చెలమలో నీళ్లకోసం కిలోమీటర్ల దూరం నడక

మన్యంలో భూగర్భజలాలు అడుగంటడంతో దప్పిక తీర్చే నీటిచుక్కకోసం గిరిజన పల్లెలు అల్లాడి పోతున్నాయి. ఈ పల్లెల్లోని గిరిజన మహిళలు రెండు బిందెల మట్టి నిండిన నీళ్లకోసం అన్ని పనులూ మాను కుని కిలోమీటర్లు దూరం వెళ్తున్నారు.ఇప్పుడే కాదు, ప్రతీ వేసవిలో వీళ్లను నీటి కష్టాలు వెంటాడుతాయి.మురికి నీళ్లే తాగిరోగాల బారిన పడేలా చేస్తాయి.ఉత్తరాంధ్రలో పాడేరు,సీతంపేట,పార్వతీపురం ఐటిడి ఎలపరిధిలో మొత్తం 39మండలాలు 7వేలకు పైగా గ్రామాలు ఉన్నాయి.వీటిలో దాదాపు అన్ని గ్రామాల్లో నీటి సమస్య ఉంది.ఎక్కువ గ్రామాల్లో తాగు నీరు అందక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బిందె నీళ్లకోసం కిలోమీటర్ల దూరం నడుస్తున్నారు. బోర్లు పనిచేయకపోవడం, బావులు పాడుబడడంతో ఇక్కడి గిరిజనులు ఊట చెలమల్లో నీటిని,చివరకు పంటలకుపెట్టే నీటినే తాగిదప్పిక తీర్చుకుంటు న్నారు.- గునపర్తి సైమన్ 


భూగర్భజల శాఖ అధికారిక లెక్కలు కూడా ఈ మÖడు ఐటీడీఏల పరిదిలో భూగర్భ జలమట్టం తగ్గిపోయిందని చెబుతున్నాయి.2024మార్చిలో 5.5 మీటర్లున్న నీటిమట్టం ఈసారి 6.2మీటర్లకు పడి పోయింది.విశాఖ ఏజన్సీలోని గిరిజన గ్రామం పెదబ యలులో భూగర్భ జలాలు 8.5 మీటర్ల నుంచి 10 మీటర్ల లోతుకు చేరాయి.అరకులో కూడా ఇవి ఒక మీటరు వరకూ పడిపోయాయి. అటు విజయనగరం గిరిజన ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. కురుపాం, ఎస్ కోట మండలం బొడ్డవరల్లో దాదాపు రెండు మీటర్ల వరకూ భూగర్భ జలాలు పడిపోయాయి.ఇక వర్షపాతం కూడా అంతంతమాత్రంగానే ఉంది. శ్రీకా కుళంలో సాధారణ వర్షపాతం ఉంటే, విశాఖ, విజ యనగరం జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమో దైంది. ఇటీవల వరుసగా పెథాయ్, తిత్లి, ఫొనీ లాంటి వరుస తుపాన్లు వచ్చినా భూగర్భ జలమట్టంలో ఎలాంటి మార్పులూ రాలేదు.విశాఖపట్నం జిల్లా డుంబ్రిగూడ మండలం కొర్రాయి పంచాయితీలోని బురుడివలస, నిమ్మగడ్డ, లోగిలి గ్రామాలలో బీబీసీ పర్యటించింది. అక్కడ నీటి కోసం కిలోమీటర్లు నడిచివెళ్లే గిరిజన మహిళలను పలకరించింది.
నీటికోసం నడక
వారిలో గుడ్డి శాంతి అనే మహిళ “నీటి కోసం రెండు కిలోమీటర్లు నడవాలి.రోజులో ఎక్కువ సమయం నీటిని వెతుక్కోవడంలోనే సరిపోతుంది.ఇంక వేరే పనులు చేసుకోవడానికి ఉండడం లేదు. పిల్లలను స్కూలుకు కూడా తీసుకెళ్లలేని పరిస్థితి”ఉంది. రాణి “రోజూ నీటి కోసం మÖడు కిలోమీటర్లు నడుస్తు న్నాం.ఊర్లో బోర్లు ఉన్నా పనిచెయ్యడం లేదు. ఆఫీ సర్లకు చెప్పినా లాభం లేకుండా పోయింది” అన్నారు. 150 మంది ఉన్న బుడ్డివలసలో తాగునీటి కోసం కొట్టుకునే పరిస్థితి వస్తోందని మహిళలు చెప్పడం ఇక్కడ తాగునీటి సమస్య తీవ్రతను చెబుతోంది.” ఎండైనా,వర్షం ఉన్నా ఈబురద నీళ్లే తాగు తాం. దాంతో జ్వరాలు వస్తున్నాయి. కానీ వేరే దారిలేదు. ఆఖరికి ఈ నీళ్లు తాగి జ్వరాలు వచ్చినవాళ్లకు సాయం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాం”అని రాణి చెప్పారు.
