అధిగమిస్తూ..అప్రతిహాతంగా..

మహిళలు పెళ్లి కానంతవరకు తల్లిదండ్రుల మాటునే ఉండాలి, పెళ్లి చేసుకున్నాక భర్త చాటున ఇంటి పట్టునే వంట, సేవ చేస్తూ ఉండాలి.. అనే దశ నుండి వివిధ ఆధునిక రంగాలలో పురుషులకు సాటిగా, దీటుగా తమ సత్తా చూపే దశకు చేరుకున్నారు. లింగ సమానత్వం పెరుగుతున్నా, సైన్స్ రంగంలో స్త్రీల ప్రవేశం నుండి అక్కడ నిలదొక్కుకుని, విజయం సాధించడానికి ఎన్నో అవరో ధాలు ఉంటూనే ఉన్నాయి. అయినా మేరీక్యూరీ లాంటి వారు స్త్రీలు సైతం శాస్త్రీయ ఆవిష్కరణలు చేయగలరని, నడిపించగలరని నిరూపించారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగమైన సైన్స్,టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం వంటి చాలా కీలకమైన అంశాల్లో మహిళల పాత్రను మెరుగు పరుచుకుంటూ ముందుకు వెళుతున్నారు.
– డాక్టర్ కాకర్లమూడి  విజయ్


సమాజం నిర్దేశించిన ఆశలు అమ్మాయిల, అబ్బాయిల ఆకాంక్షలను వేరు వేరుగా రూపొందేలా చేస్తున్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాలలో అబ్బా యిలను ఫిజిక్స్,గణితం, ఇంజనీరింగ్ వైపు ప్రోత్స హిస్తే, అమ్మాయిలను సేవ చుట్టూ తిరిగే రంగాల వైపు పంపుతు న్నాయి. ఈతేడా వలననే సైన్సులో మహిళల ప్రాతినిధ్యం లేకుండా పోతుంది.సైన్సు చైతన్యవంతమై, అనేక మంది సహకారంతో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళను పరిష్కరించడానికి, పరిశో ధనాలయాల బయట కూడా కెరీర్‌లు కల్పించడానికి అద్భుతమైన సాధనగా ఉంటూ వచ్చింది. ఈ 21వ శతాబ్దంలో దాని ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఈ రంగంలో పురుషులే ఆధిపత్యం చెలాయిస్తున్నా, మేరీక్యూరీ వంటి మహిళలూ పరిశోధనలు చేయ గలరని నిరూపించి శతాబ్ద కాలం గడిచినా, గుర్తింపు పొందిన మహిళా శాస్త్రవేత్తలు ఇప్పటికీ బహు కొద్ది మందే కావడం లింగ అసమానత్వాన్ని ఎత్తిచూపు తోంది. ఆసమానత్వాన్ని పెంపొందించు కోవడం, మరింత వైవిధ్యమైన సహకారాన్ని పంచుకోవలసిన అవసరాన్ని వెల్లడిస్తుంది.

తమను తాము సానబెట్టుకుంటూ..
ప్రపంచమంతా, ఆ మాటకొస్తే మొత్తం సృష్టి అంతా, పురుషాధిక్యతతో పేట్రేగుతున్న కాలంలో మహిళలు మేము సైతం అంటూ, అందుబాటులోకొచ్చిన అవకా శాలను అందిపుచ్చుకుంటూ వాటిలో తమ ప్రతిభను సానబెట్టుకుంటూ ముందుకు సాగుతు న్నారు.ఉదయాన్నే రోడ్లుఊడ్చే మహిళల నుండి రోదసీలో నడక సాగిస్తున్న మహిళామÖర్తులకు మనం దరం జేకొ ట్టాలి. ఇప్పటి అమ్మాయిలు కేవలం సున్నితమైన కళా కారులుగా,రచయిత్రులుగా,కవయిత్రులుగానే కాకుం డా డాక్టర్లుగా,ఇంజనీర్లుగా,డ్రైవర్లు,కండక్టర్లుగా, యుద్ధం చేసే సైనికులుగా,పరిశోధనాత్మక విషయా లను వెల్లడిచేసే జర్నలిస్టులుగా,పాలన చేసే ప్రజా ప్రతినిధులుగా,రాష్ట్రాల్ని, దేశాల్ని నడిపే ఆఫీసర్లుగా, నేతలుగా,ఐటీ రంగంలో నిపుణులుగా,కొన్నిచోట్ల శాస్త్రీయ సంస్థలలో పరిశోధకులుగా కనిపిస్తున్నా, ఇంకా వారి ఉనికి బలపడాల్సి ఉంది. సైన్సు రంగం లో ఎందరో అమ్మాయిలు పిహెచ్‌డి వరకూ చదువు తున్నా, చాలామంది చివరకు చదువు చెప్పే బోధనా రంగానికే పరిమితమౌతున్నారు.ప దవ తరగతి చదువు పూర్తవ్వగానే సైన్సు గ్రూపు సెలెక్ట్ చేసుకుని డాక్టరు అవ్వుదామా, ఇటు లెక్కలు తీసుకుని ఇంజనీరు అవ్వుదామా అనే వరకూ అంతా బాగానే ఉంది. అలా డాక్టర్లూ, ఇంజనీర్లూ అయిన మహిళలు ఆయా వృత్తులలో తమ శారీరక, మానసిక శక్తిని, పరిమితులను దాటి పనిచేయడం ముదావహం.
