురు,గృహాపకారణాలు,సెల్‌ఫోన్ల కవర్లు,అల్లికలు వంటి అంశాలపై నేర్పించారు. తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్‌ చేసేందుకు నైపుణ్యాల అభివృద్ధి పట్ల కూడా బెంగళూర్‌ నుంచి వచ్చిన నిపుణులు ద్వారా ఈ శిక్షణలు ఇప్పించారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని మెరుగైన జీవలోపాధి సాదించకోవడానికి ఈశిక్షణలు దోహద పడతాయని శిక్షణా నిపుణులు గోపి కృష్ణ తెలిపారు.ముఖ్యంగా పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతలో ఎకో టూరిజాన్ని కూడా అభివృద్ధి చేసి పర్యావరణ పరిరక్షణకు యువత పర్యాట కులను చైతన్య వంతులు కావాలని కోరారు. శిక్షణ కార్యక్రమంలో సమత కో-ఆర్డినేటర్లు కే.సతీష్‌ కుమార్‌,గునపర్తి సైమన్‌, కటికి జలపాతం కమిటీ అధ్యక్షులు మోహన్‌, ట్రైనింగ్‌ టీమ్‌ లీడర్స్‌ గోపి కృష్ణ,బొర్రా పంచాయతీ సర్పంచ్‌ జన్ని అప్పారావు, ఎంపీటీసీ అరుణ నవీన్‌,పెసా కమిటీ ఛైర్మెన్‌ దేవ కుమార్‌,సెక్రటరీ డొనేరు డేనియల్‌రాజకు మార్గే మ్మేలా చిన్నాయ్య అడ్వకేట్‌ సోమేలా రాం బాబు తదితరులు పాల్గొన్నారు. – గునపర్తి సైమన్‌

లౌకిక సౌభ్రాతృత్వం విలువలు తిరిగి వికసించాలి..!

మహాత్మాగాంధీ,నెహ్రూ,భగత్‌సింగ్‌,ఆజాద్‌ వంటి ఎందరో వీరుల నాయకత్వాన సాధించిన స్వాతం త్య్ర ప్రసాదాన్ని అందుకోవడానికి 75ఏండ్ల కింద ప్రారం భమైన పండుగ 1947 ఆగస్టు 15 స్వాతం త్య్ర దినోత్స వం. ఏటా ప్రజా విజయాన్ని, ప్రజాస్వా మ్యాన్ని కీర్తించి నీరాజనాలు ఎత్తుతూ జరుపుకొనే పండుగగా వర్ధిల్లుతూ వస్తున్నది. మూడు వందల ఏండ్లు బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం, నిరంకుశత్వం కింద దారిద్య్రం, దైన్యా లతో ప్రజలు జీవిం చారు. ఆంగ్లే యులు మన దేశాన్ని జయించడానికి, సుదీర్ఘకాలం పాలించడానికి మన జాతి నైతిక పతనం ప్రధాన కారణం. నైతిక పతనం ఎంత సులువో, దాన్ని తిరిగి నెలకొల్పడం చాలా కష్టం. మన దేశంలో మహమ్మా రిలా వ్యాపించి వ్యవస్థీకృతమైన మత మౌఢ్యాలు,ప్రజలను చీలికలు పేలికలుగా చేసిన కుల,వర్ణ వ్యవస్థలు,సాంఘిక దురాచారాలు,నీచ స్వార్థాలతో సింథియా,హోల్కర్లు వంటి కొందరి రాజుల,ఆర్కాట్‌ వంటి నవాబులు అరా చక, భోగ లాలస,వ్యక్తిగత అహంకారాల వల్ల యావత్‌ ఉపఖండం దాస్యంలోకి వెళ్లిపోయింది.
దేశ దాస్యాన్ని అనివార్యం చేసిన నైతిక పతనంలో కూడా అప్పుడప్పుడు తిరుగుబాట్లు చోటు చేసుకున్నాయి.1757ప్ల్లాసీ,ఆంగ్లో-మైసూర్‌ యుద్ధా లు,1800 ఆరంభంలో హిందూ సాధువులు సంప్ర దాయ ఆయుధాలతో నిర్వహించిన సన్యాసి తిరుగు బాటు (ఈ ఉద్యమం ఇతివృత్తంగా బంకించంద్ర ఛటర్జీ‘ఆనందమఠం’అనే నవల రాశారు), 1857లో ప్రజ్వలించిన ప్రథమ స్వాతంత్య్రసంగ్రామం వీటిలో భాగమే.ఈ యుద్ధాల్లో మన ప్రజలనే సైన్యంగా మలచుకొని మన డబ్బుతొనే,మన పాలకులలో కొందరి ధనలోభం, అధికార వ్యామోహం, స్వామి ద్రోహంతో ఆంగ్లేయులు ఈ దేశభక్తియుత యుద్ధా లలో విజయం సాధించారు. ఇవి జాతిలో తీవ్ర నైరాశ్యం, నిస్పృహలను కలిగించాయి. 1900 నుం చి స్వాతంత్య్ర సమరఆకాంక్ష మళ్లీ మొగ్గ తొడి గింది. దీనికి పునాదులు వేసిన వారు సామాజిక సంస్కర్తలు,కవులు,కళాకారులు.వీరి విశేష కృషితో భారతజాతి నైతిక పునరుత్తేజం పొందింది. ఆంగ్లే యుల ఆధిపత్యంలో బానిసలుగా ఉండటం సిగ్గు చేటనే భావన ప్రబలింది. 1880 నుంచి గెలుపోట ములతో నిమిత్తం లేకుండా అలలు అలలుగా, ఉప్పెనగా కొనసాగిన1905,1917,1921,19 29,1942,1947వరకు ప్రజావెల్లువలతో స్వాతంత్య్రం సాకారమైంది.
స్వాతంత్య్ర పాలన తొలినాళ్ళలో వైజ్ఞాని కవేత్త,సోషలిస్ట్‌ నెహ్రూ,సామాజిక విప్లవ నేత అంబే ద్కర్‌ల నేతృత్వంలో ప్రజల ఆకాంక్షలకు అనువైన రాజ్యాంగాన్ని రూపొందించారు. పీడిత ప్రజాకోటి వికాసానికి అనేక రక్షణలు కల్పించారు. ప్రజల మౌలిక ప్రగతికి తోడ్పడే విద్య, వైద్యం,రవాణా, గనులు,శక్తి రంగాలను ప్రభుత్వ ఆధీనంలో ఉం చారు.చెల్లా చెదురైన దేశానికి నిర్దిష్ట రూపం తెచ్చా రు.విద్య,పాలన,ఆర్థిక విషయాల్లో వేల ఏండ్లుగా భాగస్వామ్యానికి నోచుకొనివారికి చోటుదక్కింది, వ్యవసాయ వైజ్ఞానికరంగాల్లో స్వావలంబనతో పాటు అనేక విజయాలు సొంతం చేసుకున్నాం. వేల ఏండ్లుగా భారత సమాజాన్ని అంధకారంలో ఉంచి నమత మౌఢ్యం,విశ్వాసాల ప్రాతిపదికతో ప్రజల ఐక్యతను చీల్చే రాజకీయాలు పురుడు పోసు కొని ప్రస్తుతం మహా విపత్తుగా మారాయి. జాతీయో ద్యమంలో కానీ,సాంఘిక విప్లవాలతో కానీ సంబం ధం లేని శక్తుల పాలనలో ప్రస్తుత జీవన ప్రామా ణికత సూచికల్లో అన్నీఅధమస్థానాలే. సాధించుకున్న అనేక హక్కులను, రాజ్యాంగ వ్యవస్థలను, రక్షణలను బలహీనం చేస్తున్నాయి. సమాఖ్యవ్యవస్థ స్ఫూర్తిని కాలరాస్తూ అప్రజాస్వామిక నియంత ధోరణులు చెలరేగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్వాతం త్య్ర సమరంలో అశేష త్యాగాలు చేసిన లక్షలాది ప్రజల ఆకాంక్షలను తిరిగి నెలకొల్పే బాధ్యతను విద్యా వంతులు,ప్రజాస్వామికవాదులు తీసుకోవాలి. లౌకిక,సౌభ్రాతృత్వ విలువలను తిరిగి వికసింప జేయాలి.
లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ను కాపాడుకుందాం
భయంకరమైన మత విభజనల పెరుగు దలతోపాటు గతంలో లేని విధంగా ప్రజల పౌర హక్కులు,ప్రజాస్వామిక హక్కులపై దాడులు జరుగు తున్నాయి. తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్‌ చేసి నిర్బం ధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్‌ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు…కొంతమంది జర్నలిస్టులు, ఇతరులు అనా గరిక చట్టాల కింద జైల్లో ఉన్నారు.భిన్నాభిప్రా యంతో కూడిన ప్రతీ వ్యక్తీకరణను ‘దేశద్రోహం’ గానే పరిగణిస్తున్నారు.
75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మోడీ ప్రభుత్వం ‘’ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’’గా నామకరణం చేసింది. ఈ సందర్భం, దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసే దృష్టిని సారించే పెద్ద ప్రచారంగా మారింది. దీని కోసం ఖాదీ, కాటన్‌,సిల్క్‌ కానటువంటి పాలిస్టర్‌ జెండాలను కూడా అనుమతించే విధంగా భారతదేశ జెండా కోడ్‌ను డిసెంబర్‌ 2021లో సవరించారు. దేశంలో అత్యంత పెద్ద పాలిస్టర్‌ ఉత్పత్తిదారులెవరో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎంపిక చేయబడిన సన్నిహితులు భారీ లాభాలనుపొందే అవకాశాలను ఇది సమ కూర్చుతుంది. అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రి అయ్యేంతవరకు,ఆరెస్సెస్‌,బీజేపీలు జాతీయ జెండాను ఆవిష్కరించలేదు. కాషాయ జెండాపైనే వారికి విశ్వాసం. ఆరెస్సెస్‌కు భారత స్వాతంత్య్రో ద్యమంలో ఎటువంటి భాగస్వామ్యం లేదు. ఇది చరిత్రకారులు నమోదు చేసిన, ఆనాటి బ్రిటిష్‌ ఇంటి లిజెన్స్‌ నివేదికలు ధృవీకరించిన నిజం.
