హెడ్ ఫోన్ల ప్రభావం వినికిడి లోపం

ప్రపంచ వ్యాప్తంగా కొన్నేళ్లగా హెడ్‌ఫోన్స్ వాడకం,పెద్ద శబ్దాలతో మÖ్యజిక్ ఆలకించడం విపరీ తంగా పెరిగింది.ఈనేపథ్యంలో హెడ్‌ఫోన్స్, ఇయర్ బడ్స్,వేదిక వద్ద భారీస్థాయి శబ్దాలు వినడం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 100కోట్లకు పైగా యుక్తవయస్సు పిల్లలు,యువతలో వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉం దని తాజా అధ్యయనం వెల్లడించింది.ఇందుకు సంబం ధించి అధ్యయన నివేదిక బీఎంజీ గ్రోబల్ హెల్త్ జర్నల్ లో ప్రచురితమైంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం,ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 43కోట్ల మంది వినికిడి లోపంతో బాధపడుతున్నట్లు అంచనా. ఈనేప థ్యంలో సురక్షితంకాని శ్రవణ పరికరాలు (పీఎల్‌డీ) వినియోగంపై అమెరికాలోని మెడికల్ యÖనివర్శిటీ ఆఫ్ సౌత్ కరోలినా పరిశోధకుల బృందం అధ్యయనం చేపట్టింది. – యడవల్లి శ్రీనివాసరావు

ఇందులో భాగంగా ఇంగ్లీష్,ఫ్రెంచ్,స్పానిష్, రష్యాల్లోప్రచురితమైన 33అధ్యయనాలను విశ్లేషిం చింది.సాధారణంగా పెద్దవారిలో 80 డెసిబెల్స్,పిల్లల్లో 75డీబీ శబ్దం మించకూడదు.కానీ ప్రస్తుతం శ్రవణ పరికరాలు వినియోగించే వారు సరాసరి 105 డెసిబెల్ (డీబీ)శబ్దాన్ని వింటున్నట్లు నివేదికలు చెబుతు న్నట్లు గుర్తించారు. ఇలాగే కొనసాగితే రానున్న రోజు ల్లో యువతలో వినికిడి సమస్య పెరిగే అవకాశాల ముందని పరిశోధకులు హెచ్చరించారు.ముఖ్యంగా ఇటీవల పెరిగిన స్మార్ట్‌ఫోన్ల వినియోగంలో హెడ్ ఫోన్లు,ఇయర్‌బడ్స్ వంటి వ్యక్తిగత శ్రవణ పరికరాలతో (పీఎల్‌డీ)వినడంతోపాటు భారీ శబ్దాలుండే మÖ్యజిక్ వేదికలకు హాజరు కావడంవల్ల యువత వినికిడి లోపం బారినపడే ముప్పు ఉందన్నారు.అందుకే పౌరుల ఆరో గ్యం దృష్ట్యా..శబ్దాలపై నియంత్రణ పెంచి సురక్షిత శ్రవణ విధానాలను అమలు చేయడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రస్తుతం చాలామంది చెవుల్లో హెడ్‌ఫోన్లు పెట్టుకుని మాట్లాడటం,పాటలు వినడం, సినిమాలు, రీల్స్,యÖట్యూబ్ వీడియోలు చూడటం చేస్తున్నారు. అలా చేస్తే వెంటనే ఏమీకాదు.కానీ ఐదేళ్ల తర్వాత హెడ్‌ఫోన్ల ప్రభావం వినికిడి లోపంతో బయటపడు తుంది. ప్రతిఒక్కరికి ఏదో ఒక దశలో వినికిడి లోపం వస్తుంది. పిల్లల్లో ఎక్కువగా పుట్టుకతోనే కనిపిస్తుంది. ముఖ్యంగా గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి జ్వరానికి వాడే మందులు,మేనరిక వివాహాలవల్ల పిల్లలు వినికిడి లోపంతో జన్మిస్తారు.ప్రపంచ వినికిడి దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 3న జరుపుకుంటారు.చెవి సమ స్యలు,వినికిడి లోపాన్ని నివారించడం, వినికిడి సంరక్షణ(ఖీతీశీఎ ్పుశీఎఎuఅఱtఱవs tశీ ్పుశ్రీass తీశీశీఎs:Hవaతీఱఅస్త్ర caతీవ fశీతీ వఙవతీy cష్ట్రఱశ్రీd ` 2026) గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈరోజును నిర్వహిస్తుంది.‘కమÖ్యనిటీల నుండి తరగతి గదుల వరకు: ప్రతి బిడ్డకు వినికిడి సం రక్షణ”`2026 నినాదం.వినికిడి లోపాన్ని నివా రించడం,చిన్న పిల్లలలో వినికిడి సమస్యలను ముం దుగా గుర్తించడం, వారికి సకాలంలో చికిత్స అందిం చడం ఈ ఏడాది లక్ష్యాలు.వినికిడి లోపం పట్ల ఉన్న అపోహలను తొలగించి,ఆరోగ్యకరమైన వినికిడి అలవాట్లను పెంపొందించడం..వినికిడి సంరక్షణ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఈ ఏడాది ప్రాముఖ్యతలు.

