ప్లాస్టిక్ భూతం..తీస్తోంది ప్రాణం
ప్లాస్టిక్ కవర్లు విచ్చలవిడిగా వాడొద్దని..ఆహార వ్యర్థాలతో ఇష్టారాజ్యంగా వాటిని వీధుల్లోకి విసిరి వేయొద్దని ప్రభుత్వాలు ఎంతగా మొత్తుకున్నా పట్టించుకోని పర్యవసానం..మÖగ జీవాలపాలిట ప్రాణాంతకంగా మారుతోంది.అందుకు సోదార ణంగా నిలిచే ఘటనలు అనేకం చూస్తున్నాం.మనంచేసే తప్పులవల్లే మÖగ జీవులు ప్రాణాలు బలియిపోతున్నాయి.
ఇప్పటి జీవన శైలిలో ప్లాస్టిక్‌ను మానవు లు విపరీతంగా వినియోగిస్తున్నాం.తినే ఆహారం నుంచి,దుస్తులు,ప్యాకింగ్, ఫర్నిచర్,గృహోపకరణాలు,ఇంటి చెత్త సంచులు,ప్రతిచిన్న విషయానికి ప్లాస్టిక్ అతి సర్వసాధారణ పదార్థమై పోయింది. అయితే మనం వాడి పారేసిన ఈప్లాస్టిక్ మనచుట్టూ ఉన్నజీవులకు నిశ్శబ్దమృత్యువు తెస్తోందనే విషయాన్ని ఎంతమందికి తెలుసు? ముఖ్యంగా నగరాలు,పట్టణాల్లో తిన్నతర్వాత ప్లాస్టిక్ కవర్లతో సహా ఆహారాన్ని రోడ్లపై పడే స్తున్న అలవాటువల్ల మÖగజీవాలైన అడవి జీవులు,ఆవులు,కుక్కలు,మేకలు ప్లాస్టిక్‌ను తినేస్తున్నాయి.ఈవిషయంలో ఆవులు మరింతగా నష్టపోతున్నాయి.ప్లాస్టిక్ తినడంవల్ల ఆవులకు కలిగేప్రమాదాలు కలుగుతున్నాయి.- గునపర్తి సైమన్
ప్లాస్టిక్ ఒక నాన్-బయోడిగ్రేడబుల్ పదార్థం. ఇది కడుపులో జీర్ణం కాకుండా చాలాకాలం ఉం టుంది.ఆవుల కడుపులోకి వెళ్ళిన ప్లాస్టిక్ కాలక్రమేణా పేరుకుపోతుంది. దీని వల్ల అవి సాధారణ ఆహారాన్ని తినలేకపోతాయి. ఆకలితో అలసిపోతాయి.
ఆహార లోపాలు మరియు పీడాకలలు. ప్లాస్టిక్ తిన్న ఆవులకు పోషకాల కొరతలు వస్తాయి. మేత తినడం తగ్గిపోవడంతో రక్తహీనత, శరీర బలహీనత ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో వాటికి కడుపులో నొప్పులు వస్తాయి, కానీ అవి బయటకు చెప్పలేవు. చివరికి అవి చచ్చిపోతాయి. మనుషుల, ఆవులకు తిన్న పదార్థాన్ని వాంతి చేయగల శక్తి ఉం డదు. అందుకే ఏది పడ్డా అది కడుపులోనే ఉంటుంది. ప్లాస్టిక్ తిన్నా,లోహ ముక్కలు తిన్నా అవి అదే ఉండి పోతాయి.ఎన్నో కేసుల్లో ఆవులు మృతిచెందిన తర్వాత శవ పరీక్షలో వారి కడుపులో భారీ మొత్తంలో ప్లాస్టిక్ సంచులు,నైలాన్ ప్యాకెట్లు, ఇనుప ముక్కలు కనిపిం చాయి.ఇవి నేరుగా వారి మరణానికి కారణమ య్యాయి.
పర్యావరణ పరంగా కూడా ప్లాస్టిక్ ముప్పు
ప్లాస్టిక్ కేవలం పశువులకు మాత్రమే కాదు, మాన వులు,వృక్షాలు,నేల,నీటి వనరులకూ ప్రమాదమే. ఇవి మట్టిలో కలవడానికి దాదాపు 500 సంవత్సరాలు పడుతుంది. అప్పటివరకు ఈ ప్లాస్టిక్ తరం తరాల జీవులకు ముప్పుగా మారుతుంది. నేల గుణాన్ని తగ్గిస్తుంది.నీటిలోకి వెళ్లి చేపల ప్రాణాల్ని బలిగొంటుంది. ఆ చేపలు మళ్ళీ మనమే తింటాం అలా మళ్లీ మన ఆరోగ్యానికే నష్టమవుతుంది. మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ చెత్తను శాస్త్రీయంగా వేరు చేయడం జరగడం లేదు. “వెస్ట్ మేనేజ్మెంట” అనే మాటను పట్టించుకోక పోవడం వల్ల, ప్లాస్టిక్ కవర్లలో వేసిన ఆహారాన్ని రోడ్లపై పడేస్తున్నారు. మÖగజీవాలు వాటిని ఆహా రంగా భావించి తింటున్నాయి. ఇదే పరిస్థితి మారకుండా ఉంటే, ప్రతిరోజూ మనమÖ ఒక పశువును చంపుతున్నట్టే అవుతుంది.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలిఈ సమస్యకు పరిష్కారం ఉందా? పునర్వినియోగ పదార్థాలు వాడాలి-స్టీల్,గాజు,చెక్క బుట్టలు, పేపర్ బాగులు వాడే అలవాటు పెంచాలి. వెస్ట్ మేనేజ్మెంట్ పాటించాలి. ప్లాస్టిక్‌ను వేరు చేసి, పునర్వినియోగానికి పంపే విధానాన్ని ప్రభుత్వం, ప్రజలు పాటించాలి.పశువులకు ఆహారం విసిరే ప్పుడు జాగ్రత్త పాటించాలి.ప్లాస్టిక్‌లో ఆహారం పెట్టి పారేయడం మానేయాలి. చట్టాల అమలు కఠినంగా ఉండాలి ప్లాస్టిక్ వేస్ట్ రోడ్లపై పడేసే వారిపై జరిమానాలు విధించాలి. పశుపాలకులకు అవగాహన కల్పించాలి: ఆవులు రోడ్లపై తిరగ కుండా కాపాడే చర్యలు తీసుకోవాలి.ప్లాస్టిక్ వాడకంలో మార్పు మన నుంచే మొదలవాలి. మన చిన్న మార్పు ఒకపశువు ప్రాణాన్ని కాపాడు తుంది.
ఇటీవల ఆవుల కడుపులో ప్లాస్టిక్ పేరుకు పోయి ప్రమాదస్థాయికి చేరిన కొన్ని సంఘట నలు ఇటీవలకొన్ని ప్రాంతాల్లో వెలుగు చూశాయి. కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన ఘటన కళ్లకు కట్టినట్టు స్పష్టమవుతోంది. ఒక గోవు కడుపులో నుంచి 70 కేజీలకు పైగా ప్లాస్టిక్‌ను తొలగించి, గోవు ప్రాణాన్ని కాపాడారు పశు వైద్యలు. ఈఘ టన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగింది. జిల్లాలోని ఎమ్మిగనూరులో రోడ్డుపై పడి ఉన్న ఒక గోవును చూశాడు స్థానిక న్యాయవాది బోయ తిమ్మప్ప. భారీ కడుపుతో ఆయాసంతో నడవలేక అవస్థపడుతున్న గోవును చూసి చలించిపోయాడు. ఆవును చూసి తన దారి తాను పోలేక స్థానిక పశు వైద్య అధికారులకు సమాచారం ఇచ్చారు. పరిశీలించిన పశు వైద్యులు హుటాహుటీన అక్కడికి చేరుకుని గోవు పరిస్థితిని గమనించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. అక్కడికక్కడే ఆవుకు శస్త్రచికిత్స చేసి, దాని కడుపులో నుంచి 70 కేజీల పైగా పేరుకుపోయిన ప్లాస్టిక్‌ను తొలగించారు. దీంతో చావు బతుకుల్లో ఉన్న గోవుకు పశువైద్యులు ప్రాణం పోశారు.
మిగిలిపోయిన ఆహారం లేదా ఇతరత్రా ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ప్రజలు రోడ్లపై పారవేస్తుంటారు. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న ఆహారం తోపాటు ప్లాస్టిక్‌ను కూడా గోవులు తినేస్తుంటాయి.ఈక్రమంలోనే ఎమ్మిగనూరు ఆవు సైతం ఫ్లాస్టిక్ వ్యర్థాలను తిన డంతో,ఆవు కడుపు మొత్తం ప్లాస్టిక్‌తో నిండి పోయింది.ఇతర తిండి తినలేక,తిన్నా కూడా అరి గించలేక ఆవు ఆరోగ్యం దెబ్బతింది. ఆపరేషన్ చేసి ఆవు కడుపులోని ప్లాస్టిక్ మొత్తం తొలగించారు డాక్టర్లు.ప్రస్తుతం గోవు ఆరోగ్యం నిలకడగా ఉందని పశు వైద్యులు తెలిపారు.ఒరిస్సా రాష్ట్రంలోని బ్రహ్మపుర పట్టణంలో ఓఆవు కడుపులో 50కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను ఆపరేషన్‌చేసి వైద్యులు బయ టకు తీశారు.అంతేకాకుండా,ప్లాస్టిక్ సముద్రంలో నివసించే జీవరాశికి ముప్పుగా మారుతోంది. వేటలో దొరికిన చాలా రకాల చేప లలో,తాబేళ్లలో ప్లాస్టిక్ కణాలు విరివిగా ఉంటున్నాయి.