మహోన్నతమైన పాత్ర
దీనికి భిన్నంగా, భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్క్సిస్ట్‌)కి చెందిన తొమ్మిది మంది వ్యవస్థా పక పొలిట్‌ బ్యూరో సభ్యులందరినీ బ్రిటిష్‌ ప్రభు త్వం అరెస్ట్‌ చేసింది. స్వాతంత్య్ర పోరాట కాలంలో సుదీర్ఘ కాలంపాటు వారంతా జైల్లోనే గడిపారు. అండమాన్‌లోని సెల్యులార్‌ జైల్‌ (కాలాపాని) వద్ద పాలరాతిపై చెక్కబడిన చాలాపేర్లు కమ్యూనిస్ట్‌ విప్ల వోద్యమంతో ముడిపడి ఉన్నాయి. 1947 ఆగస్ట్‌, 15 నాటికి కన్ననూర్‌ జైల్లో ఖైదీగా ఉన్న కామ్రేడ్‌ ఎ.కె.గోపాలన్‌జాతీయ జెండాను ఆవిష్క రించాడు. 1932 హోషియార్‌పూర్‌ కలెక్టరేట్‌లో యూనియన్‌ జెండాను కిందకులాగి, త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన 16 ఏళ్ల హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ను బ్రిటిష్‌ వారు అరెస్ట్‌ చేశారు. కమ్యూనిస్టులకు, సీపీఐ(ఎం)కు దేశ భక్తి, త్యాగనిరతి అనేవి భారతదేశ సోషలిస్టు పరివ ర్తన యొక్క విప్లవ దార్శనికతకు అంతర్భాగంగా ఉంటాయి.1920లో దాని పుట్టుక నుండే కమ్యూ నిస్ట్‌ పార్టీ జాతీయోద్యమ ఎజెండాను ప్రభావితం చేయడం ఆరంభించింది. 1921లో అహ్మదాబాద్‌ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమా వేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ తరపున మౌ లానా హస్రత్‌ మోహాని,స్వామీ కుమారానంద బ్రిటిష్‌ వారినుంచి సంపూర్ణ స్వాతంత్య్రాన్ని డిమాం డ్‌ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ దానిని గాంధీజీ అంగీకరించలేదు (‘సంపూర్ణ స్వరాజ్యం’ పిలుపు 1929లో మాత్రమే ఇచ్చారు). తరువాత 1922లో గయ లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో జాతీయోద్యమ లక్ష్యాలకు సంబంధించిన పత్రాలను పంచింది. ఆతర్వాత జరిగిన ఏఐసీసీ సమావేశా ల్లో కూడాఇది కొనసాగింది.జాతీయోద్యమ ఎజెం డాను ప్రభావితం చేయడంలో కమ్యూనిస్టులు చాలా పెద్ద పాత్రను పోషించారు.1940లలో దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులు వివిధ ప్రాంతాలలో చేపట్టిన భూపోరాటాలు స్వాతంత్య్ర సాధనలో కీలకమైనవి.కేరళ లోని పున్నప్ర వాయలార్‌, బెంగా ల్‌ లోని తెభాగపోరాటం, అస్సాంలో సుర్మా వ్యాలీ పోరాటం, మహారాష్ట్రలో వర్లీ ఆదివాసీ పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వీటిలో ముఖ్యమైనవి.భారతదేశంలోని భాషాపరమైన భిన్న త్వాన్ని కమ్యూనిస్టులు సమర్థించారు. దేశంలోని వివిధ భాషలు మాట్లాడే వారిని స్వాతంత్య్ర పోరా టంతో ఐక్యంచేయడంతో,స్వతంత్ర భారత దేశంలో భాషాపరమైన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు దారి తీసింది.లౌకికవాదంపట్ల కమ్యూనిస్టులకుండే అచం చలమైన నిబద్ధత, స్వాతంత్య్ర పోరాట కాలంలో చెలరేగిన మత ఘర్షణల్లో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పి,నిలబెట్టడంలో చాలా ప్రధాన పాత్రను పోషించింది. కమ్యూనిస్టులు నేటికీ లౌకికవాదానికి అత్యంత నిబద్ధత కలిగిన సమర్థకులుగా ఉన్నారు.
చరిత్ర వక్రీకరణ
కానీ,నేడు తమను తాము స్వాతంత్య్రో ద్యమ పోరాటంలో భాగస్వాములమని తప్పుడు ప్రచారం చేసుకోవడం ద్వారా ఆరెస్సెస్‌, బీజేపీలు చరిత్రను వక్రీకరించి,చరిత్రను తిరగ రాసే ప్రయ త్నం చేస్తున్నాయి. హిందూత్వ, ఆరెస్సెస్‌ నాయకులు స్వాతంత్య్ర సమర యోధులని చిత్రీకరిస్తూ ప్రభుత్వం ప్రచారాన్ని చేపట్టింది. ఈప్రచారంలో ఉదహరిం చబడిన వారిలో వీడీ సావర్కర్‌ ముందున్నాడు. హిందూ మతాచారంతో సంబంధం లేని రాజకీయ లక్ష్యాలు గల ‘హిందూత్వ’ అనే పదాన్ని 1923లో కనుగొన్నది వి.డి.సావర్కర్‌. ఒక ప్రత్యేక ముస్లిం దేశం కోసం మహ్మదాలీ జిన్నా పోరాటానికి నాయ కత్వం వహించడానికి రెండు సంవత్సరాల ముందే సావర్కర్‌ ద్విజాతి సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చా డు.దానిని బ్రిటిష్‌ వారు ప్రోత్సహించాడు.ఆ తర్వా త విషాదకరంగా దేశ విభజన జరిగింది. బ్రిటిష్‌ పాలకులతో సంధి కుదిరిన తరువాత సావర్కర్‌, తనరాజకీయ జీవితంలో ఎక్కు వ భాగం, కాంగ్రెస్‌, వామపక్షాల నేతృత్వం లోని ఉద్యమాలకు వ్యతిరేకం గానే ఉన్నాడు. హిందూ మహాసభ నాయకునిగా, 1942లో జరిగిన క్విట్‌ ఇండియా లాంటి ఉద్య మాలలో హిందూ మహా సభ, ఆరెస్సెస్‌ సభ్యుల భాగస్వామ్యం లేకుండా చూశాడు. వాస్తవాలన్నిటిని మరుగునపెట్టి వారు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. కమ్యూ నిస్టుల విషయం పక్కన పెట్టండి, ప్రభుత్వ ప్రచారా లలో జవహర్‌ లాల్‌ నెహ్రూ గురించి కూడా ఎక్కడా ప్రస్తావిం చడం లేదు.భారత రాజ్యాంగం, స్వాతంత్య్ర భారత దేశం ఒకఆధునిక లౌకిక ప్రజా స్వామిక రిపబ్లిక్‌గా రూపొందేందుకు దారి తీసిన అనేక చర్చలు, తీర్మా నాలకు దారి చూపిన వ్యక్తి నెహ్రూ. ఈ విషయాన్ని మరుగుపరిచి బీజేపీ తన ఫాసిస్ట్‌ హిందూత్వ రాజ్యం ఆలోచనను నిజం చేసే చర్యలను ముందుకు తీసు కొనిపోతోంది.
భారత రాజ్యాంగంపై దాడి
ఈఫాసిస్ట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతం కావాలంటే, మన రాజ్యాంగం కల్పించిన భారత రిపబ్లిక్‌ యొక్క లౌకిక ప్రజాస్వామిక లక్షణం పైన దాడి చేసి, బలహీనపరచి, నాశనం చేయాల్సి ఉంది. తదనుగుణంగానే 2019లో మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన నాటి నుండి…మన రాజ్యాంగానికి నాలుగు మూల స్తంభాలైన లౌకిక ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, సామాజిక న్యాయం, ఆర్థిక సార్వభౌమత్వాలు తీవ్రమైన దాడికి గురవు తున్నాయి. చర్చలులేని తీరుతో పార్లమెంట్‌ సాంప్ర దాయాలను తుంగలో తొక్కుతున్నారు. ఏ విధమైన చర్చలు లేకుండానే కేవలం మంద బలంతో చట్టా లను ఆమోదింపజేసు కుంటున్నారు. ప్రస్తుత పార్ల మెంట్‌ సమావేశాల్లో, ఆకాశాన్నంటే ధరలు, పెరిగి పోతున్న నిరుద్యోగం లాంటి ప్రజలెదుర్కొం టున్న సమస్యలపై చర్చ జరపాలని డిమాండ్‌ చేసిన నేరా నికి గతంలో ఏనాడూలేని విధంగా27మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారు. పని చేయని పార్ల మెంట్‌ చాలా ప్రమాదకరం.అంటే భారత రాజ్యాం గం యొక్క ప్రాముఖ్యత, ప్రజల సార్వభౌ మత్వం, ప్రజలకు జవాబుదారీగా ఉండే ఎంపీల అధికారం, పార్లమెంట్‌కు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం లేకుండాపోవడం.పార్లమెంట్‌ను బలహీనపర్చ డమంటే, ప్రజల సార్వభౌమత్వాన్ని రద్దు చేయడం, ప్రభుత్వం జవాబుదారీతనం నుండి తప్పించుకొని, ఫాసిస్ట్‌ విధానాలను అవలంబిస్తూ నిరంకుశత్వం వైపు వెళ్లడం.దాదాపు మూడేళ్లుగా ఆర్టికల్‌ 370,ఆర్టికల్‌ 35ఏ రద్దు సవాళ్లు, సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం),రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేసే ఎన్నికలబాండ్లు మనరాజ్యాంగాన్ని ఉల్లం ఘించే అంశాలుగా మారాయి. ఇవేవీ సుప్రీం కోర్టుకు వినిపించవు. న్యాయ వ్యవస్థ యొక్క నిష్పా క్షికత,స్వతంత్రత తీవ్రంగా రాజీ పడినప్పుడు, రాజ్యాంగ నిబంధనల అమలు,ప్రజాస్వామిక హక్కు ల హామీలు,పౌర హక్కులపై విచారణ ఉనికిలో లేకుండా నిలిచిపోతుంది.అదేవిధంగా,ఒక ఆరోగ్య కరమైన ప్రజాస్వామ్యంలో అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తూ, స్వేచ్ఛాయుత వాతావర ణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిష న్‌ స్వతంత్రత, నిష్పాక్షికత చాలా ముఖ్యమైనవి. ఇది రాజీ పడినప్పుడు కూడా ప్రభుత్వాలు ఇంకే మాత్రం ప్రజల తీర్పును, ప్రజాస్వామిక అభిప్రాయా లను ప్రతిబింబించవు. సీబీఐ,ఇ.డిమోడీ ప్రభుత్వ రాజ కీయ ఎజెండాను అమలు చేయడానికి సాధనా లుగా మారిన తీరును దేశమంతా గమనిస్తున్నది. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడం, ప్రజా స్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిర పరచడం,ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైన ప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలగడానికి గల హామీకై పార్టీ ఫిరాయింపుల కోసం ఒత్తిడి చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, దానిని నాశనం చేస్తున్నారు.