సైన్స్ అండ్ టెక్నాలజీలో..
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మాత్రం మహిళలు కాస్త వెనకబడే ఉన్నారు. సైన్స్ అభివృద్ధికి ప్రామా ణికంగా పరిగణింపబడే నోబెల్ పురస్కారాలలో మగు వలు అగుపించడం లేదు. నూతన ఆవిష్కరణలు అతివల నుండి రావడంలేదు. పిచారులూ, జూకర్బ ర్గ్‌లూ సత్యానాదెళ్ళలూ కనిపించే టెక్ రంగంలో కూడా ఆ స్థాయిలలో మగువలు లేరు. జానకీ అమ్మా ళ్,టెస్సీ థామస్, వందనా కామత్, సునీతా విలియమ్స్ వంటివారు అడపాదడపా మెరుస్తున్నా, ఇంకా బోలెడు శూన్యం ఉంది మహిళలు భర్తీ చేయడం కోసం. సైన్స్ ఎప్పటినుండో ఉత్సుకత, నవీనత, ఎడతెగని జ్ఞానతృష్ణ మీద నడుస్తుంది. చరిత్రలో నిలిచిపోయే ఆవిష్కరణలు ఆడవారి ద్వారానే పురుడుపోసుకు న్నాయి. అటువంటి మహిళల కథలు కేవలం వారు సాధించిన శాస్త్రీయ విజయాలే కాదు, అవి ధైర్యం, స్థైర్యం, ఓపిక, పట్టుదల, ప్రతికూలమైనా అననుకూల మైనా పరిస్థితులను ఎదుర్కొని ఎదిగిన కబుర్లు. మేరీ క్యూరీ నుండి ఇప్పటి మహిళల వరకూ లింగ వివక్షను అధిగమించి తమ సామర్ధ్యాన్ని నిరంతరమÖ ప్రదర్శిం చిన వాళ్ళే. అలాగే పాఠ్య పుస్తకాలలో కూడా మహిళల శాస్త్రీయ విజయాలను పురుషుల కంటే తక్కువగానే చూపించడం జరుగుతుంది.తమకు మాదిరిగా, ప్రేరణగా మహిళలు లేకపోతే అటువంటి స్థానాలలో, స్థాయిలలో తమను తాము ఊహించుకోవడం అమ్మా యిలకు కాస్త కష్టం. ఆ విధమైన ప్రోత్సాహం ప్రస్తుతం తక్కువైంది.ఒకవేళ అన్ని అవరోధాలని దాటి శాస్త్రీయ రంగంలోకి అడుగుపెట్టిన మహిళలు తరచూ తమ పరిశోధన వాతావరణంలో కూడా సవాళ్ళను ఎదు ర్కొంటున్నారు.సీVAద్యోగులు,యాజమాన్యం మహి ళల విశ్వాసాన్ని తక్కువ చేసి,అవకాశాలను, వనరు లను తగ్గించి,వారి పురోగతిని అడ్డుకుంటున్నారు.