అసలేంటి సమస్య?
ఏజన్సీ ప్రాంతాల్లో వాతావరణంభిన్నంగా ఉంటుంది. మైదానాల్లో ఉన్నట్టు కుళాయిలు, చెరువుల నుంచి పైపులైన్లు వేయడం చాలా కష్టం.కానీ ఇక్కడ తాగునీటి సౌకర్యం కల్పించడం అంతకష్టం కూడా కాదని స్థానికులు చెబుతున్నారు.”ఊటగడ్డల నీటి కోసం చెక్ డ్యాంలు నిర్మించి,బోర్లు, కుళాయిలు బాగు చేయిస్తే తక్కువ నిధులతోనే ఈసమస్య తీర్చవచ్చు”అని గిరిజన సంఘం నాయకుడు నరేంద్ర చెప్పా రు.”2014ఎన్ని కల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటింటికి 20లీటర్ల మంచినీళ్లు ఇస్తామని తెలుగుదేశంవాళ్లు హామీ కూడా ఇచ్చారు. ఇంటిం టికి కుళాయిలు వేస్తామన్నారు. కానీ అది ఎక్కడా జరగలేదు,.కనీసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసినా మా దప్పిక తీరు తుంది” అన్నారు.
ప్రభుత్వం ఏం చేస్తోంది?
ప్రస్తుతం ఏజెన్సీలో రాష్ట్ర ప్రభుత్వం క్రాష్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు గ్రామాల్లో ఉన్న హ్యాండ్ పంపులు, నీటి పథకాలను గుర్తించి మరమ్మతులు చేయిస్తు న్నారు.ఒక్క అరకు పరిధిలో ఇప్పటి వరకూ 82 పంపులను బాగుచేశామని వాటర్ వర్క్స్ ఇంజినీర్లు చెప్పారు.”వాటర్ గ్రిడ్ పధకం ఫేజ్-1 పనులు కూడా ఇప్పటికే ప్రారంభించారు. దీనికి సంబంధించి సర్వే కూడా పూర్తయింది.త్వరలో వాటర్ గ్రిడ్ ఫేజ్-2లో నీటిని అందిచే ప్రయత్నం చేస్తున్నాం. త్వరలో అన్ని గ్రామాలకు నీళ్లు అందిస్తాం” అని జూనియర్ ఇంజి నీర్ శ్రవణ్ చెప్పారు.
వ్యాపిస్తున్న రోగాలు
ప్రభుత్వం ఒకవైపు పనులు జరుగుతున్నాయని చెబుతుంటే, మరోవైపు కలుషిత నీటిని తాగడంతో మన్యంలో రోగాలు వ్యాపిస్తున్నాయి.కలుషిత నీటిని తాగడం వల్ల అమీబియాసిస్, విష జ్వరాలు, డయేరి యా వస్తున్నాయని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. ఇక నీటి కోసం ఎక్కువ సార్లు తిరగకుండా నిల్వ చేసుకుందామని అనుకుంటే మరో సమస్య ఎదురవు తోంది. నీటి నిల్వ వల్ల దోమలు చేరి మలేరియా వ్యాప్తిస్తోంది.దీంతో నీటిని కాచిచల్లార్చి తాగాలంటూ ప్రభుత్వ వైద్యులు ప్రచారం చేస్తున్నారు.”ఈనీళ్లు తాగడం వల్ల జ్వరాలు, డయేరియా కేసులు ఎక్కువ వస్తున్నాయి. అందుకే మేం అవగాహనా కార్యక్రమా లు చేపడుతున్నాం” అని అరకు ఏరియా హాస్పిటల్ డాక్టర్ బానుప్రియ చెప్పారు.