తీవ్రమైన మత విభజనలు
ఇలా భారీగా రాజ్యాంగ క్రమాన్ని నాశ నం చేయడంతో పాటు భారతరిపబ్లిక్‌ లౌకిక ప్రజా స్వామిక లక్షణాన్ని నాశనం చేయడానికి విషపూరిత మైనద్వేషం,భయాల వ్యాప్తిపై ఆధారపడి క్రూరమైన రీతిలో మత విభజనల ప్రచారం జరుగుతున్నది. పెద్ద ఎత్తున ‘బుల్డోజర్‌ రాజకీయాల’ వ్యూహ రచన, కొన్ని రాష్ట్రాల్లో హింసకు దారితీసే రీతిలో మైనా రిటీలను లక్ష్యంగా చేసుకోవడం, పార్లమెంట్‌ నూతన భవనంపైన జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించే సంద ర్భంలో హిందూ మతాచారాలను ఆచరించడం లాంటి చర్యలు భారతరాజ్యాన్ని,ప్రభుత్వాన్ని హిం దూత్వతో గుర్తిస్తున్నారు కానీ భారత రాజ్యాంగంతో కాదని స్పష్టం చేస్తున్నాయి.ఇలాంటి భయంకరమైన మత విభ జనల పెరుగుదలతో పాటు గతంలోలేని విధంగా ప్రజల పౌరహక్కులు,ప్రజాస్వామిక హక్కు లపై దాడులు జరుగుతున్నాయి.తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్‌ చేసి నిర్బంధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్‌ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు…కొంతమంది జర్నలిస్టులు, ఇత రులు అనాగరిక చట్టాల కింద జైల్లో ఉన్నారు. భిన్నాభి ప్రాయంతో కూడిన ప్రతీ వ్యక్తీకరణను ‘దేశద్రోహం’ గానే పరిగణిస్తున్నారు.ఈ హిందూత్వ కథనం విజయవంతం కావాలంటే,ఈ ఫాసిస్ట్‌ ప్రాజెక్ట్‌ లోని సిద్ధాంతం కొనసాగడానికి భారతదేశ చరిత్రను తిరగ రాయా ల్సిన అవసరం ఉంటుంది. అందుకే విద్యా విధానంలో మార్పులు చేస్తున్నారు. వివేచనా రహిత ఆలోచనలను ప్రచారంచేస్తు న్నా రు.హేతుబద్ధత స్థానాన్ని మార్చేప్రయత్నం చేస్తు న్నారు.గుడ్డివిశ్వాసాలను ప్రచారం చేస్తూ, శాస్త్రీయ తను కాదని పురాణాలను ప్రచారం చేస్తు న్నారు. చరిత్రస్థానంలో హిందూ పురాణాలను, తత్వ శాస్త్రం స్థానంలో హిందూ ధర్మశాస్త్రాన్ని తీసు కొని రావడంద్వారా భారతదేశం యొక్క గొప్ప వైవిధ్యాన్ని, బహుళత్వాన్ని నాశనం చేస్తున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆకలి, పౌష్టికాహార లోపం లాంటి రోజువారీ సమస్యలపై ప్రజా పోరా టాలను, ప్రతిఘటనలను పెంచడం ద్వారా భారత దేశం లౌకిక ప్రజాస్వామిక రాజ్యాం గాన్ని రక్షించి, బలోపేతం చేసే బాధ్యతను తీసు కోవాలి. ప్రజా స్వామ్యం,ప్రజాస్వామిక హక్కులు,పౌర హక్కులు, లౌకికవాదాల రక్షణకై పోరాటా లను ఉధృతం చేయాలి. బలమైన ప్రజా పోరాటా లను ఉధృతం చేయడం ద్వారా సీపీఐ(ఎం) స్వతంత్ర బలాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం. వామపక్ష శక్తుల ఐక్యతను సంఘటిత పరచడం, వామపక్ష ప్రజా తంత్ర శక్తుల్ని ఏకం చేయడం, హిందూత్వ మతో న్మాదానికి వ్యతిరేకంగా విశాల ప్రాతిపదికన లౌకిక శక్తులను సిద్ధం చేయడం ద్వారానే 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మన లౌకిక ప్రజాస్వామిక రిపబ్లిక్‌ రాజ్యాంగాన్ని రక్షించు కోగలం.ఈలక్ష్యాన్ని నిజం చేసే మన దేశభక్తి తోనే ఆగస్ట్‌ 15న అన్ని పార్టీ కార్యాలయాల్లో జాతీ య జెండాను ఆవిష్కరించి, మనరాజ్యాంగంలోని పీఠిక పై ప్రతిజ్ఞ చేశామని గుర్తుంచుకోవాలి.ఈఉన్మాద పూరిత,ఫాసిస్టు ప్రయ త్నాల నుండి స్వేచ్ఛకోసం, మనలౌకిక ప్రజాస్వామికరిపబ్లిక్‌నుకాపాడు కోవడం కోసం జరిగే పోరాటాన్ని బలపరుచు కుందాం!
భయంకరమైన మత విభజనల పెరుగు దలతో పాటు గతంలో లేనివిధంగా ప్రజల పౌర హక్కులు,ప్రజాస్వామిక హక్కులపై దాడులు జరుగు తున్నాయి. తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్‌ చేసి నిర్బం ధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్‌ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు..కొంతమంది జర్నలిస్టులు,ఇతరులు అనా గరిక చట్టాలకింద జైల్లోఉన్నారు. భిన్నాబి óప్రాయం తో కూడిన ప్రతీవ్యక్తీకరణను ‘దేశద్రోహం’గానే పరిగణిస్తున్నారు. (ప్రజాశక్తి సౌజన్యంతో) –(అస్నాల శ్రీనివాస్‌ / సీతారాం ఏచూరి)

జనగణనలో ఆదివాసీల మతమేమిటీ?

ఈ దేశంలోని 12 కోట్ల మంది ఆది వాసీలకు విలక్షణ మత అస్తిత్వం ఉన్నది. వారిని హిందు వులు లేదా ఇతర ప్రధాన స్రవంతికి చెందిన ఇతర మతాల వారిగా పరిగణించడం సబబు కాదు. 2021 జనాభా గణన ప్రక్రియలో ఆదివాసీ లను వారి సొంత మతాలకు చెందినవారుగా మాత్రమే నమోదు చేయాలి. ఈదేశంలో ఆదివాసీలకు సరైన గుర్తింపు ఉందా? కొత్త సంవత్సరం (2021)లో దేశ జనాభా గణన ప్రక్రియ మొదలవనున్నది. ఆదివాసీలను ఏ మతా నికి చెందిన వారుగా నమోదు చేయనున్నారు? ఈ విషయమై ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. నిజానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో ఆదివాసీలకు సముచిత గుర్తింపు లభించింది. అయితే అది ఎంతో కాలం కొన సాగలేదు.