శాస్త్రీయ రంగంలో సవాళ్లు
మంచి విద్యకు అవకాశాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అమ్మాయిలకు ముఖ్యమైన అడ్డంకి. బల మైన విద్యా పునాది లేకపోవడం శాస్త్రీయ రంగంలో ముందుకు సాగడం, నిలదొక్కుకోవడం పెను సవాలు. సమాజంలో వేళ్ళూనుకుపోయిన కొన్ని అభిప్రాయాలు -అమ్మాయిలకి ఏదో చదివి, రాసేంత స్థాయి చదువు ఉంటే చాలు-వంటివి వాళ్లను శాస్త్రీయ విద్యవైపు పోకుండా నిరుత్సాహపరుస్తున్నాయి. ఆ కారణంగా డాక్టర్ల (అదీఎక్కువగా గైనకాలజిస్టులు) వరకూ చద వడం మాత్రమే కనిపిస్తుంది. ఈఎంసెట్‌లూ, నీట్ లలో విజయం సాధించని వాళ్లలో కొంతమంది ఎమ్మె స్సీలు చేస్తే, వాళ్లలో ఇంకా కొద్దిమంది పీహెచ్‌డీలు చేస్తారు. ఇక ఆ తరువాత అత్యధిక మంది లెక్చరర్లుగా స్థిరపడిపోతారు తప్ప పరిశోధనా రంగంలో ముందుకు వెళ్లలేకపోతున్నారు.
పరిశోధనాలయాలలో..
పరిశోధనాలయాలలో పరిశోధన విషయంలో, స్త్రీ పురుష వివక్ష ఎక్కువగా కనిపిస్తుంది. సమానమైన అర్హతలు ఉన్నా,పురుషులనే అధికంగా నియ మించు కోవడం కనిపిస్తుంది. అంతేకాకుండా, వారికే అధిక జీతం,అధిక తోడ్పాటు లభిస్తుంది.ఈ వివక్ష కేవలం పురుషుల నుండే కాకుండా స్త్రీలనుండి కూడా రావ డం ఆశ్చర్యం. పని ప్రదేశంలో ఇమిడిపోవ డానికి మహిళా శాస్త్రజ్ఞులు తమ ఆత్మగౌరవంతో పాటు ఆరోగ్యంవిషయంలో కూడా సర్దుకుపోవలసి వస్తుంది. పైగా, స్త్రీల నిర్ణయాలు తీసుకునే సమర్ధతపై పురుషు లు అనుమానంగా ఉండటం, తక్కువ చేసి చూడటం, వారి అభిప్రాయాలకు ప్రాముఖ్యత ఇవ్వక పోవడం వంటి చర్యలు తెలీకుండానే మహిళలలో ఒత్తిడి పెంచి,అనేక ఇబ్బందులకు కారణమౌతుంది. పరిశో ధనకు అవసరమైన గ్రాంట్లు, ప్రాజెక్ట్‌ల ఆమో దం వంటివి కూడా మహిళల కంటే పురుషులకే ఎక్కువగా లభిస్తున్నాయి.ఈఅంటే 22శాతం మాత్రమే ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. మహిళా పరిశో ధకుల కెరీర్ తక్కువకాలం ఉండటమే కాకుండా, తక్కువ జీతాలతో ఉంటుంది.వారి పనితనం పేరెన్నిక గన్నసైన్స్ జర్నల్స్ లో అంతగా కనిపించదు. వారికి ప్రమోషన్లు, ఇతర ప్రోత్సాహకాలు కూడా తక్కువే. మహిళలకు ఉన్న మరో సమస్య ఇంటి బాధ్యతలు. ఉద్యోగంలోనే కాకుం డా ఇంటి పనులలో కూడా లభించని ‘మగ’ సహాయం కారణంగా మానసిక,శారీరక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే, ప్రభుత్వ తోడ్పాటు ఈ విషయంలో చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది.ఇప్పటికే, మన ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఖఅశీwశ్రీవdస్త్రవ Iఅఙశీశ్రీఙవఎవఅt ఱఅ =వsవaతీcష్ట్ర Adఙaఅcవఎవఅt tష్ట్రతీశీuస్త్రష్ట్ర చీuతీtuతీఱఅస్త్ర (ఖI=Aచీ) వంటి స్కీమ్‌లు ప్రవేశపెట్టి, వాటి ద్వారా మహిళా శాస్త్రజ్ఞులను వారి వృత్తిపర అభివృద్ధికి సహాయం చేస్తున్నాయి. వివిధ ఎన్జీవోలు, కొన్ని విద్యాసంస్థలు శాస్త్రీయ విద్యను అమ్మాయిలకు అందించడంలో, ముఖ్యంగా వెనుకబ డిన ప్రాంతా లలో ముందుకు వస్తున్నాయి. శాస్త్రవేత్త లుగా, ఇంజ నీర్లుగా ఎదగాలనుకునే అమ్మాయిలకు ఇటువంటి తోడ్పాటు బలాన్ని ఇస్తుంది. ఇటీవల పెరుగుతూ వ్యాపిస్తున్న స్టార్ట్-అప్ వాతావరణం టెక్నా లజీ, ఆవిష్కరణ రంగాలలో కొత్త అవకాశాలను అంది స్తుంది.