మారనున్న విశాఖ రూపురేఖలు

సాగరతీరం విశాఖపట్నం అభివృద్ధి మీద ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా ముంబై తరహాలో విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయా లని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ నుంచి అధికారుల బృందం ముంబైలో పర్యటిం చింది. సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ విధానాలను అధ్యయ నం చేసింది.ఆవిధానాలను ఇక్కడ అమలు చేసేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం రూపురేఖలు త్వరలోనే మారిపోనున్నాయి. ముంబై తరహాలో విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన నేషనల్ గ్రోత్ హబ్‌లో భాగంగా, విశాఖపట్నాన్ని గ్లోబల్ ఎకనామిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికోసం ముంబైలో విజవంతమైన సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర లిమిటెడ్,ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీఎంఆర్‌డీఏ)తరహా విధానాలను ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది.మరోవైపు విశాఖ గ్రోత్ హబ్ కార్యక్రమం కింద..కైలాసగిరి, భీమిలి మధ్య బే సిటీని అభివృద్ధి చేయాలని నీతిఆయోగ్ సూచించింది.విశాఖపట్నం 2.0ను భోగాపురం విమానాశ్రయం వరకు విస్తరించాలని,గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం చుట్టూ ఏరోసిటీ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది.ఈ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడానికి.. ఆంధ్రప్రదేశ్ అధికారుల బృందం జనవరి 12,13 తేదీలలో పట్టణ అభివృద్ధి నమÖ నాలను అధ్యయనం చేయడానికి ముంబైని సందర్శించింది. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా ల్యాండ్ మానిటైజేషన్, ప్రీమియంల ద్వారా నిధులు ఎలా సమకూర్చు కోవాలో వీరు అధ్యయనం చేశారు.ఈ సందర్శ నలో భాగంగా సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర లిమిటెడ్ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆర్థికంగా స్వయం సమృద్ధిని ఎలా సాధించాయనే దానిపై అధ్యయనం జరిపారు. అలాగే ప్రతిపాదిత భోగాపురం ఏరోసిటీ, వైజాగ్ 2.0 ప్రాజెక్టు లకు బెంచ్‌మార్క్‌లుగా ్పుIణ్పుO నవీ ముంబై,(నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ నోటిఫైడ్ ఏరియా) నమÖనాలను అధ్యయనం చేశారు. మరోవైపు ప్రస్తుతం దాదాపు రూ.14,000 కోట్ల వార్షిక బడ్జెట్‌తో పని చేస్తుంది,ఎక్కువగా భూమి, రియల్ ఎస్టేట్ ఆధారిత ఆదాయాల ద్వారా నిధులు సమకూరుస్తుంది.
మరోవైపు నీతి ఆయోగ్ ఇటీవల డెవలపింగ్ విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ యాజ్ గ్లోబల్ ఎకనమిక్ హబ్ అనే పేరుతో నివేది కను విడుదల చేసింది.ఈఎకనమిక్ రీజియన్.. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు తొమ్మిది జిల్లాలను కవర్ చేస్తుంది. నీతి ఆయోగ్ నేషనల్ గ్రోత్ హబ్ కార్యక్రమం కింద విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ ఎంపిక చేశారు. మరోవైపు ముంబై నుంచి నేర్చుకున్న వాటి ఆధారంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ వాల్యూ క్యాప్చర్, ల్యాండ్ మానిటైజేషన్ పాలసీలను అనుసరించనుంది. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ కోస్టల్ హబ్ వైజాగ్ 2.0ఆలోచన చేస్తున్నారు. దక్షిణాన విశాఖపట్నం ఓడరేవు నుంచి ఉత్తరాన భోగాపురం విమానాశ్రయం వరకు 200-250 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఇంటి గ్రేటెడ్ కోస్టల్ హబ్‌గా తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తున్నారు. అలాగే వైజాగ్ బే సిటీని 40 చదరపు కిలోమీటర్ల ఇంటిగ్రేటెడ్ కోస్టల్ హబ్‌గా ప్రతిపాదించారు.కైలాసగిరి, భీమిలి మధ్య 25 కి.మీ తీరప్రాంతాన్ని వాటర్‌ఫ్రంట్ నగరంగా మార్చాలని ఆలోచనలు చేస్తున్నారు. మరోవైపు మధురవాడ,కాపులుప్పాడ, ఆనంద పురంలోని ఐటీ,డేటా సెంటర్ హబ్‌లు, భోగాపురం ఏరోసిటీ,వైజాగ్ బే సిటీ వంటి ప్రాజెక్టుల ద్వారా విశాఖ రూపురేఖలు మారుతాయని భావిస్తున్నారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విధించుకున్న లక్ష్యం.నవ్యాంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు..తన విజన్ సాకారం దిశగా ఈ ఏడాదిలో పలు చర్యలు తీసుకున్నారు. 2047 నాటికి ఏపీ ఆర్థిక వ్యవస్థను 2.44 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.