భారతదేశ జనాభాలో ఆదివాసీల సంఖ్య12 కోట్లు. వీరి మతమేమిటి?ఆదివాసీ సమూహాలు అనుసరిస్తున్న మతంపై సుదీర్ఘకాలంగా చర్చ జరుగుతోంది. జనాభా గణనలోనూ లేదా అటువంటి ఇతర గణనల్లోనూ ఆదివాసీ మతాలలో ఒకదాన్ని ఎంపిక చేసుకునేందుకు తమకు హక్కు కల్పించాలని ఆదివాసీలు డిమాండ్‌ చేస్తున్నారు. స్వతంత్ర భారతదేశ తొలి జనాభా గణన ప్రక్రియలో ‘మతం’కాలమ్‌లో‘ట్రైబ్‌’ అనేది తొమ్మిదో గుర్తింపులో ఉండేది. ఆదివాసీలు అంద రూ తమ మతాన్ని ‘ట్రైబ్‌’గా పేర్కొనేవారు. తరువాత ఈ ఆప్షన్‌ను తొలగించారు. ఫలితంగా ఆదివాసీలు వివిధ మతాలకు చెందిన వారుగా నమోదవు తున్నారు. ఇది తమ ఆత్మగౌరవాన్ని కించపరు స్తోందని ఆదివాసీలు వాపోతున్నారు. ఇప్పుడు జనాభా గణనలో ఆరు మతాలు-హిందూ, ముస్లిం, క్రైస్తవ,బౌద్ధ,జైన,సిక్కులకు మాత్రమే గుర్తింపు ఉంది.2011కి పూర్వం ఈ ఆరు మతాలతో పాటు ‘అదర్స్‌’(ఇతరులు) అనే ఆప్షన్‌ ఉండేది. ఆదివాసీలు ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకునేవారు.ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. జనాభా గణన ప్రారంభమయిన 1871 మొదలు 1931దాకా ఆదివాసీలు తమ మతాన్ని ఆదివాసీమతంగా నమోదు చేసేవారు.స్వతంత్ర భారతదేశంలో ముఖ్యంగా 1961 నుంచి ఆ అవకాశం లేకుండా పోయింది. హిందువులుగా, క్రైస్తవులుగా, ఇంకా ఇతర మతాలవారుగాఆదివాసీలను నమోదు చేయ డం జరుగుతోంది.‘ఆదివాసీ మతం’ అనే ఆప్షన్‌ను తొలగించడమంటే తమను మతపరమైన బానిసలు గా పరిగణించడం కాదా అని పలువురు ఆదివా సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ సువిశాల దేశంలోని ఆదివాసీలు మొత్తం83 మతా చరణలను అనుసరిస్తున్నారు. విశ్వాసాలు, ఆచారా లు, ఆరాధించే దేవతలు, ఆరాధనా పద్ధతు లు మొదలైనవి భిన్నమైనవి అయినప్పటికీ తమకు మత పరంగా ఒక నిర్దిష్ట గుర్తింపు కోసం ఆదివాసీలు సహజంగా ఆరాటపడుతున్నారు. ప్రధాన స్రవంతి మతాలకు చెందినవారుగా గుర్తింపు పొందడానికి వారు నిరాకరిస్తున్నారు. ఈ సందర్భంగా జార్ఖండ్‌ శాసనసభ తీసుకున్న ఒక నిర్ణయాన్ని ప్రస్తావించ వలసి ఉంది.ఆరాష్ట్రంలోఅత్యధిక సంఖ్యలో ఉన్న శర్ణ ఆదివాసీల మతానికిగుర్తింపు నివ్వాలని, 20 21 జనాభా గణనలో ఆ మతానికి ఒక ప్రత్యేక గుర్తింపు క్రమసంఖ్య నివ్వాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ జార్ఖండ్‌ శాసనసభ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది.శర్ణ ఆదివాసీలకు గుర్తింపు విషయమై ఆరాష్ట్ర ముఖ్యమంత్రి హేమం త్‌ సోరేన్‌ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ విషయమై ఆయన ఇప్పటికే కేంద్రప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశారు. జార్ఖండ్‌ శాసనసభ తీర్మానం దేశవ్యా ప్తంగా ఆదివాసీల అస్తిత్వానికి జీవం పోసింద నడంలో సందేహం లేదు. మతపరంగా జాతీయ స్థాయిలో ఒక నిర్దిష్ట గుర్తింపు కోసం ఆదివాసీలు సమైక్యమయ్యేందుకు జార్ఖండ్‌ అసెంబ్లీ తీర్మానం విశేష ప్రేరణ నిచ్చిందనడంలో సందేహం లేదు. ఆదివాసీలను దశాబ్దాలుగా హిందు వులు లేదా ప్రధాన స్రవంతికి చెందిన ఇతర మతాలవారుగా ఎందుకు పరిగణిస్తున్నారు? ఇన్నేళ్లుగా ఆదివాసీలకు మతపరమైన నిర్దిష్ట గుర్తింపు లేకుండా ఎందుకు చేశారు? ఈ దేశంలో ఆదివాసీల అస్తిత్వం మూలాలు ఏమిటి? అనే దానిపై చర్చ జరగడం శ్రేయస్కరం. ఇటువంటి చర్చ జరగని పక్షంలో ఈ దేశ సామాజిక వాతావ రణంలో ఒక స్పష్టమైన మార్పు రావడం అసంభవం అనేది నేడు దేశహితులు అందరూ గుర్తించవలసిన వాస్తవం. నాగరికత ఆనవాళ్ళు అనేవి నవీన శిలా యుగంలో ప్రారంభమయ్యాయి. తమ జీవన ప్రస్థా నాన్ని ముందు తరాల వారికి తెలియజేయాలనే ఆలోచన ఈయుగ మానవులకు వచ్చింది. ఈ విష యమై వారి కార్యాచరణ అద్భుతమైనది. చిత్రాల రూపంలో బండరాయిపై చెట్లరసంతో ముదురు ఎరుపురంగు బొమ్మలు వేయడం ఆ కార్యాచరణలో భాగమే. అటువంటి బొమ్మలు నేడు ఆదివాసీలు నివసించే దట్టమైన అటవీ ప్రాంతాలలో, కొండ గుహలలో కానవస్తున్నాయి. పలువురి పరిశో ధనల్లో ఆబొమ్మలు ఆదివాసీల జీవనంలో భాగమైన పడగలలోని చిత్రలిపి, మౌఖిక సాహిత్యంలో ఉన్నవని నిర్ధారణ అయింది. నవీన శిలాయుగ మాన వులు తమ అస్తిత్వాన్ని చిత్రాల రూపంలో చాటిన మొదటి ఆదివాసీలు. ఆనాటి నుంచి నేటిదాకా ఆదివాసీల జీవనం అడవిలోనే సాగుతోందనడానికి ఇవి తిరుగులేని చారిత్రక ఆనవాళ్లు.
నవీన శిలాయుగంలోనే వ్యవసాయం అంకురించింది.ఆతర్వాత మనిషిని మరింత పరి పూర్ణంగా తీర్చిదిద్దిన నాగరికత సింధు నాగరికత. సింధు నాగరికతతో ఆదివాసీలు ఒక పరిపూర్ణ నాగరికత నిర్మించారని చెప్పవచ్చు.సింధు నాగరిక తలో ఉన్న చిత్రలిపి నేటి ఆదివాసి జీవనంలో సజీవంగా ఉంది. నేటి గోండ్వానా ప్రజల జీవన చిత్రాలు, వేషధారణ కూడా సింధు నాగరికత ఆదివాసి నాగరికతే అని దృష్టాంతీకరిస్తున్నాయి. గోండ్వానా జీవనంలో ప్రాచీన శిలాయుగంలో బండరాళ్ళపై చిత్రలిపి వేసిన ఆదివాసీలు నవీన శిలాయుగంలో దానిని పెద్ద పెద్ద వృక్షాల దారు వుపై వేశారు.సింధు నాగరికత నాటికి ఎర్రని గుడ్డపై చెట్లరసంతో బొమ్మలు వేసి పడిగెల రూపం లో వంశవృక్షాలలో జన్యుపరమైన విభజన చేసు కోవడం జరిగింది.నేటికీ ఆదివాసి ఇలవేల్పు జాతర లో తమ చరిత్రను వంశవృక్షాన్ని దైవ రూపంలో కొలుచుకుంటున్నారు. కొన్ని లక్షల సంవత్సరాలు అయినా తమ వంశవృక్షం ఏమిటి అనే దాన్ని స్పష్టంగా చిత్రలిపి రూపంలో తెలుసుకునేంత గొప్ప శాస్త్రీయ పరిజ్ఞానం ఆదివాసి సమాజంలో మాత్రమే ఉంది. మరి ప్రాక్‌చరిత్ర నుంచి నేటి వరకు ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న ఆదివాసీలు హిందు వులు లేదా ఇతర మతాలకు చెందిన వారు ఎలా అవుతారు? పాక్‌చరిత్ర నుంచి నేటి వరకు ఒక్క ఆధారం కూడా ఆదివాసి హిందువు అని చూపించే తార్కాణం ఏదీ కూడా లేదనేది స్పష్టాతిస్పష్టం. ఆదివాసి పూజా విధానంలో పురోహితులు ఉం డరు.ఆదివాసీలు ప్రత్యేక ఆచారాలతో పూజ నిర్వహించుకుంటారు.వారి పూజలు పకృతితో మిళి తమై ఉంటాయి. ఆదివాసీ పండుగలు, ఆచారాలు, కట్టుబాట్లు, జంతుబలులు, ఆహార అలవాట్లు, ఇలవేలుపు జాతరలు భౌగోళిక ప్రాంతాలవారీగా ఒక విలక్షణమైన పద్ధతిలో కొనసాగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ ఈరోజు విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది. ఆదివాసీ జీవనమే ఒక శాస్త్రీయ జీవనం. విగ్రహం ఆధారం లేనిపూజలు,ఈ సృష్టిలో భూగో ళాన్ని మించిన దైవం లేదని భూమిని కొలిచే భూమి పండుగ,మనిషికి ఆహారాన్ని అందించి ఆకలి తీర్చే ఉత్పత్తికి మూలమైన విత్తనాలను దైవంగా పూజించే విత్తనాల పండుగ ఆదివాసీల విశిష్ట జీవనశైలికి దర్పణాలు.ఉత్పత్తి ప్రక్రియలను ప్రకృతిలో అంతర్భా గంగా భావించి, పండుగలు చేసుకోవడం ఆదివాసీ ల విలక్షణత.ఉత్పత్తి ప్రక్రియలకు మించిన అంశా లు ఈ ప్రకృతిలో ఏమీ లేవు. కనుకనే ప్రకృతిలో ఉత్పత్తికి సంబంధించిన ప్రతి కదలికను ఆదివాసీలు పూజిస్తారు.రేలా పాటలు, కొమ్ము, దింసా, గుస్సాడీ దండారి పాటలు, అడవిలో ఆడే నెమలి ఆటలు, ప్రకృతిలో జంతువుల నుంచి నేర్చుకున్న కళలు. బాహ్యప్రపంచంతో సంబంధం లేని,దట్టమైన అడవులలో,కొండప్రాంతాలలో కల్మషం లేని విశిష్ట సంస్కృతి ఆదివాసీలది.మరి వారిని హిందువు లుగా భావించడం సబబేనా? ఈ వాస్తవాల దృష్ట్యా భారత రాజ్యాంగంలోని ఐదు,ఆరు షెడ్యూళ్లలో పేర్కొన్న ఆదివాసీ తెగలకు మతపరంగా ఒక నిర్దిష్ట గుర్తింపునివ్వాలి. ఇందుకు 2021 జనాభా గణన ప్రక్రియతో శ్రీకారంచుట్టాలి. ఆదివాసీలపై హిందూ, క్రైస్తవ,ముస్లిం మతాల పేరిట దాడులు జరిగినా, పరాయీకరణ కార్యక్రమాలు చేపట్టినా ఇందుకు బాధ్యులైన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మోపాలి.గోండ్వానా,ఇతర గిరిజన తెగల సంస్కృ తులను సంరక్షించాలి. ప్రకృతిని సంరక్షించే ఈ అడవిబిడ్డల విలక్షణ మనుగడను కాపాడడం ప్రభు త్వాల నైతిక కర్తవ్యం.