వివక్షను, అవమానాలనూ, చిన్నచూ పునూ అధిగమించి తమ కలలను సాకారం చేసుకో వాలంటే..మహిళలు,ముఖ్యంగా అమ్మాయిలు, ఆత్మవిశ్వాసం,అపార పట్టుదలకు,మొండితనం, ధైర్యం అలవర్చుకోవాలి.వీటికంటే ముందు స్వతహాగా తమ కు ఆసక్తి, సృజనాత్మకతతో పాటు తాము విజయం సాధిస్తే ఎందరో అమ్మాయిలకు ప్రేరణగా ఉంటా మనే పాజిటివ్ దృక్పథం అవసరం.
మార్గదర్శకత్వం అవసరం
సైన్సు అండ్ టెక్నాలజీ రంగాల్లో ఇప్పటికే విజయం సాధించిన మహిళలు ఆసక్తిగల ఉత్సాహవంతులు ప్రేరేపించేందుకు, స్ఫూర్తి నింపేందుకు, ప్రోత్సహిం చేందుకు,సమస్యలకు పరిష్కారాలు, మెళకువలు నేర్పేందుకు తరచూ సమావేశాలు నిర్వహిస్తుండాలి. ఇది నిరంతరం జరుగుతుంటే మేలు జరిగే అవకా శాలు మెండుగా ఉంటాయి. భవిష్యత్తులో మరింత మంది మహిళలు సైన్స్ రంగంలో ప్రవేశించి, నాయ కుల స్థానాలకు ఎదిగి, వారి ఆవిష్కరణలతో, సృజనా త్మకతతో,జ్ఞానంతో,నైపుణ్యంతో ప్రపంచాన్ని మార్చ వచ్చు అని ఆశించవచ్చు.
మహిళా మార్గదర్శకులు మేరీ క్యూరీ
మేరీక్యూరీ పనిలో కనికరంలేని స్వభావం కల మహిళ.1906లో ఆమె భర్త, సహపరిశోధకుడు అయి న పియరీ అకాల మరణం తర్వాత, వ్యక్తిగత దుఃఖం, శాస్త్రీయ సమాజాన్ని పీడిస్తున్న వివక్ష ఉన్నప్పటికీ క్యూరీ తన పరిశోధనను కొనసాగించారు. మహిళ లకు చాలా అరుదుగా గుర్తింపు లభిస్తున్న కాలంలో.. ఆమె రెండు నోబెల్ బహుమతులు గెలుచుకున్న తొలి వ్యక్తిగా నిలిచారు. ఒకటి భౌతిక శాస్త్రం (1903), మరొకటి రసాయన శాస్త్రం (1911).ఆమె ఆవిష్కర ణలు రేడియేషన్ థెరపీద్వారా క్యాన్సర్ చికిత్సకు పునాది వేసింది. లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడింది.
అడా లవ్‌లేస్
యాంత్రిక కంప్యూటింగ్ పరికరం అయిన అనలిటి కల్ ఇంజన్ కొరకు చార్లెస్ బాబేజ్‌తో పాటు కలిసి పనిచేస్తున్నప్పుడు అడా లవ్‌లేస్ ఈ యంత్రాన్ని అంక గణిత గణనల కంటే ఎక్కువగా ఉపయోగించవచ్చని గ్రహించారు. ఆమె స్వయంగా బెర్నౌలీ సంఖ్యలను లెక్కించడానికి ఒక అల్గారిథమ్‌ను వివరించే ప్రోగ్రాం ను రాశారు.దీనిని మొట్టమొదటి కంప్యూటర్ ప్రోగ్రా మ్‌గా భావిస్తారు. ఆమె అంతరదృష్టి ఆ కంప్యూటింగ్ యంత్రాలు గణనకు మించి అనేక రకాల పనులను చేయగలవని నిరూపించింది. ఆ విధంగా ఆధునిక కంప్యూటింగ్‌కు పునాది వేశారు. అయితే, అప్పట్లో ఆమె ఆలోచనలు కొట్టివేశారు.కానీ నేడు, అడా లవ్ లేస్ ప్రపంచంలోని మొట్టమొదటి కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా ప్రశంసించబడుతున్నారు.
