కొత్త విద్యుత్ విధాన కేంద్రం ఏం చేయనుంది?
త్వరలోనే దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో సమÖల మార్పులు చూడబోతు న్నా మా?నెలనెలా టారిఫ్‌లు మారతాయా? డిస్క మ్‌లపై ఒత్తిడి తగ్గనుందా?ఇప్పుడు ఈ చర్చ రావ డానికి ఓకారణం ఉంది.కేంద్ర విద్యుత్‌శాఖ జాతీయ విద్యుత్ నూతన విధాన ముసాయిదా లోని అంశాలే ఇవన్నీ. ఎప్పటి నుంచో విద్యుత్ రంగంలో ఉన్న సమస్యలను పరిష్క రించే దిశగా ఈ కొత్తడ్రాఫ్ట్ను సిద్ధం చేసింది కేంద్రం.విని యో గదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు నిర్దిష్టమైన లక్ష్యాలు సాధించేం దుకు ఇది ఎంతో ఉపకరిస్తుందని భావిస్తోంది. మరి ఈకొత్త ముసాయిదాలో ఏముంది?ఈమార్పులు చేయాల్సిన అవసరం ఏం వచ్చింది?
వికసిత్ భారత్‌లో భాగంగా
విద్యుత్ రంగంలోసంస్కరణలు తీసు కు రావాలి.పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉండాలి.నాణ్యమైన విద్యుత్ అంది స్తూ సుస్థిరాభివృద్ధి సాధించాలి.ఈ లక్ష్యాలను 2047 నాటికి చేరుకోవాలి. వికసిత్ భారత్‌లో భాగంగా వీటిని సాధించేందుకు సిద్ధమవుతోంది కేంద్ర విద్యుత్ శాఖ.విద్యుత్ రంగంలో ప్రస్తుతం ఉన్న కొన్ని సమస్యలు తీర్చడంతో పాటు పూర్తి స్థాయి లో మార్పులు తీసుకురావాలని చూస్తోంది. అందుకే ఇటీవల జాతీయ విద్యుత్ నూతన విధాన ముసాయిదా రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఈడ్రాఫ్ట్ను అన్ని రాష్ట్రాలకూ పంపిం చింది.అంతేకాదు వచ్చే నెల అంటే ఫిబ్రవరి 20వ తేదీలోగా తమ తమ అభిప్రాయాలు చెప్పాలని సూచించింది. ఆతరవాత దీనికి ఓతుదిరూపు తీసుకు రానుంది. ఈలోగానే ఈ ముసాయిదాపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
బడ్జెట్ ముందు ముసాయిదా
ఏటా ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.అయితే ఈ బడ్జెట్ సమావేశాలకు ముందు ఈ ముసాయిదా రూపొందించడం కీలకమైన విషయం. విద్యుత్ సవరణ బిల్లు ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా డిస్కమ్స్ ఆర్థిక పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను తగ్గిం చడంతో పాటు విద్యుత్ రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం పెంచాలన్నది డ్రాఫ్ట్ బిల్లు ప్రాథమిక లక్ష్యాలు. 20ఏళ్లకు సరిపడా ప్లానింగ్ సిద్ధంగా ఉండాలన్నదీ మరో ముఖ్యమైన అంశం. నిజానికి 2005లోనే ఈ విధానాన్ని నోటిఫై చేశారు. కానీ అప్పటి నుంచి పెద్దగా అమలు చేయలేదు. ఇప్పుడు ఆపాత విధానం స్థానంలో కొత్త ముసా యిదా తయారైంది. ఇదివిద్యుత్ రంగానికి దిశా నిర్దేశం చేసే అత్యంత కీలకమైన విధానంగా భావి స్తోంది కేంద్రం.2003నాటికి విద్యుత్ చట్టం ఆధారంగా ఇది అమలు కానుంది.
