జిల్లాల మధ్య ఆరోగ్యకర పోటీతోనే అభివృద్థి వేగవంతం

విశాఖపట్నం ప్రతినిథి
వెనుకబడిన జిల్లాలు,బ్లాకుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్(ఏడీపీ) ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్(ఏబీపీ) కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నీతి ఆయోగ్ అడిషనల్ సెక్రటరీ,మిషన్ డైరెక్టర్ రోహిత్ కుమార్ పేర్కొన్నారు.జిల్లాల మధ్య ఆరోగ్యకర పోటీ ఉండేలా చర్యలు తీసుకుంటే తక్కువ సమయంలోనే ఆశాజనక అభివృద్ధి ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు.– జి ఏ సునీల్ కుమార్ 

దేశ అభివృద్ధికి ఏడీపీఏబీపీ కీలకం..
నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రటరీ గౌరవ్ కటియార్ మాట్లాడుతూ ఆశాజనక జిల్లాలు, బ్లాక్స్ కార్యక్రమాలు దేశఅభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి ప్రాథమిక రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేయడం,చివరి మైలు వరకు ప్రభుత్వ సేవలను అందించడం ఈ కార్యక్రమాల ముఖ్య లక్ష్యమన్నారు.జిల్లాలు, బ్లాక్స్ స్థాయిలో అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులు పరస్పరం పంచుకోవడం ద్వారా అభివృద్ధికి కొత్త మార్గాలు సుగమం అవుతాయని ఆయన తెలిపారు.
స్వర్ణాంధ్రఏ2047” విజన్‌తో ముందుకు రాష్ట్రం..: ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీ అనంత శంకర్ మాట్లాడుతూ ఆశాజనక జిల్లాలు,బ్లాక్స్ కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధికి గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం “స్వర్ణాంధ్రఏ2047” విజన్‌తో ముందుకు సాగుతోందన్నారు.ప్రస్తుతం సుమారు 200 బిలియన్ డాలర్లుగా ఉన్న రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎస్‌డీపీ)ను 2047 నాటికి 2.4ట్రిలియన్ డాలర్లకు పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.తలసరి ఆదాయాన్ని 3,300డాలర్ల నుంచి 42,000 డాలర్లకు పెంచే దిశగా ప్రణాళికాబద్ధ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కీలక పనితీరు సూచికలు(కేపీఐఎస్) ఆధారంగా మండల,జిల్లా,రాష్ట్ర స్థాయిలో సమగ్ర పర్య వేక్షణ వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు.రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా డేటాను పర్యవేక్షిస్తూ కుటుంబ కార్డుల ద్వారా ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా అందిస్తున్నామని తెలిపారు.
జిల్లాల వారీగా వినూత్న కార్యక్రమాల ప్రదర్శన..: సెమినార్‌లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులను ప్రెజెంటేషన్ల రూపంలో వివరించారు.అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గిరిజన విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించేందుకు చేపట్టిన “నిర్మాణ” కార్యక్రమాన్ని వివరించారు.ఎన్టీఆర్ జిల్లా అధికారులు “ఒన్ ఫ్యామిలీ ఒన్ ఎంటర్‌ప్రె న్యూర” కార్యక్రమంద్వారా గ్రామీణ మహిళ లకు శిక్షణ, మార్కెటింగ్ మద్దతు అందిస్తూ జీవనోపాధి మెరుగుపరుస్తున్న విధానాన్ని వివరించారు.వైఎసఆర్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం”, “స్మార్ట్ కిచెన” కార్యక్రమాలను వివరించగా,కర్నూలు జిల్లా కలెక్టర్ ఎ.సిరి వ్యవసాయం,ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో చేపట్టిన వినూత్న చర్యలను వివరించారు.
కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలో ఆశాజనక జిల్లాలు,బ్లాకుల అభివృద్ధికి ఉత్తమ పద్ధతుల మార్పిడి,పరస్పర అనుభవాల పంచుకోవడం,జిల్లాల మధ్య ఆరోగ్యకర పోటీ వంటి అంశాలు దేశఅభివృద్ధిని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఈసెమినార్ స్పష్టంచేసింది.ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్,పార్వతీపురం మన్యం ప్రాజెక్టు అధికారి స్వప్నిల్ పవార్,వివిధ రాష్ట్రాలకు చెందిన జిల్లా కలెక్టర్లు, నీతి ఆయోగ్ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.