వ్యాసకర్త : వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తుడుం దెబ్బ

గిరిజన కథల పొది..ఇప్ప పూలు

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు అందించిన ఈనెల పుస్తక పరిచయం ప్రముఖ రచయత ‘ ఐ.ఏ.ఎస్‌ అధికారి అయిన అపరమేధావి ‘‘ గూడూరు రాజేందర్రావు గారి ’’ కలం నుంచి జాలు వారిన ‘విప ్పపూలు’ -డా. అమ్మిన శ్రీనివాసరాజు


తెలుగు కథా సాహిత్యంలో గిరిజన కథలది ఒక ప్రత్యేక స్థానం,గిరిజనుల సంస్కృతి సాంప్రదా యాలు ఎలాంటి విశిష్టత,ప్రత్యేకతలు,కలిగి ఉం టాయో ఆ కథలు కూడా అంతే వైవిధ్యం నింపుకొని సాగుతాయి. 1910లో తెలుగు సాహిత్యంలో కథల తలుపులు తెరుచుకుంటే 1932లో గూడూరు రాజేంద్రరావు ‘‘చెంచి’’ కథతో గిరిజన కథల ప్రవేశం మొదలైంది. ప్రారంభంలో గిరిజన జన జాతికి చేరువలో జీవనం సాగించిన, అడవిబిడ్డలపై అభిమానం గల రచయితల నుంచి అరకొరగా గిరిజన ప్రత్యేక కథలు వెలువడ్డాయి.
అనంతర కాలంలో ఆదివాసుల్లో కూడా అక్షరాస్యత దినదిన ప్రవర్తమానమై వారిలో కూడా రచయితలు ఆవిర్భవించారు. అంతకు ముందుగల వారియొక్క ‘‘నోటి సాహిత్యం’’ను అక్షరబద్దం చేసే పని ప్రస్తుతం విస్తృతంగా జరుగుతుంది. గతంలో గిరిజనుల పోరాటాలు, అన్యాయా లకు గురవుతున్న తీరు,వారికష్టాలు మాత్రమే కథా వస్తువులుగా కథలు వెలువడి అవి అన్ని ‘‘సానుభూతి కథల’’ జాబితాలో చేరిపోయాయి. అనంతరం వచ్చిన గిరిజనులే వ్రాసిన గిరిజన కథల్లో విస్తృత మార్పులు చేరి వారి సంస్కృతి సాంప్రదాయాలే కథా వస్తువులుగా గిరిజన కథలు వెలబడుతూ..‘‘స్వానుభవ కథల’’ జాబితాగా తయారయ్యాయి, కథలు అవే అయినా వస్తువుల్లో భిన్నత్వం సంతరించుకొని అటు పాఠకులకు ఇటు పరిశోధకులకు పూర్తి సంతృప్తిని అందిస్తూ తెలుగు కథా సాహిత్యంలో గిరిజన కథలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
గిరిజన జీవితాలకు సంబంధించి విశ్వవిద్యాలయ స్థాయిలో విస్తృత పరిశోధనలు జరిగిన గిరిజన కథల గురించిన పరిశోధనలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. భావి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఖమ్మంకు చెందిన ప్రముఖ సీనియర్‌ రచయిత, జీవన్‌ అవిశ్రాంత సాహితీ కృషిలో భాగంగా ఆయన సంపాదకత్వంలో2009 సంవత్సరంలో 29 కథలతో ‘‘ఇప్ప పూలు’’ గిరిజన సంచార తెగల కథా సంకలనం వెలువడిరది, దానికి లభించిన అత్యధిక ఆదరణతో మరో పదకొండు అచ్చమైన గిరిజన కథలు జోడిరచి మొత్తం 40కథలతో ‘‘ఇప్పపూలు’’ మలికథా సంకలనం ఇటీవల వెలువడిరది. దీనిలో 30% సంచార జాతుల వారి జీవన దర్పణాలైనా కథలు మినహాయిస్తే అన్ని అచ్చమైన అడవి జాతి బిడ్డల కథలే…!! జయధీర్‌ తిరుమలరావు, వంశీకృష్ణ, వంటి లబ్ద ప్రతిష్టులైన రచయితల గీటురాళ్ల వంటి ఆప్త వాక్యాలు అదనపు ఆకర్షణగల ఈ కథా సంకలనం నిజంగా తెలుగు కథ సాహిత్యంలో వెలువడ్డ తొలి గిరిజన కథా సంకలనంగా చెప్పవచ్చును. బోయ జంగయ్య వ్రాసిన ‘‘ఇప్ప పూలు’’ కథ నే శీర్షికగా ఎంచుకున్న ఈ కథా సంకలనంలోని ప్రతి కథ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. లంబాడా గిరిజన కుటుం బాలలో పేదరికం వల్ల, పుట్టిన ఆడపిల్లల సంతానాన్ని డబ్బులకు అమ్ముకుంటున్న దీన పరిస్థితులకు అక్షర రూపం అయిన ‘‘ఇప్ప పూలు’’ కథలో ఇప్ప సారా తయారు చేయడం కుటీర పరిశ్రమగా చెబుతూ పోలీసులు ఆ నెపంతో లంబాడా సామాజిక వర్గం వారిని శారీరకంగా ఆర్థికంగా ఎలా దోచు కుంటున్నారో కూడా ఈ కథలో మరో కోణం ద్వారా చూపించారు. ముందు తరం గిరిజన కథకుడు గూడూరు రాజేంద్ర రావు మొదలు నేటితరం యువ గిరిజన కథకుడు రమేష్‌ కార్తీక్‌ నాయక్‌ వరకు 40మంది కథకుల నవ్య కథా రీతులు ఇందులో మనం చదవవచ్చు. బహు విశేషాల వేదిక అయిన ఈ కథల పందిరిలో ప్రజావాగ్గేయ కారుడు పాటల పోరు బిడ్డ వంగపండు ప్రసాదరావు వ్రాసిన కథ కూడా ఉండటం మరో విశేషం!! ‘‘వంగపండు’’ అంటే పాట గాడు గానే అందరికీ తెలుసు, కానీ అతనిలోని అద్భుతమైన కథకుడిని ఆవిష్క రించింది ఆయన వ్రాసిన ‘‘కొండ పందికొక్కు’’ కథ, అమాయకపు అడవి బిడ్డలు వ్యాపారస్తుల మోసాలకు ఎలా బలి అవుతున్నారో తెలుపుతూ తద్వారా ఉద్య మాలవైపు, సంఘాల వైపు, గిరిజనులు మొగ్గు చూపుతున్న తీరు గురించి తనదైన ఉద్యమ శైలిలో ఈ కథను వంగపండు వ్రాశారు. ఇక గిరిజన రచయితలైన మల్లి పురం జగదీష్‌,భూక్యా తిరుపతి,పద్దం అనసూయ,రమేష్‌ కార్తీక్‌ నాయక్‌,తిమ్మక రాంప్రసాద్‌, వంటి వారి కథలు ఈ సంపుటికి మరింత ప్రత్యేకతను అందించాయి ఈ ఐదు కథలు గిరిజన సంస్కృతిసాంప్రదాయాలు ప్రధాన భూమికగా చెప్పబడ్డాయి. భూక్య తిరుపతి ‘‘కాక్లా’’ కథలో లంబాడా సామాజిక వర్గంలో గల కాకుల కలయికతో ముడిబడ్డ ఒక అపనమ్మకాన్ని వారు సంప్రదాయంగా ఎలా కొనసాగిస్తున్నారో చెబుతారు.మల్లిపురం తన ‘‘దారి’’ కథలో అడవి బిడ్డల రోజువారి దినచర్యలను కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరిస్తూనే ఆదివాసులు ఐక మత్యంతో తమను మోసగిం చిన తమ ప్రాంతపు అధికారిపై ఎలా ఎదురు తిరిగారో ఆవిష్కరిం చారు.ఇక చావు నేపథ్యం లో కథలు వ్రాసి తనదైన ప్రత్యేకతను చాటు కున్న ‘‘పద్దం అనసూయ’’ వ్రాసిన ‘‘మూగ బోయిన శబ్దం’’ కథలో గిరిజన జన జాతి అన్యమత ఊబిలో ఎలా కూరుకుపోతున్నదో చక్కగా వివరించారు, సంస్కృతి సాంప్రదా యాలపై అన్యమత దాడి గురించి ఈ కథలో ఆలోచనత్మకంగా చెప్పారు.