తవ్వకాలతోనే సమస్య
ఏజన్సీ ప్రాంతంలో ఎక్కువగా జరిగే తవ్వకాలు, పోడు వ్యవసాయం వల్లే మన్యంలో భూగర్భ జలాలు తగ్గుతున్నాయని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతు న్నారు.“మైనింగ్ వల్ల కొండలు మాయం అవుతున్నా యి దాంతో ఎక్కడా నీళ్లు నిలబడడం లేదు. ఇటు గిరిజనులు పోడు వ్యవసాయం కోసం చెట్లు ఎక్కువగా కొట్టేస్తున్నారు. పచ్చదనం లేకపోవడం వల్ల కూడా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. చెట్లకు నీటిని పట్టి ఉంచే గుణం ఉంటుంది. అవి లేక చెలమలు ఎండిపోతున్నాయి”అని వెత్త రత్నం చెప్పారు. “గతం లో పోడు వ్యవసాయం చేసే గిరిజనులు ఒక చెట్టు కొట్టేస్తే ఇంకో మొక్కను నాటేవారు. ఇప్పుడు అలా చేయడం లేదు.దాంతో ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి. తవ్వకాలు ఆపేయడంతోపాటు మొక్కలు ఎక్కువగా నాటడం వల్ల భూగర్భ జలాలు పెంచచ్చు” అన్నారు.‘60 శాతం గ్రామాలకు తాగు నీరుఅందించాం.ఇంకా40శాతంగ్రామాలకు అందిం చాలి’ఈ కథనంపై ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు సివేరి అబ్రహం స్పందిస్తూ.. రూ.100 కోట్లతో ఏజన్సీ ప్రాంతాల్లో తాగునీటి ప్రాజెక్టులను రూపొందించాం. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ట్యాంకులు నిర్మించాం. అయితే, భౌగోళికంగా ఏజన్సీలో భిన్నమైన వాతావరణం ఉండటంతో బోర్లు పడటం లేదు. అయినా, పడినచోట బోర్లకు సోలార్ సదుపాయం ఏర్పాటు చేశాం. 60 శాతం గ్రామాలకు తాగునీరు అందించాం. ఇంకా 40 శాతం గ్రామాలకు అందించాలి. వాటర్ గ్రిడ్ మొదటి దశ ఇప్పుడు నడుస్తోంది. మÖడో దశ నాటికల్లా అన్ని గ్రామాలకూ తాగునీరు అందిస్తాం” అని తెలిపారు.
అల్లూరి జిల్లా పాడేరు ప్రాంతాల్లో నీటికి కటకట
ఏజెన్సీ వ్యాప్తంగా 244 గ్రామ పంచాయతీల పరిధిలో 3,803 గ్రామాల్లో లక్షా 55 వేల 756 గిరిజన కుటుంబాలున్నాయి. వాటిలో 2,025 గ్రామాల్లో పూర్తిగా,1,778 గ్రామాల్లో పాక్షిక తాగునీటి సదు పాయాలున్నాయని అధికారుల రికార్డులు చెబుతు న్నాయి. అలాగే ఏజెన్సీలో ప్రస్తుతం అన్ని గ్రామాలకు ఏదో రకమైన తాగునీటి సదుపాయం ఉందనేది అధికారుల వాదన.కాగాఇప్పటికీ సగానికిపైగా పల్లెల్లో తాగునీటి కోసం గిరిజనులు ఇబ్బందులు పడుతున్నా రనేది జగమెరిగిన సత్యం. వేసవి నేపథ్యంలో తాగు నీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ వంటివి కాగితాలకే పరిమితమవ్వగా, నిధులు సక్ర మంగా విడుదల కాని పరిస్థితుల్లో జల్ జీవన్ మిషన్ వంటివి ఆచరణలోకి రాని దుస్థితి ఏర్పడింది. దీంతో అన్ని విధాలా గిరిజనానికి తాగునీటి కష్టాలు తప్పడం లేదు.