అమరావతి
ఏపీ అంటే ఏ ఫర్ అమరావతి,పీ ఫర్ పోలవరం..ఇదీ సీఎం కాగానే చంద్రబాబు చెప్పిన నిర్వచనం.ఇందుకు అనుగుణంగానే అమరావతి నిర్మాణం,పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే 2025లోనే బలమైన అడుగులు పడ్డాయి. అమరావతిని అంతర్జా తీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావి స్తున్న ఏపీ ప్రభుత్వం..అమరావతిలో పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపడుతోంది. ఇందులో భాగంగా సెక్రటేరియట్ టవర్లు, అసెంబ్లీ,హైకోర్టు,ట్రంక్ రోడ్లు,రిజర్వాయర్లు వంటి ముఖ్య నిర్మాణాలను వేగంగా జరుపు తోంది. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచబ్యాంక్‌తో పాటుగా వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటూ పనుల్లో వేగం పెంచింది.అమరావతిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఎయిర్ పోర్టు వంటి నిర్మాణాలు తల పెట్టిన ఏపీ ప్రభుత్వం..రెండో విడత భూస మీకరణ కింద మరో16వేల ఎకరాలుసమీక రించాలని నిర్ణయించింది.
క్వాంటం వ్యాలీ..
మరోవైపు అమరావతిలో ప్రతిష్టాత్మక క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు.ఈ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.కేంద్రం కేటాయించిన నిధులతో దేశంలోనే మొట్ట మొదటి క్వాంటం కంప్యూటర్ కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు సన్నా హాలు జరుగుతున్నాయి.ఐబీఎం,టీసీఎస్ వంటి సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్
విశాఖను ఏఐ సిటీగా మార్చాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం..ఆదిశగా 2025లో బలంగా అడుగులు వేసింది.విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావటం వైజాగ్ ముఖ చిత్రాన్ని మార్చనుంది. గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. విశాఖలో 1గిగావాట్ ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారుగా లక్షన్నర కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు.ఈ ప్రాజెక్టు విశాఖను ఏఐ హబ్‌గా మారుస్తుందని ప్రభుత్వం చెప్తోంది.
ఏపీ గ్రోత్ ఇంజన్..విశాఖ భాగస్వామ్య సదస్సు
మరోవైపు విశాఖ వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు కూడా ఏపీ గ్రోత్ ఇంజన్‌గా మారనుంది.ఈ సదస్సులో సుమారుగా 13లక్షల కోట్ల రూపాయల పెట్టు బడులకు వివిధ సంస్థలతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు చేసుకుంది. 640 అవగాహన ఒప్పందాల ద్వారా రూ.13.2 లక్షలకోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇవన్నీ కార్యరూపం దాల్చితే 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని అంచనా.
రిలయన్స్ ఏఐ డేటా సెంటర్
మరోవైపు రిలయన్స్ సంస్థ కూడా విశాఖలో ఏఐ డేటా సెంటరఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.రూ.93,000కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. అలాగే 6గిగావాట్ల సోలార్ ప్రాజెక్టు,రాయలసీమలో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్‌ను రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. అలాగే అదానీ గ్రూప్,బ్రూక్ ఫీల్డ్,రీన్యూ వంటి సంస్థలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.
టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్
మరోవైపు డేటా సెంటర్లతో పాటుగా ఐటీ సంస్థలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా విశాఖ మారుతోంది. విశాఖలో కాగ్నిజెంట్ సంస్థ ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించింది. క్యాంపస్ ఏర్పాటు కోసం సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. అలాగే టీసీఎస్, యాక్సెం చర్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు కూడా విశాఖలో క్యాంపస్‌లు ఏర్పాటు చేయనున్నాయి.ఆ రకంగా సాగరతీరాన్ని ఐటీ హబ్‌గా మార్చేలా బలమైన అడుగులు ఈ ఏడాదిలో పడ్డాయి.
బీపీసీఎల్ రిఫైనరీ.. ఎన్టీపీసీ హైడ్రోజన్ ప్లాంట్
మరోవైపు నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం వద్ద రూ.96 వేలకోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు కూడా 2025లోనే అడుగులు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ బీపీసీఎల్ రామాయపట్నం పోర్టు వద్ద ఆయిల్ రిఫైనరీ తో పాటుగా పెట్రో కెమికల్ యÖనిట్ ఏర్పాటు చేయనుంది. ఇక అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్,ఎన్టీపీసీ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటు కూడా ఏపీ ఆర్థికవ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చడంలో కీలకంగా మారనున్నాయి.
ఏవియేషన్ ఎడ్యుసిటీ
విశాఖపట్నం,విజయనగరం సరిహద్దులలో 136 ఎకరాల్లో ఏవియేషన్ ఎడ్యు సిటీ నిర్మాణానికి కూడా ఈ ఏడాదిలో అడుగులు పడ్డాయి. 136 ఎకరాల్లో జీఎంఆర్ గ్రూప్- మాన్సాస్ ట్రస్టు కలిసి ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీని ఏర్పాటు చేయనున్నాయి.ఇది పూర్తి అయితే ఏవియేషన్ రంగంలో అంతర్జా తీయ స్థాయి నిపుణులను తయారు చేయటమే కాకుండా..ఏపీని విమానయాన శిక్షణలో గ్లోబల్ సెంటర్‌గా మార్చుతుందని అధికా రులు చెప్తున్నారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు
ఇక అన్నింటికంటే ప్రధానంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయి. 2026 మే నెలలో భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రానుంది. ఈ ఎయిర్ పోర్టు అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రం మారు తుందని నిపుణులు చెప్తున్నారు.మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశాల్లో 2025 ఏడాదిలో భారీ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 13 ఎసఐపీబీ సమావేశాలు జరగ్గా..మొత్తం రూ.8.29 లక్షల కోట్ల పెట్టుబడులకు ఈ సమావేశాల్లో ఆమోదం లభించింది.– జి ఏ సునీల్ కుమార్