‘‘ప్రాచీన పురుడు’’ తీరు గురించి సందేశాత్మకంగా ఆవిష్కరించిన మరో గిరిజన కథారచయిత రమేష్‌ కార్తీక్‌ నాయక్‌ రాసిన కథ ‘‘పురుడు’’,పాత్రోచితమైన సంభాషణ తీరు దీనిలో మనకు ఆవిష్కరించబడిరది ఇదే తీరుకు తార్కాణకంగా నిలిచే మరో కథ ‘‘పిన్లకర్ర’’ గిరిజన యువత పట్టణాలపై మోజుతో అక్కడకు చేరి తమ చక్కని సంస్కృతితో పాటు విలువైన ఆరోగ్యాలను ఎలా కోల్పోతున్నారో.. ఈ కథ కళ్ళకు కట్టింది.మొత్తానికి ఈ కథా సంకలనంలో 40కథలు వ్రాయబడ్డ కాలాల రీత్యా 50సంవత్సరాల నిడివి ఉంది ఈ ఐదు దశాబ్దాల నడుమ అనేక ఆధునిక మార్పులు వచ్చి చేరాయి కానీ గిరిజన జీవన విధానంలో వారి అణిచివేతలు, దోపిడి, ఆధిపత్యం, తదితర మోసాల్లో మాత్రం తేడా రాలేదు. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు లోబడే వారి మీద అన్యాయాలు అక్రమాలు రూపాం తరం చెందాయి.ప్రాంతాలవారీగా విభజించ బడ్డ,ఈగిరిజన కథలసమాహారం లోని కథల తీరు గమనిస్తే,..ఆస్తులు అంతస్తులు కాదు పీడన,దోపిడి కూడా ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతూ అదో గొలుసు వలయమై నిరంతరం కొనసాగుతుంది, కానీ దానిని ఎక్కడో ఒక చోట ఛేదించి నియం త్రించాలి, లేకపోతే భవిష్యత్తులో ఈ ఆదిమ తెగల మనుగడకు భారీ ప్రమాదం ఏర్పడి మహా ఉత్పాతం కలగవచ్చు, దాని నుంచి రక్షించే దిశగా సాగుతున్నదే ఈఅక్షర చైతన్య కథాయాత్ర. తరాలు మారిన తలరాతలు మారని గిరిజన స్త్రీల స్థితిగతులు, ఆందోళన కలిగిస్తున్న తీరును ఈ గిరిజన సంచార జాతుల కథాసంకలనం ఆవిష్కరించింది. గిరిజన హక్కులు మానవ హక్కులే అని ఎలుగెత్తి చాటిన ‘‘పోరాటశీలి’’బాలగోపాల్‌,స్మృతిగా ఈ ‘‘ఇప్ప పూలు’’ కథా సంకలనం ప్రచురించిన సంపా దకులు ప్రచురణకర్త జీవన్‌ గారికి అభినందనీయులు.అడవి బిడ్డలతో పాటు అణగారిన వర్గపు సంచార తెగల బతుకుల వెతలు కూడా ఇందులో మనం చదవవచ్చు, పెద్దింటి అశోక్‌ కుమార్‌,బిఎస్‌ రాములు, ఏ.విద్యాసాగర్‌, బోయ జంగయ్య, జాతశ్రీ, అల్లంరాజయ్య, అట్టాడ,గంటేడ వంటి లబ్దప్రతిష్టలైన వారి కథల్లోని భావ సొగసులతో పాటు వర్ధమాన కథా శీలురైన డా:జడా సుబ్బా రావు,బాల సుధాకర్‌ మౌళి,ఆప్త చైతన్య,ల ఆధునిక కథన రీతులు ఈ కథా సంకలనంలో మనం గమనించవచ్చు.బహురుచుల విందు భోజనంలా బహుముఖీయమైన కథల సమా హారం ఇది,కథ ప్రియులకే కాక పరిశోధక విద్యార్థులకు ఇది ఒక మార్గదర్శి వంటి అపురూప కథా పేటిక, ఇదో చారిత్రక దీపిక.

గిరిజన ముంగిట విద్యావనం

సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం జగన్‌, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శంకుస్థాపన చేశారు.దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి, ఎందరో గిరిజనుల జీవితాల్లో విద్యా కాంతులు వెలిగేలా సీఎం జగన్‌ ప్రత్యేక చొరవతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటవుతుంది.సాలూరులో మెం టాడ,దత్తిరాజేరు మండలాల్లో సుమారు రూ.834 కోట్లతో,561.88ఎకరాల్లో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయానికి కేంద్రమంత్రి ప్రధాన్‌, సీఎం జగన్‌ ఆగష్టు 25వ తేదీన శంకు స్థాపన చేశారు. అంతకు ముందు సెంట్రల్‌ ట్క్రెబల్‌ యూనివర్సిటీ లేఅవుట్‌ నమూనాను పరిశీలించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎంజగన్‌ మాట్లాడుతూ గిరిజన విశ్వ విద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో దత్తిరాజేరు మండలం మర్రివలసలో, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలో భూసేకరణ, ప్రభుత్వ భూమి కేటాయిం చడంతో పాటు, ఇప్పటికే ఆయా గ్రామాల్లో యూనివర్సిటీకి భూము లిచ్చిన రైతులకు రూ.25. 90 కోట్ల పరిహారం అందిచామని, వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు మరో రూ.28.49 కోట్లు చెల్లించి నట్లు తెలిపారు. విశాఖపట్నం-రాయగడ జాతీయ రహదారికి సమీపంలో,భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి,విజయ నగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు అందు బాటులో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేసి నట్లు వివరించారు.ఉత్తరాంధ్రకు కిరీటంగా సెంట్రల్‌ ట్రైబల్‌ వర్సిటీ ఉత్తరాంధ్రకు కిరీటంగా నిలుస్తుం దని,మన ప్రాంతం ఉన్నత చదువు లకు నెలవుగా మారుతోందని సీఎం జగన్‌ పేర్కోన్నారు.గత టీడీపీ ప్రభుత్వం విభజన హామీలో భాగమైన సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటును గాలికొదిలేస్తే, మన ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యంత అనుకూల పరిస్థితులు ఉండేలా విశాఖ పట్నం-రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, విశాఖ-హౌరా రైల్వేలైన్‌ లోని విజయనగరం, గజపతి నగరం, బొబ్బిలి రైల్వేస్టేషన్లకు అందు బాటులోఉండేలా, భోగాపురం అంతర్జాతీయఎయిర్‌ పోర్టుకు సమీప ప్రాంతలో యూనివర్సిటీకి భూకేటా యింపులు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే వర్సిటీకి అవసరమైన భూమి,విద్యుత్‌,నీటి సరఫరా మరియు రోడ్డు కనెక్టివిటీని సమకూర్చినట్లు వివరించారు. దీంతో పాటు వర్సిటీ నిర్మాణ పనులకు చర్యలు తీసుకోను న్నట్లు తెలిపారు.సెంట్రల్‌ ట్రైబల్‌ యూని వర్సిటీలో ప్రస్తుతం పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఇంగ్లీష్‌, సోషియాలజీ,ట్రైబల్‌ స్టడీస్‌, బయో టెక్నా లజీ, కెమెస్ట్రీ,జర్నలిజం,ఎంబీఏ,ఎంఎస్‌డబ్ల్యూ, డిగ్రీ స్థాయిలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలీజెన్స్‌,బోటనీ కెమిస్ట్రీ, జియాలజీ,టూరిజమ్‌ అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌ మెంట్‌,బి.కామ్‌లో ఒకేషనల్‌ తదితర 14అకాడ మిక్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయని,స్కిల్‌ డెవలప్‌ మెంట్‌,ఒకేషనల్‌,జాబ్‌ ఓరియెంటెడ్‌ షార్ట్‌ టర్మ్‌ కోర్సులను యూనివర్సిటీ అందిస్తోందన్నారు. 2019 నుంచి విజయనగరం జిల్లా కొండ కారకం లోని ఆంధ్రా యూనివర్సిటీ పీజీ పాత క్యాంపస్‌ భవనాల్లో నిర్వహిస్తున్న వర్సిటీలో 385 మంది విద్యార్థులు ఉన్నారు.
గిరిపుత్రుల జీవితాల్లో విద్యా కాంతులు
మన గిరిపుత్రులు రాబోయే రోజుల్లో ప్రపంచస్థాయిలో పోటీ పడే పరిస్థితి వస్తుందని సీఎం జగన్‌ తెలిపారు. గిరిజన ప్రాంతంలో ఈ నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఈ ప్రాం తాంలో ఎటు చూసిన కొత్త కాలేజీలు, యూనివ ర్సీటీలు కనిపిస్తున్నాయని గిరిపుత్రుల జీవీతాల్లో విద్యా కాంతులు వెలుగుతాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్ల మన పాలనలో వైద్యా, విద్యకి ప్రాధాన్యత ఇచ్చామని వాటికి సంబంధించి అనేక సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులు చేపట్టా మని సీఎం జగన్‌ వివరించారు.
1.54లక్షల మంది గిరిజనులకు3.23లక్షల ఎకరాల భూములు
వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన 50 నెలల్లో గిరిజన సంక్షేమం కోసం సమున్నత చర్యలు తీసుకుంటూ గిరిజన సంక్షేమం కోసం మన ప్రభుత్వం రూ. 16,805.77కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం జగన్‌ తెలిపారు. అర్హులైన ఎస్టీ కుటుంబాలకు 2ఎకరాల భూమి అందిస్తామని ఇచ్చిన మాట ప్రకారం గిరి భూమి పోర్టల్‌ ద్వారా డిజిటలైజేషన్‌ చేసి1.54 లక్షల మంది గిరిజనులకు 3.23 లక్షల ఎకరాలను అన్ని హక్కులతో కూడిన RశీఖీRపత్రాలు పంపిణీ చేసినట్లు వివరించారు. 4.58లక్షల మంది ఎస్టీ కుటుంబాలకు జులై, 2019నుంచి రూ.410.11 కోట్ల ఖర్చుతో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు వివరించారు.పార్వతీపురం,పాడేరులో రూ.1000 కోట్లతో మెడికల్‌ కాలేజీలు, 300 మెడికల్‌ సీట్లతో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తూ.. గిరిజనుల ఆరోగ్య సమస్యలపై పరిశోధనలకు పెద్ద పీట వస్తున్నట్లు సీఎంజగన్‌ పేర్కొన్నారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పలాసలో రూ.50 కోట్లతో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, డయాలసిస్‌ యూనిట్ల నిర్మా ణం చేపట్టినట్లు వివరించారు.105.32 ఎకరాల్లో రూ.153.85కోట్లతో కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీ రింగ్‌ కళాశాల, 500 జనాభా ఉన్న ప్రతి తండా/ గూడెంను పంచాయతీగా వర్గీకరిస్తామన్న మాటను నిలుపుకుంటూ గిరిజన ప్రాంతాల్లో 165 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్‌ వివరించారు. గిరిజన ప్రాంతాల్లోని 497 సచివాల యాల్లో అన్ని ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకే 100 శాతం రిజర్వేషన్‌ కల్పించినట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌,రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,గిరిజన సంక్షేమశాఖ మంత్రి పి.రాజన్న,తదితరలు పాల్గొన్నారు.
ఆహ్లాదకరం..ఏపీ కేంద్రియ గిరిజన విద్యాలయం
ఆహ్లాదకరమైన వాతావరణంలో, సువి శాల భవనాల్లో ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యా లయం సాకారం కానుంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2014లో కేంద్రం మన రాష్ట్రానికి 13 కేంద్రీయ విద్యా సంస్థలను మంజూరు చేసింది. అందులో భాగంగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సీటీ యూఏపీ)ను కేటాయించింది.2019 వరకూ అధికా రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం..దీనిని పట్టించు కోలేదు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామం వద్ద భూమి కేటాయించినా అది ఏ మాత్రం భవనాల నిర్మాణానికి అనుకూలంగా లేని పరిస్థితి.
పూర్తిగా కొండప్రాంతం.
పరిసరాల్లో టీడీపీ నాయకుల స్థిరాస్తి వ్యాపారాన్ని పెంచుకోవడానికి తప్ప మరెందుకూ ఉపయోగపడలేదు.తమ పదవీకాలం ముగిసే వరకూ చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేసింది. చివరకు సీటీయూఏపీ తరగతులను తప్పనిసరిగా ప్రారంభించాల్సి రావడంతో విజయనగ­రం పట్టణ శివారు కొండకరకాం వద్దనున్న ఏయూ పీజీ క్యాంపస్‌ పాత భవనంలోనే 2019ఆగస్టు 5న తరగతులు ప్రారంభమయ్యాయి.
గిరిజనులకు చేరువగా..
ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ లక్ష్యం సార్థకమయ్యేలా గిరిజన ప్రాంతంలోనే దీన్ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక ల్పించింది. విశాఖపట్నం-రాయగడ జాతీయ రహ దారికి సమీపంలో, విశాఖ-హౌరా రైల్వేలైన్‌లోని విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వేస్టేషన్ల కు అందుబాటులో ఉండేలా భూమి కేటాయిం చింది.భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా స మీ­పంలోనే ఉంటుంది. మెంటాడ మండలం చినమేడపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో 224.01ఎకరాలు,దత్తిరాజేరు మండలం మర్రి వలస రెవెన్యూ గ్రామ పరిధిలో 337.87ఎక రాలు..మొత్తం561.88ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. దాదాపు 480 మంది రైతులకు పరిహారం ఇవ్వాలని అధికారులు గుర్తిం చారు. ఇప్పటికే దాదాపు రూ.30.58కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
మౌలిక సదుపాయాలకు పెద్దపీట
సీటీయూఏపీకి కేటాయించిన భూమిని గతేడాది కేంద్ర బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. వర్సిటీ భవనాల నిర్మాణమంతా కేంద్ర ప్రజా పనుల విభాగం చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తోంది. ఇందుకోసం రూ.23.60కోట్లను గతే­డాది విడు దల చేసింది. విశాఖ-రాయ్‌పూర్‌ జాతీయ రహ దారి నుంచి సీటీయూఏపీ ప్రాంగణం వరకూ రూ.16 కోట్లతో 100 అడుగు­ల వెడల్పున ఆరు లైన్ల అప్రోచ్‌ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతు న్నాయి.తాగునీటి వసతి కల్పనకు రూ.7కోట్లు, విద్యుత్‌ సౌకర్యా­నికి దాదాపు రూ.60లక్షలను ప్రభుత్వం కేటాయించింది.కాగా,విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా ఉపాధి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడంలో సీటీయూఏపీ ముందుంది. వారికి ఆసక్తి ఉన్న రంగంలోనే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా 6గ్రాడ్యుయేట్‌(యూజీ), 8 పోస్టు గ్రాడ్యుయేట్‌(పీజీ) కోర్సుల్లో బోధన జరుగుతోంది.
అంతర్జాతీయ మార్కెటింగ్‌ నైపుణ్యాల కోర్సులను ప్రవేశపెడుతున్నారు.ఇప్పటికే పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా నైపుణ్యాలను, మెలకువలను అందించేలా సాంకేతిక మాధ్యమా లనూ సీటీయూఏపీ రూపొందిస్తోంది. అందుకు సిలబస్‌ను కూర్పు చేసేందుకు కార్యాచర ణ సిద్ధం చేసింది.ఏటా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పర్యవేక్షణలో ప్రవేశపరీక్షలు నిర్వహించి.. ప్రతిభ ఆధారంగానే సీట్లు కేటాయిస్తున్నారు.- జిఎన్‌వి సతీష్‌

జయహో భారత్‌..ఇస్రోకి జేజేలు

నిరీక్షణ ఫలించింది. కోట్లాదిమంది భారతీయుల పూజలు ఫలించాయి. చందమామ చేతికి అందింది. జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. భారత్‌.. నింగిని జయించింది. ఇస్రో చేపట్టిన చంద్ర మండల యాత్ర.. విజయ తీరాలకు చేరింది. దిగ్విజయమైంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌ 3 జాబిల్లి మీద అడుగు మోపింది. ఈ సువర్ణాధ్యాయం కోసం దేశం మొత్తం ఉత్కంఠ భరితంగా ఎదురు చూసిన క్షణాలు ఫలించాయి. కలలు సాకారం అయ్యాయి. గతంలో ఎదురైన చేదు సంఘటనలు అధిగమించి.. మరీ జాబిల్లిని అందుకుంది.
యావత్‌ భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తున్న చంద్రయాన్‌ 3 ప్రయోగం విజయవంతమైంది. ఇప్పటివరకు జరిగిన అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసు కున్న చంద్రయాన్‌ 3..చివరి అంకానికి చేరుకుంది. తాజాగా ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విడిపోయిన విక్రమ్‌ ల్యాండర్‌..చంద్రుడి ఫోటోలు తీసింది.వాటిని పంపించడంతో ఇస్రో ట్విటర్‌లో పంచు కుంది. ఆగస్టు 23వ తేదీ చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద సుమారు 70డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద విక్రమ్‌ ల్యాండర్‌ దిగనుంది.
ఆగష్టు 26 ఉదయం బెంగళూరులోని ఇస్రో నెట్‌వర్క్‌ కమాండ్‌ సెంటర్‌ చేరుకున్న ప్రధాని అక్కడ శాస్త్రవేత్తలను కలిశారు.ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండ్‌ అయిన విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి దిగిన ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తన పని ప్రారంభించడంతో ప్రధాని శాస్త్రవేత్తల నుంచి దాని సమాచారం తెలుసుకున్నారు. చంద్రయాన్‌ 3 ల్యాండిరగ్‌ ఎలా జరుగుతుందో ల్యాండర్‌ నుంచి రోవర్‌ బయటకు ఎలా వస్తుందో వీడియోల ద్వారా ఇస్రో సైంటిస్టులు ఆయనకు వివరించారు.
‘‘ఆగస్ట్‌ 23న భారత్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగింది. ఇక ఇప్పటి నుంచి, ఈ రోజుని భారత్‌లో జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వ హించుకుందాం’’అని ప్రధానమంత్రి ప్రకటిం చారు. శాస్త్రవేత్తలు మేకిన్‌ ఇండియా కార్యక్రమాన్ని చంద్రుడిపైకి తీసుకెళ్లారని అభినందించారు.తన ప్రసంగం మధ్యమధ్యలో ప్రధాని ఇస్రో శాస్త్రవేత్తల విజయాన్ని తలుచుకుని భావోద్వేగానికి గుర య్యారు. భారత్‌ చంద్రయాన్‌ 3మిషన్‌ భూమి ఎదుర్కుంటున్న సవాళ్లను పరిష్కరించడానికి కూడా సాయం చేస్తుందని ప్రధాని ఆకాంక్షించారు. మోదీ ఇస్రో కమాండ్‌ సెంటర్‌లో దాదాపు 50 నిమిషాల పాటు ప్రసంగం చేశారు. 21వ శతాబ్దంలో ప్రపం చంలోని పెద్ద పెద్ద సమస్యలను భారత్‌ పరిష్కరి స్తుందని, మన సాంకేతిక, శాస్త్రీయ ఆలోచలను ప్రపంచమంతా అంగీకరిస్తుందని మోదీ అన్నారు. చంద్రయాన్‌ మహాభియాన్‌ అనేది కేవలం భారత్‌ విజయవంతం మాత్రమే కాదని, మొత్తం మానవాళి సాధించిన విజయంగా అభివర్ణించారు. మన మిషన్‌ చేపట్టే అన్వేషణ చంద్రుడిపైకి వెళ్లేందుకు అన్ని దేశాలకు సరికొత్త ద్వారాలు తెరుస్తుం దన్నారు. కేవలం చంద్రుడి రహస్యాలు తెలుసు కోవడమే కాకుండా,భూమిపై ఉన్న సమస్యల పరి ష్కారానికి ఇది సాయం చేస్తుందని మోదీ తెలిపారు. ‘‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌, ఈజ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ అనేవి అంతరిక్ష రంగంలో ఉన్నతమైన బలం. నేడు దేశ పాలనకి ముడిపడి ఉన్న ప్రతి అంశానికి స్పేస్‌ అప్లికేషన్‌ను అనుసంధానించే కార్యక్రమం పూర్త యింది. నేను ప్రధానమంత్రి అయిన తర్వాత, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో, అంతరిక్ష శాస్త్ర వేత్తలతో నేను వర్క్‌షాపు నిర్వహించాను. పరి పాలనలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు స్పేస్‌ రంగాన్ని గరిష్టంగా వాడుకోవాలన్నది ఈ వర్క్‌ షాపు ఉద్దేశ్యం’’ అని మోదీ తెలిపారు.
చంద్రయాన్‌-3 ల్యాండర్‌ ఫొటోలు తీసిన చంద్ర యాన్‌-2 ఆర్బిటర్‌
చంద్రయాన్‌-3ల్యాండర్‌ను చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ తీసిన చిత్రాలను ఇస్రో విడుదల చేసిం ది.‘‘నేను నీకు గూఢచారిని!’’ అంటూ చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ చంద్రయాన్‌-3ల్యాండర్‌ను ఫొటో షూట్‌ చేసిందంటూ ఇస్రో ట్వీట్‌ చేసిం ది.చంద్ర యాన్‌-2లో ఆర్బిటర్‌ హై రెజల్యూషన్‌ కెమెరా (ఓహెచ్‌ఆర్‌సీ) ఉంది.చంద్రుడి చుట్టూ ఏది ఉన్నా ఈ కెమెరా ఫొటోలు తీసి పంపుతుంది. చంద్ర యాన్‌-3 అక్కడ ల్యాండ్‌ అయిన తర్వాత, దీన్ని కూడా అది గుర్తించి, ఫొటోలు తీసింది. ‘‘ఇస్రో సాధించిన విజయం చాలా గర్వకారణం. చంద్ర యాన్‌-3సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ సమయంలో దక్షిణా ఫ్రికాలో ఉన్నా. నా మనసంతా చంద్రయాన్‌ -3 విజయంపైనే ఉంది. విజయంపట్ల శాస్త్రవేత్త లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది అసాధా రణ విజయం. చంద్రుడిపై భారత్‌ అడుగుపెట్టింది. అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించాం. ఇప్పుడు భారత్‌ చంద్రుడిపై ఉంది. మన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాం. గతంలో ఎవరూ చేయలేనిది ఇప్పుడు ఇస్రో చేసింది చంద్రయాన్‌ -3 దిగిన ప్రదేశానికి శివశక్తి పేరు పెట్టుకుందాం. ’’ అని ప్రధాని మోదీ అన్నారు.
కక్ష్యలో సొంతంగా పరిభ్రమించి
ఆబిలాల పేర్లనుకూడా ఇస్రో వెల్లడిరచింది. ఫ్యాబ్రీ, గియార్డనో బ్రునో,హర్కేబి జే తదితర వాటి పొటోలను ల్యాం డర్‌ తీసింది.ఇందులో గియార్డనో బ్రునో జాబిల్లిపై ఇటీవలే గుర్తించిన అతిపెద్ద బిలాల్లో ఒకటి. ఇక హర్కేబి జే బిలం వ్యాసం దాదాపు 43 కి.మీలు ఉన్నట్టు తెలుస్తోంది.చంద్రడి కక్ష్యలో తిరుగుతున్న ల్యాండర్‌ మాడ్యూల్‌ జాబిల్లికి మరింత చేరువైంది. ఆగష్టు 23న చేపట్టిన డిబూస్టింగ్‌(వేగాన్ని తగ్గించే) ప్రక్రియ విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వెల్లడిరచింది. ల్యాండర్‌ (విక్రమ్‌),రోవర్‌(ప్రజ్ఞాన్‌)తో కూడిన ల్యాండర్‌ మాడ్యూల్‌ ఆరోగ్యంగానే ఉందని తెలిపింది.
గురు తప్పని ప్రయోగం..
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ హరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్ర యాన్‌-3ప్రయోగం విజయవంతం అయ్యిం ది. జూలై 14,2023 చంద్రయాన్‌-3 మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రయోగించారు శాస్త్రవేత్తలు.. చంద్రయాన్‌-3లోని ల్యాండర్‌కు విక్రమ్‌ అని పేరు పెట్టారు. దీనికి భారత అంతరిక్ష కార్యక్రమ పితా మహుడు విక్రమ్‌ సారాభాయ్‌ పేరు పెట్టారు. రోవర్‌కు ‘ప్రజ్ఞాన్‌’అని పేరు పెట్టారు. దీనిని సంస్కృ తంలో జ్ఞానం అంటారు. చంద్రయాన్‌-2 సమ యంలో ల్యాండ్‌ రోవర్‌కు అదే పేరు ఉండేది. రోవర్‌ అనేది వాహనం లేదా రోబోట్‌, ఇది వివిధ ప్రదేశాల నుంచి డేటాను సేకరించి ఆర్బిటర్‌కి పంపడానికి గ్రహం ఉపరితలం చుట్టూ తిరుగు తుంది.ల్యాండర్‌ అనేది లోపల రోవర్‌ ఉన్న ఒక రకమైన క్యారియర్‌. దాని సహా యంతో రోవర్‌ ఉపరితలంపై ల్యాండ్‌ చేయబడు తుంది. రోవర్‌ను ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్‌ చేయ డానికి ల్యాండర్‌ కీలక పాత్ర పోషిస్తుంది. రోవర్‌ ల్యాండ్‌ అయిన గ్రహం చుట్టూ ఒక ఆర్బిటర్‌ తిరుగుతుంది. రోవర్‌ గ్రహం ఉపరితలం నుంచి గ్రహం చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌కు డేటాను పంపుతుంది. అలాగే భూమిపై ఉన్న ఇస్రో-నాసా వంటి అంతరిక్ష సంస్థలకు ఆ సమాచారాన్ని ప్రసారం చేయడానికి ఆర్బిటర్‌ పనిచేస్తుంది…
భారత్‌ గుప్పిట చిక్కిన జాబిల్లి..
ఇండియా ఈజ్‌ ఆన్‌ ది మూన్‌.. ఇదీ ఇస్రో వారి సగర్వ ప్రకటన. జాబిలి మీద కాలు మోపిన తమ చంద్రయాన్‌3 ప్రాజెక్ట్‌ సూపర్‌ సక్సెస్‌ కొట్టిందన్న వార్తను ప్రపంచానికి చాటిచెప్పుకుంది ఇస్రో. అగ్రరాజ్యాల్ని సైతం నోరెళ్లబెట్టేలా చేసిన ఈ ఘన విజయాన్ని దేశం మొత్తం ఆస్వాదిస్తోం దన్నారు ప్రధాని మోదీ. మూన్‌ మిషన్లను చాలా దేశాలు విజయవంతం చేసుకున్నాయి. కానీ.. ఇన్నాళ్లు అందని జాబిలి..
ఇప్పుడు గుప్పిట చిక్కింది. చంద్రుడి మీద ప్రయోగంలో సంపూర్ణ విజయం సాధించి మళ్లీ మీసం మెలేసింది ఇస్రో. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద రోవర్‌ని దింపిన తొలి దేశంగా అవతరించింది భారత్‌. ఇస్రో అంచ నాలు ఏమా త్రం తప్పలేదు. అంగుళమైనా పక్కకు జరగలేదు. గీసిన గీత మీద సరిగ్గా వాలింది చంద్ర యాన్‌`3. విక్రమ్‌ ల్యాండర్‌ నెలరేడుని ముద్దా డిరదన్న శుభవార్త యావత్‌ దేశాన్నీ పులకింప జేసింది.ఈ అపూర్వమైన.. సాటిలేనివిజయంతో, భారతదేశం చరిత్ర సృష్టించింది. ఇస్రో శాస్త్రవేత్త లను దేశప్రజలు అభినందిస్తూ వారి కృషిని అభినం దిస్తున్నారు.సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
దేశాల నుంచి ప్రపంచ సంస్థల దాకా ఇదే మాట
చంద్రుని దక్షిణ ధ్రువంపైకి భారత్‌ అడుగుపెట్టగానే ప్రపంచవ్యాప్తంగా మొదలైన జయ జయధ్వానాలు ఇంకా కొనసాగుతున్నాయి. శిఖ రాగ్ర సమావేశాల కోసం కలుసుకున్న ప్రపంచ దేశాల అధినేతల సంభాషణల్లోనూ, అంతర్జాతీయ వార్తా పత్రికలు, ప్రముఖ న్యూస్‌ చానళ్ల కథనాల్లో నూ ఇదేఅంశం ప్రధానంగా కనిపించింది. చంద్రు నిపై విక్రమ్‌ ల్యాండ్‌ కాగానే క్షణాల్లో తీవ్ర ఉద్వే గానికి గురయ్యానని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ మొదలు బ్రిటన్‌ ‘బీబీసీ’ వరకు భారత్‌కు జయహోలు పలికాయి. దాయాది దేశం పాకిస్థా న్‌కు చెందిన పత్రికలు సైతం అంతరిక్ష రంగంలో భారత్‌ తిరుగులేని విజయాన్ని ప్రస్తుతించాయి. జయహో భారత్‌.. సాహో ఇస్రో..అంటూ దేశం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. ప్రతి భారతీ యుడు సగర్వంగా తన జయహో అంటూ సంబ రాలు మొదలు పెట్టింది.భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్‌-3 ‘చంద్ర యాన్‌-3’చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయ వంతంగా ‘సాఫ్ట్‌ ల్యాండ్‌’ అయింది.
ఈఅపూర్వమైన..సాటిలేని విజయం తో,భారతదేశం చరిత్ర సృష్టించింది.భూమిసహజ ఉపగ్రహం (చంద్రుడు)ఈ భాగంలో దిగిన ప్రపం చంలో భారత దేశం మొదటి దేశంగా అవతరిం చింది. ఎందు కంటే ఇప్పటివరకు చంద్రునిపైకి వెళ్ళిన అన్ని మిషన్లు చంద్ర భూమధ్యరేఖకు ఉత్తరం లేదా దక్షిణంగా కొన్ని డిగ్రీల అక్షాంశంలో దిగాయి. భారత దేశ పతాకాన్ని ఎగురవేయడం వల్ల శాస్త్రవేత్తలలోనే కాదు, దేశంలోని సాధారణ ప్రజలలో కూడా అపారమైన ఉత్సాహం కనిపి స్తోంది.‘సాఫ్ట్‌ ల్యాండిరగ్‌’ గురించి తెలిసిన ప్రతి భారతీయుడి ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.– గునపర్తి సైమన్‌

1 24 25 26 27 28 75