కీలక అంశాలెన్నో
ఈ జాతీయ విద్యుత్ నూతన ముసా యిదాలో ఎన్నో కీలక అంశాలున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే విద్యుత్ సరఫరాలో పోటీ పెంచడం.అంటే ఎక్కువగా ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించడం. అంతే కాదు. జాతీయ తలసరి వార్షిక వినియోగం ప్రస్తుతం 1300యÖనిట్ల వరకూ ఉంది.2030నాటికి దీన్ని 2వేల యÖనిట్లకు, 2047నాటికి 4వేల యÖనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర విద్యుత్ శాఖ. అయితే నాణ్యత విషయంలో మాత్రం రాజీ పడకుండా ఈలక్ష్యాన్ని సాధిం చాలని భావిస్తోంది. అదే సమయంలో బాధ్యతా యుతంగా విద్యుత్‌ను వాడే విధంగా చర్యలు చేపట్ట నుంది.వినియోగదారుల కేంద్రంగానే సేవలు అందించాలన్నది మరో ముఖ్యమైన అం శం. అదే విధంగా డిమాండ్‌కు సంబం ధించిన అంశాలనూ పరిశీలించాల్సి ఉంటుంది. అన్నింటి కన్నా కీలకంగా విద్యుత్ రంగంలో ఏదైనా ఇబ్బం దులు, వివాదాలు తలెత్తినప్పుడు వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించి వినియోగదారులపై భారం పడకుండా చూడాలన్నది ఈ బిల్లులో ఉన్న మరో అంశం. అంతే కాదు.డిస్కమ్‌లపై ఒత్తిడి తగ్గించ డంతోపాటు విద్యుత్‌రంగంలో పోటీపెంచే విధం గా మరి కొన్ని అంశాలనూ ఇందులో చేర్చారు.
డిస్కమ్‌లకు ఆర్థిక భరోసా
విద్యుత్ టారిఫ్లకుసంబంధించి కఠిన తరమైన నిబంధనలు పెట్టడం, డిస్కమ్‌లకు ఆర్థిక భరోసా అందించడం, విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయడం లాంటివి ఇందులో కీలకంగా ఉన్నాయి.ముందుగా టారి ఫ్ల గురించి చెప్పుకోవాలి. సాధారణంగా టారిఫ్ లలో మార్పులు పూర్తిగా స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యు లేటరీ కమిషన్స్ చేతుల్లో ఉంటుంది. కాకపోతే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొన్ని సార్లు విద్యుత్ టారిఫ్‌లు పెంచకుండా వదిలే స్తుంటాయి. ఈ కారణంగానే విద్యుత్ సంస్థలు నష్టాలు చవి చూడాల్సి వస్తోంది. ఈ సమస్య పరిష్కరించేందుకే కొత్త ముసాయిదాలో ఓ కీలక నిబంధన చేర్చింది విద్యుత్ శాఖ. విద్యుత్ ఛార్జీల సవరణలకు సం బంధించిన ఉత్తర్వులను ఆర్థిక సంవత్సరం మొద లు కాకముందే రెగ్యులేటరీ కమిషన్స్ తప్పని సరిగా జారీ చేయాల్సి ఉంటుంది. ఇక అంతకు ముందు ఏడాది సరఫరా వ్యయం ఎక్కువ అయ్యుంటే ఆ లోటును ప్రస్తుత ఆర్థిక సంవ త్సరంలో ట్రూఅప్ సర్ఛార్జీలతో పేరుతో వసూలు చేసి భర్తీ చేసుకోవాలి.ఈఆర్థిక సంవత్సరం నుంచే ఇదంతా అమల్లోకి రావాలి.
క్రాస్ సబ్సిడైజేషన్
ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే డిస్కమ్‌లను నష్టాల ఊబిలో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు చీజుP 2026లో కొన్ని ముఖ్య మైన అంశాలు చేర్చింది విద్యుత్ శాఖ. ఇది కూడా టారిఫ్‌లతో ముడిపడి ఉన్న విషయమే. చాలా సందర్భాల్లో విద్యుత్ సరఫరా వ్యయం కన్నా టారిఫ్‌లు చాలా తక్కువగా ఉంటున్నాయి.ఈ కారణంగానే డిస్కమ్‌లకు నష్టాలు తప్పడం లేదు. లోటు భర్తీ చేసుకునేందుకు పరిశ్రమలు, వాణిజ్య పరమైన వినియోగదారులకు ఉత్పత్తి వ్యయం కన్నా ఎక్కువ మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తారు. ఇక వ్యవసాయం సహా గృహావసరాలకు సబ్సిడీ విద్యుత్ అందిస్తారు. దీన్నే క్రాస్ సబ్సిడైజేషన్ అంటారు.కానీ ఇలా చేయడంవల్ల విద్యుత్ ఉత్ప త్తి సంస్థలు నష్టాలు మÖటగట్టుకుంటున్నాయి. అందుకే ఇకపై క్రాస్ సబ్సిడైజేషన్ పూర్తిగా తొల గించాలని ఈముసాయిదా ప్రతిపాదిస్తోంది. 50% కన్నా టారిఫ్‌లు తక్కువ ఉండకూడదని తేల్చి చెప్పింది. అంతే కాదు.టారిఫ్‌లు ఏటా ఆటో మెటిక్‌గా రెన్యువల్ అయ్యే విధంగా చర్యలు తీసు కోవాలనీ స్పష్టం చేసింది కేంద్ర విద్యుత్ శాఖ.