ఆశించిన ఫలితమివ్వని తాగునీటి పథకాలు
మన్యంలోని గిరిజనులకు తాగునీటి సదుపాయాలు కల్పించేందుకు 3,129 చేతి బోర్లు,2,200 సింగిల్ విలేజ్ తాగునీటి పథకాలు,10 బహుళ గ్రామ తాగు నీటి పథకాలు,750కి పైబడి సోలార్ నీటి పథకాలు న్నాయి.వాస్తవానికి ఏజెన్సీ వ్యాప్తంగా 3,803 గ్రామా లుండగా6,089 తాగునీటి(నీటి పథకాలు, బోర్లు) వనరులున్నాయి. అయినప్పటికీ సగానికిపైగా గిరిజన పల్లెల్లోని ప్రజలు గ్రామాలకు సమీపంలో ఉన్న ఊట గెడ్డలపైనే ఆధారపడుతున్నారు.గ్రామీణా నీటి సరఫరా విభాగం నిర్మిస్తున్న తాగునీటి పథకాలు నాణ్యతగా లేకపోవడంతో దీర్ఘకాలం పని చేయడం లేదనేది ప్రధాన ఆరోపణ.దీంతో నీటి పథకం నిర్మించిన ఒకటి లేదా రెండు సంవత్సరాల్లోనే మÖలకు చేరుతున్నది. ఫలితంగా గ్రామాల్లో నీటి పథకాలున్నా ప్రజలకు నీరందని దుస్థితి కొనసాగుతున్నది. అలాగే పల్లెల్లో నీటి పథకాలను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు నిర్మిస్తుం డగా, వాటి నిర్వహణ బాధ్యత పంచాయతీది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నుంచి పంచాయ తీలకు ఎటువంటి నిధులు లేకపోవడంతో తాగునీటి పథకాల వైపు పంచాయతీ యాజమాన్యం కన్నెత్తి చూసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎక్కడిక క్కడ తాగునీటి పథకాలు మరమ్మతులకు గురై మÖ లకు చేరుతున్నాయి. ఉదాహరణకు పాడేరు మండలం గబ్బంగి పంచాయతీ పసనపల్లి గ్రామంలో 2018లో రూ.18.50 లక్షల వ్యయంతో తాగునీటి పథకాన్ని నిర్మించారు.కానీ దానికి సరైన నిర్వహణ లేకపోవడం తో మÖలకు చేరింది. ఇలా ఏజెన్సీలో పదుల సంఖ్యలో నీటి పథకాలు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. ఇవే కాకుండా సోలార్ ఆధారంగా పని చేసే నీటి పథకాల పరిస్థితి మరీదా రుణం.వాటికి చిన్నపాటి మరమ్మతులు వచ్చినా పట్టించుకున్న దాఖ లాలు లేవు.దీంతో అనేక గ్రామా ల్లో తాగునీటి పథకా లున్నా వాటి నిర్వహణపై పాల కులు శ్రద్ధచూ పని కారణంగా నిరుపయోగంగా మారుతున్నాయి. ఫలి తంగా గిరిజనులు ఊటగెడ్డలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది.
మన్యం వాసులకు ఊటగెడ్డ నీరే ఆధారం
ఏజెన్సీలోని గిరిజన పల్లెలకు పక్కాగా రక్షిత నీటిని అందించని కారణంగా అధిక సంఖ్యలోని గిరిజన పల్లెల్లో ఊటగెడ్డలే ప్రధాన తాగునీటి వనరులుగా ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ఆర్‌డబ్ల్యూఎస్ అధికా రుల బాధ్యతా రాహిత్యం, పంచాయతీల్లో పాలన పడకేయడం వంటి కారణాలతో గిరిజనులకు గుక్కెడు నీరు దొరకని దుస్థితి కొనసాగుతున్నది. ముఖ్యంగా ఏజెన్సీలో మత్స్యగెడ్డను ఆనుకుని ఉన్న ముంచం గిపుట్టు, పెదబయలు, డుంబ్రిగుడ, జి.మాడుగుల మండలాల్లోని గిరిజన పల్లెల్లో స్థితి మరీ దారుణం. మత్స్యగెడ్డ తీరంలోని చెలమలు చేసుకుని నీటిని పట్టుకుంటున్నారు.ఇతర మండలాల్లో పంట పొలాలకు సమీపంలోని ఊటగెడ్డలను ఆశ్రయి స్తున్నారు.పెదబయలు మండలం బొడ్డగొంది, లింగేటి,పన్నెడ,గుల్లెలు, హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ పంతెలచింత, ముంచంగి పుట్టు మండలం చీపురుగొంది, దొరగూడ, డెంగా గుడ, కర్లాపొదర్ గ్రామాల్లోని గిరిజనులు దూర ప్రాంతంలోని ఊటగెడ్డల నుంచే నీటిని మోసుకు వస్తున్నారు. ఇలా ఏజెన్సీలో వందల సంఖ్యలో గిరి పల్లెల్లో దాహం కేకలు వేస్తున్నా పాలకులకు అవేవీ వినిపించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి గిరిజన పల్లెల్లోని తాగునీటి సమస్యలకు పరిష్కారం చూపి గిరిజనుల గొంతులు తడపాలని పలువురు కోరుతున్నారు.