ప్రభావాలు.. పరీక్షలు..
వినికిడి సున్నితత్వాన్ని కొలవడానికి ఇఎన్‌టీ వైద్య విభాగంలో పిల్లలు, పెద్దలతోపాటు డైయిక్ కేంద్రంలో పిల్లలకు ఆడియోమెట్రీ పరీక్షలు చేస్తారు. చెవి లోపల నరాలు దెబ్బతిన్నది తెలుసుకోవడానికి ఎంఆరఐ, సిటీ స్కానింగ్ పరీక్షలు చేస్తారు.వినికిడిలోపం ఉన్నట్లు నిర్ధారణ అయితే పరికరాలు,రెండేళ్ల పిల్లలకు కోక్లి యర్ ఇంఫ్లాంట్లు,వైద్య చికిత్సలు,శస్త్రచికిత్సలు చేయా ల్సి వస్తుంది.వినికిడి సమస్యలకు చెవిలో హెడ్‌ఫోన్లు వాడటం,పెళ్లిళ్లలో డీజే అధిక శబ్దాలకు గురికావడం, చెవిలో గులిమి పేరుకుపోవడం,చెవి ఇన్ఫెక్షన్లు, ద్రవం పేరుకుపోవడం,బయటి, మధ్య చెవిలో అడ్డంకులు, లోపలి చెవి (కోక్లియా) శ్రావణ నాడి దెబ్బతినడం, వృద్ధాప్య, జన్యుపరమైన కారణాలు.శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉన్నప్పుడు సంభాషణలు అర్థం చేసుకోవడంలో ఇబ్బందిపడటం,సామాజిక ఒంటరితనం,ఎవరితోనూ సరిగా మాట్లాడలేక పోవ డం,నిరాశకు దారితీస్తుంది. వృద్ధుల్లో వినికిడి క్షీణత, వైకల్య ప్రమాదాన్ని పెంచుతుంది. పనితీరు తగ్గడం వల్ల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.వినికిడి లోపం ఒకే సారి రాదు. క్రమంగా పెరుగుతుంది. ఇతరులకు చెప్పిందే పదేపదే చెప్పడం.గట్టిగా చెప్పమని అడగ టం.టీవీ,ఫోన్ వాల్యూమ్‌లను సాధారణం కంటే ఎక్కు వగా పెంచడం. డోర్‌బెల్స్,అలారాలు,పిల్లలు గట్టిగా అరవడాన్ని అడ్డుకోవడం వంటి సంకేతాలు సమస్య తీవ్రతను పట్టిచూపుతాయి.
వినికిడి శక్తి చాలా విలువైంది…
వినికిడి శక్తి చాలా విలువైంది.దీన్ని కోల్పోయినవారు ఎదుర్కొనే సమస్యలు తీవ్రస్థాయిలో ఉంటాయి. ఈ సమస్యతో బాధపడేవారికి సాధారణంగా మాట్లాడితే వినిపించదు.గట్టిగా అరవాల్సి ఉంటుంది. అందుకే ఎక్కువ మంది వారితో మాట్లాడటానికి వెనుకంజ వేస్తుంటారు.సదరు వ్యక్తులు మానసికంగా ఇబ్బంది పడుతూ.. మరికొన్ని జబ్బులకు చేరువవుతుంటారు. ఇలాంటి బాధితులు ప్రపంచవ్యాప్తంగానూ ఉన్నారు. అయితే ఏటేటా వీరి సంఖ్య పెరుగుతుండటం ఆందో ళన కల్గించే విషయం. పూర్తిగా చెవులు వినిపించని వారు.దానిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో సమస్య తీవ్రమై,మరింతగా ఇబ్బందులు పడతారు. వినికిడి లోపాన్ని చాలామంది పెద్దగా పట్టించుకోరు. వయస్సు తో పాటు వస్తుందని తేలిగ్గా తీసుకుంటారు.కానీ ఇది శబ్ధాలు వినపడక పోవడంతోనే ఆగిపోవడం లేదు. మతిమరుపు, కుంగుబాటు, కింద పడిపోవడం వంటి ఇతర సమస్యలకు దారితీస్తుంది.చివరకు గుండె జబ్బు ముప్పు పెరగడానికి కారణం అవుతుంది. విని కిడి లోపం ఆరంభమైన ఐదేళ్లలోనే డిమెన్షియా ముప్పు 50శాతం,కుంగుబాటు 40 శాతం పెరుగుతున్నట్లుగా పరిశోధనల్లో వెల్లడైంది.
లోపాలు.. చికిత్సలు..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఎదు ర్కొంటున్న సమస్యల్లో వినికిడి లోపం కూడా ఒకటి. మనదేశంలో సుమారు 15కోట్ల మందికిపైగానే ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.రాబోయే కాలంలో యువత ఎక్కువగా సమస్య బారినపడే ప్రమాదం ఉంది.కంప్యూటర్లు,ల్యాప్‌టాప్‌లపై పనిచేస్తూ గంటల తరబడి హెడ్‌సెట్లు,హెడ్‌ఫోన్లు, ఇయర్‌బర్డ్స్,వైర్‌లెస్ బ్లూటూత్‌లు వంటివి వాడేస్తున్నారు. రోజుకు గంటకు మించి వాడకూడదు. కానీ నేటి రోజుల్లో 10నుంచి 15గంటల వరకూ వాడుతున్న వారు ఉన్నారు. ఇది రాబోయేకాలంలో తీవ్రప్రభావాన్ని చూపబోతోంది.
ఒకచెవిలో సమస్య ఉన్నవారు ఎలాగోలా నెట్టు కొస్తుంటారు.వారికి స్వల్పంగా మాటలు వినిపిస్తాయి. కానీ సరిగా అర్థంకావు.ఒకచెవి పాక్షిక వినికిడి నష్టం నుంచి మొత్తం చెవిటితనం వరకూ వివిధ రూపాల్లో సమస్య తీవ్రరూపం దాల్చుతుంది.కొందరికి ఒక చెవి లో ఎక్కువ,మరో చెవిలో తక్కువగా సమస్య ఉండి ఉండొచ్చు.నిపుణులైన ఆడియాలజిస్టుతో వినికిడి పరీక్ష(ప్యూర్‌టోన్ ఆడియోమెట్రీ) చేయించుకుంటే ఎలాంటి రకం వినికిడి లోపమో స్పష్టంగా తెలు స్తుంది. ఏస్థాయి (ప్రీక్వెన్సీ) మాటలు వినిపించటం లేదో కూడా బయటపడుతుంది.తీవ్రతను బట్టి చికిత్స లు ఉంటాయి.
స్థాయిలు ఎలాగుంటాయంటే..
వినికిడిలోపం 30-40 డెసిబెల్స్ ఉంటే సమస్య స్వల్పంగా,50-60ఉంటే మధ్యస్తంగా,70-80 మధ్య ఉంటే తీవ్రంగా..90 డెసిబెల్స్ కన్నా ఎక్కువ ఉంటే అత్యంత తీవ్రంగా ఉన్నట్లుగా గుర్తించొచ్చు. వినికిడి లోపం 30 డిసిబెల్స్ కన్నా ఎక్కువ గలవారికి వినికిడి సాధనం అవసరం అవుతుంది. దీనిని సరిగ్గా ప్రోగ్రా మింగ్ చేయటం కూడా ముఖ్యమే. ఏఫ్రీక్వెన్సీలో ఎంత వినికిడి తక్కువుందో గుర్తించి,పరికరంలో దాన్ని అంతవరకూ పెంచాల్సి వుంది. అప్పుడే మాటలు సరిగా వినిపిస్తాయి. అందుకే నైపుణ్యం గల ఆడియాల జిస్ట్‌తో పరీక్షించి, దానిని ఏర్పాటు చేయించుకోవాలి. లేకపోతే ఉపయోగం ఉండదు. వినికిడి యంత్రాన్ని చెవి మార్గంలో సరిగ్గా అమర్చటం కూడా కీలకమే. లేకపోతే రీ సౌండ్ రావొచ్చు.యంత్రంతో చెవి మార్గం నిరంతరం మÖసుకుపోతే దురద, అసౌకర్యం తలె త్తొచ్చు. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్‌ను సంప్రదించి, చెవులను శుభ్రం చేసుకుంటే ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. వినికిడి లోపంతో బాధపడే కన్నా పరికరం వాడుకోవటమే మేలు. కచ్చితమైన వినికిడి పరీక్ష చేయించుకొని, పరికరాన్ని సరిగా సెట్ చేసుకుని,చెవి మార్గంలో సరిగ్గా అమర్చుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వినికిడి లోపం తీవ్రం గా,అత్యంత తీవ్రంగా ఉన్న వారికి కాక్లియర్ ఇంప్లాం ట్ సర్జరీ ఉపయోగపడుతుంది.
ఆహార అలవాట్లూ కీలకమే..
వంశపారంపర్యంగా వినికిడిలోపం వచ్చే అవకాశా లు ఎక్కువగా ఉన్నాయి.శిశువు గర్భంలో ఉన్న ప్పుడు సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడం, అధి కంగా మద్యం తాగడం,ఎక్కువసార్లు ఎక్స్‌రే తీయించు కోవడం, ఆక్సిజన్ అందకపోవడం తదితర కారణాల మÖలంగా వినికిడి లోపం వస్తుంది. దీంతో పాటు నగరాలు, పట్టణ ప్రాంతాలకు చెందినవారు ఎక్కువ శబ్దాలు వినడం మÖలంగా వినికిడి సమస్యలు ఎదు ర్కోవాల్సి వస్తుంది. పుట్టుకతో వినికిడి లోపం ఉన్న వారికి ఎనిమిదేళ్లు వచ్చేసరికి మాట కూడా పడిపోయే అవకాశం ఉంటుంది.వాహనాల శబ్దంద్వారా 120-140 వరకు,లౌడ్ స్పీకర్ల ద్వారా 200,చరవాణి ద్వారా 60నుంచి 70,సైరన్ వాహనాల ద్వారా 130 నుంచి 140 వరకు, బాణసంచా నుంచి 180 నుంచి 200 డెసిబుల్స్ వరకు శబ్దం వస్తుంది.
గుర్తించటం ఇలా…
ఓటోస్కోప్‌తో చెవిలో సమస్యలను గుర్తించొచ్చు. ఇందులో ఉండే మాగ్నిఫైయర్ కాంతితో చెవి లోపల ఏమైనా చిల్లులు పడ్డాయా? లోపల ఇంకేమైనా సమస్య లున్నాయా? అనేది సులభంగా తెలుసుకోవచ్చు.
వినికిడి యంత్రాలు..
ప్రస్తుతం వినికిడి యంత్రాలు మార్కెట్లో అధునాత మైనవి అందుబాటులోకి వచ్చాయి. గతంలో బోన్ యాంకర్,ఇంద ఇయర్ కెనాల్,ఓపెన్ పిట్ టైప్‌వి ఉండేవి.ప్రస్తుతం కంప్లీట్ ఇన్ ది కెనాల్,ఇంద కెనాల్,బిహైండ్ ది ఇయర్ వంటి హియర్ ఎయిడ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి బిగ్గరగా,లోపలి చెవి ప్రాసెస్ చేయటానికి దోహద పడతాయి.వినికిడి సహా యాలు, ఎముక-యాంకర్డ్ ఇంప్లాంట్లు,కాక్లియర్ ఇంప్లాంట్లతో నేరుగా శ్రవణనాడిని ప్రేరేపించి ధ్వని అవగాహన వస్తుంది. వయస్సుతోపాటు వచ్చేది కాదు.
పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ
పసిబిడ్డలను చెవిటి-మÖగ అవస్థల నుంచి బయట పడేయటానికి‘కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ’లు దోహద పడతాయి.వినికిడిలోపం తలెత్తితే వాళ్లకు సరిగా మాటలురాక..ఎదుగుదల యావత్తూ దెబ్బతింటుంది. వినికిడి లోపం చాలా తీవ్రంగా ఉంటే,దాన్ని అధిగ మించేందుకు కాక్లియర్ ఇంప్లాంట్ బాగా పని చేస్తుం ది.ఈశస్త్రచికిత్సలు మనకు అందుబాటులో ఉన్నా యి.ఈ సర్జరీతో సాధారణంగా ఎలాంటి సమస్యలూ ఉండవు.ఒకటి రెండు రోజుల్లోనే ఇంటికి వెళ్లిపోవచ్చు. తీవ్రమైన వినికిడి లోపం ఉన్న పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్‌ను మÖడేళ్ల లోపు అమరిస్తే మంచి ఫలితం ఉంటుంది.తీవ్రమైన వినికిడి లోపంతో పుట్టిన బిడ్డ లకు ఏడాదిలోపే ఈ సర్జరీ చేసి,ఇంప్లాంట్ అమ ర్చడం అత్యుత్తమం కూడా. మÖడేళ్లలోపు అమర్చిన బిడ్డలతో పోలిస్తే ఏడాదిలోపే అమర్చిన బిడ్డలకు మాటలు వచ్చే ప్రక్రియ మెరుగ్గా ఉంటుంది. రెండు చెవులకూ అమరిస్తే ఫలితాలు మరింత బాగుంటాయి. సర్జరీ తర్వాత మÖడు వారాలకు చర్మంపై నుంచి స్పీచ్ ప్రాసెసర్‌ను అనుసంధానించి, కంప్యూటర్ సహా యంతో వివిధ శబ్దస్థాయిలను మ్యాపింగ్ ద్వారా శ్రుతి చేస్తాం. ఇందులో శబ్దాల తీవ్రత మరీ అధికంగా గానీ తక్కువగాగానీ లేకుండా..క్రమేపీ వినికిడి అల వాటు పడేలా,సామర్థ్యం మెరుగయ్యేలా చేయొచ్చు. ఆడిటరీ వెర్బల్ థెరపీ ద్వారా మాట్లాడటం వచ్చిన వారికి2-3నెలల శిక్షణ సరిపోతుంది.ఇంకా మాటలు రాని పిల్లలకు 2-3ఏళ్ల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. వినికిడి మాటలను గ్రహించి,తిరిగి మాట్లాడేలా చెయ్య డం ఈశిక్షణ ప్రధాన లక్ష్యం.న్యూయొనోటల్ హియ రింగ్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం ద్వారా వినికిడి లోపం ఉందో లేదో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
యంత్రాలతో వినొచ్చు..
వినికిడి సమస్యలతో బాధపడేవారిని మన చుట్టుపక్కల కొంతమందిని చూస్తూనే ఉంటాం.ఒక వ్యక్తి 25 డెబీ శబ్ద తీవ్రతను రెండు చెవుల ద్వారా వినలేనప్పుడు వినికిడి లోపం ఉన్నట్లే. వినికిడి యంత్రాల ద్వారా కొంతమంది వినగలుగుతారు.గతంతో పోల్చితే ప్రస్తు తం ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. మెదడువాపు,తట్టు,అమ్మవారు,గవద బిళ్లలువల్ల చిన్నపిల్లల్లో వినికిడి లోపించే అవకాశాలున్నాయి. ఏ వయసు వారైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం.రోజుకు రెండు గంటలకు మించి చర వాణి మాట్లాడకపోవడం ఉత్తమం. సమస్య గుర్తించిన వెంటనే డాక్టరును సంప్రదించి,జాగ్రత్తలు తీసు కోవాలి.ఎప్పుడు చెవులు వినిపించవంటే..మనిషికి 10 నుంచి150డెసిబుల్స్‌శబ్దాన్ని వినగలిగేశక్తి ఉంటుంది. 0నుంచి25 డెసిబుల్స్ సాధారణం,26 నుంచి40 డెసిబుల్స్ వరకు మైల్డ్,41నుంచి 70డెసిబుల్స్ వరకు మోడరేట్,71నుంచి 121 డెసిబుల్స్ వరకు ప్రొపౌండ్ ఇయర్‌లాస్‌గా వర్గీకరించారు.150డెసిబుల్ కంటే ఎక్కువైతే మనిషి చెవులు పనిచేయవు.
చెవి ఆరోగ్యానికి ఇవి దోహదం..
పరిశుభ్రత : చెవి ఆరోగ్యంగా ఉండాలంటే దాని పరిశుభ్రత ముఖ్యం.దుమ్ము,ధూళి చేరకుండా చెవులను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. శుభ్రత పేరుతో ప్రతిరోజూ ఇయర్‌బడ్స్,పుల్లలు వంటివి పెట్టి తిప్పొద్దు. మైనపును బయటకు తీయడం కంటే లోతుగా నెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది.
వెల్లుల్లి-నూనె : వెల్లుల్లి కేవలం వంట కోసం మాత్రమే కాదు. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు దీనిని ఒక గొప్ప సహజ నివారణగా చేస్తాయి. చిన్న ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి వెల్లుల్లితో కలిపి నూనెను వేడి చేసి, చెవిలో చుక్కలుగా వాడితే మంచిది.
అల్లం టీ: అల్లం యాంటీ ఇన్‌ప్లమేటరీ శక్తులు కేవలం కడుపుతోపాటు చెవులకూ మేలు చేస్తాయి.రక్త ప్రసరణను పెంచడానికి, నరాల ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి అల్లం టీ దోహదపడుతుంది. శ్రవణ వ్యవస్థ ద్వారా రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి, చెవులు,మెడకు తేలికపాటి మసాజ్ దోహదపడు తుంది.యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సి,ఇ, మెగ్నీషి యం వంటి ఖనిజాలతో కూడిన ఆహారం చెవులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆకు కూరలు,గింజలు, సిట్రస్ పండ్లను తినటం మేలు.
వయస్సుతో వచ్చేది కాదు..
వినికిడి లోపాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఏదో వయస్సు తోపాటు వస్తుందులే అనే భావనను విడనాడాలి. శబ్దాలు వినపడకపోవటం ఒక సమస్య అయితే.. మతిమరుపు,కుంగుబాటు, కింద పడిపోవటం వంటి ఇతరత్రా సమస్యలకూ దారితీస్తుంది.గుండెజబ్బు ముప్పు పెరగటానికి కారణమవుతోంది. చెవిలో ఉండే కర్ణభేరికి ఏదైనా విఘాతం (డ్యామేజ్) అయిన ప్పుడు వినికిడి సమస్య వస్తుంది. సాధారణంగా కర్ణ భేరికి ఏమైనా చిల్లులు పడితే వాటంతటవే నయమ వుతాయి. కర్ణభేరి మధ్య,లోపలి చెవికి ఎలాంటి నష్టం జరగకుండా చూస్తుంది.చెవిలోకి నీరు చేరకుండా ఒక అడ్డులాగా ఉంటుంది.లోపల బ్యాక్టీరియా పేరు కుపోయినా,నీరు చేరినా వినికిడి కోల్పోయే అవకాశం ఉంటుంది. సకాలంలో గుర్తించి,చికిత్స చేస్తే వినికిడి లోపం,చెవిలో చీమికారడం,తీవ్రమైన చెవినొప్పి వంటి సమస్యలు పరిష్కారమవుతాయి.కర్ణభేరి చిల్లులు కొలెస్టీటోమా అనే చర్మతిత్తికి కూడా దారితీయొచ్చు. ఆలస్యం చేస్తే మధ్య చెవి ఎముకలు దెబ్బతినే ప్రమా దం ఉంటుంది.చెవిపోటు సమస్యకు సైతం దారితీ స్తుంది.
డాక్టర్ లక్ష్మీ లాస్య వేమÖరి
ఎంబిబిఎస్, ఎంఎస్ (ఇఎన్‌టి)
అలర్జీ అండ్ ఇమÖ్యనాలజీ స్పెషలిస్ట్
వర్టిగో అండ్ వెస్టిబ్యులర్ మెడిసిన్ స్పెషలిస్ట్,
నాసా ఆసుపత్రి, విజయవాడ.