యÖనివర్స్ సర్వీస్ ఆబ్లిగేషన్
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 1 మెగావాట్ కన్నా ఎక్కువ విద్యుత్ అవసరం ఉన్న విద్యుత్ వినియోగదారులకు సంబంధించి కీలక మార్పులు జరగనున్నాయి. వీరు యÖని వర్స్ సర్వీస్ ఆబ్లిగేషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ లను ఉపసంహరించుకోవచ్చు. అంటే 1 మెగా వాట్,అంతకన్నా ఎక్కువ వినియోగానికి కాంట్రాక్ట్ తీసుకున్న వారు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి డిస్కమ్ పరిధి నుంచి బయటకు రావచ్చు. సొంత గా పవర్ ఎక్స్ఛేంజ్లు, కాంట్రాక్ట్‌ల ద్వారా విద్యు త్ పొందవచ్చు. ఇలా చేయడం వల్ల డిస్కమ్‌లపై ఒత్తిడి చాలా వరకూ తగ్గుతుందని భావిస్తోంది కేంద్ర విద్యుత్ శాఖ.అంటే భారీ డిమాండ్‌ను తీర్చాల్సిన అవసరం డిస్కమ్‌కు ఉండదు.ఇక 2030 నాటికి ప్రతి వ్యవసాయ బోర్‌కు సోలార్ విద్యుత్ తప్పనిసరిగా అనుసంధానం కావాలని చెబుతోంది ఈకొత్త ముసాయిదా. వ్యవసాయానికి ఇస్తున్న విద్యుత్ రాయితీల భారాన్ని ఈ మేరకు తగ్గించుకోవచ్చని విద్యుత్‌శాఖ భావిస్తోంది. ప్రస్తు తం డీజిల్‌తో నడుస్తున్న వ్యవసాయ పంపుల స్థానంలో సౌర విద్యుత్ వాడడం వల్ల ఉద్గారాలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.
నూతన ముసాయిదాలో ప్రతిపాదనలు
ఇక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెంచేందుకు వీలుగా నూతన ముసాయిదాలో కొన్ని ప్రతిపాదనలు చేర్చింది కేంద్ర విద్యుత్ శాఖ. ముఖ్యంగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్‌పై ఎక్కువగా దృష్టి సారించనుంది. అంతే కాదు.డిమాండ్ అధికంగా ఉన్న సమయంలో విద్యుత్ వినియో గించిన వారికి అధిక ఛార్జీలు వసూలు చేయా లన్నదీ కీలకమైన ప్రతిపాదన.ఇలా కూడా సరఫ రా వ్యయాన్ని, వస్తున్న ఆదాయాన్ని కొంత వరకూ సమం చేసుకోవచ్చని భావిస్తోంది కేంద్రం. అంతే కాదు.రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెద్ద ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిం చాలన్నది మరో ప్రతిపాదన. ఎంత పెట్టుబడులు పెడుతున్నాం,ఎంత ఆదాయం వస్తుంది అనేది ప్రతి రంగంలోనూ ఓలెక్క ఉంటుంది.దీన్నే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. మిగతా రంగాలతో దీటుగా విద్యుత్ రంగంలోనూ ఈ =OI పెర గాలన్నది కేంద్రం ఆకాంక్ష. ఏయే సంస్థలైతే ఈ విషయంలో ముందంజలో ఉంటాయో వాటికి రాష్ట్ర కమిషన్లు ప్రోత్సాహకాలు అందించాలన్నదీ కేంద్రం చెబుతున్న మరో విషయం.
డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్
విద్యుత్ రంగంలోనూ పోటీతత్వం పెంచాలని భావిస్తోంది కేంద్రం. అయితే ఈ పోటీ వినియోగదారులపై ప్రభావం చూపించే విధంగా మాత్రం ఉండకూడదన్నది కీలక నిబంధన. స్వతంత్రంగా విద్యుత్‌ను పొందగలిగే భారీ సంస్థ లకు కూడా డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్‌లు ఇస్తు న్నారు. రైల్వేస్, తయారీ పరిశ్రమలు ఈ కోవకు వస్తాయి. అలా కాకుండా ఈ లైసెన్స్ పరిధిలో నుంచి వీటిని తొలగిస్తే చాలా వరకూ ఒత్తిడి తగ్గుతుందన్న ఓ అభిప్రాయం.రెగ్యులేటరీ కమిషన్స్ మార్కెట్ లిక్వి డిటీ పెరిగే విధంగా సరైన వ్యవస్థను తయారు చేయాలన్నది మరో ప్రతిపాదన. ఇప్పుడు చెప్పిన మార్పులన్నీ అమల్లోకి రావడంవల్ల సగటు విని యోగదారుడిపై ఎలాంటి ప్రభావం పడుతుం దన్నది తప్పకుండా చర్చించాల్సిన విషయం. ఇది అమల్లోకి వస్తే తరచూ కరెంట్ బిల్స్‌లో మార్పులు వస్తాయి. టారిఫ్‌లో మార్పులు చేయకుండా వది లేసినా ఆటోమెటిక్‌గా ఏటా ధరలు మారతాయి. ఇక బొగ్గు ధరల్లో మార్పుల ప్రకారం కూడా ప్రతి నెలా బిల్లులో ఆ ప్రభావం కనిపిస్తుంది. 2032 నాటికి పది లక్షలకు మించి జనాభా ఉన్న నగ రాల్లో విద్యుత్ కోతలు తగ్గుతాయి.ఓట్రాన్స్ ఫార్మర్ లో సమస్య తలెత్తితే వెంటనే మరోటి అందు బాటులోకి వచ్చే విధంగామార్పులు జరుగుతాయి. ఈ ప్రతిపాదనలన్నీ అమల్లోకి వస్తే డిస్కమ్‌లు ఆర్థికంగా బలపడతాయి.ఫలితంగా మౌలిక వసతులు మెరుగపడతాయి.అంటే పాత వైర్లు తొలగించడం, స్మార్ట్ మీటర్స్ ఇన్స్టాల్ చేయడం, కేబుల్స్‌ను అండర్‌గ్రౌండ్ నుంచి వేయడం లాం టివి సాధ్యమవుతాయి. ఏదైనా సమస్యలు వచ్చిన ప్పుడు త్వరగా పరిష్కరించేందుకూ వీలవుతుంది. కనెక్షన్ ఇబ్బందులు కూడా త్వరగా పరిష్కారం అవుతాయి. మొత్తంగా విద్యుత్ రంగంలో భారీ మార్పులనే చూస్తామని చెబుతున్నారు విశ్లేషకులు.
కార్పొరేట్ సేవలో విద్యుత్ రంగం
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఎ.పి.ఇ.ఆర్.సి) నిర్వహించిన ప్రజాభి ప్రాయ సేకరణ జనవరి 27న కర్నూలులో ముగి సింది.2026-27 ప్రతిపాదిత టారిఫ్‌పై 71 మంది అభ్యంతరాలు తెలిపారు. భూ కేటాయిం పులే ప్రధాన ఎజెండాగా జనవరి 28వ తేదీన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో 32 అంశాలలో 24 అంశాలు భూ కేటాయింపులకు సంబంధించినవే. ఇందులో విద్యుత్ ప్రాజెక్టులకు 5975.64 ఎకరాలను 33 ఏళ్ల లీజుతో ప్రభుత్వ, ప్రైవేటు భూములను రిలయన్స్ కంపెనీకి, ఎ.పి సోలార్ పవర్ కార్పొరేషన్‌కు అప్పగించేందుకు ఆమోదం తెలిపింది.
వాస్తవంగా నియంత్రణ మండలి సమక్షంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన వాటిలో ప్రస్తుతవిద్యుతఉత్పత్తి ఒప్పందాలుకూడాఉన్నా యి. 23వేల మెగావాట్లకు డిస్కంలు ఒప్పం దాలు చేసుకున్నాయని, గత ఏడాది వేసవిలో 13 వేల మెగావాట్లకు గ్రిడ్ డిమాండ్ చేరిందని ఇదే ఇప్పటి వరకూ అధికమైందని మిగులు విద్యుత్ ఉండగా అవసరం లేకపోయినా చేసుకున్న అడ్డగోలు ఒప్పందాలతో డిస్కంలు ఆర్థిక భారంతో కుదేలు అవుతున్నాయన్న విమర్శ వచ్చింది. వీటి నుంచి పాఠాలు నేర్చుకోకపోగా కూటమి ప్రభుత్వం ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టటానికి తహతహలాడుతుందనటానికి మంత్రివర్గ నిర్ణయం ఓసూచిక. మిగులు విద్యుత్ ఉందంటూ ప్రభుత్వ రంగ జెన్కో థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెకీ ఒప్పందం ద్వారా 7వేల మెగావాట్లు, యాక్సిస్ కంపెనీ 600 మెగావాట్లు, పి.ఎం కుసుమ్ కింద 3725 మెగావాట్లకు డిస్కంలు ఒప్పందాలు చేసు కున్నాయి.ఈ ఒప్పందాలన్నీ అమలులోకి రాను న్నాయి.దీంతో భారీగా మిగులు విద్యుత్ ఉం టుంది.9వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఒప్పం దాలు కాగా మిగిలిన 13వేల మెగావాట్లు సోలార్, విండ్ ఒప్పందాలు పీక్ సమయాలలో సోలార్ విద్యుత్ అందుబాటులో లేకపోవడం వల్ల బహి రంగ మార్కెట్ నుంచి యÖనిట్‌కు కనీసం రూ. 10పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తున్నదని డిస్కం లు తమ నివేదికలలో ప్రస్తావించాయి. ఒక్క 2024-25లోనే5,282 మిలియన్ యÖనిట్ల విద్యుత్‌ను మార్కెట్ నుంచి కొనుగోలు చేసి ఆ భారాన్ని వినియోగదారులపై నెట్టివేశారు. కార్పొరేట్ శక్తులకు మేలు చేయాలని, వాటి నుంచి తాము లాభపడాలన్న ఆత్రుత పాలక వర్గాలలో కనిపిస్తుంది.