రోసలిండ్ ఫ్రాంక్లిన్
రోసలిండ్ ఫ్రాంక్లిన్ కథలో విషాదం, విజయం రెండూ ఉన్నాయి. 1950వ దశకంలో బ్రిటీష్ జీవ భౌతిక శాస్త్రవేత్త అయిన ఫ్రాంక్లిన్, ఎక్స్-రే క్రిస్ట ల్లాగ్రఫీని ఉపయోగించి డిఎనఎ నిర్మాణంపై మార్గ దర్శక పరిశోధనను నిర్వహించారు.ఆమె తీసిన ఛాయాచిత్రాలు డబుల్ హెలిక్స్ నిర్మాణంలో కీలక మైన అంతర్దృష్టులను అందించాయి. వాటికి వాట్సన్, క్రిక్,విల్కిన్స1962లో నోబెల్ బహుమతిని అందు కున్నారు.ఫ్రాంక్లిన్ జీవితకాలంలో ఆమెకు తగిన గుర్తింపు ఇవ్వబడలేదు. ముఫ్పై ఏడు సంవత్సరాల వయస్సులో ఆమె అకాల మరణం తర్వాత, డిఎనఎ ఆవిష్కరణలో ఆమె పాత్ర పూర్తిగా గుర్తించబడింది.
కేథరీన్ జాన్సన్
కేథరీన్ జాన్సన్ కథ జాత్యహంకారం, లైంగిక వివక్ష నేపథ్యంలో పట్టుదల కథ. 1960లలో ఎనఎఎసఎలో పనిచేసిన జాన్సన్ ఆఫ్రికన్ అమెరికన్ గణిత శాస్త్రజ్ఞురాలు. అమె పని 1962లో జాన్‌గ్లెన్ యొక్క ఆర్బిటల్ ఫ్లైట్ సహా ప్రారంభ అంతరిక్ష యాత్రల విజయాలలో అంతర్భాÄగం. జాతి, లైంగిక అడ్డంకులు తీవ్రంగా ఉన్నప్పటికీ ఆ ప్రాజెక్ట్ కోసం జాన్సన్ వేసిన లెక్కలు చాలా కచ్చితంగా ఉండి, ఆమె సీVAద్యోగుల గౌరవాన్ని సంపాదించాయి. ఎనఎఎసఎలో జాన్సన్ పాత్ర పురుషాధిపత్య మిషతో చాలాకాలం వెలుగు చూడలేదు. కానీ 2015లో గణితం, అంతరిక్ష పరిశోధనలలో ఆమె చేసిన మార్గదర్శక పనిని గుర్తించారు. 97 సంవత్సరాల వయస్సులో జాన్సన్‌కు ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను ప్రదానం చేశారు.
మచ్చుకి మనవాళ్ళు..
మనదేశం గొప్ప మేధో సంప్రదాయాల భూమి. సామాజిక అడ్డంకులు, విద్యాపరమైన సవాళ్లు, గుర్తింపు లేమిని ఎదుర్కొన్నప్పటికీ%…% సైన్స్‌లో భారతీయ మహిళలు పట్టుదలతో, సంచలనాత్మక ఆవిష్కరణలు చేశారు. అలాగే భవిష్యత్ తరాలను ప్రేరేపించారు. మొదటి మహిళా భౌతిక శాస్త్రవేత్త బేగం రోక్వియా సఖావత్ హుస్సేన్ నుండి, బయో ఫిజిక్స్‌లో డాక్టర్ మంజు బన్సాల్ వరకు.. విజ యమనేది స్త్రీ-పురుషులతో ముడిపడి ఉండదని, అది ఉత్సుకత, అభిరుచితో ముడిపడి ఉందని నిరూ పించారు.
ఆనందీ గోపాల్ జోషీ
తనకంటే ఇరవై ఏళ్ళు పెద్దగా ఉన్న అతన్ని పెళ్ళాడి, పద్నాలుగేళ్ల వయసులో మగబిడ్డకు జన్మనిచ్చింది ఆనందీబాయి.అయితే వైద్య సౌకర్యాలు సరిగా లేక పోవడంతో ఆబిడ్డ పదిరోజుల తరువాత చనిపో యింది. ఈ సంఘటన ఆనంది జీవితంలో విషాదం తో పాటు దేశంలో వైద్యరంగంలో ఏదైనా చేయాలన్న తలంపుకి పురుడుపోసింది.భర్త తోడ్పాటుతో 1883లో ఆనందిబారు అమెరికాలో వైద్య శిక్షణ ప్రారంభించి, 1885లో ఎండి పట్టా పుచ్చుకున్నారు. ఆ మరుసటి సంవత్సరం కొల్హాపూర్‌లో ఆల్బర్ట్ ఎడ్వర్డ్ ఆసుపత్రిలో మహిళలవార్డ్‌కి ఇన్‌ఛార్జిగా సేవలందించారు. అయితే ఆమెకు తనకి 22 ఏళ్లు రాకముందే క్షయవ్యాధి సోకి మరణించారు. ఆమె నుండి ప్రేరణ పొందిన అనేక మంది మహిళలు ఆమె సాకారం చేసుకోలేకపోయిన కలలను సాధించి చూపారు.
జానకి అమ్మాళ్
జానకి అమ్మాళ్ వృక్షశాస్త్రజ్ఞురాలు. 1897లో జన్మిం చిన అమె మిచిగాన్ విశ్వవిద్యాలయంలో వృక్ష శాస్త్రం లో డాక్టరేట్ పొందారు. దేశంలోనే ఈ రంగంలో డాక్టరేట్ పట్టా పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. చెరకు మొక్క జన్యు నిర్మాణంపై, సిట్రస్ జాతి అధ్యయనానికి ఆమె కృషి ఘనమైనది. దేశం లోనే ఆధునిక వ్యవసాయ పరిశ్రమకు పునాది వేయ డానికి సహాయపడ్డారు. ప్రతిష్టాత్మకమైన లిన్నేయన్ సొసైటీ ఆఫ్ లండన్‌లో సభ్యురాలైన మొదటి భారతీ యురాలు కూడా ఆమె. లండన్‌లో పనిచేస్తున్న ఆమె, పండిట్ నెహ్రూ ఆహ్వానం మేరకు భారతదేశానికి తిరిగి వచ్చి, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. జానకీ అమ్మాళ్ 1977 లో పద్మశ్రీ పురస్కారం పొందారు. ఒక రకం పూల మొక్కకి ఆమె పేరు పెట్టారు కూడా. ఎనభై ఏడేళ్ల వయసులో 1884లో మరణించే సమయానికి ఆమె చెన్నైలోని ఒక ల్యాబ్‌లో పనిచేస్తున్నారు.
వందనా కామత్
భారతదేశ అంతరిక్ష కార్యక్రమ పితామహుడిగా విక్ర మ్ సారాభారు పరిగణించబడుతున్నప్పటికీ, ఇస్రో విజయాన్ని రూపొందించడంలో డా.వందనా కామత్ తెరవెనుక కీలకపాత్ర పోషించారు. భారతదేశ అంతరిక్ష విజ్ఞాన రంగంలో ప్రారంభ సంవత్సరాల్లో ఉన్న కొద్దిమంది మహిళల్లో ఒకరైన డాక్టర్ కామత్, ఇస్రో యొక్క మొదటి ఉపగ్రహాలు, ప్రయోగ వాహనాల అభివృద్ధికి గణనీయంగా సహకరించారు. సమాచార సాంకేతికత, ఉపగ్రహ వ్యవస్థలలో డా. కామత్ యొక్క నైపుణ్యం టెలీకమÖ్యనికేషన్స్, వాతావరణ అంచనా వ్యవస్థలు, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను నేరుగా ప్రభావితం చేసే ఉపగ్రహ కమÖ్యనికేషన్ రూపొందించడంలో సహాయపడింది.
టెస్సీ థామస్
‘క్షిపణి మహిళ’గా పేరుగాంచిన టెస్సీ థామస్ అగ్ని, పృథ్వీ క్షిపణులతో సహా క్షిపణి వ్యవస్థల అభివృద్ధిలో మార్గదర్శక పాత్ర పోషించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ థామస్ భారతదేశంలో క్షిపణి ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన మొదటి మహిళ.గ్లోబల్ మిస్సైల్ టెక్నాలజీ, డిఫెన్స్ సిస్టమ్స్‌లో భారతదేశాన్ని కీలకంగా మార్చడం లో ఆమె కృషి కీలకమైనది.అత్యంత సాంకేతికత, సాంప్రదాయకంగా పురుషాధిపత్య రంగంలో ఉన్న మహిళగా,భారతదేశ రక్షణ సామర్థ్యాలు, సాంకేతిక ఆవిష్కరణలలో అగ్రగామిగా ఉండేలా డా||థామస్ అడ్డంకులను అధిగమించారు.
ఈ కథనాలు సైన్స్ అంటే కేవలం కొత్త వాస్తవాలను కనుగొనడం లేదా కొత్త సాంకేతికతలను సృష్టించడం మాత్రమే కాదని గుర్తుచేస్తాయి. ఇది యథాతథస్థితిని సవాలు చేయడం,ఊహించడం, ప్రశ్నించడం, ప్రపం చాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి కృషి చేయ డం.అలా చేయడం ద్వారా సైన్స్‌లోని మహిళలు మనందరికీ గొప్పగా ఆలోచించడానికి, ధైర్యంగా కలలు కనడానికీ,అసాధ్యమైన వాటిని కొనసా గించడాన్ని నిరంతరం ప్రేరేపిస్తూనే ఉన్నారు..ఉంటారు. మరి ఆప్రేరణను అందిపుచ్చుకోడానికి మన అమ్మాయిలు సంసిద్ధులు కావాలి.
ఈ దినోత్సవము ఎందుకంటే?
ఒక దేశ ఆర్థిక అభివృద్ధిలో సైన్స్, టెక్నాలజీ, ఇంజ నీరింగ్, గణితం చాలా కీలకమైన అంశాలు. అయి నా, అభివృద్ధి చెందిన దేశాలు సహా, ప్రతి దేశంలోనూ ఈ రంగంలో లింగ సమానత్వం అంతంత మాత్రం గానే ఉంది. ఈకీలకాంశాల సాయంతోనే సుస్థిర అభివృద్ధి,వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, ఆరోగ్యంలో సమగ్రాభివృద్ధి సాధించడం వీలౌతుంది. అందుకు నిపుణులు, వారి నైపుణ్యం ఎంతో అవసరం. కేవలం పురుషులపైనే ఆధారపడితే అభివృద్ధి అనుకు న్నంతగా వేగిరం కాకపోవచ్చు. అందుకు మహిళా నిపుణులు పాలుపంచుకోవడం ముఖ్యం. సైన్స్ అండ్ టెక్నాలజీ కమÖ్యనిటీలలో మహిళలు, బాలికలు కీలకపాత్ర పోషిస్తున్నారు
సైన్స్ పరిశోధనల పట్ల ఆసక్తి పెంచాలి!
దేశంలో కేరళ వంటి కొన్ని రాష్ట్రాలలో తప్ప వివిధ రంగాల్లో మహిళా అభివృద్ధి పెద్దగా జరగడం లేదు. ఇంకా దేశంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగు తూనే ఉన్నాయి. అందువల్ల బాలికలు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. బాలికలు భవిష్యత్తులో మహిళా శాస్త్రవేత్తలుగా ఎదగాలంటే,పాఠశాల స్థాయిలోనే వారికి సైన్స్ పరిశోధనలపట్ల ఆసక్తిపెంచాలి. ఉన్నత పాఠశాలల్లో సైన్స్ ప్రయోగశాలలను అన్ని వసతులతో ఏర్పాటు చేయాలి. ఇందుకు అవసరమైన నిధులు కేటాయించాలి. ఇన్స్పైర్ పథకం కింద ఎక్కువ మంది బాలికలని ఎంపిక చేయాలి. పరిశోధనా రంగం వైపు వారిని ప్రోత్సహించాలి.విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనలు పెంచడానికి తగిన కృషి చేయాలి. బాలిక లపై తరతరాలుగా వస్తున్న ఆంక్షలని తొలగించేం దుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. అప్పుడే మహిళా శాస్త్రవేత్తలుగా మరింత మంది ఎదుగుతారు.