తారాస్థాయికి చేరిన అవినీతి
నియంత్రణ మండలి ఎదుట అభ్యంత రాలు వ్యక్తం చేసిన వారిలో అవినీతిని ప్రధాన సమస్యగా చర్చ చేయడం విశేషం. అదానీ సౌర విద్యుత్ ఒప్పందం (సెకీ ఒప్పందం) ఏడాదికి 7 వేల మెగావాట్లు (17వేల మిలియన్ యÖనిట్లు) ఆద్యంతం వివాదాస్పదమే. క్రోనీ క్యాపిటలిజంకు ఇది పరాకాష్ట (ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం). స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అసెంబ్లీలో ఈఒప్పందం గురించి మాట్లా డుతూ రాష్ట్ర ప్రజలకు లక్షాయాభై వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని అన్నారు. రూ. 1750కోట్ల లంచం తీసుకున్నారని,జగన్ మో హన్ రెడ్డి లడ్డూలా దొరికాడని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. లడ్డూలా దొరికితే మాజీ ముఖ్యమంత్రిని జైలుకు పంపకుండా, ఆ ఒప్పందాన్ని రద్దు చేయకుండా ఎందుకు కొన సాగిస్తు న్నారన్న ప్రశ్నకు ఒప్పందం రద్దు చేసు కున్నా, ఒక్క యÖనిట్ విద్యుత్‌ను కొనుగోలు చేయకపోయినా రూ.3వేలకోట్ల రూపాయల జరి మానా విధిస్తారన్న నిబంధన కారణంగా ఒప్పం దం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెబుతు న్నారు. ఇలాంటి నిబంధన ఎక్కడ ఉందో మాత్రం స్పష్టం చేయరు.అసలు కథ ఏమిటంటే ఈ ఒప్పం దం వెనుక ఉన్నది ‘అదానీ’.గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నా ప్రశ్నించకపోవటానికి ప్రధాన కారణం అదానీనే. ప్రధాన ప్రతిపక్షానికి, కూటమిలోని పార్టీలకు సెకీ ఒప్పందం గురించి మాట్లాడాలంటే ‘వణుకు’ పుడుతున్నది.
రూ.2.49పై యÖనిట్ విద్యుత్ కొను గోలు చేస్తే లక్షన్నరకోట్ల రూపాయలు నష్టం సంభ విస్తుందని ఆరోపించిన ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండి యా ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీతో 25ఏళ్ల కాల పరిమితితో 400మెగావాట్ల విండ్-సోలార్ హైబ్రి డ్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి యÖనిట్ ధర రూ. 5.50 పైసల నుంచి ప్రారంభించి రూ.4.60 పైసలకు ఒప్పందం చేసుకున్నారు. రూ.2.49కు కొనడంవల్ల జరిగే నష్టం గురించి గుండెలు బాదు కున్న చంద్రబాబుగారు రూ.4.60కు ఎలా ఒప్పం దం చేసుకుంటారు.విద్యుత్ కొనుగోలు ఒప్పం దాలతో తమకు నచ్చిన వారికి ప్రజల సంపదను కట్టబెట్టడంలో కూటమి పార్టీలకు, ప్రధాన ప్రతిపక్షానికి పెద్ద తేడాలు లేవు. ఒక్క యÖనిట్ విద్యుత్ కొనకుండారూ.1200 కోట్లు హిందూజా కంపెనీకి డబ్బులు చెల్లించిన ఘనమైన చరిత్ర మన రాష్ట్రానికే దక్కింది. – కందారపు మురళి, వ్యాసకర్త : ఎస్.పి.డి.సి.ఎల్, ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు
